Activities calendar

15 August 2016

21:29 - August 15, 2016
21:26 - August 15, 2016

గుజరాత్ : ఉనాలో దళితులు గర్జించారు. గుజరాత్‌లో చనిపోయిన పశువుల తోలు తీయడం లాంటి పనులు చేయరాదని శపథం చేశారు. ప్రతి దళిత కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళిత్-ముస్లిం భాయ్..భాయ్‌ అంటూ నినాదాలు చేశారు. గుజరాత్‌ ఉనాలోని హెచ్‌ డి షా స్కూల్‌ దళితుల ఐక్యతకు వేదికైంది. హెచ్‌సియులో ఆత్మహత్యకు పాల్పడ్డ పిహెచ్‌డి విద్యార్థి రోహిత్‌ వేముల తల్లి రాధికకు అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌తో పాటు వేలాదిగా దళితులు, మైనరీటీలు హాజరయ్యారు. ప్రధాని మోది చెప్పిన గుజరాత్‌ అభివృద్ధి అంతా బూటకమని తేలిపోయిందని కన్హయ్య అన్నారు.

పలు డిమాండ్స్..
దళితులు ఇకపై పశువుల కళేబరాలు తొలగించడం, మృతి చెందిన పశువుల తోలు తీయడం లాంటి పనులు చేయరాదని సభ శపథం చేసింది. ప్రతి దళిత కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. నెలరోజుల్లోగా తమ డిమాండ్‌ నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా రైలు రోకో ఆందోళనకు దిగుతామని ఉనా సభ హెచ్చరించింది. దళితులపై దాడులు చేయొద్దు...తనని చంపండంటూ ఇటీవల మోది చేసిన ప్రకటన ఓ నాటకమని దళిత నేత జిగ్నేశ్‌ మేవాని అభిప్రాయపడ్డారు.

గుజరాత్ లో 8 శాతం దళితులు...
10 వేల మంది ఈ సభలో అత్యాచారాలను సహించేది లేదని దళిత్-ముస్లిం భాయ్..భాయ్‌ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా తృతీయ పక్షాన్ని ఏర్పాటు చేసే సమయం ఆసన్నమైందని సభకు వచ్చిన దళిత ముస్లిం యువకులు అభిప్రాయ పడ్డారు. గోసంరక్షణ పేరిట గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా దళితులుపై మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దాద్రీలో అఖ్లాక్‌ హత్య, గత నెల ఉనాలో నలుగురు దళిత యువకులను కట్టేసి కొట్టిన ఘటనలు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గుజరాత్‌లో దళితులు, ముస్లింలపై దాడులు జరగడం వల్లే వారంతా ఏకమైనట్లు డాక్యుమెంటరీ సినిమా దర్శకుడు ఆనంద్‌ పట్‌వర్ధన్‌ అభిప్రాయపడ్డారు. ఉనాలో దళితులపై అత్యాచారం తర్వాత గుజరాత్‌లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. వచ్చే ఏడాది గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి సిఎం పదవి నుంచి ఆనందిబెన్‌ పటేల్‌ను తప్పించింది. గుజరాత్‌లో 8 శాతం దళితులున్నారు.

నల్గొండలో పర్యటించనున్న మంత్రులు..

నల్గొండ : జిల్లాలో జరుగుతున్న పుష్కరాల నేపథ్యంలో పలువురు మంత్రులు జిల్లాలో పర్యటించనున్నారు. భక్తుల ఇబ్బందులను తెలుసుకొనేందుకు మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకిరణ్ రెడ్డి పుష్కర ఘాట్లను పరిశీలించనున్నారు. 

తెలంగాణ సీపీఎం ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధం..

హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 16 నుంచి మూడురోజులపాటు ఈ సమావేశాలు కొనసాగబోతున్నాయి. 

21:22 - August 15, 2016
21:20 - August 15, 2016

హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లో ఆగస్టు 16నుంచి మూడురోజులపాటు ఈ సమావేశాలు కొనసాగబోతున్నాయి. తెలంగాణలోని పలు సమస్యలతోపాటు.. భూసేకరణకోసం ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై ప్రధానంగా ఇందులో చర్చించబోతున్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సమావేశాలు జరగబోతున్నాయి. మూడు రోజులపాటు కొనసాగే ఈ సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పరిశీలకులుగా హాజరవుతున్నారు. వివిధ జిల్లాలనుంచి 481మంది ప్రతినిధులుకూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

పలు అంశాలపై చర్చ...
ఈ సమావేశాల్లో ప్రధానంగా పార్టీని బలోపేతం చేయడం, తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కోల్‌కతా ప్లీనరి ముసాయిదాపై చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో భూనిర్వాసితుల సమస్య, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ప్రాజెక్టుల రీ డిజైన్‌, ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ, కార్మికుల సమస్యలపైకూడా చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. 3 రోజుల పాటు జరిగే సమావేశాల్లో సామాజిక సమస్యలు, గిరిజనులు, మైనార్టీలకు రిజర్వేషన్లపై కూడా చర్చ జరగనుంది.

21:19 - August 15, 2016

హైదరాబాద్ : మరో సారి ఇద్దరు చంద్రులు చేతులు కలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. గవర్నర్‌ ఇచ్చిన తేనీటి విందుకు హాజరయ్యారు. ఆప్యాయంగా కరచాలనం చేసుకున్నారు. రాజ్‌భవన్‌ సాక్షిగా ఈ అరుదైన ఘటన పునరావృతమైంది. ఈసారి మరో విశేషమేంటంటే.. చంద్రబాబుతో.. ప్రతిపక్ష నేత జగన్‌ చేతులు కలిపారు. 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి, డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, మండలి చైర్మన్‌ చక్రపాణి, ఇరు రాష్ట్రాల మంత్రులు, సీఎస్‌లు, పలువురు అధికారులు హాజరయ్యారు. వీరందరికీ గవర్నర్‌ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. కేసీఆర్‌.. చంద్రబాబు ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. అనంతరం చంద్రబాబుతో.. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సైతం కరచాలనం చేశారు. తర్వాత కొద్ది సేపటికే జగన్‌, చంద్రబాబు కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. కేసీఆర్‌ మాత్రం చివరి వరకూ ఉండి గవర్నర్‌తో కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితులను సీఎం కేసీఆర్‌ .. గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. అయితే ఈసారి తెలంగాణ విపక్షాలైన కాంగ్రెస్‌, టీడీపీ నేతలెవరూ తేనీటి విందుకు హాజరుకాలేదు.

పుష్కర ఘాట్లను పరిశీలించిన బాబు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు పుష్కర ఘాట్లను అకస్మికంగా తనిఖీలు చేశారు. కృష్ణవేణి, పద్మావతి ఘాట్లను పరిశీలించారు. 

21:06 - August 15, 2016

అనంతపురం : ఏపీలో 70వ స్వాతంత్ర్య దిన వేడుకలు ఘనంగా జరిగాయి. వీధి వీధిన, వాడ వాడన జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనంతపురంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా రాయలసీమలో అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లా అభివృద్ధికి 6,554 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం... 70వ స్వాతంత్ర్య దినోత్సవాలను.. అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు దళాలు, ఎన్‌సీసీ కేడెట్లు, స్కౌట్స్ అండ్‌ గైడ్స్, పాఠశాల విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ శాఖల ప్రగతిని వివరించే అలంకృత శకటాల ప్రదర్శనను తిలకించారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాలకు ఆతిథ్యమిచ్చిన
అనంతపురం జిల్లాకు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో వరాలు ప్రకటించారు.

ఎన్నో వరాలు..
జిల్లాను పారిశ్రామిక, విద్యాసంస్థలకు కేంద్ర స్థానంగా మార్చుస్తామన్నారు. అనంతపురం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి 6,554 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. దీనిలో కరవు నివారణకు 1700 కోట్లు, వ్యవసాయ అనుంబంధ రంగాల అభివృద్ధికి 2,654 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. అలాగే మంచినీటి ఎద్దడి వివారణకు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. దీనిద్వారా అనంతపురం జిల్లా తిరుగులేని శక్తిగా మారుతుందని చెప్పారు. విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను చంద్రబాబు ప్రస్తావించారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రం విస్మరించిందన్నారు. విశాఖ రైల్వే జోన్‌, పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వకపోవడాన్ని ప్రస్తావించారు. కుట్రలు, కుతంత్రాలతోనే కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని.. విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనపరిచిన పోలీసు, ప్రభుత్వ అధికారులు, సంస్థలకు అవార్డులు, రివార్డులు ప్రదానం చేశారు. అనంతరం జాతీయ సమైక్యతపై విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలను చంద్రబాబు తిలకించారు. 

21:03 - August 15, 2016

ఢిల్లీ : సీమాంతర ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి హెచ్చరించారు. ఉగ్రవాదులను భారత్‌పైకి ఉసిగొల్పుతున్న పాకిస్థాన్‌ నైజాన్ని అంతర్జాతీయ సమాజం ముందు ఎండగడతామని అన్నారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన భారత 70వ స్వాతంత్ర్య వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసిన ప్రధాని మోదీ.. తమ ప్రభుత్వం సాధించిన విజయాలు.. గత ప్రభుత్వాలకు, తమ ప్రభుత్వానికీ తేడాలను వివరిస్తూ ప్రసంగించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలనూ ఆయనీ సందర్భంగా ప్రస్తావించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ దంపతులతోపాటు, త్రివిధ దళాధిపతులు, పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా దంపతులు, పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, పలువురు కేంద్ర మంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దంపతులతోపాటు పలువురు అధికారులు, అనధికారులు స్వాతంత్ర్య దిన వేడుకలకు హాజరయ్యారు.

పాక్ ప్రశంసలను తప్పుబట్టిన మోదీ..
చారిత్రక ఎర్రకోట బురుజు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదంతో దేశానికి ఎదురవుతున్న సవాళ్లు, జరుగుతున్న నష్టాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. జాతీయ, అంతర్జాతీయంగా జరిగిన పలు ఉగ్రవాద ఘటనలను ప్రధాని ప్రస్తావించారు. గతనెల 8న ఉగ్రవాది బర్హాన్‌ వని ఎన్‌కౌంటర్‌ తర్వాత జమ్ము-కశ్మీర్‌లో చోటుచేకున్న అశాంతినీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. భారత్‌లో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులను హీరోలుగా పాకిస్థాన్‌ ప్రశంసించడాన్ని మోదీ తప్పుపట్టారు.

77 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు..
దేశవ్యాప్తంగా ఒకే విద్యుత్‌ గ్రిడ్‌ వ్యవస్థ.. వన్‌ నేషన్‌-వన్‌ గ్రిడ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు మోదీ తెలిపారు. విద్యుత్‌ ఆదా చేసేందుకు 77 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను తక్కువ ధరకే అందజేసే విధానాన్ని పస్తావించారు. ఆధార్‌ అనుసంధానాన్ని మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తామన్న మోదీ.. ప్రసూతి సెలవుల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. వస్తు, సేవల పన్ను బిల్లుతో దేశాభివృద్ధి వేగం పుంజుకుంటుందని ప్రధాని చెబుతున్నారు. రక్షణ వలయాన్ని పక్కన పెట్టిన మోదీ.. కార్య్రమానికి హాజరైన ప్రముఖులతోపాటు, పాఠశాల బాలబాలికలు, విద్యార్థులతో కలిసిపోయారు. వారందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

21:01 - August 15, 2016

ఢిల్లీ : రాజ్యసభ సభ్యత్వంతోపాటు బీజేపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు ఆప్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈవారంలోనే సిద్ధు అధికారికంగా ఆప్‌లో చేరే అవకాశం ఉందని ఆయన సతీమణి నవజ్యోత్‌ కౌర్‌ వెల్లడించారు. సిద్ధు బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్‌ తమను సంప్రదించిందని, అయితే ఆ పార్టీలో చేరే విషయాన్ని తిరస్కరించనట్టు చెప్పారు. ప్రస్తుతం పంజాబ్‌లో అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్‌కూ, కాంగ్రెస్ పార్టీకి పెద్ద వ్యత్యాసంలేదని నవజ్యోత్‌ కౌర్‌ వ్యాఖ్యానించారు.ఈ రెండు పార్టీలు అవినీతి ఊబిలో కూరుకుపోయాయని ఆరోపించారు. అందువల్ల ఎటువంటి మచ్చలేని ఆమ్‌ఆద్మీ పార్టీలో చేరేందుకు సిద్ధు సుముఖంగా ఉన్నట్టు నవజ్యోత్‌ కౌర్‌ వెల్లడించారు. 

