Activities calendar

20 August 2016

23:26 - August 20, 2016

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధుకు టీసర్కార్ భారీ నజరానా ప్రకటించింది. సింధుకు రూ.5 కోట్ల నజరానా ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో వెయ్యి గజాల ఇంటిస్థలం ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఎల్లుండి హైదరాబాద్ వస్తున్న సింధుకు ఘన స్వాగతం పలుకుతామన్నారు.

 

23:18 - August 20, 2016

ఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ నియామకంపై సస్పెన్స్‌ తొలగింది. ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌‌గా కొనసాగుతున్న ఊర్జిత్ పటేల్‌ను కేంద్రం గవర్నర్‌గా ప్రకటించింది. ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ విషయంలో పలువురి పేర్లు వినిపించినా చివరికి ఊర్జిత్‌కే ఆ అవకాశం దక్కింది. 52 ఏళ్ల డాక్టర్‌ ఊర్జిత్‌ పటేల్‌ ఆర్బీఐకి డిప్యూటి గవర్నర్‌గా రెండోసారి కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్‌ పదవికి మోది సర్కార్‌ ఆయన వైపే మొగ్గు చూపింది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో బిఏ పూర్తి చేసిన పటేల్- యేల్‌ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి పట్టా పొందారు. ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన రాజన్‌తో పటేల్‌ అత్యంత సన్నిహితంగా మెదిలారు. సెప్టెంబర్‌ 4న రాజన్‌ పదవీ కాలం ముగుస్తుంది.

 

23:15 - August 20, 2016
23:14 - August 20, 2016

హైదరాబాద్ : తెలుగుతేజం పీవీ సింధు ఒలింపిక్స్ విజయంపై... ప్రశంసల వర్షం మాత్రమే కాదు... నజరానాలు సైతం వెల్లువలా కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీతో పాటు... ఢిల్లీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు, కేంద్రం, బ్యాడ్మింటన్ సమాఖ్య వరాలు కురిపించాయి. 2016 ఒలింపిక్స్ లో తెలుగుతేజం పీవీ సింధు సాధించిన బ్యాడ్మింటన్ రజతపతకం ఆనందంలోనే ...దేశంలోని అభిమానులు ఇంకా మునిగితేలుతున్నారు. రియో సెంట్రో ఎరీనా వేదికగా ముగిసిన..సస్పెన్స్ థ్రిల్లర్ గోల్డ్ మెడల్ ఫైట్ లో ప్రపంచ నెంబర్ వన్ కారోలిన్ మారిన్ తో  సింధూ తుదివరకూ పోరాడిన తీరు..కోట్లాదిమంది అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.
రజత పతకం 
రజత పతకం సాధించడం ద్వారా..సింధు పలు అరుదైన రికార్డులు సొంతం చేసుకొంది. ఒలింపిక్స్ ఫైనల్స్ చేరిన భారత తొలిమహిళ మాత్రమే కాదు..రజత పతకం సాధించిన ప్లేయర్ గా రికార్డుల్లో చేరింది. సిల్వర్ మెడల్ విజయంతో దేశానికే గర్వకారణంగా నిలిచిన సింధుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసీఆర్, చంద్రబాబు నాయుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మాస్టర్ సచిన్ టెండుల్కర్, ఇతర రంగాలకు చెందిన అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాదు...సింధు రజతపతకం సాధిస్తే...ఖరీదైన కారు, కోట్లరూపాయల నగదు బహుమతుల రూపంలో కానుకల వర్షం కురుస్తోంది. సింధుకి తెలంగాణా రాష్ట్రప్రభుత్వం కోటిరూపాయలు, ఢిల్లీ రాష్ట్రప్రభుత్వం రెండుకోట్ల రూపాయలు నగదు బహుమతులుగా ప్రకటించాయి. 
సింధుకు రూ.3కోట్ల ప్రోత్సాహక బహుమతులు 
ఇక..ఒలింపిక్స్ విజేతలకు కేంద్రప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక బహుమతుల రూపంలో సింధు మూడుకోట్ల రూపాయలు అందుకోనుంది. భారత బ్యాడ్మింటన్ సంఘం రజత విజేత సింధుకు 50 లక్షల రూపాయలు, సింధు శిక్షకుడు పుల్లెల గోపీచంద్ కు పదిలక్షల రూపాయలు నజరానాగా ప్రకటించింది.
ఇక...హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం సింధుకు 80 లక్షల రూపాయల విలువైన బీఎండబ్ల్యు కారును మాస్టర్ సచిన్ టెండుల్కర్ చేతులమీదుగా అందచేయాలని నిర్ణయించింది.
సింధుకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న..!
ఇప్పటికే..కేంద్రప్రభుత్వం నుంచి అర్జున, పద్మశ్రీ పురస్కారాలు అందుకొన్న సింధు...దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు సైతం అందుకోడం ఖాయంగా కనిపిస్తోంది. అంకితభావంతో అహరహం శ్రమిస్తే..అత్యుత్తమ ఫలితాలు సాధిస్తే..పేరుప్రఖ్యాతులు, సిరిసంపదలు ఒకదాని వెనుక ఒకటిగా నడుచుకొంటూ వస్తాయనడానికి ...21 ఏళ్ల పీవీ సింధు సాధించిన విజయమే నిదర్శనం.

 

23:07 - August 20, 2016

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ మాజీ సిఎం ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలకు చెందిన 20 మంది నేతలు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. కశ్మీర్‌లో తాజా పరిస్థితులను వివరిస్తూ ఆయనకు మెమొరాండం సమర్పించారు. కశ్మీర్‌ సమస్యను పాలనా పరంగా కాకుండా రాజకీయ కోణంలో పరిష్కరించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. కశ్మీర్‌ సమస్యను కేంద్రం రాజకీయ చర్చల ద్వారా పరిష్కరించకుండా సమస్యను మరింత జఠిలం చేస్తోందని విమర్శించారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు.

 

23:03 - August 20, 2016

విజయవాడ : వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు కూడా హైదరాబాద్ లోనే నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ వియవాడలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో... అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు... ఉద్యోగులకు డీఏ బకాయిల చెల్లింపు, ఒలింపిక్స్‌ పతక విజేత పీవీ సింధుకు నజరానా లాంటి పలు నిర్ణయాలు తీసుకుంది.  
పీవీ సింధుకు 3 కోట్ల నజరానా 
విజయవాడలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో భేటీ అయిన మంత్రివర్గం పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ముందుగా రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ  సింధును అభినందిస్తూ కేబినేట్‌ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సింధుకు రూ. 3 కోట్ల నగదు బహుమతితో పాటు రాజధానిలో వెయ్యి గజాల స్థలం, గ్రూప్ వన్ స్థాయిలో ఉద్యోగం ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలాగే సింధు కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.50 లక్షల నగదును ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 
రాబోయే వర్షాకాల సమావేశాలు హైదరాబాద్‌లోనే 
అలాగే రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే నిర్వహించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని, జీఎస్‌టీ బిల్లుపై సెప్టెంబర్‌ 8లోగా అసెంబ్లీ తీర్మానం చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. 
పెరిగిన డీఏ ఆగస్టునుంచి అమలు 
దీంతో పాటు ఉద్యోగుల డీఏ బకాయిలను పీఎఫ్‌ ఖాతాలో జమచేయాలని, పెరిగిన డీఏను ఆగస్టు నుంచి అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇక పీఆర్సీ అమలు కాని ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు వేతన స్కేలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో ప్రభుత్వ సంస్థలకు పీఆర్సీ సిఫార్సులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు  చేస్తామని తెలిపారు.  అలాగే  ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి 200 ఎకరాలు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 
ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వాలి - సీఎం చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు వీలైనంత త్వరగా యుటిలిటీ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సాధారణంగా ఇవ్వాల్సిన నిధులనే ఇచ్చింది తప్ప అదనపు నిధులేమీ ఇవ్వలేదని అన్నారు. ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నట్లు కూడా చంద్రబాబు తెలిపారు. పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన పలు విభాగాలను, ఉద్యోగులను సీఎం చంద్రబాబు అభినందించారు.

22:59 - August 20, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటును తెలంగాణలోని అన్ని పార్టీలూ స్వాగతించాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గదర్శకాలను రూపొందించాలని అఖిలపక్షం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఫైనల్‌ నోటిఫికేషన్‌కు ముందే రెండు సార్లు ఆల్‌పార్టీ మీటింగ్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
అఖిలపక్ష సమావేశం
తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటుపై సచివాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి.. ఏడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 14 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో కేబినెట్‌ సబ్‌కమిటీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించిన అన్ని పార్టీలు  
కొత్త జిల్లాల ఏర్పాటును అన్ని పార్టీలూ స్వాగతించాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటులో ఎటువంటి మార్గదర్శకాలు రూపొందించలేదని.. వెంటనే గైడ్‌లైన్స్‌ తయారు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. 1974 ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటు చట్టం ఆధారంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటును టీటీడీపీ స్వాగతించింది. అయితే కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ఆరింటిలో అతి తక్కువ జనాభా ఉందని.. ఏడింటిలో ఎక్కువ జనాభా ఉన్న విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకువచ్చింది టీడీపీ. సంఖ్యాశాస్త్రం ఆధారంగా కాకుండా.. శాస్త్రీయంగా జిల్లాల విభజన జరగాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. 
ప్రభుత్వానికి సీపీఎం కొన్ని ప్రతిపాదనలు  
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు చేసింది సీపీఎం. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలన్నింటినీ కలిపి ఆటానమస్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని జిల్లాలు ఇప్పుడున్న ఆర్థిక వనరులు దెబ్బతినే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అటు సీపీఐ కూడా కొత్త జిల్లాల ఏర్పాటులో రెవిన్యూ డివిజన్లు, మండలాల విషయంలో కొన్ని నిర్థిష్ట ప్రమాణాలు పాటించాలని సూచించారు. బీజేపీ సైతం కొత్త జిల్లాల ఏర్పాటుపై కొన్ని సూచనలు చేసింది. హైదరాబాద్‌ జిల్లాను యథాతథంగా ఉంచాలని కోరింది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయ పార్టీలు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. ఫైనల్‌ నోటిఫికేషన్‌కు ముందు మరో రెండుసార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని అధికార పార్టీ స్పష్టం చేసింది. 

 

22:52 - August 20, 2016

గొర్రెలు, మేకలను మనం ఆనందం కోసం బలి చేస్తుంటాము.. మనలాగే వాటివి కూడా ప్రాణమే. మనలాన వాటికి కూడా ఆత్మలుండుంటే... మనిషి పరిస్థితేంటీ.. అని ప్రశ్నిస్తాడు ఒక నాస్తికుడు. ప్రతి మనిషికి మనసు, ఆత్మ ఉంటాయి. మనిషి చనిపోయాక ఆత్మ గాలిలో కలిసిపోతుందని.. కోరిక తీరిన స్వర్గానికి ఆత్మ స్వర్గానికో నరకానికో వెళ్తుందని... కోరికలు తీరని ఆత్మ.. ప్రేతాత్మలుగా మారి కోరికలు తీరడం కోసం బతికి ఉన్న మనిషిని ఆవిహించి.. వారి ద్వారా తమ కోరికలను తీర్చుకోవడం జరుగుతుందని... ఆత్మలకు ఎవరైననే కోపాలు, ప్రతీకారుల ఉంటే వారికిపై ప్రతీకారాలు వంటి చర్యలు చేస్తాయని ఎవరో చెబితే విన్నాం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:40 - August 20, 2016

అసలైన పరీక్షల చిక్కిన పివి.సింధు... ఇండియాకు ఆల్చంగొస్తేనే పసందు, ఎస్సై సూసైడ్ మీద తమాషా ఎంక్వైరీ.. ఏఎస్పీ విచారణ మీద జనం విచారం, కుక్కలు..నక్కలు.. ... లొట్టపిట్టలు.. పార్టీ మారనంటున్న పొన్నం మాటలు, నిజామాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ గోల్ మాల్,.. బ్రోకర్లు, లంచావతారులదే ఆడ హల్ చల్, డోనాల్డ్ ట్రంప్ బరవతల క్లీన్ బోల్డు.. అమెరికల ఇజ్జత్ దీస్తున్న ఇగ్రహాలు, ఎద్దును కిడ్నాప్ చేసిన పోరగాల్లు... కారులో ఎట్లెక్కిచ్చిరో గదవాళ్లు.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

22:02 - August 20, 2016

స్టార్ కొరియోగ్రఫీ జానీ మాస్టర్ తో టెన్ టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. తన సినీ కెరీర్ ను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:52 - August 20, 2016

రాజమండ్రి : దళితులపై ఏపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని.. మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆరోపించారు.. పాత తుంగపాడులో దళిత యువకుడు యడ్ల చిన్న ఆత్మహత్య కేసును ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు.. ప్రభుత్వ వివక్షతకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు.. సీఎం చంద్రబాబుపై కేసులు పెడతామని హెచ్చరించారు.. 

21:51 - August 20, 2016

విజయవాడ : ప్రాజెక్టు అనంతను ఎన్టీఆర్ ఆశయంగా పేరు మార్చి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వల్ల కొంత మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని ఏపీ పీసీసీ ఛీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ప్యాకేజీల వల్ల రైతుల కష్టాలు తీరవన్నారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కుఅని హోదాకు బదులు ప్యాకేజీ చాలన్నట్టుగానే.. ప్రాజెక్టు అనంత స్థానంలో ప్యాకేజీను అమలు చేయడం బాధాకరమన్నారు.

21:46 - August 20, 2016
21:45 - August 20, 2016

వరంగల్ : ఒలంపిక్స్‌లో రజతం గెలిచిన సింధుకు దేశవ్యాప్తంగా అభినందనలు కొనసాగుతున్నాయి. సింధు విజయం దేశానికి గర్వకారణమంటూ వరంగల్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు.... సింధు గెలుపు అందరిలో సంతోషం నింపిందని హర్షం వ్యక్తం చేశారు.

