Activities calendar

12 August 2016

21:46 - August 12, 2016

ఉత్తరప్రదేశ్‌ : ఘజియాబాద్‌లో బిజెపి నేత బ్రజ్‌పాల్‌ తెవ్‌తియా కాన్వాయ్‌పై కాల్పులు కలకలం సృష్టించాయి. టొయోటా ఫార్చ్యునర్‌ ఎస్‌యూవీలో వచ్చిన దుండగులు బ్రిజ్‌పాల్‌ ఉన్న స్కార్పియో వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దుండగులు ఏకే-47తో ఆయన కాన్వాయ్‌పై దాదాపు వంద రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 49ఏళ్ల బ్రిజ్‌పాల్‌ను నోయిడాలోని ఫోర్టిస్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాడిలో మరో ఆరుగురు కూడా త్రీవంగా గాయపడ్డారు. ఈ దాడి ఘటనకు సంబంధించి ఓ మహిళా కానిస్టేబుల్‌తో పాటు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రజ్‌పాల్‌ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అత్యంత సన్నిహితుడు. 

21:42 - August 12, 2016

ఢిల్లీ : కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోది అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. సమావేశంలో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. పెల్లెట్‌ గన్‌లను వినియోగించొద్దని ప్రభుత్వాన్ని కోరాయి. జనావాస ప్రాంతాల్లో అఫ్సా చట్టాన్ని రద్దు చేయాలని, చర్చల సందర్భంగా కశ్మీర్‌లోని వివిధ పక్షాలతో పాటు వేర్పాటువాదులను కూడా ఆహ్వానించాలని విపక్షాలు సూచించాయి. వివిధ పక్షాలతో చర్చలు జరపడానికి అంగీకరించిన కేంద్రం- అఖిలపక్ష బృందాన్ని కశ్మీర్‌కు పంపేందుకు మాత్రం నిరాకరించింది. జమ్ము కశ్మీర్‌తో పాటు పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ కూడా భారత్‌లో అంతర్భాగమని ఈ సందర్భంగా మోది స్పష్టం చేశారు. జాతీయ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.

21:39 - August 12, 2016

తూర్పుగోదావరి : ప్రముఖ అభ్యుదయ కవి అవంత్స సోమసుందర్ మృతిచెందారు. వజ్రాయుధం, సుబ్రహ్మణ్య భారతి, ముత్యాల సరాలు, చంద్రభాగ, అమ్మ, యుగపురుషుని ప్రహసనాలు, హెన్రిక్‌ హెయినీ, కాళిదాసు రామకథ, రామ్‌ రాజ్యమ్‌, నాడూ నేడూ శకుంతల ఆడదే, కాజీ నస్రుల్‌ ఇస్లూమ్‌ వంటి గొప్పు పుస్తకాలను ఆయన రచించారు. అవంత్స మృతి సాహితీ లోకానికి తీరనిలోటని పలువురు రచయితలు పేర్కొన్నారు. రేపు రంగరాయ మెడికల్ కాలేజీకి అవయవదానం చేసి సోమసుందర్ మృతిదేహాన్ని సందర్శనార్ధం పిఠాపురానికి తరలించనున్నారు.

అవంత్స సోమసుందర్‌ రచనలు..
అవంత్స సోమసుందర్‌ ఎన్నో గొప్ప రచనలు చేశారు. వజ్రాయుధం, సుబ్రహ్మణ్య భారతి, ముత్యాల సరాలు, చంద్రభాగ, అమ్మ, యుగపురుషుని ప్రహసనాలు, హెన్రిక్‌ హెయినీ, కాళిదాసు రామకథ, రామ్‌ రాజ్యమ్‌, నాడూ నేడూ శకుంతల ఆడదే, కాజీ నస్రుల్‌ ఇస్లూమ్‌ వంటి గొప్పు పుస్తకాలను రచించారు. అవంత్స మృతి సాహితీ లోకానికి తీరనిలోటని పలువురు రచయితలు అన్నారు. 

21:34 - August 12, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. విజయవాడ పద్మావతి ఘాట్‌లో స్నానానికి వెళ్లిన ఐదేళ్ల బాలుడు చనిపోగా.. గూడవల్లి వద్ద పుష్కర బందోబస్తుకు వెళ్తున్న కానిస్టేబుల్‌ను ప్రమాద రూపంలో మృత్యువు వెంటాడింది. అటు పున్నమిఘాట్‌లో మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.

ఐదేళ్ళ కిరణ్ కుమార్ మృత్యువాత
ఆంధ్రప్రదేశ్‌లో అట్టహాసంగా ప్రారంభమైన కృష్ణా పుష్కరాల్లో ఇద్దరు మృత్యువాత పడటం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విజయవాడ పద్మావతి ఘాట్‌లో పుష్కర స్నానాలకు వెళ్లిన ఐదేళ్ల బాలుడు కిరణ్‌ కుమార్‌ మృత్యువాతపడ్డాడు. కృష్ణ లంక భ్రమరాంబపురానికి చెందిన ఐదేళ్ల బాలుడు కిరణ్‌ కుమార్‌.. మరికొంత మంది పిల్లలతో కలిసి విజయవాడ పద్మావతి ఘాట్‌లో స్నానానికి దిగాడు. నదిలో దిగిన బాలుడు నీటిలో మునిగిపోయాడు. ఆలస్యంగా గుర్తించిన అధికారులు బాలుడిని వెలికితీయించారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు చనిపోయాడు. అత్యవసర సమయంలో అధికారుల స్పందన తీరుపై బాలుడి కుటుంబ సభ్యులు మండిపడ్డారు. స్పాట్

సీపీఎం నేతల ఆగ్రహం
పద్మావతి ఘాట్‌ ఘటనపై సీపీఎం నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఐదేళ్ల బాలుడిని కాపాడలేకపోవడం భద్రతలోని డొల్లతనం బయపడిందని విమర్శించారు.

స్పందించిన సర్కార్..రూ.5లక్షల నష్టపరిహారం..ఇల్లు నిర్మాణం
మరోవైపు ఈ విషాదంపై రాష్ట్ర సర్కార్ స్పందించింది. బాలుడి కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారంతో పాటు ఇల్లు నిర్మిస్తామని ప్రకటించింది. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై సీపీ గౌతం సవాంగ్‌ విచారణ చేపట్టారు.

కానిస్టేబుల్ మృతి..
అటు కృష్ణా జిల్లా గూడవల్లి వద్ద పుష్కర విధులకు హాజరయ్యేందుకు వెళ్తూ ఏఆర్‌ కానిస్టేబుల్‌ కారు ఢీకొని మృతిచెందాడు. మరో ఘటనలై విజయవాడ పున్నమి ఘాట్‌ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. విశాఖ జిల్లా వీరవెల్లి అగ్రహారానికి చెందిన శీలం దొరబాబు నదిలో దూకాడు. అప్రమత్తమైన గజఈతగాళ్లు అతన్ని రక్షించి భవానీపురం పీఎస్‌కు తరలించారు. 

21:27 - August 12, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలికపై నయీం లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆధారాలు లభిస్తున్నాయి. స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించే వాడని తెలుస్తోంది. ఈ అరాచకాలను ప్రశ్నించినందుకు నయీం.. ఫర్హాకు గుండు కొట్టించాడు. ఎదురుతిరిగిన బాలికలను కిరాతకంగా హతమార్చినట్టు... దర్యాప్తులో తేలింది. నయీం దగ్గర పనిచేసిన ఫర్హా, హఫ్సాలు పోలీసులకు ఈ వివరాలు వెల్లడించారు. 

21:26 - August 12, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ వెన్నంటే ఉంటూ వ్యవహారాలను చక్కదిద్దిన లేడీడాన్‌లు నోరువిప్పితే ఎవరి జాతకాలు బయటపడతాయి...నయీం దందాలకు సంబంధించి వారిద్దరూ చెబుతున్న విషయాలేంటి..? మరోసారి నయీం ఇంట్లో సోదాలు చేస్తే దొరికిన నాలుగు సంచుల్లో ఎన్నివేల కోట్ల ఆస్తులన్నాయి..? మరోవైపు గ్యాంగ్‌స్టర్‌ అనుచరుల అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి...

సిట్‌ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ భూ పట్టాలు..
గ్యాంగ్‌స్టర్‌ నయీంతో సన్నిహితంగా ఉంటూ అన్నీ తామై నడిపించిన లేడీ డాన్‌లు ఫర్హానా,యాసియానాలను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు సరికొత్త విషయాలు తెలుస్తున్నాయి..ఇందులో భాగంగానే సిట్‌ పోలీసులు అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీం ఇంట్లో మరోసారి తనిఖీలు చేయగా నాలుగు సంచుల్లో ఉన్న భూ దస్తావేజులు దొరికాయి...సమాచారం తెలుసుకుంటున్న పోలీసులు అప్పటికప్పుడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి సోదాలు నిర్వహిస్తున్నారు....ఒక్కొక్క గదిలో వందల కొలది డాక్యుమెంట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో రెండు రోజులు నయీం ఇంట్లో సోదాలు నిర్వహించే అవకాశం ఉంది

మరో నలుగురు అనుచరుల అరెస్టు..
నయీం కేసులో ఎప్పటికప్పుడు సమాచారం తెలుస్తుండడంతో పోలీసులు దూకుడు పెంచారు... ఏ మాత్రం ఆలస్యం చేసినా ఆధారాలు మాయం కావచ్చని సమయస్పూర్తితో దాడులు చేస్తుండడం ఫలితాలనిస్తోంది...ఇప్పటివరకు 18 మందిని అరెస్టు చేయగా తాజాగా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు...హైదరాబాద్‌ మల్కాజ్‌గిరిలో రమేష్‌, నవాబ్‌లను అరెస్టు చేసిన పోలీసులు వీరు మహేశ్వరంలో సుమారు 30 ఎకరాల భూ దందాల్లో మూడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు...ఇక నల్లగొండ అలేరులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు...నయీంకు సన్నిహితంగా మెలిగిన షకీల్‌తో కలిసి వీరు భూదంధాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

లేడీ డాన్‌లు నోరువిప్పితే రహస్యాలే...
నయీంకు సన్నిహితంగా ఉంటూ కీలకంగా మారిన ఫర్హానా, యాసియాలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చిన పోలీసులకు వారి నుంచి సమాచారం రాబట్టేందుకు న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు...పలు కేసుల్లో వీరిద్దరూ నేరుగా పాల్గొన్నట్లు సమాచారాన్ని రాబట్టారు. నయీం గోవా, ముంబై వెళ్లినప్పుడు వీరిద్దరూ కూడా వెళ్లే వారని అక్కడ కూడా సెటిల్‌మెంట్లు చేసే వారని తెలిసింది..అదేవిధంగా పర్హానా పేరుతో కొనుగోలు చేసిన శంషాబాద్‌లోని ఒక భవంతిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. నయీంకు సన్నిహితంగా మెలిగిన వారి వద్ద మరింత కీలకమైన డాక్యుమెంట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

లొంగిపోయిన నయీం భార్య,తమ్ముడు..14రోజుల రిమాండ్
నయీం తమ్ముడు ఫయీం, భార్య షాహిన్‌ ఇవాళ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఇద్దరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీఆర్‌ఓగా ఉద్యోగం చేస్తున్న నయీం సోదరుడు ఫయీం భూముల వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని సిట్‌ దర్యాప్తులో వెల్లడయినట్లు సమాచారం. 

శాడిస్ట్ నయీం..

హైదరాబాద్ : నయీం అకాచకాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. బాలికలతో నయీం అసభ్యంగా పవర్తించేవాడనే విషయం వెలుగులోకి వచ్చింది. బాలికలకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి అసభ్యకరంగా ప్రవర్తించేవాడని విచారణలో వెల్లడయ్యింది. పదుల సంఖ్యలో నయీం బాధితులు బైటపడుతున్నారు. నయీం చేసే ఈ అరాచకాలను ప్రశ్నించినందుకు ఫర్హాకు నయీం గుండుకొట్టించినట్లుగా ఫర్హా తెలిపింది. ఎదురు తిరిగిన బాలికలను కిరాతంగా హతమార్చేవాడని హర్హా తెలిపింది.

21:08 - August 12, 2016
20:42 - August 12, 2016

మనదేశానికి ఒక్క ఒలింపిక్ పతకం వచ్చిందంటే ఏళ్ల తరబడి కథలుకథలుగా చెప్పుకుంటాం. నూట ముప్పై కోట్ల జనాభాకు, వచ్చే పతకాలకు పొంతనే ఉండని పరిస్థితి. కానీ, ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో మెడల్స్ అలవోకగా ఎగరేసుకుపోతూ ఈతకొలనులో సెయిల్ ఫిష్ గా నిలబడ్డాడు మైఖేల్ ఫెల్ప్స్. ఒలింపిక్స్ లో తనకు ఎదురు లేదని, స్విమ్మింగ్ లో తనను టచ్ చేసేవాళ్లే లేరని రుజువు చేస్తూ ఆకాశమంత ఎత్తున నిలబడ్డాడు.. ఇంతటి ఘనత సాధించిన ఫెల్ప్స్ ఎలాంటి అవరోధాలెదుర్కొన్నాడు? ఎంతటి కఠోర శ్రమ చేశాడో ఊహకందని విషయం. ఈ రోజు వైడాంగిల్ స్టోరీ ఇదే అంశంపై చూద్దాం.. ఫ్లయింగ్ ఫిష్.. మైఖేల్ ఫెల్ప్స్ ని ఇలా కూడా పిలుస్తారు. రెప్పవేసి తెరిచేలోపు పూల్ లో గమ్యాన్ని అలా టచ్ చేసి అబ్బురపరుస్తాడు. చేపపిల్లలా ఈతకొలనులో పరుగులు పెడుతూ ఎవరికీ సాధ్యం కాని రికార్డులు క్రియేట్ చేస్తూ స్విమ్మింగ్ అంటే ఇలా కూడా ఉంటుందని ప్రూవ్ చేస్తున్నాడు.. హాకీలో ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించించింది భారత్. అదంతా చరిత్ర. పైగా అది టీమ్ ఈవెంట్ మాత్రమే. ఒక్కడుగా పాల్గొని బంగారు పతకాన్ని ఎగరేసుకొచ్చిన మొనగాడెవరన్నా ఉన్నాడా అంటే.. ఒక్క అబినవ్ బింద్రా కనిపిస్తాడు. ఆ ఒక్క పతకానికే మనం మురిసి ముక్కలయ్యాం. కానీ, మైఖేల్ ఫెల్ప్స్ అలాంటివి పదుల సంఖ్యలో తన ఖాతాలో వేసుకున్నాడు. అంతటి ఘనత ఎలా సాధ్యమయింది? ఏడుసార్లు వరల్డ్ స్విమ్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. తొమ్మిదిసార్లు అమెరికన్ స్విమ్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. లెక్కలేనన్ని స్వర్ణాలు, రజతాలు... ఫెల్ప్స్ అలా అడుగుపెడితే ఇలా పతకాలు మెడలో చేరాల్సిందే. అవార్డులు వరించాల్సిందే. అలాంటి ఫెల్ప్స్ విజయాల వెనకున్న వ్యక్తి ఎవరు? ఓ మానసిక సమస్యనుంచి విజేతగా ఫెల్ప్స్ ఎలా ఎదిగాడు..? ఉన్నత శిఖరాలు అధిరోహించటం ఒక్కరోజులో సాకారమయ్యే పని కాదు. సుదూర లక్ష్యాలను అపురూప గమ్యాలను చేరటం అలవోకగా సాధ్యంకాదు. దానికి అంతులేని తపన కావాలి. దృఢసంకల్పం, తిరుగులేని ఆత్మవిశ్వాసం కావాలి. అన్నిటికీ మించి అవరోధాలను ఎదురయ్యే ఆత్మస్థైర్యం కావాలి.. మైఖేల్ ఫెల్ప్స్ ఈత కొలనులో తన రికార్డులతోనే కాదు.. బయట కూడా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు. మెరుపులా ఈదిన సామర్ధ్యం స్పూర్తిని కలిగిస్తుంటే, కొన్ని వివాదాలు , మరికొన్ని ట్రెయినింగ్ టెక్నిక్స్, ఇంకా శిక్షణా కార్యక్రమాలు సాధారణ ప్రజానీకానికి ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆటమొదలైంది. పతకాల వేట మొదలైంది. ఈవెంట్ పూర్తయ్యేలోపు మరెన్ని పతకాలు ఖాతాలో చేరుతాయో చెప్పలేరు కూడా. ప్రపంచ స్థాయి ఈత పోటీల్లో ఓ బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసిన మైఖేల్ ఫెల్ప్స్ లాంటి స్విమ్మర్ ఒలింపిక్స్ లోనే కాదు.. మరే ఈవెంట్ లో ఉన్నాకూడా తోటి అధ్లెట్లు, ప్రేక్షకులు అంతా నోరెళ్లబెట్టి చూడాల్సిందే. ఈలోగా ఫెల్ప్స్ తన ఖాతాలో మరింత పతకాల బరువును పెంచుకుంటూనే ఉంటాడు. ఆ మ్యాజిక్ చూడ్డమే ఇప్పుడు ఒలింపిక్స్ ప్రేక్షకుల పని. 

