Activities calendar

08 August 2016

21:31 - August 8, 2016

ఢిల్లీ : జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యసభలో చేసిన సవరణలను లోక్‌సభలో సభ్యులు ఆమోదిస్తూ ఓటింగ్‌లో పాల్గొన్నారు. లోక్‌సభలో మొత్తం 443 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. దీంతో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్టు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును ఇటీవలే రాజ్యసభ కూడా ఆమోదించారు. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో రూపొందిన ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ ఒకేవిధంగా పన్నుశాతం ఉంటుంది. దేశమంతా ఒకే మార్కెట్‌గా పరిగణించబడుతుంది. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో పాటు దేశంలోని 50శాతం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలిపితే.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది.  

21:30 - August 8, 2016

ఢిల్లీ : జిఎస్‌టి సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగింది. జిఎస్‌టి బిల్లు విజయం ఏ ఒక్కరిది కాదని, అన్ని పార్టీలకు చెందుతుందని ప్రధాని నరేంద్రమోది అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోవడం వల్లే జిఎస్‌టి బిల్లు రెండేళ్లుగా అటకెక్కిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. గతవారం రాజ్యసభలో ఆమోదించిన జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో దేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ఏర్పడి వ్యాపారం సులువవుతుందన్నారు. జీఎస్టీ బిల్లుపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపినట్లు జైట్లీ తెలిపారు. పన్ను రేటును జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయిస్తుందన్నారు.

నరేంద్ర మోడీ వివరణ..
బిల్లుపై చర్చలో భాగంగా ప్రధాని నరేంద్రమోది మాట్లాడుతూ...జీఎస్‌టీ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్న పార్టీలన్నింటికీ ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య విజయమని కొనియాడారు. జీఎస్‌టీ సవరణల బిల్లులో విజయం ఏ ఒక్క పార్టీదో కాదు.. ఈ విజయం అందరిదీ అన్నారు. దేశంలోని టాక్స్‌ టెర్రరిజం నుంచి జీఎస్‌టీ బిల్లు విముక్తి కలిగిస్తుందని తెలిపారు. జిఎస్‌టి బిల్లుతో ఒక దేశం-ఒక పన్ను విధానం అమలవుతుందన్నారు. జిఎస్టి బిల్లు పేదలకు అండగా ఉంటుందని, రాష్ట్రాలకు కూడా లాభం చేకూరుతుందని తెలిపారు. నల్ల ధనాన్ని, అవినీతిని నిర్మూలించడాకిని జిఎస్‌టి బిల్లు దోహదం చేస్తుందని ప్రధాని చెప్పారు.

ఖర్గే డిమాండ్స్..
జిఎస్‌టి టాక్స్ 18 శాతం మించకుండా చూడాలని దీనిపా ప్రభుత్వం హామీ ఇవ్వాలని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే కేంద్రాన్ని కోరారు. జిఎస్‌టి బిల్లును కాంగ్రెస్‌ మొదటి నుంచి సమర్థిస్తోందని, గతంలో బిజెపి పాలిత రాష్ట్రాలు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ మద్దతు లేకుండానే జిఎస్‌టి బిల్లును పాస్‌ చేసుకోవాలని కేంద్రం భావించడం వల్లే జాప్యం జరిగిందని అన్నారు. జిఎస్‌టిని మనీ బిల్లు రూపంలో కాకుండా ఫైనాన్షియల్‌ బిల్లు రూపంలో తేవాలని ఖర్గే కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. మనీ బిల్లు రూపంలో వస్తే రాజ్యసభలో మళ్లీ ఆగిపోతుందని హెచ్చరించారు. జిఎస్‌టిని మనీ బిల్లుగా తేవాలా, ఫైనాన్షియల్‌ బిల్లుగా తేవాలా అన్నది జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్ణయిస్తుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు.

21:24 - August 8, 2016

చిత్తూరు : కరువును చూసి మనం భయపడటం కాదు..మనల్ని చూసి కరువు భయపడే రోజు రావలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా కుప్పంలో రైతుకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రతి ఇంటికి 10 వేల ఆదాయం రావాలని కాంక్షించారు. సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాలలో మొక్కలు నాటారు. అనంతరం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఇన్నోవేషన్‌ అధికారులను నియమించినట్లు తెలిపారు. విశాఖ నగరంలో పూర్తిస్థాయిలో ఎల్‌ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేశామని.. వాటి ద్వారా 40శాతం విద్యుత్‌ ఆదా అవుతోందని చెప్పారు.

ప్రభుత్వ శాఖల్లో ఇన్నోవేషన్‌ అధికారుల నియామకం..
రైతు కోసం సభలో పాల్గొన్న బాబు..హంద్రీనీవా ద్వారా డిసెంబర్‌ నాటికి కుప్పంకు నీళ్లు తెస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి నెలకు రూ.10 వేల ఆదాయం తేవడమే లక్ష్యమన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారే ఎక్కువ ఆదాయం వస్తుందని, పాడి, మేకలు, కోళ్ల పెంపకంపై రైతులు దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. రైతు సాధికార సంస్థలు, స్వయం సహాయక సంఘాలకు రుణాల చెక్కులు పంపిణి చేశారు చంద్రబాబు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. హోదాపై చవకబారు రాజకీయాలు చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఏపీకి న్యాయం జరిగే వరకు రాజీపడనని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు. 

21:20 - August 8, 2016

హైదరాబాద్ : ఎన్‌కౌంటర్‌లో హతమైన నయీం ఇంటి నుంచి భారీగా బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు కోట్ల 8 లక్షల రూపాయలకు పైగా నగదు, 1.93 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సైబరాబాద్‌ కమిషనర్‌ నవీన్‌చంద్‌ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్ధిష్ట సమాచారం నార్సింగి సీఐ అల్కాపురిలో ఇంటికి రావడం జరిగిందని, నయీం గ్యాంగ్ సభ్యులున్నట్లు సమాచారం అందిందన్నారు. మారణాయుధాలు, పేలుడు పదార్థాలు..చీకటి రాజ్యం నడిపిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇక్కడన్న మహిళలను అరెస్టు చేయడం జరిగిందని, నాలుగు పిస్టోల్, రివాల్వర్, జిలెటిన్ స్టిక్స్, డాక్యుమెంట్లు, సీడీలను స్వాధీనం చేసుకున్నట్లు, తెలంగాణలో, ఇతర రాష్ట్రాల్లో ఇతని చీకటి రాజ్యం నడిపించినట్లు తెలిపారు. పంచనామా ఇంకా జరుగుతోందన్నారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన అనంతరం దర్యాప్తు జరుపనున్నట్లు తెలిపారు. నివాసంలో పదకొండు మంది ఉన్నారని, కేసుతో సంబంధం లేని పిల్లలను ఛైల్డ్ ఆఫీసర్ ఎదుట హాజరుపరుస్తామన్నారు.  

21:18 - August 8, 2016

మహబూబ్ నగర్ : మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ నయీం హతమయ్యాడు. సామాన్యుడి నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన నయీంపై 100కు పైగా కేసులు ఉన్నాయి. వీటిలో హత్య కేసులే 20 వరకూ ఉన్నాయి. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం పలు భూ దందాలు, సెటిల్‌మెంట్లు, హత్యలతో తెలుగు రాష్ట్రాల దావుద్‌లా ఎదిగాడు. చివరకు గ్రేహౌండ్స్‌ పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌. రాత్రి 7 గంటల సమయంలో కాల్పుల కలకలం గ్రేహౌండ్స్ పోలీసులు.. నల్గొండ స్పెషల్‌ పార్టీ పోలీసులు షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లోని బాషా అనే వ్యక్తి ఇంటిని చుట్టుముట్టారు. సోదాలు నిర్వహిస్తుండగా.. జరిగిన ఎదురుకాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ నయీం మృతి చెందాడు.

ఎన్నో కేసుల్లో ప్రమేయం..
నయీం ప్రయాణించిన వాహనం డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటన స్థలం నుంచి ఏకే 47, నాలుగు షార్ట్‌గన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్‌స్టర్ నయీం హతమైన ఘటనా స్థలాన్ని ఎస్పీ రమారాజేశ్వరి సోమవారం పరిశీలించారు. ఆదివారం రాత్రి వైట్ కలర్‌ ఫోర్డ్ ఎండీవర్ వాహనం అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం వచ్చిందని, స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించినట్లు ఆమె చెప్పారు. అయితే కారులోని వ్యక్తులు పోలీసులపై కాల్పులు జరిపడంతో, ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఘటనలో ఓ వ్యక్తి మరణించారని ఎస్పీ రమా రాజేశ్వరి తెలిపారు. నయీంకు ఎన్నో కేసుల్లో ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. చాలాకాలంగా అతడు తప్పించుకుని తిరుగుతున్నాడని, నయీం ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు నార్సింగ్‌లో.. నయీం భార్య, కుటుంబసభ్యులు నివాసముంటున్న ఓ అపార్ట్ మెంట్‌నూ పోలీసులు చుట్టుముట్టారు. ఆ ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు, నగలను పోలీసులు గుర్తించారు. తమ మధ్యనే నయీం కుటుంబం నివసించిందని తెలియడంతో.. ఆ ప్రాంత ప్రజలు అవాక్కయ్యారు. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతన్న నయీం.. అనూహ్యంగా హతమవడం సంచలనం సృష్టించింది. 

21:11 - August 8, 2016

నల్గొండ : గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌తో బాధితుల కళ్లలో ఆనందం కన్పిస్తోంది. ఎన్నో అరాచకాలకు పాల్పడ్డ నయీం బాధితులు కూడా వందల్లోనే ఉన్నారు. బెదిరింపులు కిడ్నాప్‌లు..హత్యలు..హత్యాయత్నాలతో హడలగొట్టిన నయీం అనుచరుల ఆగడాలకు తెరపడిందని బాధితులు సంతోషాన్ని వెల్లిబుచ్చుతున్నారు. నిన్నటివరకు భయంతో మూగబోయిన వారంతా ఇప్పుడు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారంటే నయీం అరాచకాలకు సాక్ష్యం ఏం కావాలి. నయీం ముఠా సభ్యుల అరాచకాలు ఒక్క నల్లగొండ జిల్లాకే పరిమితం కాలేదు. నిజామామాద్ జిల్లాలో కూడా ఆ ఛాయలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఎందరో వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే ఓ వ్యాపారిని హెచ్చరించి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు బయటపడింది. దీనిపై డిచ్ పల్లి మండలానికి చెందిన వ్యాపారి అమృతపూర్ గంగాధర్‌ గత నెల 16న నయీం ముఠా ఆగడాలపై పోలీసులను కూడా ఆశ్రయించినట్లు చెబుతున్నాడు.

సాంబశివుడి తండ్రి హర్షం..
రకరకాల సంస్థలను స్థాపించి వాటి ముసుగులో అరాచకాలు చేస్తున్న గ్యాంగ్‌స్టర్ నయీం వాటి నిర్వహణ కోసం డబ్బు కావాలంటూ వ్యాపారులను ప్రజాప్రతినిధులను బెదిరింపులకు గురిచేశాడు. నిజామాబాద్ లోని గంగాధర్‌కు ఇదే విషయం చెప్పిన నయీం ముఠా కోటి రూపాయలు పంపాలని...సెల్‌ఫోన్‌కు మెసేజ్ చేసి ఆ తర్వాత హెచ్చరికలు చేస్తూ ఫోన్ చేసినట్లు చెబుతున్నాడు. మావోస్టుల్లో కలిసిపోయి ఆ తర్వాత జనజీవనస్రవంతికి వచ్చిన నయీం అరాచకాల్లో ప్రధానం మాజీ మావోయిస్టు..టీఆర్‌ఎస్‌నేత సాంబశివుడు హత్యోదంతం...సంచలనం రేపిన ఈ హత్యతో నయీం అరాచకాలు అప్పట్లో మరోసారి వెలుగులోకి వచ్చాయి...ప్రస్తుతం నయీం ఎన్‌కౌంటర్‌తో సాంబశివుడి తండ్రి హర్షం వ్యక్తం చేస్తున్నారు...తన కుమారుడిని చంపిన వారిలో ప్రతీ ఒక్కరినీ చట్టరీత్యా శిక్షించాలంటూ వేడుకుంటున్నారు. నయీం హతంతో పలు జిల్లాలలో మూగబోయిన గొంతుకలు మాట్లాడుతున్నాయి. 

నయీం ఇంట్లో నగదు..బంగారం స్వాధీనం..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం ఇంటి నుండి 2.8 లక్షల నగదు, నాలుగు పిస్టోల్, రివాల్వర్, జిలెటిన్ స్టిక్స్ 1.93 కిలోల బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. 

హోర్డింగ్స్ లకు జీహెచ్ఎంసీ అనుమతి..

హైదరాబాద్ : హోర్డింగ్స్ లకు జీహెచ్‌ఎంసీ అనుమతినిచ్చింది. గ్రౌండ్‌ హోర్డింగ్స్ కు 40-25 అడుగులతో.. రూఫ్‌టాప్‌ హోర్డింగ్స్ కు 30-25 అడుగులు వరకు పెట్టుకోవాలని పేర్కొంది. భవిష్యత్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే ఏజెన్సీలదే బాధ్యతని, చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది.

రియోలో భారత్ కు చుక్కెదురు..

ఢిల్లీ : రియోలో భారత్ కు చుక్కెదురైంది. పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ లో నాలుగో స్థానంతో అభినవ్ బింద్రా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

హరితహారంపై సీఎం సమీక్ష..

హైదరాబాద్ : హరితహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు ఏడాదిలో 10 నెలలూ మొక్కలు నాటొచ్చని, అన్ని జిల్లాల్లో అటవీభూములున్నా అడవులు లేవని తెలిపారు. కలప స్మగ్లర్లపై పీడీయాక్ట్ నమోదు చేయాలని, ప్రతి కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో గ్రీన్‌ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హరితహారంపై పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు సూచించారు. 

ఒంటరిగానే బరిలో - షీలా..

ఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ పేర్కొన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీతోను పొత్తు పెట్టుకోబోమని అన్నారు. 

20:45 - August 8, 2016

తెలుగు రాష్ట్రాలపై ప్రధాని తీరేం మారలేదు. అక్కడ చెంబెడు నీళ్లు.. చారెడు మట్టి.. ఇక్కడ నాలుగు మాటలు, కాసిన్ని పొగడ్తలు.. అంతే.. పెద్ద డిఫరెన్సేం లేదు.. రెండు రాష్ట్రాలకు చేకూర్చి ప్రయోజనాలూ ఏమీ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే వచ్చారు... వెళ్లారు.. అంతే. కానీ, ఈ చిన్న టూర్ తో అనేక ప్రశ్నలు మాత్రం లేవనెత్తి వెళ్లారు.. ఓ పక్క ఏపీలో టీడీపీతో దోస్తీ గందరగోళంలో ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తుండగా.. ఇటు తెలంగాణలో మోడీని ఆకాశానికెత్తిన కేసీఆర్ కమల దళానికి దగ్గరవుతున్నారా అనే ప్రశ్నకు కారణమయ్యారు.. ఇదే అంశంపై ప్రత్యేక కథనం.. ఉన్నది నాలుగ్గంటలే కానీ, ప్రశ్నలు, విమర్శలు చాలా వినిపించాయి. ఇచ్చిందేమిటి, తీసుకెళ్లందేమిటి అనే చర్చనూ లేవనెత్తారు. మరో పక్క కమలదళంలో అసంతృప్తికీ కారణమయ్యారనే చర్చకూడా మొదలయింది. మొత్తానికి మోడీ తెలంగాణ పర్యటన భిన్నవాదనలను, శూన్య హస్తాన్నీ మిగిల్చిందని పరిశీలకు వాదన. రెండేళ్ల రెండు నెలల తర్వాత వచ్చి రెండు గంటలు అధికారిక కార్యక్రమానికి మరో రెండు గంటలు తమ పార్టీ బిజెపి సమావేశానికి వెచ్చించి వెళ్లిపోయారు ప్రధాని. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మామూలు మర్యాదలను మించి మోడీ పాలనను పొగిడిన తీరు అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది.

రెండేళ్ల తరువాత...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల తర్వాత ప్రధాని మోడీ వచ్చారు. దేశానికి ప్రధాని అయిన వ్యక్తి రాష్ట్రానికి రావటం చిన్న కతేం కాదు. అందుకే.. ప్రధాని పర్యటన కోసం తెలంగాణ సర్కారు ఎంత భారీ ఏర్పాట్లు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాక రాక వచ్చిన మోడీ.. తెలంగాణకు వచ్చిన దానికి భారీ కాంప్లిమెంట్ తో.. ఊహించని ఇమేజ్ తో ఢిల్లీకి తిరుగుముఖం పట్టగా.. ప్రధాని రాకతో తెలంగాణకు ఏం ఒరిగిందనే విషయానికి సమాధానం లేదు.. మోడీ పర్యటనతో కమల దళం అయోమయంలో పడిందా? ఇంత కాలం కేసీఆర్ సర్కార్ ను, ప్రభుత్వం పథకాలను విమర్శిస్తూ వచ్చిన వారికి మోడీ తీరు అసంతృప్తిని కలిగించిందా? గజ్వేల్ మీటింగ్ లో ఓ తీరులో, హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం మరో తీరులో సాగిందా? మోడీ ప్రసంగంలో దళితులపై దాడుల గురించి ప్రస్తావించడం, కావాలంటే నాపై దాడి చేయండి గాని వారి జోలికి పోవద్దని చెప్పడం ఆశ్చర్యంగా కనిపించిన విమర్శ. అసలిది ఎవరిని ఉద్దేశించిందో అర్ధం కాని పరిస్థితి. గోరక్షణ పేరిట ఈ దాడులు చేసింది సంఘ్ పరివార్‌ అనుబంధ సంస్థల వారే. ఈ వ్యాఖ్యలపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎప్పటిలాగే అవే హావభావాలు.. అవే ఊకదంపుడు మాటలు తప్ప తెలంగాణకు పనికొచ్చే అంశం ఒక్కటీ చెప్పలేదు. ఇంత కాలం ఆంధ్రకు ఎలాంటి పరిస్థితి అయితే ఎదురవుతూ వచ్చిందో, తెలంగాణకు కూడా అదే రిపీట్ చేస్తూ రిక్తహస్తాలను మిగులుస్తూ మోడీ పర్యటన సాగిందని పరిశీలకులు భావిస్తున్నారు. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రైల్వే డీఎస్పీ గోవర్ధన్ ఆధ్వర్యంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సోదాలు నిర్వహించింది. 

20:39 - August 8, 2016

ఒకింట్ల పెండ్లి సందడి సుర్వైంది.. సుట్టాలు పక్కాలతోని అంత సందడి సందడున్నది.. కళ్యాణ మండపంల ఘనంగ పెండ్లైంది.. పిల్లా పిలగాడు ఇద్దరు గల్సి పిలగాని ఇంటికి వోవాలెగదా..? పక్కపొంటున్న ఒక గుడిలె పుజ జేశి ఇంట్ల కుడికాలు వెడ్దామని సూశిండ్రు.. కని అంతలనే పిలగాడు సచ్చిపోయిండు.. ఎంత బాధుంటది చెప్పుండ్రి.. ఈ విషాద ముచ్చట కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:35 - August 8, 2016

హమ్మయ్య మొత్తం మీద ఒక పెద్దపని ఒడ్సగొట్టిండ్రు పోలీసోళ్లు.. కరుడుగట్టిన కాలనాగును కాల్చి సంపిండ్రు.. వారెవ్వ నరేంద్రమోడీ సారు ఏడ వరాలు గురిపిస్తడో..? ఏడ రూటు మార్చి పరిపాలన జేస్తడో అని అందరు కండ్లళ్ల వత్తులేస్కోని సూశిండ్రుగని.. సారు మాత్రం పాత పద్దతిని మార్చలే..? సంగారెడ్డి కాడికెళ్లి మనకొక గెస్టొచ్చిండు ఇయ్యాళ.. అదే గడ్డం జగ్గారెడ్డి..బంగారు తెలంగాణ కోసం వర్గాలుగ ఇడిపోయి నెత్తులు వలగొట్టుకున్నరు కారు క్యాడర్.. ఏమున్నదమ్మా పేదోళ్ల పిల్లలు సద్వుకునె బడులు బంజరు దొడ్ల కంటె అద్వాహం తయ్యారైనయ్ సూడుండ్రి.. పక్కపొంటున్న ఒక గుడిలె పుజ జేశి ఇంట్ల కుడికాలు వెడ్దామని సూశిండ్రు.. కని అంతలనే పిలగాడు సచ్చిపోయిండు.. అనంతపురం జిల్లాల గుప్తనిధుల కోసం గుడి గోపురాన్నే పెకిలిచ్చిండ్రంటే వాళ్లు మన్సులేనా..? ఒక మన్షి నేను ఇంక జర్రశేపట్ల సచ్చిపోతా అన్న సంగతి తెలిస్తె ఎట్లుంది..? ఆగ్రానగరంల సీసీ కెమేరాలు గుడ్లు దెర్సి సూస్తుంటె గూడ.. దాని మానన దాన్ని ఇడ్సిపెట్టి.. దొంగతన రాచకార్యం సజావుగ జేస్కోని ఎల్లిపోయిండ్రు..గీ ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

మాస్టర్ డెవలపర్ ఎంపిక బిడ్ పై సీఆర్డీఏ సమావేశం..

