Activities calendar

27 August 2016

రాజమహేంద్రవరంలో భారీ వర్షం..

తూర్పుగోదావరి : జిల్లా రాజమహేంద్రవరంలో కుండపోత వర్షం కురిసింది. డీలక్స్ సెంటర్, రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

 

21:35 - August 27, 2016

పశ్చిమ బెంగాల్‌ : ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ముర్షిదాబాద్‌లోని బెహ్రామ్‌పుర్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రిలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో భీతావహులైన రోగులు పరుగులు తీశారు. దట్టంగా పొగ వ్యాపించడంతో రోగులు ఊపిరి తీసుకోవడానికి అవస్థలు పడ్డారు. పిల్లల వార్డులోని 50 మంది పసి పిల్లలు గాయపడ్డారు. చికిత్స పొందుతున్న చాలా మంది రోగులు సెలైన్లు పట్టుకుని బంధువుల సహకారంతో బయటకు వచ్చారు. మూడు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఆసుపత్రి మూడో అంతస్థులోని మందుల విభాగంలో షార్ట్ సర్క్యుట్‌ కారణంగా మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారణకు ఆదేశించారు. 

21:32 - August 27, 2016

ఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు ఐదుగురికి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను కోరుతూ.. బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు సోనియా, రాహుల్‌లకు నోటీసులు జారీ చేసింది. స్వామి పిటిషన్‌పై కాంగ్రెస్‌ పార్టీ రెండు వారాల్లోగా సమాధానమివ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 4కు వాయిదా వేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ స్వామి.. సోనియా, రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ నేతలు మోతిలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, సుమన్‌ దుబే, శామ్‌ పిట్రోడా, యంగ్‌ ఇండియన్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. 

21:31 - August 27, 2016

ఢిల్లీ : కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ దూకుడు పెంచింది. భారత దౌత్యపరమైన ఎదురుదాడిని ఉధృతం చేసేందుకు ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ 22 మంది ఎంపీలతో ఓ ప్రతినిధి బృందాన్ని నియమించారు. ఈ ప్రతినిధి బృందం 11 ప్రముఖ దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థలను సంప్రదించి కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించనుంది. కశ్మీర్ పై భారత్‌ ద్వంద్వవైఖరి అవలంభిస్తోందంటూ అంతర్జాతీయ సమాజానికి తెలియజేయనుంది. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని భారత్‌ టార్గెట్‌గా పాకిస్తాన్‌ ప్రచారం చేయనుంది. వచ్చే 15 రోజుల్లో ఈ బృందం అమెరికా, ఫ్రాన్స్‌, చైనా, రష్యా, బ్రిటన్, సౌదీ అరేబియా, టర్కీ, సౌతాఫ్రికా తదితర దేశాల్లో పర్యటించనుంది.

21:30 - August 27, 2016

ఢిల్లీ : కశ్మీర్‌లో కల్లోలానికి పాకిస్తానే కారణమని జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి స్పష్టం చేశారు. యువతను వేర్పాటువాదులు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కశ్మీర్‌ హింసాత్మక ఘటనలపై ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారని అక్కడ శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని ముఫ్తి చెప్పారు. జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి ప్రధానమంత్రి నరేంద్రమోదితో సమావేశమయ్యారు. కశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై ప్రధానితో చర్చించారు. కశ్మీర్‌ పరిస్థితిపై ప్రధాని ఆందోళనతో ఉన్నారని ఈ సందర్భంగా ముఫ్తీ పేర్కొన్నారు. కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కర్ఫ్యూ కొనసాగించడం తప్ప మరో మార్గం లేదని మెహబూబా స్పష్టం చేశారు. కశ్మీర్‌లో సాధారణ స్థితి నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కశ్మీర్‌ అశాంతికి పాకిస్తానే కారణమని మెహబూబా మండిపడ్డారు. కశ్మీర్‌ లోయలో పాక్‌ అల్లర్లకు ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. దాని వల్ల ఎందరో ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్‌ పర్యటనకు ఓ అతిథిగా వెళ్లిన హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను అవమానించడం కుసంస్కారమన్నారు. వేర్పాటు వాదులు యువతను రెచ్చగొడుతున్నారని ముఫ్తీ ఆరోపించారు. అమాయక ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వేర్పాటు వాదులు ముందుకొచ్చి.. ప్రభుత్వానికి సాయం చేయాలని మెహబూబా కోరారు. నేనంటే మీకు కోపం ఉండొచ్చు. నాకూ మీపై కోపం రావొచ్చు. కానీ నాకొక్క అవకాశం ఇవ్వండని వేర్పాటువాదులకు విజ్ఞప్తి చేశారు.

70 మంది మృతి..
కశ్మీర్‌లో అల్లర్లకు ఆజ్యం పోస్తున్న 4 వందల మంది జాబితాను భద్రతా దళాలు రూపొందించాయి. ఈ లిస్టును స్థానిక పోలీసులకు అందజేశారు. వీరిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని సూచించారు. ఇందులో ఉన్నవారు హిజ్బుల్‌ ముజాహిదీన్‌తో పాటు పలు ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్నారని భద్రతా దళాలు పేర్కొన్నాయి. కశ్మీర్‌లో సాధారణ స్థితి నెలకొల్పేందుకు చర్చల ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ట్రాక్‌ టూ టీంను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందులో ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఈ టీం వేర్పాటువాదులతో సహా కశ్మీర్‌ అంశంతో సంబంధమున్న ప్రతి ఒక్కరితో చర్చలు జరపనుంది. వచ్చే వారం అఖిలపక్ష బృందం కూడా కశ్మీర్‌లో పర్యటించనుంది. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌వనీ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో కశ్మీర్‌లోయ కల్లోలంగా మారింది. ఈ ఘటన జరిగి 50 రోజులవుతున్నా.. కశ్మీర్‌లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 70 మంది మృతి చెందారు. సుమారు 11 వేలమంది గాయపడ్డారు.

21:23 - August 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అసెంబ్లీ సమావేశాలు తూతూ మంత్రంగా నడుస్తున్నాయని బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు సమావేశపరిచి కొత్త జిల్లాల ఏర్పాటుపై పూర్తిస్ధాయిలో చర్చించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా, తమ సొంత వ్యవహారంలా కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో వ్యవహరిస్తుందని ఆరోపించారు. మహారాష్ట్ర ఒప్పదంపై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరగాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

21:20 - August 27, 2016

చిత్తూరు : ప్రత్యేక హోదాపై జనసేన అధినేత, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కదనరంగంలోకి దిగారు. రాష్ట్రానికి హోదాయే లక్ష్యంగా కేంద్రంతో యుద్ధానికి సిద్ధమైన జనసేన..ఇకముందు దూకుడే ఆయుధంగా ముందుకెళ్తానని తిరుపతి వేదికగా ప్రకటించాడు. అంతేకాదు..తన ప్రసంగంలో ఏ ఒక్కర్ని వదలకుండా ఉతికి ఆరేశారు. ప్రధాని మోదీ దగ్గర నుంచి సీఎం చంద్రబాబు, ఎంపీలు, మంత్రులపై తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. తిరుపతి వేదికగా పవర్ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఎవరెవరిపై పంచ్‌లు వేశారో చదవండి..ప్రత్యేక హోదాపై జనసేన అధినేత, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఎట్టకేలకు గొంతు విప్పారు. హోదాపై రెండేళ్లుగా సైలెంట్‌గా ఉన్న పవర్‌స్టార్‌..తిరుపతి వేదికగా గర్జించారు. హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను తనదైన స్టైల్లో విమర్శించారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ సహా సీఎం చంద్రబాబు, ఎంపీలు, మంత్రులు వ్యవహరిస్తున్న తీరును పవన్‌ తూర్పారబట్టారు. హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యవహరించిన తీరును పవన్‌కల్యాణ్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల ముందు 15 ఏళ్లపాటు స్టేటస్‌ ఇస్తామని చెప్పి ఇప్పుడు హోదాతో లాభమేంటని వెంకయ్య చెప్తున్నారని ఎద్దేవా చేశారు.

ఎంపీలపై సెటైర్లు..
పవన్‌ జనసేన..మోదీ భజనసేన అని కొందరు అన్నారు. గబ్బర్‌సింగ్‌ కాదు రబ్బర్‌సింగ్‌ అని కూడా మరికొందరు అన్నారని వైసిపి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఆమెపై సైటర్లు వేశారు. ప్రజా సమస్యలపై నేను భజనసేననే అన్న పవన్‌..ప్రధాని నరేంద్రమోదీ అంటే తనకు అమితమైన గౌరవం ఉందన్నారు. అయితే అది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేంత తనకు లేదన్నారు. ఏపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారో అర్థంకావడంలేదన్న పవన్‌..గతంలో కాంగ్రెస్‌ ఎంపీలు మేడమ్‌..మేడమ్‌..అని బతిమలాడేవారని, ఇప్పుడు ఎంపీలు సార్‌..సార్‌..అని బతిమలాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్‌ను స్తంభింపచేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలకు సూచించారు.

తెలుగు ఎంపీలు హిందీ నేర్చుకోవాలి..
తుమ్మితే వూడిపోయే ముక్కులాంటి పదవులు పట్టుకోని వేలాడకండి. వాటిని వదలి ప్రజల తరపున పోరాడండి అంటూ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజును ఉద్దేశించి పవన్‌కల్యాణ్‌ అన్నారు. పదవుల్ని త్యాగం చేసినప్పుడే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని అన్నారు. అటు మాజీ కేంద్రమంత్రి జైరాంరమేష్‌పై కూడా పవన్‌ సెటైర్లు వేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన వారిలో జైరాం రమేష్‌ నెంబర్‌ వన్‌ అని..అలాంటి ఆయనకు జేజేలు పలకాలని సెటైర్‌ వేశారు. తెలుగు ఎంపీలు హిందీ నేర్చుకోవాలి. మాకు ప్రత్యేకహోదా కావాలని అని తెలుగులో అడిగితే అక్కడ అర్థం కావడంలేదని కాంగ్రెస్‌, టిడిపి ఎంపీలనుద్దేశించి పవన్‌ అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు కనీసం రెండుముక్కల హిందీనైనా నేర్చుకోవాలని ఎంపీలపై సెటైర్లు వేశారు.
మొత్తానికి రెండేళ్ల తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తిరుపతి వేదికగా గర్జించాడు. హోదాపై ఇక కేంద్రంతో పోరు తథ్యమంటూ సమరశంఖాన్ని పూరించారు. పవర్‌స్టార్‌ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో..రాజకీయ నాయకుల సంగతేమో కానీ.. పవన్ అభిమానులు మాత్రం ఫుల్‌జోష్‌లో మునిగితేలుతున్నారు. 

21:09 - August 27, 2016

పచ్చని పల్లెవైపు పోలీసుల పరుగులు..ఏ నాడూ పల్లెమొహం చూడనివారంతా ఉరుకులు..ఆ పల్లెలో ఏం జరిగిందోనని అనుమానాలు..ఎవరిని కదిలించినా తెలియదనే సమాధానాలు..అక్కడ జరిగిన ఘోరం ప్రతీ ఒక్కరికీ తెలుసు... ఆ కిరాతకం చూసినవారున్నారు..కాని నోరు మెదపడం లేదు..ఓ అన్యాయాన్ని తొక్కి పెడుతున్నారు.. ఆ రాక్షసాన్ని మర్చిపోలేకపోతున్నారు... ఆ విషయం తెలిసిన ప్రతీ ఒక్కరిలో ఏం జరుగుతోందోనని ఆందోళన పెరిగింది... అయినా దాస్తే దాగేది కాదు..కదా... బయటపడింది... పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

21:06 - August 27, 2016
21:03 - August 27, 2016

చిత్తూరు : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకూ కేంద్రంపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. సెప్టెంబర్‌ 9న కాకినాడలో సభ నిర్వహించి.. ప్రజల్లోకి వెళ్తామన్నారు. మూడు దశల పోరాటం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో జనసేన బహిరంగసభలో ప్రసంగించిన పవన్... ప్రధాని మోదీపై కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తిరుపతి ఇందిరామైదానం వేదికగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక హోదా అంశంపై చాలా సీరియస్‌గా, ఆవేశంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపైనా, టీడీపీపైనా నిప్పులు చెరిగారు. సీమాంధ్రులంటే కేంద్రానికి చులకనా..? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎందుకు ఆడుకుంటున్నారని నిలదీశారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ కేంద్రానికి వినిపించేలా గళమెత్తాలని జనసేన నిర్ణయించిందన్నారు పవన్‌. ఇందుకోసం మూడు దశల్లో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం మొదటిదశలో ప్రతీ మండలానికి వెళ్లి.. జరిగిన అన్యాయం ఏమిటి? ప్రత్యేకహోదా కోసం జనసేన ఏం చేయబోతోందో వివరిస్తామన్నారు. బీజేపీ నాయకులు.. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న తీర్మానాన్ని ఆమోదించిన సభాస్థలి.. కాకినాడ నుంచే తన ఉద్యమాన్ని ప్రారంభిస్తానని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. సెప్టెంబర్‌ తొమ్మిదో తేదీన తొలి సభ నిర్వహిస్తామని చెప్పారు.

రెండేళ్లు వేచి చూశా..
రెండోదశ పోరాటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై, అన్ని పార్టీల ఎంపీలపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అప్పుడు కూడా ఎంపీలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే.. మూడోదశలో ప్రజల సహకారంతో రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం ఉధృతంగా పోరాడతామన్నారు. కేంద్రం ఏం చేస్తుందో చూద్దామనే రెండేళ్లు వేచి చూశానని పవన్‌ తెలిపారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఏపీ యువత ఎలా ముందుకు వెళ్తుందని, రాయితీలు ఇవ్వకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తమ హక్కని, దానిని తాము అడుక్కోవట్లేదని పవన్ అన్నారు. రాష్ట్రానికి అన్నివేల కోట్లు ఇచ్చాం, ఇన్ని కోట్లు ఇచ్చాం.. అని చెప్పడం సురికాదని... ప్రత్యేక హోదా కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం..
అరిగిపోయిన మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయవద్దని కేంద్రప్రభుత్వానికి హితవు పలికారు పవన్‌కల్యాణ్‌. రాజకీయ ప్రయోజనాలు మాని, ప్రజా ప్రయోజనాలపై దృష్టి సారించాని హితవు పలికారు. ప్రత్యేక హోదానే ఏపీ అభివృద్ధికి మూలమని, అది లేని రాష్ట్రాన్ని ఊహించలేమని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయమనే కోరుతున్నాం తప్ప మరేమీ తమకు అవసరం లేదని పునరుద్ఘాటించారు. తనకు రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పారు జనసేనాని..

నయీం కేసు..సంచలన విషయాలు వెల్లడించిన పర్హానా..

హైదరాబాద్ : ఇటీవలే ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో వంట మనిషి ఫర్హానా సంచలనాత్మక విషయాలు వెల్లడిస్తోంది. నెలలో 20 రోజుల పాటు గోవాలో ఎంజాయ్ చేసేవాడని, ప్రతిసారి అక్కడకు అమ్మాయిలను తీసుకెళ్లేవాడని తెలిపింది. బావ నదీంను గోవాలోనే నయీం అత్యంత కిరాతకంగా చంపాడని, తన మాటలు వినని పిల్లలతో నయీం పచ్చిమిర్చి జ్యూస్ తాగించేవాడని ఆమె పేర్కొంది. తన పిల్లలను నయీం విచక్షణా రహితంగా కొట్టడంతో నడవలేని స్థితిలో ఉన్నారని ఆమె చెప్పింది.

20:28 - August 27, 2016

విజయవాడ : గ్రాండ్ ప్రాజెక్ట్ క్యాపిటల్ వెంచర్‌కు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ జరుగుతోంది. నగరంలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల ప్రముఖులు కూడా ఈ ప్రతిష్ఠాత్మక వెంచర్‌ ఆవిష్కరణకు హాజరయ్యారు. 2,3,4 బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్లను ఈ సంస్థ నిర్మించనుంది. ఈ వేడుకల గురించి చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:26 - August 27, 2016

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు సాగునీరందించే ప్రధాన ఉద్దేశంతోనే మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్‌లో కాళేశ్వర్‌ లైన్ డయాగ్రామ్‌తో మీడియా ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ ఇంటరాక్షన్‌లో కాళేశ్వరం, తుమ్మిడిహట్టి, మేడిగడ్డ, ప్రాణహిత ప్రాజెక్టుల గురించి వివరించారు. ప్రాజెక్టులపై సర్కారు చేపడుతున్న చర్యలు, వాటివల్ల కలిగే లబ్ధి, సాగులోకి వచ్చే భూమి వంటి అంశాలపై వివరించారు.

20:25 - August 27, 2016

విజయవాడ : ఏసీ సీఎం చంద్రబాబు విజయవాడలోని ఎస్ డీఎంఎస్ఎంకే మహిళా కాలేజీలో జరిగిన స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలేజీలో మొక్క నాటిన చంద్రబాబు.. కళాశాల ప్రాంగణంలో నిర్మించిన ఇండోర్‌ స్టేడియంను ప్రారంభించారు. కాలేజీలో బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి నాలుగో శనివారం విద్యార్థులు చెట్లను నాటాలని సూచించారు.2022 నాటికి మూడు అగ్రరాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఏపీ ఉంటుందని చంద్రబాబు అన్నారు. తన విజన్‌ గురించి తెలిపారు. 2029కి భారత్‌లో నెంబర్‌ వన్ రాష్ట్రానికి చిరునామాగా ఏపీ నిలుస్తుందని చెప్పారు. 2050కి ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఏపీ ఉంటుందని చంద్రబాబు అన్నారు. 

