Activities calendar

10 August 2016

21:44 - August 10, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కృష్ణా పుష్కరాల ముహూర్తం ఖరారైంది. ఈనెల 12న ఉదయం 5 గంటల 58 నిమిషాలకు మహా క్రతువు ప్రారంభం కానుంది. పుష్కర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గోదిమళ్ల ఘాట్‌లో ఈనెల 12న సీఎం కేసీఆర్‌ పుష్కర స్నానం చేయనున్నారు. మరోవైపు కృష్ణా పుష్కరాల సమాచారం కోసం...పుష్కరాలు.తెలంగాణ.gov.in వెబ్‌సైట్‌ను సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. వెబ్‌సైట్‌ ద్వారా పుష్కరఘాట్లు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, బస్సులు, రైళ్ల వివరాలను భక్తులు తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. 

21:42 - August 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడబోతున్న జిల్లాల కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కొత్త జిల్లాల ఏర్పాటు, విధివిధానాలు సంబంధిత అంశాలపై చర్చించారు. ఎల్లుండి నుంచి ఈనెల 16 వరకు అన్ని జిల్లాల ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. 17న కలెక్టర్ల సమావేశం అనంతరం.. 18న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రికి తుది నివేదిక అందజేస్తామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు.

21:39 - August 10, 2016

ఖమ్మం : సాగు చేసుకుంటున్న పోడు భూముల హక్కుల పత్రాల కోసం ఖమ్మంలో గిరిపుత్రులు కథం తొక్కారు. సాగు చేసుకుంటున్న భూముల నుంచి సాగనంపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని గిరిజనుల ఉద్యమానికి నాయకత్వం వహించిన సీపీఎం నేతలు హెచ్చరించారు. హక్కుల పత్రాలు ఇచ్చే వరకు పోడు భూముల పోరు కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూములు
ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ... ఖమ్మంలో గిరిజనులు ఉద్యమం చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఏజన్సీ ప్రాంతం నుంచి గిరిపుత్రులు భారీగా తరలివచ్చారు. ఎర్రజెండాలు చేతపట్టి నగరంలో ప్రదర్శనతోపాటు, ధర్నా చౌక్‌లో మహాధర్నానిర్వహించారు.

టీ.సర్కార్ పై నేతల ఆగ్రహం..
ప్రదర్శన తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రసగించిన గిరిజన సంఘాల నాయకులు, సీపీఎం నేతలు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ విధానాలపై విరుచుకుపడ్డారు. పోడు భూముల నుంచి గిరిజనులను బయటకు పంపే శక్తి ఎవరికీ లేదని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ అన్నారు. అటవీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు.

అణగారిన వర్గాలపై తీవ్ర నిర్బంధకాండ: తమ్మినేని
కేసీఆర్‌ పాలనలో అణగారిన వర్గాలపై తీవ్ర నిర్బంధకాండ కొనసాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్షాల పోరాటం ఫలితంగానే 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దశాబ్దకాలంగా ఈ చట్టాన్నిఅమలు చేయని పాలకుల చర్యను తమ్మినేని తప్పుపట్టారు.

నిర్బంధకాండపై అసెంబ్లీలో నిలదీస్తాం: సున్నంరాజయ్య
గిరిజనులపై పోలీసులు, అటవీశాఖ అధికారులు నిర్బంధకాండపై అసెంబ్లీలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తామని భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చెప్పారు. ప్రభుత్వం పట్టుదలకు పోకుండా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, లేకపోతే తీవ్ర ప్రతిఘటనోద్యమం తప్పదని సీపీఎం నేతలు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను హెచ్చరించారు. 

21:34 - August 10, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసులకు సంబంధించి...ఎన్‌కౌంటర్‌ తర్వాత బయటపడ్డ ఆస్తులపై సిట్‌ శోధన మొదలయింది... సిట్‌ ఏర్పాటు ప్రకటించిన గంటలోనే యాక్షన్‌లోకి దిగిన బృందాలు నయీం ఇంటిని సోదాలు చేశాయి..అందులో కొన్ని దొరికిన ఆధారాలతో పాటు డాక్యుమెంట్లను స్వాదీనం చేసుకున్నారు..ఇక మరోవైపు నయీం అనుచరులు..వారి బంధువుల ఇళ్లలో సోదాలు..అరెస్టులు..విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి..ఉదయం నుంచి మొదలయిన ఈ తనిఖీలు దాదాపు 8 గంటలపాటు నిరంతరంగా కొనసాగింది...

నయీం గదిని తెరిచిన పోలీసులు..
వాయిస్....గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌ అయిన కొన్ని గంటల్లోనే పుప్పాలగూడ అల్కాపురి టౌన్‌షిప్‌లోని ఇంట్లో సోదాలు చేయగా ఎన్నో ఆస్తులు బయటపడ్డాయి....నయీం కుటుంబీకులను అదుపులోకి తీసుకుని ..అతని పిల్లలను సదనం పంపించిన పోలీసులు దాడులు కొనసాగించారు..ఇక ఆ ఇంటిని సీజ్ చేసిన పోలీసులు మాత్రం రెండో అంతస్తులోని మరో బెడ్‌రూం తెరవలేదు...ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన పోలీసులు రాజేంద్రనగర్ న్యాయస్థానం అనుమతితో ఉదయం నుంచి సోదాలు మొదలుపెట్టారు... జీప్లస్‌3 హౌస్‌లో ఉంటున్న నయీంకు రెండో అంతస్తులో మరో బెడ్‌రూం ఉంది..దాన్ని తెరిచిన పోలీసులు సోదాలు నిర్వహించారు..అందులో కూడా కొన్ని డాక్యుమెంట్లు దొరికాయి.. రెండు బ్యాగుల్లో పోలీసులు వాటిని తరలించారు....ఉదయం 11 గంటల నుంచి పోలీసులు సోదాలు చేయగా...సాయంత్రానికి సిట్‌ రంగంలోకి దిగింది...

నయీం ఇంటిని క్షుణ్ణంగా పరిశీలన..
దాదాపు 8 గంటలపాటు కొనసాగిన తనిఖీల్లో దొరికిన ఆధారాలను సిట్‌ బృందం స్వాధీనం చేసుకుంది..సిట్ చీఫ్‌ నాగిరెడ్డి బృందం రంగంలోకి దిగి క్షుణ్ణంగా పరిశీలించారు...

దాడుల్లో పాల్గొన్న ఐటీ,రెవెన్యూ..
పోలీసులతో పాటు ఆదాయపన్ను..రెవెన్యూ.. అధికారులు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నారు...నయీం ఇంట్లో దొరికిన దస్తావేజులను పరిశీలించారు..ఆదాయపు పన్ను అధికారులు వివరాలను సేకరించారు...

తుల్జాభవానీ కాలనీలో ఇంటి పరిశీలన..
నయీం కారు డ్రైవర్‌ శ్రీధర్‌గౌడ్‌ ఎన్‌కౌంటర్‌ కాగానే పారిపోయాడు..దీంతో పోలీసు బృందం గాలించి పట్టుకుంది..శ్రీధర్‌గౌడ్‌ ఉంటున్న వనస్థలీపురంలోని తుల్జాభవానీ కాలనీలోని ఇంట్లో సోదాలుచేయగా 30 లక్షల నగదుతో పాటు భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు దొరికాయి.. నయీం దందాలో భాగంగా శ్రీధర్ ఇంట్లో దాచిపెట్టినట్లు తెలుస్తోంది...ఇక శ్రీధర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు....

ప్రధాన అనుచరుడు రియాజ్...
ఇక నయీం గ్యాంగ్‌లో అత్యంత కీలకమైనవాడు రియాజ్...నయీంకు నమ్మినబంటు..రైట్‌హ్యాండ్‌లా ఉంటూ అన్నింటా తానై నడిపించాడువ.. రియాజ్‌ను వనస్థలీపురంలో అరెస్టు చేసిన పోలీసులు నల్లగొండ జిల్లాకు తరలించారు.. నయీం చేసిన దందాలపై ఆరా తీస్తున్నారు..ఆస్తులు బయటపడే అవకాశం ఉంది....ఇక మరో ప్రధాన అనుచరుడు హస్తినాపూర్‌లో ఉంటున్న శేఖర్‌ తప్పించుకున్నట్లు తెలుస్తోంది...వీరితో పాటు నయీం అనుచరుల్లో ఒకడైన సలీంను కుంట్లూరులోని తెలంగాణా కాలనీలో అదుపులోకి తీసుకున్నారు...నయీంకు సలీం బంధువు కూడా...నయీం దందాల్లో పాలుపంచుకున్న సలీం ఎన్నో అరాచకాలు చేసినట్లు అనుమానిస్తున్నారు...

21:28 - August 10, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత జరుపుతున్న సోదాల్లో బయటపడుతున్న ఆస్తులపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. స్పెషల్‌ టీం ఆధ్వర్యంలో ఇక నయీంకు సంబంధించిన ప్రతీ విషయాన్ని కూపీలాగనున్నారు...దీంతో నయీంకు సహకరించినవారు...సహకారం తీసుకున్నవారి జాతకాలు బయటపడనున్నాయి...నయీంతో పాటు దందా చేసినవారంతా ఇకపై కటకటాలు లెక్కపెట్టాల్సిందే...

నయీం కేసులో సీరియస్‌ యాక్షన్...
తవ్వినకొద్దీ బయటపడుతున్న గ్యాంగ్‌స్టర్‌ నయీం ఆస్తుల చిట్టా చూసి గుండె గుభేల్‌మంటోంది...వంద రెండు వందల కోట్లు ఉండొచ్చనుకున్నా ఆ తర్వాత బయటపడుతున్న ఆస్తులు వేలకోట్లకు వచ్చింది...దీంతో ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది..దీనిపై డీజీపీ అనురాగ్‌శర్మ సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు...ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో ఏర్పాటయిన సిట్‌కు అదనపు ఎస్పీ తో పాటు ముగ్గురు డీఎస్పీలు...ఎనిమిది మంది అధికారులను నియమించారు..ఇక నయీం సంబంధించిన ఆస్తులు... దందాలు..సెటిల్‌మెంట్లు.. రకరకాల కోణాల్లో సిట్

నయీం అరాచకాలు..అనుచరుల బాగోదతాలు..
ఇలా ఎన్నో రకాలుగా దందాలు చేసిన నయీం అతని అనుచరుల బాగోతాన్ని బయటపెట్టనున్నారు..ఇప్పటికే నయీంకు సంబంధించిన ఆస్తులు..ఫాంహౌస్‌లు..ఇళ్లలో రెండ్రోజులుగా సోదాలు చేస్తున్న పోలీసులకు వేలకోట్ల ఆస్తులున్నట్లు తేలింది...ఇక నయీం అనుచరుల కోసం వేటకొనసాగుతూనే ఉంది..కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి కూడా విలువైన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు.. మారణాయుధాలతో పాటు ఎన్నో

నయీం అనుయాయుల జాతకాలు బైటపడనున్నాయా?
వాయిస్...ఇలా నయీంకు సహకరిస్తూ గ్యాంగ్‌లో ఉన్నవారు..బయట నుంచి సహకరించినవారందరి జాతకాలు బయటపడనున్నాయి..నయీంతో పాటు కలిసి దందాలు చేసినవారు కూడా కోట్లలో ఉన్నారు... దీన్ని బట్టి నయీం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కూడా తన గ్యాంగ్‌ను విస్తరించినట్లు తేలింది.. ఇలా అరాచకాలు సృష్టిస్తూ నడిపిస్తున్న గ్యాంగ్‌లో సభ్యులను గుర్తించి వారిని కూడా అదుపులోకి తీసుకోనున్నారు..నయీంకు సంబంధించిన ప్రతీ విషయాన్ని కూలంకశకంగా దర్యాప్తు చేయనున్నారు.

20:32 - August 10, 2016

నెత్తికి గిన్నె ఇరికించుకున్న పోరడు..పుష్కరాల విధులకు హోంగార్డులు..సంబంధం లేదంటున్న అధికారులు..సర్కారు దవాఖానలతో సతమతమవుతున్న జనాలు..సర్కారు హస్టల్లో బువ్వ తింటే కడుపునొప్పులొస్తున్నయంట..బాబు వచ్చిండు కానీ జాబు రాలేదు...మంత్రికోసం లైన్లల నిలబడ్డ ఇస్కూలు పిల్లలు..రైలు బోగీల నుండి పైసలను ఎత్తికెల్లిన దొంగలు..గిసువంటి మస్తుముచ్చట్లను మన మల్లన్న ఈరోజుకూడా తీసుకొచ్చేసిండు..మరిన్ని ముచ్చట్లను చూడాలంటే గీ వీడియో చూడుండ్రి...మస్తు ఖషీ అవుండ్రి..

సెక్సువల్ హెరాస్ మెంట్ కు 3నెలలు లీవ్!..

ఢిల్లీ : విధులు నిర్వర్తించే సమయంలో వేధింపులకు గురయ్యే మహిళలకు వాటిని తాత్కాలికంగా తప్పించుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. లైంగిక వేధింపులకు గురయ్యే ఉద్యోగినులు ఆ కేసులకు సంబంధించిన విచారణ జరిగే సందర్భంలో మూడు నెలల పాటు సెలవు తీసుకోవచ్చని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. అందుకు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఆ సంస్థ యజమాని నుంచి ఈ సెలవులు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. విధులు నిర్వర్తించే సమయంలో గురయ్యే లైంగిక వేధింపులకు సంబంధించి సమాచారం ఏదీ కేంద్రం వద్ద లేదని ఆయన తెలిపారు. 

నయీం నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు..

