Activities calendar

24 August 2016

22:11 - August 24, 2016
22:04 - August 24, 2016

ఢిల్లీ: అద్దె గర్భం (సరోగసీ) ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విధానాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా మార్గదర్శకాలను రూపొందించింది. ప్రధాని అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ.. సహజీవనం చేసేవారు, స్వలింగ సంపర్కులు, జీవిత భాగస్వామి లేని, పెళ్లి కానివారు, విదేశీయులు, ప్రవాస భారతీయులకు అద్దెగర్భం ద్వారా సంతానం పొందే అవకాశం లేదని స్పష్టంచేశారు. అంతేకాకుండా ఇప్పటికే సంతానం ఉన్న వారికీ అద్దె గర్భం ద్వారా సంతానం పొందే హక్కు లేదన్నారు. అద్దె గర్భం ద్వారా జన్మించిన సంతానంపై తల్లిదండ్రులకు చట్టబద్ధమైన అధికారం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

22:01 - August 24, 2016

ఢిల్లీ : మహాత్మా గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమని రాహుల్ గాంధీ ఎప్పుడూ అనలేదని ఆయన తరఫు న్యాయవాది, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్ సిబాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పై ఎప్పుడూ ఆరోపణలు చేయలేదని, ఆర్ఎస్ఎస్ కు చెందిన కార్యకర్తలపై మాత్రమే ఆరోపణలు చేశారని కోర్టుకు చెప్పారు. దీనికి సంబంధించిన అఫిడవిట్‌ను కపిల్‌ సిబాల్‌ సుప్రీంకోర్టుకు సమర్పించారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. 2014లో మహారాష్ట్రలో జరిగిన ఓ సభలో మహాత్మాగాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌ పరువునష్టం దావా వేసింది.

21:45 - August 24, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ముసాయిదాపై పలు ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు. తమ ప్రాంతాన్ని జిల్లాగా మార్చాలని కొన్నిచోట్ల.. తమను ఇంకో జిల్లాలో కలపొద్దని మరోచోట ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. కొత్త రెవిన్యూ డివిజన్లు, మండలాల విషయంలో వస్తున్న వ్యతిరేకతలకైతే అంతేలేకుండా ఉంది.

కొత్త జిల్లాల ఏర్పాటు ముసాయిదా విడుదలతో నిరసన సెగలు
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాపై.. పలు ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా, రెవిన్యూ డివిజన్‌, మండల స్థాయుల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తమను మరో ప్రాంతంలో కలపొద్దంటూ కొన్నిచోట్ల.. తమకు జిల్లా స్థాయి, మండల స్థాయి ఎందుకు కల్పించరంటూ మరికొన్ని చోట్ల ఆందోళనలు రేగుతున్నాయి.

కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఆందోళన
కరీంనగర్ జిల్లాలో కొరుట్లను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలంటూ స్ధానికులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే జిల్లాల ఏర్పాటు ముసాయిదాను విడుదల చేయడంతో ఈ ఆందోళనలు ఉధృతం చేశారు. బుధవారం కోరుట్ల బంద్‌ పాటిస్తున్న ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. మరోవైపు సిరిసిల్ల ప్రాంతాన్ని జిల్లా చేయాలంటూ ఆందోళనలకు దిగారు అక్కడి ప్రాంతవాసులు. హుస్నాబాద్ ప్రాంతాన్ని సిద్దిపేటలో కలపడానికి అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

జనగామను జిల్లాగా చేయాలని నిరాహారదీక్షలు
జనగామ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో సభ్యులు నిరాహార దీక్ష చేస్తున్నారు. వీరి ఆందోళన రోజురోజుకు ఉధృతం కావడంతో పోలీసులు రంగలోకి దిగి వారి దీక్షను భగ్నం చేసారు. ఏరకంగా రెచ్చగొట్టినా తమ పోరాటం ఆగదని జిల్లా ఏర్పాటు వరకు కొనసాగుతుందని ఆప్రాంత వాసులు అంటున్నారు. మరోవైపు చారిత్రక నేపథ్యమున్న వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలుగా విభజించడం ఏమాత్రం సమర్థనీయం కాదంటూ ఆ ప్రాంత వాసులు మండిపడుతున్నారు.

నారాయణఖేడ్ మండలం విభజనపై స్థానికుల మండిపాటు
మరోవైపు కేసీఆర్ సొంత జిల్లా మెదక్ జిల్లాలో ప్రస్తుతం నారాయణఖేడ్ మండలంలో కొనసాగుతున్న సంజీవన్ రావు పేటను కల్హేర్ మండలంలోకి మార్చడాన్ని ఆ గ్రామస్తులు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆందోనలకు దిగుతున్నారు.

పాలమూరు జిల్లాలో రెవిన్యూ డివిజన్‌ మార్పుపై రగడ
వెనుకబడిన పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గాన్ని రెవిన్యూ డివిజన్ గా చేయాలంటూ.. ఆప్రాంత ప్రజలు గత మాడు రోజులుగా ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు. అఖిలపక్షం ఆధర్యంలో ఆ ప్రాంతవాసులు రెవిన్యూ డివిజన్ కొరుతూ నిరాహారదీక్షలకు దిగారు. ఇలా రోజురోజుకు వివిధ ప్రాంతాల ప్రజలు తమ డిమాండ్లతో నిరసనలకు దిగుతున్నారు. ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం తలొగ్గుతుందా..? లేక ఇప్పటికే నిర్దేశించుకున్న విధంగా ముందుకు వెళుతుందా...? వేచి చూడాలి. 

21:41 - August 24, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులు, కార్మికులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో ఏర్పాటుచేసిన అభినందసభలో సీఎం పాల్గొన్నారు. కృష్ణా పుష్కరాలకు స్పెషలాఫీసర్‌గా నియమితులైన రాజశేఖర్ అన్ని శాఖలను సమన్వయ పరుస్తూ చేసిన కృషి అందరికీ స్ఫూర్తిగా నిలిచిందన్నారు చంద్రబాబు.

పుష్కరాల్లో సేవలందించిన అధికారులకు సత్కరించిన చంద్రబాబు
కృష్ణా పుష్కరాల్లో యాత్రికులకు సేవలందించిన అన్ని శాఖల ప్రభుత్వాధికారులు, ఉద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా సత్కరించారు. వారికి మెమోంటోలను, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించారు.

సంస్కృతిని కాపాడుకోవాలి : చంద్రబాబు
పుష్కరాల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు సీఎం చంద్రబాబు. పారిశుధ్య సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకూ కృష్ణా పుష్కరాలను విజయవంతం చేశారని అన్నారు. పుష్కరాల్లో టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల శ్రమ తగ్గిందని, యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పించగల్గిమని అన్నారు. పుష్కరాలను స్ఫూర్తిగా తీసుకొని అధికారులు మరింత సమర్థవంతంగా పని చేయాలి సీఎం కోరారు.

పోలీసు, ఆర్టీసీ సేవలను కొనియాడిన డీజీపీ నండూరి సాంబశివరావు
పోలీసు, ఆర్టీసీ సేవలను డీజీపీ నండూరి సాంబశివరావు కొనియాడారు. హోంగార్డు నుంచి మొత్తం 34వేల మంది పోలీసులు పుష్కర విధుల్లో పాల్గొన్నట్లు డీజీపీ తెలిపారు. ప్రభుత్వం, ప్రజల్లో సంతృప్తి వ్యక్తమయ్యేలా పోలీసు వ్యవస్థ పనిచేసిందన్నారు. సాంకేతిక వినియోగంలో సీఎం చేసిన దిశానిర్దేశం చాలా పనిచేసిందన్నారు. ముఖ్యమంత్రి అభినందనలు తమపై మరింత బాధ్యతను మరింత పెంచాయన్నారు.

సమష్టి కృషితోనే కృష్ణా పుష్కరాలు విజయవంతం : అశోక్‌బాబు
సమష్టి కృషితోనే కృష్ణా పుష్కరాలు విజయవంతంగా ముగిశాయని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ పనిగానే భావించి కష్టపడ్డారన్నారు. మొత్తంగా కృష్ణా పుష్కరాలు విజయవంతం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు.

 

21:36 - August 24, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రజల హక్కులను మహారాష్ట్ర సర్కార్ వద్ద కేసీఆర్ తాకట్టు పెట్టారని టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీపై ఆరోపణలను మానుకోవాలని టీడీపీలో మంత్రులుగా పనిచేసిన సన్నాసులే ఇప్పుడు టీఆర్‌ఎస్‌ మంత్రివర్గంలో పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. బేతాళ మాత్రికుడికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని రేవంత్ రెడ్డి అరోపించారు. ప్రాజెక్టులలో అవినీతి జరిగిదంటే కేసులు పెడతానంటున్న కేసీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నాని రేవంత్ రెడ్డి అన్నారు. రీడిజైనింగ్ పేరుతో తెలంగాణలో జరిగే ప్రాజెక్టులలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందంటూ ఆరోపించారు.

21:32 - August 24, 2016

హైదరాబాద్  : సీఎం కేసీఆర్‌ బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరని టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తమ్మిడిహట్టి 152 మీటర్ల ఎత్తుపై మహారాష్ట్రతో చేసుకున్న ఆనాటి కాంగ్రెస్‌ ఒప్పంద పత్రాలు తన దగ్గర ఉన్నాయన్నారు. వాటిని గురువారం సీఎం కేసీఆర్‌కు పంపిస్తామన్నారు. అప్పుడు సీఎం ఎలాంటి శిక్ష వేసినా దానికి సిద్ధమేనని ఉత్తమ్‌ ప్రతిసవాల్ చేశారు. తమ్మిడిహట్టిపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంజినీర్ల బృందం మహాతో చేసుకున్న ఒప్పందం వివరాలను ఉత్తమ్ మీడియా ముందు చూపించారు. ఆనాటి ఇంజినీర్లు చేసిన సంతకాలు కూడా సాక్షాలుగా ఉన్నాయన్నారు. 

21:30 - August 24, 2016

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. తమ్మిడిహట్టి 152 మీటర్ల ఎత్తు ఒప్పంద పత్రాన్ని కాంగ్రెస్ నేతలు చూపిస్తే..ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం తాను మహారాష్ట్రాతో ఒప్పందం చేసుకుంటే..కాంగ్రెస్‌ నేతలు నల్లజెండాలతో నిరసనలు తెలియచేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్న సీఎం కేసీఆర్‌కు బేగంపేటలో ఘనస్వాగతం లభించింది.

సీఎం కేసీఆర్‌కు హైద‌రాబాద్‌లో ఘనస్వాగతం
తెలంగాణ బీడు భూముల్లో గోదావ‌రిని పారించేందుకు మ‌హారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్న సీఎం కేసీఆర్‌కు హైద‌రాబాద్‌లో ఘనస్వాగతం లభించింది. సాయంత్రం 5గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేసీఆర్‌కు..మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్యకర్తలు, పది జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు ఘనస్వాగతం పలికారు.

మహారాష్ట్రతో చేసుకున్న నీటి ఒప్పందం చారిత్రక ఒప్పందం:కేసీఆర్
అనంతరం కేసీఆర్‌ ప్రత్యేక వాహనం పెకెక్కి ప్రసంగించారు. మహారాష్ట్రతో చేసుకున్న నీటి ఒప్పందం చారిత్రక ఒప్పందం అని.. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామమని కేసీఆర్‌ అన్నారు.

తట్టెడు మట్టి తవ్వని సన్నాసులు కాంగ్రెస్ నాయకులు : కేసీఆర్
కాంగ్రెస్ హయాంలో తమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి తవ్వకున్నా..కాంగ్రెస్ సన్నాసులకు మాత్రం నల్ల జెండాలు కనపడుతున్నాయని సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. తమ్మిడిహట్టి 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందనేది నిజమైతే..ఆ ఒప్పంద పత్రాన్ని చూపించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. ఉత్తమ్ చెప్పిందే నిజమైతే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేసీఆర్‌ సవాల్ విసిరారు.

కాంగ్రెస్‌, టిడిపిలపై ధ్వజమెత్తిన కేసీఆర్
తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్‌, టిడిపిలని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తుంటే...ప్రాజెక్టుల్లో అంతా అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోందని సీఎం అన్నారు. ప్రాజెక్టుల్లో జరిగే అవినీతిని నిరూపించకపోతే..కాంగ్రెస్, టిడిపి నేతలపై కేసులు పెడతామని కేసీఆర్‌ హెచ్చరించారు.

కోటి ఎకరాలకు నీరందిస్తాం : కేసీఆర్
ఆరునూరైనా తెలంగాణలోని ప్రాజెక్టులను పూర్తిచేసి కోటి ఎకరాలకు నీరందిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై కాంగ్రెస్‌, టిడిపి చేస్తున్న అసత్య ప్రచారాలను త్వరలోనే టీవీ చానల్‌ ద్వారా ప్రజలకు తెలియచేస్తానన్నారు. దాంతో పాటు త్వరలోనే తెలంగాణ జిల్లాల్లో బస్సు యాత్ర చేపడుతానని కేసీఆర్ తెలిపారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రసంగం తర్వాత..సీఎం కేసీఆర్‌ ప్రత్యేక బస్సులోనే బేగంపేట నుంచి క్యాంప్‌ ఆఫీసుకు చేరుకున్నారు. బేగంపేట నుంచి క్యాంప్‌ ఆఫీసు వరకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. దారిపొడవునా..స్థానికులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ ఘనస్వాగతం పలికారు. సీఎం రాక సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

21:21 - August 24, 2016

హైదరాబాద్ : ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పై టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు అనుచరులు తనపై దౌర్జన్యం చేశారని చెప్పారు. 10కోట్ల ఆర్ధిక లావాదేవీల విషయంలో మంత్రి జోక్యం చేసుకోని తనను ఇబ్బంది పెట్టినట్లు నట్టికుమార్ వెల్లడించారు. నయిం -జగ్గిరెడ్డి ల మధ్య సంబంధాలు కొనసాగాయని విశాఖలోని క్వాంటీన్ల వ్యవహరంలో వీరు జోక్యం చేసుకున్నారని తెలిపారు. తన 10 కోట్ల లావాదేవీల విషయంలో సీబీఐ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

21:10 - August 24, 2016
20:39 - August 24, 2016

సింధుకి కోట్ల నజరానాలు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు.. అనేకం ప్రకటించేశాయి.. రెండు రాష్ట్రాలు.. ఓ విజేతను గౌరవించుకున్నాం.. సంతోషం. నో కంప్లెయింట్స్. కానీ, ఇదే ఉత్సాహం అలాంటి విజేతలను తయారు చేయటంలో ఎందుకు పెట్టడం లేదు.. కనీస ప్రోత్సాహం కోసం ఆశగా చూస్తున్న ఎందరో క్రీడాకారులను, ఇతర ఆటలను ఎందుకు పట్టించుకోవటం లేదు. ఒకరు పతకం తేగానే సన్మానించి, చెక్కులిచ్చేస్తే క్రీడారంగాన్ని ప్రోత్సహించినట్టేనా? రెండు రాష్ట్రాల నూతన క్రీడా విధానం ఈ పరిస్థితిని మార్చబోతోందా? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ. ప్రోత్సాహం లేదు.. ఆటలకు సరైన వసతులు లేవు.. ప్రాక్టీస్ కు కావలసిన ఎక్విప్ మెంట్, గ్రౌండ్ లు ఉండవు.. ఇళ్లలో ప్రోత్సామమూ కరువు.. రాజకీయ జోక్యాలు, ఆశ్రిత పక్షపాతాలు.. ఇన్ని సమస్యల మధ్య క్రీడా రంగం పడకేసింది. ఇప్పుడు టీ సర్కారు కొత్తగా ప్రకటిస్తానంటున్న నూతన క్రీడా విధానం ఈ అరిష్టాలన్నింటిని అధిగమించాల్సి ఉంది. అది ఎంతవరకు సాధ్యం? 130 కోట్లమంది.. రెండు పతకాలు..జంబో టీమ్ వెళ్లింది.. కొండను తవ్వి ఎలుకను పట్టింది. ఎక్కడుందీ లోపం? ఏ వ్యవస్థని నిందించాలి? క్రీడల్లో మనం ఎందుకు వెనుకబడుతున్నాం.. ? ఎందుకీ దుస్థితి? వంద కోట్ల జనాభాకు ఇద్దరు విజేతలు.. ఎందుకీ పతక దారిద్ర్యం.. వందకోట్లకు పైబడ్డ జనాభా.. స్వతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటింది. కానీ, క్రీడారంగంలో మాత్రం ఇంకా బాలారిష్టాల్లోనే కొట్టుమిట్టాడుతుందనటానికి ఒలింపిక్స్ ఫలితాలను మించిన నిదర్శనం మరొకటి ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, క్రీడా సంఘాల రాజకీయాలు, మధ్యతరగతి తల్లిదండ్రుల సగటు మనస్తత్వమే మన పతక దారిద్య్రానికి కారణాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరికీ ఛాంపియన్లు కావాలి.. గోల్డ్ మెడల్స్ కావాలి. కానీ, దానికి చేయాల్సిన పనులు మాత్రం చేయరు.. దేశంలో క్రీడారంగ అభివృద్ధి కోసం ఏమాత్రం పాటుపడని ప్రభుత్వాలు మన క్రీడారంగ పతనానికి కారణమని చెప్పాలి. చైనాని చూస్తే ఆటలకోసం ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకురావాలో అర్ధమవుతుంది. కలలుకనటమే కాదు.. అవి పోటీలో గెలుపుగా మారి, పతకమై మెరవాలంటే ఏం చేయాలో బోధపడుతుంది.. ఏ రంగమైనా ప్రభుత్వాలు, సమాజం కలసికట్టుగా పాటుపడితేనే మార్పు సాధ్యం. మరి తెలంగాణా నూతన క్రీడా విధానం ఈ బాటలో సాగుతుందా? వేచి చూద్దాం.. 

