Activities calendar

11 August 2016

21:48 - August 11, 2016

హైదరాబాద్ : నయీం డైరీతో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. నయీంతో రాజకీయ ప్రముఖలు, పోలీసులు, జర్నలిస్టులతో సంబంధాలు బయటపడుతున్నాయి. మాజీమంత్రి ఉమామాధవరెడ్డికి నయీంతో సంబంధాలున్నాయని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. మరోవైపు కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి.. గ్యాంగ్‌స్టర్‌ వెనకున్న అదృశ్య శక్తులను బయటపెట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

వణికిస్తున్న డైరీ..
నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత నేర సామ్రాజ్యం ఉలిక్కిపడుతోంది. నయీం డైరీని కదిలిస్తే.. కొందరు రాజకీయ నాయకులు, పోలీసు బాసులతో పాటు మీడియా ప్రతినిధుల్లో వణుకుపుడుతోంది.  నయీంకు ఆశ్రయం కల్పించి రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచారని మాజీమంత్రి ఉమామాధవరెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించారు. గ్యాంగ్‌స్టర్‌ నయీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఉమామాధవరెడ్డి అన్నారు. తమ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం యత్నిస్తుందంటున్నారు. తమపై వస్తున్న ఆరోపణలకు ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఉమామాధవరెడ్డి తనయుడు సందీప్‌రెడ్డి అన్నారు.

కావాలనే ఆరోపణలు: రేవంత్ రెడ్డి
మాధవ రెడ్డి కుటుంబంపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎలాంటి మచ్చ లేని వ్యక్తి ఉమా మాధవరెడ్డి అని ఆయన అన్నారు.

ప్రభుత్వం లీక్‌లు చేసి...గందరగోళం సృష్టిస్తోంది : మోత్కుపల్లి
ప్రభుత్వం లీక్‌లు చేసి.. గందరగోళం సృష్టిస్తుందని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మాధవరెడ్డిది క్రిమినల్‌ యాక్టివిటీ ఉన్న కుటుంబం కాదన్నారు. రాజకీయ జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవడం సరైంది కాదన్నారు మోత్కుపల్లి.

నయీంకు సహకరించిన వారందరిని బయటపెట్టాలి : జూలకంటి
యీం ఎన్‌కౌంటర్‌ తర్వాత బయటపడుతున్న నిజాలు చూస్తుంటే ప్రపంచం నివ్వెరపోయేలా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నయీం ప్రభుత్వానికి సమానంగా సమాంతర వ్యవస్థను నడిపించాడంటే.. ఆయన వెనక పాలకవర్గాలకు చెందిన ఎంతోమంది ఉండి ఉంటారన్నారు. ఈకేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి.. నయీంకు సహకరించిన వారందరిని బయటపెట్టాలని జూలకంటి డిమాండ్‌ చేశారు.

పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలి :కోదండరాం..
నయీం డైరీలో ఉన్న వివరాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని టీ-జేఏసీ నేత కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు.

గూండాగిరి చేస్తే సహించేది లేదు : ఈటెల
ఇదిలావుంటే.. రాష్ట్రంలో గుండాగిరి చేస్తే సహించేది లేదని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌జిల్లాలో ఓ పర్యటనలో పాల్గొన్న ఈటల.. ఇకనైనా గుండాగిరి చేసే వాళ్లుంటే తమ పద్ధతులు మార్చుకోవాలని ఈటల హెచ్చరించారు.

రాజకీయం ప్రకంపనలు సృష్టిస్తున్న నయీం కేసు..
మొత్తానికి నయీం కేసులో రోజుకో వార్త వెలుగుచూడడంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇక ఈ కేసులో మరెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి. 

21:37 - August 11, 2016

హైదరాబాద్ : నయీమ్‌ బాధితులు ఎవరైనా ఉంటే తమను కలవొచ్చని సిట్‌ చీఫ్‌ నాగిరెడ్డి అన్నారు. నయీం అక్రమాల కేసు దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేసి.. 18 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 19 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటివరకు 2.61 కోట్ల నగదు, 2 కిలోల 14 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని.. దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేస్తామని నాగిరెడ్డి తెలిపారు. 

21:33 - August 11, 2016

హైదరాబాద్ : ఎక్కడ సోదాలు చేసినా కట్టలకు కట్టలు దొరుకుతున్న దస్తావేజులు.. డబ్బు... నగలు.. గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరులను అదుపులోకి తీసుకుంటే ..ఆ తర్వాత ఇన్‌వెస్టిగేషన్‌లో మొత్తం ఎంత ఉందో తేల్చాలని సిట్‌ దూకుడు పెంచింది...అందులో భాగంగానే నయీం వెన్నంటే ఉన్నవారిని అరెస్టులు చేస్తున్నారు.. వారి ఇళ్లల్లో కూడా దొరుకుతున్న ఎన్నో ఆధారాలు దర్యాప్తు ముందుకు పోవడానికి అవకాశం లభిస్తోంది...

తవ్వేకొద్దీ బైటపడుతున్న ఆస్తులు
ఎన్‌కౌంటర్‌ తర్వాత మొదలయిన పోలీసుల సోదాలు..తనిఖీలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి... మూడు రోజులుగా బయటపడుతున్న ఆస్తులతో నివ్వెరపోతున్న పోలీసులు అనుచరులపై దృష్టి సారించారు..నయీం తర్వాత ఇకపై ఇలాంటి దందాలకు ఎవరూ పాల్గొనకుండా ఉండేందుకు ముందే కట్టడి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు..దీనిలో భాగంగా నయీం వెన్నంటే ఉంటూ ఎన్నో అరాచకాలకు పాల్పడ్డ వారి జాబితా రెడీ చేసుకున్నారు...ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు...వారు అందిస్తున్న వివరాలతో నయీంకు చెందిన ఇంకా వందలకోట్లలోనే ఆస్తులున్నట్లు గుర్తించారు....

కింగ్‌పిన్‌ రైట్‌ హ్యాండ్‌ శ్రీధర్‌గౌడ్...
నయీంకు రైట్‌హ్యాండ్‌గా ఉంటూ ఎన్నో దందాలు చేస్తున్న శ్రీధర్‌గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...శ్రీధర్‌తో పాటు బలరాం ను కూడా అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు..వీరి రిమాండ్‌ రిపోర్టులో తొమ్మిది మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు మిగిలినవారు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు...శ్రీధర్‌గౌడ్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతని ఇంట్లో సోదాలు చేయగా ఎన్నో డాక్యుమెంట్లు దొరికాయి...వీటిని స్వాధీనం చేసుకున్నారు....ఈ గ్యాంగ్‌లోని ఫయీం,సుధాకర్,వెంకటేశ్,శ్రీధర్‌రాజు,కరుణాకర్,శ్రీనులు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు..నయీం ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలియడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు....

అంతా కలిసి కోఆర్డినేషన్‌తో సెటిల్‌మెంట్లు...
ఇక నయీం గ్యాంగ్‌లో మరో ముఖ్యుడు ఫయీం...స్వయానా బావమరిది అయిన ఫయీంకు ఎన్నో బాధ్యతలు అప్పగించాడు నయీం.. శ్రీధర్‌గౌడ్‌కు క్లాస్‌మేట్ కావడంతో వారి మధ్య అవగాహన కుదిరింది...నగర శివార్లలోని సెటిల్‌మెంట్లన్నీ శ్రీధర్‌గౌడ్ చూసుకుంటుండగా సేకరించిన డబ్బు...దందాలో వచ్చిన సొమ్ముతో పాటు వసూళ్లను ఫయీం తీసుకెళ్లేవాడు...భవానీ గెస్ట్‌ హౌస్‌లో సెటిల్‌మెంట్లు చేసి కోట్లకు కోట్లు డబ్బు తరలించేవారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు....

భార్యాపిల్లలతో తరచూ గోవాలో జల్సాలు
గడిచిన ఐదేళ్లుగా నయీం ఫ్యామిలీతో తరుచూ గోవాకు వెళ్లేవాడు..ఇలా టూర్‌కు వెళ్లినా కొన్ని దందాలు అక్కడి నుంచే కొనసాగించేవాడని తెలుస్తోంది...దీంతో గోవాలో ఏకంగా ఓ భవనాన్ని కొనుగోలు చేసి అక్కడే తన నమ్మకస్తుడు..సామాజిక వర్గానికి చెందిన తాజొద్దీన్‌ను వాచ్‌మెన్‌గా పెట్టాడు...అతనికి డబ్బు ఇచ్చి సహకరించడమేగాక నెలవారిగా డబ్బు ఇచ్చేవాడు..దీంతో తాజొద్దీన్ కూడా నమ్మకంగా ఉంటూ నయీం దందాలకు సహకరించాడు...గోవాలో కూడా నయీం ఆస్తులు..డబ్బున్నట్లు తెలుసుకున్న ప్రత్యేక బృందం వెళ్లిన అక్కడే ఉన్న వాచ్‌మెన్‌ తాజుద్దీన్‌ను అరెస్ట్‌ చేసి నగరానికి తరలించారు..తాజొద్దీన్ చెప్పిన వివరాలను రికార్డు చేసిన నార్సింగి పోలీసులు కేసులు నమోదు చేసి రాజేంద్రనగర్‌ కోర్టులో ప్రవేశపెట్టారు... తాజుద్దీన్‌పై 120 బి, 366, 384, 120, 506, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాజుద్దీన్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో వెంటనే చర్లపల్లి జైలుకు తరలించారు.

ఫర్హానా పేరుతో ఇల్లు కొనుగోలు...
నయీం తరుచూ గోవాకు వెళ్లినప్పుడు భార్యాపిల్లలతో పాటు ఫర్హానా,సదా,కరీనా,జెబా అనే మహిళలు కూడా రెగ్యులర్‌గా టూర్‌లో ఉండేవారు...ఇక గోవాలో డబ్బులు..అక్కడి వ్యవహారాలన్నీ ఫర్హానా చూసుకునేది...ఈ విషయాలన్నీ తెలుసుకున్న పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వివరించారు...

21:21 - August 11, 2016

నెల్లూరు : కావలి రూరల్ మండలం నందమ్మపురంలో మౌనిక అనే మూడున్నరేళ్ళ బాలిక బోరుబావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్‌ శ్రీను జేసీబీతో ఘటనా స్థలానికి చేరుకుని మౌనికను బయటకు తీసేందుకు సహాయ చర్యలు చేపట్టారు. మత్స్యకార కుటుంబానికి చెందిన గోపీ,చుక్కమ్మ దంపతులు బిడ్డ మౌనిక ఇంటి ఆవరణలో తవ్విన 30 అడుగుల బోరుబావిలో పడిపోయింది. గోపీ దంపతులు నివాస ప్రాంతంలో నీటి సమస్య వుండటంతో బోరుబావి తవ్వినట్లుగా తెలుస్తోంది. బావి వున్న ప్రాంతం ఇసుకనేల కావటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కాగా మౌనిక సాయంత్రం 6.30గంటకు బావిలో పడనట్లుగా సమాచారం.

20:56 - August 11, 2016

పాతికేళ్లుగా విస్తరించిన నేరసామ్రాజ్యం అది. ఏ అండదండలతో ఎదిగాడు? ఎవరి దన్నుతో చెలరేగాడు? ఇన్ని సంవత్సరాలు నేరాలు నిరాఘాటంగా చేస్తూ గ్యాంగ్ స్టర్ గా ఎలా నిలిచాడు.. అసలీ తూటా ఏ తుపాకీది? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. అతడి పేరు చెబితే ప్రత్యర్ధులకు వణుకు.. కోవర్టు నుంచి కోటీశ్వరుడయ్యాడు.. పోలీసులకు ఆయుధంగా మారి.. చివరికి వాళ్ల చేతుల్లోనే హతమయ్యాడు.. వర్మ సినిమాకు ఏ మాత్రం తగ్గని మసాలా నయీం లైఫ్ లో కనిపిస్తుంది. గ్యాంగ్‌స్టర్ నయీం కేసులకు సంబంధించి...ఎన్‌కౌంటర్‌ తర్వాత బయటపడ్డ ఆస్తులపై సిట్‌ శోధన మొదలయింది... సిట్‌ ఏర్పాటు ప్రకటించిన గంటలోనే యాక్షన్‌లోకి దిగిన బృందాలు నయీం ఇంటిని సోదాలు చేశాయి..అందులో కొన్ని దొరికిన ఆధారాలతో పాటు డాక్యుమెంట్లను స్వాదీనం చేసుకున్నారు.. నయీం సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు విడతలుగా జరుగుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో దర్యాప్తుని సిట్ బృందం వేగవంతం చేశారు. తాజాగా నయీం గోవా గెస్ట్‌హౌస్‌లో దొరికిన డైరీలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వాసు అనే వ్యక్తి దగ్గర 2014లో నయీం ఈ గెస్ట్ హౌస్‌ను 2014లో కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. గోవా గెస్ట్ హౌస్‌ను నయీం ఫర్హానా పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ఫర్హానాను కోకోనట్ అంటూ నయీం పిలిచేవాడని గోవా గెస్ట్‌హౌస్‌లో దొరికిన డైరీలో రాసుకున్నాడు. అంతేకాదు ఈ డైరీలో నయీం కోడ్ భాషను ఉపయోగించాడు. ఈ కోడ్ భాషను డీ కోడ్ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. నయీంతో పీకల్లోతు లావాదేవీల్లో మునిగిన సీనియర్‌ ఐపీఎస్‌ ఎవరు? నయీంకు సహాయం చేస్తూ స్వామి కార్యం, స్వకార్యం చేసుకున్న ఖాకీ పెద్ద ఎవరు? భారీగా భూములు, ప్లాట్లు కైవసం.. సెటిల్‌మెంట్లకు తోడ్పడుతూ, నయీంకి అండగా నిలిచిందెవరు? డైరీలోని మేటరంతా బయటికొస్తుందా? డబ్బు సంపాదించడం కోసం...తానొక గ్యాంగ్‌స్టర్‌గా మారేందుకు నయీం ఏ అవకాశాన్ని విడువలేదు...ఇందులో ఎందరో మహిళలు కూడా పావులయ్యారు.. ప్రధానంగా గిరిజన యువతులు.. బాలికలను టార్గెట్ చేసిన నయీం ఎన్నో అరాచకాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది...నయీం గ్యాంగ్‌లోని లేడీడాన్‌లు నోరువిప్పితే ఎన్నో దుర్మార్గాలు బయటపడనున్నాయి... నయీంతో పాటు కలిసి దందాలు చేసినవారి ఆస్తులు కూడా కూడా కోట్లలో ఉన్నాయి... దీన్ని బట్టి నయీం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కూడా తన గ్యాంగ్‌ను విస్తరించినట్లు తేలుతోంది. ఇలా అరాచకాలు సృష్టిస్తూ నడిపిస్తున్న గ్యాంగ్‌లో సభ్యులను గుర్తించి వారిని కూడా అదుపులోకి తీసుకోనున్నారు.. నయీంకు సంబంధించిన ప్రతీ విషయాన్ని కూలంకుషంగా దర్యాప్తు చేయనున్నారు... నయీంకు సహకరిస్తూ గ్యాంగ్‌లో ఉన్నవారు.. బయట నుంచి సహకరించిన వారందరి జాతకాలు బయటపడనున్నాయా? వ్యవస్థ వికృత రూపంలోంచి వచ్చిన వాడు నయీం.. అధికారం, అక్రమాలతో అడ్డంగా సంపాదించాలనే దాహం నిండిన కొందరికి ఆయుధమై, తానే ఓ నిలువెత్తు అక్రమమై చివరికి తనను పెంచిన తూటాకే బలయ్యాడు. ఇలాంటి శక్తులను పెంచి పోషించే దశలో వ్యవస్థ ఉన్నంత కాలం అరాచకాలకు అంతం ఉండదు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

20:45 - August 11, 2016

స్టీలు డబ్బాలో బెజ్జంల ఏలు పెట్టిన పిలగాడు..షురువైన పుష్కరాల సందడి..మా ఆయనకు నయీంతో సంబంధం లేదంటున్న ఉమా మాధవరెడ్డి.. అబద్దాల ఆటలు ఒలింపిక్స్ లో పెడితే..నరేంద్రమోడీ గోల్డ్ మెడల్ ..రాహుల్ గాంధీ రజతం.పతకాలు పట్టుకొస్తారంట..తెలంగాణల ఒలింపిక్ క్రీడలకెల్లిన ఆటల మంత్రి పద్మారావు..రాత్రేల వైద్యశాఖ కార్యాలయం వద్ద నిదురబోయి నిరసన సేత్తన్న సెకండ్ ఏఎన్ఎంలకు సంఘీభావం తెలిపిన వానరం..టక్కరైన మడిసి వద్ద సెల్ ఫోను పట్టుకపోయిన మరో మడిసి..గిటువంటి మస్తు ముచ్చట్లను మన మల్లన్న ఈరోజుకూడా తీసుకొచ్చిండు..మరి ఈ ముచ్చట్లను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండ్రి..మస్తు ఖుషీ అవుండ్రి...

20:40 - August 11, 2016

పిల్లలు అనేకానేక కారణాలతో అనారోగ్యాలతో గురవుతూనే ఉంటారు. కుటుంబ సభ్యులు వారిని కంటికి రెప్పలా కాపాడుకున్నా నీరసపడుతూనే ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో పిల్లలు త్వరగా కోలుకోవాలంటే ఎలాంటి క్యాచప్ పుడ్ తీసుకోవాలో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. 

20:39 - August 11, 2016

వ్యవసాయం ఒక వృత్తి కాదు. జీవన విధానం. ఆ జీవన విధానానికి జవం, జీవం మహిళలే. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ.. అలాంటి వ్యవసాయంలో ప్రతి తొలికరిలో అనేక రకాల సంప్రదాయాల్ని పాటించడం. ప్రకృతిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి ఆనవాయితీని నేటికీ కొనసాగిస్తున్న శ్రీకాకుళం మహిళా రైతుల మాట, పాటలతో మానవి ప్రత్యేక కథనం. మానవ పరిణామ క్రమంలో, నాగరికత వికాసంలో మహిళలు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉన్నారు. వ్యవసాయాన్ని కనిపెట్టారు. ఉత్పత్తిని సాధించారు. సంపద పోగేసారు. ఇప్పటికీ వ్యవసాయానికి వెన్నుదన్నుగానే ఉన్నారు. వ్యవసాయం బాగుంటే, ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటే దేశం బాగుంటుంది. అందుకే వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతు కుటుంబం బాగుండాలని కోరుకుందాం. రైతును నమ్ముకున్న సమాజం బాగుండాలని కోరుకుందాం. వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు బాగుండాలని కోరుకుందాం. వారి ఉపాధికి ఎలాంటి ఢోకా లేని పరిస్థితులుండాలని ఆకాంక్షిద్దాం. 

బోరుబావిలో పడిన బాలిక..

నెల్లూరు : కావలి రూర్ లమండలం నందమ్మపురంలో మౌనిక అనే మూడున్నరేళ్ళ ఏళ్ళ బాలిక బోరుబావిలో పడింది. బాలికను రక్షించేందుకు గ్రామస్థులు ప్రయత్నిస్తున్నారు. 

పేలుడులో ఇద్దరు మృతి..

రాజస్థాన్‌ : రాజస్థాన్ లో భారీ పేలుడు సంభవించింది. చిత్తోర్‌‌ఘడ్ రావత్‌బాటలోని శివ్‌శక్తి కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. 

19:59 - August 11, 2016

తూర్పుగోదావరి :  గోదావరి అంత్యపుష్కరాలు పరిసమాప్తమయ్యాయి. రాజమండ్రిలో గోదావరికి హారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు. దంపుతులతో సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

19:54 - August 11, 2016

నల్లగొండ : రేపటి నుండి తకృష్ణానది పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు జిల్లాలలో మాత్రమే కృష్ణానది ప్రవహిస్తుంది.ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పుష్కరాలకు ఎటువంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం...నల్లగొండ జిల్లాలో మొత్తం 28 ఘాట్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా కలెక్టర్ పేర్కొన్నారు. నల్గగొండ జిల్లాలో పుష్కర స్నానం కోసం సుమారు కోటి 50లక్షలమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. దీనికోసం అన్ని ఆర్టీసీ బస్ డిపోల నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ ఘట్ వద్ద మెడికల్ క్యాంప్ లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు సర్వీస్ కోసం 8,750మంది సిబ్బందిని ఏర్పాటుచేసినట్లుగా తెలిపారు. నాగార్జున సాగర్, మట్టపల్లి, వాడపల్లి ఘాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టామనీ..వీటితోపాటుగా బ్యూటిఫుల్ లొకేషన్లలో కొత్తగా ఏర్పాట్లు చేసిన అడవిదేవులపల్లి,క్రిష్టాపురం, వజ్రపల్లి వంటి పలు అందమైన ఏర్పాటు చేసిన ఘాట్లలోకూడా భక్తులు పుష్కరస్నానాలు చేసి ఆనందంగా అనుభూతి చెందేలా పలు ఏర్పాటు చేసినట్లుగా కలెక్టర్ సత్యనారారణ తెలిపారు. 

