Activities calendar

23 August 2016

21:41 - August 23, 2016
21:33 - August 23, 2016

హైదరాబాద్ : గతంలో మహారాష్ర్ట ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి. తెలంగాణ హక్కులను మహారాష్ర్టాకు తాకట్టు పెడుతున్నారని అన్నారు. రెండు రాష్ర్టాల మధ్య జరిగిన ఒప్పందంలో క్లారిటీ లేదన్న రావుల.. చీకటి ఒప్పందంగా అభివర్ణించారు. 

21:31 - August 23, 2016

హైదరాబాద్: మ‌హారాష్ర్టతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ప్రాజెక్టుల ఒప్పదంపై కాంగ్రెస్‌ ఘాటు విమర్శలు చేస్తోంది. ఆ ఒప్పందం మహాద్రోహమంటూ విమర్శనాస్ర్తాలు సంధిస్తోంది. కేసీఆర్‌ చర్యల వల్ల మ‌హారాష్ర్టకే మేలు జరుగుతుందని ఆరోపిస్తోంది. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ... తెలంగాణలోని అన్ని జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్‌.

రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టిన కాంగ్రెస్
గోదావరి నదిపై నిర్మించే బ్యారేజీలకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య జరిగిన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ... తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు చేపట్టింది. అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట కాంగ్రెస్‌ నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు. కొన్నిచోట్ల కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీభ‌వ‌న్ నుంచి హైద‌రాబాద్‌ క‌లెక్టరేట్‌ వ‌ర‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ద్రోహ ఒప్పందం : ఉత్తమ్
మహారాష్ట్రతో కేసీఆర్ చేసుకునేది చారిత్రక ఒప్పందం కాదని... మహాద్రోహం అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వ్యయాన్ని 50 వేల కోట్లకు పెంచారని, పెద్ద మొత్తంలో అవినీతి జరిగే ఆస్కారం ఉందని ఆరోపించారు.

బంగారు తెలంగాణ భ్రష్టు పట్టిన తెలంగాణ అయ్యే ప్రమాదం : జానారెడ్డి
కేసీఆర్ వైఖరితో బంగారు తెలంగాణ కాస్త... భ్రష్టు పట్టిన తెలంగాణ అయ్యే ప్రమాదం ఉందన్నారు సీఎల్‌పీ నేత జానారెడ్డి. ప్రాజెక్టుల పేరుతో కోట్లు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. తమ్మిడిహెట్టి ఎత్తు తగ్గించి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.

పొన్నాల సవాల్
టీఆర్ఎస్ చెప్తున్న ఆయకట్టుకు... నీటి లభ్యతకు పొంతనే లేదని పొన్నాల ఆరోపించారు. మహారాష్ట్రతో ఒప్పందంపై బహిరంగ చర్చకు రావాలని కేసీఆర్‌కు పొన్నాల సవాల్ విసిరారు.

ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
మొత్తంగా మహారాష్ర్ట, తెలంగాణ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుపడుతోంది. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో ప్రభుత్వం కోట్ల నిధులు దుర్వినియోగం చేస్తోందని, దాని వల్ల అవినీతికి అస్కారం ఉందని ఆరోపిస్తోంది. మరి కాంగ్రెస్‌ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎలా స్పందిస్తోంది చూడాలి. 

21:22 - August 23, 2016

మహారాష్ట్ర : తెలగాణ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. దశాబ్దాల తరబడి అంతర్రాష్ట్ర వివాదంగా నలిగిన గోదావరి, పెన్ గంగ, ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమమైంది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుండి ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లిన సీఎం కేసీఆర్‌ బృందం.. మధ్యాహ్నం 3 గంటలకు మహారాష్ట్ర సర్కారుతో మూడు ప్రాజెక్టుల నిర్మాణంపై ఒప్పందం కుదుర్చుకుంది. ఆ వెంటనే.. తెలంగాణలోని టీఆర్ఎస్‌ శ్రేణులు బాణాసంచా కాల్చి హర్షాన్ని ప్రకటించాయి.

39 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కీలక ఒప్పందం
తెలంగాణలో 39 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కీలక ముందడుగు పడింది. గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చారిత్రక ఒప్పందంతో నీటి పారుదల రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలికారు. సహ్యాద్రి గెస్ట్ హౌజ్‌లో జరిగిన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో ఇరు రాష్ర్టాల అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాత ఒప్పంద పత్రాలను ఇరువురు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల మంత్రి హరీశ్‌ సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామం : కేసీఆర్
మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం జోక్యం లేకుండానే ఇరు రాష్ర్టాల మధ్య ఒప్పందం జరగడం శుభపరిణామమన్నారు. మహారాష్ర్టతో భవిష్యత్‌లోనూ స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

తుమ్మిడిహట్టితో మహారాష్ర్టకు నష్టాన్ని నివారించేందుకు మేడిగడ్డ : కేసీఆర్
అంతరాష్ర్ట ప్రాజెక్టులపై రెండు రాష్ర్టాల మధ్య ఎన్నో సార్లు చర్చలు జరిగాయన్న ముఖ్యమంత్రి.. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉన్నా వివాదాలను పరిష్కరించలేదని విమర్శించారు. తుమ్మిడిహట్టితో మహారాష్ర్టకు జరిగే నష్టాన్ని నివారించేందుకు మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని ప్రతిపాదించామన్నారు.

తెలంగాణతో ఒప్పందం వల్ల మహారాష్ట్రకు నష్టం లేదు : ఫడ్నవీస్
తెలంగాణతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల మహారాష్ట్రకు ఎలాంటి అన్యాయం జరగబోదని ఆరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ర్టాలు పరస్పరం సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆచరణాత్మకంగా వ్యవహరించారని ప్రశంసించారు. ఈ ఒప్పందంలో తెలంగాణ మంత్రి హరీష్‌రావు కీలకపాత్ర పోషించారనీ ప్రశంసించారు.

అంబరాన్నంటిన సంబురాలు
మహారాష్ట్రతో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందం కుదరగానే..తెలంగాణలో సంబురాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్‌ భవన్‌ వద్ద, సచివాలయంలోనూ టీఆర్ఎస్‌ ప్రముఖులు, మంత్రులు బాణాసంచా పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

ఘనంగా ముగిసిన కృష్ణమ్మ పుష్కరాలు..

విజయవాడ : కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. పుష్కర ఘాట్ వద్ద ముగింపు వేడుకలు ఏర్పాటు చేయగా, సంగమం వద్ద ఏర్పాటు చేసిన హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ హారతి కార్యమంలో ప్రత్యేక అతిథులుగా పీవీ సింధు, పుల్లెల గోపీచంద్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారిని తన వాహనంలో పుష్కర ఘాట్ కు తీసుకుని రావడం విశేషం.

మాల్యాపై మరో కేసు..

ఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చీఫ్, లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాపై ఈడీ తాజాగా మరో మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. జాతీయ బ్యాంకుల కన్సార్టియం నుంచి తీసుకున్న రూ.6,027 కోట్ల రుణానికి సంబంధించి మాల్యాతోపాటు అతని సహాయకులపై తాజా కేసు నమోదైంది. 

20:33 - August 23, 2016

సింధు.గోపీచంద్ లకు చెక్స్ అందజేసిన చంద్రబాబు..

విజయవాడ : కృష్ణా పుష్కరాల ముగింపు ఉత్సవాల సందర్భంగా రియో ఒలింపిక్స్ లో మహిళల బ్యాడ్మింటన్ పోటీల్లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 3 కోట్ల రూపాయల నగదు చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గణపతి సచ్చాదానంద స్వామి అందజేశారు. వెంకయ్యనాయుడు పుష్పగుచ్ఛంతో అభినందించగా, గణపతి సచ్చిదానంద స్వామి దుశ్శాలువతో సత్కరించారు. సింధు కోచ్ గోపీచంద్ కు 50 లక్షల రూపాయల చెక్కు, కిదాంబి శ్రీకాంత్ కు 25 లక్షల రూపాయల చెక్కులిచ్చి సత్కరించారు. 

19:57 - August 23, 2016

గ్యాంగ్ స్టర్ నయీంపై సినిమా తీస్తా : రాంగోపాల్ వర్మ

ముంబై వీరప్పన్‌ సినిమా తీసి అందరినీ మెప్పించిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.. గ్యాంగ్‌స్టర్‌ నయీం జీవిత కథను తెరకెక్కిస్తానని చెబుతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. నయీం గురించి ఎన్నో కథనాలు చదివి తెలుసుకున్నానని ఆయన చెప్పారు. నయీం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.. పెద్ద సినిమానే తీయాలని ఆయన అభిప్రాయాపడ్డారు. త్వరలో నయీంపై సినిమా తీస్తానని...అది మూడు భాగాల్లో తెరకెక్కిస్తానని వెల్లడించారు. 

19:39 - August 23, 2016
19:22 - August 23, 2016

హైదరాబాద్ :స్విస్ చాలెంజ్‌ విధానంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. విదేశీ కంపెనీల కోసమే స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారా అని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్విస్‌ విధానంపై ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని మండిపడింది. స్విస్‌ చాలెంజ్‌ విధానంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. మధ్యంతర తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.

పవిత్ర సంగమం ఘాట్ వద్ద ముగింపు పుష్కర ఉత్సవాలు..

విజయవాడ : కృష్ణా పుష్కరాలు ముగిశాయి. ముగింపు ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ లో వైభవంగా కొనసాగుతున్నాయి. పవిత్ర సంగమం ఘాట్ వద్ద జరిగిన పుష్కర ముగింపు ఉత్సవాల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగం విషయం ఆలోచించలేదు - సింధు...

విజయవాడ : తమపై ఇంత ఆదరణ చూపిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు రియో ఒలింపిక్ రజత పతక విజేత సింధు పేర్కొన్నారు. గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగం ఆఫర్ ఇచ్చినందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగం విషయం ఇంకా ఆలోచించలేదన్నారు.

 

19:16 - August 23, 2016

విజయవాడ : స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్విస్ ఛాలెంజ్ విధానంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. స్విస్ ఛాలెంజ్ విదేశీ కంపె నీల కోసమేనా హైకోర్టు పేర్కొంది. ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని, స్విస్ ఛాలెంజ్ ఎందుకని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సీల్డు టెండర్లు మేలు కదా అని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. మధ్యంతర తీర్పు శుక్రవారానికి వాయిదా వేసింది.

స్విస్ ఛాలెంజ్ ఒక తంతు - బాబురావు...
స్విస్ ఛాలెంజ్ విధానం మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిదని రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్ బాబురావు విమర్శించారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. భూములు అప్పచెప్పాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. స్విస్ ఛాలెంజ్ ఒక తంతులాగా నడుస్తోందని, సింగపూర్ వారితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. టెండర్లు వేసే వారితో నేరుగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చర్చలు జరపడం సబబు కాదన్నారు. ఇందులో పారదర్శకత లేదని, 1600 ఎకరాలను స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా కట్టబెట్టాలని చూస్తోందని, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందనేది సమాచారాన్ని సీల్డ్ టెండర్లులో పెట్టారని తెలిపారు. ఓపెన్ టెండర్లు సిస్టం ఉన్న సమయంలో స్విస్ ఛాలెంజ్ విధానం ప్రవేశ పెట్టడంపై సుప్రీం పలు వ్యాఖ్యలు చేసిందని గుర్తు చేశారు. ఏదైనా వివాదాలు వస్తే లండన్ కోర్టులో తేల్చుకోవాలనే దానిపై కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని, ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలిపారు. స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు కరెక్టయిన తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నట్లు బాబురావు తెలిపారు.

లోపభూయిష్టమైంది - వైసీపీ..
స్విస్ ఛాలెంజ్ సిస్టం లోపభూయిష్టమైందని వైసీపీ నేత గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానంపై ఓ కమిటీ నియమించబడిందని, దీనిపై నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. నివేదిక అందిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు పట్టుకుని వేలాడుతున్నాడని విమర్శించారు. నలుగురు..ఐదుగురు..50 మంది టెండర్లు వేస్తే వారందరినీ కూర్చొబెట్టి తనకు నచ్చిన వ్యక్తికి మాత్రమే టెండర్ ఇస్తానని పొందుపర్చడం జరిగిందన్నారు. ఇది లోపభూయిష్టమని వైసీపీ పేర్కొంటూ వస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు.

ఏఎస్ఐ మోహన్ రెడ్డికి రిమాండ్...

కరీంనగర్ : మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రైతు నారాయణరెడ్డి ఆత్మహత్య ఘటనలో మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. 15 రోజులుగా మోహన్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు.