20:31 - August 12, 2016

పంద్రాగస్టుకి కవాతు ప్రాక్టీసు సేత్తున్న హిజ్రాలు..జూరాల నుండి విజయవాడ దాకా పుష్కర హడావిడి..లాక్కొచ్చి నయీంను సంపిండంటున్న పౌరహక్కుల సంఘాలోల్లు..నన్ను సంపేందుకు సిద్ధపడినా..నయీంని సంపటం తప్పు అంటున్న మానవహక్కుల సంఘం నేత..లొట్టపీసు పువ్వుల్ని తెంపుతున్ ఏసీబీ సార్లు..అమ్మను ఇంట్లకెల్లి ఎల్లగొట్టిన కొడుకులు..భారతపతాకాన్ని భుజానెత్తుకున్న బయ్యా సుగుణవేణి సచ్చిపోతే మోయ్యనీకి ఒక్కరూగూడాలేరాయే... బంగారంతా సేసిన గాలిమోటరు.. 

కృష్ణా పుష్కరాల్లో మరో విషాదం..

విజయవాడ : కృష్ణా పుష్కరాలలో మరో విషాదం చోటుచేసుకుంది. పుష్కరాల పనులు చేసేందుకు వచ్చిన కార్మికురాలు మృతి చెందింది. మృతదేహాన్ని అధికారులు రహస్యంగా తరలించినట్లుగా సమాచారం.

డాక్టర్ పై దావా వేసిన 57మంది పేషెంట్లు..

లండన్‌ : అనవసర ఆపరేషన్లు చేశారన్న ఆరోపణలతో యూకేలోని ఓ భారత సంతతి వైద్యుడిపై 57 మంది రోగులు దావా వేశారు. వ్యాధి లేకపోయినా.. యూరాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ అరాకల్‌ మను నాయర్‌.. అనే డాక్టర్ పై ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వుందంటూ ఆపరేషన్లు చేస్తున్నాడంటూ 57 మంది బాధిత పేషెంట్లు ఆయనపై దావా వేశారు.

కృష్ణమ్మ పుష్కర హారతి హాజరైన చంద్రబాబు..

విజయవాడ : కృష్ణా పుష్కరాల సందర్భంగా పవిత్ర సంగమం వద్ద కృష్ణవేణికి వేద మంత్రాల నడుమ సాగిన హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులు, చినరాజప్ప, గంటా, కామినేని, ఎంపీ మురళీమోహన్ తదితరులతో కలిసి పాల్గొన్నారు.

పద్మావతి ఘాట్ ఘటనపై స్పందించిన ప్రభుత్వం..

విజయవాడ : పద్మావతి ఘాట్ లో మృతి చెందిన కిరణ్ కుమార్ మృతిపై ప్రభుత్వం స్పందించింది. కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులకు రూ.5లక్షల నష్టపరిహారం..ఒక ఇల్లు నిర్మించి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ తెలిపారు. బాలుడి మృతి బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

బాలుడి మృతికి అందరూ బాధ్యులే: సీపీ గౌతం సవాంగ్

విజయవాడ : పద్మావతి ఘాట్ లో మృతి చెందిన కిరణ్ మృతిపై సీపీ గౌతం సవాంగ్ విచారణ చేపట్టారు. ఈ దుర్ఘటనకు అందరూ బాధ్యతవహించాల్సినందేనని సీపీ పేర్కొన్నారు.

పద్మావతి ఘాట్ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా..

విజయవాడ : పద్మావతి ఘాట్ లో మృతి చెందిన కిరణ్ మృతిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బాలుడి మృతిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ బాబుకు ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో బాలుడి మృతిపై సీఎం చంద్రబాబుకు కలెక్టర్ బాబు ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నారు. 

పుష్కర స్నానం చేసిన 4.5లక్షలమంది ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా పుష్కరాలు వైభవోపేతంగా కొనసాగుతోన్నాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని పుష్కరఘాట్‌లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 4.5 లక్షల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు డీఐజీ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. 

ఆస్ట్రియాకు హరీశ్ రావు..

హైదరాబాద్ : ఈ నెల 15న నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలోని బృందం ఆస్ట్రియా వెళ్లనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీ పంపులను బృందం పరిశీలించనుంది. ఐదు రోజుల పాటు ఆస్ట్రియాలో పర్యటించే బృందం పంపు నమూనాలు, పనితీరును అధ్యయనం చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ గత కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

19:17 - August 12, 2016
19:15 - August 12, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం భార్య షాహిన్, తమ్ముడు ఫయీం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. వీరిద్దరికీ 14రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో వీరిని చంచల్ గూడ జైలుకు తరలించారు. వనస్థలిపురం పీఎస్ లో నయీం అనుచరులు 16మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. 

కోర్టులో నయీం పనిమనుషులు..

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం పనిమనుషులు ఫర్హానా, అఫ్సాలను పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. ఫర్హానా, అఫ్సాల మూడు రోజుల కస్టడీ నేటితో ముగిసింది. మరో మూడు రోజులు వారిద్దరిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కస్టడీ పిటిషన్‌పై విచారణను ఈ నెల 16వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఫర్హానా, అఫ్సాలను చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు.

నయీం భార్య, తమ్ముడు లొంగుబాటు..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం భార్య షాహిన్, తమ్ముడు ఫయీం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. వీరిద్దరికీ 14రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో వీరిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

18:59 - August 12, 2016

విక్టరీ వెంకటేష్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ బాబు బంగారం. ఈ మధ్యకాలంలో వెంకీ కామెడీ రోల్ లో చూసి చాలా కాలమైంది. అందుకే అభిమానుల కోరిక తీర్చాలని వెంకీ బాబు బంగారం మూవీ టేకప్ చేసాడు. ఇంతకీ వెంకటేష్ బాబు బంగారంతో నిజంగా బంగారం అనిపించుకున్నాడా లేడా అన్నసంగతి చూద్దాం...

ఒక సినిమా ను ఫుల్ కామెడీగా తెరకెక్కించాలనుకుంటే కొంచెం లైట్ పాయింట్ ను తీసుకుంటే సరిపోతుంది. కానీ బాబు బంగారం సినిమాను కామెడీ కాన్సెప్ట్ అనుకోవాలా లేక సీరియస్ మూవీ అనుకోవాలో జనానికి తెలియకుండా పోయింది. పైగా హీరో కేరక్టర్ ను కామెడీ కాప్ గా బిల్డప్ ఇచ్చి సీరియస్ పోలీస్ గా ఎలివేట్ చేయడం వల్ల కథాగమనం ట్రాక్ తప్పింది. పైగా ఫస్టాఫ్ ను ఓన్లీ కామెడీకే పరిమితం చేయడం వల్ల ఇంటర్వెల్ దగ్గర కానీ కథ అసలు పాయింట్ లో కి అడుగుపెట్టదు. భలే భలే మగాడివోయ్ సినిమా క్రేజ్ తో మారుతి ఈ సినిమా ఛాన్స్ కొట్టేసాడు కానీ, మారుతి లాంటి దర్శకుడికి వెంకీలాంటి హీరోని హ్యాండిల్ చేయడం ఇంకా చేతకాలేదని బాబు బంగారం నిరూపించింది.అసలు వెంకటేష్ కేరక్టర్ తగ్గ వెయిట్ చూపించడంలో మారుతి పూర్తిగా విఫలమయ్యాడని చెప్పుకోవాలి. కనీసం వెంకీ హీరోయిజాన్ని బిల్డప్ చేసే పవర్ఫుల్ డైలాగ్స్ కూడా సినిమాలో ఎక్కడా వినిపించవు.

హీరోయిన్ ను చూడగానే హీరో లవ్ లో పడిపోతాడు . తన ఐటెంటిటీని దాచిపెట్టి హీరోయిన్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. అన్ని సినిమాల్లో ఉన్నట్టే హీరోయిన్ కు ఒక ప్రాబ్లెమ్ ఉంటుంది. ఆమె తండ్రి ఒక హత్యకేసు లో ఇరుక్కొని అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. ఇక ఇంటర్వెల్ దగ్గర ట్విస్టేంటంటే ఆమె తండ్రిని పట్టుకోడానికే హీరో హీరోయిన్ తో ప్రేమనాటకం ఆడతాడని రివీల్ అవుతుంది. చివరికి హీరోయిన్ తండ్రిని నిర్దోషిగా నిరూపించి ఇద్దరూ ఒకటవడమే బాబు బంగారం కథ. ఈ కథ వింటుంటే మనకి ఇంకో సినిమా గుర్తుకొస్తోంది కదా. అదేనండీ నాగార్జున , అమల నిర్ణయం సినిమా. సరిగ్గా అదే స్టోరీ లైన్ తీసుకొని ఈ కథని అ్లలేసాడు మారుతి. నిర్ణయం లాంటి క్లాస్ కామెడీ మూవీ ని వెంకీతో చేయాలనుకోవడంలో తప్పులేదు కానీ, నిర్ణయం సినిమా సోల్ నే దెబ్బతీసాడు మారుతి అనిపిస్తుంది జనానికి.

ఇందులో పెర్ఫార్మెన్స్ పరంగా వెంకీ కి పేరు పెట్టలేం. మళ్లీ అతడిలోని పూర్తి ఎనర్జీని వెలికితీయడంలో సక్సెస్ అయ్యాడు మారుతి. కాకపోతే వెంకీకి వయసుమీదపడుతోందని క్లియర్ గా తెలుస్తుంది. ఇక హీరోయిన్ గా నయనతార ఈ సినిమాకి అనవసరం అనిపిస్తుంది. అసలు ఆమె చేయాల్సిన పాత్ర కాదది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకున్న సినిమా లాంగిచేయొచ్చు. ఇక పృథ్వి చేసిన బత్తాకాయల బాబ్జీ పాత్ర కూడా ఏమంతగా నవ్వించలేకపోయింది. బ్రహ్మానందం కేరక్టర్ అయితే వేస్ట్. ఇక విలన్ గా సంపత్ రాజ్ నటన యాజ్ యూజువల్. యమ్మెల్యే గా పోసాని పాత్రకూడా మామూలే. కామెడీ పరంగా ఫస్టాఫే బెటరనిపిస్తుంది. సెకండాఫ్ ను మరీ ఘోరంగా తయారుచేసాడు దర్శకుడు. మొత్తానికి మారుతి ఏదో సినిమా చేయబోయి చివరికి ఏదో సినిమా చేసాడని అర్ధమౌతుంది. చివరగా చెప్పేదేంటంటే బాబు బంగారానికి వెంకీ క్రేజ్ వల్ల ఏమైనా కొంచెం ఓపెనింగ్స్ రావచ్చేమో కానీ, సినిమా మాత్రం లాంగ్ స్టాండ్ లో నిలబడ్డం కష్టం . వెంకీలాంటి హీరోతో సినిమా చేసే ఛాన్స్ అందుకొన్న మారుతి ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడని చెప్పుకోవాలి. ఈ సినిమా రేటింగ్ కోసం ఈ వీడియోను చూడండి..

ప్లస్ పాయింట్స్ ..

వెంకటేష్ ఎనర్జీ, నటన

జాలి సీన్వెన్సెస్

మైనస్ పాయింట్స్

కథ, స్ర్కీన్ ప్లే

సెకండాఫ్

సిల్లీ క్లైమాక్స్

మారుతి డైరెక్షన్

రేటింగ్ : 1.5/5

18:47 - August 12, 2016

విజయవాడ : ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కృష్ణానది పుష్కరాలలో విషాదం చోటు చేసుకుంది. వేదమంత్రాలు వినిపించాల్సిన ప్రాంతంలో ఏడుపులు..పెడబొబ్బలతో మారుమ్రోగిపోతోంది. పుష్కరాలు ప్రారంభమైన మొదటిరోజే ఇటువంటి ఘటన జరగటంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. పుష్కర స్నానానికి వచ్చిన ఐదు సంవత్సరాల కిరణ్ అనే బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు..బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. విజయవాడ పద్మావతి ఘాట్ వద్ద ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. మధ్యహ్నాం 3.00గంటల సమయంలో మరో ముగ్గురు చిన్నారులతో కలిసి కిరణ్ అనే బాలుడు  ఘాట్ లోకి స్నానానికి వెళ్లిన  బాలుడు మృతి చెందాడు. 

ప్రభుత్వ వైఫల్యమే కారణం :బాబూరావు
ముక్కుపచ్చలారని ఐదేళ్ళ బాలుడి మృతికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఎం నేత బాబురావు డిమాండ్ చేశారు. ఘటన జరిగిన తీరు చూస్తుంటే అధికారుల వైఫల్యం కారణంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. ఎటువంటి అవాంఛనీయఘటనలు జరగకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని ప్రభుత్వం నెలల క్రితం నుండి ఊదరగొడుతోందన్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అన్ని ఏర్పాట్లు చేశామన్న చంద్రబాబు ప్రభుత్వం దీనికి బాధ్యవహించాలనీ..ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అధికారులు సహకరించలేదు: బంధువులు
108 సమీపంలోనే వున్నా బాలుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లటానికి అధికారులు అనుమతించలేదని కిరణ్ బంధువులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి తమ బిడ్డ బలైపోయాడని బంధువులు  ఆవేదన వ్యక్తం చేశారు. 

18:28 - August 12, 2016

హైదరాబాద్ : నయీం ఎన్‌ కౌంటర్‌ను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. చట్టపరిధిలో జరగాల్సింది జరిగిందన్నారు. క్రిమినల్స్ రహిత రాష్ట్రం కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కేసులో మాజీ మంత్రుల ప్రమేయం ఉంటే.. విచారణలో వెల్లడవుతుందని కవిత తెలిపారు.

18:22 - August 12, 2016

మహబూబ్ నగర్ : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆలయాలకు చాలా అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి.. కృష్ణా పుష్కరాలంటే విజయవాడగా వ్యవహరించారని మండిపడ్డారు.. తెలంగాణ ఏర్పాటయ్యాక గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించామని... కృష్ణా పుష్కరాలనుకూడా అదే స్థాయిలో పూర్తిచేస్తామని ప్రకటించారు..

గొందిమళ్ల ఘాట్‌లో స్నానం చేసిన సీఎం కేసీఆర్‌ దంపతులు
తెలంగాణలో కృష్ణా పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.. ఉదయం 5గంటల 58 నిమిషాలకు మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌ మండలం గొందిమళ్ల ఘాట్‌లో సీఎం కేసీఆర్‌ పుష్కరాలను ప్రారంభించారు.. అర్చకుల వేదమంత్రాల మధ్య ఘాట్‌లో కేసీఆర్‌ దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు.

జోగులాంబ గుడిలో ప్రత్యేక పూజలు..
పుష్కర స్నానం తర్వాత కేసీఆర్‌ జోగులాంబ ఆలయానికి వచ్చారు.. సీఎం దంపతులకు వేదపండితులు ఘన స్వాగతం పలికారు.. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పుష్కరాలను పట్టించుకోలేదు:
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పుష్కరాలను అప్పటి ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని కేసీఆర్‌ ఆరోపించారు. గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి.. కృష్ణా పుష్కరాలంటే విజయవాడగా వ్యవహరించారని మండిపడ్డారు. జోగులాంబ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

18:11 - August 12, 2016

విజయవాడ : ఏపీ పుష్కరాల్లో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. పున్నమి ఘాట్ వద్ద శ్రీకాకుళం జిల్లా వీరవెల్లి ఆగ్రహారానికి చెందిన శీలం దొరబాబు (33) అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన గజీతగాళ్లు భవానీపురం పీఎస్ కు తరలించారు. దొరబాబు పుష్కరస్నానం చేసి భవానీ ద్వీపానికి వెళ్లి తిరిగి వస్తూ ఆత్మహత్యకు యత్నించినట్లుగా తెలుస్తోంది. దొరబాబుకూ భార్యకూ మధ్య కొంతకాలంగా కలహాలు రేగటంతో పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవటంతో మనస్థాపంతో దొరబాబు ఆత్మహత్యకు యత్నించినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు.

18:04 - August 12, 2016

విజయవాడ : ఏపీ కృష్ణా పుష్కరాల్లో అపశృతి చోటుచేసుకుంది. పుష్కర స్నానానికి వచ్చిన ఐదు సంవత్సరాల కిరణ్  అనే బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు..బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. విజయవాడ పద్మావతి ఘాట్ వద్ద ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. మధ్యహ్నాం 3.00గంటల సమయంలో మరో ముగ్గురు చిన్నారులతో కలిసి కిరణ్  ఘాట్ లోకి స్నానానికి దిగి మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. కాగా దాదాపు 50 మెట్లు వున్న పద్మావతి ఘాట్ లో చిన్నారులు నదిలోకి దిగుతుంటే పహారా కాస్తున్న సెక్యూరిటీ పట్టించుకోకవటం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మృతి చెందిన బాలుడు కనిపించటంలేదని మధ్యహ్నాం 3.00గంటల నుండి వెతుకుతున్నామని తల్లిదండ్రులు..బంధువులు తెలిపారు. విధులు నిర్వాహణలోవున్న అధికారుల బాధ్యరాహిత్యానికి తమ బిడ్డ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పెద్దగా రద్దీలేని పద్మావతి ఘాట్ లోనే ఇలా జరిగితే రద్దీగా వున్న ఘాట్లలో భద్రత పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు చెత్తను ఊడుస్తుండగా చెత్తలో బాలుడి మృతదేహం బయటపడిన తరువాతనే బాలుడు చనిపోయినట్లుగా తెలిసింది. వారు తెలిపేంతవరకూ బాలుడు చనిపోయిన విషయం ఎవ్వరూ గుర్తించకపోవటం..గమనించదగిన విశేషం.

