Activities calendar

18 August 2016

పీవీ సింధూకు అభినందనల వెల్లువ..

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్ మహిళల సెమీ ఫైనల్ మ్యాచ్ లో జపాన్ షట్లర్ పై వరుస సెట్లలో సింధూ గెలిచింది. సింధూ గెలవడం పట్ల పలువురు అభినందనలు తెలియచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. భారత్ కు పసిడి పతకం తేవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. వైసీపీ అధ్యక్షుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. 

ఒలింపిక్స్ మహిళల ఫైనల్లో సింధు.

రియో ఒలింపిక్స్ మహిళల సెమీ ఫైనల్ మ్యాచ్ లో జపాన్ షట్లర్ పై వరుస సెట్లలో సింధు గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో 21-19, 21-10 తేడాతో సింధు విజయం సాధించింది. 

21:27 - August 18, 2016

రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి సింధు దూకుడుగా ఆడుతోంది. ఫస్ట్ సెట్ లో సింధు అధిక్యాన్ని కనబరిచింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో 21-19, 21-10 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి సెట్ ను 27 నిమిషాల్లో 21-19 తేడాతో సింధు గెలిచింది. తొలి పాయింట్ నుండి సింధు అధిక్యాన్ని కనబరిచింది. మరోవైపు ఒకుహర కూడా పోరాటాన్ని ప్రదర్శించింది. రెండో గేమ్ లో కూడా సింధూ పూర్తి అధిక్యాన్ని కనబరిచింది. వరుస గేమ్ లో తెలుగు తేజం నెగ్గింది. కారోలిన్ మారిన్ తో ఫైనల్లో సింధు తలపడనుంది. సింధు గెలవడం పట్ల కుటుంబసభ్యులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
ఆత్మవిశ్వాసంతో సింధు బరిలోకి దిగింది. సింధు విజయం కోసం కోట్లాది మంది అభిమానులు ఉత్కంఠగా వీక్షించారు. రియో సెంట్రో పెవీలియన్ వేదికగా తొలి సెమీఫైనల్లో జపాన్ సంచలనం, ప్రపంచ ఆరవ ర్యాంకర్ నజోమీ ఒకుహరాతో 10వ ర్యాంకర్ సింధు తలపడింది. గతంలో ఒకుహరాతో నాలుగుసార్లు తలపడిన సింధుకు ఒక్క గెలుపు, మూడు పరాజయాల రికార్డు ఉంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ ఈ హాన్ పై సాధించిన వరుస గేమ్ ల విజయం స్ఫూర్తితో...సింధు సెమీస్ సమరానికి సిద్ధమయ్యింది. ప్రపంచ బ్యాడ్మింటన్లో ఇప్పటికే రెండు కాంస్య పతకాలు సాధించిన సింధు...ఒలింపిక్స్ సెమీస్ చేరడం ఇదే మొదటిసారి. ఫైనల్ మ్యాచ్ లో సింధు విజయం సాధించాలని కోరుకుందాం. 

21:10 - August 18, 2016
21:04 - August 18, 2016

రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి సింధు దూకుడుగా ఆడుతోంది. ఫస్ట్ సెట్ లో సింధు అధిక్యాన్ని కనబరిచింది. తొలి సెట్ ను 21-19 తేడాతో సింధు గెలిచింది. తొలి పాయింట్ నుండి సింధు అధిక్యాన్ని కనబరిచింది. మరోవైపు ఒకుహర కూడా పోరాటాన్ని ప్రదర్శించింది. రెండో గేమ్ ఎలా ఆడుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఆత్మవిశ్వాసంతో సింధు బరిలోకి దిగింది. సింధు విజయం కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. సింధు నివాసంలో సందడి నెలకొంది.
ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్లో చోటుకు తెలుగుతేజం పీవీ సింధు గురిపెట్టింది. రియో సెంట్రో పెవీలియన్ వేదికగా తొలి సెమీఫైనల్లో జపాన్ సంచలనం, ప్రపంచ ఆరవ ర్యాంకర్ నజోమీ ఒకుహరాతో 10వ ర్యాంకర్ సింధు తలపడుతోంది. గతంలో ఒకుహరాతో నాలుగుసార్లు తలపడిన సింధుకు ఒక్క గెలుపు, మూడు పరాజయాల రికార్డు ఉంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ ఈ హాన్ పై సాధించిన వరుస గేమ్ ల విజయం స్ఫూర్తితో...సింధు సెమీస్ సమరానికి సిద్ధమయ్యింది. ప్రపంచ బ్యాడ్మింటన్లో ఇప్పటికే రెండు కాంస్య పతకాలు సాధించిన సింధు...ఒలింపిక్స్ సెమీస్ చేరడం ఇదే మొదటిసారి.

ఫస్ట్ గేమ్ లో సింధు గెలుపు..

రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి సింధు దూకుడుగా ఆడుతోంది. ఫస్ట్ సెట్ లో సింధు అధిక్యాన్ని కనబరిచింది. తొలి సెట్ ను 21-19 తేడాతో సింధు గెలిచింది. 

మగ్ధుం భవన్ లో పది వామపక్షాల భేటీ..

హైదరాబాద్ : మగ్ధుం భవన్ లో పది వామపక్షాలు భేటీ అయ్యాయి. ఆగస్టు 28వ తేదీన విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించనున్నారు. రూ. 1600 కోట్ల విద్యుత్ భారాన్ని కేసీఆర్ ప్రజలపై మోపారని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, చాడ లు పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపాదనలు పెడితే తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తామన్నారు. పోడు భూముల సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో యాత్రలు నిర్వహించనున్నట్లు, 2న ఖమ్మం, 5న వరంగల్, 6న మెదక్ జిల్లాలో యాత్రలు ఉంటాయన్నారు. దళితులపై దాడులను వ్యతిరేకిస్తూ సదస్సు నిర్వహించనున్నట్లు, నయీం అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

దూకుడుగా ఆడుతున్న సింధు..

రియో ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ విభాగంలో బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి సింధు దూకుడుగా ఆడుతోంది. ఫస్ట్ సెట్ లో సింధు అధిక్యాన్ని కనబరిచింది. తొలి సెట్ లో 11-7 అధిక్యంలో కొనసాగింది. 

నయీం రెండో డ్రైవర్ అరెస్టు..

రంగారెడ్డి : శంషాబాద్ మండలం సాతంరాయి వద్ద గ్యాంగ్ స్టర్ నయీం రెండో డ్రైవర్ షేక్ ఫయాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తనిఖీలు నిర్వహిస్తుండగా షేక్ ఫయాజ్ పట్టుబడ్డాడు. తపంచా..మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతను మిర్యాలగూడకు చెందిన వాడు. 

కృష్ణమ్మకు హారతి ఇచ్చిన చినజీయర్..

గుంటూరు : సీతానగరం ఘాట్ లో కృష్ణమ్మకు చిన జీయర్ స్వామి హారతి ఇచ్చారు. రేపు ఉదయం 6గంటలకు లక్ష మంది భక్తులతో సమతా స్నానం నిర్వహించనున్నారు. 

జెద్దాలో కేంద్ర మంత్రి వీకే సింగ్..

సౌదీ అరేబియా : కేంద్ర మంత్రి వీకే సింగ్ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. జెద్దాలో భారత కార్మికులతో ముచ్చటించారు. 

ఆసుపత్రిలో సైనా నెహ్వాల్..

హైదరాబాద్ : భారత స్టార్ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆసుపత్రిలో చేరారు. మోకాలి గాయంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్ లో సైనా నెహ్వాల్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 

20:28 - August 18, 2016

ఒకే ఒక్కడు సీన్మ జూశిండ్రుగదా..? ఆ సీన్మల అర్జున్ ఏం జేస్తడు.. అవినీతి జేశె అధికారులను.. లంచాలు దీస్కునెటోళ్లను.. నిర్లక్ష్యం జేశెటోళ్లను ఎట్ల సస్పెండ్ జేస్తడు.. అగో ఢిల్లీల గూడ 'ఒకే ఒక్కడు' దిగిండు.. అర్జున్ యాక్టింగ్ జేశిండుగని.. ఈన రియల్గనే జేస్తున్నడు ఆ పని.. మరి ఎవరు ఏంటా కథ అనేది వీడియోలో సూడుండ్రి.

20:10 - August 18, 2016

మాతృత్వం ప్రకృతిలో కష్టమైన పనే. అయినా మహిళలు ఎంతో ఇష్టంగా ఆ బాధ్యత మోస్తారు. 9 నెలలు కడుపులో బిడ్డ కోసం అన్ని రకాల కష్టాలను ఇష్టంగానే భరిస్తారు. మరుజన్మలాంటి ప్రసవ వేదనను పంటిబిగువునే భరిస్తారు. అలాంటి ప్రసవం తొలి కాన్పుఅయితే ఆ స్త్రీకి కొన్ని అపోహలు, అనుమానులుంటాయి. మరి వాటిని పోగొట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వీడియో చూడండి. 

టి.బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడిగా..

కరీంనగర్ : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడిగా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా కె.మల్లయ్య లు నియమితులయ్యారు. 

త్వరలో హెల్త్ ఏటీఎంలు - కామినేని..

విజయవాడ : ఏపీలో త్వరలోనే హెల్త్ ఏటీఎంలు ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. పవిత్ర సంగమం ఘాట్ ఫెర్రీ వద్ద 'మన ఆరోగ్యం- మన చేతిలో' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 

వెనుదిరిగిన రెజ్లర్ బబిత కుమారి...

భారత మహిళా స్టార్ రెజ్లర్ బబితా కుమారి రియో ఒలింపిక్స్ నుంచి వెనుదిరిగింది. 53 కేజీల ఫ్రీ స్టైల్ మహిళా రెజ్లింగ్ విభాగంలో పోటీ పడిన బబితా కుమారి గ్రీస్ రెజ్లర్ యారియా చేతిలో పరాజయం పాలయ్యారు. యారియా చేతిలో 5-1 తేడాతో బబితా కుమారి పరాజయం పాలైంది. 

19:47 - August 18, 2016
19:45 - August 18, 2016

చెన్నై బ్యూటీ 'రెజీనా' గోల్డెన్ ఛాన్స్ అందుకుంది. ఈ బ్యూటీ బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. పదేళ్ల కిందట వచ్చిన ఓ మూవీకి సీక్వెల్ గా రూపొందనుందట. ఇంతకీ రెజీనా నటించబోతున్న ఆ బాలీవుడ్ సీక్వెల్ ఏంటో తెలుసుకోవాలంటే చదవాల్సిందే.. తెలుగులో యంగ్ హీరోల ఫేవరేట్ హీరోయిన్ ఎవరంటే 'రెజీనా' అనే చెప్పాలి. సెకెండ్ స్టేజ్ హీరోలతో నటిస్తూ ఈ బ్యూటీ బిజీ బిజీగా ఉంది. స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తోంది. అయితే స్టార్ హీరోయిన్ స్టేటస్ ఏమో కానీ ఈ బ్యూటీ బాలీవుడ్ సూపర్ స్టార్ 'అమితాబ్' సినిమాలో నటించే ఛాన్స్ మాత్రం వచ్చింది.

హీరోయిన్ గా బిజీ...
తెలుగుతో పాటు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా బిజీగా ఉన్న 'రెజీనా' ఏకంగా 'అమితాబ్' మూవీతో బాలీవుడ్ లో ఏంట్రీ ఇస్తోంది. 2002లో వచ్చిన 'ఆంఖేన్' మూవీకి సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది. ఈ సీక్వెల్ 'రెజీనా' హీరోయిన్ గా సెట్ అయినట్లు సమాచారం. మొదటి భాగంలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అర్జున్ రాంపాల్, సుస్మితా సేన్ ప్రధానమైన పాత్రల్లో నటించారు. 'రెజీనా' ప్రస్తుతం 'నక్షత్రం'సినిమాతో పాటు 'మంచు మనోజ్' తో మరో సినిమాలో నటిస్తోంది. అలాగే అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం 'జో అచ్యుతానందా' మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ సినిమాలే కాకుండా తమిళంలో మరో రెండు సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు ఏకంగా అమితాబ్ మూవీలో ఛాన్స్ వచ్చింది. 'రెజీనా' నటిస్తున్న ఈ సీక్వెల్ సక్సెస్ అయితే బాలీవుడ్ లో ఈ బ్యూటీ మరిన్ని ఛాన్స్ లు దక్కే అవకాశం ఉంది. 

19:40 - August 18, 2016

'రకూల్ ప్రీత్ సింగ్' కూడా మెగా హీరోయిన్ అయిపోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఇద్దరు మెగా కాంపౌండ్ హీరోలతో ఆడిపాడిన ఈ బ్యూటీ లేటేస్ట్ గా మరో మెగా హీరోతో జోడి కట్టుతోంది. మరి రకూల్ ఏ మెగా హీరోతో జోడి కట్టుబోతోందో చదవండి.. ఇండస్ట్రీలో ప్రస్తుతం 'రకూల్ ప్రీత్ సింగ్' హవా నడుస్తోంది. ఈ బ్యూటీ ఖాతాలో హిట్స్ తక్కేవే అయిన కొత్త ఛాన్స్ లకు మాత్రం కొదవ లేదు. గత ఎడాది వరుస ప్లాప్స్ తో సతమతమైన ఈ బ్యూటీకి సరైన టైంలో 'సరైనోడు' మూవీ మంచి హిట్టు ఇచ్చింది. ఈ సక్సెస్ తో 'రకూల్' హవా కంటిన్యూ అవుతోంది. 

గోపిచంద్ తో కూడా...
ఇప్పటికే మెగా హీరోలైన రామ్ చరణ్, అల్లుఅర్జున్ లతో నటించేసింది. ఇప్పుడు మరో మెగా హీరో 'సాయి ధరమ్ తేజ్' తో కూడా ఈ బ్యూటీ జోడి కట్టేందుకు రెడీ అయింది. 'గోపీచంద్ మలినేని' దర్శకత్వంలో 'సాయి ధరమ్ తేజ్' హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ నెల 26 సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీలో హీరోయిన్ గా 'రకుల్' ను ఫైనల్ చేశారట. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో 'మహేష్ బాబు' నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే 'ధృవ' సినిమా కోసం 'రామ్ చరణ్' తో రెండోసారి జోడి కడుతోంది. ఈ రెండు చిత్రాలే కాకుండా యంగ్ హీరో 'రామ్' తో పాటు 'గోపీచంద్' కూడా ఈ బ్యూటీ మరో మూవీలో నటించనుందట. 

