Activities calendar

26 August 2016

21:56 - August 26, 2016

పంజాబ్‌ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్‌ అమ్ముకుంటూ ఆప్‌ నేత ఒకరు స్టింగ్‌ ఆపరేషన్‌కు చిక్కారు. తమ పార్టీ కార్యకర్తకు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వడం కోసం ఆమ్‌ ఆద్మి పార్టీ ప్రముఖ నేత సుచ్చా సింగ్‌ ఛోటేపూర్‌ 2 లక్షలు తీసుకున్నట్లు స్టింగ్‌ ఆపరేషన్‌లో వెల్లడైంది. సచ్చాసింగ్‌పై వస్తున్న ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న ఆప్‌ హైకమాండ్‌ ఆయనను పార్టీ నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆప్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశమై నిర్ణయించనుంది. తనపై వచ్చిన ఆరోపణలను ఛోటేపూర్‌ ఖండించారు. పార్టీలో తనను బద్నాం చేయడానికి కొందరు కక్ష గట్టారని ఆరోపించారు. తమ పార్టీలో అవినీతికి ఆస్కారం లేదని, అవినీతికి పాల్పడ్డవారిపై విచారణ జరుగుతుందని ఆప్‌ అధికార ప్రతినిధి హిమ్మత్‌సింగ్‌ షేర్‌గిల్‌ స్పష్టం చేశారు.

21:52 - August 26, 2016

ఒడిషా: ఈ దేశంలో జీవించడం ఎంత కష్టమో...మరణించడం కూడా అంతకన్నా కష్టంగా మారింది. చచ్చిన మనిషికి అంతిమ సంస్కారం చేసేందుకు కనీస సౌకర్యాలు కూడా లేని దౌర్భాగ్య స్థితి. నిస్సహాయుడైన ఓ భర్త భార్య శవాన్ని భుజాన వేసుకుని మోసుకుంటూ వెళ్లిన ఘటన మరవకముందే మరో ఘటన వెలుగు చూసింది. అంబులెన్స్‌ సౌకర్యం లేక మృత దేహాన్ని మూట కట్టి కర్రకు వేలాడ దీసి మోసుకెళ్లారు. ఈ దేశంలో పేదవాడు మరణించడం కూడా ఓ శాపమేనా?

గడచిన 24 గంటల్లో మూడు మృతదేహాల హృదయ విదారక దృశ్యాలివి...
అభివృద్ధి గురించి పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు...కాని ప్రజలకు అందుతున్న సౌకర్యాల మాటేమిటి?ఒడిషాలోని కలహండిలో 12 కిలోమీటర్ల మేర భర్త భార్య శవాన్ని భుజాన వేసుకుని మోసుకుంటూ వెళ్తున్న అంతిమ యాత్ర ఇది.ఒడిషాలోనే బాలాసోర్‌లో ఇద్దరు వ్యక్తులు శవాన్ని 3 కిలోమీటర్ల వరకు మోసుకెళ్లిన అంతిమ యాత్ర మరో దృశ్యమిది.మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లో అంతిమ యాత్ర కోసం చెరువులో నుంచి వెళ్తూ అష్టకష్టాలు పడ్డ దృశ్యమిది.ఒడిషా బాలాసోర్‌కు చెందిన 76ఏళ్ల సాలామణి బారిక్‌ సోరో ప్రాంతంలో రైలు నుంచి కింద పడి మృతి చెందింది. పోలీసులు సోరో స్టేషన్‌లోనే పోస్టుమార్టం చేసి కుటుంబీకులకు శవాన్ని అప్పగించి చేతులు దులుపుకున్నారు. శవాన్ని తీసుకెళ్లడానికి రైల్వే పోలీసులు ఎలాంటి సౌకర్యం కల్పించలేదు. అంబులెన్స్‌ సదుపాయం లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులు శవాన్ని మూటలా గట్టి కర్రకు వేలాడదీసి మూడు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లారు.

శవాన్ని కర్రకు మూటగట్టి మోసుకెళ్తున్న ఘటన
మధ్యప్రదేశ్‌ జబల్‌ పూర్‌లోని పనాగర్‌లో అంతిమ శవయాత్ర నీటిలో నుంచే సాగింది. స్మశాన వాటికకు వెళ్లే దారి వర్షాల కారణంగా నీట మునిగింది. మరో దారి ఉన్నా ఆ స్థలం కబ్జాకు గురైంది. స్థల యజమాని శవయాత్రకు ఒప్పుకోకపోవడంతో.. చేసేది లేక చెరువులో నుంచే స్మశాన వాటికకు వెళ్లారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా పట్టించుకునే వారే లేరని గ్రామస్థులు ఆరోపించారు.

కలహండిలో క్షయ వ్యాధితో మృతి చెందిన తన భార్య
ఒడిషాలోని కలహండిలో క్షయ వ్యాధితో మృతి చెందిన తన భార్య మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు సిబ్బంది సహకరించలేదు. నిస్సహాయుడైన దానామాంజీ భార్య శవాన్ని తన భుజంపై వేసుకుని 12 కిలోమీటర్ల మేర నడచుకుంటూ వెళ్లిన విషయం తెలిసిందే. 60 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉన్న దానామాంజీకి మధ్యలో మీడియా సహకరించడంతో కలెక్టర్‌ అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. అభివృద్ధి గురించి ఢంకా బజాయించే పాలకులు- గ్రామీణ ప్రాంతాల దుస్థితిని చూసి ఇప్పటికైనా కళ్లు తెరవాలి.

21:48 - August 26, 2016

విజయవాడ : రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు. కరువు ప్రాంత జిల్లాకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్రప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదని ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మండిపడ్డారు. కేంద్రం విడుదల చేసిన 700 కోట్లను వెంటనే... వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాలకు ఖర్చు చేయాలని మధు డిమాండ్‌ చేశారు. 

21:45 - August 26, 2016

హైదరాబాద్ : ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. జీఎస్టీ బిల్లును ఆమోదించడానికి ఉభయసభలు సమావేశం అవుతాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం, అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డితో సమావేశమై చర్చించారు.

జీఎస్‌టీ బిల్లును ఆమోదానికి కేసీఆర్ నిర్ణయం
జీఎస్‌టీ బిల్లును ఆమోదించడానికి ఈ నెల 30న అసెంబ్లీని సమావేశపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం, అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డితో సమావేశమై చర్చించారు.

ప్రత్యేక ఆహ్వానితుడిగా అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి
రాజ్యాంగాన్ని సవరిస్తూ ఇటీవల పార్లమెంట్‌ జీఎస్టీ చట్టం తెచ్చింది. ఈ చట్టం అమల్లోకి రావాలంటే దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లుపై చర్చించడానికి ఈ నెల 30న ఉదయం 11 గంటలకు శాసనసభను సమావేశ పర్చాలని స్పీకర్‌ మధుసూదనా చారిని సీఎం కోరారు. రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు కాబట్టి సభ్యులకు పూర్తి వివరణ ఇవ్వడానికి అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డిని ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవాలని కూడా స్పీకర్‌ను ముఖ్యమంత్రి కోరారు.  

21:42 - August 26, 2016

హైదరాబాద్ : మహా ఒప్పందంపై కేసీఆర్ టాం..టాం చేస్తున్నారు. ఇది తప్పని మనం ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్దాం... ఇదీ టీకాంగ్రెస్‌ నేతల మనోగతం. ఈ దిశగా ఓ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పై ఊరూరా ప్రచారం చేయాలని నిర్ణయించారు. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం నేపథ్యంలో.. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్‌ చేస్తోంది.

కాంగ్రెస్ ఊరూరా ప్రచారం
మహా ఒప్పందంతో కాంగ్రెస్-టీఆర్ఎస్ ల మధ్య పోరు తారాస్ధాయికి వెళ్లింది. ప్రాణహిత డిజైన్ మార్చి...మహా ఒప్పందంతో సీఎం కేసీఆర్ చేస్తున్న హడావిడిపై కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న కాంగ్రెస్ వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సన్నద్థం అవుతోంది. దీని కోసం గాంధీభవన్ లో టీపీసీసీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. మహా ఒప్పందంపై ఎలా ప్రజల్లోకి వెళ్లాలన్న దానిపై చర్చించారు. ఈ సమావేశానికి ఉత్తం, భట్టి, జానారెడ్డి, పొన్నాలతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు.

కేసీఆర్ పై కాంగ్రెస్ విమర్శలు
మహా ఒప్పందంపై తాము చెబుతున్న దాంట్లో వాస్తవం ఉన్నందువల్లే కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలకు దిగుతున్నారని, అసహానానికి గురవుతున్నారని కాంగ్రెస్ భావిస్తోంది. సరిగ్గా ఇదే అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని హస్తం పార్టీ డిసైడ్ అయ్యింది. రాష్ట్రంలో రీ డిజైన్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు వ్యవహారాలను ప్రజలకు తెలపాలని నిర్ణయించింది. దీని కోసం యాక్షన్ ప్లాన్ సైతం సిద్ధం చేసుకుంది.

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపరిమితంపై కాంగ్రెస్ వాదన
కాళేశ్వరంలో 152 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ని 148 మీటర్లకు మాత్రమే పరిమితం చేయడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందన్నది కాంగ్రెస్ వాదన. 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి నిర్మాణం వల్ల 160 టీఎంసీల నీటిని గ్రావిటీతో ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు తీసుకునే వీలుందని చెబుతున్న కాంగ్రెస్... ఇది పూర్తయితే రైతులపై 8 వేల కోట్ల విద్యుత్ బిల్లుల భారం పడుతుందని చెబుతోంది. రాష్ట్ర ప్రయోజనాలపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే కేసీఆర్ అహాంకారంతో బెదిరింపులకు దిగుతున్నారని హస్తం నేతలు మండిపడుతున్నారు. ఈ తప్పులన్నింటిని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. దీని కోసం..మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాలలో సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. ప్రాజెక్టుల డిజైన్ మార్పుతో పాటు కాలేశ్వరం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల జరిగే నష్టాలకు ప్రజలకు అర్ధమయ్యే రీతిలో హాస్తం నేతలు వివరించనున్నారు.

ఊరూరా తిరుగనున్న కాంగ్రెస్ ..
ఒకవైపు కేసీఆర్ పై మాటల దాడిని కొనసాగిస్తూనే... మరోవైపు లెక్కా పత్రాలతో మహా ఒప్పందం వల్ల జరగబోయే నష్టాన్ని ఊరూరా తిరుగుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చెప్పనుంది. ఈ కొత్త ప్లానుతో కాంగ్రెస్ పార్టీ గులాబీ బాస్ పై ఏ మేరకు ఒత్తిడి పెంచుతుందో వేచిచూడాలి. 

21:37 - August 26, 2016

హైదరాబాద్ : ప్రస్తుత సీజన్‌లో నీటి పంపకాలే ప్రధాన అజెండాగా హైదరాబాద్‌లో నిర్వహించిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం ఎటూ తేలకుండానే ముగిసింది. నీటి పంపకాలతో పాటు బోర్డు నిర్వహణ మార్గదర్శకాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల పరిధిలో టెలిమెట్రీ ఏర్పాట్లు, ఉమ్మడి జలాశయాల నిర్వహణ నిధులు, కొత్త ప్రాజెక్టులు తదితర 11 అంశాలతో కూడిన అజెండాపై సమావేశంలో చర్చించారు. ఖరీఫ్‌ కోసం ఏపీ 47 టీఎంసీలు, తెలంగాణ 41 టీఎంసీలు విడుదల చేయాలని కోరాయి. వీటిపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం రేపు మరోసారి సమావేశం కానున్నారు. 

21:35 - August 26, 2016

హైదరాబాద్ : స్విస్‌ చాలెంజ్‌ విధానంపై పూర్తి వివరాలు అందించాలని హైకోర్టు ఏపీ సర్కారును ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారంటూ కోర్టు మరోసారి మండిపడింది. తమకు తగినంత సమయం ఇవ్వాలని ఏపీ సర్కారు కోరడంతో.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

స్విస్ చాలెంజ్‌ విధానాన్ని సవాలు చేస్తూ హైకోర్టులోదాఖలైన పిటిషన్
అమరావతి అభివృద్ధి పనులకు ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానాన్ని ఎంచుకోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం వాడివేడిగా వాదనలు సాగాయి. స్విస్ చాలెంజ్ విధానంలో టెండర్ దాఖలు చేసిన కంపెనీల వివరాలు అందజేయాలని హైకోర్టు కోరింది. ఆ వివరాలు ప్రస్తుతం తమ వద్ద లేవని, పూర్తి వివరాలు అందించేందుకు సమయం కావాలని ఏపీ అడ్వకేట్ జనరల్ అడిగారు.


స్విస్ చాలెంజ్‌ విధానపు నిబంధనలపై హైకోర్టు అభ్యంతరం
స్విస్ టెండర్ విధానంలోని నిబంధనలపై హైకోర్టు అభ్యంతరం లేవనెత్తింది. టెండర్‌లో పాల్గొనాలనుకున్న కంపెనీలు దేశంలో 500 హెక్టార్లరో ఏదైనా నిర్మాణం చేసుండాలని స్విస్‌ చాలెంజ్‌ విధానపు నిబంధనల్లో పేర్కొనడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అలాగే విదేశాల్లో కూడా నిర్మాణ రంగంలో అనుభవం ఉండాలన్న షరతుపైనా మండిపడింది. దేశంలో పదివేల హెక్టార్లరో నిర్మాణాలు చేపట్టి, విదేశాల్లో నిర్మాణ అనుభవం లేని కంపెనీలు అర్హత కోల్పోయే ప్రమాదముంది కదా..అని ధర్మాసనం ప్రశ్నించింది.

ప్రభుత్వం దగ్గర సమాచారం లేకపోవడం హాస్యాస్పదమంటూ వ్యాఖ్య
స్విస్ విధానంపై సమాచారం తమ వద్దలేదన్నఅడ్వకేట్ జనరల్‌ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం దగ్గర సమాచారం లేకపోవడం హాస్యాస్పదమంటూ ఘాటుగా స్పందించింది. ఇంతకు మందు విచారణలో కూడా అర్హత లేదని ప్రభుత్వం తప్పించుకుందని గుర్తుచేసింది. స్విస్ విధానానికి సంబంధించి సమగ్ర వివరాలను అందించాలని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాలకు స్పందించిన అడ్వకేట్ జనరల్...
హైకోర్టు ఆదేశాలకు స్పందించిన అడ్వకేట్ జనరల్... స్విస్ చాలెంజ్ విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సోమవారం నోటిఫికేషన్‌తో వస్తామని చెప్పారు. దీంతో న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

21:31 - August 26, 2016

చిత్తూరు : జనసేనాని మరోసారి జనంలోకి రానున్నారు. రేపు సాయంత్రం తిరుపతి వేదికగా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇందిరామైదానంలో జరిగే పవన్‌ సభకు పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు. జనసేనాని ప్రజా సమస్యలపై సర్కార్‌ను నిలదీస్తారా.. లేక కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి వెళ్లిపోతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
తిరుపతిలో పవన్ బహిరంగసభ
జనసేన అధినేత.. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ శనివారం సాయంత్రం చిత్తూరు జిల్లా తిరుపతిలో బహిరంగసభ నిర్వహించనున్నారు. ఇందిరామైదానంలో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ సభకు పోలీసుల అనుమతి కూడా లభించింది. సభను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తిరుపతి ఎస్పీ విజయలక్ష్మీ సూచించారు. పోలీసు బలగాలు సరిపడా లేవని జనసేన నేతలకు ఎస్పీ తెలిపారు. తమ పార్టీ వలంటీర్లతో సభ ప్రశాంతంగా నిర్వహించుకుంటామని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇవ్వడంతో పోలీసులు బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు.

వినోద్‌ రాయ్‌ కుటుంబాన్ని పరామర్శించిన పవన్
శుక్రవారమే తిరుపతి వచ్చిన పవన్.. ఇటీవల కర్ణాటక కోలార్‌లో అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన వినోద్‌ రాయ్‌ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వెంకన్న దర్శనం చేసుకున్న ఆయన కొండపైనే అతిథి గృహంలో బస చేశారు.

తిరుమల సుబ్బిరామిరెడ్డి అతిథి గృహంలో పవన్ మంతనాలు
తిరుమల సుబ్బిరామిరెడ్డి అతిథి గృహంలో పవన్‌ తన సన్నిహితులతో మంతనాలు జరిపారు. సభ ఏర్పాటుపై చర్చించారు. ఈ సభావేదిక పై నుంచి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, విభజన హామీలపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై పవన్‌ నిరసన గళం వినిపిస్తారా... లేక పార్టీ కార్యకర్తలు, అభిమానులకు దిశానిర్దేశం చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ నేతలు మాత్రం అభిమానులకు దిశానిర్దేశం మాత్రమే చేస్తారని చెబుతున్నారు.

అభిమానుల కోలాహలం
మొత్తానికి జనసేనాని మళ్లీ జనంలోకి రావడంతో కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. పవన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా.. ప్రశ్నించకపోయినా పార్టీ ప్రజలకు చేరువ చేసే ఈ ప్రయత్నం సఫలమవుతుందన్న భావన అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

 

అమర లింగయ్యకు రూ.1.47 కోట్లు..

అమరావతి: కృష్ణా పుష్కరాల సందర్భంగాఅమరావతిలోని అమరేశ్వర ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. శుక్రవారం ఆలయంలోని హుండీలను తెరిచిన ఆలయ అధికారులు ఆదాయాన్ని గణించారు. ఆలయం ఈవో ఎన్‌.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పుష్కరాల 12 రోజుల్లో స్వామివారికి హుండీల ద్వారా రూ.42,49,606 ఆదాయం వచ్చిందని.. మొత్తంగా అన్ని రకాల సేవలు కలిసి రూ.1,47,23,526 ఆదాయం వచ్చిన్నట్లు తెలిపారు. వీటిలో దర్శనం టిక్కెట్ల ద్వారా రూ. 96లక్షలు సమకూరినట్లు వెల్లడించారు. హుండీల లెక్కింపును దేవాదాయ శాఖ ఏసీ శ్రీనివాసరావు పర్యవేక్షించారు.

ఒడిషా సీఎంకు బాధ కలిగించిన ఘటన..

ఒడిషా : భార్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు దారి ఖర్చులు లేక భుజాన వేసుకొని వెళ్లిన ఒడిశాకు చెందిన మాఝీ విషయంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్పందించారు. ఈ ఘటన తనకు ఎంతో బాధ కలిగించిందని.. దీనిపై విచారణకు ఆదేశించానని తెలిపారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణించిన పేద వారి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ఒడిశా ప్రభుత్వం ‘మహాప్రయాణ’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తిగా జరిగితే కానీ విషయం తెలియదని ఆయన అన్నారు.