హైదరాబాద్: నయీం కేసు దర్యాప్తును సిట్ అధికారుల బృందం వేగవంతం చేసింది. ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో సిట్ అధికారుల బృందం పుష్పాలగూడలోని నయీం నివాసానికి చేరుకున్నారు. నయీం నివాసంలో పలు దఫాలుగా సోదాలు నిర్వహించి మరిన్ని కీలక పత్రాలను పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు పెద్ద సంచుల్లో డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్‌లు, ఔషధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

మల్లన్న సన్నిధిలో దంపతులు ఆత్మహత్య..

కర్నూలు : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని అన్నపూర్ణ సత్రంలో బుధవారం దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.గుంటూరు శ్రీనగర్‌కు చెందిన మహంకాళి, సైదులు దంపతులు అన్నపూర్ణ వసతిగృహంలో గది అద్దెకు తీసుకున్నారు. ఏమయ్యిందో తెలీదుగానీ బుధవారం నాడు గదిలో పురుగుమందు తాగి పడి ఉండటాన్ని సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

19:23 - August 10, 2016

గుంటూరు : అమరావతిలో కీలక శాఖల కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఊపందుకుంది. తాజాగా వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యాలయాన్ని మంత్రి యనమల ఆవిష్కరించారు. న్యాయ శాఖ కార్యాలయంతో పాటు సాంఘిక, గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శుల చాంబర్లను సంబంధిత మంత్రులు, కార్యదర్శులు ప్రారంభించారు.

అమరావతి నుంచే పరిపాలన సాగించేందుకు ఏపీ సర్కార్‌ వేగం..
కొత్త రాజధాని అమరావతి నుంచే పరిపాలన సాగించేందుకు ఏపీ సర్కార్‌ వేగం పెంచింది. ఓవైపు కీలక శాఖల ఆవిష్కరణ..మరోవైపు ఉద్యోగుల తరలివస్తుండటంతో వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో సందడి నెలకొంది.

ఆర్ధిక శాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి యనమల
రెండవ బ్లాక్.. మొదటి అంతస్థులో ఆర్ధిక శాఖ కార్యాలయాన్ని మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. దీంతో పాటు ఆర్ధిక శాఖలో భాగంగా ఉన్న పరిశ్రమలు, ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శుల ఛాంబర్లును మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి చినరాజప్ప, మంత్రి నారాయణ, చీఫ్ సెక్రటరీ ఎస్. పి. టక్కర్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.. సాంప్రదాయ బద్దంగా పూజా కార్యక్రమాలతో 9 గంటల 21 నిమిషాలకు మంత్రి తన ఛాంబర్ లోకి ప్రవేశించారు.

15 శాతం వృద్ధి రేటు సాధించేందుకు కృషి : యనమల
నూతన సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యలయాన్ని ప్రారంభించడంపై మంత్రి యనమల హర్షం వ్యక్తం చేశారు. గతేడాది 10.99 ఆర్థిక వృద్ధి రేటు సాధించామని.. వచ్చే ఏడాది అన్ని శాఖల మంత్రులు, అధికారుల సహకారంతో 15 శాతం వృద్ధి రేటు సాధించేందుకు కృషి చేయాలని కోరారు. తాత్కాలిక సచివాలయానికి ఇప్పటికే 200 కోట్లు కేటాయించామని, మరో 400 కోట్లు త్వరలోనే విడుదల చేస్తామన్నారు..

సీఎం కృషి, పట్టుదలకు నిదర్శనమే సచివాలయం : మంత్రి రావెల
తాత్కాలిక సచివాలయంలోని మొదటి భ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో న్యాయ శాఖ కార్యాలయాన్ని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దుర్గాప్రసాద్ ప్రారంభించారు. మూడో బ్లాక్ మొదటి అంతస్థులో సాంఘిక, గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శుల చాంబర్లను ఆ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు కృషి, పట్టుదలకు నిదర్శనమే తాత్కాలిక సచివాలయమని మంత్రి రావెల అన్నారు..తాత్కాలిక సచివాలయంలో కార్యాలయాలు ప్రారంభించిన మంత్రులకు టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

19:14 - August 10, 2016

తూర్పుగోదావరి : అమలాపురంలో దళితులపై దాడి ఘటనపై 10 టీవీ వరుస కథనాలకు సర్కార్‌ స్పందించింది. దళితులపై దాడి ఘటనపై సీఎం చంద్రబాబుకు డీజీపీ సాంబశివరావు నివేదిక సమర్పించారు. అమలాపురం ఘటనలో 8 మందిని అరెస్ట్‌ చేసినట్లు డీజీపీ తెలిపారు. అటు శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి అధికారులకు ఆదేశించారు. గాయపడ్డ దళితులకు మెరుగైన వైద్యం అందించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన చంద్రబాబు బాధితులకు లక్ష రూపాయల పరిహారం అందజేయాలన్నారు. అమలాపురంలో గోవును చంపారనే నెపంతో దళితులపై అత్యంత పాశవికంగా గోసంరక్షణ పేరుతో మతతత్వ శక్తులు దళితులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జంతువుల చర్మాన్ని తీసుకుని జీవనం కొనసాగిస్తున్న మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరరావుతో పాటు మరో వ్యక్తిపై దాదాపు 100 మందికి దాడికి పాల్పడ్డారు. బాధితులు చనిపోయిన ఆవు చర్మాన్ని తీస్తున్నామని ఎంత చెప్పినా పట్టించుకోకుండా అత్యంత పాశవికంగా వారిపై దాడి చేసిన తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో ఎలీషా స్పృహతప్పి పడిపోగా.. వెంకటేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో అమలాపురం ఆస్పత్రికి తరలించారు.

బాధులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుమారుడి డిమాండ్..
అయితే.. దళితులు ఆవును చంపి చర్మం తీయడం లేదని.. ఆవు విద్యుత్‌షాక్‌తో చనిపోయిందని ఆవు యజమాని తెలిపారు. ఆవు చనిపోయిందని సమాచారం ఇచ్చిన తరువాతే... చర్మం తీస్తుండగా గ్రామస్తులు దాడి చేశారని బాధితుడి కుమారుడు అంటున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.
దాడిపై భగ్గుమన్న ప్రజాసంఘాలు..
మరోవైపు దళితులపై దాడి ఘటనను ప్రజాసంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఇది అత్యంత అమానుషమని అంటున్నారు. కొంతమంది కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దళిత సంఘాల నేతలంటున్నారు. వాస్తవ విషయాలు గ్రహించకుండా ఇలాంటి ఘటనలకు పాల్పడడం దారుణమని.. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బాధితులను పరామర్శించిన వామపక్ష నేతలు..
అమలాపురం ఘటనలో బాధితులను వామపక్ష నేతల బృందం పరామర్శించింది. బాధితులకు అండగా ఉంటామని వామపక్షనేతలు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

18:59 - August 10, 2016

కథ స్వంతంగా రాసుకుని స్ర్కీప్లే రాయటం వల్లనే సినిమాకు సినిమాకు మధ్య ఆలస్యమవుతోందని మనమంతా సినిమా దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెలిపారు. ఐతే,అనుకోకుండా ఒకరోజు, సాహసం లాంటి సినిమాలతో ప్రేక్షకులలో ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా తనదైన శైలితో మంచి గుర్తింపు తెచ్చుకున్న చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లింగ్ ఫ్యామిలీ చిత్రం మనమంతా.మళయాల స్టార్ హిరో మోహన్ లాల్ , హీరోయిన్ గౌతమీ,విశ్వాంత్, రైనారావు,అనీషా అంబ్రోస్ ప్రధాన పాత్రలో నటించారు. ఇటీవల విడుదలయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి స్పెషల్ చిట్ చాట్..మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మనమంతా సినిమా చేయటానికి ఒప్పుకోవటం తన అదృష్టమన్నారు. తన ప్రొఫైల్ చూసి నటి గౌతమి అపాయింట్ మెంట్ ఇచ్చారని తెలిపారు. మనమంతా సినిమా గురించి ఏలేటితో మరింత విశేషాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

అగ్నిప్రమాదం..11మంది శిశువులు మృతి..

ఇరాక్ : రాజ‌ధాని బాగ్దాద్‌లో ఓ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వార్డులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో 11 మంది శిశువులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. ప్ర‌మాదం ప‌ట్ల అప్రమత్తమైన సిబ్బంది ఎంత‌గా ప్ర‌య‌త్నించినా కొందరిని మాత్ర‌మే ర‌క్షించ‌గ‌లిగారు. 11 మంది శిశువులు స‌జీవ ద‌హ‌నం కావ‌డంతో ఆసుప‌త్రి ప‌రిస‌రాల్లో విషాద‌ఛాయ‌లు అల‌ముకున్నాయి. ప్ర‌మాదంలో ఓ తండ్రి త‌న‌ కవల పిల్లలను కోల్పోయి రోదించడం అంద‌రినీ క‌ల‌చివేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్ర‌మాదం జ‌రిగింద‌ని సిబ్బంది చెబుతున్నారు.

పుష్కరాలకు టీఎస్.ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు కూడా రోజువారీ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. 13,14,15 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉంటుందని అంచనా వేసినట్లు వెల్లడించారు. 

యువతిపై గ్యాంగ్ రేప్!..

మెదక్: మెదక్ జిల్లా చిన్నకోడూరుకు చెందిన యువతి(20)పై గత నాలుగు నెలలుగా అదే ప్రాంతానికి చెందిన 5గురు యువకులు లైంగిక దాడికి పాల్పడుతున్నారు. విషయం ఎవరికైనా చెప్తే.. కుటుంబ సభ్యులందర్ని చంపుతామని బెదిరించి యువతిపై పలుమార్లు అత్యాచారం చేశారు.యువతి గర్భవతి కావడంతో విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

పుష్కరాల వెబ్ సైట్ ప్రారంభం..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాల ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 5.58 నిమిషాలకు పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. గొందిమళ్లలో పీఠాధిపతులు, సీఎం కేసీఆర్ పుష్కరస్నానాలతో సంరంభం ప్రారంభం కానుంది. పుష్కరాల వెబ్‌సైట్‌ను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. వెబ్‌సైట్ చిరునామా PUSHKARALU.TELANGANA.GOV.IN, ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వెబ్‌సైట్లో అన్ని రకాల సమాచారం పొందుపరిచామని వెల్లడించారు. 

18:11 - August 10, 2016

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు.జిల్లాలో వున్న 52 పుష్కరఘాట్లలో పది ఘాట్ల దగ్గర రద్దీ ఎక్కువగా వుంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలంపూర్‌లో పుష్కర స్నానం చేసే అవకాశముందని మంత్రి తెలిపారు. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో రూ.700 కోట్లతో పుష్కర ఏర్పాట్లు చేశామని తెలిపారు.

18:06 - August 10, 2016

హైదరాబాద్ : బీఎస్ఎన్ఎల్ కొత్త స్కీమ్స్ తో వినియోగదారులను ఆకర్షించే పనిలో పడింది. చిరునవ్వుతో మీ సేవలో అనే కొత్త స్కీమ్‌ని ఇవాళ ఆవిష్కరించింది. అతి తక్కువ ధరల్లో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. రెంట్‌ ఫ్రీ లాండ్‌లైన్ ఫెసిలిటీని కల్పించడమే కాకుండా ఫ్రీ నైట్‌కాల్స్‌ కూడా ఇస్తోంది. 2 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 10జీబీ డాటాను అందించనున్నట్టు తెలంగాణ సిజీఎం అనంతరామ్ తెలిపారు. గతంతో పోలిస్తే బిఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల సంఖ్య పెరుగుతుందన్నారు. దేశ వ్యాప్తంగా టవర్స్‌ సంఖ్యని పెంచడమే కాకుండా పుష్కరాల సమయంలో సర్వీసులు అందరికన్నా బాగా ఇవ్వగలుగుతున్నామని అనంతరామ్‌ గుర్తుచేసారు. 

18:03 - August 10, 2016

ఖమ్మం : ఖమ్మం : జిల్లా కొత్తగూడెం మండలం వేకళ్లలో పోడు భూముల వద్ద మళ్లీ రగడ మొదలైంది. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులను.. ఫారెస్ట్, పోలీస్ సిబ్బంది అడ్డుకోవడంతో.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పోలీసులు 11 మంది పోడు రైతులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత దళితులకు మూడెకరాల భూమినిస్తామన్న ప్రభుత్వం వాటి ఊసే ఎత్తటం లేదటం లేదు సరికదా..గత 50 సంవత్సరాలు ఆదివాసీలు సాగుచేసుకుంటున్న భూములకు ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని ఆరోపించారు. వారు సాగుచేసుకుంటున్న భూములకు వెంటనే పట్టాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలపై ఉద్యమాలు చేసేవారిపై నిర్భందాలు విధించినంత మాత్రాన ఉద్యమాలు ఆగవని కేసీఆర్ ప్రభుత్వం గమనించాలన్నారు. న్యాయం కోసం చేసే ప్రజాఉద్యమాలే ఎప్పటికైనా విజయం సాధిస్తాయని తెలిపారు. ఉద్యమాలను అణిచివేయాలని యత్నించిన గత ప్రభుత్వాలకు పట్టిన గతే టీఆర్ఎస్ కు పడుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదివాసీలు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. పోడుభూముల విషయంలోనే కాకుండా చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం భూసేకరణకు పాల్పడుతోందనీ.. భూ నిర్వాశితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

 

17:54 - August 10, 2016

వరంగల్ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ జిల్లాలో సెకండ్‌ ఏఎన్ఎంలు ఆందోళన ఉధృతం చేశారు. డీఎం అండ్‌ హెచ్ వో కార్యాలయాన్ని ముట్టడించి మహా ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన విరమించబోమంటున్నారు.ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

17:50 - August 10, 2016

మెదక్ : కేసీఆర్ ప్రభుత్వ తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ మాజీ విప్ జగ్గారెడ్డి ఆమరణ దీక్షను భగ్నం చేయడంతో ఆయన సంగారెడ్డికి చేరుకున్నారు. రాష్ట్రంలో భూనిర్వాసితులపై ప్రభుత్వం అణచివేత ధోరణిలో వ్యవహరిస్తోందని ఉత్తమ్ విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ పోరాటం ఆగబోదన్నారు. 

