Activities calendar

16 August 2016

22:08 - August 16, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌పై డీజీపీ ఉన్నతస్థాయి సమావేశం కొనసాగుతోంది. నయీం అక్రమాస్తులపై ఏడు గంటలకుపైగా సమీక్ష కొనసాగుతోంది. డైరీలో ఉన్న కోడ్ ల్యాంగ్వేజ్ పై ప్రధాన చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి కేసు దర్యాప్తు స్థాయి నివేదిక సమర్పించే యోచనలో డీజీపీ ఉన్నాడు. నయీంకు సహకరించిన పోలీసులపై చర్యలకు ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ భేటీకి సిట్ చీఫ్ నాగిరెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, సైబరాబాద్ ఈస్ట్‌, వెస్ట్ కమిషనర్లు హాజరయ్యారు. 

22:00 - August 16, 2016

చిత్తూరు : జిల్లాలోని పుంగనూరు బోయకొండ గంగమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు.. హుండీలో చోరీచేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.. వీరిని ఆలయ అధికారులు పోలీసులకు అప్పగించారు.. 

21:58 - August 16, 2016

ఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీతో  కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సమస్యలు, ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలపై జైట్లీతో చర్చించారు. అంతకుముందు హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఇరువురు భేటీ అయ్యారు.  రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

 

21:56 - August 16, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాలపై ఈ నెల 20న అఖిలపక్షా సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు ప్రభుత్వం అన్ని పార్టీలతో సమావేశం కానుంది. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. ఆయా పార్టీల నుంచి ఇద్దరు ప్రతినిధులకు సమావేశానికి ఆహ్వానం అందనుంది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, కేబినెట్ సబ్‌కమిటీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. నూతనంగా ఏర్పడబోయే కొత్త జిల్లాలకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మీద చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఆల్ పార్టీ మీటింగ్‌కు ఆమోదం తెలిపారు. 

 

21:53 - August 16, 2016

తెలుగు రాష్ట్రాలల జోరుదారైతున్న పుష్కరాలు..  పోయినై మునిగినోళ్ల ఐదు ప్రాణాలు, జాతీయజెండాల ఎత్తునువెంచిరు... ప్రజలకిచ్చిన హామీలు మర్చిరు, ఖమ్మం పట్నంల సురవైతున్న కొత్తిండ్లు... పేదోళ్లంతా ఇడిసిపెట్టుండ్రీ మీ పాతిండ్లు, మోడీ సారు ఆఫీసర్లకు కాషాయ కామెర్లు.. లేనేలేరంటా మనదేశంల అసలు పేదోళ్లు, వేములవాడ గుడిలో మెరిసిన మోహన్ బాబు... ముఖ్యమంత్రి పనికి మురిసిపోయి కితాబు, నీటి వరదల మునిగిపోతున్న ఎర్రరంగు కారు.. లోపలున్నోళ్లు బతికిండ్రా,... సచ్చిండ్రా.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

21:41 - August 16, 2016

ప్రమాణాలు పాటించిన యాజమాన్యాలు, ఫీజుల దందా సాగిస్తున్న టాప్ కాలేజీలు, విచ్చల విడిగా సీట్లు అమ్మకాలు, ఇంజనీరింగ్ పూర్తి చేసినా దొరకని ఉద్యోగాలు, మిథ్యగా మారిని ఇంజనీరింగ్ విద్య... ఇదే అంశంపై ఈరోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

లోథా కమిటీ సిఫారసులపై సుప్రీంకోర్టులో బీసీసీఐ రివ్యూ పిటిషన్

ఢిల్లీ : లోథా కమిటీ సిఫారసులపై బీసీసీఐ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఆశ్రయింది.  

 

21:31 - August 16, 2016
21:30 - August 16, 2016
21:29 - August 16, 2016

చిత్తూరు : తిరుమలేశుని అన్నప్రసాదం భక్తుల్లో అజీర్తికి కారణమవుతోందా..? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. నాణ్యత లేని బియ్యాన్ని ప్రసాద వితరణ కోసం వాడుతుండడమే శ్రీవారి భక్తుల్లో అజీర్తికి కారణమన్న వాదన వినిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద నిత్యాన్నదాన వితరణ కేంద్రంలో వాడే పదార్థాలపై శాస్త్రీయ అధ్యయనం కొరవడడంతో.. టీటీడీ సత్సంకల్పం విమర్శలపాలవుతోంది. 
బియ్యంలో నాణ్యత లోపమా...? 
అన్నదానం కిరికిరి..! అన్నదానం కేంద్రంలో తింటే అజీర్తి సమస్య..! బియ్యంలో నాణ్యత లోపమా...? వండుతున్న తీరులో లోపమా..? అన్నదానానికి వినియోగించే పదార్థాలపై శాస్త్రీయ అధ్యయనం ఏదీ..?
అజీర్తి సమస్యతో బాధపడుతున్న భక్తులు  
తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ప్రతిరోజు 70 వేల నుంచి లక్షమంది భక్తులకు ఇక్కడ ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తారు. అన్న ప్రసాదం పేరుతో టీటీడీ పెడుతున్న భోజనాన్ని భక్తులు స్వామివారి ప్రసాదంగా భుజిస్తారు. అయితే కొంతకాలంగా ఇక్కడ భోజనం చేస్తున్న భక్తులు అజీర్తి సమస్యతో బాధపడుతున్నారు. 
అసలు టీటీడీ కొనుగోలు చేస్తున్న బియ్యంలో లోపమా..? 
తిరుమలకు వచ్చే భక్తులు ఆకలితో బాధ పడకూడదన్నది భావనతో.. టీటీడీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఏటా 70 కోట్ల రూపాయల దాకా ఈ వితరణకు ఖర్చు చేస్తోంది. భక్తుల అన్నదానానికి ఎక్కడా అవాంతరం రారాదన్న సదుద్దేశంతో భక్తులు విరాళాల రూపంలో ఇచ్చిన సొమ్ము సుమారు ఏడు వందల కోట్ల రూపాయల దాకా ఉంది. ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేయడం ద్వారా వచ్చే వడ్డీతో అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని నిర్వహిస్తోంది టీటీడీ. అంత ఖర్చు చేసినా.. భక్తులకు రుచికరమైన భోజనం దొరకడం లేదన్నది కొందరి ఆరోపణ. ఎందుకిలా..? అసలు టీటీడీ కొనుగోలు చేస్తున్న బియ్యంలో లోపమా..? లేక దాన్ని వండుతున్న తీరులో లోపమా..? 
ఒకసారైనా భోజనం తినాలని కోరుకుంటున్న భక్తుడు
తిరుమల శ్రీవారి నిత్యాన్నదాన కేంద్రం తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడూ ఒకసారైనా ఇందులో భోజనం తినాలని కోరుకుంటాడు. కానీ ఇటీవల కాలంలో ఒక్కసారి ఇక్కడ తిన్న భక్తులు మళ్లీ అటువైపు వెళ్లడానికి సాహసించడం లేదు. ఇక్కడ వండే భోజనం సరైన నాణ్యత లేకపోవడమే దానికి కారణం. అన్నాన్ని శ్రీవారి ప్రసాదంగా భావించే భక్తులు.. అన్నదానంలో లోపాలున్నా నోరెత్తడం లేదు. తరచూ అజీర్తి సమస్యలు తలెత్తుతున్నా.. శ్రీవారి ప్రసాదాన్ని తూలనాడితే పాపం చుట్టుకుంటుందన్న భావనతో భక్తులు మిన్నకుండిపోతున్నారన్న భావన వ్యక్తమవుతోంది. 
అన్నదానంలో తింటే అరగదన్న అభిప్రాయం 
టీటీడీ ఉద్యోగులు, అధికారుల్లో సైతం అన్నదానంలో తింటే అరగదన్న అభిప్రాయం ఉంది. ఉద్యోగులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవడమో లేదంటే స్థానికంగా ఉండే ప్రైవేటు హోటళ్ల నుంచి క్యారియర్‌ తెప్పించుకోవడమే చేస్తారు. ఉద్యోగులే అన్నప్రసాద కేంద్రంలో తినడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నూకల బియ్యం, నాణ్యత లోపించిన బియ్యంతో భోజనం తయారు చేయడం వల్లనే అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయని కొందరు భక్తులు వాపోతున్నారు. 
నాణ్యమైన భోజనాన్ని ఎందుకు అందించడం లేదన్న విమర్శలు 
కిలోకు 39.50 రూపాయలు వెచ్చించి సోనా మసూరి సన్నబియ్యం కొనుగోలు చేస్తున్న టీటీడీ..నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని ఎందుకు అందించడం లేదన్న విమర్శలున్నాయి. అయితే  బియ్యం విషయంలో ఎలాంటి నాణ్యత లోపాలు లేవని, నాణ్యమైన బియ్యాన్నే కొనుగోలు చేస్తున్నామని ఇటు ల్యాబ్‌ టెక్నీషియన్లు, తాము బాగానే వండుతున్నామని వంట సిబ్బంది చెబుతున్నారు. నాణ్యత పరీక్షలకు అధునాతన ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేశామని, బియ్యంలో నాణ్యత కొరవడితే అధికారులు తిప్పిపంపుతారని చెబుతున్నారు. ఆరోగ్యశాఖ అధికారి, సీనియర్‌ ల్యాబ్‌ విశ్లేషకుల  పర్యవేక్షణలోనే బియ్యం నాణ్యత పరిశీలిస్తారని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. 
ఉడికించడంలోనే లోపాలు : టీటీడీ ఆరోగ్యశాఖ అధికారులు 
తిరుమల క్యాంటీన్లలో భారీ బాయిలర్స్‌లో, నీటి ఆవిరితో భోజనాలు సిద్ధం చేస్తారు. ఒక్కో బాయిలర్‌లో ఒకేసారి 70-80 కిలోల బియ్యం వండవచ్చు. టీటీడీలో రోజుకు 17వేల కిలోల బియ్యం వినియోగిస్తుండగా ఒక్క నిత్యాన్నదానంలోనే రోజుకు 13 వేల కిలోల బియ్యం వండుతుంటారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే మధ్యాహ్న భోజనం కోసం తెల్లవారుజామున నాలుగు గంటలకే వంట మొదలుపెట్టి వండి ట్రేలలో నిల్వ చేస్తారు. రాత్రి 7 గంటలకు మొదలయ్యే రాత్రి భోజనానికి మధ్యాహ్నమే వంట మొదలు పెడతారు. బియ్యం నానబెట్టడం, ఉడికించడంలోనే లోపాలున్నాయని సాక్షాత్తు టీటీడీ ఆరోగ్యశాఖ అధికారులే చెబుతున్నారు. 
అన్నదానం పథకంపై టీటీడీ శాస్త్రీయ అధ్యయనం లేదు.. 
ఏటా  కోట్లు వెచ్చించే అన్నదానం పథకంపై టీటీడీ శాస్త్రీయ అధ్యయనం చేసిన దాఖలాలు లేవు. అన్నదానం కేంద్రంలో వడ్డించే భోజనం ఇంటి భోజనంలా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి పరికరాలు వాడాలి, ఎంత సేపు బియ్యాన్ని నానబెట్టాలన్న దానిపై అధ్యయనం చేస్తే లోపాలను గుర్తించే వీలుంటుంది. భోజనం ఎలా ఉందన్న దానిపై భక్తులు అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భోజనం నాణ్యత పెంచి, ఉద్యోగులు, అధికారులు సైతం ఇక్కడే భోజనం చేసేలా చూస్తేనే టీటీడీకి  మరింత మంచిపేరు వస్తుందని భక్తులు అభిప్రాయపడతున్నారు. 

 

21:10 - August 16, 2016

సఫాయి పనిని ఒక కులంతో ముడిపెట్టారని... ఇది బానిసత్వంతో సమానమని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, సఫాయి కార్మిక ఆందోళన్ జాతీయ కన్వీనర్ బెజవాడ విల్సన్ అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మల మూత్రాలను చేతులతో ఎత్తివేయడం నాగరికతకే అవమానం అన్నారు. సఫాయి కార్మికులు అస్తిత్వాన్ని ఈ దేశం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..
'1993లో మాన్యువల్ స్కావెంజింగ్ ను రద్దు చేస్తూ చట్టం తెచ్చారు. కానీ ఇప్పటి వరకూ ఆ చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఒక్కరి మీద కూడా కేసు నమోదు కాలేదు. రాజకీయ సంకల్పం లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమన్నారు. సఫాయి కార్మికుల గణాంకాలు కూడా ఎవరికీ తెలియదు. సఫాయి కార్మికులు అస్తిత్వాన్ని ఈ దేశం గుర్తించడం లేదు. రాజ్యాంగం సమానత్వం గురించి చెప్పినా అది అమలుకావడం లేదు. కుల స్వామ్య వ్యవస్థ ఈ దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దారుణంగా దెబ్బతీస్తోంది. మల మూత్రాలను చేతులతో ఎత్తివేయడం నాగరికతకే అవమానం. ఈ పనిలో కూడా స్త్రీ, పురుషుల మధ్య వివక్ష కొనసాగుతోంది. మాన్యువల్ స్కావెంజింగ్ ను పూర్తిగా నిర్మూలించడమే నిజమైన నాగరిత. స్వచ్ఛ అనే పదానికి కుల ప్రభావం ఉంది. పరిశుభ్రత అనే అర్థం స్వచ్చ భారత్ అనే పదబంధంలో లేదు. కోట్ల సంఖ్యలో టాయిలెట్లను కడతామంటున్న ప్రభుత్వం సఫాయి కార్మికులను పట్టించుకోరా...? టాయిలెట్ల శుభ్రం చేయడానికి యంత్రాలను ఉపయోగించే ప్రయత్నాలు జరగడం లేదు. మనుషులు లేకుండా ఎలా చేయాలో మీరే చెప్పండని మమ్మల్లే అడుగుతారు. ఇప్పుడు దేశంలో ఒక లక్షా 60 వేలకు పైగా సఫాయి కార్మికులు ఉన్నారు. వీరు కాకుండా రైల్వే ట్రాక్స్, సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసేవాళ్ల సంఖ్య ఇందులో లేదు. సఫాయి పనిని ఒక కులంతో ముడిపెట్టారు.. ఇది బానిసత్వంతో సమానం. ఈ పోరాటం ఇక ముందు మరింత ఉధృతం చేస్తామని' చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

టీప్రభుత్వం నిర్ణయం దారుణం : మురళీకృష్ణ

హైదరాబాద్ : ఏపీకి చెందిన 41 మంది సెక్షన్ ఆఫీసర్లను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దారుణమని ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ అన్నారు. ఉద్యోగుల తుది కేటాయింపులు తేలే వరకు సెక్షన్ ఆఫీసర్లను రిలీవ్ చేయమని గతంలో తెలంగాణ ప్రభుత్వం హమీ ఇచ్చిందని.. దానిని ఉల్లంఘించడం సరికాదన్నారు. దీనిపై త్వరలో కేంద్రాన్ని కమల్ నాథన్ కమిటీని ఆశ్రయిస్తామని చెప్పారు.