17:49 - August 12, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ అల్వాల్ పీఎస్ పరిధిలో అర్థరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. మచ్చబొల్లారం ప్రాంతంలోని మార్కెట్ ప్రాంతంలో తెల్లవారుఝామున 1.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా సమచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలోవ్ను సీసీకెమెరీ పుటేజ్ లో డేటాను పోలీసులు పరిశీలించారు. వెర్నా కారులో వచ్చిన నలుగురి వ్యక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవటంతో ఒకరిపై మరొకరు కాల్పులు జరుపుకున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తుపాకీతో ఓ వ్యక్తి నాలుగు రౌండ్లు కాల్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ఘటనాస్థలంలో బుల్లెట్ షెల్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులతో మచ్చబొల్లారం ప్రాంతంలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరా లోని దృశ్యాలు క్లారిటీగా లేకపోవటంతో సీసీ పుటేజ్ డేటాను మరింతగా పరిశీలించేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. కాగా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ జరిగినప్పటి నుండి నయీం అనుచరులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ కాల్పుల్లో నయీం అనుచరుల హస్తం వుందా? అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.

17:37 - August 12, 2016

టీమిండియా ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్...కరీబియన్ టెస్ట్ సిరీస్ లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. నాలుగుమ్యాచ్ ల సిరీస్ మొదటి మూడు టెస్టుల్లోనే రెండు సెంచరీలు సాధించిన ..ఆల్ ఇన్ వన్ ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ అశ్విన్ పై ప్రత్యేక కథనం..
రవిచంద్రన్ అశ్విన్...భారత క్రికెట్లో అత్యంత విలువైన ఆటగాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్...ఏదైనా సరే అత్యుత్తమంగా రాణించడంలో అశ్విన్ కు అశ్విన్ మాత్రమే సాటి. అంతే కాదు ఫార్మాట్ ఏదైనా సరే ఆల్ రౌండ్ షోతో మ్యాచ్ విన్నర్ గా నిలవడంలో అశ్విన్ తర్వాతే ఎవరైనా.. భారత ఉపఖండ పిచ్ లపై అసాధారణంగా రాణించే అశ్విన్ కు...ప్రస్తుత వెస్టిండీస్ సిరీస్ కు ముందు వరకూ విదేశీ సిరీస్ ల్లో అంతంత మాత్రం రికార్డే ఉంది. అయితే...ప్రస్తుత కరీబియన్ టూర్ లో మాత్రం ఆల్ రౌండర్ గా అశ్విన్ చెలరేగిపోతున్నాడు. బంతితో మాత్రమే కాదు మిడిలార్డర్ బ్యాట్స్ మన్ గా సైతం నిలకడగా రాణిస్తూ...టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కు కొండంత అండగా నిలుస్తున్నాడు. 


నాలుగో రోజుకే టీమిండియా విజయం..
యాంటీగా.. సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ముగిసిన ఐదు రోజుల తొలి టెస్ట్ నాలుగో రోజుకే టీమిండియా ఇన్నింగ్స్ విజయం సాధించడంలో కెప్టెన్ విరాట్ కొహ్లీతో కలసి అశ్విన్ ప్రధాన పాత్ర వహించాడు. బ్యాటింగ్ లో సెంచరీ, బౌలర్ గా ఏడు వికెట్లు పడగొట్టి ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు. అంతేకాదు సెయింట్ లూషియాలోని డారెన్ సామీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో సెంచరీ పూర్తి చేశాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ వృద్ధిమాన్ సాహాతో కలసి 6వ వికెట్ కు 213 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.  వెస్టిండీస్ ప్రత్యర్థిగా టీమిండియాకు ఆరవ వికెట్ కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. అశ్విన్ మొత్తం 297 బాల్స్ ఎదుర్కొని ఆరు బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 118 పరుగులు సాధించాడు. టెస్ట్ క్రికెట్లో రవిచంద్రన్ అశ్విన్ కు ఇది నాలుగో శతకం. వెస్టిండీస్ ప్రత్యర్థిగా నాలుగు సెంచరీలు సాధించిన భారత తొలి ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ గా అశ్విన్ రికార్డుల్లో చేరాడు.

మొదటి మూడు టెస్టుల్లోనే రెండు సెంచరీలు..
అశ్విన్ అనగానే...బౌలింగ్ లో భారత తురుపుముక్క, స్ట్రయిక్ బౌలర్ అన్నమాటలే గుర్తుకు వస్తాయి. కానీ.. బ్యాటింగ్ లోనూ అశ్విన్ రూపంలో ఓ నమ్మదగిన మిడిలార్డర్ ఆటగాడన్న విషయం ప్రస్తుత కరీబియన్ సిరీస్ ద్వారా మరోసారి తెలిసి వచ్చింది. ఐదేళ్ళ క్రితమే వెస్టిండీస్ ప్రత్యర్థిగా టెస్ట్ అరంగేట్రం చేసిన అశ్విన్ కు..ఇంతకు ముందు వరకూ ఆడిన 33 టెస్ట్ మ్యాచ్ ల్లో మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన రికార్డు ఉంది. ఇప్పటి వరకూ ..స్వదేశీ సిరీస్ ల్లో మాత్రమే సెంచరీలు సాధించిన అశ్విన్...ప్రస్తుత కరీబియన్ టూర్ లో భాగంగా విండీస్ తో జరుగుతున్న సిరీస్ లోని మొదటి మూడు టెస్టుల్లోనే రెండు సెంచరీలు బాది తానేమిటో నిరూపించుకొన్నాడు. విదేశీ పిచ్ లపైన సైతం శతకాలు సాధించే సత్తా తనకుందని చెప్పకనే చెప్పాడు.

అశ్విన్ సగటు 55 కు పైనే...
తొలిటెస్ట్ తొలి ఇన్నింగ్స్ ఆరోస్థానంలో బ్యాటింగ్ కు దిగిన అశ్విన్..5వ వికెట్ కు కెప్టెన్ విరాట్ కొహ్లీతో కలసి 168 పరుగుల భారీభాగస్వామ్యం నమోదు చేశాడు. మూడోటెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో వృద్ధిమాన్ సాహాతో జంటగా 6వ వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యం సాధించాడు. స్ట్రెయిట్ డ్రైవ్ లు, కవర్ డ్రైవ్ లు, ఫ్లిక్ షాట్ల తో అశ్విన్ అలరించాడు. టెస్ట్ క్రికెట్ 35వ మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ కు ఇది నాలుగో సెంచరీ, తొలి డబుల్ సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం. అంతేకాదు...వెస్టిండీస్ ప్రత్యర్థిగానే నాలుగు సెంచరీలు సాధించిన అశ్విన్ సగటు 55 కు పైనే ఉంది. ఒకే టెస్ట్ లో సెంచరీతో పాటు ఐదుకు పైగా వికెట్లు సాధించిన ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ జాక్ గ్రెగరీ, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ సరసన అశ్విన్ సైతం చోటు సంపాదించాడు. టెస్ట్ జీవితంలో ఇప్పటికే ఐదుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్న అశ్విన్ ప్రస్తుత సెయింట్ లూషియా టెస్ట్ లో సైతం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచినా ఆశ్చర్యపోనక్కరలేదు.

17:31 - August 12, 2016

జమైకన్ సుడిగాలి రన్నర్, మానవ చిరుత ఉసేన్ బోల్ట్...రియో ఒలింపిక్స్ లో ట్రిపుల్ గోల్డ్ కు గురిపెట్టాడు. తన పోటీలు చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావాలంటూ ట్విట్టర్ ద్వారా అభిమానులకు ఆహ్వానం పంపాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు అంశాలతో పాటు 100 మీటర్ల రిలేలో సైతం బంగారు మోతతో చరిత్ర సృష్టించడమే ఇక తరువాయి అంటున్నాడు. ఏరేంజ్ లో రాణించగలడన్నదే ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. నాలుగుకాళ్ల జంతువుల్లో అత్యంత వేగంగా పరుగెత్తే ప్రాణి చిరుతపులి. రెండు కాళ్ల మానవజాతిలో అత్యంత వేగంగా పరుగెత్తిన ఒకే ఒక్కడు ఉసేన్ బోల్ట్. ట్రాక్ అండ్ ఫీల్డ్ 100, 200 మీటర్ల పరుగు కోసం ట్రాక్ లోకి దిగాడంటే...మెరుపువేగంతో చిరుతలా పరుగెత్తే జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్. వరుసగా మూడో ఒలింపిక్స్ మూడు విభాగాలలో బంగారు పతకాలు కొల్లగొట్టడానికి సిద్ధమయ్యాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ ద్వారా అరంగేట్రం చేసిన ఉసేన్ బోల్ట్ కు...100 మీటర్ల పరుగులో 9.58 సెకన్ల వేగంతో పరుగెత్తిన ప్రపంచ రికార్డు మాత్రమే కాదు. 200 మీటర్ల పరుగులో సైతం..19.19 సెకన్ల మరో ప్రపంచ రికార్డు సైతం ఉంది.

తొలి ఒలింపిక్స్ లో గోల్డెన్ హ్యాట్రిక్..
బీజింగ్ ఒలింపిక్స్ 100 మీటర్లు, 200 మీటర్ల స్ప్రింట్స్ అంశాలలో డబుల్ గోల్డ్ సాధించిన బోల్ట్...100 మీటర్ల రిలే పరుగులో సైతం స్వర్ణపతకం సాధించి..తొలి ఒలింపిక్స్ లోనే గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత...నాలుగు సంవత్సరాలకు లండన్ వేదికగా ముగిసిన 2012 ఒలింపిక్స్ లో సైతం బోల్ట్ అదే దూకుడు కొనసాగించాడు. మూడుకు మూడు విభాగాల్లోనూ బంగారు మోత మోగించి...గ్రేటెస్ట్ స్ప్రింటర్ గా నిలిచాడు. ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఇప్పటికే 11 బంగారు పతకాలతో పాటు..జంట ప్రపంచ రికార్డుల హోల్డర్ గా ఉన్న బోల్ట్...ఆగస్టు 5న ప్రారంభమయ్యే రియో ఒలింపిక్స్ లో సైతం ట్రిపుల్ గోల్డ్ సాధించగలనన్న ధీమాతో ఉన్నాడు.
రియో ట్రాక్ లోనూ బోల్ట్ బుల్లెట్ దూసుకెళితే...మూడుకు మూడు విభాగాలలోనూ బంగారు పతకాలు సాధించగలిగితే..120 సంవత్సరాల ఒలింపిక్స్ చరిత్రలో అది సరికొత్త చరిత్రే అవుతుంది. మరి...వరుసగా మూడో ఒలింపిక్స్ లో బోల్ట్ ఏరేంజ్ లో రాణించగలడన్నదే ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

పద్మావతి ఘాట్ దగ్గర విషాదం..

విజయవాడ : పద్మావతి ఘాట్ దగ్గర విషాదం చోటు చేసుకుంది. పుష్కర స్నానం చేయడానికి ఓ కుటుంబానికి చెందిన ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. 

17:25 - August 12, 2016

రియో ఒలింపిక్స్‌ ఉమెన్స్‌ డబుల్స్‌లో తేలిపోయిన సానియా మీర్జా ...మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మాత్రం శుభారంభం చేసింది. మిక్సిడ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా మీర్జా- రోహన్ బొపన్న జోడీ...సునాయాస విజయాన్ని నమోదు చేశారు. ఈ విభాగంలో 4వ సీడ్‌ జోడీగా బరిలోకి దిగిన సానియా-బోపన్న జోడీ తొలిరౌండ్లో ఆస్ట్రేలియా జోడీ సమాంతా స్టోసుర్- జాన్ పీర్స్‌ జోడీని చిత్తు చేశారు. తొలి సెట్‌ నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన భారతజోడీ...ప్రత్యర్ధులకు అవకాశమే ఇవ్వలేదు. తొలి సెట్‌ను అతికష్టంమీద 7-5తో సొంతం చేసుకుని మ్యాచ్‌పై పట్టు బిగించారు. రెండో సెట్‌లో మరింత ధాటిగా ఆడిన సానియా జోడీ...6-4తో సెకండ్‌ సెట్‌ను సైతం సొంతం చేసుకుని విజేతలుగా నిలిచారు. సానియా-బోపన్న జోడీ క్వార్టర్‌ఫైనల్స్‌లో బ్రిటన్‌కు చెందిన యాండీ ముర్రే, హీదర్‌ వాట్సన్‌ జోడీతో పోటీపడతారు. 

17:24 - August 12, 2016

రియో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ ఉమెన్స్‌ సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అదరగొట్టింది. మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో హంగెరీ ప్లేయర్ లారా సరోసీతో పోటీపడిన సింధు....అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాణించింది. పోటీ ఆరంభం నుంచే పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించిన సింధు సునాయాసంగా తొలి రౌండ్‌ను అధిగమించింది. లారా సరోసికు చాన్స్‌ ఇవ్వకుండా చెలరేగి ఆడిన సింధు....తొలి సెట్‌ను 21-8 తో దక్కించుకుని మ్యాచ్‌పై పట్టు బిగించింది. రెండో సెట్‌లోనూ సింధు జోరు ముందు సరోసీ తేలిపోయింది. 21-9తో రెండో సెట్‌కు కూడా సొంతం చేసుకుని ప్రీ క్వార్టర్‌ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించింది.

పోరాడి నెగ్గిన సైనా..
బ్యాడ్మింటన్‌ ఉమెన్స్‌ సింగిల్స్‌లో ఎన్నో అంచనాల మద్య బరిలోకి దిగిన భారత స్టార్‌ సైనా నెహ్వాల్ ..తొలి రౌండ్‌లో పోరాడి నెగ్గింది. బ్రెజిల్ ప్లేయర్ లోహెన్నీ విసెంటీతో పోటీ పడిన సైనా నెహ్వాల్ రెండు సెట్లలో చెమటోడ్చి విజయం సాధించింది. విసెంటీ అడుగడుగునా గట్టి పోటీనిచ్చి సైనాకు సవాల్‌ విసరడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగింది. కానీ ఒత్తిడి సమయంలోనూ తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడిన సైనా 21-17తో తొలి సెట్‌ నెగ్గి ఊపిరి పీల్చుకుంది. రెండో సెట్‌లోనూ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది.అయినా ఆఖరి వరకూ పోరాడిన సైనా 21-17తో రెండో సెట్‌ను దక్కించుకుని విజేతగా నిలిచింది.

17:20 - August 12, 2016

నల్లగొండ : తెలంగాణలో కొన్ని చోట్ల పుష్కర ఘాట్లు నీళ్లు లేక వెలవెల పోతున్నాయి. నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వెశిపురం వద్ద 2కోట్లతో నిర్మించిన కృష్ణపుష్కరాల ఘట్లు మధ్యాహ్నం వరకు కూడ నీరు రాకపోవడంతో వృధాగా ఉండిపోయింది. అన్ని ఘట్టాల వద్ద సందడి నెలకొంటే.. ఇక్కడ మాత్రం వెలవెలపోతూ కనిపిస్తున్నాయి. ఈ ఘాట్ వద్ద రేణుక ఎల్లమ్మ వారు ఇక్కడ కోలువై ఉన్నందు వల్ల భక్తులు అధి సంఖ్యలో వస్తుంటారు. అందుకు తగ్గటుగా అధికారులు ఏర్పాట్లు చేసిన నీరు రాకపోవడంతో.. భక్తులకు ఇబ్బందిగా మారింది. 

17:16 - August 12, 2016
17:13 - August 12, 2016
17:10 - August 12, 2016

కాశ్మీర్ అంశంపై ముగిసిన అఖిలపక్షం..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష పార్టీల సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కాశ్మీర్ నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించారు. 

భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు - చినరాజప్ప..

విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో తొలి రోజున భక్తులు కొంత ఇబ్బంది పడ్డారని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నిబంధనలను తొలగిస్తున్నట్లు, ప్రకాశం బ్యారేజీపై నడిచి వెళ్లేందుకు భక్తులకు అనుమతినివ్వనున్నట్లు వెల్లడించారు. రేపటి నుండి భక్తులు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 292.80 పాయింట్లు పెరిగి 1.05 శాతం లాభంతో 28,152.40 పాయింట్ల వద్ద చేరింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 0.93 శాతం లాభంతో 8,672.15 పాయింట్ల వద్దకు ట్రేడయ్యాయి. 