20:50 - August 15, 2016

దేశమంతా మువ్వెన్నెల జెండా రెపరెలాడింది. 70 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ 70 ఏళ్లలో మనం సాధించిన ప్రగతి ఏమిటి? చేరుకోవాల్సిన లక్ష్యాలేమిటి? అధిగమించాల్సిన సవాళ్లేమిటి? ఈ అంశంపై ప్రత్యేక కథనం..స్వాతంత్ర్య దేశ పతాకం సమోన్నతంగా రెపరెపలాడుతోంది. బ్రిటీషోళ్ల పాలన నుంచి స్వేచ్ఛ గాలులు పీల్చుకున్న స్వాతంత్ర్య భారతావనికి 70 వసంతాలొచ్చాయి. ఇది మనమంతా గర్వించదగ్గ సందర్భం. భారతదేశ సమైక్యత, సమగ్రతలకు పునరంకితం కావాల్సిన సమయం. మానవీయ విలువలను, ప్రజాస్వామిక సంప్రదాయాలను మరింత సమోన్నతంగా నిలబెట్టుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీదా వుంది. దేశం బానిసత్వ సంకేళ్లు తెంచుకుంటున్నవేళ బోసినవ్వులతో కేరింతలు కొట్టిన తరం ఇప్పుడు సీనియర్ సిటిజన్ హోదాలో మన మధ్యనే వుండడం సంతోషకరం. నాటి స్వాతంత్ర్య సంగ్రామంలో సర్వస్వం త్యాగం చేసినతరంలో నేడు ఏ కొద్ది మందో మిగిలారు. నాటి త్యాగాల పునాదుల మీదనే నేటి స్వాతంత్ర్య పతాకం సమోన్నతంగా రెపరెపలాడుతోంది. 70 ఏళ్ల స్వాతంత్ర్యం మనకేమిచ్చింది? 70 ఏళ్ల క్రితం మన ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఎన్నెన్ని మలుపులు తిరిగింది? మన గమ్యం ఎటు వైపు నడుస్తోంది? స్వాతంత్ర్య సంగ్రామంలో దేశ హితం కోసం సర్వం ధారపోసిన నాటి తరం కోరుకున్నదేమిటి? నేటి తరం సాధిస్తున్నదేమిటి? ఈ అంశంపై మరింత విశ్లేషణ కోసం వీడియోలో చూడండి. 

నయీం మరో అనుచరుడి అరెస్టు..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం మరో అనుచరుడు సమీరుద్దీన్ ను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను నల్గొండ జిల్లాకు చెందిన వాడు. 

20:38 - August 15, 2016

కేరళ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనంత పద్మనాభస్వామి ఆలయానికి చెందిన నిధులు మాయమయ్యాయి.186 కోట్ల విలువ చేసే 769 బంగారు కుండల ఆచూకీ తెలియడం లేదని మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వినోద్‌రాయ్‌ సుప్రీంకోర్టులో ఓ నివేదిక ద్వారా వెల్లడించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీ.ఎస్‌.ఠాకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఆలయ నిధుల్లో ఉన్న బంగారు కుండలన్నింటికీ వరుస సంఖ్యలున్నాయి. జులై 2002 వరకు 1 నుంచి వెయ్యి సంఖ్యలు గల కుండలు ఉపయోగంలో ఉన్నాయి. అయితే 2011 ఏప్రిల్‌ 1న 1988వ సంఖ్య కలిగిన కుండ బయటపడింది. దీంతో బంగారుకుండల సంఖ్య కనీసం 1988 ఉండాలని వినోద్‌రాయ్‌ చెబుతున్నారు. వీటిలో 822 కుండలను ఆలయ అలంకరణకు వినియోగించగా.. ఇంకా 1,166 బంగారు కుండలు ఉండాలి. కానీ 397 వరకు సంఖ్యలు గల కుండలు మాత్రమే దొరికాయని నివేదికలో పేర్కొన్నారు.

20:36 - August 15, 2016
20:35 - August 15, 2016

ప్రకాశం : బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడో దుర్మార్గుడు.....ప్రకాశం జిల్లా శంఖవరం గ్రామంలో నివసించే బాధితురాలి తల్లిదండ్రులు.. ఆమె చిన్నప్పుడే చనిపోయారు. తాత దగ్గర పెరుగుతున్న ఆమెపై అదే గ్రామానికి చెందిన కటారపు చిన్నా కన్నేశాడు. ఎవరూలేని సమయంలో అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పడంతో ఆమె ఎవ్వరికీ ఈ విషయం చెప్పలేదు. తర్వాత చిన్నా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

20:33 - August 15, 2016
20:32 - August 15, 2016

ఆదిలాబాద్‌ : పంద్రాగస్టు రోజును అందరూ ఘనంగా జరుపుకుంటుంటే కొంతమంది ప్రజాప్రతినిధులు, వారి భర్తలు మాత్రం వేరే మూడ్ లో ఉన్నారు. జిల్లా కాగజ్‌నగర్‌లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కౌన్సిలర్లు, వారి భర్తలు పేకాట ఆడుతూ రెచ్చిపోయారు. పలువురు పేకాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. పోలీసులను చూసి అక్కడి నుంచి కొంతమంది పరారయ్యారు. పేకాట స్థావరంలో మద్యం బాటిళ్లు, మాంసం వండిన పాత్రలున్నాయి. వీటితో పాటు 5 బైక్‌లు, ఓ కారు, 3 సెల్‌ఫోన్లు, 13500 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

20:30 - August 15, 2016

తూర్పుగోదావరి : దేశంలో మహిళలు విద్యారంగంలో వెనుకబడి ఉన్నారని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో నిర్వహించిన 69 సంవత్సరాల స్వతంత్ర భారతావని పేరిట సదస్సులో బీవీ రాఘవులు పాల్గొన్నారు. అంతకు ముందు బీవీ రాఘవులు బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

 

20:21 - August 15, 2016

హైదరాబాద్ : నాలుగు గంటలపాటు కన్నవారిలో ఆందోళన...పోలీసుల్లో టెన్షన్...చిన్నారిని ఎత్తుకెళ్లింది లేడీ కిలాడీనా..? లేక తెలిసినవారా..?. ఏ మాత్రం ఆలస్యం చేసినా ఏదైనా జరగొచ్చు...ఇదే టెన్షన్‌తో పోలీసులు పరుగులు పెట్టారు..మరోవైపు చిన్నారి తల్లిదండ్రులు భోరున విలపించారు.మహానగరంలో మాయలేడీలు సంచరిస్తున్నారు..తస్మాత్ జాగ్రత్తా...ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి... అప్పుడే వచ్చిన ఓ అపరిచితురాలు..చాక్లెట్ కొనిస్తానంటూ ఆశ చూపి ఎత్తుకెళ్లింది..కూతురు కన్పించక కన్నవారిలో ఆందోళన..మహానగరంలో మరో చిన్నారి కిడ్నాప్..మహానగరంలో మాయలేడీలు సంచరిస్తూనే ఉన్నారు..ఇప్పటికే ఎన్నో ఘటనలు జరిగాయి. చిన్నారుల ఒంటిపై కాళ్లపట్టీలున్నా...చెవి పోగులున్నాయంటే ఎత్తుకెళ్లేవారి కన్ను పడుతుందని తెలుసుకోవాలి. తాజాగా నగరంలో జరిగిన ఘటన కలకలం రేపింది. నాలుగు గంటల తర్వాత టెన్షన్‌కు తెరపడింది.

తనిఖీలు నిర్వహించగా అంబర్‌పేటలో చిన్నారి..
హైదరాబాద్‌ నల్లకుంట అడిక్‌మెట్‌లో ఐదేళ్ల బాలిక హర్షిత ఉదయాన్నే ఆడుకుంటుండగా అపరిచిత మహిళ వచ్చి చాక్లెట్ కొనిస్తానంటూ ఆశపెట్టి ఎత్తుకెళ్లింది. కాసేపటికి కూతురు కన్పించకపోవడంతో కన్నవారు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు వెంటనే నగరంలోని స్టేషన్లకు సమాచారం అందించి గాలింపు చేపట్టారు. పోలీసులు పాప కన్నవారు వెతుకుతుండగా ..మీడియాలో వచ్చిన కిడ్నాప్ వార్తను చూసిన జనం చిన్నారిని అంబర్‌పేటలో గుర్తించి సమాచారం అందించారు. చిన్నారి చెవిపోగులను లాక్కున్న లేడీకిలాడీ అంబర్‌పేట రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయింది. చిన్నారిని సురక్షితంగా చేర్చిన పోలీసులు కన్నవారికి అప్పగించారు. చూశారుగా ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌ నగరంలో మామూలైపోయింది..సో.. పేరెంట్స్ జర భద్రం.

కార్పొరేషన్లకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే - అచ్చెన్నాయుడు..

శ్రీకాకుళం : కార్పొరేషన్లకు, పెండింగ్ నగర పంచాయతీలకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. జనవరిలోగా కార్పొరేషన్లకు ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు - జేసీ..

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు. హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చే అవకాశమే కనిపిస్తుందని, ఏపీకి లోటుబడ్జెట్ ఉన్నా నీటి ప్రాజెక్టుల కోసం సీఎం స్పందించే తీరు హర్షణీయమన్నారు. 

20:09 - August 15, 2016
20:08 - August 15, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్ర సౌరభాలు గుబాళించాయి. వాడవాడలా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల మంత్రులు.. అధికారులు జెండాలను ఆవిష్కరించి.. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను కొనియాడారు. పలు జిల్లాలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పిల్లలు..పెద్దలు..అధికారులు..ప్రజాప్రతినిధులు పాల్గొని జెండా వందనం చేశారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి..స్వాతంత్ర సమర యోధులను సత్కరించారు. అలాగే నెల్లూరులో పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో మంత్రి నారాయణ జెండా ఆవిష్కరించారు.

కడప..విశాఖ..విజయనగరం..తూ.గో..
కడపలో జిల్లాలోని.. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో పంద్రాగస్ట్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అలాగే కర్నూలు నగరంలోని పరేడ్ గ్రౌండ్‌లో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే విశాఖపట్నంలో మంత్రి యనమల రామకృష్ణ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయనగరంలో కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారతీయ పౌరునిగా స్వాతంత్ర ఫలాలను రక్షించుకోవడం అందరి బాధ్యత అని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర వేడుకల్లో భాగంగా పలు చోట్ల వినూత్న రీతిలో జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా.. కాకినాడలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 450 అడుగుల భారీ జాతీయ జెండాను ఊరేగించారు. ఆరు వందల మంది చిన్నారులు భరతమాత వేషధారణలో.. 400 మంది గాంధీ వేషధారణలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లిలో మంత్రి గంటా శ్రీనివాసరావు సతీమణి 900 మీటర్ల జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అపశృతి..
అయితే స్వాతంత్ర వేడుకల్లో కొన్నిచోట్ల అపశ్రుతి చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని.. పాలకొల్లులో తలకిందులుగా జెండాను ఎగురవేశారు. అలాగే కర్నూలు జిల్లా పెద్దమర్తి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో జెండా వందనం కార్యక్రమంలో సర్పంచ్‌..ఎంపీటీసీ వర్గీయులకు ఘర్షణ జరిగింది. ఈ గొడవలో జెండా స్తంభాన్ని చుట్టుముట్టి జాతీయ జెండాను లాగి పారవేశారు. వేడుకల్లో నాయకుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీఎం కేసీఆర్ పై మోహన్ బాబు ప్రశంసలు..

కరీంనగర్ : వేములవాడ రాజరాజేశ్వరస్వామిని కుటుంబసమేతంగా సినీ హీరో మోహన్ బాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై మోహన్ బాబు ప్రశంసలు గుప్పించారు. రెండు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ తరువాత గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణకు సీఎంగా కేసీఆర్ కావడం ప్రజల అదృష్టమని, సీఎం కేసీఆర్ మెరుగైన పాలన అందిస్తున్నారని తెలిపారు. 

19:53 - August 15, 2016

క్వార్టర్ ఫైనల్స్ కు చేరిన కిదాంబి..

రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మెంటెన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాడు. డెన్మార్మ్ దేశస్థుడిని ఓడించాడు. 

19:15 - August 15, 2016

లవ్‌లీ రాక్‌స్టార్‌ 'ఆది' హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు 'వీరభద్రమ్‌' దర్శకత్వంలో 'చుట్టాలబ్బాయి' చిత్రం రూపొందుతోంది. శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 19వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆది..వీరభద్రమ్ తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు చిత్ర వివరాలతో పలు విశేషాలను పంచుకున్నారు. లవ్..ఫ్యామిలీ..యాక్షన్ ఎంటర్ టైనర్ గా చిత్రం ఉంటుందని దర్శకుడు వీరభద్రం పేర్కొన్నారు. వెరైటీ పాత్రలు చేయడం తనకిష్టమని 'ఆది' పేర్కొన్నారు. ఇంకా హీరోయిన్ నమిత ప్రమోద్ ఫోన్ చేసి మాట్లాడారు. వీరు ఎలాంటి విశేషాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి. 

ఏపీ కృష్ణా పుష్కరాల్లో నాలుగో రోజు..

విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో నాలుగో రోజు 15,19,372 మంది పుష్కర స్నానాలు ఆచరించారు. విజయవాడలో 6,39,704 మంది, గుంటూరు అర్బన్ 70,078, గుంటూరు రూరల్ లో 4,45,820, కృష్ణాలో 1,98,240 మంది, కర్నూలులో 1,11,103 మంది భక్తులు స్నానాలు ఆచరించారు. ఇప్పటి వరకు మొత్తం 52,85,285 మంది స్నానాలు చేశారు. 

మైనర్ బాలికను గర్భవతి చేసిన యువకుడు..

ప్రకాశం : కనిగిరి (మం) శంఖరాపురంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను ఓ యువకుడు గర్భవతి చేశాడు. దీనితో పీఎస్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. 

వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్..

