Activities calendar

09 August 2016

22:08 - August 9, 2016

తూర్పుగోదావరి : ప్రతిరోజు దేశంలో ఏదో ఒక చోట దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పొట్టకూటి కోసం కుల వృత్తి చేసుకుని బతుకుతున్న దళితులపై కొన్ని వర్గాలు అమానుషంగా దాడులకు తెగబడుతున్నాయి. గోవు చర్మం వలుస్తున్నారని సవరపాలెంలో దళితులపై జరిగిన దాడితో ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం మరో గుజరాత్‌గా మారే ప్రమాదముందని పలువురు హెచ్చరిస్తున్నారు.

గోదవరి జిల్లాకు ప్రాకిన దళితుల దాడులు..
దేశంలో దళితులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఉత్తరాదికే పరిమితమైన ఇలాంటి ఘటనలు.. ఇప్పడు దక్షిణాదికి పాకాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం సవరపాలెంలో కొంతమంది దుండగులు అమానుషంగా రెచ్చిపోయారు. పొట్టకూటి కోసం చనిపోయిన జంతువుల చర్మాన్ని తీసుకుని జీవనం కొనసాగిస్తున్న మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరరావుతో పాటు మరో వ్యక్తిపై దాదాపు 100 మందికి దాడికి పాల్పడ్డారు. తమ ఆవులను దొంగిలించి చర్మం ఒలుస్తున్నారనే అనుమానంతో గ్రామస్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే.. బాధితులు చనిపోయిన ఆవు చర్మాన్ని తీస్తున్నామని ఎంత చెప్పినా పట్టించుకోకుండా తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో ఎలీషా స్పృహతప్పి పడిపోగా.. వెంకటేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో అమలాపురం ఆస్పత్రికి తరలించారు.

చనిపోయిన ఆవు చర్మం తీస్తుండగా దాడి ..
అయితే.. దళితులు ఆవును చంపి చర్మం తీయడం లేదని.. ఆవు విద్యుత్‌షాక్‌తో చనిపోయిందని ఆవు యజమాని తెలిపారు. ఆవు చనిపోయిందని సమాచారం ఇచ్చిన తరువాతే... చర్మం తీస్తుండగా గ్రామస్తులు దాడి చేశారని బాధితుడి కుమారుడు అంటున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దాడిపై భగ్గుమన్న ప్రజాసంఘాలు..
మరోవైపు దళితులపై దాడి ఘటనను ప్రజాసంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఇది అత్యంత అమానుషమని అంటున్నారు. కొంతమంది కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దళిత సంఘాల నేతలంటున్నారు. వాస్తవ విషయాలు గ్రహించకుండా ఇలాంటి ఘటనలకు పాల్పడడం దారుణమని.. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దాడి ఘటనను ఖండించిన సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు
ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దారుణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు వెంటనే స్పందించి.. ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే.. కోనసీమ మరో గుజరాత్‌గా మారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. దాడి ఘటనను ఖండించిన సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు.. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దాడిని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాకినాడ కలెక్టరేట్‌ను దళితులు, ప్రజాసంఘాలు ముట్టడించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

బాధితులకు హర్షకుమార్ పరామర్శ
అమలాపురం ఆస్పత్రిలో బాధితులను మాజీ ఎంపీ హర్షకుమార్‌ పరామర్శించారు. 48 గంటల్లోగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు.

ఏడుగురు నిందితులు గుర్తింపు : డీఎస్పీ అంకయ్య
ఇదిలావుంటే దాడులకు పాల్పడినవారిలో ఏడుగురిని గుర్తించినట్లు అమలాపురం డీఎస్పీ అంకయ్య తెలిపారు. బాధితులపై మూకుమ్మడిగా దాడి జరిగిందని.. దాదాపు 100 మంది దాడి చేశారని అంకయ్య తెలిపారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రజాసంఘాలు, దళిత సంఘాలు నిరసనలు..
మరోవైపు హోంమంత్రి చినరాజప్ప నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల ప్రజాసంఘాలు, దళిత సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. దళితులపై దాడులు జరగడం దారుణమని ప్రధాని మోదీ ప్రకటించి రెండు రోజులు గడవకముందే ఇలాంటి దాడులు జరగడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే దాడికి పాల్పడిన వారిని తప్పించే ప్రయత్నం జరుగుతుందని దళిత నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దాడికి పాల్పడినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

22:03 - August 9, 2016

ప్రకాశం : మహిళలపై..బాలికలపై హింస, అత్యాచారాల పర్వం కొనసాగుతూనే వున్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా అరాచకాలకుఅడ్డుకట్ట పడటంలేదు. ముక్కుపచ్చలారని చిన్నారులు కూడా ఈ దారుణానికి బలైపోతునే వున్నారు. మంచీ చెడూ చెప్పాల్సిన ఉపాధ్యాయుల నుండి..కథలు చెప్పి నీతిని భోదించాల్సిన వయసులో వున్న వృద్ధుల వరకూ చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు..యత్నిస్తున్నారు...ఇటువంటి సంఘటనే ప్రకాశం జిల్లా పామూరు లో జరిగింది. చిన్నారిపై ఓ వృద్దకామాంధుడు అత్యాచారానికి యత్నించాడు. ఓ బాలికపై రామకృష్ణ అనే వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయటంతో పరారయ్యాడు. మూడు రోజుల అనంతరం ఇంటికి వచ్చిన రామకృష్ణకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

22:00 - August 9, 2016

ఢిల్లీ : ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తన చివరి పరపతి విధాన సమీక్షను నిర్వహించారు. కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా ఉంచినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి మించి, రెండేళ్ళ గరిష్ఠ స్థాయికి చేరినప్పటికీ, వడ్డీ రేటును 6.50 శాతంగానే ఉంచుతున్నట్లు రాజన్ పేర్కొన్నారు. 2017 మార్చి నాటికి ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యానికి అప్‌సైడ్ రిస్క్ ఉందని రాజన్ చెప్పారు. నగదు నిల్వల నిష్పత్తి 4శాతం, రివర్స్‌ రెపోరేటు 6శాతం, ఎంఎస్‌ఎఫ్‌ రేటు 7శాతం యథాతథంగా ఉంచారు. 2016-17లో వృద్ధిరేటు 7.6 శాతం ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రాజన్ పదవీ కాలం వచ్చే నెల సెప్టెంబర్ 4న ముగుస్తుంది.

21:55 - August 9, 2016

ఢిల్లీ : కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ జైరామ్‌ రమేష్‌ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాకు 14 వ ఆర్థిక సంఘం సిఫారసు చేయలేదని రాజ్యసభలో జైట్లీ చేసిన ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంటే... జాతీయాభివృద్ధి మండలి సిఫారసు చేసిందని చెప్పడం సభా హక్కుల ఉల్లంఘనకు వస్తుందన్నారు. 

21:45 - August 9, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీంను పెంచి పోషిస్తున్నది కొందరు పోలీసులే...కాదు..ప్రజాప్రతినిధులే దందాలు చేస్తున్నారు.. ఇలాంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి... వాటికి సమాధానం కూడా రాలేదు...కాని ఇప్పుడు అవి నిజం కాబోతున్నాయా..? నయీంతో కొందరు పోలీసుల లావాదేవీలు...మరికొందరు ప్రజాప్రతినిధులు..రాజకీయుల జాతకాలు బయటపడనున్నాయా..? అవును..నిజమేననిపిస్తోంది...నయీం ఇంట్లో సోదాల్లో పోలీసులకు డైరీ దొరికింది..అందులో నయీం అన్ని లావాదేవీలు..అందరితో ఉన్న లింకులున్నాయని తెలుస్తోంది..దీన్ని బట్టి ఆ డైరీ ఎవరి చిట్టావిప్పనుందో చూడాలి..

నయీం డైరీలో పెద్దోళ్ల జాతకాలు..
అన్ని విషయాలు రాసిన నయీం...లావాదేవీలన్నీ బయటపడనున్నాయి...ఆ డైరీలో రాజకీయ లింకులు..?ఆ డైరీలోనే పోలీసు అధికారులతో కాంటాక్ట్స్..??జాతకాల చిట్టాను విప్పనున్న డైరీ...వాయిస్...గ్యాంగ్‌స్టర్ నయీం ఇంట్లో పోలీసులు సోదాలు చేసినప్పుడు దొరికిన డైరీ కీలకం కానుంది...ఆ డైరీలో పెద్దోళ్ల జాతకాలు బయటపడనున్నాయని తెలుస్తోంది...ప్రతీ విషయాన్ని...ప్రతీ లావాదేవీలను డైరీలో రాసుకున్నట్లు తెలుస్తోంది.. దీన్ని బట్టి నయీంతో ఎవరెవరికి లింకులున్నాయన్నది బయటపడుతుంది...ఇప్పటికే పోలీసులకు తెలిసిన వివరాల్లో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బావమరిదితో లింకులున్నట్లు పోలీసులు గుర్తించి రిమాండ్‌ రిపోర్టులో లిఖించారు..ఇక డైరీ ఓపెన్ చేస్తే అందులో ఎవరెవరితో ఏం చేశాడన్నది బయటపడుతుంది..దీన్ని బట్టి నయీంతో ఇంతకాలం దందాలు చేశారని వస్తున్నా ఆరోపణలు నిజం కానున్నాయి....

సోదాల్లో దొరికిన పెన్‌డ్రైవ్...ల్యాప్‌టాప్‌లో ఏమున్నాయి..
వాయిస్..ఇదిలా ఉంటే పోలీసులకు డైరీతో పాటు ల్యాప్‌టాప్...పెన్‌డ్రైవ్‌లు దొరికాయి..అందులో కూడా నయీం కీలకమైన సమాచారం పెట్టుకున్నట్లు అనుమానిస్తున్నారు... ల్యాండ్ సెటిల్మెంట్లు, భూముల వివరాలు, డబ్బుల వసూళ్లకు సంబంధించిన వివరాలు ఈ డైరీల్లో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు....ఇక నయీం తనకు తానుగా తీర్పులు ఇవ్వడం, జరిమానా విధించి వసూలు చేసిన వివరాలు అతని డైరీలో ఉన్నట్టు చెప్పారు. బలవంతపు వసూళ్ల వివరాలను నయీం

నయీం టార్గెట్‌లో సంపన్నులు..
ఇక నయీం డైరీలో ఎవరికి డబ్బులు ఇచ్చింది, ఖర్చు చేసింది వివరాలు డైరీలో ఉన్నాయని తెలుస్తోంది...నయీం కొనుగోలు చేసిన స్థిర, చరాస్తుల వివరాలు డైరీలో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు...షెల్టర్లు, డెన్లకు సంబంధించిన తాళాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు నయీం టార్గెట్‌లో ఎందరో ధనవంతులున్నారని తెలుసుకున్నారు...

కేసును సిట్‌కు బదలాయింపు..
గ్యాంగ్‌స్టర్‌ నయీం ఆస్తులు...బినామీల జాతకాలు బయటపెట్టేందుకు కేసును సిట్‌కు అప్పగించారు...ఈ కేసును డీల్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని మరికొన్ని గంటల్లో ప్రకటించనున్నారు...అయితే ఇప్పటికే పోలీసులు గుర్తించినవాటి విలువ వేయికోట్లు దాటింది...నయీం భార్యను అరెస్టు చేసి రిమాండ్ తరలించినప్పుడు ఇచ్చిన రిపోర్టులో ఆస్తుల వివరాలను బయటపెట్టారు..

తవ్వినకొద్దీ బయటపడుతున్న అరాచకాలు..
హత్యలు, దోపిడీలు, బెదిరింపులు, భూదందాలతో అరాచకాలు సృష్టించిన కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌తో ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి...ఇన్నేళ్లుగా అధికారంలో ఉన్నవారిని అడ్డుపెట్టుకుని ..బెదిరించి పబ్బం గడపడమేగాకుండా అరాచకాలతో ఆస్తులు సంపాదించాడు నయీం... నయీం ఇళ్లలో ..ఫాంహౌస్‌లలో సోదాలు చేస్తున్న పోలీసులకు దొరికిన ఆధారాలను బట్టి వేయి కోట్ల ఆస్తులు బయటపడ్డాయి...ఇంకా ఎన్నో ఉన్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి...దీంతో నయీం ఆస్తులకు సంబంధించిన కేసును పూర్తిస్థాయిలో విచారించేందుకు స్పెషల్‌ ఇన్‌వెస్టిగేషన్ టీంకు అప్పగించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు..అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరికొన్ని గంటల్లో అధికారులు వెల్లడించనున్నారు...సరైన అధికారిని నియమించడం ద్వారా పూర్తి ఆధారాలతో బయటపడతాయని ...ఆ ఆఫీసర్‌ ఎవరన్నది తేలనుంది...

ముంబాయి మాఫియాను తలపించే దందాలు..
గ్యాంగ్ స్టర్ నయీం ముంబై మాఫియాను మించిన నగదు, భూములు, నగలు, వజ్రాలు ఉన్నాయని, వీటి లెక్క తేల్చడంతో ఇప్పట్లో సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు...నయీంకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు చూసి అధికారులు విస్తుపోతున్నారు...బినామీ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు....బయటపడుతున్నవాటి వివరాలను సేకరించే పనిలో పడ్డారు...

హైదరాబాద్‌ శివార్లలో వేయికోట్లపైనే ఆస్తులు..
ఇవేగాకుండా ఇంకా ఎన్నో ఆస్తులు బయటపడుతున్నాయి...ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నవాటిని నయీం ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి....నయీం భార్యను కోర్టులో రిమాండ్ చేసినప్పుడు పోలీసులు అందులో ఈ విషయాలను పొందుపరిచారు..ఇక ఆస్తులతో పాటు పోలీసులు స్వాధీనం చేసుకున్నవాటిలో ఆయుధాలతో పాటు అతనికి సంబంధించిన ఎన్నో ఉన్నాయి..అందులో బంగారంతో పాటు మారణాయుధాలు ఉన్నాయి...ఇవే గాకుండా వందల సంఖ్యలో బ్యాంకు పాస్బుక్లు, చెక్బుక్లతో పాటు నయీం డైరీలను స్వాధీనం చేసుకున్నారు...

మారణాయుధాలు స్వాధీనం..
గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు దూకుడు పెంచారు...నయీం అనుచరులపై దృష్టి సారించిన పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు.. నయీంతో కలిసి దందాలు చేసినవారు..నయీం బినామీగా ఉన్నవారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు...నయీం అనుచరుల ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులకు కీలక డాక్యుమెంట్లతో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు...

నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న అరెస్టులు..
షాద్‌నగర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్‌ నయీం మృతి చెందడంతో పోలీసులు ఇక అతని అనుచరులపై దృష్టి పెట్టారు... వందల కోట్ల ఆస్తులు సంపాదించినట్లు వస్తున్న అనుమానాలపై పోలీసులు దృష్టి సారించారు...ఎన్నో రకాల ఆరాచకాలు చేస్తూ కోట్లు సంపాదించిన ఈ గ్యాంగ్‌లో నయీంకు ప్రధాన అనుచరులుగా ఉంటున్నవారిని గుర్తించారు..వారి ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు....

సోదాల్లో దొరికిన మారణాయుధాలు..కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం..
నల్గొండ జిల్లాలో గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరులు ఐదుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...భువనగిరిలో ఇద్దరు, వలిగొండలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు విచారించారు....పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న సమయంలో వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తుండగా మారణాయుధాలు దొరికాయి...భువనగిరి ఎంపీపీ తోటకూర వెంకటేశ్‌ యాదవ్‌ ప్రధాన అనుచరుడిగా భావిస్తున్నారు..అతన్ని విచారించిన పోలీసులు వెంకటేశ్‌ యాదవ్‌ నుంచి తపంచా, 4 రౌండ్ల తూటాలు, విలువైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు...ఇక భువనగిరి మున్సిపల్‌ కౌన్సిలర్‌ నాజర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాజర్‌ నుంచి తపంచా, నాలుగురౌండ్ల తూటాలు, రూ.71వేలు, దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు....వలిగొండలో కొనపురి శంకర్‌, శ్రీశైలం, గుండు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు...

