Activities calendar

21 August 2016

22:49 - August 21, 2016
22:38 - August 21, 2016

హైదరాబాద్ : తెలుగు జర్నలిజంలో భాష వాడకంలో పాత్రికేయులు పొరపాట్లు చేస్తున్నారమని పలువురు భాషావేత్తలు, సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో తెలుగు పత్రికలు, ప్రసార మాధ్యమాల బాషా స్వరూపం అనే అంశంపై హైదరాబాద్‌లో రెండు రోజుల సదస్సు జరిగింది. ఈ సెమినార్‌లో.. పలువురు సీనియర్ పాత్రికేయులు పత్రికలు ప్రసార మధ్యమాల్లో ఎలాంటి భాషను వాడాలి అనే అంశాలపైన చర్చించారు. తెలుగు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో పొరపాట్లు చేయకుండా ఉండేందుకు అన్ని మీడియా సంస్థల ఎడిటర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ సారస్వత పరిషత్తు తెలిపింది. జర్నలిజంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని భాషలపైన అవగాహన ఉండాలని సీనియర్ పాత్రికేయులు, టెన్ టీవీ అసోసియేట్ ఎడిటర్ శ్రీధర్ బాబు అన్నారు. 

 

22:35 - August 21, 2016

బ్రెజిల్ : విశ్వక్రీడాభిమానులను గత రెండువారాలుగా ఓలలాడించిన 2016 ఒలింపిక్స్ ముగింపువేడుకలకు రియో నగరంలోని మరకానా స్టేడియం ముస్తాబవుతోంది. బ్రెజిల్ సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా 3వేలమంది కళాకారులతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రారంభవేడుకలను అపూర్వంగా నిర్వహించిన బ్రెజిల్ ఒలింపిక్ సంఘం...ముగింపు వేడుకలను సైతం ఘనంగా నిర్వహించగలమన్న ధీమాతో ఉంది. ప్రపంచంలోని 206 దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్న ఈ పోటీల పతకాల పట్టికలో అమెరికా అగ్రస్థానంలో నిలిస్తే...ఆతిథ్య బ్రెజిల్ 14వ స్థానంలో కొనసాగుతోంది. భారత్ ఒక్కో రజత, కాంస్యాలతో 66వ స్థానంలో నిలిచింది.

 

22:33 - August 21, 2016

బ్రెజిల్ : ఒలింపిక్స్‌లో మిగిలిన చివరి ఆశ కూడా ఆవిరయ్యింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ పురుషుల 65 కేజీల విభాగంలో యోగేశ్వర్ పతకం ఆశ నిరాశే అయింది. మంగోలియా క్రీడాకారుడు గాంజోరిగిన్  చేతిలో ఓటమి పాలై ఇంటిముఖం పట్టాడు. క్వాలిఫైయింగ్ రౌండ్‌లో యోగేశ్వర్ 0-3తో ఓటమిపాలయ్యాడు. అయితే గాంజోరిగిన్ క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలవడంతో రెపిచెజ్ రౌండ్‌పై యోగీశ్వర్ పెట్టుకున్న ఆశలు కూడా ఆవిరయ్యాయి. ఒకవేళ గాంజోరిగిన్ ఫైనల్‌కు చేరి వుంటే యోగేశ్వర్‌కు కాంస్యం కోసం పోరాడే అవకాశం దక్కేది.

22:31 - August 21, 2016

అంకర : టర్కీలో ఘోరం జరిగింది. ఓ వివాహ వేడుకపై ఆత్మాహుతి దాడి జరగడంతో దాదాపు 50 మంది మృతి చెందారు. మరో 100 మందికి గాయాలయ్యాయి. టర్కీలోని ఘజియాన్‌టేప్‌ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు కుర్దిష్ తిరుగుబాటు దారులు లేక ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. బాంబు దాడిలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందగానే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీంతో పాటు ఫోరెన్సిక్‌ బృందం చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. 

 

22:27 - August 21, 2016

హైదరాబాద్ : జోనల్‌ విధానాన్ని ఎత్తివేసే ముందు దానిపై... అధ్యాయనం, చర్చలు అవసరమన్నారు ప్రొఫెసర్‌ కోదండరామ్‌. తొందరపాటు నిర్ణయాలు సరికాదన్నారు. అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజాసౌమ్య విధానంలో అందరికీ ఉపయోగపడే నిర్ణయాలు జరగాలని కోరారు. 
జోనల్‌ వ్యవస్థపై అధ్యాయనం, చర్చ జరగాలి : కోదండరాం
ప్రాజెక్టులు కట్టే ముందు మంచి చెడు ఆలోచన చేయాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన 'మరో ఉదయం కోసం' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రాజెక్టుల విషయంలో గుత్తేదారుల మాటలను ప్రభుత్వం పట్టించుకోవద్దని సూచించారు. ఆర్థికాభివృద్ధి ఫలాలు అందరికీ అందినప్పుడే.. రాష్ర్ట సాధన ఫలితం నెరవేరుతుందన్నారు కోదండరాం. నాడు నిజాం ప్రభుత్వం డీపీఆర్‌తోనే సాగునీటి ప్రాజెక్టులు కట్టారని, చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. జోనల్‌ వ్యవస్థను ఎత్తివేసి ముందు అందరి అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. 
సామాజిక ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోతాయి : ప్రొ.హరగోపాల్ 
రాజ్యాధికారాన్ని ప్రశ్నించే సామాజిక ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు ప్రొఫెసర్‌ హరగోపాల్‌. చారిత్రక స్రృహ ఉన్నప్పుడే పోరాటాలు విజయం సాధిస్తాయన్నారు. అభివృద్ధి నమూనాలు ప్రజలందరీ కేంద్రంగా ఉండాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయాలని సూచించారు. మొత్తంగా ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండాలని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. 

22:24 - August 21, 2016

హైదరాబాద్ : తెలంగాణ కొత్త జిల్లాల డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్ రేపు అధికారికంగా విడుదల కానుంది. నోటిఫికేషన్‌కు అనుగుణంగా 27 కొత్త జిల్లాల సరిహద్దులతో కూడిన మ్యాప్‌ కూడా అధికారులు సిద్ధం చేశారు. దీన్ని నోటిఫికేషన్‌తో పాటు పబ్లికేషన్‌కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త జిల్లాలు, వాటి సరిహద్దులతో పాటు అన్ని అంశాలపై 30 రోజుల పాటు ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం సేకరించనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై నిన్న సచివాలయంలో జరిగిన  అఖిలపక్ష సమావేశంలోనూ అన్ని పార్టీలూ కొన్ని సూచనలతో స్వాగతించాయి. 

 

22:22 - August 21, 2016
22:21 - August 21, 2016

ఆ దయ్యం ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్లను అష్టకష్టాలు పెడుతోంది. ఆ బంగ్లా మీద ఆశపడ్డవారి అంతు చూస్తుంది. నిన్న భూత వైద్యుడి హత్య, మొన్న ఎస్ ఐ మీద హత్య ప్రయత్నం, భార్గవ్ మీద దాడి... నిజంగానే ఆ ఇంట్లో దయ్యం ఉందా..? ఉంటే ఆ దయ్యానికి హాయ్ చెప్పి ఒద్దాం రండీ... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:11 - August 21, 2016

హైదరాబాద్ : నయీం దందాల కేసులో అనుచరుల కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా.. హైదరాబాద్ వనస్థలీపురంలో నయీం అనుచరుడు సామ సంజీవరెడ్డి ఇంట్లో సిట్ అధికారులు సోదాలు జరిపారు. పోలీసులు రావడాన్ని ముందే పసిగట్టిన సంజీవరెడ్డి పారిపోయాడు. సిట్ అధికారులు... అతని ఇంట్లో... విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సంజీవరెడ్డి కోసం గాలింపు ప్రారంభించారు. 

22:04 - August 21, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో చివరి సెలవురోజు కావడంతో  ఇబ్రహీంపట్నంలోని సంగమం ఘాట్‌ భక్తులతో కిటకిటలాడుతోంది. విజయవాడతో పాటు దూరప్రాంతాల వాళ్లు కూడా హారతిని చూడటానికి రావడంతో ఘాట్‌ మొత్తం భక్తజనంతో నిండిపోయింది. ఆర్టీసీ బస్సులను సంగమం ఘాట్‌కు తరలించడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. 

 

21:20 - August 21, 2016

వరంగల్ : బాలలు.. భవిష్యత్ దేశపౌరులు. బాలలు చిరునవ్వులు చిందించే పాలబుగ్గల సిరిమల్లెలు. కాని నేడు ఆ బాలల నవ్వులు బోసిపోతున్నాయి. సరైన పోషకాహారం లేక పిల్లలు బక్కచిక్కిపోతున్నారు. న్యూట్రిషన్ లోపమో.. ఆలనాపాలనలేకనో పిల్లల్లో ఎదుగుదల మందగిస్తోంది. వరంగల్ జిల్లాలో రానురాను ఈ సంఖ్య పెరుగుతుండడంతో.. అందరిలోను ఆందోళన మొదలైంది.  
పోషకాహారలోపంతో బాధపడుతున్న పిల్లలు  
వరంగల్ జిల్లా వ్యాప్తంగా వందలాది మంది పిల్లలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. పిల్లల ఎదుగుదలకు కావాల్సిన పోషకాహారం లభించకపోవడంతో 3 ఏళ్ల వయస్సున్నా.. బరువు 5 కిలోలకు మించడం లేదు.  పోషకాహారలోపంతో పిల్లల మానసికస్థితిపై ప్రభావం పడుతుండడంతో వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
గర్బిణీగా ఉన్నప్పటి నుంచే పిండానికి అందని పోషకాహారాలు
గర్బిణీలుగా ఉన్నప్పటి నుండే పిండానికి కావాల్సిన పోషకాహారాలు అందించాలి. కాని అలా జరగకపోవడం.. పిల్లలు పుట్టిన తర్వాత వారిలో ఎదుగుదల మందగిస్తోంది. రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు గ్రామీణస్థాయి నుండే అవగాహన కల్పించాలని అంగన్‌వాడీలకు, ఆశావర్కర్లకు ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నా పిల్లలబరువులో మాత్రం మార్పురావడంలేదు.
ఎన్ ఆర్ సీఎస్ ను ప్రారంభించిన కేంద్రసర్కార్
న్యూట్రిషన్‌లోపంతో బాధపడుతున్న పిల్లల కోసం 2012 లో కేంద్రప్రభుత్వం న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ స్కీమ్ ను ప్రారంభించింది. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల బరువును పెంచేందుకు వరంగల్ ఎంజీఎంలో 20 బెడ్‌లతో ఎన్ఆర్సీ సెంటర్ ను ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలకు ఆహ్లదం కలిగించే రకరకాల కార్టున్ బొమ్మలతో ఈ సెంటర్ ను తీర్చిదిద్దారు. చిన్నపిల్లల బరువును పెంచేందుకు న్యూట్రిషన్ల సలహాల మేరకు పిల్లలకు ఆహ్లాదంతోపాటు ఆహారం అందిస్తున్నారు. 
పిల్లల మానసికస్థితి ఎదుగుదలను పరిశీలిస్తున్న వైద్యులు
పిల్లలు పోషకాహారలోపంతో బాధపడుతూ ఎంజీఎంకు వస్తున్న పిల్లలను డాక్టర్లు  ఎన్ఆర్సీకి రిఫర్ చేస్తున్నారు. దీంతో న్యూట్రిషన్ డాక్టర్లు మెరుగైన సేవలు అందిస్తున్నారు. పిల్లలతోపాటు వారి సంరక్షణచూసే తల్లిదండ్రులకు కూడా ఎన్ఆర్సీ వారే రోజుభోజనాలు అందిస్తూ రోజుకు వందరూపాయల చొప్పున అందిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని చిన్నారులు పోషకాహారలోపంతో భాధపడుతుండడం ఆందోళన కలిగించే విషయం. పిల్లల ఎదుగుదల కోసం పనిచేస్తున్న ఎన్ఆర్సీ పథకం గురించి విస్తృత ప్రచారం జరగాల్సిన అవసరంవుంది. 

 

21:16 - August 21, 2016

 హైదరాబాద్ : సనత్ నగర్ మెడికల్ కాలేజీ దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలకు ఆదర్శంగా నిలువనుందని కేంద్రకార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఫ్యాకల్టీ అంటెనెన్స్ మానిటర్ సిస్టమ్, ఆధార్ ఎనబుల్ బయోమెట్రిక్ అటెనెన్స్ సిస్టమ్ ను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. సకాలంలో పేషంట్లకు సేవలందించడంలో కూడా ఈ మెడికల్ కాలేజీ ముందుందని ఆయన అన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సనత్ మెడికల్ కాలేజీ మోడల్ విధానాన్ని దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలలో ప్రవేశపెట్టనుందని దత్తాత్రేయ చెప్పారు.

21:12 - August 21, 2016

హైదరాబాద్ : స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడానికి నాస్కామ్ తో సింబియాసిస్ యూనివర్సిటీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌లో ఇంక్యూబేటర్స్ ఏర్పాటుకు సాంకేతిక సహాకారాన్ని అందించనుంది. కళాశాల విద్య పూర్తికాగానే స్టార్టప్ ఏర్పాటుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని నాస్కామ్ రీజీనల్ డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. 