17:47 - August 10, 2016

తూర్పుగోదావరి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రంలో మోదీ సర్కార్‌ దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో దళితులపై జరిగిన దాడిని ఆమె ఖండించారు. అమలాపురం ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని.. వారిని మనుషులుగా చూడటం లేదని ఉప్పులేటి కల్పన మండిపడ్డారు.

17:44 - August 10, 2016

ఢిల్లీ : మాదిగ రిజర్వేషన్లు తప్పనిసరని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఢిల్లీలో ఎమ్మార్పీఎస్‌ మహాధర్నాకు మద్దతిచ్చిన ఆయన రిజర్వేషన్ల ద్వారానే అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. మాదిగ రిజర్వేషన్లపై ప్రధానితో మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చారు. జనాభా ప్రాతిపధికన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. 

17:41 - August 10, 2016

హైదరాబాద్ : ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్‌ మౌలాలికి చెందిన మహ్మద్‌ షఫీ మరపల్లిలో 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. బోరు వేసేందుకు విద్యుత్‌ సరఫరా కోసం ఏఈ ఏడుకొండల్‌ రెడ్డిని సంప్రదించగా.. 25 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. అధికారులు వలపన్ని తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి వద్ద అవినీతి అధికారిని పట్టుకున్నారు. అతడి నుంచి 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

17:39 - August 10, 2016

హైదరాబాద్ : కోర్టు అనుమతితో రంగారెడ్డి జిల్లా అల్కాపూర్‌లోని నయీం ఇంట్లో పోలీసులు మళ్లీ సోదాలు నిర్వహించారు. సీజ్‌ చేసిన ఇంటిని ఓపెన్‌ చేసి.. నయీం బెడ్‌రూమ్‌ను తెరిచి తనిఖీలు చేపడుతున్నారు. నిన్నటివరకు జరిగిన తనిఖీల్లో వేల కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. అయితే.. బెడ్‌రూమ్‌లో మరిన్ని విలువైన ఆస్తుల వివరాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది.

2 బ్యాగుల్లో కీలక డాక్యుమెంట్లు..
అల్కాపూరిలోని నయీం ఇంట్లో ఉదయం నుంచి కొనసాగుతున్న తనిఖీలు కొనసాగుతున్నాయి ..2 బ్యాగుల్లో కీలక డాక్యుమెంట్లను తరలించిన పోలీసులు..సోదాలను కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..నయీం ఆస్తుల చిట్టా గురించి తెలుసుకోండి..

ప్రభుత్వ ఆస్పత్రి భవనం కూల్చివేత..

హైదరాబాద్: ప్రమాదకరంగా మారిన పురాతన భవనాలు కూల్చడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం ముషీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని పురాతన భవనాన్ని పరిశీలించిన అధికారులు భవనం శిథిలావస్థకు చేరుకుందని నిర్ధరించుకున్నారు. భవనం పూర్తిగా దెబ్బతినడంతో.. వర్షాలు కురుస్తున్న సమయంలో ఎప్పుడైన అది కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు భవనాన్ని కూల్చివేస్తున్నారు. 

దళితులపై దాడి ఘటనలో సీఎంకు డీజీపీ నివేదిక..

విజయవాడ : అమలాపురం దళితులపై దాడి ఘటనలకు సంబంధించి సీఎం చంద్రబాబుక డీజీపీ నివేదిక అందజేశారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలింగించినా ఉపేక్షించమని ఆయన పేర్కొన్నారు. దళితులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపిని ఆదేశించారు. గాయపడిన దళితులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు రూ.లక్ష పరిహారం అందజేయాలని కలెక్టర్ కు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

 

గుడిలోకి రాకుండా దళితులను అడ్డుకున్న అగ్రవర్ణాలు..

మెదక్ : జిన్నారం మండలం మంబపూర్ గ్రామంలో పెద్దమ్మతల్లి విగ్రహావిష్కరణ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో డప్పు కొడుతున్న దళితులను ఆలయ ప్రాంగణంలోనికి రాకుండా నిషేధించారు. దీంతో కోపోద్రిక్తులైన దళితులు బలవంతంగా ఆలయ ప్రవేశం చేయడానికి ప్రయత్నించగా.. అగ్రకులాల వారు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంతకి గుడిలోపలికి దళితులను రానివ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 

ఇద్దరు బాలికలు ఆత్మహత్యాయత్నం ..

నిజామాబాద్: జిల్లాలోని తాడ్వాయి మండలం ఎండ్రియాల్‌లో ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు యత్నించారు.  ఉన్నతపాఠశాల తరగతిగదిలో విద్యార్థినులు పురుగుల మందు తాగినట్లు సమాచారం. విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం  కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు.

 

17:00 - August 10, 2016

మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నది. తెలంగాణలో నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కలిపి కృష్ణానది 281 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్నది. ఆగస్టు 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కృష్ణా పుష్కరాలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పుష్కర ఏర్పాట్లపై మంత్రి లక్ష్మారెడ్డి మాట్టాడుతూ.. పుష్కరాలంటేనే ఆంధ్రాలోనే తప్ప తెలంగాణాలో పుష్కరాలు వుండవన్నట్లుగా గత పాలకులు వ్యవహరించేవారని ఆయన విమర్శించారు. కృష్ణానది పుష్కరాలను మహబూబ్ నగర్ జిల్లా 50 ఘాట్లను ఏర్పాటు చేశామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు కోట్లమంది పుష్కర స్నానం చేసే అవకాశముందని ఆయన తెలిపారు. స్నానమాచరించేందుకు వచ్చే భక్తులకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశామన్నారు. పుష్కరా స్నానానికి సీఎం కేసీఆర్ 11వ తేదీ రాత్రి మహబూబ్ నగర్ కు చేరుకుని తెల్లవారుఝామున గొందిమెళ్ళలో సీఎం కేసీఆర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించి జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. 

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 310 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 27,775 వద్ద ముగిసింది. 103 పాయింట్లు నష్టపోయిన నిఫ్టి 8,575 వద్ద ముగిసింది. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,970గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,890గా ఉంది. కిలో వెండి ధర రూ.50764గా ఉంది.

అణువిద్యుత్ కేంద్రాన్ని జాతి అంకితం చేసిన ప్రధాని..

తమిళనాడు : తమిళనాడు రాష్ట్రం కూడంకుళంలోని అణు విద్యుత్ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, రష్యా అధ్యక్షుడు పుతిన్లు కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. తిరునల్వెలి జిల్లా కూడంకుళంలో భారత్-రష్యాలు సంయుక్తంగా రూ.22వేల కోట్లతో రెండు యూనిట్ల అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించాయి. కాగా, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా కూడంకుళం ప్లాంటును మూసివేయాలంటూ రెండేళ్లుగా స్థానిక ప్రజలు పోరాడుతున్న సంగతి తెలిసిందే.

 

 

మీడియా ముందుకు లష్కరే తీవ్రవాది బహదూర్ అలీ..

హైదరాబాద్: జులై 25న నౌగామ్ ప్రాంతంలో లష్కరేతొయిబా తీవ్రవాది బహదూర్ అలీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అలీని ఎన్‌ఐఏ మీడియా ముందు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఎన్‌ఐఏ అధికారులు మాట్లాడుతూ... పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో లష్కరేతొయిబా క్యాంపులు నిర్వహిస్తుందని అధికారులు వెల్లడించారు. 30 నుంచి 50 మందితో లష్కరే తొయిబా క్యాంపు నిర్వహిస్తోంది. క్యాంపుల్లో తీవ్రవాదులకు లష్కరేతొయిబా శిక్షణ ఇస్తుంది. కశ్మీర్ పరిస్థితిని అవకాశంగా మలచుకునేందుకు ఎల్‌ఈటీ యత్నిస్తుంది. బహుదూర్ అలీ వంటి వారిని చొరబాటు ద్వారా కశ్మీర్‌కు పంపిందని అధికారులు తెలిపారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు..

హైద‌రాబాద్‌: కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివ‌ర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేస్తూ సీఎం కేసీఆర్ ఉత్త‌ర్వులు జారీచేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటయ్యింది. కడియం, ఈటెల, తుమ్మల, జూపల్లి సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ క‌మిటీలో జిల్లాల సంఖ్య‌, కొత్త జిల్లాల నుంచి కార్య‌క‌లాపాల‌పై అధ్య‌య‌నం చేయ‌నుంది. తాత్కాలిక ఏర్పాట్లు, వ‌స‌తి, మౌలిక స‌దుపాయాల క‌ల్పన‌పై ఈ క‌మిటీ దృష్టి సారించ‌నుంది. ఉద్యోగుల కేటాయింపు, జోనల్, శాఖల పునర్వ్యవస్థీకరణపై అధ్యయనం చేయనుంది. వారంలోగా నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

పంపులో నీరు త్రాగారని దళితులపై దాడి..

ఉత్తరప్రదేశ్‌ : దళితులపై దాడులు ఎక్కువవుతున్నాయి. యూపీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో గో సంరక్షణ పేరుతో దళితులపై దాడి చేసిన ఘటనలు వెలుగులోకి రాగా.. ఇప్పుడు తాజాగా ఓ ఆశ్రమంలోని చేతిపంపు వద్ద నీరు తాగినందుకుగానూ దళిత కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లపై దాడి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

15:50 - August 10, 2016

విజయవాడ : కాంగ్రెస్ పుష్కర కమిటీ సభ్యులు విజయవాడలో నిర్మాణమవుతున్న పుష్కరఘాట్లను పరిశీలించారు. సీఎల్పీ లీడర్ సి. రామచంద్రయ్య ఆధ్వర్యంలో పద్మావతిఘాట్‌ నుంచి పున్నమిఘాట్ వరకు పూర్తయిన పనులను పరిశీలించారు. భక్తిపరమైన కార్యక్రమాన్ని చంద్రబాబు ఆర్భాటం కోసం చేయటమే తప్ప, భక్తుల ప్రయోజనం కోసం కాదని నేతలు విమర్శించారు. 

15:45 - August 10, 2016

మెదక్ : టీపీసీసీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డి ఆమరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు బయలుదేరిన ఆయన్ను మార్గమధ్యంలోనే అరెస్ట్ చేసి ఇంద్రకరణ్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎన్ని ఆంటకాలు ఎదురైనా మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేంత వరకు దశల వారీ పోరాటం చేస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టులకు మేం వ్యతిరేకంగా కాదనీ..అదే క్రమంలో రైతులకు న్యాయం జరగాలంటే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూమిమీదనే ఆధారపడి బ్రతుకుతున్న రైతులకు మాత్రం అన్యాయం చేస్తే మరోసారి ఉద్యమాన్ని చేపడతామని ఆయన పేర్కొన్నారు.

15:40 - August 10, 2016

హైదరాబాద్ : నయీం కేసులను విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంఘం-సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీచేశారు. ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో ఈ సిట్ పనిచేయనుంది. విచారణ అధికారులుగా ఓ ఎస్పీతో పాటు ఇద్దరు డీఎస్పీలను ఏర్పాటు చేసింది. నయూం అనుచరులపై ఉన్న అన్ని కేసులను సిట్ విచారణ చేయనుంది.

అల్కాపూర్‌లోని నయీం ఇంట్లో పోలీసులు సోదాలు..
కోర్టు అనుమతితో రంగారెడ్డి జిల్లా అల్కాపూర్‌లోని నయీం ఇంట్లో పోలీసులు మళ్లీ సోదాలు నిర్వహిస్తున్నారు. సీజ్‌ చేసిన ఇంటిని ఓపెన్‌ చేసి.. నయీం బెడ్‌రూమ్‌ను తెరిచి తనిఖీలు చేపట్టారు. నిన్నటివరకు జరిగిన తనిఖీల్లో వేల కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. అయితే.. బెడ్‌రూమ్‌లో మరిన్ని విలువైన ఆస్తుల వివరాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. 

నితిన్ గడ్కరీతో మంత్రి తుమ్మల భేటీ..

ఢిల్లీ: కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. సమావేశంలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్రతేజావత్, తెలంగాణ పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రోడ్ల విస్తరణపై సమావేశంలో చర్చిచారు.

నయీం కేసు సిట్ కు అప్పగింత..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసును డీజీపీ అనురాగ్ శర్మ సిట్ కు అప్పగించారు. ఐజీ నాగిరెడ్డి నేతీత్వంలో సిట్ పనిచేయనుంది. విచారణ అధికారులుగా ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు వ్యవహరించనున్నారు. నయీం, అతని అనుచరులపై వున్న అన్ని కేసులపై సిట్ విచారణ చేయనుంది.

ఏసీబీకి చిక్కిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్..

విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న మాధవరావు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బుధవారం నాడు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏకకాలంలో మాధవ రావు ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లపై దాడులు జరిపారు. సుమారు రూ. కోటి 50 లక్షల ఆస్తులను గుర్తించారు. 20 తులాల బంగారం, కెనరాబ్యాంకు లాకర్‌లో నగదు ఉన్నట్లు గుర్తించారు. 

14:51 - August 10, 2016

ఢిల్లీ : కశ్మీర్‌ ప్రజలకు పాలకులు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతోనే ఆ రాష్ట్రంలో రోజు రోజుకు అశాంతి పెరుగుతోందని సీపీఎం సభ్యులు సీతారాం ఏచూరి రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో నెలకొన్న అశాంతిపై జరిగిన చర్చలో పాల్గొన్న ఏచూరి... ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370తో పాటు పలు అంశాలను ప్రస్తావించారు. ఈ అర్టికల్‌ విషయంలో ప్రభుత్వం చేస్తున్న రకరకాల ప్రకటనలు ప్రజల్లో అశాంతికి కారణమవుతున్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా మైనారిటీలపై జరుగుతున్న దాడులు కూడా కశ్మీర్‌ ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. రాజకీయ చర్చలతోనే కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఏచూరి సూచించారు. 