20:23 - August 27, 2016
20:21 - August 27, 2016

హైదరాబాద్ : ఖరీఫ్ సీజన్ సాగునీటికి, తాగు నీటి కోసం ఏపి తెలంగాణ రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేసింది కృష్ణా బోర్డు.. శుక్రవారం జరిగిన పుల్ బోర్డు మీటింగ్ నీటి పంపిణీ విషయాన్ని వర్కింగ్ గ్రూప్ కి అప్పగించింది. నేడు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ అధ్యక్షతన సమావేశమైన వర్కింగ్ గ్రూప్ ఏపికి 36టిఎంసిలు, తెలంగాణకు 15 టిఎంసిల నీటిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపికి కేటాయించిన నీటి నుండే చెన్నై తాగునీటికి నీటిని విడుదల చేస్తారన్నారు. సెప్టెంబర్ తర్వాత అవసరాలను బట్టి నీటి పంపిణీ పై మరోసారి బోర్డు నిర్ణయం తీసుకుంటుందన్నారు.

గ్రాండ్ ప్రాజెక్టు క్యాపిటల్ బ్రోచర్ ఆవిష్కరణ...

విజయవాడ : నగరంలో గ్రాండ్ ప్రాజెక్టు క్యాపిటల్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. ఏ 1 కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం సందడిగా జరిగింది. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

19:46 - August 27, 2016

ఏపీ ప్రత్యేక హోదా కోసం మూడు దశల్లో పోరాటం చేస్తామని సినీ నటుడు, జనసేన అధినేత పవన కళ్యాణ్ ప్రకటించారు. త్వరలోనే ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని, ప్రజలను చైతన్యపరుస్తానన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే..జరిగే నష్టాలను వివరిస్తానన్నారు. కేంద్రం స్పందించే వరకూ జనసేన పోరాటం ఆగదన్నారు. హోదా విషయంలో టిడిపి తీరును పవన్ తప్పుబట్టారు. సంయమనం పేరుతో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని, ఎంపీలు యాచకుల్లా అడగడం సరిగ్గా లేదని పవన్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), అద్దెపల్లి శ్రీధర్ (బీజేపీ), గౌతమ్ రెడ్డి (వైసీపీ), విజయ్ కుమార్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

19:25 - August 27, 2016

ఈ ఎడాది రిలీజైన 'ఎక్స్ ప్రెస్ రాజా'తో 'శర్వానంద్' సక్సెస్ పుల్ గా హ్యట్రిక్ కంప్లీట్ చేశాడు. 'రన్ రాజా రన్', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాలో వరుసగా రెండు హిట్స్ అందుకున్న ఈ యంగ్ హీరో 'ఎక్స్ ప్రెస్ రాజా'తో మూడో హిట్టు అందుకున్నాడు. ఇలా వరుసగా మూడు హిట్స్ తో జోరుమీదున్న 'శర్వానంద్' ఆచి తూచి కొత్త సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో క్రేజీ బ్యానర్ లో కొత్త దర్శకుడితో న్యూ మూవీకి కమిట్ అయ్యాడు. 'శర్వానంద్' కథానాయకుడిగా వేగేశ్న సతీష్ అనే కొత్త దర్శకుడితో 'శతమానం భవతి' సినిమా చేస్తున్నాడు. 'దిల్ రాజు' నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నఈ కొత్త చిత్రాన్ని నవంబర్ నాటికి షూటింగ్ ని కంప్లీట్ చేయాలని 'దిల్ రాజ్' ప్లాన్ చేశాడు. డిసెంబర్ లో ఎడిటింగ్ గ్రాఫిక్స్ వర్క్ ని పూర్తి చేసి సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయాలని భావిస్తున్నారు. 'ఎక్స్ ప్రెస్ రాజా' ఈ సంక్రాంతికి వచ్చి విజయం అందుకున్న విషయం తెలిసిందే. సేమ్ అలాగే మరోసారి సంక్రాంతికి సక్సెస్ కొట్టాలని 'శర్వా' ఆశగా ఉన్నాడు. 'అనుపమ పరమేశ్వరన్' హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. మరి హిట్ కొడుతాడా ? లేదా ? అనేది చూడాలి. 

19:18 - August 27, 2016

చెన్నై పొన్ను 'రెజీనా' పుల్ బిజీ అయిపోయింది. సక్సెస్ లు లేవు కానీ కొత్త అవకాశాలు మాత్రం కొకొల్లలుగా వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్న నాలుగు కొత్త సినిమాలు ఏకకాలంలో షూటింగ్ జరుపుకోవడం విశేషం. అందుకే సక్సెస్ లు లేకపోయిన ఛాన్స్ లు పెరగడంతో అమ్ముడు అమాంతం తన రెమ్యూనేషన్ పెంచింది. 'రెజీనా' ప్రస్తుతం నాలుగు క్రేజీ సినిమాలు చేస్తోంది. 'కృష్ణవంశీ' 'నక్షత్రం' సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ 'అవసరాల శ్రీనివాస్' దర్శకత్వం వహిస్తున్న 'జ్యో అచ్యుతానంద' మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకి రెడీ ఉంది. ఇక తమిళంలోనూ 'మా నగరం' అనే సినిమా చేస్తోంది. అంతేకాదు బాలీవుడ్ లో 'ఆంఖే 2' చిత్రంలో నటించే ఛాన్స్ పట్టేసింది.
కేవలం బాలీవుడ్ లో ఛాన్స్ రావడం వల్లే 'రెజీనా' రెమ్యూనేషన్ పెంచినట్లు వినిపిస్తోంది. ఇప్పటి వరకు రూ.60 లక్షల రెమ్యూనేషన్ తీసుకున్న ఈ చెన్నై పిల్ల ఇక నుంచి రూ. కోటి 50 లక్షలకు ఏ మాత్రం తగ్గేది లేదని చెప్పుతోందట. డిమాండ్ వచ్చేవరకూ పారితోషికం కాస్త తక్కువైనా సర్దుకోవడం. డిమాండ్ పెరగ్గానే పారితోషికం పెంచడం కామనే గదా ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవలసినదేవుందని చెప్పుకుంటున్నారు.

19:15 - August 27, 2016

'బాబు బంగారం' అని నమ్ముకుంటే ఇత్తడైపోయిందంటున్నారు డిస్టిబ్యూటర్స్. అంతేకాదు కనీసం పెట్టుబడిని కూడా రాకపోవడంతో డిస్టిబ్యూటర్స్ లబోదిబోమంటున్నారు. బాబు బంగారంలా కాసుల వర్షం కురిపిస్తాడనుకుంటే ఇలా నష్టాలపాలు చేశాడంటూ విసుక్కుంటున్నారు. ఇంతకీ 'బాబు బంగారం' బాక్సాఫీసు గోడవెంటీ ? 'విక్టరీ వెంకటేష్', 'మారుతి'ల కాంబినేషన్ లో వచ్చిన 'బాబు బంగారం' తెలుగు రాష్ట్రాల వరకూ బాగానే నడుస్తోంది. లాంగ్ వీకెండ్ తో పాటు ఈ సినిమా తరువాత పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవడం కూడా 'బాబు బంగారం'కు బాగానే కలిసొచ్చింది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమాను కొన్న వాళ్లకు బాగానే దెబ్బ పడిందని సమాచారం.

టచ్ చేయని హాఫ్ మిలియన్ మార్క్..
'బాబు బంగారం' ఓవర్సీస్ లో ఇప్పటి వరకు హాఫ్ మిలియన్ మార్క్ ను టచ్ చేయలేదట. కేవలం ఈ మూవీ రూ.2.4 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందట. అంటే రూ. 1.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. 'బాబు బంగారం', 'ఆ ఆ', 'ప్రేమమ్' చిత్రాలు మూడింటికీ కలిపి రూ.6.5 కోట్ల డీల్ మాట్లాడుకుని కొనుగోలు డిస్టిబ్యూషన్ హక్కులు తీసుకున్నారంట. 'అ ఆ' బాగానే లాభాలు తెచ్చిపెట్టింది. కానీ 'బాబు బంగారం' మాత్రం భారీ లాస్ చేసిందని ఓవర్సీస్ టాక్. 'బాబు బంగారం' చిత్రాన్ని ఓవర్సీస్ డిస్టిబ్యూటర్స్ తెలివిగా థర్డ్ పార్టీ బయ్యర్లకు రూ. 5 కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది. సో రూ. 5 కోట్లలో రూ. 1.5 కోట్లు రాబట్టింది. అంటే 'బాబు బంగారం' కొన్న డిస్టిబ్యూటర్స్ నష్టం లేదు కానీ థర్డ్ పార్టీ బయ్యర్లకు మాత్రం 'బాబు బంగారం' వల్ల బాగానే నష్టాలు వచ్చాయి. మరి ఈ నష్టాలను త్వరలో రిలీజ్ కానున్న 'ప్రేమమ్' మూవీ రికవరీ చేస్తోందో చూడాలి.

పవన్ స్పీచ్ పై కాసేపట్లో టిడిపి స్పందన..

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన స్పీచ్ పై టిడిపి కాసేపట్లో స్పందించనుంది. ఆచితూచి మాట్లాడాలని నేతలకు సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.

 

19:02 - August 27, 2016

దేశ ప్రజల సంక్షేమం కోసం చట్టాలు చేసేందుకు పార్లమెంట్ ఉన్నట్లుగానే రాష్ట్రానికి కూడా అసెంబ్లీ ఉంటుంది. శాసనసభ..శాసన మండలి కలిపి అసెంబ్లీగా పిలుస్తారు. ఇందులో ఎన్నికైన ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ హర్యానాలో మాత్రం ఓ ఘటన చోటు చేసుకుంది. అక్కడ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం సందర్భంగా జైన దిగంబర బాబా తరుణ్ సాగర్ ప్రసంగించారు. ఈయన ప్రసంగం వినడానికి గవర్నర్, సీఎంలు కూడా హాజరయ్యారు. అక్కడి విద్యాశాఖ మంత్రి రాం విలాస్ శర్మ సూచన మేరకు బాబా తరుణ్ సాగర్ ఈ ప్రసంగం చేశారంట. ధర్మం భర్త అయితే రాజకీయాలు భార్య..తన భార్య సంరక్షించడమే ప్రతి భర్త కర్తవ్యం అవుతుందని జ్ఞాన బోధ చేశారు. రియో ఒలింపిక్స్ లో సిందు..సాక్షి మాలిక్ లు దేశ పరువు కాపాడారని, హర్యానాలో స్త్రీ పురుషుల నిష్పత్తిలో ఉన్న తేడా గురించి కూడా మాట్లాడారు. కూతురు ఉన్న నాయకులకే పార్టీ టికెట్లవ్వాలని, కూతురు లేని ఇంటికి తమ కూతురుని కోడలిగా పంపించకూడదన్నారు. అలా చేస్తే అప్పుడైనా కూతుళ్లను కనేందుకు జనం ముందుకొస్తారని తెలిపారు. సుమారు 40 నిమిషాల పాటు అసెంబ్లీలో ప్రసంగం చేశారు. ఓ బాబా నగ్నంగా అసెంబ్లీలో ప్రసంగించడం ఇదే తొలిసారి. 

ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎల్ బ్లాక్ ఐదో అంతస్తులో ఉన్న ప్రణాళిక శాఖలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఫర్నీచర్, కంప్యూటర్లు తగలబడుతున్నట్లు తెలుస్తోంది. 

18:38 - August 27, 2016

సీతమ్మ మంగళ సూత్రాలు లభ్యం..

ఖమ్మం : భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో మాయమైన సీతమ్మ మంగళ సూత్రాలు లభ్యమయ్యాయి. ఆలయంలోనే మంగళసూత్రం దొరికిందని ఈవో ఛాంబర్ లో పూజారులు అప్పగించారు. 

18:31 - August 27, 2016

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన స్పీచ్ పై ఏపీ కాంగ్రెస్ నేత తులసీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో పవన్ చేసిన ప్రసంగంపై ఆయన స్పందించారు. టెన్ టివితో ఫోన్ లో మాట్లాడారు. అత్త చచ్చిన ఆరు నెలలకు కోడలు ఏడ్చిన చందంగా పవన్ ప్రసంగం ఉందని విమర్శించారు. అప్పుడేం మాట్లాడకుండా..ఇప్పుడు మాట్లాడడం సరికాదన్నారు. అప్పుడొప్పుడు వచ్చి మాట్లాడుతుంటాడు..వెళుతుంటాడు..ఏమవుతుందని ఘాటు విమర్శలు గుప్పించారు. సీమాంధ్రకు చెందిన నేతలు వీరోచితంగా పోరాటం చేయడం జరిగిందని, సోనియా నాయకత్వాన్ని ఎదుర్కొనే విధంగా జరిగిందన్నారు. 

18:29 - August 27, 2016

విజయవాడ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన స్పీచ్ ఆహ్వానించదగిందేనని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. తిరుపతిలో పవన్ చేసిన ప్రసంగంపై ఆయన స్పందించారు. టెన్ టివితో ఫోన్ లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యం..రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో పోరాటం చేస్తానని పవన్ చెప్పడాన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆవులు..గోవులపై శ్రద్ధ ఎకుక్కవైందని..బీజేపీ..ఆర్ఎస్ఎస్..ఇతర కార్యకర్తలు ఒక్కో గోవును పెంచుకోవచ్చు...ఇలా చేస్తూ ప్రజా సమస్యలు పక్కన పెడుతున్నారని పవన్ విమర్శించారని తెలిపారు. కేంద్రం హామీలను విస్మరించిందని, గతంలో కాంగ్రెస్ ఎలా చేసిందో అదే పద్ధతుల్లో బీజేపీ చేస్తోందని పవన్ ఘాటుగా విమర్శలు గుప్పించారని మధు తెలిపారు.

18:26 - August 27, 2016
18:15 - August 27, 2016

హైదరాబాద్ : బీజేపీ టార్గెట్ గా పవన్ ప్రసంగం సాగిందని చెప్పవచ్చని టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం పేర్కొన్నారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో జనసేన భారీ బహిరంగసభ ముగిసింది. ఈసభలో పవన్ కళ్యాణ్ ఉద్వేగ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పవన్ స్పీచ్ పై కృష్ణ సాయిరాం విశ్లేషణ చేశారు. జనసేన సభను ఒక కీలకమైన ముందడుగా చూడాల్సి ఉంటుందని, ప్రత్యేక హోదా సెంటిమెంట్ గా మారిందన్నారు. ఇందుకు జనసేన నిర్దిష్ట కార్యచరణను ప్రకటించిందని, ప్రజల్లో చైతన్యవంతం కలిగే విధంగా మొదటి దశలో పోరాటం చేయనున్నట్లు పవన్ ప్రకటించారని తెలిపారు. ఎంపీలపై వత్తిడి తేవడం ద్వారా ప్రత్యేక హోదాను ప్రకటించే విధంగా రెండో దశ ఉద్యమంలో భాగంగా నిర్ణయం తీసుకుందని, ఈ రెండు దశల్లో కేంద్రం స్పందించకపోతే ఒక ఉద్యమ స్థాయిలో స్పందించాలని జనసేన నిర్ణయం తీసుకుందన్నారు. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధిస్తానని పవన్ పేర్కొనడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో రాజకీయ భూమికగా ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు., రాష్ట్రాన్ని విభజించాలని బీజేపీ ఎక్కడైతే నిర్ణయం తీసుకుందో అక్కడే సభ నిర్వహించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా టార్గెట్ గా తీసుకోవడం కనిపించిందని, టిడిపి ప్రభుత్వంపై కొన్ని చెణుకులు..విమర్శలు గుప్పించారని తెలిపారు. పోరాటం ఎందుకు చేయడం లేదని టిడిపి ఎంపీలపై.మరోవైపు కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు గుప్పించారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వస్తున్న విమర్శలపై కూడా పవన్ సమాధానం చెప్పారని తెలిపారు. 

గాంధీ ఆసుపత్రిలో 300 పడకల ప్రారంభం..

హైదరాబాద్ : నగరంలోని గాంధీ ఆస్పత్రిలో అదనంగా 300 పడకలను ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. 

ముగిసిన కృష్ణా బోర్డు సమావేశం..

హైదరాబాద్ : కృష్ణా బోర్డు యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. కృష్ణా నది 63.37 నిష్పత్తిలో ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. సెప్టెంబర్ లో నెలలోనే తమకు ఎక్కువ నీరు కావాలని ఏపీ ప్రభుత్వం కోరింది. 83.5 టీఎంసీల నీటిలో సెప్టెంబర్ లో ఏపీ 36 టీఎంసీలు ఉపయోగించుకోవాలని తీర్మానించారు. తెలంగాణ 15 టీఎంసీలు ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

 

సెప్టెంబర్ 9వ తేదీ మొదటి సభ - పవన్..

చిత్తూరు : ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాటం చేస్తానని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 9వ తేదీన కాకినాడలో మొదటి సభ పెడుతానన్నారు. 

గో సంరక్షణ పేరిట రాజకీయాలు వద్దు - పవన్..

చిత్తూరు : గో సంరక్షణ పేరిట రాజకీయాలు చేయవద్దని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గో సంరక్షణ పేరిట సమస్యలు పక్కదారి పెట్టిస్తున్నారని ఇలా చేయడం సరికాదన్నారు. బీజేపీ..ఆర్ఎస్ఎస్ వారికి ఒక గోవు ఇవ్వాలి..గో సంరక్షణ పేరిట ప్రత్యేక హోదాను వెనక్కి నెట్టవద్దని సూచించారు. 

వెంకయ్య తప్పు చేస్తున్నారు - పవన్..

