Activities calendar

14 August 2016

21:38 - August 14, 2016
21:37 - August 14, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో మునిగితే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. అయితే గంగలో మునిగినా కుల వివక్ష మాత్రం పోవడం లేదు. విజయవాడ పద్మవతి ఘాట్ వద్ద జరుగుతున్న కృష్ణా పుష్కరాల్లో జంగమ కుల పురోహితులు తీవ్ర కుల వివక్షకు గురతున్నారు. బ్రాహ్మణులు కానందున పిండం పెట్టే అర్హత, సంకల్పం చేయించే అర్హతలు లేవని తమను బ్రాహ్మణులు, అధికారులు, పోలీసులు అడ్డుకుంటున్నారని జంగమ పురోహితులు ఆందోళనకు దిగారు.

21:36 - August 14, 2016

హైదరాబాద్ : పుష్కరాల మూడోరోజు ఏపీ, తెలంగాణలోని పలు ఘాట్లు భక్తులతో పోటెత్తాయి.. ఆదివారం కావడంతో పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.. ఘాట్లలోని ఏర్పాట్లను మంత్రులు, అధికారులు స్వయంగా పరిశీలించారు. 
తెలంగాణలో..
తెలంగాణలో మూడోరోజూ పుష్కర సందడి కొనసాగింది.. వరుస సెలవులు కావడంతో పుష్కర స్నానం చేసేందుకు భక్తులు క్యూ కట్టారు.. సొంతవాహనాల్లో హైదరాబాద్‌నుంచి భారీగా భక్తులు రావడంతో మహబూబ్ నగర్ జిల్లా రంగాపూర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం అయింది ఆలంపూర్‌లోకూడా అన్ని ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి.. జోగులాంబ ఆలయం భక్తులతో పోటెత్తింది.  రంగాపూర్ వీఐపీ ఘాట్‌లో సీనీ హీరో శ్రీకాంత్ పుష్కరస్నానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు. నల్గొండ జిల్లాలోకూడా భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. వాడపల్లి పుష్కరఘాట్‌లో ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. నాగార్జునసాగర్‌ శివాలయం పుష్కర ఘాట్‌కు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కేరళ, కర్నాటక నుంచి భక్తులు తరలివచ్చారు. దామరచర్ల మండలం వాడపల్లి కృష్ణమూడి సంగమ స్థలం దగ్గర పుష్కరాల ఏర్పాట్లను డీజీపీ అనురాగ్‌శర్మ పరిశీలించారు..

ఏపీలో కూడా..
ఏపీలో కూడా సంఖ్యలో భక్తులు స్నానం చేశారు.. అమరావతి రామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పుష్కరాల్లో ప్రముఖులుకూడా సందడి చేశారు. పున్నమిఘాట్లో కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్‌, ఏపీ మంత్రి శిద్ధారాఘవరావు స్నానం ఆచరించారు. ధ్యానబుద్ద ప్రాజెక్టు దగ్గర టెంట్‌ కూలి ఓ మహిళకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ ఘాట్లను పరిశీలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇంద్రకీలాద్రిపైకూడా భక్తుల సంఖ్య పెరిగింది. దుర్గమ్మ దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. ఇక కృష్ణవేణి ఘాట్‌ను మంత్రి దేవినేని పరిశీలించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం నెహ్రూ నగర్‌లో పుష్కరఘాట్‌ను డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సందర్శించారు.. సంగమేశ్వరం నుంచి ఏపీ టూరిజం ఏర్పాటుచేసిన బోటులో ఏర్పాట్లను పరిశీలించారు. విజయవాడలో కృష్ణా నది హారతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతోసహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.. 

21:32 - August 14, 2016

హైదరాబాద్ : నయీం కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సిట్‌ విచారణలో నయీంకు సహకరించిన ఉన్నతాధికారుల హస్తం బట్టబయలవుతోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న నయీం డైరీ నుంచి సేకరించిన సమాచారంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా విజయవాడకు చెందిన రిటైర్డ్ పోలీసు అధికారిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నయీంకు గతంలో కొన్ని కేసుల్లో ఈ అధికారి సహకరించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. మరోపక్క, నయీం డ్రైవర్ శామ్యూల్స్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా చర్ల నుంచి అతడు చత్తీస్ గఢ్ వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. శామ్యూల్ నుంచి 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు.

ఇంట్లో నుంచి భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం..
ఇక నయీంకు సంబంధించి మరో ఆస్తి బయటపడింది. పుప్పాలగూడలో నయీంకు సంబంధించిన మరో ఇల్లును పోలీసులు ఆదివారం గుర్తించారు. అలకాపూర్ ఇంటికి కిలోమీటర్ దూరంలో నాలుగు అంతస్తుల్లో ఈ ఇల్లు నిర్మించి ఉంది. విలాసవంతమైన ఈ ఇంట్లో పోలీసుల సోదాలు నిర్వహించారు. భారీగా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 

21:30 - August 14, 2016

హైదరాబాద్ : తెలంగాణలో డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్ల కోసం వేర్వేరు పద్ధతులు అవలంభించాలని చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో పేదల బస్తీలను అన్ని మౌలిక సదుపాయాలతో మంచి లే అవుట్‌ కాలనీలుగా తీర్చి దిద్దాలని అన్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకంపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న గృహ సముదాయాల పనులను వేగవంతం చేయాలని కోరారు. పేదల బస్తీలను అన్ని వసతులతో కూడిన కాలనీలుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. పేదల కోసం గృహ నిర్మాణ శాఖ స్థలాలతో పాటు టీఎస్‌ఐఐసీ ఆధీనంలో ఉన్న భూములను వినియోగించాలని చెప్పారు.

నిర్మాణం పూర్తి చేయాలన్న కేసీఆర్..
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కట్టడాలకు మైవాన్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నందున ఇళ్ల నిర్మాణం కోసం ముందుకొచ్చే సంస్థలకు ఆ టెక్నాలజీ వాడుకోవడానికి అనుమతించాలని సీఎం అన్నారు. సులభంగా, త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇసుకను ఉచితంగా అందించాలని, ఫ్యాక్టరీ ధరకే సిమెంట్‌ ఇప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజీవ్‌ స్వగృహ ద్వారా నిర్మించిన ఇళ్లను ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించినందున.. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సీఎం చెప్పారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పనుల అప్పగింత తదితర వ్యవహారాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. 

21:28 - August 14, 2016

విజయవాడ : నదులు మనకు ఎంతో ఇచ్చాయని, వాటి రుణం తీర్చుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రం నుంచి కరవును తరిమికొట్టాలంటే నదుల అనుసంధానం తప్పనిసరని చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా పుష్కర ఘాట్లలో సమస్యలకు సంబంధించి 201 ఫిర్యాదులు తమకు అందాయని చెప్పారు. ఈ పుష్కరాల్లో గోదావరి నీటిని పెన్నాకు తీసుకువెళ్లాలని సంకల్పం చేశామని ప్రకటించారు. రాష్ట్రం నుంచి కరవును తరిమికొట్టాలంటే నదుల అనుసంధానం తప్పనిసరని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పుష్కరాలకు సంబంధించి అధికారులతో సమీక్ష సందర్భంగా.. ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం గోదావరి నీటిని పెన్నాతో అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా మూడు రోజుల్లో 21,69,959 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు చంద్రబాబు తెలిపారు. మూడు రోజుల్లోనే ఇంతమంది పుష్కర స్నానాలు చేయడం శుభపరిణామమని ఆయన అన్నారు. కృష్ణా నది వల్ల అందరం అభివృద్ధి చెందామని, ఆ కృతజ్ఞతను తీర్చుకోవడానికి ఇతరులకూ సాయం చేయాలని సీఎం సూచించారు.
పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. సీసీ కెమెరాలతో కంట్రోల్‌ రూమ్‌ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ స్వార్థాన్ని వీడి ఇతరులు బాగుంటేనే నేను బాగుంటానన్న సూత్రాన్ని అలవర్చుకోవాలని సూచించారు. గోదావరి జలాలను పెన్నాకు తీసుకు వెళ్లాలని సంకల్పించినట్లు చంద్రబాబు తెలిపారు. 

21:25 - August 14, 2016

ఢిల్లీ : 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ సర్వం సిద్ధమైంది. ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో ఎర్రకోట పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా చర్యలలో భాగంగా దేశ రాజధానిలోకి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే ప్రవేశానికి అనుమతి నిస్తున్నారు. ఎర్రకోట మొత్తం భద్రతా దళాల అధీనంలో ఉంది. ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను సైతం గతంలో కంటే భారీగా పెంచారు. పదివేల మందికి పైగా బలగాలు ఢిల్లీ పోలీసులు సహా కేంద్ర భద్రతా దళాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సీఐఎస్ఎఫ్, బీఎస్ ఎఫ్ దళాలు ఎర్రకోట చుట్టూ పహారా కాస్తున్నాయి.

హై రిజల్యూషన్‌ కెమెరాల వినియోగం..
ఎర్రకోటలోని చిన్న గదులు, కిటికీల వంటివి దాదాపు 18వందల ప్రదేశాలను భద్రతా దళాలు ముసేశాయి. మొత్తం 600 సిసి కెమెరాల ద్వారా నిఘాను పర్యవేక్షించగా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లోనే 115 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని స్పష్టంగా చూపించగలిగే రెండు కోట్ల విలువైన హై రిజల్యూషన్ కెమెరాలను ఈసారి వినియోగిస్తున్నారు.  ప్రధాని ఎర్రకోటకు వచ్చే మార్గంలో 50 ఆర్మీ వాహనాలు గస్తీ కాస్తున్నాయి. స్క్వాడ్ బృందాలు ప్రతి అంగుళాన్నితనిఖీ చేస్తున్నాయి. సందర్శకుల కోసం ఎల్ ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే ఎర్రకోటలోకి అనుమతించేందుకు బాంబ్ స్క్వాడ్స్ తనిఖీ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం ఏడుగంటలకు ఎర్రకోటపై ప్రధాని ప్రధమంగా త్రివర్ణపతకాన్ని ఆవిష్కరించి జాతి నుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సారి గార్డ్ ఆఫ్ హానర్ కమాండెంట్ గా భారత వైమానిక అధికారి కె.శ్రీనివాసన్ వ్యవహరిస్తారు. దేశ రాజధానిలోని ప్రభుత్వ పాఠశాలలనుంచి ఐదు వందల మంది విద్యార్థినులు జాతీయగీతాన్ని ఆలపించనున్నారు.

21:23 - August 14, 2016

ఢిల్లీ : బలహీన వర్గాలపై దాడులు దేశ సంస్కృతికి వ్యతిరేకమని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ప్రణబ్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. మన ప్రజాస్వామ్యానికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వమే పునాదులని పేర్కొన్నారు. దేశ ప్రజలకు 70వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య దేశంగా భారత్ పరిఢవిల్లుతుందని ఎవరూ నమ్మలేదని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలకు ఓర్చి స్వాతంత్య్రం తీసుకువచ్చిన వీరులను ఎప్పుడూ గౌరవించాలని తెలిపారు. మనల్ని మనం ప్రశ్నించుకుంటూ శాస్త్రీయ దృక్కోణం పెంచుకోవాలని సూచించారు.

భద్రత విషయంలో..
దేశ భద్రత విషయంలో అందరూ కలిసి సమగ్రంగా చర్చ జరిపి పోరాడాలన్నారు. దేశ అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు. మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బలహీన వర్గాలపై దాడులు దేశ సంస్కృతికి వ్యతిరేకమన్నారు. అలా చేయడం సరికాదన్నారు. దేశ ప్రజలంతా ఐక్యమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం శుభసూచకమని ప్రణబ్‌ అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలను తిప్పికొట్టాలని ప్రణబ్ పేర్కొన్నారు. మన ప్రజాస్వామ్యానికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వమే పునాదులని రాష్ట్రపతి స్పష్టం చేశారు. 

అయ్యప్ప సొసైటీ ఘటనపై జుడిషియల్ విచారణ..

హైదరాబాద్ : అయ్యప్ప సొసైటీ వద్ద మ్యాన్ హాల్ ఘటనపై జుడిషియల్ విచారణకు అధికారులు ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ తో విచారణ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై డిపార్ట్ మెంటల్ విచారణకు ఆదేశించడం జరిగిందని జలమండలి ఎండీ దానకిషోర్ పేర్కొన్నారు. 

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి..

ఢిల్లీ : దేశ ప్రజలకు 70వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా యావత్ జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య దేశంగా భారత్ పరిఢవిల్లుతుందని ఎవరూ నమ్మలేదని, ఎన్నో కష్టాలకు ఓర్చి స్వాతంత్య్రం తీసుకువచ్చిన వీరులను ఎప్పుడూ గౌరవిస్తానన్నారు. దేశ భద్రత విషయంలో అందరూ కలిసి సమగ్రంగా చర్చ జరిపి పోరాడాలని, దేశ అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు. 

20:29 - August 14, 2016
20:09 - August 14, 2016

'సలాం ఇండియా' రూపొందిన ఓ సాంగ్ ను పంద్రాగస్టు సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. నవతరం సింగర్స్ షేకింగ్ గ్రూప్ గా ఏర్పాటయ్యారు. ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్, యువ గాయకుడు నోయల్, గాయనీమనులు మౌనిమా, దామిని, మోహన, రమ్యలు షేకింగ్ గ్రూపులో సభ్యులుగా ఉన్నారు. కీరవాణి ఆధ్వర్యంలో అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో తామంతా కలుసుకోవడం జరిగిందని, వచ్చే సమయంలో కొంతమంది భావోద్వేగానికి లోనయ్యామని బృందం పేర్కొంది. దీనితో ఓ గ్రూపుగా ఏర్పడి 'సలాం ఇండియా' పేరిట ఏర్పడడం జరిగిందన్నారు. పంద్రాగస్టుకు రిలీజ్ చేయడం జరుగుతుందని నోయల్ పేర్కొన్నారు. అనంత శ్రీరామ్, గాయనీమనులు, నోయల్ ఎలాంటి ముచ్చట్లు చెప్పారు ? 'సలాం ఇండియా' గురించి ఇంకా ఎలాంటి విశేషాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి. 

నయీం డ్రైవర్ అరెస్టు..