వాఘా : భారత్ - పాక్ సరిహద్దైన వాఘాలో బీటింగ్ రిట్రీట్ కొనసాగుతోంది. రిట్రీట్ ను చూడటానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. 

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

నేపాల్ : పర్వత జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడడంతో సుమారు 33 మంది మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరో 28 మందికి గాయాలైనట్లు సమాచారం. 

దీపా కర్మాకర్ పై ప్రశంసల జల్లు..

ఢిల్లీ : భారత జిమ్నాస్టిక్స్ ప్లేయర్ దీపా కర్మాకర్ పై సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆమె ప్రదర్శన గొప్పగా ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఎంపీ జితేంద్ర చౌదరి, సీఎంవో కేరళతో పాటు పలువురు ప్రశంసలు కురిపించారు. దీపా కర్మాకర్‌ రియో ఒలింపిక్స్ నుంచి పతకం లేకుండానే నిష్క్రమించింది. కానీ తలెత్తుకుని సగర్వంగా నిలిచే ప్రదర్శన ఆమెది. 

18:13 - August 15, 2016

బాలీవుడ్ కండల వీరుడు నటిస్తున్న తాజా చిత్రం 'ట్యూబ్ లైట్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన నటించిన చిత్రాలన్నీ ఘనవిజయాలు సాధిస్తుండడం..భారీ కలెక్షన్లు సాధిస్తుండడంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి లుక్ ను విడుదల చేశారు. దర్శకుడు కబీర్ ఖాన్ అభిమానులకు విషెస్ చెబుతూ ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఈ లుక్ ను విడుదల చేశారు. సల్మాన్ సైనికుడి యూనిఫాంలో కనిపిస్తున్నారు. కానీ ఈ చిత్రంలో సల్మాన్ ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఈ చిత్రంలో ఉన్నది సల్మాన్ నేనా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నట్లు సమాచారం.
1962 లో జరిగిన ఇండో - చైనీస్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా మొదటి భాగం లడఖ్ లో పూర్తి చేశారు. చిత్రీకరణలో పాల్గొన్న సల్లూ తన గర్ల్ ఫ్రెండ్ లులియా వాంతూర్ లు ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాను కలిసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ రీల్ లైఫ్ సోదరుడిగా నటిస్తున్నాడని తెలుస్తోంది. సల్మాన్ కు ఉన్న సెంటిమెంటన్ ను ఫాలో అవుతూ ఈ చిత్రాన్ని కూడా రంజాన్ పర్వదినాన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ భావిస్తోందంట. 

17:52 - August 15, 2016

మచ్చబొల్లారం కాల్పుల ఘటనలో నిందితుడు లొంగుబాటు..

హైదరాబాద్ : అల్వాల్ మచ్చబొల్లారం కాల్పుల ఘటనలో నిందితుడు నందు యాదవ్ లొంగిపోయాడు. నందూ యాదవ్ ఆర్మీ ఉద్యోగి అని తేలింది. 

రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం..

హైదరాబాద్ : రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లు హాజరయ్యారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రులు, ఎంపీలు, ఇరు రాష్ట్రాల సీఎస్ లు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తదితరులు పాల్గొన్నారు. 

17:37 - August 15, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యాల దోపిడికి అంతేలేకుండా పోతోంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఏదో ఒక పేరు చెప్పి భారీ మొత్తాలను వసూలు చేస్తున్నారు. ఓసారి అప్లికేషన్‌ ఫీ అంటారు.. మరోసారి అదేదో పేరు చెబుతారు. ఏదో రకంగా తల్లిదండ్రులను మాయచేసి భారీ మొత్తాలను దండుకుంటున్నారు. కౌన్సిలింగ్‌ ప్రక్రియనూ అపహాస్యం పాల్జేస్తున్నారు. కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌ పూర్తి కాకముందే.. బీ-కేటగిరీ సీట్లను బజార్లో పెట్టిమరీ అమ్మేస్తున్నారు. తెలంగాణలో ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల దందాపై 10టీవీ ప్రత్యేక కథనం..తెలంగాణలో ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల అక్రమాల దందా రోజుకొకటిగా వెలుగు చూస్తోంది. నిన్న మొన్నటి వరకూ ఈ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు.. మేనేజిమెంట్‌ కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లనే విచ్చలవిడిగా అమ్ముకున్నారని విన్నాం. కానీ ఇప్పుడు కన్వీనర్‌ కోటా సీట్లను కూడా దొడ్డిదారుల్లో తెగనమ్ముతున్న వైనం వెలుగు చూస్తోంది.

ఇంకా ముగియని కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌..
ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌ ఇంకా ముగియనే లేదు. కానీ కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు.. బీ-కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ సీట్లను బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టాయి. దీనికి స్పాట్‌ కౌన్సెలింగ్‌ అన్న పేరు పెట్టాయి. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మార్గాల్లో తొలి కౌన్సెలింగ్‌లో మిగిలి పోయిన సీట్లను అమ్మేసుకుంటున్నాయి. దరఖాస్తు రుసుము.. రిజిస్ట్రేషన్‌ల పేరిట.. విద్యార్థుల నుంచి భారీ మొత్తాన్ని వసూలు చేసే పనిలో పడ్డాయి ఈ ఇంజినీరింగ్‌ కాలేజీలు. టాప్‌ కాలేజీలు కూడా ఇలాంటి దందాకు తెగబడ్డం విశేషం. కన్వీనర్‌ కోటాలో.. టాప్‌ కాలేజీలో జాయిన్‌ కావాలనుకునే విద్యార్థుల ఆశలు.. యాజమాన్యాల ఫీజు దోపిడితో అడియాశలవుతున్నాయి.

లక్షలాది రూపాయలకు సీట్లు అమ్మకం..
సాధారణంగా కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ కోసం తొలి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అందులో ఎంపికైన విద్యార్థి.. ఏ కారణం చేతనైనా రెండో కౌన్సెలింగ్‌కు ఆప్షన్‌ ఇస్తే.. ఆ సీటు ఖాళీ అవుతుంది. మామూలుగా అయితే.. రెండో కౌన్సెలింగ్‌ జాబితాలో.. ఈ ఖాళీ అయిన సీట్ల వివరాలనూ పొందుపరచాలి. రెండో కౌన్సిలింగ్‌లోను మిగిలితే మూడో కౌన్సిలింగ్‌లోనూ చూపాలి. కానీ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు ఈ నిబంధనను తోసిరాజంటున్నాయి. మలి విడత కౌన్సిలింగ్‌ రాక ముందే స్పాట్‌ కౌన్సెలింగ్‌ పేరిట భారీ మొత్తాలను వసూలు చేస్తూ.. కన్వీనర్‌ కోటా సీట్లను బయటే లక్షలాది రూపాయలకు అమ్మేసుకుంటున్నారు.

విద్యార్థుల నుంచి లక్షలు దోచుకుంటున్న యాజమాన్యాలు..
ఇంజినీరింగ్‌లో బి-కేటగిరీ సీట్ల కేటాయింపు కోసం ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు అప్లికేషన్‌ల పేరిట ప్రతి విద్యార్థి నుంచీ రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎంవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ లాంటివైతే.. రిజిస్ట్రేషన్‌ పేరిట మరో మూడు వేలు అదనంగా వసూలు చేస్తున్నాయి. అంటే ఓ విద్యార్థి నుంచి అక్రమంగా.. అప్లికేషన్‌, రిజిస్ట్రేషన్‌ పేరిట ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఒక్కో కాలేజీకి వంద మంది వచ్చి రిజిస్టర్‌ చేసుకున్నా.. కాలేజీ యాజమాన్యాలకు ఐదు లక్షల రూపాయల దాకా వసూలవుతోంది. ఈ మొత్తం నేరుగా ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల జేబుల్లోకే వెళుతోంది. ఇది కాక.. ఎవరైనా విద్యార్థి సీటు ఖరారు చేసుకుంటే.. వార్షిక ఫీజు లక్షల్లోచెల్లించాల్సి వుంటుంది.

ఈ నెల చివరికల్లా ప్రారంభంకానున్న క్లాసులు...
ఈనెల చివరికల్లా అడ్మిషన్‌ల పూర్తి ప్రక్రియ పూర్తయి క్లాసులు కూడా ప్రారంభం కావాలి. అయితే బి-కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ సీట్ల భర్తీ కోసం కాలేజీలు రెండు మూడు నెలల నుంచే తీవ్ర కసరత్తును ప్రారంభించాయి. ఈ కసరత్తులో భాగంగానే ఒక్కో విద్యార్థి నుంచి టాప్‌ కాలేజీలైతే ఆరు నుంచి 16 లక్షల రూపాయల వరకూ వసూలు చేస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఐ సీట్ల భర్తీలో కూడా అనేక మోసాలకు పాల్పడుతున్నాయి ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు. ఐదు శాతం ఉన్న ఎన్‌ఆర్‌ఐ సీట్లను అక్రమంగా ఏఐసీటీఈ నిబంధనలకు విరుద్ధంగా 15 శాతం చేసుకుని.. ఎన్‌ఆర్‌ఐలు లేకపోతే వారి తరఫున స్పాన్సరర్ల పేరుతో డొనేషన్‌లను లక్షల్లో దండుకుంటున్నారు.

నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌ ప్రక్రియ..
నిజానికి ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం.. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరగాలి. కేవలం రాత్రిళ్లు మాత్రమే ఆన్‌లైన్‌లో ఉన్నట్లు చూపించి.. మిగతా అంతా బయటే సరిచేసుకుంటున్నాయి ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు. వీరి ఆగడాలను అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు జీవో 74, 75లను జారీ చేశాయి. వీటిని రద్దు చేయించే ప్రయత్నాలు చేసినా.. కోర్టుల కారణంగా ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు సైలెంట్‌ అయ్యాయి. అయితే.. ఇప్పటికీ ఈ జీవోలు అమలుకు నోచుకోక పోవడం విశేషం.

మిగిలిపోయిన కోటా సీట్లపై కరవైన పర్యవేక్షణ..
కన్వీనర్‌ కోటాలో మిగిలిపోయిన సీట్లపై కనీస పర్యవేక్షణ లేకపోవడంతో.. ఇంజినీరింగ్‌ కాలేజీల ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. రాష్ట్రంలోని టాప్‌ కాలేజీలన్నీ ఇప్పుడు ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అయినా అధికారుల నుంచి స్పందనే కరవైంది. ఇంతవరకూ ఏ ఒక్క కాలేజీపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఫిర్యాదు చేసేందుకు మండలి ఛైర్మన్‌ను కలవాలంటేనే గగనమైపోతోంది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని.. తక్షణమే ఈ ఫీజుల దందాను అరికట్టాల్సిన అవసరమూ ఉంది. 

17:30 - August 15, 2016
17:28 - August 15, 2016

వరంగల్ : స్వాతంత్ర్య వేడుకల్లో డిఫ్యూటీ సీఎం కడియం శ్రీహరికి చేదు అనుభవం ఎదురైంది. వరంగల్‌లో స్వాతంత్ర సమరయోదులను సన్మానిస్తుండగా.. తమ కోసం ఏమి చేశారని వారు ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరులకు 10 లక్షల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తమను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో కడియం శ్రీహరి సన్మానం మధ్యలోనే వెనుదిరిగారు. 

17:27 - August 15, 2016

హైదరాబాద్ : దసరా నాటికి కొత్త జిల్లాలకు ఒక రూపు వస్తుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కోటి ఎకరాలకు నీరు అందించడమే తన ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ఆకర్షించాయని.. రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రధాని మోదీ ప్రశంసించడం తమలో స్ఫూర్తి నింపిందన్నారు. సమాఖ్య స్ఫూర్తితో కేంద్రంతో సంబంధాలు కొనసాగిస్తున్నామని, ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలతో సత్ఫలితాలు పొందుతున్నామన్నారు. గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఈ నెల 23న ముంబయిలో చారిత్రక ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందన్నారు.

పోలీసుల పనితీరును అభినందించిన కేసీఆర్.
ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తన ప్రసంగంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలనకు తమ పాలనకు తేడాను వివరించారు. రైతులు పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు వీలుగా తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టిందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో 177 గోదాములు ఉండగా తమ ప్రభుత్వం 330 గోదాముల నిర్మాణాలకు చర్యలు తీసుకుందన్నారు. ఇందులో భాగంగా ముందుగా 100 గోదాముల నిర్మాణానికి పూర్తిస్థాయి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో విద్యుత్‌ కొరత ఉండేదని... త్వరలో ప్రతి గ్రామానికి పూర్తిస్థాయి విద్యుత్‌ను అందిస్తామన్నారు. మిషన్‌ భగీరథ పనుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి మంచినీటితో పాటు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల విషయంలో పోలీసుల పనితీరును కేసీఆర్‌ అభినందించారు. రాష్ట్రపతి శౌర్య పోలీసు పతకాలు పొందిన వారికి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. 

రేపటి నుండి టి.సీపీఎం ప్లీనరీ సమావేశాలు..

హైదరాబాద్ : రేపటి నుండి ఈనెల 18 వరకు తెలంగాణ సీపీఎం ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు హాజరు కానున్నారు. రేపు ఉదయం పది గంటలకు ఎస్వీకేలో ప్రారంభ సభ జరగనుంది. వివిధ జిల్లాల నుండి 481 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు.