14:35 - August 10, 2016

విశాఖపట్నం: విశాఖ ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. జీవీఎంసీ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వీర మాధవరావు ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా దాదాపు కోటిన్నర రూపాయలకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించారు. ఇవికాకుండా జిల్లాలోని దేవారాపల్లి, తాడువాయిలో 15 ఎకరాల భూమి, భీమిలిలో స్థలాలను గుర్తించారు. 20 తులాల బంగారు ఆభరణాలు, రెండు బ్యాంక్‌ లాకర్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ పరిసర ప్రాంతాలలో దాదాపు ఎనిమిది ప్రదేశాలలో అధికారులు దాడులు నిర్విహించారు.

14:32 - August 10, 2016

హైదరాబాద్ : నయీం కేసులో పోలీసులు మరింత స్పీడ్‌ పెంచారు. నయీం అరాచాకాలను బయటకు తీసేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రెండు, మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. ఇప్పటికే అరెస్ట్‌ చేసిన నయీం బంధువులు ఫరానా, హర్షియాలను కస్టడీలోకి తీసుకున్నారు. మహిళల అక్రమ రవాణాపై పోలీసులు వీరిని మూడు రోజులు విచారించనున్నారు.

నయీం బెడ్ రూమ్ ను ఓపెన్ చేసిన పోలీసులు ..
కోర్టు అనుమతితో రంగారెడ్డి జిల్లా అల్కాపూర్‌లోని నయీం ఇంట్లో పోలీసులు మళ్లీ సోదాలు నిర్వహించారు. సీజ్‌ చేసిన ఇంటిని ఓపెన్‌ చేసి.. నయీం బెడ్‌రూమ్‌ను తెరిచి తనిఖీలు చేపడుతున్నారు. నిన్నటివరకు జరిగిన తనిఖీల్లో వేల కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. అయితే.. బెడ్‌రూమ్‌లో మరిన్ని విలువైన ఆస్తుల వివరాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

నయీం కేసు సీఐడీకి ?..

హైదరాబాద్ : నయీం కేసును సీఐడీకి అప్పగించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. సాయంత్రం డీజీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 

వరుస పేలుళ్లతో దద్దరిల్లుతున్న ఇంఫాల్!..

మణిపూర్‌ : రాజధాని ఇంఫాల్‌లో ఈరోజు వరుస పేలుళ్లు సంభవించాయి. ఉదయం ఓ పేలుడు సంభవించగా.. ఇప్పుడు రెండోసారి బాంబు పేలింది. తాజాగా ఇంఫాల్‌లోని మణిపూర్‌ యూనివర్సిటీ గేట్‌ వద్ద బాంబు పేలింది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడినదీ లేనిదీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతకుముందు ఉదయం 9 గంటల ప్రాతంలో ఇంఫాల్‌ ఈస్ట్‌లోని బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌ సమీపంలో ఐఈడీ పేలడంతో ఏడేళ్ల బాలిక గాయపడింది. మోయిరాంగ్‌ పురెల్‌ గ్రామంలో ఈ పేలుడు జరిగిందని.. గాయపడిన పాపను ఇంఫాల్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పేలుళ్ల కారణంగా పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మోహరించారు.

14:26 - August 10, 2016

హైదరాబాద్ : నయీం కేసును సీఐడీకి అప్పగించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. సాయంత్రం డీజీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కేసు విచారణ కోసం నాలుగు సీఐడీ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు విచారణ అధికారులుగా ఉండనున్నారు. ఐజీ సౌమ్యామిశ్రా నేతృత్వంలో నాలుగు బృందాలు పని చేయనున్నాయి. 

నయీం ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు

రంగారెడ్డి : కోర్టు అనుమతితో రంగారెడ్డి జిల్లా అల్కాపురిలోని నయీం ఇంట్లో పోలీసులు మళ్లీ సోదాలు నిర్వహించారు. ఈరోజు పోలీసులు నయీం బెడ్‌రూమ్‌ను ఓపెన్‌ చేయనున్నారు. నిన్నటివరకు జరిగిన తనిఖీల్లో వేల కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఇక ఈరోజు జరిగే సోదాలతో మరెన్నో వాస్తవాలు బయటపడతాయో చూడాలి. 

13:49 - August 10, 2016

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం కాలయాపన చేయడం తగదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రాన్ని విభజించి కష్టాల్లో నెట్టేశాయని ఆరోపించారు. త్వరలోనే ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రకటన ఇవ్వకపోతే ఒత్తిడి పెంచుతామని తెలిపారు. తన కేసులు మాఫీ చేసుకునేందుకే జగన్ ఢిల్లీ ప్రదక్షిణలు చేస్తున్నాడే తప్ప హోదా కోసం కాదని మంత్రి విమర్శించారు.

13:47 - August 10, 2016

ముస్లీం వివాహాల రద్దు చట్టంలోని అంశాలను లాయర్ పార్వతి వివరించారు. ఇదే అంశంపై మానవి నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ముస్లీం దంపతులు.. వారి సంసారం పొసగనప్పుడు విడాకులు కోర్టులకు వెళ్తారు. మిరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

13:46 - August 10, 2016

హైదరాబాద్ : అమలాపురంలో దళితులపై దాడులను నిరసిస్తూ హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్‌ వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దళితులపై దాడికి పాల్పడిన దుండగుల దిష్టిబొమ్మను కేవీపీఎస్‌ కార్యకర్తలు దహనం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాల్సిన అవసరముందని కేవీపీఎస్‌ నేత రాములు అన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

 

13:43 - August 10, 2016

గుంటూరు : అమలాపురంలో దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుంటూరులో దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 
దళిత సంఘం నేత...
'రాష్ట్రం, దేశ వ్యాప్తంగా దళితలపై దాడులు చేస్తున్నారు. హిందూమత ఉన్మాదులు దాడులు చేస్తున్నారు. సమాజానికి సేవలందించే మాదిగా జాతిపై దాడులు చేస్తున్నారు. బీజీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయి. ఆర్ ఎస్ ఎస్, హిందూ మనువాద సంస్థలకు దాడులకు తెగబడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో నలుగురు దళిత యువకులపై దాడులు చేశారు. దళితులపై దాడి ఘటనలపై మోడీ మాట్లాడడం లేదు. ప్రధాని నోరు విప్పాలి. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని' డిమాండ్ చేశారు.
 

13:34 - August 10, 2016

రంగారెడ్డి : కోర్టు అనుమతితో రంగారెడ్డి జిల్లా అల్కాపురిలోని నయీం ఇంట్లో పోలీసులు మళ్లీ సోదాలు నిర్వహించారు. ఈరోజు పోలీసులు నయీం బెడ్‌రూమ్‌ను ఓపెన్‌ చేయనున్నారు. నిన్నటివరకు జరిగిన తనిఖీల్లో వేల కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఇక ఈరోజు జరిగే సోదాలతో మరెన్నో వాస్తవాలు బయటపడతాయో చూడాలి. 

 

13:29 - August 10, 2016

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్ట్‌లో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లో నీటిమట్టం 865.80 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇన్‌ఫ్లో 1,45,325 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 14,833 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరు శ్రీశైలంలోకి చేరుతోంది. 

 

కశ్మీర్ రగిలిపోతుంటే ప్రధాని మౌనం : ఆజాద్

ఢిల్లీ : కశ్మీర్ కల్లోలంపై రాజ్యసభలో హాట్ హాట్ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్  మాట్లాడారు. కశ్మీర్ రగిలిపోతుంటే ప్రధాని మౌనంగా చూస్తున్నారని విమర్శించారు. కశ్మీర్ పై పార్లమెంట్ లో ప్రస్తావించని ప్రధాని మధ్యప్రదేశ్ నుంచి ప్రకటన చేశారని తెలిపారు. బిజెపి అడుగుపెట్టడంతో కశ్మీర్ భగ్గుమందన్నారు. కశ్మీర్ లో సాధారణ పరిస్థితి నెలకొల్పడానికి అఖిలపక్షం నిర్వహించాలన్నారు

13:03 - August 10, 2016

ఢిల్లీ : కశ్మీర్ కల్లోలంపై రాజ్యసభలో హాట్ హాట్ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్  మాట్లాడారు. కశ్మీర్ రగిలిపోతుంటే ప్రధాని మౌనంగా చూస్తున్నారని విమర్శించారు. కశ్మీర్ పై పార్లమెంట్ లో ప్రస్తావించని ప్రధాని మధ్యప్రదేశ్ నుంచి ప్రకటన చేశారని తెలిపారు. బిజెపి అడుగుపెట్టడంతో కశ్మీర్ భగ్గుమందన్నారు. కశ్మీర్ లో సాధారణ పరిస్థితి నెలకొల్పడానికి అఖిలపక్షం నిర్వహించాలన్నారు. 

12:52 - August 10, 2016

రంగారెడ్డి : జిల్లాలోని మోమిన్‌పేటకు చెందిన ఎలక్ట్రికల్‌ ఏఈ ఏడుకొండలు ఏసీబీకి చిక్కాడు. విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి.. తార్నాక దగ్గర 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏడుకొండలను రేపు ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని ఉన్నతాధికారులు తెలిపారు. 

 

12:49 - August 10, 2016

హైదరాబాద్ : మియాపూర్‌-ఎస్ ఆర్‌ నగర్‌ మధ్య మెట్రో రైలు మార్గం పూర్తయింది. దీంతో మియాపూర్‌ నుంచి ఎస్‌ ఆర్‌ నగర్‌ వరకు.. అధికారులు మెట్రో రైలు ట్రయల్‌ రన్‌ను చేపట్టారు. రైల్వే సేఫ్టీ అధికారులు దగ్గరుండి ట్రయల్‌ రన్‌ను పరిశీలించారు. 

 

12:47 - August 10, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీం ప్రధాన అనుచరుడు రియాజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ అపార్ట్‌మెంట్‌లో రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని నుంచి తుపాకితో పాటు జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం చేసుకున్నారు. రియాజ్‌ను నల్లగొండకు తరలించి పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 

 

నయీం అనుచరుడు రియాజ్ అరెస్ట్‌..

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీం ప్రధాన అనుచరుడు రియాజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ అపార్ట్‌మెంట్‌లో రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని నుంచి తుపాకితో పాటు.. జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం చేసుకున్నారు. రియాజ్‌ను నల్లగొండకు తరలించి పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 

12:41 - August 10, 2016

కరీంనగర్ : సూసైడ్‌ నోట్‌ రాశాడు... తనచావుకు కారణాలను వివరించాడు.. అయినా... మృతుని బంధువులు మాత్రం గంటల వ్యవధిలోనే మాటమార్చారు. మా వాడి చావుకు వేరే కారణాలు ఉన్నాయంటున్నారు. ఒకరు అనారోగ్య సమస్య అంటే... మరొకరు ఆస్తి సమస్య అంటూ పొంతనలేని  సమాధానాలు చెబుతున్నారు. కరీంనగర్‌ జిల్లాలో రైతు నారాయణరెడ్డి ఆత్మహత్య వ్యవహారంలో బంధువుల మాటలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. 
నారాయణరెడ్డి ఆత్మహ్యతపై అనుమానాలు 
కరీంనగర్‌ జిల్లాలో రైతు నారాయణరెడ్డి ఆత్మహత్యలో మరోట్విస్ట్‌ చోటుచేసుకుంది. తన తండ్రి ఆనారోగ్య సమస్యతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని కూతురు చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన పొలం కాజేయడానికే మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి  కుట్రపూరింతంగా వ్యవహరించారని.. అందుకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్‌ నోట్‌ రాసిమరీ రైతు నారాయణరెడ్డి చనిపోయారు. అయితే.. నారాయణరెడ్డి చనిపోయిన కొద్దిగంటల్లోనే సీన్‌ మారింది.  కడుపునొప్పి  భరించలేకనే నారాయణరెడ్డి ఆత్మహత్యచేసుకున్నారని... మృతుని కూతురు, సోదరుడు మీడియా ముందుకొచ్చారు.  తన తండ్రి ఆత్మహత్యతో మోహన్‌రెడ్డికి ఎటువంటి సంబంధంలేదని మృతుడు నారాయణరెడ్డి కూతురు అంటోంది. దీంతో రైతు నారాయణరెడ్డి మరణంపై అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి. 
మృతుని బంధువులకు మోహన్‌రెడ్డి బెదరింపులు..?
ఇంకోవిషయం ఏంటంటే.. సూసైడ్‌ నోట్‌ రాసింది నారాయణరెడ్డే అని  ఒప్పుకుంటున్న కుటుంబసభ్యులు... ఈవిషయంలో ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి హస్తం లేదని చెప్పడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. మృతుని బంధువులను బెదిరించి మోహన్‌రెడ్డే ఇలా చెప్పిస్తున్నారే  ఆరోపణలొపస్తున్నాయి. బాధితులను భయపెట్టి కేసును నీరుగార్చేందుకు మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. 