20:46 - August 26, 2016

మర్డర్లు, కబ్జాలు, అక్రమ వసూళ్లు, సెటిల్ మెంట్లు మాత్రమేనా? ఎప్పుడూ అవే అయితే బోర్ కొట్టదూ. జస్ట్ ఫర్ ఛేంజ్ అన్నట్టు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులేస్తున్నారు. సినిమాలకు పెట్టుబడులు పెడుతున్నారు. నిర్మాతల వెనుక నిలబడుతున్నారు.తారల తలరాతలు రాస్తున్నారు. మొత్తంగా ఇండస్ట్రీని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మనీ.. మాఫియా.. మూవీస్ వీటి మధ్య సంబంధంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. సాధారణంగా ఓ ఎన్ కౌంటర్ తో కథ ముగుస్తుంది. కానీ, ఇక్కడ అసలు కథ మొదలయింది. పొలిటీషియన్స్, పోలీస్ ఆఫీసర్స్, బడా వ్యాపారవేత్తల నుంచి టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఇలా నయీం విస్తరించిన ఏరియాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంతకీ నయీం టాలీవుడ్ లో ఏం చేశాడు? తన పాత్రను వెండితెరపై చూసుకోవాలన్న కల. ఏకంగా బాలీవుడ్ లోనే దిసీజ్ నయీమ్ అనిపించుకోవాలనే ప్రయత్నం. సినిమాలు తీస్తూ, థియేటర్లు గుప్పిట్లో పెట్టుకుంటూ ...ఇలా అన్ని ఏరియాల్లో నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు.. అదే ఇండస్ట్రీ వైపు అడుగులేయించింది. మరి ఇండస్ట్రీలో అతగాడితో కలిసి అడుగులేసిన పెద్దలెవరు?ఎవరెవరికి నయీంతో సంబంధాలున్నాయి? ఏ హీరోకు నయీం అండగా ఉన్నాడు? ఏ సినిమాలు నయీం సొమ్ముతో తయారయ్యాయి? హైదరాబాద్ లో, టాలీవుడ్ లో మాఫియా కథలు చూశాం... ముంబయిపై మాఫియా ఏ రేంజ్ లో పట్టు సాధించింది...? హైదరాబాద్ సంగతి చూశాం.. ఇక ముంబయిపై మాఫియా పడగ నీడ ఈ నాటిది కాదు. దశాబ్దాలుగా కనిపిస్తున్న ఈ సీన్ ఇప్పటికీ అదే తీరులో ఉందని అనేక ఆధారాలు చెప్తున్నాయి. బాలీవుడ్ ఇప్పటికీ అండర్ వాల్డ్ కనుసన్నల్లోనే ఉందనే అంశం స్పష్టమౌతోంది. బాలీవుడ్ లో నిలదొక్కుకోవాలంటే వీరి ఆశీస్సులు కావాలి. అవకాశాలు రావాలంటే అనుకూలంగా ఉండాలి.. ముచ్చటపడితే దుబాయ్ లో డాన్సులు చేయాలి.. పెట్టుబడి పెడితే నటించాలి... ఇదీ బాలీవుడ్ పై మాఫియాకున్న పట్టు.. బాలీవుడ్, భారత్ లోనే కాదు.. ప్రపంచంలోనే అతి ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్న సినీ పరిశ్రమల్లో ఒకటి. లో బడ్జెట్ హిట్ చిత్రాల నుంచి వందల కోట్లు కొల్లగొట్టగలిగే బడా బడా స్టార్ హీరోల సినిమాల వరకు ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలు బాలీవుడ్లో చేతులు మారతాయి. ఇదే ఎలిమెంట్ ముంబై మాఫియాకు బాలీవుడ్ మీద కన్నేసేలా చేసింది. బెదిరింపు కాల్స్ చాలా సాధారణం..మాట వినకపోతే, మూసేయటం మామూలు విషయమే..గుల్షన్ కుమార్ హత్య నుండి ఆ మధ్య గాయకుడు అరిజిత్ సింగ్ కు వచ్చిన బెదిరింపు కాల్స్ వరకు అండర్ వాల్డ్ దూకుడుని స్పష్టం చేస్తున్నాయి. మాఫియా పెచ్చుమీరటానికి, విస్తరించానికి ప్రయత్నిస్తున్నదంటే వ్యవస్థ బలహీనంగా ఉన్నట్టే. ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్టే. నయీం ఇన్నేళ్లు రాజ్యమేలాడంటే ఎవరి అండదండలతో ఈ పని చేశాడో తేల్చాలి.. పొలిటీషియన్స్ , అధికారులే కాదు,.. ఇండస్ట్రీ పెద్దలెవరెవరు నయీంతో కుమ్మక్కయ్యారో తేల్చాల్సి ఉంది. ..

20:40 - August 26, 2016

లవ్ కాన్సెప్ట్ అంటేనే బిస్కెట్ అని పెళ్ళి చూపులు సినిమా హీరో విజయ్ దేవరకొండ అంటున్నాడు..తాను నాల్గవ తరగతి చదివేరోజుల్లోనే ఓ బుక్ రాయాలనుకున్నాని విజయ్ పేద్దఇం టిలిజెంట్ లా ఫోజ్ పెట్టి మరీ చెప్పాడు..ఇంతకీ అసలు విషయం ఏమంటే..ఎటువంటి అంచనాలూ లేకుండా వచ్చిన 'పెళ్ళిచూపులు' సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ మరోసారి తన ఎనర్జిటిక్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బిగ్ బెన్ సినిమాస్ నిర్మాణ సంస్థ...దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్స్ గా నటించిన పెళ్ళిచూపులు సినిమా హీరో తో టెన్ టీవీ లైవ్ షో నిర్వహించింది. ఈ చిట్ చాట్ లో విజయ్ చాలా జోవియల్ గా మాట్లాడాడు.. అమ్మానాన్నలు ఎరేంజ్ చేసిన ' పెళ్ళిచూపులు' బాగుంటాయని సరదా చెప్పాడు. నేను యాక్టర్ అయిపోతా..ఇంకెందుకు పరీక్షలకు చదవటం అనేవాడట స్కూల్లో...ఒకరికి తెలీకుండా..మరొకరికి ప్రపోజ్ చేస్తే బాగుంటుందని దేవరకొండ జోవియల్ గా చెప్పారు..ఇటువంటి మరిన్ని సరదా సరదా విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:31 - August 26, 2016

ఏపకల్లు తాగితే రోగాలు తగ్గుంటున్న జనాలు..రగులుతున్న జిల్లాల రగడ..జిల్లా చేయకుంటే రాజీనామా చేస్తానంటున్న నేతలు..దళితులకు మూడెకరాల భూములిచ్చుడెలాగున్నా..దళితుల భూములు లాక్కుంటున్ సర్కారోళ్లు..ఆర్డీవోని బెదిరిస్తున్న ఎమ్మెల్యే మేడమ్..ఏప కల్లు తాగితే సుగర్ తగ్గుంటున్న జనాలు..లైట్లు ఎయ్యి సచ్చిపోతానంటున్న పోరగాడు..చెట్టెక్కిన చిరుత..మల్లన్న ముచ్చట్ల ప్రోగ్రాంల ఆడియో రిలీజ్..గిసువంటి మస్తు ముచ్చట్లు గీరోజుకూడా మన ముందు వచ్చేసిండు..ఖుషీ అవ్వాలంటే మల్లన్న ముచ్చట్లే సూడాలా..గందుకనే ఈ వీడియోను చూడుండ్రి...

రాహుల్ కు సలహా ఇచ్చిన సుబ్రహ్మణ్య స్వామి..

ఢిల్లీ : రాహుల్‌ గాంధీకి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఒక ఉచిత సలహా ఇచ్చారు. ద్వేషపూరిత, విభజన రాజకీయాలంటూ రాహుల్‌ చేసిన ట్వీట్‌లపై స్పందించిన స్వామి శుక్రవారం తనదైన రీతిలో రాహుల్‌కు సలహా ఇచ్చారు. ‘మీరు కాంగ్రెస్‌ పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌గానే కాదు, రాజకీయాలనుంచీ వైదొలగితేనే పురాతన కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.

రోడ్లపై హల్ చల్ చేస్తున్న సర్పాలు..

చైనా : చైనా వాసులకు పాములు హడలెత్తేస్తున్నాయి. సిచుయాన్ ప్రావిన్స్‌లో ఓ బ్రీడింగ్ ఫామ్ నుంచి 180కోబ్రా పాము పిల్లలు వీధుల్లోకి వచ్చి చేరాయి. వీధుల్లో పలుచోట్ల పాములు కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. లూము టౌన్‌షిప్‌లోకి కొన్ని పాములు వచ్చినట్లు ప్రజలు తెలిపారు. ఫామ్ నుంచి తప్పించుకుని వచ్చిన వాటిలో 23పాములు అతి పెద్ద సైజ్ లో ఉన్నాయని తెలిపారు. 

18:59 - August 26, 2016

కర్నూలు : ఉల్లి.. వినియోగదారులకే కాదు.. ఇప్పుడు రైతులకూ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పెట్టుబడులు వేలల్లోకి చేరిపోగా.. దిగుబడులను అమ్మేందుకు వెళితే వందల రూపాయలు కూడా రాని దుస్థితి. నిరుడు ఐదువేల రూపాయలు పలికిన క్వింటాలు ఉల్లిధర.. ఈ ఏడాది రెండు వందల యాభై రూపాయలు కూడా పలకడం లేదు. దీంతో ఉల్లిరైతు ఉసూరుమంటున్నాడు. గిట్టుబాటు ధర లేక.. అయినకాడికి అమ్మేందుకు మనసొప్పక కలవర పడుతున్నాడు.

ఎకరాకు దాదాపు 50 వేలకు పైగా పెట్టుబడులు
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి.. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక ఉల్లిరైతు దిగాలు చెందుతున్నాడు. ఎకరాకు 50 వేల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి ఉల్లిపంటను సాగుచేసిన రైతన్న గిట్టుబాటు ధరలేక విలవిల్లాడుతున్నాడు. బోర్ల ద్వారా పంటను సాగు చేసిన రైతులకు ఎకరాకు కేవలం 50 నుంచి 60 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. కనీసం పండించిన పంటకు కోతకూలీలు కూడ రావడంలేదు. ఉల్లిరైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు.

ఉత్తత్తిలో కర్నూలు దేశంలోనే మొదటిస్థానం..
దేశంలోనే ఉల్లి ఉత్పత్తిలో మొదటిస్థానంలో ఉన్న కర్నూలు జిల్లాలో ఈ ఏడాది రైతులు ఇతర పంటను వేసుకునేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్నారు. ఎమ్మిగనూరు మండలంలో వేసిన ఉల్లిపంటను సాగుచేసి వేరే పంటలు వేస్తున్నారు రైతులు.

కనీస మద్దతు ధర రూ.2,500 ఇవ్వాలని రైతుల డిమాండ్
ఉల్లి దిగుబడులను మార్కెట్‌లో నామమాత్రపు ధరలకు అమ్ముదామనుకున్నా.. రైతులకు వీలు కావడం లేదు. లాభార్జనే ఏకైక ధ్యేయంగా పెట్టుకున్న వ్యాపారులు ఉల్లిధరను తమకు అనుకూలంగా నిర్ణయిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతుల నుంచి వ్యాపారులు వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాలు రెండు వందల యాభై రూపాయలకు కొని.. పక్కనే ఉన్న రైతుబజారులో కిలో 16 రూపాయలకు అమ్ముతున్నారు. రైతులు అక్కడికే తీసుకు వెళ్లి అమ్ముదామన్నా.. వ్యాపారులు సహకరించడం లేదు. దళారీల దందాను ప్రభుత్వం నియంత్రించలేకపోవడంతో.. రైతులు నిండా మునిగిపోతున్నారు.

మద్దతు ధర 2 వేల 500 నిర్ణయించాలంటున్న రైతులు..
అంతర్జాతీయ మార్కెట్లో ఉల్లికి డిమాండ్ ఉన్నసమయంలో, ధర పెరిగితే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ధరను నియంత్రిస్తుంది. కాని ధర పడిపోయిన కీలకసమయాల్లో రైతుల పక్షాన ప్రభుత్వం మాట్లాడకపోవడం దురదృష్టకరమని రైతులు అంటున్నారు. ధరలేని సమయంలో కూడా కనీస మద్దతు ధర 2 వేల 500 రూపాయలుగా నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు.

నల్లబజారులో రూ. 1600 ధర పలుకుతున్న క్వింటాలు ఉల్లి
ఆరుగాలం శ్రమించి ఉల్లిని పండించిన రైతులు కోలుకోలేనివిధంగా అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని మద్య దళారులను అరికట్టి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు కోరుతున్నాయి.

18:54 - August 26, 2016

విశాఖపట్నం : విభజన చట్టంలో ఉన్న ప్రతి హామీని కేంద్రం అమలు చేస్తుందని విశాఖ ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు చెప్పారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వ సహాయంపై వస్తున్న కామెంట్లపై ఘాటుగా స్పందించారు. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఎక్కువగా ఇచ్చిందని హరిబాబు తెలిపారు. పోలవరం విషయంలో కూడా ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. ఏపీకి చేయాల్సిన అన్ని పనులు బీజేపీ చేస్తుందని, విజయవాడ-గూడూరు మధ్యలో మూడో రైల్వే లైను కేంద్రం ఆమోదించిందన్నారు. విశాఖ రైల్వే జోన్ పై కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నామని ఎంపీ హరిబాబు అన్నారు. 

18:51 - August 26, 2016

విజయవాడ : పోలవరం ప్రాజెక్టును నిర్మించే బాధ్యత కేంద్రానిదే అయినా..చంద్రబాబు మాత్రం కేంద్రానికి ఎందుకు అప్పగించడంలేదని ఏసీ సీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ప్రశ్నించారు. వెంటనే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ హాయాంలోనే 32శాతం పనులు పూర్తయ్యాయని ఇంకా 68శాతం పూర్తిచేస్తే సరిపోతుందన్నారు. కేంద్రానికి ప్రాజెక్టును అప్పచెప్పకపోవడంవల్లే నిధులు రావడం లేదని రఘువీరారెడ్డి ఆరోపించారు. 

18:45 - August 26, 2016

ఎల్బీ నగర్ లో దారుణం..

హైదరాబాద్ : ల్బీ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. అన్వితారెడ్డి అనే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.దీంతో ఆప్రాంతంలో విషాదం నెలకొంది. కళాశాలకు సంబంధించిన హాస్టర్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అన్వితారెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా వాడపల్లి వాసిగా గుర్తించారు.

ప్రారంభమైన కేంద్ర కేబినెట్ సమావేశం...

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్రమంత్రి వర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేబినెట్‌ మంత్రులు సహా స్వతంత్ర, సహాయ మంత్రులు హాజరయ్యారు. తిరంగా యాత్ర, క్యాబినెట్‌ నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, వివిధ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మంత్రులు శాఖల వారీగా ప్రధానికి నివేదికలు సమర్పించనున్నారు.

 

ఇంజెక్షన్ వికటించి వ్యక్తి మృతి..

రంగారెడ్డి : డాక్టర్ చేసిన ఇంజెక్షన్ వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర క్లినిక్‌లో చోటు చేసుకుంది. రోగి గోపాల్ మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు ఆందోళన చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గోపాల్ మృతి చెందాడని ఆరోపిస్తున్నారు.

ముగిసిన కృష్ణా బోర్డు సమావేశం..

హైదరాబాద్ : జలసౌధ కార్యాలయంలో కృష్ణా బోర్డు సమావేశం ముగిసింది. బోర్డు చైర్మన్ ఇరు పక్షాల వాదనలు విన్నారు. 47 టీఎంసీల నీరును విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. కానీ 39 టీఎంసీలు మాత్రమే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. నీటి విడుదలపై రేపు బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించనుంది. సెప్టెంబర్ 15 లోగా త్రిసభ్య కమిటీ నివేదిక ఇవ్వనుంది. 

కోర్టులో ఫయీమ్ దంపతులు హాజరు..

హైదారబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఫయీమ్ దంపతులకు రెండు రోజుల కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో వీరిని హాజరుపరిచారు. నయీం మరదలు సలీమాను మహబూబ్ నగర్ జైలు నుండి పీటీ వారెంట్ పై రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచేందుకు రాజేంద్రనగర్ కోర్టు అనమతించింది. 

18:05 - August 26, 2016

హైదరాబాద్ : మొన్నటి దాకా వరంగల్ జిల్లా రైతుల కళ్లలో ఆనందం తొణికిసలాడేది. ఈ ఏడాది పంటలకు ఢోకా లేదులే అనుకున్నారు. కానీ, రెండు మూడు వారాల్లోనే పరిస్థితి తారుమారైంది. ఇక బతికేదెట్టా? అన్న బెంగ పట్టుకుంది.

వానల కోసం ఎదురుతెన్నులు చూస్తున్న అన్నదాతలు
ఇది బీడు భూమి కాదు. వరంగల్ జిల్లాలోని వరిపొలం. అదను ప్రకారం వానలు కురిసి వుంటే ఈ సమయంలో ఈ పొలం ఎంత పచ్చగా కళకళలాడుతుండేదో. కానీ కాలం కలిసిరాలేదు. చినుకు జాడలేక పుడమితల్లి గుండె ఇలా ముక్కలైంది. ఇది మొక్కజొన్న, పెసర పంటల పరిస్థితి. శ్రావణమాసంలో ఎవరింట్లో చూసినా కుప్పులు కుప్పులుగా మొక్కజొన్న కంకులు, రాశులు రాశులుగా కొత్త పెసలు కనిపించేవి. కానీ, ఇప్పుడు ఆ వైభవం లేదు. వరంగల్ జిల్లాలో ఏ రైతును పలకరించినా కరవు బాధలే వినిపిస్తున్నారు. నీళ్లు లేకపోతే తామెలా బతకాలంటూ ఆక్రందిస్తున్నారు.

జూన్ వానలతో పంటలు వేసిన రైతన్నలు
జూన్ లో సమృద్ధిగా వానలు కురవడంతో వరంగల్ జిల్లాలో జోరుగా వ్యవసాయం ప్రారంభించారు. నెల రోజుల నుంచి చినుకు జాడలేదు. బోర్లలో నీళ్లులేవు బావుల్లో నీళ్లులేవు. పొలాలు ఎండిపోతున్నాయి. పత్తి, వరి, మొక్కజొన్న, పసుపు, వేరుసెనగ, మిర్చి అన్ని పంటలూ వెక్కిరిస్తున్నాయి. ఒక్కొక్కరు ఎకరానికి ఇప్పటికే 20 వేల రూపాయల దాకా ఖర్చు చేశారు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.

ఆమడదూరంలో నీరున్నా చుక్కనీరు అందని స్థితి

వరంగల్ జిల్లాలోని కొన్ని మండలాలకు ఎస్ ఆర్ ఎస్ పి ద్వారా, మరికొన్ని మండలాలకు దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా నీళ్లందుతాయి. కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే దేవాదుల ప్రాజెక్ట్ వున్నా చుక్కనీరు పొందలేని దీనస్థితి ముప్పారం, నారాయణగిరి, వేలేరు గ్రామాల రైతులది.

ఖమ్మం జిల్లాలోనూ తీవ్రమైన కరవు పరిస్థితులు
ఖమ్మం జిల్లాలోనూ తీవ్రమైన కరవు పరిస్థితులున్నాయి. జిల్లాలో 37 మండలాల్లో పరిస్థితి చేయిదాటి పోతోంది. ఒక్కొక్క ఎకరానికి 20 వేల రూపాయల దాకా పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయో రావోనన్న దిగులుతో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు.

ఎండిపోతున్న 2 లక్షల హెక్టార్లలో పంటలు
ఖమ్మం జిల్లాలో జూన్ లో జోరుగా వానలు కురిశాయి. సాధారణం కంటే దాదాపు రెట్టింపు వర్షపాతం నమోదైంది. జులైలో తేడా వచ్చింది. 309 మి.మి. సగటు వర్షపాతం వుండే జులైలో 188 మి.మి.లే పడింది. ఆగస్టులో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఆగస్టు సగటు వర్షపాతం 276 మి.మీ. అయితే, ఇప్పటికి 60 మిల్లీమీటర్లు కూడా పడలేదు. దీంతో తొలకరి చినుకులకు ఆశపడి, సాగు చేసినవారంతా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. జిల్లాలో దాదాపు 2 లక్షల హెక్టార్లలో పంటలు ఎండిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది పత్తికి ప్రత్యామ్నాయంగా కంది, పెసర, మొక్కజొన్న, మినుము, వేరుసెనగ, వరి, నువ్వు పంటలను సిఫారసు చేశారు. ఇవన్నీ వానలు లేక ఎండిపోతున్నాయి.

అడుగంటిన పాలేరు రిజర్వాయర్
ఖమ్మం జిల్లాకు అన్నపూర్ణ లాంటి పాలేరు రిజర్వాయర్ అడుగంటింది. పాలేరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 23 అడుగులు కాగా, 8 అడుగుల నీళ్లు మాత్రమే వున్నాయి. గత 30 ఏళ్లలో ఇంత తక్కువ నీళ్లు ఎప్పుడూ చూడలేదంటున్నారు రైతులు. దీంతో 3 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు ప్రశ్నార్ధకంగా మారింది.