గుంటూరు : రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపిక బిడ్‌పై ఆసక్తి చూపుతున్న సంస్థలతో సీఆర్డీఏ ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి పలు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. 

ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లు..

ఢిల్లీ : లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం లోక్ సభలో బిల్లు ఆమోదం పొందింది. జీఎస్టీ బిల్లుపై ఓటింగ్ ను స్పీకర్ సుమిత్రా మహజన్ కొనసాగించారు. కొద్దిసేపటి క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివరణినిచ్చారు. 

లోక్ సభలో జీఎస్టీ బిల్లుపై ఓటింగ్..

ఢిల్లీ : లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. జీఎస్టీ బిల్లుపై ఓటింగ్ ను స్పీకర్ సుమిత్రా మహజన్ కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివరణినిచ్చారు. 

నయీం మృతదేహానికి పంచనామా పూర్తి..

మహబూబ్ నగర్ : గ్యాంగ్ స్టర్ నయీం మృతదేహానికి పంచనామా పూర్తయ్యింది. షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. 

స్థానికతపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు..

విజయవాడ : స్థానికతపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణ నుండి ఏపీకి వెళ్లే వారికి వారు కోరుకున్న చోటే స్థానికత వర్తించనుంది. స్థానికత కల్పించే బాధ్యత తహశీల్దార్ లకు అప్పగించనున్నారు. జూన్ 2, 2017 నాటికి ఏపీకి తరలివెళ్లిన వారికే స్థానికత వర్తించనుంది. స్థానికత కోసం మీ సేవాలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఏపీలో కాంట్రాక్టు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు..

విజయవాడ : ఏపీలో కాంట్రాక్టు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం పెంచింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ అసిస్టెంట్లకు రూ. 17,500, జూ.అసిసెంట్లు, డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ. 15వేలకు పెంచింది. ఆఫీస్ సబార్డినేట్, రికార్డు అసిస్టెంట్లకు రూ. 12వేలకు పెంచింది.

 

19:35 - August 8, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం హతమయ్యాడు. షాద్ నగర్ లోని మిలినయం వద్ద గ్రే హౌండ్స్ జరిపిన కాల్పుల్లో నయీం మృతి చెందాడు. షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రి వద్ద పోస్టుమార్టం నిర్వహించారు. పుప్పాల్ గూడలోని ఆల్కాపురిలో పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. శంషాబాద్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. దాదాపు ఏడు గంటల పాటు జరిపిన సోదాల్లో కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా 13 తపాంచాలు, జిలెటిన్ స్టిక్స్, పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కసారిగా ఈ ఘటనతో ఆల్కాపురి ఉలిక్కిపడింది. ఇదిలా ఉంటే నయీంకి మూడు కుటుంబాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. నల్గొండ, హైదరాబాద్, నిజామాబాద్ లో ఈ కుటుంబాలున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని పుప్పాల్ గూడ ఆల్కాపురిలో ఓ భవంతి కుటుంబం ఉంటోందని సమాచారం. ఈ భవంతిని అత్యంత కట్టుదిట్టంగా నిర్మించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న తనిఖీలతో ఆ ప్రాంతంలో ఉన్న స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 

19:31 - August 8, 2016

ప్రకాశం : జిల్లా మార్కాపురంలో నిర్మిస్తున్న వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం పెంచాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆందోళన చెపట్టింది. ప్రాజెక్ట్‌ పరిధిలోని 11 గ్రామాల ప్రజలు మార్కాపురం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆఫీసులోకి వెళ్లకుండా ఆర్డీఓ చంద్రశేఖర్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్వాసితులకు గతంలో తక్కువ పరిహారం చెల్లించిన విషయాన్ని సీపీఎం నేతలు ప్రస్తావిస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

19:28 - August 8, 2016

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ గరం గరమయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవడానికి ఆయన ఢిల్లీకి వచ్చారు. కొద్దిసేపటి క్రితం పార్టీ ఎంపీలతో ఆయన రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదాపై వినతిపత్రం సమర్పించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇస్తామని అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం ఒక్కటై రాష్ట్రాన్ని విభజించారని, ఇచ్చిన మాటను తప్పితే ఎవరిని నమ్మాలి ? అని ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలపై సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉత్సన్నమౌతుందన్నారు. దీనికి సంబంధించిన అంశాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

జీఎస్టీ వల్ల నష్టం..
జీఎస్టీ వల్ల దేశానికి మంచి జరుగుతుందని, కానీ ఏపీ రాష్ట్రానికి ఒక అన్యాయం జరుగుతుందన్నారు. ఏ పారిశ్రామిక వేత్త వస్తే రాష్ట్ర ప్రభుత్వం సేల్స్ టాక్స్ బెనిఫిట్స్ కల్పిస్తుందని, ఐదేళ్ల పాటు ఇన్సెంటివ్ ఇస్తుందని గుర్తు చేశారు. ఈ బెనిఫిట్స్ చూసి ఇతర రాష్ట్రాల వారు ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారని, జీఎస్టీ బిల్లు వల్ల అది లేకుండా పోయిందన్నారు. కేంద్ర పరిధిలోకి వెళ్లిందని, పరిశ్రమలను ఆకర్షించడం కష్టతరమవుతుందన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు నాయుడులో చలనం లేదని విమర్శించారు.

బాబుకు ధైర్యం లేదు..
తమ మంత్రులను ఉపసంహరించుకుంటామని చెప్పే ధైర్యం బాబులో లేదని, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి సన్మానాలు చేస్తూ ఆయనతో సమావేశాల్లో పాల్గొంటూనే బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని బాబు ఏడుస్తుంటారని తెలిపారు. దేవుళ్లను అమ్మే బాబు కృష్ణా పుష్కరాలకు ఆహ్వానం పలకడానికి ఢిల్లీకి వచ్చారని తెలిపారు. ఇంగ్లీషులో నరేంద్ర మోడీని విమర్శించలేదని, గట్టిగా అడిగితే సీబీఐ విచారణ జరుపుతారని భయపడ్డారని తెలిపారు. బాబు మాదిరిగా దేశం ఎక్కడకు పోతుందోనని రాష్ట్రపతి వ్యాఖ్యానించారని ఓ పత్రికలో వార్తలు వచ్చినట్లు తెలిపారు. కానీ రాష్ట్రపతి వద్ద ఎలాంటి మీడియా ఉండదని, ప్రెసిడెంట్ మాటలు విన్నట్లుగా వార్తలు ప్రచురించడం దారుణమన్నారు. చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో చంద్రబాబు భాగస్వామ్యం కావాలని కోరారు.

గుళ్లను కొట్టేస్తున్న బాబు..
విజయవాడలో 40 గుళ్లను కొట్టేస్తున్నారని, పుష్కరాల కోసం వచ్చానని బాబు నిసిగ్గుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరేశ్వరుడి సదావర్తి భూములను తన బినామీలకు విక్రయించడానికి సిద్ధమయ్యాడని ఆరోపణలు గుప్పించారు.  

నయీం ఇంట్లో కొనసాగుతున్న సోదాలు...

హైదరాబాద్ : నయీం ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. పుప్పాల్ గూడలోని ఆల్కాపురిలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇంట్లో జిలెటిన్ స్టిక్స్, పలు కీలక డాక్యుమెంట్లు, ఆడి కారును స్వాధీనం చేసుకున్నారు. 

19:02 - August 8, 2016

టీమిండియా, వెస్టిండీస్ జట్ల నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కీలక దశకు చేరింది. కరీబియన్ ద్వీపాలలోని సెయింట్ లూషియా వేదికగా రేపటి నుంచి ఐదు రోజుల పాటు జరిగే మూడో టెస్ట్ రెండు జట్లకు మాత్రమే కాదు...సిరీస్ కే కీలకంగా మారింది. రెండు జట్లూ విజయమే లక్ష్యంగా పలు మార్పులతో సమరానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే 1-0 ఆధిక్యం సాధించిన టీమిండియా రెండో విజయంతో సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. జమైకాలోని సబైనా పార్క్ వేదికగా ముగిసిన రెండో టెస్ట్ మొదటి మూడు రోజుల ఆటలో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించిన టీమిండియా ఆఖరి రోజు ఆటలో తేలిపోయిన నేపథ్యంలో ఈ కీలక టెస్ట్ కు రంగం సిద్ధమయ్యింది. యాంటీగాలో ముగిసిన తొలిటెస్ట్ ను మొదటి నాలుగు రోజుల ఆటలోనే ఇన్నింగ్స్ తేడాతో గెలుచిన టీమిండియాను....రెండో టెస్ట్ లో మాత్రం వెస్టిండీస్ నిలువరించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకొంది.

పలు మార్పులు..
మిడిలార్డర్ ఆటగాళ్ళు బ్లాక్ వెల్, చేజ్, డారిచ్, కెప్టెన్ జేసన్ హోల్డర్...ఐదుగురు బౌలర్లతో కూడిన టీమిండియా ఎటాక్ ను విజయవంతంగా అడ్డుకోగలిగారు. వర్షం దెబ్బతో నాలుగో రోజు ఆటలో అరవై ఓవర్ల ఆట నష్టపోవడం కూడా కరీబియన్ టీమ్ కు కలసి వచ్చింది. అయితే...గ్రాస్ ఐలెట్ లోని సెంట్ లూషియా స్టేడియంలో ప్రారంభమయ్యే మూడోటెస్ట్ లో మాత్రం ఆరు నూరైనా నెగ్గితీరాలన్న పట్టుదలతో రెండు జట్లు పలు మార్పులతో పోటీకి దిగుతున్నాయి. మొదటి రెండు టెస్టుల్లోనూ దారుణంగా విఫలమైన ఓపెనర్ చంద్రిక స్థానంలో బార్బెడోస్ ఓపెనర్ హోప్ ను తుదిజట్టులోకి తీసుకోవాలని వెస్టిండీస్ టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. బ్రాత్ వెయిట్ తో జంటగా హోప్ ..విండీస్ ఇన్నింగ్స్ ను ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికితోడు మిడిలార్డర్ సైతం చక్కటి ఫామ్ లో ఉండడంతో కరీబియన్ బ్యాటింగ్ ఆర్డర్ గాడిలో పడినట్లే కనిపిస్తోంది. మరోవైపు...ఐదుగురు బౌలర్ల వ్యూహంతో సిరీస్ వేటకు దిగిన టీమిండియా...మూడో టెస్ట్ జట్టులో పలు మార్పులు చేపట్టే అవకాశాలు లేకపోలేదు. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను పక్కన పెట్టి...లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను తీసుకొనే అవకాశాలున్నాయి.

టీమిండియా బౌలింగ్ లో నిలకడలేమి..
బ్యాటింగ్ లో విరాట్ సేన స్థాయికి తగ్గట్టుగా రాణిస్తున్నా...బౌలింగ్ విభాగంలోనే నిలకడలేమితో సతమతమవుతోంది. జమైకాటెస్ట్ తొలిఇన్నింగ్స్ లో టీమిండియా తురుపుముక్కలు ఇశాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ చెలరేగినా...రెండో ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలం కావడం టీమ్ మేనేజ్ మెంట్ కు మింగుడుపడకుండా ఉంది. మూడో టెస్ట్ లో విజేతగా నిలవాలంటే...ముందుగా టీమిండియా బౌలింగ్ లోపాలను సవరించుకోవాల్సి ఉంది. ఏది ఏమైనా సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ లో ఆతిథ్య కరీబియన్ టీమ్ నెగ్గి తీరాల్సి ఉంది. అదే టీమిండియా కు మాత్రం సిరీస్ గెలుచుకోడానికి..మరో రెండుటెస్ట్ ల పాటు అవకాశం ఉంది.

18:57 - August 8, 2016

రియో ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ తొలిరౌండ్లోనే భారత జోడీ లియాండర్ పేస్- రోహన్ బోపన్న పోటీ ముగిసింది. ఏకపక్షంగా సాగిన తొలిరౌండ్లో పోలిష్ జోడీ లూకాస్ కుబోట్- మార్సిన్ మక్టో విస్కీ వరుస సెట్లలో 6-4, 7-6తో పేస్- రోహన్ జోడీని కంగుతినిపించారు. తొలిసెట్లో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయిన భారతజోడీ...రెండోసెట్లో మాత్రం గట్టిపోటీ ఇచ్చి...మ్యాచ్ ను టైబ్రేక్ వరకూ తీసుకెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. వరుసగా ఏడోసారి ఏడు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న పేస్ తొలిరౌండ్లోనే నిష్క్రమించాల్సి వచ్చింది.

18:56 - August 8, 2016

ఒలింపిక్స్ మహిళల విలువిద్య టీమ్.. క్వార్టర్ ఫైనల్లోనే భారత్ పోటీ ముగిసింది. దీపిక కుమారి, బాంబ్యేలా దేవి, లక్ష్మీరాణి మాజీలతో కూడిన భారత జట్టు...ప్రీ-క్వార్టర్ ఫైనల్లో కొలంబియాను అధిగమించినా...క్వార్టర్ ఫైనల్లో మాత్రం...ప్రపంచ రెండోర్యాంకర్ రష్యాతో పోరాడి ఓడింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన క్వార్టర్ ఫైనల్లో రెండు జట్లూ 4-4తో సమఉజ్జీలుగా నిలవడంతో...షూటౌట్ పాటించారు. ఇందులో రష్యా ఒక్క పాయింట్ తేడాతో భారత్ ను అధిగమించింది. చివరకు 5-4 విజయంతో సెమీస్ రౌండ్లో అడుగుపెట్టింది. ఇక భారత మహిళా ఆర్చర్లు వ్యక్తిగత విభాగంలో తమ అదృష్టం పరీక్షించుకోవాల్సి ఉంది.

18:54 - August 8, 2016

ఒలింపిక్స్ మహిళల హాకీలో 36 ఏళ్ల సుదీర్ఘవిరామం తర్వాత పోటీపడుతున్న భారత్...గ్రూప్ - బీ లీగ్ ప్రారంభమ్యాచ్ ను డ్రాగా ముగించింది. జపాన్ ను 2-2 గోల్స్ తో నిలువరించింది. మరికాసేపట్లో జరిగే గ్రూప్ లీగ్ రెండోరౌండ్లో గ్రేట్ బ్రిటన్ తో భారత్ తలపడటానికి సిద్ధమయ్యింది. గ్రూప్- బీ లీగ్ ఇతర అగ్రశ్రేణి జట్లలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, అమెరికా ఉన్నాయి. రియో ఒలింపిక్స్ మహిళల హాకీ...గ్రూప్- బీ ప్రారంభ లీగ్ మ్యాచ్ ను భారత్ డ్రాగా ముగించింది. రియో ఇంటర్నేషనల్ హాకీ సెంటర్ వేదికగా జరిగిన పోటీలో జపాన్ ను భారత్ నిలువరించింది. 2-2గోల్స్ తో మ్యాచ్ ను ముగించడం ద్వారా...పాయింట్లు పంచుకొంది. సమఉజ్జీల సమరంలా సాగిన ఈపోటీ మొదటి క్వార్టర్లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బంతిని తన అదుపులోనే ఉంచుకొని గోల్ సాధించే అవకాశాలను సాధించింది. అయితే అందివచ్చిన అవకాశాలను గోల్స్ గా మలచుకోడంలో విఫలమయ్యింది.

నిషికోరీ తొలి గోల్..
ఆట రెండోక్వార్టర్ నుంచి జపాన్ ఆటపై పట్టు సంపాదించింది.15వ నిముషంలోనే.. జపాన్ కు నిషికోరీ తొలిగోల్ అందించింది. ఆ తర్వాత ఆట 28వ నిముషంలో నకామిషా సాధించిన గోల్ తో జపాన్ ఆధిక్యం 2-0కు చేరింది. ఆట మొదటి భాగం ముగిసే సమయానికే 0-2తో వెనుకబడిన భారత్..మూడోక్వార్టర్ తొలినిముషం నుంచే..ఎదురుదాడి మొదలు పెట్టింది. ఆట 31వ నిముషంలో లభించిన పెనాల్టీ కార్నర్ రిబౌండ్ ను రాణీ రాంపాల్ గోల్ గా మలచి...తనజట్టుకు తొలిగోల్ అందించింది. ఆ తర్వాత భారత్ ఈక్వలైజర్ కోసం జోరు మరింతగా పెంచింది. 40 నిముషంలో భారత్ ఈక్వలైజర్ సాధించింది. లిలిమా మింజ్ సాధించిన గోల్ తో స్కోరు 2-2తో సమమయ్యింది. 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత జట్టు...జపాన్ తో మ్యాచ్ ను డ్రాగా ముగించడం ద్వారా ఊపిరిపీల్చుకొంది. మరి కాసేపట్లో జరిగే గ్రూప్- బీ లీగ్ రెండో రౌండ్లో పవర్ ఫుల్ గ్రేట్ బ్రిటన్ తో భారత్ తలపడుతుంది. గ్రూప్- బీ లీగ్ ఇతర అగ్రశ్రేణి జట్లలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, అమెరికా ఉన్నాయి.

18:52 - August 8, 2016

రియో ఒలింపిక్స్ పురుషుల 10 మీటర్ల ఏర్ రైఫిల్ విభాగంలో...భారత స్టార్ షూటర్లు అభినవ్ బింద్రా, గగన్ నారంగ్.  పతకం వేట ప్రారంభించారు. ఒలింపిక్స్ షూటింగ్ రేంజ్ లో జరిగే ఈ పోటీలు భారత కాలమానప్రకారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యాయి. రియో ఒలింపిక్స్ లో పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ కు అభినవ్ బింద్రా చేరాడు. కానీ ఫైనల్ లో నాలుగో స్థానంతో అభినవ్ బింద్రా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 
అభినవ్ బింద్రాకు 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన రికార్డు ఉంటే 2012 లండన్ ఒలింపిక్స్ లో గగన్ నారంగ్ కాంస్య విజేతగా ఉన్నాడు. 

18:30 - August 8, 2016

కృష్ణా : జిల్లాలో కృష్ణా..గోదావరి సంగమం వద్ద పుష్కరాల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. నాలుగు రోజులే ఉన్నా పనులు ఎక్కడికక్కడనే ఉన్నాయి. ఎప్పటి పూర్తవుతాయోనని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. హరతుల కార్యక్రమాన్ని బోయపాటి శ్రీను చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు బోయపాటి ఇక్కడే మకాం వేశారు. ఆర్ట్ డైరెక్టర్..ఇతరుల సహకారంతో సెట్టింగ్ లు వేస్తున్నారు. సాంస్కృతిక కమిటీ సభ్యులు టెన్ టివితో మాట్లారు. ఆగస్టు 12 నుంచి 23 వరకు జరగనున్న కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు సంబధించిన పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

18:22 - August 8, 2016

మహబూబ్ నగర్ : నయీం.. గ్యాంగ్‌ స్టర్‌గా మారిన మాజీ నక్సలైట్‌. అతని పేరు వింటే చాలు.. రాజకీయ నాయకుల దగ్గర్నుంచి అడవిలో అన్నల వరకు ఉలిక్కి పడతారు. నయీం కనబడడు.. పేరు మాత్రమే వినబడుతుంది.. మిగిలిన పనంతా కిందవాళ్లు చూసుకుంటారు. హత్యలైనా.. బెదిరింపులైనా అంతా పద్ధతి ప్రకారం చేసుకుపోయాడు నయీం. ఇలాంటి నయీం షాద్ నగర్ లో జరిగిన కాల్పుల్లో నయీం హతమయ్యాడు. స్మృతి వనం వద్ద కుప్పకూలిపోయాడు. అతని చేతిలో ఓ తుపాకీ ఉంది.