ఖమ్మం : చెర్ల పీఎస్ పరిధిలో నయీం డ్రైవర్ శామ్యూల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్ గడ్ వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. శ్యామూల్ నుండి ఆరు రౌండ్ల 9 ఎంఎం పిస్తోల్ ను స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురం పీఎస్ లో నమోదైన కేసులో ఏ -4 గా శామ్యూల్ ఉన్నాడు. 

19:40 - August 14, 2016

అనంత శ్రీరామ్...ప్రముఖ సినీ గీత రచయిత. ఎన్నో చిత్రాలకు ఆయన గీతాలు అందించారు. తాజాగా అనంత శ్రీరామ్..ఇతరులతో 'సలాం ఇండియా' అనే బ్యాండ్ ఏర్పాటైంది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి ఈ బృందంతో ముచ్చటించింది. ఈసందర్భంగా అనంత శ్రీరామ్ మాట్లాడారు. అమెరికాలో సంగీత విభావరి కార్యక్రమం జరిగిందని, కీరవాణితో పాటు అందరం అక్కడకు వెళ్లడం జరిగిందన్నారు. అక్కడ అందరం బాగా కలిసిపోయామని, కార్యక్రమం అనంతరం కొంతమంది ఉద్వేగానికి లోనై ఏడిచారని పేర్కొన్నారు. పనే పాటగా పెట్టుకుంటే బాగుంటుందని, ఒక బ్యాండ్ లా ఏర్పడితే బాగుంటుందని నోయల్ తనకు సూచించడం జరిగిందన్నారు. మొదటి పాట..గౌరవాన్ని పెంపొందించేలా ఉండాలని భావించినట్లు తెలిపారు. దేశభక్తితో పాటు ఇతర పాటలు కూడా ఇందులో ఉంటాయని, సినిమాలో సెన్సార్ ఉంటుంది కాని ఇక్కడ ఉండదన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్రపతి..

ఢిల్లీ : సోమవారం దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతినుద్ధేశించి ప్రసంగిస్తున్నారు. 

డబుల్ బెడ్ రూం ఇళ్లపై కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : డబుల్ బెడ్ రూం ఇళ్లపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో పేదల బస్తీలను మౌలిక సదుపాయాలతో లే ఔట్లుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో లక్ష, జిల్లాలో 2 లక్షల చొప్పున ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటిని వేగవంతం చేయాలని, పేదల బస్తీలలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించాలని సూచించారు. సిమెంట్ కంపెనీలతో మాట్లాడి ఫ్యాక్టరీల ధరకే సిమెంట్ ను కొనుగోలు చేసేలా చొరవ చూపాలన్నారు.

ముగిసిన సైనా పోరు..

రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటెన్ మహిళల సింగిల్స్ పోరులో సైనా నెహ్వాల్ పోటీ ముగిసింది. గ్రూప్ ప్లే విభాగంలో 61వ ర్యాంక్ క్రీడాకారిణి చేతిలో సైనా ఓటమి చెందింది. 

18:36 - August 14, 2016

హైదరాబాద్ : ఇటీవలే హతమైన గ్యాంగ్ స్టర్ నయీం వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. నయీం కేసులో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రాసుకున్న డైరీలో పలువురు ప్రముఖులున్నట్లు, నయీంతో దందాలు..సత్సంబంధాలు కొనసాగించినట్లు ఆరోపణలు రావడంతో పలువురు స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే సిట్ పోలీసులు విజయవాడకు చెందిన ఓ రిటైర్డ్ పోలీసు అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణలో పలు కీలకమైన డ్యాక్యుమెంట్లతో పాటు కీలక సమాచారాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బ్యాంకుల్లో ఉన్న డ్యాక్యుమెంట్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

18:31 - August 14, 2016

చిత్తూరు : తిరుమలేశుడు.. శ్రీనివాసుడు.! సాక్షాత్తూ సిరుల తల్లి లక్ష్మీదేవిని వక్షస్థలంపై నిలుపుకున్న వేలుపు. అంత దేవదేవుడి సంపద ఇంతింతని ఎన్నగలమా..? వడ్డీకాసుల వాడి క్షేత్రంలో ప్రతిరోజూ కాసుల గలగలలే. లెక్కించలేనంతటి సంపదలే. శ్రీనివాసుడికి భక్తులు సమర్పించే సంపదను లెక్కించేందుకు టీటీడీ సరికొత్తగా ప్రత్యేక భవనాన్నే నిర్మించింది. శ్రీనివాసుని కానుకల లెక్కింపుపై ప్రత్యేక కథనం..తిరుమలేశుడు.. వడ్డీకాసుల వాడు..శ్రీనివాసుడు.. రమకు ఈశుడు.. వేంకటేశుడు.. అనంత సంపదకు వేలుపు..కోట్లాది రూపాయల ఆదాయంతో.. శ్రీనివాసుడు.. ప్రపంచలోనే అత్యంత సంపద కలిగిన దేవుడిగా వెలుగులీనుతున్నాడు. స్వామికి భక్తులు సమర్పించే కానుకలు అనంతం. అగణితం... అయినా మానవ ప్రయత్నంగా స్వామి కానుకల లెక్కింపును తిలకించడం నేత్రోత్సవమే అన్నది భక్తుల మనోగతం. బ్రహ్మాండనాయకుడు కొలువైన సప్తగిరులు కాసుల గుట్టలతో జిగేల్మంటున్నాయి. భక్తిభావంతో సమర్పించే కానుకులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కోర్కెలుతీర్చే కోనేటిరాయుడంటూ కోట్లరూపాయల కానుకలు సమర్పిస్తున్నారు భక్తులు. తిరుమల శ్రీనివాసుని భక్తుల్లో కొందరు నిలువుదోపిడి సమర్పిస్తే మరికొందరు అతి ఖరీదైన నీలాలు కానుకలుగా ఇస్తారు. ఇక ప్రతి సామాన్య భక్తుడూ కొండకు వెళ్లితే తప్పనిసరిగా సమర్పించేది తలనీలాలు. కానుకలు ఏరూపంలో సమర్పించినా.. స్వామివారికి ఆదాయమే ఆదాయం..

1958లో తొలిసారి రూ.లక్ష ఆదాయం..
తిరుమల ఆలయంలో కానుకలు సమర్పించే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇలా వస్తున్న సంపదకు ఒక లెక్కాపద్దు ఉండాలనే ఆలోచనతో బ్రిటీష్‌వారు 1821 జూలై 25న మొదటిసారిగా శ్రీవారి ఆలయంలో హుండీని ఏర్పాటు చేశారు. ఒక గంగాళానికి తెల్లని వస్త్రాన్ని చుట్టి కానుకలు అందులో వేసేలా ఏర్పాటు చేశారు. దీన్ని కొప్పెర అంటారు. స్వామివారి కానుకల చరిత్రలో 1958లో తొలిసారిగా లక్షరూపాయల ఆదాయం దాటింది. అప్పటినుంచి దినదిన ప్రవర్దమానం అవుతూ అనంత కోటికి చేరుకుంది ఏడు కొండల వాడి ఆదాయం.

కానుకలను లెక్కించడమే పరకామణి..
ప్రస్తుతం ప్రతిరోజూ రెండు నుంచి మూడు కోట్లరూపాయలు... రద్దీ సమయాల్లో అయితే దాదాపు 5కోట్ల రూపాయలవరకు శ్రీవారికి కానుకలు సమర్పిస్తున్నారు భక్తులు. ఇలా సంవత్సర సంపద సుమారు వెయ్యికోట్లు దాటిపోతోంది. ఇంతలా కుప్పలు తెప్పలుగా పోగుపడుతున్న సంపదను లెక్కించడానికి అధికారులు ఎప్పటికపుడు కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. గుట్టలుగా పోగవుతున్న కానుకల డబ్బులను లెక్కించడాన్నే పరకామణి అంటారు. పరకామణికోసం కొందరు భక్తులను కూడా వాలంటీర్లుగా తీసుకుని స్వామి సంపదను గణిస్తుంటారు. ప్రస్తుతం మూడు షిప్టుల్లో 250 మంది వరకు భక్తవాలంటీర్లు.. పరకామణి సేవలో తరిస్తున్నారు.

లెక్కింపు సులభతరం కోసం ఆపరేషన్‌ మ్యానువల్‌..
తాజాగా పరకామణికోసం అడ్మినిష్ట్రేటివ్‌ బిల్డింగ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇప్పటిదాకా నోట్లు, చిల్లర డబ్బులు ఒకే దగ్గర లెక్కించేవారు. ఇక నుంచి చిల్లరపరకామణిని ప్రత్యేకంగా లెక్కిస్తామంటున్నారు. దీనికోసం నాణేలను ఎల్లోమెటల్‌, వైట్ మెటల్‌గా విభజించి లెక్కపెడుతామంటున్నారు. సీసీకెమెరాల నిఘాలో పైసాపైసా లెక్కగడుతున్నారు. కానుకల లెక్కింపును సులభతరం చేసేందుకు ఆపరేషన్‌ మ్యానువల్‌ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు టీటీడీ అధికారులు. అభయ హస్తుడు తిరుమల వేంకటేశర్వుడి దర్శనానికి బారులు తీరే భక్తులు... స్వామివారికి మొక్కులు సమర్పించడానికి తండోపతండాలుగా పోటీపడుతుంటారు. రోజురోజుకీ పెరుగుతున్న కానుకల ప్రవాహాన్ని లెక్కించడం.. టీటీడీ అధికారులకు సవాల్‌గానే మారుతోంది. 

నయీం కేసులో దర్యాప్తు ముమ్మరం..

హైదరాబాద్ : నయీం కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. విజయవాడలో రిటైర్డ్ పోలీసు అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

18:24 - August 14, 2016

హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. సీఎం కేసీఆర్‌ గోల్కొండ కోటపై రెండోసారి జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండటంతో పోలీస్‌ యంత్రాంగం... కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. నగరంలో ఐసిస్‌ ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో సెక్యూరిటీని టైట్‌ చేసింది. పాస్‌లున్నవారికి మాత్రమే వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రతిష్టాత్మంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం గోల్కొండ కోటలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. కోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గోల్కొండ కోటపై రెండోసారి సీఎం కేసీఆర్‌ జెండా ఆవిష్కరించనున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు కోట పరిసరాలతో పాటు సిటీలోనూ భద్రతను కట్టుదిట్టం చేసింది. పదిరోజులుగా కోటలోపల పోలీస్‌ దళాలు కవాతు నిర్వహించాయి. వేడుకల రిహార్సల్స్ చేపట్టాయి.

గోల్కొండ కోటలో భద్రత కట్టుదిట్టం..
రాజధాని హైదరాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలపై పోలీసులు నిఘా పెంచారు. గోల్కొండకు వెళ్లే మూడు రహదారుల్లో సిసి కెమెరాలను ఏర్పాటుచేశారు. లంగర్‌హౌస్‌, నార్సింగి రోడ్లలో వాహనాల తనిఖీలు విస్తృతంగా చేస్తున్నారు. కేవలం పాస్‌లున్న వారిని మాత్రమే గోల్కొండ కోటలోపలికి అనుమతించనున్నారు. వేడుకలకు వచ్చే వాహనాల పార్కింగ్‌పై ప్రధానంగా దృష్టిపెట్టారు పోలీస్‌ అధికారులు. నాలుగు ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాటుచేశారు. వివిఐపి పార్కింగ్‌ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. లంగర్‌హౌస్‌, నార్సింగ్‌, మిలిటరీ రోడ్డు మీదుగా గోల్కొండ కోటకు చేరుకునే వాహనాలు సెవెన్‌ టూంబ్స్ మీదుగా దారిమళ్లించనున్నారు. ఉగ్రవాదులు, సానుభూతిపరుల కదలికలు బయటపడుతుండటంతో.. నగరంలో అడుగడుగునా నిఘాపెంచారు సిటీ పోలీసులు. స్వాతంత్ర్య వేడుకల సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. 

కాసేపట్లో బీటింగ్ రిట్రీట్..

వాఘా : భారత్ - పాక్ సరిహద్దులోని వాఘా వద్ద బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భారీగా ప్రజలకు తరలివచ్చారు. 

రోహిత్ శర్మ..బ్రావోలకు ఫైన్..

ఢిల్లీ : టీమిండియా బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ..విండీస్ ఆల్ రౌండర్ డారెన్ బ్రావోకు జరిమాన విధించారు. మూడో టెస్టు ఆఖరి రోజు వీరిద్దరూ పరస్పరం దూషించుకున్నారని, మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. 

17:43 - August 14, 2016

పంజాబ్ : ది గ్రేట్ ఖలీ...తెలియని వారుండరు...ఎందుకంటే ఆయన ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్.. 7.1 అడుగులు..మాంఛి బలిష్టంగా ఉండే శరీరం..రెజ్లింగ్ ఆటలో ప్రపంచస్థాయి ఆటగాడిగా గుర్తింపు పొందాడు..పంజాబ్ రాష్ట్ర పోలీసు ఆఫీసర్ అయిన ఖలీ..2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ ను పొందాడు. ప్రస్తుతం ఇతను రింగ్ వదిలి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయనకు సంబంధించిన ఓ చిత్రం హల్ చల్ చేస్తోంది. ఆయన 'ఆమ్ ఆద్మీ పార్టీ' తీర్థం పుచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 
పంజాబ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. దీనితో ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా పలువురు ప్రముఖులు..ఇతరులపై నజర్ పెట్టింది. పార్టీలో చేర్పించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవలే ప్రముఖ క్రికెటర్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన త్వరలో ఆప్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా దిలీప్ సింగ్ రాణా ఆధ్వర్యంలో ఖలీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఆయనకు ఖలీ మద్దతు తెలియచేసినట్లు తెలుస్తోంది. మరి ఖలీ రాజకీయాలో ఎంట్రీ ఇచ్చాడా ? లేదా ? అనేది చూడాలి. 

17:35 - August 14, 2016
17:26 - August 14, 2016
17:21 - August 14, 2016
17:12 - August 14, 2016

హైదరాబాద్ : అంటరానితనం అనేది కేవలం దురాచారమే కాదని తక్కువ ఖర్చుతో శ్రామిక దోపిడి చేసే మార్గమే అంటరానితనం అని సీనియర్ జర్నలిస్టు పి.సాయినాథ్ అభివర్ణించారు. నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఓ సదస్సులో హాజరై ప్రధానోపన్యాసం చేశారు. ఉనా సంఘటన మానవత్వానికే మాయని మచ్చ అని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రాజకీయ రూపమైతే, వీహెచ్ పి ఆర్ఎస్ ఎస్ లకు ఉన్మాద రూపం ఉందని విమర్శించారు. ఇంకా ఎలాంటి అంశాలు విశ్లేషించారో వీడియోలో చూడండి. 