 

12:40 - August 10, 2016

హైదరాబాద్ : నగర వాసులు ఫ్లూజ్వరాల విలవిల్లాడుతున్నారు. వాతవ‌ర‌ణంలో వ‌చ్చిన మార్పులతో పాటు దోమలవల్ల రోగాలు పెరిగిపోతున్నాయి.   రెండు వారాలుగా  సిటిలో ప్లూ జ్వరాలు, విరేచ‌నాలు, మ‌లేరియా, డెంగ్యూ, క‌ల‌రా, డ‌యేరియా వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి. దీంతో రోగుల‌తో సిటిలోని ఆసుప‌త్రులన్ని నిండిపోతున్నాయి.  
100 మందితో కిటకిటలాడుతున్న ఔట్ పేషేంట్స్ విభాగాలు 
ఆసుప‌త్రుల్లోని ఔట్ పేషేంట్స్ విభాగాలు వంద‌లాది మందితో కిటకిటలాడుతున్నాయి. రెగ్యుల‌ర్‌గా ప్రతి రోజు 500 ఓపిలు ఉండే ఫీవ‌ర్ అసుప‌త్రి వ‌ద్ద గ‌త రెండు వారాలుగా రద్దీ ఐదు రెట్లు పెరిగింది. దీంతో ఒపిటైమ్‌ను కూడా పెంచారు. ఆసుపత్రికి వ‌చ్చిన ప్రతి ఒక్కరికి వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వాసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక...రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఇకనైనా ప్రధాన ఆసుప‌త్రుల్లో క‌నీస సౌక‌ర్యాలైనా ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు.   

 

12:38 - August 10, 2016

శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న 'శతమానం భవతి' చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. శర్వానంద్... గమ్యం, రన్ రాజ రన్ వంటి పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అ... ఆ సినిమాలో ప్రత్యేకపాత్రలో నటించిన కేరళ నటి అనుపమపరమేశ్వరన్ తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఈ సినిమాకు వేగేశ్న సతీష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, జయసుధ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. 

12:09 - August 10, 2016

మెదక్ : జిల్లాలోని సంగారెడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా దీక్ష చేపట్టేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. జగ్గారెడ్డిని సంగారెడ్డికి పీఎస్ కు తరలించారు. కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న గెస్టుహౌజ్ వద్ద ఆయన ఆమరణనిరాహాదీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు దీక్ష చేపట్టేందుకు జగ్గారెడ్డి ఐదు వందలమంది కార్యకర్తలతో కొత్త బస్టాండ్ వద్ద ఉన్న గెస్టుహౌజ్ వద్దకు వెళ్తున్నాడు. ఈనేపథ్యంలో పాత బస్టాండ్ సెంటర్ లో పోలీసులు జగ్గారెడ్డిని అరెస్టు చేశారు. సంగారెడ్డి పీఎస్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

సంగారెడ్డిలో ఉద్రిక్తత

మెదక్ : జిల్లాలోని సంగారెడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా దీక్ష చేపట్టేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డికి పీఎస్ కు జగ్గారెడ్డిని తరలించారు. 

11:46 - August 10, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు దూకుడు పెంచారు...నయీం అనుచరులపై దృష్టి సారించిన పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు.. నయీంతో కలిసి దందాలు చేసినవారు..నయీం బినామీగా ఉన్నవారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు...నయీం అనుచరుల ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులకు కీలక డాక్యుమెంట్లతో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు...
అనుచరులపై పోలీసుల నిఘా...
షాద్‌నగర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్‌ నయీం మృతి చెందడంతో పోలీసులు ఇక అతని అనుచరులపై దృష్టి పెట్టారు... వందల కోట్ల ఆస్తులు సంపాదించినట్లు వస్తున్న అనుమానాలపై పోలీసులు దృష్టి సారించారు...ఎన్నో రకాల ఆరాచకాలు చేస్తూ కోట్లు సంపాదించిన ఈ గ్యాంగ్‌లో నయీంకు ప్రధాన అనుచరులుగా ఉంటున్నవారిని గుర్తించారు..వారి ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు....
జిల్లాలో ఐదుగురు అరెస్టు...
నల్గొండ జిల్లాలో గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరులు ఐదుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...భువనగిరిలో ఇద్దరు, వలిగొండలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు విచారించారు....పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న సమయంలో వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తుండగా మారణాయుధాలు దొరికాయి...భువనగిరి ఎంపీపీ తోటకూర వెంకటేశ్‌ యాదవ్‌ ప్రధాన అనుచరుడిగా భావిస్తున్నారు..అతన్ని విచారించిన పోలీసులు వెంకటేశ్‌ యాదవ్‌ నుంచి తపంచా, 4 రౌండ్ల తూటాలు, విలువైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు...ఇక భువనగిరి మున్సిపల్‌ కౌన్సిలర్‌ నాజర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాజర్‌ నుంచి తపంచా, నాలుగురౌండ్ల తూటాలు, రూ.71వేలు, దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు....వలిగొండలో కొనపురి శంకర్‌, శ్రీశైలం, గుండు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు...
నయీం పేరు చెప్పి..
పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుచరుల్లో ప్రజాప్రతినిధులుగా ఉంటున్న వీరిలో కొందరు సెటిల్‌మెంట్లు చేయడంలో కీలకమని తెలుస్తోంది...ఎక్కడైనా ఏదైనా కాంటవర్సీ ఉందంటే చాలు వీరు డీల్ చేసేవారు..నయీం పేరు చెప్పి..నయీంతో పాటే కేసులన్నీ డీల్ చేస్తూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు..వీరి ఇళ్లలో దొరికిన డాక్యుమెంట్లు కూడా దీనికి సంబంధించిందని తెలుస్తోంది...
నయీం బంధువులు అరెస్టు...
నయీం బంధువులు ఫరా, హర్షియాలను అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు వారిని రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరుపరిచారు ...వీరిపై ఐపీసీ 25  1/b, 342, 366, 384, 420, 467, 488 సెక్షన్లతో పాటు ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు...నిందితులకు రాజేంద్రనగర్‌ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది....వీరిని చర్లపల్లి జైలుకు తరలించారు.

 

నయీం ఇంటిని మరోసారి తనిఖీ చేయనున్న పోలీసులు

హైదరాబాద్ : కోర్టు అనుమతితో అల్కాపూర్‌లోని నయీం ఇంటిని పోలీసులు మరోసారి తనిఖీలు చేయనున్నారు.  
నయీం ఇంటిలోని బెడ్ రూంను పోలీసులు తెరవనున్నారు.

11:42 - August 10, 2016

హైదరాబాద్ : కోర్టు అనుమతితో అల్కాపూర్‌లోని నయీం ఇంటిని పోలీసులు మరోసారి తనిఖీలు చేయనున్నారు. నయీం ఇంటిలోని బెడ్ రూంను పోలీసులు తెరవనున్నారు. ఇప్పటివరకు రూ.4 వేల కోట్ల ఆస్తుల వివరాలు సేకరించారు. నయీం డైరీలో 15 మంది ఐపీఎస్ ల వివరాలు ఉన్నాయి. నాలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులు, రియలర్టర్లను నయీం బెదిరించారు. నయీం కేసును డీజీపీ నేడు సిట్ కు అప్పగించనున్నారు. 

 

11:31 - August 10, 2016

గుంటూరు : అచంచల భక్తితో.. త్యాగ నిరతితో అమరుడయ్యాడు ఓ చక్రవర్తి.. అశేష భక్తజనంతో నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇంతకీ దేవుడిగా మారిన ఆ చక్రవర్తి ఎవరు..? ఆయన్ను కొలిచే క్షేత్రం నెలకొన్న ప్రదేశం ఏది..? ఈ విశేషాలు టెన్‌టీవీ ప్రేక్షకుల కోసం. త్యాగానికి ప్రతీకగా నిలిచిన శిబి చక్రవర్తి.. కపోతేశ్వరునిగా నిత్య నీరాజనాలు.. గుంటూరు జిల్లా నకరేకల్లు మండలం.. చేజర్ల గ్రామంలోని శ్రీ కపోతేశ్వరాలయం.. ఎన్నెన్నో విశిష్టతలతో అలరారుతోంది. ఈ ఆలయానికి సంబంధించి స్థలపురాణమొకటి ప్రచారంలో ఉంది. కాశీరాజ్యాధీశుడు శిబిచక్రవర్తి.. శత క్రతు నిర్వహణ కోసం దక్షిణాదిన పర్యటించారని.. ఆయన వంద యజ్ఞాలూ పూర్తయితే దేవేంద్రపదవికి అర్హుడవుతాడని భయపడ్డ అమరేంద్రుడు త్రిమూర్తులను శరణు వేడారట. దేవతల మాయతో.. ఓ పావురం శిబి చక్రవర్తి ముంగిట్లో వాలిందని.. దాన్ని వెంటాడుతూ మారువేషంలో వచ్చిన శివుడు కపోతాన్ని కోరాడని.. అయితే భయవిహ్వల అయిన పావురానికి బదులు తన శరీరంలోని మాంసాన్ని ఇస్తానని శిబిచెప్పాడన్నది పురాణ గాథ. అయితే శిబి చక్రవర్తి తన శరీర భాగాలను ఎంత కోసినా.. పావురానికి మాంసం సరితూగకపోవడంతో.. చివరకు తన తలను కూడా కోసి త్రాసులో ఉంచాడని.. సంతుష్టుడైన శివుడు శిబి త్యాగనిరతికి మెచ్చి వరాలు కురిపించాడని భక్తులు విశ్వసిస్తారు. శివుడి వరం మేరకే.. శిబి చక్రవర్తి .. కపోతేశ్వరునిగా.. ఆయన పరివారం కోటి లింగాలుగా చేజర్ల గ్రామంలో వెలిశారన్నది స్థలపురాణం. 
శివలింగంపైన రెండు గుంతలు 
శివలింగంపైన రెండు గుంతలు ఉన్నాయి. వాటిని మానవ శరీర భుజలుగా భావిస్తున్నారు. కుడి భుజ భాగములో ఒక బిందె నీరు మాత్రమే పడుతుందని, ఎడమ భుజ భాగములో ఎంత నీరు పోసినా శివలింగం లోపలికి వెళ్లిపోతాయని భక్తులు నమ్ముతారు. ప్రతి ఏటా కార్తీక మాసం, మహా శివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి.  3వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం నేటికి చెక్కు చెదరక.. ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. 

 

11:22 - August 10, 2016

గుంటూరు : జిల్లాలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం పుష్కరశోభను సంతరించుకుంది. గురజాల నియోజకవర్గ పరిధిలోని, పొందుగల, మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని వాడపల్లి రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలను వేరుచేస్తూ కృష్ణా నది ప్రవహిస్తోంది. పుష్కరాల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఏపీ సరిహద్దు ప్రాంతంగా ఉన్న పొందుగల వద్ద ఈసారి నూతన ఘాట్‌ నిర్మించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు పుష్కర ఘాట్ల వద్ద భక్తుల మనోభావాలు ప్రతిబింబించేలా నమూనా ఆలయాలను ఏర్పాటు చేశామని, ప్రజల మనస్సులో చిర స్థాయిగా నిలిచిపోయోలా పుష్కరాలను డిజైన్‌ చేశామని స్థానిక ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు చెప్పారు. 
ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

మియాపూర్-ఎస్ఆర్ నగర్ మెట్రోరైలు మార్గం పూర్తి

హైదరాబాద్ : మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు మెట్రోరైలు మార్గం పూర్తి అయింది. మియాపూర్ నుంచి ఎస్ ఆర్ నగర్ వరకు ట్రయల్ రన్ ను రైల్వే సేఫ్టీ అధికారులు పరిశీలించారు. 