19:27 - August 18, 2016

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సెమీఫైనల్స్ లో సింధు పోటీ కోసం ఎక్కడలేని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నట్లు ..సింధు తల్లిదండ్రులు చెప్పారు. సింధు బంగారుపతకం గెలుచుకురావాలని తాను కోరుకొంటున్నట్లు సింధు తల్లి విజయ ఆత్మవిశ్వాసంతో చెప్పారు.
తెలుగురాష్ట్రాలలోని కోట్లాదిమంది అభిమానులకూ గర్వకారణంగా నిలిచిపోతుంది. అమెజాన్ గడ్డ రియో డి జెనీరో వేదికగా జరుగుతున్న 2016 ఒలింపిక్స్ 14వ రోజు పోటీల్లో భారత్ కాంస్య పతకం గెలుచుకోడంతో...దేశంలోని కోట్లాదిమంది అభిమానులు ఊపిరిపీల్చుకొన్నారు. అంతేకాదు..మరికొద్దిగంటల్లో జరిగే బ్యాడ్మింటన్ మహిళలసింగిల్స్ సెమీస్ లో పీవీ సింధు పోటీకోసం..అభిమానులు మాత్రమే కాదు...సింధు తల్లిదండ్రులు సైతం ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఒలింపిక్స్ సెమీఫైనల్స్ కు తమ కుమార్తె అర్హత సాధించడం దేశంలోని కోట్లాదిమంది అభిమానులతో పాటు తమకు గర్వకారణమని, స్వర్ణపతకం సాధిస్తే బాగుంటుందని సింధు అమ్మానాన్నలు పీవీ రమణ, విజయ..10 టీవీ కి తెలిపారు.

ఏడు గంటల పాటు సాధన..
భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్ అకాడమీలో సింధు గత కొద్ది మాసాలుగా రోజుకు ఏడు గంటల పాటు సాధన చేసిందని, ఒలింపిక్స్ కు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యిందని సింధు తండ్రి, భారత వాలీబాల్ మాజీ కెప్టెన్ రమణ చెప్పారు. గతంలో ఎన్నడూలేనంత ఆత్మవిశ్వాసంతో సింధు ఆడుతోందని, సెమీస్ లో సైతం సింధు ఇదేజోరు కొనసాగించగలిగితే ప్రత్యర్థి కంటే సింధుకే ఐదుశాతం విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రమణ అన్నారు. తమ కుమార్తెకు క్లిష్టమైన డ్రా వచ్చినా...ఆత్మవిశ్వాసంతో ఆడి..సెమీస్ వరకూ వచ్చిందని, దైవకృప కోసమే బోనం ఎత్తించామని సింధు తల్లి తెలిపారు. సింధు బంగారు పతకంతో తిరిగిరావాలని తాను కోరుకొంటున్నానని, సింధు సత్తాపై తనకు పూర్తినమ్మకం ఉందని జాతీయ మాజీ వాలీబాల్ ప్లేయర్, సింధు తల్లి విజయం ధీమాగా చెప్పారు.
సింధుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ప్రోత్సాహం బాగుందని, గోపీచంద్ అకాడమీలో శిక్షణ కారణంగానే సింధు ఈస్థాయికి చేరిందంటూ రమణ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రపంచ బ్యాడ్మింటన్, ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన సింధు...ఒలింపిక్స్ లో సైతం పతకం సాధించగలిగితే ..సింధు తల్లిదండ్రులకు మాత్రమే కాదు...తెలుగు రాష్ట్రాలలోని కోట్లాదిమంది అభిమానులకూ గర్వకారణంగా నిలిచిపోతుంది.

19:22 - August 18, 2016

ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్లో చోటుకు తెలుగుతేజం పీవీ సింధు గురిపెట్టింది. రియో సెంట్రో పెవీలియన్ వేదికగా మరికాసేపట్లో జరిగే తొలిసెమీఫైనల్లో జపాన్ సంచలనం, ప్రపంచ ఆరవ ర్యాంకర్ నజోమీ ఒకుహరాతో 10వ ర్యాంకర్ సింధు తలపడనుంది. గతంలో ఒకుహరాతో నాలుగుసార్లు తలపడిన సింధుకు ఒక్క గెలుపు, మూడు పరాజయాల రికార్డు ఉంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ ఈ హాన్ పై సాధించిన వరుస గేమ్ ల విజయం స్ఫూర్తితో...సింధు సెమీస్ సమరానికి సిద్ధమయ్యింది. ప్రపంచ బ్యాడ్మింటన్లో ఇప్పటికే రెండు కాంస్య పతకాలు సాధించిన సింధు...ఒలింపిక్స్ సెమీస్ చేరడం ఇదే మొదటిసారి.

19:19 - August 18, 2016

రెమ్యూనేషన్ పరంగా 'పూరీ జగన్నాథ్' తన టెంపర్ చూపిస్తున్నాడు. 'కళ్యాణ్ రామ్' తో చేస్తున్న కొత్త సినిమా 'ఇజం' కోసం 'పూరీ' భారీ రెమ్యూనేషన్ తీసుకుంటుండడం హాట్ టాపిక్ గా మారింది. సక్సెస్ లు లేకపోయిన కూడా రెమ్యూనేషన్ విషయంలో మాత్రం ఈ దర్శకుడు తన రేంజ్ చూపిస్తున్నాడంట. 'ఇజం' కోసం రెమ్యూనేషన్ విషయంలో తన 'ఇజం' చూపిస్తున్న పూరీ రెమ్యూనేషన్ పై కథనం..దర్శకుడు 'పూరీ జగన్నాథ్' ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న మాట ఒప్పుకోవాల్సిందే. 'వరుణ్ తేజ్' తో చేసిన 'లోఫర్' పల్టీ కొట్టడంతో 'పూరీ' కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడనే టాక్ ఉంది.అంతకు ముందు తీసిన 'జ్యోతిలక్ష్మీ' కూడా 'పూరీ' స్థాయి సినిమా కాదనే చెప్పాలి. అయితే సిట్యుయేషన్ ఎలా ఉన్నా 'పూరీ' ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ దర్శకుడు తీస్తున్న 'ఇజం' చిత్రానికి తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి తెలిసి చాలా మంది 'పూరీ' పేమెంట్ ప్యాకేజీ అదిరింది అంటున్నారు.

'ఇజం'..
'కళ్యాణ్ రామ్' తో 'ఇజం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు 'పూరీ'. ఈ చిత్రం జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే నెలాఖరునాటికి ఇజం మూవీని రిలీజ్ చేయాలనేది ఆలోచన. అయితే ఈ సినిమా కోసం 'పూరీ' పారితోషికంగా ఏకంగా 8 కోట్లు పుచ్చుకున్నాడట. 'కళ్యాణ్ రామ్' స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లు అని అంటున్నారు. బడ్జెట్ లో మేజర్ వాటా పూరీకే దక్కడం విశేషం. రీసెంట్ టైమ్ లో 'పూరీ జగన్నాథ్', 'ఎన్టీఆర్' తో చేసిన 'టెంపర్' మాత్రమే ఓ మాదిరి సక్సెస్ అందుకుంది. ఈ దర్శకుడు ఓ రేంజ్ సక్సెస్ చూసి చాలా కాలమే అయిపోయింది. అయినా సరే రూపాయి కూడా తగ్గకుండా తన రెమ్యూనరేషన్ 8 కోట్లను తీసుకుంటున్నాడంటే దర్శకుడిగా 'పూరీ' డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని ఫిల్మ్ నగర్ టాక్. చూద్దాం ఈ సినిమాతోనైనా 'పూరీ' భారీ హిట్టు కొడుతాడో లేదో మరి.

19:13 - August 18, 2016

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీఫైనల్లో జపాన్ కు చెందిన ప్రపంచ ఆరవ ర్యాంక్ ప్లేయర్ నజోమీ ఒకుహరాతో సింధు తలపడబోతోంది. ఒలింపిక్స్ సెమీస్ కు తొలిసారిగా చేరిన సింధుకు... ప్రపంచ బ్యాడ్మింటన్లో ఇప్పటికే రెండు కాంస్య పతకాలు సాధించిన అరుదైన రికార్డు ఉంది. ఈ సందర్భంగా ఆమె తండ్రి మీడియాతో మాట్లాడారు. అంచనాలు సరిసమానంగా ఉన్నాయని, సింధు గెలవాలని దేవుడిని ప్రార్తిస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగ సింధుకు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

కేంద్రం ప్రకటించిన నిధులపై స్పష్టత లేదు - బాబు..

హైదరాబాద్ : కేంద్రం ప్రకటించిన రూ. 1976 కోట్లపై స్పష్టత లేదని షనల్ మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజ్యసభలో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలని, హోదానా, ప్రత్యేక ప్యాకేజీనా స్పష్టం చేయాలని సూచించారు. పక్క రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకొనే ధోరణి కొనసాగిస్తామని బాబు తెలిపారు. సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా అనంతపురం కడప, చిత్తూరు జిల్లాలకు నీరు లేదన్నారు. పోలవరం, నదుల అనుసంధానం పూర్తయితే తామే ఇతర రాష్ట్రాలకు నీరందిస్తామన్నారు. 

జీఎస్టీ బిల్లు కోసం త్వరలో అసెంబ్లీ సెషన్ - కేటీఆర్..

హైదరాబాద్ : జీఎస్టీ బిల్లు కోసం త్వ‌ర‌లోనే అసెంబ్లీ సెష‌న్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇటీవ‌లే రాజ్య‌స‌భ, లోక్‌స‌భ‌ల్లో ఆమోదం పొందిన వ‌స్తుసేవ‌ల ప‌న్ను(జీఎస్‌టీ) బిల్లును కేంద్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమ‌లులోకి తేవాల‌ని చూస్తోన్న విష‌యం తెలిసిందే.

 

కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ను ప్రారంభించిన గడ్కరి..

విశాఖపట్టణం : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోర్టులోని కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ను ప్రారంభించారు. విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన కేంద్ర మంత్రికి మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావు, ఎంపీ అవంతి శ్రీనివాస్ తో పాటు పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. 

18:33 - August 18, 2016
18:32 - August 18, 2016

విజయవాడ : వీటీపీఎస్ ఎస్ ఈగా విధులు నిర్వహిస్తున్న రామకోటి శివలింగేశ్వరరావు ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఆదాయానికి మించిన అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. వీటీపీఎస్ సూపరిండెంట్ ఇంజనీర్ గా మూడేళ్ల క్రితం విధుల్లో చేరారు. ఈయన..శ్రీకాంత్ అనే వ్యక్తితో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. వీరిద్దరూ అక్రమాస్తులు కూడబెట్టినట్లు కూడబెట్టినట్లు ఏసీబీకి సమాచారం అందింది. దీనితో గురువారం ఉదయం రామకోటి..శ్రీకాంత్ నివాసాలపై దాడులు నిర్వహించారు. రామకోటి నివాసంలో దాదాపు 8 కోట్ల విలువైన ఆస్తి డాక్యుమెంట్లు, 90 లక్షల నగదు..కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

18:24 - August 18, 2016

కడప : ప్రాజెక్టు కడతామన్నారు..రైతులు భూములు ఇవ్వాలన్నారు.. భూమికి పరిహారం చెల్లిస్తామని చెప్పారు..అన్ని వసతులతో పునరావాసం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వాధికారులు దశాబ్దకాలం గడుస్తున్నా పరిహారం ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు ముంపు గ్రామాల ప్రజలను కనీస సౌకర్యాలు లేని పునరావాస గ్రామాలకు వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. కడప జిల్లా గండికోట జలాశయ ముంపు గ్రామ ప్రజల కష్టాలపై 10టీవీ ప్రత్యేక కథనం.

నష్టపరిహారం, పునరావాసం కల్పిస్తామన్న ప్రభుత్వం..
కడప జిల్లాలో గండికోట జలాశయానికి 2004లో శంకుస్ధాపన జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. గండికోట జలశాయం పూర్తైతే దాదాపు 22 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ముంపు గ్రామాలన్నీ కడప జిల్లా కొండాపురం మండల పరిధిలోనివి. ముంపు గ్రామాలకు ప్రభుత్వం 2006 కటాఫ్ ప్రకారం నష్టపరిహారాన్ని ప్రకటించింది. పునరావాస గ్రామాలకు అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చింది.

ఇంటి నిర్మాణానికి ఐదు సెంట్ల స్థలం..
ముంపు గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాల్లో ఒక్కొక్కరికి ఐదు సెంట్ల స్ధలం ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చింది. ఒక్కో ఇంటికి 1 లక్ష 86 వేల రూపాయలిచ్చింది. అయితే ఆ డబ్బుతో కేవలం పునాదులు, గోడలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన డబ్బు కోసం ప్రభుత్వాన్ని అడగ్గా ఇళ్ల సొంతంగా పూర్తి చేసుకుంటే రెండున్నర ఎకరాల భూమి ఇస్తామని అధికారులు ఆశచూపారు. దీంతో అప్పులు చేసి మరీ ఇల్లు పూర్తి చేశారు. తీరా ఇప్పుడు ఇండ్లు పూర్తి అయినా..భూమి ఇస్తామనన్న హమీ తుంగలో తొక్కి ఇప్పడు ముంపు గ్రామాలను ఖాళీ చేయాలని అధికారగణం దండోరా వేయిస్తోంది.

ఆందోళనలో ముంపు గ్రామాల ప్రజలు..
ప్రభుత్వం ఇస్తామన్న రెండున్నర ఎకరాలు భూమి ఇవ్వాలని, దీంతో పాటు ఇళ్ల నిర్మాణానికి ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వాలని ముంపు బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి డిమాండ్ల విషయంలో కలెక్టర్ రెండు రకాల ధోరణి ప్రదర్శిస్తున్నారు. పునరావస కేంద్రాలో ఉన్న వారికి ఒక రకంగా...ముంపు గ్రామాల్లో ఇప్పటికీ నివసిస్తున్న ప్రజలకు మరో రకంగా పరిహారం ఇస్తామని ప్రకటిచండం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది.

ముంపుకు గురయ్యే గ్రామాలు 22..
గండికోట ప్రాజెక్టు వల్ల ముంపుకు గురయ్యే గ్రామాలు 22 ఉండగా, వాటిలో 14 గ్రామాలు మొదటగా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరిలిపోవాలని అధికారులు హుకుం జారీ చేశారు. అయితే పునరావాస కేంద్రాల పరిస్ధితి చూస్తే కడు దయనీయంగా ఉంది. తమకు పట్టిసీమ తరహాలో ప్యాకేజీ ఇవ్వాలని గండికోట ప్రాజెక్టు ముంపు బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనితో పాటు జీవనోపాధిని కూడా ప్రభుత్వమే చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమ ప్రాణాలు పోయినా సొంత ఊర్లను వదులుకోం అని తెగేసి చెబుతున్నారు. 