17:03 - August 15, 2016

ఉలవలు..నవ ధ్యాన్యాలో ఒకటి అని పిలుస్తుంటారు. దీనితో పలు రకాల వంటకాలు చేసుకుంటుంటారు. కానీ చాలా మంది దీనిని తినరు. అతిగా తినడం వల్ల వేడి చేస్తుంటుంది. పశువుల దాణాలోనూ ఉలవలను వాడుతుంటారు. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా నేటితరంలో ఉలవలు..ఇతరత్రా వాటి ప్రాముఖ్యత గురించి తెలిసిన వారు కొద్ది మందేనని చెప్పుకోవచ్చు. మరి ఉలవలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దామా...
మేలైన ఉలవలను చిన్నట మంటమీద లేతగా వేయించుకోవాలి. ఇది చల్లారిన తరువాత పిండి చేసుకోవాలి. ఇలా వచ్చిన పొడిని రోజు పరగడుపున రెండు చెంచాల మోతాదు తీసుకుని గ్లాసుడు నీళ్లలోకి వేసుకుని తాగితే బరువు తగ్గుతారు. కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు పోసి నానబెట్టి కుక్కర్‌లో ఉడికించి, ఆ ఉలవకట్టుకు చిటికెడు ఉప్పు కలిపి ఉదయం పరగడుపునే తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు.
ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకునే మహిళల్లో నెలసరి రాకపోవటం, క్రమం తప్పటం వంటి ఋతు సంబంధ సమస్యలు రావు.
ఉలవలు దెబ్బతిన్న కాలేయాన్ని కోలుకునేలా చేస్తాయి.
ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని పలుచ బరచడంలో ఉలవలు చక్కగా ఉపయోగపడతాయి.
మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారు ఉలవలు తింటే త్వరలోనే రాళ్లు కరిగి కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.
మూత్ర సమస్యలు ఉన్నవారు ఒక కప్పు చొప్పున ఉలవచారు, కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే ఉపశమనం కలుగుతుంది.
నేరుగా తినేదాని కంటే ఉడికించి, మొలకలెత్తించిన లేదా వేయించి పొట్టు తీసిన ఉలవలను తిన్నప్పుడు పోషకాల విలువ మరింత పెరుగుతుంది.

16:47 - August 15, 2016

శరీరానికి కొన్ని విటమిన్స్ తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. ఈ విటమిన్లు ఉండే ఆహారం తీసుకోకపోతే పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. విటమిన్లలో ఎ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. ముఖ్యంగా కంటి చూపును సవ్యంగా ఉండదానికి దోహ పడుతుంది. వ్యాధి నిరోధక చర్యలు, చర్మ దృఢత్వానికి ఇది దోహదం చేస్తుంది.
సాధారణ కంటి చూపునకు విటమిన్ - ఎ అత్యవసరం. ఇది లోపిస్తే రేచీకటి, ఇతర చిక్కులకు దారితీస్తుంది.
మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు, అంతకన్నాముందు కూడా విటమిన్ ఎ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని నివారించవచ్చు.
ఆకుకూరలు, పసుపురంగు, నారింజ పండ్లు, కాయగూరల్లో బీటా-కెరోటిన్ (విటమిన్ ఎ మూలకం) సమృద్ధిగా ఉంటుంది.
బీటా-కెరోటిన్ విటమిన్ ఎ గా మారుతుంది. ముఖ్యంగా మాంసాహారంలోనే ఇది లభిస్తుంది.
పాలు, పాలతో చేసే పదార్ధాలు, గుడ్డులోని పచ్చని సొన, ఎర్రపామాయిల్, చేపలు, చేపనూనెల్లో కూడా విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.
క్యాల్షియం మన శరీరానికి అత్యవసరం. ఇందుకోసం మునగాకు, ఆకుకూరలు, వెన్న, కోడిగుడ్డు పచ్చసొన, చేపలనూనె వంటివి తీసుకోవాలి.

ఘాట్ వద్ద పెద్దవూర ఎంపీపీ ఆందోళన..

నల్గొండ : నాగార్జున శివాలయం ఘాట్ వద్ద పెద్దవూర ఎంపీపీ మల్లిక కారును పోలీసులు అడ్డుకున్నారు. వీఐపీ పాస్ ఉంటేనే లోనికి అనుమతినిస్తామని పోలీసులు చెప్పడంతో ఎంపీపీ ఆందోళన చేపట్టారు. 

నయీం కేసులో అధికార పార్టీపై షబ్బీర్ ఆరోపణలు..

హైదరాబాద్ : నయీం ఇంట్లో దొరికిన డబ్బు రెండు కోట్ల కంటే ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తున్నాయని కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ వ్యాఖ్యానించారు. మహిళల అక్రమ రవాణాలో నయీంతో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలున్నారని ఆరోపించారు. కేసు నీరుగారకుండా ఉండాలంటే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. 

15:58 - August 15, 2016

మెగాస్టార్ తనయుడు 'రాంచరణ్ తేజ' నటిస్తున్న 'ధృవ' చిత్రం ఫస్ట్ లుక్ వచ్చేసింది. పంద్రాగస్టు రోజున ఈ మొదటి లుక్ ను విడుదల చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసిన‌ట్టు చిత్ర వ‌ర్గాలు తెలిపాయి. చెర్రీ తన ఫేస్ భుక్ ఖాతా ద్వారా ఫస్ట్ లుక్ ను అభిమానులతో పంచుకున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.
'తుఫాన్‌' తర్వాత రామ్‌ చరణ్‌ 'ధృవ' చిత్రంలో పోలీస్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో యువ హీరో నవదీప్ కూడా ఓ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం చరణ్‌ శాఖాహారిగా మారి కఠినమైన డైట్‌ పాటిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక విదేశీ ట్రైనర్ల సహకారంతో ఫిట్‌నెస్‌ కసరత్తులు కూడా చేశారు. తమిళంలో గతేడాది విడుదలై భారీ హిట్‌ సాధించిన 'తని ఒరువన్‌'కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దసరాకి 'ధృవ' చిత్రాన్ని తీసుకరావాలని చిత్ర యూనిట్ ప్రయత్నాల్లో ఉంది. 

15:52 - August 15, 2016
15:51 - August 15, 2016

ఢిల్లీ : 70వ స్వాతంత్ర్య దినోత్సవం..ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాక ఆవిష్కరణ..అనంతరం ప్రసంగం..కానీ ప్రధాని చేసిన ప్రసంగం బోర్ కొట్టిందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకో తెలుసుకోవాలంటే చదవండి..
70వ స్వతంత్ర దినోత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై జరిగిన కార్యక్రమానికి వివిధ ప్రముఖులు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని సుదీర్ఘ ప్రసంగం చేశారు. కానీ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల్లో కొందరు గుర్రు కొట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. వీఐపీ గ్యాలరీలో కూర్చొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాంగ్రెస్ నేతల గులాం నబీ ఆజాద్ లు కునుకు తీస్తున్న ఫొటో బయటకు వచ్చింది. వీరే గాకుండా కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్ లు కూడా కునుకు తీస్తున్న ఫొటోలు దర్శనమిస్తున్నాయి. కేజ్రీవాల్ ఫొటోలపై డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పందించారు. మోడీ ప్రసంగం బోర్ కొట్టిందంటూ ట్వీట్ చేశారు. 

15:45 - August 15, 2016

ఢిల్లీ : 70వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ప్రధాని చేసిన ప్రసంగంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జీల నియామకంపై ప్రసంగంలో ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. గంటన్నర సేపు ప్రధాని ప్రసంగాన్ని వినడం జరిగిందని, ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదని తెలిపారు. తన కెరీర్ లో అత్యున్నతస్థాయి పదవి పొందానని, తన మనోభావాలను వ్యక్తపరిచడానికి సందేహించనని తెలిపారు. జడ్జిల నియామకంలో తాను పలుమార్లు ప్రస్తావించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

15:41 - August 15, 2016

గుజరాత్ : హెచ్ సీయూ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల తల్లి రాధిక ఉనాను సందర్శించారు. అక్కడ ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఢిల్లీ జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి కన్నయ్య కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది దళితులు, మైనార్టీలు హాజరయ్యారు. గో సంరక్షణ పేరిట ఇటీవలే ఉనాలో నలుగురు యువ దళితులను కట్టేసి దారుణంగా కొట్టిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన ఘటనతో అట్టుడికింది. 

15:36 - August 15, 2016

హైదరాబాద్ : నల్లకుంట అడిక్ మెట్ లో అదృశ్యమైన చిన్నారి హర్షిత క్షేమమని తేలింది. కిడ్నాప్ చేసిన మహిళ హర్షితను వదిలివెళ్లింది. చెవికమ్మలు లాక్కొని బాలికను అంబర్ పేటలో ఓ మహిళ వదిలి వెళ్లింది.
సోమవారం ఉదయం అడిక్ మెట్ లో ఐదేళ్ల చిన్నారి హర్షిత..మరో చిన్నారి భానుచందర్ ఆడుకుంటున్నారు. ఆ సమయంలో చాక్లెట్ ఇస్తానని చెప్పిన ఓ మహిళ ఉంటున్న హర్షితను ఎత్తుకెళ్లింది. హర్షిత కిడ్నాప్ కు గురైందని తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎర్రచీర కట్టుకుని ఉన్న మహిళ ఆటోలో వెళ్లిపోయిందని భానుచందర్ పేర్కొన్నాడు. అనంతరం అంబర్ పేటలో చిన్నారిని వదిలిపెట్టినట్లు తెలిసింది. ఆ చిన్నారి హర్షిత అని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కిడ్నాప్ చేసిన మహిళ ఎవరనేది తెలియడం లేదు. 

15:32 - August 15, 2016
15:30 - August 15, 2016

నల్గొండ : జిల్లాలో నాలుగో రోజు పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. నాగార్జున సాగర్ వద్ద భక్తులు పోటెత్తుతున్నారు. గత రెండు రోజులుగా వరుసగా సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు. గడిచిన రోజుల్లో ఆరు లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నాగార్జున సాగర్ ఘాట్ వద్దకు అధికంగా భక్తులు తరలివస్తున్నారు. దీనితో ఘాట్ లో కనీసం కూర్చొవడానికి స్థలం లేకపోవడంతో పలువురు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇతర ఘాట్ ల్లోకి తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ స్నానం చేసినా పుణ్యం వస్తుందని..ఒక్క ఘాట్ వద్దకే రావద్దని అధికారులు ప్రచారం చేపడుతున్నారు. 

నల్లకుంటలో అదృశ్యమైన బాలిక క్షేమం..

హైదరాబాద్ : నల్లకుంటలో అదృశ్యమైన బాలిక ఆచూకి లభ్యమైంది. చెవికమ్మలు లాక్కొని బాలికను అంబర్ పేటలో ఓ మహిళ వదిలి వెళ్లింది. అడిక్ మెట్ లో చిన్నారి హర్షితను మహిళ ఎత్తుకెళ్లింది.

 

రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం..

హైదరాబాద్ : సాయంత్రం 5.15గంటలకు రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. చాలాకాలం తరువాత వీరు కలుసుకోనున్నారు. ఎట్ హోం కార్యక్రమానికి వైసీపీ అధ్యక్షుడు జగన్, తెలంగాణ పార్టీల ప్రముఖులు హాజరు కానున్నారు. 

సీతానగరం పుష్కర ఘాట్ ను సందర్శించిన మంత్రి ప్రత్తిపాటి..

పశ్చిమగోదావరి : సీతానగరం పుష్కర ఘాట్ ను మంత్రి ప్రత్తిపాటి సందర్శించారు. వచ్చే పుష్కరాలు నాటికి కృష్ణా - పెన్నా నదుల అనుసంధానం చేయనున్నట్లు తెలుస్తోంది. 

కాటేదాన్ లో అదుపులోకి వచ్చిన మంటలు..

రంగారెడ్డి : కాటేదాన్ ప్లాస్టిక్ కంపెనీలో మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదంలో రెండు ప్లాస్టిక్ గౌడౌన్లు పూర్తిగా కాలిపోయాయి. 

100 అడుగులు త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన బాబు..

కృష్ణా : గన్నవరం ఎయిర్ పోర్టులో 100 అడుగుల త్రివర్ణపతాకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 365 రోజులూ 30x20 జాతీయ జెండా ఎగురనుంది. 

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం..

విశాఖపట్టణం : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాగల 48గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 

15:10 - August 15, 2016

గుంటూరు : ఏపీలో నాలుగో రోజు పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. అమరావతి జనసంద్రంగా మారిపోయింది. పుష్కర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. ధ్యానబుద్ధలో లక్షలాది మంది యాత్రికులు చేరుకుని పుణ్యస్నానాలు చేస్తున్నారు. మూడు లక్షల మంది నిన్న ఒక్క రోజే పుష్కరస్నానాలు ఆచరించారు. సోమవారం రోజు లక్షలాది మంది స్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. ప్రజలు భారీగానే వస్తారని అంచనా వేసుకోవడం జరిగిందని, ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని రేంజ్ ఐజీ సంజయ్ టెన్ టివికి తెలిపారు. వాలంటీర్ల సహాయంతో రద్దీని క్రమబద్ధీకరించడం జరుగుతోందని, ఎలాంటి ప్రమాదాలు జరగలేదన్నారు. వివిధ రకాల శాఖలకు చెందిన వారు చాలా కృషి చేస్తున్నారని, ముఖ్యంగా శానిటేషన్ విభాగం చాలా కృషి చేస్తోందంన్నారు. ఎక్కడ శానిటేషన్ లోపం లేకపోవడం వల్ల చాలా మంది భక్తులు ఇక్కడకు తరలివస్తున్నారని తెలిపారు. రాబోయే కార్తీక పున్నమి సందర్భంగా పలు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, వివిధ డిపార్ట్ మెంట్ లలో ప్రతి రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. 