19:01 - August 23, 2016

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు చివరి దశకు చేరుకున్నాయి. భక్తులు పుష్కరస్నానాలు చేసేందుకు తరలిరావడంతో ఘాట్లన్ని కిక్కిరిసిపోతున్నాయి. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులకు తమ వంతు సేవలు చేస్తున్నారు విద్యార్థులు. సీఎం చంద్రబాబు పిలుపుతో పెద్ద ఎత్తున విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చి వృద్ధులకు, చిన్నారులకు సేవలు చేస్తున్నారు. వీరి సేవలు అమోఘం అంటున్నారు పుష్కర భక్తులు. 12 రోజులపాటు కృష్ణా పుష్కరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కృష్ణమ్మ ఒడిలో పుష్కరస్నానం చేసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు తమవంతుగా సేవలు చేస్తున్నారు విద్యార్థి వాలంటీర్లు. ట్రాఫిక్‌ రద్దీని క్రమబద్ధీకరించడం నుండి ఘాట్లలో వృద్ధులకు స్నానాలు చేయించే వరకు దగ్గరుండి మరీ చేయిస్తున్నారు ఈ విద్యావాలంటీర్లు.

వృద్ధులు, చిన్నపిల్లలకు స్నానాలు చేయిస్తున్న విద్యావాలంటీర్లు..
అసలే బిజీగా ఉండే విజయవాడ రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీ గురించి తెలియంది కాదు. ఈ తరుణంలో కృష్ణా పుష్కరాలు రావడంతో ఈ ట్రాఫిక్ మరింత పెరిగింది. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే పోలీసు విధులు మొదలుకొని పుష్కరనగర్‌లలో భోజనం సరఫరాచేసే డ్యూటీలు చేస్తున్నారు విద్యావాలంటీర్లు. పుష్కరఘాట్ల వద్ద వృద్ధులు, చిన్నపిల్లలకు స్నానాలు చేయించడం వంటివి విద్యావాలంటీర్లు స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఘాట్లలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్, పుష్కరఘాట్‌ల వద్ద పిల్లలు తప్పిపోకుండా వారికిట్యాగ్‌లు వేయటం వంటి అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ భక్తుల ప్రశంశలను అందుకుంటున్నారు విద్యావాలంటీర్లు. తమకు సహాయం చేస్తున్న విద్యా వాలంటర్ల సేవలు మరచిపోలేమంటున్నారు భక్తులు.

ఆనందం కలిగిందన్న విద్యావాలంటీర్లు..
కృష్ణా పుష్కరాల్లో సేవ చేయటం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందంటున్నారు విద్యావాలంటీర్లు. సేవా కార్యక్రమాలను తాము ఎంజాయ్ చేస్తున్నామని ఈ విద్యార్థి వాలంటర్లు చెబుతున్నారు. ఎప్పుడో కానీ తమకు ఇటువంటి అవకాశం రాదని అందుకే సేవా కార్యక్రమాలు తమకు థ్రిల్లింగ్ ఉన్నాయంటున్నారు విద్యార్థులు. ఎప్పుడు పుస్తకాలతో కుస్తీపడుతూ కాస్త సమయం దొరికితే ఆట విడుపుగా గ్రౌండ్ లో కాసేపు ఆడుకొనే విద్యార్ధులు. కృష్ణా పుష్కరాలలో ఉదయం నుండి రాత్రి వరకు సేవా కార్యక్రమాల్లోనే తరించడం ప్రశంసనీయం.
మరి వారు ఎలాంటి సేవలు అందించారో..వారు ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేసి చూడండి..

18:57 - August 23, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇవాళ చివరి రోజు కావడంతో మధ్యాహ్నం నుంచి భక్తులను లోపలికి అనుమతించలేదు. ముగింపు ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించేందుకు పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

18:55 - August 23, 2016

విజయవాడ : అతిధి దేవో భవ సూక్తిని అక్షరాలా సార్ధకం చేశారు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల వాసులు. పుష్కర భక్తులకు కడుపునిండా అన్నం పెట్టి ఆకలి తీర్చారు. ఆతిథ్యంలో తమకు ఎవరూ సాటిరారని నిరూపించుకున్నారు. ఏపీలో కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులు ఆహారం కోసం ఎక్కడా ఇబ్బంది పడలేదు. బస్సు దిగడం ఆలస్యం ఎంతో గౌరవంగా ఆహ్వానించి మరీ వివిధ రకాల ఆహార పదార్థాలతో కొసరి కొసరి వడ్డించారు.. టీలు, టిఫిన్‌లు, భోజనం... ఇలా దేనికీ కొరత రాకుండా చూసుకున్నారు.. ఈ ఘనతంతా వివిధ మతసంస్థలు, వ్యాపారసంస్థలు, స్వచ్ఛంద సంస్థలకే చెందుతుంది. దాదాపు కోటిమంది భక్తులు పుష్కరాలకు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. వీరందరికీ భోజన సదుపాయాలు అందించడమంటే సర్కారు వల్ల అయ్యేపని కాదు. ఈ విషయంపై ముందుగానే ఆలోచించిన సీఎం చంద్రబాబు వివిధ సంస్థల సహకారం తీసుకున్నారు. మంత్రులను పంపి సేవాతత్పరత ఉన్న సంస్థల యజమానులతో సమావేశం ఏర్పాటుచేశారు. అన్నదానం చేసి పుష్కరాలకువచ్చే భక్తుల ఆకలి తీర్చాలని కోరారు. ప్రభుత్వ విజ్ఞప్తితో వీరంతా కదిలారు.

సుష్టుగా భోజనం..
ఏ ఒక్క భక్తుడు ఆకలితో ఇబ్బందిపడకుండా సుష్టుగా భోజనం చేసేలా వీరంతా ఏర్పాట్లు చేశారు. కేవలం అక్షయ సంస్థకు మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది. మిగతా సంస్థలన్నీ సర్కారునుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పోటీలు పడి మరీ అన్నదానం చేశాయి. పుష్కరఘాట్లకు వచ్చిన భక్తులను పిలిచి మరీ వడ్డించారు. ఎన్ని వేల మంది వచ్చినా లేదనకుండా కడుపు నింపారు.. వివిధ రకాల వంటలను భక్తుల ముందుంచారు. ఇంతమందికి అన్నదానం చేసినా ఇంకా ఆహారం మిగిలిపోయిందంటే ఏ స్థాయిలో వంటలు చేశారో అర్థం చేసుకోవచ్చు. కొందరు దాతలు భక్తుల దగ్గరకు వెళ్లి మరీ ఆహారం ప్యాకెట్ల సరఫరా చేశారు. పుష్కర భక్తుల ఆకలి తీర్చడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నదాతలు చెబుతున్నారు. ఇది తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా పిలుస్తారు. అన్నదానం చేసిన సంస్థలు ఈ పేరును సార్ధకం చేసుకున్నాయి. గోదావరి పుష్కరాల్లో రాజమండ్రివాసులు చూపిన ఆదరణకు ఏమాత్రం తగ్గకుండా అన్నదానం చేశాయి. రోడ్లపై కూడా ఆహారం సరఫరా చేసి భక్తుల ఆకలి తీర్చారు. భక్తుల అభిమానాన్ని సంపాదించారు.

18:46 - August 23, 2016

స్విస్ ఛాలెంజ్..ఏపీ సర్కార్ పై హైకోర్టు మండిపాటు..

హైదరాబాద్ : స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. స్విస్ ఛాలెంజ్ విదేశీ కంపె నీల కోసమేనా హైకోర్టు పేర్కొంది. ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని, స్విస్ ఛాలెంజ్ ఎందుకని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సీల్డు టెండర్లు మేలు కదా అని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. మధ్యంతర తీర్పు శుక్రవారానికి వాయిదా వేసింది. అఫిడవిట్ దాఖలుకు రెండు వారాల గడువు కావాలని ఏపీ సర్కార్ కోరింది.

బీచ్ పల్లి ఘాట్ వద్ద పుష్కరాల ముగింపు ఉత్సవాలు..

మహబూబ్ నగర్ : జిల్లా బీచ్ పల్లి ఘాట్ వద్ద కృష్ణా పుష్కరాలు ముగింపు ఉత్సవాలు జరిగాయి. మంత్రులు లక్ష్మారెడ్డి..జూపల్లి..ఇంద్రకిరణ్ లు హారతి ఇచ్చారు.

18:28 - August 23, 2016

ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి కొంతమందికి వృద్దాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. వయసుకు మించి కనిపిస్తుండడంతో మానసికంగా ఆందోళన చెందుతుంటారు. వృద్దాప్య ఛాయలు త్వరగా వస్తుంటాయి. మనం తీసుకుంటున్న ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహారాలు వృద్దాప్యాన్ని తెచ్చిపెడుతుంటాయి. మరి ఏం ఆహారం తినకూడదో తెలుసుకుందాం.
కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. దీనితో ఆడు అధిక బరువును కూడా తగ్గించుకోవాలి.
స్వీట్లు ఎక్కువగా తినే వారికి గ్లెకొషన్ అనేన ప్రక్రియ స్టార్ట్ అయి అది ప్రొటీన్లను గమనించకుండా చేస్తుంది.
పిండి పదార్థాలను తక్కువగా, ఫైబర్ ను ఎక్కువగా తీసుకోవాలి. పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కణాలు వృద్ధాప్య దశకు వచ్చేస్తాయి.
కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తిన్నా వృద్ధాపప్య ఛాయలు త్వరగా వచ్చేస్తాయం,. 

చర్లపల్లి జైల్లో వార్డెన్ల మధ్య ఘర్షణ..

హైదరాబాద్ : చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్లో ఇద్దరు వార్డర్లు మంగళవారం ఘర్షణ పడ్డారు. రిలీవ్ విషయంలో వార్డర్ సైదులు మరో వార్డర్ పై దాడి చేశాడు. దీంతో బాధిత వార్డర్... జైళ్లుశాఖ డీఐజీ నర్సింహకు ఫిర్యాదు చేశాడు. 

కేంద్ర మంత్రుల పుష్కర స్నానం..

విజయవాడ: కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సురేష్‌ప్రభు విజయవాడలోని పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్రప్రభుత్వానికి కితాబిచ్చారు. వర్షాలు పడి ప్రాజెక్టులు నిండాలని కోరుకున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

స్కూల్ వ్యాన్ కింద పడి మూడేళ్ల బాలుడు మృతి..

ఢిల్లీ : రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో స్కూల్ వ్యాన్ మూడు సంవత్సరాల బాలుడి ప్రాణాలు తీసింది. ఇంటి దగ్గర వదిలిపెట్టే సమయంలో బాలుడిపై నుండి స్కూల్ వ్యాన్ వెళ్లినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కోఠి ప్రసూతి ఆసుపత్రిలో మహిళ ఆందోళన..

హైదరాబాద్ : కోఠి ప్రసూతి ఆసుపత్రిలో ఓ మహిళ ఆందోళన చేపట్టింది. మగ శిశువు పుడితే ఆడ శిశువును అప్పగించారని బాధిత బంధువులు ఆందోళన చేపట్టారు.

అందరి ఆశీస్సుల వల్లే పతకం - సింధు..

విజయవాడ : అందరి ఆశీస్సుల వల్లే పతకం వచ్చిందని ఒలింపిక్ రజత పతకం విజేత సంధు పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, ఒలింపిక్స్ లో పతకం సాధించాలనే కల నెరవేరిందన్నారు. పతకం కోసం చాలా కష్టపడడం జరిగిందని, కోచ్ గోపిచంద్ వల్లే ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందని సింధు తెలిపారు.

మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి లొంగుబాటు..

కరీంనగర్ : జిల్లా ఎస్పీ ఎదుట మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి లొంగుబాటయ్యారు. మోహన్ రెడ్డిని కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రైతు నారాయణ రెడ్డి ఆత్మహత్య ఘటనలో మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసు నమోదైంది. 15 రోజులుగా మోహన్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నాడు.

ఎంసెట్ 2 కేసులో మరో దళారీ అరెస్టు..

హైదరాబాద్ : ఎంసెట్ 2 పేపర్ లీకేజీలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో దళారిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.

 

హీరో మోటార్ కార్ షోరూంలో అగ్నిప్రమాదం..

ఢిల్లీ : రాష్ట్రంలోని హీరో మోటార్ కార్ షోరూంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జిటి కమల్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పుతున్నాయి.

17:44 - August 23, 2016

మహారాష్ట్ర సీఎంకు కేసీఆర్ ధన్యవాదాలు..

మహారాష్ట్ర : రాష్ట్ర సీఎంకు తెలంగాణ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నీటిపారుదల రంగంలో మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం జరిగిందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించినదగిన రోజని అభివర్ణించారు. స్నేహపూర్వక వాతావరణంలో ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయని తెలిపారు. కేంద్రం జోక్యం లేకుండానే ఇరు రాష్ట్రాల ఒప్పందం జరగడం శుభపరిణామమని తెలిపారు.

17:36 - August 23, 2016

ఖమ్మం : కొత్త జిల్లాలను జనాభా అధారంగా ఏర్పాటు చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. వరంగల్ జిల్లాను 4 జిల్లాలుగా విభజించిన ప్రభుత్వం... ఖమ్మం జిల్లాను కొత్తగూడెంతో పాటు ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలాన్ని జిల్లాగా ప్రకటించాలన్నారు. ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని.. నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏన్కూర్, జూలురుపాడు మండలాలు కొత్తగూడెంకు దగ్గరగా ఉంటే వాటిని ఖమ్మంలో కలిపారన్నారు. కామేపల్లి, కారేపల్లి మండలాల గురించి ఆలోచన చేయాలన్నారు. 40 లక్షల జనాభా ఉన్న రంగారెడ్డి జిల్లాను సికింద్రాబాద్, హైదరాబాద్ జిల్లాలుగా విభజించాలని కోరారు. అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు చేసిన సూచనలు, మార్పులను ప్రభుతవం పరిగణలోకి తీసుకోలేదన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ చేసి... ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. 