18:18 - August 18, 2016

'బాహుబలి'తో ప్రభాస్ కష్టానికి మించిన ఫలితమే అందుకున్నాడు. ఈ సక్సెస్ కి ఏ మాత్రం తగ్గని విధంగా 'బాహుబలి - 2' సక్సెస్ ని రిపీట్ చేయాలని ఈ స్టార్ హీరో రెట్టింపు కష్టపడుతున్నాడట. ఇందుకోసం 'ప్రభాస్' వెయిట్ తో పాటు టైంని కూడా పట్టించుకోవడం లేదట. 'బాహుబలి-2' కోసం 'ప్రభాస్' చేస్తున్న కసరత్తులేంటో మీరు ఓ లుక్కెయండి. 'బాహుబలి' సృష్టించిన సంచలనం 'ప్రభాస్' కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను తెచ్చిపెట్టింది. దాంతో ఆయన రెండవ భాగం కోసం మరింతగా కష్టపడుతున్నాడు. మొదటి భాగంలో శివుడు గాను, 'బాహుబలి'గా 'ప్రభాస్' రెండు డిఫరెంట్ లుక్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. ఈ ఇదే విధంగా సెకెండ్ పార్ట్ తో కూడా ఆడియన్స్ ని మరోసారి థ్రిల్ కి గురిచేయాలని ప్రభాస్ అహర్నిశలు కష్టపడుతున్నాడట.

20 కేజీలు...
'బాహుబలి' సెకెండ్ పార్ట్ కోసం 'ప్రభాస్' అదనంగా 20కేజీల బరువు పెరిగాడట. రెండో భాగంలో ఎక్కువగా భాగం 'బాహుబలి'కి సంబంధించిన స్టోరీనే ఉంటుంది. అందుకే పాత్రకు తగ్గట్టు బాడీని హేవీగా ఉండాలనే దర్శకుడి కోరిక మేరకు 'ప్రభాస్' ఇంత బరువు పెంచాడట. ఈ వెయిట్ ని మొయిన్ టేన్ చేయడానికి ఈ స్టార్ హీరో రోజుకి 16 గంటలపాటు కష్టపడుతున్నాడట. 'బాహుబలి' బాక్సఫీసు వద్ద ప్రభంజనం సృష్టించడంతో 'బాహుబలి 2' పై స్కై రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను అందుకోవడానికి 'రాజమౌళి' అండ్ టీం పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతున్నారు. నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే సమ్మర్ లో కానీ జూలైలో కానీ రిలీజ్ చేసేందుకు జక్కన్న ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాడు.

18:16 - August 18, 2016
18:15 - August 18, 2016
18:12 - August 18, 2016

ఛత్తీస్ గఢ్ : గ్యాంగ్ స్టర్ నయీం సామ్రాజ్యం పక్క రాష్ట్రాలకు కూడా విస్తరించిందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లో గ్రే హౌండ్స్ దళాలు జరిపిన ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంగతి తెలిసిందే. అనంతరం దీనిపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇతని కేసులో ఎన్నో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. కోట్ల రూపాయల నగదు..బంగారు ఆభరాణాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నో నివాసాలున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే నయీంకు ఛత్తీస్ గఢ్ లోనూ ఇళ్లు ఉన్నట్లు గుర్తించినట్లు బత్తర్ ఐజీ శివరామప్రసాద్ తెలిపారు. రాయ్ పూర్, సుకుమా, జగదళ్ పూర్ లో ఇళ్లు ఉన్నట్లు గుర్తించినట్లు, ఇందుకు సిట్ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేగాకుండా ఛతీస్ గడ్ మావోయిస్టులతో నయీంకు సంబంధాలున్నాయని, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. నయీం కారు డ్రైవర్ ఇటీవలే ఛత్తీస్ గఢ్ పోలీసులకు దొరికాడు. పోలీసుల విచారణలో డ్రైవర్ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.  

'ఛత్తీస్ గడ్ మావోయిస్టులతో నయీంకు సంబంధాలు'...

ఢిల్లీ : ఛతీస్ గడ్ మావోయిస్టులతో నయీంకు సంబంధాలున్నాయని, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు బత్తర్ ఐజీ శివరామప్రసాద్ తెలిపారు. రాయ్పూర్, సుకుమా, జగదళ్ పూర్ లో ఇళ్లు ఉన్నట్లు గుర్తించినట్లు, ఇందుకు సిట్ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

17:55 - August 18, 2016

కిష్ణా పుష్కారాలొచ్చి జనానికి ఏం పుణ్యం బట్కొచ్చినయో తెల్వదిగని.. అవ్వే పుష్కరాలు అయ్యగార్ల నడ్మ పంచాది లేపినయ్..చిన్నగుప్పుడు రాకీలు గట్టుకుంటె పెద్ద పెద్ద రైకీలు.. చేతినిండ ఉండే రాకీలు దీస్కపోయి కడ్తుంటిమి మా అన్నదమ్ముండ్లకు ఇప్పుడు పెద్ద రాకీలు ఎవ్వలు గడ్తున్నరు..మన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సన్నను ఐదేండ్లేగాదు.. పర్మినెంటుగ అదే పోస్టుల ఉంచితే బాగుండు..సర్కారు బడి సద్వు సత్తెనాశ్ కొచ్చింది.. టీచర్లు అట్లనే మోపైండ్రు..రోడ్ల పొంట.. ట్రాఫిక్ సిగ్నళ్ల కాడ.. బిచ్చగాళ్లు గనిపియ్యంగనే.. వాళ్ల అంగిలాగు అవుతారం జూడంగనే.. మనకు ఏమనిపిస్తది.. ఢిల్లీల 'ఒకే ఒక్కడు' దిగిండు.. అర్జున్ యాక్టింగ్ జేశిండుగని..ఇప్పుడు తప్పిపోయినోళ్లది ఒక ప్రకటనొచ్చింది..గిసొంటి ముచ్చట్లు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయుండ్రి.

జైట్లీ తప్పుదోవ పట్టిస్తున్నారు - కేవీపీ..

విశాఖపట్టణం : ప్రత్యేక హోదా విషయమై ఏపీ ప్రజలను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టలేదంటూ కాంగ్రెస్ పై నింద మోపాలని బీజేపీ చూస్తోందన్నారు. 

నలుగురు ఆదీవాసుల విడుదల..

తూర్పుగోదావరి : మావోయిస్టుల చెర నుండి నలుగురు ఆదీవాసులు విడుదలయ్యారు. రెండు రోజుల క్రితం చింతూరు (మం) పేగ అటవీ ప్రాంతంలో నలుగురు ఆదీవాసులను కిడ్నాప్ చేశారు. 

విశాఖకు చేరుకున్న గడ్కరి..

విశాఖపట్టణం : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి జిల్లాకు చేరుకున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో విశాఖ పోర్టులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నితిన్ గడ్కరి పాల్గొననున్నారు.  

17:29 - August 18, 2016
17:28 - August 18, 2016

కరీంనగర్ :  రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని కోటి ఎకరాలకు నీరందిస్తామని ఆర్బాటంగా ప్రకటించింది తెలంగాణ సర్కార్. కాని అది అమలయ్యేలా లేదు. పంటపొలాలకు నీరందేమార్గం కనపడడంలేదు. కోట్ల రూపాయలను వెచ్చించి కెనాళ్లకు మరమ్మతులు చేశామని చెప్పుకుంటున్నా .. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్న కెనాల్స్ ని చూస్తే ప్రభుత్వం చెప్పేది ఒకటి.. జరిగేది ఇంక్కొక్కటిలా కనిపిస్తోంది. కెనాళ్ల మరమ్మతులకు కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలంగాణసర్కార్ చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రెండేళ్ల దుర్బర కరవు తర్వాత వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండుతున్నా.. ఈ నీటిని పంటలకు అందించే కెనాళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఎస్ఆర్ఎస్పీ తో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కెనాళ్లు పగుళ్లతో శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు రైతన్న. రెండేళ్లుగా నీళ్లులేక పగుళ్లతో శిథిలావస్థకు చేరుకున్న కాలువల మరమ్మతులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం లోయర్ మానేరు డ్యాం నుండి నీటిని తరలించే కాకతీయ కాలువలకు 200 కోట్ల రూపాయలు కేటాయించింది సర్కార్. అంతర్గతంగా చొప్పదండి, సుల్తానాబాద్, పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్ వెళ్లే కెనాల్స్ కు పైసా కూడా కేటాయించకపోవడంతో రైతులకు నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు.

పూర్తిగా దెబ్బతిన్న కాలువల లైనింగ్,తెగిపోతున్న కట్టలు..
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిని కెనాళ్ల ద్వారా కరీంనగర్ జిల్లాలోని చెరువులు, కుంటలతోపాటు మానేరు డ్యామ్ లోకి పంపిస్తారు. అక్కడి నుండి హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాలతోపాటు వరంగల్ జిల్లాకు కాకతీయ కాలువల ద్వారా తరలించడం జరుగుతుంది. ఈ కాకతీయకాలువ ప్రవాహసామర్ధ్యం 8,500 క్యూసెక్కులు కాని ఏనాడు 5000 క్యూసెక్కుల నీటినికూడా వదలలేదు. 3 దశాబ్దల క్రితం నిర్మించిన కాలువల లైనింగ్ పూర్తిగా దెబ్బతినడం, కట్టలు బలహీనపడి పలుచోట్ల గండ్లుపడడంతో చివరి ఆయకట్టుకు నీరందే పరిస్థితి కనపడడం లేదు.

తుప్పుపట్టిన నీటిని విడుదల చేసే చానెల్స్..
దీంతోపాటు ఎస్ ఆర్ ఎస్పీ నుండి పెద్దపల్లి, చొప్పదండి నియోజకవర్గాలకు నీరందించే డి 83,డి 85 కెనాళ్ల పరిస్థితి మరీదారుణంగా ఉంది. పిచ్చిమొక్కలు పెరిగి, అడుగుభాగం కంకరతేలింది. లైనింగ్ శిథిలమై ఎప్పుడు కూలుతాయే తెలియని పరిస్థితికి చేరుకున్నాయి. పిల్లకాలువలకు నీటిని విడుదల చేసే చానెల్స్ తుప్పుపట్టి పనిచేయడం లేవు. ఈ పరిస్థితిలో చివరి ఆయకట్టుకు నీరందిస్తామని ప్రభుత్వం చెప్పుకోవడంపై రైతులకు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

నాణ్యతకు నీళ్లొదులుతున్న కాంట్రాక్టర్లు..
కాకతీయ కాలువలో 8 వేల 500 క్యూసెక్కుల ప్రవాహం ఉండాలంటే.. కాలువల కట్టలు పటిష్టంగా ఉండాలి. కాని ప్రస్తుతం నాణ్యతకు నీళ్లొదిలి కాంట్రాక్టర్ నిర్మాణాలు చేపడుతున్నారు. కుడికట్టను 5 మీటర్లు, ఎడమకట్టను ఏడున్నరమీటర్ల వెడల్పుచేసి నిర్మించాలని నీటిపారుదలశాఖ అధికారులు నిర్ణయించారు. కాని ప్రస్తుత నిర్మాణాలు అలా జరగడం లేదు. ప్రస్తుతం తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం మండల పరిధిలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. పూర్తిస్థాయిలో మరమ్మతులు జరగకపోవడంతోపాటు లోయర్ మానేరు డ్యాం నుండి నీటిని విడుదల చేయలేదు.

చుక్క నీరు లేదు..
ఇక శంకరపట్నం మండలం వద్ద అండర్ టన్నెల్ వద్ద మరమ్మత్తులు పూర్తిస్థాయిలో జరగడంలేదు. టన్నెల్ పనుల్లో జాప్యం జరుగుతుంది. ఇప్పలపల్లి గ్రామంలోని నీరంత ఈ అండర్ టన్నెల్ నుంచే బయటకుపోవాలి కాని ఈ పనులు పూర్తికాలేదు. కాంట్రాక్ట్ పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని అక్రమాలు జరిగితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే మంత్రి ఈటెల రాజేందర్ చెప్పిన మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా ఉన్నాయి. రైతులు నారు పోసుకుని నాట్లకు సిద్దంగా ఉండాలని మంత్రిఈటెల రాజేందర్ చెప్పడంతో రైతాంగం పంటలు వేయడానికి సిద్దంగా ఉన్నా చుక్కనీరు కూడా అందించలేని పరిస్థితి ఉంది. 

17:21 - August 18, 2016

హైదరాబాద్ : ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నమూనా మారాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సీపీఎం ప్లీనం సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా తమ్మినేనితో టెన్ టివి మాట్లాడింది. సామాజిక, సమగ్ర అభివృద్ధి సాధనకై త్వరలోనే మహాపాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రభుత్వ సాగిస్తున్న పరిపాలన అభివృద్దికి సహకరించడం లేదని, భవిష్యత్ లో సాగదని ప్లీనం అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపారు. సామాజిక వర్గాల ప్రజలకు..ఆర్థికంగా అంటే వ్యవసాయ రైతులు, కార్మిక వర్గం..చిన్న చిన్న కార్మికుల..మధ్యతరగతి వాసులకు మేలు చేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమౌతుందన్నారు. కానీ ప్రభుత్వం కార్పొరేట్, ఫార్మా కంపెనీలు..రాజకీయ నేతలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం ఉందన్నారు. ఎమ్మెల్యేలు..ఎంపీలకు జీతాలు పెంచే విధానం ప్రభుత్వానిదని విమర్శించారు. కనీస వేతనాలు పెంచాలని సమ్మెలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు.

