Activities calendar

17 August 2016

22:21 - August 17, 2016
22:19 - August 17, 2016

బ్రెజిల్ : ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోనే తెలుగుతేజం కిడాంబీ శ్రీకాంత్ పోటీ ముగిసింది. రియో సెంటీనరీ సెంటర్లో ముగిసిన డూ ఆర్ డై సమరంలో చైనా సూపర్ స్టార్ లిన్ డాన్ చేతిలో 21-6, 11-21, 21-18 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. సెమీస్ చేరడంలో శ్రీకాంత్ విఫలమైనా బ్యాడ్మింటన్ ఆల్ టైమ్ గ్రేట్ లిన్ డాన్ ను మాత్రం ముప్పతిప్పలు పెట్టి..తానేమిటో నిరూపించుకొన్నాడు. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో ఇక...పీవీ సింధుపైనే భారత పతకం ఆశలు ఆధారపడి ఉన్నాయి.

 

22:16 - August 17, 2016

పాట్నా : బీహార్‌లో ఓ వైపు మద్య నిషేధం కొనసాగుతుండగానే.. మరోవైపు కల్తీ మద్యం 13 మంది ప్రాణాలను కాటేసింది. గోపాల్గంజ్ జిల్లాలో స్థానిక ప్రజలు అక్రమ మద్యాన్ని సేవించారు. ఆ మద్యం తాగిన వెంటనే వారు వాంతులు చేసుకున్నారు. వెంటనే వారిని ప్రాథమిక చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కొంతమంది పరిస్థితి విషమంగా మారడంతో గోరఖ్పూర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 13 మంది మృతి చెందారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి అధికారులు మాత్రం అనారోగ్యం వల్లే చనిపోయారని తెలిపారు. కల్తీ మద్యం సేవించడం వల్లే మృతి చెందారని బాధితులు చెబుతున్నారు.

 

22:09 - August 17, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై డిఎంకే ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేయడంతో అసెంబ్లీ అట్టుడికింది. జయలలిత డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చేలా చేస్తున్నారని ఆరోపించారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు అవరోధం కలిగిస్తున్నారన్న కారణంతో స్పీకర్‌ ధనపాల్‌ 89 మంది డిఎంకె ఎమ్మెల్యేలను వారం రోజుల పాటు సస్పెండ్‌ చేశారు. విపక్ష నేత స్టాలిన్‌ను మార్షల్స్‌ బలవంతంగా అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లారు.

 

22:05 - August 17, 2016

హైదరాబాద్ : తెలంగాణలో బలవంతపు భూసేకరణను ఆపాలని.. సీపీఎం ప్లీనంలో తీర్మానించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసి ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల దోపిడిని అరికట్టాలని, నయీం అక్రమాలపై న్యాయవిచారణ జరపాలనీ ప్లీనంలో తీర్మానాలు చేశారు.
467 మంది ప్రతినిధులు హాజరు 
సీపీఎం తెలంగాణ శాఖ ప్లీనం.. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతోంది. బుధవారం రెండోరోజున 467 మంది ప్రతినిధులు హాజరై వివిధ అంశాలపై లోతుగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్లీనంలో వివిధ తీర్మానాలను ఆమోదించారు. 123 జీవో ను రద్దు చేసి, 2013 చట్టాన్ని అమలు చేయాలని తీర్మానించారు. భూసేకరణ వ్యవహారంలో కోర్టుకు తప్పుడు అఫిడవిట్‌లను దాఖలు చేయడాన్ని నిలిపివేయాలనీ తీర్మానంలో డిమాండ్‌ చేశారు. సీఎం వెంటనే జోక్యం చేసుకొని నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు.
నయీం అక్రమాలపై న్యాయవిచారణ జరపాలని మరో తీర్మానం
గ్యాంగ్‌స్టర్‌ నయీం అక్రమాలపై న్యాయ విచారణ జరపాలని కూడా ప్లీనంలో మరో తీర్మానం చేశారు. రాజకీయ నాయకులు, పోలీసులకు నయీంతో లింకులను బయటపెట్టాలని.. నయీం డైరీ వివరాలను ప్రజల ముందుంచాలని ఈ తీర్మానంలో డిమాండ్‌ చేశారు. గతంలోనే పలు ఆరోపణలున్న సిట్‌ అధికారి నాగిరెడ్డి.. మంత్రులు, పోలీసు అధికారులపై ఎలా విచారణ చేస్తారని తీర్మానంలో ప్రశ్నించారు. 
కార్పొరేట్‌ ఆసుపత్రుల దోపిడీని నియంత్రించాలని తీర్మానం 
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడం ద్వారా.. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల దోపిడీని నియంత్రించాలని ప్లీనంలో మరో తీర్మానం చేసింది. జిల్లాల విభజన శాస్త్రీయంగా, సంస్కృతీసంప్రదాయాలను కాపాడేలా జరగాలని, జిల్లాల విభజనకు సంబంధించిన ప్రభుత్వ ప్రతిపాదనలను అఖిల పక్షానికి ముందుగానే.. అందించాలని సీపీఎం ప్లీనం డిమాండ్‌ చేసింది. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పరిశీలకులుగా హాజరైన ప్లీనం..  కార్మిక ,ఉద్యోగ సంఘాలు  తలపెట్టిన సెప్టెంబర్ 2 సార్వత్రిక సమ్మెకు మద్దతు  తెలపాలని తీర్మానించింది.

 

22:02 - August 17, 2016

విజయవాడ : శ్రావణ పౌర్ణమి సందర్భంగా పుష్కర స్నానాలకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో పోలీసులను అప్రమత్తంగా ఉండేలా ఆదేశించినట్లు ఏపీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ప్రతి ఘాట్ వద్ద ఉత్తమ సేవలు అందిస్తున్న ముగ్గురు సిబ్బందికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. విజయవాడలోని కమాండ్ సెంటర్‌లో పుష్కరాల్లో పోలీసుల పనితీరుపై చినరాజప్ప నిర్వహించిన సమీక్ష సమావేశంలో డీజీపీ సాంబశివరావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

21:58 - August 17, 2016

విజయవాడ : ఏపీలో స్పిన్నింగ్‌ మిల్లులకు యూనిట్‌ విద్యుత్‌ను కేవలం 2 రూపాయలకే అందించాలని నిర్ణయించినట్లు కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదన సిద్ధం చేసింది. పత్తి రైతులు, కార్మికులను దృష్టిలో ఉంచుకొని స్పిన్నింగ్‌ మిల్లులకు రాయితీలు, వెసులుబాట్లు కల్పించినట్లు మంత్రి యనమల తెలిపారు. టెక్ట్స్‌టైల్‌ రంగంపై విజయవాడలో కేబినేట్‌ సబ్‌ కమిటీ భేటీ జరిగింది. మంత్రి యనమల నేతృత్వంలోని ఈ భేటీకి మంత్రులు అయ్యన్న పాత్రుడు, శిద్ధా రాఘవరావు హాజరయ్యారు. సబ్ కమిటీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. 

 

21:51 - August 17, 2016

తెలంగాణల తెరకెక్కిన నీళ్ల పంజాది... కారుమీద గుర్రుమంటున్న కాంగ్రెస్, నయీం డైరీల కాలజ్ఞాన భవిష్యత్తు.. బైటపెడితే చాలా మంది పని శిత్తు శిత్తు, పుష్కరాలకు వచ్చిన బయటి రాష్ట్రాల దొంగలు... ఉంగరం ఉటాయించిన అయ్యగారు, కాపాడమని భక్తుని వేడుకున్న దేవుడు...పాలమూరు జిల్లల గుట్టెక్కిన శివుడు, మహారాష్ట్ర గవర్నర్ బంగ్ల కింద బంగ్ల.. బంగారం నగలు ఏంలేవంట అండ్ల, ఏడారిల నడిసిపోతున్న వింత జీవి.. పోర్చుగీసొళ్లను బయపెడుతున్న వీడియో.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం..

 

21:36 - August 17, 2016
21:35 - August 17, 2016
21:34 - August 17, 2016
21:33 - August 17, 2016
21:32 - August 17, 2016

తెలియని 150 మంది పాలతిట్ట గ్రామస్తుల ఆచూకీ

ఖమ్మం : పేగలో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఐదుగురి ఆచూకీ కోసం వెతుక్కుంటూ వెళ్లిన 150 మంది పాలతిట్ట గ్రామస్తుల ఆచూకీ తెలియలేదు. పాలతిట్ట, పేగ గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. 

నయీం కేసులో బయటపడుతున్న ఐఎఎస్ లింకులు

హైదరాబాద్ : నయీం కేసులో ఐఎఎస్ లింకులు బయటపడుతున్నాయి. భువనగిరిలో నయీం అనుచరులు జెడ్ పీటీసీ సుధాకర్ ..పాశం శ్రీనుపై పీడీ యాక్టు పెట్టకుండా ఐఎఎస్ అడ్డుకున్నారు. వీఐపీ బంధువుతో నయీం అనురులు మంతనాలు చేస్తున్నారు. ఐఎఎస్ బంధువుకు బహుమతిగా రూ.20 లక్షల విలువైన భూమిని నయీం కొనిచ్చారు. 
 

20:59 - August 17, 2016

నయీం అంతమైతే సమస్య పరిష్కారమయినట్టేనా...? నయీంతో సంబంధాలున్న పెద్దలెవరు..? నయీంని ఉపయోగించుకున్న ఖాకీలెవరు..? సిట్ విచాణలో గుట్టు వీడుతుందా..?? సిట్ సత్తా ఎంత.. ఈ అంశాలపై వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం. పూర్తి వివరాలను వీడియలో చూద్దాం...

20:56 - August 17, 2016

ఆర్థిక వ్యవసాయ రంగ నిపుణులు ప్రొఫెసర్ జయతీఘోష్ తో టెన్ టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తిరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే.. 'గత 25 ఏళ్ల సంస్కరణల ఫలమే నేడు కోట్లాదిమందికి ఉపాధి లేకపోవడం కొత్తగా ఉద్యోగాలేవి..? 
ఆర్థిక విధానంలో సమతుల్యత లోపించింది. వనరులను అభివృద్ధికి వినియోగించడం కంటే దోపిడీ పెరిగిపోయింది. 
25 ఏళ్ల తర్వాత మనమే ముందున్నాం.. ప్రజలపై కంటే కార్పొరేట్లపై డబ్బులు ఖర్చు పెట్టాడానికే పాలకులు దృష్టి పెడుతున్నారు. ఎన్ డీఏ, యూపీఏ రెండు దొందూ దొందే. యూపీఏ హయాంలో 2012 జాతీయ మాన్యుఫాక్చరింగ్ పాలసీ వచ్చింది. మోడీ కొత్తగా మేక్ ఇన్ ఇండియా అంటున్నారు.. రెండింటీకి పెద్ద తేడా లేదు. వెబ్ సైట్లు మీడియాలో ప్రకటనలిస్తే కాదు... విదేశీ పెట్టుబడులు రావడం లేదు. స్వదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం లేదు... మరి ఉద్యోగాలెక్కడ..? దేశీయ చిన్నతరహా పరిశ్రమలకను ప్రొత్సహిస్తే చాలా ఫలితాలు వస్తాయి. పబ్లిక్ సెక్టార్ కంపెనీల వల్ల నష్టాలనడం పాలకుల అవివేకం. పబ్లిక్ సెక్టార్లో ఉన్న బ్యాంకులు మాల్యా వంటి మోసగాళ్ల చేతిలో నష్టపోతున్నాయి. దీనిపై ఎవరూ నోరు మెదపరు. మెట్రో, ఫ్లైవోవర్ల నిర్మాణంలో ధనవంతులు భూములు కోల్పోతే మార్కెట్ రేటు ఇస్తారు.. అదే ప్రాజెక్టుల కోసం ఇచ్చే ప్రజలు బలహీనవర్గాలు కాబట్టి ఇవ్వడానికి లెక్కలేస్తారు. 
అభివృద్ధి కోసం భూములిచ్చే వారు దేశ శక్తులు.. వారికి పరిహారం ఎందుకివ్వరు..? రెండు తెలుగు రాష్ట్రాల్లో 2013 భూ సేకరణ చట్టం అమలు జరగడం లేదు. ల్యాండ్ పూలింగ్ కొంత ఒకే కానీ పరిహారం పునరావాసంపై దృష్టేది..?
ప్రధానికే చట్టాలపై శ్రద్ధ లేనప్పుడు మిగతా రాష్ట్రాల పాలకులకేముంది. వైఎస్ హయాంలో రైతుల ఆత్మహత్యల నివారణకు చాలా సిఫార్సులు చేశాం.. కానీ అవేమీ అమలుకు నోచుకోలేదు... అవి చేసి ఉంటే ఆత్మహత్యలు ఆగేవి. 
కమిషన్లు, కమిటీలనడం కాలం వెళ్లదీసే కార్యక్రమమే. ఉత్పత్తి ధరకు 50 శాతం కలిపి ఇస్తేనే అది మద్దతు ధర అని స్వామినాథన్ చెప్పారు. కానీ అమలు ఎక్కడ..? రైతులు, గిరిజనులు, గ్రామీణులంటే పాలకులకు చులకన. 
దీన్ని ప్రశ్నించాలి' అని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:10 - August 17, 2016
20:08 - August 17, 2016
20:07 - August 17, 2016
20:02 - August 17, 2016

కరీంనగర్ : కుటుంబ కలహాలతో.. కరీంనగర్‌లో ఓ మహిళ.. కుమారుడితో కలిసి పురుగుల మందు తాగింది. ఈ ఘటనలో ఐదేళ్ల కుమారుడు చనిపోగా... తల్లి ప్రాణాప్రాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన గోపగాని శ్రీనివాస్, నల్గొండ జిల్లా బీబీనగర్ కు చెందిన సుజాతను ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య కలహాలు పెరగడంతో.. సుజాత ఇవాళ కుమారుడు రాంచరణ్‌కు పురుగుల మందు తాగించి.. తాను తాగింది. కుమారుడు అక్కడికక్కడే చనిపోగా... చుట్టుపక్కల వారు సుజాతను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుజాత పరిస్థితి విషమంగా ఉంది. 