15:01 - August 15, 2016

హైదరాబాద్ : హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ.. కోటి చిరునవ్వుల లోగోను ఆవిష్కరించింది. తమిళనాడులోని సీఐటీ నగర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ రచయిత కలైమామణి.. ఎళ్తు సితార్‌ బాలకుమరన్‌ పాల్గొన్నారు. హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ వ్యవస్థాపకుడు.. చైర్మన్‌ అండ్‌ ఎండీ డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవార్‌ ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలను వివరించారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో.. 36 శాఖలతో.. మూడు వందల మంది నిపుణులైన హోమియోపతి వైద్యులతో వ్యాధిగ్రస్థులకు స్వాంతన అందిస్తున్నామని డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవార్‌ తెలిపారు. హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ దక్షిణాదిన కోటి మందిలో చిరునవ్వులను పూయించిందని.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని లోగో ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా.. హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఉచిత కన్సల్టేషన్‌తో పాటు చికిత్సకయ్యే వ్యయంలో 30శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు శ్రీకాంత్‌ మోర్లవార్‌ తెలిపారు. 

15:00 - August 15, 2016

పోలీసుల ఆంక్షలపై ఏపీ డిప్యూటి స్పీకర్ ఆగ్రహం..

కృష్ణా : కోడూరు మండలం సాగరసంగమం ఘాట్‌ దగ్గర పోలీసుల ఆంక్షలపై డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్దప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని చక్కదిద్దాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించినట్లు సమాచారం. 

ఎంపీ కేశినేని నాని పుష్కర స్నానం..

విజయవాడ : కృష్ణా పుష్కరాల సందర్భంగా పున్నమిఘాట్‌లో ఎంపీ కేశినేని నాని పుష్కరస్నానం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన పుష్కరస్నానమాచరించారు. 

ఏపీలో పుష్కరాలు..పోలీసుల తీరుపై భక్తుల ఆగ్రహం..

విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు పోలీసు వాహనాల్లో తీసుకెళుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

14:40 - August 15, 2016

ఢిల్లీ : భారతదేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురష్కరించుకుని గూగుల్‌ డూడుల్‌లో సరికొత్త ఫొటోను పెట్టారు. పార్లమెంట్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రసంగిస్తున్న ఫొటోను గూగుల్‌ డూడుల్‌లో పెట్టారు. గత స్వాతంత్ర్య దినోత్సవాలకు ఎర్రకోట, మూడు రంగుల జాతీయ జెండా, జాతీయ స్టాంపులు, జాతీయ పక్షి నెమలితో కూడుకున్న ఇమేజ్‌లను ఉంచిన గూగుల్‌ ఈసారి.. స్వాతంత్ర్యం వచ్చిన రోజు నె‌హ్రూ ప్రసంగిస్తున్న చిత్రాన్ని ఉంచారు. ఇది నెటిజన్‌లను విశేషంగా ఆకట్టుకుంటుంది.

14:37 - August 15, 2016
14:35 - August 15, 2016
14:33 - August 15, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. పలువురు మృత్యువాత పడుతున్నారు. తాజాగా మరో యువకుడు మృతి చెందాడు. ఖమ్మం పాడుకు చెందిన కొంతమంది పుష్కర స్నానం చేయడానికి వచ్చారు. వీరు పవిత్ర సంగమం వద్ద స్నానం చేస్తున్నారు. వీరిలో యశ్వంత్ కు ఫిట్స్ వచ్చి నీటిలో పడిపోయాడు. ఈ విషయాన్ని ఇతర కుటుంబసభ్యులు గమనించలేదు. చివరకు కుటుంబసభ్యులు వెతికి యశ్వంత్ ను బయటకు లాగారు. అపస్మారక స్థితికి చేరుకున్న యశ్వంత్ ను రక్షించేందుకు ప్రయత్నించారు. 108 సిబ్బంది కూడా ప్రయత్నించారు. చివరకు చికిత్స పొందుతూ యశ్వంత్ మృతి చెందాడు. దీనితో కుటుబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 108 వాహనం తొందరగా వచ్చి ఉంటే ప్రాణాపాయం తప్పేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యశ్వంత్ ఇంజినీరింగ్ చదువుతున్నట్లు తెలుస్తోంది. 

14:28 - August 15, 2016

హైదరాబాద్ : నగరంలో చిన్నారుల కిడ్నాప్ లు ఆగడం లేదు. కొందరు దుండగులు అక్కడకక్కడ కిడ్నాప్ లు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా నల్లకుంటలో ఐదేళ్ల బాలికను ఓ మహిళ కిడ్నాప్ చేసింది. దీనితో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్లకుంటలో ఐదేళ్ల చిన్నారి హర్షిత..మరో చిన్నారి భానుచందర్ ఆడుకుంటున్నారు. ఆ సమయంలో చాక్లెట్ ఇస్తానని చెప్పిన ఓ మహిళ ఉంటున్న హర్షితను ఎత్తుకెళ్లింది. హర్షిత కిడ్నాప్ కు గురైందని తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎర్రచీర కట్టుకుని ఉన్న మహిళ ఆటోలో వెళ్లిపోయిందని భానుచందర్ పేర్కొన్నాడు. సమీపంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తుకు ఆటంకం కలుగుతోందని తెలుస్తోంది. కేవలం బంగారం కోసమే కిడ్నాప్ చేసి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం మూడు బృందాలు రంగంలోకి దిగి చిన్నారి హర్షిత కోసం గాలింపులు చేపట్టారు. 

ఐదేళ్ల బాలిక కిడ్నాప్..

హైదరాబద్ : నల్లకుంటలో కిడ్నాప్ కలకం సృష్టించింది. ఐదేళ్ల బాలిక హర్షితను దుండగులు ఎత్తుకెళ్లారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం హరిత అవార్డులు..

హైదరాబాద్ : స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హరితహారంలో చురుగ్గా పాల్గొన్న అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం హరితమిత్ర పురస్కారాలు అందజేసింది. నిజామాబాద్ కలెక్టర్ యోగితారాణా, సిద్దిపేట పురపాలక కమిషనర్ రమణాచారి, ఆర్మూర్ మార్కెట్ యార్డు, గ్రామీణాభివృద్ధిశాఖ సంయుక్త కమిషనర్ సైదులు, హయత్‌నగర్ పశువైద్యుడు వంశీకృష్ణరెడ్డిలు హరితమిత్ర పురస్కారాలు అందుకున్నారు.

నవ్ హట్టా చౌరస్తాలో ఎదురు కాల్పులు..

శ్రీనగర్ : నవ్ హట్టా చౌరస్తాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. సీఆర్పీఎఫ్ కమాండర్ మృతి చెందగా ఆరుగురు జవాన్లకు గాయాలయ్యాయి. 

పుట్టపర్తికి బయలుదేరిన బాబు..

అనంతపురం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం జిల్లా నుండి పుట్టపర్తికి బయలుదేరి వెళ్లారు. 

13:43 - August 15, 2016
13:42 - August 15, 2016
13:40 - August 15, 2016

హైదరాబాద్ : స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అయినా సాతంత్ర్య ఫలాలు అందరికీ దక్కడం లేదని పేర్కొన్నారు. టెన్ టివి ఎండీ వేణుగోపాల్ పేర్కొన్నారు. టెన్ టివి..నవతెలంగాణ కార్యాలయం వద్ద పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్య ఫలాలు ప్రజలకు చేరాలంటే ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రపతి ఉపన్యాసంలో చెప్పిన ముఖ్యంశాలేవీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉపన్యాసంలో కనిపించలేదని నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య పేర్కొన్నారు. రాష్ట్రపతికి కనిపించిన సమస్యలు ప్రధానికి కనిపించకపోవడం విచారకరమన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:33 - August 15, 2016
13:31 - August 15, 2016
13:29 - August 15, 2016

కడప : ఈ ఏడాది 15 శాతం వృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ప్రతి జిల్లాలో రెండంచెల వృద్ధి రేటు సాధించేందుకు కృషి చేస్తుందన్నారు. జిల్లాలో స్వాతంత్ర్య సౌరభాలు గుభాళించాయి. వాడవాడలా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. పోలీస్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో పంద్రాగస్ట్ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. వేడుకల్లో విద్యార్థుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. వివిధ రంగాల్లో కృషి చేసిన అధికారులకు అవార్డులు ప్రధానం చేశారు. 

13:27 - August 15, 2016
13:25 - August 15, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలు నాల్గో రోజు విజయవాడలో ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలివస్తున్నారు. పలు ఘాట్ల వద్ద భక్తుల రద్దీతో నిండిపోతున్నాయి. రద్దీని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణవేణి ఘాట్‌లో భక్తుల సందోహం కొనసాగుతోంది. సెలవు దినం కావడంతో యాత్రికుల రద్దీ పెరిగింది. దుర్గాఘాట్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. దీనితో పోలీసులు భక్తులను పోనీయ్యడం లేదు. తాము దుర్గాఘాట్ కు వెళ్లాలని అనుకుంటున్నా పోలీసులు అనుమతించడం లేదని పలువురు భక్తులు టెన్ టివికి తెలిపారు. 

13:20 - August 15, 2016

హైదరాబాద్ : ఇటీవలే హతమైన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఆయనకు సంబంధించి వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా పలు ఇళ్లను గుర్తించిన సిట్ అధికారులు తాజాగా మరోఇంటిని గుర్తించారు. ఖమ్మం జిల్లా వైరాలో అదుపులోకి తీసుకున్న నయీ డ్రైవర్ శ్యామూల్స్ ఇచ్చిన సమాచారం మేరకు పుప్పాల్ గూడలోని తిరుమల హిల్స్ లో ఇంటిపై సోదాలు నిర్వహించారు. ఇంటి తాళాలు పగులగొట్టి తనిఖీలు నిర్వహించారు. ఇంటిలో విలువైన డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు, వజ్రాల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రెండు సంవత్సరాల కిందట ఈసీఎల్ లో పనిచేస్తున్న వ్యక్తి వద్ద నయీం ఈ ఇంటిని కొనుక్కొన్నట్లు సమాచారం. రెండంతస్తులున్న ఈ ఇంటికి మూడు నెలల నుండి తాళం వేసి ఉండేదని, ఎవరూ రావడం లేదని స్థానికులు పేర్కొంటున్నట్లు సమాచారం. నయీం ఇంట్లో ఇంకా ఏమి స్వాధీనం చేసుకున్నారో తెలియాల్సి ఉంది. 

13:16 - August 15, 2016

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కానీ ప్రమాదాలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. బెజవాడలోని భవానీపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం పుష్కరస్నానం చేసేందుకు విజయవాడకు దాదాపు 8మంది వచ్చారు. వీరందరూ భవానీ టవర్స్ లో రాత్రి బస చేశారు. సోమవారం ఉదయం పుష్కర స్నానం చేసేందుకు 8మంది ఐదో అంతస్తులో లిఫ్ట్ ఎక్కారు. ఒక్కసారిగా ఓవర్ లోడ్ కావడంతో లిఫ్ట్ కేబుల్ తెగిపోయాయి. దీనితో ఐదో ఫ్లోర్ నుండి లిఫ్ట్ కిందకు పడిపోయింది. లిఫ్ట్ లో ఉన్న వారికి గాయాలయ్యాయి. ఇద్దరికి మాత్రం తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరికి కాలు ఫ్యాక్టర్ కాగా, మరొకరికి నడుం భాగంలో తీవ్రగాయమైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

13:12 - August 15, 2016

రంగారెడ్డి : రాజేంద్రనగర్ మండలంలోని కాటేదాన్ లో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పారిశ్రామిక వాడగా పేరొందిన కాటేదాన్ లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పంద్రాగస్టు రోజున ప్లాస్టిక్ గౌడోన్ లో అగ్నిప్రమాదం జరిగింది. పక్కనే స్టీల్ గౌడోన్ లోకి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయాలని సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమౌతున్నాయి. ఒకవైపు మంటలు..మరోవైపు దట్టంగా పొగలు వ్యాపిస్తుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

మైలార్ దేవ్ పల్లిలో అగ్నిప్రమాదం..

రంగారెడ్డి : మైలార్ దేవ్ పల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆనంద్ నగర్ లోని ప్లాస్టిక్ గౌడౌన్ లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 

బెజవాడ భవానీపురంలో ప్రమాదం..

విజయవాడ : బెజవాడలోని భవానీపురంలో ప్రమాదం చోటు చేసుకుంది. భవానీ టవర్స్ లిఫ్ట్ విరిగింది. ఐదో అంతస్తు నుండి లిఫ్ట్ పడిపోవడంతో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలితంచారు. వీరు పుష్కరస్నానానికి విజయవాడకు వచ్చినట్లు సమాచారం. 