ప్రజాప్రతినిధులుగా ఉంటూ దందాలు..
పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుచరుల్లో ప్రజాప్రతినిధులుగా ఉంటున్నవీరిలో కొందరు సెటిల్‌మెంట్లు చేయడంలో కీలకమని తెలుస్తోంది...ఎక్కడైనా ఏదైనా కాంటవర్సీ ఉందంటే చాలు వీరు డీల్ చేసేవారు..నయీం పేరు చెప్పి..నయీంతో పాటే కేసులన్నీ డీల్ చేస్తూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు..వీరి ఇళ్లలో దొరికిన డాక్యుమెంట్లు కూడా దీనికి సంబంధించిందని తెలుస్తోంది...

నయీం బంధువులు అరెస్టు...
నయీం బంధువులు ఫరా, హర్షియాలను అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు వారిని రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరుపరిచారు ...వీరిపై ఐపీసీ 25 1/బి, 342, 366, 384, 420, 467, 488 సెక్షన్లతో పాటు ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు...నిందితులకు రాజేంద్రనగర్‌ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది....వీరిని చర్లపల్లి జైలుకు తరలించారు... 

21:01 - August 9, 2016

అడవిబిడ్డలు.. ఈ దేశ మూలవాసులు.. వేల ఏళ్లుగా తమ సంస్కృతి కాపాడుకుంటూ వస్తున్న వాళ్లు.. కానీ అభివృద్ధి మంత్రాల నడుమ, గ్లోబల్ రాకాసి కబంధ హస్తాల మధ్య నలిగిపోతున్నారు..పైన ఆకాశం విరుచుకు పడుతోంది.. కింద నేల కదిలిపోతోంది.. బతుకులు చెదిరిపోతున్నాయి.. ఒక్కమాటలో చెప్పాలంటే వారి అస్థిత్వమే ప్రమాదంలో పడుతోంది. ఆదివాసీల బతుకు చిత్రాన్ని కాలరాస్తున్న శక్తులేంటి? దానికి పరిష్కారమేంటి.. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ రోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం.. అసలీ అడవి ఎవరిది? ఆ అడవిని నిజంగా కాపాడుతున్నదెవరు? ఆ అటవీ సంపదను నాశనం చేస్తున్నదెవరు? ఇవన్నీ వదిలేసి కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టే న్యాయాన్ని అనుసరిస్తున్నదెవరు?చారెడు నేల అడిగితే లాఠీ ఝుళిపిస్తున్నారు.. అటు అడవికి, ఇటు మైదానానికి కాకుండా గిరిపుత్రుల ఉనికినే ప్రమాదంలో పడేస్తున్నారు.. మరి ఆదివాసుల్ని తరిమేస్తే అడవి కళకళలాడుతుందా? ఏదో ఒక కారణం చూపాలి.. గిరిజనుల్ని అడవులనుంచి తరిమెయ్యాలి.. ప్రభుత్వాలు చేస్తున్న పని ఇదే. అభివృద్ధి ప్రణాళికల పేరుతో ఓసారి, పోలవరం లాంటి ప్రాజెక్టు సాకుతో మరో సారి... కవ్వాల్ టైగర్ జోన్ లాంటి కారణాలతో ఇంకోసారి.. సందర్భమేదైనా బలవుతున్నది అమాయక గిరిజనులే. ఏటా ఆదివాసీ ఉత్సవాల హడావుడి తప్ప జరుగుతున్నదేంటి..? కొండా కోనలు.. పచ్చదనం చుట్టుకున్న చెట్లు.. విశాలమైన అడవులేవారి ప్రపంచం. పశుపోషణ, అటవీ ఉత్పత్తులే వారి బతుకులకు ఆదరువు.. ప్రకృతి ప్రసాదించిందే పరమాన్నం.. కొండకోనల్లోంచి పారేనీరే వారికి అమృతం.. అడవి చెట్లు, జంతువులే నేస్తాలు… ఆనందమొచ్చినా, కష్టమొచ్చినా అడవే ఆత్మబంధువు.. ప్రకృతి ఫలాలు తప్ప ప్రభుత్వ పథకాలతో పనిలేదు.. ఇదీ కొండకోనల్లో ఉంటున్న కోట్లాది గిరిజనుల బతుకు చిత్రం. ఇదే వారి తరతరాల చరిత్ర. మరి వాళ్ల భవిష్యత్ ఎలా ఉండబోతోంది? ఆదివాసీలు బాగా వెనకబడిన 25 దేశాల్లో ఇండియా కూడా ఒకటి.. ఆగస్ట్‌9ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి 1994లో ప్రకటించింది. ప్రపంచంలోని ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, అస్థిత్వం, హక్కుల పరిరక్షణకు విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి, స్వయంపాలనకు కృషి చేయాలని ఐరాస తన సభ్యదేశాలను కోరింది. కానీ ఏటా ఉత్సవాల హడావుడి తప్ప ఒరుగుతున్నదేమీ లేదు..గత 30 ఏళ్లలో మొత్తం 35 లక్షల ఎకరాల అటవీ భూమి చట్టబద్ధంగా నాశనమైంది. దానిపై ఎలాంటి చర్యలు, పరిశీలనలు లేవు. కానీ, పొట్టకూటికోసం మాత్రం తనసొంతమైన అడవితల్లి ఇచ్చిన సంపదను ఉపయోగించుకుంటే, పండించుకుంటే, ప్రభుత్వాలకు నొప్పి కలుగుతోంది. ఈ దేశమూలవాసులను నిర్లక్ష్యం చేస్తూ ఇప్పటికీ వారికోసం ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టకపోగా, ఉన్న కాస్త ఆధారాన్ని పోగొట్టే ప్రయత్నాలను ప్రజాస్వామికవాదులు తీవ్రంగా నిరసిస్తున్నారు. 

20:56 - August 9, 2016

కళ్లద్దాలు పెట్టుకో.. సెల్ పోను చూసుకో...గోవుసంపిరని దళితులపై దాడి ఏసిన దుండగులు...నయీం ఆస్తుల లెక్క మొదలేసిన పోలీసోళ్లు..విచిత్రమైన ఏసాలు కట్టి ఏపీ హోదాను డిమాండ్ చేస్తున్న ఎంపీ శివప్రసాద్..సర్కారు పంతుళ్లకు సుద్దులు సెప్పిన కడియం..విద్యాకమిటీ చైర్మన్ కోసం రోకలు బండలు..కారంతో కొట్టుకున్న జనాలు..ఆవులమంద మీద దాడిజేసిన చిరుతలు..గుంతలోబడ్డ ఆవులు..బతికేదుకు తప్ప భవితకోసం ఆలోసించని స్వచ్ఛమైన మనస్సున్న అడవిబిడ్డలు..గిటువంటి మస్తు ముచ్చట్లని చూడాలంటే ఈ వీడియోని క్లిక్ చేయుండ్రి..మస్తు మస్తు ముచ్చట్లను చూడుండ్రి..

బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం..

ప్రకాశం : సామూరు ఎన్జీవో కాలనీలో దారుణం జరిగింది. ఓ మైనర్ పై రామకృష్ణ అనే వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయటంతో పరారయ్యాడు. మూడు రోజుల అనంతరం ఇంటికి వచ్చిన రామకృష్ణకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

నయీం కేసుల దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు..

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీంకు సంబంధించిన కేసుల విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బందం(సిట్‌) ఏర్పాటు చేసింది. నయీంపై రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నందున వాటన్నింటినీ సిట్‌కు బదిలీ చేసింది. సిట్‌ బాధ్యతలు..దర్యాప్తు బృందంలో ఎవరెవరిని నియమించాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది. సిట్‌ వివరాలను రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. నయీంపై నమోదైన అనేక కేసులు ఆయా పోలీస్‌స్టేషన్లలో దర్యాప్తు చేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే ప్రమాదమున్నందున సిట్‌ ఏర్పాటు చేయాలని డీజీపీ అనురాగ్‌శర్మ నిర్ణయించారు.

సీఎం ఇంటిపై రాళ్ళదాడి...

అరుణాచల్ ప్రదేశ్ : మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుడు కలిఖో పుల్ (48) అనుమానాస్పద మృతి అంశం ఆందోళనకరంగా మారింది. ప్రస్తుత కొత్త ముఖ్యమంత్రి పెమా ఖండూ నివాసంపై కొంతమంది దాడులకు దిగారు. వీధుల్లోకి వచ్చి నిరసన నినాదాలు చేస్తూ పెమా ఖండూ నివాసంపై రాళ్లు విసిరారు. అనంతరం డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ వద్దకు వెళ్లి అక్కడి వాహనాలను ధ్వంసం చేసా..నిప్పు పెట్టారు. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద ఉన్న వస్తువులకు నిప్పంటించారు. మంత్రుల నివాసాలపై కూడా దాడి చేశారు

19:55 - August 9, 2016

చెన్నై : చెన్నైలో భారీ దోపిడీ జరిగింది. సెక్యూరిటీ మధ్య డబ్బును రైలులో తరలిస్తుండగా.. రైలు పైకప్పునకు రంధ్రం చేసి లోపలికి దిగి దాదాపు 342కోట్లు దొంగిలించారు. చెన్నైకి చెందిన రైలులో ఆర్బీఐకి చెందిన పాత నోట్లను సేలం నుంచి తరలిస్తుండగా అందులో 342కోట్ల డబ్బు కనిపించకుండా పోయింది. మొత్తం 226 పెట్టెల్లో డబ్బును తరలిస్తున్నట్లు అందులో రెండు బాక్సుల్లో  పగిలిపోయి ఉన్నట్లు కనిపించడమే కాకుండా డబ్బు బయటకు లాగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని అధికారులు చెప్పారు. రైలు పెట్టె పైభాగానికి రంధ్రం చేసి ఎవరో ఈ డబ్బు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

19:39 - August 9, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తుల వివరాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నకొద్దీ అధికారులు విస్తుపోతున్నారు. ముంబై మాఫియాను మించిపోయినట్లుగా వున్న నయీం ఆస్తుల చిట్టాలు బయటపడుతున్నాయి. మూటలకొద్దీ కట్టలు బయటపడుతున్నాయి. ప్రజలను భయపెట్టి..బెదిరించి..ప్రాణాలు తీసి నయీం కూడబెట్టిన ఆస్తులు ఇప్పటివరకూ చీకటి రాజ్యానికే పరిమితమయ్యాయి.   ప్రాణాల్ని సునాయాసంగా తీసేసే గ్యాంగ్ స్టర్ నయీం గ్రేహౌండ్ దళాలచేతిలో కుక్కచావు చచ్చాడు.  సాధారణ నక్సలైట్ మొదలుపెట్టిన నయీం ప్రస్థానం రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో అతను  అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు అంతాఇంతా కాదు...లెక్కపెట్టేందుకు కూడా అధికారులు నానా తంటాలు పడుతున్నారు. నయీం ఎన్ కౌంటర్ అనంతరం అతనికి సంబంధించిన అన్ని ప్రాంతాలలోనూ తనిఖీలు చేపట్టిన అధికారులు నయీం ఆస్తుల వివరాలను వెల్లడించారు. నయీం నివాసాలలో తనిఖీలు చేసే కొద్ది బంగారం, నగలు, వజ్రాలతో పాటు విలువైన వస్తువులు, ఆస్తుల చిట్టా బయటపడుతోంది. ఆస్తుల వివరాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కొండాపూర్ లో ఒకేచోట 69 ఎకరాల భూమి..దీని విలువ రూ.500కోట్లపైమాటగా అంచనా వేస్తున్నారు. పుప్పాలగూడ, మణికొండల్లో 40 ప్రాంతాల్లో ఖరీదైన ప్లాట్లు, భువనగిరి సమీపంలోని బొమ్మల రామారంలో 500 ఎకరాలు..హైదరాబాద్ నగరంలో పదుల కొద్దీ ప్లాట్స్, ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో స్థలాలు..ఆడీ కారుతో సహా హోండా సీర్వీ, ఫోర్ట్ ఎండీవర్ కార్లు..సరూర్ నగర్ లోని ఎన్టీఈర్ నగర్ లో 1180 గజాల సైటు..అత్తాపూర్ సర్వే నెం : 462,468 లో ఫ్లాట్స్, కొండాపూర్ సర్వే 87 పత్రాలు.. గుంటూరు జిల్లా చినకాకానీలో సర్వే నెంబర్ 230/231 పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షేక్ పేటలో మరో ఫ్లాటు..ముసారాబాద్ లో మరో నాలుగు స్థలాలు..జూబ్లీహిల్స్ లో 1365 గజాల స్థలాన్ని కబ్జా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. గాలింపు జరుగుతున్నకొద్దీ బైటపడుతున్న ఆస్తుల వివరాలను చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. కాగా ఈ కేసులో మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దీనిపై మరింత సమచారం కోసం ఈ వీడియోను చూడండి...

ఆర్‌బీఐ డబ్బు తరలిస్తున్న బోగీలకు కన్నం?!..

చెన్నై : ఆర్‌బీఐ డబ్బు తరలిస్తున్న ఓ రైలు బోగీలకు గుర్తు తెలియని దుండగులు రంధ్రం చేశారు. ఈ ఘటన విరుదాచలం రైల్వేస్టేషన్ వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్టేషన్‌లో ఆగిన సమయంలో వెల్డింగ్ సహాయంతో బోగీలకు రంధ్రం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సేలం నుంచి చెన్నైలోని రిజర్వు బ్యాంక్‌కు నగదు తరలిస్తున్న రెండు బోగీలకు రంధ్రం చేశారు. 220 కాటన్స్‌లలో రూ. 340 కోట్ల డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

19:09 - August 9, 2016

తూ.గోదావరి : అమలాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మెకాటి ఎలీషా, వెంకటేశ్వరరావులను మాజీ ఎంపీ హర్షకుమార్‌ పరామర్శించారు. 48 గంటల్లోగా బాధితులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హర్షకుమార్‌ హెచ్చరించారు. ప్రశాంతంగా వుండే తూర్పుగోదావరి జిల్లాలో దళితులపై దాడులు జరుగుతాయని ఎన్నడూ ఊహించలేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం పర్యటించిన ప్రధాని మోదీ దళితులపై జరుగుతున్న దాడులను  ఖండించారనీ...కానీ ఆయన వ్యాఖ్యానించిన 24గంటల్లోనే దాడి జరగటం చూస్తుంటే ప్రధాని పరోక్షంగా దళితులపై దాడిని ప్రోత్సహిస్తున్నట్లుగా వుందన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ముసుగులో వచ్చి దాడులకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

దత్తత గ్రామాలపై 'బాబు'వరాల జల్లు..

విశాఖ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరాల జల్లు కురిపించారు. నేడు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా పర్యటనలోని ఆయన పెదలబుడులో పర్యటించి,స్థానికులతో సమావేశమయ్యారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరో 10రోజుల్లో ఇంటింటికీ వంట గ్యాస్ ను పైప్ లైన్ ద్వారా అందిస్తానని హామీ ఇచ్చారు. నెల రోజుల్లో ప్రతి ఇంటికీ తాగు నీటిని పైప్ లైన్ల ద్వారా అందిస్తామని తెలిపారు.

18:37 - August 9, 2016

తూ.గోదావరి : దళితుల దాడి ఘటనపై ఆందోళనలు కొనసాగతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దళితులు, ప్రజాసంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. దళితులు, ప్రజాసంఘాలు కాకినాడ కలెక్టరేట్ ను ముట్టడించారు. అమలాపురం గడియారం సెంటర్ లో దళితులు ఆందోళన చేట్టారు.

దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి : ప్రజాసంఘాలు..
బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ప్రజాసంఘాల నేతలు  పేర్కొంటున్నాయి. బీజేపీకి సపోర్ట్ గా టీడీపీ పార్టీ వ్యవహరిస్తోందని కేవీపీఎస్ నేతలు పేర్కొంటున్నారు. సాక్షాత్తూ హోంమినిస్టర్ జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలో దళితులపై దాడులు జరటం దారుణమని వారు పేర్కొన్నారు. ఒక జంతువుకు ఇచ్చిన విలువ కూడా మనిషికి ఇవ్వటంలేదనీ..బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేసి రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని వారు తెలిపారు.

