Activities calendar

07 August 2016

22:15 - August 7, 2016

బ్రెజిల్ : ఎన్నో ఆశలతో రియోలో అడుగుపెట్టిన ఆ క్రీడాకారుడు కల నెరవేరకుండానే ఆస్పత్రికి చేరాడు. ఫ్రెంచ్ ఒలింపియన్ జిమ్నాస్ట్ సమీర్ అయిత్ పోటీలో భాగంగా ప్రదర్శన ఇస్తుండగా ప్రమాదవశాత్తు క్రాష్ ల్యాండింగ్ అయ్యాడు. దీంతో అతని ఎడమ కాలు విరిగిపోయింది. ఎంతలా అంటే కాలి ఎముక విరిగిన చప్పుడు ప్రేక్షకులకు స్పష్టంగా వినిపించింది. కాలు విరిగిన బాధను బయటకు రానివ్వకుండా కళ్లపై చేతులు వేసుకుని కన్నీటిని అదుపుచేసుకునే ప్రయత్నం చేశాడు సమీర్. కాలు విరిగి కుప్పకూలిన సమీర్‌కు ప్రేక్షకులు స్టాండిగ్ ఒవేషన్ ఇచ్చి గౌరవించారు. ఒలింపిక్ సిబ్బంది వెంటనే సమీర్‌ను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

22:09 - August 7, 2016

ఢిల్లీ : విజయ్‌ మాల్యాకు చెందిన ఆరు వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది జనవరి 11న మొదటి విడత 1411 కోట్ల రూపాయలను జప్తు చేసిన... ఈడీ.. తాజాగా రెండో విడత జప్తుకు ఏర్పాట్లు చేస్తోంది. రెండో దఫా  జప్తుకు ఉద్దేశించిన ఆరు వేల కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అధికారులు గుర్తించారు. అక్రమ నగదు చెలామణి నియంత్రణ చట్టం కింది  ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్‌ మాల్యా వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాను అక్రమంగా విదేశాలను తరలించిన కేసులో నిందితుడుగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 2న మన దేశం విడివెళ్లిన విజయ్‌ మాల్యా లండన్‌లో ఉంటున్నారు. 
--

22:07 - August 7, 2016

ఢిల్లీ : వస్తు, సేవల పన్ను బిల్లు సోమవారం లోక్‌సభ ముందుకు రానుంది. ఈ బిల్లుకు రాజ్యసభలో చేసిన సవరణలను లోక్‌సభలో కూడా  ఆమోదించాల్సి ఉంది. దీనికి అన్ని పార్టీలు అండగా నిలుస్తాయని భావిస్తున్నారు. జీఎస్ టీ బిల్లుపై జరిగే చర్చ కూడా సజావుగా సాగుతుందన్న ఆశాభావంతో ఎన్ డీఏ పక్షాలు ఉన్నాయి. ఈ బిల్లుపై జరిగే చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పే అవకాశం ఉంది. బిల్లుకు మద్దతు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రక్రటించింది. పార్టీ ఎంపీలు అందరూ సభకు హాజరు కావాలని కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసింది. జీఎస్ టీ  బిల్లు లోక్‌సభ ముందుకు రానున్న నేపథ్యంలో ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు పార్టీ ఎంపీలందరూ సభకు విధిగా  హాజరు  కావాలని ఆదేశిస్తూ టీడీపీ కూడా విప్‌ జారీ చేసింది. 

22:05 - August 7, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు సర్కారు తీపి కబురు అందించింది. పెన్షన్‌ మొత్తాన్ని దాదాపు 157.14 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫారసులకు అనుగుణగా ఈ నిర్ణయం తీసుకుంది. రిటైరైన తర్వాత ఇచ్చే గ్రాట్యుటీని 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు  ట్రాట్యుటీతోపాటు మరో 20 లక్షల రూపాయల పరిహారం అందజేస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో 58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటి వరకున్న కనీస పెన్షన్‌ 3,500 రూపాయల నుంచి 9 వేలకు పెరగనుంది. అత్యధిక పెన్షన్‌ లక్షా 25 వేల రూపాయలు లభిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

22:02 - August 7, 2016

నెల్లూరు : ఓ ఉద్యమ కెరటం..నింగికెగిసింది. 1993 నుంచి 1996 వరకు అలుపెరుగని పోరాటం చేసిన పోరాట యోధురాలు ఇకలేరు. ఉద్యమంలో అప్పటి ప్రభుత్వాలను గడగడలాడించిన ఆ ధీరురాలు దివికెగిరారు. ఆమే దూబగుంట రోశమ్మ. సారా నిషేధ ఉద్యమాన్ని ముందుండి నడిపిన ధీర వనిత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ కన్నుమూశారు. 
దూబగుంట రోశమ్మ ఇకలేరు..
సారా వ్యతిరేక ఉద్యమనాయకురాలు దూబగుంట రోశమ్మ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోశమ్మ నెల్లూరు జిల్లా దూబగుంటలోని తన నివాసంలో మృతి చెందారు. వారం క్రితం మూత్రపిండాల వ్యాధి తీవ్రం కావడంతో కోమాలోకి వెళ్లిన రోశమ్మ..ఆదివారం తుదిశ్వాస విడిచారు. 
సారా వ్యతిరేకోద్యమానికి శ్రీకారం 
1993లో సారా వ్యతిరేకోద్యమానికి శ్రీకారం చుట్టారు రోశమ్మ. నెల్లూరు జిల్లా దూబగుంటలో మొదలైన ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉదృతమైంది. అప్పట్లో ఏ గ్రామంలోనైనా సరే..సారా అమ్ముతున్నట్లు కనపడితే చాలు,.మహిళలు అపర కాళికలుగా మారి దుకాణాలను ధ్వంసం చేసేవారు. ఆమె ఉద్యమ ఫలితంగానే దివంగత ఎన్టీఆర్ తాను గెలిచిన తర్వాత రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని విధించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు..ఆమెకు ఎంతో సాయం చేస్తామని హామీలిచ్చారు. కానీ..కాలక్రమంలో వాటిని మర్చిపోయారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్య నిషేధం కాస్తా గాలికికొట్టుకుపోయింది. 
సంపూర్ణ మద్య నిషేధం విధించిన ఎన్టీఆర్‌ 
1993 నుంచి 1996 వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని నడిపి సంచలనం సృష్టించిన రోశమ్మను అప్పటి ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. సర్కారు కంట్లో నలుసులాగా తయారైన రోశమ్మకు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. చివరకు వృద్ధాప్య పించన్‌ను కూడా ఆమెకు అందకుండా చేశారు. దీంతో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. అయితే ప్రతిపక్షాల ఆందోళనలతో ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వం..రోశమ్మ పేరును పించన్‌ లిస్ట్‌లో చేర్చి..నెలనెలా పించన్‌ను అందించింది. 

 

21:56 - August 7, 2016

హైదరాబాద్ : 'చేనేత మన జాతీయవారసత్వ సంపద' అని దాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నెక్లెస్‌రోడ్‌ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు హ్యాండ్లూమ్ వాక్ జరిగింది. చేనేత స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. హ్యాండ్లూమ్‌ వాక్‌ను కోదండరాం ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు కోరారు. చేనేతవస్త్రాల మార్కెటింగ్ వ్యవస్థను విస్తృత పరచాలని ఎమ్మెల్సీ రాజ్‌గోపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నటి ఝూన్సీతోపాటు పలువురు పాల్గొన్నారు. 

21:51 - August 7, 2016

నల్గొండ : ప్రధాని పర్యటనను అడ్డుకుంటారంటూ పలు జిల్లాల్లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో కాంగ్రెస్‌, సీపీఎం, టీడీపీ నేతలను అరెస్ట్‌ చేశారు. మెదక్‌ జిల్లా సిద్ధిపేటలోకూడా సీపీఎం నేతలతోపాటు.. కాంగ్రెస్‌, టీడీపీ నేతలను అరెస్ట్‌ చేశారు.. ఈ అరెస్టులను సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కరిక రాజయ్య ఖండించారు.

 

21:48 - August 7, 2016

మెదక్ : గోసంరక్షణ పేరుతో.. దేశంలో విచ్చిన్నం సృష్టించడానికి అనేకమంది యత్నిస్తున్నారని.. నకిలీ గోసంరక్షుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. గజ్వేల్‌లో మిషన్ భగీరథ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించిన ప్రధాని... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు ప్రతిపాదనలు చేయగా... తమ వంతు సాయమందిస్తామని హామీ ఇచ్చారు. సభలో మోడీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించగా.. కేసీఆర్ హిందీతో మాట్లాడి ఆకట్టుకున్నారు. 
మోడీకి వేదపండితులు స్వాగతం 
ప్రధాని హోదాలో నరేంద్రమోదీ తొలిసారి తెలంగాణలో పర్యటించారు. బేగంపేట నుంచి గజ్వేల్‌కు చేరుకున్న మోడీ.. అక్కడినుంచి రోడ్డుమార్గం ద్వారా కోమటిబండకు చేరుకున్నారు. మోడీకి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 
పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన
మోదీ మిషన్‌ భగీరథ తొలిదశ పనులతో పాటు.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మిషన్‌ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరించిన మోదీ.. గజ్వేల్‌ నియోజకవర్గానికి దాహార్తిని తీర్చే పథకానికి నల్లా తిప్పి ప్రారంభించారు. అనంతరం మిషన్‌ భగీరథ ఫోటో ఎగ్జిబిషన్‌ను మోదీ తిలకించారు. దేశ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖిస్తూ సింగరేణి నిర్మించిన జైపూర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను మోదీ జాతికి అంకితం చేశారు. రామగుండంలో తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌, స్టేజ్‌-1కి.. ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు రామగుండం ఫర్టిలైజర్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా తెలంగాణ వైద్య విద్యను పటిష్టం చేయడానికి కాళోజి నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీకి..  హైదరాబాద్ మరియు కరీంనగర్‌ను కలిపే మనోహరాబాద్...కొత్తపల్లి రైల్వే లైన్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. ఐదు నిమిషాల్లో ఐదు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయడం విశేషం. 
మోదీపై కేసీఆర్ ప్రశంసల జల్లు 
తన విజ్ఞప్తి మేరకు తెలంగాణలో అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోదీపై ప్రశంసలు జల్లు కురిపించడంతో.. ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్‌. మోదీ చేతుల మీదుగా మిషన్‌ భగీరథను ప్రారంభించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దేశంలో అవినీతిరహిత పాలన అందిస్తున్న మోదీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని కేసీఆర్‌ అన్నారు. 
రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్‌ కేటాయించాలి : కేసీఆర్  
తెలంగాణకు అనేక విషయాల్లో కేంద్రం నుంచి సహకారం లభిస్తోందని.. ఇప్పటికే అనేక ప్రాజక్టులు వచ్చాయని కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ మినహా తెలంగాణ జిల్లాలను వెనకబడిన జిల్లాలుగా గుర్తించి నిధులు మంజూరు చేసినందుకు మోదీకి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్‌ను కేటాయించాలని మోదీని కేసీఆర్‌ కోరారు. అదేవిధంగా ఎయిమ్స్‌, ఐఐఎం, ఐటీఐఆర్‌ కేటాయించాలని కేసీఆర్‌ సభాముఖంగా మోదీకి విజ్ఞప్తి చేశారు.  తెలంగాణకు మోదీ ప్రేమను కోరుకుంటున్నామని కేసీఆర్‌ అన్నారు. 
తెలంగాణకు కేంద్రం అండ : మోడీ 
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనిలో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. దేశ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయడంతో పాటు.. ఫర్టిలైజర్‌, నీళ్లు, విద్యుత్‌ విషయంలో రాష్ట్రాలతో తమ ప్రభుత్వం కలిసి పని చేస్తుందని మోదీ అన్నారు. కేసీఆర్‌ తనను కలిసినప్పుడల్లా నీళ్ల కోసం భావోద్వేగంతో మాట్లాడేవారన్నారు. ప్రతి ఒక్కరికి నీళ్లు ఇస్తే మట్టిలో బంగారం పండించే శక్తి ప్రజలకుందని మోడీ అన్నారు. గత పాలకుల హయాంలో ఎరువుల కోసం రైతుల ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. తమ సర్కార్‌ వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులు తప్పాయని మోదీ అన్నారు. గత రెండేళ్లలో ఎరువుల ధరలు తగ్గడమే కాకుండా.. రాష్ట్రాల  నుంచి ఎరువుల కోసం విజ్ఞప్తులు తప్పాయన్నారు. 
నకిలీ గోరక్షకుల బండారం బయటపెట్టాలన్న మోడీ 
గోరక్ష పేరుతో సమాజంలో అలజడులు సృష్టించేందుకు కొంతమంది యత్నిస్తున్నారని మోడీ అన్నారు. నకిలీ గోరక్షకుల బండారం బయటపెట్టాల్సిన అవసరముందన్నారు. ప్రధాని హోదాలో తొలిసారి తెలంగాణకు విచ్చేసిన మోడీతో పాటు.. పలువురిని సీఎం కేసీఆర్‌ సత్కరించారు. 

 

21:39 - August 7, 2016

ఎన్నో... ఎన్నెన్నో వింతలు, విషేశాలు జరుగుతుంటాయి.. అటువంటి చిత్ర, విచిత్రాలు సావిత్రి జీవితంలో జరుగుతున్నాయి. ఏదిఏమైనా సావిత్రి జీవితం ముళ్లపొదల్లో రాచబాట అవుతుంది. ఆమె అయోమయస్థితిలో ఉంటుంది. కారణం ఏమైవుంటుంది.? ఎటువంటి పరిస్థితులు ఆమెను వెంటాడుతన్నాయి..? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

సీఎం కేసీఆర్ ను కలిసిన కేంద్రమంత్రి సురేష్ ప్రభు

హైదరాబాద్ : కేంద్రమంత్రి సురేష్ ప్రభు సీఎం కేసీఆర్ ను కలిశారు. పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. 

21:12 - August 7, 2016

హైదరాబాద్ : చేనేత కార్మికుల అభివృద్ధి కోసం త్వరలో హ్యాండ్లూమ్ పాలసీని ప్రకటిస్తామని తెలంగాణ మంత్రి కేటిఆర్ అన్నారు. రవీంద్రభారతిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవానికి మంత్రి హాజరయ్యారు. రాష్ట్రంలో చేనేత క్లస్టర్ల ఏర్పాటు వేగంగా జరుగుతోందని చెప్పారు. యాభై ఏళ్లకుపైబడి వయసున్న కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలోభాగంగా చేనేత దుస్తులతో నిర్వహించిన ఫ్యాషన్‌ పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. 

 

21:09 - August 7, 2016

విజయవాడ : పుష్కరాలను పురించుకొని అన్ని చోట్లా మెడికల్ క్యాంపులను నిర్వహించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన పుష్కర ఫుడ్ సేఫ్టీ సెల్‌ను ప్రారంభించారు. పుష్కరాల్లో భక్తులకు స్వచ్ఛంద సంస్థలు అందించే ఆహారం, మంచినీళ్లు, మజ్జిగ వంటి వాటిని పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఈ సెల్‌ను ప్రారంభించినట్లు తెలపారు. పుష్కరాల్లో ఆహారపదార్థాలను పరీక్షించడం కోసం ఫుడ్‌ సేఫ్టీ సెల్‌ ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 

21:06 - August 7, 2016

హైదరాబాద్ : నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనను నిరసిస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. గోసంరక్షణ పేరుతో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంతో మోదీ సర్కార్‌ విఫలమయ్యిందని ఆరోపించారు. దళిత వ్యతిరేక శక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకోపోవడాన్ని నేతలు తప్పుపట్టారు. 

 

20:06 - August 7, 2016

హైదరాబాద్ : దేశంలో రెండోసారి హరిత విప్లవం రావాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఎల్ బీస్టేడియంలో నిర్వహించిన బీజేపీ మహా సమ్మేళనం కార్యక్రమంలో మోడీ పాల్గొని, మాట్లాడారు. 'సోదరీ సోదరీమణులారా'.. అంటూ తెలుగులో  ప్రసంగాన్ని ప్రారంభించారు. చరిత్ర సృష్టించడంలో తెలంగాణ ముందుంటుందని తన అభిప్రాయం అన్నారు. రాజకీయ పండితులు ఇక తెలంగాణ భవిష్యత్ ను కొత్త తరహాలో చూడాల్సిందేనని చెప్పారు. 'నా హైకమాండ్ మాత్రం నా కళ్ల ముందు మీ రూపంలో ఉందని' అన్నారు. ఆగస్టు 7వ తేదీన చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా నేతన్నలకు తన శుభాకాంక్షలు తెలిపారు. తమ హయాంలో అవినీతి మాటే లేదన్నారు. గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలని పిలుపు ఇచ్చినందుకు కోటి 25 లక్షల మంది స్పందించారని తెలిపారు. 5 కోట్ల మంది పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ తమ నినాదం అన్నారు.ఆగస్టు 1న దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం ఇక్కడ తన సభకు టికెట్లు కొనుక్కొని వచ్చారని.. ఇక్కడ ఇంత మందిని ఏకం చేసిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇక్కడ తెలంగాణ భవిష్యత్ కనిపిస్తుందన్నారు.

