Activities calendar

13 August 2016

21:54 - August 13, 2016

ఢిల్లీ : కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై తాజాగా మరో కేసు నమోదైంది. మాల్యా తమ వద్ద రుణం తీసుకుని ఎగవేశాడంటూ ఎస్బీఐ చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ మాల్యాపై మోసం, నేరపూరిత కుట్ర 420, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులకు 9వేల కోట్లకు పైగా రుణాలు ఎగవేసిన మాల్యా.. గత మార్చి 2న దేశం విడిచి లండన్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. మాల్యాను భారత్‌కు రావాలంటూ ఈడీ, కోర్టులు పలు మార్లు హెచ్చరించినప్పటికీ స్పందించకపోవడంతో.. ఆయన పాస్‌పోర్టును రద్దు చేశారు. ఇప్పటికే దేశంలోని పలు చోట్ల ఆయనపై కేసులు నమోదయ్యాయి.

21:51 - August 13, 2016

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తెకు సైతం వేధింపులు తప్పలేదు. పార్థ మండల్‌ అనే పేరు గల సోషల్‌ మీడియా ఖాతా నుంచి తనకు అసభ్యకర సందేశాలు వస్తున్నాయని షర్మిష్ఠ ముఖర్జీ వెల్లడించారు. పార్థ మండల్‌ ఫేస్‌బుక్‌లో నాకు అసభ్యకర సందేశాలు పంపిస్తున్నాడు. మొదట దీన్ని పెద్దగా పట్టించుకోకుండా అతడిని బ్లాక్‌ చేశాను. అయితే ఇలాంటి విషయాలపై మౌనంగా ఉంటే.. అతడు మరికొందరిని ఇలాగే వేధిస్తాడు. అందుకే అతడి వివరాలను బయటపెట్టి అవమానించాలని నిర్ణయించుకున్నాను. అతడి ప్రొఫైల్‌, మెసేజ్‌లను స్క్రీన్‌షాట్‌ తీసి పోస్టు చేస్తున్నాను. దీన్ని అందరూ షేర్‌ చేయండి. ఇలాంటి చర్యలను తేలిగ్గా తీసుకోవద్దంటూ షర్మిష్ఠ పోస్టు చేశారు.

21:46 - August 13, 2016

విజయనగరం : భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి.. మరో 1600 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ పై వామపక్షాలు భగ్గుమన్నాయి. భూసేకరణకు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తుండగా.. నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారని సీపీఎం, సీపీఐ నేతలు ప్రశ్నించారు. వెంటనే నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

21:43 - August 13, 2016

హైదరాబాద్ : జిల్లాల విభజనపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన కేబినెట్‌ సబ్‌ కమిటీ స్పీడ్‌ పెంచింది. రెండో రోజు సమావేశంలో నాలుగు జిల్లాల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించింది. హైదరాబాద్‌ తప్ప అన్ని జిల్లాల నేతలు ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించారని కమిటీ పేర్కొంది. రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్, సికింద్రాబాద్‌లో విలీనం చేయొద్దని ఈజిల్లాల నేతలు డిమాండ్‌ చేశారు.

వివిధ జిల్లాల ప్రజాప్రతినిధులతో వరుసగా సమావేశాలు
తెలంగాణా ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్రియను వేగవంతం చేసింది. కేబినెట్‌ సబ్‌ కమిటీ.. వివిధ జిల్లాల ప్రజాప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. శనివారం కరీంనగర్, ఖమ్మం ,హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల నేతలతో భేటీ అయ్యింది. జిల్లా పునర్వ్యవస్థీకరణపై అభిప్రాయాలు సేకరించింది. హైదరాబాద్ తప్ప మిగతా అంశాల్లో చిన్న అభిప్రాయ బేధాలున్నాయన్నారు కేబినెట్‌ సబ్ కమీటి కన్వీనర్

కరీంనగర్, ఖమ్మం,హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల నేతలతో భేటీ
హైదరాబాద్‌ జిల్లా నేతలతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించడం పట్ల రంగారెడ్డి జిల్లా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశం నుంచి బయటకు వచ్చి నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్, సికింద్రాబాద్‌లో కలపొద్దన్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని సికింద్రాబాద్‌లో విలీనంచేయాలని సూచించారు. మల్కాజ్‌గిరి,చేవేళ్ళ పార్లమెంట్ పరిధితో రెండు జిల్లాలుగా చేయాలన్నారు.

జిల్లా విభజనతో హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం: కిషన్ రెడ్డి
మరోవైపు హైదరాబాద్‌ జిల్లా విభజనపై బీజేపీ నేతలు అభ్యంతరం తెలిపారు. జిల్లా విభజనతో హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉందన్నారు బిజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. జిహెచ్ఎంసి పరిధి మొత్తాన్ని కలపి ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలన్నారు. ప్రతిపాదనలన్నీ సిద్దం చేశాక అభిప్రాయలు సేకరించడం ఏంటని ప్రశ్నించారు. డ్రాప్ట్ నోట్ కూడా ఇవ్వకపోడం ప్రభుత్వ ఒంటెత్తు పోకడను తెలియజేస్తుందని విమర్శించారు.

ఖమ్మం,కరీంనగర్ జిల్లా నేతలతో కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ
ఖమ్మం,కరీంనగర్ జిల్లా నేతలతోనూ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ అయ్యింది. బెజ్జంకి,ఇల్లంతకుంట, హుస్నాబాద్,కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని నేతలు డిమాండ్ చేశారు. సిరిసిల్లను జిల్లాగా ప్రకటిస్తామని ప్రచారం చేసి..తాజా డ్రాఫ్ట్‌లో పొందుపర్చలేదన్నారు. సిరిసిల్ల కాని పక్షంలో రామగుండం ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇక ఖమ్మం జిల్లా నుంచి గార్ల, బయ్యరం మండలాలను ఇతర జిల్లాల్లో విలీనం చేయొద్దని ఎమ్మెల్సి పొంగులేటి సుధాకార్ రెడ్డి కోరారు.

పెద్దగా అభ్యంతరాలు రాలేదంటున్న కేబినెట్‌ సబ్ కమీటి సభ్యులు
చాలా జిల్లాల నుంచి పెద్దగా అభ్యంతరాలు రాలేదని కేబినెట్‌ సబ్ కమీటి సభ్యులు తెలిపారు. మిగిలిన మూడు జిల్లాల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తర్వాతి సమావేశంలో సేకరించనున్నారు.

21:38 - August 13, 2016

హైదరాబాద్ : జంటనగరాల్లో మ్యాన్‌హోల్స్‌ మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. మొన్న సుల్తాన్‌బజార్‌, నిన్న మాదాపూర్‌.... తాజాగా అప్పయ్య సొసైటీ... ఇలా మూతల్లేని మ్యాన్‌హోల్స్‌ మనుషులను మింగేస్తున్నాయి. హైటెక్‌ సిటీ నుంచి అయ్యప్పసొసైటీకి వెళుతున్న మార్గంలో మ్యాన్‌హోల్‌లో పడి నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

మాదాపూర్ లో విషాదం
హైదరాబాద్‌లో మహా విషాదం చోటుచేసుకుంది. హైటెక్‌ సిటీ నుంచి అయ్యప్ప సొసైటీకి వెళ్లేమార్గంలో మ్యాన్‌హోల్‌లో పడి నలుగు మరణించారు. వీరిలో ముగ్గురు వాటర్‌బోర్డు కార్మికులు శ్రీనివాస్‌, నగేష్‌, సత్యనారాయణగా గుర్తించారు. వీరంతా ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోని మానికేశ్వర్‌నగర్‌కు చెందినవారు. కాగా ఈ ఘటనలో మరణించిన మరోవ్యక్తిని స్థానికుడు గంగాధర్ గా గుర్తించారు.

నలుగురు మృతి..
దాదాపు 25 అడుగుల మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు ముందుగా ఒక కార్మికుడు దిగాడు. శ్వాస అందకపోవడంతో అపస్మారకి స్థితికి చేరుకుని డ్రెయినేజీలో కొట్టుకుపోయాడు. దీనిని గమనించి, తోటి కార్మికుడిని రక్షించేందుకు మాన్‌హోల్‌లో దిగిన మరో వర్కర్‌కు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఇలా వరుసగా మ్యాన్‌లో హోల్‌లో దిగిన నలుగురూ ప్రాణాలు కోల్పోవడంతో బాధితుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఎన్ని ఘటనలు జరుగుతున్నా ఇదే తీరా అంటున్న ప్రజలు
సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్‌, వాటర్‌ వర్క్స్ అధికారులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రయత్నంలో 108 సిబ్బందికి అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. జంటనగరాల్లో తరచు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అటు మున్సిపల్‌ అధికారులు కానీ, ఇటు వాటర్‌ బోర్డు అధికారులు కారీ మూతల్లేని మ్యాన హోల్స్ దగ్గర రక్షణ చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది మే 1 న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నాడు సుల్తాన్‌ బజార్‌లో మ్యాన్‌హోల్‌ శుభ్రం చేసేందుకు దిగిన ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే జూన్‌లో భారీ వర్షాలతో మూతలేని మాన్‌హోల్‌లో పడి ఉత్తారిదికి చెందిన సెక్యూరిటీ గార్డు మరణించాడు. ఇన్ని ఘటనలు జరిగుతున్నా అధికారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ గుణపాఠం నేర్చుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. 

21:33 - August 13, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీంను హతమార్చిన తెలంగాణ పోలీసులను మాజీ డీజీపీ దినేష్‌ రెడ్డి అభినందించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌కు సలాం చెప్పారు. నయీంను అంతమొందించడం మంచిదేనని, నయీం కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏ డీజీపీ స్థాయి అధికారికి నయీంతో లింకు లేదని ఆయన స్పష్టం చేశారు. స్వలాభం కోసం నయీంను వాడుకున్న వారందరినీ శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

దర్యాప్తులో నిజాలు వెల్లడవుతాయి: దినేష్ రెడ్డి
గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా వస్తున్న వార్తలపై దినేష్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఏ డీజీపీ స్థాయి అధికారికి నయీంతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులను పోలీసులు వాడుకోవడం సహజమేనని ఆయన అన్నారు. సిట్ దర్యాప్తులో నిజానిజాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు.

అంతం మంచిదే: దినేష్
గ్యాంగ్‌స్టర్ నయీంను అంతం చేయడం మంచిదేనన్నారు మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సలాం చెప్పారు. మరోవైపు సిట్‌ దర్యాప్తుకు పరిమితులు లేవని.. మాజీ డీజీపీలే కాక ప్రస్తుత డీజీపీలను విచారించే అధికారం ఉంటుందన్నారు.

సిట్ కు సమాచారం ఇస్తా : దినేష్ రెడ్డి
సమాజంలో ఫోర్త్ ఎస్టేట్‌కు విలువ ఉందన్నారు దినేష్ రెడ్డి. ఏదైనా సమాచారం ఉంటే సిట్‌కు అందించి విచారణకు సహకరించాలన్నారు. నయీమ్‌కు సంబంధించి తనకు తెలిసిన వివరాలను సీఎంకు తెలిపేందుకు అపాయింట్ మెంట్ కోరుతామన్నారు.

21:24 - August 13, 2016

హైదరాబాద్‌ : నయీం నేరసామ్రాజ్యం పునాదులు కదులుతున్నాయి. తన పేరు వింటేనే ఉలిక్కిపడే స్థాయికి భయాన్ని సృష్టించిన డాన్‌ కోటలు బీటలు వారుతున్నాయి. నయీంతో సంబంధాలున్న పొలిటిషీయన్లు, పోలీస్‌ ఆఫీసర్లు, రౌడీషీటర్లు, గల్లీ లీడర్లు.. ఒక్కొక్కరి అక్రమాల గుట్టు బయటపడుతోంది. వివాదంలో ఉన్న ఆస్తులు, భూములు, కంపెనీలను సొంతం చేసుకున్న చోటా డాన్‌ల జాబితా సిట్‌ అధికారుల చెంతకు చేరుతోంది.

హైదరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి పాత్రపై ఆరా
గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో సిట్‌ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కీలక సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి పాత్రపై ఆరా తీస్తున్నారు. నయీం ఫాంహౌస్‌ పక్కనే మాజీ మంత్రి ఫాంహౌస్‌ ఉన్నట్లు సిట్‌ బృందం గుర్తించింది. పదవిలో లేనన్ని రోజులు నయీంతో సదరు మాజీ మంత్రి సంబంధాలు నడిపినట్లు సమాచారం. నయీం రెండు నెలల్లో 200 కోట్లు సంపాదించి.. దుబాయ్‌లో స్థిరపడాలని ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు తిరిగి హైదరాబాద్‌కు రావాలని నయీం ప్లాన్‌ చేశాడు.. 

4 హత్య కేసుల్లో నయీం మొదటి ముద్దాయి : సిట్‌ చీఫ్‌ నాగిరెడ్డి
నయీం కేసును సిట్ బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. 4 హత్య కేసుల్లో నయీం మొదటి ముద్దాయని సిట్‌ చీఫ్‌ నాగిరెడ్డి తెలిపారు. నయీం కేసులో మహిళల అక్రమ రవాణా కోణం కూడా ఉందని అధికారులు గుర్తించారు. పిల్లలను నిర్బంధించి.. వేధించినట్లు దర్యాప్తులో తేలింది. నయీంకు చెందిన 20 ఇళ్లను గుర్తించారు. కోర్టు అనుమతితో ఇళ్లను స్వాధీనం చేసుకుని.. ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఇటు నయీం కేసులో ఇప్పటివరకూ 20 మందిని అరెస్ట్‌ చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు. నయీం గురించి చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, సిట్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదులు అందుతున్నట్లు చెప్పారు.

డీజీ నుంచి ఎస్‌ఐ వరకు ఆస్తుల పంపకం..
గ్యాంగ్‌స్టర్‌ నయీం డైరీలో పోలీసు అధికారుల ఆస్తుల చిట్టా ఒక్కొకక్కటిగా బయటపడుతున్నాయి. డీజీ నుంచి ఎస్సై వరకు నయీం ఆస్తులు పంచిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యాదగిరిగుట్టలో డీజీ స్థాయి అధికారికి నయీం 80 ఎకరాల స్థలం ఇచ్చినట్లు తేలింది. ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న ఓ అధికారికి 2 ఖరీదైన కార్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. నయీమ్‌ చెప్పిన మావోయిస్టుల డంప్‌లో డబ్బులు మాయం చేసిన ఐపీఎస్‌ అధికారి కూడా ఉన్నట్లు తేలింది. ఇటు ఓ ఉన్నతాధికారి బావమరిది, నయీమ్‌ కలిసి చిట్‌ఫండ్‌ వ్యాపారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఓ డీఐజీకి 12 ఎకరాల భూమి నయీమ్‌ ఇచ్చినట్లు గుర్తించారు. అంతేకాదు.. నయీమ్‌ 16 ఏళ్ల నుంచి రంజాన్‌ సందర్భంగా పోలీసులకు భారీ ఎత్తున ఖరీదైన గిఫ్టులు ఇచ్చేవాడని గుర్తించారు. భువనగిరిలో నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు తనకు భద్రత కల్పించిన అధికారులకు నయీం నజరానాలు ప్రకటించేవాడు. శివరాంపల్లిలో పోలీసులతో కలిసి 400 ఎకరాలు సెటిల్‌మెంట్‌ చేసినట్లు నయీం డైరీ ద్వారా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మణికొండలో 40 ప్లాట్లను అధికారులకు ఇచ్చినట్లు గుర్తించారు. టెలికాంకాలనీలో ముగ్గురు సీఐలకు నయీం అధునాతన ఇళ్లు కట్టించాడని కూడా సిట్‌ దర్యాప్తులో తేలింది. ఇటు రాయదుర్గంలోనూ 65 ఎకరాల ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ చేసినట్లు గుర్తించారు. ఇటు నయీం గ్యాంగ్‌తో కలిసి భూ దందాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులు నగునూరుకు చెందిన గోవర్థనచారి అలియాస్‌ గోపి, రమేష్‌లను కరీంనగర్‌లో సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నారు. మొత్తంగా సిట్‌ బృందం వేటలో విస్మయానికి గురిచేసే అంశాలు వెలుగుచూస్తున్నాయి. 