దాడిలో పాల్గొన్నవారు 100మంది : డీఎస్పీ అంకయ్య
అమలాపురం మండలం సవరపాలెంకు చెందిన మోకాటి ఎలీషాతో పాటు.. వెంకటేశ్వరరావుపై దాదాపు 100 మంది దాడి చేశారని అమలాపురం డీఎస్పీ అంకయ్య తెలిపారు. కూరగాయల అరవింద్‌కు చెందిన ఆవు విద్యుత్‌ షాక్‌తో చనిపోవడంతో.. ఎలీషాకు ఫోన్‌ చేసి అప్పగించారని.. ఆవు చర్మం తీస్తుండగా ఉరింక నారాయణరావు, గంగాధరరావుతో పాటు కొంతమంది వారిద్దరిపై దాడి చేశారన్నారు. ఎలీషాను చెట్టుకు కట్టి చితకబాదడంతో తీవ్రగాయాలయ్యాయన్నారు. వారిద్దరిని ఆస్పత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అంకయ్య తెలిపారు. 

నగరంలో దొంగల బీభత్సం..

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని మహంకాళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. బంగారు నగల తయారీ దుకాణంలోకి చొరబడి సిబ్బందిని కత్తులతో బెదిరించి రూ.9లక్షల విలువైన బంగారు నగలను ఎత్తుకెళ్లారు. దోపిడీలో ఆరుగురు సభ్యులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ సినీ నిర్మాత 'పంచు' మృతి..

చెన్నై: ప్రముఖ సినీ నిర్మాత, కథ, పాటల రచయిత పంచు అరుణాచలం కన్నుమూశారు. అగ్ర కథానాయకులు కమల్‌హాసన్‌, రజనీకాంత్‌లతో ఎక్కువ సినిమాలను తెరకెక్కించిన అరుణాచలం.. ఇళయరాజాను సంగీత దర్శకుడిగా ‘అన్నాలిలీ’ చిత్రంతో పరిచయం చేశారు. 75ఏళ్ల అరుణాచలానికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

దళితులపై దాడిని ఖండిస్తూ ఆందోళనలు..

తూ.గోదావరి : దళితుల దాడి ఘటనపై ఆందోళనలు కొనసాగతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దళితులు, ప్రజాసంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. దళితులు, ప్రజాసంఘాలు కాకినాడ కలెక్టరేట్ ను ముట్టడించారు. అమలాపురం గడియారం సెంటర్ లో దళితులు ఆందోళన చేట్టారు. 

టీఎంయూ విజయోత్సవ సభ..

హైదరాబాద్ : బస్ భవన్ లో టీఎంయూ విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నాయిని నర్శింహారెడ్డి, హరీశ్ రావు హాజరయ్యారు. టీ.ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ విజయం సాధించిన విషయం తెలిసిందే. 

నయీం అంత్యక్రియల్ని ప్రసారం చెయ్యొద్దు : కమిషనరేట్

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ హెచ్చరించింది. హెచ్చరికను ఉల్లంఘించిన వారిని చట్టపరంగా శిక్షిస్తామన్నారు. కాగా, నిన్న మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని మిలినీయం టౌన్‌షిప్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ నయీం హతమైన విషయం తెలిసిందే. 

భారత్ ను హెచ్చరించిన చైనా..

ఢిల్లీ : వివాదం చెలరేగుతున్న ద‌క్షిణ చైనా స‌ముద్రంపై భారత్ ఏమీ మాట్లాడొద్ద‌ని చైనా హెచ్చరించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటనకు వస్తోన్న నేపథ్యంలో భారత్‌కు చైనా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 13న సుష్మా స్వ‌రాజ్‌తో చైనా విదేశాంగ మంత్రి కొన్ని కీల‌క ద్వైపాక్షిక‌, ప్రాంతీయ అంశాల‌పై చర్చించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఇరు దేశాల‌కు మ‌ధ్య ఉన్న స‌త్సంబంధాలు మ‌రింత త‌గ్గించుకునేలా చేసుకోవ‌ద్ద‌ని ప్ర‌భుత్వ ప‌త్రిక గ్లోబ‌ల్ టైమ్స్ త‌న ఎడిటోరియ‌ల్‌లో పేర్కొంది. 

మరో ఉద్యమానికి సిద్ధమవుతున్న ముద్రగడ..

కడప : కాపుల రిజర్వేషన్ల అంశంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన గడువు ఈనెలాఖ‌రుకి పూర్తవుతుందని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. క‌డ‌ప జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. 2014 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెట్టిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని తాము కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇచ్చిన హామీల‌పై నిర్ల‌క్ష్యం వ‌హించొద్దని అన్నారు. వ‌చ్చేనెల మొద‌టి వారంలో త‌మ‌ భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక ఖ‌రారు చేస్తామ‌ని ముద్రగడ చెప్పారు. 

17:49 - August 9, 2016

హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఎంసెట్ -2 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్ అంశంలో అరెస్ట్ ల పర్వం ఇంకా కొనసాగుతూనేవుంది. ఇప్పటికే 11మందికి అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసలు మంగళవారం మరో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ముకుల్ జైన్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ముకుల్ జైన్ స్టడీ ఎడ్యుకేషనల్ కన్సట్లెన్సీని నిర్వహిస్తున్నాడు. పరీక్ష రాయనున్న ఆరుగురు విద్యార్థులను కలకత్తా తీసుకువెళ్లి ఎంసెట్ -2 ప్రశ్నాపత్రాలకు సంబంధించి శిక్షణ ఇప్పించినట్లుగా అధికారులు గుర్తించారు. త్వరంలో మరికొంతమందిని అరెస్ట్ చేస్తామని ఐజీ సౌమ్యామిశ్రా పేర్కొన్నారు. 

17:47 - August 9, 2016

హైదరాబాద్ : దట్టమైన అడవులు.....ప్రకృతి అందానికి నిలువెత్తు దృశ్యాలు... అక్కడక్కడ విసిరేసినట్టుండే గిరిజన గూడేలు....చూసేందుకు ఆహ్లాదకరంగా కనిపించినా... ఆగూడేల్లో నివసించే గిరిజనుల పరిస్థితి మాత్రం దయనీయంగానే ఉంది. దేశం ఎంత అభివృద్ధి సాధిస్తున్నా....ఎన్ని ప్రభుత్వాలు మారినా..గిరిజనులు సమాజానికి దూరంగానే ఉండాల్సి రావడం సిగ్గుచేటు. 12వ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనుల స్థితిగతులపై ప్రత్యేక కథనం.....

ఆగస్ట్‌ 9 ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి..
గిరిజనులు..ప్రకృతినే ఆధారంగా చేసుకుని బతుకుతూ ప్రత్యేక జీవన విధానాన్ని కొనసాగించే మానవ జాతి. మానవ మనుగడ వీరి నుంచే ప్రారంభమైందని..కనుకనే వీరిని ఆదివాసీలుగా పేర్కొంటారు. సమాజం ఎంత అభివృద్ధి సాధిస్తున్నా..వీరు మాత్రం ప్రకృతి ఒడిలో ఉండేందుకే ఇష్టపడుతూ..సమాజానికి దూరంగా ఉంటారు. ఫలితంగా ఎలాంటి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించలేక సతమతమవుతూనే ఉన్నారు. గిరిజనులను అభివృద్ధి పథంలోకి తీసుకొద్దామనే ఆలోచనతో ఐక్యరాజ్యసమితి...1994 జెనీవా సమావేశంలో ప్రతి ఏడాది ఆగస్ట్ 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరపుకోవాలని పిలుపునిచ్చింది.

విద్య, వైద్య సదుపాయాలు అంతంతమాత్రమే..
సమాజానికి దూరంగా ఉంటూ జీవనం సాగిస్తున్న గిరిజన ప్రజల కష్టాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విద్య, వైద్య, ఆరోగ్య పరిస్థితులు అంతంతమాత్రమే. చాలామంది చిన్నారులకు పసిప్రాయంలోనే నూరేళ్ళు నిండుతున్నాయి. చిన్నారులు, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. గిరిజనుల సమాగ్రాభివృద్ది కోసం ప్రభుత్వం ఐటిడీఏ ఏర్పాటు చేసి నాలుగు దశాబ్దాలు గడిచినా వారి జీవన విధానంలో మార్పు కనిపిచడంలేదు.

గిరిజన చట్టాలు అమల్లోకి వచ్చినా ఫలితం శూన్యం..
గిరిజనుల జీవనవిధానాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎన్ని చట్టాలు వచ్చినా ఫలితం మాత్రం శూన్యమే. గిరిజనుల సంక్షేమం కోసం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా వారి అభివృద్ధి అంతంతమాత్రమే. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసినా అధికారుల నిర్లక్ష్యంతో వాటి ఫలాలు గిరిజనులకు అందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి గిరిజనుల అభివృద్ధికి కృషి చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

17:38 - August 9, 2016

ఖమ్మం : భద్రాచలంలో ఏర్పాటు చేయాల్సిన గురుకుల విద్యాలయాన్ని ఖమ్మం సమీపంలోని తిరుమలాయపాలెంకు తరలించడం సరికాదని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. గురుకుల పాఠశాలను తిరుమలాయపాలెంకు తరలిస్తున్నారని తెలుసుకున్న గిరిజనులు ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. భద్రాచలానికి మంజూరైన పాఠశాలను అక్కడే నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.  

ఎంసెట్-2 లీక్ లో మరో నిందితుడు అరెస్ట్..

హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఎంసెట్ -2 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్ అంశంలో అరెస్ట్ ల పర్వం ఇంకా కొనసాగుతూనేవుంది. ఇప్పటికే 11మందికి అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసలు మంగళవారం మరో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ముకుల్ జైన్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

మహిళను విక్రయించిన సర్పంచ్‌ అరెస్ట్

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఓ మహిళను రూ.20,000 లకు విక్రయించిన మాజీ సర్పంచ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. షరిఫాబాద్‌ గ్రామం మాజీ సర్పంచి రాంకుమార్‌ యాదవ్‌, కృష్ణ కుమార్‌లు అదే గ్రామానికి చెందిన ఓ మహిళను రూ.20,000లకు అమ్మేందుకు సర్వం సిద్ధం చేసకున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు నిందితుడు కుమార్‌ ఇంట్లో మహిళ అపస్మారక స్థితిలో పడివుండటాన్ని గమనించి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించి నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నారు. 

ముగిసిన జ్యోతిలక్ష్మి అంత్యక్రియలు..

చెన్నై: అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్‌ సినీనటి జ్యోతిలక్ష్మి అంత్యక్రియలు చెన్నైలోని కన్మమ్మాపేట స్మశానవాటికలో ముగిశాయి. జ్యోతిలక్ష్మి అల్లుడు బాలాజీ ఆమె పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. జ్యోతిలక్ష్మిని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు తరలివచ్చారు.

 

ఏసీబీ వలలో మోడికల్ ఉద్యోగి..

హైదరాబాద్కోఠిలోని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తోన్న ప్రభాకర్ అనే ఉద్యోగి మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఇప్పించే విషయమై ఓ వ్యక్తి నుంచి రూ.4 వేలు డిమాండ్ చేశాడు. సదరు మొత్తాన్ని స్వీకరిస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.

17:06 - August 9, 2016

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నార్సింగి అల్కాపురిలోని నయీం ఇంటిని పోలీసులు సీజ్‌ చేశారు. ఆ ఇంటి నుంచి ఇప్పటికే భారీగా డబ్బులు, నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇవాళ 137 భూ దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. మణికొండ, కొండాపూర్‌ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాలలో సుమారు 67 ఎకరాలకు పైగా భూములు ఉన్నట్లు గుర్తించారు. అలాగే హయత్‌నగర్‌, వనస్థలిపురం, నల్లగొండ, భువనగిరి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో నయీంకు అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. నయీం ఇంటి నుంచి ఖరీదైన రెండు డైమండ్‌ వాచీలు, బంగారు బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాయీం కు సంబందించిన..అనుచరులు, బంధువుల ఇళ్ళల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

చర్లపల్లి జైలుకు నయాం బంధువులు ..
నయీం బంధువులు ఫరా, హర్షియాను రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరుపరిచారు నార్సింగి పోలీసులు. వీరిపై ఐపీసీ 25 1/బి , 342, 366, 384, 420, 467, 488 సెక్షన్లతో పాటు ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులకు రాజేంద్రనగర్‌ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. వీరిని చర్లపల్లి జైలుకు తరలించారు.

నయీం అనుచరులు అరెస్ట్..
నల్లగొండలో ఐదుగురు నయీం అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరిలో ఎంపీపీ తోటకూర వెంకటేశ్‌ యాదవ్‌, కౌన్సిలర్‌ నాజర్‌ను, అలాగే వలిగొండలో కె.శంకర్‌, శ్రీశైలం, జి.వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్‌ యాదవ్‌ వద్ద తపంచా, 4 రౌండ్ల బుల్లెట్లు, దస్త్రాలు, కౌన్సిలర్‌ నాజర్‌ వద్ద తపంచా, 4 రౌండ్ల బుల్లెట్లు, 71వేల రూపాయలు, దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. కె.శంకర్‌, శ్రీశైలం, జి.వెంకటేశ్‌ల వద్ద తపంచా, 4 రౌండ్ల బుల్లెట్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

16:55 - August 9, 2016

ఢిల్లీ : వైసిపి చీఫ్ జగన్మోహన్ రెడ్డి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశమయ్యారు. ఏపికి ప్రత్యేక హోదా అంశంపై ఆయనతో చర్చించారు. ఏపికి ప్రత్యేక హోదాపై కేంద్రం హామి ఇచ్చిందని, దీనిపై పార్లమెంట్‌లో చర్చించడం కూడా జరిగిందని తెలిపారు. మోది సర్కార్‌ వైఖరి చూస్తుంటే ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తారన్న నమ్మకం కలగడం లేదని ఏచూరి అన్నారు. ఏపికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లోనూ, ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వామపక్షాలు కృషి చేస్తాయని ఏచూరి పేర్కొన్నారు.

16:52 - August 9, 2016

హైదరాబాద్ : 123 జీవోపై హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం స్వాగతించింది. 2013 భూసేకరణ చట్టం కంటే ఈ జీవోతోనే నిర్వాసితులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని తాము మొదటి నుంచి చెబుతున్న విషయాలతో హైకోర్టు ఏకీభవించిందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ... పులిచింత నిర్వాసితులను గాలికొదిలేశారని మండిపడ్డారు.

16:49 - August 9, 2016

హైదరాబాద్ : గోరక్ష దళాలపై మోదీ స్పందన ఎన్నికల ఎత్తుగడ అని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. మొదట్లోనే ఈ విషయంలో స్పందించి ఉంటే.. ఆయన మాటలు నమ్మేవాళ్లమని.. కానీ ఆయన స్పందనలో చిత్తశుద్ధి లేదన్నారు. దళితులపై దాడులు చేసినవారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టాలన్నారు సురవరం. మరోవైపు మోదీ పర్యటనకు తెలంగాణ సర్కార్‌ ఎంత ఖర్చుపెట్టిందో చెప్పాలని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. నయీంను ప్రభుత్వమే పెంచి పోషించిందని.. టీఆర్‌ఎస్‌ నేతలకు సమస్యలు రావడం వల్లే నయీంను హతమార్చారని సీపీఐ నేత నారాయణ అన్నారు. 

16:45 - August 9, 2016

హైదరాబాద్ : ఈనెల 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో ఉన్న పుష్కర ఘాట్లలో నీటి లభ్యతపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రెండు జిల్లాల కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్ల దగ్గర నీరు పుష్కళంగానే ఉంది. నల్గొండ జిల్లాలో ఉన్న 29 ఘాట్లలో నీరు తక్కువగా ఉండటంతో ప్రవాహం పెరిగేలా చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శ్రీశైలం నుంచి ప్రతి రోజూ 22 వేల క్యూసెక్కుల నీటిని పుష్కరాల కోసం విడుదల చేయాలని కోరారు. 

16:42 - August 9, 2016

మణిపూర్‌ : 16 ఏళ్లుగా ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్ పవర్‌ యాక్ట్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల ఇవాళ దీక్షను విరమించారు. 16 ఏళ్ల తర్వాత ఆమె జనజీవనంలో కలిసారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన షర్మిలా ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. దీక్షలో ఉన్న గత 16 ఏళ్లుగా ఆమెకు బలవంతంగా ముక్కులో నుంచి పైపు ద్వారా లిక్విడ్‌ రూపంలో ఆహారాన్ని అందించారు. దీక్షను విరమించిన ఇరోమ్‌ షర్మిలా రాజకీయాల్లోకి ప్రవేశించి పోరాడాలని నిర్ణయించుకున్నారు. షర్మిలా పెళ్లి కూడా చేసుకుంటానని ఇదివరకే తెలిపారు.