20:31 - August 24, 2016

వానకోసం సంగీత కచేరీ..మల్లన్న ముచ్చట్లకు పద్మమోహన అవార్డు ..కొత్త జిల్లాల ఏర్పాట్లుతో నేతల సంబురాలు..సమరాలు..గద్వాల జిల్లాకోసం బస్సును తగలబెట్టిన జనాలు..సింధూ తెచ్చింది పథకం..తెలుగు సీఎంల ప్యాకేజీలు..పథకాలు కాకున్నా పైకం కర్చుపోట్టాలె.. వానకోసం సంగీత కచేరీ..పీనుగుల మీద సిన్మా తీస్తానమంటున్న వర్మయ్య.. మల్లన్న ముచ్చట్లకు పద్మమోహన అవార్డు ..గిసువంటి మస్తు ముచ్చట్లను మన మల్లన్న గీదినంగూడ తీసుకొచ్చిండు..మరి జాగెందుకు గీ వీడియో చూడుండ్రి..మస్తు ఖుషీ అవుండ్రి..

19:59 - August 24, 2016

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ అంశంపై కేంద్రప్రభుత్వానికి లేఖ కూడా రాయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మేలు జరగాలంటే జోనల్ వ్యవస్థ కొనసాగించాలా? పునర్వవస్థీకరించాలా? లేక పూర్తిగా రద్దు చేయాలా?అ అంశంపై టెన్ టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో జి.వెంకట్ రెడ్డి (టీ.జాక్ కో ప్రతినిధి), పి.సరోత్తంరెడ్డి (పీఆర్ టీయూ టీఎస్), చావారవి( టీఎస్ యూడీఎఫ్ ప్రధాన కార్యదర్శి) పాల్గొన్నారు. ఈ అంశంపై చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...మరింత సమాచారం తెలుసుకోండి.. 

రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టి సంబరాలా? ఉత్తమ్

హైదరాబాద్ : మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం పూర్తిగా దగా అని ఆయన అన్నారు. మహా ఒప్పందంలో కుట్రల్ని రేపు బయటపెడతామని ఉత్తమ్ అన్నారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు భయపడేది లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. విషయాన్ని కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులపై ఎలాంటి చర్చలకైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. టెండర్ల ప్రక్రియలో అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. విపక్షాన్ని లేకుండా చేస్తామని చెప్పడం, కేసీఆర్ నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. తెలంగాణ భవిష్యత్ ను తాకట్టుపెట్టి సంబరాలు చేసుకుంటారా? అని ఉత్తమ్ ప్రశ్నించారు.

35మంది అంతర్‌ రాష్ట్ర దొంగలు అరెస్టు..

విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో చోరీలకు పాల్పడిన 35మంది అంతర్‌రాష్ట్ర దొంగలను ఏపీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.5.25లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

చంద్రబాబును పొగిడిన కేవీపీ..

ఢిల్లీ : రాష్ట్రానికి ప్రత్యేకహోదా ద్వారా వచ్చే లాభాల కంటే ప్యాకేజీ వల్ల వచ్చే లాభాల గురించి బాబుకే బాగా తెలుసని అన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థం కావటంలేదన్నారు. చంద్రబాబు చేవగలవాడు, తెలివిగల వాడు, ధైర్యవంతుడు అని ఆయన చెప్పారు. బాబు గతంలో రాష్ట్రపతి, ప్రధానులను కేంద్రంలో నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అటువంటి బాబు ఇలా మారాడో తనకు అర్థం కావడం లేదన్నారు.చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పాకులాడడం లేదని స్పష్టంగా తెలుస్తుందని ఆయన తెలిపారు.

మహారాష్ట్ర ఒప్పంద కుట్రను బహిర్గతం చేస్తాం : రేవంత్

హైదారబాద్ : మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసుకున్న ఒప్పందం మహా దగా ఒప్పందమని టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను మహారాష్ట్ర ప్రభుత్వం వద్ద తాకట్టుపెట్టారని ఆరోపించారు. తమ్మిడిహట్టి ఎత్తు తగ్గింపుతో 50 వేల కోట్ల రూపాయల అదనపు భారం రాష్ట్రంపై పడుతుందని ఆయన పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రాజెక్టు నిర్మాణాలను ఎందుకు ఆపేశారో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో చేవెళ్లను తొలగించి, కాళేశ్వరంను ఎందుకు కలిపారో స్పష్టత ఇవ్వాలని ఆయన అడిగారు.

19:07 - August 24, 2016

హైదరాబాద్ : గత ఒప్పందాలను గత చర్చలను కాదని సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో తిరిగి కొత్త ఒప్పందాలను చేసుకుని తెలంగాణలో నీటి సమస్యలను తీరుస్తానని కేసీఆర్ ప్రజలను నమ్మించే యత్నం చేస్తున్నారని టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తుమ్మిడి హట్టిని 152 మీటర్ల నుండి 148 మీటర్లకు తగ్గిస్తూ రీ డిజైనింగ్‌ చేయటంతో తెలంగాణ ప్రజలపై 50 వేల కోట్ల ఆర్థికభారం పడుతుందని చెప్పారు. గతంలో ఇప్పటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రతిపక్షంలో వున్నప్పుడు 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడి హట్టిని నిర్మిస్తే మహారాష్ట్రకు 18 వందల ఎకరాల భూమి ముంపుకు గురవుతుందని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తిన విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈరోజు ఫడ్నవీస్ పంతాన్ని నెగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కును మహారాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టిందని విమర్శించారు. మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందం పత్రాన్ని ఈ సందర్భంగా ఆయన మీడియాకు చూపారు. 

17:55 - August 24, 2016
17:40 - August 24, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. వివిధ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్ కారణమని దుయ్యబట్టారు. 'మహా' ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం బేగంపేట విమానాశ్రయానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఈసందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడారు. మహారాష్ట్ర సర్కార్ తో చారిత్రాత్మక ఒప్పందం చేసుకుని తిరిగి వస్తున్న సందర్భంగా..ఈరోజు గుండెల నిండా చాలా సంతృప్తిగా ఉందన్నారు. ఒకప్పుడు గుక్కెడు నీటికోసం తెలంగాణ బిడ్డలు అల్లాడిపోయారని, ఒక్కో అడుగు ముందుకు వేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఈ ఒప్పందం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిపోతుందన్నారు. ఎంతో సమర్థవంతంగా..సమన్వయంతో గత సంత్సరంన్నర కాలంగా చర్చలు జరిపి ఎట్టకేలకూ మహారాష్ట్ర సర్కార్ తో ఒప్పందం కుదిరిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోతుంటే.. గుండెలు తరుక్కుపోతున్నాయని చెప్పుకొచ్చారు. గతంలో బొట్టు నీటి చుక్క కోసం ఎంతో తపన పడ్డామని, జనాల్లో ఇంత సంతోషం చూస్తుంటే.. కాంగ్రెసోళ్లకు మాత్రం నల్ల జెండాలు కనపడుతున్నాయని విమర్శించారు. తమ్మిడి హట్టి విషయంలో టి.కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ అవాకులు చెవాకులు పేలుతున్నారని, ఇంకా గంట సేపు బేగంపేటలో తాను ఉంటానని, దమ్ముంటే బేగంపేట ఎయిర్ రావాలని ఉత్తమ్ కు సవాల్ విసిరారు. ఉత్తమ్ చెప్పింది నిజమైతే ఇటు నుంచే రాజ్‌భవన్‌కు పోయి తాను రాజీనామాను సమర్పిస్తానని, అనంతరం రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు. 
కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం...
తెలంగాణ పంటలు ఎండిపోవటానికి కాంగ్రెస్ పాలకులు నిర్వాకమేనని విమర్శించారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉంటే కాంగ్రెస్ సన్నాసులకు నల్లజెండాలు కనిపిస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పౌరుషమంటే కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. 2018కల్లా కరవు జిల్లాలలో రెండు పంటలు పడించి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గోదావరి మిగులు జలాలలో తెలంగాణ వాటా విషయాన్ని తేల్చాలని ప్రధానికి తాను లేఖ రాయడం జరుగుతుందని అనంతరం ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఎంపీల బృందం ప్రధానిని కలుస్తుందన్నారు. ఎవరు ఎన్ని అవంతరాలు సృష్టించినా తెలంగాణ రాష్ట్రాన్ని నీటితో సుభిక్షం చేస్తానని, కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తానని మరోసారి స్పష్టం చేశారు. త్వరలో బస్ యాత్ర ద్వారా ప్రజలను కలుస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అంతకంటే ముందు కేసీఆర్‌ బేగంపేట్‌కు చేరుకోగానే మంత్రులు హరీశ్‌రావు, తలసాని, ఇతర మంత్రులు స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్‌ నేతలు.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కేసీఆర్ కు స్వాగతం పలికారు. 

కోటి ఎకరాలకు నీళ్లు తెస్తా - కాంగ్రెస్..

హైదరాబాద్ : కోటి ఎకరాలకు తాను నీరందిస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మహా ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం బేగంపేట విమానాశ్రయానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఈసందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడారు. గోదావరి మిగులు జలాల వాటాపై హరీష్ నేతృత్వంలో ఎంపీల బృందం ప్రధానిని కలుస్తుందని తెలిపారు. 

కాంగ్రెస్ పై కేసీఆర్ నిప్పులు..

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ నిప్పులు కక్కారు. వివిధ ప్రాజెక్టులపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహా ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం బేగంపేట విమానాశ్రయానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఈసందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడారు. తమ్మిడిహట్టి విషయంలో కాంగ్రెస్ అవాకులు చెవాకులు పేలుతున్నారని, 610 జీవోలో కూడా అన్యాయం చేశారని విమర్శించారు. కాళేశ్వరం నీళ్లు తెచ్చి ఉత్తర తెలంగాణ రైతుల కాళ్లు కడుగుతామన్నారు.

అందరూ సంతోషంగానే ఉన్నరు - కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహా ఒప్పందం కుదిరిన అనంతరం నగరానికి చేరకున్న సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. గత సంవత్సన్నర కాలంగా కష్టాలు పడి మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకుందని, అందరూ సంతోషంగానే ఉన్నారని తెలిపారు. కానీ కాంగ్రెస్ సన్నాసులకు మాత్రం నల్లజెండాలు కనబడుతున్నాయని విమర్శించారు. తమ్మిడి హట్టి ఒప్పందం జరిగిందని పలు ఆరోపణలు గుప్పించారని విమర్శించారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఉంటా...దమ్ముంటే ఆ ఒప్పందం పత్రం తీసుకరావాలని సవాల్ విసిరారు.

ప్రసంగిస్తున్న కేసీఆర్..

హైదరాబాద్ : మహారాష్ట్ర నుండి హైదరాబాద్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భగా ఏర్పాటు చేసిన విజయోత్సవ యాత్రలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. 

పడవ ప్రమాదంలో 9 మంది గల్లంతు..

బీహార్ : పున్‌పున్‌ నదిలో జరిగిన పడవ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు. బుధవారం బిహార్‌లోని ఔరంగాబాద్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వోబ్రా నియోజకవర్గంలోని కాలెన్‌ గ్రామానికి చెందిన 18 మంది సమీపంలోని ఖుండ్వా మార్కెట్‌ నుంచి పడవపై ఇళ్లకు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రక్షణ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. తొమ్మిది మందిని కాపాడారు. గల్లంతయినవారిలో ఓ యువతి మృతదేహం లభ్యమయ్యింది. మరో ఎనిమిది ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

16:49 - August 24, 2016

బీహార్ : తూర్పు ఈశాన్య భారతంలో భూ ప్రకంపనలు సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.8గా నమోదైంది. పాట్నా, కోల్ కతా, గౌహతి, రాంచి మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ లలో భూప్రకంపనలు సంభవించాయి. మయన్మార్ భూకంప కేంద్రంగా గుర్తించారు. పశ్చిమబెంగాల్, జార్ఖండ్ లలో కూడా భూమి కంపించినట్లుగా సమాచారం. దీంతో ప్రజలు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. 

హైదరాబాద్ కు సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నగరానికి చేరకురన్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో రెండు వేల మంది కళాకారులతో కేసీఆర్ కు టీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలుకుతున్నారు. కాసేపట్లో బేగంపేటలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. 

ఉత్తర భారతాన్ని తాకిన భారీ భూకంపం..

బీహార్ : కోల్‌కతా, రాంచీ సరిహద్దుల్లోని మయన్మార్‌లో బుధవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.8గా నమోదైంది. గువాహటిలో కూడా ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

భూకంప ఘటనలో 21కి చేరిన మృతుల సంఖ్య..

ఇటలీ : ఇటలీలో బుధవారం ఉదయం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంపం ధాటికి ఇప్పటి వరకు 21 మంది మృతిచెందారు. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల్లో ఎక్కువ మంది పెస్కారా డెల్‌ ట్రోంటో ప్రాంతానికి చెందినవారుగా అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. 

చిన్నారితో కలిసి తల్లి ఆత్మహత్య..

నిజామాబాద్ : తాడ్వాయి (మం) కరడుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఏడాది కూతురితో సహా ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటంబ కలహాలే కారణమని తెలుస్తోంది. 

సరోగసీ ముసాయిదా బిల్లుకు కేంద్రం ఆమోదం..

ఢిల్లీ: అద్దె గర్భం (సరోగసీ) ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విధానాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా మార్గదర్శకాలను రూపొందించింది. ప్రధాని అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ.. సహజీవనం చేసేవారు, స్వలింగ సంపర్కులు, జీవిత భాగస్వామి లేని, పెళ్లి కానివారు, విదేశీయులు, ప్రవాస భారతీయులకు అద్దెగర్భం ద్వారా సంతానం పొందే అవకాశం లేదని స్పష్టంచేశారు. అంతేకాకుండా ఇప్పటికే సంతానం ఉన్న వారికీ అద్దె గర్భం ద్వారా సంతానం పొందే హక్కు లేదన్నారు.

16:21 - August 24, 2016

ఇంత కాలానికి గోవా బ్యూటీ 'ఇలియానా' నిరీక్షణ ఫలించింది. ఇల్లిబేబి సక్సెస్ ఆక్సిజన్ అయితే దక్కింది కానీ ఇప్పుడైనా ఈ బ్యూటీ కెరీర్ ఊపందుకుంటుందా అనేదే బిలియన్ మార్క్ క్వశ్చన్ గా ఉంది. ఇంతకీ ఫలించిన ఇలియనా నిరీక్షణ ఏంటో తెలుసుకోవాలంటే చదవాల్సిందే. బాలీవుడ్ మీద మోజు టాలీవుడ్ ని వదిలేసిన 'ఇలియానా' రెండింటి చెడింది. బాలీవుడ్ లో సక్సెస్ లు లేక తెలుగులో మళ్లీ నటిస్తాను మోర్రో అంటూ వేడుకున్న ఇక్కడ ఛాన్స్ లు లేవు. ఇలా మూడేళ్లుగా నానా తంటాలు పడుతోంది. అంతేకాదు ఇక ఈ బ్యూటీ సినిమాలు మానేసి బాయ్ ప్రెండ్ ఆండ్రూని పెళ్లి చేసుకుంటుందని కూడా కామెంట్స్ వినిపించాయి. కానీ ఆమె ఆశలకు అక్షయ్ కుమార్ ఆక్సీజన్ అందించాడు.

రుస్తుం హిట్...
'అక్షయ్ కుమార్', 'ఇలియానా' జంటగా నటించిన 'రుస్తుం' రీసెంట్ గా రిలీజైంది. ఈ చిత్రం మంచి హిట్టు కావడంతో 'ఇలియానా' బాలీవుడ్ ఆశలకు ఆక్సిజన్ అందించినట్లైంది. బర్ఫీ మూవీతో బాలీవుడ్ లో ఎంటర్ అయిన ఇలియానాకి ఆ మూవీ తరువాత మరో పడలేదు. దీంతో బాలీవుడ్ లో ఈ బ్యూటీ కెరీర్ కి దాదాపుగా ది ఎండ్ కార్డ్ పడిందని కామెంట్స్ వినిపించాయి. 1959లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన రుస్తుం మూవీలో ఇలియానా, అక్షయ్ కుమార్ భార్యగా ఇంపార్టెంట్ రోల్ చేసింది. రీసెంట్ గా ఈ మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరి హిట్ గా నిలిచింది. దీంతో ఇల్లీ బేబీ ఎగిరిగంతులేస్తోంది. ఈ మూవీ సక్సెస్ తో మరిన్ని ఛాన్స్ లు వచ్చిపడుతాయని ఇలియానా నమ్ముతోంది. మరి గోవా బ్యూటీ నమ్మకాన్ని 'రుస్తుం' అయిన తీరుస్తోందో చూడాలి.