17:32 - August 23, 2016

విజయవాడ : విజయవాడలోని రైల్వే ఆడిటోరియం నుంచి రిమోట్‌ ద్వారా రైలు మార్గాన్ని ప్రారంభించారు. అలాగే నంద్యాల-కడప ప్యాసింజర్‌ రైలును కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

రాయలసీమకు ఈ మార్గం కీలమైనది : చంద్రబాబు
రాయలసీమలో ఈ మార్గం చాలా కీలకమైనది సీఎం చంద్రబాబు తెలిపారు. పోర్టులు, సిమెంట్‌ ఫ్యాక్టరీలకు కనెక్టివిటీ పెరుగుతుందని, 1996లో నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గానికి స్థలం కేటాయించామని, ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 20 ఏళ్లు పట్టిందని అన్నారు. ఇన్ని ఏళ్లు నత్తనడక నచిడినా సురేష్ ప్రభు ఫాస్ట్ ట్రాక్లో పెట్టి పూర్తి చేశారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ ప్రభుకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.

ఈమార్గంతో ర‌వాణా సౌక‌ర్యాలు మెరుగు ప‌డ‌తాయి : వెంకయ్యనాయుడు
ఈ రైలు మార్గం ద్వారా ర‌వాణా సౌక‌ర్యాలు మెరుగు ప‌డ‌తాయ‌న్నారు. ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు ముందుచూపుతో ఏపీ నుండి సురేష్ ప్రభును ఎంపీని చేశారని దీంతో ఆంధ్రప్రదేశ్ మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. 

మహారాష్ట్ర-తెలంగాణ మూడు ఒప్పందాలు..

హైదరాబాద్ : మేడిగడ్డ, తుమ్మిడి హట్టి, చనాక – కొరాటా బ్యారేజ్ పై మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రుల సమక్షంలో ఒప్పందం కుదిరింది. మూడు ఒప్పందాలపై కేసీఆర్..ఫడ్నవీస్ సంతకాలు చేశారు.

ఇద్దరు పిల్లలకు నిప్పంటించి తల్లి సూసైడ్..

నిజామాబాద్ : బీర్కూర్ మండలం దుర్కిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు నిప్పంటించి తల్లి నాగమణి ఆత్మహత్యకు పాల్పడింది.

రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి - సురేష్ ప్రభు..

హైదరాబాద్ : రాష్ట్రాల అభివృద్దితోనే దేశాభివృద్ధి జరుగుతుందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. ఏపీ అభివృద్ధికి సహకారం అందిస్తామని, రైలు మార్గాల ద్వారా కొత్త రాజధానిలో రాయలసీమను కలుపుతున్నట్లు తెలిపారు. రాయలసీమ అభివృద్ధిలో నంద్యాల - ఎర్రగుంట్ల రైలుమార్గం కీలకం కానుందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

17:12 - August 23, 2016

మహారాష్ట్ర : మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. గోదావరి నదిపై నిర్మించి పలు ప్రాజెక్టుల నిర్మాణం కోసం పరస్పర సహకారమే లక్ష్యంగా మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో దశాబ్దాల తరబడి అంతర్రాష్ట్ర వివాదాల్లో నలుగుతున్న గోదావరి, పెన్ గంగ, ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌ నుంచి ముంబైకి వెళ్లిన సీఎం కేసీఆర్‌..మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు ముంబైలోని సహ్యాద్రి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. సీఎంతో పాటు నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు, జోగురామన్న, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్‌, జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీలు, సీఎస్‌ రాజీవ్‌శర్మ, సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య మొత్తం 3 ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. మూడు ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంధ్ర ఫడ్నవీస్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకాలు చేశారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు ఒప్పందపత్రాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంధ్ర ఫడ్నవీస్‌ను కేసీఆర్‌ శాలువాతో సత్కరించి ప్రత్యేక బహుమతిని ఇచ్చారు. ఆ తర్వాత మహా సీఎం కేసీఆర్‌ను శాలువాతో సత్కరించి ప్రత్యేక బహుమతిని అందచేశారు. మహారాష్ట్రాతో జరిగిన ఒప్పందం చారిత్రక ఒప్పందం అని...ఇది సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన గొప్ప దినం అని కేసీఆర్‌ అన్నారు.

ఒప్పందంపై సంతకాలు చేసిన ఇరు సీఎంలు..
గోదావరి పై తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన అంతరాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంది. ప్రాజెక్టులపై జరుగుతున్న కీలక సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సహ్యాద్రి గెస్ట్‌ హౌస్‌లో జరుగుతున్న ఈ చారిత్రక ఒప్పందంపై.... తెలంగాణ సీఎం కేసీఆర్,మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లు సంతకాలు చేశారు.

మహారాష్ట్ర ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపిన కేసీఆర్..
మహారాష్ట్రతో జరిగిన ఈ ఒప్పందం దేశంలో సరికొత్త దిశకు నాంది పలికిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై మహారాష్ట్రతో జరిగిన చారిత్రక ఒప్పందంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్రవీస్‌కు, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. 

16:51 - August 23, 2016

ఢిల్లీ : బిజెపి కోర్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల కోర్‌ కమిటీ సమావేశాన్ని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ప్రారంభించారు. సమావేశాన్ని ఉద్దేశించి సాయంత్రం ప్రధాని మోది ముగింపు ప్రసంగం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బిజెపి నేతలు కంబంపాటి హరిబాబు, కె. లక్ష్మణ్‌ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించేలా జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీ నేతలు ప్రయత్నించనున్నారు. మరోవైపు తెలంగాణలో పార్టీకి పునరుజ్జీవం కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై జాతీయ నాయకత్వం నుంచి దిశానిర్దేశం చేయాలని తెలంగాణ నేతలు కోరుతున్నారు. 

16:50 - August 23, 2016

ముంబై : బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ సోదరి అర్పితఖాన్‌ ఇంట్లో దొంగలు పడ్డారు. ఆమె ఇంట్లో నుంచి రెండు లక్షల 50 వేల విలువ చేసే నగలు అపహరించారు. దీనిపై ముంబైలోని ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో అర్పితాఖాన్‌ శర్మ ఫిర్యాదు చేశారు. అర్పిత ఇంట్లో పనిమనిషిపైనే అనుమానం వ్యక్తమవుతోంది. ఆమె ఇంట్లో పనిచేస్తూ అక్కడే ఉంటున్న అఫ్సాఖాన్‌ ఆదివారం ఉన్నట్టుండి మాయమైపోయింది. ఆ తర్వాతే నగలు కనిపించడం లేదని అర్పిత భావిస్తున్నారు. పోలీసులు అర్పిత డ్రైవర్, చుట్టు పక్కల ఉండే పనిమనుషులను విచారణ జరుపుతున్నారు. 

16:47 - August 23, 2016

కర్నాటక : పొరుగుదేశం పాకిస్థాన్‌ను పొగుడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కన్నడ నటి,.మాజీ ఎంపీ రమ్యపై దేశద్రోహం కేసు నమోదైంది. కర్ణాటకలోని మదికేరీలో కత్నమణె విట్టల్‌ గౌడ అనే న్యాయవాది ఆమెపై కేసు పెట్టారు. శనివారం ఈ కేసు విచారణకు రానుంది. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్‌ కార్యక్రమానికి రమ్య హాజరయ్యారు. తిరిగి భారత్‌కు చేరుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ..పాకిస్థాన్‌ నరకమేమీ కాదు.. అక్కడి ప్రజలంతా మనలాంటివారే. మమ్మల్ని వారు ఎంతో బాగా చూసుకున్నారు అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. దీంతో రమ్య వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పాకిస్థాన్‌ను పొగిడేలా మాట్లాడారంటూ ఆమెపై విమర్శలు వెళ్లువెత్తాయి. కన్నడంతో పాటు పలు భాషల్లో నటించిన రమ్య..2011లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇటీవల పాక్‌-భారత్‌ మధ్య విభేదాల నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌..ఆ దేశాన్ని నరకంతో పోల్చిన విషయం తెలిసిందే. ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్‌ దేశాల సమావేశానికి హాజరైన హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా పాక్‌ వైఖరిని ఖండించారు.

16:45 - August 23, 2016

కర్నూలు : సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించతలపెట్టిన ప్రభుత్వం ...నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్లాంట్‌ నిర్మాణం చేపడుతోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ప్లాంట్‌ నిర్మాణం జరగనున్న ప్రాంతాలలో ఆయన పర్యటించారు. నిర్వాసితులు కూడా ప్రభుత్వవైఖరిపై మండిపడ్డారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న రైతులపై తప్పడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని మధు ఆరోపించారు. వారం రోజుల్లో రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే పూర్తిగా పని ఆపెయ్యాలని నిర్వాసితుల కమిటీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 

16:42 - August 23, 2016

తూర్పుగోదావరి : జిల్లాలో దళితులపై పెత్తందారుల దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. సీతానగరం మండలం నల్లగొండ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా... చెరువు గట్టుపై మొక్కలు నాటుతున్న దళితులపై పెత్తందారులు తోట అన్నవరం, తోట శ్రీనివాస్, తోట సోమరాజు విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. చెరువుని ఆనుకుని ఉన్న పొలం తమదని, చెరువు గట్టుపై మొక్కలు నాటే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తూ.. దళితులపై దాడి చేశారు. గ్రామ సర్పంచ్ ఆదేశాల మేరకే మొక్కలు నాటుతున్నమని చెప్పినా... వినిపించుకోకుండా... తలలు పగిలేలా కొట్టారు. గాయపడ్డ దళిత కూలీలు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

కశ్మీర్ లో పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి..

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రేపు జమ్మూకశ్మీర్ లో పర్యటించనున్నారు. రెండురోజుల పాటు పర్యటనలో ఆయనతో పాటు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి కూడా వెళ్లనున్నారు. కశ్మీర్ లోయలో తాజా పరిస్థితులుపై ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ, సీనియర్ మంత్రులతో హోంమంత్రి సమీక్షించనున్నారు. 

నూతన రైల్వే మార్గాలను ప్రారంభించిన సురేష్ ప్రభు..

విజయవాడ : ఎర్ర‌గుంట్ల‌-నంద్యాల మ‌ధ్య నూత‌న రైల్వే మార్గాన్ని రైల్వేమంత్రి సురేశ్ ప్ర‌భు విజ‌య‌వాడ‌ నుంచి రిమోట్ ద్వారా ప్రారంభించారు. నంద్యాల‌-క‌డ‌ప డెమూ రైలును కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, కేంద్ర‌మంత్రులు సురేశ్ ప్ర‌భు, వెంక‌య్య‌నాయుడు కలిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సురేష్‌ప్ర‌భు మాట్లాడుతూ.. రైలు మార్గం ద్వారా కొత్త రాజ‌ధాని న‌గ‌రం అమరావతితో రాయ‌ల‌సీమ‌ను క‌లుపుతున్నామ‌ని వ్యాఖ్యానించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి సాయం అందిస్తామ‌ని అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయ‌న అన్నారు.

350 అడుగుల అంబేద్కర్ విగ్రహం!..

మహారాష్ట్ర : ప్రభుత్వం ముంబయిలో నగరంలో 350 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. నగరంలోని ఇందు మిల్స్‌ ప్రాంతంలో నిర్మిస్తున్న అంబేడ్కర్‌ స్మారక భవనంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు మహారాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాజ్‌కుమార్‌ బడోలె సోమవారం వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం ఎంతగానో పోరాడిన అంబేడ్కర్‌ పోరాటానికి గుర్తుగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విగ్రహాన్ని సమానతకు ప్రతిరూపంగా ఆయన పేర్కొన్నారు.

దళితులపై అగ్రవర్ణాల దాడి..

తూర్పుగోదావరి : సీతానరగరం మండలం నల్లగొండ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. దళితులపై అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన దళితులకు చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెరువు గట్టుపై మొక్కలు నాటుతున్న దళితులపై అగ్రవర్ణ వ్యక్తులు దాడికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమచారం అందాల్సివుంది. 

టీవీ ఛానల్ పై 2000మంది దాడి..ఒకరు మృతి..