16:40 - August 9, 2016

ఢిల్లీ : దేశంలో గోసంరక్షణ పేరిట జరుగుతున్న దాడులపై రాజ్యసభలో సిపిఎం ప్రస్తావించింది. గోసంరక్షణ పేరిట జరుగుతున్న దాడులపై ప్రధాని స్పందించిన తీరు సినిమా డైలాగులను తలపిస్తోందని సీతారాం ఏచూరి ఎద్దేవా చేశారు. దళితులపై దాడి చేయొద్దు ... అవసరమైతే తనని చంపండని మోది మాట్లాడడంలో నిజాయితీ లేదని ఓ నటుడిని తలపిస్తోందని పేర్కొన్నారు. గోసంరక్షణ పేరిట యూపిలో అఖ్లాక్‌ను హత్య చేయడం జరిగిందన్నారు. మైనారిటీలు, దళితులపై జరుగుతున్న దాడులను ఆపేందుకు సభలో ప్రధాని హామీ ఇవ్వాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. దాడులు చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

నయాం అంత్యక్రియలు..ఉద్రిక్తత..

నల్లగొండ : గ్యాంగ్ స్టర్ నయీమ్ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం షాద్ నగర్ నుంచి భువనగిరి తరలించారు. ఈ నేపథఝ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన అనంతరం నయీమ్ భార్యా బిడ్డలు, సోదరినీ తీసుకువచ్చిన తరువాతనే అంత్యక్రియలు జరిపిస్తామని బంధువులు మొండికేశారు. వారికి మద్దతుగా వేలాది మంది ముస్లింలు ఆ ప్రాంతంలో చేరి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. 

పీఎస్ పరిధిలో మృతదేహం కలకలం..

హైదరాబాద్: రాయదుర్గం పీఎస్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం సృష్టించింది. విష్పర్ వ్యాలీకి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో మృతదేహం కనిపించింది. ఎవరో చంపి ఇక్కడ మృతదేహాన్ని పడవేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా మృతదేహం పూర్తిగా కుల్లిపోయిన స్థితిలో పడి ఉంది.

 

నీట్ పరీక్ష పిటిషన్‌ తిరస్కరించిన సుప్రీంకోర్టు..

ఢిల్లీ: నీట్‌పై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌ను తిరస్కరిస్తూ ధర్మాసనం తీర్పు చెప్పింది. ప్రశ్నా పత్రం లీకేజీ ఆరోపణలు రావడంతో నీట్‌ను రద్దు చేయాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. నీట్ దర్యాప్తు జరుగుతుండగా తాము మధ్యలో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఈమేరకు పిటిషన్‌ను తోసిపుచ్చింది.

15:56 - August 9, 2016

హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నార్సింగి అల్కాపురిలోని నయీం ఇంటిని పోలీసులు సీజ్‌ చేశారు. ఆ ఇంటి నుంచి ఇప్పటికే భారీగా డబ్బులు, నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇవాళ 137 భూ దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక్క కొండాపూర్‌లోనే 67 ఎకరాలకు పైగా భూములు ఉన్నట్లు గుర్తించారు. అలాగే హయత్‌నగర్‌, వనస్థలిపురం, నల్లగొండ, భువనగిరి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో నయీంకు అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. నయీం ఇంటి నుంచి ఖరీదైన రెండు డైమండ్‌ వాచీలు, బంగారు బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

15:53 - August 9, 2016

నల్లగొండ : నల్లగొండలో ఐదుగురు నయీం అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరిలో ఎంపీపీ తోటకూర వెంకటేశ్‌ యాదవ్‌, కౌన్సిలర్‌ నాజర్‌ను, అలాగే వలిగొండలో కె.శంకర్‌, శ్రీశైలం, జి.వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్‌ యాదవ్‌ వద్ద తపంచా, 4 రౌండ్ల బుల్లెట్లు, దస్త్రాలు, కౌన్సిలర్‌ నాజర్‌ వద్ద తపంచా, 4 రౌండ్ల బుల్లెట్లు, 71వేల రూపాయలు, దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. కె.శంకర్‌, శ్రీశైలం, జి.వెంకటేశ్‌ల వద్ద తపంచా, 4 రౌండ్ల బుల్లెట్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా గ్యాంగ్ స్టర్ నయీం భూబాధితులు నిస్సంకోచంగా వచ్చిర పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు పేర్కొన్నారు. భూసోదాలు కొనసాగుతాయని..దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసిన బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. దీని పై మరింత సమచారం కోసం ఈ వీడియోను చూడండి..

15:51 - August 9, 2016

హైదరాబాద్ : నయీం బంధువులు ఫరా, హర్షియాను రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరుపరిచారు నార్సింగి పోలీసులు. వీరిపై ఐపీసీ 25 1/బి, 342, 366, 384, 420, 467, 488 సెక్షన్లతో పాటు ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులకు రాజేంద్రనగర్‌ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. వీరిని చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా సోమవారం నాడు మహబ్ బూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో మిలీనియం టౌన్ షిప్ వద్ద గ్యాంగ్ స్టర్ నయీంను గ్రేహౌండ్ పోలీసులు మట్టుపెట్టిన సంగతి తెలిసిందే.

నయీం అనుచరులు అరెస్ట్..

నల్లగొండ్ : నల్లగొండలో నయీం అనుచరులను ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరిలో ఎంపీపీ తోటకూర వెంకటేశ్ యాదవ్,కౌన్సిలర్ నాజర్ ను అదుపులోకి తీసుకున్నారు. వలిగొండలో కె.శంకర్,శ్రీశైలం, జి.వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్ యాదవ్ వద్ద తపంచా, 4రౌండ్ల బుల్లెట్లు, మరికొన్ని ఫైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

గ్యాంగ్ స్టర్ నయీం బంధువులు కోర్టులో హాజరు..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం బంధువులు బంధువులు ఫరా, హర్షియాలలను నార్శింగ్ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. వీరిపై ఐపీసీ 251/బి, 342,366,384,420,467,488 సెక్షన్ లతోపాటు ఆయుధాల చట్టంకింద కేసు నమోదు చేశారు. కోర్టు 14రోజులపాటు రిమాండ్ విధించి చర్లపల్లి జైలుకు తరలించారు. 

15:02 - August 9, 2016

భారతదేశ వ్యాప్తంగా దళితులను అణచివేయటానికే హిందూత్వం శక్తులు దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆఖరికి దళితులపై తీసుకునే ఆహారంపై కూడా దాడులు చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చనిపోయిన పశువులు శరీరం నుండి పాదరక్షలు తయారుచేసే శాస్త్రవేత్తలనిఆ యన పేర్కొన్నారు. వీటిని ఆధిపత్య ధోరణితో ఆలోచించే అగ్రవర్ణాలవారు దళితులను అణచివేయటానికే చూస్తున్నారన్నారు. ఏప్రాంతంలోనైతే దళితులు విద్యావంతులవుతున్నారో.. రాజకీయంగా...ఆర్థికంగా...సాంస్కృతికంగా ఎదుగుతున్నారో ఆ ప్రాంతాలలో దళితులపై దాడులు పెరుగుతున్నాయన్నారు.

ప్రజాస్వామ్యానికే ప్రమాదం: సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామృష్ణ..
దేశవ్యాప్తంగా మనోత్మాద శక్తులు అరాచకాలు సృష్టిస్తున్నాయన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు దాపురిస్తున్నాయని విమర్శించారు. దళితులపై దేశవ్యాప్తంగా జరుగతున్న దాడులకు ఆయన ఖండించారు. దీనిపై వామపక్షాలతో కలిసి నిరసన కార్యక్రమాలకు చేపడతామన్నారు.

దళితుల దాడి ఘటనలో నిందుతులు అరెస్ట్..
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం (మం) సవర్పాలెంలో దారుణం. చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్న దళితులపై గ్రామస్తుల దాడి. పలువురికి గాయాలు, అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం సవర్పాలెం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. చనిపోయిన ఆవు చర్మాన్ని తీస్తున్న దళితులపై కొందరు గ్రామస్తులు దాడి చేశారు. ఈ ఘటనలో మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరరావుకు గాయాలయ్యాయి. గాయాలైన వారిని వెంటనే చికిత్స కోసం అమలాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దళితులపై దాడిచేసిన ఘటనలో 8మంది నిందితులను పోలీసులు గుర్తించి వారిలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. దళితులపై దాడి ఘటనను అమలాపురం డీఎస్పీ అంకయ్య విచారణ చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవలే..గుజరాత్‌లోని ఉనాలో దళితులపై కూడా ఇదే రీతిలో దాడులు చోటుచేసుకున్నాయి. దళితులపై జరుగుతున్న దాడులపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళితులపై దాడులను ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.ఈ నేపధ్యంలో రెండు రోజుల క్రితం మెదక్‌లో పర్యటించిన మోదీ..దళితుల దాడులపై స్పందిస్తూ..దళితులపై కాదు..నాపై దాడి చేయండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మోదీ అలాంటి వ్యాఖ్యలు చేసి రెండు రోజులైనా గడవకముందే మరోసారి దళితులపై దాడి జరిగింది. 

పోలీసుల అదుపులో 221మంది యువకులు!..

హైదరాబాద్ : పాతబస్తీలో సోమవారం అర్థరాత్రి రోడ్లపై హల్ చల్ చేస్తున్న యువతే లక్ష్యంగా చేసుకుని పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 221 మంది యువ‌కుల‌ను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేష‌న్‌కి త‌ర‌లించారు. ఈ విషయాన్నివారి పేరెంట్స్ కు సమాచారం అందించారు. పురానీ హవేలిలోని సౌత్ జోన్ డీసీపీ కార్యాలయంలో యువతకు..పేరెంట్స్ కు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.

మారనున్న నంది అవార్డుల పేరు!..

హైదరాబాద్‌: చలనచిత్ర రంగంలో ఇచ్చే నంది అవార్డులకు త్వరలోనే కొత్త పేరు ప్రకటిస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిపై అధికారులతో మంత్రి ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. చిన్న సినిమాలను ప్రభుత్వం తరపున ప్రోత్సహిస్తామన్న మంత్రి.. అన్ని థియేటర్లలోనూ ఐదో ప్రదర్శనగా చిన్న సినిమాలకు అనుమతి ఇస్తామని తెలిపారు. 200 సీట్ల సామర్థంతో మినీ థియేటర్లకు త్వరలోనే అనుమతులు ఇస్తామని ప్రకటించారు.

అగ్నిప్రమాదంలో 4ఇళ్లు దగ్థం..

ఆదిలాబాద్ : రెబ్బన మండలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని గంగాపురంలో మంగళవారం ప్రమాదవశాత్తూ 4 ఇండ్లు దగ్ధమయ్యాయి. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 తులాల బంగారం, రూ.లక్ష నగదుతో పాటు మొత్తం రూ.5 లక్షల ఆస్తి నష్టం సంభవించింది.

భువనగిరికి నయీం మృతదేహం..

మహబూబ్‌నగర్: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం మృతదేహాన్ని పోలీసులు ఆయన బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని షాద్‌నగర్ నుంచి భువనగిరికి తరలించారు. అక్కడ నయీం బంధువులు ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిన్న షాద్‌నగర్‌లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నయీంతోపాటు మరో అనుచరుడు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, పోలీసులు అరెస్టు చేసిన నయీం భార్య, ఆమెతోపాటు అరెస్టయిన మరో మహిళను ఇవాళ పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. 

భారత క్రీడాకారులపై శోభాడే వివాదాస్పద వ్యాఖ్యలు..

ఢిల్లీ : రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులపై ప్రముఖ నవలా రచయిత్రి శోభా డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘రియో వెళ్లడం.. సెల్ఫీలు తీసుకోవడం.. ఉత్త చేతులతో తిరిగి రావడం. ఒలింపిక్స్‌లో భారత జట్టు లక్ష్యమిదే. అవకాశం, డబ్బు రెండూ వృథా.’ అంటూ శోభ ట్వీట్‌ చేశారు. శోభ ట్వీట్‌పై పలువురు క్రీడాభిమానులు మండిపడ్డారు. క్రీడాకారులను నిరుత్సాహపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు నెటిజన్లు హితవు పలికారు. మరికొందరైతే శోభపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ట్విట్టర్‌కు రావడం. విషయం తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడటం. వెళ్లిపోవడం’ అంటూ ఎద్దేవా చేశారు.

అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న 4గురు ఆరెస్ట్..

మెదక్: అక్రమంగా ఆయుధాలను తరలిస్తోన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు అక్రమంగా ఆయుధాలను తరలిస్తూ పట్టుబడ్డారు. ఈమేరకు డీఎస్పీ తిరుపతన్న వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రెండు పిస్టోళ్లు, మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు కత్తులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి. 

13:51 - August 9, 2016

బిడ్డకు తల్లిపాలు శ్రేష్టమైనవని వక్తలు తెలిపారు. తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా మానవి నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధి డా. రమాదేవి, డా.నలిని పాల్గొని, మాట్లాడారు. మామూలు కాన్పు అయితే అరగంటలోపు బిడ్డకి పాలు పట్టాలన్నారు. ఆపరేషన్ కాన్పు అయితే రెండు గంటల్లోపు తల్లిపాలు పట్టవచ్చని తెలిపారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:48 - August 9, 2016

హైదరాబాద్ : భూ సేకరణ జీవో 123 జీవో రద్దుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. భూ సేకరణ జీవో 123ను రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు నిమ్జ్‌ కేసుకు మాత్రమే వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. 2013 భూసేకరణ చట్టం రెండో షెడ్యూల్‌లో ఉన్న సౌకర్యాలన్నీ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిర్వాసితులు, రైతు వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారికి పరిహారంపై సవివరణలతో కూడిన జీవోను రేపు జారీచేసి ఒకేసారి నిధులు కేటాయించి ఉద్యోగం కల్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే 20 ఏళ్లపాటు నెలకు 2,500 రూపాయలు ఇవ్వలని..2013 చట్టానికి తక్కువ కాకుండా ఎక్కువ పరిహారం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది.

13:45 - August 9, 2016

మహబూబ్ నగర్ : నయీమ్ మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పటించారు. భువనగిరికి తరలించనున్నారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ శవాన్ని తమకు అప్పగించాలని నయీమ్‌ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నయీమ్ అక్కాచెల్లెల్లు, వారి పిల్లలు ఆయన్ని చూడాలని ఆరాటపడుతున్నారని అన్నారు. దహనసంస్కారాల తరువాత మీకు నచ్చినట్లు చెయ్యండని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

13:43 - August 9, 2016

రంగారెడ్డి : గ్యాంగ్‌స్టర్‌ నయీం ఆస్తులపై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. పుప్పాలగూడలోని నయీం ఇంటిని సీజ్‌ చేశారు. నయీం మృతదేహం మహబూబ్ నగర్ ప్రభుత్వఆస్పత్రిలో ఉంది. మృతదేహం కోసం ఎవరూ రావటం లేదు. 

13:40 - August 9, 2016

తూర్పుగోదావరి : దళితులపై డాడులు చేయొద్దని ప్రధాని మోడీ ప్రకటించిన ఒక రోజు వ్యవధిలోనే మరోసారి ఎపిలో దళితులపై దాడికి తెగబడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో అమలాపురం మండలం సమనప్పలో దారుణం జరిగింది. చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్న వారిపై  బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. అమలాపురం ఆస్పత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ దాడులపై సీపీఎం, కెవిపిఎస్, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవలే...గుజరాత్‌లోని ఉనాలో దళితులపై కూడా ఇలాంటి దాడులే చోటుచేసుకున్నాయి. దళితులపై జరుగుతున్న దాడులపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళితులపై దాడులను ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.
దళిత నేత.. దిలీప్ 
గో సంరక్షణ దళం దళితులపై దాడి దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి చూస్తుంటే...'దళితులను కాదు నన్ను కాల్చండి' అంటూ హైదరాబాద్ లో మొన్న మోడీ చేసిన ప్రకటన ఎలా ఉందంటే... 'దళితులను వదలబోకండి... దాడులు చేయండి అని సందేశం ఇచ్చినట్లుగా ఉంది. 
ఎపి కెవిపిఎస్ మ్యాలాద్రి 
'బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు జరుగుతున్నాయి. దాడులను అందరూ 
ఖండించాలి' అని అన్నారు. 
కెవిపిఎస్ నేత...రాజశేఖర్
'మనుషులకంటే మూగ జీవాల ప్రాణాలు గో సంరక్షణ దళంకు ముఖ్యమైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు' ప్రకటించారు.