గాంధీని హత్య చేసింది ఆరెస్సెస్ కాదు : రాహుల్

ఢిల్లీ: మ‌హాత్మాగాంధీ హ‌త్య వెనుక ఆరెస్సెస్ ప్ర‌మేయం ఉంద‌ని తాను అన‌లేద‌ని, ఆ సంస్థ‌తో సంబంధం ఉన్న కొంద‌రు వ్య‌క్తులే ఉన్న‌ట్లు చెప్పాన‌ని రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆయ‌న‌పై ఆరెస్సెస్ వేసిన ప‌రువున‌ష్టం కేసులో రాహుల్‌గాంధీ బుధ‌వారం అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. పిటిష‌న‌ర్ మ‌రింత స‌మ‌యం కోర‌డంతో సెప్టెంబ‌ర్ 1కి విచార‌ణ వాయిదా వేస్తున్న‌ట్లు కోర్టు వ్యాఖ్యానించింది. త‌న‌పై దాఖ‌లైన‌ ప‌రువున‌ష్టం కేసును కొట్టేయడానికి బాంబే హైకోర్టు నిరాక‌రించడాన్ని స‌వాలు చేస్తూ గ‌తేడాది మేలో రాహుల్ సుప్రీంను ఆశ్ర‌యించారు.

16:12 - August 24, 2016

ఎనర్జిటిక్ హీరో 'రామ్' కెరీర్ ను మలుపుతిప్పిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'కందిరీగ'. ఈ సినిమాతో సంతోష్ శ్రీనివాస్ అనే టాలెంటెడ్ డైరెక్టర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్టవడంతో, ఇప్పుడు 'రామ్' మళ్లీ ఇదే దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో 'రామ్' కెరీర్ లోనే చెప్పుకోదగ్గ సినిమా 'కందిరీగ'. ఇలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ చేయడం 'రామ్' కి అదే ఫస్ట్ టైమ్. ఇంట్రెస్టింగ్ స్ర్కీన్ ప్లేతో, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ తో 'కందిరీగ' టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్టైపోయింది. ఈ సినిమా తీసుకొచ్చిన క్రేజ్ తో సంతోష్ శ్రీనివాస్ కు యన్టీఆర్ తో 'రభస' ఛాన్సొచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అయినా సరే అతడి మీద కాన్ఫిడెన్స్ తో సంతోష్ కి మరో ఛాన్సిచ్చాడు 'రామ్'. సినిమా పేరు 'హైపర్'. ఈ సినిమా తో 'రామ్' మరోసారి మాస్ అవతారంలో అలరించబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ లోకానీ, అక్టోబర్ లో కాని రిలీజ్ కు రెడీ అవుతోంది. 'నేను శైలజ'తో ఈ సంవత్సరం హిట్టుతో బోణి కొట్టిన 'రామ్', ఇప్పుడు హిట్టు కాంబో రిపీట్ చేయడం ద్వారా తన కెరీర్ ను సరైన ట్రాక్ లోకి తేవాలని ప్రయత్నిస్తున్నాడు. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

16:03 - August 24, 2016

మెగా తనయుడు 'రామ్ చరణ్' మెగా ఎక్స్ ప్రెస్ టైటిల్ తో కొత్త మూవీకి సిద్దమవుతున్నాడు. 'ధృవ' సినిమా షూటింగ్ తో బిజీ ఉన్న చెర్రీ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఇచ్చిన దర్శకుడితో 'మెగా ఎక్స్ ప్రెస్' అనే సినిమా చేయబోతున్నట్లు టాక్. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ సినిమా దర్శకుడెవరో 'మెగా ఎక్స్ ప్రెస్' విశేషాలు మీ కోసం...ఫ్లాప్ దర్శకులను కొత్త దర్శకులను ప్రొత్సాహించడంలో మెగా తనయుడు ముందుంటున్నాడు. ఒక్క మూవీ ఎక్స్ పిరియన్స్ ఉన్న సంపత్ నందితో 'రచ్చ' మూవీ చేశాడు. ఇక ఫాంలో లేని కృష్ణవంశీతో 'గోవిందుడు అందరివాడేలే' చేశాడు. ఇప్పుడు 'కిక్ '2తో డిజాస్టర్ చవిచూసిన సురేందర్ రెడ్డితో 'ధృవ' చేస్తుండగా, రెండు సినిమాల అనుభవం ఉన్న ఓ దర్శకుడితో చెర్రీ మూవీ చేయడానికి ఫిక్స్ అయినట్లు సమాచారం. 'ధృవ' సినిమా షూటింగ్ తో పాటు తండ్రి చిరంజీవి 150వ సినిమాతో చెర్రీ యమ బిజీగా ఉన్నాడు. అయినా కొత్త సినిమాలకు సంబంధించిన విషయాల్లో స్పీడ్ గానే ఉన్నాడు. 'ధృవ' కంప్లీట్ కాగానే 'సుకుమార్' డైరెక్షన్ లో కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలా ప్లాన్ చేస్తున్న మెగా తనయుడు ఆ సినిమాతో పాటు మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో మరో మూవీకి సన్నాహాలు చేస్తున్నాడట.

మేర్లపాక గాంధీ...
ఈ సంక్రాంతికి 'ఎక్స్ ప్రెస్ రాజా'తో దర్శకుడు మేర్లపాక గాంధీ మరో హిట్టు అందుకున్నాడు. ఈ దర్శకుడు ఇటీవల చరణ్ కి ఓ స్టోరీ చెప్పాడట. కథ నచ్చడంతో చరణ్ మూవీ చేసేందుకు ఓకే చెప్పాడట. లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రానికి 'మెగా ఎక్స్ ప్రెస్' అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు టాక్. తనకున్న ఎక్స్ ప్రెస్ సెంటిమెంట్ తో ఫ్యాన్స్ కి ఈజీగా కనెక్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే దర్శకుడు ఈ టైటిల్ ని సూచించినట్లు టాక్. 'బ్రూస్ లీ' మూవీలో 'చరణ్' మెగా మీటర్ అంటూ డాన్స్ ఇరగదీసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో..తదితర వివరాలు కొద్ది రోజుల్లో తెలువనున్నాయి. 

15:55 - August 24, 2016

తూర్పుగోదావరి : ఆ ఊరు యువత వేసిన ఒక్క అడుగు.. ఆ ఊరి చరిత్రను తిరగరాసింది. ఆ యువ కిశోరాల పిలుపు ఎందరి హృదయాలనో కదిలించివేసింది. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అన్న ఎదురుచూపులు మాని..గ్రామ అభివృద్ధి కోసం చేతులు కలిపేలా చేసింది. ఊరి బాగోగు కోసం పిలుపు ఇవ్వడమే ఆలస్యం....మేము సైతం అంటున్నారు అక్కడి స్థానికులు..ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. వాచ్ దిస్‌ స్టోరీ..

పెద్దాపురానికి పెద్దమనసేంటో చాటేందుకు ముందుకు కదిలలిన యువత..
సమస్య ఏదైనా.. కష్టం ఎలాంటిదైనా..సాయం ఎంత పెద్దదైనా...ఏ శ్రీమంతుడో తమ ఊరికి వస్తాడని ఎదురుచూడటం లేదు. దేవుడే దిక్కని గాలిలో దీపం పెట్టడటం లేదు. మన ఊరిని మనమే మార్చుకుందామన్న సామాజిక మీడియాలో ఇచ్చిన ఒక్క పిలుపుతో ఊరుఊరంతా కదిలిన గ్రామమే పెద్దాపురం..తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం గ్రామానికి గతంలో ఉన్న మకిలిని పోగొట్టి..పెద్దాపురానికి ఉన్న పెద్దమనసేంటో చాటేందుకు ముందుకు కదిలారు.

పెద్దాపురం గ్రూప్‌ పిలుపునకు ఏకంగా 2 వేల మంది గ్రామస్తులు సంతకాలు
పెద్దాపురం యువత తీసుకుంటున్న నిర్ణయాలు ఆ ఊరి గ్రామస్వరాజ్వానికి బాటలు వేశాయి. ఫేస్‌బుక్‌లో మన పెద్దాపురం గ్రూపులో 10 వేల మంది స్థానికులు ఉన్నారంటే..యువకుల చైతన్య స్ఫూర్తి ఏ పాటిదో అర్థమవుతోంది. అవయవ దానం కోసం మన పెద్దాపురం గ్రూప్‌ పిలుపునకు ఏకంగా 2 వేల మంది గ్రామస్తులు సంతకాలు చేశారు.

గ్రూప్‌ సేవా కార్యక్రమాలకు స్థానికుల నుంచి విశేష స్పందన
మన పెద్దాపురం గ్రూప్‌ సేవా కార్యక్రమాలకు స్థానికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రక్తదానం, గ్రీనరి తదితర కార్యక్రమాలకు ఊరు ఊరంతా యువత వెంటే అంటూ ముందుకు కదులుతున్నారు. కష్టాల్లో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.

పెద్దాపురం గ్రూప్‌ సేవాతత్పరతపై తూర్పు గోదావరి జిల్లాలో ప్రశంసలు
పెద్దాపురం గొప్పతనం, చారిత్రక విశేషాలు ప్రపంచానికి చాటిచెప్పేందుకే ఫేస్‌బుక్‌లో మన పెద్దాపురం గ్రూప్‌ తెరిచామంటున్నారు స్థానిక యువకులు. మన పెద్దాపురం గ్రూప్‌ సేవాతత్పరతపై తూర్పు గోదావరి జిల్లాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దాపురం యువకుల సేవా స్ఫూర్తిని ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

టి.సచివాలయంలో ఉద్యోగుల ఆందోళన..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఎస్సీ డెవలప్ మెంట్ కార్యదర్శి ఎక్కా పర్సనల్ కార్యదర్శి శ్రీనివాసరావు వేధిస్తున్నాడని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కొన్ని రోజులుగా శ్రీనివాసరావు తోటి ఉద్యోగులకు ఫైల్స్ పంపకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 

15:45 - August 24, 2016

కశ్మీర్ : రెండు రోజుల పర్యటన కోసం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ జమ్మూకశ్మీర్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కశ్మీర్‌లో సాధారణ స్థితి నెలకొల్పేందుకు సహకరించే వారందరితోనూ చర్చలు జరిపేందుకు స్వాగతిస్తామని రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు. పలు రాజకీయ పార్టీలు, పౌర సంస్థల ప్రతినిధులతో హోంమంత్రి చర్చలు జరపనున్నారు. రాజ్‌నాథ్‌ పర్యటన నేపథ్యంలో వేర్పాటువాదులు రెండు రోజుల కశ్మీర్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. తాజాగా పుల్వామాలో జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందారు, 40 మంది గాయపడ్డారు.

15:44 - August 24, 2016

ఢిల్లీ : మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం భార్య నళినీకి ఈడీ సమన్లు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని శారదా చిట్‌ ఫండ్‌ స్కాంకు సంబంధించి మనీ లాండరింగ్‌ కింద నళినీ చిదంబరంను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ జరపనుంది. సెప్టెంబర్‌ మొదటి వారంలో కోల్‌కతాలో విచారణ అధికారుల ముందు హాజరు కావాలని నళినీని ఈడీ ఆదేశించింది. శారదా కంపెనీ నుంచి ఆమె అకౌంట్లోకి చేరిన కోటి 26 లక్షల ఫండ్‌ గురించి ఈడీ విచారణ జరపనుంది. ఈ కేసులో నళిని చిదంబరాన్ని ఇదివరకే ఈడీ, సిబిఐ విచారణ జరిపింది. మళ్లీ ఈడీ తాజాగా కొత్త సమన్లు జారీ చేసింది.

మిషన్ భగీరథ పనులను అడ్డుకున్న మావోలు..

ఖమ్మం : చర్ల మండలం పూసగుప్పలో మిషన్ భగీరథ పనులను మావోయిస్టులు అడ్డుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

15:30 - August 24, 2016

హైదరాబాద్ : నగరంలో అదృశ్యమైన నలుగురు విద్యార్థులు గోవాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థుల వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ ఆధారంగా పిల్లలు గోవా రాజధాని పనాజీకి చేరుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.ఎల్బీనగర్‌లోని శివగంగానగర్‌ కాలనీకి చెందిన 14ఏళ్ల సాయినాధరెడ్డి, ఉప్పల్‌కు చెందిన 13ఏళ్ల లిఖిత్‌కుమార్‌, 14ఏళ్ల సాయికృష్ణ, విజయ్‌కుమార్‌ కేంద్రీయ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్నారు. నిన్న సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత యూనీఫాం మార్చుకుని బయటికి వెళ్లి కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అయితే ఇవాళ కేంద్రీయ విద్యాలయానికి వెళ్లిన తల్లిదండ్రులు అక్కడి విద్యార్థులను విచారించగా..అగస్టు 14 నుంచి గోవా, బెంగళూరు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. పాఠశాల నుంచి బయటికి వెళ్లిన తర్వాత ఎరుపు రంగు మారుతి వ్యానులో ఘట్‌కేసర్‌ వైపు వెళ్లినట్లు వారి తల్లిదండ్రులకు తోటి విద్యార్థులు తెలిపారు. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు విద్యార్థుల ఆచూకీ కనుగొన్నారు. వీరిలో విజయ్‌కుమార్‌ అనే విద్యార్థి ఇంట్లో నుంచి 4వేల నగదు, బంగారు నగలు తీసుకెళ్లినట్లు గుర్తించారు. 

టీ.సర్కార్ పిటీషన్ కు నో చెప్పిన సుప్రీం..

ఢిల్లీ: ఏపీ ఉన్నత విద్యామండలికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉన్నతవిద్యామండలి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఉమ్మడి ఆస్తులను జనాభా నిష్పత్తిలో పంచుకోవాలని జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రా ఆదేశించింది. తీర్పును పున:సమీక్షించాలని ఏపీ ప్రభుత్వంపై అలాగే ఏపీ ఉన్నతవిద్యామండలిపై వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై దాఖలైన పిటిషన్‌ను గతంలోనే సుప్రీం కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

ఖైరతాబాద్ గణేశుడే ముందు..

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనాన్ని ఈసారి ముందుగానే నిర్వహిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో వినాయకచవితి, బక్రీద్ పండగలపై ఈరోజు సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం చేయాలని నిర్ణయించామన్నారు. దక్షిణ మండల పరిధిలో 15 అడుగుల విగ్రహాలను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, మెట్రో రైలు, పోలీసులు ఒక సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

విరగిపడిన కొండచరియలు..సిఆర్‌పిఎఫ్ జవాన్ మృతి..

శ్రీనగర్: వైష్ణోదేవి ఆలయం బయట కొండచెరియలు విరిగిపడిన ఘటనలో ఒక సిఆర్‌పిఎఫ్ జవాన్ చనిపోయారు. వైష్ణోదేవి భవన్ గేట్ నెంబర్ మూడు వద్ద యాత్రికులు తలదాచుకునే షెడ్‌పై కొండచెరియలు విరిగిపడ్డాయి. అక్కడే ఉన్న సిఆర్‌పిఎఫ్ జవాన్ చనిపోయారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని సమాచారం. దీంతో అర్థకుమారి వైపు నుంచి వెళ్లేవారికి దర్శనాన్ని నిలిపివేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

15:04 - August 24, 2016

హైదరాబాద్‌ : తెలంగాణ సచివాలయం డి బ్లాక్‌లో ఉద్యోగులు బుధవారం ఆందోళనకు దిగారు. విద్యాశాఖలో అధికారిగా పనిచేస్తున్న  శ్రీనివాసరావు తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పెద్ద ఎత్తున డి బ్లాక్‌లో నిరసనకు దిగారు. గత కొంత కాలంగా మహిళలకు, మిగతా ఉద్యోగులకు కానీ సెలవులు ఇవ్వకుండా తమపై పెత్తనం చేస్తున్నారని, సెలవులు అడిగినప్పుడు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఉద్యోగులు తెలిపారు. దీనిపై గతంలో సీఎస్‌ రాజీవ్‌శర్మవద్దకు పిర్యాదు చేశామని, అయినా తమకు న్యాయం జరగడంలేదని సుమారు రెండు గంటలపాటు అన్ని బ్లాకులకు తిరుగుతూ ఆందోళన చేశారు. ఇదివరకు ఆర్థిక శాఖలో ఉన్న అధికారి వేధిస్తే...ఆందోళన చేసి విజయం సాధించామని, ఇప్పుడు శ్రీనివాసరావును కూడా తొలగించేవరకు తాము ఆందోళన కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు.

అదృశ్యం అయిన విద్యార్ధుల ఆచూకీ లభ్యం..