21:42 - August 20, 2016

హైదరాబాద్ : తమ సమస్యలను పరిష్కారించాలని డిప్యూటీ సీయం కడియం శ్రీహరి ఇంటిని సెకండ్ ఏఎన్‌ఎంలులు ముట్టడించారు. సరైన వేతనాలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు సమ్మెను విరమించమన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించిన సెంకడ్ ఏఎన్‌ఎంలను, సిఐటీయూ నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
మంత్రి ఈటెల ఇంటి ముట్టడి
అటు కరీంనగర్‌లోని మంత్రి ఈటెల రాజేందర్‌ ఇంటిని కూడా సెకండ్‌ ఏఎన్‌ఎంలు ముట్టడించారు. వెంటనే కనీస వేతనాలను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ర్యాలీగా బయలు దేరిన ఏఎన్‌ఎంలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 
మంత్రి పోచారం ఇంటి ముట్టడి 
నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడలోని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటిని సెకండ్‌ ఏఎన్‌ఎంలు ముట్టడించే ప్రయత్నం చేశారు. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన ఏఎన్‌ఎంలు బాన్సువాడకు చేరుకొని మంత్రి పోచారం ఇంటికి ర్యాలీగా బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

 

21:35 - August 20, 2016

 ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధరించిన సూటు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. వేలంలో అత్యధిక ధర పలికిన సూటుగా గిన్నిస్ రికార్డుల్లో నమోదైంది. ఈ మేరకు గిన్నిస్ బుక్ నిర్వాహకులు సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సూటు 4 కోట్ల 31 లక్షలకు అమ్ముడైనట్లు వెల్లడించింది. గుజరాత్ కు చెందిన హితేష్‌ లాల్జీభాయ్ పటేల్ 2015, ఫిబ్రవరి 20న దీన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. వేలం ద్వారా వచ్చిన ఈ డబ్బును గంగా ప్రక్షాళనకు విరాళంగా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనకు వచ్చినప్పుడు నరేంద్ర మోదీ ఈ సూటు ధరించారు. 'నరేంద్ర దామోదర్దాస్ మోదీ' పేరు కనిపించేలా బంగారంతో ఈ సూటును ప్రత్యేకంగా తయారు చేశారు. ఖరీదైన సూటు ధరించిన మోదీపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

21:20 - August 20, 2016

కృష్ణా : విజయవాడలో కృష్ణాపుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వారి సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. మరికొంత మంది కృష్ణా నదిలో వాటర్‌ గ్లైడింగ్‌ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.

21:19 - August 20, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలకు విజయవాడకు తరలివస్తున్న భక్తజనంతో రైల్వేస్టేషన్ కిటకిటలాడుతోంది. పుష్కరాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైళ్ల ప్రయాణం ద్వారా పుష్కర యాత్రికులు లక్షలాదిగా విచ్చేస్తున్నారు. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తజనసందోహం తరలివస్తోంది. పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన రైళ్లన్నీ రద్దీగా మారాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:16 - August 20, 2016

నల్లగొండ : జిల్లాలోని ఆలేరును జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జనగాం రెవెన్యూ డివిజన్‌లో కలపవద్దని జాతీయరహదారి 163పై అఖిలపక్ష నేతలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ధర్నాలో టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు. ఆలేరును భువనగిరి రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

21:12 - August 20, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం పెట్టామని... అన్ని రాజకీయ పార్టీలు కొత్త జిల్లాలను స్వాగతించాయని  సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని పార్టీలు కొన్ని సూచనలు చేశాయన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని పేర్కొన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం మార్గదర్శకాల ప్రకారం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 22న జిల్లాల పునర్విభజన ముసాయిదా విడుదల చేస్తామని చెప్పారు. జిల్లాల ఫైనల్ నోటిఫికేషన్ ముందు మరో రెండు సార్లు అఖిలపక్ష భేటీ పెడతామని చెప్పారు. ఏ ప్రాంత ప్రజలకైనా ఇబ్బందులు ఉంటే జిల్లాల కలెక్టర్లకు గాను, సీసీఎల్ ఏ కార్యాలయంలో కానీ తెలియజేయాలన్నారు. ప్రజాభిప్రాయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకుటామని చెప్పారు. కొన్ని చోట్ల తమ ప్రాంతాన్ని జిల్లా చేయాలని కోరుతున్నారని.. ఎలా పడితే అలా జిల్లా చేయడం కుదరదని... పెద్ద మనుసుతో అర్థం చేసుకోవాలన్నారు. వరంగల్ జిల్లాలో కొంత కన్ ఫ్యూజన్ ఉందన్నారు. ప్రజల కోరిక మేరకే వరంగల్ జిల్లా ఉంటుందని స్పష్టం చేశారు. ఒక నియోజవర్గం ఒకే జిల్లాలో ఉండాలనే నియమం ఎక్కడా లేదన్నారు. త్వరలో శాసనసభ ప్రత్యేక సమావేశాలుంటాయని చెప్పారు.  జీఎస్ టీకి మద్దతిస్తామని ప్రధానికి చెప్పామని తెలిపారు. సమావేశాల్లో జీఎస్ టీ బిల్లుకు ఆమోదం తెలుపుతామని చెప్పారు. కేంద్రప్రభుత్వ ప్రతినిధి సమక్షంలో ప్రాజెక్టులపై మహారాష్ట్రతో తుది ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో విషయం లేదని విమర్శించారు. కొత్త కోర్టులో ఏర్పాటయ్యే వరకు ఇప్పుడున్న కోర్టులోనే విచారణలు జరుగుతాయన్నారు.

 

జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం మార్గదర్శకాల ప్రకారం కొత్త జిల్లాలు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం మార్గదర్శకాల ప్రకారం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. 22న జిల్లాల పునర్విభజన ముసాయిదా విడుదల చేస్తామని చెప్పారు. జిల్లాల ఫైనల్ నోటిఫికేషన్ ముందు మరో రెండు సార్లు అఖిలపక్ష భేటీ పెడతామని చెప్పారు. ఏ ప్రాంత ప్రజలకైనా ఇబ్బందులు ఉంటే జిల్లాల కలెక్టర్లకు గాను, సీసీఎల్ ఏ కార్యాలయంలో కానీ తెలియజేయాలన్నారు. ప్రజాభిప్రాయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకుటామని చెప్పారు. 

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ :  పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని పార్టీలు కొత్త జిల్లాలను స్వాగతించాయన్నారు. అన్ని పార్టీలు కొన్ని సూచనలు చేశాయని పేర్కొన్నారు. 

కొత్త జిల్లాలపై అఖిలపక్ష సమావేశం పెట్టాం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : కొత్త జిల్లాలపై అఖిలపక్ష సమావేశం పెట్టామని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని పార్టీలు కొత్త జిల్లాలను ప్వాగతించాయని తెలిపారు.  కొత్త జిల్లాల ఏర్పాటుపై మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని పేర్కొన్నారు.
 

20:16 - August 20, 2016

హైదరాబాద్ : సెప్టెంబర్ మొదటివారంలో హైదరాబాద్ లోనే అంసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఎపి సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ చార్జీలు ఇచ్చామని తెలిపారు. ఈ ఏడాది పీఆర్ సీ అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో వర్తింపజేస్తామని చెప్పారు. భవిష్యత్ లో పీఆర్ సీ, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధం లేదన్నారు. ఐఎంజీ సంస్థను రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుందని తెలిపారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధుకు రూ.3 కోట్ల విరాళం, అమరావతిలో ఇంటిస్థలం, గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కోచ్ గోపిచంద్ కు రూ.50 లక్షల నజరానా, అకాడమీకి 5 ఎకరాల స్థలం కేటాయించాలని నిర్ణయించామని తెలిపారు. పివి. సింధు మన అందరకీ గర్వకారణంగా నిలిచిందన్నారు. అద్భుతంగా పోరాడి రజతం సాధించిందని చెప్పారు. సింధు పోరాట పటిమను చూసి దేశం గర్వపడిందని తెలిపారు. సింధుకు స్వర్ణం వస్తుందనుకున్నామని చెప్పారు. 

ఈ ఏడాది అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో పీఆర్ సీ : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ చార్జీలు ఇచ్చామని తెలిపారు. ఈ ఏడాది అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో పీఆర్ సీ వర్తింపజేస్తామని చెప్పారు. భవిష్యత్ లో పీఆర్ సీ, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధం లేదన్నారు. ఐఎంజీ సంస్థను రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుందని తెలిపారు. సెప్టెంబర్ మొదటివారంలో హైదరాబాద్ లోనే అంసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.  

అందరకీ గర్వకారణంగా నిలిచిన పివి.సింధు : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : పివి. సింధు మన అందరకీ గర్వకారణంగా నిలిచిందని సీఎం చంద్రబాబు తెలిపారు. అద్భుతంగా పోరాడి రజతం సాధించిందని చెప్పారు. సింధు పోరాట పటిమను చూసి దేశం గర్వపడిందని తెలిపారు. సింధుకు స్వర్ణం వస్తుందనుకున్నామని చెప్పారు. 

పివి.సింధుకు ఎపి ప్రభుత్వం రూ.3 కోట్ల విరాళం

హైదరాబాద్ : రియో ఒలింపిక్ లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధుకు రూ.3 కోట్ల విరాళం, అమరావతిలో ఇంటిస్థలం, గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నట్లు ఎపి సీఎం తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కోచ్ గోపిచంద్ కు రూ.50 లక్షల నజరానా, అకాడమీకి 5 ఎకరాల స్థలం కేటాయించాలని నిర్ణయించామని తెలిపారు. పివి. సింధు మన అందరకీ గర్వకారణంగా నిలిచిందన్నారు. 

19:42 - August 20, 2016

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా సమస్యపై సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ స్పందించారు. గొడవలతో ప్రత్యేకహోదాకు పరిష్కారం దొరకదన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సున్నితమైన అంశం అని తెలిపారు. తనది గొడవలు పెట్టుకునే మనస్తత్వం కాదన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌, బీజేపీలు హామీ ఇచ్చాయని పేర్కొన్నారు. హోదాకోసం ప్రయత్నాలు సాగుతున్నాయని...ఏదో ఒకటి చేయాలని తనకు కూడా ఉందని తెలిపారు. ఒలంపిక్స్‌లో సిల్వర్ మెడల్‌ సాధించిన సింధుకు పవన్‌కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

 

19:29 - August 20, 2016

హైదరాబాద్ : కుకునూరు పల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై డీఐజీ అకున్‌ సభర్వాల్‌ విచారణ చేపట్టారు. సిద్ధిపేట రూరల్‌ సీఐ వెంకటయ్య, తొగుట సీఐ రామాంజనేయులుతో పాటు, కుక్కునూరుకు చెందిన నలుగురు కానిస్టేబుళ్లను ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డీఎస్పీ శ్రీధర్‌గౌడ్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. మరోవైపు న్యాయం చేయాలంటూ ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి బంధువులు హోంమంత్రి నాయిని కలిసి విజ్ఞప్తి చేశారు. 

 

18:49 - August 20, 2016
18:41 - August 20, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం తమ్మినేని వీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం 27 జిల్లాలను ప్రతిపాదించిందని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటును అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని.. సీపీఎం కూడా ఆమోదం తెలిపిందని చెప్పారు. గిరిజన ప్రాంతాలను అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్  ను 2 లేదా 3 జిల్లాలుగా విభజించాలని పేర్కొన్నారు. జనగామ జిల్లా ప్రతిపాదనను ఆలోచించాలన్నారు. షాద్ నగర్ ను కొత్త ఏర్పాటు చేయబోయే శంషాబాద్ జిల్లాలో విలీనం చేయాలను కోవడం సరికాదని.. షాద్ నగర్ మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంచాలని సూచించనట్లు తెలిపారు. అధికంగా పారిశ్రమలు కలిగిన ప్రాంతాలను ఒకే జిల్లాలో ఉంచడం భావ్యం కాదన్నారు. అయితే జిల్లాలను ఫైనల్ చేసే ముందు మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారని తెలిపారు. జిల్లాల విభజనపై రాజకీయ పార్టీలు పలు సలహాలు, సూచనలు చేశాయని వివరించారు. 
 

 

18:15 - August 20, 2016
18:13 - August 20, 2016

కొత్త జిల్లాలపై ముగిసిన అఖిలపక్షం సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలపై అఖిలపక్షం సమావేశం ముగిసింది. జిల్లాల విభజనపై వివిధ రాజకీయ పార్టీలు పలు సలహాలు, సూచనలు చేశారు. 

గొర్లుపాలెంలో అగ్నిప్రమాదం

విశాఖ : పరవాడ మండలం గొర్లుపాలెంలో అగ్నిప్రమాదం సంభవించింది. గణేష్ విగ్రహాల గోడౌన్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీ విగ్రహాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. 

16:29 - August 20, 2016
16:27 - August 20, 2016
16:25 - August 20, 2016

విశాఖ :  రాజమహేంద్రవరంలో ఆదర్శ వివాహం జరిగింది. తన జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో ఓ యువతి మూడుముళ్ల బంధానికే కొత్త భాష్యం చెప్పింది. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించడమే అంధుడితో ఏడడుగులు నడిచి నేటి యువతరానికే ఆదర్శంగా నిలింది. రాజమహేంద్రవరంలో జరిగిన ఆ ఆదర్శ వివాహంపై స్పెషల్‌ స్టోరీ. 
మానవీయ కోణం..
పెళ్ళి ప్రస్తావన తీసుకురాగానే ముందుగా పెద్దల నుంచి, పెళ్ళి పీటలు ఎక్కబోయే యువతీ,యువకులు ఒకరికోసం ఒకరు రూపు రేకలకే ప్రాధాన్యత ఇస్తారు. కాని జీవితభాగస్వామికి మనసుంటే చాలు.. రూపంతో సంబంధంలేదు అని నిరూపించింది..విశాఖ జిల్లాపరదేశిపాలెంకు చెందిన సత్యాల శ్యామల. మానవీయ కోణంలో ఆలోచించి. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన అంధ యువకుడు వడ్డి కొండబాబుకు వివాహ సంబంధాలు చూస్తున్న విషయం తన తల్లి ద్వారా తెలుసుకున్న శ్యామల తానే కొండబాబుతో మాట్లాడతానని ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటైతే పెళ్లి చేసుకోవడానికి సిద్దమని తల్లితో చెప్పింది.