10:39 - August 10, 2016

ఢిల్లీ : భారత జిమ్నాస్ట్ దీప కర్మాకర్ రియో ఒలింపిక్స్ లో సంచలనం సృష్టించింది. 2016 ఒలింపిక్స్ మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వాల్టింగ్ విభాగం ఫైనల్ రౌండ్ చేరి చరిత్రలో నిలిచింది.ఈ ఘనత సాధించిన భారత తొలిమహిళగా రికార్డుల్లో చేరిన త్రిపుర రాష్ట్ర మెరుపుతీగ ,వాల్టింగ్ వండర్ దీప కర్మాకర్ పై...10 స్పోర్ట్స్ స్పెషల్ ఫోకస్........
రబ్బరు బంతిలా గాల్లో ఎగురుతూ...
రబ్బరు బంతిలా గాల్లో ఎగురుతూ... విన్యాసాలు చేస్తూ...స్ర్పింగులా మెలికలు తిరిగిపోతూ సాగే ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ అనగానే.. అమెరికా, రష్యా, ఉక్రెయిన్, చైనా, కొరియా, జపాన్, రుమేనియా లాంటి దేశాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అయితే ..మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ లో గత 52 సంవత్సరాలుగా భారత్ కు చెందిన ఓ జిమ్నాస్ట్ ఒలింపిక్స్ కు అర్హత సాధించలేదంటే....ఈ ప్రపంచ క్రీడలో మనపరిస్థితి ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పురుషుల విభాగంలో భారత్ కు ప్రాతినిథ్యం 
12 దశాబ్దాల ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో.. భారత్ కు చెందిన 11 మంది పురుష జిమ్నాస్ట్ లు మాత్రమే ఒలింపిక్స్ లో పాల్గొన్నట్లుగా గత రికార్డులు చెబుతున్నాయి. 1952 ఒలింపిక్స్ లో ఇద్దరు, 1956 ఒలింపిక్స్ లో ముగ్గురు, 1964 టోక్యో ఒలింపిక్స్ లో ఆరుగురు జిమ్నాస్ట్ లు మాత్రమే పురుషుల విభాగంలో భారత్ కు ప్రాతినిథ్యం వహించారు. 1964 గేమ్స్ తర్వాత..భారత జిమ్నాస్ట్ లు ఒలింపిక్స్ అన్నమాటే మరచిపోయారు. ఇక మహిళల విభాగంలో మాత్రం భారత మహిళలకు ఒలింపిక్స్ బెర్త్ అన్నది ఓ కలగా, అందని ద్రాక్షగానే మిగిలిపోతూ వచ్చింది.
త్రిపుర మెరుపుతీగ దీప కర్మాకర్ ..
అయితే...ఆ లోటును త్రిపుర మెరుపుతీగ దీప కర్మాకర్ ..రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ద్వారా తీర్చింది. ఈశాన్య భారతంలోని అతిచిన్నరాష్ట్రాలలో ఒకటైన త్రిపుర రాజధాని అగర్తలలో.. 22 సంవత్సరాల క్రితం జన్మించిన దీప కర్మాకర్.. ఆరేళ్ల చిరుప్రాయంలోనే జిమ్నాస్ట్ గా తన క్రీడాజీవితాన్ని ప్రారంభించింది. ప్రపంచ స్థాయి శిక్షణ సౌకర్యాలు లేకున్నా స్వయం కృషితో అంతర్జాతీయ జిమ్నాస్ట్ గా గుర్తింపు సంపాదించిన దీప...అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్, రుమేనియా, ఆసియా స్థాయిలో చైనా, జపాన్, కొరియా దేశాల జిమ్నాస్ట్ ల నుంచి అసాధారణ పోటీ ఎదురైనా..ఏమాత్రం నిరాశకు గురికాలేదు. నిరాశ, నిస్పృహలకు తావే లేకుండా సాధన కొనసాగించింది. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఫ్లోర్ వాల్ట్, అన్ ఈవెన్ బార్స్, బ్యాలెన్స్ బీమ్, ఆల్ రౌండ్ విభాగాలలో తన ప్రతిభకు పదును పెట్టుకొంది.
గత 16 సం.లుగా దీప తన ప్రస్థానం  
అగర్తల లాంటి మారుమూల ప్రాంతంలో ఉన్నా.. గత పదహారు సంవత్సరాలుగా అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ లో దీప తన ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చింది. జల్పాయిగురి వేదికగా 2007లో ముగిసిన జాతీయ జూనియర్ జిమ్నాస్టిక్స్ లో విజేతగా నిలవడం ద్వారా ..దీప కర్మాకర్ తన బంగారు వేట మొదలు పెట్టింది. అంతటితో ఆగకుండా.. జాతీయ క్రీడలు, శాఫ్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ క్రీడల్లో పాల్గొంటూ తన నైపుణ్యాన్ని మెరుగుపరచుకొంటూ వచ్చింది.
2011 జాతీయక్రీడల్లో దీపకు ఐదు బంగారు పతకాలు 
2011 జాతీయక్రీడల్లో దీప ఏకంగా ఐదు బంగారు పతకాలు సాధించి తనకు తానే సాటిగా నిలిచింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ మహిళల వాల్ట్ విభాగంలో దీప కాంస్య పతకం సంపాదించింది. అదే ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో 4వ స్థానం సాధించడం ద్వారా అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకొంది. జపాన్ లోని హిరోషిమా వేదికగా జరిగిన 2015 ఆసియా జిమ్నాస్టిక్స్ లో సైతం దీప కంచుమోత మోగించింది. అదే ఏడాది ప్రపంచ జిమ్నాస్టిక్స్ లో పాల్గొనటానికి అర్హత సంపాదించిన తొలి భారత మహిళగా రికార్డుల్లో దీప చోటు సంపాదించింది.
ప్రుడునోవా వాల్ట్ వినూత్నమైన అంశాన్ని పూర్తి చేసని దీప
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ లో అత్యంత కష్టమైన, క్లిష్టమైన ప్రుడునోవా వాల్ట్... అనే వినూత్నమైన అంశాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ముగ్గురు ప్రపంచ జిమ్నాస్ట్ ల్లో ఒకరిగా దీప కర్మాకర్ సంచలనం సృష్టించింది. అంతేకాదు.. బ్రెజిల్ వాణిజ్య నగరం రియో డి జెనీరోలో జరిగే 2016 ఒలింపిక్స్ కు అర్హత కోసం నిర్వహించిన పోటీల్లో దీప ఏకంగా బంగారు పతకం సాధించడంతో పాటు...బెర్త్ ను సైతం ఖాయం చేసుకొంది. వాల్ట్ ఫైనల్స్ లో 14.833 పాయింట్లతో గోల్డెన్ క్వీన్ గా నిలిచింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా జిమ్నాస్ట్ గా చరిత్ర సృష్టించింది. దీప ఈ అసాధారణ ఘనతను భారత ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ ప్రముఖంగా ప్రస్తావించడమే కాదు..ప్రశంసల వర్షం కురిపించారు. 
కేంద్రం రూ.30 లక్షల ఆర్థికసాయం  
ఒలింపిక్స్ కు సన్నాహాల కోసం... టాప్ పథకంలో భాగంగా 30 లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని సైతం కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ ప్రకటించి తనవంతుగా ప్రోత్సాహించింది. 22 ఏళ్ల జీవితంలో 16 సంవత్సరాలపాటు జిమ్నాస్ట్ గా సాధన చేస్తూ 2009, 2011, 2013, 2014, 2015 ప్రపంచ జిమ్నాస్టిక్స్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన దీప కర్మాకర్ ఇప్పటి వరకూ 77 పతకాలు సాధిస్తే..అందులో 67 స్వర్ణపతకాలు ఉన్నాయి.
అర్జున పురస్కారానికి ఎంపిక 
భారత్ లో ఏమాత్రం ఆదరణ లేకున్నా..జిమ్నాస్ట్ గా కొనసాగుతూ దేశానికే గర్వకారణంగా నిలిచిన దీపను కేంద్రప్రభుత్వం 2015లో అర్జున పురస్కారానికి ఎంపిక చేసి వెన్నుతట్టి మరీ ప్రోత్సహించింది. అంతేకాదు...రియో ఒలింపిక్స్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వాల్టింగ్ విభాగం ఫైనల్స్ చేరి..ఈ ఘనత సాధించిన భారత తొలిజిమ్నాస్ట్ గా తనకు తానే సాటిగా నిలిచింది.ఈనెల 14న జరిగే ఫైనల్ రౌండ్లో దీప పతకం కోసం పోటీపడనుంది.
ఎనిమిదో స్థానంలో దీప
క్వాలిఫైయింగ్ రౌండ్లో దీప మొత్తం 14.850 పాయింట్లు సాధించి...ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రోడునోవా టెక్నిక్ ద్వారా దీప..కళ్లు చెదిరే విన్యాసాలు ప్రదర్శించి ఫైనల్ రౌండ్లో ప్రవేశించింది.
వాల్టింగ్ ఫైనల్స్ చేరడం గొప్ప ఘనత
భారత మహిళా క్రీడారంగం అంటే కోట్లరూపాయలు ఆర్జిస్తూ... మీడియా దృష్టిని ప్రధానంగా ఆకర్షిస్తున్న సానియా మీర్జా, సైనా నెహ్వాల్ మాత్రమే కాదు...జిమ్నాస్టిక్స్ క్వీన్ దీప కర్మాకర్ కూడా. రియో ఒలింపిక్స్ లో దీప ఏదో పతకం సాధించినా, సాధించకపోయినా...అర్హత సాధించడమే కాదు...వాల్టింగ్ ఫైనల్స్ చేరడం కూడా .. ఓ గొప్ప ఘనతగా, అసాధారణ విజయంగా మిగిలిపోతుంది.

09:45 - August 10, 2016

హైదరాబాద్ : కృష్ణా పుష్కరాలకోసం 72 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా మీదుగా ఈ ట్రెయిన్స్‌ నడుపుతారు. ఈనెల 11నుంచి  24వరకు ఈరైళ్లు అందుబాటులో ఉంటాయి. కర్నూలు నుంచి 20, హైదరాబాద్‌ నుంచి 28, బొల్లారం నుంచి 24 సర్వేసులను ఏర్పాటు చేసినట్టు  అధికారులు తెలిపారు. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో అవసరమైతే మరిన్ని సర్వీసులను నడుపుతామని రైల్వే అధికారులు అంటున్నారు.

09:38 - August 10, 2016

మల్లన్నసాగర్, నిమ్జ్ ప్రాంతాల్లో 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్షేషకుడు నడింపల్లి సీతారామరాజు, రైతు సంఘం నేత టీ.సాగర్, టీఆర్ ఎస్ అధికార ప్రతినిధి రాకేష్ పాల్గొని, మాట్లాడారు. భూ సేకరణ విషయంలో 2013 చట్టంలోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. జీవో 123 పై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లడం సరికాదన్నారు. రైతులకు న్యాయం చేయాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు అనుమానాస్పద మృతి

రంగారెడ్డి : మేడ్చల్ మండలం గౌడవెల్లి రైల్వేట్రాక్ పై ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 

పంజాబ్ లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్టు

పంజాబ్ : హోషియర్ పూర్ లో ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదుల నుంచి 3 ఫిస్టళ్లు, భారీగా పేలుడు పదార్థాలు, పాకిస్థాన్ కు చెందిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేశారు. 

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇద్దరు వ్యక్తులు అరెస్టు

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టు ఇద్దరు వ్యక్తులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ వచ్చిన ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. ఎయిర్ పోర్టు పోలీసులకు మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.  

 

నయీం ఇంట్లో మరోసారి పోలీసుల తనిఖీలు

హైదరాబాద్ : కోర్టు అనుమతితో అల్కాపూర్ లోని నయీం ఇంటిలో పోలీసులు మరోసారి తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు రూ.4 వేల కోట్ల ఆస్తుల వివరాలను సేకరించారు. నయీం డైరీలో 15మంది ఐపీఎస్ ల వివరాలు ఉన్నాయి. ముంబై, రాంపూర్, తెలంగాణ, ఎపిలో ఆస్తులు ఉన్నాయి. 20 మంది రాజకీయ నాయకులు, 200 మంది రియల్టర్లపై నయీం బెదిరింపులకు పాల్పడ్డాడు. 

 

ఒలింపిక్స్ లో 20 గోల్డ్ మెడల్స్ సాధించిన మైకల్ ఫెల్ఫ్స్

బ్రెజిల్ : ఒలింపిక్స్ లో మైకల్ ఫెల్ఫ్స్ 20 గోల్డ్ మెడల్స్ సాధించారు. 200 మీటర్ల బట్టర్ ఫ్లై ఫెల్ఫ్స్ లో మైకెల్ కు బంగారం పతకం లభించింది. ఫెల్ఫ్స్ 1,53, 36 సెకన్లలో లక్ష్యాన్ని  పూర్తి చేశారు. 

08:52 - August 10, 2016

గ్రామీణ బ్యాంకుల్లో పని చేసి రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షన్ లు ఇవ్వాలని గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్  నేత కొండపల్లి లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'గ్రామీణ బ్యాంక్ ల్లో పనిచేసి, రిటైరైన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. రిటైర్మెంట్ సమయంలో 40వేల జీతం పొందినవారు కూడా కేవలం 15వందల రూపాయల పెన్షన్ తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ లేకపోవడానికి కారణం ఏమిటి? దీనివల్ల వారు పడుతున్న ఇబ్బందులేమిటి?  గవర్నమెంట్ ఉద్యోగులతో పోల్చుకుంటే గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ తక్కువగా వుండడానికి కారణం ఏమిటి? ఇలాంటి అంశాలపై లక్ష్మణ్ రావు మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.... 

08:47 - August 10, 2016

దారిద్య్రరేఖకు దిగువన వున్న వారి యోగ క్షేమాల కోసం పనిచేసినవారే ఇప్పుడు బిపిఎల్ కేటగిరిలో చేరిపోయారు. వినడానికి ఆశ్చర్యంగా వున్న ఇది నిజం. గ్రామీణ బ్యాంక్ లలో పనిచేసిన రిటైనవారు ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
1970లో గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థ
1970కి పూర్వం బ్యాంకింగ్ సేవలన్నీ పట్టణాలకే పరిమితమయ్యేవి. రైతులకు, చేతి వృత్తిదారులకు రుణాలిచ్చే దిక్కు వుండేది కాదు. ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు బ్యాంకింగ్ వ్యవస్థ స్వరూపాన్ని, స్వభావాన్నే మార్చేశాయి. గ్రామాల్లోని వ్యవసాయదారులకు, చేతివ్రుత్తిదారులకు అందుబాటులో వుండేవిధంగా 1970లో గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.  గ్రామీణ బ్యాంక్ ల రాకతో 1980ల నుంచి గ్రామీణ జీవనవిధానమే మారిపోయింది. గత 40 ఏళ్ల కాలంలో దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సేవలందించడమే లక్షంగా 196 ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ లు ఏర్పటయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2006 నాటికి 22 గ్రామీణ బ్యాంక్ లుండేవి. ఇప్పుడు వాటి సంఖ్యను ఐదుకు కుదించారు.  ఆయా జిల్లాల సంస్క్రుతి, చరిత్రలను గౌరవిస్తూ గ్రామీణ బ్యాంక్ లకు నామకరణం చేయడం మరో విశేషం. పట్టణాల్లోని వాణిజ్య బ్యాంక్ లు వ్యాపార ద్రుక్పథంతో పనిచేసి లాభాలు ఆర్జిస్తే, మారుమూల ప్రాంతాలకు సేవలు, సంక్షేమ పథకాలు అందించడమే తమ విద్యుక్త ధర్మంగా గ్రామీణ బ్యాంక్ లు పనిచేస్తున్నాయి.  ఏ సౌకర్యాలు లేని మారుమూల పల్లెల్లోని  గ్రామీణ బ్యాంక్ ల్లో పనిచేయడానికి ఎందరో విద్యావంతులు ఉత్సాహం చూపించారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం తెలియని, అప్లికేషన్ ఫామ్ నింపడంరాని, కనీసం సంతకం చేయడం కూడా రాని నిరక్షరాస్యులకు ఎంతో ఓపికగా సేవలందించారు గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు. ప్రభుత్వాలు ప్రకటించిన వివిధ సంక్షేమ పథకాలను గ్రామీణులకు పరిచయం చేయడంలో, ఆయా స్కీమ్ ల్లో వారే చేరేవిధంగా ప్రోత్సహించడంలోనూ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు పోషించిన పాత్ర మరువలేనిది. 
గ్రామీణ బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్ లు లేవు...
ఏ సౌకర్యాలూ లేని మారుమూల ప్రాంతాల్లోని గ్రామీణ బ్యాంక్ ల్లో సేవలందించిన దాదాపు 20 వేల మంది ఉద్యోగులు ఇప్పటికే రిటైరయ్యారు. కానీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వీరికి పెన్షన్ లు లేవు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు.  రిటైర్మెంట్ సమయంలో 40 వేలకు పైగా జీతం వున్నవారికి ఇప్పుడు నెలకు 15వందలు, 16వందలు పెన్షన్ తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఉద్యోగం చేస్తున్నరోజుల్లో బాగా బతికి, నలుగురికి సహాయం చేసినవారిని కూడా ఇవాళ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. 1990 నుంచి 26 ఏళ్లుగా పోరాడుతున్నా న్యాయం దక్కలేదు.   గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులకు కూడా ఇతర వాణిజ్య బ్యాంక్ ఉద్యోగులకు మాదిరిగానే అలవెన్స్ లు, పెన్షన్ లు ఇవ్వాలంటూ ఎప్పుడో 1990లోనే నేషనల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలంటూ రాజస్థాన్, కర్నాటక హైకోర్టులు కేంద్ర ప్రభుత్వానికి సూచించాయి.   దీంతో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర ఆర్థిక మంత్రిగా వున్న రోజుల్లో పెన్షన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించింది. అయితే, ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన స్థానంలో ఆర్థికమంత్రిగా నియమితులైన చిదంబరం మోకాలడ్డారు.  సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే, ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేతలు ఆయనను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. దీంతో  2014లో కేంద్రం మనస్సు మార్చుకుంది. మూడు నెలల్లో పెన్షన్ స్కీమ్ విధివిధానాలు ఖరారు చేస్తామంటూ సుప్రీంకోర్టుకు విన్నవించింది. రెండేళ్లయినా గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల కల తీరలేదు. కష్టాలు తొలగిపోలేదు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 26 ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవచూపాలి. 