చిత్తూరు : ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగంపై అసహనం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయనంత రాజకీయ అనుభవం తనకు లేదని, కానీ విభజన సమయంలో ఎలాంటి పోరాటం చేశారో అలాగే ప్రస్తుతం కొనసాగించాలన్నారు. జాతి ప్రయోజనాలు వెనక్కి నెట్టే విధంగ మాట్లాడుతూ తప్పు చేస్తున్నారని పవన్ తెలిపారు. 

హోదా విషయంలో పోరాటం - పవన్..

చిత్తూరు :ప్రత్యేక హోదా విషయంలో తాను పోరాటం చేయడానికి సిద్ధమైనట్లు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇందుకు మూడు దశల్లో పోరాటం చేస్తానని, కాకినాడలో మొదటి మీటింగ్ ఉంటుందన్నారు. అధికార రాష్ట్ర ప్రభుత్వం..అధికార ఎంపీల..ప్రతిపక్ష పార్టీల ఎంపీల..బీజేపీ ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. 

16:49 - August 27, 2016

చిత్తూరు : పవన్ కళ్యాణ్...మళ్లీ ప్రజల ముందుకొచ్చాడు.. చాలా కాలం తరువాత తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ ఆవిర్భావం..రాజకీయాల్లో ఎంట్రీ..తదితర వాటిపై ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా..కేంద్రం ఇచ్చిన హామీలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే...

ఆచితూచి మాట్లాడుతా..
''నోటి నుండి వచ్చిన మాటను వెనక్కి తీసుకోలేం. ఏం మాట మాట్లాడినా ఆచి తూచి మాట్లాడుతా..దేశ సంపద యువత. 'జనసేన' పార్టీ పెట్టి రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు కావస్తోంది. రాజకీయాలు, పదవులపై నాకు వ్యామోహం లేదు. అభిమానుల ప్రేమ కావాలి. కోట్లు సంపాదిస్తాను..కోట్ల ట్యాక్స్ కడుతాను...సుఖంగా ఇంట్లో కూర్చొవచ్చు..మరి రాజకీయాలు ఎందుకు ? సమాజం..దేశం మీద బాధ..వ్యామోహం ఉంది. వర్తమాన రాజకీయాలు..రాజకీయ నాయకులు..యువతకు మేలు చేయకపోతే తనకు బాధ కలుగుతుంది. సినిమాలో చాలా చెబుతాం. రెండు గంటల్లో..అద్భుతాలు చెప్పవచ్చు. ఆస్తుల దానం..రౌడీలు..విలన్లను కొట్టవచ్చు. హీరోయిన్లతో పాటలు పాడవచ్చు..కానీ నిజ జీవితంలో ఇవన్నీ వీలు కావు. ఒక్కమాటలో చెప్పాలంటే రాందేవ్ బాబా టు మినిట్స్ నూడ్స్ లాగా సమస్యలు పరిష్కారం కావు.

మూడు విషయాలు మాట్లాడుతా..
మూడు విషయాలు మాట్లాడటానికి వచ్చాను. పార్టీ ఆవిర్భావం..రాజకీయాల్లో ఏమి ఎదుర్కొన్నా..టిడిపి ప్రభుత్వ పని తీరు ఎలా ఉంది ? నా అభిప్రాయం...రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన కాంగ్రెస్...అలాగే కేంద్ర ప్రభుత్వం మీద అభిప్రాయాన్ని వెల్లడిస్తా. తిరుపతిలోనే ఎందుకు మాట్లాడాలి.. గతంలో ఇక్కడి నుండే మాట్లాడడం జరిగింది. అందుకే ఇక్కడి నుండే మాట్లాడడానికి నిర్ణయించిన. మోడీ భజన చేయడానికి పార్టీ పెట్టారని కొందరు..టిటిడి తొత్తులాగా ఉన్నారని మరికొందరు..గబ్బర్ సింగ్ కాదు..రబ్బర్ సింగ్ ఇంకొందరు విమర్శలు చేశారు. మాటలు పడకుండా ఉంటామా..? తన జీవితం రాష్ట్రం..దేశం కోసం అంకితం చేస్తా...మోడీకి భజన చేయను. కొన్ని విమర్శలు సీపీఐ నేత నారాయణ కూడా చేశారు. వామపక్షాలు అన్నా..వారు చేసే పోరాటం అంటే గౌరవం. చేగువేరా అంటే ఇష్టం.

రిస్క్ లు ఎదుర్కొన్నా...
సినిమా అనేది వినోదంగా చూడాలి. సీరియస్ గా తీసుకోవాల్సినవసరం లేదు. నిజ జీవితంలో ఉండే సమస్యలను సీరియస్ గా తీసుకుంటా. ఇటీవలే అభిమాని వినోద్ హత్యకు గురికావడం కలిచివేసింది. గత ఎన్నికల్లో టిడిపి, బిజెపికి సహాయం చేశాను. దీనివల్ల అధికారంలోకి ఎవరూ వచ్చారో ఆలోచించడం లేదు. రిస్క్ లు ఎదుర్కొని రాజకీయాల్లోకి వచ్చాను. ప్రభుత్వ పనితీరులో కొన్ని తప్పులుంటాయి. కొన్నిసార్లు ఎత్తి చూపాను. రైతుల భూముల విషయంలో ప్రశ్నించిన. వెంటనే పవన్ కళ్యాణ్ చుట్టూ కులం ఉంది అన్నారు. కులం..మతం..ప్రాంతం అంటకడుతారా ? సంపాదకీయం రాసిన సంపాదకులతో మాట్లాడా. సహృదయంతో వారు మరలా రిపీట్ చేయలేదు.

బీజేపీలోకి రావాలన్నారు...
జాతీయ పార్టీలకు భవిష్యత్ ఉంది...ప్రాంతీయ పార్టీలకు ఛాన్స్ లేదు..బీజేపీకి రావాలని ఆపార్టీ అధిష్టానం కోరింది. తన పార్టీ జాతీయ శ్రేయస్సు కోరే పార్టీ. బీజేపీ పార్టీ సిద్ధాంతాలంటే గౌరవం.. ఉంది. కానీ ప్రత్యేక హోదా...విషయంలో మాట్లాడుతా. సీమాంధ్రులంటే చులకన..పౌరుషం లేని వారా ? వీరితో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆడుకొంటోంది ? సీమాంధ్రులకు దేశంపై ప్రేమ ఉంది. ఇచ్చిన మాట వెనక్కి తిప్పితే సీమాంధ్రుల పోరాటం..పౌరుషం చూస్తారు' 

కాంగ్రెస్ లాగే బీజేపీ..
గతంలో విభజన విషయంలో కాంగ్రెస్ ఎలా వ్యవహరించిందో బీజేపీ అలాగే వ్యవహరిస్తోంది. అప్పుడు ఎంపీలు ఎలా మాట్లాడుతున్నారో..ప్రస్తుతం బీజేపీ ఎంపీలు అలాగే మాట్లాడుతున్నారు. అప్పుడు ప్లీజ్ మేడం..అంటే ఇప్పుడే ప్లీజ్ సార్..అంటున్నారు. అందుకే ప్రత్యేక హోదా విషయంలో తాను పోరాటం చేయడానికి సిద్ధమయ్యా. ఇందుకు మూడు దశల్లో పోరాటం చేస్తా. కాకినాడలో మొదటి మీటింగ్ ఉంటుంది. అధికార రాష్ట్ర ప్రభుత్వం..అధికార ఎంపీలు..ప్రతిపక్ష పార్టీల ఎంపీలు....బీజేపీ ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందిస్తా. మూడో దశలో రోడ్ల మీదకు వస్తా..

వెంకయ్యది తప్పు...
ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగంపై అసహనం ఉంది. ఆయనంత రాజకీయ అనుభవం తనకు లేదు. కానీ విభజన సమయంలో ఎలాంటి పోరాటం చేశారో వెంకయ్య అలాగే ప్రస్తుతం కొనసాగించాలి. జాతి ప్రయోజనాలు వెనక్కి నెట్టే విధంగా మాట్లాడుతూ వెంకయ్య తప్పు చేస్తున్నారు. గో సంరక్షణ పేరిట రాజకీయాలు చేయవద్దు. గో సంరక్షణ పేరిట సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. బీజేపీ..ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఒక గోవు ఇవ్వండి..కార్పొరేట్స్ వారికి గో సంరక్షణ కార్యక్రమాన్ని అప్పగించుకొండి. కానీ గో సంరక్షణ పేరిట ప్రత్యేక హోదాను మాత్రం వెనక్కి నెట్టకండి.

ఎందుకు భయం..
హోదా విషయంలో ఎందుకు భయపడుతున్నారు. లొసులుగులున్నాయా ? సీబీఐ ని ప్రయోగిస్తారని భయమా ? హోదా విషయంలో ఎందుకు మాట్లాడుతలేరు. పార్లమెంట్ ను స్తంభింప చేయాలి. చేయండి. సిగ్గు..లేదా..సీమాంధ్రుల వారిని తాకట్టు పెట్టవద్దు. కేంద్రానికి ఎంపీలు ఎందుకు గులాంగిరి చేస్తున్నారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాడుతా. హమ్ లడేంగే..జీత్ నే తక్ లడేంగే..కేంద్ర ప్రభుత్వానికి ఇదే హెచ్చరిక' అని పవన్ తెలిపారు.

బీజేపీలోకి రావాలని కోరారు - పవన్..

చిత్తూరు : రాజకీయాల ప్రవేశం నుండి మొదలు కొంటే ప్రస్తుతం వరకున్న పరిస్థితులను సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ వ్యక్తీకరిస్తున్నారు. ఇందిరా మైదానంలో ఆయన ప్రసంగిస్తున్నారు. జాతీయ పార్టీలకు భవిష్యత్ ఉంది...ప్రాంతీయ పార్టీలకు ఛాన్స్ లేదు..బీజేపీకి రావాలని ఆపార్టీ అధిష్టానం కోరిందన్నారు. కానీ దీనిని తిరస్కరించడం జరిగిందని, తన పార్టీ జాతీయ శ్రేయస్సు కోరే పార్టీ అని..పార్టీ సిద్ధాంతాలంటే గౌరవం ఉందన్నారు.

 

కులం..మతం అంటకట్టారు - పవన్..

చిత్తూరు : తాను రిస్క్ లు ఎదుర్కొని రాజకీయాల్లోకి వచ్చానని సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరులో కొన్ని తప్పులుంటాయని, కొన్నిసార్లు ఎత్తి చూపానన్నారు. ఏపీలో రైతుల భూముల విషయంలో ప్రశ్నిస్తే తనకు కులం..మతం అంటకట్టారని తెలిపారు. కులం..మతం..ప్రాంతం అంటకడుతారా ? అని ప్రశ్నించారు. దీనిపై సంపాదకీయం రాసిన సంపాదకులతో మాట్లాడా. సహృదయంతో వారు రిపీట్ చేయలేదన్నారు. 

సినిమా అనేది వినోదంగా చూడాలి - పవన్..

చిత్తూరు : సినిమా అనేది వినోదంగా చూడాలని సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సీరియస్ గా తీసుకోవాల్సినవసరం లేదని అభిమానులకు పిలుపునిచ్చారు. నిజ జీవితంలో ఉండే సమస్యలను తాను సీరియస్ గా తీసుకుంటానని తెలిపారు. 

చేగువేరా అంటే ఇష్టం - పవన్..

చిత్తూరు : తనకు చేగువేరా అంటే ఇష్టమని సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందిరా మైదానంలో ఆయన ప్రసంగించారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో తనను కొందరు విమర్శలు గుప్పించారని, మోడీ భజన చేయడానికి పెట్టారని కొందరు..టిటిడి తొత్తులాగా ఉన్నారని..గబ్బర్ సింగ్ కాదు..రబ్బర్ సింగ్ అని అన్నారు. మాటలు పడకుండా ఉంటామా..? తన జీవితం రాష్ట్రం..దేశం కోసం అంకితం చేస్తా...ఈ మాటలు సీపీఐ నేత నారాయణ అన్నారని, వామపక్షాలు..వారు చేసే పోరాటం అంటే గౌరవమని తెలిపారు. 

రాజకీయాలు..పదవులపై వ్యామోహం లేదు - పవన్...

చిత్తూరు : జనసేన పార్టీ పెట్టి రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు కావస్తోందని, రాజకీయాలు, పదవులపై తనకు వ్యామోహం లేదని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తనకు అభిమానుల నుండి ప్రేమ కావాలని తెలిపారు. 

16:14 - August 27, 2016

చిత్తూరు : పవన్ కళ్యాణ్..సినీ నటుడు...ఆయనకు ఎంతో మంది అభిమానులున్నారు. గత ఎన్నికల్లో టిడిపి, బిజెపికి సపోర్టు ప్రకటించి కేంద్రంలో బీజేపీ, ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ కీలక పాత్ర పోషించారు. అనంతరం జనసేన పార్టీ స్థాపించారు. ప్రత్యేక హోదా..పోలవరం..ఇతరత్రా విభజన హామీలపై కేంద్రం, రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన స్పందించకపోవడంపై పలు విమర్శలు వచ్చాయి. 29 నెలల తరువాత తిరుపతిలోని ఇందిరా మైదానంలో తొలి భారీ సభ నిర్వహిస్తున్నారు. సందేశం..దిశా నిర్ధేశం..కార్యచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అభిమానులతో ఇందిరా మైదానం నిండిపోయింది. పార్టీ ఏర్పడిన అనంతరం తొలిసారిగా పవన్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం విశ్లేషించారు. జనసేన అధినేత నుండి ఎలాంటి నిర్ధిష్టంగా ప్రకటన వెలువడలేదనే సంగతి తెలిసిందేనని, ప్రస్తుతం రాజకీయంగా కీలకంగా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ప్రస్తుతం ఉన్న అవసరాలు..ఇతరత్రా వాటిపై పవన్ స్పందిస్తారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోందన్నారు. రాజకీయపరమైన అంశాలను విపక్ష పార్టీ వైఫల్యం చెందిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయని, ఈ నేపథ్యంలో జనసేన ఎలాంటి పాత్ర పోషించనుందా అనే ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయని తెలిపారు. రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు గాను ప్రజల్లోకి వెళుతారా అనేది చూడాలన్నారు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

తిరుపతికి చేరుకున్న పవన్..

చిత్తూరు : సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకున్నారు. కాసేపట్లో ఇందిరా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు.

15:58 - August 27, 2016
15:57 - August 27, 2016
15:54 - August 27, 2016

బయలుదేరిన పవన్..

చిత్తూరు : సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల నుండి తిరుపతికి బయలుదేరారు. కాసేపట్లో ఇందిరా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. 

అగ్రిగోల్డ్ పై హైకోర్టుకు సీఐడీ నివేదిక..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ సంస్థలపై బాధితులు వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అగ్రిగోల్డ్ కేసులో దర్యాప్తుపై సీఐడీ నివేదిక అందచేసింది. జ్యుడిషియల్ కమిటీకి రూ. 10 లక్షలను అగ్రిగోల్డ్ అందచేసింది. అక్షయ గోల్డ్ వద్ద రూ. 10 కోట్లు..2500 ఎకరాల భూమి ఉన్నట్లు హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణనను మంగళవారానికి వాయిదా వేసింది. 

15:40 - August 27, 2016
15:38 - August 27, 2016
15:35 - August 27, 2016
15:33 - August 27, 2016

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. భూ నిర్వాసితులు ఈ షాక్ తగిలించారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల బాటలోనే మేడిగడ్డ భూ నిర్వాసితులు నడుస్తున్నారు. ఒక్క సెంట్ భూమి కూడా ఇవ్వమని స్పష్టం చేస్తున్నారు. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో మేడిగడ్డ ప్రాజెక్టు కూడా ఉంది. దీనితో అక్కడి రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ విలువైన భూములు ఎక్కడ కోల్పోతామనే భయం వారిలో నెలకొంది. తమ విలువైన భూములు ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలని ? ప్రాణాలు పోయినా కూడా ఇవ్వమని వారు శనివారం మీడియా సమావేశంలో తేగేసి చెప్పారు. సూరారంలో అధికారులు నిర్వహించాలని భావించిన సర్వేను నిర్వాసితులు అడ్డుకున్నారు. విలువైన భూములు ప్రభుత్వానికి ఇచ్చి తాము నిరుపేదలుగా మారాలా ? అని నిలదీస్తున్నారు.
మల్లన్న సాగర్ విషయంలో 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాల్సి ఉంటే ప్రభుత్వం పలు జీవోలు జారీ చేస్తున్న సంగతి తెలిందే. దీనిపై విపక్షాలు, భూ నిర్వాసితులు పోరాటం చేపట్టారు. మల్లన్న సాగర్ నుండి ఈ ఆందోళన ప్రారంభమైంది. క్రమక్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. దీనిపై ప్రభుత్వం విపక్షాలపై విమర్శలు గుప్పిస్తోంది. ప్రస్తుతం మేడిగడ్డ భూ నిర్వాసితులపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

భూములివ్వమన్న మేడిగడ్డ భూ నిర్వాసితులు..

కరీంనగర్ : ప్రభుత్వానికి సెంటు భూమి కూడా ఇవ్వమని మేడిగడ్డ భూ నిర్వాసితులు ప్రకటించారు. కాసేపటి క్రితం మీడియాతో వారు మాట్లాడారు. ప్రాణాలు కోల్పోయినా సెంటు భూమి కూడా ఇవ్వమని స్పష్టం చేశారు. 

రేపు అనంతకు వెళ్లనున్న బాబు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాలో పరిస్థితులను తెలుసుకొనేందుక బాబు పర్యటించనున్నారు. 