బ్రెయిలీ బోధకుడు..
ఇరు వర్గాలకు చెందిన కుటుంబ పెద్దలు అంగీకరించడంతో వివాహానికి సిద్ధమయ్యారు. పుట్టుకతోనే అంధుడైన కొండబాబు. రాజమహేంద్రవరంలోని జియోన్ అంధుల పాఠశాలలో విద్యా బుద్దులు నేర్చుకుని...అక్కడే అంధ విద్యార్థులకు బ్రెయిలీ బోధకుడిగా తాను పనిచేస్తున్నానని  వివరించాడు..దీంతో కొండబాబు పై శ్యామలకు గౌరవం పెరగడంతో పాటు జీవితభాగస్వామిగా కొండబాబు తోనే ఏడడుగులు వేస్తానని,జీవితాంతం కొండబాబు నయనంగా పయనిస్తానని శ్యామల ఇంట్లో బంధువులను ఒప్పించింది. దీంతో వీరిద్దరి వివాహం రాజమహేంద్రవరంలోని జియోన్ అంధుల పాఠశాలలోనే వైభవంగా జరిగింది..వివాహనికి నగర మేయర్ పంతం రజనీశేషసాయి తో సహ ప్రముఖలు హజరయ్యారు. 
చిన్న చిన్న  కారణాలతో చిన్నాభిన్నామవుతున్న వివాహ వ్యవస్థకి శ్యామల - కొండబాబుల వివాహం ఆదర్శం. ఇప్పటకైనా ఈ తరం యువకులు వీరిని చూసి నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది.

16:20 - August 20, 2016

హైదరాబాద్ : కశ్మీర్‌లో కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది. గత 43 రోజులుగా కర్ఫ్యూతో స్థానిక జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. అనంతనాగ్, శ్రీనగర్ లోని కొన్ని ప్రాంతాలలో కర్ఫ్యూ  అమలవుతోందని, కశ్మీర్ లోయలోని ఇతర ప్రాంతాల్లో బంద్‌ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ప్రభుత్వం సూచించింది. లేదంటే ఆగస్టు నెల్లో జీతాలు నిలిపివేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గత ఆరు రోజులుగా నౌహట్టా ప్రాంతంలోని మసీదులోనికి నమాజు చేయడానికి అనుమతించడం లేదు. ర్యాలీ నిర్వహించేందుకు యత్నించిన వేర్పాటువాదులు సయ్యద్‌ అలీ గిలానీ, మీర్వాజ్ ఉమర్‌ ఫరూక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

16:15 - August 20, 2016

హైదరాబాద్ : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా పి వి సింధూ ఫ్యాన్‌గా మారిపోయారు. హ్యాట్సాఫ్‌ టు యు సింధూ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. నీకు నేను పెద్ద ఫ్యాన్‌గా మారానంటూ ట్వీట్‌ చేశారు. రజనీకాంత్‌ చాలా అరుదుగా ట్వీట్‌ చేస్తుంటారు. బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ కూడా సింధూకు శుభాకాంక్షలు తెలిపారు. సింధూ  ఫైనల్‌లో అద్భుత పోరాట పటిమ చూపిందని, భారత్‌కు ఎంతో గర్వకారణమని అమితాబ్‌ ట్వీట్‌ చేశారు. తన తల్లితో కలిసి ఫైనల్‌ గేమ్‌ చూశానని మరో నటుడు సల్మాన్‌ ఖాన్‌ అన్నారు. సింధూతో కలిసి దిగిన ఫొటోను సల్మాన్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.  బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన తెలుగమ్మాయి సింధూకు బాలీవుడ్‌ నటీ నటుల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

16:13 - August 20, 2016

విజయవాడ : ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి సంగమం ఘాట్‌లో పోలీసులు ఓవరాక్షన్‌ శృతి మించుతోంది.  పుష్కర హారతికి సీఎం రావడానికి రెండు గంటల ముందే ఘాట్లో స్నానాలు చేయకుండా భక్తులను ఆపేస్తున్నారు. హారతి కేవలం వీఐపీల కోసమే అన్నట్లు సామాన్యులను అడ్డుకుంటున్నారు. ఉన్నత అధికారుల సమక్షంలోనే సామాన్యులను బయటకు తోసేస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లో యాత్రికులను తరలించి హారతికి ఆమడ దూరాన్నే ఆపేస్తున్నారు. సంగమం ఘాట్‌ దగ్గర ఉన్న పరిస్థితిని వీడియోలో చూడండి.

16:10 - August 20, 2016
16:08 - August 20, 2016

హైదరాబాద్ : యాత్రికులు పుష్కరాలకు ఎలా వెళ్లాలని నానా ప్రయాసపడుతున్నారు.. బస్సులు, రైళ్లు, ప్రయివేటు వాహనాలు ఇలా ఎలా వీలయితే.. ఎలా అవకాశం ఉంటే అలా కృష్ణా తీరానికి చేరుతున్నారు. కాని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన దొంగల ముఠాలు మాత్రం విమానాల్లో వచ్చేశారు. దోచుకునేందుకు గగన మార్గంలో వచ్చిన చోర్స్‌ ఫ్యామిలీల్లా పుష్కర ఘాట్లలోని యాత్రికుల్లో కలిసిపోయారు. మూడు మునకల్లో రెండో మునకకే మెడలో గొలుసు తెంచేస్తున్నారు. స్నానం చేయకముందే పౌడర్ చల్లి దురదపుట్టిస్తున్నారు. రకరకాల వేషాల్లో దోచేస్తున్న పుష్కర దొంగలు నదీతీరాన మాటువేశారు. సో..  జర భద్రం..  ఏమాత్రం అలక్ష్యం చేసినా గుల్ల చేస్తారు. రిటన్ టిక్కెట్టు సంగతి తర్వాత కనీసం చాయ్ తాగేందుకు కూడా చిల్లి గవ్వ ఉంచడం లేదు. నిలువు దోపిడీ చేస్తున్న గ్యాంగ్స్‌లో మహిళలే ఎక్కువ..
పౌడర్ జల్లితే భస్మం అనుకోకండి..
రద్దీలో పౌడర్ మీద పడుతుంది. భస్మం అనుకుంటే పొరపాటే...అది దురదపుట్టించే పౌడర్.. నీళ్లలో మునిగేందుకు భయపడుతున్నారా. అయితే మిమ్మల్ని మరో మహిళ చేయి పట్టుకుని ముంచేస్తుంది. రెండో మునకలోనే మెడలో తాళిబొట్టు మాయం. ఇలాంటివెన్నో కళ్ల ముందు జరుగుతున్నా వారిని మాత్రం దొంగలనుకోం. ఎందుకంటే ఆ తర్వాత వారిని చెక్ చేసినా చోరీ చేసిన సొత్తు ఉండదు. అదే క్షణంలో చేతులు మార్చేసే మాయగాళ్లు ఇప్పుడు కృష్ణాతీరంలో ఉన్నారు.

టార్గెట్ మహిళలే..
పుష్కరాలకు వచ్చే మహిళా యాత్రికులే వారి టార్గెట్. వారిని లక్ష్యం చేసుకున్న ముఠాలు చోరీ చేసే విధానంలో ప్రధానంగా వారు తెచ్చే పౌడర్ చల్లడం. దీంతో దురదపెట్టినట్లయి బ్యాగ్‌లు వదిలడంతో మాయం చేస్తారు.
పుష్కరాల్లో చోరీ విధానం - 2 
ఇక యాత్రికులతో పాటు చోరీ ముఠాల్లోని మహిళలు. పురుషులు కలిసి ఫ్యామిలీలా వెళ్తారు. వారితో కలిసి నీళ్లలో మునుగుతున్నట్లు చేస్తూ కట్టర్‌తో గొలుసు తెంచేస్తారు. పుష్కరాలకు తరలివస్తున్న మహిళలను లక్ష్యం చేసుకోవడమేగాకుండా పురుషులను చుట్టుముట్టేస్తారు. హడావుడిలో పాకెట్‌ కొట్టేస్తారు. ఇక అటెన్షన్ డైవర్షన్...దృష్టి మరల్చి దోచుకునేందుకు దొంగలు వందరూపాయల నోటు కిందపడేస్తారు..అది మీదేనా అంటూ మాట కలిపి దృష్టి మరల్చి దోచేస్తారు.
నగలు జాగ్రత్త.. 
ప్రధానంగా పుష్కరాల్లో మహిళా యాత్రికుల సంఖ్య పెద్దగా ఉండడంతో పాటు వారిపైనే నగలు ఉంటాయి...దీంతో మహిళలను లక్ష్యం చేసుకున్న ముఠాలు వ్యూహాత్మకంగా వారితో పాటు మహిళా చోరులను కూడా వెంటపెట్టుకొచ్చారు..దీంతో ఆ గుంపులో కలిపేసి టార్గెట్ చేసుకున్న మహిళలను దోచేస్తున్నారు. ఇలా రకరకాలుగా దోపిడీ ముఠాలు పుష్కరాలకు చేరుకున్నాయి...

16:00 - August 20, 2016

హైదరాబాద్ : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో విబేధాలు భగ్గుమన్నాయి. రంగారెడ్డి జిల్లా మైలార్‌ దేవ్‌పల్లి అభివృద్ధి కార్యక్రమాల్లో అధికార పార్టీ నేతలు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఎదుటే ఘర్షణకు దిగారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌, కార్పోరేటర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మధ్య ఫ్లెక్సీల విషయంలో వివాదం తలెత్తడంతో ఇరు నేతల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరు నేతల కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించుకొని మేయర్‌ బొంతు వెళ్లిపోయారు.  మరింత సమాచారం వీడియోలో చూడండి.

అఖిలపక్ష మీటింగ్ ప్రారంభం..

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. భేటీకి ఆహ్వనం అందుకున్న 7 పార్టీల నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులు హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశంలో పార్టీల అభిప్రాయాలను కేసీఆర్‌ తెలుసుకుంటున్నారు. 

15:40 - August 20, 2016

నెల్లూరు :  ఒలింపిక్స్‌లో రజతపథకం సాధించిన పీవీ సింధూకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. నెల్లూరులోని నారాయణ మెడికల్‌ కాలేజీలో విద్యార్థులు, సిబ్బంది సంబరాలు జరుపుకున్నారు. సింధూ సోదరి దివ్య కేక్‌కట్‌చేసి విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. భవిష్యత్తులో సింధూ మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్థులు ఆకాంక్షించారు.  
కండీషన్ పెట్టలేదు..
ఈ సందర్భంగా సింధూ సోదరి మీడియాతో మాట్లాడింది. గోపీ చంద్ అకాడెమీ నుండే సింధూ ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభమయ్యింది. మేము ఏ రంగాన్ని ఎంచుకోవాలనే నిర్ణయంలో మా పేరెంట్స్ కండిషన్స్ పెట్టలేదు. చెల్లి (సింధూ) బ్యాడ్మింటన్ ను కెరీర్ గా ఎంచుకోగానే ఓకే చెప్పారు. సింధూ, ఆమె కోచ్ గోపీ చంద్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రాక్టీస్ కోసం సింధూ చాలా సాక్రిఫైజ్ చేసింది. మార్నింగ్ 4గం.ల నుండి రాత్రి 7 గం.ల వరకు ప్రాక్టీస్ చేసేది. తనకు రెస్ట్ తీసుకునే టైం మాత్రమే ఉండేది. సింధూ డెడికేషన్ ఫలితమే ఒలింపిక్ మెడల్.. అంటూ సింధూ సిస్టర్ దివ్య చెప్పుకొచ్చారు. 

15:39 - August 20, 2016
15:38 - August 20, 2016
15:34 - August 20, 2016

ఢిల్లీ : రియో ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన క్రీడాకారిణులకు ఢిల్లీ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్‌కు నగదు పురస్కారం ప్రకటించారు. బ్యాండ్మింటన్‌లో గెలిచి రజతం సాధించిన పీవీ సింధుకు 2 కోట్లు, రెజ్లింగ్‌లో కాంస్యం గెలిచిన సాక్షి మాలిక్‌కు కోటి రూపాయలు ఇవ్వనున్నట్టు కేజ్రీవాల్‌ ప్రకటించారు. అంతే కాకుండా ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న సాక్షి మాలిక్‌ తండ్రికి ప్రమోషన్ ఇస్తున్నట్టు వెల్లడించారు. 

15:14 - August 20, 2016

హైదరాబాద్‌ : చిన్నారులపై దాడులు నానాటికి పెరిగిపోతున్నాయి. చక్కగా చదువులు నేర్పించాల్సిన బడి కూడా ఈ దాడులకు నిత్యం నిలయాలౌతున్నాయి. తాజాగా అల్వాల్‌లో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. బచ్‌ఫన్‌ స్కూల్‌లో ఓ టీచర్‌ శివాలెత్తింది. మూడేళ్ల చిన్నారిని కిరాతకంగా చితకబాదింది. సరిగ్గా చదవట్లేదని వాతలు తేలేలా కొట్టింది. ఇంటికి చేరుకున్న చిన్నారి తల్లిదండ్రులకు విషయం తెలపటంతో.. స్థానిక ఆసుపత్రిలో బాలికకు చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో చిన్నారి తల్లిదండ్రులు స్కూల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. టీచర్‌ నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కాసేపట్లో అఖిలపక్ష సమావేశం..

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగునుంది. ఇప్పటికే ఏడు పార్టీలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించారు. అన్ని పార్టీలకు జిల్లాలకు సంబంధించిన ప్రతిపాదనలను సీల్డ్‌ కవర్‌లో పంపించినట్లు తెలుస్తోంది. అఖిలపక్ష సమావేశంలో పార్టీల అభిప్రాయాలను కేసీఆర్‌ తెలుసుకోనున్నారు. 

15:09 - August 20, 2016

హైదరాబాద్ : ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధుకు భారీ నజరానాలు ప్రకటించింది. సింధుకు 3 కోట్ల రూపాయలు, గ్రూప్‌-1 ఉద్యోగం, అమరావతిలో వెయ్యి గజాల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే సింధు కోచ్‌ గోపీచంద్‌కు 50లక్షల రూపాయలు.. గోపీచంద్‌ అకాడమీ ఏర్పాటుకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే హైదరాబాద్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని..కొత్త ఐటీ పాలసీ తీసుకురావాలని కేబినెట్‌లో  నిర్ణయించారు.

సింధూకు నజరానా..

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధూకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ భారీ నజరానా ప్రకటించింది. మూడు కోట్ల నగదుతో పాటు.. రాజధానిలో వెయ్యి గజాల స్థలం, గ్రూప్‌-1 ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే కోచ్‌ గోపిచంద్‌కు 50 లక్షల నగదు బహుమతి ఇవ్వాలని కూడా నిర్ణయించారు. మరిన్ని వివరాలు వీడియోలో చూడండి.