ఢిల్లీ బయల్దేరిన మోడీ...

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటన ముగిసింది. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మోడీ ఢిల్లీ బయల్దేరారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ తోపాలు పలువురు రాష్ట్ర మంత్రులు మోడీకి వీడ్కోలు పలికారు. 

నేతన్నలకు శుభాకాంక్షలు : మోడీ

హైదరాబాద్ : 'నా హైకమాండ్ మాత్రం నా కళ్ల ముందు మీ రూపంలో ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆగస్టు 7వ తేదీ చేనేత కార్మికుల దినోత్సవం నేతన్నలకు తన శుభాకాంక్షలు తెలిపారు. తమ హయాంలో అవినీతి మాటే లేదన్నారు. గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలని పిలుపు ఇచ్చినందుకు కోటి 25 లక్షల మంది స్పందించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ తమ నినాదం అన్నారు. 

 

తెలంగాణకు నా వందనాలు : మోడీ

హైదరాబాద్ : ఎల్ బీస్టేడియంలో నిర్వహించిన బీజేపీ మహా సమ్మేళనం కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొని, మాట్లాడారు. 'సోదరీ సోదరీమణులారా'.. అంటూ తెలుగులో మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. చరిత్ర సృష్టించడంలో తెలంగాణ ముందుంటుందని తన అభిప్రాయం అన్నారు. రాజకీయ పండితులు ఇక తెలంగాణ భవిష్యత్ ను కొత్త తరహాలో చూడాల్సిందేనని చెప్పారు. 

 

19:36 - August 7, 2016

హైదరాబాద్ : గత కాంగ్రెస్ పాలన అవినీతిమయమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. ఎల్ బీ స్టేడియంలో నిర్వహించిన 'మహాసమ్మేళనం'లో ఆయన పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్ కుంభకోణాల్లో ముందుకుదూసుకెళ్లిందని ఎద్దేవా చేశారు. నేలను, ఆకాశాన్ని, అంతరిక్షాన్ని వదిలిపెట్టలేదన్నారు. 
భూ అంతర్భాగంలో బొగ్గు స్కాం, ఆకాశంలో అగస్టా స్కాం, అంతరిక్షంలో 2జీ స్కాం.. ఇలా వేటిని 
వదిలిపెట్టలేదని విమర్శించారు. ధరలు ఆకాశాన్నంటాయన్నారు. కేంద్ర పథకాలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మోడీ కృషితో ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తోందన్నారు. 

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : వెంకయ్య

హైదరాబాద్ : కేంద్ర పథకాలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఎల్ బీ స్టేడియంలో నిర్వహించిన మహాసమ్మేళనంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మోడీ కృషితో ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తోందన్నారు. 

19:14 - August 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు డా.లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. ఎల్ బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ మహాసమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ...టీఆర్ ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. అందరం కలిసి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ప్రజాస్వామ్యం ఉన్నదా అనే అనుమానం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిందన్నారు. ఎంసెట్ లీకేజీతో విద్యార్థులు గందరగోళంలో పడ్డారని తెలిపారు. విద్యార్థులతో జీవితాలతో ఆడుకుంటుందని విమర్శించారు. రెండేళ్లపాలనలో కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయని చెప్పారు. మజ్లిస్ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. మజ్లిస్ అరాచకాలను బీజేపీ అడ్డుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. మోడీ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. రెండేళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు మోడీ నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. మోడీ రాక రాష్ట్రంలో బీజేపీకి కొత్త ఊపునిస్తుందని అన్నారు. రాబోయేరోజుల్లో ఉద్యమాలకు, పోరాటాలకు బీజేపీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 
రాష్ట్ర అభివృద్ధికి మోడీ కృషి : కిషన్ రెడ్డి  
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోడీ కృషి చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి చెప్పారు. మోడీ కృషి వల్ల తెలంగాణలో విద్యుత్ లోటు లేదన్నారు. 

మోడీ రాక రాష్ట్రంలో బీజేపీకి కొత్త ఊపు : డా.లక్ష్మణ్

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ రాక రాష్ట్రంలో బీజేపీకి కొత్త ఊపునిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా.లక్ష్మణ్ అన్నారు. ఎల్ బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ మహాసమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రెండేళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు మోడీ నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. 

రాష్ట్ర అభివృద్ధికి మోడీ కృషి : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోడీ కృషి చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి చెప్పారు. ఎల్ బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ మహాసమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనున్నారు. మోడీ కృషి వల్ల తెలంగాణలో విద్యుత్ లోటు లేదన్నారు. 

ఎల్ బీస్టేడియం చేరుకున్న ప్రధాని మోడీ

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ఎల్ బీస్టేడియం చేరుకున్నారు. బీజేపీ మహాసమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనున్నారు.
 

ఎల్ బి స్టేడియం బయల్దేరిన మోడీ

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ బేగంపేట నుంచి ఎల్ బి స్టేడియం బయల్దేరారు. బీజేపీ బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు. కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నారు.

 

17:19 - August 7, 2016

మెదక్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వ సహకారం ఉంటుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గజ్వేల్ మండలం కోమటిబండలో మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. పలు కార్యక్రమాలకు శంకుస్థాన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భహిరంగసభలో మోడీ మాట్లాడారు. 'సోదర సోదరీమణులారా'... అంటూ ప్రధాని మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చానని చెప్పారు. తెలంగాణ దేనికోసం ఏర్పడిందో ఆ కల నెరవేరుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణలో అనేక వనరులున్నాయని తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధిలో ముందుకెళ్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరు నీటి విలువ తెలుసుకోవాలన్నారు. నీరు పుష్కలంగా ఉంటే నీటి నుంచి బంగారం తీయవచ్చన్నారు. 'నీటిని మనం కాపాడితే నీరు మనల్ని కాపాడుతుందని' పేర్కొన్నారు. గ్రామాల్లో వ్యవసాయ రంగానికే ప్రాధాన్యత ఉందని తెలిపారు. 'గ్రామాలు, వ్యవసాయరంగమే మన ప్రధాన బలమని' అన్నారు. జీఎస్ టీ రూపంలో ఆర్థిక సంస్కరణలకు మద్దతు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ లోటు ఉన్న రాష్ట్రాలు మిగులు విద్యుత్ సాధించాయన్నారు. మిషన్ భగీరథకు సోలార్ విద్యుత్ ను ఉపయోగిస్తే కరెంట్ భారం ఎక్కువ ఉండదని తెలిపారు. దేశ వ్యాప్తంగా 30 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. ప్రస్తుతం యూనిట్ ఉత్పత్తికి కేవలం రూ.1.10 పైసల ఖర్చు అవుతోందన్నారు. సాయిల్ హెల్త్ కార్డు ద్వారా భూమాత సంరక్షణపై శ్రద్ధ పెడుతున్నామని చెప్పారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం : మోడీ

మెదక్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధిలో ముందుకెళ్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రతి ఒక్కరు నీటి విలువ తెలుసుకోవాలన్నారు. నీరు పుష్కలంగా ఉంటే నీటి నుంచి బంగారం తీయవచ్చన్నారు. 'నీటిని మనం కాపాడితే నీరు మనల్ని కాపాడుతుందని' పేర్కొన్నారు. గ్రామాల్లో వ్యవసాయ రంగానికే ప్రాధాన్యత ఉందని తెలిపారు. 'గ్రామాలు, వ్యవసాయరంగమే మన ప్రధాన బలమని' అన్నారు.

తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ

మెదక్ : 'సోదర సోదరీమణులారా'... అంటూ ప్రధాని నరేంద్రమోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చానని చెప్పారు. తెలంగాణ దేనికోసం ఏర్పడిందో ఆ కల నెరవేరుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణలో అనేక వనరులున్నాయన్నారు. 

 

16:58 - August 7, 2016

మెదక్ : సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రసంశల జల్లు కురిపించారు. ప్రధాని నరేంద్రమోడీ నేడు తెలంగాణకు రావడం ఓ శుభ దినం అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి మోడీ ప్రేమ కావాలని ఆకాంక్షించారు. తెలంగాణకు నిధులు ఇచ్చిన కేంద్రమంత్రులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని సీఎం చెప్పారు. గోదావరి నది ద్వారా ఇంటింటికీ నీరు అందిస్తామని చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మళ్లీ ప్రారంభించిన మోడీకి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో కరెంట్ కష్టాలు తొలగిపోయాయన్నారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు నిధులు పెంచారని తెలిపారు. సురేష్ ప్రభు వల్ల మెట్రో రైల్ పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. దేశంలో గత రెండేళ్లుగా అవినీతి రహిత పాలన సాగుతోందన్నారు. 

 

తెలంగాణలో తొలగిన కరెంట్ కష్టాలు : సీఎం కేసీఆర్

మెదక్ : తెలంగాణలో కరెంట్ కష్టాలు తొలగిపోయాయని సీఎం కేసీఆర్ అన్నారు. సురేష్ ప్రభు వల్ల మెట్రో రైల్ పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. దేశంలో గత రెండేళ్లుగా అవినీతి రహిత పాలన సాగుతోందన్నారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు నిధులు పెంచారని తెలిపారు. 

 

ప్రతిష్టాత్మకంగా 'మిషన్ భగీరథ' : సీఎం కేసీఆర్

మెదక్ : మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. గోదావరి నది ద్వారా ఇంటింటికీ నీరు అందిస్తామని చెప్పారు. 
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మళ్లీ ప్రారంభించిన మోడీకి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. 

ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ ప్రసంశలు

మెదక్ : సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీపై మోడీపై ప్రసంశల జల్లు కురింపించారు. తెలంగాణకు నిధులు ఇచ్చిన కేంద్రమంత్రులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ నేడు తెలంగాణకు రావడం ఓ శుభ దినం అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి మోడీ ప్రేమ కావాలని ఆకాంక్షించారు. 

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతోనే దేశం అభివృద్ధి : దత్తాత్రేయ

మెదక్ : 'మిషన్ భగీరథ' తెలంగాణ ప్రజలకు ఒక వరం అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గజ్వేల్ మండలం కోమటిబండలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ప్రధాని తొలిసారి తెలంగాణకు రావడం సంతోషకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతున్నారు. 

 

16:21 - August 7, 2016

మెదక్ : 'మిషన్ భగీరథ' తెలంగాణ ప్రజలకు ఒక వరం అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గజ్వేల్ మండలం కోమటిబండలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ప్రధాని తొలిసారి తెలంగాణకు రావడం సంతోషకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతున్నారు. 

16:11 - August 7, 2016

మెదక్ : గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని నరేంద్రమోడీ మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. గ్రామాలకు నీటి సరఫరా చేసే పంపును పీఎం ఆవిష్కరించారు. వరంగల్ కాలోజీ యానివర్సిటీ శిలా ఫలకాలను ఆవిష్కరించారు. అలాగే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరణ చేశారు. 1,600 మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. మనోహరబాద్..కొత్తపల్లి రైల్వేస్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ లో 1600 మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్ ను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. 

 

కాసేపట్లో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించనున్న మోడీ

మెదక్ : ప్రధాని నరేంద్రమోడీ మిషన్ భగీరథ పథకాన్ని కాసేపట్లో ప్రారంభించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేకహెలికాప్టర్ లో మోడీ గజ్వేల్ మండలం కోమటిబండ బయల్దేరారు. ప్రధాని వెంట గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ , కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెళ్లారు. 

గజ్వేల్ బయల్దేరిన ప్రధాని మోడీ

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక హెలికాప్టర్ లో గజ్వేజ్ బయల్దేరారు. ప్రధాని వెంట గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెళ్లారు. అంతకముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి మోడీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మోడీ మెదక్ జిల్లా గజ్వేల్ కు బయల్దేరారు. 

ప్రధాని మోడీకి స్వాగతం పలికిన గవర్నర్, సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి మోడీకి ఘన స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మోడీ మెదక్ జిల్లా గజ్వేల్ కు బయల్దేరారు. 

14:40 - August 7, 2016

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి మోడీకి ఘన స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మోడీ మెదక్ జిల్లా గజ్వేల్ కు బయల్దేరారు. 

 

కాపేసట్లో హైదరాబాద్ కు ప్రధాని మోడీ

హైదరాబాద్ : కాపేసట్లో ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, నాయిని, పద్మారావు, కిషన్ రెడ్డి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.    

 

పద్మావతి మహిళా యూనివర్సిటీ విద్యార్థినిల ఆందోళన..

చిత్తూరు : తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలోని వీసీ బిల్డింగ్ ఎదుట ఆదివారం విద్యార్ధినులు ఆందోళన నిర్వహించారు. హాస్టల్‌లో అల్పాహారం, భోజనం సరిగా లేదని, అహార పదార్థాల్లో నాప్తలిన్‌ కలుపుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. 

హోదాపై సందిగ్ధత – వెంకయ్య..

విజయవాడ : 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా హోదాపై సందిగ్ధత ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం అనేక రాష్ట్రాలు పోటీపడుతున్నాయని హోదా సర్వరోగ నివారిణి కాదన్నారు. 

యూటీఎఫ్ కార్లాయంయలో టీమ్ వర్కర్ల రాష్ట్ర సదస్సు..

హైదరాబాద్ : దోమలగూడ యూటీఎఫ్ కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో టీమ్ వర్కర్ల రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు హాజరయ్యారు. 

కొనసాగుతున్న అంత్య పుష్కరాలు..

తూర్పుగోదావరి : గోదావరి అంత్యపుష్కరాలు కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజైన ఆదివారం గోదావరి తీరం సందడిగా మారింది. పులువురు పుణ్యస్నానాలు ఆచరించారు. 

జనగామలో ఐకాస నేతల అరెస్టు..

వరంగల్ : జనగామలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు మందస్తు చర్యలు చేపట్టారు. 20 మంది ఐకాస నాయకులను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. 

13:20 - August 7, 2016

హైదరాబాద్ : మెదక్‌ జిల్లాలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌ రెడ్డి, నారాయణఖేడ్‌లో మాజీ ఎంపీ సురేష్‌ షట్కార్‌, సంగారెడ్డిలో జగ్గారెడ్డితోపాటు యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా నేతలు కిరణ్‌, మహేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధిపేటలో కాంగ్రెస్‌, సీపీఎం, టీడీపీలకు చెందిన నేతలనూ అరెస్ట్ చేశారు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటారన్న సందేహంతో అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటారంటూ పలు జిల్లాల్లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో కాంగ్రెస్‌, సీపీఎం, టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. మెదక్‌ జిల్లా సిద్ధిపేటలోకూడా సీపీఎం నేతలతోపాటు కాంగ్రెస్‌, టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కరిక రాజయ్య ఖండించారు. టిడిపి, కాంగ్రెస్, సీపీఎం నేతలను అరెస్టు చేయడం దారుణమని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని సీపీఎం నేత పేర్కొన్నారు. కానీ విపక్షాల హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. దళితులపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోడీ స్పందించడం లేదని పలు ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. శాంతియుతంగా తాము నిరసన తెలియచేయాలని భావిస్తే ముందస్తు అరెస్టులు చేయడం దారుణమన్నారు. 

పచ్చికాపలంలో ఉద్రిక్తత..

చిత్తూరు : తిరుపతి వెదురుకుప్పం (మం) పచ్చికాపలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన గ్రామోత్సవాల్లో దళితులను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ గ్రామంలోకి వెళ్లేందుకు దళిత నేతలు యత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. దీనితో నేతలు అక్కడే బైఠాయించారు. 

మెదక్ లో విపక్ష నేతల అరెస్టు..

మెదక్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు విపక్ష నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, నారాయణఖేడ్ లో మాజీ ఎంపీ సురేష్ షట్కార్, సంగారెడ్డిలో జగ్గారెడ్డి తదితర కాంగ్రెస్, సీపీఎం, టిడిపి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఢిల్లీ నుండి బయలుదేరిన మోడీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాసేపట్లో తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నారు. మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. 2.50గంటలకు గజ్వేల్ కు చేరుకుని 3గంటల నుండి 3.45 వరకు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. గజ్వేల్ లో మిషన్ భగరీథను ప్రారంభించనున్నారు. 1600 మె.వా రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కు రామగుండం ఎరువుల కర్మాగారం, కాళోజీ హెల్త్ వర్సిటీ మనోహారాబాద్ - కొత్తపల్లి రైల్వేలైన్ లకు శంకుస్థాపనలు చేయనున్నారు. 1200 మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్ ను రిమోట్ ద్వారా మోడీ ప్రారంభించనున్నారు.