16:52 - August 12, 2016

రంగారెడ్డి : జిల్లా అల్కాపురిలోని నయీం ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ నయీం ఇంట్లో నాలుగు బ్యాగుల్లో డాక్యుమెంట్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మల్కాజ్‌ గిరీలో నయీం ముఠా సభ్యులు రమేష్, మహ్మద్ నవాజ్‌ లను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింతసమచారం కోసం ఈ వీడియో చూడండి..

16:49 - August 12, 2016

గుంటూరు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ మండలం ఓబులునాయుడు పాలెంలో ఈత సరదా నలుగురు చిన్నారుల ప్రాణాలు బలిగొంది. ఇవాళ పాఠశాలకు సెలవు కావటంతో క్రికెట్ అడేందుకు వెళ్ళిన విద్యార్ధులు సమీపంలోని నీటి కుంటలో ఈతకొట్టేందుకు దిగారు. లోతు అధికంగా ఉండటంతో క్షణాల వ్యవధిలోనే ఒకరిని కాపాడబోయి మరొకరు ఇలా నలుగురు విద్యార్ధులు నీటిలో మునిగిపోయారు. వారిని కాపాడేందుకు స్ధానికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నలుగురు విద్యార్ధులు తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. మృతుల్లో ఇద్దరు జూనంచుండూరుగ్రామానికి చెందిన కనపర్తి మహేష్, పోలిశెట్టి గోపిలు కాగా, మరో ఇద్దరు దాసరిపాలెం గ్రామానికి చెందిన సాయితేజ, అభినాష్ లుగా గుర్తించారు. విద్యార్ధుల మృతితో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. 

16:38 - August 12, 2016

హైదరాబాద్ : జీవో నెంబర్ 123 పై మొదటి నుండి సీపీఎం చెప్పిందే నిజమైందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. భూమి లేని పేదలకు ఎలాంటి రక్షణ లేదని కోర్టు తేల్చిందని, దీనికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ప్రభుత్వం ఇంకో తతంగానికి తెరలేపిందని, భూమి లేని పేదలకు మాత్రమే 190 జీవో వర్తిస్తుందని పేర్కొంటోందన్నారు. డొంక తిరుగుడు వ్యవహరాలు మానుకోవాలని సూచించారు. 2013 చట్టాన్ని సమగ్రంగా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, 123 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ ప్రాంతంలో 144వ సెక్షన్ కొనసాగడం ఏం ప్రజాస్వామికమని, అక్కడ ఎలాంటి ఘర్షణలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. న్యాయం ఏంటో ప్రజలకు చెప్పడానికి సిద్ధం కావాలి కానీ సత్యం నొక్కి చెప్పడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు.

ఈనెల 16,17,18 వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్లీనం: తమ్మినేని
ఈనెల 16,17,18 వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్లీనం సమావేశం జరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ సమావేశాలకు జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పరిశీలకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు 80 మందితో పాటు మొత్తం జిల్లాలోని కమిటీ సభ్యులు, వివిధ రంగాల్లో ఇతర సభ్యులు మొత్తం 481 మంది హాజరౌతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు..ఈ పరిస్థితులను ఉపయోగించి నిర్వహించిన ప్రజా ఉద్యమాలపై విశ్లేషణాత్మక విశ్లేషణ జరుగుతుందన్నారు. రాబోయే కాలంలో ఎలాంటి పోరాటాలు నిర్వహించాలనే దానిపై సమీక్ష నిర్వహిస్తామని, మల్లన్న సాగర్ వరకే ఉద్యమం పరిమితం కాదని తమ్మినేని తెలిపారు.

నయీం కేసుపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ జరిపించాలి ..
గ్యాంగ్ స్టర్ నయీం హత్యపై వస్తున్న కథనాలపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ జరిపించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నయీం ఘటన అనంతరం మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోందని, చట్టాలు రక్షించాల్సిన పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారని..చట్టాలు రూపొందించాల్సిన ప్రజాప్రతినిధులపై కూడా పలు ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరు కరెక్టుగా లేదన్నారు. నయీం డైరీలను బయటపెట్టాలని, వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదంతా లోపాయికారీ ఒప్పందంలా నడుస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయని, నయీం చావును అడ్డుపెట్టుకొని ప్రభుత్వం ప్రయత్నిస్తుందా ? అని అనుమానం వ్యక్తం చేశారు. నేరానికి పాల్పడింది పోలీసు అధికారులంటూ ఆరోపణలు వస్తున్నా సిట్ చేత దర్యాప్తు కాకుండా జ్యుడిషియల్ ఎంక్వయిరీ జరిపించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. 

16:35 - August 12, 2016

రకుల్ ప్రీత్ సింగ్ కి కొన్ని లెక్కలున్నాయట. ఆ లెక్కల ప్రకారమే ఈ బ్యూటీ కొత్త సినిమాలు ఒప్పుకుంటుందట. కొన్ని సినిమాలను కథ వినకుండనే ఒప్పుకుంటుందట. అందుకు ఈ బ్యూటీ లెక్కలు ఈ బ్యూటీకి ఉన్నాయట. కథ వినకుండనే రకూల్ కొన్ని సినిమాలు ఎందుకు ఎంచుకుంటుందో తెలుసుకోవాలంటే చదవండి.. ప్రస్తుతం ఇండస్ట్రీలోని హీరోయిన్స్ లో రకూల్ ప్రీతి సింగ్ హవా నడుస్తోంది. ఈ ఎడాది 'నాన్నకు ప్రేమతో', 'సరైనోడు' చిత్రాలతో మరో రెండు విజయాలు తన ఖాతాలో వేసుకుంది. టాప్ హీరోయిన్ గా మారిన రకూల్ కొన్ని సినిమాలకు కథ వినకుండనే సినిమా చేస్తానంటుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కానీ ఈ బ్యూటీ ఇలా చేయడానికి బలమైన రిజనే ఉందంట.

నచ్చితేనే సినిమా చేస్తానంటున్న నిత్యా..
టాప్ హీరో, టాప్ డైరెక్టర్ కాంబినేషన్ లో నటించే ఆఫర్ వచ్చిందనుకోండి. ఇక రకూల్ కథ కాకరకాయ లాంటివి ఏవీ అడగదట. డేట్స్ ఖాళీ ఉంటే వెంటనే ఇచ్చేస్తుందట. ఎందుకంటే, ఎంతో కసరత్తు చేసి టాప్ హీరోలు దర్శకుల కథ రెడీ చేస్తారు. వాళ్లకు నచ్చితేనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లుతారు. అలాంటి పెద్ద సినిమాలకు నేను కథ ఏమిటి, ఎన్ని సీన్లు వుంటాయి. అని అడగడం అవివేకం అవుతుంది కాదా అన్సార్ ఇస్తోందంట. నిత్యామీనన్ లాంటి హీరోయిన్ కథ నచ్చితేనే సినిమా చేస్తుంది. కథ నచ్చకపోతే ఎంతటి స్టార్ అయిన ఏ డైరెక్టర్ అయిన ఈ బ్యూటీ నో అని చెప్పేస్తుంది. కానీ రకూల్ మాత్రం ఇందుకు భిన్నంగా స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ సినిమా చాలు కథ అవసరం లేదనడం ఆశ్చర్యంగా ఉంది. అయిన ఈ బ్యూటీ చెప్పింది కూడా నిజమే పెద్ద హీరోలా సినిమాల్లో హీరోయిన్స్ నటించడానికి పెద్దగా ఏం ఉంటుంది. మహా అయితే అందాల ఆరబోత, సాంగ్స్ లో ఆడిపాడడం తప్పా ఏముంటుందిలే, ఈ విషయాన్ని రకూల్ బాగానే ఒంటపట్టించుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

16:31 - August 12, 2016

హైదరాబాద్ : ఇటీవ‌లే పోలీసుల ఎన్ కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచ‌రులను ప‌ట్టుకునే ప‌నిలో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఈరోజు న‌ల్గొండ జిల్లాలో ఇద్ద‌రు న‌యీమ్ అనుచ‌రుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొద్దిసేప‌టి క్రితం మ‌రో ఇద్ద‌రిని అరెస్టు చేశారు. హైదర‌ాబాద్‌లోని మ‌ల్కాజ్‌గిరిలో తనిఖీ చేసిన పోలీసులు న‌యీమ్ అనుచ‌రులు న‌వాబ్‌, ర‌మేశ్‌ల‌ను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అనంతరంగా నయీం అనుచరులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మల్కాజ్ గిరి ఎస్సై మాట్లాడుతూ..నయీం అనుచరుడు రమేష్  నవాబ్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని  మరో అనుచరుడు షకీల్ ద్వారా వివాదంలో వున్న స్థలాలను షకీల్ దృష్టికి తీసుకువెళ్ళి డబ్బులు సంపాదించటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో యాదగిరి అనే ఆర్ఎంపీ డాక్టర్ కు బంజారాహిల్స్ లో వున్న మరో వ్యక్తి జయారెడ్డికి మధ్యలో వున్న వివాద స్థలం విషయాన్ని రమేష్ ..నవాబ్ లు కలిసి యాదగిరితో బేరం కుదుర్చుకునేందుకు ప్రయత్నించారు.  దీనికి సంబంధించి సుమారు కోటి రూపాయలు ఖర్చవుతాయని యాదగిరితో రమేష్ చెప్పగా తనవద్ద అంత పైకం లేదని యాదగిరి చెప్పాడు. కాగా కొంతకాలానికి యాదగిరి చనిపోయాడు. తరువాత అతని కుమారుడు రాముతో రమేష్ సంప్రదింపులు జరిపాడు. కానీ తనవద్ద అంత డబ్బు లేదని రాముకూడా చెప్పాడు. దీంతో రమేష్..నవాబ్ మరోమార్గంలో దందాను కొనసాగించారు. స్థల వివాదంలో వున్న మరో వ్యక్తి జయారెడ్డిని కలిసి కోటి రూపాలయలకు ఒప్పందం కుదుర్చుకుని స్థల వివాదాన్ని షకీల్  ద్వారా సెటిల్  చేశారు. దీనికి సంబంధించి వసూలైన కోటి రూపాలయల్లో సుమారు రూ60లక్షలు రమేష్, నవాబ్, షకీల్ షేర్ చేసుకున్నారు. ఇలా కొన్నిదందాలు సెటిల్ చేయటం మొదలుపెట్టిన వీరు నయీం గ్యాంగ్ లో చేరి వివాదం స్థలాలను ఎన్నుకొని దందాలు చేస్తూ డబ్బులు సంపాదించంటం ప్రారంభించారని ఎస్సై తెలిపారు. 

16:28 - August 12, 2016

నయా 'మజ్ను' డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. నేచురల్ స్టార్ 'నాని' 'మజ్ను' టైటిల్ తో కొత్త మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ ని కన్ ఫర్మ్ చేశారు. అంతేకాదు ఈ చిత్రంతో నాని ఈ ఎడాది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయాలని భావిస్తున్నాడు. ఇంతకీ 'మజ్ను'తో ఈ యంగ్ హీరో క్రియేట్ చేయాలనుకుంటున్న రికార్డ్ ఏంటో తెలుసుకోవాలంటే చదవండి..వరుస విజయాలతో నాని మంచి ఊపు మీదున్నాడు. ఇటీవల వచ్చిన 'జెంటిల్మేన్' తో మరో హిట్టుని ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో అంతే పాస్ట్ గా మరో సక్సెస్ ని డెలివరీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం విరించి వర్మ దర్శకత్వంలో నాని ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. 'మజ్ను' టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంతో ఈ ఎడాది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయాలని భావిస్తున్నాడు.

నాని కృష్ణగాడి వీర ప్రేమ గాథ...
ఈ ఎడాది ప్రారంభంలోనే నాని 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'తో చక్కటి విజయం అందుకున్నాడు. ఫిబ్రవరిలో రిలీజైన ఈ చిత్రానికి తొలిరోజు సూపర్ హిట్టు టాక్ వచ్చింది. అయితే టాక్ బాగున్నప్పటికి 'కృష్ణగాడు' కలెక్షన్ల విషయంలో మాత్రం వెనుకపడ్డాడు. అయిన్నప్పటికి చివరికి ఈ మూవీ సక్సెస్ లిస్ట్ లోకి చేరింది. ఇక ఇటీవలే నాని 'జెంటిల్ మేన్' అంటూ మరో మూవీతో వచ్చాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. 'జెంటిల్ మేన్' మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చిన్నప్పటికి ఫైనల్ ఈ మూవీ 20క్రోర్స్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పుతున్నాయి. ఇలా రెండు విజయాలు అందుకున్న నాని ఇప్పుడు 'మజ్ను' మూవీతో మరో విజయం దక్కించుకోవాలని ఉత్సాహపడుతున్నాడు. ఇలా ఒకే ఎడాదిలో మూడు విజయాలు అందించిన హీరోగా సరికొత్త రికార్డ్ ని లిఖించాలని నేచురల్ స్టార్ భావిస్తున్నాడు. మరి నాని ఆశలను 'మజ్ను' ఏం చేస్తాడో చూడాలి.  

మూడు రోజుల పాటు టి.సీపీఎం ప్లీనం - తమ్మినేని..

హైదరాబాద్ : ఈనెల 16,17,18 వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్లీనం సమావేశం జరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ సమావేశాలకు జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పరిశీలకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు 80 మందితో పాటు మొత్తం జిల్లాలోని కమిటీ సభ్యులు, వివిధ రంగాల్లో ఇతర సభ్యులు మొత్తం 481 మంది హాజరౌతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు..ఈ పరిస్థితులను ఉపయోగించి నిర్వహించిన ప్రజా ఉద్యమాలపై విశ్లేషణాత్మక విశ్లేషణ జరుగుతుందన్నారు.

నయీం ఘటన కథనాలపై జ్యుడిషయల్ ఎంక్వయిరీ చేయాలి తమ్మినేని..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం హత్యపై వస్తున్న కథనాలపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ జరిపించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నయీం ఘటన అనంతరం మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోందని, చట్టాలు రక్షించాల్సిన పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారని..చట్టాలు రూపొందించాల్సిన ప్రజాప్రతినిధులపై కూడా పలు ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరు కరెక్టుగా లేదన్నారు. నయీం డైరీలను బయటపెట్టాలని, వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

సీపీఎం వాదన నిజమైంది - తమ్మినేని..

హైదరాబాద్ : జీవో నెంబర్ 123 పై మొదటి నుండి సీపీఎం చెప్పిందే నిజమైందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. భూమి లేని పేదలకు ఎలాంటి రక్షణ లేదని కోర్టు తేల్చిందని, దీనికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ప్రభుత్వం ఇంకో తతంగానికి తెరలేపిందని, భూమి లేని పేదలకు మాత్రమే 190 జీవో వర్తిస్తుందని పేర్కొంటోందన్నారు. డొంక తిరుగుడు వ్యవహరాలు మానుకోవాలని సూచించారు. 2013 చట్టాన్ని సమగ్రంగా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, 123 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

16:07 - August 12, 2016

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే మెగాస్టార్ తో 151 వ సినిమాకి చేయడానికి ఇప్పటి నుంచే చాలా మంది డైరెక్టర్స్ చిరుతో టచ్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఓ తమిళ డైరెక్టర్ కూడా ఇటీవల మెగాస్టార్ తో 151 వ సినిమా సంబంధించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరి చిరుతో 151సినిమా చేయాలనుకుంటున్న ఆ తమిళ డైరెక్టర్ ఎవరు ? చిరంజీవి రీ ఏంట్రీ ఇస్తుండడంతో ఆయనతో ఒక్క సినిమా చేసిన చాలని చాలా మంది డైరెక్టర్స్ భావిస్తున్నారు. మెగాస్టార్ 150వ సినిమాకి సంబంధించి డైరెక్టర్ విషయం పెద్ద హంగామా జరిగింది. అయితే చివరికి సైలెంట్ గా వినాయక్ లైన్ లోకి వచ్చి చిరంజీవి మరోసారి డైరెక్ట్ చేసే అద్భుత అవకాశం అందుకున్నాడు. ఈ క్రమంలో చిరు 151వ సినిమాకైనా దర్శకత్వం వహించాలని ఓ తమిళ డైరెక్టర్ ఆశపడుతున్నాడట.

రజినీతో లింగా..
దర్శకుడు కెఎస్ రవికుమార్ చిరంజీవితో సినిమా చేయాలని ఆరాటపడుతున్నాడు. ఈ దర్శకుడు చిరంజీవి 151 సినిమాకి ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్‌ న్యూస్. గతంలో ఈ డైరెక్టర్ చిరంజీవితో 'స్నేహాంకోసం' లాంటి మూవీ చేశాడు. స్టోరీ పరంగా చిరు నటన పరంగా ఈ చిత్రం బాగున్నా అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. దీంతో ఇప్పుడు మరోసారి చిరంజీవితో సినిమా చేయాలని రవికుమార్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఇటీవల దర్శకుడు రవికుమార్ చిరంజీవి ఇంటికి వెళ్లాడంట. ఆ సమయంలో చిరు, రవికుమార్ ల మధ్య 151 సినిమా సంబంధించి టాపిక్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈ దర్శకుడు కూడా స్వయంగా ప్రస్తావించడాన్ని టాక్. ఈ దర్శకుడు గత ఎడాది రజినీకాంత్ తో 'లింగా' మూవీ చేసిన విషయం తెలిసిందే. మరీ కె ఎస్ రవికుమార్ తో చిరంజీవి సినిమా చేస్తాడా లేక మాటలకే పరిమితం చేస్తాడా చూడాలి.  