21:09 - August 21, 2016
20:44 - August 21, 2016
20:40 - August 21, 2016
20:33 - August 21, 2016

ఖమ్మం : రెండేళ్లుగా వర్షాలు కురవక రైత్తన్నల బతుకులు ఆవిరైపోయాయి. ఈ ఏడాదైనా వర్షాతలు పడతాయనుకున్న రైతులకు.. ఖరీఫ్ సీజన్‌ ప్రారంభంలో పడిన వర్షాలు కొత్త ఆశలు రేపాయి. దీంతో ఖరీఫ్ సీజన్‌పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు వర్షాలు మొహం చాటేయడంతో రైతన్నల బతుకులు ఆగమ్యగోచరంగా తయారయ్యాయి. కరవుతో కొట్టుమిట్టాడుతున్న ఖమ్మం జిల్లా రైతులపై ప్రత్యేక కథనం..
తీవ్ర వర్షాభావ పరిస్థితులు
ఖమ్మం జిల్లా తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఖరీఫ్ ప్రారంభంలో పడిన వర్షాలకు రైతులు పంటలు వేశారు. అయితే తర్వాత ఇంత వరకు వర్షాలు పడకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 3.40 లక్షల హెక్టార్లకు గాను..  2లక్షల 27 వేల హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. అయితే వర్షాభావ పరిస్థితులతో అవి దెబ్బతింటున్నాయి. జిల్లాలో 50వేల హెక్టార్లలో వరి, 1,18,000 హెక్టార్లలో పత్తి , మొక్కజొన్న 13,428 హెక్టార్లలో , పెసర25వేలు, కందిపప్పు 9వేల హెక్టార్లు, మిర్చి 7వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. దాదాపు ఈ పంటలన్నీ ఇప్పుడు ఎండిపోతున్నాయి. 
పత్తికి ప్రత్యామ్నయ పంటలు
పత్తికి ప్రత్యామ్నయ పంటగా కంది, పెసర, మొక్కజొన్న , మినుము, వేరుశనగా , వరి , నువ్వులు తదితర పంటలు సాగు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. దీంతో రైతులూ ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపారు. కానీ ప్రస్తుతం వాతావరణం పొడిగా మారి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రత్యామ్నయ పంటలకూ తిప్పలు తప్పటం లేదు. జిల్లాలోని మైదాన ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు వాడిపోతున్నాయి. ఈ సారీ ఎన్నోఆశలతో సాగు మొదలు పెడితే మళ్లీ అదే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
పదేళ్లుగా పూర్తి కాని పనులు  
ఇది కాక జిల్లాలో సాగర్ ఆయుకట్టు సాగునీరందక దాదాపు మూడేళ్లు అవుతుంది. ప్రధానంగా కాల్వల ఆధునీకరణ పేరుతో రూ.600 కోట్లతో చేపట్టిన కాల్వల పనులు పదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ నేటికి పనులు పూర్తికాక సాగర్ ఆయుకట్టు బీడుగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
జూన్ లో 3371 మి.మీ వర్షం నమోదు
జిల్లాలో జూన్ నెలలో 127 మి.మీ కు గాను 3371 మి.మీ పడటంతో ఈసారి కాలం కలిసొస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో విస్తారంగా పంటలు వేశారు. జూలైలో 309 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉండగా 188మి.మీ మాత్రమే పడింది. దీంతో 39.8 మి. మీ వర్షపాతం తగ్గింది.. ఆగస్టులో 276 మి.మీ వర్షం పడాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 59.8 మి.మీ మాత్రమే పడింది. ఇదే పరిస్థితి ఈ నెలాఖరు వరకు కొనసాగితే ఈ ఏడాదీ కరువు తప్పదని.. రూ.వేలకు రూ. వేలు పెట్టుబడులు పెట్టి వేసిన పంటలు ప్రారంభంలోనే దెబ్బతినటంతో రైతులు కన్నీరుమున్నీరువుతున్నారు. 

20:29 - August 21, 2016
20:25 - August 21, 2016

హైదరాబాద్ : భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను కార్మికులు వినియోగించుకోవాలని కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులు  ప్రమాదవశాత్తు మరణిస్తే.. నష్టపరిహారం మొదట్లో 2 లక్షల రూపాయల ఉండేదని, తాను  5లక్షల రూపాయలకు పెంచానని అన్నారు. సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, కార్మికుల సంక్షేమం కోసమే ఆయన ఆలోచిస్తాడని మంత్రి తెలిపారు.

 

20:23 - August 21, 2016

నెల్లూరు : ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్ల నిర్వాకం మరోసారి బయట పడింది. నెల్లూరులో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి.. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. క్షతగాత్రుడు రాజు కాలుకు చికిత్స చేయాల్సిన డాక్టర్లు కుట్లు వేయకుండా... సెక్యూరిటీ గార్డుతో కుట్లు వేయించారు. డ్యూటీలో డాక్టర్ ఉన్నా... రోగిని పట్టించుకోకుండా సెక్యూరిటీ గార్డుతో కుట్లు వేయిస్తుండడంతో బాధను తట్టుకోలేక క్షతగాత్రుడు రాజు పెద్దగా కేకలు వేశాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న 10 టీవీ తన కెమెరాలో షుట్‌ చేస్తుండడంతో... అక్కడున్న డాక్టర్లు కుట్లు వేస్తున్న సెక్యూరిటీ గార్డును అక్కడ నుంచి పంపించి వేశారు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన కాంపౌండర్‌ తనకు కళ్లు సరిగా కనపడకపోవడంతో సెక్యూరిటీ గార్డుని కుట్లు వేయమని చెప్పానని చెబుతున్నాడు. తమకు సంబంధం లేకపోయినా... తమతో డాక్టర్లు ఇలాంటి పనులు చేయించుకుంటున్నారని, చేయకపోతే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని క్షతగాత్రుడికి కుట్లు వేసిన సెక్యూరిటీ గార్డు చెప్పాడు. 

 

20:18 - August 21, 2016

విజయవాడ : సినీ హిరో వెంకటేష్ విజయవాడలో పర్యటించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడకు వచ్చిన వెంకటేష్... ఎంపీ కేశినేని ఆధ్యర్వంలో పుష్కర భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలో ప్రభుత్వం చేసిన పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని వెంకటేష్ అన్నారు.  

20:15 - August 21, 2016
20:09 - August 21, 2016

విజయవాడ : పుష్కరాల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే దాదాపు లక్షా 20 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం. అయితే ఘాట్‌ రోడ్‌ వినాయకుడి గుడి నుంచి ఇంద్రకీలాద్రి చేరుకునే భక్తులు ఏర్పాట్లు సరిగాలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏర్పాట్లన్నీ సక్రమంగా చేసామని అధికారులు చెబుతున్నా, తాము మాత్రం ఇక్కట్లు పడుతున్నామని భక్తులు చెబుతున్నారు.

 

20:06 - August 21, 2016

విజయవాడ : ఏపీలో టీడీపీ వైపు కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. నారా లోకేష్ తో గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, పీసీసీ కార్యదర్శి నరహరిశెట్టి నర్సింహారావు సమావేశం అయ్యారు.

గాంధీభవన్ లో టీపీసీసీ ముఖ్య నేతలు భేటీ

హైదరాబాద్ : గాంధీభవన్ లో టీపీసీసీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ మహారాష్ట్రతో ఒప్పందం సందర్భంగా 23న చేయాల్సిన నిరసన కార్యక్రమాలపై చర్చించారు. 

ఏపీలో టీడీపీ వైపు కాంగ్రెస్ నేతల చూపు

విజయవాడ : ఏపీలో టీడీపీ వైపు కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. నారా లోకేష్ తో గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, పీసీసీ కార్యదర్శి నరహరిశెట్టి నర్సింహారావు సమావేశం అయ్యారు. 

 

19:09 - August 21, 2016

హైదరాబాద్ : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరు 150వ సినిమా పేరు ఖరారైంది. ఆయన తనయుడు చెర్రీ మూవీ పేరును ఫైనల్‌ చేశాడు. సోమవారం చిరు 61వ పుట్టిన రోజు సందర్భంగా చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారు. తమిళంలో సూపర్ హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేస్తున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.
స్వరాలు సమకూరుస్తున్న దేవిశ్రీ ప్రసాద్‌
మెగాస్టార్ రీఎంట్రీ గురించి చర్చ మొదలైనప్పటి నుంచి కథ, దర్శకుడు, హీరోయిన్, టైటిల్ ఇలా ప్రతి అంశంలోనూ గందరగోళమే నెలకొంది. ఈసినిమాకి కత్తిలాంటోడు.. నెపోలియన్‌.. తదితర టైటిల్స్‌ ప్రచారంలోకి వచ్చాయి. చివరికి.. చిరు 150వ సినిమా టైటిల్‌పై క్లారీటి వచ్చింది. చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 150వ చిత్రానికి 'ఖైదీ నంబర్‌ 150' అనే పేరును ఖరారు చేశారు. 
వివి వినాయక్‌ దర్శకత్వంలో చిత్రం 
ఖైదీ నంబర్‌ 150 సినిమా దర్శకుడు వివి వినాయక్‌.. తమిళ మాతృకను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేయించారు. ఈ చిత్రంలో కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కొణెదల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై చిరు తనయుడు రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం చిరంజీవి 61వ పుట్టిన రోజు సందర్భంగా 'ఖైదీ నంబర్‌ 150'కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. 
చిరు 150వ సినిమా కోసం అభిమానుల ఎదురుచూపులు
చిరు 150వ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. చిరు సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సినిమా మొదలవ్వాల్సి ఉన్నా.... చిరంజీవి చిన్నకూతురు శ్రీజ వివాహం కారణంగా సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడింది. 2007లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ హీరోగా చిరంజీవికి చివరి చిత్రం. ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. మధ్యలో తనయుడు రామ్ చరణ్ చిత్రాలు మగధీర, బ్రూస్‌ లీ సినిమాల్లో గెస్ట్ రోల్‌లో అభిమానులను అలరించారు చిరు. 
విజయబాపినీడు దర్శకత్వంలో 'ఖైదీ నంబర్‌ 786'
చిరంజీవి గతంలో కథానాయకుడిగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 'ఖైదీ', విజయబాపినీడు దర్శకత్వంలో 'ఖైదీ నంబర్‌ 786' చిత్రాలు చేశారు. మొత్తంగా చిరు బర్త్‌డే సందర్భంగా.. 'ఖైదీ నంబర్‌ 150'కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనుండడంతో.. మెగా ఫ్యాన్స్‌లో అప్పుడే జోష్‌ మొదలైంది. 

18:59 - August 21, 2016

నల్గొండ : కృష్ణా పుష్కరాల్లో విషాదం చోటుచేసుకుంది. చందంపేట మండలం వైజాగ్‌ కాలనీ సమీపంలో పుష్కర స్నానానికి వెళ్లిన 12 ఏళ్ల బాలుడు హార్దిక్‌ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. కాచరాజుపల్లి పుష్కరఘాట్‌కు కిలోమీటర్‌ దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ఇద్దరు కుమారులతో హార్దిక్‌ తండ్రి పుష్కరాలకు వెళ్లాడు.

 

18:57 - August 21, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో కరవు ఛాయలు అలుముకున్నాయి. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే ఎక్కువే కురుస్తాయని అని చెప్పగానే రైతుల కళ్లలోకి వచ్చిన ఆనందం కాస్తా..వర్షాభావ పరిస్ధితులతో మాయయై పోతోంది. అత్యధిక జిల్లాల్లో లోటు వర్షపాతంతో భూగర్బజలాలు అడుగంటాయి. దీంతో ప్రాజెక్టుల్లోకి సైతం ఆశించిన మేర నీరు చేరకపోవడంతో ఖరీఫ్ సీజన్ పశ్నార్థకంగా మారింది. సీజన్‌ ప్రారంభమై 3 నెలల పూర్తవుతున్నా..చుక్కనీరు లేకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు.   
పలు జిల్లాల్లో కరువు 
తెలంగాణలో మొత్తం కోటి 64 లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా ఈ ఏడాది కోటి ఏడు లక్షల సాగును వ్యవసాయశాఖ టార్గెట్ గా పెట్టుకోంది. ఇందులో 19.48 లక్షల హెక్టార్లలో పత్తి, 34 లక్షల హెక్టార్లలో చెరుకు వంటి పంటలు సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్‌లో సాగుకు తగ్గట్టు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. అంతా బాగానే ఉంది కానీ టార్గెట్ కు అనుగుణంగా సాగవుతుందా అంటే  క్షేత్రస్ధాయిలో చూస్తే అందులో సగం కూడా సాగవడం లేదు. రుతుపవనాలు ఆలస్యంగా రావడం, వర్షాలు తగినంతగా కురవకపోవడం, ప్రాజెక్టుల్లో నీరు సరిపడా రాలేదు. దీంతో భూగర్భ జలాలు సైతం తగినంత లేకపోవడం ఖరీఫ్ సాగును ముందుకు సాగనివ్వడం లేదు. 
తారుమారైన వాతావరణ శాఖ లెక్కలు
తెలంగాణలో వర్షాలు పుష్కలం అని చెప్పుకొచ్చిన వాతావరణ శాఖ లెక్కలు తాజాగా తారుమారయ్యాయి. ఈ నెల 17వ తేదీ నాటికి వర్షపాత లెక్కలు ఓసారి పరిశీలిస్తే ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలోని కొంత భాగంలో మాత్రమే సాధారణం కంటే కొంత ఎక్కువ వర్షపాతం నమోదైంది. మెదక్‌లో 21 శాతం వర్షపాతం లోటు ఉండగా, నల్గొండలో 20 శాతం వర్షపాతం లోటు నమోదైంది. సాధారణ వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో కొంత వర్షాభావ పంటలు వేయగా వర్షపాతం లేని జిల్లాల్లో కరవు ఛాయలు అలుముకున్నాయి. 
అడుగంటిన భూగర్భ జలాలు
ఇదిలా ఉంటే భూగర్భ జలాలు రైతులకు అందనంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 15శాతం అధిక వర్షపాతం కురిసింది. వరంగల్, ఆదిలాబాద్‌లో అధిక వర్షపాతం నమోదుకాగ, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జలాలు 1.91 మీటర్లు పెరిగాయి. కానీ రెండు సంవత్సరాల కరవు వల్ల భూగర్భ జలాల వినియోగం అధికమైంది. దీంతో గతేడాది జులైతో పోలిస్తే ఈ జులైలో నీటిమట్టం మరింత కిందకు దిగజారింది. గతేడాది జులైలో 12.73 మీటర్ల కింద ఉన్న నీరు ఈ జులైలో 13.71 మీటర్ల కిందకు పడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా సగటు చూస్తే..గత ఏడాది కన్నా మరో మీటర్ కిందకు నీరు చేరుకుంది. 
ప్రత్యామ్నాయ పంటలను ప్రొత్సహించాలంటున్న రైతులు  
గడిచిన రెండేళ్లుగా కరువుతో అల్లాడిన రైతన్నలు..ఈ ఏడాది కూడా అలాంటి పరిస్ధితే ఎదుర్కోవాల్సి వస్తోంది. కాబట్టి వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలను ప్రొత్సహించడంతో పాటు కెంటంజెన్సీ ప్లాన్‌ను ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో వైపు కేంద్రానికి నివేదికలు పంపి కరవు నిధులు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

యోగేశ్వర్ దత్ కు చుక్కెదురు....