అబిడ్స్‌లో ఖాప్స్ కార్డన్‌ సెర్చ్..

హైదరాబాద్‌: అబిడ్స్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు శనివారం సాయంత్రం నిర్బంధ తనిఖీలు చేపట్టారు. డీసీపీ కమలాసన్‌రెడ్డి, ఏసీపీ రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సీఐలు, 300 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు.

20:51 - August 13, 2016
20:45 - August 13, 2016

మెగా మేనల్లుడు సాయిధర్మ్ తేజ హీరోగా , మన్నారా చోప్రా, లారిస్సాబొనోసీ హీరోయిన్స్ గా సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టరైన సునీల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన లవ్ అండ్ యాక్షన్ మూవీ తిక్క. ఈ సినిమా ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమాతో సుప్రీమ్ స్టార్ సాయిధర్మ్ తేజ మరో హిట్టు కొడతాడా లేడా? ఇంతకీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబడుతుందా లేదా? ఈ రివ్యూలో చూద్దాం.

20:31 - August 13, 2016

మంత్రాలు చదివి నిరసన తెలుపుతున్న అయ్యవార్లు..నల్లగొండలో నీళ్లు లేని పుష్కరఘాట్లు..హిందువుల గుడి కట్టేందుకు చందా ఇచ్చిండంట..గ్యాంగ్ స్టర్ నయీం..ఎయ్యి రూపాలు కట్టండి..బంగారం గెలువుండ్రంటున్న లాటరీ స్కీము.. ప్రేమించమని పిలగాని ఎంట పడి ఏధించిన పోరి..పురుగుమందు తాగి సచ్చిపోయిన పోరగాడు..మందిని ఎంటబెట్టుకుని రియోకి ఉరికినమంత్రి..కుక్కపిల్ల పోయింది ఎతికిపెట్టండి అంటున్న ఆగ్రా ఎంపీ భార్య..ఎంపీగారి ఎతికేందుకు పోలీసులు బలగాలు..తిరుమల కొండపై కొండసిలవ హల్ చల్..లంబాడాల్ల పండగను షురూ చేసిన పట్నపు ఆడబిడ్డలు..గిసువంటి మస్తు ముచ్చట్లు చూడనీకి ఈ బొమ్మల పెట్టిని క్లిక్ చేయుండ్రి మల్ల..

20:01 - August 13, 2016

గుంటూరు : కృష్ణా నదికి ఉన్న చరిత్ర ఈ నాటిది కాదు. ఎక్కడో మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ప్రవేశించే కృష్ణమ్మ పుష్కరాల వేడుక జరుపుకుంటోంది. కృష్ణానదిపై ప్రాజెక్టులు, ఆనకట్టలు కట్టడం వల్లే అనేక ప్రాంతాలు సస్యశ్యామలం అవుతున్నాయి. కృష్ణా జలాల వచ్చిన తర్వాతే రకరకాల పంటలు పండిస్తున్నామని చెబుతున్నారు. కృష్ణానది ప్రాశస్త్యం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

19:55 - August 13, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీం డైరీలో పోలీసు అధికారుల ఆస్తుల చిట్ట బయటపడింది. డీజీ నుంచి ఎస్సై వరకు నయీం ఆస్తులు పంచిన విషయం వెలుగులోకి వచ్చింది. నయీం డైరీలో అధికారుల ఆస్తుల చిట్టా బయటపడింది. డీజీ నుంచి ఎస్‌ఐ వరకు ఆస్తులు పంచిన నయీం తన డైరీలో వ్రాసుకున్నట్లుగా తెలుస్తోంది. యాదగిరిగుట్టలో డీజీ స్థాయి అధికారికి 80 ఎకరాల భూమి ఇచ్చినట్లుగా డైరీలో నయీం పేర్కొన్నాడు. ఇంటెలిజెన్స్‌లో పని చేస్తున్న ఓ అధికారికి రెండు ఖరీదైన కార్లు కొనిచ్చినట్లుగా వుంది. రంగారెడ్డి జిల్లాలో డీఐజీకి 12 ఎకరాల భూమిని నయీం ఇచ్చినట్లుగా డైరీలో పేర్కొన్నాడు. పోలీసుల నుండి తప్పించుకోవటానకి నయీం ఆడవేషాలు వేసుకుని సంచరించేవాడు. నయీం నివాసంలో పలురకాల విగ్గులు..బట్టలు వున్నట్లుగా అధికారులు గుర్తించారు.

19:46 - August 13, 2016

హైదరాబాద్‌ : మాదాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. మ్యాన్‌హోల్‌లో పడి నలుగురు దుర్మరణం పాలయ్యారు. హైటెక్ సిటీ నుంచి అయ్యప్ప సొసైటీ మార్గంలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు మున్సిపల్ కార్మికులు మ్యాన్ హోల్ లో పడిపోగా.. వారిని రక్షించేందుకు వెళ్లిన స్థానికుడు కూడా వారితో పాటు చనిపోయాడు. నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. కాగా మ్యాన్ హోల్ లో వుండే గ్యాస్ కారణంగానే పడినవారు చనిపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు.  

19:39 - August 13, 2016
19:35 - August 13, 2016

అనంతపురం : స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు రోజుల ముందే అనంతపురంలో సందడి మొదలైంది. 2800 అడుగుల భారీ జాతీయ జెండాతో విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరు కాగా.. మంత్రులు పరిటాల సునిత, పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతపురాన్ని స్మార్ట్‌సిటీగా, ఇండస్ట్రియల్‌ హబ్‌గా చేయాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నట్లు కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అనంతపురంలో ప్రదర్శించిన జెండా.. దేశంలోనే అత్యంత పొడవైన జాతీయజెండాగా రికార్డు నమోదు చేసిందన్నారు త్రివర్ణపతాక రూపకర్త లక్ష్మినారాయణ.   

19:33 - August 13, 2016

కృష్ణాజిల్లా : కోడూరు మండలం ఉల్లిపాలెం వద్ద కారు బీభత్సం సృష్టించింది. పుష్కర భక్తులపైకి దూసుకెళ్లడంతో... ఒకరు మృతి చెందగా... మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం.. కారు నడుపుతున్న మహిళ పరారైంది. మృతుడు రమణయ్య కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయారు. కాగా ఈ కారు ఓ ప్రజాప్రతినిధిదిగా సమాచారం.

19:26 - August 13, 2016

గుంటూరు : పుష్కరాల సందర్భంగా గుంటూరు జిల్లాలోని పుష్కర ఘాట్లకు శనివారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా జిల్లాలో ఘాట్లను పరిశీలించి.. సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు.మొదటిరోజు కంటే రెండవరోజునే భక్తులు ఎక్కువగా తరలివస్తారని ఊహించామనీ దానికి తగ్గట్లుగా రద్దీని తగ్గట్టుగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే తెలిపారు. మూడురోజుల పాటు వరుసగా సెలవులు వుండటంతో భక్తులు ఎక్కువగా వస్తున్నారని తెలిపారు. రద్దీ పెరగటంతో శానిటేషన్, హెల్త్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటున్న కలెక్టర్ కాంతీలాల్ దండే తెలిపారు. అలాగే అన్నిఘాట్లలోనూ ఒకో ఇన్ చార్జ్ ను నియమించిన ప్రతీక్షణం ఏర్పాట్లును పరిశీలిస్తున్నామన్నారు. అన్ని ఘాట్లవద్ద మెడికల్..వాటర్ క్యాంప్ లను నిర్వహిస్తున్నామని తెలిపారు. 

19:14 - August 13, 2016

హైదరాబాద్ : మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. మ్యాన్ హోల్ లో పడి నలుగురు కార్మికులు మృతి చెందారు. ఒకరిని రక్షించేందుకు ఒకరు ప్రయత్నించడం కారణంగా ఈ నలుగురు కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ మ్యాన్ హోల్ లో విషవాయువుల కారణంగా వారు మృతి చెందినట్టు అధికారులు భావిస్తున్నారు. అధికారులు ఈ నలుగురి మృతదేహాలను బయటకు తీసే చర్యలు చేపట్టారు. కాగా గల్లంతైన నలుగురిలో ఇద్దరు స్థానికులు, ఇద్దరు కార్మికులుగా గుర్తించారు. 

19:09 - August 13, 2016

విజయవాడ : పుష్కరాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఏపీ డిజిపి సాంబశివరావు తెలిపారు. పుష్కర ఘాట్లలో భద్రతా ఏర్పాట్లను డిజిపి పరిశీలించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని డిజిపి తెలిపారు. వృద్దులు, పిల్లల కోసం ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. పుష్కరాలు పార్రంభంమైన రెండోరోజు మొదటిరోజుకంటే రెండవరోజు పుష్కర స్నానానికి వచ్చే యాత్రీకుల సంఖ్య పెరిగిందని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతీరోజూ రివ్వ్యూలు జరుపుతున్నారని పేర్కొన్నారు. దుర్గమ్మ గుడి నుండి కుమ్మరిపాలెం వరకూ ఉచితంగా సిటీ సర్వీస్ నడిపే యోచనలో వున్నట్లుగా తెలిపారు. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు తగ్గించామని పేర్కొన్నారు.

పుష్కర భక్తులపైకి దూసుకెళ్లిన కారు..

కృష్ణా : కోడూరు వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. పుష్కర భక్తులపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలాయ్యయి. కాగా ఈ కారును ఓ మహిళ నడుపుతున్నట్లుగా గుర్తించారు. కారు నడిపే మహిళ ప్రమాదం జరగగానే పరారైనట్లుగా తెలుస్తోంది. 

మ్యాన్ హోల్ లో పడి 4గురు మృతి..

హైదరాబాదు: మాదాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. అయ్యప్పసొసైటీలోని మ్యాన్ హోల్ లో పడి నలుగురు కార్మికులు మృతి చెందారు. ఒకరిని రక్షించేందుకు ఒకరు ప్రయత్నించడం కారణంగా ఈ నలుగురు కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ మ్యాన్ హోల్ లో విషవాయువుల కారణంగా వారు మృతి చెందినట్టు అధికారులు భావిస్తున్నారు. అధికారులు ఈ నలుగురి మృతదేహాలను బయటకు తీసే చర్యలు చేపట్టారు.

18:10 - August 13, 2016

మహబూబ్‌నగర్‌ : పుష్కరాల సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో వీఐపీ ఘాట్ల వద్ద అధికారులు ఏరియల్‌ ద్వారా సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం... ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఏరియల్ సర్వేతో సమీక్షించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వీఐపీ ఘాట్ల వద్ద ఏరియల్‌ సర్వేపై మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

18:01 - August 13, 2016

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ సమస్యలతో సతమతమవుతోంది.. ఏళ్లతరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు జీతాలకోసం అల్లాడిపోతున్నారు.. వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియక... వచ్చే ఆ కాస్త డబ్బు సరిపోక నరకం అనుభవిస్తున్నారు.. ఎంతమంది వీసీలు మారినా... ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమ జీవితాలు మాత్రం అలాగే ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు..

అరకొర జీతాలతో అధ్యాపకుల ఇబ్బందులు..
అరకొర జీతాలతో ఉస్మానియా విశ్వవిద్యాలయం కాంట్రాక్ట్‌ అధ్యాపకులు అష్టకష్టాలు పడుతున్నారు.. ఏళ్లతరబడి విధులు నిర్వహిస్తున్నా.. కనీసం ప్యూన్‌కు ఇచ్చేపాటి జీతం కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. 20ఏళ్ల అనుభవంఉన్నా జీతం 20వేలుకూడా రావడంలేదని ఆందోళన చెందుతున్నారు..

ఓయూలో రెగ్యులర్‌ అధ్యాపకుల పోస్టులు 1254
దేశంలోని టాప్‌ యూనివర్శిటీల్లో ఒకటిగాఉన్న ఓయూని అధ్యాపకుల కొరత వేధిస్తోంది.. యూజీసీ నిబంధనలప్రకారం యూనివర్సిటీలో 1254మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండాలి.. యూనివర్శిటీలోమాత్రం ప్రస్తుతం కేవలం 550మంది మాత్రమే పనిచేస్తున్నారు.. ఇందులో 200మంది ప్రొఫెసర్లు వచ్చే ఏడాది రిటైర్‌ కాబోతున్నారు.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2019వరకు మొత్తం 48 డిపార్ట్‌మెంట్లలో ఒక్క ప్రొఫెసర్‌కూడా ఉండరు.. ఈ పరిస్థితుల్లో పాఠాలు చెప్పే బాధ్యత కాంట్రాక్ట్‌ అధ్యాపకులపై పడుతోంది..

పీజీలు, పీహెచ్‌డీలు చేసినా అరకొర జీతాలు..
రెగ్యులర్‌ సిబ్బంది కొరత కారణంగా.. యూనివర్శిటీలో 441మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులను తీసుకున్నారు. రెగ్యులర్‌ సిబ్బందితో సమానంగా కష్టపడి పనిచేస్తున్నావీరి కష్టాన్ని గుర్తించేవారే కరువయ్యారు.. పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వీరికి పదో తరగతి చదివిన ప్యూన్‌కంటే అధ్వాన్నంగా జీతాలున్నాయి.. కాంట్రాక్ట్, టీచింగ్, నాన్‌టీచింగ్ ఇలా అన్ని విభాగాల సిబ్బందీ ఇదే సమస్యతో బాధ పడుతున్నారు.. జీతాలు పెంచాలంటూ వీరు ఎన్నోసార్లు రోడ్డెక్కారు.. అయినా ఎలాంటి స్పందనా రావడంలేదంటున్నారు కాంట్రాక్ట్‌ అధ్యాపకులు..

రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు దాటినా తీరని కష్టాలు
తెలంగాణ రాష్ట్రంలోనైనా తమ కష్టాలు తీరతాయని భావించిన అధ్యాపకులకు నిరాశే ఎదురవుతోంది.. రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు దాటినా ఇంతవరకూ వీరి సమస్యపై సర్కారు దృష్టిపెట్టలేదు.. కాంట్రాక్ట్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేస్తామన్న సీఎం కేసీఆర్‌.. ఇంతవరకూ ఈ హామీ అమలుదిశగా చర్యలు చేపట్టలేదు..

యూజీసీ ప్రకారం జీతాలివ్వాలంటున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు..
యూజీసీ నిబంధనల ప్రకారం తమకు జీతాలివ్వాలంటూ ఓయూ కొత్త వీసీని కలిశారు కాంట్రాక్ట్ అధ్యాపకులు.. వీరీ సమస్యపై స్పందించిన వీసీ ​ఈ విషయం తమ దృష్టిలోఉందని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు..

ప్రభుత్వ విద్యను నీరుగార్చే కుట్ర
యూజీసీ నిబంధనలప్రకారం తాము నియమితులైనా జీతాల విషయంలో తమకు అన్యాయమే జరుగుతోందని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు.. 2006 పేస్కేల్ ప్రకారం జీతాలిచ్చినా తమకు కొంతవరకైనా న్యాయం జరిగేదనిఅభిప్రాయపడుతున్నారు.. ప్రభుత్వ విద్యను నీరుగార్చే కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు..

సమస్యలు తీరేవరకూ ఆందోళనలు తప్పవంటున్న అధ్యాపకులు
తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు తప్పవని కాంట్రాక్ట్ అధ్యాపకులు హెచ్చరిస్తున్నారు.. త్వరగా జీతాలు పెంచి తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.. 

