Activities calendar

22 August 2016

22:10 - August 22, 2016

ఢిల్లీ : ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ వద్ద డబ్బు లేదని ఆప్‌ అధినేత, ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఏడాదిన్నరగా ఢిల్లీని ఏలుతున్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్‌ వద్ద ఒక్క పైసా లేదన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ బ్యాంక్‌ అకౌంట్‌ చూస్తే ఈ విషయం తెలిసిపోతుందన్నారు. గోవాలో దళిత, గిరిజనులకు సంబంధంచిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న పంజాబ్‌, గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్‌ ప్రచారాన్ని ప్రారంభించింది. ఢిల్లీ మాదిరి ఇక్కడ కూడా ప్రజలే ఎన్నికల్లో పోరాడాలని కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. గోవాలో డ్రగ్స్‌ నిషేధించడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

22:08 - August 22, 2016

ఢిల్లీ : 2009లో ఐటీ ఉద్యోగిని జిగీష హత్య కేసులో ఢిల్లీ కోర్టు ఇద్దరికి మరణశిక్ష, ఒకరికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో కోర్టు దోషులుగా నిర్ధారించిన రవి కపూర్‌, అమిత్‌ శుక్లాలకు మరణ శిక్ష.. బల్‌జీత్‌ మాలిక్‌కు జీవిత ఖైదు విధించింది. బల్‌జీత్‌, అమిత్‌ శుక్లాలు ఇప్పటికే ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఓ కన్సల్టెన్సీ సంస్థలో ఆపరేషన్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న జిగీషా తెల్లవారు జామున కాబ్‌ ఇంటి వద్ద దింపగా.. ఆమె ఇంట్లోకి వెళ్లేలోపే దుండగులు దాడిచేసి బలవంతంగా తమ వాహనంలోకి లాగి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమె వద్ద ఉన్న విలువైన సామాగ్రి దోచుకుని తర్వాత హత్య చేశారు. దుండగులు జిగీష వద్ద నుంచి డెబిట్‌కార్డు దొంగిలించి తర్వాత షాపింగ్‌ చెయ్యడంతో సీసీటీవీ కెమెరాల దృశ్యాల ద్వారా పోలీసులు నిందితులను గుర్తించారు. 

22:05 - August 22, 2016

త్రిపుర : రియో ఒలెంపిక్స్ లో పతకం రాకపోయిన ప్రజల హృదయాలను చూరగొన్న జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌కు అగర్తలలో ఘన స్వాగతం లభించింది. దీపతో పాటు కోచ్‌ బిస్వేశ్వర్‌ నందిలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వీరిద్దరిని ఎయిర్‌పోర్ట్ నుంచి దీప ఇంటివరకు టాప్‌ లేని జీపులో ఊరేగింపుగా తీసుకెళ్లారు. జన సమూహంలో ఉన్న సోదరిని చూసిన దీప భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే జీపు నుంచి దిగి సోదరిని ఆలింగనం చేసుకున్నారు. ఒలెంపిక్స్‌ కోసం ఎంపికైన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా రికార్డ్‌ సృష్టించిన దీపా కర్మాకర్‌- తృటిలో పతకాన్ని కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచారు. 2020లో టోక్యోలో జరిగే ఒలెంపిక్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు దీపా తెలిపారు.

22:03 - August 22, 2016

హైదరాబాద్ : సింధూ.. సింధూ..సింధూ...! ఇప్పుడు ఎక్కడ విన్నా అదే పేరు. ఎక్కడ చూసినా ఆమె నామస్మరణే. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన వెండికొండ తెలుగు నేలపై అడుగుపెట్టగానే అడుగడుగునా జననీరాజనం. దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన సింధును తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.

తెలుగు గడ్డపై సింధుకు నీరాజనం
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి తెలుగు గడ్డపై అడుగు పెట్టిన పీవీ సింధూకు అడుగడుగున జనం నీరాజనం పలికారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సింధుకు వేలాది మంది విద్యార్థులు, నగర పౌరులు జయహో నినాదాలతో స్వాగతం చెప్పారు. దారిపొడవునా సింధుకు స్వాగత తోరణాలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.

భారతదేశపు సత్తా చాటిన సింధు
రియో ఒలింపిక్స్ లో భారత్ సత్తాను చాటి దేశానికి రజత పతకం సాధించిన స్టార్ షట్లర్, తెలుగుతేజం సింధును తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని, కేటీఆర్‌, మహేందర్‌రెడ్డి ఆమెను ఘనంగా సత్కరించిన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింధూ కోచ్‌ గోపీచంద్‌, ఆమె కుటుంబ సభ్యులు పలువురు అధికారులు పాల్గొన్నారు.

సింధు తెలంగాణ అమ్మాయి కావడం గర్వకారణం: మహమూద్ అలీ
ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన సింధూ తెలంగాణ అమ్మాయి కావడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మహ్మద్‌ అలీ అన్నారు. రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటిన సింధూకు డిప్యూటీ సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. దేశ కీర్తి ప్రతిష్టలను సింధూ, సాక్షి మలిక్ కాపాడారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలిపారు. ఇందుకోసం స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని చెప్పారు.

అభినందనలతో ముంచెత్తిన ప్రలువురు ప్రముఖులు
ఒలింపిక్‌ పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధూను పలువురు ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. రాష్ట్ర మంత్రులు, క్రీడా ప్రముఖులు సింధూ విజయాన్ని కొనియాడారు. భవిష్యత్‌ ఒలింపిక్స్‌లో సింధూ ఖచ్చితంగా మన దేశానికి గోల్డ్‌ మెడల్‌ సాధించి పెడుతోందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులకు ..గోపీచంద్రకు కృతజ్ఞతలు చెప్పిన సింధు

ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తానని తాను నమ్మలేదని.. తనను ప్రోత్సహించిన కోచ్ గోపిచంద్‌కు, ఆమె తల్లిదండ్రులకు సింధూ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్పూర్తితో భవిష్యత్తులో అనేక పతకాలు సాధిస్తానన్నారు.

కరణం మల్లీశ్వరి స్ఫూర్తితోనే : గోపీచంద్
2000 సంవత్సరం ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి కాంస్యపతకం ద్వారా అందించిన స్ఫూర్తితోనే బ్యాడ్మింటన్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించామని కోచ్‌ గోపీచంద్‌ తెలిపారు. సింధు సన్మానసభ సందర్భంగా కోచ్‌ గోపిచంద్‌ తెలంగాణ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు.

గచ్చిబౌలి స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు
అంతకుముందు సింధూ అభినందన సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఒగ్గుడోలు, పేరిణి నృత్యాలు చూపరులను విశేషంగా అకట్టుకున్నాయి. 

21:55 - August 22, 2016

కర్నూలు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేవరకూ కేంద్రం చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామనీ చెప్పారు.

కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, సారె
కృష్ణా పుష్కరాల 11వ రోజున.. ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు.. శ్రీశైలంలోని లింగాలగట్టు ఘాట్‌ను పరిశీలించారు. కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, సారె సమర్పించి హారతినిచ్చారు. భక్తులకు కల్పిస్తున్న సదుపాయాల గురించీ సీఎం ఆరా తీశారు. లింగాల ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు.

నదుల అనుసంధానమే లక్ష్యం : చంద్రబాబు
నదుల అనుసంధానమే లక్ష్యంగా ఏడాది క్రితం గోదావరి, ఇప్పుడు కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామన్న సీఎం.. 2050 నాటికీ ప్రపంచ దేశాలు అబ్బురపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ఈ క్రమంలో కేంద్రం.. తగినంత చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. పుష్కర ఏర్పాట్లలో అధికారులు.. ముఖ్యంగా పోలీసు శాఖ సేవలు అద్భుతమని సీఎం ప్రశంసించారు. 

21:52 - August 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రాన్ని మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లుగా విభజించనున్నట్లు ముసాయిదాలో పేర్కొన్నారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలు స్వీకరించి, దసరా నాటికి కొత్త జిల్లాల నుంచి పాలన చేసేలా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

27కు పెరిగిన జిల్లాల సంఖ్య..
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణ ఇకపై 60 రెవిన్యూ డివిజన్లతో 27 జిల్లాలుగా రూపుదిద్దుకోనుంది. మండలాల సంఖ్య కూడా 505కి చేరుకుంది. కొత్త జిల్లాలకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలతో.. ప్రభుత్వం 194 జీవోను విడుదల చేసింది. తొమ్మిది జిల్లాలకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

ముసాయిదాపై అభ్యంతరాలు తెలిపేందుకు ప్రత్యేక వెబ్‌సైట్
ముసాయిదాపై ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలను తెలియజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలు, హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో కూడా అభ్యంతరాలు తెలుపొచ్చని ముసాయిదాను విడుదల చేసిన ఉపముఖ్యమంత్రి మహమూద్‌ ఆలీ తెలిపారు. సోమవారం నుంచి నెల రోజుల పాటు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి, తుది నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. దీనికంటే ముందు మరోసారి ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి రాజకీయపక్షాల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటామని మహమూద్‌ ఆలీ చెప్పారు. జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా సీఎం కేసీఆర్ సంకల్పించారని మహమూద్‌ అలీ తెలిపారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు, పరిపాలన సౌలభ్యం కొరకే జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

21:48 - August 22, 2016

హైదరాబాద్ : నయీమ్ కేసులో... తీగ లాగే కొద్దీ డొంకలు కదులుతున్నాయి. తాజాగా మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ పేరూ బయటకి వచ్చింది. నయీం బాధితుడొకరు ఇచ్చిన ఫిర్యాదులో.. నేతి విద్యాసాగర్‌ పేరూ పొందుపరిచారు. దీంతో మండలి డిప్యూటీ చైర్మన్‌ మెడకు ఉచ్చు బిగుస్తోందన్న ప్రచారం జరుగుతోంది. సిట్‌ బృందం ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉందన్న వార్తలూ వినిపిస్తున్నాయి.

తాజాగా నల్లగొండ జిల్లా నేత నేతివిద్యాసాగర్ పేరు
నయీమ్‌ దందాల వ్యవహారం.. ప్రముఖుల మెడకు ఉచ్చు బిగిస్తోంది...ఇప్పటికే మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి పేరుతో పాటు మాజీ డీజీపీ దినేష్‌రెడ్డిల పేర్లు బయటకు రాగా.. వారు తమకు సంబంధం లేదంటూ మీడియా ముందుకు వచ్చారు..ఇప్పుడు నల్లగొండ జిల్లాలో కీలక నేత...ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ పేరూ బయటికి వచ్చింది. భువనగిరిలోని వ్యాపారి.. నయీం బాధితుడు గంపా నాగేందర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

నయీంకే వత్తాసు పలికిన విద్యాసాగర్
గ్యాంగ్‌స్టర్‌ ఫోన్‌ ద్వారా బెదిరించి కోటి రూపాయలు డిమాండ్‌ చేయడంతో భయపడ్డ తాను ఫోన్ స్విచ్చాఫ్‌ చేసుకున్నానని... దీంతో ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ నుంచి తన ఇంటిపక్కన వ్యక్తికి కాల్ వచ్చిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. నయీం ఇచ్చిన ధక్కాతో తన ఫోన్‌ స్విచాఫ్‌ చేసుకుని.. నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ను శరణు వేడినట్లు గంపా ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. గౌరవ ప్రదమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న నేతి విద్యాసాగర్ ... నయీంకే వత్తాసు పలుకుతూ.. అతనితో వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని చెప్పడం ద్వారా... తనను భయభ్రాంతులకు గురిచేశాడని గంపనాగేందర్‌ ఫిర్యాదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. నయీం అనుచరుడు పాశం శ్రీనుతో పాటు.. నేతి విద్యాసాగర్‌పైనా నాగేందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 17న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