15:12 - August 27, 2016

చిత్తూరు : సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించతలపెట్టిన సభలో ఆదిలోనే అపశృతి చోటు చేసుకుంది. ఇటీవలే హత్యకు గురైన అభిమాని వినోద్ కుటుంబాన్ని పవన్ పరామర్శించిన సంగతి తెలిసిందే. తిరుమలలోనే మకాం వేసిన పవన్ అకస్మాత్తుగా సభ నిర్వహించాలని తలపెట్టారు. ఇందుకు ఇందిరా మైదానాన్ని సిద్ధం చేశారు. కానీ మైదానం కెపాసిటీ ఏడు వేల మంది వరకు ఉండడం..అభిమానులు భారీగా తరలివస్తుండడంతో కొంత కలవరం రేపుతోంది. ఇదిలా ఉంటే శనివారం మధ్యాహ్నం సమయంలో మైదానంలో ఏర్పాటు చేసిన ఓ భారీ ఎల్ ఈడీ స్ర్కీన్ కుప్పకూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

పవన్ ప్రసంగంపై ఉత్కంఠ...
మరోవైపు మైదానానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. అసలు పవన్ ఏం ప్రసంగిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. పవన్ ఎలాంటి ప్రసంగం చేయనున్నారో తమకు కూడా తెలియదని, ఆయన చెప్పే దానిపై ఉత్కంఠగా ఎదరు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్క రోజు పిలుపుతో వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారని అభిమానులు పేర్కొన్నారు. కేవలం అభిమానులనుద్ధేశించి ప్రసంగిస్తారా ? లేక రాజకీయాలపై ప్రసంగిస్తారా అనే దానిపై తెలియరావడం లేదు. ఏమైనా ప్రత్యేక హోదా..పోలవరం..ఇతరత్రా అంశాలపై పవన్ మాట్లాడుతారని పవన్ అభిమానులు పేర్కొంటున్నారు. కేంద్రంపై నిరసన గళం వినిపించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కాసేపట్లో ఈ ఉత్కంఠకు తెరవీడనుంది. 

 • అభిమాని వినోద్ హత్య విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
 • గురువారం తిరుపతికి బయలుదేరారు. అక్కడ వినోద్ కుటుంబాన్ని పరామర్శించి తాను అండగా ఉంటానని వెల్లడించారు.
 • అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు. వినోద్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, అభిమానం వెర్రిగా మారొద్దని సూచించారు.
 • అనంతరం తిరుపతిలో ఓ గెస్ట్ హౌస్ లో పవన్ విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం పలుమార్లు శ్రీవారిని దర్శించుకున్నారు.
 • ఈ తరుణంలో జనసేన పార్టీ నేతలు, తన సన్నిహితులతో పవన్ సమావేశాలు నిర్వహించారు.
 • సభ నిర్వహించాలని అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారు.
 • ఇందుకు ఇందిరా మైదానాన్ని సెలక్ట్ చేశారు.
 • సభకు అనుమతినివ్వాలని పార్టీకి సంబంధించిన కీలక నేతలు పోలీసులను కోరారు.
 • సాయంత్రం 4 నుండి 5గంటల వరకు సభకు అనుమతినిచ్చారు.
 • పవన్ ప్రసంగం ఎలా ఉంటుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. 

పవన్ సభలో కూలిన భారీ స్ర్కీన్..

చిత్తూరు : ఇందిరా భవన్ లో పవన్ కళ్యాణ్ నిర్వహించతలపెట్టిన సభలో చిన్నపాటి అపశృతి చోటు చేసుకుంది. సభలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ ఈడీ స్ర్కీన్ కుప్పకూలింది. ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. 

15:00 - August 27, 2016

'త్రీ ఇడియన్స్' సినిమాతో 'అమీర్ ఖాన్', దర్శకుడు 'రాజ్ కుమార్ హిరానీ' ల ద్వయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఈ సెన్సేషన్ కాంబినేషన్ లో మరో మూవీ రాబోతున్నట్లు వినికిడి. అయితే ఈసారి వీరు సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ అమీర్ ఖాన్ తో రాజ్ కుమార్ హిర్వానీ చేస్తున్న ఆ సీక్వెల్ ఎంటీ ? 'అమీర్ ఖాన్', 'రాజ్ కుమార్ హిరానీ' కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం 'త్రీ ఇడియట్స్'. 2009లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు వందకోట్లు ఉన్న బాలీవుడ్ మార్కెట్ ని 'త్రీ ఇడియట్స్' 400కోట్లకు తీసుకెళ్లింది. ఇక రెండేళ్ల కిందట వీరి కాంబినేషన్ లో వచ్చిన 'పీకే' మూవీ ఏకంగా 500కోట్లను కొల్లగొట్టి గ్రేట్ సక్సెస్ అందుకుంది.

అమీర్ గ్రీన్ సిగ్నల్..
ఇలాంటి కాంబినేషన్ లో ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం రాబోతోంది. 'అమీర్ ఖాన్', 'రాజ్ కుమార్' మరో మూవీ చేయబోతున్నారు. అయితే ఈసారి వీరి కాంబినేషన్ లో రానున్న మూవీ సీక్వెల్ గా రూపొందనుందట. ఈ విషయాన్ని దర్శకుడు 'హిరానీ' స్వయంగా వెల్లడించాడు. ఈ మూవీ 'త్రీ ఇడియట్స్' కి సీక్వెల్ కావడం విశేషం. ఇటీవలే దర్శకుడు 'అమీర్' ని కలిసి స్టోరీ వినిపించడాంట. దీంతో స్టోరీకి ఫిదా అయిన 'అమీర్' ఓకే అంటూ సిగ్నల్ ఇచ్చాడట. 'త్రీ ఇడియట్స్' ని ముగ్గురు కాలేజీ కుర్రాళ్ల నేపథ్యంలో తెరకెక్కిస్తే, ఈ సీక్వెల్ ని మాత్రం ముగ్గురు నడి వయసు వ్యక్తుల మధ్య నడిచే స్టోరీగా ప్లాన్ చేశారట. పాత్ర విషయంలో బెస్ట్ రిజల్ట్ కోసం తప్పించే 'అమీర్' తో పని చేయడం ఎప్పుడు హ్యపీగా ఉంటుందని 'హిరానీ' చెబుతున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ గ్రేట్స్ హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్ ఈ సీక్వెల్ తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.  

సోనియా..రాహుల్ కు పాటియాల కోర్టు నోటీసులు...

ఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీకి పాటియాల కోర్టు నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నోటీసులు జారీ చేసింది. 

14:52 - August 27, 2016

కరీంనగర్ : గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. జిల్లాలోని కోనరావుపేట మండలంలోని గిరిజన ఆశ్రమ హాస్టల్ లో స్వామి అనే విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం హాస్టల్ గదిలోని కిటికీకి స్వామి ఉరి వేసుకుని మృతి చెంది ఉండడం కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్వామి ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని, ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. విద్యార్థి మృతిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆశ్రమ పాఠశాలపై దాడికి దిగారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీనితో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరి విద్యార్థి మృతికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. 

14:36 - August 27, 2016
14:33 - August 27, 2016

హైదరాబాద్ : ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ మరోసారి రోడ్డెక్కింది. ఫీజుల నియంత్రణపై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థులకు...తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్న ప్రైవేటు స్కూల్స్ మితిమీరి ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నోటికి నల్లబట్ట కట్టుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్లక్ష్యంగా టీసీలు ఇచ్చి బయటకు పంపుతున్నారని తెలిపారు. విద్యను వ్యాపారంగా మార్చి పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. 

14:29 - August 27, 2016

హైదరాబాద్ : జీఎస్టీ బిల్లుపై మంత్రి ఈటెల రాజేందర్ సమావేశం నిర్వహించారు. అసోచాం ప్రతినిధులు, ఆర్థిక శాఖ అధికారులతో ఈ సమావేశం జరిగింది. ఈనెల 31న ఢిల్లీలో ఆర్థిక మంత్రుల సమావేశంపై అభిప్రాయ సేకరణ జరిపారు. ఈసందర్భంగా మంత్రి ఈటెల మీడియాతో మాట్లాడారు. 30వ తేదీన సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించి..మద్దతు తెలిపి కేంద్రానికి పంపించే ఆస్కారముందన్నారు. ఫిక్కీ..సీఐఐ, అసోచమ్ లాంటి సంస్థలు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ చేయడం జరిగిందన్నారు. అనంతరం ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల మీటింగ్ ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల అభ్యంతరాలు తీసుకొనే అవకాశం ఉంటుందన్నారు. 

14:22 - August 27, 2016

బెంగాల్ లోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..

పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలో ఉన్న ముర్షిదాబాద్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఆసుపత్రిలో ఉన్న రోగులను బయటకు తరలిస్తున్నారు.

 

14:08 - August 27, 2016

చిత్తూరు : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి గళం విప్పడానికి రంగం సిద్ధమైంది. కాసేపట్లో ఇందిరా మైదానంలో ఆయన ప్రసంగం చేయనున్నారు. ఇటీవలే హత్యకు గురైన అభిమాని వినోద్ కుటుంబాన్ని పరామర్శించడానికి రెండు రోజుల క్రితం తిరుపతికి వచ్చిన పవన్ తిరుపతిలోనే మకాం వేశారు. అకస్మాత్తుగా బహిరంగ సభ నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం మూడు గంటలకు సభ ప్రారంభమౌతుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతారా ? అభిమానులకు ఏదైనా సందేశం ఇస్తారా ? అనేది తెలియడం లేదు. కాపులను బీసీల్లో చేర్చాలనే అంశంపై పవన్ మాట్లాడుతారా ? లేదా ? అనేది ఉత్కంఠ నెలకొంది.

 • సభకు సంబంధించిన అనుమతి కోసం పార్టీ కోశాధికారి రాఘవయ్య అర్బన్‌ ఎస్పీ జయలక్ష్మిని కోరారు.
 • సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే పవన్‌ సమావేశానికి అనుమతి ఇచ్చారు.
 • బహిరంగ సభ వేదికపై పవన్‌ ఒక్కరే ఉండి గంటపాటు జనసేన కార్యకర్తలకు, అభిమానులకు దిశానిర్ధేశం చేయనున్నారు.
 • మూడు గంటలకు తిరుమలలో బయలుదేరి సభాస్థలికి పవన్ చేరుకోనున్నారు.
 • 4-5 గంటల వరకు ఈ సభ ఉంటుందని తెలుస్తోంది.
 • పవన్ సభ నిర్వహణకు గల కారణమేంటో ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటన విడుదల కాకపోవటం విశేషం.
 • దీంతో పలువురు పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
 • దీనిపై ఉత్కంఠ వీడాలంటే సాయంత్రం నాలుగు గంటలవరకూ వేచి చూడాల్సిందే.

దీనిపై అభిమానులు ఇంకా ఏమన్నారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి..

హైకోర్టులో ఎఫ్ఎన్ సీసీకి చుక్కెదురు...

హైదరాబాద్ :హైకోర్టులో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కు చుక్కెదురైంది. ఎఫ్ఎన్ సీసీని తెరిచేందుకు కోర్టు నిరాకరించింది. జెఎన్టీయూ ఎత్తిచూపిన లోపాలను మూడు నెలల్లోపు సరిదిద్దుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల తరువాత జేఎన్టీయూ కమిటీ మరోసారి పరిశీలించాలని సూచించింది. అంతవరకు మరమ్మత్తులు చేసుకొనేందుకు ఎఫ్ఎన్ సీసీకి అనుమతినిచ్చింది. 

చేవెళ్ల ఇన్ స్పెక్టర్ సస్పెండ్...

హైదరాబాద్ : చేవెళ్ల ఇన్ స్పెక్టర్ ఉపేందర్ ను ఐజీ నాగిరెడ్డి సస్పెండ్ చేశారు. న్యాయం కోసం వచ్చిన బాధితులపై ఉపేందర్ వేధించినట్లు ఆరోపణలున్నాయి. నయీం కేసులో ఫిర్యాదు చేయడానికి బాధితులు వచ్చినట్లు తెలుస్తోంది. 

రేపు నగరానికి సచిన్..

హైదరాబాద్ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రేపు నగరానికి రానున్నారు. ఒలింపిక్ బ్యాడ్మింటెన్ రజత పతక విజేత పీవీ సింధుకు బీఎండబ్ల్యూ కారును సచిన్ అందచేయనున్నారు. గోపిచంద్ అకాడమీలో ఉదయం 9.30గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. 

కేసీఆర్ భాష బాగాలేదు - షబ్బీర్...

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మాట్లాడిన భాషా బాగాలేదని టి.కాంగ్రెస్ నేత షబ్బీర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు డబ్బు అహంకారం పెరిగిందని, సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎంకు దమ్ముంటే తమను జైల్లో కూర్చొబెట్టాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజలు పాటు పెట్టాలని, ఏడాదికి 18 రోజులే సభ నడుపుతున్నారని విమర్శించారు. తాము అధికారంలో ఉన్న సమయం లో 50 రోజులు సభను నిర్వహించడం జరిగిందన్నారు. 

బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి..

హైదరాబాద్ : బీజేఎల్పీ నేతగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కార్యాలయానికి విచ్చేసిన కిషన్ రెడ్డి గణపతి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కర్నూలులో రైతుల ఆందోళన..

కర్నూలు : ఉల్లికి మద్దతు ధర కల్పించాలని కోరుతూ కర్నూలులో రైతులు ఆందోళన చేపట్టారు. ఉల్లి ధర రూ. 100 నుండి 300 రూపాయలలోపు ధర ఉండడంతో ఆగ్రహించిన రైతులు రోడ్లపై ఉల్లిపాయలు పారపోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

 

గుజరాత్ లోనూ భూకంపం..

గుజరాత్ : గుజ‌రాత్‌లోనూ భూకంపం వ‌చ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ఉదయం మూడు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. కొద్దిసేపటికే గుజరాత్ లో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.8 తీవ్రత నమోదైంది. పోరుబందర్‌, జునాగఢ్‌, కచ్‌ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభ‌వించాయి. 

13:51 - August 27, 2016

హైదరాబాద్ : 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయాలంటూ అమాత్యుల ఆదేశాలు..అందుకు తగ్గట్లే పనులు చేస్తున్నామని నివేదికలతో బల్దియా అధికారుల హడావుడి..క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే జీహెచ్‌ఎంసీ అధికారులది ఆర్భాటం తప్ప యాక్షన్‌ లేదన్నది బహిరంగ రహస్యం..కాంట్రాక్టర్‌కు జబ్బుచేసినా పనులు ఆపేస్తున్నారు. ఈ ఆరోపణలకు బతుకమ్మకుంట పార్క్ ప్రహరి గోడ నిర్మాణమే నిలువెత్తుసాక్ష్యంగా నిలుస్తోంది.

డబ్ల్యూఎల్ సీసీఎస్ అనే ఏజెన్సీతో జీహెచ్ ఎంసీ ఒప్పందం
మాటలు కోటలు దాటుతున్నా పనులు గడప దాటడం లేదన్న చందంగా మారింది జీహెచ్‌ఎంసీ పరిస్థితి. యాక్షన్‌ ప్లాన్‌తో గ్రేటర్ హైదరాబాద్‌ స్వరూపాన్నే మార్చేస్తాం..విశ్వనగరానికి బాటలు వేస్తామంటూ బీరాలు పలుకుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బాగ్‌ అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంటలో 3921 చదరపు గజాల స్థలం పార్కు ఏర్పాటుకు కేటాయించారు. స్థలం అన్యాక్రాంతం కాకుండా చుట్టూ ప్రహరి గోడ నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ 20 లక్షల రూపాయలు కేటాయించింది. 2014 మార్చిలో జనప్రియా డబ్ల్యూఎల్ సీసీఎస్ అనే ఏజెన్సీతో ఒప్పందం చేసుకుంది. ప్రహరిగోడ నిర్మాణ పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు.

బతుకమ్మకుంట పార్కు ప్రహరి నిర్మాణంలో అంతులేని జాప్యం
బతుకమ్మకుంట పార్కు ప్రహరి గోడ నిర్మాణ పనులు 3 నెలల్లో పూర్తి కావాల్సి ఉన్నా...30 నెలలు దాటినా అతిగతిలేదు. చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్‌ మధ్యలోనే పనులను ఆపేశారు. చేసిన పనులకు 8 లక్షల బిల్లులు కూడా బల్దియా చెల్లించింది. పనులు పూర్తి చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా అదిగో ఇదిగో అంటూ కాలం వెల్లిబుచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్‌ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే పనులు ఆగిపోయాయని సమాధానమిచ్చారని ఆక్రోశిస్తున్నారు.

తిరిగి అలసిపోయామంటున్న బతుకమ్మకుంట వాసులు
బల్దియా అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయామని బతుకమ్మకుంట కాలనీ వాసులు చెబుతున్నారు. ఫైల్‌ దొరకడం లేదని కొన్నాళ్లు..ఫైల్‌ తెచ్చి ఇచ్చినా చలనం లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు.

కాంట్రాక్టు రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలుస్తామంటున్న అధికారులు
మరోవైపు పనుల జాప్యానికి కారణాలేంటని సదరు ఇంజనీర్‌ను అడిగితే.. కాంట్రాక్టర్‌కు సుస్తీ చేయడం వల్లే అంటూ కూల్‌గా సమాధానమిచ్చారు. పాత కాంట్రాక్టు రద్దు చేసి కొత్త టెండర్లు పిలుస్తామని చెప్పుకొస్తున్నారు. వందరోజుల్లో 350 ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో ప్రహరిగోడలు నిర్మిస్తామని బల్దియా కమిషనర్‌ ప్రకటించారు. చిన్న ప్రహరిగోడ నిర్మాణానికే రెండున్నరేళ్లు పడితే..భారీ ప్రహరిగోడల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.  