17:50 - August 13, 2016

నల్లగొండ : జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మిర్యాలగూడ మార్కెట్ యార్డులో భోజనం ఏర్పాట్లు చేశారు. హరే రామ హరే కృష్ణ, అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో పాటు జిల్లా రెవిన్యూ యంత్రాంగం కలిసి ఈ భోజన ఏర్పాట్లు చేశారు. నాగార్జునసాగర్‌ మొదలుకొని మట్టపల్లి వరకు గల అన్ని ఘాట్లకు సమయానికి భోజనం అందేలా చర్యలు చేపట్టారు. పుష్కర ఘాట్లలో విధుల్లో ఉన్న దాదాపు పదివేల మందికి నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడమే తమ లక్ష్యమని చెబుతున్న..భోజన సదుపాయాల బాధ్యులు, మిర్యాలగూడ తహసీల్దార్‌ కృష్ణారెడ్డి చెప్పే వివరాల కోసం ఈ వీడియో చూడండి..

17:33 - August 13, 2016

కరీంనగర్ : నయీం గ్యాంగ్‌తో కలిసి భూదందాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులు కరీంనగర్‌లో అరెస్ట్‌ అయ్యారు. నగునూరుకు చెందిన గోవర్ధనచారి అలియాస్‌ గోపి, మరో వ్యక్తి రమేష్‌ను కరీంనగర్‌లో సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నయీం గ్యాంగ్‌తో కలిసి భూదందాలకు పాల్పడిన ఇద్దరు అరెస్ట్‌ కరీంనగర్‌లో అదుపులోకి తీసుకున్న సిట్‌ అధికారులు తెలిపారు. నయీం కేసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని సిట్ అధికారి నాగిరెడ్డి తెలిపారు. 4 హత్య కేసుల్లో నయీంకు సంబంధాలున్నట్లుగా గుర్తించామన్నారు.

17:25 - August 13, 2016

ప్రముఖ టిబెట్ ఆధ్యాత్మిక గురువు 'దలైలామా'ను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కలిశారు. సల్మాన్ తో పాటు ఆయన గర్ల్ ఫ్రెండ్ లులియా వాంతూరు కూడా ఉండడం గమనార్హం. కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ట్యూబ్ లైట్' చిత్రం షూటింగ్ లడఖ్ లో జరుగుతోంది. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. తిరిగి ముంబై కు పయనం అయ్యే ముందు సల్మాన్, తన ప్రియురాలు లులియా వాంతూరుతో కలిసి బౌద్ధమత గురువు దలైలామాను కలిశారు. ఈ సందర్భంగా వీరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయో తెలియరాలేదు. ఆశీస్సుల కోసమే వెళ్లారా ? అనేది తెలియాల్సి ఉంది. దలైలామాకు ఒక వైపున ఉన్న సోఫాలో సల్మాన్, వాంతూర్ లు కూర్చోగా, మరో వైపు దలైలామా సహాయకులు ఉన్నారు. వీరు కూర్చొన్న ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

17:18 - August 13, 2016

గ్రాస్ ఐలెట్ : సెయింట్‌ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. భువనేశ్వర్‌ చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్‌ను 225 పరుగులకే కుప్పకూల్చింది. రెండో ఇన్నింగ్స్‌లో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా అజింక్యా రహానే, రోహిత్‌ శర్మ కీలక భాగస్వామ్యం నమోదు చేసి భారత జట్టును ఆధిక్యంలో నిలిపారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సరికి భారత్‌ 285 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది రహానె (51 బ్యాటింగ్, 93 బంతుల్లో 1x4) అర్ధశతకం సాధించగా రోహిత్ శర్మ (41 బ్యాటింగ్, 57 బంతుల్లో 1x4, 3x6) సహకారం అందిస్తున్నాడు. విండీస్ బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు తీయగా ఛేజ్ ఒక వికెట్ తీశాడు. 

కాసేపట్లో సికింద్రాబాద్ కు సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాసేపట్లో సికింద్రాబాద్‌లోని చర్చిని సందర్శించనున్నారు. చర్చి నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్బంగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. 

రేపు విజయవాడకు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్..

విజయవాడ : కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ రేపు విజయవాడకు రానున్నారు. కృష్ణా పుష్కర స్నానం ఆచరించడానికి ఆయన ఇక్కడికి రానున్నారు. మధ్యాహ్నం సీఎం చంద్రబాబును కలువనున్నట్లు తెలుస్తోంది. 

మాల్యాపై సీబీఐ 420 కేసు...

ఢిల్లీ : ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాపై సీబీఐ 420 కేసు నమోదు చేసింది. వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలుగా పొందిన విజయ్ మాల్యా 17 బ్యాంకులను 9 వేల కోట్ల రూపాయలకు నిలువునా ముంచేసి పారిపోయినట్లు ఆరోపణలున్న సంగతి తెలిసిందే. 

17:07 - August 13, 2016

ఒలింపిక్స్ మెన్స్ బాక్సింగ్‌లో భారత బాక్సర్‌ వికాస్‌ కృష్టన్‌ యాదవ్‌ సంచలనం సృష్టించాడు. పురుషుల 75 కేజీల విభాగంలో వికాస్‌ క్వార్టర్‌ ఫైనల్స్ కు అర్హత సాధించాడు. ఒలింపిక్స్ లో ఎటువంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా బరిలోకి దిగిన 24 ఏళ్ల వికాస్‌ ప్రీక్వార్టర్‌ఫైనల్‌ రౌండ్‌లో టర్కీకి చెందిన సిపాల్‌ ఓండర్‌పై 3-0తో నెగ్గాడు. తొలి రౌండ్‌ నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన వికాస్‌...మూడు రౌండ్లలోనే ప్రత్యర్ధిని ఓడించాడు. క్వార్టర్‌ఫైనల్‌లో నెగ్గి వికాస్‌ సెమీ ఫైనల్స్ కు అర్హత సాధిస్తే భారత్‌కు బాక్సింగ్‌లో ఓ పతకం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 

17:05 - August 13, 2016

బ్యాడ్మింటన్‌ ఉమెన్స్ డబుల్స్ లో భారత జట్టు పోటీ దాదాపుగా ముగిసింది. డబుల్స్ లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన గుత్తా జ్వాల-అశ్వినీ జోడీ రెండో గ్రూప్‌ పోటీలోనూ విఫలమయ్యారు. తొలి రౌండ్‌ పోటీలో నెదర్లాండ్స్ జోడీ పీక్‌-మస్కెన్స్ చేతిలో ఓడి శుభారంభం చేయలేకపోయిన భారత జోడీకి రెండో రౌండ్‌ జపనీస్‌ జోడీ షాకిచ్చింది. రెండో రౌండ్‌లో టకాహషీ-మత్సుతోమో జోడీకి జ్వాల-అశ్వినీ జోడీ అసలే మాత్రం పోటీఇవ్వలేకపోయారు. వరుస సెట్లలో జ్వాల జోడీని చిత్తు చేసి ప్రీ క్వార్టర్‌ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించారు. ఈ ఓటమితో డబుల్స్ లో జ్వాల-అశ్వినీ జోడీ పోటీ దాదాపుగా ముగిసింది. ఆఖరి రౌండ్‌ మ్యాచ్‌లో భారత జోడీ థాయ్‌ల్యాండ్‌కు చెందిన సుపజ్రకూల్‌, తీరతాంచాయ్‌ జోడీతో పోటీపడతారు. 

17:04 - August 13, 2016

మహబూబ్‌నగర్‌ : వరుస సెలవులు రావడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం రద్దీగా మారింది. జాతీయ రహదారిని అత్యంత సమీపంలో ఈ ఆలయం ఉండటం, ఆంజనేయస్వామి కోరిన కోర్కెలు తీర్చుతాడన్న నమ్మకం ఉండటంతో.. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక్కడికి తరలివచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

16:59 - August 13, 2016

నల్లగొండ : జిల్లా నాగార్జున సాగర్ లో పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు నిరాశే ఎదురవుతోంది. నాగార్జున సాగర్ అందాలకను వీక్షిస్తామనుకున్న భక్తులకు ప్రభుత్వ ఏర్పాట్లతో పుష్కర స్నానంతోనే వెనుతిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇంతదూరం వచ్చిన యాత్రీకులకు పర్యాటకంగా ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగార్జున సాగర్ లో పర్యాటక ఏర్పాట్ల వైఫల్యాన్ని ఈ వీడియోలో చూడండి..

త్వరలో అఖిలపక్షం - టి.డిప్యూటి సీఎం..

హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లా తప్ప మిగతా అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులు తమ ప్రతిపాదనలకు అంగీకరించారని డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ పేర్కొన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశ తేదీల ప్రకటన చేస్తామన్నారు. 

డ్రాఫ్టులో సిరిసిల్ల పేరు లేదు - జీవన్ రెడ్డి..

హైదరాబాద్ : కేబినెట్ సబ్ కమిటీతో కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు జరిపిన భేటీ ముగిసింది. కోహెడ, హుస్నాబాద్, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలను కరీంనగర్ జిల్లాలోనే ఉంచాలని కోరడం జరిగిందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. డ్రాఫ్టులో సిరిసిల్ల పేరు లేదని, పెద్దపల్లిని కలుపుకుని రామగుండంను జిల్లా చేస్తే ఇండస్ట్రియల్ సెంటర్ గా ఎదుగుతుందన్నారు. 

16:52 - August 13, 2016

హైదరాబాద్ : ఓల్డ్‌ బోయిన్‌పల్లి కాల్పుల ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఘటనా స్థలాన్ని హైదరాబాద్‌ సీపీ మహేందర్‌ రెడ్డి పరిశీలించారు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. కాల్పులకు భూ వివాదాలే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాంగ్రెస్‌ నేత యాదగిరిపై కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులు టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇటు ప్రస్తుతం ఆస్పత్రిలో కాంగ్రెస్‌ నేత యాదగిరి చికిత్స పొందుతున్నాడు. యాదగిరికి ఆపరేషన్‌ చేసి కడుపులోని బుల్లెట్లను డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం యాదగిరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు.

యాదగిరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న డాక్టర్లు
ఆపరేషన్‌ చేసి కడుపులోని బుల్లెట్లను తొలగించిన వైద్యులు..సికింద్రాబాద్‌ ఓల్డ్ బోయిన్‌పల్లి ప్రాంతంలో రౌడిషీటర్‌ కాల్పుల్లో గాయపడ్డ కాంగ్రెస్‌ నేత యాదగిరికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెబుతున్నారు. రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం యాదగిరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

భూవివాదాలతోనే కాల్పులు : సీపీ మహేందర్ రెడ్డి
ఓల్డ్ బోయిన్ పల్లిలో కాంగ్రెస్‌ నేత యాదగిరిపై జరిగిన కాల్పులకు భూ వివాదాలే కారణమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందని, ఈ పెనుగులాటలోనే కాల్పులు జరిగాయని ఆయన వివరించారు. కాల్పులు జరిగిన తర్వాత బుల్లెట్ గాయాలతోనే యాదగిరి పోలీసు స్టేషన్‌కు వచ్చారని చెప్పారు. అయితే ఈ ఘటనలో ఉపయోగించిన తుపాకి ఎవరిదనే విషయమై ఇంకా స్పష్టత లేదన్నారు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని సీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం యాదగిరి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని, ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అల్వాల్‌లో ఓ భూ వివాదానికి సంబంధించి యాదగిరికి, మరో వ్యక్తికి మధ్య గొడవలు ఉన్నాయని, వాటి నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చని తెలిపారు.

16:29 - August 13, 2016
16:16 - August 13, 2016

బాల నటుడిగా కేరీర్ ను ప్రారంభించిన 'బాలాదిత్య' ఓ ఇంటి వాడయ్యాడు. జూబ్లిహిల్స్ లోని తాజ్ మహల్ హోటల్ లో ఆయన వివాహ వేడుక జరిగింది. కుటుంబసభ్యులు..స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోను నటుడు శివ బాలాజీ సోషల్ మీడియా ద్వారా వెళ్లడించారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను శివ బాలాజీ పోస్టు చేశారు.
బాల‌న‌టుడిగా కెరీర్‌ను ప్రారంభించిన బాలాదిత్య హీరోగానూ సినిమాలు చేశాడు. 'ఎదురింటి మొగుడు ప‌క్కింటి పెళ్లాం' సినిమాతో బాల‌న‌టుడిగా సినీ రంగానికి ప‌రిచ‌యమయ్యాడు. ఆ చిత్రం త‌ర్వాత 'అన్న', 'లిటిల్ సోల్జ‌ర్స్', 'బంగారు బుల్లోడు', 'హిట్ల‌ర్', 'అబ్బాయిగారు', 'ఏవండీ ఆవిడ వ‌చ్చింది', 'హ‌లో బ్ర‌ద‌ర్' వంటి చిత్రాల్లోనూ బాల న‌టుడిగా మెప్పించాడు. జ‌య‌. బి ద‌ర్శ‌క‌త్వంలో 'చంటిగాడు' చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మయ్యాడు. ఆ త‌ర్వాత 'రూమ్ మేట్స్', '1940లో ఒక గ్రామం' వంటి చిత్రాల్లో నటించాడు. 

కాల్పుల ఘటనలో లొంగిపోయిన ఇద్దరు వ్యక్తులు...

హైదరాబాద్ : బోయిన్ పల్లిలో కాంగ్రెస్ నేత యాదగిరిపై కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులు సికింద్రాబాద్ టాస్క్ పోర్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. బాబుతో పాటు మరో వ్యక్తి లొంగిపోయాడు. యాదగిరిపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. 

గుంటూరులో ట్రాఫిక్ నిబంధనల సడలింపు...

గుంటూరు : ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు సడలించారు. మంగళగిరి, మహానాడులోని పుష్కర నగర్ ల నుండి సీతానగరం వరకు మినీ బస్సులకు అనుమతినిచ్చారు. దీనితో ఘాట్ కు భక్తులు నేరుగా చేరుకుంటున్నారు. 

ఏపీ పుష్కరాలు ప్రశాంతం - సీఎం..

విజయవాడ : ఏపీ పుష్కరాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పద్మావతి ఘాట్ వద్ద ఆడుకుంటూ వెళ్లి బాలుడు మృతి చెందాడని తెలిపారు. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను చంద్రబాబు మీడియాకు చూపించారు. ఐవీఆర్ ఎస్, సీసీ కెమెరాలు, డ్రోన్ ల ద్వారా ఘాట్ల వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. పుష్కరాలపై సోషల్ మీడియా, యూ ట్యూబ్ లలో ప్రచారం చేసిన వారిలో ఒకరిని ఎంపిక చేసి స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇస్తామన్నారు. దుర్గాగుడిపై రూ. 500 వీఐపీ దర్శనం టికెట్ పై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రూ. 300 కి తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

15:51 - August 13, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీంను పెంచి పోషించింది ప్రభుత్వాలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ప్రభుత్వాలకు అడ్డంగా ఉన్నవారిని, లేదా ప్రభుత్వాలు ఎవరినైనా చంపాలనుకుంటే నయీంను ఉపయోగించుకునే వారన్నారు. మావోయిస్టు నేతలను, పౌరహక్కుల సంఘాల నేతలను ప్రభుత్వం చంపితే గొడవలు జరుగుతాయన్న ఉద్దేశంతో నయీంను వాడుకునేవారిని చెప్పారు. నయీం టీఆర్ఎస్ నేతలనే టార్గెట్‌ చేయడంతోనే ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపారని నారాయణ ఆరోపించారు. నయీంను హతమార్చాలనుకుంటే రెండేళ్లుగా ఎందుకు ఊరుకున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల జోలికి వెళ్లపోతే నయీంను చంపేవాళ్లు కాదన్నారు. 