17:05 - August 14, 2016

నాకెర్ నదిలో పడి ఐదుగురు మృతి..

హిమాచల్‌ప్రదేశ్ : కంగ్రా జిల్లా జ్వాలముఖిలోని నాకెర్ నదిలో ప్రమాదవశాత్తు ఆరుగురు యువకులు పడిపోయారు. వీరిలో ఐదుగురు మృతి చెందగా, ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతదేహాలను నది నుంచి స్థానికులు బయటకు వెలికితీశారు. 

నయీం కేసులో ఎవరినీ వదలం - నాయినీ..

హైదరాబాద్ : హతమైన గ్యాంగ్ స్టర్ నయీం కేసుకు సంబంధించిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయినీ పేర్కొన్నారు. సంబంధం ఉన్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

రాష్ట్రపతి గేటు వద్ద కలకలం..

ఢిల్లీ : రాష్ట్రపతి గేటు నెంబర్ 1వద్ద కలకలం రేగింది. ఓ బ్యాగు ఉందని ఫోన్ కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు నిర్వహించగా బ్యాగులో ఏమి లేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

గోల్కొండలో పంద్రాగస్టు ఏర్పాట్లు..

హైదరాబాద్ : పంద్రాగస్టు సందర్భంగా అధికారులు గోల్కొండ కోటను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గోల్కొండకోటలో అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

16:33 - August 14, 2016
16:32 - August 14, 2016
16:31 - August 14, 2016

హైదరాబాద్ : తనపై దాడి చేసిన డాకూరి బాబు వెనుక ఎవరో ఉన్నారని దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నేత యాదగిరి పేర్కొన్నారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు వెలికి తీయాలని వారు డిమాండ్ చేశారు. కావాలని తనపై ఎవరో కుట్ర చేస్తున్నారని, బాబును ఆర్థికంగా చాలా ఆదుకున్నట్లు చెప్పారు. తమకు సమాజంలో మంచి పేరు ఉందని, తనకు..తన కుటుంసభ్యులకు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
శనివారం మధ్యాహ్నం డాకూరి బాబు..యాదగిరిపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. బోయిన్ పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే కడుపులో ఓ బుల్లెట్ దూసుకపోవడంతో గాయపడిన యాదగిరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. 

16:24 - August 14, 2016

చిత్తూరు : మెగాస్టార్ చిరంజీవి పెద్దకుమార్తె సుస్మిత కాణిపాకం ఆలయాన్ని సందర్శించారు. అక్కడున్న వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెచే అర్చకులు హోం చేయించారు. ఈనెల 22వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే సుస్మిత పూజలు నిర్వహించారు. తన తండ్రి ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పూజలు నిర్వహించినట్లు సుస్మిత తెలిపారు.

 

16:20 - August 14, 2016
16:19 - August 14, 2016
16:14 - August 14, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలు ఏ ఒక్క మతానికి సంబంధించి కాదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పుష్కరాల్లో మూడో రోజు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నదులు అందరీ అవసరాలు తీరుస్తోందని, ఇందుకు అందరూ అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు 21.69 లక్షల మంది పుష్కర స్నానాలు చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజల నుండి అందిన 201 ఫిర్యాదులను పరిష్కరించినట్లు, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్న కృష్ణమ్మకు కృతజ్ఞత తెలియచేసి ప్రకృతితో అనుసంధానం చేయాలన్నారు. గోదావరి నీటిని పెన్నాకు తీసుకెళ్లాలని కృష్ణా పుష్కరాల్లో సంకల్పం చేసినట్లు తెలిపారు. నదుల అనుసంధానం బాధ్యత ప్రభుత్వానిదని, వర్షపునీటిని భూగర్భ జలాలుగా మార్చే బాధ్యత ప్రజలదన్నారు. రాష్ట్రంలో నేరాల సంఖ్యను తగ్గించేందుకు ఆరు లక్షల మంది నేరస్తుల వేలి ముద్రలను ఆన్ లైన్ లో పెట్టడం జరిగిందన్నారు. నేరం జరిగిన వెంటనే నేరస్తులను పట్టుకోవడం జరుగుతుందన్నారు.

 

ఏపీ పోలీసులకు రాష్ట్రపతి సేవా పతకాలు..

విజయవాడ : ఏపీ పోలీసులు రాష్ట్రపతి సేవా పతకాలకు ఎంపికయ్యారు. తిరుపతి ఎస్ఐ చంద్రశేఖర్ పిళ్లై, విజయనగరం జిల్లా ఆర్ఎస్ఐ ఎం.గిరినివాస్, విజయవాడ ఏఎస్ఐ సరోజ, ఆర్ఎస్ఐ (హైదరాబాద్) జె.రామచంద్రయ్య, ఏఎస్ఐ మెరుగుమువ్వల ధనరాజ్, హెడ్ కానిస్టేబుల్ రామకోటి నాయక్ లు రాష్ట్రపతి అత్యుత్తమ సేవా పతకాలకు ఎంపికయ్యారు. 

ఉత్తర్ ప్రదేశ్ లో పోలీసుల తనిఖీలు..

హైదరాబాద్ : ఉత్తర్ ప్రదేశ్ లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రేపు పంద్రాగస్టును పురస్కరించుకుని మోర్దాబాద్ ళక్ష రైల్వే, బస్ స్టేషన్ లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

కేసరిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం..

కృష్ణా : గన్నవరం (మం) కేసరిపల్లి వద్ద డివైడర్ ను ఢీకొని కారు బోల్తా కొట్టింది. కారును వెనుకనుండి లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. 

15:36 - August 14, 2016

రంగారెడ్డి : సోమవారం పంద్రాగస్టు పురస్కరించుకుని పలు ప్రభుత్వ పాఠశాలలు..కార్యాలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని పూడూరు మండలం మేడికొండలో విషాదం చోటు చేసుకుంది. పంద్రాగస్టు నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం ఏర్పాట్లు చేస్తున్నారు. జెండా ఎగురవేయడానికి ఏర్పాటు చేస్తున్న స్తంభం పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తాకింది. దీనితో టీచర్ ప్రభావతికి విద్యుత్ షాక్ తగిలింది. దీనితో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఈమెను కాపాడటానికి ప్రయత్నించిన ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే వీరిని వికరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే ప్రభావతి కన్నుమూసింది. ఐదుగురు విద్యార్థులకు మాత్రం చికిత్స అందిస్తున్నారు. ప్రభావతి మృతదేహాన్ని వికారాబాద్ ఆసుపత్రిలో భద్రపరిచారు. దీనితో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. 

15:32 - August 14, 2016

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు కృష్ణా నదిలోని పవిత్ర ఘాట్లలో పుణ్య స్నానాలాచరించి దుర్గమ్మ దర్శనానికి పోటెత్తుతున్నారు. దీంతో దుర్గమ్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. వినాయకుని గుడి నుంచి కొండపైన అమ్మవారి సన్నిధానం వరకు వేకువజామునుంచే క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసాయి. అధికారులు ఏవిధమైన ఏర్పాట్లు చేశారో ప్రస్తుతం కొండపై భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

15:29 - August 14, 2016

ఢిల్లీ : స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరణ చేయనున్న నేపథ్యంలో భద్రతా బలగాలు ఎర్రకోట పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎన్‌ఎస్‌జీ కమాండోలతో పాటు పారామిలటరీ, బీఎస్‌ఎఫ్‌ దళాలు ఎర్రకోటను పహారా కాస్తున్నాయి. సీసీకెమెరాలతో గట్టి నిఘా ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో 9వేల మంది పోలీసులు మోహరించారు. అంతేగాకుండా 3వేల మంది కీలక ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 30 మంది కూడిన బృందం సీసీ టివి ఫుటేజ్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనుంది. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను మూసివేయించారు. ఎర్రకోట సమీపంలో ఉన్న నివాస స్థలాలపై పోలీసులు నిఘా పెట్టారు. గత కొద్ది రోజులుగా వర్షాలుగా కురుస్తున్నాయి. రేపు కూడా వర్షం కురుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రేపు ప్రధాని స్పీచ్ ఎలా ఉంటుందోనని ప్రజలు వేచి చూస్తున్నారు. 

15:26 - August 14, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రెవిన్యూ యంత్రాంగం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదన్నారు. పెట్టుబడుల కోసం కౌలు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 26, 27 తేదీల్లో తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల్లో 14 లక్షల మంది కౌలు రౌతులున్నారని, 4 లక్షల 15 వేల మంది కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుందని తెలిపారు. కానీ మొదటి సంవత్సరంలో 44వేలు, రెండో సంవత్సరంలో 50 వేల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చారని విమర్శించారు. 

15:24 - August 14, 2016

హైదరాబాద్ : ప్రభుత్వాలు మేక్‌ ఇన్‌ ఇండియా పిలుపు ఇచ్చినా దేశంలో ఐదేళ్లుగా ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోతున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ జయతీఘోష్‌ చెప్పారు. 'సరళీకృత ఆర్థిక విధానాల'పై హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. గుజరాత్‌ అభివృద్ధి నమూనా ఒక విఫల ప్రయోగమన్నారు. కార్పొరేట్లకు ప్రోత్సహాలకు కల్పించడానికి మినహా, ఉద్యోగాల కల్పనకు ఈ విధానం దోహదం చేయలేదన్నారు. అందుకే గురాజత్‌లో రిజర్వేషన్ల కోసం పాటీదార్లు ఉద్యమిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉదారవాద విధానాల అమలు తర్వాత దేశంలో అసమానతలు పెరిగిపోయాయని, విద్య వ్యాపారంగా మారడంతో తల్లిదండ్రులు భూములు అమ్మి, అప్పులు చేసి పిల్లల్ని చదవించాల్సి వస్తోందన్నారు. ఇంతచేసినా ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేకపోవడంతో ఇలాంటి లక్షలాది కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో విద్య వ్యాపార వస్తువుగా మారిందని పేర్కొన్నారు.

15:21 - August 14, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్ సబ్ కమటీ తెలంగాణ రాష్ట్ర జిల్లాల ప్రజా ప్రతినిధులతో భేటీలు జరుపుతున్నారు. ఈ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు..ఇతర అధికారులు అందించిన సూచనలు..సలహాల ప్రకారం కేబినెట్ సబ్ కమిటీ నివేదిక రూపొందిస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం కొత్త జిల్లాల ఏర్పాటు కోసం నియమించిన కేబినెట్‌ సబ్‌ కమిటీ ఇవాళ మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ జిల్లా ప్రతినిధులతో సమావేశమైంది. గద్వాల్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని గద్వాల జిల్లా సాధన సమితి ఆందోళనకు దిగింది. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల విభజన చేయాలి తప్ప..నేతలు డిమాండ్ చేశారని జిల్లాలు చేయొద్దన్నారు కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే అరుణ. రాజకీయాల కోసం జిల్లాలను విభజిస్తే చరిత్ర హీనులవుతారని డీకే అరుణ, సంపత్ లు విమర్శించారు. కనీస మార్గదర్శకాలు లేకుండా జిల్లాలు ఎలా ఏర్పాటు చేస్తారని సూటిగా ప్రశ్నించారు. జిల్లాల ఏర్పాటుపై ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలని, గద్వాల..ఆలంపూర్..మక్తల్ ను కలిసి జోగులాంబ జిల్లా చేయాలని అరుణ డిమాండ్ చేశారు.

ప్రతిపాదనలో లోపాలు - రేవంత్..
జిల్లాల ఏర్పాటుపై తూతూ మంత్రంగా అభిప్రాయాలు సేకరించడం సరికాదన్నారు రేవంత్‌రెడ్డి. ప్రతిపాదనలో చాలా లోపాలున్నాయని సబ్‌కమిటీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. గాల్లో దీపం పెట్టినట్లు మార్గదర్శకాలు తయారు చేసి సలహాలు కోరడం సరైంది కాదని, ఏ ప్రాతిపదికన కొత్త జిల్లాల మార్గదర్శకాలు తయారు చేశారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త జిల్లాల ఏర్పాటు ఉండకూడదని సూచించారు. 

మేడికొండలో విషాదం..

రంగారెడ్డి : పూడూరు మండలం మేడికొండలో విషాదం చోటు చేసుకుంది. పంద్రాగస్టు నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాట్లు చేస్తున్న టీచర్ ప్రభావతి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. 

400 కేజీల గంజాయి స్వాధీనం..

విశాఖపట్టణం : జి.మాడుగుల (మం) కె.కోడపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రూ. 1.5 కోట్ల విలువైన 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. ప్రజల అభిప్రాయాల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు, అంతేగాకుండా పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటి సీఎంలు మహమూద్ ఆలీ, కడియం శ్రీహరిలు పేర్కొన్నారు. సమావేశాల్లో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయడం జరిగిందని, మూడు రోజుల పాటు జరిగిన సమావేశాలతో పాటు జిల్లాల కలెక్టర్లు ఇచ్చే సమాచారంతో సీఎంకు నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నారు.

 

జార్ఖండ్ లో పేలుడు పదార్థాలు స్వాధీనం..

జార్ఖండ్ : డుమ్కాలో ఎస్ఎస్ బి దళాలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. డిటోనేటర్స్..అల్యూమినియం నైట్రేట్ తో పాటు పలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

82 మందికి పతకాలను ప్రకటించిన కేంద్రం..

ఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి 82 శౌర్య పతకాలకు ఆమోదం తెలిపారు. ఒక అశోక్ చక్ర, 14 శౌర్య పతకాలు, 63 సేన మెడల్స్, రెండు నౌ సేన మెడల్స్, రెండు వాయు సేన మెడల్స్ ఉన్నాయి. 

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ నాథ్ సమావేశం..

ఢిల్లీ : సోమవారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భద్రతా పరిస్థితిపై చర్చిస్తున్నారు. 

తెలంగాణ పోలీసులకు కేంద్రం 'పోలీస్ పతకాలు'...

హైదరాబాద్ : తెలంగాణలో మరో 26 మంది పోలీసులకు 'పోలీస్ పతకాలు' ను ప్రకటించింది. అడిషినల్ ఎస్పీ చంద్రశేఖర్, ఎస్పీలు ప్రభాకర్ రావు, రాజశేఖర్ రెడ్డి, డీఎస్పీ దయానంద రెడ్డి, ఇన్స్ పెక్టర్లు బాలగంగిరెడ్డి, భాస్కర్, రవీందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ కరీం, కానిస్టేబుళ్లు రాజీవ్ వర్ధన్, రాజ్ ఫాషా, ముషారం బాబాలకు కేంద్రం పతకాలు ప్రకటించింది. 

