Activities calendar

19 August 2016

ప్రభుత్వ ప్రతిపాదిత కొత్త జిల్లాలు - మండలాలు..

ఆదిలాబాద్ జిల్లా : మావల (కొత్త మండలం), బజార్ హత్నూర్, బేల, జైనథ్, థాంప్సీ, తలమడుగు, ఇంద్రవెల్లి, జైనూరు, నార్నూరు, సిర్పూర్ యు, ఉత్నూరు (కొత్త రెవెన్యూ డివిజన్), గుడి హత్నూరు, ఇచ్చోడ, కెరామెరి, నేరడిగొండ మండలాలు..
కొమరం భీమ్ జిల్లా : చెన్నూరు, జైపూరు, కొత్తపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, మందమర్రి, దండేపల్లి, హజీపూర్ (న్యూ), నర్సాపూరు స(న్యూ), ఖాసీపేట, బెల్లంపల్లి (కొత్త రెవెన్యూ డివిజన్), వేమనపల్లి, నెన్నల్, థైరానీ, తాండూరు, భీమిని, దహేగామ్, హాసిఫాబాద్, బెజ్జూరు, కాగజ్ నగర్, కౌతాల, రెబ్బన, సిర్పూరుటి, పెంచికల్ పేట (న్యూ మండలం) వాంఖిడి,

బ్యాడ్మింటెన్ పురుషులు ఫైనల్ లో లీ చాంగ్ వే..

ఒలింపిక్స్ బ్యాడ్మింటెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ లో మలేషియా లీ చాంగ్ వే అడుగుపెట్టాడు. సెమీస్ లో చైనా సూపర్ స్టార్ లిన్ డాన్ ఔట్ అయ్యాడు. లిన్ డాన్ పై 15-21, 21-11, 22-20 తేడాతో లీ చాంగ్ వే గెలుపొందాడు. 

కొత్త జిల్లాల ఏర్పాటుపై రేపే అఖిలపక్షం..

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై రేపు అఖిలపక్ష సమావేశం జరగనుంది. టిడిపి నుండి ఎల్.రమణ, రావుల, సీపీఎం నుండి తమ్మినేని, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నుండి చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకటరెడ్డి, కాంగ్రెస్ నుండి షబ్బీర్ ఆలీ, భట్టీ విక్రమార్కలు హాజరు కానున్నారు.  

18:44 - August 19, 2016

విశాఖపట్టణం : తాను సీఎంగా ఉన్న సమయంలో క్రీడలకు చాలా ప్రాధాన్యత ఇచ్చానని... ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.. అప్పట్లో తాను గోపీచంద్‌కు అందించిన సహకారమే ఇవాళ దేశానికి ఒలంపిక్ మెడల్‌ తెచ్చిందని చెప్పారు.. క్రీడలను ప్రోత్సహిస్తే అత్యుత్తమ క్రీడాకారులు తయారవుతారని తెలిపారు

ఫొటో ఎగ్జిబిషన్..
హైదరాబాద్: ఒలింపిక్స్‌లో అద్భుతంగా రాణించిన సాక్షి మాలిక్‌, పీవీ సింధును చూసి దేశం గర్వపడుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సింధు ఒలింపిక్స్ ఫైనల్లో గెలుపొందాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంచార ఫోటో ఎగ్జిబిషన్‌ను వెంకయ్యనాయుడు తిలకించారు. మహనీయుల ఫోటోలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వెంకయ్యనాయుడు అన్నారు.  

18:41 - August 19, 2016

పశ్చిమగోదావరి : రియో ఒలంపిక్స్‌లో పీవీ సింధు బంగారు పతకం సాధించాలని ఆమె తండ్రి వెంకటరమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలోని శ్రీ రత్నాలమ్మ ఆలయంలో ఆయన పూజలు చేశారు. సింధు బంగారు పతకం గెలిచి దేశ ఖ్యాతిని పెంచుతుందనే నమ్మకం తనకుందని రమణ తెలిపారు. ఇక్కడ కుల దేవతను పూజలు చేయడం ఆచారంగా వస్తోందన్నారు.

గెలుస్తుందన్న నెల్లూరు ప్రజలు..
రియో ఒలంపిక్స్ లో తెలుగు తేజం సిందూ ఫైనల్ కు చేరడంతో నెల్లూరు జిల్లా వాసులు శుభాకాంక్షలు తెలిపారు. సింధు భారత్ కు స్వర్ణపతకానికి మరో అడుగు దూరంలో ఉండడంతో ఫైనల్ లో ఎలాగైనా గెలిచి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:38 - August 19, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలను ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అనేకమంది సీఎం చంద్రబాబు పుష్కరాలు నిర్వహిస్తున్న తీరును అభినందించి వెళ్తున్నారు. పుష్కరాలు విజయవంతంగా సాగడానికి, చంద్రబాబుకు మంచి పేరు రావడానికి ప్రత్యక్ష కారకులు మాత్రం పారిశుధ్య కార్మికులు. రాత్రింబవళ్లు నిరంతరం శ్రమించి పుష్కర ప్రదేశాలను చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఇంత చేస్తున్నా వారిని మాత్రం గుర్తించకపోవడం బాధాకరం. నిరంతరం చీపుర్లు చేతపట్టి కృష్ణా పుష్కర ఘాట్లను శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులు.. అలుపు సొలుపు లేకుండా శ్రమిస్తున్నారు. ఘాట్ల వద్ద ఎక్కడ కూడా మట్టి, చెత్తా చెదారం లేకుండా నీట్‌గా ఉంచుతున్నారు. చిన్నపాటి ఆకు కూడా కనిపించకుండా ఎప్పటికప్పుడు చెత్తను ఊడ్చేస్తూ... పరిశుభ్రతను కాపాడుతున్నారు. కిలోమీటర్ల పొడవునా ఉన్న పుష్కర ఘాట్లను నిరంతరం శుభ్రం చేస్తూ పుష్కర స్నానాలకు వచ్చిపోయే లక్షలాది మంది భక్తుల ఆరోగ్యాలను కాపాడుతున్నారు. 24 గంటల పాటు అలుపు సొలుపూ లేకుండా పారిశుధ్య కార్మికులు శ్రమిస్తున్నారు.

పరిశుభ్రం..
ఘాట్ల వద్ద చీపుర్లతో ఊడవడంతో పాటు ఎక్కడా నీరు నిలువకుండా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. నీటిలో భక్తులు వేసే పూజా సామాగ్రి, వ్యర్థాలను, పిండాలను ఎంతో ఓపిగ్గా తీసేసి క్రిమిసంహాకర మందులు చల్లుతూ భక్తుల ఆరోగ్యాన్ని కాపాడటంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండేలా శ్రమిస్తున్నారు. పుష్కరాల్లో అత్యధికంగా కష్టపడుతున్నవారు ఎవరంటే మొదటగా చెప్పుకోవాల్సింది మాత్రం పారిశుధ్య కార్మికులనే. వీరి శ్రమ వల్లే పుష్కరాలకు ఎంతో పేరు వస్తోందంటే ఏ మాత్రం అతిశయేక్తి లేదు. పారిశుధ్య కార్మికుల సేవలు మరవలేనివని భక్తులు మెచ్చుకుంటున్నారు. రేయింబవళ్లు విరామం లేకుండా పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నందువల్లే తాము పుష్కర స్నానాలు సవ్యంగా చేయగలుగుతున్నామని, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయమని భక్తులు కొనియాడుతున్నారు.

అరకొర వేతనాలు..
ఇంత చేస్తున్నా.. పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే వేతనాలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. కాంట్రాక్టర్లు పారిశుధ్య కార్మికులను తీసుకొస్తూ.. పని చేయిస్తున్నారే తప్పా.. ఇంతవరకు వాళ్లకు ఒక్క పైసా ఇచ్చింది లేదని, రోజువారి కూలీ ఎంతో నిర్ణయించలేదని కార్మికులు చెబుతున్నారు. అయినా పారిశుధ్య కార్మికులు మాత్రం శ్రమనే నమ్ముకుని పనిలో నిమగ్నమై అహర్నిశలు కృషి చేయడం గమనార్హం. ప్రభుత్వం.. పారిశుధ్య కార్మికుల పట్ల కనికరం చూపాలని, రోజుకు కనీసం ఆరు వందలైనా చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు. రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుంటున్న ఈ శ్రమజీవులకు.. న్యాయం చేయాలని, పుష్కరాల విజయవంతంలో ప్రత్యక్ష పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. 

18:33 - August 19, 2016

విశాఖపట్టణం : రైల్వే జోన్ కేటాయించాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ వద్ద నిరవధిక దీక్షలు చేపట్టారు. విభజన హమీలలో రైల్వే జోన్ ఇస్తామన్నారని కాని ఇప్పటి వరకు దాని ఊసే లేదన్నారు వామపక్ష నాయకులు ఆంధ్ర నుంచి రాజ్యసభకు సురేష్ ప్రభుని పంపి ఆరు నెలలు కావొస్తున్న రైల్వే జోన్ పై ప్రకటన కూడా లేదని మండిపడ్డారు. తక్షణమే రైల్వే జోన్ కేటాయించాలని లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు టెన్ టివితో మాట్లాడారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:31 - August 19, 2016

విశాఖపట్టణం : మన దేశంలో వైద్య పరికరాలు తయారు చేస్తే చాలా ఖర్చులు తగ్గించుకోవచ్చని... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.. ఏపీ మెడిటెక్‌ జోన్‌లో ఉత్పత్తిని త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు.. ఇందుకోసం 270 ఎకరాల భూమి, 50కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు.. విశాఖ ఏపీ మెడిటెక్‌ జోన్‌ పెట్టుబడి దారుల సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు.

18:17 - August 19, 2016

అపజయం లేని దర్శకుడిగా దూసుకుపోతున్న జక్కన్న స్టార్ హీరోలు సైతం అవాక్కైయ్యే రేంజ్ లో రెమ్యూనేషన్ తీసుకుంటున్నాడు. బాహుబలి 2 కోసం రాజమౌళి తీసుకుంటున్న రెమ్యూనేషన్ చూస్తే బాలీవుడ్ స్టార్స్ సైతం ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ సెకెండ్ పార్ట్ కంక్లూజన్ కోసం జక్కన్న పుట్టనున్న అమౌంట్ ఎంతో మీరే చదవండి..దర్శకుడిగా రాజమౌళి న్యూ హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు.ఈ జనరేషన్ లో అపజయం లేని దర్శకుడిగా జక్కన్న వరుసగా పది సూపర్ హిట్స్ అందించాడు. ప్రస్తుతం కాలంలో ఇలా వరుసగా పది సక్సెస్ చూసిన దర్శకుడు దేశంలోనే లేడు. ఎప్పటికప్పుడు దర్శకుడిగా సరికొత్త విజన్ తో ముందుకు వెళ్లుతున్నా రాజమౌళి తన పేరుమీద సినిమా బిజినేస్ జరిగే రేంజ్ కి చేరుకున్నాడు. అందుకు నిర్మాతలు ఈ దర్శకుడు ఎంత అడిగిన నో చెప్పకుండా ఇచ్చేస్తున్నారు.

నెంబర్ వన్..
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి 2 కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ వింటే ఎవరికైనా దిమ్మతిరిగి తిరగాల్సిందే. హిట్స్ లోనే కాదు, రెమ్యునరేషన్ విషయంలో కూడా ఈ దర్శకుడు దేశంలోనే నెంబర్ వన్ నిలవబోతున్నాడు. బాహుబలి మొదటి పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా 650 కోట్లను వసూలు చేసింది. మొదటి పార్ట్ లో జక్కన్నకు 30కోట్ల వరకు రెమ్యూనేషన్ కింద ముట్టినట్లు సమాచారం. అయితే రెండో పార్ట్ విషయంలో మాత్రం జక్కన్న వాటా తీసుకోనున్నట్లు టాక్ . రిలీజ్ కి ఎడాది సమయం ఉండగానే బాహుబలి2 హాట్ కేక్ ల జరుగుతోంది. ఈ రెండో పార్ట్ కి రాజమౌళి ఏకంగా 70 నుంచి 100కోట్లు రెమ్యూనరేషన్ కింద ముట్టినునట్లు తెలుస్తోంది. హిందీ, తమిళ్ బిజినెస్ అమౌంట్ లో సగం జక్కన్నకు రెమ్యునరేషన్ గా ఇచ్చేందుకు నిర్మాతలు ఒప్పందం చేశారట. ఈ లెక్కన ఈ రెండు భాషల్లో బాహుబలి2 ఎంత లేదన్నఈజీగా 150 నుంచి 200 కోట్ల వరకు బిజినెస్ చేస్తోంది. ఇందులో సగం అంటే 75 నుంచి 100 కోట్ల రాజమౌళి ముట్టుతాయి. జక్కన్న పనితననికి ఈ మాత్రం ఇవ్వాల్సిందే మరి.

18:09 - August 19, 2016

శ్రీకాకుళం : జిల్లాలోని పైడి భీమవరంలోని అరంబిందో కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. కార్మికుడు మృతి చెందాడు. యాజమాన్య నిర్లక్ష్య వైఖరే కారణమని తోటి కార్మికులు పేర్కొన్నారు. అతను మృతి చెదిన సమచారాన్ని ఎవరికి తెలియచేయలేదు.
బ్లాక్ 1లో అప్పల్రాజు పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా జరిగిన ప్రమాదంలో అప్పల్రాజు అక్కడికక్కడనే దుర్మరణం చెందాడు. దీనితో యాజమాన్యం అతడి మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా విశాఖకు తరలించేందుకు యాజమాన్యం ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న తోటి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ ఎదుట నిరహార దీక్షకు దిగారు. 

అరబిందో కార్మికుడి మృతి..

శ్రీకాకుళం : జిల్లాలోని పైడి భీమవరంలోని అరంబిందో కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. అప్పల్రారాజు అనే కార్మికుడు మృతి చెందాడు. గుట్టుచప్పుడు కాకుండా అప్పల్రాజు మృతదేహాన్ని విశాఖకు తరలించింది. దీనితో కార్మికులు హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. 

ఎంసెట్ లీకేజ్ లో మరొకరి అరెస్టు..

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మరొకరిని ఢిల్లీలో అరెస్టు చేశారు. ఆకృతి కన్సల్టెన్నీ నిర్వహకుడు అశ్వనీకుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. 

17:52 - August 19, 2016

సాయికుమార్ తనయుడు ఆది హీరోగా, మలయాళ కుట్టి నమితా ప్రమోద్ హీరోయిన్ గా నటించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ చుట్టాలబ్బాయి. వీరభద్రం దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆదికి చాలా కీలకం, అలాగే డైరెక్టర్ వీరభద్రానికి చాలా ముఖ్యం. మరి వీరిద్దరి కలయిక లో వచ్చిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను రాబట్టిందో చూద్దాం....

కథ..
ఆది కి ముందునుంచి తనను తాను మాస్ హీరోగా ఎలివేట్ చేసుకోవడం ఇష్టం. మాస్ హీరోగా ఎదగాలనే తాపత్రయంలో మాస్ లవ్ స్టోరీల్ని సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టాడు. దాంతో అతడు చేసిన సుకుమారుడు, గాలిపటం, రఫ్, గరం, లాంటి సినిమాలన్నీ మిస్ ఫైర్ అయ్యాయి. ముందు మంచి లవర్ బోయ్ గా ఎస్టాబ్లిష్ అయి తరువాత హీరోగా నిలబడాలనే ఆలోచనే లేకపోవడంతో ఆది చుట్టాలబ్బాయ్ లో కూడా ఇదే రూట్లో ట్రావెల్ చేసి మరోసారి కంటెంట్ లెస్ ఎటెమ్ట్ చేసాడు. ఇందులో ఆదిని మాస్ హీరో గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో కథ పక్కదారి పడుతూ పోతుంది. అర్ధం పర్ధంలేని సన్నివేశాలు వచ్చిపోతుంటాయి. ఒక పృధ్వి ఎపిసోడ్ తప్ప ఇందులో కామెడీ ఏమాత్రం పేలలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేవరకూ ఫస్ట్ హాఫ్ లక్ష్యం ఏంటో తెలియకుండా పోతుంది. అసలు దీనికి చుట్టాలబ్బాయ్ అనే టైటిల్ ను ఎందుకు పెట్టారో తెలియదు.