15:48 - August 13, 2016

హైదరాబాద్ : బైక్‌పై వచ్చి యాదగిరిపై కాల్పులు జరిపింది అల్వాల్‌ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ డక్కల బాబుగా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజిలో డక్కల బాబుని స్పష్టంగా గుర్తించినట్లు పోలీసులు చెప్తున్నారు. పరారీలో ఉన్న అతడి కోసం ప్రస్తుతం పోలీసులు విస్త్రతంగా గాలిస్తున్నారు. భువనగిరి, ఎల్బీనగర్‌లో జరిగిన హత్యకేసుల్లో డక్కల బాబు నిందితుడని పోలీసులు చెప్తున్నారు. గతంలోనే బాబుపై గోపాలరావుపేటలో హత్యాయత్నం కేసు నమోదైంది. దీంతో కొంతకాలంగా బాబు అజ్ఞాతంలో ఉన్నాడు. యాదగిరిపై కాల్పులకు భూ తగాదాలేనా..లేకుంటే వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బైక్ వచ్చి కాల్పులు..
సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లి ప్రాంతంలో కాల్పుల కలకలం చెలరేగింది. మల్లికార్జున నగర్ ప్రాంతానికి చెందిన యాదగిరి అనే కాంగ్రెస్ నాయకుడు టార్గెట్‌గా కాల్పులు జరిగాయి. యాదగిరి ఇంట్లోకి వెళ్తుండగా బైక్ మీద వచ్చిన దుండగులు..ఆయనపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అయిదే యాదగిరి కడుపులోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లినట్లు తెలిసింది. దుండగులు తాము కాల్పులు జరిపిన తుపాకిని కూడా అక్కడే విడిచిపెట్టి అక్కడి నుంచి పరారయ్యారని తెలుస్తోంది. రక్తపు మడుగులో ఉన్న యాదగిరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆయనను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సర్జరీ చేసిన వైద్యులు... ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందన్నారు. భూవివాదంతోనే ప్రత్యర్థులు యాదగిరిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భూవివాదాలలో యాదగిరి పేరు తరచుగా వినిపిస్తోందని స్థానికులు అంటున్నారు.

15:44 - August 13, 2016

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ కోర్టు వద్ద భారీ భద్రత పెంచారు. నయీం అనుచరులు ఐదుగురు లొంగిపోతారన్న సమాచారంతో పోలీసులు భద్రత పెంచారు. రాజేంద్రనగర్ ఏసీబీ ఆఫీసులో సిట్ అధికారి ఐజీ నాగిరెడ్డి శనివారం కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సిట్ సభ్యులతో పాటు నల్లగొండ జిల్లా, హైదరాబాదు పరిధిలోని నార్సింగి, మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ పోలీసులు హాజరయ్యారు. ఇప్పటికే 24మంది నయీం అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. నయీమ్ భార్య ఫర్హానా, తమ్ముడు ఫయీం శక్రవారంనాడు రాజేంద్రనగర్ కోర్టును లొంగిపోయిన సంగతి తెలిసిందే. పోలీస్ స్టేషన్ లో లొంగిపోతే పరిస్థితులు ఎలావుంటాయో అనే యోచనతో ఇదే దారిలో మరో ఐదుగురు అనుచరులు సరాసరి కోర్టులో లొంగిపోయేందుకు సిద్ధపడినట్లుగా సమాచారం. నయీం అనుచరులను కోర్టుకు వెళ్లనీయకుండా.. మధ్యలోనే అడ్డుకుని అరెస్ట్‌ చేసేందుకు సిట్‌ అధికారులు రంగం సిద్ధం చేశారు.

యాదగిరిపై కాల్పులు జరిపిన నిందితులు గుర్తింపు..

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లి ప్రాంతంలో యాదగిరి అనే కాంగ్రెస్ నాయకునిపై ఇవాళ గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించటం గమనించదగిన విషయం. నిందితులు హస్మత్‌నగర్‌కు చెందిన డొక్కల బాబు, రాజుగా పోలీసులు గుర్తించారు. సంఘటానా స్థలంలో సీసీ టీవీ ఫూటేజీ ఆధారంగా నిందితులను గుర్తించగలిగా

14:57 - August 13, 2016

హైదరాబాద్ మహానగరం దేశంలోనే హాట్ టాపిక్ గా మారడానికి కారణాలు ఏంటీ ? నాలుగు ప్రధాన నగరాలకు ధీటుగా ఈ నగరం శరవేగంగా ఎందుకు అభివృద్ధి చెందుతోంది ? పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆవాసాలను ఏర్పాటు చేయడంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది ? నగరంలో గృహ యజమానుల నమ్మకాలను ఆ సంస్థ నిలబెడుతోంది. రెండు దశాబ్దాలకు పైగా కన్ స్ట్రక్షన్ రంగంలో ఎన్నో విజయవంతమైన ప్రాజెక్టులను నిర్మించి శభాష్ అనిపించుకొంటోంది. ఈ సంస్థ ఇటీవలే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ప్రారంభించింది. ఆ సంస్థ వివరాలు ఎంటీ ?

  • ప్లాట్లు..అపార్ట్ మెంట్ కొనేమందు రిజిస్ట్రేషన్ లపై ఎన్నో అనుమానాలు ఉంటాయి. మోసగాళ్ల బారిన పడకుండా తమ ప్రాపర్టీని ఎలా రిజిష్టర్ చేసుకోవచ్చు ? ఇటీవల రిజిష్టర్ శాఖలో వచ్చిన మార్పులేంటీ ?
  • హైదరాబాద్ విశ్వనగరం తమకు ప్రాపర్టీ ఉండాలని అనుకుంటారు అందరూ. అక్కడ ఏ ప్రాంతాల్లో ఎలాంటి సదుపాయాలున్నాయి ? తమ బడ్జెట్ కు అనువైన రీతిలో లభించే ప్రాపర్టీ కోసం ఆరా తీస్తుంటారు. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి ? ఎంతున్నాయి ?
  • వివిధ గృహాల్లో కొలువుదీరుతున్న మోడలర్ కిచెన్ విశేషాలు..
  • సొంతింటి కల నెరవేరాక ఆ ఇంటికి కొత్త సొబగులు అద్దాలి అనుకుంటారు అందరు. అయితే ఆ ఇంట్లోని వివిధ గదులకు ఎటువంటి ఇంటీరియర్ అవసరమో.. దానికి ఎంత ఖర్చు అవుతుందో అన్న సందేహంలో చాలా మంది ఉంటారు. మరి మీ అనుమానాలకు తావు లేకుండా.. వివిధ ఇంటీరియర్ డిజైన్స్ వాటి తీరు తెన్నులు తెలుసుకోవాలని అనుకుంటున్నారా ?

ఈ అంశాలపై పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:52 - August 13, 2016

చిత్తూరు : ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు పుంగనూరు కోర్టులో మరో మెర్సీ కిల్లింగ్‌ పిటిషన్‌ దాఖలైంది. నాలుగేళ్ల మహేశ్‌ అనే పిల్లాడు బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. దీంతో నిరుపేదలైన మహేష్‌ తల్లిదండ్రులు వైద్యం చేయించలేదని స్థితిలో ఉండడంతో వారు.. మహేష్‌ను మెర్సీ కిల్లింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. పుంగనూరు కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. 

14:50 - August 13, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల విభజనపై ఎంసీహెచ్‌ఆర్డీ భవనంలో రెండోరోజు సమావేశం ముగిసింది. రెండో రోజు సమావేశానికి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతో కేబినెట్‌ సబ్‌కమిటీ చర్చలు జరిపింది. ఈ రెండు జిల్లాల విభజనపై అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు తమ తమ అభిప్రాయాలను సబ్‌ కమిటీకి తెలిపారు. అయితే దీనిపై ప్రజాప్రతినిధులు స్పందిస్తూ..హైదరాబాద్‌ను విభజిస్తే హైదరాబాద్‌ బ్రాండ్‌ పడిపోతుందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిని ఓ జిల్లాగా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం డ్రాఫ్ట్‌కాపీ ఇవ్వకుండా సమావేశం పెట్టడం సరైంది కాదని ప్రశ్నించారు. 

14:46 - August 13, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లి ప్రాంతంలో కాల్పుల కలకలం చెలరేగింది. మల్లికార్జున నగర్ ప్రాంతానికి చెందిన యాదగిరి అనే కాంగ్రెస్ నాయకుడు టార్గెట్‌గా కాల్పులు జరిగాయి. యాదగిరి ఇంట్లోకి వెళ్తుండగా బైక్ మీద వచ్చిన దుండగులు..ఆయనపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అయిదే యాదగిరి కడుపులోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లినట్లు తెలిసింది. దుండగులు తాము కాల్పులు జరిపిన తుపాకిని కూడా అక్కడే విడిచిపెట్టి అక్కడి నుంచి పరారయ్యారని తెలుస్తోంది. రక్తపు మడుగులో ఉన్న యాదగిరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆయనను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. స్థానికులు కూడా కాల్పుల విషయాన్ని ధృవీకరిస్తున్నారు. భూవివాదంతోనే ప్రత్యర్థులు యాదగిరిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భూవివాదాలలో యాదగిరి పేరు తరచుగా వినిపిస్తోందని స్థానికులు అంటున్నారు.

ప్రస్తుతం యాదగిరి పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందన్న వైద్యులు
బైక్‌పై వచ్చి యాదగిరిపై కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు విస్త్రతంగా గాలిస్తున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కాల్పులు జరిపిన దుండగులు ఎవరనే దానిపై ఆరాతీస్తున్నారు. ఇటీవలే అల్వాల్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఆ ఘటనకు, ఇప్పటి ఘటనకు ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే యాదగిరిపై కాల్పులు జరిపింది డక్కల బాబు అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు అల్వాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతడిపై గతంలో రౌడీషీట్‌ను పోలీసులు తెరిచారు. సీసీటీవీ ఫుటేజిలో అతడిని గుర్తించినట్లు పోలీసులు చెప్తున్నారు. పరారీలో ఉన్న అతడి కోసం ప్రస్తుతం పోలీసులు విస్త్రతంగా గాలిస్తున్నారు. పోలీసు కమిషనర్ కూడా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రక్రియను పరిశీలిస్తున్నారు. అయితే యాదగిరిపై కాల్పులకు భూ తగాదాలేనా..లేకుంటే వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రణాళికబద్ధంగా హైదరాబాద్ అభివృద్ధి - మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : ప్రణాళికబద్ధంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలని, మూడు నెలల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైటెక్స్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కొత్తగా ఏర్పడనున్న అన్ని జిల్లా కేంద్రాలకు కూడా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ రంగం సహకరించాలన్నారు. వచ్చే ఏడాదికి మెట్రో పూర్తవుతుందని, రెండో దశ 53 కి.మీటర్ల నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. 

కాల్పులు జరిపింది అల్వాల్ రౌడీషీటర్..

హైదరాబాద్ : అల్వాల్ చెందిన రౌడీషీటర్ బాబు కాల్పులు జరిపాడు. కాల్పుల్లో యాదగిరికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కాల్పుల జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. భూ తగదాలే కారణమని తెలుస్తోంది. 

విబేధాలు సృష్టించేలా చేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక - మంత్రి నారాయణ..

విజయవాడ : రాష్ట్ర విభజనపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రజల్లో విబేధాలు సృష్టించేలా చేసిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 13 జిల్లాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా నివేదిక ఉందని, రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్లు వేయాలని సింగపూర్ కు కంపెనీకు తాము చెప్పడం జరిగిందన్నారు. 

ఉండవల్లి సెంటర్ లో పోలీసుల ఓవర్ యాక్షన్..

గుంటూరు : ఉండవల్లి సెంటర్ లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ట్రాఫిక్ ఆంక్షళ పేరిట ప్రజలను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారు. సీతానగరం ఘాట్ కు వెళుతున్న మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. వెహికల్ పాస్ లు చూపించినా పోలీసులు అనుమతించలేదు. 

చిత్తూరు జిల్లాలో మరో మెర్సీ కిల్లింగ్ పిటిషన్..

చిత్తూరు : జిల్లాలో మరో మెర్సీ కిల్లింగ్ పిటిషన్ దాఖలైంది. బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్న నాలుగేళ్ల కుమారుడిని మెర్సీ కిల్లింగ్ కు అనుమతించాలంటూ తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పుంగనూరు కోర్టు తిరస్కరించింది. 

14:08 - August 13, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీంను అంతమొందించడం మంచిదేనని మాజీ డీజీపీ దినేష్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతు నయీం కేసులో వివరణ ఇచ్చారు. తెలంగాణ పోలీసులకు దినేష్ రెడ్డి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ కు సలాం తెలిపారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలన్నారు. అమాయకులకు అన్యాయం జరగొద్దని చెప్పారు. ఏ డీజీపీ స్థాయి అధికారితో నయీంకు సంబంధం లేదని స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులను ఇన్ ఫార్మర్లుగా తీసుకోవడం సహజమన్నారు. నయీంను స్వలాభం కోసం వాడుకున్నవారిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. నయీం కేసును 'సిట్' నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుందని తెలిపారు. 

 

13:54 - August 13, 2016

హైదరాబాద్ : 'మా హక్కులను అడ్డుకునే వారికి జ్ఞానోదయం కలగాలి' అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ వ్యతికించే వారికి, తమ హక్కులను అడ్డుకునే  వారికి జ్ఞానోదయం కలగలన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడే వెంకయ్యనాయుడుపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. సుప్రీంకోర్టును అడ్డుపెట్టి వర్గీకరణ ఆపలేరన్నారు. పార్లమెంట్ లోనే ఎస్సీ వర్గీకరణ చట్టం చేయాలని ఉషామెహరా కమిషన్ సూచించిన విషయాన్ని ఆయన గుర్తించారు. 

 

రెండు రౌండ్లు కాల్పులు - సీపీ..

హైదరాబాద్ : యాదగిరిపై దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారని సీపీ వెల్లడించారు. దుండగుల నుండి యాదగిరి లాక్కున్న తుపాకీని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. 

13:50 - August 13, 2016

బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగం సంస్థ. కస్టమర్లను ఆకట్టుకోవడానికి బీఎస్ఎన్ఎల్ కష్టపడుతోంది. అందుకనుగుణంగా వివిధ రకాల ఆఫర్లతో ముందుకొస్తోంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆఫర్స్ ను ప్రకటించింది. ఆగష్టు 15 నుంచి ప్రతి ఆదివారం బీఎస్ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్ నుంచి ఏ నెట్‌వర్క్ కైనా ఉచితంగా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోనైనా, ల్యాండ్ లైన్ అయినా అన్ లిమిటెడ్‌గా మాట్లాడుకోవచ్చు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ నైట్ ఫ్రీ కాలింగ్ ప్లాన్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ల్యాండ్ కనెక్షన్ లు పెంచేందుకు ఈ ఆఫర్స్ తీసుకొచ్చిందని తెలుస్తోంది. ఆగష్టు 15 నుంచి 90 రోజుల్లోగా నూతన కనెక్షన్ తీసుకున్నవారు కేవలం రూ.49 నెలసరి ఛార్జీ చెల్లిస్తే సరిపోతుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. ప్రస్తుతం కొత్త కనెక్షన్‌కు రూ.500 ఇన్ స్టాలేషన్ ఛార్జీ తీసుకుంటుండగా, ఇక మీదట ఉచితంగా కనెక్షన్ ఇవ్వనున్నారు. ఈ ఆఫర్లతో ల్యాండ్ లైన్ కనెక్షన్లు భారీగా పెరుగుతాయని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఆశిస్తోంది. మరి కనెక్షన్లు పెరుగుతాయా ? లేదా ? అని చూడాలి. 