బ్రెజిల్ : రియో ఒలింపిక్స్ లో రెజ్లింగ్ ప్రీస్టయిల్ 65 కిలోల విభాగంలో యోగేశ్వర్ దత్ కు చుక్కెదురైంది. మంగోలియా రెజ్లర్ చేతిలో యోగేశ్వర్ ఓటమి పాలయ్యారు. 

 

పుష్కర స్నానమాచరించిన ఎంపీ హరిబాబు

విజయవాడ : పున్నమి ఘాట్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు పుష్కర స్నానమాచరించారు. రాష్ట్రానికి కేంద్రం ఇప్పటికే చాలా సాయం చేసిందని చెప్పారు. 

కీలక ఘట్టానికి చేరుకున్న పుష్కరాలు : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : పుష్కరాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్కడా ఎవరూ విశ్రాంతి తీసుకోకూడదని చెప్పారు. అధికారులు, సిబ్బంది దగ్గరుండి సౌకర్యాల పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 30 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారని తెలిపారు. 

17:23 - August 21, 2016

హైదరాబాద్‌ : నగరంలోని కూకట్ పల్లిలో విషాదం నెలకొంది. వాటర్ ట్యాంకర్ ఢీకొని బాలుడు మృతి చెందాడు. ఎల్లమ్మబండలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న బాలుడిని ట్యాంకర్ ఢీకొట్టడంతో బాలుడు అక్కడిక్కకడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

 

17:13 - August 21, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో విషాద ఘటనలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. తాజాగా మరో విషాదం నెలకొంది. కృష్ణవేణిఘాట్‌లో పుష్కరస్నానానికి వచ్చిన ఓ వృద్ధుడికి గుండెపోటు వచ్చింది. సకాలంలోనే అధికారులు స్పందించి ప్రాథమిక చికిత్స అందించినా వృద్ధుడు ఘాట్‌లోనే మృతి చెందాడు. అధికారులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

 

17:02 - August 21, 2016

నల్గొండ : జిల్లాలోని మట్టపల్లి ఘాట్‌కు భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో భక్తులు పుష్కరస్నానానికి భారీగా తరలివస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఘాట్‌లో ఎక్కడ చూసినా భక్తులు దర్శనిమిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:59 - August 21, 2016
16:13 - August 21, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలకు ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో పుష్కరఘాట్లకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విజయవాడలోని ప్రధాన పుష్కర ఘాట్లు అయిన దుర్గా ఘాట్‌, సంగమం ఘాట్లకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. జనంతో ఘాట్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు ఘాట్లకు వెళ్లే దారులన్నీ జనంతో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్య సైతం ఏర్పడింది. అలాగే అటు తెలంగాణలోని నాగార్జున సాగర్‌, పస్పుల ఘాట్‌ లలో సైతం జనం పోటెత్తి వస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరవుతారని ముందే అంచనా వేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

చిరంజీవి 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'

హైదరాబాద్ : చిరంజీవి 150 వ చిత్ర టైటిల్ ను నిర్మాత, హీరో రామ్ చరణ్ ఖరారు చేసింది. చిరంజీవి 150 వ చిత్రం పేరు 'ఖైదీ నెంబర్ 150' గా ఖరారు చేశారు. రేపు చిరంజీవి బర్త్ డే సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్ ను రామ్ చరణ్ విడుదల చేయనున్నారు. 

కృష్ణా పుష్కరాల్లో విషాదం

నల్గొండ : కృష్ణా పుష్కరాల్లో విషాదం నెలకొంది. చందంపేట మండలం వైజాగ్ కాలనీ సమీపంలో పుష్కరస్నానానికి వెళ్లి హర్దిక్ (12) అనే బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి ఇద్దరు కుమారులతో హార్దిక్ పుష్కరాలకు వచ్చాడు. కాచరాజుపల్లి పుష్కర ఘాట్ కు కిలో మీటరు దూరంలో ఘటన చోటుచేసుకుంది. 

కార్మికులకు ప్రభుత్వం చేయూత – నాయినీ..

హైదరాబాద్ : కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని రాష్ట్ర హోం మంత్రి నాయినీ పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల అభ్యున్నతికి పాటు పడతామని హామీ ఇచ్చారు. డ్రైవర్లు, కార్మికులు, జర్నలిస్టులకు ప్రభుత్వం రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తోందన్నారు. 

13:34 - August 21, 2016
13:33 - August 21, 2016

హైదరాబాద్ : మలేరియా వణికిస్తోంది. డెంగీ పంజా విసురుతోంది. తెలంగాణలో ఎవరింటికెళ్లినా జ్వరంతో బాధపడుతున్న పేషెంట్లే కనిపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో సిబ్బంది కొరత వుంటే, ప్రయివేట్ ఆస్పత్రులు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తెలంగాణలో విషజ్వరాలు విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఊరు వాడ, పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రతి చోటా జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రతి ఇంటిలోనూ జ్వరపీడితులు కనిపిస్తున్నారు. ఇంట్లో ఒకరికి జ్వరం తగ్గగానే మరొకరికి మొదలవుతోంది. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. నెలరోజుల్లో మలేరియా కేసులు డబలయ్యాయి. డెంగీ జ్వరం చుక్కలు చూపిస్తోంది. సీజనల్గా వచ్చే ఫ్లూ కూడా విరుచుకుపడుతోంది. గత రెండు నెలల్లోనే జలుబు, దగ్గు, జ్వరాలతో శ్వాసకోశ సమస్యల కేసులు 63వేలకు పైగా నమోదయ్యాయి. 1800కి పైగా మలేరియా కేసులు, 250కి పైగా డెంగీ కేసులు నమోదయినట్టు తెలుస్తోంది. మలేరియా కేసులు అత్యధికంగా ఆదిలాబాద్జిల్లాలో 707 నమోదయ్యాయి. ఖమ్మంలో 601 కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కరోజే 14 మలేరియా కేసుల్ని కొత్తగా గుర్తించారు. హైదరాబాద్లోని ఒక్క ఫీవర్ఆసుపత్రికే రోజుకు సుమారు 2వేల మంది జ్వరపీడితులు వస్తున్నారు. కరీంనగర్, మంథని, గోదావరిఖని, సారంగపూర్, రామడుగు, మహదేవపూర్, మానకొండూరు, హుస్నాబాద్తదితర ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలతున్నాయి.

పలు జిల్లాలో..
వరంగల్ జిల్లాలో హన్మకొండ, వరంగల్నగరాలతో పాటు ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కొత్తగూడ, గోవిందరావుపేట, వెంకటాపురం, భూపాలపల్లి, మహబూబాబాద్, వర్ధన్నపేట, తొర్రూరు, దంతాలపల్లి, నర్సింహులపేట, డోర్నకల్, మరిపెడ మండలాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో జ్వరాల బారినపడుతున్నారు. ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని వాజేడు, చర్ల, చంద్రుగొండ, దుమ్ముగూడెం, వెంకటాపురం, అశ్వాపురం, బూర్గంపాడు, ములకలపల్లి, టేకులపల్లి, గుండాల తదితర మండలాల్లో జ్వరపీడితుల సంఖ్య ఎక్కువగా ఉంది. నిజామాబాద్ జిల్లాలోనూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, దోమకొండ, మద్నూర్మండలాల్లో డయేరియా, విషజ్వరాల కేసులు ఎక్కువగా వున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఆదిలాబాద్సహా సిర్పూర్(యు), నార్నూరు, బూర్కురు, వాంఖేడి, జైనూరు, ఇంద్రవెళ్లి మండలాల్లో మలేరియాతో మంచాన పడుతున్నారు. రిమ్స్ ఓపీ రోగుల సంఖ్య 1000 నుంచి 1500కు చేరింది. ఓ వైపు జనం జ్వరాలతో బాధపడుతుంటే, మరోవైపు చాలా పిహెచ్ సిలలో పలకరించే దిక్కులేదు. సూదులిచ్చేవారు. మందులిచ్చేవారు. దాంతో ప్రయివేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది.

జ్వర పీడితులు...
హైదరాబాద్లోని పలు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జ్వర పీడితుల సంఖ్య భారీగా ఉంది. గ్రామాల్లో వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో డెంగీ జ్వరమనే సందేహమొచ్చిన రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రులు నిలువు దోపిడీ చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. విష జ్వరాలు విజృంభిస్తుండగా (పీహెచ్సీ)ల్లో కనీస వైద్యం కరవవుతోంది. 676 పిహెచ్ సిలలో 2280 ఖాళీలున్నాయి. 13వ ఆర్థిక సంఘం నిధులతో రెండేళ్ల కిందట నిర్మించిన 54 పీహెచ్సీలలో ఇప్పటి వరకూ ఒక్క ఉద్యోగాన్ని కూడా అదనంగా నియమించలేదు. తెలంగాణలోని సగానికిపైగా ఆరోగ్య కేంద్రాల్లో సగానికి పైగా పీహెచ్సీల్లో ఒక్క డాక్టరే వున్నారు. 

13:27 - August 21, 2016

హైదరాబాద్ : కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌లో దోపిడీదొంగలు బీభత్సం సృష్టించారు. కేటీఆర్‌కాలనీ, నిజాంపేట్‌ రోడ్డులోని పలుఇళ్లలో దొంగలుచోరీకి యత్నించారు. బాలాజీ, మిడోస్‌ విల్లాలోని 130 వ ఫ్లాట్‌లో డోర్‌ పగులగొట్టి 9 లక్షలనగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అకిలా విల్లాలోని ఫ్లాట్‌నెం 130 లోను దొంగలు 50 వేల రూపాయలు, 5 లక్షల విలువైన నగలు ఎత్తుకెళ్లారు. దోపిడీని అడ్డుకున్న వారిపై రాళ్లతో దాడిచేశారు దొంగలు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.  

13:25 - August 21, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూం అత్యంత సమర్థవంతంగా పనిచేసిందని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఇప్పటి వరకూ 1 కోటి 30 లక్షల మంది పుష్కరస్నానం ఆచరించారని, పుష్కర ఏర్పాట్లపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పుష్కరాల తర్వాత కూడా కమాండ్‌ కంట్రోల్‌ రూంలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. 

13:22 - August 21, 2016

హైదరాబాద్ : పుష్కరాలు ముగింపు దశకు చేరడంతో గుంటూరు అమరావతిలోని పుష్కరఘాట్లన్ని భక్తులతో కిటకిటలాడుతోంది. అమరాశ్వేరలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలో బారులుతీరారు. ఆదివారం కావడంతో భక్తులందరూ పుష్కర స్నానానికి పరుగులు పెట్టారు. దీంతో గుంటూరు నగరమంతా భక్త జనసంద్రాన్ని తలపిస్తోంది.