హైదరాబాద్ : భాగ్యనగరంలోని కేంద్రీయ విద్యాలయంలో అదృశ్యం అయిన విద్యార్థుల అచూకీ లభ్యమయ్యింది. తొమ్మిదవ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు అదృశ్యం కావటం కలకలం రేపింది. అదృశ్యం అయిన విద్యార్థులు సాయినాథ్ రెడ్డి, లికిత్ కుమార్, సాయికుమార్, విజయ్ కుమార్ లుగా గుర్తించారు. కాగా విద్యార్ధులంతా మారుతికారులో గోవా వెళ్లినట్లుగా సాయినాథ్ రెడ్డి తండ్రి పోలీసులకు తెలిపారు. విద్యార్థుల వద్ద వున్న మొబైల్ ఆధారంగా వారి ఆచూకీని కనిపెట్టినట్లు సమాచారం. విజయ్ కుమార్ ఇంటినుండి నాలుగు వేల నగదు..నలుగు తీసుకెళ్ళినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. 

కాసేపట్లో బేగంపేట చేరుకోనున్న కేసీఆర్..

హైదరాబాద్ : కాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మ.3గంటల నుండి సా.6 గంటల వరకూ బేగంపేట పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో వుంటాయి. 

పుల్వామాలో అల్లర్లు.. ఒకరి మృతి..

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. పుల్వామాలో అల్లర్లకు పాల్పడుతున్న వారిని భద్రతా బలగాలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

14:34 - August 24, 2016

కస్తూర్బా పాఠశాలలో 30 మంది విద్యార్థినులు అస్వస్థత..

ఆదిలాబాద్ : తలమడుగు మండలం సాయిలింగిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. విద్యార్థినులకు పాఠశాలలో ప్రాథమిక చికిత్స అందించి రిమ్స్‌కు తరలించారు. విద్యార్థినులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

 

14:02 - August 24, 2016

హైదరాబాద్‌ : నగరంలో గణేష్ నిమజ్జనానికి తెలంగాణసర్కార్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా 10 చోట్ల ప్రత్యేక బేబిపాండ్స్‌ను నిర్మిస్తోంది జీహెచ్ఎంసీ. ఈ బేబిపాండ్లలో 8 ఫీట్ల వరకు ఉన్న గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేసి రద్దీని తగ్గించేందుకు ప్లాన్ చేస్తోంది. భక్తులు నేరుగా విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:59 - August 24, 2016

పిల్లల కస్టడీ అనే అంశంపై మానవి నిర్వహించిన మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. పిల్లల కస్టడికి సంబంధించిన పలు విషయాలు వివరించారు. పలు సలహాలు, సూచనలు చేశారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:54 - August 24, 2016

హైదరాబాద్ : సౌత్ ఇండియాలో మొట్టమొదటి సారి నాంపల్లి కోర్టులో చిల్డ్రన్ కోర్టు ఏర్పాటుచేయడం అభినందనీయమని డీజీపీ అనురాగ్ శర్మ కొనియాడారు. చిల్డ్రన్ ఫ్రైండ్లీ కోర్టును ఉమ్మడి హైకోర్టు తాత్కలిక చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్ ప్రారంభించారు . బాధిత పిల్లలు కోర్టు వాతవరణం చూసి భయపడకుండా.. ఆహ్లాదకరమైన వాతవరణంలో విచారణ జరిగేలా చిల్డ్రన్ కోర్టును ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కేవలం ఢిల్లీ, గోవాలో మాత్రమే ఇలాంటి కోర్టులు ఉన్నాయి. చైల్డ్ కోర్టును నిర్వహించేందుకు అందరూ సహాకరించాలని నాంపల్లి చీఫ్‌ మెట్రోపాలిటన్ కోర్టు ఛీప్ జస్టిస్‌ రజినీ కోరారు.

 

13:52 - August 24, 2016

గుంటూరు : జిల్లాలోని అమరావతి పంచాయితీ కార్యాలయం ఎదుట పుష్కర పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగారు... ఒప్పందంప్రకారం అధికారులు డబ్బులు చెల్లించడంలేదని ఆరోపించారు.... రోడ్లు శుభ్రపరిచినందుకు తమకు 400 రూపాయలు ఇస్తామని ముందు హామీ ఇచ్చారని కార్మికులు చెప్పారు.. ఇప్పుడు మూడు వందలే ఇస్తామని మాట మారుస్తున్నారని మండిపడ్డారు.. తమకు న్యాయం జరిగేవరకూ ఆందోళన కొనసాగిస్తామని అధికారుల్ని హెచ్చరించారు. 

13:50 - August 24, 2016

చెన్నై : పరువునష్టం కేసులో తమిళనాడు సీఎం జయలలితపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజాప్రతినిధులు విమర్శలు ఎదుర్కోవాలి కానీ.. ఇలా పరువునష్టం కేసులు వేయడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.. జయలలిత వేసిన కేసుల జాబితాను సమర్పించాలని గతంలో సుప్రీం కోరింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. 

13:47 - August 24, 2016

ఢిల్లీ : భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. గంగానది ఉప్పొంగడంతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. వారణాసిలో ఘాట్లు మునిగిపోవడంతో అంత్యక్రియలు భవన పైభాగంలో నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వరదల కారణంగా యూపి, బీహార్‌లో 30 మంది మృతి చెందారు. వరద బాధితులను రక్షించేందుకు కేంద్రం 10 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఈ రెండు రాష్ట్రాలకు పంపింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు 
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఇక్కడి గంగానది ఉదృతంగా ప్రవహిస్తోంది. వారణాసి వద్ద ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్‌లో దాదాపు లక్షమందికి పైగా ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.
నీటిలో మునిగిపోయిన అంత్యక్రియల ప్రత్యేక ఘాట్లు 
ఇక వారణాసిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఉన్న ప్రత్యేక ఘాట్లన్ని నీటిలో మునిగిపోయాయి. దీంతో చనిపోయినవారి మృతదేహాలను ఘాట్‌ల వద్ద ఉన్న కొన్ని భవన సముదాయాలపై భాగంలోకి తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని యుపి అధికారులు తెలిపారు. అలహాబాద్‌లో కూడా అంత్యక్రియలకు అంతరాయం ఏర్పడుతోంది.
నదులు పొంగిపొర్లుతుండడంతో వరదలు 
ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లలో భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతుండడంతో వరదలు సంభవించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 30 మంది మృతి చెందారు. యుపిలో 11 బీహార్‌లో అత్యధికంగా 19 మంది మృతి చెందారు. ఇప్పటివరకు అధికారులు లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 
ప్రధాని మోడీని కలిసిన బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌  
బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదిని కలిసారు. రాష్ట్రంలోని వరద పరిస్థితిని వివరించి సహాయం అందించాలని కోరారు. బీహార్‌లో పది లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని... 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.
రంగంలోకి మరో 10 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 
పలుచోట్ల వరద పరిస్థితి తీవ్రంగా ఉండడంతో బాధితులను రక్షించేందుకు కేంద్రం మరో 10 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపింది. ఒడిశా నుంచి 5 బృందాలను యూపీకి, పంజాబ్‌ నుంచి మరో 5 బృందాలను బిహార్‌కి తరలించినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. పడవల సహాయంతో బాధితులకు ఆహారం, వైద్య సేవలను అందిస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని చెప్పారు. బిహార్‌, యూపీలతో పాటు ఇతర వరద బాధిత ప్రాంతాలైన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలోనూ ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయ సహకారాలను అందిస్తోంది. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, రాజస్థాన్‌ల ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

 

13:45 - August 24, 2016
13:44 - August 24, 2016
13:43 - August 24, 2016

ఢిల్లీ : రియోలో ముగిసిన 2016 ఒలింపిక్స్ లో భారత్ వెలవెల బోయింది. పతకాల పట్టిక 67వ స్థానానికి పడిపోయి...బంగారు పతకాలు సాధించిన ఫిజీ, జమైకా లాంటి బుల్లిదేశాల ముందు చిన్నబోయింది.129 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్..కేవలం రెండు పతకాలు మాత్రమే సాధించడం..భారత క్రీడారంగ డొల్లతనానికి నిదర్శనంగా నిలుస్తుంది.
అట్టహాసంగా ముగిసిన రియో ఒలింపిక్స్  
దక్షిణ అమెరికా గడ్డపై తొలిసారిగా జరిగిన రియో ఒలింపిక్స్ అట్టహాసంగా ముగిశాయి. అయితే ..హర్యానా రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య, తెలుగు రాష్ట్రాల షట్లర్ పీవీ సింధు రజత పతకాలు సాధించారని పొంగిపోవాలో....ఒలింపిక్స్ పతకాల పట్టిక 67వ స్థానానికి పడిపోయామని కృంగిపోవాలో తెలియని పరిస్థితిలో భారత క్రీడాసంఘాలు , అభిమానులు పడిపోయారు.
2012 ఒలింపిక్స్ లో ఆరు పతకాలు సాధించిన భారత్
లండన్ వేదికగా జరిగిన 2012 ఒలింపిక్స్ లో 83మంది సభ్యుల బృందంతో పాల్గొని రెండు రజత, నాలుగు కాంస్యాలతో సహా మొత్తం ఆరు పతకాలు సాధించిన భారత్..పతకాల పట్టిక 55వ స్థానంలో నిలిచింది.
రియో ఒలింపిక్స్ లో భారత్ కు రెండు పతకాలు 
అయితే...రియో ఒలింపిక్స్ లో మాత్రం..గతంలో ఎన్నడూలేనంతగా 118 సభ్యుల భారీబృందంతో..అట్టహాసంగా పాల్గొన్న భారత్..రెండంటే రెండు పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చింది. పతకాల పట్టిక 67వ స్థానంలో నిలిచింది.
అగ్రస్థానంలో అమెరికా 
46 స్వర్ణాలతో సహా మొత్తం 121 పతకాలతో అమెరికా అగ్రస్థానంలో నిలిస్తే...గ్రేట్ బ్రిటన్,చైనా, రష్యా, జర్మనీ పతకాల పట్టిక మొదటి ఐదుస్థానాల్లో నిలిచాయి. చివరకు ఆతిథ్య బ్రెజిల్ సైతం 7 స్వర్ణాలతో సహా 19 పతకాలు సాధించి...13వ స్థానం సాధించింది.
భారత్ కంటే మెరుగైన స్థానంలో చిన్నదేశాలు 
చివరకు ..మనదేశంలో ఓ రాష్ట్రం, ఓ జిల్లా వైశాల్యం,జనాభా లేని జమైకా, క్రొయేషియా, క్యూబా, సెర్బియా, స్లవేకియా లాంటి దేశాలు మాత్రమే కాదు...ఆసియాలో అతిపేద దేశాలుగా ఉన్న ఇండోనీషియా, వియత్నాం సైతం స్వర్ణ పతకాలతో ..మనకంటే మెరుగైన స్థానంలో నిలిచాయి.
పతకాల పట్టిక లో 54వ స్థానంలోనూ ఫిజీ ..
కేవలం 8 లక్షల జనాభా మాత్రమే ఉన్న..పసిఫిక్ మహాసముద్ర ద్వీప దేశం ఫిజీ ..ఒకే ఒక్కబంగారు పతకంతో పతకాల పట్టిక 54వ స్థానంలోనూ, 27 లక్షల జనాభా మాత్రమే ఉన్న కరీబియన్ దేశం జమైకా ఆరు స్వర్ణపతకాలతో పతకాల పట్టిక 17వ స్థానంలో నిలవడం చూస్తే....భారత ప్రభుత్వం, క్రీడారంగ పెద్దలు ముక్కమీద వేలు వేసుకోవాల్సిందే. 129కోట్లు జనాభాలో .. అపార యువజనశక్తితో కూడిన భారత్ ...అంతర్జాతీయ క్రీడల్లో ఇంతదారుణంగా విఫలం కావడానికి కేంద్రరాష్ట్రప్రభుత్వాల విధానాలు, మనసమాజంలోని అమ్మానాన్నల మధ్యతరగతి మనస్తత్వం కూడా ప్రధాన కారణాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకటి రెండు పతకాలు తెచ్చినవారిని ఆకాశానికి ఎత్తేయడమేకాదు...అట్టడుగున ఉన్న ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను గుర్తించి..ఒలింపిక్ చాంపియన్లుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన సమాజం పైన, ప్రభుత్వాల పైనా ఎంతైనా ఉంది. పతకాల కరువు, దారిద్ర్యం తీరాలంటే.. క్రీడల్ని సైతం నిర్భందం పాఠ్యాంశంగా ప్రవేశపెట్టక తప్పదు కాక తప్పదు.

 

13:36 - August 24, 2016

ఢిల్లీ : రియోఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించిన సాక్షిమాలిక్‌కు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. రియో నుంచి ఢిల్లీకి చేరుకున్న సాక్షిమాలిక్‌కు హర్యానామంత్రులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ స్వగ్రామంలో సాక్షిని సన్మానించనున్నారు హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్. 2020 లో జరిగే ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ ను సాధించడమే లక్ష్యమని సాక్షిమాలిక్ తెలిపింది.

 

13:30 - August 24, 2016
13:29 - August 24, 2016

రోమ్ : ఇటలీలో భారీ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో ఏర్పడ్డ భారీ భూ ప్రకంపంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి దేశంలోని పలుచోట్లు భవనాలు కుప్పకూలాయి. భూకంపానికి ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు శిథిలాల నుంచి బయటికి తీసేందుకు చర్యలు చేపట్టాయి.  భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.2గా నమోదైంది. రీటి ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. రాజధాని రోమ్‌లోనూ 20 సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

 

13:13 - August 24, 2016

రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్లలో ప్రమాదం జరిగింది. విద్యార్థులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. చేవెళ్లలోని బస్టాప్ లో వికాస్ బీఈడీ కాలేజీకి చెందిన 15 విద్యార్థులు నిల్చున్నారు. మెహిదీపట్నంకు చెందిన రాహుల్, సయ్యద్‌ అనే ఇంజనీరింగ్ విద్యార్థులు అత్యంతవేగంగా కారు నడపడంతో కారు బస్టాప్ లోని విద్యార్థులపైకి దూసుకెళ్లింది. దీంతో అనిత అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. లక్ష్మీప్రసన్న అనే మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమ్తితం ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. సయ్యద్‌ కారు నడుపుతున్నాడు. రాహుల్, సయ్యద్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్ పై నిర్లక్ష్యపు డ్రైవింగ్ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. 

 

 

13:13 - August 24, 2016

మెగా స్టార్ చిరంజీవి...150వ సినిమాపైనే అందరి కళ్లున్నాయి. చిరంజీవి ఎంతో ప్రతిష్టాకంగా తీసుకుని నటిస్తున్నారు. వి.వి.వినాయక్ కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆగస్టు 22వ తేదీన చిరు జన్మదినం సందర్భంగా చిత్ర ఓ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందు ఈ చిత్రానికి 'ఖైదీ నెంబర్ 150' అని ప్రకటించారు. ఇదిలా ఉంటే రైతుల నేపథ్యంలో కథ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. రైతు సమస్యను ప్రధానంగా చేసుకొని వినాయక్ స్క్రిప్టు సిద్ధం చేసినట్లు, పంటలు పండక కునారిల్లుతున్న రైతాంగ పరిస్థితిని హైలైట్ చేస్తూ సినిమా సాగుతుందని ప్రచారం జరుగుతోంది. కథ అంతా రైతుల చుట్టూ తిరగడం..ఈ చిత్రంలో ఖైదీ పాత్రను చిరు పోషిస్తుండడంతో టాలీవుడ్ లో హైప్ అమాంతం పెరిగిపోయింది.
రైతుల గురించి చిరు చెప్పే ఈ డైలాగులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నాగలి పట్టడమే తెలుసు వీళ్లకు.. నరకడం తెలియదు.
వీళ్ల పొలాలకు నీరు ఇవ్వకపోతే నాగలి పట్టిన చేతులే… మీలాంటి కలుపు మొక్కలను ఏరి పారేస్తారు.
దుక్కి దున్నడం మాత్రమే తెలుసు వీళ్లకి… దుర్మార్గం చేయడం తెలియదు. అంటూ చిరు డైలాగ్స్ ఉంటాయని వార్తలు వస్తున్నాయి. మరి చిరు పాత్ర ఏంటీ ? కథ ఏంటీ అనేది తెలియాలంటే విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే. 

సాదిపూర్ హాస్టల్ లో విదార్థుల ఘర్షణ..