అభివృద్ధి నమూన మారాలి..
సాధారణ ప్రజల అభివృద్ధి ఈ ప్రభుత్వంలో సాధ్యం కాదని, అభివృద్ధి నమూనా మారాలని తెలిపారు. దీనిపై ప్లీనంలో కసరత్తు చేయడం జరిగిందని, ఓ డాక్యుమెంట్ రూపొందించి ప్రజల్లోకి వెళ్లి వివరిస్తామన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ నెలలో నాలుగు వేల కిలోమీటర్లు తిరగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏ తేదీల్లో పాదయాత్ర జరుగుతుందో తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. మల్లన్న సాగర్..భూ నిర్వాసిత ప్రాంతాల్లో, విద్య..వైద్య రంగాలపై పోరాటాలు చేయడం జరుగుతోందన్నారు. ప్రజా ఉద్యమాలు ఇంకా ఉధృతం కావాలంటే తగినంత నిర్మాణ శక్తి సీపీఎం లేదన్నారు. అన్ని ప్రాంతాల్లో సీపీఎం లేదని, అన్ని గ్రామాలకు విస్తరించడం ఎలా ? ఉన్న కార్యకర్తలు మరింత నాణ్యంగా పని చేయడం ఎలా ? అనే దానిపై చర్చించడం జరిగిందన్నారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లో నిర్మాణ మార్పులపై కేంద్రీకరించడం జరుగుతుందని తమ్మినేని తెలిపారు. 

17:11 - August 18, 2016

కాంగ్రెస్ చెప్పిన లెక్కలన్నీ కాకి లెక్కలు - విద్యాసాగర్ రావు..

హైదరాబాద్ : కాంగ్రెస్ చెప్పిన లెక్కలన్నీ కాకి లెక్కలని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల సలహాదారు విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. నీళ్లు..నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ఎందుకు కావాలని దిగ్విజయ్ సింగ్ అడిగితే కాంగ్రెస్ నేతలు తన వద్దకు వచ్చి నీటి వివరాలు అడిగారని, అప్పుడు కాంగ్రెస్ నేతలకు నీళ్లపై పూర్తి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అందుకు వారు తనకు కంగ్రాట్స్ చెప్పారని, ఒకపక్క నీటి వాటా కోసం పోరాడుతుంటే కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం సరికాదన్నారు.

వీటీపీఎస్ ఎస్ఈ ఏసీబీ దాడులు..

విజయవాడ : వీటీపీఎస్ ఎస్ఈ రామకోటి శివలింగేశ్వరరావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆయన వద్ద ఆదాయానికి మించిన ఆస్తులను కనుగొన్నట్లు సమాచారం.

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : భార‌తీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మెరుగైన ఫ‌లితాలు రాబ‌ట్టాయి. సెన్సెక్స్ 118 పాయింట్లు లాభపడి 28123 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 49 పాయింట్లు లాభపడి 8673 పాయింట్ల వద్ద ముగిసింది. 

16:38 - August 18, 2016
16:37 - August 18, 2016

ఢిల్లీ : కాశ్మీర్ అంశంపై మాజీ కేంద్ర మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు బాధ్యతరాహిత్యంగా ఉన్నాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలింబిస్తోందని, కాశ్మీర్ లోయలో శాంతి కోసం తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. 50 సంవత్సరాలు కాశ్మీర్ ను పాలించిన పార్టీల వల్లే ఈ సమస్యలన్నీ అని తెలిపారు. 

మధ్యప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి..

మధ్యప్రదేశ్ : దిందోరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. బస్సు, సుమో ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. 

16:18 - August 18, 2016
16:16 - August 18, 2016

విజయవాడ : ఏపీపీపీస్సీ తీపి కబురు అందించింది. విభజన అనంతరం ఏపీపీఎస్సీ తొలి నొటిఫికేషన్ జారీ చేసింది. 748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులకు సెప్టెంబర్ 21 వరకు గడువు ఇచ్చింది. నవంబర్ లో పరీక్ష నిర్వహించనున్నారు. ఆరు శాఖలో ఈ ఖాళీలున్నాయి. తొలిసారి జారీ చేసిన నోటిఫికేషన్ లో కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఆన్ లైన్ లో ఈ పరీక్ష జరగనుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 20వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం పది వేల పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగానే ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై నిరుద్యోగుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. 

16:14 - August 18, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విపక్ష పార్టీలకు లేఖలు రాసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్ష అభిప్రాయాలు తెలుసుకోనుంది. కానీ వైసీపీ పార్టీకి మాత్రం లేఖ రాయలేదు. రాష్ట్రంలోని ఏడు పార్టీలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ లేఖలు రాశారు. సబ్ కేబినెట్ కమిటీ ద్వారా వరుసగా భేటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కూడా సమావేశం నిర్వహించింది. కొత్త జిల్లాలపై అఖిలపక్ష అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ప్రభుత్వం రాసిన లేఖల్లో ఏజెండా అంశాలు..సమావేశానికి ఎవరు అధ్యక్షతన వహిస్తారని తదితర వివరాలు పొందపర్చలేదు. సమావేశానికి సంబంధించిన అంశాలు పొందుపర్చలేదని, పార్టీలను అవమానపర్చడమేనని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. వైసీపీకి మాత్రం లేఖ రాకపోవడం గమనార్హం. తమను అవమానపర్చడమేనని వైసీపీ పేర్కొంటోంది. సీపీఎం పార్టీకి సంబంధించి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డిలు హాజరు కానున్నారు. 

పార్టీలకు ప్రభుత్వం లేఖలు..

హైదరాబాద్ : అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని అన్ని పార్టీలకు ప్రభుత్వం లేఖలు రాసింది. రాష్ట్రంలోని ఏడు పార్టీలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ లేఖలు రాశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈ భేటీ జరగనుంది. 

ముగిసిన సీపీఎం ప్లీనం సమావేశాలు..

హైదరాబాద్ : సీపీఎం ప్లీనం సమావేశాలు ముగిశాయి. పలు తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టంలో లోపాలు సవరించి సమగ్రమైన నిబంధనలు రూపొందించాలి..బీసీ, మైనార్టీలకు సబ్ ప్లాన్ చట్టాలు తేవాలి..సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలివ్వాలి..కేసులు ఎత్తివేయాలి..నిర్భందం ఆపాలని తీర్మానాలకు ఆమోదం తెలిపింది. 

ఏపీపీఎస్సీ తొలి నొటిఫికేషన్

విజయవాడ : విభజన అనంతరం ఏపీపీఎస్సీ తొలి నొటిఫికేషన్ జారీ చేసింది. 748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులకు సెప్టెంబర్ 21 వరకు గడువు ఇచ్చింది. నవంబర్ లో పరీక్ష నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆన్ లైన్ లో ఈ పరీక్ష జరగనుంది. 

నార్సింగి పీఎస్ లో నయీం అనచరుల విచారణ..

రంగారెడ్డి : నార్సింగి పీఎస్ లో నయీం అనుచరులు ఫర్హాన్, హర్షా, షాహీమ్, సాజిదా, షహీన్ లను సిట్ నల్గొండ పోలీసులు సంయుక్తంగా విచారిస్తున్నారు. 

15:49 - August 18, 2016

ముంబై : ఎక్స్ ప్రెస్‌ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఉదయం 5 గంటలకు అతి వేగంతో వెళ్తున్న హోండా కారు బలంగా ఓ చెట్టును ఢీకొట్టడంతో కారు టాప్‌ లేచిపోయి నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరిలో నలుగురు 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉన్నవారే. ముంబయి విలిపర్లేకు చెందిన ముజామిల్ మక్నుజా తన హోండా సిటీ కారులో నలుగురు స్నేహితులతో కలిసి మితిమీరిన వేగంతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారును నడుపుతున్న ముజామిల్‌ మక్నుజాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

15:46 - August 18, 2016

ఢిల్లీ: ఖురేజి ప్రాంతంలో ఉన్న ఓ బేకరీలో పేలుడు సంభంవించింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఉదయం ఐదు గంటల సమయంలో బేకరీలోని ఓ బట్టీలో పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో బేకరీలో 20 మంది కూలీలు పనిచేస్తున్నారు. మూడంతస్తుల భవనంలో ఉన్న బేకరీలో మొదటి అంతస్తులో పేలుడు సంభవించింది. మంటలను ఆర్పేందుకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డవారిని రక్షించి ఆసుపత్రికి తరలించింది. పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

15:43 - August 18, 2016

కర్నాటక : ఆవులు తరలిస్తున్నారని ఓ బీజేపీ కార్యకర్తను దాడి చేసిన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. ఉడిపికి చెందిన బీజేపీ కార్యకర్త ప్రవీణ్‌ పూజారి, తన మిత్రుడు అక్షయ్‌తో కలిసి మూడు ఆవులను టెంపో వాహనంలో తరలిస్తున్నారు. బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఉడిపిలోని హెబ్రీ ప్రాంతంలో ఆవులను తరలిస్తున్న వాహనంపై దాదాపు 20మంది హిందూ జాగరణ వేదిక కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ప్రవీణ్‌ పూజారీ చనిపోగా, అక్షయ్‌ గాయపడ్డాడని ఉడిపి ఎస్పీ కేపీ బాలకృష్ణన్‌ తెలిపారు. ఈ కేసులో శ్రీకాంత్‌తో పాటు 16 మందిని అరెస్టు చేశామని వివరించారు. హిందూ జాగరణ వేదిక కార్యకర్తల వద్ద పదునైన ఆయుధాలు ఉన్నట్టు సమాచారం.

15:41 - August 18, 2016
15:38 - August 18, 2016

విజయవాడ : ఏడో రోజు పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. విజయవాడ దుర్గాఘాట్‌కు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. శ్రావణ పౌర్ణమి, రక్షా బంధన్‌ సెలవు కావడంతో.. పుష్కర స్నానాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటివరకు 75 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. పుష్కరాలకు రోజురోజుకు భక్తులు పెరుగుతుండడంతో అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. దుర్గాఘాట్‌లో భక్తుల రద్దీ గురించి మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:36 - August 18, 2016

మహబూబ్ నగర్ : హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ పవిత్ర కృష్ణా నదిలో పుష్కర స్నానం ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లా సోమశిల పుష్కర ఘాట్‌లో సతీసమేతంగా ఆయన పుష్కర స్నానం చేశారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. సోమశిలలో పుష్కర స్నానం చేయడం, పితృదేవతలకు పిండ ప్రధానం చేయడం సంతోషంగా ఉందన్నారు. సోమశిల పుష్కర ఘాట్ వద్ద ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అద్బుతంగా ఉన్నాయన్నారు. సోమశిల వద్ద భవిష్యత్‌లో సినిమా చిత్రీకరణకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.

15:34 - August 18, 2016

ఢిల్లీ : కృష్ణా ట్రైబ్యునల్‌లో తెలంగాణ,కర్ణాటక వాదనలు ముగిశాయి. ఏపీ విభజన చట్టాన్ని ఇతర రాష్ట్రాల విభజన చట్టాలతో పోల్చవద్దని.. ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు జరపాలని మాత్రమే చట్టంలో ఉందని ట్రైబ్యునల్ ముందు తెలంగాణ వాదించింది. విభజన చట్టం వచ్చిన తర్వాత నాలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరపాలని చేయాలని తెలంగాణ ఫిర్యాదు చేసిందని.. తెలంగాణ ఫిర్యాదును మరో ట్రైబ్యునల్ ముందుకు తీసుకెళ్తే మంచిదని కర్ణాటక వాదించింది. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ట్రైబ్యునల్‌ తెలంగాణ డిమాండ్ సమంజసమే అని తెలిపింది. వచ్చే విచారణను సెప్టెంబర్ 7,8 వ తేదీలకు వాయిదా వేసింది. 

మళ్లీ ఆసుపత్రిలో సోనియా..

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మళ్లీ ఆసుపత్రిలో చేరారు. భుజానికి గాయం..అస్వస్థత కారణంగా కొద్ది రోజుల పాటు చికిత్స పొందిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స సందర్భంగా వేసిన కుట్లను తొలగించుకోవడానికే సోనియా ఆసుపత్రికి వెళ్లారని, బుధవారం సాయంత్రమే మళ్లీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని తెలుస్తోంది. 

అనాసాగరంలో ఎంపీ కవిత పర్యటన..

కృష్ణా : జిల్లాలోని నందిగామ శివారు అనాసాగ‌రంలో నిజామాబాద్ ఎంపీ క‌విత ప‌ర్య‌టించారు. ఏపీకి హోదా విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ద్ద‌తుగా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. 

అక్టోబర్ లో మహా పాదయాత్ర - సీపీఎం..

హైదరాబాద్ : దళితులపై దాడులను ఖండిస్తున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. దళితులపై దాడులకు నిరసనగా 22న రాష్ట్ర వ్యాప్తం ఆందోళనలు చేయనున్నట్లు, తెలంగాణ ప్రాంత సమగ్రాభివృద్ధి సాధన కోసం అక్టోబర్ లో మహాపాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. నాలుగు నెలల పాటు 4వేల కి.మీటర్ల కు పైగా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. 

బాలకృష్ణ పుష్కర స్నానం..

హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా సోమశిల పుష్కర ఘాట్‌లో ప్రముఖ నటుడు బాలకృష్ణ సతీసమేతంగా పుష్కర స్నానం చేశారు. పితృదేవతలకు పిండ ప్రధానం చేశారు.

గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్..

ముంబై : ప్ర‌ముఖ మాజీ క్రికెట‌ర్, రాజ్య‌స‌భ ఎంపీ స‌చిన్ టెండూల్క‌ర్ సంస‌ద్ ఆద‌ర్శ్ గ్రామ్ యోజ‌న కింద మ‌హారాష్ట్ర‌లోని ఒస్మానాబాద్ జిల్లాలోని డోంజా గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్నారు.

14:30 - August 18, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ రద్దైంది. ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలతో ఇవాళ సీఎస్ రాజీవ్ శర్మ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. ఉద్యోగుల సర్వీసు రూల్స్ మార్చాలని..కొత్త నియామకాలు జిల్లాస్థాయిలో, కేటాయింపులు రాష్ట్రస్థాయిలో ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. జోనల్ వ్యవస్థను రద్దు పరచాలని సీఎస్ కు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు సూచించారు. వీరి అభిప్రాయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవించింది. జోనల్ వ్యవస్థను రద్దు పరచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

కృష్ణా జలాల విచారణ వాయిదా..

ఢిల్లీ : కృష్ణా జలాల వివాదంపై కృష్ణా ట్రైబ్యునల్‌లో విచారణ జరిగింది. అనంతరం తదుపరి విచారణ సెప్టెంబర్ 7, 8 తేదీలకు వాయిదా పడింది. 

14:14 - August 18, 2016
14:13 - August 18, 2016

జోనల్ వ్యవస్థ రద్దు..