13:39 - August 27, 2016

హైదరాబాద్ : సింగరేణిలో కార్మికుల హక్కులు హరించబడుతున్నాయా? నల్ల బంగారాన్ని వెలికితీసే కార్మికశక్తిని అడ్డుకుంటున్నారా? నిరసన గళాన్ని నొక్కే ప్రయత్నం జరుగుతుందా ? గుర్తింపు సంఘం గెలుపే లక్ష్యంగా వెన్నుదన్నుగా ఉంటూ మద్దతు ఇస్తున్నది ఎవరు? నల్ల చట్టాలు ప్రయోగిస్తున్నది ఎవరు? వాచ్‌ దిస్‌

ఉపాధినిస్తున్న సింగరేణి సంస్థ..
ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఎంతో మందికి ఉపాధినిస్తున్న సంస్థ సింగరేణి. బొగ్గు వెలికితీతలో ఎన్నో రికార్డులు తిరగరాసి అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు తమ శ్రమతో సింగరేణి అభివృద్ధికి బాటలు వేసిన కార్మికులకు స్వేచ్చా స్వాంత్రంత్యం..నిరసన గళాన్ని వినిపించే హక్కులు కాలరాయబడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. గతంలో సింగరేణి అంటే కార్మిక సంఘాలకు పెట్టని కోటగా ఉండేది. కార్మిక వ్యతిరేక విధానాలపై కదం తొక్కేవారు. శ్రమజీవులను చైతన్యం చేసేవారు. యజమాన్యం మొండికేస్తే సమ్మె సైరన్‌ మోగించేవారు. సింగరేణిని నష్టాల ఊబి నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చింది కార్మికులే అన్న విషయాలను ప్రస్తుత యాజమాన్యం మరిచి పోయిందని కార్మికసంఘాలు ఆరోపిస్తున్నాయి. సంస్కరణల పేరుతో కార్మికులకు అండగా ఉంటున్న సంఘాల ఉనికి లేకుండా చేశాయన్న వాదనలున్నాయి. 1996 నుండి సింగరేణి గుర్తింపు సంఘాల పేరుతో పోరాడే సంఘాల ఉనికి లేకుండా చేశాయంటున్నారు. 1995లో 74 కార్మిక సంఘాలు ఉండగా..ప్రస్తుతం వాటి సంఖ్య 14కు పడిపోయింది. 5 జాతీయ సంఘాలతో పాటు ప్రాంతీయ సంఘం తప్ప మరే సంఘాలకు మనుగడ లేకుండా పోయింది.

కార్మికుల గొంతు నొక్కేలా నల్ల చట్టాలు అమలు..
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..కార్మికుల గొంతు నొక్కేలా నల్ల చట్టాలు అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంస్థకు వ్యతిరేకంగా మట్లాడిన వారిపై కోడ్ ఆఫ్‌ డిసిప్లేన్ పేరుతో చార్జీషీట్లు, మెమోలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కార్మికులకు బాసటగా నిలిచే కార్మిక సంఘాల నాయకులపై యాజమాన్యం బదిలీ వేటు వేస్తుందట. మరోవైపు ప్రయివేటికరణ చేయడానికి కుట్రజరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా శ్రీధర్ బాధ్యతలు చేపట్టిన తరువాత సింగరేణిలో కొత్త చట్టాలు తెరపైకి వస్తున్నాయి. సమ్మెలు, ధర్నాలు, ఆందోళనలు చేయకుండా అడ్డుకుంటున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా రామగుండం రీజియన్‌లో సీఐటీయూ చేపట్టిన ప్రచారసభలో.. సింగరేణి యాజమాన్య అనుయాయులు సృష్టించిన గందరగోళం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఈ సభలో కార్మికులు పాల్గొనకుండా విశ్వప్రయత్నాలు చేశారు. సభకు హాజరైన కార్మికుల విజువల్స్ రికార్డు చేయడం..వక్తల మాటలు వినిపించకుండా పక్కనే వేరే మైకులో భారీ శబ్దాలు వినిపించేలా చేశారు.

కార్మిక సంఘాల నాయకులపై బదిలీ వేటు
సింగరేణి యాజమాన్యం అవలంబిస్తున్న తీరుపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పద్దతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి కార్మికుల స్వేచ్ఛను హరించకుండా..వారి హక్కులు కాపాడేలా వ్యవహరించాలని వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  

13:35 - August 27, 2016

'బాహుబలి' తెలుగు పరిశ్రమ కనీవిని ఎరుగని స్థాయిలో విజయం సాధించింది. అయితే ఇప్పుడు 'బాహుబలి 2' శాటిలైట్ రైట్స్ ఇండియన్ మూవీస్ లో న్యూ హిస్టరీ క్రియేట్ చేసినట్లు టాక్. ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉన్న 'బాహుబలి ది కంక్లూజన్' శాటిలైట్ రైట్స్ రేట్ తెలుసుకోవాలంటే చదవండి..'బాహుబలి' తెలుగు పరిశ్రమ కలలో కూడా ఊహించని విజయం సాధించింది. వందకోట్లు కలెక్ట్ చేస్తే చాలనుకుంటే ఏకంగా 500 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ సినిపండితులను సైతం అబ్బురపరిచింది. ఒక్క బాలీవుడ్ స్టార్ హీరోలకి సమానంగా 'బాహుబలి' అక్కడ 100కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటే ఈ మూవీ రేంజ్ లో విజయవిహారం చేసిందో అర్ధం చేసుకోవచ్చు.

55కోట్లకు డీల్ ? 
'బాహుబలి'కి రెండో పార్ట్ గా 'బాహుబలి ది కంక్లూజన్' రూపొందుతోంది. ఇంకా షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ఇండియన్ మూవీ హిస్టరీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసినట్లు టాక్. హిందీ వెర్షన్ శాటిలైట్ హక్కులను తమకి ఇవ్వమంటూ జీఈసీ ఛానల్ వారు 50 కోట్లను ఆఫర్ చేశారట. అయితే నిర్మాతలు మరో 10 కోట్లు డిమాండ్ చేయగా, 55 కోట్లకి డీల్ కుదిరినట్టుగా వినికిడి.
బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల శాటిలైట్స్ సైతం 20కోట్లకు మించడం లేదు. అలాంటిది 'బాహుబలి2' చిత్రానికి 55కోట్ల శాటిలైట్ పలకడం ఇప్పుడు ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో వెరీ స్పెషల్ గా మాట్లాడుకొంటోంది. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం క్లైమాక్స్ ని రాజమౌళి ఏకంగా రెండు నెలల పాటు నిర్విరామంగా చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ హిందీ వెర్షన్ హక్కులను మళ్లీ కరణ్ జోహార్ కే ఇచ్చినట్లు సమాచారం. 

13:30 - August 27, 2016

తిరుపతి: జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ నేటి సాయంత్రం తిరుపతిలో సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు పవన్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. అయితే ఈ సభలో పవన్ ఏం మాట్లాడతారనే అంశంపై ఇప్పటికీ ఉత్కంఠ వీడటంలేదు. దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు అభిమానుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ..ఉద్వేగం,ఆసక్తి నెలకొంది. కాగా ఎక్కువమంది అభిమానులు మాత్రం ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేకహోదాపై పవన్ కళ్యాణ్ మాట్లాడాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాలని కోరుకుంటున్నారు. పవన్ ఇచ్చే పిలుపుకోసం అభిమానులు ఉద్వేగంతో ఎదురు చూస్తున్నారు. ఆయన ఇచ్చే పిలుపుకోసం రాష్ట్ర సమస్యలపై పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా వున్నామని అభిమానులు పేర్కొంటున్నారు. ఏ వర్గాన్ని గానీ, ఏ పార్టీని గానీ టార్గెట్ చేసిన మాట్లాడాలని తాము కోరుకోవటం లేదనీ..రాష్ట్ర ప్రయోజనాలకోసం మాట్లాడాలనీ...డిమాండ్ చేయాలని కోరుకుంటున్నట్లుగా అభిమానులు తెలిపారు. ఏది ఏమైనా పవన్ మాటకోసం.. పిలుపుకోసం..అభిమానలు తీవ్ర ఉద్వేగంతో ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి పవన్ అభిమానులకు దిశానిర్ధేశం చేస్తారా? పిలుపినిస్తారా? ప్రశ్నిస్తారా? అలరిస్తారా? వంటి పలు ప్రశ్నలు వేయికళ్ళతోఎదురు చూస్తున్నారు.

అభిమాని కుటుంబాన్ని పరామర్శించిన పవన్
ఇటీవల కర్ణాటక కోలార్‌లో అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన వినోద్‌ రాయ్‌ కుటుంబాన్ని పరామర్శించి తిరుమలకు చేరుకన్న పవన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తనను చూసేందుకు ఉత్సాహం చూపిన అభిమానులకు అభివాదం చేశారు. మొత్తానికి జనసేనాని మళ్లీ జనంలోకి రావడంతో కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. పవన్‌ పార్టీ ప్రజలకు చేరువ చేసే ఈ ప్రయత్నం సఫలమవుతుందన్న భావన అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

చర్చనీయాంశంగా పవన్ సభ..
తిరుమల సుబ్బిరామిరెడ్డి అతిథి గృహంలో పవన్‌ తన సన్నిహితులతో మంతనాలు జరిపారు. సభ ఏర్పాటుపై చర్చించారు. ఈ సభావేదిక పై నుంచి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, విభజన హామీలపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై పవన్‌ నిరసన గళం వినిపిస్తారా... లేక పార్టీ కార్యకర్తలు, అభిమానులకు దిశానిర్దేశం చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.

13:17 - August 27, 2016

ముల్తానా మట్టి బ్యూటీ పరిశ్రమలో వాడుతుంటారు. ఇది ఒక రకమైన మట్టి. దీనిలో మెగ్నీషియం, క్వార్ట్జ్, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్ మరియు డోలమైట్ తో సహా వివిధ రకాల ఖనిజాలు ఉన్నాయి. చర్మ సౌందర్యాన్ని పెంచే ముఖ్య సాధనాల్లో ఒకటిగా నేడు చలామణి అవుతోంది. దీనితో చర్మ సౌందర్యాన్ని పెంచే మంచి గుణాలున్నాయి. మరి దీనితో చర్మం మెరుపు ఎలా వస్తుందో చూద్దామా...
పొడి చర్మం ఉన్న వారు మట్టిలో చెంచా తేనె, ఒక చెంచా బాదం నూనె, అర చెంచా మీగడ, గులాబీ నీరూ కలిపి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకోవాలి. పూర్తిగా ఆరకుండానే శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగిన తేమ అందిస్తుంది.
ముల్తానా మట్టి, క్యారెట్ గుజ్జు, ఆలివ్ ఆయిల్ మూడింటిని సమాన భాగాలుగా తీసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చల మీద రాయాలి. 20 నిమిషాల అనంతరం శుభ్రంగా కడుక్కోవాలి. వారంలో ఒకసారి..లేదా రెండుసార్లు చేస్తే మచ్చలు దూరమవుతాయి.
చర్మం సాగినట్లు అనిపిస్తున్న వారికి అరకప్పు ముల్తాని మట్టి, కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా ఓట్స్, రెండు చెంచాల టమాట గుజ్జులను తీసుకోవాలి. ఈ మిశ్రమాలన్నింటినీ మెత్తగా కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఓ పావు గంట ఆగిన తరువాత శుభ్రం చేసుకోవాలి. తరువాత ముఖానికి బాదం నూనె రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.
ముల్తానా మట్టి, రోజ్ వాటర్, గంధం పొడి సమాన మొత్తాలలో తీసుకుని కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. సహజంగా ఆరిపోయిన అనంతరం గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. 

మహా ఒప్పందంపై హర్షం వ్యక్తం చేసిన ఒవైసీ..

హైదరాబాద్ : మ‌హారాష్ట్ర‌తో మూడు ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న అంశంపై ఎంఐఎం పార్టీ చీఫ్, హైద‌రాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈరోజు స్పందిస్తూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తెలంగాణ స‌ర్కారుని అభినందిస్తున్న‌ట్లు తెలిపిన ఆయ‌న‌, 2019 నాటికి గోదావ‌రి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలని అన్నారు. గోదావ‌రి నీటి వాడ‌కంపై గ‌తంలో ఒప్పందాలు లేవ‌ని కాంగ్రెస్ నేత‌ జానారెడ్డి అన్నారని ఒవైసీ చెప్పారు. ఈ విష‌యాన్ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి గుర్తుంచుకోవాలని ఆయ‌న సూచించారు.

జీఎస్టీ బిల్లుపై మంత్రి ఈటెల సమావేశం..

హైదరాబాద్: జీఎస్టీ బిల్లుపై మంత్రి ఈటల రాజేందర్ సమావేశం నిర్వహించారు. అసోచాం ప్రతినిధులు, ఆర్థిక శాఖ అధికారులతో మంత్రి సమావేశం కొనసాగింది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై మంత్రి సమాలోచనలు చేసినట్టు సమాచారం. ఈనెల 31న ఢిల్లీలో ఆర్థిక మంత్రుల సమావేశంపై అభిప్రాయ సేకరణ జరుపనున్నారు.

12:50 - August 27, 2016

హైదరాబాద్ : మాదాపూర్‌..హైటెక్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఎయిర్‌టెల్‌ 5కె రన్‌ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ మారథాన్‌లో ఐదు వేల మంది నగరవాసులు పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్యం పట్ల నగరవాసులు శ్రద్ధ కనబరుస్తున్నారని..రేపు జరగబోయే 10కే..ఫుల్‌..హాఫ్‌..మారథాన్‌లలో కూడా పదివేల రన్నర్లు పాల్గొంటారని జయేష్‌ రంజన్‌ అన్నారు. 

12:48 - August 27, 2016

గుంటూరు : పవన్‌ కళ్యాణ్‌ పోలవరం, ప్రత్యేకహోదా, విభజనహామీలపై మాట్లాడితే స్వాగతిస్తామన్నారు మంత్రి ప్రత్తిపాటి. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకహోదా కోసం పోరాడుతోందని..హోదాపై పోరాటానికి పవన్‌ కలిసివస్తే బాగుంటుందని అన్నారు. ఏపీ తాత్కాలిక సచివాలయంలో వ్యవసాయశాఖ నూతనకార్యాలయాన్ని మంత్రి ప్రత్తిపాటిపుల్లారావు ప్రారంభించారు. నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని.. రాష్ట్ర ప్రజలందరికీ వ్యవసాయశాఖ అందుబాటులో ఉంటుందని చెప్పారు.  

12:46 - August 27, 2016

ఢిల్లీ : కాశ్మీర్లో కొనసాగుతున్న కల్లోల పరిస్థితిపై ప్రధాని ఆవేదన వ్యక్తంచేశారని సీఎం ముఫ్తీ మెహబూబా పేర్కొన్నారు. కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు పీడీపీ - బీజేపీ కృషిచేస్తుందని తెలిపారు. కాశ్మీర్ సమస్యను త్వరలో పరిష్కరించేందుకు కేంద్రం చొరవతీసుకోవాలని కోరారు. కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించేలా పాకిస్థాన్‌ కుట్ర చేస్తోందని ముఫ్తీ విమర్శించారు.

12:34 - August 27, 2016

అనంతపురం : తపోవనం కాలనీలో బాంబు పేలుడు ఘటన కలకలం సృష్టించింది. శనివారం ఉదయం చెత్తకుప్పలో పేలుడు సంభవించటంతో చెత్త ఏరుకునే కమలమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాజుముక్కలు శరీరంలోకి దూసుకెళ్లి మహిళకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసుల కథనం ప్రకారం చూస్తే చెత్తబకుప్పలో వున్న ఓ యాసిడ్ తో వున్న ఓ గాజు బాటిల్ పేలటంతోనే ఈ పేలుడు జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో మహిళలకు కుడి చేయి..మొహం గాయపడినట్లుగా తెలుస్తోంది. 

12:16 - August 27, 2016

హైదరాబాద్ : పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని ఒలంపిక్ మెడల్ విజేత పీ.వి సింధు దర్శించుకున్నారు. లాల్‌దర్వాజ ఆలయకమిటీ సింధూకు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి సింధు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు . సింధూను ఆలయకమిటీ ఘనంగా సత్కరించింది. 

12:11 - August 27, 2016
12:04 - August 27, 2016

హైదరాబాద్ : మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విపక్షాలు  విమర్శిస్తున్న విషయం తెలిసిందే..ఈ ఒప్పందంతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై టీఆర్ఎస్ ఎంపీ కవిత స్పందించారు. వర్క్ లేని ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అని ఆమె ఎద్దేవా చేశారు . తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై విపక్షాలు విమర్శించటం కాదనీ..రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రతిపక్షాలకు కనీస అవగాహనలేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌విస్‌కి ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతోనే ప్రాజెక్టులకు ఆటంకాలు తొలగాయన్నారు. ప్రాజెక్టుల విషయంలో పట్టువిడుపులతో సీఎం ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రతో ఒప్పందంతో సీఎం కేసీఆర్ సాధించిదేమీలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడిగా మారుతుందన్నారు. తమ రాష్ట్రంతో పాటు ఆంధ్ర‌, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర బాగుండాల‌నేదే కేసీఆర్ కోరుకుంటార‌ని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి నేషనల స్టేటస్ తీసుకువచ్చి ఆ తురువాత బీజేపీ నేతలు మాట్లాడాలనీ.. మేం పెళ్లి చేస్తే మీరు వచ్చి బాజాలు కొట్టుడు కాదనీ బీజేపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

'భమరావతి' బుక్ లెట్ ను విడుదల చేసిన ఉండవల్లి ..

తూర్పుగోదావరి : నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు చెబుతున్న ప్రతి మాటా అబద్దమేనని ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. అమరావతిపై తాను రాసిన 'భమరావతి' బుక్ లెట్ ను ఈ ఉదయం విడుదల చేసిన ఆయన ప్రసంగించారు. అనేక వివాదాలకు అమరావతి కేంద్ర బిందువు అయిందని ఆయన అన్నారు. కేంద్ర కమిటీ రాజధాని నిర్మాణంపై సిఫార్సులు ఇవ్వకముందే నిర్మాణాలు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. తాను అనేక వర్గాలు, సంస్థల నుంచి సమాచారాన్ని సేకరించి ఈ బుక్ లెట్ తయారు చేశానని చెప్పారు.