పాత్రల తీరుతెన్నులు..
రికవర్ బాబ్జి లోన్ తీసుకొని తీర్చని బాకీల్ని బలవంతంగా వసూలు చేస్తుంటాడు. అనుకోకుండా ఒక అమ్మాయిని పెళ్లిలో కలుసుకున్న బాబ్జీకి ఆ అమ్మాయి మూలంగా ఆమె అన్ననుంచి థ్రెట్ ఏర్పడుతుంది. వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారనుకుని పొరపాటు పడ్డ ఆమె పోలీస్ అన్న మనుషులు బాబ్జీని ఫాలో చేస్తూ ఉంటారు. హీరోయిన్ కు పెళ్లి చేసుకోవడం ఇష్టముండకపోవడంతో బాజ్జీ సహాయంతో ఆమె ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోతుంది, ఇంటర్వెల్ బ్యాంగ్. కథ ఇంటర్వెల్ తరువాత బాబ్జీ ఇంట్లో ల్యాండ్ అవుతుంది. బాబ్జీ ఎవరో అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో అప్పుడు తెలుస్తుంది. ఈలోగా హీరోయిన్ అన్న శత్రువులు హీరోయిన్ ను వెతుకుతుంటారు. కథ క్లైమాక్స్ కు వస్తుంది. చాలా సినిమాల్లో విరగ్గొట్టేసిన రొటీన్ స్టోరీనే వీరభద్రం మళ్లీ ప్రేక్షకులకు రుచి చూపించే ప్రయత్నం చేసాడు. ఈ సినిమా ఏ పరిస్థితుల్లోనూ కూడా ఆకట్టుకొనే ప్రయత్నం చేయదు. చాలా సీన్లు బోరింగ్ గా అనిపిస్తాయి. ప్రతీ సీన్ తరువాత ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేసేలా ఉంటుంది.

పాత్రల తీరు తెన్నులు..
బాబ్జీ గా ఆది పెర్ఫార్మెన్స్ కు పేరు పెట్టలేం. ఎనర్టిటిక్ గా చాలా చక్కగా నటించాడు. డ్యాన్సులు కూడా హుషారు గా వేసాడు. హీరోయిన్ నమితా ప్రమోద్ కూడా పెర్ఫార్మెన్స్ వైజ్ గా పర్వాలేదు. కానీ ఈ మాత్రం దానికి కేరళ నుంచి ఆమెను రప్పించడం ఎందుకో అర్ధం కాలేదు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ట్విస్ట్ ఇచ్చి తరువాత రివీల్ చేసిన సాయికుమార్ పాత్రకూడా ఏ మాత్రం జనాన్ని ఆకట్టుకోదు. వీరభద్రం సినిమాలో సీరియస్ విలన్స్ పాజిటివ్ పాత్రలు వేస్తుంటారు. యాజ్ యూజువల్ గా ఇందులో కూడా అభిమన్యు సింగ్ పాత్రను పాజిటివ్ పోలీస్ పాత్రలో చూపించే ప్రయత్నం చేసాడు కానీ, పాత్ర తేలిపోయింది. ఇక ఆదిలాంటి మిడిల్ రేంజ్ హీరోచేత పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పించడం జోక్ గా అనిపిస్తుంది. ఇక విలన్ పాత్రను కూడా క్లైమాక్స్ లో ఫూల్ ని చేసాడు దర్శకుడు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీరియల్ మ్యూజిక్ కన్నా ఘోరంగా ఉంది. పాటలు కూడా అంతగా ఆకట్టుకోలేవు. టోటల్ గా చుట్టాలబ్బాయి పరమ రొటీన్ బోరింగ్ మూవీగా తయారైంది. ఆదిని హీరోగా నిలబెడుతుందనుకున్న ఈ సినిమా అతడి కెరీర్ కు ఎందుకూ పనికి రాదని సినిమా చూస్తే అర్ధమైపోతుంది.

ప్లస్ పాయింట్స్:
హీరో, హీరోయిన్ పెర్ఫార్మెన్స్
పృధ్వి కామెడీ

మైనస్ పాయింట్స్ :
కథ, స్ర్కీన్ ప్లే
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
బోరింగ్ సీన్స్
డైరెక్షన్
రేటింగ్ : 1 /5

17:35 - August 19, 2016

హైదరాబాద్ : ఒలంపిక్స్ లో తొలిసారి ఫైనల్ చేరుకున్న భారత బాడ్మింటన్ క్రీడాకారిణిగా సింధు ఇప్పటికే చరిత్ర సృష్టించింది. ఇప్పటికే సెమిఫైనల్‌లో టాప్ సీడ్‌ క్రీడాకారిణిని దడదడలాండించిన సింధు ఇవాళ ఫైనల్‌లో బంగారు పతకం కోసం వరల్డ్ నెంబర్ వన్... క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో ఢీ కొనేందుకు సిద్ధమైంది. సింధు గెలవాలని దేశమంతా కోరుకుంటుంది. అలాగే సింధు చదివిన కాలేజీ కూడా కోరుకుంటోంది. అంతేకాదు సింధుని గెలుపు కాంక్షిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
సికింద్రాబాద్‌లో బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు చదివిన ఆగ్జీలియం స్కూల్‌లో సంబరాలు హోరెత్తిపోతున్నాయి.. సింధుకు స్కూల్‌ విద్యార్థులంతా బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెబుతున్నారు.. ఈ స్కూల్‌లో సింధు ఎల్‌కేజీనుంచి పదో తరగతి వరకూ చదువుకుంది.
పూజలు..
రియో ఒలంపిక్స్‌లో ఫైనల్‌కు చేరుకున్న సింధూ గెలుపొందాలని కోరుతూ ఫిలింనగర్ యువజన సంఘం సభ్యులు అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. సింధూ బంగారు పతకాన్ని సాధించి భారతదేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టాలని..వారు ఆకాంక్షించారు.  
ఈ స్కూల్...మెహిదిపట్నం లో సింధు చదివిన సెయింట్ ఆన్స్ కాలేజీలో విద్యార్థులు, అధ్యాపకులు ఏమన్నారో లుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 
 

17:32 - August 19, 2016

నల్గొండ : ఆందోళనలు మిన్నంటుతున్నాయి. నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. పార్టీలకతీతంగా కదం తొక్కుతూ సమరశంఖం పూరిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడను సూర్యాపేటలో విలీనం చేయొద్దంటూ ఆ ప్రాంత వాసులు పోరుబాట కొనసాగిస్తున్నారు. ఊరువాడ కదిలింది..పల్లె పట్టణం ఏకమైంది. జెండాలు, అజెండాలు పక్కనబెట్టి.. ఒక్క గొంతుకగా నినదించింది. నల్లగొండ జిల్లా నుంచి తమను వేరు చేయొద్దంటూ మిర్యాలగూడ వాసులు ముక్త కంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు. సూర్యాపేటలో విలీనం చేసే ప్రక్రియను ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా.. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని సూర్యాపేట జిల్లాలో విలీనం చేసేందుకు సర్కార్‌ సిద్ధమవడంతో.. మిర్యాలగూడ వాసులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు.

కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రతిపాదనపై నిరసన..
వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పడి ఉద్యమ వాణి వినిపిస్తున్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని యథాతథంగా కొనసాగిస్తామన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే భాస్కర్‌ రావు..మిర్యాలగూడను నల్లగొండలోనే కొనసాగిస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీతో ఆ పార్టీలో చేరానని చెప్పుకుంటున్నారు. అయితే మంత్రివర్గ ఉపసంఘం మిర్యాలగూడను కొత్తగా ఏర్పాటయ్యే సూర్యాపేటలో విలీనం చేస్తామని ప్రతిపాదించింది. ప్రభుత్వ ప్రతిపాదనలపై మిర్యాలగూడ జేఏసీ నేతలు భగ్గుమంటున్నారు.

నల్లగొండ జిల్లాలో కొనసాగించాలని విన్నపం..
నిరసనకారుల వాదనలు పరిశీలిస్తే...నల్లగొండ జిల్లాలో వాణిజ్య, వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరిగే ప్రాంతం మిర్యాలగూడ. వరి ఎక్కువగా పండించే ప్రాంతం కావడంతో వరి ధాన్యం వ్యాపారానికి ప్రఖ్యాతి గాంచింది. మూడు మండలాలు, ఒక మున్సిపాల్టీ ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గం నల్లగొండ జిల్లాకు గుండెకాయ లాంటిది. ఇక్కడి ప్రాంత వాసులు ప్రతి పనికి జిల్లా కేంద్రానికే ఎక్కువగా వెళ్తుంటారు. సూర్యాపేటతో సంబంధాలు అంతంత మాత్రమే. అందుకే మెజార్టీ ప్రజలు మిర్యాలగూడను నల్లగొండ జిల్లాలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో మిర్యాలగూడను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నారు. మిర్యాలగూడ ప్రజల ఆందోళనలు మిన్నంటుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. 

17:31 - August 19, 2016

 

హైదరాబాద్ : బల్దియా ఖజానా ఖాళీ అయ్యిందా.. ? ఆర్థిక ఇబ్బందుల్లో జీహెచ్‌ఎంసీ చిక్కుకోబోతుందా..? ఉద్యోగుల జీతాల చెల్లింపు కూడా కష్టంగా మారనుందా..? నూతన ప్రాజెక్టుల కథ కంచికి చేరబోతుందా..? అన్ గోయింగ్ ప్రాజెక్టుల పరిస్థితేంటీ...? ఇదే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌లో హాట్ టాఫిక్. నిత్యం కాసులతో కళకళలాడే కార్పొరేషన్‌కు నిధుల సమస్య తీవ్రంగా వెంటాడుతోంది..! జీహెచ్‌ఎంసీ ఒకప్పుడు భారీగా ఆదాయం ఉన్న లోకల్ బాడీ. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నిత్యం కాసులతో గళగళలాడే కార్పొరేషన్ గల్లాపెట్టే ఇప్పుడు వెలవెలబోతుంది. గత ఆర్థిక సంవత్సరం కూడా బల్దియాకు 600కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉండేవి. కానీ, ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఖజానా ఖాళీగా కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 700కోట్ల వరకు బల్దియాకు ఆదాయం సమకూరింది. అయితే.. ఇప్పుడు 20కోట్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు వచ్చే రాబడి అంత ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఏప్రిల్‌, మే నెలల్లోనే ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్‌ను భారీగా వసూలు చేశారు. గతేడాది కంటే 120కోట్లు అధికంగా వసూలు చేసిన అధికారులు మొత్తం 422కోట్లు వసూలు చేశారు. ట్రేడ్ లైసెన్స్ 22కోట్లు కాగా 156కోట్లు టౌన్ ప్లానింగ్ ద్వారా జీహెచ్ఎంసీ ఖజానాకు చేరాయి. ఇక మిగిలిన 100కోట్లు ఇతర ఆదాయంగా వచ్చింది. ఇలా వచ్చిన 700కోట్లు ఇప్పటికే అయిపోయాయి. దాంతో 1990వ సంవత్సరంలో ఉన్న ఎంసీహెచ్ కాలం నాటి పరిస్థితులు పునారావృతం అవుతాయని భావిస్తున్నారు.

కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయంపై ప్రత్యేక దృష్టి..
ప్రస్తుతం అభివృద్ధి పనులను పక్కన బెట్టి... మెయింటేనెన్స్ కోసం ప్రతినెలా తప్పకుండా చెల్లించాల్సిన మొత్తం 150 కోట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం కార్పొరేషన్‌ను ఎలా నెట్టుకురావాలో ఆలోచిస్తున్నారు బల్దియా అధికారులు. ముఖ్యంగా కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ట్రెడ్ లైసెన్స్, ఆస్తి పన్ను వసూళ్లపై ఎప్పటికప్పుడు జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు సమీక్షలు చేయాలని, 100శాతం వసూళ్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టీసీ నష్టాలను భర్తీ చేస్తున్న బల్దియా..
జీహెచ్‌ఎంసీకి ఇలాంటి పరిస్థితులు రావడానికి ప్రభుత్వ చర్యలే కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ నష్టాలను భర్తీ చేయడం కోసం బల్దియా నిధులను ఖర్చు చేస్తున్నారు. ఇటు ఆస్తిపన్ను వసూళ్లలో 15 శాతం నిధులు హైదరాబాద్ వాటర్ బోర్డుకు చెల్లిస్తున్నారు. ఫలితంగా బల్దియా ఖజానా ఖాళీగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను 95 కోట్లు రద్దు చేసిన ప్రభుత్వం... ఇప్పడు ఒక్కరూపాయి కూడా చెల్లించలేదు. 1200 రూపాయల కంటే తక్కువ ఆస్తిపన్ను చెల్లించే వారు నామినల్ పన్నును మాత్రమే చెల్లించాలని డిసైడ్ చేయడంతో ప్రతిఏటా కార్పొరేషన్‌కు 25 కోట్లకుపైగా ఆదాయం కోతపడింది. ఇంతచేసినా.. జీహెచ్ఎంసీకి ప్రభుత్వం న్యాయంగా ఇవ్వాల్సిన నిధులైనా ఇస్తుందా..? అంటే అది లేదు..! ఇప్పటికే గ్రేటర్‌లో అనేక ప్రాజెక్టులు చేపట్టారు. వాటికి తోడు ఎన్నికల హామీలు అదనంగా ఉన్నాయి. ప్రారంభించిన పనులకు కోట్లాది రూపాయలు అవసరమవుతాయి. ఇక మినిమమ్ మెయింటెనెన్స్‌కే ఇబ్బందులుంటే అభివృద్ధి పనుల మాటేంటని అంతా చర్చించుకుంటున్నారు.

17:28 - August 19, 2016

హైదరాబాద్ : నయీం అనుచరులు నుంచి తనకు ప్రాణహాని ఉందని..తనకు రక్షణ కల్పించాలని వలిగొండకు చెందిన కొమిరెల్లి ప్రదీప్‌ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పొలిట్‌ బ్యూరో సభ్యుడు సాంబశివుడు.. అతని సోదరుడు రాములుతో కలసి పనిచేస్తున్న సమయంలో నయీం ముఠా తనను నానా రకాలు వేధించిందని ప్రదీప్ అన్నారు. తనపై హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని చెప్పారు. తనకు ప్రభుత్వం ఆత్మరక్షణ కల్పించాలని ఆయన కోరారు.

17:18 - August 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ లీకేజ్ స్కాంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవలే ఎంసెట్ 2 లీకేజ్ అయ్యిందని నిర్ధారణకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ప్రభుత్వం ఎసెట్ 3ని పరీక్ష నిర్వహించింది. నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు..నిందితులను అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు రంగంలోకి దిగారు. పలువురిని అరెస్టు కూడా చేశారు. తాజాగా ఈ కేసులో వరంగల్ సీఐడీ డీఎస్పీ బాల జాదవ్ కు లింకు ఉన్నట్లు గుర్తించారు. బ్రోకర్ ను పట్టుకోవడానికి వెళ్లి అతనితో కుమ్మక్కయ్యాడని, అరెస్టు చేయకుండా ఉండేందుకు రూ. 3లక్షలు డిమాండ్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితుడు నుండి రూ. 1.5 లక్షలు డ్రా చేసుకున్నాడు. సీఐడీ డీఎస్పీ బాలు జాదవ్ పై చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధమౌతున్నట్లు సమాచారం. చార్జి మెమో ఇచ్చి వివరణ కోరుతారు. అనంతరం చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇంకా ఎంతమందికి లింక్ లున్నాయో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. 

ఎంసెట్ లీక్ స్కాం..సీఐడీ డీఎస్పీకి లింక్..

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ లీకేజ్ స్కాంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. లీక్ స్కాంలో వరంగల్ సీఐడీ డీఎస్పీ బాల జాదవ్ కు లింకు ఉన్నట్లు గుర్తించారు. బ్రోకర్ ను పట్టుకోవడానికి వెళ్లి అతనితో కుమ్మక్కయ్యాడని, అరెస్టు చేయకుండా ఉండేందుకు రూ. 3లక్షలు డిమాండ్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితుడు నుండి రూ. 1.5 లక్షలు డ్రా చేసుకున్నాడు. సీఐడీ డీఎస్పీ బాలు జాదవ్ పై చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధమౌతున్నట్లు సమాచారం. 

వీటీపీఎస్ ఎస్ఈ ఇంట్లో ఏసీబీ సోదాలు..