బీళ్లుగా దర్శనమిస్తున్న భూములు

పాలేరులో నీళ్లు లేకపోడంతో కూసుమంచి, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, చింతకాని, ముదిగొండ, నేలకొండపల్లి, కొణిజర్ల, వైరా, తల్లాడ, కల్లూరు, కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో సాగుభూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి.

నీరు లేక నిలిచిపోయిన విద్యుత్
పాలేరు రిజర్వాయర్ లో నీళ్లు అడుగంటడడంతో మినీ హైడల్ విద్యుత్ ప్రాజెక్ట్ లో కరెంట్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది.

వాన రాక కోసం ఎదురు చూస్తున్ననిజామాబాద్ జిల్లా
నిజామాబాద్ జిల్లా వాన రాక కోసం తపిస్తోంది. గత నాలుగు వారాలుగా వాన జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు. భూగర్భ జలాలు పడిపోయాయి. బోర్లు పనిచేయడం లేదు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.
పంటను చూస్తుంటే గుండె తరుక్కుపోయే స్థితి..
నిజామాబాద్ జిల్లాలో పంటల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. జులై నెలలో దాదాపు పది రోజుల పాటు చక్కగా వర్షాలు పడడంతో రైతులంతా సంతోషించారు. దాదాపు మూడు లక్షల హెక్టార్లలో వరి, సోయ, మొక్కజొన్న, పసుపు లాంటి పంటలు సాగుచేశారు. అయితే నాలుగు వారాలుగా వానలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి.

11 మండలాల్లో తక్కువ వర్షపాతం
36 మండలాలున్న నిజామాబాద్ జిల్లాలో 11 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి, బోధన్ డివిజన్ లలో తక్కువగా వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి డివిజన్ లో 24.3శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో పంటలు కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.

పెరగని భూగర్భ జలాలు
భూగర్భ జలాలు కూడా పెద్దగా పెరగలేదు. సాధారణంగా ఆగస్టు నెలలో 8 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలుండేవి. ఇప్పుడు 14.32 మీటర్ల లోతులో వున్నాయి. కామారెడ్డి డివిజన్ లో పరిస్థితి మరీ ఘోరంగా వుంది. 20 మీటర్ల లోతులో భూగర్భ జలాలుండడంతో బోర్లు సరిగా పనిచేయడం లేదు. రోజు మొత్తం మీద రెండు గంటలు కూడా నీళ్లు రావడం లేదు. బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది.

చుక్కనీరు లేని నిజాం సాగర్ ప్రాజెక్టు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి కొన్ని నీళ్లు వచ్చిన్నప్పటికీ, నిజాం సాగర్ ప్రాజెక్ట్ లోకి చుక్కనీరు రాలేదు. నాగిరెడ్డి పేట, ఎల్లారెడ్డి మండలాలకు సాగునీరందించే పోచారం ప్రాజెక్ట్ లో కూడా నీళ్లు లేవు. వానలు కురవక, బోరు బావులు పనిచేయక, ప్రాజెక్ట్ ల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. వరి పంటల పరిస్థితి అత్యంత దయనీయంగా వుంది. సోయా పూత దశలో వుంది. ఇప్పుడు వర్షాలు పడకపోతే, సోయా రైతులకు కష్టాలు తప్పవంటున్నారు. 

17:52 - August 26, 2016

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఈనెల 30న సమావేశం కానుంది. జీఎస్‌టీ బిల్లును ఆమోదింపజేసేం అవకాశాలున్నట్లుగా సమాచారం. ఇందుకోసం  సభను ప్రత్యేకంగా సమావేశపరచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ కార్యదర్శి సదారామ్‌, మంత్రి హరీశ్‌రావులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవాలని సీఎం నిర్ణయించారు. 30న ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం కానున్నాయి.

17:48 - August 26, 2016

హైదారబాద్ : మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సీఎం మరోసారి పునసమీక్షించుకోవాలని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. 152 మీటర్ల ఎత్తుతో తుమ్మడిహట్టి నిర్మిస్తే అనేక లాభాలున్నాయని..కానీ కేసీఆర్ మాత్రం 148 మీటర్ల ఎత్తుకే ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎత్తు విషయంలో మార్పులు చేసుకోవాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. త్వరలోనే టిడిపి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తుందన్నారు. 

17:46 - August 26, 2016

హైదరాబాద్ : తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌లో 27 కొత్త జిల్లాల మ్యాప్‌లను ప్రభుత్వం పొందుపరిచింది. రాష్ట్ర మ్యాప్‌తో సహా 27 కొత్త జిల్లాల మ్యాప్‌లను ఇందులో ఉంచారు. newdistrictsinformation.telangana.gov.inలో జిల్లాల మ్యాప్‌లతో పాటు ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై దాదాపు 5 వేల మంది స్పందించారు.  

టీ.పీసీసీ నేతలు భేటీ ..

హైదరాబాద్ : గాంధీ భవన్ లో టీపీసీసీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, పొన్నాల, సబితా ఇంద్రారెడ్డి, ఇంకా పలువురు నేతలు హాజరయ్యారు. ప్రాణహిత ప్రాజెక్టు డిజైన మార్పుపై ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపై నేతలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

30 నుంచి తెలంగాణ అసెంబ్లీ ..

హైదరాబాద్ : ఈ నెల 30 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలో జీఎస్టీ బిల్లుపై తీర్మానం చేసే అవకాశమున్నట్లు సమాచారం. 

మూడు ప్రాజెక్టులపై బాబు మౌనం వీడాలి:రఘువీరా

విజయవాడ : తెలంగాణలో మూడు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేసీఆర్ సర్కారు మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పందించారు. ఆ రెండు రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందంపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పందించాలని ఆయన కొద్దిసేపటి క్రితం డిమాండ్ చేశారు. ‘మహా’ ఒప్పందంగా పిలుస్తున్న సదరు ఒప్పందం వల్ల ... ఏపీకి లాభమా? లేదా నష్టమా? అన్న విషయాన్ని చంద్రబాబు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. అయినా కేంద్రం అనుమతి లేకుండా మహారాష్ట్రతో తెలంగాణ సర్కారు ఎలా ఒప్పందం చేసుకుంటుందని రఘువీరా ప్రశ్నించారు.

17:29 - August 26, 2016
17:22 - August 26, 2016

హైదరాబాద్ : ప్రాజెక్టుల విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం శాస్త్రీయంగా ముందుకెళ్తున్నదని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ్మడిహట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. గత పాలకులు ప్రాజెక్టుల పేరిట వందల కోట్ల రూపాయలు జుబుల్లో వేసుకున్నారని దుయ్యబట్టారు. 

కేసీఆర్‌ తో సీఐఎస్‌ఎఫ్ డీజీ భేటీ..

హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఐఎస్‌ఎఫ్ డీజీ సురేందర్‌సింగ్, ఐజీ ఆనంద్ మోహన్, సీనియర్ కమాండెంట్ శ్రీనివాస్ కలిశారు. ఆలిండియా పోలీస్ అథ్లెటిక్స్ ప్రారంభోత్సవానికి సీఎంను వారు ఆహ్వానించారు. సెప్టెంబర్ 3 నుంచి 7 వరకు అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జరగనుంది.

16:59 - August 26, 2016

హైదరాబాద్ : ఆకస్మికతనిఖీలు..అధికారులకు టార్గెట్లు.. పనిలో నాణ్యత పాటించాలని ఆదేశాలు.. వందరోజుల్లో సిటీని అద్దంలా మెరిపించాలని యాక్షన్‌ప్లాన్‌. మున్సిపల్‌శాఖా మంత్రిగా చార్జ్‌తీసుకున్న మొదట్లో మంత్రి కేటీఆర్‌ చేసిన హడావుడి అది. టార్గెట్‌పెట్టుకుని 200రోజులు గడిచినా..ఏమాత్రం మారని అధికారులు.. అడ్మినిష్ట్రేన్‌.. జీహెచ్‌ఎంసీలో మంత్రి కేటీఆర్‌ వందరోజుల యాక్షన్‌ప్లాన్‌ పరిస్థితిపై టెన్‌టీవీ ఫోకస్‌.

ప్రచారానికి ఫీల్డులో నెలకొన్న పరిస్థితికి పొంతనేలేదు...
మున్సిప‌ల్ శాఖా బాధ్యతలు చేప‌ట్టిన వెంట‌నే గ్రేటర్‌ హైదరాబాద్‌ అడ్మినిస్ట్రేష‌న్ లో 100రోజుల్లో పూర్తి చేయ్యాల్సిన ప‌నుల‌ను గుర్తించాలని అధికారుల‌ను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. దీనికోసం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటిల‌తో పాటు జిహెచ్ఎంసి..., వాట‌ర్ బోర్డు, హెచ్ఎండిఎ, మెట్రోరైల్ త‌దిత‌ర సంస్థలు ఉత్సాహంగా టార్గెట్లు ప్రకటించాయి.

మంత్రిగారి హడావుడితో పరుగులు పెట్టిన అధికారులు
టార్గెట్లు పెట్టడమేకాదు.. పనుల్లో వేగం పెంచాలని మంత్రి కేటీఆర్‌ అధికారయంత్రాంగాన్ని మొదట్లో పరుగులు పెట్టించారు. జీహెచ్ ఎంసీతోపాటు పలు మున్సిపాలిటీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై ఫైర్‌ అయ్యారు. మంత్రిగారి స్పీడ్‌ చూసిన అధికారులు.. తెగహడావుడి చేశారు. టార్గెట్‌గా పెట్టుకున్న వాటిలో కొన్ని పనుల్ని పూర్తి చేశారు. ఆన్‌లైన్‌సేవలు అందుబాటులోకి తీసుకురావడం.. ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా యాప్‌లు రూపొందించడంలాంటివి జోరుగానే చేశారు. కాని..అదంతా ఆరంభ శూరత్వంగానే మారిపోయింది.

100రోజుల యాక్షన్‌ప్లాన్‌పై రిపోర్ట్‌కార్డును రెడీ
అటు మంత్రి కేటీఆర్‌ నిర్ణయించిన టార్గెట్ ప్రకారం మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్ 100రోజుల యాక్షన్‌ప్లాన్‌పై రిపోర్టుకార్డును రెడీ చేసింది. ఇందులో జిహెచ్ఎంసి ఇంటిగ్రేటేడ్ యాప్...., హైద‌రాబాద్ క‌న్వర్జెన్సీ పోర్టల్‌ ., ఇ- ఆఫిస్..., ఆన్ లైన్ బిల్డింగ్ అప్రూవ‌ల్స్.., వంటి ప‌నులు మాత్రమే 100 శాతం పూర్తి అయ్యాయి. కాని... గ్రేట‌ర్ అధికారులు మాత్రం అన్నిపలను కంప్లీట్‌ అయినట్టు అందమైన ఫోటోలతో ప్రోగ్రెస్‌ రిపోర్టును తయారుచేయడం గమనార్హం.

అన్నిస్థలాలకు 90శాతం ప్రహరీగోడలు పూర్తైనట్టు రిపోర్టు
అధికారుల పనితీరు ఎంత గొప్పగా ఉందంటే.. సర్కిల్10పరిధిలోని సనత్‌నగర్‌ ఏరియాలో ఆల్రెడీ ఉన్న పార్కులనే కొత్తగా అభివృద్ధి చేసినట్లు రిపోర్ట్‌ కార్టులో అందంగా ముద్రించారు. జిహెచ్ఎంసికి చెందిన 350 ఖాళీ స్థలాల్లో సగం వాటికే ప్రహరి గోడలు నిర్మించి .. దాదాపు 90 శాతం పనులు పూర్తి చేసినట్లుగా చూపించారు.

నిరుపయోగంగా ఫ్రీఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్స్..
అటు జీహెచ్‌ఎంసీ పరిధిలో 100రోజుల టార్గెట్లో భాగంగా 40 మోడల్‌ మార్కెట్లు నిర్మిస్తామని ప్రకటించారు అధికారులు. కాని.. ఇప్పటికి పూర్తిఅయింది కేవలం 4 మాత్రమే. ఇక సోమేష్ కుమార్ క‌మిష‌న‌ర్ గా ఉన్న సమయంలో టెండ‌ర్ ఫైన‌ల్ చేసిన 100 ఫ్రి ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ లో వందశాతం పూర్తిఅయినట్టు రికార్డుల్లో రాసేశారు అధికారులు. కాని.. ఫీల్డ్‌లో మాత్రం ఇవి అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి.

రోడ్లపైన ఎక్కడచూసినా చెత్తకుప్పలే
అటు బస్‌షెల్టర్‌లు లేని ప్రాంతాల్లో వందరోజుల్లో 50 బస్‌బేలను ఏర్పాటు చేసినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతుంటే.. సిటీజనానికి మాత్రం ఎక్కడా కొత్తబస్‌బే వచ్చిన దాఖలాలే కనిపించడంలేదు. తడిచెత్తా పొడిచెత్తా సంగతి సరేసరి. ఎక్కడచూసినా రోడ్లపై చెత్తకుప్పలే కనిపిస్తున్నాయి.

ఆఫీసులకే పరిమితం అయిన అధికారులు
గ్రేటర్‌సిటీలో సమస్యలకు చెక్‌పెడతామని మంత్రి కేటీఆర్‌ మొదట్లో చేసిన హడావుడి.. ఇపుడు చల్లారిపోయినట్లే కనిపిస్తోంది. అధికారులు ఎప్పటిలాగే చల్లగా ఏసీగదుల్లో కూర్చొని.. పనుల్నీ పూర్తి అవుతున్నట్టు కలర్‌పుల్‌ కాగితాల్లో రాసేసుకుంటున్నారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని గ్రేటర్‌ ప్రజలు కోరుతున్నారు .

16:54 - August 26, 2016

విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయాన్ని సినీ హీరో సాయుకుమార్ తో పాటు ఆయన తనయుడు ఆది, దర్శకుడు వీరభద్రం సందర్శించారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా సాయికుమార్ వరలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రత్యే కపూజలు నిర్వహించారు. విజయవాడతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి, పుష్కరాల నవ హారతుల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించడం జీవితంలో లభించిన గొప్ప అదృష్టమని సాయుకుమార్ అన్నారు. చుట్టాలబ్బాయి చిత్రం విజయవంతంగా ప్రదర్శించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 

16:52 - August 26, 2016

హైదరాబాద్ : తెలంగాణ వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖలతో పాటు విత్తనాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఈ సమీక్షలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో పంటల సాగు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సరైన సమయంలో వర్షపాతం లేనందున ప్రత్యామ్నాయ పంటలు వేసుకోనేందుకు రైతులను సమాయత్తపరచాలని అధికారులకు ఆదేశించారు. 

16:51 - August 26, 2016

మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్ జిల్లా ములుగు మండలంలో పర్యటించారు. లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. లక్ష్మక్కపల్లిలో 300 పడకలతో ఏర్పాటు చేసిన ఆసుపత్రిని సీఎం సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆర్వీఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా ఉచితంగా చికిత్సలు అందజేయనున్నారు. 150 మంది విద్యార్థులతో కొత్తగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో మంత్రులు కడియంశ్రీహరి, మహమూద్ అలీ, ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, హరీశ్ రావు, జూపల్లికృష్ణరావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

మళ్లీ భూప్రకంపనలు..

ఇట‌లీ : మ‌ళ్లీ భూ ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. అమాట్రిస్‌లో శుక్ర‌వారం రోజున 4.7 తీవ్ర‌త‌తో ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. మ‌రోవైపు ఇట‌లీ ప్ర‌ధాని దేశంలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. బుధ‌వారం వ‌చ్చిన భూకంపం వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 267కు చేరింది. ఇటలీ ప్ర‌ధాని మాటియో రెంజి అత్య‌వ‌స‌ర నిధుల‌ను విడుద‌ల చేశారు. బుధవారం సంభ‌వించిన 6.2 తీవ్ర‌త భూకంపం త‌ర్వాత అదే ప్రాంతంలో సుమారు 500 ప్ర‌కంప‌న‌లో వ‌చ్చాయి. కాగా శుక్ర‌వారం మాత్రం 4.7 తీవ్ర‌త‌తో మ‌రోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 

గ్యాస్ సిలిండర్ పేలి దంపతులు మృతి..

విశాఖ పట్నం : ఆనందపురం మండలం ప్రేమగొట్టిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి దంపతులు మృతిచెందారు. 

వెబ్ సైట్ లో కొత్త జిల్లాల మ్యాపులు విడుదల..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడనున్న 17 కొత్త జిల్లాలకు సంబంధించిన మ్యాపులు ఇంటర్నెట్ లోకి వచ్చేశాయి. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను జారీ చేసిన కేసీఆర్ సర్కారు... కొద్దిసేపటి క్రితం తన అధికారిక వెబ్ సైట్ లో కొత్త జిల్లాల మ్యాపులను విడుదల చేసింది. ఈ మ్యాపుల్లో కొత్త జిల్లాలతో పాటు... జిల్లాల విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర స్వరూపానికి సంబంధించిన మ్యాపులు కూడా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న 17 జిల్లాలు సహా మొత్తం 27 జిల్లాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఆ మ్యాపుల్లో కనిపిస్తోంది.

16:14 - August 26, 2016

తూర్పులో 1000 అడుగుల జాతీయ పతాకం..

తూర్పుగోదావరి : భార‌త దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళు గడిచిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల్లో తిరంగా యాత్ర నిర్వ‌హిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో బీజేపీ కార్య‌క‌ర్త‌ల ఆధ్వ‌ర్యంలో మోడ్రన్ విద్యాసంస్థలు తిరంగా యాత్ర నిర్వహించారు. వెయ్యి అడుగుల జాతీయ పతాకాన్ని చేతపట్టుకొని విద్యార్థులు యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజగోపాల్‌సెంటర్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కూడా బీజేపీ ఆధ్వ‌ర్యంలో తిరంగా యాత్ర కొన‌సాగుతోంది.

16:06 - August 26, 2016

హైదరాబాద్ : రాజధాని నిర్మాణంలో కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ ఎందుకు గోప్యత పాటిస్తుందని.. ఓ కాంట్రాక్టర్‌ వేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని నిర్మించాలనుకునే కాంట్రాక్టర్లకు మార్గదర్శకాలు ఉన్నా పాటించడం లేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది ఆరోపించారు. బిడ్‌లో పాల్గొనాలనుకునే కాంట్రాక్టర్‌ దేశంలో 500 హెక్టార్లలో డెవలప్‌మెంట్‌ చేసి ఉండాలని.. దేశం వెలుపల 500 హెక్టార్లలో అభివృద్ధి చేసి ఉండాలనే నిబంధన ఉంది. దేశంలో 10 వేల హెక్టార్లలో అభివృద్ధి చేసినా వారు అనర్హులని ప్రభుత్వం అనడం హాస్యాస్పదమే అవుతుందని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. దీనిపై కోర్టు వివరణ కోరగా.. తమ వద్ద పూర్తి సమాచారం లేదని తమకు కొంత గడువు కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. దీంతో విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 

ములుగులో సీఎం కేసీఆర్ పర్యటన..

మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా ములుగు మండలంలో పర్యటించారు. ఆయన లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించారు. లక్ష్మక్కపల్లిలో 300 పడకలతో ఏర్పాటు చేసిన దవాఖానను సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆర్వీఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా ఇక్కడ ఉచితంగా చికిత్సలు అందజేస్తారు. 150 మంది విద్యార్థులతో కొత్తగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు ,అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థినిపై ఎస్పీ అసభ్య ప్రవర్తన..