మహబూబ్ నగర్ లో...
పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో భక్తుల సంఖ్య గంట గంటకు పెరిగిపోతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని రంగాపూర్ ఘాట్‌లో పుష్కర స్నానం చేసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆయన తల్లిదండ్రులకు పిండప్రధానం చేశారు. బీచుపల్లి వద్దనున్న ఘాట్ ల వద్దకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వీకెండ్ కావడంతో హైదరాబాద్..వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. మరో మూడు రోజులే ఉండడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. బీచుపల్లి వద్దనున్న వీఐపీ ఘాట్ ల వద్ద సినీ నటులు, రాజకీయ నేతలు పుష్కర స్నానమాచరించారు. మరింత వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:20 - August 21, 2016

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు సోమవారం హైదరాబాద్‌కు రానుంది. ఆమెకు స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల30 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సింధు, గోపిచంద్‌ విమానం దిగిన అనంతరం గచ్చిబౌలి స్టేడియం వరకు ర్యాలీ ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి తెలిపారు. ఈ మార్గం ప్రధాన కూడళ్ల వద్ద విద్యార్థులు, నగర పౌరులు సింధుకు పెద్ద ఎత్తున అపూర్వ స్వాగతం పలుకుతారని కమిషనర్‌ తెలిపారు. అనంతరం గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇటు సింధు ప్రయాణించే శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకూ పెద్ద ఎత్తున స్వాగత హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను కమిషనర్‌ ఆదేశించారు.
అంకితభావంతో శ్రమిస్తే..అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని పీవీ సింధు నిరిపించింది. కఠోర సాధనతో ఫలితం సాధించడమే కాదు..పేరుప్రఖ్యాతులు, సిరిసంపదలు ఒకదాని వెనుక ఒకటిగా నడుచుకొంటూ వస్తాయనడానికి..21 ఏళ్ల పీవీ సింధు సాధించిన విజయమే ఓ నిదర్శనం.

13:06 - August 21, 2016

'అ ఆ' సినిమాతో 'నితిన్' కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ అందుకున్న కొత్త సినిమా విషయంలో బాగా జాగ్రత్త పడుతున్నాడు. యంగ్ హీరో చూపు లేటేస్ట్ గా స్టైలీష్ డైరెక్టర్ పై పడినట్లు సమాచారం. సదరు డైరెక్టర్ కూడా నితిన్ కోసం మంచి యాక్షన్ లవ్ స్టోరీ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ నితిన్ ఏ డైరెక్టర్ తో కొత్త మూవీకి సన్నాహాలు చేస్తున్నాడో తెలుసుకోవాలంటే చదవండి..త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అఆ మూవీ కెరీర్ పరంగా నితిన్ కి మెమరబుల్ హిట్టుని అందించింది. ఈ చిత్రం నటుడిగా నితిన్ కి మంచి పేరు తీసుకొచ్చింది. అంతేకాదు అఆతో ఈ హీరో 50కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు. ఇలా 'అ ఆ' చిత్రం నితిన్ కి కెరీర్ పరంగా గుర్తుండిపోయే చిత్రంగా మిగిలింది. దీంతో నితిన్ కొత్త మూవీని స్టార్ చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

సురేందర్ రెడ్డి...
'అ..ఆ' మూవీ రిలీజై 50రోజులు దాటింది. అయిన కూడా కొత్త సినిమాను ఫైనల్ చేయని నితిన్ లేటస్ట్ గా స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ దర్శకుడితో మూవీ చేస్తేనే తనను లవర్ బాయ్ గా, యాక్షన్ హీరో ప్రజెంట్ చేస్తాడని నితిన్ నమ్ముతున్నాడు. సురేందర్ రెడ్డి కూడా నితిన్ కోసం మంచి యాక్షన్ లవ్ స్టోరీని సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్ తో 'ధృవ' మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఆ తరువాత ఈ డైరెక్టర్ ఫ్రీ కానున్నాడు. అప్పటి వరకు నితిన్ సురేందర్ రెడ్డి కోసం వెయిట్ చేస్తాడా లేక మరో దర్శకుడితో కొత్త సినిమాకి కమిట్ అవుతాడా చూడాలి.

ఛత్తీస్ గఢ్ లో బాంబు పేలుడు..

ఛత్తీస్ గఢ్ : సుక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలడంతో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఇతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

డీఎంకే ఎమ్మెల్యేలపై ఎఫ్ఐఆర్..

చెన్నై : సచివాలయం ఎదుట ధర్నాకు దిగిన డీఎంకే శాసన సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జయలలిత ప్రభుత్వాన్ని, అసెంబ్లీలో అన్నాడీఎంకే పార్టీ వైఖరిని విమర్శిస్తూ, భారీ ఎత్తున కార్యకర్తలతో సెక్రటేరియట్ వద్ద నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. 

12:35 - August 21, 2016

మనసు తునాతునకలైన చోట అశ్రునది వింత శబ్దంతో ప్రవహిస్తూనే ఉంటుంది. జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా తెగి పడుతున్నపుడు ఆశలు ఆకాంక్షలు నీటిపాలై అంతరంగాన్ని అతలాకుతలం చేస్తుంటాయి. అంటూ అద్భుత భావుకతతో, వాస్తవికతతో కవిత్వం రాస్తున్న విలక్షణ కవి సాహిత్య ప్రకాశ్. కరువు సీమలో పుట్టి కన్నీటి బతుకులు చూసి వేదనతో చలించి జ్వలించి కవిత్వమై ఎగసిపడిన ధర్మాగ్రహ కెరటమతడు. ఒక సంచలిత రాగం కవితాసంపుటితో పాటు నయనం ఆలపించిన రాగం కథా సంపుటిని వెలువరించిన అభ్యుదయకవి సాహిత్య ప్రకాశ్ విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి..

12:33 - August 21, 2016

సాహిత్యం చీకటితో ఉన్న ప్రజా సమూహాలను వెలుగు దారుల వైపు నడిపిస్తుంది. సామాజిక పరిణామాలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంది. ఎందరో సృజనకారులు తమ రచనలతో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. నిరంతర చలనంతో సమాజాన్ని పరికిస్తూ సామాజిక ఉద్యమాలకు, కల్లోలిత సందర్భాలకు తమ కలంతో గళంతో బాసటగా నిలుస్తున్నారు. సంద్రంనుంచి జలపాతాల వరకు రచయితలు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, విద్యార్ధులతో కల్లోలిత ప్రాంతంలో చిత్ర కూటమి యాత్ర జరిగింది.

ఆగస్టు నెలలో ప్రారంభం..
విశేషాల సమాజాన్ని అనునిత్యం పరిశీలిస్తూ సాగే ప్రయాణం మనిషికి కొత్త పాఠాలు నేర్పుతుంది. ప్రకృతితో, వివిధ సంస్కృతులతో అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. జీవితాలను వెలిగిస్తుంది. చిత్రకూటమి ఇదే లక్ష్యంతో ముందుకు సాగింది. చత్తీస్ ఘర్ లో గిరిజనుల జీవన విధ్వంసాన్ని గమనిస్తూ, ప్రకృతి సౌందర్యానికి పరవశిస్తూ సాగిన ఈ మూడు రోజుల యాత్ర విజయవంతంగా ముగిసింది. ప్రరవే ఏపీ, మహిళా చేతన, సంస్కృతి గ్లోబల్ స్కూల్, తెలుగు రీడర్స్ క్లబ్, టెన్ టీవీ అక్షరం సంయుక్తంగా నిర్వహించిన ఆ కార్యక్రమ విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

12:13 - August 21, 2016

పుష్కరాల ఏర్పాట్లపై బాబు టెలికాన్ఫరెన్స్..

కృష్ణా : పుష్కరాల ఏర్పాట్లపై ఇన్ ఛార్జీలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాల్లో రానున్న రెండు రోజులు కీలకమైనవని బాబు తెలిపారు. భక్తుల సౌకర్యాలను అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. పుష్కరాల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లు ఉండాలని తెలిపారు. పద్మావతి ఘాట్ వద్ద అమ్మ ఒడి కార్యక్రమం అభినందనీయమన్నారు. అమ్మ ఒడి కార్యక్రమాన్ని ఇతర ఘాట్ల వద్ద కూడా కొనసాగించాలన్నారు. ఘాట్ల వద్ద యాత్రికులు గుమిగూడకుండా ఉండేలా పోలీసులు చూడాలన్నారు. 

12:06 - August 21, 2016

స్టార్ కొరియోగ్రాఫర్ 'జానీ మాస్టర్'... ప్రముఖ హీరోలకు ఆయన కొరియో గ్రాఫర్ గా చేరారు. రేసుగుర్రం..జులాయి..రచ్చ..ఎవడు లాంటి సినిమాలతో కొరియోగ్రాఫర్ గా టాప్ రేంజ్ కు చేరుకున్నారు. తాను డైరెక్టర్ అవుదామని వచ్చి కొరియోగ్రాఫర్ గా అయిపోయాయని జానీ మాస్టర్ పేర్కొన్నారు. టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలను తెలియచేశారు. కేవలం డబ్బు సంపాదించుకోవడానికే ఇండస్ట్రీకి రావడం జరిగిందని కుండబద్ధలు కొట్టారు. కానీ దీనికి ఒక కారణం ఉందని పేర్కొన్నారు. ఒక అనాథ శరణాలయం..పెద్ద ఆసుపత్రి కట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. హెల్ప్ చేయాలనే భావనతో చేస్తున్నట్లు జానీ మాస్టర్ పేర్కొన్నారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

కుప్వారాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం..

జమ్మూ కాశ్మీర్ : కుప్వారాలో భారత బలగాలు..ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. నాలుగు పారా ఇండియన్ ఆర్మీ దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

11:25 - August 21, 2016

విజయవాడ : ఏపీ, తెలంగాణలో పదో రోజు కృష్ణా పుష్కరాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. పదో రోజు..ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులతో కృష్ణ సాగర తీరాలు పులకించిపోతున్నాయి. భక్తుల సందడితో ఘాట్లు సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. 
కృష్ణవేణి ఘాట్ లో..
విజయవాడ : కృష్ణవేణి ఘాట్ లో భక్తులతో నిండిపోయింది. దుర్గా ఘాట్ లో కూడా జనం కిక్కిరిసిపోవడంతో ఘాట్ ను మూసివేశారు. కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఇప్పటి వరకు 1.50 వేల మంది అమ్మవారి దర్శనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణవేణి ఘాట్ లో అపశృతి చోటు చేసుకుంది. పుష్కర స్నానానికి వచ్చిన వృద్ధుడికి గుండెపోటు వచ్చి మృతి చెందాడు.

నల్గొండలో...
నల్గొండ : జిల్లాలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. రెండు రోజుల్లో పుష్కరాలు ముగుస్తుండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. శివాలయం ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఘాట్ లలో ఎక్కువ సేపు స్నానాలు చేయకుండా వెంట వెంటనే జరిగే విధంగా చూడాలని కోరుతున్నట్లు శివాలయం ఆర్డీఓ టెన్ టివితో పేర్కొన్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో భారీగా ట్రాఫిక్ జాం..
మహబూబ్ నగర్ జిల్లా బీచుపల్లికు భక్తులు తరలివస్తున్నారు. బీచుపల్లి వద్ద పుష్కర స్నానమాచరించేందుకు భక్తులు భారీగా వస్తుండడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జాతీయ రహదారిపై నగరం నుండి వస్తున్న వాహనాలు బారులు తీరాయి. శనివారం కూడా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు పలు చర్యలు తీసుకున్నారు. కానీ ఆదివారం కూడా అదే పరిస్థితి తలెత్తినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. టోల్ గేట్ ల వద్ద ఉచిత ప్రవేశం కల్పించాలన్న కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ అయ్యాయి. 

సంగమం పుష్కర్ ఘాట్ వద్ద విద్యార్థుల ఆందోళన..

పశ్చిమగోదావరి : సంగమం పుష్కర ఘాట్ వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. మీ సేవలు తమకు అవసరం లేదని, స్టూడెంట్స్ వాలంటీర్స్ ను పోలీసులు గెంటివేశారు. వాలంటీర్ సర్వీసు నుండి 200 మంది విద్యార్థులు విచ్చేశారు. సేవ చేసేందుకు వస్తే పోలీసులు అవమానించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 

కుప్వారలో ఎన్ కౌంటర్...

జమ్మూ కాశ్మీర్ : కుప్వారలోని తంగ్దార్ ఏరియాలో ఉగ్రవాదులు...భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

10:43 - August 21, 2016

ఆయనో మెగా మెరుపు..మహా వెలుగు..ఆయన పేరే వైబ్రేషన్..ఆయన డ్యాన్సో సెన్సేషన్..టోటల్ గా ఆయన స్టైలో సెలబ్రేషన్...దాదాపు మూడు దశాబ్దాల కాలం పాటు వెండి తెరనేలిన ఆ మెగా మహారాజు చిరంజీవి. ఆ కోట్లాది అభిమానుల గుండె చప్పుడు... ఇప్పుడు విజయధ్వానమై వినిపిస్తోంది. ఆయన 62 వ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి నట ప్రస్థానంపై ప్రత్యేక కథనం..చిరంజీవిది సాధారణమైన ఇమేజ్ కాదు. అసాధారణమైన విజయాలను ఒంటి చేత్తో సాధించి, తెలుగు తెర శిఖరాగ్రంపై నిలిచిన అసమాన్యమైన ఇమేజ్. కోట్లాది మంది అభిమానులకు తెరవేలుపుగా నిలిచిన ఆయన ప్రస్థానం అద్వితీయమైనది.