15:42 - August 12, 2016

తమిళనాడు : తిరుచ్చి రహదారి రక్తమోడింది. బస్సు-వ్యాను ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రయాణికుల మృతిచెందారు. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఎదురెదురుగా వచ్చిన వాహనాలు వేగంగా ఢీకొనడంతో... మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. కాగా మధురై నుండి వస్తున్న బస్ తిరుచ్చివద్ద వ్యాన్ ను ఢీకొట్టడంతో ఈప్రమాదం జరిగినుట్లుగా తెలుస్తోంది.

15:40 - August 12, 2016

గొంతు ఇన్ఫెక్షన్ ఉండడం..దానితో పాటు గొంతు గరగరగా ఉండడంతో ఏవో మందులు వాడుతుంటారు. దీనికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుండి దూరమయ్యే అవకాశం ఉంది. ఆ చిట్కాలు ఏంటో చూడండి.
కప్పు పాలలో చిటికెడు పసుపు చేర్చాలి. ఈ పాలను తీసుకోవడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమస్యను త్వరగా దూరం చేసేస్తాయి.
వెల్లుల్లిని మెత్తగా చేసి అందులో ఉప్పు..కారం కొంచెం కలిపి వేడి వేడి అన్నంలో తీసుకోవాలి.
అరకప్పు వేడి నీళ్లలో చెంచా శొంఠి పొడి, అరచెంచా నిమ్మరసం, అల్లం రసం, తేనే కలిపి పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే సరిపోతుంది.
దాల్చిన చెక్క నూనె చెంచా మోతాదు తీసుకుని అందులో మరో చెంచా తేనె కలిపి తాగితే ఫలితం ఉంటుంది.
దాల్చిన చెక్కా..మిరియాల పొడిలను వెచ్చటి నీళ్లలో కలపాలి. కాసేపయ్యాక వడకట్టుకుని పుక్కిలించాలి. రోజు మూడుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుంది. 

15:37 - August 12, 2016

ముంబై : రైలు ఆలస్యం కావడంతో కోపోద్రిక్తులైన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. కర్జత్‌ నుంచి సిఎస్‌టి వెళ్లే రైలు ముంబైలోని బద్‌లాపూర్‌ రైల్వేస్టేషన్‌కు ఆలస్యంగా రావడంతో వందలాది మంది ప్రయాణీకులు రైలు పట్టాలపైకి వచ్చి ఆందోళన చేశారు. దీంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రతిరోజు రైళ్లు ఆలస్యంగా రావడం వల్ల తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ప్రయాణికులు తెలిపారు. స్పెషల్‌ ట్రెయిన్‌ వేయడంతో ఆందోళన సద్దుమణిగింది.

15:34 - August 12, 2016

హైదరాబాద్‌ : ఎంసీహెచ్‌ఆర్డీలో కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం అయింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాలు తమ వాదనల్ని సబ్‌ కమిటీకి వినిపించాయి. అయితే జోనల్ వ్యవస్థపై ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాలు భిన్న వాదనలు వినిపించారు. జోనల్ విధానాన్ని కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. స్థానికత ఆధారంగా ఉద్యోగాల కేటాయింపులు ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. 

15:31 - August 12, 2016

హైదరాబాద్ : నయీం కేసుపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబీర్ అలీ డిమాండ్‌ చేశారు. సీబీఐకి జాతీయ స్థాయిలో అన్ని విభాగాలతో కోఆర్డినేషన్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే కేసులో పురోగతి కనిపించే అవకాశముందని ఆయన తెలిపారు. సిట్ కేవలం రాష్ట్రానికే పరిమితం కావడం వల్ల నిజాలు బయటపడేందుకు ఎక్కువ సమయం పడుతుందని అన్నారు. నయీం కేసులో బయటపడిన అక్రమ ఆస్తుల గురించి తెలిపిన ప్రభుత్వం, నిందితుల పేర్లను ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు.

ప్రత్యేక అసెంబ్లీ సమావేశం - సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : ప్ర‌త్యేక శాస‌న‌స‌భ స‌మావేశంలో ముస్లింల రిజ‌ర్వేష‌న్ల కోసం ప్రత్యేక చ‌ట్టం తీసుకొస్తామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ముస్లింల‌కు జ‌నాభా ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్లు కల్పిస్తామని, రాష్ట్రంలో బ‌ల‌హీన వ‌ర్గాలు ఎక్కువ సంఖ్య‌లో ఉన్నాయన్నారు. త‌మిళ‌నాడు త‌ర‌హా ప్ర‌త్యేక చ‌ట్టం ద్వారా ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు కల్పిస్తామని పేర్కొన్నారు.

15:22 - August 12, 2016

తూర్పుగోదావరి : మలాపురంలో దళితులపై దాడిని వైసీపీ అధినేత జగన్‌ తీవ్రంగా ఖండించారు. అమలాపురం ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన ఆయన చంద్రబాబు సర్కార్‌పై నిప్పులు చెరిగారు. హోంమంత్రి సొంత నియోజకవర్గంలో దళితులకు భద్రత లేకపోవడం విచారకరమన్నారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు దళితులను పరామర్శించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద గాయపడ్డ దళితులకు 8 లక్షల వరకు పరిహారం ఇచ్చే అవకాశం ఉన్నా.. చంద్రబాబు కేవలం లక్ష ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.  కాగా గత కొన్ని రోజుల క్రితం ఆవును చంపారనే నెపంతో దళితులపై దాదాపు 100మంది వ్యక్తులు గోసంరక్షణ పేరుతో దళితులపై దాడి చేసిన తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. దీనిపట్ల వాపపక్షాలతో సహా పలు ప్రజాసంఘాలు తీవ్రంగా నిరసిస్తూ ఆందోళన కార్యాక్రమాలు చేపట్టారు.

మల్కాజ్ గిరిలో నయీం సభ్యుల అరెస్టు..

హైదరాబాద్ : మల్కాజ్ గిరిలో నయీం ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. రమేష్, మహ్మద్ నవాబ్ లను పోలీసులు అరెస్టు చేశారు.  

నయీం ఇంట్లో నాలుగు బ్యాగ్ లు స్వాధీనం..

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం నివాసంలో మరో నాలుగు బ్యాగులు లభ్యమయ్యాయి. పోలీసులు రాజేంద్రనగర్‌లోని పుప్పాలగూడలో ఉన్న నయీం నివాసంలో శుక్రవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. 

సదాపాలెం బాధితులకు రూ.8లక్షలు ఇవ్వాలి -జగన్..

తూర్పుగోదావరి : అమలాపురం ఏరియా ఆసుపత్రుల్లో సదాపాలెం బాధితులను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. హోం మంత్రి సొంత ఇలాఖాలో దళితులకు భద్రత లేదని విమర్శించారు. బాధితులకు రూ. 8లక్షల పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. 

15:13 - August 12, 2016

కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు..

హైదరాబాద్ : ఎంసీహెచ్ఆర్టీలో జరుగుతున్న కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయాలు వెల్లడించారు. జోనల్ విధానమే కావాలంటే 24 జిల్లాలను ఆరు జోన్లగా విభజించాలని ఉద్యోగులు పేర్కొన్నారు. పాత జోన్లు ఉంచడం వల్ల వెనుకబడిన జిల్లాలకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగులు పేర్కొన్నారు. 

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..

చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుచ్చి వద్ద బస్సు- వ్యాన్ ఢీకొన్నాయి. ఏడుగురు ప్రయాణీకులు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. రోడ్డుపై చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి.

15:00 - August 12, 2016

తూర్పుగోదావరి : ప్రముఖ కవి అవంత్స సోమసుందర్ కన్నుమూశారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత వారం రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన శుక్రవారంనాడు మృతి చెందారు. సోమసుందరం స్వస్థలం జిల్లాలోని పిఠాపురం. వజ్రాయుధం పుస్తకంతో ఆయన భావ కవిత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. మేఘరంజని, అక్షయ తరంగిణి, రక్తాక్షి, కాహళి పుస్తకాలతో ఆయన సాహిత్య రంగంలో ప్రాచుర్యం పొందారు. సోమసుందర్ మృతిపట్ల దేవిప్రియ,తెలకపల్లి రవి, ఖాదర్‌ మొహియుద్దీన్‌, వోల్గా, శిఖామణి, పలువురు సాహితీవేత్తలు సంతాపం తెలిపారు.అభ్యుదర సాహిత్యంలో ఆయన మృతి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

నాగార్జున సాగర్ లో డీజీపీ ఏరియల్ సర్వే..

నల్గొండ : నాగార్జున సాగర్ లో డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. శివాలయం ఘాట్ ను డీజీపీ, జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఆలంపూర్ నుండి అన్ని ఘాట్లను డీజీపీ పరిశీలిస్తున్నారు. 

సదాపాలెం బాధితులను పరామర్శించిన జగన్..

తూర్పుగోదావరి : అమలాపురం ఏరియా ఆసుపత్రుల్లో సదాపాలెం బాధితులను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. 

అక్రమ ఆయుధాల కేసులో ఇద్దరు అనుచరుల అరెస్టు..

హైదరాబాద్ : అక్రమ ఆయుధాల కేసులో ఇద్దరు అనుచరులను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా ఆలేరులో కుమారస్వామి, శ్రీనివాస్ అరెస్టు చేశారు. నిందితులను కాసేపట్లో ఆలేరు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఈతకెళ్లి నలుగురు చిన్నారుల మృతి

గుంటూరు : ఓబులనాయుడుపాలెంలో విషాదం నెలకొంది. నీటి గుంటలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారుల మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

ముక్త్యాల వేదాద్రి క్షేత్రాల్లో భక్తులు పుణ్యస్నానాలు

కృష్ణా : జగ్గయ్యపేట ముండలం ముక్త్యాల వేదాద్రి క్షేత్రాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులు భారీగా తరలివస్తున్నారు. 

ముగ్గురు నయీం ముఠా సభ్యుల అరెస్టు

హైదరాబాద్ : ముగ్గురు నయీం ముఠా సభ్యులను మాల్కాజ్ గిరి పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యులను పోలీసులు విచారించనున్నారు. 

కేంద్రంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆగ్రహం

ఢిల్లీ : కేంద్రంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల నియామకంలో ఆలస్యంపై చీఫ్ జస్టిస్ కేంద్రాన్ని సమాధానం కోరారు.  

 

షారూఖ్ కు అమెరికా రాయబారి క్షమాపణలు..

అమెరికా : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ క్షమాపణలు చెప్పారు. లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో షారుఖ్ ను అడ్డుకున్నందుకు క్షమించాలని కోరారు. 

ఇద్దరు పైలట్ల సస్పెండ్..

న్యూఢిల్లీ: ఎయిరిండియా, జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఇద్ద‌రు పైల‌ట్లను నాలుగేళ్ల పాటు స‌స్పెండ్ చేశారు. వీరు మద్యం సేవించినట్లు పరీక్షల్లో వెల్లడైంది. పైల‌ట్ల‌పై కేసులు న‌మోదు చేయాల‌ని ప్ర‌భుత్వం ఎయిర్‌వేస్ అధికారుల‌ను ఆదేశించింది. 

13:50 - August 12, 2016

ఇప్పుడంతా పండగల సీజన్. పార్టీల సీజన్. మరి నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే పార్టీవేర్ కావాల్సిందే కదా? మరి అలాంటి వెరైటీ పార్టీ వేర్ కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:45 - August 12, 2016

ఇంటా, బైటా అంతటా ఆడపిల్లలకు అభద్రతతో కూడిన పరిస్థితులే. ఎప్పుడూ తమని తాము రక్షించుకునేందుకు భయపడాల్సిన స్థితిగతులే. ఇలాంటి పరిస్థితులు మారాలంటే వ్యవస్థలో రావాల్సిన మార్పులు చాలా ఉన్నాయి. అవి పూర్తిగా మన చేతుల్లో లేవు. అందుకే వ్యక్తిగతంగానైనా మనని మనం రక్షించుకునేందుకు ఆత్మరక్షణా మార్గాలు నేర్చుకోవడం ఎంతో కొంత అవసరం. అలాంటి టెక్నిక్స్ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:36 - August 12, 2016

కర్నూలు : పుణ్య నదీ పవిత్ర క్షేత్రాల్లో శ్రీశైల మహాశైవ క్షేత్రం అత్యంత ప్రధానమైనంది. చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతలున్న శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. అంతేకాదు... ఇదే క్షేత్రంలోని భ్రమరీదేవి అష్టాదశ శక్తి పీఠాల్లో పేరెన్నికగన్నదిగా చెప్పుకోవచ్చు. శ్రీశైల సమీపంలో కృష్ణా నది తన ప్రవాహ వేగాన్ని తగ్గించుకుని బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి పర్వతాల నడుమ సాగుతోంది.  పాతాళగంగ స్నానం, భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దర్శనం కోసం పుష్కరాల సందర్భంగా భక్తులు అశేషంగా తరలివస్తారు. శ్రీగిరి క్షేత్ర విశేషాలపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం. 
సకల పాపాల నుంచి విముక్తి 
శ్రీశైలం..ఇక్కడ పాతాళగంగలో మునిగితే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతోందన్నది భక్తులు అపార నమ్మకం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన భ్రమరాంబదేవి ఆలయం, మల్లిఖార్జున స్వామి ఆలయం ఉండటంతో ఇక్కడికి నిరంతరం భక్తులు తరలివస్తూనే ఉంటారు. లక్ష సంవత్సరాల కాశీ క్షేత్రంలో నివసిస్తే వచ్చే పుణ్యం శ్రీశైల మల్లన్నను ఒక్కసారి దర్శిస్తే కలుగుతుందని భక్తులు విశ్వాసం.  
64వ అధ్యాయంలో క్షేత్ర విషయాలు
శ్రీశైల క్షేత్రం గురించి పద్మపురాణంలోని ఉత్తర ఖండంలో మార్కడేయపురాణం, శివపురాణం, రుద్రసంహింత, ఆదిత్య పురాణం, సూతసంహితం, మహాభారత వనపర్వం, భాగవత దశమ స్కందంలో చాలా వివరంగా ఉందని, స్కందపురాణంలోని శ్రీశైల ఖండం 64వ అధ్యాయంలో క్షేత్ర విషయాలు ఉండటం విశేషం. ఆది శంకరులు రాసిన శివానందలహరి, సోమేశ్వరుడి కథాసరిత్సాగరం, సిద్ధనాథుడి రసరత్నాకరం, భవభూతి మాలతీ మాధవం, బాణభట్టు కాదంబరి, శ్రీహర్షుని రత్రావళి గ్రంథాల్లో శ్రీశైల ప్రస్తావన ఉంది.  వీటితో పాటు మరెన్నో తెలుగు, కన్నడ, మరాఠీ, గ్రంథాల్లోనూ శ్రీశైల మహా పుణ్యక్షేత్రం గురించిన ప్రస్తావనలు చూడవచ్చు. 
మూడో శతాబ్ధిలో శ్రీశైలాన్ని పాలించిన ఇక్ష్వాకులు
మూడో శతాబ్దిలో శ్రీపర్వతీయులుగా పిలువబడ్డ ఇక్ష్వాకులు శ్రీశైలాన్ని పాలించగా తర్వాత పల్లవులు, 4వ శతాబ్ది చివర నుంచి విష్ణుకుండినులు, 6వ శతాబ్ది మొదటిలో తిరిగి పల్వులు, తదుపరి కాలంలో కదంబులు, 6వ శతాబ్ది మధ్య నుంచి 8వ శతాబ్ది వరకు తెలుగు చోళులు ఈ క్షేత్రాన్ని పాలించారు. క్రీ.శ 973 వరకు రాష్ట్ర కూటులు, తర్వాత చాళుక్యులు, క్రీ.శ 1162 వరకు చాళుక్య చోళులు, క్రీ.శ 1323 వరక కాకతీయులు, క్రీ.శ 1420 దాకా రెడ్డి రాజులు శ్రీశైల క్షేత్రాన్ని పాలించినట్లు చరిత్ర చెబుతోంది.   
శ్రీశైలానికి మెట్ల మార్గం 
రెడ్డిరాజుల కాలంలో నాగలూటి నుంచి పెచ్చెర్యు భీమునికొలను మీదుగా శ్రీశైలానికి మెట్ల మార్గం నిర్మించారు.  అనంతరం పాతళగంగకు మెట్లు కట్టించారు. అనవేమారెడ్డి మల్లన్న ఆలయ మందుబాగాన వీరశిరోమండపాన్ని నిర్మించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. తర్వాత 1398లో కాటయవేముడు శిఖరేశ్వరానికి మెట్ల వేయించినట్లు, రెడ్డి రాజుల కాలంలోనే విజయనగర రాజులు దండెత్తి శ్రీశైలాన్ని అక్రమించుకుని పాలించారు. కొండవీటిరెడ్డి వంశం అంతరించాక శ్రీశైలం పూర్తిగా విజయనగర రాజుల ఆధీనంలోకి వచ్చింది. 16వ శతాబ్ది మధ్యభాగం వరకు పాలించిన విజయనగరాజుల కాలంలో శ్రీశైలం ఎంతో అభివృద్ధి చెందినట్లు చరిత్రాక ఆధారాలు చెబుతున్నాయి.  
సాల మండపాలు... 
శ్రీక్రిష్ణదేవరాయులు ఆలయ తూర్పు ప్రాకార గోపురాన్ని ఎదురుగా ఉన్న రథవీదికి ఇరువైపులా సాల మండపాలను కట్టించినట్లు... మంత్రి చంద్రశేఖరామాత్యుడు స్వామివారి కల్యాణమండపాన్ని నిర్మించినట్లు... విజయనగర సామ్రాజ్యం అంతరించాక మొగలు చక్రవర్తులు,  హైదరాబాద్  నైజాం నవాబు దత్త మండలాలతోపాటు శ్రీశైల దేవస్థానాన్ని కూడా ఈస్టిండియా కంపెనీ వారికి స్వాధీనపరిచినట్లు చెబుతుంటారు. బ్రిటిష్ వారు ఈ పాలన భారాన్ని క్రీ.శ1840లో పుష్పగిరి మఠానికి అప్పగించారు. అయితే పుష్పగిరి మఠం ఆలయ నిర్వహణ సరిగా చేయకపోవడంతో ప్రభుత్వం ఆలయాన్ని కొంతకాలం పాటు జిల్లా కోర్టు పరిధిలో ఉంచి 1929లో అడ్వకేట్ పాణ్యం రామయ్య అధ్యక్షతన నిర్వహణ మండలిని నియమించింది. 1949వరకు విధులు నిర్వర్తించిన సదరు మండలి రాష్ట్ర దేవాదాయ శాఖకు అప్పగించింది. పుష్కర స్నానాలచించేందుకు ఈ సారి అశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీ పెరుగనున్న దృష్ట్యా ఆలయ నిర్వాహకులు అందుకుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