కేర‌ళ‌ : ఓ పోలీస్ అధికారి కాలేజీ అమ్మాయితో అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడు. కొల్ల‌మ్‌లో జ‌రిగిన జాతీయ సైబ‌ర్ సెక్యూర్టీ స‌ద‌స్సులో స్థానిక డిప్యూటీ ఎస్పీ ఆ కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కాలేజీ విద్యార్థినితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. స్టేజ్ మీద త‌న ప‌క్క కుర్చీలోనే కూర్చున్న ఆ డిప్యూటీ ఎస్సీ డిగ్రీ కాలేజీ విద్యార్థినిపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశాడు. విసుగెత్తిన ఆ అమ్మాయి అక్క‌డే ఉన్న పోలీస్ కాలేజ్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా డిప్యూటీ ఎస్సీ వినయ్ కుమార్ ను వేదిక నుంచి తప్పించారు.

స్విస్ చాలెంజ్ విధానంపై విచారణ వాయిదా..

హైదరాబాద్ : స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాగా ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం స్విస్ చాలెంజ్ విధానం ద్వారా నిర్మించదలచుకున్న విషయం తెలిసిందే.

15:48 - August 26, 2016

అనంతపురం : జంతువులు..మృగాలు అడవిలో వుండాలి..సమాజంలో ప్రజలుంటాలి. ఇది ప్రకృతిసహజంగా వచ్చిన కట్టుబాటు..కానీ గత కొంతకాలంగా చిరుతలు,పులులు,ఎలుగులు వంటి క్రూర మృగాలు..నక్కలు..హైనాలు,జికంలు వంటి ..సాధుజంతువులు..ఏనుగులు వంటి భారీ జంతువులు అరణ్యాలను వదిలి జనారణ్యంలోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. దీనికంతటికీ కారణం క్రమేపీ అడవులు తరగిపోవటం..వున్న కొద్దిపాటి అడవుల్లో వాటికి ఆహారం, నీరు అందుబాటులో లేకపోవటం వంటి పలు కారణాలుగా చెప్పుకోవచ్చు.. దీనికి చాలావరకూ మనిషే ప్రధాన కారణంగా అనుకోవాలి. జనాభా పెరుగుదల..మనిషికి నానాటికి పెరిగిపోతున్న అత్యాశ..అడవులన నరికి పారేయటం కూడా దీనికి కారణంగా మనం అనుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి..మరి ఈ చిరుతలకు ఎటువంటి పరిస్థితుల్లో జనాలలో వచ్చియో తెలీదుగానీ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో చిరుతలు జనావాసంలోకి వచ్చి కలకలం సృష్టించాయి. పట్టణంలో ప్రవేశించిన జంట చిరుతల్లో ఇప్పటికే అటవీశాఖ అధికారులు ఒక చిరుతను బంధించగా, మరో చిరుత ఇంకా పట్టణంలోనే ఉంది. తాజాగా పట్టణంలోని పరిమళ స్టూడియో ప్రాంతంలో చిరుత సంచారం కనపడగా స్థానికులంతా భయాందోళనల్లో ఉన్నారు. దీంతో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు చిరుత కోసం పట్టణమంతా జల్లెడ పడుతున్నారు. పట్టణంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. 

15:37 - August 26, 2016

గుంటూరు : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మరో ఇద్దరు మంత్రులు తమ కార్యాలయాలను ప్రారంభించారు. సచివాలయంలోని 4వ బ్లాక్ మొదటి అంతస్తులో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి పూజా కార్యాక్రమాలతో తన కార్యాలయాన్ని ప్రారంభించారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా తన కార్యాలయంలోకి ప్రవేశం చేశారు. 5వ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎంపీ గోకరాజు గంగరాజు, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, విజయవాడ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

15:34 - August 26, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో బిఈడీ కోర్సులకు అడ్మిషన్లు మరింత ఆలస్యం కానున్నాయా? ఉపాధ్యాయవృత్తిలోకి వెళ్లాలన్న వేలాది మంది విద్యార్థుల ఆకాంక్ష .. కలగానే మిగిలిపోనుందా..? బీఈడీ అడ్మిషన్ల ఆలస్యానికి కారణాలు ఏంటి..? బీఈడీ కౌన్సిలింగ్‌పై నెలకొన్న సందిగ్ధంపై టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ.

అడ్మిషన్ల కోసం 50వేల మంది ఎదరుచూపులు
తెలంగాణా సర్కార్ తీసుకున్న నిర్ణయం బీఈడి చదవాలనుకునే విద్యార్ధుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే ఎంట్రన్స్ టెస్ట్‌లో క్వాలిఫై ర్యాంకులు తెచ్చుకున్న యాభైవేల మంది విద్యార్ధులు బిఈడి అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రంలో మొత్తం 119 ప్రైవేట్ బీఈడీ కాలేజీలు
రాష్ట్రంలో వున్న మొత్తం 119 ప్రైవేటు బిఈడి కాలేజీల్లో నాణ్యమైన విద్య అందడంలేదన్న కారణంతో తెలంగాణ సర్కార్‌ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేకులు వేసింది. ఇప్పటికే గుర్తింపు పొందిన కాలేజీలను కూడా రద్దుచేసి అఫ్లియేషన్లకోసం కొత్తగా దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా టీసర్కార్‌ ఆదేశించింది. అయితే..అడ్మిషన్లలో భాగంగా ప్రతి కాలేజీలో 100 సీట్లు భర్తీచేయాల్సి వుంటుంది.. అందులో 25శాతంసీట్లు మేనేజ్‌మెంట్ కోటాకింద భర్తీ చేయాల్సిఉంది. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో ప్రైవైట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలతో అడ్మిషన్ల ప్రక్రియను ఆపేసింది తెలంగాణ ఉన్నత విద్యాశాఖ.

విద్యాసంత్సరం వృధా అవుతుందని స్టూండెంట్స్‌ ఆందోళన
తెలంగాణ సర్కార్‌ నిర్ణయంతో ఇప్పటికే ఎంట్రన్స్ రాసి.. అర్హత పొందిన విద్యార్థులంతా విద్యా సంవత్సరాన్ని వృధా చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఆగస్టు మొదటి వారంలో క్లాసులు ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటికీ కౌన్సెలింగ్ కూడా ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్ధులు తీవ్ర ఆందోళనపడుతున్నారు. బిఈడి ఎంట్రన్స్ లో మంచి ర్యాంకులు సాధించి అటు పీజి చేయలేక... ఇటు బిఈడి కోసం వేచి వుండలేక విద్యార్ధులు సతమతం అవుతున్నారు.

కనీస అర్హత లేని వారిని టీచర్లుగా నియమించారని ఆరోపణ
ప్రైవేట్‌ స్కూళ్లలో విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోయాయని విద్యార్థిసంఘాలు మండిపడుతున్నాయి. టీచింగ్‌పై కనీస అవగాహనలేని వారిని ఉపాధ్యాయులుగా నియమించుకున్నారని ఆరోపిస్తున్నారు. అటు..బీఈడీ కోర్సును కూడా రెండు సంత్సరాలకు పెంచడంతో .. ఫీజురీయింబర్స్‌మెంట్‌కు ఆశపడిన ప్రైవేట్‌ కాలేజీలు ..అక్రమాలకు తెరతీశాయంటున్నారు.

విద్యాసంవత్సరం వృధా అవుతోందని విద్యార్థులు ఆందోళన
అయితే బిఈడి కాలేజీల ప్రక్షాళన చేయాలనే ప్రయత్నం బాగున్నప్పటికీ ... విద్యాసంవత్సరం వృధా అవుతోందని విద్యార్థులు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నాన్చుడు ధోరణి మాని.. త్వరగా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని విద్యార్థిసంఘాలు కోరుతున్నాయి.

 

15:31 - August 26, 2016

తిరుపతి : ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ బహిరంగ సభకు సంబంధించి ఎట్టకేలకూ ఉత్కంఠ వీడింది. శనివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి నగరంలోని ఇందిరా మైదానంలో పవన్ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ పార్టీ ప్రతినిధి రాఘవయ్య కొద్దిసేపటి క్రితం కీలక ప్రకటన చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు జరగనున్న సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేయనున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలపై సభ వేదికపై పవన్ డిమాండ్ చేయనున్నట్లు సమాచారం. కాగా పవన్ కళ్యాణ్ సభకు అనుమతివ్వాలంటూ తాము చేసిన విజ్ఞప్తికి పోలీసుల నుంచి అనుమతి లభించిందని ఆయన పేర్కొన్నారు. పోలీసుల నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఇందిరా మైదానంలో సభకు ఏర్పాట్లు మొదలయ్యాయి.తిరుపతిలో సభ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో సభలు, ర్యాలీ నిర్వహించనున్నట్లు పవన్ అభినులు పేర్కొంటున్నారు. కాగా గతంలో ప్రజారాజ్యం పార్టీని ప్రారంభోత్సవ సభను చిరంజీవి తిరుపతి నుండే ఆరంభించిన విషయం తెలిసిందే. 

14:59 - August 26, 2016

ముంబై : ముంబయిలోని హజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ.. బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. దర్గాలోకి మహిళలు ప్రవేశించకుండా నిషేధం విధించడం.. వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లేనని హైకోర్టు అభిప్రాయపడింది. పురుషులతో సమానంగా మహిళలు కూడా దర్గాలోనికి వెళ్లొచ్చని, అయితే మహిళలకు రక్షణ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. దర్గా అంతర్భాగంలోకి మహిళలు రాకూడదంటూ హజీ అలీ దర్గా ట్రస్ట్‌ 2012లో నిషేధం విధించింది. దీనిపై భూమాతా బ్రిగేడ్‌ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఈ ఉద్యమంలో తృప్తిదేశాయ్‌ కూడా పాల్గొన్నారు. మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు పై విధంగా తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దర్గా ట్రస్ట్‌ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. 

14:57 - August 26, 2016

నెల్లూరు : రాపురు వద్ద తెల్లవారుజామున పెళ్లిజీపు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..పలువురికిగాయాలయ్యాయి. పెళ్లికూతురు చాముండేశ్వరి..బంధు మిత్రులు వాహనంలో గోనుపల్లి గ్రామం నుంచి తిరుమలకు వెళ్తుండగా దారిలో వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 14 మందికి గాయాలయ్యాయి. వారందరినీ నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి..చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది.

14:55 - August 26, 2016

గుంటూరు : తాడేపల్లి మండలం కుంచనపల్లి వద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. శ్రీనగర్‌లో ఉంటున్న నేపాల్‌ యువకులు విజయవాడలో జరిగే కృష్ణాష్టమి వేడుకలకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. అదే సమయంలో వీరిని రక్షించడానికి వచ్చిన రక్షణ వాహనాన్ని..ఆటోను వెనుక నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా మార్గంమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. వీరిని నేపాల్‌కు చెందిన రాంబహదూర్‌.. ఘనబహదూర్‌.. గుంటూరుకు చెందిన అరుణ్‌కుమార్‌.. ధర్మేంద్రగా పోలీసులు గుర్తించారు. కాగా గాయపడిన రక్షక భటులను మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు.   

14:53 - August 26, 2016

చిత్తూరు : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకునే పరిణామాలు తిరుపతిలో చోటుచేసుకుంటున్నాయి. గురువారం వినోద్‌ రాయల్‌ కుటుంబాన్ని పరామర్శించిన పవన్‌ కళ్యాణ్‌.. నిన్నటి నుంచి తిరుపతిలోనే మకాం వేశారు. పార్టీకి సంబంధించిన ముఖ్యకార్యకర్తలు, ఆంతరంగికులతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు రేపు తిరుపతిలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో పవన్‌ కళ్యాణ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సభావేదిక పై నుంచి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, విభజన హామీలపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై పవన్‌ నిరసన గళం వినిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇన్నాళ్లు మౌనంగా వున్న పవన్ వేదికపై ఏం మాట్లాడతారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తిరుమలలో వెంకన్న దర్శనం తర్వాత తనకు కేటాయించిన గెస్ట్ హౌస్ కు చేరుకున్న ఆయన తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న పలువురితో రహస్యంగా భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన ఆదేశాల మేరకు ఆయన అభిమానులు తిరుపతిలో బహిరంగ సభ వేదిక కోసం పరిశీలన జరుపుతున్నారు. ఈ సభకు పవన్ అభిమానులు వేలాదిగా తరలిరానున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ ద్వారా సభ యొక్క సమాచారాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు ఇప్పటికే సమాచారం అంఆదించినట్లుగా తెలిపారు.ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

14:41 - August 26, 2016

హైదరాబాద్ : రాష్ట్ర సమస్యలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు వుందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. సమస్యలపై ప్రశ్నించిన విపక్షాలను విమర్శించటం తగదన్నారు. కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒకస్థాయికి వచ్చిన తరువాత హుందాగా వ్యవహరించాలని సూచించారు. ప్రతిపక్షాలను చులకన చేయాలని చూస్తే ప్రభుత్వమే చులకనవుందనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా జానారెడ్డి అన్నారు. 

ముగిసిన టీ.టీడీపీ నేతల సమావేశం..

హైదరాబాద్ : టీ.టీడీపీ నేతల సమావేశం ముగిసింది. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై పోరాడాలని సమావేవం లో నేతలు నిర్ణయించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సోమవారం హైదరాబాద్ లోని జలసౌధ కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. గవర్నర్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలవాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ సీఎంకు లేఖ రాయాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు. 

టర్కీలో పేలుళ్లు..8మంది పోలీసులు మృతి..

టర్కీ : టర్కీలోని పోలీసు ప్రధాన కార్యాలయం లక్ష్యంగా పేలుళ్లు జరిగాయి. ఖుర్దీష్ ఉగ్రవాదులు కారు బాంబుతో జరిపిన దాడుల్లో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుళ్ల ధాటికి పోలీసు కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. సమీపంలో ఉన్న భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

13:52 - August 26, 2016

అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకర్హం అంటారు. పగలిన కుండ, పాడుబడిన క్లాక్ కాదేదీ కళాకృతికి అనర్హం అంటారున్నారు ఈ తరం మహిళలు. కాలంతో పరుగులు తీయించే వాల్ క్లాక్ పాడయిపోతే, ఏం చేస్తాం, డస్ట్ బిన్ లో పారేస్తాం. అలాకాకుండా కాస్తంత ఓపికచేసి, ఇంకాస్త సృజనాత్మకత జోడిస్తే అందమైన ఫ్లవర్ వాజ్ రెడీ. దీని గురించి మరింత తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:51 - August 26, 2016

ఇంట్లోంచి కాలుబైట పెట్టిన ఆడపిల్లలు, అంతే క్షేమంగా ఇంటికి చేరతారనే భరోసా లేని రోజులివి. ఎవరో మన రక్షణ కోసం వచ్చేదాకా చూస్తూ కూర్చుకునే కాలం కాదు. అందుకే ఆడపిల్లలకు ఆత్మరక్షణా మార్గాలు అవసరం. అలాంటి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:50 - August 26, 2016
  • కులాంతర వివాహాల పిల్లలకు తండ్రి కులమే ప్రామాణికం కాకూడదు. పిల్లలు పెరిగిన నేపథ్యాన్ని చూసి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 
  • పురుషులకు పితృత్వ సెలవు డిమాండ్‌పై జాతీయ మహిళా కమిషన చైర్మన్ లలిత కుమారమంగళం స్పందించారు. ఆ సెలవులను బాధ్యతలను మోసేందుకే వినియోగించాలని తెలిపారు.
  • అద్దెగర్భాల అక్రమాలను అరికట్టటానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. లాభాపేక్షతో కూడిన 'వాణిజ్య అద్దెగర్భాలను' పూర్తిగా నిషేధించటం దీనిలోని కీలకాంశం. చట్టబద్ధంగా పెళ్లి చేసుకుని ఐదేళ్లు దాటిన భారతీయ దంపతులకు.. అదీ కొన్ని పరిస్థితుల్లో మాత్రమే అద్దెగర్భం ద్వారా సంతానాన్ని కనటానికి ఇది వీలు కల్పిస్తుంది. 
  • తెలంగాణా రాష్ట్రంలో జోగిని వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వ్యతిరేక మహిళా సంఘం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ప్రెస్ మీట్ లో వివిధ తెలంగాణా జిల్లాల నుండి వచ్చిన జోగినిలు తమ డిమాండ్లను వినిపించారు. 
  • ​దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈఏడాది నలుగురిని ఎంపిక చేశారు. బాడ్మింటన్ స్టార్ పివి సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూ రాయ్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

పంజాబ్ ఆప్ చీఫ్ పై స్టింగ్ ఆపరేషన్...

పంజాబ్ : ఆప్ చీఫ్ సుచ్చా సింగ్ చోటేపూర్ స్టింగ్ ఆపరేషన్ లో లంచం తీసుకుంటూ దొరికిపోడానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో పార్టీ ఆయన్ను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

టర్కీలో పేలిన కారు బాంబు..

టర్కీ : పోలీసు ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఉగ్రవాదులు పేలుళ్లు జరిపారు. ఖుర్దీష్ ఉగ్రవాదులు కారు బాంబుతో జరిపిన దాడుల్లో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం - కేటీఆర్..

హైదరాబాద్ : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని, అందరిలాగే ఫోటో, వీడియో జర్నలిస్టులకు సమాన హక్కులకు కల్పిస్తామన్నారు. 

13:35 - August 26, 2016

వరంగల్ : కరవు నేల పాడిపంటలతో కళకళలాడబోతోంది.. కక్షలు, కార్పణ్యాలతో రగిలిపోయిన గ్రామాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయి.. రాష్ట్రంలోనే మొదటి ఇరిగేషన్‌ సర్క్యూట్‌కు వరంగల్‌ జిల్లాలో అడుగులు పడుతున్నాయి.. నీటి పారుదల శాఖ చరిత్రలో తొట్టతొలి ఇరిగేషన్ మోడల్ నర్సంపేట నియోజకవర్గంలో రూపుదిద్దుకోబోతోంది. వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గం.......! రాజకీయ కక్షలు, గొడవలతో ఇక్కడ ఎప్పుడూ యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది... దీనికి కరవూ తోడైంది. సాగునీటి వసతిలేక వరుణుడిపైనే ఆధారపడ్డారిక్కడి రైతులు. వీరికి కాకతీయులనాటి చెరువులు భారీ వర్షాలు కురిసినప్పుడు కాస్తంత ఊరటనిచ్చేవి. దీంతో ఎక్కడ చూసినా పేదరికం తాండవించేది. అలాంటి ఈ పల్లెల రూపురేఖలు త్వరలోనే మారిపోతున్నాయి. పేదరికంతో అల్లాడుతున్న గ్రామాలు పాడిపంటలతో కళకళలాడబోతున్నాయి.

నియోజకవర్గ అభివృద్ధికోసం ప్రత్యేక ప్రణాళికలు..

ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త పద్ధతులను ప్రభుత్వం ఉపయోగిస్తోంది. ఈ గ్రామాలనుంచి కరవును తరమికొట్టేందుకు తెలంగాణ ఉద్యమ కారుడు, టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి నడుంబిగించారు. ఈ ప్రాంత స్థితిగతులు, రాజకీయ కక్షలకు బలైన కుటుంబాలపై సర్కారుకు ప్రత్యేక నివేదిక సమర్పించారు. ఈ సమస్యలన్నింటికీ ప్రజల వెనుకబాటు తనమే కారణమని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం.. నియోజకవర్గ అభివృద్ధికోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. సాగునీటికి సంబంధించి ప్రభుత్వ పథకాల అమలులో ఈ నియోజకవర్గం చాలా ముందుంది. సర్కారునుంచి సూచనలు రావడం ఆలస్యం గ్రామాలన్నీ ఏకమై వీటిని విజయవంతం చేసేదిశగా సాగుతున్నాయి. చెరువులకు ప్రాణం పోసే మిషన్ కాకతీయ మొదటి ఫేస్‌ ఈ గ్రామాల్లో వందశాతం విజయవంతమైంది. ఉద్యమంలా కదిలివచ్చిన రైతులు పదహారున్నర లక్షల క్యూబిక్ మీటర్ల చెరువు మట్టిని తమ పొలాల్లోకి తరలించారు. ఇక్కడ అత్యంతవేగంగా సాగిన మిషన్‌ కాకతీయ రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఈ రైతుల చైతన్యం రామన్ మెగసెసే అవార్డు గ్రహిత, వాటర్ మెన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్‌ను కట్టి పడేసింది. గ్రామస్తుల స్పందన చూసి ముగ్దుడైన రాజేందర్ సింగ్ నెక్కొండ మండలంలోని చెరువు గట్టుపై తన పుట్టిన రోజును జరుపుకున్నారు. సీఎం కేసీఆర్‌, గవర్నర్ నరసింహన్ ఈ గ్రామాలను పరిశీలిచేందుకు వచ్చారంటే నీటిని ఒడిసి పట్టే కార్యక్రమం ఇక్కడ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

రూ. 750 కోట్ల అంచనాతో ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు..
ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకునే కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు పెద్ది సుదర్శన్‌రెడ్డి... ఈ ప్రాంతం రైతుల సలహాలు, సూచనలతో కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. కాకతీయుల టెక్నాలజీని మోడ్రనైజేషన్ చేసి గొలుసుకట్టు విధానానికి ప్రణాళికలు రూపొందించారు. 750 కోట్ల అంచనాతో సర్కారుముందు ప్రతిపాదనలు ఉంచారు. ఈ పనులకు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పనులు ప్రారంభమయ్యాయి. నర్సంపేట నియోజకవర్గంలో మిషన్ కాకతీయకింద 230 కోట్ల రూపాయల ఖర్చుతో చెరువుల పూడికతీత పనులు సాగాయి. ఈ పనులతో పాటు తాజాగా మాదన్నపేట, పాకాల, రంగయ్య చెరువుల్లోకి గోదావరి జలాల్ని తరలించేందుకు ప్రణాళికలు తయారయ్యాయి. రామప్ప సరస్సు నుంచి రంగాయ చెరువు, పాకాలకు గోదావరి జలాలను లిఫ్ట్ చేసే పనులు నడుస్తున్నాయి. గత ప్రభుత్వాలు ముంపు ప్రతిపానలతో తయారు చేసిన ఈ ప్లాన్‌లో అధికారులు మార్పులు చేశారు. రంగాయ చెరువుకు ముంపు లేకుండా సిస్టర్న్ నిర్మాణంతో నీరు అందించనున్నారు. ఈ పనులకోసం ప్రభుత్వం 110 కోట్ల రూపాయల్ని కేటాయించింది.

పాకల చెరువుకు మహర్ధశ..
పన్నెండు వందల ఏళ్లనాటి పాకాల చెరువుకు మహార్దశ పడుతోంది.. సకల ప్రాణకోటికి జీవనాధారమైన నీటి ధారను ఒడిసిపట్టేందుకు వేగంగా పనులు సాగుతున్నాయి.. నియోజకవర్గానికి మూడువైపులనుంచి నీరు వచ్చే వలయాకార ప్రణాళికకు సర్కారు పచ్చజెండా ఊపింది. నర్సంపేట నియోజకవర్గాన్ని పాడిపంటలతో విలసిల్లేలా చేసేందుకు అన్ని మార్గాలను అధికారులు ఉపయోగించుకుంటున్నారు. చెరువులు నీటితో నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాదన్నపేట చెరువుకు డీబీఎం 38తోపాటు... 11 ఆర్ కాల్వనుంచి నీటిని తరలించబోతున్నారు. ఈ పనుల కోసం 7కోట్ల రూపాయల్ని ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే మాదన్నపేట చెరువులో పూడికతీత కోసం ఏడున్నరకోట్లతో టెండర్లు పూర్తయ్యాయి. చెరువుకు మెట్లు, సిమెంట్ లోలెవల్ రోడ్డు, కట్ట వెడల్పు పనులు చేపట్టాల్సి ఉంది. మిషన్‌ కాకతీయకింద 136 చెరువుల్లో 82 కోట్ల విలువైన పనులూ నడుస్తున్నాయి. మొదటివిడత ఇప్పటికే పూర్తికాగా రెండో విడత పనులు నడుస్తున్నాయి. ఈ పనుల ఫలితం కూడా వెంటనే కనిపిస్తోంది. ఒకప్పుడు ఒక్క పంటకే నీరు కష్టంకాగా ఇప్పుడు రెండో పంటకూ నీరు అందుతోంది.

చెన్నారావుపేట, గూడూరు మండలాల్లో కరవు సమస్య..
మిషన్‌ కాకతీయతో మిగతా చెరువులకు జలకళ వచ్చినా చెన్నారావుపేట, గూడూరు మండలాల కష్టాలు తీరలేదు.. డీబీఎం 40 కాల్వకు నీళ్లు రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.. ఈ కాల్వకు క్రాస్ రెగ్యులేటర్‌ నిర్మిస్తే సమస్య తీరుతుందని అధికారులు సూచించారు.. దీనికి ఓకే చెప్పిన సర్కారు.. రెగ్యులేటర్‌ నిర్మాణంకోసం ఐదున్నరకోట్లు కేటాయించింది.. ఈ పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది.

పాకాల సరస్సు అభివృద్ధికి రూ. 241 కోట్లు కేటాయింపు..
ఈ చెరువులతోపాటు పాకాల సరస్సుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. 12 వందల ఏళ్లనుంచి మరమ్మత్తులకు నోచుకోని ఈ చెరువుకు గోదావరి జలాల్ని లిఫ్ట్ చేసేలా ప్రభుత్వాన్ని సుదర్శన్‌ రెడ్డి ఒప్పించారు. ఇందుకోసం ప్రభుత్వం 241 కోట్ల రూపాయల్ని కేటాయించింది. పాకాల వాగుపై మూడు చోట్ల, వట్టెవాగుపై రెండు చోట్ల లిఫ్ట్‌ల నిర్మాణంకూడా చేపట్టబోతున్నారు.

తూములు, కట్టల అభివృద్ధికి రూ. 54 కోట్లు కేటాయింపు..
ఇలా అన్ని చెరువుల పునరుద్ధరణ పనులకు శాశ్వత ప్రణాళికల్ని సిద్ధం చేసిన ప్రభుత్వం.. కాకతీయుల నాటి తూములు, కట్టలు, అలుగుల అభివృద్ధితోపాటు మెయింటెనెన్స్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.. 54 కోట్ల రూపాయల్ని కేటాయించేందుకు అంగీకరించింది.. ఎస్సారెస్పీ 38, 48, 40 కాల్వల ద్వారా నియోజకవర్గంలోని 118 చెరువులను నింపేందుకు... అవసరమైన చోట్ల తూములు, షటర్ల నిర్మాణానికి 50కోట్ల రూపాయలు ఖర్చవుతాయంటూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు.. దీనిపైకూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

3.23 టీఎంసీల నీటిని నిల్వచేసేలా సంప్‌హౌస్ నిర్మాణం..
అటు రంగయ్య చెరువు దగ్గర రైతులు భూములు నష్టపోకుండా ఉండేలా కొత్త టెక్నాలజీని అధికారులు వాడుతున్నారు.. దీనిద్వారా ఒక టీఎంసీ నీరు నిల్వ ఉండేలా సిస్టర్న్ స్టోరేజ్ రిజర్వాయర్ నిర్మాణం చేయాలని సంకల్పించారు. పాకాల చెరువులో 3.23 టీఎంసీల గోదావరి నీటిని నిల్వచేసేలా రామన్నగూడెం దగ్గర ప్రత్యేకంగా సంప్‌హౌస్ నిర్మాణం చేపట్టబోతున్నారు.. ఇలా అన్ని చెరువులకు నీటిని రప్పించే నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.. నియోజకవర్గానికి మూడు వైపుల నుంచి నీరు వచ్చేలా వలయాకార ప్రణాళికకు కూడా ప్రభుత్వాన్ని సుదర్శన్‌ రెడ్డి బృందం ఒప్పించింది.

లక్షా యాభైవేల ఎకరాలకు అదనంగా సాగునీరు..
అందుబాటులోఉన్న అన్ని విధానాలను వాడుతూ ఇక్కడ వర్షపు నీటిని జాగ్రత్త చేసేలా మూడురకాల వ్యూహాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.. వాన నీటిని ఎక్కువగా నిల్వచేసేలా చెరువుల్ని సిద్ధంచేసింది.. అలాగే గోదావరి జలాలతో రంగాయ, పాకాల, మాదన్నపేట చెరువులు నింపనుంది. మూడోప్లాన్‌గా 118 చెరువులను నింపేందుకు ఎస్సారెస్పీ కెనాల్ ను ఉపయోగించుకోనుంది. ఇవేకాకుండా చెరువులు, కుంటలు, అలుగుల ద్వారా వృధాగా పోతున్న నీటిని వాడుకోవాలని కూడా చూస్తోంది. దీనికోసం మాదన్నపేట చెరువు నుంచి వెళ్లే వట్టి వాగు, పాకాల చెరువు నుంచి వెళ్లే పాకాల-మున్నేరు, నెక్కొండలోని పెద్ద వాగుపై 12 భారీ తరహా చెక్ డ్యాంలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నీటిద్వారా లక్షా యాభైవేల ఎకరాలకు అదనంగా సాగునీటిని అందించనున్నారు.

నెక్కొండ మండలాలు సస్యశామలంగా చేయనున్న సర్క్యూట్‌..
నాలుగు దశల్లో నీటి వనరులను ఒడిసి పట్టేందుకు సరికొత్త పద్ధతులను సర్కారు వాడుతోంది.. గొలుసుకట్టు ఇరిగేషన్ సర్క్యూట్ రాష్ట్రంలోనే మొదటిసారి ఉపయోగించుకుంటోంది. ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాలు సస్యశామలంగా చేసేలా ఈ ఇరిగేషన్ సర్క్యూట్‌ ఉపయోగపడనుంది.. మొత్తానికి తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రయోగాత్మకంగా సర్కారు చేస్తున్న ఈ ప్రయత్నం రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది.. ఈ నిర్మాణాలన్నీ పూర్తయిపోతే కరువు, కక్షలతో రక్తసిక్తమైన ఈ ప్రాంతం పాడిపంటలతో కళకళలాడనుంది.

13:27 - August 26, 2016

విజయవాడ : పుష్కరాల్లో పనిచేసిన వేలాదిమంది కార్మికులకు రోజువారీ వేతనాలివ్వకుండా వేధించడం తగదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. వారికి ఇవ్వాల్సిన వేతనాలు సక్రమంగా వారికి చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పుష్కరాల్లో 25వేల మంది కార్మికులు పనిచేశారని, వీరికి రోజుకు నాలుగు వందల రూపాయలు చెల్లిస్తామని కాంట్రాక్టులు పనిలో నియమించుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు చాలా మందికి వేతనాలివ్వలేదని, ఇచ్చిన వారికి రూ. 250 రూపాయలిచ్చి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 2న నిర్వహిస్తున్న దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికులకు కనీసవేతనాలు అమలు చేయాలని కోరారు.  

13:24 - August 26, 2016

మెదక్‌ : జిల్లాలో పేద దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు పెత్తందార్ల చేతుల్లోకి వెళ్లాయి. భూములకు సంబంధించిన పాస్‌బుక్‌లు దళితుల దగ్గర ఉన్నా... భూములు మాత్రం భూస్వాముల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. దళితుల భూములను పెద్దోళ్లు కబ్జాచేసి దర్జాగా సాగుచేసుకుంటున్నారు. మెదక్‌ జిల్లా ఆందోల్‌ తహశీల్‌ పరిధిలోని చింతకుంటలో దళితుల కడుపుకొట్టి సాగుచేసుకుంటున్న కబ్జా భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో సర్వేకి ప్రభుత్వం ఆదేశించింది. మెదక్‌ జిల్లా అందోల్‌ మండలం చింతకుంట గ్రామం. పైర్లతో పచ్చగా ఉన్న ఈ భూములు దళితులు, ధనికుల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో ఇక్కడి పేద దళితులకు ప్రభుత్వం భూములు పంపిణీ చేసింది. గ్రామంలోని 638 సర్వే నంబర్‌లో 168 ఎకరాల భూమిని 80 మంది దళితులను పంచారు. మరో రెండు సర్వే నంబర్లలో ఇంకో 300 ఎకరాల భూమిని కూడా పేదలకు పంపిణీ చేశారు. లబ్దిదారులు కొంతకాలం సాగుచేసుకున్న తర్వాత ఈ భూములపై పెద్దోళ్ల కన్నుపడింది. కొంతమంది భూస్వాములు ఈ భూములు తమవంటూ దళితులను తన్ని తరిమేశారు. దళితుల భూములు అన్యాక్రాంతమయ్యాయి. అగ్రవర్ణాలు తమ భూములను కబ్జాచేసి, నోట్లో మట్టికొట్టారంటూ దళితులు అటు పాలకులు, ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా... ప్రయోజనం లేకపోయింది. దీనిపై బాధితులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

పెద్దల హస్తం...
చింతకుంట దళితుల భూమి కబ్జా వెనుక చాలా మంది పెద్దల హస్తం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. చింతకుంట భూములు ఇంత వివాదాస్పదంగా మారాడానికి కారణంలేకపోలేదు. 2008లో అప్పటి ప్రభుత్వం ఈ భుములను ప్రభుత్వానికి చెందినవిగా ప్రకటించి, సాగుదారులకు నోటీసులు జారీ ఇచ్చింది. రెవిన్యూ అధికారులు సర్వే చేసి, పట్టాలతోపాటు పాసు పుస్తకాలు ఇచ్చారన్న వాదాన్నిభూములను సాగుచేసుకుంటున్న రైతులు వినిపిస్తున్నారు. దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను తాము కబ్జా చేయలేదని, సేల్‌ డీడ్‌ ద్వారా కొన్నామంటున్నారు.
అయితే చింతకుంట దళితులు భూముల వివాదం ముదిరి... చివరకు నిరసనోద్యమాలు చేపట్టడంతో దిగొచ్చిన అధికారులు... తాజాగా సర్వేకి ఆదేశించారు. ఇందుకు ఐదుగురు సర్వేయర్లను నియమించారు. సర్వేలో ఈ భూములు ఎవరివని తేలితే వారికి అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. చింతకుంటలో దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసి, అన్యాక్రాంతమైన భూముల వివాదం ఈ సర్వేలో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

13:21 - August 26, 2016

హైదరాబాద్ : ఒకప్పుడు ఆ కోట సేవాకార్యక్రమాలకు పెట్టని కోట...అభాగ్యుల కన్నీళ్లు తుడిచేందుకు సాయం చేస్తుండేవారు...దివానంలో ప్రతీ ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేవారు...15 వ శతాబ్దం నుండి గజపతి రాజులు సహాయ సహకారాలతో ఆ ప్రాంతానికి చెందినవారికి అండగా ఉండేవారు..కాని ఇదంతా గతం..ఇప్పుడా కోటలో ఏం జరుగుతోంది...ఆ కోటలోంచి వస్తున్న దుర్వాసనకు కారణాలేంటి..? వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలకు ఎవరు సమాధానం చెప్పాలి..? రాజుగారి అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకుని ఆడుకుంటున్నదెవరు..? ఆస్తి కొట్టేసేందుకా..? లేక మరేదైనా జరుగుతుందా..?. రాజుగారి కోటలో ఏం జరుగుతుంది...? చిక్కుముడి విప్పేందుకు పాలకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం మిస్టరీలను చేధిస్తుందా..? రాజవంశీకుడు నోరు విప్పేదెన్నడు..???

రాజుగారి కోట..
అదో రాజుగారి కోట...దివానం సాయంతో ఎందరో స్థిరపడ్డారు..మరెందరో కాలం వెళ్లదీసుకున్నారు..కాని ఇప్పుడు అదే కోటలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు...అందులో ఆత్మహత్యలు చేసుకున్నవారి ఆత్మలు ఆశ తీరక కోట చుట్టూ తిరుగున్నాయంటున్నారు...అవును..అక్కడేం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు..ఆస్తులను కొట్టేసేందుకు జరుగుతున్న కుట్రలా..? లేక ఇంకా ఏదైనా జరుగుతుందా.??? సాయం సంధ్య నుంచే ఆకాశం మేఘావృతమవుతోంది. పగలు ప్రచంఢ భానుడి ప్రతాపానికి పారిపోయిన మేఘాలు చీకటి పడడంతో పగతో రగిలిపోతూ ఒకదాన్నొకటి ఢీ కొంటున్నాయి. ఒక్కసారి ఆకాశం రెండుగా విచ్చుకుని పగిలినట్లుగా పెద్ద శబ్దం ఉరుములు మెరుపులతో నింగి నుంచి వచ్చే రణగొణ ధ్వనులను చీల్చుకుని వస్తున్న ఏదో ఒకరకమైన శబ్దాలు..హోరుమన్న గాలి చప్పడు ఆ మేడను చుట్టుముట్టి ఊపేస్తుంది.

ఇళ్లలో భయం..
ఎగురుతున్న పక్షులు తమ పయనాన్ని ఆపి కిందకు చూశాయి...చల్లనిగాలులకు ఏదో మూలకు మట్టి తవ్వుకుని వెచ్చగా... గురకపెట్టి నిద్రపోతున్న వీధి కుక్కలు ఎవరో తరిమినట్లుగా పరుగులు తీస్తున్నాయి. ఒక్కసారిగా పక్షుల అలజడి... చెట్లపై నుంచి ఎగిరిపోయాయి. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతంలో జీవరాశుల చప్పుళ్లతో అక్కడి పరిస్థితి మారిపోతోంది. వీటి అరుపులతో దూరంగా ఇళ్లలో ఉంటున్నవారి ఇళ్లలో భయం పుడుతుంది. ఆ మేడలోంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న గుడ్లగూబల రెక్కల చప్పడు భయంకరంగా మారింది. అప్రతిహితంగా మొదలయిన శబ్దాలతో అకస్మాత్తుగా సృష్టి చైతన్యవంతమయింది. రయ్ మంటూ వీస్తున్న గాలులు ఆ ప్రాంతంలో పెద్ద శబ్దాలే చేస్తున్నాయి. ఆ మేడలోంచి వస్తున్న దుర్వాసన భయాన్ని సృష్టిస్తోంది. కాలగర్భంలో కలిసిపోయిన ఓ దేహం నుంచి వస్తున్న దుర్వాసనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టేస్తుంది...ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందనుకున్నవారు చూస్తే వీస్తున్న గాలులను బట్టి తెలుస్తోంది...ఆ కోటలోంచి వస్తుందని. ఎన్నో ఆత్మలు ఇప్పడా దివానాన్ని చుట్టుముడుతన్నాయి....వారి కోరిక నెరవేరలేదేమో...వారి ఆశ తీరలేదేమో...అందుకేనేమో..ఆ కోట చుట్టూ తిరుగుతున్నాయి. నిజమే ..ఇప్పుడా రాజకోటను వదిలి వెళ్లలేని ఆత్మలు అక్కడే సంచరిస్తున్నాయి...ఆశ తీరక అల్లాడిపోతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు...ఆ తర్వాత మరొకరు...ఇలా మృత్యువు దారి పట్టారు. మృత్యుముఖాన్ని చూసినవారు ఆస్పత్రిలో కోలుకుంటున్న వారు నోరు విప్పితేగాని ఆ కోటలో రహస్యాన్ని చేధించలేము. అవును..ఇప్పుడా కోటలో ఏం జరుగుతోంది..?? వరుస ఆత్మహత్యలకు కారణాలేంటి..???