12:58 - August 7, 2016

ఆగస్ట్‌ నెల ఆరంభమైదంటే చాలు ఎక్కడా లేని హడావుడి మొదలవుతుంది. స్నేహితులకు ఎస్సెమ్మెస్‌లు పంపించుకోవడం,.వాళ్లకి ఖరీదైన బహుమతులు కొనివ్వడం,.,.ఇదీ నేటి తరం యువత అనుసరిస్తున్న ఫ్రెండ్‌షిప్‌ డే తీరు. మళ్లీ ఫ్రెండ్‌షిప్‌ డే రానేవచ్చింది. ఇప్పుడిది ఓ పక్కా వ్యాపారం. ఫ్రెండ్‌షిప్‌ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోంది. ఇద్దరి మనుసుల్ని కలిపేది స్నేహం. ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ కష్టకాలంలో నీకు నేనున్నానంటూ గుర్తుచేసేదే స్నేహం. అలాంటి స్వచ్ఛమైన స్నేహం ఇప్పుడు కనిపించదంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడంతా హాయ్‌ బాయ్‌ ఫ్రెండ్‌షిప్‌లే. తరతరాల బంధాన్ని కూడా గుర్తుచేసేందుకు ఫ్రెండ్‌షిప్‌ డే రానే వచ్చింది.  ఫ్రెండ్‌షిప్‌ డే మన భారతీయ సాంప్రదాయం కాదు. దీనికి కచ్చితమైన ఆచార వ్యవహారాలేమీలేవు. జరుపుకునే రోజు కూడా ఖచ్చితమైనది కాదు. ఇతర దేశాల్లో వేర్వేరు రోజుల్లో ఫ్రెండ్‌షిప్‌డేను జరుపుకుంటున్నారు. ఈ వేడుకపై ఒక వర్గానికి చెందిన యువత మాత్రమే ఆసక్తి కనబరుస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలలో మాత్రమే అత్యధికంగా జరుపుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్రెండ్‌ఫిప్‌ డేపై ఆసక్తి అంతంత మాత్రమే. కేవలం పట్టణాలు, మెట్రో నగరాల్లో మాత్రమే ఫ్రెండ్‌షిప్‌ డేను ఆదరిస్తున్నారు.

పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితం..
ఇండియాలో ఫ్రెండ్‌షిప్‌ డే పక్కా వ్యాపారంగా మారిపోయింది. ఫ్రెండ్‌షిప్‌ పేరుతో ప్రతి ఏటా వందల కోట్లరూపాయల బిజినెస్‌ జరుగుతోంది. ఫ్రెండ్‌షిప్ డేకు పది రోజుల ముందు నుంచే ఫ్యాన్సీ షాపులన్నీ కిటకిటలాడుతాయి. ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లు, గ్రీటింగ్‌ కార్డులు, ఖరీదైన బహుమతులకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఇక యువతీ యువకులు రెస్టారెంట్లలు, కాఫీడేలు, పబ్బులు, సినిమాహాళ్లలో గడుపుతూ వేలకువేలు ఖర్చు చేస్తున్నారు. స్వచ్ఛమైన స్నేహనికి బహుమతులతో వెలకడుతున్నారు నేటి తరం మిత్రులు. ఓ మహత్తర కార్యసాధన కోసం ఇండియాలో ఫ్రెండ్‌షిప్‌ డేను పరిచయం చేశారు. మన దేశంలో ఫ్రెండ్‌షిప్‌డేకు మొట్టమొదటి సారిగా 1949లో బీజం పడింది. స్వతంత్ర జాతి నిర్మాణం కోసం ప్రముఖ జైనుల ఆధ్యాత్మిక గురువు ఆచార్య తులసీ అనువ్రత్‌ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ పదేళ్లలో అనువ్రత్‌ ఉద్యమం విపరీతంగా సక్సెస్‌ అయింది. చివరకు 1958లో ప్రపంచశాంతి లక్ష్యంగా ఫ్రెండ్‌షిప్‌ డేను జరుపుకునేందుకు పిలుపునిచ్చారు.

1958లో ఫ్రెండ్‌షిప్‌ డేకు పిలుపు..
ఇండియాలో మొట్టమొదటి సారిగా ఫ్రెండ్‌ఫిప్‌డేను 1958 జనవరి 11న ఢిల్లీలో జరుపుకున్నారు. ఆ వేడుకకు నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ సహా దేశవిదేశాల నుంచి అతిథులు తరలివచ్చారు. ప్రతి ఏటా ఫ్రెండ్‌షిప్‌డే రోజున మిత్రులు, ఆత్మీయులతో తమ కష్టసుఖాలను పంచుకోవాలని ఢిల్లీ వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు. కాని తర్వాత ఆ వేడుక అంతగా విజయవంతం కాలేదు. కాల క్రమేణా మరుగునపడిపోయింది. అయితే సెల్‌ ఫోన్ల వాడకం.. ఇంటర్‌నెట్‌..రేడియో, టీవీ కార్యక్రమాలు.. ఫ్రెండ్‌షిప్‌ డేకు విస్తృత ప్రచారం కల్పించాయి. దాని వెనుక కోట్ల రూపాయల మార్కెట్‌ను కార్పొరేట్‌ సంస్థలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఓ మహత్తర కార్యసాధన కోసం తలపెట్టిన ఫ్రెండ్‌షిప్‌డే నేడు పక్కదారి పడుతోంది. కష్టసుఖాలు పంచుకోవాల్సిన మిత్రులు చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. మిత్రులతో కలిసి విందు, వినోదాల చేసుకోవటానికే నేటితరం యువత ఆసక్తి కనబరుస్తున్నారు.

12:54 - August 7, 2016

చాలా సంవత్సరాల నుండి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కొన్ని ఫ్యామిలీస్ రూల్ చేస్తున్నాయి. ఒక్కొక్క ఫ్యామిలీ లో ముగ్గురు నుండి ఆరుగురు వరకు హీరోలు వచ్చి సిల్వర్ స్క్రీన్ మీద మెరుపులు మెరిపిస్తున్నారు. ఈ మధ్యే ఓ బడా ఫిల్మ్ ఫ్యామిలీలో లుకలుకలు వస్తున్నాయని టాలీవుడ్ టాక్... ఇంతకీ ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న ఫ్యామిలీ ఎవరు..మెగాస్టార్ చిరంజీవి.. ఒక్కడిగా ఇండస్ట్రీకి వచ్చి స్టెప్ బై స్టెప్ ఎక్కి.. అందనంత ఎత్తుకి ఎదిగిన హీరో... కష్టపడి చిన్నచిన్న సినిమాల చేస్తూ మెగాస్టార్ రేంజ్ కి ఎదిగాడు చిరు.. ఆ తరువాత ఆయన ఫ్యామిలీ నుండి నాగబాబు మూవీస్ లోకి అడుగు పెట్టారు.. ఆయన కూడా లీడ్ రోల్స్ చేస్తూ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారి చాలా సినిమాల్లో నటించారు, ఇక్కడే సెటిల్ అయ్యాడు. ఆ తరువాత చిరు ఫ్యామిలీ నుండి వచ్చింది ఓ ప్రభంజనం... చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కల్యాణ్... కుర్ర హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పవర్ స్టార్ గా ఎదిగిపోయాడు. దాదాపు చిరుకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఆ తరువాత బన్ని, ఆ తరువాత రాం చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లూ శిరీష్ ఇలా మెగాస్టార్ ఫ్యామిలీ నుండి సిల్వర్ స్క్రీన్ మీదకు కుర్ర హీరోల వరుస స్టార్ట్ అయ్యింది.

చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ..
అంతే కాదు మొన్నటికి మొన్న తెలుగు ఫిల్మ్ హిస్టరీలోనే లేని విధంగా మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు కూతురు నిహారికా హీరోయిన్ గా ఇంటర్డ్యూస్ అయ్యింది. నాగ శౌర్యా తో జంటగా ఒక మనసు మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇలా మెగా ఫ్యామిలీ నుండి ఫిల్మ్ ఇంటస్ట్రీకి ఒకరి తరువాత ఒకరు వచ్చి సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో మనస్పర్థలు స్టార్ట్ అయ్యాయని సిని జనాలు గుసగుసలాడుతున్నారు. నిజానికి చిరు ఇంట లుకలుకలు ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి. చిరంజీవి పొలిటికల్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. చిరు పొలిటికల్ ఎంట్రీతో మెగా బ్రదర్స్ ఇద్దరూ కూడా అన్నకు అండగా నిలిచారు. కాని చిరంజీవి పొలిటికల్ గా కొంచె బ్యాక్ స్టెప్ తీసుకోవడంతో ముగ్గురి మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. 

కలవలేకపోయిన కల్యాణ్..
నాగబాబు సర్ధుకుని అన్నతో పాటు నడిచాడు. కాని కల్యాణ్ బాబు కలవలేకపోయాడు. అంతే కాదు చిరు ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వచ్చాడు. ఆ తరువాత తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో తానే స్వయంగా వెళ్లి అన్నను కలిశాడు పవన్ అంతటితో అయిపోయింది అనుకున్న సమయంలోనే ఇప్పుడు కొత్త న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మెగా ఫ్యామిలీకి... అల్లూ ఫ్యామిలీకి దూరం పెరుగుతుందా...? ఈ డౌట్ ఇప్పుడు అందరికి ఉంది... దీనికి కారణం అల్లూవారబ్బయి చేసిన కామెంట్సే అంటున్నారందరు. ఈ కామెట్స్ ఇద్దరు కుర్ర హీరోల మధ్య కౌంటర్ల వార్ కి కారణమైయిందట.

బన్నీ వర్సెస్ సాయి..
ఆ మధ్య ఓ ఫంక్షన్ లో పవర్ స్టార్.... పవర్ స్టార్... అని అరుస్తున్న అభిమానులను అరవద్దు ఎందుకు అరుస్తున్నారు అలా అని బన్నీ అనడం, పవర్ స్టార్ అభిమానులకు కోపం తెప్పించిందట. మొన్నటికి మొన్న తిక్క ఆడియో ఫంక్షన్ లో సాయిధరమ్ తేజ్, బన్నీ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చాడు. మెగాస్టార్, పవర్ స్టార్ అని అరవండి అరవకపోతే మజా ఏం ఉంటుంది. మీరు అరవండి మీతో పాటు నేను కూడా అరుస్తాను అని అన్నాడు. పనిలో పనిగా మెగా పవర్ స్టార్ ని కూడా తలుచుకున్నాడంట బన్నీ. ఎంతైనా చిరంజీవి, ప‌వ‌న్, రామ్ చ‌ర‌ణ్, సాయిధ‌రంతేజ్, వ‌రుణ్ తేజ్ వీళ్లు మొత్తం ఒకే గూటి ప‌క్షులు. అల్లు అర్జున్ మాత్రం క‌చ్చితంగా మ‌రో కుటుంబ‌మే. ఎంత మెగా ఇమేజ్ వాడుకున్నా ఆయ‌న అల్లు వార‌బ్బాయే. పైగా ఇప్పుడు బ‌న్నీ ఇమేజ్ పీక్స్ లో ఉంది. మ‌నోడు ఈ మ‌ధ్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై చేసిన క‌మెంట్స్ కూడా ఆయ‌న్ని మెగా అభిమానుల‌కు కాస్త దూరం చేసాయి. ప‌వ‌ర్ స్టార్ అని అర‌వొద్ద‌ని చెప్పి బ‌న్నీ ఫ్యాన్స్ కు దూర‌మ‌య్యాడు.

పోటీ జరుగుతోందా ? 
ఇప్పడు బన్నీకి...సాయికి పోటీ జరగబోతోందా...? వారిద్దరి మధ్య ఈ కౌంటర్స్ ఎంతవరకూ వెళ్తాయి? ఈ కాంట్రవర్సీ ఇలాగే కొనసాగితే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి ? ఇప్పటికే బన్నీ స్టార్ హీరో... తనకంటూ స్పెషల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడే కాదు మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ గా వెలిగిపోతున్నాడు అల్లూవారి అల్లరోడు. సాయి చేసినవి నాలుగు సినిమాలే అయిన అతను కూడా దాదాపు స్టార్డమ్ కి దగ్గరగా వచ్చాడు. అంతే కాదు సుప్రీమ్ హీరో అన్న బిరుదు కూడా మెడలో వేసుకున్నాడు. కాని అల్లూ స్టార్ డమ్ తో పోలిస్తే... సాయికి అంత సీన్ లేదనే చెప్పాలి. ఇంతకి ఈ విషయంలో మోగా ఫ్యామిలీ ఎటువైపు ? మెగా పవర్ స్టార్ల ఫ్యాన్ ఎవరికి సపోర్ట్ చేస్తారు ? మెగా ఫ్యామిలీ నుండి బన్నీని వేరు చేస్తున్నారా ? ఈ కాంట్రవర్సీ ఎక్కడి వెళ్తుందో చూడాలి.

విజయ్ రూపానీ ప్రమాణ స్వీకారం..

గుజరాత్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీ ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కురువృద్ధుడు అద్వానీ, పలువురు నేతలు హాజరయ్యారు. 

12:40 - August 7, 2016

సినిమాల్లో కొందరి కాంబినేషన్ హిట్ ఫేర్ గా నిలుస్తుంది. వారి కాంబినేషన్ లో వచ్చే చిత్రాలు విజయవంతమవుతుంటాయి. అంతేగాకుండా ప్రేక్షకుల వీరిని ఆదరిస్తుంటారు. అలాంటి కోవలో నాగ చైతన్య..తమన్నా కాంబినేషన్ ఒకటి. '100% లవ్', 'తడాఖా' చ్రితాలు రూపొందాయి. ఈచిత్రాలు విజయవంతమయ్యాయి. అనంతరం వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రాలు రూపొందలేదు. తాజాగా..చైతూ..తమన్నా హీరోహీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కనుంది. 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున ఓ చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్నారు. చైతూ సరసన మొదట సమంతను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావించినట్లు తెలుస్తోంది. కొన్ని కారణాల రీత్యా తమన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తారని టాక్. 'ప్రేమమ్‌', 'సాహసం శ్వాసగా సాగిపో' వంటి చిత్రాల్లో నాగచైతన్య నటిస్తున్నారు. 'ధర్మ దురై', 'కత్తిసందై', 'బాహుబలి2' చిత్రాల్లో తమన్నా నటిస్తోంది. మరి ఈ కాంబినేషన్ మరో హిట్ కొడుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

కాసేపట్లో విజయ్ రూపానీ ప్రమాణ స్వీకారం..

గుజరాత్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రమాణ స్వీకార ముహూర్తం నిర్ణయించారు. 

ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యంతో సీపీ భేటీ..

విజయవాడ : పుష్కర భక్తులకు సేవలందించేందుకు ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యంతో సీపీ గౌతమ్ సవాంగ్ సమావేశమయ్యారు. నగరంలోని అన్ని వర్గాల ప్రజలు పుష్కర భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలని సూచించారు. నూతన రాజధానిలో జరుగుతున్న పుష్కరాలను ప్రతొక్కరూ విజయవంతం చేయాలని సీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

పుష్కర ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం..

విజయవాడ : పాత ప్రభుత్వాసుపత్రిలో పుష్కర ఫుడ్ ఫెస్టివల్ సెల్ ను మంత్రి కామినేని ప్రారంభించారు. భక్తులకు నాణ్యమైన ఆహారం అందించడమేనని మంత్రి కామినేని తెలిపారు. అందుకోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు, అన్నదానం చేసే వారు ఫుడ్ సేఫ్టీ అనుమతి పొందాలని సూచించారు. ఫుష్కర ఘాట్లు, ఫుష్కర్ నగర్, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్ వద్ద మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

12:24 - August 7, 2016

అనుష్క..టాలీవుడ్ లో వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందుకు ఆమె నటించిన చిత్రాలే ఉదహారణ. అరుంధతి..రుద్రమదేవి..దేవసేనగా అలరించిన అనుష్క తాజాగా 'ఓం నమో వెంకటేశాయ' చిత్రంలో నటిస్తోంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జునకి జోడీగా ప్రగ్యాజైస్వాల్‌ నటిస్తోంది. వేంకటేశ్వరుడి భక్తుడైన హథీరాం బాబాగా నాగార్జున నటిస్తుండగా, శ్రీనివాసుడిగా టెలివిజన్‌ నటుడు సౌరభ్‌ నటిస్తున్నారు. అనుష్క పాత్రపై ఉత్కంఠ నెలకొంది. చాలా రోజులుగా ఈ సినిమాలో అనుష్క ఓ సన్యాసి పాత్రలో కనిపిస్తుందంటూ ప్రచారం జరిగింది. అనుష్క నటిస్తోందని..కానీ సన్యాసి పాత్ర అని మాత్రం పేర్కొనలేదు. తాజాగా ఓం నమో వేంకటేశాయా సినిమాలో అనుష్క ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు చూపించారు. కృష్ణమ్మ పాత్రలో కనిపిస్తున్న అనుష్క లుక్ ను శనివారం సోషల్ మీడియాలో విడుదల చేశారు. వెంకటేశ్వర స్వామి నేపధ్యంగా సినిమా తెరకెక్కుతుంది కాబట్టి సినిమాకు సంబంధించిన లుక్స్ ని శనివారం రోజే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించిందట. మరి అనుష్క పాత్ర ఎలా మరిపిస్తుందో వేచి చూడాలి. 

నాగావళి నది ఆవతల చిక్కుకున్న యువకులు..