19:38 - August 11, 2016

విజయవాడ : ఏపీ ప్రభుత్వ ప్రతిష్తాత్మకంగా తలపెట్టిన కృష్ణా నది పుష్కరాలకు వచ్చిన భక్తులు కృష్ణమ్మ చెంతనే ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మను దర్శించుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్కరన్నానం చేసిన భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకోసం ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారో ఆలయ ఈవో సూర్యకుమారి మాటల్లోనే తెలుసుకుందాం.. పుష్కరాలకు వచ్చే భక్తులకోసం ఏర్పాట్లన్నీ ఇంచుమించుగా పూర్తయ్యాయని దుర్గగుడి ఆలయ ఈవో సూర్యకుమారి తెలిపారు. రోజుకు 22గంటలపాటు దర్శనం కొనసాగించేలా.. రెండు లక్షలమంది భక్తులు దుర్గమ్మను దర్శించుకునే ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉచిత దర్శనంకోసం నాలుగు క్యూలైన్లను ఏర్పాట్లుచేసామనీ..వృద్ధులు, వికలాంగులు..వీఐపీల కోసం ఒకలైనును ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులు వెనుకున్న భక్తులను కూడా దృష్టిలో పెట్టుకుని దర్శనాన్ని త్వరంగా ముగించుకోవాలని ఆమె భక్తులకు విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఆధ్యాత్మిక చింతన కలిగేలా భజనలు తదితర ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. భక్తుల అవసరాల కోసం మెడికల్ క్యాంపులు..మంచినీరు ప్యాకెట్లు..అన్ని అందుబాటులో వుండేలా చర్యలు తీసుకున్నామని ఈవో సూర్యకుమారి తెలిపారు.

19:14 - August 11, 2016

తూర్పుగోదావరి : దళితులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో దాడికి గురైన బాధితులను ఆయన పరామర్శించారు. బాధితులను అడిగి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ బాధితులకు 4లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడ్డ వారికి లక్ష రూపాయలు పరిహారాన్ని కమిషన్‌ తరపున ఇస్తున్నామన్నారు. బాధితులకు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి తెలిపారు. 

19:10 - August 11, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఘాట్ల ధగ్గర రద్దీ నియంత్రణ నుంచి యాత్రికుల భద్రత, ఆహారం, మంచినీరు సరఫరా వరకు... ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంది. బస్టాప్‌ల నుంచి పుష్కర ఘాట్లకు యాత్రికులను చేరవేసుందుకు ఉచిత బస్‌ సర్వీసులను సిద్ధం చేసింది.

పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు..
కృష్ణా పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. యాత్రికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నానమాచరించడం నుంచి పుణ్యక్షేత్రాల సందర్శన వరకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.

కమాండ్‌ కంట్రోల్‌ రూమును ప్రారంభించిన బాబు
ఘాట్ల దగ్గర యాత్రికుల రద్దీని పరిశీలించి ఎప్పటికప్పుడు నియంత్రించడంతోపాటు, సమాచారం చేరవేసేందుకు దుర్గాఘాట్‌ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షలో ఈ కేంద్రం పని చేస్తుంది.

తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని ప్రారంభించిన చంద్రబాబు
పుష్కరాల సందర్భంగా సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా ఏడు కోట్ల రూపాయలతో ఆధునీకరించిన తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని చంద్రబాబునాయుడు ప్రారంభించారు. పుష్కర యాత్రికులను అతిధులుగా చూడాలని, ఆతిధ్యమిచ్చి ఆదరించాలని కోరారు. యాత్రికుల నుంచి అధిక రేట్లు వసూలుచేసి, దోపిడీచేస్తే సహించబోమని చంద్రబాబు హెచ్చరించారు.

అక్షయపాత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు భోజన వసతి కల్పించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ భవానీపురం గొల్లపూడి మార్కెట్‌ నిర్మించిన అక్షయపాత్ర ఆధునిక వంటశాలను చంద్రబాబు ప్రారంభించారు. ఇక్కడ తయారు చేసిన వంటలను పరిశీలించి, రుచి చూసిన చంద్రబాబు..ఆహార నాణ్యతపై కొన్ని సూచనలు చేశారు. వంటకాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

చిన జీయర్‌స్వామిని పుష్కరాలకు ఆహ్వానించిన చంద్రబాబు
గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో ఉన్న సీతానగరంలోని చినజీయర్‌ స్వామి ఆశ్రమాన్ని చంద్రబాబు సందర్శించారు. చిన జీయర్‌స్వామిని పుష్కరాలకు ఆహ్వానించారు. చిన జీయర్‌స్వామి ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మంగళరిగిలో తలపెట్టిన బ్రహ్మయజ్ఞం విజయవంతం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈనెల 19న సీతానగరం ఘాట్‌లో లక్ష మంది యాత్రికులతో కలిసి జీయర్‌స్వామి పుష్కర స్నాయం చేయనున్నారు.

కృష్ణా పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం : చంద్రబాబు
కృష్ణా పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.. పుష్కరాలకు వచ్చేవారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్నీ సిద్ధం చేశామన్నారు.. ఘాట్లలో రద్దీ పెరగకుండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి భక్తులను అధికారులు అక్కడికి పంపుతారని తెలిపారు..

కృష్ణా జిల్లాలో 170 ఘాట్లు..
కృష్ణా పుష్కరాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే బెజవాడలో పుష్కర శోభతో ప్రధాన రహదారులు రద్దీగా మారాయి. కృష్ణా జిల్లాలో మొత్తం 170 ఘాట్లను నిర్మించారు. పవిత్ర సంగమంలో రెండున్నర కిలోమీటర్ల పొడవునా చేపట్టిన అభివృద్ధి పనులు ప్రత్యేక ఆకర్షణగా నిలస్తున్నాయి. ఘాట్ల వద్ద భక్తులకు అసౌకర్యం కలగకుండా కృష్ణా జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో 20 నుంచి 30 మంది సభ్యులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో దేవాదాయ, పోలీస్ తదితర శాఖల సిబ్బంది ఉంటారు. వీరిని పుష్కరాలకు 72 గంటల ముందు నుంచే అందుబాటులోకి తెచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 51 పుష్కర నగర్ లు ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులకు వసతితోపాటు ఆహారం కూడా అందిస్తారు. కృష్ణాలో 27 వేల మంది పోలీసులు, గుంటూరులో 7 వేల మందికి పైగా పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే పుష్కరాలు జరిగే ప్రాంతాలు, దాని పరిసర ప్రాంతాలను ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘాలోకి తీసుకున్నాయి. కృష్ణాలో 284, గుంటూరులో 217 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో బాధితులను తరలించేందుకు ఒక హెలికాఫ్టర్‌ను సిద్ధం చేస్తున్నారు.

700కుపైగా ప్రత్యేక బస్‌లు..
గత పుష్కరాలకు 163 ప్రత్యేక బస్‌లు నడపగా, ఈసారి 700కుపైగా ప్రత్యేక బస్‌లు నడుపుతున్నారు. రైల్వే శాఖ పుష్కరాలకు ప్రత్యేక రైళ్ల ద్వారా యాత్రికులను తరలించే ఏర్పాట్లలో నిమగ్నమైంది. మరోవైపు విజయవాడ ప్రాంతం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. రోడ్ల విస్తరణ, రోడ్ల వెంబడి గోడలకు, డివైడర్లకు రంగులు, వాటి మధ్య పూల కుండీలు, మొక్కలు, చెట్లను ఏర్పాటు చేశారు. వీటికి విద్యుత్ దీపాంలంకరణలతో ముస్తాబు చేశారు. ప్రకాశం బ్యారేజ్, ప్రభుత్వ కార్యాలయాలన్నీటికి విద్యుత్ కాంతులు అద్దుకున్నాయి.

పుష్కరాలకు టోల్‌ఫ్రీ నెంబర్‌ 1077..
కృష్ణా పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణం పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశామంటున్నారు కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాబు. 1300 సీసీ కెమెరాల కనెక్టివిటీతో ఏర్పాటైన కమాండెంట్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని చెబుతున్నారు. ఘాట్లలో రద్దీ పెరిగినా, మరేదైనా సమస్య వచ్చినా ఎండీటీ టీమ్‌ రంగంలో దిగుతుందంటున్నారు. పుష్కరాల్లో ఎవరైనా తప్పిపోయినా టోల్‌ఫ్రీ నెంబర్‌ 1077కు ఫోన్‌ చేస్తే తక్షణ సమాచారం అందించేలా విజయవాడలో ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్‌ బాబు తెలిపారు.

మొండికుంటలో విషాదం..

ఖమ్మం : అశ్వాపురం మండలం మొండికుంటలో విషాదం నెలకొంది. కుమారుల నిరాధారణకు గురై పంచాయతీ ఆఫీస్ దగ్గర దీక్ష చేస్తున్న వృద్ధురాలు సరోజనమ్మ (70) మృతి చెందింది. నిన్నటి నుంచి దీక్ష చేస్తున్నా ఐదుగురు కొడుకులు పట్టించుకోకపోవడంతో ఆమె మృతిచెందిందని గ్రామస్థులు చెబుతున్నారు. సరోజనమ్మకు 5గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు వున్నారు. పది ఎకరాల భూమిని లాక్కొని తిండిపెట్టడం లేదని వృద్ధురాలు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.

దళితుల దాడి ఘటనలో 8మంది అరెస్ట్ : చంద్రబాబు

రాజమండ్రి : అమలాపురం మండలం సవర్పాలెంలో దళితులపై దాడి జరిగిన రెండు రోజుల్లోనే 8 మంది నిందితులను అరెస్ట్ చేశామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. చెరుకూరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, దళితులపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

అలంపూర్ కు చేరుకున్న కేసీఆర్ దంపతులు..

మహబూబ్ నగర్ : సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక బస్ లో అలంపూర్ కు చేరుకున్నారు. రేపు తెల్లవారుఝామున 5.58గంటలకు గొందిమళ్ళ కేసీఆర్ దంపతులు పుష్కరస్నానం ఆచరించనున్నారు.అనంతరం జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు కూడా వెంట వున్నారు. 

మెట్రో రైల్వేస్టేషన్ లో యువతి ఆత్మహత్యాయత్నం..

ఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్వేస్టేషన్ ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 21ఏళ్ల వయస్సున్న యువతి ఇంద్రప్రస్థ మెట్రో స్టేషన్ సమీపంలో బ్లూలైన్ వద్ద రైలు వస్తున్న సమయంలో ట్రాక్‌పై దూకి ఆత్మహత్యాయత్నం చేసిందని అధికారులు తెలిపారు. తీవ్ర గాయాలైన యువతిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

నయీం బాధితులూ కేసులు నమోదు చేయండి : ఐజీ నాగిరెడ్డి

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా పీఎస్ కు వచ్చి కేసులు పెట్టాలని సిట్ ఐజీ నాగిరెడ్డి పిలుపునిచ్చారు. బాధితుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. నయీం వ్యవహారంలో మొత్తం 12 కేసులు నమోదు చేశాం. రెండు ఏకే47లు, ఒక స్టెన్‌గన్, పలు తుపాకులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 599 ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నాం. ఇప్పటి వరకు 18 మందిని ఈ వ్యవహారంలో అరెస్టు చేశాం. నయీం భార్యను అరెస్టు చేశామని తెలిపారు. వీలైనంత తొందరగా కేసును దర్యాప్తు పూర్తిచేస్తామని తెలిపారు.

18:25 - August 11, 2016

విజయవాడ : ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. పుష్కర స్నానాలకు నీటి సమస్య తలెత్తకుండా ప్రకాశం బ్యారేజీ నుంచి పద్మావతి ఘాట్‌కు నీటిని విడుదల చేశారు. ఘాట్ల దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణవేణి, పద్మావతి ఘాట్లలో పుష్కర ఏర్పాట్లపై మరింత సమాచారం కోసం ఈ వీడియో  చూడండి..

విద్యుత్ ప్లాంట్ పేలి 21మంది మృతి..

చైనా : విద్యుత్ కర్మాగారంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 21 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స జరిపిస్తున్నారు.

18:01 - August 11, 2016

హైదరాబాద్ : హైకోర్టులో ప్రభుత్వం అన్నీ అబద్ధాలే చెబుతుందని భూనిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్‌ వెంకట్‌ తెలిపారు. 2013 చట్టం షెడ్యూల్‌ 2 ప్రకారం రైతులకు ఉపాధి పరిహారం ఇవ్వాలన్నారు. 123 జీవో ఇష్టం లేని రైతులు కోర్టును ఆశ్రయిస్తే.. 2013 చట్టం అమలయ్యేలా చూస్తామని హైకోర్టు చెప్పిందని.. ఈ అవకాశాన్ని రైతులు, నిర్వాసితులు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. 

17:55 - August 11, 2016

హైదరాబాద్ : నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత బయటపడుతున్న నిజాలు చూస్తుంటే ప్రపంచం నివ్వెరపోయేలా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నయీం ప్రభుత్వానికి సమానంగా సమాంతర వ్యవస్థను నడిపించాడంటే.. ఆయన వెనక పాలకవర్గాలకు చెందిన ఎంతోమంది ఉండి ఉంటారన్నారు. ఈకేసులో పూర్తి దర్యాప్తు చేసి.. నయీంకు సహకరించిన వారందరిని బయటపెట్టాలని జూలకంటి డిమాండ్‌ చేశారు. 

17:47 - August 11, 2016

ఢిల్లీ : సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కు చుక్కెదురయ్యింది. ఉన్నతవిద్యామండలి ఆస్తుల పంపకంపై తెలంగాణ సర్కార్ వేసిన రివ్యూ పిటీషన్ ను దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. జనాభా ప్రాతిపదికన 58:42 నిష్ప‌త్తి ప్రకారం ఆస్తులను అప్పులను పంచుకోవాలని గతంలో సుప్రీంకోర్టు సూచించింది. రెండు నెలల్లో వివాదాన్ని ప‌రిష్క‌రించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించింది. అయితే ఆ తీర్పును స‌వాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిష‌న్ వేసింది. ఈ నేపథ్యంలో పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తిరస్కరించింది. రాష్ట్ర విభజనాతంరం తెలంగాణ ప్రభుత్వం ఉన్న‌త విద్యామండ‌లి ఖాతాలలోవున్న ఆస్తులను తెలంగాణా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఆస్తుల పంపకాల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విభజన పునర్వవస్థీకరణ 75వ సెక్షన్ ప్రకారం ఏ ప్రాంతంలో వున్న ఆస్తులు వారికే చెందుతాయని తెలంగాణ ప్రభుత్వం గతంలో వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. 

నయీం కేసు దర్యాప్తు సాగుతోంది - నాయినీ..

హైదరాబాద్ : నయీం కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, నాగిరెడ్డి నేతృత్వంలోన సిట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నల్గొండ జిల్లాలో ఓ మాజీ మంత్రి ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. నయీం కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు. 

టీఎస్ రివ్యూ పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం..

ఢిల్లీ : ఉన్నత విద్యామండలి కేసులో టీఎస్ ప్రభుత్వ రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆస్తులు, బ్యాంకు ఖాతాల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. విభజనకు ముందు ఉన్నత విద్యామండలి ఖాతాలోని నిధులను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని, 10వ షెడ్యూల్ లోని అన్ని అంశాలను ఇదే నిష్పత్తిలో పంచుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. 

17:17 - August 11, 2016

హైదరాబాద్ : నయీం అనుచరుల అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. గోవాలోని నయీం ఇంటి వాచ్‌మెన్‌ తాజుద్దీన్‌ను అరెస్ట్‌ చేసిన నార్సింగి పోలీసులు.. రాజేంద్రనగర్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. తాజుద్దీన్‌పై 120 బి, 366, 384, 120, 506, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాజుద్దీన్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. తాజుద్దీన్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. తాజుద్ధీన్ తో పాటు రెండు బ్యాగ్గుల్లో దాదాపు రూ.2కోట్ల 8లక్షలను స్వాధీనం చేసుకున్నారు. 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రం కాస్తా కుదుటపడ్డాయి. సెన్సెక్స్ 85 పాయింట్లు లాభపడి 27859 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17 పాయింట్లు లాభపడి 8592 వద్ద ముగిసింది. 

కృష్ణా పుష్కరాలకు భారీ బందోబస్తు - డీజీపీ

హైదరాబాద్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. పుష్కర ఘాట్ల వద్ద 555 నిఘా కెమెరాలు అమర్చినట్లు, మహిళలపై వేధింపుల నిరోధానికి 27 షీ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

17:03 - August 11, 2016

ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి నిధులివ్వకుండా కేంద్రం పక్షపాతం చూపుతోందని రాజ్యసభలో సమాజ్‌వాది పార్టీ ఆరోపించింది. రాష్ట్రానికి రావలసిన నిధులకు సంబంధించి ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌తో పాటు పలువురు మంత్రులు కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని ఎస్పీ నేత ప్రొఫెసర్‌ రాంగోపాల్‌ యాదవ్‌ ఆరోపించారు. సర్వశిక్ష అభియాన్‌కు సంబంధించి 3 వేల 585 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉందని, దీంతో పాటు పలు శాఖలకు సంబంధించిన నిధులను కేంద్రం విడుదల చేయలేదన్నారు. కేంద్రం వైఖరికి నిరసనగా ఎస్పీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి మోది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటలవరకు నాలుగుసార్లు వాయిదా పడింది.

17:00 - August 11, 2016

తూర్పుగోదావరి : నేటితో గోదావరి అంత్య పుష్కరాలు ముగియనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని గోపాద పుణ్యక్షేత్రం వద్ద గోదావరి అంత్య పుష్కరాల్లో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానమాచరించారు. మరిన్ని వివరాలు కోసం ఈ వీడియో చూడండి..

16:58 - August 11, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.. పుష్కరాలకు వచ్చేవారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్నీ సిద్ధం చేశామన్నారు.. ఘాట్లలో రద్దీ పెరగకుండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి భక్తులను అధికారులు అక్కడికి పంపుతారని తెలిపారు.

పవిత్ర సంగమం ఘాట్ వరకు శోభాయాత్ర
కృష్ణా పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. ఈ రోజు సాయంత్రం విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి పవిత్ర సంగమం ఘాట్ వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. దీంతో కృష్ణానది తీరాల్లో పుష్కర సందడి మొదలుకానుంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు రానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజమహేంద్రవరంలో గోదావరి అంత్య పుష్కరాల్లో పాల్గొని... విజయవాడకు చేరుకుని కృష్ణమ్మకు హారతినిచ్చి పుష్కరుడికి

700కుపైగా ప్రత్యేక బస్సులను నడుపుతున్న ఆర్టీసీ
గత పుష్కరాలకు 163 ప్రత్యేక బస్‌లు నడపగా, ఈసారి 700కుపైగా ప్రత్యేక బస్‌లు నడుపుతున్నారు. రైల్వే శాఖ పుష్కరాలకు ప్రత్యేక రైళ్ల ద్వారా యాత్రికులను తరలించే ఏర్పాట్లలో నిమగ్నమైంది. మరోవైపు విజయవాడ ప్రాంతం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. రోడ్ల విస్తరణ, రోడ్ల వెంబడి గోడలకు, డివైడర్లకు రంగులు, వాటి మధ్య పూల కుండీలు, మొక్కలు, చెట్లను ఏర్పాటు చేశారు. వీటికి విద్యుత్ దీపాంలంకరణలతో ముస్తాబు చేశారు. ప్రకాశం బ్యారేజ్, ప్రభుత్వ కార్యాలయాలన్నీటికి విద్యుత్ కాంతులు అద్దుకున్నాయి. 