పాకిస్థాన్ : రెండువేల మంది ఉద్య‌మకారులు ఒక టీవీ ఛానల్‌పై దాడి చేసిన ఘ‌ట‌న పాకిస్థాన్‌లోని క‌రాచీలో చోటుచేసుకుంది. ముత్తాహిదా ఖామీ ఉద్యమం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డం ప‌ట్ల రెండు వేల మంది ఉద్య‌మకారులు ఆందోళ‌న తెలిపారు.వారు చేపట్టిన ఆందోళ‌న‌ను ఏఆర్‌వై టీవీ ఛానల్‌లో ప్రసారం చేయలేదని మదీనా షాపింగ్‌మాల్‌లో ఉన్న స‌ద‌రు ఛాన‌ల్‌పై దాడికి పాల్ప‌డ్డారు. దీంతో ఆ ప్రాంతంలో తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ ఘనటలో ఓ జర్నలిస్ట్ మృతి చెందినంట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ఉద్య‌మ‌కారుల‌ను అరెస్టు చేశారు.

ఖతర్ షిప్పింగ్ కంపెనీకి రూ.100కోట్ల జరిమానా!..

ముంబై: ఖతర్ షిప్పింగ్ కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. 2011లో ముంబై సముద్ర తీరంలో ఆయిల్ ఒలికిపోయిన కేసును విచారించిన ట్రైబ్యునల్ ఖతర్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీని దోషిగా తేల్చి రూ.వంద కోట్ల జరిమానా విధించింది. అలాగే అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు రూ.5 కోట్ల జరిమానా విధించింది.

15:35 - August 23, 2016

ముంబై : గోదావరి పై తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన అంతరాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంది. ప్రాజెక్టులపై జరుగుతున్న కీలక సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సహ్యాద్రి గెస్ట్‌ హౌస్‌లో జరుగుతున్న ఈ చారిత్రక ఒప్పందంపై.... తెలంగాణ సీఎం కేసీఆర్,మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంతకాలు చేశారు.

ముంబై సహ్యాద్రి గెస్ట్ హౌస్ వేదికగా ఒప్పందం..
ముంబయి సహ్యాద్రి గెస్ట్ హౌజ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మేడిగడ్డ, తుమ్మిడిహట్టి, చనాక - కొరాటా బ్యారేజీలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ మూడు ఒప్పందాలపై కేసీఆర్, ఫడ్నవీస్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలతో గోదావరిలో హక్కుగా ఉన్న 950 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం తెలంగాణ రాష్ట్రానికి లభించింది. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ర్టాల నీటి పారుదల శాఖ మంత్రులతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

మరాఠా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్..

ముంబై : గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నీటి పారుదల రంగంలో ఇరు రాష్ర్టాల మధ్య చారిత్రక ఒప్పందం జరిగిందన్నారు. ఈ ఒప్పందంపై సంతకాలు సువర్ణాక్షరాలతో లిఖించదగినవి అని పేర్కొన్నారు. 

మరాఠా తెలంగాణల జల బంధం..

ముంబై : గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నారు. ముంబయి సహ్యాద్రి గెస్ట్ హౌజ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మేడిగడ్డ, తుమ్మిడిహట్టి, చనాక - కొరాటా బ్యారేజీలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ మూడు ఒప్పందాలపై కేసీఆర్, ఫడ్నవీస్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలతో గోదావరిలో హక్కుగా ఉన్న 950 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం లభించింది. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ర్టాల నీటి పారుదల శాఖ మంత్రులతో పాటు అధికారులు, మంత్రులు పాల్గొన్నారు. 

15:09 - August 23, 2016

హైదరాబాద్ : నయీంతో నల్గొండజిల్లా టీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్‌నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను గులాబీ నేతలు ఖండించారు. కోమటిరెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదని ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిషోర్ తెలిపారు. దమ్ముంటే తమపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. లేకపోతే ప్రజాక్షేత్రంలో క్షమాపణలు చెప్పాలన్నారు. కోమటిరెడ్డి తీరు మారకపోతే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసుపెడతామని గాదరి కిషోర్ హెచ్చరించారు. ఎఫ్ ఐఆర్ లో నేతిపై కేసు ఫైల్ అయినంత మాత్రాన దోషులు కారన్నారు పల్లారాజేశ్వర్ రెడ్డి.

15:06 - August 23, 2016

హైదరాబాద్ : జిల్లాలలోని లోకల్ రిజర్వేషన్లపై ప్రత్యేకచర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. ప్రతీ విషయంపై మేధావుల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించగలిగితే దాని ప్రభావం అద్భుతంగా ఉంటుందన్నారు. రీలోకలైజేషన్ ఎలా జరుగుతుందన్న దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు కోదండరాం. ఇప్పుడున్న ఉద్యోగులకే జోనల్ వ్యవస్ధను కొనసాగిస్తామనడం సబబుకాదని.. భవిష్యత్ ఉద్యోగులకు కూడా జోనల్ వ్యవస్ధ అమలు చేయాలని సూచించారు.

15:04 - August 23, 2016

ముంబై : వీరప్పన్‌ సినిమా తీసి అందరినీ మెప్పించిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.. గ్యాంగ్‌స్టర్‌ నయీం జీవిత కథను తెరకెక్కిస్తానని చెబుతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. నయీం గురించి ఎన్నో కథనాలు చదివి తెలుసుకున్నానని ఆయన చెప్పారు. నయీం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.. పెద్ద సినిమానే తీయాలని ఆయన అభిప్రాయాపడ్డారు. త్వరలో నయీంపై సినిమా తీస్తానని...అది మూడు భాగాల్లో తెరకెక్కిస్తానని వెల్లడించారు. 

15:01 - August 23, 2016

విజయవాడ : ప్రజల ప్రేమ, అభిమానాలతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నట్లు ఒలింపిక్‌ రజత పతక విజేత పీవీ సింధు అన్నారు. తల్లిదండ్రులు, కోచ్‌ సహకారంతోనే తాను బ్యాడ్మింటన్‌లో రాణించగలుగుతున్నట్లు చెప్పారు. తన తాతగారి వూరైన విజయవాడకు చిన్నతనంలో చాలాసార్లు వచ్చానని.. ఇక్కడి ఇండోర్‌ స్టేడియంలో బ్యాడ్మింటన్‌ ఆడానని సింధు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

కరణం మల్లీశ్వరి సన్మానంతో స్ఫూర్తి పొందా : గోపీచంద్
కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి తిరిగి వచ్చినప్పుడు ఆమెకు జరిగిన సన్మానం తనకింకా గుర్తుందని సింధు కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. ఆ సమయంలో తనకూ అలా సన్మానం చేయించుకోవాలని అనిపించిందని, అది ఇప్పుడు నెరవేరిందని పేర్కొన్నారు. ఈరోజు సింధు ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతున్న సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

 

14:55 - August 23, 2016

మహారాష్ట్ర : వినాయక చవితి సందర్భంగా కొందరు చందాల పేరిట దందాలు చేస్తున్నారు. డబ్బులివ్వకుంటే బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ దౌర్జన్యాలకు దిగుతున్నారు. గణేశ్ మండపాలకు చందా ఇవ్వలేదన్న కారణంతో బేకరిలో పనిచేసే కార్మికులతో గుంజీలు తీయించిన ఘటన మహారాష్ట్రలోని పుణె నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ కావడంతో స్పందించిన పోలీసులు ముగ్గురు నిందితులు ప్రకాశ్ , గణేశ్ , మహేశ్‌లను అరెస్ట్‌ చేశారు. నిందితులు భోసరి ప్రాంతంలోని ఓ బేకరికి వెళ్లి, అక్కడ పనిచేస్తున్న కార్మికులను 151 రూపాయలు చందా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ యాజమాని లేడని, తాము చందా ఇవ్వలేమన్న కార్మికులను నోటికొచ్చినట్టు తిట్టారు. అక్కడితో ఆగకుండా వారితో గుంజీలు తీయించారు. బాధితుడు ఇర్షాద్ మహ్మద్ ఆయుబ్ ఖాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

14:52 - August 23, 2016

ఛత్తీస్ ఘడ్ : దండకారణ్యం.. మావోయిస్టుల శిక్షణ వేదికగా మారింది. ముఖ్యంగా మహిళా మావోయిస్టులకు యుద్ధవిద్యలు, గెరిల్లా పోరాట విద్యలను నేర్పుతున్నారు. పారామిలటరీ బలాలు ఏ దిశగా వచ్చినా.. ఎన్ని రూపాల్లో వచ్చినా దీటుగా తిప్పికోట్టేలా మహిళా మావోయిస్టులు శిక్షణ పొందుతున్నారు. భూమి, ఆకాశ మార్గాల్లో ఎదురయ్యే ఎలాంటి దాడినైనా సమర్థంగా ఎదుర్కోవడంపై కఠోర శిక్షణనిస్తున్నారు. దీనికి సంబంధించి వెలుగు చూసిన వీడియో దృశ్యాలు.. దండకారణ్య పరిసర ప్రాంతాల్లోనూ... పోలీసు వర్గాల్లోనూ కలలం సృష్టిస్తున్నాయి. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూండండి..

14:49 - August 23, 2016

ముంబై : సీఎం కేసీఆర్ మహారాష్ట్రతో ఒప్పందంలో భాగంగా ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్నారు. మధ్యాహ్నం 2.45 నిమిషాల వరకు రాజ్‌భవన్‌లో గడుపుతారు. అనంతరం 3 గంటలకు సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు సీఎం. అక్కడ జరిగే తెలంగాణ, మహారాష్ట్ర ఇంటర్‌స్టేట్ బోర్డు సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి 5.15 నిమిషాలకు తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుని అక్కడే రాత్రి బస చేయనున్నారు సీఎం కేసీఆర్ . 

గడ్కరీతో తెలంగాణ నేతలు భేటీ..

ఢిల్లీ : కేంద్రమంత్రి గడ్రరీతో మంత్రి తుమ్మల, ఎంపీ వినోద్ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో హైవేల విస్తరణ, కొత్తరోడ్లు నిర్మాణంపై నేతలు చర్చించారు.

ముగిసిన టీ.జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : టీ.జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేవం ముగిసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, జోనల్ వ్యవస్థ, ఎస్సై రామకృష్ణా రెడ్డి ఆత్మహత్యపై చర్చించామని జేఏసీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజల అభీష్టం మేరక జరగాలని ఈ సందర్భంగా కోదండరాం పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ఆదివాసీల సమగ్రతలను కాపాడాలన్నారు. జోనల్ వ్యవస్థపై లోతైన, సమగ్రమైన చర్చ జరిగాకే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి ఒప్పందాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. కాగా రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలను బహిర్గతం చేయాలన్నారు.

మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోనున్న తెలంగాణ..

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంతో నీటి ఒప్పందం కుదుర్చుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు విషయం తెలిసిందే. కాసేపట్లో కేసీఆర్ ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌజ్‌కు చేరుకుంటారు. అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య చారిత్రక ఒప్పందం కుదురనుంది.

పుష్కరాల ముగింపు వేడుకల్లో విషాదం

విజయవాడ : పుష్కరాల ముగింపు వేడుకల్లో విషాదం నెలకొంది. విజయవాడలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బెంజి సర్కిల్ బ్రిడ్జీ వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..

విజయవాడ: విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు భక్తులు విజయవాడలో పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చారు. పుష్కర స్నానం ముగించుకొని తిరిగి వెళ్తుండగా బెంజ్‌ సర్కిల్‌ వద్ద వీరి వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది.

 

రియో ఒలింపిక్స్ లో ఆశాకిరణం సింధు : సీఎం చంద్రబాబు

విజయవాడ : భారత్ కు ఆశాశ్యోతిలా సింధు నిలిచిందని సీఎం చంద్రబాబు అన్నారు. రియో ఒలింపిక్స్ లో ఆశాకిరణంలా సింధు కన్పించిందన్నారు. ఇవాళ మనందరి ఆనందానికి కారణం పీవీ.సింధు అని పేర్కొన్నారు.  సింధును ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. 'మీ అందరికీ స్ఫూర్తినిచ్చేందుకు ప్రోటో కాల్ పక్కనబెట్టానని' సీఎం చెప్పారు. 