60 ఏళ్ల కిందట...
సరిగ్గా 60ఏళ్ళ క్రిందట గోదారి దారిలో వున్న మొగల్తూరుకి తెలియకపోవచ్చు తాను భవిష్యత్ లో సినీ సంచలనానికి కేంద్రబిందువుగా నిలవనున్న పసిబిడ్డను మోస్తున్నానని తల్లి అంజనాదేవికి అప్పుడు తెలిసివుండక పోవచ్చు. తెలుగు సినిమా సింహాసనాన్ని ఏలే మొనగాడి బోసి నవ్వులు వింటున్నానని. కట్ చేస్తే తనొక సినీ శిఖరంగా ఎదిగాడు. అప్పటికే ఎన్.టి.ఆర్ దేవుడిగా పూజింపబడుతున్నాడు. ఏ.ఎన్.ఆర్ నవలానాయకుడిగా ప్రేమింపబడుతున్నాడు కృష్ణ కొత్తదనంతో కీర్తింపబడుతున్నాడు. వీరి ముందు నిలబడాలంటే ఏం చెయ్యాలి అన్న ప్రశ్నకు తనదైన శైలిలో డ్యాన్స్ ని ఎంటర్ టైన్మెంట్ ని కామెడి ని మాస్ ని కలబోసి తనకంటూ ఒక బెంచ్ మార్క్ సృష్టించుకున్నాడు. నేటి మేటి మెగాస్టార్ అయ్యాడు. ఈ స్థితికి చేరడానికి చిరంజీవి ఎన్నో ఎత్తు పల్లాల్ని ఎక్కి దిగాడు. మరెన్నో ఎత్తుల పై ఎత్తులకు చిత్తవక ఎంతో ఎదిగాడు.

తెలుగు సినిమాని కమర్షియల్ ఎక్స్ప్రెస్ ఎక్కించిన ఘనుడు చిరంజీవి. అప్పటివరకూ కనీ వినీ ఎరుగని హీరోయిజం కళ్ళముందు కదలాడే సరికి అభిమానులు ఉబ్బితబ్బిబ్బైపోయేవారు. సుప్రీమ్ హీరో మెగాస్టార్ ల బిరుదులు చిరు ముందు నిలుచుని సత్కారాన్ని అందుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మూడు దశాబ్దాలపాటు తెలుగు వాళ్ల గుండెల్లో మెదలిన రూపం. తన నటన, డాన్స్ లతో అశేష జనవాహిని తన అభిమానులు మార్చుకున్న ఘనత ఆయన సొంతం. నటనలో మాత్రమే కాదు డాన్సర్, సింగర్, ప్రొడ్యూసర్, బిజినెస్..ఇలా ప్రతి రంగంలో సక్సెస్ లైఫ్ ని సాధించారు. ఆయన నటన, సమాజ సేవ..కోట్లాది అభిమానులను సంపాదించిపెట్టింది. టిక్కెట్ దొరికితే పండగలు.. ఫస్ట్ షో పడకపోతే ధర్నాలు ప్రధాన కూడలి థియేటర్ ల దగ్గర ట్రాఫిక్ జామ్ లు కట్ అవుట్ లకు పాలాభిషేకాలు ఇటువంటి వెర్రి అభిమానాలకి నిలువెత్తు నిదర్శనం చిరంజీవి సినిమాలే. చిన్న పిల్లలు కొత్తగా ఒక డైలాగ్ చెప్పినా ఒక స్టెప్పేసినా చిన్నగా నవ్వించినా 'ఈడు పెద్దయ్యాక చిరంజీవైపోతాడు' అన్న డైలాగ్ ప్రతీ ఇంట్లో కూడా పడేది.

మొగల్తూరులో జననం..
మొగల్తూరు లో జన్మించిన చిరంజీవి నట ప్రస్థానం 1978 లో ప్రారంభమైంది. సరిగ్గా అప్పుడే ఆయన సినీ జీవితానికి పునాది రాళ్ళతో పునాది పడింది. ప్రాణం ఖరీదు విడుదలైన తొలి చిత్రమైంది. అక్కడనుంచి చిరంజీవి కెరీర్ అంచెలంచలుగా ఎదిగింది. 1978 లో శిక్షణాకాలం పూర్తవుతున్న సమయంలో 'పునాది రాళ్ళు' సినిమాలో నటించే ఆవకాశం రావటంతో చిరంజీవి సినీ ప్రస్థానం మొదలయింది. తరవాత వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా వినియోగించుకుని ఆనతికాలంలోనే మంచి నటుడిగా, మంచి డాన్సర్ గా పేరు గడించారు. మొదట ప్రతినాయక పాత్రలలో నటించినా తరవాత హీరో గా రాణించడం మొదలయింది. 1983 లో విడుదల అయిన 'ఖైది ' తెలుగు సినిమా పరిశ్రమకు ఓ పెద్ద స్టార్ నీ ప్రసాదించింది. అదిరిపోయే డాన్సు లుతో , ఫైట్ లతో వచ్చిన మాస్ ఫాలోయింగ్ తో సుప్రీంహీరోగా తరవాత మెగా స్టార్ గా కోటానుకోట్ల అభిమానులను సంపాదించుకుని స్టార్ ఇమేజ్ కు కొత్త నిర్వచనం చెప్పారు అయన. తరవాత తెలుగు సినిమాలో స్టార్ హీరో గా నిలదొక్కుకోవాలంటే డాన్సు చేయడం, ఫైట్స్ చేయడం అనేవి ప్రధాన అర్హతలు అయ్యాయి. ఇప్పటికి అదే భావనలో తెలుగు ప్రేక్షకులు ఉండటం చూస్తుంటే చిరంజీవి ఎంతలా ప్రభావితం చేసారో ఊహించవచ్చు.

అద్భుతమైన టైమింగ్...
మాస్ కామెడీకి చిరంజీవి పెట్టింది పేరు. దానికి ఆయన వాడే బాడీ లాంగ్వేజ్ , లాంగ్వేజ్ ఎప్పటికీ డిఫరెంటే. అద్భుతమైన టైమింగ్ తో ఆయన చేసే కామెడీ మాస్ జనానికి భలే కిక్కెస్తుంది. దొంగమొగుడు, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడులోని ఆయన పెర్ఫార్మెన్సే దీనికి నిదర్శనం. ఎంటర్ టైన్మెంట్ లో సైతం వైవిధ్యం చిరు నైజం. నా ముక్కుమీద ఇలా వేలు పెట్టి అంటూ త్రాగుబోతు పాత్రలో నవ్వు తెప్పించిన తీరు అసామాన్యం. నాయకుడు కులం నుండి కాదు జాతి నుండి పుడతాడన్న సూత్రాన్ని జ్ఞప్తి చేసినా స్టైల్ గా ప్యాంట్ జేబులో చెయ్యి పెట్టుకుంటే అదికాస్తా చిరిగి బయటకు కనిపించి నవ్వించినా అంతెందుకు కేవలం లుంగీ కట్టి నోట బీడీ పట్టినా, స్టైల్ గా వంగి నమస్కారం పెట్టినా, చెయ్యి చూపించి రఫ్ఫాడిస్తానని చెప్పినా, అంతొద్దు ఇదిచాలని చెప్పినా, లెంగ్త్ ఎక్కువైంది కట్ చేస్తానని చెప్పినా, బాక్స్ బద్దలైపోద్దని, జంక్షన్ జామైపోద్దని వార్నింగిచ్చినా ... ప్రేక్షకులు చిరంజీవి నటనకు, ఎపీరెన్స్ కి, ఆ స్టైల్ కి బ్రహ్మరథం పట్టారు.

విజయాల సంకలనం..
మెగాస్టార్ అంటే విజయాల సంకలనం. ఎవరూ సాధించలేని విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నారు చిరంజీవి. ఎన్నో చిత్రాలు చేసి మెగాస్టార్ అనే శిఖరానికి చేరుకున్న మెగానటుడు చిరంజీవి. చిరంజీవి నెలకొల్పిన రికార్డులన్నీ కలిపితే అదొక రికార్డు. 149 సినిమాలు అందులో 100కు పైగా కమర్షియల్ హిట్లు 30 కి పైగా బ్లాక్ బస్టర్ లు.. అయినా కేవలం సినిమా గురించి కలెక్షన్ల గురించి మాత్రమె మాట్లాడుకునే సాధారణ వ్యక్తి కాదు చిరు. సామాజిక సేవతో అభిమానులను ముందుండి నడిపించిన వ్యక్తి చిరంజీవి. అసలు తెలుగు ప్రేక్షకుడికి తమ షర్టు కాలర్ విలువ తెలిపిన ఘనుడు చిరు. అతనోదిలెళ్ళి పోయాక నెంబర్ 1 స్థానం 9ఏళ్ళు గడిచినా అలానే ఖాళీగా వుందంటే చిరంజీవి ఇమేజ్ ఏ రేంజ్ లో ఉండేదో ఊహించుకోవచ్చు. మళ్లీ ఇప్పుడు మెగాస్టార్ స్టైల్ గా చిరు స్మైలిచ్చి ఒక స్టెప్పేస్తే చాలు మెగాభిమానులకు పండగే పండగ.

మేకప్ వేసుకున్న చిరు..
మళ్లీ 9 ఏళ్ళ తర్వాత చిరంజీవి, తన వేలుపట్టి నడిపించిన వెండితెరకు తిరిగొచ్చారు. తన దైన స్టైల్లో మళ్లీ డ్యాన్సులతో, ఫైట్స్ తో, యాక్టింగ్ తో మరిపించాలని డిసైడయ్యారు. కత్తి లాంటి కథతో కత్తి కన్నా పదునైన ఆలోచనలతో ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయాలని కష్టపడుతున్నారు చిరంజీవి. చిరు ఇమేజ్ ను వెండితెరమీద బ్యాలెన్స్ గా నిలపడం ఏ దర్శకుడికైనా కత్తి మీదసామే. అయితే ఆ ఛాలెంజ్ ను చాలా సంతోషంగా స్వీకరించి చిరంజీవి 150 వ సినిమాను టేకప్ చేసాడు వివివినాయక్. మాస్ లో హీరో ఇమేజ్ ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టే వినాయక్ , చిరంజీవితో ఆల్రెడీ ఠాగూర్ తో బ్లాక్ బస్టర్ సాధించాడు. దాని వల్లే ఇప్పుడు చిరంజీవి తన 150 వ సినిమా భాధ్యతను కూడా వినాయక్ భుజాలమీద పెట్టాడు. తనను ఎలా చూడ్డానికి తన అభిమానులు ఇష్టపడతారు అనే కోణంలో చిరు ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నారు. మళ్లీ తన ట్రేడ్ మార్క్ డ్యాన్సులతో మాస్ జనానికి పూనకం తెప్పించడానికి రకరకాల డ్యాన్సింగ్ మూమెంట్స్ తో ఫ్లోర్ మీద రెచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారు చిరంజీవి. సో..ఆయన తలుచుకుంటే మళ్లీ డాన్సులతో అదరగొట్టడం ఎంతసేపూ...ఒక స్టెప్పేసినంత తేలిక.

దటీజ్ మెగాస్టార్..
రజినికాంత్ + కమల్ హాసన్ = చిరంజీవి' అని బాలచందర్ కీర్తించారు. 'హి ఇస్ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా' అని అమితాబ్ తేల్చేశారు. వీక్ మ్యాగజైన్ చిరు రెమ్యునరేషన్ గురించి రాస్తూ బిగ్గర్ దేన్ బచ్చన్ అని కీర్తించింది. అలాంటి చిరంజీవి మళ్లీ ఇన్నాళ్ళకు వెండితెరమీద వెలిగిపోతుంటే.. మెగాభిమానుల కళ్లల్లో కోటి కాంతులు విరబూస్తాయి. దటీజ్ మెగాస్టార్.  

నాగవరప్పాడులో దంపతుల ఆత్మహత్యాయత్నం..

ఖమ్మం : మధిర మండలం నాగవరప్పాడులో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలే కారణమని బంధువులు పేర్కొంటున్నారు. 

ఇంద్రకీలాద్రిలో జనమే..జనం..

విజయవాడ : ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. కిలోమీటర్ మేర క్యూ లైన్ ఉండడంతో భక్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది. 

10:33 - August 21, 2016
10:29 - August 21, 2016

కడప : తెల్లారితే పెళ్లి...పెళ్లి వారి ట్రాక్టర్ బయలుదేరింది..కొన్ని కిలోమీటర్లు దాటారు..ట్రాక్టర్ లో డీజిల్ అయిపోయింది. పక్కనే ఓ పక్కన ట్రాక్టర్ ను డ్రైవర్ పార్క్ చేశాడు..ఇంతలో మృత్యువులా దూసుకొచ్చిన ఓ లారీ ట్రాక్టర్ ను అమాంతం ఢీకొట్టింది. విషయం తెలిసేలోగా ఐదు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. కడప జిల్లా దువ్వూరు మండలం ఎగిరిపల్లి బైపాస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అల్లంకుంట్ల వెంకటరమణ, బత్తన్నల లక్ష్మీ ప్రసన్న, గంప బాలకృష్ణ, పెద్దయ్య, బాలరాజులు ట్రాక్టర్ కింద పడి మృతి చెందారు. క్షతగాత్రులను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పచ్చని పెళ్లింట తీవ్ర విషాదం నింపింది.