13:46 - August 13, 2016

హైదరాబాద్ : నయీం కేసులో సిట్ తమ విచారణను వేగవంతం చేసింది. రాజేంద్ర నగర్ ఏసీపీ కార్యాలయంలో... దర్యాప్తు అధికారులతో సిట్ చీఫ్ నాగిరెడ్డి భేటీ అయ్యారు. సేకరించిన ఆధారాలపై రివ్యూ చేస్తున్నారు. 

13:43 - August 13, 2016

విజయనగరం : జిల్లాలోని భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి.. మరో 1600 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ పై వామపక్షాలు భగ్గుమన్నాయి. భూసేకరణకు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తుండగా.. నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారని సీపీఎం, సీపీఐ నేతలు ప్రశ్నించారు. వెంటనే నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

13:40 - August 13, 2016

హైదరాబాద్ : ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన కృష్ణా పుష్కరాలలో కొన్ని చోట్ల మాత్రం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్‌లలో నీరు లేకపోవడంతో  పుణ్యస్నానం చేద్దామని వచ్చిన యాత్రికులు తీవ్ర నిరాశ చెందారు. నీరు లేక వెలవెలబోతున్న పుష్కర ఘాట్‌లపై ప్రత్యేక కథనం.. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది భక్తులు ఈ పుష్కరాలకు తరిలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం భక్తులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ఘాట్‌లలో నీరు లేకపోవడంతో భక్తులు పుష్కర స్నానం చేయకుండా వెనుదిరుగుతున్నారు. 
భక్తులకు స్వాగతం పలుకుతున్న  ఖాళీగా ఘాట్‌లు 
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో అనేక ఘాట్‌లు ఖాళీగా భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. ఘాట్‌లలో నీరు లేకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దూర ప్రాంతాల నుంచి పుష్కరస్నానం చేయడానికి వచ్చిన యాత్రికులు ఆందోళనకు దిగారు. కొంత మంది జగ్గులు, బక్కెట్లుతో నీటిని తీసుకుని స్నానం చేయగా.. మరికొంత మంది తీవ్ర నిరాశతో తిరుగు ప్రయాణం అయ్యారు. 
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఘాట్లలో నీటి కరువు 
పుష్కరాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ప్రభుత్వం ప్రగల్భాలు పలకడం తప్పితే... దీని వల్ల ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఘాట్‌లు నీరులేక దర్శనిమిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ఘాట్‌లు నీరు లేక వెలవెలపోతున్నాయి. నల్గొండ జిల్లాలోని కనగల్‌ మండలం దర్వెశిపురం వద్ద రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన పుష్కర ఘాట్‌లో నీరు లేకపోవడంతో భక్తులు వెనుదిరిగారు. పుణ్యస్నానం కోసం దూరప్రాంతాల నుంచి ఈ ఘాట్‌లకు వచ్చిన భక్తులు మాత్రం ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తీవ్ర నిరాశగా వెనుదిరిగారు. మరో 10రోజుల పాటు జరగనుండడంతో ఇకనైనా ఈ ఘాట్‌లకు నీరు విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు.

 

రాజేంద్రనగర్ కోర్టు వద్ద భారీ భద్రత..

రంగారెడ్డి : రాజేంద్రనగర్ కోర్టు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నయీం అనుచరులు ఐదుగురు కోర్టు లొంగిపోతారని పోలీసులు భావిస్తున్నారు. దీనితో భద్రత పెంచారు. నయీం అనుచరులను కోర్టుకు వెళ్లనీయకుండా అడ్డుకుని అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. 

13:36 - August 13, 2016

మాస్ రాజా రవితేజ లేటేస్ట్ గా ఓ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. న్యూ మూవీలో రవితేజ మరోసారి పోలీస్ గా నటించబోతున్నట్లు వినికిడి. అంతేకాదు కొత్త దర్శకుడు పరిచయం అవుతున్న ఈ సినిమాలో మాస్ రాజా బ్యాడ్ పోలీస్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ మాస్ రాజా కొత్త మూవీ ముచ్చట్లేంటో తెలుసుకోవాలంటే చదవండి..

ఖాళీగా పది నెలలు...
మాస్ మహరాజ్ రవితేజ 10నెలలు ఖాళీగా ఉన్నాడు. 'బెంగాల్ టైగర్' సినిమా తరువాత ఈ స్టార్ హీరో ఇంతవరకు కొత్త సినిమాను స్టార్ట్ చేయలేదు. దాదాపు మూడు ప్రాజెక్టులు అనుకున్నా, ఒక్కటీ పట్టాలెక్కలేదు. అయితే ఇన్ని రోజులకు రవితేజ ఓ సినిమాని ఫైనల్ చేశాడని తెలుస్తోంది. ఈ కొత్త సినిమాలో మాస్ రాజా మరోసారి ఖాఖీ డ్రస్ లో ఇరగదీయడానికి రెడీ అవుతున్నాడని టాక్. రవితేజ మరోసారి కొత్త దర్శకుడికి చాన్స్ ఇస్తున్నాడు. ఇటీవల వరుసగా కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తున్నా ఈ స్టార్ హీరో ఇప్పుడు విక్రమ్ సిరి అనే స్టోరీ రైటర్ కి దర్శకుడిగా ప్రమోషన్ కల్పిస్తున్నాడు.

రేసుగుర్రంకి స్క్రీన్ ప్లే...
ఈ రైటర్ ఇంతకు ముందు అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ 'రేసుగుర్రం'కి స్క్రీన్ ప్లే అందించాడు. ఈ నమ్మకంతోనే రవితేజ ఈ రైటర్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. కొత్త సినిమాలో మాస్ మహరాజా బ్యాడ్ పోలీస్ గా నటించబోతున్నాడట. ఈ చిత్రానికి వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నట్లు వినికిడి. ఇందులో రవితేజ తనను తాను ఓవర్ గా ఊహించేసుకునే పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడట. గతంలో 'విక్రమార్కుడు', 'పవర్' మూవీస్ లో కూడా రవితేజ పోలీస్ పాత్రలు చేశాడు. అయితే ఈ క్యారెక్టర్స్ కి ఇప్పుడు చేయనున్న కొత్త సినిమాలోకి క్యారెక్టర్ చాలా డిఫరెన్స్ ఉంటుందట. కొత్త మూవీలోని క్యారెక్టర్ పిచ్చపిచ్చగా నచ్చడంతో వీలైనంత త్వరగా సినిమాను పట్టాలెక్కించాలని రవితేజ భావిస్తున్నాడట. మరి బ్యాడ్ పోలీస్ గా మాస్ రాజా ఎలా రప్పాడిస్తాడో చూడాలి.

13:34 - August 13, 2016

విజయవాడ : పుష్కరాలను కూడా రాజకీయం చేయాలని జగన్‌ చూస్తున్నారని ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. జగన్‌ను పుష్కరాలకు రావాలని నిన్ననే ఆహ్వానించినప్పటికీ తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు మంత్రి. సీఎం చంద్రబాబు సూచన మేరకు మరోసారి ఆహ్వానించడానికి జగన్‌ నివాసానికి వచ్చామని మంత్రి తెలిపారు. రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా జగన్ ఇదే రీతిలో రాజకీయం చేశారని మంత్రి రావెల అన్నారు. 

13:32 - August 13, 2016

కరీంనగర్ : జిల్లాలోని మెట్‌పల్లి పీఎస్ ఎదుట కుమార్ అనే యువకుడు పురుగుల మందు తాగాడు. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ కుమార్ మృతి చెందాడు. ఓ మహిళతో పాటు మరో ఇద్దరు యువకులు వేధిస్తున్నారని... పీఎస్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న మనస్థాపంతో.. కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.  

 

నయీంను అంతమొందించడం మంచిదే - దినేష్ రెడ్డి..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీంను అంతమొందించడం మంచిదేనని మాజీ డీజీపీ దినేష్ రెడ్డి పేర్కొన్నారు. వస్తున్న ఆరోపణపై ఆయన స్పందించారు. తెలంగాణ పోలీసులకు అభినందనలు తెలియచేస్తున్నట్లు, తెలంగాణ సీఎం కేసీఆర్ కు సలాం తెలియచేస్తున్నట్లు తెలిపారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలని, తనపై వస్తున్న ఆరోపణలు ఊహాగానాలు మాత్రమేనన్నారు. డీజీపీ స్థాయి అధికారిపై ఇలాంటి ఆరోపణలు రావడం సరికావన్నారు. నయీం కేసులో సిట్ నిష్పక్షపాతంగా విచారణ జరుపుతోందని, నయీం కేసు వెనుకున్న వారిని బయటకు తేవాలన్నారు. అన్ని విషయాలను సిట్ త్వరలోనే తేల్చుతుందన్నారు. 

13:29 - August 13, 2016

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు భూపంపిణీ పథకం నత్తనడకను తలపిస్తోంది. రెండేళ్ల క్రింతం ఎంతో హడావుడిగా ప్రారంభించిన పథకాన్ని... ప్రస్తుతం మూలనపడేశారనే అరోపణలొస్తున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్రంలో త్వరలో 10వేల ఎకరాలు పంచుతామని ఎస్సీ కార్పొరేషన్‌ అంటుంది. నిరుపేద దళితులకోసం చేపట్టిన భూపంపిణీ కార్యాక్రమం ఒకడుకుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్టుగా తయారైంది.  
లబ్ధిదారులను గుర్తించడంలో అధికారుల నిర్లక్ష్యం
తెలంగాణలో దళితులకు భూ పంపిణీ పథకం ప్రారంభించి రెండేళ్లు గడిచిపోయినా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 3వేల మందికి మాత్రమే భూమిని పంచారు.  గ్రామాల్లో లబ్దిదారులను  గుర్తించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అరోపణలొస్తున్నాయి. అయితే  భూపంపిణీ కి  కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. 
సాగుకు పనికిరాని భూమినే పంచారు
దళితులకు భూపంపిణీ విషయంలో తెలంగాణ సర్కార్‌ ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ లాంటి కార్యక్రమాల్లో చూపించే శ్రద్ధ .. భూపంపిణీపై లేదంటున్నాయి దళితసంఘాలు. మరోవైపు  పంచుతున్న భూమికూడా సాగుకు ఏమాంత్రం పనికి రాదని విర్శిస్తున్నాయి. పంపిణీచేసిన భూమిని సాగుకు అనువుగా మార్చేందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. 
త్వరలో 10వేల ఎకరాల భూపంపిణీ : ఎస్సీ కార్పొరేషన్‌ 
ఈనేపథ్యంలో ... ప్రభుత్వం మరోసారి భూపంపిణీకీ సిద్ధం అవుతుందంటున్నారు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తిరవి. తర్వలోనే 10వేల ఎకరాల భూమిని పంచుతామంటున్నారు. ప్రభుత్వం  ఎన్ని చెబుతున్నా.. దళితుల భూపంపిణీ మాత్రం ప్రహసనంగా మారిందనే విర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు అడిగిందే తడవుగా వందల ఎకరాలను కట్టబెడుతున్న తెలంగాణ సర్కార్‌.. దళితుల భూపంపిణీ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వవ్యవహరిస్తుందనే ఆరోపణలొలస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దళితుల భూపంపిణీపై చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది. 

 

13:19 - August 13, 2016

నయీం కేసులో దినేష్ రెడ్డి వివరణ..

హైదరాబాద్ : నయీం కేసులో మాజీ డీజీపీ దినేష్ రెడ్డి వివరణనిచ్చారు. నయీంను వాడుకున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, ఏ డీజీపీ స్థాయి అధికారితో నయీంకు సంబంధం లేదన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను, ఇన్ ఫార్మర్ గా వాడుకోవడం సహజమన్నారు. నయీంను వాడుకున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, విచారణ నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేశారు. అమాయకులకు అన్యాయం జరగొద్దని సూచించారు. 

యాదగిరికి ప్రాణపాయం లేదు - డీసీపీ సుమతి..

హైదరాబాద్ : బోయిన్ పల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో గాయాలకు గురైన కాంగ్రెస్ నేత యాదగిరికి ప్రాణాపాయం లేదని డీసీపీ సుమతి వెల్లడించారు. యాదగిరి ఆసుపత్రిలో చికిత్స చేయించడం జరుగుతోందని, దుండగుల నుండి యాదగిరి ఆయుధం లాక్కొన్నారని తెలిపారు. 

13:13 - August 13, 2016

సమాజంలో మానవ సంబంధాలు మృగ్యమవుతున్నాయి. ఆర్థిక లావాదేవీల్లో తేడాలు.. వివాహేతర సంబంధాలు...పగ, ప్రతీకారాలు...వంటివి హత్యలకు దారి తీస్తున్నాయి. ఆస్తి పాస్తుల కోసం తోడబుట్టిన వారిని, జన్మనిచ్చిన వారిని ఖతం చేసేస్తున్నారు. ప్రేమానురాగాలు, ఆప్యాయత ఆనందాలతో వెల్లివిరియాల్సిన మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. మానవ సంబంధాలు దారుణంగా పడిపోతున్నాయనడానికి మరో నిదర్శనం ఈ ఘటన. ఆస్తి కోసం ఓ కూతురు కన్నతండ్రి ప్రాణాలే తీసేసింది. ఈ ఉదంతం చెన్నైలో ఆలస్యంగా వెలుగు చూసింది. గత ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన ఈ ఘోరం జరిగింది. గౌరవంగా భావించే వైద్య వృత్తికి చెందిన వారు ఈ ఘటనకు పాల్పడడం గమనార్హం. ఈ ఘోరం అక్కడి సీసీ కెమెరాలో రిక్డారయ్యింది. ఆ దృశ్యాలు నేడు బయటపడడంతో ఆ కూతురు పాపం బాహ్య ప్రపంచానికి తెలిసింది.