శ్రీకాకుళం : కల్లెపల్లిలో జీడి తోటలకు ఎరువులు వేయడానికి వెళ్లిన 15 మంది యువకులు నాగావళి నది ఆవతల చిక్కుకున్నారు. రక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

12:12 - August 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన టీజేఏసీ ఛైర్మన్ కోదండరాంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్ను పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు..ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా పలు జిల్లాల్లో పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనితో ఆయన కదలికలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు...ఎక్కడకు వెళుతున్నారు ? తదితర సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా ఆయన నివాసం వద్ద ఇంటెలిజెన్స్ సిబ్బంది సంచరిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు నాంపల్లిలో ఉన్న టీ జాక్ కార్యాలయంలో నిఘా పెట్టినట్లు జాక్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదని..పదవులు ఆశించి తాము కార్యక్రమాలు చేయడం లేదని, ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అనుమానాలు వ్యక్తమౌతున్నాయని వారు పేర్కొంటున్నారు. వెంటనేఈ ప్రయత్నాలను విరమించుకోవాలని హితవు పలుకుతున్నారు. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలవాల్సి ఉంది. దీనిపై ప్రొ.కోదండరాం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

12:08 - August 7, 2016

తమ పిల్లలకు పాలు సరివడం లేదని కొంతమంది బాలింతలు మథనపడుతుంటారు. దీనితో పోత పాలు అలవాటు చేస్తుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని, పాలు ఎంత ఎక్కువ పడితే అంత ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందుకు బాలింతలు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
ఆముదం ఆకులపైన ఆముదాన్ని రాసి వేడిచేయాలి. వీటిని రొమ్ములకు కడితే ఫలితం కనిపిస్తుంది.
ఆవుపాలు, కర్బుజా పండు, పాలకూర, జీలకర్ర, బార్లీజావా, బొబ్బర్లు, తెలకపిండితో చేసిన కూర, మునగాకు కూరలు మంచి ఫలితాన్నిస్తాయి.
వాము కషాయం రోజు తేనేతో తీసుకోవాలి. తద్వారా చక్కగా పాలు పడడమే కాకుండా గర్భాశయం త్వరగా కుదించుకపోతుంది. అంతేగాకుండా గర్భాశయంలో నొప్పి కూడా తగ్గుతుంది.
దోరగా ఉన్న బొప్పాయిని తీసుకుని కూర వండుకోవాలి. ఈ కూరను తినడం వల్ల స్తన్య వృద్ధి చెందుతుంది.
మెంతుల కషాయం, మెంతికూర పప్పు ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల పాలు ఎక్కువగా పడుతాయి. 

ప్రొ.కోదండరాంపై ఇంటెలిజెన్స్ నిఘా ?

హైదరాబాద్ : ప్రొ.కోదండరాంపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఇంటి పరిసరాల్లో ఇంటెలిజెన్స్ సిబ్బంది సంచరిస్తున్నట్లు సమాచారం. కోదండరాం వెనుక ఎవరున్నారో తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తోంది. జేఏసీ కార్యాలయంలోనూ నిఘా పెంచినట్లు సమాచారం. 

జనగణమనపై నిషేధం..

ఉత్తర్ ప్రదేశ్ : అలహాబాద్ లో ఎంఏ కాన్వెంట్ స్కూల్ లో జాతీయ గీతం 'జనగణమన అధినాయక జయహే...'ను నిషేధించిన వెలువడిన ప్రకటన కలకలం రేపింది. దీనిని నిరసిస్తూ 8 మంది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. 

బీజేపీపై షీలా విమర్శలు..

ఢిల్లీ : గోవుల రక్షణ పేరిట దళితులపై జరిగిన దాడులపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని షీలా దీక్షిత్ బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ కేవలం గోవులను పూజిస్తుందే తప్ప, వాటి రక్షణకు చర్యలు తీసుకోవడాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

11:40 - August 7, 2016

ఈ సృష్టిలో వెలకట్టలేనిది స్నేహం. ఈ లోకంలో స్నేహమనే తోడు లేకుండా ఏ వ్యక్తి తన జీవనాన్ని కొనసాగించలేడు. దేవుడు ఇచ్చిన ఈ బంధం రక్తసంబంధం కాకపోయిన అంతకంటే గొప్పది. ఈ రోజు ఫ్రెండ్‌షిప్‌డే. ఈ సంధర్భంగా అ స్నేహామాధుర్యాన్ని ఓ సారి మనమందరమూ పంచుకుందాం. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..అన్నాడో సినీకవి. అది అక్షరసత్యం. సృష్టిలో తీయనైనది స్నేహమొక్కటే అన్నది అతిశయోక్తి కాదు. రక్తసంబంధాన్ని కూడా మరిపించే అద్వితీయబంధం స్నేహానిది. స్నేహం ఎవరెవరి మధ్య చిగురురిస్తుందో చెప్పలేం కానీ చిగురించిన ప్రతి స్నేహం వాడిపోకుండా కలకాలం అలాగే నిలిచిపోతుంది. ఎన్నో అద్భుతాలకు తెరతీస్తుంది. తేనెకన్నా తీయనైనది.. మకరందం కన్నా మధురమైనది ఏదైనా సృష్టిలో వుందంటే..అది ఖచ్చితంగా స్నేహమనే చెప్పాలి. స్నేహం త్యాగాన్ని కోరుకుంటుంది.. త్యాగం, స్నేహాన్ని సజీవంగా వుంచుతుంది. అందుకే స్నేహానికీ ఓ రోజు వుండాలని మైత్రీ దినోత్సవాన్ని జరుపుకుంటోందీ లోకం.1935లో అమెరికన్లు ఈ ఫ్రెండ్ షిప్ డే ప్రారంభించారు. ఆగస్టు మాసంలో మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్ షిప్ డేగా జరుపుకునే ఆనవాయితీ ప్రారంభమైంది. అప్పుడు మొదలైన ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతి ఏడాది ఘనంగా జరుపుకుంటారు స్నేహితులు.

స్నేహం అంటే.. రెండక్షరాలు కాదు..
స్నేహం అంటే.. రెండక్షరాలు కాదు.. రెండక్షరాల్లో ఇమిడిపోయే ఇద్దరి వ్యక్తుల ప్రాణం. అందుకే స్నేహానికి అంత గౌరవం. నమ్మకమొక్కటే దానికి పునాది. అలాంటి స్నేహాన్ని ఆస్వాదించడానికి భగవంతుడే భువికి తరలివచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. సుగ్రీవునితో శ్రీరాముడి చెలిమి, కుచేలుడితో శ్రీకృష్ణుని మైత్రి ఇందుకు ఉదాహరణగా చెబుతారు. భారతంలో కర్ణ-ధుర్యోధనుల స్నేహానికి ప్రత్యేక స్థానముంది. స్నేహం కోసం ప్రాణాన్ని కూడా త్యాగం చేసిన ధన్యజీవి కర్ణుడు. అందుకే మైత్రీ ప్రస్తావన వచ్చినప్పుడు ఆ ఇద్దరి పేర్లు స్పురణకు వస్తాయి. ఆపదలో ఆదుకునేవాడే మిత్రుడంటారు. కానీ..ఆపద రానీయకుండా చూసుకునే వాడే నిజమైన స్నేహితుడు. దోస్తీకి హద్దులు లేవు.. వయసుతో పనిలేదు.. లింగ బేధం అసలేలేదు..రాజు-పేద చూసుకోదు.. కులం, గోత్రం, ప్రాంతం ఇవేవీ పట్టించుకోదు.. తెలిసింది ఒక్కటే..అదే స్నేహం. స్నేహానికి అర్ధం నిఘంటువుల్లో వెతకక్కర్లేదు. నీ వెన్నంటే వుండే నీ మిత్రుడే దానికి ప్రతిరూపం. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే. 

11:37 - August 7, 2016

హైదరాబాద్ : ప్రజ‌ల‌పై మంచినీటి చార్జీల పెంపు భారం మోపే ప్రతిపాద‌న‌లు ప్రభుత్వం ఉప‌సంహ‌రించుకోవాలని సీపీఎం అభిప్రాయపడింది. జ‌ల‌మండ‌లి చేస్తున్న అర‌కొర నీటి స‌ర‌ఫరాకు మీట‌ర్లు బిగించడ‌మేంట‌ని ప్రశ్నించింది. ప్రజలకు తాగునీటిని అందించే వాట‌ర్ బోర్డును ప్రభుత్వం వ్యాపార సంస్థలా చూడ‌టం వ‌ల్లే బోర్డు ఇబ్బందుల్లోకి వెళ్తోంద‌న్నారు. హైద‌రాబాద్ మెట్రో వాట‌ర్ సప్లై అండ్ సివ‌రేజ్ బోర్డు లో స‌మూల మార్పుల‌కు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. నగరంలోని ప్రతి నల్లాకు మీట‌ర్ బిగించాల‌ని నిర్ణయించిన అధికారులు ఇందుకు ఒక నెల‌ మాత్రమే టైం ఇచ్చారు. ఆగ‌స్ట్ 31 త‌ర్వాత డ‌బుల్ చార్జీలు వ‌సూలు చేస్తామ‌ని హెచ్చరిస్తున్నారు. సిటిలో అన్ బిల్డ్ వాట‌ర్ లెక్కలు తేల్చడానికే ఈ ప్రయ‌త్నమ‌ని చెబుతున్నారు. అయితే ప్రభుత్వ చ‌ర్యల‌పై స‌ర్వత్రా నిర‌స‌న వ్యక్తం అవుతోంది. జ‌ల‌మండ‌లి ఆర్థిక స్థితిగ‌తులు - మంచినీటి చార్జీలు పెంచే ప్రతిపాదన‌లు అన్న అంశంపై సుంద‌ర‌య్యవిజ్ఞాన కేంద్రంలో సీపీయం న‌గ‌ర క‌మీటి రౌండ్ టెబుల్ స‌మావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ చ‌ర్యను వక్తలు త‌ప్పుప‌ట్టారు.

ఆర్తికస్థితిగతులు మెరుగుపడుతాయా ? 
జ‌లమండ‌లిపై ప్రభుత్వానికి స‌రైన పాల‌సీ లేద‌న్నారు నీటిరంగ నిపుణులు దొంతి న‌ర్సింహారెడ్డి. ఖ‌ర్చులు,మెయింటెనెన్స్, ప్రాజెక్టుల ఖ‌ర్చును కూడా ఎప్పటిక‌ప్పుడు స‌మీక్ష చేయడం లేదన్నారు . దీంతో బోర్డులో అవినీతి తారాస్థాయికి చేరింద‌న్నారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బోర్డుకు చైర్మన్‌గా ఉన్నా.. రెండు సంవత్సరాల నుంచి బోర్డుపై దృష్టి సారించ‌లేదన్నారు. ఇక ఎన్నిక‌ల ముందు నీటి చార్జీల బ‌కాయిల‌ను 457 కోట్ల రూపాయ‌ల‌ను ప్రభుత్వం ర‌ద్దు చేసింది. ఇప్పుడు చార్జీల‌ను పెంచ‌డం కోసం ప్రయ‌త్నిస్తుందన్నారు సీపీఎం న‌గ‌ర కార్యద‌ర్శి శ్రీనివాస్. ఇంత‌టి ఇబ్బందుల్లో ఉన్న బోర్డు బ‌కాయిలు ర‌ద్దు చేసే విష‌యం ముందు తెలియ‌దా అని ప్రశ్నించారు. క‌రెంటు బిల్లులు కూడా క‌మర్షియ‌ల్ ప‌ద్ధతిలో వ‌సూలు చేయడం దారుణమ‌ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంస్థాగ‌త లొసుగులు స‌రిచేయకుండా మీట‌ర్లు బిగించ‌డం ద్వారా బోర్డు ఆర్థిక స్థితిగతులు ఏ మేర‌కు మెరుగుప‌డుతాయోనని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

11:34 - August 7, 2016

హైదరాబాద్ : తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి గండం తప్పినట్టు కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ నేతలకు పదవులు అప్పగించే విషయంలో గులాబీ బాస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి పదవుల విషయం ఎలా ఉన్నా.. ముందు జిల్లా స్థాయిలో పదవుల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి కొంతమంది గులాబీ కార్యకర్తలు, నేతలు నామినేటెడ్ పోస్టులపై కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే రెండు సంవత్సరాల నుంచి ఈ పదవుల భర్తీలో జాప్యం జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు ఇప్పుడు ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీకి గులాబి బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

రిజర్వేషన్లకు అనుగుణంగా భర్తీ చేపట్టాలని ఆదేశాలు..
ప్రతి విషయంలో సెంటిమెంట్ లకు ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు నెలలుగా పదవుల భర్తీని పెద్దగా పట్టించుకోవడం లేదు. మంచి ముహూర్తాలు మొదలుకావడంతో త్వరలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో దేవాలయ కమిటీల నియామకం చేయాలని సంబంధిత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆదేశించారు. మార్కెట్ కమిటీలను రిజర్వేషన్లకు అనుగుణంగా నియామకం చేస్తుండడంతో దేవాలయ కమిటీలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అన్నట్లు సమాచారం. నామినేట్‌డ్ పదవుల భర్తీపై సీఎం సుముఖంగా ఉండడంతో ఆశావహులు లాబీయింగ్‌లను ముమ్మరం చేసే పనిలో పడ్డారు. 

అహ్మదాబాద్ కు చేరుకున్న ఎల్ కే అద్వానీ..

గుజరాత్ : బీజేపీ కురువృద్ధుడు ఎల్. కే అద్వానీ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. కేంద్ర మంత్రి జైట్లీ కూడా చేరుకున్నారు. కాసేపట్లో విజయ్ రూపానీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

 

11:22 - August 7, 2016

విజయవాడ : జిల్లాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రూరల్ ఎనికేపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నపిల్లలకు ఉపయోగించే డైపర్స్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు భారీగా చెలరేగాయి. గోదాం మేనేజర్ కు సమాచారం అందించాడు. వెంటనే మేనేజర్ ప్రమాద విషయాన్ని అగ్నిమాపక శాఖకు తెలియచేశాడు. ఘటనా స్థలికి చేరుకొనే లోపే మంటలు భారీగా విస్తరించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. దాదాపు మూడు ఫైరింజన్లతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రెండు కోట్ల మేర ఆస్తినష్టం జరిగిందని యజమాని పేర్కొంటున్నారు. 

11:20 - August 7, 2016

ఒకప్పుడు వెలుగు వెలిగిన హీరోయిన్స్ ఇప్పడు సైలెంట్ గా ఐటమ్ సాంగ్స్ చేసుకుంటున్నారు. ఫేడ్ అవుట్ అవుతున్న వాళ్ళు ఐటమ్ సాంగ్స్ తో అలరిస్తున్నారు. ఎవరు చేసిన కాని నేను మాత్రం ఐటమ్ సాంగ్ చేయను అన్న ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ కి రెడీ ఐపోయిందట ఇంతకీ ఎవరా హీరోయిన్ తెలుసుకోవాలంటే చదవండి.. చాలా కాలంగా మూవీస్ లో ఐటమ్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తుంది. ఐటమ్ సాంగ్ సినిమాకు ఎట్రాక్షన్ గా మారింది. ఐటమ్ సాంగ్ హింట్ అవ్వడానికి అందులో హీరోయిన్స్ ని ఇన్వల్వ్ చేసి మరీ హిట్ కొడుతున్నారు. దాంతో హీరోయిన్స్ అయిటమ్ సాంగ్స్ చేయాలంటే దానికి తగ్గట్టు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఐటమ్ సాంగ్స్ చేసేవారికి డిమాండ్ పెరిగిపోయింది. రాశీ, రంభ, రమ్యకృష్ణ లాంటి ఫేడ్అవుట్ అయిన పాత హీరోయిన్స్ నుండి శ్రుతి హాసన్, పార్వతీ మెల్టన్, తమన్నా, అంజలి, శ్రియా లాంటి పాపులర్ హీరోయిన్స్ కూడా ఐటమ్స్ సాంగ్స్ చేశారు. బాలీవుడ్ బ్యూటీ మలైకా గబ్బర్ సింగ్ లో స్పెషల్ సాంగ్ చేసి దాదాపు కోటిన్నర రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇలా చాలా మంది హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఇస్టపడుతున్నారు. కమల్ హాసన్ గారల పట్టి, కోలీవుడ్ బ్యూటిఫుల్ లేడీ శ్రుతి హాసన్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగడు మూవీలో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తూ ఐటమ్ సాంగ్ చేసింది.