గంప నాగేందర్‌ ఫిర్యాదుతో.. మరో కొత్త కోణం
గంపనాగేందర్‌ ఫిర్యాదుతో.. మరో కొత్త కోణమూ వెలుగులోకి వచ్చింది. నయీం ప్రధాన అనుచరుడైన పాశం శ్రీను.. గంపగోవర్దన్‌కి ఫోన్‌ చేసి.. కోమటిరెడ్డి కుమారుడికి పట్టిన గతే పడుతుందని బెదిరించారని.. ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. తద్వారా కోమటిరెడ్డి కుమారుడిని తామే చంపామని పరోక్షంగా బెరించినట్లు వెల్లడవుతోంది. దీంతో సిట్‌ అధికారులు... కోమటిరెడ్డి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడా..? లేక హత్యకు గురయ్యాడా అన్న కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. నయీమ్‌ ఓ వ్యాపారిని బెదిరించిన ఆడియో టేప్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్న నేపథ్యంలో.. సిట్‌ తీసుకోబోయే తదుపరి స్టెప్‌ ఎలా ఉంటుందో..? గౌరవప్రదమైన పదవిలో కొనసాగుతున్న నేతి.. తనపై వచ్చిన ఆరోపణలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

నయీం బెదిరింపులతో ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్న వ్యాపారి
ఎన్‌కౌంటర్‌కు నెల రోజుల ముందు గ్యాంగ్‌స్టర్‌ నయీం ఫోన్‌లో ఓ వ్యాపారిని బెదిరించాడు. భువనగిరికి చెందిన వ్యాపారిని బెదిరించి కోటి రూపాయలు డిమాండ్‌ చేశాడు. నయీం బెదిరింపులతో ఆ వ్యాపారి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నాడు. డబ్బులు ఇవ్వక పోతే నీ కుటుంబాన్ని చంపేస్తా.. నీ ప్రతి కదలిక నాకు తెలుసంటూ వ్యాపారిని నయీం బెదిరించాడు. నెల రోజుల్లో చనిపోతానని అనుకుంటున్నావు.. అది ఎప్పటికీ జరగదని నయీం బెదిరించాడు.

బైటపడుతున్న నయీం రక్త చరిత్ర
గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత రంగంలోకి దిగిన సిట్‌ ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది.. ఇప్పటికే 143 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు..ఇక పరారీలో ఉన్న అనుచరుల కోసం గాలిస్తున్నారు..మరోవైపు కస్టడీకి తీసుకున్నవారిచ్చే సమాచారంతో నయీం హత్యల రక్తచరిత్ర కూడా బయటపడుతుంది...ఓ మహిళను అంతం చేసి పూడ్చిపెట్టగా అవశేషాలను వెలికి తీశారు..

నయీం కేసులో బయటపడుతున్న సంచలనాలు..
గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత రంగంలోకి దిగిన సిట్ అధికారులు ప్రాథమిక విచారణ పూర్తి చేశారు...మొదటి దశ దర్యాప్తు పూర్తి చేసేందుకు రెండు మూడు రోజులు సమయం పడుతుందని అంచనా...ఇప్పటికే నయీం కేసులో తోడినకొద్దీ బయటపడుతున్న వాస్తవాలు సంచలనాలు రేపుతున్నాయి...అనుమానాలు..అపోహలు ఎన్ని ఉన్నా... సిట్‌ దర్యాప్తులో వెల్లయిన విషయాలను బయటపెట్టారు...

కొనసాగుతున్న భూ డాక్యుమెంట్ల పరిశీలన...

సిట్‌ అధికారులు ఇప్పటి వరకు 33 మంది నయీం అ నుచరులు..బంధువులను అరెస్టు చేశారు...కాగా పోలీసుల విచారణలో తేలిన స్వాధీనం చేసుకున్న వాటి లెక్కలన్నీ దాదాపు 143 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు...ఇంకా పెద్ద సంఖ్యలో లభించిన భూ డాక్యుమెంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు...

ఇప్పటికే 80 మంది బాధితుల ఫిర్యాదులు..
ఇక నయీం కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది...ప్రధానంగా పరారీలో ఉన్న మరో 20 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. నయీం ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను కోర్టులో ప్రవేశపెట్టి అర్హులకు అందించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఇప్పటి వరకు 80కుపైగా బాధితులు సిట్‌ అధికారులకు ఆశ్రయించి నయీం తమను బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు వివరించారు. హైదరాబాద్‌, నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో నయీంపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.

నార్సింగ్‌ మండలంలో మహిళ డెడ్‌బాడీ వెలికితీత
నయీం చేసిన ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. హత్యలు, బ్లాక్‌మెయిలింగ్‌, భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు వంటి వ్యవహారాలు తవ్వేకొద్దీ బయటకు వస్తూనే ఉన్నాయి. మూడేళ్ల క్రితం నస్రీన్‌ అనే మహిళను కొట్టి హత్య చేశాడు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని ఏం చేశాడో ఎవ్వరికీ తెలియలేదు. నయీంకు సన్నిహితంగా మెలిగిన ఫర్హాను పోలీసులు విచారించినప్పుడు నార్సింగి ప్రాంతంలో పూడ్చినట్లు తెలిసింది. దీనితో సైబరాబాద్‌ జాయింట్‌ సిపి స్టీఫెన్‌ రవీంద్ర, ఆర్డీవోల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసారు. మంచిరేవులలోని ఒక ప్రైవేటు వెంచర్‌ ప్రాంతం నుంచి వెలికి తీసిన మృతదేహం కేవలం ఎముకలగూడుగా ఉంది. వీటిని సేకరించిన పోలీసులు పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.

20:51 - August 22, 2016

ఖాకీలను ఉతికిపారేసిన పుష్కర భక్తులు..పతకం తెచ్చిన సింధుకి సన్మానాలే సన్మానాలు..హెల్మెట్ పెట్టకుండనే మోటరు బండి నడిపిన జూపల్లి..శ్రీశైలం మల్లన్న కాడ సీఐ రాసలీలలు..చూసీ చూడనట్టు వదిలేసిన డీఎస్పీ..భద్రాద్రి రాములోరి గుడిలో సీతమ్మోరి పుస్తెల తాడు..పూసల గొలుసు మాయం.. డాన్స్ కట్టిన హోంమంత్రి నాయిని నర్సన్న..గిటువంటి మస్తు ముచ్చట్లు మన మల్లన్న తీసుకొచ్చిండు..మస్తు మస్తు ముచ్చట్లు చూడాలంటే ఈ వీడియో చూడుండ్రి...మస్తు ఖుషీ అవుండ్రి..

20:30 - August 22, 2016

నల్లగొండ : భువనగిరి పీఎస్ లో ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఐపీసీ 363,346,386,120(బి) సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించాడని రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వున్న గంపా నాగేందర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. గ్యాంగ్ స్టర్ నయీం నేతి విద్యాసాగర్ మొబైల్ నుండి ఫోన్ చేసి బెదిరించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ముందు రూ.10కోట్లు ఇవ్వమని బెదిరించారనీ తరువాత కోటి రూపాయలకు ఒప్పందం కుదిరిందని గంపా నాగేందర్ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 

20:14 - August 22, 2016

హైదరాబాద్ : కస్టమర్లకు మంచి సేవలు అందించడంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎప్పడూ ముందులో ఉంటుందని తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్ అనంతరామ్‌ అన్నారు. వినియోగదారులకు ఉపయోగపడే విధంగా ఆగస్టు 15 నుంచి ఆకర్షణీయమైన ఆఫర్లను బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించిందని తెలిపారు. బీఎస్ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌లో 49 రూపాయలతో కొత్త స్కీం ప్రవేశపెట్టింది. ఈ స్కీం ప్రకారం రాత్రి 9గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ ఉచితంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ ఫ్రీకాల్స్ చేసుకోవచ్చని అన్నారు.

నయీం మరో అనుచరుడు అరెస్ట్..

నల్లగొండ : మిర్యాలగూడలో నయీం చెందిన మరో అనుచరుడిని అధికారులు అరెస్ట్ చేశారు. మసూద్ అలీ అనే వ్యక్తి గతంలో నయీం కారు డ్రైవర్ గా పనిచేసినట్లుగా అధికారులు గుర్తించారు. మసూద్ నుండి బొలెరో వాహనం, నీలుగు ల్యాండ్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, వైజాగ్, ఛత్తీస్ ఘడ్ , బాపట్ల వంటి పలు ప్రాంతాలకు చెందిన ల్యాండ్ డాక్యుమెంట్లుగా గుర్తించారు. 

వినాయకుడి విగ్రహంపై వివాదం..

విజయవాడ : 72 అడుగుల వినాయక విగ్రహంపై విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో గణేషుడి విగ్రహ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే బోండా ఉమ భాగస్వామ్యంపై అంతర్గత వివాదం నెలకొంది. అవినీతి, నిధుల దుర్వినియోగంపై పలు అనుమానాలు రేకెత్తాయి. 

ఎంసెట్ -2 కేసులో మరో ఇద్దరు అరెస్ట్..

హైదరాబాద్ : ఎంసెట్ 2 లీకేజ్ కేసులో మరో ఇద్దరు బ్రోకర్లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన రాజేష్, నల్లగొండకు చెందిన చింతపల్లి జానయ్యలను అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రూ.7.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దిల్ సుక్ నగర్ లోని శ్రేష్ఠ ఎక్స్ ప్రెస్ సంస్థను నిర్వహిస్తూ ..తొమ్మిది మంది విద్యార్థులకు పలు ప్రాంతాలలో శిక్షణ ఇచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. 

రైల్వే ఉద్యోగినిపై వేటకొడవళ్ళతో దుండగుల దాడి..

అనంతపురం : గుంతకల్ రైల్వే డీజిల్ షెడ్ వద్ద రైల్వే ఉద్యోగినిపై వేట కొడవళ్ళతో దుండగులు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలవ్వటంతో ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.

 

18:51 - August 22, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో శానిటేషన్ కార్మికులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి కృష్ణా నదిలో స్నానమాచరించేందుకు వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా రోడ్లన్నీ శుభ్రపరుస్తున్నారు. ఘాట్లలో చెత్తలేకుండా ఎప్పటికప్పుడు క్లీన్‌ చేస్తున్నారు. పుష్కరాల్లో సేవలందించడమే తమ బాధ్యత అంటున్నారు కార్మికులు. దీనిపై మరింత సమచారం కోసం ఈ వీడియో చూడండి..

18:49 - August 22, 2016

గుంటూరు : కృష్ణా పుష్కరాల సందర్భంగా అమరావతికి వచ్చే భక్తులకు... స్థానికులు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. మరోవైపు భక్తులు సైతం భోజన సదుపాయం కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు భోజన సదుపాయం కల్పించడం ద్వారా తమకు సంతృప్తి లభిస్తుందని ఆతిధ్యమిస్తున్న వ్యక్తులు చెబుతున్నారు. భక్తులు తృప్తిగా భోజనం చేసి వెళ్తే చాలు..కష్టాన్ని మర్చిపోతామంటున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

18:47 - August 22, 2016

కర్నూలు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలంలో పర్యటించారు. కృష్ణాపుష్కరాలు ముగింపుదశకు చేరుకోవడంతో చంద్రబాబు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పుష్కర భక్తులకు అన్నదానం చేశారు. లింగాల ఘాట్ వద్ద పుష్కర ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు భక్తులను అడిగి తెలుసుకున్నారు.

18:42 - August 22, 2016

గుంటూరు : నవ్యాంధ్రప్రదేశ్‌ తాత్కాలిక సచివాలయంలో అప్పుడే మరమ్మతులు చేస్తున్నారు. మంత్రుల కార్యాలయాలు సరిపోవడం లేదని కొన్ని... వాస్తు సరిగా లేదని మరికొన్నింటికి మరమ్మతులు చేస్తున్నారు. మొదట కట్టిన భవనానికి అప్పుడే మరమ్మతులు చేయడం పట్ల ప్రతి ఒక్కరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీని పరిస్థితే ఇలా ఉంటే.. భవిష్యత్‌లో కట్టబోయే రాజధాని పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహం వెలిబుచ్చుతున్నారు. 