13:45 - August 20, 2016

శుక్రవారం రెండు సినిమాలు విడుదలయ్యాయి. 'చుట్టాలబ్బాయి'గా వస్తున్న 'ఆది' సినిమాతో పాటు.. 'ఆటాడుకుందాం..రా' అని ఇన్వైట్ చేస్తున్న 'సుశాంత్' సినిమా కూడా శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయ్యాయి. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా ఓ హిట్ కొడదామని ట్రై చేస్తున్నాడు సుశాంత్ అందుకే.. ఆటాడుకుందాం రా అంటూ మంచి దూకుడు గా ఆడియన్స్ ముందుకొచ్చాడు. 'సుశాంత్' ప్రేక్షకులను అలరించాడా ? లేదా ? అనేది రివ్యూలో చూడండి. 

13:35 - August 20, 2016

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చిస్తున్నారు. వర్షాకాల సమావేశాలు ఎప్పుడు..ఎక్కడ నిర్వహించాలనే దానిపై కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆరో తేదీ నుండి వర్షాకాల సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించాలని, వారం రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. రియో ఒలింపిక్స్ లో భారత దేశానికి రజత పతకం తీసుకొచ్చిన తెలుగుతేజం పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం అభినందనలు తెలిపింది. సింధు..గోపిచంద్ అకాడమీకి భూ కేటాయింపు ఇచ్చి ప్రోత్సాహించే మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. విజయవాడలో పుల్లెల గోపిచంద్ కు ఒక స్థలం కేటాయించి క్రీడాకారులను ప్రోత్సాహించాలని కోరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పుష్కరాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేయడం జరిగిందని కేబినెట్ లో బాబు పేర్కొన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు భేటీ అనంతరం తెలువనున్నాయి. 

13:30 - August 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కొత్త జిల్లాల ప్రతిపాదనలపై కాంగ్రెస్ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గద్వాల జిల్లా కోసం డీకే అరుణ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాసేపట్లో అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా డీకే అరుణతో టెన్ టివి మాట్లాడింది. ప్రభుత్వం ఇచ్చిన లిస్టులో గద్వాల పేరు లేదని, గద్వాలకు ఆనుకుని ఉన్న కొన్ని మండలాలను వనపర్తిలో కలుపుతూ చూపిస్తున్నారని తెలిపారు. ఇది సమంజసం కాదని, తాము పూర్తిగా వ్యతిరేకమన్నారు. గద్వాల జిల్లా కావడానికి అన్ని అర్హతలున్నాయని, వనపర్తి దగ్గరకు అందరం పోవాలంటే ఎలా అని ప్రశ్నించారు. రాయచూరు, కర్నూలు, కర్నాటకకు వెళ్లిపోవాలని చెబితే సంతోషంగా వెళ్లిపోతామని తెలిపారు. గద్వాల జిల్లాగా ప్రకటించకపోతే ఆమరణ నిరహార దీక్షకు కూర్చొంటానని డీకే అరుణ హెచ్చరించారు. 

13:26 - August 20, 2016

హైదరాబాద్ : జిల్లాల పునర్విభజన స్వాగతించదగిందని, అయినా విభజనకు ఒక ప్రాతిపదిక లేదని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ తరపున చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకటరెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా చాడతో టెన్ టివి ముచ్చటించింది. శాస్త్రీయబద్ధంగా ప్రాతిపదిక ఉండాలని, ప్రభుత్వం పేర్కొంటున్న ప్రతిపాదనలకు ఒక దానితో ఒకదానికి సంబంధం లేదన్నారు. ఎన్ని జిల్లాలు చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఎక్స్ పర్ట్ కమిటీ వేసి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని అనంతరం ప్రతిపాదనలు పెడితే బాగుంటుందన్నారు. ఒక నియోజకవర్గాన్ని మూడు జిల్లాలుగా విభజిస్తున్నారని, పది లక్షల జనాభాకు తగ్గకుండా ఉండాలన్నారు. ప్రభుత్వం పంపించిన నివేదికలో ఏ మండలంలో ఎంత జనాభా ఉందనే దానిపై లెక్క లేదని, అస్పష్టంగా ఉందని చాడ వెంకట్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఆమరణ దీక్ష చేపడుతా - డీకే అరుణ...

హైదరాబాద్ : ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలో గద్వాల జిల్లా పేరు లేకపోవడం పట్ల డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్వాలను జిల్లా చేయాలంటూ తాను ఆమరణ దీక్ష చేస్తానని టెన్ టివికి తెలిపారు. 

13:17 - August 20, 2016

హైదరాబాద్ : కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న ప్రతిపాదనలపై అఖిలపక్షం అభిప్రాయాలు తెలుసుకోనుంది. పాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్య పెంచడం వల్ల ప్రజలకు ప్రభుత్వం మరింత దగ్గరగా వచ్చినట్లవుతుందని ప్రభుత్వం తన అజెండాలో స్పష్టం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల జిల్లా కేంద్రాలు సరికొత్త అభివృద్ధి కేంద్రాలుగా మారతాయని, మౌలిక సదుపాయాలు, వ్యాపారావకాశాలు పెరిగి ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయని చెబుతోంది... చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల అభివృద్దిలో సమతుల్యత పాటించడం సాధ్యమవుతుందని అఖిలపక్షం అజెండాలో ప్రభుత్వం వివరించింది. జిల్లాల ప్రతిపాదనలపై ఈ నెల 20న అఖిల పక్షం ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు సంబంధించిన వివరాలతో అన్ని పార్టీలకు లేఖలు రాసింది. ఏ జిల్లా పరిధిలో ఏయే మండలాలు ఉంటాయనే వివరాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక ఉన్న అనివార్య కారణాలను కూడా వివరించింది. ప్రభుత్వ ప్రతిపాదనలపై విపక్ష పార్టీలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి. నిన్న మొన్నటి ఊహాగానాలతో మొదలైన విభజన అంశాలు..ప్రభుత్వం ముసాయిదాను విడుదల చేయడంతో విమర్శలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీ నేతలు కూడా తమ సొంత డిమాండ్లను వినిపిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం తాను వేసుకున్న స్కెచ్ ప్రకారమే ముందుడుగు వేయాలనే అభిప్రాయంతో ఉంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:07 - August 20, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ భేటీ జరగనుంది. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ నేతలు మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ ఆలీ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో షబ్బీర్ ఆలీ మాట్లాడారు. ఏ ప్రాతిపదికన జిల్లాలు విభజిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం తరువాత తమ నిర్ణయం తీసుకుంటామన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగిరెడ్డి పేట మండలం మెదక్ కు వెళుతోందని తెలిపారు. ఇలా జరగడం కరెక్టు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

పవన్ కు..తనకు మధ్య స్నేహబంధం - కుమార స్వామి..

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో జరిపిన భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ కీలక నేత కుమారస్వామి వెల్లడించారు. చాలా కాలం నుండి తమ మధ్య స్నేహం ఉందని, తన కుమారుడి సినిమా రిలీజ్ సందర్భంగా ఆశీర్వాదం కోసమే పవన్ ను కలవడం జరిగిందని కుమార స్వామి వెల్లడించారు. 

కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం..

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్ లోనే జరపాలని నిర్ణయం తీసుకున్నారు. 

సెప్టెంబర్ 6 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

విజయవాడ : సెప్టెంబర్ 6 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి కూడా సమావేశాలు హైదరాబాద్ లోనే జరగనున్నాయి. 

హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ప్రతిపాదిత మండలాలు...

హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ప్రతిపాదిత మండలాలు : అంబర్ పేట, ఆసీఫ్ నగర్, బహదూర్ పురా, బండ్లగూడ, చార్మినార్, గోల్కొండ, హిమాయత్ నగర్, నాంపల్లి, సైదాబాద్, మెహదీపట్నం (కొత్త మండలం), కంచన్ బాగ్ (కొత్త మండలం),
సికింద్రాబాద్ డివిజన్ : యూసుఫ్ గూడ (కొత్త మండలం), ఖైరతాబాద్, ముషిరాబాద్, సికింద్రాబాద్, మారేడ్ పల్లి, షేక్ పేట, తిర్మలగిరి.

ఇంద్రకీలాద్రిపై పెరుగుతున్న భక్తుల రద్దీ..

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుతోంది. ఉదయం 11గంటల వరకు అమ్మవారిని 88వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 

జోగులాంబను దర్శించుకున్న గవర్నర్ దంపతులు...

మహబూబ్ నగర్ : ఆలంపూర్ జోగులాంబను గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. జిల్లా ఆలంపూర్ లోని గొందిమళ్ల పుష్కర ఘాట్ లో ఉదయం గవర్నర్ నరసింహన్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. 

నయీం ముఠాతో మోహన్ రెడ్డికి సంబంధాలు - బాధితులు...

కరీంనగర్ : మాజీ ఎస్ఐ మోహన్ రెడ్డి బాధితులు ప్రెస్ మీట్ నిర్వహించారు. మోహన్ రెడ్డికి నయీం ముఠాతో సంబంధాలున్నాయని, నయీం డైరీలో కరీంనగర్ హెడ్ కానిస్టేబుల్ అని ఉండడమే నిదర్శనమన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తే వారి బినామీలు బయటపడుతాయని బాధితులు తెలిపారు. 

12:25 - August 20, 2016

గుంటూరు : కృష్ణా నది పరివాహక ప్రాంతాలు పరవశించి పోతున్నాయి. గుంటూరు జిల్లాలో పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 9వ రోజు ఘాట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. మూడు రోజులు మాత్రమే ఉండడంతో పుష్కర స్నానం చేయడానికి భక్తులు పోటెత్తుతున్నార. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం తాలయి వద్దనున్న శైవక్షేత్రం మహాఘాట్ కు భక్తులు తరలివస్తున్నారు. ఇక్కడ పుష్కర స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని పలువురు భక్తులు పేర్కొన్నారు. రాజధాని ప్రాంతమైన ఇక్కడ ఏర్పాట్లు బాగా చేశారని తెలిపారు. రాబోయే మూడు రోజులకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, అందువల్ల తాము వారికి సహాయం చేయడానికి మరింత బృందాలు ఇక్కడకు వస్తున్నాయని ఎన్ సిసి కమాండెంట్ పేర్కొన్నారు. ఇంకా విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

12:09 - August 20, 2016

మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత..

హైద‌రాబాద్‌ : మినిస్ట‌ర్స్ క్వార్టర్స్ వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. తమ కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యుల‌రైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఎన్ఎం గ్రామస్థాయి మ‌హిళా ఉద్యోగులు ఆందోళ‌నకు దిగారు. మినిస్ట‌ర్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లడానికి ప్ర‌యత్నించిన వారిని పోలీసులు గేటు వ‌ద్ద అడ్డుకున్నారు. దీంతో వారు గేటు ముందే బైఠాయించి త‌మ నిర‌స‌న తెలుపుతున్నారు. త

హైదరాబాద్ జేడీఎస్ నేత కుమార స్వామి

హైదరాబాదు : కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ కీలక నేత కుమారస్వామి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈయన సినీ నటుడు పవన్ కల్యాణ్ ను కలువనున్నారని వార్తలు వస్తున్నాయి. 

11:53 - August 20, 2016

జెట్ స్పీడ్ తో సినిమాలు చేసే మాస్ రాజా రవితేజ ఈ ఎడాదిలో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ ఎడాదిని వదిలేస్తున్న ఈ స్టార్ హీరో వచ్చే ఎడాదిలో మాత్రం ఈ ఎడాది లోటును భర్తీ చేయాలని భావిస్తున్నాడట. వచ్చే ఎడాది మాస్ రాజా చేయనున్న ఆ సినిమాలేంటో చూడండి. స్పీడ్ అంటే రవితేజ. రవితేజ అంటే స్పీడ్ అన్నట్లుంది సినిమాల విషయంలో ఆయన శైలి. మాస్ రాజా ఎడాదికి రెండు మూడు సినిమాలు తగ్గకుండా రిలీజ్ చేస్తాడు. కానీ ఈ ఎడాది ఆడియన్స్ కి రవితేజ నిరాశనే మిగిల్చాడు. గత ఎడాది మాస్ రాజా చేసిన కిక్ 2 డిజాస్టర్ అయిన్నప్పటకి బెంగాల్ టైగర్ తో ఆడియన్స్ ని బాగానే ఎంటర్ టైన్ చేశాడు.

పలు సినిమాల డిజాస్టర్..
కిక్ 2 డిజాస్టర్ కావడం, బెంగాల్ టైగర్ సినిమా కూడా సూపర్ హిట్టు రేంజ్ ని అందుకోకపోవడంతో మాస్ రాజా స్టోరీ విషయంలో శ్రద్ద పెట్టాడు. ఈ క్రమంలో ఇటీవల ఆయన విన్న ఏ స్టోరీ కూడా పెద్దగా నచ్చలేదట. దీంతో 2016లో రవితేజ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ఈ ఎడాదిని ఖాళీగా వదిలేస్తున్న మాస్ రాజా వచ్చే ఎడాది కోసం మాత్రం ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

మరో సినిమాకు రెడీ...
రవితేజ, బాబీ దర్శకత్వంలో మరో సినిమాకి రెడీ అయినట్లు సమాచారం. ఆల్ రెడీ వీరు పవర్ సినిమాతో పర్వాలేదనించారు.ఈ నమ్మకంతోనే సర్ధార్ డిజాస్టర్ అయినప్పటికి మాస్ రాజా, దర్శకుడు బాబీ మరో అవకాశం ఇచ్చినట్లు వినిపిస్తోంది. అదే విధంగా విక్రమ్, దీపక్ ఇద్దరు దర్శకులు వినిపించిన కథకి కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి వెళ్లనున్నాయి. అంతేకాదు రెండు నెలల గ్యాప్ లోనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు రవితేజ.

వెద్యుల ఒకరోజు సమ్మె..

బీహార్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు స్టేట్ హెల్త్ సొసైటీ ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చింది. బీహార్ రాష్ట్రంలోని వైద్యులు సమ్మె చేపట్టనున్నారు. అత్యవసర పరిస్థితిని మినహాయించారు. తరచుగా దాడులు జరుగుతుండడంపై వారు సమ్మె చేపట్టారు. 

డీఎన్ఏ ఇండెక్స్ సిస్టమ్ ను ప్రారంభించిన సీఎం బాబు..