 

 

13:39 - August 9, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఏపి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇపుడు అధికారంలో కొనసాగుతున్న మోది ప్రత్యేక హోదా అంశాన్ని తిరస్కరించడం శోచనీయమని సిపిఐ ఎంపి డి.రాజా అన్నారు. వైసిపి చీఫ్‌ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీలో ఆయనతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై రాజాతో చర్చించారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశంపై పోరాడేందుకు తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జిఎస్‌టి వచ్చిన నేపథ్యంలో సేల్స్‌ టాక్స్‌ను కోల్పోతున్నందున కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జగన్‌ అన్నారు. 

13:37 - August 9, 2016

హైదరాబాద్ : మల్లన్న సాగర్ రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి సంగారెడ్డిలో ఆమరణ నిరాహార దీక్షను చేపడుతున్నట్లు టీకాంగ్రెస్‌నేత జగ్గారెడ్డి తెలిపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం అమలు చెయ్యాలని అన్నారు. హైకోర్టు తీర్పును అనుసరిస్తూ 123జీవోను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని హెచ్చరించడం కోసమే తాను దీక్ష చేపడుతున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.

 

గ్యాంగ్‌స్టర్‌ నయీం ఇల్లు సీజ్..

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీం ఆస్తులపై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. పుప్పాలగూడలోని నయీం ఇంటిని సీజ్‌ చేశారు.  

12:56 - August 9, 2016

కరీంనగర్ : రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి బాధితులు మళ్లీ తెరపైకి వచ్చారు. మోహన్‌రెడ్డి వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. మోహన్‌రెడ్డి వేధింపులకు మరొకరు బలయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రం విద్యనగర్‌లో నివాసం ఉంటున్న నారాయణరెడ్డి అర్థరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెజ్జెంకి మండలం గుండ్లపల్లి గ్రామం వద్ద ఉన్న ఎకరంన్నర పొలం కాగితాల్ని కూతురు పెళ్లికోసం ఏఎస్సై మోహన్ రెడ్డి దగ్గర పెట్టి రెండు లక్షల రూపాయల్ని అప్పుగా తీసుకున్నాడు. అయితే తీసుకున్న 2లక్షలు చెల్లించినప్పటికి..మోహన్ రెడ్డి తన భూమిని తన పేరుపై రిజిస్టేషన్ చేయడం లేదన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ నోట్‌లో తన చావు ఏఎస్సై మోహన్ రెడ్డితో పాటు శ్యాం సుందర్ రెడ్డి కారణామంటూ పేర్కోన్నారు. గతేడాది ఆగస్టులో మోహన్ రెడ్డి వేధింపులు భరించలేక..ప్రముఖ విద్యావేత్త ప్రసాద్‌రావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది గడవక ముందే మోహన్ రెడ్డి బాధితుల్లో మరొకరు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నా..ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 

12:52 - August 9, 2016

కృష్ణా : జిల్లాలోని పరిటాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న ఆటోబోల్తాపడి ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. క్వారీలో పనిచేసే కార్మికుల పిల్లలు రోజూలాగానే స్కూల్‌కి ఆటోలో వెళ్లారు. పరిటాల సమీపంలోని ఆంజనేయస్వామి గుడి దగ్గరకు చేరుకునే సరికి మలుపు దగ్గర ఆటోబోల్తా పడటంతో ప్రమాదం జరిగింది.

 

12:48 - August 9, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎంపీ శివప్రసాద్ ఢిల్లీలో వినూత్న నిరసన తెలిపారు. తప్పెటగుళ్ల వేషంతో పాట పాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సూచించారు. రేపు మాపంటూ కాలం వెళ్లదీయకుండా...ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పాట రూపంలో ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వాల్సిందే అన్నారు. అసలే లోటు బడ్జెట్‌తో రాష్ట్రం కుదేలవుతున్న తరుణంలో కేంద్రం ఏపీని పట్టించుకోకపోవడం విచారకరమని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి..ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవాలని శివప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఆంధ్రుల ఆగ్రహం కట్టలు తెంచుకొని ఉద్యమంలా రూపుదాల్చుతుందని కేంద్రానికి సూచించారు. 

 

12:43 - August 9, 2016

హైదరాబాద్ : టిప్పర్ లారీడ్రైవర్ అతివేగం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. గచ్చిబౌలి ఇంద్రానగర్‌లో ఇసుకలోడ్‌తో వెళుతున్న టిప్పర్ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చి ఆటోను ఢీకొనడంతో ఇద్దరుల యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమమైన టిప్పర్‌లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

 

జీవో 123 రద్దును నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. భూసేకరణ జీవో 123 రద్దును నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జీ తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

 

12:34 - August 9, 2016

చెన్నై : అలనాటి ప్రముఖ నటి జ్యోతిలక్ష్మి కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జ్యోతిలక్ష్మి...చెన్నైలోని స్వగృహంలో ఇవాళ తెల్లవారుజామూను కన్నుమూశారు. 1963లో ఇడతు పెన్‌ అనే తమిళ చిత్రంతో సినీరంగంలోకి అరంగేట్రం చేసిన జ్యోతిలక్ష్మి..ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. తెలుగు, కన్నడ, తమిళ, మళయాలం, హిందీ తదితర భాషల్లో దాదాపు 300 చిత్రాలకుపైగా ఆమె నటించారు. ఎన్నో హిట్‌ చిత్రాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌లో ఆమె నటించారు. ఇక తెలుగులో జ్యోతిలక్ష్మి నటించిన తొలిచిత్రం పిల్లా పిడుగా. ఆతర్వాత తెలుగులో దొంగరాముడు, గాంధర్వకన్య, స్టేట్‌రౌడీ, సీతారాముడు, బిగ్‌బాస్‌, బెబ్బులి, బంగారుబాబు తదితర చిత్రాల్లో నటించారు. ఇక జ్యోతిలక్ష్మి 2009లో చివరి చిత్రం బంగారుబాబులో నటించారు. ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించిన జ్యోతిలక్ష్మి అనారోగ్యంతో కన్నుమూయడంతో సినీప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
 అంత్యక్రియలు.. : జ్యోతిలక్ష్మీ భర్త  
జ్యోతిలక్ష్మి బ్లడ్‌క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ మృతిచెందిందని ఆమె భర్త పార్ధిబన్‌ తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంటే ఆసుపత్రుల్లో బ్లడ్‌ టెస్ట్‌లు చేశామని..ఆ టెస్టుల్లో బ్లడ్‌క్యాన్సర్‌ అని తేలిందని ఆయన అన్నారు. చివరకు ఆరోగ్యం విషమించడంతో నిన్న రాత్రి 11.57 గంటలకు మృతిచెందిందని ఆమె భర్త తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలోని కన్నమ్మ స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరగనునున్నాయి. 

 

12:30 - August 9, 2016

ఢిల్లీ : కరీబియన్ టూర్ లో ప్రపంచ రెండోర్యాంకర్ టీమిండియా రెండో విజయానికి ఉరకలేస్తోంది. టెస్ట్ క్రికెట్ ఎనిమిదోర్యాంకర్ వెస్టిండీస్ ప్రత్యర్థిగా గత17 టెస్టుల్లో తిరుగులేని రికార్డుతో ఉన్న టీమిండియా...మూడో టెస్ట్ లోసైతం హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. 2002 సిరీస్ నుంచి టెస్ట్ క్రికెట్లో టీమిండియా, వెస్టిండీస్ ఫేస్ టు ఫేస్ రికార్డు ఓసారి చూద్దాం....
మరింత వేడెక్కిన నాలుగు మ్యాచ్ ల సిరీస్  
టెస్ట్ క్రికెట్ రెండోర్యాంకర్ టీమిండియా, ఎనిమిదోర్యాంకర్ వెస్టిండీస్ జట్ల నాలుగు మ్యాచ్ ల సిరీస్ మరింత వేడెక్కింది. సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన మూడోటెస్ట్ కు..గ్రాస్ ఐలెట్స్ లోని సెయింట్ లూషియా స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. యాంటీగా స్టేడియంలో కేవలం నాలుగురోజుల్లోనే ముగిసిన తొలిటెస్ట్ లో టీమిండియా... ఇన్నింగ్స్ విజయం సాధించి 1-0 ఆధిక్యం సాధిస్తే...జమైకాలోని సబైనాపార్క్ లో ముగిసిన రెండోటెస్ట్ ను డ్రాగా ముగించడం ద్వారా...వెస్టిండీస్ పుంజుకోగలిగింది.
అజేయంగా టీమిండియా కనిపిస్తోన్న  
గత 14 సంవత్సరాలుగా ఈ రెండుజట్ల ఫేస్ టు ఫేస్  రికార్డులు చూస్తే టీమిండియానే అజేయంగా కనిపిస్తోంది. 2002 నుంచి ప్రస్తుత 2016 సిరీస్ లోని రెండో టెస్ట్ వరకూ .. విండీస్ తో టీమిండియా ఆడిన మొత్తం 17 టెస్టుల్లో తొమ్మిది విజయాలు, 8 డ్రాల రికార్డుతో అజేయంగా నిలిచింది. టీమిండియా పై వెస్టిండీస్ కనీసం ఒక్క విజయమూ  సాధించలేకపోయిందంటే...రెండోర్యాంకర్ టీమిండియా ఎంత పటిష్టంగా ఉందీ  మరి చెప్పాల్సిన పనిలేదు.
టీమిండియా సంపూర్ణ ఆధిక్యం 
ఇక...ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్ట్ కు ఆతిథ్యమిచ్చిన యాంటీగా సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఆట అన్ని విభాగాలలోనూ టీమిండియా సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది. తనకు కరీబియన్ టీమ్ ఏమాత్రం సరిజోడి కాదని ఇన్నింగ్స్ విజయంతో చెప్పకనే చెప్పింది. అయితే...రెండోటెస్ట్ వేదిక కింగ్స్ స్టన్ సబైనా పార్క్ లో మాత్రం...టీమిండియా బౌలింగ్ లో పసలేదని తెలిపోయింది. కరీబియన్ మిడిలార్డర్ ఆటగాళ్లు బ్లాక్ వెల్, చేజ్, కెప్టెన్ హోల్డర్ ఫైటింగ్ బ్యాటింగ్ తో భారత్ ను నిలువిరించి..మ్యాచ్ ను డ్రాగా ముగించగలిగారు.
రెండు జట్లకూ కీలకంగా మూడోటెస్ట్ 
దీంతో సెయింట్ లూషియా వేదికగా జరిగే మూడోటెస్ట్ రెండు జట్లకూ కీలకంగా మారింది. టీమిండియా 2-0తో సిరీస్ సొంతం చేసుకోవాలంటే ఈమ్యాచ్ లో నెగ్గితీరాల్సి ఉంది. అదే విండీస్ జట్టు...సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోవాలంటే...మూడోటెస్ట్ లో ఆరునూరైనా నెగ్గి తీరాల్సిఉంది. రెండుజట్లూ బ్యాటింగ్ బలంతోనే సమరానికి సిద్ధమయ్యాయి. అయితే రెండోర్యాంకర్ టీమిండియానే మరోసారి హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

 

12:22 - August 9, 2016

మహబూబ్ నగర్ : కొండల మధ్య కృష్ణమ్మ గలగలలు.. చుట్టూ పచ్చదనం పరచుకున్న ప్రకృతి. వాటి నడుమ చాళుక్యుల నాటి 14 ఆలయాల సముదాయం.. ఇదీ పాలమూరు జిల్లాలోని సోమశిల క్షేత్రపు విశేషం. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన ఈ ఆలయాలను... సోమశిల గ్రామంలో పునర్‌ నిర్మించారు. అపార చరిత్ర గల లలితా సోమేశ్వరాలయ సముదాయం.. కృష్ణా పుష్కర స్నానాలకు వచ్చే వారిని అలరించేందుకు సర్వాంగ సుందరంగా ముస్తబవుతోంది...!
కృష్ణానది ముఖ ద్వారంగా ఉన్న సోమశిల 
మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశించే కృష్ణానది ముఖ ద్వారంగా ఉన్న సోమశిల గ్రామం ఎత్తైన కొండపై ఉంది. నిండైన నీటితో, చెంతనే ఎతైన కొండలతో, పరిసరాల్లో పచ్చిక బయళ్లతో.. ఇక్కడి కృష్ణానది సౌందర్యం వర్ణనాతీతం. సోమశిలలో వెలసిన శ్రీ లలితా సోమేశ్వర స్వామిని భక్తులు విశేషంగా కొలుస్తుంటారు. ఇక్కడ శ్రీచక్రసహిత లలితాంబిక, బిలం కామాక్షమ్మ అమ్మవారు, శ్రీఆంజనేయస్వామి ఆలయాలూ కొలువు దీరాయి. 
వేల సంవత్సరాల చరిత్ర గల లలితా సోమేశ్వరస్వామివారి..
వేల సంవత్సరాల చరిత్ర గల ఈ లలితా సోమేశ్వరస్వామివారిని.. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని భక్తులు ఉవ్విళ్లూరుతారు.  సోమశిల చెంత.. భద్ర, క్రిష్ట, వేణి, భీమ, మలాపహ, భవవాసి అనే ఏడు నదులు కలిసి ప్రవహించేవని స్థానికులు నమ్ముతారు. ఇలా ఏడు నదులు కలిసి ప్రవహించే ఈ ప్రదేశంలో ఉన్న సంగమేశ్వరుని దర్శనం పుణ్యప్రదమన్నది భక్తుల నమ్మకం. ఆనాటి  ధర్మరాజు ప్రతిష్టించిన వేపదారువుతో చేసిన శివలింగం, భీముడు తెచ్చిన కాశీ శివలింగం భీమలింగంగా అర్చనలందుకుంటోంది. నీటి  ప్రవాహవేగం తగ్గిన వెంటనే భక్తులంతా భీమలింగాన్ని, వేపలింగాన్ని దర్శించడానికి వేలాదిగా తరలివస్తారు. శతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయం శ్రీశైలం జలాశయం నిర్మాణం కారణంగా ముంపునకు గురైంది. అప్పటి ప్రభుత్వం నదిలో నీరు తగ్గిన తర్వాత  ఆలయ రాళ్లను తీసుకొచ్చి ఏటిగట్టున ఆలయాలను పునర్నిర్మించింది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో ప్రకృతి రమణీయ దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. 
అద్భుత చిత్తరువు.. 
ఎత్తయిన కొండల మధ్య.. కృష్ణమ్మకు పచ్చని పట్టు చీరె కట్టినట్లుండే దుర్గమారణ్యం నడుమ.. ప్రకృతి కుంచె దిద్దితీర్చిన ఓ అద్భుత చిత్తరువు.. వంద కిలోమీటర్ల పొడవునా మెరిసిపోతూ మురిసిపోతుంటుంది. పడవ బయల్దేరితే..  ఆప్యాయంగా పలకరిస్తుంటుంది.  జిల్లాలో ఉన్న కృష్ణా పుష్కరాల ఘాట్‌లలో ప్రధానమైన ఘాట్ సోమశిల ఘాట్, ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది.  ఆధ్యాత్మికతకు తోడు పర్యటకం కూడా తోడై సోమశిల ప్రత్యేకతను సంతరించుకుంది. 
2కి.మీ మేర బైపాస్ రోడ్డు పనులు 
సోమశిల ఘాట్ కు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తుల కోసం రెండు కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు పనులు చేపట్టారు. పార్కింగ్, ఆరోగ్యకేంద్రాలు, నదిలో పుణ్య స్నానాలు చేయడానికి వీలు కాని చోట బోరు నీటితో స్నానాలు చేయడానికి పైపులైన్లను ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. నదీతీరాన్ని ఆధ్యాత్మిక శోభలతో సుందరీకరణ, పాత ఘాట్లకు మరమ్మతులు, కొత్త వాటి నిర్మాణం. కాంతి వంతమైన దీపాలు, నిరంతర విద్యుత్, పార్కింగ్, సెల్ టవర్ల వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.  