వాస్తు సరిగా లేకపోవడంతో మరమ్మతులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెలగపూడిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తాత్కాలిక సచివాలయానికి అప్పుడే మరమ్మతులు చేస్తున్నారు. మంత్రుల చాంబర్లు చిన్నగా ఉండడమో లేక వాస్తు సరిగా లేవనే కారణంతో ఈ మరమ్మతులు చేస్తున్నారు.

ప్రజల సొమ్ము దుర్వినియోగమవుతుందని ఆరోపణలు
వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ పనులు జూన్‌ నెలాఖరుకే పూర్తి కావాల్సి ఉన్నప్పటికి ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు అన్ని శాఖల ఉద్యోగులు సచివాలయానికి తరలివస్తున్నారు. ఇప్పటికే 5వ బ్లాక్‌లో మంత్రుల కార్యాలయాలు ప్రారంభించారు. అయితే.. అందులో లోపాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. మంత్రుల కార్యాలయాలు తక్కువ విస్తీర్ణంలో నిర్మించడంతో.. ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు మంత్రుల కార్యాలయాలకు వాస్తు కూడా సరిగా లేదనే కారణంతో స్వల్ప మార్పులు చేస్తున్నారు. ఇదిలావుంటే ఇప్పటికే మిగతా బ్లాక్‌ల నిర్మాణాలు కూడా పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ అవి నత్తనడకనే కొనసాగుతున్నాయన్న ఆరోపణలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. పూర్తి చేసిన ఐదో బ్లాక్‌లో కూడా మళ్లీ మరమ్మతులు చేపట్టడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. హడావుడిగా పనులు చేసి.. ఇప్పుడు మరమ్మతులు చేపట్టడం వల్ల ప్రజల సొమ్ము దుర్వినియోగమవుతుందని ఆరోపిస్తున్నారు.
పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచనలు
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మొదటి కట్టడమే ఇలా ఉంటే.. ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా నిర్మిస్తామన్న రాజధాని ఎలా ఉంటుందోనన్న సందేహాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు హడావుడిగా పనులు చేయించకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. 

18:40 - August 22, 2016

ఢిల్లీ : న‌లుగురు క్రీడాకారుల‌కు రాజీవ్ ఖేల్ ర‌త్న పుర‌స్కారం అందించ‌నున్న‌ట్లు కేంద్రం ఈరోజు ప్ర‌క‌టించింది. పీవీ సింధు, దీపా క‌ర్మాక‌ర్‌, జీతూ రాయ్, సాక్షి మాలిక్‌ లకు రాజీవ్ ఖేల్ ర‌త్న పుర‌స్కారం ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు పేర్కొంది. అలాగే ఆరుగురికి ద్రోణాచార్య పుర‌స్కారం అందించ‌నున్న‌ట్లు తెలిపింది. దీపా క‌ర్మాక‌ర్ కోచ్ విశ్వేశ్వ‌ర్ నందికి ద్రోణాచార్య అవార్డు ప్ర‌క‌టించింది. నాగ‌పురి ర‌మేశ్‌(అథ్లెటిక్స్ ), సాగ‌ర్ మాల్ ధ్యాయ‌ల్ (బాక్సింగ్‌), రాజ్‌కుమార్ శ‌ర్మ‌ (క్రికెట్‌), ప్ర‌దీప్ కుమార్ (స్విమ్మింగ్‌), మ‌హావీర్ సింగ్ (రెజ్లింగ్‌)ల‌కు ద్రోణాచార్య పుర‌స్కారం అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

18:34 - August 22, 2016

హైదరాబాద్ : మహారాష్ట్రతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చేసుకున్న ఒప్పందాన్ని చారిత్రాత్మకమంటూ కేసీఆర్ తెలంగాణ ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారని మాజీ ఎంపీ మధుయాస్కీ మండిపడ్డారు. గత ప్రభుత్వాలు చేసుకున్న ఇరిగేషన్ ఒప్పందాలపై ఓబైడ్ అంటూ సంతకం చేసి తెలంగాణ హక్కులను కేసీఆర్ మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు.

18:30 - August 22, 2016

హైదరాబాద్ : నయీం కేసులో సిట్‌ మొదటి ప్రాధమిక విచారణ పూర్తయింది. మరో మూడు రోజుల్లో విచారణ పూర్తి కానుంది. ఇప్పటి వరకు 33 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 143 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నయీంకు చెందిన మంచిరేవులలోని ఇంట్లో ఓ మహిళ మృతదేహం బయటపడింది. మూడేళ్ల క్రితం నజ్రీన్‌ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని నార్సింగ్‌ పోలీసులు బయటకు తీశారు. 

18:27 - August 22, 2016

బైక్-జీపు ఢీ..ఇద్దరు మృతి..

మెదక్ : ఐడియా బొల్లారంలోని సుల్తాన్ పూర్ లో బైక్-జీపు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వీరిద్దరూ అన్నా చెల్లెళ్లుగా తెలుస్తోంది. మృతులు సురేంద్ర గౌడ్. పరిమళగా గుర్తించారు. 

మోదీ వ్యాఖ్యలకు మద్దతిచ్చిన నేతలపై కేసు..

పాకిస్థాన్ : ప్ర‌ధాని మోదీ చేసిన వ్యాఖ్య‌లు మ‌ద్ద‌తు తెలిపిన పాకిస్థాన్‌లోని బ‌లోచిస్తాన్ వేర్పాటువాద నేత‌ల‌పై స్థానిక పోలీసులు కేసు న‌మోదు చేశారు. బ‌లోచిస్తాన్ ప్రావిన్స్‌లోని కుజ్దార్ ఏరియాకు చెందిన వ్య‌క్తులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసును న‌మోదు చేశారు. ఆగ‌స్టు 15 ఎర్ర‌కోట ప్ర‌సంగంలో మోదీ బ‌లోచిస్తాన్ వేర్పాటువాదుల‌కు మ‌ద్దుతు తెలిపిన విష‌యం తెలిసిందే. 

17:39 - August 22, 2016
17:38 - August 22, 2016

4గురకి ఖేల్ రత్న,6గురికి అర్జున అవార్డులు..

ఢిల్లీ : న‌లుగురు క్రీడాకారుల‌కు రాజీవ్ ఖేల్ ర‌త్న పుర‌స్కారం అందించ‌నున్న‌ట్లు కేంద్ర ప్రభుత్వం  ప్ర‌క‌టించింది. పీవీ సింధు, దీపా క‌ర్మాక‌ర్‌, జీతూ రాయ్, సాక్షి మాలిక్‌ లకు రాజీవ్ ఖేల్ ర‌త్న పుర‌స్కారం ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు పేర్కొంది. అలాగే ఆరుగురికి ద్రోణాచార్య పుర‌స్కారం అందించ‌నున్న‌ట్లు తెలిపింది. దీపా క‌ర్మాక‌ర్ కోచ్ విశ్వేశ్వ‌ర్ నందికి ద్రోణాచార్య అవార్డు ప్ర‌క‌టించింది.

బీభత్సం సృష్టించిన కారు..ఒకరు మృతి..

కరీంనగర్ : ఎల్ఎండీ కాలనీ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. పాదచారులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.

మీడియాకు చిక్కిన నయీం బెదిరింపు ఆడియో కాల్..

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం ఫోన్ ఆడియో మీడియాకు చిక్కింది. భువనగిరికి సంబంధించిన వ్యాపారి నాగేంద్రను కోటి రూపాయాలు ఇవ్వాలని ఫోన్‌లో నయీం బెదిరించాడు. చివరిసారిగా భువనగిరి వ్యాపారికి బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు నయీం. నయీం బెదిరింపులతో వ్యాపారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. కోటి రూపాయాలను ఇవ్వనందుకు వ్యాపారి కుటుంబ సభ్యులను చంపుతానంటూ నయీం బెదిరించాడు.

'సూకీ తో సుష్మా'..

మయన్మార్ : మయన్మార్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ఆమె మయన్మార్ చేరుకోగానే ఆమెకు అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె ఆ దేశ విదేశాంగ మంత్రి, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ అధినేత ఆంగ్‌సాన్ సూకీతో భేటీ అయ్యారు. ఇరువురు కొద్దిసేపు రెండు దేశాల మధ్య సంబంధాల విషయమై చర్చించుకున్నారు. అంతకు ముందు సుష్మా మయన్మార్ అధ్యక్షుడు హుతిన్ క్వాతోతో భేటీ అయ్యారు. మయన్మార్ కొత్త ప్రభుత్వానికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

16:52 - August 22, 2016

హైదరాబాద్ : సంచలనం కలిగించిన గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తరువాత అతను చేసిన కిరాతకాలు..బెదిరింపులు..అక్రమాలు క్రమేపీ వెలుగులోకి వస్తున్నాయి. ప్రజాప్రతినిధులను..ఉన్నతస్థాయి పోలీసు అధికారులకు చేతిలో పెట్టుకుని అతను చేసిన అక్రమాలు..భూదందాలు..ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ కు నెలరోజుల ముందు ఒక వ్యాపారికి ఫోన్ చేసిన కోటి రూపాలయలు ఇవ్వాలంటూ బెదిరించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎన్‌కౌంటర్‌కు నెల రోజుల ముందు గ్యాంగ్‌స్టర్‌ నయీం ఫోన్‌లో ఓ వ్యాపారిని బెదిరించాడు. భువనగిరికి చెందిన వ్యాపారిని బెదిరించి కోటి రూపాయలు డిమాండ్‌ చేశాడు. నయీం బెదిరింపులతో ఆ వ్యాపారి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నాడు. డబ్బులు ఇవ్వక పోతే నీ కుటుంబాన్ని చంపేస్తా.. నీ ప్రతి కదలిక నాకు తెలుసంటూ వ్యాపారిని నయీం బెదిరించాడు. నెల రోజుల్లో చనిపోతానని అనుకుంటున్నావు.. అది ఎప్పటికీ జరగదని నయీం బెదిరించాడు. వ్యాపారిని బెదిరిస్తూ ఫోన్ లో మాట్లాడిన బెదిరింపులు వినాలంటే ఈ వీడియోను చూడండి..

16:40 - August 22, 2016

కడప : కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా సెప్టెంబర్ 2 న దేశవ్యాప్త సమ్మెను చేపట్టబోతున్న తరుణంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గపూర్ పేర్కొన్నారు.కార్మిక చట్టాల సవరణ ద్వారా కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గపూర్ ఆరోపించారు. కార్మికవర్గ సమస్యలను పట్టించుకోకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ అంశంపై మరింత సమచారం కోసం ఈ వీడియో చూడండి..

16:33 - August 22, 2016

హైదరాబాద్ : తల్లిదండ్రులు, గురువు గోపీచంద్‌ ప్రోత్సావం వల్లే తాను రియో ఒలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్ సాధించానని రియో స్టార్ పీవీ సింధు అన్నారు. కఠోర శ్రమకు తోడు తల్లిదండ్రులు ప్రోత్సాహం వల్లే తాను మెడల్ సాధించడానికి తోడ్పడిందని ఆమె అన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా గోల్డ్‌ మెడల్ సాధించానికి కృషి చేస్తానని సింధు పేర్కొంది.

2020లో జరిగే ఒలింపిక్స్ లో సింధు గోల్డ్ మెడల్ సాధిస్తుంది: గోపీచంద్

2020లో జరిగే ఒలింపిక్స్‌లో సింధు తప్పకుండా గోల్డ్‌ మెడల్‌ సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు కోచ్‌ గోపీచంద్‌. రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో సింధు చాలా బాగా ఆడిందని గోపీచంద్‌ పొగిడారు. ప్రత్యర్థి వరల్డ్‌ నెంబర్‌ వన్‌ అయినప్పటికీ సింధు గట్టి పోటీ ఇచ్చిందని గోపీచంద్‌ అన్నారు.  