నకిలీ నెయ్యి తయారీ కేంద్రం సీజ్..

హైదరాబాద్: నకిలీ నెయ్యి తయారీ కేంద్రాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన నగరంలోని గోల్కొండలో గల తులసీరాంగనర్‌లో చోటుచేసుకుంది. కల్తీ నెయ్యి తయారీపై సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ సర్కిల్-9బి అధికారుల కంపెనీపై దాడిచేసి సోదాలు జరిపారు. ఈ సందర్భంగా నకిలీ నెయ్యిని గుర్తించిన అధికారులు కంపెనీని సీజ్ చేశారు. రూ. 5 వేలు జరిమానా విధించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

తండ్రి అయిన షాహిద్ కపూర్..

ముంబై : బాలివుడ్‌ నటుడు షాహిద్‌కపూర్‌ తండ్రి అయ్యారు. షాహిద్‌ సతీమణి మీరా రాజ్‌పుత్‌ ముంబయిలోని హిందుజా హెల్త్‌కేర్‌ ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం పాపకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను షాహిద్‌ తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

11:26 - August 27, 2016

శాసన మండలి చీఫ్ విప్ గా సుధాకర్ రెడ్డి..

హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ గా సుధాకర్ రెడ్డి..విప్ లుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, బి.వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. దీనిపై మరికొద్ది సేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. 

ఎన్ కౌంటర్ లో 4గరు ఉగ్రవాదులు హతం..

బంగ్లాదేశ్ : శనివారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఢాకా శివార్లలోని నారాయణ్ గంజ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారంతో సైన్యం, భద్రతాదళాలు సోదాలకు దిగగా, వారిని చూసిన ముష్కరులు కాల్పులకు దిగారు. భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో నలుగురు హతమైనట్టు అధికారులు తెలిపారు. ఢాకాలోని కేఫ్ పై గత నెలలో జరిగిన ఉగ్ర దాడి ఘటనలో కీలక సూత్రధారి, కెనడా పౌరుడు తమీమ్ అహ్మద్ చౌధురి మరణించిన వారిలో ఉన్నాడని పేర్కొన్నారు. ఢాకా ఘటనలో 22 మంది మరణించిన సంగతి తెలిసిందే.

చెత్తకుండీలో పేలుడు..మహిళకు గాయాలు..

అనంతపురం : అనంతపురం తపోవనం కాలనీలో బాంబు పేలుడు ఘటన కలకలం సృష్టించింది. శనివారం ఉదయం చెత్తకుప్పలో బాంబుపేలి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాజుముక్కలు శరీరంలోకి దూసుకెళ్లి మహిళకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జనసభకు ఇందిరా స్టేడియం సిద్ధం..

తిరుపతి : పవన్ కళ్యాణ్ సభకు ఇందిరా స్టేడియం సర్వం సిద్ధమైంది. కాగా ఇందిరా స్టేడియం సామర్థ్యం 7వేలు మాత్రమే కాగా భారీగా తరలివస్తే పరిస్థితి ఏంటనే సందిగ్థంలో నిర్వాహకులు వున్నట్లుగా తెలుస్తోంది. స్టేడియం సామర్థ్యంపై పోలీసులు కలవరపడుతున్నారు. 

కొత్తజిల్లాల ఏర్పాటుపై ఫిర్యాదుల వెల్లువ..

హైదరాబాద్ : కొత్తజిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఫిర్యాదుల పోర్టల్ ఏర్పాటు చేసింది. దీనికి భారీగా స్పందన వచ్చింది. పోర్టల్ ఇప్పటివరకూ 5,599 ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లా ఏర్పాటుపై 778 ఫిర్యాదలు అందగా...వనపర్తి జిల్లాపై 636 , హన్మకొండపై 534,జగిత్యాల రెవెన్యూ డివిజన్ విషయంలో అత్యధికంగా 1,161 ఫిర్యాదులు అందాయి.

ప్రధానితో భేటీ అయిన కశ్మీర్ సీఎం ముఫ్తీ..

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీతో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శనివారం సమావేశమయ్యారు. కశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లపై ప్రదానితో మెహబూబా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బుర్హాన్‌ వానీ ఎన్‌కౌంటర్‌ తర్వాత చెలరేగిన అల్లర్లతో శ్రీనగర్‌లో గత 50రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌ అల్లర్లు మొదలైన తర్వాత కశ్మీరు సీఎం మెహబూబా ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి.

 

కశ్మీర్ అల్లర్ల నిందితులు గుర్తింపు..

జమ్ము కశ్మీర్ : దాదాపు రెండు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న కశ్మీర్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం చివరి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆందోళనలను రెచ్చగొడుతున్న 400 మంది స్థానిక నేతలను గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థలు ఆ జాబితాను కశ్మీర్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించాయి. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద వారిని అదుపులోకి తీసుకోవాలని కోరాయి. 

10:48 - August 27, 2016

తూర్పుగోదావరి: అమలాపురంలో ఎమ్మెల్యే ఆనంద్‌రావు ఇంటి ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు... కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు.. మంటల్ని ఆర్పివేసిన పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు..... ఎర్రవంతెన దగ్గర ఆక్రమణల తొలగింపుకు నిరసనగా బాధితుడు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడని తెలుస్తోంది.. 

10:46 - August 27, 2016

తిరుపతి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తిరుపతి ఇందిరా మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సభలో పవన్ ఏం మాట్లాడతారనే అంశంపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సభకు సంబంధించిన అనుమతి కోసం పార్టీ కోశాధికారి రాఘవయ్య అర్బన్‌ ఎస్పీ జయలక్ష్మిని కోరారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే పవన్‌ సమావేశానికి అనుమతి ఇచ్చారు. బహిరంగ సభ వేదికపై పవన్‌ ఒక్కరే ఉండి గంటపాటు జనసేన కార్యకర్తలకు, అభిమానులకు దిశానిర్ధేశం చేయనున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను చూసుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక బృందం శుక్రవారం తిరుపతికి వచ్చింది. కాగా సభలో పవన్ కళ్యాణ్ ఏ అంశంపై మాట్లాడనున్నారోనని అభిమానులు, రాజకీయనేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పవన్ సభ నిర్వహణకు గల కారణమేంటో ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటన విడుదల కాకపోవటం విశేషం..దీంతో పలువులు పలురకాలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  దీనిపై ఉత్కంఠ వీడాలంటే సాయంత్రం నాలుగు గంటలవరకూ వేచిచూడాల్సిందే. కాగా పవన్ కళ్యాణ్ ఏది చేసిన పలు సంచలనాలకు దారితీస్తూన్న విషయం  తెలిసిందే.

శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్..
జనసేన నాయకుడు..హీరో పవన్‌కల్యాణ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తనను చూడడానికి వచ్చిన అభిమానులకు ఆయన అభివాదం చేశారు. ఈరోజు సాయంత్రం తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. ఈ అంశంపై మరింత సమచారం కోసం ఈ వీడియో చూడండి..

గ్యాంగ్ స్టర్ కి ఓ ఛానల్ ?!..

హైదరాబాద్ : రాజకీయంగా ఆధిపత్యం చెలాయించాలంటే, ముందు మీడియా ద్వారా పాప్యులర్ కావాలని భావించిన నయీమ్, తన సొంత పెట్టుబడులతో ఐ10 న్యూస్ చానల్ ను ప్రారంభించాడని, పేరుకు మాత్రమే సీఈఓగా హరిప్రసాద్ రెడ్డిని నియమించాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిన్న హరిప్రసాద్ ను అరెస్ట్ చేసి విచారించగా, పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. సమాజం, ప్రజలు తనను హీరోగా భావించాలన్నది నయీమ్ అభిమతమని, మానవత్వం చూపే నేతగా కనిపించాలన్న ఆశతో, మీడియాను మార్గంగా ఎంచుకున్నాడని హరిప్రసాద్ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. 

తిరుపతి సభలో పవన్ నిరాహార దీక్ష ?!..

తిరుపతి: జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ నేటి సాయంత్రం తిరుపతిలో సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సభలో పవన్ ఏం మాట్లాడతారనే అంశంపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిమాని హత్యపై ఉద్వేగానికి లోనైనా పవన్ ఆ నేపథ్యంలోనే ఈ సభను పెడుతున్నారని... అందుకే కచ్చితంగా ఫ్యాన్స్‌కు దిశానిర్దేశం చేయడానికే ఈ సభ అని కొందరు అనుకుంటున్నారు. పవన్‌కు సన్నిహితంగా ఉండే అభిమానులు ఏపీకి ప్రత్యేక హోదా కోసం అధినేతను దీక్ష చేయమని కోరారట. పవన్ ఈ వ్యవహారంపై ఇప్పటివరకూ స్పందించలేదు. మరి జనసేన అధినేత ప్రత్యేక హోదాపై దీక్ష చేస్తారా ?

ఆర్టీఏ తనిఖీలు..10బస్ లు సీజ్..

హైదరాబాద్ : హైదరాబాద్-విజయవాడ హైవేపై ఆర్టీఏ అధికారలు తనిఖీలు చేపట్టారు. 13 ట్రావెల్స్ బస్సులపై కేసు నమోదు చేశారు. అనంతరం 10బస్ లను సీజ్ చేశారు. 

కారుబోల్తా..ఒకరు మృతి..

నెల్లూరు : కోవూరు శివారులోని జాతీయ రహదారిలో ఉన్న భారత్ బెంజ్ షోరూమ్ వద్ద అదుపుతప్పి కారు బోల్తాపడింది. ఈ సంఘటనలో ప్రకాశం జిల్లా సోదరగుట్ట మండలం రామాపురం గ్రామానికి చెందిన ఎద్దు ఏడుకొండలు అక్కడికక్కడే మృతిచెందగా, ఆయన తండ్రి చెన్నయ్య, భార్య అంకమ్మ, వారి పిల్లలు శ్రీనివాసులు, లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కోవూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడుకొండలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

10:07 - August 27, 2016

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శనసమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. గత రెండ్రోజులుగా తిరుమలలోనే బస చేసిన పవన్‌ కల్యాణ్‌ ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు తిరుపతి చేరుకుని తిరుపతిలోని ఇందిరా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా తన అభిమానులకు పవన్ అభిమానులకు అభివాదం చేశారు.

09:55 - August 27, 2016

మహబూబ్ నగర్ : హైదరాబాద్‌కు వచ్చి అన్నకు రాఖీ కట్టింది..ఆ తర్వాత ఇంటికి వెళ్లేందుకు బస్సులో బయల్దేరింది...ఊరికి దగ్గర్లో బస్సు దిగి ఆటోకోసం వేచి చూసిన ఆమె ఆ తర్వాత ఇల్లు చేరింది...ఆ వెంటనే కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది....అసలేం జరిగింది..? ఆ ఇల్లాలు కఠిన నిర్ణయం తీసుకునేందుకు కారణాలేంటి..? ఊరంతా ఒక్కటై ఎందుకు ఆందోళన చేస్తుంది...?

పాలమూరులో మరో ఘోరం...
మహబూబ్‌నగర్‌ జిల్లా, కొల్లాపూర్‌ మండలం, కుడికిల్ల గ్రామానికి చెందిన ఆకుతోట వర్షిణి ఈ నెల 22న హైదరాబాద్‌లో ఉంటున్న సోదరుడి వద్దకు వెళ్లి రాఖీ కట్టింది..అదే రోజు తిరుగు ప్రయాణమైంది...చీకటి పడడంతో కొల్లాపూర్‌ బస్టాండ్ చేరింది...

అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్న వర్షిణి

కుడికళ్ల వెళ్లేందుకు ఆటో కోసం..వేచి చూస్తున్న వర్షిణిపై కన్నేసిన కిరాతకులు..అదే గ్రామానికి చెందిన స్వామి బైక్‌లిఫ్ట్..తెలిసినవాడేనని బైక్ ఎక్కినందుకు కాటు..బస్సు దిగి ఆటో కోసం వేచి ఉన్న వర్షిణిని చూసిన అదే గ్రామానికి చెందిన స్వామి బైక్‌పై లిఫ్ట్ ఇస్తానన్నాడు..అప్పటికే చీకటి పడడంతో తెలిసినవాడేనని ఎక్కింది..మార్గమధ్యలో దారి మళ్లించిన స్వామి,అతని మిత్రులు కలిసి సామూహిక అత్యాచారం చేసి అక్కడే వదిలి వెళ్లిపోయారు..దీంతో తనకు జరిగిన అన్యాయంతో పాటు అవమాన భారంతో వర్షిణి ఇంటికి చేరి కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకుంది...

నిందితుల్ని శిక్షించాలంటున్న గ్రామస్థులు
వర్షిణి మృతికి కారణమైనవారిపై కఠినంగా వ్యవహరించాలని...కామాంధులను అదుపులోకి తీసుకోవాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు...ఎమ్మార్వో కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి గంటన్నరపాటు ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు...సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ రంగంలోకి దిగి వారికి న్యాయం చేస్తానంటూ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు..

09:49 - August 27, 2016

విజయవాడ : పోలవరం జాతీయ ప్రాజెక్టేనా..? ఈ ప్రాజెక్టు పూర్తికి నిధులు మొత్తం కేంద్రమే భరిస్తుందా..? రాష్ట్రానికి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండ కాబోతోందని తెలుస్తోంది. దీనికి అవసరమయ్యే నిధులను నాబార్డ్‌ నుంచి రుణంగా ఇప్పిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రత్యేక హోదాపై రాష్ట్రాన్ని వంచించన కేంద్రం.. పోలవరంపై కూడా మాట మార్చుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని తెరపైకి తెచ్చి.. కేంద్రం చేతులు దులిపేసుకోనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

జాతీయ హోదా నుంచి తప్పించే పన్నాగాలు కేంద్రం చేస్తోందా..?
ప్రత్యేక హోదాలో ఎదురైన చేదు అనుభవమే.. పోలవరంలోనూ ఎదురు కానుందా..?ఈ ప్రాజెక్టును జాతీయ హోదా నుంచి తప్పించే పన్నాగాలు కేంద్రం చేస్తోందా..?ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ ప్రశ్నలు షికారు చేస్తున్నాయి. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినా... ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కావాల్సిన నిధులను మాత్రం కేంద్ర భరించబోదన్న సంకేతాలు అందుతున్నాయి.

మెలికలు పెడుతున్న కేంద్రం
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన నేపథ్యంలో దీని నిర్మాణానికి అవసరమయ్యే నిధులను పూర్తిగా కేంద్రమే భరించాలి. కానీ ఇప్పుడు కేంద్రం దీనిపై మెలికలు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులను నాబార్డ్‌ నుంచి రుణంగా ఇప్పిస్తామని చంద్రబాబు సర్కారుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే రాష్ట్ర సర్కారు నెత్తిపై పిడుగు పడ్డట్లే. తాజాగా ఎఫ్‌ఆర్‌బీఎం మెలిక పెట్టడంతో.. ఈ ప్రాజెక్టు భారాన్ని కేంద్ర ప్రభుత్వం వదిలించుకోబోతోందన్న భావనను కలిగిస్తోంది. ఇంతకీ ఎఫ్‌ఆర్‌బీఎం అంటే ఏంటీ.. ఆ నిబంధనల ప్రకారం నిధులు తీసుకుంటే... ఏమవుతుంది..? అసలు ఇపుడున్న పరిస్థితుల్లో ఏపీకి ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట ప్రకారం వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవడం సాధ్యమేనా..?

పోలవరం ప్రాజెక్టు నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా?
బక్కోడినెత్తిన మోయలేని బరువుపెడితే వాడు తట్టుకోగలడా...? ఈ ప్రశ్నకు ఎవరైనా లేదనే సమాధానం చెబుతారు. అలాగే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కూడా అదే చెబుతుంది. 'ఫిజికల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌' రీతిని అనుసరించి... తనకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి మాత్రమే ఆయా రాష్ట్రాలు అప్పులను సమీకరించుకోవాల్సి ఉంటుంది. అసలే రాష్ట్ర విభజన నేపథ్యంలో.. లోటు బడ్జెట్‌తో నెట్టుకొస్తున్న నవ్యాంధ్రకు.. కేంద్రం చెబుతున్నట్టు నాబార్డ్‌ ద్వారా నిధులు పొందడం.. దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. అదీగాక.. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందా..? లేక రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందా..? అన్నదానిపైనా క్లారిటీ ఇవ్వడం లేదు.

ఏపీకి గుదిబండగా పోలవరం మారనుంది?..
ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్‌ గుదిబండగా మారిపోయే ఆవకాశం ఉందంటున్నారు నిపుణులు. 2018నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తిచేస్తామని పట్టిసీమద్వారా నీటిని విడుదల చేస్తూ ఘనంగా చెప్పుకొచ్చారు చంద్రబాబు. బీజేపీతో బంధం బలంగా ఉన్నపుడు చెప్పిన మాటలు అవి. అయితే.. తాజాగా కేంద్రం వైఖరితో ఏపీ ప్రభుత్వానికి కాళ్లూచేతులు ఆడని పరిస్థితినెలకొంది. పోలవరాన్ని రాష్ట్రప్రజలకు వరంగా ఇచ్చి.. రాబోయే 2019సాధారణ ఎన్నికల్లో సగర్వంగా ప్రజలముందుకు వెళ్లాలన్న చంద్రబాబు ఆశలకు నీళ్లొదులుతున్నారు ఢిల్లీపాలకులు. ఈ ప్రాజెక్టుకు అందుతున్న నిధులు కూడా అంతంత మాత్రంగా ఉండడాన్ని సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబే ఆక్షేపించడం గమనార్హం.