 • మృతుడు నయీం అవునా ? కాదా ? అనేది తేలాల్సి ఉందని ఎస్పీ ప్రకటించారు. కానీ హతమైంది నయీంమేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది.
 • డిచ్ పల్లిలో ఓ కేసు నమోదైందని...కోటి రూపాయలు డిమాండ్ చేయడం జరిగిందని దీనిపై పీఎస్ లో కేసు నమోదైందని ఎస్పీ పేర్కొన్నారు.
 • పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు మిలినియం టౌన్ షిప్ ను పోలీసులు చుట్టుముట్టారు.
 • కారులో పారిపోతూ నయీం కాల్పులు జరపడం..వెంటనే రెండు పోలీసు బృందాలు కాల్పులు చేశారు.
 • దీనితో నయీంకి బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
 • కారులో ఉన్న ఒకరు పారిపోయారు.
 • ఇదిలా ఉంటే నయీం కుటుంబసభ్యులు నివాసం ఉంటున్న పుప్పాల్ గూడకు పోలీసులు చేరుకున్నారు.
 • వారు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ను చుట్టుముట్టారు.
 • ఘటన జరిగిన అనంతరం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
 • నయీం భార్య, బావమరిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 • నయీం బంధువుల ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగదు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

ల్యాండ్ పూలింగ్ స్కీంకు మార్గదర్శకాలు..

విజయవాడ : రాజధాని సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కనీస నివాస స్థలం 120 చ.గజాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లను కేటాయించనున్నారు. భూములు ఇచ్చిన గ్రామ పరిధిలోనే అర్హులైన రైతులకు భూములు కేటాయించనున్నారు. 

18:12 - August 8, 2016

ఢిల్లీ : దేశంలో ట్యాక్సీ టెర్రరిజం నడుస్తోందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. లోక్ సభలో జీఎస్టీ బిల్లుపై ప్రధాని వివరణనిచ్చారు. టాక్సీ టెర్రరిజం నుండి విముక్తి కలిగించేందుకే జీఎస్టీ బిల్లు అని తెలిపారు. రెండు సభల్లో జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలిపిన విపక్షాలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఇది ఏ ఒక్క పార్టీ విజయమో..ప్రభుత్వ విజయమో కాదన్నారు. ఇది భారత దేశ ప్రజాస్వామ్యం యొక్క విజయమన్నారు. జీఎస్టీ బిల్లుతో ఒక దేశం..ఒక పన్ను విధానం ఉండబోతోందని, జీఎస్టీ అంటే గ్రేట్ స్టెప్ బై టీమ్ ఇండియా అని అభివర్ణించారు. తాను సోనియా, మన్మోహన్ సింగ్ లను పిలవడం జరిగిందని, జీఎస్టీ విషయంలో విచారించినట్లు తెలిపారు.  

జీఎస్టీ బిల్లుపై మోడీ వివరణ..

ఢిల్లీ :  దేశంలో ట్యాక్సీ టెర్రరిజం నడుస్తోందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. లోక్ సభలో జీఎస్టీ బిల్లుపై ప్రధాని వివరణనిచ్చారు. టాక్సీ టెర్రరిజం నుండి విముక్తి కలిగించేందుకే జీఎస్టీ బిల్లు అని తెలిపారు. 

మల్లన్న సాగర్ భూ సేకరణపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : మల్లన్న సాగర్ భూ సేకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టును రైతు కూలీలు, వృత్తిదారులు ఆశ్రయించారు. 123జీవోపై అంత త్వరగా నిర్ణయం తీసుకోలేమని, ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు ఇళ్లు నిర్మించి భూ సేకరణ పనులు చేపట్టాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

 

18:02 - August 8, 2016

చిత్తూరు : కరువును చూసి భయపడటం కాదు..మనల్ని చూసి కరువు భయపడే రోజు రావలని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రైతుకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి 10 వేల ఆదాయం రావాలని ఆకాంక్షించారు. సంక్షేమ పథకాల లబ్దితో పాటు 10 వేల ఆదాయం వస్తే కనీస అవసరాలు తీరుతాయన్నారు. 

17:56 - August 8, 2016

నిజామాబాద్ : ఆవుల మందపై చిరుత పులులు దాడి చేసిన ఘటన నిజామాబాద్‌ జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటలో చోటుచేసుకుంది. చిరుతల దాడితో భయపడిన ఆవులు పరుగులు తీశాయి. దీంతో ప్రమాదవశాత్తు పాడుపడిన బావిలో పడిపోయిన 15 ఆవుల్లో రెండు ప్రాణాలు కోల్పోయాయి. ఇసాయిపేట, అక్కాపూర్‌ గ్రామాల మధ్య ఉన్న నందులకుట్లగూడెం అటవీప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు ఎంతో శ్రమపడి ఆవులను బావి నుంచి బయటకు తీశారు. రెండు నెలలుగా మాచారెడ్డి మండలంలో చిరుతల సంచారం పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

17:52 - August 8, 2016

నల్గొండ : గ్యాంగ్ స్టర్ నయీం హత్యతో.. ఆయన బెదిరింపుల చిట్టా బయటకు వస్తోంది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పీఎస్‌లో జులై16న నయీంపై అమృతాపూర్ దస్తావేజుల వ్యాపారి గంగాధర్‌ ఫిర్యాదు చేశారు. తనను కోటి రూపాయలు ఇవ్వాలని నయీం బెదిరించారని.. డబ్బులు ఇవ్వకపోతే తన కుటుంబాన్ని హతమారుస్తానని హెచ్చరించారని తెలిపారు. ఆయన మాటల్లోనే.. ''బాగున్నావా అని అడిగాడు. భార్య..నువ్వు బాగుండాలంటే తాము చెప్పినట్లు నడుచుకో. తమది యాంటీ నక్సలైట్ గ్రూపు. నిధులు కావాలని డిమాండ్ చేసిండు. సంతోషంగా డిన్నర్ చేసుకోవడానికి వస్తే బెదిరింపులు ఏంటని అడిగా. సామాన్యులకు సేవ చేస్తానని చెప్పా. రేపు ఫోన్ చేయాలని కట్ చేశా. మరలా తెల్లారి ఫోన్ చేసిండు. డబ్బులు ఎన్నిస్తవు అని అడిగిండు. 50-60 ఎకరాల భూమి ఉంది..భార్య జడ్పీటీసీ..పెద్ద కొడుకు జాబ్ చేస్తుండు..జర్మనీలో మరో కొడుకున్నాడని తెలిపిండు. వాళ్లను ఎందుకు చంపుతవు..ఎక్కడకు రావాలంటే నేనే వస్త అని చెప్పినా. భయ్యతో మాట్లాడాలని చెప్పిండు. భయ్య..లేడు...పుయ్యతో మాట్లాడ..ఎక్కడకు రావాలో స్థలం చెప్పాలని అడిగా. వెంటనే నాకు మేసేజ్ పంపించిండు.'' అని పేర్కొన్నారు.

బంధువుల ఇళ్లలో దాడులు..
పట్టణంతో పాటు... భువనగిరిలో నయీం బంధువులు, అనుచరుల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. మిర్యాలగూడలోని నయీం అత్త సుల్తానా బేగం, బావమరిది ఫాజీద్ ఇళ్లలో పోలీసుల సోదాల్లో 6లక్షల నగదు, భారీగా బంగారం, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 

17:48 - August 8, 2016

అమెజాన్ గడ్డపై తెరలేచిన 2016 రియో ఒలింపిక్స్ కు 207 దేశాలకు చెందిన పురుషుల అథ్లెట్లు మాత్రమే కాదు...మహిళా అథ్లెట్లు సైతం భారీసంఖ్యలో సిద్ధమయ్యారు. పన్నెండు దశాబ్దాల ఒలింపిక్స్ చరిత్రలో 116 సంవత్సరాల మహిళల ప్రస్థానం పై కథనం. మొత్తం మీద, భారీసంఖ్యలో మహిళా అథ్లెట్లు ఒలింపిక్స్ బరిలోకి దిగుతూ లేచింది మహిళాలోకం..నిదురలేచింది మహిళా లోకం అనిపిస్తున్నారు. వారందరికీ మానవి శుభాకాంక్షలు తెలియచేస్తోంది. జయహో అంటూ అభినందనలు తెలియచేస్తోంది. 

17:47 - August 8, 2016

వంట పని మహిళల పనుల్లో తప్పనిసరి చేసింది ఈ సమాజం. కానీ, ఆ తప్పని సరి పనినే వృత్తిగా ఎంచుకోవాలనే ఆలోచనే, అవకాశం కొందరికే ఉంటుందేమో. ఆ కొందరిలో ఒకరు ఆ చెఫ్. భిన్నమైన అభిరుచులతో ప్రత్యేకత చాటుకుంటున్న రుచికా శర్మ అభిప్రాయాలపై కథనం..ఇంట్లో వంట చేసేది మహిళలే. వంటింటి భారాన్ని మోసేది మహిళలే. అడపాదడపా, లేదా అరకొర కుటుంబాల్లో తప్ప మగవారు వంటింటి తలుపుకేసి కూడా చూడరు. కానీ, టీవీ షోస్ లో మాత్రం చెఫ్ గా మగవారే దర్శనమిస్తుంటారు. అది ఏ భాషలో ప్రసారమయ్యే కుకరీ షో అయినా సరే. ఇదొక వైరుధ్యమే మరి. ఇలాంటి కుకరీ షోస్ ని బ్రేక్ చేసి, చెఫ్ గా తనను తాను ప్రూవ్ చేసుకుంది రుచికా శర్మ. భిన్న రంగాల్లో తన సత్తా చాటుతూ, ఒడిదొడుకులను ఎదిరిస్తూ, ముందుకు సాగుతున్న రుచికా శర్మకు మానవి అభినందనలు తెలియచేస్తోంది. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

సౌతాఫ్రికా క్రికేటర్లపై వేటు..

ఢిల్లీ : మ్యాచ్ ఫిక్స్ చేసేందుకు ప్ర‌య‌త్నించారన్న ఆరోప‌ణ‌ల‌పై న‌లుగురు సౌతాఫ్రికా క్రికెట‌ర్ల‌పై వేటు పడింది. వారిని ఏడు నుంచి ప‌న్నెండేళ్ల పాటు నిషేధించిన‌ట్లు క్రికెట్ సౌతాఫ్రికా సోమ‌వారం వెల్ల‌డించింది. నిషేధానికి గురైన క్రికెట‌ర్ల‌లో మాజీ టెస్ట్ ప్లేయ‌ర్ థామి సోలెకిలె, పుమెలెల మాట్షిక్వే, ఎతి ఎంబ‌లాటి, జీన్ సైమ్స్ ఉన్నారు. వీరంతా మ్యాచ్‌ల‌ను ఫిక్స్ చేసేందుకు మాజీ అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ గులామ్ బోడి నుంచి డ‌బ్బులు తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి.

ఎంసెట్ 2 లీకేజ్ మరో ఇద్దరి అరెస్టు..

హైదరాబాద్ : ఎంసెట్-2 లీకేజీ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని శ్యామ్ యాదవ్ అలియాస్ గుడ్డూ, రామకృష్ణగా పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీనగర్‌కు చెందిన రామకృష్ణ ఎన్‌ఐఎన్‌లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. శ్యామ్ యాదవ్ అలియాస్ గుడ్డూ ప్రధాన నిందితుడు నిషాద్ మయాంగ్ సింగ్ అనుచరుడిగా పేర్కొన్నారు. ముంబైలో ఎనిమిది మంది విద్యార్థులతో శిబిరం నిర్వహించారని వెల్లడించారు. నలుగురు విద్యార్థుల నుంచి రూ.60 లక్షలు వసూలు చేసి మాయాంగ్‌సింగ్‌కు పంపించినట్టు తెలిపారు.

నయీం ఇంట్లో సోదాలు..

నల్గొండ : మిర్యాలగూడలోని నయీం అత్త సుల్తానా బేగం, బావమరిది ఫాజీద్ ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. రూ. 6 లక్షలు, బంగారం, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ, భువనగిరిలో నయీం బంధువుల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. 

17:27 - August 8, 2016

మెదక్ : తెలంగాణలో భూసేకరణ కోసం ప్రభుత్వం 2013 చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. 123 జీవో విషయంలో హైకోర్టులో రైతులకు సానుకూలంగా తీర్పు రాకపోతే ఎల్లుండి నుంచి ఆమరణ దీక్ష చేడతానని తెలిపారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ప్రకటిస్తే సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు వెనకాడమన్నారు. సంగారెడ్డి హెడ్ క్వార్టర్ లో దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. 

17:22 - August 8, 2016

మహబూబ్ నగర్ : గ్యాంగ్ స్టర్ నయీం మృతదేహాన్ని షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పంచనామా నిర్వహించనున్నారు. పోస్టుమార్టాన్ని వీడియో చిత్రీకరించనున్నారు. సోమవారం ఉదయం మిలినియం టౌన్ షిప్ వద్ద గ్రే హౌండ్స్ జరిపిన కాల్పుల్లో నయీం హతమైన సంగతి తెలిసిందే. షాద్ నగర్ తహసీల్దార్ చందర్ రావు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా, బెల్ల లలిత, ఐపీఎస్ వ్యాస్, మాజీ నక్సల్స్ సాంబశివుడు, రాములు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నయీం ప్రధాన నిందితుడు. పలు భూ దందాలు, సెటిల్ మెంట్లు చేసిన నయీంపై 58కి పైగా హత్య కేసులు, 100కి పైగా కేసులు ఉన్నాయి.

17:20 - August 8, 2016

మహబూబ్ నగర్ : గ్యాంగ్ స్టర్ నయీం హతమయ్యాడు. గ్రే హౌండ్స్ దళాలు జరిపిన కాల్పుల్లో నయీం మృతి చెందాడు. షాద్ నగర్ లోని మిలినియం టౌన్ షిప్ వద్దనున్న స్మృతివనం వద్ద కప్పకూలిపోయాడు. సోమవారం ఉదయం కారులో పారిపోతూ నయీం కాల్పులు జరపడం..వెంటనే రెండు పోలీసు బృందాలు కాల్పులు జరిపారు. దీనితో నయీంకి బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఘటనా స్థలం ఐదు బుల్లెట్లు పడి ఉన్నాయి. డ్రైవర్ కాల్పులు జరుపుతూ పారిపోయాడు. శంషాబాద్ వద్ద డ్రైవర్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఉదయం నుండి ఏం జరిగింది ?

 • మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో నయీంతోపాటు మరో పదిమంది ఉగ్రవాదులు తలదాచుకున్నారని పోలీసులకు సమాచారం అందింది.
 • గ్రే హౌండ్స్ దళాలతో కలిసి ఆ టౌన్‌షిప్‌ను చుట్టుముట్టారు.
 • భాషా అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు..
 • ఈ కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ నయీం హతమయ్యాడు.
 • సామాన్యుడినుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన నయీంపై వంద కేసులతోపాటు ఇరవై హత్య కేసులు నమోదై ఉన్నాయి.
 • నల్లగొండ జిల్లా భువనగిరిచెందిన నయీం పలు భూదందాలు, సెటిల్‌మెంట్లు చేశాడు
 • ఐపీఎస్‌ వ్యాస్‌తోపాటు.. పటోళ్ల గోవర్ధన్‌ రెడ్డి, మాజీ మావోయిస్టులు సాంబశివుడు, రాముడు హత్యకు నయీం సూత్రధారిగా ఉన్నాడు.
 • నయీంకోసం కొన్నేళ్లనుంచి పోలీసులు గాలిస్తున్నారు.
 • అనంతరం నయీం బంధువుల ఇళ్లలో దాడులు చేశారు.
 • పుప్పాల్ గూడలోని ఆల్కాపురి వద్ద తనిఖీలు చేసి నయీం భార్య..బావమరిదిని అదుపులోకి తీసుకున్నారు. కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
 • షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రి వద్దకు నయీం మృతదేహాన్ని తరలించారు. 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 104 పాయింట్లు లాభపడి 28,182, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 8,711 వద్ద ముగిశాయి. 

షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో నయీం మృతదేహం..

మహబూబ్ నగర్ : షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రికి నయీం మృతదేహాన్ని తరలించారు. కాసేపట్లో నయీం మృతదేహానికి పంచనామా పూర్తి చేయనున్నారు. షాద్ నగర్ వద్ద గ్రే హౌండ్స్ జరిపిన కాల్పుల్లో నయీం హతమైన సంగతి తెలిసిందే. 

17:00 - August 8, 2016

అనంతపురం : జిల్లాలో టమాటా రైతులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. కిలో టమాటాకు రూపాయి కూడా ధర లభించలేదంటూ బెంగళూరు-హైదరాబాద్‌ హైవేపై టమాటాలు పారబోసి ధర్నా నిర్వహించారు. బహిరంగ మార్కెట్‌లో కిలో 10 నుంచి 20 రూపాయలకు అమ్ముతున్నా.. తమకు రూపాయి కూడా దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి రైతుల పొట్టకొడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

2013 చట్టాన్ని అమలు చేయాలి - జగ్గారెడ్డి..

మెదక్ : తెలంగాణలో భూసేకరణ కోసం ప్రభుత్వం 2013 చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. 123 జీవో విషయంలో హైకోర్టులో రైతులకు సానుకూలంగా తీర్పు రాకపోతే ఎల్లుండి నుంచి ఆమరణ దీక్ష చేడతానని తెలిపారు.

రాష్ట్ర ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నాం-బాబు

చిత్తూరు : కరువును చూసి భయపడటం కాదు..మనల్ని చూసి కరువు భయపడే రోజు రావలని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రైతుకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి 10 వేల ఆదాయం రావాలని ఆకాంక్షించారు. సంక్షేమ పథకాల లబ్దితో పాటు 10 వేల ఆదాయం వస్తే కనీస అవసరాలు తీరుతాయన్నారు. 

16:57 - August 8, 2016

హైదరాబాద్ : ఇంతింతై అన్నట్లుగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్‌ నయీం మాత్రం జాతకాలను నమ్ముతాడు. తన నమ్మకాల ప్రకారమే నడుచుకుంటాడు. ఎప్పుడూ రింగులు మారుస్తూ ఎప్పటికప్పుడు తన జాతకాన్ని బట్టి నడుచుకోవడం నయీం వ్యక్తిగత జీవితంలో ప్రధానం. దీన్ని బట్టే నయీం బయటకు అడుగుపెట్టాలన్నా జగ్రత్తలు తీసుకోవడం అనుచరులను సైతం ఆశ్చర్యకితులను చేస్తుంది. గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన నయీం ప్రధానంగా జాతకాలకు ప్రేయార్టీ ఇస్తుంటాడట. తన జాతకం తీరు చెప్పించుకోవడంతో పాటు తాను వేసే అడుగుకు ముందు నక్షత్ర బలం చూసుకుంటాడని చెబుతుంటారు. ఇలా ప్రతీసారి ప్రత్యేకంగా కన్పించే నయీం ఎక్కువ శాతం బంగారం ఆభరణాలు ధరించడం ఇష్టపడతాడు. నయీం బయటకు వెళ్లాలంటే ప్రతీ సమయాన్ని తెలుసుకుంటాడు. తన జాతకఫలంతో పాటు ఆ సమయంలో బయటకు వెళ్లాలంటే మాత్రం గ్రహబలాలు చూసుకోవడం ఆనవాయితీ. ఇలా బయటకు వెళ్తున్న సమయంతో పాటు తిరిగి వచ్చే సమయాన్ని చూపించుకుని ఆ విధంగానే బయటకు వెళ్తాడు..వస్తాడు. ఇలా అన్ని జాగ్రత్తలతో పాటు జాతకాల మీద గ్రహబలాలపై ఆధారపడడం గ్యాంగ్‌స్టర్‌కు అలవాటు.