 

19:58 - August 17, 2016

హైదరాబాద్ : మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువయ్యాయని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. దళితులపై దాడులను నిరసిస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో గో గూండాల దిష్టిబొమ్మను దహనం చేశారు. సుందరయ్య పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. దాడులకు మోడీ సమాధానం చెప్పాలన్నారు. దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. 

 

19:54 - August 17, 2016
19:51 - August 17, 2016

కరీంనగర్ : గ్యాంగ్‌స్టార్ నయీం అనుచరులు రాంబాబు అలియాస్ రమేష్‌, గోపిలను కరీంనగర్ జిల్లా జగిత్యాల కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వీరికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వీరిని జగిత్యాల సబ్‌జైలుకు తరలించారు. ఇద్దరు నిందితుల నుంచి రెండు కార్లు, లక్షన్నర డబ్బు, ఐదు రౌండ్ల బుల్లెట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

 

19:43 - August 17, 2016

హైదరాబాద్ : నయీం పేరు విన్నట్లు తనకు గుర్తులేదని రిటైర్డ్ పోలీసు అధికారి శివానందరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లగొండలో తాను అతి తక్కువ కాలం మాత్రమే ఏఎస్పీగా పనిచేశానని తెలిపారు. 2003 వరకు తాను నల్లగొండ జిల్లాలో ఉన్నానని, అప్పటికి నయీం పేరు  పెద్దగా ప్రచారంలోకి రాలేదని తెలిపారు. సజ్జనార్, శివధర్‌రెడ్డి లాంటి అధికారులకు నయీంతో సంబంధం లేదని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు. నల్లగొండలో పనిచేయడంతోనే తన పేరు బయటకు వచ్చి ఉండొచ్చేమో గానీ.. తనకు సంబంధం ఉందో లేదో ఖరారు చేసుకుని తన పేరును ఉపయోగించాలని సూచించారు. 

 

19:38 - August 17, 2016

ఢిల్లీ : బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ సమావేశంలో మహారాష్ట్ర వాదనలు ముగిశాయి. మహారాష్ట్ర తరపున సీనియర్ న్యాయవాది అంధ్యార్జున వాదనలు వినిపించారు. మళ్లీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి మొదటి నుంచి నీటి కేటాయింపులు జరపాలని తెలుగు రాష్ట్రాలు డిమాండ్ చేయడం సరికాదని అభ్యంతరం తెలిపింది. ఏపీకి అన్యాయం జరిగినందునే ట్రైబ్యునల్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఆ రాష్ట్రం తరపు న్యాయవాది గంగూలీ వాదించారు. 

 

19:34 - August 17, 2016

హైదరాబాద్ : ఏఎస్సై మోహన్ రెడ్డి మళ్లీ బెదిరిపులు కొనసాగిస్తున్నారని బాధితుల సంఘం సి.ఐ.డి.ని కలిసింది. ఈమేరకు బాధితులు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మోహన్‌రెడ్డిపై 42 కేసులు నమోదైనందున పిడి యాక్ట్ కింద జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఎస్సై ఆగడాలను అడ్డుకట్టవేయలంటూ వేడుకుంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే : ఎంపీ రవీంద్ర

కాకినాడ : ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే అని అమలాపురం ఎంపీ రవీంద్ర అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 

రియో ఒలింపిక్స్ లో కిదాంబి శ్రీకాంత్ కు నిరాశ

బ్రెజిల్ : రియో ఒలింపిక్స్ లో కిదాంబి శ్రీకాంత్ కు నిరాశ కలిగింది. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ క్వార్టర్ర్స ఫైనల్లో శ్రీకాంత్  ఓటిమి పాలయ్యారు. మూడు సెట్ల పాటు మ్యాచ్ హోరా హోరిగా సాగింది. 

19:21 - August 17, 2016
19:18 - August 17, 2016

విశాఖ : జిల్లాలో విషాదం నెలకొంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. దేవరాపల్లి మండలం ఎ.కొత్తపల్లిలో బాణాసంచా తయారీ కేంద్రంలో బాణాసంచా తయారీ చేస్తుండగా పేలుడు సంబభించింది. ఈ ప్రమాదంలో కాకిపల్లి బుజ్జి, గాలి రాంబాబు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైనవారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రులు గంటా శ్రీనివాస్ రావు, అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. బాణాసంచా తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

 

18:43 - August 17, 2016

మెదక్ : జనావాసాల మధ్య.. ముఖ్యంగా స్కూలు.. మసీదుల నడుమ సెల్‌టవర్‌ వద్దంటూ విద్యార్థులు కదం తొక్కారు. వారి ఆందోళనలకు దిగొచ్చిన సొసైటీ.. నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ ఘటన.. హైదరాబాద్‌ శివారు బిహెచ్‌ఈఎల్‌ పరిధిలో చోటుచేసుకుంది. విద్యార్థుల ఉద్యమం దెబ్బకు పెద్దలు దిగొచ్చారు. స్కూలు పక్కనే నిర్మించ తలపెట్టిన సెల్‌ టవర్‌ అనుమతులను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. ఈమేరకు విస్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించారు. 
స్కూలు విద్యార్థులు, ముస్లిం పెద్దలు ఆందోళన
బిహెచ్‌ఈఎల్‌లో.. ఎంఐజీ క్వార్టర్స్‌లోని మార్గదర్శిని స్కూలు పక్కనే సెల్‌టవర్‌ నిర్మాణానికి ఎంఐజీ సొసైటీ అనుమతించింది. పోలీసుల సహకారంతో హడావుడిగా టవర్‌ నిర్మాణం చేపట్టింది. అయితే.. ఈ టవర్‌ పక్కనే స్కూలు, మసీదు ఉన్నాయి. టవర్‌ వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందంటూ స్కూలు విద్యార్థులు.. ముస్లిం పెద్దలు ఆందోళన చేపట్టాయి. 
సెల్‌టవర్‌ నిర్మాణాన్ని ఆపేయిస్తామని ప్రకటన 
ఆందోళనకు దిగివచ్చిన సర్పంచ్‌, ఎంఐజీ సొసైటీ పెద్దలు.. సెల్‌టవర్‌ నిర్మాణాన్ని ఆపేయిస్తామని ప్రకటించారు. ఆమేరకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో.. విద్యార్థులు.. ముస్లిం మత పెద్దలు ఆందోళన విరమించారు. 

 

18:34 - August 17, 2016

శ్రీకాకుళం : పేరుగొప్ప..బతుకులు దిబ్బ అన్న చందంగా మారింది చేనేత కార్మికుల పరిస్థితి..ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీకాకుళం పొందూరు ఖాది పేటెంట్ సంపాదించుకున్నా.. ప్రయోజనం మాత్రం శూన్యం. విశ్వవ్యాప్తంగా పేరున్న ఈ బట్టలకు ఇకనైనా మంచిరోజులు వస్తాయా... అన్న విషయం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్న తమ  ఖాదీకి   పేటెంట్ తో పాటు పెర్మనెంట్ ఆదాయం వచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం చేనేత కార్మికులు కోరుతున్నారు.
మారని చేనేత కార్మికుల బతుకులు 
పొందూరు ఖాది.. ఈ పేరుకు పరిచయమక్కర్లేదు.. నాటి గాంధీ నుంచి నేటి తరం రాజకీయనాయకుల వరకూ ఖాది వస్త్రాల విశిష్టతను పొగిడిన వారే... కానీ ఎందరు నాయకులు వచ్చినా ..ఎన్ని ప్రభుత్వాలు మారినా చేనేత కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదు.
గడ్డుపరిస్థితిల్లో చేనేత కార్మికులు
శ్రీకాకుళం జిల్లా పొందూరులో వేలాదిమంది చేనేత కార్మికులున్నారు. వంశపారంపర్యంగా తాతముత్తాతల కాలం నుంచి ఖాదీ వస్త్రాలను తయారు చెయ్యడం వీరి దినచర్య.. రోజంతా కష్టపడినా కనీసం 100 రూపాయలు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. ప్రభుత్వం ప్రోత్సాహం అందకపోవడంతో  కష్టాలు తప్ప అభివృద్ధి లేకుండా పోతోంది. దీంతో పొందూరు పరిసర ప్రాంతాల్లోని ఖాది వస్త్రాల  కార్మికులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 
చేనేతను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
పొందూరు ఖాదీ వష్ట్రాలకు ఖాది విలేజి ఇండస్ట్రి కమిషన్ పేటెంట్ హక్కులు పొందింది. దీంతో  నకిలీ ఖాదీని అడ్డుకోవడంతోపాటు ప్రైవేట్ సంస్థలు, వస్త్ర వ్యాపారులు, పొందూరు ఖాదీ వస్త్రాలు విక్రయిస్తే చర్యలు తీసుకునే వీలుంటుంది.. అయితే ప్రభుత్వం ఈ విషయంలో కట్టుదిట్టంగా వ్యవహరిస్తే తప్ప తమ బతుకులు బాగుపడవని చేనేత కార్మికులు చెబుతున్నారు. ప్రపంచ ప్రఖ్యతిగాంచిన పొందూరు ఖాదిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని చేనేత కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

18:27 - August 17, 2016

హైదరాబాద్ : పరస్పర సహకారంతో ముందుకు వెళ్లారు..అవును ఐపీఎస్‌ అధికారులు..గ్యాంగ్‌స్టర్‌ల మధ్య అవగాహన ఒప్పందాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది... హైదరాబాద్‌ నగరంతో పాటు మిగతా ప్రాంతాల్లో సెటిల్‌మెంట్ల వ్యవహారంలో నయీంకు అడ్డుగా ఉన్న రౌడీలు..గూండాలను అడ్డు తొలగించుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు...అందుకు నయీంకు పోలీసులు సహకరిస్తూ ..వారి ఖాతాలో ఎన్‌కౌంటర్లు వేసుకున్నట్లు తెలుస్తోంది... గ్యాంగ్‌స్టర్‌గా మారిన అజీజ్‌రెడ్డి ఎన్‌కౌంటర్‌ స్కెచ్‌కూడా నయీందేనని డైరీ చెబుతోంది...
సీనియర్‌ పోలీసు అధికారులతో వ్యవహారం..
నయీం ఇంట్లో దొరికిన డైరీ ప్రకంపనలు సృష్టిస్తోంది...ఇప్పటికే ఎన్నో విషయాలపై సిట్‌ పోలీసులు లోతుగా శోధిస్తుండగా సీనియర్ ఐపీఎస్‌ల ప్రమేయం కూడా ఉన్నట్లు అందులో ఉన్నట్లు సమాచారం...పేజీలు తిప్పుతున్న కొద్దీ ఒక్కొక్క విషయం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది...నయీం తన రక్త చరిత్రకు అడ్డు లేకుండా కొనసాగేందుకు రాజకీయ నేతలను. మీడియా ఉపయోగించుకున్న నయీం అంతకు మించి పోలీసులను వాడుకున్నాడు, సీనియర్‌ ఐపిఎస్‌ అధికారుల అండదండలు ఉండటంతో ఎన్‌కౌంటర్లు చేయించి తనకు అడ్డు లేకుండా చూసుకున్నాడు. తనకు అడ్డుగా ఉన్నవాడు..తనను మించి పోతున్నవాడిని అంతం చేయించేందుకు పోలీసు బుల్లెట్‌ వాడుకోవడంలో నయీం సక్సెస్‌ అయినట్లు తెలుస్తోంది...తన చేతికి రక్తం అంటకుండా ప్రత్యర్థులపై పంజా విసరడంలో గ్యాంగ్‌స్టర్‌ ప్లానింగ్‌ డైరీ చెబుతోంది.
అజీజ్‌రెడ్డిపై దృష్టి
మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు పక్కలో బళ్లెంగా ఉన్న చోటా రాజన్‌ గ్యాంగ్‌లో కీలకంగా మారాడు అజీజ్‌రెడ్డి...నల్గొండ నివాసి అయిన అజీజ్‌రెడ్డి కొన్నేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో ఎన్‌కౌంటర్‌ అయ్యాడు...అప్పట్లో ఈ ఎన్‌కౌంటర్‌ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది...అయితే ఈ ఎన్‌కౌంటర్‌ వెనుక అసలు సూత్రధారి నయీంగా తేలింది...ఈ విషయాన్ని నయీం తన డైరీలో స్పష్టంగా రాసుకున్నట్లు తెలుస్తోంది..అజీజ్‌ రెడ్డి అసలు పేరు వెంకటరెడ్డి... నల్గొండ నుంచి ఉపాధి కోసం ముంబై వెళ్లి అక్కడ ఒక బార్‌లో బౌన్సర్‌గా పనిచేశాడు,  ఆ సమయంలో ఛోటా రాజన్‌ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ముంబైలో కొంతకాలంగా చీకటిరాజ్యంలో జోరుగా కార్యకలాపాలు సాగించిన అజీజ్‌రెడ్డి ఆ తర్వాత మహానగరంపై కన్నేశాడు..హైదరాబాద్‌ వచ్చి తన కార్యకలాపాలు మొదలుపెట్టాడు...అజీజ్‌ ఎదిగితే తనకు చోటు ఉండదని భావించిన నయీం ప్లాన్‌తో వ్యవహరించినట్లు తెలుస్తోంది...ఇందుకు తనకు సహకరించిన ఆఫీసర్‌కు పదికోట్లకుపైనే ముట్టచెప్పినట్లు డైరీలో రాసుకున్నట్లు తెలుస్తోంది..
నయీంకు చుక్కలు చూపించిన వేణు...
ఇక గ్యాంగ్‌స్టర్‌గా నయీం ఎన్నో దందాలు చేసినా హైదరాబాద్‌ నేరెడ్‌మెట్‌లో రౌడీషీటర్‌ వేణుగోపాల్‌ తన ఆధిపత్యంతో దూసుకుపోయాడు... హైదరాబాద్‌లో మొట్టమొదటిగా రికవరీలు చేయడంతో వేణుగోపాల్‌ హవా ఎక్కువగా సాగింది..పెద్దమొత్తాల్లో రికవరీలకు అతిపెద్ద ఆర్థిక సంస్థలు వేణుగోపాల్‌తో ఒప్పందం కుదుర్చుకునేవి, క్రమంగా భూములకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా వేణుగోపాల్‌ చురుగ్గా వ్యవహరించాడు...ఈ వ్యవహారం నయీంకు ఇబ్బందిగా మారింది. దీనితో సైబరాబాద్‌లో సీనియర్‌ పోలీసు బాస్‌ను కలిసిన నయీం వేణుగోపాల్‌ను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు...ఇక వేణును హతమార్చినందుకు గచ్చిబౌలి ప్రాంతంలో విలువైన భూములను అధికారికి ముట్టచెప్పినట్లు నయీం డెరీలో రాసినట్లు తేలుస్తోంది...
డైరీలో విషయాలపై ఆరా...
నయీం డైరీలో ఒక్కొక్క విషయంపై పోలీసులు దృష్టి సారించారు. డైరీలో ఉన్న విషయాలు ఏమేరకు వాస్తవాలు అన్న అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సిట్‌లో ఒక బృందం డైరీకి సంబంధించిన అంశాలపై పరిశీలన సాగిస్తోంది. పూర్తి స్థాయి దర్యాప్తు తరువాత నయీంకు ఏయే అధికారులు సహకరించారో వివరాలతో ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నారు.