పలువురు హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్..
టాలీవుడ్, బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా కూడా రెండు సినిమాల్లో ఐటమ్ సాంగ్ చేసింది. స్టార్ హీరోయిన్ గామంచి ఫాంమ్ లో ఉన్నప్పటికీ, రెమ్యూనరేషన్ మహీమో ఏమో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన రెండు సినిమాలలో హాట్ హాట్ సాంగ్స్ చేసింది. అందాల భామ అంజలి కూడా ఐటమ్ సాంగ్స్ చేయడానికి రెడీగా ఉందట. ఉంటమో కాదు చేసింది కూడా. జర్నీతో ఫేమస్ అయ్యి.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో పద్దతిగా పదహారణాల ఆంధ్రా అమ్మాయిగా కనిపించిన అంజలి, అల్లూ అర్జున్ సరైనోడు మూవీలో ఐటమ్ సాంగ్ తో దుమ్ముదులిపేసింది.
ఇలా అందరు హీరోయిన్స్ ఏదో రకంగా ఐటమ్స్ సాంగ్స్ చేస్తూ సంపాదిస్తుంటే... కాజల్ మాత్రం మొన్నటి దాకా ఐటమ్స్ సాంగ్స్ చేయలేను... స్పెషల్ సాంగ్ అని పేరుపెట్టినా సరే చేయడం నావల్ల కాదు అని చెప్పేసింది. ఇన్నీ చెప్పిన కాజల్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందట. అప్పుడు ఒప్పుకోని కాజల్ ఇప్పుడు ఎలా ఒప్పుకుంది.... టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే హాట్ హాట్ టాపిక్.

కాజల్ కు ఫ్లాప్స్..
తెలుగులో సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం మూవీస్ కాజన్ ని బాగా నిరాశ పరిచాయి, ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు పెద్ద ఫ్లాప్స్ వచ్చాక, కాజల్‌ ఇమేజ్‌ బాగానే డ్యామేజ్‌ అయ్యింది. మామూలుగా పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తే, అవి ఫ్లాపయినా హీరోయిన్లకు వచ్చే డ్యామేజీ పెద్దగా ఏమీ వుండదు. కానీ, కాజల్‌ విషయంలో సీన్‌ రివర్స్ అయ్యింది. కాజల్‌ని టాలీవుడ్‌ పట్టించుకోవడమే మానేసింది. దాంతో, కాజల్‌ ఇప్పుడు తన ఉనికి కోసం టాలీవుడ్‌లో కొత్తగా ట్రై చెయ్యాల్సి వస్తోంది. అందుకే, 'జనతా గ్యారేజ్‌' కోసం ఐటమ్‌ సాంగ్‌ ఆఫర్‌ వస్తే కాదనలేకపోయిందట. మరోపక్క, ముందుగా తమన్నాతో ఐటమ్‌ సాంగ్‌ చేయిద్దామనుకున్నా, చివరి నిమిషంలో ఆ ఛాన్స్‌ కాజల్‌కి ఇచ్చింది 'జనతా గ్యారేజ్‌' టీమ్‌. ఇందుకోసం కాజల్‌కి బాగానే ముట్టచెబుతున్నారట. అదెంత.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. తొలిసారిగా కాజల్‌ ఐటమ్‌ సాంగ్‌ చేస్తుండడంతో, 'జనతా గ్యారేజ్‌'కి ఇదొక యాడెడ్‌ ఎట్రాక్షన్‌ అయ్యిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ ఏడాది రెండు ఫ్లాప్స్ ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్న కాజల్‌కి, ఈ ఐటమ్‌ సాంగ్‌ కలిసొస్తుందా.? చూడాలి మరి.

11:10 - August 7, 2016

దాదాపు మూడు దశాబ్ధాల పాటు తెలుగు సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేసిన మోగా హీరో... నైన్ ఇయర్స్ తరువాత మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఎన్నో ప్రాబ్లమ్స్ ను క్రాస్ చేస్తూ ఇంత వరకు జర్ని చేసిన మెగాస్టార్ కి, ఈ 150 మూవీ చాలా ప్రాబ్లమ్ గా మారిందట.. ఇంతకీ మన ఠాగూర్ పడే కష్టాలు, కొత్త సినిమా విశేషాలు తెలుసుకోవాలంటే చదవండి... పునాది రాళ్ళ దగ్గరి నుండి శంకర్ దాదా జిందాబాద్ వరకు చిరంజీవిది అలుపెరుగని ప్రయాణం. చిన్న హీరోగా మొదలు పెట్టి సుప్రీమ్ గా ఎదిగాడు. సుప్రీమ్ స్థానాన్ని నిలబెట్టుకుని మెగాస్టార్ గా పట్టాభిషేకం చేయించుకున్నాడు. అప్పటి వరకు వెస్ట్రన్ డాన్స్ అంటే తెలియని టాలీవుడ్ జనాలతో వెరైటీ స్టెప్పులు వేయించాడు చిరు. చిరు రాకముందు వరకు తెలుగు తెరపై హీరోలంటే ఎన్టీఆర్, ఏఎన్నార్... చిరు వచ్చిన తరువాత ఇండస్ట్రీలో సెట్ అవ్వడానికి టైం పట్టింది.. ఆ తరువాత చిన్నగా సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు మెరిపించడం మొదలు పెట్టాడు శివశంకరుడు. మొదట విలన్ వేశాలు పలుకరించినా.. ఆ తరువాత హీరో క్యారక్టర్స్ ను అంది పుచ్చుకుని దుమ్ము దులిపేశాడు చిరంజీవి.

పున్నమినాగులో వెరైటీ రోల్..
పున్నమి నాగు లో వెరైటీ రోల్ చేసి తనను తాను నిరూపించుకున్న చిరు, ఖైదీతో తిరిగి చూసుకోలేదు.. చిరంజీవి కెరీర్ లోనే ఓ మలుపు తిప్పిన సినిమా ఖైదీ. ఈ సినిమా చిరును తిరుగులేని హీరోని చేయడమే కాదు, ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించిపెట్టింది. ఖైదీ తరువాత దాదాపు 25 సినిమాలు కోదండరామిరెడ్డి డైరక్షన్ లో చేశారు చిరంజీవి. తీసిన ప్రతి సినిమా హిట్టే... దాంతో సుప్రీమ్ హీరోగా ఉన్న చిరు మెగాస్టార్ గా మారిపోయారు. కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రీ లాంటి సినిమాలు అప్పట్లో ట్రెండ్ సెట్టర్స్ అయ్యాయి. 149 సినిమాలతో ప్రేక్షకులను అలరించి శంకర్ దాదా జిందాబాద్ వరుకు అలుపెరుగని సినీ ప్రయాణం కొనసాగించిన మెగాస్టార్, ఆ తరువాత సినిమాలకు విరామం ఇచ్చి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు... పాలిటిక్స్ లోకి వచ్చినా కాని రాంచరణ్ కోసం మగధీర, బ్రూస్ లీ... మూవీస్ లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చాడు శంకర్ దాదా.

హడావుడి..
దాదాపు తొమ్మిది ఏళ్ళ తరువాత మళ్ళీ వెండి తెరపై మెరుపులు మెరిపించడానికి రెడీ అవుతున్నాడు మన ఠాగూర్. రాజకీయాలు కలిసి రాకపోవడంతో అభిమానులు తనను మర్చిపోతున్నారు అని అనుకున్నాడో ఏమో.... వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నాడంట అందరివాడు. ఇప్పటి వరకు 149 మూవీస్ తో ఆడియన్స్ ని అలరించిన చిరంజీవి తన 150వ సినిమా కోసం చాలా హడావిడి చేస్తున్నాడని గుసగుసలు వినిపించాయి. సినిమా చేయాలి అనుకున్నప్పటి నుండి ఇద్దరు, ముగ్గురు డైరక్టర్స్ ను పిలిచి కథ చెప్పించుకుని మరీ నిరాశ పరిచినట్లు తెలుస్తోంది. ఆఖరికి వి.వి.వినాయక్ ను సెలక్ట్ చేసి, సినిమా స్టార్ట్ చేసిన చిరుకి, కొత్త సినిమా ఎక్కడ లేని కష్టాలను తెచ్చిపెడుతోందంట.

కాజల్ ను పెట్టడంపై విమర్శలు..
తమిళ స్టార్ హీరో విజయ దళపతికి సూపర్ హిట్ ను ఇచ్చిన కత్తి మూవీ స్టోరి నచ్చింది చిరుకి అందుకే.. తెలుగులో బడా డైరక్టర్లు కష్టపడి రాసుకున్న కథలను కూడా పక్కకు నెట్టి, ఈ తమిళ స్టోరితో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మూవీని తానే నిర్మిస్తున్నాను అని రాంచరణ్ ప్రకటించాడు. కాని సినిమా ఎలా జరుగుతుందో చూసేవారు లేక సెట్స్ పైకి వెళ్లిన చిరు మూవీ నత్తనడకన సాగుతుందట.  చిరు మూవీ స్టార్ట్ అయ్యి ఫస్ట్ షెడ్యూల్ అయిపోయోంతవరకు హీరోయిన్ కన్ఫామ్ కాలేదట. ఏ హీరోయిన్ ని పలకరించిన సరే ఈ మూవీలో చేయడానికి ఇంట్రస్ట్ చూపించడంలేదంట. కొంత మంది చేస్తా అన్న కూడా వారు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ శారంట. కాజల్ ఈ సినిమాలో నటిస్తుంది అని చెప్పినా ఆమె కూడా కన్ఫాం చేయలా వద్దా అని ఆలోచించి మరీ ఒప్పుకుందట. కాజల్ అలా చేయడానికీ కారణం లేకపోలేదు. రాంచరణ్ తో మూడు సినిమాలు చేసి ఉండటంతో చిరు పక్కన చేయడం బాగోదేమో అని సినీజనాల నుండి విమర్శలు వస్తున్నాయంట. అయినా సరే కాజల్ ఈ సినిమాకు ఓకే చెప్పడం విశేషం.

హిట్ కొడుతుందా ? 
ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదంట చిరు. తొమ్మిదేళ్ళ గ్యాప్ తరువాత వస్తుండటంతో సినిమా ను ఎలాగైన హిట్టు కొట్టించాలని పట్టుదలతో ఉన్నాడంట. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదంట చిరంజీవి. మరి ఈ సినిమా మెగాస్టార్ అభిమానులను అలరిస్తుందా.. వివి వినాయక్ డైరక్ట్ చేస్తుండటంతో మరో ఠాగూర్ లా హిట్ కొడుతుందా లేదా చూడాలి మరి.

10:59 - August 7, 2016

బాహుబలి.. ఓ ట్రెండ్ సెట్టర్..బాహుబలి..ఓ పాత్ బ్రేకర్..బాహుబలి.. ఓ రికార్డ్..ఇలా.. చెప్పుకుంటే పోతే.. ఈ సినిమా విశేషాలకు అంతుండదు. ఈ సినిమా సృష్టించిన సంచలనం అలాంటిది.. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అలాంటివి. మరి తెలుగు సినిమా కలలో కూడా ఊహించడానికి సాహసం చెయ్యలేని రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా మరో రికార్డ్ తో మళ్లీ తెరమీదికి వచ్చింది అదేంటో తెలుసుకోవాలంటే చదవండి..బాహుబలి.. తెలుగు సినిమా కీర్తి కిరీటం.. ఇలా అనడం కన్నా తెలుగు వారి సినిమా సత్తాను ప్రపంచానికి తెలియచెప్పిన సినిమా. బాలీవుడ్ కాదు.. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా .. ఆ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా తీసిన అద్భుతమైన విజువల్ వండర్. ఈ సినిమా టాలీవుడ్ లోనేకాదు.. బాలీవుడ్ లో కూడా సంచనలం రేపింది. అంతేకాదు ఫారెన్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ అయ్యింది. రీసెంట్ గా చైనీస్ కూడా రిలీజ్ అవ్వబోతోంది. బాహుబలి ది కన్ క్లూజన్.. ఈ సినిమాపై ఏ స్తాయిలో అంచనాలు ఉన్నాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాహుబలి పార్ట్ 1 సృష్టించిన ప్రభంజనం అలాంటిది మరి. అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలని వరల్డ్ వైడ్ గా బాహుబలి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ తెలుగు సినిమాకు ట్రెండ్ సెట్ చెయ్యడంతో పాటు టాలీవుడ్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.

క్లైమాక్స్ కు రూ. 30 కోట్లు..
దర్శకుడు రాజమౌళి, బాహుబలి సక్సెస్ ఇచ్చిన జోష్ తో మరింత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం బాహుబలి షూటింగ్ యాజ్ పర్ ప్లాన్ జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు. దీనికోసం ఏకంగా 30 కోట్లు ఖర్చుపెడుతున్నారట. నిజానికి 30 కోట్లంటే.. మామూలు విషయం కాదు. 30 కోట్లతో 4,5 చిన్న సినిమాలు చెయ్యొచ్చు. మంచి మీడియం బడ్జెట్ మూవీ చెయ్యొచ్చు. అలాంటిది జస్ట్ క్లైమాక్స్ కోసం 30 కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేస్తోంది. హై బడ్జెట్ మూవీ ఆఫ్ ద ఇండియన్ సినిమాగా తెరకెక్కిన బాహుబలి ఫస్ట్ పార్ట్ కు దాదాపు 150 కోట్లకు పైనే ఖర్చు పెట్టారట.

భారీ కలెక్షన్లు..
ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ కోసం వెయ్యిమంది జూనియర్‌ ఆర్టిస్టుల్ని వాడిన జక్కన్న.. 'కంక్లూజన్‌' క్లైమాక్స్ మాత్రం ఏకంగా 5 వేల మంది జూనియర్‌ ఆర్టిస్టుల మధ్య ప్లాన్ చేస్తున్నాడట. అంటే బాహుబలి-1 క్లైమాక్స్ కంటే సెకండ్ పార్ట్ క్లైమాక్స్ ఎంత భారీగా ఉంటుందో ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చు. ఆర్టిస్టుల విషయంలోనే కాదు.. మిగతా ఏ విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదట మేకర్స్.  ప్రపంచ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా బాహుబలి-2 క్లైమాక్స్‌ ఉంటుందని సమాచారం. నిజానికి మూడేళ్ల ముందు వరకు టాలీవుడ్లో భారీ బడ్జెట్‌ సినిమా అంటే రూ.50 కోట్లకు అటు ఇటు అంతే. అలాంటిది రాజమౌళి అండ్‌ కో ఏకంగా150 కోట్లకు పైగా బడ్జెట్‌తో 'బాహుబలి' సినిమా తీసి ఓ ట్రెండ్ సెట్ చేసింది. అసలు ట్రెండ్ అనడం కన్నా సాహసం అనడం కరెక్ట్. ఎంత బడ్జెట్ పెట్టి సినిమాలు చేసినా.. కొన్ని మినిమమ్ గ్యారంటీ కూడా లేకుండా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి .. అలాంటిది ఇంత బడ్జెట్ పెట్టి సినిమా చేసి అంతకు 4 రెట్లు కలెక్షన్లు రాబట్టారు.

600 కోట్ల కలెక్షన్లు..
బాహుబలి కి స్పెండ్ చేసిన మనీలో ప్రతి పైసా విజువల్ గా కనిపిస్తూనే ఉంటుంది. 150 కోట్లతో తెరకెక్కిన సినిమా టాలీవుడ్ రికార్డులన్నింటినీ తుడిచేసి ఏకంగా 600 కోట్ల కలెక్షన్లు సాధించింది. రీమేక్ రైట్స్ లో కూడా రికార్డులు సృష్టించింది. తమిళ్ లోబాహుబ‌లి తొలి భాగాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ‌తో క‌లిసి యూవీ క్రియేష‌న్స్ త‌మిళ్‌లో రిలీజ్ చేసింది. బాహుబ‌లి తొలి పార్ట్ అక్క‌డ రూ.28 కోట్ల‌కు అమ్మితే రూ.50 కోట్లు కలెక్ట్ చేసింది. బాహుబలి బిజినెస్ అలాంటిది మరి. ఫస్ట్ పార్ట్ కలెక్షన్స్ తో సెకండ్ పార్ట్ కి కూడా బాగా ఖర్చుపెడుతున్నారు. ఓన్లీ క్లైమాక్స్ కే 30 కోట్లు పెట్టినా.. అంతకు అంత కాదు.. అంతకు మించి ప్రాఫిట్ ని తెచ్చిపెట్టగల కెపాసిటీ ఉందంటున్నారు దర్శక నిర్మాతలు . అందుకే క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా.. అధ్బుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో మరో విజువల్ వండర్ ని నెక్ట్స్ ఇయర్ రిలీజ్ చెయ్యడానికి కష్టపడుతున్నారట యూనిట్.

శ్రీశైలానికి తగ్గిన వరద ఉధృతి..

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గింది. గత వారం రోజులుగా ఎగువ పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరింది. జూరాల జలాశయం నుండి 91,260 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుండడంతో జలాశయంలో 853.50 అడుగులకు చేరింది. 