రేపు ఎపిలో పుష్కరస్నానం చేయనున్న గవర్నర్

విజయవాడ : గవర్నర్ నరసింహన్ రేపు ఎపిలో పుష్కరస్నానం చేయనున్నారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈనెల 19న నల్గొండ జిల్లా మట్టంపల్లిలో గవర్నర్ దంపతులు పుష్కరస్నానం చేయనున్నారు. అనంతరం యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 

రోడ్లపై సమగ్ర అధ్యయనం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : రోడ్లపై సమగ్ర అధ్యయనం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. వచ్చే వర్షాకాలం నాటికి సిటీ రోడ్లు బాగు చేస్తామన్నారు.  మ్యాన్ హోల్ ప్రమాద బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

 

20:13 - August 16, 2016

అనంతపురం : జిల్లాలోని హిందూపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఈ ఘటనలో సుమారు 30 లక్షల విలువైన కంప్యూటర్లు, ప్రింటర్లు,యూపీఎస్‌, స్కానర్లు కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని సిబ్బంది చెబుతున్నారు. 

20:10 - August 16, 2016

హైదరాబాద్ : బ్లడ్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆరేళ్ల బాబుకు మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని గుంటూరు మాస్టర్ మైండ్ సంస్థ డైరెక్టర్ మోహన్ తెలిపారు. ఇందుకు తమ సంస్థ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహకరించారన్నారు.  నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన షఫీ,మున్నీసా దంపతుల పిల్లాడు చిన్నప్పటి నుంచి బ్లడ్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. దాతలు ఎవరైనా ఉంటే బాలుడి వైద్య ఖర్చులకు సహకరించాలని ఆయన కోరారు. బాలుడి ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని అ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

 

20:05 - August 16, 2016

విజయవాడ : సినీనటుడు కోటాశ్రీనివాసరావు విజయవాడలో పుష్కరస్నానం చేశారు. సాంప్రదాయబద్దంగా పుష్కరస్నానం చేసి పిండప్రదానం చేశారు. ఇప్పటివరకు  5 సార్లు కృష్ణా పుష్కరాలలో పాల్గొన్నానని  కోటా తెలిపారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని కితాబిచ్చారు.

 

20:02 - August 16, 2016

హైదరాబాద్ : పుష్కరాల్లో పుణ్యస్నానాలతో పాటు పితృదేవతలకు పిండప్రదానం చేయడం పరిపాటి. పూర్వీకులకు పిండప్రదానం చేస్తే వారి ఆత్మకు శాంతి చేకూరి ఆశీస్సులందిస్తారని అనేక మంది తమ పితృదేవుళ్లకు నదిమా తల్లి ఒడిలో పిండాలను వదులుతుంటారు. అయితే కృష్ణా పుష్కరాల్లో పిండాలను నదిలో కలపనీయకుండా అధికారులు.. చెత్త బుట్టలో పడేస్తున్నారు. అరకొర సౌకర్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
పుష్కరాలంటేనే పుణ్యస్నానాలు... 
పుష్కరాలంటేనే పుణ్యస్నానాలు... పితృ మూర్తులు, పూర్వీకులకు పిండప్రదానాలు. అందుకే పన్నేండేళ్లకోసారి వచ్చే పుష్కరాలకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. పుష్కరాల్లో నదిలో పిండ ప్రదానాలు చేయడం వల్ల తమ పితృదేవతల ఆత్మకు శాంతి, వారి నుంచి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల  విశ్వాసం. అందుకే భక్తులు పుష్కరాలకు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ పూర్వీకులకు పిండాలు పెడుతుంటారు. అలా తరలివచ్చిన భక్తులకు విజయవాడ పుష్కర ఘాట్ల వద్ద తీవ్ర నిరాశే ఎదురవుతోంది. పిండాలను నదిలో వదలకుండా, చెత్తబుట్టలో వేయడంతో భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
విజయవాడలో వివాదస్పదమవుతున్న పిండప్రదానాలు
కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో పిండప్రదానాలు వివాదస్పదమవుతున్నాయి. పిండ ప్రదానం చేసేందుకు వస్తున్న భక్తులు పుష్కర స్నానాలు చేసి పిండ ప్రదానాలు చేయకుండానే వెళ్లి పోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పిండప్రదానం చేయకుండా వెళ్లడం బాధాకరంగా ఉందని భక్తులు వాపోతున్నారు. 
సౌకర్యాలు నిరాశకు గురవుతున్న భక్తులు
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉత్సాహంగా పుష్కర స్నానాలు చేసి.. ఆ తర్వాత పిండప్రదానాలు చేసేందుకు సౌకర్యాలు సరిగా లేక నిరాశకు గురవుతున్నారు. అధికారులు పిండాలను నదిలో కలపనీయకుండా అడ్డుకోవడంతో చెత్త బుట్టలో పడేయడం అపచారమని పండితులు చెబుతున్నారు. శాస్త్రం, సాంప్రదాయం ప్రకారం పిండాలను నదిలోనే కలపాలని ఉన్నా.. అధికారులు మాత్రం అరకొర సౌకర్యాలు ఏర్పాటు చేయడంపై భక్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. 

19:55 - August 16, 2016

హైదరాబాద్ : పేదోడి చిరకాల స్వప్నం...ఆత్మగౌరవ ప్రతీక డబుల్ బెడ్ రూం పథకం...గ్రేటర్ హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా మార్మోగిన పదం డబుల్ బెడ్ రూం. పేదల సొంతింటి కల నెరువేస్తాం..గౌరవపదమైన జీవితాన్ని కల్పిస్తాం. ఇది తెలంగాణ ప్రభుత్వం చెప్పిన మాటలు. సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో ఒక్క ఇంటికి 7 లక్షలు ఖర్చుచేసి 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వం 396 ఇళ్లను నిర్మించింది. ఇక్కడి డబుల్ బెడ్ రూంలకు మంచి పేరు రావడంతో తెలంగాణ వ్యాప్తంగా ఇళ్లులేని వారందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డబుల్ బెడ్ రూం పథకం తీరుపై టెన్ టీవీ ప్రత్యేక కథనం..
8నెలలు పూర్తైన ముందుకు కదలని పనులు 
సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలాగే తమకు కూడా మంచి ఇళ్లు వస్తాయని అందరూ సంతోషపడ్డారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంత్రులు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్ధాపన కూడా చేశారు. తొలుత నియోజకవర్గానికి 400 ఇళ్లు నిర్మించాలని అనుకున్నప్పటికీ...ఎన్నికల ఫలితాల తరువాత ఒక లక్ష ఇళ్లు  నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు . 8 నెలలు పూర్తి కావస్తున్నప్పటికి ఆ దిశగా అడుగులు ముదుకు వేయలేదు ప్రభుత్వం. కొన్ని ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చేందుకు ప్రజలు సిద్దమైనా నిర్మాణాలు మాత్రం మొదలుపెట్టలేదు. 
అమలుకాని సీఎం మాటలు 
ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నది ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్. ఇక్కడ పురాతన ఇళ్లను చూసిన సీఎం కేసీఆర్..వీటిని ఖాళీ చేసి ఇస్తే కొత్త ఇళ్లను నిర్మిస్తామని హమీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇళ్ల నిర్మాణానికి శంకుస్ధాపన కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు నిర్మాణాలు చేపట్టలేదు. ఇళ్ల నిర్మాణం ఎప్పుడని ఎవరైనా ప్రశ్నిస్తే..అదిగో అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారు. అయితే లబ్దిదారుల ఎంపికలో ఓనర్స్ కిరాయి దారుల మధ్య గందరగోళం నెలకొంది. అయితే అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. 
ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్న లబ్ధిదారులు 
ఇప్పటికైనా తెలంగాణ ప్రబుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని లబ్దిదారులు కోరుతున్నారు. స్థలాలు ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామంటూ లబ్దిదారులు ముందుకొస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రభుత్వం నిలపెట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

 

కలెక్టర్లతో సీఎస్ రాజీవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : హరితహారంపై జిల్లాల కలెక్టర్లతో సీఎస్ రాజీవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

పాల్వంచ కేటీపీఎస్ 5 వ దశ పనుల్లో అపశృతి

ఖమ్మం : పాల్వంచ కేటీపీఎస్ 5 వ దశ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. 10 వ యూనిట్ మరమ్మతు పనుల్లో బాయిలర్ పై నుంచి కిందపడి సర్వీస్ ఇంజినీర్ మాస్కో మృతి చెందాడు. 

19:38 - August 16, 2016

హైదరాబాద్ : మతతత్వ శక్తులను ప్రోత్సహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలు దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ శక్తుల నుంచి దేశాన్ని కాపాడేందుకు  ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం తెలంగాణ ప్లీనం సమావేశాల్లో ఏచూరి పిలుపునిచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై...  పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విచురుకుపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీడీపీ పాలకులు అనుసరించిన విధానాలకు టీఆర్ ఎస్ సర్కార్‌  పాలసీలకు తేడా లేదని విమర్శించారు. 
సీపీఎం పతాకాన్ని ఆవిష్కరించిన సారంపల్లి 
హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం తెలంగాణ ప్లీనం సమావేశాలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. అఖిల భారత రైతు సంఘం అధ్యక్షుడు, పార్టీ సీనియర్‌ నేత సారంపల్లి మల్లారెడ్డి సీపీఎం పతాకాన్ని ఆవిష్కరించారు. ప్లీనం ప్రారంభోత్సవానికి హాజరైన నాయకులు, ప్రతినిధులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. 
పరిశీలకులుగా ఏచూరి, బీవీ రాఘవులు 
మూడు రోజులపాటు కొనసాగే సీపీఎం తెలంగాణ ప్లీనం సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పరిశీలకులుగా హాజరవుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 489 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటున్నారు.
సన్నగిల్లిన ఉద్యోగావకాశాలు -సీతారాం ఏచూరి 
ప్లీనంలో ప్రారంభోపన్యాసం చేసిన సీతారం ఏచూరి.... కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజలపై ఆర్థిక భారం మోపే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఆకాశానంటున్న నిత్యాసరాల ధరలతో   ప్రజల కొనుగోలు శక్తి రోజురోజుకు తగ్గిపోతోందని ఆందోళనవ వ్యక్తం చేశారు.  ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో నిరుద్యోగిత పెరిగిన అంశాన్ని ప్రస్తావించారు. వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకోవడంతో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం అండ చూసుకుని మతతత్వ శక్తులు పెచ్చరిల్లిపోతున్న అంశాన్ని వేలెత్తి చూపారు. విద్య కాషాయీకరణ, ప్రభుత్వ విధానాల్లో సంఘ్‌పరివార్‌ శక్తుల జోక్యం వంటి అంశాలను సీతారాం ఏచూరి తన ప్రసంగంలో ప్రస్తావించారు. వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కుల, మత ఘర్షణలను పెంచి పోషిస్తున్నారని, ఇది దేశానికి  అంత్యత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో జరుగుతున్న అల్లర్లను  అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందని సీతారాం ఏచూరి విమర్శించారు. 
కాంగ్రెస్‌, టీడీపీ విధానాలనే అనుసరిస్తున్న కేసీఆర్‌ : తమ్మినేని 
తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రదం ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని ప్లీనంలో ఆమోదించారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన కొరవడిందని రాజకీయ తీర్మానంపై ప్రసగించిన తమ్మినేని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్‌ పాలకులు అనుసరించిన విధానాలకు.... ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ విధనానాలకు తేడాలేదని మండిపడ్డారు. ఉద్యమకారులు అణచివేత నుంచి సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న దోపిడీ అంశాలను ప్రస్తావించారు. ఒకటి లేదా రెండు టీఎంసీ నీటి నిల్వ సామర్ధ్యంతో రూపొందించిన సాగునీటి ప్రాజెక్ట్‌ల డిజైన్లు మార్చి  కేపాసిటీని 50 టీఎంసీలకు పెంచడం  వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయని తమ్మినేని ప్రశ్నించారు.  ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించకపోతే తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రాజెక్ట్‌ల పేరుతో జరుగుతున్న బలవంతపు భూసేకరణల అంశాన్ని కూడా రాజకీయ తీర్మానంలో తమ్మినేని ప్రస్తావించారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా 123 జీవో ద్వారా భూములు సేకరించడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఎం చేపట్టే ఉద్యమాలకు వామపక్ష ప్రజాతంత్ర శక్తులు కలిసిరావాలని తమ్మినేని పిలుపు ఇచ్చారు. 