10:23 - August 21, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఉందా ? టిటిడిపి వర్కింగ్ ప్రెసిండెంట్ ప్రశ్నించారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టి.టిడిపి కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. అంతకంటే ముందు రేవంత్ రెడ్డి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ సమక్షంలో పలువురు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వారిని ఉద్దేశించి రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా పత్రికల ప్రకటనలలో..టివి యాడ్స్ లలో మాత్రమే కనిపిస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో టిడిపిని సొంతంగా నిలబెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 

10:22 - August 21, 2016

చిత్తూరు : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..కనకభూషణం లే అవుట్ లో ఉన్న ఎర్రయ్య (50) కుటుంబం నివాసం ఉంటోంది. ఇంట్లో గ్యాస్ లీక్ అవుతున్న విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. ఆదివారం తెల్లవారుజామున సమయంలో లైట్ వేయడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఆ వెంటనే గ్యాస్ సిలిండర్ కు మంటలు వ్యాపించాయి. మంటలను ఆర్పడానికి ఎర్రయ్య ప్రయత్నించడం..సిలిండర్ పేలిపేవడం జరిగిపోయాయి. పేలుడు ధాటికి ఇళ్లు ఓ వైపు కుప్పకూలిపోయింది. ఎర్రయ్య శరీరం ఛిద్రమైంది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఎర్రయ్య భార్య రెడ్డమ్మ, కూతురు శర్మిల, మనువడు మణికంఠలకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాలకు గురైన వీరిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

10:10 - August 21, 2016

చిత్తూరు : శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కారు డ్రైవర్ కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఘటన తిరుమలలో చోటు చేసుకుంది. ప్రొటోకాల్ కు విరుద్ధంగా జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే...శ్రీవారి దర్శనం కోసం లంక అధ్యక్షుడు మైత్రిపాల కుటుంసభ్యులతో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న మైత్రిపాల ఆలయం బయటకు వచ్చారు. కానీ అక్కడ డ్రైవర్ లేకపోవడంతో కారులోనే మైత్రిపాల కారులో కూర్చొవాల్సి వచ్చింది. ఇలా పది నిమిషాల పాటు కూర్చొన్నారు. 
దర్శనానికి వెళ్లిన డ్రైవర్..
డ్రైవర్ కోసం వాకబు చేస్తే శ్రీవారి దర్శనానికి వెళ్లాడని తెలిసింది. దీనితో మైత్రిపాల పది నిమిషాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. అనంతరం డ్రైవర్ రావడంతో మైత్రిపాల వెళ్లిపోయారు. ఓ దేశాధ్యక్షుడికి జరిగిన పరిణామంతో అధికారులు విస్తుపోయారు. డ్రైవర్ కు దర్శనానికి వెళ్లేందుకు ఎవరు అనుమతినిచ్చారు ? ఆయన ఎలా వెళ్లాడనేది తెలియరావడం లేదు. ఓ దేశాధ్యక్షుడు వేచి చూసేలా చేసిన ఆలయ అధికారుల తీరుపై ఆయన భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అర్బన్ ఎస్పీ జయలక్ష్మి మండిపడ్డారు. 

కోచిలో పోలీసు అధికారి మృతి..

కోచి : పోలీసు అధికారి సాబు మ్యాథ్యూ మృతి చెందారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరైనా హత్య చేశారా ? ఇతర కారణాలున్నాయా ? అనేది తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

రంగంలోకి ఎన్డీఆర్..ఆర్మీలు - చౌహాన్..

మధ్యప్రదేశ్ : రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్ డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. 

09:30 - August 21, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అధికార పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. నిన్న ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించిప్పటికీ..కొన్ని జిల్లాల్లో మాత్రం ఆందోళనలు చల్లారడంలేదు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రభుత్వానికి కత్తిమీద సాములాగా మారుతోంది. తెలంగాణాలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కానీ అదే స్థాయిలో నిరసనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం సిద్ధం చేసిన ముసాయిదానూ అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని ప్రభుత్వం ముందుంచాయి. అయితే జిల్లాల విభజన ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఎన్నో మార్పులు-చేర్పులు తెరపైకి వస్తూనే ఉన్నాయి. దీంతో మండలాలు, రెవెన్యూడివిజన్ల నుంచి జిల్లాల వరకు కూడా ప్రజల తమ తమ నిరసనలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు.

సిరిసిల్లా జిల్లా అవసరం లేదన్న ప్రభుత్వం..
ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్‌ను జిల్లా కేంద్రం చేయోద్దంటూ అధికార పార్టీకి చెందిన నేతలే కేబినెట్ సబ్ కమిటీ ముందు స్పష్టం చేశారు. కాని ముసాయిదాలో మాత్రం నిర్మల్ జిల్లా కేంద్రంగా మారుతుందంటూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఇప్పటికే వెల్లడించింది. అదే విధంగా సిరిసిల్ల జిల్లా చేయాలనే ప్రతిపాదనను అధికార పార్టీ నేతలు వ్యతిరేకించారు. కానీ సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలంటూ అక్కడ ఆందోళనలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి.

వరంగల్ జిల్లాలో...
వరంగల్ జిల్లాలో కూడా జనగాంను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ తీవ్రంగా వినిపిస్తున్నా..చివరి నిమిషంలో హన్మకొండ కొత్తగా తెరపైకి వచ్చింది. దీంతో జనగాంలో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాలను జిల్లా కేంద్రం చేయాలని మెజారిటీ రాజకీయ పార్టీలు కలిసి డిమాండ్ చేస్తున్నాయి. అయితే ముసాయిదా ప్రకారం నాగర్ కర్నూల్, వనపర్తిలు జిల్లాలుగా ఏర్పాటవుతున్నాయనే విషయం స్పష్టమైంది. దీంతో గద్వాల జిల్లా డిమాండ్ మరింత గట్టిగా వినిపించాలనే అభిప్రాయానికి అఖిలపక్షం నేతలు సిద్ధమవుతున్నారు. దీంట్లో అధికార పార్టీ నేతలు కూడా కీలక పాత్రనే పోషిస్తున్నారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మరో అడుగు ముందుకేసి గద్వాలను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే..తాను ఆమరణ దీక్షకు సిద్ధమని ప్రకటన కూడా చేశారు.

నేతల అయోమయం..
క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఆందోళనలన్నీ జేఏసీల ఆధ్వర్యంలో జరుగుతుండడంతో అధికార పార్టీ నేతలు కూడా మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి క్షేత్ర స్థాయిలో కనిపిస్తోంది. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వరకు ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటుందన్న ధీమా గులాబి నేతల్లో కూడా కనిపించడం లేదు. దీంతో స్థానికంగా తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు అధికార పార్టీ నేతలను అయోమయానికి గురి చేస్తున్నాయి.

09:19 - August 21, 2016
09:16 - August 21, 2016

హైదరాబాద్ : మియాపూర్ సిగ్నల్ జైలో కారు బీభత్సం సృష్టించింది. ఒకరి ప్రాణాలు తీయడమే గాక మరో ఇద్దరికి గాయాలు పాలు చేసింది. ఆదివారం ఉదయం మియాపూర్ సిగ్నల్ వద్ద జైలో కారు అదుపు తప్పి జనాల మీదకు దూసుకొచ్చింది. కారు డ్రైవర్ రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టాడు. అనంతరం బైక్ పై వెళుతున్న వారిని ఢీకొట్టాడు. దీనితో బైక్ పై కూర్చొన్న వ్యక్తి కింద పడిపోయి మృతి చెందాడు. అనంతరం కారు డ్రైవర్ అదే స్పీడ్ తో ఆటోను ఢీ కొట్టబోయి తప్పించుకుని ఆగకుండా వెళ్లిపోయాడు. మృతి చెందిన వ్యక్తి ఎవరనేది తెలియడం లేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటాన ప్రదేశానికి చేరుకున్నారు. కారు ఎవరిది ? ఎవరు నడుపుతున్నారనేది తెలియ రాలేదు. కారు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

మహబూబ్ నగర్ ఘాట్లకు పోటెత్తిన భక్తులు..

మహబూబ్ నగర్ : పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. తెల్లవారజామునుండే భక్తులు పుష్కర స్నానం చేస్తున్నారు. ఆదివారం కావడంతో ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. ఆలంపూర్ జోగులాంబ ఆలయంలో మధ్యాహ్నం 12గంటల నుండి వీఐపీ దర్శనాలు రద్దు చేశారు.

 

హ్యాండ్ బాల్ ప్లేయర్ పూజ ఆత్మహత్య..

పంజాబ్ : హ్యాండ్ బాల్ ప్లేయర్ పూజా కుమారి ఆత్మహత్య చేసుకంది. ఈఘటన పాటియాలలో చోటు చేసుకుంది. ధనవంతులైన విద్యార్థులకు మాత్రమే కోచ్ అనుమతినిస్తున్నాడని, తన కూతురును అడ్డుకున్నాడని పూజా కుమారి తండ్రి ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. 

మియాపూర్ వద్ద కారు బీభత్సం..

హైదరాబాద్ : మియాపూర్ సిగ్నల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. బైక్ ను ఢీకొట్టి ఆగకుండా కారు వెళ్లిపోయింది. ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 

సీతానగరం ఘాట్ కు పోటెత్తిన భక్తులు..

గుంటూరు : సీతానగరం ఘాట్ కు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. 

కడప ప్రమాదంపై చినరాజప్ప విచారం..

విజయవాడ : కడప జిల్లాలోని దువ్వూరు ప్రాంతంలో జరిగిన ప్రమాదంపై ఏపీ హోం మంత్రి చిన రాజప్ప విచారం వ్యక్తం చేశారు. ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. స్వగ్రామాలకు పంపే ఏర్పాట్లు చేయాలని, ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు. 

మధ్యప్రదేశ్ లో భారీ వర్షాలు..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. 

ఉత్తరాఖండ్ లో ఐదుగురు మృతి..

ఉత్తరాఖండ్ : మర్కోలా ప్రాంతంలో గాలి..వాన బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

08:27 - August 21, 2016
08:22 - August 21, 2016

వంటింట్లో ఎన్నో వస్తువులను వాడేసి పడేస్తుంటాం. వాటిని తిరిగి ఎందుకు ఉపయోగించుకోడదు ? ఎలా ఉపయోగిస్తాం అని అనుకుంటున్నారా ? కానీ ఇలాంటి పడేసిన వస్తువులను తిరిగి ఉపయోగించుకోవచ్చు. మరి అలాంటి వస్తువులు ఎంటో చూద్దామా..
గోధుమ పొట్టును అందం కోసం ఉపయోగించుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల పాలు, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాస్తూ మసాజ్ చేసుకోవాలి. ఇది బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి సహాయ పడుతుంది.
అరటి తొక్కకు చక్కెర రాసి చర్మంపై రుద్దితే గరుకుదనం తగ్గుతుంది. అలాగే ఎండిన నారింజ తొక్కలను పొడి చేయాలి. ఆ మిశ్రమానికి పసుపు, తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
టీ బ్యాగులను పడేయకుండా వాటిని కళ్ల మీద పెట్టుకోవడం వల్ల సాంత్వన కలుగుతుంది.
నిమ్మరసం తీసిన తరువాత ఉన్న తొక్కలతో మోకాలు..మోచేయ్యి వద్ద రాసుకోవచ్చు. చర్మంపై ట్యాన్ ను తొలగించి సువాసనను ఇస్తుంది. 

08:12 - August 21, 2016

ఇండియా - నేపాల్ సరిహద్దులో డ్రగ్స్ పట్టివేత..

వెస్ట్ బెంగాల్ : ఇండియా - నేపాల్ సరిహద్దులో మిజోరాం మహిళ వద్ద డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న విలువ రూ. 15 కోట్లు ఉంటుందని అంచనా. 

బావిలో నూనె..

బీహార్ : గయా ప్రాంతంలోని ఓ బావి నుండి ఆయిల్ వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో ప్రజలు భారీగా అక్కడకు తరలివస్తున్నారు. బావిలో పెట్రోల్ లాంటిది వస్తోందని, ఈ బావిని సీజ్ చేయడం జరిగిందని ఎస్ఐ చంద్రశేఖర్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 

అమెరికాకు స్వర్ణం..

రియో డి జనీరో : 1600 మీటర్ల రిలేలో అమెరికా పసిడి పతకాన్ని సాధించింది. అలెసన్ ఫెలిక్స్ ఆరో ఒలింపిక్ స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుని సంచలనం సృష్టిచింది. 

07:36 - August 21, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాల శోభ కొనసాగుతోంది. గత 9 రోజులుగా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పదో రోజు ఆదివారం కావడంతో వివిధ ఘాట్ ల వద్ద భక్తులు పోటెత్తుతున్నారు. లక్షలాది మంది భక్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద పుష్కర స్నానాలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వాలు పలు ఏర్పాట్లు చేశాయి..

విజయవాడలో...
విజయవాడలో పుష్కరాలు పదో రోజు..ఆదివారం..పోలీసుల ఆంక్షలు సడలించిన వేళ భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గత 9 రోజుల్లో కోటి 23 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. ఆదివారం రోజున 30-35 లక్షల మంది భక్తులు స్నానాలు చేస్తారని తెలుస్తోంది. జనాలకు తక్కువగా రావడానికి పోలీసుల ఆంక్షలే కారణమని, శ్రీకాకుళం, తూర్పు ఆంధ్రప్రదేశ్ వాసులు ఎక్కువగా వస్తున్నారని ఓ భక్తుడు టెన్ టివికి తెలిపారు.