16:46 - August 11, 2016

హైదరాబాద్ : కరుడుకట్టిన నేరస్థుడు నయీంతో తమ కుటుంబానికి సంబంధాలున్నాయని వస్తున్న వార్తల వెనుక రాజకీయ, సమాజిక కుట్రలు ఉన్నాయని మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి తనయుడు, టీడీపీ నేత సందీప్‌రెడ్డి అంటున్నారు. నక్సల్స్‌ ఘాతుకానికి బలైన తన తండ్రి మాధవరెడ్డికి ఉన్న మంచిపేరును చెడగొట్టేందుకు జరుగుతున్న కుట్రల్లో ఇదో భాగమని సందీప్‌రెడ్డి చెబుతున్నారు. నయీంతో తమ కుటుంబానికి సంబంధాలున్నాయని పత్రికల్లో వార్తలు రాయించడం వెనుక టీడీపీ నేతల హస్తం కూడా ఉందంటున్న సందీప్‌రెడ్డి పేర్కొన్నారు. ఎవరిని మోసం చేయటానికి ఈ వదంతులను సృష్టిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మాతండ్రి పేరును చెడగొట్టటానికి మాపై నిదలు మోపుతున్నారని ఆయన తెలిపారు. ఇది రాజకీయ కుట్రేకాకుండా సామాజిక కుట్ర అని ఆయన పేర్కొన్నారు. మాధవరెడ్డిగారి సమాజిక వర్గాన్ని దెబ్బతీయటానికి కుట్రపన్నుతున్నారన్నారు. నయీంతో సంబంధాలపై ఎటువంటి విచారణకైనా తాము సిద్ధంగా వున్నామని తెలిపారు.

యుద్ధ విమానాల దాడిలో 30 మంది మృతి..

సిరియా : ఐసిస్ అధీనంలో ఉన్న రఖా నగరంపై రష్యా యుద్ధ విమానాలు విరుచుకు పడ్డాయి. ఇవాళ రష్యాకు చెందిన తుపోలోవ్ యుద్ద విమానాలు నగరంపై జరిపిన దాడిలో 30 మంది మృతిచెందారు. మరో 70 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో 24 మంది సాధారణ పౌరులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 

పోలీసుల అదుపులో 4గురు మావోలు ..

కర్నూలు : అవుకు మండలం రామవరం వద్ద నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించిన పోలీసులు మావోయిస్టులుగా గుర్తించారు. గాలేరు-నగరి సుజల స్రవంతి పనుల్లో పనిచేస్తున్న ఈ నలుగురు మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 

తాజుద్దీన్‌కు 14రోజుల కస్టడీ..

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరుడు తాజుద్దీన్‌కు రాజేంద్రనగర్‌ 23వ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ 14 రోజుల కస్టడీకి ఆదేశించారు. తాజుద్దీన్‌ను పోలీసులు కొద్దిసేపటి క్రితమే రాజేంద్రనగర్‌ న్యాయస్థానంలో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నయీం ఇంట్లో స్వాధీనం చేసుకున్న రూ.2కోట్ల నగదును పోలీసులు న్యాయస్థానానికి అప్పగించారు. కోర్టు ఆదేశాల మేరకు నగదు, ఆస్తులపత్రాలను బ్యాంకులో డిపాజిట్‌ చేయనున్నారు.

కోర్టును సర్కార్ మభ్యపెడుతోంది : వెంకట్

మెదక్ : హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని భూనిర్వాశితుల పోరాట కమిటీ కన్వీనర్ బి. వెంకట్ పేర్కొన్నారు. భూసేకరణ చట్టం -2013 అమలు చేయాలని ఆదేశిస్తామని కోర్టు పేర్కొందని ఆయన తెలిపారు. నిర్వాశితులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కోర్టులో పిటీషన్లు వేసి 2013 చట్టం ప్రకారం ప్రయోజనాలు పొందాలని ఆయన తెలిపారు.

16:14 - August 11, 2016

పవన్ సెంటిమెంట్ ఆయన ఫ్యాన్స్ కి బయం పుట్టిస్తుందట... ఆ సెంటిమెంట్ వల్ల మళ్ళీ ఇంకో ప్లాప్ చూడాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారట. ఈ సారి కూడా అలానే జరిగితే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నారంట. అసలు వాళ్లు అంతలా భయపడటానికి కారణమైన సెంటిమెట్లు ఏమిటి...

ఆయన రూటే వేరు...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పడి చస్తారు ఫ్యాన్స్... ఆయన సినిమా రిలీజ్ అయ్యిందంటే దానిని ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ మూవీ రిజీజ్ అయ్యి బాగా ఆడేవరకు బాగోగులు చూసుకునేది పవన్ ఫ్యాన్సే. అటువంటి ఫ్యాన్స్ కి హీరో ఓ ఫ్లాప్ మూవీనిని ఇస్తే వాళ్ళు ఫీలవుతారు. తరువాత మూవీకి కూడా అదే తప్పు చేస్తున్నాడంటే మరి వాళ్ళు కంగారు పడకుండా ఉంటారా చెప్పండి. పవర్ స్టార్ ఆయన రూటే వేరు... అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నుండి సర్ధార్ గబ్బర్ సింగ్ వరకు వచ్చిన సినిమాలన్నీ పవన్ ట్రెండ్ మార్క్ మూవీసే అని చెప్పాలి. బద్రీ, ఖుషి మూవీస్ తో.. ఫ్యాన్ ఫాలోయింగ్ ను అమాంతం పెంచుకున్న పవన్ ఆ తరువాత పవర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిపోయాడు. ఇప్పటికి పవర్ స్టార్ సినిమా అంటే పండగ చేసుకుంటారు ఆయన ఫ్యాన్స్.

సెంటిమెంట్...
పవన్ ఎవ్వరి మాట వినడండి... ఇదేంటి ఇది మన సీతయ్య డైలాగ్ కదా అని అనుకుంటున్నారా...? అదేం లేదు పవన్ కూడా ఓసారి డిసైడ్ అయితే ఎవరి మాట వినడు. ఆయన అనుకున్నది సాధించే వరకు వదలడట. అది ఏ పని అయిన కాని దానిలో ఫర్ఫెక్షన్ చూస్తాడట కళ్యాణ్ బాబు. అందుకే ఎప్పుడు పనివిషయంలో చాలా సీరియస్ గా ఉంటాడు పవర్ స్టార్. ఇంతకీ విషయం ఏమిటంటే పవన్ కొన్ని సెంటిమెంటల్ గా పెట్టుకున్న వాటివల్ల ఆయనకు ప్లాపులు వస్తున్నాయోమో అని ఫ్యాన్స్ భయపడుతున్నారంట. వాటి వల్ల మళ్లీ ఇంకో ఫ్లాప్ వస్తే ఫ్యాన్ తట్టుకోలేరేమో అని అనుకుంటున్నారంట. సర్థార్ గబ్బర్ సింగ్ లో కూడా అటువంటి సెంటిమెంట్స్ వలనే అది ఫ్లాప్ అయ్యిందని భావిస్తున్నారంట అందరు.

అవే సీన్స్ మళ్లీ రిపీట్...
'సర్దార్ గబ్బర్ సింగ్' ప్రొడక్షన్ జరిగినప్పుడు జరిగిన సీన్ అన్ని ఇప్పుడు కూడా రిపీట్ అవుతున్నాయంట. 'సర్దార్' సినిమా మొదలు అయ్యాక ఆ సినిమా దర్శకుడు సంపత్ నందిని తప్పించి పవన్ ఆ బాధ్యతను దర్శకుడు బాబికి అప్పగించాడు. అదే విధంగా పవన్ లెటెస్ట్ సినిమా విషయంలో కూడ దర్శకుడు ఎస్.జె. సూర్యను తప్పించి డాలీకి ఈ సినిమాను అప్పగించడం అనుకోకుండా జరిగినా సర్దార్ గబ్బర్ సింగ్ రిపీట్ అయినట్లుగానే భావిస్తున్నారు అభిమానులు. ఇవే కాదు సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ పూణే లో మొదలు అయిన తరువాత కొంత గ్యాప్ ఇచ్చి షూటింగ్ కి వచ్చాడు పవన్. ఇప్పుడు కూడ అదేవిధంగా పవన్ తన లెటెస్ట్ సినిమా షూటింగ్ మొదలైన రెండు వారాల గ్యాప్ తరువాత ఆగస్టు మూడవ వారం నుండి షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడట. లాస్ట్ మూవీకి కూడా ఇలానే లేట్ గా జాయిన్ అవ్వడంతో ఇది సెంటిమెట్ గా పెట్టుకున్నాడా ? ఏమిటి అని అందరు చెవులు కొరుకుంటున్నారట.

సెప్టెంబర్ 2న ఫస్ట్ లుక్...
ఇది చాలదు అన్నట్లుగా పవన్ లెటెస్ట్ సినిమా ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 2న పవర్ బర్త్ డే రోజున రిలీజ్ కాబోతుందంట లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది. పవన్ పుట్టినరోజు నాడు సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ లుక్ విడుదల అయింది. ఇలా ఫస్ట్ లుక్ రిలీజ్ అవడంలో కూడ పవన్ సర్దార్ సంఘటనలు ను మళ్లీ గుర్తు చేస్తుంది అనుకుంటున్నారంత. ఇప్పటికే ఈ లేటెస్ట్ సినిమాకు సంబంధించి కూడ పవన్ స్క్రిప్ట్ విషయంలో తల దూర్చడమే కాకుండా కొన్ని డైలాగ్స్ వెర్షన్ పవన్ సూచనలతో మార్పులు చేర్పులు చేసారు అన్న వార్తలు ఉన్నాయి. 'సర్దార్ గబ్బర్ సింగ్' స్క్రిప్ట్ విషయంలో కూడ ఇలాంటి సంఘటనలే జరిగాయి. పవన్ స్క్రిప్ట్ లో వేలు పెట్టడం వల్ల ఘోరమైన పరాభవాన్ని కూడ చూసాడు. అలాగే షూటింగ్ కూడా వంద రోజులలో కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ పెట్టాడంట పవన్... ఇలా ఒకటికి ఇంకోకటి సింక్ అవ్వడం ఎక్కడి దారి తీస్తుందో అని భయపడుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

16:06 - August 11, 2016

అనుకున్నాట్లుగానే మెగా నందమూరి మల్టీస్టార్ పట్టాలెక్కబోతోంది. ఎవరూ ఊహించని ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుండడంతో ఇటు రెండు ఫ్యామిలీస్ చెందిన ఫ్యాన్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రం కోసం చూస్తున్నారు. మెగా నందమూరి మల్టీస్టార్ మూవీలో నటిస్తున్న ఆ హీరోలెవరో తెలుసుకోవాలంటే చదవండి.

నిర్మాతగా కళ్యాణ్ రామ్...
మెగా నందమూరి హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు ఇదే నిజమవుతోంది. కలలో కూడా ఊహించని మెగా నందమూరి మల్టీస్టార్ చిత్రం త్వరలో పట్టాలెక్కబోతోంది. కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం ఓ కొలిక్కివచ్చినట్లు వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తుండడం మరో విశేషం. కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ ల మల్టీస్టార్ మూవీని ఎ.ఎస్.రవికుమార్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ కాంబినేషన్‌ని సెట్ చేసింది కల్యాణ్ రామేనని సమాచారం. డైరెక్టర్ రవికుమార్ ఇటీవల కళ్యాణ్ రామ్‌కి ఓ స్టోరీ చెప్పాడట. కథ బాగా నచ్చడంతో కళ్యాణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అంతే కాదు స్టోరీలో వున్న మాస్ రోల్‌కి సాయి ధరమ్ కరెక్ట్‌గా సరిపోతాడని సజెస్ట్ కూడా చేశాడని. దీంతో దర్శకుడు రీసెంట్‌గా తేజుకి సైతం ఈ విషయం చెప్పడం ఒకే అంటూ సిగ్నల్ ఇచ్చాడట. పిల్లా నువ్వులేని జీవితం సినిమాకు సాయిధరమ్ కి ఈ దర్శకుడు తొలి హిట్టు ఇచ్చిన విషయం తెలిసిందే.

డిసెంబర్ లో సెట్స్ పైకి...
కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ ఇద్దరు పచ్చజెండా ఊపెయ్యడంతో డైరెక్టర్ రవికుమార్ పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో పడ్డాడట. ఇక ఈ మూవీని కె.ఎస్.రామారావు నిర్మించనున్నారని టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిచనున్నట్లు వినికిడి. డిసెంబర్‌లోగా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. చిత్రంపై ఇప్పటి నుంచే నందమూరి, మెగా అభిమానులు ఆసక్తిగా చర్చించుకోవడం విశేషం.

రేపే కృష్ణా పుష్కరాలు..

విజయవాడ : కృష్ణా పుష్కరాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం చేస్తోంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఇబ్రహీంపట్నం నుండి పవిత్ర సంగమం వరకు శోభాయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ గీతాలాపన, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. 

15:57 - August 11, 2016

హైదరాబాద్‌ : చింతల్‌లో ఉన్న నారాయణ స్కూలు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నారాయణ స్కూలు భవనానికి అనుమతులు లేవని జీహెచ్‌ఎంసీ తేల్చిచెప్పింది. అనుమతులు లేని భవనాన్ని కూల్చివేయాలని కూడా జీహెచ్‌ఎంసీ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. అయితే స్కూలు బిల్డింగ్‌ను ఖాళీ చేయాల్సి ఉన్నా..యాజమాన్యం మాత్రం విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపించలేదు. దీంతో స్కూలు భవనం ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో పోలీసులు సంప్రదిస్తున్నారు. 

రేపు నగరానికి రానున్న పణగారియ..

హైదరాబాద్ : నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పణగారియ హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కానున్నారు. 

కళాక్షేత్రాన్ని ప్రారంభించిన చంద్రబాబు..

విజయవాడ: తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. రూ.8కోట్ల వ్యయంతో హైదరాబాద్‌ రవీంద్రభారతి తరహాలో సాంస్కృతిక పరంగా ఇది ప్రభుత్వ ప్రధాన కేంద్రం కానుంది. రాష్ట్ర విభజన వల్ల ఒక సమావేశం కూడా పెట్టుకునేందుకు సరైన వేదికలేని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం అన్ని విధాలా ఉపయోగకరంగా వుంటుందన్నారు.పుష్కరాలకు వచ్చే యాత్రికులను ఈ కేంద్రం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించడంతో పాటు అనేక కార్యక్రమాలకు వేదిక కానుందన్నారు.

15:47 - August 11, 2016

తెలుగు సినిమా పరిశ్రమలో మంచు లక్ష్మి గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు. మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా...తనదైన యాటిట్యూడ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె చేసిన ఓ పని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. క్రిష్...బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. పెళ్లి పనుల్లో చిత్రానికి తాత్కాలికంగా ఇటీవలే బ్రేక్ ఇచ్చారు. మొన్ననే ఘనంగా క్రిష్ వివాహం జరిగింది. ఈ వివాహానికి టాలీవుడ్..ఇతర సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. వధూవరులను ఆశ్వీరించారు. ఈ పెళ్లికి మంచు లక్ష్మి కూడా హాజరయ్యారు. అందరూ ఆశీర్వదిస్తూ వెళుతున్నారు. కానీ మంచు లక్ష్మి మాత్రం వెరైటీగా ప్రవర్తించారు. ఏకంగా క్రిష్ తొడలపై కూర్చొంది. ఉన్నట్టుండి మంచు లక్ష్మి ఇలా చేయడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారంట. క్రిష్ ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం... మరీ ఇలాంటి సందర్భంలో, ఇలా వ్యవహరిస్తారా ? అంటూ విమర్శలు వినిపిస్తున్నాయంట. దీనిపై మంచు లక్ష్మి ఎలా స్పందిస్తుందో ? 

ప్రారంభమైన పుష్కర శోభాయాత్ర..

విజయవాడ : ఏపీలో కృష్ణా పుష్కరాల వేడుక శోభాయాత్ర ప్రారంభయ్యింది. సాయంత్రం 5గంటలకు ఇబ్రహీంపట్నం నుండి పవిత్ర సంగమం వరకూ ఈ యాత్ర కొనసాగనుంది. గోదావరి నదిలో జరుగుతున్న అంత్యపుష్కరాలను ముగించుకుని రాత్రి 8015గంటలకు సీఎం చంద్రబాబు పవిత్ర సంగమం వద్దకు చేరుకుంటారు. టీడీపీ నమూనా ఆలయాన్ని ప్రారంభించి అనంతరం కూచిపూడి నృత్యప్రదర్శన, సీఎం ప్రసంగం, లేజర్ షో జరుగనుంది. రేపు ఉదయం దుర్గాఘాట్ లో చంద్రబాబు పుష్కరన్నానం చేయనున్నారు. 

15:37 - August 11, 2016

మీరు రౌండ్ ఫిగర్ పెట్రోల్ కానీ డీజిల్ పోయిస్తున్నారా ? అయితే కొద్ది సేపు ఆగండి. ఇది చదివిన తరువాత నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది బంకు నిర్వాహకులు కొత్త మోసానికి తెరలేపారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న మోసాలను, దోపిడిలను తెలుసుకుని జాగ్రత్త పడుతున్నా..మోసం చేసే వారు కొత్త కొత్త పద్ధతులను అవలింబిస్తున్నారు. ప్రధానంగా పెట్రోల్..డీజిల్ విషయంలో మోసాలను ప్రజలు తెలుసుకుంటూనే ఉన్నారు. ఆయినా కొంతమంది నిర్వాహకులు కొత్త కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
సాధారణంగా అందరూ రూ. 50..రూ. 100..రూ. 200 ఇలా రౌండ్ ఫిగర్ తో పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకుంటుంటారు. పంప్ డిజిటల్ మీటర్ ప్రోగ్రామింగ్ లో ముందే ఓ 100-300 ఎంఎల్ తక్కువగా వచ్చేలా ఫిక్స్ చేస్తున్నారంట. దీనితో పెట్రోల్..డీజిల్ కొట్టించే వారిలో అత్యధిక మంది మోసపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా మోస పోకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. రూ. 60..రూ. 110..రూ. 120..రూ. 210..ఇలా పెట్రోల్..డీజిల్ కాని పోయించుకోవాలి. తద్వారా మోసం పోకుండా ఉంటారు. మరీ ముఖ్యంగా మీటర్ రీడింగ్ 0 నుంచే కొడుతున్నారా? అనే విషయాన్ని నిశితంగా గమనించాలి. రౌండ్ ఫిగర్ లో పెట్రోల్ పోయించొద్దంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచార ఉద్యమం నడుస్తోంది. 

ఆలంపూర్ కు సీఎం కేసీఆర్ పయనం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలంపూర్ కు బయలుదేరారు. సీఎం వెంట పలువురు మంత్రులు కూడా ఉన్నారు. రేపు ఉదయం 5.58గంటలకు గొందిమళ్లలో కేసీఆర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించనున్నారు. అనంతరం ఏడు గంటలకు జోగులాంబ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 

బస్తర్ జిల్లాలో ఎన్ కౌంటర్..

ఛత్తీస్ ఘడ్ : బస్తర్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. తుండేరు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టు దళ కమాండర్ సింగన్న మృతి చెందాడు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 

15:20 - August 11, 2016

మెదక్ : మల్లన్న సాగర్ ముంపు గ్రామం ఏటిగడ్డ కిష్టాపూర్ లో భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. గురువారం నాడు ఎనిమిది ఎకరాల వరకూ వీఆర్వోలు రిజిస్ట్రేషన్లు చేశారు. 123 జీవోపై కేసును కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. దీంతో కోర్టులో కేసుపై విచారణ జరుగుతండగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేయటం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొంతమంది దళారులు 123 జీవో తో లబ్ది చేకూరుతుందని కొందరు అమాయక రైతులను మభ్యపెట్టిన రిజిస్ట్రేషన్లకు ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తోంది. 123 జీవో ప్రకారం సమ్మతంతో మా వద్దకు వచ్చిన వారి భూములకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం తప్ప బలవంతంగా మాత్రం రిజిస్ట్రేషన్లు వీఆర్వోలు పేర్కొంటున్నారు. కాగా టీఆర్ఎస్ సర్కార్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిమిత్తం మెదక్ జిల్లాలోని ఏటిగడ్డ క్రిష్టాపూర్ పరిసర ప్రాంతాలలో 123 జీవో ప్రకారం భూసేకరణ చేపట్టింది. ప్రాజెక్టుకు తమ భూములు ఇవ్వమని గతకొంతకాలంలో ఆప్రాంత వాసులు నిరసనలు ధర్నాలు చేపడుతున్న విషయం తెలిసేందే. ఈ తరుణంలో 2013 చట్టం ప్రకారం మాత్రమే భూసేకరణ చేపట్టాలని 123 జీవోతో భూసేకరణ చెల్లదని వామపక్షాలు..ఇతర పార్టీల నేతలు నిరసనలు ధర్నాలు చేపట్టిన తరుణంలో భూసేకరణపై 123 జీవో ప్రకారం భూసేకరణ చేయవద్దంటూ కోర్టు టీఆర్ఎస్ సర్కార్ కు తీర్పునిచ్చింది. దీంతో టీ,సర్కార్ సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లోపిటీషన్ వేసింది. ఈ కేసుపై విచారణకు మంగళవారంనాటికి వాయిదా వేసింది. ఈ క్రమంలో ఏటిగడ్డ క్రిష్టాపూర్ లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేయటంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

17న టి.కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్...