మొక్కులు తీర్చుకుంటాడు..
నయీం ఎక్కడున్నా..ఏ పరిస్థితుల్లో ఉన్నా అన్నీ అనుకూలం చేసుకుని భువనగిరిలో జరిగే గణేష్‌ ఉత్సవాలకు చేరుకుంటాడు..పుట్టి పెరిగిన ఆ ప్రాంతంలోని గణేష్‌ ఉత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది..ఉత్సవాలు జరిగే పది రోజుల్లో ఏదో ఒకరోజు టైం చూసుకుని వచ్చి సందర్శిస్తాడని చెబుతుంటారు.

16:55 - August 8, 2016

హైదరాబాద్ : ఏదైనా చక్కదిద్దాలంటే చాలు...అంతా కూర్చున్న చోటు నుంచే...బయటకు వెళ్లాల్సి వచ్చిదంటే చాలు..అది చాలా పెద్ద వ్యవహారమే...ఆ విధంగా ఉంటేనే నయీం బయటకు అడుగుపెడతాడు...తాను ఎక్కడికి వెళ్తున్నాడు..ఎలా వెళ్తున్నాడు.. ఎవరితో వెళ్తున్నాడు..ఇవన్నీ రహస్యమే....తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న నయీం బయటకు అడుగుపెడితే ప్లానింగ్‌ ఎలా ఉంటుందో తెలిసిన పోలీసులే అవాక్కయ్యేవారు.

మొత్తంగా 200 మంది సైన్యం...
గ్యాంగ్‌స్టర్ నయీం...ఏదైనా పని పట్టాడంటే ఆ పనిపూర్తి కావాల్సిందే...ఎంతటివారు ఉన్నాసరే తన మాట నెగ్గాల్సిందే...అందుకు ఎంతకైనా తెగిస్తాడు..ఇదే నయీంను కరడుగట్టిన నేరగాడిగా మార్చేసింది. ఒక్కమాట నిలబడేవారున్నారు..ఒకే మాటమీద ఏదైనా తెగించేవారున్నారు. ఇదీ నయీం వెంట ఉండే అనుచరుల తీరు. నయీం ముందుకు ఏదైనా సెటిల్‌మెంట్..కేసులు వచ్చాయంటే కూర్చున్న చోటు నుంచే చక్కబెట్టేసేవాడు. బయటకు అడుగుపెట్టాల్సి వచ్చిందంటే అది చాలా పెద్ద వ్యవహారమే. అందుకు తానే స్వయంగా రంగంలోకి దిగి వెళ్లాల్సి వస్తే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇదీ నయీం స్టైల్...అంతకు మించి తనను తాను కాపాడుకోవడమే...తన నీడను కూడా నమ్మలేని నయీం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు.

ఒకే తరహాలో బయటకు వెళ్లడు..
నయీం బయటకు అడుగుపెట్టాడంటే చాలు అనుచరుల కనుసన్నల్లో ఆ ప్రాంతం కవర్‌ అయిపోతుంది. ముఖ్యంగా నయీం వెళ్తున్న ప్రాంతానికి చుట్టూ దాదాపు 150 మంది అక్కడక్కడ ఉంటూ అన్నీ చూసుకుంటారు. ఇక నయీం వెంట పది మంది ఉంటారు. అందులో ఉన్నవారంతా నయీంలానే వేషం వేస్తారు. నయీం ఎలాంటి డ్రస్ వేస్తాడో...ఎలాంటి క్యాప్‌లు ధరిస్తాడో...సేమ్‌టూ సేమ్ నయీంలానే తయారయి రంగంలోకి దిగుతారు. ప్రత్యర్థులు ఎవరైనా అటాక్ చేయాలంటే మాత్రం గుర్తించడం కష్టం. ఇదే కాన్సెప్ట్ తో నయీం బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకుంటాడు. ఇలా బయటకు వెళ్లే నయీం సమయాన్ని వృధా చేయకుండా పనిపూర్తి చేసుకుని తిరిగి సేఫ్‌ జోన్ చేరుకుంటాడు. 

సోనియా గాంధీ హెల్త్ బులెటిన్ విడుదల..

ఢిల్లీ : ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన సోనియా గాంధీ సర్ గంగ రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు పేర్కొన్నారు. 

రాజ్ నాథ్ తో ముఫ్తీ సమావేశం..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో జమ్మూ కాశ్మీర్ ముఫ్తీ సమావేశమయ్యారు. కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చిస్తున్నారు. 

ద.మ.రైల్వే మజ్దూర్ యూనియన్ గోల్డెన్ జూబ్లి ఉత్సవాలు..

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైళ్ కళా రంగ్ లో ద.మ.రైల్వే మజ్దూర్ యూనియన్ గోల్డెన్ జూబ్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు, హోం మంత్రి నాయినీ, యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శివగోపాల మిశ్రా హాజరయ్యారు. 

టీచర్లపై డిప్యూటి సీఎం కడియం అనుచిత వ్యాఖ్యలు...

ఖమ్మం : ప్రభుత్వ టీచర్లపై డిప్యూటి సీఎం కడియం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏం సాధించారని ఉపాధ్యాయులకు సన్మానాలు చేయాలని, సర్దుకుని వెళ్లడానికే మహిళా టీచర్లకు సమయం పడుతుందన్నారు. వాళ్లే ఇంకేం పాఠాలు చెబుతారని ప్రశ్నించారు. ఉపాధ్యాయ సంఘాలు డైరీలు పట్టుకుని తిరగడం తప్ప విద్యార్థులకు పాఠాలు చె ప్పేది ఎప్పుడని పేర్కొన్నారు. ఎన్నారైల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మాన సభలో కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేశారు. డిప్యూటి సీఎం కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

నువా కోట్ సమీపంలో కూలిన హెలికాప్టర్..

నేపాల్ : నువా కోట్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఖాఠ్మాండు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పైలట్ తో సహా ఆరుగురు ప్రయాణీకులు మృతి చెందారు. 

15:39 - August 8, 2016

తూర్పుగోదావరి : తమ సమస్యలు పరిష్కరించాలంటూ కోరుతూ వస్తున్న రైతులకు..ఇతరులకు అధికారులు మొండి చేయి చూపుతున్నారు. దీనితో తీవ్రమనస్థాపానికి గురవుతున్న వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. తాజాగా జిల్లాలో కలెక్టర్ సమక్షంలోనే ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ జరుగుతోంది. తన సమస్య పరిష్కరించాలని అమలాపురం మండలం నడిపుడికి చెందిన సాయిబాబా అనే రైతు కోరాడు. తాను సాగు చేసుకుంటున్న భూమిని తహశీల్దార్ మరొకరికి అప్పగించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరాడు. ఒక్కసారిగా బ్లేడ్ తీసుకుని గొంతు కోసుకున్నాడు. ఈ హఠ్మాత్ పరిమాణం ఉలిక్కిపడేలా చేసింది. వెంటనే పోలీసులు ఇతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఇతడి పరిస్థితి బాగానే ఉందని తెలుస్తోంది. మరి అధికారులు సాయిబాబా సమస్యను పరిష్కరిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

15:21 - August 8, 2016

రంగారెడ్డి : పుప్పాల్ గూడలోని ఆల్కాపురి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్యాంగ్ స్టర్ నయీం నివాసం ఇక్కడ ఉంటాడా ? అని స్థానికులు నోరెళ్లబెట్టారు. సోమవారం నయీం హతమైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. షాద్ నగర్ లో జరిగిన గ్రే హౌండ్స్ బలగాలు జరిపన కాల్పుల్లో నయీం హతమయ్యాడు. నయీమేనా ? కాదా ? అనేది తెలవాల్సి ఉందని ఎస్పీ పేర్కొన్నారు. నయీం బంధువులకు చెందినదిగా భావిస్తున్న పుప్పాల్ గూడాలోని ఆల్కాపురి నివాసం చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. శంషాబాద్ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. నయీంకు చెందిన నివాసం తెలిసి స్థానికులు ఆశ్చర్యపోయారు. నయీంకి చెందినదిగా భావిస్తున్న ఈ ఇళ్లు శత్రుదుర్భేధ్యంగా నిర్మించారు. ఇంటి చుట్టూ ఇనుప గేట్లు..ఎత్తుగా ఉండే గేటు..చుట్టూ గ్లాసులతో ఇంటిని నిర్మించారు. ఈ గ్లాసులు కూడా బుల్లెట్ ఫ్రూప్ తో నిర్మించినట్లు తెలుస్తోంది. 
దీనిపై స్థానికులు టెన్ టివితో మాట్లాడారు. ఇంత బందోబస్తుగా ఎందుకు కట్టారో తమకు తెలవదని, నయీం ఇళ్లు తెలిసి ఆశ్చర్యపోయామన్నారు. ఇక్కడంతా ఉద్యోగులు నివాసం ఉంటారని, పోలీసుల బందోబస్తు కూడా బాగానే ఉంటుందన్నారు. 

15:18 - August 8, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం హతం రాష్ట్రంలో కలకల రేపింది. షాద్ నగర్ వద్ద జరిగిన కాల్పుల్లో నయీం హతమైన సంగతి తెలిసిందే. నయీం కాదా ? అనేది తెలియాల్సి ఉందని ఎస్పీ వెల్లడించారు. ఇదిలా ఉంటే రాజేంద్రనగర్ లోని పుప్పాల్ గూడలోని అల్కాపురి టౌన్ షిప్ లో ఓ ఇంటిని గ్రే హౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారు. శంషాబాద్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంటి ప్రహారీ గోడపై ముళ్ల కంచెలు..భారీ ఎత్తున గేటుతో నిర్మితమయిన ఈ ఇళ్లు నిర్మించడం గమనార్హం.
నయీం భార్యను..బామమరిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో నుండి కోట్ల రూపాయల నగదు, ఆడీ కారును స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా నాలుగు పిస్తోలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. డబ్బులు లెక్కించేందుకు మిషన్ ను ఆ ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఇంట్లోకి ఎవరినీ వెళ్లనీయడం లేదు. నయీంకి ఒక కుమార్తె..ఇద్దరు కుమారులున్నట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ డిచ్ పల్లిలో కేసు నమోదైన అనంతరం పోలీసులు నయీంపై నిఘా పెట్టారు. కోటి రూపాయలు ఇవ్వాలని అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను నయీం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అల్కాపురిలో ఈ నివాసం నయీంకి చెందిందని స్థానికులకు తెలవద్దని తెలుస్తోంది. ఇదిలా ఉంటే శంషాబాద్, తాలమల్క వద్ద నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఐరాసలో కేంద్ర మంత్రి సుష్మా ప్రసంగం..

ఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసగించనున్నారు. వచ్చే నెలలో న్యూయార్క్ లోని ఐరాస కార్యాలయంలో 71వ జనరల్ అసెంబ్లీ జరగనుంది. ఈ సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 26వ తేదీన కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ ప్రసంగించనున్నారు.

 

 

కుప్పంలో బాబు..

చిత్తూరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ కళాశాలలో మొక్కలు నాటారు. అనంతరం నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి కళాశాల, పాఠశాలల్లో సొసైటీ ఫర్‌ ఇన్నోవేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 

ప్రధాని పర్యటనతో ఒరిగిందేమి లేదు - పొన్నాల..

ఢిల్లీ : ప్రధాని పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీలేదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఒకరినొకరు పొగుడుకోవటానికే సమయం కేటాయించారని, విభజన చట్టంలోని హామీల గురించి ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు.

 

ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన కోదండరాం..

ఖమ్మం : ధర్నా చౌక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రొ.కోదండరాం ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోషించిన పాత్రనే... తెలంగాణ అభివృద్ధిలోనూ జేఏసీ పోషిస్తుందని స్పష్టం చేశారు. 

శంషాబాద్ వద్ద నలుగురు అనుమానితుల అరెస్టు..

రంగారెడ్డి : శంషాబాద్, తాలమల్క వద్ద నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం షాద్ నగర్ వద్ద జరిగిన కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంగతి తెలిసిందే.  

పోలీసుల అదుపులో నయీం బావమరిది..

హైదరాబాద్ : పుప్పాల్ గూడలోని అల్కాపురి టౌన్ షిప్ లో ఓ ఇంటిని గ్రే హౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారు. నయీం బామమరిదిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో నుండి కోట్ల రూపాయల నగదు, ఆడీ కారును స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు లెక్కించేందుకు మిషన్ ను ఆ ఇంటికి తీసుకెళ్లారు. 

14:33 - August 8, 2016

హైదరాబాద్ : హైకోర్టులో 123 జీ.వో రద్దు అప్పిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగాయి.. నిర్వాసితగ్రామాల్లో రైతు కూలీల కోసం చేపట్టబోయే ప్రభుత్వ పాలసీ విధానాన్ని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రతి కుటుంబానికి దాదాపు 5లక్షల రూపాయలతో డబుల్‌ బెడ్‌ రూంను నిర్మిస్తామని... ఎస్సీ, ఎస్టీలకు నెలకు 3 వేల రూపాయల్ని 20ఏళ్లపాటు చెల్లిస్తామని తెలిపింది.. రైతు కూలీలకు 2వేల 500రూపాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించింది.. ఇలా నెల నెలా డబ్బు వద్దన్నవారికి వన్ టైం సెటిల్‌మెంట్‌ కింద దాదాపు ఏడున్నరలక్షలు ఇస్తామని స్పష్టంచేసింది.. భూసేకరణ పూర్తయ్యేవరకూ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూముల్లో పంటలు పండించుకోవచ్చని ప్రభుత్వం పాలసీలో తెలిపింది.. కూలీలకు అండగా ఉంటామని... 123 జీవో రద్దు తీర్పుపై స్టే విధించాలని కోర్టును అడ్వకేజ్‌ జనరల్‌ కోరారు.. ఈ వాదన విన్న పిటిషనర్‌ తరపు న్యాయవాది.. మరికొన్ని అంశాలు కోర్టుకు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు... ఆ తర్వాత కోర్టు విచారణనకు రేపటికి వాయిదావేసింది.. 

14:20 - August 8, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం హతం కలకలం రేగింది. సోమవారం ఉదయం షాద్ నగర్ లో జరిగిన కాల్పుల్లో నయీం హతమయ్యాడు. మృతుడు నయీం అవునా ? కాదా ? అనేది తేలాల్సి ఉందని ఎస్పీ ప్రకటించారు. కానీ హతమైంది నయీంమేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. డిచ్ పల్లిలో ఓ కేసు నమోదైందని...కోటి రూపాయలు డిమాండ్ చేయడం జరిగిందని దీనిపై పీఎస్ లో కేసు నమోదైందని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసులకు అందించన పక్కా సమాచారం మేరకు మిలినియం టౌన్ షిప్ ను పోలీసులు చుట్టుముట్టారు. కారులో పారిపోతూ నయీం కాల్పులు జరపడం..వెంటనే రెండు పోలీసు బృందాలు కాల్పులు చేశారు. దీనితో నయీంకి బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కారులో ఉన్న ఒకరు పారిపోయారు. ఇదిలా ఉంటే నయీం కుటుంబసభ్యులు నివాసం ఉంటున్న పుప్పాల్ గూడకు పోలీసులు చేరుకున్నారు. వారు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ను చుట్టుముట్టారు. వీరిని పోలీసులు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటన జరిగిన అనంతరం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నయీం కింద వేయి మంది పనిచేస్తుంటారని, తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చీకటి రాజ్యాన్ని నయీం నడిపినట్లు తెలుస్తోంది. 

14:12 - August 8, 2016

రంగారెడ్డి : పుప్పాల్ గూడలో కలకలం రేగింది. గ్యాంగ్ స్టర్ నయీం అనుచరులు ఓ ఇంట్లో ఉన్నారని సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. దీనితో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ రోజు ఉదయం నయీం షాద్ నగర్ లో జరిగిన కాల్పుల్లో హతమయ్యాడు. ఈ కాల్పుల్లో నయీం అనుచరులు పారిపోయినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో పుప్పాల్ గూడలోని అల్కాపురి టౌన్ షిప్ లో నయీం అనుచరులు ఉన్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు శంషాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో ఇంటిని చుట్టుముట్టారు. ఇంట్లో ఉన్న వారు నయీం అనుచరులేనా ? తేలాల్సి ఉంది. వీరు పోలీసుల ఎదుట లొంగిపోతారా ? లేక ప్రతిఘటిస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది. నయీం అనుచరులు 10 మంది నగరంలో చొరబడ్డారని ఇంటెలిజెన్స్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. నయీం హత్యతో వీరు చెలరేగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఉదయం నుండి ఏం జరిగింది ?

 • మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో నయీంతోపాటు మరో పదిమంది ఉగ్రవాదులు తలదాచుకున్నారని పోలీసులకు సమాచారం అందింది.
 • గ్రే హౌండ్స్ దళాలతో కలిసి ఆ టౌన్‌షిప్‌ను చుట్టుముట్టారు.
 • భాషా అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు..
 • ఈ కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ నయీం హతమయ్యాడు.
 • సామాన్యుడినుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన నయీంపై వంద కేసులతోపాటు ఇరవై హత్య కేసులు నమోదై ఉన్నాయి.
 • నల్లగొండ జిల్లా భువనగిరిచెందిన నయీం పలు భూదందాలు, సెటిల్‌మెంట్లు చేశాడు
 • ఐపీఎస్‌ వ్యాస్‌తోపాటు.. పటోళ్ల గోవర్ధన్‌ రెడ్డి, మాజీ మావోయిస్టులు సాంబశివుడు, రాముడు హత్యకు నయీం సూత్రధారిగా ఉన్నాడు.
 • నయీంకోసం కొన్నేళ్లనుంచి పోలీసులు గాలిస్తున్నారు.

అల్కాపురిలో ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు..

రంగారెడ్డి : జిల్లాలోని పుప్పాల్ గూడలో అల్కాపురి టౌన్ షిప్ లో ఓ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. నయీం బంధువు ఇళ్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో ఇంటిని చుట్టుముట్టారు. 

కమల్ నాథన్ కమిటీతో తెలుగు రాష్ట్రాల సీఎస్ ల భేటీ..

హైదరాబాద్ : కమల్ నాథన్ కమిటీ ఛైర్మన్ తో ఏపీ, తెలంగాణ సీఎస్ ల భేటీ అయ్యారు. ఉద్యోగుల విభజనపై చర్చించారు. 

కృతజ్ఞతలు తెలిపిన లక్ష్మణ్..

హైదరాబాద్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేసిన ప్రతొక్కరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. నిన్నటి సభ కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందని, ప్రధాని పర్యటన కాంగ్రెస్ కు కనువిప్పు కలగాలని తెలిపారు. తెలంగాణను కాంగ్రెస్ చిన్నచూపు చూసిందని, తెలంగాణలో జరిగే ప్రతి అభివృద్ధి పనికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. మోడీ చేతల ప్రధాని అని మాటల ప్రధాని కాదని చెప్పుకొచ్చారు. తిరంగాయాత్రను ఘనంగా నిర్వహిస్తామని, తెలంగాణ కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటామన్నారు. 2019 లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకుంటామన్నారు.

ఢిల్లీకి చేరుకున్న జగన్..

ఢిల్లీ : వైసీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం 6.45 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పార్టీ ఎంపీలతో జగన్ కలవనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీలను కేంద్రం అమలుపరచాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు పార్లమెంట్ లో మద్దతు తెలిపిన జాతీయ నాయకులను జగన్ కలువనున్నారు. 

షాద్ నగర్ కాల్పులపై ఎస్పీ స్పందన..

మహబూబ్ నగర్ : షాద్ నగర్ కాల్పులపై ఎస్పీ స్పందించారు. రూ కోటి ఇవ్వాలని బెదిరిస్తున్నారంటూ డిచ్ పల్లి పీఎస్ లో జులై 16వ తేదీన కేసు నమోదైందన్నారు. ఈకేసుకు సంబంధించిన వ్యక్తి షాద్ నగర్ లో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందిందని, తనిఖీలు చేయడానికి వస్తే కారులో పారిపోతూ పోలీసులపైకి కాల్పులు జరిపారని ఎస్పీ పేర్కొన్నారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో ఒకరు చనిపోయారని తెలిపారు. చనిపోయిన వ్యక్తి నయీం అని అనుమానిస్తున్నట్లు, నయీం డ్రైవర్ పారిపోయాడని తెలిపారు. 

సుందరయ్య నగర్ లో దారుణం..

విశాఖపట్టణం : గాజువాక సుందరయ్య నగర్ లో దారుణం చోటు చేసుకుంది. నవవధువుపై దుండగులు బ్లేడ్ తో దాడి చేశారు. ఈమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. 