 

18:19 - August 17, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో నీళ్ల పేరుతో టీప్రభుత్వం దోపిడీ చేస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై టీకాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కాకి లెక్కలు చెప్పారని మండిపడ్డారు. రూ.1.50 లక్షల కోట్లకు టెండర్ పిలిచి దోపిడీకి తెరతీశారని పేర్కొన్నారు. కోటి ఎకరాలకు నీళ్లు ఏ సర్వే నెంబర్ లో ఇస్తారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల ప్రాజెక్టులకు డీపీఆర్ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి తెలంగాణ భవిష్యత్ ను తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో కాంట్రాక్టర్లు, కమీషన్లకే ప్రాధాన్యం ఉందన్నారు. 2013 భూసేకరణ చట్టానికి జీవో 123 జీవోతో తూట్లు పొడిచారని మండిపడ్డారు. ప్రభుత్వం అప్రజాస్వామిక భూసేకరణను అడ్డుకుంటామన్నారు. కాంగ్రెస్ పై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రభుత్వం ఏ వైపుకు తీసుకుపోతుందన్నారు. 

17:59 - August 17, 2016

ఢిల్లీ : విండీస్‌లో టెస్ట్ సిరీస్‌ ముగియక ముందే టీం ఇండియా నెంబర్‌ వన్ ర్యాంక్ కైవసం చేసుకుంది. ఇప్పటివరకు నెంబర్ వన్‌గా ఉన్న ఆస్ట్రేలియా నెంబర్‌ టూకు పడిపోయింది. లంకతో జరిగిన సిరీస్‌ను కంగారులు.. 3-0తో ఓడిపోయారు. దీంత భారత్‌.. విండీస్‌తో నాలుగో టెస్ట్ ఆడక ముందే నెంబర్‌ వన్‌ గా నిలిచింది. అయితే ఈ ర్యాంక్‌ను కొనసాగించాలంటే .. విండీస్ తో జరిగే నాలుగో టెస్ట్‌ ను కూడా భారత్‌ గెలవాల్సి ఉంటుంది. 

 

విండీస్ సిరీస్ భారత్ కైవసం...

ఢిల్లీ : టెస్టుల్లో భారత్ కు మళ్లీ నెంబర్ వన్ ర్యాంకు దక్కింది. విండీస్ సిరీస్ ను 2...0 తో భారత్ గెలుచుకుంది. లంకతో 3..0తో సిరీస్ ను ఆసిస్ కోల్పోయింది. ఓటమితో ఆసిస్ రెండో ర్యాంకుకు పడిపోయింది. 

17:54 - August 17, 2016

చత్తీస్ గఢ్ : దంతెవాడలో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరో 8 మంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. పలువురు పోలీసులకు గాయపడ్డారు. ఎన్ కౌంటర్ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతారణం నెలకొంది. 

 

రెండ్ రోజు కొనసాగుతున్న సీపీఎం ప్లీనరీ సమావేశాలు

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2 వ రోజు సీపీఎం ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్లీనం పలు తీర్మానాలను ఆమోదించింది. సెప్టెంబర్ 2 న కార్మికులు తలపెట్టిన బంద్ కు సీపీఎం మద్దతు తెలిపింది. 

దంతెవాడలో ఎన్ కౌంటర్

చత్తీస్ గఢ్ : దంతెవాడలో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 
నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. 

 

 

అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కాకిలెక్కలు : ఉత్తమ్

హైదరాబాద్ : అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కాకిలెక్కలు చెప్పారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై టీకాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. రూ.1.50 లక్షల కోట్లకు టెండర్ పిలిచి దోపిడీకి తెరతీశారని ఎద్దేవా చేశారు. 

కోటి ఎకరాలను నీళ్లు ఇస్తామంటూ కేసీఆర్ మోసం : ఉత్తమ్

హైదరాబాద్ : కోటి ఎకరాలను నీళ్లు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పీసీపీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై టీకాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో నీళ్ల పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తోందన్నారు.

 

నలుగురు ఆదివాసీలను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

తూర్పుగోదావరి : చింతూరు మండలం పేగ అటవీప్రాంతంలో మావోయిస్టులు నలుగురు ఆదివాసీలను కిడ్నాప్ చేశారు. పోలీసులు అప్రమత్తమయ్యారు. 

16:32 - August 17, 2016

తూర్పుగోదావరి : గో సంరక్షణ పేరుతో దళితులపై దాడి చేస్తున్న గో సంరక్షణ దళ సభ్యులు గోవుల ఆలనాపాలన చూసుకోవడం లేదు. గోవులపై ప్రేమ ఒలకబోస్తున్న వారు వాటికి కనీసం తిండిపెట్టడం లేదు. గాసం లేక, నీళ్లు లేక ఆవులు ఆకలితో అలమటించి, మలమల మాడి మృత్యువాతపడుతున్నాయి. గో సంరక్షకులమని చెప్పుకుంటున్న కార్యకర్తలు గోవులపై ఉత్తుత్తి ప్రేమ ఒలకబోస్తున్నారు. కాకినాడ గోశాలలో దారుణం జరిగింది. గోసంరక్షణ సంస్థలో పరిస్థితులు  దారుణంగా మారాయి. తిండి లేక మూడు గోవులు మృతి చెందాయి. కాకినాడలోని జంతు హింసా నివారణ సంఘం ఆధ్వర్యంలో గోశాల నడుస్తోంది. ఇందులో మొత్తం 400 వందల గోవులు ఉన్నాయి. తాజాగా గాసం లేక మూడు ఆవులు మృత్యువాతపడ్డాయి. మరో 100 గోవుల పరిస్థితి దారుణంగా ఉంది. తిండి, నీళ్లు లేక ఆవులు బక్కచిక్కిపోయాయి. కాటికి దగ్గరయ్యాయి. వీటి ఆలనాపాలన చూసే దిక్కు లేదు. గోవుల ప్రాణాలపై తెగ గగ్గోలు పెడుతున్న గోసంరక్షణ దళ సభ్యులు వాటికి కనీసం గాసం సమకూర్చే స్థితిలేరు. తాజాగా గోవుల మృతి ఘటన... గోవుల పేరుతో రాజకీయం చేస్తున్న వారికి వాటిపై ఎమాత్రం ప్రేమ ఉందో ఇట్టే తెలుస్తోంది. ఆవులకు తిండిపెట్టేందుకు నిధులు లేవని గోశాల నిర్వహకులు అంటున్నారు. గోవుల మృతిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన జంతవులను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ అమాలాపురంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆవుల చర్మం తీస్తున్నారని దళితులపై గో సంరక్షణ దళ సభ్యులు డాడులకు పాల్పడ్డారు. కానీ తిండి లేక చనిపోతున్న గోవులను కాపాడే స్థితిలో, వాటి ఆలనాపాలన చూసే స్థితిలో లేరని పలువురు అంటున్నారు. 

 

15:56 - August 17, 2016

రంగారెడ్డి : డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఇళ్ల నిర్మాణం కోసం అనువైన స్థలాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి. జనార్దన్‌ రెడ్డి పరిశీలించారు. రాజేంద్రనగర్‌లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రంగారెడ్జి జిల్లా జాయింట్‌ కలెక్టర్, హౌసింగ్‌ అధికారులతో కలిసి జీహెచ్ ఎంసీ కమిషనర్‌ ఇళ్ల స్థలాలను పరిశీలించారు. 

15:52 - August 17, 2016

హైదరాబాద్ : 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా..ముచ్చెర్ల ఫార్మాసిటీ భూసేకరణ కోసం తెచ్చిన 45 జీవోను రద్దు చేస్తూ హైకోర్టు స్టే ఇవ్వడం శుభపరిణామమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 2013 భూసేకరణ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికే 45, 123 జీవోలు తెచ్చారని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

 

15:45 - August 17, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం డైరీ విషయాలను బయటపెట్టాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్లీనం సమావేశాల్లో నయీం ఎన్‌కౌంటర్‌ పరిణామాలపై చర్చించామని తెలిపారు. మాఫియా డాన్‌ నయీంను సాధారణ నేరస్తుడిగా పరిగణించరాదన్నారు. మావోయిస్టులను హతం చేయడానికి, అధికార పనులు చక్కబెట్టుకోవడానికి ప్రభుత్వాలు నయీంను ఉపయోగించుకున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులకు నయీం చరిత్ర తెలియకుండా ఉంటుందా..? అని ప్రశ్నించారు. 

 

15:23 - August 17, 2016

రంగారెడ్డి : నిత్యావసర సరకుల ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఆకాశానంటున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను  డిమాండ్‌ చేశారు. నిత్యావసర సరకులను బడా వ్యాపారాలు నల్లబజారుకు తరలిస్తున్నా పట్టించుకునే దిక్కులేదని చాడ అన్నారు. చాడ వెంకటరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ  కార్యక్రమంలో సీపీఐ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

 

15:10 - August 17, 2016

హైదరాబాద్ : తాను ఎవరినీ వేధించలేదని ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ పీఎస్‌ పద్మావతి అన్నారు. ఈమేరకు ఆమో టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కొందరు కావాలనే కుట్ర చేసి తనను టార్గెట్‌ చేస్తున్నారని పద్మావతి ఆరోపించారు. తనకు ప్రమోషన్‌ వస్తే కిందివారు వెనకబడిపోతారనే ఇలా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. నన్ను ఆఫీస్‌ నుంచి బయటకు తోసేశారని తెలిపారు. షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసి పరిస్థితి వివరిస్తానని చెప్పారు. టీఎస్‌ ఉద్యోగుల ఆందోళనపై స్పందించిన నవీన్‌ మిట్టల్‌.. ఉద్యోగసంఘాల నేతల్ని చర్చలకు ఆహ్వానించినట్టు 
తెలుస్తోంది.

15:06 - August 17, 2016
15:00 - August 17, 2016

హైదరాబాద్ : ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ కార్యాలయం ముందు తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలు ఆందోళనకు దిగారు. నవీన్‌ మిట్టల్‌ పీఎస్ పద్మావతిని ఏపీకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఆమెను బయటకు పంపి కుర్చీ తోసేశారు. 

 

కడప జిల్లా టీ.కోడూరులో ఉద్రిక్తత

కడప : కొండాపురం మండలం టీ.కోడూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. పీఎస్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన రామసుబ్బారెడ్డి వర్గీయులపై ఆదినారాయణ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు.  
 పీఎస్ లో ఫర్నీచర్ ధ్వంసమైంది. 

విశాఖ జిల్లా కొత్తపల్లిలో ప్రమాదం

విశాఖ : దేవరాపల్లి మండలం కొత్తపల్లిలో ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ముగ్గురు మృతి చెందారు. 

 

కరీంనగర్ లో ఎక్లాట్ ప్రారంభం..

కరీంనగర్ : జిల్లాలో ఎక్లాట్ మెడికల్ సొల్యూషన్స్ యూనిట్ ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని జగిత్యాల రోడ్ లో గల పాపారావు కాంపెక్స్ లో ఏర్పాటు చేసిన ఎక్లాట్ యూనిట్ ను బుధవారం మంత్రులు కేటీ రామారావు, ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్ ప్రారంభించారు. 

రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెస్ ఆరోపణలు - మంత్రి ఇంద్రకరణ్..

హైదరాబాద్: రాజకీయ ఉనికి కోసమే ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని దేవాదాయ, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు. 

మావోయిస్టు క్యాంపుల ధ్వంసం..

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ : కాంకేర్ ప్రాంతంలో పోలీసులు పెద్దఎత్తున‌ కూంబింగ్‌ నిర్వహించారు. 12 కు పైగా మావోయిస్టుల క్యాంప్‌లను పోలీసులు ధ్వంసం చేశారు. అనంతరం భారీ ఎత్తున్న పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. 

కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు..

కడప : జిల్లాలోని కొండాపురం మండలం టి.కొడూరు గ్రామంలో నీరు చెట్టు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు కొట్టుకున్నారు. పనుల విషయంలో గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగారు. 

13:43 - August 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్య..వైద్య సమస్యలు పరిష్కరించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఎస్వీకేలో సీపీఎం ప్లీనం సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశానికి సంబంధించిన వివరాలను తమ్మినేని మీడియాకు వెళ్లడించారు. అటవీ ప్రాంతంలో వైద్య, విద్య అందుబాటులో లేదని, మూడున్నర కోట్ల మంది ప్రజలకు వైద్య..విద్య అందించేందుకు కృషి చేయాలని సూచించారు. విద్య అనేది మారుమూల అటవీ ప్రాంతంలో కూడా జరగాలని, ఇంగ్లీషు చదవాలంటే లక్ష రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉందన్నారు. కార్పొరేట్ శక్తులను రక్షించే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.