హైదరాబాద్ : జోనల్ వ్యవస్థను రద్దు పరచాలని సీఎస్ కు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు సూచించారు. వీరి అభిప్రాయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవించింది. జోనల్ వ్యవస్థను రద్దు పరచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

14:03 - August 18, 2016

హైదరాబాద్ : దళితులపై దాడులకు నిరసనగా ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగం కావాలనే నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే సామాజిక సమస్యలు పరిష్కారం కావాలి. క్షేత్రస్థాయిలో సమస్యలపై పోరాటం చేయాలన్నారు. గుజరాత్ లోని ఉనాలో, ఎపిలోని అమలాపురంతోపాటు దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని చెప్పారు. దళితులపై దాడులకు నిరసనగా ఉధృతంగా ఆందోళన, పోరాటాలు చేయాలని ప్లీనం నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుకోవాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. తెలంగాణలో 92 శాతం సామాజికంగా వెనుకబడిన తరగతులవారున్నారని తెలిపారు. వీరు అభివృద్ధికి చెందితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నారు. కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేశాడని.. ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదన్నారు. దళితున్ని సీఎం చేస్తానని, దళితులకు మూడు ఎకరాలు భూ పంపిణీ చేస్తామని, మస్లిములకు కూడా మూడు ఎకరాలు భూ పంపిణీ, మస్లిములకు 12శాతం రిజర్వేషన్లు, బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు, ఎస్టీ లకు భూ పంపిణీ వంటి పలు వాగ్ధానాలు చేశారని.. వీటిలో ఏ ఒక్కట హామీ అమలు కాలేదని విమర్శించారు. ఎస్టీ లకు భూ పంపిణీ చేయకపోగా హరితహారం పేరుతో గిరిజనుల నుంచి భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సామాజిక న్యాయానికి పెద్ద పీఠ వేయాలన్నారు. ప్రత్యామ్నాయ పంథాను ముందుకు తీసుకెల్లాలని చెప్పారు. తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం అక్టోబర్ లో 4 నెలలపాటు 4 వేల కిలో మీటర్ల మేర మహా పాదయాత్ర చేయనున్నట్లు పేర్కొన్నారు. పాదయాత్రకు సంబంధించిన కార్యాచరణ, రూట్ల వివరాలను వచ్చే రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చర్చిస్తామని చెప్పారు.

13:55 - August 18, 2016

వరంగల్‌ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్‌ ఖమ్మం రహదారిలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు దుర్మణం చెందారు. మృతులను జక్కలొద్ది గ్రామానికి చెందిన అశోక్‌, మహబూబాబాద్‌ మండలం అమన్‌గల్గు వాసి పూజారి భరత్‌, రంగశాయంపెటకు చెందిన సందీప్‌గా గుర్తించారు. న్యూసైన్స్‌ కాలేజీలో డిగ్రీ చదువుతున్న వీరు ద్విచక్రవాహనంపై వెళుతుండగా...  ఎదురుగా వచ్చిన  గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. మామునూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసిన దర్యాప్తు చేస్తున్నారు. 
 

 

13:53 - August 18, 2016

పశ్ఛిమగోదావరి : జిల్లాలో రోడ్డు ప్రమాదం విషాదాన్ని న్నింపింది. కొవ్వూరు మండలం బంగారుపేటలో లారీ, ఆటో ఢీకోన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.  అమలాపురం నుంచి గౌరీపట్నం వెళ్లుతుండగా ఆటో ప్రమాదానికి గురైంది.

 

13:47 - August 18, 2016

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో రాఖీపౌర్ణమిని ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆయన సోదరి ఎంపీకవిత రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వారితోపాటు నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు కు పలువురు రాఖీలు కట్టారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు ఆయన సోదరి షర్మిల రాఖీ కట్టి అన్నకు శుభాకాంక్షలు తెలిపారు. 

13:41 - August 18, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక సాయాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక లోటు కింద రూ.1176 కోట్లు ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి రూ.450 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.350 కోట్లను ప్రకటించింది. మొత్తం రూ.1976 కోట్లను విడుదల చేసింది. 

13:32 - August 18, 2016

రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని నటుడు నందుతో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నందు,   ఆయన అక్క, చెల్లిలు పలు విషయాలను తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

13:27 - August 18, 2016

ఒకే ఒక చిరు కోరిక. ఆ దంపతులను ఆలోచించకుండా చేసింది. అదే వారికి పెద్ద భారమైంది. ఒకరు కాదు..ఇద్దరు కాదు..వరుసగా ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు..కొడుకు కావాలన్న కోరిక ఉండవచ్చు కానీ నిరక్షరాస్యులైన వారికి అవగాహన లేక కొడుకు పుడుతాడన్న ఆశతో ఆడపిల్లలకు జన్మనిస్తూ పోయారు. ఇలా ఒకరి తరువాత ఒకరు పుట్టడంతో వారి నిరుపేద తనానికి తోడు సమస్యలు మొదలయ్యాయి. మరింత ఆర్థికంగా కష్టాల్లో కూరుకపోయిన దంపతులు పిల్లను పోషించే పరిస్థితి లేక ఒకరి తరువాత ఒకరు ఏడాదిలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆలు..మగలు చేసే తప్పులు పిల్లలకు జీవితాంతం శిక్ష పడుతుందని ఈ చిన్నారులను చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఐదుగురు ఆడపిల్లల పరిస్థితి కడుదయనీయం. పని చేసే వయస్సు కాదు..ముద్దలు కలిపి తినే బాల్యంలోనే ఆ పసిబిడ్డలకు దిక్కేది. ? పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

చిన్నారులకు సాయం అందించాలంటే...
మడితప శిరీష.. D/O శివయ్య
ఆంధ్రా బ్యాంకు అకౌంట్ నెంబర్ 2304 10 1000 16549
IFSC ANDB 0002304
రాఘవరాజపురం.
రైల్వే కోడూరు, కడప జిల్లా.

ఏపీకి కేంద్ర ఆర్థిక సాయం విడుదల..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఆర్థిక సాయం విడుదల చేసింది. ఆర్థిక లోటు కింద రూ. 1176 కోట్లు..వెనుకపడిన జిల్లాల అభివృద్ధికి రూ. 350 కోట్లు..మొత్తంగా రూ.1976 కోట్లను కేంద్రం విడుదల చేసింది.

 

13:13 - August 18, 2016

తనకు వివాహం జరిగి రెండు సంవత్సరాలు అయినా మ్యారేజ్ అయినట్లు ఫీలింగ్ లేదని నటుడు 'నందు' పేర్కొన్నారు. పిల్లలతో ఇంకో పిల్లగా తన భార్య 'గీతా మాధురి' ఉంటుందన్నారు. తన చెలెళ్లతో ఎంతో చక్కగా మెలిగి ఉంటుందన్నారు. ఎంతో సరదగా ఉంటుందని, అన్న బర్త్ డే కు తాను కేక్ తయారు చేసి తినిపించ్నానని నందు సోదరి పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియోలో చూడండి. 

13:13 - August 18, 2016

నల్గొండ : పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు పలు స్వచ్చంద సంస్థలు, వ్యాపార సంస్థలు తమ వంతు సాయం చేస్తూ సేవాభావాన్ని చాటుకుంటున్నాయి. నల్లగొండ జిల్లా వాడపల్లి, అడవిదేవులపల్లి పుష్కరఘాట్లకు వచ్చే భక్తులకు మిర్యాలగూడకు చెందిన వెంకటేశ్వర మిల్క్స్‌ ప్రతిరోజు పాలను అందిస్తున్నాయి. ఇందుకోసం 3 వేల లీటర్ల నుంచి ఐదు వేల లీటర్ల పాలను అందిస్తున్నారు. తమ తల్లి స్ఫూర్తితో.. అన్నదమ్ములమంతా ఈ స్థాయికి ఎదిగామని.. ఆమె జ్ఞాపకార్ధం పుష్కర ఘాట్లలో పాల పంపిణీ చేపట్టామని వెంకటేశ్వర మిల్క్స్‌ యజమానులు అంటున్నారు.

 

13:02 - August 18, 2016

ఏదైనా విషయంలో తన అక్క మొండి ఘటంగా వ్యవహరిస్తుందని నటుడు నందు పేర్కొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా నందు..చెలెళ్లతో టెన్ టివి ముచ్చటించింది. తన అక్క ఎంతో హెల్ప్ చేసిందని, ఫొటో షూట్స్ కోసం డబ్బులు ఇచ్చి ఎంతో ప్రోత్సాహించిందని నందు తెలిపారు. స్కేటింగ్..ఇతర పనులకు దగ్గరుండి తీసుకెళ్లేదని, 'పెళ్లి చూపులు' హిట్ కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హిట్ అవుతుందనే అన్ని సినిమాలు చేయడం జరుగుతుందని, కానీ కొన్ని సినిమాలు మాత్రం హిట్ అవుతాయన్నారు. తన చెల్లి ఎంతో సపోర్టు ఇస్తుందని, కాళ్లు కూడా నొక్కుతుందని, తనతో కబుర్లు చెబుతుందన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:02 - August 18, 2016

నల్లగొండ : జిల్లాలోని వాడపల్లి పుష్కర ఘాట్‌కు వచ్చే భక్తులకు ప్రాథమిక వైద్య సాయం అందించేందుకు తెలంగాణ జాగృతి, అమ్మ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు. సీనియర్‌ డాక్టర్లతో కూడిన వైద్య బృందం వైద్య సేవలందిస్తూ.. ఉచితంగా మందులు పంపిణి చేస్తున్నారు. అంతేకాకుండా అత్యవసరమైతే మిర్యాలగూడ ఆస్పత్రికి తరలిస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందని వైద్య సిబ్బంది అంటున్నారు. 

 

12:59 - August 18, 2016

కృష్ణా : పుష్కర ఘాట్లలో నాసిరకం పనులు వెలుగులోకి వచ్చాయని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. విజయవాడలోని పద్మావతి, కృష్ణవేణి, దుర్గా పుష్కరఘాట్లను ఆయన పరిశీలించారు. ఘాట్లలో నాసిరకం పనులకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని అన్నారు. పుష్కర స్నానాలు చేస్తున్న భక్తులను సీపీఎం నేతలు వై వెంకటేశ్వరరావు, సీహెచ్ బాబూరావు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

12:55 - August 18, 2016

కృష్ణా : విజయవాడలో వైసీపీ అధినేత జగన్‌ పుష్కరస్నానం ఆచరించారు. పున్నమిఘాట్‌ లో స్నానం చేసిన జగన్‌ తన తండ్రి వైఎస్‌రాజశేఖరరెడ్డికి పిండప్రధానం చేశారు. అంతకుముందు ఆయన లబ్బీపేటలోని వేంకటేశ్వర దేవస్థానంలో  కంచిపీఠాధిపతి జయేంద్రసరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్‌తోపాటు వైసీపీ ఎమ్మెల్యే కొడాలినానితోపాటు మాజీ మంత్రి పార్థసారథి కూడా పుష్కరస్నానం చేశారు.  

12:50 - August 18, 2016

విజయవాడ : పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిసౌకర్యాలు కల్పించినట్టు టీడీపీ ఎంపీ కేసీనేని నాని అన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్‌లో ఆయన కుటుంబసమేతంగా ఫుష్కరస్నానం చేశారు.  పుష్కరఘాట్‌లోనే  టీడీపీ మహిళా లీడర్లు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.  

 

టీఆర్ఎస్ లో చేరను - మాజీ ఎంపీ పొన్నం..

కరీంనగర్ : టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఖండించారు. తనను బలహీనపరచడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని, కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ లో చేరనని స్పష్టం చేశారు. 

12:45 - August 18, 2016

హైదరాబాద్‌ : రాజ్‌భవన్‌లో రాఖీపండుగ ఉత్సాహం నెలకొంది. గవర్నర్‌ నరసింహన్‌ కు రాఖీలు కట్టడానికి స్కూల్‌పిల్లలు బారులు తీరారు. పలువురు బ్రహ్మకుమారీలు కూడా రాఖీలు కట్టడానికి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.  ఈసందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ రాఖీపండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

 

12:43 - August 18, 2016

హైదరాబాద్ : సోదరీసోదరిమణుల ప్రేమానుబంధాలకు ప్రతీకైన రాఖీ పండుగ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టి తమ ప్రేమను తెలుపుతున్నారు. తెలంగాణలో ఎంపీ కవిత మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టారు. సీఎం క్యాంప్‌ ఆఫీసులో కవిత.. కేటీఆర్‌కు రాఖీ కట్టారు. 