ఎస్ఐ సదయ్య, నాగరాజులకు 'ప్రెసిడెంట్ పోలీస్' పతకం..

హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలువురు పోలీసులకు కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. నల్గొండలో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన ఎస్ఐ సదయ్య, నాగరాజులకు 'ప్రెసిడెంట్ పోలీస్' పతకం ప్రకటించింది.

కృష్ణవేణి ఘాట్ వద్ద పోలీసుల అదుపులో నలుగురు..

విజయవాడ : కృష్ణవేణి ఘాట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఛత్తీస్ గఢ్ వాసులుగా గుర్తించారు. 

21.69 లక్షల మంది పుణ్యస్నానాలు - బాబు..

విజయవాడ : ఇప్పటి వరకు 21.69 లక్షల మంది పుష్కర స్నానాలు చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజల నుండి అందిన 201 ఫిర్యాదులను పరిష్కరించినట్లు, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్న కృష్ణమ్మకు కృతజ్ఞత తెలియచేసి ప్రకృతితో అనుసంధానం చేయాలన్నారు. గోదావరి నీటిని పెన్నాకు తీసుకెళ్లాలని కృష్ణా పుష్కరాల్లో సంకల్పం చేసినట్లు తెలిపారు. నదుల అనుసంధానం బాధ్యత ప్రభుత్వానిదని, వర్షపునీటిని భూగర్భ జలాలుగా మార్చే బాధ్యత ప్రజలదన్నారు. రాష్ట్రంలో నేరాల సంఖ్యను తగ్గించేందుకు ఆరు లక్షల మంది నేరస్తుల వేలి ముద్రలను ఆన్ లైన్ లో పెట్టడం జరిగిందన్నారు.

14:36 - August 14, 2016

అభ్యుదయ సాహితీ సృజనామూర్తి డా. ఆవంత్స సోమసుందర్ ఈ శుక్రవారమే కన్నుమూశారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించిన వజ్రాయుధం లాంటి మహాకావ్యం రాసిన ఆవంతి సోమసుందర్ చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. అభ్యుదయ కవిగా, విమర్శకునిగా సాహితీ పరిశోధకునిగా ఆయన జీవితమంతా కృషి చేశారు. ప్రజా ఉద్యమాలకు ఆయన సాహిత్యం ప్రేరణ ఇచ్చింది. ఆ సాహితీమూర్తి లేడన్న వాస్తవాన్ని సాహితీప్రియులు, సృజనా కారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ కవి, అభ్యుదయ సాహితోద్యమ వేగుచుక్క, తొంబైయేళ్ల సిరా చుక్క ఆవంత్స సోమసుందర్ మృతికి టెన్ టివి నివాళులర్పిస్తోంది... ఆయన జీవితానికి సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:28 - August 14, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పోటెత్తారు. దీనితో ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. విజయవాడలో పేరొందిన దుర్గాఘాట్ కు భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు చేస్తూ తరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేస్తోంది. పోలీసులు పలు నిబంధనలు సడలించింది. అమ్మవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమవుతున్నారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:26 - August 14, 2016

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా పుష్కరాలు కొనసాగుతున్నాయి. మూడో రోజు నల్గొండ జిల్లాలో భక్తుల తాకిడి అధికంగా ఉంది. నాగార్జున శివాలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువైంది. తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తున్నారు. నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో భక్తులు ఫిర్యాదు చేశారు. దీనితో జాయింట్ కలెక్టర్ ప్రభుత్వానికి విన్నవించారు. దీనితో నీటిని విడుదల చేయడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. 28 ఘాట్లున్న ఇక్కడ పది ఘాట్లలో జనప్రవాహం అధికంగా ఉంది. ఆదివారం మధ్యాహ్నం వరకు 20 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. సాయంత్రం వరకు ఈ రద్దీ పెరిగే అవకాశం ఉందని సమాచారం. దుస్తులు మార్చుకోవడానికి గదులు మరిన్ని ఏర్పాటు చేశారు. పుష్కరస్నానం చేయడానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజఈతగాళ్లు బోట్లలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:16 - August 14, 2016

గుంటూరు : ఏపీ రాష్ట్రంలో కృష్ణా పుష్కరాలు కొనసాగుతున్నాయి. తొలి రోజు కొన్ని ఇబ్బందులు ఎదురు కావడంతో మరుసటి రోజు నుండి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఎలాంటి ట్రాఫిక్ తలెత్తకుండా కొన్ని నిబంధనలు సడలించింది. సీతారంనగరం పుష్కరఘాట్ వరకు భక్తులను అనుమతించలేదు. దీనితో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఆదివారం నేరుగా బస్సులను పుష్కర ఘాట్ వరకు అనుమతించారు. దీనితో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళగిరి నుండి బస్సులను వదిలేస్తున్నారు. ఉచిత బస్సులను నడపడం లేదు. బస్సుల్లో సాధారణ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని గౌతమిబుద్ధ ఘాట్ కు భక్తుల తాకిడి అధికమౌతోంది. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:07 - August 14, 2016

కొత్త జిల్లాల ఏర్పాటుపై రేవంత్ విమర్శలు..

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు నామమాత్రపు ప్రక్రియగా సాగితే సరిపోదని టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ వ్యాఖ్యానించారు. గాల్లో దీపం పెట్టినట్లు మార్గదర్శకాలు తయారు చేసి సలహాలు కోరడం సరైంది కాదని, ఏ ప్రాతిపదికన కొత్త జిల్లాల మార్గదర్శకాలు తయారు చేశారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త జిల్లా ఏర్పాటు ఉండకూడదన్నారు.

నల్గొండ జిల్లా ప్రతినిధులతో కేబినెట్ సబ్ కమిటి భేటీ..

హైదరాబాద్ : కేబినెట్ సబ్ కమిటీ భేటీ కొనసాగుతోంది. పలు జిల్లాల ప్రతినిధులతో కమిటీ సమావేశం జరుపుతోంది. కాసేపటి క్రితం నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించారు. 

14:02 - August 14, 2016

హైదరాబాద్ : ఏ ప్రాతిపదికన కొత్త జిల్లాల మార్గదర్శకాలు తయారు చేశారో చెప్పాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు భూమిని ప్రాతిపదికగా తీసుకున్నారా లేదా జిల్లా కేంద్రాలకు ఉండే దూరాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారా అని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రతిపాదన లోపభూయిష్టంగా ఉందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నామమాత్రపు ప్రక్రియగా సాగితే సరిపోదని తెలిపారు. గాల్లో దీపం పెట్టినట్లు మార్గదర్శకాలు తయారు చేసి సలహాలు కోరడం సరైనదికాదన్నారు. కేబినెట్ సబ్ కమిటీ సరైన ప్రతిపాదనతో వస్తే దాని ఆధారంగా సలహాలు, సూచనలు చేయడానికి వీలుకలుగుందని చెప్పారు. జనాభా అధారంగా దమాషా ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు ఉంటుందని చెప్పిన ప్రభుత్వం.. మహబూబ్ నగర జిల్లాలో 24 మండలాల్లో 18 లక్షల జనాభా ఉందని...కొత్తగా ఏర్పాటు కాబోయే నాగర్ కర్నూలు జిల్లాలో 9 లక్షల జనాభా ఉందన్నారు. ఇలా అయితే దమాషా ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నామమాత్రపు ప్రక్రియ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు. స్వార్థంతో, రాజకీయ లబ్ధికోసం కొత్త జిల్లాలపై తప్పుడు ప్రతిపాదనలు చేస్తే పరిపాలనకు, ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యుడు కూడా అభ్యంతరాలు తెలిపారని పేర్కొన్నారు. కానీ సభ్యుల అభ్యంతరాలను మినిట్స్ లో రాయకుండా... ప్రభుత్వానికి అనుకూలమైన అంశాలను మాత్రమే మినిట్స్ లో రాయడం సరికాదన్నారు. సభ్యులు తెలిపిన అభ్యంతరాలను కూడా మినిట్స్ లో రాయాలని కోరారు. మహబూబ్ నగర్ జిల్లాకు దగ్గరగా ఉన్న రంగారెడ్డి జిల్లాలోని గండీడ్ , కుల్కచర్చ మండలాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే వికారాబాద్ జిల్లాలో కలిపారని తెలిపారు. తన కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలను వికరాబాబాద్ జిల్లాలో.. రెండు మండలాలను మహబూబ్ నగర్ జిల్లాలో కలిపారని తెలిపారు. 

 

'రాజకీయాల కోసం విభజిస్తే హీనులవుతారు'..

హైదరాబాద్ : రాజకీయాల కోసం జిల్లాలను విభజిస్తే చరిత్ర హీనులవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్ లు విమర్శించారు. కనీస మార్గదర్శకాలు లేకుండా జిల్లాలు ఎలా ఏర్పాటు చేస్తారని సూటిగా ప్రశ్నించారు. జిల్లాల ఏర్పాటుపై ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలని, గద్వాల..ఆలంపూర్..మక్తల్ ను కలిసి జోగులాంబ జిల్లా చేయాలని అరుణ డిమాండ్ చేశారు. 

ఉపాధి రేటు పెరగలేదు - ప్రొఫెసర్ జయతి ఘోష్..

హైదరాబాద్ : ఎస్వీకేలో 'నయా సరళీకరణ కాలంలో ఏం జరిగింది' అనే అంశంపై సెమినార్ జరిగింది. నయా ఉదార విధానాల నేపథ్యంలో చాలా మంది కార్మికులు తక్కువ జీతాలకు పనిచేస్తున్నారని ప్రొఫెసర్ జయతి ఘోష్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు దొరకకపోవడం ఆందోళనకరమని, 25 ఏళలో ఉపాధి రేటు పెరగలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీరమై పోతున్నాయని, పెట్టుబడుల ఉపసంహరణ పెరుగుతోందన్నారు. సంక్షేమ పథకాల్లో పేదలకు సబ్సిడీలు తగ్గించి పెట్టుబడి దారులకు లబ్ధి చేకూర్చేలా విధానాలు రూపొందిస్తున్నారని జేఎన్జీటీయూ ప్రొ.జయతి తెలిపారు. 

ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సీఎం బాబు..

విజయవాడ : ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఫొటో ఎగ్జిబిషన్, డ్వాక్రా బజార్ ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు దీనిని ప్రారంభించారు. విజయవాడకు భక్తుల సందర్శన..షాపింగ్ మాల్స్ లలో కొనుగోళ్లపై డాక్యుమెంటరీ రూపొందించాలని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులకు బాబు ఆదేశాలు జారీ చేశారు. 

వరంగల్ జిల్లా ప్రతినిధులతో కేబినెట్ సబ్ కమిటి భేటీ..

హైదరాబాద్ : కేబినెట్ సబ్ కమిటీ భేటీ కొనసాగుతోంది. పలు జిల్లాల ప్రతినిధులతో కమిటీ సమావేశం జరుపుతోంది. ఈ రోజు వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించారు. 

ఘాట్లను పరిశీలించిన డీజీపీ అనురాగ్..

మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా పుష్కరాలు కొనసాగుతున్నాయి. పలు ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మాగనూరు మండలంలోని కృష్ణా పుష్కర ఘాట్లను డీజీపీ అనురాగ్ శర్మ సందర్శించారు. 

13:54 - August 14, 2016

హైదరాబాద్ : ఉదారవాద విధానాల అమలు తర్వాత దేశంలో అసమానతలు పెరిగిపోయాయని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ జయతీఘోష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 'సరళీకృత ఆర్థిక విధానాల'పై హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. విద్య వ్యాపారంగా మారడంతో తల్లిదండ్రులు భూములు అమ్మి,  అప్పులు చేసి పిల్లల్ని చదవించాల్సి వస్తోందన్నారు. ఇంతచేసినా ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేకపోవడంతో ఇలాంటి లక్షలాది కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో విద్య వ్యాపార వస్తువుగా మారిందని పేర్కొన్నారు.

 

13:49 - August 14, 2016

అవిసెలు...శక్తివంతమైన ఆహారాలలో ఇది ఒకటి. వీటిని తినడం వల్ల గుండె వ్యాధి..క్యాన్సర్..స్ట్రోక్..మధుమేహం..వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేగాకుండా జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. ప్రత్యేక పోషకాలు కీలంగా పనిచేస్తాయి. మేలు చేసే అవిసెగింజలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తినడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు దాగుతున్నాయో చూద్దాం..
అవిసెల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటాక్సిడెంట్లు, పీచు ఎక్కువ. షుగ‌ర్‌, క్యాన్సర్‌, గుండె జబ్బులను నివారించటంలో అవిసె నూనె సమర్థమైనదని పరిశోధనల్లో కూడా రుజువైంది. అవిసె గింజల ద్వ‌రా పూర్తి ప్రయోజనం దక్కాలంటే వాటిని దంచి, పొడి చేసి లేదా నూనె రూపంలో తీసుకోవాలి.
ఎముకలు దృఢంగా ఉండేందుకు అవిసెగింజలు తోడ్పడతాయి. రుతుక్రమం సవ్యంగా కొనసాగడంలో సాయపడతాయి.
ఇందులో ఉండే పోషకాలకు రొమ్ము, అండాశయ క్యాన్సర్‌ కారకాలతో పోరాడే శక్తి ఉంది.
అవిసె నూనె వాడడం వల్ల ప్రొస్టేట్‌, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు. రేడియేషన్‌ ప్రభావానికి గురికాకుండా చర్మానికి రక్షణ అందిస్తుంది.
మెదడుకు శక్తిని పెంచుతుంది. అంతేగాకుండా వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు ఎమర్జెన్సీగా పనిచేసి డిప్రెష‌న్‌ను కూడా తగ్గిస్తాయి.
జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని బి విటమిన్‌, కీలక కొవ్వులు చర్మం పొడిబారే తత్వాన్ని తగ్గించి, మృదువుగా తయారు చేస్తాయి.
చుండ్రు సమస్య ఉన్న వారికి..పేలు నశించేట్లు చేయడంలో అవిసె నూనె బాగా పనిచేస్తుంది. వెంటుకలు కూడా మళ్ళీ పెరిగి జుత్తు చిక్కగా తయారవుతుంది.
వీటిని నేరుగా తినడానికి ఇష్టం లేఇ వారు సూప్ లు...సలాడ్ లలో వేసుకుని తింటే మంచిది. 