ఆసుపత్రిలో ఘోరం..
చెన్నైకి చెందిన డాక్టర్ రాజగోపాల్(82) అనారోగ్యానికి గురయ్యాడు. దీనితో అతని కొడుకు జయప్రకాష్ ఆదిత్య ఆసుపత్రిలో చేరిపించి చికిత్స చేయిస్తున్నారు. 2015, సెప్టెంబర్ 5వ తేదీన ఉదయం రాజగోపాల్ కుమార్తె డాక్టర్ జయసుధ, భర్త మనోహరన్, ఆమె కొడుకు డాక్టర్ హరిప్రసాద్‌తో కలసి ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో అక్కడ నర్సులు ఉన్నారు. తండ్రితో ఏకాంతంగా మాట్లాడాలని, బయటకు వెళ్లాలని చెప్పడంతో నర్సులు వెళ్లిపోయారు. అనంతరం వెంట తెచ్చుకున్న ఆస్తిపత్రాలపై సంతకం చేయాలని రాజగోపాల్ పై వత్తిడి తెచ్చారు. దీనికి తండ్రి నిరాకరించాడు. అంతే..బలవంతంగా అతని వేలిముద్రలు వేయించుకున్నారు. తర్వాత శ్వాస తీసుకునేందుకు సాయపడే ఆక్సిజన్ మాస్క్ ను తొలగించారు. సెలైన్ పైప్‌నూ కత్తిరించడంతో ఆయనకు తీవ్రంగా రక్తం పోయింది. అంతలో నర్సులు రావడంతో ఒకరి తరువాత ఒకరు బయటకు వెళ్లిపోయారు. ఈ హత్యాయత్నం తరువాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. గత ఏడాది నవంబర్ రెండో తేదీన కన్నుమూశాడు. దీనిపై కొడుకు జయప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి రాజగోపాల్ ను డా.జయసుధ, ఆమె భర్త డా.యు.మనోహరన్, కొడుకు డా.హరిప్రసాద్ లు హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మెడికల్ కౌన్సిల్ స్పందించింది. దీనిపై విచారణకు రావాలని కోరగా డా.జయసుధ కుటుంబీకులను కోరడం జరిగిందని, వారు రాతపూర్వకంగా వివరణనిచ్చారని కౌన్సిల్ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై తాము సంతృప్తి చెందలేదని, స్వయంగా విచారణకు హాజరు కావాలని పేర్కొనడం జరిగిందన్నారు. నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలుంటాయని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

13:12 - August 13, 2016

హైదరాబాద్ : నయీం ఎన్ కౌంటర్ తర్వాత అతని అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటపడుతున్నాయి. తన మాటవినని వారిని అతి కిరాతకంగా హత్య చేసే నయీం చివరకు చిన్నారులను సైతం ఒదిలేవాడు కాదు. మైనర్ బాలికలను లైంగికంగా వేధించేవాడని అధికారుల దర్యాప్తులో తెలిసింది. 
పోలీసులు విచారణలో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు
తన మాట విననివారిని అత్యంత కిరాతకంగా హత్య చేసే నయీం చివరకు మైనర్ బాలికలపై తీవ్రస్థాయిలో వేధింపులకు పాల్పడేవాడని అధికారుల విచారణలో వెలుగుచూసింది. తన వేధింపులు భరించలేక ఏడ్చే పిల్లలకు నిద్రమాత్రలు వేసి పడుకోబెట్టేవాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నయీం ఎనకౌంటర్‌ తర్వాత అల్కాపురిలోని నయీం ఇంట్లో ఫర్హానా, అఫ్షాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టు అనుమతితో వారిని రెండు రోజుల కస్టడీకి తీసుకుని విచారించారు. విచారణ సమయంలో.. చిన్న పిల్లలపై నయీం లైంగిక వేధింపులకు పాల్పడేవాడని ఫర్హానా, అఫ్షా దర్యాప్తు అధికారులకు తెలిపారు. నయీం ఇచ్చే నిద్రమాత్రల మోతాదు ఎక్కువ కావడంతో ఓ చిన్నారి అపస్మారకస్థితిలోకి వెళ్లిందని, ఆ చిన్నారిని నయీం బయటకు తీసుకెళ్లాడని, ఆ తర్వాత చిన్నారి ఆచూకీ తెలియరాలేదని నిందితులు విచారణలో వెల్లడించారు.
లైంగిక వేధింపులు ప్రశ్నించిన ఫర్హానాకు గుండు గీయించిన నయీం 
అల్కాపురిలోని నయీం ఇంట్లో తనిఖీల సమయంలో తొమ్మిదిమంది మైనర్ బాలికలను గుర్తించిన అధికారులు వారిని ప్రభుత్వ వసతిగృహానికి తరలించారు. చిన్నారులపై నయీం వేధింపులను ప్రశ్నించినందుకు ఫర్హానాకు నయీం గ్యాంగ్‌ గుండు గీయించినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. ఫర్హానా, అఫ్షా ఇచ్చిన సమాచారంతో.. ఆ చిన్నారుల వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. 

13:07 - August 13, 2016

గుంటూరు : అందరి తల రాతలు రాసేది బ్రహ్మ. అయితే అటువంటి బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవని, పూజా పునస్కారాలు జరుగవని భక్తులు చెప్పుకుంటారు. బృహు మహర్షి శాపం కారణంగానే బ్రహ్మదేవునికి పూజా పునస్కారాలు నిర్హహించరని చరిత్ర చెబుతోంది. 19 వశతాబ్దంలో నిర్మించిన ఓ బ్రహ్మ దేవాలయం ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రత్యక్ష తార్కాణంలా నిలుస్తోంది. 
శైవక్షేత్రంగా పరిఢవిల్లుతున్న చేబ్రోలు 
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజక వర్గం పరిధిలోని చేబ్రోలు..తో ఆధ్యాత్మిక ప్రాంతంగా చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. పూర్వం కాకతీయుల కాలం నుంచే శైవక్షేత్రంగా పరిఢవిల్లుతున్న చేబ్రోలులో చతుర్ముఖ బ్రహ్మ కొలువు దీరి భక్తులకు దర్శినమిస్తున్నారు. పూర్వం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చెంచులను శిక్షించిన పాపానికి మనశ్శాంతి కొరవడి, అసహనంతో విసుగు చెందిన ఆయన వేదపండితుల సలహా మేరకు ఎక్కడా లేనటువంటి అరుదైన చతుర్ముఖ బ్రహ్మదేవాలయాన్ని ఇక్కడ నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. 
అష్టదిగ్భందనలో బ్రహ్మ లింగేశ్వరస్వామి
బృహు మహర్షి శాపాన్ని సైతం మినహాయిస్తూ వేదపండితులు తెలిపిన శాస్త్ర ప్రకారం తూర్పు, పడమర శైవక్షేత్రాలు, దక్షిణం, ఉత్తరం, విష్ణు ఆలయాలను.. నాలుగు మూలల నలుగురు అమ్మవార్ల శక్తి పీఠాలను ప్రతిష్ట చేసి అష్టదిగ్భందనలో చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వరస్వామి వారిని రాజా వెంకటాద్రి నాయుడు కోనేరు నడుమ ప్రతిష్ట చేసినట్లు స్థల పురాణం చెబుతోంది. ఆనాటి నుంచి నేటి వరకు ఈ క్షేత్రం మహా పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది. భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసి ఈ ఆలయంలోని బ్రహ్మ దేవుడిని దర్శించుకోవడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 

 

గవర్నర్ ను కలవనున్న టి.మంత్రి జూపల్లి..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను మంత్రి జూపల్లి సాయంత్రం 4.30గంటలకు కలవనున్నారు. పుష్కరస్నానం ఆచరించేందుకు సోమశిలకు రావాలని కోరనున్నారు. 

ముగిసిన టి.కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

హైదరాబాద్ : రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులతో జరిపిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. రంగారెడ్డి జిల్లాను రెండు, మూడుగా విభజించాలని, హైదరాబాద్ లో మాత్రం విలీనం చేయవద్దని, మహేశ్వరం నియోజకవర్గాన్ని ఏ జిల్లాలో కలిపినా సమస్య లేదని సబ్ కమిటీకి రంగారెడ్డి జిల్లా నేతలు తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేయాలని, కంటోన్మెంట్ ను హైదరాబాద్ లో కలపాలని కోరారు. 

నయీం కబ్జా చేసిన భూముల్లో జెండాలు పాతాలన్న నారాయణ..

వరంగల్ : నయీంను ప్రభుత్వం రౌడీగా మార్చిందని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. నయీం కబ్జా చేసిన భూముల్లో ఎర్రజెండాలు పాతాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. 

12:49 - August 13, 2016
12:47 - August 13, 2016

హైదరాబాద్ : మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ప్రెస్ మీట్ రద్దు అయింది. మీడియా సమావేశం వాయిదా పడింది. నయీం కేసుకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరిస్తానని దినేష్ రెడ్డి తెలిపారు. ఈమేరకు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాలని ప్రకటించారు. 
అయితే నయీం కేసుకు సంబంధించిన విషయాలకు సంబంధించి పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టొద్దని బీజేపీ నేతల సలహా ఇచ్చారు. దీంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ను కాస్తా దినేష్ రెడ్డి రద్దు చేశారు. వేరే చోట ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశ ముంది. మరోవైపు నయీం కేసుతో తనకు సంబంధం లేదని చెబుతున్నాడు. తనపై అసత్యప్రచారాలు చేస్తున్నారని వాపోయారు. మరో అరగంటలో వేరే చోట ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 

 

12:41 - August 13, 2016

కొత్త కొత్త ఆవిష్కరణలతో ఇప్పటికే చైనా తనేమిటో నిరూపించుకుంది. ఆ రంగం..ఈ రంగం..అనేది లేకుండా అన్ని రంగాల్లో ప్రతిభను చాటుతోంది. వినూత్న పద్ధతిలో భవంతులు నిర్మించడం..సౌర విద్యుత్ రంగం..ఇలా చైనా దేశం అద్భుతాలు చేస్తోంది. తాజాగా మరో అద్భుతం చేసింది. అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతనూ తట్టుకొనే ఓ పరికరాన్ని తయారు చేసింది. ప్రస్తుతం తయారు చేసిన లోహాల్లోకెల్లా ఎక్కువ ఉష్ణోగ్రతను ఈ లోహం తట్టుకుంటుందని ఏరోస్పేస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ మెటీరియల్ అండ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అధికారులు పేర్కొంటున్నారు. అంతరిక్షంలోకి పంపే రాకెట్ లు..స్పేస్ క్రాఫ్ట్ లు..శాటిలైట్ల తయారీలో ఈ లోహాన్ని వాడుకోవచ్చని పేర్కొంటున్నారు. ఏరోజెల్ మెటీరియల్ ను అమెరికా, రష్యా, మరికొన్ని ఐరోపా దేశాలు రాకెట్ల తయారీలో ఉపయోగిస్తున్నాయి. కానీ దానికి మించిన ఉష్ణోగ్రతను తట్టుకొనే శక్తి రూపొందించిన లోహానికి ఉందని వారు పేర్కొంటున్నారు. కొత్తగా తాము తయారు చేసిన లోహం కేవలం ఉష్ణోగ్రతనే కాకుండా భారీ వైబ్రేషన్స్ ను సైతం తట్టుకుంటుందని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. 

12:37 - August 13, 2016
12:36 - August 13, 2016

హైదరాబాద్ : త్వరలోనే ప్రభుత్వ విద్యలో సమూల మార్పులు తీసుకొస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ అన్నారు. హైదరాబాద్‌లో పర్యటించిన కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌...ముషీరాబాద్‌లోని ప్రభుత్వ స్కూలును సందర్శించారు. స్కూల్లోని విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాలను రూపొందిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యను ప్రోత్సహించేందుకు సరికొత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

 

12:33 - August 13, 2016

హైదరాబాద్ : నగరంలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ నాయకుడు యాదగిరిపై గుర్తుతెలియని దుండగులు..కాల్పులు జరిపారు. బోయినిపల్లిలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన యాదగిరిపై ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. యాదగిరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు..వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సంఘటనాస్థలిలో బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యాదగిరిపై కాల్పులు జరిపి పారిపోయిన దుండగుల కోసం గాలిస్తున్నారు. 

 

ఇండియా - చైనా ప్రతినిధుల సమావేశం..

ఢిల్లీ : ఇండియా - చైనా దేశాలకు చెందిన ప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, చైనాకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. 

ప్రకాశం బ్యారేజ్ పై ఆంక్షల తొలగింపు...

కృష్ణా : ప్రకాశం బ్యారేజీపై ఆంక్షలను తొలగించారు. బ్యారేజీపై ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు ఎత్తివేసి ద్విచక్రవాహనాలకు అనుమతినిచ్చారు. తొలిరోజు పుష్కరాలకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తెల్లవారుజాము నుంచే బ్యారేజీపై రాకపోకలకు అనుమతినిచ్చారు. 

భోగాపురం ఎయిర్ పోర్టుకు మరో భూ సేకరణ నోటిఫికేషన్..

విజయనగరం : భోగాపురం ఎయిర్ పోర్టుకు సంబంధించి మరో 1600 ఎకరాల భూ సేకరణకు కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. భూ సేకరణకు సంబంధించి హైకోర్టులో కేసు ఉండగా నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారని, వెంటనే నోటిఫికేషన్ రద్దు చేయాలని సీపీఎం నేత సూర్యనారాయణ, సీపీఐ నేత అశోక్ లు డిమాండ్ చేశారు. 

బోయిన్ పల్లిలో కాల్పుల కలకలం..

హైదరాబాద్ : బోయిన్ పల్లిలో కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ నేత యాదగిరిపై కాల్పులు జరిపారు. మల్లిఖార్జున నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన యాదగిరిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 

దినేష్ రెడ్డి ప్రెస్ మీట్ వాయిదా..

హైదరాబాద్ : మాజీ డీజీపీ దినేష్ రెడ్డి మీడియా సమావేశం రద్దయ్యింది. పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ అవసరం లేదని బీజేపీ సూచించడంతో చివరి నిమిషంలో ప్రెస్ మీట్ వాయిదా వేసుకున్నారు. నయీం కేసులో ఆరోపణలపై స్పందించేందుకు దినేష్ రెడ్డి సిద్ధమయ్యారు. 

దుర్గగుడి పోలీసుల అత్యుత్సాహం..

విజయవాడ : దుర్గగుడి పోలీసులు అత్యుత్సాహం చూపారు. ఈవోను కొండపైకి పోలీసులు అనుమతించలేదు. పోలీసుల తీరుపై ఈవో సూర్యకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

11:53 - August 13, 2016
11:52 - August 13, 2016
11:50 - August 13, 2016
11:48 - August 13, 2016
11:45 - August 13, 2016

విజయవాడ : పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తడంతో... జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్‌ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. 2కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు నిలిచిపోయి... ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 

 

11:44 - August 13, 2016

ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఓ గ్రామం చేస్తే.. స్మార్ట్ ఫోన్ కుగ్రామం చేసేసింది. ప్రపంచంలో ఇప్పుడు ఏ దేశంలో ఉన్నా.. ఎవరితోనైనా క్షణాల్లో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఫ్రీ లాన్సింగ్..ప్రస్తుతం కాసుల వర్షం కురిపిస్తోంది. ఉద్యోగం ఎందుకు దండగ..ఫ్రీ లాన్సింగ్ ఉందిగా..అంటున్నారంట. ఉద్యోగం చేస్తే ఎమొస్తుంది ? ఒకరికింద పని చేయాలి..కష్టాలుంటాయి..అదే ఫ్రీలాన్సింగ్ ఉంటే ఎంచక్కా...హాయిగా పనిచేసుకోవచ్చు. బుద్ధి పుట్టినప్పుడు పని చేయొచ్చు..లేకపోతే లేదు..అంటున్నారు. ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు..ఒకళ్ల గురించి భయపడక్కర్లేదు..జీతం కూడా బాగానే వస్తుందని కొంతమంది పేర్కొంటున్నారు. ఇంట్లోనే కూర్చుని చేసే ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇష్టం వచ్చినప్పుడు, ఇల్లు కదలకుండా, సౌకర్యంగా పనిచేసుకోవచ్చు. సంపాదించుకన్నంత సొమ్ము. ఈ ఫ్రీలాన్స్ ఉద్యోగాలు ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్యనున్న యువకులు వీటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

సంపాదన...
వీళ్లు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా ? రోజుకు ఏకంగా రూ. 46 వేల వరకు డబ్బులు సంపాదిస్తున్నారంట. 'ఫ్లెక్సింగ్ ఇట్' అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం తేలిదంట. ఫ్రీలాన్సింగ్ అవకాశాల కోసం ఎదురు చూసే ప్రొఫెషనల్స్ కు..వాళ్లతో పని చేయించుకోవాలని చూసే సంస్థలకు వారధిగా 'ఫ్లెక్సింగ్ ఇట్' సంస్థ పనిచేస్తోంది. 2,500 మంది ప్రొఫెషనల్స్ నుండి సమాచారం సేకరించింది. 2016 జనవరి నుండి 2016 జులై వరకు సమాచారాన్ని సేకరించారు. ఫ్రీ లాన్సింగ్ లో ఐదేళ్ల వరకు అనుభవం ఉన్న వారికి ఉత్పాదక రంగం..ఆర్థిక రంగం, సేల్స్ వంటి రంగాల్లో అత్యధికంగా చెల్లిస్తున్నారని తేలింది. అలాగే 20 ఏళ్ల అనుభవం ఉన్న వారిలో ఎక్కువగా ఫైనాన్స్..జనరల్ మేనేజ్ మెంట్..స్ట్రాటజీ..హ్యూమన్ రిసోర్సిస్ లాంటి రంగాల్లో ఎక్కువ చెల్లింపులు వస్తున్నాయంట. ఐదేళ్లలోపు అనుభవం వారికి రోజుకు రూ. 8వేలు..5 నుంచి 10 ఏళ్ల వరకు అనుభవం ఉన్న వారికి రోజుకు రూ. 19వేలు, 20 ఏళ్లకుపైగా అనుభవం ఉన్నవాళ్లు రోజుకు రూ. 46 వేల వరకు ఫ్రీలాన్సింగ్‌లో సంపాదిస్తున్నారట. 