 

13:59 - August 23, 2016

విజయవాడ : పుష్కరాల ముగింపు వేడుకల్లో విషాదం నెలకొంది. విజయవాడలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బెంజి సర్కిల్ బ్రిడ్జీ వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

13:55 - August 23, 2016

విజయవాడ : భారత్ కు ఆశాశ్యోతిలా సింధు నిలిచిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. సింధు, గోపీచంద్, ఒలింపిక్స్ లో పాల్గొన్న పలువురు క్రీడాకారులతోపాటు కోనేరు హంపిలను ఘనంగా సన్మానించారు. రియో ఒలింపిక్స్ లో ఆశాకిరణంలా సింధు కన్పించిందన్నారు. ఇవాళ మనందరి ఆనందానికి కారణం పీవీ.సింధు అని పేర్కొన్నారు.  సింధును ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. 'మీ అందరికీ స్ఫూర్తినిచ్చేందుకు ప్రోటో కాల్ పక్కనబెట్టానని' సీఎం చెప్పారు. భారత దేశం పరువును కాపాడిన అమ్మాయి సింధు అని అన్నారు. సింధు.. ఆణిముత్యం, డైమండ్ అని అభివర్ణించారు. క్రికెట్ మాత్రమే కాకుండా అన్ని గేమ్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యంతో ముందుకెళ్లాలని తెలిపారు. అమరావతిలో క్రీడలకు మంచి వసతులు కల్పిస్తామని చెప్పారు. సింధు దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిందన్నారు. సింధు సిల్వర్ మెడల్ సాధించడం గర్వంగా ఉందన్నారు. సింధు విజయంలో గోపీచంద్ కృషి ఎనలేనిదన్నారు. మళ్లీశ్వరికి మొట్టమొదటిగా బ్రాంజ్ మెడల్ వచ్చిందని.. అప్పుడు ఎల్ బి స్టేడియంలో ఆమెకు సన్మాన సభ ఏర్పాటు చేశామని చెప్పారు. తర్వాత సానియా మీర్జాను సైతం సన్మానించానని తెలిపారు.  
భారత ప్రతిష్ట ప్రపంచానికి చాటి చెప్పిన క్రీడాకారులకు సన్మానం చేశానని గుర్తు చేశారు. నాడు అకాడమీకి ఇచ్చిన ఐదు ఎకరాల భూమి నేడు భారతదేశ ప్రతిష్ట పెంచిందన్నారు. గతంలో గచ్చిబౌలిలో నేషనల్ గేమ్స్ ను నిర్వహించానని తెలిపారు. గోపిచంద్ నిరంతరం కష్టపడే వ్యక్తి అని...  నమ్మిన సిద్ధాంతం కోసం తపిస్తాడని చెప్పారు.  అన్ని రకాలుగా ప్రోత్సహిస్తే అత్యుతమ క్రీడాకారులుగా తయారవుతారని పేర్కొన్నారు. పిల్లలు మరో సింధు, గోపీచంద్ లు కావాలన్నారు. 2029 నాటికి రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా ఉండాలని ఆకాంక్షించారు. సింధుకు ప్రభుత్వం తరపున రూ.3 కోట్ల రూపాయలు, గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. సింధు అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. రియో ఒలింపిక్స్ లో పాల్గొన్న శ్రీకాంత్ కు 25 లక్షల రూపాయలు, గ్రూప్ 2 ఉద్యోగం,  రజినికి రూ.25 లక్షలు, గ్రూప్ 2 ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రా యూనిర్సిటీ గోపీచంద్ కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అమరావతిలో అకాడమీకి 15 ఎకరాల స్థలం ఇస్తామని చెప్పారు. అమరావతిని క్రీడలకు కేంద్రంగా తయారు చేస్తామని చెప్పారు. అమరావతిలో ఏర్పాటు చేయబోయే 9 సిటీల్లో స్పోర్ట్స్ సిటీగా ఒకటి అని తెలిపారు. అలాగే విశాఖ, తిరుపతితోపాటు ప్రతి జిల్లాలో ఒక స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

పీవీసింధు రజతం పథకం సాధించడం గర్వకారణం : మంత్రి అచ్చెన్నాయుడు

విజయవాడ : మహిళలు బ్యాడ్మింటన్ సింధును ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నాడు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సింధు విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. తెలుగుతేజం పీవీసింధు రజతం పథకం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. సింధును ఆయన అభినందించారు. 

13:44 - August 23, 2016

విజయవాడ : మహిళలు బ్యాడ్మింటన్ సింధును ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నాడు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సింధు విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. తెలుగుతేజం పీవీసింధు రజతం పథకం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. సింధును ఆయన అభినందించారు. 

 

13:30 - August 23, 2016

వేములఘాట్ లో రైతు గుండెపోటుతో మృతి

మెదక్ : మల్లన్నప్రాజెక్టు ముంపు గ్రామం వేములఘాట్ లో రైతు గుండెపోటుతో మృతి చెందారు. ఎర్రవల్లి లాఠీచార్జ్ ఘటనలో హుస్సేన్ కేసును ఎదుర్కొంటున్నారు. బెయిల్ రాక మనస్థాపానికి గురయ్యాడని మృతుని బంధువులు అన్నారు. 

12:58 - August 23, 2016
12:57 - August 23, 2016

విజయవాడ : దేవుడిపై భక్తులకున్న కొండంత నమ్మికను రాజకీయాలు వమ్ముచేస్తున్నాయి. విఘ్నాలను తొలగించే వినాయకునికి నాయకుల గ్రహణం పట్టింది. రికార్డు కోసం మొదలుపెట్టిన భారీ గణేశ్‌ విగ్రహ నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయింది. విజయవాడలోని డూండీ గణేశ్‌ ఉత్సవ కమిటీలో పాలిటిక్స్‌ పీక్‌స్టేజికి చేరుకున్నాయి.  
అర్ధాతరంగా ఆగిపోయిన 72 అడుగుల గణేశ్‌ విగ్రహం 
రాజకీయం.. ఇపుడు దేవుడికీ కష్టాలను తెచ్చిపెట్టింది. విజయవాడలో తయారవుతున్న భారీగణేశ్‌ విగ్రహానికి  రాజకీయగ్రహణం పట్టింది. డూంఢీగణేశ్‌ సేవాసమితి ఆధ్వర్యంలో తయారవుతున్న 72 అడుగుల భారీ వినాయక విగ్రహనిర్మాణం అర్థాంతరంగా నిలిచిపోయింది. 
గత ఏడాది ఉత్సావాల్లో నిధుల దుర్వినియోగం..
గత ఏడాది ఉత్సవాల్లో విరాళాల నిధులు  పెద్దమొత్తంలో దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలొచ్చాయి.  డూండీ గణేశ్‌ ఉత్సవకమిటీ అధ్యక్షుడు కోగంటి సత్యనారాయణ,  వ్యవస్థాపక అధ్యక్షుడు పారేపల్లి రాకేష్‌తోపాటు మరికొంతమంది సభ్యులు లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలొచ్చాయి.  ఈ నేపథ్యంలో ఈఏడాది కొత్తగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును ఉత్సవ కమిటీలోకి  తీసున్నట్టు ఫ్లెక్సీలను కట్టేశారు. దీంతో కమిటీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. 
కమిటీలో వివాదం రాజేసిన ఫ్లెక్సీలు 
డూండీగణేశ్‌ ఉత్సవకమిటీలో లుకలుకలకు అసలు కారణం.. కమిటీలో రాజకీయాల ప్రవేశించడమే అంటున్నారు.  2015లో లక్షరూపాయలు.. అలాగే ఈఏడాది ఉత్సవాలకు కూడా మరో లక్షరూపాయలు ఇచ్చిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌రావు పేరును ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేయలేదు.  దీంతో కమిటీ సభ్యుల మధ్య విభేదాల పెరిగిపోయి..అతిపెద్ద గణేశ్‌విగ్రహం .. తయారీ దశలోనే ఆగిపోయింది.   
అర్థాంతరంగా ఆగిపోయిన విగ్రహ నిర్మాణం
విగ్రహం నిర్మాణ పనులు అర్దాంతరంగా ఆగిపోవడంతో కమిటీలో  విమర్శలు ప్రతివిమర్శలు మొదలైయ్యాయి. గత ఏడాది జరిగిన అవకతవకలపై నిలదీసినందుకే  వ్యవస్థాపక అధ్యక్షుడు పారేపల్లి రాకేశ్‌ పాలిటిక్స్‌ ప్లేచేస్తున్నారని కమిటీ ఉపాధ్యక్షుడు  విమర్శిస్తున్నారు. 
రికార్డుకోసం మొదలు పెట్టిన భారీ గణేవిగ్రహనిర్మాణం
గత ఏడాది 63 అడుగుల గణేశ్‌విగ్రహం ఏర్పాటు చేయగా ...ఈసారి 72 అడుగుల  విగ్రహాన్ని నిర్మాణం చేస్తున్నారు. అతిపెద్ద విగ్రహంతో  గిన్నీస్ రికార్డు నెలకొల్పాలనే ఆలోచనతో ఎంతో ఆర్భాటంగా మొదలు పెట్టిన విగ్రహంపనులు మధ్యలోనే ఆగిపోవడంపై భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

 

12:52 - August 23, 2016

ప్రకాశం : ఫ్లోరైడ్‌ భూతం ప్రకాశం జిల్లా బాలల ఆరోగ్యాన్ని కబళిస్తోంది. భావి పౌరులుగా ఎదిగి భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాల్సిన  విద్యార్థులు ఫ్లోరోసిస్‌ బారినపడుతున్నారు. దీంతో జీవితం అంధకార బంధురంగా  మారుతోంది. పాఠశాలలకు రక్షిత మంచినీరు అందిచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జారీ చేసిన జీవో అటకెక్కింది. దీంతో ఫ్లోరైడ్‌ నీటిని తాగుతూ ఫ్లోరోసిస్‌ బారిన పడుతున్న ప్రకాశం జిల్లా బాలలపై 10 టీవీ ప్రత్యేక కథనం...
చాలా ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య
ఆంధప్రదేశ్‌లో  ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్‌ సమస్యలకు కేరాఫ్‌ ఆడ్రస్‌గా మారింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్నా... కనిగిరి నియోజకవర్గంలో మాత్రం మరీ ఎక్కువగా ఉంది. బోరు నీరు మినహా  ప్రత్యామ్నాయ మంచినీటి వనరులు లేకపోవడంతో... ఈ నీటినే తాగుతున్నపాఠశాల బాలలు ఫ్లోరోసిస్‌ సమస్యతో సతమతమవుతున్నారు. 
ఫ్లోరోసిస్‌ బారిన పడుతున్న బాలలు 
జాతీయ ఫ్లోరోసిస్‌ నివారణ పథకం కింద అన్ని స్కూళ్లలో రక్షిత మంచినీరు సరఫరా చేయాలని 2012లోనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానీ  ఏ స్కూల్లో కూడా ఇది అమలుకు నోచుకోలేదు. దీంతో ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న బోరు నీరు తాగుతున్న బాలలు ఫ్లోరోసిస్‌ బారిన పడుతున్నారు. ఫ్లోరోసిస్‌ శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. దీంతో దంత సమస్యలతోపాటు మూత్ర పిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఫ్లోరైడ్‌ నీరు తాగి మంచంపట్టిన తమ తల్లిదండ్రులకు పట్టిన గతి తమకు పట్టకుండా చూడాలని  బాలికలు కోరుతున్నారు. తమకు సాగర్‌  కుడికాల్వ  నుంచి  నీరు అందిస్తే ఫ్లోరైడ్‌ పీడ విరగడవుతుందని బాలికలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ఫ్లోరైడ్‌ నీటిని తాగడం వలన ఎముకల పటుత్వం తగ్గిపోతోంది. కీళ్ల సంబంధ బ్యాధులు వస్తున్నాయి.  ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకుని రక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఫ్లోరైడ్‌ సమస్య మరింత జఠిలం కాకముందే పాలకులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పట్టించుకుని తరుణోపాయం ఆలోచించి..  మరింతమంది బాలలు ఫ్లోరోసిస్‌ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

 

12:45 - August 23, 2016
12:33 - August 23, 2016

నిజామాబాద్‌ : గతమెంతో ఘనంగా వెలుగొందిన సాగునీటి ప్రాజెక్ట్‌ నేడు వెలవెలబోతోంది. దశాబ్దాలుగా సాగు, తాగునీటి అవసరాలు తీర్చిన జలాశయం వొట్టిపోయింది. నిజామాబాద్‌ జిల్లాలో అడుగంటిన నిజాంసాగర్‌ జలాశయం దుస్థితిపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. లక్షలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందించిన నిజాంసాగర్‌ నేడు వెలవెలబోతోంది. అడుగంటిన నీటితో ప్రాజెక్ట్‌ బావురుమంటోంది. 
1923లో నిజాంసాగర్‌ నిర్మాణం  
నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను 1923లో అప్పటి హైదరాబాద్‌ నిజాం మీర్‌ఉస్మాన్‌ అలిఖాన్‌ కాలంలో నిర్మించారు. నిజామాబాద్‌ జిల్లాలోని అచ్చంపేట్‌-బంజపల్లి గ్రామాల మధ్య ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత పటిష్టంగా నిర్మించారు. అప్పట్లో 18లక్షల రూపాయలతో  ఈ జలాశయాన్ని పూర్తిచేశారు.    
29.7టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మాణం 
నిజాంసాగర్‌ను 29.7టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. అప్పట్లో బోధన్‌ తాలూకాలో భాగంగా ఉన్న నిజామాబాద్‌, ఆర్మూరు, బాన్సువాడ పరిధిలోని 2లక్షల 75వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కాని...  నీటిని వాడుకోవడమేకాని.. ప్రాజెక్ట్‌నిర్వహణను పాలకులు పట్టించుకోలేదు. దశాబ్దాలుగా జలాశయంలోకి భారీ ఎత్తున పూడిక చేరిపోయింది. దీంతో నీటినిల్వసామర్థ్యం పడిపోయింది. 29టీఎంసీలకు పైగా నిల్వుండాల్సిన నీరు 17.8టీఎంసీలకు పడిపోయింది. ప్రాజెక్ట్‌ పై పరిశోధనచేసిన ఇంజీనీర్లబృందం ఈ విషయాలు వెల్లడించింది. 
మహరాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో 47 ప్రాజెక్టుల నిర్మాణం
మరోవైపు ఎగువ ప్రాంతాల్లో  మహరాష్ట్ర, కర్నాటకలు పోటీలు పడిమరీ ప్రాజెక్ట్‌లను నిర్మించాయి. రెండు రాష్ట్రాలు మొత్తం 47 చిన్నాపెద్దా జలాశయాలను కట్టేశాయి. దీంతో మంజీరానదిలో ప్రవాహం దారుణంగా పడిపోయింది. కేవలం వర్షాలు పడుతున్నప్పుడు వస్తున్న వరదజలాలపైనే నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ఆధారపడే పరిస్థితికి వచ్చింది. అటు మెదక్‌జిల్లాలో కట్టిన సింగూరుప్రాజెక్ట్‌ ను దాటుకుని నీరు రావడం అసాధ్యంగా మారింది. దాంతోపాటు హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ నగరాలకు తాగునీరందించడానికి సింగూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణంతో నిజాంసాగర్‌ పరిస్థితి మరింత దారుణంగా మారింది. 
డెడ్‌స్టోరేజ్‌కి చేరిన నిజాంసాగర్‌ జలాశయం
ఈ పరిస్థితుల్లో నిజాంసాగర్‌ నిండటం గగనంగా మారింది. ప్రాజెక్ట్‌ నిర్మాణసమయంలో స్థిరీకరించిన ఆయకట్టుకు నీరందని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం జలాశయంలో నీరు డెడ్‌స్టోరేజ్‌కు చేరడంతో ఆయకట్టు రైతుల  ఆశలు ఆవిరవుతున్నాయి. మరోవైపు వర్షాలు కూడా ముఖం చాటేస్తుండంతో ఈఏడాది ఈ ప్రాజెక్టు నిండే పరిస్థితులు కనిపించడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 