విజయవాడ : నేరగాళ్ల వివరాలకు సంబంధించిన డీఎన్ఏ ఇండెక్స్ సిస్టమ్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం...

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కృష్ణా పుష్కరాలు, ఇటీవలే కేంద్రం ప్రకటించిన ఆర్థిక సాయం..తదితర అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. 

11:42 - August 20, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలలో భక్తులతో పాటు దొంగలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల దొంగల గ్యాంగ్ లతో పాటు పలు అంతరాష్ట్ర జేబు దొంగల ముఠా గ్యాంగ్ లు పుష్కర భక్తులను హఢలెత్తిస్తున్నారు. వీరందరినీ టెక్నాలజీ సాయంతో బెజవాడ పోలీసులు ఆట కట్టించారు. ఏకంగా 20 గ్యాంగులకు చెందిన 115 మంది దొంగలను పట్టుకున్నట్లు నగర కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. జేబులు కొట్టేయడం..ఛైన్ లను లాక్కోవడం..కెమికల్స్ వాడి..ఇతరత్రా ఉపయోగిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
హోం గార్డు రూపంలో..పూజారీ రూపంలో..ఇలా వివిధ రకాల రూపాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. పట్టుబడిన వారిలో మహిళలు అధికంగా ఉండడం గమనార్హం. వాళ్లు ఎలా ఉన్నారు ? ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:33 - August 20, 2016

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితం..ఇంట్లో..బయట వర్క్ లతో మహిళలు అలసిపోతున్నారు. దీనితో వారు ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ పెట్టడం లేదు. పనిచేయడానికి టైం సరిపోవడం లేదు..ఇంక వ్యాయామం ఎక్కడ చేయాలి ? అని పలువురు మహిళలు పేర్కొంటుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు..మానసిక ఆరోగ్యం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. మరి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని టిప్స్ చూద్దాం..
రోజూ కొద్దిసేపైనా వ్యాయామం చేయాలి. సరి సమాన బరువు కలిగి, ఎంతో ఉపయోగకరమైన పరికరాలతోనే వ్యాయామం చేయాలి.
పాల ఉత్పత్తులు..వెన్న..చాక్లెట్లు..వంటి పదార్థాలు లేని ఆహారం తీసుకోవాలి.
అధిక కొవ్వు..క్యాలరీలతో కూడిన ఆహారానికి దూరంగా ఉంటే మంచిది.
ఎక్కువ శాతం నీటిని సేవించాలి. రోజుకు కనీసం ఆరు..ఎనిమిది లీటర్ల నీరు తీసుకోవాలి.
ఆర్ధిక సమస్యలు మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. అధికంగా ఖర్చు పెట్టడం మంచిది కాదు.
సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొని అమూల్యమైన మానసిక ఆనందాన్ని సొంతం చేసుకోండి.
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా ఒత్తిళ్ళకు గుడ్‌బై చెప్పండి.
 

11:25 - August 20, 2016

నల్గొండ : ఇటీవలే గ్రే హౌండ్స్ బలగాలు జరిపిన కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ నయీం హతమైన కేసులో సిట్ బృందం విచారిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని సిట్ బృందం భావిస్తోంది. ఇప్పటికే పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. భారీ ఎత్తున డబ్బు..పలు నివాసాలను సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. నయీం మూలాలు నల్గొండ జిల్లాలో ఉన్నాయని సిట్ బృందం గుర్తించింది. దీనితో శనివారం మిర్యాలగూడకు సిట్ బృందం చేరుకుంది. కాసేపటి క్రితం నయీం అత్తను, బావమరిదిని సిట్ విచారిస్తోంది. విచారణ సమయంలో ఎవరినీ లోనికి రానివ్వడం లేదు. నయీం అత్త సుల్తానా బేగం బ్యాంకు లాకర్ లో రూ. 1.3 లక్షలు, 20 తులాల బంగారం ఉన్నట్లు సిట్ గుర్తించింది. సుల్తానా బేగం ఏటితండాలో 9 నెలల చిన్నారిని కొనుగోలు చేసి నయీంకు అప్పగించినట్లు సిట్ గుర్తించింది. అంతేగాకుండా పలువురు రాజకీయ నేతలు, పోలీసులను సిట్ బృందం విచారించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం విషయాలు తెలిసే అవకాశం ఉంది.

11:13 - August 20, 2016
11:13 - August 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరపనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ భేటీ కొనసాగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సమావేశం జరగనుంది. ప్రతిపక్షాలకు ఇచ్చే సమయం కూడా ప్రభుత్వం నిర్ణయించడం సరికాదని విపక్షాలు పేర్కొంటున్నాయి. టిడిపి నుండి ఎల్.రమణ, రావుల, సీపీఎం నుండి తమ్మినేని, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నుండి చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకటరెడ్డి, కాంగ్రెస్ నుండి షబ్బీర్ ఆలీ, భట్టీ విక్రమార్కలు అఖిలపక్ష సమావేశానికి హాజరు కానున్నారు. వైసీపీని మాత్రం ఆహ్వానించలేదు. దీనికి కారణాలు తెలియరాలేదు.

అభిప్రాయాలను తెలుసుకోనున్న కేసీఆర్...
కొత్త జిల్లాల ప్రతిపాదనలపై అఖిలపక్ష నేతల అభిప్రాయాలను సీఎం కేసీఆర్ తెలుసుకోనున్నారు. తొలుత పార్టీలకు ప్రభుత్వం పంపించిన ఆహ్వానంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఏజెండా లేకుండానే విపక్షాలను ఎలా పిలుస్తారంటూ విమర్శలు గుప్పించాయి. దీనితో సీల్డ్ కవర్ లో జిల్లాల ప్రతిపాదనలు పంపించినట్లు తెలుస్తోంది. తమ పార్టీలకు చెందిన నేతలు సమావేశానికి హాజరవుతారని, నేతల పేర్లను ప్రభుత్వానికి పంపించింది.

నిర్ణయాలపై అభ్యంతరాలు..
రెవెన్యూ, మండలాల ఏర్పాటు ప్రతిపాదనలపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనగాం జిల్లా ఏర్పాటు చేయాలని, జోగులాంబ పేరిట జిల్లా ఏర్పాటు చేయాలని అక్కడ ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ ను యదావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన 27 జిల్లాలో ఒకటి..రెండు జిల్లాలు తగ్గే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో భేటీ అనంతరం తెలుస్తుంది. 

సింధు..సాక్షి మాలిక్ కు ఢిల్లీ సర్కార్ నజరానా..

ఢిల్లీ : ఒలింపిక్ లో పతకాలు సాధించిన సాక్షి మాలిక్..సింధు లకు ఢిల్లీ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. సాక్షి మాలిక్ కు రూ. కోటి..సింధుకు రూ.2 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

మిర్యాలగూడలో సిట్ బృందం విచారణ..

నల్గొండ : మిర్యాలగూడలో సిట్ బృందం విచారిస్తోంది. నయీం అత్తను, బావమరిదిని సిట్ విచారించింది. నయీం అత్త సుల్తానా బేగం బ్యాంకు లాకర్ లో రూ. 1.3 లక్షలు, 20 తులాల బంగారం ఉన్నట్లు సిట్ గుర్తించింది. సుల్తానా బేగం ఏటితండాలో 9 నెలల చిన్నారిని కొనుగోలు చేసి నయీంకు అప్పగించినట్లు సిట్ గుర్తించింది. 

10:28 - August 20, 2016
10:27 - August 20, 2016
10:24 - August 20, 2016

కరీంనగర్ : సిరిసిల్లనుజిల్లాగా ప్రకటించాలని కోరుతూ జిల్లా సాధన సమితి చేస్తున్న ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆమరణ నిరహార దీక్షలతో పాటు మంత్రి కేటీఆర్ గృహాన్ని ముట్టడించారు. న్యాయవాదులు పోలీసులను ఘెరావ్ చేస్తూ తమ నిరసనలను తెలిపారు. పలు స్వచ్ఛంద సంస్థలు, అఖిలపక్షం నాయకులు పట్టణ బంద్ కు చేపట్టారు. బస్ డిపోల వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. వెంటనే సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 'కేటీఆర్ గో బ్యాక్' అనే నినాదాలు రాశారు. సిరిసిల్లను జిల్లాగా చేస్తామని చెప్పి వెనక్కి వెళుతున్నారని విమర్శించారు. ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నా పట్టించుకోలేదని ఇది మంచి పద్ధతి కాదన్నారు. సిరిసిల్ల జిల్లాగా ప్రకటించకపోతే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. 

10:18 - August 20, 2016

హైదరాబాద్ : జిల్లాల పునర్విభజన అంశంలో తమ వాదనను వినిపించేందుకు టి-టిడిపి సిద్దమైంది. కేవలం రాజకీయ కోణంలో కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా జిల్లాల పునర్విభజన జరగాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ జరిగే అఖిల పక్ష సమావేశానికి టి-టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణతోపాటు, పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డిలు హాజరు కానున్నారు.

హడావిడిగా కొత్త జిల్లాల ప్రక్రియ..
తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పు పట్టింది టి-టిడిపి. తాము అధికారంలోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 24కు పెంచుతామని తమ మేనిఫెస్టోలోనే పేర్కొన్న టిఆర్ఎస్..అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడిచిన తర్వాత హాడావుడిగా ప్రక్రియ ప్రారంభించిందని అన్నారు. రెండు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం తయారు చేసిన ప్రపోజల్స్‌ ను ఇతర పార్టీలకు పంపి, వాళ్ళ అభిప్రాయాలు చెప్పమనటం ఆశ్చర్యంగా వుందని టి-టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. కేవలం రాజకీయ పరమైన అంశాలతోనే జిల్లాలను పునర్విభజన చేయకుండా, ప్రజల ఆకాంక్షలను పరిశీలించాలని కోరారు. అయితే గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, జిల్లాల పునర్విభజన చేద్దామని చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్, ఇప్పుడు హడావుడిగా ఎందుకు ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారో ప్రజలకు తెలియచేయాలని అన్నారు.

డిమాండ్లను ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తాం- రావుల..
జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఇప్పటికే అనేక డిమాండ్లు వున్నాయని, వాటన్నింటిని అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ స్థానాలకు అనుగుణంగా జిల్లాలను రూపొందిస్తే బాగుంటుందని టిడిపి భావిస్తోంది. అయితే అసెంబ్లీ స్థానాల డిలిమిటేషన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా టిడిపి నేతలు కోరుతున్నారు.

10:11 - August 20, 2016

విజయవాడ : కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. సమావేశంలో పాల్గొనేందుకు మంత్రులు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో సమావేశం జరగనుంది. రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి సహాయం చేయడం లేదని, వత్తిడి తేవాలని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా నిధులు రాబట్టుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై కేబినెట్ లో చర్చించనున్నారు. వచ్చే పాలన కాలంలో వేగం పెంచాలని, ప్రత్యేక హోదా, కొత్తగా వచ్చే పరిశ్రమలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం చర్చించనుంది.
కృష్ణా పుష్కరాలు..
మరోవైపు జరుగుతున్న కృష్ణా పుష్కరాలపై సమీక్షించనున్నారు. ప్రజల నుండి వస్తున్న ప్రశంసలు..విమర్శలపై సమీక్షించనున్నారు. అంతేగాకుండా కృష్ణా పుష్కరాలపై ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులపై విపక్షాలు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. పుష్కరాలకు వెచ్చించిన డబ్బు ప్రాజెక్టులకు ఉపయోగిస్తే బాగుండేదని పేర్కొంటున్నాయి. పుష్కరాలకు ప్రభుత్వం అతిగా ప్రచారం నిర్వహించడం వల్ల పాలన పడకేసిందని, ఎక్కడి ఫైళ్లు అక్కడే ఉన్నాయని ఆరోపిస్తున్నారు. మరి ఏ అంశాలపై చర్చించారు ? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనేది కాసేపట్లో తెలుస్తుంది. 

10:00 - August 20, 2016

ఆంధ్రప్రదేశ్ లో హాట్ ప్రాపర్టీకి కేంద్రాలైన అమరావతి..విజయవాడ..గుంటూరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ స్థితిగతులు ఎలా ఉన్నాయి ? ఆ ప్రాంతాల్లో హౌసింగ్..ఇతరత్రా ఎలాంటి డిమాండ్ ఉంది ? దీనిపై బిల్డర్లు ఏమంటున్నారో ? ఎలాంటి సలహాలు..సూచనలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి.
దీనితో పాటు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం...మార్కెట్ ధరలు..ఇతర సమాచారం కూడా చూడవచ్చు...

09:55 - August 20, 2016

ప్రపంచంలో ఏ ప్రాంతంలో చూసినా జనాభా పె రుగుతూనే ఉంది. జనాభాకు కావాల్సింది కూడు..గూడు..బట్ట..ముఖ్యంగా తలదాచుకోవడానికి తమకంటూ గూడు కావాలి. అల్పాదాయ..మధ్యతరగతి..సంపన్న వర్గాలు..ఇలా ఎవరైనా సరే వారికంటూ ఓ గృహం ఉండాల్సిందే. అది అద్దె ఇల్లు అయినా..వసతి గృహమైనా..సొంతిళ్లు అయినా అంతా నాలుగు గోడల మధ్య నివాసం ఉండాలి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల కంప్లీట్ రియల్ ఎస్టేట్ సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:53 - August 20, 2016

కుక్కల దాడిలో వృద్ధురాలి మృతి..

కేరళ : పులువిల ప్రాంతంలో 50 వీధి కుక్కలు దాడి చేయడంతో 65 సంవత్సరాల వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మరో మహిళకు గాయాలయ్యాయి. ఈమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

బాలాజీనగర్ లో దొంగల బీభత్సం..

హైదరాబాద్ : కూకట్ పల్లి బాలాజీనగర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు ఇళ్లలో చోరీలు చేశారు. మూడు లక్షల నగదు, అరకిలో బంగారాన్ని అపహరించారు. అడ్డుగా వచ్చిన ఓ మహిళపై దొంగలు దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. 

వీహెచ్ ఆధ్వర్యంలో సద్భావన్ రన్...

హైదరాబాద్ : రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మాజీ ఎంపీ వీహెచ్ ఆధ్వర్యంలో సద్భావన్ రన్ నిర్వహించారు. ఈ రన్ కు మల్లు, భట్టి విక్రమార్క, షబ్బీర్, దానం నాగేందర్, బలరాం నాయక్ తదితరులు హాజరయ్యారు. 