జమ్మూలో ఒక తీవ్రవాది హతం..

జమ్మూ కాశ్మీర్ : ఉత్త‌ర కాశ్మీర్‌లోని స‌రిహ‌ద్దు రేఖ వ‌ద్ద భద్రతా బలగాలకు మిలిటెంట్లకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక తీవ్ర‌వాది హ‌త‌మ‌య్యాడు. మ‌రో ఇద్ద‌రు బీఎస్ఎఫ్ జ‌వాన్లు వీరమరణం పొందారు. 

నయీం ఎన్ కౌంటర్ పై డీజీపీ ప్రకటన...

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీంను ఎన్‌కౌంటర్‌లో హతమార్చినట్టు డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో నయీం కదలికలు పోలీసులకు తెలవడం జరిగిందని, వెంటనే గ్రేహౌండ్స్ బలగాలు ఆయన ఉంటున్న ఇంటిని చుట్టుముట్టాయని తెలిపారు. సాయంత్రమే నయీం గ్యాంగ్ షాద్ నగర్ చేరుకున్నట్టు సమాచారం తెలిసిందని, పోలీసు బలగాల రాకను కనిపెట్టి నయీం గన్‌మెన్ కాల్పులు జరిపాడని తెలిపారు. దీంతో ఎదురు కాల్పుల్లో నయీం మృతిచెందాడని డీజీపీ పేర్కొన్నారు. 

కాశ్మీర్ అంశంపై మోడీ సమావేశం..

ఢిల్లీ : కాశ్మీర్ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశానికి హాజరయ్యారు. కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు. 

జీవో 123పై హైకోర్టులో అఫిడవిట్..

హైదరాబాద్ : జీవో 123 పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు హైకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన న్యాయస్థానం కేసును రేపటికి వాయిదా వేసింది. 

13:49 - August 8, 2016

కొన్ని దేశాల్లో ముస్లిం మహిళలపై వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా వివక్ష కొనసాగుతుందనడానికి ఈ ఘటనే ఉదహారణ కేవలం బుర్కా అంటే హిజాబ్ వేసుకొచ్చిందని ఏకంగా ఉద్యోగంలో నుండే తొలగించారు. ఈ ఘటన అగ్రరాజ్యం అని పిలవబడే అమెరికాలో చోటు చేసుకుంది. తటస్థ వాతావరణం ఉండాలనే సాకుతో ఆమెను ఉద్యోగంలో నుండి తీసివేశారు.
వర్జినీయా ఫెయిర్‌ ఫాక్స్‌ కౌంటీలోని ఫెయిర్‌ ఓక్స్‌ డెంటల్‌ కేర్‌లో డెంటల్‌ అసిస్టెంట్‌గా నజాఫ్‌ ఖాన్‌ పనిచేస్తున్నారు. ఇంటర్వ్యూ...ఉద్యోగంలో చేరిన సమయాల్లో ఆమె బురఖా ధరించలేదు. కానీ మూడో రోజు మాత్రం బురఖా ధరించి కార్యాలయానికి వచ్చింది. డాక్టర్ చుక్ జో ఆమెను పిలిచాడు. మత రహిత తటస్థ వాతావరణాన్ని ఉంచాలని భావిస్తున్నట్లు...తలపై స్కార్ఫ్ ధరిస్తే రోగుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నాడు. కాబట్టి వెంటనే దానిని తొలగించాలని సూచించారంట. కానీ నజాఫ్ ఒప్పుకోలేదు. దీనితో ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. షాక్ తిని ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చేసినట్లు నజాఫ్ పేర్కొన్నారు. తమ కార్యాలయం మతప్రమేయంలేకుండా తటస్థంగా ఉండాలని తాము నిర్ణయం తీసుకున్నామని, ఉద్యోగులు కావాలంటే తలపై టోపీ ధరించవచ్చునని డెంటల్ కేర్ ప్రధాన డాక్టర్ చుక్ జో పేర్కొన్నారు. పారిశుద్ధ్యం దృష్ట్యా సర్టికల్‌ టోపీ అయి ఉండాలని పేర్కొన్నారు. 

13:48 - August 8, 2016

మహబూబ్ నగర్ : గ్యాంగ్ స్టర్ నయీం హతం అయ్యాడు. దీనిపై మావోయిస్టునేత సాంబశివుడు తండ్రి సంతోషం వ్యక్తం చేశారు. నయీం ఒక్కడినే కాకుండా అతడి గ్యాంగ్ మొత్తాన్ని అంతం చేయాలని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నయీం అరాచకాల పట్ల ప్రభుత్వం పట్టించుకోకపోవటంతోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. కాగా మావోయిస్టు సాంబశివుడ్ని నయీం హత్య చేసిన విషయం తెలిసిందే..సాంబశివుడితోపాటు పలువురు మావోలను చంపుతానని ప్రకటించాడు..చెప్పిన విధంగా పలువురుని దారుణంగా హత్య చేశాడు.

కాల్పులపై జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి..
షాద్ నగర్ కాల్పులపై ఎస్పీ రమారాజేశ్వరి స్పందించారు. రూ.కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని డిచ్ పల్లి పీఎస్ లో జులై 16న కేసు నమోదయ్యిందని ఆమె తెలిపారు. ఆ కేసుకు సంబందించిన వ్యక్తి షాద్ నగర్ లో వున్నాడన్న సమాచారంతో తనిఖీలు చేయటానికి షాద్ నగర్ చేరుకున్నామనీ...ఈ క్రమంలో కారులో పారిపోతూ నయీం అనుసరులు పోలీసులపై కాల్పులు జరపగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారని ఆమె పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తిని నయీం అనుమానిస్తున్నామనీ..కాగా ఈ క్రమంలో కారు డ్రైవర్ పరారయ్యాడని ఆమె తెలిపారు. విచారణ పూర్తయిన తరువాత అధికారికంగా అన్ని విషయాలు మీడియా తెలుపుతామని ఆమె పేర్కొన్నాడు.

గ్యాంగ్‌స్టర్‌ నయీం హతం..నేర చరిత్ర..
మహబూబ్‌నగర్‌
: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో నయీంతోపాటు మరో పదిమంది ఉగ్రవాదులు తలదాచుకున్నారని పోలీసులకు సమాచారం అందింది.. గ్రేహౌండ్స్ దళాలతో కలిసి ఆ టౌన్‌షిప్‌ను చుట్టుముట్టిన పోలీసులు భాషా అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.. వెంటనే అప్రమత్తమైన ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు.. ఈ కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ నయీం హతమయ్యాడు.. సామాన్యుడినుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన నయీంపై 100 కేసులతోపాటు.. 20 హత్యకేసులు నమోదైఉన్నాయి.. నల్లగొండ జిల్లా భువనగిరిచెందిన నయీం పలు భూదందాలు, సెటిల్‌మెంట్లు చేశాడు.... ఐపీఎస్‌ వ్యాస్‌తోపాటు.. పటోళ్ల గోవర్ధన్‌ రెడ్డి, మాజీ మావోయిస్టులు సాంబశివుడు, రాముడు హత్యకు నయీం సూత్రధారిగా ఉన్నాడు.. నయీంకోసం కొన్నేళ్లనుంచి పోలీసులు గాలిస్తున్నారు.

ఆదివారం రాత్రి 7గంటలకు షాద్‌నగర్‌ చేరుకున్న : నయీం

నిన్న రాత్రి 7గంటలకు నయీం గ్యాంగ్‌ షాద్‌నగర్‌ చేరుకుంది.. అక్కడినుంచి మిలీనియం టౌన్‌షిప్‌లోని భాషా ఇంట్లో మాకాంవేసింది.. పక్కా సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నయీంను పట్టుకునేందుకు స్పెషల్ ప్లాన్ వేశారు.. టౌన్‌షిప్‌ను చుట్టుముట్టి భాషా ఇంటివైపు వెళ్లారు.. వీరి కదలికల్ని గమనించిన నయీం గన్‌మెన్‌ పోలీసులు, గ్రేహౌండ్స్‌పై కాల్పులు జరిపాడు.. నయీముద్దీన్ దాదాపు 40 హత్య కేసుల్లో నిందితుడు. బెదిరింపులు, సెటిల్‌మెంట్లలో కూడా నయీంపై ఆరోపణలున్నాయి. మావోయిస్టు దళాల్లో పాల్గొన్న దళ సభ్యులను మట్టుబెడతానని శపథం పన్నాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని పక్కా ప్లాన్‌తో వేటాడం మొదలుపెట్టాడు. మావోయిస్టుల్లో పని చేసినప్పుడు గ్రేహౌండ్స్ డీఐజీ వ్యాస్‌ను నడిరోడ్డులో కాల్చి చంపిన కేసులో నయీం ప్రధాన నిందితుడు. ఆ తర్వాత భువనగిరిలో బెల్లి లలితను దారుణంగా హతమార్చాడు. ఆమె శరీరాన్ని 17 ముక్కలు చేసి నగరంలో ఒక్కొ చోట వదిలి వెళ్లాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఆ హత్య అనంతరం వెంటనే ప్రజా సంఘాల అనుబంధ సంస్థ ప్రతినిధులు కరుణాకర్, పురుషోత్తంలను సైతం మట్టుబెట్టాడు.

మోస్ట్ వాంటెడ్‌గా నయీం..
నేరుగా హత్యల్లో పాల్గొనడమే కాకుండా మావోయిస్టు సభ్యులు గణేష్, ఈదన్న, పౌరహక్కుల నేత ఆజం అలీ హత్య వెనుక కూడా నయీం హస్తం ఉన్నట్లు ఆధారాలున్నాయి. ఎల్.బి నగర్‌లో రియల్టర్ రాధాకృష్ణతో పాటు, మాజీ మావోయిస్టు టిఆర్ఎస్ నేత సాంబశివుడు, పటోళ్ల గోవర్థన్ రెడ్డి హత్య కేసుల్లో నయీం మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. ఇక గుజరాత్‌లో కలకలం రేపిన సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌లో కూడా నయీం హ్యాండ్ ఉందని మృతుని భార్య గీతా జోహ్రా ఫిర్యాదు చేశారు.

నయీం పేరు చెబితే అడవిలో అన్నలు సైతం ఉలిక్కిపడే పరిస్థితి..
నయీం.. గ్యాంగ్‌ స్టర్‌గా మారిన మాజీ నక్సలైట్‌. అతని పేరు వింటే చాలు.. రాజకీయ నాయకుల దగ్గర్నుంచి అడవిలో అన్నల వరకు ఉలిక్కి పడతారు. నయీం కనబడడు.. పేరు మాత్రమే వినబడుతుంది.. మిగిలిన పనంతా కిందవాళ్లు చూసుకుంటారు. హత్యలైనా.. బెదిరింపులైనా అంతా పద్ధతి ప్రకారం చేసుకుపోయాడు నయీం.

100 హత్యకేసులో నయీం నిందితుడు..
నక్సలైట్‌గా జీవితం ప్రారంభించి.. ఆ తర్వాత నక్సలైట్లను అంతం చేయడమే తన జీవితాశయంగా ప్రకటించిన మోస్టు వాంటెడ్‌ క్రిమినల్‌. నేరగాళ్లను చేరదీసి వారితో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు నయీం. భువనగిరిలో బెల్లి లలిత హత్యతో మొదలు పెట్టి వందకుపైగా దారుణ హత్యలతో సమాజానికి సవాల్‌ విసిరాడు.సంచలనాత్మక హత్యలు జరిగిన ప్రతిసారీ నయీం పేరే వినిపించేది. కానీ అతన్ని పట్టుకోవడంలో పోలీసులు ప్రతీసారి విఫలమయ్యారు. మాజీ నక్సలైట్లు, మావోయిస్టులనే టార్గెట్‌గా చేసుకున్న నయీంకు పొలిటికల్‌ సపోర్ట్ ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు కొందరు నయీంకి సహకరించారన్న విమర్శలూ లేకపోలేదు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి. 

13:24 - August 8, 2016

వర్షాకాలంలో బీరకాయ విరివిగా దొరుకుతుంది. కొంతమంది బీరకాయను తినాలంటే ఇష్టపడరు. కానీ ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీరకాయ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం..
బీరకాయ తినడం వల్ల సులువుగా జీర్ణమవుతుంది. ఇందులో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం, పైల్స్ సమస్యతో బాధ పడేవారికి చక్కని ఔషధంలా పనిచేస్తుంది.
కొవ్వు..కొలెస్ట్రాల్..క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలని అనుకొనే వారికి ఇది చాలా మంచి ఆహారం.
ఇందులో ఉండే బీటాకెరోటిన్ కంటిచూపును మెరుగుపరుస్తుంది. అంతేగాకుండా రకాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి కాలేయం, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కామెర్ల వ్యాధి సహజంగా తగ్గాలంటే రోజు ఒక గ్లాసు బీరకాయ రసం తాగితే మంచిది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు వారి డైట్ లో దీనిని చేర్చుకోవాలి. 

ఎదురుకాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జ‌వాన్లు మృతి..

జ‌మ్మూక‌శ్మీర్‌ : ఉత్త‌ర క‌శ్మీర్‌లోని స‌రిహ‌ద్దు వ‌ద్ద జ‌రుగుతున్న ఎదురుకాల్పుల్లో ఒక తీవ్ర‌వాది హ‌త‌మ‌య్యాడు. మ‌రో ఇద్ద‌రు బీఎస్ఎఫ్ జ‌వాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ ద‌గ్గ‌ర కాల్పులు చోటుచేసుకున్నాయి. గ‌త మూడు వారాల నుంచి మూడుసార్లు తీవ్రవాదుల చొర‌బాటు య‌త్నాల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు తిప్పికొట్టాయి. మూడు వారాల్లోనే సుమారు ఏడు మంది మిలిటెంట్ల‌ను కూడా హ‌త‌మార్చారు.

ఆస్పత్రిలో పేలిన బాంబు..20మంది మృతి..

పాకిస్థాన్‌ : క్వెట్టా నగరం బాండు పేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలోని సివిల్‌ ఆస్పత్రిలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా, 35 మంది గాయాలపాలయ్యారు. బలోచిస్థాన్‌ బార్‌ అసోసియేషన్స్ ప్రెసిడెంట్‌ బిలాల్‌ను కాల్చి చంపిన తర్వాత ఆస్పత్రిలో పేలుళ్లు సంభవించినట్లుగా తెలుస్తోంది.

‘జన గణ మన’ పాడొద్దు...

ఉత్తరప్రదేశ్ : జాతీయ గీతం ‘జన గణ మన’ ఆలపించొద్దని ఆదేశాలు జారీ చేసిన పాఠశాల మేనేజర్‌ను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఎంఏ కాన్వెంట్‌ స్కూల్‌ నడుపుతున్న మేనేజర్‌ జియా-ఉల్‌ హక్‌ అనే వ్యక్తిని జాతీయ పతాకాన్ని అవమానపరిచిన నేరం కింద అరెస్ట్ చేశారు. 

కుప్పంలో చంద్రబాబు పర్యటన..

చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ‘వనం-మనం’ కార్యక్రమంలో భాగంగా కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాలలో మొక్కలు నాటారు. అనంతరం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.

12:33 - August 8, 2016

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో నయీంతోపాటు మరో పదిమంది ఉగ్రవాదులు తలదాచుకున్నారని పోలీసులకు సమాచారం అందింది.. గ్రేహౌండ్స్‌తోకలిసి ఆ టౌన్‌షిప్‌ను చుట్టుముట్టిన పోలీసులు భాషా అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.. వెంటనే అప్రమత్తమైన ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు.. ఈ కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ నయీం హతమయ్యాడు.. సామాన్యుడినుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన నయీంపై 100 కేసులతోపాటు.. 20 హత్యకేసులు నమోదైఉన్నాయి.. నల్లగొండ జిల్లా భువనగిరిచెందిన నయీం పలు భూదందాలు, సెటిల్‌మెంట్లు చేశాడు.... ఐపీఎస్‌ వ్యాస్‌తోపాటు.. పటోళ్ల గోవర్ధన్‌ రెడ్డి, మాజీ మావోయిస్టులు సాంబశివుడు, రాముడు హత్యకు నయీం సూత్రధారిగా ఉన్నాడు.. నయీంకోసం కొన్నేళ్లనుంచి పోలీసులు గాలిస్తున్నారు.

ఆదివారం రాత్రి 7గంటలకు షాద్‌నగర్‌ చేరుకున్న  నయీం..
నిన్న రాత్రి 7గంటలకు నయీం గ్యాంగ్‌ షాద్‌నగర్‌ చేరుకుంది.. అక్కడినుంచి మిలీనియం టౌన్‌షిప్‌లోని భాషా ఇంట్లో మాకాంవేసింది.. పక్కా సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నయీంను పట్టుకునేందుకు స్పెషల్ ప్లాన్ వేశారు.. టౌన్‌షిప్‌ను చుట్టుముట్టి భాషా ఇంటివైపు వెళ్లారు.. వీరి కదలికల్ని గమనించిన నయీం గన్‌మెన్‌ పోలీసులు, గ్రేహౌండ్స్‌పై కాల్పులు జరిపాడు.. నయీముద్దీన్ దాదాపు 40 హత్య కేసుల్లో నిందితుడు. బెదిరింపులు, సెటిల్‌మెంట్లలో కూడా నయీంపై ఆరోపణలున్నాయి. మావోయిస్టు దళాల్లో పాల్గొన్న దళ సభ్యులను మట్టుబెడతానని శపథం పన్నాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని పక్కా ప్లాన్‌తో వేటాడం మొదలుపెట్టాడు. మావోయిస్టుగా  పని చేసినప్పుడు గ్రేహౌండ్స్ డీఐజీ వ్యాస్‌ను నడిరోడ్డుపై  కాల్చి చంపిన కేసులో నయీం ప్రధాన నిందితుడు. ఆ తర్వాత భువనగిరిలో ప్రజాగాయకురాలు బెల్లి లలితను దారుణంగా హతమార్చాడు. ఆమె శరీరాన్ని 17 ముక్కలు చేసి నగరంలో పలుప్రాంతాలలో  వదిలి వెళ్లాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఆ హత్య అనంతరం వెంటనే ప్రజా సంఘాల అనుబంధ సంస్థ ప్రతినిధులు కరుణాకర్, పురుషోత్తంలను సైతం మట్టుబెట్టాడు.

మోస్ట్ వాంటెడ్‌గా నయీం..
నేరుగా హత్యల్లో పాల్గొనడమే కాకుండా మావోయిస్టు సభ్యులు గణేష్, ఈదన్న, పౌరహక్కుల నేత ఆజం అలీ హత్య వెనుక కూడా నయీం హస్తం ఉన్నట్లు ఆధారాలున్నాయి. ఎల్.బి నగర్‌లో రియల్టర్ రాధాకృష్ణతో పాటు, మాజీ మావోయిస్టు టిఆర్ఎస్ నేత సాంబశివుడు, రాములు, పటోళ్ల గోవర్థన్ రెడ్డి హత్య కేసుల్లో నయీం మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. ఇక గుజరాత్‌లో కలకలం రేపిన సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌లో కూడా నయీం హ్యాండ్ ఉందని మృతుని భార్య గీతా జోహ్రా ఫిర్యాదు చేశారు.

నయీం పేరు చెబితే అడవిలో అన్నలు సైతం ఉలిక్కిపడే పరిస్థితి..
నయీం.. గ్యాంగ్‌ స్టర్‌గా మారిన మాజీ నక్సలైట్‌. అతని పేరు వింటే చాలు.. రాజకీయ నాయకుల దగ్గర్నుంచి అడవిలో అన్నల వరకు ఉలిక్కి పడతారు. నయీం కనబడడు.. కానీ పేరు మాత్రమే వినబడుతుంది.. మిగిలిన పనంతా కిందవాళ్లు చూసుకుంటారు. హత్యలైనా.. బెదిరింపులైనా అంతా పద్ధతి ప్రకారం చేసుకుపోయాడు నయీం.