12:40 - August 18, 2016
12:34 - August 18, 2016

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్ బెర్త్ కు తెలుగుతేజం పీవీ సింధు గురిపెట్టింది. సెమీఫైనల్స్ చేరిన రెండో భారత మహిళగా సరికొత్త చరిత్రకు తెరతీసింది. ఫైనల్లో చోటు కోసం జపాన్ స్టార్ నజోమీ ఒకుహరాకు సవాల్ విసురుతోంది. రెండు సార్లు ప్రపంచ కాంస్య విజేత, ఇండియన్ బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ సింధుపై 10 స్పోర్ట్స్ స్పెషల్ ఫోకస్....
భారత మహిళా బ్యాడ్మింటన్... సరికొత్త అధ్యాయం
భారత మహిళా బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి...రియో డి జెనీరో వేదికగా జరుగుతున్న 2016 ఒలింపిక్స్ లో తెరలేచింది. భారత టాప్ స్టార్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్ రౌండ్ నుంచే నిష్క్రమిస్తే....యంగ్ గన్ పీవీ సింధు సెమీఫైనల్స్ చేరి...ఫైనల్ బెర్త్ కు గురి పెట్టింది. రియో ఒలింపిక్స్ గ్రూప్ లీగ్ లో కెనడా ప్లేయర్ మిషెల్లీ లీ, హంగెరీకి చెందిన లారా సరోసీల పై విజయాలతో నాకౌట్ రౌండ్ చేరింది. నాకౌట్ ప్రీక్వార్టర్ ఫైనల్స్ రౌండ్లో చైనీస్ తైపీ ప్లేయర్ తాయ్ జు యింగ్ ను 21-13, 21-15తో చిత్తు చేసి...క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.
సింధు వరుస గేమ్ ల విజయంతో సంచలనం
ఇక...కీలక క్వార్టర్ ఫైనల్లో..తనకంటే ఎనిమిదిర్యాంకులు ముందున్న చైనా సూపర్ స్టార్ వాంగ్ ఈ హాన్ పై సింధు వరుస గేమ్ ల విజయంతో సంచలనమే సృష్టించింది. రియో సెంట్రో పెవీలియన్ వేదికగా ..54 నిముషాలపాటు సాగిన హోరాహోరీ సమరంలో సింధు 22-20, 21-19తో రెండోసీడ్ వాంగ్ ను కంగు తినిపించింది. 2012 లండన్ ఒలింపిక్స్ లో సైనా నెహ్వాల్ తర్వాత...ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సెమీస్ చేరిన భారత రెండో మహిళ గౌరవం సింధు దక్కించుకొంది. తన కెరియర్ లో సాధించిన అత్యుత్తమ విజయం ఇదేనని...క్వార్టర్స్ విజయానంతరం సింధు పొంగిపోతూ చెప్పింది.
ఒకుహరాతో తలపడనున్న సింధు 
ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీఫైనల్లో జపాన్ కు చెందిన ప్రపంచ ఆరవ ర్యాంక్ ప్లేయర్ నజోమీ ఒకుహరాతో సింధు తలపడుతుంది. ఒలింపిక్స్ సెమీస్ కు తొలిసారిగా చేరిన సింధుకు... ప్రపంచ బ్యాడ్మింటన్లో ఇప్పటికే రెండు కాంస్య పతకాలు సాధించిన అరుదైన రికార్డు ఉంది.
సింధు వరుసగా రెండు కాంస్య పతకాలు 
2013, 2014 ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీల్లో సింధు వరుసగా రెండు కాంస్య పతకాలు సాధించింది.
ప్రపంచ మహిళల టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్లకు ఇచ్చే ఉబర్ కప్ టోర్నీలో సైతం 2014, 2016 టోర్నీల్లో కాంస్య పతకాలు సాధించిన రికార్డు సింధూకు ఉంది. సింధు సాధించిన ఇతర ప్రధాన విజయాలలో ..2014 ఆసియాక్రీడల కాంస్యం, 2014 కామన్వెల్త్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ ఉన్నాయి.
పలుసార్లు విజేతగా నిలిచిన పీవీ సింధు
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టూర్లో ప్రతి ఏడాదీ జరిగే గ్రాండ్ ప్రీ, సూపర్ సిరీస్, మాస్టర్స్ టోర్నీల్లో సైతం పలుసార్లు విజేతగా నిలిచిన ఘనత పీవీ సింధుకు ఉంది. మకావో ఓపెన్ లో మూడుసార్లు చాంపియన్ గా నిలిచిన సింధు...2011 ఇండోనీషియా మాస్టర్స్ టైటిల్ గెలుచుకొంది. 2013, 2016 మలేసియన్ మాస్టర్స్ టైటిల్స్ గెలుచుకొన్న సింధు..ఒలింపిక్స్ కు ముందే ప్రపంచ 10వ ర్యాంక్ లో కొనసాగుతూ వచ్చింది. అర్జున అవార్డుతో పాటు..2015లో పద్మశ్రీ పురస్కారం సైతం అందుకొన్న సింధు...రియో ఒలింపిక్స్ ఫైనల్స్ చేరగలిగితే...భారత బ్యాడ్మింటన్లో అది సరికొత్త చరిత్రే అవుతుంది. సింధు ఏదో ఒక పతకంతో..తెలుగురాష్ట్రాలతో పాటు దేశంలోని శతకోటి క్రీడాభిమానులకు గర్వకారణంగా నిలవాలని 10 టీవీ సైతం కోరుకొంటోంది.        

12:23 - August 18, 2016

కర్నూలు : 7వ రోజు పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలోని పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నదీమాతల్లి ఒడిలో భక్తులు మునకలేస్తూ తమ బాధలు, సర్వపాపాలు తొలగిపోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. లింగాలగట్టుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి.. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 

 

12:11 - August 18, 2016

ప్రాజెక్టుల రిడిజైనింగ్ పై కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై వక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి, టీకాంగ్రెస్ నేత ఇందిర, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం..

రాజ్ భవన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలు

హైదరాబాద్ : రాజ్ భవన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నారులు, బ్రహ్మకుమారులు గవర్నర్ కు రాఖీలు కట్టారు.

11:51 - August 18, 2016

వాషింగ్టన్ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని దావానలం దహించివేస్తోంది. కార్చిచ్చు  అంతకంతకు విస్తరిస్తుండటంతో కాలిఫోర్నియాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. శాన్‌ బెర్నార్డినో ప్రాంతం నుంచి 82 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందలాది అగ్రిమాపక శకటాలు, వేలాది మంది సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నా కార్చిచ్చు అదుపులోకి రావడంలేదు. కాలిఫోర్నియా దావానలం అటు లాస్‌ ఏంజెలెస్‌తోపాటు... కాజోన్‌ కనుమల వైపు విస్తరిస్తోంది. దీంతో ఈ ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. 
80 వేలకు పైగా ఎకరాల్లో అడవులు ఆహుతి
కాలిఫోర్నియా కార్చిచ్చులో ఇంతవరకు ఇంతవరకు 80 వేలకు పైగా ఎకరాల్లో అడవులు ఆహుతయ్యాయ్యి. విమానాలు, హెలికాప్టర్ల ద్వారా వేలాది గాలన్ల నీరు, ఫోమ్‌ వెదజల్లుతున్నా... మంటలు అదుపులోకి రావడంలేదు. కాలిఫోర్నియా నుంచి అమెరికాలోని ఇతర ప్రాంతాలకు దారితీసే జాతీయ రహదారులను మూసివేశారు. వందలాది ఇళ్లు కాలిబూడిదవడంతో నిరాశ్రయులైన వారు తలదాచుకునేందుకు వీలుగా  రెడ్‌ క్రాస్‌ సంస్థ తాత్కాలిక షెల్టర్ల ఏర్పాటు చేసింది. కార్చిచ్చు పరిస్థితి భయానకంగా ఉందని అమెరికా అగ్నిమాపక అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పటికి నియంత్రణలోకి ఇస్తుందో అర్థంకాక తలలుబాదుకుంటున్నారు. 
 

11:47 - August 18, 2016

ఢిల్లీ : రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సాక్షి మాలిక్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. సాక్షిపై మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. సాక్షి.. పతకం సాధనతో చరిత్ర సృష్టించిందని మోడీ అన్నారు. సాక్షి దేశంలోని క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని మోడీ అన్నారు. ఇక పతకం సాధించిన సాక్షి మాలిక్‌పై హర్యానా ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా.. రెండున్నర కోట్ల నజరానా ప్రకటించింది. అంతేకాకుండా ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. 

11:44 - August 18, 2016
11:41 - August 18, 2016

విజయవాడ : ఏడో రోజు కృష్ణాపుష్కరాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. పున్నమినాడు పుష్కరస్నానం చేస్తే మంచిదనే ఉద్దేశ్యంతో భక్తులు ఘాట్లకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. దీంతో  ఏపీలోని ఘాట్లన్ని పుష్కరస్నానాలు చేసేందుకు వస్తున్న భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. పుష్కరఘాట్ల వద్ద సోదరులకు సోదరీమణలు రాఖీలు కట్టారు. ఉదయం నుంచే భక్తులు పుష్కరస్నానాలు చేసేందుకు ఘాట్లకు వస్తున్నారు. ప్రత్యేకపూజలు నిర్వహించి పిండప్రదానాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:36 - August 18, 2016
11:34 - August 18, 2016
11:33 - August 18, 2016
11:31 - August 18, 2016
11:30 - August 18, 2016
11:29 - August 18, 2016

కర్నూలు : జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో..  బస్సు డ్రైవర్‌ రామలింగేశ్వర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

 

11:27 - August 18, 2016

రాయ్ పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతెవాడజిల్లాలోని  కిరణ్‌-బచేలి ప్రాంతాల మధ్య రైలు పట్టాలను తొలిగించారు. కిరణ్‌గ్రామ సమీపంలోని స్టీల్‌ప్లాంట్‌లో పంప్‌హౌజ్‌కు నిప్పంటించారు. చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగాపడవేశారు.  నిన్నటి పోలీస్‌ కాల్పులకు నిరసనగానే ఈ చర్యకు దిగినట్టు తెలుస్తోంది. 

 

గ్యాస్‌ సిలిండర్‌ పేలి..ముగ్గురికి గాయాలు

హైదరాబాద్‌ : నేరేడ్‌మెట్‌లో జరుగుతున్న కృష్ణాపైపు లైన్‌ పనుల్లో ప్రమాదం జరిగింది. వెల్డింగ్‌ పనులు జరుగుతుండగా గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. కార్మికులు మహారాష్ట్రకు చెందినవారుగా గుర్తించారు. 

 

11:24 - August 18, 2016

హైదరాబాద్‌ : నేరేడ్‌మెట్‌లో జరుగుతున్న కృష్ణాపైపు లైన్‌ పనుల్లో ప్రమాదం జరిగింది. వెల్డింగ్‌ పనులు జరుగుతుండగా గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. కార్మికులు మహారాష్ట్రకు చెందినవారుగా గుర్తించారు. 

 

మావోయిస్టుల దుశ్చర్య

ఛత్తీస్ గఢ్ : మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. దంతెవాడ జిల్లా కిరణ్ డోల్.... బచేలి మధ్యలో మావోయిస్టులు రైలు పట్టాలు తొలగించారు. పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కిరణ్ డోల్ లో ఎస్ ఆర్ స్టీల్ ప్లాంట్ పంప్ హౌజ్ ను మావోయిస్టులు తగులబెట్టారు. బచేలి సమీపంలో చెట్లను నరికి రోడ్డుపై పడేశారు. 

 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

వరంగల్ : మానునూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 

ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు

తూర్పుగోదావరి : రంపచోడవరం చెక్ పోస్టు వద్ద ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. లారీలో తరలిస్తున్న 600 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

 

పుష్కర మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం..

విజయవాడ : కృష్ణా పుష్కర స్నానానికి వెళ్లి మృతి చెందిన ఐదుగురు విద్యార్థుల కుటుంబాలను ఎంపీ కేశినేని నాని, నందిగామ ఎమ్మెల్యే సౌమ్య ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి ఎంపీ కేశినేని రూ.3 లక్షల పరిహారం అందజేశారు.  

 

 

మణుగూరు భద్రాద్రి పవర్ ప్లాంటును పరిశీలించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బృందం

ఖమ్మం : మణుగూరు భద్రాద్రి పవర్ ప్లాంటును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బృందం పరిశీలించింది.  

10:24 - August 18, 2016

తెలంగాణలో శాస్త్రీయపద్ధతితో కొత్త జిల్లాల ఏర్పాటు జరగాలని న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్ అన్నారు. ఆదివాసి జిల్లాల ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. దసరా నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి కెసిఆర్ వున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల స్వరూప స్వభావాలపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. వివిధ పార్టీలు తమ తమ అభిప్రాయాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలోనూ, టిజెఏసిలోనూ భాగస్వామిగా వున్న న్యూడెమోక్రసీ నేతలు రెండు రోజుల క్రితం రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ను కలిసి తమ సూచనలు అందజేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో న్యూడెమోక్రసీ సూచనలు సలహాలేమిటి? జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు పరిగణలోనికి తీసుకోవాల్సిన అంశాలేమిటి? ఆదివాసి జిల్లాల ఏర్పాటు కోసం న్యూడెమోక్రసీ ఎందుకు డిమాండ్ చేస్తోంది? ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:44 - August 18, 2016

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముమ్మరమవుతోంది.   జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రం ఎంపిక విషయంలో ప్రభుత్వం హేతుబద్దంగా వ్యవహరించాల్సి వుంటుంది. ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా, ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది. 
రాజకీయాలకు అతీతంగా కొత్త జిల్లాలు ఏర్పాటు : ప్రజలు 
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటును ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. జిల్లాల విభజన, కొత్త జిల్లా కేంద్రాల ఎంపిక విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలన్నదే అందరి కోరిక.  ఈ విషయంలోనూ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రం ఎంపిక ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఇవాళ తీసుకునే నిర్ణయం  ఆయా ప్రాంతాల భవిష్యత్ ను సుదీర్ఘకాలంపాటు ప్రభావితం చేస్తుంది. కాబట్టి, రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి విశాల ద్రుష్టితో ఆలోచిస్తేనే అందరికీ మేలు జరుగుతుంది. పాలనా సౌలభ్యం, భౌగోళిక విస్తీర్ణం, జిల్లా కేంద్రానికి వుండే దూరం,  రవాణా సౌలభ్యం, సాంస్క్రుతిక, చారిత్రక నేపథ్యం, స్థానిక సమస్యలు, స్థానికంగా సాధించాల్సిన ప్రగతి,  ఆర్థిక భారం ఇలా అనేక అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సి వుంటుంది. తెలంగాణలో గిరిజనులు, ఆదివాసీల జనాభా ఎక్కువ.  ఆధునిక అభివ్రుద్ధి ఫలాలు ఇంకా వీరి దరి చేరలేదు.  కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఈ సున్నితాంశాన్ని మరచిపోవడానికి వీల్లేదు. 
రంగంలోకి రియల్ ఎస్టేట్ వ్యాపారులు 
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన్నప్పుడే కొత్త జిల్లాల ఏర్పాటు ఖాయమన్న అభిప్రాయం ఏర్పడింది. అప్పటి నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగారు. స్పెక్యులేషన్స్ పెంచారు. జిల్లా కేంద్రంగా ఆవిర్భవించే అవకాశం వున్న ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెంచేశారు. కొన్ని చోట్ల భూ దందాలు, భూ ఆక్రమణల కేసులు నమోదవుతున్నాయి.  కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎంపిక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదన్న వాస్తవాన్ని ప్రభుత్వమూ, అధికారులు మనస్సులో పెట్టుకోవాలి.  
మౌలిక వసతులు కల్పించాలి...  
కొత్త జిల్లాలు ఏర్పాటు చేయగానే సరిపోదు. చకచకా మౌలిక వసతులు కల్పించాలి. అన్ని ఆఫీసులు ఏర్పాటు చేయాలి. అన్ని విభాగాల్లో పూర్తి స్థాయి అధికారుల నియామకాలు చేపట్టాలి. రెండు మూడు జిల్లాలకో ఇన్ చార్జి అధికారిని నియమిస్తే ఉపయోగం వుండదు.  కొత్త జిల్లాల ఏర్పాటు లో ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వుంటుంది.   అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలను మనస్సులో పెట్టుకుని, తమకు అనుకూలంగా కసరత్తు చేయడం సహజం. టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ బలహీనతను అధిగమిస్తేనే జిల్లాల ఏర్పాటు వల్ల   ప్రజలు ఆశిస్తున్న ప్రయోజనం చేకూరుతుంది. 