 

12:27 - August 23, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు బయల్దేరారు. ప్రత్యేక విమానంలో సీఎం ముంబైకి పయనమయ్యారు. కొద్దిసేపటికి క్రితం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం ముంబై బయల్దేరారు. మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో ప్రాజెక్టులపై కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నారు. 

12:19 - August 23, 2016
12:17 - August 23, 2016

గుంటూరు : నదుల వెంటే నాగరికత వర్ధిల్లుతుందన్నది అక్షరసత్యం. ఆనాటి సింధూ నాగరికత మొదలు.. ఈనాటి పట్టణ నాగరికతలకు ఆయువు పట్టు నదీ తీరాలే. కృష్ణా నదీ తీరం వెంబడి వెలసిన నాగరికతకూ ఎంతో ప్రాధాన్యత ఉంది. పరవళ్లు తొక్కుతున్న జలాలతో కృష్ణా నదీతీరం వెంట పర్యటక స్థలాలు, దర్శనీయ క్షేత్రాలు యాత్రికులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. పుష్కరాల సందర్భంగా నాగార్జున సాగర్‌ విశిష్టతను గుర్తు చేసుకుందాం....
పర్యాటక క్షేత్రంగానూ సాగర్‌ ప్రసిద్ధి 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ జిల్లాగా పేరొందిన గుంటూరుకు ప్రధాన నీటి వనరు కృష్ణా నది. డెల్టా ప్రాంతంలో బ్రిటిష్‌ వారి కాలంలో రూపుదిద్దుకున్న కాల్వలు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చాక నిర్మించిన మానవ నిర్మిత మహాసాగరం నాగార్జునసాగర్‌ ఆనకట్ట. పల్నాడు ప్రాంతంలోని లక్షలాది ఎకరాలకు తాగు, సాగు నీరు అందిస్తూ.. సిరుల పంటలు పండిస్తున్న సాగర్‌ పర్యటక క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది. 
1955, డిసెంబరు 10న నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు   
నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు 1955, డిసెంబరు 10న గుంటూరు, నల్గొండ జిల్లాల రెండు కొండల మధ్య నిర్మించారు.  1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎడమ వైపు లాల్‌బహదూర్‌ కాలువ, కుడి వైపు జవహర్‌ కాలువను నిర్మించారు. గుంటూరు , ప్రకాశం జిల్లాలకు కుడి కాల్వ ద్వారా, నల్గొండ , ఖమ్మం, కృష్ణా జిల్లాలకు తాగు నీరందించేలా రూపకల్పన చేశారు. ఎడమ కాలవకు 11 వేల క్యూసెక్కులు, కుడి కాలవకు 21 వేల క్యూసెక్కుల పరిమాణం ఉండే విధంగా ఏర్పాటు చేశారు. 
నాగార్జునసాగర్‌ డ్యాం పూర్తిగా ఎత్తైన రాతి కట్టడం
నాగార్జునసాగర్‌ డ్యాం పూర్తిగా ఎత్తైన రాతి కట్టడం. మానవ ప్రయత్నానికి అపరూప  ప్రతీకగా ఈ ఆనకట్ట నిలుస్తోంది. యంత్రపరికరాలు లేకుండానే 400 అడుగుల ఎత్తుకు రాళ్లను, సిమెంటు మోటార్లను బిగించి పరంజా తయారు చేశారంటే ప్రాజెక్టు నిర్మాణంలో ఎంతటి కృషి, తెలివి తేటలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మాచర్లకు అత్యంత చేరువలో ఉండే నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలాశయం పర్యాటకులను  విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మహా కట్టడాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు తరలి వస్తుంటారు. 
యాత్రికులు చూడాల్సిన ప్రాంతాలలో నాగార్జున సాగర్ ప్రధానం
పుష్కరాలకు తరలివచ్చే యాత్రికులు చూడాల్సిన ప్రాంతాలలో నాగార్జున సాగర్ ప్రధానమైనది. నిండుకుండలా ఉండే సాగర్ జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేసే సమయంలో పరవళ్ళు తొక్కుతూ పరుగులు పెట్టే కృష్ణమ్మ అందాలను చూడాలంటే వేయి కళ్లు కూడా చాలవు.  సాగర్‌ దృశ్యాలను చూస్తూ.. నది ఇసుక తెన్నెలు, బండరాళ్ళపై సేద తీరుతూ, నీటి తుంపర్ల మధ్య కేరింతలు కొడుతూ పర్యాటకులు పొందే అనుభూతి అంతా ఇంతా కాదు. చుట్టూ ఎర్రని కొండలు... పచ్చని తివాచీ పరిచిన చందంగా ప్రకృతి అందచందాలు అందరిని కట్టిపడేస్తాయి. 
నాగార్జునకొండ..
నాగార్జున సాగర్‌ను సందర్శించాలనుకునే పుష్కర యాత్రికులు ప్రాజెక్టుతో పాటు...మరికొన్ని టూరిజం స్పాట్‌లను ఎంచక్కా ఎంజాయ్ చేసేయొచ్చు. ముఖ్యంగా నాగార్జునకొండ, ఎత్తిపోతల జలపాతం. సాగర్ రిజర్వాయర్ మధ్యలో ఓ ద్వీపంలా ఈ కొండ ఉంది.  నాగార్జున కొండపై బౌద్ధ మతానికి సంబంధించిన చరిత్ర అనవాళ్ళను పదిల పరిచిన మ్యూజియం పర్యాటకులను కనువిందు చేస్తోంది. నాగార్జున సాగర్ విజయపురి సౌత్ నుంచి లాంచీ ప్రయాణం ద్వారా నాగార్జున కొండను చేరుకోవాల్సి ఉంటుంది. నదీ జలాశయంలో లాంచీ ప్రయాణం మధురానుభూతిని కలిగిస్తోంది. చుట్టూ కొండలతో, పచ్చని చెట్లతో పిల్ల తెమ్మెరల సవ్వడితో సాగే ప్రయాణం పర్యటకులను అబ్బుర పరుస్తోందంటే అతిశయేక్తి కాదు.  నాగార్జున కొండపైన పురావస్తుశాఖ మ్యూజియం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. 
ఎత్తిపోతల జలపాతం
నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న మరో సందర్శనీయ ప్రాంతం ఎత్తిపోతల జలపాతం. నాగార్జున సాగర్ నుంచి మాచర్లకు వచ్చే మార్గంలో 11 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. నల్లమల అడవుల్లో పుట్టిన చంద్రవంక నది అటవీ ప్రాంతం గుండా ప్రయాణించి ఎత్తిపోతల వద్ద 70 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకి, అక్కడి నుంచి కృష్ణా నదిలో కలుస్తోంది.  ఎత్తిపోతల జలాశయం మొసళ్ళ పెంపకానికి ప్రసిద్ధి. ఎత్తు నుంచి జాలువారే జలపాతం పర్యటకులకు ఎంతో అహ్లాదాన్ని పంచుతోంది. ఇక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాలు సినిమా షూటింగ్‌లకు కూడా అనువైనవిగా ఉండటం విశేషం. 
సుగాలీయుల ఇలవేలుపుగా దత్తాత్రేయస్వామి 
జలపాతం దిగువ భాగంలో ఉన్న దత్తాత్రేయస్వామి సుగాలీయుల ఇలవేలుపుగా పూజలందుకుంటున్నాడు. ప్రతిఏటా తొలి ఏకాదశి నాడు జరిగే తిరునాళ్లకు సుగాలీలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. మధుమతి దేవి, రంగనాథస్వామి, చౌడేశ్వరి దేవి ఆలయాలు కూడా ఇక్కడే ఉండటంతో .. ఇక్కడికి సందర్శకులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తానికి  పవిత్ర పుష్కర స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులు, యాత్రికులకు..  ఇక్కడి నాగార్జునసాగర్‌, నాగార్జున కొండ, ఎత్తిపోతల జలపాతంతో పాటు వివిధ ఆలయాలు అద్భుత అనుభూతిని కలిగిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. 

 

12:14 - August 23, 2016

ఖమ్మం : అక్టోబర్‌ 20 నుంచి సీపీఎం ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపడుతున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. 2017 మార్చి 5 వరకు కొనసాగే ఈ పాదయాత్ర తెలంగాణలోని మొత్తం అన్ని మండలాలు, జిల్లాల గుండా 4వేల కిలోమీటర్ల మేర కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్న మునగాల గ్రామంలో సీపీఎం కార్యకర్త ఏసు సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళితులపై జరుగుతున్న దాడులపై తమ్మినేని ఆందోళన వ్యక్తం చేశారు.  

12:07 - August 23, 2016

గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ ర్యాలీ

హైదరాబాద్ : గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నల్ల జెండాలతో కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపారు. 

 

గుజరాత్ అసెంబ్లీ నుంచి 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెండ్

హైదరాబాద్ : గుజరాత్ లో 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. గుజరాత్ అసెంబ్లీ నుంచి 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.

గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పీవీ.సింధు, గోపిచంద్

విజయవాడ : ఒలింపిక్ రజత పతక విజేత పీవీ.సింధు, కోచ్ గోపిచంద్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. పలువురు మంత్రులు, అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విజయవాడలోని భారీ ర్యాలీతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వెళ్లనుంది. 

 

10:46 - August 23, 2016
10:42 - August 23, 2016

విజయవాడ : ఒలింపిక్ రజత పతక విజేత పీవీ.సింధు, కోచ్ గోపిచంద్ గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. పలువురు మంత్రులు, అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విజయవాడలోని భారీ ర్యాలీతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వెళ్లనుంది. క్రీడాకారులు, విద్యార్థులతో స్టేడియం కిక్కిరిసోయింది. మున్సిపల్ స్టేడియంలో సింధుకు సీఎం చంద్రబాబు ఘన సన్మానం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆమో పుష్కరఘాట్లను సందర్శించనున్నారు. సాయంత్రం కృష్ణా హారతిలో సింధు పాల్గొనున్నారు. 

10:36 - August 23, 2016

ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో టీసర్కార్ దోపిడీ చేస్తుందని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేత సమ్మారావు, సీపీఎం నేత నంద్యాల నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ నేత కైలాష్ పాల్గొని, మాట్లాడారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగే ప్రాజెక్టులు కట్టాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:28 - August 23, 2016

నల్గొండ : పుష్కరాల చివరి రోజు కావడంతో నల్గొండ జిల్లాలోని పుష్కర ఘాట్లకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. నాగార్జున సాగర్ శివాలయం ఘాట్‌లో తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్ పుష్కరస్నానం చేశారు. అనంతరం ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

10:13 - August 23, 2016

కాసేపట్లో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న పీవీ.సింధు, గోపీచంద్

కృష్ణా : పీవీ.సింధు, గోపీచంద్ కాసేపట్లో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. పలువురు మంత్రులు, అధికారులు స్వాగతం పలకనున్నారు. 

09:53 - August 23, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నేటితో కృష్ణాపుష్కరాలు ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని పుష్కరఘాట్లన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు పుష్కరస్నానమాచరిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 

 

09:19 - August 23, 2016

హైదరాబాద్ : చిరంజీవి బర్త్‌డే సందర్భంగా సోమవారం రాత్రి నగరంలోని ఓ హోటల్‌లో సినీ ప్రముఖులకు గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌లోని సినీ హీరోలు, హీరోయిన్స్‌, నటులు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్‌ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. 