12:14 - August 9, 2016

నల్గొండ : శ్రీ లక్ష్మీనృసింహుడు భక్త వరదుడు.. అన్నది కొలిచేవారి నమ్మకం. భక్తజన హృదయాల్లో కొలువుండడమే కాదు.. ఆ భక్తుడికీ తనతో సమానంగా పూజలు అందేలా వరమిచ్చేటి వేలుపు శ్రీ లక్ష్మీనృసింహుడని భక్తులు విశ్వసిస్తారు. ఇందుకు ప్రతీకగా నిలుస్తోంది.. నల్లగొండ జిల్లాలోని మట్టపల్లి క్షేత్రం. ఎక్కడా లేని రీతిలో.. తన అవతారానికి కారణభూతుడైన ప్రహ్లాదుడిని.. అంకంపై కూర్చుండబెట్టుకుని దర్శనమిస్తున్నాడు శ్రీ లక్ష్మీనరసింహుడు. అశేష భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న మట్టపల్లి క్షేత్రంపై టెన్ టివి ప్రత్యేక కథనం....
మట్టపల్లి క్షేత్రపు వేలుపు నృసింహస్వామి
నల్లగొండ, గుంటూరు జిల్లాలకు వారధిగా ఉన్న పవిత్ర కృష్ణానది తీరాన వెలసిన మట్టపల్లి క్షేత్రపు వేలుపు నృసింహస్వామి.. భక్తుల కొంగుబంగారంగా భాసిల్లుతున్నాడు. ఇక్కడి వేలుపు స్వయంభువు అన్నది భక్తుల విశ్వాసం. పదకొండు వందల ఏళ్ల క్రితం మట్టపల్లి కీకారణ్యంలో భరద్వాజ మహర్షి తపస్సు చేశాడని, ఆ తర్వాత కొంత కాలానికి కృష్ణానది ఆవలి తీరాన వెలసిన తంగెడ గ్రామాన్ని పాలించే అనుముల మాచిరెడ్డి ప్రభువుకు లక్ష్మీ నృసింహుడు కలలో కనిపించి, కృష్ణానది రెండో వైపున గృహ గర్భంలో తాను స్వయంభువుగా వెలశానని, అక్కడ ఆలయ నిర్మాణానికి ఆదేశించాడని స్థలపురాణం చెబుతోంది.  
మట్టపల్లిలో ఆర్జిత సేవలు
మట్టపల్లిలో తిరుమల, శ్రీశైలం ఆలయాల మాదిరిగా ఆర్జిత సేవలు, ప్రసాదాలు, నిత్యాన్నదానం ప్రతినిత్యం కొనసాగుతుంటాయి. ప్రతి ఏడాది మేలో వచ్చే నృసింహ జయంతికి శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనసింహస్వామికి తిరుకల్యాణం జరుపుతారు. ప్రతిఏటా డిసెంబర్, జనవరిలో వచ్చే తొలి ఏకాదశికి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం జరుగుతోంది. 
స్వామివారి గర్భగుడికి సొరంగ మార్గం.. 
స్వామివారి గర్భగుడికి రాకపోకలకు వినియోగించిన సొరంగ మార్గం.. ఇప్పటికీ బ్రహ్మముహూర్తంలో సప్తర్షులు వినియోగించుకుంటా ఉంటారని భక్తులు నమ్ముతారు. ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి కృష్ణమ్మ పొంగి స్వామివారి పాదాలను స్వయంగా అభిషేకిస్తుందనీ విశ్వసిస్తారు. 
నిత్యం నరసింహోపాసన 
మట్టపల్లిలో శ్రీలక్ష్మీనసింహస్వామి ఆలయంతో పాటు పక్కనే పార్వతీ రామలింగేశ్వర స్వామి, ఆంజనేయస్వామి, గోదాదేవి ఆలయాలున్నాయి. సమీపంలోని శ్రీరామతీర్థ సేవాశ్రమంలో ప్రతి నిత్యం నరసింహోపాసన జరుగుతోంది. అదేవిధంగా హుజూర్‌నగర్‌ నుంచి మట్టపల్లి వరకు  25 కిలోమీటర్ల పొడవునా త్రివేణినగర్‌లో లక్ష్మీతిరుపతమ్మ, మఠంపల్లిలో కనకదుర్గ, పెదవీడులో సోమలింగేశ్వరాలయాలు ప్రధాన రహదారిపై పూజలందుకుంటున్నాయి.  ఈసారి పుష్కరాల సందర్భంగా ఇక్కడికి రాబోయే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త తెలిపారు. మట్టపల్లి మహాక్షేత్రంలో చెన్నైకి చెందిన ముక్కూరు లక్ష్మీనరసింహచారియార్‌ స్వామి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రధాన ఆలయానికి పై భాగాన గోశాల ప్రక్కన పీఠాన్ని నిర్మించారు. చెన్నైకి చెందిన తమిళనాడు భక్తులు అనునిత్యం మట్టపల్లి స్వామిని దర్శించుకొని ముక్కూరు స్వామి పీఠాన్ని దర్శించుకుంటారు. పలువురు పీఠాధిపతులు మట్టపల్లి శ్రీలక్ష్మీనసింహ స్వామిని తరచూ దర్శించుకుంటున్నారు.
మట్టపల్లిలో నాలుగు పుష్కరఘాట్లు ఏర్పాటు 
కృష్ణా పుష్కరాల్లో ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారన్న భావనతో.. అధికారులు ఇక్కడ వీఐపీ ఘాట్ తో పాటు వీవీఐపీ  ఘాట్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు అధికారులు. మట్టపల్లిలో మొత్తం నాలుగు పుష్కరఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు.  భక్తితో పాటు.. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు జీవనది ఓడ్డున  సేద తీరాలనుకునే వారికి మట్టపల్లి క్షేత్రం సరైన ప్రదేశంగా చెప్పవచ్చు.  

 

12:06 - August 9, 2016

విజయవాడ : రవాణా రాజధాని బెజవాడ కృష్ణా పుష్కరాలకు సన్నద్ధమైంది. రాష్ట్రంలో ఎక్కడా లేనిరీతిలో ఈ జిల్లాలోనే భారీసంఖ్యలో.. భారీ, చిన్న తరహా వాహనాలున్నాయి.  వీటికితోడు పుష్కరాల సందర్భంగా వేలాది వాహనాలు బెజవాడకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశమూ ఉంది. అందుకే.. అధికారులు ట్రాఫిక్‌ నియంత్రణకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధమయ్యారు...
మౌలిక సౌకర్యాలు, తాత్కాలిక ఏర్పాట్లపై దృష్టి 
జాతీయ రహదారులను జంక్షన్‌గా, ఉత్తర, దక్షిణ భారతదేశాలను అనుసంధానం చేసే సెంటర్‌గా విజయవాడకు పేరుంది. రైలు, బస్సు, ప్రైవేట్ వాహనాలన్నీ బెజవాడకు వచ్చి వెళ్లాల్సిందే. దీంతో అటూ ఇటుగా మూడున్నర కోట్ల మంది పుష్కర భక్తులు బెజవాడకు వస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపులు, ఇతర అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేశారు. విజయవాడ నలు వైపులా..  నగర శివార్లలోనే పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 121 పార్కింగ్ స్థలాలను, విజయవాడలో 23 పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి ఆయా పార్కింగ్ ప్రాంతాలలో మౌలిక సౌకర్యాలు, తాత్కాలిక ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. 
దారి మళ్లింపు
హైదరాబాద్ నుంచి కోల్ కతా వైపు వెళ్లే వాహనాలను ఇబ్రహీంపట్నం వద్ద మళ్లిస్తారు. కోల్ కతా నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను గన్నవరం, హనుమాన్ జంక్షన్ వద్ద మళ్లించనున్నారు. చెన్నై నుంచి కోల్ కతా వెళ్లే వాహనాలను గుంటూరు, తెనాలి, రేపల్లె మీదుగా గుడివాడ, ఏలూరు వైపు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను గుంటూరు అవతలే నల్లొండ వైపుగా మళ్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. నగరంలో ఏ ప్రాంతం నుంచి ఏ ఘాట్ కు వెళ్లాలన్నా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అనుకున్న పుష్కర ఘాట్ కు వెళ్లాలన్నా ట్రాఫిక్ అనుసంధానం చేస్తూ అన్ని చర్యలు తీసుకున్నారు.
యాప్‌లతో ట్రాఫిక్ నియంత్రణ 
ఎక్కడికక్కడ పుష్కర నగర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి పుష్కర ఘాట్‌లకు ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే యాత్రికులు అనుమతించాలని ప్రణాళికలు వేస్తున్నారు. యాత్రికుల రద్దీని దృష్టిలో వుంచుకొని ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లతో ట్రాఫిక్ ను నియంత్రించేలా పోలీసులు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. 
పోలీసులు ప్రత్యేక ఆంక్షలు 
విజయవాడ నగరంలో ప్రజల వాహనాలకు సంబంధించి పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధిస్తున్నారు. నగరంలోని అన్ని  అంతర్గత రహదారులను ఘాట్లకు అనుసంధానం చేస్తున్నారు. ఆటోలకు, ప్రైవేట్ వాహనాలకు ప్రవేశం లేకుండా చేస్తున్నారు. పోలీసులు సూచించిన మేరకే ఆయా మార్గాల గుండా వెళ్లాలని, ప్రైవేట్ వాహనాలు ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేయరాదని విస్తృతమైన ప్రచారం చేపట్టారు. కుమ్మరిపాలెం నుంచి పండిట్ నెహ్రూ బస్టేషన్ వరకు 'నో వెహికల్ జోన్'గా ప్రకటించారు. పుష్కర ఘాట్లలో ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ మళ్లింపులు అప్పటికప్పుడు చేపట్టే విధంగా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. విజయవాడ నగరంలోని వాహనాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు పోలీసులు సూచించిన పార్కింగ్ స్థలాల్లోనే నిలపాలని ముందుగానే సూచిస్తున్నారు. ఏలూరు రోడ్, బందరు రోడ్, ఇన్నర్ ఫ్లై ఓవర్, బీఆర్టీఎస్ రోడ్ల వైపు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి పుష్కరాల్లో ఎదురైన ట్రాఫిక్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బెజవాడ పోలీసులు ప్రత్యేకంగా ట్రాఫిక్ డీఐజీ శ్రీకాంత్ ను ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం నియమించారు. పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు, ఆధునిక పరిజ్ఞానంతో ముందుకు వెళుతున్నారు.  
యాత్రికుల కోసం స్పెషల్‌ బస్సులు 
కృష్ణా పుష్కరాల ద్వారా.. లబ్ది పొందేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. నష్టాల్లో మూలుగుతున్న సంస్థను గట్టెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికుల కోసం స్పెషల్‌ బస్సులు నడపాలని.. వారు గంటల తరబడి వేచిచూడకుండా.. తగినన్ని బస్సులను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. బెజవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి వందలాది బస్సులు యాత్రికులను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. 
యాత్రికుల రద్దీకి తగ్గట్లుగా బస్సులు సన్నద్ధం 
గోదావరి పుష్కరాల కంటే కృష్ణా పుష్కరాలకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు రవాణా సంస్థ యాత్రికుల రద్దీకి తగ్గట్లుగా బస్సులను సన్నద్ధం చేస్తోంది. 9వ తేదీ తర్వాత దూర ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకునే యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 13 జిల్లాల్లోని పెద్ద బస్‌స్టేషన్లలో అదనపు బస్సులను సిద్ధంగా ఉంచాలని ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. యాత్రికులకు బస్‌ స్టేషన్‌లలో తాగునీటిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. వీలైనన్నీ ఎక్కువ బస్సులను నడపాలని ఉన్నతాధికారులు కోరారు. 
రాష్ట్రంలో నడవనున్న ఆర్టీసీ 3 వేల బస్సులు 
కృష్ణా పుష్కర యాత్రికుల కోసం ఏపీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ 3 వేల బస్సులు నడుపుతోంది. 25 వేల మంది సిబ్బందిని పుష్కర సేవలకు వినియోగించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. విజయవాడ, గుంటూరు పట్టణాల నుంచి పుష్కర ఘాట్లకు సిటీ సర్వీసులు ఉచితంగా నడపాలని నిర్ణయించారు. విజయవాడలోని ఆరు తాత్కాలిక బస్‌ స్టేషన్‌ల నుంచి పుష్కర ఘాట్లకు ప్రతి మూడు నిమిషాలకు ఒక బస్సును ఉచితంగా నడపనున్నారు. ఇటు గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కూడా ఘాట్లకు బస్ సౌకర్యాన్ని కల్పించారు.
మూడు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు 
పుష్కరాల పర్యవేక్షణకు మొత్తం మూడు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. మోడల్ గెస్ట్ హౌస్ వద్ద సీఎం, మంత్రులు పర్యవేక్షించేలా కంట్రోల్ రూం ఉండేలా  ఏర్పాట్లు చేస్తున్నారు. 20 కోట్లతో డ్రోన్లు, 1,200 సీసీ కెమెరాలతో పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సిద్ధం చేస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్‌ స్టేషన్ నుంచి కుమ్మరిపాలెం స్వాతి థియేటర్ వరకు ఇప్పటికే 'నో వెహికల్ జోన్'గా ప్రకటించారు. 
గోదావరి పుష్కరాలకు ఆర్టీసీకి రూ.76 కోట్ల ఆదాయం 
గోదావరి పుష్కరాలకు ఆర్టీసీకి 76 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కృష్ణా పుష్కరాల ద్వారా 90 నుంచి 100 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. పుష్కర ఘాట్ల దారులపై భక్తులకు సూచనలు ఇచ్చేందుకు ఎలక్ట్రానిక్ తెరలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి పుష్కరాలు ఉపశమనం కల్గించనున్నాయి. 

 

11:29 - August 9, 2016

ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కలిఖోపుల్ (47) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈటానగర్ లోని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి సీఎం అయ్యారు. బీజేపీ మద్దతుతో 145 రోజులు సీఎంగా పని చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవలే సీఎం పదవి కోల్పోయారు. సీఎం పదవి కోల్పోయిన తర్వాత తిగిరి కాంగ్రెస్ లో చేరారు. అయితే కలిఖో మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 

అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కలిఖోపుల్ ఉరివేసుకుని ఆత్మహత్య

ఈటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కలిఖోపుల్ ఈటానగర్ లోని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 

 

నయీం ఆస్తులపై ఐటీ అధికారుల ఆరా

హైదరాబాద్ : నయీం ఆస్తులపై ఇన్ కామ్ ట్యాక్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. కాసేపట్లో పుప్పాలగూడలోని నయీం ఇంటికి ఐటీ అధికారులు చేరుకోనున్నారు. 

 

సీపీఐ నేత డి.రాజాతో భేటీ కానున్న జగన్

ఢిల్లీ : సీపీఐ నేత డి.రాజాతో వైసీపీ అధినేత జగన్ తోపాటు ఆ పార్టీ ఎంపీలు భేటీ కానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. 

కాసేపట్లో గాంధీభవన్ లో జిల్లా ఇంచార్జ్ ల భేటీ

హైదరాబాద్ : కాసేపట్లో గాంధీభవన్ లో జిల్లా ఇంచార్జ్ ల భేటీ జరుగునుంది. ఈ సమావేశానికి పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొప్పుల రాజు, కుంతియాలు హాజరుకానున్నారు. 

10:38 - August 9, 2016

నయిం లాంటి నేరస్తుల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని వక్తలు సూచించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో రాజకీయ విశ్లేషుకుడు నగేష్ కుమార్, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ రావు, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వాలు, కొంతమంది అండదండలతోనే నయిం లాంటి నేరస్తులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:23 - August 9, 2016

నల్గొండ : జిల్లా వ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో నయీం అనుచరుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. నయీం అనుచరులు టమాటా శ్రీను ఇంట్లో సోదాలు చేశారు. జహంగీర్ ఇంట్లో డాక్యుమెంట్లు, ఓ కత్తి స్వాధీనం చేసుకున్నారు. నయీం సోదరి ఆస్తానా ఇంట్లో కత్తి, తపంచా, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నయీం అత్త సుల్తానాబేగం, బావమరిది సాజిద్ లపై కేసులు నమోదు చేశారు. భూములకు సంబంధించిన 400 పత్రాలు, ఓ దేశీయ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. నయీ అనుచరుడు ఎంపీపీ తోటకూర వెంకటేష్ ఇంట్లో సోదాలు జరిపారు. నయీం అనుచరులు ఎవరున్నా తమను సంప్రదించవచ్చని ఎస్పీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని చెప్పారు. అనుమానితుల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. 