13:30 - August 12, 2016

కర్నూలు : బాసరలో కంటే ముందుగానే ఆ ప్రాంతంలో సరస్వతి దేవి స్వయంభుగా వెలిశారు. నాలుగు రాష్ర్టాలకు చెందిన భక్తులతో విశేష పూజలందుకుంటున్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా వామహస్తాన పుస్తకాన్ని ధరించి.. మిగిలిన చేతులతో పాశాంకుషాలతో.. అభయహస్తాలతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. చదువుల తల్లి, వీణాపాణి, శారదాదేవి, జ్ఞాన సరస్వతి.. ఇలా అనేక పేర్లతో విరాజిల్లుతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆలయ గోపురాలు భక్తులకు ఆహ్లాదాన్ని, అనందాన్ని పంచుతున్నాయి. ఎన్నో శతాబ్ధాల చరిత్ర ఉన్న ఆ దేవాలయాన్ని దర్శించాలంటే.. కర్నూలు జిల్లాకు వెళ్లాల్సిందే..! 
రెండవ చాళుక్యుల కాలంలో మల్లభూపతి ఆలయ నిర్మాణం 
కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలం శివపురం గ్రామ శివారులో ఉన్న కొలనుభారతి దేవి అమ్మవారు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రజల ఆరాధ్యదైవంగా భాసిల్లుతోంది. కొలనుభారతి దర్శనం సకల అభిష్టప్రధాయనిగా భక్తులు భావిస్తారు. కార్యసిద్ధి, విజ్ఞ నివారణ, జీవన సాఫ్యలత, స్వచ్ఛత, విద్యాలబ్ది, ఐశ్వర్యం... ఈ ఆరుగుణాలు కొలనుభారతి దేవి దివ్యానుగ్రహం వల్లే ఏర్పడుతాయని భక్తులు విశ్వసిస్తారు. 11వ శతాబద్దం రెండవ చాళుక్యుల కాలంలో మల్లభూపతి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి స్థల పురాణం చెబుతోంది.
అభయ హస్తాలతో అమ్మవారి దర్శనం
ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా వామహస్తాన పుస్తకాన్ని ధరించి మిగిలిన చేతులతో పాశాంకుషాలతో అభయ హస్తాలతో అమ్మవారు దర్శనమిస్తోంది. ఈ వాగ్దేవికి క్షీరాభిషేకంతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ దేవాలయంలో అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, నామకరణాలను చేస్తుంటారు. కృష్ణానదిలో స్నానమాచరించి... కొలనుభారతీ దేవిని దర్శించుకుంటే... పుణ్యఫలాలు దక్కుతాయని అర్చకులు చెబుతున్నారు. ఇక్కడ ఏడు మందిరాలకు మధ్యలో ఏకశిలా రథ ధ్వజ స్తంభం భక్తులను మంత్రముగ్దులను చేస్తుంది. దేవాలయానికి ఉత్తర ఈశాన్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి నెలకొని ఉంటాడు. ఆలయం నుంచి సమీపంలోని నల్లమల అడవిలోకి ప్రవేశిస్తే.... అక్కడ జీవ జలధార ప్రవహిస్తుంటుంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా కొలనుభారతి ఆలయం సర్వంగా సుందరంగా ముస్తాబవుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన అమ్మవారిని యాత్రికులు దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

13:27 - August 12, 2016

సారా వ్యతిరేక ఉద్యమకర్త వర్ధినేని రోశమ్మ అలియాస్‌ దూబగుంట రోశమ్మ ఆదివారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో కన్నుమూసారు.
పురుషులతో సమానంగా ఆఫీసుల్లో మహిళలు పనిచేస్తున్నారు. ఇది ఒకందుకు మంచి వాతావరణానికి సంకేతమేనని తాజా అధ్యయనంలో తేలింది.
కారు అంబులెన్స్ లు, ఎయిర్ అంబులెన్స్ లను చూసి ఉంటాం. బైక్ అంబులెన్స్ లును చూశారా? బైక్ అంబులెన్స్ లా! ఎప్పుడూ చూడలేదే అనుకుంటున్నారా? ఇప్పుడు బైక్ అంబులెన్స్ లు క్షేత్రస్థాయిలో తిరుగాడుతున్నాయి.
సైన్యం దురాగతాలను నిరసిస్తూ దశాబ్దంన్నరకు పైగా ఆహారం తీసుకోకుండా ప్రపంచాన్ని సంభ్రమపరిచిన మణిపూర్ ఉక్కుమహిళ 44 ఏండ్ల ఇరోం షర్మిల నిరాహారదీక్షను విరమించారు. మణిపూర్‌లో అమలవుతున్న సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్పీఏ) తొలగించటం కోసం ముఖ్యమంత్రిని అవుతానని ప్రకటించారు.
మార్కెట్ శక్తులు సహజత్వాన్ని కూడా అసహజంగా మార్చేశాయి. ఇప్పుడు మనం తల్లిపాలుపట్టడాన్ని ప్రోత్సహించాల్సిన దుస్థితి.
రోజురోజుకీ మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. ఎంతో కొంత ధైర్యంగా వేధింపులకు గురిచేసిన వారిమీద కేసులు నమోదు చేసే వారి సంఖ్యా పెరిగింది. ఇలా కేసులను ఎదుర్కునే మహిళలు ఇంటా బైటా, పనిచేసే చోటా ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉంటారు.
నిర్భయ నిధికి నిధులు మంజూరైంది. బాధిత మహిళలకు ఈ నిధి నుండే పరిహారం అందచేయనున్నారు.
పూర్తిగా మహిళలతో నడిచే బ్యాంకు శాఖలను ఏర్పాటు చేయడంపై స్పష్టమైన విధానం ఉండాలని, పార్లమెంటరీ కమిటీ సూచిస్తోంది. అందుకోసం ఓ నివేదికను రూపొందించింది. 
పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

13:23 - August 12, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. విజయవాడ, శ్రీశైలం, గుంటూరులల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. పుష్కరస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. కృష్ణా జిల్లాలో కృష్ణా పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర కృష్ణా గోదావరి సంగమం దగ్గర భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ప్రభుత్వం భక్తుల రద్దీని నియంత్రించేందుకు పెద్ద సంఖ్యలో ఘాట్లను ఏర్పాటు చేయడంతో భక్తుల రద్దీ చాలా తగ్గింది. 
ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం :బోయపాటి 
ఈనెల 23న కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకను రాష్ట్ర ప్రజలకు గుర్తుండేలా ఉంటాయని ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. విజయవాడలోని పున్నమిఘాట్‌లో పుష్కరస్నానమాచరించిన బోయపాటి..పుష్కరాలకు ఘనంగా నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పుష్కరాల ప్రారంభోత్సవం కంటే ముగింపు ఉత్సవాలను ఇంకా ఘనంగా నిర్వహిస్తామన్నారు. 

 

జమ్మూలో కలకలం..

జమ్మూ : జమ్మూ కాశ్మీర్ లో శుక్రవారం మధ్యాహ్నం కలకలం రేగింది. కార్మల్ కాన్వెంట్ స్కూల్ వద్ద ఇద్దరు అపరిచితులు తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. స్కూల్ లో ఉన్న చిన్నారులను తరలించారు. 

కాశ్మీర్ అంశంపై ఆల్ పార్టీ మీటింగ్..

ఢిల్లీ : పార్లమెంట్ లో కాశ్మీర్ అంశంపై ఆల్ పార్టీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, మంత్రి సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, ములాయం సింగ్ యాదవ్, వైఎస్ చౌదరి లు హాజరయ్యారు. 

13:18 - August 12, 2016

హైరాబాద్ : తెలంగాణలో కృష్ణా పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పుష్కరఘాట్లను ఏర్పాటు చేశారు. పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పుణ్యస్నానమాచరించేందుకు పుష్కరఘాట్ల వద్ద భక్తులు బారులు తీరి నిల్చున్నారు. సీఎం కేసీఆర్ దంపతులు మహబూబ్ నగర్ జిల్లాలోని గుందిమల్ల పుష్కరఘాట్ వద్ద పుష్కరస్నానమాచరించి పుష్కరాలను ప్రారంభించారు. అనంతరం అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
పుష్కర ఏర్పాట్లన్నీ సంతృప్తికరం : ఎంపీ జితేందర్‌ రెడ్డి 
పుష్కర ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని ఎంపీ జితేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణకు పుణ్యం కలగాలని సీఎం కేసీఆర్ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
నల్గొండ జిల్లాలో కృష్ణా పుష్కరాలు
నల్గొండ జిల్లాలో కృష్ణా పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వాడపల్లి కృష్ణమ్మకు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు పుష్కరస్నానమాచరించారు. అనంతరం మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు మంత్రి జగదీశ్వర్‌రెడ్డి దంపతులు మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద ఉదయం 6గంటలకే పుష్కరస్నానం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా వచ్చిన కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు మంత్రి జగదీశ్వర్‌రెడ్డి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని వసతులను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.  

13:16 - August 12, 2016

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలోని కంగారా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు వంతెన కూలిపోయింది. సుమారు 44 ఏళ్ల క్రితం ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు. ఇటీవలే మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బ్రిడ్జి కూలిపోవడంతో రెండు బస్సులు..ఇతర వాహనాలు కొట్టుకపోయాయి. గురువారం మధ్యాహ్నం బ్రిడ్జి కూలిపోతున్న దృశ్యాలను కొందరు చిత్రీకరించారు. సుమారు 160 మీటర్ల పొడుగులో ఈ బ్రిడ్జి ఉంది. పది పిల్లర్లతో పాటు 76 మీటర్ల పొడుగున్న బ్రిడ్జి నీటిలో కొట్టుక పోయింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని నూర్‌పూర్ తాలూకాకు, పొరుగునే ఉన్న పంజాబ్ రాష్ట్రానికి మధ్య రాకపోకలు సాగించడానికి ఈ వంతెనే ప్రధానమైన ఆధారం. అదృష్టవశాత్తు వంతెన కూలిన సమయంలో దాని మీద ఎవరూ రాకపోకలు సాగించకపోవడంతో పెను ముప్పు తప్పింది. పిల్లర్లకు బీటలు వారినట్లు ముందే గుర్తించిన అధికారులు బుధవారం నుంచే దానిమీద రాకపోకలను నిలిపివేశారు. 

13:08 - August 12, 2016

హైదరాబాద్ : ఎంసీహెచ్ఆర్డీలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యా సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. ప్రధానంగా జోనల్ విధానంపై చర్చించారు. జోనల్ విధానంపై భిన్న వాదనలు సాగాయి. మూడు జిల్లాలకు చెందిన వారితో మంత్రివర్గం సమావేశమయ్యారు. దసరా నుండి కొత్త జిల్లాలు అమలు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరుగుతోంది. జోనల్ విధానం ఎత్తివేయాలని లేనిపక్షంలో ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఐదో జోన్ పరిధిలోకి వస్తాయని వాదించారు. జోనల్ విధానం కొనసాగించాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపులు జరగాలని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఉద్యోగుల విభజనకు కమిటీ వేయాలని సబ్ కమిటీని విన్నవించారు. పీఆర్సీ బకాయిలు, హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీలో పనిచేస్తున్న నాలుగో తరగతి తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయి రిక్రూట్ మెంట్ లు ఎక్కువగా జరగాలని కోరారు. రాష్ట్రస్థాయి పరిధిలో జరిగే అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. 

పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈమేరకు లోక్ సభ స్పీకర్, రాజ్యసభ వైస్ చైర్మన్ సభలను నిరవధికంగా వాయివా వేస్తున్నట్లు ప్రకటించారు. 

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

చెన్నై : తమిళనాడులోని తిరుచ్చిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి.  

 

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కృష్ణా పుష్కరస్నానాలు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరస్నానాలు కొనసాగుతున్నాయి. 12 రోజులపాటు పుష్కరాలు కొనసాగునున్నాయి. విజయవాడ, శ్రీశైలం, అమరావతి, నల్గొండ, మహబూబ్ నగర్ లలో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. పుష్కరస్నానాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు చేసేందుకు పుష్కరఘాట్ల వద్ద భక్తులు బారులు తీరారు.

 

 

12:36 - August 12, 2016

గుంటూరు : జిల్లాలో కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పలు ఘాట్ లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ధ్యానబుద్ధ ఘాట్ ఆకర్షిస్తోంది. ధ్యానంలో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అంతేగాకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన ధ్యాన ఆంజనేయ స్వామి విగ్రహం భక్తులను ఆకర్షిస్తోంది. ఉదయం నుండి భక్తులు పలుచగానే వచ్చారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన భక్తులు ఇక్కడకు తరలి వస్తున్నారు. ఘాట్ లో మధ్యాహ్నం నుండి రద్దీ క్రమేపీ పెరుగుతూ వస్తోంది. ఇందుకు శ్రావణ శుక్రవారం కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

నయీం ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్మును కోర్టుకు సమర్పించిన పోలీసులు

హైదరాబాద్ : అల్కాపురిలోని నయీం ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.2.80 కోట్లు, 2 కిలోల బంగారాన్ని నార్సింగి పోలీసులు కోర్టుకు సమర్పించారు. 

 

వెలవెలబోతున్న వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం పుష్కర ఘాట్లు

గుంటూరు : జిల్లాలోని వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం పుష్కర ఘాట్లు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. వైకుంఠపురంలో నీరు సరిగ్గా లేకపోవడంతో భక్తులు చెంబులతో స్నానం చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సీతారాం ఘాట్ ఖాళీగా ఉంది. 

నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న కృష్ణా పుష్కర స్నానాలు

నల్గొండ : జిల్లాలో కృష్ణా పుష్కర స్నానాలు కొనసాగుతున్నాయి. వాడపల్లి, మట్టపల్లి ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. అంత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ పుష్కరస్నానమాచరిస్తున్నారు. 

12:22 - August 12, 2016

గుంటూరు : ఏపీ రాష్ట్రంలో కృష్ణా పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పలు ఘాట్ లలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇదిలా ఉంటే సీతానగరం ఘాట్ వద్ద కలకలం రేగింది. నీటిలో ఈకోలా బ్యాక్టీరియా ఉందని ప్రచారం జరగడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనితో అధికారులు రంగంలోకి దిగి నీటి శాంపిల్స్ ను సేకరించారు. దీనివల్ల టైఫాయిడ్, విరోచనాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈకోలా బ్యాక్టీరియా చంపడానికి క్లోరినేషన్ చేయడం జరుగుతోందని, ఏడు ట్యాంకర్ల ద్వారా చేయడం జరుగుతోందన్నారు. రెండు గంటలకొకసారి శాంపిల్స్ తీసుకోవడం జరుగుతోందని, తాము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. భక్తులు ఎటువంటి భయం లేకుండా సీతానగరం ఘాట్ లో పుష్కరస్నానం ఆచరించవచ్చని తెలిపారు. 