 

ఉ. 10.15 గం.లకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న పివి.సింధు

కృష్ణా : ఒలింపిక్స్ రజత పతకం విజేత పీవీ.సింధు ఉదయం 10.15 గంటలకు ప్రత్యేకవిమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. ఎయిర్ పోర్టులో ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు మంత్రులు, అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వెళ్లనుంది. మున్సిపల్ స్టేడియంలో సింధుకు సీఎం చంద్రబాబు ఘన సన్మానం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆమో పుష్కరఘాట్లను సందర్శించనున్నారు. సాయంత్రం కృష్ణా హారతిలో సింధు పాల్గొనున్నారు. 

విజయవాడకు పివి.సింధు పయనం

కృష్ణా : ఒలింపిక్స్ రజత పతకం విజేత పీవీ.సింధు విజయవాడకు బయలుదేరింది. ఉదయం 10.15 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. ఎయిర్ పోర్టులో ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు మంత్రులు, అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వెళ్లనుంది. మున్సిపల్ స్టేడియంలో సింధుకు సీఎం చంద్రబాబు ఘన సన్మానం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆమో పుష్కరఘాట్లను సందర్శించనున్నారు. సాయంత్రం కృష్ణా హారతిలో సింధు పాల్గొనున్నారు. 

09:10 - August 23, 2016

కృష్ణా : ఒలింపిక్స్ రజత పతకం విజేత పీవీ.సింధు విజయవాడకు బయలుదేరింది. ఉదయం 10.15 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. ఎయిర్ పోర్టులో ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు మంత్రులు, అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వెళ్లనుంది. మున్సిపల్ స్టేడియంలో సింధుకు సీఎం చంద్రబాబు ఘన సన్మానం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆమో పుష్కరఘాట్లను సందర్శించనున్నారు. సాయంత్రం కృష్ణా హారతిలో సింధు పాల్గొనున్నారు. 

09:01 - August 23, 2016

హైదరాబాద్ : ఎమ్మెస్‌వోలు, కేబుల్‌ఆపరేటర్లకు టెక్నాలజీ వినియోగంపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ కేబుల్‌ఆపరేటర్లు-ఎమ్మెస్‌వోల సంఘం రెడీ అయ్యింది. ఈనెల 24 నుంచి 26వరకు మూడు రోజుల పాటు కార్యక్రమాలు జరగనున్నాయి.  కేంద్రప్రభుత్వ డిజిటల్‌ ఇండియా లక్ష్యంలో భాగంగా కేబుల్‌ఎక్స్‌పో విజన్‌-2016 నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ హైటెక్స్‌జరిగే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేతారకరామారావు హాజరవుతారని ఎమ్మెస్‌వోల సంఘం తెలిపింది. 

 

08:52 - August 23, 2016

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన పీవీ సింధూ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు కృష్ణా పుష్కరాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న సింధు, గోపిచంద్‌లను ఘనంగా సత్కరించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి సన్మానం జరిగే మున్సిపల్‌ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. 
పీవీ సింధుపై ప్రశంసల వర్షం 
రియోలో రజతం సాధించిన పీవీ సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒలింపిక్స్‌ నుంచి దేశానికి తిరిగివచ్చిన సింధూకు హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. అంతేకాకుండా తెలంగాణ సర్కార్‌ భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు ఘన సన్మానం చేసి సత్కరించింది. 
సింధుకు ఘన సన్మానం చేయనున్న చంద్రబాబు
ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ కూడా పీవీ సింధూను ఘనంగా సత్కరించాలని నిర్ణయించింది. ఇందుకోసం పుష్కరాలు ముగింపు సందర్భంగా సింధు, గోపిచంద్‌లను ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పీవీ సింధు, గోపిచంద్‌లు ఈరోజు విజయవాడ రానున్నారు. 
ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు 
బెజవాడకు రానున్న సింధు, గోపిచంద్‌లకు ఘన స్వాగతం పలికేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలకనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి విజయవాడ మున్సిపల్‌ స్టేడియం వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్వర్యంలో సింధూకు ఘన సన్మానం చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సింధూ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించనున్నారు. అదేవిధంగా ఈరోజు కృష్ణా పుష్కరాలు ముగుస్తున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలోని సంగమం ఘాట్‌లో కృష్ణమ్మ హారతి కార్యక్రమంలో సింధూ పాల్గొననుంది. రియో ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన సింధూ తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 

 

08:48 - August 23, 2016

హైదరాబాద్ : ఎంతో ప్రతిభ ఉండి కూడా సరైన ప్రోత్సాహం లేక మట్టిలోనే ఉన్న మాణిక్యాలను వెలికి తీయాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని రెపరెపలాడించిన పీవీ సింధును సన్మానించిన కేసీఆర్‌.. వచ్చే ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించేలా అందరూ కృషి చేయాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో క్రీడా విధానం రూపకల్పన కోసం త్వరలో క్రీడాకారులు, క్రీడాసంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 
దేశం గర్వపడే విధంగా పతకం సాధించిన సింధు : కేసీఆర్‌ 
పివి సింధు లాంటి మరింత మంది క్రీడాకారులను తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో క్రీడా విధానాన్ని రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక మంది ప్రతిభావంతులున్నారని, మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. ఒలింపిక్స్ లో రజతం సాధించిన పివి సింధు, కోచ్ గోపీచంద్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. తాను సాధించిన పతకాన్ని సింధు ముఖ్యమంత్రికి చూపించారు. పివి  సింధును హృదయపూర్వకంగా అభినందించిన ముఖ్యమంత్రి, అమెను ఘనంగా సన్మానించి, రూ.5కోట్ల చెక్కును అందించారు. అలాగే గోపికి కూడా కోటి రూపాయల చెక్ అందించారు. పివి సింధు దేశం గర్వపడే విధంగా ప్రతిభ ప్రదర్శించి పతకం సాధించడం అభినందనీయమని ముఖ్యమంత్రి అన్నారు. కోచ్ గోపీ చంద్ కూడా తన అకాడమీ ద్వారా ఎంతోమందిని ప్రోత్సహిస్తున్నారన్నారు. సింధును క్రీడల్లో ప్రోత్సహించిన తల్లిదండ్రులను కేసీఆర్‌ అభినందించారు.
వచ్చే బడ్జెట్‌లో క్రీడల అభివృద్ధికి నిధుల కేటాయింపు 
సింధు రజతం సాధించడం గొప్ప విషయమని, అయితే.. ఇంత పెద్ద దేశం కేవలం రెండు పతకాలే గెలిచిందనే విమర్శ కూడా ఉందని కేసీఆర్‌ అన్నారు. దేశంలో క్రీడాకారులు ఎవరికి వారు ఎదిగి పతకాలు సాధిస్తున్నారు తప్ప ప్రభుత్వ పరంగా సరైన ప్రోత్సాహం లభించడం లేదనే భావన ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఒలింపిక్ పతకాలు సాధించడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రముఖ క్రీడాకారులు, అధికారులు, కోచ్ లు, క్రీడా సంఘాలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి క్రీడా విధానాన్ని ఖరారు చేస్తామన్నారు కేసీఆర్‌.  వచ్చే బడ్జెట్ నాటికి విధానం రూపొందించి, నిధులు కేటాయిస్తామని చెప్పారు. 
జిల్లాల్లో క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు -కేసీఆర్‌ 
గతంలో అన్ని ప్రాంతాల్లో పాఠశాలల్లో ఆటలు ఆడేవారని, కానీ ఇప్పుడు పరీక్షల్లో మార్కులు సంపాదించడమే లక్ష్యంగా మారి క్రీడలను నిర్లక్ష్యం చేశారన్నారు ముఖ్యమంత్రి. క్రీడల పట్ల ప్రభుత్వ పరంగా కూడా మరింత చొరవ అవసరం అని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. అలాగే హైదరాబాద్‌లో ఉన్న క్రీడాప్రాంగణాలను ఉపయోగంలోకి తేవాల్సిన అవసరముందన్నారు. అదేవిధంగా జిల్లాల్లో కూడా క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తామన్నారు. భవిష్యత్‌లో హైదరాబాద్‌ను విశ్వ క్రీడలకు వేదికగా మారుస్తామన్నారు కేసీఆర్‌. ఇక పీవీ సింధు ఫిజియోథెరపిస్టు కిరణ్‌కు,.. ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబర్చిన శ్రీకాంత్‌లకు కేసీఆర్‌ చెరో 25 లక్షల రూపాయలు నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. 

 

08:37 - August 23, 2016

హైదరాబాద్ : కృష్ణా పుష్కరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈనెల 12న ప్రారంభమైన పుష్కరాలు నేటితో ముగుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగిన పుష్కరాల్లో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేసి, నదీమతల్లికి నీరాజనాలు పలికారు. దీపారాదనలు చేసిన కృష్ణమ్మకు ప్రణమిల్లి నమస్కరించారు. లక్షలాది మంది భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు.  రెండు ప్రభుత్వాలు విస్తృత ఏర్పాట్లు చేయడంతో యాత్రికులు ఎటువంటి అసౌకర్యం లేకుండా పుష్కర స్నానాలు చేయగలిగారు. ఈరోజు  పుష్కరాల ముగింపు కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేశాయి. విజయవాడ ఇబ్రహీపట్నంలోని కృష్ణా, గోదావరి నదుల సంగమ స్థానంలో జరిగే ముగింపు కార్యక్రమానికి పలువురు  ప్రముఖులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు రియో ఒలింపిక్స్‌ బాడ్మింటన్‌లో రజత పతకం సాధించింన పీవీ సింధు, ఈమె కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని... కృష్ణా హారతిని తిలకించనున్నారు. 

 

08:34 - August 23, 2016

కరీంనగర్ : పునర్విభజనలో కరీంనగర్‌ జిల్లా మూడు ముక్కలయ్యింది. ప్రస్తుతం ఉన్న కరీంనగర్‌కు తోడు జగిత్యాల, పెద్దపల్లి కేంద్రాలుగా మరో రెండు జిల్లాలు రానున్నాయి. అనూహ్యంగా పెద్దపల్లిని జిల్లాగా ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాగా అవతరిస్తున్న పెద్దపల్లిపై 10 టీవీ ప్రత్యేక కథనం... 
జిల్లా కేంద్రంగా మారనున్న పెద్దపల్లి 
కరీంనగర్‌ జిల్లాలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజవర్గాల కేంద్రంగా ఉన్న పెద్దపల్లి జిల్లా కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం నగర పంచాయతీగా ఉన్న పెద్దపల్లిని జిల్లాగా ప్రకటించడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను కొత్త జిల్లాగా ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనూహ్యంగా, రాజకీయ నేతల అంచనాలకు కూడా అందకుండా పెద్దపల్లిని కొత్త జిల్లాగా  ఏర్పాటు చేస్తున్నారు. పెద్దపల్లిని జిల్లా చేయాలని కోరుకున్న నాయకులు కూడా లేరు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌తో పాటు, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ కూడా రామగుండం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ సైతం రామగుండంకే ఓటేశారు. అయినప్పటికీ పెద్దపల్లిని జిల్లాగా ప్రకటిస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్‌, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, రామగుండం, శ్రీరాంపూర్‌, కమాన్‌పూర్‌, అంతర్గాం, మంథని, ముత్తారం మండలాలను కలిపి  జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాగా ప్రతిపాదించిన ప్రాంతంలో ప్రస్తుతం 7,37,749 మంది జనాభా ఉన్నారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడే జిల్లాల్లో  పెద్ద జిల్లా నిర్మల్‌ తర్వాత పెద్దపల్లి మూడో స్థానంలో నిలుస్తుంది. 
పెద్దపల్లి జిల్లాగా అవతరించడానికి అన్ని అర్హతలు 
పెద్దపల్లి జిల్లాగా అవతరించడానికి భౌగోళికంగా అన్ని అర్హతలు ఉన్నాయి. రైలు మార్గం, జాతీయ రహదారి, బసంత్‌నగర్‌ సమీపంలో ఎయిర్‌ స్ట్రిప్‌ ఉన్నాయి. సహజ వనరలకు కొదువలేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పెద్దపల్లిని జిల్లాగా ప్రకటించారని భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలో రోడ్లను వెడల్పు చేయడంతోపాటు ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకేచోట ఉండేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. పెద్దపల్లిని జిల్లాగా ప్రకటించడంతోనే సరిపెట్టకుండా....  అన్ని హంగులు కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు పెద్దపల్లిని జిల్లాగా ప్రకటించడం వెనుక మాజీ ఎంపీ  జీ వివేక్‌ చక్రం తిప్పినట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. భవిష్యత్‌ రాజకీయ అవసరాల కోసం జిల్లా కోసం వ్యూహాత్మకంగా పావులు కదపినట్టు రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. 