09:44 - August 9, 2016

పుష్కరాల పేరుతో నదులను కలుషితం చేయొద్దని జనశ్వస్తా అభియాన్ నేత డాక్టర్ సురేష్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పుష్కరాల్లో ఎలాంటి శాస్త్రీయత లేదన్నారు. 'క్రిష్ణా పుష్కరాలు దగ్గరకొస్తున్నాయి. ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతున్నాయి. అధికార యంత్రాంగం పుష్కర ఏర్పాట్ల జోరు పెంచింది.  పుష్కర స్నానాలకు వెళ్లేవారు ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తానికి నలుగురు కలిసిన చోట పుష్కరాల చర్చలే వినిపిస్తున్నాయి. అయితే పుష్కరాలకు వెళ్లేవారు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలేమిటి?  ప్రభుత్వం చేయాల్సిన ఏర్పాట్లేమిటి? నదుల విషయంలో మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలేమిటి?.. అనే అంశాలను డాక్టర్ సురేష్ వివరించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:34 - August 9, 2016

చెన్నై : అలనాటి ప్రముఖ సినీ నటి జ్యోతిలక్ష్మీ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని స్వగృహంలో తెల్లవారుజామున జ్యోతిలక్ష్మీ మృతి చెందారు. తెలుగు, కన్నడ, తమిళ, మళయాలం, హిందీ తదదిర భాషల్లో 300 వందలకు పైగా చిత్రాల్లో ఆమె నటించారు. ఎన్నో హిట్స్ చిత్రాల్లోని ఐటెట్ సాంగ్స్ లో జ్యోతిలక్ష్మీ నటించారు. 1963 లో పెరియ ఇడతు పెన్ తమిళ చిత్రంతో అరంగ్రేటం చేసింది. తెలుగులో నటించిన తొలిచిత్రం 'పిల్లా పిడుగా'. అనంతరం దొంగరాముడు, గాంధర్వకన్య, స్టేట్ రౌడీ, సీతారాముడు, బిగ్ బాస్, బెబ్బులి, బంగారుబాబు, కలుసుకోవాలని అనే తెలుగు చిత్రాల్లో ఆమె నటించారు. జ్యోతిలక్ష్మీ చివరిగా నటించిన చిత్రం 
బంగారుబాబు(2009).  

08:42 - August 9, 2016

మరో రెండు రోజుల్లో క్రిష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. 4 రాష్ట్రాల్లో కలిపి 12 రోజుల పాటు దాదాపు 15 కోట్లమంది పుష్కర స్నానం చేస్తారన్న అంచనాలున్నాయి. నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పుష్కరాలకు వెళ్తున్నవారంతా  అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.  మనిషికి నాగరికత నేర్పిన నదీమతల్లిని గౌరవించేందుకే పుష్కరాలు కానీ, దానిని కలుషితం చేసేందుకు   కాదన్న విజ్ఞతను  ప్రతి ఒక్కరూ ప్రదర్శించాల్సిన సమయమిది. 
భారత్ లో 12 నదులకు పుష్కరాలు
ఇప్పుడు అందరి మనస్సూ క్రిష్ణా పుష్కరాల మీదే వుంది. మన దేశంలో 12 నదులకు పుష్కరాలు నిర్వహిస్తారు. దక్షిణభారతదేశంలో  ప్రవహించే గోదావరి, క్రిష్ణా, కావేరి, తుంగభద్ర ఈ  నాలుగు నదులకు  పుష్కరాలు నిర్వహించే సంప్రదయం వుంది.  మహారాష్ట్ర కొండల్లో మహేబళేళ్వరం దగ్గర పుట్టిన క్రిష్ణా నది క్రిష్ణా జిల్లాల్లోని హంసల దీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. మహానదిగా, జీవనదిగా పేరొందిన క్రిష్ణమ్మ మనదేశంలో ప్రవహించే అతిపెద్ద నదుల్లో మూడవది. క్రిష్ణవేణిలో మొత్తం 29 ఉపనదులు కలుస్తాయి.  క్రష్ణా నదితో సంగమించే తొలి ఉపనది కొయినా కాగా తుంగభద్ర అతి పెద్ద ఉపనది. మహాబళేశ్వరం నుంచి హంసలదీవి వరకు దాదాపు 1400 కిలో మీటర్ల దూరం ప్రయాణించే, క్రిష్ణా నదికి అన్ని ఉపనదులతో కలిసి 2,56,000 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం వుంది. 
క్రిష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు 
మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల్లో 12 రోజుల పాటు క్రిష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 12 నుంచి 23 వరకు సాగే ఈ క్రిష్ణా పుష్కరాల్లో 15 కోట్ల మందికిపైగా పుష్కర స్నానాలు చేస్తారన్న అంచనాలున్నాయి. తెలంగాణలో మూడున్నర కోట్ల మంది, ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మంది పుష్కర స్నానాలు ఆచరిస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వాలు అంచనాలేస్తున్నాయి.  క్రిష్ణా పుష్కరాల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం 825 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3వేల కోట్లు కేటాయించాయి.  తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్లగొండ, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లో పుష్కర ఘాట్లు నిర్మిస్తున్నారు. 
నదీతీరాల్లోనే నాగరికత 
నదీతీరాల్లోనే నాగరికత వికసించింది. నదుల వడ్డునే పెద్ద పెద్ద పట్టణాలు,  మహామహా నగరాలు విస్తరించాయి. మనల్ని బతికేంచే నదులను గౌరవించుకోవడమే పుష్కరాల అంతస్సూత్రం.  మానవ సంబంధాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం పుష్కరాల లక్ష్యం. పుష్కరాల వేళ ఇళ్లకు సున్నాలు వేయించడం, తోరణాలు కట్టడం, బంధువులను, స్నేహితులను ఆహ్వానించడం, వారికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చిపెట్టడం, దానధర్మాలతో తోటి మనుషుల పట్ల దయార్ధ్రతను ప్రదర్శించడం పుష్కరకాలంలో కనిపించే సాధారణ ద్రుశ్యాలు.  మనిషికీ మనిషికీ మధ్య, మనిషికీ ప్రక్రుతికి మధ్య వుండే సంబంధాలను బలోపేతం చేసుకోవడమే పుష్కర ధర్మం. 
మారుతోన్న పుష్కరాలు నిర్వహించే ధోరణి 
అయితే, రానురాను పుష్కరాలు నిర్వహించే ధోరణి మారుతోంది. గత సంవత్సరం గోదావరి పుష్కరాల్లో ఈ మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇప్పుడు క్రిష్ణా పుష్కరాల విషయంలోనూ అదే జరుగుతోంది. పుష్కరాలకు విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వడం, గ్లామరైజ్ చేయడం, భారీ సంఖ్యలో ప్రజలను తరలించడం, బాగా నిర్వహించామంటూ జబ్బలు చరచుకోవడం అనేది ప్రభుత్వ విధానంగా మారుతోంది.  రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి దాదాపు 4వేల కోట్ల రూపాయలు, అంతకు నాలుగింతల మొత్తంలో ప్రజలు పుష్కరాల కోసం ఖర్చు చేస్తున్నారు.  క్రిష్ణా నదీతీరంలో రకరకాల బిజినెస్ లు చేసేవారికి నిజంగా ఇది పండుగే. 
15 కోట్ల మంది క్రిష్ణా నదిలో పుష్కర స్నానాలు 
పన్నెండు రోజుల్లో దాదాపు 15 కోట్ల మంది క్రిష్ణా నదిలో పుష్కర స్నానాలు చేస్తారన్న అంచనాలున్న నేపథ్యంలో అటు ప్రభుత్వమూ, ఇటు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని నియమనిబంధనలు పాటించాలి.  వీటిలో అత్యంత ముఖ్యమైంది షాంపోలు, సబ్బుల వాడాకాన్ని పూర్తిగా నివారించడం.  15 కోట్ల మంది ఒక్కొక్క షాంపూ వినియోగించినా, దాదాపు 12 లక్షల లీటర్ల షాంపో క్రిష్ణా నదిలో చేరుతుంది.  ఒక్కొక్కరు 20 గ్రాముల సబ్బు రుద్దినా,  30 లక్షల కిలోల సబ్బు నదిలో కలుస్తుంది.  దీంతో పవిత్ర క్రిష్ణమ్మ జలాలు రసాయనాలతో అపవిత్రమవుతాయి.  అది అనేక జీవజాతులకు ప్రాణహాని కలిగిస్తుంది. 
క్రిష్ణమ్మను తీవ్ర కలుషితం చేస్తున్న మురికినీరు  
ఇప్పటికే పరిశ్రమల నుంచి వెలువడే విష రసాయనాలు, పట్టణాల నుంచి వెళ్లే మురికినీరు క్రిష్ణమ్మను తీవ్రంగా కలుషితం చేస్తున్నాయి. హైదరాబాద్ లో మూసీనదిని చూస్తే  నదులను మనం ఎంతగా నాశనం చేస్తున్నామో అర్ధమవుతోంది.   స్నానమాచరించేటప్పుడు పళ్లు తోమడం, ఉమ్మి వేయడం, మూత్రం పోయడం, దుస్తులు ఉతకడం లాంటివి చేయకూడదు.  జర్నీ టైమ్ లో తాగి, ఖాళీ చేసిన వాటర్ బాటిల్స్ ను, తినుబండారాలు ప్యాక్ చేసిన ప్లాస్టిక్ పేపర్లను నదీమ తల్లి పరిసరాలలో విసిరివేయడం ఏ మాత్రం క్షంతవ్యం కాదు.  ఇంటి దగ్గర శుభ్రంగా తలస్నానం చేసి, ఉతికిన బట్టలేసుకుని, షాంపోలు, సబ్బులు వాడకుండా పుష్కర స్నానం చేసి వచ్చేవారే  అసలైన పుణ్యాత్ములు. నదికి, ప్రక్రుత్తికి హాని కలిగించే ఏ చర్యకు పాల్పడ్డా పుణ్యం దక్కకపోగా, పాపాత్ముల జాబితాలో చేరడం ఖాయం. పుష్కర స్నానాలు నదినీ, ప్రక్రతిని గౌరవించేరీతిలో, వాటి ఉనికిని కాపాడే రీతిలో వుండాలే తప్ప, వాటికి, వాటి చుట్టూ జీవితాలను అల్లుకుంటున్నవారికి హాని కలిగించే రీతిలో వుండకూడదు. 

 

నయిం బాధితులు తమను సంప్రదించవచ్చు : ఎప్పీ ప్రకాశ్ రెడ్డి

నల్గొండ : నయిం బాధితులు ఎరున్నా తమను సంప్రదించవచ్చని ఎప్పీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. బాధితులకు తాము పూర్తి న్యాయం చేస్తామని చెప్పారు. అనుమానితుల ఇళ్లలో సోదాలు కొనసాగుతాయన్నారు. 

నయిం అనుచరుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు

నల్గొండ : జిల్లా వ్యాప్తంగా 7 ప్రాంతాల్లో నయిం అనుచరుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు కొనసాగాయి. నల్లగొండలో 3 కేసులు నమోదు అయ్యాయి. నయిం సోదరి ఆస్తానా ఇంట్లో కత్తి, తపంచా, డాక్యుమెంట్లు, నయిం అనుచరులు టమాటా శ్రీను ఇంట్లో తపంచా డాక్యుమెంట్లు, జహంగీర్ ఇంట్లో ఓ కత్తి స్వాధీనం చేసుకున్నారు. 

 

ప్రముఖ సినీనటి జ్యోతిలక్ష్మీ కన్నుమూత

చెన్నై : ప్రముఖ సినీ నటి జ్యోతిలక్ష్మీ కన్నుమూశారు. చెన్నైలో అనారోగ్యంతో ఆమె మృతి చెందారు. 300 వందలకు పైగా సినిమాల్లో ఆమె నటించారు. 

08:22 - August 9, 2016

నల్లగొండ : జిల్లా ఉలిక్కిపడింది...నయీం హతమయ్యాడన్న విషయం తెలియడంతో కలకలం రేపింది...ఒక్కసారి పోలీసులు అప్రమత్తమయి నయీం స్వస్థలం భువనగిరిలోని ఆయన ఇంటితో పాటు జిల్లాలోని బంధువులు..మిత్రులు..అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు..పలు కాలనీల్లో పోలీసుల వాహనాలు చక్కర్లు కొట్టడంతో భువనగిరి వాసులు ఆందోళనకు గురయ్యారు.
భువనగిరిలో ఉదయం నుంచి కలకలం 
నల్లగొండ జిల్లా భువనగిరి... హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న భువనగిరిలో ఉదయం నుంచి కలకలం రేపింది...గ్యాంగ్‌స్టర్‌ నయీం స్వస్థలం భువనగిరిలో ఎన్‌కౌంటర్ విషయం తెలియడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు..ఎప్పుడేం జరుగుతోందోనని ఆందోళన చెందారు.. పోలీసులు కూడా అప్రమత్తమయి వెంటనే తనిఖీలు నిర్వహించారు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో నయీం సంబంధించిన బంధువులు..మిత్రులు.. అనుచరులతో పాటు అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. నయీం చనిపోయాడని తెలియడంతో పోలీసులు వెంటనే రోడ్లపైకి వచ్చి అనుమానితులను..వాహనాలను సోదా చేస్తూనే మరికొన్ని బృందాలుగా విడిపోయి నయీం బంధువుల ఇళ్లను తనిఖీ చేశారు.
ఎంపీపీ వెంకటేశ్‌ యాదవ్ విచారణ...
నయీం ఎన్‌కౌంటర్ విషయం తెలియడంతోపాటు ఉన్నతాధికారుల ఆదేశాలతో నల్లగొండ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. భువనరిగిలో ఎంపిపి వెంకటేష్ యాదవ్ తో పాటు మరో ఇద్దరిని, మిర్యాలగూడలో నయీం బామ్మర్థి సాజిద్, అత్త సుల్తానా బేగం, నల్లగొండలో సోదరి అజ్మితా బేగంతో పాటు మరో మహిళ ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించి.. వారందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు...వీరితో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు... దాదాపు నాలుగు గంటలపాటు ఈ తనిఖీలు కొనసాగాయి.

 

08:15 - August 9, 2016

బ్రెజిల్ : రియో ఒలంపిక్స్‌లో పోరాడిన భారత మహిళల జట్టు జపాన్‌తో మ్యాచ్‌ డ్రా చేసుకుంది.... గ్రూప్‌ బీ మ్యాచ్‌లో 0-2తో వెనకబడిన భారత్‌... తర్వాత పుంజుకుంది.. రెండోభాగంలో రాణి రాంపాల్‌, లిమిమా మింజ్‌ చెరో గోల్‌ చేయడంతో ఓటమినుంచి గట్టెక్కింది.. 2-2తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది..

 

08:07 - August 9, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌ లీకేజి కేసులో సీఐడీ పోలీసులు మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. శ్యామ్‌ యాదవ్‌ అలియాస్‌ గుడ్డూతోపాటు అశోక్‌నగర్‌కు చెందిన రామకృష్ణను  అరెస్టు చేశారు. ఎనిమిది మంది విద్యార్థలకు ముంబైలో వీరు శిబిరం నిర్వహించారు. నలుగురు విద్యార్థుల నుంచి 60 లక్షల రూపాయలు తీసుకున్న గుడ్డూ.. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న  నిషాద్‌ మయాంక్‌సింగ్‌కు 50 లక్షల రూపాయలు ఇచ్చాడు. గుడ్డూ, రామకృష్ణల  అరెస్టుతో ... ఈ కేసులో ఇంతవరకు అరెస్టైనవారి సంఖ్య పదికి పెరిగింది. సీఐడీ చీఫ్‌ సౌమ్యా మిశ్రా ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది. 