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై: నేడు స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరికి నష్టపోయాయి. సెన్సెక్స్‌ 91 పాయింట్లు నష్టపోయి 27,985 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 37.75 పాయింట్లు నష్టపోయి 8629 పాయింట్లకు చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.18 వద్ద కొనసాగుతోంది.

తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదు : మధుయాష్కి

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌ అయ్య జాగీరు కాదని మాజీ ఎంపీ మధుయాష్కి అన్నారు. మత్తులో ఉన్న కేసీఆర్‌కు కాంగ్రెస్‌ జల దృశ్యం ఎలా కనిపిస్తుందని మండిపడ్డారు. విద్యాసాగర్‌రావు ప్రభుత్వానికి ఊడిగం చేస్తూ కాంగ్రెస్‌ ప్రజెంటేషన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తుమ్మిడిహట్టి ఎత్తును తగ్గించేందుకు ఒప్పుకుని.. కేసీఆర్‌ తెలంగాణను మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. మహారాష్ట్రతో చేసుకునే ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్‌ డీపీఆర్‌ను ఎందుకు బయటపెట్టడం లేదని మధుయాష్కి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

వీసీల నియామయంపై స్టేట‌స్ కో జారీ చేసిన సుప్రీంకోర్టు..

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ల (వీసీ) నియామకాలకు సంబంధించిన విధివిధానాలపై వాదనలు జరుగుతుండగానే వీసీలను నియమించడం పట్ల హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన వీసీ ఉత్త‌ర్వుల‌ను కూడా హైకోర్టు కొట్టి వేసింది. అయితే, హైకోర్టు ఆదేశాల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై ఈరోజు వాద‌న‌లు విన్న అత్యున్న‌త న్యాయ‌స్థానం వీసీల నియామకంలో హైకోర్టు ఉత్తర్వుల‌పై స్టేట‌స్ కో జారీ చేసింది. నియామ‌కంలో య‌థాత‌థ స్థితి కొన‌సాగించాల‌ని ఆదేశించింది.

16:09 - August 22, 2016

హైదరాబాద్:  ప్రజల పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, రాజకీయాల కోసం కాదని తెలిపారు. ప్రజల కోరిక మేరకే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.మండలాల సంఖ్యను 505కు పెంచామని వెల్లడించారు. జయశంకర్ సార్‌జిల్లా కోసం చాలా డిమాండ్లు వచ్చాయని తెలిపారు. కొత్త జిల్లాల అంశంపై మళ్లీ అఖిలపక్షం పెడతామని వెల్లడించారు. 

ఏసీబీ వలలో సర్వశిక్షా అభియాన్ అధికారి..

కర్నూలు : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. నంద్యాల సర్వశిక్షా అభియాన్ టెక్నికల్ సూపర్ వైజర్ భాస్కర్ రూ.66వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 

ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు..

ఢిల్లీ: దేశ రాజధాని దిల్లీలో సోమవారం స్వల్ప భూప్రకపంనలు సంభవించాయి. రిక్టర్‌స్కేల్‌పై వీటి తీవ్రత 3.7గా నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. హరియాణాలోని చాజవాస్‌ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.

పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు : మహ్మమ్మూద్ అలీ

హైదరాబాద్: ప్రజల కోరిక మేరకే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, రాజకీయాల కోసం కాదని తెలిపారు. మండలాల సంఖ్యను 505కు పెంచామని వెల్లడించారు. జయశంకర్ సార్‌జిల్లా కోసం చాలా డిమాండ్లు వచ్చాయని తెలిపారు. కొత్త జిల్లాల అంశంపై మళ్లీ అఖిలపక్షం పెడతామని వెల్లడించారు.

 

ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన సైనా ..

ముంబై: ఇటీవల తన కుడి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రియో ఒలింపిక్స్ లో లీగ్ దశ నుంచి నిష్క్రమించిన సైనా మోకాలి గాయం తీవ్రంగా బాధించడంతో ముంబై ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.

పుల్లెల గోపీచంద్ పై డిప్యూటీ సీఎం వావాదాస్పద వ్యాఖ్యలు..

హైదరాబాద్: ఒలింపిక్స్ లో బాట్మింటన్ లో రజత పతకం సాధించిన సింధుకు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సింధు కోచ్‌ పుల్లెల  గోపీచంద్‌పై మహమూద్‌అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఒలింపిక్స్‌లో సింధు గోల్డ్‌మెడల్‌ సాధించేందుకు గోపిచంద్‌ కంటే ఇంకా మంచి వ్యక్తితో కోచింగ్‌ ఇప్పిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. మహమూద్‌ అలీ వ్యాఖ్యలపై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

14:57 - August 22, 2016

హైదరాబాద్ : 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేయాలని హైకోర్టు తెలంగాణ సర్కారును ఆదేశించింది. ఈ తీర్పు హైకోర్టును ఆశ్రయించిన 70 మంది మల్లన్న సాగర్‌ రైతులకు ఊరట కలిగించింది. కోర్టును ఆశ్రయించిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలాగే కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. 

14:54 - August 22, 2016

ఖమ్మం : బస్సు బోల్తా ఘటనలో మృతులసంఖ్య పదికి చేరింది.. గాయపడ్డ 18మందికి ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్తున్న యాత్రాజినీ బస్సు కూసుమంచి మండలం నాయకన్‌గూడెం దగ్గర కాల్వలోకి దూసుకెళ్లింది.. తెల్లవారుజామున రెండున్నరగంటలకు ఈ ప్రమాదం జరిగింది.. ఘటనా స్థలంలో ఏడుగురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులున్నారు.. బాధితుల్లో ఎక్కువ మంది తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారే ఉన్నారు.

బాధితులకు రూ.3లక్షల నష్టపరిహారం ప్రకటించిన చంద్రబాబు
పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.. ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీసీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అదించాలని కలెక్టర్‌ను కేసీఆర్‌ ఆదేశించారు.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అటు చంద్రబాబు మృతుల కుటుంబాలకు 3లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు..

బస్ ప్రమాదంపై బాధితుల స్పందన..
అతివేగం, డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంవల్లే బస్సు బోల్తా కొట్టిందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ పరారయ్యాడు... బస్సు నీళ్లలోపడగానే గమనించిన స్థానికులు బస్సులోనివారిని కాపాడారు..3 అంబులెన్స్‌ల్లో బాధితులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా ఎస్సీ షానావాజ్‌ ఖాసీం, డీఎస్పీ సురేశ్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకొని సహాయకక చర్యలను పర్యవేక్షించారు. రెండు భారీ క్రేన్ల సాయంతో కాల్వలోంచి బస్సును బయటకు తీశారు. దాదాపు 5గంటల పాటు సహాయకచర్యలు కొనసాగాయి.

బాధితులకు పరామర్శించిన మంత్రి తమ్మల
ఖమ్మం బస్సు బోల్తా ఘటనలో గాయపడ్డవారిని మంత్రి తుమ్మల పరామర్శించారు.. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.. అటు ఈ ప్రమాదానికి ఆర్‌ అండ్‌ బీ అధికారులు బాధ్యత వహించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు.. రోడ్లు వెడల్పు చేసి బ్రిడ్జ్‌లు, కల్వర్టులను అలాగే ఉంచడంవల్లే ఇలా జరిగిందని ఆరోపించారు..

14:34 - August 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటుచేసేందుకు టీఆర్ఎస్ సర్కార్ గత కొంతకాలంలో తీవ్రంగా కసరత్తులు చేస్తోంది.  జిల్లాల పునర్వ్వవస్థీకరణపై  ప్రభుత్వం ఎట్టకేలకూ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది . వివిధ జిల్లాలకు వేరువేరుగా జీవోలు విడుదల చేసింది. మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లుగా విభజన చేయనున్నట్టు ప్రభుత్వం ముసాయిదాలో పేర్కొంది. అభ్యంతరాలు తెలిపేందుకు నెలరోజుల గడువు ఇచ్చింది. కలెక్టరేట్లు, సీసీఎల్‌ఏలలో అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. మార్గదర్శకాలకు జీవో 194ను సర్కారు జారీ చేసింది.

మల్లన్నసాగర్ రైతులకు హైకోర్టులో ఊరట..

హైదరాబాద్‌: మల్లన్నసాగర్ రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వం 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలని కోర్టు సూచించింది. కోర్టును ఆశ్రయించిన 70 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ ..

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా ఏర్పాటుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లతో కూడిన ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు, సలహాలు తెలియజేయాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అభ్యంతరాలు, సలహాలకు నెల రోజుల గడువు విధిస్తున్నట్లు ప్రకటించింది. అభ్యంతరాలు, సలహాలను జిల్లా కల్లెక్టరేట్లు, సీసీఎల్ఏ కార్యాలయాల్లో అందజేయాలని సూచించింది. 

13:39 - August 22, 2016

హైదరాబాద్ : తమను ఘనంగా సన్మానించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కతృజ్ఞతలు తెలియచేస్తున్నట్లు బ్యాడ్మింటెన్ కోచ్ గోపిచంద్, రియో ఒలింపిక్ రజత పతకం విజేత సింధులు వెల్లడించారు. గచ్చిబౌలి స్టేడియంలో సింధుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. అంతకుముందు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి గచ్చిబౌలి స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై కోచ్ గోపిచంద్..సింధులు ప్రసంగించారు.
చాలా ఆనందంగా ఉంది - సింధు..
చాలా ఆనందంగా ఉందని, ప్రజల సపోర్టు...ఆశ్వీరాదాల వల్ల తాను ఇక్కడ ఉన్నానని సింధు తెలిపారు. గోపిచంద్..తల్లిదండ్రుల వల్ల తాను విజయం సాధించడం జరిగిందన్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి ఇంత మంది వస్తారని అనుకోలేదని, రానున్న రోజుల్లో విజయాలు సాధించి ముందుకొస్తానని తెలిపారు.
కృతజ్ఞతలు - గోపిచంద్...
తమను సన్మానించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు కోచ్ గోపిచంద్ పేర్కొన్నారు. 2000లో కరణం మల్లీశ్వరీ ఒలింపిక్ పతకం గెలుచుకున్న సందర్భంలో తాను ఇంకా బాగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పతకాలు సాధించిన ఇద్దరు అమ్మాయిలకు అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. స్పోర్ట్స్ లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తుందని గోపిచంద్ ఆకాంక్షించారు. 

చాలా ఆనందంగా ఉంది - సింధు...

హైదరాబాద్ : తమను ఘనంగా సన్మానించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కతృజ్ఞతలు తెలియచేస్తున్నట్లు బ్యాడ్మింటెన్ కోచ్ గోపిచంద్, రియో ఒలింపిక్ రజత పతకం విజేత సింధులు వెల్లడించారు. 

పేపర్ మిల్లులో బాయిలర్ పేలుడు..

పంజాబ్ : సంగ్రూర్ లో ఓ పేపర్ మిల్లులో బాయిలర్ పేలడంతో ఇద్దరు మృతి చెందారు. 21 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

13:23 - August 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో క్రీడా పాలసీని తీసుకొస్తామన రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గచ్చిబౌలి స్టేడియంలో సింధుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. అంతకుముందు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి గచ్చిబౌలి స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై తెలంగాణ మంత్రులు ప్రసంగించారు.

సంతోషంగా ఉంది - మహేందర్ రెడ్డి...
దేశ పేరును ఇనుమడింప చేయడం సంతోషంగా ఉందని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక నజరానాను ప్రకటించడం జరిగిందని, సింధును సన్మానించడం సంతోషంగా ఉందన్నారు.