10:49 - August 7, 2016

నేను అక్షరాలతో ఆయుధాల్ని చేస్తాను. మాటల్తో మనుషులుగా మారుస్తాను. మనువాదాన్ని జయిస్తాను. పదాలతో పద్యం కట్టి వాక్యాలతో కొత్త జాతికి పునాదులు నిర్మిస్తాను. అంటూ కవిత్వమై ఎగసిపడిన అభ్యుదయ కవి లోసారి సుధాకర్ . కరువుసీమ ప్రజల కష్టాలను కన్నీళ్లను కవిత్వంగా మార్చి ఒక ఆర్ధ్రతనిండిన చినుకు కోసం ఆకాశమంత దు:ఖం పిడికెడంత గుండెలో పిడిచగట్టుకు పోతుందని కవిత్వమై విలపించిన హృదయమున్న కవి ఆయన. మైనపు బొమ్మలు, తడియారని స్వప్నం లాంటి కవితా సంపుటాలు వెలువరించిన ప్రముఖ కవి లోసారి సుధాకర్ గురించి పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

10:48 - August 7, 2016

కవిత్వం, కథ ఏదైనాగాని కమిట్ మెంట్ తో రాయాలి. బాగా స్పందించి రాయాలి. అనుభవాలను రంగరించి రాయాలి. అలా కథలు రాస్తున్న నేటి కథారచయిత్రుల్లో కస్తూరి అలివేణిది ఓ విలక్షణ మార్గం. ఆమె సమాజాన్ని, మనుషుల ప్రవర్తనలను నిశితంగా పరిశీలించి కథలు రాశారు. మధ్యతరగతి ప్రజల జీవన చిత్రాలను, భావోద్వేగాలను, మానవసంబంధాల మాధుర్యాలను మంచి కథలుగా శిల్పీకరించారు. ప్రముఖ కథారచయిత్రి, కవయిత్రి, గేయ రచయిత కస్తూరి అలివేణి గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

10:47 - August 7, 2016

సాహిత్యం సమాజాన్ని సమూలంగా మార్చక పోవచ్చు. కాని సామాజిక మార్పుకు దోహదం చేస్తుంది. మానవ విలువలు కాలానుగుణంగా మారవచ్చు. కాని మానవత్వం కొంతవరకు మనుషుల్లో బతికి ఉందంటే అది కేవలం సాహిత్యం వల్లనే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కొన్నిపుస్తకాలు, కొందరు మహారచయితలు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో దళిత బహుజనకవి జూపల్లి ప్రేమ్ చంద్ పై ప్రత్యేక కథనం. కవిత్వం, కథ, నవల, సాహిత్యం ఏదైనా కావచ్చు పేజీలను అలా తిప్పుతుంటే చాలు..నీ అంతరాంతరాల్లో తంత్రులను మీటాలి...అణువణువూ పులకించాలి అంటూ దళిత బహుజన కవి జూపల్లి ప్రేమ్ చంద్ కవిత్వం రాశారు. ఆయన అవేద, నిచ్చెనమెట్ల లోలకం లాంటి కవితాసంపుటాలు వెలువరించాడు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

10:43 - August 7, 2016

కరీంనగర్ : తరాలుగా మానవ నాగరికతకు మర్యాదల అందాలను అద్దుతూనే ఉన్నారు... మనసులోని కళను మునివేళ్లలో రంగరించి.. పంచరంగుల వలువలకు జీవంపోస్తున్నారు. కడుపులో పేగులు మాడుతున్నా... పడుగుపేకలపై పోగులను సరిచేస్తూఉన్నారు... 70 ఏళ్ల వయస్సులో మగ్గాలపై బతుకుపోరు సాగిస్తున్నారు. ఆగష్టు7 న చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల నేతల స్థితిగతులపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం..చేనేత అంటే సిరిసిల్ల... సిరిసిల్ల అంటే చేనేత. పోగు పోగు పెనవేసుకొని అందమైన నేత వస్త్రాలు అద్దుకున్నట్టు సిరిసిల్లతో అల్లుకుపోయింది చేనేత పరిశ్రమ. మగువ మనసు మెచ్చిన నేత చీరలు...విశ్వ విఖ్యాతిగాంచిన నేత దుస్తులు ఇక్కడే పురుడు పోసుకున్నాయి. అలాంటి సిరిసిల్ల నేత పరిశ్రమ నేడు మగ్గంపైనే మగ్గిపోతోంది. మగ్గం కర్రల చప్పుడులో మిణుమిణుకుమంటోంది.

1948లో సిరిసిల్లలో చేనేత సంస్థ స్థాపన..
కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో 1948లో ఇక్కడ చేనేతసంస్థను స్థాపించారు. ఒకప్పుడు 52సంఘాలతో కళకళాడిన సిరిసిల్ల చేనేతపరిశ్రమ... నేడు కేవలం రెండు సంఘాలతో నెట్టుకొస్తోంది. ఇక్కడ 80శాతం ప్రజలు నేత పనిపై ఆధారపడి జీవిస్తున్నారు. చేతినిండా పని ఉన్నా కార్మికులకు పూటగడవని పరిస్థితి. ఇక్కడ యజమాని లాభాలబాటలో సాగుతుండగా... కార్మికుని జీవితం మాత్రం... పోగులుతెగిన పడుగులా తయారైంది. చేసేపనితో పూటగడవని స్థితిలో కడుపేదరికంలో మగ్గుతున్నాడు చేనేత కార్మికుడు. చివరికి వయసుమీరిన స్థితిలోనూ మగ్గాలపై కుస్తీపడుతూనే ఉన్నాడు చేనేతన్న. చేనేతలో కావాల్సిన రంగులు, రసాయనాలు, నూలు ధరలు కార్మికుడిని మొదటినుంచీ దెబ్బతీస్తూనే ఉన్నాయి. సిరిసిల్లలో కార్మికుని ఆకలిమంటలకు ప్రధాన కారణం... దశాబ్దాలుగా పెరగని కూలిరేట్లు. రోజంతా మగ్గంపై చాకిరీచేస్తే.. కేవలం 60 నుంచి 70 రూయలు మాత్రమే వస్తున్న దుస్థితి.

సర్కారోల్లకేనా సౌలతులు.. ?
సిరిసిల్ల చేనేత సంఘాల్లో ఉన్న 200 మంది కార్మికుల్లో ఎక్కువమంది 70ఏళ్లకు పైబడినవారే. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఎండిన డొక్కలతో మగ్గాలపై బతుకుబండిని ఈడుస్తూనే ఉన్నారిలా. " సర్కారు కొలువులు చేసేటోల్లకు యాబైఎనిమిదో ఆరవైయ్యో రాంగనే విశ్రాంతి ఇస్తరు. జీవనం గడవడానికి సకల సౌలతులు చేస్తరు.. మరి మా బతుకులిట్టైనేందీసారూ" అని కన్నీరు పెట్టుకుంటున్నారు చేనేతన్నలు.

59 ఏళ్లు దాటితే పావలావడ్డీ వర్తించదంటున్న బ్యాంకులు..
అన్నికష్టాలకోర్చి తయారు చేసిన వస్త్రాన్ని కొనేది మాత్రం ఒకేసంస్థ. అందుకే వారు తక్కువరేటుకే కొనుగోలు చేయడంవల్ల కనీసం రోజుకూలి కూడా గిట్టుబాటు కావడంలేదంటున్నారు చేనేతలు. అటు సర్కార్‌ పింఛన్లు ఇతర సౌకర్యాలు ఏవీ వీరి దరికి చేరడంలేదు. పావలావడ్డీకే రుణాలతో పెద్ద తకరారు పెట్టింది తెలంగాణ సర్కారు. సిరిసిల్లలో 70ఏళ్లు పైబడిని కార్మికులు అధికంగా ఉంటే.. 59ఏళ్లు దాటిన వారికి పావలావడ్డీ రుణాలు వర్తింపజేయడంతో చాలామందికి రుణసదుపాయం లేకుండా పోయింది.

సరుకును అందిస్తోంది ఆఫ్కో ఒక్కటే..
మరోవైపు కార్మికులకు 60శాతందాకా సరుకును అందిస్తున్న ఆఫ్కో సంస్థ ఒక్కటే మాత్రమే. దీంతో ఆసంస్థ ఎంత ఇస్తే అంతే తీసుకోవల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కోకార్మికునికి మీటరుబట్టకు 13రూపాయలు కూడా లభించడంలేదు. దీంతో లాభాల మాట అటుంచితే కనీసవేతనం కూడా లభించక కటికదారిద్ర్యంలో మగ్గుతున్నామంటున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా.. పథకాలద్వారా కోట్లరూపాయలు అందిస్తున్నామని చెబుతున్నా.. చేనేతల బతుకులు మాత్రం మారడం లేదు. కనీస కూలి కోసం ఎన్నిసార్లు నిరసనలు తెలిపినా పాలకుల మనసు కరగడంలేదని నేత కార్మికులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏపనికి చేతగానివాడు కనీసం కులవృత్తి చేసుకునైనా బతుతాడని పెద్దలు చెప్పేమాట. కాని.. అదే కులవృత్తి ఇపుడు చేనేతలకు అన్నంపెట్టనిదైంది. దీంతో వృత్తిని నమ్ముకుని బతుకులు పాడుచేసుకోవద్దని పిల్లలను నేతపనికి దూరంగా ఉంచుతున్నారు. ఒకపుడు ఓ వెలుగు వెలిగిన చేనేతవృత్తి.. ఇపుడు తమ పాలిట అంపశయ్యలా మారిందని నేతన్నలు ఆవేద చెందుతున్నారు.   

10:37 - August 7, 2016

మధ్యప్రదేశ్‌ : రాష్ట్రంలో మిడ్‌ డే మీల్స్ లో మతం రంగు పులుముకుంది. మదర్సా విద్యార్థులు మిడ్‌డే మీల్స్ ను వ్యతిరేకిస్తున్నారు. హిందూ సంస్థలు పంపే భోజనం తమకు వద్దని వారిస్తున్నారు. బిజెపి పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో మిడ్‌డే మీల్స్ వివాదస్పదంగా మారింది. విద్యార్థులకందించే మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం హిందూ సంస్థలకు అప్పగించడమే ఇందుకు కారణం. 2010 నుంచి హిందూ సంస్థ ఇస్కాన్ ప్రభుత్వ పాఠశాలలతో పాటు మదర్సాలకు కూడా మిడ్‌ డే మీల్స్ సప్లయ్‌ చేస్తోంది. ఉజ్జయినిలో 39 మదర్సాల విద్యార్థులు ఇస్కాన్‌ నుంచి వచ్చే మధ్యాహ్న భోజనాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ భోజనం తమ మత విశ్వాసాలకు వ్యతిరేకమని వాదిస్తున్నారు. హిందూ సంస్థలు భోజనాన్ని దేవాలయాల్లో ఉంచి ప్రార్థన చేసి తీసుకువస్తున్నారని, అలా ప్రార్థన చేసిన భోజనాన్ని తాము తినమని విద్యార్థులు తెగేసి చెబుతున్నారు.

వ్యతిరేకిస్తున్న మదర్సాలు...
నిజానికి ఇస్కాన్‌తో మిడ్‌డే మీల్స్ ఒప్పందం ఈ ఏడాది జులైతో ముగిసింది. తాజాగా కాంట్రాక్ట్‌ తీసుకున్న బిఆర్‌కె ఫుడ్స్, పార్వతి ఫుడ్స్ అందిస్తున్న మిడ్‌డే మీల్‌ను కూడా మదర్సాలు తిరస్కరిస్తున్నాయి. బిఆర్కే సంస్థ 315 స్కూళ్లలో మధ్యాహ్న భోజనాన్ని సప్లయ్‌ చేస్తోంది. కాగా... 56 మదర్సాలు మిడ్‌ మీల్స్‌ను వ్యతిరేకిస్తున్నాయి. హిందూ సంస్థల నుంచి మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తే తమ పిల్లలను మదర్సాలో ఉంచమని తల్లిదండ్రులు హెచ్చరించారు. భోజనాన్ని బయట నుంచి తెప్పించే బదులు మదర్సాలలోనే వండాలని డిమాండ్‌ చేస్తున్నారు. మదర్సాలో చదివే పిల్లల ఆహారపు టలవాట్లు వేరుగా ఉండడం వల్ల ఈ ఆహారాన్ని తిరస్కరిస్తున్నారని దీనిపై విచారణ జరుపుతున్న అధికారులు చెబుతున్నారు.

భీవండిలో నలుగురిని రక్షించిన సహాయక సిబ్బంది..

ముంబై : భీవండి ప్రాంతంలోని హనుమాన్ టేక్రీ వద్ద కుప్పకూలిన రెండంతస్తుల పాత భవనం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం భవంతి కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భవంతిలో ఉన్న 9 మంది మరణించినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టాయి. నలుగురిని రక్షించారు. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ భవనం పడిపోయి 8 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డ సంగతి తెలిసిందే.

10:10 - August 7, 2016

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిగంటల్లో తెలంగాణలో అడుగుపెట్టబోతున్నారు. దీనితో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రధాని పర్యటనలో నిరసనలు..ఆందోళనలు నిర్వహించకుండా విపక్ష నేతలను ముందస్తు అదుపులోకి తీసుకుంటున్నారు. విపక్ష నేతలను అర్ధరాత్రి లేపి మరీ అదుపులోకి తీసుకుంటుండడం విశేషం. పోలీసుల వ్యవహరతీరును పలువురు నేతలు తప్పుబడుతున్నారు. సిద్ధిపేటలో సీపీఎం నేత రేవంత్ తో పాటు పలువురు కాంగ్రెస్, టిడిపి నేతలను ముందస్తు అరెస్టు చేశారు. నల్గొండలో జిల్లాలో అర్ధరాత్రి పోలీసులు ఓవరాక్షన్ చేపడుతున్నారు. భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ లో విపక్ష నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుల వ్యవహారంపై విపక్ష నేతలు నిరసన..ఆందోళన చేస్తారనే ఉద్ధేశ్యంతో పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. చౌటుప్పల్ లో 50 మంది నేతలను..యాదగిరిగుట్టలో పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ దేవరకొండ సమీపంలోని డిండి పీఎస్ కు తరలించారు. కేవలం తాము అదుపులోకి తీసుకుంటున్నామని..అరెస్టులు చేయడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. 

ఘనంగా నాగపంచమి..

ఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో నాగ పంచమిని ఘనంగా జరుగుతోంది. పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వారణాసిలో శివలింగానికి భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. 

సిద్ధిపేటలో ముందస్తు అరెస్టులు..

మెదక్ : ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. సిద్ధిపేటలో సీపీఎం నేత రేవంత్ తో పాటు పలువురు కాంగ్రెస్, టిడిపి నేతలను ముందస్తు అరెస్టు చేశారు. 

ప్రారంభమైన సివిల్స్ ప్రిలిమనరీ పరీక్ష..

హైదరాబాద్ : సివిల్స్ ప్రిలిమనరీ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9.30నుండి 11.30 వరకు ఒకటో పేపర్, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో పేపర్ జరగనుంది. నగరంలో 100, వరంగల్ లో 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

నిరాశపరిచిన సానియా జోడి..

బీజింగ్ : హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా మహిళల డబుల్స్ విభాగంలో తీవ్ర నిరాశ పరిచింది. ఈ విభాగంలో ప్రార్థనా తొంబారేతో జతకట్టిన సానియా, చైనా జోడి షువాయ్ పెంగ్, షువాయ్ జాంగ్ చేతిలో తొలి రౌండులో ఓడిపోయారు. 7-6, 5-7, 7-5 తేడాతో పరాజయం చెందారు. 

కుప్పకూలిన భవంతి ఘటనలో 9మంది మృతి ?

ముంబై : మరో భవంతి కుప్పకూలింది. భీవండి ప్రాంతంలోని హనుమాన్ టేక్రీ వద్ద రెండంతస్తుల పాత భవనం ఈ ఉదయం కూలింది. ఈ ప్రమాదంలో భవంతిలో ఉన్న 9 మంది మరణించినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టాయి. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ భవనం పడిపోయి 8 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డ సంగతి తెలిసిందే.

ఉత్తరాఖండ్ లో ఇంట్లోకి చొరబడిన చిరుత..

ఉత్తరాఖండ్ : బీమ్ టాట్ లో ఓ ఇంట్లోకి చిరుత చొరబడింది. ఈ ఘటన నిన్న చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫారెస్టు సిబ్బంది పది గంటల పాటు శ్రమించి చిరుతను బంధించారు. 

09:30 - August 7, 2016

మహబూబ్ నగర్ : అది తొమ్మిదో శతాబ్దానికి చెందిన గుడి. చోళరాజుల ఏలుబడిలో నిర్మితమైంది. వాల్మీకులే మొదటి పూజ చేసే ఆచారం తరతరాలుగా కొనసాగుతున్న మందిరం. అదే గద్వాల రాజులు నిర్మించిన బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం. కృష్ణా పుష్కరాల సందర్భంగా అశేషంగా భక్తుల కోసం.. ఆలయ విశేషాలపై ప్రత్యేక కథనం..మహబూబ్‌నగర్‌ జిల్లా ఇటిక్యాలలో కృష్ణా నది ఒడ్డున ఉంది బీచుపల్లి. ఇక్కడ.. చారిత్రక ఆంజనేయస్వామి ఆలయం భక్తులను తరతరాలుగా ఆధ్యాత్మిక డోలికల్లో తేలుస్తోంది. తొమ్మిదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో నిర్మితమైనదిగా భావించే ఇక్కడి ఆలయంలోని ఆంజనేయస్వామిని బీచుపల్లి రాయుడుగా భక్తులు పిలుచుకుంటారు. అనాది నుంచి ఈ ఆలయంలో వాల్మీకులే తొలి పూజలు చేయడం ఆనవాయితీ.