పెద్ద ఎత్తున్న ఉద్యమాలు..
రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను చేయాలని ప్లీనం నిర్ణయం తీసుకుందన్నారు. దేశం అంతా వెలిగిపోతుందంటూ ఎర్రకోటలో చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ పేర్కొన్నారని, కానీ దేశం ఎక్కడా వెలిగిపోవడం లేదన్నారు. గత పది సంవత్సరాల నుండి ఇప్పటి వరకు చూస్తే ధరలు అమాంతం పెరిగిపోయాయన్నారు. ద్రవ్యోల్బణం తగ్గిస్తున్నామని చెప్పడం సరికాదని, ఉద్యోగాలు కల్పించడం లేదన్నారు. నల్లధనం డబ్బు ఎక్కడా అని ప్రశ్నించారు. మతోన్మాదం పెరిగిపోతోందని ఇలాంటి సమస్యలపై సీపీఎం కన్నెర్ర చేస్తోందని, సెప్టెంబర్ 2వ తేదీన జరిగే సమ్మెలో అన్ని ట్రేడ్ యూనియన్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ సమ్మెను జయప్రదం చేయడానికి సీపీఎం కృషి చేస్తుందన్నారు. ప్లీనం జయప్రదంగా కొనసాగుతోందని, ఇంకా చర్చలు కొనసాగుతాయన్నారు. సాయంత్రానికి డాక్యుమెంట్ కు ఆమోదం తెలియచేస్తామని, అన్ని జిల్లాలు..అన్ని రంగాల నుండి ప్రతినిధులు ప్లీనంకు హాజరయ్యారన్నారు. జిల్లాల విభజనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం నుండి సమాచారం అందిందని, సీపీఎం పార్టీ తరపు హాజరవుతున్నామన్నారు. 

13:39 - August 17, 2016

ఈ మధ్యకాలంలో మగవారు చాలా మంది భార్యలు ఉండగానే వారికి విడాకులు ఇవ్వకుండానే మరో వివాహం చేసుకుంటున్నారు. వీరిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపై మానవి 'వేదిక'లో లాయర్ పార్వతి విశ్లేషించారు. ఇలా చేయడం నేరమవుతుందని, నేరం నిర్ధారించబడితే ఏడేళ్ల పాటు జైలు శిక్ష పడుతుందన్నారు. ఈ అంశంపై పాటు పలు ప్రాంతాల నుండి ప్రజలు వ్యక్తపరిచిన న్యాయ సలహాలు..న్యాయ సందేహాలను లాయర్ పార్వతి నివృత్తి చేశారు. మరింత వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:35 - August 17, 2016

విజయవాడ : పుష్కర ఘాట్లను సీపీఎం నేతలు పరిశీలించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి పుష్కర ఘాట్లలో నాసిరకం పనులు చేశారని ఏపీ సీపీఎం కమిటీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు ఆరోపించారు. భద్రతను గాలికొదిలేసి నాయకులు పుష్కరాల పేరుతో దోచుకుంటున్నారని, అతి అంచనాలు వేసుకోవడం..అతిగా ఖర్చు చేయడం వల్ల ప్రజాధనం వృధా అయ్యిందన్నారు. ఇలాంటి అంచనాలు ఎందుకు వేశారని ప్రశ్నించారు. చాలా మంది ప్రజలు ఉదారంగా సహాయం చేయడానికి ముందుకొస్తున్నారని తెలిపారు. కానీ ప్రభుత్వం మాత్రం వారి గురించి పట్టించుకోవడం లేదని, పది రోజుల నుండి పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ప్రాణనష్టం జరుగుతోందని, రాబోయే రోజుల్లో ప్రాణనష్టం జరగకుండా, ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. ఘాట్ లపై వేసిన టైల్స్ ఊసిపోతున్నాయని, వెంటనే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. 

13:33 - August 17, 2016
13:31 - August 17, 2016

హైదరాబాద్ : పవర్ స్టార్ అంటే ఓ బ్రాండ్... పవన్ ఓ ట్రెండ్ సెట్టర్... చిరు ఇమేజ్ తో ఇండస్ట్రీకి వచ్చినా తనకంటూ సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న స్టార్... రాజకీయలకు అంటుకున్న బూజు దులపాలని కంకణం కట్టుకున్న పొలిటీషియన్... మొత్తానికి ఆయనో హ్యూమన్ బీయింగ్... ఇప్పుడు పవన్ ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డాడంట. ఆయనకు ఎంతో ఇష్టమైన కారును అమ్ముకునే పరిస్థితి వచ్చిందట. ఏంటి నమ్మేలా లేదు కదా.... పవర్ స్టార్ ఆయన రూటే వేరు... 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' నుండి 'సర్ధార్ గబ్బర్ సింగ్' వరకు ఆయన మూవీస్ కి ఓ ట్రెండ్ సెట్టర్. బద్రీ, ఖుషి మూవీస్ తో.. ఫ్యాన్ ఫాలోయింగ్ ను అమాంతం పెంచుకున్న పవన్ ఆతరువాత పవర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిపోయాడు... కల్యాణ్ బాబు సినిమా అంటే ఫ్యాన్స్ కి పండగే. పవన్ ఎవ్వరి మాట వినడండి... ఇదేంటి ఇది మన సీతయ్య డైలాగ్ కదా అని అనుకుంటున్నారా ? అదేం లేదు పవన్ కూడా ఓసారి డిసైడ్ అయితే ఎవరి మాట వినడు. ఆయన అనుకున్నది సాధించే వరకు వదలడట. అది ఏ పని అయిన కాని దానిలో ఫర్ఫెక్షన్ చూస్తాడట కల్యాణ్ బాబు. అందుకే ఎప్పుడు పనివిషయంలో చాలా సీరియస్ గా ఉంటాడు పవర్ స్టార్.

రాజకీయాల్లో..
సినిమాలలో తనేంటో నిరూపించుకున్న పవన్ రాజకీయాలవైపు అడుగులు వేశాడు. అన్నతో కలిసి ప్రజారాజ్యంలో ఆక్టీవ్ గా పార్టిస్పైట్ చేశాడు. ఆ తరువాత ప్రజారాజ్యం కనుమరుగవ్వడంతో అన్నతో కొద్దిగా మనస్పర్థలు వచ్చి దూరంగా ఉన్నాడు. రీసెంట్ గా 2 ఇయర్స్ బ్యాక్ జనసేనను స్థాపించాడు కల్యాణ్. ప్రజలకు సేవచేయాలని రాజకీయల్లోకి వచ్చిన పవన్ పూర్తిగా రాజకీయలపై దృష్టిపెట్టడంలేదు. పవన్ హంగులు ఆర్భాటాలు లేని వ్యక్తి. షూటింగ్స్ లేపోతే ఫామ్ హౌస్ లో కూరగాయలు పండించుకుంటాడు. తోటపని చేసుకుంటాడు. ఇంట్లో సాదా సీదా లైఫ్ స్టైల్ పవన్ ది. ఎవరైనా సాయం కోసం వస్తే వెంటనే స్పందించే గుణం ఆయనది. అటువంటింది ఇప్పుడు... పవన్ ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డారంట. అంతే కాదు అప్పుల్లో ఉన్నాడని టాలీవుడ్ లో హాట్ టాక్ నడుస్తుంది.

కారును అమ్మేశాడంట..
2011 లో ఎంతో ఇష్టంతో కొనుకున్న కారును పవన్ అమ్మేశాడంట. అది కూడా ఎవరికో సహాయం చేయడం కోసం తనకిష్టమైన కారును అమ్మేశాడంట. దాదాపు కోటికి పైన విలువ చేసే ఈ కారులోనే రాం చరణ్ ని పెళ్ళికి తీసుకువచ్చారు అప్పుడు. అది కూడా పవన్ స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకువచ్చాడు. ఆర్ధిక ఇబ్బందుల వల్లనే తను పార్టీ కార్యక్రమాలలో కూడా పూర్తిగా పాల్గొనలేకపోతున్నాను అని గతంలో పవన్ అన్నాడు.

కన్ఫ్యూజన్..
సర్ధార్ గబ్బర్ సింగ్ పక్కన పెడితే ఈ మధ్య పవన్ సినిమాలన్నీ హిట్టే. అయినా సరే కల్యణ్ బాబు ఆర్ధిక పరిస్థితి ఎందుకు మారిపోయింది. సొంత కారును.. అదికూడా ఇష్టపడి కొనుకున్న దానిని అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇందులో ఉన్న రహస్యం ఏమిటో అని అటు టాలీవుడ్ జనాలు.. ఇటు పొలిటికల్ లీడర్స్ మొత్తానికి పవన్ ఫ్యాన్స్ కన్ఫూజన్ లో పడ్డారు.. 

అఖిలపక్ష సమావేశానికి హాజరవుతాం - తమ్మినేని..

హైదరాబాద్ : రాష్ట్రంల జిల్లాల విభజనను స్వాగతిస్తున్నామని, అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన సమాచారం తమకు వచ్చిందని సీపీఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. విద్య, వైద్య సమస్యలను పరిష్కరించాలని ప్లీనంలో ఆమోదించండం జరిగిందన్నారు. 

13:22 - August 17, 2016

హైదరాబాద్ : మంచి చదువులు చదివి ఉన్నత ఉద్యోగం చేస్తూ తమను ఆదుకుంటారని ఆశిస్తున్న కన్నతల్లిదండ్రుల కలలు కల్లలవుతున్నాయి. క్షణికావేశంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుల్జాపూర్ గ్రామానికి చెందిన విష్ణు బీటెక్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వెస్లీ హాస్టల్ లో ఉంటున్నాడు. తోటి విద్యార్థులు వెళ్లిపోయిన అనంతరం హాస్టల్ గదిలో ఉరేసుకుని విష్ణు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ కు గల కారణాలు తెలియరావడం లేదు. కానీ ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ దొరికింది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని..జీవితంపై విరక్తి చెందడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. విష్ణు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విష్ణు కొంత మానసిక వత్తిడికి గురయ్యాడని తెలుస్తోంది. 

13:12 - August 17, 2016

విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ నిండు కుండలా మారిపోయింది. వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. 11.4 అడుగులకు చేరింది. నాగార్జున, పట్టిసీమ, పులిచింతల నుండి 18 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నీటి ప్రవాహం ఎక్కువవుతుండడంతో నీటిని కాల్వలకు వదులుతున్నారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజ్ కు ఎగువనున్న దుర్గాఘాట్, పున్నమీ ఘాట్..తదితర ఘాట్ల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ఎత్తున నీరు రాలేదని..ప్రస్తుతం వస్తున్న వరద ఉధృతి చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:58 - August 17, 2016

కేరళ కుట్టి నిత్యామీనన్ అద్భతమైన అవకాశం అందుకుంది. ఈ బ్యూటీకి మహానటి జీవిత చరిత్రలో నటించే గోల్డెన్ ఆఫర్ వరించినట్లు సమాచారం. నటిగా సవాల్ చేసే మహానటి పాత్రలో నిత్యామీనన్ ఏ మేరకు ఒదిగిపోనుందనేది ఇప్పుడు సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ నిత్యామీనన్ ఏ మహానటి పాత్రలో నటించనుందో తెలుసుకోవాలంటే చదవండి..

సావిత్రి...
'మహా నటి' అనగానే ప్రతి ఒక్కరికి కళ్లముందు 'సావిత్రి' కదలాడుతుంది. అంతటి పేరు సంపాదించిన 'సావిత్రి' దారిదాపుల్లోకి తరువాత వచ్చిన ఏ హీరోయిన్ చేరలేకపోయింది. అలాంటి 'మహానటి' పాత్రలో ఇప్పుడు 'నిత్యమీనన్' నటిస్తుండడం ఆసక్తికరంగా మారింది. గతంలో 'డర్టీ పిక్చర్' భామ 'విద్యా బాలన్' 'మహానటి' పాత్రను పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లేనని తెలిపోయింది. లేటేస్ట్ ఆ గొప్ప పాత్రను 'నిత్యమీనన్' రక్తికట్టించడానికి రెడీ అవుతోంది. తొలి సినిమా 'ఎవడే సుబ్రమణ్యం'తో దర్శకుడు నాగ్ అశ్విన్ విమర్శకులను సైతం మెప్పించాడు. ఇప్పుడు ఈ దర్శకుడే మహానటి 'సావిత్రి' లైఫ్ స్టోరీని సినిమాగా రూపొందించాలని కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్స్ అనుకున్న నాగ్ అశ్విన్ ఫైనల్ 'నిత్యామీనన్' అయితేనే పాత్రకు సరైన హీరోయిన్ అని ఫిక్స్ అయ్యాడట.

మెప్పిస్తుందా ? 
ఈ జనరేషన్ హీరోయిన్స్ లో 'నిత్యామీనన్' నటిగా మంచి పేరు సంపాదించింది. ఈ బ్యూటీ చేసిన కొన్ని సినిమాలు చూస్తే నిత్యలో ఎంత మంచి నటి దాగుందో అర్ధం అవుతోంది. అందుకే 'సావిత్రి' పాత్రకు 'నిత్యామీనన్' అయితేనే న్యాయం చేయగలదని దర్శకుడు భావించినట్లు సమాచారం. ద్విభాష చిత్రంగా రూపొందనున్న మహానటి సినిమాతో దర్శకుడిగా నాగఅశ్విన్, నటిగా నిత్యామీనన్ ఎంత వరకు ఆడియన్స్ ని మెప్పిస్తారో చూడాలి. 

కొత్తపల్లిలో అగ్నిప్రమాదం..

విశాఖపట్టణం : దేవరాపల్లి మండలం కొత్తపల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందారు. 

కళ్యాణ దుర్గంలో ఫైర్ ఆక్సిడెంట్..

అనంతపురం : కళ్యాణదుర్గంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ లో గ్యాస్ నింపుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. పలువురికి గాయాలయ్యాయి. రూ. 30 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. 

గవర్నర్ తో బాబు భేటీ..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పున్నమిఘాట్ లో గవర్నర్ దంపతులు పుణ్యస్నానం ఆచరించిన సంగతి తెలిసిందే. 

బీహార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..

బీహార్ : రాష్ట్రంలో కల్తీ మద్యం కలకలం సృష్టించింది. గోపాల్ గంజ్ లో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు. కల్తీ మద్యం వల్లే ఈ ఘటన జరిగిందని కుటుంసభ్యులు పేర్కొంటున్నారు. 

12:24 - August 17, 2016

ఐఏఎస్..ఐపీఎస్ ల మధ్య వివాదం..