అభినందిస్తున్నా - నాయినీ..
తెలంగాణ గౌరవాన్ని కాపాడినందుకు అభినందిస్తున్నట్లు, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నజరానాను ప్రకటించడం జరిగిందని హోం మంత్రి నాయినీ పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు సింధును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

దేశాన్ని బతికించారు - కేటీఆర్...
బేటీ బచావో..బేటీ పడావో..దేశ ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారని, దేశాన్ని ఇద్దరు బేటీలు బచాయించారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సింధుకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఎన్నో త్యాగాలు..ఎంతో కృషి దాగుందనే విషయం తనకు తెలుసని, గెలిచిన వారికి రివార్డులలే ప్రకటించడమే గాకుండా ప్రణాళికలు రూపొందించాలని పలువురు సూచించడం జరిగిందన్నారు. సింధులాంటి ఛాంపియన్స్ ను ఇతరులను తయారు చేయాలని, ఇంటర్నేషనల్ కోచర్స్ లాంటి వ్యక్తులను తీసుకరావాలని గోపిచంద్ సూచించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళుతానని, ద్రోణ అవార్డు గ్రహీతలు..గోపిచంద్..ఇతరుల సహకారంతో స్పోర్ట్ పాలసీని ప్రకటించడం జరుగుతుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
అనంతరం కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటి సీఎం ఆలీలు ప్రసంగించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

డాటర్ ఆఫ్ ఇండియా - కేటీఆర్...

హైదరాబాద్ : సింధు..డాటర్ ఆఫ్ ఇండియా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సింధు విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే స్పోర్ట్స్ పాలసీని ప్రకటిస్తామని తెలిపారు. 

సింధును స్పూర్తిగా తీసుకోవాలి - నాయినీ..

హైదరాబాద్ : క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు చాలా కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతోందని హోం మంత్రి నాయినీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు సింధును స్పూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 

ఖమ్మంలో జగన్..

ఖమ్మం : వైసీపీ అధ్యక్షుడు జగన్ ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. కూసుమంచి మండలం నాయికన్ గూడెం వద్ద నేటి తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన తీరును జగన్ పరిశీలించి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. 

స్టేజ్ పైకి చేరుకున్న సింధు..

హైదరాబాద్ : ఒలింపిక్ రజత పతక విజేత సింధు గచ్చిబౌలి స్టేడియంలో వేదికపైకి చేరుకుంది. మంత్రులు..ఇతర అధికారులకు సింధు అభివాదం చేసింది. 

శ్రీశైలానికి చేరుకున్న సీఎం చంద్రబాబు..

కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్నారు. ఘాట్లను సందర్శించి.. భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించనున్నారు. 

రేపు విజయవాడకు వెళ్లనున్న సింధు..గోపిచంద్..

హైదరాబాద్ : ఒలింపిక్ రజత పతక విజేత సింధు..కోచ్ గోపిచంద్ లు రేపు విజయవాడకు వెళ్లనున్నారు. ఉదయం 8.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు సింధు, గోపిచంద్ లు చేరుకోనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి విజయవాడ వరకు ర్యాలీ నిర్వహించనుంది. రేపు సాయంత్రం పీవీ సింధు, గోపిచంద్ లనుఏ సీఎం చంద్రబబు నాయుడు సన్మానించనున్నారు. 

మల్లన్న సాగర్ రైతులకు ఊరట..

హైదరాబాద్ : హైకోర్టులో 70 మంది మల్లన్న సాగర్ రైతులకు ఊరట లభించింది. 2013 చట్టం ప్రకారం భూ సేకరణ చేయాలని కోర్టు సూచించింది. కోర్టును ఆశ్రయించిన వారికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. 

నయీం ఎన్ కౌంటర్ నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్ : నయీం ఎన్ కౌంటర్ పై నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ కౌంటర్ పై ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడాలని డిమాండ్ చేశారు. విజయవాడ నుండి ఉత్తరాంధ్ర వరకు పలు థియేటర్ లలో నయీం అనుచరులే క్యాంటీన్లను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీనిపై సీఎం చంద్రబాబు పూర్తి విచారణ జరిపించాలని, కొందరు నయీం అనుచరులు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి గెస్ట్ హౌస్ లో ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. 

బిగిషా హత్య కేసులో ఇద్దరికి ఉరిశిక్ష...

ఢిల్లీ : ఐటీ ఉద్యోగిని బిగిషా హత్య కేసులో ఇద్దరు దోషులకు సాకేత్ కోర్టు ఉరి శిక్ష విధించింది. అమిత్ శుక్లా, రవికపూర్ లకు ఉరిశిక్ష పడిన వారిలో ఉన్నారు. మరో దోషి బల్జీత్ కు జీవిత ఖైదు విధించింది. 2009 మార్చి 18వ తేదీన బిగిషా దారుణ హత్యకు గురైంది. 

గచ్చిబౌలి స్టేడియానికి చేరుకున్న పీవీ సింధు...

హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియానికి ఒలింపిక్ రజత పకత విజేత పీవీ సింధు చేరుకున్నారు. కాసేపట్లో ప్రభుత్వం సన్మానించనుంది. 

గచ్చిబౌలి స్టేడియానికి చేరుకున్న మంత్రులు..

హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రి కేటీఆర్, నాయినీ, తదితరులు చేరుకున్నారు. కాసేపట్లో ఒలింపిక్ పతక విజేత సింధును ప్రభుత్వం సన్మానించనుంది. 

ఇంకా కొనసాగుతున్న సింధు విజయోత్సవ ర్యాలీ..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ నుండి సింధు విజయోత్సవ ర్యాలీ ఇంకా కొనసాగుతోంది. గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. రియో ఒలింపిక్స్ లో సింధు రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే. 

కాసేపట్లో టి. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నోటిఫికేషన్..

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నోటిఫికేషన్ విడుదల కానుంది. నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించనుంది. కలెక్టరేట్లు, సీసీఎల్ఏలో అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 

అగార్తలకు చేరుకున్న దీపా కర్మాకర్..

త్రిపుర : జిమ్నాసిస్టు దీపా కర్మాకర్ ఆగార్తలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. 

సీఎం కేసీఆర్ ను కలవనున్న సింధు..

హైదరాబాద్ : ఒలింపిక్ రజత పతకం విజేత సింధు సాయంత్రం సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో సింధుకు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. 

సుప్రీంలో ఓటుకు నోటు కేసు విచారణ..

ఢిల్లీ : ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు నాలుగు వారాల గడువు కోరాడు. కేసు నుండి మత్తయ్య పేరును తొలగించడాన్ని సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. 

ఆమరగిరి పుష్కర ఘాట్ లో విషాదం..

మహబూబ్ నగర్ : కొల్లాపూర్ (మం); ఆమరగిరి పుష్కర ఘాట్ లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన నగేష్ (35) కు ఫిట్స్ రావడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. 

మూడు రాష్ట్రాలకు ఎన్ జీటీ నోటీసులు..

ఢిల్లీ : పోలవరం పర్యావరణ అనుమతులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. పోలవరానికి ఇచ్చిన పర్యావరణ అనుమతులు చెల్లవంటూ పిటిషన్ దాఖలైంది. కేంద్ర పర్యావరణ శాఖ, పోలవరం అథార్టీకి ఏన్ జీటీ నోటీసులు జారీ చేసింది. అలాగే ఏపీ, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వలని ఆదేశించింది. తదుపరి విచారణనను అక్టోబర్ 3కి వాయిదా వేసింది. 

పున్నమి ఘాట్ లో నీట మునిగిన మహిళ..

విజయవాడ : పున్నమి ఘాట్ లో ఓ మహిళ నీట మునిగింది. అక్కడనే ఉన్న రెస్క్యూ టీం మహిళను కాపాడింది. ఘాట్ దగ్గర ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

ఖమ్మం ప్రమాద ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య..

ఖమ్మం : జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. మొత్తం 14 కి పెరిగింది. ప్రైవేటు బస్సు ఎన్ఎస్ పి కాల్వలో పడిపోయిన సంగతి తెలిసిందే. 

11:10 - August 22, 2016

ఖమ్మం బస్సు ప్రమాదంపై బాబు విచారం..

ఖమ్మం : జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. 

ప్రధానికి కాశ్మీర్ విపక్ష నేతల వినతిపత్రం..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కాశ్మీర్ విపక్ష నేతలు కలిశారు. ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని విపక్ష నేతల బృందం ప్రధానితో సమావేశమైంది. రాష్ట్ర పరిస్థితులను ప్రధానికి వివరించారు. పెలల్లెట్ తుపాకీల వినియోగంపై వెంటనే నిషేధం విధించాలని ప్రతిపక్షాలు కోరాయి. ఈ సందర్భంగా ఓ వినతిపత్రాన్ని సమర్పించాయి. 

10:49 - August 22, 2016

హైదరాబాద్ : సింధూ..సింధు..అనే నినాదాలతో గచ్చిబౌలి జీఎంసీ స్టేడియం మారిమోగిపోయింది. దేశభక్తి గీతాలు స్టేడియంలో నినదించాయి. రియో ఒలింపిక్స్ లో రజత పతక విజేత సింధూ కాసేపటి క్రితం నగరంలో అడుగు పెట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ మంత్రులు, క్రీడాభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ అభిమాన సందోహం కరతాళ ధ్వనుల మధ్య ఎయిర్ పోర్టు బయటకు వచ్చిన సింధు... విజయోత్సవ ర్యాలీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ బస్సు టాపు పైకి ఎక్కింది. సింధుతో పాటు ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా బస్సెక్కాడు. ర్యాలీ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం దాకా కొనసాగనుంది. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియానికి విద్యార్థులను తరలించారు. సింధును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్మానించనుంది. స్టేడియం ఇరువైపులా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

10:47 - August 22, 2016

గచ్చిబౌలి స్టేడియంలో దేశభక్తి గీతాలు..

హైదరాబాద్ : రియో ఒలింపిక్ విజేత సింధూ రాకకోసం గచ్చిబౌలి స్టేడియంలో విద్యార్థులు..ఇతరులు వేచి చూస్తున్నారు. సింధూ..సింధు..అనే నినాదాలతో గచ్చిబౌలి జీఎంసీ స్టేడియం మారిమోగిపోయింది. దేశభక్తి గీతాలు స్టేడియంలో నినదించాయి. రియో ఒలింపిక్స్ లో రజత పతక విజేత సింధూ కాసేపటి క్రితం నగరంలో అడుగు పెట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ మంత్రులు, క్రీడాభిమానులు ఘన స్వాగతం పలికారు.

బారాముల్లాలో మిలిటెంట్ శిబిరం ధ్వంసం..

జమ్మూకాశ్మీర్ : బారాముల్లాలో మిలిటెంట్ శిబిరాన్ని 46 పీఆర్ మరియు ఎస్ ఓజీ దళాలు ధ్వంసం చేశాయి. ఈ సందర్భంగా భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

10:15 - August 22, 2016

అమెరికాలో కాల్పులు..

హైదరాబాద్ : అమెరికాలో కనెక్టికట్ కాల్పులతో దద్దరిల్లింది. నగరంలోని ఓ ఇంటిలో దాక్కున్న గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా జనంపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది దాకా గాయపడ్డట్లు ప్రాథమిక సమాచారం.

09:57 - August 22, 2016
09:56 - August 22, 2016

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్ లో రజత పతకం విజేత సింధు నగరానికి చేరుకున్నారు. కాసపటి క్రితం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమెకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, మంత్రులు నాయినీ, మహేందర్ రెడ్డి ఇతర మంత్రులు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. ఏపీ మంత్రి దేవినేని ఉమ, ఎంపీ కేశినేని నాని శాలువతా సత్కరించారు. కోచ్ గోపిచంద్ కు కూడా ఘన స్వాగతం పలికారు. ఘన స్వాగతం అనంతరం ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ వాహనంపైకి సింధు..గోపిచంద్ లు ఎక్కారు. క్రీడాభిమానులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. సింధు..గోపిచంద్ లు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకూ పీవీ సింధు విజయోత్సవ ర్యాలీ జరగనుంది. రాజీవ్‌ గాంధీ విమానాశ్రయం నుంచి అత్తాపూర్, టోలీచౌకి దర్గా, కాజాగూడ ప్రాంతాల గుండా ర్యాలీ గచ్చిబౌలికి చేరుకోనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ర్యాలీ సాగనుంది. రోడ్డు మార్గాన విద్యార్థులు సింధుకు ఘన స్వాగతం పలికారు. 