విజయవాడ : వీటీపీఎస్ ఎస్ ఈ రామకోటి శివలింగేశ్వరరావు ఇంట్లో రెండో రోజు ఏసీబీ సోదాలు జరుపుతోంది. కాంట్రాక్టర్ల నుండి నగదుకు బదులుగా నగలు తీసుకున్నట్లు గుర్తించారు. తవ్వేకొద్ది రామకోటి అవినీతి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. రామకోటి బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరవనున్నారు. 

టిటిడిపి నేతల సమావేశం..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఎల్.రమణ అధ్యక్షతన తెలంగాణ టిడిపి నేతల సమావేశం జరుగుతోంది. అన్ని జిల్లాల టిడిపి నేతలు హాజరయ్యారు. ప్రభుత్వం తలపెట్టిన కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. 20న జరిగే అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. 

మెట్రో ప్రాజెక్టు కోసం రూ. 300 కోట్లు విడుదల..

విజయవాడ : మెట్రో రైలు ప్రాజెక్టు భూ సేకరణ కోసం రూ. 300 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలో భూ సేకరణ ప్రారంభిస్తామని మెట్రో రైలు ఎండీ రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 

హోదా ఇచ్చే వరకు పోరాటం ఆగదు - చలసాని..

విశాఖపట్టణం : అనకాపల్లిలో ప్రత్యేకహోదా సాధన సమితి, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా గర్జన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చలసాని శ్రీనివాస్, దాడి వీరభద్రరావు, అజయ్ శర్మలు హాజరయ్యారు. విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలం చెందిందని, ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం ఆగదని చలసాని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతో ఏపీ విద్యార్థుల భవిష్యత్ ముడి పడి ఉందన్నారు. విద్యార్థులను చైతన్యపరచడం కోసమే విద్యార్థి జేఏసీతో కలిసి పనిచేయడం జరుగుతోందన్నారు. 

ప్రకాశం పంతులు జయంతి ఏపీ రాష్ట్ర ఉత్సవం..

విజయవాడ : ఈనెల 23వ తేదీన ప్రకాశం పంతులు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆమరణ నిరహార దీక్ష చేస్తా - డీకే అరుణ..

మహబూబ్ నగర్ : గద్వాలను జిల్లాగా ప్రకటించకపోతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ హెచ్చరించారు. 

సోనియాను కలిసిన ఉత్తమ్..

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కలిశారు. ఆయన కుటుంబ సమేతంగా వెళ్లి రాహుల్‌గాంధీని కలిశారు. 

16:25 - August 19, 2016

విశాఖపట్టణం : పీవీ సింధు ఖచ్చితంగా విజయం సాధిస్తుందని యూత్ పేర్కొంటోంది. కొద్ది గంటల్లో ఫైనల్ పోరు జరగనుంది. ఈ సందర్భంగా విశాఖ జిల్లాకు చెందిన అధ్యాపకులు విద్యార్థులు..ఆల్ ది బెస్ట్ చెప్పారు.
శుక్రవారం జరిగే ఫైనల్లో స్పెయిన్ ప్లేయర్ కారోలిన్ మారిన్ ను ఢీ కొంటుంది. రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్స్ కు తెలుగుతేజం పీవీ సింధు చేరి చరిత్ర సృష్టించింది. బంగారు పతకం కోసం జరిగే పోటీలో స్పెయిన్ సూపర్ స్టార్ కారోలిన్ మారిన్ తో తలపడటానికి అర్హత సంపాదించింది. రియో సెంట్రో పెవీలియన్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో జపాన్ కు చెందిన 6వ ర్యాంకర్ నజోమీ ఒకుహరాను వరుస గేమ్ ల్లో సింధు చిత్తు చేసింది. కేవలం 49 నిముషాలలోనే సింధు 21-19, 21-10 పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది.

బీఎస్ఎఫ్ క్యాంపుపై మిలిటెంట్ల దాడి..

కాశ్మీర్ : కుప్వార జిల్లాలో బీఎస్ఎఫ్ క్యాంప్ పై మిలిటెంట్లు దాడి జరిపారు. దీనితో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి.

 

16:08 - August 19, 2016

కడప : సిద్ధవటం (మం) పెద్దపల్లిలో బాలయ్య అనే దళితుడి మృతి కేసులో అగ్రకులాల వారు బెదిరింపులకు గురి చేస్తున్నారని మృతుడి కుటుంబీకులు పేర్కొన్నారు. కేసు వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో చంపేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొంటున్నారు. కేసు విత్ డ్రా చేసుకొనేందుకు డబ్బులు ఆశ చూపుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే ఈ కేసులో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
రియల్ ఎస్టేట్ వివాదంలో బాలయ్య అనే దళితుడిపై సలసలలాడే నూనె పోసి ఓ రూంలో బంధించారు. అనంతరం చన్నీళ్లు పోయడంతో బాలయ్య అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు కడప ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు బాలయ్య మృతి చెందాడు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఘటనకు కారణమైన మురళీ, ఈశ్వరయ్య, రమణలను పోలీసులు అరెస్టు చేశారు. 

డీఎంకే మాక్ అసెంబ్లీ..

చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో సస్పెన్షన్ కు గురైన డీఎంకే సభ్యులు వినూత్న నిరసన చేపట్టారు. సభ్యులంతా ఒక చోట చేరి అసెంబ్లీ సమావేశాల తరహాలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. 

భువనగిరిలో నయీం అరాచకాలు..

నల్గొండ : భువనగిరి (మం) తుక్కాపురంలో నయీం అరాచకాలు వెలుగు చూస్తున్నాయి. 16 ఎకరాలను నయీం అనుచరుడు పాశం శ్రీను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. పోలీసులకు 30 మంది రైతులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

15:39 - August 19, 2016

ఇప్పుడంతా పండగల సీజన్. పార్టీల సీజన్. మరి నలుగురికలో ప్రత్యేకంగా కనిపించాలంటే పార్టీవేర్ కావాల్సిందే కదా? మరి అలాంటి వెరైటీ పార్టీ వేర్ గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

15:38 - August 19, 2016
  • ప్రసూతి సెలవుల పెంపు బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచే ప్రసూతి ప్రయోజనబిల్లు-2016ను సభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది.
  • మంటలు మీదికొస్తుంటే భయంతో పరుగులు తీస్తాం.. అగ్నిపర్వతం బద్ధలై లావా దూసుకొస్తుంటే బెంబేలెత్తి పోతాం.. కానీ, హవాయ్ దీవుల్లో ఓ యువతి మాత్రం థ్రిల్ ఫీల్ అయింది.
  • 'ఓం కారం వేదమై వెలసిన దేశమే మనదిరా. సాకారం సంస్కృతై నిలిచినమేటి చరితరా. జగతికి గురువుగా జ్ఞానమే పంచి, పంచభూతములు దైవముగా కొలిచి...' అంటూ సాగే ఈ పాట దేశభక్తితో సాగుతుంది. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా గాయకురాలు అంజనా సౌమ్య 'ఇదిరా భారతం' అనే వీడియోను విడుదల చేశారు.
  • మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా యంత్రాంగం సెక్స్ వర్కర్ల జీవితాల్లో మార్పును తెచ్చేందుకు నిర్ణయించుకుంది. వారిని వ్యభిచార కూపంనుంచీ బయటకు తెచ్చి పునరావాసం కల్పించేందుకు సిద్ధమైంది.
  • మణిపూర్ లో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా ఇరోం షర్మిల స్పూర్తితో మరొకరు అలాంటి దీక్షకే దిగారు. వెంటనే ఆ తరహాలోనే దీక్షకు దిగిన రాంబం రోబితా నిరసనను పోలీసులు భగ్నం చేశారు.
  • దేశంలో మహిళలపై నానాటికీ పెరుగుతున్న హింసను నిరసిస్తూ పెరూ రాజధాని లిమాతో పాటు మరో ఎనిమిది నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి. వీటిలో దాదాపు 50 వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థ నిర్లిప్తత కారణంగానే మహిళలపై నానాటికీ హింస పెరుగుతోందని ప్రదర్శకులు విమర్శించారు.
  • ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో ఒక్క పతకమైనా చేరుతుందా? అని నిరాశ పడుతున్న సమయంలో సాక్షి మాలిక్ ఆనందాల జల్లు కురిపించింది. రెజ్లింగ్ లో తొలి పతకం సాధించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 
15:34 - August 19, 2016
15:33 - August 19, 2016
15:32 - August 19, 2016

విజయవాడ : రియో ఒలింపిక్స్ లో బంగారు పతకం కోసం ఆఖరి పోరాటం చేస్తున్న భారత షట్లర్ సింధు విజయం సాధించాలని విజయవాడ వాసులు కోరుతున్నారు. రాకెట్ చేతపట్టినప్పటి నుండి సింధు ఆటతీరు బాగా తెలుసని అంతర్జాతీయ మాజీ క్రీడాకారుడు, బ్యాడ్మింటెన్ కోచ్ విద్యాధర్ పేర్కొన్నారు. ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తుందని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. సింధు భారతదేశానికి మొదటి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ అందించనుందని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారో వీడియోలో చూడండి.

ఆలంపూర్ లో పుష్కర స్నానం చేయనున్న గవర్నర్..

మహబూబ్ నగర్ : ఆలంపూర్ లో రేపు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింమహన్ పుష్కర స్నానం చేయనున్నారు. రేపు ఉదయం 8.30గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరనున్నారు. 

పున్నమి ఘాట్ ను సందర్శించిన చిన రాజప్ప..

విజయవాడ : పున్నమి ఘాట్ ను ఏపీ హోం మంత్రి చిన రాజప్ప సందర్శించారు. పుష్కరాలకు భక్తులు విలువైన వస్తువులు తీసుకరావద్దని సూచించారు. పుష్కరాలకు రూ. కోట్లు ఖర్చు చేశామని జగన్ అనడం హాస్యాస్పదమన్నారు. భక్తులకు సదుపాయం కోసమే డబ్బు ఖర్చు చేయడం జరిగిందన్నారు. 

ముగిసిన మెడ్ టెక్ జోన్ భాగస్వామ్య సదస్సు..

విశాఖపట్టణం : మెడ్ టెక్ జోన్ భాగస్వామ్య సదస్సు ముగిసింది. 200 నుండి 300 వైద్య పరికాల తయారీ కేంద్రాలు ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 14 రోజుల్లో అన్ని అనుమతులు ఆన్ లైన్ లో ఇస్తామని, అమరావతిలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అమరావతిలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు, విశాఖలో స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశాఖ పర్యటనను ముగించుకుని విజయవాడకు బయలుదేరారు. 

మియాపూర్ లో విషాదం..

హైదరాబాద్ : మియాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీనగర్ మంజీరా వాటస్ సంపులో పడి ఇద్దరు మృతి చెందారు. భిక్షాటన చేసే పాలప్ప (50), వెంకటయ్య (48) గా గుర్తించారు. ఘటనాస్థలం వద్ద మృతులకు ఎమ్మెల్యే గాంధీ నివాళులర్పించారు. 

రత్నాలమ్మ ఆలయానికి వెళ్లిన పీవీ సింధు తండ్రి...

వెస్ట్ గోదావరి : భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు రియో ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ కొద్దిసేపట్లో జరగనుంది. ఈ సందర్భంగా ఆమె తండ్రి పీవీ రమణ రత్నాలమ్మ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. 

నీట్ 2 లీకేజ్ పై ఉత్తరాఖండ్ హైకోర్టు విచారణ..

డెహ్రాడూన్: నీట్ 2 పై ఉత్తరాఖండ్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పోలీసులు సాధించిన పురోగతిని తమకు నివేదించాలని ధర్మాసనం పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రెన్స్ టెస్టు-2 (నీట్-2) పేపర్ లీకైనట్టు ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే. 

జాట్ వర్గీయుల ఆందోళనలపై సీబీఐ విచారణ..

హర్యానా : జాట్ వర్గీయులు చేసిన ఆందోళనలో పలు హింసాత్మక ఘటనలు జరగడంపై సీబీఐ విచారణ జరపాలని హర్యానా ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ ఆందోళనల్లో 30 మంది వరకు మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. 

ఆప్ రెండో జాబితా విడుదల..

న్యూఢిల్లీ : పంజాబ్ ఎన్నికలకు ఆప్ తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 13 మంది అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. మొదటి జాబితాను ఆగస్టు 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో 19 మంది అభ్యర్థులను ప్రకటించింది. 

14:38 - August 19, 2016

ఢిల్లీ : అమెరికా అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికల బరిలోకి దిగేసిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. న్యూయార్క్ లోని ఓ పార్కులో ట్రంప్‌ నగ్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదస్పదంగా మారింది. ట్రంప్ కు ప్రతిరూపంగా ఆయన మేని రంగులోనే మలచిన సదరు విగ్రహంపై ఒక్క నూలు పోగు కూడా లేదు. ట్రంప్ శరీర వర్ణంతోనే తీర్చిదిద్దిన సదరు విగ్రహాన్ని మన్ హట్టన్ లోని రద్దీ ప్రాంతం యూనియన్ స్క్వేర్ వద్ద 'ఇండిక్లెయిన్' పేరిట జట్టు కట్టిన ఆర్టిస్టులు ఏర్పాటు చేశారు. 'ద ఎంపరర్‌ హ్యాజ్ నో బాల్స్‌' అంటూ టైటిల్‌ పెట్టారు. అయితే ట్రంప్‌ విగ్రహాన్ని మన్‌హట్టన్‌ అధికారులు తొలగించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా పార్కులో విగ్రహం పెట్టినందుకే తొలగించామన్నారు.

14:36 - August 19, 2016

ఢిల్లీ : మాజీ బిజెపి నేత, క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ ఆప్‌లో చేరేందుకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ వస్తున్న వార్తలపై ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ స్పందించారు. గత కొన్నాళ్లుగా సిద్ధూ తమ పార్టీలో చేరతాడ‌నే వార్తలు వింటున్నానని, అందుకని ఈ అంశంపై స్పందించాల్సిన బాధ్యత తనపై ఉంద‌ని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. సిద్ధూ త‌న‌ను వారం రోజుల క్రిత‌మే క‌లిశార‌ని, త‌మ‌ పార్టీలో చేరే విష‌యంపై ఆలోచించుకోవడానికి సిద్ధూ త‌న‌ను కొంత వ్యవ‌ధి కావాలని అడిగారని ఆయన తెలిపారు. సిద్ధూ తీసుకునే నిర్ణయాన్ని తాము గౌర‌విస్తామ‌ని, సిద్ధూ చాలా మంచి వ్యక్తని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్‌లో చేరినా చేరకపోయినా సిద్ధూపై ఉన్న గౌరవం తగ్గదన్నారు.

14:34 - August 19, 2016

ఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌, ప్రముఖ జర్నలిస్ట్ శంకర్‌ ఝా ప్రతినిధి బృందానికి జమ్ము కశ్మీర్‌లో చుక్కెదురైంది. భద్రత బలగాల పెల్లెట్‌ గన్స్ కాల్పుల్లో గాయపడి ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆస్పత్రిలోకి వెళ్లనివ్వకుండా 'గో ఇండియా గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. వెంటనే ఆస్పత్రి ప్రాంగణాన్ని వదిలి వెళ్లిపోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. హంతకులతో చేతులు కలపబోమని స్పష్టం చేశారు. కొందరు జర్నలిస్టులను మాత్రం గాయపడిన వారిని ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతించారు. దీంతో చేసేదిలేక మణిశంకర్‌ బృందం వెనుదిరిగింది.

14:33 - August 19, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. కృష్ణా నదిలో స్నానాలను చేసిన భక్తులు అమ్మవారి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. దుర్గగుడికి వచ్చేందుకు అధికారులు ఉచిత బస్సులతో పాటు వాటర్‌ ప్యాకెట్లను, మజ్జిగను అందిస్తున్నాయి. ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీ..ఇతరత్రా ఏర్పాట్లపై ఆలయ అధికారి టెన్ టివితో మాట్లాడారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

14:29 - August 19, 2016

కృష్ణా : జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో పార్క్ లో పాత నేరస్తుడు దుర్గారావు దారుణ హత్యకు గురయ్యాడు. దుర్గారావుపై దొంగతనాలు, గొడవలకు సంబంధించి అనేక కేసులున్నాయి. ప్రస్తుతం నందిగామలో ఉంటున్న దుర్గారావు.. ఓ కేసు విచారణకు సంబంధించి నిన్న పెనమలూరుకు వచ్చాడు. అయితే రాత్రి పార్క్ లో మద్యం సేవించి జూదమాడిన దుర్గారావు.. ఉదయానికి హత్యకు గురయ్యాడు. పేకాటలో వివాదం చెలరేగి దుర్గారావుపై హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. 