100 హత్యకేసులో నయీం నిందితుడు..
నక్సలైట్‌గా జీవితం ప్రారంభించి.. ఆ తర్వాత నక్సలైట్లను అంతం చేయడమే తన జీవితాశయంగా ప్రకటించిన మోస్టు వాంటెడ్‌ క్రిమినల్‌. నేరగాళ్లను చేరదీసి వారితో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. భువనగిరిలో బెల్లి లలిత హత్యతో మొదలు పెట్టి వందకుపైగా దారుణ హత్యలతో సమాజానికి సవాల్‌ విసిరాడు.సంచలనాత్మక హత్యలు జరిగిన ప్రతిసారీ నయీం పేరే వినిపించేది. కానీ అతన్ని పట్టుకోవడంలో పోలీసులు ప్రతీసారి విఫలమయ్యారు. మాజీ నక్సలైట్లు, మావోయిస్టులనే టార్గెట్‌గా చేసుకున్న నయీంకు పొలిటికల్‌ సపోర్ట్ ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు కొందరు నయీంకి సహకరించారన్న విమర్శలూ లేకపోలేదు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

 

ఒలింపిక్స్ లో భారత్ ' దీపా'చరిత్ర...

బ్రెజిల్ : ఇండియ‌న్ జిమ్నాస్ట్ దీపా క‌ర్మాక‌ర్ చ‌రిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో వాల్ట్ ఫైన‌ల్ చేరిన తొలి భార‌తీయురాలిగా నిలిచింది. క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో 8వ స్థానంలో నిలిచి ఈ అరుదైన ఘ‌న‌త సాధించింది. ఇంత‌కుముందే ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన తొలి భార‌త జిమ్నాస్ట్‌గా నిలిచిన త్రిపుర‌కు చెందిన దీపా.. ఇప్పుడు మ‌రో చ‌రిత్ర‌కు శ్రీకారం చుట్టింది.

రోడ్లను పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ..

హైదరాబాద్: భారీగా కురుస్తున్న వర్షాలకు దెబ్బకు ప్రస్తుత రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యింది. వైట్ ట్యాపింగ్ రోడ్లు నిర్మించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈక్రమంలో నగరంలోని 60 ప్రధాన రహదారుల్లో అధికారులు రోడ్లను పరిశీలిస్తున్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులతో కలిసి రహదారులను పరిశీలిస్తున్నారు. 

మావోల ఇలాకాలో ఖాప్స్ పాగా..

విశాఖ : మావోయిస్టుల కంచుకోటగా పేరొందిన విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని రాళ్లగెడ్డలో పోలీసులు పాగా వేశారు. మన్యంలో మావోయిస్టుల కట్టడికి సరిహద్దు భద్రతా దళాలు విధులు నిర్వహించేందుకు వీలుగా రాళ్లగెడ్డలో ఆరు నెలల కిందట పోలీసు అధికారులు భూమి పూజ చేశారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఔట్‌పోస్టులో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు కొలువుదీరాయి.

గ్యాంగ్ స్టర్ నయీమ్ హతం..

మహబూబ్‌నగర్: షాద్‌నగర్ మిలీనియం టౌన్‌షిప్‌లో ఎన్‌ఐఏ, దుండగుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్‌ఐఏ, గ్రేహౌండ్స్ దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు.కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ నయూం హతమయ్యాడు. మిలీనియం టౌన్‌షిప్‌లో మరికొందరు నయీం ముఠాసభ్యులున్నట్లు తెలుస్తోంది. మిలీనియం టౌన్‌షిప్‌లో 10మంది దుండగులున్నారన్న సమాచారంతో ఇప్పటికే ఎన్‌ఐఏ బృందాలు పరసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకితేవటానికి అధికారులు యత్నిస్తున్నారు. 

11:34 - August 8, 2016

విజయవాడ : ఏపీ క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోందా.? చంద్రబాబు టీమ్‌లోకి కొత్త మంత్రులు రానున్నారా.? వస్తే ఎవరెవరికి అవకాశం దక్కనుంది.? ఉద్వాసనకు గురయ్యేదెవరు? కేబినెట్‌లోకి చినబాబు ఎంట్రీ దాదాపు ఖాయమైందా? ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గరపడిందా.? చంద్రబాబు సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్నలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇంతకీ ఏపీ క్యాబినెట్‌ విస్తరణ ఎప్పుడు.?? దాని కూర్పులపై 10టీవీ ప్రత్యేక కథనం.

క్యాబినెట్ ప్రక్షాళనకు బాబు సిద్ధపడ్డారా?..
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు క్యాబినెట్ ప్రక్షాళనకు సిద్ధమయ్యారా.? సమర్థవంతమైన పాలనే ప్రాతిపదికగా మంత్రి మండలిలోకి కొత్త ముఖాలకు ఛాన్స్ ఇవ్వనున్నారా.? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నర ఏళ్లు కావస్తున్న సందర్భంగా పార్టీ గత ఆనవాయితీ ప్రకారం కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. తప్పు ఒప్పులను బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన తరుణం కావడంతో.. వాటిని సరిదిద్దుకుంటూ.. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేబినెట్‌ను విస్తరించాలని ముఖ్యమంత్రి అభిలషిస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణా పుష్కరాల అనంత‌రం సెప్టెంబ‌ర్‌లో మంత్రివర్గ విస్తర‌ణ తథ్యమని తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల‌కు స‌న్నద్ధం అయ్యే దిశగా క్యాబినెట్ రూపొందించాలన్నది చంద్రబాబు అలోచ‌న‌గా క‌నిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ఆరు ఖాళీలుండగా...ఆశావహుల చిట్టా మాత్రం చాంతాడంతా ఉంది.

2019 ఎన్నికలే లక్ష్యంగా రూపొందిస్తున్నారా?..
చంద్రబాబు మంత్రి మండలిలోకి నారా లోకేష్‌ ఎంట్రీ అంశం హాట్‌ టాఫిక్‌ మారింది. ఆయనకు దాదాపు లైన్‌ క్లీయర్‌ అయ్యిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ జాతియ ప్రధాన కార్యద‌ర్శిగా ఉన్న లోకేశ్‌ మంత్రివ‌ర్గంలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనేక త‌ర్జన భర్జన‌ల అనంత‌రం చంద్రబాబు.. ఇత‌ర సన్నిహితులు లోకేష్ మంత్రివ‌ర్గంలో చేరితేనే మంచిద‌నే అభిప్రాయానికి వ‌చ్చారని... అందుకే ఈసారి విస్తరణలో లోకేష్ చేరిక లాంఛనప్రాయమని పార్టీవర్గాల్లో ప్రచారమవుతోంది. లోకేశ్‌కు ప్రాధాన్యత క‌లిగిన ప‌రిశ్రమ‌ల శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే భవిష్యత్‌లో చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాల్సి వస్తేనే ఆయన లోకేశ్‌కు రాష్ట్రపగ్గాలు అప్పగిస్తారని మరో వర్గం చెబుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో ఢిల్లీలో రాజకీయ ప‌రిణామాలు మారే అవకాశం ఉందని.. అప్పటివ‌ర‌కు లోకేష్‌.. రాష్ట్రపాల‌నపై ప‌ట్టు సాధించేలా ప్రణాళిక‌లు రూపొందిస్తున్నారన్నది పార్టీ శ్రేణుల మాట.

నారా లోకేశ్‌ ఎంట్రీపై చర్చ..
లోకేశ్‌ మిన‌హా...మిగతా ఐదు ఖాళీలకు ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికొస్తే శ్రీకాకుళం జిల్లా నుండి కళా వెంకట్రావ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న హౌజింగ్‌ శాఖ మంత్రి మృణాళిని బంధువు కావడం.. కుటుంబ సభ్యుల మధ్య అవగాహనలో భాగంగా అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది. పార్టీలో సీనియార్టీతో పాటు ఏపి టిడిపి అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రావ్‌ లోకేష్‌కు సన్నిహితుడిగా ఉండటం మరో ప్లస్ పాయింట్. అయితే ఇదే జిల్లానుండి మరో సీనియర్ నేత గౌతు శ్యాంసుందర్ శివాజీ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇక విజయనగరం జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే పతివాడ నారయణ స్వామి నాయుడు, కేఏ నాయుడు, ఎమ్మెల్యే నారయణ స్వామి ఆశావహుల జాబితాలో ఉన్నారు. విశాఖ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు ఇప్పటికే మంత్రి వర్గంలో కొనసాగుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారయణ మూర్తి, పాయకారావు పేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంత్రి పదవి రేసులో ఉన్నారు. కేబినెట్‌లో ప్రక్షాళన జరిగితే ఎస్సి సామాజిక వర్గానికి చెందిన తనకు బెర్త్ కన్ఫామ్ కావొచ్చని ఆమె భావిస్తున్నారు.

రేసులో ఎమ్మెల్యేలు పతివాడ నారాయణ స్వామి, కేఏ నాయుడు
తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్‌ నేతలు మంత్రి పదవులపై కన్నేశారు. బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి సూర్యారావు, తోట త్రిమూర్తులు కేబినెట్ రేసులో ఉన్నారు. పార్టీ వ్యవస్థాపక సభ్యునిగా ఉన్న తనకు మంత్రిపదవి లభిస్తుందని బుచ్చయ్య అశిస్తుండగా... దళిత నేతగా తనకు ప్రాధన్యత కల్పించాలని గొల్లపల్లి సూర్యారావు కోరుతున్నారు. ఇక కాపు కోటాలొ తనకు ఛాన్స్‌ ఇవ్వాలంటున్నారు తోట త్రిమూర్తులు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ పేరూ తెరపైకి వస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే కలవపూడి శివ కేబినెట్‌లో చోటు కోసం ట్రై చేస్తున్నారు.

తెరపైకి వచ్చిన జ్యోతుల నెహ్రూ పేరు..
ఇక రాజధాని అమరావతి విషయానికొస్తే...కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఐదుగురు మంత్రులు కేబినెట్‌లో కొనసాగుతున్నారు. కృష్ణా జిల్లా నుంచి పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మినహా రేసులో పోటీ నామమాత్రంగా ఉంది. అటు గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య పోటీ పెరిగింది. సీనియర్ నేత ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర రేసులో ముందున్నారు. 2004 టీడీపీ ఓటమి సమయంలో జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడం.. వైఎస్‌పై పోరాటం తనకు కలిసొచ్చే అంశంగా ఆయన భావిస్తున్నారు. ఇక స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం మంత్రివర్గంలోకి వచ్చేందుకు అసక్తి కనబరుస్తున్నారు. వీరితో పాటు జీవీ ఆంజనేయులు, య‌ర‌ప‌తినేని శ్రీనివాస్, కొమ్మాల పాటి శ్రీధర్, శ్రావణ్ కుమార్, న‌క్కా ఆనంద్ బాబు ఆశావహుల్లో ఉన్నారు.

గుంటూరు జిల్లాలో ధూళిపాళ్ల, కోడెల శివప్రసాద్‌
ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాలను పరిశీలిస్తే....ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామర చర్ల జనార్దన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం మంత్రి పదవి కోరుతున్నారు. ఇక నెల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీ సోమిరెడ్డి పేరు వినిపిస్తోంది. అప్పట్లో వైఎస్ సర్కార్‌ను ఎండగట్టడంలో..ప్రస్తుతం జగన్ అవినీతి ఆరోపణలపై పోరాటంలో వెన్నుదన్నుగా ఉన్న తనకు ఛాన్స్ కల్పిస్తారని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో దామరచర్ల జనార్ధన్, నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి
ఇక రాయలసీమ విషయానికొస్తే...చిత్తూరు నుంచి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బీసీ కోటాలొ తంబళ్ళపల్లి ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తనకు మంత్రిపదవిస్తే...క్యాడర్ కు న్యాయం జరుగుతుందనీ..ఫలితంగా జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని ముద్దుకృష్ణమ భావిస్తున్నారు. గతంలో బీసీ నేతలకు జిల్లా నుంచి ప్రాతినిథ్యం లేనందునా ఈసారి తనకు అవకాశం లభిస్తుందన్న ధీమాలో శంకర్ ఉన్నారు. ఇక టీడీపీకి కంచుకోటగా అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు. సీనియర్ నేత జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పెనుగొండ ఎమ్మెల్యే పార్థసారధి, మరో సీనియర్ నేత, చీఫ్‌ విప్ కాలువ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కేబినెట్‌ రేసులో ఉన్నారు. కర్నూలు జిల్లాలో వైసిపినుంచి టిడిపిలో చేరిన భూమా నాగిరెడ్డి పేరు బలంగా వినిపిస్తొంది. భూమకు మంత్రిపదవి ఇవ్వడం ద్వారా జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. కడపలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి మంత్రిపదవి ఆశిస్తున్నారు. ఇక మైనారిటీలకు కేబినెట్‌లో చోటు కల్పిస్తానని చంద్రబాబు ప్రకటించడంతో..ఎమ్మెల్సీ షరీఫ్, జలీల్ ఖాన్ మినిస్టర్ గిరిపై ఆశలు పెట్టుకున్నారు.

కేబినెట్‌లో ఎవరు ఇన్?ఎవరు అవుట్?..
విధుల నిర్వహణలో విఫలమైన మంత్రుల శాఖల మార్పుతోపాటు.. కొందరిని తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మంత్రులపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీంతో మంత్రివర్గం ఎలా ఉండబోతోంది..? కేబినెట్‌లో కొత్తగా ఎవరికి చోటు దక్కుతుంది..? ప్రస్తుతమున్నవారిలో ఎవరిపై వేటు పడుతుంది..? కాబినెట్‌ మార్పులు చేర్పులపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. 

11:23 - August 8, 2016

సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఇవాళ రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ ప్లాట్‌ఫాం-1లో ఏసీ డార్మెట్రీతోపాటు రెండు కొత్త రైళ్లను సురేశ్‌ప్రభు ప్రారంభించారు. హైదరాబాద్-గుల్బర్గా, కాజీపేట-ముంబై రైళ్లను సురేశ్‌ప్రభు జెండా ఊపి ప్రారంభించారు. చరల్లపల్లి , నాగుల పల్లి టెర్మినల్స్ నిర్మాణానికి తోడ్పడతామని తెలిపారు. అలాగే సికింద్రబాద్ రైల్వేస్టేషన్‌ను మరింత అభివృద్ధి పరుస్తామని అన్నారు.

11:08 - August 8, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-2 లీకేజి కేసులో సీఐడీ పోలీసులు మరో 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కీలక నిందితులు ఇక్బాల్‌, గుడ్డు, నౌషద్‌, సునీల్‌సింగ్‌తో పాటు మరో ఆరుగురు బ్రోకర్లను సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు. ప్రధాన సూత్రధారి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీక్ అయి పలు సంచలనం రేపింది...ఈ నేపథ్యంలో ఎంసెట్ -2 ప్రభుత్వం రద్దు చేసి ఎంసెట్-3ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. 

11:04 - August 8, 2016

మహబూబ్‌నగర్: షాద్ నగర్ లో గ్యాంగ్ స్టర్ నయీమ్ హతమయ్యాడు. పలు భూదందాలు, సెటిల్ మెంట్ల కేసులో నయీమ్ సిద్ధహస్తుడు. ఐపీఎస్ వ్యాస్ హత్యకేసులో నయీమ్ ప్రధాన నిందితుగా వున్నాడు. మావోయిస్టులు పటోళ్ళ గోవర్థన్ రెడ్డి, సాంబశివుడు, రాములు హత్యకేసుల్లో నయీమ్ ప్రధాననిందితుడు. 100 కేసులతో పాటు దాదాపు 20 హత్యకేసుల్లో నయీమ్ నిందితుడగా వున్నాడు. కాగా షాద్ నగర్ మిలీనియం టౌన్ షిప్ లో ఉగ్రవాదులు నివాసముంటున్నారనే అనుమానంతో ఎన్ఐఏ అధికారులు భాషా అనే వ్యక్తి ఇంటిని చుట్టుముట్టి కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. కాగా ఈ కాల్పుల్లో మరో వ్యక్తి కూడా మృతి చెందినట్లుగా సమాచారం. మృతుడు గ్యాంగ్ స్టర్  నయీమ్ గా పోలీసులు  అనుమానిస్తున్నారు. నయీం స్వస్థలం నల్లగొండ జిల్లా భువనగిరివాసిగా పోలీసులు గుర్తించారు. 

10:44 - August 8, 2016

మహబూబ్ నగర్ : షాద్ నగర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. వందలాది కటుంబాలు నివాసముంటున్న షాద్ నగ్ మిలీనియం టౌన్ షిప్ లో ఉగ్రవాదుల కలకల రేగింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో ఏఎన్ఐ పోలీసులు భారీగా మోహరించారు. భాషా అనే వ్యక్తి ఇంటిని చుట్టుముట్టి ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు.ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదరుకాల్పులకు దిగటంతో ఒక వ్యక్తి మరణించాడు. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. మిలీనియం టౌన్ షిప్ చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఆప్రాంతంలో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. సుష్కరాల నేపథ్యంలో ఈ ఉగ్రవాదులు కలకలం సంచలనం సృష్టిస్తోంది. గతంతో హైదరబాద్ నగరంలో ఎన్ఐఏ అధికారులు పలువురు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల నుండి విచారిస్తున్న అధికారులు పలు కీలక సమాచారం రాబట్టారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లోని మిలీనియం టౌన్ షిప్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లుగా విచారణలో తెలియటంతో భారీ బలగంతో ఎన్ఐఏ అధికారులు ఈ ఆపరేషన్ ను చేట్టినట్లుగా సమాచారం అందుతోంది. కాగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉద్రిక్తత నేపథ్యంలో మీడియాను కూడా పోలీసులు అనుమతించటంలేదు. 

శ్రీవారి సేవలో ప్రముఖులు..

తిరుమల: తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీనటుడు మంచు మోహన్‌బాబు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు వీరికి ఆహ్వానం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

షాద్ నగర్ లో కాల్పులు కలకలం..

మహబూబ్ నగర్ : షాద్ నగర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. మిలీనియం టౌన్ షిప్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే అనుమానంతో భాషా అనే వ్యక్తి ఇంటిని చుట్టుముట్టిన ఏఎన్ఐ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఉగ్రవాదిగా పోలీసలు అనుమానిస్తున్నారు. 

09:58 - August 8, 2016

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం జండాపంజా రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. మణప్పురం ఫైనాన్స్ కంపెనీలో షాట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆఫీస్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు, బంగారం వస్తువులు దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

09:55 - August 8, 2016

వరంగల్ : వరంగల్ వస్త్ర పరిశ్రమ అడుగుల్లో వేగం తగ్గిందా?... సీఎం సంకల్పానికి అడ్డంకులు ఎదురవుతున్నాయా?... వరంగల్‌ పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసే అరుదైన సందర్భం ఆవిష్కృతం అందుకే ఆగి పోయిందా? ప్రధాని మోడీ చేతులతో పురుడు పోసుకోవాల్సిన కాటన్ టు క్లాత్ సందిగ్ధంలో పడిందా.... పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది.. ప్రతిష్టాత్మక టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపనను తెలంగాణ సర్కార్ ఎందుకు వాయిదా వేసింది.... వాచ్ దిస్ స్టోరీ.

టెక్స్ టైల్స్ పార్కుకు శంకుస్థాపన చేస్తారన్న ప్రచారం..
మొదటిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చే నరేంద్రమోదీ.. వరంగల్ దేవనూరులోని టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆఖరు క్షణాల్లో ఆ కార్యక్రమం షెడ్యూలులోంచి మాయమైంది. ఎందుకిలా..? ఈ ప్రశ్నకు సమాధానాన్ని తరచి చూస్తే.. పెద్ద కథే నడిచినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో టెక్స్‌టైల్ పార్క్‌ నిర్మాణానికి ప్రభుత్వాల హామీ..
తెలంగాణలోనే అతి పెద్ద పరిశ్రమగా నిజాం కాలంలో ఏర్పాటు చేసిన అజాంజాహి మిల్లు వరంగల్ ప్రగతికి ప్రతీకగా నిలిచేది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేలమంది కుటుంబాలకు అండగా వుండేది. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో లాభాల బాటన ఉన్న మిల్లు.. కాలగర్భంలో కలిసిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్ర బాబు నాయుడు అదే స్థలంలో టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మిల్లు భూములను రామ్‌కీ సంస్థకు ధారాదత్తం చేశారు. ఇక అంతే ఆ ప్రతిపాదన అటకెక్కింది .. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో పరిశ్రమపై మళ్లీ ఆశలు చిగురించాయి.