 

19:20 - August 16, 2016

ఆదిలాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల్ని దారుణంగా మోసపుచ్చిందని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ రైతు గర్జన సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల హామీల్ని నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఎన్నికలకుముందు ఒకలా... ప్రభుత్వం ఏర్పాటయ్యాక మరోలా మాట్లాడుతోందని విమర్శించారు. ఎన్నికలకుముందు రుణమాఫీ చేస్తామన్నారని.. ఇప్పుడు నాలుగు విడతలుగా చేస్తామంటున్నారని పేర్కొన్నారు. రైతులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని తెలిపారు. రైతాంగం అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

కాంగ్రెస్‌ రైతు గర్జనకు డుమ్మా కొట్టిన జానారెడ్డి

ఆదిలాబాద్‌ : కాంగ్రెస్‌ రైతు గర్జనకు జానారెడ్డి డుమ్మా కొట్టారు. రేపటి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌కు కూడా జానా దూరంగా ఉన్నారు. 

19:12 - August 16, 2016

హైదరాబాద్ : ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ రైతు గర్జనకు జానారెడ్డి డుమ్మా కొట్టారు. రేపటి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌కు కూడా జానా దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే అనారోగ్య సమస్యలతోనే సభకు హాజరుకాలేకపోయారని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. జానారెడ్డి హాజరు కాకపోవడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. 

18:59 - August 16, 2016

నల్లగొండ : జిల్లాలో కృష్ణా పుష్కరాలను పరిశీలించేందుకు మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీష్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. జిల్లాలోని పుష్కర ఘాట్లను వారు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం ఘాట్లలోని భక్తులతో ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే పుష్కరాల ప్రారంభం నుంచి పోలీసుల ఓవర్ యాక్షన్ తో విసిగిన జర్నలిస్టులు మంత్రులను అడుగడుగునా అడ్డుకున్నారు. సాగర్ లో మంత్రులను పూర్తిగా దిగ్భందించారు. దీంతో పక్కనే ఉన్న జిల్లా ఎస్పీ ప్రకాష్ రెడ్డి ని జర్నలిస్టులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు.

 

18:55 - August 16, 2016

కృష్ణా : జిల్లాలో పుష్కర స్నానాలు విషాదం జరిగింది. ఏటూరు వద్ద స్నానాలకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. వీరి మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. నందిగామ చైతన్య కాలేజీ విద్యార్థులు హరగోపాల్, లోకేష్, గోపిరెడ్డి, నగేష్‌, హరిగా వీరిని గుర్తించారు. నందిగామకు చెందిన చైతన్య కాలేజీకి చెందిన పదకొండు మంది పుష్కర స్నానం చేసేందుకు వచ్చారు. ఘాట్ లో నీరు బాగా లేకపోవడంతో ఓ బోట్ లో జిడుగు వద్దనున్న పాయ వద్దకు వచ్చారు. వాస్తవానికి అక్కడ ప్రభుత్వం ఎలాంటి ఘాట్ లు నిర్మించలేదు. నిర్మించని ఘాట్ లు వద్ద ఎవరూ వెళ్లవద్దని..బోట్లు తిప్పవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కానీ పదకొండు మంది విద్యార్థులు నదిలోకి దిగారు. కృష్ణమ్మ ఉధృతి అధికంగా ఉండడంతో ఐదుగురు గల్లంతయ్యారు. మిగతా ఐదుగురు మాత్రం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అనంతరం గాలింపులు చేపట్టారు. ఐదుగురు మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు.  మృతుల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబాలు కోరుతున్నారు. 

18:48 - August 16, 2016

గుజరాత్ : ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి పేరిట ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ ఆరోపించారు. ఉనాలో జరిగిన దళిత్‌ సమ్మేళన్‌లో కన్హయ్య పాల్గొని, మాట్లాడారు. సంఘ్‌ పరివార్‌ ప్రజాస్వామ్యవాదుల గొంతు నొక్కుతోందని ధ్వజమెత్తారు. మతాల పేరిట దేశాన్ని చీల్చడానికి అద్వాని అహ్మదాబాద్‌ నుంచి రథయాత్ర చేపట్టారని, దళితులు మాత్రం ఆత్మ గౌరవం, భూమి కోసం భుక్తి కోసం, ఐకమత్యం కోసం పోరాడుతున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, భూమి కోసం దళితులు శ్రామిక వర్గాలు ఏకతాటిపై పోరాడాలని కన్హయ్య పిలుపునిచ్చారు.

18:42 - August 16, 2016

విజయవాడ : నదుల అనుసంధానం ద్వారా కృష్ణా- గోదావరి నదులకు సంవత్సరం వ్యవధిలో పుష్కరాలు నిర్వహించడం తన అదృష్టమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ధ్యానబుద్ధ ఘాట్‌లో భక్తులతో ఆయన మాటామంతి నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని కాపాడాలని.. ఇందుకోసం ఇంకుడు గుంతలు, పూడికలు తీసి భూగర్భ నీటిమట్టాన్ని పెంచాలని కోరారు. ప్రతి వ్యక్తి నదులను పూజించాలన్నారు. కృష్ణా నది నీరు చాలా స్వచ్ఛమైనది.. అనేక మంది ఈ నీటిని తాగుతున్నారని తెలిపారు. పుష్కరస్నానం చేసి సెల్ఫీలు దిగి సోషల్ నెట్‌వర్క్స్‌లో పెట్టాలని యువతకు హితవు పలికారు. 

 

18:39 - August 16, 2016

ఆదిలాబాద్ : ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్‌ నేడు రైతులను మోసం చేసిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్ గర్జన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఇంతవరకు మూడో విడత రైతు రుణమాఫీ పూర్తి కాలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేవలం సోనియా గాంధీ ధృడసంకల్పం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. 

 

18:25 - August 16, 2016

హైదరాబాద్ : స్వచ్ఛ హైదరాబాద్ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఐటీ, పురపాలకశాఖమంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన ఇవాళ 176 స్వచ్ఛ ఆటోలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చెత్త తరలింపు కోసం ఆధునిక టెక్నాలజీతో వాహనాలను ప్రత్యేకంగా తయారు చేశారు. కొత్తగా 6 స్వీపింగ్ మిషన్లు, 6 జంపర్లను అప్పగించామన్నారు కేటీఆర్. హెచ్ఎం డబ్ల్యూఎస్ నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన 4 కుటుంబాల వారికి 10 లక్షలు ప్రకటించామని అన్నారు. చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు మంత్రి. కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. 

 

16:41 - August 16, 2016

శ్రీనగర్ : కశ్మీర్‌లో క‌ల్లోల ప‌రిస్థితులు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. బుద్గామ్ జిల్లాలో ఆందోళ‌న‌కారులు, భ‌ద్రతాబ‌ల‌గాల‌కు మ‌ధ్య జరిగిన ఘ‌ర్షణలో ఐదుగురు పౌరులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. రెచ్చిపోయిన ఆందోళ‌నకారులు  భ‌ద్రతాబ‌ల‌గాల‌పై రాళ్లతో దాడికి పాల్పడడడంతో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తెచ్చేందుకు భ‌ద్రతా బ‌ల‌గాలు  కాల్పులు జ‌రిపాయి. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత చెల‌రేగిన‌ అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య 64కు పెరిగింది. కశ్మీర్‌ తాజా పరిస్థితుల‌పై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత‌న ఢిల్లీలో భేటీ ప్రారంభ‌మైంది. జాతీయ భ‌ద్రతాస‌ల‌హాదారు అజిత్‌ దోవల్, ఐబీ డైరెక్టర్‌తో పాటు ప‌లువురు అధికారులు ఈ భేటీకి హాజ‌ర‌య్యారు. 

16:40 - August 16, 2016

గుజరాత్ : ఉనాలో దళితులపై మళ్లీ దాడి జరిగింది. సోమవారం సాయంత్రం ఉనాలో జరిగిన 'దళిత్ సమ్మేళన్' నిరసన ప్రదర్శనలో పాల్గొని స్వగ్రామాలకు వెళుతున్న వారిపై సమతర్ గ్రామం వద్ద స్థానికులు కర్రలు, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో 20 మందికి గాయాలయ్యాయి. ఇందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు చూస్తుండి కూడా తమను కాపాడేందుకు చర్యలు తీసుకోలేదని దళితులు ఆరోపించారు.  తాము టియర్ గ్యాస్ ప్రయోగించి దాడులు చేస్తున్న వారిని చెల్లాచెదురు చేశామని, లాఠీచార్జ్ కూడా జరిపామని పోలీసులు అంటున్నారు. బాధితులంతా భావ్ నగర్ జిల్లాకు చెందిన వారు.

 

16:36 - August 16, 2016

హైదరాబాద్ : నయీం ఎన్‌కౌంటర్‌పై డీజీపీ ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి సిట్ చీఫ్ నాగిరెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, సైబరాబాద్ ఈస్ట్‌, వెస్ట్ కమిషనర్లు హాజరయ్యారు. నయీం అక్రమాస్తులపై 3 గంటలకుగా రివ్యూ జరుగుతోంది. 

 

16:28 - August 16, 2016

గుంటూరు : జిల్లాలోని సీతానగరం ఘాట్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ అస్వస్థతకు గురైంది. ఘాట్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జరీనాబేగం స్పృహతప్పి పడిపోయింది. మూడురోజులుగా జ్వరంతో బాధపడుతున్నా అధికారులు సెలవుకు నిరాకరించారని జరీనా తల్లి తెలిపింది. జరీనాకు తోడుగా విధులు నిర్వహించేందుకు వచ్చానని ఆమె తల్లి తెలిపింది. జరీనాబేగం పాత గుంటూరు పీఎస్ ఉద్యోగిని.

 

కృష్ణానదిలో స్నానానికి వెళ్లి... ఐదుగురు మృతి

కృష్ణా : జిల్లాలోని ఏటూరు వద్ద  కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టి ఐదుగురి మృత దేహాలను వెలికితీశారు.

 

16:13 - August 16, 2016

కృష్ణా : జిల్లాలోని చందర్లపాడు (మం) ఏటూరు వద్ద కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనలో ఉన్న బందోబస్తు సిబ్బంది ఇక్కడకు తరలివచ్చారు. ప్రస్తుతం నాలుగు మృతదేహాలను బయటకు తీశారు. నందిగామకు చెందిన చైతన్య కాలేజీకి చెందిన పదకొండు మంది పుష్కర స్నానం చేసేందుకు వచ్చారు. ఘాట్ లో నీరు బాగా లేకపోవడంతో ఓ బోట్ లో జిడుగు వద్దనున్న పాయ వద్దకు వచ్చారు. వాస్తవానికి అక్కడ ప్రభుత్వం ఎలాంటి ఘాట్ లు నిర్మించలేదు. నిర్మించని ఘాట్ లు వద్ద ఎవరూ వెళ్లవద్దని..బోట్లు తిప్పవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కానీ పదకొండు మంది విద్యార్థులు నదిలోకి దిగారు. కృష్ణమ్మ ఉధృతి అధికంగా ఉండడంతో ఐదుగురు గల్లంతయ్యారు. మిగతా ఐదుగురు మాత్రం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అనంతరం గాలింపులు చేపట్టారు. గల్లంతైన వారిలో హరగోపాల్, లోకేష్, గోపిరెడ్డి, నాగేష్, హరిలున్నారు. వీరంతా నందిగామ చైతన్య కళాశాలకు చెందిన విద్యార్థులు. 

కృష్ణా పుష్కరాల్లో విషాదం

గుంటూరు : కృష్ణా పుష్కరాల్లో విషాదం నెలకొంది. చందర్లపాడు మండలం ఏటూరు వద్ద పుష్కర స్నానానికి వెళ్లి.. ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో నాలుగు మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష

హైదరాబాద్ : నయీం ఎన్ కౌంటర్ పై డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి డీజీపీ, సిట్, ఎస్ ఐబీ, సైబరాబాద్ పోలీసులు హాజరయ్యారు. 

 

రెండు బైకులు ఢీకొని...ఒకరి మృతి

గుంటూరు : మంగళగిరి వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఎన్ డీఆర్ ఎఫ్ కు చెందిన ఎస్ ఐ శివకృష్ణ రఘువంశీ (34) మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. 

హైదరాబాద్ హౌసింగ్ పై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ కార్యాలయంలో హైదరాబాద్ హౌసింగ్ పై మంత్రి కేటీఆర్ సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో గ్రేటర్ మేయర్ బొంతురామ్మోహన్, కమిషనర్ జనార్థన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అక్బరుద్ధీన్ ఒవైసీ, గాంధీ పాల్గొన్నారు.

నయీం ఘటనలో నిష్పక్షపాతికంగా దర్యాప్తు - కర్నె..

హైదరాబాద్ : నయీం ఘటనలో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని టిఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. సిట్ విచారణలో దోషుల పేర్లు బయటకు వస్తాయని, రైతులకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

జీవో 123 పిటిషన్ లపై హైకోర్టు స్పందన..

హైదరాబాద్ : జీవో 123 రాజకీయ పార్టీలు వేసిన పిటిషన్ లపై హైకోర్టు అభిప్రాయం తెలిపింది. పార్టీలు పిటిషన్ లు దాఖలు చేస్తే రాజకీయ కోణంలోనే చూడాల్సి వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. బాధితులు కోర్టును ఆశ్రయిస్తే సమస్యను పరిష్కరిస్తామని చెప్పింది. 

13:40 - August 16, 2016

ప్రసూతి సెలవలు 12 వారాల నుండి 24 వారాలకు పెంచడానికి వీలు కల్పిస్తూ మాతృత్వ ప్రయోజన చట్టానికి సవరణలను రాజ్యసభ ఆమోదించింది. స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ గత సెప్టెంబర్ లో ప్రసూతి సెలవులను పెంచాలని ప్రతిపాదనలు చేసింది. దీనిని అమలు చేస్తే ప్రైవేటు రంగంలో స్త్రీలతో పాటు అందరూ ఉద్యోగినిలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో జేఎల్ఎన్ మూర్తి (అడ్వకేట్), అరుణ (సామాజిక కార్యకర్త) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

గల్లంతైన ఇద్దరి మృతదేహాలు వెలికితీత..