13:47 - August 14, 2016
13:46 - August 14, 2016
13:44 - August 14, 2016

నల్లగొండ : జిల్లాలోని వాడపల్లి పుణ్యక్షేత్రంలో సిట్ చీఫ్ నాగిరెడ్డి కుటుంబ సమేతంగా పుణ్యస్నానం చేశారు. అనంతరం స్వామివారికి పూజలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ఘాట్లన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయని అన్నారు. రద్దీని తగ్గించేందుకు భక్తులు తెలంగాణవ్యాప్తంగా ఉన్న ఘాట్లలో పుష్కరస్నానాలు చేయాలని కోరారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఘాట్లను ఎంచుకోవాలని సూచించారు. 

 

13:41 - August 14, 2016

నల్గొండ : జిల్లా వాడపల్లి పుష్కర ఘాట్‌కు ఆదివారం యాత్రికులు పోటెత్తారు. పోలీసులు ఆంక్షలు సడలించడంతో తెల్లవారు జాము నుంచే భక్తులు స్నానాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు తరలివస్తున్నారు. పుష్కర స్నానం చేసిన భక్తులు వాడపల్లి క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు.

 

13:37 - August 14, 2016

బెండకాయ...ఈ కూరగాయన్ని వివిధ రకాలుగా వండుకోవచ్చు. కొంతమంది బెండకాయలంటే అయిష్టంగా ఉంటారు. కానీ ఈ బెండలో ఎన్నో పోషక పదార్థాలు లభిస్తాయి. బెండ ఔషధపరంగా కూడా ఎంతో ఉపయోగిస్తుంది. ఐరన్..జింక్..ఫైబర్..విటమిన్ ఎ.సి.ఇలు..బీటా కెరోటిన్..పెక్టిన్, ఫోలిక్ యాసిడ్..యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దామా...
శరీరంలో నీటి సమతుల్యతను కాపాడడమే కాకుండా జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది. పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతుంది.
గుండకు రక్షణగా పనిచేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది.
డయేరియా ఉంటే బెండకాయ రసం తీసుకోవాలి. బెండరసం ద్వారా బ్లడ్‌షుగర్ తగ్గేలా చేస్తుంది. అంతేగాకుండా అల్సర్ వ్యాధికి ఔషధంగా పనిచేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది.
శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. నాడీ వ్యవస్థ పని తీరుకు సాయపడుతుంది.

13:36 - August 14, 2016

వయస్సు మీద పడుతున్నా కొద్ది ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. చికాకులు..అనారోగ్యాలు..ఇలా ఎన్నో వస్తుంటాయి. కానీ కొంతమంది మాత్రం వయస్సు మీద పడుతున్నా చలాకీగా ఉంటూ అన్ని పనులు వారే చేసుకుంటుంటారు. అంతేగాకుండా అనారోగ్యానికి కూడా గురికారు. ఆధునిక జీవితంలో ముప్పై ఏండ్లకే గుండె జబ్బులు..కీళ్ల నొప్పులు..అధిక బరువు..బిపి..షుగర్ తదితర అనారోగ్యాలు ఎన్నో వెంటాడుతున్నాయి. ఇందుకు 'పీచు పదార్థాలు' తినడమే పరిష్కారమని వైద్యులు పేర్కొంటున్నారు. అధ్యయనాలు కూడా ఇవే తెలియచేస్తున్నాయి.
రెగ్యులర్ ఆహార పదార్థాల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు మందగించడం..శ్వాసకోశ సమస్యలు..క్యాన్సర్..గుండె జబ్బులు..లాంటి తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయంట.
ధాన్యాలు..పప్పులు..ఆకు కూరలు..కూరగయాలు..పళ్ల నుండి పీచు పదార్థాలు లభిస్తుంటాయి.
ఓట్స్, బీన్స్, వేరుశెనగలు, ఆపిల్స్, పుల్లని పండ్లు, క్యారట్లు, బార్లీ వంటి వాటిలో కరిగే పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నీటిలో కరిగే పీచు పదార్థాలు.
మలబద్ధకంతో బాధపడేవారికి నీటిలో కరుగని పీచుపదార్థాలు చాలా ఉపయోగపడతాయి. పొట్టుతో కూడిన ధాన్యాలు, గింజలు, బీన్స్, క్యాలీఫ్లవర్, బంగాళదుంపలు వంటి కూరగాయల్లో నీటిలో కరగని పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. 

13:36 - August 14, 2016

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు విజయవాడ పున్నమి ఘాట్‌లో భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో పుష్కర స్నానానికి  భక్తులు తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి యాత్రికులు స్నానం చేస్తున్నారు. పుష్కరఘాట్ల వద్ద భక్తులు బారులు తీరి నిల్చున్నారు. 12 రోజులు పాటు ఈ పుష్కరాలు కొనసాగనున్నాయి. పున్నమి ఘాట్‌లో పుష్కర యాత్రికుల రద్దీపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:32 - August 14, 2016

విజయవాడ : కృష్ణా, గోదావరి నీరు కలిసిన పవిత్ర సంగమంగా మారిన ఇబ్రహీంపట్నం ఘాట్ భక్తులతో రద్దీగా మారాయి. మొదటి, రెండురోజులు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షల కారణంగా వెలవెలబోయిన ఘాట్లు మూడోరోజు సందడిగా మారాయి. దీంతో భక్తులు సైతం పుణ్యస్నానాలు చేసేందుకు తరలివస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పూర్తి వెసులుబాటు కల్పించారు. ఘాట్ కు సంబంధించి మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

గొల్లపూడి పుష్కరఘాట్ వద్ద విషాదం

విజయవాడ : గొల్లపూడి పుష్కరఘాట్ వద్ద విషాదం నెలకొంది. పుష్కరాలకు వెళ్లిన ఓ రైల్వే ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. అతని మృతితో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. 

 

13:23 - August 14, 2016

చిత్తూరు : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. తను టీడీపీలో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేయిస్తూ మైండ్‌గేమ్‌ ఆడుతుందని ధ్వజమెత్తారు. పుష్కరాల పేరిట చంద్రబాబు ప్రభుత్వం భారీగా దోపిడీ చేస్తోందని ఆరోపించారు. భక్తులకు కనీసం మంచినీళ్లు కూడా అందించడం లేదని.. బురద నీళ్లలో పుష్కర స్నానం చేయడం బాధాకరమన్నారు. 

 

13:21 - August 14, 2016

కర్నూలు : జిల్లా నంద్యాలలో విషాదమైన ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నంద్యాలలోని బర్మశాల వీధికి చెందిన రామ్‌ప్రసాద్‌, సత్యవతి దంపతులు.. కూతురు శోభారాణి, కుమారుడు విజయ్‌కుమార్‌తో కలిసి పంటపొలాల్లో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఘటనా స్థలంలో రామ్‌ ప్రసాద్‌తో పాటు కుమారుడు విజయ్‌ చనిపోగా.. ఆస్పత్రిలో సత్యవతి, కూతురు శోభారాణి మృతిచెందారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని బంధువులు అంటున్నారు.   

13:15 - August 14, 2016

చెన్నై : ఐసీయూలో తండ్రి వేలి0ముద్రలు తీసుకుని ఊపిరి తీసిన ఓ కుమార్తె ఉదంతం సంవత్సరం తర్వాత సీసీటీవీ పుటేజ్ ద్వారా బయటపడింది. చెన్నైలో ఆస్తి కోసం ఓ కుమార్తె తండ్రిని చంపాలని చూసిన ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసుల విచారణలో బయటపడింది.
తండ్రిని చంపిన ఘటన సంచలనం 
చెన్నైలోని కీల్పాకంకు చెందిన డాక్టర్ రాజగోపాల్ కు కుమార్తె జయసుధమనోహర్ ఆస్తి కోసం తండ్రిని చంపిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ తతంగం అంతా సీసీ ఫుటేజీ ద్వారా బయటపడింది. దీంతో తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంపై పోలీసులు కుమార్తె జయసుధను విచారిస్తున్నారు. చెన్నైలోని కీల్పాకంకు చెందిన డాక్టర్ రాజగోపాల్ కు ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు. కుమారుడు జయప్రకాష్, కూతురు జయసుధ ఇద్దరు వైద్య వృత్తిలో ఉన్నవారే.  ప్రధానంగా కుమార్తె జయసుధ మనోహర్ కోయంబత్తూరులో ఆస్పత్రి నిర్వహిస్తుండగా...  కుమారుడు జయప్రకాష్ చెన్నైలోని కీల్పాక్ లో ఆదిత్య ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఏడాది కిందట డాక్టర్ రాజగోపాల్ అనారోగ్యానికి గురై ఆదిత్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలోనే కూతురు తండ్రిని చంపాలనుకుంది.
ఆక్సిజన్ మార్గాన్ని ఊపిరి ఆడకుండా కట్ చేసిన కూతురు
డాక్టర్ రాజగోపాల్ ను పరామార్శించేందుకు తన కుమారుడిని, అల్లుడిని వెంటబెట్టుకుని వచ్చింది జయసుధ. ఐసీయూలో ఉన్న నర్సులను అటెండర్లను బయటకు పంపించి.. అనంతరం తనతో తీసుకు వచ్చిన డాక్యుమెంట్లపై ఆయన వేలిముద్రలు వేయించుకుంది. అనంతరం రాజగోపాల్ కి రక్తం ఎక్కించే ట్యూబ్స్ ను, ఆక్సిజన్ మార్గాన్ని ఊపిరి ఆడకుండా కట్ చేసింది. కొద్దిసేపటికే  రాజగోపాల్ రక్తం.. బెడ్ కింద పడటం గమనించిన జయసుధ దాన్ని తుడిచే ప్రయత్నం చేసింది. అటుగా వచ్చిన డాక్టర్ నర్సులను పిలిచి మళ్లీ రాజగోపాల్ కు ఊపిరిపోశారు. 
చికిత్స అనంతరం రాజగోపాల్ మృతి 
ఇది గమనించిన జయసుధ ఎవరైనా అనుమానిస్తారేమోనన్న భయంతో అక్కడి నుండి పారిపోయింది. మూడు నెలల చికిత్స అనంతరం రాజగోపాల్ మృతి చెందాడు. కొన్ని నెలల తర్వాత ఆస్తుల వివాదాలు ఉండడంతో.. ఆస్పత్రిలో సీసీటీవీ ఫుటేజ్ సన్నివేశాలు గమనించిన కుమారుడు  అవాక్కయ్యారు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  వీరి కేసును దర్యాప్తుకు ఆదేశించింది కోర్టు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. 

 

12:57 - August 14, 2016

మహబూబ్ నగర్ : సోమశిల వద్ద మూడోరోజు కృష్ణాపుష్కరాలకు భక్తులరద్దీ పెరిగింది. ఇందుకు సర్కార్ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరఘాట్లలో అధికారులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులు ఆనందోత్సాహాలతో పుష్కరస్నానాలు చేస్తున్నారు. అటు స్నానాలు.. ఇటు పిండ ప్రదానాలతో ఘాట్లు సందడిగా మారాయి. వరుస సెలవులు కావడంతో భక్తులు రద్దీ పెరుగుతోంది. జిల్లాలో మొత్తం 52 ఘాట్లను ఏర్పాటు చేశారు. ఇందులో 32 ప్రధాన ఘాట్లు కాగా మిగిలిన 20 లోకల్ ఘాట్లుగా ఉన్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:53 - August 14, 2016

విజయవాడ : మూడవరోజు పుష్కరాలకు విజయవాడఘాట్లు భక్త జనసందోహంగా మారాయి. లక్షలాది మంది తరలివస్తుండటంతో.. అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లుచేశారు. ఘాట్లలో చిన్నారులు తప్పిపోకుండా... ట్యాగ్‌లను తగిలిస్తున్నారు. దీంతో తప్పిపోయిన పిల్లలను గుర్తించడం ఈజీగా మారిందని తల్లిదండ్రులు హర్షం వక్త్యం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

12:51 - August 14, 2016

కృష్ణా : విజయవాడలో కృష్ణాపుష్కరాలు కన్నులపండువగా జరగుతున్నాయి. మూడవరోజు పుష్కరాల్లో వీఐపీలు సందడి చేశారు. పున్నమిఘాట్లో కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్‌తోపాటు ఏపీ మంత్రి శిద్ధారాఘవరావు.. ఇతర వీఐపీలు  స్నానం చేశారు. పోలీసులు పటిష్టభద్రతను కల్పించారు. పున్నమిఘాట్లో ఏర్పాట్లపై మంత్రులు హర్షంవ్యక్తం చేశారు.  పలువురు వీపీలు  కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

 

12:44 - August 14, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాల మూడో రోజు గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్‌కు యాత్రికులు పోటెత్తారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న బస్సులను నేరుగా ఘాట్‌ దగ్గరకు అనుమతిస్తున్నారు. దీంతో యాత్రికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుష్కర స్నానాలు చేస్తున్నారు. సీతానగరం పుష్కర ఘాట్‌లో యాత్రికుల రద్దీపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నల్గొండ జిల్లాలో పుష్కరాలు...

నల్గొండ : నాగార్జున సాగర్ శివాలయం ఘాట్, మట్టపల్లి ప్రహ్లాద ఘాట్, వాడపల్లి ఘాట్ లలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఘాట్ల వద్ద భక్తులు బారులు తీరారు. 

 

సీతానగరం ఘాట్ కు పోటెత్తిన భక్తులు

గుంటూరు : సీతానగరం ఘాట్ కు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఘాట్ కు చేరుకుని భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. 

కేబినెట్ సబ్ కమిటీతో మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధులు భేటీ

హైదరాబాద్ : కేబినెట్ సబ్ కమిటీతో మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధులు సమావేశం అయ్యారు. గద్వాల్ ను ప్రత్యేక జిల్లాగా చేయాలంటూ ఎంసీహెచ్ ఆర్డీ ఎదుట ప్రజాప్రతినిధుల అనుచరులు ఆందోళన చెందారు. 

12:25 - August 14, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలో విషాదం నెలకొంది. పోడూరు మండలం తూర్పుపాలెంలో గెద్దాడ సాయిబాబా అనే రైతుకు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అంత్యక్రియల నిర్వహిస్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు శ్మశానానికి చేరుకుని సగం కాలిన శవాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టానికి పాలకొల్లు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధ తాళలేక సాయిబాబా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. 