నల్గొండలో ...
నల్గొండ : జిల్లాలో పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాగార్జున సాగర్ శివాలయం ఘాట్ వద్ద భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా వస్తున్నారు. ఘాట్ అంతా భక్తులతో నిండిపోయి కనిపిస్తోంది. వాలంటీర్లు, కంట్రోల్ రూం అధికారులు భక్తుల రద్దీని నియంత్రిస్తున్నారు. స్నాన ఘట్టాలలో భక్తులు ఎక్కువ సేపు ఉండకుండా ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు 5 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

గుంటూరులో..
గుంటూరు జిల్లాలో పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులు పుష్కరాలు ఉండడం..ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. ధ్యానబుద్ధ ఘాట్ వద్ద పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఇసుకేస్తే రాలనంతగా జనసంద్రంగా మారిపోయింది. 9 రోజులుగా లక్షలాది మంది ప్రజలు పవిత్ర స్నానాలు చేశారు. అమరావతి చారిత్రాత్మక ప్రాంతం కావడంతో ఇక్కడకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. అమరలింగేశ్వర దేవస్థానం వద్ద భక్తులు బారులు తీరి ఉన్నారు. భక్తులు ఉదయం ఐదు గంటల నుండే భక్తులు తరలివస్తున్నారని ఆలయ ఈవో టెన్ టివికి తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేవాలయానికి రూ. 50 లక్షల ఆదాయం వచ్చిందని, మొత్తం పది రోజుల్లో 90 లక్షల వరకు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.

పుష్కరాల వైభవం చూడటానికి వీడియో క్లిక్ చేయండి. 

సీతమ్మ వారి బంగారు గొలుసు మాయం..

ఖమ్మం : భద్రాచలం రామాలయంలో సీతమ్మ వారి బంగారు గొలుసు మాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని అధికారులు నిర్ధారించడం లేదు. 

మలక్ పేటలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : మలక్ పేట మూసారాంబాగ్ చౌరస్తా వద్ద కార్ల మరమ్మత్తు గోదాంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐదు కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

07:15 - August 21, 2016

జమైకన్ సుడిగాలి రన్నర్, మానవచిరుత ఉసేన్ బోల్ట్...ట్రిపుల్ గోల్డ్ హ్యాట్రిక్ తో తన ఒలింపిక్స్ కెరియర్ కు గుడ్ బై చెప్పాడు. రియో ఒలింపిక్స్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు, 100 మీటర్ల రిలే అంశాలలో బంగారు పతకాలు సాధించి...ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా నిలిచాడు. అరుదైన రికార్డులతో అసాధారణ స్ర్పింటర్ గా చరిత్రలో మిగిలిపోయిన జమైకన్ వండర్ రన్నర్, గోల్డెన్ బోల్ట్ పై 10 టివి ప్రత్యేక కథనం..

సుడిగాలి రన్నర్..
ఒలింపిక్స్ 100 మీటర్లు, 200మీటర్ల రేస్ లతో పాటు 100 మీటర్ల రిలే పరుగు అంశాలలో జమైకన్ సుడిగాలి రన్నర్, మానవచిరుత ఉసేన్ బోల్ట్ బంగారు పతకాలు సాధించి..మరెవ్వరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పాడు. వరుసగా మూడు ఒలింపిక్స్ లో తొమ్మిది బంగారు పతకాలు సాధించిన ఏకైక స్ప్రింటర్ గా చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి ..ట్రాక్ అండ్ ఫీల్డ్ 100, 200 మీటర్ల పరుగు కోసం ట్రాక్ లోకి బోల్ట్ దిగాడంటేచాలు మానవ చిరుతలా దూసుకుపోతాడు. పెద్దపెద్ద అంగలు వేస్తూ..మెరుపువేగంతో దూసుకుపోతూ తనకు తానేసాటిగా నిలిచిపోడం ఓ అలవాటుగా మార్చుకొన్నాడు. బీజింగ్ ఒలింపిక్స్ తో అరంగేట్రం చేసిన ఉసేన్ బోల్ట్ కు...100 మీటర్ల పరుగులో 9.58 సెకన్ల వేగంతో పరుగెత్తిన ప్రపంచ రికార్డు మాత్రమే కాదు. 200 మీటర్ల పరుగులో సైతం..19.19 సెకన్ల మరో ప్రపంచ రికార్డు సైతం ఉంది. బీజింగ్ ఒలింపిక్స్ 100 మీటర్లు, 200 మీటర్ల స్ప్రింట్స్ అంశాలలో డబుల్ గోల్డ్ సాధించిన బోల్ట్...100 మీటర్ల రిలే పరుగులో సైతం స్వర్ణపతకం సాధించి..తొలి ఒలింపిక్స్ లోనే గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

గ్రేటెస్ట్ స్ప్రింటర్..
ఆ తర్వాత...నాలుగు సంవత్సరాలకు లండన్ వేదికగా ముగిసిన 2012 ఒలింపిక్స్ లో సైతం బోల్ట్ అదే దూకుడు కొనసాగించాడు. మూడుకు మూడు విభాగాల్లోనూ బంగారు మోత మోగించి గ్రేటెస్ట్ స్ప్రింటర్ గా నిలిచాడు. ఇక..ప్రస్తుత రియో ఒలింపిక్స్ 100 మీటర్ల రేస్ లో బంగారు బోణీ కొట్టిన బోల్ట్ ..200 మీటర్ల రేస్, 100 మీటర్ల రేస్ ల్లో సైతం అదే దూకుడు కొనసాగించాడు. రియో ఒలింపిక్స్ ట్రాక్ లో ముగిసిన 200 మీటర్ల రేస్ ను 19.78 సెకన్ల టైమింగ్ తో నెగ్గి బంగారు పతకం అందుకొన్న ఉసేన్ బోల్ట్...100 మీటర్ల రిలే లో సైతం తనదేశానికి స్వర్ణం అందించాడు.

మూడు విభాగాలలోనూ..
2008 నుంచి 2016 వరకూ...వరుసగా..మూడు ఒలింపిక్స్.. మూడు విభాగాలలోనూ బంగారు పతకాలు సాధించిన తొలి రన్నర్ గా మిగిలిపోయాడు. ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఇప్పటికే 11 బంగారు పతకాలతో పాటు..జంట ప్రపంచ రికార్డుల హోల్డర్ గా ఉన్న బోల్ట్...రియో ఒలింపిక్స్ తో...తొమ్మిది బంగారు పతకాలు గెలుచుకొన్నాడు. మొత్తం మీద 11 ప్రపంచ, 9 ఒలింపిక్స్ స్వర్ణాలు సాధించిన స్ర్పింటర్ గా బోల్ట్ చరిత్ర సృష్టించాడు.

గుడ్ బై...
అమెరికన్ ఆల్ టైమ్ గ్రేట్ అథ్లెట్..కార్ల్ లూయిస్ ఒలింపిక్స్ 100, 200 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ , రిలే అంశాలలో తొమ్మిది బంగారు పతకాల రికార్డును ఇప్పుడు ఉసేన్ బోల్ట్ సమం చేశాడు. ట్ బాల్ లో పీలే, బాక్సింగ్ లో మహ్మద్ అలీ ఎంతో...పరుగులో తానూ అంతఘనత సాధించానంటూ ధీమాగా ప్రకటించిన బోల్ట్...ఇక ఒలింపిక్స్ కు గుడ్ బై అని ప్రకటించడం కొసమెరుపుగా చెప్పుకోవాలి. బోల్ట్ లాంటి అసాధారణ రన్నర్ ను మళ్లీ మనం చూడాలంటే...ఎంతకాలం వేచి చూడాలో మరి.

06:43 - August 21, 2016

హైదరాబాద్ : మొన్న ఐదు రూపాయ‌ల భోజ‌నం... నిన్న మ‌ఠం భోజ‌నం... భోజనాల పేరుతో మరోసారి వార్తల్లోకెక్కారు సీఎల్పీ నేత. గత జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల స‌మ‌యంలో 5 రూపాయల భోజ‌నంతో కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం రేపిన జానా..నిన్న జరిగిన పార్టీ జ‌ల‌దృశ్యానికి డుమ్మాకొట్టి... క‌ర్నాట‌క‌లో మ‌ఠం భోజ‌నం చేసేందుకు వెళ్లారు..? ఇంతకు జానా మఠం భోజనానికి ఎందుకెళ్లారు. జానా స్పెషల్‌ లంచ్‌ల వెన‌క ఉన్న మ‌త‌లబులేంటీ..?

జీర్ణించుకోలేకపోతున్న నాయకులు...
కాంగ్రెస్‌లో సీఎల్పీ నేత జానారెడ్డి ఏం చేసినా..స్పెష‌లే. ఆయ‌న మాట్లాడినా.. మాట్లాడ‌కపోయినా.. చివ‌రికి మీడియాకు దూరంగా ఉన్నా స‌రే .. పార్టీలో హాట్ హాట్ చ‌ర్చకు తెర‌లేస్తుంది. గ‌తంలో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎల్పీలో 5 రూపాయ‌ల భోజ‌నం చేసిన జానారెడ్డి.. పార్టీలో కలకలం రేపారు. సొంత పార్టీ నేత‌ల నుంచి తీవ్ర విమ‌ర్శలు ఎదుర్కొన్నారు. ఇది మ‌ర‌వ‌క‌ముందే..ఇప్పడు మ‌రోసారి జానా భోజ‌నాలు చ‌ర్చనీయాంశమ‌య్యాయి. కేసీఆర్ ఇరిగేష‌న్‌పై ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్‌కు కౌంటర్‌ ఇచ్చేందుకు..కాంగ్రెస్‌ ఐదు నెల‌లు తీవ్రంగా కుస్తీ పట్టింది. పార్టీ ఎంతో స‌వాల్‌గా తీసుకుని జ‌ల‌దృశ్యాన్ని చూపించింది. అయితే... ఈ కార్యక్రమాన్ని పీసీసీ ముందే ఫిక్స్ చేసినప్పటికీ..దానికి జానారెడ్డి దూరంగా ఉండడం..పార్టీలో తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనిపై స్పందించిన జానా..తాను క‌ర్నాట‌క‌లో వివిధ మ‌ఠాల్లో భోజ‌నాలు చేశాన‌ని చెప్పడం పార్టీల్లో చ‌ర్చనీయాంశంగా మారింది. ఉడిపి, శృంగేరితోపాటు మ‌రో రెండు మ‌ఠాల‌కు వెళ్ళి..అక్కడి స‌త్రాల‌లో భోజ‌నాల‌ను రుచి చూశాన‌ని చెప్పుకొచ్చారు జానారెడ్డి. అంతేకాదు అన్నింటికి అంద‌రూ ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పడం కొస‌మెరుపు. గతంలో జీహెచ్‌ఎంసీ ఐదు రూపాయల భోజనం చేసి.. పార్టీకి తీవ్ర నష్టం చేశారని జానాపై ఢిల్లీకి సైతం ఫిర్యాదులు చేసిన నేతలు ఇప్పుడు జానా మఠం భోజనాలను జీర్ణించుకోలేకపోతున్నారు.

06:41 - August 21, 2016

నెల్లూరు : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి అధ్యక్షుడు పెళ్లకూరు సురేంద్ర రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత 6 రోజులుగా నగరంలోని కొండాయపాలెం గేటు వద్దనున్న పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తున్న సురేంద్ర రెడ్డిని పోలీసులు బలవంతంగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సురేంద్ర రెడ్డి ఆరోగ్యపరిస్ధితి క్షీణించిందని, కానీ వైద్యం చేయించుకునేందుకు మాత్రం సురేంద్రరెడ్డి నిరాకరిస్తున్నారని చెబుతున్నారు. పోలీసుల సహాయంతో బలవంతంగా వైద్యం అందించారు.

06:36 - August 21, 2016
06:35 - August 21, 2016

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీ.వీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటు నజరానాలు సైతం వెల్లువలా కురుస్తున్నాయి. సింధుకు, ఆమె కోచ్‌ గోపించంద్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలతో పాటు ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు నజరానాలు ప్రకటించాయి. రేపు హైదరాబాద్‌కు రానున్న సింధుకు స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లల్లో నిమగ్నమైంది. నూట ఇరవై ఐదు కోట్ల హృదయాల్ని ఉప్పొంగేలా చేసిన పీ.వీ సింధు పోరాట పటిమ చిరస్మరణీయం. విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను మురిపించిన నీ తెగువ అపురూపం..120 ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో దేశానికి తొలి బ్యాడ్మింటన్‌ రజత పతకం. దేశ క్రీడా యవనికపై 'రజతా'క్షరాలు లిఖించిన సింధు ఆటతీరుకు..భారతావని జేజేలు పలుకుతోంది.120 ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో దేశానికి తొలి బ్యాడ్మింటన్‌ రజతాన్ని అందించిన సింధూపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒలింపిక్స్‌లో అసమాన ప్రదర్శన కనబరిచి రజత పతకం కైవసం చేసుకున్న పీవీ సింధుకు తెలంగాణ సర్కారు 5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది. హైదరాబాద్‌లో వెయ్యి గజాల స్థలం కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది. సింధు కోరుకుంటే..రాష్ర్ట కేడర్‌లో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కోచ్‌ గోపిచంద్‌కు కూడా కోటి రూపాయల నగదు పురస్కారం ప్రకటించారు.

పలు ప్రభుత్వాల నజరానాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సింధుకి భారీ నజరానా ప్రకటించింది. 3 కోట్ల నగదు, ఏపీ రాజధాని అమరావతిలో వెయ్యి గజాల స్థలంతో పాటు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే కోచ్ గోపిచంద్‌కు 50 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల్లోపు సింధూతో పాటు గోపీచంద్‌ను ప్రభుత్వం సన్మానించనుంది. ఇటు ఢిల్లీ ప్రభుత్వం కూడా సింధుకు భారీ నజరానా ప్రకటించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీవీ సింధుకు 2 కోట్ల నగదు పురస్కారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం 50 లక్షలు ఇస్తామని ప్రకటించింది. మరోవైపు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య సింధూకు 50 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు 10 లక్షలు నగదు ప్రకటించింది. పీవీ సింధుకు 60 లక్షల విలువైన బీఎం డబ్ల్యు కారు నజరానాగా అందుకోనుంది. క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేతులమీదుగా ఈ కారును ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్-ముంబై మాస్టర్స్ ఫ్రాంచైజీ సహ యజమాని చాముండేశ్వరీనాథ్ గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు.