గుంటూరు : కృష్ణా జిల్లా చందర్లపాడు (మం) ఏటూరు వద్ద కృష్ణా నదిలో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల కోసం గాలింపులు చేపట్టారు. గజఈతగాళ్ల సహాయంతో ఇప్పటి వరకు ఇద్దరు మృతదేహాలను బయటకు తీశారు. 

13:26 - August 16, 2016

గుంటూరు : ఏపీ పుష్కరాల్లో పెను అపశృతి చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా చందర్లపాడు (మం) ఏటూరు వద్ద కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనలో ఉన్న బందోబస్తు సిబ్బంది ఇక్కడకు తరలివచ్చారు. ప్రస్తుతం రెండు మృతదేహాలను బయటకు తీశారు.
నందిగామకు చెందిన చైతన్య కాలేజీకి చెందిన పదకొండు మంది పుష్కర స్నానం చేసేందుకు వచ్చారు. ఘాట్ లో నీరు బాగా లేకపోవడంతో ఓ బోట్ లో జిడుగు వద్దనున్న పాయ వద్దకు వచ్చారు. వాస్తవానికి అక్కడ ప్రభుత్వం ఎలాంటి ఘాట్ లు నిర్మించలేదు. నిర్మించని ఘాట్ లు వద్ద ఎవరూ వెళ్లవద్దని..బోట్లు తిప్పవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కానీ పదకొండు మంది విద్యార్థులు నదిలోకి దిగారు. కృష్ణమ్మ ఉధృతి అధికంగా ఉండడంతో ఐదుగురు గల్లంతయ్యారు. మిగతా ఐదుగురు మాత్రం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అనంతరం గాలింపులు చేపట్టారు. గల్లంతైన వారిలో హరగోపాల్, లోకేష్, గోపిరెడ్డి, నాగేష్, హరిలున్నారు. వీరంతా నందిగామ చైతన్య కళాశాలకు చెందిన విద్యార్థులు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చైతన్య కాలేజీకి చెందిన విద్యార్థులు ఈత కోసం వచ్చారని ఆమె టెన్ టివికి తెలిపారు.
ఈ విషాద ఘటన కోసం మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

 

13:12 - August 16, 2016

నల్గొండ : వాళ్లు ఏం తప్పు చేశారు ? వాళ్లు కూడా మనుషులే ? కానీ వారిని మాత్రం కొంతమంది మనుషులుగా గుర్తించరు. వాళ్లే దళితులు..వీరిపట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పుష్కరాల్లో సైతం వివక్ష కనిపించడం గమనార్హం. నల్గొండ జిల్లా ముదిమాణిక్యం ఘాట్ లో దళిత కార్మికులు విధులు ముగించుకుని వెళ్లే సమయంలో టాయిలెట్ కు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అగ్రకులాలకు చెందిన కార్మికులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. టాయిలెట్లు ఉపయోగించకూడదని, ఉపయోగిస్తే క్లీన్ చేయమని ఖరాఖండిగా చెబుతున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులకు తెలిసినా స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై కార్మికుడు టెన్ టివితో మాట్లాడారు. తమకు కేవలం టాయిలెట్ల వద్దనే డ్యూటీలు వేస్తున్నారని, అగ్రకులాలకు చెందిన వారికి మాత్రం ఇతర చోట్ల డ్యూటీలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై ఎవరూ ఏదీ మాట్లాడవద్దని అధికారులు సూచించడం జరిగిందని, చివరకు తాము మీడియాకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. 

గల్లంతైన విద్యార్థులు వీరే..

కృష్ణా : చందర్లపాడు (మం) ఏటూరు వద్ద కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. హరగోపాల్, లోకేష్, గోపిరెడ్డి, నాగేష్, హరిలు గల్లంతైన వారిలో ఉన్నారు. వీరంతా నందిగామ చైతన్య కళాశాలకు చెందిన విద్యార్థులు. 

పుష్కరాల్లో స్పృ తప్పిపడిపోయిన కానిస్టేబుల్..

గుంటూరు : సీతానగరం ఘాట్ లో విధులు నిర్వహిస్తూ కానిస్టేబుల్ జరీనా బేగం స్పృహతప్పిపడిపోయింది. మూడు రోజులుగా జ్వరంతో జరీనా బేగం బాధ పడుతోంది. తల్లి సహాయంతో పుష్కర విధుల్లో జరీనా బేగం పాల్గొంటోంది. 

12:49 - August 16, 2016

గుంటూరు : ఏపీ పుష్కరాల్లో విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఉదయం ఒక పూజారి గుండెపోటుతో మృతి చెందగా తాజాగా కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థుల జాడ తెలియడం లేదు. నందిగామకు చెందిన చైతన్య కాలేజీకి చెందిన పది మంది పుష్కర స్నానం చేసేందుకు వచ్చారు. ఘాట్ లో నీరు బాగా లేకపోవడంతో ఓ బోట్ లో జిడుగు వద్దనున్న పాయ వద్దకు వచ్చారు. అక్కడకు వచ్చిన అనంతరం పది మంది విద్యార్థులు నదిలోకి దిగారు. కృష్ణమ్మ ఉధృతి అధికంగా ఉండడంతో ఐదుగురు గల్లంతయ్యారు. మిగతా ఐదుగురు మాత్రం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనలో ఉన్న భద్రతా సిబ్బంది..పోలీసులు వెంటనే ఘటనాస్థలికి వెళ్లారు. 

గుంటూరు జిల్లాలో పుష్కర స్నానాల్లో అపశృతి..

గుంటూరు : జిల్లాలో పుష్కర స్నానాలో అపశృతి చోటు చేసుకుంది. ఏటూరు వద్ద స్నానాలకు వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు గాలింపులు చర్యలు చేపట్టారు. 

నల్గొండలో పుష్కరాల్లో కులవివక్ష..

నల్గొండ : జిల్లా పుష్కరాల్లో కుల వివక్ష బయటపడింది. ముదిమాణిక్యం ఘాట్ లో దళితులను అగ్రకులస్తులు అడ్డుకున్నారు. దళితులు వాడిన టాయిలెట్లను శుభ్రం చేయమంటూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు టాయిలెట్లు వాడవద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

12:40 - August 16, 2016

నల్గొండ : దళితులపై కుల వివక్షలు ఇంకా ఆగడం లేదు. భారతదేశంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇది తెలంగాణకు కూడా పాకింది. పుష్కరాల్లో సైతం దళితులను అడ్డుకున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ముదిమాణిక్యం ఘాట్ లో పుష్కర స్నానం చేసేందుకు కొంతమంది దళితులు వచ్చారు. కానీ అగ్రకులస్తులు వీరిని అడ్డుకున్నారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దళితులు వాడిన టాయిలెట్లను శుభ్రం చేయామంటూ కార్మికులు ఆందోళన నిర్వహించారు. దళితులు వాడిన టాయిలెట్లు వాడవద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా అడ్డుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 

12:36 - August 16, 2016

హైదరాబాద్ : 123 జీవోపై ప్రభుత్వ అప్పీల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. అయితే పరిశ్రమలు వచ్చే వరకు ఎవరిని బయటకు పంపించవద్దని ఆదేశించింది. రైతు, కూలీలకు మేలు చేసేలా ప్రభుత్వం జారీ చేసిన 190 జీవోలో పొందుపర్చిన హామీలను నెరవేర్చుతున్నారా లేదా... అనే అంశాలపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు తుదితీర్పుకు లోబడే భూసేకరణ ఉండాలని ధర్మాసనం తెలిపింది. ఈ సందర్భంగ పలువురు న్యాయవాదులు టెన్ టివితో మాట్లాడారు. వారు ఏమి వివరాలు చెప్పారో తెలుసుకోవాలంటే వీడియోలో క్లిక్ చేయండి. 

12:34 - August 16, 2016

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు అలంభించిన విధానాలకు తేడా లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విరుచుకుపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించడంలేదని సీపీఎం రాష్ట్ర ప్లీనంలో విమర్శించారు.

భూ సేకరణకు వ్యతిరేం కాదు..
భూసేకరణకు సీపీఎం పార్టీ వ్యతిరేకం కాదన్నారు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కొంటోందని, ప్రాజెక్టులకు ఎంత అవసరమో అంతే భూమి సేకరించాలని..తప్పుడు అంచనాలతో వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వ పరం చేసేందుకు కుట్ర జరుగుతుందని విమర్శించారు. 

12:28 - August 16, 2016

హైదరాబాద్ : దేశంలో గోసంరక్షణ పేరుతో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. కొందరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మతోన్మాద ఘర్షణలు పెంచి సామాజిక ఐక్యతను దెబ్బతీయడం దారుణమన్నారు. తెలంగాణలో పార్టీ ప్లీనం సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వాస్తవ పరిస్థితులు ప్రస్తావించని మోడీ..
మరోవైపు మోదీ స్వాతంత్ర్య సందేశంలో వాస్తవ పరిస్థితులను ప్రస్తావించలేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. రెండేళ్లుగా చెప్పిన విషయాలే పదే పదే చెబుతున్నారని విమర్శించారు. ఓవైపు నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజలు అల్లాడిపోతుంటే..దేశంలో ఆర్థికాభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుందని గొప్పలు చెప్పుకోవడం విచారకరమన్నారు.

కేంద్రం కుట్రలు..
మతతత్వాన్ని విద్యారంగంలో చొప్పించే విధంగా మోదీ సర్కార్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోందని సీతారాం ఏచూరి ఆరోపించారు. జాతీయత పేరుతో మతతత్వాన్ని పెంచి పోషించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. 

పరిశ్రమలు వచ్చేంత వరకు బయటకు పంపొద్దు - హైకోర్టు..

హైదరాబాద్ : రైతు, కూలీలకు మేలు చేసేలా 190 జీవోను ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. 190 జీవోలో పొందుపరిచిన హామీలను నెరవేర్చుతున్నారా ? లేదా అని ప్రశ్నించింది. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు సమర్పించాలని ఆదేశించింది. తుది తీర్పుకు లోబడే భూ సేకరణ ఉండాలని ధర్మాసనం పేర్కొంది. భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. పరిశ్రమలు వచ్చేంత వరకు ఎవరినీ బయటకు పంపించ వద్దని ఆదేశించింది. 

12:14 - August 16, 2016

ముంబై : ఆ బంగళాకు ఎంతో విశిష్టత ఉంది. పేరు ప్రఖ్యాతలూ ఉన్నాయి. ఎంతో మంది జాతీయ నేతలు. బస చేసేందుకు విడిదిగా ఉపయోగపడింది. 1904లో నిర్మించిన ఆ బంగళాను ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. రియల్‌ఎస్టేట్‌ మార్కెట్‌లో ఇప్పుడా బంగ్లా వందల కోట్లు పలుకుతోంది. ఇంతకు ఆ పురాతన బిల్డింగ్‌ ఎక్కడుంది..? స్వాతంత్య్ర సమరయోధులకు రహస్య స్థావరం. స్వాతంత్య్ర సమరయోధులకు రహస్య స్థావరంగా నిలిచిన పురాతన బంగ్లా. ఎంతోమంది జాతీయ నేతలకు అనేకసార్లు విడిదిగా ఉపయోగపడిన బంగళా.  ముంబైలోని ఓల్డ్ బాంబే నేపియన్‌సీ రోడ్డులో ఉన్న లక్ష్మీనివాస్ బంగళాను అమ్మకానికి పెట్టారు. ఈ భవనం నుంచే నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఐఎన్‌ఏ రేడియో కేంద్రాన్ని నిర్వహించారు. మూడు తరాలుగా కపాడియా కుటుంబ సభ్యులకు నివాసంగా ఉన్న ఈ చరిత్రాత్మక బంగళాను 1904లో ఒక పార్సీ కుటుంబం నిర్మించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే శతాబ్ది కాలంగా అది కపాడియా కుటుంబం చేతుల్లోనే ఉంది.
క్విట్ ఇండియా ఉద్యమం రోజుల్లో అరుణా అసఫలీ వంటి నేతలు బ్రిటిష్ పోలీసులను తప్పించుకొనేందుకు ఈ బంగళాలోనే తలదాచుకొనేవారు. జవహర్‌లాల్ నెహ్రూ వారిని కలుసుకొనేందుకు పలుమార్లు ఈ బంగళాకు వచ్చేవారు. రాంమనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్ ముంబైకి వస్తే బస చేసేది ఈ బంగళాలోనే. ఎంతోమందికి ఆతిథ్యమిచ్చిన ఈ సువిశాలమైన బంగ్లా ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో వందల కోట్లు పలికే అవకాశముంది. మరి ఏ కోటిశ్వరుడు సొంతం చేసుకుంటారో చూడాలి..!

ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి పుష్కర స్నానం..

విజయవాడ : పున్నమి ఘాట్ లో ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి పుష్కర స్నానం ఆచరించారు. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. 

హైదరాబాద్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం - కేటీఆర్..

హైదరాబాద్ : నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద జరిగిన స్వచ్ఛ ఆటోల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తయారు చేస్తామని చెప్పారు. 

ఆటోలను పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 176 స్వచ్ఛ ఆటోలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చెత్త తరలింపు కోసం ఆధునిక టెక్నాలజీతో వాహనాలను ప్రత్యేకంగా తయారు చేశారు.

11:58 - August 16, 2016
11:57 - August 16, 2016

హైదరాబాద్ : 'కదిలితే లాఠీ ఛార్జీలు..అణిచివేత, బురద జల్లడం ద్వారా సమస్యను పరిష్కరించాలని సర్కార్ అనుకొంటొంది..గత ప్రభుత్వ విధానాలే ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది' అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎస్వీకేలో సీపీఎం ప్లీనం సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా ఆయన రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టారు. అనంతరం ప్రసంగించారు.