ఖమ్మం జిల్లా మృతులకు ఏపీ పరిహారం..

ఖమ్మం : జిల్లా బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 3లక్షల పరిహారాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. కూసుమంచి (మం) నాయకన్ గూడెంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్ఎస్ పి కాల్వలోకి ప్రైవేటు బస్సు (ఏపీ 26 టిసి 9512) దూసుకెళ్లడంతో 9 మంది మృతి చెందారు. 

సింధుకు ఏపీ మంత్రి దేవినేని స్వాగతం..

హైదరాబాద్ : రియో ఒలింపిక్ పతక విజేత సింధు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏపీ మంత్రులు దేవినేని ఉమ, ఎంపీ కేశినేని నాని శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. 

కిక్కిరిసిన శంషాబాద్ ఎయిర్ పోర్టు..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టు కిక్కిరిసింది. రియో ఒలింపిక్ విజేత సింధుకు స్వాగతం తెలిపేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు..జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ లు ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సింధుకు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. 

మోడీతో భేటీ కానున్న జమ్మూ విపక్ష నేతలు..

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ విపక్ష నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వీరు భేటీ కానున్నారు. జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నారు. కాసేపటి క్రితం ఒమర్ అబ్దుల్లా సౌత్ బ్లాక్ కు చేరుకున్నారు. 

09:23 - August 22, 2016

'స్టార్...బాస్ ఈజ్ బ్యాక్ అంటూ' చిరు మెస్మరైజ్ చేశారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న చిరంజీవి 150వ చిత్రం టీజర్ విడుదలైంది. చిరు తనయుడు రాంచరణ్ తేజ తన ఫేస్ బుక్ ద్వారా టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో చిత్రం షూటింగ్ దృశ్యాలు పొందుపరిచారు. చివరిలో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరంజీవి కనిపించారు. సోమవారం చిరు 61వ పుట్టిన రోజు సందర్భంగా దీనిని విడుదల చేశారు. తమిళంలో సూపర్ హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేస్తున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.టీజర్ విడుదల కావడంతో చిరంజీవి అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

ఖైదీ నెంబర్ 150
చిరంజీవి 150వ సినిమాకు కత్తిలాంటోడు.. నెపోలియన్‌.. తదితర టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. చివరికి.. చిరు 150వ సినిమా టైటిల్‌పై క్లారీటి వచ్చింది. చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 150వ చిత్రానికి 'ఖైదీ నంబర్‌ 150' అనే పేరును ఖరారు చేశారు. ఖైదీ నంబర్‌ 150 సినిమా దర్శకుడు వివి వినాయక్‌.. తమిళ మాతృకను తెలుగు నేటి విటీకి అనుగుణంగా మార్పులు చేయించారు. ఈ చిత్రంలో కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిరు తనయుడు రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అభిమానుల ఎదురుచూపులు..
 చిరు 150వ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. చిరు సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సినిమా మొదలవ్వాల్సి ఉన్నా.... చిరంజీవి చిన్నకూతురు శ్రీజ వివాహం కారణంగా సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడింది. 2007లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ హీరోగా చిరంజీవికి చివరి చిత్రం. ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. మధ్యలో తనయుడు రామ్ చరణ్ చిత్రాలు మగధీర, బ్రూస్‌ లీ సినిమాల్లో గెస్ట్ రోల్‌లో అభిమానులను అలరించారు చిరు. 

09:14 - August 22, 2016

హైదరాబాద్ : రియో ఒలింపిక్ లో సిల్వర్ మెడల్ సాధించిన తెలుగు తేజం సింధు నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సింధుకు ఘన స్వాగతం లభించింది. రియో ఒలింపిక్స్ విజేత పీవీ సింధు రాకకోసం తెలుగురాష్ట్రాల అభిమానులు ఎదురుచూస్తున్నారు. రియోడీజెనీరో నుంచి ఈరోజు ఉదయం 8 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి సింధు చేరుకొంటుంది. సింధును ఘనంగా స్వాగతించేందుకు తెలంగాణ సర్కారు, హైదరాబాద్‌ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌ భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. సింధుకు అభినందనలు తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం భారీ ఏర్పాట్లు చేశాయి. ఓపెన్ టాప్ వాహనంలో గోపీచంద్ అకాడమీ వరకూ ఊరేగింపుగా తీసుకు వెళుతున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకూ పీవీసింధు విజయోత్సవ ర్యాలీ జరగనుంది. రాజీవ్‌ గాంధీ విమానాశ్రయం నుంచి అత్తాపూర్, టోలీచౌకి దర్గా, కాజాగూడ ప్రాంతాల గుండా ర్యాలీ గచ్చిబౌలికి చేరుకోనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ర్యాలీ సాగనుంది. రోడ్డు మార్గాన విద్యార్థులు సింధుకు ఘన స్వాగతం పలకనున్నారు.

సింధు కార్యక్రమ విశేషాలు..

 • 9.20 నుంచి 9.30 : వీవీఐపీలకు మర్యాద పూర్వక పరిచయం.
 • 9.30 నుంచి 10 గంటల మధ్య సింధుకు, సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారులకు అభినందనలు తెలియచేయనున్నారు.
 •  10 గంటల నుండి శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియంకు ర్యాలీ ప్రాంరభం కానుంది.
 • 11 గంటలకు గచ్చిబౌలి స్టేడియంకు ర్యాలీ చేరుకోనుంది. అనంతరం జీపులో స్టేడియంలో సింధు తిరగనున్నారు.
 • 11.15 నుంచి 11.30 వరకు శాలువాలు, పుష్పాగుచ్ఛాలు, మెమోంటోలతో సత్కారం. రివార్డుల చెక్కులను అందచేయనున్నారు.
 • 11.30 నుండి ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి కేటీఆర్, సింధు కోచ్ పి. గోపీచంద్, పీవీ సింధు ప్రసంగాలు చేయనున్నారు.
 • 12.00 గంటలకు కార్యక్రమం ముగియనుంది. 

చిరంజీవి టీజర్ విడుదల..

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన ఓ టీజర్ ను చిరు తనయుడు రాంచరణ్ తేజ రిలీజ్ చేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

08:54 - August 22, 2016

ఖమ్మం : సోమవారం ఉదయాన్నే దుర్వార్త. కూసుమంచి (మం) నాయకన్ గూడెంలో యాత్రా జైన్ కు చెందిన (ఏపీ 26 టిసి 9512) బస్సు ఎన్ఎస్ పి కాల్వలో పడిపోయింది. 30 అడుగుల పై నుండి పడిపోవడంతో 9 మంది మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విజయవాడకు వెళ్లాల్సిన బస్సులు ఖమ్మం నుండి వెళుతున్నాయి. ఎన్ఎస్ పి బ్రిడ్జి ఇరుకుగా ఉండడం..చీకటిగా ఉండడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అంతకుముందే ఓ బస్సు ప్రమాదానికి గురికావడంతో అక్కడే నిలిచిపోయింది. దీనిని యాత్రా జైన్ చెందిన బస్సు డ్రైవర్ గమనించలేదు. దీనితో బస్సు అదుపు తప్పి ఎన్ఎస్ పి కాల్వ బ్రిడ్జి పై నుండి కిందకు పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని క్రేన్ సహాయంతో బస్సును పైకి లేపారు. ఆ ప్రాంతం హృదయ విదారకరంగా ఉంది. బస్సులోనే మృతదేహాలు పడి ఉన్నాయి.

బస్సు కండీషన్ బాగానే ఉంది - యాత్రా జైన్ సంస్థ..
బస్సు కండీషన్ బాగానే ఉందని యాత్రా జైన్ సంస్థకు చెందిన సాయి అనే వ్యక్తి పేర్కొన్నారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఖమ్మం నుండి వెళ్లాల్సి వస్తోందని, ఇద్దరు డ్రైవర్లు ఉంటారన్నారు. సూర్యాపేట వరకు ఒకరు నడిపారని, అనంతరం వేరే డ్రైవర్ బస్సు నడిపినట్లు తెలిపారు. అతనికి 20 సంవత్సరాల ఎక్స్ పీరీయన్స్ ఉందని, 9 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. కంపెనీకి ఎప్పుడూ బ్యాడ్ పేరు రాలేదని, మొత్తం 26 మంది ప్రయాణీకులు బస్సులో ఉన్నారని, ఘటనా స్థలికి తమ స్టాఫ్ వెళ్లినట్లు తెలిపారు.

అసలు ఏం జరిగింది ? 

 • యాత్రా జైన్ కు చెందిన ప్రైవేటు బస్సు ఏపీ 26 టిసి 9512 కాకినాడకు వెళుతోంది.
 • నాయకన్ గూడెం వద్ద భారతీ ట్రావెల్స్ కు చెందిన బస్సుకు ప్రమాదం చోటు చేసుకుంది.
 • ఈ బస్సును తప్పించబోయి యాత్రా జైన్ బస్సు అదుపు తప్పింది.
 • నేరుగా 30 అడుగుల పై నుండి ఎన్ ఎస్ పి కాల్వలోకి పడిపోయింది.
 • దీనితో 9 మంది మృతి చెందారు.
 • గాయపడిన క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

చత్తాపూర్ లో కూలిన స్కూల్....

మధ్యప్రదేశ్ : చత్తాపూర్ లో ఓ స్కూల్ కూలిపోయింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వానకు తడిపోవడంతోనే స్కూల్ పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఎవరికైనా ప్రమాదం సంభవించిందా అనేది తెలియరాలేదు. 

08:27 - August 22, 2016

నల్గొండ : కృష్ణా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగుతున్న పుష్కరాలు 12 రోజులు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణా తీరం వెంబడి ప్రభుత్వం ఘాట్లను ఏర్పాటు చేశారు. పదో రోజు ఆదివారం కావడంతో ఘాట్లకు భక్తులు పోటెత్తారు. ప్రధాన ఘాట్లు జనసంద్రంగా మారిపోయాయి. పదో రోజు తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అంచనా. సోమవారం 11వ రోజున నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ శివాలయం ఘాట్ వద్ద ఉదయం నుండే భక్తులు పోటెత్తారు. ఆదివారం ఒక్క రోజు ఐదు లక్షల మంది ఘాట్ లో పుణ్యస్నానాలు ఆచరించారు. రెండు రోజులు మాత్రమే ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఎంత మంది తరలివచ్చినా భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఘాట్ నిర్వాహకుడు పేర్కొన్నారు. పుష్కర విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

07:58 - August 22, 2016

యుక్త వయస్సు వచ్చే వారికి మొటిమల సమస్య బాధ పెడుతుంటుంది. మొటిమల నుండి తప్పించుకోవడానికి బ్యూటీ పార్లర్లు..ఇతరత్రా సౌందర్య సాధనాలు వాడుతూ పలు సమస్యలు తెచ్చుకుంటుంటారు. మొటిమలు అధికంగా ఉన్న వారు బయటకు వెళ్లడానికి మొహమాటం పడుతుంటారు. అంతేగాకుండా మానసికంగా కృంగిపోతుంటారు. మరి మొటిమల బాధ తీరాలంటే కొన్ని చిట్కాలు...
రెండు చెంచాల తేనె, ఒక చెంచా దాల్చిన చెక్కపొడి కలుపుకోవాలి. ఈ పేస్టు ముఖానికి పూతలా పూయాలి. ఓ పావుగంట అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి.
ఒక చెంచా వెనిగరల్ లో మూడు చెంచాల నీళ్లు కలపాలి. అందులో దూదిని ముంచి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల అనంతరం నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
పండిన బొప్పాయి గుజ్జును ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి.
నారింజ తొక్కల పొడిని రెండు చెంచాల మోతాదులో తీసుకుని దీనికి కొన్ని నీళ్లు చేర్చాలి. అలా వచ్చిన పేస్టును ముఖానికి రాసి ఇరవై నిమిషాల పాటు ఉంచి తరువాత కడిగేయాలి.
పచ్చి బంగాళాదుంపను ముక్కలుగా కోసుకోవాలి. ఆ ముక్కలతో ముఖంపై వలయాకారంగా పది నిమిషాల పాటు రుద్దుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. 