11:30 - August 13, 2016

చిత్తూరు : తిరుమలలో రాత్రి ఓ కొండచిలువ హల్‌చల్‌ చేసింది. బాలాజీనగర్‌ సమీపంలోని శ్రీనివాస అతిథిగృహం వద్ద కొండచిలువను చూసిన భక్తులు..వెంటనే టిటిడి సిబ్బందికి సమాచారమందించారు. స్పందించిన టిటిడి సిబ్బంది గంటపాటు శ్రమించి 12 అడుగుల పొడవున్న కొండచిలువను పట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని సమీపంలోని అడవిలో వదిలేశారు. 

 

11:29 - August 13, 2016

శరీరానికి విటమిన్ 'డి' ఎంతో ముఖ్యమైంది. ఇది లేకపోవడం వల్ల మన దేశ జనాభాలో 84 శాతం మందిలో విటమిన్-డి కొరత ఉంది. కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, హృదయ కోశ వ్యాధులకు ఈ లోపమే కారణం. అందుకే తరచూ శరీరంలో విటమిన్-డి నిల్వలను పరీక్షించుకోవాలి. విటమిన్ డి కోసం చిట్కాలు..
రోజూ కొద్దిసేపు శరీరంపై సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. లేకపోతే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో వెలువడే సూర్యకిరణాల్లో విటమిన్-డి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి బద్ధకాన్ని వదిలి రోజూ కొంత విటమిన్-డిని అందించండి.
అత్యధిక శాతం న్యూట్రిషియన్స్ కలిగినటువంటి గుడ్లలో విటమిన్ డి మరియు విటమిన్ బి12 మరియు ప్రోటీనులు అధిక శాతంలో ఉంటాయి. కాబట్టి వీటిని తరచూ ఆహారంతో తీసుకోవడం చాలా ముఖ్యం.
మష్రుమ్(పుట్టగొడుగు)ల్లో విటమిన్ డి మాత్రమే కాదు విటమిన్ బి5 ను కూడా అందిస్తుంది. తెల్లని పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల విటమిన్ డితో పాటు జింక్ మరియు ప్రోటీన్స్ పుష్కలంగా శరీరానికి లభ్యం అవుతుంది.
సోయా ప్రొడక్ట్స్ సంబంధించిన ఉత్పత్తులు టోపు, సోయా మిల్క్ వంటి వాటిలో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవడం చాలా ఆరోగ్యకరం.

11:27 - August 13, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో  మరో విషాదం చోటుచేసుకోంది. విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్ వద్ద పుష్కర విధులు నిర్వహిస్తున్న అప్పాయమ్మ అనే పారిశుద్ద్య కార్మికురాలు అస్వస్ధతకు గురైంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అప్పాయమ్మ విజయవాడలోని వాంబేకాలనీ జిబ్లాక్ నివాసి. సీపీఎం నేతలు అప్పాయమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. అప్పాయమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. 

 

11:10 - August 13, 2016

సోనాక్షి సిన్హా...శతృఘ్నసిన్హా కుమార్తె. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. తాజాగా ఈమె పెళ్లి చేసుకొంటోందని...త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతోందని ప్రచారం జరిగింది. ఈ వార్తలను సోనాక్షి కొట్టిపారేశారు. పెళ్లి వార్తల్లో నిజం లేదని పేర్కొంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బంధువు బంటి సచ్ దేవ్ తో సోనాక్షి ప్రేమలో మునిగిందని ఇటీవల వార్తలు వచ్చాయి. పలు వేడుకల్లో కూడా వీరు సన్నిహితంగా మెలగడంతో ఈ జంట ప్రేమ వ్యవహారం నిజమేనని పుకార్లు షికార్లు చేశాయి. ఈ మధ్యకాలంలో సోనాక్షి ఎక్కడికి వెళ్లినా అతనితో కలిసి దిగిన ఫొటోలు బయటికి వస్తున్నాయి. త్వరగా వివాహం చేసుకోవాలని బంటీ నిర్ణయించుకున్నాడని అందుకే సోనాక్షి కూడా తన నిర్ణయాన్ని త్వరలో వెల్లడించనుందని బాలీవుడ్ టాక్. ఈ ఆలోచనతోనే కొత్త సినిమాలు అంగీకరించడం లేదని, వచ్చిన అవకాశాలను కూడా సోనాక్షి తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. తన ప్రేమ..పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవేలనని, తన భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సింది తానేనని సోనాక్షి పేర్కొంటోందంట. 

యూపీ సీఎంకు రక్తంతో లేఖ రాసిన బాలిక..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ బాలిక రక్తంతో లేఖ రాసింది. తన తల్లి సజీవదహనంలో న్యాయం చేయాలని ఆ లేఖలో కోరింది. 

మహీంద్రా షోరూంలో ఫైర్ ఆక్సిడెంట్...

భోపాల్ : మహీంద్రా షోరూంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

భద్రత పెంచాం - ఐజీ సంజయ్..

విజయవాడ : కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. దీనితో బారికేడ్లు నీట మునిగిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భద్రత పెంచడం జరిగిందని ఐజీ సంజయ్ తెలిపారు.

10:51 - August 13, 2016

నల్గొండ : కృష్ణా పుష్కరాల్లో అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటి విషాధ ఘటనలు మరువకముందే తాజాగా మరో విషాదం నెలకొంది. పుష్కరస్నానానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. పుష్కరఘాట్‌లో స్నానం చేసి ఆలయం సమీపంలో దుస్తులు మార్చుకుంటుండగా ఓ వ్యక్తికి ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైరు తాకింది. విద్యుత్‌షాక్‌తో భక్తుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘాట్‌ వద్ద అంబులెన్సు లేకపోవడం,..వైద్య శిబిరం ఏర్పాటు చేయకపోవడంతో భక్తుడు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మృతి చెందిన భక్తుడు ఎవరనే వివరాలు తెలియాల్సి ఉంది. నిన్న విజయవాడ పద్మావతి ఘాట్‌లో స్నానానికి వెళ్లిన ఐదేళ్ల బాలుడు చనిపోగా.. గూడవల్లి వద్ద పుష్కర బందోబస్తుకు వెళ్తున్న కానిస్టేబుల్‌ను ప్రమాద రూపంలో మృత్యువు వెంటాడింది. అటు పున్నమిఘాట్‌లో మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

 

భక్తుల రద్దీ పెరిగింది - ఏపీ డీజీపీ..

విజయవాడ : పుష్కరఘాట్లను ఏపీ డీజీపీ సందర్శించారు. నిన్నటికంటే నేడు భక్తుల రద్దీ పెరిగిపోయిందని, రద్దీ దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. వృద్ధులు, పిల్లల కోసం ప్రత్యేకంగా ఘాట్ల వద్ద 20 మంది హోంగార్డులను నియమించినట్లు పేర్కొన్నారు. కెనాల్ ఘాట్ల వదద గజఈతగాళ్లు, బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ట్రాఫిక్ నిబంధనలను కొంతమేర సడలించినట్లు తెలిపారు. 

సామాజిక అంశాలపై అవగాహన పెంచాలి - ప్రకాష్ జవేదకర్..

హైదరాబాద్ : ముషిరాబాద్ పాఠశాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, డిప్యూటి సీఎం కడియంలు సందర్శించారు. ఈసందర్భంగా ప్రకాష్ జవదేకర్ విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలల నుండే పిల్లల భవిష్యత్ ప్రారంభమవుతుందని, ప్రైవేటు పాఠశాలలకంటే ప్రభుత్వ పాఠశాల్లోనే విద్య విజయం వైపు నడిపిస్తుందన్నారు. సామాజిక అంశాలపై అవగాహన పెంచాలని సూచించారు. 

జగన్ ను కలిసిన ఏపీ మంత్రి రావెల..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ ను మంత్రి రావెల కలిశారు. పుష్కరాలకు రావాలని ఆహ్వానించారు. పుష్కరాలను కూడా రాజకీయం చేయాలని జగన్ చూస్తున్నారని, నిన్న సాయంత్రమే ఆహ్వానించడానికి వస్తే ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదని మంత్రి రావెల పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు వచ్చినప్పుడూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. 

కేబినెట్ సబ్ కమిటీతో హైదరాబాద్, రంగారెడ్డి ప్రజాప్రతినిధుల భేటీ..

హైదరాబాద్ : కేబినెట్ సబ్ కమిటీతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. 

ఎన్ఎస్ పీ, ఎస్సార్ ఎస్పీపై మంత్రుల సమావేశం..

హైదరాబాద్ : ఎంసీహెచ్ ఆర్డీలో ఎన్ఎస్ పీ, ఎస్సార్ ఎస్పీపై మంత్రులు హరీష్ రావు, ఈటెల, తుమ్మలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ పొంగులేటి, ఇరిగేషన్ ప్రిన్స్ పల్ సెక్రటరీ జోషిలు హాజరయ్యారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలో సాగునీటి అవసరాల కోసం ఎన్ఎస్ పీ నుండి నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డును కోరాలని తీర్మానించారు. 

పుష్కర ఘాట్లను సందర్శించిన డీజీపీ

విజయవాడ : పుష్కర ఘాట్లను డీజీపీ సందర్శించారు. నిన్నటి కంటే నేడు భక్తుల రద్దీ పెరిగిందని డీజీపీ తెలిపారు. రద్దీ దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. 

ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన జవదేకర్, కడియం

హైదరాబాద్ : ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సందర్శించారు. విద్యార్థులతో జవదేకర్ ముచ్చటించారు. 

 

10:30 - August 13, 2016
10:25 - August 13, 2016

పుష్కర ఘాట్లకు భారీగా భక్తులు....

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కృష్ణా పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. పుష్కర ఘాట్లకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుష్కరస్నానాలు చేస్తున్నారు. నిన్నటి ఘటనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ఘాట్ల వద్ద భద్రతను పెంచారు. 

09:52 - August 13, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కృష్ణా పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. పుష్కర ఘాట్లకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుష్కరస్నానాలు చేస్తున్నారు. నిన్నటి ఘటనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ఘాట్ల వద్ద భద్రతను పెంచారు. 

 

09:50 - August 13, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం అయింది. ఈ కేసులో కీలక సాక్ష్యాధారాలు సేకరించే పనిలో సిట్ బృందం నిమగ్నమైంది. హైదరాబాద్ కు చెందిన మాజీ మంత్రి పాత్రపై ఆరా తీస్తున్నారు. నయీం పాంహౌజ్ పక్కనే మాజీ మంత్రి ఫాంహౌజ్ ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి నాలుగేళ్లపాటు నయీంతో చట్టాపట్టాలు వేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. పదవిలో లేనన్ని రోజులు మాజీ మంత్రి నయీంతో గడిపినట్లు సమాచారం. నయీం రెండు నెలల్లో రూ.200 కోట్లు సంపాదించి దుబాయ్ లో స్ధిరపడాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు తిరిగి హైదరాబాద్ రావాలని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఈలోపు తనపై ఓ సినిమా తీయాలని సినీ ఇండస్త్రీతో నయీం భేరాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలావుంటే తనపై వస్తున్న ఆరోపణలపై మాజీ డీజీపీ దినేష్ రెడ్డి నేడు వివరణ ఇవ్వనున్నారు. 

 

నయీం కేసులో కీలక సాక్ష్యాధారాలు సేకరించే పనిలో సిట్

హైదరాబాద్ : నయీం కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం అయింది. ఈ కేసులో కీలక సాక్ష్యాధారాలు సేకరించే పనిలో సిట్ బృందం నిమగ్నమైంది. హైదరాబాద్ కు చెందిన మాజీ మంత్రి పాత్రపై ఆరా తీస్తున్నారు. 

పుష్కరాలు.. పోలీసులకు సూచనలు : కలెక్టర్ కాంతిలాల్

గుంటూరు : పోలీసులకు సూచనలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ తెలిపారు. వరుసుగా మూడు రోజులు సెలవు దినాలు కావడంతో జ్ఞానబుద్ధఘాట్ కు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనా.. దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 

కల్టెకర్ కాంతిలాల్ కు పుష్కరయాత్రికులు ఫిర్యాదు

గుంటూరు : పోలీసులు ఘాట్ల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పుష్కరయాత్రికులు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ కు ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరును కలెక్టర్ డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. 

09:04 - August 13, 2016
09:01 - August 13, 2016
08:59 - August 13, 2016

తూర్పుగోదావరి : అభ్యుదయవాద కవి, సాహితీ విమర్శకుడు ఆవంత్స సోమసుందర్‌ కన్నుమూశారు. సుమారు ఏడున్నర దశాబ్దాల పాటు సాహితీ సేద్యాన్ని కొనసాగించిన ఆవంత్స.. ఈ ఉదయం పిఠాపురంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన కోరిక మేరకు.. భౌతికదేహాన్ని గురువారం స్థానిక మెడికల్‌ కాలేజీకి అందించనున్నారు. ప్రముఖ అభ్యుదయవాద కవి.. కథకుడు.. నవల, నాటక రచయిత ఆవంత్స సోమసుందర్‌.. పిఠాపురంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 92 ఏళ్లు. సుమారు 75 ఏళ్లపాటు అక్షర సేద్యం చేసి.. సాహితీ లోకంలో తనకంటూ విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ఆవంత్స.. జీవనకాలంలో దాదాపు 80 వరకూ పుస్తకాలను వెలువరించారు. 
1924 నవంబర్‌లో జననం 
1924 నవంబర్‌లో.. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం గ్రామంలో జన్మించిన ఆవంత్స సోమసుందర్‌.. పిల్లలు లేని పినతల్లి వెంకాయమ్మకు దత్తపుత్రుడిగా వెళ్లారు. ఆ కుటుంబానికి గల సాహిత్యాభిలాష.. ఆవంత్స సోమసుందర్‌కూ అబ్బింది. ఆయన తన జీవనకాలంలో దాదాపు 80 వరకూ పుస్తకాలు రచించారు. 1949లో నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా రచించిన వజ్రాయుధం ఆయనకు ఎనలేని ఖ్యాతిని సముపార్జించి పెట్టింది. ఈ పుస్తకాన్ని అప్పట్లో బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది. 1956లో నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ రచనను.. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాఠ్యపుస్తకంగానూ స్వీకరించింది.
ప్రజల గళాన్ని తన కలం ద్వారా వినిపించిన సోమసుందర్ 
సమాజంలో మతోన్మాదం.. రాజ్యహింస పెల్లుబికిన ప్రతిసారీ ఆయన కలమెత్తారు. పీడిత తాడిత ప్రజల గళాన్ని తన కలం ద్వారా వినిపించేవారు. ఎమర్జెన్సీ కాలంలోనూ, బాబ్రీమసీదు కూల్చినప్పుడు ఆయన వెలువరించిన రచనలు ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాయి. విరసం ఆవిర్భవించిన కొత్తలో విజయనగరం నుంచి చిత్తూరుదాకా ప్రయాణించి.. పలు  సభలు నిర్వహించి.. ఆ సభల్లో వక్తలు  వెలిబుచ్చిన సందేహాలకు సమాధానాలిస్తూ రూపొందించిన సంకలనం... సాహిత్యంలో సంశయ కల్లోలం.. గోవా ప్రయాణంలో రాసిన కవితల సంపుటి దోనా పాలా.. కూడా ఆవంత్స సోమసుందరం యశస్సును దశదిశాలా వ్యాపింప చేశాయి. గురజాడ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి తదితరుల కవితలపై విశ్లేషణాత్మక, విమర్శనాత్మక వ్యాసాలనూ ఆయన ప్రచురించారు. ఆయన రాసిన లేఖలూ పుస్తక రూపంలో వచ్చాయి.   
పిఆర్‌ కాలేజీలో ఉన్నత విద్య
ఆవంత్స సోమసుందర్‌.. 1943లో కాకినాడ పిఆర్‌ కాలేజీలో ఉన్నత విద్యను పూర్తిచేశారు. అప్పట్లోనే ఆయన దేశభక్తిని చాటుకున్నారు. 1942లో బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేశారు. దీంతో బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది. ఆవంత్స క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ  చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలో పోలీసుల దెబ్బలకు తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడే ఆయన ఆంగ్లేయుల చర్యలను వ్యతిరేకిస్తూ కవితలు రాయడం మొదలు పెట్టారు. 
సాహిత్య సేవకు ఎన్నెన్నో పురస్కారాలు 
ఆవంత్స సోమసుందర్‌.. తన సాహిత్యసేవకు గాను ఎన్నెన్నో పురస్కారాలను అందుకున్నారు. 1979లో అత్యంత ప్రతిష్ఠాకరమైన సోవియట్‌ల్యాండ్‌ నెహ్రూ పురస్కారాన్ని, రాజాలక్ష్మీ ఫౌండేషన్‌ అవార్డును, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం లాంటివి పొందారు. 2008లో లభించిన ఎన్టీఆర్‌ జాతీయ ఆత్మగౌరవ సాహితీ పురస్కారం ఆవంత్స కీర్తి కిరీటంలో కలికితురాయిలా ఆయన అభిమానులు భావిస్తారు. దేశంలో మతోన్మాదం పెచ్చుమీరుతున్న ప్రస్తుత తరుణంలో.. కలం ద్వారా ప్రశ్నించే గొంతు మూగబోవడం.. సాహితీ ప్రపంచానికి తీరని లోటని సాహితీవేత్తలు భావిస్తున్నారు. 
రంగరాయ మెడికల్‌ కాలేజీకి దేహం దానం 
ఆవంత్స సోమసుందర్‌.. తన దేహాన్ని స్థానిక రంగరాయ మెడికల్‌ కాలేజీకి దానం చేశారు. ఆయన అంతిమ కోరికను శనివారం నెరవేర్చేందుకు అభిమానులు, సాహితీ వేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. తన రచనలతో సమాజాన్ని చేతన పరచిన ఆవంత్స సోమసుందర్‌.. తన దేహాన్ని వైద్యవిద్యార్థుల అధ్యయనానికే దానమిచ్చి.. సమాజం పట్ల తన అకుంఠిత బాధ్యతను తుదిశ్వాసలోనూ చాటుకున్నారు. 