విపక్షాల విమర్శలు
పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమీకరణ బాధ్యత రాష్ట్రప్రభుత్వంపైనే పెట్టిందన్న ప్రచారం నేపథ్యంలో విపక్షాలు విమర్శల జోరును పెంచాయి. టీడీపీకి బీజేపీ ఝలక్‌ ఇస్తుందని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని విపక్షాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతసేపు.. టెక్నాలజీ అని.. రాష్ట్ర ప్రజలకు మాయామశ్ఛీంద్ర కథలు చెతున్నారని వివర్శిస్తున్నాయి. కంప్యూటర్‌ తెరపై డిజిటల్‌ సినిమా చూపిస్తూ.. అదిగో పోలవరం..ఇదిగో రాజధాని అంటూ పొద్దుపుచ్చుతున్నారని మండిపడుతున్నారు. తక్షణమే ఈ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించి.. సకాలంలో పూర్తయ్యేలా ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

పోలవరం విషయంలో ఇరుకున పడిన చంద్రబాబు
మొత్తానికి పోలవరం విషయంలో మోదీ ప్రభుత్వం తీరు చంద్రబాబును ఇరుకున పెడుతోంది. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి నాబార్డు నిధులు తీసుకోవచ్చంటూనే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి మాత్రమే అని ముక్తాయింపునిస్తోంది. దీంతో పోలవరానికి జాతీయ హోదా సాధించాం.. సాధించాం.. అని అంతెత్తున ప్రచారం చేసుకుంటున్న పసుపు పార్టీ నాయకులకు.. కేంద్రం నుంచి ఊహించని షాక్‌ తగిలినట్టైంది. 

జకీర్ పై దేశద్రోహం కేసు..

బంగ్లాదేశ్ : వివాదాస్పద మతబోధకుడు జకీర్ నాయక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రసంగాలతో యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్‌పై ఉగ్రవాదం కేసు నమోదు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే అతడు నడుపుతున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థకు చట్టబద్ధత లేకపోవడంతో దానిని మూసివేయాలని నిర్ణయించింది. ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న యువకులు తాము జకీర్ నాయక్ ప్రసంగాలతోనే స్ఫూర్తిపొందినట్టు చెప్పిన సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వదలం : క్రాంతిసేన కమిటి

హైదరాబాద్ : ఒక డీఎస్పీ, మరో ఎమ్మెల్యే కలసి చర్చలు జరపాలని పిలిపించి నయీమ్ ను కాల్చి చంపారు. మాకున్న నెట్ వర్క్ ను ఉపయోగించుకుని నక్సల్స్ ను ఏరివేసిన పోలీసులు చివరికి మా నేతనే లక్ష్యంగా చేసుకుని చంపారు" అని క్రాంతిసేన సెంట్రల్ కమిటీ పేరిట సంచలన ప్రకటన మీడియాకు విడుదలైంది. నయీమ్ మరణించిన మూడు వారాల తరువాత ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నందునే నయీమ్ ను హత్య చేశారని, ఇది బూటకపు ఎన్ కౌంటరని క్రాంతిసేన మహారాష్ట్ర, ఒడిశా సెంట్రల్ కమిటీ సభ్యులు మధు, జగత్ పట్నాయక్ ల పేరిట ఈ ప్రకటన విడుదలైంది.

క్యాబినెట్ లోకి ఏపీ యువరాజు?..

విజయవాడ : చినబాబు క్యాబినెట్ లోకి వచ్చే సూచనలకు బలంచేకూరుతోంది. దీనిపై గతకొంతకాలంగా ఈఅంశంపై పలు మాటలు వినిపిస్తున్నాయి. యువనేత నారా లోకేశ్ చంద్రబాబు మంత్రివర్గంలో చేరేందుకు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. పార్టీకోసం లోకేశ్ బాగా పనిచేస్తున్నాడని, మంచి అవకాశం ఇస్తే పైకొస్తాడన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో క్యాబినెట్ లో ఆయన చేరిక ఖాయమైపోయినట్టు తెలుస్తోంది.

తిరుపతి నుండి పోటీ చేయనున్న పవన్ ?..

తిరుపతి : పవన్ కల్యాణ్ తిరుపతిలో సభ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం వెనుక భారీ వ్యూహమే ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. గతంలో సినీతారలు రాజకీయ రంగ ప్రవేశం చేసిన వేళ, తొలిసారి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు తిరుపతినే ఎంచుకున్నారని, ఇప్పుడు పవన్ సైతం అదే దారిలో నడుస్తున్నారని జనసేన ప్రతినిధులు చెబుతున్నారు.

సరోగసీపై సూచనలకు సిద్ధం : నడ్డా

ఢిల్లీ: కేంద్రం ఆమోదించిన సరోగసీ (అద్దెగర్భం) బిల్లు ముసాయిదాపై విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో అందులో సూచనలను చేర్చటానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం పేర్కొంది. పిల్లలను వదిలిపెట్టటం, మహిళలను దోపిడీ చేయడం వంటి కీలక అంశాలపై మరో మాటకు అవకాశమే లేదని తేల్చిచెప్పింది. పౌరులపై నైతిక విలువలను రుద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలను కేంద్ర ఆరోగ్యమంత్రి నడ్డా తిరస్కరించారు. ఇది ధర్మబద్ధతకు సంబంధించినదని ఈ రంగంలో సాంకేతిక పురోగతిని సరైన దృక్కోణంతో వినియోగించుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

దున్నేవాడిదే భూమి..నడిపేవాడిదే ఆటో..

హైదరాబాద్: దున్నేవాడిదే భూమి.. నడుపుతున్న వారికే యాజమాన్య హక్కులు వర్తించేలా, వారి పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయించాలని నగర ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. రెండు నెలల క్రితమే పూర్తికావాల్సిన ఈ ప్రక్రియ ఆలస్యమైంది. శుక్రవారం ఆర్టీఏ, ఆటో యూనియన్లు, ఫైనాన్షియర్లతో నగర ట్రాఫిక్ ఉన్నతాధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫైనాన్స్ తీసుకొని, కొన్నాళ్ల పాటు ఆటోను నడిపి, కిస్తీలు కట్టలేక ఆటోను ఫైనాన్సర్‌కు వదిలేసి పోతున్నారు. ఇలా పలువురి చేతులు మారినా, మొదట ఎవరి పేరుతో అయితే ఆటో రిజిస్ట్రేషన్ అయి ఉందో, అదే పేరుతో నేటికి కొనసాగుతున్నాయి.

'సన్నీ' వారసుడి ఎంట్రీ..

ముంబై : సినీ ఇండ్రస్ట్రీల్లో వారసుల ఎంట్రీలు రివాజుగా మారిపోయాయి. దీనికి అన్ని వుడ్ లు ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో వారసుడు బాలివుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ నటుడుడు ధర్మేంద్ర కుమారు సన్నిడియోల్ తన కుమారుడు కరణ్ ను హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నాడట. 30 ఏళ్ల క్రితం తనకు తొలి విజయాన్ని అందించిన ‘బేతాబ్’ సినిమాను కరణ్ తో రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నాడు. కరణ్‌ను హీరో చేయాలని కొంతకాలం కిందటే అనుకున్నా మంచి స్టోరీ కోసం ఆగాడు. చివరకు ‘బేతాబ్’ కే ఫిక్సయినట్టు తెలుస్తోంది.

పతకాల పెంపుకు టాస్క్ ఫోర్స్..

ఢిల్లీ: ప్రపంచ దేశాలన్నీ పోటీపడే ఒలింపిక్స్ ప్రాముఖ్యానికి ఇప్పటికైనా గుర్తింపు లభించింది. రానున్న మూడు ఒలింపిక్స్‌ల్లో(2020, 2024, 2028) క్రీడాకారుల ప్రాతినిధ్యాన్ని మరింత పెంచేందుకు గాను ఓ ప్రత్యేకమైన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని శుక్రవారం జరిగిన సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఇందులో భాగంగా క్రీడా నిపుణులతో పాటు ఇతర రంగాల్లోని మేధావులు టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారు. రానున్న కొన్ని రోజుల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు మోదీ పేర్కొన్నారు.

పతకాల పెంపుకు టాస్క్ ఫోర్స్..

ఢిల్లీ: ప్రపంచ దేశాలన్నీ పోటీపడే ఒలింపిక్స్ ప్రాముఖ్యానికి ఇప్పటికైనా గుర్తింపు లభించింది. రానున్న మూడు ఒలింపిక్స్‌ల్లో(2020, 2024, 2028) క్రీడాకారుల ప్రాతినిధ్యాన్ని మరింత పెంచేందుకు గాను ఓ ప్రత్యేకమైన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని శుక్రవారం జరిగిన సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఇందులో భాగంగా క్రీడా నిపుణులతో పాటు ఇతర రంగాల్లోని మేధావులు టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారు. రానున్న కొన్ని రోజుల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు మోదీ పేర్కొన్నారు.

అమలాపురంలో ఉద్రిక్తత..

తూర్పుగోదావరి : అమలాపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎర్రవంతెలన వద్ద ఆక్రమణల తొలగింపుకు నిరసనగా ఎమ్మెల్యే ఆనందరావు ఇంటి ఎదుట ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సింధు

హైదరాబాద్ : బాడ్మింటన్ క్రీడాకారణి పీవీ సింధు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సింధుకు ఘనస్వాగతం పలికారు. సింధు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతోనే ఒలింపిక్స్ లో రజత పతకం సాధించాననీ..వచ్చే ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధిస్తానని సింధు ఈ సందర్భంగా తెలిపారు.

08:38 - August 27, 2016

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నీటి విడుదలపై కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశమైంది. ప్రస్తుత ఖరీఫ్‌లో ఆరుతడి పంటలకు నీరివ్వాలని రాష్ట్రాలు కోరడంతో నేడు నిర్ణయం తీసుకోనున్నారు. నీటి కేటాయింపులపై బాధ్యతను కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీకి అప్పగించింది.

శనివారం మరోసారి సమావేశం కానున్న కృష్ణా రివర్ బోర్డు
శనివారం కృష్ణా రివర్ బోర్డు మీటింగ్ నిర్వహించింది. ఈ మీటింగ్ లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శనివారం జరిగే సమావేశంలో నీటి విడుదలపై ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

ఖరీఫ్ సీజన్‌కు నీటిని విడుదల చేయాలంటున్న ఏపీ, తెలంగాణ
ఖరీఫ్ సీజన్ లో తమ నీటి అవసరాల కోసం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా బోర్డుకి నివేదించాయి. ...బోర్డు ఛైర్మన్ రాంశరణ్ అధ్యక్షతన పూర్తి బోర్డు సమావేశమైంది. సమావేశానికి ఇరు రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. తాగు, సాగునీటి అవసరాల కోసం 47 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటు సాగర్ ఎడమ కాల్వ ద్వారా సాగునీటికి 41 టీఎంసీల నీరు విడుదల చేయాలని తెలంగాణ ప్రతినిధులు బోర్డు ముందు నివేదించారు. మొత్తం ఈ సమావేశం లో బోర్డు 11 అజెండా అంశాలపై చర్చించింది.

సెప్టెంబర్ 15 నాటికి బోర్డుకి నివేదిక అందించనున్న కమిటీ
కృష్ణా బేసిన్‌లో చిన్న నీటి వనరుల అధ్యయనానికి బోర్డు ఛైర్మన్ రాంశరణ్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో చెరువులు, కుంటల ద్వారా నీటి లభ్యతను కమిటీ అధ్యయనం చేసి సెప్టెంబర్ 15 నాటికి బోర్డుకి నివేదిక సమర్పించనుంది. ఈ నెల 29 న నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను సందర్శించి టెలిమెట్రీ విధానాన్ని ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.

బంజారాహిల్స్‌లో ప్రత్యేక తనిఖీ కేంద్రం..

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో అర్థరాత్రి వరకు ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. రోడ్డు నెం.2లోని ప్రధాన రహదారిపై ప్రత్యేక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసిన పోలీసులు వాహనాదారులకు బ్రీత్‌ అనలైజర్‌ పరికరంతో పరీక్షలు నిర్వహించారు. ఆరుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వాహనాలను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. కౌన్సిలింగ్‌ నిర్వహించిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పంజాగుట్ట ట్రాఫిక్‌ సీఐ సంతోష్‌ కిరణ్‌ తెలిపారు.

ఉగ్ర కాల్పుల్లో కానిస్టేబుల్ మృతి..

శ్రీనగర్: ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గల కోలీ ప్రాంతంలో చోటుచేసుకుంది. హిజ్బుల్ కమాండర్ బుర్హానీ వానీ ఎన్‌కౌంటర్ అనంతరం ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.

ఖాప్స్ అదుపులో 172 మంది..

హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో నగర పోలీసులు అర్థరాత్రి విసృత సోదాలు నిర్వహించారు. 15 బృందాలతో పోలీసులు ఇంటింటిని జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా 172 మంది పాత నేరస్తులు, రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్ఫూర్తినిచ్చి మృతి చెందిన డ్రైవర్..

తమిళనాడు : గుండెపోటు బాధిస్తున్నా ప్రయాణికుల ప్రాణాలు తన చేతిలో ఉన్నాయని భావించిన ఓ బస్ డ్రైవర్ వారిని సురక్షితంగా బస్టాండ్‌కు చేర్చి మరణించిన స్ఫూర్తిదాయక విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తమిళనాడులోని పెర్నాంబట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం మధ్య తిరిగే ప్రైవేటు బస్సు 30 మంది ప్రయాణికులతో గురువారం పెర్నాంబట్ నుంచి బయలుదేరింది. మార్గమధ్యంలో డ్రైవర్‌ వెంకటేశన్(41)‌కు గుండెనొప్పి వచ్చింది. బాధను భరిస్తూనే చిత్తూరు జిల్లా వెంకటగిరిలోని కోట బస్టాండ్‌కు చేరుకుని బస్సును నిలిపివేశాడు.

పురిటి నొప్పులతో 6కి.మీ నడక..

మధ్యప్రదేశ్ : పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ ఆస్పత్రికి వెళ్లేందుకు ఏకంగా ఆరు కిలోమీటర్లు నడిచింది. ఛత్తర్‌పూర్‌లోని టిమారియా గ్రామానికి చెందిన సంధ్య యాదవ్(28) నిండు గర్భిణి. శుక్రవారం ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జనని ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ కోసం కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. గంటలు గడుస్తున్నా అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు నడక ప్రారంభించారు. సంధ్య పురిటి నొప్పులతో విలవిల్లాడుతూనే వరద నీటిలో ఆరు కిలోమీటర్లు నడిచింది. 

ప్రధానితో భేటీ కానున్న కశ్మీర్ సీఎం..

ఢిల్లీ : శనివారం ఉదయం 10.30గం.లకు ప్రధాని నరేంద్ర మోదీతో కశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ సమావేశం కానున్నారు. కశ్మీర్ లోని పరిస్థితులపై ప్రధానికి వివరించనున్నారు. కాగా కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై రెండురోజులపాటు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కశ్మీర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. 

రెండోరోజు సమావేశం కానున్న కృష్ణా వాటర్‌ బోర్డు ..

హైదరాబాద్ : జలసౌధలో నేడు కృష్ణా వాటర్‌ బోర్డు భేటీ జరుగనుంది. శుక్రవారం నాడు ఇరు రాష్ట్ర అధికారులు పాల్గొని వారి వాదనలన వినిపించారు. కాగా ఈ అంశంపై ఎటూ తేలకుండానే సమావేశం ముగిసింది. దీంతోరెండోరోజుకూడా సమావేశాన్ని కొనసాగించనున్నారు. ఏపీ, తెలంగాణలో నీటి విడుదలపై  నేడు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకోనుంది. 

తిరుపతిలో జనసేన బహిరంగ సభ..

చిత్తూరు : నేడు తిరుపతిలో పవన్‌ కల్యాణ్‌ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సా. 4 గంటలకు ఇందిరా మైదానంలో బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

హిమాచల్‌ ప్రదేశ్ లో భూ ప్రకంపనలు..

హిమాచల్‌ ప్రదేశ్ : రాష్ట్రంలో స్వల్పంగా భూమి కంపించింది. పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం 6.45 ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.6 గా నమోదు అయినట్టు జియోలాజికల్‌ సర్వే విభాగం ఒక ప్రకటనలో వెల్లడించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో అక్కడి ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

శ్రీవారి సేవలో జనసేనాని..

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శనసమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. గత రెండ్రోజులుగా తిరుమలలోనే బస చేసిన పవన్‌ కల్యాణ్‌ ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నారు.

07:39 - August 27, 2016

జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి జనంలోకి రాబోతున్నారు. శనివారం సాయంత్రం 4గంటలకు తిరుపతి వేదికగా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇటీవల కర్ణాటక కోలార్‌లో అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన వినోద్‌ రాయ్‌ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్న పవన్ కొండపైనే అతిథి గృహంలో బస చేశారు. సభలో పవన్ ఏఏ అంశాలపై మాట్లాడబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన గళం వినిపించనున్నారా? లేదా అభిమానులకు దిశానిర్ధేం చేయనున్నారా? ఈ విషయంపై జనసేన పార్టీ నుండి గానీ..పవన్ కళ్యాణ్ నుండి గానీ ఇంతవరకూ ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.. దీంతో పవన్ సభలో మాట్లాడబోయే అంశాలపై అటు అభిమానుల్లోనూ..ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్రం ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో రాకేష్ రెడ్డి (బీజేపీ అధికార ప్రతినిధి), గిడుగు రుద్రరాజు (కాంగ్రెస్ నేత) పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..మరింత సమాచారం తెలుసుకోండి..