 

09:40 - August 18, 2016

ఢిల్లీ : రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో భారతీయుల హృదయాలను గెలిచిన జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌కు ఖేల్‌ రత్న పురస్కారం వరించే అవకాశం కనిపిస్తోంది. గురువారం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఓ భారత జిమ్నాస్ట్‌ ఒలింపిక్స్‌లో పోటీ పడటమే గొప్ప అనుకుంటే దీప ఏకంగా ఫైనల్‌కు చేరి అబ్బుర పరచారు. ఫైనల్‌లో ఇతర జిమ్నాస్ట్‌లకు గట్టి పోటీనిచ్చిన దీప- నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీపతో పాటు 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ఎనిమిదో స్థానంలో నిలిచిన షూటర్‌ జితూరాయ్‌కు కూడా ఖేల్‌రత్న దక్కే అవకాశముంది. దీప కోచ్‌ బిశ్వేశ్వర్‌కు ద్రోణాచార్య ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించినట్లు సమాచారం.

09:36 - August 18, 2016

హైదరాబాద్ : రాఖీ..అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. తోబుట్టువుకి ఎల్లవేళలా రక్షణగా ఉంటానని భరోసా ఇచ్చే పండగ రాఖీ పండగ. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకొనే ఈ పండుగ వచ్చిందంటే.. ఆడపడుచులు తమ సోదరులకు రక్షా బంధనం కట్టాలని చూస్తారు. మెట్టింటి నుంచి పుట్టింటికి చేరుకుని అన్నాతమ్ముళ్లతో ఎంతో సంతోషంగా ప్రేమ, ఆప్యాయతల్ని పంచుకుంటారు. 
ప్రేమానురాగాలకు ప్రతీకగా రాఖీ పండగ
అన్నాచెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల.. మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండగే రాఖీ పండగ..దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా రక్షా బంధన్‌ను జరుపుకొంటారు. సోదరసోదరీమణుల మధ్య గల అనుబంధాన్ని చాటుకునేందుకు రక్షా బంధన్‌ చక్కటి వేడుక. చెల్లెల్లు తమ అన్నయ్యలు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యలకు రాఖీ కడుతారు. రాఖీ అంటే రక్షా బంధం. ఈ బంధం కలకాలం ఉండాలని కోరుకుంటూ ఆడపడుచులు, మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అన్నా చెల్లెళ్ల అనురాగానికి నిలువెత్తు నిదర్శనమే ఈ రాఖీ పర్వదినం. 
మానవీయ సంబంధాలను పటిష్టం 
మానవీయ సంబంధాలను పటిష్టం చేస్తూ.. సోదర ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే రక్షా బంధన్ సంప్రాదాయబద్ధమైన విలువలను మరింత పెంపొందించేలా ఈ పండగను జరుపుకొంటారు. ప్రస్తుత ఆధునిక యుగంలో రాఖీ పౌర్ణమి తన విశిష్టతను చాటి చెబుతూ సోదర ప్రేమ పటిష్టతకు దోహదపడుతోంది. సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. రాఖీపండుగ వచ్చిందంటే ఇళ్లంతా సందడే... సందడి. చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా అందరూ రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొనడం విశేషం. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మార్కెట్లో రకరకాల రాఖీలు మనకు దర్శనమిస్తాయి. 
మార్కెట్లో రకరకాల రాఖీలు 
గతంలో కంటే భిన్నంగా ఈ సారి రాఖీలు మార్కెట్లో కనబడుతున్నాయి. అయితే గతేడాదితో పోల్చితే ఈసారి కాస్తా రేట్లు కూడా మండిపోతున్నాయంటున్నారు వినియోగదారులు. 
స్నేహానికి కూడా ప్రతీక
కేవలం అన్నాచెల్లెళ్లు .. అక్కాతమ్ముళ్లకే రక్షాబంధన్ పరిమితం కాదు. స్నేహానికి కూడా ఈ బంధనం ప్రతీకగా నిలస్తుంది. విలువలతో కూడిన ప్రేమను ఆస్వాదించే వారు ఎవరైనా సరే రాఖీ వేడుకల్లో మునిగి తేలాల్సిందే. ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పండగను కులమతాలకు అతీతంగా జరుపుకోవడం సోదర బంధం పవిత్రతను చాటిచెపుతోంది. శ్రావణ మాసంలో వచ్చే పండగ కాబట్టి ఈ పండగను శ్రావణ పౌర్ణమిగా మరి కొందరు రాఖీ పౌర్ణమిగా పిలుస్తారు. 

 

రిమ్స్ లో వైద్యుల నిర్వాకం

శ్రీకాకుళం : రిమ్స్ లో వైద్యులు నిర్వాకం వెలుగులోకి వచ్చింది. హిరమండలానికి చెందిన ఓ వ్యక్తికి వైద్యులు మోకాలి చికిత్స చేశారు. రోగి మృతి చెందారు. మెడికల్ లీగల్ కేసుగా నమోదు చేశారు. మృతదేహం అప్పగించడం లేదని బంధువుల ఆందోళన చేపట్టారు. 

పుష్కర స్నానం చేసిన ఎంపీ కేశినేని నాని దంపతులు

విజయవాడ : ఇబ్రహీంపట్నం సంగమం ఘాట్ లో ఎంపీ కేశినేని నాని దంపతులు పుష్కర స్నానం చేశారు.  

నేడు విశాఖ జిల్లాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన

విశాఖ : నేడు జిల్లాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటింంచనున్నారు. విశాఖ పోర్టులో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పోర్టు వ్యవహారాలపై గడ్కరీ సమీక్షించనున్నారు. 

08:47 - August 18, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని జిల్లాల నుంచి వస్తున్న భక్తులు పుణ్యస్నానాలాచరించి పిండప్రదానాలు చేస్తున్నారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో.. గవర్నర్‌ పుష్కర స్నానం ఆచరించారు. పుష్కరాల సందర్భంగా పోలీస్‌శాఖ పనితీరుపై ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప సమీక్ష జరిపారు. మరోవైపు తెలంగాణలోని అలంపూర్ జోగులాంబ శక్తి పీఠంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శత చండీయాగంలో పాల్గొన్నారు. వైసీపీ అధినేత జగన్ ఇవాళ పుష్కరస్నానం చేయనున్నారు.
పుణ్యస్నానాలాచరిస్తున్న భక్తులు 
ఏపీ, తెలంగాణలో కృష్ణా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో ఘాట్లకు చేరుకుని పుణ్యస్నానాలు చేసి..పిండప్రదానాలు చేశారు. కృష్ణాజిల్లాతో పాటు..గుంటూరుజిల్లా ధరణికోట, అమరావతిలోని నాలుగు ఘాట్లు కిక్కిరిసిపోయాయి. విజయవాడలోని పుష్కరఘాట్లలో భక్తులు పెద్ధసంఖ్యలో స్నానాలు ఆచరించి దైవదర్శనం కోసం బారులు తీరారు. 
పుష్కర స్నానమాచరించిన గవర్నర్‌ దంపతులు   
విజయవాడ పున్నమి ఘాట్‌లో..గవర్నర్‌ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. ఇక మానవవనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు సంగమం ఘాట్‌ వద్ద సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. పుష్కరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక్కోశాఖపై  ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలతో సమీక్షలు నిర్వహించారు. విజయవాడలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబ సమేతంగా పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కరాల ఏర్పాట్లలో అధికారులు అద్భుతంగా పనిచేస్తున్నారని కోడెల ప్రశంసించారు.
పుష్కరాల్లో పోలీసు సిబ్బంది సేవలపై చినరాజప్ప హర్షం 
పుష్కరాల్లో పోలీసు సిబ్బంది సేవలపై ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఘాట్ దగ్గర ఉత్తమ సేవలు అందిస్తున్న ముగ్గురు సిబ్బందికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. పుష్కరాల సందర్భంగా పోలీస్‌శాఖ పనితీరుపై చినరాజప్ప సమీక్ష జరిపారు. విజయవాడలోని కమాండ్‌ సెంటర్ కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో డీజీపీ సాంబశివరావు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
పుష్కర ఘాట్లకు బస్సు సర్వీసులు : మంత్రి పరిటాల సునీత 
పుష్కర ఘాట్లకు జిల్లా వ్యాప్తంగా బస్సు సర్వీసులు నడుపుతామని మంత్రి పరిటాల సునీత అన్నారు. పుష్కరాలలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టులో క్రిష్ణాజలాలు చేరడంతో అనంతపురం జిల్లాలో పుష్కర శోభ సంతరించకుంది. జీడిపల్లిలోని పుష్కరఘాట్‌ను మంత్రి పరిటాల సునీత పరిశీలించారు.
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పుష్కరఘాట్లకు పోటెత్తిన భక్తులు 
తెలంగాణలో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పుష్కరఘాట్లకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అలంపూర్‌లో అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. నల్లగొండ జిల్లాలోనూ పుష్కరఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నాగార్జునసాగర్‌, వాడపల్లితోపాటు మట్టపల్లి క్షేత్రాల్లో పుష్కరస్నానాలు జోరుగా సాగుతున్నాయి. 
చండీయాగంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి   
మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ జోగులాంబ శక్తి పీఠంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి  కుటుంబ సమేతంగా చండీయాగంలో పాల్గొన్నారు. ఈనెల 18 నుంచి 22 వరకూ శతచండీయాగాన్ని నిర్వహించనున్నారు. గొందిమల్ల ఘాట్‌లో ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రాల మధ్య కలెక్టర్‌ శ్రీదేవికి హారతి అందించారు. హారతి పూజను చూసిన భక్తులు తన్మయం చెందారు. మరోవైపు గద్వాల మండలం నదీఅగ్రహారం గంగాహారతి పూజలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు. సీఐకి, ప్రత్యేక అధికారులకు అర్చకులు మేలతాళాలతో స్వాగతం పలికారు.

 

08:36 - August 18, 2016

హైదరాబాద్ : వినూత్నమైన ఆర్ధిక నిధుల సేకరణ పద్ధతుల ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మేలు జరిగేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. నిధుల సేకరణ మార్గాలపై ఎస్‌బీఐ కాప్స్‌ ప్రతినిధులతో పవర్‌ ప్రజెంటేషన్ ద్వారా ఆయన చర్చించారు. మున్సిపల్‌ శాఖలో ప్రభుత్వం చేపడుతున్న భారీ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సేకరణ మీద సమీక్ష నిర్వహించారు.
ఎస్‌బీఐ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమీక్ష
అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల సేకరణపై మున్సిపల్‌ శాఖ కసరత్తు చేస్తోంది. దీనిపై మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయంగా అనేక ఆర్థిక సంస్థలు ప్రభుత్వానికి నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రతినిధులు మంత్రికి తెలిపారు. శాఖాపరంగా ఉన్న రాబడి వనరులు, భవిష్యత్తులో రాబడి పెరిగేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తే కోట్ల రూపాయల నిధులు సమకూరే చాన్స్ ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా నగరాల్లో ఆస్తిపన్నులు సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఆదాయం పెరిగే అవకాశముందని తెలిపారు.
మున్సిపల్‌శాఖకు నిధులు దొరకడం కష్టం కాదన్న బ్యాంకు ప్రతినిధులు
జీహెచ్‌ఎంసీలో  చేపడుతున్న భారీ ప్రాజెక్టులకు నిధులు దొరకడం పెద్ద కష్టమేమీకాదని ఎస్‌బీఐ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. నగరంలో పెట్టుబడి పెట్టే ప్రాజెక్టుల కోసం పెట్రోలియం, సీవరేజీ, విద్యుత్‌ చార్జీల్లో కొంత వాటాను ప్రభుత్వం నుంచి కోరే అంశాన్ని మున్సిపాలిటీ శాఖ పరిశీలించాలని ప్రతినిధులు తెలిపారు. అయితే ఈ విషయంలో మరింత లోతుగా అధ్యయనం చేయాలని బ్యాంక్‌ ప్రతినిధులను మంత్రి కేటీఆర్ కోరారు.

08:31 - August 18, 2016

హైదరాబాద్ : పర్యావరణ హిత, ప్రజా సంక్షేమ పారదర్శక మైనింగ్ లక్ష్యంగా నూతన మినరల్ పాలసీపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ర్ట స్థాయిలో స్టేట్ మినరల్ ఎక్స్ ఫ్లోరేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కేబినెట్‌ సూచనల మేరకు తుది పాలసీని అతి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. 
పాలసీలో దేశంలోని అత్యుత్తమ మైనింగ్ విధానాలు
తెలంగాణ స్టేట్ మినరల్ పాలసీ-2016పై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డితోపాటు మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలోని అత్యుత్తమ, మైనింగ్ విధానాలను ఈ మినరల్‌ పాలసీలో ఉండేలా చూడాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్‌ పారదర్శకత కేంద్రంగా ఈ పాలసీ రూపొందిస్తున్నామన్నారు. పర్యావరణ హిత, ప్రజా సంక్షేమ మైనింగ్ జరిగేలా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లతో, నిబంధనలతో ఈ-పాలసీ రానున్నట్లు తెలిపారు.
జీరో వేస్ట్ మైనింగ్ అధారంగా ఈ-పాలసీ 
మేజర్ మినరల్, మైనర్ మినరల్ మైనింగ్, రాబడి, కేటాయింపు వంటి అంశాలను ఈ-పాలసీలో స్పష్టంగా పేర్కొననున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్రం నిర్ణయం మేరకు మేజర్ మినరల్‌ను వేలం ద్వారా కేటాయిస్తారని, రాష్ర్టానికి అధికారం ఉన్న మైనర్ మినరల్స్ కేటాయింపులు, లైసెన్సులు, లీజుల వంటి అంశాలపై పాలసీలో స్పష్టంగా ప్రకటిస్తామన్నారు. కేంద్రం ఇప్పటిదాక తన పరిధిలో ఉన్న 31 మినరల్స్‌ను మైనర్ మినరల్స్‌గా ప్రకటించడంతో వాటి అన్వేషణకు రాష్ర్టా స్థాయిలో స్టేట్ మినరల్ ఏక్స్ ఫ్లోరేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పూర్తి పారదర్శకత, అన్‌లైన్ అప్లికేషన్ సిస్టమ్, నిర్ణీత కాలపరిధితో కూడిన కేటాయింపులు, ఖజానాకు అత్యధిక అదాయం, జీరో వేస్ట్ మైనింగ్ అధారంగా ఈ-పాలసీ ఉంటుందని చెప్పారు. 
నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కొత్త పాలసీ పరిశీలిస్తుందని కేటీఆర్‌ చెప్పారు. జాతి సంపద ద్వారా కొత్త వర్గాలు, యువకులకు అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా, సంపద కల్పన లక్ష్యంగా ఈ-పాలసీ ఉంటుందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తీసుకునేలా నూతన పాలసీ ఉంటుందన్నారు. గనుల శాఖ రూపొందించిన మినరల్ పాలసీపై కేబినెట్‌ ముందుంచి..మరిన్ని మార్పులు చేయనున్నట్లు తెలిపారు. తుది పాలసీని త్వరలో ప్రకటిస్తామన్నారు. 