హైదరాబాద్ : ప్రాజెక్టు రీ డిజైన్ పై టి.కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. 17వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పిసిసి చీఫ్ ఉత్తమ్ ఇవ్వనున్నారు. 

ఏటిగడ్డ కిష్టాపూర్ లో భూముల రిజిస్ట్రేషన్లు..

మెదక్ : మల్లన్న సాగర్ ముంపు గ్రామం ఏటిగడ్డ కిష్టాపూర్ లో భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఏనిమిది ఎకరాల వరకు వీఆర్ వోలు రిజిస్ట్రేషన్ లు చేశారు. ఓ వైపు కోర్టులో కేసులు నడుస్తున్న నేపథ్యంలో బలవంతపు రిజిస్ట్రేషన్ లు జరగడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మల్లన్న సాగర్ భూ సేకరణపై హైకోర్టులో విచారణ...

హైదరాబాద్ : మల్లన్న సాగర్ భూ సేకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. మల్లన్న సాగర్ కు జీవో 123 ప్రకారం భూ సేకరణ చేయడం లేదని, రైతులు స్వచ్చందంగా భూములు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారని హైకోర్టులో అటార్నీ జనరల్ వాదనలు వినిపించారు. రైతులను ఇబ్బంది పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తమను ఆశ్రయించవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్...

హైదరాబాద్ : ఖైరతాబాద్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న బిల్ కలెక్టర్ సతీష్ ఏసీబీకి చిక్కాడు.

14:57 - August 11, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం డ్రైవర్ ను పోలీసులు ఎట్టకేలకూ అరెస్ట్ చేశారు. పుప్పాలగూడ శ్రీరాంనగర్ కాలనీలోని నయీం డ్రైవర్ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఇంటికి వునన తాళం పగులగొట్టి భారీగా బంగారు ఆభరణాలు, వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నయీం డ్రైవర్ శ్రీధర్ గౌడ్ ను అదుపులోకి తీసుకున్నారు. నయీం మరో అనుచరుడు బలరాంను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికి కోర్టు రిమండ్ విధించింది. దీంతో వీరిద్దరినీ చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లోని మిలీనియం టౌన్ షిప్ లో గ్రేహౌండ్స్ దళాల కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ నయాం మృతి చెందిన విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో ఆప్రదేశం నుంఇ డ్రైవర్ శ్రీనివాస్ గౌడ్ పరారయిన విషయం తెలిసిందే. నయీం మృతి అనంతరం అతని అనుచరులు, బంధువుల నివాసాలపై పోలీసులు గత రెండు రోజుల నుండి దాడిచేసిన సోదాలు నిర్వహిస్తూ భారీగా ఆస్తులను సీజ్ చేస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నయీంకు సంబంధించిన వారందరినీ అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. విచారణలో భాగంగా పరారీలో వున్న డ్రైవర్ గురువారం నాడు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించటం జరిగింది.

14:35 - August 11, 2016

హైదరాబాద్ : నగరంలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముందు 2011 గ్రూప్‌-1 అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. వెంటనే తమకు ఇంటర్యూ నిర్వహించి నియామకాలు చేపట్టాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మేయిన్స్‌ పరీక్ష రాశామని...ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్న సాకుతో మళ్లీ మేయిన్స్‌ నిర్వహించవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ, ఏపిపిఎస్సీ మొండి వైఖరి వీడి వెంటనే ఇంటర్వూలు నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 

14:08 - August 11, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసును మాధవరెడ్డి కుటుంబానికి అంటగట్టి.. ఆయన కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది టీ.సర్కార్ దిగజారుడుకు నిదర్శనమన్నారు. మాదవరెడ్డి కుటుంబంపై ఈగ వాలినా టీడీపీ ఊరుకోదని హెచ్చరించారు.  తెలంగాణ కుటుంబంలో అత్యంత గౌవరప్రదమైన మాధవరెడ్డి కుటుంబంపై మచ్చతెచ్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని.. దీన్ని సహించేదన్నారు. ఈకేసులో ప్రభుత్వ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణ పారదర్శకంగా జరగాలని కోరారు. రాజయ్య అవినీతికి పాల్పడ్డారని బర్తరఫ్ చేశారని.. ఆయన అవినీతికి పాల్పడ్డాడనే ఆధారాలు చూపలేకపోయారని తెలిపారు.

 

13:58 - August 11, 2016

మురుగదాస్ డైరెక్షన్ లో కొత్త సినిమా చేస్తున్న మహేష్ బాబు మరో రెండు న్యూ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇందులో ఓ మూవీని తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో చేస్తుండగా, మరో మూవీని తనకు డిజాస్టర్ ఇచ్చిన బ్యానర్ లో చేస్తున్నాడు. మహేష్ బాబు చేస్తున్న ఆ కొత్త సినిమాలేంటో తెలుసుకోవాలంటే చదవండి.. బ్రహ్మోత్సవం డిజాస్టర్ తో ఏ మాత్రం గ్యాప్ లేకుండా మహేష్ బాబు కొత్త సినిమాను పట్టాలెక్కించాడు. మురుగదాస్ డైరెక్షన్‌లో ప్రిన్స్ నటిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ప్రిన్స్ తన బర్త్ డే సందర్భంగా తను చేయబోయే కొత్త సినిమాలకు సంబంధించిన డైరెక్టర్స్ విషయంలో క్లారిటి ఇచ్చాడు. మురుగదాస్ సినిమా తరువాత మహేష్ బాబు మరోసారి కొరటాల శివ డైరెక్షన్ లో నటించనున్నాడు. తనకు శ్రీమంతుడు లాంటి మరిచిపోలేని సక్సెస్ ఇచ్చిన ఈ దర్శకుడితో ప్రిన్స్ మరో మూవీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

వంశీ పైడిపల్లి...
కొరటాలతో చేసే సినిమాకి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కొరటాల శివ తరువాత వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ప్రిన్స్ మరో సినిమా చేయబోతున్నాడట. ఈ చిత్రాన్ని పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తుండడం విశేషం. ఈ ప్రొడ్యూసర్ ఇటీవలే మహేష్ తో బ్రహ్మోత్సవం నిర్మించిన సంగతి తెలిసిందే.ఈ మూవీ డిజాస్టర్ కావడంతో ప్రిన్స్ మరో మూవీ చేసి పెడతానని ఈ నిర్మాతకు మాట ఇచ్చాడట. దీంతో పీవీపీ తన బ్యానర్ లో ఊపిరి లాంటి టేస్ట్ ఉన్న సినిమాని అందించిన వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమాని సెట్ చేశాడట. మరి ఈ దర్శకుడు ప్రిన్స్ తో ఎలాంటి మూవీ చేయబోతున్నాడో చూడాలి.  

13:54 - August 11, 2016

తూర్పుగోదావరి : అమలాపురంలో దళితులపై దాడి ఘటనను వెలుగులోకి తీసుకొచ్చిన 10 టీవీకి మాజీ ఎంపీ హర్షకుమార్ ధన్యవాదాలు తెలిపారు. దాడి జరిగిన కొద్ది గంటల్లోనే చర్చావేదికను నిర్వహించడంపై అభినందనలు తెలిపారు. 10టీవీ వల్లే  జాతీయ స్థాయి మీడియాకు విషయం తెలిసిందని అన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

 

చినజీయర్ స్వామి ఆశ్రమంలో పూజలు..

గుంటూరు : జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలోని చినజీయర్‌స్వామి ఆశ్రమంలో జరిగిన పూజల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో చినజీయర్‌స్వామి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు జరిగాయి. 

13:46 - August 11, 2016

హైదరాబాద్ : 123 జీవోపై హైకోర్టులో విచారణ కొనసాగింది... నిమ్జ్‌ భూసేకరణకు సంబంధించి జీవో డ్రాఫ్ట్‌ కాపీని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. అయితే జీవోలో పలు అంశాలపై కోర్టు  స్పష్టత లేదన్నారు. ఈ జీవోలోని వివరాలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉమ్మడి కుటుంబంలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని ప్రశ్నించింది. కుటుంబాన్ని ఏ ప్రాతిపదికన తీసుకున్నారో స్పష్టత లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యవసాయ కూలీలకు మరింత లబ్ధి చేకూర్చేలా సవరణలు చేయాలని సూచించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అప్పటివరకూ స్టే కొనసాగుతుందన్న హైకోర్టు తెలిపింది. విచారణ మంగళవారానికి వాయిదా పడింది. 

 

13:30 - August 11, 2016

బ్రెజిల్ : రియో ఒలింపిక్స్ పురుషుల హాకీ క్వార్టర్ ఫైనల్స్ కు ఎనిమిదిసార్లు చాంపియన్ భారత్ చేరుకొంది. గ్రూప్ - బీ లీగ్ మూడోరౌండ్ పోటీలో పాన్ అమెరికన్ చాంపియన్ అర్జెంటీనాపై 2-1 గోల్స్ విజయం సాధించి...ఆరుజట్ల లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచింది. భారత విజయంలో కెప్టెన్ కమ్ గోల్ కీపర్ శ్రీజేశ్ ప్రధానపాత్ర వహించాడు......
భారత్ రెండో విజయం 
రియో ఒలింపిక్స్ పురుషుల హాకీ.. గ్రూప్- బీ లీగ్ లో మాజీ చాంపియన్ భారత్ రెండో విజయం సాధించింది. పాన్ అమెరికన్ చాంపియన్ అర్జెంటీనాపై కీలక విజయంతో నాకౌట్ రౌండ్ బెర్త్ ఖాయం చేసుకొంది. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ, రన్నరప్ హాలెండ్, అర్జెంటీనా, కెనడా, ఐర్లాండ్ జట్లతో కూడిన గ్రూప్ - బీ లీగ్ లో భారత్ ఇప్పటి వరకూ ఆడిన మూడురౌండ్ల మ్యాచ్ ల్లో రెండు విజయాల ద్వారా ఆరు పాయింట్లు సంపాదించి...జర్మనీ తర్వాతి స్థానంలో నిలిచింది. గ్రూప్ ప్రారంభమ్యాచ్ లో ఐర్లాండ్ పై 3-2 గోల్స్ తో నెగ్గిన భారత్...జర్మనీతో ముగిసిన రెండోరౌండ్లో మాత్రం తుదివరకూ పోరాడినా 1-2 గోల్స్ తో ఓటమి తప్పలేదు. అయితే...ప్రపంచ మేటి హాకీ జట్లలో ఒకటైన పాన్ అమెరికన్ చాంపియన్ అర్జెంటీనాతో జరిగిన హోరాహోరీ మూడోరౌండ్ పోటీలో మాత్రం భారత్ కీలక విజయం నమోదు చేసింది. ఆట మొదటి 45 నిముషాలలోనూ భారత ఆధిపత్యమే కొనసాగింది. మిడ్ ఫీల్డ్ లో పట్టుబిగించిన భారత్  ఆట8వ నిముషంలోనే తొలిగోల్ నమోదు చేసింది. పెనాల్టీ కార్నర్ రీబౌండ్ ద్వారా .. చింగ్లేన్ సింగ్ ఈ గోల్ సాధించాడు. ఆ తర్వాత 3వ క్వార్టర్ 35వ నిముషంలో భారత ఆధిక్యం 2-0కి పెరిగింది. అర్జెంటీనా గోల్ పైకి భారత్ పదేపదే దాడులు చేసిన సమయంలో లభించిన అవకాశాన్ని ..కొతాజిత్ సింగ్ తెలివిగా ఉపయోగించుకొన్నాడు. ఇక..ఆఖరి 15 నిముషాలలో మాత్రం అర్జెంటీనా దూకుడు పెంచింది. భారత్ ను ఆత్మరక్షణలోకి నెట్టడమే కాదు..మెరుపుదాడులతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
భారత్ 2-1 గోల్స్ తేడాతో కీలక విజయం
ఆట 49వ నిముషంలో లభించిన పెనాల్టీ కార్నర్ ను గొంజాలో గోల్ గా మలచి భారత ఆధిక్యాన్ని 2-1 తగ్గించాడు. ఆ తర్వాత అర్జెంటీనాకు వరుసగా నాలుగు పెనాల్టీకార్నర్లు దక్కినా భారత డిఫెండర్లు...ప్రధానంగా గోల్ కీపర్ శ్రీజేష్ సమర్థవంతంగా అడ్డుకొన్నాడు. చివరకు భారత్ 2-1 గోల్స్ తేడాతో కీలక విజయం సొంతం చేసుకోగలిగింది. గ్రూప్- బీ మిగిలిన లీగ్ పోటీల్లో ఒలింపిక్ రన్నరప్ హాలెండ్, కెనడా జట్లతో భారత్ తలపడాల్సి ఉంది.

వరంగల్ లో డిప్యూటి స్పీకర్, మంత్రి జోగు పర్యటన..

వరంగల్ : జిల్లాలో డిప్యూటి స్పీకర్, మంత్రి జోగులు పర్యటించారు. హన్మకొండ పింగిలి కాలేజీలో మొక్కలు నాటారు. హరిత తెలంగాణ లక్ష్యం వైపు పయనిస్తున్నామని డిప్యూటి స్పీకర్ పేర్కొన్నారు. హరితహారం ఉద్యమంలా సాగుతోందని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని రక్షించాలని సూచించారు. 

సావిత్రి నదిలో కొనసాగుతున్న గాలింపు చర్యలు...

ముంబై : సావిత్రి నదిలో గాలింపులు చర్యలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జికి 200 కి.మీటర్ల దూరంలో బస్సును అధికారులు గుర్తించారు. బ్రిడ్జి కూలిన ఘటనలో రెండు బస్సులు కొట్టుకపోయాయి. 

యశ్వంతరావుపేటలో ఆందోళన..

మెదక్ : వెల్దుర్తి (మం) యశ్వంతరావుపేటలో ఆందోళన నెలకొంది. మధ్యాహ్న భోజనంలో విషం కలుపుతామంటూ బోర్డుపై దుండగులు రాశారు. ప్రైమరీ స్కూల్ ముందు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

 

రాజ్యసభలో రేపు కేవీపీ ప్రైవేటు మెంబర్ రెజల్యూషన్..

ఢిల్లీ : రాజ్యసభలో శుక్రవారం మధ్యాహ్నం కేవీపీ ప్రైవేటు మెంబర్ రెజల్యూషన్ ఇవ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రైవేటు రెజల్యూషన్ ఇవ్వనున్నారు. నిర్మాణ నిర్వహణ బాధ్యత మొత్తం కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని, నిర్మాణానికి తగినంత బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. 2018 నాటికల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని కేవీపీ రెజల్యూషన్ లో పేర్కొన్నారు. 

13:17 - August 11, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించేలా విజయవాడ నగరంలో టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసింది. పవిత్ర కృష్ణా నదిలో స్నానాలు, పక్కనే దుర్గామాతా దర్శనంతో పాటు శ్రీవారి భాగ్యం కూడా కలిగేలా నమూనా ఆలయాన్ని నిర్మించారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన శ్రీవారి ఆలయంపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం. Look. 
సకల సౌకర్యాలు
కృష్ణా నది పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సకల సౌకర్యాలు కల్పిస్తోంది. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.. విజయవాడనగరంలోని స్వరాజ్య మైదానంలో టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. 
శ్రీవారి నమూనా దేవాలయం ఏర్పాటు 
పుష్కర యాత్రికుల్లో ఆధ్యాత్మిక చింతనను నింపేలా శ్రీవారి నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. సాక్షాత్తు తిరుమలలో కొలువైన స్వామివారి ఆలయాలను పోలి ఉండేలా నమూనా ఆలయాన్ని సకల హంగులతో తీర్చిదిద్దారు టీటీడీ అధికారులు. 
ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు 
పుష్కరాల సందర్భంగా రోజుకు లక్ష మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకునేలా.. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, ఫైర్‌ సెఫ్టీ తదితర ఏర్పాట్లు చేశారు. తిరుమల తిరుపతి దేవాలయంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా అలాంటి పూజలే నిర్వహిస్తున్నారు. స్వరాజ్య మైదానంలో శ్రీవారి దర్శనంతో పాటు పద్మావతి ఘాట్‌లో జరిగే కార్యక్రమాలను నిరంతరం భారీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలను భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో 600 మంది టీటీడీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. భక్తులకు లడ్డూ ప్రసాదాలతో పాటు ప్రతిరోజు ఐదు వేల మంది భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించనున్నారు. మొత్తానికి పుష్కరాలకి తరలి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేయడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

13:13 - August 11, 2016

తూర్పుగోదావరి : అమలాపురంలో దళితులపై దాడి ఘటనపై 10 టీవీ వరుస కథనాలకు సర్కార్‌ స్పందించింది. దాడి ఘటనపై సీఎం చంద్రబాబుకు డీజీపీ సాంబశివరావు నివేదిక సమర్పించారు. అమలాపురం ఘటనలో 8 మందిని అరెస్ట్‌ చేసినట్లు  తెలిపారు. అటు శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేదిలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యంతో పాటు లక్ష రూపాయల పరిహారం అందించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. మరోవైపు దళితులపై దాడులపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. 
దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు   
అమలాపురం మండలం సవరపాలెంలో దళితులపై దాడి ఘటనపై సర్కార్‌ స్పందించింది. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదన్నారు. గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని.. అలాగే లక్ష రూపాలయల పరిహారం ఇవ్వాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.   
సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేసిన డీజీపీ... 
దళితులపై దాడి ఘటనకు సంబందించిన నివేదికను డీజీపీ సాంబశివరావు.. సీఎం చంద్రబాబుకు అందించారు. దాడికి పాల్పడ్డ 8 మందిని అరెస్ట్‌ చేసినట్లు డీజీపీ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలింగించే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
100 మంది దాడి 
సవరపాలెంలో పొట్టకూటి కోసం చనిపోయిన జంతువుల చర్మాన్ని తీసుకుని జీవనం కొనసాగిస్తున్న మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరరావుతో పాటు మరో వ్యక్తిపై దాదాపు 100 మంది దాడికి పాల్పడ్డారు. తమ ఆవులను దొంగిలించి చర్మం ఒలుస్తున్నారనే అనుమానంతో గ్రామస్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే.. చనిపోయిన ఆవు చర్మాన్ని తీస్తున్నామని బాధితులు ఎంత చెప్పినా పట్టించుకోకుండా తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో ఎలీషా.. మోకాటి వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు.
దాడి ఘటనను వెలుగులోకి తెచ్చిన 10 టీవీ   
అమలాపురం దాడి ఘటనలో గాయపడ్డ బాధితులను వామపక్ష నేతల బృందం పరామర్శించింది. బాధితులకు అండగా ఉంటామని లెఫ్ట్‌ పార్టీ నేతలు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 
దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్న మోడీ సర్కార్‌ : ఉప్పులేటి 
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రంలో మోదీ సర్కార్‌ దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. అమలాపురంలో దళితులపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. మరోవైపు దళితులపై దాడి ఘటనను ప్రజాసంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

 

13:06 - August 11, 2016

రెజీనాని ఓ గొప్ప ఛాన్స్ వరించినట్లు సమాచారం. యూత్ లవ్ స్టోరీస్ లో ఎక్కువగా నటిస్తున్న ఈ బ్యూటీ ఫస్ట్ పీరియాడికల్ లవ్ స్టోరీలో నటించబోతోంది. ఈ పీరియడిక్ లవ్ స్టోరీ కోసం ఓ క్రేజీ హీరో పక్కన రెజీనాను ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరి రెజీనా ఏ యంగ్ హీరోతో పీరియడిక్ లవ్ స్టోరీ చేస్తోందో తెలుసుకోవాలంటే చదవండి.. యంగ్ హీరోల ఫేవరేట్ బ్యూటీ ఎవరంటే రెజీనా అని చెప్పాలి. సెకెండ్ స్టేజ్ హీరోలకు ఈ బ్యూటీ గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనే చెప్పాలి. సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్, అల్లుశిరీష్ లాంటి హీరోలకు రెజీనా లెగ్ బాగానే కలిసొచ్చింది. ఈ క్రమంలో రెజీనాను సూపర్ ఛాన్స్ వరించింది. రానా హీరోగా నూతన దర్శకుడు సత్యశివ డైరెక్షన్ లో 1945అనే మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయి.

