Activities calendar

25 August 2016

21:51 - August 25, 2016

హైదరాబాద్ : గడువులోపు మిషన్‌ భగీరథ పనులను పూర్తి చేయాలని ఆ సంస్థ వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 2017 నాటికి తెలంగాణలోని అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించాలని కోరారు. సచివాలయంలో మిషన్‌ భగీరథ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫైబర్‌ వర్క్స్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఇప్పటికే పైపులైన్‌ పనులకు ఆటంకాలు లేకుండా రైల్వేశాఖ, అటవీశాఖ నుంచి అన్ని అనుమతులు వచ్చాయని, దీంతో పనులు పెండింగ్‌లో పెట్టకూడదని ఆదేశించారు. సెగ్మెంట్ల వారీగా పనుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

21:46 - August 25, 2016

హైదరాబాద్ : ప్రాజెక్టుల విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం శాస్త్రీయంగా ముందుకెళ్తున్నదని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ్మడిహట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. గత పాలకులు ప్రాజెక్టుల పేరిట వందల కోట్ల రూపాయలు జుబుల్లో వేసుకున్నారని దుయ్యబట్టారు. 

21:44 - August 25, 2016

హైదరాబాద్‌ : గచ్చిబౌలి గ్లోబల్‌ పీఎస్‌ ఆడిటోరియంలో బ్రహ్మకుమారి శాంతి సరోవర్‌ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధును ఘనంగా సన్మానించారు. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించడం తన కలని...ఆ కల సాకారమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

21:40 - August 25, 2016

ఒడిషా : మానవత్వపు విలువలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. తోటి వ్యక్తి ఆపదలో ఉంటే ఆదుకునే నాథుడే కరువయ్యాడు. ఆసుపత్రిలో భార్య చనిపోతే...అంబులెన్స్‌లో తీసుకుపోయే స్థోమత లేని ఓ వ్యక్తి శవాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్లు నడచుకుంటూ వెళ్లిన హృదయ విదారక దృశ్యం ఒడిషాలో చోటుచేసుకుంది.

భార్య శవంతో 60 కిలో మీటర్ల నడచేందుకు సిద్ధమయ్యిన భర్త
చేతిలో చిల్లిగవ్వ లేదు...అందుబాటులో అంబులెన్స్‌ లేదు... చేసేదిలేక దుప్పటిలో కప్పి ఉన్న తన భార్య శవాన్ని ఆసుపత్రి నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న తన ఊరుకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషాద ఘటనలో 12 ఏళ్ల కూతురు కూడా అతని వెంటే నడుచుకుంటూ వెళ్లింది.

ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ మృతి
ఒడిషాలోనే అత్యంత దుర్భర స్థితి కలిగిన కలహండి జిల్లాలోని మెల్గారా గ్రామానికి చెందిన 42 ఏళ్ల దనమాజి, అమాంగ్‌ దేయి గిరిజన దంపతులు. గత కొద్ది కాలంగా అమాంగ్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుండగా ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి భర్త తీసుకువెళ్లాడు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అమంగ్ మృతిచెందింది. అమాంగ్‌ మృత దేహాన్ని ఊరికి తీసుకెళ్లేందుకు ఆసుపత్రి వర్గాలు సహకరించ లేదు. ప్రయివేట్‌ వాహనంలో తీసుకెళ్లే స్థోమత లేక దనమాజి- భార్య శవాన్ని భుజాలపై మోస్తూ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామం మెల్గారాకు బయల్దేరాడు.

'మహాపారాయణ' పథకం కింద పంపేందుకు నిరాకరించిన అధికారులు
వాస్తవానికి నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం ప్రారంభించిన 'మహాపారాయణ' పథకం కింద మృతదేహాలను ఉచితంగా స్వగ్రామాలకు పంపేందుకు ఏర్పాటు చేయాలి. ఆసుపత్రి అధికారులు నిరాకరించడంతో పేదవాడికి కష్టాలు తప్పలేదు.

స్పందించిన కలెక్టర్ ..50 కిలోమీటర్ల దూరానికి వాహనం ఏర్పాటు
దనమాజి 10 కిలో మీటర్లు నడిచిన తర్వాత స్థానిక మీడియా ప్రతినిధులు ఆరా తీశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు ఫోనులో వివరించారు. స్పందించిన కలెక్టర్ వెంటనే మిగితా 50 కిలోమీటర్ల దూరానికి వాహనం ఏర్పాటుచేశారు. ఘటనపై విచారణ జరిపి ఆస్పత్రి వర్గాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రమ్యపై కోడిగుడ్లతో దాడి..

కర్నాటక : పాకిస్థాన్ నరకం కాదని, శాంతి కోసం తాను పాకిస్థాన్ సందర్శిస్తానని వ్యాఖ్యానించిన నటి రమ్యపై మంగళూరు ఎయిర్‌పోర్ట్ వద్ద దాడి జరిగింది. ఆందోళనకారులు ఆమెను ఘెరావ్ చేశారు. ఆ తర్వాత గుడ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకు నటి రమ్యపై ఇప్పటికే దేశద్రోహం కేసు పెట్టారు.

ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో బాంబు బెదిరింపు ...

హైదరాబాద్ : నుంచి హౌరా వెళ్తున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో బాంబు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిలిపివేశారు. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అధికారుల వెంటపడిన సర్పం..

ఖమ్మం : పురాతన శివలింగంతో పాటు మరో రెండు విగ్రహాలను తరలిస్తున్న అధికారులను ఒక పాము పరుగులు తీయించిన ఆశ్చర్యకరమైన సంఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామానికి చెందిన భూస్వామి రాజా తన పొలాన్ని చదును చేయిస్తున్న క్రమంలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఇందులో పురాతన శివలింగం, వీరభద్రుడి విగ్రహంతో పాటు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్ మరో విగ్రహం ఉన్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు నిన్న అక్కడికి వెళ్లి విగ్రహాలను పరిశీలించారు.

గ్యాంగ్ స్టర్ డ్రైవర్‌ ఇంట్లో సోదాలు..

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో రోషన్‌ కాలనీలో గ్యాంగ్‌స్టర్‌ నయీం కారుడ్రైవర్‌ ఫయాజుద్దీన్‌ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిపి డ్రైవర్‌ భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఫయాజుద్దీన్‌ నివాసంలో ఓ సంచి, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18నే ఫయాజుద్దీన్‌ను అరెస్టు చేశారు.

విదేశీ సిగరెట్లు స్వాధీనం..

చెన్నై: అక్రమంగా రవాణా చేస్తున్న విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు చెన్నైలో స్వాధీనం చేసుకున్నారు. న్యూ మనాలీకి సమీపంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. కంటెయినర్లలోని ఫ్లైవుడ్ షీట్లలో సిగరెట్లను పెట్టి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.7 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. సింగపూర్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ వీటిని రవాణా చేస్తున్నట్లు తెలిపారు.

కుప్వారా జిల్లాలో ఎదురు కాల్పులు..

జమ్మూకశ్మీర్ : కుప్వారా జిల్లాలోని కర్నాహ్ సెక్టార్‌లో ఇవాళ భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ఓ జవానుకు గాయాలయ్యాయి. గాయాలైన జవానును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  

బీహార్, కర్ణాటకలో పర్యటించనున్న ప్రణబ్ ..

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బీహార్, కర్ణాటకలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఈ నెల 27న బీహార్ లో నలంద యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రణబ్‌ముఖర్జీ పాల్గొననున్నారు. అనంతరం రాజ్‌గిరి వద్ద నలంద యూనివర్సిటీ క్యాంపస్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. బెంగళూరులో అక్షయ పాత్ర పౌండేషన్ ఆధ్వర్యంలో జరుగనున్న ఓ కార్యక్రమంలో ప్రణబ్‌ముఖర్జీ పాల్గొని..28న తిరిగి ఢిల్లీకి పయనమవుతారని రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు.

20:40 - August 25, 2016

సూడుండ్రి తుపాకీ రాముడి కథ...కొత్త జిల్లాల కందిరీగ తుట్టె...సందడి చేస్తున్న చిన్ని కృష్ణులు...నేను సింధునవుతున్నానంటున్న సర్కారు పోరగాళ్లు..విద్యా కమిటీ చైర్మన్ కుర్సీ కోసం కొట్టుకున్న తమ్ముళ్లు..ఆటగాళ్ళను..సూడనీకి పోయినోళ్లను ఆటాడించిన రియోలో దొంగలు..భారీ వర్షాలకు కొట్టుకొచ్చిన మకరరాజం..గిటువంటి మస్తు ముచ్చట్లు మీకోసం ఈ రోజుకూడా రెడీగున్నయ్..మరి జగెందుకు ఈ వీడియోను క్లిక్ చేయుండ్రి..మస్తు ఖుషీ అవుండ్రి..

20:37 - August 25, 2016

స్టార్లు చల్లగా ఉంటారు.. వీళ్లు మాత్రం రచ్చకెక్కుతారు..స్టార్లు సఖ్యంగానే ఉంటారు.. వీళ్లు మాత్రం కుమ్ములాటలకు దిగుతారు. పిచ్చి ఇంకా ముదిరితే పొడుచుకు చంపుకుంటారు. ఇది అభిమానమా లేక దురభిమానమా? ఒకర్నొకరు హేళన చేసుకుంటూ, హీనపరుచుకుంటూ తమ హీరోలపై వెర్రితనాన్ని పెంచుకుంటున్న ఈ సంస్కృతికి ఎలా అడ్డుకట్ట వేయాలి? దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? హీరోలా? అభిమాన సంఘాల నేతలా? ఇండస్ట్రీ పెద్దలా? ఎవరు? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టొరీ చూద్దాం.. ఇప్పుడు తెలుగు సినిమా హీరోల అభిమానులకు కొన్ని ప్రశ్నలు..తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో గొప్ప? ఎవరు నంబర్ వన్? ఎవరు బాగా నటిస్తారు? ఎవరు బాగా ఫైట్లు డాన్సులు ఇరగదీస్తారు? అభిమానులుగా బట్టలు చించుకునే వారు బ్లైండ్ గా మా హీరో అంటే మా హీరొనే అని చెప్తారు..నో డౌట్. ఇవేవీ కారణాలు కాకపోయినా.. మా కులానికి చెందిన హీరోనే గొప్ప అనేవాళ్లూ ఉండొచ్చు. అంతవరకు ఎలాంటి సమస్య లేదు. కానీ, ఆ గుడ్డితనం మరొకరి ప్రాణాలు తీసేదైతే మాత్రం అది క్షమించరాని నేరం.. మళ్లీ అదే ప్రశ్న.. పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు.. ఎవరు గొప్ప.. ? వీరిలో ఎవరెవరికి శత్రువులు, ఎవరెవరికి మిత్రులు.. మీ హీరోలకు స్పష్టత ఉంది.. మరి అభిమానులుగా చించుకుంటున్న వారికుందా? తమ తమ ఫ్యాన్స్ ని స్టార్లు ఆ దిశగా నడిపిస్తున్నారా? అలా నడిపిస్తే వినోద్ రాయల్ చనిపోయి ఉండేవాడా? ఫ్లెక్సీ చింపితే అక్కడ రచ్చ రచ్చే.. వివరాలు చిన్న బ్రేక్ తర్వాత..ఇది మొదటిది కాదు... గతంలోనే ఫ్లెక్సీలు తగలబెట్టుకున్నారు.. కుమ్ములాటలకు దిగారు.. దాడులు చేసుకున్నారు. ధియేటర్లు ధ్వంసం చేశారు.. మీంటింగులు రసాభాస చేసారు.. అన్నిటి వెనుకా ఉన్నది అదే దురభిమానం. అదే పిచ్చి పీక్స్ కు చేరిన అభిమానం.. ఇప్పుడు ప్రతి హీరోకో అభిమానం సంఘం ఉంది. ఈ సంఘాలు సేవా కార్యక్రమాలకు, సమాజానికి పనికొచ్చే పనులకు మాత్రమే పరిమితమయితే ఆ హీరోకి ఈ అభిమానులకు పేరొస్తుంది. కానీ, దాడులకు హింసకు పాల్పడితే ఆ హీరో తలదించుకోవాల్సి వస్తుంది. అభిమానులు ఊచలు లెక్కలు పెట్టాల్సి ఉంటుంది. లాజిక్ మిస్సైతే అభిమానం లేదు.. హీరో లేడు.. అంతా ట్రాష్ అనే వరకు రాక తప్పదు. అయ్యా అభిమానులూ... మీ హీరో చల్లగా ఉన్నాడు. ఇతర హీరోలతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు.. ఎటొచ్చీ మీకే పిచ్చి ముదురుతోంది. అభిమానం దురభిమానంగా మారుతోంది. దీన్ని కులానికి, ప్రాంతానికి అన్వయించుకుని హింసకు పాల్పడుతున్నారు. సినిమా జీవితంలో ఓ వినోద సాధనం.. అందులో నటించే హీరో.. ఓ నటుడు మాత్రమే. అతడే జీవితమనుకునే అబ్సెషన్ లో బతికితే చేజారేది మీ జీవితమే.. బీకేర్ ఫుల్.  

20:26 - August 25, 2016

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య వార్‌ కొనసాగుతోంది. మహాత్మా గాంధీ హత్యకు సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాపై తన పోరు కొనసాగుతుందని రాహుల్‌ ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమని ఆరోపించిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఆర్‌ఎస్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమని ఎప్పుడూ అనలేదని రాహుల్‌గాంధీ బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.