కలికివాయిలో ప్రమాదం..

ప్రకాశం : సింగరాయకొండ (మం) కలికివాయిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి. వీరిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుండి తిరుపతికి వెళుతోంది. 

ఆర్జేడీ నేత హత్య..

బీహార్ : ఆర్జేడీ నేత వినోద్ యాదవ్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. భాగల్ పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

09:33 - August 20, 2016

ప్రాంతం

ఫ్లాట్ ధర(చ.అ)

ఫ్లాట్ ధర(చ.గ)

సనత్ నగర్

S.Rనగర్

శ్రీనగర్ కాలనీ

సోమజీగూడ

అమీర్ పేట్

3800-4300

5300-5800

6200-6800

6300-6700

4500-4800

42,000-48,000

52,000-64,000

65,000-72,000

63,000-70,000

54,000-60,000

హైదరాబాద్ వివిధ ప్రాంతాల ఇంటి అద్దె వివరాలు.

ఏరియా

రెంట్

బేగంపేట్ 
బంజారాహిల్స్
కూకట్ పల్లి
కొండాపూర్
తెల్లాపూర్
గచ్చిబౌలి

18,000-25,000
25,000-40,000
15,000-20,000
12,000-20,000
8,000-15,000
12,000-25,000

09:17 - August 20, 2016

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో 9వ రోజు కృష్ణా పుష్కరాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. వీకెండ్ కావడం..మూడు రోజులే సమయం ఉండంతో భక్తులు పోటెత్తుతున్నారు. పలు ఘాట్ లలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కృష్ణవేణి, పద్మావతి ఘాట్ ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. పుణ్యస్నానాలు చేసిన భక్తులు సమీపంలో ఉన్న ఆలయాలకు వెళుతున్నారు. దీనితో శనీశ్వర స్వామి వద్ద భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుండి ఇప్పటి వరకు రెండు లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. భక్తుల రద్దీ ఉండడంతో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. దుర్గాఘాట్ ను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుండి విజయవాడలోని 13 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:09 - August 20, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ క్లైమాక్స్ కు చేరింది. ఈ అంశంపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకునేందుకు ప్రభుత్వం శనివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసింది. ముందునుంచి జిల్లాల విభజనతీరును తప్పుబడుతున్న కాంగ్రెస్‌... ఈ సమావేశం వేదికగా తమ పలు సూచనల్ని చేసేందుకు రెడీ అయింది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై శనివారం అఖిలపక్ష సమావేశం జరగబోతోంది.. మొదటినుంచీ జిల్లా విభజనతీరును తప్పుబడుతున్న కాంగ్రెస్‌ ఈ సమావేశంలో తమ వాణిని గట్టిగా వినిపించేందుకు సిద్ధమైంది.. సర్కారుతీరును ఎండగడుతూ ప్రధానప్రతిపక్షంగా పలు సూచనలు చేయాలని హస్తం నేతలు నిర్ణయించారు..

మొక్కుబడి అన్న కాంగ్రెస్..
కేవలం విపక్షాల డిమాండ్‌తో మొక్కుబడిగా అఖిలపక్షం ఏర్పాటు చేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.. ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు సాగుతోందని మండిపడుతోంది.. జిల్లాల విభజన శాస్త్రీయబద్దంగా జరగాలని సూచిస్తోంది.. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటీ వేయాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేస్తోంది.. రవాణా, మౌళిక వసతులు, భౌగోళికంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని హస్తం పార్టీ కోరుతోంది.. పార్లమెంట్‌ పరిధిని జిల్లాగా చేయాలని.. ఇలా వీలుకాకపోతే నియోజకవర్గం మొత్తం ఒక జిల్లా పరిధిలో ఉండేలా చూడాలని అభిప్రాయపడుతోంది.. రాజకీయ కోణంలోకాకుండా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జిల్లాల విభజన జరగాలని సూచిస్తోంది... ఈ విషయాల్ని సవివరంగా సమావేశంలో చెప్పేందుకు హస్తం పార్టీ రెడీ అయింది.. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ తరపున పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క హాజరవుతున్నారు.. మరోవైపు ఇప్పటికే జిల్లాలపై ఓ క్లారిటీకివచ్చిన అధికార పార్టీ... విపక్షాలు ఇచ్చే సూచనల్ని పట్టించుకుంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నరేంద్ర దబోల్కర్ కుటుంబ సభ్యుల ర్యాలీ..

పూణె : ముష్కరులు జరిపిన దాడిలో మృతి చెందిన నరేంద్ర దబోల్కర్ కుటుంబసభ్యులు నిరసన ర్యాలీ నిర్వహించారు. పూణెలో నిర్వహించిన ఈ ర్యాలీలో దబోల్కర్ అభిమానులు కూడా పాల్గొన్నారు. మూఢనమ్మకాలు, దురాచారాల నిర్మూలనకు ప్రముఖ హేతువాది, వైద్యుడు, జర్నలిస్టు నరేంద్ర దబోల్కర్ రాజీలేని పోరాటం చేసిన సంగతి తెలిసిందే. 

డేంజర్ మార్క్ దాటిన గంగ నది..

ఉత్తర్ ప్రదేశ్ : గంగ నది డేంజర్ మార్క్ దాటింది. దీనితో అలహా బాద్ ప్రాంతంలోని నివాసిత ప్రాంతాల్లోకి నీరు పోటెత్తుతుంది. పలు కాలనీలు జలమయమయ్యాయి. 

08:30 - August 20, 2016

చెల్లికి ఓ అన్న వినూత్న కానుక..

జార్ఖండ్ : రామ్ గర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తన చెల్లికి వినూత్న బహుమతి అందించాడు. రక్షా బంధన్ సందర్భంగా టాయిలెట్ ను నిర్మించి తన చెల్లికి అందించాడు. 

08:22 - August 20, 2016

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో 9వ రోజు కృష్ణ పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వీకెండ్ కావడం..మూడు రోజులు మాత్రమే ఉండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. శనివారం ఉదయం నుండి కృష్ణవేణి పుష్కర ఘాట్ కు భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం..ఆదివారం కావడంతో భక్తులు అధికంగా తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణవేణి ఘాట్ వద్ద ఓ మహిళ కాలు జారిపడిపోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సెలవు దినం కావడంతో 30-40 లక్షల మంది భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనితో ప్రత్యేకంగా ఆర్టీసీ, రైళ్లు నడపాలని అధికారులు నిర్ణయించారు. కృష్ణవేణి ఘాట్ కు సంబంధించిన సమాచారం ఇంకా తెలుసుకోవాలని అనుకొంటే వీడియో క్లిక్ చేయండి. 

కానిస్టేబుల్ పై కాల్పులు..

ఢిల్లీ : ఓ కానిస్టేబుల్ పై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. దుండగులు మహిళ మెడలో ఛైన్ తెంచి పారిపోతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులను అడ్డుకునే సమయంలో కాల్పులు చేసినట్లు, కానిస్టేబుల్ మృతి చెందాడని తెలుస్తోంది. 

08:13 - August 20, 2016

నల్గొండ : మహా క్రతువు కన్నుల పండుగగా కొనసాగుతోంది. పుష్కర స్నానాలు..పూజలతో కృష్ణా పుష్కరాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. 9వ రోజు భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. నల్గొండ జిల్లాలో 9వ రోజు పుష్కరాలు కొనసాగుతున్నాయి. వీకెండ్ ప్రారంభం కావడం..మూడు రోజులే ఉండడంతో నాగార్జున సాగర్ శివాలయం ఘాట్ కు ఉదయం నుండే భక్తులు తరలివస్తున్నారు. దీనితో ఘాట్ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుండి శుక్రవారం వరకు 35 లక్షలు..శుక్రవారం ఒక్క రోజే 5 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు ఎక్కువ సేపు నిలబడకుండా ఉండేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

నాగార్జున సాగర్ పోటెత్తిన భక్తులు..

నల్గొండ : నాగార్జున సాగర్ శివాలయం ఘాట్ కు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడం..మూడు రోజులే మిగిలి ఉండడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలివస్తున్నారు. 

ఉసేన్ కు మూడో స్వర్ణం..

ఒలింపిక్స్ చరిత్రలో జమైకా చిరుత ఉసేన్ బోల్డ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వరుసగా మూడో స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. కొద్దిసేపటి క్రితం రియోలో జరిగిన 400 మీటర్ల పరుగులో అతడు స్వర్ణం సాధించాడు. దీనితో ఒలింపిక్స్ లో 100, 200, 400 మీటర్ల పరుగులో అతడు పసిడి పతకాలు సాధించినట్లైంది. 

07:55 - August 20, 2016

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. తమ ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించాలంటూ పలు జిల్లాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రియో ఒలింపిక్స్ లో సింధు రజత పతకం గెలిచింది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో రాకేష్ (టీఆర్ఎస్), వేణుగోపాల్ (బీజేపీ), గఫూర్ (సీపీఎం), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

07:37 - August 20, 2016

తెలుగు తేజం పీవీసింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ చేరడం ద్వారా రజత పతకం ఖాయం చేసింది. ఫైనల్ చేరిన భారత బ్యాడ్మింటన్ తొలిప్లేయర్ గా రికార్డుల్లో చోటు సంపాదించింది. బంగారు పతకం కోసం శుక్రవారం జరిగే ఫైనల్లో స్పెయిన్ ప్లేయర్ కారోలిన్ మారిన్ ను ఢీ కొంటుంది. రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్స్ కు తెలుగుతేజం పీవీ సింధు చేరి చరిత్ర సృష్టించింది. బంగారు పతకం కోసం జరిగే పోటీలో స్పెయిన్ సూపర్ స్టార్ కారోలిన్ మారిన్ తో తలపడటానికి అర్హత సంపాదించింది. రియో సెంట్రో పెవీలియన్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో జపాన్ కు చెందిన 6వ ర్యాంకర్ నజోమీ ఒకుహరాను వరుస గేమ్ ల్లో సింధు చిత్తు చేసింది. కేవలం 49 నిముషాలలోనే సింధు 21-19, 21-10 పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా టెన్ టివి చర్చా వేదికను చేపట్టింది. ఈ చర్చలో మనోజ్ కుమార్ (క్రీడాకారుడు), కృష్ణారావు (స్పోర్ట్స్ ఎడిటర్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

రాజీవ్ గాంధీకి పలువురు నివాళులు...

ఢిల్లీ : నేడు మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. ఈ సందర్భంగా వీర్ భూమి వద్ద రాజీవ్ గాంధీ సమాధికి పలువురు నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజీవ్ తనయుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. 

నేడు తెలంగాణ వైసీపీ మౌన దీక్ష..

హైదరాబాద్ : నేడు ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ వైసీపీ మౌన దీక్ష చేపట్టనుంది. అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ దీక్ష చేపట్టనుంది. 

సిరిసిల్లను జిల్లా చేయాలంటూ నేడు బంద్...

కరీంనగర్ : సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం జేఏసీ బంద్ కు పిలుపునిచ్చింది. నేడు కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. 

06:45 - August 20, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో జిల్లాల పునర్విభజనలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌..వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నిన్న మొన్నటి వరకు విపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోని గులాబి పార్టీ..తాను అనుకున్నట్లుగానే కొత్త జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియర్ చేసుకుంటోంది. ఎంఐఎం ఆధిపత్యంలో ఉండే హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో కొత్త జిల్లాలు ఆవిర్భవించనున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలో జిల్లాల పునర్విభజన చేయాల్సిన అవసరం ఉందని ముందు నుంచి చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్ల తర్వాత జిల్లాల విభజనపై వడివడిగా అధికార పార్టీ అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు పది జిల్లాలతో ఉన్న తెలంగాణా భవిష్యత్ లో 27 జిల్లాలుగా పునర్విభజన చేయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసింది.

విపక్షాల విమర్శలు..
ప్రభుత్వ ప్రతిపాదనలపై విపక్ష పార్టీలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి. నిన్న మొన్నటి ఊహాగానాలతో మొదలైన విభజన అంశాలు..ప్రభుత్వం ముసాయిదాను విడుదల చేయడంతో విమర్శలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీ నేతలు కూడా తమ సొంత డిమాండ్లను వినిపిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం తాను వేసుకున్న స్కెచ్ ప్రకారమే ముందడుగు వేయాలనే అభిప్రాయంతో ఉంది. వరంగల్ జిల్లా జనగాం, మహబూబ్ నగర్ జిల్లా గద్వాలను జిల్లా కేంద్రాలుగా చేయాలని అన్ని రాజకీయ పార్టీలు దాదాపు ఏకాభిప్రాయాన్ని వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని పార్టీ పెద్దల ముందుంచారు. కాని ముసాయిదాలో ఆ రెండు జిల్లాల పేర్లు కనిపించడం లేదు. ఊహించని విధంగా శంషాబాద్, మల్కాజి గిరి జిల్లాలు తెరపైకి వచ్చాయి. అయితే శంషాబాద్ జిల్లా ఏర్పాటులో రంగారెడ్డి జిల్లాతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో పలు ప్రాంతాలను శంషాబాద్ జిల్లాలో విలీనం చేయాలనే అంశం దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. అటు అధికార పార్టీ నేతల్లో కూడా జిల్లాల విభజనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా, ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకుంటుదా అన్న అనుమానాలు గులాబి నేతలను వెంటాడుతున్నాయి.

పరిగణలోకి తీసుకుంటుందా ? 
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇవాళ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చే సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనేది సందేహంగానే కనిపిస్తోంది. జిల్లాల విభజనలో అన్ని జిల్లాల రూపురేఖలు పూర్తిగా మారుతున్నా..మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ ఆధీనంలో ఉండే హైదరాబాద్ జిల్లా మాత్రం యధావిధిగా కొనసాగడం చర్చకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ వ్యవహరిస్తన్న తీరు పరిశీలిస్తే ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలకు ఏమేరకు ప్రాధాన్యత ఇస్తుందనేదే అందరిముందున్న ప్రశ్న.  