1945 కాలం లవ్ స్టోరీ..
1945 కాలం లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ మూవీలో రెజీనాను హీరోయిన్ గా తీసుకున్నారట. ఈ సినిమా కోసం ఏ హీరోయిన్ తీసుకోవాలా అనే డిస్కషన్స్ లో రానా రెజీనా వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. దీంతో ఈ బ్యూటీ నే ఫైనల్ చేశారట. రెజీనా ఫస్ట్ టైం పీరియడిక్ లవ్ స్టోరీ చేస్తుండడంతో ఇందులో ఆమె లుక్ ఎలా ఉంటుందని ఇంట్రెస్టింగ్ మారింది. దీనికి తోడు రానా పక్కన ఈ చెన్నై చిన్నది ఏ మేరకు సూట్ అవుతుందనేది ఆసక్తిగానే ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కృష్ణవంశీ, నక్షతం మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. క్రేజీ ఛాన్స్ లు పట్టేస్తున్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం రెజీనా తెగ ఫీలవుతోంది.

12:57 - August 11, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాల తాకిడి అంతా బెజవాడలోనే ఉంటుంది. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే యాత్రికులు సింహభాగం బెజవాడకే తరలివస్తారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి భారీగా ఆర్టీసీ బస్సులు, రైళ్ళల్లో వచ్చే యాత్రికులను తరలించడానికి ఎక్కడికక్కడ జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విజయవాడ అర్బన్, రూరల్ పరిధిలో వేర్వేరుగా పార్కింగ్ ఏరియాలను అధికారులు గుర్తించారు.
24 ప్రాంతాలలో పార్కింగ్ ప్రదేశాలు 
విజయవాడ అర్బన్ ఏరియాలో మొత్తం 12 రూట్లలో 24 ప్రాంతాలలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయబోతున్నారు. నగరం నలువైపులా ప్రైవేట్ వాహనాల కోసం పార్కింగ్ ప్రదేశాలను   గుర్తించారు. ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నేరుగా వాహనాలు.. ప్రధాన రోడ్ల మీదకు చేరుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లిపోయేలా చర్యలు తీసుకున్నారు. నగరవ్యాప్తంగా గుర్తించిన పార్కింగ్ ప్రదేశాలలో మొత్తం 62,750 ద్విచక్ర వాహనాలు, 6270 కార్లను పార్కింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.  
45 వేల వాహనాలకు పార్కింగ్ వెసులుబాటు 
మొత్తం 121 పార్కింగ్ ప్రాంతాల్లో 45 వేల వాహనాలకు పార్కింగ్ వెసులుబాటు కల్పించారు. విజయవాడతో పాటు నగరానికి నలువైపులా 30 కిలోమీటర్ల పరిధిలో పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. 51 పార్కింగ్ ప్రదేశాలను విజయవాడ నగరపాలక సంస్థ, 40 రెవిన్యూ యంత్రాంగం, 9 ప్రాంతాలను నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం సిద్ధం చేసింది. విజయవాడ పరిధిలో 12 రూట్లలో పార్కింగ్‌ ఏరియాలు, 23 ప్రాంతాలలో పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. మొత్తం 62 వేల 750 ద్విచక్రవాహనాలు, 6,270 కార్లకు పార్కింగ్‌ కెపాసిటీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 
ప్రధాన పార్కింగ్ ఏరియాలు
బందర్‌ రోడ్డు, కాళేశ్వరరావు మార్కెట్‌ ఏరియా, ఐదో నెంబర్‌ రూట్‌ బిషప్‌ అజరయ్య స్కూల్‌, సీతారామపురం శాతవాహన కాలేజ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్, కాల్టెక్స్‌రోడ్, తారాపేట్‌ వెస్ట్‌ బుకింగ్‌ ఏరియా, ఇబ్రహీంపట్నం గొల్లపూడి వై జంక్షన్‌, వారధి ఏరియా ఏలూరు రోడ్‌ ప్రాంతాలను ప్రధాన పార్కింగ్ ఏరియాలుగా గుర్తించారు. 
సిద్ధార్థ మహిళా కాలేజ్‌ స్థలంలో పార్కింగ్ 
బందర్‌ రోడ్డులో సిద్ధార్థ మహిళా కాలేజ్‌ స్థలంలో 2 వేల ద్విచక్రవాహనాలకు పార్కింగ్‌ ఏర్పాటు చేశారు.  కాళేశ్వరరావు మార్కెట్‌ ఏరియాలో 100 ద్విచక్ర వాహనాలు, 50 కార్లు పార్కింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేశారు. వక్ఫ్‌ బోర్డ్‌ ఖాళీ స్థలంలో 100 ద్విచక్ర వాహనాలు, 50 కార్లు, అలాగే ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌-1 ఎదురుగా స్థలంలో 100 ద్విచక్ర వాహనాలు, 50 కార్లకు పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. 
ఐదో నెంబర్‌ రూట్‌లో 
ఐదో నెంబర్‌ రూట్‌లో బిషప్‌ అజరయ్య స్కూల్‌, రెడ్‌ సర్కిల్‌ స్థలంలో 1500 ద్విచక్ర వాహనాలు, 300 కార్లు, సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, పిన్నమనేని పాలీ క్లినిక్‌ స్థలంలో 2500 ద్విచక్ర వాహనాలు, 500 కార్లు   నిలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చుట్టుగుంట-సీతారామపురం శాతవాహన కాలేజ్‌ స్థలంలో 1500 ద్విచక్రవాహనాలు, 300 కార్లకు పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. 
ఇన్నర్‌ రింగ్ రోడ్‌ 
ఇన్నర్‌ రింగ్ రోడ్‌ - రామప్పాడు జంక్షన్‌, గొల్లపూడి వై జంక్షన్‌లో మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 2000 ద్విచక్రవాహనాలు, 500 కార్లు పార్కింగ్‌ చేసేలా.. అలాగే పైపుల రోడ్‌ స్థలంలో 1000 ద్విచక్ర వాహనాలు, 100 కార్లు నిలిపేలా చర్యలు చేపట్టారు. గుణదల రైల్వేస్టేషన్ గ్రౌండ్ ఎదురు స్థలం 5000 గజాలు, ద్విచక్ర వాహనాలు కెపాసిటీ 1000, కార్లు 100 నిలిపేలా ప్లాన్‌ చేశారు. 
కాల్టెక్స్‌ రోడ్‌లో 500 ద్విచక్రవాహనాలు 
కాల్టెక్స్‌ రోడ్‌లో 500 ద్విచక్రవాహనాలు, 100 కార్లు, గాంధీనగర్‌ జింఖానా గ్రౌండ్‌లో బైక్‌లు, 50 కార్లు, సత్యనారాయణపురం రైల్వేస్టేషన్‌ స్థలంలో 1000 ద్విచక్ర వాహనాలు, 200 కార్లు నిలిపేలా ఏర్పాట్లు చేశారు. మధురానగర్‌ కేంద్రీయ విద్యాలయం స్థలంలో 3000 ద్విచక్రవాహనాలు, 300 కార్లు, అలాగే తారాపేట వెస్ట్ బుకింగ్ ఏరియాలో కృష్ణ వేణి మార్కెట్‌ స్థలంలో 500 ద్విచక్రవాహనాలు, 100 కార్లు పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు.  
గొల్లపూడి వై జంక్షన్ - స్వాతి సెంటర్‌లో 
గొల్లపూడి వై జంక్షన్ - స్వాతి సెంటర్‌లో మార్బుల్ యార్డ్‌ స్థలంలో 100 ద్విచక్ర వాహనాలు, 100 కార్లు, కుమ్మరిపాలెం గుప్తా సెంటర్‌లో 200 ద్విచక్ర వాహనాలు, 100 కార్లు నిలిపేలా పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. వారధి ఏరియా ఏలూరు రోడ్‌లో దూరదర్శన్‌ ఓపెన్‌ సైట్‌లో 2000 ద్విచక్ర వాహనాలు, 400 కార్లు అదే విధంగా కృష్ణలంక పొట్టి శ్రీరాములు స్కూల్‌ స్థలంలో 150 ద్విచక్ర వాహనాలు, 300 కార్లు పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. 
 

 

12:56 - August 11, 2016

వరుసగా ఫ్లాపులు పలుకరిస్తే ఎంత పెద్ద హీరో అయిన ఆలోచనలోపడతాడు.. నెక్ట్స్ మూవీ విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలనే అనుకుంటాడు. స్టోరీ దగ్గర నుండి డైరక్టర్ వరకు చాలా జాగ్రత్తగా డిసైడ్ చేసుకుంటాడు. టాలీవుడ్ యంగ్ టైగర్ అదే ఫాలో అయ్యాడంట. తన మార్క్ మూవీతో ఫ్యాన్స్ ను అలరించడానికి తొందర్లోనే రాబోతున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ ఎనర్జీతో ఎన్టీఆర్ స్టెప్పులు వేస్తే.. ఫ్యాన్స్ ఊగిపోతారు. ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ కి పండగే... కాని వరుసగా మూడు సినిమాలతో ఎన్టీఆర్ ఆడియన్స్ ను అంతగా మెప్పించలేకపోయాడు. ఎన్టీఆర్ నుండి ఎక్స్ పర్ట్ చేసిన రిజల్ట్ రాకపోవడంతో ఫ్యాన్స్ కొంచె నిరాశ చెందారనే చెప్పుకోవాలి. బాద్ షా మూవీ సూపర్ సక్సెస్ తరువాత వచ్చిన 'రామయ్యా వస్తావయ్యా' మూవీ పై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. కాని ఆ సినిమా అందరికి నిరాశ మిగిల్చింది. ఆ తరువాత వచ్చిన రభస అయిన మళ్ళీ ఎన్టీఆర్ మార్క్ మూవీ లా ఉంటుంది అనుకున్నారు. అది కూడా నిరాశే మిగిల్చింది. ఆ మూవీ కూడా సరిగ్గా ఆడకపోవడంతో ఎన్టీఆర్ రెండు ఫ్లాప్ ల బరువు మోయక తప్పలేదు. ఆ తరువాత వచ్చిన రెండు సినిమాలు రెండు డిఫెరెంట్ స్టోరీస్... టాలీవుడ్ లో వెరైటీ డైరక్టర్స్ అని పేరు తెచ్చుకున్న వారు తీసినవే. ఇంతకు ముందు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో స్టార్ డైరక్టర్ పూరీ తో టెంపర్ చూపించాడు ఎన్టీర్. పూరీ మార్క్ అందరికి తెలిసిదే. ఈ సినిమా అంత హిట్ అవ్వకపోయినా.... పర్వాలేదు అనిపించింది. ఈ మూవీ రిలీజ్ టైంలోనే కల్యాణ్ రామ్ పటాస్ రిలీజ్ అవ్వడం, అది బంపర్ హిట్ కొట్టి, టెంపర్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూడు సినిమాల నిరాశ నుండి కొంచెం బయటపడేలా చేసింది 'నాన్నకు ప్రేమతో' మూవీ.. సుకుమార్ డైరక్షన్ లోవచ్చిన ఈ సినిమా నాన్న సెంటిమెంట్ తో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. దాంతో టెంపర్ కంటే కూడా నాన్నకు ప్రేమతో మూవీ బెటర్ అనిపించుకుంది. ఈ రెండు సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా కాని ఈ మూవీస్ తో ఎన్టీఆర్ లో ఏదో మిస్సవుతున్నాం అన్న భావన కలిగింది ఫ్యాన్స్కి.

ఆగస్టు 12న ఆడియో..
అందుకే ఈసారి ఆడియన్స్ ను, ఫ్యాన్స్ ను నిరాశ పరచొద్దని డిసైడ్ అయ్యాడు బుడ్డోడు. జనతా గ్యారేజ్ మూవీతో రయ్యిన దూసుకొస్తున్నాడు. బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు హిట్స్ తో టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ డైరక్షన్ లో వస్తోన్న 'జనతా గ్యారేజ్‌' సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఆగస్టు 12వ తేదీన ఆడియో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. సెప్టెంబర్‌ ఫస్ట్ వీక్ లో మూవీ రిలీజ్ కి ఫ్లాన్ చేస్తున్నారంట. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ పరంగా ఈ సినిమా సరికొత్త రికార్డుల్ని ఇప్పటికే నమోదు చేస్తోంది. కొరటాల శివ డైరక్టర్ కావడం.. అది ఎన్టీఆర్ హీరోగా చేస్తుండటంతో 'జనతా గ్యారేజ్‌'కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కన్పిస్తోంది. గత కొన్ని సినిమాల డాన్సుల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోతున్నాడు. 'టెంపర్‌'లో మాత్రం కొంత చూపించినా... పూర్తిగా ఎన్టీఆర్ పవర్ ను చూడాలనుకునే ఫ్యాన్స్ పర్ఫెక్ట్ సినిమా చేయలేకపోయాడు. 'జనతా గ్యారేజ్‌' సినిమాలో ఎన్టీఆర్‌ స్టెప్పులతో ఇరగదీశాడంట.. ఈ డాన్స్ లు టాలీవుడ్‌కి సరికొత్త బెంచ్‌ మార్క్ ని సెట్‌ చేస్తాయి అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. టాలీవుడ్‌ టాప్‌ డాన్సర్స్ లో ఎన్టీఆర్‌ ఒకడు. అతదయినా ఈమధ్య అనుకున్నంత ఎఫెక్ట్ గా చేయకపోవడం, తన టాలెంట్ పెద్దగా డాన్స్ మీద పెట్టడంలేదు. మరిప్పుడైన 'జనతా గ్యారేజ్‌'తో ఎన్టీఆర్‌ మార్క్ సెట్‌ చేస్తాడా.. ఫ్యాన్స్ ని అలరిస్తాడా చూడాలి మారి. 

12:50 - August 11, 2016

నాగర్జున తనయుడు నాగచైతన్య కళ్యాణం ఖరారైంది. కాకపోతే వధువు మాత్రం మారిపోయింది. చైతూ సమంతను పెళ్లి చేసుకుంటాడని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పుడు వేరే హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. మరి చైతూ సమంతని కాకుండా ఏ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడో తెలుసుకోవాలంటే చదవండి.. 'దోచేయ్' సినిమా తరువాత నాగచైతన్య కొత్త సినిమాకి కాస్త గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో చైతూ, సమంతలు లవ్ లో మునిగిపోయారు. అంతేకాదు వీరిద్దరూ కలిసి షాపింగ్ మాల్స్ కి, సినిమాలకి వెళ్లి వీరి మధ్య ఉన్న లవ్ అందరికి అర్ధమయ్యేలా చేశారు.

హాట్ టాపిక్...
తీరా చూస్తే ఇప్పుడు చైతూ మరో హీరోయిన్ తో పెళ్లి రెడీ కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చైతూ, తమన్నాతో కళ్యాణానికి అంతా రెడీ అయింది. అయితే ఇది సినిమా కోసం చేసుకుంటున్న కళ్యాణం కావడం విశేషం. రియల్ లైఫ్ కాకుండా రీల్ లైఫ్ లో నాగ్ వారసుడు మిల్కీ బ్యూటీతో పెళ్లికి రెడీ అయ్యాడు. అసలు విషయమిటంటే చైతూ తమన్నా కలిసి కళ్యాణం అనే కొత్త మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి కళ్యాణం అనే టైటిల్ ని ఖారారు చేశారు.
చైతూ, తమన్నాల కళ్యాణం చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఎడాది వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రంతో ఈ దర్శకుడు లేటే వయస్సులో నాగర్జునకు అదిరిపోయే హిట్టు ఇచ్చాడు. దీంతో నాగర్జున ఈ దర్శకుడికి, నాగచైతన్యతో సినిమా చేసే ఛాన్స్ ని ఇచ్చాడు. చైతూ,తమన్నా జోడిగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. గతంలో 100పర్సెంట్ మూవీలో నాగచైతన్య,తమన్నాల కెమిస్ట్రీ ఓ రేంజ్ లో వర్కవుట్ అయింది. అదే రేంజ్ లో కళ్యాణ్ కృష్ణ కళ్యాణం మూవీలో వీరి కెమిస్ట్రీని పండిస్తాడో లేదో చూడాలి.

12:49 - August 11, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసుతో తమకు సంబంధం లేదని ఉమామాధవరెడ్డి స్పష్టం చేశారు. గ్యాంగ్ స్టర్ నయీం కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై ఉమామాధవరెడ్డి వివరణ ఇచ్చారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబానికి చెడ్డపేరు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం కక్షపూరితంగా మాధవరెడ్డి పేరును చెడగొడుతుందన్నారు. అసలు సూత్రదారులను తప్పించడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనకు సంబంధం లేని విషయాలను అంటగడుతున్నారని వాపోయారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. సర్కారు కుట్రను ప్రజలు అర్థం చేసుకుంటారని తెలిపారు. మహిళ అని కూడా చూడకుండా తనపై మచ్చ తెచ్చె ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాంగ్ స్టర్లను ప్రోత్సహించే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. హత్యా రాజకీయాలు చేసే నీచ సంస్కృతి తమకు లేదన్నారు. ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలు చూపించాలన్నారు. తాను నయీంతో మాట్లాడిన ఫోన్ కాల్ డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విచారణపై కొంత నమ్మకం ఉంటుంది.. కొంత నమ్మకం ఉండదని పేర్కొన్నారు. సిట్ కాదు.. జ్యుడియల్ ఎంక్వరీ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏ విచారణకైనా తాను సిద్ధమని... తప్పుజేస్తే జైలుకెళ్లడానికైనా సిద్ధమన్నారు. తనకు రాజకీయాలు కూడా అవసరం లేదని తెలిపారు. 
జ్యుడిషియల్ ఎంక్వరీ చేయాలి : సందీప్ రెడ్డి 
'నయీం కేసుతో మాకు సంబంధం లేదు. మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. సిట్ తో కాదు..  జ్యుడిషియల్ ఎంక్వరీ చేయించాలని డిమాండ్ చేశారు.  టీడీపీ హయాంలో ఈ ఘటనలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ ఘటనలు జరిగాయి. మా పార్టీలో ఉన్నవారు కూడా  మమ్మల్ని ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది' అని అన్నారు. 
 
 

నేటితో ముగియనున్న గోదావరి అంత్యపుష్కరాలు..

హైదరాబాద్: గోదావరి అంత్య పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. పుష్కరాల చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు గోదావరి తీరానికి చేరుకుని పుణ్య స్నానాలు చేస్తున్నారు.

రాజ్యసభలో బీఎస్పీ ఆందోళన..

న్యూడిల్లీ : ద‌ళితుల అంశంపై ప్ర‌ధాని మోడీ పార్ల‌మెంట్‌లో మాట్లాడాల‌ని బీఎస్పీ నేత‌లు ప‌ట్టుప‌ట్టారు. రాజ్య‌స‌భ‌లో వెల్‌లోకి దూసుకొచ్చిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎంపీలు స‌భ‌ను అడ్డుకున్నారు. బ‌హిరంగ స‌భ‌ల్లో ద‌ళితుల గురించి మాట్లాడ‌డం కాద‌ని, రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాని మోడీ ద‌ళితుల అంశాన్ని మాట్లాడాల‌ని బీఎస్పీ నేత మాయావ‌తి డిమాండ్ చేశారు. 

దళితులపై దాడులపై మోడీ ప్రకటన చేయాలి - మాయావతి..

ఢిల్లీ : దళితులపై జరుగుతున్న దాడులపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో ఓ ప్రకటన చేయాలని బీఎస్పీ చీఫ్ మాయవతి డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ హయాంలో నయీం ఆగడాలు - ఉమా తనయుడు..