బీహార్ : పాట్నాలో సాదిపూర్ హాస్టల్ లో ఇద్దరు విద్యార్థుల గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

12:59 - August 24, 2016

టాలీవుడ్..కోలీవుడ్ లలో పలు హర్రర్ చిత్రాలు నిర్మితమౌతున్నాయి. ప్రధాన హీరోయిన్లు ఇలాంటి చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను భయపెట్టడానికి ముందుకొస్తున్నారు. ఇలాంటి పలు చిత్రాలుర రిలీజయ్యాయి కూడా. తాజాగా 'తమన్నా' కూడా భయపెట్టే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'అభినేత్రి', తమిళంలో 'డెవిల్‌', హిందీలో '2 ఇన్‌ 1'గా త్రిభాషా చిత్రంగా రూపొందుతోంది. హిందీలో ప్రముఖ క్యారెక్టర్ నటుడు, విలన్ సోనుసూద్ తన సొంత ప్రోడక్షన్ ద్వారా '2ఇన్1' చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత సోనుసూద్ ఒ ఫొటోని సామాజిక మీడియాలో విడుదల చేశారు. సోనూసూద్‌ పుషప్స్ చేస్తుండగా, ఆయనపై దర్జాగా కూర్చుని తమన్నా, ప్రభుదేవాలు సెల్‌ఫోన్‌లో సెల్ఫీలు చూసుకుంటున్న ఫొటోని నెజిజన్లు విపరీతంగా షేర్‌ చేసుకుంటున్నారు. ఎ.ఎల్‌.విజయ్ దర్శకత్వంలో 'తమన్నా', 'ప్రభుదేవా', 'సోనూసూద్‌' ప్రధాన పాత్రధారులుగా 'అభినేత్రి' చిత్రం రూపొందుతోంది. 

ఏపీలో పుష్కరాల సిబ్బందికి అభినందన సభ..

విజయవాడ : నగరంలో పుష్కరాల సిబ్బంది అభినందన సభ జరుగుతోంది. ఈ సభకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రెస్ వాడలేని టెక్నాలజీని తాము ఉపయోగించుకోవడం జరిగిందని, సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా భద్రతను సమీక్షించడం జరిగిందన్నారు. 

సెప్టెంబర్ 15వ తేదీన వినాయక నిమజ్జనం..

హైదరాబాద్ : నగరంలో సెప్టెంబర్ 15వ తేదీన వినాయక నిమజ్జనం నిర్వహించనున్నారు. 15వ తేదీ మధ్యాహ్నం 2గంటలకే ఖైరతాబాద్ గణేష్ ఊరేగింపు ప్రారంభం కావాలని, తొలుత ఖైరతాబాద్ గణేష్ ను నిమజ్జనం చేయాలని హై లెవల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 

కుటుంబ సంక్షేమ భవన్ ను ముట్టడించిన హెల్త్ అసిస్టెంట్లు..

హైదరాబాద్ : కోఠిలోని కుటుంబ సంక్షేమ భవన్ ను హెల్త్ అసిస్టెంట్లు ముట్టడించారు. తెలంగాణలోని నాలుగు వేల మందికి హెల్త్ అసిస్టెంట్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. 

పుష్కరాల్లో ప్రతొక్కరూ కష్టపడ్డారు - ఏపీ డీజీపీ..

విజయవాడ : హోంగార్డు నుండి ఉన్నతాధికారి వరకు కష్టపడ్డారని డీజీపీ సాంబశివరావు తెలిపారు. సీఎం ప్రోత్సాహంతో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయడం జరుగుతుందన్నారు. 

అన్ని విభాగాలు కలిసి పనిచేయాలి - సీపీ...

హైదరాబాద్ : వినాయక నిమజ్జన సమయంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. నగర శివారులో 35 చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 

తక్కువ ఎత్తులో వినాయక విగ్రహాలు - జీహెచ్ఎంసీ కమిషనర్..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ, పోలీసు, మెట్రో రైలు మధ్య సమన్వయం ఉండాలని, వీలైనంత తక్కువ ఎత్తులో విగ్రహాలు ఏర్పాటు చేయించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి రోజు పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని, అన్ని విభాగాలను సమన్వయపరుస్తూ ముందుకెళుతామన్నారు. 

12:24 - August 24, 2016

జయపై సుప్రీం ఆగ్రహం..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులు విమర్శలు ఎదుర్కొవాలే గాని ప్రతి విమర్శకు కేసులు వేయడం సరికాదని తెలిపింది. 

12:23 - August 24, 2016
12:21 - August 24, 2016

హైదరాబాద్‌ : రవీంద్రభారతిలో పద్మమోహన అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుఖీభవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ గురురాజు ప్రతిభాపురస్కారం అందుకున్నారు. 26 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో కృషి చేసినందుకు నిర్వాహకులు ఈ అవార్డును ప్రదానం చేశారు... తీన్మార్‌తో ఆకట్టుకున్న మల్లన్నకు బెస్ట్ ప్రెజెంటర్‌ అవార్డు దక్కింది.. ఆరేళ్లుగా వివిధ రంగాల నిపుణులకు ఈ పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు.

 

12:19 - August 24, 2016

తూర్పుగోదావరి : టూరిజం అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెప్తున్న మాటలు కోటలు దాటుతున్నాయి. బీచ్‌ల అభివృద్ధి పనులలో అవినీతి రాజ్యమేలుతున్నా..ప్రభుత్వం చోద్యం చూస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలే కాంట్రాక్ట్‌ పనుల్లో తలదూర్చుతూ సర్కారు సొమ్మును అప్పనంగా స్వాహా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బీచ్‌లో సాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది.  
అభివృద్ధి పనుల్లో అవినీతి
ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం అభివృద్ధి దారితప్పుతోంది. కాకినాడ బీచ్ అభివృద్ధి పనుల పేరుతో ప్రభుత్వం సుమారు 70 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. దీనికి తోడు టూరిజం సర్క్యూట్ అంటూ కేంద్రం కేటాయించిన నిధులతో మరో ప్రాజెక్టు కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో కాకినాడ వాకలపూడి సమీపంలోని ఎన్టీఆర్ బీచ్‌లో పలు అభివృద్ధి పనులు సాగుతున్నాయి. అయితే ఈ పనులన్నీ స్ధానిక ఎమ్మెల్యే అనుచరులే నిర్వహిస్తున్నారు. దీంతో అభివృద్ధి పనుల్లో అవినీతి రాజ్యమేలుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీచ్ అభివృద్ధి పనుల్లో అవినీతి రాజ్యమేలుతున్నా..ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   
బీచ్ అభివృద్ధి పనులలో నాణ్యత లోపం 
బీచ్ అభివృద్ధి పనులలో నాణ్యత లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మెటీరియల్‌తో పాటు అన్ని విషయాల్లోనూ ఇదే తంతు. అభివృద్ధి పనులలో కాంట్రాక్టర్లు అసలు ప్రమాణాలను పాటించటం లేదు. పనులను పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ సిబ్బంది నిద్రమత్తులో జోగుతున్నారు. వంతెన నిర్మిస్తున్న మెటీరియల్‌లో కూడా ఏమాత్రం క్వాలిటీ కనిపించడం లేదని సీపీఎం నేతలు విమర్శిస్తున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ పేరుతో నిర్మిస్తున్న బీచ్ అభివృద్ధి పనులు అత్యంత నాసిరకంగా సాగడం అందరినీ విస్మయపరుస్తోంది. స్ధానిక నేతలు సాగిస్తున్న వ్యవహారాలపై ఉన్నతాధికారులు చోద్యం చూడటం తగదని అంటున్నారు. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. 

 

12:11 - August 24, 2016

ఆదిలాబాద్‌ : అడవులు జిల్లాగా పేరు పొందిన ఆదిలాబాద్‌ అభయారణ్యాలు పులులకు ఆవాస కేంద్రాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతంలో వీటి సంఖ్య పెరిగినట్టు గుర్తించారు. ఇప్పటికే తొమ్మిది పులులు ఉన్నట్టు లెక్కలు తేల్చిన అటవీశాఖ అధికారులు.. వీటిని సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 
పెరుగుతున్న పులుల సంచారం 
మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా అడవులు, అభయారణ్యాలకు పెట్టింది పేరు. ఇప్పుడు ఈ అడవుల్లో పులుల సంచారం పెరుగుతోంది. కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతంలో వీటిని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. జిల్లాలోని సిర్పూర్‌ (టీ), బెజ్జూరు దట్టమైన అడవులున్నాయి. మహారాష్ట్రకు అతిసమీపంలో ఉండటంతో ఆ రాష్ట్ర అడవుల నుంచి మన  అభయారణ్యాల్లోకి పులుల వలస వస్తున్నట్టు గుర్తించారు. మహారాష్ట్ర అడవుల్లో పులులకు భద్రత లేకపోవడంతో సురక్షితమైన ఆదిలాబాద్‌ అభయారణ్యాలను ఆవాసంగా ఎంచుకుంటున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. 
కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ లో 9 పులులు 
కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ పరిధిలో తొమ్మిది పులులు ఉన్నట్టు గుర్తించారు.మహారాష్ట్రలోని తాడోభా టైగర్‌ రిజర్వులో అత్యధికంగా 70 నుంచి 85 వరకు పులులు ఉన్నాయి. వివిధ కారణలతో అడవులు నాశనం అవ్వడం, వేటగాళ్ల బెదడ తట్టుకోలేక తాడోభా టైగర్‌ రిజర్వు నుంచి ఆదిలాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌ (టీ), కాగజ్‌నగర్‌, బెజ్జూరు అడవుల్లోకి ఇవి  వలస వస్తున్నాయి. 2014లో చైత్ర, వైశాఖ అనే రెండు పులులు మహారాష్ట్ర నుంచి ఈ ప్రాంతానికి  వలస వచ్చాయి. 2015లో పాల్గుణ 1, పాల్గుణ 2 అనే మరో రెండు పులులు కూడా వలస రావడంతో వీటి సంఖ్య నాలుగుకు చేరింది. వీటికి మరో నాలుగు పిల్లలు పుట్టడంతో వీటి సంఖ్య ఎనిమిదికి చేరినట్టు గుర్తించారు. మరో పులి కూడా కాగజ్‌నగర్‌ అడవుల్లో సంచరిస్తున్నట్టు  అధికారులు చెబుతున్నారు. 
పులుల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు 
మహారాష్ట్రలోని తాడోభా టైగర్‌ రిజర్వు నుంచి ఆదిలాబాద్‌ అడవుల్లోకి వస్తున్న పులల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వీటి ఆహారానికి నిధులు కేటాయించడంతోపాటు, సంరక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించింది. ఈ ప్రాంతంలోని పెన్‌గంగ, ప్రాణహిత నదులతోపాటు పెద్దవాగుల్లోని  నీటిని తాగుతున్న పులులు... ఈ ప్రాంతాన్ని స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.  సిర్పూర్‌ అటవీ ప్రాంతంలోని గుహల్లో మరో రెండు చిన్న పులి పిల్లలు కూడా ఆవాసం ఏర్పరచుకున్నట్టు సీసీటీవీ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు. 
మహారాష్ట్ర పుంచి ఆదిలాబాద్‌ అడవుల్లోకి వచ్చిన జై వీరు పులి 
మహారాష్ట్రలోని తాడోభా టైగర్‌ రిజర్వులో దేశంలోనే అతిపెద్దదైన 9 అడుగుల పులిగా గుర్తింపు పొందిన జై వీరు  కూడా అక్కడ నుంచి ఆదిలాబాద్‌ అదవుల్లోకి వచ్చినట్టు అక్కడి ప్రభుత్వం అనుమానిస్తోంది. జై వీరుతోపాటు జై అనే మరో పులి కూడా ఆదిలాబాద్‌ అడవుల్లోనే ఉంటునట్టు  మహారాష్ట్ర భావిస్తోంది. జై పెద్దపులి ఆచాకీ తెలిపిన వారికి  50 వేల రూపాయల నజరానా ఇస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. తాడోభా టైగర్‌ రిజర్వు మాదిరిగానే కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతాన్ని టైగర్‌ జోన్‌గా ప్రకటిస్తే వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఆదిలాబాద్‌ జిల్లా పులుల సంరక్షణ విభాగం అధికారులు కోరుతున్నారు. 

 

12:10 - August 24, 2016

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా ఓ కథ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శక, నిర్మాత రాజ్ కుమారి హిరానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్రలో 'రణ్ బీర్ కపూర్' నటిస్తున్నారు. బాలీవుడ్ 'ఖల్‌నాయక్‌' గా ముద్రపడిన సంజూభాయ్‌ జీవితం నిండా వివాదాలే. హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు, డ్రగ్స్ కు బానిస కావడం, అండర్‌ వరల్డ్ మాఫియాతో సంబంధాలు, అక్రమ ఆయుధాలు, జైలు జీవితం..ఇలా వివాదాలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తండ్రి పాత్రలో బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించనున్నట్లు తెలుస్తోంది.
సంజయ్ దత్‌తో 'మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్‌', 'లగేరహో మున్నాభాయ్' వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను తెరకెక్కించిన రాజ్‌కుమార్‌ హిరానీ త్వరలోనే మరో చిత్రాన్ని సంజయ్ దత్‌తో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బాలీవుడ్ టాక్.

చేవెళ్లలో కారు బీభత్సం..

రంగారెడ్డి : చేవెళ్లలో కారు బీభత్సం సృష్టించింది. విద్యార్థులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. నిన్న సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనలో రాహుల్..డ్రైవర్ సయ్యద్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

12:01 - August 24, 2016

యాజిన్ నిసార్..మెలోడీ సాంగ్స్ పాడడంలో దిట్ట. ఇతను పాడిన సాంగ్స్ ప్రేక్షకాదరణను పొందాయి. 1990, ఫిబ్రవరి 9వ తేదీన జన్మించిన నిసార్ మలయాళం, తెలుగు, కన్నడ సినిమాల్లో పాటలు పాడారు. పలు ఆల్బమ్స్ కూడా రూపొందించారు.
శ్రీమంతుడు సినిమాలో 'చారుశీల'..'కుమారి 21ఎఫ్' సినిమా..'మేఘాలు లేకుండా' ఇలాంటి బోలెడన్నీ సినిమాల పాటలు విన్నారు కదా.. వినే సమయంలో మెలోడీగా ఉంది..వావ్ అంటూ ఫీలయ్యారు. కానీ ఈ పాటలు పాడింది యాజిన్ నిసార్. తొలిసారిగా తెలుగులో టెన్ టివికి ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఆయన ఎలాంటి పాటలు పాడారో..ఇతరత్రా వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

11:55 - August 24, 2016

విజయవాడ : ఎపి నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఎపి సర్కార్ తీపి కబురు అందించింది. వచ్చే నెలలో గ్రూప్స్ నోటిఫికేషన్‌కు సన్నాహాలు చేస్తున్నామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. 4009 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలచేస్తామని చెప్పారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ అనంతరం గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో గ్రూప్స్‌కు సంబంధించిన ఇయర్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. పాత సిలబర్ ప్రకారమే పరీక్షల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేశారు. 

 

11:50 - August 24, 2016

కృష్ణా : విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఓ మహిళ హత్యకు దారితీసింది. గన్నవరంలోని తెలప్రోలుకు చెందిన దీప్తి కుటుంబ కలహాలతో భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో నాగరాజు అనే వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తోంది. కొన్నిరోజులుగా వీరివురు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీప్తి మరో వ్యక్తితో చనువుగా ఉంటుందనే కోపంతో ఆమెను నాగరాజు మరో ఇద్దరిని సహాయంగా తీసుకుని దీప్తి మెడకు చున్నీతో ఉరివేసి హత్య చేసి మృతదేహాన్ని ఏలూరు కాలువలో పడేశాడు. బంధువుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాగరాజుతోపాటు అతనికి సహకరించిన శ్రీకాంత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

బీజేజీ ఎమ్మెల్యే అసెంబ్లీ నుండి సస్పెండ్..

హిమాచల్ ప్రదేశ్ : బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ రవిని అసెంబ్లీ సమావేశాల నుండి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ ఆస్తులను ధ్వంసం చేశారని మూడు రోజుల పాటు సస్పెన్షన్ చేశారు. 