 

08:42 - August 10, 2016

ఇంపాల్ : మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ చాను షర్మిలా తన దీక్షను విరమించారు. మణిపూర్‌లో 16 ఏళ్లుగా సైనిక దళాల ప్రత్యేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆమె నిరాహార దీక్ష చేశారు. ఇకపై తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తానని ప్రకటించారు. కోర్టు విచారణలో షర్మిలా తన తరఫున తానే వాదించుకున్నారు. జనజీవన స్రవంతిలో కలవాలని ఆమె నిర్ణయించారు.
త‌న కేసును తానే వాదించుకున్న షర్మిలా
మణిపూర్‌లో గత 16 ఏళ్లుగా అఫ్సా చ‌ట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఇరోమ్ షర్మిలా దీక్షను విరమించారు. అంతకుముందు దీక్షా విర‌మ‌ణ చేయాల‌నుకున్న ష‌ర్మిల‌ను పోలీసులు పూర్తి భ‌ద్రత మ‌ధ్య హాస్పట‌ల్ నుంచి కోర్టుకు త‌ర‌లించారు. ఇంఫాల్ జ్యుడిషియ‌ల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 44 ఏళ్ల ఇరోమ్‌ షర్మిలా కోర్టులో త‌న కేసును తానే వాదించుకున్నారు. త‌న మీద న‌మోదైన కేసుల‌ను ఎత్తివేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. చ‌ట్టం సాకుతో త‌న‌ను త‌ప్పుడు ప‌ద్ధతుల్లో అరెస్టు చేయ‌డం స‌రికాద‌ని ష‌ర్మిల కోర్టు ముందు వాదించారు. దీనిపై తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 23కు వాయిదా వేసింది. ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలోనే ఉన్న షర్మిలకు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. అనంతరం షర్మిలా తన దీక్షను విరమించారు.
రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటున్న ష‌ర్మిల‌ 
రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటున్న ష‌ర్మిల‌కు మెజిస్ట్రేట్ బెస్ట్ ఆఫ్‌ ల‌క్ చెప్పారు. వచ్చే మ‌ణిపూర్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  ష‌ర్మిల‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల‌నుకుంటున్నారు. తనను ఓ వింత మహిళగా కాకుండా మనిషిలా చూడాలని షర్మిలా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయం మురికి కూపమని ప్రజలంటారు... సమాజం కూడా అలాంటిదేనని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోరాడతానని ఆమె స్పష్టం చేశారు. తాను గాంధీ బాటలోనే నడిచానని ఇపుడిక స్వతంత్రురాలిని కావాలనుకుంటున్నట్లు చెప్పారు.
సైనిక దళాల ప్రత్యేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ షర్మిలా ఆందోళన 
2 వేల సంవత్సరంలో మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కు సమీపంలోని ఓ గ్రామంలో అసోం రైఫిల్స్‌ దాడులు జరిపాయి. ఈ దాడుల్లో పది మంది మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన ఇరోమ్‌ షర్మిలా సైనిక దళాల ప్రత్యేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఆ చట్టాన్ని రద్దు చేయాలని ఆమరణ దీక్ష చేపట్టారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. 16 ఏళ్లుగా ఇరోమ్‌ షర్మిలా జైల్లోనే ఆమరణ దీక్ష కొనసాగించారు. ఆమెకు బలవంతంగా ముక్కులో నుంచి పైపు ద్వారా లిక్విడ్‌ రూపంలో ఆహారాన్ని అందించారు. 

 

08:37 - August 10, 2016

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌కు సొంతపార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. అమెరికాకు నేతృత్వం వహించే స్థాయి ట్రంప్‌కు లేదని ..50మందితో కూడిన రిపబ్లికన్‌ నేషనల్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌ టీమ్‌ ప్రకటించింది. ఒకవేళ ట్రంప్‌ దేశాధ్యక్షుడైతే  అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికయిన అత్యంత మొరటు మనిషిగా చరిత్రలో నిలిచిపోతాడని నిపుణుల బృందం అభిప్రాయపడింది. ట్రంప్‌చేతికి పగ్గాలొస్తే.. ఇప్పటిదాకా సురక్షితంగా ఉన్న అమెరికా అణ్వాయిదా  సంపత్తికి ప్రమాదం వాటిల్లుతుందని  కమిటీ హెచ్చిరించింది. 

08:32 - August 10, 2016

శ్రీకాకుళం : ఇసుక కొరతకు చెక్‌పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందుకోసం కృత్రిమ ఇసుక తయారీకి మొగ్గుచూపుతోంది. శిలలను క్రషింగ్‌ చేసి రోబోశాండ్‌ను తయారు చేయడానికి సిద్ధమైంది. శ్రీకాకుళంజిల్లాలో ఉన్న విస్తారమైన రాతిఖనిజ నిల్వలు రోబోశాండ్‌ తయారీకి ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ప్లాన్స్‌ రెడీ చేస్తోంది. 
ఇసుకకు ప్రత్యామ్నాయంగా రోబోశాండ్‌ 
శ్రీకాకుళం జిల్లాలో ఇసుక కొరతకు చెక్‌ పడనుంది. నదీగర్భాల్లోని ఇసుకకు ప్రత్యామ్నాయంగా రోబోశాండ్‌ ఇండస్ట్రీ అభివృద్ధి అవుతోంది. నదీగర్భాలనుంచి ఇసుకను తీయడంవల్ల అనేక పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. భూగర్భజలాలు కుంగిపోవడంతోపాటు... భూమి కోతకుగరువుతోంది. ఇప్పటికే ఇప్పటికే నాగావళి, వంశధార, బహుదా, మహేంద్రతనయ నదుల నుండి తీరం లో వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుక తరలిపోయింది. రోజురోజుకూ పెరుగుతున్న ఇసుక డిమాండ్‌కు రోబోశాండ్‌  చక్కని పరిష్కారం అంటున్నారు నిపుణులు. 
2వేల హెక్టార్లలో రాతినిక్షేపాలు
రోబోశాండ్ కు అవసరమయ్యే గ్రాడ్యులైట్స్, చర్నోకేట్, ఖోండాలైటీస్లాంటి నిక్షేపాలు శ్రీకాకుళంజిల్లాలో విస్తారంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. జిల్లావ్యాప్తంగా దాదాపు  రెండువేల హెక్టార్లలో రాతినిక్షేపాలు ఉన్నాయి.   టెక్కలి, మందస ప్రాంతాలలో ఉన్న గ్రానైట్ గనుల నుండి గ్రాడ్యులైట్... పొందూరు, పోలాకి, కంచిలి, జలుమూరు ప్రాంతాలలో రోడ్ మెటల్ కు వినియోగించే కొండ రాళ్ళు నుండి చర్నోకేట్... అలాగే కోటబొమ్మాళి, ఎచ్చెర్ల మండలాల్లో ఉన్న ఖోండాలిటీస్ లపై ప్రభుత్వం దృష్టి  పెడితే ఈ మిశ్రమం ద్వారా రోబో శాండ్ తయారు చేసే వీలుంది. రోబోశాండ్ ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటమే కాక ఇసుక కొరతకు ప్రత్యామ్న్యాయంగా అందుబాటులో ఉండే వీలుందంటున్నారు నిపుణులు. 
రోబోశాండ్‌ చక్కని మార్గం
నిర్మాణరంగం నుంచి రోజురోజుకు వస్తున్న డిమాండ్‌కు సరిపడా ఇసుకను అందించాలంటే... రోబోశాండ్‌ చక్కని మార్గంగా మారనుంది. జిల్లాలో విస్తారంగా ఉన్న రాతిఖనిజ నిల్వలు కూడా రోబోశాండ్‌ పరిశ్రమ అభివృద్ధికి దోహదం కానున్నాయి.  

08:17 - August 10, 2016

వరంగల్ : ఆ కళాశాల ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిద్దింది. మరెంతో మందిని ఉన్నత శిఖరాలకు చేర్చింది. దశాబ్దాలుగా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించిన ఆ కళాశాల ప్రస్థానం నేడు ప్రశ్నార్థకంగా మారింది. గతమెంతో ఘనంగా ఉన్న ఆ కళాశాల.. నేడు  వైభవం కోల్పోయింది. వరంగల్‌జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ దుస్థితిపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం
ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు చేర్చిన విద్యానిలయం 
దశాబ్దాల ప్రస్థానంలో .. ఎందరికో విద్యను అందించి ఉన్నత శిఖరాలకు చేర్చిన .. సరస్వతీ నిలయం.. నేడు శిథిల సౌథంగా మారింది. 
1955-56 వ సం.లో కళాశాల ప్రస్థానం
1955-56 వ సంవత్సరంలో వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. కానీ నేడు శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో కళాశాల మనుగడ సాగిస్తోంది. 
భయం గుప్పిట్లో అధ్యాపకులు 
ఈ కళాశాల సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ ఇలా మొత్తం ఐదు కోర్సులను అందిస్తోంది. ఇక్కడి విద్యా విధానం బాగుండడంతో కళాశాలలో చేరే విద్యార్ధుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. 1600 మంది విద్యార్థులు ఉన్న ఈ కళాశాలలో మొత్తం 90 మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే శిథిలావస్థకు చేరిన కళాశాలలో సిబ్బంది భయంగుప్పిట్లో పాఠాలను బోధిస్తున్నారు. 
కనీస సదుపాయాలు లేక విద్యార్థుల ఇబ్బందులు
కళాశాలలో కనీస మౌలిక సదుపాయలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెచ్చులుడుతున్న తరగతి గదుల్లో బిక్కుబిక్కుమంటూ చదువుతున్నారు.  ఇక్కడ తాగునీటి సమస్యతో పాటు మరుగుదొడ్ల సమస్య, వసతి సమస్య ఉందని.. అధికారులు, ప్రజా ప్రతినిధులు పలుమార్లు కళాశాలను సందర్శించిన ఫలితం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా శిథిలావస్థకు చేరిన భవనంలో నూతన భవనం నిర్మాణం చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. 

 

08:10 - August 10, 2016

మెదక్ : ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి. హాస్టల్‌ సిబ్బంది తీరుతో పేదవిద్యార్థినిలు పస్తులుంటున్నారు. తీరిక దొరికినపుడు మాత్రమే వంటలు చేస్తుండటంతో స్టూడెంట్స్‌ అర్థాకలితోనే గడుపుతున్నారు. మెదక్‌జిల్లాలోని బాలికల వసతిగృహాల్లో విద్యార్థినుల ఆకలిబాధలపై టెన్‌టీవీ ఫోకస్‌..
మూడు రోజులుగా పస్తులుంటున్న విద్యార్థినులు 
మెదక్ జిల్లా నర్సాపూర్ లోని  గిరిజన బాలికల  వసతి గృహంలో  విద్యార్థినులు ఆకలితో అలమటిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో.. గత మూడు రోజులుగా వసతి గృహంలో విద్యార్థులకు భోజనాలు పెట్టడంలేదు. తమకు తీరిక ఉన్నపుడు మాత్రమే వండుతాం అన్నట్టుగా ఉంది సిబ్బంది తీరు. ఒకవేళ భోజనం వండినా  50 మంది విద్యార్థులు ఉన్న హాస్టల్ లో 15 మందికి సరిపోయేంత రేషన్‌తోనే  భోజనాలు వండి సరిపెడుతున్నారు.  
ఆస్పత్రుల పాలవుతున్న విద్యార్థినిలు 
ప్రొద్దున వండితే రాత్రికి వండడం లేదని..విద్యార్థినులు అంటున్నారు. ఒకపూట వండిన అన్నం కూడా శుభ్రత పాటించకపోవడంతో.. రాత్రి సమయానికి పాచిపోతోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకలి బాధలకు తట్టుకోలేక పాచిపోయిన అన్నమే తిని ఆస్పత్రుల పాలవుతున్నారు విద్యార్థినిలు. 
హాస్టల్లో వార్డెన్‌, సిబ్బంది నిర్లక్ష్యం 
హాస్టల్లో వార్డెన్‌, సిబ్బంది నిర్లక్ష్యాన్ని.. ఘటనపై విద్యార్థినిలు ఎంఈవో  దృష్టికి తీసుకెళ్లారు. దీంతో  హాస్టల్ కు వెళ్లిన అధికారులు సమస్యపై విచారణ జరిపారు. విద్యార్థులకు వంటలు తయారుచేయని వైనాన్ని ఎంఈవో జెమినికుమారి స్వయంగా గమనించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణతోనైనా తమ సమస్యలు పరిష్కారం కావాలని విద్యార్థినిలు కోరుతున్నారు. 