వరంగల్‌లో వస్త్రపరిశ్రమ నెలకొల్పుతామని కేసీఆర్ హామీ
ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు తొలిసారిగా వచ్చిన కేసీఆర్ ఇక్కడ వస్త్ర పరిశ్రమను నెలకొల్పుతామని ప్రకటించారు. లక్ష మర మగ్గాలతో భారీ స్థాయిలో ఏర్పాటు కాబోతున్న టెక్స్ టైల్ పరిశ్రమకు నీరు, విద్యుత్ అత్యంత ముఖ్యమైంది. రామగుండం, హైదరాబాద్‌ నుంచి విద్యుత్‌ను వాడుకోవచ్చని భావించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని అందించడానికి ప్రణాళికలు రచించారు. వస్త్రపరిశ్రమకు సంబంధించి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీని వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేటి రాష్ట్ర పర్యటలో ప్రతిష్టాత్మక టెక్స్‌టైల్‌ పార్కు శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా చేశారు. ఈమేరకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించారు.

భూముల సేకరణ కోసం జూలై 20న రెవెన్యూ శాఖ నోటిఫికేషన్‌
భూముల సేకరణ కోసం జూలై 20న రెవెన్యూ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 123 జీవో ప్రకారం భూసేకరణ జరుపుతామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అభ్యంతరాల గడువు రాగానే రైతులు భూములు ఇవ్వడానికి మొండికేశారు. అధికారులు తమతో సమావేశాలు నిర్వహించినప్పుడు భూసేకరణ చట్టం-2013, జీవో 123 మధ్య లాభనష్టాల్లో తేడాలను వివరించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

శంకుస్థాపనను వాయిదా వేసిన ప్రభుత్వం
టెక్స్‌టైల్‌ పార్కుకు అవసరమైన భూముల సేకరణలో ఇబ్బందులు మొదలవుతుండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. టెక్స్‌టైల్‌ పార్కుకు హడావుడిగా శంకుస్థాపన చేస్తే తర్వాత ఇబ్బందులు తప్పవని భావించి, కార్యక్రమాన్ని వాయిదా వేసింది. మొత్తానికి ప్రభుత్వం హడావుడిగా జారీచేసిన జీవో 123ని హైకోర్టు రద్దు చేయడం.. ప్రభుత్వం స్టే కోసం చేసిన ప్రయత్నాలూ బెడిసికొట్టడమే.. టెక్స్‌టైల్‌ పార్కు శంకుస్థాపనకు అవరోధమైందని తెలుస్తోంది. ఇంతకీ ప్రభుత్వం భూసేకరణ చట్టం-2103 ప్రకారమే భూమిని సేకరిస్తుందా..? అందులో నిర్దిష్ట కాలావధిలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తుందా..? అయితే ఎప్పుడు..? ఇవీ ఇప్పుడు ఓరుగల్లు జిల్లావాసులను వేధిస్తున్న ప్రశ్నలు. వీటికి కాలమే సమాధానం చెప్పాలి. 

09:47 - August 8, 2016

హైదరాబాద్ : జీవో 123పై నీలి నీడలు కమ్ముకున్నాయి. హైకోర్టు నుంచి ఉపశమనం లభించని పక్షంలో ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం సమాలోచలు చేస్తోంది. జీవో ఎందుకులే భూసేకరణ చట్టాన్నే అమలు చేద్దామనుకుంటే.. ప్రభుత్వ ప్రణాళికలు తలకిందులయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఎకరాలను సేకరిస్తున్న నేపథ్యంలో నష్టపరిహరం చెల్లింపు, పునరావాసం తదితరాలు ప్రభుత్వానికి పెను భారంగా మారనుంది.

వివిధ ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీగా భూ సేకరణ
వివిధ ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీగా భూ సేకరణ చేస్తోంది. సుమారు 5లక్షల ఎకరాలను సేకరించాలన్న టార్గెట్‌తో జీవో 123ని తెచ్చింది. అయితే ఈ జీవో అమలుపై సందిగ్ధత కొనసాగుతోంది. హైకోర్టులో సోమవారంనాడు జీవో భవితవ్యం తెలిపోనుంది. ఒకవేళ కోర్టు భూ సేకరణ చట్టం..2013 ప్రకారమే నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని ఆదేశిస్తే.. ప్రభుత్వానికి తలనొప్పులు తప్పక పోవచ్చు. ఎందుకంటే 5 లక్షల ఎకరాలకు మార్కెట్ రేటుకు మూడింతల పరిహరం ఇవ్వాలంటే లక్షల కోట్లు సమకూర్చాల్సి వుంటుంది. దాంతో పాటు భూ సేకరణ ప్రకటన తేదీ నుండి మొత్తం పరిహారంపై 12 శాతం వడ్డీ చెల్లించాలి.

2013 చట్టం ప్రకారం నష్టపరిహారం, పునరావాసం కల్పించాలి
జీవో 123 వల్లే కాకుండా భూ సేకరణ చట్టంతో భూములు కోల్పోతున్న రైతులకే కాదు.. భూమిపై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు, వృత్తి దారులకు, చిరు వ్యాపారులకు కూడా పరిహారం చెల్లించాలి. ప్రాజెక్టుల వల్ల ప్రభావితమౌతున్న కుటుంబాలన్నింటికీ పునరావాసం కింద ఒకేసారి కోరుకుంటే ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెల్లించాలి. లేదంటే నెలకు 2వేల చొప్పున 20ఏళ్ల పాటు చెల్లించాలి లేదా..కోరుకుంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఇక భూమి కోల్పోయిన వారికి నెలకు 3వేల చొప్పున ఒక సంవత్సరానికి 36వేలు ఇవ్వాలి. ఇక భూములు కోల్పోతున్న ఎస్సీ, ఎస్టీలకు 50 వేలు పునరావాస భృతిని అదనంగా చెల్లించాలి. నిర్వాసితులైన వారికి రవాణా ఖర్చుల కింద కుటుంబానికి 50 వేలు, చేతి వృత్తుల వారికి 25 వేల నష్ట పరిహరం చెల్లించాలి. ఇదే గాక మరెన్నో రకాలుగా నిర్వాసితులకు పూర్తి ప్రయోజనాలు చేకూర్చేలా ఉందీ భూ సేకరణ చట్టం. అందుకే నష్ట పరిహరం, పునరావాసం కల్పించని జీవో 123ను కాదని..భూ సేకరణ చట్టం ద్వారా పరిహారం చెల్లించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.

30వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం టార్గెట్
ఇదిలా ఉంటే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో దేనికోసం ఎంతెంత భూ సేకరణ జరుగుతుందో ఓసారి పరిశీలిద్దాం. నల్గొండ జిల్లాలో వివిధ ప్రాజెక్టులు, అవసరాల కోసం 30వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. పాలమూరు-డిండి ప్రాజెక్టు కోసం ఆ జిల్లాలో 13వేల ఎకరాలు, పెండ్లిపాకల రిజర్వాయర్ కోసం 2,935 ఎకరాలను, ప్రాణహిత కోసం 5వేల ఎకరాలు, యాదాద్రి అభివృద్ధి కోసం 2వేల ఎకరాలు, యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం 4, 676 ఎకరాలు, నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ కోసం 1150 ఎకరాలు, ఎస్సారెస్పీ, పులిచింతల, నేషనల్ హైవే, ఇతర అవసరాల కోసం మరో వేయి ఎకరాలను సేకరిస్తుంది. అదే మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 13వేల ఎకరాలు, నెట్టెంపాడుకోసం 1,341 ఎకరాలు,.గట్టు మండలంలో సోలార్ పవర్ ప్లాంట్ కోసం 5,800 ఎకరాలు, ఇతర అవసరాల కోసం మరో 100 ఎకరాలను సేకరిస్తుంది.

మెదక్ జిల్లాలో నేషనల్ హైవే కోసం 631 ఎకరాలు, నిమ్జ్ కోసం 12,636 ఎకరాలు
ఇక మెదక్ జిల్లాలో నేషనల్ హైవే కోసం 631 ఎకరాలు, నిమ్జ్ కోసం 12,636 ఎకరాలు, ప్రాణహిత కోసం 21 వేలు, కొండ పోచమ్మ కోసం 610, సింగూరు కాల్వల కోసం 344 ఎకరాలను సేకరిస్తుంది. కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కోసం 25వేల ఎకరాలను సేకరించే పనిలో ఉంది సర్కార్‌. రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ కోసం 15వేల ఎకరాలు, ఏరో స్పేస్ కోసం 300 ఎకరాలతో పాటు, రీజినల్ రింగురోడ్డు, పారిశ్రామిక వాడల కోసం వేల ఎకరాలను సేకరిస్తోంది. గతంలో సేకరించిన భూమిని నిరుపయోగంగా ఉంచి..కొత్తగా మరోసారి భూములను సేకరించడం దేనికని ప్రశ్నిస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం 1500 ఎకరాలు..
ఇక ఖమ్మం జిల్లాలో భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం 1500 ఎకరాలు, సింగరేణి ఓపెన్ కాస్ట్ కోసం 850, సీతారామ సాగర్ ప్రాజెక్టు కోసం 12వేల ఎకరాలను సేకరిస్తుంది. వరంగల్ జిల్లాలో పలు పరిశ్రమల కోసం 27వేల ఎకరాలకుపైగా భూములను సేకరిస్తోంది. అదిలాబాద్‌లో ఓపెన్ కాస్ట్ కోసం 2వేల ఎకరాలు, పవర్ ప్లాంట్ కోసం 600 ఎకరాలు, తుమ్మడి హట్టి కోసం 2,500 ఎకరాలను సేకరిస్తుంది. నిజామాబాద్‌లో పవర్ గ్రిడ్ కోసం 500 ఎకరాలు, హైదరాబాద్‌ చుట్టూ 131 చోట్ల 50వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఇవిగాక పరిశ్రమల కోసంటీఎస్ఐఐసీ లక్షన్నర ఎకరాలను సేకరించి లాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. పరిశ్రమలకు రెడీమెడ్‌గా కేటాయించేందుకు అనువుగా ఈ భూములను సిద్ధం చేస్తోంది.

తలనొప్పిగా మారిన భూసేకరణ..
ఏది ఏమైనా భూ సేకరణ చట్టం అమలు చేయడమంటే అంత ఆషామాషీ వ్యవహరం కాదు. ప్రతి అంశాన్ని పారదర్శకంగా ప్రజల ముందుంచి..వారిని సంతృప్తి పరిచిన తర్వాతే భూ సేకరణ ప్రక్రియ చేపట్టాలి. అదీ కూడా మార్కెట్ రేటుకు 3 రెట్లు చెల్లించాలి. ఇది నిజంగా ప్రభుత్వానికి భారంగానే మారనుంది. అందుకే ప్రభుత్వం జీవో 123ను తెరపైకి తెచ్చింది. అయితే.. దాన్ని కోర్టు కొట్టేసిన నేపథ్యంలో.. ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. దాని భవిష్యత్తు సోమవారం తేలిపోనుంది. తీర్పు తమకు అనుకూలంగా వస్తే సరి.. రాకుంటే.. ప్రభుత్వం ప్రాజెక్టులకు అవసరమైన భూమి కోసం ఏమార్గాలను అనుసరిస్తుందన్నది తేలాల్సి ఉంది. 

 

09:32 - August 8, 2016

విజయవాడ : అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. బెజవాడ కనకదుర్గమ్మ. కృష్ణానదీ తీరాన.. ఇంద్రకీలాద్రిపై వెలసి... అభయప్రదాయనిగా భక్తకోటి పూజలందుకుంటోంది కనకదుర్గమ్మ. స్వయంభువుగా వెలసిన బెజవాడ కనక దుర్గమ్మ ఆలయ విశేషాలపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం.

రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవి కోసం తపస్సు
కృష్ణానది తీరాన వెలసిన కనకదుర్గ ఆలయం..భక్తుల కొంగుబంగారంగా బెజవాడ కనకదుర్గమ్మ. ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలసి.. వరాల కల్పవల్లిగా నీరజానాలు అందుకుంటున్న జగజ్జనననే కనకదుర్గమ్మ అన్నది భక్తుల నమ్మకం. బెజవాడ కనకదుర్గమ్మ ఆవిర్భావానికి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవి కోసం తపస్సు చేశాడని, ప్రసన్నయై ప్రత్యక్షమైన అమ్మవారిని తనపైనే వసిస్తూ... రాక్షస సంహారం చేయాలని ఇంద్రకీలుడు కోరాడని చెబుతారు. అమ్మవారి వరప్రభావంతో ఇంద్రకీలుడు... ఇంద్రకీలాద్రిగా అవతరించగా... అమ్మవారు... ఆ కొండపై స్వయంభువుగా కొలువుదీరారట.

శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన ఆదిశంకరాచార్యులు..
ఇంద్రకీలాద్రికి మరో పురాణ విశేషమూ ఉంది. అర్జునుడు శివుని కోసం ఈ కొండపైనే ఘోర తపస్సు ఆచరించాడట. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై... అర్జునుడికి ధనుస్సును ప్రసాదించాడట. అంతేకాదు... ఆది శంకరుల వారు... పర్యటనలలో భాగంగా... ఇంద్రకీలాద్రిపైని దుర్గమ్మను దర్శించి... ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు..

రావిచెట్టు నీడలో రాతి అరుగుపై అమ్మవారిని పూజించిన బెస్తలు..
ఇంతటి మహిమాన్విత క్షేత్రం కాబట్టే... బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం... నిత్యం భక్తులతో కిటకిట లాడుతూ ఉంటుంది. అమ్మవారి ఆలయ చరిత్ర ఇప్పటిది కాదు. అమ్మవారి ఆలయం అభివృద్ధి చెందడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. తొలినాళ్లలో మునులకు మాత్రమే ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ దర్శనభాగ్యం కలిగేదని.. అనంతర కాలంలో ఇక్కడి రావిచెట్టు నీడలో రాతి అరుగుపై అమ్మవారిని బెస్తలు పూజించారని చెబుతారు. 1900 సంవత్సరంలో కూడా ఇక్కడ ఓ చిన్న గూడు మాత్రమే ఉండేదని స్థానికులు చెబుతుంటారు. ఆ తర్వాత ఆరు దశాబ్దాలకు పదిహేను అడుగుల వెడల్పు, పొడవు ఉన్న మండపాన్ని నిర్మించారు. 1970 లో గర్భాలయాన్ని విస్తరించి, గర్భాలయ గోపురం ఎత్తును పెంచారు. 1972లో ప్రాకార గర్భాలయ గోపురంలో సగ భాగానికి స్వర్ణతాపడం చేశారు.

2008లో ఆలయ విస్తరణ..అభివృద్ధి పనులకు శ్రీకారం..
2008లో ఆలయ విస్తరణతో పాటు ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 90 అడుగుల ఎత్తులో తొమ్మిది అంతస్థుల రాజగోపురం నిర్మాణానికి అంకురార్పణ చేసి 2015 నాటికి పూర్తిస్థాయిలో నిర్మాణాన్ని పూర్తిచేశారు. దీనికి అనుబంధంగా మల్లికార్జున మహా మండపాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ మరో ఏడు అంతస్థులతో ఈ మహామండపం తయారైంది. కాలక్రమంలో దినదిన ప్రవర్తమానం చెందుతూ అమ్మవారి ఆలయం ఇప్పుడున్న స్థితికి చేరుకుంది. ప్రతి ఏటా పెరుగుతున్న భక్తులతో అమ్మవారి ఆలయానికి విశేష ఖ్యాతి వస్తోంది.

రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత పెరిగిన జనాభా..
ఇప్పుడున్న ఇంద్రకీలాద్రిని ఆనుకుని పదిహేను చిన్న నివాసాలు ఉండేవి. అప్పుడు కృష్ణానది చిన్నవాలులో మత్స్యకారులు పడవలు నడుపుతూ..చేపలు పట్టేవారు. అలా ఉన్న పల్లె 1845 సంవత్సరానికి విస్తరించి సుమారు 2 వేల మంది జనాభా గల పెద్ద పల్లెగా విస్తరించింది. తర్వాత కాలంలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత జనాభా పెరిగారు. ఆదిశంకరాచార్యుల వారు అప్పటివరకు ఉన్న జంతుబలులు ఆచారానికి స్వస్తి చెప్పి శాస్త్రోక్త విధానంలో అమ్మవారిని అర్చించడానికి శ్రీకారం చుట్టారు. ఈ సారి పుష్కరాలకు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. 

అభివృద్ధికి 'ప్రభు' శ్రీకారం..

సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఇవాళ రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ ప్లాట్‌ఫాం-1లో ఏసీ డార్మెట్రీతోపాటు రెండు కొత్త రైళ్లను సురేశ్‌ప్రభు ప్రారంభించారు. హైదరాబాద్-గుల్బర్గా, కాజీపేట-ముంబై రైళ్లను సురేశ్‌ప్రభు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు. 

09:13 - August 8, 2016

గుంటూరు : కృష్ణా పుష్కరాలకు గుంటూరు జిల్లా సిద్ధమవుతోంది. జిల్లాలోని ప్రధాన ఘాట్లలో ఒకటైన సీతానగరం ఘాట్‌ వద్ద పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలకు ఈ ఘాట్‌కే తరలి వస్తారని భావిస్తున్నారు. అయితే ఇక్కడ పనులు ఆలస్యంగా మొదలుపెట్టడం వల్ల.. సకాలంలో పూర్తవుతాయా అన్న అనుమానం కలుగుతోంది. సీతానగరం ఘాట్‌ నిర్మాణ తీరుపై 10 టీవీ ప్రత్యేక కథనం..!

పుష్కరఘాట్‌లలో అతి పెద్దది సీతానగరం ఘాట్..
గుంటూరు జిల్లాలోని పుష్కరఘాట్‌లలో అతి పెద్దది సీతానగరం ఘాట్. విజయవాడ తర్వాత అత్యధికంగా భక్తులు ఈ ఘాట్‌కే తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇంకా పూర్తికి సీతానగరం ఘాట్..
సీతానగరం ఘాట్‌ వద్ద ఇప్పటివరకూ 60 శాతం పనులై పూర్తయ్యాయి. ఇక నాలుగు రోజులే గడువుంది. మిగిలిన నలభై శాతం పనులు ఈ అతి తక్కువ వ్యవధిలో పూర్తవుతాయా అన్న సందేహం లేకపోలేదు. కాంట్రాక్టర్‌, అధికారులు అలసత్వమే పనుల్లో జాప్యానికి కారణమన్న వాదన ఉంది.

విజయవాడలో ట్రాఫిక్ తో తప్పని ఇబ్బందులు..
విజయవాడలో సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్‌ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇక పుష్కరాల రోజుల్లో వాహనాల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ, కనక దుర్గ వారధిపై వాహనాలు భారీగా జామ్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదన్న భావన ఉంది. అందుకే.. ఎక్కువ మంది యాత్రికులు సీతానగరం ఘాట్‌కు వస్తారని అధికారులు అంచనావేస్తున్నారు. సీతానగరం చేరుకునే వారి కోసం మంగళగిరి టీటీ శానిటోరియం ప్రాంతంతో పాటు.. జాతీయ రహదారి సమీపంలోనూ పుష్కర నగరిని ఏర్పాటు చేస్తున్నారు. సీతానగరంలో 18 మంది కమిషనర్లు, 18 మంది శానిటరీ అధికారులు పుష్కరాలను పర్యవేక్షించనున్నారు.

యాత్రీకులకు నీటిని పంపింగ్‌ ఏర్పాట్లు..
చెన్నై, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు... జాతీయ రహదారి ప్రాంతంలో వాహనాలను నిలిపి, అక్కడి నుంచి ఉచిత బస్సుల్లో ఘాట్లకు చేరుకోవాల్సి ఉంటుంది. జాతీయ రహదారి, మంగళగిరి నుంచి ఘాట్‌కు చేరుకోవడానికి సరైన రహదారులు లేకపోవడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు. ఘాట్‌లను అనుకుని రహదారులు ఉండటం కూడా భక్తులకు అసౌకర్యంగా మారవచ్చు. సీతానగరం ఘాట్ బ్యారేజీకి దిగువన ఉండటంతో స్నానాలకూ ఇబ్బంది కావచ్చంటున్నారు. అయితే మోటార్లు ఏర్పాటు చేసి, ఘాట్‌లోకి నీటిని పంపింగ్‌ చేయడం ద్వారా భక్తులకు పుష్కర స్నానాలు ఆచరించేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు.