బంగారు తెలంగాణ ఎలా సాధ్యం..?
ఆర్థిక, సామాజిక స్థితి గతులను మార్చడం ద్వారా బంగారు తెలంగాణ సాధ్యమని, కానీ నినాదాలు చేయడం..ఏదో చెప్పడం ద్వారా బంగారు తెలంగాణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రం కాబట్టి ఆర్థిక ప్రమాణాలు పెరగాలని ఆకాంక్షించారు. మూడున్నర కోట్ల మందిలో 92 శాతం ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలున్నారని తెలిపారు. 90 శాతం వ్యవసాయ కార్మికులు, దళితులు, మధ్య తరగతి, చిన్న పరిశ్రమల్లో పని చేసే కార్మికులున్నారని తెలిపారు. 85 శాతం పూర్తిగా పేదరికంలో ఉండడం...బలహీన కులాల్లో ఉండడం వాస్తవ పరిస్థితి ఉందన్నారు. వీరు బాగుపడకుండా బంగారు తెలంగాణ సాధిస్తామనడం ఎలా అని ప్రశ్నించారు.

మూడెకరాల భూమి ఎక్కడ ? విద్య.వైద్య రంగం పరిస్థితి ఏంటీ ? 
దళితులు..గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి తొలుత కొంత భూమి ఇచ్చారని, ప్రస్తుతం ఆ మాటే మరిచిపోయారని విమర్శించారు. సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కొంటున్నారని, దళితులు, గిరిజనులకు ఇచ్చే హామీలు అమలు జరగగడం లేదన్నారు.
అంతేగాకుండా విద్య, వైద్యం రంగాలపై నిర్లక్ష్యం కనబరుస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్య రంగం ఏ పరిస్థితి నెలకొందని ప్రశ్నించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే పరిస్థితి నెలకొందని, కార్పొరేట్ రంగం వృద్ధి చెందుతోందని, వేలకొద్ది పాఠశాలలు మూసివేస్తున్నారని, ఫీజుల నియంత్రణ లేని పరిస్థితి నెలకొందన్నారు. విద్య..వైద్యం గురించి ఏ మాత్రం శద్ధ తీసుకోవడం లేదన్నారు. ప్రైవేటు సెక్టార్ పై నియంత్రణ చేయడం లేదన్నారు. ఇంటికో ఉద్యోగం చెప్పారని, నోటిఫికేషన్ లు విడుదల చేయడం లేదని...నిరుద్యోగుల్లో పెద్ద అలజడి నెలకొందన్నారు.

ప్రాజెక్టుల అంచనాలు పెంచేస్తున్నారు..
కోటి ఎకరాలకు సాగునీరందిస్తామని చెబుతున్నారని, ఏ ప్రాతిపదికన నీళ్లు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆర్థికంగా దోచుకోవడానికి ప్రాజెక్టుల డిజైన్ లున్నాయని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంచనాలు రూ. 85వేల కోట్లకు పోయిందన్నారు. నీళ్లు రైతులకు ఇస్తున్నారా ? లేదా అనేది నిమిత్తం లేకుండా అంచనాలను అమాంతం పెంచేస్తున్నారని విమర్శిస్తున్నారు. దుమ్ముగూడెంలో చేస్తున్న మార్పు మంచిదేనని, కానీ ఆశించిన తీరుగా రావడం లేదన్నారు. ప్రాజెక్టులకు, పరిశ్రమలకు సీపీఎం వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు. చట్టన్ని మార్చే పరిస్థితి లేదని, సొంతంగా జీవోలు తయారు చేసుకుని భూములు సేకరించుకోవాలని కేంద్రం చెబుతుండడంతో ఆయా రాష్ట్రాలు జీవోలు జారీ చేస్తున్నాయని తెలిపారు. మహారాష్ట్రలో జారీ చేసిన జీవోకు ఇటీవలే తెలంగాణ జారీ చేసిన జీవోకు పెద్ద వ్యత్యాసం లేదన్నారు. మొత్తంగా పాత ప్రభుత్వాలకు..ఈ ప్రభుత్వానికి పొంతన ఏమీ లేదన్నారు.

ప్రత్యామ్నాయ విధానంతో ముందుకు రావాలి...
అణిచివేయడం ద్వారా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం యోచిస్తోందని, అభివృద్ధికి ప్రభుత్వ యొక్క విధానాలు ముఖ్యమన్నారు. కొత్త పద్ధతులు పాటించాలని..ప్రస్తుత విధానాన్ని వ్యతిరేకించే వారు...నిజమైన అభివృద్ధి కోరుకొనే వారు..ప్రత్యామ్నాయ అభివృద్ధి కోరుకొనే వారు ఐక్యం కావాల్సినవసరం ఉందని నొక్కాణించారు. ప్రత్యామ్నాయ విధానంతో ముందుకు రావాలి తమ్మినేని పిలుపునిచ్చారు. 

జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ అల్లర్లు..

కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. బుద్గాం జిల్లాలో భద్రత సిబ్బంది..ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు యువకులు మృతి చెందారు. 

కాశ్మీర్ పరిస్థితులపై రాజ్ నాథ్ సమావేశం..

ఢిల్లీ : కాశ్మీర్ పరిస్థితుల‌పై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్య‌క్ష‌త‌న ఢిల్లీలో భేటీ ప్రారంభ‌మైంది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్‌లో ఏర్ప‌డిన ఉద్రిక్త ప‌రిస్థితులు ఇంకా చ‌ల్లార‌లేదు. ఆందోళ‌న‌కారులు, భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగుతూనే ఉంది.

11:25 - August 16, 2016

హైదరాబాద్ : కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానిది చతుర్ముఖ ప్రభుత్వం అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి పేర్కొన్నారు. ఎస్వీకేలో జరుగుతున్న పార్టీ ప్లీనం సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులను ఉద్ధేశించి ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. మోడీ పాలన తీరు..ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పష్టంగా విశ్లేషించారు. దేశంలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయని హెచ్చరించారు. ఆర్థిక భారాలు పెంచడం..ఆర్థిక దౌర్జన్యానికి పూనుకోవడం మొదటి ముఖమన్నారు. మతతత్వాన్ని పెంచి పోషిస్తోందన్నారు. దళితులపై దాడులు పెరిగాయని, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు వచ్చే ముందు మతోన్మాద ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్నారు. అన్ని రంగాల్లో మతతత్వ దాడులు జరుగుతున్నాయన్నారు. అంతేగాకుండా విద్యారంగంలో తీవ్రమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, యూనివర్సిటీలను ఎలా కంట్రోల్ చేయాలి ? ఘర్షణలు ఎలా పెంచాలనే దానిపై ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భారత్ మాతాకి జై అనే ఒక్క స్లోగన్ పెడుతున్నారని గుర్తు చేశారు. ఇది రెండో ముఖమన్నారు. రాష్ట్రాలపై పెత్తనం చెలాయించడం మూడో ముఖమన్నారు. అరుణాచల్, ఉత్తరాఖండ్ లో జరిగిన సంగతి తెలిసిందేనని గుర్తు చేశారు.

మతతత్వ దాడులు...
బిల్లులను రాజ్యసభలు ఆమోదించాల్సిన పరిస్థితి ఉండేదని కానీ ప్రస్తుతం ప్రతి బిల్లు మనీ బిల్లు కాదా ? అవునా ? అనేది లోక్ సభ స్పీకర్ నిర్ణయిస్తారని పేర్కొంటున్నారని తెలిపారు. నిరంకుశతత్వం పెరుగుతూ వస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యానికే పెద్ద ప్రమాదం హెచ్చరించారు. విదేశీ విధానాల్లో చాలా మార్పులు వస్తున్నాయని, ఇంకా వస్తాయని తెలిపారు. కాశ్మీర్ లో ఇంకా గొడవలు జరుగుతున్నాయని, ప్రస్తుతం 36వ రోజు కర్ఫ్యూ కొనసాగుతోందన్నారు. ఇక్కడ ఎంతో మంది మృతి చెందారని, ఎంతో మంది చూపు కొల్పోతున్నారని తెలిపారు. సమస్య పరిష్కరించాలని తాము మొదటి నుండి కోరడం జరుగుతోందన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాను మొదట చెప్పడం జరిగిందని, పార్లమెంటరీ చివరి రోజున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. పాక్ వల్లే ఇదంతా జరుగుతోందంటూ కాశ్మీర్ అంశం పక్కదారిపెట్టించే విధంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రెండు సంవత్సరాల్లో నాలుగు సార్లు అమెరికాకు వెళ్లడం జరిగిందని, 50 పేజీల అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. వాళ్లకు లొంగి ఒక జూనియర్ పార్ట్ నర్ గా ఉందని స్పష్టంగా కనబడుతోందన్నారు. అన్ని రంగాల్లో ఎఫ్ డీఐలకు అనుమతించడం జరిగిందని, గతంలో వ్యతిరేకించిన ఈ పార్టీయే ఇప్పుడు అనుమతినిస్తోందన్నారు. మొత్తం సామ్రాజ్యావాదానికి లొంగడం నాలుగో ముఖమని తెలిపారు.

మోడీ ప్రసంగంలో వాస్తవాలు ఏవీ ?
స్వతంత్రం రోజున ప్రధాన మంత్రి మోడీ చేసిన ప్రసంగంలో వాస్తవాలు ఎక్కడా అని ప్రశ్నించారు. 90 నిమిషాల పాటు మోడీ మాట్లాడారని, దేశంలో నెలకొన్న పరిస్థితులపై స్పష్టంగా ఏమి చెప్పలేదన్నారు. ప్రతిసారి ఏదో ఒక నినాదం ఇస్తున్నారని, ఈసారి కూడా నినాదం ఇచ్చారని తెలిపారు. రెండు సంవత్సరాల నుండి అదే విషయాలను చెబుతున్నారని తెలిపారు. దేశం అభివృద్ధి చెందుతోందని పేర్కొంటున్నారని, వాస్తవంగా జరుగుతున్నది ఏంటీ అని ప్రశ్నించారు. రూరల్ ఇన్ కమ్ గ్రోత్ రేట్ 2015 సంవత్సరంలో సున్నా శాతంగా ఉందని, 2015లో 60 శాతం ఎంప్లాయిమెంట్ గ్రోత్ తగ్గిందన్నారు. అంతేగాకుండా కరవులు పెరుగుతున్నాయని, ఈ విషయంలో ఆర్థికరంగంలోనే పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ హెచ్చరించడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగంలో సంక్షోభం తీవ్రతమరమౌతోందని, రైతుల ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. రుణాల వల్ల వత్తిడి వల్ల ఆత్మహత్యలు జరగడం లేదని, దీనికి కారణాలు వేరే ఉన్నాయని కేంద్రం వాదిస్తోందని విమర్శించారు. ధరలు పెరుగుతున్నాయి..కానీ ఈ లాభాలు రైతులకు అందడం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతుల జీవన పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏ రంగంలో ఉద్యోగాలు దొరుకుతాయో..పెరుగుతాయో అలాంటి రంగమైన మ్యాన్యుఫ్యాక్ష రింగ్ రంగంలో 2015లో మైనస్ 0.07గా ఉందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:01 - August 16, 2016

హైదరాబాద్ : స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయడం జరుగుతోందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నూతన పారిశుధ్య వాహనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన ముచ్చటించారు. 176మంది లబ్ధిదారులకు ఆటో రిక్షాలు పంపిణీ చేయనున్నట్లు లైసెన్స్ కలిగిన వారికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే టిప్పర్లను కూడా అందచేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 9వ తేదీన 1400 ఆటోలను సీఎం కేసీఆర్ పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రతి ఇంటి నుండి చెత్తను పంపిణీ చేసేందుకు ఈ ఆటోలను ఉపయోగించడం వల్ల ఫలితం బాగుటుందని, కార్మికులకు సేఫ్టీగా ఉంటుందన్నారు. 31 రోడ్డు స్వీపర్స్ ఉన్నాయని, మరికొన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. 

మోడీ ప్రసంగంలో వాస్తవ పరిస్థితులు ఎక్కడ – ఏచూరి..

హైదరాబాద్ : స్వతంత్ర దినోత్సవం సందర్భగా ప్రధాన మంత్రి మోడీ చేసిన ప్రసంగంలో దేశ వాస్తవ పరిస్థితులను ప్రస్తావించలేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి పేర్కొన్నారు. మోడీ పాలనలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయన్నారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకపోయారని తెలిపారు. 

10:33 - August 16, 2016
10:29 - August 16, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్లీనం సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎస్వీకేలో జరుగుతున్న ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పరిశీలకులుగా హాజరయ్యాన్నారు. వివిధ జిల్లాలనుంచి 481 మంది ప్రతినిధులుకూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ నేత జూలకంటి రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధురాలు మల్లు స్వరాజ్యం తదితరులు హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి ఏచూరి, రాఘవులు, తమ్మినేనితో పాటు పలువురు నేతలు నివాళులర్పించారు.
తెలంగాణలోని పలు సమస్యలతోపాటు.. భూసేకరణకోసం ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై ప్రధానంగా ఇందులో చర్చించబోతున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా పార్టీని బలోపేతం చేయడం, తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కోల్‌కతా ప్లీనరి ముసాయిదాపై చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో భూనిర్వాసితుల సమస్య, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ప్రాజెక్టుల రీ డిజైన్‌, ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, కార్మికుల సమస్యలపై కూడా చర్చించి కార్యాచరణ రూపొందించనున్నారు. అంతేగాకుండా సామాజిక సమస్యలు, గిరిజనులు, మైనార్టీలకు రిజర్వేషన్లపై కూడా చర్చ జరగనుంది.

ప్రారంభమైన సీపీఎం ప్లీనం సమావేశాలు..