 

08:51 - August 13, 2016

ఎపి రాజధాని నిర్మాణం సింగపూర్ కు మాత్రమే లాభం చేకూరుతుందని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత దినకర్, వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, సీపీఎం నేత బాబూరావు పాల్గొని, మాట్లాడారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. రాజధాని నిర్మాణానికి ఎవరు అడ్డుపడరని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం..

 

08:40 - August 13, 2016

ఖమ్మం : మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు...అని దిగజారుతున్న మానవసంబంధాలపై ఆర్తిగా గేయాన్ని రాసుకున్నాడో కవి. ఈ మాటలను నిజం చేస్తున్నారు కొందరు సుపుత్రులు. మావవత్వపు విలువలు నశించి.. చివరికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను రోడ్డున పడేస్తున్నారు. కొడుకుల నిరాధరణతో అనాధలుగా వీధుల్లో ప్రాణాలు విడుస్తున్నారు వృద్ధులు..  ఖమ్మంజిల్లాలో  జరిగిన  ఓమాతృమూర్తి విషాదాంతం ఇది..
దిగజారిపోతున్న మానవసంబధాలు 
ఐదుగురు కొడుకులున్నా... అనాధగా కడతేరిపోయింది. కడుపునపుట్టినోళ్ల కసాయితనాన్ని ఇలా నడివీధిలో నిగ్గదీసింది.
మానవసంబధాలు దిగజారిపోతున్నాయి అనడానికి ఈమాతృమూర్తి మరణమే నిదర్శనం... రక్తమాంసాలు ధారగాపోసి  సంపాదించిన ఆస్తులను.. వాటేలేసుకుని పంచుకున్న కొడుకులు..  నడివీధిలోకి నేట్టేస్తే..  తట్టుకోలేక పోయింది.
కన్నతల్లిని నడివీధిలోకి నెట్టేసిన కొడుకులు
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం మొండికుంట గ్రామానికి చెందిన సరోజనమ్మ...కు ఏడుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు.   5గురు కొడుకులు. తన కడుపున పుట్టినోళ్లను చూసుకుని మురిసిపోయింది.  రక్తమాంసాలు ధారగాపోసి సంపాదించిన ఆస్తులను ఐదుగురు కొడుకులకు పంచేసింది. పది ఎకరాల పొలాన్ని వాటాలేసుకుని పంచుకున్న సుపుత్రులు.. తల్లి సరోజనమ్మను మాత్రం.. వీధిలోకి నెట్టేశారు. వృద్ధాప్యంలో తనకు అండగా ఉంటారనుకున్న కొడుకులు.. ఇలా దయలేకకుండా ప్రవర్తించడంపై ఈ అమ్మ కుమిలిపోయింది. కనబడిన ప్రతి పెద్దమనిషిని వేడుకుంది. తన కొడుకులకు బుద్దిచెప్పమని. అధికారులకు విన్నవించుకుంది. కాని.. కొడుకులు మాత్రం కనికరం చూపలేదు. ఐదుగురిలో ఎవరూ పట్టెడన్నం  పెట్టలేకపోయారు. న్యాయంకావాలంటూ ఇలా నిరాహారదీక్షకు దిగింది. 
మెడపట్టుకుని గెంటేసిన కోడళ్లు
ఈ అమ్మను అనాథలా వదిలేసిన కొడుకులు... కూటికి లేనోళ్లు కాదు.. ఐదుగురు కొడుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు.. మిగిలిన వారు కాంట్రాక్టర్లుగా రెండు చేతులా సంపాదిస్తున్నారు. కొడుకులను ప్రయోజకులుగా తీర్చిదిద్ది.. ఓ పదెకరాల పొలాన్నికూడా సంపాదించారు.. సరోజనమ్మ-నర్సిరెడ్డి దంపతులు. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోవడంతో సరోజనమ్మకు కష్టాలు మొదలైయ్యాయి. తండ్రి చనిపోయిన దగ్గరనుంచి పొలం పంచాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొడుకుల బుద్ధిబాగా తెలిసిన సరోజనమ్మ ... పొలాన్ని పంచడానికి ఒప్పుకోలేదు. వృద్ధాప్యంలో నాకు దిక్కెవరు... పొలం చేతులో ఉంటే.. ఏ కొడుకైనా ఇంత అన్నం పెట్టకపోతాడా అని ఆశించింది. కాని... పొలం మీద ఆశ పెట్టుకున్న కొడుకులు.. అమ్మకు అన్నం పెట్టడానికి మాత్రం ముందుకురాలేదు. చివరికి కోడళ్లు మెడపట్టుకు గెంటేస్తే ఇలా న్యాయంకోసం ..నిరసనకు దిగింది. 
అన్నం నీళ్లకు దూరమై ప్రాణాలు విడిచింది
నలుగురికి పెట్టిన ఈ అమ్మ.. చివరిరోజల్లో పరాధీనంగా కొడుకుల దయాభిక్షకోసం ఇలా ధర్నాకు దిగింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పుకున్నా పట్టించుకోవలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మెండికుంటలోని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు దిగింది. అన్నం నీళ్లకు దూరమై చివరికి ప్రాణాలు విడిచింది. తాతకు పెట్టిబొచ్చె తలాపునే ఉంటది.. గుర్తుంచుకోండి కొడుకుల్లారా...  రేపు మీ బిడ్డలుకూడా మీరు చూపిన బాటలోనే నడుస్తారు.. అని హెచ్చరిస్తోంది.. ఈ మాతృమూర్తి మరణం. 

 

నయీం డైరీలో హైదరాబాద్ కు చెందిన మాజీ మంత్రి..

హైదరాబాద్ : నయీం డైరీలో హైదరాబాద్ కు చెందిన మాజీ మంత్రి ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. గతంలో ఈ మాజీ మంత్రి పలు పార్టీలు మారారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అనచరుల హావా కొనసాగింది. నయీం డైరీలో పలు వివరాలు నమోదున్నట్లు తెలుస్తోంది. 

ముగిసిన నాలుగో రోజు ఆట..

గ్రాస్ ఐలెట్ : నాలుగో రోజు ఆట ముగిసింది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 225 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 285 పరుగుల అధిక్యంలో భారత్ ఉంది. 

మెట్ పల్లి పీఎస్ వద్ద యువకుడు ఆత్మహత్య..

కరీంనగర్ : మెట్ పల్లి పీఎస్ ఎదుట పురుగుల మందు తాగి కుమార్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహిళతో పాటు మరో ఇద్దరు యువకులు వేధిస్తున్నారని పీఎస్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

జ్ఞానబుద్ధ మహాఘాట్ కు భక్తుల రద్దీ..

గుంటూరు : జ్ఞానబుద్ధ మహాఘాట్ కు భక్తుల రద్దీ పెరుగుతోంది. అమరలింగేశ్వరస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

08:27 - August 13, 2016

కరీంనగర్ : పూట గడవడమే కష్టంగా ఉన్న ఓ చేనేత శిల్పి మగ్గంపై కుట్టు లేని మూడు రంగుల జాతీయ జెండాకు రూపకల్పన చేసి తన భక్తిని చాటుకున్నాడు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కళాకృతులతో అందరి మన్ననలు పొందాడు. 
సిరిసిల్ల చేనేత కళాశిల్పులకు ప్రసిద్ధి
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల వస్త్రపరిశ్రమ చేనేత కళాశిల్పులకు పెట్టింది పేరు. ఇక్కడి చేనేత కళాకారులు నేత కళాకృతులతో దేశవిదేశాలలో తమ కళా నైపుణ్యాన్ని చాటి చెప్పారు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేసి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న నల్లపరంధాములు.. తర్వాత ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న విజయ్ కూడా చేనేత కళాకృతులకు ప్రాణం పోసి తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. విజయ్ ఉంగరంలో దూరే శాలువాతో పాటుగా, దబ్బనంలో దూరే చీరను మగ్గం పై నేసి అబ్బురపరిచి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అగ్రనాయకులతో శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం విజయ్ క్విట్ ఇండియా వారోత్సవాల సందర్భంగా మగ్గంపై కుట్టు లేకుండా మూడు రంగుల జాతీయ జెండాకు రూపకల్పన చేశాడు. ఈ కుట్టు లేని మూడు రంగుల జెండాను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేతులమీదుగా గోల్కొండ కోటలో ఈ ఆగస్ట్ 15న ఎగురవేయడానికి ప్రయత్నం చేస్తున్నానని, జెండా ఆవిష్కరణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాడు. దేశం మీద ఉన్న భక్తితోనే జెండా రూపకల్పన చేశానని... సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జెండా ఆవిష్కృణకు అధికారులు సహకరించాలని కోరుతున్నాడు. 

08:19 - August 13, 2016

తూర్పుగోదావరి : సూదాపాలెంలో దళితులపై దాడికి.. రాష్ట్ర హోంమంత్రే బాధ్యత వహించాలని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. దాడికి గురైన దళితులకు, ఎస్సీ, ఎస్టీ చట్టప్రకారమే ఎనిమిదిన్నర లక్షల దాకా పరిహారం ఇచ్చే వీలున్నా.. ప్రభుత్వం లక్ష రూపాయలిచ్చి చేతులు దులిపేసుకుందని జగన్‌ విమర్శించారు. 
బాధిత దళితులను పరామర్శించిన జగన్ 
తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో... దాడికి గురైన దళితులను వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో విడివిడిగా మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులతో సుమారు గంటపాటు గడిపారు. 
బాధితులను పరామర్శించిన పాపాన పోలేదన్న జగన్ 
సూదాపాలెం ఘటన సభ్యసమాజం తలదించుకోవాల్సిన అంశమని జగన్‌ అన్నారు. ఘటన జరిగిన రెండు రోజులకే రాజమండ్రి వచ్చిన చంద్రబాబు.. కనీసం బాధితులను పరామర్శించిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. బాధితులకు పరిహారం విషయంలో ప్రభుత్వం బాధ్యతరహితంగా వ్యవహరించిందని ఆరోపించారు. 
ఘటనకు హోంమంత్రి చినరాజప్పదే బాధ్యత... 
ఘటనకు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. తమ పార్టీ ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా.. వారిలో మనోధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తుందని జగన్‌ చెప్పారు. తుని పాలమాన్‌పేటలో ఆర్థిక మంత్రి యనమల సోదరుడి అండతో అన్యాయంపాలైన మత్స్యకారులకూ మనోధైర్యం కల్పించామని ఆయనీ సందర్భంగా చెప్పుకొచ్చారు. 

 

యాదాద్రిలో నేటి నుంచి పవిత్రోత్సవాలు

నల్గొండ : యాదాద్రిలో నేటి నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలు మూడురోజులపాటు కొనసాగునున్నాయి.  

 

08:09 - August 13, 2016

శ్రీకాకుళం : జిల్లాలోని పలాకి అణువిద్యుత్‌ కేంద్ర వ్యతిరేక ఉద్యమంలో సీపీఎం నేతలపై నమోదైన కేసులో ఆ పార్టీ నేతలకు ఊరట లభించింది. జిల్లా కోర్టు విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఆగస్ట్‌ 2015లో అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా మద్దతు ఇచ్చినందుకు సీపీఎం నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసులో మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఏ1గా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఉన్నారు. 

08:06 - August 13, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కృష్ణా పుష్కరాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు పుష్కరాలు కొనసాగుతున్నాయి. 12 రోజులపాటు పుష్కరాలు జరుగనున్నాయి. విజయవాడ, అమరావతి, గుంటూరు, శ్రీశైలం, నల్గొండ, మహబూబ్ నగర్ లలో పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల్లో నిన్న పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. విజయవాడలోని దుర్గాఘాట్ వద్ద ఎపి సీఎం చంద్రబాబు పుష్కరస్నానమాచరించి, పుష్కరాలను ప్రారంభించారు. మరోవైపు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని గొందిమళ్ల ఘాట్ వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు పుష్కరస్నానమాచరించి, పుష్కరాలను ప్రారంభించారు. రెండో రోజున పుష్కరాలకు భక్తులు భారీ ఎత్తున పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పుష్కరస్నానమాచరిస్తున్నారు. పుష్కరఘాట్ల వద్ద భక్తులు బారులు తీరి నిల్చున్నారు. పుష్కరఘాట్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. 

 

నేడు ఆదిలాబాద్ జిల్లాలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ పర్యటన

ఆదిలాబాద్ : నేడు జిల్లాలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది.  నడకదారి భక్తుల దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. 

సీతానగరం ఘాట్ కు పెరిగిన భక్తుల రద్దీ

గుంటూరు : సీతానగరం ఘాట్ కు భక్తుల రద్దీ పెరిగింది. సెలవు దినం కావడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారు జాము నుంచి భక్తులు పుష్కరస్నానమాచరిస్తున్నారు. 

 

అమరావతిలో పెరిగిన పుష్కర యాత్రికుల రద్దీ

గుంటూరు : అమరావతిలో పుష్కర యాత్రికుల రద్దీ పెరిగింది. జ్ఞాన బుద్ధ మహా ఘాట్ లో భక్తులు పుష్కరస్నానమాచరిస్తున్నారు. అమరలింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. 

 

రెండోరోజు కృష్ణా పుష్కరాలు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు రెండో రోజు పుష్కరాలు కొనసాగుతున్నాయి. 12 రోజులపాటు పుష్కరాలు కొనసాగనున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు పుష్కరస్నానమాచరిస్తున్నారు. 
 

Don't Miss