ముగ్గురి మృతి..
కోటలో ఉరితాడుకు వేలాడిన సంజయ్... బెడ్‌మీదే పడుకున్నట్లున్నా నిర్జీవమైన విజయలక్ష్మి.. పురుగుల మందు తాగిన మంజరి... మృత్యు అంచు వరకు వెళ్లొచ్చిన సంతోష్. ఒకరు కాదు..ఇద్దరు కాదు.. ముగ్గురి ప్రాణాలు పోయాయి...అదే కోటలో వారి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది ఆంధ్రా - ఓడిస్సా సరిహద్దులోని పర్లాఖిముండి వద్ద గల రాజుగారి కోట ఇది..ఈ రాజుగారి కోటలో ఇటీవలే జరుగుతున్న పరిణామాలు ఒకవైపు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. మరోవైపు ఏం జరుగుతుందోనన్న ఆందోళనను కలిగిస్తున్నాయి. మొత్తం మీద ఇదో కోట...రాజుగారి కోట. పర్లాఖిముండిలోని రాజుగారి కోటలో సిబ్బందిగా పనిచేస్తున్న సంజయ్‌పాత్రో...విజయలక్ష్మి...మంజరి...ఇలా వరుసగా ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆ కోటలోంచి వచ్చే దుర్వాసన భరించలేకుండా ఉంటుంది. ఇక వీరితో పాటే నాల్గోవ్యక్తి సంతోష్‌ కిల్లు ఇతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కాని తృటిలో మృత్యుముఖం నుంచి తప్పించుకుని ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలు తెలియాలంటే సంతోష్‌ కోలుకోవాలి. అప్పుడే వాస్తవాలు బయటపడతాయి. ఆ కోటలో ఏం జరిగిందో తెలుస్తోంది. పర్లాఖిమిడి కోటలో ఏం జరుగుతోంది..? కోటలోని విలువైన సంపదను కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నదెవరు..? రాజవంశీకుడి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నది ఎవరు ? వరుసగా కోటలోంచి వస్తున్న డెడ్‌బాడీలకు సమాధానం ఎక్కడుంది..? అందులో ఏం జరుగుతుంది..? అక్రమాలు బయటపడతాయని అంతం చేశారా..? లేక ప్రజాఉద్యమానికి భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారా..? ఏం జరుగుతుంది ఆ కోటలో...

కలకలం రేపుతున్న సిబ్బంది బలవన్మరణాలు..
ఆంధ్రా- ఒరిస్సా బోర్డర్‌లోని పర్లాఖిముండి రాజుగారి కోటకు ప్రస్తుతం గోపీనాథ్ గజపతి మహారాజుగా కొనసాగుతున్నారు...ఈ కోటలో ఎప్పుడూ సందడిగా ఉండేది..ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించారు..ఎందరో అభాగ్యుల కన్నీళ్లు తుడిచారు..వేల కోట్ల ఆస్తులున్నట్లు తెలుస్తోన్న కోటలో ఇప్పుడు దాగి ఉందో రహస్యం..అందులో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు...అందులో ఎందుకు బలవన్మరణాలు కొనసాగుతున్నాయో అంతుచిక్కడం లేదు. గోపీనాథ్‌ మహరాజుకు కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు చెన్నైలో స్థిరపడగా కుమారుడు ఏడాది క్రితం చనిపోయాడు...అంతకు ముందే గోపీనాథ్‌ సతీమణి శాశ్వతంగా దూరమైంది. దీంతో గోపీనాథ్‌ మహారాజు మానసికంగా కుంగిపోయారు. కోటలోని సిబ్బంది..గోపీనాథ్‌ మహారాజును బంధించి ఆస్తిని కాజేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలున్నాయి. మహారాజుకు వైద్యం అందకుండా అడ్డుకున్నారని..ఆత్మహత్యకు పాల్పడిన వారే ఇదంతా చేశారని స్థానికులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

చిక్కుముడి విప్పేందుకు క్రైం బ్రాంచ్ స్పెషల్‌ టీం...
గోపీనాథ్‌ మహారాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్థానికులు చెన్నై ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కోటలో సిబ్బంది వరుస ఆత్మహత్యలను సీరియస్‌గా తీసుకున్న ఒడిషా సర్కార్‌.. దర్యాప్తుకు ఆదేశించింది. రంగంలోకి దిగిన క్రైమ్‌ బ్రాంచ్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఆత్మహత్యలా లేక హత్యలా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు. మంజరి ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో మూడు లేఖలను స్వాధీనం చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా గోపీనాథ్‌ మహారాజు మౌనముద్ర వీడటం లేదు. ఆత్మహత్యాయత్నం చేసిన సంతోష్‌ నోరు విప్పితే ఎలాంటి నిజాలు బయటపడుతాయో చూడాలి. మొత్తంగా పర్లాఖిమిడిలో రాజ కోట రహస్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం పర్లాఖిముండి పరిణామాలపై దర్యాప్తు సాగుతుండగా...వాస్తవాలను వెలికి తీయాలని...రాజ వంశానికి చెందిన గోపీనాథ్ గజపతి ఆరోగ్య సమస్యపై ప్రజలు సైతం ముందుకు వచ్చి ప్రజా ఉద్యమం చేస్తున్నారు...మంజరి ఆత్మహత్యా సమయంలో దొరికిన లేఖల సారంశం పోలీసులు బయట పెడితే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

13:10 - August 26, 2016

చిత్తూరు : సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ గళం విప్పనున్నారా ? కేంద్రంపై నిరసన వ్యక్తం చేయనున్నారా ? అంటే అవననే సమాధానం వస్తోంది. ఇటీవలే అభిమాని వినోద్ హత్యకు గురికావడంతో అతని కుటుంబసభ్యులను పవన్ నిన్న పరామర్శించారు. అనంతరం తిరుమలలోనే బస చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం పార్టీకి సంబంధించిన వివిధ జిల్లాలో ఉన్న జనసేన నేతలు..సన్నిహితులతో పవన్ సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, రాష్ట్ర విభజనపై చర్చిస్తున్నారు. పార్టీ, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకొనే విధంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. బహిరంగ సభకు ఇందిరా మైదానంతో పాటు ఇతర మైదానాలను పరిశీలిస్తున్నారు. అంతేగాకుండా శ్రీకాకుళం నుండి చిత్తూరు వకు పాదయాత్ర నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. శ్రీవారి సాక్షిగా ఉద్యమాన్ని ప్రారంభించాలని పవన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మొండి వైఖరి అవలింబిస్తున్నా పవన్ నోరు మెదపడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యేక హోదా..ఇతరత్రా విషయాలపై కేంద్రాన్ని కనీసం నిలదీయడం లేదని పవన్ పై పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. మరి పవన్ ఉద్యమం చేపడుతారా ? కేంద్రాన్ని నిలదీస్తారా ? అనే దానిపై సాయంత్రంలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టి.టిడిపి నేతల సమావేశం..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో తెలంగాణ టిడిపి నేతలు సమావేశం నిర్వహించారు. మహారాష్ట్రతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలపై చర్చిస్తున్నారు. 

రాయదుర్గంలో చిరుత సంచారం..

అనంతపురం : రాయదుర్గంలో చిరుత కదలికలు కలకలం రేపాయి. ముళ్లపోదల్లో ఉన్న చిరుతను పట్టుకొనేందుకు అటవీ శాఖాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. 

12:28 - August 26, 2016

రైలులో భారీ చోరీ..

హైదరాబాద్ : కాచిగూడ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. కొందరు దుండగులు ప్రయాణికులపై మత్తుమందు చల్లి విలువైన బంగారు నగలు దోచుకెళ్లారు. వీటి విలువ రూ. 20 లక్షలుగా సమాచారం.

12:12 - August 26, 2016

ఒంగోలు : నయీం షెల్టర్‌ జోన్లు, కార్యకలాపాలు ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు. రాష్ట్రాల ఎల్లలు దాటిపోయాయి. ఏకంగా తన బంధువును ఓ జిల్లాలో మకాం వేయించాడు నయీం. కాసేపటి క్రితం తెలంగాణ సిట్ అధికారులు ఒంగోలుకు చేరుకున్నారు. అక్కడ తనిఖీలు చేపడుతోంది. ఓ అపార్ట్ మెంట్ లో నయీం బినామీ సలీం ఉన్నట్లు సిట్ గుర్తించింది. పక్కనే ఉన్న స్థానికుల నుండి వివరాలు సేకరిస్తోంది. నయీం అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడిగా ఉన్న సలీంను ఇటీవలే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా పలు అంశాలను తెలియచేసినట్లు తెలుస్తోంది. ఫర్హానా అనే అమ్మాయిపై కూడా ఆస్తులున్నట్లు తెలుస్తోంది. కరుడుగట్టిన నేరగాడైన నయీం.. తన సమీప బంధువు ఒకరిని ఒంగోలులో ఉంచి అప్పుడప్పుడూ వచ్చిపోతుండే వాడని సిట్ భావిస్తోంది. అయితే.. ఒంగోలులో నయీం ఏమైనా కార్యకలాపాలు సాగించాడా, ఇంకా ఎవరెవరితో సంబంధాలు పెట్టుకున్నాడన్న దిశగా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. 

12:04 - August 26, 2016
11:52 - August 26, 2016

కాకరకాయలో మరో రకం కూడా ఉంది. దీనినే ఆకాకరాయలు అంటారు. అంతేగాకుండా బోడ కాకరకాయ కూడా అంటారు. కాకరకాయలలో మాదిరిగా పొడుగ్గా కాకుండా రౌండ్ గా ఉండి..చిన్న చిన్న బొడిపలుంటాయి. దీనిని వంట్లో చేర్చుకుంటే పలు ప్రయోజనాలు కలుగుతాయి. మరి అవేంటో చూద్దామా..
ఈ కాకరకాయను తినడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫ్లవనాయుడ్లు సమృద్ధిగా లభిస్తాయి.
ఇందులో కొద్దిగా కెలేరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి లావు అవుతామనే భయం ఉండదు.
ఇవి తినడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమద్ధీకరిస్తుంది.
విటమిన్ సి శరీరంలోని ఇన్ ఫెక్షన్లతో పోరాడుతుంది. అదే విధంగా విటమిన్ ఎ కంటి చూపునకు మేలు చేస్తుంది.
జీర్ణవ్యవస్థ మేలుగా ఉండే విధంగా చూస్తుంది. మూత్ర పిండాల సమస్యలున్న వారు ఈ కూరకు ప్రాధాన్యమివ్వాలి.
కాలేయం, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తుంది. కొత్త కణాల వృద్ధికి, గర్భస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పడుతాయి. 

అధికారులతో మంత్రి పోచారం సమావేశం..

హైదరాబాద్ : వ్యవసాయ, ఉద్యావన శాఖల అధికారులతో మంత్రి పోచారం సమావేశాన్ని నిర్వహించారు. వర్షాభావ, పంటల పరిస్థితులపై చర్చిస్తున్నారు. 

హజి ఆలీ దర్గాలోకి మహిళలకు ప్రవేశం..

ముంబై : హజి ఆలీ దర్గాలో మహిళల ప్రవేశంపై హైకోర్టు నిషేధం ఎత్తివేసింది. హైకోర్టు తీర్పుతో దర్గాలోకి మహిళలు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లైంది. 

మంత్రి కామినేని కార్యాలయం ప్రారంభం..

గుంటూరు : తాత్కాలిక సచివాలయంలో ఐదో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఆరోగ్య మంత్రి కామినేని తన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎంపీ గోకరాజు గంగరాజు, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. 

టీఆర్ఎస్ లో టిడిఎల్పి విలీనంపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : టీఆర్ఎస్ లో టిడిఎల్పి విలీనంపై హైకోర్టులో విచారణ జరిగింది. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అభ్యంతరాలు..వివరణలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని పిటిషనర్, అడ్వకేట్ జనరల్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. 

రేపు అభిమానులతో పవన్ సభ ?

తిరుపతి : సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు అభిమానులతో సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే హత్యకు గురైన అభిమాని వినోద్ కుటుంబాన్ని గురువారం పవన్ పరామర్శించిన సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా పవన్ తిరుపతిలోనే ఉన్నారు. రేపటి వరకు కూడా తిరుమలలోనే ఉండాలని పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

11:24 - August 26, 2016

విజయవాడ : రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం రూ. 700 కోట్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ. 14 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని పేర్కొన్నారు. కేంద్రం నిధులను ఖర్చు చేయకపోవడం దారుణమన్నారు. పుష్కరాలు..రాజధాని నిర్మాణాల పేరిట ప్రభుత్వం రాష్ట్రంలోని సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులే నిర్వహించడం సరికాదన్నారు. ఉత్తరాంధ్ర..రాయలసీమ జిల్లాలకు నిధులు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయన్నారు. 

11:22 - August 26, 2016

మహబూబ్ నగర్ : గద్వాల బంద్ కొనసాగుతోంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా గద్వాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిరవధిక బంద్‌కు జిల్లా సాధన సమితి, అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం నుండే నేతలు పలు బస్ డిపోల ఎదుట బైఠాయించారు. బస్సులను బయటకు తీసేందుకు ప్రయత్నించిన వారితో నేతలు వాగ్వాదానికి దిగారు. డిపోల ఎదుట బైఠాయించిన టీజేఏసీ నేతలు, వామపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో విధించిన 144 సెక్షన్ ఎత్తివేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ బంద్‌కు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. నడిగడ్డ ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం గుర్తించి గద్వాలను జిల్లా చేయాలని అఖిలపక్ష నాయకులు కోరుతున్నారు.

11:16 - August 26, 2016

హైదరాబాద్ : స్విస్ ఛాలెంజ్ విధానంపై ఉభయ రాష్ట్రాల హైకోర్టు లో విచారణ జరిగింది. దీనిపై గతంలో హైకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. స్విస్ ఛాలెంజ్ విదేశీ కంపెనీల కోసమేనా హైకోర్టు పేర్కొంది. ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని, స్విస్ ఛాలెంజ్ ఎందుకని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సీల్డు టెండర్లు మేలు కదా అని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అఫిడవిట్ దాఖలుకు రెండు వారాల గడువు కావాలని ఏపీ సర్కార్ కోరింది. మధ్యంతర తీర్పు శుక్రవారానికి వాయిదా వేసింది. శుక్రవారం దీనిపై విచారణ జరిగింది.

రహస్య ఒప్పందాలు..
స్విస్ ఛాలెంజ్ లో రహస్యమైన ఒప్పందాలున్నాయని, వీటిని బహిర్గతం చేయడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. రహస్యంగా ఉంచమని, అఫిడవిట్ దాఖలు చేసేంత వరకు ఉత్తర్వులు ఆపివేయాలని కోరింది. పిటిషనర్ అనర్హుడని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు. ఇతను అనర్హుడని ఎలా చెబుతారని ప్రశ్నించింది. స్విస్ ఛాలెంజ్ విధానంలో ఎలాంటి అంశాలు బహిర్గతం చేస్తారని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది ? ఎంత నష్టం వస్తుందనే దానిని బహిర్గతం చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని తుది ఉత్తర్వులకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని కోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. తుది తీర్పు ? ఇస్తుందా ? లేదా అన్నది చూడాలి.

  • స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ కన్సార్షియంతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం రాజధాని ప్రాంత గ్రామాల్లో తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
  • స్టార్టప్‌ ఏరియా ఉన్న ప్రాంతంలో ఇళ్లు, ప్రార్థనా స్థలాలు, శ్మశానాలను తొలగించాలని ఒప్పందంలో చేర్చారు.
  • అయితే ఈ వాస్తవం ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం మరుగు పరిచింది.
  • మంత్రులు కూడా ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. 

స్విస్ ఛాలెంజ్ కోర్టులో విచారణ..

హైదరాబాద్ : స్విస్ చాలెంజ్ పద్ధతిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. తీర్పు మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేసింది. ఏపీ తన తాజా నిర్ణయాన్ని కోర్టు ఎదుట ఉంచాలని ఆదేశించింది. 

గద్వాలలో ఉద్రిక్తత..

మహబూబ్ నగర్ : గద్వాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా గద్వాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిరవధిక బంద్‌కు జిల్లా సాధన సమితి, అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా అఖిలపక్ష నేతలు ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. 

10:57 - August 26, 2016

'గోపికమ్మా..చాలును లేమ్మా..' అంటూ తెలుగు వారిని తన అందాలతో లేపిన ముద్దుగుమ్మ 'పూజా హెగ్డే'. 'ముకుందా' సినిమాతో మురిపించిన ఈ అమ్ముడు టాలీవుడ్ లో వెంట వెంటనే రెండు సినిమాలు చేసేసింది. అనంతరం బాలీవుడ్ కు ఎగురెళ్లింది. ఈ సమయంలో పలు చిత్రాలు ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆమె మాత్రం ఏవీ ఒప్పుకోలేదంట. ఎందుకంటే ఏకంగా హృతిక్ రోషన్ నటించే అవకాశం వచ్చేసింది. 'మొహెంజోదారో' లాంటి భారీ సినిమాలో ఛాన్స్ రావడంతో ఎగిరిగంతేసింది. ఈ మూవీ బిగ్ హిట్ అవుతుందని భావించిన హెగ్గే ఆశలపై నీళ్లు చల్లింది. మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే హృతిక్ రోషన్ తో హెగ్డే లవ్ లో పడిపోయిందని బాలీవుడ్ పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై ఈ ముద్దుగుమ్మ స్పందించింది. బాలీవుడ్ లోనే కాదు..ఇతర భాషల హీరోలతో ఎవరితోనూ ప్రేమలో పడలేదని స్పష్టం చేసింది. కానీ ప్రేమకు మాత్రం వ్యతిరేకం కాదని..సరైన వ్యక్తి దొరికితే అతడిని ప్రేమించడానికి, అతనితో డేటింగ్ చేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని కుండబద్ధలు కొట్టేసింది. అంతేకాదు..ఏకంగా డేటింగ్ కూడా చేస్తానంటోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఏ వ్యక్తితో ప్రేమలో పడుతుందో ? డేటింగ్ ఎవరితో చేస్తుందే చూడాలి. 

సోమాలియాలో ఉగ్రదాడి..

సోమాలియా : రాజధాని మొగదిషులోని బీచ్ రెస్టారెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. రెస్టారెంట్‌లోకి చొరబడిన ఉగ్రవాది విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..

విజయవాడ : శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. వరలక్ష్మి దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తున్నారు.

కడపలో అగ్నిప్రమాదం..

కడప : ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని వెంకటేశ్వర బయో క్రూడాయిల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. రూ. 10 లక్షల మేర ఆస్తినష్టం జరిగింది. 

రాష్ట్రంలో కరవు - మధు..

విజయవాడ : రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం రూ. 700 కోట్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ. 14 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని పేర్కొన్నారు. కేంద్రం నిధులను ఖర్చు చేయకపోవడం దారుణమన్నారు. పుష్కరాలు..రాజధాని నిర్మాణాల పేరిట ప్రభుత్వం రాష్ట్రంలోని సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులే నిర్వహించడం సరికాదన్నారు. 

ఆటో బోల్తా..నలుగురి మృతి..కానిస్టేబుళ్లకు గాయాలు..

గుంటూరు : తాడేపల్లి (మం) కుంచనపల్లి వద్ద ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. రక్షించేందుకని వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లను లారీ ఢీకొట్టింది. దీనితో వారికి తీవ్రగాయాలయ్యాయి. 

సి.కళ్యాణ్ పై నట్టికుమార్ తీవ్ర ఆరోపణలు..

హైదరాబాద్ : అమ్మాయిలు..ఆర్టిస్టులను బ్లాక్ మెయిలింగ్ చేసింది అందరికీ తెలిసిందేనని, ఎవరు తప్పు చేసినా అదుపులోకి తీసుకోవచ్చని నట్టికుమార్ పేర్కొన్నారు. సి.కళ్యాణ్ చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. టెన్ టివితో ఫోన్ లో మాట్లాడారు. ఛాంబర్ ను అడ్డుపెట్టుకుని దందాలు చేస్తున్నారని, మూకుమ్మడి దాడి చేసుకుంటూ వస్తున్నారన్నారు. 