హైదరాబాద్ : ఎస్వీకేలో సీపీఎం ప్లీనం సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 

10:15 - August 16, 2016

నెల్లూరు : జిల్లాలో మత్స్యకారులు కిడ్నాప్ కు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం తమిళ జాలర్లు జిల్లాకు చెందిన 18 మందిని కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలిసినా అధికారులు..మెరైన్ సిబ్బంది స్పందించడం లేదని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆంజనేయపురం మత్స్యకారులు వేటకు వెళ్లారు. మొత్తం 18 మంది చేపల వేట కొనసాగిస్తున్నారు. ఆ సమయంలో 60 మంది తమిళ జాలర్లు అక్కడకు చేరుకున్నారు. సరిహద్దు..చేపల వేట విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. వీరు ఘర్షణ పడ్డారన్న సమాచారం తెలుసుకున్న బంగారుపురంలో ఉంటున్న మత్స్యకారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. వీరు చేరుకొనే లోపు తమిళ జాలర్లు 18 మందిని తీసుకెళ్లిపోయారు. రెండు రోజులవుతున్నా అధికారులు స్పందించడం లేదని, వెంటనే ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కాశిమేడు ప్రాంతంలో నిర్భందించినట్లు సమాచారం. మత్స్యకారులను నిర్భంధించే క్రమంలో తెలుగు మత్స్యకారుల బోటుకు రంధ్రం పడినట్లుగా తెలుస్తోంది. దీంతో కొంత మంది జాలర్లు ఈతకొడుతూ వచ్చారని... మరికొందరి ఆచూకి తెలియడం లేదని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

10:07 - August 16, 2016

నౌహట్ట అమరవీరుడి ఊరేగింపు..

జార్ఖండ్ : నౌహట్ట ఎన్ కౌంటర్ లో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ కమాండర్ ప్రమోద్ కుమార్ ఊరేగింపు జరుగుతోంది. జార్ఖండ్ లోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. 

ఒడిశా బంద్ కు కాంగ్రెస్ పిలుపు..

ఒడిశా : రాష్ట్ర బంద్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మహనది అంశంపై ఈ బంద్ కు పిలుపునిచ్చింది. వెంటనే మహనదిపై కడుతున్న బ్యారేజీ పనులను ఆపివేయాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా నేతలు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. 

అనంతగిరి వద్ద కారు ప్రమాదం..

విశాఖపట్టణం : అనంతగిరి వద్ద కారు లోయలోకి దూసుకెళ్లింది. నలుగురికి తీవ్రగాయాలు కావడంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

పుష్కర స్నానం చేసిన కోట..

విజయవాడ : సినీ నటుడు కోట శ్రీనివాసరావు వీఐపీ ఘాట్ లో పుష్కరస్నానం ఆచరించారు. పుష్కరాలకు చాలా విశిష్టత ఉందని, పుష్కరాలు తీర్థయాత్రలా సాగుతున్నాయన్నారు. గతంలో పుష్కరాలు ఇంత ఘనంగా జరిగేవి కావని, ప్రభుత్వ ఏర్పాట్లన్నీ బాగున్నాయన్నారు. 

09:45 - August 16, 2016

గుంటూరు : ఏపీలో ఐదో రోజు పుష్కరాలు కొనసాగుతున్నాయి. కానీ అవే అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సంగమం ఘాట్ వద్ద పలువురు మృతి చెందుతున్నారు. నిన్న యశ్వంత్ అనే యువకుడు ఫిట్స్ తో మృతి చెందగా ఈ రోజు ఓ పురోహితుడు మృతి చెందాడు. కృష్ణా జిల్లా మైలవరంకు చెందిన రంగారావు పిండ ప్రధానాలు జరిపించేందుకు సంగమం ఘాట్ వద్దకు చేరుకున్నాడు. ఒక్కసారిగా గుండె పోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలో ఉన్న చికిత్స కేంద్రానికి తరలించిన ఫలితం లేకపోయింది. దీనితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 

09:39 - August 16, 2016
09:38 - August 16, 2016

కరీంనగర్ : టాలీవుడ్ లో విలక్షణ నటుడుగా పేరొందిన మోహన్ బాబు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆకాశానికెత్తేశారు. ప్రశంసల జల్లు కురిపించారు. మాట మీద నిలబడిన వ్యక్తి ఎన్టీఆర్ తరువాత కేసీఆర్ అంటూ కొనియాడారు. వేములవాడ రాజన్న సన్నిధికి మోహన్ బాబు నిన్న కుటుంబంతో వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా మోహన్ బాబు కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చన మాట ప్రకారం కేసీఆర్ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వేముల వాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. 

09:34 - August 16, 2016
09:33 - August 16, 2016

విశాఖపట్టణం : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా అపరితల ఆవర్తనం ఏర్పడడంతో మరో 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావం వల్ల కోస్తాంధ్రలో చెదురుముదురు వర్షాలు కురుస్తాయన్నారు. తెలంగాణపై ఈ ప్రభావం అంతగా ఉండదని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం విశాఖలో భారీ వర్షం కురిసింది. 

కృష్ణా పుష్కరాల్లో అపశృతి..

విజయవాడ : ఏపీ పుష్కరాల్లో మరో అపశృతి చోటు చేసుకుంది. పిండ ప్రధానాలు చేసేందుకు వచ్చిన ఓ పురోహితుడు గుండెపోటుతో మృతి చెందాడు. సంగమం ఘాట్ వద్దకు వచ్చిన ఈ పురోహితుడు రంగారావు కృష్ణా జిల్లా మైలవరంకు చెందిన వారు. 

09:26 - August 16, 2016

మహబూబ్ నగర్ : కృష్ణా బేసిన్ లోని జూరాలకు దిగువకు ఇన్ ఫ్లో తక్కువవడంతో ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. ఇప్పటి వరకు జూరాలకు ఇన్ ఫ్లో 45వేల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలంలోకి 44వేల క్కూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. సోమవారం సాయంత్రం వరకు ఇన్ ఫ్లో పెరగడం వల్ల నీటి మట్టం 874 అడుగులకు చేరుకుంది. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా 103 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం నుండి 18,242 నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. 

09:20 - August 16, 2016
09:15 - August 16, 2016
09:12 - August 16, 2016

మహబూబ్ నగర్ : జిల్లాలో పుష్కరాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. జడ్చర్ల సమీపంలో ఈ బస్సు బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులున్నారు. తొలుత ఆర్టీసీ బస్సు బొల్తా కొట్టినట్లు ప్రచారం జరిగింది. తెలంగాణలో జరుగుతున్న పుష్కరాల్లో భాగంగా పుష్కర స్నానం చేసేందుకు కొంతమంది ఓ బస్సును మాట్లాడుకుని మహబూబ్ నగర్ జిల్లాకు పయనమయ్యారు. ఆర్టీసీ బస్సును కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేసి నడుపుతున్నట్లు తెలుస్తోంది. వీరు ఈ బస్సులో ప్రయాణించారు. జడ్చర్లకు సమీపంలో రాగానే బస్సు బోల్తా కొట్టింది. గాయాలైన 17 మందిలో ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ఆర్టీసీ బస్సును కొనుగోలు చేసినా ఎలాంటి మార్పులు..చేర్పులు.. చేసుకోకుండా అదే స్టికర్ తో బస్సును నడుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్టీసీ కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

09:06 - August 16, 2016

హైదరాబాద్ : కాసేపట్లో ఎస్వీకేలో సీపీఎం పీన్లరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు ఈ సమావేశాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు ఈ ప్లీనం సమావేశాలు జరుగుతాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పరిశీలకులుగా హాజరవుతున్నారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వివిధ జిల్లాల నుండి 489 మంది హాజరవుతున్నారు. తెలంగాణలోని పలు సమస్యలతోపాటు.. భూసేకరణకోసం ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై ప్రధానంగా ఇందులో చర్చించబోతున్నారు.
ఈ సమావేశాల్లో ప్రధానంగా పార్టీని బలోపేతం చేయడం, తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కోల్‌కతా ప్లీనరి ముసాయిదాపై చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో భూనిర్వాసితుల సమస్య, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ప్రాజెక్టుల రీ డిజైన్‌, ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, కార్మికుల సమస్యలపై కూడా చర్చించి కార్యాచరణ రూపొందించనున్నారు. అంతేగాకుండా సామాజిక సమస్యలు, గిరిజనులు, మైనార్టీలకు రిజర్వేషన్లపై కూడా చర్చ జరగనుంది.

09:01 - August 16, 2016

అందంగా ఉండాలని తాపత్రయపడుతుంటారు. అందుకోసం బ్యూటీపార్లు..ఇతరత్రా సౌందర్య సాధనాలను ఉపయోగిస్తుంటారు. ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యత మెడకు ఇవ్వరు. దీనితో మెడ నల్లగా మారిపోతుంటుంది. ముఖమంతా బాగుండి మెడ నల్లగా ఉండే చూసే వారికి అసహ్యం కలుగుతుంటుంది. మరి మెడ మెరవాలంటే కొన్ని చిట్కాలు చూద్దాం..
ఆలివ్ ఆయిల్, స్పూన్ల ఉప్పు, బేకింగ్ సోడాలు మెడ నలుపును పొగొడుతుంది. ఎందుకంటే ఉప్పు న్యాచురల్ స్కిన్ ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. ఆలివ్ ఆయిల్ లో మిటమిన్ ఇ ఉంటుందనేది తెలిసిందే. ఇది చర్మానికి పోషణ అందిస్తుంది. ఇక బేకింగ్ సోడా సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని తెల్లగా మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది.
పైన చెప్పిన పదార్థాలన్నింటినీ.. ఒక గిన్నెలో మిక్స్ చేసుకోవాలి. అన్నింటినీ బాగా కలిపి.. పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన మెడకు పట్టించాలి. కొన్ని నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. 15 నిమిషాలు ఆరిన తర్వాత.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

షిమ్లాలో భారీ వర్షాలు..

హిమాచల్ ప్రదేశ్ : షిమ్లా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. 

08:27 - August 16, 2016
08:24 - August 16, 2016
08:22 - August 16, 2016

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో పుష్కర శోభ కొనసాగుతోంది. ఐదు రోజు పుష్కరాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వరస సెలవులు రావడంతో భక్తులు తరలివచ్చారు. మంగళవారం రోజున భక్తుల రద్దీ తక్కువగా ఉంది. మొత్తంగా ఐదు రోజుల్లో 13 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారని తెలుస్తోంది. వాడపల్లి, మెట్టపల్లి, నాగార్జున సాగర్ వద్దనున్న ఘాట్లకు అధికంగా భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించడం సంతోషంగా ఉందని, కానీ స్నానం చేసే సమయంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలువురు టెన్ టివికి తెలిపారు. భక్తులు తక్కువగా ఉన్న సమయంలో ఆంక్షలు తొలిగించాలని పలువురు కోరారు. ఇదిలా ఉంటే జిల్లాలో మంత్రులు ఏరియల్ సర్వే ద్వారా పుష్కరాలను తిలకించనున్నారు. ఇక రవాణాకు సంబంధించిన దానిపై అధికారులు ఏర్పాట్లు చేశారు. షటిల్ బస్సుల్లో ఉచితం అని చెప్పి నిన్న పది రూపాయలు వసూలు చేశారని పలువురు భక్తులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. డబుల్ ఛార్జీలు చెల్లించడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇంకా పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:10 - August 16, 2016

విజయవాడ : ఏపీ పుష్కరాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. వరుసగా సెలవులు రావడంతో నిన్నటి వరకు విపరీతమైన రద్దీ నెలకొంది. మంగళవారం మాత్రం భక్తుల రద్దీ తగ్గిపోయింది. 50 లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే ఒక్క విజయవాడలోనే 25 లక్షల మంది స్నానాలు ఆచరించినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. కృష్ణవేణి ఘాట్ వద్ద భక్తుల పలచగా ఉండడం కనిపిస్తోంది. భక్తులు తక్కువగా ఉన్నారని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ఎన్ఆర్ఐ టెన్ టివికి తెలిపారు. పూర్తి విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

పుష్కరాలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు బోల్తా..

మహబూబ్ నగర్ : జడ్చర్ల సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. 17 మందికి గాయాలు కావడంతో వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి బీచ్ పల్లి పుష్కరాలకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

హిందూపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాయలం ఫైర్ ఆక్సిడెంట్..

అనంతపురం : హిందూపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుద్ఘాతంతో కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. దస్తావేజులు సురక్షితమా ? లేవా ? అనేవి తెలియాల్సి ఉంది. 

శ్రీవారి ఆలయంలో ముగియనున్న పవిత్రోత్సవాలు..

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. రేపటి నుండి ఆర్జిత సేవలు యథాతథంగా అమలు కానున్నాయి. 

నిజామాబాద్ లో పర్యటించనున్న ఎంపీ కవిత..

నిజామాబాద్ : జిల్లాలో ఎంపీ కవిత పర్యటించనున్నారు. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ కవిత పాల్గొనున్నారు. 