12:23 - August 14, 2016

నెల్లూరు : జిల్లాలోని విక్రం సింహపురి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ మళ్లీ హ్యాకింగ్‌కు గురయ్యింది. పాకిస్థాన్‌కు చెందిన డెత్‌ ఏడర్‌ అనే సంస్థ ఈ చర్యకు పాల్పడింది. పాకిస్థాన్‌ స్వాతంత్ర్య దినోత్సవం రోజున సైబర్‌ కేసును క్రాష్‌ చేస్తామని హాకర్స్‌ హెచ్చరించారు. హ్యాక్‌ చేసిన సైట్‌లో పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు పోస్టు చేశారు. పుర్రె గుర్తులో పామును కూడా  పోస్టు చేశారు. పాకిస్థాన్‌ జెండాలు కూడా ప్రత్యక్షమయ్యాయి. ఈనెల 1న మొదటిసారి ఈ యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ హ్యాకింగ్‌కు గురయ్యింది.

11:58 - August 14, 2016

విజయవాడ : కృష్ణా జిల్లా విజయవాడలోని కృష్ణవేణిఘాట్ ను మంత్రి దేవినేనిఉమా పరిశీలించారు. పుష్కరాల సంధర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామంటున్నారు. చిన్నా, పెద్దా కృష్ణమ్మ ఒడిలో పుష్కరస్నానం చేసి ముక్తి పొందుతున్నారని అన్నారు. ప్రస్తుతం భక్తుల రద్దీ పెరిగిందని అందుకు అనుగుణంగా అధికారులను అప్రమత్తం చేస్తున్నామని మంత్రి దేవినేని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:55 - August 14, 2016

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో కృష్ణాపుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు.   పసుపుల, బీచుపల్లి,  రంగాపూర్‌లతోపాటు గొందిమళ్ల, సోమశిల ఘాట్లకు భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో.. ఇవాళ ఒక్కరోజే దాదాపు 10లక్షల మంది భక్తులు స్నానాలు చేస్తారని అంచానా  వేస్తున్నారు. అధికారులు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. పుష్కరాలకు సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:52 - August 14, 2016

కర్నూలు : కృష్ణా పుష్కరాలలో భాగంగా కర్నూలుజిల్లాలో భక్తుల రద్దీ పెరిగింది. పుష్కరాలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామంటున్నారు పోలీసులు. భక్తులు సహకరించి నిర్ణీత పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్క్ చేయాలంటున్నారు కోరుతున్నారు. స్నానం చేసేప్పుడు కనీసముందు జాగ్రత్తలు పాటించాలని కోరారు. నిరంతరం ఘాట్ల పరిశీలన, సీసీ కెమెరాలతో పరిశీలిస్తున్నామంటున్న ఎస్పీ రవికృష్ణతో టెన్ టివి ప్రత్యేకంగా ఆయన పలు విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:49 - August 14, 2016

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో మూడోరోజు కృష్ణ పుష్కరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వరుస సెలవులతో పుష్కర ఘాట్ల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. విజయవాడ, శ్రీశైలం, నాగార్జున సాగర్, మహబూబ్ నగర్ లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. 12రోజులపాటు పుష్కరాలు కొనసాగుతాయి. పలువురు వీఐపీలు కూడా వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. 
భక్తుల రాకతో ఘాట్లు రద్దీగా మారాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

11:43 - August 14, 2016

గుంటూరు : ప్రకృతి రమణీయతకు అది శాశ్వత చిరునామా. విదేశీ విహంగాలకు అదో చక్కని విడిది. భగభగ మండే ఎండల్లోనూ అక్కడి ప్రకృతి అందాలు తాజాగా ఉంటాయి. ఇక శీతాకాలంలో అయితే సరికొత్త సొబగులు సంతరించుకుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సహజ అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఆ సుమధుర దృశ్యాలను వర్ణిచేందుకు ఎన్ని పదాలైనా సరిపోవు. కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులు.. సందర్శించిన ప్రాంతాల్లో ముఖ్య ప్రదేశం అది.. ఆ ప్రాంత విశేషాలు తెలుసుకోవాలంటే.. గుంటూరు జిల్లాకు వెళ్లాల్సిందే..!
రంగు రంగుల విదేశీ పక్షులు... 
రంగు రంగుల విదేశీ పక్షులు...  ఒకటి కాదు, రెండు కాదు... వేలసంఖ్యలో విదేశీ పక్షులు.. మనసుకు హాయినిచ్చే పక్షుల కిలకిల రావాలు...విదేశీ విహాంగాల సందడితో మైమరిచిపోతున్న పర్యాటకులు... ఇంతటి సుమనోహర దృశ్యాలు ఎక్కడో పరాయి దేశంలోనివో లేక  హిమాలయాల్లోనివో కావు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు ప్రాంతమిది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఉప్పలపాడు పక్షుల కేంద్రం పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. దాదాపు 50 ఏళ్ల నుంచి విదేశీ పక్షులు ఈ ప్రాంతాని వచ్చి.. విడిచి చేస్తాయి. సైబీరియా, ఆస్ట్రేలియాల నుంచి గూడబాతుల గుంపులు, తెల్ల కంకణాలు, ఎర్రకాళ్ల కొంగలు, నత్తకొట్టు కొంగలు, చిత్త ఒక్కలు, చుక్కమూతి బాతులు, నల్ల బోలి కోడి, కలికి పక్షులు ఇలా చెప్పుకుంటూ పోతే.. దాదాపు  70 జాతులకు పైగా పక్షులు ఉప్పలపాడుకు వస్తుండడం విశేషం. 
విదేశీపక్షులు, పర్యాటకులతో నిత్యం సందడి
చెరువు మధ్య, చుట్టూ గుబురుగా ఉన్న చెట్లపై అవాసం ఏర్పాటు చేసుకుని... గూళ్ళు కట్టుకుని... అక్కడే గుడ్లుపెట్టి, పిల్లలను పొదుగుతాయి. పక్షి స్థావరానికి వెళ్లే దారికిరువైపులా పచ్చని చేలు, ఆ చేలపై ఎగురుతున్న మైనగోరలు, కత్తిరిపిట్టలు, అక్కడక్కడ పాలపిట్టలు, కొంగలు... పొలాలను ఆశిస్తున్న మిడతలను, పురుగులను వేటాడుతూ కనువిందు చేస్తాయి. విదేశీ పక్షులతో పాటు పర్యాటకులతో ఈ ప్రాంతం నిత్యం సందడిగా ఉంటుంది. 
30 ఎకరాల విస్తీర్ణంలో చెరువు 
30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును ఒకప్పుడు... తాగునీటి అవసరాలకు వినియోగించేవారు. విదేశీ పక్షలు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో ఈ చెరువును ప్రత్యేకంగా వాటికోసమే కేటాయించారు. ఈ ప్రాంతంలో విద్యార్థులు పరిశోధనలు కూడా చేస్తారు. గుంటూరు నుంచి నందివెలుగు మీదుగా తెనాలికి వెళ్లే మార్గంలో 7 కిలోమీటర్ల దూరంలో ఈ పక్షి కేంద్రం ఉంది. గుంటూరు నుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోల ద్వారా ఈ గ్రామాన్ని చేరుకోవచ్చు. చెన్నై-హోరా రైలు మార్గాన ప్రయాణించేవారు తెనాలిలో దిగి నందివెలుగు మీదుగా 18 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామానికి చేరుకోవచ్చు. కృష్ణా పుష్కరాల కోసం గుంటూరు జిల్లాకు వెళ్లే యాత్రికులు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక కేంద్రల్లో ఉప్పలపాడు పక్షి కేంద్రం ఒకటని చెప్పొచ్చు..! ఈ ప్రాంతం పర్యాటకులను కట్టిపడేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

 

11:38 - August 14, 2016

గుంటూరు : ఆ ఊరికి పెద్ద చరిత్రే ఉంది. ఒకసారి ఆ ప్రాంతాన్ని సందర్శిస్తే.. మనసు పులకించిపోతుంది. ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. 12వ శతాబ్దానికి చెందిన రాణి రుద్రమదేవి నిర్మించిన ఆలయం విశేషాలు ఆసక్తిని పెంచుతాయి. దేవాలయంలోని నంది విగ్రహం అమరావతి వైపు చూస్తు ఉండడం నాటి దుండగుల దుశ్చర్యలను గుర్తు చేస్తాయి.. ఏపీ రాజధాని అమరావతిగా ఏర్పడినప్పటి నుంచి ఆ ప్రాంతానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులు మల్కాపురం గ్రామాన్ని సందర్శిస్తే.. ఆసక్తికర విషయాలెన్నో తెలుసుకోవచ్చు..! 
అమరావతి నడిబొడ్డున మల్కాపురం 
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నడిబొడ్డున ఉన్న ఈ ఊరు మల్కాపురం. వెలగపూడి-మందడం గ్రామాల మధ్య ఉన్న ఈ చిన్న ఊరుకు ఎంతో విశిష్టత ఉంది. 12వ శాతబ్ధానికి చెందిన కాకతీయ మహారాణి రుద్రమదేవికి అమరావతికి వీడదీయరాని అనుబంధం ఉంది. ఓరగల్లును పాలించే రోజుల్లో రుద్రమదేవి అమరావతి ప్రాంతంలోని మల్కాపురం గ్రామానికి తరచూ వచ్చేవారని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది.
మల్కాపురం గ్రామంతో రుద్రమదేవికి అనుబంధం
రుద్రమదేవి.. కృష్ణానది అవతల ఉన్న కొండపల్లి రాజుపై యుద్ధం చేసి, రాజ్యాన్ని ఆక్రమించారు. అప్పటి నుంచి రుద్రమదేవికి మల్కాపురం గ్రామంతో అనుబంధం ఏర్పడింది. రుద్రమదేవి దండయాత్రకు వెళ్లేముందు మల్కాపురంకు వచ్చి.. ప్రత్యేక పూజలు చేసేవారు. రుద్రమదేవి మల్కాపురంలో నిర్మించిన శాసనాలు, శిలలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 14 అడుగుల స్థూపంపై ఉన్న నంది విగ్రహం అమరావతి పట్టణం వైపు చూస్తూ ఉంటుంది. ఆలయంలోని లింగాన్ని దుండగులు అపహరించి.. అమరావతిలో ప్రతిష్టించడానికి తీసుకెళ్తుంటే.. వివిధ రూపాల్లో ఉన్న రాళ్లు వారి వెంట పడ్డాయని, అప్పుటి నుంచి నందీ విగ్రహం అమరావతి వైపే చూస్తూ ఉందంటారు ఇక్కడివారు. 
మల్కాపురంలో రుద్రమదేవి పూజలు  
రుద్రమదేవి ప్రతి ఏటా తన పుట్టినరోజున మల్కాపురానికి వచ్చి.. కొలనులో స్నానమాచరించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం కొలను వాడుకలో లేకపోయినప్పటికీ... స్థూపం ఎదురుగా, దేవాలయానికి ఉత్తర దిక్కుగా కొలను ఇప్పటికీ ఉంది. తన వద్ద నర్తకిగా పని చేసిన మల్లికకు ఈ ప్రాంతాన్ని రుద్రమదేవి ఇచ్చారని చెబుతారు. మొదట్లో ఈ ప్రాంతాన్ని మల్లికాపురంగా పిలిచేవారు. ఇప్పుడు మల్కాపురం అని పిలుస్తున్నారు. 
మల్కాపురాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆదేశాలు...
మల్కాపురం గ్రామం ప్రాముఖ్యత తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ ప్రాంతాన్ని సందర్శించి... ఇక్కడి విశేషాలకు ముగ్దుడయ్యారు. ఘనమైన చరిత్ర ఉన్న మల్కాపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులు మల్కాపురం గ్రామాన్ని సందర్శించుకుంటే.. రుద్రమదేవికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయని గ్రామస్తులు అంటున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి ఏర్పడినప్పటి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మల్కాపురం గ్రామానికి వచ్చి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 
కొత్త అనుభూతి
పుష్కరాల కోసం రాజధాని ప్రాంతానికి వచ్చే యాత్రికులకు ఖచ్చితంగా ఈ ప్రాంతం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి.. మల్కాపురం ప్రాంత విశేషాల గురించి ప్రచారం కల్పిస్తే.. రాణి రుద్రమదేవి గురించి మరెన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. 