07:37 - August 27, 2016

ఢిల్లీ : మా ఆదేశంతో దేశంలో అవినీతి నిర్మూలన అవుతుందా ? రామరాజ్యం తీసుకురాగలమా ? మేము చాలా చేయాలనుకుంటాం.. కానీ మా అధికారాలు చాలా స్వల్పం.. ఇది ఎవరో సామాన్య అధికారో.. రాజకీయ నేతో చెప్పిన మాటలు కాదు.. ఫుట్‌పాత్‌ల దురాక్రమణ కేసులో భాగంగా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు.

ఆ ఆదేశాలతో అవినీతి నిర్మూల అవుతుందా?ఠాకూర్
దేశంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణపై వాయిస్‌ ఆఫ్‌ ఇండియా అనే స్వచ్చంద సంస్థ 2014లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ విచారణ సమయంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

స్వయంగా వాదనలు వినిపించిన పిటిషనర్‌ ధనేష్‌
తొలుత విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్‌ ధనేష్‌ స్వయంగా వాదనలు ప్రారంభించారు. దీంతో మీరేమైనా బాధితులా అని చీఫ్‌ జస్టిస్‌ ప్రశ్నించారు. అయితే దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చేందుకు పిటిషన్‌ వేసినట్లు ధనేష్‌ చెప్పారు. మరి హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని సీజే ప్రశ్నించారు. దేశంలో అన్ని సమస్యలకు తాము ఆదేశాలు ఇవ్వలేమన్నారు. దీంతో ఒక్క ఢిల్లీలోనే ఈ సమస్య లేదని.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు ధనేష్‌.

కోర్టు ఉత్తర్వులతో పరిష్కారం లభిస్తుందనుకోవడం పొరపాటు సీజే ఠాకూర్‌
అయితే.. దేశంలో అనేక సమస్యలున్నాయని.. వాటన్నింటికి కోర్టు ఉత్తర్వులతో పరిష్కారం లభిస్తుందనుకోవడం పొరపాటని సీజే ఠాకూర్‌ అన్నారు. దేశంలో అంతా తప్పుగానే జరుగుతుందని అంచనాకు రాలేమన్నారు. ఎన్నో లోపాలను సరిదిద్దాలని తాము అనుకుంటామని.. కానీ తమ అధికారాలు స్వల్పమేనన్న ఆవేదనను చీఫ్‌ జస్టిస్‌ ఠాకూర్‌ వెలిబుచ్చారు.

ఇక్కడే న్యాయం జరగకపోతే ఎక్కడకు వెళ్లాలన్న పిటిషనర్‌
ఎన్నో ఆశలతో కోర్టుకు వస్తే.. న్యాయం చేయనంటే ఎక్కడకు వెళ్లాలన్నారు పిటిషనర్‌. ఫుట్‌పాత్‌లు దురాక్రమణకు గురవుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో అన్నింట్లో కోర్టు జోక్యం చేసుకోదని సీజే తేల్చి చెప్పారు. దేశంలోని ఫుట్‌పాత్‌లపై దురాక్రమణలను తొలగించాలని తాము ఉత్తర్వులిస్తే.. ఆచరణలో సాధ్యమవుతుందా ? అని పిటిషనర్‌ను ప్రశ్నించారు. అవినీతిని రూపుమాపాలని తాము ఆదేశాలిస్తే అవినీతి ఆగిపోతుందా ? రామరాజ్యాన్ని స్థాపించాలని ఉత్తర్వులిస్తే సాధ్యపడుతుందా ? అని సీజే ప్రశ్నించారు. ఆచరణకు సాధ్యం కాని అంశాల్లో కోర్టులు ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు.

తన ఆశలపై నీళ్లు చల్లితే ఎక్కడికి పోవాలన్న పిటిషనర్‌
దీంతో పిటిషనర్‌.. తన ఆశలపై న్యాయస్థానమే నీళ్లు చల్లితే ఎక్కడి పోవాలి ? అని వాదించారు. దీంతో పిటిషనర్‌ను బయటకు తీసుకెళ్లాలని సీజే సెక్యూరిటీని ఆదేశించారు. ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానానిదేనని.. అలా చేయలేమంటే బయటకు పంపించేయండి అంటూ పిటిషనర్‌ అన్నారు. దీంతో స్పందించిన చీఫ్‌ జస్టిస్‌ ఠాకూర్‌ కేసు విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేశారు. అయితే జనవరిలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఠాకూర్‌ పదవీ విరమణ చేయనుండడం గమనార్హం.

 

07:28 - August 27, 2016

విశాఖపట్నం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. దేశవ్యాప్త సమ్మెకు కార్మికసంఘాలు సమాయత్తం అయ్యాయి. సెప్టెంబర్‌ రెండున మూకుమ్మడి సమ్మెతో పాలకుల కళ్లు తెరిపిస్తామంటోంది కార్మికశక్తి. సమ్మెకు కార్మికులను సమాయత్తం చేసేందుకు ఊరూవాడా ర్యాలీలు ప్రదర్శనలు హోరెత్తుతున్నాయి.

సెప్టెంబర్‌2న మూతపడనున్న ప్రభుత్వరంగ పరిశ్రమలు
పాలకులు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, అభివృద్ధి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... కార్మికసంఘాలు సమ్మెబాట పడుతున్నాయి. వచ్చేనెల రెండున నిర్వహించనున్న జాతీయ సార్వత్రిక సమ్మెతో పలు పరిశ్రమలు , బ్యాంకులు, షిప్‌యార్డు..ఇలా విమానయాన కార్మికుల దగ్గర నుంచి రిక్షా కార్మికుల వరకు సమ్మెల్ కదంతొక్కున్నారు.

సమ్మెబాటలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐన్‌టీయూసీ
కార్మికసంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు విశాఖలో కార్మికులు ఒక్కతాటిపైకి వచ్చారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐన్‌టీయూసీలతోపాటు బీఎంఎస్‌, వైసీపీ ట్రేడ్‌యూనియన్లు సమ్మెకు సిద్దమయ్యాయి. వీరితోపాటు ఇతర ఉద్యోగసంఘాలు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించాయి. మొత్తం 12డిమాండ్లతో జాతీయ సార్వత్రిక సమ్మెకు వెళ్లుతున్నట్టు కార్మిక నేతలు చెబుతున్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాలబాటలో నడిపిన కార్మికులు
ఎన్నడూలేనంతాగా బీజేపీ, టీడీపీ పాలనలో విశాఖలో కార్మికవర్గం ఇబ్బందులు పడుతోంది. నష్టాల్లో ఉన్నపుడు అదనంగా పనిచేసి విశాఖస్టీల్‌ప్లాంట్‌ను లాభాల్లోకి నడిపించడానికి కార్మికులు ఎనలేని కృషిచేశారు. కాని.. పరిశ్రమలో కార్మికులను తగ్గిస్తోంది యాజమాన్యం.. గతంలో 6795 మంది ఉద్యోగులు ఉంటే ..ప్రస్తుతం వారిసంఖ్యను 1451కి తగ్గించారంటున్నారు కార్మికనేతలు. దీనికి నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సెప్టెంబర్‌ రెండున విశాఖ కార్మికవర్గం ఆందోళనలతో కదంతొక్కడానికి సిద్ధమైందంటున్నారు.

నెల్లూరులో కదంతొక్కనున్న కార్మిక శక్తి
అటు నెల్లూరు జిల్లాలోనూ కార్మికులు సమ్మెబాటపడుతున్నారు. సమ్మెను విజయవంతం చేయాడనికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానలవల్ల సంపద కొద్దిమంది చేతుల్లోకే వెళ్లిపోతోందని.. ఈదేశంలో రోజురోజుకు పేదవాడు మరింత పేదవాడుగా మారుతున్నాడని సీఐటీయూ నేతలు విమర్శించారు. కేంద్ర, రాష్ట్రపాలకులు కళ్లుతెరిచేలా కార్మికవర్గం కదంతొక్కడానికి రెడీఅవుతోంది. కార్మికవ్యతిరేక విధానాలను విడనాడాలని కార్మికసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

07:24 - August 27, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీం ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. హత్యలు, బెదిరింపులతో చెలరేగిపోయిన నయీంగ్యాంగులు.. ప్రధానంగా రియల్‌ఎస్టేట్‌పై దృష్టిపెట్టాయి. ఈనేపథ్యంలో పోలీసుల చేతిలో డాన్‌ హతం అవడంతో.. అతని అనుచరులు జాగ్రత్తపడుతున్నారు.

బయటికొస్తున్న నయీం చీకటిసామ్రాజ్యపు జాడలు
సిట్‌ దర్యాప్తులో నయీం చీకటిసామ్రాజ్యపు జాడలు వెలుగుచూస్తుండటంతో కూడబెట్టిన సొత్తు, ల్యాండ్స్‌ చేజారకుండా డాన్‌ అనుచరులు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం.. దాడులకు తెగబడుతున్నారు. తాజాగా హైదరబాద్‌ రామాంతపూర్‌లో ఓ రియల్‌ఎస్టేట్‌ కంపెనీపై దాడిచేశారు. ల్యాండ్స్‌కు సంబంధించిన డాక్యూమెంట్స్‌ ఇవ్వాల్సిందిగా బెదిరించారు. ఆఫీస్‌ సిబ్బంది నిరాకరించడంతో వారిని చితకబాదారు.

నయీం బినామీల పేరున రూ.కోట్ల ల్యాండ్స్‌ రిజిస్ట్రేషన్‌
నయీం తనను గతంలోనే బెదిరించడంతో కోట్లరూపాయల విలువైన భూములను నయీం బినామీలపేరున రిజిస్ట్రేషన్‌ చేసినట్టు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి కె చిత్తరంజన్‌రెడ్డి అంటున్నారు. దీనికోసం బండ్లగూడలోని లాయర్‌ రహీంతో డీల్‌ నడిపించినట్టు వ్యాపారి చెబుతున్నారు. ల్యాండ్‌ను లాయర్‌పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేశామంటున్నారు.

యాదగిరిగుట్టదగ్గర వెంచర్‌లో నయీం బినామీలకు ల్యాండ్స్‌
నల్లగొండజిల్లా యాదగిరిగుట్ట దగ్గర వేసిన వెంచర్‌లో నయీంముఠాపేరున భూములను రిజిష్ట్రేన్‌ చేశానంటున్నారు కేసీరెడ్డి. మొదట్లో తాను నిరాకరించినా మరో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి సలహాతో తాను నయీం చెప్పినట్టు చేశానంటున్నారు.

డాన్‌ అంతంతో బయటికొస్తున్న షాడోజాడలు
మొత్తానికి డాన్‌అంత కావడంతో... చీకటిమాటున ఉన్న షాడోజాడలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. డాన్‌చచ్చాడన్న ధైర్యంతో కొందరు బయటికొస్తుంటే.. ఇంకొందరు మాత్రం బయటికొస్తే ఏమవుతుంతో అని భయపడుతూ.. గుట్టుగా ఉంటున్నారు. తెలంగాణతోపాటు, ఇతర రాష్ట్రాల్లో నయీం సామ్రాజ్యం విస్తరించినట్టు తెలుస్తున్న నేపథ్యంలో.. కేసును సీబీఐకి అప్పగిస్తే.. డాన్‌కు సహకరించిన ఖాకీచొక్కాల నీడలు ఎవరివనేది కూడా తెలిసే అవకాశంవుందంటున్నారు నయీం బాధితులు. 

07:08 - August 27, 2016

హైదరాబాద్ :జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ టీటీడీపీకి ప్లస్సా ? మైనెస్సా ? కొత్త జిల్లాల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా..టీడీపీకి లాభం జరగనుందా? జిల్లాల విభజనతో కొత్త నాయకత్వం పెరిగి పార్టీ మరింత బ‌లోపేతం కానుందా...? ఈ ప్రశ్నలకు టీడీపీ పెద్దలు ఔననే సమాధానమిస్తున్నారు.

పార్టీ బలోపేతానికి అవకాశలు ఎక్కువ?
తెలంగాణలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ హేతుబద్ధంగా జరగడం లేదని ప్రతిపక్షాలు గట్టిగా వాదిస్తున్నాయి. అధికార పార్టీ రాజ‌కీయ ప్రయోజ‌నాల కోస‌మే జిల్లాల ఏర్పాటుకు ఉప‌క్రమించిందని ఆరోపిస్తున్నాయి. జిల్లాల ఏర్పాటు అంశంపై అఖిల‌ప‌క్షాన్ని పిల‌వ‌కుండా చేయాల్సిందంతా చేసి నామ మాత్రంగా ఇత‌ర పార్టీల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిప‌డుతున్నాయి. ఇది ఇలా ఉంటే మరోవైపు జిల్లాల విభ‌జ‌న అనివార్యం అయితే టిడిపికి క‌లిసి వ‌చ్చే అవకాశాలే ఎక్కువ అని ఆ పార్టీ నేత‌లు విశ్లేషించుకుంటున్నారు.

అనుకూలించే అంశాలపై టీటీడీపీ కసరత్తు
జిల్లాల విభ‌జ‌న‌ తప్పనిసరి అయితే త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే అంశాల‌పైన క‌స‌రత్తు చేస్తోంది టీటీడీపీ. ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షులు, స‌మ‌న్వయ క‌ర్తలు, , ఇంఛార్జీలతో పాటు మండ‌ల స్ధాయిలో కూడా నాయ‌క‌త్వం పెరుగుతుంద‌ని..తద్వారా పార్టీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో నూతన క్యాడర్‌కు అవ‌కాశాలు విసృతంగా ఉంటాయ‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు.

నూతన నాయకత్వం పెరుగుతుందని నేతల ఆశాభావం
మొత్తంగా నూత‌న జిల్లాల ఏర్పాటుతో ఓ వైపు ఖేదాన్ని... మ‌రో వైపు మోదాన్ని వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణను త‌మ‌కు అనుకూలంగా మార్చుకొని...ఏ పార్టీ బలపడుతుందో చూడాలి. 

07:04 - August 27, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల మ్యాపుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌లో 27జిల్లాలతో కూడిన మ్యాపుల్ని ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై ఫిర్యాదులు మాత్రం కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఈ నెల 22న డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన ప్రభుత్వం.. అభ్యంతరాలను, సూచనలు చేయడానికి నెల రోజుల గడువు ఇవ్వడంతో పాటు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసింది. LOOK

ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కొత్త జిల్లాల మ్యాపులు
తెలంగాణలో కొత్త జిల్లాల మ్యాపుల్ని ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. 27 జిల్లాలతో కూడిన రాష్ట్ర మ్యాప్‌ను ప్రభుత్వం వెబ్‌సైట్‌లో పెట్టింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతుంది. ప్రస్తుతం జిల్లాల వారిగా పరిశీలిస్తే కరీంనగర్ జిల్లా నుంచి అత్యధికంగా 1526 ఫిర్యాదులు రాగా... వరంగల్ నుంచి 930 కంప్లైంట్లు పోర్టల్‌కు వచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లా నుంచి 865, నల్గొండ నుంచి 790 ఫిర్యాదులు వచ్చాయి. ఇక అదిలాబాద్, మెదక్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి నుంచి తక్కువ సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. జిల్లాల ఏర్పాటు విషయంలో తెలంగాణ వ్యాప్తంగా 2,920 ఫిర్యాదులు రాగా.. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు విషయంలో 1366 ఫిర్యాదులు అందాయి. మండలాల విషయానికొస్తే 632 కంప్లైంట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్‌కు వచ్చాయి.

అత్యధికంగా కరీంనగర్ జిల్లా నుంచి 1526 ఫిర్యాదులు
కొత్త జిల్లాలుగా ప్రతిపాదించిన వాటిలో యాదాద్రి జిల్లాపై అత్యధికంగా ఫిర్యాదులు అందాయి. ఈ జిల్లాపై 667 మంది స్పందించారు. ఆ తర్వాతి స్థానాన్ని వనపర్తి జిల్లా దక్కించుకొంది. వనపర్తిపై 555 ఫిర్యాదులు వచ్చాయి. మూడవ స్థానం 450 కంప్లైంట్లతో హన్మకొండ నిలిచింది. చివరి స్థానంలో సంగారెడ్డి నిలిచింది. సంగారెడ్డి జిల్లా ఏర్పాటుపై కేవలం 8 ఫిర్యాదులు మాత్రమే అందాయి. రెవిన్యూ డివిజన్ల కేంద్రాల ఏర్పాటులో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేస్తోన్న రెవిన్యూ డివిజన్ కేంద్రంపై 1043 ఫిర్యాదులు అందాయి. సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసే రెవిన్యూ డివిజన్ కేంద్రంపై అత్యల్పంగా 2 ఫిర్యాదులు మాత్రమే అందాయి. మండలాల ఏర్పాటు విషయంలో అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లాలో 68 ఫిర్యాదులు అందాయి.

జగిత్యాలపై అత్యధికంగా 1079 ఫిర్యాదులు
కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు..రెవిన్యూ డివిజన్ కేంద్రాలు, మండలాల ఏర్పాటుతో పాటు అన్ని రకాల ఫిర్యాదుల్లో జగిత్యాల జిల్లా తొలి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో అన్ని విభాగాల్లో కలిపి 1079 ఫిర్యాదులు వచ్చాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చాయి. ఈ జిల్లా నుండి కేవలం 21 మాత్రమే ఫిర్యాదులు వచ్చాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై కేవలం 4రోజుల వ్యవధిలోనే ఇన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతుంటే,..నెల రోజుల వ్యవధిలో వీటి సంఖ్య ఎన్ని వేలకు చేరుతుందో చూడాల్సి ఉంది. అంతేకాదు..ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, సూచనలు..సలహాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో చూడాలి.

Don't Miss