10:19 - August 26, 2016
10:17 - August 26, 2016

హైదరాబాద్ : నట్టికుమార్..నిర్మాత సి.కళ్యాణ్ మధ్య వివాదం ముదురుతోంది. ఇరువురు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. నయీంతో సంబంధాలున్నాయని నట్టికుమార్ చేసిన ఆరోపణలపై సి. కళ్యాణ్ శుక్రవారం స్పందించారు. నయీం కేసులో నట్టికుమార్ దగ్గరున్న ఆధారాలు చూపెట్టాలని, నట్టికుమార్ జీవితమే బ్లాక్ మెయిలింగ్ అని సి.కళ్యాణ్ ఆరోపించారు. నట్టికుమార్ ను విశాఖ నుండి తన్నితరిమేశారని, క్రీస్తు పేరు చెప్పుకుని డబ్బులు దండుకుంటున్నారని తెలిపారు. నయీం బాధితుల కంటే నట్టికుమార్ బాధితులే ఎక్కువ అని తెలిపారు. నట్టికుమార్ గాడు జీవితంలో చేసిన కామెంట్ లలో ఏదైనా ఫ్రూప్ అయ్యిందా ? అని ప్రశ్నించారు. సినీ ఇండ్రస్ట్రీలో ఉన్నాను కనుకే బాధ్యతగా వహించి తాను ప్రెస్ ముందుకు రావడం జరిగిందని, వీడి సంతకం ఇంకొకడు పెడుతాడని, ఫోర్జరీ సంతకం అని పేర్కొంటాడని తెలిపారు.

నట్టికుమార్ స్పందన...
దీనిపై నట్టికుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. టెన్ టివితో ఫోన్ లో మాట్లాడారు. అమ్మాయిలు..ఆర్టిస్టులను బ్లాక్ మెయిలింగ్ చేసింది అందరికీ తెలిసిందేనని, ఎవరు తప్పు చేసినా అదుపులోకి తీసుకోవచ్చని నట్టికుమార్ పేర్కొన్నారు. ఛాంబర్ ను అడ్డుపెట్టుకుని దందాలు చేస్తున్నారని, మూకుమ్మడి దాడి చేసుకుంటూ వస్తున్నారన్నారు. రెండు వేల మంది నిర్మాతలు ఉంటే తాను ఎందుకు మాట్లాడాలని, 'అడవి' సినిమా చేస్తుంటే దొంగ సంతకం పెట్టి విత్ డ్రా చేసుకున్నారని తెలిపారు. దీనిపై కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సెలింగ్ తో సంబంధం లేదని, తనకు ఇంత వరకు లెటర్ అందలేదన్నారు. ఎవరితో సంబంధాలుంటే వారిని అరెస్టు చేయాలని, ఆధారాలు అతడిని ఎందుకు చూపించాలన్నారు. లీగల్ గా తనకు నోటిసులు పంపిస్తే తాను ఆధారాలు బయటపెడుతానని కళ్యాణ్ స్పష్టం చేశారు. 

10:00 - August 26, 2016

హీరోగా తెలుగు ఇండ్రస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి విలన్ గా టర్న్ అయి...తాజాగా హరర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భయపెట్టించే చిత్రం 'ఎవరు మూవీతో తారకరత్న ప్రేక్షకుల ముందుకొచ్చాడు. క్రాంతి చిత్ర బ్యానర్ పై శేఖర్, యాచమిని, చందు ప్రధాన తారాగణంగా ఈ చిత్రం రూపొందింది. ఇందులో తారకరత్న కీలక పాత్రలో నటించారు. రమణ సెల్వ దర్శకత్వంలో ముప్ప అంకమ్మ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా టెన్ టివి తారకరత్న..హీరోయిన్ తో ముచ్చటింది. ఆ విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

నట్టికుమార్ ఆరోపణలపై సి.కళ్యాణ్ స్పందన..

హైదరాబాద్ : నట్టికుమార్ ఆరోపణలపై సి.కళ్యాణ్ స్పందించారు. నయీం కేసులో నట్టికుమార్ దగ్గరున్న ఆధారాలు చూపెట్టాలని, నట్టికుమార్ జీవితమే బ్లాక్ మెయిలింగ్ అని సి.కళ్యాణ్ ఆరోపించారు. నట్టికుమార్ ను విశాఖ నుండి తన్నితరిమేశారని, క్రీస్తు పేరు చెప్పుకుని డబ్బులు దండుకుంటున్నారని తెలిపారు. నయీం బాధితుల కంటే నట్టికుమార్ బాధితులే ఎక్కువ అని తెలిపారు. 

09:52 - August 26, 2016
09:29 - August 26, 2016

శ్రీకాకుళ: అధికారంలో ఉన్నా... లేకపోయినా సిక్కొలు జిల్లాలో ధర్మాన హవా నడుస్తోంది. ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీలో ఆయనదే పైచేయి..! దీంతో ప్రసాదరావు తీరు సొంత పార్టీ నేతలకు ఇబ్బందిగా మారుతోంది. పార్టీకి నష్టం జరుగుతోందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ధర్మాన వైసీపీ అధినేతపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో.. పబ్లిక్‌కు, పార్టీకి వివరణ ఇచ్చికోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు... ఆ సీనియర్‌ నేత పార్టీ మారుతున్నారనే ప్రచారమూ సాగుతోంది..? ''కడపలో నేను పోటీ చేసినా గెలుస్తాను.. జగన్ గెలవడంలో పెద్ద విచిత్రం లేదు... ఓడిపోయిన వారిని అధినేత గౌరవించడం లేదు'' మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు పార్టీ విసృత స్థాయి సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారడంతో ధర్మాణ వివరణ ఇచ్చికోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారని అంటున్నారు.

ధర్మాన అసంతృప్తి ? 
''కడపలో నేను పోటీ చేసినా గెలుస్తాను.. జగన్ గెలవడంలో పెద్ద విచిత్రం లేదు... ఓడిపోయిన వారిని అధినేత గౌరవించడం లేదు'' మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు పార్టీ విసృత స్థాయి సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారడంతో ధర్మాణ వివరణ ఇచ్చికోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారని అంటున్నారు. వైఎస్‌కు మొదటి నుంచి తాను విధేయుడినని, అందువల్లే వైసీపీలో చేరానని ధర్మాన చెప్పారు. వైఎస్‌కు గిట్టనివాళ్లు తనపై కూడా దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు ధర్మాన. పార్టీ తీరు పట్ల ధర్మాన కొంత అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2014 ఎన్నికలకు రెండు నెలలు ముందు ధర్మాన కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. అప్పటి వరకు గతంలో పీఆర్పీ టిక్కెట్‌పై శ్రీకాకుళం నుంచి పోటీ చేసిన వరుదు కల్యాణి.. ఆ తర్వాత వైసీపీలో చేరి.. శ్రీకాకుళం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. టిక్కెట్‌ ఇస్తానని ఆమెకు జగన్‌ కూడా ఇచ్చారు. అయితే... సడన్‌గా సీన్‌లోకి వచ్చిన ధర్మాన.. శ్రీకాకుళం టిక్కెట్ సంపాదించుకున్నారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ ధర్మాన జిల్లాలో పార్టీని తన కనుసన్నల్లో నడుపుతున్నారు. రెడ్డి శాంతి జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పటికీ ధర్మాన బ్రదర్స్ హవా నడుస్తోంది. ఈ మధ్య పార్టీ పరంగా ధర్మాన వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ అధినాయకత్వం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ధర్మాన కోపంపై పార్టీలో చర్చ...
వైసీపీ అవిర్భావం నుంచి టెక్కలి నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్తగా దువ్వాడ శ్రీను వ్యవహరిస్తున్నారు. అయితే.. ధర్మాన ప్రసాద్‌రావు కాంగ్రెస్‌ను వీడి వైసీపీలోకి వచ్చిన తర్వాత.. తన అనుచరుడు పేడాడ తిలక్‌ను ప్రొత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ధర్మాన ఇటీవల తిలక్‌ను టెక్కలి నియోజకవర్గానికి మరో సమన్వయకర్తగా నియమించుకున్నారు. దీంతో టెక్కలి నియోజవర్గ వైసీపీలో గ్రూపు రాజకీయాలకు బీజం పడింది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న రెడ్డిశాంతి కూడా ధర్మాన తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానానికి బలమైన అభ్యర్థి కోసం వైసీపీ హైకమాండ్ అన్వేషణ మొదలుపెట్టింది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణిని వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇది కూడా ధర్మాన కోపానికి కారణమని పార్టీలో చర్చ సాగుతోంది. త్వరలో శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా తనయుడు ధర్మాన మనోహర్ నాయుడికి అవకాశం ఇవ్వాలని ధర్మాన జగన్‌ను కోరారట. అయితే.. జగన్ ఈ విషయమై క్లారిటీ ఇవ్వకపోవడం కూడా ధర్మాన అసంతృప్తి కారణమై ఉండోచ్చనే ప్రచారం జరుగుతోంది.

ఏదైనా జరగొచ్చు...
పాలకొండ ఎమ్మెల్యే కళావతి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు కూడా ధర్మాన తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. జోగులు టీడీపీలో చేరేందుకు కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది. ధర్మాన తీరుతో జిల్లాలో పార్టీకి కొంత నష్టం జరుగుతోందనే భావనలో వైఎస్ జగన్ ఉన్నారంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ధర్మాన ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. తాను వైసీపీలోనే కొనసాగుతానని ధర్మాన చెబుతున్నా... వచ్చే ఎన్నికల్లోపు ఏదైనా జరగొచ్చనేది జిల్లా పార్టీ క్యాడర్ మాట. మొత్తంగా ధర్మాన వ్యాఖ్యలో పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. 

09:13 - August 26, 2016

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా వ్యాధులు ప్రబలుతున్నాయి. దీనితో జీహెచ్ఎంసీ కమిషనర్ రంగలోకి దిగారు. భోలక్ పూర్ లో శుక్రవాం ఉదయం పర్యటించారు. గోదాముల్లో ఫైర్ సేఫ్టీపై ఆరా తీస్తున్నారు. భోలక్ పూరలో శానిటేషన్ వ్యవస్థ సరిగ్గా లదేని, వెంనే మెరుగుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

భారీ వర్షాలకు ఇద్దరు మృతి..

హిమాచల్ ప్రదేశ్ : భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రాంపూర్ రీజన్ ప్రాంతంలో భారీ వర్షాలకు ఇద్దరు మృతి చెందగా ఇద్దరు గల్లంతయ్యారు. 

నేడు మదర్ థెరిస్సా జయంతి..

కోల్ కతా : నేడు మదర్ థెరిస్సా జయంతి. ఈ సందర్భంగా ఓ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు.

 

ఏపీలో డీజీపీ ఆఫీసుకు శంకుస్థాపన..

గుంటూరు : మంగళగిరి ఆరవ బెటాలియన్ లో డీజీపీ ఆఫీసుకు హోం మంత్రి చిన రాజప్ప శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి, రావెల, కామినేని శ్రీనివాస్, డీజీపీ పాల్గొన్నారు. 

భోలక్ పూర్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటన..

హైదరాబాద్ : నగరంలోని భోలక్ పూర్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటిస్తున్నారు. గోదాముల్లో ఫైర్ సేఫ్టీపై ఆరా తీస్తున్నారు. శానిటేషన్ మెరుగుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. 

08:09 - August 26, 2016

అందంగా ఉండాలని ప్రతొక్కరూ అనుకుంటున్నారు. అందుకనుగుణంగా సౌందర్య సాధనాలు వాడుతుంటారు. అందులో మాయిశ్చరైజర్ కీలకం. ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయం చేస్తుంది. కానీ ఈ మాయిశ్చరైజర్ కొనే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో మీకోసం..
ఎలాంటి పరిమళం లేని మాయిశ్చరైజర్ తీసుకోవడం వల్ల స్కిన్ ఇరిటేషన్ నుండి కాపాడుతుంది. ఎస్ పీఎఫ్ ఉన్నది తీసుకోవాలి.
మాయిశ్చరైజర్ రాసుకొంటే ఒక పొరల పేరుకపోతే వెంటనే దానిని మార్చేయండి.
ఇన్ గ్రేడియెంట్స్ లో డైమైతికోన్ ఉందా ? లేదా ? చెక్ చేసుకోండి. ఇది చర్మాన్ని రక్షించి సహజమైన తేమను కోల్పోకుండా చేస్తుంది.
శీతాకాలంలో పొడిదనం చర్మపు మాయిశ్చరైజర్‌ను లాగేసుకుంటుంది. చర్మాన్ని నీరసంగా, నిర్జీవంగా మార్చేస్తుంది. నూతన పాండ్స్ యాక్టివ్‌ మాయిశ్చరైజర్‌ అనేది హైడ్రేటింగ్‌ ఏజెంట్స్‌తో కూడుకున్నదని పాండ్స్ తెలిపింది. ఇవి చర్మపు పొరల లోతుల్లో మాయిశ్చర్‌ను పట్టి ఉంచుతాయని వెల్లడించింది. 

కారు బైక్ ఢీ..ఇద్దరు మృతి..

నెల్లూరు : జిల్లా ముత్తుకూరు మండలం మల్లూరు వద్ద కారు బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను దమ్మాయపాలెం వాసులున్నట్లు తెలుస్తోంది. 

07:21 - August 26, 2016

ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...'అన్ని విషయాల్లో తెలంగాణా వెంటే ఉంటాం...' అని ప్రకటించారు. ప్రతిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌...ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తారు. ఇదే సమయంలో...'వెనుకబడిన తెలంగాణాకు ఇతోధికంగా ఆర్థికసాయం చేయాలంటూ...' అర్థించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కొద్ది నెలల క్రితం రాష్ట్ర పర్యటన సందర్భంగా...'తెలంగాణాకు రెండేండ్లలో ఎన్డీయే నుంచి రూ.90 వేల కోట్ల సాయమందించాం...' అని ప్రకటించారు. మరుసటి రోజు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌...అమిత్‌ షా వ్యాఖ్యలను ఖండించారు. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం నుంచి తెలంగాణాకు కేవలం రూ.36 వేల కోట్లే వచ్చాయని ఆయన ప్రకటించారు. మహా ఒప్పందంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. సవాళ్ల మీద ప్రతిసవాల్ విసురుతున్నాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (నవ తెలంగాణ ఎడిటర్), ఇందిర (టిపిసిసి), రాకేష్ (బిజెపి), తాడూరి శ్రీనివాస్ రెడ్డి (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

తొలుత మోస్తరు..తరువాత భారీ వర్షాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనం మారనుండడంతో రాష్ట్రంలో శుక్రవారం, శనివారం ఓ మోస్తారు వర్షాలు..28, 29వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

గద్వాలలో కొనసాగుతున్న బంద్..

మహబూబ్ నగర్ : గద్వాలలో బంద్ కొనసాగుతోంది. గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ 72 గంటల పాటు బంద్ కు నడిగడ్డ జేఏసీ పిలుపునిచ్చింది. 

07:09 - August 26, 2016

క్రీడా పోటీలలో గెలిచినవారిని, ప్రైజులు, పతకాలు సాధించినవారిని చాలా గొప్పగా కీర్తిస్తాం. కానీ, పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ప్లేస్ ఇవ్వాలంటే మన మనస్సు ఒప్పద్దు. మన తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల ఇదే జరుగుతోంది. సగానికి పైగా స్కూళ్లల్లో ఆటస్థలం లేదు. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కసారిగా క్రీడాకారుల మీద అంతులేని ప్రేమ ఉప్పొంగుతోంది. రియో ఒలంపిక్స్ లో సింధూ రజత పతకం సాధించడంతో సంతోషం పట్టలేకపోతున్నారు. పోటాపోటీగా స్వాగతాలు పలుకుతున్నారు. సన్మానాలు చేస్తున్నారు. ఒకటి, మూడు, ఐదు కోట్లంటూ నగదు ప్రోత్సహకాలు, ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగమూ ఆఫర్ చేస్తున్నారు. మన ప్రభుత్వాలు చేస్తున్న హడావుడి చూస్తుంటే, క్రీడల మీద, క్రీడాకారుల మీద ఇంత ప్రేమ వున్నదా? అన్న ఆశ్చర్యం కలుగుతోంది. పాపం. క్రీడల మీద ఇంత ప్రేమను ఇంతకాలం మనస్సులోనే ఎలా దాచుకోగలిగారో...?

సింధు స్పూర్తి..
ఇప్పుడు చాలామంది యంగ్ ఇండియన్స్ కి సింధు ఓ స్పూర్తి. ఆమెలాగే బాగా బాగా ఆడి, పతకాలు సాధించాలన్న గోల్ చాలామందికి వుంది. అయితే, ఆడుకునే అవకాశం ఎందరికున్నదన్నదే ప్రశ్న. ఏ దేశం ఎన్ని పతకాలు సాధిస్తే ఆ దేశం కీర్తిప్రతిష్టలు అంతగా పెరుగుతాయి. ఎవరు ఎంత ఎక్కువ ఆడితే, వారికి అంత మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఆటలు ఆరోగ్యానికి పూబాటలు. సింధూ విజయాన్ని గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నవారిలో ఎందరు తమ పిల్లలకు ఆడుకునే అవకాశం కల్పిస్తున్నారన్నది ప్రశ్న. అసలు పిల్లలు ఆడుకోవడానికి స్థలాలెక్కడున్నాయి? ఆడించే కోచ్ లు ఎక్కడున్నారు? తెలంగాణ రాష్ట్రంలో 25,966 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో కేవలం 14,029 స్కూల్స్ లోనే ప్లే గ్రౌండ్స్ వున్నాయి. దాదాపు 12వేల గవర్నమెంట్ స్కూల్స్ లో ఆడుకోవడానికి స్థలం లేదు. 4583 హైస్కూల్స్ లో 2253 మంది పిఇటిలు మాత్రమే వున్నారు. సగం ప్రభుత్వ స్కూళ్లల్లో పిఇటీలు, ప్లే గ్రౌండ్స్ లేకపోవడం క్రీడల పట్ల మన ప్రభుత్వాలకున్న శ్రద్ధకు అద్దం పడుతోంది. తెలంగాణలోని 403 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో కేవలం 23 మంది పిడిలు మాత్రమే వున్నారు. 127 డిగ్రీ కాలేజీలలో 23 మంది పిటీలున్నారు. ఆడుకోవాలన్న ఉత్సాహం వున్న విద్యార్థులకు ఇంతకు మించిన అవమానం ఇంకొకటి వుంటుందా?

ప్రైవేటు స్కూళ్లలో పరిస్థితి ఘోరం..
ఇక ప్రయివేట్ స్కూళ్లలో పరిస్థితి ఇంకా ఘోరం. అపార్టమెంట్లలో స్కూళ్లు, కాలేజీలు నడపడం నేర్చిన యాజమాన్యాలు ఏనాడో ఆటలను నిషేధించాయి. మన కర్మ కొద్ది అవే ఇప్పుడు మనల్ని శాసిస్తున్నాయి. ఏవైనా కొన్ని ప్రయివేట్ స్కూళ్లలో ఆటస్థలాలున్నా, వాటిలో ఆడుకుంటున్న పిల్లలెప్పుడూ కనిపించరు. స్కూల్ వార్షికోత్సవం సందర్భంలో తప్ప మరెప్పుడూ ఆ గ్రౌండ్స్ లో విద్యార్థులను ఆడించరు. పెద్దపెద్ద పట్టణాల్లో ఒకటో రెండో స్టేడియాలున్నా అవి రాజకీయ పార్టీల సభలకు, పెద్దోళ్ల పెళ్లి ఫంక్షన్ లకు, రకరకాల ఎగ్జిబిషన్ లకు వేదికలవుతున్నాయి. అయితే, ఈ పరిస్థితిని మారుస్తామన్న ప్రకటన ఇప్పటికీ ప్రభుత్వాల నుంచి రావడం లేదు. క్రీడలను ప్రోత్సహించడమంటే పతకాలు సాధించినవారికి హారతి పట్టడం కాదు. ఆడుకునే అవకాశం, అందుకు తగిన వాతావరణం కల్పించడం. ఆటలు పతకాల కోసం కాదు. ఆటలు శారీరక మానసిక వికాసం కోసం. ఇందుకు లక్ష కోట్ల బడ్జెట్ లో మన ప్రభుత్వాలు కేటాయిస్తున్న 50 కోట్ల లోపు మాటే. మనం నిర్లక్ష్యం చేస్తున్నది క్రీడలను కాదు మన పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలను అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

06:52 - August 26, 2016

ఒలంపిక్స్ లో సింధు రజతపతకం సాధించిన శుభసందర్భంలో మన దేశంలోనూ, మన రాష్ట్రాల్లోనూ క్రీడా విధానంపై కూడా చర్చ జరుగుతోంది. సింధూకి పోటాపోటీగా స్వాగతం పలికిన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత ఎంత? అసలు మనదేశంలో ఆటలకు ఇస్తున్న విలువ ఎంత? ఈతరం క్రీడా ప్రేక్షకులుగా మాత్రమే ఎందుకు మిగిలిపోతోంది? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ విశ్లేషించారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:45 - August 26, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-2 పశ్నాపత్రం లీకేజీపై జరుగుతున్న సీఐడీ దర్యాప్తు నీరు గారుతోందా ? నలభై రోజులుగా వందలాది మంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నా సూత్రధారి ఎందుకు పట్టుకోలేకపోయారు ? నిందితులు కళ్లముందే తిరుగుతున్నా ఆధారాల పేరుతో జాప్యం చేస్తున్నారా ? ఎంసెట్‌-2 లీకేజీపై CID దర్యాప్తు తీరుతెన్నులను పరిశీలిస్తే... ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోందని అంటున్నారు. ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకేజీపై సీఐడీ అధికారులు చేస్తున్న దర్యాప్తులో జాప్యం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకున్న లీకువీరులను అరెస్టు చేయకుండా ఉపేక్షిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నలభై రోజులుగా జరుగుతున్న దర్యాప్తు ఇంకా కొలిక్కి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్న వాదనలు ఉన్నాయి.