సోమవారం నగరానికి..
ఇక..ఒలింపిక్స్ విజేతలకు కేంద్రప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక బహుమతుల రూపంలో సింధు 3 కోట్ల రూపాయలు అందుకోనుంది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం నుంచి అర్జున, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న సింధు..దేశఅత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు సైతం అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు సోమవారం హైదరాబాద్‌కు రానుంది. ఆమెకు స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల30 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సింధు, గోపిచంద్‌ విమానం దిగిన అనంతరం గచ్చిబౌలి స్టేడియం వరకు ర్యాలీ ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి తెలిపారు. ఈ మార్గం ప్రధాన కూడళ్ల వద్ద విద్యార్థులు, నగర పౌరులు సింధుకు పెద్ద ఎత్తున అపూర్వ స్వాగతం పలుకుతారని కమిషనర్‌ తెలిపారు. అనంతరం గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇటు సింధు ప్రయాణించే శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకూ పెద్ద ఎత్తున స్వాగత హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను కమిషనర్‌ ఆదేశించారు.
అంకితభావంతో శ్రమిస్తే..అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని పీవీ సింధు నిరిపించింది. కఠోర సాధనతో ఫలితం సాధించడమే కాదు..పేరుప్రఖ్యాతులు, సిరిసంపదలు ఒకదాని వెనుక ఒకటిగా నడుచుకొంటూ వస్తాయనడానికి..21 ఏళ్ల పీవీ సింధు సాధించిన విజయమే ఓ నిదర్శనం.

06:31 - August 21, 2016

విజయవాడ : వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు కూడా హైదరాబాద్ లోనే నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వియవాడలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు ఉద్యోగులకు డీఏ బకాయిల చెల్లింపు, ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధుకు నజరానా లాంటి పలు నిర్ణయాలు తీసుకుంది. విజయవాడలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో భేటీ అయిన మంత్రివర్గం పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ముందుగా రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధును అభినందిస్తూ కేబినేట్‌ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సింధును రూ. 3 కోట్ల నగదు బహుమతితో పాటు రాజధానిలో వెయ్యి గజాల స్థలం, గ్రూప్ వన్ స్థాయిలో ఉద్యోగం ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలాగే సింధు కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.50 లక్షల నగదును ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఐదు రోజుల పాటు సమావేశాల నిర్వహణ..
అలాగే రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే నిర్వహించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని, జీఎస్‌టీ బిల్లుపై సెప్టెంబర్‌ 8లోగా అసెంబ్లీ తీర్మానం చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. దీంతో పాటు ఉద్యోగుల డీఏ బకాయిలను పీఎఫ్‌ ఖాతాలో జమచేయాలని, పెరిగిన డీఏను ఆగస్టు నుంచి అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇక పీఆర్సీ అమలు కాని ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు వేతన స్కేలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో ప్రభుత్వ సంస్థలకు పీఆర్సీ సిఫార్సులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అలాగే ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి 200 ఎకరాలు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వాలి - సీఎం చంద్రబాబు..
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు వీలైనంత త్వరగా యుటిలిటీ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సాధారణంగా ఇవ్వాల్సిన నిధులనే ఇచ్చింది తప్ప అదనపు నిధులేమీ ఇవ్వలేదని అన్నారు. ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నట్లు కూడా చంద్రబాబు తెలిపారు. పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన పలు విభాగాలను, ఉద్యోగులను సీఎం చంద్రబాబు అభినందించారు.

06:29 - August 21, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటును తెలంగాణలోని అన్ని పార్టీలూ స్వాగతించాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గదర్శకాలను రూపొందించాలని అఖిలపక్షం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఫైనల్‌ నోటిఫికేషన్‌కు ముందే రెండు సార్లు ఆల్‌పార్టీ మీటింగ్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటుపై సచివాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి..ఏడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 14 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో కేబినెట్‌ సబ్‌కమిటీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటును అన్ని పార్టీలూ స్వాగతించాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటులో ఎటువంటి మార్గదర్శకాలు రూపొందించలేదని..వెంటనే గైడ్‌లైన్స్ తయారు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. 1974 ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటు చట్టం ఆధారంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

పలు పార్టీల సూచనలు...
కొత్త జిల్లాల ఏర్పాటును టీ-టీడీపీ స్వాగతించింది. అయితే కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ఆరింటిలో అతి తక్కువ జనాభా ఉందని ఏడింటిలో ఎక్కువ జనాభా ఉన్న విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకువచ్చింది టీడీపీ. సంఖ్యాశాస్త్రం ఆధారంగా కాకుండా.. శాస్త్రీయంగా జిల్లాల విభజన జరగాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు చేసింది సీపీఎం. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలన్నింటినీ కలిపి అటానమస్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని జిల్లాలు ఇప్పుడున్న ఆర్థిక వనరులు దెబ్బతినే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అటు సీపీఐ కూడా కొత్త జిల్లాల ఏర్పాటులో రెవిన్యూ డివిజన్లు, మండలాల విషయంలో కొన్ని నిర్థిష్ట ప్రమాణాలు పాటించాలని సూచించారు. బీజేపీ సైతం కొత్త జిల్లాల ఏర్పాటుపై కొన్ని సూచనలు చేసింది. హైదరాబాద్‌ జిల్లాను యథాతథంగా ఉంచాలని కోరింది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయ పార్టీలు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. ఫైనల్‌ నోటిఫికేషన్‌కు ముందు మరో రెండుసార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని అధికార పార్టీ స్పష్టం చేసింది. 

06:27 - August 21, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాలపై ఈ నెల 22న పునర్విభజన ముసాయిదా విడుదలచేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.. ప్రజాభిప్రాయం ప్రకారమే జిల్లాల ఏర్పాటు ఉంటుందని స్పష్టం చేశారు.. నయీం బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.. తప్పు చేసినవారు ఎవ్వరైనా శిక్షించి తీరతామని సీఎం స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్‌.. 27 జిల్లాల ఏర్పాటుకు అఖిలపక్షసమావేశంలో అన్ని పార్టీలు అంగీకరించాయని ప్రకటించారు.. ప్రతిపక్షాలు కొన్ని సూచనలు చేశాయని తెలిపారు.. ఈ నెల 22న పునర్విభజన ముసాయిదా విడుదల చేస్తామని తెలిపారు.

సెప్టెంబర్ లో శాసనసభా సమావేశాలు..
ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు 5 కోట్ల నగదు, ప్రభుత్వ ఉద్యోగం, వెయ్యి గజాల స్థలం ఇస్తామన్నారు. అలాగే కోచ్‌ గోపీ చంద్‌కు కోటి రూపాయలు, రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్‌కు తెలంగాణ ప్రభుత్వం తరపున కోటి రూపాయలు ఇస్తామని సీఎం తెలిపారు. సెప్టెంబర్‌ మొదటివారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఉండే అవకాశముందని కేసీఆర్‌ చెప్పారు. ఆ సమావేశాల్లో జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం తెలుపుతామని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు సంబంధించి ఈ నెల 23న మహారాష్ట్రతో తుదిఒప్పందం చేసుకుంటామని కేసీఆర్‌ ప్రకటించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.

పలు విమర్శలు...
కాంగ్రెస్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌లో విషయం లేదని కేసీఆర్‌ విమర్శించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి రావొద్దంటూ లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. లా అండ్ ఆర్డర్‌ విషయంలో వెనక్కితగ్గేదిలేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. నయీం బాధితులకు వందశాతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నేరం ఎవరుచేసినా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎస్‌ఐ రామకృష్ణ ఆత్మహత్య దురదృష్టకరమన్నారు కేసీఆర్‌. ఈ కేసులో పోలీసు విచారణ కొనసాగుతోందని చెప్పారు.

06:24 - August 21, 2016

కడప : జిల్లా దువ్వూరు మండ‌లం ఏకోప‌ల్లె స‌మీపంలో చిత్తూరు-కర్నూలు జాతీయ ర‌హ‌దారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దువ్వూరు మండ‌లం కృష్ణంప‌ల్లెకు చెందిన వారు వివాహం నిమిత్తం ట్రాక్టర్‌లో దేవుని క‌డ‌ప‌కు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారితోపాటు మరో నలుగురు చనిపోయారు. మ‌రో 25 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. గాయపడిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో తీవ్రంగా గాయపడిన 10మందిని క‌ర్నూలు ప్రభుత్వాసుప‌త్రి తరలించారు. దువ్వూరు మండ‌లం క్రిష్ణంప‌ల్లెకు చెందిన పెళ్లి బృందం గ్రామం నుంచి దేవునికి కడపకు ట్రాక్టరులో వెళ్తూ ఉండగా మార్గమధ్యలో డీజల్‌ అయిపోవడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. వెనుక వస్తున్న లారీ ట్రాక్టరును ఢీకొంది. ప్రమాదంలో ఏడేళ్ల బాలికతోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు.

టర్కీలో బాంబు దాడి..22 మంది మృతి..

టర్కీ : ఓ వివాహ వేడుకపై జరిగిన బాంబు దాడిలో 22 మంది మృతి చెందగా 90 మందికి పైగా గాయపడ్డారు. గాజియాన్ టేప్ పట్టణంలో ఈ దాడి జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం..5గురు మృతి..

కడప : జిల్లాల రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ పై కడప వెళుతున్న పెళ్లి బృందాన్ని దువ్వూరి మండలం ఏకోపల్లె శివారు వద్ద లారీ ఢీకొంది. ఈఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. 

రియో ఒలింపిక్ పోటీలకు నేడు చివరి రోజు..

ఢిల్లీ : పది హేను రోజులుగా అసాధారణ విన్యాసాలు..అద్భుత ప్రదర్శనలతో మరిచిపోలేని విజయాలు..మరుపురాని అనుభవాలను ఎన్నో మిగిల్చిన రియో ఒలింపిక్స్ లో నేడు చివరి రోజు. పతకాంశలన్నీ ముగిశాయ భారత కాల మానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.30గంటలకు ముగింపోత్సవం ఆరంభమవుతుంది. 

రేపు నగరానికి సింధు..

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన హైదరాబాదీ తార పీవీ సింధు సోమవారం నగరానికి రానుంది. ఉదయం 8.30గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో అడుగు పెట్టనుంది. సింధూ, కోచ్ గోపిచంద్ లకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. 

23న జూలపల్లి టు మేడిగడ్డ మహా రైతు యాత్ర..

హైదరాబాద్ : ఈనెల 23వ తేదీన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, సీఎం కేసీఆర్ బ్యారేజీ ఒప్పందాలపై సంతకాలు చేస్తున్న సందర్భంగా మహా రైతు యాత్ర నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ నేత జీ రఘువీర్ సింగ్ పేర్కొన్నారు. జూలపల్లి నుండి మంథని మండలం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వరకు ఈ యాత్ర జరగనుంది. 

22న గణాంకభవన్ ప్రారంభం..

హైదరాబాద్ : 1919లో ఏర్పాటైన బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగం భవనం స్థానంలో పునర్నిర్మించిన గణాంక భవన్ ను ఈ నెల 22వ తేదీన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించనున్నారు. 

8న స్థానిక ఉప ఎన్నికలు..

హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల పదవులకు సెప్టెంబర్ 8వ తేదీన ఉప ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 సర్పంచ్ స్థానాలకు, 11 ఎంపీటీసీ స్థానాలకు వివిధ కారణాలతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈనెల 26వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆ రోజు నుండి 29 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. సెప్టెంబర్ 3వ తేదీ ఉపసంహరణకు తుదిగడువు విధించారు. సెప్టెంబర్ 8వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. 

నేడు సాగర్ నీటి విడుదలపై సమావేశం..

హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఎడమకాలువ నుండి నీటి విడుదలకు సంబంధించి సాగర్ ఆయుకట్టు పరిధిలోని ఎమ్మెల్యేలతో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండలో కీలక సమావేశం జరగనుంది. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్సే జోషి, అధికారులు పాల్గొననున్నారు. 

సెప్టెంబర్ 2న సమ్మెలో పంచాయతీ, మున్సిపల్ కార్మికులు..

హైదరాబాద్ : కనీస వేతనాన్ని రూ. 18వేలు చేయాలని, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగలందరినీ పర్మినెంట్ చేయాలని వచ్చే నెల 2వ తేదీన సమ్మె చేపడుతున్నట్లు తెలంగాణ గ్రామీణ పంచాయతీ, మున్సిపల్ కార్మిక సంఘాలు ప్రకటించాయి. 

రేపటి నుండి జానపదా కళా జాతరలు..

హైదరాబాద్ : ఈనెల 22న ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని జానపద కళా జాతరలు చేపట్టినట్టు పర్యాటక, సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. భాషా సాంస్కృతిక సారథ్యంలో ఈ నెల 22 నుంచి 31 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జానపద జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చిందుల ఎల్లమ్మ జన్మించిన నిజామాబాద్‌లో ఈ నెల 22న ఉత్సవాలను ప్రారంభిస్తారు.

Don't Miss