20:24 - August 25, 2016

హైదరాబాద్ : పటాన్‌చెరువు గీతం యూనివర్సిటీ బీటెక్‌ విద్యార్థులు నూతన వాహనాన్ని రూపొందించారు. 45 డిగ్రీలు కోణంలో ఉన్న ఏటవాలు ప్రాంతాన్ని కూడా ఎక్కడం దీని ప్రత్యేకత. ఐదు లక్షల వ్యయంతో.. ట్రాక్టర్‌ రూపంలో ఉండే "ఆల్‌టరైన్‌ వెహికల్‌"ను 28 మంది బీటెక్‌ విద్యార్థులు తయారుచేశారు. నాలుగు సంవత్సరాలు కష్టపడి ఈ వెహికల్‌ను తయారుచేశామని..మెట్లను సైతం ఈ వెహికల్‌ ఎక్కగలుగుతుందని విద్యార్థులు చెప్పారు. ఈ వాహనంతో ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ న్యూ ఇరా ఇంజనీరింగ్‌ నిర్వహిస్తున్న జాతీయస్థాయి పోటీలో పాల్గొంటామని విద్యార్థులు చెప్పారు.

20:17 - August 25, 2016

మెదక్ : జిల్లాలో జిల్లాల పునర్విజన మండలాల్లో మంటలు రేపుతోంది. సంగారెడ్డి జిల్లాలోనే అల్లదుర్గం, రేగోడ్ మండలాలను కలపాలని వేరే ప్రాంతంలో కలిపోద్దంటూ అల్లదుర్గం ప్రధాన రహదారిపై గ్రామస్తులు, అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. అదే దారిలో వెళుతున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి , కాంగ్రెస్ నేత శ్రవణ్ లు ఆందోళన చేస్తున్న గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో తుగ్గక్ పాలన సాగుతోందని జిల్లాలకు సంబంధం లేకుండా లేని మండలాలను వేరే జిల్లాలో కలుపుతున్నారని సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు.

20:14 - August 25, 2016

నెల్లూరు: క్రీడలు.. దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చేవి. క్రీడలు.. ఫిజికల్ ఫిట్‌నెస్‌ను, మానసిక ఉల్లాసాన్నిచ్చేవి. రియో ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన పీవీసింధు, సాక్షిమాలిక్‌లకు నగదు పురస్కారాలు అందించడంపై ఇప్పుడు చర్చ మొదలైంది. తమనూ ప్రోత్సహిస్తే పతకాలపంట పండిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలోని పలువురు క్రీడాకారులు.

విదేశాలు పతకాల పంట..స్వదేశానికి సింగిల్ పతకం
క్రీడల్లో విదేశాలు పతకాల పంట పండిస్తుంటే .. మన దేశంలో సింగిల్ డిజిట్ కే పరిమితమవ్వాల్సి వస్తోంది. క్రీడల్లో ప్రోత్సాహం లేకపోవడంవల్లే పతకాలు సాధించడంలో వెనకబడి ఉన్నామా అనే అనుమానం రాకమానదు. ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తే సింధు లాంటి క్రీడాకారులు వందల మంది తయారవుతారంటున్నారు నెల్లూరు జిల్లాలోని క్రీడాకారులు.

మెడల్స్ సాధించిన సింధు, సాక్షిమాలిక్ లు
బ్యాడ్మింటన్‌ స్టార్‌ సింధు, రెజ్లర్‌ సాక్షిమాలిక్ లు రియోఒలంపిక్స్‌లో మెడల్స్ సాధించి భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడేలా చేశారు. ఇది సంతోషించదగ్గ విషయమే. కేవలం రెండు పతకాలకే పరిమితమై విజేతలకు కోట్ల రూపాయల నజరానాలు ప్రకటించడం సరి కాదంటున్నారు పలువురు క్రీడాకారులు. అదే ధనాన్ని గ్రౌండ్ల అభివృద్దికి,క్రీడాకారుల ప్రోత్సహానికి వెచ్చించాలని కోరుతున్నారు .

క్రీడాకారుల పట్ల చిన్నచూపు చూస్తున్నారంటున్న క్రీడాకారులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస అవసరాలయిన గ్రౌండ్లు, కోచ్‌ల ఊసేలేదని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర క్రీడా విధానాలను అమలుచేస్తే ఎందరో క్రీడాకారులు వెలుగులోకివచ్చి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తామంటున్నారు.

ప్రైవేట్‌స్కూళ్లలో కనీసం గ్రౌండ్ లేని వైనం
నెల్లూరు జిల్లాలో 3 వేల 4వందల ప్రభుత్వ , 813 ప్రైవేట్ స్కూళ్లు ఉన్న కేవలం వందల సంఖ్యలోనే క్రీడాకారులు పరిమితమవుతున్నారు. పాఠశాలస్థాయి నుండే పిల్లలకు క్రీడలపై ఆసక్తిని పెంచాలని కోరుతున్నారు. అటు తల్లిదండ్రుల్లోను ర్యాంకుల దాహం తప్ప ఫిజికల్ ఫిట్‌నెస్‌ను కల్పించడం లేదంటున్నారు క్రీడాకారులు. ప్రైవేట్‌స్కూళ్లలో కనీసం గ్రౌండ్ కూడా ఉండడంలేదని అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వేళ్లమీద లెక్కపెట్టేలా ఆటస్థలాలు..
నెల్లూరు జిల్లాలోని స్టేడియంలను పెద్ద పెద్ద గ్రౌండ్లను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. నెల్లూరులోని ఏపీ సుబ్బారెడ్డి స్టేడియం, వీఆర్సీగ్రౌండ్ ,కావలి, గూడూరు, ఆత్మకూరులో మాత్రమే గ్రౌండ్స్‌ ఉన్నాయి. చిన్నా,పెద్దా ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం ఉన్న అరకొర గ్రౌండ్లనే వాడుతున్నారు. తమ పాఠశాలలో గ్రౌండ్ లేకనే 3 కిలోమీటర్లు దూరం నుంచి వచ్చి గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు మరికొందరు విద్యార్థులు.

క్రీడలను ప్రోత్సహించాలంటున్న క్రీడాకారులు,కోచ్ లు
క్రీడాకారుల ప్రోత్సహానికి ప్రభుత్వాలు ఎప్పుడు చర్యలు చేపడతాయో అప్పుడే దేశానికి పేరు తెచ్చే క్రీడాకారులు తయారవుతారని క్రీడాకారులు, కోచ్ లు అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైన ఉందంటున్నారు.  

19:59 - August 25, 2016

గుంటూరు : వెలగపూడిలోని ఏపీ తాత్కాలిక సచివాలయంలో మంత్రుల కార్యాలయాల తరలింపు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఏడు శాఖల మంత్రుల కార్యాలయాలను వెలగపూడిలో ప్రారంభించగా రేపు ఉదయం మరో ఇద్దరు మంత్రులు తమ కార్యాలయాలను ప్రారంభించచున్నారు..దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

19:53 - August 25, 2016

ఖమ్మం : నిత్యం ఎక్కడో అక్కడ రోడ్లు రక్తమోడుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. అతివేగం కన్నా ప్రాణం ముఖ్యమన్న భావనను మరిచారు వాహనదారులు. రోడ్లపై వేగంగా ప్రయాణించి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అయినా వాటి నుండి పాఠాలు నేర్చుకోవడం లేదు.

సాగర్‌కాల్వలో పడిన ప్రయివేట్ బస్
ఖమ్మం జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈనెల 21 వ తేదీన నాయకన్‌గూడెం వద్ద అతివేగంగా వచ్చి ప్రైవేట్ బస్సు సాగర్‌కాల్వలో పడింది. గతంలోనే ఈ ప్రాంతంలో పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. కాని అధికారులు కేవలం ముళ్లకంపను అడ్డుగా పెట్టి సరిపెట్టారు. ఇలాంటివి కేవలం ఉదాహరణలే నిత్యం వందలాది వాహనాలు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది.

అంటు వ్యాధుల మరణాలకన్నా రోడ్డు ప్రమాద మరణాలే ఎక్కువ
నాయకన్‌గూడెం నుండి దేవరపల్లి వరకు రాష్ట్రీయ 42వ రహదారి 162 కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఈ రహదారిపై ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా అమాయకప్రజలు ప్రాణాలు వదులుతున్నారు. అంటువ్యాధుల కారణంగా మరణించే వారి కంటే రోడ్డు ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉందంటే ప్రమాద స్థాయిని అర్థం చేసుకోవచ్చు.

జూలై 13 న పాదచారులను ఢీకొట్టిన లారీ ముగ్గురు మృతి
జూన్ 3 న తిరుమలాయపాలెం మండలం బచ్చోడు వద్ద ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పక్కనే ఉన్న కాల్వలో ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. జూలై 13 న లారీడ్రైవర్ అతివేగం కారణంగా రోడ్డు మీద వెళ్తున్న పాదచారులను ఢీకొట్టడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

జాతీయరహదారిపై 220 ప్రమాదాలు జరగగా, 49 మంది మృతి
గతేడాది అక్టోబర్ 22న కొణిజర్ల మండలంలో ద్విచక్రవాహనాలు అతివేగంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మరణించారు. ఇదే ఏడాది డిసెంబర్ 31న వీఎం బంజర వద్ద పెళ్లి వేడుకలకు వెళ్లి వస్తున్న బొలేరో వాహనం చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రరహదారులపై 463 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అందులో 156 మంది మరణించగా..578 మంది గాయపడ్డారు. జిల్లా గుండా వెళ్లే జాతీయరహదారిపై 220 ప్రమాదాలు జరగగా,49 మంది మృతి చెందారు.

2014 లో ప్రమాదలకు గురై 19 మంది, 2015లో 9 మంది
2014 లో చూసుకుంటే రాష్ట్రరహదారులపై 15 చోట్ల బ్లాక్ స్పాట్స్ ను గుర్తించారు ఆర్టీఏ అధికారులు. ఈ బ్లాక్ స్పాట్స్‌ లో 45 మంది మృతిచెందగా.. 2015లో 36 మంది, 2016 లో 25 మంది మరణించారు. జాతీయరహదారులపై బ్లాక్‌స్పాట్స్‌లో 2014 లో జరిగిన ప్రమాదాలలో 19 మంది, 2015 లో 9 మంది మృత్యువాతపడ్డారు. వేర్వేరు ఘటనల్లో ఎనిమిది నెలల కాలంలో 67 బస్సులు ప్రమాదానికి గురవగా 19 మంది మరణించారు. 211 లారీలు,ట్రక్కులు ప్రమాదానికి గురయి 71 మంది మరణించారు. దాదాపు 161 కార్లు ప్రమాదానికి గురవగా.. 46 మంది మృత్యువాతపడ్డారు. 243 ద్విచక్రవాహనాలు ప్రమాదానికి గురవగా 84 మంది మృత్యువాతపడ్డారు.

అవగాహనతో ప్రమాదాలు తగ్గుతాయంటున్న నిపుణులు
కోటి రూపాయల వ్యయంతో కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద విశ్రాంతి భనాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర రవాణాశాఖమంత్రి గొప్పగా చెప్పారు. కాని అవి అమలుకు నోచుకోవడం లేదు. వాహనదారులకు విశ్రాంతి గదులు నిర్మించి... అతివేగంపై అవగాహన కల్పిస్తే.. కొంతమేరకైనా ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

19:47 - August 25, 2016

హైదరాబాద్ : గోకుల్ చాట్ లో పేలుళ్లకు తొమ్మిదేళ్లు పూరైన సందర్భంగా...అలనాటి ప్రమాదంలో మృతిచెందిన వారికి పలువురు నివాళులు అర్పించారు. హైదరాబాద్ కోఠిలోని గోకుల్ చాట్ వద్ద భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, సీపీఐ తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేలుడులో కన్ను కోల్పోయిన బాధితుడు రషీద్ తనకు ఇంతవరకు ప్రభుత్వ సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరాడు.

19:44 - August 25, 2016

హైదరాబాద్ : నయీం బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పోలీసుల ఎన్ కౌంటర్ తర్వాత నయీం టీమ్ చేసిన అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భువనగిరి పట్టణానికి చెందిన నందిని ఎలక్ట్రికల్ షాపు యాజమాని నరహరి షాపు నిర్మాణం చేపట్టిన సమయంలో నయూం ప్రధాన అనుచరుడు పాశం శ్రీను బెదిరించాడని వాపోయాడు. అనంతరం నయీం దగ్గరకు తీసుకెళ్లడంతో 2 కోట్ల రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే నీ పిల్లలను, భార్యను చంపుతానని నయీం బెదిరించడంతో 25 లక్షల రూపాయలు చెల్లించి బయటపడ్డానని తెలిపాడు. 

19:41 - August 25, 2016

మహబూబ్‌నగర్ : నారాయణ పేటలో కొడంగల్‌ ఎత్తిపోతల నిర్వాసితులు నిరాహార దీక్ష చేపట్టారు. నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతలకు సంబంధించిన జీవో 69 అమలు చెయ్యాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ దీక్షకు టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ మద్దతు తెలిపారు. ప్రభుత్వం ప్రజల డిమాండ్లను పరిష్కరించకపోతే .. ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

19:28 - August 25, 2016
19:20 - August 25, 2016
19:13 - August 25, 2016

హైదరాబాద్ : మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్ష నేతల విమర్శలు గుప్పిస్తున్నారు. మరాఠా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం కేసీఆర్ విపక్షాలపై తీవ్ర పదజాలయంతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై విపక్షాలు కూడా అదేస్థాయిలో విమర్శలు గుప్పించారు.

వీధి నాయకుడ్లా కేసీఆర్ మాటలు : భట్టి
సీఎం కేసీఆర్‌ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌పై చేసిన వ్యాఖ్యలను వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి విధి పోరాటానికి దిగిన నాయకుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ అడుగుడగునా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మహా ఒప్పందం తెలంగాణ కు ద్రోహం : రేవంత్ రెడ్డి 
టీ-సర్కార్‌పై టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఫైరయ్యారు. మహారాష్ట్రతో ఒప్పందాలతో కేసీఆర్‌ తెలంగాణ సమాజానికి దగా చేశారని ఆయన మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 148 మీటర్లకే పరిమితం చేస్తే 25 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుంటామని అదే.. 152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే 160 టీఎంసీల నీటీని వినియోగించుకోవచ్చని అన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ప్రాజెక్టుల ఎత్తును తగ్గించారని రేవంత్‌ ప్రశ్నించారు.

