Activities calendar

28 August 2016

22:07 - August 28, 2016

నల్లగొండ : నేరేడుచర్ల మండలం రామాపురంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రంగా గాయాలపాలయ్యారు. దీంట్లో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. గణేష్ ఉత్సవాలకోసం బాణసంచా తయారుచేస్తుండగా పేలుడు జరిగినట్లుగా తెలుస్తోంది. పేరులోనే బాంబులు వున్న బాంబుల బాలరెడ్డి అనే వ్యక్తి అనధికారికంగా బాణసంచా తయారు చేసే ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది.గాయపడినవారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

22:05 - August 28, 2016

హైదరాబాద్ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హైదరాబాద్‌లోని గోపిచంద్ అకాడమీలో సందడి చేశారు. రియో ఒలింపిక్స్‌లో సత్తాచాటిన క్రీడాకారులకు సచిన్‌ టెండుల్కర్‌ బీఎండబ్ల్యూ కార్లను బహూకరించారు. ఒలింపిక్‌ విజేతలను చూసి భారత్ గర్విస్తోందని సచిన్‌ కొనియాడారు.

గోపీచంద్ అకాడమీలో సచిన సందడి
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో సందడి చేశారు. రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సింధు, సాక్షిమాలిక్‌, దీపాకర్మాకర్‌, కోచ్‌ గోపీచంద్‌లకు బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చేందుకు సచిన్‌ హైదరాబాద్ వచ్చారు. వాస్తవానికి ఒలింపిక్స్‌లో పీవీ సింధు పతకం తెస్తే కారు గిఫ్ట్‌గా ఇస్తామని తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్‌ హామీ ఇచ్చారు. అయితే.. రియోలో కాంస్యం సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్‌తో పాటు అథ్లటిక్ విభాగంలో ప్రతిభ కనబరిచిన దీపా కర్మాకర్, పీవీ సింధు కోచ్ గోపీచంద్‌లకు కూడా సచిన్‌ కార్లను బహుకరించారు.

ఒలింపిక్‌ విజేతలతో సచిన్ సెల్ఫీ..
తొలుత ఒలింపిక్‌ విజేతలకు సచిన్ శుభాకాంక్షలు తెలిపారు. కఠోర సాధనతోనే మెడల్స్‌ సాధించగలగారని... వీరిని చూసి భారత్‌ ఎంతో గర్విస్తోందని కొనియాడారు. మరిన్ని మెడల్స్‌ సాధించే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అలాగే కోచ్‌గా గోపీచంద్‌ రియల్ హీరో అంటూ సచిన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా సచిన్‌ సింధు, గోపిచంద్‌, సాక్షిమాలిక్‌, దీపా కర్మాకర్లతో సెల్ఫీ తీసుకున్నారు.

కృతజ్ఞతలు తెలిపిన సింధు
ఒలింపిక్‌లో తనకు సహకరించిన అందరికి పీవీ సింధు కృతజ్ఞతలు తెలిపింది. ఒలింపిక్‌ మెడల్‌ సాధించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.

మరిన్నీ పతకాలు సాధిస్తానని రెజ్లర్‌ సాక్షి ధీమా..
భవిష్యత్‌లో మరిన్నీ పతకాలు సాధిస్తానని రెజ్లర్‌ సాక్షి ధీమా వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో వచ్చినా..ఇంత ప్రోత్సాహం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటానని జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ చెప్పింది. వచ్చే ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు తీసుకొచ్చేందుకు తనవంతు కృషిచేస్తానని బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌ అన్నారు.

సచిన్‌ తన చేతుల మీదుగా కారు తాళాలు
అనంతరం సచిన్‌ తన చేతుల మీదుగా కారు తాళాలను అందచేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా సచిన్‌తో సెల్ఫీ తీసుకున్నారు.

21:58 - August 28, 2016

ఢిల్లీ : రియో ఒలింపిక్స్ పతకాలు సాధించిన పీవీ సింధు, సాక్షి మాలిక్‌ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సింధు కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కూడా మోదీని కలుసుకున్నారు. బ్యాడ్మింటన్‌లో రజతపతకం సాధించిన సింధు, రెజ్లింగ్‌లో కాంస్య పతకం పొందిన సాక్షి మాలిక్‌ను మోదీ అభినందించారు. ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిపభ కనపరిచి, దేశ ఖ్యాతిని మరోసారి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసిచారు. 2020 ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే తయారు కవాలని కోరారు. జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌, షూటర్‌ జీతూరాయ్‌తోపాటు రాజీవ్‌ ఖేల్‌రత్న, ధ్యాన్‌చంద్‌, ద్రోణాచార్య, టెన్సింగ్‌ నార్కే అవార్డు గ్రహీతలు కూడా మోదీని కలిశారు. 

21:56 - August 28, 2016

హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం రోజురోజుకు దిగజారుతోందని హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనగూడేల్లో పరిస్థితి మరీ దారుణంగా మారిందని ఆవేదన వెలిబుచ్చారు. వైద్యరంగంపై ఐద్వా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో చంద్రకుమార్‌.. ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు రోగులకు అందుబాటులో ఉండటంలేదని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

21:53 - August 28, 2016

హైదరాబాద్ : ప్రజలు కేంద్రంగా అభివృద్ధి జరగాలన్నారు.. టీ. జాక్ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం... తెలంగాణ అభివృద్ధి నమూనా, టి జెఎసి ఆలోచన అనే అంశంపై హైదరాబాద్‌లో సదస్సు జరిగింది.. ఈ కార్యక్రమానికి హాజరైన కోదండరాం... జిడిపిలు, తలసరి ఆదాయాలు అభివృద్ధికి ప్రమాణాలు కావని చెప్పారు. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలని సూచించారు.. 