పుప్పాల్ గూడలో నయీంకు చెందిన మరో ఇంట్లో సోదాలు.

రంగారెడ్డి : హతమైన గ్యాంగ్ స్టర్ నయీంకు సంబంధించిన మరో ఇంటిని గుర్తించారు. పుప్పాల్ గూడలోని తిరుమల హిల్స్ లో ఇంటిని గుర్తించి తాళాలు పగొట్టి తనిఖీలు నిర్వహించారు. అందులో విలువైన డాక్యుమెంట్లు, బంగారు, వజ్రాల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

కుప్వాడలో ఎన్ కౌంటర్..

జమ్మూ కాశ్మీర్ : కుప్వాడలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భారత్ లోకి ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. 

హామీలు నిలబెట్టుకోవాలి - చంద్రబాబు..

హైదరాబాద్ : పార్లమెంట్ ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, విశాఖ, రైల్వే జోనష్ రెండేళ్లైనా ఇంకా రాలేదని, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా ఇంకా నిధులు రాలేదన్నారు. విభజన తరువాత రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించలేదని, చట్టబద్ధంగా ఏపీకి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని చాలాసార్లు అడిగినట్లు గుర్తు చేశారు. 

తెలంగాణ భవన్ లో పంద్రాగస్టు వేడుకలు..

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో 70వ స్వాతంత్ర్య దినోత్స వేడుకలు ఘనంగా నిర్వహించారు. హోం మంత్రి నాయినీ జాతీయ పతకాన్ని, పార్టీ జెండాను ఎగురవేశారు. 

ఉనాలో రోహిత్ తల్లి జెండావిష్కరణ..

గుజరాత్ : హెచ్ సీయూ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల తల్లి రాధిక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉనా ప్రాంతంలోని ఓ పాఠశాలలో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఢిల్లీ జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి కన్నయ్య కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అసోంలో పేలుళ్లు..

అసోం : పంద్రాగస్టు రోజున అసోంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఉల్ఫా ఇండిపెండెంట్ మిలిటెంట్లు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడ్డారు. ఎవరికి ఎలాంటి హానీ జరగలేదని తెలుస్తోంది. 

అనంతపురానికి బాబు భారీ ప్యాకేజీ..

అనంతపురం : జిల్లాకు టిడిపి అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పంద్రాగస్టు సందర్భంగా భారీ ప్యాకేజీ ప్రకటించారు. 'ఎన్టీఆర్ ఆశయం' పేరిట ప్రకటించిన సదరు ప్యాకేజీ కింద అనంతపురం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు గాను రూ.6,554 కోట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

11:32 - August 15, 2016

హైదరాబాద్ : విద్యుత్ విషయంలో ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రతో సయోధ్య సాధించగలిగామని సీఎం కేసీఆర్ చెప్పారు. త్వరలో రాష్ట్రానికి వెయ్యి మెగావాట్ల విద్యుత్ వస్తుందన్నారు. గోల్కొండ కోటలో ఘనంగా 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు సీఎం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిలో మనం పథకాలను ఇరుగుపొరుగు రాష్ట్రాలు అనుకరిస్తున్నాయన్నారు. మిషన్ భగీరథను ప్రారంభించి ఇంటింటికీ నల్లా నీరు అందించామని తెలిపారు. రామగుండంలో ఎరువుల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించామని చెప్పారు. రామగుండంలో ఎన్ టీపీసీలో మొదటి దశ పనులను ప్రధాని శంకుస్థాపన చేశారని తెలిపారు. 

 

త్వరలో రాష్ట్రానికి వెయ్యి మెగావాట్ల విద్యుత్ : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : విద్యుత్ విషయంలో ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రతో సయోధ్య సాధించగలిగామని సీఎం కేసీఆర్ చెప్పారు. త్వరలో రాష్ట్రానికి వెయ్యి మెగావాట్ల విద్యుత్ వస్తుందన్నారు. మిషన్ భగీరథను ప్రారంభించి ఇంటింటికీ నల్లా నీరు అందించామని తెలిపారు. రామగుండంలో ఎరువుల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించామని చెప్పారు. రామగుండంలో ఎన్ టీపీసీలో మొదటి దశ పనులను ప్రధాని శంకుస్థాపన చేశారని తెలిపారు. 

రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ కోటలో ఘనంగా 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. సీఎం కేసీఆర్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అభివృద్ధిలో మనం పథకాలను ఇరుగుపొరుగు రాష్ట్రాలు అనుకరిస్తున్నాయన్నారు.

11:10 - August 15, 2016

అనంతపురం : రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తయారు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోలీసులకు పతకాలు ప్రదానం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ ప్రక్షాళన చేస్తామన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. ఆస్పత్రులలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. సంచార వైద్యశాలలతో సేవలందిస్తున్నామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలపై దృష్టిపెడతామన్నారు. అనంతపురంలో సెంట్రల్ యూనిర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేశామని తెలిపారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా తయారు చేయాలని అన్నారు. దేశానికి గొప్ప సంపద యువతే అని చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా నిధులు రాలేదని తెలిపారు. విభజన తర్వాత 2 రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. అస్తులు, అప్పుల పంపకంలో న్యాయం జరగలేదన్నారు. 'చట్టబద్దంగా మనకు రావాల్సిన వాటిపై కేంద్రాన్ని చాలాసార్లు అడిగామని' గుర్తు చేశారు. త

రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా తయారు చేయాలి : సీఎం చంద్రబాబు

అనంతపురం : రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా తయారు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆస్పత్రులలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాలపై దృష్టిపెడతామన్నారు. అనంతపురంలో సెంట్రల్ యూనిర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేశామని తెలిపారు. దేశానికి గొప్ప సంపద యువతే అని చెప్పారు. 

ప్రభుత్వ ఆస్పత్రుల ప్రక్షాళన : సీఎం చంద్రబాబు

అనంతపురం : ప్రభుత్వ ఆస్పత్రులను ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా నిధులు రాలేదన్నారు. సంచార వైద్యశాలలతో సేవలందిస్తున్నామని తెలిపారు. విభజన తర్వాత 2 రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. 'చట్టబద్దంగా మనకు రావాల్సిన వాటిపై కేంద్రాన్ని చాలాసార్లు అడిగామని' గుర్తు చేశారు. రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తయారు చేస్తామని చెప్పారు. 

 

పేదలకు ఉచిత వైద్యం : సీఎం చంద్రబాబు

అనంతపురం : పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. అనంతపురంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జాతీయజెండాను సీఎం ఆవిష్కరించారు. ప్రత్యేకహోదా, విశాఖ లైల్వే జోన్ రెండేళ్లైనా ఇంకా రాలేదన్నారు.

10:41 - August 15, 2016

భారతదేశానికి అర్ధ స్వాతంత్య్రమే సిద్ధించిందని ఐఎఫ్ టీయూ నాయకురాలు ఎస్ ఎల్ పద్మ అన్నారు. ఇదే నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. 'దేశం 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది. దేశం యావత్తు ఇవాళ మువ్వన్నెల పతాకానికి శాల్యూట్ చేస్తోంది. ఈ 70 వసంతాల్లో చాలామంది మహిళలు అత్యున్నత విజయాలు సాధించారు. ఎందరికో స్పూర్తిన్నిచ్చారు. అయితే, స్వాతంత్ర్యానంతరం మహిళల జీవితాల్లో వచ్చిన మార్పులేమిటి? భారతీయ మహిళలకు సంపూర్ణ స్వేచ్ఛను ప్రసాదించిందా? మహిళల జీవితాలు మెరుగుపడాలంటే తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఇలాంటి అంశాలపై పద్మ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:37 - August 15, 2016

స్త్రీలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగగలిగిననాడే అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అన్నారు పూజ్య బాపూజీ.  ఆ మహాత్ముడి ఆకాంక్ష ఫలించాలంటే మనం ఇంకా చాలా దూరమే ప్రయాణించాలి. ఇది  స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల కోలాహలం. పరాయి పాలన నుంచి దేశం విముక్తి చెందిన దినోత్సవం. ఇది స్వాతంత్ర్య భారతావనికి 70వ వసంతోత్సవం. స్వాతంత్ర్యానంతరం మనం సాధించిన ప్రగతిని సమీక్షించుకుంటే కొన్ని అపురూప విజయాలు మనల్ని ఉత్సాహపరుస్తాయి.  మరికొన్ని రంగాల్లో మనం సాధించాల్సిన లక్ష్యాలను గుర్తు చేసుకోవడం ద్వారా నూతనోత్తేజం పొందుతాం. 1947 ఆగస్టు 15కి పూర్వపు రోజులతో పోల్చుకుంటే నిస్సందేహంగా మనం చాలా రంగాల్లో, చాలాచాలా విషయాల్లో ముందడుగు వేశాం. 
పెరిగిన స్త్రీలలో అక్షరాస్యత 
ఈ దేశ జనాభాలో సగభాగంగా వున్న స్త్రీలలో అక్షరాస్యత పెరిగింది. విద్య, ఉద్యోగాలలో మహిళలు అత్యున్నత విజయాలు సాధిస్తున్నారు. క్రీడారంగంలోనూ, అంతరిక్ష యానంలోనూ, పర్వాతరోహణలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు.  రాష్ట్రపతిగా, దేశప్రధానిగా, ప్రతిపక్షనేతగా, స్పీకర్లుగా, ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఇలా విభిన్నహోదాల్లో ఎందరో మహిళలు తమ సమర్ధతను చాటుకున్నారు.  వ్యాపార , వాణిజ్య రంగాలలోనూ, శాస్త్రసాంకేతిక రంగాలలోనూ, సాహసోపేత కార్యాల్లోనూ మన దేశ స్త్రీలు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు.  ఇవన్నీ ఆయా మహిళలు సాధించిన వ్యక్తిగత విజయాలు.
ఇంకా కష్టాల కడలిలో మహిళలు 
ఎవరెన్ని వ్యక్తిగత విజయాలు సాధించినా, ఎవరెంతగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నా సగటు మహిళల జీవితాలు ఇంకా కష్టాల కడలిలోనే ఎదురీదుతున్నాయి. ఇదొక వర్తమాన వాస్తవం. మహిళల రక్షణ కోసం, సంక్షేమం కోసం ఎన్ని చట్టాలు చేసినా ఇంకా అభద్రత, భయం తొలగిపోవడం లేదు. ఆడపిల్లలను కనాలంటే భయం. పెంచాలంటే భయం. ఒంటరిగా వీధిలోకి పంపాలంటే భయం. నిర్భయ చట్టాలు చేసినా అత్యాచారాలు ఆగడం లేదు. వరకట్న చావులకు అంతులేకుండా పోతోంది.  చట్టాలు చట్టాలే నేరాలు నేరాలే అన్నట్టు సాగిపోతోంది. నేరస్తులను తమ చుట్టాలుగా మార్చుకుంటుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితి.
స్త్రీల మీద పెరుగుతున్న నేరాలు 
70ఏళ్ల స్వాతంత్ర్యదేశంలో స్త్రీల మీద జరిగే నేరాలను తగ్గించలేకపోయాం. ఏటేటా పెరుగుతున్నాయి. శిరోముండనాలు, వివస్త్రీలను చేయడం, యాసిడ్ దాడులు, లైంగిక అత్యాచారాలు, కిడ్నాప్ లు, హత్యలు ఇలా ఎన్నో రూపాల్లో మహిళలపై దాడులు జరుగుతున్నాయి.  వీటిని అరికట్టాల్సినవారే రోతమాటలు మాట్లాడుతున్నారు. నేరాలకు, స్త్రీలు వేసుకునే డ్రస్సులకు లంకె పెడుతున్నారు. స్త్రీల మీద జరిగే నేరాలకు స్త్రీలే కారకులు. స్త్రీలే బాధ్యులు అన్నట్టుగా వుంటున్నాయి కొంతమంది నాయకుల మాటలు.
రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్క లేదు..
ప్రధాని, రాష్ట్రపతి, స్పీకర్, ముఖ్యమంత్రి, గవర్నర్ ఎలా ఎన్ని ఉన్నతపదవులు దక్కినా, రాజకీయాల్లో మహిళలకు దక్కాల్సిన సముచిత స్థానం దక్కనే లేదు. 790 మంది సభ్యులున్న మన పార్లమెంట్ లో  కనీసం పదో వంతు మంది స్త్రీలకు కూడా చోటు దక్కని దైన్యం. 1951 లో లోక్ సభకు 22 మంది  మహిళలు ఎంపిలుగా  ఎన్నికైతే 2014లో ఆ సంఖ్య 66 దగ్గరే ఆగిపోయింది. అధికార గర్భగుడిలో వారికి ప్రవేశం లభించడం లేదు.  మహిళలకు కేబినెట్ లో స్థానం కల్పించాలన్నా  కొంతమంది ముఖ్యమంత్రులకు మనసొస్పడం లేదు. స్థానిక సంస్థల్లో స్త్రీలకు రిజర్వేషన్లు కల్పించినా అసలైన అధికారం ఎవరు అనుభవిస్తున్నారో చూస్తూనే వున్నాం. స్వాతంత్ర్యం పొందిన 70 ఏళ్ల తర్వాత కూడా ఈ పరిస్థితి కొనసాగడం నిజంగా బాధాకరమే. 