హైదరాబాద్ : తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ల‌ మధ్య వివాదం రాజుకుంది. త‌మ‌ను కాకుండా ఐపీఎస్‌ల‌ను ప‌లు శాఖ‌లకు క‌మిష‌న‌ర్‌లుగా నియ‌మించ‌డం ప‌ట్ల ఐఏఎస్‌లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. 

12:21 - August 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్..ఐపీఎస్ ల మధ్య వివాదం నెలకొంది. ప‌లు శాఖ‌లకు క‌మిష‌న‌ర్‌లుగా తమనుకు త‌మ‌ను కాకుండా ఐపీఎస్‌ల‌ను నియ‌మించ‌డం ప‌ట్ల ఐఏఎస్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం సరైంది కాదని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఐపీఎస్ సీవీ ఆనంద్ కు సివిల్ సప్లయి కమిషనర్ గా బాధ్యతలు అప్పగించడాన్ని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ తో మాట్లాడాలని ఐఏఎస్ లు భావిస్తున్నారు. ఇప్ప‌టికే సాంఘిక సంక్షేమ శాఖ‌లో ఐపీఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ప‌నిచేస్తున్నారు. కాగా, ట్రాన్స్ ఫోర్ట్ క‌మిష‌న‌ర్‌గా కూడా ఐపీఎస్‌ను నియ‌మించే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉందని తెలుస్తోంది. 

రాజేంద్రనగర్ లో జీహెచ్ఎంసీ కమిషననర్ పర్యటన..

రంగారెడ్డి : రాజేంద్రనగర్ లో జీహెచ్ఎంసీ కమిషననర్ పర్యటిస్తున్నారు. డబుల్ బెడ్ రూ ఇళ్ల నిర్మాణం కోసం అనువైనస్థలాలను ఎంపిక చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

12:11 - August 17, 2016
12:09 - August 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్పీకర్ కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు జరిగి రెండేళ్లవుతున్నా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పీకర్, ఫిరాయించిన ఎమ్మెల్యేలకు జస్టిస్ కురియన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. మరి దీనిపై ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాలి. 

తెలంగాణ పార్టీ ఫిరాయింపులపై సుప్రీంలో విచారణ..

హైదరాబాద్ : తెలంగాణ పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ దాఖలు చేసిన పిటిషణ్ ను విచారించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. 

11:48 - August 17, 2016
11:38 - August 17, 2016

మన సినిమాలు తమిళ డబ్బింగ్ లుగా మారుతున్నాయి. పెద్దగా ఆశించిన ఫలితం లేకపోయినప్పటికి తెలుగు సినిమాలను మాత్రం తమిళంలోకి డబ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ యంగ్ హీరో ప్లాప్ సినిమాను తమిళంలోకి డచ్ చేసి రిలీజ్ చేస్తుండడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ ఏ హీరో ప్లాప్ సినిమాను తమిళంలోకి తీసుకెళ్లుతున్నారో తెలుసుకోండి. అదేం చిత్రమో ఒక భాషలో ఆడని సినిమాల్ని కూడా ఇంకో భాషలోకి అనువాదం చేస్తుంటారు. ఇది ఎక్కువగా తమిళం నుంచి తెలుగులోకి వచ్చే అనువాద చిత్రాల విషయంలో జరుగుతూ ఉంటుంది. ఐతే ఈ మధ్య తెలుగు సినిమాల్ని కూడా తమిళంలోకి తెగ అనువదించేస్తున్నారు. 'బ్రూస్ లీ', 'బ్రహ్మోత్సవం' సినిమాలను అలాగే రిలీజ్ చేశారు. 'నాగచైతన్య' ప్లాప్ మూవీని కూడా ఇలాగే తమిళంలోకి డబ్ చేస్తున్నారు.

ఓ లైలా పేరిట అనువాదం..
తాజాగా 'నాగచైతన్య' సినిమా 'ఒక లైలా కోసం'ను తమిళంలోకి లైలా ఓ లైలా పేరుతో అనువాదం చేస్తున్నారు. 2014లో విడుదలైన ఒక లైలా కోసం పెద్దగా ఆడలేదు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సోసోగా ఆడి యావరేజ్ అనిపించుకుంది. ఐతే చైతూకి తమిళంలో మార్కెట్ ఏమీ లేకపోయినా ఈ సినిమాను ఓ నిర్మాత అనువాదం చేసి రిలీజ్ చేస్తుండడం విశేషం. 'లైలా కోసం' మూవీ కాన్సెప్ట్ ఏమైనా వెరైటీగా ఉంటుందా అంటే అదీ లేదు. ఇక్కడ సరిగా ఆడని, ఓ మామూలు సినిమాను తమిళంలోకి అనువాదం చేసి ఏం ప్రయోజనమో అర్ధం కావడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయిన తెలుగు సినిమాలకు తమిళ అనువాద ప్రొడ్యూసర్స్ పెద్ద రేట్ పెట్టి కొనరులే. ఏ లక్షకో రెండు లక్షలకో ఈ చిత్రం హక్కులు తీసుకోని దానికి కాస్త లాభం వస్తే చాలాని ఇలాంటి డబ్బింగ్ లు చేస్తుంటారని టాక్.

11:33 - August 17, 2016

సీనియర్ స్టార్ బాలకృష్ణ మీద భారీ భారం పడుతోంది. బాలయ్య కొత్త చిత్రం 'గౌతమి పుత్త శాతకర్ణి' పై ఎంత క్రేజ్ ఉన్నప్పటికి ఆయన రేంజ్ కి మించిపోయిందట. దీంతో ఈ భారాన్ని నటసింహా బాలకృష్ణ ఎంత వరకు సేఫ్ జోన్ కి తీసుకెళ్లుతాడనేది ఇప్పుడు ఇంట్రెస్ట్ గా ఉంది. మరి బాలయ్యపై పడిన అదనపు భారం ఎంటో తెలుసుకోవాలంటే చదవండి..ఎంతటి ఊరమాస్ స్టార్ అనేది అందరికి తెలిసిందే. 'లెజెండ్' తో బాక్సఫీసు వద్ద తన మాస్ ఇమేజ్ ఏంటో ఈ సీనియర్ హీరో మరోసారి ఫ్రూవ్ చేశాడు. అయితే 'లెజెండ్' భారీ హిట్టు అయినప్పటికి ఈ చిత్రం కలెక్షన్లు మాత్రం 40కోట్లు మాత్రమే. అంటే బాక్సఫీసు వద్ద బాలయ్య స్టామినా 40కోట్లు అన్నమాట. ఇంకా అదరహో రేంజ్ హిట్టు పడితే 50కోట్లు అనుకుందాం. కానీ ఇప్పుడు ఈ లెక్కకు మించి శాతకర్ణ మూవీకి ఖర్చు పెడుతున్నాట్లు టాక్.

రూ. 70 కోట్లు...
'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం దర్శకుడు క్రిష్ 70 కోట్ల బడ్జెడ్‌ వెచ్చిస్తున్నాడట. బాలయ్య 100వ చిత్రం కావడంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని రూపొందించాలని దర్శకుడు భావిస్తున్నాడు. అయితే ఇక్కడే బడ్జెట్ మిస్ ఫైర్ అయ్యేలా కనిపిస్తోంది.అయితే ఈ బడ్జెట్ విషయంలో క్రిష్ కానీ బాలయ్య కానీ ఏ మాత్రం భయపడడం లేదట. వీరి లెక్కలు వీరికి ఉన్నట్లు తెలుస్తోంది. 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై 70కోట్లు పెట్టడం పెద్ద రిస్కేం కాదని యూనిట్ భావిస్తోందట. ఎందుకంటే బాలకృష్ణ వందో సినిమా కావడం ఒకెత్తు అయితే ఈ చిత్రం చారిత్రక చిత్రం కావడం మరో విశేషం. ఈ కాన్సెప్ట్ ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసిన కనెక్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే బాలయ్య కానీ దర్శకుడు క్రిష్ కానీ 70కోట్ల బడ్జెట్ విషయంలో భయపడడం లేదట. దీనికి తోడు ఇటీవల తెలుగు మార్కెట్ కూడా బాగా పెరిగింది. మరి సంక్రాంతి రిలీజ్ కానున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో బాలయ్య ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. 

పార్టీ ముఖ్యనేతలతో జగన్ భేటీ..

హైదరాబాద్ : పార్టీ ముఖ్యనేతలతో వైసీపీ అధ్యక్షుడు జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమంపై చర్చిస్తున్నారు. 

వంజరి హాట్ రోడ్డులో జీపు బోల్తా...

విశాఖపట్టణం : జి.మాడగుల (మం) వంజరి హాట్ రోడ్డులో జీపు బోల్తా కొట్టింది. ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. 

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ సమీక్ష...

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం ఏర్పాటు చేశారు. 9,10వ షెడ్యూల్, కేంద్ర ప్రాయోజిక పథకాలపై చర్చిస్తున్నారు. 

దోషులను కఠినంగా శిక్షించాలి - టి. పోలీసు అధికారుల సంఘం..

హైదరాబాద్ : కుకునూరుపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని, ఘటనప ఉన్నతాధికారులను కలుస్తామని తెలంగాణ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 

 

ఎర్రవారిపాలెంలో ఎర్రచందనం దుంగల స్వాధీనం..

తిరుపతి : ఎర్రవారిపాలెం (మం) కోటకాడపల్లి వద్ద పోలీసుల వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఓ వాహనంలో 28 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. 

11:19 - August 17, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుష్కర సందడి నెలకొంది. ఆరో రోజు పలు ఘాట్ లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భవానీ ఘాట్, పున్నమి ఘాట్..ఇతర ఘాట్ లకు భక్తుల తాకిడి ఎక్కువైంది. వీఐపీ ఘాట్ లలో పలువురు స్నానాలు చేశారు. పున్నమి ఘాట్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులతో కలిసి పుష్కర స్నానమాచరించారు. కాసేపట క్రితం గవర్నర్ దంపతులు పుణ్యస్నానాలు ఆచరించి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తదితరులు పుష్కరస్నానమాచరించారు. స్పీకర్ కోడెల కుటుంబంతో పుణ్యస్నానాలు ఆచరించారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:16 - August 17, 2016

గుంటూరు : జిల్లాలోని పిడుగురాళ్ల సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన 13 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గుంటూరు జిల్లా దాచేపల్లి నుండి విశాఖలోని నర్సీపట్నంకు సిమెంట్ లోడ్ తో వెళుతున్న లారీ రోడ్డుపక్కన ఆగింది. హైదరాబాద్ నుండి నెల్లూరుకు వెళుతున్న ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టింది. దీనితో ఇద్దరు ప్రయాణీకులు బస్సులో ఇరుక్కుని అక్కడికక్కడనే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డారు. క్షతగాత్రులను పిడుగురాళ్ల, నరసరావుపేట ఆసుపత్రులకు తరలించి... చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

11:13 - August 17, 2016

ఎస్ఐ రామకృష్ణారెడ్డి బంధువుల ఆందోళన..

మెదక్ : గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి ఎదుట ఎస్ఐ రామకృష్ణారెడ్డి బంధువులు ఆందోళన నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి మద్దతుగా టిడిపి నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి రాస్తారోకో నిర్వహించారు. 

11:11 - August 17, 2016

హైదరాబాద్ : ప్రభుత్వ పాలన..వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాని..ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమి అనుకుంటున్నారో తెలుసుకొనేందుకు నిర్వహించిన 'గడపగడపకు వైసీపీ' ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో జగన్ కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన నేతతో ఆయన లోటస్ పాండ్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీలు కూడా కార్యక్రమంలో పాల్గొనేలా జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కార్యక్రమం సక్సెస్ కావాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు.

వైఎస్ జయంతి..
జులై 8వ తేదీన వైఎస్ జయంతి రోజ సందర్భంగా ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. అందులో భాగంగా ప్రభుత్వం పాలన..ప్రభుత్వ వైఫల్యాలను తెలుసుకొనేందుకు 'గడపగడపకు వైసీపీ' పేరిట కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంపై నేతలు ఆసక్తి చూపెట్టలేదు. దీనితో 13 జిల్లాలో సగం మాత్రమే కార్యక్రమం చేశారు. ఇందులో పాల్గొనడానికి పార్టీ నేతలు అంతగా ఉత్సాహం చూపడం లేదని తెలుస్తోంది. కొంతమంది నేతలు టిడిపి వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ ఈ భేటీ ఏర్పాటు చేశారు. మరి ఈ భేటీ అనంతరం ఎలాంటి వ్యూహాలతో ప్రజల ముందుకు వెళుతారో చూడాలి. 

బాబు టెలికాన్ఫరెన్స్..

విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో ఆరో రోజు ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాల్లో తొలి అర్ధభాగం విజయవంతంగా పూర్తి చే యడం జరిగిందని, డబ్బుల వసూలుపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. మరిన్ని ఉచిత బస్సులను అందుబాటులోకి తేవాలని సూచించారు. 

నగరంలో డ్రగ్స్ కలకలం..

హైదరాబాద్: ఏడుగురు నైజీరియన్లను వెస్ట్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 70 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. 

10:15 - August 17, 2016

మెదక్ : జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. డీఎస్పీ, సీఐల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొనడం కలకలం సృష్టిస్తోంది. బుధవారం తెల్లవారుజామున రామకృష్ణారెడ్డి తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. తొలుత వ్యక్తిగత కారణాలని తెలిసింది. కానీ ఘటనస్థలంలో సూసైడ్ నోట్ దొరికింది. ఈ నోట్ లో అనేక అంశాలు ప్రస్తావించాడు. గత రెండు నెలల క్రితం డీఎస్పీకి రూ. 15 లక్షలు ఇచ్చినుట్ల, గత ఎనిమిది నెలలుగా సీఐకి డబ్బులు ముట్ట చెబుతున్నానని లేఖలో పేర్కొన్నాడు. కానీ వీరి వేధింపులు మానడం లేదని తెలిపాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఏఎస్పీతో విచారణ జరిపిస్తామని ఎస్పీ చంద్రశేఖర్ ప్రకటించారు. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టడం జరుగుతుందన్నారు. సివిల్ తగదాల్లో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇసుక మాఫియా కూడా ఉందని, ఇందులో పోలీసుల జోక్యం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

10:06 - August 17, 2016

విజయవాడకు చేరుకున్న గవర్నర్..