14:27 - August 19, 2016

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని వైసీపీ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాను తలదన్నేలా ప్యాకేజీ ఉంటుందని చంద్రబాబు సహా టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. కేంద్రం 1976 కోట్లు విడుదల చేయడం చూసి సంతోషపడాలో, బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. 

14:25 - August 19, 2016

హైదరాబాద్ : జలదృశ్య ప్రదర్శనలో కాంగ్రెస్‌పార్టి అవాస్తవాలు చెప్పిందని టీ.టీడీపీ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులకోసం టీడీపీ చేసిన కృషి కాంగ్రెస్‌ పార్టీకి గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ విసిరిన సవాలుపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సైలెంటైందని రేవంత్‌ ఎద్దేవాచేశారు. లోపాలతోకూడిన సాగునీటి ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్‌పై ఇంజనీరింగ్‌ నిపుణులు ఎందుకు మాడ్లాడడంలేదని ఆయన ప్రశ్నించారు. కోదండరాం నిబద్ధతను ప్రశ్నిస్తారా ? వేలెత్తి చూపుతారా ? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల హక్కులను..ఆంధ్రా ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లకు కేసీఆర్ కట్టబెడుతున్నారని ఆరోపించారు. 

14:23 - August 19, 2016

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన 13వ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని ప్రధాన ప్రసంగం చేశారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి గురించి వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక అభివృద్ధితోనే రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుందని సమావేశంలో వివరించామన్నారు కేటీఆర్. టీఎస్‌ఐపాస్‌ రియాల్టీ రంగానికి ఊతమిచ్చిందన్నారు. 

14:22 - August 19, 2016

హైదరాబాద్ : ఒలింపిక్స్‌లో సత్తా చాటుతున్న పీవీ సింధూ మరియు పతకం సాధించిన సాక్షి మాలిక్‌లకు తెలంగాణ సీపీఎం అభినందనలు తెలిపింది. బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు చేరిన సింధు.. ఈరోజు జరిగే ఫైనల్స్‌లో స్వర్ణం సాధించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆకాంక్షించారు. అసమానతలను అంతమొందించి మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తే.. ఇలాంటి ఎన్నో విజయాలు దక్కుతాయని తమ్మినేని అన్నారు. 

14:20 - August 19, 2016

ఢిల్లీ : ఒలింపిక్స్ లో సత్తా చాటి పతకం సాధించిన సాక్షి మాలిక్‌లకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అభినందనలు తెలిపారు. అలాగే బ్యాడ్మింటన్‌లో ఫైనల్‌కు చేరిన పీవీ సింధూకు అభినందనలు తెలపడంతో పాటు.. ఫైనల్‌లో గెలిచి స్వర్ణం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. సింధుకు సచిన్‌ ఆల్‌ ద బెస్ట్‌ విషెష్‌ చెప్పారు.
రియో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో ఫైనల్స్‌కు చేరిన పీవీ సింధుకు భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో సింధు ఫైనల్‌లో గెలుపు సాధించాలని కోహ్లీ ఆకాక్షించారు. 

కోల్ స్కాం కేసులో ఆరుగురిపై అభియోగాలు..

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు గనుల శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాతో సహా ఆరుగురిపై అభియోగాలు నమోదయ్యాయి. బొగ్గు కేటాయింపుల్లో మోసపూరిత, కుట్రలకు పాల్పడ్డారని ఛార్జీషీట్‌లో ఆరోపించారు. 

తెలంగాణలో ఐదుగురు డీఎస్పీల బదిలీ..

హైదరాబాద్ : తెలంగాణలో ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డీఎస్పీగా శివకుమార్..ఖమ్మం జిల్లా వైరా డీఎస్పీగా శ్రీధర్ రె డ్డి..మణుగూడరు డీఎస్పీగా అశోక్ కుమార్ లు బదిలీ అయ్యారు. 

మదనపల్లిలో దారుణ హత్య..

చిత్తూరు : జిల్లాలోని మదనపల్లి దేవళం వీధికి చెందిన ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. రాజీవ్ నగర్ లో చోటు చేసుకున్న ఈ దాడిలో వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు.

సింధూ గెలవాలి - సచిన్..

ముంబై : రియోలో బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి సింధూ కొద్దిసేపట్లో ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ చూడటానికి తాను ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. సింధు గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 

13:46 - August 19, 2016

కాలేజీకి యువతులు..ఏదో పని మీద బయటకు గృహిణిలు..ఒంటరిగా వెళుతుంటారు. సిటీ బస్సు దిగిన తరువాత వారు నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ సమయంలో ఆకతాయలు వెంటపడి వేధిస్తుంటారు. కొంచెం ఆత్మస్థైర్యంతో వారిని ఎదుర్కొనవచ్చు. కొన్ని టెక్నిక్స్ ద్వారా రక్షించుకోవచ్చు. ఆ టెక్నిక్స్ ఎంటో వీడియోలో చూడండి. 

రియల్ ఎస్టేట్ అభివృద్ధిపై కేటీఆర్ ప్రసంగం..

ఢిల్లీ : నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి గురించి మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రాథమికంగా పారిశ్రామికీకరణపై దృష్టి పెట్టిందని, టీఎస్ ఐపాస్ వల్ల పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్న విషయాన్ని సదస్సులో చెప్పడం జరిగిందన్నారు. గతంలో ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ సంస్థలతో నిర్వహించిన సమావేశంలో 40 డిమాండ్లకు 31 డిమాండ్లను ఆమోదించారని తెలిపారు. జూన్ 2వ తేదీ నుండి మున్సిపాల్టీలు, హైదరాబాద్ లో అన్ని రకాల అనుమతులను ఆన్ లైన్ లో చేయడం జరిగిందన్నారు. 

13:38 - August 19, 2016
13:35 - August 19, 2016

గుంటూరు : జిల్లాలో కృష్ణా పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పుష్కరస్నానాలు చేసి పిండప్రదానాలు చేస్తున్నారు. స్నానఘట్టాలకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మిగిలిన రోజులకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని అర్బన్ ఎస్పీ త్రిపాఠి టెన్ టివికి తెలిపారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:34 - August 19, 2016

అమ్మానాన్నలున్నా ఓ చిట్టి చేయి చిల్లర డబ్బు కోసం చేయి చాస్తోంది. అయినవారందరూ ఉన్నా చరమాంకంలో చేరదీసేవారు లేక..చేయూత నిచ్చేవారు లేక చేయి చాస్తోంది...ఏ తోడూ లేక..మోసానికి గురయి...పైశాచికత్వానికి తల్లులయి వీధిన పడ్డ అభాగ్యురాళ్ల చేయి చాస్తోంది... వీరంతా చేసేది ఒక్కటే యాచన..కాని వారికి వారు ఈ పనిచేయరు.. వారితో ఈ పని చేయించేవారున్నారు. చీకటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే ఎన్నో ముఠాల్లో ఇదో గ్యాంగ్‌ కూడా. తాజాగా హైదరాబాద్‌ శివార్లలో బయటపడ్డ ఓ అనాథాశ్రమం ముసుగులో జరుగుతున్న దందా కూడా ఇదే. చిన్నారులను చేరదీసి అనాథాశ్రమంగా పెట్టి వారితో యాచన చేయిస్తున్నాడో జేమ్స్...కాసుల వర్షం కురుస్తుండడంతో ఎన్నో ముఠాలు చెలరేగుతున్నాయి..తెలుగు రాష్ట్రాల్లో భిక్షాటనపై సంపాదిస్తున్న దుర్మార్గులెందరో ఉన్నారు.

అనాథశ్రమంలో..
నగర శివార్లలో ఉన్న ఓ భవనానికి తోచింది సాయం చేసే స్థానికులున్నారు..కొందరు అన్నం పెడతారు..మరికొందరు దుస్తులు ఇస్తారు..ఇలా సాయం అందుతున్న ఆ భవనానికి పోలీసులు వచ్చేవరకు అక్కడేం జరుగుతుందో తెలియదు.. చిట్టి చిన్నారులను తమతో పాటు తీసుకెళ్లారు పోలీసులు.. అప్పటివరకు అనాథాశ్రమం నడిపే ఓ మానవతావాదిగా కన్పించినవాడే కిరాతకుడని తెలియడంతో అంతా నోళ్లు వెళ్లబెట్టారు.. ఆశ్రమం ముసుగులో చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న దుర్మార్గం ప్రతీ ఒక్కరినీ కదిలించింది. అనాథాశ్రమం ముసుగులో అరాచకం..అన్నం పెడుతున్నామని దందా చేస్తున్న దుర్మార్గం..తోడులేనివారికి నీడనిస్తున్నామని కిరాతకాలు..చిట్టి చేతులు యాచిస్తే జల్సా చేస్తున్న నిర్వాహకులు..హైదరాబాద్‌ శివార్లలో వెలుగుచూసిన మరో బాగోతం..ఇది హైదరాబాద్‌ శివార్లలోని మెదక్ జిల్లా పరిధిలో ఉన్న అమీన్‌పూర్‌లోని ఓ భవనం...ఇందులో బ్రహ్మపుత్ర అనాథ ఆశ్రమాన్ని నెలకొల్పాడు జేమ్స్..బ్రహ్మపుత్ర అనాథ శ్రమం పేరుతో చిన్న పిల్లలను తీసుకొచ్చి దందా మొదలుపెట్టాడు. నగరంలోని వివిధ సెంటర్లలో ఈ చిట్టి చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న జేమ్స్‌ వ్యవహారం బయటపడింది..

భవనాన్ని అద్దెకు తీసుకుని ఆశ్రమం పేరు..
అమీన్‌పూర్‌లోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని... దాంట్లో బ్రహ్మపుత్ర అనాథశ్రమాన్ని నెలకొల్పాడు. వివిధ ప్రాంతాలను నుంచి చిన్న పిల్లలను తీసుకొచ్చి.. ఆ అనాథశ్రమంలో ఉంచి.. వారితో వివిధ సెంటర్లలో భిక్షాటన చేయిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా దందా చేస్తున్న జేమ్స్ వ్యవహారం బయటపడింది. పోలీసులకు సమాచారం అందడంతో నిఘా వేయగా చిన్నారులు యాచించి తెచ్చిన చిల్లర డబ్బులన్నీ జేమ్స్ కు అప్పగిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత రాంచంద్రపురం పోలీసులు బ్రహ్మపుత్ర అనాథశ్రమంపై దాడి చేసి... 19 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు... ఆ చిన్నారులను ప్రభుత్వంచే గుర్తింపు పొందిన అనాథశ్రమానికి తరలించారు.

పసిబిడ్డలపై పైశాచికత్వం..?
ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న చిట్టి చిన్నారుల్లో కొందరు అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించారు..వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు...జేమ్స్‌ ముఠా కార్యకలాపాల్లో ఓ లేడీ కూడా ఉంది...అయితే చిన్నారుల్లో కొందరిపై లైంగిక దాడులు జరిగాయన్న అనుమానాలున్నాయి...దీనిపై పూర్తిగా విచారించాలంటే చిన్నారులు షాక్‌ నుంచి కోలుకోవాలని..ఆ తర్వాతే విచారణలో వాస్తవాలు బయటపడతాయంటున్నారు. ఎన్నో చిట్టి చేతులు చిల్లర తెస్తే వాటిని నోట్లుగా మార్చుకుని జల్సాలు చేసే జేమ్స్‌లాంటి దుర్మార్గులెందరో ఉన్నారు...ఆ చిట్టి తండ్రులు.. చిట్టితల్లులు అర్థాకలితో అలమటిస్తూ యాచిస్తుంటారు. అందులో వచ్చిన డబ్బుతో కనీసం ఒక్క బ్రెడ్‌ముక్క కూడా కొనుక్కోలేని కడుదయనీయ పరిస్థితి. మహానగరంలోని మూలమూలనా ఇలాంటి దందా చేస్తున్న జేమ్స్ లాంటి వారెందరో పసిబిడ్డల చిట్టి రెక్కల కష్టంమీద కాసులు సంపాదిస్తున్నారు.

వికలాంగులుగా..
అవయవాలున్నా వికలాంగులుగా వీధుల్లో సంచారం.. గాయాలు లేకున్నా కట్టుకట్టుకుని రోడ్లపై పడుకోవాలి..వివిధ రకాల వేషాలేసి పసిబిడ్డలను ఎండలో నిలబెట్టడం..హైదరాబాద్‌ మహానగరంలో మనకు కన్పించే ఇలాంటి దృశ్యాలెన్నో....రహదారులపై ...సర్కిల్‌లలో కన్పించే చిన్నారులను చూస్తూనే ఉంటాం...ప్రతీ మలుపు వద్ద..ప్రతీ సిగ్నల్‌ వద్దా కన్పించే చిట్టి చేతులు చేసేదంతా వారి జానెడుపొట్టకోసమే...వివిధ రకాల రసాయనాలతో కూడిన రంగులు వారికి వేసి తయారు చేసే దుర్మార్గులు ఎర్రని ఎండలో వదిలేస్తారు...సిగ్నల్‌ వద్దే నిలబడి ఉండాలి...చేయి చాచి ఉండడం వల్ల వారికి అందులో పడే ఒక్కోరూపాయి జమ చేయాలి....ఇలా ఆకలిని దిగమింగుకుని రోడ్డుపక్కన నీళ్లు తాగి యాచించే వారున్నారు..వారికి వచ్చిన ఆ చిల్లర డబ్బులోంచి రెండు రూపాయలు తీసుకుని ఓ బ్రెడ్‌ ముక్క కొనుక్కోలేరు...ఓ బజ్జీ తినలేరు.. ఆకలేస్తే అవి కూడా అడుక్కోవాల్సిందే. 
అర్థాకలితో అలమటిస్తున్న పసిబిడ్డలు...ఆకలేస్తే చెప్పుకునే దిక్కులేదు...అయ్యే అనేవారు లేరు..ఎవరి బిజీ వారిదే...ఇలాంటి చిన్నారులను చూసి జాలిపడి ఓ రూపాయి చేతిలో వేస్తారు. కాని వారికి అది చెందదనే విషయం ఎవరికీ తెలియదు.

వెనుక నుండి అరాచకాలు..
హృదయ విదారకంగా కన్పించే ఎందరో చిన్నారులు జీవితాల్లోకి తొంగి చూస్తే ఎన్నో రకాల దుర్మార్గులున్నారు. రోడ్ల మీద కన్పించే చిన్నారులెందరో స్వతహాగా వారి కోసం మాత్రం యాచించడం లేదు... జానెడు పొట్ట నింపే కొందరు దుర్మార్గులు వారిని యాచకులుగా మారుస్తున్నారు. చిన్నారులను అడ్డుపెట్టి లక్షలు..కోట్లు గడించే కిరాతకులు వెనకాల ఉండి నడిపిస్తున్నారు. ఇది నమ్మలేని నిజం...ఇలాంటి దుర్మార్గాన్ని పెంచి పోషిస్తున్న రాక్షసులు నగరంలోనే కాదు..తెలుగు రాష్ట్రాల్లో విస్తరించారు...ఎన్నో ముఠాలు ప్రాంతాలను పంచుకుని ఇలాంటి దందాలు చేస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే తేలిపోయింది...చిట్టి చిన్నారులను చేరదీసి వారికి కావాల్సిన నీడ...జానెడు పొట్టకు ఓ ముద్ద అన్నం పెడతారు..సీజన్‌ను బట్టి నడుస్తున్న ఈ దందా అంతా గోప్యమే..ఆ చిన్నారుల వెనకాల ఉండి నడిపించేవారెవరూ బయటకు కన్పించరు.