 

08:20 - August 18, 2016

హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. కోర్టులో జరిగిన విచారణలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపులపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ 
తెలంగాణాలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. 2014 ఎన్నికలలో ఇతర పార్టీల నుంచి గెలుపొంది అధికార పక్షంలోకి పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం 
దీనిపై జస్టిస్ కురియన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడి 14 నెలలు అవుతున్నా ఇంతవరకు స్పీకర్ వారిపై చర్యలు తీసుకోలేదంటూ పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వివేక్ తన్కా వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం తెలంగాణ స్పీకర్‌ మధుసూధనాచారి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపులపై మూడు వారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 
గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంపత్
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని.. గతంలో పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌ను కొట్టివేసింది. అనంతరం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

08:14 - August 18, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌భగీరథ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యేందుకు 8 బ్యాంకులు ముందుకొచ్చాయి. ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలో మరో 7బ్యాంకులు ఆర్థిక సాయానికి ముందుకొచ్చాయి. మిషన్‌భగీరథకు 6 వేల 750కోట్ల ఆర్థిక సహాయానికి బ్యాంకులు అంగీకారం తెలిపాయి. 
మిషన్ భగీరథలో భాగం అయ్యేందుకు ముందుకొచ్చిన బ్యాంకులు  
ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథలో భాగం అయ్యేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలో కన్సార్టియంగా ఏర్పడ్డ 7 బ్యాంకులు దాదాపు 6,750 కోట్ల రూపాయల ఆర్థిక సహాయానికి అంగీకరించాయి. సైఫాబాద్‌లోని ఆంధ్రాబ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ పటేల్‌ మాట్లాడారు. ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ ప్రాజెక్టులో ఆంధ్రా బ్యాంకు భాగమైనందుకు గర్వంగా ఉందన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 1300 కోట్ల రుణాన్ని మంజూరు చేయడానికి ఒప్పుకున్నామన్నారు. ఈ పథకంలో ఇతర బ్యాంకులను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో కన్సార్టియం ఆలోచన చేశామన్నారు. తాము సంపూర్ణంగా సంతృప్తి చెందాకే... బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో ఆర్థిక సహాయానికి నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.  
మిషన్ భగీరథ లక్ష్యాలపై పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్‌
మిషన్ భగీరథ లక్ష్యాలపై పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు పంచాయితీరాజ్ స్పెషల్ సీఎస్ ఎస్పీసింగ్‌. ఈ సందర్భంగా ఎస్పీ సింగ్‌ మాట్లాడుతూ..ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించిన మిషన్ భగీరథ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్టును చేపట్టాలంటే..ఆర్థిక వనరులతో పాటు రాజకీయ సంకల్పం కావాలన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశంలో గుజరాత్ తరువాత తెలంగాణనే మిగులు రాష్ట్రమని చెప్పారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో స్థిరమైన వృద్ధి నమోదు చేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే అన్నారు. ఆదాయంలో నెంబర్‌ వన్‌గా ఉన్న తెలంగాణ రాష్ర్టంతో చేతులు కలిపి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని బ్యాంకర్లను కోరారు. 
ఆంధ్రాబ్యాంకు...రూ.1300 కోట్ల ఆర్థిక సహాయం 
1300 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంపై ఆంధ్రాబ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో ఇప్పటికే అంగీకారం కుదిరింది. త్వరలోనే దీనికి సంబంధించిన చెల్లింపు జరుగుతుంది. మిగిలిన బ్యాంకులు త్వరలో జరిగే తమ మేనేజ్‌మెంట్ కమిటీ మీటింగ్‌లో రుణ సహాయానికి ఆమోదం తెలుపనున్నాయి.

 

08:03 - August 18, 2016

హైదరాబాద్ : ఐదు నెలల సమయం.. నీటిపారుదల నిపుణుల సలహాలు.. ప్రాజెక్టుల లెక్కలు.. మొత్తమ్మీద సుదీర్ఘ కసరత్తు  చేసిన హస్తం నేతలు.. కేసీఆర్‌ సర్కారు ప్రతిపాదిత నీటి ప్రాజెక్టులపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్‌ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ తప్పుల తడక అంటూ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా నిరూపించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ కాకి లెక్కలు చెప్పి.. కోటి ఎకరాలకు నీళ్లిస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. తామిచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా ? అంటూ సవాల్‌ విసిరారు.
త్రీడీలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ 
తెలంగాణ కాంగ్రెస్‌ చెప్పిందంతా చేసింది.. ప్రభుత్వానికి గట్టిగా సమాధానం చెప్పింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినవన్నీ అబద్దాలంటూ... త్రీడీలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చింది. కేసీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చిన తర్వాత సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్‌ నేతలు.. నీటిపారుదల రంగ నిపుణులు, ప్రాజెక్టుల లెక్కలన్నీ సేకరించి.. ఎట్టకేలకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో.. టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. నీళ్ల పేరుతో దోపిడీ చేస్తున్న సర్కార్‌ తీరును ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని ఉత్తమ్‌ హెచ్చరించారు. 
కేసీఆర్‌ ఇచ్చిన ప్రజంటేషన్‌ తప్పుల తడక : ఉత్తమ్‌ 
సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ఇచ్చిన ప్రజంటేషన్‌ తప్పుల తడక అని ఉత్తమ్‌ ఆరోపించారు. సీఎం ప్రజెంటేషన్‌లోని తప్పులను బయటపెట్టేందుకే తాము ప్రజంటేషన్‌ ఇస్తున్నామన్నారు. తమ ప్రజంటేషన్‌ జాప్యంపై టీఆర్‌ఎస్‌ ఆరోపణలను ఉత్తమ్‌ తిప్పికొట్టారు. నిజాలైతే వెంటనే నిరూపించవచ్చు... కేసీఆర్‌ చెప్పిన అబద్దాలను నిరూపించాలంటే ఇంత సమయం పడుతుందంటూ సెటైర్‌ వేశారు ఉత్తమ్‌. కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని కేసీఆర్‌ చెప్పిన మాటలన్నీ వట్టివేనని ఉత్తమ్‌ కొట్టిపారేశారు. 
పెండింగ్‌ ప్రాజెక్టులపై కేసీఆర్‌ వివక్ష 
పెండింగ్‌ ప్రాజెక్టులపై కేసీఆర్‌ వివక్ష చూపుతున్నారని ఉత్తమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణహిత డిజైన్‌ మార్చి తెలంగాణ భవిష్యత్‌ను తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్‌ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ.. ప్రాజెక్టుల డిజైన్ల మార్చడమే కాకుండా.. మాట్లాడిన వారిపై ఇష్టమొచ్చినట్లు విరుచుకు పడుతున్నారన్నారు. 2013 భూసేకరణ చట్టానికి జీవో 123తో తూట్లు పొడిచారని ఉత్తమ్‌ అన్నారు. అప్రజాస్వామికంగా భూసేకరణ చేపడితే అడ్డుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సాగు, తాగు నీరు అందించేందుకు తమ సహకారం ఉంటుందన్నారు. కానీ... ప్రాజెక్టుల పేరుతో కోట్లు దండుకునేందుకు యత్నిస్తే కచ్చితంగా అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు ఉత్తమ్‌. 
కాంగ్రెస్‌ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించాం : దాసోజు 
మరోవైపు కాంగ్రెస్‌ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించామని.. ఇంకా కొన్ని ప్రాజెక్టులు 70 శాతం వరకు పూర్తయ్యాయని కాంగ్రెస్‌ దాసోజు శ్రవణ్‌ అన్నారు. 8 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే.. రాష్ట్రంలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని.. కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. 
ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు : కాంగ్రెస్ నేతలు  
ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్‌ నేతలు హెచ్చరించారు. అయితే.. గతంలో వ్యాప్కోస్‌ సంస్థను వైఎస్సార్‌ బెదిరించి.. తమ్మిడిహట్టి వద్దనే ప్రాజెక్ట్‌ కట్టాలని ఒత్తిడి తీసుకువచ్చారని కేసీఆర్‌ అసెంబ్లీలో చెప్పారని.. కానీ.. అదే వ్యాప్కోస్‌ను కేసీఆర్‌ బెదిరించలేదని ఎలా చెప్తారని శ్రవణ్‌ ప్రశ్నించారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ ఇచ్చిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌పై టీఆర్‌ఎస్‌ నేతలు  బహిరంగ చర్చకు సిద్ధమా ? అని సవాల్‌ విసిరారు. 
మహారాష్ట్రతో టీసర్కార్ ఒప్పందం...నిరసనలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం 
ఇక మహారాష్ట్రతో ఈనెల 23న ఒప్పందం కుదుర్చుకునే రోజున నిరసనలు పాటించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకేంద్రాలలో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ నేతల పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు దిగ్విజయ్‌సింగ్‌, కుంతియాతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీ-జేఏసీ నేతలు , సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, నీటిపారుదల రంగ నిపుణులు హాజరయ్యారు. 

 

07:56 - August 18, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించిన సర్కార్.. తాజాగా శాఖల వారీగా అధికారుల నుంచి నివేదికలు కోరింది. కొత్తగా ఏర్పడే జిల్లాల్లో సిబ్బందిని సర్దుబాటు చేయడంతో పాటు..పరిపాలన భవనాల పరిస్థితిపైనా..సీఎస్‌ రాజీవ్ శర్మ సమీక్షించారు. త్వరలో నిర్వహించబోయే కలెక్టర్ల సమావేశంలోపు దీనిపై నివేదికలు అందించాలని కోరారు. మొత్తం 27 జిల్లాలుగా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. 
కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్‌ సమీక్ష 
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష 
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కేబినెట్‌ సబ్‌కమిటీ నివేదిక అందించడంతో.. కొత్త జిల్లాలను ఖరారు చేసింది సర్కార్‌. మొత్తం 27 జిల్లాలు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. రెవెన్యూ డివిజన్లు 44 నుంచి 74కు పెంచాలని, మండలాలను 459 నుంచి 533కు పెంచాలని నిర్ణయించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా..ఈ నెల 20న ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది. దానిలో భాగంగానే విపక్షాలకు సమగ్ర నివేదికను తయారు చేసే పనిలో పడింది ప్రభుత్వ యంత్రాంగం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ..అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో భేటీ అయి..జిల్లాల ఏర్పాటు ప్రక్రియను సమీక్షించారు. 
కలెక్టర్‌, శాఖల కార్యాలయాల ఏర్పాటుపై చర్చ
ప్రభుత్వ శాఖాధిపతుల సమావేశంలో.. జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలతో పాటు.. వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటు, వాటి స్వరూపం, సిబ్బంది విభజన తదితర అంశాలపై వివరాలు కోరినట్లు సమాచారం. కొత్త జిల్లాల్లో సిబ్బంది విభజనకు సంబంధించిన మార్గదర్శకాల నోట్‌ను ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు పంపించారు. వారి నుంచి దీనికి సంబంధించిన సమాచారం రాగానే శాఖల వారీగా క్రోడీకరించనున్నారు. ఈ వివరాలను తదుపరి కలెక్టర్ల సమావేశం నాటికి అందించాలని సీఎస్‌ ఆదేశించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై సమగ్ర నివేదిక 
మరోవైపు..బుధవారం నాటి సమావేశంలో...కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల అమలు తీరు..వాటికి కేంద్రం నుంచి విడుదలైన గ్రాంట్స్ వివరాలపైనా కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. మొత్తానికి మరో రెండు రోజుల్లో జరగబోయే కేబినెట్‌ సమావేశంలోపు కొత్త జిల్లాల ఏర్పాటుపై సమగ్ర నివేదిక రూపొందించాలని సీఎస్ రాజీవ్‌శర్మ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

 

07:51 - August 18, 2016

ఢిల్లీ : ఎట్టకేలకు రియో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్య పతకాన్ని సాధించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంస్య పతక పోరులో సాక్షి 8-5తో ఐసులు తినిబెకోవా  (కిర్గిజిస్తాన్)పై గెలిచింది. అంతకుముందు 'రెప్‌చేజ్' బౌట్‌లో సాక్షి 12-3తో ఒర్ఖాన్ ప్యూర్‌దోర్జ్ (మంగోలియా)పై నెగ్గింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 2-9తో వలెరియా కొబ్లోవా (రష్యా) చేతిలో  ఓడిపోయింది. అయితే సాక్షిపై నెగ్గిన రష్యా రెజ్లర్ వలెరియా కొబ్లోవా ఫైనల్‌కు చేరుకోవడంతో భారత రెజ్లర్‌కు 'రెప్‌చేజ్'లో పోటీపడే అవకాశం లభించింది. 

రెజ్లింగ్ లో సాక్షి మాలిక్ కు కాంస్య పతకం

బ్రెజిల్ : రియో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం లభించింది. మహిళల 58 కిలోల ప్రిస్టైల్ రెజ్లింగ్ లో సాక్షి మాలిక్ కు కాంస్య పతకం లభించింది. కిర్గిస్తాన్ రెజ్లర్ ఐసులా తినిబకోవాపై 8..5 తేడాతో సాక్షి గెలుపొందింది. 

నేడు మహిళ బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్

బ్రెజిల్ : రియో ఒలింపిక్స్ లో భాగంగా నేడు మహిళ బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్ సాయంత్రం జపాన్ షట్లర్ తో పీవీ సింధు తలపడునుంది. 

ఖేల్ రత్న అవార్డు కోసం జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పేరు

ఢిల్లీ : ఖేల్ రత్న అవార్డు కోసం జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పేరును ఎంపిక చేశారు. నేడు తుది నిర్ణయం వెల్లడయ్యే అవకాశం ఉంది. 

నేడు పున్నమి ఘాట్ లో జగన్ పుణ్యస్నానం

విజయవాడ : నేడు పున్నమి ఘాట్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుణ్యస్నానమాచరించనున్నారు. పుష్కర స్నానానికి వెళ్లి మృతి చెందిన ఐదుగురు విద్యార్థుల కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. 

నేడు రాజ్ భవన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలు

హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని నేడు రాజ్ భవన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలు జరుగనున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ దంపతులు ప్రజలను కలవనున్నారు. 

Don't Miss