11:44 - August 24, 2016

నిజామాబాద్ : జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా గెజిట్ విడుదలపై నిజామాబాద్‌ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో మండలాల సంఖ్య 36 నుంచి 45కు చేరింది. 26 మండలాలతో నిజామాబాద్ జిల్లా...19 మండలాలతో కామారెడ్డి జిల్లాలు దసరా నుంచి మనుగడలోకి రానున్నాయి. అభ్యంతరాలు, అభిప్రాయాలకు నెల రోజులు గడువు విధించడంతో..ఆ పనులు పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 
నిజామాబాద్‌ జిల్లాలో 2 జిల్లాలు, 45 మండలాలు
నిజామాబాద్ జిల్లాలో...జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదా గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయడంతో...కొత్త జిల్లాలు, కొత్త మండలాల అంశాలపై స్పష్టత వచ్చింది. తొమ్మిది కొత్త మండలాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ యోగితారాణా ప్రకటించారు. అభ్యంతరాలు, అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి నెల రోజుల గడువును విధించింది. జిల్లాను రెండు జిల్లాలుగా విభజిస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతమున్న 36 మండలాలకు అదనంగా తొమ్మిది మండలాలను ప్రకటించడంతో మండలాల సంఖ్య 45కు పెరిగింది. 26 మండలాలతో నిజామాబాద్ జిల్లా, 19 మండలాలతో కామారెడ్డి జిల్లాలు ఆవిర్భవించనున్నాయి. 
బాన్సువాడకు రెవెన్యూ డివిజన్ హోదా 
నిజామాబాద్ ఉత్తర, నిజామాబాద్ దక్షిణ, మోపాల్, ఇందల్వాయి, ఆలూరు, మెండోర, రుద్రూర్, రామారెడ్డి, రాజంపేట మండలాలు కొత్తగా ప్రతిపాదిస్తూ ముసాయిదాలో చేర్చారు. నిజామాబాద్‌లో రెవెన్యూ డివిజన్ల సంఖ్య పెరిగింది. గతంలో నిజామాబాద్, బోధన్, కామారెడ్డి రెవెన్యూ డివిజన్లు మాత్రమే ఉండగా... ఇటీవల ఆర్మూర్ కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడింది. తాజా ముసాయిదాలో బాన్సువాడను కూడా రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారు. దీంతో రెవెన్యూ డివిజన్ల సంఖ్య కాస్తా ఐదుకు పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, కామారెడ్డి జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లను చేర్చారు.
4 మండలాలుగా విడిపోయిన నిజామాబాద్ 
ఇక నిజామాబాద్ మండలం నాలుగు మండలాలుగా విడిపోయింది. నిజామాబాద్ నగరాన్ని నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ సౌత్ మండలాలుగా విభజించారు. రూరల్ పరిధిలో ఉన్న మోపాల్‌ను మండలకేంద్రంగా చేశారు. నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాలుగా విభజించారు. డిచ్‌పల్లి మండలంలో ఉన్న ఇందల్వాయిని, ఆర్మూర్ మండలం నుంచి ఆలూర్‌ను, బాల్కొండ మండలం పరిధిలోని మెండోరాను, వర్ని మండల పరిధిలోని రుద్రూర్, కామారెడ్డి నుంచి రాజంపేటను, సదాశివనగర్ మండలం నుంచి రామారెడ్డిని విడదీసి కొత్త మండలాలుగా ఏర్పాటు ప్రకటించారు. కొత్తగా తొమ్మిది మండలాలు జిల్లాలో ఏర్పడ్డాయి. దీంతో రెండు జిల్లాల్లోని మండలాల సంఖ్య 45కు పెరిగింది. జిల్లాకు ప్రత్యేక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వెలువరించింది. 1974 చట్టం ప్రకారం గెజిట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర రెవెన్యూశాఖ నుంచి విడుదల చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై నిజామాబాద్ జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. 

 

ఏపీలో గ్రూప్ నోటిఫికేషన్ కు సన్నాహాలు...

విశాఖపట్టణం : గ్రూప్ నోటిఫికేషన్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ లో 4009 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ అనంతరం గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 

లీడర్‌ షిప్ సిరీస్ ఆన్ మ్యానిఫాక్చరింగ్ రిపోర్టు ఆవిష్కరణ..

హైదరాబాద్ : ఐటీసీ కాకతీయలో సీఐఐ ఆధ్వర్యంలో లీడర్‌షిప్ సిరీస్ ఆన్ మ్యానిఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. లీడర్‌ షిప్ సిరీస్ ఆన్ మ్యానిఫాక్చరింగ్ రిపోర్టును ఆవిష్కరించారు. 

11:38 - August 24, 2016

హైదరాబాద్ : నయీం చరిత్ర ఆధారంగా మూడు సినిమాలు తీస్తానని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ప్రకటించారు. ఇప్పటికే  వాస్తవ సంఘటనలు ఆధారంగా రక్తచరిత్ర.. కిల్లర్‌ వీరప్పన్‌ సినిమాలను తెరకెక్కించిన ఆర్జీవీ తాజాగా నయీం చరిత్రనే కథగా ఎంచుకున్నారు. 
నయీం చరిత్రను తెరకెక్కించనున్న రామ్‌గోపాల్‌ వర్మ
క్రైమ్‌...హర్రర్‌.. సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ రామ్‌గోపాల్‌వర్మ. నిజ జీవిత ఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో ఆర్జీవీది అందవేసిన చేయి. అయితే ఈసారి ఆర్జీవీ గ్యాంగ్‌స్టర్‌ నయీం చరిత్రను తెరకెక్కించడానికి  ఉత్సాహం చూపిస్తున్నారు.
నేరగాళ్లే ఆయన హీరోలు
తొలి సినిమా శివ నుంచి..వీరప్పన్‌ మూవీ వరకూ రామ్‌గోపాల్‌వర్మది ప్రత్యేకమైన స్టైల్‌. చాలా సినిమాల్లో నేరగాళ్లే ఆయన హీరోలు. ఆయన ఎంచుకునే కథే ఓ సంచలనం. ఇప్పుడు కూడా  ఆయన అదేబాటలో వెళ్తున్నారు. తన కొత్త సినిమాకు నయీం చరిత్రనే కథాంశంగా ఎంచుకున్నారు. నేరాలకు...ఘోరాలకు పాల్పడిన గ్యాంగ్‌స్టర్ నయీం చరిత్రను తెరకెక్కించనున్నారు. 
గ్యాంగ్‌స్టర్‌ నయీం చరిత్రపై ఆర్జీవీ దృష్టి
సినిమాలు..సంచలనాత్మకమైన వ్యాఖ్యలతో మీడియాలో హల్‌చల్‌ చేసే ఆర్జీవీ దృష్టి ఈసారి గ్యాంగ్‌స్టర్‌ నయీంపై పడింది.  నయీం జీవితకథను తెరకెక్కిస్తానని ట్విట్టర్‌లో వెల్లడించారు. నయీం గురించి ఎన్నో కథనాలు చదివి తెలుసుకున్నానని.. అతను చేసిన కుట్రలు భయంకరమైనవని అభివర్ణించారు. నక్సలైట్‌ నుంచి పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా మారి తర్వాత అండర్‌వరల్డ్‌ గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీం భయంకరమైన క్రిమినల్‌ అని కూడా అన్నారు.
మూడు భాగాల్లో నయీం మూవీ
నయీం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు..పెద్ద సినిమానే తీయాలని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. అంతేకాదు రక్తచరిత్రను రెండు భాగాల్లో చూపించానని.. నయీం చరిత్రను మూడు భాగాల్లో తెరకెక్కిస్తానని కూడా ట్విట్టర్‌లో వెల్లడించారు. వీరప్పన్‌తో అందరినీ మెప్పించిన ఆర్జీవీ...నయీం కథతో ప్రేక్షకులను ఒప్పించగలడో.. లేదో వేచి చూడాలి.

 

గుంటూరులో భగ్గుమన్న పాతకక్షలు..

గుంటూరు : జిల్లాలో పాతకక్ష‌లు భగ్గుమన్నాయి. తెనాలి మండ‌లం నేల‌పాడు వ‌ద్ద ఓ వ్యక్తిని దుండగులు హత్య చేశారు. కోర్టుకు వెళుతున్న స‌మ‌యంలో ఈ దాడి జ‌రిగినట్లు, దాడికి ఆస్తి త‌గాదాలే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

11:28 - August 24, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీంకు కరీంనగర్‌ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డిల మధ్య సంబంధాలున్నాయా..? కలిసి దందాలు చేశారా..? అరాచకాలు చేసిన ఏఎస్‌ఐ నయీంతో లింకులు పెట్టుకున్నాడా..? ఎన్‌కౌంటర్‌ జరిగినప్పటి నుంచి ఏఎస్‌ఐ బాధితులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు..అదే సమయంలో మోహన్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడం బలాన్ని చేకూర్చింది... బాధితుడి ఆత్మహత్య కేసులో లొంగిపోయినట్లుగా చూపిస్తున్న మోహన్‌రెడ్డి నుంచి నయీంతో లింకులపై ఆరా తీస్తున్నారా..? అంతా గోప్యంగా సాగుతున్న విచారణలో ఏం తేలనుంది...?
బయటపడ్డ మోహన్‌రెడ్డి దందాలు  
ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి....కొన్నేళ్లుగా ఎంతో మంది అమాయకులను పీల్చిపిప్పి చేసిన మోహన్‌రెడ్డి దందాలు బయటపడ్డాయి... వడ్డీ వ్యాపారం పేరుతో చేసిన అరాచకాలు అంతా ఇంతా కావు..పోలీసు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని పోలీసు అధికారులను భాగస్వామ్యం చేసుకుని చేసిన అరాచకాలు బయటపడిన విషయం తెలిసిందే...అయితే ఈ మధ్యనే గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌ కావడంతో కరీంనగర్‌ జిల్లాలో కూడా దందాలు చేసినట్లు బయటపడ్డాయి...ఇందులో ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి ప్రమేయం కూడా ఉందని బాధితులు నయీం ఎన్‌కౌంటర్‌ నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు... నయీం ఎన్‌కౌంటర్‌ సమయంలో ఏఎస్‌ఐ అందుబాటులో లేడు...అప్పటికే అజ్ఞాతంలో ఉన్నాడు..ఇదే సమయంలో నయీంతో లింకులపై వస్తున్న ఆరోపణలతో తలదాచుకున్నట్లు తెలుస్తోంది...ఈ క్రమంలోనే అనూహ్యంగా మోహన్‌రెడ్డి జిల్లా ఎస్పీ జోయల్‌ డెవీస్‌ ఎదుట లొంగిపోయినట్లు సమాచారం..ఈ విషయాన్ని అధికారులు దృవీకరించకపోయినా నయీంతో లింకులపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
నయీం ఎన్‌కౌంటర్ తర్వాత కన్పించలేదు..
కెన్‌క్రెస్ట్‌ పాఠశాల ఛైర్మన్‌ ప్రసాదరావు ఆత్మహత్య కేసులో అరెస్టయిన మోహన్‌రెడ్డి.. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చాడు. 15 రోజుల క్రితం బెజ్జంకి మండలం గుండ్లపల్లికి చెందిన చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం.. ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి తన స్థలాన్ని తిరిగి ఇవ్వడం లేదని ఆయన వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ లభించడంతో కరీంనగర్‌ రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
అజ్ఞాతంలోకి వెళ్లిన మోహన్ రెడ్డి
ఇదే సమయంలో గ్యాంగ్‌స్టర్‌ నయీంతో మోహన్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయని బాధితులు ఆరోపించడంతో అజ్ఞాతంలోకి వెళ్లాడు...అప్పటి నుంచి మోహన్‌రెడ్డి కనిపించకపోవడంతో అనుమానాలు కూడా బలపడ్డాయి...జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మోహన్‌రెడ్డి కోసం గాలింపు చేపట్టారు.
సిట్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు...
మోహన్ రెడ్డికి గ్యాంగ్ స్టర్ నయింకు సంబందాలు ఉన్నయంటు బాదితులంతా సిట్ కు పిర్యాదు చేయడం..మోహన్‌రెడ్డి కన్పించకుండా పోయాడు...అనుహ్య పరిణామాల నడుమ మోహన్ రెడ్డి లొంగిపోయాడు...అయితే నయీంతో ఉన్న లింకులను బయటపెట్టాలని...బాధితులకు న్యాయం చేసే విధంగా దర్యాప్తు సాగాలని బాధితులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లాలో నయిమ్ గ్యాంగ్ తో సంబందాలు ఉన్న రమేష్, గోపిలను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమండ్ కు తరలించారు. మోహన్ రెడ్డిని విచారిస్తే మరింత మంది పేర్లు బయట పడే అవకాశం ఉంది.

 

11:20 - August 24, 2016

హైదరాబాద్ : నగరంలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. ఎల్బీనగర్ లో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. అదృశ్యమయిన విద్యార్థులు ఉప్పల్  కేంద్రీయ విద్యాలయంలో 9 వ తరగతి చదువుతున్నారు. ఈ నలుగురు విద్యార్థులను సాయినాథ్‌రెడ్డి, లిఖిత్‌కుమార్, విజయ్‌కుమార్‌, సాయికుమార్‌లుగా గుర్తించారు. ఈ నలుగురు ఎరుపురంగు మారుతి వ్యాన్‌లో వెళ్లారని తోటి విద్యార్థులు అంటున్నారు. ఇందులో విజయ్‌, సాయికుమార్‌లు  విజయపురికాలనీ, సాయినాథ్‌రెడ్డి, లిఖిత్‌కుమార్‌లు ఎల్బీనగర్‌లో నివాసముంటున్నారు. పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. 

గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశం..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, లా అండ్ అడిషినల్ సీపీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ అడిషినల్ సీపీ జితేందర్, జీహెచ్ఎంసీ జోనల్, డిప్యూటి కమిషనర్లు హాజరయ్యారు. 

10:53 - August 24, 2016

కూరగాయలు..కొన్ని పచ్చిగా తింటే ఎన్నో పోషకాలు వస్తాయి. పండ్లను కూడా పచ్చిగా కొన్ని తినాల్సి ఉంటుంది. ఇలా తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని పచ్చిగా తింటే పలు సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. మరి అవెంటో తెలుసుకుందామా ?
పచ్చికోడిగుడ్లలో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లకు కలిగిస్తుంది. అందువల్ల కోడిగుడ్లను ఉడకబెట్టి తినాలి. లేదా ఆమ్లెట్ ఇతర రూపాల్లో తింటే బాగుంటుంది.
పచ్చి బాదం పప్పును పచ్చిగానే తింటే పలు సమస్యలు ఎదురవుతాయి. వాపులు..నొప్పులు కలుగుతాయి. వీటిని 8 నుండి 12 గంటల పాటు నానబెట్టిన అనంతరం తినాల్సి ఉంటుంది.
ఆకుపచ్చని కూరగాయలను పచ్చిగా తినకూడదు. కొంత ఉడకబెట్టిన అనంతరం తీసుకుంటే బాగుంటుంది.
పుట్టగొడుగులను పచ్చితా తినడం వల్ల కార్సినోజెనిక్ శరీరంలోకి చేరి అనారోగ్యానికి దారి తీస్తుంది.
ఇక టమాటలను కూడా పచ్చిగా తినవద్దని పలువురు సూచిస్తున్నారు. కడపులు అసిడిటీని పెంచుతుందని, చెమటతో కూడిన దుర్వాసన వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారంట. 

10:53 - August 24, 2016

హైదరాబాద్ : వచ్చే నెల 2న జరిగే సార్వత్రిక సమ్మెకు తెలంగాణ జేఏసీ మద్దతు ఉంటుందని టీజాక్ చైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. సరళీకృత ఆర్ధిక విధానాలు అమలు తర్వాత కార్మిక హక్కులు హరించుకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల మధ్య వివాదాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. మహారాష్ట్ర-తెలంగాణ సాగునీటి ఒప్పందాలను పరిశీలించాలన్నారు. మరోవైపు సాగునీటి ప్రాజెక్ట్‌లపై మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లోని విషయాలు చర్చనీయాంశమన్నారు. ఏటేటా వేతన జీవుల సంఖ్య తగ్గిపోతుందని తెలిపారు. కాంట్రాక్ట్‌, క్యాజువల్‌ కార్మికులు పెరుగుతున్నారని పేర్కొన్నారు. స్వయం ఉపాధితో జీవించే వారి సంఖ్య పెరుగుతోందన్నారు.

 

జమ్మూకు వెళ్లిన రాజ్ నాథ్..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 

10:44 - August 24, 2016

హైదరాబాద్ : కేసీఆర్‌ ప్రభుత్వం మహారాష్ట్ర సర్కారుతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల తెలంగాణకు ఒనగూరే లాభాలేంటి? అసలు మహారాష్ట్రాతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఆ మూడు ఒప్పందాలు ఏంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ. 
మూడు ప్రాజెక్టులపై తాజాగా ఒప్పందం 
మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందం తెలంగాణకు వరప్రదాయిని అవుతుందని టీఆర్ఎస్‌ శ్రేణులు అంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ల సమక్షంలో మంగళవారం మొత్తం మూడు ఒప్పందాలు కుదిరాయి. గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్-1979 పరిశీలనకు అనుగుణంగా రెండు రాష్ర్టాల మధ్య పాత, కొత్తవి కలిపి మొత్తం ఆరు ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకున్నారు. అందులో మూడు బ్యారేజీలపై తాజాగా ఇరురాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. 
ఒప్పందం-1 
తాజాగా కుదిరిన ఒప్పందాల్లో మొదటిదాని ప్రకారం..గోదావరిపై 100 మీటర్ల ఎత్తుతో 16టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల మేడిగడ్డ బ్యారేజీని నిర్మాణానికి మార్గం సుగమమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మేడిగడ్డ ద్వారానే గోదావరి నీటిని తెలంగాణ వాడుకునే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీ వల్ల కరీంనగర్‌, వరంగల్, మెదక్, నిజామాబాద్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 19 లక్షల ఎకరాల భూమి సాగులోకి రానుంది. శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌, సింగూరు జలాశయాల కింద మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. 
ఒప్పందం-2
ఇక రెండో ఒప్పందం ప్రకారం... ప్రాణహితపై తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో 1.8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం కానుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ నియోజకవర్గాల్లో 2లక్షల ఎకరాలకు సాగునీరును అందించే అవకాశం ఉంది. 
ఒప్పందం-3 
ఇక మూడో ఒప్పందం ప్రకారం..  పెన్‌గంగపై 213 మీటర్ల ఎత్తుతో 0.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చనాఖా-కొరాటా బ్యారేజీకి లైన్‌ క్లియర్‌ అయింది. ఈ బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్‌ జిల్లాలోని తాంసీ, జైనథ్‌, బేలా మండలాలకు సాగునీరు అందనుంది. 
మహా ఒప్పందంతో తొలగిన అడ్డంకులు
మొత్తానికి దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన ప్రాజెక్టుల నిర్మాణాలకు తాజా మహా ఒప్పందంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. మహారాష్ట్ర-తెలంగాణ మధ్య జరిగిన ఒప్పందాన్ని సీఎం కేసీఆర్‌ చారిత్రక ఒప్పందంగా అభివర్ణించారు. రాబోయే రోజుల్లో కృష్ణానదిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో కూడా మహారాష్ట్రతో స్నేహపూర్వక వాతావరణాన్నే కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 

హర్యానాలో సాక్షికి ఘన స్వాగతం..