స్థల పురాణం..
శ్రీకృష్ణదేవరాయల గురువు వ్యాస రాయలవారు దేశ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చి కృష్ణా స్నానం చేసి తడి బట్టలను శిష్యుడికి ఇచ్చాడని, ఆయన ఆ బట్టలను నదిలోని ఓ రాయిపై ఉతకుతుంటే.. ఆ రాతి నుంచి శబ్దాలు వినిపించాయని, రాతిని తిప్పి చూడగా ఆంజనేయస్వామి ప్రతిమ కనిపించిందని.. ఆంజనేయుడు స్వప్నసాక్షాత్కారం ద్వారా తనను ఇక్కడే ప్రతిష్టించమని ఆదేశించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. అంత పెద్ద రాయిని మోయలేక స్వామిని బరువు తగ్గమని వ్యాసరాయలు ప్రార్థించారని, దాంతో స్వామివారు నిజంగానే బరువు తగ్గారని భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటారు. వ్యాసరాయలు భుజాలపై స్వామివారిని మోసుకుంటూ వస్తుండగా.. ఓ రావి చెట్టు దగ్గరకు రాగానే మళ్లీ స్వామి బరువు పెరిగారని.. అదే అనువైన ప్రదేశంగా భావించి ఆ చెట్టుకిందే స్వామివారిని ప్రతిష్టించారని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతుంటారు.

బీచుపల్లిలో ఆలయాలు..
హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్లే దారిలో పెబ్బేరు సమీపంలో బీచుపల్లి ఉంది. రహదారి పక్కనే ఇక్కడి ఆంజనేయస్వామి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఓ పాతిక కిలోమీటర్లు జాతీయ రహదారిపై ప్రయాణిస్తే.. ఆలంపూరు జోగులాంబ ఆలయం వస్తుంది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. అంతేనా.. బీచుపల్లి పరిసరాల్లోని అగ్రహారం, సోమశిల, కృష్ణ దత్తాత్రేయ స్వామి ఆలయాలూ భక్తులను అలరించేందుకు సన్నద్ధమవుతున్నాయి. మొత్తానికి బీచుపల్లిలో పుష్కరస్నానాలకు తరలి వచ్చే భక్తులకు... పరిసరాల్లోని నల్లమల కొండలు, అక్కడి వన్యప్రాణులు, సుప్రసిద్ధ దేవాలయాలు కనువిందు చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. యాత్రికులకు ఆధ్యాత్మికత, ఆహ్లాదాలను పంచేందుకు అటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.  

09:24 - August 7, 2016

కర్నూలు : కృష్ణాతీరం.. ఎన్నెన్నో ఆలయాలకు ఆలవాలం. వీటిలో సుప్రసిద్ధం జోగులాంబ దేవాలయం..ఈ క్షేత్రం.. అష్టాదశ శక్తిపీఠాల్లో మహా మహిమాన్వితం. అంతేకాదు.. విరించి.. బ్రహ్మదేవుడికి విశిష్టపూజలందే అపురూప ఆలయం. కృష్ణానదీ తీరాన వెలసిన ఆలంపూరు క్షేత్ర విశేషాలపై టెన్ టివి ప్రత్యేక కథనం.. జోగులాంబగా జగజ్జనని వెలసిన శక్తిపీఠం..నవబ్రహ్మలు కొలువైన దివ్య క్షేత్రం..లెక్కకు మిక్కిలిగా వేల్పులు కొలువైన పుణ్యతీర్థం.. పద్దెనిమిది శక్తిపీఠాల్లో నాలుగు... తెలుగు నేలపై నెలకొని ఉన్నాయి. వాటిల్లో ఆలంపూరు జోగులాంబ ఆలయం ఒకటి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది అయిదోది. తండ్రి దక్షుడి ఇంట యాగానికి వెళ్లి ఆత్మాహుతి చేసుకున్న సతి.. సతీదేవి వియోగంతో శివుడు విషాదంలో ఉంటాడని, అతడిని పునర్వివాహానికి పురికొల్పడం ద్వారా తారాకాసుర సంహారానికి నియోగించేందుకు.. సతీదేవి దేహాన్ని విష్ణువు ఖండించాడని.. ఆమె దేహ ఖండాలు పడ్డ ప్రాంతాలు అష్టాదశ శక్తిపీఠాలుగా పూజలందు కుంటున్నాయని భక్తులు నమ్ముతారు. ఖండిత దేహం నుంచి ఎగువ పలువరస ఆలంపూరులో పడిందనీ విశ్వసిస్తారు.

మహబూబ్ నగర్ - కర్నూలు సరిహద్దు..
ఆలంపూరు క్షేత్రం.. మహబూబ్‌నగర్‌, కర్నూలు జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ క్షేత్రం... ఆలయ సముదాయాల దివ్యధామంగా విరాజిల్లుతోంది. అమ్మవారు జోగులాంబగా.... శివుడు బాలబ్రహ్మేశ్వరుడిగా ఇక్కడ పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రంలో... బ్రహ్మదేవుడు తపస్సు చేసి శివదర్శనం పొందాడని, అనంతరం, స్వయంగా బ్రహ్మే శివలింగాన్ని ప్రతిష్ఠించినందువల్ల.. శివుడిని బ్రహ్మేశ్వరుడిగా కొలుస్తారని స్థల పురాణం.
సాధారణంగా శక్తి పీఠాల్లో శివుడి ఆలయాలు ఉండడం మామూలే. కొన్ని చోట్ల కేశవుడి చిహ్నాలూ కనిపిస్తాయి. అయితే... దేశంలోనే ఎక్కడా లేని విధంగా... ఆలంపూరులో బ్రహ్మదేవుడికీ గుడి ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నవ బ్రహ్మల ఆలయాలు ఈ క్షేత్రంలో భక్తులను రంజింపజేస్తున్నాయి. ఈ ఆలయాల గురించి కూడా స్థలపురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. కాశీ నగరంలో పుణ్యవతి అనే స్త్రీ భక్తి శ్రద్ధలతో.. విశ్వేశ్వరుని పూజించి... స్వామి అనుగ్రహంతో రససిద్ధుడిని పుత్రునిగా పొందిందట. కారణ జన్ముడైన రససిద్ధుడు... విశ్వేశ్వరుని ఆనతి మేరకు శ్రీశైల క్షేత్రపు దక్షిణ ద్వారమైన ఆలంపూరులో దేవాలయాల సముదాయాన్ని నిర్మించాడని చెబుతారు.

దక్షిణ కాశి..
ఆలంపూరులో జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరాలయాలతో పాటు.. సూర్యనారాయణ, నీలకంఠేశ్వర, వేంకటేశ్వర, దత్తాత్రేయ, కామాక్షి, ఆంజనేయ, బసవేశ్వర, మహిషాసుర మర్ధిని ఆలయాలున్నాయి. వీటితో పాటు నవబ్రహ్మల ఆలయాలూ ఉన్నాయి. ఆలంపూరులో తుంగభద్రానది, 64 స్నానఘట్టాలు, కృష్ణా, తుంగభద్రల సంగమం, పాపనాశిని మణికర్ణికలు ఉన్నాయి. వీటితో కాశీక్షేత్రానికి పోలిక ఉన్న కారణంగా ఆలంపూరును దక్షిణ కాశిగా పిలుస్తుంటారు. ఆలంపూరులో జోగులాంబ విగ్రహం చూసేందుకు భీకరంగా ఉన్నా.. కొలిచిన వారికి కొంగుబంగారమేనంటారు భక్తులు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 6. 7 శతాబ్దాల కాలంలో బాదామి చాళుక్యులు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ క్షేత్రం ప్రాచీన శిల్పకళా సంపదకు ఆలవాలంగా కూడా భాసిల్లుతోంది. 14వ శతాబ్దంలో మహ్మదీయుల దాడిలో జోగులాంబ ఆలయం ధ్వంసమైంది. ఆసమయంలో శక్తి స్వరూపాలైన చండి, ముండిలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వరాలయంలో నిక్షిప్తం చేశారట.. 2005 దాకా అమ్మవారికి బాలబ్రహ్మేశ్వరాలయంలోనే పూజలు జరిగేవి. 2005లో అమ్మవారి ఆలయాన్ని పునరుద్ధరించాక.. తిరిగి శక్తి పీఠంలోనే పూజలు నిర్వహిస్తున్నారు. కృష్ణా పుష్కరాల వేళ.. ఆలంపూరు క్షేత్ర సమీపంలోని గొందిమల్లలో.. వీఐపీ పుష్కరఘాట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇక్కడే పుష్కర స్నానమాచరిస్తారు. హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్లే మార్గంలో.. జాతీయ రహదారికి కొద్ది దూరంలోనే ఆలంపూరు జోగులాంబ ఆలయం ఉంది. 

09:19 - August 7, 2016

విజయవాడ : బెజవాడ సరికొత్త అందాలను సంతరించుకుంటోంది. ఒక ప‌క్క వినోదం, మ‌రోప‌క్క సంస్కృతి, సంప్రదాయాలు.. అలా న‌గ‌రంలోని గోడలన్నింటినీ అందంగా తీర్చిదిద్దారు విద్యార్ధులు. కృష్ణా పుష్కరాల్లో పాల్గొనేందుకు వచ్చే అతిథులకు ఆహ్లాదకరమైన ఆహ్వానం పలికేందుకు బెజవాడ విద్యార్థులు చేపట్టిన నగర సుందరీకరణపై టెన్ టివి ప్రత్యేక కథనం..పుష్కరాల సందర్భంగా విజయవాడ నగరం అందంగా ముస్తాబవుతోంది. నగరంలోని గోడలు, రోడ్లు రకరకాల పెయింటింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. పుష్కరాల కోసం తరలి వచ్చే అతిథులను,ఆకర్షించేందుకు.. నగర విద్యార్థులు ఈ సుందర చిత్తరువుల చిత్రీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు ఆహ్లాదకరమైన ఆహ్వానం పలికేందుకు విజయవాడ విద్యార్థులు ఇలా నడుం బిగించారు. నగరంలోని గోడలు, రోడ్లపై ఆకట్టుకునేలా పెయింటింగ్స్ వేస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో నగర సుందరీకరణ బాధ్యతలు తీసుకున్నారు విద్యార్థులు.

పరిశుభ్రతకూ ప్రాధాన్యం..
ఇప్పుడు విద్యార్థుల చొరవ వల్ల.. విజ‌య‌వాడలోని ఏ గోడ‌ల‌ను చూసినా రంగురంగుల బొమ్మలు మదిని దోచుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వినోదంతో కూడిన చిత్రాలు చూపరులను కట్టిపడేస్తే.. మరికొన్ని చోట్ల నగర చరిత్రను తెలిపేలా ఆకృతులు అలరిస్తున్నాయి. అన్నింటా అమరావతి చరిత్ర, విశిష్టతలే థీమ్‌గా కనిపిస్తున్నాయి.  పుష్కరాల సందర్భంగా బెజవాడ నగరాన్ని అందంగా తీర్చిదిద్దే పనిలో పాలు పంచుకోవడాన్ని విద్యార్థి లోకం అమితంగా ఆస్వాదిస్తోంది. తమ కార్యక్రమం ద్వారా పరిశుభ్రతకూ ప్రాధాన్యత కల్పించడం విశేషం. 

09:14 - August 7, 2016

నెల్లూరు : సారా వ్యతిరేక ఉద్యమ నాయకురాలు రోశమ్మ ఇక లేరు. ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతోంది. నెల్లూరు జిల్లాలోని ఓ ఆసుపత్రిలో డయాలిస్ చేయించుకుంటోంది. కానీ వైద్య ఖర్చులు అందలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదు. దీనితో నెల రోజుల నుండి ఇంట్లోనే ఉండిపోయింది. వైద్యం అందకపోయేసరికి కోమాలోకి వెళ్లిపోయింది. చివరకు ఆదివారం ఉదయం ఆమె కన్నుమూశారు.

సారా ఉద్యమం..
1993 నుండి 1996 వరకు సారా ఉద్యమం నడిపారు. దూబగుంట నుండి ప్రారంభమైన ఈ ఉద్యమం సంచలనం రేకేత్తించింది. ప్రభుత్వానికి ఒక నలుసుగా మారిపోయారు. అప్పటి సీఎం ఎన్టీఆర్ ఈమెపై ప్రశంసలు కురిపించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ వ్యక్తిగా మారారు. ఆమె పడుతున్న కష్టాలపై టెన్ టివి కథనాలు ప్రసారం చేసింది. దీనితో పలువురు ప్రజాప్రతినిధులు పలు హామీలు గుప్పించారు. కానీ ఆ హామీలు నీటిమూటలుగానే మారిపోయాయి. ఒక పొలం ఉందనే కారణంతో వృద్ధాప్య ఫించన్ ఆపివేశారు. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడంతో ప్రభుత్వం మళ్లీ ఫించన్ ను మంజూరు చేశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదని ఆమె కుమారుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధి వచ్చి చూడలేదన్నారు. 

చేనేత రంగాన్ని కాపాడుకోవాలి - కోదండరాం...

హైదరాబాద్ : చేనేత స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జలవిహార్ నుండి హ్యాండ్లూమ్ వాక్ జరిగింది. వాక్ ను ప్రొ. కోదండరామ్, ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. చేనేత మన జాతీయ వారసత్వ సంపద అని కోదండరాం తెలిపారు. చేనేత రంగాన్ని కాపాడుకోవాలని సూచించారు. 

దూబగంట రోశమ్మ కన్నుమూత..

నెల్లూరు : సారా వ్యతిరేక ఉద్యమ నాయకురాలు దూబగుంట రోశమ్మ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా రోశమ్మ అనారోగ్యంతో బాధ పడుతోంది. వారం క్రితం కోమాలోకి వెళ్లిన ఆమె ఈ రోజు ఉదయం కన్నుమూశారు. 1993 నుండి 1996 వరకు సారా వ్యతిరేక ఉద్యమాన్ని నడిపారు. 

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద హ్యాపీ సండే..

విజయవాడ : ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. అధికారులు..ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

08:59 - August 7, 2016

డాక్టర్లకు వీఐపీ సత్కార్..
ప్రభుత్వాసుపత్రిలో ఎన్ఆర్ఐ డాక్టర్లు సేవ చేస్తే ఏపీ ప్రభుత్వం పథకాలను ప్రవేశ పెట్టింది. వైద్యం చేస్తే ఏపీలో ఉన్న ఆలయాల్లో ఉచితంగా దర్శనం చేయించి ఉండటానికి వసతి కల్పిస్తారంట.
పార్లమెంట్ లో కోతి...
పార్లమెంట్ లో ఓ కూతి దూరింది. సెంట్రల్ హాల్ రీడింగ్ లైబ్రరీలోకి వెళ్లింది. తలుపులు వేసి కూర్చొన్నారంట. వీఐపీలు వాడే దారి గుండా బయటకు వెళ్లిపోయింది.
సంజీవని కోసం గాలింపు..
ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంజీవని పర్వతం కోసం గాలింపులు చేపడుతున్నారంట. నిధుల విషయంలో సహాయం చేయాలని అడిగితే కేంద్ర ప్రభుత్వం చేతులేత్తిసిందని సమాచారం. ఉత్తరాఖండ్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 కోట్లు విడుదల చేసింది.
మటన్ తాజాగా ఉండటానికి చిట్కా..
మటన్ తాజాగా ఉండటానికి డీఆర్డీవో సంస్థ ఓ చిటికా కనిపెట్టింది. దానిమ్మ చెక్కుల రసం పూస్తే మటన్ వారం రోజుల వరకు తాజాగా ఉంటుదంట. 
వీటిపై విశ్లేషణ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

08:56 - August 7, 2016

మహానగరాల్లో రోడ్లన్నీ అస్తవ్యస్థమవుతున్నాయి. చిన్నపాటి వర్షానికి రోడ్లు జలమయమవుతున్నాయి. ఇటీవలే పలు నగరాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించిన సంగతి తెలిసిందే. వాటర్ పోవడానికి డ్రైనేజీ సిస్టం లేకపోవడంతో చాలా మంది ట్రాఫిక్ జాంలో చిక్కుకున్నారు. కొన్ని కొన్ని చోట్ల కారులోకి నీళ్లు వచ్చేశాయంట. బెంగళూరులో రోడ్లపై చేపలు పట్టారు.

ఇంజినీర్లు..
తిరుపతిలో ఐఐటీ రాబోతోంది. దేశ వ్యాప్తంగా 15 లక్షల మంది ఇంజినీర్లు బయటకు వస్తున్నారు. 80 శాతం మందికి ఉద్యోగాలు లేవంట. పుట్టగొడుగుల్లా ఇంజినీరింగ్ కాలేజీలు పుట్టుకొస్తున్నాయి.
ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

జూరాలకు భారీగా వరదనీరు..

మహబూబ్ నగర్ : జూరాలకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 317.280 మీటర్లుగా ఉంది. ఇన్ ఫ్లో 1.42 లక్షలు, ఔట్ ఫ్లో 96.333 క్యూసెక్కులుగా ఉంది. 