 

నేడు సంగారెడ్డిలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి దీక్ష

మెదక్ : నేడు సంగారెడ్డిలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి దీక్ష చేపట్టనున్నారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. 

రియో ఒలింపిక్స్.. మీడియా ప్రతినిధుల బస్సుపై కాల్పులు

బ్రెజిల్ : రియో ఒలింపిక్స్ మీడియా ప్రతినిధుల బస్సుపై దుండగుడు కాల్పులు జరిపారు. ఒలింపిక్ పార్కుకు వెళ్తున్న సమయంలో హైవేపై ఈ ఘటన జరిగింది. అయితే మీడియా ప్రతినిధులు సురక్షితంగా బయటపడ్డారు. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

07:51 - August 10, 2016

తూర్పుగోదావరి : ఆకాశంలో సగం అంటూనే అవమానిస్తున్నారు. చట్టంద్వారా లభించిన అవకాశాల్లోనూ ఆమెకు స్పేస్‌ తగ్గిపోయింది. స్థానిక సంస్థలు మొదలు.. అసెంబ్లీ స్థాయి వరకు పేరుకుమాత్రమే ఆమె మిగిలింది.. పవర్‌ మొత్తం ఆయనగారిదే..  మహిళాసాధికారత అంటూ చెప్పేవి... ఉత్తుత్తి వరిపొట్టుమాటలేనని తేలిపోతోంది. కాకినాడ రూరల్లో  ఎమ్మెల్యేగారి భర్త పెత్తనంపై టెన్‌టీవీ స్పెషల్‌ ఫోకస్‌...
ఆకాశంలో సగం సంగతి చట్టాలకే ఎరుక
ఆకాశంలో సగం సంగతి చట్టాలకే ఎరుక.. తన భార్యకు దక్కిన ప్రతిఅవకాశంలోనూ సగం మింగేస్తున్నాడు ఈయనగారు. ఇతనిపేరు సత్తిబాబు... ఉరఫ్‌ పిల్లి సత్యనారాయణ... అయితే ఏంటీ.. అని అడక్కండి.. చాలావుంది విషయం... పదవులేం లేవుగాని.. పవరంతా ఈయనదే. ఉన్న అర్హతల్లా ఒక్కటే.. ఎమ్మెల్యేగారి భర్త... కాని.. అధికారిక కార్యక్రమాల్లో కయాక్టివ్‌ ఎమ్మెల్యేగా మారిపోయాడు. 
ఎమ్మెల్యే భర్త హడావుడి
కాకినాడ రూరల్‌ పరిధిలో టీడీపీఎమ్మెల్యే పిల్లి అనతంలక్ష్మి భర్తగారి హడావుడి అంతాఇంతాకాదు..   ఊ అన్నా..  ఊహూ అన్నా.. జోహుకుం అనాల్సిందే అన్నట్టుగాఉంది ఈయనగారి వ్యవహారం. పార్టీపనైతే ఎవరికీ అభ్యంతరం లేదుగాని.. ఈ ఎమ్మెల్యే భర్తగారు అధికార కార్యక్రమాలను తెగ మెయింటేన్‌ చేస్తున్నారు. భార్య ఎమ్మెల్యే అయినా...ఆమెను పక్కనపెట్టేశాడు.  తన పోటోతో శిలాఫలకాలు తగిలించేస్తున్నాడు.  చివరికి ప్రభుత్వ భవనాలకూ ఇలా తనపేరుపెట్టేసుకుంటున్నాడు.  ఎమ్మెల్యే భర్తగారి తీరుపై కాకినాడ మహిళలు మండిపడుతున్నారు. 
భర్తపెత్తనాన్ని పెంచిపోషిస్తున్న అధికార పార్టీ
మైక్‌దొరికితే చాలు...మహిళా సాధికారత అంటూ తెగ లెక్చర్లిచ్చే అధికార పార్టీ నాయకులు...ఇలా భర్తపెత్తనాన్ని పెంచిపోషిస్తున్నారు. పేరుకు ఆమె ఎమ్మెల్యే అయినా... ఆయనగారితోనే  ప్రైవేట్‌, పబ్లిక్‌ కార్యక్రమాలన్నీ అన్నీ నడిపిస్తున్నారు. చివరికి మంత్రులు, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్‌ల్లోకూడా  ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి  భర్తపెత్తనమే సాగుతోంది. చట్టాలు  ప్రసాధించిన  రిజర్వేషన్లు ఇలా నీరుగారిపోతున్నాయని మహిళాసంఘాలు ఆగ్రహిస్తున్నాయి. ఇప్పటికైనా... అధికారపార్టీ తీరుమార్చుకోవాల్సిన అవసరం ఉంది. మహిళాసాధికారత మాటలకే పరిమితం కాకుండా చూడాలి. పదవుల్లో భర్తపెత్తనాన్ని అడ్డుకోవాలని మహిళాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

07:44 - August 10, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై మంత్రి కేటీఆర్ ఫోకస్ పెట్టారు. పెండింగ్ సమస్యల పై గ్రేటర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో  మోడ్రస్ బస్ షెల్టర్లు ఏర్పాటుతోపాటు  డిజిటల్ డోర్ నెంబర్ల ప్రాజెక్టులో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి హైదరాబాద్ లోని సమస్యలపై దృష్టి పెట్టారు మంత్రి కేటీఆర్.  నగరంలోని సమస్యలను దగ్గరుండి పరిశీలిస్తున్న మంత్రి..  ఎప్పటికప్పడు సమీక్ష నిర్వహిస్తున్నారు.
బస్ షెల్టర్ల నిర్మాణ బాధ్యతలు అస్కికి అప్పగింత 
సిటీలో బస్ షెల్టర్ల నిర్మాణం, వాటి డిజైన్ తయారీబాధ్యతలు అస్కి సంస్థకు అప్పగించారు  బల్దియా అధికారులు. 38 కారిడార్లలో సర్వే నిర్వహించిన అస్కి సంస్థ మొత్తం 2 వేల 300 బస్ స్టాపులు అవసరమని రిపోర్ట్ ఇచ్చింది. అస్కి రిపోర్టుపై మంత్రికేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులతో ,అటు అస్కి డిజైనర్స్ తో చర్చించారు. సిటీలో ఎక్కువ ప్రయాణికులు ఉన్న 800 చోట్ల మొదటి దశలో షెల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 
నాలుగురకాల డిజైన్లతో నూతన బస్ షెల్టర్లు
నాలుగురకాల డిజైన్లతో  సిటీలో నూతన బస్ షెల్టర్లను నిర్మించాలని డిసైడ్ చేశారు మంత్రి.   
ప్రయాణికులు కూర్చోవడానికి, ఎండా,వాన నుండి పూర్తిస్థాయిలో రక్షణఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్. దీంతోపాటు సిటీలో స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రాంను కంటిన్యూ చేయాలని, సాలిడ్ వెస్ట్ మేనేజ్ మెంట్ లో పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి.అటు గ్రేటర్‌ పరిధిలో ప్రతి ఇంటికి డిజిటల్‌ డోర్ నెంబర్లు ఏర్పాటు చేయాలని .. అందరికి అర్థం అయ్యేలా డైజైన్‌ను రూపొందించాలని సూచించారాయన. మొత్తానికి గ్రేటర్‌ సిటీలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రిగారు చేస్తున్న హడావుడిని అధికారులు ఏ మేరకు సక్సెస్‌ చేస్తారో వేచిచూడాలి. 

 

07:40 - August 10, 2016

విశాఖ : అరకును ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. అరకును దత్తత తీసుకుని ఏడాదిలోగా రూపురేఖలు మారుస్తానన్నారు. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లాలోని అరకులో ఆయన పర్యటించిన చంద్రబాబు..ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. 
అరకులో పర్యటించిన సీఎం బాబు
ప్రపంచ ఆదివాసిదినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా అరుకులోని ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తాని ఈ సందర్భంగా అన్నారు. అలాగే ఏజెన్సీలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని బాబు స్పష్టం చేశారు.
గిరిజనుల విద్యార్థుల విదేశీ విద్యకు సాయం
ప్రపంచాన్ని జయించే శక్తి గిరిజన పిల్లలకు ఉందని, గిరిజన విద్యార్థుల విదేశీ విద్యకు సాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గిరిజన హాస్టళ్లను రెసిడెన్షియల్‌ స్కూళ్లుగా మారుస్తామన్నారు. స్పెషల్‌ డీఎస్సీతో 301 పోస్టులు భర్తీ చేసినట్లు బాబు తెలిపారు. గిరిజన యువతుల వివాహాలకు గిరిపుత్రిక పథకం కింద రూ.51 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు పేరిట ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామన్నారు..
ప్రతి గిరిజన ఇంటికి నల్లా కనెక్షన్ 
వచ్చే 4 నెలల్లో ప్రతి గిరిజన ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆదివాసీలకు గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తామని, రూ.2.20 కోట్లతో పద్మాపురం గార్డెన్‌ను అభివృద్ధి చేసినట్టు ఆయన తెలిపారు. గిరిజన విద్యార్థులు ఆటల్లో రాణించే విధంగా ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అరకును ఎడ్యుకేషన్‌ హబ్‌గా ఏర్పాటు చేస్తామని. తన పర్యటన ఆసాంతం వరాలు కురిపిస్తూనే ఉన్న బాబు.. ఈ హామీలను ఎంతవరకు నెరవేర్చి గిరిజనుల బతుకులను బాగుచేస్తారో వేచి చూడాలి. 

 

07:35 - August 10, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇందుకోసం ఈ నెల 22న కొత్త జిల్లాల ఏర్పాటుపై ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. దసరా నుంచి కొత్త జిల్లాలు మనుగడ లోకి రావాలని పట్టుదలగా ఉన్న తెలంగాణసర్కార్‌... కొత్త జిల్లాలపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. 
అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష  
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేగంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై  కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. దసరా నుండి కొత్త జిల్లాలపై క్లారిటీ రావాలని అందుకు ఉప ముఖ్యముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్.
అధ్యయనంపై సీఎం చర్చ 
అటు ఏర్పాటుపై సీఎస్ నేతృత్వంలో జరిగిన అధ్యయనంపై కూడా చర్చించారు సీఎం. ప్రజలు ,ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను అన్నికోణాల నుంచి పరిశీలించిన సీఎం తొందరలోనే ఒక నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో వేసిన కేబినెట్ సబ్ కమిటీలో కడియం శ్రీహరి, 
జనాభా, భౌగోళిక అంశాలపై చర్చ 
జనాభా, భౌగోళిక అంశాలపైనా అధికారులతో చర్చించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. కొత్త కార్యాలయాల ఏర్పాటు.. అధికారుల విభజన వంటి సమస్యలను పరిష్కరించాలని సీఎం సూచించారు. అధికార యంత్రాంగం ఎలా ఉండాలి అన్న దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు కేసీఆర్. జోనల్ సమస్యను అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఖరారు చేయాలని సీఎస్ ను ఆదేశించారు సీఎం. 
ఈనెల 22 న ముసాయిదా నోటిఫికేషన్ 
ఈనెల 22 న కొత్త జిల్లాలకు సంబంధించిన ముసాయిదాకు నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు సీఎం. వీలైనంత త్వరగా కేబినెట్ సబ్ కమిటీ నివేదికను అందజేయాలని ఆదేశించారు. ముసాయిదా నోటిఫికేషన్ కు ముందే కేబినెట్ , అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. నోటిఫికేషన్ విడుదల చేసిన నెలరోజుల గడువు ఇచ్చి.. సమస్యలను పరిష్కరించాలన్నారు.  మొత్తంగా దసరాకు మనుగడలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది సర్కార్.  

 

ఆర్థికశాఖ కార్యాలయాన్ని ప్రారంభించనున్న మంత్రి యనమల

గుంటూరు : తాత్కాలిక సచివాలయంలో ఉదయం 9.20 గంటలకు ఆర్థిక శాఖ కార్యాలయాన్ని మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించనున్నారు. 

నేడు కేంద్రమంత్రి వర్గ సమావేశం

ఢిల్లీ : నేడు కేంద్రమంత్రి వర్గం భేటీ కానుంది. సాయంత్రం 6 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

నేడు కేంద్రమంత్రి గడ్కరీతో మంత్రి తుమ్మల భేటీ

ఢిల్లీ : నేడు కేంద్రమంత్రి గడ్కరీతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు భేటీ అయ్యారు. తెలంగాణలో రహదారుల విస్తరణ, అభివృద్ధిపై చర్చ చేపట్టనున్నారు. 

నేడు అమలాపురం బంద్ కు దళిత సంఘాల పిలుపు

తూ.గో : నేడు అమలాపురం బంద్ కు దళిత సంఘాల పిలుపునిచ్చాయి. దళితులపై దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Don't Miss