 

10:32 - August 15, 2016

ఢిల్లీ : భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌కు షాక్‌.. గ్రూప్‌-జిలో భాగంగా రెండో ప్రిలిమినరీ మ్యాచ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ప్రపంచ 61వ ర్యాంక్‌ మరియా ఉలిటిన చేతిలో సైనా 18-21, 19-21తో వరుస గేముల్లో అనూహ్య ఓటమి చవిచూసి భారత పతక ఆశలను ఆవిరి చేసింది. హోరా హోరీగా జరిగిన పోరులో సైనా కోర్టులో మునుపటిలా చురుగ్గా కదలలేకపోయింది. ప్రత్యర్థి స్మాష్‌లతో దూకుడు ప్రదర్శిస్తుంటే సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. 18-21తో తొలి సెట్‌ కోల్పోయిన సైనా.. రెండో సెట్లో కాస్త పుంజుకొన్నా నిలకడగా పాయింట్లు రాబట్టలేకపోయింది. 16-17తో ముందంజలో ఉన్నా ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఉలిటినా వెంటనే 17-17తో స్కోర్‌ సమం చేసింది. 20-19తో గేమ్‌పాయింట్‌ సాధించింది. మరో పాయింట్‌ సాధించి సైనాను ఓడించింది.

 

10:30 - August 15, 2016

ఢిల్లీ : జిమ్నాస్టిక్స్‌ మహిళల వాల్ట్‌ ఫైనల్స్‌లో భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీప కర్మాకర్‌ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని కోల్పోయింది. మొదటి ప్రయత్నంలో 14 పాయింట్‌ 866 పాయింట్లు సాధించిన దీప.. రెండో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రదర్శన చేసి 15 పాయింట్‌ 266 పాయింట్లు స్కోర్‌ చేసింది. సరాసరి 15 పాయింట్‌ 066 స్కోర్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో అమెరికాకు చెందిన సిమోన్‌ బైల్స్‌ 15 పాయింట్‌ 966 స్కోర్‌తో స్వర్ణం సాధించగా, రష్యాకు చెందిన మారియా పాసెకా 15 పాయింట్‌ 253తో రజతం, స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన స్టెయిన్‌గ్రుబెర్‌ 15 పాయింట్‌ 216తో కాంస్యం సొంతం చేసుకుంది. అయితే కాంస్యం గెలిచిన జమ్నాస్ట్‌ సాధించిన పాయింట్లు, దీప సాధించిన పాయింట్లకు మధ్య తేడా కేవలం 0 పాయింట్‌15 మాత్రమే.
తలెత్తుకుని సగర్వంగా నిలిచే ప్రదర్శన ఆమెది 
దీపా కర్మాకర్‌ రియో ఒలింపిక్స్‌ నుంచి పతకం లేకుండానే నిష్క్రమించింది. కానీ తలెత్తుకుని సగర్వంగా నిలిచే ప్రదర్శన ఆమెది. కొన్ని నెలల కిందట ఓ భారత జిమ్నాస్ట్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిందంటే.. ఏదో నామమాత్రంగా వెళ్లడం, రావడమే అనుకున్నారు చాలామంది! కానీ తనను తక్కువగా అంచనా వేసిన వాళ్లందరినీ విస్మయానికి గురి చేస్తూ నాలుగు రోజుల కిందట వాల్ట్‌ విభాగంలో ఏకంగా ఫైనల్‌ చేరి ఆశ్చర్యపరిచిన దీప.. తుది పోరులోనూ అంచనాల్ని మించి అద్భుత ప్రదర్శనే చేసింది. ప్రపంచ స్థాయి జిమ్నాస్ట్‌లతో పోటీ పడి నాలుగో స్థానంలో నిలిచిన దీప.. త్రుటిలో పతకం చేజార్చుకుంది. జిమ్నాస్టిక్స్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్రీడాకారిణి అనదగ్గ సిమోన్‌ బైల్స్‌ సహా చాలామంది సాహసించని అత్యంత ప్రమాదకర విన్యాసమైన ప్రొడునోవాను ఫైనల్లో అలవోకగా చేసిన దీప.. 15 పాయింట్‌ 066 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. జిమ్నాస్టిక్స్‌లో చైనా ఆధిపత్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ దేశానికి చెందిన యాన్‌ వాంగ్‌.. దీప తర్వాతి స్థానంలోనే నిలిచింది. ఒలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణాలు సాధించిన ఉజ్బెకిస్థాన్‌ దిగ్గజ జిమ్నాస్ట్‌ చుసోవితినా సైతం దీప కంటే కింద ఏడో స్థానంలో నిలిచింది. 
ఆమె  సాహసం చరిత్రలో నిలిచిపోతుంది
రియో ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్‌ పతకం గెలవలేదు.. కానీ ఆమె విన్యాసాల్ని ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆమె చేసిన సాహసం చరిత్రలో నిలిచిపోతుంది. ఆమె ప్రదర్శన ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది! దీపా కర్మాకర్‌.. భారత క్రీడా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే పేరిది! ఓ భారత జిమ్నాస్ట్‌ ఒలింపిక్స్‌లో పోటీ పడటమే గొప్ప అనుకుంటే.. దీప తన అద్భుత విన్యాసాలతో ఏకంగా ఫైనల్‌ చేరింది. అక్కడా అంచనాల్ని మించి ఆకట్టుకుంది. పతకానికి గట్టి పోటీదారుగా నిలిచింది. చివరికి త్రుటిలో ఆమెకు పతకం చేజారింది. 

 

జాతీయజెండా ఎగరవేసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : 70 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గోల్కొండలో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. 

 

09:24 - August 15, 2016

కరీంనగర్ : గాంధీజీ కలలకు ప్రతిరూపం ఆ గ్రామం... ఖాదీ వస్త్రాల తయారీలో ప్రత్యేకత అక్కడ సొంతం.  అక్కడ తయారయ్యే నూలు వస్త్రాన్ని జాతీయ జెండాల తయారీలో ఉపయోగించటం ఆ గ్రామానికి దక్కిన గౌరవం. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఢిల్లీలోని ఎర్రకోటపైన ఎగిరిన తొలి జాతీయ జెండాను అందించిన వావిలాల గ్రామంపై 10 టీవీ ప్రత్యేక కథనం..!
వావిలాల జాతీయ జెండాలకు ప్రత్యేక గుర్తింపు 
ఈ గ్రామం పేరు వావిలాల...ఇదీ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని ఓ కుగ్రామం. ఈ గ్రామానికి  దేశ స్వాతంత్ర్య సమరంతోనూ, స్వాతంత్ర్య దినోత్సవంతోనూ అవినాభావ సంబంధం ఉంది. 1929లో మహాత్మాగాంధీ ఆదేశాల మేరకు ఆయన అనుచరులు గ్రామీణ ప్రాంతాల్లో చరఖాతో నూలు దారంతో ఖద్దర్ వస్త్రాలను తయారు చేసేవారు. వావిలాల గ్రామం కూడా వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ ద్వారా ఖాదీ వస్త్రాలను తయారు చేస్తూ వాటిని దేశవ్యాప్తంగా సరఫరా చేసింది. దీంతో ఈ గ్రామం దేశవ్యాప్తంగా పేరుగాంచింది. ఈ సంస్ధలో తయారయ్యే నూలును జాతీయ జెండాల తయారీలో ఉపయోగించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ జాతీయ జెండాలు దేశవ్యాప్తంగా సరఫరా అవుతుంటాయి. 
వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ సంస్థదే
బ్రిటిషు పాలకుల నుంచి మన దేశం స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ఢిల్లీలోని ఎర్రకోట పైన ఎగరేసిన తొలి జాతీయజెండా వావిలాల గ్రామంలోని ఖాదీ ప్రతిష్టాన్ సంస్ధ తయారు చేసిందే. మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా విదేశీ వస్తాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు. ఈ
సమయంలో ఆ పిలుపునందుకున్న వావివాల ఖాదీ ప్రతిష్టాన్ స్వదేశీ వస్తాలను తయారుచేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. 
వావిలాల ఖాదీ ప్రతిష్టాన్‌కు రాష్ట్రపతి అవార్డు 
జాతీయ జెండాలకు తుదిరూపమిచ్చిన వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ కు 2005-2009 సంవత్సరంలో రాష్ట్రపతి అవార్డు వరించింది. 2010లో ISO 9001 సంస్ధ నాణ్యత గల వస్త్రాలు తయారు చేస్తున్నారని సర్టిఫై చేస్తూ అవార్డును అందించింది. వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ లో నూలుతో తయారయ్యే చొక్కాలు, ప్యాంట్లు, జరీ దొవతులు, చీరలు, టవల్స్, టస్పర్ లు తదితర దుస్తులు ఎంతో పాచుర్యం పొందాయి. 1983లో వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ స్వతంత్ర ప్రతిపత్తి సంతరించుకొని 20 లక్షల టర్నోవర్ సాధించింది. ప్రస్తుతం రెండు కోట్ల టర్నోవర్ తో కొనసాగటం విశేషం.

 

ఎపి శాసనమండలిలో జాతీయజెండా ఎగురవేసిన చైర్మన్ చక్రపాణి

హైదరాబాద్ : 70 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎపి శాసనమండలిలో చైర్మన్ చక్రపాణి జాతీయజెండాను ఎగురవేశారు. 

ఎపి అసెంబ్లీలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన స్పీకర్ కోడెల

హైదరాబాద్ : భారత 70 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎపి అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాద్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు.  

 

జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

అనంతపురం :  70 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అనంతపురంలో జాతీయపతాకాన్ని ఎపి సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. సీఎం పోలీసుల గౌరవందనాన్ని స్వీకరించారు. 

 

08:50 - August 15, 2016

శ్రీకాకుళం : దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన దేశభక్తుల త్యాగఫలితమే నేటి స్వేచ్భా స్వాతంత్యాలతో కూడిన భారతదేశం. అప్పటి బ్రిటీష్ పాలకులను ఎదురించి...దేశప్రజల్లో స్ఫూర్తినింపిన నాయకులంతా అమరులైనా...వారి స్ఫూర్తి మాత్రం చిరస్థాయిగానే నిలిచిపోతుంది...నాటి పాలకుల వైఖరికి నిరసనగా అలుపెరుగని పోరాటం చేసిన వారిలో శ్రీకాకుళానికి చెందిన సీతారామయ్య ఒకరు. ఎవరీయన..ఏవిధంగా పాలకులను ఎదురించారు...వాచ్‌దిస్‌స్టోరీ....
రైతాంగ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన శ్రీకాకుళం
దేశస్వాతంత్ర్యం కోసం ఎన్నో ప్రాంతాల్లో పోరాటాలు జరిగాయి...ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామమైన సిపాయిల తిరుగుబాటు మీరట్‌లో ప్రారంభమై...స్వాతంత్ర్య పతాకాన్ని ఢిల్లీలో ఎగిరేసేదాకా కొనసాగింది..ఈ మహా సంగ్రామంలో ఎన్నో ప్రాంతాలు పోరాటాలకు కేంద్రాలుగా నిలిచాయి..అలాంటి వాటిలో శ్రీకాకుళం ఒకటి...ఉద్యమాలకు, పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా ....రైతాంగ పోరాటాలకు పుట్టినిల్లుగా బాసిల్లిందా గ్రామం..అదే మదనాపురం..అక్కడ జన్మించిన వారే సీతారామయ్య...పుట్టుకతోనే స్వాతంత్ర్యభావాలను వారసత్వంగా పొందారు.
మదనాపురంలో జన్మించిన మార్పు సీతారామయ్య
ఈయన పేరు మార్పు సీతారామయ్య. జిల్లాలో మిగిలిన ఏకైక స్వాతంత్ర్య సమరయోధుడు. తండ్రి మార్పు పద్మనాభం స్ఫూర్తితోనే ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. కాశీబుగ్గలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఆచార్య ఎన్జీ రంగాతో కలసి పోరాడారు. ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, మందస ప్రాంతాల్లో రైతు కార్యాచరణ కమిటీ ఏర్పాటుకు కృషి చేశారు. 
చాలీచాలని పింఛనుతో అవస్తలు పడుతున్న సీతారామయ్య
ఉద్యమాల కోసం తండ్రి పద్మనాభం, కుమారుడు సీతారామయ్యలు ఉన్న భూములు కూడా అమ్ముకుని పోరాటాలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది గతంలో స్వాతంత్ర్య సమరయోధులు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈయన ఒక్కరు మాత్రమే సజీవంగా ఉండి నేటి తరాలకు స్ఫూర్తిగా నిలచారు. కమ్యూనిస్టు భావాలను పుణికిపుచ్చుకున్న ఈయన పెత్తందారీ వ్యవస్థపై అలుపెరగని పోరాటం చేశారు. ఈయన పోరాటాలను గుర్తించి.. రాష్ట్ర సాంస్కృతిక సమాఖ్య పురస్కారాన్ని అందించింది. అయితే ఆ తరువాత మరిచింది...ప్రస్తుతం తనకొస్తున్న ఫించన్‌ సరిపోవడం లేదంటూ.. సీతారామయ్య విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారుల త్యాగఫలితం వల్లనే మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందన్న వాస్తవాన్ని ప్రభుత్వాలు మర్చిపోకూడదు. ఇప్పటికైనా స్పందించి ఇలాంటి పోరాటయోధుల్ని అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.