08:41 - August 7, 2016

మహబూబ్ నగర్ : తెలుగు నేల నలు చెరగులా సంబరంగా ముచ్చటించుకున్న ఉత్సవం. గోదారమ్మ అంత్యపుష్కరాలు ముగిసిన మర్నాడే.. కృష్ణవేణిలో పుష్కరుడు ప్రవేశించే శుభతరుణం. ఆ శుభఘడియల కోసం తెలుగునేల ఆత్రంగా ఎదురు చూస్తోంది. భక్తజన సందోహానికి ఏలోటూ రానీయరాదన్న ఏలికల ఆదేశాల మేరకు అధికార యంత్రాంగమూ ఏర్పాట్లలో తలమునకలైపోయింది. పుష్కర స్నానాలకు తరలివచ్చే భక్తులను రంజింప చేసేందుకు.. పరిసరాల్లోని పర్యటక ప్రాంతాలు.. ప్రముఖ ఆలయాలూ ముస్తాబవుతున్నాయి.ఓ వైపు పుష్కరాలకు గడువు ముంచుకొస్తుంది. పాలమూరు జిల్లాలో పనులు ఇంకా కొలిక్కి రాలేదు. మాటల్లో చూపుతున్న హడావిడి.. పనుల్లో కనిపించడం లేదు. పుష్కర ఘాట్ల పనుల్లో అస్తవ్యస్తత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్ల పనులపై ప్రత్యేక కథనం..

లోపించిన ప్రణాళిక..
తొలిసారిగా జరగనున్న కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇక్కడ పనులు మాత్రం ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లు సాగుతున్నాయి. అధ్వాన్నంగా మారిన స్నానపు ఘాట్లు, విసుగెత్తిస్తున్న రోడ్ల విస్తరణ పనులు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. జిల్లాలో ఈ సారి 52 ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 32 ఘాట్లను అత్యంత ప్రధానమైనవిగా నిర్ణయించారు. పుష్కరాల గడువు ముంచుకొస్తున్నా.. పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ట్రాఫిక్‌ నియంత్రణకు సంబంధించిన ముందస్తు ప్రణాళిక కూడా అధికారుల వద్ద లోపించింది.  హైదరాబాద్ నుంచి బీచుపల్లికికు వెళ్లే మార్గంలో ఇంకా పనులు పూర్తి కాకపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఆలంపూర్ వద్ద సీఎం కేసీఆర్‌ పుష్కర స్నానం చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కూడా పార్కింగ్‌ సంబంధిత ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. దీంతో పుష్కర స్నానాల కోసం తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

బీచుపల్లి వీఐపీ ఘాట్..
జులై నెలాఖరుకు పనులన్నీ పూర్తి చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. పుష్కరాల నాటికి పనులు పూర్తవుతాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలే వర్షాకాలం.. ఏ మాత్రం వర్షాలు కురిసినా పనులకు ఆటంకం కలిగే అవకాశం లేకపోలేదు. ఎగువ నీటి విడుదల నేపథ్యంలో ఘాట్ల పనుల్లో తీవ్ర ఆటంకం కలుగుతున్నాయన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. బీచుపల్లి వీఐపీ ఘాట్‌ వద్ద చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. హడావిడిగా చేసే పనుల్లో నాణ్యత ఎంతన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కాంట్రాక్టర్లు ఆదరా బాదరాగా పనులు చేస్తుండటంతో మన్నికపై అనుమానాలు షరామామూలుగానే ఉన్నాయి. 

భీవండిలో కుప్పకూలిన భవంతి..

మహారాష్ట్ర : భీవండిలోని హనుమాన్ టేక్రిలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

08:14 - August 7, 2016

గుజరాత్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రమాణ స్వీకార ముహూర్తం నిర్ణయించారు. ఆనందీబెన్‌ పటేల్‌ రాజీనామా తర్వాత విజయ్‌ రుపానీ గుజరాత్‌ బీజేఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. గుజరాత్‌ సౌరాష్ట్రలోని రాజ్‌కోట్‌కు చెందిన విజయ్‌ రూపానీ ఏబీవీపీ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆతర్వాత బీజేపీలో వివిధ హోదాల్లో పని చేశారు. 

08:11 - August 7, 2016

శ్రీకాకుళం: మూఢం పోయింది. ఆషాడ మాసం కూడా వెళ్లిపోయింది. శ్రావణ మాసంతో శుభ ముహూర్తాల సీజన్‌ ప్రారంభయ్యింది. పల్లెలు, పట్టణాలు... ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సందడి కనిపిస్తోంది. బట్టల దుకాణాలు, బంగారం షాపుల నుంచి కిరాణ షాపుల వరకు అన్నీ పెళ్లివార్లతో క్రిక్కిరిసిపోతున్నాయి. ఏప్రిల్‌ నుంచి జులై 13 వ తేదీ వరకు మూడు నెలల మూఢంతో సరిపోయింది. ఆ తర్వాత ఈనెల 2 వరకు ఆషాడంతో సరిపోయింది. శ్రావణమాసం రాకతో మళ్లీ పెళ్లిళ్ల సందడి ప్రారంభమయ్యింది. దీంతో బాజాభ్రజంత్రీలతో అన్ని చోట్ల సందడి నెలకొంది. ఈ నెలలో దాదాపు పది రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు 6న చాలా వివాహాలు జరిగాయి. 7న కూడా ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయి. ఈనెల 13, 18, 20, 21, 25, 26, 27 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఎక్కడ చూసినా నిశ్చితార్ధాలు, పెళ్లిళ్లతో సందడి సందడిగా కనిపిస్తోంది. బట్టల దుకాణాలు, బంగారం షాపులు కిటికిటిలాడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న 200 కల్యాణ మండపాలు ముందుగానే బుక్‌ అయ్యాయి. ఫంక్షన్‌ హాళ్లదీ ఇదే పరిస్థితి. ఇవి దొరకనివారు హోటళ్లను బుక్‌ చేసుకుంటున్నారు. దేవాలయాలు కూడా ఖాళీలేవు. దీంతో కొంతమంది రోడ్లపైనే షామియానాలు వేసుకుని పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో పురోహితులుకు డిమాండ్‌ పెరిగింది. వంటలు చేసేందుకు క్యాటరింగ్‌ కాంట్రాక్టర్లు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. అలంకరణ కళాకారులకు కూడా డిమాండ్‌ ఏర్పడింది. దీంతో అందరూ కూడా అధిక రేట్లు డిమాండ్‌ చేస్తుండంలో పెళ్లిళ్ల వ్యయం తడిసిమోడవుతోందని వధువరుల తల్లిదండ్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

08:06 - August 7, 2016

కరీంనగర్ : దశాబ్దంన్నర కాలం క్రితం మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు నోచుకోనుంది. ఈ యూరియా ప్లాంట్‌ పునర్నిర్మాణం పూర్తయితే వందలాది మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కర్మాగారం పునరుద్ధరణ పనులను ప్రారంభించనున్నారు. రామగుండం యూరియా ప్లాంట్‌లో 2018 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కరీంనగర్‌ జిల్లాలో రెండు పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ఎన్టీపీసీ నాలుగువేల మెగావాట్ల థర్మల్‌ విద్యత్‌ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మెదక్‌ జిల్లా కోమటి బండ నుంచి ఈ రెండు పనులకు రిమోట్‌ ద్వారా శ్రీకారం చుడతారు.

1999 మార్చి 31న మూత..
రామగుండం ఎరువుల కర్మాగారానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1970 అక్టోబర్‌ 2న ఈ ప్రాజెక్ట్‌కు పునాదిరాయి పడింది. 1980 ఉత్పత్తి ప్రారంభించింది. దాదాపు 18 ఏళ్లపాటు పనిచేసిన ఈ ప్లాంట్‌ నిర్వహణలోపంతో 1999 మార్చి 31 మూతపడింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. దీని పునరుద్ధరణకు కార్మికులు చేసిన పోరాటాలు ఫలించలేదు. పాలకులు చేసిన ప్రయత్రాలు కొలిక్కిరాలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దీని పునరుద్ధరణ కోసం ప్రయత్నించింది. దేశంలో నెలకొన్న ఎరువుల కొరతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని పునరుద్ధరించాలని నిర్ణయించడంతో రామగుండం ఎరువుల కర్మాగారం పునర్నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.

కేజీ బేసిన్‌ నుంచి సహజవాయువు సరఫరా..
రామగుండం ఎరవుల కర్మాగారం పునరుద్ధరణలో చాలా సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా 26 శాతం, ఇంజినీర్స్‌ ఇండియా మరో 26 శాతం వాటా భరిస్తున్నాయి. ఈ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఫర్టిలైజర్స్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా 11 శాతం వాటా సమకూర్చేందుకు ముందుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం 10 శాతం వాటా పెట్టుబడిగా పెట్టనుంది. మిగిలిన మొత్తాన్ని డెన్మార్క్‌కు చెందిన హల్దార్‌ సంస్థ ముందుకొచ్చింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కూడా నిధులు సమకూర్చుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. మిషన్‌ భగీరథ పైపులైన్‌ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నుంచి 0.55 టీఎంసీల నీటిని ఈ కర్మాగానికి అందిస్తారు. తెలంగాణ ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ ద్వారా 40 మెగావాట్ల కరెంట్‌ సరఫరా చేస్తారు. ఏపీలోని కేజీ బేసిన్‌ నుంచి అహ్మదాబాద్‌ గ్యాస్‌ పైపులైన్‌ ద్వారా సహజ వాయువు సరఫరా చేస్తారు. దీంతో రామగుండం ఎరువుల కర్మాగారానికి పట్టిన గ్రహణం చాలా కాలం తర్వాత వీడినట్టు అయ్యింది. రామగుండంలో నిర్మిస్తున్న నాలుగువేల మెగావాట్ల జాతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి కూడా మోదీ కోమటిబండ నుంచి రిమోట్‌ ద్వారా శంకుస్థాపన చేస్తారు. సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో చేపట్టే ఈ ప్లాంట్‌కు కోల్‌ లింకేజ్‌, పర్యావరణంతోపాటు, ఇతర అన్నిరకాల అనుమతులు లభించాయి. రామగుండం ఎరువుల కర్మాగారం, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. 

08:03 - August 7, 2016

హైదరాబాద్ : ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్బీస్టేడియం దగ్గర ఐదు వేల మంది పోలీసులతో పాటు.. ర్యాపిడ్‌యాక్షన్‌ ఫోర్స్‌, ఆర్ముడ్‌ ఫోర్స్‌లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నగరానికి మోదీ రానున్న నేపథ్యంలో పోలీసులు, ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన డీజీపీ అనురాగ్‌శర్మ భారీ భద్రతతో పాటు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ విధించినట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఎస్పీరోడ్‌, గ్రీన్‌ల్యాండ్స్‌, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌, రాజ్‌భవన్‌, ఖైరతాబాద్‌, బేగంపేట ప్రాంతాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయన్నారు. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో అవసరమైనప్పుడు ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టనున్నట్లు డీజీపీ తెలిపారు.

ఐదు వేల మంది పోలీసులు..
ఇక ఐదు వేల మంది పోలీసులతో ఎల్బీ స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అనురాగ్‌శర్మ తెలిపారు. వీరితో పాటు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, ఆర్ముడ్‌ఫోర్స్‌, సాయుధ బలగాలు కూడా బందోబస్తులో పాల్గొంటాయన్నారు. బేగంపేట విమనాశ్రయం నుంచి ఎల్బీ స్టేడియం వరకు సీసీ కెమెరాలను నిఘాను ఏర్పాటు చేసినట్లు.. వాటిని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానం చేసినట్లు డీజీపీ తెలిపారు. బేగంపేట, ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 2 కిలోమీటర్ల మేర నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. ఇక వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ నుంచి వచ్చే వాహనాలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో... రంగారెడ్డి, వరంగల్‌, హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలకు నిజాం కాలేజీ ‌గ్రౌండ్‌లో... మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం నుంచి వచ్చే వాహనాలకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన ముగిసే వరకు నిరంతర నిఘా కొనసాగుతుందని డీజీపీ తెలిపారు. 

08:01 - August 7, 2016

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనపై టీఆర్ఎస్ ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. మొదటిసారి తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని... రాష్ట్రానికి భారీగా వరాలు ప్రకటిస్తారన్న ఆశాభావంతో సర్కార్‌ ఉంది. రాష్ట్రాభివృద్ధికి పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు అందిస్తారన్న ధీమాతో ఉంది. ప్రధాని పర్యటనపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న విమర్శలను పక్కనపెట్టిన టీఆర్ఎస్... మోదీ టూర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సక్సెస్‌ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మొదటిసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు ఈ టూర్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు గులాబీ దళం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ పర్యనటకు ప్రధాని మోదీకి తీరిక దొరకడం లేదని గతంలో విమర్శలు చేసిన టీఆర్‌ఎస్ నేతలు.. మోదీ టూర్‌ ఖరారైన తర్వాత ఈ విషయాన్ని వదలేశారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి కొన్ని కొత్త పథకాలు, ప్రత్యేక నిధులు సాధించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు.

మిషన్‌ భగీరథకు నిధుల మంజూరుపై ఆశలు..
మెదక్‌ జిల్లాలో పర్యటించనున్న మోదీని అన్ని విధాల సంతృప్తి పరిచేలా టీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాట్లు చేశారు. కోమటిబండ సభకు రెండు లక్షల మంది జన సమీకరణ చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు గజ్వేల్‌లో మకాం వేసి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. దేశంలోని చాలా రాష్ట్రాలను ఆదర్శంగా నిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు నిధులు మంజూరుపై సర్కార్‌ ఆశలు పెట్టుకుంది. రెండు పడక గదుల ఇళ్ల పథకంతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న నేపథ్యంలో... మోదీ దీనిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే మిషన్‌ కాకతీయ ద్వారా పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ చేపట్టిన తరుణంలో దీనితో పాటు మరికొన్ని పథకాలకు కూడా నిధుల మంజూరుపై పాలకులు ఆశలు పెట్టుకున్నారు.

మోదీ ముందుకు మరోసారి హైకోర్టు విభజన అంశం..
విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని ముఖ్యమంత్రి కేసీఆర్‌.... ప్రధాని మోదీని కోరే అవకాశం ఉంది. హైకోర్టు విభజన అంశాన్ని కూడా మోదీ ముందు ఉంచొచ్చని భావిస్తున్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంత ఒత్తిడి తెచ్చినా... ఎలాంటి హామీ ఇవ్వని ప్రధాని మోదీ.... తెలంగాణ విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి. 

దయాశంకర్ విడుదల..

ఢిల్లీ : బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ జైలు నుండి విడుదలయ్యారు. ఆయనకు నిన్న బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. 

నేడు జాతీయ చేనేత దినోత్సవం..

హైదరాబాద్ : నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మిలియన్ గొంతుకలతో 'వీవర్ జిందాబాద్ - హ్యాండ్ లూమ్' కార్యక్రమం జరగనుంది. ఉదయం 8గంటలకు నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుండి ప్రారంభం కానుంది. 

యాదగిరిగుట్టలో కాంగ్రెస్ నేతల అరెస్టు..

నల్గొండ : యాదగరిగుట్టలో కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్టు చేశారు. ప్రధాని మోడీ గజ్వేల్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు చేపట్టారు. మల్లన్న సాగర్ విషయంలో ప్రధాని మోడీని అడ్డుకుంటారన్న అనుమానంతో 10 మంది కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. డిండి పీఎస్ కు తరలించారు. 

పాల్వంచలో 10 మంది కాంగ్రెస్ నేతల అరెస్టు..

ఖమ్మం : ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పాల్వంచలో 10 మంది కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

 

నేడు భవన కార్మికుల 6వ రాష్ట్ర మహాసభలు..

నెల్లూరు : నేడు భవన కార్మికుల సంఘం 6వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. నగరంలో ప్రదర్శన, వీఆర్పీ గ్రౌండ్ లో బహిరంగ సభ జరగనుంది. 

నేడు సివిల్స్ ప్రిలిమనరీ పరీక్ష..

హైదరాబాద్ : నేడు సివిల్స్ ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. ఉదయం 9.30నుండి మధ్యాహ్నం 11.30 వరకు ఒకటో పేపర్, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో పేపర్ జరగనుంది. నగరంలో 100, వరంగల్ లో 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

నగరంలో నేడు మోడీ పర్యటన..

హైదరాబాద్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 2.50గంటలకు గజ్వేల్ కు చేరుకుని 3గంటల నుండి 3.45 వరకు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. గజ్వేల్ లో మిషన్ భగరీథను ప్రారంభించనున్నారు. 1600 మె.వా రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కు రామగుండం ఎరువుల కర్మాగారం, కాళోజీ హెల్త్ వర్సిటీ మనోహారాబాద్ - కొత్తపల్లి రైల్వేలైన్ లకు శంకుస్థాపనలు చేయనున్నారు. 1200 మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్ ను రిమోట్ ద్వారా మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం గజ్వేల్ బహిరంగసభలో ప్రధాని ప్రసంగించనున్నారు.

నగరంలో ఆంక్షలు..

హైదరాబాద్ : ఎల్బీస్టేడియంలో భారతీయ జనతాపార్టీ వర్కర్స్ మహాసమ్మేళన కార్యక్రమం ఆదివారం జరగనుంది. దీనితో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. 

Don't Miss