 

11:33 - August 14, 2016

మహబూబ్ నగర్ : కాణిపాకం.. ఈ పేరు వినగానే చిత్తూరు జిల్లాలో వెలసిన స్వయంభు వినాయకుడే గుర్తొస్తాడు. కానీ తెలంగాణలో కూడా అలాంటిదే ఓ భారీ గణేశ ప్రతిమ ఉంది. దేశంలోనే అతి ఎత్తైన మూర్తిగా ఇది భాసిల్లుతోంది. ఐశ్వర్య గణపతిగా భక్తులు కొలిచే.. ఈ ప్రతిమ పాలమూరు జిల్లాలో ప్రతిష్ఠతమై ఉంది. పుష్కరస్నానాలకు తరలి వచ్చే యాత్రికుల కోసం.. 10టీవీ అందిస్తోన్న ఆవంచ గణపతి ప్రతిమ విశేషాలు.
ఆవంచలో భారీ గణేష్ 
మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలోని పంటపొలాల మధ్య భారీ గణేశ ప్రతిమ విశేషంగా ఆకర్షిస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా.. దాదాపు 25 అడుగుల ఎత్తున్న ఈ ఏకశిలా విగ్రహం 11వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. 
ఏడేళ్ల క్రితమే భారీ వినాయకుడి విగ్రహం వెలుగులోకి
ఏడేళ్ల క్రితమే ఈ భారీ వినాయకుడి విగ్రహం గురించి వెలుగులోకి వచ్చినా.. ప్రభుత్వం కానీ, స్థానికులు కానీ పట్టించుకోలేదు. పంట పొలాల మధ్య ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. ఏలికల నిరాదరణకు సాక్ష్యంగా నిలుస్తోంది. నాలుగేళ్ల క్రితం పుణెకు చెందిన ఉత్తరదేవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తామన్న హామీ అమలు కాలేదు. మైసూరుకు చెందిన వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి ఐశ్వర్య గణపతిగా నామకరణం చేశారని స్థానికులు చెబుతుంటారు. 
పర్వదినాన మాత్రమే ఆవంచ గణపతికి ధూపదీప నైవేద్యాలు
ప్రస్తుతం ఏదైన పర్వదినం నాడు మాత్రమే ఆవంచ గణపతికి ధూపదీప నైవేద్యాలు అందుతున్నాయి. ఈ వినాయకుడికి ఆలయం కోసమని 6.19 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆలయ నిర్మాణానికి 8 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ట్రస్టు సభ్యులు అంచనా కూడా వేశారు. వినాయకుడికి గుడి లేకపోవటం వల్ల భక్తులు ఇక్కడికి వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. 
ఆవంచ గణపతిని పట్టించుకోవడం లేదు : స్థానికులు 
తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌,డాక్టర్‌ లక్ష్మారెడ్డి ఆవంచ గ్రామాన్ని సందర్శించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినప్పటికీ.. ఆవంచ గణపతిని పట్టించుకోవడం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి సొంత గ్రామమైనప్పటికీ ఆయన కూడా వినాయకుడి ఆలయం పట్ల అసక్తి చూపడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు . వెంటనే ప్రభుత్వం ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్దులు  కోరుతున్నారు. 
వినాయకుడి ఆలయంపై ఆశ్రద్ధ 
అడపా దడపా భక్తులు, వీఐపీలు వచ్చినప్పటికీ వినాయకుడి ఆలయంపై శ్రద్ధ చూపడం లేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం.. ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు.. ఆవంచ గణపతినీ దర్శించుకునే వీలుంది. అందుకే.. ఇక్కడ స్థానికులు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

 

11:27 - August 14, 2016

గుంటూరు : పుష్కర స్నానాలకు గుంటూరు జిల్లాకు తరలివచ్చే భక్తులు.. పరిసరాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. స్థలపురాణాన్ని తెలుసుకుంటూ.. అక్కడి వేల్పులకు మొక్కులు సమర్పించుకుంటున్నారు. వీటిలో ప్రసిద్ధమైనది గురజాలలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం. ప్రశాంతమైన వాతావరణం, కనుచూపు మేర కొండలు, అటవీ ప్రాంతం మధ్య వెలిసిన స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు.  
ఆలయం చుట్టూ పచ్చని చెట్లు...
గుంటూరు జిల్లా గురజాల మండలం దైద గ్రామానికి ఉత్తర వాహినిగా కృష్ణా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నది అనుకుని అమరలింగేశ్వర స్వామి స్వయంభువుగా వెలిశాడు. కృష్ణానది పరివాహక ప్రాంతం, అటవీ ప్రాంతం కావడంతో ఎటుచూసినా ఈ ప్రాంతం పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. 
గుహలో వెలిసిన స్వామివారు..
కృష్ణానది పక్కనే ఉన్న ఈ ఆలయంలో అమరలింగేశ్వర స్వామి సుమారు రెండు కిలోమీటర్ల దూరం గల గుహలో వెలిశారు. 80 ఏళ్ల క్రితం పులిపాడు గ్రామస్తులు గేదెలు కాస్తుండగా.. గుహ నుంచి కేకలు వినపడడంతో.. లోపలికెళ్లి చూడగా లింగాకారంలో ఉన్న శివుడు కనిపించాడని,  అమరలింగేశ్వర రూపంలో వెలిసిన తనను ప్రతి సోమవారం దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేయమని గ్రామస్తులకు చెప్పారని పండితులు చెబుతున్నారు. గుహ బయట రాళ్ల గుట్టను చెక్కినట్టుగా...ప్రత్యేక ఆకర్షణగా ఉండడం మరో విశేషం.
గుహలో ఋషులు, మునులు తపస్సు 
ఈ గుహలో ఋషులు, మునులు తపస్సు చేసేవారని చెబుతారు. దేవాలయం పక్కనే ఉన్న ఈ నదిలో నీరు ఎప్పుడు కూడా ఇంకిపోదు. ఇదంతా స్వామివారి అనుగ్రహమేనని భక్తులు విశ్వసిస్తారు. ఎంతో చరిత్ర ఉన్న ప్రాంతం పుష్కరాలకు ప్రాధాన్యత తీసుకొచ్చింది. గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఈ దేవాలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. పుష్కర యాత్రికుల కోసం ఘాట్‌ నిర్మాణం, రోడ్డు నిర్మాణం చేపట్టారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ ఘాట్‌కు సుమారు 2 నుంచి 3 లక్షల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నారు. గురజాల నియోజకవర్గంలోనే తెలంగాణ, ఆంధ్రా బోర్డర్‌ల మధ్య పొందుగుల గ్రామంలో అతి పెద్ద ఘాట్‌ నిర్మాణం చేపట్టారు. ఈ ఘాట్‌కు రవాణా సౌకర్యం అనుకూలంగా ఉండటంతో యాత్రికులు 3 నుంచి 4 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. పొందుగుల గ్రామ సమీపంలోనే వీ.ఐ.పీ ఘాట్‌ను కూడా నిర్మించారు. కృష్ణా పుష్కరాలకు గుంటూరు జిల్లాకు వెళ్లే యాత్రికులు గురజాల మండలం దైద గ్రామంలో వెలిసిన అమరలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకుని.. ప్రకృతి ఒడిలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపొచ్చు.

నంద్యాలలో విషాదం

కర్నూలు : జిల్లాలోని నంద్యాలలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలతో పురుగుల మందు తాగి రామ్ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని బంధువులు అంటున్నారు. 

 

09:48 - August 14, 2016

మొగుడులేకుండా హనిమూన్ కు, గాలిలో పెళ్లి, 350అడుగుల జాతీయజెండా, సినిమా స్టైల్ లో దొంగతనం, సెల్ ఫోన్ నుంచి రేడియేషన్ నియంత్రణకు సెల్ ఫోన్ కు పేడా వాడకం.. వంటి అంశాలపై క్రేజీన్యూస్ ను వీడియోలో చూద్దాం....
  

నేడు ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వాల్డ్ విభాగం ఫైనల్

బ్రెజిల్ : ఒలింపిక్స్ లో భాగంగా నేడు ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వాల్డ్ విభాగం ఫైనల్ జరుగనుంది. పోటీలో దీపా కర్మాకర్ పాల్గొననున్నారు.  

 

రియో ఒలింపిక్స్...నేడు హాకీ క్వార్టర్ ఫైనల్

బ్రెజిల్ : రియో ఒలింపిక్స్ లో భాగంగా నేడు హాకీ క్వార్టర్ ఫైనల్ జరుగనుంది. భారత్, బెల్జియం తలపడనున్నాయి. రాత్రి 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.  

 

మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్... నేడు సైనా నెహ్వాల్, మరిజ ఉలిటినా ఢీ

బ్రెజిల్ : రియో ఒలింపిక్స్ లో భాగంగా మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో నేడు సైనా నెహ్వాల్, మరిజ ఉలిటినా(ఉక్రెయిన్ ) ఢీ కొననున్నారు. సాయంత్రం 5.25 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 
 

09:12 - August 14, 2016
09:04 - August 14, 2016

ఢిల్లీ : రెండో టెస్ట్‌లో తృటిలో గెలుపు చేజార్చుకున్న టీమిండియా.. మూడో టెస్ట్‌లో విశ్వరూపం చూపింది. అసలు గెలుపు ఆశలు లేని స్థితి నుంచి గ్రాండ్‌ విక్టరీ సాధించింది. బౌలర్ల విజృంభణతో టీమిండియా 237 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో ఆతిథ్య వెస్టిండీస్‌ అనూహ్య ఓటమి చవిచూసింది. పేసర్లు షమి, ఇషాంత్‌ చెలరేగడంతో... 346 పరుగుల లక్ష్య ఛేదనలో.. విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే కుప్పకూలింది. దీంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

 

08:58 - August 14, 2016

'అనంత' జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

అనంతపురం : నేడు సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. 

08:49 - August 14, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు వైభవంగా కృష్ణ పుష్కరాలు జరుగుతున్నాయి. 12 రోజులపాటు పుష్కరాలు కొనసాగుతున్నాయి. పుష్కర ఘాట్లకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వరుస సెలవులతో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే పుష్కర స్నానాలాచరిస్తున్నారు. కృష్ణవేణి, పద్మావతి పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులను పుష్కరఘాట్లకు బస్సుల్లో తరలిస్తున్నారు. వరుసగా సెలవులు రావడంతో నేడు, రేపు భక్తులు ఎక్కువగా రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 

 

08:25 - August 14, 2016

చిత్తూరు : టీటీడీ ఉన్నతాధికారులపై ప్రధాన అర్చకులు ధ్వజమెత్తారు. తిరుమలలో పనిచేసే అధికారులు క్షేత్ర సంప్రదాయాన్ని పాటించాలని సూచించారు. గతేడాది పవిత్రోత్సవాల్లో జరిగిన తప్పులే పునరావృతవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని మంటగలపడం దారుణమని మండిపడ్డారు. మృతసౌచ్యం ఉన్న వ్యక్తితో రేపటి పవిత్రోత్సవాలు నిర్వహించడం అపచారమన్నారు. 

 

08:23 - August 14, 2016

వరంగల్ : ప్రజలకు ఆహ్లాదం కలిగించే పార్కులు నిరాదరణకు గురవుతున్నాయి. పాములు, జంతువులకు ఆవాసాలుగా మారుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఆధ్వానస్థితిలో ఉంటున్నాయి. గ్రేటర్ వరంగల్‌లో ఉన్న పార్కులపై టెన్ టీవీ స్పేషల్ స్టోరీ... వరంగల్‌లో పార్కులు ఆధ్వానస్థితిలో ఉన్నాయి. రిలాక్స్ కోసం పార్కులకు వెళ్దామంటే జంతువులు దర్శనిమిస్తున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట్ లో చిన్నవి పెద్దవి కలుపుకుని సూమారు 30 పార్కులున్నాయి. గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ లో పార్కులను పట్టించుకోనే అధికారులే కరువయ్యారు. 
హన్మకొండ చిల్డ్రన్ పార్కు పరిస్థితి దారుణం 
హన్మకొండలోని చిల్డ్రన్ పార్కు పరిస్థితి ఐతే మరింత దారుణంగా వుంది. సిటీకి కేంద్రంగా ఉన్న ఈ పార్కులో పాముల పుట్టలు దర్శనమిస్తున్నాయి. పిల్లలు ఆడుకునే ఆటవస్తువులు పాడైపోయాయి. పిల్లల కోసం నిర్మించిన స్కేటింగ్ రింగ్ ఇబ్బందికరంగా మారింది. పార్కుకు వచ్చే వారిపై కుక్కులు దాడి చేస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారు.
చెరువులను తలపిస్తున్న పార్కులు   
చిన్న వర్షం కురిసిన చెరువులను తలపిస్తున్నాయి మిగతా పార్కులు. నగరంలో ఉన్న ఏకాశిలా పార్కు పరిస్థితైతే మరింత దారుణంగా వుంది. పార్కులను అభివృద్ధి చేస్తామని చెప్పిన నాయకులు ఎలక్షన్స్ తర్వాత వీటి వైపే చూడటం లేదని స్థానికులు అంటున్నారు. 
పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు : మేయర్ 
వరంగల్ ను గ్రేటర్ గా అభివృద్ధి చేసేందుకు అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుంటున్నామంటున్నారు మేయర్ నరేందర్‌. నగరంలో ఉన్న చిన్న పెద్ద పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. గ్రేటర్ అభివృద్ధిని ఎవరు కాదనరు కానీ... ఆధ్వానస్థితిలో ఉన్న పార్కులను తక్షణమే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. 

 

08:14 - August 14, 2016

చిత్తూరు : ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వేలకోట్ల రూపాయల మిగులు సాధించినట్లు కేంద్ర ఐటీశాఖమంత్రి  రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అనంతపురం , చిత్తూరు, జిల్లాలోని శ్రీసిటీ సెజ్ లో ఎలక్రానిక్ మాన్యుఫాక్చరింగ్  క్లస్టర్ల ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చాయన్నారు. మరో మూడు రానున్నాయని రవిశంకర్ అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దేశమంతటా 36 వేల కోట్ల రూపాయలు ప్రక్కదారి పట్టకుండా ఆదా చేశామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆధార్ అనుసంధానంతో 1100 కోట్ల రూపాయలు మిగులుతున్నాయని అన్నారు.  

 

08:10 - August 14, 2016

హైదరాబాద్ : మూసినదిపై ఈస్ట్ వెస్ట్ కారీడార్ కాగితాలకే పరిమితం అయ్యింది. ఎలివేటేడ్ మార్గంలో ఆరులైన్ల రోడ్డు మార్గం.. పాతనగరానికి కొత్త శోభ.. ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి పాత బస్తికీ విముక్తి... ఇవీ సరిగ్గా ఏడాది క్రితం మూసి రోడ్డు ప్రాజెక్టుపై ప్రభుత్వం చెప్పిన మాటలు. ఈ  మాటలు ఒట్టి మాటలుగానే మిగలనున్నాయి. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 
కంచికి చేరిన మూసీ కారిడార్ ప్రాజెక్టు?
టీఆర్‌ఎస్‌ సర్కారు ఏర్పడినప్పటి నుంచి  హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామని చెబుతూనే ఉన్నారు.  అంతటితో ఆగకుండా గ్రేటర్ ఎన్నికల ముందు హామీలతో ఊదగొట్టారు. అధికార పార్టీ గ్రేటర్ పీఠం చేజిక్కించుకుని 6 నెలలు పూర్తయ్యింది. ఎన్నికలలో ఇచ్చిన హామీలు మాత్రం కాగితాలకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు తాజాగా మూసీపై నిర్మిస్తామన్నా ఈస్ట్ వెస్ట్ కారిడార్ కథ కంచికి చేరినట్లు తెలుస్తుంది.
42 కి.మీ మూసీ కారిడార్‌కు ప్రణాళికలు
42 కిలోమీటర్ల నిర్మించనున్నా మూసీ కారిడార్‌ రోడ్డు నార్సింగ్ ఔటర్‌ రింగ్ రోడ్డు నుంచి బీబీ నగర్ వద్ద గల కొర్రెముల వరకు ఆరులైన్ల ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. ఇక దీని కోసం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చైనా ప్రతినిధుల బృందం ఏరియల్ సర్వే కూడా చేసింది. అన్ని ప్రాంతాలను కలపడానికి ఈ రోడ్డులో 12 ప్రధాన జంక్షన్లు ఉంటాయని ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం 8వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
జీహెచ్‌ఎంసీకి భారీ ఆదాయం వస్తుందని ప్రగల్భాలు
ఇక ఈ కారిడార్ వల్ల మూసికి ఇరువైపులా ఉండే భూములకు భారీ డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. 42కిలో మీటర్ల మేర దాదాపు 25వేల ఎకరాల్లో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.. ఈ స్కైవే అందుబాటులోకి వచ్చాక జీహెచ్ఎంసీకి వివిధ రూపాల్లో భారీ ఆదాయం వస్తుందని.. స్కైవే వెంబడి అభివృద్ధి చెందే ప్రాంతాల్లో భారీ నిర్మాణాలకు వీలుంటుందని అధికారులు అంచనా వేశారు. అనుమతుల ఫీజుల ద్వారా దాదాపు 30 వేల కోట్లు జీహెచ్‌ఎంసీ ఖజానాకు చేరడమే కాకుండా భవిష్యత్తులో ప్రతి ఏటా దాదాపు 600 కోట్ల ఆస్తిపన్ను రూపంలో బల్దియాకు ఆదాయం వస్తుందని ప్రగల్భాలు పలికారు.  
నిధులు లేక అట్టకెక్కనున్న  ప్రాజెక్టు?
ఈ ప్రాజెక్టు కోసం అంతర్జాతీయం నిర్మాణ సంస్థలతో కూడా ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది.  అవసరమైతే నిధుల సమీకరణ కోసం న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, బ్రిక్స్ బ్యాంకును సంప్రదించాలని డిసైడ్ చేశారు. ఇక గతంలో చైనా పర్యాటనలో భాగంగా బ్రిక్స్ చైర్మన్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూసి ప్రాజెక్టుకు ఆర్థిక సాయం కోసం విజ్ఞప్తి చేసారు. అయితే ఇవన్నీ ఒకప్పటి మాటలు.. కాని ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ప్రాజెక్టు పట్టాలు ఎక్కడం కోసం ఆర్థికంగా చేయూత నివ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని సమాచారం. ఇక నదిలో చేపట్టబోయే ఈ నిర్మాణానికి పర్యావరణ అనుమతులతోపాటు పలు అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాజెక్టు అటకెక్కే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు కనబడుతోంది.