 

08:29 - August 23, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల డ్రాఫ్ట్‌ ముసాయిదా విడుదలతో తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి. కొత్త జిల్లాలు ఏర్పడుతున్న ప్రాంతాల్లో నేతలు సంబరాలు జరుపుతుండగా.. జిల్లాలుగా ఏర్పడని ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లు శాంతియుతంగా ఆందోళనలు చేసిన ప్రజలు.. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
జిల్లాల ఏర్పాటు... నిరసనలు 
తెలంగాణలో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ నిరసనలకు కారణమవుతోంది. కొత్త జిల్లాలకు రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలిపినా.. క్షేత్రస్థాయిలో నిరసనలు తప్పడం లేదు. గత కొన్ని రోజులుగా జిల్లాల ఏర్పాటుపై ఆందోళనలు చేస్తున్న ఆయా  ప్రాంత ప్రజలు..  జిల్లాల ముసాయిదా   ప్రకటనతో తమ ఆందోళనలను తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జిల్లాల ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిరసనలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ఇదే జిల్లాల ఏర్పాటుకు తుది  కూర్పు కాదనే సంకేతాలను ఇచ్చింది. రాబోయే రోజుల్లో మరో రెండుసార్లు ఆల్ పార్టీ మీటింగ్‌లు నిర్వహించి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని తేల్చి చెప్పింది. 
మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో..  
ఇదిలావుంటే.. జిల్లాల పునర్విభజనపై నిర్ణయం జరిగినప్పటి నుంచి వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జనగాం, గద్వాలను జిల్లా కేంద్రం చేయాలని అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. ముసాయిదా ప్రకటనలో ఆ రెండింటికి చోటు దక్కకపోవడంపై ప్రజలు ఆందోళన బాటపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆందోళనకారులు ఓ బస్సుకు నిప్పు పెట్టారు.  జిల్లాకు చెందిన  కొంత మంది అధికార పార్టీ నేతలు  గద్వాలను జిల్లా కేంద్రంగా చేయకపోతే తమ పదవులను వదిలేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. 
అధికారపార్టీ నేతలు సంబరాలు 
మరోవైపు జిల్లాల ముసాయిదా విడుదల కావడంతో కొత్త జిల్లాలుగా ఏర్పడుతున్న ప్రాంతాల్లో అధికారపార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటుతో తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే జిల్లాల ఏర్పాటుపై నెలరోజుల పాటు ప్రజాభిప్రాయాలు సేకరించిన తర్వాత మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశముందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదిఏమైనా కొత్త జిల్లాల ముసాయిదా విడుదలైనప్పటికి.. చివరకు ఎన్ని జిల్లాలు ఏర్పడుతాయనేది తేలేందుకు మరో నెల రోజులు పట్టనుంది. 

 

08:23 - August 23, 2016

నేటితో ముగియనున్న కృష్ణాపుష్కరాలు

హైదరాబాద్ : ఎపి, తెలంగాణలో కృష్ణాపుష్కరాలు నేటితో ముగియనున్నాయి. కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకలకు భారీ ఏర్పాటు చేశారు. పుష్కరాల ముగింపు సందర్భంగా విజయవాడలో సాంస్కృతి భేరీ జరుగనుంది. పవిత్ర సంగమం వద్ద కృష్ణా హారతికి భారీ ఏర్పాట్లు చేశారు. 

నేడు కర్నూలు జిల్లాలో సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు పర్యటన

కర్నూలు : జిల్లాలో నేడు సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు పర్యటించనున్నారు. ఓర్వకల్లు మండలం శకునాలలో సోలార్ పవర్ ప్లాంట్ వల్ల భూములు కోల్పోయిన రైతులను మధు పరామర్శించనున్నారు. 

 

నేడు నంద్యాల, ఎర్రగుంట్ల మధ్య నూతన రైలు ప్రారంభం

విజయవాడ : నేడు నంద్యాల, ఎర్రగుంట్ల మధ్య నూతన రైలు ప్రారంభం కానుంది. ఈ కొత్త రైలున కేంద్రరైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం రైల్వే స్టేషన్ లో జరిగే ఈ కార్యక్రమానికి ఎపి సీఎం చంద్రబాబు, సురేష్ ప్రభు, వెంకయ్య, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.

 

08:09 - August 23, 2016
08:09 - August 23, 2016

ఆగస్టు 12న ప్రారంభమైన కృష్ణా పుష్కరాలు ఇవాళ్టితో ముగుస్తున్నాయి. ఆఖరి రోజు భక్తులు భారీ సంఖ్యలో పుష్కర స్నానాలు ఆచరిస్తారన్న అంచనాలున్నాయి. నేటితో పుష్కరాలు ముగుస్తున్న నేపథ్యంలో విజయవాడలోని పుష్కర ఘాట్‌ వద్ద పుష్కరాల వివరాలను వీడియోలో చూద్దాం...

నేడు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ బస్సు యాత్ర ప్రారంభం

మెదక్ : నేడు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. యాత్రను మల్లు స్వరాజ్యం ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో ఆత్మగౌరవ బస్సుయాత్ర జరుగనుంది. 4 వేల కి.మీ బస్సుయాత్ర కొనసాగనుంది. 

08:01 - August 23, 2016

హైదరాబాద్ : ఇరిగేష‌న్ ప్రాజెక్టుల డిజైన్ మార్పుల‌పై జ‌ల‌దృశ్యంతో ప్రభుత్వంపై దూకుడు పెంచిన కాంగ్రెస్.. అదే టెంపోను కొన‌సాగిస్తుంది. కాళేశ్వరంపై సీఎం కేసీఆర్ చేసుకుంటున్న మ‌హా ఒప్పందాన్ని నిర‌సిస్తూ..నిర‌స‌ల‌తో  రోడ్డెక్కుతోంది. కేసీఆర్ తెలంగాణను మ‌హ‌రాష్ట్రకు తాక‌ట్టు పెట్టాడ‌ని ఆరోపిస్తున్న హ‌స్తం పార్టీ..ఇది మ‌హా చెత్త ఒప్పందమ‌ని నిర‌స‌న‌ల‌తో హోరెత్తించ‌నుంది.
టీఆర్ఎస్-కాంగ్రెస్‌ల మ‌ధ్య పోరు 
తెలంగాణ‌లో టీఆర్ఎస్-కాంగ్రెస్‌ల మ‌ధ్య పోరు సెగ‌పుట్టిస్తోంది. కేసీఆర్ ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు కౌంట‌ర్ ప్రజెంటేషన్‌తో ధీటుగా జ‌వాబిచ్చిన కాంగ్రెస్..ఇప్పుడు మ‌రింత స్పీడ్‌ను పెంచింది. మంగ‌ళ‌వారం తెలంగాణ ప్రభుత్వం మ‌హా ఒప్పందానికి రెడీ కావ‌డంతో..దీన్నే ల‌క్ష్యంగా కాంగ్రెస్ మ‌రింత జోరు పెంచింది. స‌ర్కార్ తీరును ఎండ‌గ‌ట్టేందుకు హ‌స్తం పార్టీ న‌డుంబిగించింది.
మహా ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు 
టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ మార్పునకు తెర‌లేపిన కేసీఆర్..ఈఏడాది మొద‌ట్లో మ‌హ‌రాష్ట్రకు వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒప్పందం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో మాదిరి కాకుండా..తుమ్మిడి హ‌ట్టి ఎత్తును 148 అడుగుల‌కు ప‌రిమితం చేసి కేసీఆర్..ఒప్పందం చేకున్నారు. దీనిపై అప్పుడు ప్రభుత్వం భారీగా ప్రచారం చేసుకుంది. అయితే దీనిని కాంగ్రెస్ తిప్పికొడుతూ వస్తోంది. మ‌ళ్ళీ ఇప్పుడు..మ‌హారాష్ట్రతో ఒప్పందం చేసుకునేందుకు మంగళవారం కేసీఆర్‌ ముంబై వెళ్తుండడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. కేసీఆర్ తెలంగాణ ప్రాజెక్టుల‌ను మ‌హారాష్ట్రకు తాక‌ట్టుపెట్టార‌ని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. 
నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు 
ప్రభుత్వం తీరుకు నిర‌స‌న‌గా..మంగ‌ళ‌వారం రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న‌లకు దిగనుంది కాంగ్రెస్. అన్ని కలెక్టరేట్ల ముందు మ‌హా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నల్లజెండాలతో నిర‌స‌నల‌కు పిలుపునిచ్చింది. పీసీసీ చీఫ్‌ ఉత్తం కుమార్ రెడ్డితో పాటు ముఖ్యనేతలందరూ రంగారెడ్డి క‌లెక్టరేట్‌ ముందు న‌ల్ల జెండాలతో ధర్నాకు దిగనున్నారు. అయితే ఇదే అంశంపై మంత్రి జోగురామన్న స్పందిస్తూ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మహా ఒప్పందంపై ప్రతిపక్షాలు పనిగట్టుకొని విమర్శిస్తున్నాయని మంత్రి అన్నారు. మొత్తానికి ప్రాజెక్టుల‌పై కాంగ్రెస్‌ తీరును కేసీఆర్‌ టార్గెట్ చేస్తుంటే..స‌రిగ్గా దాన్నే రివ‌ర్స్‌లో కాంగ్రెస్ టీఆర్ఎస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటుంది. మ‌రి ఈఫైట్ ఎటు ట‌ర్న్ తీసుకుంటుందో చూడాలి.

 

07:56 - August 23, 2016

హైదరాబాద్ : మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. దీంతో దశాబ్దాల తరబడి అంతర్రాష్ట్ర వివాదాల్లో నలుగుతున్న గోదావరి, పెన్ గంగ, ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. పరస్పర సహకారమే లక్ష్యంగా మహారాష్ట్రతో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకోనుంది. మంగళవారం హైదరాబాద్‌ నుంచి ముంబైకి సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. సాయంత్రం 3 గంటలకు ముంబైలోని సహ్యాద్రి అతిథి గృహంలో జరిగే బోర్డు సమావేశంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. సీఎంతో పాటు మంత్రి హరీష్‌రావు, జోగురామన్న, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, సీఎస్‌ రాజీవ్‌శర్మ, సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.  
ప్రాజెక్టుల వివాదాలపై కేసీఆర్‌ దృష్టి 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టులు, వాటి వివాదాలపై సీఎం కేసీఆర్‌ దృష్టిసారించారు. ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ బ్యారేజీ, ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బ్యారేజీ, నిజామాబాద్ జిల్లాలో నత్తనడక నడుస్తున్న లెండి ప్రాజెక్టులపై కేసీఆర్ జులై 2014లో ముంబై వెళ్ళి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలు జరిపారు. ఆ తర్వాత నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు ముంబై, నాగపూర్ వెళ్ళి ఆ రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి గిరీశ్ మహాజన్‌తో పలుమార్లు చర్చించారు. 
రెండు రాష్ట్రాల మధ్య ఫలించిన సంప్రదింపులు 
ఆ తర్వాత ఇరురాష్ట్రాల మధ్య జరిపిన సంప్రదింపులు ఎట్టకేలకు ఫలించాయి. ఈ ఏడాది జనవరి 12న ముంబైలో రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంతర రాష్ట్రాల ప్రాజెక్టుల సమస్యల పరిష్కారం కోసం, వాటి అమలు కోసం ఉమ్మడి అంతర రాష్ట్ర బోర్డ్ ఏర్పాటుకు ఇరురాష్ట్రాలు అంగీకరించాయి. చర్చల ఫలితంగానే..ప్రస్తుతం చనాక-కొరాటా బ్యారేజీ పనులు ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంతో ఒక్క చనాక-కొరాట బ్యారేజీయే కాదు..ఆదిలాబాద్ జిల్లాలో 40 ఏళ్లుగా పెన్ గంగ నీటి కోసం ఎదురుచూస్తున్న ప్రజల చిరకాల వాంఛా నెరవేరనుంది. అలాగే ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉండిపొయిన తుమ్మిడిహట్టి, ప్రాణహిత, లెండి, మేడిగడ్డ బ్యారేజి సమస్యలన్నీ ఈ ఒప్పందం ద్వారా పరిష్కారం కానున్నాయి.  
ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు 
మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చేసుకోనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంబురాలకు సిద్ధమైంది. ముంబై నుంచి బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో భారీ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 

నేడు ముంబై వెళ్లనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : నేడు సీఎం కేసీఆర్ ముంబై వెళ్లనున్నారు.  ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం ముంబై వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అంతర్ రాష్ట్ర బోర్డు సమావేశంలో సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పాల్గొననున్నారు. 

నేడు గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో టీ.ప్రభుత్వం ఒప్పందం

హైదరాబాద్ : నేడు ముంబైలో గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. 

 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తులకు3 గంటల సమయం పడుతుంది. 

కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై 17కు పైగా అభ్యంతరాల స్వీకరణ

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై ఆన్ లైన్ లో ఇప్పటి వరకు 17కు పైగా అభ్యంతరాలను స్వీకరించారు. యాదాద్రి జిల్లాపై అధికంగా 32 అభ్యంతరాలు, హన్మకొండ జిల్లాపై 28, పెద్దపల్లి జిల్లాపై 18 ఫిర్యాదులు, వరంగల్ జిల్లాపైచ 12 అభ్యంతరాలు స్వీకరించారు. 

 

Don't Miss