విజయవాడ : గన్నవరానికి గవర్నర్ దంపతులు చేరుకున్నారు. గవర్నర్ కు డీజీసీ సాంబశివరావు, మంత్రి ప్రత్తిపాటిలు స్వాగతం పలికారు. కాసేపట్లో పున్నమి ఘాట్ వీరు పుణ్యస్నానం ఆచరించనున్నారు. 

09:58 - August 17, 2016

యాత్రికులను దోచేస్తున్న పుష్కర దొంగలు...నదీ తీరాన సంచరిస్తున్న ముఠాలు..పుష్కరాలకు వచ్చిన భక్తుల దోపిడి..

పుష్కరాలకు వెళ్లే వారు జర భద్రంగా ఉండండి. పుష్కరాలు జరుగుతున్న కృష్ణా నదీ తీర ప్రాంతంలో దోపిడి దొంగలు మాటు వేసి ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈజీగా దోచేస్తున్నారు. భారీగా డబ్బులు..నగలతో పుష్కరాలకు వెళ్లకుండా ఉంటేనే బెటర్ అని పలువురు సూచిస్తున్నారు. ఏ మాత్రం ఎమరుపాటుగా ఉన్నా నిలువునా దోచేస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని చిల్లర దొంగలంతా నది తీరానికి చేరారంట. పుష్కర దోపిడికి సంబంధంచిన వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

09:51 - August 17, 2016

2003లో అంగన్ వాడీ కార్యకర్త మిస్సింగ్..ఆ తరువాత కిడ్నాప్ హత్యగా తేలింది..అవయవాల కోసం రక్త చరిత్ర..ఎన్నో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి..

కావాల్సిన వారిని ట్రాప్ చేయడం..ఆ తరువాత వారిని ఫాం హౌస్ కు తీసుకెళ్లడం..అక్కడ అరాచకానికి పాల్పడిన తరువాత మోతాదుకు మించిన మెడిసిన్ ఇచ్చి అంతం చేయడం...నిజాలు బయటకు రాకుండా ఉండేందుకు పూడ్చిపెట్టడం..ఇలా ఎన్నో చేశాడు. ఈ కేసులో ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. చివరకు ఓ ఫోన్ కాల్ తో పోలీసులు శోధిస్తే ఆరు హత్యోదంతాలు బయటపడ్డాయి. డెడ్ బాడీలను జేసీబీతో తవ్వించి బయటకు తీశారు. ఈ హత్యలన్నీ ప్రాణాలు పోయాల్సిన ఓ వైద్యుడే చేశాడు. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

09:32 - August 17, 2016

విజయవాడ : రాష్ట్రంలో పుష్కర సందడి నెలకొంది. ఆరో రోజు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజామునుండే ఘాట్లకు పోటెత్తుతున్నారు. పలు ఘాట్లలో వీఐపీలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అమరావతిలో ధ్యానబుద్ధ ఘాట్ వద్ద భక్తుల సందడి నెలకొంది. పున్నమి ఘాట్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులతో కలిసి పుష్కర స్నానమాచరించారు. విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తదితరులు పుష్కరస్నానమాచరించారు. కాసేపటి క్రితం స్పీకర్ కోడెల కుటుంబంతో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక విజయవాడకు కూడా భక్తుల రద్దీ అధికంగానే ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:27 - August 17, 2016
09:26 - August 17, 2016

గుంటూరు : జిల్లా పిడుగురాళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ నుండి ఓ ప్రైవేటు బస్సు నెల్లూరుకు వెళుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి నుండి విశాఖలోని నర్సీపట్నంకు సిమెంట్ లోడ్ తో వెళుతున్న లారీ రోడ్డుపక్కన ఆగింది. ఈ లారీని ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను పిడుగురాళ్ల, నరసరావుపేట ఆసుపత్రులకు తరలించి... చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

09:20 - August 17, 2016

హైదరాబాద్ : ఆడపిల్ల పుట్టిందని..వ్యభిచారం చేయాలంటూ భర్త చేసిన వేధింపులకు భరించలేని ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఎల్లారెడ్డిగూడలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన రాము..రంగారెడ్డి జిల్లాకు చెందిన సుశీలతో 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నం..ఇతర లాంఛనాలు ముట్టచెప్పారు. ఆడపిల్ల అని స్కానింగ్ లో తేలుతుండడంతో గతంలో రాము అబార్షన్ చేయించాడు. కానీ ఇటీవల ఆడపిల్ల పుట్టడంతో వ్యభిచారం చేయాలని వత్తిడి తెచ్చేవాడు. అంతేగాకుండా అదనపు కట్నం తేవాలని వేధించే వాడు. తీవ్రమనస్థాపానికి గురైన సుశీల ఆత్మహత్యకు పాల్పడింది. సుశీల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరులగా విలపిస్తున్నారు. 

09:15 - August 17, 2016

మెదక్ : జిల్లాలో కుకునూరుపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. బుధవారం తెల్లవారుజామున సర్వీసు రివాల్వర్ తో కాల్చుకున్న సంగతి తెలిసిందే. డీఎస్పీ శ్రీధర్, సీఐ వెంకటయ్యలు వేధించారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల వేధింపులతో ఉద్యోగం మానేస్తానని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారని భార్య పేర్కొంటోంది. ఎవరూ లేని సమయంలో రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఇద్దరు కానిస్టేబుల్, ఎస్ఐ లకు రామకృష్ణారెడ్డి పేర్కొనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇతని మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సూసైడ్ లేఖలో ఎలాంటి అంశాలు పేర్కొన్నారో తెలియాల్సి ఉంది. 

బీహార్ లో ఏడుగురు మృతి..

బీహార్ : రాష్ట్రంలోని గోపాల్ గంజ్ ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

బీజేపీ నేతపై కాల్పుల ఘటనలో ముగ్గురి అరెస్టు...

ఉత్తర్ ప్రదేశ్ : బీజేపీ నేత బ్రిజ్ పాల్ తేవతియాపై కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మూరద్‌నగర్ నుంచి 2012లో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ నేత బ్రిజ్‌పాల్ తేవతియాపై దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

08:47 - August 17, 2016

ఎల్లరెడ్డిగూలో వివాహిత ఆత్మహత్య..

హైదరాబాద్ : ఎల్లారెడ్డి గూడలో దారుణం చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని వ్యభిచారం చేయాలని ఓ భర్త పేర్కొనడంతో మనస్థాపానికి గురైన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. 

08:22 - August 17, 2016
08:20 - August 17, 2016

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. జిల్లాలో పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పది ఘాట్లలో మాత్రమే రద్దీ కొనసాగుతోంది. ప్రముఖంగా నాగార్జున సాగర్ తదితర కొన్ని ఘాట్లకు భక్తులు తరలివస్తున్నారు. 15 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే జర్నలిస్టులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్విస్తున్నారు. అనుమతించకపోవడంపై జర్నలిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. ఎలాంటి సమస్య రాకుండా చేస్తామని హామీనిచ్చారు. 

08:14 - August 17, 2016

టాలీవుడ్..బాలీవుడ్..మాలీవుడ్..ఇలా ఏ వుడ్ లోనైనా హీరో..హీరోయిన్స్ పై గాసిప్స్..రూమర్స్ వస్తుంటాయి. వాళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని..విభేదాలు వచ్చాయని..ఇలా రకరకాల వార్తలు పుకార్లు షికార్లు చేస్తుంటాయి. వీటిపై సంబంధిత తారలు స్పందించేంత వరకు ఇలాంటి వార్తలు వస్తుంటాయి. ఇలాగే ప్రముఖ నటుడు కమల్ హాసన్ మొదటి భార్య సారిక కూతురైన శృతి హాసన్..గౌతమి మధ్య ఫైటింగ్ జరిగినట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. కమల్ హాసన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'శభాష్ నాయుడు'. ఈ చిత్రంలో కమల్ కూతురిగా శృతి హాసన్ నటిస్తోంది. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా గౌతమి వర్క్ చేస్తోంది. గౌతమి డిజైన్‌ చేసిన కాస్ట్యూమ్స్ నచ్చకపోవడంతో షూటింగ్‌ జరుగుతున్న సెట్‌లోనే శ్రుతిహాసన్‌, గౌతమి ఇద్దరూ తిట్టుకున్నారని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. దీనితో శృతి హాసన్ అధికార ప్రతినిధి స్పందించారు. శృతి వేసుకొనే కాస్టూమ్స్ కు గౌతమి డిజైన్ చేయడం జరిగిందని, ఈ డిజైన్ కు శృతి కొన్ని మార్పులు చేయించారని తెలిపారు. వారిద్దరి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదని, వీరిద్దరూ చాలా సంతోషంగా ఉంటారని తెలిపారు. 

08:09 - August 17, 2016

విజయవాడ : ఏపీలో పుష్కరాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. పున్నమి ఘాట్ వద్ద భక్తులతో నిండిపోయింది. జిల్లాలో ఉన్న ఆరు ప్రధాన ఘాట్లలో భక్తుల రద్దీ నెలకొంది. వీఐపీల తాకిడితో పాటు భక్తుల తాకిడి అధికంగా ఉంది. సుదూర ప్రాంతాల నుండే కాక పక్క రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తున్నారు. జేబు దొంగలు తమ హస్తలాఘవాన్ని వాడుతున్నారు. విలువైన బంగారు ఆభరణాలు తస్కరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనితో పోలీసులు దొంగలపై దృష్టి పెట్టారు. నిన్న విజయవాడ సిటి పోలీసులు కొంతమందిని పట్టుకున్నారు. దూరంగా వచ్చే భక్తులకు ఎలా వెళ్లాలో తెలియడం లేదని, సరైన బోర్డులు పెట్టలేదన్నారు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులతో కలిసి పుష్కర స్నానమాచరించారు

పుష్కర స్నానం చేసిన ప్రముఖులు..

ఢిల్లీ : ఏపీలో పుష్కరాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. పున్నమి ఘాట్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులతో కలిసి పుష్కర స్నానమాచరించారు. విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తదితరులు పుష్కరస్నానమాచరించారు. 

07:50 - August 17, 2016

అందంగా కనపడాలి అంటే ఆరోగ్యకర ఆహరం తప్పని సరి. చర్మానికి కావలసిన పోషకాలు అందితేనే ఆరోగ్యంగానే కాకుండా అందంగా కనబడుతారు. సమతుల్య ఆహరాలను తీసుకోవటం వలన చర్మానికి కావలసిన పోషకాలు అందుతాయి. దీనితో ఆరోగ్యంగా మరియు అందంగా కనపడతారు. మృదువైన చర్మం, నునుపైన జుట్టు, ప్రకాశ వంతమైన కళ్ళు, స్లిమ్ గా కనపడాలంటే అందైమన ఆరోగ్యం ముఖ్యం.
కొవ్వు పదార్థాలు, చక్కెరలు మరియు రెడ్ మీట్ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. హోల్ గ్రైన్స్, తృణధాన్యాల వంటి వాటిని తినండి.
శరీరానికి కావలసిన చక్కెరలను, పండ్ల ద్వారా తేనె ద్వారా పొందవచ్చు.
ప్రతి రోజు తాజా పండ్లు మరియు కూరగాయలు ఉండేలా చూసుకోండి. పచ్చి కూరగాయలు తినటం వల్ల మార్పులు వస్తాయి.
వెన్న తీసిన పాలు, పన్నీరు వంటి వాటిని కూడా ఆహార ప్రణాళికలో కలుపుకోండి. ఆకుకూరలలో పాలకూరను ఎక్కువగా తినండి. కూరగాయలను ఎక్కువగా ఉడకబెట్టకండి.
పండ్లు, కూరగాయలు మరియు తాజాగా తయరు చేసిన వెజిటేబుల్ జ్యూస్'లు చాలా ముఖ్యం. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను మాత్రమే కాకుండా, జీర్ణ వ్యవస్థలో త్వరగా గ్రహింప బడతాయి.
ఈ సహజ ఆహారాలు, జీర్ణ వ్యవస్థను శుభ్రపరచటమే కాకుండా, శరీరంలో ఉండే హానికర కారకాలను బయటకి పంపి వేస్తాయి.

07:31 - August 17, 2016

కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజలపై ఆర్థిక భారం మోపే విధంగా ఉన్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి విమర్శించారు. ఆకాశానంటున్న నిత్యాసరాల ధరలతో ప్రజల కొనుగోలు శక్తి రోజురోజుకు తగ్గిపోతోందని ఆందోళనవ వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో నిరుద్యోగిత పెరిగిన అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నడింపల్లి సీతారామరాజు (విశ్లేషకులు), జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), ఆచారి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:04 - August 17, 2016

వినాయక ఉత్సవాల ఏర్పాట్లు జోరందకుంటున్నాయి. విగ్రహాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. మరోవైపు వినాయక ఉత్సవాలలో అట్టహాసాలు వద్దు, మట్టి విగ్రహాలే వాడండంటూ ప్రచారోద్యమమూ సాగుతోంది. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు హైదరాబాద్ పెట్టింది పేరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఇతర పట్టణాల్లోనూ ఇటీవల కాలంలో వినాయక ఉత్సవాలు గ్రాండ్ గా నిర్వహించేందుకు పోటీ పడుతున్నారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో వయస్సు తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. నేటి తరం యువతకు అదొక పెద్ద యాక్టివిటీ. ఎవరికి వారు తమతమ కాలనీలలో చందాలు పోగేసుకుని, నిర్వహణా ఏర్పాట్లు చేసుకోవడం మరో విశిష్టత. వినాయక ఉత్సవాలు హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు చాలు మేలు చేస్తున్నాయనే చెప్పాలి. ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 20 వేల కుటుంబాలు వినాయక విగ్రహాల తయారీలో ఉపాధి పొందుతుండడం విశేషం. వీరికి తోడుగా మరో లక్ష మంది పనిచేస్తుంటారని అంచనా. వీరికి కనీసం ఆరు నెలల పాటు ఉపాధి లభిస్తోంది. భాగ్యనగరంలో ఏటా దాదాపు 70వేల వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క మండపంలో 30 వేల నుంచి 5 లక్షల దాకా ఖర్చు చేస్తున్నారు. వినాయక విగ్రహాలు, మంటపాల ఏర్పాటు, టెంట్, మైక్ లు, జెండాలు, స్వీట్లు, పూలు, పండ్లు, పత్రి , నిమజ్జనం నాడు వినియోగించే వాహనాలు, పూజారులకు ఇచ్చే దక్షిణలు అన్ని కలిపితే 5వేల కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరుగుతున్నట్టు అంచనా. ఇదేమీ చిన్న విషయం కాదు. వినాయక ఉత్సవాల సందర్భంగా ఉపాధి పొందుతున్నవారిలో అన్ని కులాలవారు వుండడం మరో విశేషం.