ఒప్పందం పేరుతో మామా అలుళ్ళ దోపిడీ : మధుయాష్కి
సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత మధుయాష్కి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహా ఒప్పందం పేరుతో మామ అల్లుళ్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. 

18:42 - August 25, 2016

ఖమ్మం : 10 టీవీ కథనానికి ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో కదలిక వచ్చింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలోని మల్లాయిగూడెం, గుమ్మడవల్లి గిరిజన గ్రామాల్లో ప్రజలు కిడ్నీవ్యాధులతో బాధపడుతున్నారని 10 టీవీ కథనం ప్రసారం చేసింది. ఇప్పటికే గ్రామాల్లో కిడ్నీ సమస్యలతో నలుగురు చనిపోగా.. పదులసంఖ్యలో ప్రజలు బాధపడుతున్నారు. గిరిజన గ్రామాల్లో మృత్యు ఘంటికలు పేరుతో టెన్‌ టీవీ గ్రౌండ్‌ రిపోర్ట్‌ను ప్రసారం చేసింది. దీన్ని చూసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మల్లాయిగూడెం గ్రామంలో పర్యటించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్యం చేయిస్తానని.. అలాగే కిడ్నీ వ్యాదితో చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు.  

18:36 - August 25, 2016

అనంతపురం : రాయదుర్గంలో చిరుత కలకలం సృష్టించింది. పట్టణంలో రెండు చిరుతలు సంచరించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చిరుతలను చూసిన ప్రజలు అక్కడి నుండి పరుగులు తీశారు. అయితే కొందరు ముళ్లపోదల్లో ఉన్న చిరుతలను పట్టుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా ఒక చిరుత చిక్కగా మరో చిరుత తప్పించుకుపోయింది. దీంతో ఇంకా గ్రామంలో టెన్షన్ కొనసాగుతోంది. అటవీశాఖ అధికారులు తప్పించుకున్న చిరుతను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

18:35 - August 25, 2016

ఆస్ట్రేలియా: క్వీన్స్‌ల్యాండ్‌ వేదికగా జరుగుతున్న రెడ్‌బుల్‌ సర్ఫింగ్‌ చాలెంజ్‌లో టాప్‌ క్లాస్‌ సర్ఫర్లు అదరగొడుతున్నారు.రాకాసి అలలపై.....ప్రతి కూల వాతావరణంలోనూ సర్ఫింగ్‌ చేసి ఔరా అనిపిస్తున్నారు. ప్రపంచంలోనే ది బెస్ట్‌ సర్ఫర్లుగా పేరున్న రమైనా వాన్‌ బస్టోలర్‌, పోటో డేవిడ్‌, జెరోమ్‌ శాయోన్‌ 10 మీటర్ల ఎత్తులో ఎగసిపడుతున్న అలలపై సునాయాసంగా ఫీట్స్‌ ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరచారు.

18:30 - August 25, 2016

ఢిల్లీ : దహి హండి పేరిట ఉట్టి కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్ ఎత్తు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కృష్ణభక్తులు వ్యతిరేకిస్తున్నారు. ముంబైలోని దాదర్ ప్రాంతంలో కృష్ణభక్తులు 20 అడుగుల మానవ పిరమిడ్ రూపంలో నేలపై పడుకుని నిరసన తెలిపారు. ఉట్టి కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్ ఎత్తు 20 అడుగులు మించవద్దని, 18 ఏళ్లలోపు వారు ఉత్సవంలో పాల్గొనవద్దని బాంబే ఇచ్చిన హైకోర్టు తీర్పునే కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎత్తు పెంచాలంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ అంతకు మించి ఎత్తు పెంచలేమని సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది. మహారాష్ట్రలో కృష్ణాష్టమి సందర్భంగా దహి హండి పేరుతో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహిస్తారు.

18:25 - August 25, 2016

హైదరాబాద్ : హైద్రాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్ధిగా తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అభ్యర్ధిని ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి కల్లా ఎంఎల్‌సి గడువు ముగుస్తుంది. ఈనేపథ్యంలో యూటీఎఫ్ తరుపున సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్‌రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో యూటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చావా రవి ప్రకటించారు. మండలిలో ప్రజల పక్షాన నిలబడే ప్రజల గొంతుక అవసరం ఉందని అది మాణిక్ రెడ్డి అయితే మరింత ఉపయోగకరంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య అభిప్రాయపడ్డారు. మాణిక్‌రెడ్డి గెలుపునకు అందరూ కలిసిరావాలని చుక్కా రామయ్య పిలుపునిచ్చారు. 

18:22 - August 25, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ నిర్వహణ వ్యయం తడిచి మోపడవుతోంది. నెల నెలా ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇందుకు అనుగుణంగా ఆదాయం లేకపోవడంతో ఖజానా ఖాళీ అయ్యింది. ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చకముందే ఒట్టిపోయిన ఖజానాను నింపుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులు రకరకాల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆస్తి పన్ను, వ్యాపార లైసెన్స్‌ల ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు.

కళకళలాడిన బల్దియా ఖజానా ఇప్పుడు ఖాళీ
కొన్నేళ్లుగా కళకళలాడిన బల్దియా ఖజానా ఇప్పుడు ఖాళీ అయింది. జీహెచ్‌ఎంసీ దగ్గర పట్టుమని పదికోట్ల రూపాయలు నిధులు కూడా లేకపోవడంతో అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. సిబ్బంది జీతాలు, కార్మికలు వేతనాలు, ఉద్యోగ విరమణ చేసిన వారికి పించన్లు చెల్లించేందుకు కూడా నిధులు లేకపోడంతో అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే తరుణోపాయాల్లో భాగంగా ఆదాయం పెంపు మార్గాలపై దృష్టి పెట్టారు.

నెలవారీ కనీస ఖర్చు రూ.150 కోట్లు
జీహెచ్‌ఎంసీ ఖర్చులు పెరుగుతున్నాయి. నెలవారీ ఖర్చులకు కనీసం 150 కోట్లు కావాల్సి ఉంది. దీంతో ఆదాయం పెంపు మార్గాలను అన్వేషిస్తున్నారు. రావాల్సిన పన్నులను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్తిపన్నుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈసారి వంద కోట్ల రూపాయలు ఎక్కువగా వసూలు చేయగలిగారు. వ్యాపార లైసెన్స్‌ ఫీజును కూడా బాగానే రాబట్టారు. గతేడాది మొత్తంమీద 24 కోట్లు వసూలైతే... ఈ సంవత్సరం ఇంతవరకు 26 కోట్ల రూపాయలు వచ్చింది. దీనిని మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టారు.

బకాయిదారుల నుంచి రావాల్సిన రూ.34 కోట్ల ఆదాయం
ఆస్తిపన్ను, ట్రేడ్‌ లైన్స్‌ ఫీజు బకాయిదారులపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝుళిపించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. ప్రతి సర్కిల్‌లో వందమంది వంతున ఆస్తిపన్ను, ట్రేడ్‌ లైసెన్స్‌ బకాయిదారులను గుర్తించారు. వీరి నుంచి పన్నులు రాబడితే 34 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ భూముల్లో ఉన్న నిర్మాణాలను గుర్తించి, పన్ను వసూలుకు డిమాండ్‌ నోటీసులు పంపాలని నిర్ణయించారు. ఆదాయం పెంచుకునేందుకు బల్దియా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. 

18:16 - August 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో ప్రాజెక్టులపై చేసుకున్న మహా ఒప్పందం చారిత్రక నేరం అని తెలంగాణ రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. మహారాష్ట్రతో ఒప్పందమైనట్టు ప్రాజెక్టుల ఎత్తు తగ్గిస్తే...అది తెలంగాణకు ఐరావతం అవుతుంది కాని చరిత్రాత్మకం ఎలా అవుతుందని ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల...మహారాష్ట్రకు తలొగ్గి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని జస్టిస్ చంద్రకుమార్ విమర్శించారు.

18:13 - August 25, 2016

కరీంనగర్‌ : జిల్లాలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీటి కోసం టీడీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తం మారింది. పెద్దపల్లి నియోజకవర్గంలోని రైతాంగానికి నీటిని అందించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయ రమణ ఆధ్వర్యంలో రైతులు సుల్తానాబాద్‌లోని డీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎవరూ రాకపోవడంతో.. కార్యకర్తలు కార్యాలయం తాళం పగులగొట్టి ఫర్నీచర్‌, అద్దాలు ధ్వంసం చేశారు. రోడ్డుపైన వెళ్తున్న ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. 

18:06 - August 25, 2016

కశ్మీర్: కశ్మీర్‌ కల్లోల పరిస్థితులపై 20 పౌర సంఘాలు, 3 వందల మంది ప్రతినిధులతో మాడ్లాడినట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు అందరూ సహకరించాలని కోరినట్లు మంత్రి తెలిపారు. కశ్మీర్‌ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన రాజ్‌నాథ్- యువత చేతుల్లో పెన్ను, కంప్యూటర్లకు బదులు కొందరు రాళ్లు ఇచ్చి వారిని రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. కశ్మీర్‌లో సాధారణ స్థితి తెచ్చేందుకు త్వరలో అఖిలపక్ష కమిటీని పంపే యోచనలో ఉన్నట్లు సిఎం మెహబూబా ముఫ్తితో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు.

18:05 - August 25, 2016

విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్‌ పనులను యుద్ధప్రతిపాదికన చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకపై ప్రతినెల ప్రాజెక్ట్‌ పనులను పరిశీలిస్తానని పోలవరం సమీక్షలో భాగంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం వెంటనే పోలవరం పనులకు గానూ 1700 కోట్లు కేటాయించాలని ఈ సందర్భంగా తెలిపారు.

18:00 - August 25, 2016

ఢిల్లీ : అద్దె గర్భం కావాలా? అయితే భారతదేశమే కరక్ట్.. తక్కువ డబ్బుతో అద్దె గర్భం కావాలా? భారత్‌ వెళ్లండి.. ఇకపై ఇలాంటి పనులకు దేశంలో ఆస్కారం లేదు.. అనైతిక అద్దెగర్భాలకు చెక్‌పెట్టే కీలక బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన 10 నెలల తర్వాత ఈ బిల్లు నోటిఫై అయ్యే అవకాశముంది..

చట్టాన్ని అతిక్రమిస్తే పదేళ్ల జైలు, రూ.10లక్షల జరిమానా
అనైతిక అద్దెగర్భాలను కట్టడిచేసే ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ నేతృత్వంలో.. జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్‌, హర్‌సిమ్రత కౌర్‌ బాదల్‌లతో కూడిన మంత్రుల బృందం ఈ బిల్లు తయారీకోసం కసరత్తు చేసింది.. దాదాపు ఏడాదికాలం సుదీర్ఘ సంప్రదింపులు జరిపి పకడ్బందీగా బిల్లు తయారుచేసింది.. సరోగసీ విధానాన్ని అనైతికంగా వినియోగించే వీల్లేకుండా జాగ్రత్తలను ఈ బిల్లులో సూచించింది.. చట్టాన్ని అతిక్రమించిన వారికి 10 ఏళ్లు జైలు శిక్షతో పాటు, రూ.10లక్షల జరిమానా విధించేలా బిల్లులో నిబంధనలున్నాయి..

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సరోగసీ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ సరోగసీ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు.. ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందిన 10 నెలల తర్వాత ఈ కొత్త చట్టాన్ని నోటిఫై చేస్తామని మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు.... సరోగసీ ద్వారా గర్భం దాల్చిన మహిళలు ప్రసవించేందుకు ఈ సమయం ఇస్తున్నామని చెప్పారు.. ఈ బిల్లు ద్వారా అద్దెగర్భాలు వాణిజ్యమయం కాకుండా అడ్డుకోవడంతోపాటు.. అనైతిక చర్యలను నిషేధించగలుగుతామని సుష్మ స్పష్టం చేశారు..

పెళ్లికాని వారు,సింగిల్‌ పేరెంట్స్, సహజీవనం చేసేవారు, స్వలింగ సంపర్కులు
ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. పెళ్లి కాని యువతీ యువకులు, సింగిల్‌ పేరెంట్స్‌, సహజీవనం చేసే వారు, స్వలింగ సంపర్కులు అద్దెగర్భం ద్వారా పిల్లలను పొందే అవకాశం ఉండదు... విదేశీయులు, ఎన్‌ఆర్‌ఐలు, పిఐవోలూ ఇకపై అద్దెగర్భం ద్వారా పిల్లలను పొందడం సాధ్యంకాదు.. పిల్లలు కావాలంటే వీరంతా దత్తత తీసుకోవాలని సుష్మ సూచించారు..

పెళ్లైన ఐదేళ్ల తరువాతే సరోగసీకి తల్లిదండ్రులు అర్హులు
అంతేకాదు.. ఈ బిల్లు ప్రకారం పెళ్లైన ఐదేళ్ల తరువాత మాత్రమే అద్దెగర్భం ద్వారా పిల్లలను పొందేందుకు తల్లిదండ్రులు అర్హులౌతారు.. భార్యాభర్తల్లో ఉన్న లోపాన్ని డాక్టర్‌ ద్వారా నిర్ధారించాకే సరోగసీకి అనుమతి దొరుకుతుంది.. అలాగే వృద్ధాప్యంలో అద్దెగర్భం ద్వారా పిల్లల్ని కనడానికి వీలుకాదు.. భార్యకు 23 నుంచి 50 ఏళ్లు, భర్తకు 26 నుంచి 55 ఏళ్లవయసుఉంటేనే సరోగసీకి అధికారులు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తారు.. ఈ అర్హతలన్నీ ఉన్నాకూడా పిల్లలు కావాలనుకునేవారు అద్దెగర్భంకోసం తమ దగ్గర బంధువులను మాత్రమే ఎంచుకోవాలి.. పైగా మహిళలు ఒక్కసారి మాత్రమే తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వాలి.. సరోగసీద్వారా పుట్టిన బిడ్డలకు తల్లిదండ్రులెవరో ఈ బిల్లులో స్పష్టంగా తెలియజేశారు.. పిల్లల కోసం అద్దెగర్భం కావాలనుకున్న వారే నిజమైన తల్లిదండ్రులవుతారు. సాధారణంగా పుట్టిన చిన్నారులకు లభించే హక్కులన్నీ అద్దెగర్భం ద్వారా పుట్టిన పిల్లలకూ వర్తిస్తాయి..

జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో సరోగసీ బోర్డులు ఏర్పాటు..
ఈ బిల్లు చట్టరూపం దాల్చినతర్వాత పక్కాగా అమలుచేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.. ఇందుకోసం జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో సరోగసీ బోర్డులను ఏర్పాటుచేస్తామని సర్కారు ప్రకటించింది.. అద్దెగర్భం కోరుకుంటున్నవారు ముందుగా ఈ బోర్డులలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలి..

సరోగసీ సెలబ్రిటీలకు ఫ్యాషన్‌ అయిందన్న మంత్రి సుష్మాస్వరాజ్
సరోగసీ బిల్లు ప్రెస్‌మీట్‌లో కొందరు సెలబ్రిటీలపై సుష్మ విమర్శలు గుప్పించారు.. అద్దె గర్భం ద్వారా పిల్లలను పొందడం సెలబ్రిటీలకు ఫ్యాషన్‌ అయ్యిందని మండిపడ్డారు.. పురిటి నొప్పులు భరించలేక.. డబ్బులిస్తే ఎవరో ఒకరు బిడ్డలను కనిపెడతారన్న ధోరణి మంచిదికాదన్నారు.... దీనివల్ల సమాజంలో అనైతికత పెరిగిపోతుందని సుష్మాస్వరాజ్‌ సూచించారు... గ్రామాల్లో పలువురు దళారులు గిరిజన మహిళలను ప్రలోభపెట్టి అష్టకష్టాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శిశువుల్ని అనాధలు చేసి వెళ్లిపోవడానికి వీలువుండదు
సరోగసీకి సంబంధించి మనదేశంలో ఇంతవరకూ నిర్దిష్టమైన విధానమంటూలేదు.. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే అనైతిక సరోగసీకి అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది.. అద్దెగర్భం ద్వారా ఆడపిల్లలు, వికలాంగులు పుట్టారంటూ శిశువుల్ని అనాధలు చేసి వెళ్లిపోవడానికి వీలుండదు.. 

బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు..

హైదరాబాద్ : బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పాడ్డాయి. ఉత్తర,పవ్చి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డంతో ఈ ప్రభావంతో ఈ నెల 26న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురుగా జల్లులు పడేఅవకాశమునట్లుగా వాతావరణ శాఖ తెలిపింది.

సుల్తానాబాద్ లో టీడీపీ ఆందోళన...

కరీంనగర్ : సుల్తానాబాద్ లో టీడీపీ ఆందోళన చేపట్టింది. ఎస్ ఆర్ఎస్పీ నుండి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుల్తానాబాద్ లోని డీఈ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఫర్నీచర్ ను కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు. అదేసయమంలో రోడ్డుపై వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్ అద్దాలను కూడా కార్యకర్తలు ధ్వంసం చేశారు.

టిప్పర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్..15మందికి గాయాలు..

హైదరాబాద్ : హయత్ నగర్ మండలం బాటసింగారం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ ను ఆర్టీసీ బసు ఢీకొంది. ఈ ఘటనలో 15మందికి గాయాలయ్యాయి. హైదారాబాద్ నుండి సూర్యాపేటకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

రాయదుర్గంలో చిరుతలు కలకలం..

అనంతపురం : రాయదుర్గంలో చిరుతలు కలకలం సృష్టించాయి. పట్టణం నడిబొడ్బుకు రెడు చిరుతపులులు రావటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. చిరుతలను పట్టుకునేందుకు గ్రామస్థులు యత్నించారు. 

16:42 - August 25, 2016

నేటికి మహిళలపై వివక్ష కొనసాగుతోంది. పలు రంగాల్లో ఇంకా వివక్ష కొనసాగుతోంది. ఈనెల 27వ తేదీన అంరాత్జీయ మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా మానవి 'వేదిక'లో టెన్ టివి చర్చ చేపట్టింది. ఈ చర్చలో ఉస్మానియా ప్రొ. లక్ష్మీ, అడ్వకేట్ మూర్తిలు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికాలో మహిళలు ఉద్యమించారని, చట్టాలు అమలు చేయడం కాదు..పటిష్టంగా అమలు పరచాలని ప్రొ.లక్ష్మీ తెలిపారు. నిర్భయ చట్టం వచ్చిన తరువాత మహిళలపై హింస పెరిగిపోయిందన్నారు. మహిళ పుట్టే సమయం నుండి వివక్ష ఆపాలని, మహిళ పుడుతుందని తెలిసి పలు చర్యలకు పాల్పడుతున్నారని అడ్వకేట్ మూర్తి తెలిపారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

హైకోర్టు వ్యాఖ్యలతో ఆరోపణలు బలపడుతున్నాయి : బాబూరావు

విజయవాడ : స్విస్ ఛాలెంజ్ పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు బలపడుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు తెలిపారు. సింగపూర్ కంపెనీలకు మేలు చేసేందుకే ఈ పద్ధతి అని, రూ. 306 కోట్లు పెట్టుబడులు పెట్టిన సింగపూర్ కంపెనీలకు రూ. 16,900 కోట్ల విలువైన భూములు ఇవ్వడం ఏంటనీ ప్రశ్నించారు. 

బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం..

హైదరాబాద్ : హయత్ నగర్ (మం) బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్ నుండి సూర్యపేటకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

కేసీఆర్ బెదిరిస్తే భయపడం - వీహెచ్

హైదరాబాద్ : కేసీఆర్ అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని, జైల్లో పెడతామని కేసీఆర్ బెదిరిస్తే ఎవరూ భయపడరని కాంగ్రెస్ నేత వీహెచ్ పేర్కొన్నారు. జైలుకు వెళ్లడం కాంగ్రెస్ కార్యకర్తలకు కొత్తేమీ కాదన్నారు. కేసులు పెట్టిన రోజే టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, మహారాష్ట్రకు మూడు వేల ఎకరాలు లాభం చేకూర్చి సంబరాలు చేసుకుంటున్నారని వీహెచ్ విమర్శించారు. 

ఒపికే లేకుంటే రాజకీయాలు వదలాలి - మల్లు రవి

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు ఓపిక లేకుంటే రాజకీయాలను వదిలిపెట్టాలని కాంగ్రెస్ నేత మల్లు రవి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను కేసీఆర్ సన్నాసులు అనడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ వ్యాఖ్యలతో శాంతిభద్రతల సమస్యల తలెత్తే ప్రమాదం ఉందన్నారు. 

రెండో రోజు జమ్మూలో రాజ్ నాథ్ పర్యటన..

జమ్మూ కాశ్మీర్ : కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కాశ్మీర్ లో పరిస్థితులపై సీఎం ముఫ్తీతో రాజ్ నాథ్ చర్చించారు. కాశ్మీర్ లో శాంతియుత వాతావరణం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.

 

కాకినాడలో టిడిపి జిల్లా సమన్వయ కమిటీ..

తూర్పుగోదావరి : కాకినాడలో టిడిపి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మంత్రి చిన రాజప్ప, ఎంపీ మురళీ మోహన్ లు హాజరయ్యారు. 

రేపు కార్యాలయాలను ప్రారంభించనున్న మంత్రులు..

గుంటూరు : తాత్కాలిక సచివాలయంలో రేపు తమ కార్యాలయాలను మంత్రులు కామినేని, బొజ్జలలు ప్రారంభించనున్నారు. ఎల్లుండి తన కార్యాలయాన్ని ప్రత్తిపాటి ప్రారంభించనున్నారు. 

ప్రాజెక్టులపై హరీష్..ఈటెల సమీక్ష..

హైదరాబాద్ : కాళేశ్వరం, శ్రీరాం సాగర్ ప్రాజెక్టులపై టి.మంత్రులు హరీష్, ఈటెలలు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. 

మహా ఒప్పందం ప్రజలకు అన్యాయం - రఘునందనరావు

హైదరాబాద్ : మహారాష్ట్రతో ఒప్పందంతో ప్రజలకు అన్యాయం చేశారని, ఎవరి ప్రయోజనాల కోసం ప్రాజెక్టు ఎత్తు తగ్గించారని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందనరావు ప్రశ్నించారు.

స్వప్రయోజనాల కోసమే డిజైన్ల మార్పు - చంద్రకుమార్

హైదరాబాద్ : మహారాష్ట్రతో ఒప్పందం తెలంగాణకు శాశ్వత గుదిబండగా మారిపోతుందని, రాష్ట్ర ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని తెలంగాణ రైతు సంఘాల జేఏసీ ఛైర్మన్ చంద్రకుమార్ పేర్కొన్నారు. స్వప్రయోజనాల కోసం ప్రాజెక్టుల డిజైన్లను మారుస్తున్నారని, రూ. 2వేల కోట్లు ఖర్చు చేస్తే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టుల పూర్తవుతాయని చంద్రకుమార్ పేర్కొన్నారు.
 

'మహా' ఒప్పందంపై పునరాలోచించాలి - రావుల

హైదరాబాద్ : మహరాష్ట్రతో ఒప్పందం ప్రజలకు ఆమోదయోగ్యం కాదని, ఒప్పందం విషయంలో పునరాలోచించి అఖిలపక్షాన్ని పిలవాలని టిడిపి నేత రావుల డిమాండ్ చేశారు. 

ఇటలీ భూకంపం..పెరుగుతున్న మృతులు..

ఇటలీ : భూకంప మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 247 మంది మృతి చెందగా 500 మందికి పైగా గాయపడ్డారు. బహుళ అంతస్తులు కూలాయి. 2009 తరువాత ఇటలీలో వచ్చిన భారీ భూకంపం ఇదే. 

కిడ్నీ బాధితుల టెన్ టివి కథనాలపై స్పందన..

ఖమ్మం : అశ్వరావుపేట (మం) మల్లాయగూడెంలో కిడ్నీ బాధితులపై టెన్ టివి ప్రసారమైన కథనాలకు స్పందన లభించింది. మల్లాయగూడెంను ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సందర్శించారు. కిడ్నీ బాధితుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 

ఎలాంటి తప్పుడు ప్రకటనలు చేయలేదు - ధర్మాన

శ్రీకాకుళం : జగన్, వైసీపీపై తప్పుడు ప్రకటనలు చేయలేదని, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. 

నిందితులను కఠినంగా శిక్షించాలి - పవన్..

చిత్తూరు : నిందితులను కఠినంగా శిక్షించాలని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. హత్యకు గురైన అభిమాని వినోద్ కుటుంబసభ్యులను పవన్ పరామర్శించారు. 

వినోద్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్..

తిరుపతి : హత్యకు గురైన అభిమాని వినోద్ కుటుంబసభ్యులను సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. 

తిరుపతిలో పవన్ రాక ..భారీ జనసందోహం..

చిత్తూరు : సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం తిరుపతికి చేరుకున్నారు. పవన్ రాకతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోలార్‌ లో హత్యకు గురైన తన అభిమాని వినోద్‌ కుటుంబాన్ని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ పరామర్శించనున్నారు.

తిరుపతికి చేరుకున్న పవన్ కళ్యాణ్..

కర్ణాటక : కోలార్‌ లో హత్యకు గురైన తన అభిమాని వినోద్‌ కుటుంబాన్ని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ పరామర్శించనున్నారు. ఇందుకోసం వినోద్ స్వగ్రామమైన చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు. 

నట్టికుమార్ వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు స్పందన..

శ్రీకాకుళం : నట్టికుమార్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. నట్టికుమార్ తన పేరు ఎందుకు ప్రస్తావించారో అర్థం కావడం లేదని, జగ్గిరెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు. దీనిని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని తెలిపారు. 

పెనుకొండ ఆర్డీవో చెక్ పోస్టుపై ఏసీబీ దాడి..

అనంతపురం : పెనుకొండ ఆర్డీవో చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 27,800 స్వాధీనం చేసుకున్నారు. మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ మల్లిఖార్జున్, హోంగార్డు శివకుమార్ లపై కేసు నమోదు చేశారు.

 

గోదావరి మధ్యలో నిలిచిన టూరిస్టు బోటు..

పశ్చిమగోదావరి : గోదావరి మధ్యలో టూరిస్టు బోటు నిలిచిపోయింది. ఇసుక దిన్నెలు తగిలి బోటు నిలిచిపోయింది. బోటులో వంద మంది పర్యాటకులున్నారు. 

10:33 - August 25, 2016

విజయవాడ : పర్లాఖిమిడి కోటలో ఏం జరుగుతోంది? కోటలోని విలువైన సంపదను కొల్లగొడుతున్నది ఎవరు? పర్లాఖిముండి కోట రాజు ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నది ఎవరు? వరుసగా సిబ్బంది ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? వారి అక్రమాలు బయటపడుతాయనే దారుణానికి తెగబడ్డారా? అసలు వారి ఆత్మహత్యలకు కారణాలేంటి? ఇవి ఆత్మహత్యలా లేక హత్యలా? ఆంధ్రా- ఒడిషా సరిహద్దులోని పర్లాఖిమిడి రాజుగారి కోటలో జరుగుతున్న హఠత్పారిణామాలు కలకలం రేపుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీని తలపిస్తున్నాయి. కోటలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వరుసగా కోట సిబ్బంది బలవన్మరణాలు కలవరం సృష్టిస్తున్నాయి. సంజయ్ పాత్రో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయలక్ష్మి, మంజరి పాత్రోలు పురుగుల మందు తాగి బలవన్మరణం చేసుకున్నారు. మరో వ్యక్తి సంతోష్ అలియాస్ కిల్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.