06:41 - August 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగం పెంచింది. జిల్లాల ప్రతిపాదనలపై ఈ నెల 20న అఖిల పక్షం ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు సంబంధించిన వివరాలతో అన్ని పార్టీలకు లేఖలు రాసింది. ఏ జిల్లా పరిధిలో ఏయే మండలాలు ఉంటాయనే వివరాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక ఉన్న అనివార్య కారణాలను కూడా వివరించింది. కేసీఆర్ మదిలో చాలా కాలంగా రగులుతున్న ఆలోచన ఎట్టకేలకు కార్యరూపం తీసుకునే దశ సమీపించింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమని ఉద్యమ కాలం నుంచే చెబుతూ వచ్చిన కేసీఆర్, ఇప్పుడు ఆ ఆలోచనకు స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అఖిల పక్షం కోసం అన్ని రాజకీయ పార్టీలకు పంపించిన అజెండాలో జిల్లాల సంఖ్యను, జిల్లాల పరిధిలో ఉండే మండలాల వివరాలను స్పష్టంగా చేర్చారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో 27 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

ఆదిలాబాద్..రంగారెడ్డి..
ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ తో పాటు కొత్తగా కొమరం భీమ్, నిర్మల్ జిల్లాలు రానున్నాయి. అలాగే నిజమాబాద్ లో కామారెడ్డి కొత్త జిల్లాగా ఆవిర్భవించనుంది. కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలు, వరంగల్ జిల్లాలో వరంగల్, హన్మకొండ, జయశంకర్ జిల్లా, మహబూబాబాద్ అనే నాలుగు జిల్లాలకు ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో హైదరాబాద్, వికారాబాద్, మల్కాజిగిరి, శంషాబాద్ జిల్లాలు, నల్గొండ జిల్లా పరిధిలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల ఏర్పాటుకు ఈ అజెండా ప్రతిపాదించింది.

జనాభా 18 లక్షలు..
దేశవ్యాప్తంగా చూస్తే జిల్లాల సగటు జనాభా 18 లక్షలు మాత్రమే. అయితే, తెలంగాణలో ఒక జిల్లాలో సగటున 35 లక్షల జనాభా ఉందని, పాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్య పెంచడం వల్ల ప్రజలకు ప్రభుత్వం మరింత దగ్గరగా వచ్చినట్లవుతుందని ప్రభుత్వం తన అజెండాలో స్పష్టం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల జిల్లా కేంద్రాలు సరికొత్త అభివృద్ధి కేంద్రాలుగా మారతాయని, మౌలిక సదుపాయాలు, వ్యాపారావకాశాలు పెరిగి ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయని చెబుతోంది... చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల అభివృద్దిలో సమతుల్యత పాటించడం సాధ్యమవుతుందని అఖిలపక్షం అజెండాలో ప్రభుత్వం వివరించింది.

ఈ నెల 20న అఖిలపక్ష సమావేశం..
అయితే, ఈ నెల 20న జరిగే అఖిలపక్ష సదస్సులో వివిధ రాజకీయ పక్షాలు తమ వాదనలు ఎలా వినిపిస్తాయి?, ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కొత్త ఉద్యమాలు ముందుకు రావడంతో ప్రభుత్వం ఈ కసరత్తుకు ఎలాంటి తుదిరూపం ఇస్తుందో చూడాలి.

తెలంగాణ స్టడీ సర్కిల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్...

హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని తెలంగాణ స్టడీ సర్కిల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు అర్థరాత్రి డ్రంక్‌ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 24 మందిని పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. 

06:37 - August 20, 2016

హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని తెలంగాణ స్టడీ సర్కిల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు అర్థరాత్రి డ్రంక్‌ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 24 మంది పోలీసులకు చిక్కారు. దీంతో వారి నుండి 12 కార్లు, 12 బైక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. మద్యం సేవిస్తూ పట్టుబడిన వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరు పరుచుతామని పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో ఎవరూ సెలబ్రేటీలు లేకపోవడంతో పాటు అందరూ 35 ఏళ్ల వయస్సు లోపు వారే ఉండటం విశేషం.  

06:36 - August 20, 2016

హైదరాబాద్ : రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ దేశంలోకెల్లా అనువైన నగరమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో జరిగిన నేషనల్‌ రియల్‌ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాలు గృహనిర్మాణంలో అనుసరిస్తున్న విధానాల్లో..మంచి విధానాలను జాతీయస్థాయిలో తీసుకొచ్చేందుకు కృషిచేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇతర రంగాల అభివృద్ధి జరిగినప్పుడే గృహ నిర్మాణ రంగంలో పురోగతి కనిపిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా పారిశ్రామికీకరణపై దృష్టిపెట్టిందని..టీఎస్ ఐపాస్ వల్ల పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తున్న విషయాన్ని సదస్సులో వివరించారు. గతంలో సీఎం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో నిర్వహించిన సమావేశంలో 40 డిమాండ్లకు 31 డిమాండ్లను ఆమోదించామని కేటీఆర్ గుర్తుచేశారు. బెంగళూరు, చెన్నై, పూణె నగరాలకన్నా రెండింతల మౌలిక వసతులు హైదరాబాద్‌లో ఉన్నాయని...అందువల్ల ఆయా నగరాలలో కంటే తక్కువ పెట్టుబడితోనే భవనాల నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ..
వరంగల్‌ జిల్లాలో ఇంటర్నేషనల్ లెదర్ పార్క్ ఏర్పాటు విషయమై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి కేటీఆర్ చర్చించారు. కేంద్రటెక్స్‌టైల్స్ శాఖ కార్యదర్శి రశ్మివర్మని కలసి, తెలంగాణలో ఏర్పాటు చేయబోయే క్లస్టర్స్ గురించి మాట్లాడారు. గతంలో ఇచ్చిన ప్రతిపాదనలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను అందజేశారు. తన శ్రీలంక పర్యటనలో వివిధ పారిశ్రామిక వర్గాలు..భారత్‌లో పరిశ్రమలను ఏర్పటు చేయడంలో తమకున్న సమస్యలను వివరించారని...వీటన్నింటిని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లానని కేటీఆర్ తెలిపారు. మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా వివిధ బహుళజాతి సంస్థల ప్రతినిధులతో సమావేశమై..రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయమై చర్చించారు.

06:32 - August 20, 2016

రియో ఒలపింక్స్ లో తెలుగు తేజం పి.వి సింధు వెండి వెలుగులో భారత్ సంబురాల్లో మునిగిపోయింది. ఒలంపిక్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రవేశించి చరిత్ర సృష్టించిన సింధు. సిల్వర్ మెడల్ తో భారత క్రీడారంగంలో నూతన శకానికి శ్రీకారం చుట్టింది. పి. వి సింధు సాధించిన ఈ ఘనత పట్ల ఒకపక్క యావత్ దేశం గర్విస్తుంటే..మరోపక్క పి.వి సింధు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పి.వి సింధు సాధించిన విజయం పట్ల తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఫైనల్ మ్యాచ్ లో గెలిస్తే వారి ఆనందం రెట్టింపయ్యేది. ఎట్టకేలకు ఫైనల్ లో ప్రపంచ నంబర్ వన్ మారిన్ కు గట్టిపోటినించిన తమ కూతురు ఆటను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. తమ కూతురు సిల్వర్‌ మెడల్‌ను సాధించడంతో పట్టలేని సంతోషంలో పి.వి సింధు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మునిగితేలారు.

బాగా ఆడిందన్న సింధు తండ్రి..
సింధు చాలా బాగా ఆడిందని, చివరి వరకు పోరాడిందని ఈమె తండ్రి రమణ అన్నారు. భారత్ నుంచి ఒలింపిక్స్‌కు వెళ్ళడం గర్వంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరింత సమర్ధవంతంగా ఆడి స్వర్ణం సాధించాలని ఆయన అన్నారు. కోచ్ గోపీచంద్, సహకరించిన అందరికి రమణ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో తన కూతురు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భారతీయుల విశ్వాసాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని, అయితే ప్రత్యర్థిపై తొలి గేమ్ సింధు గెలిచినా ఆమెపై గెలుపు అంత సులువుకాదని మరోసారి పీవీ రమణ ప్రస్తావించారు.

ఫైనల్లో సింధు కాస్త నెర్వస్‌గా ఆడింది- తల్లి విజయ..
బ్యాడ్మింటన్ ఫైనల్లో సింధు కాస్త నెర్వస్ గా కనిపించిందని ఆమె తల్లి విజయ అన్నారు. కచ్చితంగా సింధు స్వర్ణం నెగ్గుతుందని భావించామని, అయితే అనవసర తప్పిదాలు చేయడం వల్లే సింధు స్వర్ణం సాధించలేక పోయిందని పేర్కొన్నారు. సింధు 'శారీరకంగానూ కాస్త అలసిపోవడం తన ఆటపై ప్రభావం చూపింది. మొదట్లో మెరుగ్గానే ఆడినా చివరికొచ్చే సరికి కాస్త టెన్షన్ పడ్డట్లు కనిపించింది. మరో ప్రయత్నంలో కచ్చితంగా ఒలింపిక్ స్వర్ణం నెగ్గుతుంది' అని సింధు తల్లి విజయ ఆశాభావం వ్యక్తం చేశారు.

బాగా ఆడితే బాగుండేది - గోపిచంద్ సతీమణి..
ఒలంపిక్స్ లో రజతం సాధించిన సింధుకు ఆమె కోచ్‌ గోపీచంద్‌ సతీమణి లక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్‌ మ్యాచ్‌లో మరికొంత బాగా ఆడితే బావుండేదని లక్ష్మి అభిప్రాయపడ్డారు. పి.వి సింధు ఒలంపిక్స్ లో రజత పతకాన్ని సాధించటం పట్ల ఆమె సోదరి దివ్య ఆనందం వ్యక్తం చేసింది. పి.వి సింధు సాధించిన ఈ రజతం పతకం వెనుక తమ తల్లిదండ్రులు, కోచ్ గోపిచంద్ కృషి ఎంతగానో ఉందని ఆమె తెలిపింది. రియో ఒలంపిక్స్ లో ఫైనల్ మ్యాచ్ లో ఓడినప్పటికీ రజతం సాధించి భారత్ ప్రతిష్టను విశ్వయవనికపై నిలిపిన సింధు కుటుబంసభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బివుతున్నారు. స్వర్ణం పతకం సాధిస్తే ఈ ఆనందం రెట్టింపయ్యేదిగా కనిపిస్తోంది. అయినప్పటికీ రజత పతకాన్ని అందించి సింధు దేశం గర్వించేలా చేసింది. 

06:29 - August 20, 2016

భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో తెలుగింటి ఆడబిడ్డ, భారత అగ్రశ్రేణి షట్లర్‌ పూసర్ల వెంకట సింధు రికార్డు సృష్టించింది. ఆడింది..తొలి ఒలింపిక్సే అయినా బ్యాడ్మింటన్‌లోనూ, ఏ క్రీడలోనైనా సరే.. రజతం గెలిచిన తొలి భారత మహిళగా తన పేరు లిఖించుకొంది. ఫైనల్లో ప్రపంచ నెంబర్‌ వన్‌ క్రీడాకారిణి ప్రత్యర్థి కరోలినా మారిన్‌తో బంగారు పతకం కోసం తన శక్తికి మించి పోరాడి ఓడింది. రజతంతో ఇండియా ఖ్యాతిని విశ్వయవనికపై నిలిపిన పీవీ సింధుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తున్నాయి. రియో ఒలంపిక్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పీవీ సింధు రజతాన్ని దేశానికి అందించింది. పి.వి సింధు ఆటతీరుకు భారతీయులంతా ఫిదా అయ్యారు. ఒలింపింక్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పీవీ సింధుపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లివిరుస్తున్నాయి. రాష్ట్రపతి, దేశ ప్రధాని సహా..వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముకులు పీవీ సింధుకు అభినందలు తెలిపారు.

 • ఫైనల్ లో గొప్పగా ఆడావు, రజత పతకంతో సరికొత్త చరిత్ర సృష్టించావు అంటూ పి.వి సింధుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందనలు తెలిపారు.
 • 2016 ఒలంపిక్స్ చారిత్రక ఆటతీరు చిరకాలం నిలుస్తుందని ప్రధాని మోడీ పీవీ సింధుపై అభినందనలు కురిపించారు.
 • ఒలంపిక్స్ లో రజత పతకం సాధించటం దేశానికి గర్వకారణమని, యువ క్రీడాకారులకు పి.వి సింధు తన ఆటతీరుతో స్పూర్తి నింపిందని జస్టిస్ రమణ పి.వి సింధును అభినందించారు.
 • సింధు ఆటతీరుతో దేశమంతా గర్వపడేలా చేసిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.
 • భారత్ గర్వించే ప్రదర్శన చేశావంటూ పి.వి సింధును సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభినందలు తెలిపారు.
 • పి.వి సింధును తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ అభినందించారు. సిల్వర్‌ సాధించిన సింధుకు మంచి రివార్డు ప్రకటించాలని సీఎం కేసీఆర్‌కు గవర్నర్ సూచించారు.
 • ఒలంపిక్స్ లో రజత పతకాన్ని దేశానికి అందించిన పి.వి సింధుకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. సింధును తీర్చిదిద్దిన కోచ్ గోపించంద్ ను ప్రత్యేకంగా కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా యువ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు.
 • ఒలింపిక్స్‌లో రజితాన్ని సాధించిన సింధుకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. సింధు పోరాట పటిమ భారతీయులకు స్ఫూర్తని ఆయన వ్యాఖ్యానించారు. సింధు ప్రదర్శన దేశానికి కొండంత బలాన్నిచ్చిందని, కోచ్ పుల్లెల గోపీచంద్‌ను అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు.
 • ఒలంపిక్స్ ప్రారంభమైన నాటి నుంచి విజయం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో పి.వి సింధు రజతపతకాన్న దేశానికి అందించడం స్పూర్తిదాయకమన సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
 • పి.వి సింధు దేశానికి రజతం పతకం సాధించి తెలుగుజాతి గౌరవాన్ని పెంచిందని వైస్సాఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ సింధుపై ప్రశంసల జల్లు కురిపించారు.
 • రియో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ పోరులో పోరాడి ఓడి రజతం సాధించిన సింధుకు మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ 50 లక్షల రూపాయల నగదు పురస్కారం ప్రకటించారు. టీవీల ద్వారా ఆయన మ్యాచ్‌ను కూడా చూశారు. సింధు ఆటతీరు అద్భుతంగా ఉందని కీర్తించారు. రజతం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారని కితాబునిచ్చారు.
 • పి.వి సింధు ఆట చూసి అభిమానిని అయ్యానని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. నీ ఆటే మాకు బంగారం అంటూ రాజమౌళి సింధుపై ప్రశంసల జల్లు కురిపించారు.
 • రియోలో భారత్‌కు రజత పతకాన్ని అందించిన పి.వి సింధును మంత్రి కేటీఆర్ అభినందించారు. సింధుకి ఘనంగా స్వాగతం పలికేందుకు హైదరాబాద్‌లో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సింధుని చూసి దేశం గర్విస్తోందని ఆయన అన్నారు.
06:25 - August 20, 2016