08:04 - August 9, 2016

విజయవాడ : పుష్కరాలు దగ్గర పడుతున్నా ఇంకా పనులు పూర్తి కాకపోవడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు.  సంగమం వద్ద మహా హారతి నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఇంకా అక్కడ పుష్కర పనులు పూర్తి కాకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తున్నాయి. 
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం 
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. భక్తులకు సౌకర్యాల కోసం కృష్ణానది తీరాన ఘాట్ల పనులను ప్రభుత్వం చేపట్టింది. అయితే పనులు చేపట్టి రెండు నెలలైనా ఇంకా పనులు కొనసాగుతుండడంపై పలువురు విమర్శిస్తున్నారు. 
ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద మహా హారతి 
కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద మహా హారతి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆ కార్యక్రమ బాధ్యతలను సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించారు. ఇప్పటికే ఆయన అక్కడి పరిసరాలను పరిశీలించి.. కార్యక్రమ విజయవంతానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆ ప్రాంతంలో ఇంకా పుష్కర ఘాట్ల పనులు పూర్తి కాలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆలస్యంగా పనులు ప్రారంభించడం వల్లే.. పనులు పూర్తి కాలేదంటున్నారు. 
పనులు ఇంకా పూర్తి చేయకపోవడాన్ని తప్పుపడుతున్న ప్రతిపక్ష నేతలు 
గోదావరి పుష్కరాల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం.. పనులు ఇంకా పూర్తి చేయకపోవడాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుపడుతున్నారు. లక్షలాది భక్తులు తరలివచ్చే ప్రాంతంలో హడావుడిగా పనులు పూర్తి  చేయడం వల్ల అనుకోని సంఘటనలు జరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. పనులన్నీ తమ అనుయాయులకు అప్పగించడంపై పాలకులకు ఉన్న శ్రద్ధ.. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పుష్కరాలకు సమయం దగ్గరపడుతుండడంతో పుష్కర ఘాట్ల పనులు పూర్తవుతాయా ? లేదా అనే టెన్షన్‌ అధికారులను వెంటాడుతోంది. 

 

08:00 - August 9, 2016

హైదరాబాద్ : మోడీ పర్యటనపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ, కేసీఆర్‌లు పరస్పరం పొగడ్తలతో ముంచెత్తుకోవడం తప్ప.. రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. తమ హయాంలో ప్రారంభించిన పథకాలనే.. మళ్లీ ప్రారంభించి కలరింగ్‌ ఇచ్చి ప్రజల చెవిలో పువ్వులు పెట్టారంటున్నారు. 
మోడీ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు
తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి రాష్ట్రంలో ప్రధాని మోదీ చేపట్టిన పర్యటనపై తెలంగాణ కాంగ్రెస్‌ విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రధాని హోదాలో 24 నెలల తర్వాత వచ్చిన మోదీ.. తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని మండిపడింది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలపై మోదీ ఒక్కమాట చెప్పకపోవడాన్ని కాంగ్రెస్‌ నేతలు తప్పుపట్టారు. 
మోదీ ప్రారంభించిన పథకాలన్నీ కాంగ్రెస్‌ హయాంలోనివే : ఉత్తమ్‌ 
ఇక మోదీ ప్రారంభించిన పథకాలన్నీ కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించినవేనని  పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తమ హయాంలో ఎరువులు ధరలు తగ్గాయని గొప్పగా చెప్పిన మోదీ.. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గితే.. దేశంలో ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. ఈ పర్యటనలో మోదీ, కేసీఆర్‌లు పరస్పరం పొగడ్తలతో ముంచెత్తుకోవడం తప్ప... ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రస్తుత వారిద్దరి చూస్తుంటే భవిష్యత్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు కలిసిపోతాయని స్పష్టమవుతుందన్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. 
ఎన్డీయే హయాంలో ఒక్క కొత్త ప్రాజెక్ట్‌ కూడా రాలేదని ఆరోపణ 
మోదీ ప్రారంభించిన పథకాలన్నీ తమ హయాంలోనే ప్రారంభించిన ఆధారాలను కాంగ్రెస్‌ నేతలు విడుదల చేశారు. యూపీఏ హయాంలో కాకుండా.. ఎన్డీయే హయాంలో కొత్తగా కేటాయించిన ప్రాజెక్ట్‌ ఒక్కటీ కూడా లేదని ఆరోపించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, ప్రత్యేక హైకోర్టు అంశాలను కేసీఆర్‌ ఎందుకు ప్రస్తావించలేదని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. 
దళితులపై మోడీ మొసలి కన్నీరు 
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్‌ సంఘటనలో స్పందించని మోదీ.. ఇప్పుడు దళితులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. మొత్తానికి మోదీ పర్యటన వల్ల పరస్పరం పొగడ్తలు తప్ప.. రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. 

 

07:55 - August 9, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రైల్వే శాఖ తోడ్పాటునిస్తోందని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు అతిథులుగా  కేంద్రమంత్రులు దత్తాత్రేయ, హన్సీరాం గంగరాం, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ పాల్గొన్నారు. 
తెలంగాణలో సురేష్ ప్రభు రెండో రోజు పర్యటన
రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలంగాణలో రెండవ రోజు పర్యటించారు. నిన్న మోడీతో పాటు కోమటిబండ సభలో పాల్గొన్న ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నూతనంగా నిర్మించిన ఏసీ రిటైర్మెంట్ రూంని ప్రారంభించారు. గుల్బర్గా, హైదరాబాద్‌ల మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలును, కాజీపేట, ముంబై మధ్య నడిచే వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. 
ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి 
చర్లపల్లి, నాగులపల్లి స్టేషన్లను అంతర్జాతీయ స్థాయి టర్మినల్స్ గా తీర్చిదిద్దుతామని సురేష్ ప్రభు తెలిపారు. కాచిగూడ స్టేషన్ అభివృద్ది, ఎంఎంటిఎస్ రెండవ దశలో శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎంఎంటిఎస్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైల్వేల్లో విద్యుత్ పైనే అత్యధికంగా వ్యయం అవుతుందన్న ఆయన ఆ ఖర్చును తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెడుతున్నామని తెలిపారు. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రైల్వేలను మరింత అభివృద్ధి చేసేందుకు మోడీ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రైల్వే శాఖ మద్దతు ఉంటుందని సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. 

 

07:51 - August 9, 2016

హైదరాబాద్ : మరికొద్ది నెలల్లో శతాబ్ది ఉత్సవాలకు ఉస్మానియా యూనివర్శిటీ సిద్ధమవుతోంది. ఎన్నో ఉద్యమాలకు పురిటిగడ్డగా నిలిచిన ఈ యూనివర్శిటీ. నేడు కష్టాల్లో కూరుకుపోతోంది. రాను రాను ఈ వర్శిటీ. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైందంటున్నారు యూనివర్శిటీ ఉద్యోగులు. ఉద్యోగులు జీతాల కోసం పడుతున్న వెతలపై స్పెషల్ స్టోరీ..
యూనివర్శిటీని నిర్మించిన ఉస్మాన్ అలీఖాన్ 
ఉస్మానియా యూనివర్శిటీని నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఉస్మానియాకి ఎంతో పేరు ప్రఖ్యాతలున్నప్పటికీ... తాజాగా యూనివర్శిటీ మూలాలు దెబ్బతింటున్నాయి.
ఉద్యమాలకు పురిటిగడ్డ ఓయూ  
ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన వర్శిటీ ఎప్పుడు నినాదాలతో మారుమోగుతుంటుంది. ఎప్పుడు అందరి సమస్యల గురించి పోరాడే ఇక్కడి విద్యార్ధులు అధ్యాపకులు నేడు పొట్ట చేతపట్టుకుని రోడ్డెక్కాల్సి వచ్చింది. కొంత కాలంగా వేతనాలు లేక రెగ్యులర్ టీచింగ్, నాన్‌టీచింగ్, ఎన్‌జీవోలు ప్రతి ఒక్కరు రోడ్డెక్కారు. 
జీతాలు రాక ఉద్యోగులు అవస్థలు 
ఎందరికో విద్యాబోధన చేసిన తాము చివరకు జీతాలు రాక నానావస్థలు పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్ ఆధ్వర్యంలో ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చి ఓయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మొదలుకొని అన్నీ కార్యాలయాలకు ఉద్యోగులు తాళాలు వేశారు. ఇప్పటివరకు జీతాలు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు తమ శాలరీస్ ఆగలేదని తెలంగాణా వచ్చిన తరువాత ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుందని ఊహించలేదని వారు అభిప్రాయపడుతున్నారు. 
నిరసన తెలిపితేనే జీతాలు అకౌంట్ లో 
ప్రతినెల ఏదో ఒక రకంగా ఉద్యమం చేసి నిరసన తెలిపితేనే జీతాలు అకౌంట్ లో పడుతున్నాయంటున్నారు ఉద్యోగులు. చివరికి జీతాలు అడుక్కోవాల్సి పరిస్థితికి కేసీఆర్‌ ప్రభుత్వం దిగజార్చిందంటూ ఉద్యోగులు విమర్శించారు. ఇప్పటి వరకు బ్లాక్‌ గ్రాంట్స్‌ విడుదల చేయకుండా శతాబ్ది ఉత్సవాలకు సన్నద్ధమవుతున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా తమ జీతాలు వెంటనే విడుదల చేయాలని లేనిపక్షంలో రేపటి నుంచి విధులు బహిష్కరించి సమ్మె బాట పడతామంటూ హెచ్చరిస్తున్నారు. 

 

07:46 - August 9, 2016

విజయవాడ : ఏపీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది.కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ.. కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ  మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుమేరకు వేతన సవరణచేస్తూ..ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వేతనాలు పెంపు
ఏపీలోని కాంట్రాక్ట్ ,అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వేలసంఖ్యలో కాంట్రాక్ట్ ప్రాతిపదికపై పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల సవరణకు గతంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది సర్కార్. కమిటీ సిఫార్సుల మేరకు వేతనాలు సవరిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.
యనమల నేతృత్వంలో కమిటీ అధ్యయనం
ఆర్థికమంత్రి యనమల నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ అధ్యయనం చేసి కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్  ఉద్యోగుల వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేడర్ వారీగా వేతనాలు పెంచాలని కమిటీ సూచించింది. కమిటీ సూచనలతో  సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో గ్రాఫర్, అకౌంటెంట్, సీనియర్ డేటాఎంట్రీ ఆపరేటర్లకు 17 వేల 500 రూపాయలుగా వేతనాన్ని సర్కార్ నిర్ణయించింది. 
ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చిన నూతన వేతనాలు 
వీరితో పాటు జూనియర్ అసిస్టెంట్ , స్టెనో, టైపిస్ట్ లకు 15 వేల రూపాయలను వేతనంగా నిర్ణయించింది. ఆఫీస్ సబార్డినేట్ క్యాడర్ కు 12 వేల రూపాయల్ని నూతన వేతనంగా నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఆయా శాఖలకు  ఉత్తర్వులు జారీ చేసింది. వేతనాలు పెంచుతూ.. నిర్ణయం తీసుకోవడంతో పాటు ఒప్పంద, డైలీవేజ్  నియామకాలకు సంబంధించి పలు మార్గదర్శకాలు జారీ చేసింది సర్కార్. ఈ పెరిగిన వేతనాలు ఆగస్టు 1 నుండి అమలులోకి రానున్నాయి.  

 

07:42 - August 9, 2016

హైదరాబాద్ : గలగల పారే సెలయేళ్లు.. పక్షుల కిలకిల రావాలు మెలికలు తిరిగే వాగులు.. గజ్జల సవ్వళ్లు.. మువ్వల సందళ్లు.. హొయలొలికే నృత్యాలు. ఇదీ ఏజెన్సీ అనగానే గుర్తుకు వచ్చే అంశాలు. కాని దేశంలో అభివృద్ధి మాటున ఆదివాసీలను వనానికి దూరం చేస్తున్నారు నేతలు. 60 ఏళ్ల స్వతంత్ర భారతంలోను వెనకబాటుకు గురవుతున్నారు ఆదివాసీలు.      
అస్థిత్వం కోసం పోరాడుతున్న ఆదివాసీలు 
వనం సల్లగుంటే.. అన్నానికి కొదవేముంది. పంటలు ఇంటికొస్తే పండగే ఇంకేముంది. కొండల నుండి కోనల నుండి ఒంపులు తిరుగుతున్న వాగులువంకల నడుమ జీవిస్తూ.. 461 జాతులు ఉన్న ఆదివాసీలు.. దేశ ఆదాయాన్ని పెంచడంలో తమవంతు కృషిచేస్తున్నా.. వారిని ఇంకా మూఢనమ్మకాలు.. ప్రజాప్రతినిధుల కుటిల రాజకీయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆదివాసీల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అడవిబిడ్డలు వారి అస్థిత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు. 
ఆదివాసీల అభివృద్థిపై 2006 లో ముసాయిదా 
1994 లో ఆగస్టు 9 వ తేదీని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ప్రపంచంలోని ఆదివాసీలసంస్కృతి, సాంప్రదాయాలు ,అస్థిత్వం, హక్కుల పరిరక్షణ కోసం నేటికి పోరాడుతూనే ఉన్నారు. ఆవివాసీల  అభివృద్దికి , స్వేచ్ఛ కోసం వచ్చిన చట్టాలు చట్టబండలు అవుతున్నాయి. ఆదివాసీలు బాగా వెనకబడిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఆదివాసీల అభివృద్దికి నేటికి ఒక సమగ్ర జాతీయ విధానం లేకపోవడం దారుణం. 2006 లో దీనిపై ముసాయిదాను రూపొందించినా తర్వాత కేంద్ర క్యాబినెట్ ఆమోదం కూడా పొందలేదు. 
వైద్యం అందక నేలకొరుగుతున్న అడవిబిడ్డలు
ఈ ఆధునిక యుగంలోను అభివృద్ది అంటే తెలియని గ్రామాలు కోకొల్లలు. ఏజెన్సీలో సరైన వైద్యం అందక అడవిబిడ్డలు నేలకొరుగుతున్నా.. పట్టించుకునే నాధుడేలేడు. వీటికి తోడునేటికి మూఢనమ్మకాల జాడ్యం ఏజెన్సీలో పడగ విప్పుతోంది.  మన్యంలో రహదార్లు లేక అనేక గ్రామాల ప్రజలు నేటికి వాగులు వంకలు దాటుతూ.. సాహసో పేత ప్రయాణాలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆదివాసీలు కాపాడుకుంటూ వస్తున్న సనాతన సాంప్రదాయాలు ఆధునిక ఒరవడిలో కనుమరుగవుతున్నాయి. 
నేటికి ఆదివాసీలకు అందని ఐటీడీఏ ఫలాలు 
ప్రస్తుతం 206 ఆదివాసీ గ్రామాలు పోలవరం కారణంగా జలసమాధి అవనున్నాయి.  అభివృద్ది మాటున ప్రభుత్వాలు వారిని అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. వారి గొంతును లేవకుండా నొక్కేస్తున్నారు.  ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఉత్సవాలుగా జరుపుకోవాల్సిన తరుణంలో నిరసన సభలతో తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ది కోసం ఏర్పాటుచేసిన ఐటీడీఏలు ఫలాలను అందించలేకపోతున్నాయి. ఆదివాసీల సాంప్రదాయాలకు, ఆచారాలకు విలువనివ్వాల్సిన తరుణంలో.. విద్య ఉద్యోగాలకోసం ఆస్థిత్వం పోరాడుతుండడం అత్యంత దారుణం. అభివృద్ధి మాటున అడవిబిడ్డలు బలికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఆదివాసీల దినోత్సవం సందర్భంగానైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.     

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

హైదరాబద్ : గచ్చిబౌలి ఇంద్రానగర్ లో టిప్పర్ ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

దేవినేని నెహ్రూ సోదరుడు బాజీ ప్రసాద్ మృతి

విజయవాడ : మాజీ మంత్రి దేవినేని నెహ్రూ సోదరుడు బాజీ ప్రసాద్ గుండెపోటులో మృతి చెందారు. తెల్లవారుజామున గుండెపోటుతో బాజీని ఓ ఆస్పత్రికి తరలించారు. బాజీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. 

 

నేడు విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

విశాఖ : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అరకులో ప్రపంచ ఆదివాసి దినోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. 

07:24 - August 9, 2016

మెదక్ : ఆందోల్ మండలం దానంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మంది మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. 

నేడు ఉక్కు మహిళ ఇరోమ్ షర్మీలా దీక్ష విరమణ

ఇంపాల్ : నేడు ఉక్కు మహిళ ఇరోమ్ షర్మీలా దీక్ష విరమణ చేయనున్నారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్లుగా షర్మీలా నిరాహారదీక్ష చేపట్టారు. 

నేటి నుంచి వెస్టిండీస్, భారత్ మూడో టెస్టు

ఢిల్లీ : నేటి నుంచి వెస్టిండీస్, భారత్ మధ్య మూడో టెస్టు జరుగనుంది. సెయింట్ లూసియానా వేదికగా సాయంత్రం 6.30 గంటలకు మ్యాజ్ ప్రారంభం కానుంది. 

 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మెదక్ : ఆందోల్ మండలం దానంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మంది మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

 

Don't Miss