వికలాంగులుగా మారుస్తారు..
రాజధాని నగరంలోనే కాదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ పట్టణంలో..నగరాల్లో ఇలాంటి బెగ్గింగ్‌ మాఫియాలున్నాయి. మహానగరం హైదరాబాద్‌లో డజనుకుపైగా గ్యాంగ్‌లున్నాయంటే నమ్మశక్యం కాదు. ఈ గ్యాంగ్స్ లక్ష్యం ఒక్కటే. ఎక్కడెక్కడి నుంచో చిన్నారులను చేరదీసి వారికి ఓ పట్టెడన్నం పెట్టి రోజంతా యాచించేలా ట్రయినింగ్ ఇచ్చి రోడ్లమీదకు వదులుతారు..కన్పించని ఎన్నో చీకటి కోణాలకు దృశ్యరూపం ఇచ్చిన సినిమా దర్శకులు నగరాల్లో గ్యాంగ్స్‌ అరాచకాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. జాతిపిత గాంధీతో పాటు ఇతర నేతల వేషధారణ చేసి చిన్నారులను వీధుల్లో అడుక్కునేందుకు పంపిస్తారు..దేశ భక్తి కలిగినవారు కొద్దో గొప్పో డబ్బు ఇవ్వకపోతారానే దాంతో ముఠాలు ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తున్నాయి. పిల్లల ఒళ్లంతా సునేరు పూయడం వల్ల ఆ చిన్నారులు వ్యాధులకు గురయినా పట్టించుకోరు. వారు ఆ వేషధారణలోనే యాచించాలి... కలెక్షన్లు తీసుకువచ్చి ఇవ్వాలి. ఇక కొందరు చిన్నారులను వికలాంగులుగా మార్చేస్తారు. వారికి ఓ ప్రాంతం లేదా...ఓ సిగ్నల్‌ పాయింట్‌ అప్పగిస్తారు.. కాలు..చేతులు సరిగా లేకుండా ఉన్న చిన్నారులను చూసి జాలిపడి చిల్లర వేస్తారని దుర్మార్గానికి తెగబడుతున్నారు. 

పసిపిల్లల కిడ్నాప్..
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి లాంటి నగరాల్లో కొన్నాళ్లుగా సాగుతున్న దందాను పట్టించుకున్నవారు లేరు. యాంత్రిక జీవనం గడిపే సిటిజన్లు వీధిలో యాచించే చిట్టి చేతుల గురించి ఆలోచించరు. ఆ సమయం లేదు..అందుకే ఎన్నో ముఠాల దందా కొనసాగుతోంది. పసిపిల్లలను కిడ్నాప్ చేస్తూ కొందరు...చిన్నారులను బెదిరించి కొందరు...ఇలా వారిని తీసుకెళ్లే దుర్మార్గులు చిట్టి చేతులతో దందా చేయిస్తున్నారు.. అడుక్కునేలా చేస్తున్నారు...భిక్షాటన చేయిస్తూ కాసులు సంపాదిస్తున్నామని.. జల్సాలు చేస్తున్నామనుకుంటారు..కాని ఇలాంటి కిరాతకులకు ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా..? చిన్నారులను కిడ్నాప్ చేయడం..ఆ తర్వాత ఎక్కడో ఒక చోట అమ్మేయడం..నిత్యం చూస్తున్నాం.. పసిపిల్లలను ఎత్తుకెళ్లిన దుర్మార్గులు ఏం చేస్తున్నారో తెలుసా..? కొందరు దత్తత ఇచ్చేందుకు అమ్మేస్తే.. మరికొందరు దుండగులు ఆ పిల్లలను తీసుకుని వారితో భిక్షాటన చేయిస్తున్నారు. 

పసిపిల్లలతో భిక్షాటన..
ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి కూడా. పసిపిల్లలతో భిక్షాటన చేయించుటకు అపహరించినా... మైనర్ పిల్లలను కిడ్నాప్ చేసి వారితో యాచించేందుకు ప్రయత్నం చేసినా.. అలాంటి చిన్నారులను స్వీకరించినా...IPC సెక్షన్- 363 A క్షమించదు... ఇలాంటి దుర్మార్గానికి పాల్పడినవారికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. మైనర్ పిల్లలకు అంగవైకల్యం కల్పించి ఆ తర్వాత భిక్షాటనలోకి దించినట్లు రుజువైతే యావజ్జీవ కారాగార శిక్షతో పాటు జరిమాన విధిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో పాటలు పాడుతూ..నాట్యం చేయిస్తూ.. జాతకాలు చెప్పిస్తూ.. డబ్బులు అడిగించేందుకు అనువుగా మలుచుకోవడం.. తనకు గాని..ఇతరులకు గాని గాయాలు..పుండ్లు, గాట్లు ,దెబ్బలు చూపిస్తూ అడుక్కోవడాన్ని భిక్షాటన కింద పరిగణిస్తారు....ఇలా చేయించేవారిని చట్టం కఠినంగా శిక్షిస్తుంది.

13:21 - August 19, 2016

హైదరాబాద్ : ఒలెంపిక్స్ బ్యాండ్మింటన్‌ ఫైనల్లో సింధూ విజయం సాధించాలని తిరుపతిలో అభిమానులు పూజలు నిర్వహించారు. సిందూ గోల్డ్ మెడల్‌ సాధించాలని కోరుకుంటున్నట్టు చెబుతున్నారు. ప్రపంచ నెంబర్‌వన్‌ క్రీడాకారిణిపై సిందూ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్లో దూకుడు ఖాయం అంటున్నారు. తల్లిదండ్రులకు, కోచ్‌ గోపిచంద్‌పై అభిమానులు ప్రశంశలు కురిపిస్తున్నారు.

ప్రశంసలు..
ఒలింపిక్స్ ఫైనల్‌ చేరుకున్న పీవీ సిందూపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. కుటుంబసభ్యులతో పాటు.. బంధువులు ఆనందంలో మునిగితేలుతున్నారు. నెల్లూరులోని సిందూ అక్కాచెల్లెళ్లు కేక్‌కట్‌చేసి విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు పడిన శ్రమకు సిందూ ఫలితం సాధించిందని.. ఫైనల్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించి .. భారత కీర్తపతాకను ఎగురవేస్తుందంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

గుడివాడలో దారి దోపిడి..

కృష్ణా : బ్యాంకుకు వెళుతున్న పెట్రోల్ బంకు సిబ్బంది కళ్లల్లో కారం కొట్టి రూ.3.83 లక్షలను ఎత్తుకెళ్లారు. కృష్ణా జిల్లా గుడివాడలోని పెద్ద కాల్వ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఛత్తీస్ గఢ్ లో బాంబు స్వాధీనం..

ఛత్తీస్ గఢ్ : నారాయణపూర్ లోని ఓ బ్రిడ్జి దగ్గర పాతిపెట్టిన ఎల్ ఈడీ బాంబును ఐటీబీపీకి చెందిన 46వ బెటాలియన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పది కిలోలున్న ఈ బాంబును నిర్వీర్యం చేశారు. 

ముంబైలో కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ పర్యటన.

ముంబై : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముంబైలో పర్యటిస్తున్నారు. సాయంత్రం కేంద్ర మంత్రులతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. 

ముంబైలో భారీ అగ్నిప్రమాదం..

ముంబై : లింకింగ్ రోడ్ లో ఉన్న ఓ భవంతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 16 ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ప్రజలను మోసం చేస్తున్న రెండు పార్టీలు - సీపీఐ..

హైదరాబాద్ : టీఆర్ఎస్, కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చూపినవి తప్పుడు లెక్కలని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. రెండు పార్టీలు పోటీపడి ప్రజలను మోసం చేస్తున్నాయని, నయీం అక్రమాలపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నయీం అక్రమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, రైతులకు కరవు పరిహారం..రుణమాఫీ నిధులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 

జగన్ ది పుష్కర స్నానం కాదు..రాజకీయ స్నానం - ఎంపీ కేశినేని నాని..

విజయవాడ : టిడిపి నేత నాగూల్ మీరా రూపొందించిన కృష్ణమ్మ వైభవం సిడిని యూ ట్యూబ్ లో ఎంపీ కేశినేని నాని అప్ లోడ్ చేశారు. జగన్ చేసింది పుష్కర స్నానం కాదని..రాజకీయ స్నానమని నాని తెలిపారు. చిన్నారులు అనధికారిక ఘాట్ లో చనిపోతే దానిపై శవరాజకీయం చేస్తున్నారని విమర్శించారు. 

రక్షణ కల్పించాలి - నయీం బాధితుడు..

హైదరాబాద్ : తనకు గ్యాంగ్ స్టర్ నయీం ముఠా నుండి ప్రాణహాని ఉందని ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని నయీం బాధితుడు ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. సాంబశివుడితో తిరిగినందుకే తనపై కక్ష కట్టారని తెలిపారు. 

ఆసుపత్రి నుండి సోనియా డిశ్చార్జ్..

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అస్వస్థతకు గురి కావడంతో సర్ గంగ రామ్ ఆసుపత్రిలో సోనియా చేరిన సంగతి తెలిసిందే. 

12:28 - August 19, 2016

నల్గొండ : నాగార్జునసాగర్ లో 8 వ రోజు కృష్ణా పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. మానవతా దినోత్సవం సందర్భంగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అమరులైన వారికి, కార్గిల్ అమరవీరులతో పాటు.. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి.. సాగర్‌మిత్ర మండలి, మాజీ సైనికోద్యోగులకు పిండ ప్రదానాలు చేశారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

 

12:27 - August 19, 2016

గుంటూరు : జిల్లాలో 8వ రోజు కృష్ణా పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున కృష్ణమ్మ ఒడిలో పుష్కరస్నానాలు చేసేందుకు తరలివస్తున్నారు. కృష్ణా నదీతీరం పుష్కరాలకే కాకుండా.. టూరిస్ట్ హబ్ గా మార్చుతామని ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. నదీతీర ప్రాంతాలలో రాజధానులు ఉన్న రాష్ట్రాలు తక్కువగా ఉన్నాయని..12 ఏళ్ల తర్వాత రాబోయే కృష్ణా పుష్కరాలను అమరావతిలో ఘనంగా జరుపుకుంటామంటున్నారు గల్లా జయదేవ్. మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

12:24 - August 19, 2016

విశాఖపట్టణం : రహదారుల భద్రతపై విశాఖలో జాతీయ సదస్సు ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరీ, వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సదస్సును ప్రారంభించారు. మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డ్రైవింగ్‌ శిక్షణాకేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో శిక్షణాకేంద్రానికి రూ.కోటి గ్రాంట్‌ ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు.
మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడం వల్ల అధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అధిక లోడ్‌, ఓవర్‌స్పీడ్‌ వల్ల ప్రమాదాలు జరుగుతాయన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ను నివారించగలిగితే 50 శాతం ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. 52 వేల కి.మీ. రాష్ట్ర రహదారులను నేషనల్‌ హైవేలుగా మార్చేందుకు కేంద్రం అంగీకరించిందని చంద్రబాబు వెల్లడించారు. 

సింధు విజయం కోసం పూజలు..

ఢిల్లీ : ఒలింపిక్స్ లో బాడ్మింటెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ లో తెలుగు తేజం సింధు విజయం సాధించాలని కోరుతూ దేశంలోని పలు ప్రాంతాల్లో అభిమానలు పూజలు చేస్తున్నారు.

పుష్కరస్నానం చేసిన డి.శ్రీనివాస్..

b: ఆలంపూర్ సమీంపలోని గొందిమళ్ల పుష్కర ఘాట్ లో రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, మాజీ ఎంపీ మందా జగన్నాథం పుష్కరస్నానమాచరించారు. 

11:29 - August 19, 2016

నిజామాబాద్ : ఒకటి కాదు రెండు కాదు 47 రోజులుగా ఆగ్రామస్తులు నిరాహారా దీక్షలు చేశారు. తమ గ్రామాన్ని మండలంగా చేయాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. గత 30 ఏళ్ల క్రితం అధికారులు తమకు హమీ ఇచ్చి మోసం చేశారని కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని పోరు బాటపట్టిన నిజామాబాద్ జిల్లాలోని చందూరు గ్రామంపై టెన్ టీవీ ప్రత్యేక కథనం...

17 గ్రామాల ప్రజలు మండలం చేయాలని తీర్మానం..
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని ఒక గ్రామం చందూరు. తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చందూరు గ్రామస్తులు 47 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మండలానికి అనువైన అన్ని అర్హతలు తమ గ్రామానికి ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు. చందురూ గ్రామంలో 5,882 మంది జనాభా ఉండగా, 4,400 మంది ఓటర్లున్నారు. అయితే చందూరు చుట్టుపక్కల ఉండే 17 గ్రామాలు, 9 గ్రామపంచాయితీలు, 10తండాలన్నీ ఏకతాటిపైకి వచ్చి చందూరు గ్రామాన్ని మండలంగా చేయాలని అందరూ తీర్మానించారు.

అడ్డుకున్న జిల్లా నాయకులు..
అయితే 1984 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం చందూరు గ్రామాన్ని మండలం చేస్తామని ఒప్పుకున్నప్పటికీ జిల్లా నాయకుల రాజకీయం చేసి అడ్డుకున్నారని గ్రామస్తులు అంటున్నారు. గత 30 ఏళ్లుగా తమ గ్రామాన్ని మండలంగా చేస్తారని ఎదురు చూశామని చెబుతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తాజాగా జిల్లాలో ఏర్పాటులో భాగంగా మండలాలను ఏర్పాటుచేస్తున్నందును చందూరు గ్రామాన్ని మండలంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చందూరు గ్రామానికి మండలం చేయడానికి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో మూడు ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాల కూడా ఉందని మొత్తం 400 మంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారంటున్నారు. తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

చందూరును మండలం చేయాలని డిమాండ్..
గతంలో నాయకులకు, అధికారులను కలిసి విన్నివించినప్పటికి పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని శాంతియుతంగా నిరాహరాదీక్షలు చేస్తున్నామన్నారు. ఒకవేళ తమకు అన్యాయం చేస్తే తమ ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అన్ని విధాల అనుకూలమైన, జిల్లా కేంద్రానికి 20 కి.మీ దూరంలో ఉన్న , బోధన్ మండలానికి సమీపంలో ఉన్న తమ చందూరు గ్రామాన్ని మండలంగా చేయాలని గ్రామస్తులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం గురించి చందూరు గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయడం న్యాయమైందని గ్రామస్తులు అంటున్నారు. 

లక్షన్నర మంది చనిపోతున్నారు. - గడ్కరి..

విశాఖపట్టణం : ప్రధానమంత్రి సురక్ష సడక్‌ యోజన పథకాన్ని ప్రారంభించామని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. ఏటా లక్షన్నరమంది రోడ్డుప్రమాదాల్లో చనిపోతున్నారని, దేశ వ్యాప్తంగా 786 ప్రమాద రోడ్లను గుర్తించామని చెప్పారు. రూ.11,900 కోట్లతో గుంతలుపడిన రోడ్లను బాగుచేస్తామని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ వెల్లడించారు.

11:11 - August 19, 2016

విశాఖపట్టణం : రహదారి భద్రతపై విశాఖలో నేడు జాతీయ సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సును కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడులు ప్రారంభించారు. దేశంలో నానాటికి పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో కీలక చర్చ జరగనుంది. ఈ సందర్భంగా నితన్ గడ్కరి, సీఎం చంద్రబాబు నాయుడులు ప్రసంగించారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
ప్రధానమంత్రి సురక్ష సడక్‌ యోజన పథకాన్ని ప్రారంభించామని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. ఏటా లక్షన్నరమంది రోడ్డుప్రమాదాల్లో చనిపోతున్నారని, దేశ వ్యాప్తంగా 786 ప్రమాద రోడ్లను గుర్తించామని చెప్పారు. రూ.11,900 కోట్లతో గుంతలుపడిన రోడ్లను బాగుచేస్తామని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ వెల్లడించారు. గడిచిన రోజుల్లో ఏపీ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8,296 మంది మృతి చెందగా, విశాఖపట్టణంలో 704 మంది మృతి..2,500 మందికి గాయాల పాలయ్యారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అతివేగం..మద్యం సేవించి..ఇతరత్రా కారణాల వల్ల మృతి చెందారని తెలిపారు. 

11:04 - August 19, 2016

కడప : దేశంలో ఎక్కడ ఒక చోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. వారిని హతమార్చేందుకు కూడా వెనుకాడడం లేదు. తాజాగా ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. సిద్ధవటం (మం) పెద్దపల్లిలో ఓ దళితుడు మృతి చెందాడు. రియల్ ఎస్టేట్ వివాదంలో బాలయ్య అనే దళితుడిపై ముగ్గురు వ్యక్తులు వేడి నూనెను పోశారు. బజ్జీలు వేయించే నూనె పోసి చితకబాదారు. దీనితో బాలయ్యకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని కడప ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఐదు రోజులుగా కడప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు బాలయ్య మృతి చెందాడు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఘటనకు కారణమైన మురళీ, ఈశ్వరయ్య, రమణలను పోలీసులు అరెస్టు చేశారు. 