ఆస్తిని కాజేసే కుట్రలు..
పర్లాఖిమిడి రాజుగారి కోటకు ప్రస్తుతం గోపీనాథ్ గజపతి మహారాజుగా కొనసాగుతున్నారు. గోపీనాథ్‌కు కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు చెన్నైలో స్థిరపడగా కుమారుడు ఏడాది క్రితం చనిపోయాడు. దీంతో గోపీనాథ్‌ మహారాజు మానసికంగా కుంగిపోయారు. కోటలోని సిబ్బంది..గోపీనాథ్‌ మహారాజును బంధించి ఆస్తిని కాజేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలున్నాయి. మహారాజుకు వైద్యం అందకుండా అడ్డుకున్నారని..ఆత్మహత్యకు పాల్పడిన వారే ఇదంతా చేశారని స్థానికులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

చెన్నై ఆసుపత్రికి తరలింపు..
గోపీనాథ్‌ మహారాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్థానికులు చెన్నై ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కోటలో సిబ్బంది వరుస ఆత్మహత్యలను సీరియస్‌గా తీసుకున్న ఒడిషా సర్కార్‌.. దర్యాప్తుకు ఆదేశించింది. రంగంలోకి దిగిన క్రైమ్‌ బ్రాంచ్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఆత్మహత్యలా లేక హత్యలా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు. మంజరి ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో మూడు లేఖలను స్వాధీనం చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా గోపీనాథ్‌ మహారాజు మౌనముద్ర వీడటం లేదు. ఆత్మహత్యాయత్నం చేసిన సంతోష్‌ నోరు విప్పితే ఎలాంటి నిజాలు బయటపడుతాయో చూడాలి. మొత్తంగా పర్లాఖిమిడిలో రాజ కోట రహస్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 

నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదల..

నల్గొండ : నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు మంత్రి జగదీష్ రెడ్డి నీటిని విడుదల చేశారు. రోజుకు 8వేల క్యూసెక్కులు చొప్పున 12 రోజుల పాటు నీటి విడుదల కొనసాగనుంది.

జగన్ పై చేసిన వ్యాఖ్యలపై వివరణనివ్వనున్న ధర్మాన..

శ్రీకాకుళం : వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలపై ధర్మాన ప్రసాదరావు వివరణనివ్వనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి పోటీ చేసినా జగన్ గెలవలేదని, టిడిపికి వెనుకబడిన వర్గాల మద్దతుందని ధర్మాన వ్యాఖ్యలు చేశారు. 

కాసేపట్లో నెల్లూరుకు బాబు..

నెల్లూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 12.30గంటలకు నెల్లూరు జిల్లాకు చేరుకోనున్నారు. జ్వాలాముఖి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం ఉదయగిరి ఎమ్మెల్యే బీవీ రామారావు కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు. 

మాచర్లలో సంపూర్ణేష్ బాబు..

గుంటూరు : జిల్లాలోని మాచర్లలో నటుడు సంపూర్ణేష్ బాబు సందడి చేశాడు. పాతూరులో స్థానిక విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వెళుతూ మార్గమధ్యంలో ఇక్కడకు వచ్చినట్లు సంపూర్ణేష్ బాబు పేర్కొన్నారు. 

ఛత్తీస్ ఘడ్ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు...

ఛత్తీస్ ఘడ్ : జగదల్ పూర్ వద్ద ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రెండు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. వెంటనే రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు. 

బీహార్ లో వరద బీభత్సం..127 మంది మృతి..

బీహార్‌ : వరద బీభత్సంతో జనజీవనం స్తంభించింది. నదులన్నీ ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. బీహార్‌ వరదల్లో 127 మంది మృతి చెందగా, ప్రత్యక్షంగా 30 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. గంగా,సోని, పున్‌ పున్‌, బుర్హి గండక్‌, గాగ్రా, కోషి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలో 4,222 గ్రామాలు చిక్కుకోగా, రిలీఫ్‌ క్యాంపుల్లో 6 లక్షల మంది ప్రజలు ఆవాసం పొందుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 3 లక్షల మందిని తరలించారు. 

09:25 - August 25, 2016

బీహార్ : నిర్భయ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేశాడు. తీహార్ జైలులో ఉన్న అతడు పెయిన్‌ కిల్లర్స్‌ మింగి, టవల్‌తో ఉరివేసుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అధికారులు అతన్ని ఢిల్లీలోని దీన్‌ దయాళ్‌ ఆస్పత్రికి తరలించారు. వినయ్‌ శర్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
2012 డిసెంబర్‌ 15 నిర్భయ అత్యాచారం కేసులో వినయ్‌ నిందితుడిగా ఉన్నాడు. సుప్రీంకోర్టులో ఈ విచారణ కొనసాగుతోంది. నిర్భయ కేసులో మరో నిందితుడు రామ్‌ సింగ్‌ 2013లో ఆత్మహత్య చేసుకున్నాడు. 

  • 2012 డిసెంబర్ 16న తన స్నేహితుడితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతిపై కొందరు దుండగులు అతి పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
  • బస్సు డోర్లు మూసేసి, కదులుతున్న బస్సులో దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
  • సుమారు 2 వారాల పాటు మృత్యువుతో పోరాడిన 'నిర్భయ' డిసెంబర్ 29న మరణించిన సంగతి విదితమే.
  • దుండగుల అరాచకాన్ని ధైర్యంగా ప్రతిఘటించిన యువతిని 'నిర్భయ'గా కీర్తిస్తూ, ఆమెకు మద్దతుగా దేశ యువత, ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలను చేపట్టారు.
  • అప్పటి యూపీఏ ప్రభుత్వం మాజీ చీఫ్ జస్టిస్ జే.ఎస్.వర్మ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
  • కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకువచ్చింది.
  • ఈ ఘటనలో వినయ్ సహా ఆరుగు వ్యక్తులను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది.
  • వీరిలో ఒకరు జువైనల్. మైనర్ మినహా వీరంతా తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.


 

09:21 - August 25, 2016

చిత్తూరు : చాలా కాలం తరువాత మీడియా ఎదుట వచ్చిన పవన్ కల్యాణ్ నేడు తిరుపతికి రానున్నారు. అక్కడ మృతి చెందిన అభిమాని కుటుంబాన్ని పరామర్శించనున్నారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు భారీగా తరలివస్తున్నారు. కొద్దిగా టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. కర్ణాటకలో వినోద్ అనే పవన్ అభిమాని హత్యకు గురయ్యాడు. వినోద్‌ సొంతూరు అయిన తిరుపతికి పవన్ వెళ్లబోతున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన వినోద్‌ కర్ణాటకలోని కోలార్‌లో హత్యకు గురయ్యాడు. ఇద్దరు హీరో అభిమానుల మధ్య గొడవలో వినోద్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

అసలేం జరిగింది ? 
రెండు రోజులక్రితం కర్ణాటకలో ఇద్దరు హీరోల అభిమానులు ఘర్షణ పడ్డారు. అవయవదానం కార్యక్రమంకోసం హీరో సుమన్‌ కోలారుకు వచ్చారు. ఇందులో పాల్గొనేందుకు తిరుపతినుంచి వినోద్‌ తన మిత్రుడు త్రినాథ్‌తోకలిసి ఇక్కడికి చేరుకున్నారు. అవయవ దానాన్ని ఏపీలో విస్తరిస్తామని చెబుతూ తన అభిమాన నటుడికి జై కొట్టారు. దీనిపై మరో హీరో అభిమాని సునీల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ గొడవ ముదిరి ఘర్షణకు దారితీసింది. ఈ కార్యక్రమం ముగిశాక అంతా స్థానిక హొటల్‌కు వెళ్లారు. అక్కడకూడా హీరోల అభిమానులమధ్య వివాదం కొనసాగింది. దీంతో ఆగ్రహించిన సునీల్‌ వెంట వచ్చిన అక్షయ్‌ కుమార్‌ తన దగ్గరున్న కత్తితో వినోద్‌ను పొడిచాడు. వెంటనే మిగతావారంతా సునీల్‌ను అడ్డుకున్నారు. వినోద్‌ను ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే వినోద్‌ ప్రాణాలు విడిచాడు. పోలీసులు అక్షయ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పవన్ ఆవేదన..
తన అభిమాని హత్యకు గురికావడంపై పవన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.. వినోద్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఇవాళ తిరుపతి వెళుతున్నాడు. వినోద్‌ కుటుంబసభ్యులను పవన్‌ ఓదారుస్తారు.

09:13 - August 25, 2016

ఎయిర్ ఇండియా 191 విమానం దారి మళ్లింపు..

ముంబై : ముంబై టు నేవాక్ (న్యూ జెర్సీ) ఎయిర్ ఇండియా 191 విమానాన్ని కజకిస్తాన్ కు దారి మళ్లించారు. సాంకేతిక సమస్యతోనే దారి మళ్లించినట్లు తెలుస్తోంది. 

08:43 - August 25, 2016

ఒరిస్సా : ప్రతిభకు పేదరికం, మురికివాడల్లో జీవితం ఏమాత్రం అడ్డుకాదని...ఒరిస్సా ఫుట్ బాల్ పిడుగు, 11 ఏళ్ల చందన్ నాయక్ నిరూపించాడు. జర్మనీకి చెందిన విశ్వవిఖ్యాత సాకర్ క్లబ్ బైరన్ మ్యూనిచ్ లో రెండుమాసాల శిక్షణకు చందన్ ఎంపిక కావడం ద్వారా..ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. భారత ఫుట్ బాల్ లో ప్రస్తుతం విపరీతంగా వినిపిస్తున్నపేరు. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లోని ఓ మురికివాడకు చెందిన 11 ఏళ్ల ఈ బుడతడి ప్రత్యేకత ఏంటా అంటూ ఆశ్చర్యపోకండి.

మురికివాడలో జననం..
జర్మనీలోని విశ్వ విఖ్యాత సాకర్ క్లబ్ ..బైరన్ మ్యూనిచ్ లో రెండుమాసాల శిక్షణకు ఎంపిక కావడం ద్వారా చందన్ నాయక్ అంతర్జాతీయ దృష్టిని ఆకట్టుకొన్నాడు. బాల్యంలోనే తండ్రి లేని కుటుంబం నుంచి వచ్చిన చందన్ నాయక్ ..భువనేశ్వర్ లోని సబార్ సాహీ మురికివాడలో పుట్టిపెరిగాడు. నిత్యదారిద్ర్యం వెంటాడుతున్నా..ఫుట్ బాల్ ఆటే ఊపిరిగా పెరిగాడు. పాచిపనులు చేసి తల్లి తమ కుటుంబాన్ని పోషిస్తుంటే..కడుపునిండా తిండిలేకపోయినా, పౌష్టికాహారం అందకున్నా..చందన్ నాయక్ ఫుట్ బాల్ ఆడుతూ వచ్చాడు.

శిక్షకుడు జయదేవ్ ప్రోత్సాహం..
11 ఏళ్ల చందన్ నాయక్ లో.. వయసుకు మించిన ప్రతిభను గమనించిన శిక్షకుడు జయదేవ్ మహాపాత్ర పలు రకాలుగా ప్రోత్సహించడమే కాదు..అండగా నిలుస్తూ వచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా సాకర్ లో ప్రతిభావంతులైన బాలలను గుర్తించి రెండునెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చే...జర్మనీకి చెందిన బైరన్ మ్యూనిచ్ క్లబ్ నిర్వహించిన ఎంపికకు చందన్ హాజరయ్యాడు. ఈ బుడ్డోడిలోని ప్రతిభాపాటవాలను గుర్తించి..శిక్షణ కోసం ఎంపిక చేశారు.

25వ తేదీన జర్మనికి పయనం..
ఎప్పటికైనా భారత ఫుట్ బాల్ జట్టులో చోటు సంపాదించాలని కలలు కంటున్న చందన్ నాయక్ కు..లయనల్ మెస్సీ అంటే ప్రాణం. ఆగస్టు 25న జర్మనీకి బయలుదేరుతున్న చందన్ నాయక్..రెండు నెలలపాటు అక్కడి అకాడమీలో ప్రత్యేక శిక్షణ పొందబోతున్నాడు. ఈ శిక్షణతో చందన్ నాయక్ జీవితమే మారిపోవాలని, పేదరికం, కష్టాలు తొలగిపోవాలని కోరుకొందాం.

08:38 - August 25, 2016

ఖమ్మం : అవి గిరిజన కుగ్రామాలు..! ఇప్పుడా పల్లెల్లో సగం మందికి కిడ్నీలు పాడయ్యాయి. వైద్య సిబ్బంది సహాయం అందక.. తమ వ్యాధికి వైద్యం చేయించుకోలేక కిడ్నీ వ్యాధిగ్రస్తులు మృత్యువు అంచుకు చేరుతున్నారు. ఇప్పటికే చాలామంది కిడ్నీవ్యాధితో ప్రాణాలు వదిలారు. మరికొంత మంది మృత్యువుకు చేరువవుతున్నారు. తాము పోతే బిడ్డల పరిస్థితి ఏంటన్న వేదన.. వారిని, వ్యాధికన్నా ఎక్కువగా బాధిస్తోంది. మృత్యుఘంటికలు మోగుతోన్న గిరిజన కుగ్రామాలపై 10టీవీ కథనం..ఖమ్మం జిల్లాలోని గిరిజన కుగ్రామాలు..ఆగ్రామాల్లో తిప్పి కొడితే 500 మంది జనాభా.. పరిశీలిస్తే సగం మంది కిడ్నీ వ్యాధి పీడితులే.. ఎందుకిలా..? ఆ గ్రామాలకు ఏమైంది..? కిడ్నీ వ్యాధి వారిని ఎందుకు చంపుతోంది..?