హైదరాబాద్ : 2004లో టిడిపి హాయాంలో నయీం భూ దందాలు జరగలేదని, కాంగ్రెస్ వచ్చిన తరువాత నయీం ఆగడాలు వచ్చాయని మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి తనయుడు పేర్కొన్నారు. డైరీ ముసుగులో లీకులు బయటపెట్టవద్దని, డైరీని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మాధవరెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తమ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి లీకులు ఇచ్చారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. జ్యుడిషయల్ ఎంక్వయిరీలో వాస్తవాలు బయటపడుతున్నాయని, కొంతమందిని కాపాడేందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయన్నారు. 

నయీంతో సంబంధాలు లేవు - ఉమా మాధవరెడ్డి...

హైదరాబాద్ : ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, మాధవరెడ్డి పేరును చెడగొట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఉమా మాధవరెడ్డి పేర్కొన్నారు. నయీం సంబంధాలను ఖండించారు. తన సెల్ నెంబర్ నుండి వందల కాల్స్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయని, మాధవరెడ్డి ఉన్నప్పటి నుండి ఒకే నెంబర్ ఉందన్నారు. కాల్ డేటాను తన ఎదుట పెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా అని చూడకుండా కావాలనే లీకులు ఇస్తున్నారని, జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయించాలని..తాను తప్పు చేస్తే తప్పకుండా జైల్లో కూర్చొంటానని తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని, ముఖ్యమంత్రికి తెలియకుండా లీకులు రావన్నారు.

నయీం డ్రైవర్ ఇంట్లో బంగారు ఆభరణాలు..వజ్రాలు స్వాధీనం..

రంగారెడ్డి : పుప్పాల్ గూడ శ్రీరాంనగర్ కాలనీలో నయీం డ్రైవర్ ఇంటి తాళాలను పోలీసులు పగులగొట్టారు. భారీగా బంగారు ఆభరణాలు..వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు.

 

నిమ్జ్ భూ సేకరణపై జారీ చేసిన జీవోపై కోర్టు అసంతృప్తి...

హైదరాబాద్ : నిమ్జ్ భూ సేకరణపై జారీ చేసిన జీవోను కోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. జీవోలో స్పష్టత లేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉమ్మడి కుటుంబంలో ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ? ఒక కుటుంబాన్ని ఏ ప్రాతిపదికన తీసుకున్నారో స్పష్టత లేదన్నారు. 20 ఏళ్ల పాటు నెలకు రూ. 2500 చెల్లిస్తామని, కానీ కన్జ్యుమర్ ప్రైస్ ను లెక్కలోకి తీసుకోలేదని కోర్టు పేర్కొంది. మళ్లీ స్పష్టతతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అప్పటి వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. 

చింతల్ లోని నారాయణ స్కూల్స్ వద్ద ఉద్రిక్తత...

హైదరాబాద్ : చింతల్ లోని నారాయణ స్కూల్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్కూల్ భవనంకు అనుమతులు లేకపోవడంతో కూల్చివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ ఖాళీ చేయాల్సి వచ్చినా విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపలేదు. దీనితో స్కూల్ భవనం ఎదుట విద్యార్థులు..వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. 

వరంగల్ జిల్లాలో నయీం ఆగడాలు...

వరంగల్ : జిల్లాలో నయీం ఆగడాలు బయటపడుతున్నాయి. రెండు ప్రధాన రాజకీయ పార్టీలతో నేతలతో కలిసి హైదరాబాద్ లో సెటిల్ మెంట్లకు నయీం పాల్పడినట్లు తెలుస్తోంది. బాలసముద్రం కాంప్లెక్స్ వివాదంలో నయీం సెటిల్ మెంట్ చేసినట్లు, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల వెంచర్లు భూ దందాకు నయీం సహకరించినట్లు తెలుస్తోంది. ఓ మాజీ ఐపీఎస్ అధికారితో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులతో నయీంకు సంబంధాలున్నట్లు సమాచారం. 

11:47 - August 11, 2016

హైదరాబాద్‌ : నగరంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం రేపుతోంది. స్లైన్‌ఫ్లూతో బాధపడుతూ ఓ విద్యార్థి మృతి చెందాడు. 10వ తరగతి విద్యార్థి రాకేష్ హయత్‌నగర్ మండలం పసుమములోని బీసీ హాస్టల్‌ లో ఉంటున్నాడు. రాకేశ్‌ ఒక్కసారిగా అస్వస్థతకు గురైయ్యాడు. దీంతో వెంటనే హాస్టల్‌ సిబ్బంది ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ రాకేశ్‌ మృతి చెందాడు. స్లైన్‌ఫ్లూతో రాకేశ్‌ మృతి చెందాడని వైద్యులు చెప్తున్నారు. 

11:36 - August 11, 2016

హైదరాబాద్ : సిట్‌ యాక్షన్‌ నయీం అస్తులపైనేనా...లేక డైరీలో గ్యాంగ్‌స్టర్ రాసిన వాటిపైనా ఉంటుందా...? ఇప్పటికే డైరీలో పోలీసు ఆఫీసర్లు..ప్రజాప్రతినిధులు.. మీడియా ప్రతినిధుల పేర్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం దందాకు సహకరించినవారు.. సాయం తీసుకున్నవారి వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సిట్‌ శోధన వీటిపైనా ఉంటుందా..? ఉంటే ఆఫీసర్ల బాగోతం బయటపడుతుందా..? లీడర్ల చీకటి ముసుగు తొలగుతుందా..? ఒక ఎన్‌కౌంటర్‌ ఎన్నో ప్రశ్నలకు దారి తీసేది..కాని నయీం ఎన్‌కౌంటర్‌ మాత్రం ఎందరో జాతకాలను బయటపెడుతుందాన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
సిట్‌ దర్యాప్తులో బయటపడనున్న ఆఫీసర్లు...
నయీం ఎన్‌కౌంటర్‌తో తుట్టె కదులుతోంది. ఇప్పటికే నయీం ఇంట్లో సోదాల్లో దొరికిన డైరీ, ల్యాప్‌టాప్..పెన్‌డ్రైవ్‌లలో ఎంతో సమాచారం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా నయీం ఇంతకాలం చేస్తున్న దందాలు..ఎవరితో లావాదేవీలు..ఎవరెవరికి పంచిన డబ్బు ఎంత... ఎవరెవరు ఏయే సెటిల్‌మెంట్లు తీసుకువచ్చారన్న విషయాలన్నీ డైరీలో ఉన్నట్లు తెలుస్తోంది. డైరీ విప్పితే కాని అసలు వాస్తవాలు బయటపడవు. డైరీ ఆధారంగా బయటపడే విషయాలపై ..అధికారులపై..ప్రజాప్రతినిధులు..మీడియా ప్రతినిధులపై సిట్‌ ఏ విధమైన చర్యలు తీసుకోబోతుందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తతం హాట్‌ టాపిగ్‌గా మారింది.
ఆ 25 మంది ఐపీఎస్‌లు ఎవరు..
ఇప్పటికే నయీం డైరీ దొరికింది..అందులో ఎన్నో విషయాలున్నాయన్న నిజం తెలిసిన క్షణం నుంచి గ్యాంగ్‌స్టర్‌ను అడ్డుపెట్టుకుని దందాలు చేసినవారిలో గుబులు మొదలయింది... దీనికి సంబంధించి తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు ఎలాంటి వ్యూహం పన్నాలని కూడా చూస్తున్నారు...నయీంతో పాటు ఎందరో దందాలు చేశారు...సెటిల్‌మెంట్లు కూడా చేసుకుని పబ్బం గడుపుకున్నారు..ఇక పోలీసుల్లో ఉన్నతాధికారుల నుంచి మొదలుకొని కానిస్టేబుల్‌ స్థాయి వరకు వాడుకున్నారనే తెలుస్తోంది..ఇలా డిపార్ట్‌మెంట్లో ఉన్న ఆ కొందరి జాతకాలు బయటపడితే పరిస్థితి ఏంటి..? ఏ మేరకు వారిపై చర్యలు తీసుకోబోతున్నారనేది చర్చనీయాంశమైంది....
నాలుగు రాష్ట్రాల్లో నయీం అనుకూల ఆఫీసర్లు...
గిఫ్ట్‌ల రూపంలో ఆస్తులు...
నయీం నుంచి గిఫ్ట్‌ల రూపంలో ఆస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలున్నాయి...అదే సమయంలో తమకు కావాల్సిన పనులు చేసుకున్నారని కూడా అనుమానాలున్నాయి...ఇక తెలంగాణాతో పాటు ఆంధ్రప్రదేశ్,చత్తీస్‌ఘడ్, ఝర్ఖండ్ రాష్ట్రాల్లో నయీం రహస్య సమాచారంతో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపిన అధికారులు ఆ తర్వాత తమకు అనుకూలంగా పనులు చేయించుకున్నారని ఇప్పటికే బయటపడింది..అయితే వీరందరి విషయాలు బయటకు రానిస్తారా లేదా..అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్...అదే జరిగితే ఎదురయ్యే ఇబ్బందులను ఎలా ఎదుర్కోబోతున్నారనేది కాలం నిర్ణయిస్తుంది.
అనుచరులపై నిఘా...లోతుగా అధ్యయనం..
ఇప్పటి వరకు రంగారెడ్డి,హైదరాబాద్, నల్గోండ, కరీంనగర్, నిజామాబాద్, మహాబూబ్ నగర్ జిల్లాలో 30 కేసులు నమోదయినట్లు తెలుస్తుంది. ఇందులో నార్సింగ్ లోని నయిం ఇంటి వద్ద దొరకిన డబ్బులు , డాక్యుమెంట్లు, అయుదాల పై నమోదయిన కేసును ప్రధాన కేసుగా తీసుకోని మిగితా కేసులను అటాచ్ చేసుకునే అవకాశం ఉంది....ఇన్వెస్టిగేషన్ ఛీఫ్‌ నాగిరెడ్డితో పాటు అడిషనల్ డిసిపి సైబరాబాద్ క్రైం శ్రీనివాసరెడ్డి ఐ.ఓ. ఆఫీసర్ కానున్నారు...ఈ టీంలో బేగం బజార్ సి.ఐ. శ్రీధర్, ఉప్పల్ ట్రాఫిక్ సి.ఐ.సుధాకర్, వనపర్తి సి.ఐ. షకీర్ హుస్సెన్, కోరుట్ల సి.ఐ. రాజశేఖర్ రాజు, సంగారెడ్డి సి.సి.ఎస్. సి.ఐ. సామాల వెంకటేశ్, కోదాడ సి.ఐ. మధుసుధన్ రెడ్డి, ఆర్మూర్ సి.ఐ. సీతారాం లను సభ్యులుగా ఉన్నారు. వీరు ఎనిమిది టీంలుగా విడిపోయి.. అక్రమ ఆయుదాలు ఎక్కడి నుంచి వచ్చాయి. పేలుడు పదార్ధాలు ఎవరు సమకూర్చారు. డబ్బులు ఏవరెవరి ఖాతా నుంచి చేరుకున్నాయనే కోణంలోదర్యాప్తు చేయనున్నారు. 

 

కాసేపట్లో మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి ప్రెస్ మీట్..

నల్గొండ : కాసేపట్లో మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. నయీం కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై ఉమా మాధవరెడ్డి వివరణనివ్వనున్నారు. 

2011 గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన..

హైదరాబాద్ : ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద 2011 గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. ఇంటర్వ్యూ నిర్వహించి నియామకాలు చేపట్టాలని టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. 

ఏపీలో దళితుల దాడిని సభలో ప్రస్తావించిన బీఎస్పీ..

ఢిల్లీ : ఎన్డీయే పాలనలో దళితులపై దాడులు పెరిగాయని సభ్యుడు సతీష్ చంద్ర మిశ్రా పేర్కొన్నారు. ఏపీలో దళితులపై జరిగిన దాడి అంశాన్ని రాజ్యసభలో బీఎస్పీ ప్రస్తావించింది. చనిపోయిన ఆవు చర్మాన్ని తీస్తున్న దళితులపై అమానుషంగా దాడి చేశారని, తనను తుపాకితో కాల్చడంటూ ప్రధాన మంత్రి చెప్పిన రోజే ఈ ఘటన చోటు చేసుకుందని సభకు తెలిపారు. 

జూరాల 13 గేట్ల ఎత్తివేత..

హైదరాబాద్ : జూరాల ప్రాజెక్టుకు చెందిన 13 గేట్లను గురువారం ఎత్తివేసి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.73 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

టిడిపి సీనియర్ నేత బస్వారెడ్డి కన్నుమూత..

వరంగల్ : టిడిపి సీనియర్ నేత ఎడబోయిన బస్వారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం హన్మకొండలో తుదిశ్వాస విడిచారు. 

11:23 - August 11, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీం ఇంట్లో వరుసగా మూడో రోజు సిట్‌ బృందం సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం నుంచి మొదలైన సోదాలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. సిట్‌ సోదాల్లో భారీ ఎత్తున దస్త్రాలు, బంగారం, డబ్బుల కట్టలు బయటపడుతున్నాయి. తాజాగా నయీం ఇంట్లో సైనైడ్‌ గన్‌, వైర్‌లెస్‌ కిట్‌, భారీగా విగ్గులును సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. పలు రకాల మేకప్ కిట్‌లను కూడా సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పల రకాల బాండ్లు, ప్రామిసరీ నోట్లపై సిట్‌ బృందం దర్యాప్తు చేస్తోంది. 

మహద్ బ్రిడ్జి..దొరికిన బస్సు..

మహారాష్ట్ర : ఇటీవలే మహద్ బ్రిడ్జి కూలడంతో నదిలో కొట్టుకపోయిన రెండు బస్సుల్లో ఒక బస్సును గుర్తించారు. గతకొన్ని రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు గాలిస్తున్నాయి. ఒక బస్సును గుర్తించినట్లు, గుర్తించిన ప్రాంతానికి అధికారులు చేరుకున్నారు. 

నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం..

హైదరాబాద్ : నగరంలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. హయత్ నగర్ లో టెన్త్ విద్యార్థి రాకేష్ స్వైన్ ఫ్లూతో మృతి చెందాడు. స్వైన్ ఫ్లూతో మృతి చెందాడని గ్లోబల్ వైద్యులు నిర్ధారించారు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ అనుమానిత కేసులు నమోదయ్యాయి. 

కృష్ణా పుష్కరాలపై బాబు టెలికాన్ఫరెన్స్...

విజయవాడ : కృష్ణా పుష్కరాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పుష్కర విదులకు ఐఏఎస్ అధికారులే కాకుండా డిప్యూటి కలెక్లర్లు, తహశీల్దార్లు, సిబ్బంది హాజరు కావాలని సూచించారు. అక్షయ ద్వారా టిటిడి నిర్వహిస్తున్న భోజన ఏర్పాట్లపై ఈ రోజు ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. 

ఆవుకులో ముగ్గురు మావోయిస్టు సానుభూతి పరుల అరెస్టు...

కర్నూలు : ఆవుకులో ముగ్గురు మావోయిస్టు సానుభూతి పరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

10:49 - August 11, 2016

నల్గొండ : కొత్త రాష్ట్రంలో తొలిసారిగా జరగనున్న కృష్ణాపుష్కరాలకు సర్వం సిద్ధమైంది. నల్లగొండ జిల్లాలో 28 ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. నాగార్జునసాగర్, మట్టపల్లి, వాడపల్లి ప్రాంతాల్లో ఘాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. రేపటి నుంచి కృష్ణా పుష్కరాలు జరుగనున్నాయి. 

రాజేంద్రనగర్ కోర్టుకు నయీం ఇంటి వాచ్ మెన్..

హైదరాబాద్ : గోవాలోని నయీం ఇంటి వాచ్ మెన్ తాజుద్దీన్ ను నేడు రాజేంద్రనగర్ కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. ఇదిలా ఉంటే నయీం ఇంట్లో మూడో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఈ సోదాలు కొననసాగనున్నాయి. నయీం ఇంట్లో సైనైడ్ గన్, వైర్ లైస్ కిట్, భారీగా విగ్గులు, మేకప్ కిట్ లు సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు బాంబ్లు, ప్రామిసరీ నోట్లపై సిట్ బృందం విచారిస్తోంది. 

10:27 - August 11, 2016

మెదక్ : మల్లన్న సాగర్‌ భూనిర్వాసితుల కోసం ఇటీవలే అరెస్టై జైలు నుంచి విడుదలైన సీపీఎం నాయకులకు వేములగట్టు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. 14 రోజుల నిర్బంధం అనంతరం సీపీఎం నాయకులు మల్లేశం జయరాజు, భాస్కర్‌లను గ్రామంలో సత్కరించారు. ఈ సందర్భంగా రైతులకు సీపీఎం అండగా ఉంటుందని నాయకులు అన్నారు. 

 

10:24 - August 11, 2016

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో 25వ సినిమాగా వచ్చిన 'నాన్నకు ప్రేమతో' సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం 50 కోట్ల క్లబ్‌లో చేరి ఆయన కెరీర్‌లోనే బెస్ట్ కలెక్షన్‌లను వసూలు చేసింది. అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్..సమంత..నిత్యా మీనన్ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతోంది. షూటింగ్ మొదలైన సమయం నుండి మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఆగస్టు 12న చిత్రం రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల చిత్రం రిలీజ్ ఆలస్యమయ్యింది. దీనితో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. కానీ వీరిని నిరుత్సాహ పరచకుండా అదే తేదీన చిత్ర ఆడియోను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఇందుకు భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి సరికొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో పచ్చని కొండల ప్రాంతంలో సమంత వెనుక ఎన్టీఆర్‌, ఎన్టీఆర్‌ వెనుక నిత్యామీనన్‌ లు పరుగెడెతూ ఉన్నారు. ఎన్టీఆర్ భుజానికి లగేజ్‌ వేసుకుని ఉన్న ఈ పోస్టర్‌ అభిమానులను అలరించింది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు దేశీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మళయాల నటులు మోహన్ లాల్, ఉన్ని ముకుందన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్ రిలీజ్ తరువాత రికార్డ్ లు తిరగరాయటం ఖాయం అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. 

10:18 - August 11, 2016

తూర్పుగోదావరి : అమలాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను హోంమంత్రి చిన్న రాజప్ప పరామర్శించారు. దళితులపై దాడి సంఘటనను దురదృష్టకరమన్నారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

 

10:14 - August 11, 2016

తూర్పుగోదావరి : జిల్లాలోని అమలాపురంలో దళితులపై దాడి ఘటనలో నిజాలు బయటపడుతున్నాయి. సవర్పాలెం గ్రామంలోని ఇద్దరు దళితులపై దాడిచేసింది గో పరిరక్షణ సమితి సభ్యులేనని పోలీసులు నివేదిక సిద్ధం చేశారు. ముందస్తు వ్యూహం ప్రకారమే దళితులపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 

నయీం ఇంట్లో మూడో రోజు సోదాలు..

హైదరాబాద్ : హతమైన గ్యాంగ్ స్టర్ నయీం ఇంట్లో మూడో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఈ సోదాలు కొననసాగనున్నాయి. నయీం ఇంట్లో సైనైడ్ గన్, వైర్ లైస్ కిట్, భారీగా విగ్గులు, మేకప్ కిట్ లు సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు బాంబ్లు, ప్రామిసరీ నోట్లపై సిట్ బృందం విచారిస్తోంది. 

10:08 - August 11, 2016

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కూడా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్నారు. ఇటీవలే క్రిష్ వివాహం జరిగింది. దీనితో షూటింగ్ కు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవలే మొరాకోలో తొలి షెడ్యూల్ యాక్షన్ పార్ట్ చిత్రీకరించారు. జార్జియాలో మూడో షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్య జరిగే పోరాట సన్నివేశాలను 1000 మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలతో జార్జియాలోని మౌంట్‌ కజ్‌బెగ్‌ పర్వతం వద్ద చిత్రీకరించడం జరిగిందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈనెలాఖరు నుండి నాలుగో షెడ్యూల్ ను నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
బాలకృష్ణ సరసన శ్రియ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు జాతి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఈచిత్రం తెరకెక్కుతోంది. ప్రేక్షకులు, ఆయన అభిమానులు మెచ్చే అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయని నిర్మాతలు తెలిపారు. 

అస్సాంలో పేలిన ఎల్ ఈడీ..