కేంద్ర మంత్రి మహేష్ శర్మ సెక్యూర్టీ హల్ చల్..

గజియాబాద్ : కేంద్ర మంత్రి మహేష్ శర్మ పర్సనల్ సెక్యూర్టీ గార్డు హల్ చల్ చేశాడు. హౌసింగ్ సోసైటీ గార్డ్స్ పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటన 18వ తేదీన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. 

దుమ్ముగూడెంలో రెండు నెలల చిన్నారి మృతి..

ఖమ్మం : దుమ్ముగూడెంలో రెండు నెలల చిన్నారి మృతి చెందింది. పొలియో వ్యాక్సిన్ వికటించి మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

మృతి చెందిన దళితుడు బాలయ్య..

కడప : సిద్ధవటం (మం) పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వివాదంలో బాలయ్య అనే దళితుడిపై ముగ్గురు వ్యక్తులు వేడి నూనెను పోశారు. ఐదు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు బాలయ్య మృతి చెందాడు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఘటనకు కారణమైన మురళీ, ఈశ్వరయ్య, రమణలను పోలీసులు అరెస్టు చేశారు. 

గడ్కరితో బాబు సమావేశం..

విశాఖపట్టణం : కేంద్ర మంత్రి గడ్కరితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో రోడ్లు, పోర్టుల అభివృద్ధి పై చర్చించారు. వర్క్ షాప్ ప్రారంభానికంటే ముందు ఈ భేటీ జరిగింది. 

జాతీయ రోడ్ సేఫ్టీ..షిప్పింగ్ పై వర్క్ షాప్..

విజయవాడ : జాతీయ రోడ్ సేఫ్టీ..షిప్పింగ్ పై వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ వర్క్ షాప్ లో కేంద్ర మంత్రి గడ్కరి, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు..ఇతర అధికారులు పాల్గొన్నారు. 

నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో రోగి ఆత్మహత్య..

నిజామాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైద్యం సరిగ్గా అందించడం లేదంటూ భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 

శ్రీనగర్ కాలనీలో జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటన..

హైదరాబాద్ : శ్రీనగర్ కాలనీలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పర్యటించారు. మంత్రి కేటీఆర్ పర్యటించి రెండు నెలలవుతున్నా రోడ్డు పనులు పూర్తి కాకపోవడం పట్ల ఇంజినీర్లపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

10:22 - August 19, 2016

మెగాస్టార్ చిరంజీవి..ఎన్నో రోజుల తరువాత మేకప్ వేసుకున్నారు. ఆయన నటిస్తున్న 150వ చిత్రంపై అందరి దృష్టి నెలకొంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే పూజలు..షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏకధాటిగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం నగరంలో చిత్రీకరణ జరుగుతోంది. చిరంజీవి..కొంత మంది ఫైటర్లపై పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. వీటికి రామ్ లక్ష్మణ్ నేతృత్వం వహిస్తున్నారు.
'కత్తి' రీమెక్ గా చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు 149 మూవీస్ తో ఆడియన్స్ ని అలరించిన చిరంజీవి తన 150వ సినిమా కోసం చాలా హడావిడి చేస్తున్నాడని గుసగుసలు వినిపించాయి. సినిమా చేయాలి అనుకున్నప్పటి నుండి ఇద్దరు, ముగ్గురు డైరక్టర్స్ ను పిలిచి కథ చెప్పించుకుని మరీ నిరాశ పరిచినట్లు తెలుస్తోంది. ఆఖరికి వి.వి.వినాయక్ ను సెలక్ట్ చేసి, సినిమా స్టార్ట్ చేసిన చిరుకి, కొత్త సినిమా ఎక్కడ లేని కష్టాలను తెచ్చిపెడుతోందంట. రాంచరణ్ తో మూడు సినిమాలు చేసిన కాజల్ చిరు పక్కన చేయడం బాగోదేమో అని సినీజనాల నుండి విమర్శలు వస్తున్నాయంట. అయినా సరే కాజల్ ఈ సినిమాకు ఓకే చెప్పడం విశేషం. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఆగస్టు 22వ తేదీన మొదటి లుక్ ను విడుదల చేయనున్నారు. ఆయన మొదటి లుక్ ఎలా ఉంటుందోని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

10:13 - August 19, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు వివిధ ఘాట్ లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కృష్ణా తీరానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ పుష్కర్ నగర్ లో ఆంధ్రా మోటార్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు లక్షల విలువైన ఆహారాన్ని ఉచితంగా అందచేస్తున్నారు. పది వేల మందికి అన్నదానం చేయాలని సంకల్పించామని కానీ భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని తెలిపారు. పులిహోర, పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లు అందచేయడం జరుగుతోందన్నారు.

గుంటూరు జిల్లాలో పుష్కర శోభ..
గుంటూరు :
జిల్లాలో పుష్కర శోభ కొనసాగుతోంది. సీతానగరం ఘాట్ కి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఘాట్ పై సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. పారిశుధ్యం..తదితర ఏర్పాట్లు చక్కగా చేస్తున్నారని ఇటీవలే బాబు పేర్కొన్నారు. ఎంపీ గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ లు పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా పుష్కరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. నదుల అనుసంధానం చేయడం సీఎం చంద్రబాబుకే చెల్లిందని, పుష్కారాల్లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకొకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సీతానగరంలో ఉదయమే పది వేల మంది పుష్కర స్నానాలు చేసినట్లు తెలిపారు. ఘాట్ లను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనితో భక్తులు తరలివస్తున్నారని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. అందరి సహకారంతో కృష్ణా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయన్నారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

వేదాద్రి ఘాట్ లో భక్తుల రద్దీ..

కృష్ణా : వేదాద్రి పుష్కర ఘాట్ కు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే భక్తుల రద్దీ పెరగడంతో, లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. 

పుష్కర స్నానం చేసిన ప్రముఖులు..

విజయవాడ : కృష్ణా పుష్కరాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు, శ్రీపాద క్షేత్రంలో విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ లు పుష్కరస్నానమాచరించారు.

 

చినజీయర్ స్వామిజీ ఆధ్వర్యంలో సమతా స్నానం..

విజయవాడ : తాడేపల్లి గూడెం మండలం సీతానగరం పుష్కర ఘాట్ లో త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో సమతా స్నానం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. 

09:33 - August 19, 2016

చెన్నై : ప్రపంచ ఫోటోగ్రఫి డే ని పురస్కరించుకుని చెన్నైలో ఏర్పాటు చేసిన కెమెరా మ్యూజియం అందరినీ ఆకట్టుకుంటోంది. వింటేజ్ కెమెరా మ్యూజియం పేరుతో ఏర్పాటైన ఈ ప్రదర్శనను ప్రఖ్యాత ఛాయాగ్రహకుడు పీసీ శ్రీరామ్, తమిళ యువనటుడు శివకార్తికేయన్‌లు ప్రారంభించారు. వందల సంఖ్యలో ఉన్న ఆయా కెమెరాల విశిష్టతలను శ్రీరామ్‌ వివరించారు. బ్లాక్‌ కలర్‌ చిత్రాల నుంచి నేటి వరకూ మారిన కెమెరా ప్రస్థానం వీక్షకులను ఆకర్షిస్తోంది.

 

09:32 - August 19, 2016

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. కృష్ణానదీ పరివాహక ప్రాంతాలు..ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి పుష్కర ఘాట్లకు యాత్రికులు తరలివస్తున్నారు. అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్న పుష్కరాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఎనిమిదోరోజు కృష్ణా పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పుష్కరాలు ముగిసే రోజులు దగ్గర పడుతుండడంతో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు అధిక సంఖ్యలో పుష్కరస్నానమాచరించి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:30 - August 19, 2016

గుంటూరు : ప్రకృతి రమణీయతకు అది శాశ్వత చిరునామా. విదేశీ విహంగాలకు అదో చక్కని విడిది. భగభగ మండే ఎండల్లోనూ అక్కడి ప్రకృతి అందాలు తాజాగా ఉంటాయి. ఇక శీతాకాలంలో అయితే సరికొత్త సొబగులు సంతరించుకుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సహజ అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఆ సుమధుర దృశ్యాలను వర్ణిచేందుకు ఎన్ని పదాలైనా సరిపోవు. కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులు.. సందర్శించిన ప్రాంతాల్లో ముఖ్య ప్రదేశం అది.. ఆ ప్రాంత విశేషాలు తెలుసుకోవాలంటే.. గుంటూరు జిల్లాకు వెళ్లాల్సిందే..!  రంగు రంగుల విదేశీ పక్షులు..ఒకటి కాదు, రెండు కాదు... వేలసంఖ్యలో విదేశీ పక్షులు..మనసుకు హాయినిచ్చే పక్షుల కిలకిల రావాలు...విదేశీ విహాంగాల సందడితో మైమరిచిపోతున్న పర్యాటకులు..ఇంతటి సుమనోహర దృశ్యాలు ఎక్కడో పరాయి దేశంలోనివో లేక హిమాలయాల్లోనివో కావు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు ప్రాంతమిది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఉప్పలపాడు పక్షుల కేంద్రం పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. దాదాపు 50 ఏళ్ల నుంచి విదేశీ పక్షులు ఈ ప్రాంతాని వచ్చి.. విడిచి చేస్తాయి. సైబీరియా, ఆస్ట్రేలియాల నుంచి గూడబాతుల గుంపులు, తెల్ల కంకణాలు, ఎర్రకాళ్ల కొంగలు, నత్తకొట్టు కొంగలు, చిత్త ఒక్కలు, చుక్కమూతి బాతులు, నల్ల బోలి కోడి, కలికి పక్షులు ఇలా చెప్పుకుంటూ పోతే.. దాదాపు 70 జాతులకు పైగా పక్షులు ఉప్పలపాడుకు వస్తుండడం విశేషం.

30 ఎకరాల చెరువు...
చెరువు మధ్య, చుట్టూ గుబురుగా ఉన్న చెట్లపై అవాసం ఏర్పాటు చేసుకుని... గూళ్ళు కట్టుకుని... అక్కడే గుడ్లుపెట్టి, పిల్లలను పొదుగుతాయి. పక్షి స్థావరానికి వెళ్లే దారికిరువైపులా పచ్చని చేలు, ఆ చేలపై ఎగురుతున్న మైనగోరలు, కత్తిరిపిట్టలు, అక్కడక్కడ పాలపిట్టలు, కొంగలు... పొలాలను ఆశిస్తున్న మిడతలను, పురుగులను వేటాడుతూ కనువిందు చేస్తాయి. విదేశీ పక్షులతో పాటు పర్యాటకులతో ఈ ప్రాంతం నిత్యం సందడిగా ఉంటుంది.  30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును ఒకప్పుడు... తాగునీటి అవసరాలకు వినియోగించేవారు. విదేశీ పక్షలు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో ఈ చెరువును ప్రత్యేకంగా వాటికోసమే కేటాయించారు. ఈ ప్రాంతంలో విద్యార్థులు పరిశోధనలు కూడా చేస్తారు. గుంటూరు నుంచి నందివెలుగు మీదుగా తెనాలికి వెళ్లే మార్గంలో 7 కిలోమీటర్ల దూరంలో ఈ పక్షి కేంద్రం ఉంది. గుంటూరు నుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోల ద్వారా ఈ గ్రామాన్ని చేరుకోవచ్చు. చెన్నై-హోరా రైలు మార్గాన ప్రయాణించేవారు తెనాలిలో దిగి నందివెలుగు మీదుగా 18 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామానికి చేరుకోవచ్చు. కృష్ణా పుష్కరాల కోసం గుంటూరు జిల్లాకు వెళ్లే యాత్రికులు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక కేంద్రల్లో ఉప్పలపాడు పక్షి కేంద్రం ఒకటని చెప్పొచ్చు..! ఈ ప్రాంతం పర్యాటకులను కట్టిపడేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

నేడు డీ ఫార్మసీ సీట్ల కేటాయింపు...

హైదరాబాద్ : నేడు డీ ఫార్మసీ సీట్లను కేటాయించనున్నారు. వెబ్ ఆప్షన్ ఇచ్చిన విద్యార్థులకు రాత్రి 8.00 గంటల తర్వాత సీట్ల కేటాయించనున్నారు. 

09:13 - August 19, 2016

రియో డి జనీరో : జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ తనకు సాటి లేదని మరోసారి నిరూపించాడు. రియో ఒలింపిక్స్ లో 100 మీటర్ల పరుగులో స్వర్ణాన్ని గెలిచిన బోల్ట్ శుక్రవారం ఉదయం జరిగిన 200 మీటర్ల రేసులో కూడా అగ్రస్థానంలో నిలిచాడు. లక్ష్యాన్ని కేవలం 19.78 సెకన్లలో పూర్తి చేసిన బోల్ట్ స్వర్ణాన్ని గెలిచాడు. కెనడా స్ప్రింటర్ అండ్రీ గ్రీన్ 20.02 సెకన్లతో రజతం..ఫ్రాన్స్ అథ్లెట్ క్రిస్టోఫ్ 20.12 సెకన్లతో కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. 

09:07 - August 19, 2016

బాలీవుడ్ బాద్ షా 'షారుఖ్ ఖాన్'..అందాల తార 'ఐశ్వర్య రాయ్' లు మరోసారి జంటగా నటించనున్నారు. వీరిద్దరూ గతంలో 'మొహబ్బతేన్', 'దేవదాస్' చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజగా 'యే దిల్ హై ముష్కిల్' అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో షారుఖ్ నటిస్తున్నారు. ఐశ్వర్య రాయ్ కు ప్రియుడిగా నటించనున్నారు. కూతురు పుట్టి కొన్నాళ్ళు ఆమెతోనే గడిపిన ముద్దుగుమ్మ ఐష్.. గత యేడాది 'జబ్జా' సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాఫ్ అయినా ఐశ్వర్యని చూసిన వారందరూ ఆమె అందం ఇంకా తరగలేదని పలువురు మెచ్చుకున్నారు.
రణబీర్‌కపూర్‌, అనుష్కశర్మ, ఫవాడ్‌ఖాన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో కరణ్‌జోహార్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 1977లో విడుదలైన 'దూస్రా ఆద్మీ' చిత్రానికి స్వీకెల్ గా ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. 'దూస్రా ఆద్మీ' చిత్రంలోని శశి కపూర్ పోషించిన పాత్ర షారూఖ్ పోషిస్తున్నారని బాలీవుడ్ టాక్. షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి అక్టోబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర యూనిట్ భావిస్తోందంట. 