హర్యానా : రియో ఒలింపిక్స్ లో పతకం సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్ కు హర్యానాలో ఘన స్వాగతం లభించింది. హర్యానా సీఎం మాలిక్ న్ ను ప్రశంసించారు. బేటీ బచావో..బేటీ పడావో ప్రచార కర్తగా సాక్షిని అక్కడి ప్రభుత్వం నియమించింది. 

10:37 - August 24, 2016

జూనియర్ ఎన్టీఆర్...యంగ్ టైగర్..అతను నటిస్తున్న కొత్త సినిమా 'జనతా గ్యారేజ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మెకానికల్‌ షెడ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'ఇక్కడ అన్నీ రిపేర్లు చేయబడతాయి' అనేది ఉప శీర్షికను పెట్టారు. రివేంజ్‌ డ్రామాను కుటుంబ కథతో మిళితం చేసి తీయనున్నారు. మోహన్‌లాల్‌ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు తండ్రిగా నటించనున్నట్టు సమాచారం. నిత్యా మీనన్‌, సమంత కథానాయికలుగా చేస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ బాణీలు సమకూరుస్తున్నారు. ఇదిలా ఉంటే తొలుత అనుకున్న దాని ప్రకారం చిత్రాన్ని సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయాల్సి ఉంది. కానీ అంతకు ఒకే రోజు ముందే 'జనతా గ్యారేజ్' తలుపులు తీయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీనితో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
మరోవైపు 'జనతా గ్యారేజ్' బిజినేస్ భారీ రేంజ్ లో సాగుతోంది. ఇందుకు దర్శకుడు కొరటాల శివ ఫ్యాక్టర్ కూడా బాగానే పనిచేస్తోంది. ఈ దర్శకుడు బ్యాక్ టూ బ్యాక్ భారీ హిట్స్ సాధించడంతో ఎన్టీఆర్ తో చేసిన 'జనతా గ్యారేజ్' పై ఆటోమేటిక్ గా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ హైప్ ని వాడుకోని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఎన్టీఆర్ స్కెచ్ వేస్తున్నాడు. అన్ని ఏరియాలు కలిసి 'జనతా గ్యారేజ్' 70కోట్లకు పైగా ప్రీ బిజినేస్ జరిపినట్లు తెలుస్తోంది. ఒక్క మలయాళంలోనే ఈ మూవీ 8కోట్ల ఫ్రీ బిజినేస్ చేసిందట. మరి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో వేచి చూడాలి. 

10:27 - August 24, 2016

కోరుట్ల పట్టణ బంద్..

కరీంనగర్ : కోరుట్ల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ పట్టణ వాసులు ఆందోళన చేస్తున్నారు. గత రెండు రోజులుగా వీరు ఆందోళన చేపట్టారు. రెండో రోజు కూడా పట్టణ బంద్ కొనసాగుతోంది.

10:25 - August 24, 2016

లాభాల్లో స్టాక్ మార్కెట్లు...

ముంబై : స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 50 పాయింట్లు..నిఫ్టీ 10 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడవుతున్నాయి. 

ఢిల్లీలో చికెన్ గున్యా..డెంగ్యూ ప్రబలం..

ఢిల్లీ : దేశ రాజధానిలో చికెన్ గున్యా..డెంగ్యూ వ్యాధులు ప్రబలుతున్నాయి. గత రెండు నెలలుగా ఈ పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిమ్స్ లో చికెన్ గున్యాకు సంబంధించి 180 పాజిటివ్ కేసులను గుర్తించినట్లు డాక్టర్ ఆశుతోష్ బిస్వాస్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 

10:16 - August 24, 2016

విశాఖ : జిల్లాలోని అనకాపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఓ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిని చికిత్సకోసం కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30మంది ప్రయాణికులున్నారు. మిగతావారంతా క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. 

నళిని చిదంబరంకు ఈడీ నోటీసులు..

ఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం సతీమణి నళిని చిదంబరంకు ఈడీ నోటీసులు పంపించింది. శారదా స్కాంకు సంబంధించి నళిని చిదంబంరకు ఈడీ నోటీసులు పంపించింది. 

10:13 - August 24, 2016

చిత్తూరు : జిల్లాలోని చంద్రగిరి మండలం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని సుమో ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఒకరు మహిళ ఉన్నారు. 

టిటిడి లడ్డూ కౌంటర్ల వద్ద భక్తుల ఆందోళన..

చిత్తూరు : లడ్డూ కౌంటర్ల వద్ద భక్తులు ఆందోళన నిర్వహిస్తున్నారు. అదనపు లడ్డూ కోటా ముగియడంతో కౌంటర్లను అధికారులు మూసివేశారు. దీనితో భక్తులు ఆందోళన చేస్తున్నారు. 

అందరి ప్రోత్సాహం వల్లే విజయం - సాక్షి మాలిక్..

ఢిల్లీ : ప్రతొక్కరూ ప్రోత్సాహం వల్లే తాను పతకం సాధించడం జరిగిందని భారత రెజ్లింగ్ స్టార్ సాక్షి మాలిక పేర్కొన్నారు. రియో ఒలింపిక్ లో రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాక్షి మాలిక్ సాధించిన సంగతి తెలిసిందే. బుధవారం సన్మాన కార్యక్రమంలో సాక్షి మాలిక్ పాల్గొని ప్రసంగించారు. 

150 తాబేళ్ల స్వాధీనం..

చెన్నై : సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికుడి వద్ద 150 తాబేళ్లను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన మంగళవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఎల్బీనగర్ లో విద్యార్థుల అదృశ్యం..

హైదరాబాద్ : ఎల్బీనగర్ లో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం కలకలం రేగింది. తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో సాయినాథ్ రెడ్డి, లిఖిత్ కుమార్ లు 9వ తరగతి చదువుతున్నారు. 

అమరావతి పంచాయతీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన

గుంటూరు : అమరావతి పంచాయతీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. అధికారులు ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకుండా తక్కువ డబ్బులు చెల్లిస్తామంటున్నారని తెలిపార పారిశుద్ధ్య కార్మికులు పుష్కరాల్లో విధులు నిర్వహించారు. 

08:49 - August 24, 2016

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు నడింపల్లి సీతారామరాజు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, టీఆర్ ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. తెలంగాణలో చాలా ప్రాజెక్టులు పెండింగ్ లోన్నాయని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:41 - August 24, 2016

కరువులో ఉన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం నేత బొంతల రాంచంద్రారెడ్డి అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం ఖరీఫ్ ప్రణాళిక ను తయారు చేసింది కానీ.. కాంటెన్ జెన్సీ ప్రణాళిక తయారు చేయలేదని విమర్శించారు. కాంటెన్ జెన్సీ ప్రణాళిక తయారు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వాలని  చెప్పారు. 'వర్షాభావ పరిస్థితులు కలవరపెడుతున్నాయి. ఆగస్టులో ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏమిటి? ఈ ఏడాది కూడా కరవు కష్టాలు తప్పవా? సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం చేపట్టాల్సిన చర్యలేమిటి'? ఈ ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

08:22 - August 24, 2016

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరువు తప్పదా? గత మూడు నెలల్లో నమోదైన వర్షపాతం గణాంకాలు చూస్తే ఇలాంటి భయమే కలుగుతోంది. ఇప్పటికే చాలా పంటలు ఎండిపోయాయి. జూన్, జులై, ఆగస్టు ఈ మూడు నెలలు వ్యవసాయ రంగానికి అత్యంత కీలకం. శ్రావణమాసం ముగిసిన తర్వాత వానలు కురిసినా పెద్దగా ప్రయోజనం వుండదు. జూన్ లో వర్షాలు మురిపించినా, జులై లో  ఆ జోరు కనిపించలేదు. ఆగస్టులో చెప్పుకోదగ్గ వానలు పడలేదు. మామాలుగానైతే ఈ రోజుల్లో క్రిష్ణా, గోదావరి నదులు వరదలతో పోటెత్తాలి.  ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నీళ్లతో కళకళలాడుతుండాలి. కానీ, పుష్కరాలకు వెళ్లివచ్చిన క్రిష్ణా నది పరిస్థితి ఏమిటో స్వయంగా చూసొచ్చారు.
తెలంగాణలో తక్కువ వర్షపాతం
జూన్ 1 నుంచి ఆగస్టు 23 వరకు నమోదైన వర్షపాతం వివరాలను చూస్తే ఈ ఏడాది కూడా కరువు తప్పదా? అన్న భయం కలుగుతోంది. సెప్టెంబర్ లో వానలు బాగానే కురుస్తాయంటూ వాతావరణ శాఖ భరోసా ఇస్తున్నా, అవి పంటలకు ఎంత మాత్రం ఉపయోగపడతాయన్నది అనుమానమే. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఈ ఏడాది బియ్యానికి కటకట తప్పదు. తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్ మినహా మిగిలిన 8 జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మినహా మిగిలిన 10 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. 
హైదరాబాద్ లో 26శాతం తక్కువ వర్షపాతం 
జూన్ ఒకటి నుంచి ఆగస్టు 23 వరకు హైదరాబాద్ లో 26శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. శ్రావణమాసంలో కూడా హైదరాబాద్ లోని అపార్ట్ మెంట్ వాసులు ట్యాంకర్లు నీళ్లు తెప్పించుకుంటుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్కొక్కరోజు ఎండ తీవ్రతా ఎక్కువగానే కనిపిస్తోంది. మెదక్ జిల్లాలో 32శాతం, మహబూబ్ నగర్ జిల్లాలో 22శాతం, రంగారెడ్డి జిల్లాలో 21శాతం చొప్పున వర్షపాతం తగ్గింది. నల్లగొండలో 16శాతం, నిజామాబాద్ లో 9శాతం, ఖమ్మం 6శాతం, వరంగల్ లో 5శాతం చొప్పున తక్కువ వర్షపాతం నమోదైంది.  
ఎపిలో ఆశాజనకంగా లేని పరిస్థితి
ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. క్రిష్ణా డెల్టా కలవరపెడుతోంది. ఉభయ గోదావరి జిల్లాలు చినుకు కోసం ఎదురుచూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సాధారణం కంటే 17శాతం తక్కువ వర్షాలు పడ్డాయి. నెల్లూరు జిల్లా తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోంది. అక్కడ 49.2శాతం లోటు కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలోనూ అంతే దయనీయంగా వుంది. ప్రకాశంలో 37.3శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో 23.6శాతం, పశ్చిమగోదావరిలో 20.5శాతం, క్రిష్ణాలో 17.1శాతం, తూర్పుగోదావరిలో 15.4శాతం చొప్పున తక్కువ వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో 27.8శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న జిల్లాల్లో శ్రీకాకుళంది మూడో స్థానం. విజయనగరంలో 8.3శాతం, విశాఖపట్టణంలో 4.8శాతం చొప్పున తక్కువ వర్షపాతం నమోదైంది.
ఎండిపోతున్న పంటలు 
అదును ప్రకారం వానలు పడకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకునే మార్గాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పొలాల పరిస్థితి దారుణంగా వుంది. మొక్కజొన్న పంట కన్నీళ్లు తెప్పిస్తోంది. పత్తి పంట కలవరపెడుతోంది. సోయాబీన్ మీద కూడా వర్షాభావం పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే వారం పదిరోజుల్లో మంచి వర్షాలు కురవకపోతే, రైతులకు తీవ్ర నష్టాలు తప్పవు.  క్రిష్ణా పుస్కరాలు ఘనంగా నిర్వహించామంటూ సంబరపడుతున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా రైతుల పరిస్థితిని అర్ధం చేసుకోవాలి. ప్రత్యామ్నాయ ప్రణాళిక మీద దృష్టి సారించాలి. 

 

థాయ్ లాండ్ లో కారు బాంబు పేలుడు

బ్యాంకాక్ : థాయ్ లాండ్ లో కారు బాంబు పేలుడు సంభవించింది. పట్టానిలో ఓ హోటల్ వద్ద కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. 

 

07:57 - August 24, 2016
07:54 - August 24, 2016

హైదరాబాద్ : నిన్నటి వరకు బీజేపీపై కారాలు మిరియాలు నూరిన టీఆర్‌ఎస్‌ నేతలు ఒక్కసారిగా చల్లబడ్డారు. రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందంటూ ఆరోపణలు చేసిన ఆ నేతలే.. తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్‌ సహకరిస్తుందంటూ మాట మార్చారు. మహా ఒప్పందం సందర్భంగా తమ బంధం మరింత బలపడుతుందంటూ కేసీఆర్‌ వ్యాఖ్యానించడం.. ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంమైంది. 
రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదని ఆరోపణలు 
రూట్‌ మార్చిన గులాబీ నేతలు  
బీజేపీ పట్ల టీఆర్‌ఎస్‌ వైఖరి మారుతోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో కేంద్రం నుంచి సరైన ప్రోత్సాహం అందడం లేదని..  రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడిన గులాబీ నేతలు.. ఇప్పుడు రూట్‌ మార్చారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించినప్పుడు కేసీఆర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. అప్పటినుంచి అదే వైఖరిని కొనసాగిస్తున్నారు. 
మహా ఒప్పందంతో సఖ్యతకు బాటలు 
అయితే.. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వంతో టీఆర్‌ఎస్‌ ఆచితూచి వ్యవహరిస్తుందనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రతో కేసీఆర్‌ ప్రభుత్వం చేసుకున్న జల ఒప్పందం.. బీజేపీ-టీఆర్‌ఎస్‌ మరింత దగ్గరయ్యేందుకు బాటలు వేసిందని విశ్లేషకులంటున్నారు. 
ప్రధాని పర్యటనలో మోదీ, కేసీఆర్‌లు పరస్పర పొగడ్తలు 
ప్రధాని రాష్ట్ర పర్యటనలో మోదీ, కేసీఆర్‌లు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. అదే సీన్‌ ఇప్పుడు మహారాష్ట్ర జల ఒప్పంద సమయంలోనూ కనిపించింది. అయితే ఈసారి పొగడ్తల వర్షం కురిపించుకుంది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సీఎంలైన ఫడ్నవీస్‌, కేసీఆర్‌లు. ఫడ్నవీస్‌ కేసీఆర్‌ను పొగడ్తలతో ఆకాశానికెత్తారు. గత ప్రభుత్వాల హయంలో చేసుకున్న ఒప్పందాలతో ఎలాంటి ఫలితం లేదని.. ఇప్పుడు చేసుకుంటున్న ఒప్పందాలు ఇరు రాష్ట్రాలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఇరువురు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మహారాష్ట్రతో ఏర్పడిన బంధం.. రాబోయే రోజుల్లో మరింత దగ్గరయ్యేందుకు ఉపయోగపడుతుందని కేసీఆర్‌ ప్రస్తావించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఏదిఏమైనా మహా ఒప్పందంతో తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తుండగా.. అధికార పార్టీకి మాత్రం కొత్త మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. 

 

07:50 - August 24, 2016

హైదరాబాద్ : ముమ్మాటికీ టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు.. ఇది కచ్చితంగా చట్టవిరుద్ధమే...ఇది రేవంత్‌ రెడ్డి తరఫు న్యాయవాది వాదన..కాదు కాదు.. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసినట్లు ఉత్తర్వుల్లో లేదు..టీటీడీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ప్రత్యేక సీట్లు మాత్రమే కేటాయించాం..ఇది ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదన..ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.  
రేవంత్‌ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు 
టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయడాన్ని సవాల్‌ చేస్తూ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిసినా.. తీర్పు రిజర్వ్‌లో ఉంచడంతో ఉత్కంఠ నెలకొంది. ఉత్తరాఖండ్, అసోంలో పరిణామాలపై సుప్రీం తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది జంద్యాల రవిశంకర్‌ వాదనలు వినిపించారు. పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని షెడ్యూల్ 10లో పేర్కొన్నట్లు తెలిపారు. 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని..టీ.ఆర్.ఎస్.ఎల్పీలో విలీనం చేసినట్లు బులిటెన్ విడుదల చేయడం చట్టవిరుద్దమని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయలేదన్న అడ్వకేట్‌ జనరల్‌ 
తెలంగాణ స్పీకర్ తరఫున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. మార్చి10, 2016 నుంచి తమ దగ్గర పార్టీ ఫిరాయింపుల పిటిషన్స్ పెండింగ్‌లో లేవని స్పష్టం చేశారు. టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయలేదన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన టీటీడీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ప్రత్యేక సీట్లు మాత్రమే కేటాయించినట్లు చెప్పారు. ఎక్కడా పార్టీ వీలీనం చేసినట్లు ఉత్తర్వుల్లో లేదని వాదించారు. స్పీకర్ కాలపరిమితిపై కోర్టుకు రాజ్యాంగ సవాలు చేసే అధికారం ఉండదన్నారు. స్పీకర్ నిర్ణయంపై కాలపరిమితి విధించడం చట్ట విరుద్దమని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫున ఇంప్లీడ్‌ అవుతానన్న ఏఏజీ
అయితే పార్టీ మారిన 13 మంది తరఫున తాను వాదనలు వినిపిస్తానని అడిషనల్ అడ్వకేట్ జనరల్ జే. రామచంద్రర్ రావు ఇంప్లీడ్ అవుతానని కోర్టుకు విన్నవించారు. అయితే కోర్టు అందుకు అనుమతి నిరాకరించింది. దీంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు ఇప్పుడు కీలకంగా మారాయి. ఏదీ ఏమైనా ఉన్నత న్యాయస్థానం తీర్పుపై..అటు టీడీపీలోనూ, ఇటు టీఆర్‌ఎస్‌లోనూ ఉత్కంఠ రేపుతోంది. 