అస్సాం : డూమ్ డూమ్ ప్రాంతంలో డ్రైన్ లో ఎల్ ఈడీ బాంబు పేలింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

09:58 - August 11, 2016

టాలీవుడ్ లో మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ టెన్షన్ పడుతున్నాడంట. ఆయన నటించిన చిత్రం 'తిక్క' విడుదలకు సిద్ధంగా ఉంది. సాయిధరమ్‌ తేజ్‌, మన్నారా చోప్రా, లారిస్సా బోన్సీ హీరో హీరోయిన్లుగా సునీల్‌రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. చిత్రం విడుదల తేదీ సమీపిస్తున్న కొద్ది తేజూ ఆందోళనలో ఉన్నాడని టాక్. ఆయన గతంలో నటించిన చిత్రాలు విజయవంతమైన సంగతి తెలిసిందే. 'తిక్క' మూవీతో హాట్రిక్ హీరో అనిపించుకోవాలని తేజూ తహతహలాడుతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' విజయాన్ని నమోదు చేసుకుంది. రూ. 20 కోట్లు కలెక్షన్ రాబట్టి తేజూ తన సత్తాని చాటాడు. మరో చిత్రం 'సుప్రీం' యావరేజ్ గా నిలిచింది. కానీ కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. రూ. 22 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అనంతరం 'తిక్క' విడుదల కానుంది. ఈనెల 13న విడుదల ఈ చిత్రం విడుదల కానుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'తిక్క' రూపొందిందని తెలుస్తోంది. గత చిత్రాలకు భిన్నంగా తేజూ నటించాడని సమాచారం. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందనే వచ్చింది. ఫ్లాప్‌ డైరెక్టరైన తనను నమ్మి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చిన తేజు, రోహిణ్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు నిర్మాత పేర్కొన్నారు. ఇదొక మంచి రొమాంటిక్‌ లవ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ అని ఫస్టాఫ్‌లో థమన్‌ సంగీతం, ఇంటర్వెల్‌ ట్విస్ట్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు. మరి తేజూ హ్యాట్రిక్ హీరో అనిపించుకుంటాడా ? లేదా ? అనేది చిత్రం విడుదల అనంతరం తెలుస్తుంది.

09:34 - August 11, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కేసు కొత్త మలుపు తిరుగుతోంది.  నయీం కేసులో తవ్వుతున్న కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. నయీం కేసులో ఓ మాజీ మంత్రి హస్తం ఉన్నట్లు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక సిట్‌ స్పష్టం చేసింది. నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అండదండలతోనే నయీం ఎదిగినట్లు సిట్‌ బృంధం ఆధారాలను సేకరిస్తోంది. మొత్తం 8 బృంధాలుగా విడిపోయిన సిట్‌...నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ముమ్మర దర్యాప్తు చేస్తోంది. మరోవైపు నయీం ఇంట్లో నిన్న రెండోరోజు కూడా ముమ్మర సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాల్లో గుట్టల కొద్ది స్థలాలు, ఇళ్ల దస్త్రాలు,  బయటపడుతున్నాయి. దాంతో పాటు కిలోల కొద్ది బంగారం, వెండి ఆభరాలు కూడా బయటపడుతున్నాయి. నయీం బెడ్‌రూంలో నిర్వహించిన సోదాల్లో 2 గోనెసంచుల్లో బంగారు ఆభరణాలు, చైన్లు, బ్రేస్‌లెట్లు, వెయ్యి డ్రెస్సులు బయటపడ్డాయి. 

 

09:22 - August 11, 2016

కళ్లు..మనిషికి కళ్లు ఎంతో ముఖ్యం. కళ్లకు కలిగే నిరంతర శ్రమను అంచనా వేయలేం. నేటి ఆధునిక జీవితంలో ఎక్కువగా చదవడం..రాయడం..టీవీ చూడడం..కంప్యూటర్ పై పనిచేయడం...ఇలా కంటితో ముడిపడే పనులను ఎన్నో చేస్తున్నాం. కళ్లకోసం ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచన రాదు. దీనితో కంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ? కొన్ని చిట్కాలు మీ కోసం...

గంటకు మించి విడవకుండా టీవీ చూడడం మంచిది కాదు.
టీవీ చూస్తున్నప్పుడు శరీరాన్ని పలు రకాల భంగిమల్లో ఉంచడం చాలా మంచిది.
వెన్నెముకకు ఆసరా ఇచ్చే కుర్చీలో కూర్చుని టీవీ చూడడం కంటికి మేలు చేస్తుంది.
టీవీకి కనీసం మూడు మీటర్ల దూరంలో కూర్చోవాలి.
కంప్యూటర్ తెర మధ్యభాగానికి కాస్తపైన మీ చూపు ఉంటే మంచిది.
రెప్ప వేయకుండా పని చేయడం మంచిది కాదు. కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు తరచుగా రెప్ప వేయాలి.
నిరంతరం పని చేయకుండా మధ్యలో విరామం తీసుకోవడం ఉత్తమం.
కాళ్లు నేలపై ఆనించి వెన్నుముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి.
ఆరోగ్యంగా ఉండటానికి రోజూ కొంత వ్యాయామం చేస్తే సరిపోతుంది. వీటితో పాటు క్యారెట్స్ తినటం ఎంతో మంచిది.
సాల్మన్‌, సార్డీలైన్‌ చేపలు కంటికి చాలా మంచివి. ఇవి తినటం వల్ల కళ్లు పొడి బారవు, దాంతో పాటు కంటి మచ్చలు తొలగిపోయేలా చేస్తాయి. 
రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినాలి. గుడ్లల్లో ముఖ్యంగా ప్రోటిన్స్, విటమిన్‌ 'ఎ', 'డి', 'బి6' లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అంధత్వాన్ని దూరం చేస్తాయి.
తలను విశ్రాంతి దశలో ఉంచి చూపును, క్లాక్‌వైజ్, యాంటీక్లాక్‌వైజ్‌గా తిప్పాలి. ఇలా మూడుసార్లు చేయాలి. 
తలను నిటారుగా ఉంచి చూపును పైకి తిప్పుతూ పూర్తిగా కుడివైపునకు చూడాలి. ఆ తర్వాత చూపును కిందకు దింపి ఎడమ పక్కకు చూడాలి. ఇలా మూడుసార్లు చేయాలి.
కంటి చూపు బాగుగా ఉండాలంటే ఓట్స్, కార్న్స్, బార్లీ, గోధుమలు తీసుకోవాలి. కళ్లు మండుతున్నపుడు ఆరెంజ్‌, లెమన్‌, ద్రాక్ష వంటివి తినాలి. వీటిలో ఎక్కువగా విటమిన్‌ 'సి' ఉంటుంది. 

దళితులను పరామర్శించిన ఏపీ హోం మంత్రి చిన రాజప్ప.

తూర్పుగోదావరి : అమలాపురం దళితులపై దాడి ఘటనలో నిజాలు బయటపడుతున్నాయి. దాడికి గో పరిరక్షణ సమితే కారణమని నివేదికలో పేర్కొన్నారు. ముందస్తు వ్యూహం ప్రకారమే దాడి చేసినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. చికిత్స పొందుతున్న దళితులను ఏపీ హోం మంత్రి చినరాజప్ప పరామర్శించారు. 

09:09 - August 11, 2016

శనగలు...వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మహిళలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంటాయి. శనగలతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. మరి శనగల్లో ఉన్న పోషకాల విలువలు ఏంటో తెలుసుకోవాలంటే చదవండి..
ఫొలేట్, మెగ్నీషియం అధిక మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలోని అమినోయాసిడ్ ప్రభావాన్ని తగ్గించి గుండెలోని రక్తనాళాలు మూసుకపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శరీరానికి అవసరమైన ఐరన్ ను అందిస్తుంది. రక్తహీనత, అలసట, నిద్రలేమి, జుట్టురాలడం..తలనొప్పి తదితర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా ఉంటుంది. అంతేగాకుండా రక్తంలో చక్కెరస్థాయిలను అదుపులో ఉంచుతుంది.
శనగల్లో పీచు సమృద్ధిగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. శనగలను రెండు రోజులు వదిలేస్తే మొలకలు వస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. మరి శనగలను ఆహారంలో భాగం చేసుకుంటారు కదూ..

08:58 - August 11, 2016

ఏప్పుడు చూసినా పుస్తకాలు పట్టుకొనే ఉంటారు..ఎప్పుడు చదువేనా ? ఎప్పుడు చూసినా పుస్తకాలను పట్టుకుని ఉండే వాళ్లను 'పుస్తకాల పురుగులు' అని అంటుంటాం. వీరే ఎక్కువకాలం బతుకుతారంట. యుఎస్ లోని యేల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సీరియస్ రీడర్స్ లకు ఆయుష్షు మాత్రం కచ్చితంగా పెరుగుతుందంట. పుస్తకాలు అస్సలు చదవనివారు...వారానికి కొన్ని గంటలు చదివేవారు...అంతకన్నా ఎక్కువ చదివేవారు.. మూడు విభాగాలుగా విభజించారు. 50 ఏళ్ల పాటు 3,635 మందిపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయంట. మహిళలు ఎక్కువగా చదువుతున్నారని అధ్యయనంలో వెల్లడైంది. అసలు చదవని వారంకటే వారానికి మూడు నాలుగు గంటలు చదివేవారు...రెండేళ్లు ఎక్కువగా బతుకుతారు. అంతకంటే ఎక్కువ పుస్తకాలు చదివే వారు ఇంకా ఎక్కువకాలం బతికుతారని అధ్యయనంలో తేలింది. 

08:55 - August 11, 2016

దళితులపై దాడులు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత గఫూర్,  టీడీపీ నేత శ్రీరాములు, బీజేపీ నాయకురాలు పాదూరి కరుణ పాల్గొని, మాట్లాడారు. కఠినమైన నిర్ణయాలు, శిక్షలు అమలు చేస్తేనే దళితులపై దాడులు అగుతాయని అభిప్రాయపడ్డారు. భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, ఆర్ ఎస్ ఎస్ ఇవన్నీ దళితులపై దాడులు చేస్తున్నాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

సెప్టెంబర్ లో ప్రధాని విదేశీ పర్యటన..

ఢిల్లీ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ లో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వియత్నాం, చైనా, లావోస్ లో పర్యటించనున్నారు. జీ 20 సమ్మిట్, ఏషియన్ సమ్మిట్ లో ఆయన పాల్గొననున్నారు. 

08:47 - August 11, 2016

పుష్కరాల సందర్భంగా నదులను కలుషితం చేయొద్దని ఎంప్లాయీస్ వాయిస్ ఎడిటర్,  క్రిష్ణా పరివాహక ప్రాంత జలవనరుల యాక్టివిస్ట్  కెవి అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'క్రిష్ణా పుష్కరాలకు వేళయ్యింది. రేపటి నుంచి 12 రోజుల పాటు   క్రిష్ణా పుష్కరాలు సాగుతాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్రిష్ణా నదికున్న ప్రాధాన్యత ఏమిటి? క్రిష్ణా నదిపై వున్న ప్రముఖ చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలేమిటి?  క్రిష్ణా నది కలుషితం కాకుండా కాపాడుకోవడంలో పౌర సమాజం పాత్ర ఏమిటి ? ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ముంబైలో కుప్పకూలిన భవంతి...

ముంబై : ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఉన్న ముగ్గురిని రక్షించారు. 

08:43 - August 11, 2016

క్రిష్ణా పుష్కరాలు రేపటి నుంచే ప్రారంభమవుతున్నాయి. తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లోనూ పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు.    రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 250 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయగా 40 ఘాట్లకు భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుందన్న అంచనాలున్నాయి. 
గుంటూరు జిల్లాలో 80 ఘాట్లు
గుంటూరు జిల్లాలో 80 ఘాట్లు సిద్ధం చేశారు. అమరావతి ఘాట్ కు భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుందని భావిస్తున్నారు.  అమరావతిలోని అమరేశ్వరస్వామి ఆలయం, మాచర్లలోని చెన్నకేశవాలయం, గురజాల సమీపంలోని సత్రశాల ఆలయం, తంగెడికోట ఆలయం, చేజర్లలోని కపోతేశ్వరాలయం, పొందుగులలోని జలపేశ్వరస్వామి ఆలయం గుంటూరు జిల్లాలోని సుప్రసిద్ధ ఆలయాలు.
క్రిష్ణా జిల్లాలో 74 స్నాన ఘట్టాలు 
క్రిష్ణా జిల్లాలో మొత్తం 74 స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశారు. విజయవాడ సిటీలో ఆరు ఘాట్లు ఏర్పాటు చేయగా, గ్రామీణ ప్రాంతాల్లో 68 ఘాట్లు ఏర్పాటు చేశారు. విజయవాడ సిటీలోని భవానీ, పున్నమి, దుర్గ, క్రిష్ణవేణి, పద్మావతి, ఇబ్రహీంపట్నం మండలంలోని పవిత్రసంగమం, ఫెర్రీ ఘాట్ల లో లక్ష మంది స్నానాలు చేస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేశారు. జగ్గయ్యపేట, మోపిదేవి, కోడూరు  మండలాల్లోని ఘాట్లలో 50 వేల మంది వరకు స్నానం చేస్తారన్న అంచనాలున్నాయి. 
జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలో క్రిష్ణమ్మ ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. ముక్త్యాల శైవ క్షేత్రం, వేదాద్రి వైష్ణవ క్షేత్రం ఇక్కడే వున్నాయి..  ముక్త్యాలను ఉత్తర కాశీగా వర్ణిస్తుంటారు.  
నల్లగొండ జిల్లాలో 29 పుష్కరఘాట్లు  
నల్లగొండ జిల్లాలో మొత్తం 29 పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు. చందంపేట, పెదవూర, మేళ్ల చెరువు, నేరేడు చర్ల, మఠంపల్లి, వాడపల్లి, కనగల్, నాగార్జునసాగర్ లలో పుష్కర ఘాట్లున్నాయి. 
మహబూబ్ నగర్ జిల్లాలో 52 పుష్కరఘాట్లు 
మహబూబ్ నగర్ జిల్లాలో 52 పుష్కరఘాట్లు నిర్మించారు. మాగనూరు మండలంలోని క్రిష్ణా ఘాట్ హైదరాబాద్ నుంచి 182 కిలోమీటర్ల దూరంలో వుంది. నాంపల్లి, సికింద్రాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రతి రైలూ క్రిష్ణ ఘాట్ మీదుగానే వెళ్తుంది. మహబూబ్ నగర్, మక్తల్ మీదుగా రోడ్డు మార్గం వుంది. మక్తల్ మండంలోని పస్పుల ఘాట్ హైదరాబాద్ నుంచి 185 కిలోమీటర్ల దూరంలో వుంది. మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్ మీదుగా పస్పుల ఘాట్ కి రోడ్డు మార్గం వుంది. ఆత్మకూర్ మండలంలోని నందిమల్ల ఘాట్  హైదరాబాద్ కి 177 కిలోమీటర్ల దూరంలో వుంది.  హైదరాబాద్ నుంచి జడ్చర్ల,  ఆత్మకూర్ మీదుగా నందిమల్ల ఘాట్ కు రోడ్దు మార్గం వుంది. 
హైదరాబాద్ కి 155 కి.మీ దూరంలో రంగాపూర్ ఘాట్... 
పెబ్బేరు మండలంలోని రంగాపూర్ ఘాట్ హైదరాబాద్ కి 155 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి ఘాట్ హైదరాబాద్ కు 166 కిలోమీటర్ల దూరంలో వుంది.  హైదరాబాద్ నుంచి గద్వాల వరకు రైళ్లు వెళ్తాయి.  గద్వాలకు 16కిలోమీటర్ల దూరంలో బీచ్ పల్లి ఘాట్ వుంది. కర్నూలు నుంచి 44 కిలోమీటర్ల దూరంలో వుంది. అలంపూర్ సమీపంలోని క్యాతూర్ ఘాట్ హైదరాబాద్ కి 233 కిలోమీటర్ల దూరంలో  వుంది. కర్నూలు నుంచి 33 కిలోమీటర్ల దూరంలో వుంది.  హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే రైలు ఎక్కితే, జోగుళాంబ రైల్వే హాల్ట్ దగ్గర దిగాల్సి వుంటుంది. 
హైదరాబాద్ నుంచి 150 కి.మీ. దూరంలో నాగార్జున సాగర్ ఘాట్ 
నాగార్జున సాగర్ ఘాట్ హైదరాబాద్ నుంచి 150 కి.మీ. దూరంలో వుంది. హైదరాబాద్ నుంచి నల్లగొండ జిల్లాలోని చందంపేట, పెద్దమునిగల్ ఘాట్  135 కి.మీ. దూరంలో వుంది.   కాచురాజుపల్లి ఘాట్ 147 కి.మీ.,  అజ్మాపురం ఘాట్ 120 కి.మీ. ఊట్లపల్లి ఘాట్ 145 కి.మీ.,  మఠంపల్లి ఘాట్ 200 కి.మీ.,  వాడపల్లి ఘాట్ 170 కి.మీ. దూరంలో వున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం లోని పాతాళగంగ దగ్గర కూడా పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు. 

 

నయీం కేసులో సిట్ విచారణ వేగవంతం..

హైదరాబాద్ : నయీం కేసులో సిట్ విచారణను వేగవంతం చేసింది. ఎనిమిది టీమ్ లుగా విడిపోయి జిల్లాలో దర్యాప్తు చేస్తోంది. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో సిట్ దర్యాప్తు చేపట్టింది. మాజీ మంత్రి పాత్రపై సాక్ష్యాధారాలు సేకరిస్తోంది. ఓ రిటైర్డ్ డీజీతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారుల సహకారంపై సిట్ దర్యాప్తు చేపట్టింది. 

08:34 - August 11, 2016

ఢిల్లీ : తూర్పుగోదావరి జిల్లా సవరపాలెంలో దళితులపై జరిగిన దాడి అంశాన్ని రాజ్యసభ ప్రారంభంలోనే బిఎస్పీ ప్రస్తావించింది. చనిపోయిన ఆవు చర్మాన్ని తీస్తున్న దళితులపై కొందరు అమానుషంగా దాడి చేశారని బిఎస్పీ ఎంపి సతీష్‌చంద్ర మిశ్రా తెలిపారు. గ్రామస్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరరావు మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. దళితులపై దాడి చేయొద్దు.. తనను తుపాకితో కాల్చండంటూ తెలంగాణ గడ్డపై మోది ప్రకటించిన రోజే ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. నిజానికి దళితులు ఆవును చంపలేదని, చనిపోయిన ఆవు చర్మం తీస్తుండగా గ్రామస్తులు దాడి చేశారని పేర్కొన్నారు. ఎన్టీయే పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు.

 

భారత్ 353 ఆలౌట్..

గ్రాస్ ఐలెట్ : వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 353 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం ఇన్నింగ్ ప్రారంభించిన విండీస్ వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. 

17న నీట్ ఫలితాలు..

గుంటూరు : వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించయిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు ఈనెల 17న విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ పేర్కొన్నారు. 

శ్రీశైలం జలాశయానికి వరద..

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 868.80 అడుగులు ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా ఇన్ ఫ్లో 2,49,544 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 75,527 క్యూసెక్కులుగా ఉంది. 

08:23 - August 11, 2016

హైదరాబాద్ : కాశ్మీర్ సమస్య సైన్యంతో పరిష్కారం కాదని, రాజకీయంగా దీనిని పరిష్కరించాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. నగరంలోని ఎస్వీకేలో సీఐటీయూ ఆధ్వర్యంలో 'కాశ్మీర్ సమస్య, పరిష్కారం' అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ముఖ్యవక్తగా బీవీ రాఘులు హాజరై మాట్లాడారు. కాశ్మీర్‌ సమస్యపై ప్రజా అభిప్రాయానికి విరుద్ధంగా వెళ్లొద్దని సూచించారు. బీజేపీ విధానాలు కాశ్మీర్ సమస్యను మరింత తీవ్రతరం చేసేలా ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 370 అధికరణం, దుర్వినియోగం అయ్యిందని విమర్శించారు. దేశ ఐక్యతను కాపాడాలని, సమగ్రతను దెబ్బతీసే విధానాలను వ్యతిరేకించాలని కోరారు. 

 

08:14 - August 11, 2016

రంగారెడ్డి : నార్సింగిలోని నయీం ఇంటిలో సోదాలు కొనసాగుతున్నాయని సీపీ నవీన్‌చంద్‌ తెలిపారు. రేపు షెడ్యూల్స్‌ రూపొందిస్తామని ఆయన చెప్పారు. నయీం బంధువు ఖాజుద్ధీన్‌ను అదుపులోకి తీసుకున్నామని... అతని బొలెరో వాహనం నుంచి నాలుగు లక్షల 30 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని సీపీ చెప్పారు. గోవాలో నయీంకు చెందిన ఇంటి పత్రాలు.. ఆస్తులను కోర్టుకు ప్రొడ్యూస్‌ చేస్తామని సీపీ నవీన్‌చంద్‌ తెలిపారు. 