జోనల్ విధానంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భిన్నవాదనలు

హైదరాబాద్ : ఎంసీహెచ్ ఆర్డీలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీకి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు కొత్త జిల్లాల ఏర్పాటుపై తమ వాదనాలు వినిపించారు. జోనల్ విధానంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భిన్నవాదనలు వినిపించాయి. జోనల్ విధానం కొనసాగించాలని ఉపాధ్యాయు సంఘాలు కోరాయి.

12:08 - August 12, 2016

నల్గొండ : నాగార్జునసాగర్ పుష్కరఘాట్ వద్ద పురోహితులు ఆందోళన చేపట్టారు. పిండ ప్రదానానికి కనీస వసతులు కల్పించలేదని ధర్నాకు దిగారు. తాగునీరు, షెల్టరు వసతులు లేక అర్చకులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పురోహితులు తెలిపారు. కొంతమంది అర్చకులను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ విషయాన్ని పురోహితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కనీస వసతులు కల్పించాలని పురోహితులు డిమాండ్ చేశారు. పిండ ప్రధానానికి షెల్డర్లు, భక్తులకు తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. ఐడెంటి కార్డులున్న అర్చకులను లోనికి అనుమతించాలని కోరారు.

 

11:51 - August 12, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులకు సౌకర్యవంతమైన రావాణా సౌకర్యం కల్పించామని చెప్పారు. పరిశుభ్రద విషయంలో రాజీపడకుండా సిబ్బంది పని చేస్తున్నారని కొనియడారు. పుష్కరాలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. మరుగుదొడ్లు, ఉచిత భోజనం, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. 

 

11:45 - August 12, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కృష్ణా పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. 12 రోజులపాటు పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. విజయవాడ, అమరావతి, గుంటూరు, శ్రీశైలం, నల్గొండ, మహబూబ్ నగర్ వంటి పలు ప్రాంతాల్లో పుష్కరఘాట్లను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని గొందిమళ్ల ఘాట్‌లో మొదటగా పలువురు పీఠాధిపతులు పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అలంపూర్‌ గొందిమళ్ల ఘాట్‌లో పుష్కర స్నానం తర్వాత సీఎం కేసీఆర్‌ దంపతులు జోగులాంబ ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
ఎపిలో
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడలోని దుర్గాఘాట్‌లో మొదటగా కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పుష్కరస్నానం చేశారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు చేత పూజలు చేయించారు. తర్వాత బాబు దంపతులు పుష్కరస్నానం చేశారు. గోదావరి, కృష్ణా పుష్కరాలను నిర్వహించడంతో తన జన్మ ధన్యం అయిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతిఒక్కరు పుష్కరాలకు విచ్చేసి పుష్కరస్నానమాచరించి పుష్కర హారతిలో పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. 2018 వరకు పోలవరాన్ని పూర్తిచేస్తామని సీఎం అన్నారు. దాంతో పాటు రాబోయే రోజుల్లో నదుల అనుసంధాన ప్రక్రియను కొనసాగిస్తానని చంద్రబాబు అన్నారు. దుర్ఘాఘాట్‌లో ఉదయం 6గంటలకు పుష్కరస్నానమాచరించిన చంద్రబాబు..ఆ తర్వాత ప్రత్యేక పూజకార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

 

11:40 - August 12, 2016

గుంటూరు : సీతానగరం ఘాట్ వద్ద విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రకాశం బ్యారేజీ నుండి దిగువకు నీటిని అధికారులు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువ వద్ద సదుపాయం లేకపోవడంతో పంపుల ద్వారా నీటిని వదులుతున్నారు. వదిలిన నీరు సరిపోకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం మోకాలి లోతు వరకే రావడం..నీళ్లు మురికిగా ఉండడంతో భక్తులు పలు ఇబ్బందులు పడుతున్నారు. శ్రావణ శుక్రవారం ఉండడంతో భక్తుల తాకిడి అంతగా లేదు. 

ఇంద్రకీలాద్రి వద్ద మీడియాపై ఆంక్షలు..

విజయవాడ : ఇంద్రకీలాద్రి వద్ద మీడియాపై ఆంక్షలు విధించారు. కొండపైకి మీడియాను అధికారులు అనుమతించలేదు. దుర్గగుడి క్యూలైన్ లలో ఎండకు భక్తలు సొమ్మసిల్లిపడిపోయారు. భారీ క్యూ లైన్ లు ఏర్పాటు చేయడంతో భక్తులు ఇక్కటక్లు గురవుతున్నారు. 

శనివారం జగన్ పుష్కర స్నానం..

విజయవాడ : కృష్ణా పుష్కరాలు పురస్కరించుకుని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 13న విజయవాడలో స్నానమాచరిస్తారని పార్టీ పేర్కొంది. 

శుక్రవారం తూర్పుగోదారి జిల్లాకు వెళ్లనున్న జగన్..

తూర్పుగోదావరి : వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. గోవధకు పాల్పడ్డారన్న అపోహతో కొందరు వ్యక్తులు చేసిన దాడిలో గాయపడి అమలాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్‌ మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు.

పుష్కర స్నానం చేసిన చిన జీయర్ స్వామి..

గుంటూరు : జిల్లా సీతానగరం పుష్కరఘాట్‌లో త్రిదండి చినజీయర్ స్వామి పుణ్యస్నానం ఆచరించి కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు గోకరాజు గంగరాజు, గల్లాజయదేవ్ పాల్గొన్నారు.

11:18 - August 12, 2016

మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు ఏపీ రాష్ట్రంపై పలు విమర్శలు గుప్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో పుష్కరాల విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని, ఎంతో మహిమ కలిగిన ఆలంపూర్ లో స్నానం చేద్దామనే తాను ఇక్కడకు రావడం జరిగిందన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జోగులాంబ రూపంలో శక్తి స్వరూపిణి కొలువై విరాజిల్లుతున్న అలంపూర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ ఉదయం పుష్కర స్నానం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అలంపూర్ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇక్కడికి వచ్చే ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచుతామని అన్నారు. ఇక్కడ 100 పడకలతో అత్యాధునిక ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు. పుష్కరాలంటే విజయవాడ అనేలా చేశారని, ఆలంపూర్ చాలా పవిత్రమైందన్నారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా జరిగాయని, ఇందుకు మంత్రి ఇంద్రకిరణ్ ఎంతో కృషి చేశారని తెలిపారు. పుష్కర స్నానం చేసిన అనంతరం దైవ దర్శనం చేసుకోవాలని, అష్టాదశ శక్తి పీఠాలలో పంచమస్థానంలో ఉన్న దైవాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. జోగులాంబ రూపంలో ఇక్కడ ఉన్న శక్తి పీఠాన్ని సందర్శించడానికి ప్రతి యేటా 5 వేల నుంచి 10 వేల మంది ఉపాసకులు వస్తుంటారని, వారికి ఏ ఇబ్బందులూ కలుగకుండా వసతి ఏర్పాట్లు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

11:13 - August 12, 2016

అనంతపురం : జిల్లాలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. రాప్తాడు మండలం బుక్కచర్ల గ్రామానికి చెందిన అశోక్..జయలు రాత్రి పని మీద వెళ్లి తిరిగి వచ్చారు. కక్కలపల్లి గ్రామ శివారులో వీరిద్దరినీ గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్త్రీ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఎంసీహెచ్ ఆర్డీలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ

హైదరాబాద్ : ఎంసీహెచ్ ఆర్డీలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాలో ప్రజాప్రతినిధులు కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష జరిపింది. ఈ సమావేశానికి అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. 

ఆధ్యాత్మిక కేంద్రంగా ఆలంపూర్ - కేసీఆర్..

మహబూబ్ నగర్ : కృష్ణమ్మ ఒడిలో సైతం కొత్త ఘాట్ల నిర్మాణం జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ గొప్పతనం మరుగున పడిపోయిందని విమర్శలు గుప్పించారు. అలంపూర్ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తానని, ఇక్కడికి వచ్చే ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచుతామని అన్నారు. ఇక్కడ 100 పడకలతో అత్యాధునిక ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు.

10:45 - August 12, 2016

సౌత్ సినిమాలో కమల్ హాసన్ అంటే ఓ ట్రెండ్ మార్క్. ఆయన చేసిన ప్రయోగాలు, ఆయన వేసిన గెటప్ లు ఎవరూ వేయలేరు. కాని ఇప్పుడు కోలీవుడ్ నుండి ఇంకో హీరో బయలుదేరాడు. కమల్ ను మించిన గెటప్ లతో కనువిందు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంతకి కమల్ రేంజ్ లో ప్రయోగాలే చేసేది ఎవరు...? విక్రమ్... ఇప్పుడు సౌత్ ఫిల్మ్స్ లో సెంట్రల్ ఎట్రాక్షన్. డిఫెరెంట్ స్టోరీస్ ఎంచుకుని... వెరైటీ గెటప్స్ తో తన ఇమేజ్ ను పెంచుకున్నాడు విక్రమ్. చిన్న హీరోగా స్టార్ట్ అయ్యి స్టార్ హీరోగా మారి సినీ జనాలను మెస్మరైజ్ చేస్తున్నాడు విక్రమ్. మూవీ కెరీర్ లో ప్రయోగాలు చాలానే ఉన్నాయి. శివ పుత్రుడిగా విక్రమ్ నటన ఎవరూ మర్చిపోలేరు. హీరోగా గ్లామర్ పాత్రకు భిన్నంగా ఉండే క్యారక్టర్ ను ఎంచుకున్నాడు విక్రమ్. శివపుత్రుడులో స్మశానంలో ఉండే కాటి కాపరి క్యారక్టర్ ను అద్భుతంగా పండించాడు విక్రమ్. హీరోగా విక్రమ్ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా శివపుత్రుడు.

అపరిచితుడు..ఐ..
అపరిచితుడు... ఈ సినిమా గురించి చెప్పేది ఏముంటుంది. అదరికి తెలుసు. విక్రమ్ నట పరాక్రమం చూపించిన మూవీ అది. లెజండ్ డైరక్టర్ శంకర్ తెలివితోపాటు విక్రమ్ నటన తోడైంది. ఆ సినిమా ఎంతలా ఆడియన్స్ ను ఆకట్టుకుందో అందరికి తెలుసు. మూడు క్యారెక్టర్లను ఒకరిలో చూపించడం ఎంత కష్టం. ఆ క్యారక్టర్ కోసం విక్రమ్ చేసి హార్డ్ వర్క్ అభినందనీయం. ఆ తరువాత మళ్ళీ విక్రమ్, శంకర్ కాంభినేషన్ లో వచ్చిన 'ఐ' మూవీ కూడా అంతే. గ్లామర్ గా ఉండే హీరో.. కురూపిగా మారుతాడు అంటే.... ఏ హీరో సాహసం చేయడు. కాని విక్రమ్ ఐ మూవీ చేసి ఎటువంటి క్యారక్టర్ అయిన నేను చేయగలను అని నిరూపించాడు. ఈ మధ్యలో మల్లన్న, నాన్న, ఇలా చేసినవన్నీ ఎక్స్పర్మెంట్స్ మూవీసే. ఇండియాలో కమల్ హాసన్ తర్వాత పాత్రల విషయంలో అద్భుతమైన ఎక్స్పర్మెంట్స్ చేసే ఆర్టిస్ట్ విక్రమ్. హీరోగా తొలి బ్రేక్ ఇచ్చిన 'సేతు' దగ్గర్నుంచి గత ఏడాది వచ్చిన 'ఐ' వరకు విక్రమ్ మామూలు క్యారెక్టర్లు చేయలేదు.

హిజ్రాగా..
ఇప్పుడు తన కొత్త సినిమా 'ఇరుముగన్' లోనూ విక్రమ్ ఓ సెన్సేషనల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో 'ఇంకొక్కడు' గా రాబోతుంది. ఇందులో హీరోగానే కాదు విలన్‌గానూ విక్రమే నటిస్తుండటం విశేషం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విక్రమ్ విలన్ గా చేసేది కూడా హిజ్రా పాత్ర కావడం విశేషం. 'ఇరు ముగన్' ట్రైలర్ తో ఆడియన్స్ లో హోప్స్ పెంచేశాడు విక్రమ్. ఇందులో హీరో-విలన్ పాత్రల్లో విక్రమ్ నటనే సినిమాకు హైలైట్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా విలన్ పాత్రను దర్శకుడు ఆనంద్ శంకర్ ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లున్నాడు. ఇలాంటి డిఫెరెంట్ క్యారక్టర్ తో మన ముందుకు రాబోతున్న విక్రమ్ ఇంతకు ముందులాగానే ఆదరిస్తారా మరి ఈ సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో చూడాలి.

10:42 - August 12, 2016

విజయవాడ : కృష్ణా పుష్కర ఏర్పాట్ల నాణ్యత లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రకాశం బ్యారేజి దిగువన క్రిష్ణవేణి, పద్మావతి ఘాట్ మధ్య గండిపడటంతో 4 అడుగులు ఉండాల్సిన నీరు ఒక్క అడుగుకు చేరుకుంది. వెంటనే స్పందంచిన అధికారులు జేసీబీల సహాయంతో నల్లమట్టితో గండిని పూడ్చారు. ఈ సమయంలో జేసీబీ బొల్తాపడటంతో డ్రైవర్ కు ప్రాణాపాయం తప్పి బయటపడ్డాడు. మరో జేసీబీతో పడిపోయిన జేసీబీని లాగారు. గండిని పూడ్చేందుకు అధికారులు నానాతంటాలు పడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

10:39 - August 12, 2016

విజయవాడ : గోదావరి, కృష్ణా పుష్కరాలను నిర్వహించడంతో తన జన్మ ధన్యం అయిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దుర్ఘాఘాట్‌లో ఉదయం 6గంటలకు పుష్కరస్నానమాచరించిన చంద్రబాబు..ఆ తర్వాత ప్రత్యేక పూజకార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిఒక్కరు పుష్కరాలకు విచ్చేసి పుష్కరస్నానమాచరించి పుష్కర హారతిలో పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. పుష్కర హారతిలో పాల్గొంటే ఎనలేని అనుభూతిని పొందపొవచ్చని తెలిపారు. 2018 వరకు పోలవరాన్ని పూర్తి చేస్తామని సీఎం అన్నారు. దాంతో పాటు రాబోయే రోజుల్లో నదుల అనుసంధాన ప్రక్రియను కొనసాగిస్తానని చంద్రబాబు అన్నారు. 

 

10:37 - August 12, 2016

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకప్పటిలా చరిత్ర క్రియేట్ చేయాలని కసిగా ఉన్నాడు. అందుకు తన కొత్త సినిమా జనతా గ్యారేజ్ సరైన చిత్రమని బుడ్డోడు భావిస్తున్నాడు. ఈ చిత్రంతో ఎన్టీఆర్ బాక్సాపీసు వద్ద కలెక్షన్ల మోత మోగించాలని చూస్తున్నాడు. 'జనతా గ్యారేజ్' సినిమాతో యంగ్ టైగర్ కొట్టాలనుకుంటున్న టార్గెట్ ఏంటో చదవండి..ఇప్పటి స్టార్ హీరోల్లో అందరికంటే ముందే స్టార్ స్టేటస్ అందుకున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. కానీ కొన్నేళ్లుగా జూనియర్ బాగా వెనకబడిపోయాడు. ఇందులో తన చేతులారా చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయనే మాటను అంగీకరించాల్సిందే. అయితే వాటిన్నిటినీ సరి చేసుకుంటూ వస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు వరుస హిట్స్ కొడుతున్నాడు. పూరీతో 'టెంపర్', సుకుమార్ తో 'నాన్నకు ప్రేమతో' చిత్రాలతో మోస్తరు హిట్స్ కొట్టాడు. కానీ 'జనతా గ్యారేజ్' తో మాత్రం బుడ్డోడు సెన్సేషన్ క్రియేట్ చేయాలని కసిగా ఉన్నాడు.

చరిత్ర సృష్టించాలని భావిస్తున్న ఎన్టీఆర్...
'నాన్నకు ప్రేమతో' మూవీతో ఎన్టీఆర్ మొదటిసారి 50 కోట్ల మార్కును టచ్ చేశాడు. ఈ సినిమాకు ముందు వచ్చిన 'టెంపర్' 40కోట్ల వద్ద ఆగిపోయింది. అయితే ఈ రెండు సినిమాల బడ్జెట్ కి కలెక్షన్లకి అక్కడిక్కడికి సరిగ్గా సరిపోయాయి. దీంతో బయ్యర్లకు కానీ, నిర్మాతకు కానీ లాభాలు లేకుండా పోయాయి. అంతేకాదు హిట్స్ పడ్డాయన్న మాటే కానీ ఈ సినిమాల వల్ల ఎన్టీఆర్ కి పెద్దగా ఒరిగిందేమి లేదు. కాకపోతే ఈ రెండు సినిమాల్లో యంగ్ టైగర్ చాలా కొత్తగా కనిపించాడు. 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో' సినిమాలతో ఎన్టీఆర్ కలిగిన తృప్తి ఇదోకటే. అయితే కొత్త చిత్రం 'జనతా గ్యారేజ్' తో ఒకప్పటిలా బాక్సఫీసు వద్ద చరిత్ర సృష్టించి స్టార్ గా తన స్టామినాను ఫ్రూవ్ చేసుకోవాలని ఈ నందమూరి చిన్నోడు భావిస్తున్నాడు.