07:44 - August 16, 2016

భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వతంత్రం రోజున చేసిన ప్రసంగంపై పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. 70వ స్వాతంత్ర్యం దినోత్సవ సందర్భగా ఎర్రకోట పై మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా ప్రసగించారు. ఆయన ప్రసంగ సమయంలో కేంద్ర మంత్రులు..పలువురు నేతలు నిద్రపోయినట్లుగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇతర అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో బి.వెంకట్ (సీపీఎం), తులసీ రెడ్డి (కాంగ్రెస్), మదన్ మోహన్ రెడ్డి (వైసీపీ), రాకేష్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి అభిప్రాయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:42 - August 16, 2016

ఒలింపిక్స్ లో పాల్గొనాలని క్రీడాకారులు భావిస్తుంటారు. పతకం గెలవాలని ఆశిస్తుంటారు. ఇటీవలే ప్రారంభమైన రియో ఒలింపిక్స్ పోటీలు కొనసాగుతున్నాయి. కానీ ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఒలింపిక్ సాక్షిగా ఓ యువకుడు తన ప్రేమను వ్యక్తపరిచాడు. మొదట షాక్ తిన్న క్రీడాకారిణి ఆ తరువాత అంగీకరించడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. క్వీన్‌ కాయ్‌, యువతి హెజీ చైనాకు చెందిన వారు. వీరు డైవింగ్‌ పోటీల్లో పాల్గొన్నారు. మహిళల డైవింగ్‌ 3 మీ. స్ప్రింగ్‌ బోర్డు విభాగంలో హిజీ రజతం పతకం గెలిచింది. దానిని ఆమె తీసుకుంటున్న సమయంలో అక్కడికి క్వీన్‌ కాయ్‌ చేరుకున్నాడు. పతకం తీసుకొని పోడియం దిగగానే ఆమె వద్దకు వెళ్లి మోకాళ్ల పైన కుర్చొని బంగారు ఉంగరాన్ని చూపించి పెళ్లి చేసుకుందామా.. అని ప్రపోజ్‌ చేశాడు. దీంతో ఆశ్చర్యం, ఆనందానికి గురైన ఆమె ఆనందబాష్పాలతో ప్రియుడిని హత్తుకొని ఓకే అన్నది. త‌న ప్రేయ‌సి హీజీకి ఎర్ర గులాబిని కూడా కానుక‌గా ఇచ్చాడు.
ఆరేళ్లుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒలింపిక్ వేదిక‌గా త‌న బాయ్‌ఫ్రెండ్ ల‌వ్‌ను ప్ర‌పోజ్ చేస్తాడ‌ను కోలేద‌ని హీజీ తెలిపింది. పురుషుల స్విమ్మింగ్ ఈవెంట్‌లోనూ క్విన్ మేటి డైవ‌రే. అత‌ను 3 మీట‌ర్ల స్ప్రింగ్‌ బోర్డ్ లో కాంస్య ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు. స్విమ్మింగ్ పూల్ వేదిక‌గా ఒక్క‌టైన ఆ జంట స్టేడియంలోని ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. 

క్వార్టర్స్ ఫైనల్లో సింధు..శ్రీకాంత్..

రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటెన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు చేరింది. పురుషుల సింగిల్స్ లో శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్ కు చేరాడు. 

కేసీఆర్ కు నివేదిక అందచేయనున్న కేబినెట్ సబ్ కమిటీ..

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ కు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక అందచేయనుంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజాప్రతినిధులతో కేబినెట్ సబ్ కమీ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. 

07:17 - August 16, 2016

హైదరాబాద్ : మనిషి జీవిత కాలం ఎంత ? గరిష్టంగా వందేళ్లు.. ఇంకా అంటే మరో నాలుగేళ్లు అటు ఇటుగా ఉండొచ్చు. అదే తాబేలు అయితే రెండొందల ఏళ్ల వరకు బతుకుతుంది. ఇంతకంటే ఎక్కువ రోజులు బతికే జీవరాశి ఏదైనా ఉందా.? ఇటీవలే 400 ఏళ్లు బతికే జీవిని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఆ జీవి ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. గ్రీన్‌ల్యాండ్‌ షార్క్ ఆర్కిటిక్‌ మహాసముద్రంలోని అతి శీతల నీటిలో ఈ చేపలు జీవిస్తాయి. ప్రపంచంలో అత్యధిక వయసు ఈ చేపల సొంతం. దాదాపు 400 ఏళ్లుగా ఈ గ్రీన్‌ల్యాండ్‌ షార్క్‌ జీవిస్తోంది. గ్రీన్‌ల్యాండ్‌ షార్క్ లు రెండు అడుగుల నుంచి 16 అడుగుల వరకు పెరుగుతాయి. ఇవి అతి శీతల నీటిలో పెరగడం వల్ల వీటి జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది. ఈ చేపలు ప్రత్యుత్పత్తి దశకు రావడానికే దాదాపు 150 ఏళ్లు పడుతుంది. గ్రీన్‌ల్యాండ్‌ షార్క్ లు 1500 సంవత్సరం నుంచి 1740 వరకు ఎక్కువగా పెరిగాయి. 1620 సంవత్సరం ఈ గ్రీన్‌ల్యాండ్‌ షార్క్ లకు స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఈ కాలంలో ఇవి అధికంగా పెరిగాయి. గ్రీన్‌ల్యాండ్‌ షార్క్ నాలుగు వందల ఏళ్లు బతికిందనే విషయాన్ని శాస్త్రజ్ఞులు నోవెల్‌ డేటింగ్‌ విధానాల ద్వారా గుర్తించారు. వీటి కంటి కణజాలాల ద్వారా వయసును నిర్దారించారు. భూమి పైన ఉండే జీవుల్లో తాబేళ్లు రెండొందల ఏళ్ల వరకు బతికితే.. ఈ షార్క్ చేపలు మాత్రం 400 ఏళ్ల వరకు జీవిస్తాయి. 400 ఏళ్ల అంటే.. అప్పటి వరకు వాటికి ఎలాంటి హాని జరగకుండా ఉండాలి. పెద్ద చేపల నుంచి తప్పించుకుంటూ ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూ నిలబడాలి.

07:10 - August 16, 2016

ఢిల్లీ : జమైకన్‌ బుల్లెట్‌ ఉసేన్‌ బోల్ట్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించాడు. రియోలో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొట్టిన బోల్ట్ హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ తో రికార్డ్ ల మోత మోగించాడు. 100 మీటర్ల స్ప్రింట్‌లో వరుసగా మూడు ఒలింపిక్‌ గోల్డ్ మెడల్స్ నెగ్గిన తొలి అథ్లెట్‌గా బోల్ట్ హిస్టరీ క్రియేట్‌ చేశాడు. రియో ఒలింపిక్స్ లో జమైకన్‌ స్పీడ్‌ గన్‌ ఉసేన్‌ బోల్ట్ రికార్డ్ ల మోత మోగించాడు. హ్యాట్రిక్‌ గోల్డ్ మెడల్స్ తో చరిత్రను తిరగరాశాడు. 100 మీటర్ల స్ప్రింట్‌లో తన తర్వాతే ఎవరైనా అని బోల్ట్ మరోసారి నిరూపించాడు. ఒలింపిక్స్ లో మరే ఇతర అథ్లెట్‌కు సాధ్యం కాని ఘనతను బోల్ట్‌ సొంతం చేసుకున్నాడు.

బుల్లెట్ స్పీడ్...
మెన్స్‌ 100 మీటర్ల హీట్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్ రౌండ్‌కు క్వాలిఫై అయ్యాడు. క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో 10.07 సెకన్లలో రేస్‌ ముగించిన బోల్ట్ ఫైనల్‌ రౌండ్‌లో మాత్రం అంచనాలకు మించి అదరగొట్టాడు. ఎప్పటిలానే రేస్‌ ఆరంభంలో స్లోగా స్టార్ట్ చేసిన బోల్ట్....30 మీటర్ల నుంచి జోరు పెంచాడు. రేస్‌ ట్రాక్‌లో బుల్లెట్‌ స్పీడ్‌లో దూసుకుపోయిన బోల్ట్.....ప్రత్యర్ధులందరి కంటే ముందుగా రేస్‌ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. కేవలం 9.81 సెకన్లలోనే రేస్‌ ముగించి స్వర్ణ పతకం సొంతంచేసుకున్నాడు. ఈ విజయంతో బోల్ట్ కొన్ని అరుదైన రికార్డ్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఒలింపిక్స్ లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ తో రికార్డ్ ల మోత మోగించాడు. 100 మీటర్ల స్ప్రింట్‌లో వరుసగా మూడు ఒలింపిక్‌ గోల్డ్ మెడల్స్ నెగ్గిన తొలి అథ్లెట్‌గా బోల్ట్ హిస్టరీ క్రియేట్‌ చేశాడు. బీజింగ్‌ ఒలింపిక్స్ లో 9.69 సెకన్లలో రేస్‌ పూర్తి చేసిన బోల్ట్ 2012 లండన్‌లో 9.63 సెకన్లతో ఒలింపిక్స్ లో రికార్డ్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ లోనే కాదు...క్రీడా చరిత్రలోనే జమైకన్‌ బుల్లెట్‌ ఉసేన్‌ బోల్ట్ అత్యుత్తమ అథ్లెట్‌గా నిలిచిపోతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. 

నేడు అమరావతిలో ఏపీ సీఎం బాబు పర్యటన..

గుంటూరు : నేడు ఉదయం 10.30 గంటలకు అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. జ్ఞానబుద్ధ, అమరలింగేశ్వర ఘాట్లను బాబు పరిశీలించనున్నారు.

ఐదో రోజుకు చేరిన కృష్ణా పుష్కరాలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. పుష్కర స్నానాలకు భక్తులు పెరుగుతున్నారు. 

06:39 - August 16, 2016

ఇంజనీరింగ్ కాలేజీలలో అడ్మిషన్ల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. తెలంగాణలో ఇవాళ్టితో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ పూర్తవుతుంది. అయితే, కన్వీనర్ కోటా సీట్లు భర్తీ కాకముందే బి కేటగిరి, ఎన్ఆర్ఐ కేటగిరి సీట్లను భర్తీ చేస్తుండడం వివాదస్పదమైంది. అసలు ఇంజనీరింగ్ విద్యలో ఏం జరుగుతోంది? అడ్మిషన్ల ప్రక్రియ సాఫిగా సాగుతోందా? ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రమాణాలు ఎలా వున్నాయి? ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసినవారిలో 75శాతం మందికి ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఏమిటి? లోపం ఎక్కడుంది? ఈ అంశాలపై జనపథంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాంబశివ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:37 - August 16, 2016

ఇంజనీరింగ్ విద్యలో విచిత్రకరమైన పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు కాలేజీల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు, కొన్ని కాలేజీలలో సీట్లు మిగిలిపోతున్నాయి. మరోవైపు ఆరు నుంచి పది లక్షల రూపాయలు పెట్టి ఇంజనీరింగ్ సీట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇంకోవైపు ఇంజనీరింగ్ పూర్తి చేసినా ఉద్యోగాలు దొరకడం లేదు. 1995 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్ల సంఖ్య బాగా పెరిగింది. 1994 - 95 విద్యా సంవత్సరంలో 32 కాలేజీలు 9335 సీట్లు వుండేవి. 2014 -15 అకాడమిక్ ఇయర్ లో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య 700 కి పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కలిపి 3 లక్షల 70 వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏటా రెండున్నర లక్షల మంది ఇంజనీరింగ్ సర్టిఫికెట్లతో బయటకు వస్తుంటే, కేవలం 50 వేల మందికే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారిలో కేవలం 25 శాతం మందికే ఉద్యోగార్హతకు సంబంధించిన నైపుణ్యాలున్నాయంటూ వివిధ సర్వేలు ఘోషిస్తున్నాయి. అంటే మన ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగులనే ఉత్పత్తి చేస్తున్నాయి. తప్ప వారిలో ప్రతిభాపాటవాలు వెలికి తీయడం లేదు. ఈ దుస్థితికి కారణం ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాలు పడిపోవడమే.

ఉత్తీర్ణతా శాతం చాలా తక్కువ..
తెలుగు రాష్ట్రాల్లో 700 కాలేజీలున్నా సగానికి పైగా కాలేజీలలో ఉత్తీర్ణతా శాతం చాలా తక్కువగా వుంటోంది. 435 కాలేజీలలో 50 శాతం కంటే తక్కువ మంది విద్యార్థులు పాస్ అవుతున్నారు. 143 కాలేజీలలో కేవలం 20శాతం మంది విద్యార్థులే పాస్ అవుతున్నారంటే నాణ్యతా ప్రమాణాలు ఎంతగా దిగజారాయో అర్ధం చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు పొందినవారంతా టెన్త్ ఇంటర్మీడియట్ లలో కష్టించి చదివినవారే. ఎంసెట్ లాంటి కఠిన పరీక్షల్లో మెరిట్ సాధించినవారే. టెన్త్, ఇంటర్మీడియట్, ఎంసెట్ లలో మంచి మార్కులు, ర్యాంక్ లు సాధించినవారు కూడా ఇంజనీరింగ్ విద్యలో ఎందుకు అదే ఊపు కొనసాగించలేకపోతున్నారన్నది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. ఇంజనీరింగ్ విద్యార్థుల ఫెయిల్యూర్ కి కారణం ఎవరు? విద్యార్థులా? పేరెంట్సా? ఇంజనీరింగ్ కాలేజీల అధ్యాపకులా? యాజమాన్యాలా? ఈ ప్రశ్నలకు కచ్చితమైన జవాబు కనిపెట్టకపోతే, ఇంజనీరింగ్ డిగ్రీలకు ఏమాత్రం వాల్యూ వుండదు. 

06:33 - August 16, 2016

నెల్లూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాలాయపల్లి మండలం రామాపురం సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని అతి వేగంతో బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. కృష్ణ పుష్కరాలుకు వెళ్లే క్రమంలో మిస్తైన బస్సును అందుకోవాలనే తొందరలో బైక్ ను వేగంగా నడపటంతో ఈ ప్రమాదం చోటు చేసుకోంది. మృతులను యాచవరంకు హరీష్, సాయిగా, డక్కిలి మండలం నడిపిల్లికి చెందిన అనురాధగా పోలీసులు గుర్తించారు. 

06:31 - August 16, 2016

ఆదిలాబాద్ : రైతు ప‌క్షాన పోరాటం ఉధృతం చేస్తోంది కాంగ్రెస్. దీని కోసం గులాబీ స‌ర్కారుపై రైతు శంఖారావాన్ని పూరించ‌బోతోంది. ఆదిలాబాద్ వేదికగా చేయ‌బోతున్న రైతు గ‌ర్జన‌లో కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యారు హ‌స్తం నేత‌లు. రైతు ఎజెండాతో జ‌ర‌ప‌బోతున్న ఈ బ‌హిరంగ స‌భ‌కు పార్టీ రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జీ దిగ్విజ‌య్ సింగ్ హ‌జ‌రు కాబోతున్నారు. తెలంగాణ‌లో ప్రధాన ప్రతిప‌క్షం కాంగ్రెస్ గులాబీ స‌ర్కారుపై కాలు దువ్వుతోంది. ప్రధానంగా రైతాంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్యల‌ను ఎప్పటిక‌ప్పుడు ఏక‌రువు పెడుతూ స‌ర్కారును ఎండ‌గ‌డుతున్న కాంగ్రెస్ నాయ‌కులు ఇప్పుడు ఆ స్పీడ్ ను మ‌రింత పెంచేందుకు సిద్ధమయ్యారు.