మల్లాయిగూడెం..
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలోని మల్లాయిగూడెం, గుమ్మడవల్లి గిరిజన కుగ్రామాల ప్రజలు కిడ్నీవ్యాధితో కునారిల్లుతున్నారు. ఉన్నట్టుండి జ్వరాలు.. ఒళ్లు నొప్పులు రావడంతో మొదలైన వ్యాధి.. కిడ్నీలపై ప్రభావం చూపింది. ఈగ్రామాలలో అన్నీ నిరుపేద కుటుంబాలే. దీంతో జ్వరమొచ్చిందని నాటు వైద్యాన్ని ఆశ్రయించారు. వైద్యశాలలకు వెళ్లక పోవడం.. ఆరోగ్య కార్యకర్తలూ వీరి చెంతకు రాకపోవడం.. వీరి వ్యాధిని తీవ్రరూపం దాల్చేలా చేసింది. మల్లాయిగూడెం రోగులు దగ్గరలోని వినాయకపురం పీహెచ్‌సీ కి వెళితే... అక్కడి సిబ్బంది తూతూ మంత్రంగా టాట్లెట్లు ఇచ్చి సరిపెడుతున్నారు. గుమ్మడవల్లికి వెళితే అక్కడ వైద్యులు కానీ, వైద్య సిబ్బంది కానీ అందుబాటులో ఉండడం లేదు. దీంతో వీరు అందుబాటులోని ఆర్‌ఎంపీల చేతిలో తమ ప్రాణాలను పెట్టేస్తున్నారు.

47 మంది..
యువతి పేరు దుర్గ. ఈమె భర్త గత ఏడాదే కిడ్నీవ్యాధితో మరణించాడు. ప్రస్తుతం ఈమె కూడా కిడ్నీవ్యాధితో బాధపడుతోంది. తాను పోతే తమ కొడుకు అనాథ అవుతాడని ఆమె అవేదన చెందుతోంది. ఇది ఓ దుర్గ వ్యథే కాదు. ఇలాంటి దుర్గలు ఇక్కడి గ్రామాల్లో ఎందరో ఉన్నారు. మల్లాయిగూడేనికి సమీపంలో కొండతోడు తండా ఉంది. ఆ తండాలో దాదాపు 47 మంది కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. కిడ్నీవ్యాధి వచ్చిన తమ తల్లికి వైద్యం కోసం... తన తండ్రి ఉన్న రెండెకరాల పొలం తాకట్టుపెట్టారని వారి కుమార్తె శివన్య ఆవేదనగా చెబుతోంది.

స్పందించని వైద్య ఆరోగ్య శాఖ..
ఇంతా జరుగుతున్నా వైద్యఆరోగ్యశాఖ క్యాంపులు నిర్వహించకపోవడం, సరైన వైద్యం అందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక్కడి ప్రజల కిడ్నీ వ్యాధులకు వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమన్న వాదనా ఉంది. కిడ్నీ వ్యాధుల గురించి తమకేమీ సమాచారమే లేదని మండల ప్రాథమిక ఆరోగ్యాధికారే చెబుతుంటే.. గిరిజన కుగ్రామాలకు వారు అందిస్తున్న సేవలు ఏపాటివో ఇట్టే అర్థమవుతోంది. ఈ గ్రామాల్లో రక్షిత మంచినీరు లేకపోవడం కూడా కిడ్నీ వ్యాధి ప్రబలేందుకు కారణమై ఉండొచ్చన్న భావనా వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా.. అధికారులు తక్షణమే ఈ రెండు గ్రామాలను సందర్శించి.. అక్కడి అనారోగ్యకర వాతావరణాన్ని దూరం చేసి.. తాగునీటిని పరీక్షించి.. అవసరాన్ని బట్టి రక్షిత నీటిని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కిడ్నీ వ్యాధులకు కారణాలను అన్వేషించి.. వాటిని సమూలంగా తుడిచిపెట్టేయాల్సిన అవసరమూ ఉంది. 

08:32 - August 25, 2016

హైదరాబాద్ : ప్రచారంలో తనకు తిరుగులేదని నిరూపించుకునే ముఖ్యమంత్రి కేసీఆర్‌... 'మహా' ఒప్పందం తర్వాత అదే విధానాన్ని అనుసరించారా ? మహారాష్ర్టతో ఒప్పందం తర్వాత హైదరాబాద్‌ నగరానికి వచ్చిన కేసీఆర్‌కు పబ్లిసిటీని టీఆర్‌ఎస్‌ నేతలే కల్పించారా..? ప్రభుత్వ పరంగా జరిగిన నిర్ణయాలను గులాబీదళం తన మైలేజ్‌ను పెంచుకోవడంలో సక్సెస్‌ సాధించిందా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ సొమ్మును నీళ్లలా ఖర్చు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..!.గోదావరి జలాలపై ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించామంటూ అధికార పార్టీ నేతలు ప్రచార హోరును తీవ్రం చేశారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంతో గతంలో ఓసారి చర్చలు జరిపిన ప్రభుత్వం...రెండో విడతలో మూడు ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాల్లో కొత్తదనం ఏమీలేదంటూ విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది సర్కార్‌.

పలు విమర్శలు..
ముఖ్యంగా మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలపై అధికార పార్టీ ప్రచారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహారాష్ర్టకు కేసీఆర్‌ తన వెంట మంత్రులు, ఎంపీలు, పార్టీ నాయకులను తీసుకెళ్లి.... ఎక్కువ ప్రచారం చేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు.. ఒప్పందాలు పూర్తైన తర్వాత అక్కడి నుంచే.. ఇక్కడి ప్రజాప్రతినిధులకు ఆదేశాలు అందడంతో.. కేసీఆర్‌ బేగంపేటకు వచ్చినప్పుడు పెద్దస్థాయిలో టీఆర్‌ఎస్‌ నేతలు స్వాగతం పలికి.. ప్రచారానికి పెద్దపీఠ వేశారనే విమర్శలు వస్తున్నాయి.

అధికారుల కనుసన్నలలో..
హైదరాబాద్‌ నగరానికి కేసీఆర్‌ రాక సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 15 ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు అందాయి. గ్రేటర్ హైదరాబాద్ నేతలతో పాటు మహా ఒప్పందంతో లబ్ది పొందే జిల్లాల నేతలు జనసమీకరణ చేయడంలో సఫలీకృతులయ్యారు. కార్పొరేటర్‌ నుంచి ఎమ్మెల్యే, మంత్రి వరకూ జనసమీకరణ చేశారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరిగిందనే విమర్శ వినిపిస్తోంది. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలను కూడా పార్టీ ప్రచారంగా మలుచుకోవడంలో టీఆర్‌ఎస్‌ అధినేత సక్సెస్‌ అయ్యారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

కేసీర్ వ్యూహాత్మకం..
మహారాష్ర్టతో జరిగిన ఒప్పందాన్ని పార్టీకి మైలేజీగా వాడుకోవడంలో కేసీఆర్‌ వ్యూహాత్మకంగా ముందుకెళ్లారంటున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనులను కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ... మహారాష్ర్టతో జరిగిన ఒప్పందాన్ని ప్రచారాన్ని భుజాన వేసుకోవడం చర్చనీయంశంగా మారింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వ సొమ్మును ఇంత దుబారాగా ఖర్చు చేయలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో ప్రభుత్వ సొమ్ముతో ముఖ్యమంత్రికి స్వాగత ఏర్పాట్లు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా మహారాష్ర్టతో జరిగిన ఒప్పందాన్ని పార్టీకి మైలేజీగా వాడుకోవడంలో గులాబీనేత సక్సెస్‌ అయ్యారని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు దుబారా ఖర్చు కూడా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.  

నిర్భయ కేసులో నిందితుడు ఆత్మహత్యాయత్నం..

బీహార్ : నిర్భయ కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు వినయ్ శర్మ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన జైలు సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. 

ఆరెంజ్ బస్సు బోల్తా..

ప్రకాశం : జిల్లాలో టంగుటూరు వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి విజయవాడకు ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. టంగుటూరు వద్ద వేగంగా దూసుకువచ్చి అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. 

08:07 - August 25, 2016
08:05 - August 25, 2016

నేరస్తులను చూడగానే అందరూ భయపడుతారు. కానీ హీరోలు మాత్రం తెరపై సిని ఖైదీలుగా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నారు. ఖైదీ టైటిల్ తో వచ్చిన అన్ని సినిమాలు ఆల్ మోస్ట్ ప్రేక్షాకుల మెప్పుపొందాయి. చిరంజీవికి 'ఖైదీ' సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో ఆయన 150వ సినిమా ద్వారా మరోసారి చాటుకున్నారు. 'చిరంజీవి' అనే వ్యక్తిని మెగాస్టార్ అనే రేంజ్ వెళ్లాడానికి 'ఖైదీ' సినిమా 'పునాది రాళ్లు' వేసిన సంగతి తెలిసిందే. అందుకే రీ ఏంట్రీ లో మరోసారి ఆ సెంటిమెంట్ కలిస్తోందనే భావనతో 'చిరంజీవి' తన 150వ సినిమాకి 'ఖైదీ నెంబర్ 150' అనే టైటిల్ ని కన్ ఫర్మ్ చేశాడు. 'చిరంజీవి'కి కలిసొచ్చినంతగా 'ఖైదీ' టైటిల్ మరో హీరోకి కలిసి రాలేదని చెప్పాలి. అంతేకాదు 'ఖైదీ' అంటే 'చిరంజీవి'. 'చిరంజీవి' అంటే 'ఖైదీ' అనే రేంజ్ లో ఆయన తెరపై మెస్మరైజ్ చేశారు.

మలుపుతిప్పింది..
ఓ మాదిరిగా సాగుతున్న తన కెరీర్ ని 'ఖైదీ' చిత్రం సమూలంగా మలుపుతిప్పింది. ఈ చిత్రంతో 'చిరంజీవి' రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. 'చిరంజీవి' హీరోగా వచ్చిన 'ఖైదీ' సినిమా తెలుగు సినిమా గతినే మార్చేసింది. రివేంజ్ స్టోరీకి లవ్ డ్రామాను మిక్స్ చేసి దర్శకుడు కొదండరామ్ రెడ్డి రూపొందిన ఈ చిత్రం తెలుగు పరిశ్రమకు కొత్తదారిని చూపించింది. సరికొత్త యాక్షన్ చిత్రాలకు, మాస్ చిత్రాలకు నాంది పలికిన 'ఖైదీ'తో 'చిరంజీవి' న్యూ సూపర్ స్టార్ గా రూపుదిద్దుకున్నాడు.
'ఖైదీ' చిత్రంలోని పాటలు కానీ ఫైట్స్ కానీ సీన్స్ కానీ ఇప్పటికి ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. అంతేకాదు ఇందులోని 'రగులుతోంది మొగలి పొద' సాంగ్ కానీ, 'గోరింటా పూసింది' సాంగ్ ఇప్పటి ఆడియన్స్ సైతం మెస్మరైజ్ చేస్తున్నాయి. అంతేనా 'ఖైదీ'లోని కొన్ని సీన్స్ ని ఇప్పటి సినిమాల్లో ఈ జనరేషన్ కి తగ్గట్టుగా చాలా సినిమాల్లో వాడుకుంటున్నారు.

ఖైదీ నెంబర్ 786...
మెగాస్టార్ 'ఖైదీ'గా మెప్పించిన మరో సినిమా 'ఖైదీ నెంబర్ 786'. ఈ చిత్రం కూడా బాక్సాపీసు వద్ద ఘనవిజయం సాధించింది. ఇది కూడా రివేంజ్ స్టోరీగా రూపొందిన చిత్రమే. 'చిరంజీవి', 'భానుప్రియ' జంటగా నటించిన ఈ చిత్రంలోని 'గువ్వా గోరింకా'తో సాంగ్ ఎవర్ గ్రీన్ సాంగ్ గా అలరిస్తుంది. 'ఖైదీ' మూవీ సెంటిమెంట్ ని 'చిరంజీవి' మరోసారి నమ్ముకుంటున్నాడు. 9ఏళ్ల తరవాత రీ ఏంట్రీ ఇస్తుండడంతో టైటిల్ విషయంలో మెగా కాంపౌండ్ చాలా కసరత్తు చేసింది. కానీ చివరికి మెగాస్టార్ రేంజ్ బాటలు వేసిన 'ఖైదీ' మూవీకి కలిసొచ్చేలా 'ఖైదీ నెంబర్ 150' టైటిల్ ని ఫిక్స్ చేశారు. రెండు సార్లు 'ఖైదీ' టైటిల్ తో హిట్స్ కొట్టిన మెగాస్టార్ ఈసారి ఎలాంటి ఫలితం అందుకుంటారనేది ఇంట్రెస్ట్ గా మారింది. తమిళంలో విజయం సాధించిన 'కత్తి' సినిమాకి 'ఖైదీ నెంబర్ 150' రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ 'ఖైదీ నెంబర్ 150' 'చిరంజీవి' రీ ఏంట్రీ గ్రాండ్ సక్సెస్ ఇచ్చి వెల్ కమ్ చెప్పుతోందో చూడాలి.