జనతా గ్యారేజ్ భారీ బిజినెస్...
'జనతా గ్యారేజ్' బిజినేస్ భారీ రేంజ్ లో సాగుతోంది. ఇందుకు దర్శకుడు కొరటాల శివ ఫ్యాక్టర్ కూడా బాగానే పనిచేస్తోంది. ఈ దర్శకుడు బ్యాక్ టూ బ్యాక్ భారీ హిట్స్ సాధించడంతో ఎన్టీఆర్ తో చేసిన 'జనతా గ్యారేజ్' పై ఆటోమేటిక్ గా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ హైప్ ని వాడుకోని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఎన్టీఆర్ స్కెచ్ వేస్తున్నాడు. అన్ని ఏరియాలు కలిసి 'జనతా గ్యారేజ్' 70కోట్లకు పైగా ప్రీ బిజినేస్ జరిపినట్లు తెలుస్తోంది. ఒక్క మలయాళంలోనే ఈ మూవీ 8కోట్ల ఫ్రీ బిజినేస్ చేసిందట. ఈ సదావకాశాన్ని సరిగ్గా వినియోగించుకుని 'జనతా గ్యారేజ్' తో ఏకంగా 100 కోట్లు రాబట్టాలని యంగ్ టైగర్ ఆశపడుతున్నాడట. మరి ఎన్టీఆర్ ఆశలను 'జనతా గ్యారేజ్' నిజం చేస్తుందో లేదో చూడాలి.

ఏపీలో అడుగు పెట్ట - లక్ష్మీపార్వతి..

నల్గొండ : చెన్నంపేట మండలం పెద్దమునిగల్ ఘాట్ లో లక్ష్మీపార్వతి పుష్కరస్నానాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం ఏపీలో అడుగుపెట్టనని, ఏపీలో పుష్కర స్నానానికి కూడా వెళ్లనని తెలిపారు. తెలంగాణలో ప్రశాంతంగా ఉందన్నారు. 

ఈకోలా బ్యాక్టీరియా ఉంది - వైద్యులు..

గుంటూరు : సీతానగరం ఘాట్ వద్ద నీటిలో ఈకోలా బ్యాక్టీరియా ఉన్నమాట వాస్తవమేనని వైద్యులు వెల్లడించారు. ఎప్పటికప్పుడు క్లోరిన్ ఉపయోగించి నీటిని శుద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఎటువంటి భయం లేకుండా సీతానగరం ఘాట్ లో పుష్కరస్నానం ఆచరించవచ్చని తెలిపారు. 

పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు - కలెక్టర్ విజయ్ మోహన్...

కర్నూలు : పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ విజయ్ మోహన్ పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుండడంతో నీటిమట్టం 880 అడుగులకు చేరిన తరువాతే గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలిపారు. పాతాళగంగ, సంగమేశ్వరం, లింగాలగట్టు ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 

నాగార్జున సాగర్ శివాలయం ఘాట్ వద్ద పురోహితుల ఆందోళన...

నల్గొండ : నాగార్జున సాగర్ శివాలయం ఘాట్ లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని పురోహితులు ఆందోళన వ్యక్తం చేశారు. 

10:22 - August 12, 2016

గుంటూరు : చరిత్రలో గుర్తుంచుకునేలా కృష్ణా పుష్కర ఏర్పాట్లు చేశామని ఎపి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. అమరావతిలో ధ్యానబుద్ధ ప్రాజెక్టు ఘాట్ వద్ద మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పుష్కరస్నానమాచరించి పుష్కరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలను 12 ఏండ్లు గుర్తుంచునేలా జరుపుతున్నామని చెప్పారు. నదులే నాగరికతను తీసుకొచ్చాయని.. నదులతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. చరిత్రలో నిలిచే విధంగా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎపికి ప్రత్యేకహోదా రావాలని ఆకాంక్షించారు.
 

10:21 - August 12, 2016

లాస్ఏంజిల్స్: అగ్రరాజ్యంగా పిలవబడే అమెరికాలో మళ్లీ షారూఖ్ ఖాన్ కు అవమానం ఎదురైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్ ద్వారా తెలియ చేశారు. అమెరికా వెళ్లిన ప్రతిసారి షారూఖ్ అవమాన పాలవుతున్న సంగతి తెలిసిందే.
లాస్‌ ఏంజిల్స్‌ విమానశ్రయంలో పోలీసులు షారుక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ షారుక్‌ఖాన్‌కు క్షమాపణ చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా చూస్తామని ట్వీట్‌ చేశారు. భద్రత విషయంలో తాను అర్థం చేసుకుంటానని... అమెరికా వెళ్లిన ప్రతీసారి ఇలా జరగడంపై షారుక్‌ ట్విట్టర్‌ ద్వారా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా పరమైన చర్యలను కాదనని, వాటిని అర్థం చేసుకుంటానని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.  
2009లో న్యూ జెర్సీలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రం ఒకసారి, 2012లో న్యూయార్క్ ఎయిర్ పోర్టులో మరోసారి ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని గంటల తరబడి తనిఖీలు చేశారు.

09:41 - August 12, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో విషాదం నెలకొంది. పుష్కరాల విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాకు చెందిన వెంకట్రావ్ అనే ఏఆర్ కానిస్టేబుల్ కృష్ణా జిల్లాలో పుష్కరాల విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో కృష్ణా జిల్లా గూడవల్లి వద్ద రోడ్డు దాటుతుండగా కానిస్టేబుల్ ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వెంకట్రావ్ ను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. 

 

09:36 - August 12, 2016

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ బయోగ్రాఫీ రానుందా అంటే కోలీవుడ్ వర్గాలు అవునానే అంటున్నాయి. మాములుగా స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన రజినీకాంత్ జీవిత చరిత్రను, సినిమాగా అందించాలని రజినీ కూతుళ్లు ప్లాన్ చేస్తున్నారట. మరి సౌత్ సూపర్ స్టార్ బయోగ్రాఫీ మూవీ విశేషాలు.. కబాలి సినిమాతో రజనీకాంత్ మరోసారి నిరాశపరిచాడు. తన గత చిత్రాలు కొచ్చాడియన్, లింగాల మాదిరి కబాలి కూడా డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ మూవీ వల్ల డిస్టిబ్యూటర్స్ నష్టపోయారు కానీ నిర్మాతకు మాత్రం లాభాల వచ్చాయి. ఏది ఏమైనా కబాలితో కూడా రజినీ బాక్సఫీసు వద్ద మ్యాజిక్ చేయలేకపోయాడు. ఈ క్రమంలో ఆయన కూతుళ్లు రజినీకాంత్ జీవిత చరిత్రతో మూవీకి ప్లాన్ చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
రజనీకాంత్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

డైరెక్టర్ ఎవరో ? 
అసమానమైన స్టార్ డమ్, ఇమేజ్ రజినీకాంత్ సొంతం. బస్ కండక్టర్ నుంచి సౌత్ సూపర్ స్టార్ గా ఆయన అంచెలంచెలుగా ఎదిగిన తీరు ఎవరినైనా ఆశ్చర్యపరుస్తోంది. ఇదే పాయింట్ తో ఇప్పుడు తన కూతురు ఐశ్వర్య సినిమాగా తీయాలని భావిస్తున్నారట. నటుడిగానే కాకుండా రజినీకాంత్ వ్యక్తిత్వంలోను ఎవరెస్టు శిఖరమే. ఇటీవలే ఆయన తను మరణించిన తరువాత తన యావదాస్తిని అనాధ శరాణయాలకు దక్కేలేలా నోటు రాసి ఇచ్చాడని సమాచారం. ఇలా రజినీకాంత్ జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అలాంటి విషయాలనంటిని స్టోరీగా తయారు చేసి సినిమా చేస్తే బంపర్ హిట్టే అనేది రజినీకాంత్ కూతురు ఐశ్యర్య విశ్వాసం. అందుకే ఇప్పుడు ఆయన కూతుళ్లు ఈ బయోగ్రాఫీ స్టోరీని రెడీ చేసే పనిలో ఉన్నారట. మరి ఈ సినిమాను డైరెక్ట్ చేసే అద్భుతఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి.   

రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

కృష్ణా : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పుష్కరాల విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మృతుడు  చిత్తూరు జిల్లావాసిగా గుర్తించారు. రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. 

అమెరికాలో షారుఖ్ మళ్లీ అవమానం..

ఢిల్లీ : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు అమెరికాలో మళ్లీ అవమానం జరిగింది. అమెరికాలో పదేపదే తనను అడ్డుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టులో షారూఖ్ ను సిబ్బంది అడ్డుకున్నారు. ఈ విషయాన్ని షారూఖ్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

గోదావరికి అఖండ హారతి, కృష్ణమ్మకు పవిత్రహారతి : సీఎం చంద్రబాబు

విజయవాడ : గోదావరికి అఖండ హారతి, కృష్ణమ్మకు పవిత్రహారతి కోనసాగుతాయని సీఎం చంద్రబాబు చెప్పారు. దుర్గాఘాట్ లో పుష్కరస్నానం ఆచరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నదుల అనుసంధానంతో రాష్ట్రం సుభిక్షం కావాలని ఆకాంక్షించారు. 

 

కొనసాగుతున్న కృష్ణా పుష్కరాలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 12 రోజుల పాటు ఈ పుష్కరాలు కొనసాగనున్నాయి. ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు బారులు తీరుతున్నారు. విజయవాడ, శ్రీశైలం, అమరావతిలలో పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్, నల్గొండలలో పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు. 

అరుదైన అవకాశం దక్కింది - చంద్రబాబు..

విజయవాడ : రెండు పుష్కరాలను జరిపించే అరుదైన అవకాశం తనకు దక్కిందని, రాబోయే పుష్కరాల నాటికి అన్ని నదుల అనుసంధానం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రం సుభిక్షం కావాలని, గోదావరికి అఖండహరతి, కృష్ణమ్మకు పవిత్రహారతి కొనసాగుతాయన్నారు. 

నల్గొండ జిల్లాలో పుష్కర సంబరాలు ప్రారంభం

నల్గొండ : జిల్లాలో పుష్కర సంబరాలు ప్రారంభమయ్యాయి. నాగార్జున సాగర్ భక్తులతో కిటకిటలాడుతోంది. వాడపల్లి, మట్టపల్లి ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. పుష్కరస్నానాలకు భక్తులు పోటెత్తారు. 

కృష్ణవేణి ఘాట్ వద్ద కాల్వకు గండి..

విజయవాడ : కృష్ణవేణి ఘాట్ వద్ద అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్వకు గండి పడింది. నీరులేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు గండి పూడ్చే ప్రయత్నం చేశారు. ప్రయత్నంలో జేసీబీ బోల్తాపడిపోయింది. జేసీబీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. 

గొందిమళ్ల ఘాట్ లో పుష్కరస్నానమాచిరించిన మంత్రులు

మహబూబ్ నగర్ : జిల్లాలో కృష్ణా పుస్కరాలు ప్రారంభం అయ్యాయి. గొందిమళ్ల ఘాట్ లో సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంపత్, శ్రీనివాస్ గడ్ లు పుష్కరస్నానాలు ఆచరించారు.  

 

బ్యాంకాక్ లో పేలుళ్లు...

థాయిలాండ్ : బ్యాంకాక్ లో రెండు చోట్ల బాంబు పేలుడులు సంభవించాయి. నలుగురు మృతి చెందగా 21 మందికి గాయాలయ్యాయి. ఓ రిస్టార్స్ లో ఈ పేలుళ్లు సంభవించాయి. 

సదుపాయాలు కల్పించలేదంటూ పురోహితుల ఆందోళన...

గుంటూరు: జిల్లాలోని సీతానగరం, తాలాయపాలెం పుష్కరఘాట్లకు భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామునుండే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సీతానగరం వద్ద పిండ ప్రధానం కోసం సదుపాయాలు కల్పించలేదంటూ పురోహితులు ఆందోళన నిర్వహించారు. 

ఏపీ పుష్కరాల్లో విషాదం..

కృష్ణా : పుష్కరాల్లో విషాదం నెలకొంది. పుష్కరాల్లో విధులు నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వెంకట్రావ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కృష్ణా జిల్లాలోని గూడవల్లి వద్ద రోడ్డు దాటుతుండగా ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీనితో వెంకట్రావ్ కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ వెంకట్రావ్ మృతి చెందాడు. 

దుర్గాఘాట్ లో పుష్కర స్నానం చేసిన బాలకృష్ణ, లోకేష్

కృష్ణా : విజయవాడలోని దుర్గాఘాట్ లో కృష్ణ పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. దుర్గాఘాట్ వద్ద ఎపి బాలకృష్ణ, లోకేష్ లు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

గొందిమల్లలో ప్రారంభమైన పుష్కరాలు

మహబూబ్ నగర్ : జిల్లాలోని ఆలంపూర్ గొందిమల్ల ఘాట్ వద్ద కృష్ణ పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. సీఎం కేసీఆర్ దంపతులు పుణ్యస్నానాలు ఆచరించి, పుష్కరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

దుర్గాఘాట్ లో ప్రారంభమైన పుష్కరాలు

కృష్ణా : విజయవాడలోని దుర్గాఘాట్ లో కృష్ణ పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. విజయవాడలోని దుర్గాఘాట్ వద్ద ఎపి సీఎం చంద్రబాబు దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

08:39 - August 12, 2016

మహబూబ్ నగర్ : సీఎం జిల్లాలోని అలంపూర్ జోగులాంబ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అంతకముందు గొందిమళ్ల ఘాట్ లో ఉదయం 5.58 గంటలకు సీఎం కేసీఆర్ దంపతులు పుష్కరస్నానం చేశారు. వారితోపాటు పలువురు ప్రజాప్రనిధులు పుష్కరస్నానాలను ఆచరించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గొందిమళ్ల ఘాట్ కు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీఎం కేసీఆర్ దంపతులు పుష్కరస్నానం ఆచరించిన తర్వాత పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. వేలాది మంది భక్తులు పుష్కరస్నానాలు చేస్తున్నారు. వృద్ధులు, యువకులు, పిల్లలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 

 

08:03 - August 12, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. 12 రోజులపాటు పుష్కరాలు కొనసాగనున్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఘాట్లకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దుర్గాఘాట్ లో జయేంద్ర సరస్వతి పుణ్యస్నానం ఆచరించారు. ఆ తర్వాత ఎపి సీఎం చంద్రబాబు దంపతులు విజయవాడ దుర్గాఘాట్ కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 5.58 నిమిషాలకు పుణ్యస్నానం చేశారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ వద్ద ఏర్పాటు చేసిన గొందిమళ్ల పుష్కర ఘాట్ కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉదయం 5.58 నిమిషాలకు పుణ్యస్నానం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

పుణ్యస్నానం చేసిన సీఎం చంద్రబాబు దంపతులు

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. విజయవాడలోని దుర్గాఘాట్ వద్ద ఎపి సీఎం చంద్రబాబు దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

07:43 - August 12, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. 12 రోజులపాటు పుష్కరాలు కొనసాగనున్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఘాట్లకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దుర్గాఘాట్ లో జయేంద్ర సరస్వతి పుణ్యస్నానం ఆచరించారు. ఎపి సీఎం చంద్రబాబు దంపతులు విజయవాడ దుర్గాఘాట్ కు చేరుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ వద్ద ఉన్న గొందిమళ్ల పుష్కర ఘాట్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగం అటు విజయవాడలో ఇటు గొందిమళ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు రెండు రాష్ట్రాల్లో ప్రారంభం అయిన పుష్కర ప్రదేశాలకు భక్తులు చేరవేసేందుకు ఆర్టీసీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది.  ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. విజయవాడ, మహబూబ్ నగర్, నల్గొండ, గుంటూరు జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లు నుంచి పుష్కర ఘాట్ల వరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. 
      
 

గొందిమళ్లలో సీఎం కేసీఆర్ దంపతులు పుష్కరస్నానం

మహబూబ్ నగర్ : జిల్లాలోని అలంపూర్ గొందిమళ్ల వీఐపీ ఘాట్ వద్ద సీఎం కేసీఆర్ దంపతులు పుష్కరస్నానాలు ఆచరించారు. వారి జిల్లా నేతలు పుష్కరాలు ఆచరించారు. జోగులాంబ అంబవారిని దర్శించుకోవడానికి వారు వెళ్లారు. అక్కడ సీఎం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. 

 

మహానాడు ఘాట్ వరకు ఉచిత బస్సులు

విజయవాడ : కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ నుంచి సీతానగరం మహానాడు ఘాట్ వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. పుష్కర యాత్రికుల కోసం 145 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. తెల్లవారు జాము 4 గంటల నుంచి పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. ఇరు రాష్ట్రాల్లో లక్షలాది భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు.

Don't Miss