07:46 - August 22, 2016

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముసాయిదా ప్రకటన ఇవాళ అధికారికంగా విడుదల కానుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా 27 జిల్లాల సరిహద్దులతో కూడిన మ్యాప్‌ను అధికారులు సిద్ధం చేశారు. నోటిఫికేషన్‌ విడులైన నాటి నుంచి కొత్త జిల్లాలు, వీటి సరిహద్దులతోపాటు అన్ని అంశాలపై నెల రోజుల పాటు ప్రజాభిప్రాయం సేకరిస్తారు. రాష్ట్రాల ఖజానాపై కేంద్రం నిఘా పెడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), దినకర్ (టిడిపి), తులసీ రెడి (కాంగ్రెస్) వకుళాభరణం కృష్ణమోహన్ (టీఆర్ఎస్), రాకేష్ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

07:43 - August 22, 2016

కొంతమంది ఇంట్లో నడిస్తే చెప్పులు..బయటకు వెళితే చెప్పులు..వేసుకుని నడుస్తుంటారు. చెప్పులు లేకుండా నడవడం అన్నది సాధ్యం కాదు అని భావిస్తుంటారు. కానీ చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎన్నో లాభాలున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
చెప్పులు లేకుండా నడవడం వల్ల వెన్ను మోకాళ్ల బాధల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.
అంతేగాకుండా కాలి కండరాలకు ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. పచ్చని..పచ్చికపై చెప్పులు లేకుండా నడవడం మంచిది.
కలతలు లేని నిద్ర పోవాలన్న..ఒత్తిడిని తగ్గించుకోవాలన్నా ఒట్టిపాదాల నడక అవసరం.
పాదాలు అలసటను కొల్పోతాయి. బీచ్ లకు వెళ్లిన సమయంలో పాదరక్షలు లేకుండా నడవడం వల్ల పాదాలు మృదువుగా తయారవుతాయి.
అరికాలి మంటలూ, నొప్పులూ ఉన్నవారికి ఎంతగానో దోహదపడుతుంది.
కండరాల బలహీనత ఉన్నవారికి కూడా కాలినడక అంత మంచిది కాదు. మధుమేహం వంటివి ఉంటే మాత్రం చెప్పులు లేకుండా నడవరాదు.
వయసు మళ్లిన వాళ్లు కూడా వైద్యుల సలహామేరకు ఇంటి తోటలో కాసేపు నడవొచ్చు.
శరీరంలోని లిగమెంట్లూ, కండరాలూ, కీళ్లూ శక్తిమంతం అవ్వాలంటే ప్రతి రోజూ కాకపోయినా నిర్ణీత సమయంలో వారానికోసారి కాసేపు నడవడం ఎంతో ముఖ్యమని వైద్యులు చెపుతున్నారు. 

నేడు శ్రీశైలానికి సీఎం చంద్రబాబు..

కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీశైలం క్షేత్రానికి రానున్నారు. ఘాట్లను సందర్శించి.. భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. పోలీసు ఉన్నతాధికారులు సెక్యూరిటీని పర్యవేక్షించారు. 

06:39 - August 22, 2016
06:36 - August 22, 2016

పని చేస్తున్న హమాలీ వర్కర్లకు 2016 జనవరి నుంచి వేతనాలు పెంచేవిధంగా గతంలో ఒప్పందం కుదిరింది. అయితే, జనవరి నుంచి కాకుండా ఆగస్టు నుంచి కొత్త వేతనాలు అమలు చేస్తామంటూ సర్య్యులర్ జారీ చేయడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎలక్ట్రిసిటీ స్టోర్స్ లో పనిచేసే హమాలీలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. దీంతో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలు పోరుబాట పడుతున్నారు. ఇవాళ బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు ధర్నా చేస్తుంటే, 29 నుంచి సమ్మె చేస్తామంటున్నారు సివిల్ సప్లయ్ హమాలీలు. దీర్ఘకాలంగా పెండింగ్ లో వున్న తమ సమస్యలు పరిష్కరించాలంటూ మిగిలిన హమాలీలు కూడా సెప్టెంబర్ 2న జరిగే సమ్మెలో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నారు. హమాలీలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ నేత సుధాకర్ విశ్లేషించారు. ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియోలో క్లిక్ చేయండి. 

06:32 - August 22, 2016

విజయవాడ : సెక్యూరిటీ పేరుతో పోలీసులు రెచ్చిపోతున్నారు. పుష్కర భక్తులపై అమానుషంగా దాడి చేస్తున్నారు. మహిళలు, చిన్నపిల్లలు అనే విచక్షణకూడా లేదు. ఛాన్సు దొరికితేచాలు లాఠీలతో విరుచుపడుతున్నారు. తీరుమారని ఖాకీల కాఠిన్యం భక్తులపై ప్రతాపాన్ని చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల దురుసు ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న వీరు దొంగలుకాదు.. దొమ్మీలు అసలే చేయలేదు... మనసునిండా భక్తిభావంతో పుష్కరస్నాం చేయడానికి వచ్చారు. అయినా.. పోలీసులు తెగబడ్డారు. పోలీసులు ఎక్కడైనా పోలీసులేగా.. అన్నట్టు ప్రవర్తించారు. అందుకే రెచ్చిపోయారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు.

పుష్కరభక్తులపై అమానుష దాడి..
గుంటూరు జిల్లాలోని రేపల్లె మండలం పెనుమూడి సమీపంలో పుష్కర ఘాట్‌ దగ్గర ఖాకీలు రెచ్చిపోయారు. కృష్ణా జిల్లా హంసలదీవికి పుష్కర స్నానం చేయడానికి రెండు కుటుంబాలవారు బంధువులతో కలిసి వెళ్లారు. అయితే అక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో పెనుమూడిఘాట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అంతే.. ఒక్కసారిగా దూసుకు వచ్చిన పోలీసులు.. వాహనాన్ని పక్కకు పెట్టాలని హూంకరించారు. ఒక్క నిముషం ఓపికపట్డండి.. వెనక్కి వెళ్లిపోతాం అని భక్తులు బతిమాలినా వినిపించుకోలేదు. చివరికి మహిళలు , చంటిబడ్డలు ఉన్నా ఖాతరు చేయలేదు. లాఠీలతో విరుచుకుపడ్డారు. మొన్నటికి మొన్న శనివారం రోజుకూడా విజయవాడలో పోలీసులు ఓవర్‌యాక్షన్‌ చేశారు. చిన్నపిల్లవాడు ఉన్నా పట్టించుకోలేదు. తండ్రిని, కొడుకును ఈడ్చిపడేశారు.

పోలీసులా..పోట్లగిత్తలా...
పుష్కరాలకు అంతచేశాం ఇంతచేశాం అని.. గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. పోలీసులను మాత్రం.. పోట్లగిత్తల్లా జనంపైకి వదిలారని భక్తులు మండిపడుతున్నారు. పుణ్యాణికిపోతే తన్నులు తినాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. పుష్కరాలు ముగింపుదశకు చేరుకోవడంతో.. చివరి రెండు రోజులు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. పోలీసుల తీరు ఇలాగే ఉంటే.. ఇంకెంతమంది లాఠీదెబ్బలు రుచిచూడాల్సి వస్తుందో అని భక్తులు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పోలీసుల దూకుడుకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. 

06:30 - August 22, 2016

హైదరాబాద్ : కృష్ణా పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో.. భక్తులు పెద్దసంఖ్యలో స్నానాలు ఆచరిస్తున్నారు. రెండు రోజులే స్నానాలకు అవకాశం ఉండటంతో శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కృష్ణా పుష్కరాలకు మరో రెండు రోజులే మిగిలి ఉండటంతో భక్తులు పెద్దసంఖ్యలో స్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీశైలంలోని పుష్కరఘాట్‌లకు భక్తుల ప్రవాహం పెరిగింది. పాతాళగంగ, లింగాలఘాట్‌లు కిటకిటలాడుతున్నాయి. లక్షలాది మంది భక్తులు కృష్ణానదిలో స్నానంచేసి భ్రమరాంబ మల్లికార్జునిడి దర్శించుకుంటున్నారు.

శ్రీశైలానికి రానున్న బాబు..
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీశైలం క్షేత్రానికి వస్తున్నారు. ఘాట్లను సందర్శించి.. భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది.పోలీసు ఉన్నతాధికారులు సెక్యూరిటీని పర్యవేక్షించారు. పుష్కరాల్లో సౌకర్యాలపై భక్తుల సంతృప్తిని తెలుసుకుంటారని అధికారులు చెబుతున్నారు. కర్నూలుజిల్లా కలెక్టర్‌ విజయ్‌మోమన్‌ లింగాలగట్టు ఘాట్‌ను సందర్శించిన సీఎం టూర్‌ సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

06:26 - August 22, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముసాయిదా ప్రకటన ఇవాళ అధికారికంగా విడుదల కానుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా 27 జిల్లాల సరిహద్దులతో కూడిన మ్యాప్‌ను అధికారులు సిద్ధం చేశారు. నోటిఫికేషన్‌ విడులైన నాటి నుంచి కొత్త జిల్లాలు, వీటి సరిహద్దులతోపాటు అన్ని అంశాలపై నెల రోజుల పాటు ప్రజాభిప్రాయం సేకరిస్తారు. శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తర్వాత మంత్రివర్గం ఆమోదించిన ముసాయిదా ప్రకటనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సంతకం చేసి, రాజ్‌భవన్‌కు పంపారు. గవర్నర్‌ నరసింహన్‌ దీనిని ఆమోదించి, నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ముసాయిదా ప్రకటనలో కొత్త జిల్లాలతోపాటు రెవిన్యూ డివిజన్లు, మండలాలను ప్రచురిస్తారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై నెల రోజుల పాటు ప్రజాభిప్రాయం సేకరిస్తారు.

1974 చట్టంలోని మార్గదర్శకాలు..
తెలంగాణలో ప్రస్తుతం పది జిల్లాలు ఉన్నాయి. జిల్లాల వైశ్యాలం ఎక్కువగా ఉండటంతో పరిపాలనా సంబంధమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రజలకు పాలనను చేరువ చేసే లక్ష్యంతో కొత్తగా 17 జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1974 జిల్లాల పునర్విభజన చట్టంలోని మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం రూపాకల్పన చేసింది. వచ్చే అక్టోబర్‌ 11న విజయ దశమి నుంచి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది.

ముందుగా రాజీవ్‌శర్మ అధ్యక్షతన కమిటీ...
కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్‌ పెద్ద కసరత్తే చేసింది. వీటి విధి విధానాల రూపకల్పనను ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షత కమిటీ వేసింది. ఈ కమిటీ దఫదఫాలుగా సమావేశమై కొత్త జిల్లాలపై కొంత కసరత్తు చేసింది. ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించి, వీరి అభిప్రాయం తెలుసుకున్నారు. ఆ తర్వాత అఖిలపక్ష భేటీ జరిగింది, రాజకీయ నేతల ఆమోదం తీసుకున్నారు.