పర్యావరణ సమస్యలు..
అయితే, వినాయక ఉత్సవాల్లో మితిమీరిన రంగులు వాడడం, విగ్రహాల ఎత్తు విషయంలో పోటీ పడడం కొన్ని పర్యావరణ సమస్యలకు దారితీస్తోంది. ఎక్కువ శాతం విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తున్నారు. 7వేల టన్నుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ హుస్సేన్ సాగర్ లో కలుస్తోంది. దీంతో పాటు పాదరసం, సీసం, నికెల్, టర్బైంటైన్, రెడ్ ఆక్సైడ్, సిలికాన్, వార్నిష్, క్రోమియం, ఆర్సినేట్, నాఫ్తలేట్, క్లోరేట్, క్లోమేట్, థాలేట్ వంటి మరెన్నో ప్రమాదకర రసాయనాలు నీళ్లలో కలుస్తున్నాయి. వీటివల్ల మనం తాగే జలవనరులు కలుషితమవుతున్నాయి. క్రోమియం, లెడ్, నికెల్ వంటివి కేన్సర్ కారకాలు. ఇవి నీళ్ళను విషతుల్యం చేస్తాయి. వీటివల్ల జలచరాలు చనిపోతున్నాయి. రసాయన రంగుల వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతోంది. హుస్సేన్ సాగర్ లో సాధారణ రోజుల్లో 5.5 పరిమాణంలో ఆక్సిజన్ వుంటే, నిమజ్జనం సమయంలో అది 1.1 శాతానికి పడిపోతోంది. సాధారణ రోజుల్లో 75.3 వుండే కాఠిన్యం నిమజ్జన సమయంలో 255 కి పెరుగుతోంది.

జల కాఠిన్యం..
కాల్షియం, మెగ్నీషియం వల్ల జల కాఠిన్యం పెరుగుతోంది. ఇలాంటి ప్రమాదకారకాలన్నీ హుస్సేన్ సాగర్ లో కలవడం వల్ల అందులోని నీరు తాగడానికి, స్నానం చేయడానికి పనికిరాకుండా పోతోంది. చుట్టుపక్కల భూగర్భ జలాలు పాడైపోతున్నాయి. పిల్లల ఆరోగ్యాల మీద పెను ప్రభావం పడుతోంది.  అయితే, పర్యావరణానికి జరుగుతున్న హాని గురించి మాట్లాడుతున్నవారెవరూ వినాయక పూజను వ్యతిరేకించడం లేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనాల వాడకాన్ని వ్యతిరేకిస్తున్నారు. రంగురంగుల విగ్రహాల కంటే స్వచ్ఛమైన మట్టితో చేసిన విగ్రహాలే మేలంటున్నారు. పర్యావరణ ప్రేమికులు చెబుతున్న మాటలు మనకు మేలుకొలుపు కావాలి.

07:00 - August 17, 2016

మరికొద్ది రోజుల్లో వినాయక చవితి రాబోతోంది. భక్తి ప్రవృత్తులతో సాగాల్సిన వినాయక పూజలో అట్టహాసాలు పెరుగుతున్నాయి. వినాయక విగ్రహాల తయారీలో ఇష్టానుసారంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగులు, రసాయనాలు వాడుతున్నారు. ఇది పర్యావరణ సమస్యలకు కారణం అవుతోంది. దీంతో పర్యావరణానికి హాని కలగని రీతిలో, మట్టి విగ్రహాలే వాడాలంటూ కొన్ని సంవత్సరాలు పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సేవకులు, జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయక విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల వచ్చే నష్టాలేమిటి? రంగులు, రసాయనాలు పర్యావరణం పై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? వినాయక ఉత్సవాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఈ అంశాలపై జనపథంలో జన విజ్ఞాన వేదిక హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు విశ్లేషించారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:43 - August 17, 2016

హైదరాబాద్ : నయీం కేసులు ఓ కొలిక్కి రానున్నాయి. ఎన్‌కౌంటర్‌ తర్వాత జరిగిన పరిణామాలు. దొరికిన ఆస్తులు...తవ్వినకొద్దీ బయటపడుతున్న విషయాలు అన్నింటిని సిద్దం చేసుకుంటున్న పోలీసులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ప్రధానంగా నయీంతో లింకులున్న ఆఫీసర్లు ఎవరు..? ప్రజాప్రతినిధులు ఎవరు..? ఎక్కడెక్కడేం చేశారు..? ఇలాంటివాటిపై సాగిన సమీక్షా సమావేశంలో ఎన్నో విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సర్కార్‌కు నివేదిక అందించగానే గ్రీన్‌సిగ్నల్‌ వస్తే ఇక సిట్‌ దూకుడు పెంచనుంది. సంచలనం సృష్టిస్తున్న గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత పరిణామాలపై డిజిపి అనురాగశర్మ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇప్పటికి వచ్చిన ఫిర్యాదులు, సాక్షాధారాల సేకరణ...నయీంకు సహకరించిన పోలీసులు..పొలిటికల్‌ లీడర్లు..ఇతరత్రా అంశాలతో పాటు డైరీలో రాసిన విషయాలేంటనే దానిపై దాదాపు ఏడుగంటలపాటు సమీక్ష జరిగింది.

సుధీర్ఘంగా కొనసాగిన సమీక్ష...
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులు పలు విషయాలపై చర్చించారు. ప్రధానంగా డైరీలో విషయాలు కొంత మంది పోలీస్ అధికారులకు మాత్రమే తెలవడంతో దర్యాప్తులో ఏం జరుగబోతుందని సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారన్న దానిపై ఉత్కంఠ కోనసాగుతోంది. కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి నాగిరెడ్డి, నిఘా విభాగం అధిపతి శివధర్ రెడ్డి, స్పెషల్ నిఘా ఐజీ సజ్జనార్, సైబరాబాద్ వెస్ట్ కమిషనర్ నవీన్ చంద్,ఈస్ట్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ లు ఈ సమావేశంలో హాజరయ్యారు... డైరీలో ఎవరి ఎవరి పేర్లు ఉన్నాయి. వాటిపై ఎలాంటి నిర్ణయాలు..స్టెప్ తీసుకోవాలన్నదానిపై కొనసాగినట్లు తెలుస్తోంది. ఇక నయీం తన డైరీలో కోడ్ బాషాలో వ్రాసిన చింటి, టెర్రర్ బాస్ ఏవరో తెల్చేపనిలో పడ్డారు. నయీంకు పోలీసులకు ఉన్న సంబందాల పై ఆరా తీస్తున్నారు. గతంలో నయింను ఎలా వాడుకున్నారు. నయిం పోలీసులను ఎక్కడెక్కడ ఉపయోగించుకున్నారు.

ఎవరెవరిని బెదిరించారు ? 
ఎవరెవరిని బెదిరించారనే కీలక అంశాలను క్రోడికరించుకున్నారు. ఇప్పటి వరకు దొరికిన అయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి. ఇంకా ఎవరి వద్ద అయుధాలు ఉన్నాయనే దర్యాప్తు పై ఆరా తీసినట్లు సమాచారం. ఇక గతంలో జరిగిన మర్డర్ కేసుల్లో, బెదిరింపుల కేసుల్లో సాక్షాదారాలు సేకరించి అందులో పాలుపంచుకున్న గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరులను పట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక సిట్ కు ఇప్పటి వరకు 70 పిర్యాదులు వచ్చాయి. అందులో ఎన్ని నిజాలు, ఎంత మందికి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన వారికి ఎలా న్యాయం చేయకలిగే అవకాశాలు ఉన్నాయనే అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. నయిం ఆస్తులను అటాచ్ మెంట్ చేసుకుంటే తర్వాత ఎలా కోర్టులో భాదితులకు చెల్లించేలా ఉండాలి. బినామి ఆస్తుల పై ఎలా ఆదారాలు సేకరించాలి అనే కోణంలో సమీక్ష సమావేశం జరిగినట్లు తెలుస్తుంది.

ఆఫీసర్ల లింకులపై సాక్ష్యాధారాలు...
అయితే కేసు దర్యాప్తు స్థాయి నివేదికను సి.ఎం.కు అందజేసేందుకు డిజిపి ఫైల్ సిద్దం చేసుకున్నారు. నయీంకు సంబందం ఉన్న ఐ.పి.ఎస్. స్థాయి అధికారుల పై నివేదిక ఇవ్వనున్నారు. కావాల్సిన సాక్షాదారాలు సేకరించడం కష్టమని చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. పొలిటికల్ లీడర్స్ సంబందాల పై కబ్జాలు చేసిన ప్రదేశాల్లో అప్పటి బాధితులతో మళ్లీ పిర్యాదు స్వీకరించి.. కేసులు దర్యాప్తు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు 13 కేసుల్లో 20 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వివిధ కోర్టులలో కస్టడి ఫిటిషన్ దాఖలు చేశారు. కొంత మందిని కోర్టులు పోలీసుల కస్టడికి ఇచ్చాయి. దీంతో విచారణ వేగంవంత చేయనున్నారు. మరికొంత మందిని అరెస్ట్ చేసేందుకు పక్క అధారాలు సంపాదిస్తున్నారు సిట్ పోలీసులు. 

06:37 - August 17, 2016

ఢిల్లీ : కృష్ణా నదీ జలాల వివాదం కేసుపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ మరోసారి విచారణ ప్రారంభించింది. నీటి పంపకాలపై ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్‌ వద్ద సుధీర్ఘ వాదనలు వినిపించింది. రాష్ట్రాలకున్న రాజకీయ సరిహద్దులు మారుతాయే తప్ప నదులకున్న సరిహద్దులు మారవని ఏపీ తరపు సీనియర్‌ న్యాయవాది ఏ.కే. గంగూలీ వాదనలు వినిపించారు. నది పుట్టుక నుంచి సముద్రంలో ఒక యూనిట్‌గా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ మహారాష్ర్ట, కర్నాటక ప్రభుత్వాలు ట్రైబ్యునల్‌ ఎదుట తమ వాదనలు వినిపించనున్నాయి..!కృష్ణా నదీ జలాల వివాదం కేసు మరోసారి తెరపైకొచ్చింది. కృష్ణా నదీలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీ కేటాయింపులు ఎలా సాధ్యమని కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రైబ్యునల్‌ ప్రశ్నించింది. పైగా ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసినా... ఎగువ రాష్ట్రాలు నిబంధనలను ఉల్లంఘించబోవని భరోసా ఏంటని అడిగింది. కృష్ణా నదీ జలాల వివాదంపై జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి.

ఏపీ వాదనలు..
ఏపీ తరపు సీనియర్‌ న్యాయవాది ఏ.కే. గంగూలీ సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. రాష్ర్టాలకున్న రాజకీయ సరిహద్దులు మారుతాయి తప్ప నదులకున్న సరిహద్దులు మారవని వాదించారు. నది పుట్టుక నుంచీ సముద్రంలో కలిసే వరకూ ఒక యూనిట్‌గా పరిగణించాలన్నారు. ఈ సందర్భంగా పునర్విభజన చట్టం ప్రస్తావిస్తూ..గతంలో రాష్ర్టాలు ఏర్పడినప్పుడు ఆస్తుల పంపకాలు సహా నీటి కేటాయింపులను కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఉనికిలో ఉన్నందున పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌-89ని పొందుపర్చారని, అందువల్ల నీటి కేటాయింపుల బాధ్యతను ట్రైబ్యునల్‌కు అప్పగించారని గంగూలీ వాదనలు వినిపించారు. విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులు, ఆపరేషన్‌ ప్రోటోకాల్‌ను నిర్ణయించాల్సిన బాధ్యత కూడా ట్రైబ్యునల్‌కే ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసిన తర్వాత ఎగువ రాష్ర్టాలు నిబంధనలు ఉల్లంఘించకుండా... నీటి కేటాయింపుల పర్యవేక్షణకు నదీ యాజమాన్య బోర్డులు ఉన్నాయని ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకొచ్చారు ఏ.కే. గంగూలీ. నిన్నటితో ఏపీ వాదనలు ముగిశాయి. ఇవాళ మహారాష్ర్ట, కర్నాటక ప్రభుత్వాలు ట్రైబ్యునల్‌ ఎదుట తమ వాదనలు వినిపించనున్నాయి. 

06:35 - August 17, 2016
06:34 - August 17, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ సర్కార్‌ మహారాష్ట్రతో ప్రాజెక్టులపై కీలక ఒప్పందం చేసుకోనుంది. ఈనెల 23న రెండు రాష్ట్రాల మధ్య గోదావరి అంతరాష్ట్రమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంలు, ఇరిగేషన్‌ మంత్రులు పాల్గొననున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఒప్పందం చేసుకోనున్నాయి. రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు కాళేశ్వరం, చనాఖా కొరాటా, ప్రాణహిత ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ముంబైలో సమావేశం జరగనుంది.