07:50 - August 25, 2016

ముఖం అందంగా కనిపించాలంటే జుట్టు ప్రముఖ పాత్ర పోషిస్తుంటుంది. కానీ ఈ జుట్టు వల్ల ఎంతోమంది వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. అందులో తెల్ల జుట్టు. తెల్లజుట్టును నల్లగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల కాస్మోటిక్స్..సౌందర్య సాధనాలను వాడుతుంటారు. ఎర్రగా..నల్లగా..ఇలా వివిధ రకాల కలర్స్ లో కనిపించాలని జుట్టుకు కలర్స్ వేసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. అందుకనే ఇంట్లోనే కొన్ని హెయిర్ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
జుట్టు ఎరుపు రంగులో కనిపించాలంటే బీట్ రూట్..క్యారెట్ జ్యూస్ లను తీసుకోవాలి. అందులో కొన్ని చుక్కల కొబ్బరి నూనె, టీ పౌడర్ ను కలిపాలి. అనంతరం దీనిని మరిగించాలి. కొద్దిగా చల్లబడిన అనంతరం తలకు మెల్లగా మర్దన చేయాలి. 45 నిమిషాల అనంతరం జుట్టును కడుక్కోవాలి.
ఓ గ్యాస్ లో లెమన్ జ్యూస్ తీసుకోవాలి. జ్యూస్ ను బాగా మరిగించాలి. ఇందులో చెంచా టీ పౌడర్ కలిపి జుట్టుకు పట్టించి రెండు గంటల తరువాత స్నానం చేయాలి.
కాఫీ పౌడర్ ను కొద్దిగా తీసుకుని వేడి నీటిలో వేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 45 నిమిషాల పాటు ఉంచి తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా మూడు సార్లు చేస్తే జట్టు రంగు మారడమే కాకుండా వత్తుగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. 

ఘనంగా కృష్ణాష్టమి..

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా గురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. 

రొమ్ము క్యాన్సర్ చికిత్సపై నేడు విశాఖలో శిక్షణ..

విశాఖపట్టణం : అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా దేశంలో తొలిసారిగా గురువారం రొమ్ము క్యాన్సర్ చికిత్సపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. విశాఖలోని గీతం విశ్వ విద్యాలయంలో భారత సర్జన్స్ సంఘం వార్షిక సమావేశంలో ఈ శిక్షణ కార్యక్రమం జరగనుంది. 

బీహార్ లో ఇద్దరు నక్సల్స్ అరెస్టు..

బీహార్ : గయాలో ఇద్దరు నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. మందుగుండు, బాంబులు, డిటోనేటర్లను రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

07:04 - August 25, 2016

ఆగస్టు మొదటి వారంలో కేంద్ర కేబినెట్ ఆమోదం పొంది, అనేక నిరసనల మధ్య లోక్ సభలో ప్రవేశించిన ఆర్ టిఎస్ బిల్లు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ బిల్లు అమలులోకి వస్తే రవాణారంగంలో తీవ్రమైన కుదుపులొస్తాయి. అనేక మంది ఉద్యోగాలకు, ఉపాధికి ఎసరు వస్తుంది. డ్రైవింగ్ చేసేవారు కఠినశిక్షలకు, పోలీసు వేధింపులకు సిద్ధం కాక తప్పదు. దేశ ఆర్థిక వ్యవస్థలో రవాణా రంగానిది కీలకపాత్ర. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ప్రగతి రవాణారంగంతో ముడిపడివుంది. మనదేశంలో రోడ్డు మార్గంలోనే 66 శాతం రవాణా జరుగుతోంది. మొత్తం ప్రయాణికుల్లో 85శాతం మంది రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తున్నారు.

లక్షన్నర కోట్ల ఆదాయం..
జాతీయ రహదారుల మీదనే 40శాతం సరకులు రవాణా అవుతున్నాయి. అయితే, మన దేశంలో మొత్తం రోడ్లలో జాతీయ రహదారులు కేవలం 2శాతం మాత్రమే వున్నాయి. రోడ్డు రవాణా మీద విధించే పన్నుల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దాదాపు లక్షన్నర కోట్ల ఆదాయం వస్తోంది. మన దేశంలో 19 కోట్ల కు పైగా మోటారు వాహనాలు తిరుగుతున్నాయి. దాదాపు 15 కోట్ల మంది వాహనరంగంలో ఉపాధి పొందుతున్నారు. నిరుద్యోగ యువతకు రవాణా రంగం ఓ ఉపాధి మార్గంగా మారింది. డిగ్రీలు, పీజీలు చేసినవారు కూడా ఆటోలు, టాక్సీలు నడుపుతూ పొట్ట పోసుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి, రవాణా రంగంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కొన్ని కోట్ల మంది జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

ట్రాఫిక్ సమస్య..
మన దేశంలో ఏటా పదిశాతం చొప్పున వాహనాల సంఖ్య పెరుగుతుంటే, రహదారుల విస్తీర్ణం 4శాతానికి మంచి పెరగడం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. రోడ్ల నిర్మాణంలో ప్రమాణాలు పాటించడంలేదు. మరమ్మతుల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసి ఎన్నికల సమయంలో వేసిన రోడ్లు ఆరు నెలలు తిరక్కముందే నాశనమైపోయాయి. రోడ్ల నిర్వహణా లోపాలు అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దీంతో డ్రైవర్లు, ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ డ్రైవరూ ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ చేయడు. ఏ ప్రమాదమూ జరగకుండా కాపాడు స్వామీ అంటూ డ్రైవర్లు స్టీరింగ్ ముందు తలవంచి మరీ దండం పెడతారు.

జరిమానాలు..
రోడ్డు ప్రమాదాలను నివారించే పేరుతో కేంద్ర కేబినెట్ కొద్ది రోజుల రోడ్డు రవాణా భద్రత బిల్లును ఆమోదించింది. దీన్ని లోక్ సభలో ప్రవేశపెట్టారు. అక్కడ తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో సెలక్ట్ కమిటీకి పంపించారు. ప్రమాదానికి డ్రైవర్లను బాధ్యులను చేస్తూ కఠిన శిక్షలు విధిస్తోంది ఈ బిల్లు. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు, సీటు బెల్టు పెట్టుకోకపోతే 10వేలు, ఇన్స్యూరెన్స్ లేకపోతే 2000 వేలు, పరిమితికి మించి లగేజీ వేస్తే 20వేలు, మద్యం తాగి వాహనం నడిపితే 10వేలు, అతి వేగంగా వాహనం నడిపితే 5వేల చొప్పున జరిమానా విధిస్తారు. పిల్లలు యాక్సిడెంట్ చేస్తే పాతిక వేల జరిమానాతో పాటు తండ్రికి 3ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఇలా కఠిన శిక్షలు ప్రతిపాదించిన ఈ బిల్లు మొత్తం రవాణా వ్యవస్థను బడా ప్రయివేట్ సంస్థల చేతిలో పెట్టే వ్యూహాన్ని కూడా సిద్ధం చేసింది.

ఆర్టీసీపై పెను ప్రభావం..
ఈ బిల్లు అమలులోకి వస్తే రోడ్ల వెంట, చిన్న చిన్న మెకానిక్ షాపులు నడుపుతున్నవారంతా తమ ఉపాధి కోల్పోతారు. ఎవరైనా సరే తమ వాహనాలు రిపేర్లు, సర్వీసులు అన్నీ అధీకృత కేంద్రాల్లో మాత్రమే చేయించుకోవాల్సి వుంటుంది. ఈ బిల్లు ఆర్టీసీకి మరణశాసం లిఖిస్తుందంటూ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీలకున్న ప్రత్యేక సదుపాయాలను రద్దు చేసి, దేశంలోని అన్ని రూట్లను వేలం వేస్తారు. వేలం పాటలో నెగ్గినవారికే రూట్ పర్మిట్లిస్తారు. లాభాలొచ్చే మార్గాలను ప్రయివేట్ సంస్థలు తన్నుకుపోతే, నష్టాలొచ్చే రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుపుకోవాల్సి వస్తుంది. దీంతో రవాణా వ్యవస్థ మీద ప్రయివేట్ సంస్థల ఆధిపత్యం పెరిగే ప్రమాదం వుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి చూపిస్తున్న ఆటోల మీద కూడా ఈ బిల్లు ప్రభావం తీవ్రంగా వుంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్టీసీలలో కండక్టర్ల వ్యవస్థ రద్దవుతుంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, లైసెన్స్ ల జారీ, ఫిట్ నెస్ టెస్టులు ఇలాంటివన్నీ ప్రయివేట్ ఏజెన్సీలకు అప్పగిస్తారు. అందుకే ఈ బిల్లును కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

06:46 - August 25, 2016

సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా సమ్మె జరగబోతోంది. ఇందులో రవాణారంగం కూడా పాల్గొంటోంది. దీంతో ఆ రోజు మొత్తం రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశం వుంది. బస్సులు, లారీలు, ఆయిల్ ట్యాంకర్లు, ఆటోలు, టాక్సీలు ఇలా అన్నిరకాల వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోతాయి. రవాణా రంగ కార్మికులు సెప్టెంబర్ 2న సమ్మె పాటించడానికి కారణం ఏమిటి? కొద్ది రోజుల క్రితం కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ఆర్ టి ఎస్ బిల్లు రవాణా రంగం మీద ఎలాంటి ప్రభావం చూపబోతోంది? సమ్మెకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో ఎస్డ బ్ల్యు ఎఫ్ నేత సుందరయ్య విశ్లేషించారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియోలో చూడండి

06:43 - August 25, 2016

ఇటలీ : భారీ భూకంపం ఇటలీని కుదిపేసింది. పెను విలయం సృష్టించింది. భూకంప ధాటికి 120 మందికిపైగా మృతి చెందారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరో 150 మందికిపైగా గల్లంతయ్యారు. పేకమేడల్లా కూలిపోయిన భవన శిథిలాల కింది చాలా మంది చిక్కుకుపోయారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మయన్మార్‌లో కూడా భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రభావం మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా పడింది. భూప్రకంపనలకు ఉత్తర భారతం ఒణికిపోయింది. ఇటలీలో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. బుధవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపంతో ఇటలీ కుదుపులకు గురైంది. భూకంప లేఖినిపై తీవ్రత 6.2గా నమోదయ్యింది. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో సంభవించి భూకంప ధాటికి ఇళ్లు, భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఊళ్లకు ఊళ్లే శిథిల గుట్టులుగా మారిపోయాయి. చాలా మంది మరణించారు. క్షతగ్రాతుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. నేలమట్టమైన భవనాల శిథిలాల కింది చిక్కుకున్నవారి ఆర్తనాదాలు మిన్నంటాయి వీరిని కాపాడేందుకు సహాయ బృందాలు శ్రమిస్తున్నాయి.

క్రొయేషియా దేశంలో కూడా భూప్రకంపనలు..
భూకంపం సంభవించిన ప్రాంతాల్లో హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. పెరుగియా నగరానికి 76 కీ.మీ. దూరంలో ఉన్న రిటీ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇక్కడకు వందమైళ్ల దూరంలో ఉన్న క్రొయేషియా దేశంలో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. ఇటలీ రాజధాని రోమ్‌ నగరంలో కూడా 20 సెకన్లపాటు భూమి కంపించిందని అధికారులు ప్రకటించారు. భూకంప ధాటికి ఎమాట్రిస్‌ నగరం పూర్తిగా ధ్వంసమైంది. అక్యుమోలి, అర్కాట్‌ డెల్‌ టోరంటో, పెస్కారా డెల్‌ టోరంటో పట్టణాలూ పూర్తిగా నేలమట్టమై, శిథిలా దిబ్బల్లా కనిపిస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో గాడాంధకారం నెలకొంది. సమాచార వ్యవస్థ కుప్పకూలి, చిన్నాభిన్నంగా మారిపోయింది. ఆహారం, మంచినీరు లభించక బాధితులు అల్లాడుతున్నారు. 2009 తర్వాత ఇటలీలో ఇంతటి భారీ భూకంపం సంభవించడం ఇదే మొదటిసారి. అప్పట్లో అకీలా ప్రాంతంలో సంభవించిన భూకంపంలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భూకంప ప్రభావిత ఇటలీని ఆదుకునేందుకు అమెరికా సహా పలు దేశాలు ముందుకొచ్చాయి. ఆహారం, మంచినీరు ప్రాణరక్షణ మందులు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. కాగా ఇటలీలోని భారతీయులందరూ క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ టీట్‌ చేశారు.

మాండలేకు 190 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం..
మయన్మార్‌లో కూడా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదయ్యింది. దక్షిణ మయన్మార్‌లోని మాండలేకు 190 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మయన్మార్‌ భూకంపంలో భారీ ఆస్తినష్టం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. నష్టాన్ని అంచనావేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. మయన్మార్‌లో సంభవించిన భూకంప ప్రభావం మనదేశంలోని పలు ప్రాంతాలపై కూడా పడింది. భూప్రకంపనలతో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు వణికిపోయాయి. అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, నాగాలాండ్‌, త్రిపుర, అసోం, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. కోల్‌కతా, పాట్నా, గౌహతిల్లో భారీ ప్రకంపనలు నమోదయ్యాయి. కోల్‌కతాలో పది సెకన్లు, పాట్నాలో మూడు సెకన్లపాటు భూమి కంపించినట్టు గుర్తించారు. ప్రకంపనల తర్వాత కోల్‌కతాలో నిలిపివేసిన మెట్రో రైలు సర్వీసులను ఆ తర్వాత పునరుద్ధరించారు. కార్యాలయాలు, విద్యా సంస్థలను ఖాళీ చేయించారు. ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో మరోసారి ప్రకంపనలు నమోదయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అప్రమత్తత ప్రకటించారు. 

06:40 - August 25, 2016

ఢిల్లీ : భారత నౌకాదళం కోసం తయారు చేస్తున్న స్కార్‌పీన్‌ జలంతర్గాముల అతి ముఖ్య సమాచారం లీక్‌ కావడం కలకలం రేపింది. దేశ భద్రత విషయంలో ఇది ఆందోళన కలిగించే విషయమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విదేశాల నుంచి సమాచారం హ్యాక్‌ అయిందని రక్షణ శాఖ నిర్ధారించింది. భద్రతకు సంబంధించి అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఈ సమాచారాన్ని లీక్‌ చేసిందెవరు? భారత నౌకా దళానికి చెందిన స్కార్పిన్ క్లాస్‌ జలాంతర్గాములకు సంబంధించిన అతి ముఖ్య రహస్య సమాచారం లీకయింది. ఫ్రెంచ్ డిఫెన్స్ కాంట్రాక్టర్ డీసీఎన్ఎస్ కంపెనీ ద్వారా భారత్ నావికా దళం కోసం ఆరు స్కార్పియన్ క్లాస్ జలాంతర్గాములను తయారు చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన రహస్య సమాచారం లీకైంది. దాదాపు 22 వేల 400 పేజీల సమాచారం లీకైందని 'ది ఆస్ట్రేలియన్' పత్రిక వెల్లడించింది. దీంతో ఈ జలాంతర్గాములు పనిచేసే సామర్థ్యానికి సంబంధించిన పూర్తి రహస్యాలు వెలుగులోకి వచ్చినట్లు ఆ పత్రిక పేర్కొంది.