రియో ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడింది. ఒలింపిక్స్ పతకాల సంఖ్యలో భారత్‌ ఖాతాలోకి మరో పతకం చేరింది. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో..తెలుగమ్మాయి, భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్ పూసర్ల వెంకట సింధు రికార్డు సృష్టించింది. సింధుకు ఇది తొలి ఒలింపిక్సే అయినా బ్యాడ్మింటన్‌లోనూ, ఏ క్రీడలోనైనా సరే.. రజతం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం కోసం వరల్డ్ నెంబర్‌ వన్‌.. స్పెయిన్‌ షట్లర్‌ కరోలినా మారిన్‌తో సాగిన హోరా హోరీ ఫైనల్‌ మ్యాచ్‌లో పీవీ సింధు రజతానికే పరిమితమయ్యింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సింధు అసమాన ప్రతిభ కనబరిచింది. ఫైనల్లో ప్రపంచ నెంబర్‌ వన్‌ క్రీడాకారిణి, కరోలినా మారిన్‌తో బంగారు పతకం కోసం తన శక్తికి మించి పోరాడింది. ఉత్కంఠగా సాగిన పోరులో ఆమె 21-19, 12-21, 15-21తో ఓటమి చవిచూసింది. బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నెంబర్‌ వన్‌ కరోలినా మారిన్‌ను తొలిగేమ్‌లో మట్టికరిపించిన సింధు స్వర్ణ పతకంపై ఆశలు రేపింది. క్రాస్‌ కోర్టు షాట్లు, స్మాష్‌లు, నెట్‌గేమ్‌తో 21-19తో ప్రత్యర్థిని ఓడించింది. తొలుత 3-7తో ఉన్న దశ నుంచి మ్యాచ్‌ 15-16 వచ్చే వరకు హోరాహోరీగా సాగింది. ప్రత్యర్థులిద్దరూ చెరో పాయింటు సాధిస్తూ ముందుకు పోయారు. మారిన్‌ పుంజుకొని 19-16తో గేమ్‌ పాయింట్‌ను సమీపించింది. ఈ దశలో అద్భుతంగా పుంజుకొన్న సింధు.. వరుసగా ఆరు పాయింట్లు సాధించి 21-19తో తొలిగేమ్‌ కైవసం చేసుకొంది.

తడబడిన సింధు..
అయితే రెండో గేమ్‌లో సింధు పూర్తిగా తడబడింది. మారిన్‌ తన తెలివినంతా ఉపయోగించి మొదటి నుంచే వరుస పాయింట్లు సాధిస్తూ సింధును ఒత్తిడిలోకి నెట్టింది. వరుసగా నాలుగు పాయింట్లతో 4-0తో ఉన్న మారిన్‌ నెట్‌గేమ్‌, హాఫ్‌ స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్‌ స్మాష్‌లు సంధిస్తూ 21-12తో గేమ్‌ గెలుచుకొంది. అనవసర తప్పిదాలతో సింధు ప్రత్యర్థికి పాయింట్లు ఇచ్చింది. ఇక మూడో గేమ్‌లో మారిన్‌ మరింత రెచ్చిపోయింది. సింధు పుంజుకుంటున్న ప్రతి దశలోనూ క్రాస్‌కోర్టు షాట్లు, స్మాష్‌లతో ఆమెను దెబ్బతీసింది. చూస్తుండగానే 6-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్‌ 4-9తో ఉన్న సమయంలో సింధు వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 8-9తో నిలిచింది. అయితే సింధు సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన మారిన్‌ నెట్‌ దగ్గరే అద్భుతంగా సర్వీసులు చేస్తూ సింధును అసహనానికి గురిచేసింది. సింధు 10-10తో స్కోర్‌ సమం చేసేందుకు దీర్ఘర్యాలీ ఆడింది. ఈ దశలో మారిన్‌ నాలుగు వరుస పాయింట్లతో 14-10తో దూసుకుపోయింది. ఇక్కడ మారిన్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన సింధు రెండు పాయింట్లు సాధించి 12-15తో నిలిచింది.

మారిన్ విజేత..
అయితే సింధు వరుస పాయింట్లు సాధించకుండా మారిన్‌ చాకచక్యంగా వ్యవహరించింది. సింధును కోర్టుకు నలువైపులా తిప్పుతూ అలసిపోయేలా చేస్తూ నిలకడగా పాయింట్లు సాధించింది. మ్యాచ్‌ 14-16తో ఉన్నప్పుడు మారిన్‌ వరుసగా నాలుగు పాయింట్లు కొట్టి 20-14తో గేమ్‌ పాయింట్‌ను సమీపించింది. ఆ తర్వాత సింధు ఒక పాయింట్‌ సాధించి 15-20తో ముందుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే మారిన్‌ క్రాస్‌కోర్ట్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించి, విజేతగా నిలిచింది.

06:22 - August 20, 2016

బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధూ... భారత క్రీడారంగంలో కొత్త చరిత్ర లిఖించింది. శతకోటి భారతీయుల ఆశలను నెరవేర్చుతూ..మహిళల విభాగంలో తొలిసారిగా రజత పతకాన్ని అందించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌ లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌ విజయం సాధించి గోల్డ్ గెలుచుకుంది. మూడు సెట్ల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌ లో సింధూ ద్వితియ స్థానంలో నిలిచింది. మొదటి నుంచి పోరాట పటిమ కనబరిచిన సింధు మొదటి గేమ్‌ను 21-19 తేడాతో గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో వరుస రెండు సెట్లలో మారిన్‌ ఆధిక్యం చూపించింది. రెండో గేమ్‌లో 12-21, మూడో గేమ్‌లో 15-21 తేడాతో విజయం సాధించింది. ఒలింపిక్‌ బ్యాడ్మింటన్‌లో ఫైనల్స్‌కు చేరుకుని చరిత్ర సృష్టించిన సింధు రజత పతకం సొంతం చేసుకుంది. అద్భుతమైన ఆట తీరుతో అందరి మనసులు గెలుచుకుంది.

సరికొత్త చరిత్ర...
రియో ఒలింపిక్స్ లో తెలుగు తేజం బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సరికొత్త అధ్యాయం లిఖించింది. స్వర్ణ పతకం కోసం వరల్డ్ నెంబర్‌ వన్‌..స్పెయిన్‌ షట్లర్‌ కరోలినా మారిన్‌తో సాగిన హోరా హోరీ ఫైనల్‌ మ్యాచ్‌లో పీవీ సింధు రజతానికే పరిమితమయ్యింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సింధు అసమాన ప్రతిభ కనబరిచింది. తెలుగు తేజం స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు రియో ఒలింపిక్స్‌ మహిళల విభాగంలో రజతం సొంతంచేసుకుంది. వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్‌తో జరిగిన ఫైనల్‌లో హోరాహోరీగా తలబడింది. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పాయింట్ పాయింట్‌కు సమరంలా సాగింది. మ్యాచ్‌లో సింధు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. ప్రత్యర్థి వరల్డ్‌ నెంబర్‌ వన్‌ కరోలినా మారిన్‌పై తొలి గేమ్‌లో 21-19 పాయింట్లతో సింధు విజయం సాధించింది.

మూడు సెట్లపాటు సాగిన ఉత్కంఠ పోరులో తొలిసెట్ నెగ్గిన సింధు..తరువాత వరుస సెట్లలో కరోలినా మారిన్‌ జోరుకు తడబడింది. తొలి సెట్ ఒటమి నుంచి తేరుకున్న కరోలినా తర్వాత వరుసగా రెండు సెట్లలో విజయభేరీ మోగించింది. రెండో సెట్‌లో ఏదశలోనూ సింధూ పోటి ఇవ్వలేకపోయింది. ఇక మూడోసెట్‌లో క్రాస్ కోర్ట్‌ స్మాష్‌లు, ప్లేసింగ్‌లు సహా నెట్‌ గేమ్‌ దగ్గర విఫలమైన సింధు వరుస పాయింట్లు కోల్పోయింది. చివరకు 21-19, 12-21, 15-21తో ఓటమి చవిచూసింది. 2013,2014లలో వరుసగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించిన సింధు...రియో ఒలింపిక్స్‌లో సిల్వర్‌మెడల్‌తో భారత బ్యాడ్మింటన్‌ రాణిగా అవతరించింది.

గతంలో అభినవ్ బింద్రా...
వరల్డ్‌ నెంబర్‌ వన్ కరోలినా మారిన్‌కు ఇదే తొలి ఒలింపిక్‌ స్వర్ణపతకం కావడం విశేషం. అయితే సింధు మాత్రం...ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లోనే కాదు... ఏ క్రీడలోనైనా సరే.. రజతం గెలిచిన తొలి భారత మహిళగా తన పేరు లిఖించుకొంది. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా అభినవ్‌ బింద్రా చరిత్ర సృష్టించగా... ఆయా క్రీడల్లో భారత్‌కు కాంస్యపతకాలే దక్కాయి. సింధూ మాత్రమే భారత్‌ తరపున రజతం సాధించిన ఏకైక వ్యక్తి కావడం విశేషం.

భారత్ - విండీస్ రెండో రోజు ఆట రద్దు..

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : భారత్ - వెస్టిండీస్ మధ్య నాలుగో టెస్టులో వరుణుడు ముంచెత్తాడు. తొలి రోజు ఆటలో 22 ఓవర్ల ఆటే సాధ్యం కాగా శుక్రవారం రెండో రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకపోయింది. తొలి రోజు వర్షం కారణంగా ఆట నిలిపివేసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 62 పరుగులు చేసింది. నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 2-0 తో ఆధిక్యంలో ఉంది. 

రియోలో నేడు...

రియోల ఒలింపిక్స్ లో పలు పోటీలు జరగనున్నాయి. గోల్ఫ్ మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్ (ఆదితి) మధ్యాహ్నం 3.30 నుండి..
బ్యాడ్మింటెన్ : పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 5.50 నుండి పోటీ ప్రారంభం కానుంది.
పుట్ బాల్ : పురుషుల విభాగంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది రాత్రి 2గంటలకు ప్రారంభం కానుంది.
అథ్లెటిక్స్ : మహిళల హై జంప్ విభాగంలో ఆదివారం ఉదయం 5 నుండి మహిళల 800 మీటర్లు పోటీ ప్రారంభం కానుంది. 

22 నుండి శ్రీశైలానికి హెలికాప్టర్..

కర్నూలు : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి ఈనెల 22వ తేదీ నుండి హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకశాలున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి నల్లమల్ల అటవీ ప్రాంతం, కృష్ణా నది అందాలను వీక్షిస్తూ 45 నిమిషాల్లో శ్రీశైలం చేరుకోవచ్చు. 22 నుండి శ్రీశైలం టూర్ ప్రారంభిస్తామని సమ్మిట్ ఏవియేషన్స్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 

కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు అఖిలపక్షం..

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. టిడిపి నుండి ఎల్.రమణ, రావుల, సీపీఎం నుండి తమ్మినేని, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నుండి చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకటరెడ్డి, కాంగ్రెస్ నుండి షబ్బీర్ ఆలీ, భట్టీ విక్రమార్కలు హాజరు కానున్నారు.  

సింధుకు అరకోటి ప్రకటించిన మధ్యప్రదేశ్ సీఎం..

మధ్యప్రదేశ్ : రియో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ పోరులో పోరాడి ఓడి రజతం సాధించిన సింధుకు మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ 50 లక్షల రూపాయల నగదు పురస్కారం ప్రకటించారు. 

క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి మహేష్ శర్మ..

ఢిల్లీ : ఘజియాబాద్ లోని ఆషియానా గ్రీన్స్ అనే సొసైటీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి మహేష్ శర్మ క్షమాపణలు చెప్పారు. ఇద్దరు వాచ్ మెన్లను కొట్టిన తన భద్రతాధికారిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. రాఖీ పండగ రోజున తన సోదరి నివాసానికి వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన జరిగిందన్నారు. 

సింధుకు అభినందనల వెల్లువ..

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్స్ లో రజత పతకం సాధించిన సింధుకు అభినందనలు వెల్లువెత్తాయి.
రజత పతకం సాధించిన పీవీ సింధు దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు.
భారత ఒలింపిక్ చరిత్రలో సింధు చరిత్ర నెలకొల్పిందని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
సింధు విజయం మరింత మంది క్రీడాకారులకు స్పూర్తిగా నిలుస్తుందని, ఈ స్పూర్తితో టోక్యో ఒలింపిక్స్ లో ఆటగాళ్లు రాణిస్తారని ఆశిస్తున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

నేడు ఆలంపూర్ లో గవర్నర్ పుష్కర స్నానం..

మహబూబ్ నగర్ : జిల్లా ఆలంపూర్ లోని గొందిమళ్ల పుష్కర ఘాట్ లో శనివారం ఉదయం గవర్నర్ నరసింహన్ దంపతులు పుష్కర స్నానం ఆచరించనున్నారు. ఉదయం 9గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్టు నుండి గవర్నర్ దంపతులు బయలుదేరి వెళ్లనున్నారు. 

నేడు తెలంగాణ కేబినెట్..అఖిలపక్ష సమావేశం..

హైదరాబాద్ : జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది అంకానికి చేరింది. శనివారం జరిగే అఖిలపక్ష సమావేశం..మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రతిపాదిత జిల్లాలు, డివిజన్లు, మండలాల వివరాలతో సోమవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు పది జిల్లాలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇక నుండి 27 జిల్లాలుగా మారనుంది. 

సింధుకి రజతం..

రియో ఒలింపిక్స్ లో మహిళల బ్యాడ్మింటెన్ సింగిల్స్ ఫైనల్లో సింధు 21-19, 12-21, 15-21తో స్పెయిన్ కు చెందిన ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ చేతిలో పోరాడి ఓడి రజతంతో సరిపెట్టుకుంది. 

Don't Miss