 

07:42 - August 24, 2016

హైదరాబాద్ : జోనల్‌ వ్యవస్థను రద్దు చేసే ముందు సమగ్రంగా అధ్యయనం చేసి, చర్చ జరపాలని టీ-జాక్‌ డిమాండ్‌ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల అభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఆదివాసీల సమగ్రతను కాపాడాలని కోరింది. రాష్ర్టాల మధ్య ఉండే జలవివాదాలను శాంతియుతంగా చర్చించుకోవడం మంచి పరిణామమే అని వ్యాఖ్యానించింది.
ప్రొ. కోదండరాం అధ్యక్షతన టీజాక్ భేటీ
తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశం నాంపల్లిలోని టీజాక్ కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన జరిగింది. ప్రస్తుతం రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, జోనల్ వ్యవస్థ రద్దు, కుకునూరుపల్లి ఎస్‌ఐ సూసైడ్‌, తదితర కీలక అంశాలపై చర్చించారు. మహారాష్ట్రతో తెలంగాణ సర్కారు కుదుర్చుకున్న సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందాన్ని టీ-జాక్‌ స్వాగతించింది. రాష్ర్టాల మధ్య ఉండే జలవివాదాలను శాంతియుతంగా చర్చించుకోవడం మంచి పరిణామమే అన్నారు కోదండరాం. అయితే మహారాష్ర్ట, తెలంగాణ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పంద విషయాలను రాష్ర్ట ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాలని కోరారు. 
కొత్త జిల్లాల ఏర్పాటుపై హేతుబద్దమైన చర్చ జరగాలి : కోదండరాం
కొత్త జిల్లాల ఏర్పాటుపై హేతుబద్దమైన చర్చ జరగాలని, ప్రజల అభిష్టం మేరకే నిర్ణయాలు తీసుకోవాలని ప్రొఫెసర్‌ కోదండరాం సూచించారు. జిల్లాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారో వివరించాలని కోరారు. ముఖ్యంగా జిల్లాల ఏర్పాటులో ఆదివాసీల సమగ్రతను కాపాడాలని స్పష్టం చేశారు.       
జోనల్‌ వ్యవస్థను రద్దు చేసే ముందు అభిప్రాయలు తీసుకోవాలి : టీజాక్ నేతలు 
జోనల్‌ వ్యవస్థను రద్దు చేసే ముందు రాష్ర్ట ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి అభిప్రాయలు తీసుకోవాలని టీ-జాక్‌ నేతలు సూచించారు. జోనల్‌ వ్యవస్థ రద్దుపై లోతైన అధ్యయనం, చర్చ జరగాలని స్పష్టం చేశారు. మెజార్టీ ప్రజల అభిప్రాయం ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. 
సూసైడ్ చేసుకున్న ఎస్ఐ అంశంపై చర్చ
ఈ మధ్య సూసైడ్‌ చేసుకున్న మెదక్‌ జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ అంశంపై చర్చించారు. ఎస్‌ఐ సూసైడ్ నోట్‌లో పేర్కొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీ జాక్‌ నేతలు డిమాండ్‌ చేశారు. పోలీస్‌ వ్యవస్థలో జరుగుతున్న వసూళ్లపై సుదీర్ఘ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 
పీ.వీ. సింధూ, కోచ్‌ గోపిచంద్‌కు అభినందనలు తెలుపుతూ తీర్మానం  
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీ.వీ. సింధూ, ఆమె కోచ్‌ గోపిచంద్‌కు అభినందనలు తెలుపుతూ... తీర్మానం చేశారు.  భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలంటే... స్పోర్ట్స్‌ పాలసీని ప్రకటించి.. దాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు. ఆగస్టు 28న తెలంగాణ అభివృద్ధి-జేఏసీ నమూనా పేరుతో సెమినార్ నిర్వహిస్తున్నట్లు టీజాక్‌ నేతలు తెలిపారు. 

 

07:35 - August 24, 2016

హైదరాబాద్ : ఎపి రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అమలు చేస్తున్న స్విస్‌ చాలెంజ్‌ విధానంపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విధానం ఎవరి కోసమని ధర్మాసం ప్రశ్నించింది. కేవలం విదేశీ కంపెనీల కోసమేనా.. అని స్విస్‌ చాలెంజ్‌పై దాఖలైన కేసులో ఎపి ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. 
పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ 
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిలో విదేశీ సంస్థలకు పనులు అప్పగించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన కేసులో పిటిషనర్‌ తరపు న్యాయవాదితోపాటు, అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. ఈ విధానం సరిగాలేదని పిటిషనర్‌ తరుపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. స్విస్‌ చాలెంజ్‌లో పారదర్శకత లోపించిందని, దీనిని మార్గదర్శకాలు, విధివిధానాలను బహిర్గతం చేయాలని కోరారు. ఈ దశలో  అడ్వకేట్‌ జనరల్ జోక్యం చేసుకుని... ఈ దశలో వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. రెండు పక్షాల వాదనలు విన్న బెంచ్‌... ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 
స్విజ్‌ చాలెంజ్‌లో దాపరికం ఎందుకు : హైకోర్టు 
ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న స్విస్‌ చాలెంజ్‌ విధానంలో ఇంత దాపరికం ఎందుకని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పారదర్శకంగా ఉండాల్సిన విధానంలో ఇంత రహస్యం ఎందుకని నిలదీసింది. అసలు స్విస్‌ చాలెంజ్‌ ఎవరి కోసం... కేవలం విదేశీ కంపెనీల ప్రయోజనాల పరిరక్షణకేనా... అన్ని నిగ్గదీయడంతో ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి  ఉత్పన్నమయ్యింది. ప్రభుత్వ ఆస్తులకు పాలకులు కేవలం ధర్మకర్తలు మాత్రమేనని వ్యాఖ్యానించింది. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోడానికి ఇవి ప్రైవేటు ఆస్తులు కావని హైకోర్టు బెంచ్‌ గుర్తు చేసింది. అసలు ఈ విధానం ఎందుకని నిలదీసింది. సీల్డు కవర్‌ టెండర్ల విధానం మేలు కదా..  అటూ ఆచరణలో మాత్రం మరోలా జరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఈ విషయం అందరికీ తెలుసంటూ కేసు తదుపరి విచారణను శుక్రవానికి వాయిదా వేసింది. ఆ రోజు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని చెప్పింది. 
స్విస్‌ చాలెంజ్‌ విధానంలో అమరావతి నిర్మాణానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం 
స్విస్‌ చాలెంజ్‌ విధానంలో రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సింగపూర్‌కు చెందిన కన్సార్టియం... సింగ్‌బ్రిడ్జ్‌, సెంబ్‌కార్బ్‌, అసెండాస్‌ కంపెనీలకు పనులు అప్పగించింది. స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిలో కాంట్రాక్టర్లను ఎంపిక చేయడం ఓ పెద్ద ప్రక్రియ. బిడ్లు తెరిచిన తర్వాత తక్కువ కోట్‌ చేసిన కంపెనీకి పనులు అప్పగించరు. పోటీలో ఉన్న కంపెనీ అంతకన్నా తక్కువ రేటుకు మెరుగైన డిజైన్‌తో మరో ప్రణాళిక సమర్పించి క్రాంట్రాక్టును దక్కించుకునే అవకాశం ఈ విధానంలో ఉంటుంది.  ఆ తర్వాత మరో సంస్థ ఇంకో ఆకృతితో  ముందుకొస్తే.. అది ప్రభుత్వానికి నచ్చితే... ఆ సంస్థకు పనులు అప్పగించే వెసులుబాటు ఉంటుంది. ఇదే స్విస్‌ చాలెంజ్‌ పద్ధతి. నిర్ణీత కాలవ్యవధిలో ఒక కంపెనీ ఇలా ఎన్నిసార్లైనా కాంట్రాక్టులు సమర్పించుకునే అవకాశం ఉంది. ఈ విధానం ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్లింది. 

 

07:30 - August 24, 2016

హైదరాబాద్ : 12 రోజుల పాటు కన్నుల పండువగా సాగిన కృష్ణా పుష్కరాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ముగిశాయి. ముగింపు రోజున భక్తులు, వీఐపీలు భారీగా తరలివచ్చి పుష్కర స్నానాలు చేశారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఘాట్లన్నీ పుష్కర యాత్రికులతో కిటకిటలాడాయి. 
యాత్రికులతో కిటకిటలాడిన పుష్కరఘాట్లు  
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు ఘనంగా ముగిశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పుష్కరఘాట్లన్నీ పుష్కర యాత్రికులతో కిటకిటలాడాయి. విజయవాడలో పుష్కరాల చివరిరోజున పుష్కరఘాట్లన్నీ భక్తులు, వీఐపీలతో కిక్కిరిసిపోయాయి. వీఐపీ ఘాట్‌ పున్నమిఘాట్‌లో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్‌ప్రభు పుష్కరస్నానం చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..నదుల పుట్టుకతోనే మానవ నాగరికత ఆధారపడి ఉందన్నారు. నదులు ఎక్కడ జీవిస్తుంటే మనుషులు అక్కడ జీవిస్తారని వెంకయ్యనాయుడు అన్నారు. వైసిపి ఎమ్మెల్యే  రోజా కుటుంబసమేతంగా శ్రీశైలంలోని లింగాలగట్టు ఘాట్‌లో పుణ్యస్నానం చేశారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
తెలంగాణలో వైభవంగా కొనసాగిన పుష్కరాలు 
తెలంగాణలో చివరిరోజైన 12వ రోజు కృష్ణా పుష్కరాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగాయి. అన్ని పుష్కరఘాట్ల వద్ద నదీ హారతితో పుష్కరాలు ముగిశాయి. నదీ తీరంలోని ఆలయాలన్నీ భక్త జనంతో కిటకిటలాడాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌ మండలం గొందిమల్ల జోగులాంబ పుష్కర ఘాట్‌లో డీజీపీ అనుగరాగ్‌శర్మ పుణ్య స్నానమాచరించారు. ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గొందిమల్ల ఘాట్‌కు రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పుష్కరస్నానమాచరించారు. 
బీచ్‌పల్లిలో పుణ్యస్నానమాచరించిన ప్రముఖులు 
ఇటిక్యాల మండల పరిధిలోని బీచ్‌పల్లిలో కృష్ణా పుష్కరాల చివరి రోజు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రముఖ సినీ దర్శకుడు శ్రీనువైట్ల నదిలో పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు కుటుంబసభ్యులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీచుపల్లి పుష్కర ఘాట్‌లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పుష్కర స్నానాలను ఆచరించారు. 12వ రోజు పుష్కరాలు ముగింపు కావడంతో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పుష్కర ముగింపు హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. అటు నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి పుష్కరఘాట్‌లో టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు కుటుంబసమేతంగా పుష్కరస్నానం చేశారు. 
విజయవాడలోని పున్నమిఘాట్‌లో ప్రత్యేక కార్యక్రమాలు 
మొత్తానికి 12 ఏళ్లకోసారి కృష్ణాపుష్కరాలు ఘనంగా ముగిశాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజయవాడలోని పున్నమిఘాట్‌లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. పుష్కరాల ముగింపు సందర్భంగా పుష్కర ముగింపు హారతి పుష్కర యాత్రికులకు కనులవిందు చేసింది. ఆ తర్వాత ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన బాణాసంచా ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. కళ్లు జిగేల్‌ మనేలా ఏర్పాటు చేసిన బాణాసంచా యాత్రికులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పుష్కరయాత్రికులకు కనువిందు చేశాయి. 

07:24 - August 24, 2016

విజయవాడ : 12 రోజులపాటు కన్నుల పండువగా సాగిన కృష్ణాపుష్కరాలు ఘనంగా ముగిశాయి. ఆంధ్రప్రదేశ్‌లో పవిత్ర సంగమం ఘాట్‌ వద్ద ముగింపు వేడుకలను సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కృష్ణా హారతి ముగిసిన వెంటనే బాణాసంచా కాల్చారు. ముగింపు ఉత్సవాలకు హాజరైన భక్తులు.. వేడుకలను చూసి పరవశించిపోయారు. 
అంగరంగ వైభవంగా ముగింపు కార్యక్రమం
కృష్ణా పుష్కరాల ముగింపు కార్యక్రమాన్ని ఏపీ సర్కార్‌ అంగరంగ వైభవంగా నిర్వహించింది. పవిత్ర సంగమం ఘాట్‌ వద్ద కృష్ణా హారతి ముగియగానే బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. బాణాసంచా పేలుళ్లు ఆకాశంలో సరికొత్త కాంతులు నెలకొన్నాయి. పుష్కరాలకు వచ్చిన భక్తులు ముగింపోత్సవాలను చూసి ఆనందభరితులయ్యారు. 
అలరించిన కూచిపూడి నృత ప్రదర్శన  
అంతకుముందు పుష్కరాల ముగింపు వేడుకల్లో భాగంగా కళాకారుల కూచిపూడి నృత ప్రదర్శన అందరినీ అలరించింది. వెయ్యి మంది కళాకారులు ఒకే వేదికపై చేసిన నృత్య ప్రదర్శన కనుల విందుగా నిలిచింది. ఈ కార్యక్రమానికి గణపతి సచ్చితానందస్వామితో పాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్‌ప్రభులు పాల్గొన్నారు. అదేవిధంగా ఒలింపిక్స్‌లో సత్తా చాటిన పీవీ సింధూ, గోపిచంద్‌, శ్రీకాంత్‌లను వారిని చంద్రబాబు సత్కరించారు. పుష్కరాల ముగింపు సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. కుంభమేళా తరహాలో జరిగిన పుష్కరాలలో ప్రజలంతా ఎంతో క్రమశిక్షణతో మెలిగి విజయంతం చేశారన్నారు వెంకయ్యనాయుడు.
కృష్ణా పుష్కరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్న సింధు 
కృష్ణా పుష్కరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని.. పీవీ సింధు తెలిపారు. అందరి ప్రోత్సాహంతో భవిష్యత్‌లో మరింత మెరుగైన ఆట తీరును ప్రదర్శిస్తానని ఆమె తెలిపింది. అదేవిధంగా సింధును స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆటలపై ఆసక్తిని పెంచుకోవాలని గోపిచంద్‌ అన్నారు. మొత్తానికి పుష్కరాల ముగింపు సందర్భంగా ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించిన వేడుకలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

 

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. 

06:59 - August 24, 2016

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని ఈరోజు నగరానికి తిరిగి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిర్ణయించారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. ఏర్పాట్లపై అధికారులు, పోలీసులతో చర్చించారు. మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు రానున్న కేసీఆర్‌కు.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలతో స్వాగతం పలకడమే కాకుండా భారీ బహిరంగం సభ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 2 వేల మంది కళాకారులు పాల్గొననున్నారు.  ఇక ఈ కార్యక్రమానికి జిల్లాల నుంచి రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 

 

నేడు ఎపి నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్న బృందం

హైదరాబాద్ : నేడు ఎపి నుంచి హజ్ యాత్రకు బృందం వెళ్లనుంది. 340 మంది హజ్ యాత్రికులతో విమానం జెడ్డా వెళ్లనుంది.   

నేడు జమ్మూకశ్మీర్ లో రాజ్ నాథ్ సింగ్ పర్యటన

శ్రీనగర్ : నేడు జమ్మూకశ్మీర్ లో కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

నేడు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ రానున్న కేసీఆర్ బృందం

హైదరాబాద్ : నేడు మహారాష్ట్ర నుంచి సీఎం కేసీఆర్ బృందం హైదరాబాద్ రానుంది. కార్యకర్తలు సీఎంకు ఘన స్వాగతం పలకనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. 

లారీ, సుమో ఢీ... ముగ్గురు మృతి

చిత్తూరు : చంద్రగిరి మండలం అగరాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని సుమో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. 

Don't Miss