 

08:42 - August 15, 2016

విశాఖ : బ్రిటీష్‌ పాలకుల క్రూర పాలన నుంచి విముక్తి కలిగిన దినం... ఎన్నో పోరాటాల శ్రమ ఫలితం.. ఎంతోమంది అమర వీరుల త్యాగఫలమే..స్వాతంత్ర్య దినోత్సవం...దేశ ప్రజల స్వేచ్ఛకోసం పోరాటం చేసిన నాటి నాయకుల కృషిని ఎంత కీర్తించినా సరిపోదు.. కనీసం నాటి స్మృతులనైనా తలచుకుంటే...కొంతైనా స్ఫూర్తి పొందొచ్చు.. అలాంటిదే జాతిపిత గాంధీజీ ఆయా ప్రాంతాల పర్యటన... మహాత్మాగాంధీకి విశాఖ జిల్లా భీమిలికి ప్రత్యేక అనుబంధం ఉంది. భీమిలిని సందర్శించిన మహాత్ముడు... ఇక్కడి ప్రజల్లో స్వాతంత్ర్యాకాంక్ష  జ్వాలను రగిలించిన సంఘటనపై 10టీవీ ప్రత్యేక కథనం..!
ప్రజల్లో స్ఫూర్తిని నింపిన గాంధీ
దేశప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపేందుకు మహాత్మగాంధీ..దేశనలుమూలలా పర్యటించారు. తన పోరాట పటిమతో దేశప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు. అలా ఎన్నో ప్రాంతాల్లో పర్యటిస్తూ..ప్రజల్లో స్వాతంత్ర్యాకాంక్ష  జ్వాలను రగిలించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి అహింసా మార్గం ద్వారా పోరాటం చేసిన మహాత్మాగాంధీకి భీమిలి ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన భీమిలిలో రెండుసార్లు పర్యటించారు..
దళితులకు ఆలయ ప్రవేశం కల్పించిన బాపూజీ
మహాత్మగాంధీ భీమిలిలో మొదటిసారి 1930 లో ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న రోజుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా భీమిలి తీరం దగ్గర జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తరువాత 1942 లో క్విట్ ఇండియా పోరాటంలో మరోసారి ఇక్కడకు వచ్చారు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా గంటస్తంభం వద్దకు విదేశీ వస్త్రాలను తీసుకు వచ్చి  ఆయన సమక్షంలో తగులబెట్టారు. తరువాత  రొట్టెల వీధిలోని శ్రీరామ మందిరానికి ఈ మార్గంలోనే కాలినడక వచ్చారు. అంతవరకు అంటరానివారుగా దూరంగా ఉంచిన దళితులు, మత్స్యకారులకు ఈ మందిరంలో ప్రవేశం కల్పించి పూజలు చేశారు.
ప్రజలందరికీ ఆలయ ప్రవేశం కల్పించిన బాపూజీ... 
ప్రజలందరికీ ఆలయ ప్రవేశం కల్పించిన బాపూజీ... వారితోపాటు కలసి ఇక్కడే సహపంక్తి భోజనం చేశారు. దాంతో ఈ రామ మందిరానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. అప్పటి నుంచి ఈ మందిరంలో మహాత్ముని చిత్రపటం ఉంటుంది. అలాగే ఈ మందిరానికి పక్కనే ఆయన దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ప్రదేశం ఇప్పటికీ అలాగే ఉంది. మహాత్ముడు ఇక్కడకు రావడం పట్ల స్థానికులు ఎంతో గర్వపడుతున్నారు. మహాత్ముడు ఇచ్చిన పిలుపుమేరకు ప్రతీ గురువారం  ఇక్కడి తీర ప్రాంతంలో చేపల వేట నిషేధించారు. అలాగే ప్రతీ గురువారం మాంసాహారాన్ని ముట్టుకోకూడదని ఒట్టు పెట్టుకున్నారు. భీమిలిలోని ఈ గుడిలో జరిగే వేడుకల్లో  తప్పనిసరిగా గాంధీజీకి కూడా పూజలు చెయ్యడం ఇప్పటికీ ఆనవాయితీగా వస్తోంది. పూజ జరిగిన తరువాత జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని, ఆయనపట్ల ఉన్న గౌరవాన్ని చాటుకుంటున్నారు. ఎన్ని తరాలు మారినా ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగుతుండడం విశేషం..

 

08:37 - August 15, 2016

అనంతపురం : స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా అనంతపురంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. వేడుకలు నిర్వహిస్తున్న నీలం సంజీవరెడ్డి స్టేడియాన్ని అధికార యంత్రాంగం అందంగా ముస్తాబు చేసింది. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించనున్నారు. వేడుకల నేపథ్యంలో నగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలకు అనుకూలంగా ట్రాఫిక్‌ మళ్లిస్తున్నారు. వేడుకలను తిలకించేందుకు పాసులున్న వారినే మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారు. 
సుందరంగా నీలం సంజీవరెడ్డి స్టేడియం
ఏపీ రాష్ర్ట స్థాయి స్వాతంత్ర్య దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్‌ కాంతుల వెలుగులో స్టేడియం మెరిసిపోతోంది. ప్రధాన వేదికను రకరకాల పూలతో అద్భుతంగా అలంకరించారు. ఐపీ, వీఐపీ గ్యాలరీలను అందంగా తీర్చిదిద్దారు. సుమారు ఐదువేల మంది వేడుకలను వీక్షించేందుకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటుచేశారు. అనంత జిల్లాలో రాష్ర్ట స్వాతంత్ర్య వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఐలాండ్స్‌, డివైడర్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుల్లతలతో నగరం నూతన శోభను సంతరించుకుంది. 
సంజీవరెడ్డి స్టేడియం పరిసరాల్లో ఆంక్షలు విధింపు
ఎక్కడా ఎలాంటి పొరబాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి అధికారులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో నిబంధనలు కఠినతరం చేశారు. ప్రధానంగా వేడుకలు నిర్వహించే నీలం సంజీవరెడ్డి స్టేడియం పరిసరాల్లో ఆంక్షలు విధించారు.
జాతీయజెండాను ఆవిష్కరించనున్న చంద్రబాబు
ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించి.. గౌరవ వందనం చేయనున్నారు. వివిధ శాఖల శకటాల ప్రదర్శన ఉంటుంది. తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అయిదు పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పాసులున్న వారు ఉదయం 7 గంటల 30 నిమిషాల లోపు స్టేడియంకు చేరుకోవాలి. ఆ తర్వాత లోపలికి అనుమతించరు. ఒకసారి లోపలికి వెళ్లిన వారిని మధ్యాహ్నం 12 గంటలకు వేడుకలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లాకే బయటికు పంపిస్తారు. స్టేడియం చుట్టూ ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. వీరందరికి బి-3 పాసులు ఇచ్చారు. కేటాయించిన స్థానంలో వాహనాలను పార్కింగ్‌ చేయాలి. వాహనాల రాకపోకలకు ట్రాఫిక్‌ను మళ్లించారు. వేడుకల సందర్భంగా నగరంలో పలు రహదారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. తెలుగు తల్లి విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్, టవర్‌ క్లాక్‌ మీదుగా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నారు.
స్వాతంత్య్ర వేడుకలు జిల్లాలో జరగడం అదృష్టం : మంత్రులు 
రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత తెలిపారు. వేడుకలు జరుగనున్న పీటీసీ మైదానాన్ని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, డీజీపీ సాంబశివరావు, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. వేడుకల సందర్భంగా.. నగరంలోని పలు రహదారులపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. మొత్తంగా 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసింది. 

దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు సంకల్పిద్దాం : మోడీ

ఢిల్లీ : ఎంతోమంది మహా పురుషులు దేశ స్వాతంత్ర్య కోసం పోరాడి, ప్రాణం త్యాగం చేసి... మనకు స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చారని ప్రధాని మోడీ తెలిపారు. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు సంకల్పిద్దామని చెప్పారు. సోలార్ టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవాలన్నారు. ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

 

ఈ స్వాతంత్ర్యం ప్రజలకు జవాబుదారీనతంగా ఉండాలి : మోడీ

ఢిల్లీ : ఎంతో మంది త్యాగఫలమే స్వాతంత్ర్యమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ స్వాతంత్ర్యం ప్రజలకు జవాబుదారీనతంగా ఉండాలన్నారు. అప్పుడే స్వరాజ్యం సురాజ్యంగా మారుతుందన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రతి ఒక్కరు దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు.

 

08:11 - August 15, 2016

ఢిల్లీ : 'మనం జరుపుకుంటున్న స్వాతంత్య్రదినోత్సవ వేడుకల వెనుక ఎందరో అమరవీరుల త్యాగం ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. దేశవ్యాప్తంగా 70 వ స్వాతంత్ర్య దినోత్సవేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయపతాకాన్ని మోడీ ఆవిష్కరించారు. త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. భారతదేశం.. సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని తెలిపారు. 'దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని మనందరం సంకల్పిద్దామని' పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వేడుకలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవేడుకలను విదేశీ ప్రముఖులు తిలకిస్తున్నారు. 

 

ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న భారత్ : మోడీ

ఢిల్లీ : భారతదేశం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 'మనం జరుపుకుంటున్న వేడుకల వెనక ఎందరో అమరవీరుల త్యాగం ఉందని' అన్నారు. భారతదేశం.. సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని తెలిపారు. 'దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని మనందరం సంకల్పిద్దామని' పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.  

 

07:38 - August 15, 2016

ఢిల్లీ : దేశ సంస్కృతి సంప్రదాయాలన్నీ ఒకే చోట ప్రతిబింబించేలా రాజ్‌పథ్‌లో ప్రారంభమైన భారత్‌పర్వ్‌ ప్రదర్శన వీక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలో వారం రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో... తెలంగాణ నుంచి కూచిపూడి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతిని తెలపడంతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటడం ఈ వేడుక ప్రత్యేకత..!
దేశసంస్కృతిని చాటేలా భారత్‌పర్వ్ కార్యక్రమం
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశం... దేశంలోని వివిధ రాష్ట్రాల సంప్రదాయాలను చాటిచెప్పడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న భారత్‌ పర్వ్‌ ప్రదర్శన సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హస్తకళలు, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఒక్క ప్రదర్శనతో దేశం మొత్తాన్ని ఒక్క చోటికి తీసుకొచ్చినట్టుందని సందర్శకులు చెప్పడం విశేషం.
భారత్‌పర్వ్‌లో కూచిపూడి ప్రదర్శన
భారత్‌పర్వ్‌ ప్రదర్శనలో తెలుగురాష్ట్రాలు సైతం స్టాళ్లను ఏర్పాటు చేశాయి. తెలుగు వంటకాలను ఇష్టపడే ఉత్తరాది భోజన ప్రియులకు హైదరాబాద్ బిర్యానీ సైతం అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు ప్రముఖ నాట్యకారిణి యామినీ రెడ్డి బృంద ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంటోంది. తమ బృందప్రదర్శనపై యామినీ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈనెల 18 వరకూ కొనసాగే భారత్‌పర్వ్‌లో వివిధ రాష్ట్రాల హస్తకళలు, ఆయా ప్రాంతాల వంటకాలకు సంబంధించి మొత్తం 50 స్టాళ్లను ఏర్పాటు చేశారు. 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆజాదీ సత్తర్‌సాల్-యాద్‌కరో కుర్బానీ పేరిట ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 70 వ స్వాతంత్ర్య దినోత్సవేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రదాని నరేంద్రమోడీ త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు. మోడీ మూడోసారి జాతీయజెండాను ఎగరవేశారు. వేడుకలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవేడుకలను విదేశీ ప్రముఖలు తిలకిస్తున్నారు. 

 

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయజెండా ఎగురవేయనున్న రఘువీరా

కర్నూలు : కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 70 వ స్వాతంత్ర్య దినోత్స వేడుకలు జరుగనున్నాయి. ఎపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి పాల్గొననున్నారు. 

నేడు ఏ మొబైల్ లేదా ల్యాండ్ లైన్ నెంబర్ కైనా బీఎస్ ఎన్ ఎల్ అపరిమిత కాల్స్

ఢిల్లీ : నేడు దేశంలోని ఏ మొబైల్ లేదా ల్యాండ్ లైన్ నెంబర్ కైనా అపరిమిత కాల్స్ చేసుకునే సౌలభ్యాన్ని బీఎస్ ఎన్ ఎల్ కల్పించింది. 

'ఎట్ హోం' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : రాజ్ భవన్ లో సాయంత్రం నిర్వహించే 'ఎట్ హోం' కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. 

గోల్కొండలో జాతీయ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

 హైదరాబాద్ : గోల్కొండలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఉదయం 9.45 గంటలకు సీఎం సీఎం జాతీయ జెండా ఎగరవేయనున్నారు. 

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా....ముగ్గురు మృతి

చిత్తూరు : శ్రీకాళహస్తి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు.  బస్సులో 46 మంది ప్రయాణికులున్నారు. బస్సు ఒంగోలు నుంచి బెంగళూరు వెళ్తోంది. 
 

ఎర్రకోటపై కాసేపట్లో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ

ఢిల్లీ : 70 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై కాసేపట్లో త్రివర్ణపతాకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించనున్నారు. ఎర్రకోట వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వేయ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 

Don't Miss