ప్రాణహిత చేవేళ్లతో ఆదిలాబాద్‌కు సాగునీరు..
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను రెండు ప్రాజెక్టులుగా విభజించి, ఆదిలాబాద్ జిల్లా అవసరాల కోసం తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మించనున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ద్వారా లక్ష ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు అందించేలా ప్రభుత్వం ప్లాన్‌ చేసింది. కరీంనగర్ జిల్లా మేడిగడ్డ దగ్గర రిజర్వాయర్ నిర్మించనున్నారు. మేడిగడ్డ దగ్గర 101 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఇంజనీర్లు సానుకూలంగా స్పందించారు. అంతరాష్ట్ర బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

ఈనెల 23న జరుగనున్న కీలక ఒప్పందం..
ప్రాజెక్టులకు సంబంధించి గతేడాది ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు ముంబై వెళ్లి చర్చించారు. తుమ్మిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర వ్యతిరేకించింది. గోదావరిలో 160 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని ఎత్తు విషయంలో మాత్రం అంగీకరించే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది. అయితే దీని విషయంలో మహారాష్ట్రతో చర్చించామని, వివాదాలు పరిష్కారమయ్యేందుకు ఈనెల 23న చారిత్రక ఒప్పందం జరగనుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రాజెక్టులకు సంబంధించి జూలై 15నే ఒప్పందం జరగాల్సి ఉన్నా..కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ప్రాజెక్టులపై మహారాష్ట్రతో వివాదాలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈనెల 23న జరిగే సమావేశంలో ఈ అంశం ఓ కొలిక్కి రానుంది.

06:32 - August 17, 2016

మెదక్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుకునూరుపల్లి ఎస్ఐ గా రామకృష్ణారెడ్డి విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి తన సర్వీసు రివాల్వర్ తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఇద్దరు కానిస్టేబుల్, ఎస్ ఐ లకు రామకృష్ణారెడ్డి తెలియచేసినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వ్యక్తిగత కారణాలే ఆత్మహత్యకు గల కారణమని తెలుస్తోంది. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇతని మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ, డీఎస్పీ ఆసుపత్రికి చేరుకోనున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

06:27 - August 17, 2016

రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు సంచలనం సృష్టించింది. క్వార్టర్స్‌లో వరల్డ్‌నెంబర్2 వాంగ్‌పై వరుస సెట్లలో సింధు విజయం సాధించింది. రెండుసార్లు ఒలింపిక్ మెడల్ గెలిచిన వాంగ్‌పై గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. రేపు సాయంత్రం జర్మనీ షట్లర్‌తో సెమీస్‌లో పీవీ సింధు తలపడనుంది.
రియోలో తెలుగు అమ్మాయి సింధూ తన అద్బుత ప్రదర్శనతో అదరగొడుతోంది. ఆడుతున్నది తొలి ఒలింపిక్సే అయినా, ఏమాత్రం ఒత్తిడి లేకుండా ప్రత్యర్థులను చిత్తుచేస్తూ భారత్‌కు పతకం అందించే దిశగా దూసుకెళ్తోంది. ఈ యువ కెరటం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్ చేరి సంచలనం సృష్టించింది. సైనా తర్వాత ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ చేరిన తొలి భారత మహిళా షట్లర్‌గా నిలిచిన సింధు,.మరో రెండు విజయాలు అందుకుంటే రియోలో పతకం సొంతమవుతుంది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రీక్వార్టర్స్ పోరులో సింధు 21-13, 21-15తో తనకంటే మెరుగైన చైనీస్ తైపీ క్రీడాకారిణి తాయ్ జూ యింగ్‌ను చిత్తుచేసింది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అయిన 21ఏండ్ల సింధు తాను పోటీపడ్డ తొలి ఒలింపిక్స్‌లోనే క్వార్టర్స్ చేరి ఆకట్టుకోవడం విశేషం. 

06:25 - August 17, 2016

హైదరాబాద్ : నిమ్జ్ భూసేకరణకోసం టీఎస్‌ ప్రభుత్వం వేసిన అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టు క్లారిటీ ఇచ్చింది.. అటు ప్రభుత్వానికి ఇటు నిర్వాసితులకు ఊరట కల్గించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.. తుది తీర్పుకు లోబడి భూసేకరణ ఉండాలంటూ విచారణను నిరవధికంగా వాయిదా వేసింది. మెదక్ జిల్లాలో నిమ్జ్ కు సంబంధించి భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. నిమ్జ్ భూసేకరణతో తమ జీవితాలు రోడ్డున పడతాయంటూ మెదక్‌ జిల్లాకు చెందిన రైతు కూలీలు కొన్ని వారాలక్రితం హైకోర్టులో పిటిషన్‌ వేశారు.. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం... 123 జీవోను రద్దు చేసింది.. దీనిపై ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌ కోసం వెళ్లింది... దీనిపై విచారించిన ధర్మాసనం.. రైతు కూలీలకు మేలు జరిగేలా జీవో జారీ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం 123 జీవోకు అనుబంధంగా ఆగస్టు 15న 190 జీవో జారీచేసింది. ఈ జీవో వివరాల్ని కోర్టు ముందుంచారు టీఎస్‌ అడ్వకేట్‌ జనరల్‌..... ప్రతి కూలీ కుటుంబానికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు.. కుటుంబాన్ని ఎలా లెక్కగడుతున్నారన్న అంశంపై క్లారిటీ లేదన్న కోర్టు ప్రశ్నకు జీవోలో స్పష్టత ఇచ్చామని ఏజీ చెప్పారు. మేజర్‌గాఉండి వివాహం చేసుకున్న కుమారుల్ని వేరు కుటుంబంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. భూసేకరణచట్టం 2013, షెడ్యూల్‌ 2లో ఉన్న విధంగానే నష్టపరిహారం ఇస్తున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు.

వాదనలు...
సర్కారు వాదనవిన్న కోర్టు... భూమి కోనుగోలు చేసుకునేందుకు అంగీకరిస్తూ ఆదేశాలు జారీచేసింది.. అయితే పరిశ్రమలు వచ్చేవరకూ రైతులు వ్యవసాయం కొనసాగించేలా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.. రైతు కూలీలను ఖాళీ చేయించొద్దని సూచించింది.. 190 జీ.వో పై అభ్యంతరాలుంటే హైకోర్టును ఆశ్రయించాలని నిర్వాసితులకు సూచించింది.. 190 జీ.వో. హామీల అమలు, నిర్వాసితులు ఇచ్చే ఫిర్యాదులను కోర్టుకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అడ్వకేట్‌ జనరల్‌తోపాటు.  పిటిషనర్‌ తరపు లాయర్‌ను ఆదేశించింది. రాజకీయ పార్టీలు 123 జీవోపై పిటిషన్‌ వేస్తున్నాయని కోర్టుకు పిటిషనర్‌ తరపు లాయర్‌ తెలియజేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఈ పిటిషన్‌పై రాజకీయ కోణంలోనే విచారణ జరుపుతామని చురకలు అంటించింది.. బాధితులు ఎవ్వరు వచ్చినా న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.. బాధితుల తరపున ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు చేసుకోవచ్చని తెలిపింది.. అటు నీటిపారుదల ప్రాజెక్టులకోసం 123 జీవోతో భూసేకరణపై కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.. వీటిపై ఈనెల 22న సుధీర్ఘ వాదనలు వినేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. మొత్తానికి నిమ్జ్ కోసం భూమి కోనుగోలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి... రైతు కూలీలకు 190 జీ.వోతో ఉమ్మడి న్యాయస్థానంలో ఊరట లభించింది.

06:22 - August 17, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ నెల 22 నుంచి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. విపక్షాల అభిప్రాయాలను సేకరించేందుకు నిర్ణయించింది. 20వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్టీకి ఇద్దరు చొప్పున ప్రతినిధులను ఆహ్వానించింది. ఇప్పటికే జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులతో చర్చించి..తయారు చేసిన డ్రాఫ్ట్‌ నోట్‌పై చర్చించేందుకు..ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన ప్రభుత్వం అదే రోజు సాయంత్రం కేబినేట్ భేటీ కావాలని నిర్ణయించింది. వచ్చే దసరా నుంచే కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలని సర్కార్‌ నిర్ణయించింది. ఇందుకోసం కసరత్తు ముమ్మరం చేస్తోంది. వివిధ వర్గాల నుంచి వచ్చే అభ్యంతరాలు, విజ్ఞప్తులను స్వీకరించేందుకు సీఎస్ రాజీవ్ శర్మ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది.

ఈనెల 20న సచివాలయంలో అఖిలపక్ష సమావేశం...
జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, అధికారుల అభిప్రాయాలు తీసుకునేందుకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నేతృత్వంలో మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్ సీహెచ్ ఆర్డీలో మంత్రి వర్గ ఉపసంఘం మూడ్రోజులు రోజుకు మూడు జిల్లాలకు చెందిన నేతల అభిప్రాయాలు సేకరించింది. ఈ నెల 22న జిల్లాల విభజనపై డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. విపక్షాల అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించింది. ఈనెల 20న సచివాలయంలో అఖలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్టీకి ఇద్దరు చొప్పున ప్రతినిధులు రావాలని ఆహ్వానం పంపనున్నారు. అయితే వైసీపీని సమావేశానికి పిలుస్తారా..? లేదా అనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అఖిలపక్ష సమావేశం రోజే.. క్యాబినేట్‌ భేటీ కావాలని నిర్ణయించారు.
ఇటీవల మంత్రివర్గ ఉప సంఘం సమావేశాలు ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్‌లో కమిటీకి ఉన్న మార్గదర్శకాలు ఏంటో చెప్పాలని విపక్షాలు అడిగినప్పుడు ప్రభుత్వ పెద్దలు సమాధానం దాటవేశారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటు చేయబోయే అఖిలపక్ష సమావేశం కూడా నామమాత్రంగానే ఏర్పాటు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తమ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటారో..? లేదో అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుందని చెప్పాలి. 

06:17 - August 17, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై వారం రోజుల్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకోనున్నది. చట్టంలో చేసిన హామీల్లో ఇప్పటికీ అమలుకాని వాటిపై సత్వర చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను త్వరగా పరిష్కరించాలని డిసైడ్‌ అయ్యింది.  విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్రం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా ఉన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు నోడల్ ఏజెన్సీ అయిన హోంమంత్రిత్వ శాఖకు విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చే బాధ్యత ఉందని వెంకయ్యనాయుడు హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చట్టంలో పేర్కొన్న హామీలకు సంబంధించి ఆయా మంత్రిత్వ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించి, పెండింగ్‌లో ఉన్న హామీల అమలుపై త్వరగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. చట్టంలో పేర్కొన్న వివిధ సంస్థల విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాలు తీసుకున్న చర్యలను సమీక్షించాలని, రెండు రాష్ట్రాల మధ్య తేలని అంశాలపై కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది.

వెంకయ్య చొరవ..
ఇప్పటి వరకూ వెంకయ్యనాయుడు రెండు రాష్ట్రాల తరపున ఆయా మంత్రిత్వ శాఖలతో చర్చలు జరిపి..హామీలు నెరవేర్చేందుకు చొరవ తీసుకుంటున్నారు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్వయంగా రంగంలోకి దిగి... రెండు రాష్ట్రాల మంత్రిత్వ శాఖలతో చర్చలు జరిపి... పెండింగ్‌లో ఉన్న హామీలను వీలైనంత త్వరగా పరిష్కరం అయ్యేలా చూస్తారని తెలుస్తోంది. అంతకు ముందు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీతో వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సమస్యలు, ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలపై జైట్లీతో చర్చించారు. మొత్తంగా రాజ్‌నాథ్‌సింగ్‌తో విభజనచట్టంలోని హామీల అమలుపై సుదీర్ఘంగా సమీక్ష చేశారు. అసెంబ్లీ సీట్ల పెంపు అంశం కూడా చర్చకొచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంపై, విభజన హామీల అమలుపై రెండు వారాల్లో కేంద్రం స్పష్టత ఇవ్వనుంది. 

పిడుగురాళ్లలో రోడ్డు ప్రమాదం..

గుంటూరు : పిడుగురాళ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఇద్దరు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

సెమీస్ కు దూసుకెళ్లిన సింధు..

రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటెన్ మహిళల సింగిల్స్ లో పీవీ సింధు సెమీస్ కు దూసుకెళ్లింది. కార్టర్ ఫైనల్ లో చైనా షట్లర్ ఇహాన్ వాంగ్ పై 22-20, 21-19 తేడాతో గెలుపొందింది. 

ప్రాజెక్టుల భూ సేకరణపై నేడు సీఎస్ సమీక్ష..

హైదరాబాద్ : నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులపై బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు.

 

నేడు టీఎన్జీవో ఆధ్వర్యంలో సీపీఎస్ సమావేశం..

హైదరాబాద్ : టీఎన్జీవో సారథ్యంలోని బుధవారం టీఎన్జీవో భవన్ లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పైన సమావేశం జరగనుంది. 

కరీంనగర్ లో నేడు 'ఎక్లాట్' ప్రారంభం..

కరీంనగర్ : జిల్లాలో ఎక్లాట్ మెడికల్ సొల్యూషన్స్ యూనిట్ ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రంలోని జగిత్యాల రోడ్ లో గల పాపారావు కాంపెక్స్ లో ఏర్పాటు చేసిన ఎక్లాట్ యూనిట్ ను బుధవారం మంత్రులు కేటీ రామారావు, ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్ ప్రారంభించనున్నారు. 

నేటి నుండి డీ ఫార్మసీ కౌన్సెలింగ్..

హైదరాబాద్ : డీ ఫార్మసీ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం బుధ, గురువారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 830 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందుకోసం 409 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు కన్వీనర్ వెల్లడించారు. 

251 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు..

హైదరాబాద్ : రాష్ట్ర పశు సంవర్థక శాఖలోని 251 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 19వ తేదీ నుండి సెప్టెంబర్ ఏడు వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనుంది. 

నూతన జిల్లాలపై సబ్ కమిటీ నివేదిక...

హైదరాబాద్ : నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియయపై ప్రభుత్వం వేగం పెంచింది. ఈ దిశగా ఈనెల 20వ తేదీన అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై నియమించబడిన సబ్ కమిటీ సీఎం కేసీఆర్ కు నివేదిక అందచేయనుంది. మరోవైపు సీఎస్ ఆధ్వర్యంలో నేడు కార్యదర్శుల స్థాయి సమావేశం జరగనుంది.

 

ఏపీలో నేడు పుష్కర స్నానం చేయనున్న గవర్నర్..

విజయవాడ : గవర్నర్ నరసింహన్ నేడు ఎపిలో పుష్కరస్నానం చేయనున్నారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకోనున్నారు. 

Don't Miss