08:58 - August 19, 2016

'శ్రీను వైట్ల', 'రామ్' కాంబినేషన్ లో వచ్చిన 'రెడీ' మూవీ సూపర్ హిట్టు అయింది. ఈ సినిమాకి సీక్వెల్ రానుందనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. అయితే ఈ సీక్వెల్ పట్టాలెక్కంటే 'వరుణ్ తేజ్' హిట్టు కొట్టాల్సిందేనట. 'రెడీ' సీక్వెల్ కి 'వరుణ్ తేజ్' ఉన్న లింకేంటో తెలుసుకోవాలంటే చదవండి.. 'రామ్' కెరీర్ లో భారీ హిట్స్ లో 'రెడీ' ఒకటి. 'రామ్', 'జెనీలియా' జంటగా వచ్చిన ఈ చిత్రంతోనే దర్శకుడు 'శ్రీనువైట్ల' తొలి జెన్యూన్ సక్సెస్ అందుకున్నాడు. అంతేకాదు ఈ చిత్రం అప్పట్లో చిన్న చిత్రాల్లో భారీ సక్సెస్ సాధించింది. ఇలాంటి చిత్రానికి సిక్వెల్ చేయాలని 'రామ్', 'శ్రీనువైట్ల' కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారు.
కండీషన్..
అయితే ఈ సీక్వెల్ పట్టాలెక్కడానికి 'రామ్' దర్శకుడిగా ఓ కండీషన్ పెట్టాడట. 'శ్రీను వైట్ల' ప్రస్తుతం 'వరుణ్ తేజ్' హీరోగా 'మిస్టర్' అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ సక్సెస్ అయితే 'రెడీ' సీక్వెల్ చేద్దామని హీరో 'రామ్' ఈ దర్శకుడితో కండిషన్ పెట్టాడట. దీంతో 'మిస్టర్' సినిమాను ఎలాగైనా సక్సెస్ చేసి 'రెడీ' సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని 'శ్రీనువైట్ల' కసిగా ఉన్నాడట. 'శ్రీను వైట్ల' దర్శకుడిగా ఫాం కోల్పోయాడు. 'దూకుడు' సినిమా ఈ దర్శకుడు ఆ స్థాయిలో మరో సినిమా చేయలేకపోయాడు. 'దూకుడు' ఆ తరువాత ఆయన తీసిన 'బాద్ షా' యావరేజ్ కాగా 'ఆగడు', 'బ్రూస్ లీ' చిత్రాలు డిజాస్టర్ మిగిలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 'శ్రీను వైట్ల'తో సినిమా అంటేనే పెద్ద హీరోలు భయపడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో 'మిస్టర్' మూవీ సక్సెస్ 'శ్రీనువైట్ల' వెరీ ఇంపార్టెంట్ గా మారింది. మరి 'మిస్టర్' అయిన వైట్ల ఆడియన్స్ ని మెప్పిస్తాడో లేక మరోసారి తన మూస పద్దతినే ఫాలో అవుతాడో చూడాలి.

కల్తీ మద్యం కేసులో పోలీసుల సస్పెండ్..

బీహార్ : గోపాల్ గంజ్ లో కల్తీ మద్యం సేవించి పలువురు మృతి చెందిన ఘటనలో 15 మంది పోలీసులను ఎస్పీ సస్పెండ్ చేశారు. కల్తీ మద్యం సేవించి 13 మంది బలైన సంగతి తెలిసిందే. 

08:29 - August 19, 2016
08:20 - August 19, 2016

నల్గొండ : తెలంగాణలో కృష్ణా పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు నాగర్జున సాగర్ శివాలయం ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ దిగువ భాగంలో ఉన్న ఘాట్ వద్ద స్నానాలు చేయడానికి భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ఉదయం పూట భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. గంట..గంట గడుస్తున్న కొద్ది భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. గురువారం ఒక్క రోజు మూడు లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. గడిచిన 7 రోజుల్లో 28 ఘాట్ లలో 26 లక్షల మంది స్నానాలు చేసినట్లు తెలుస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పలు ఘాట్ లలో పారిశుధ్యం లోపించకుండా ఉండేందుకు కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పారిశుధ్య కార్మికుడికి రూ. 450 రూపాయలు వెచ్చించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే డ్యామ్ నిర్మాణంలో పలు కారణాల వల్ల పలువురు కార్మికులు అమరులయ్యారు. వీరందరికీ పిండ ప్రధానం చేసేందుకు ఓ సంస్థ నడుం బిగించింది. కాసేపట్లో ఈ కార్యక్రమం జరగనుంది. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

08:12 - August 19, 2016

టాలీవుడ్ స్టైలిష్ నటుడు అల్లు అర్జున్ కు ప్రవసి రత్న పురస్కారం లభించింది. బన్నీ సినిమాలు టాలీవుడ్ లోనే కాకుండా మాలీవుడ్ లో కూడా విశేష ప్రేక్షకాదరణ పొందాయి. అంతేగాకుండా అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. ఆయన నటించిన పలు సినిమాలు అక్కడ విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. ఇటీవలే ఆయన నటించిన 'సరైనోడు' సినిమా మాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించింది. కలెక్షన్ల విషయంలో కూడా సత్తా చాటింది. ప్రేక్షకుల ఆదరణ, గౌరవం పొందిన వారికి అక్కడ 'ప్రవసి రత్న' పురస్కారం పేరిట ఓ అవార్డును బహుకరించనున్నారు. అక్కడి కథానాయకుల మాదిరినే ఆదరణ, గౌరవం పొందిన బన్నీని 'ప్రవసి రత్న' పురస్కారంతో ఓ ప్రైవేట్‌ మాలీవుడ్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ ఛానెల్‌ సత్కరించనుంది. క్రవారం దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్‌ సెంటర్‌లో జరిగే ఓ వేడుకలో బన్నీకి ఈ పురస్కారాన్ని స్టార్‌ ఏసియానెట్‌ మిడిల్‌ ఈస్ట్ ఛానెల్‌ అందించనుంది.

08:09 - August 19, 2016

విజయవాడ : ఏపీలో కృష్ణా పుష్కరాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు పోలీసుల ఆంక్షలను సడలిస్తున్నారు. మొదటి రెండు రోజులు పోలిస్తే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగింది. కానీ ఎనిమిది రోజు భక్తుల సంఖ్య పలచగా ఉంది. 12 రోజుల పాటు జరిగే కృష్ణా పుష్కరాలకు 3 కోట్ల 50 లక్షల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ 7 రోజులోల 80 లక్షల నుండి కోటి మంది భక్తులు వచ్చారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కృష్ణ వేణి ఘాట్ లో భక్తుల రద్దీ పలచగా ఉంది. ప్రభుత్వ ఏర్పాట్లు బాగానే ఉన్నాయని పలువురు భక్తులు టెన్ టివికి తెలిపారు.
ప్రకాశం బ్యారేజ్ ఎగువకు వెళ్లే ఘాట్ లలో ఉండే నీటిని పెంచాలని, 24గంటల పాటు అలాగే ఉంచకుండా శుద్ధి చేయాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పోలీసుల ఆంక్షలను సడలించాలని, వాహనాలను నిలిపివేయడం ద్వారా భక్తులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. కొద్దిగా ఆంక్షలను సడలించాలనే పలువురు కోరుతున్నారు. 

07:52 - August 19, 2016

ఆలుగడ్డ..కూరగాయాల్లో ఒక రకమైన కూరగాయ. దీనితో ఎన్నో వంటకాలు చేసుకోవచ్చు. వంటకాల్లోనే కాదూ ఆలూతో అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలాగో చూద్దాం..
కళ్ల కింద నల్లమచ్చలు ఉంటే ఆలుగడ్డను ముక్కల్లా తరగాలి. కాసేపు ఫ్రిజ్ లో పెట్టాలి. తరువాత తీసి కళ్ల కింద పెట్టుకోవాలి. ఇలా ప్రతి రోజు చేస్తే నల్లమచ్చలు తొలిగిపోయే అవకాశం ఉంది.
ముల్తాని మట్టిలో చెంచా ఆలుగడ్డ గుజ్జు, నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలపాలి. పావుగంట అనంతరం గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
ఆలుగడ్డలో కూడా బ్లీచింగ్ కాంపౌండ్స్ ఉంటాయి. నారింజ తొక్కల పొడి కూడా నల్లని మచ్చలను సమర్థవంతంగా తొలగించేస్తుంది.
ఒక ఆలుగడ్డను తురిమి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని ఒక గిన్నెలో వేసి, దానిలో కోడిగుడ్డు, పెరుగు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి మొత్తానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగి, మామూలుగా షాంపూ చేసుకోండి. ఇలా 20 రోజులకోసారి చేసి చూడండి.
మూడు టేబుల్ స్పూన్ల ఆలుగడ్డ రసం, 3 స్పూన్ల కలబంద రసం, 2 స్పూన్ల తేనె తీసుకోండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి. వారంలో రెండుసార్లు ఇలా చేసి చూడండి..

07:45 - August 19, 2016

వంటల కొరకు నాన్‌ స్టిక్‌ పాత్రలు వాడడం సర్వసాధారణంగా మారిపోయింది. ఎందుకంటే వీటిలో నూనె వాడకం తక్కువ. అలాగే చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. అందుకే ఎక్కువ మంది వంటకు నాన్‌స్టిక్‌ పాత్రలనే వాడుతున్నారు. కానీ...ఈ పాత్రలు సరిగ్గా ఉపయోగించుకోకపోతే పలు ప్రమాదాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఇవి బాగుండాలంటే కొన్ని చిట్కాలు..
పాత్రలో నీటిని పోసి కొద్ది సమయం నాననివ్వాలి. తర్వాత మెల్లగా రుద్ది కడిగితే అతుకున్న పదార్థం వదిలిపోతుంది. నాన్‌స్టిక్‌ పాత్రలను వంటింటి గట్లపైన, అల్మారాల్లో భద్రపరచకుండా, ఎప్పుడూ సామాన్లు భద్రపరిచే స్టాండు ల్లోనే పెట్టడం మంచిది.
క్లీన్ చేయడానికి స్ర్కబ్బర్ వాడాల్సి ఉంటుంది. ఎక్కువగా ఘాటుగా ఉండే క్లీనింగ్ పౌడర్ లు ఉపయోగించుకోవడం మంచిది.
ఈ పాత్రల్లో వండే పదార్థాల కోసం ఉపయోగించే గరిటెలు ప్లాస్టిక్..చెక్కతో కూడుకున్నవి ఉంటే బాగుంటుంది.
నాన్ స్టిక్ పాత్రలను ఎప్పుడూ సన్నని సెగపైనే ఉంచాలి. ఎక్కువ మంట పెట్టడం వల్ల వీటి పాలిష్ త్వరగా పోతుంది.
పాత్రలు ఎక్కువ కొత్తగా కనిపించాలంటే వాడిన తరువాత శుభ్రం చేసి మెత్తని బట్టతో తుడిచి, కొద్దిగా నూనెను రాసి భద్రపరచాలి.
నాన్ స్టిక్ లపై అతికించిన స్టిక్కర్‌ పాత్రను కొద్దిగా వేడి చేస్తే సులభంగా వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా వేడినీటితో శుభ్రంచేసి ఆరబెట్టాలి. చిన్న చెంచాడు నూనెను వేసి మెత్తని బట్టతో పాత్ర అన్నివ్కెపులకూ రాయాలి.
తరచుగా నాన్‌ స్టిక్‌ వంటసామాను ఉపయోగిస్తూ ఉంటే పిఎఫ్‌ఒఏ మీ కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
నాన్‌ స్టిక్‌ వంటసామాను వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి తెలుసుకోవాలి. వాటి వల్ల ఆరోగ్యానికి ఎంత హానికరమో అర్థం చేసుకోవాలి. 

జోగులాంబను దర్శించుకోనున్న నాయినీ..

మహబూబ్ నగర్ : ఆలంపూర్ జోగులాంబ అమ్మవారిని హోం మంత్రి నాయిని దర్శించుకోనున్నారు. సోమశిల పుష్కర ఘాట్ లో జేఏసీ కోదండరామ్ పుష్కర స్నానమాచరించనున్నారు. 

07:33 - August 19, 2016

భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓలు న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి. సంప్రదింపుల పేరుతో రైతులను బెదిరించి భూములను బలవంతంగా సేకరించడానికి దొడ్డి దారిలో తీసుకువచ్చిన జీఓల చట్టబద్ధతపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే సోలార్‌ ప్రాజెక్టు, నిమ్జ్‌ కేసుల్లో హైకోర్టులో ఎదురు దెబ్బలు తిన్న రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ముచ్చర్ల ఫార్మాసిటీ కేసులో కూడా చుక్కెదురు కావడం అధికార వర్గాల్లో కూడా అంతర్మధనం జరుగుతొంది. సోమవారం మరికొన్ని కేసులు కూడా కోర్టు ముందుకు విచారణకు రానున్న నేపధ్యంలో ప్రభుత్వం ఏవిధమైన వైఖరి అవలంబిస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (నవ తెలంగాణ ఎడిటర్), ప్రకాష్ రెడ్డి (బీజేపీ), మన్నే గోవర్దన్ రెడ్డి (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియోలో చూడండి. 

జాతీయ రహదారిపై నేడు వర్క్ షాప్..

విశాఖపట్టణం : జాతీయ రహదారి భద్రతపై నేడు వర్క్ షాప్ జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే వర్క్ షాప్ లో కేంద్ర మంత్రులు గడ్కరి, వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు, రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు పాల్గొననున్నారు.  

06:49 - August 19, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలు ప్రారంభమై వారం రోజులైంది. మరో అయిదు రోజుల్లో ఈ పుష్కరాలు ముగుస్తాయి. కృష్ణా పుష్కరాలపై విజయవాడ పుష్కర ఘాట్ల దగ్గర టెన్ టివితో పలువురు మాట్లాడారు. ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలపై పలువురు విమర్శలు గుప్పించారు. పుష్కరాల్లో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై పలువురు సంతృప్తి వ్యక్తం చేశారు.  మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:43 - August 19, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో కృష్ణా నది పరివాహక ప్రాంతల్లో ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించి, పితృదేవతలకు పిండప్రదానం చేశారు. రాఖీ పౌర్ణమి సెలవు దినం కావడంతో భక్తులు పుష్కరాలకు భారీ ఎత్తున తరలివచ్చారు. విజయవాడలో పున్నమిఘాట్‌లో కేంద్ర మంత్రి అశాక్‌గజపతి రాజు పుష్కర స్నానం ఆచరించారు. పుష్కరాలు మానవ విలువలను పెంపొందించేలా ఒక ఐకమత్యాన్ని తెలియజేస్తాయని, పుష్కర స్నానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని అశోక్‌గజపతి రాజు అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ కృష్ణా నదిలో పుష్కర స్నానం ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లా సోమశిల పుష్కర ఘాట్‌లో సతీసమేతంగా ఆయన పుష్కర స్నానం చేసి అనంతరం పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. సోమశిల పుష్కర ఘాట్ వద్ద ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అద్బుతంగా ఉన్నాయన్నారు.

నేతల పుష్కర స్నానం..
వైసీపీ అధినేత జగన్‌ విజయవాడ పున్నమిఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. అనంతరం తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదానం చేశారు. అంతకుముందు ఆయన లబ్బీపేటలోని వేంకటేశ్వర దేవస్థానంలో కంచి పీఠాధిపతి జయేంద్రసరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యే కొడాలినాని, మాజీ మంత్రి పార్థసారథి పుష్కరస్నానం చేశారు. విజయవాడలోని పద్మావతి, కృష్ణవేణి, దుర్గా పుష్కరఘాట్లను సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పరిశీలించారు. ఘాట్లలో నాసిరకం పనులకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని మధు అన్నారు. పుష్కర స్నానాలు చేస్తున్న భక్తులను సీపీఎం నేతలు వై వెంకటేశ్వరరావు, సీహెచ్ బాబూరావు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిసౌకర్యాలు కల్పించినట్టు టీడీపీ ఎంపీ కేసీనేని నాని అన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఆయన కుటుంబసమేతంగా ఫుష్కరస్నానం చేశారు. పుష్కరఘాట్‌లోనే టీడీపీ మహిళా లీడర్లు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా రాఖీ పౌర్ణమి..
సీనియర్ సినీనటి జమున విజయవాడలో పుష్కరస్నానం చేశారు. పున్నమిఘాట్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఆమె స్నానం చేశారు. అనంతరం ఘాట్‌లో పిండప్రదానం చేశారు. విజయవాడ కృష్ణా పుష్కరాల్లో సేవలందిస్తున్న విద్యార్థినులు.. ఈసారి రాఖీ పౌర్ణమి వినూత్నంగా జరుపుకున్నారు. పుష్కర ఘాట్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు విద్యార్థినులు రాఖీలు కట్టారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ సరిహద్దులో గల కృష్ణా నది పుష్కర ఘాట్‌లో సమీప ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు వేయి మంది ముస్లింలు పుష్కర స్నానాలు ఆచరించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా పెద్ద ఎత్తున ముస్లింలు పుష్కర స్నానాలాచరించడం మతసామరస్యానికి నిదర్శనంగా నిలుస్తోందని.. వారితో పాటు పుష్కర స్నానాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు.