08:05 - August 11, 2016

విజయవాడ : ఏపీ స‌చివాల‌య త‌ర‌లింపు మ‌రింత ఆల‌స్యం కానుంది. ఈనెల 10 నాటికి స‌చివాల‌యంలోని అన్నిశాఖ‌లు అమ‌రావ‌తికి త‌ర‌లిరావాల‌ని ప్రభుత్వం చెప్పినా సాంకేతిక కార‌ణాలు అడ్డుగా మారుతున్నాయి. వెల‌గ‌పూడిలో స‌రైన వ‌స‌తులలేమి తరలించేందుకు అవరోధంగా మారింది. దీంతో శాఖల తరలింపు కొన్నిరోజలు వాయిదా వేయడమే బెటరని ఏపీ సర్కార్ అభిప్రాయపడుతోంది. 
ఇంకా తరలిరాని పలు శాఖలు...
హైద‌రాబాద్ నుంచి వెల‌గ‌పూడికి ఏపీ స‌చివాల‌యశాఖల త‌ర‌లింపు మ‌రింత ఆల‌స్యం కానుందా.. ఈ నెల 10 నాటికి డెడ్ లైన్ విధించినా ఇంకా తరలిరాని పలు శాఖలు. దీంతో తరలింపును పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సచివాలయ శాఖల తరలింపుపై పలుమార్లు డెడ్ లైన్లు విధించిన సర్కార్ మరోసారి వాయిదాకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వెల‌గ‌పూడిలోని కొత్త  స‌చివాల‌యంలో పలుశాఖల మంత్రులు ఈ నెల 10 న త‌మ పేషీల‌ను ప్రారంభించాలని  నిర్ణయించారు. అయితే చివ‌రి నిమిషంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఆరోగ్య, రెవెన్యూ, విద్యాశాఖ మంత్రులు త‌మ పేషీల ప్రారంభాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
మౌలిక వసతులు లేకపోవడంతో పేషీ అధికారుల అసంతృప్తి
ఇరుకైన గ‌దుల్లో ఎలా విధులు నిర్వహించాల‌ని పలు శాఖల మంత్రులు వాపోతున్నారు. ఇప్పుడు నిర్మించిన వాటిని మ‌రింత పెద్దవిగా నిర్మించాల‌ని కొంద‌రు మంత్రులు గుత్తేదారుల‌కు సూచిస్తున్నారు. నిర్మించిన భ‌వ‌నాల్లో మౌలిక వ‌స‌తులు లేక‌పోవ‌డంపై కూడా ఉద్యోగులు, మంత్రుల పేషీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పుష్కరాల విధుల్లో పాల్గొంటున్న మంత్రులు, ఉన్నతాధికారులు
మ‌రోవైపు పుష్కరాలకు మంత్రులు, ఉన్నాతాధికారులు విధులు నిర్వహించనున్నారు. ఈ పుష్కరాలు ముగియ‌గానే వ‌ర్షాకాల అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాలు కూడా హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌వ‌చ్చని స‌మాచారం. దీంతో స‌చివాల‌యంలోని వివిధ శాఖ‌ల‌తో పాటు హైద‌రాబాద్ లోని హెచ్ఓడీలను త‌రలించాల్సి ఉంది. ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.  మొత్తానికి అమ‌రావ‌తికి ఉద్యోగుల త‌ర‌లింపు ప్రక్రియకు మ‌రోసారి తాత్కాలికంగా బ్రేక్ ప‌డిన‌ట్లయింది. మ‌రో మూడు నెల‌లు గ‌డిచినా పాల‌న పూర్తిస్థాయిలో గాడిలో ప‌డేలా లేదు.

 

07:59 - August 11, 2016

హైదరాబాద్ : కొత్తజిల్లాలపై కసరత్తును తెలంగాణసర్కార్‌ స్పీడప్‌చేసింది. ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం... వివిధస్థాయిల్లో విపక్షాలతో చర్చించడానికి రంగం సిద్ధం చేసింది. మొత్తానికి దసరానాటికి కొత్తజిల్లాలనుంచే పాలన మొదలు పెట్టడానికి  టీసర్కార్‌ రెడీ అవుతోంది. 
ఆగష్టు22న కొత్త జిల్లాలపై డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్
కొత్తజిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం వరుసగా సమీక్షలు నిర్వహిస్తోంది. ఈనెల 22న డ్రాఫ్ట్‌నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన టీ సర్కార్‌... అంతకంటే ముందే జిల్లాలవారీగా ప్రజాప్రతినిధుల  అభిప్రాయాలను సేకరించడానికి రంగం సిద్దం చేసింది.  దీనికోసం క్యాబినెట్‌ సబ్‌కమిటీ ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది.
కొత్త జిల్లాల ఏర్పాటు కోసం కసరత్తు
దసరా పండుగ నాటికి కొత్త జిల్లాలను మనుగడలోకి తీసుకురావాలని తమ సర్కార్‌ కసరత్తు చేస్తోందని ఉపముఖ్యమంత్రి చెప్పారు.  దీనికో ఆగష్టు 12న మెదక్‌, ఆదిలాబాద్‌, ఖమ్మంజిల్లాల్లో వివిధపార్టీల నాయకులతో  క్యాబినెట్‌సబ్‌కమిటీ సమావేశాలు నిర్వహించనుంది.  అలాగే  13వ తేదీన నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్లగొండ జిల్లాలు... 14న హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, వరంగల్‌జిల్లాల్లో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తామని డిప్యూటీసీఎం  మహమ్మూద్‌ఆలీ చెప్పారు. 
ఆగష్టు 18న అఖిలపక్షాలతో ఫైనల్‌ భేటీ
జిల్లాలవారీగా భేటీల తర్వాత ఈనెల 18న చివరగా  హైదరాబాద్‌లో అఖిలపక్షాలతో సమావేశం నిర్వహించనున్నారు.  తర్వాత... అందరిఅభిప్రాయాలపై ఓనివేదికను రూపొందించి ముఖ్యమంత్రికి రిపోర్టును అందించడానికి డిప్యూటీ సీఎం మహమ్మూద్‌ఆలీ నేతృత్వంలోని క్యాబినెట్‌ సబ్‌కమిటీ నిర్ణయించింది. 

07:55 - August 11, 2016

విజయవాడ : పుష్కరాలకోసం ప్రజలంతా ఉత్సాహంగా ఉంటే.. ఆటోవాలాలకు చేదువార్తను చెప్పారు విజయవాడ పోలీసులు. పుష్కరాల సమయంలో నగరంలో ఆటోలపై బ్యాన్‌ విధించారు.  ట్రాఫిక్‌ బూచిచూపి తమ కడుపులు కొడుతున్నారని ఆటోడ్రైవర్లు మండిపడుతున్నారు. పుష్కరాసమయంలో రాత్రిపగలు ఆటోలు నడుపుకుని అప్పల నుంచి కొంతైనా బయటపడొచ్చనుకున్న ఆటోడ్రైవర్లకు బెజవాడ పోలీసులు చేదుకబురు చెప్పారు. 
ఆటోలకు బ్రేకులు 
పుష్కరాల సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ జామ్‌ల భయం పట్టుకుంది పోలీసులకు.  యాత్రీకులకోసం  పెద్దసంఖ్యలో బస్సు సర్వీసులను పెంచింది ఆర్టీసీ . దీంతో నగరంలో ప్రతి పదినిముషాలకు ఓ బస్సును నడవనుంది. పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి వస్తే... ట్రాఫిక్‌ జామ్‌లు జరిగే అవకాశం ఉంది. రద్దీ సమస్యను నిరవారించేందుకు  పోలీసులు   ఆటోలపైపడ్డారు. ట్రాఫిక్‌ నియంత్రణకోసం పుష్కరాలు జరిగే 12రోజుల పాటు విజయవాడలో ఆటోలను పూర్తిగా బంద్‌చేయాలని నిర్ణయించారు. దీనిపై ఆటోవాలాలు మండిపడుతున్నారు. ప్రభుత్వం తమ కడుపులుకొడుతోందని ఆవేదన చెందుతున్నారు. 
ఆటోడ్రైవర్ల ఆశలపై నీళ్లుచల్లిన ప్రభుత్వం
తమపై నిషేదం విధించడాన్ని ఆటోడ్రైవర్లు  తప్పుబడుతున్నారు. పుష్కరాల సందర్భంగా  ఆటోలకు మంచి గిరాకీ ఉంటుందన్న తమ ప్రభుత్వం నీళ్లుచల్లిందని   ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు   పుష్కరాల సమయంలో ... ఆటోలు బంద్‌చేసి.. వాలంటీర్లుగా పనిచేయాలన్న పోలీసు అధికారుల హుకుంతో ఆటోడ్రైవర్లు మండిపడుతున్నారు.  మొత్తానికి ట్రాఫిక్‌ సమస్యను తీర్చడానికి అధికారులు ఆటోలకు బ్రేకులు వేశారు. 

 

దళితులపై దాడి ఘటనకు గో సంరక్షణ సమితే కారణం : పోలీసులు నివేదిక

తూర్పుగోదావరి : దళితులపై దాడి ఘటనకు గో సంరక్షణ సమితే కారణమని పోలీసులు నివేదిక ఇచ్చారు. ముందస్తు వ్యూహం ప్రకారమే దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. 

07:45 - August 11, 2016

హైదరాబాద్ : కృష్ణా పుష్కరాల కోసం బస్సు సర్వీసులను నిరంతరాయంగా నడిపేందుకు తెలంగాణ ఆర్‌టీసీ విసృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మహబూబ్‌ నగర్, న‌ల్గొండ జిల్లాల్లో పుష్కర ఘాట్‌లకు ప్రయాణికులను  తరలించేందుకు ఉచిత సర్వీసులను నడిపేందుకు టీఎస్‌ ఆర్టీసీ సిద్ధమవుతోంది.    
పార్కింగ్‌ స్థలాల నుంచి ఘాట్‌ వరకు ఆర్టీసీ ఉచిత సర్వీసులు
కృష్ణా పుష్కరాల కోసం తెలంగాణ వ్యాప్తంగా  రవాణా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్టీసి బస్సులను ఘాట్ ల వరకు తీసుకెళ్లే ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో పార్కింగ్ స్థలాల నుంచి పుష్కర ఘాట్ ల వరకు ఆర్టీసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పించింది తెలంగాణ ఆర్టీసీ. సుమారు రెండున్నర వేల మంది ఆర్టీసీ సిబ్బంది పుష్కరాల్లో సేవలు అందించనుంది. 
1350 ప్రత్యేక బస్సులు 
కృష్ణా పుష్కరాలకు తెలంగాణ ఆర్టీసి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి 1350 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. హైదరాబాద్‌ నుంచే కాకుండా, ఇతర జిల్లాల నుండి కూడా రద్దీకి అనుగుణంగా బస్సులు నడపనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 55 పుష్కర ఘాట్ లకు ఆర్టీసి బస్సులు నడపనుంది. ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లాలోని 3 ఘాట్లకు, నల్లగొండ జిల్లాలోని నాలుగు ఘాట్లకు ఎక్కువ బస్సులు నడపనున్నారు. ఖమ్మం, హైదరాబాద్ ల నుండి విజయవాడకు కూడా బస్సులు పెద్ద సంఖ్యలో  నడపనున్నారు.
బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు 
ఇదిలా ఉంటే ఆర్టీసి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెబుతున్నప్పటికీ ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. సాధారణ చార్జీల కంటే అదనంగా వసూలు చేయడంపై గత సంవత్సరం జరిగిన గోదావరి పుష్కరాల సమయంలోనే ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేవారు. ఇప్పుడెలా స్పందిస్తారో వేచిచూడాలి.

 

07:42 - August 11, 2016

హైదరాబాద్ : కృష్ణా పుష్కరాల కోసం రైల్వేశాఖ సర్వం సిద్దం చేసింది. యాత్రికులకోసం  ప్రత్యేక రైళ్ళను నడుపనుంది రైల్వేశాఖ. ప్రధానంగా గుంటూరు రైల్వేడివిజన్ పరిధిలో 145 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఘాట్లకు సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్లలో కూడా ఈ  రైళ్లు నిలిచేలా రైల్వేశాఖ అదేశాలు జారీ చేసింది.
ప్రత్యేక రైళ్లు నడపడానికి ద.మ. సిద్ధం 
కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైల్ సర్వీసులను నడపడానికి దక్షిణమధ్యరైల్వే సిద్ధమైంది. ప్రయాణికుల రద్ధీని దృష్టిలో ఉంచుకుని స్పెషల్‌ ట్రైన్స్‌ను ఏర్పాటు చేసింది రైల్వేశాఖ. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో 145 ప్రత్యేక రైళ్ళను నడపనున్నారు. విశాఖపట్నం నుండి గుంటూరుకు , సికింద్రాబాద్ నుండి గుంటూరు, సికింద్రాబాద్ నుండి కాకినాడ, విశాఖపట్నం నుండి తిరుపతి మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. 
ఈనెల 11 నుండి 23 వ తేదీ వరకు కృష్ణా పుష్కరాలు
ఈనెల 11 నుండి 23 వ తేదీ వరకు కృష్ణపుష్కరాల నేపథ్యంలో ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్ళు అందుబాటులో ఉండనున్నాయి.  గుంటూరు పరిధిలోని ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్ళలో 73 రైళ్ళల్లో ముందస్తుగా రిజర్వేషన్ కు అవకాశం కల్పిస్తోంది రైల్వేశాఖ. అటు పుష్కరయాత్రీకులకు సౌకర్యంగా ఉండేలా ఘాట్లకు సమీపంలోని రైల్వేస్టేషన్లలో కూడా ప్రత్యేక రైళ్ళు నిలుపతామని  రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. 
పుష్కర ఘాట్ల వద్ద రైళ్ల సమాచార బ్యానర్లు 
యాత్రికులకు ఎప్పటికప్పుడు రైళ్ళ సమాచారం తెలియజేసేలా పుష్కరనగర్ ఘాట్ల వద్ద  బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. టిక్కెట్లు జారీచేసేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పటు చేస్తుంది రైల్వేశాఖ. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మొబైల్ టిక్కెట్ వాహనాలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు టిక్కెట్లు జారీచేయనున్నారు. అలాగే ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో యాత్రికులకు అవసరమైన అహారపదార్ధాలను అందించేందుకు క్యాటరింగ్ స్టాల్స్ ను కూడా  ఏర్పాటు చేస్తున్నారు.  అటు భద్రత విషయంలో కూడా  అన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నారు రైల్వే అధికారులు. స్టేషన్లలో రైల్వేపోలీసు బలగాలను మోహరించనున్నారు. రాత్రిపూట  రైళ్ళల్లో పోలీసుల సంఖ్యను పెంచేలా రైల్వేశాఖ అధికారులు చర్యలు తీసుకుంటోంది.

 

07:34 - August 11, 2016

హైదరాబాద్ : కృష్ణా  పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు  ప్రభుత్వం పుష్కర ఏర్పాట్లపై తుది సమీక్ష నిర్వహించింది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని అలంపూర్  పుష్కరఘాట్ లో సీఎం పవిత్ర స్నానమాచరించి కృష్ణా పుష్కరాలను ప్రారంభించనున్నారు. వరుస సెలవుల కారణంగా భక్తులరద్దీ దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.
పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు 
కృష్ణా పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్. కృష్ణా పుష్కరాలకు భక్తులు కోట్లాదిగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు. వరుస సెలవుల కారణంగా భక్తుల రద్దీ మరింత పెరగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం మంత్రులను, అధికారులను ఆదేశించారు.
అన్ని జిల్లాల నుంచి భక్తుల రాక
కృష్ణా పుష్కరాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భక్తులు రానున్నారు. సీఎం కేసీఆర్ పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమావేశమై పలు ఆదేశాలు జారీచేశారు. పలు ప్రాజెక్టులు నిండుతున్న నేపథ్యంలో దిగువకు నీటిని విడుదల చేయడంలో జాప్యం చేయవద్దని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన మొత్తం 81 పుష్కర స్నానఘట్టాల నిర్మాణ పనులపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.
గొందిమల్ల పుష్కరఘాట్‌లో సీఎం పుష్కర స్నానం 
మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ మండలంలోని గొందిమల్ల పుష్కరఘాట్ లో..  ఆగస్టు 12 , శ్రావణ శుద్ద నవమి శుక్రవారం ఉదయం 5 గంటల 58 నిమిషాలకు సీఎం కేసీఆర్ సతీసమేతంగా పుష్కరస్నానం చేయనున్నారు. పవిత్రన్నానం చేసి జోగుళాంబ అమ్మవారి దర్శించుకోనున్నారు సీఎం దంపతులు.
పుష్కరాలకు 1365 బస్సులు 
మరోవైపు పుష్కరాలకు వివిధ ప్రాంతాలనుంచి వెళ్ళే భక్తులకు రవాణా సౌకర్యం కల్పించేందకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రవాణామంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. కృష్ణా పుష్కరాలకు 55 స్నానఘట్టాలకు వెళ్లేందుకు 1365 బస్సులు ఏర్పాటు చేసింది సర్కార్. 210 ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. కాలుష్య నియంత్రణ మండలి సైతం ప్రజల్లో ప్లాస్టిట్ వాడకుండా చైతన్యం కలిగించే కార్యక్రమాలను చేపట్టనున్నాట్లు మంత్రిజోగురామన్న తెలిపారు. మొత్తంగా కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కార్. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పకడ్బందీగా నిర్వహించాలనుకుంటోంది. 

 

నయీం కేసులో విచారణ వేగవంతం

హైదరాబాద్ : నయీం కేసులో విచారణలో సిట్ వేగంపెంచింది. నయీం కెరియర్ ప్రారంభం నుంచి సిట్ ఆధారాలు సేకరించింది.  ఓ మాజీ మంత్రి అండదండలతో నయీం ఎదిగినట్లు ఆధారాలున్నాయి. 

నేడు హాకీ పురుషుల గ్రూప్ -బి లీగ్ మ్యాచ్

ఢిల్లీ : నేడు హాకీ పురుషుల గ్రూప్ -బి లీగ్ మ్యాచ్ జరుగనుంది. సాయంత్రం 6.30 గంటలకు భారత్, నెదర్లాండ్ తలపడనున్నాయి. 

రియో ఒలింపిక్స్ లో నేటి నుంచి బ్యాడ్మింటన్ మ్యాచ్ లు

బ్రెజిల్ : రియో ఒలింపిక్స్ లో నేటి నుంచి బ్యాడ్మింటన్ మ్యాచ్ లు జరుగనున్నాయి.   

నేడు కరీంనగర్ జిల్లాలో రోశయ్య పర్యటన

కరీంనగర్ : నేడు జిల్లాలో తమిళనాడు గవర్నర్ రోశయ్య పర్యటించనున్నారు. గోదావరిఖనిలో హరితహారంలో రోశయ్య పాల్గొననున్నారు. 

నేడు గోదావరి అంత్యపుష్కరాల ముగింపు వేడుకలు

రాజమహేంద్రవరం : నేడు గోదావరి అంత్యపుష్కరాల ముగింపు వేడుకలు జరుగునున్నాయి. సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.  

ఎస్సారెస్పీ రైతులకు నేటి నుంచి నీటి విడుదల

హైదరాబాద్ : ఎస్సారెస్పీ రైతులకు నేటి నుంచి నీటి విడుదల చేయనున్నారు. మూడేళ్ల తర్వాత తొలిసారి ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. 

నేడు అలంపూర్ కు సీఎం కేసీఆర్

మహబూబ్ నగర్ : నేడు అలంపూర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. రాత్రి హరిత గెస్టుహౌస్ లో సీఎం కేసీఆర్ బస చేయనున్నారు. రేపు ఉదయం 5.58 గంటలకు కృష్ణా పుష్కరాలను సీఎం ప్రారంభించనున్నారు. 

రియో ఒలింపిక్స్ లో నేటి నుంచి బ్యాట్మింటన్ మ్యాచ్ లు

బ్రెజిల్ : రియో ఒలింపిక్స్ లో నేటి నుంచి బ్యాట్మింటన్ మ్యాచ్ లు జరుగనున్నాయి.  

Don't Miss