ఘాట్ల వద్ద ఆలయాలకు ముస్తాబు..
ఘాట్‌ల వద్ద ఉన్న కోదండరామ ఆలయం, ఆంజనేయస్వామి ఆలయంతో పాటు వెంకటేశ్వర ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఘాట్లలో పుణ్యస్నానాలాచరించి ఈ ఆలయాల్లో దర్శనం చేసుకునే విధంగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. యాత్రికులకు అన్నదానం, భద్రతకు సిసీ కెమెరాలు, ఆలయాలు, ప్రసిద్ధ పర్యటక ప్రదేశాలకు విద్యుద్దీపాలంకరణ, వీలైనన్ని చోట్ల తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ మరో నాలుగు రోజుల్లో పూర్తయి.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పుష్కరాలు పూర్తి కావాలని కోరుకుందాం. 

09:05 - August 8, 2016

విజయవాడ : పుష్కరం ఇంటింటి వేడుకలా మారుతోంది. ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. యువత మాటైతే చెప్పనే పనిలేదు. ఉరకలెత్తే యువకుల ఉత్సాహాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని అధికారులూ యోచిస్తున్నారు. అందుకే పుష్కరాలకు తరలివచ్చే యాత్రికులకు సేవా కార్యక్రమాల్లో యువత సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. దీనికోసం ఎంపిక చేసుకున్న యువకులకు ప్రత్యేక శిక్షణనూ ఇస్తున్నారు.

పర్యాటక ప్రదేశాలలో కూడా ఏర్పాట్లు..
విజయవాడలో కృష్ణవేణి పుష్కర సందడి మొదలైంది. పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు జోరందుకుంటున్నాయి. లక్షలాదిగా యాత్రికులు పుష్కరస్నానాలకు బెజవాడకే తరలివస్తారని.. ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను దర్శించుకోవడంతో పాటు.. పరిసరాల్లోని పర్యాటక ప్రదేశాలనూ సందర్శిస్తారనీ అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షల్లో తరలివచ్చే పుష్కర యాత్రికులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూడడం..పోలీసులకు తలకు మించిన భారమే. ఆ భారాన్ని కాస్తైనా తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో విజయవాడ పోలీసులు యువత సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. పుష్కరాల విధుల్లో పోలీసులకు సహాయం అందించేందుకు కొంత మంది యువతను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

భద్రతపై దృష్టి పెట్టిన పోలీసులు...
లక్షలాదిగా యాత్రికులు తరలి రానుండటంతో భద్రతపై దృష్టి పెట్టిన పోలీసులు... మొత్తం 20 వేల మంది పోలీసులను భద్రతకు నియోగిస్తున్నారు. విజయవాడలో ట్రాఫిక్‌ సమస్యలతో పాటు ఇతర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. ఆ కష్టాల నివారణలో యువతను భాగస్వామ్యం చేస్తున్నారు. యువత సేవలు వినియోగించుకునేందుకు పుష్కర సేవక్‌ పేరుతో వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కళాశాలలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

పుష్కర సేవక్‌లకు ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌,గుర్తింపు కార్డులు, క్యాప్‌లు
పుష్కరాల కోసం దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల మంది యువత అవసరం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విద్యార్థులకు శిక్షణ పూర్తి కాగానే వారిని పోలీసుల మాదిరిగా వినియోగించుకోనున్నారు. పుష్కర సేవక్‌లకు ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌, గుర్తింపు కార్డులు, క్యాప్‌లు ఇస్తారు. పుష్కరనగర్‌, రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, ఘాట్ల వద్ద పుష్కర సేవక్‌ల సేవలను వినియోగించుకోనున్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌, రెడ్‌క్రాస్‌ తదితర సంస్థలు కూడా పుష్కరాల భద్రతా చర్యల్లో పాల్గొననున్నాయి.

వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు..
పుష్కరాలకు తరలివచ్చే వృద్ధులు, వికలాంగులను ఘాట్ల వద్దకు తీసుకువెళ్లేందుకు వీల్‌ ఛైర్స్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. పుష్కర సేవక్‌ల సేవలను వినియోగించుకుని యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పోలీసులు నిశ్చయంతో ఉన్నారు.

 

08:53 - August 8, 2016

విజవయాడ : నమస్కారం. పుష్కరవేణి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కృష్ణాపుష్కరాలకు ఇక నాలుగు రోజులే మిగిలింది. పుష్కర పనులు ఎక్కడికక్కడ జోరందుకున్నాయి. భక్తజన సందోహం సంతృప్తితో తిరిగి వెళ్లాలన్నదే లక్ష్యంగా అధికారులు పుష్కర ఘాట్లను రూపొందిస్తున్నారు. అంతేనా.. పరిసరాల్లోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలనూ అందంగా ముస్తాబు చేస్తున్నారు. తెలుగునేలపై తంగడి మొదలు.. హంసలదీవి వరకూ ప్రవహించే కృష్ణానది పుష్కర విశేషాలతో రూపుదిద్దుకున్నదే ఈ 'పుష్కరవేణి' ప్రత్యేక కార్యక్రమం.

చారిత్రక ప్రాధాన్యం.. కృష్ణాతీర ప్రదేశం..
చారిత్రక ప్రాధాన్యం.. కృష్ణాతీర ప్రదేశం.. సుందర బెజవాడ నగరం. చుట్టూ కొండలు.. చెంతనే కృష్ణమ్మ గలగలలు.. నగరంలోంచి ప్రవహించే కాలువలు, పచ్చని పొలాలతో అలరారే ప్రకృతి సోయగం కనువిందు చేస్తుంది. ఇంతటి సుందరనగరానికి ఇప్పుడు పుష్కరశోభ తోడైంది. పన్నెండు వసంతాలకోసారి వచ్చే పుష్కర పండుగ నేపథ్యంలో బెజవాడ అందంగా ముస్తాబువుతోంది. యాత్రికులను అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చేందుకు సిద్ధమైంది.

సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా బెజవాడ..!
బెజవాడ..! కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇప్పుడీ నగరం సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారింది. పుష్కరాల సమయం సమీపిస్తున్న కొద్దీ నగర రూపురేఖలు మారిపోతున్నాయి. రహదారుల ఆధునీకరణ, కాలువ గట్ల సుందరీకరణతో పాటు నగరం నలువైపులా అలంకరణలతో అద్భుతంగా తయారవుతోంది. విజయవాడకే తలమానికంగా ఉన్న బందర్‌ రోడ్డు, ఏలూరు రోడ్డు రూపురేఖలు ఆసాంతం మారిపోయాయి. డివైడర్లు, ట్రాఫిక్‌ జంక్షన్‌లు చూడ చక్కగా ముస్తాబయ్యాయి.

 

సుందరంగా ముస్తాబైన విజయవాడ నగరం
ప్రకాశం బ్యారేజ్‌ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేర కాలువ గట్లను ఇప్పటికే సుందరీకరించారు. నగరంలోని ప్రధాన రహదార్లతో పాటు అంతర్గత రోడ్లనూ ముస్తాబు చేశారు. యాత్రికులను ఆకట్టుకునేందుకు విజయవాడలో విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు ప్రహారీ గోడలను పెయింటిగ్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. విజయవాడ నగరాన్ని పోస్టర్‌ ఫ్రీ నగరంగా రూపొందించారు. అనేక చోట్ల చిన్నపిల్లలను విశేషంగా ఆకట్టుకునేలా డోరీమాన్‌ బొమ్మల నుంచి చారిత్రక, ప్రాధాన్యత కలిగిన రాజుల చిహ్నాలను గోడలపై తీర్చిదిద్దారు. ముఖ్యంగా భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా, పర్యాటక శోభను అద్దారు.

ఆర్‌బీజీ లైటింగ్‌ వెలిగిపోతున్న ప్రకాశం బ్యారేజ్
నగరంలోని అన్ని రహదారులను విద్యుత్‌ దీపాల తళుకులతో దేదీప్యమానంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానంగా ప్రకాశం బ్యారేజీపై ఏర్పాటు చేసిన ఆర్‌బీజీ లైటింగ్‌ కాంతుల మిరుమిట్లు సందర్శకులను అబ్బురపరుస్తాయనడంలో సందేహం లేదు. ప్రభుత్వ అభిలాష మేరకు.. నగరపాలక సంస్థ బెజవాడ నగరాన్ని ఏకోణంలో చూసినా రమణీయంగా తీర్చిదిద్దుతోంది.

పుష్కరశోభను సంతరించుకున్న ఆలయాలు..
నగరంలో కనకదుర్గ ఆలయం, వినాయకుడి ఆలయం, యనమలకుదురు రామలింగేశ్వరస్వామి దేవాలయంతో పాటు హంసలదీవి వద్ద గల వేణుగోపాలస్వామి ఆలయం, జగ్గయ్యపేట, ముక్త్యాల ప్రాంతాల్లోని ఆలయాలు పుష్కర శోభను సంతరించుకున్నాయి. సాంస్కృతిక, సంప్రదాయ రీతిలో రంగుల హరివిల్లులు, పచ్చని తోరణాలతో దేవాలయాలు ముస్తాబయ్యాయి.

భక్తుల సౌకర్యాలకు సర్కార్ ఏర్పాట్లు..
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఆహ్లాదం, ఆనందం వెల్లివిరిసే రీతిలో బెజవాడ అందంగా ముస్తాబైంది. 

08:40 - August 8, 2016

ఎన్డీయే ప్రభ్తుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా పర్యటించారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రధాని దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు..గోసంరక్షణలో నకిలీలు వంటి అంశంపై మాట్లాడుతూ...దేశంలో దళితులపై జరుగతున్న దాడులు మానవత్వానికే మాయని మచ్చగా అభివర్ణియించారు. గోరసంక్షణ పేరుతో సమాజంలో అలజడులు సృష్టించేందుకు కొంతమంది యత్నిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. నకిలీ గోసంరక్షుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఆయన హెచ్చరించారు...ఆయన మాటల్లోని అంతరార్థం ఏమిటి? రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పట్టుకోసమే మోదీ వ్యూహాత్మక వ్యాఖ్యానించారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలకపల్లి రవి (ప్రముఖ రాజకీయ విశ్లేషకులు) ప్రకాశ్ రెడ్డి (బీజేపీ నేత) గోవర్థన్ రెడ్డి (టీఆర్ఎస్ నేత ) మహేష్ గౌడ్ (కాంగ్రెస్ నేత) పాల్గొన్నారు. ఈ అంశంపై వక్తలు ఎటువంటి అభిప్రాయాలు తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...మరింత సమాచారం తెలుసుకోండి...

07:55 - August 8, 2016

తెలంగాణ యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ స్టాఫ్ కి గత కొన్ని నెలలుగా ఒకటో తేదీన జీతాలు రావడం లేదు. ఏ తేదీన జీతం వస్తుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. పెన్షన్‌ ల విషయంలోనూ ఇదే పరిస్థితి. దీంతో తెలంగాణలో 13 యూనివర్సిటీలలోని 15వేల మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఇబ్బందిపడాల్సి వస్తోంది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో పరిస్థితి మరీ ఘోరంగా వుంది. ఈ దుస్థితికికారణం ఏమిటి? యూనివర్సిటీ ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటి? రాష్ట్ర ప్రభుత్వం ముందు వీరు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు తెలంగాణ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్‌ నేత లు కంచె మనోహర్ పాల్గొన్నారు.

07:49 - August 8, 2016

ఖమ్మం : ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండడంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. మరో మూడురోజుల పాటు గోదారి నీటిమట్టం పెరిగే అవకాశమున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.

భద్రాచలం వద్ద భారీగా పెరిగిన నీటిమట్టం..
ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం భారీగా పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉధృతి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 33 అడుగులున్న నీటిమట్టం 38.2 అడుగులకు చేరుకుంది.

తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వర్షపునీరు చేరిక..
చర్ల తాలిపేరు ప్రాజెక్టుకు వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో ఏడు గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు వదిలారు. భద్రాచలం వద్ద నీటిమట్టం పెరగడంతో స్నానపు ఘట్టాలు మునిగిపోయాయి. దీంతో అంత్య పుష్కరాలకొచ్చిన సందర్శకులు ఇబ్బందులు పడ్డారు. భద్రాచలం కరకట్ట వద్ద స్లూయిజ్‌ లీకేజీతో పట్టణంలోని అశోక్‌నగర్‌, కొత్తకాలనీల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. 

07:46 - August 8, 2016

బ్రెజిల్ : ఎన్నో ఆశలతో రియోలో అడుగుపెట్టిన ఓ క్రీడాకారుడు ఆ కల నెరవేరకుండానే ఆస్పత్రికి చేరాడు. పతకం గెలవాలని రియోకు వచ్చిన ఫ్రెంచ్‌ జిమ్నాస్ట్ సమీర్‌ ఐత్‌ సయీద్‌కు అనుకోని విషాదం ఎదురైంది. ప్రపంచ క్రీడాభిమానులను కంటతడి పెట్టించిన ఈ ఘటన ఒలింపిక్ చరిత్రలోనే ఓ విషాద ఘటనగా చరిత్రలోకి ఎక్కింది.

కల నెరవేర్చుకునే క్రమంలో గాయాలు బారిన పడుతున్న జిమ్నాస్ట్ లు..
ఒలింపిక్స్ లో పతకం సాధించడమనేది ప్రతీ క్రీడాకారుడి కల. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ఒక ఎత్తైతే, అక్కడ సత్తా చాటడం మరొక ఎత్తు. అందులోనూ జిమ్నాస్టిక్స్ అంటే మరింత కఠినమైన సాధన చేయాల్సి ఉంటుంది. తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నంలో జిమ్నాస్ట్ లు గాయాలు బారిన పడటం ఎక్కువే.

ప్రదర్శన ఇస్తుండగా ప్రమాదవశాత్తు క్రాష్ ల్యాండింగ్ అయిన సమీర్‌..
అయితే తాజాగా ఈ తరహా ఘటనే రియో ఒలింపిక్స్ లో చోటు చేసుకుంది. ఫ్రెంచ్ జిమ్నాస్ట్ సమీర్ అయిత్ పోటీలో భాగంగా ప్రదర్శన ఇస్తుండగా ప్రమాదవశాత్తు క్రాష్ ల్యాండింగ్ అయ్యాడు. దీంతో అతని ఎడమ కాలు విరిగిపోయింది. ఎంతలా అంటే కాలి ఎముక విరిగిన చప్పుడు ప్రేక్షకులకు స్పష్టంగా వినిపించింది. ఆ ధ్వని స్టేడియం మొత్తం స్పష్టంగా వినిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆందోళన చెందారు.

కల నెరవేరకుండానే ఆస్పత్రికి చేరిన సమీర్ అయిత్‌..
కాలు విరిగిన వెంటనే సయీద్‌ ఉద్వేగరహితంగా మారిపోయి తన చేతులతో కళ్లను మూసుకున్నాడు. అక్కడే ఉన్న పారామెడికల్‌ సిబ్బంది సయీద్‌ను స్ట్రెచర్‌పై పడుకోబెట్టి ప్రథమ చికిత్స చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా స్టేడియంలోని అభిమానులు నిలబడి వీడ్కోలు పలకగా ధైర్యం కోల్పోని ఆ అథ్లెట్‌ చేతిని పైకెత్తి తన మద్దతుదారులను వూరడించాడు.

ఎన్నో ఆశలతో రియోలో అడుగుపెట్టిన ఫ్రెంచ్ ఒలింపియన్ జిమ్నాస్ట్ సమీర్..
వాల్ట్‌, రింగ్స్‌లో విన్యాసాలు చేయడంలో మంచి అనుభవం ఉన్న సయీద్‌ 2013 యూరోపియన్‌ ఛాంపియన్‌ కూడా. అర్హత రౌండ్లో ప్యార్‌లల్‌ బార్స్‌, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌, రింగ్స్‌, పామెల్‌హార్స్‌ కూడా ప్రదర్శించాల్సి వుంది. తన సహచరులతో సయీద్‌ చాలా సరదాగా ఉండేవాడని ఫ్రెంచ్‌ జట్టు నాయకుడు కొరిన్‌ మౌస్టర్డ్‌ కలోన్‌ తెలిపారు.

07:33 - August 8, 2016

ఢిల్లీ : వస్తు, సేవల పన్ను బిల్లు ఇవాళ లోక్‌సభ ముందుకు రానుంది. ఈ బిల్లుకు రాజ్యసభలో చేసిన సవరణలను లోక్‌సభలో కూడా ఆమోదించాల్సి ఉంది. దీనికి అన్ని పార్టీలు అండగా నిలుస్తాయని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. జీఎస్టీ బిల్లుపై జరిగే చర్చ కూడా సజావుగా సాగుతుందన్న ఆశాభావంతో ఎన్డీయే పక్షాలు ఉన్నాయి. ఈ బిల్లుపై జరిగే చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పే అవకాశం ఉంది. 

జీఎస్‌టీ బిల్లును సవరణలతో ఆమోదించిన రాజ్యసభ..
పెద్దల సభలో ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లు నేడు లోక్‌సభ ముందుకు రానుంది. గత ఏడాది లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదించిన సవరణలను చర్చించేందుకు మళ్లీ దిగువ సభకు రానుంది.

బిల్లుపై సమాధానం చెప్పనున్న ప్రధాని మోడీ..
లోక్‌సభలో ప్రభుత్వానికి పూర్తి ఆధిక్యం ఉండడం... బిల్లుకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తామడంతో సవరణ బిల్లు సులభంగానే ఆమోదం పొందే అవకాశాలున్నాయి. ఇక ఈ బిల్లుపై ప్రధాని మోడీ సమాధానం చెబుతారని భావిస్తున్నారు. మరోవైపు పార్టీ ఎంపీలు అందరూ సభకు హాజరు కావాలని విప్‌ జారీ చేశామని కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు..

ఈనెల 10 వరకు లోక్‌సభకు హాజరు కావాలని టీడీపీ ఎంపీలకు విప్‌
అలాగే జీఎస్టీ బిల్లు లోక్‌సభ ముందుకు రానున్న నేపథ్యంలో ఈనెల 10వ తేదీ వరకు పార్టీ ఎంపీలందరూ సభకు విధిగా హాజరు కావాలని ఆదేశిస్తూ  టీడీపీ  కూడా విప్‌ జారీ చేసింది. ఈ బిల్లు సత్వర అమలుకు ఎన్డీయే రాష్ట్ర ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రులు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.. పార్లమెంట్ ఆమోదించిన 30 రోజుల్లోగా కనీసం 16 రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది..జీఎస్టీ బిల్లు అమల్లోకి వస్తే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పలు పన్నుల రద్దువుతాయి. ఈ బిల్లు ద్వారా వచ్చే రాబడిని పంచుకుంటాయి. 

07:27 - August 8, 2016

నల్గొండ : జిల్లా మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది.  తిరుపతి నుండి హైదరాబాద్ కు వస్తుండగా మార్గమధ్యంలో ఆగివున్న ఆర్టీసీ బస్ ను ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్ ఢీకొట్టటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ఈ ఘటనలో ట్రావెల్స్ బస్ లోని క్లీనర్ మృతి చెందగా మరో పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంట్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.  ట్రావెల్స్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

07:14 - August 8, 2016

నల్గొండ : టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో టీఆర్‌ఎస్‌ పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. స్థానిక నేత మందడి సాగర్‌రెడ్డి ఇంటిపై మరో వర్గానికి చెందిన నేతలు దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఆదివారం రాత్రి 10గంటలకు మందడి సాగర్‌రెడ్డి ఇంటిపై దాదాపు 50మంది ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఫర్నీచర్ ను ..కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో నలుగురికి తీవ్రగాయాలు కావంటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ కామినేని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషయమంగా వున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ స్వయంగా సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిలో మంత్రి జగదీష్ రెడ్డి సమీపబంధువులకు కూడా గాయాలయినట్లుగా తెలుస్తోంది. ఇంద్రపాలెంలో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థిలు నెలకొన్నాయి. 

రోడ్డు ప్రమాదంలో 10మందికి గాయాలు..

నల్గొండ : జిల్లా మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో క్లీనర్ మృతి చెందాడు. పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారుప. ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ..

నల్గొండ : టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో టీఆర్‌ఎస్‌ పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. స్థానిక నేత మందడి సాగర్‌రెడ్డి ఇంటిపై మరో వర్గం దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

Don't Miss