 

08:05 - August 14, 2016

హైదరాబాద్ : మ‌ళ్లీ అదే నిర్లక్ష్యం... అధికారుల నిర్లక్ష్యం కార్మికుల పాలిట మృత్యుశకటాలవుతున్నాయి. ఎంత మంది మృత్యువాత పడినా నిర్లక్ష్యం వీడనంటోంది హైద‌రాబాద్ జ‌ల‌మండ‌లి. అధికారుల నిర్లక్ష్యం వల్ల కార్మికుల ప్రాణాలు మ్యాన్ హోల్‌లోనే క‌లుస్తున్నాయి. పొట్టకూటికోసం మురుగులోకి దిగితున్న  కార్మికులు.. చివరకు ఆ మురుగులోనే శ‌వాలౌతున్నారు.
కార్మికుల ప్రాణాలను హరిస్తోన్న అధికారుల నిర్లక్ష్యం
గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాగునీరు మురుగు నీటి వ్యవ‌స్థను పర్యవేక్షించే హైదరాబాద్ జలమండలి అధికారుల నిర్లక్ష్యం కార్మికుల ప్రాణాలను హరిస్తోంది. ఎంత మంది ప్రాణాలు పోయినా వారు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. 
నగరంలో సివరేజ్  పైప్‌లైన్స్‌ 2,75,000
నగరంలో వేలాది కిలోమీట‌ర్లు ఉన్న సివరేజ్  పైపులైన్ల మీద 2ల‌క్షల 75వేల మ్యాన్ హోల్స్ ఉన్నాయి.  ఈ పైపులైన్‌లను శుద్ధి చేయడం.. మ్యాన్ హోల్స్ ఒవ‌ర్ ప్లోను నిలువ‌రిస్తోంది.  ముఖ్యంగా మ్యాన్ హోల్స్ శుభ్రప‌ర‌చ‌డం కోసం కాంట్రాక్టు లేబ‌ర్ తో పాటు ఎయిర్ టెక్ మిష‌న్లు ఉప‌యోగిస్తోంది జ‌ల‌మండ‌లి. మ్యాన్ హోల్స్ శుభ్రం చేయడానికి సిబ్బందికి అధునాత‌న ప‌రికారాలు స‌మ‌కూర్చుతుంది వాట‌ర్ బోర్డు. కానీ అవి కార్మికుల‌కు అంద‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. లోతుగా ఉన్న మ్యాన్ హోల్స్ క్లినింగ్ కు ఎయిర్ టెక్ మిష‌న్లు వాడాలి. కాని కార్మికుల‌నే మ్యాన్ హోల్స్ లోకి దించుతున్నారు. అంతేకాకుండా వారి ప‌ట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఫ‌లితంగా అమాయ‌క కార్మికులు త‌మ ప్రాణాలు కోల్పోతున్నారు.  
ఇప్పటివరకు 15 మంది కార్మికుల మృతి
గ‌త కొద్దికాలంలోనే మ్యాన్ హోల్స్ లో ప‌డి 15 మందికిపైగా కార్మికులు ప్రాణాలు వ‌దిలారు.  మే నెల‌లో రామ్ కోటిలో ఇద్దరు, ఎల్ బీన‌గ‌ర్ లో ముగ్గురు, కూక‌ట్ ప‌ల్లిలో ఒక‌రు, అడిక్ మెట్ పోచ‌మ్మ బ‌స్తిలో ఒక‌రు మ్యాన్ హోల్ క్లినింగ్ కోసం దిగి ప్రాణాలు విడ‌వ‌గా..  తాజాగా మాదాపూర్ లో ముగ్గురూ కార్మికులు ఒక  పౌరుడు మ‌ర‌ణించారు. 
దిద్దు బాటు చ‌ర్యలు చేప‌ట్టినా మార్పు లేదు..  
అయితే గ‌తంలో వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై జ‌ల మండ‌లి దిద్దు బాటు చ‌ర్యలు చేప‌ట్టినా.. ఆచ‌రణ‌లో మాత్రం ఎలాంటి  మార్పురాలేద‌నేది ఈ ఘ‌ట‌నే రుజువుగా మారింది. ఇకనైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. 

08:00 - August 14, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయూం డైరీ.. రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. డైరీలోఉన్న పేర్లు లీక్ ల రూపంలో బయటకు  వస్తుండడంతో ......అసలు ఈ కేసులో ఏం జరుగుతోందో అన్న   ఆందోళన  కొంత మంది నేతల్లో కనిపిస్తోంది. గ్యాంగ్ స్టర్ నయీం పోలీసుల ఎన్‌కౌంటర్లో హతం కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో  కలకలం రేపుతోంది. పోలీసులకు అత్యంత సన్నిహితంగా ఉండే గ్యాంగ్ స్టర్ కు ఊహించని రీతిలో ఫుల్‌స్టాప్ పడడంతో ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందో అన్న ఆందోళన రాజకీయనేతలను వెంటాడుతోంది.
గులాబీపార్టీలో గుసగుసలు
నయూం ఎన్ కౌంటర్ అనంతరం పోలీసులు జరిపిన సోదాల్లో  అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సోదాల్లో ఎలాంటి ఆధారాలు పోలీసులు సేకరిస్తున్నారా అన్న ఉత్కంఠ అన్ని పార్టీల నేతల్లోనూ కనిపిస్తోంది. ఈ పరిణామాలు  గులాబి పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీస్తున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి పేరు తొలి రోజు బయటకు రావడం ఆ తర్వాత.......హైదరాబాద్ కు చెందిన మరో మాజీ మంత్రి పేరు  తెరపైకి రావడంతో పాటు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి పేరు పరోక్షంగా చర్చనీయంశంగా మారింది. అయితే నయూం ఎన్ కౌంటర్ ఘటనను శాంతి భద్రతల సమస్యగానే చూడాలని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
విచారణ తీరుపై అనుమానాలు
నయీం ఎన్‌కౌంటర్‌ ఎపిసోడ్‌లో రోజుకో కొత్తపేరు బయటికొస్తుండటంతో... విచారణ జరుగుతున్న తీరుపై విపక్ష నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  తూతూ మంత్రంగా కాకుండా  దోషులు ఎంతటివారైనా బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

07:55 - August 14, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో రెండో రోజు పుష్కర హారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరైన ఈ కార్యక్రమానికి పుష్కర యాత్రికులు భారీగా తరలివ వచ్చారు. ఈ సందర్భంగా నక్షత్ర హారతిపై నిర్వహించిన లేజర్‌ షో  అందర్నీ ఆకట్టుకుంది. కార్యక్రమానికి వచ్చిన వారితో చంద్రబాబునాయుడు ఏపీ రాజధాని అమరావతి సంకల్పం చేయించారు. 

 

07:53 - August 14, 2016

విజయవాడ : కృష్ణా నదీతీరం పుష్కర భక్తులతో కిటకిటలాడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లన్నీ భక్తుల తాకిడితో కళకళలాడుతున్నాయి. పిల్లలు, పెద్దలు పలు ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో విజయవాడ దుర్గాఘాట్‌ కిక్కిరిసింది. గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్‌ వద్ద భక్తుల రద్దీ పెరిగింది. పుష్కర భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అధికారుల చెబుతున్నప్పటికీ కొన్ని చోట్ల భక్తులు నిరాశకు గురవుతున్న పరిస్థితి ఉంది. 
కృష్ణా నది పరివాహక ప్రాంతం భక్తులతో కిటకిట 
కృష్ణా పుష్కరాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా నది పరివాహక ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది. అనేక ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు పుణ్యస్నానాలాచరించి, సమీప ఆలయాలను దర్శించుకుంటున్నారు. పిల్లలు, పెద్దలతో పాటు కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు కృష్ణమ్మకు మొక్కులు చెల్లిస్తున్నారు. 
విజయవాడ దుర్గాఘాట్‌ వద్ద భక్తుల రద్దీ 
విజయవాడ దుర్గాఘాట్‌ భక్తులతో రద్దీగా మారింది. అనేక మంది భక్తులు ఘాట్ల వద్ద స్నానాలాచరించి ఆలయాల్లో దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఘాట్‌లో ఆహ్లాదంగా స్నానాలు చేశారు. ఎక్కడ చూసినా గుండెలు నిండిన భక్తి పారవశ్యంతో భక్తులు కృష్ణమ్మ చెంత చేరిపోయారు. 
గుంటూరు జిల్లాలో పుష్కర సందడి
గుంటూరు జిల్లాలో పుష్కర సందడి జోరందుకుంది. పలుచోట్ల భక్తులతో పుష్కర ఘాట్లు కళకళలాడాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా... అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్ని ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. అమరావతిలో యాత్రికుల రద్దీ విపరీతంగా పెరిగింది. జ్ఞాన బుద్ధ ఘాట్‌ వద్ద గల అమరలింగేశ్వర స్వామి దర్శనానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. సీతానగరం ఘాట్‌కు భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో మహిళలు, పిల్లలు భారీ ఎత్తున పుణ్యస్నానాలాచరించారు. చాలా మంది తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి మొక్కులు చెల్లించారు. రేపల్లె సమీపంలోని పెనుమూడి మోర్తాట పుష్కర ఘాట్‌కు జనం పోటెత్తారు. స్థానికులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఇక్కడి పుష్కర ఘాట్‌ సందడిగా మారింది.  
యాత్రికులతో కిటకిటలాడుతున్న లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం 
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం యాత్రికులతో కిటకిటలాడింది. కృష్ణ నది మెట్లన్నీ భక్తులతో నిండి పోయాయి. వేదాద్రి కొండపై నరసింహ స్వామివారిని అనేక మంది భక్తులు దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ క్షేత్రంలో భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ వాలంటీర్లు, హోంగార్డులు సేవలందిస్తున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ చెప్పారు. 
నది అగ్రహారం పుష్కర ఘాట్‌ కు పోటెత్తిన భక్తులు 
మహబూబ్‌నగర్‌ జిల్లాలో నది అగ్రహారం పుష్కర ఘాట్‌ వద్ద భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే యాత్రికులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు చేశారు. 
మట్టపల్లి పష్కర ఘాట్‌ వద్ద భక్తులు పుణ్యస్నానాలు 
నల్గొండ జిల్లా మట్టపల్లి పష్కర ఘాట్‌ వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పుణ్యస్నానాలాచరించారు. మౌలిక వసతులు కల్పన, ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు అభిప్రాయపడ్డారు. జిల్లాలోని వాడపల్లి ఘాట్‌కు భక్తులు అధికంగా తరలివచ్చారు. ఈ ఘాట్‌ వద్ద భక్తులు మునిగేంత నీళ్లు లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొందరు నిరాశ చెందారు. నాగార్జునసాగర్‌ పుష్కర ఘాట్‌కు వచ్చిన భక్తులకు నిరాశ కలుగుంది. సాగర్‌ అందాలను వీక్షించే అవకాశం లేదని యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

 

తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజు వైభవంగా కృష్ణా పుష్కరాలు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు వైభవంగా కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వరుస సెలవుల కారణంగా ఘాట్ల వద్ద రద్దీ పెరుగుతోంది. 

ఢిల్లీలో నేడు తెలంగాణ తరపున కూచిపూడి నృత్య ప్రదర్శన

ఢిల్లీ : భారత్ పర్స్ లో భాగంగా నేడు తెలంగాణ తరపున కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు.

విక్రంసింహపురి వర్సిటీ వెబ్ సైట్ ను హ్యాకింగ్ చేసిన పాకిస్తాన్ డెత్ ఏడర్ సంస్థ

నెల్లూరు : జిల్లాలోని విక్రం సింహపురి యూనివర్సిటీ వెబ్ సైట్ మళ్లీ హ్యాకింగ్ కు గురైంది. పాకిస్తాన్ డెత్ ఏడర్ సంస్థ సైట్ ను హ్యాక్ చేసింది. హ్యాకర్స్ హాక్ చేసిన సైట్ లో పుర్రె గుర్తులో పామును పోస్టు చేశారు. పాకిస్తాన్ అనుకూల నినాదాలతోపాటు జెండాలు ప్రత్యక్షమయ్యాయి. 

 

శ్రీహరిపురంలో నేడు కాపు నేతల సమావేశం

విశాఖ : శ్రీహరిపురంలో నేడు కాపు నేతల సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు. 

నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ప్రణబ్

ఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించనున్నారు. 

 

Don't Miss