లీక్ వల్ల ఇబ్బందులు..
ప్రాజెక్ట్ 75 పేరుతో డీసీఎన్ఎస్, భారతదేశానికి చెందిన మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కలిసి ఆరు స్కార్పిన్‌ క్లాస్‌ జలాంతర్గాములను నిర్మిస్తున్నాయి. ఇందుకోసం భారత్ 3.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోందని అంచనా. తొలి జలాంతర్గామిని ఈ ఏడాది చివర్లో, మిగితా ఐదింటిని 2020 నాటికి భారత నేవీకి అప్పగిస్తారు. అత్యంత ఆధునికమైన ఈ జలాంతర్గాములు సముద్రంలో ఎంత లోతువరకైనా వెళతాయి. నీటిలో ప్రయాణించే సమయంలో అతి తక్కువ శబ్దం చేస్తాయి. దీన్ని శత్రువులు ఏ మాత్రం పసిగట్టలేరు.స్కార్పిన్ క్లాస్‌ జలాంతర్గాముల సమాచారం విదేశాల నుంచి హ్యాక్‌ అయిందని రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారీకర్‌ నిర్ధారించారు. లీకైన సమాచారంపై దర్యాప్తు జరుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే సమాచారం వంద శాతం లీక్‌ అవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు స్కార్పిన్ క్లాస్‌ జలాంతర్గాముల లీక్‌పై ఫ్రాన్స్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ లీక్‌ వల్ల మలేషియా, చిలీకి కూడా ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఆ దేశాలు కూడా స్కార్పిన్ క్లాస్‌ జలాంతర్గాములనే ఉపయోగిస్తున్నాయి. బ్రెజిల్‌ కూడా 2018 నుంచి ఈ తరహా జలాంతర్గాములను వినియోగించనుంది. 

06:35 - August 25, 2016

హైదరాబాద్ : కార్మికుల సంక్షేమం కోసం కార్మిక సంఘాలు పోరుబాటకు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరును ఎండగట్టేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే కార్మిక సంఘాలు కంపెనీ యాజమాన్యాలకు సమ్మె నోటీసులు ఇచ్చాయి. కేంద్రంలో మోడీ, ఏపీలో చంద్రబాబు పాలన వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా... కార్మికుల సంక్షేమంపై ఇప్పటికీ దృష్టిపెట్టలేదంటూ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడడంలో ఈ రెండు ప్రభుత్వాలు పోటీపడుతున్నాయని కార్మిక సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టర్ల ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని, అసంఘటిత, స్కీము వర్కర్లకు సామాజిక భద్రత కల్పిచాలని, కార్మికుల చట్టాల్లో సవరణలను నిలుపుదల చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకాలని ఆపాలన్న కీలక డిమాండ్లు నెరవేర్చాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

సమ్మెకు సన్నద్ధమవుతున్న కార్మిక సంఘాలు..
ఏపీలో మూతపడ్డ పరిశ్రమలను తెరిపించకపోవడం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర కార్మిక సంఘాలు సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు సన్నద్దమవుతున్నాయి. సీఐటీయూ, దాని అనుబంధ సంస్థలు, ఏఐటీయూసీ, ఇఫ్టూ వంటి కార్మిక సంఘాలు ఇప్పటికే ఆయా కంపెనీ యాజమాన్యాలకు సమ్మె నోటీసులు ఇచ్చాయి. కార్మికులను సమాయత్తం చేసేందుకు వారు పనిచేస్తున్న చోట ధర్నాలు, నిరసనలు తెలియజేస్తున్నారు.
సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ.. ప్రచార పోస్టర్లను విడుదల చేశారు. ఈ నెల 28 ,29, 30 తేదీల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. 31వ తేదీ, సెప్టెంబర్ 1న సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో ప్రచారం చేపట్టనున్నారు. సమ్మెలో పాల్గొనేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడా సన్నద్ధమవుతున్నాయి. ఇటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, కనీస వేతనాలు వంటి కీలక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో ఎన్జీవో సంఘం తీవ్ర అసంతృప్తిలో ఉంది. సెప్టెంబర్‌ 2న తలపెట్టిన సమ్మెలో ఆటో యూనియన్‌ కార్మికులు పాల్గొనాలని సీఐటీయూ కడప నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సమ్మె సన్నాహాక సదస్సు నిర్వహించారు. మొత్తంగా సెప్టెంబర్‌2న తలపెట్టిన సమ్మెను విజయవంతం చేసి.. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి... డిమాండ్లు సాధించే దిశగా అన్ని కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. 

06:30 - August 25, 2016

హైదరాబాద్ : రాష్ట్రాలు ఏర్పడ్డాయి.. ఉద్యోగులు విడిపోయారు. అయినా ఇంకా తెలంగాణ సచివాలయంలో కొంతమంది ఆంధ్ర అధికారుల ఆగడాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖలో ఓ అధికారి నిత్యం వేధింపులకు గురి చేయడంతో సహనం కోల్పోయిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆ అధికారిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి మహేష్‌దత్‌ ఎక్కా వద్ద పీఎస్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావు ఉద్యోగుల పట్ల వేధింపులకు గురి చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగులు ఆందోళనలు చేశారు.

నిత్యం వేధింపులు..
శ్రీనివాసరావు కార్యాలయానికి భారీగా తరలివచ్చిన తెలంగాణ ఉద్యోగులు.. ఆయనను నిలదీశారు. శ్రీనివాసరావు కూర్చున్న కుర్చీని కార్యాలయం నుంచి బయటపడేశారు. ఉద్యోగుల అటెండెన్స్‌ రిజిష్టర్‌ తన వద్ద ఎందుకు ఉంచుకున్నావని శ్రీనివాసరావును ప్రశ్నించారు. తామంటేనే శ్రీనివాసరావు చీదరించుకుంటున్నాడని తెలంగాణ ఉద్యోగులంటున్నారు. సెలవు అడిగినా ఇవ్వకుండా నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర స్థానికత ఉన్న శ్రీనివాసరావును వెంటనే ఆంధ్రకు పంపించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావుపై అనేక ఆరోపణలున్నాయని వాటిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలంగాణ ఉద్యోగులు హెచ్చరించారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా కొంతమంది ఆంధ్ర అధికారుల వైఖరితో తెలంగాణ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. 

06:27 - August 25, 2016

హైదరాబాద్ : రెండో ఏఎన్‌ఎంలు కదం తొక్కారు. 38 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వివిధ జిల్లాల నుంచి ఏఎన్‌ఎంలు కోఠిలోని వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగించేందుకు మొగ్గు చూపారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం కాంట్రాక్ట్‌ రెండో ఏఎన్‌ఎంలు ఆందోళనలు ఉధృతం చేశారు. 'చలో హైదరాబాద్‌' మహాధర్నాకు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దాదాపు 4 వేల మంది ఏఎన్‌ఎంలు తరలివచ్చారు. కోఠిలోని వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యాలయం ఏఎన్‌ఎంల నినాదాలతో దద్దరిలింది.

ప్రభుత్వంతో చర్చలు..
తమను రెగ్యులరైజ్‌ చేయాలని, పదో పీఆర్సీ ప్రకారం కనీస వేతనం 21,300 రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏఎన్‌ఎంలు గత 38 రోజులుగా సమ్మె చేస్తున్నారు. పీఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించి మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని ఏఎన్‌ఎంలు డిమాండ్‌ చేస్తున్నారు. అంతకుముందు కార్మికసంఘ నేతలు, వివిధ జిల్లాల నేతలు ఉదయం నుంచే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైన ఎన్‌హెచ్‌ఎం సీపీవో డాక్టర్‌ శ్రీనివాస్‌.. సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సమ్మె విరమిస్తే నాలుగైదు రోజుల్లో కొన్ని సమస్యలు పరిష్కరిస్తామని.. వేతనాన్ని పెంచుతామని, వచ్చే నెల నుంచి పీఎఫ్‌ అమల్లోకి వస్తుందన్నారు. క్రమబద్ధీకరణపై కేంద్రాన్ని సంప్రదిస్తామని.. ఇతర సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు. అయితే లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో సమ్మె చేసేందుకే నేతలు మొగ్గుచూపారు.

పోరాటం ఆపేది లేదు..
అయితే.. అధికారులతో ఎన్నిసార్లు చర్చలు జరిపినా సమస్యలు పరిష్కరించకపోవడంపై సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్లు సాధించుకునేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. అధికారుల ఒత్తిళ్లు, బెదిరింపులకు లొంగకుండా సమ్మె చేస్తున్న రెండో ఏఎన్‌ఎంలను కార్మిక సంఘాల నేతలు అభినందించారు. పోరాటం చేసి డిమాండ్లు సాధించుకుందామని.. అప్పటివరకు సమిష్టిగా పోరాడుదామని నేతలు పిలుపునిచ్చారు. 

06:25 - August 25, 2016

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. అధికార, ప్రతిపక్షాలు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ, సవాళ్లు విసురుకుంటున్నాయి. ప్రాజెక్ట్ ల పునరాకృతిలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్‌, టీడీపీలు చేస్తున్న ఆరోపణలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆరోపణలు చేస్తున్నవారిపై కేసులు పెట్టి, జైలుకు పంపిస్తామని కేసీఆర్ చేసిన హెచ్చరికలపై ఈ రెండు పార్టీలు స్పందించాయి. సాగునీటి ప్రాజెక్ట్ లపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహారాష్ట్రంలో ఒప్పందాలు కుదుర్చుకుని.. ముంబయి నుంచి హైదరాబాద్‌ తిరిగొచ్ని ముఖ్యమంత్రి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తుమ్మిడిహట్టిపై 152 మీటర్లకు ఒప్పందం జరిగిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న ప్రకటనలను రుజువు చేస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని కేసీఆర్‌ సవాల్‌ విసిరారు.
ఉత్తమ్..రేవంత్ స్పందన..
దీనిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేరుగా ప్రతిస్పందిచకపోయినా.. కేసుల విషయంలో తనదైన రీతిలో స్పందించారు. ప్రాజెక్ట్‌ల పునరాకృతి అవినీతి మయమంటూ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై కేసులు పెట్టి, జైలుకు పంపిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించడాన్ని తప్పుపట్టారు. కేసీఆర్‌ బెదిరింపులకు భయపడి లొంగిపోతారనుకుంటే పొరపాటని మండిపడ్డారు. కేసీఆర్‌ హెచ్చరికలపై తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా స్పందించారు. ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్‌ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు.

తప్పుబట్టిన సీపీఎం..
మరోవైపు మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న సాగునీటి ప్రాజెక్ట్‌ల ఒప్పందాలను సీపీఎం తప్పుపట్టింది. ఈ ఒప్పందాలతో తెలంగాణ కంటే మహారాష్ట్రకే ఎక్కువ మేలు జరుగుతుందని సీపీఎం నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శి గంగాదరప్ప విమర్శించారు. మొత్తంమీద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎత్తును 152 నుంచి 148 మీటర్లకు తగ్గిస్తూ మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంపై రగులుతున్న రాజకీయ సెగలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడంలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

06:02 - August 25, 2016

ఆ ఇప్పుడు మన మల్లన్న ముచ్చట్ల మీదనే ఒక ముచ్చటొచ్చింది.. అదే మన ముచ్చట్లు బాగున్నయ్.. ఇనసొంపుగుంటున్నయ్ అని.. పద్మమోహన సంస్థోళ్లు అవార్డిచ్చిండ్రు.. దానికి మా మల్లన్న తాత వొయ్యిండు.. గా ముచ్చట్లు జూడాలంటే వీడియో చూడుండ్రి..

నేడు అభిమానిని పరామర్శించనున్న పవన్ ?

కర్ణాటక : కోలార్‌ లో హత్యకు గురైన తన అభిమాని వినోద్‌ కుటుంబాన్ని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ నేడు పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య రాజుకున్న విభేదాల కారణంగా తిరుపతికి చెందిన వినోద్‌ కోలార్ లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. 

కాబూల్ లోని అమెరికా యూనివర్సిటీలోకి చొరబడ్డ ముష్కరులు...

ఆఫ్ఘనిస్థాన్ : రాజధాని కాబూల్ లోని అమెరికా యూనివర్శిటీ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ లోకి ముష్కరులు చొరబడ్డారు. బాంబులు పేల్చుతూ, కాల్పులకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అధ్యాపకులు, కొంతమంది విద్యార్థులు యూనివర్శిటీ లోపలే చిక్కుకుపోయారు. ముష్కరులను మట్టుబెట్టేందుకు ప్రభుత్వ భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. 

నేడు మాల్యా బ్రాండ్ వేలం..

ముంబై : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ లోగో, ట్రేడ్ మార్క్ ను మరోసారి వేలం వేయనున్నారు. తొలిసారి నిర్వహించిన వేలం పాటలో కొనుగోలు దారుల నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఈసారి రిజర్వు ధరను రూ. 330.03 కోట్లకు తగ్గించింది. 

టి.సీఎస్ పదవి కాలం పొడిగింపు ?

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్ శర్మ పదవీకాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఈ నెలాఖరులోగా ఉత్తర్వులు వెలువడుతాయని తెలుస్తోంది. 

నేడు కృష్ణాష్టమి..

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా గురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. 

Don't Miss