కలెక్టరేట్లు, సీసీఎల్‌ఏలో అభ్యంతరాలు చెప్పొచ్చు..
పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాలకు సంబంధించి ఏర్పాటు ఇబ్బందులుంటే జిల్లా కలెక్టర్లుతోపాటు, హైదరాబాద్‌లోని భూపరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్‌ కార్యాలయంలో తెలయజేయవచ్చు. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత మరో రెండుసార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహించి... తుది జాబితా తయారు చేస్తారు. దసరా నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటైనా.. పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు సంబంధించిన పాత జిల్లాలనే కొసాగిస్తారు. జిల్లా పరిషత్‌లు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీల పాలకవర్గాలకు ప్రస్తుతం ఉన్న పదవీకాలం పూర్తయ్యేవరకు పదవుల్లో కొనసాగుతారు.ప్రస్తుతానికి రెవిన్యూ జిల్లాలు మాత్రమే అమల్లో ఉంటాయి. 

06:22 - August 22, 2016

ఢిల్లీ : రియో ఒలింపిక్స్ ముగిశాయి. భారత్‌ రెండు కేవలం రెండు పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అది కూడా ఇద్దరు మహిళలు పతకాలు సాధించి భారత్‌ పరువు నిలబెట్టారు. కుస్తీ పోటీల్లో సాక్షి మాలిక్‌ కాంస్య పతకం సాధిస్తే... తెలుగమ్మాయి పీవీ సింధు బాడ్మింటన్‌లో రజత పతకం సాధించారు. గోల్డ్‌ ఆశలు రేకెత్తించిన షూటర్‌ అభినవ్‌ బంద్రా పరివారమంతా రిక్త హస్తాలతో తిరిగొచ్చింది.  సాక్షి మాలిక్‌, పీవీ సింధు లేకుంటే రియో ఒలింపిక్స్‌లో భారత పరువు అట్లాంటిక్‌ మహా సముద్రలో కలిసిపోయి ఉండేది. వీరిద్దరే 125 కోట్ల మంది భారతీయుల పరువును నిలబెట్టారు. కుస్తీ పోటీల్లో సాక్షి మాలిక్‌ కాంస్య పతకం, బాడ్మింటన్‌లో పీవీ సింధు రజత పకతం సాధించి మన పేరు ప్రతిష్టలు ఇనుమడింప చేశారు. జిమ్నాస్టిక్స్‌లో దీపా కర్మాకర్‌ మినహా... మిగిలిన అందరూ నిరాశ పరిశారు.

రియో ఒలింపిక్స్‌కు 118 మంది భారత్ బృందం...
మన దేశం నుంచి అధిక సంఖ్యలోనే క్రీడాకారులు రియో ఒలింపిక్స్‌కు వెళ్లారు. మొత్తం 118 మంది పాల్గొన్నారు. ఒలింపిక్స్‌కు ఇంత పెద్ద సంఖ్యలో భారతీయ క్రీడాకారులు వెళ్లడం ఇదే మొదటిసారి. కానీ చివరకు రెండు పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మనది ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న దేశంగా మన పాలకులు చెబుతున్నారు. కానీ క్రీడల్లో మాత్రం అధమ స్థానంలో ఉన్నాం. అమెరికా 46 బంగారు, 37 రజిత, 38 కాంస్య పతకాలతో మొత్తం 121 మెడల్స్‌తో మొదటి స్థానంలో నిలువగా... గ్రేట్‌ బ్రిటన్‌ రెండో స్థానంలో ఉంది. మన పొరుగుదేశం చైనా 26 బంగారు, 18 వెండి, 26 కంచు పతకాలు సాధించి.. మొత్తం 70 మెడల్స్‌తో మూడో స్థానంలో ఉంటే... కనీసం మనం ఆ దరిదాపులకు కూడా వెళ్లలేకపోయం.

1980 తర్వాత ఒకే ఒక్క బంగారు పతకం ..
1980 తర్వాత జరిగిన ఒలింపిక్స్‌లో భారత్‌ కేవలం ఒకే ఒక్క బంగారు పతకం సాధించింది. 2008 ఒలింపిక్స్‌లో అభినవ్‌ బింద్రాకు పది మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో గోల్డ్‌ దక్కింది. అంతకు ముందు ఎనిమిది బంగారు పతకాలు వచ్చినా... అవన్నీ కూడా 1928-1980 మధ్య జరిగిన ఒలింపిక్స్‌లో ఫీల్డ్‌ హాకీలో వచ్చినవే. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు సాధించిన ఇండియా... ఈసారి మాత్రం కేవలం రెండింటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

సవాలక్ష కారణాలు..
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు... భారతీయ క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పేలవమైన ఆటతీరు ప్రదర్శించడానికి కూడా అన్నే కారణాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. వీటిలో పేదరికాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తారు. కొద్ది మంది క్రీడల్లో రాణించినా ఇలాంటి వారికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం కరవు అవుతోందన్న వాదనలు ఉన్నాయి. పోటీలకు క్రీడాకారులు ఎంపికలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు లేకపోలేదు. పోటీలకు తీసుకెళ్లిన క్రీడాకారులకు సరైన వసతి కల్పించలేదన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. పైగా ఇండియన్‌ ఒలింపిక్స్‌ అసోషియేషన్‌కు వృత్తి నిపుణుల కంటే నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులే ఎక్కువగా ఎన్నికవుతుంటారు. ఈకారణంతోనే ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ నుంచి 2012లో ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌కు గురైంది. దీంతో సోచి వింటర్‌ గేమ్స్‌లో మన అథెట్లు భారత పతాకానికి బదులు ఇంటర్నేషన్‌ ఒలింపిక్‌ కమిటీ పతాకం కింది పాల్గొనాల్సి వచ్చింది. ఇలాంటి కారణంతో కొంతమంది ఔత్సాహికులు కూడా క్రీడలంటేనే విముఖత చూపే పరిస్థితి వచ్చింది. 

06:19 - August 22, 2016

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్ విజేత పీవీ సింధు రాకకోసం తెలుగురాష్ట్రాల అభిమానులు ఎదురుచూస్తున్నారు. రియోడీజెనీరో నుంచి ఈరోజు ఉదయం 8 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి సింధు చేరుకొంటుంది. సింధును ఘనంగా స్వాగతించేందుకు తెలంగాణ సర్కారు, హైదరాబాద్‌ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌ భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. రియో ఒలింపిక్స్ రజత విజేత, తెలుగుతేజం పీవీ సింధుకు ఘనస్వాగతం పలికేందుకు తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లూ చేసింది. సింధుకు అభినందనలు తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం భారీఏర్పాట్లు చేస్తున్నాయి. రియో డి జెనీరో నుంచి సోమవారం ఉదయం 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి సింధు చేరుకొంటుంది. అక్కడి నుంచి ఓపెన్ టాప్ వాహనంలో గోపీచంద్ అకాడమీ వరకూ ఊరేగింపుగా తీసుకు వెళతారు.

ట్రాఫిక్ ఆంక్షలు..
శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకూ పీవీసింధు విజయోత్సవ ర్యాలీ జరగనుంది. రాజీవ్‌ గాంధీ విమానాశ్రయం నుంచి అత్తాపూర్, టోలీచౌకి దర్గా, కాజాగూడ ప్రాంతాల గుండా ర్యాలీ గచ్చిబౌలికి చేరుకోనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ర్యాలీ సాగనుంది. ర్యాలీ సమయంలో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా.. ట్రాఫిక్ అధికారులు..ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ముఖ్యఅతిథులు, వాహనాదారులు... రోడ్‌ నెంబర్ 36, హండ్రెడ్‌ ఫీట్‌ రోడ్‌ మీదుగా సైబర్ టవర్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్స్, మజీద్‌ బండా, ఓల్డ్‌ బాంబే హైవే మీదుగా వెళ్లాలని సైబరాబాద్ సీపీ తెలిపారు. నగర వాసులు ట్రాఫిక్‌ మార్పుల మేరకు రాకపోకలను సాగించి.. రద్దీ నియంత్రణకు సహకరించాలని ఆయన కోరారు.

06:12 - August 22, 2016

ఖమ్మం : కూసుమంచి (మం) నాయకన్ గూడెంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్ఎస్ పి కాల్వలోకి ఓ పైవేటు బస్సు (ఏపీ 26 టిసి 9512) దూసుకెళ్లింది. ఈఘటనలో 9 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే...యాత్రా జైన్ కు చెందిన ప్రైవేటు బస్సు కాకినాడకు వెళుతోంది. నాయకన్ గూడెం వద్ద భారతీ ట్రావెల్స్ కు చెందిన బస్సుకు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బస్సును తప్పించబోయి యాత్రా జైన్ బస్సు అదుపు తప్పింది. నేరుగా 30 అడుగుల పై నుండి ఎన్ ఎస్ పి కాల్వలోకి పడిపోయింది. దీనితో బస్సులో ఉన్న 9 మంది మృతి చెందడం...20మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులున్నారు. అదే ప్రాంతంలో నెల రోజుల క్రితం మణుగూరుకు నాలుగు నెలల బాబు 20 మందికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ ఆచూకి తెలియడం లేదు.

ఇదిలా ఉంటే నాయకన్ గూడెం ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. గత నెలలో జరిగిన బస్సు ప్రమాదంలో నాలుగు నెలల బాబు చనిపోగా మరికొంతమందికి గాయాలయ్యాయి. తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేటలో ఓ ధాబా దగ్గర ఆగి టీ తాగామని, నాయకన్ గూడెం వద్ద ఓ బస్సు ఆగిపోయి ఉందని ప్రయాణీకులు పేర్కొన్నారు. దీనిని తప్పించబోయి కాల్వలోకి బస్సు దూసుకెళ్లిందని తెలిపారు. డ్రైవర్ ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. 

ముగిసిన విశ్వ క్రీడా పోటీలు..

రియో డి జనీరో : విశ్వ క్రీడా పోటీలు ముగిశాయి. ఆగస్టు 5 నుండది 21వ తేదీ వరకు రియో డి జనీరోలో పోటాపోటీగా సాగిన ఒలింపిక్స్ 2016 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పతకాల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 121 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. 

కత్తిపూడిలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు...

తూర్పుగోదావరి : శంఖవరం (మం) కత్తిపూడిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

బస్సు ప్రమాదం బాధాకరం - మంత్రి తుమ్మల..

ఖమ్మం : నాయకన్ గూడెంలో జరిగిన బస్సు ప్రమాదంపై మంత్రి తుమ్మల విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం బాధాకరమని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ కు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. 

ఖమ్మంలో బస్సు ప్రమాదం..9 మంది మృతి..

ఖమ్మం : కూసుమంచి (మం) నాయకన్ గూడెంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్ఎస్ పి కాల్వలోకి ప్రైవేటు బస్సు (ఏపీ 26 టిసి 9512) దూసుకెళ్లడంతో 9 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి కాకినాడకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

నేడు ఢిల్లీకి మంత్రి తుమ్మల..

హైదరాబాద్ : రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, నిధుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో కలిసి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు. 

నేడు సింధు రాక..

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన సింధూ నేడు నగరానికి రానుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వరకు భారీ ర్యాలీ జరగనుంది. గచ్చిబౌలిలోని బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో సింధూకు ఘనంగా సన్మానించనున్నారు. డిప్యూటి సీఎం, మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.

నిరాశపరిచిన యోగేశ్వర్ దత్..

రియో ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ నిరాశపరిచాడు. 65 కిలోల ఫ్రీస్టయిల్ విభాగం క్వాలిఫికేషన్ రౌండ్లోనే యోగేశ్వర్ అపజయం చెందాడు. యోగేశ్వర్ పై మంగోలియాకు చెందిన రెజ్లర్ మందక్ నరన్ గంజోరిజ్ 3-0 తేడాతో విజయం సాధించాడు.

నేడు కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్..

హైదరాబాద్ : తెలంగాణ కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల కానుంది. నోటిఫికేషన్‌కు అనుగుణంగా 27 కొత్త జిల్లాల సరిహద్దులతో కూడిన మ్యాప్‌ కూడా అధికారులు సిద్ధం చేశారు. దీన్ని నోటిఫికేషన్‌తో పాటు పబ్లికేషన్‌కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

Don't Miss