వత్తిడి పెంచేందుకు...
ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు కేసీఆర్ ప్రభుత్వం రుణ‌మాఫీని త‌క్షణం అమ‌లు చేయాల‌ని మొద‌టి నుంచి డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ విడ‌త‌ల వారిగా రుణ‌మాఫీతో రైతులు తీవ్రంగా న‌ష్టపోతున్నార‌ని వాదిస్తోంది. విడ‌త‌ల‌ వారీగా రుణ‌మాఫీ చేయ‌డం ద్వారా టిఆర్ఎస్ స‌ర్కారు రైతుల‌ను పూర్తిగా అప్పుల్లోకి నెడుతోంద‌ని హ‌స్తం నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. అందుకే రుణ‌మాఫీని ఒకేసారి చెల్లించాల‌నే డిమాండ్‌తో రైతు ప‌క్షాన పోరును ఉధృతం చేస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు. దీని కోసం ఆదిలాబాద్ జిల్లాలో రైతు గ‌ర్జన పేరుతో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌బోతున్నారు. ఈ బ‌హిరంగ స‌భ‌లో రైతు స‌మ‌స్యలే ప్రధాన ఎజెండాగా గులాబీ బాస్ ను ఎండ‌గ‌ట్టేందుకు కార్యాచ‌ర‌ణ సిద్దం చేసుకున్నారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం చేప‌ట్టిన భూసేక‌ర‌ణ‌లో 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టాన్ని అమ‌లు చేయాల‌ని కూడా ఈ స‌భ ద్వారా కాంగ్రెస్‌ మ‌రోసారి స‌ర్కారుపై వ‌త్తిడి పెంచ‌నుంది.

06:29 - August 16, 2016

హైదరాబాద్ : మొన్నటివరకు సోదాల్లో డాక్యుమెంట్లు దొరికాయి..ఇప్పుడు ఏకంగా భవనాలే బయటపడుతున్నాయి. బంధువులు.. అనుచరులు..కుటుంబీకులు..ఇలా ఎందరో పేర్లమీద ఉన్న ఆస్తులు వెలుగులోకి వస్తున్నాయి. ఇది గ్యాంగ్‌స్టర్ నయీం దందాల్లో ఓ కోణం...ఇక పదేళ్లుగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తనతో దందాలు చేసినవారు..లబ్ది పొందినవారి పేర్లతో డైరీతో పాటు వాయిస్..వీడియో రికార్డింగ్‌లు కూడా చేసినట్లు బయటపడుతుంది. ఇది మరో కోణం...దొరుకుతున్న సాక్ష్యాలతో సిట్‌ శోధనలో పెద్దోళ్ల జాతకాలు బయటపడనున్నాయి. గ్యాంగ్‌స్టర్‌ నయీం ఇప్పుడు ఎందరో గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. నయీం బతికున్నంతకాలం భయపడ్డవారు ఎందరో అయితే ఇప్పుడు ఎన్‌కౌంటర్‌ తర్వాత వణుకుతున్నవారు కూడా అదే స్థాయిలో ఉన్నారు..ఎక్కడ తమ జాతకాలు బయటపడతాయోనన్న భయం వెంటాడుతోంది. నయీంతో దందాలు చేసినవారు అనుచరులు, బంధువులు నయీంను అడ్డుపెట్టుకుని సెటిల్‌మెంట్లు చేయించుకున్నవారు. ఇలా ఎంతో మందిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నయీం కేసులను డీల్ చేస్తున్న సిట్‌ శోధనలో ఎన్నో బయటపడుతున్నాయి. వెతికినకొద్దీ ఏకంగా ఇళ్లు బయటపడుతున్నాయి. నయీం గుప్పిట్లో ఎన్నో భవంతులున్నాయి. తాజాగా పుప్పాలగూడలో మరో ఇల్లు బయటపడ్డంతో అందులో సోదాలు చేస్తే డాక్యుమెంట్లు..డబ్బు దొరికింది.

అనుచరుల పేర్లపై ఆస్తులు..
గ్యాంగ్‌స్టర్ నయీమ్ అతని కుటుంబ సభ్యుల పేరిట నల్లగొండ పరిసరాల్లో ఖరీదైన భవనాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నల్లగొండ పట్టణంలో నాలుగు భవనాలు, కనగల్ మండలం పర్వతగిరిలో ఒక ఇల్లు ఉన్నట్లు కనుగొన్నారు. నయీమ్ సోదరి అస్మత్ బేగం ఇచ్చిన సమాచారం మేరకు ఆస్తుల చిట్టాను బయటకు తీస్తున్నారు. బేగం పేరిట చైతన్యపురి కాలనీలో ఇల్లు, శ్రీనగర్ కాలనీలో నయీమ్ తల్లి తాహెరా బేగం పేరిట, మరదలు నేహా పేరిట ఇళ్లు, బావమరిది కూతురు నీలోమ పేరిట భవనం, కనగల్ మండలం పర్వతగిరిలో నయీమ్ సోదరుడు అలీమొద్దీన్ కుమార్తె మహెల్లా పేరిట ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. నయీమ్ కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు నార్సింగి పోలీ సులతో పాటు సిట్ అధికారి పుప్పాలగూడలోని ఇంట్లో సోదాలు నిర్వహించారు...మరోవైపు దీనికి సంబంధించిన సమాచారం సేకరిస్తూనే అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు.

అందరి జాతకాలు బయటపడే అవకాశం..
ఇదిలా ఉంటే తనను వాడుకుంటూ పబ్బం గడుపుకుంటున్నవారు తయారు చేసిన గ్యాంగ్‌స్టర్‌ నయీం నేరం తనదే కాదు..అందులో ఎందరో భాగస్వాములు కూడా ఉన్నారని వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది...నయీం చేస్తున్న దందాలకు సంబంధించి డైరీ రాసుకోగా గడిచిన పదేళ్లలో పెద్దోళ్లతో డీలింగ్‌లన్నీ వాయిస్‌ రికార్డులు...వీడియో సాక్ష్యాలు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇవి బయటపడితే మాత్రం తమకు సంబంధం లేదంటున్న ఎందరో జాతకాలు బయటపడే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసనప్పటినుంచి..అనుమానాలు మొదలయినప్పటి నుంచి పెద్దోళ్లలో వణుకు మొదలయింది. తన భూదందాలో లబ్ధిపొందిన వారి పేర్లను ఆధారాలతో సహా బయటకు వచ్చేలా చూడడానికి గ్యాంగ్‌స్టర్‌ పక్కాప్లాన్‌తో వ్యవహరించినట్లు తెలుస్తోంది.

06:23 - August 16, 2016

హైదరాబాద్ : రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్నర్‌ న‌ర‌సింహ‌న్‌ ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల సిఎంలు కేసీఆర్, చంద్రబాబుతో పాటు ఏపీ ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ హ‌జ‌ర‌య్యారు. అయితే జ‌గ‌న్ చంద్రబాబు.. కార్యక్రమం మ‌ధ్యలోనే వెళ్లిపోయారు. అనంత‌రం కేసిఆర్ గ‌వ‌ర్నర్‌తో అర‌గంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే ఈ సారి తెలంగాణలోని ప్రధాన ప్రతిప‌క్ష పార్టీ కాంగ్రెస్, టీడీపీ నేత‌లు ఎవ్వరూ హ‌జ‌రు కాలేదు. కానీ ఏపీ ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ మాత్రం అటెండ్ అయ్యారు. అయితే జ‌గ‌న్ చంద్రబాబు మ‌ధ్య ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం నెల‌కొంది. గ‌వ‌ర్నర్‌తో క‌ల‌సి వ‌చ్చిన చంద్రబాబు జ‌గ‌న్‌కి షేక్ హ్యండ్ ఇచ్చి ప‌ల‌క‌రించారు. అయితే ఇది గ‌మ‌నించ‌ని ఏపీ మండ‌లి ఛైర్మన్ చక్రపాణి జ‌గ‌న్ వెళ్తున్న స‌మయంలో రాజ‌కీయాలు ఏమైనా.. అంద‌రినీ క‌ల‌వాల‌ని సూచిస్తూ తానే స్వయంగా జ‌గన్ చేయి ప‌ట్టుకుని చంద్రబాబు వ‌ద్దకు వెళ్ళి హలో చెప్పాల‌ని సూచించారు. దీంతో జ‌గ‌న్ త‌న‌కు అటువంటిదేమి లేద‌ని... నేను ముందుగానే చంద్రబాబును క‌లిశాన‌ని చెప్పారు. దీంతో ప‌క్కనే ఉన్న కేసీఆర్, సుజ‌నా చౌద‌రి, బండారు ద‌త్తాత్రేయ‌, స్వామిగౌడ్, మ‌ధుసూదనాచారి ఆస‌క్తిగా గమనించారు.

ఫామ్ హౌస్ కు వెళ్లిన కేసీఆర్..
అయితే కార్యక్రమం మ‌ధ్య నుంచే జ‌గ‌న్‌ ఆ త‌ర్వాత చంద్రబాబు వెళ్లిపోయారు. అక్కడికి వచ్చిన వారంద‌రినీ గ‌వ‌ర్నర్‌ దంప‌తులు వెళ్లి ప‌ల‌క‌రించారు. కార్యక్రమం ముగిసిన త‌ర్వాత కేసీఆర్... గ‌వ‌ర్నర్‌తో ఓ అర‌గంట పాటు ఏకాంతంగా భేటి అయ్యారు. రాష్ట్రంలో జ‌ర‌గుతున్న రాజ‌కీయ ప‌రిణ‌ామాలపై చ‌ర్చించారు. ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌రిగిన గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంట‌ర్‌తో పాటు ఈ నెల 23న గోదావ‌రిన‌దిపై నిర్మించబోయే ప్రాజెక్టులపై మ‌హారాష్ట్ర సీఎంతో కుదుర్చుకోనున్న ఒప్పందాలు, రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తీసుకుంటున్న చ‌ర్యలు, త్వరలో ఏర్పాటు చేయ‌బోయే అఖిల‌ప‌క్ష స‌మావేశ వివ‌రాలను గ‌వ‌ర్నర్‌కి వివ‌రించిన‌ట్లు స‌మాచారం. కార్యక్రమం ముగియ‌గానే సీఎం కేసీఆర్ అటు నుంచి నేరుగా ఎర్రవ‌ల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. 

06:18 - August 16, 2016

నేడు టి.కాంగ్రెస్ రైతు గర్జన..

ఆదిలాబాద్ : నేడు జిల్లాలో టి.కాంగ్రెస్ రైతు గర్జన పేరిట సభ నిర్వహించనుంది. రైతు రుణమాఫీ, 2013 చట్టం ప్రకారమే భూ సేకరణ జరగాలనే డిమాండ్ తో రైతు గర్జన సభ నిర్వహించనున్నట్లు పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 

రాజధానిలో నేటి నుండి సీపీఎం ప్లీనరీ..

హైదరాబాద్ : నగరంలో నేటి నుండి సీపీఎం ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. మూడు రోజులపాటు కొనసాగే ఈ సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పరిశీలకులుగా హాజరవుతున్నారు. వివిధ జిల్లాలనుంచి 481మంది ప్రతినిధులుకూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 

నెల్లూరులో రోడ్డు ప్రమాదం..

నెల్లూరు : బాలాయపల్లి (మం) రామాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని బైక్ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులు యాచవరానికి చెందిన సాయి, హరీష్, డక్కిలి (మం) నడింపల్లికి చెందిన అనురాధలుగా గుర్తించారు. 

నేడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ..

హైదరాబాద్ : కృష్ణా జలాల పంపకాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది విచారణనను మంగళవారం నుండి చేపట్టనుంది. మూడు రోజుల పాటు ఈ విచారణ కొనసాగనుంది. 

రేపు కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులు, రీ డిజైన్ పై కాంగ్రెస్ పార్టీ బుధవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించనుంది. లోటస్ పాండ్ లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనుంది.

 

నేడు టాంకాం సమావేశం..

హైదరాబాద్ : నేడు గోల్కొండ హోటల్ లో టాంకాం సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఐటీ, ఎన్ఆర్ఐ ఎఫైర్స్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర హోం మంత్రి నాయినీ, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు. 

హన్మకొండలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య..

వరంగల్ : ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న టెన్త్ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన హన్మకొండలో జరిగింది. వరంగల్ జిల్లా నర్మెటకు చెందిన గడిపె ప్రభాకర్ రెండో కూతురు అరుంధతి(15) హన్మకొండ రెడ్డికాలనీలోని సెయింట్‌జోసెఫ్ పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. సోమవారం పాఠశాల ఆవరణలోని వార్డెన్ రూంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. 

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం...

హైదరాబాద్ : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, మరో 48 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 

ఫాం హౌస్ లో సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం చేరుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నాక ఫాంహౌస్‌కు వచ్చారు. 

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఈ మేరకు ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు ప్రకటించాయి. లీటరు పెట్రోల్‌పై రూపాయి, డీజిల్‌పై రూ.2 తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. తగ్గించిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేశాయి.

నేడు జిల్లా అధికారులతో రవాణాశాఖ సమావేశం..

హైదరాబాద్ : నూతన జిల్లాల్లో ఎలాంటి విధివిధానాలు నిర్వహించాలన్న దానిపై రవాణా శాఖ ముసాయిదాను రూపొందించనున్నది. ఈ మేరకు మంగళవారం ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న జిల్లాల రవాణాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

 

Don't Miss