34 మంది బ్రోకర్ల పాత్ర ..
లీకేజీ వ్యవహారంలో ఎంసెట్‌-2 నిర్వహించిన జేఎన్‌టీయూ పాత్ర ఉందని సీఐడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయినా విచారణకు అధికారులు సహకరించడంలేదని దర్యాప్తు అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్న వాదనలు ఉన్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో జేఎన్‌టీయూ పీఆర్‌వోను నిందితుడిగా చేర్చినా ఇంతవరకు అరెస్టు చేయలేదు. లీకేజీ సూత్రధారి దొరికేంత వరకు జేఎన్‌టీయూలోని నిందితుల జోలికి వెళ్లకూడదని సీఐడీ అధికారులు గిరిగీసుకుని కూర్చోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎంసెట్‌-2కు కన్వీనర్‌గా వ్యవహరించిన రమణరావు పాత్రను చార్జిషీటులో చేర్చుతామంటూ సీఐడీ అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్రం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకేజీతో మొత్తం 200 మంది విద్యార్థులు ప్రయోజనం పొంది ఉంటారని అంచనా వేశారు. 34 మంది దళారీల ప్రాత ఉందని తేల్చారు. అయితే ప్రధాన సూత్రధారిని మాత్రం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

రెండు సెట్లు మాత్రమే ముద్రణ..
ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం ముద్రణ విషయంలో నిర్వాహకులు మార్గదర్శకాలను పాటించలేదని సీఐడీ అధికారులు గుర్తించారు. నాలుగు సెట్ల ప్రశ్నా పత్రాలు తయారు చేయించాల్సి ఉండగా... రెండు సెట్లు మాత్రమే చేయించినట్టు ఆధారాలు సేకరించారు. ఈ రెండు సెట్లు కూడా ఒకే ముద్రణా సంస్థ దగ్గర ప్రింట్‌ చేయించిట్లు సాక్ష్యాలు లభించాయి. కానీ ఇందుకు బాధ్యులైన వారి విషయంలో సీఐడీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం ఒక సెట్‌ ప్రశ్నాపత్రం ముద్రించే సంస్థకు మరోసెట్‌ ప్రింట్‌ చేసే ముద్రణాలయానికి మధ్య మూడు కిలోమీటర్ల దూరం ఉండాలన్న నిబంధనను తుంగలో తొక్కారు. ప్రశ్నాపత్రం ముద్రణకు ఇచ్చే విషయంలో కన్వీనర్‌తోపాటు, పరీక్షా విభాగాధిపతికి మాత్రమే తెలుస్తుంది. వీరిద్దరి అంగీకారంతోనే ఒకే ప్రిటింగ్‌ ప్రెస్‌కు ఇచ్చారన్న విషయం అర్థమవుతోంది. కేసులో వీరిని నిందితులుగా చేర్చి, అరెస్టు చేయడంలో సీఐడీ అధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆధారాలను తారుమారు చేస్తే పరిస్థితి ఏంటి ?.
లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఖలీల్‌ను అరెస్టు చేస్తే మినహా... ఎంసెట్‌-2 నిర్వాహకులను అదుపులోకి తీసుకోలేమన్న వాదాన్ని సీఐడీ అధికారులు వినిపిస్తున్నారు. ఈ లోగా సాక్ష్యాధారాలను తారుమారు చేస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పెద్దలను వదిలి... బ్రోకర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మాత్రమే విచారిస్తే దర్యాప్తులో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సీఐడీ అధికారులు ఇప్పటికైనా దర్యాప్తు వేగం పెంచి లీకువీరులను అరెస్టుచేసి...కఠిన శిక్షలు పడేలా చేస్తే భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. 

06:43 - August 26, 2016

హైదరాబాద్ : వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఊరట లభిస్తోంది. ఏపీలోని రాజమండ్రి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. మరోవైపు తెలంగాణలోనూ పలుప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీ, తెలంగాణలో వర్షాలు..
హైదరాబాద్‌లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి, మెహిదీపట్నం, టోలీచౌకి, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీ నగర్‌, నాచారంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏపీలోని రాజమండ్రి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. రాజమహేంద్రవరం, గ్రామీణ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ వర్షం కురవడంతో ఖరీఫ్ సీజన్‌లో నారుమళ్లు వేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 26న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ దిశగా ముందుకు కదిలే వీలున్నందున మరో రెండు రోజులు కోస్తా, తెలంగాణ లోని కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 

06:41 - August 26, 2016

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెలాఖరు నుంచి ప్రారంభయ్యే అవకాశాలున్నాయి. ఈ సమావేశాలకు అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమతున్నాయి. సాగునీటి ప్రాజెక్ట్‌ల అంశాలే ఈసారి ప్రధాన చర్చనీయాంశమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిపై ప్రభుతాన్ని ఎండగట్టేందుకు విపక్షాలు రెడీ అవుతుండగా... ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార టీఆర్ఎస్‌ సిద్ధమవుతోంది. శాసనసభ వర్షాకాల సమావేశాలను నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒక సమావేశానికి మరో సమావేశానికి మధ్య ఆరు నెలల వ్యవధి మించకుడదన్న నిబంధన ఉంది. దీని ప్రకారం మార్చిలో ముగిసిన బడ్జెట్‌ సమావేశాల తర్వాత వర్షాకాల భేటీ నిర్వహించేందుకు వచ్చే నెలాఖరు వరకు గడువు ఉంది. అయితే అంతవరకు వేచివుండకుండా ముందుగానే నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. సెప్టెంబర్‌లో గణేష్‌ నవరాత్రులు, బక్రీద్‌ పండుగలు ఉండటంతో ఆ లోగానే ముగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు. వర్షాకాల భేటీలపై అధికారికంగా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోపోయినా... ఈనెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరగుతున్నట్టు టీఆర్ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


వాడీవేడీ జరిగే అవకాశం..
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్ట్‌ల పునరాకృతి, గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన ఆనకట్టలపై మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందాలపై వర్షాకాల భేటీలో దుమారం చెలరేగే అవకాశం ఉంది. ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్‌ వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని విపక్షాలు... టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో ఈ అంశంపై సెగలు రగలొచ్చని భావిస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న జలాశయాల సామర్ధ్యాన్ని పెంచడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. గుత్తేదార్ల ప్రయోజనాల పరిక్షణకే ప్రభుత్వం ఈ విధంగా చేసిందని, దీని వెనుక పెద్ద అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ప్రాజెక్ట్‌ల భూసేకరణ వివాదం కూడా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రధాన చర్చినీయాంశమయ్యే అవకాశం ఉంది. 2013 భూసేకరణ చట్టాన్ని పక్కనపెట్టి....123 జీవో ఆధారంగా బలవంతపు భూసేకరణ చేపడుతుందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షాల ఎత్తులకు పైఎత్తులు వేసి చిత్తు చేసేందుకు అవలంభించాల్సిన వ్యూహ రచనలో అధికార టీఆర్‌ఎస్‌ ఉంది.

ఆగ్రహంలో విపక్షాలు..
పార్లమెంటు ఇటీవల ఆమోదించిన వస్తు, సేవల పన్ను బిల్లును అసెంబ్లీ వర్షాకాల భేటీలోనే ధృవీకరించాల్సి ఉంది. మరోవైపు జిల్లాల పునర్వస్థీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో... ఈ అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో గద్వాలను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడం పట్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ... టీఆర్ఎస్‌ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మొత్తంమీద చూస్తే శాసనసభ వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

06:38 - August 26, 2016
06:36 - August 26, 2016

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్‌ సర్కార్ చేసుకుంటున్న ఒప్పందాలపై టిడిపి డైరెక్ట్ ఎటాక్ ప్రారంభించింది. ఒప్పందాల్లోని లోపాలను ఆధారాలతో సహ బయటపెట్టి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతోంది. వరుస ప్రెస్‌మీట్లతో ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తమ వాదనకు బలాన్ని చేకూర్చే ఆధారాలను విడుదల చేస్తూ ప్రభుత్వాన్ని పరేషాన్‌ చేస్తోంది. అధికార పార్టీపై విరుచుకుపడడానికి అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది టీటీడీపీ. టీఆర్‌ఎస్‌, టీడీపీల మధ్య ప్రాజెక్టుల వార్‌ ముదురుతోంది..కేసీఆర్‌ సర్కార్ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో వివాదం మరింత వేడెక్కుతోంది.. టీఆర్ఎస్‌ నేతల స్పందనపై టీ-టీడీపీ నేతల కౌంటర్లు కాకపుట్టిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గతంలో వైఎస్‌ సర్కార్ చేసిన తప్పిదాలే..కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఒంటరి పోరు చేయకుండా కలిసివచ్చే పక్షాలతో అధికార పార్టీని ఎదుర్కోనేందుకు సమాయత్తం అవుతున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీటీడీపీ దూకుడు పెంచింది. ముఖ్యంగా రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం మినిట్స్ కాపీని బుధవారం విడుదల చేసిన రేవంత్.. మరుసటి రోజే రెండు ప్రభుత్వాలకు చెందిన ఇంజనీర్ల మధ్య జరిగిన మీటింగ్ మీనిట్స్‌ను బహిర్గతం చేశారు.

ఒప్పంద కాపీల బహిర్గతం..
ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి పాలకులు కుదుర్చుకున్న ఒప్పంద కాపీని సైతం మీడియాకు విడుదల చేశారు. 160 టిఎంసిలు తీసుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని..అయితే తాజాగా తెలంగాణ ప్రయోజనాలను మహారాష్ట్రతో తాకట్టుపెట్టేలా ఒప్పందం చేసుకుందని రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ప్రాణహిత జలాలపైనే రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు ఉండేవని తాజా ఒప్పందంతో అది గోదావరి జలాలకూ వర్తించేలా నిర్ణయం జరిగిందన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి గోడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామంటున్నారు తెలంగాణ టీడీపీ నేతలు. అవసరం అయితే ప్రజాసంఘాలు, కులసంఘాలతో కలిసి ప్రభుతంపై పోరాటం చేస్తామంటున్నారు. టిడిపి విడుదల చేసిన పత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.

06:33 - August 26, 2016

హైదరాబాద్ : తెలంగాణలో అధికార-విపక్ష నేతల మధ్య మాటలు.. తూటాల్లా పేలుతున్నాయి.. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటున్నారు. గోదావరి నదిపై నిర్మించనున్న బ్యారేజీల నిర్మాణం విషయంలో మహారాష్ర్ట ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని కాంగ్రెస్‌, టీడీపీ తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ముప్పేట దాడికి దిగాయి. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ భగ్గుమంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి... వీధి నాయకుడిలా మాట్లాడుతున్నారని ఘాటు విమర్శలకు దిగింది. పొరుగు రాష్ర్టంతో చేసుకున్న ఒప్పందం.. మహాద్రోహం మంటూ కాంగ్రెస్‌ నేతలు నిప్పులు చెరిగాయి. ప్రాజెక్టు ఎత్తును 148 అడుగులకు తగ్గించి... మహారాష్ర్టకు తాకట్టు పెట్టిన కేసీఆర్‌.. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగుతున్నారని మధుయాష్కి అన్నారు. అనాడు ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌, మహారాష్ర్ట సీఎం ఫృథ్విచౌహన్‌ ల మధ్య నడిచిన లేఖలను చూపించారు.

అబద్ధాలు..
కేసీఆర్ తన కుటుంబ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలపై 80వేల కోట్ల భారం మోపారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను మహారాష్ర్ట వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. గోదావరి ప్రాజెక్ట్‌ల ఒప్పందంపై కేసీఆర్‌ అబద్దాలు చెబుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 2012లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌-మహారాష్ట్ర మధ్య ఒప్పందం జరిగిందన్నారు. మొత్తంగా మహా ఒప్పందం తర్వాత కేసీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. గతంలో నాటి ప్రభుత్వాలు మధ్య సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలను చూపిస్తూ.. కేసీఆర్‌ చర్చ రావాలని సవాల్‌ విసురుతున్నారు. 

06:31 - August 26, 2016

హైదరాబాద్ : మహారాష్ట్ర ఒప్పందంతో తెలంగాణ ఇరిగేషన్ శాఖపై మరింత బాధ్యత పెరిగిందన్నారు మంత్రి హరీష్ రావు. కరీంనగర్‌ జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం సమీక్షించాలని ఇంజనీర్లకు మంత్రి హరీష్ సూచించారు. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలు, పంప్ హౌజ్ లు, మిడ్ మానేరు, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను మంత్రి సమీక్షించారు. 

ప్రాజెక్టుల పనులపై సమీక్ష..
కాళేశ్వరంతో పాటు కరీంనగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతిపై హైదరాబాద్ ఐ.డి.సి.లో మంత్రి హరీష్‌ రావు సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంప్ హౌజ్‌ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు మంత్రి హరీష్ రావు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల దగ్గర క్యాంప్ లను ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాలని వర్కింగ్ ఏజెన్సీలను కోరారు. బ్యారేజీ, పంపు హౌజ్‌ల సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ పనులన్నీ ఏకకాలంలో జరగాలని సూచించారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య చారిత్రక ఒప్పందం పూర్తయిన నేపధ్యంలో ప్రాజెక్టు పురోగతిని నిరంతరం సమీక్షించాలని ఇంజనీర్లకు మంత్రి హరీష్ సూచించారు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఇదివరకే చేపట్టిన ప్యాకేజీలు 6,7,8,9 లలో భూసేకరణ పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా గతంలో ప్రారంభించిన పంపుహౌజ్‌ల నిర్మాణం పూర్తి చేయడానికి నిర్ణీత కాలవ్యవధిని ఇదివరకే ఖరారు చేశారు.

పలు సూచనలు..
ఇక వేమునూరు, గంగాధర, మేడారం పంపు హౌజ్‌ల డ్రై రన్ ను ఈ నెలాఖరులో ప్రారంభించాలని, సెప్టెంబర్ 5 న వెట్ ట్రయల్ రన్ ను ప్రారంభించేందుకు పనులు వేగవంతం చేయాలని హరీష్ రావు ఆదేశించారు. ఎల్లంపల్లిలో మిగిలిపోయిన 920 ఎకరాల భూమిని యుద్ధప్రాతిపదికన సేకరించాలని కోరారు. ఇది పూర్తయితే ఈ ప్రాజెక్టు కింద 1,65,000 ఎకరాల ఆయకట్టు ఏర్పడుతుందని మంత్రి గుర్తు చేశారు. తోటపల్లి ప్రాజెక్టు కోసం సేకరించిన 1600 ఎకరాలను తిరిగి గ్రామస్తులకే ఇచ్చే అంశాన్ని చర్చించారు. ఇందులో 117 ఎకరాలు లింక్ కెనాల్ కోసం వినియోగిస్తున్నట్లు మంత్రి తె లిపారు. చందుర్తి, కోనరావుపేట, వేములవాడ, కొడిమ్యాల మండలాల్లో భూసేకరణను పూర్తి చేయాలన్నారు. గౌరవల్లి, గండిపల్లి భూసేకరణ పనులను సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పంపు హౌజ్ లకు సంబంధించి భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు.

06:29 - August 26, 2016

విజయవాడ : పోలవరం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే నెలకల్లా పోలవరం ప్రాజెక్టు వరకు ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇకపై ప్రతి నెలా ప్రాజెక్టు పనులు పరిశీలిస్తానన్న సీఎం.. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం 1700 కోట్లు ఇవ్వాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను విజయవాడ దుర్గాఘాట్‌లో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని అందుకే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 1700 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని.. దీనికోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. వచ్చే నెల నుంచి ప్రాజెక్టు పనులపై ప్రతి నెలా పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో పాటు నిరంతరాయంగా తనిఖీలు, పరిశీలనలు జరుపుతామని చంద్రబాబు వెల్లడించారు. పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా.. ఇంకా అనేక అవాంతరాలు ఉన్నాయని వాటిని అధిగమించేందుకు తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 10.49 కోట్ల క్యూబిక్‌ మీటర్ల స్పిల్‌వే నిర్మాణ పనికి గాను.. 4.02 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తయిందన్నారు. ఇంకా 6.47 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పని చేయాల్సి ఉందన్నారు. రోజుకు 2 లక్షల 42 వేల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌ వర్క్‌ చేయాల్సి ఉందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి క్రెడిట్‌ దక్కించుకోవాలని బాబు సర్కార్‌ యోచిస్తోంది. అందుకు నెలనెలా సమీక్షలు జరిపాలని చంద్రబాబు నిర్ణయించారు.

నేటి నుండి గద్వాల బంద్..

మహబూబ్ నగర్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా గద్వాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిరవధిక బంద్‌కు జిల్లా సాధన సమితి, అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. 

నేడు టీఎస్ఐసెట్ కౌన్సెలింగ్..

హైదరాబాద్ : టీఎస్‌ఐసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 16 హెల్ప్ లైన్ కేంద్రాల్లో తొలిరోజు 1వ ర్యాంకు నుంచి 12 వేల ర్యాంకు వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తామని సాంకేతిక విద్య కమిషనర్ వెల్లడించారు. 

రేపు టీ 20 సిరీస్..

ఫోర్ట్ లాడెర్ వెల్ : వెస్టిండీస్ తో నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 2-0 తో గెలిచిన భారత్ ఇప్పుడు రెండు టీ 20 మ్యాచ్ ల కోసం అమెరికాపై గడ్డపై అడుగు పెట్టింది. ఈనెల 27, 28న భారత్ - వెస్టిండీస్ జట్లు ఢీకొననున్నాయి. 

ములుగులో పర్యటించనున్న కేసీఆర్..

మెదక్ : జిల్లా ములుగు మండలంలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. 

నేడు ప్రధాని మోడీ సమీక్ష..

ఢిల్లీ : కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల పని తీరుపై ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం సమీక్షించనున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు అనే దానిపై ప్రధానంగా చర్చించనున్నారు

బంగాళాఖాతంలో అల్పపీడనం..

హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయి.

రేపు రెండు రాష్ట్రాల సీఎస్ ల భేటీ..

హైదరాబాద్ : ఈ నెల 27న ఉద్యోగుల విభజన కమిటీ చైర్మన్ కమలనాథన్ సారథ్యంలోని విభజన పూర్తిస్థాయి కమిటీ భేటీ జరుగనున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్పీ టక్కర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 

Don't Miss