చెర్రీ పుష్కర స్నానం..
నల్లగొండ జిల్లా వాడపల్లి పుష్కర ఘాట్‌కు వచ్చే భక్తులకు ప్రాథమిక వైద్య సాయం అందించేందుకు తెలంగాణ జాగృతి, అమ్మ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు. సీనియర్‌ డాక్టర్లతో కూడిన వైద్య బృందం వైద్య సేవలందిస్తూ.. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సినీ హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన మహబూబ్‌నగర్‌ జిల్లా రంగాపూర్‌ వీఐపీ ఘాట్‌ వద్ద పుష్కర స్నానాలు ఆచరించారు. వాడపల్లి, అడవిదేవులపల్లి పుష్కరఘాట్లకు వచ్చే భక్తులకు మిర్యాలగూడకు చెందిన వెంకటేశ్వర మిల్క్స్ ప్రతిరోజు పాలను అందిస్తున్నాయి. ఇందుకోసం 3 వేల లీటర్ల నుంచి ఐదు వేల లీటర్ల పాలను అందిస్తున్నారు. 

06:38 - August 19, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల నగారా మోగింది. నిరుద్యోగులకు APPSC తీపిక‌బురు అందించింది. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం తొలి నోటిఫికేష‌న్‌ను స‌ర్వీస్ క‌మిష‌న్ విడుద‌ల చేసింది. ప‌లు శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 748 అసిస్టెంట్ ఇంజ‌నీర్స్ పోస్టుల భ‌ర్తీకి శ్రీకారం చుట్టింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగుల నిరీక్షణకు కొంతవరకు తెరపడింది. ప‌లు ప్రభుత్వ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ పోస్టుల భ‌ర్తీకీ ఆంధ్రప్రదేశ్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నోటీఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారిగా విడుద‌లైన ఈ నోటిఫికేష‌న్‌లో అసిస్టెంట్ ఎగ్జ్‌క్యూటివ్ ఇంజినీరింగ్ క్యాడ‌ర్‌లో 748 పోస్టులను ఏపీపీఎస్సీ భ‌ర్తీచేయ‌నుంది. దర‌ఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 21 తుది గ‌డువుగా నిర్ణయించింది. న‌వంబ‌ర్‌లో ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. ప‌రీక్షల‌ను పారద‌ర్శకంగా నిర్వహించేదుకు తొలిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. అలాగే వ‌న్ టైం రిజిస్ట్రేష‌న్ విధానాన్ని కూడా అమ‌లుచేస్తోంది. అభ్యర్ది ఒక్కసారి త‌న వివ‌రాలు న‌మోదు చేసుకుంటే.. భవిష్యత్తులో ఏ నోటిఫికేష‌న్ వ‌చ్చిన సుల‌భంగా ధ‌ర‌ఖాస్తు చేసుకునేలా అధికారులు రూప‌క‌ల్పన చేశారు. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో 20వేల పోస్టుల భ‌ర్తీ చేస్తామ‌నీ ప్రక‌టించిన ఏపీ ప్రభుత్వం తొలివిడ‌త‌గా 10వేల పోస్టుల భ‌ర్తీకి ఆమోదముద్ర వేసింది. వీటిలో ఇప్పటికే 4000లకు పైగా కానిస్టేబుల్ పోస్టులకు పోలీసుశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మిగిలిన‌వి ఏపీపీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేయాల‌ని నిర్ణయించింది. ఏది ఏమైనా రానున్న రోజుల‌లో ఏపీ నిరుద్యోగుల‌కు మరో శుభవార్త అంద‌నుంది.

06:35 - August 19, 2016

విజయవాడ : విభజన తర్వాత ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించింది. రాష్ట్రానికి 19 వందల 76కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే దీనిపై అటు అధికారపక్షం సహా అన్ని రాజకీయ పక్షాలు పెదవి విరుస్తున్నాయి. ప్రత్యేక హోదాను పక్కనబెట్టి కేంద్రం ప్యాకేజీకే పరిమితం కావడంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు 1976 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఇందులో రెవెన్యూ లోటు కింద 1,176 కోట్ల నిధులను కేంద్రం ఏపీకి విడుదల చేసింది. అలాగే వెనుకబడిన జిల్లాలకు 350 కోట్లు, రాజధాని అభివృద్ధికి 450 కోట్లు కేటాయించారు. దీంతో గడిచిన రెండు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకూ 1500 కోట్ల నిధులను అందించినట్లయ్యింది. అలాగే తాజా ఆర్థిక సహాయంతో కేంద్రం మొత్తం 3,989 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించినట్లయ్యింది. నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్థిక లోటును పూడ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతున్నా.. కేంద్రం మాత్రం అరకొర సహాయంతో చేతులు దులుపుకుందనే విమర్శలు చుట్టుముడుతున్నాయి.

బాబు అసంతృప్తి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ఆర్థిక సాయంపై అటు సాక్షాత్తూ ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో స్పష్టత లేదన్నారు. హోదా ఇస్తారా లేదా ప్యాకేజీతో పరిమితం చేస్తారా అనేది స్పష్టంగా తెలపాలన్నారు. అంతేకాదు బుందేల్‌ ఖండ్‌కు మంచి ప్యాకేజీ ఇచ్చారని, ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్నారు సీఎం చంద్రబాబు, అలాగే విభజన చట్టంలోని హామీలను ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయాల్సిందేనన్నారు. మరోవైపు కేంద్ర ప్యాకేజీపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. అరకొర నిధులతో కొత్త రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని నిలదీస్తున్నారు. కేంద్ర ప్యాకేజీ ఏపీ ప్రజలకు కేంద్రం తీవ్ర నిరాశను కలిగించిందన్నారు. అరకొర నిధులు ఇస్తే లాభం లేదన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు..
అటు ప్రతిపక్ష పార్టీ సీపీఎం సైతం కేంద్ర ప్యాకేజీపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను పక్కనబెట్టి కేవలం 1900 కోట్లు మాత్రమే ఇవ్వడం సమంజసం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. సీఎం చంద్రబాబు వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ బంద్‌ సహా పలు ఆందోళనలు జరిగాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఆందోళన బాటపట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రకటించిన ఈ ప్యాకేజీ ఏమాత్రం సంతృప్తి కలిగించే అవకాశం కనపడటం లేదు. 

06:31 - August 19, 2016

హైదరాబాద్: తెలుగుతేజం పీవీసింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ చేరడం ద్వారా రజత పతకం ఖాయం చేసింది. ఫైనల్ చేరిన భారత బ్యాడ్మింటన్ తొలిప్లేయర్ గా రికార్డుల్లో చోటు సంపాదించింది. బంగారు పతకం కోసం శుక్రవారం జరిగే ఫైనల్లో స్పెయిన్ ప్లేయర్ కారోలిన్ మారిన్ ను ఢీ కొంటుంది. రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్స్ కు తెలుగుతేజం పీవీ సింధు చేరి చరిత్ర సృష్టించింది. బంగారు పతకం కోసం జరిగే పోటీలో స్పెయిన్ సూపర్ స్టార్ కారోలిన్ మారిన్ తో తలపడటానికి అర్హత సంపాదించింది. రియో సెంట్రో పెవీలియన్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో జపాన్ కు చెందిన 6వ ర్యాంకర్ నజోమీ ఒకుహరాను వరుస గేమ్ ల్లో సింధు చిత్తు చేసింది. కేవలం 49 నిముషాలలోనే సింధు 21-19, 21-10 పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది.

హోరాహోరీ..
హోరాహోరీగా సాగిన తొలిగేమ్ ను 27 నిముషాలలో 21-19తో సొంతం చేసుకొన్న సింధు రెండో గేమ్ లో ఆల్ కోర్ట్ ప్లేతో చెలరేగి పోయింది. కేవలం 22 నిముషాలలోనే ప్రత్యర్థిని 21-10 పాయింట్ల తేడాతో కంగుతినిపించింది. 21 ఏళ్ల సింధు కెరియర్ లో ఇదే అతిపెద్ద విజయం. గతంలో ప్రపంచ బ్యాడ్మింటన్లో రెండుసార్లు కాంస్య పతకాలు సాధించిన సింధు...ఫైనల్స్ చేరడం ద్వారా ఇప్పటికే రజత పతకం ఖాయంచేసుకొంది. ఫైనల్లో నెగ్గితే బంగారు పతకం అందుకోగలుగుతుంది. 2012 లండన్ ఒలింపిక్స్ సెమీస్ లో ఓడిన సైనా నెహ్వాల్ కాంస్య పతకం సాధిస్తే...ప్రస్తుత ఒలింపిక్స్ లో సింధు ఆ రికార్డును తెరమరుగు చేసింది. మొత్తం మీద ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ చేరిన తొలి భారత ప్లేయర్ గా సింధు రికార్డు సంపాదించింది.

అద్భుత ఆటతీరు..
భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు రియో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. ఒలింపిక్స్‌లో భారత్‌ కాంస్యం(సాక్షిమాలిక్‌)తో బోణి చేసిన రోజే మరో పతకానికి సింధు బాటలు పరిచింది. జపాన్‌ షట్లర్‌ ఒకుహరతో గురువారం జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో పి.వి. సింధు 21-19, 21-10 తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లింది. దీంతో ఒలింపిక్‌ ఫైనల్‌ చేరిన తొలి మహిళా షట్లర్‌గా సరికొత్త రికార్డు సృష్టించిన సింధు తుదిపోరులో పసిడి కోసం ప్రపంచ నెంబర్‌వన్‌ షట్లర్‌ మారిన్‌తో ఢీకొననుంది.

నేడు ఫైనల్..
తొలిసారి ఒలింపిక్స్‌ బరిలో నిలిచిన పి.వి.సింధు. ఒక్కో అడుగు దాటుతూ సెమీ ఫైనల్‌లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం రాత్రి 7.30గం. జరిగే ఫైనల్‌ పోరులో స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మారినాతో సింధు ఢీకొననుంది. పి.వి.సింధు బ్యాడ్మింటన్‌లో జెయింట్‌ కిల్లర్‌ అనే పేరు ఉంది. సెమీ ఫైనల్‌లో ప్రత్యర్థి ఒకుహర బలాన్ని అంచనా వేయడంలో ఆమె వ్యూహం తప్పలేదు. తొలి నుంచే సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే అటు వైపు ఉన్నది ఒకుహర! తొలి సెట్‌లో ఇరువురి మధ్యా నువ్వానేనా అన్న రీతిలో పోరు సాగింది. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సింధు ఒడిసి పట్టింది. ఫలితం 21-19తో తొలి సెట్‌ను కైవసం చేసుకుని ప్రత్యర్థి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ఇక రెండో సెట్‌లో ఆది నుంచే సింధు శివ తాండవం చేసింది. ఏ దశలోనూ ప్రత్యర్థిని కొలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్‌కు రెండో సెట్‌కూ సంబంధం లేకుండా సాగింది. దీంతో 21-10 తేడాతో సెట్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా ఫైనల్‌లో బెర్తును, రియోలో పతకాన్ని ఖరారు చేసేసుకుంది.

తల్లిదండ్రుల సంతోషం..
సింధు విజయాన్ని కోచ్‌ గోపీచంద్‌ ముందుగానే ఊహించారని పీవీ. సింధు తండ్రి రమణ తెలిపారు. సింధు, ఆమె కోచ్‌ గోపీచంద్‌ పట్టుదల వల్లే ఈ విజయం సాధ్యమయ్యిందని తెలిపారు. ఫైనల్‌ లో కూడా సింధు ఇదే స్థాయిలో ఆట కొనసాగిస్తే బంగారు పతకం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పి.వి సింధు విజయం పట్ల ఆమె తల్లి విజయ ఆనందం వ్యక్తం చేశారు. సింధు విజయం వెనుక కోచ్ గోపిచంద్ కృషి ఎంతో ఉందన్నారు. రేపు ఫైనల్ కూడా ఇదే విధంగా ఆడి పతకం గెలుచుకోవాలి అభిలషించారు. సెమీ ఫైనల్ మ్యాచ్ ఆసక్తిగా సాగిందన్నారు గోపిచంద్ భార్య లక్ష్మి. ఇవాళ ఫైనల్ మ్యాచ్ కూడా చాలా ఆసక్తిగా ఉంటుందన్నారు. ప్రపంచ నెంబర్‌వన్‌ షట్లర్‌ మారిన్‌ తో పోటీపడే మ్యాచ్ చాలా కష్టంగా కూడా ఉంటుందని గోపిచంద్ భార్య పివివి లక్ష్మి అభిప్రాయపడింది. తప్పకుండా సింధు ఫైనల్ గెలిచి బంగారు పతకంతో ఇండియాకు తిరిగివస్తుందని ఆమె అభిలషించారు. సెమీస్ లో తన ఆటతీరుతో చిరస్మరణీయ విజయాన్ని పివి సింధు సొంతం చేసుకుంది. అంచనాలకు మించి సెమీస్‌లో రాణించిన సింధు ఫైనల్లో కూడా అదే ఆటతీరుతో స్వర్ణంతో భారత్‌కు రావాలని కోరుకుందాం!. 

06:25 - August 19, 2016

ఢిల్లీ : రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం విధించినట్లు సీఏఎస్ ప్రకటించింది. గతంలో డోపింగ్ కేసు విషయంలో క్లీన్ చీట్ పై పిటిషన్ ధాఖలవటంతో సీఏఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నర్సింగ్ యాదవ్ నాలుగేళ్ల పాటు రెజ్లింగ్ కు దూరం అవ్వాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అతను నిర్దోషో తెలవదు కానీ అతను దోషి అని సీఏఎస్ తేల్చింది. పతకం రాకపోగా భారత్ ప్రతిష్ట అప్రదిష్టపాలైనట్లు, దీనిపై భారత్ కచ్చితంగా దృష్టి సారించాలని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డోపింగ్ జాబితాలో భారత్ చేరడం దురదృష్టకరంగా చెప్పుకోవాలని పలువురు పేర్కొంటున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) జరిపిన డోపింగ్ టెస్టులో పాజిటీవ్ గా తేలినా అతడి తప్పులేదని భావించి అతడికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థలకు నాడా అందజేసింది. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, వాడా మాత్రం నర్సింగ్ ను బరిలో దింపేందుకు అనుమతించడం లేదు. తాజాగా నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం విధించాలనుకుంటున్నట్లు తన నిర్ణయాన్ని వెల్లడించింది.

2న బ్యాంకులు బంద్..

ఢిల్లీ : కార్మిక సంఘాలు చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెకు బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు తమ మద్దతును ప్రకటించారు. వచ్చే నెల 2న కార్మికులు చేపట్టిన ఒక రోజు దేశ వ్యాప్త సమ్మెలో బ్యాంకింగ్ ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారు. 

నేడు లక్ష మంది భక్తులతో చిన జీయర్ సమతా స్నానం..

గుంటూరు : నేడు ఉదయం 6గంటలకు లక్ష మంది భక్తులతో చిన జీయర్ స్వామి సమతా స్నానం నిర్వహించనున్నారు. 

నయీం వ్యవహారంపై 30 కేసులు - సిట్.

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం వ్యవహారంలో 30 కేసులు నమోదు చేసినట్లు సిట్ పేర్కొంది. నల్గొండలో 14, మహబూబ్ నగర్ లో 4, సైబరాబాద్ జంట కమిషనరేట్ లో 7, కరీంనగర్ లో 4, నిజామాబాద్ లో ఒక కేసు నమోదు చేసినట్లు సిట్ పేర్కొంది. 

రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై నిషేధం..

ఢిల్లీ : రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల పాటు నిషేధం విధించారు. డోపింగ్ కేసులో నర్సింగ్ పై సీఏఎస్ నిషేధం విధించింది. దీనితో భారత్ ఆశలు అడియాశలయ్యాయి. 

మారిన్ తో తలపడనున్న సింధు..

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్ లో నేడు మహిళా బ్యాడ్మింటెన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ నెంబర్ 1 షట్లర్ మారిన్ తో తెలుగు తేజం పీవీ సింధు తలపడనుంది.

నేటి నుండి నయీం ప్రధాన అనుచరుల విచారణ..

రంగారెడ్డి : నేటి నుండి నయీం ప్రధాన అనుచరులు శ్రీధర్ గౌడ్, బలరాంలను సిట్ బృందం విచారించనుంది. ఇటీవలే గ్రే హౌండ్స్ బలగాల కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంగతి తెలిసిందే. 

నేడు ఢిల్లీకి మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీ కానున్నారు. 

నేడు రెవిన్యూ డివిజన్లు, మండలాల ఖరారు..

హైదరాబాద్ : నేడు రెవిన్యూ డివిజన్లు, మండలాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. ఇటీవలే కేబినెట్ సబ్ కమిటీ కొత్త జిల్లాలపై జిల్లాల ప్రతినిధులతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. 

Don't Miss