21:50 - August 28, 2016

హైదరాబాద్ : అది మరో జలియన్‌ వాలాబాగ్ దురాగతం. యావత్ తెలుగు జాతిని కుదిపేసిన దుస్సంఘటన. దూసుకొచ్చిన బుల్లెట్లు అన్నదాత గుండెలను చీల్చిన దుశ్చర్య. విద్యుత్‌ భారం తగ్గించమన్నందుకు ప్రభుత్వం మారణహోమానికి పాల్పడిన విషాద ఘటన అది. బషీర్‌బాగ్‌ కాల్పుల దమనకాండకు నేటితో 16 ఏళ్లు నిండాయి. అమరవీరులకు తెలుగు రాష్ట్రాల వామపక్ష నేతలు ఘనంగా నివాళులు అర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు.

పోలీస్‌ కాల్పుల్లో ముగ్గురు బలి
సరిగ్గా 16 ఏళ్ల క్రితం అంటే 2000 ఆగష్టు 28న బషీర్‌బాగ్‌ రణరంగమైంది. భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా, నాటి టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దీన్ని తీవ్రంగా అణిచివేయాలనుకున్న ప్రభుత్వం అన్నంత పని చేసింది. పోలీస్‌ కాల్పుల్లో ముగ్గురిని బలి తీసుకుంది.

బషీర్‌బాగ్‌ ఘటనకు 16ఏళ్లు
బషీర్‌బాగ్‌ ఘటనకు 16ఏళ్లు పూర్తి కావటంతో వామపక్షనేతలు అమరవీరులకు నివాళులు అర్పించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. బషీర్‌బాగ్‌లోని అమరవీరుల స్ధూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమరుల స్ఫూర్తిగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామన్నారు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.

ప్రజా వ్యతిరేక విధానాలు : చాడ
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు సీపీఐ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి.

'ప్రజా ఉద్యమాలు- ప్రభుత్వ అణిచివేత' అంశంపై సదస్సు
బషీర్ బాగ్ ప్రెస్‌ క్లబ్‌లో... 'ప్రజా ఉద్యమాలు- ప్రభుత్వ అణిచివేత' అంశంపై సదస్సులో తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షాలన్నీ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

రామకృష్ణ స్తూపం వద్ద వామపక్ష నేతలు నివాళి
అటు ఖమ్మం జిల్లా అమరజీవి సత్తెనపల్లి రామకృష్ణ స్తూపం వద్ద వామపక్ష నేతలు నివాళి అర్పించారు. అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని అన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వం ఏదైనా ప్రపంచ బ్యాంకు ఆదేశాలనే అనుసరిస్తుందని విమర్శించారు.

అమరులకు వామపక్షాలు ఘన నివాళి
కరీంనగర్‌లో బషీర్‌బాగ్ కాల్పుల అమరులకు వామపక్షాలు ఘన నివాళి అర్పించాయి. తెలంగాణ చౌక్‌లో అమరవీరులను స్మరిస్తూ జోహార్లు పలికారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు, ప్రజా ఉద్యమాలు స్ఫూర్తి నింపాయన్నారు.

శ్రీ శ్రీ భవన్‌లో విద్యుత్ అమరవీరుల చిత్ర పటాలకు నివాళులు
అటు విజయవాడ శ్రీ శ్రీ భవన్‌లో విద్యుత్ అమరవీరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమాల ద్వారా అడ్డుకుంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు హెచ్చరించారు. సిపిఎం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో విద్యుత్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపితే పోరాటం
రెండు రాష్ట్రాలను పాలిస్తున్న ప్రభుత్వాలు సైతం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశాయని వామపక్ష నేతలు మండిపడ్డారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపితే ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.

21:44 - August 28, 2016

అనంతపురం : అనంతపురం, చిత్తూరు జిల్లాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు సీఎం చంద్రబాబు. రెండు జిల్లాల్లో పర్యటించిన ఆయన ప్రతి నియోజక వర్గానికి ఓ ఐఏఎస్ ఆఫీసర్‌, ప్రతి రెండు మండలాలకు గ్రూప్‌ 1 ఆఫీసర్‌ ద్వారా కరవు పరిస్థితిని సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. రెయిన్ గన్స్ ద్వారా రక్షక తడులిస్తామని చెప్పారు. అయితే చంద్రబాబు హామీలపై సీపీఎం మండిపడింది.. రెయిన్ గన్స్‌ ఓ బోగస్‌ కార్యక్రమమని మండిపడింది..

వేరుసెనగ పంటను పరిశీలించిన చంద్రబాబు
అనంతపురం జిల్లాలో ఓవైపు చంద్రబాబు, మరోవైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించారు.. వర్షాభావంతో ఎండిపోతున్న వేరుసెనగ పంట పొలాలను పరిశీలించారు...

బిజీ బిజీగా చంద్రబాబు..
ఆమడుగూరు, కోటపల్లిగ్రామాల్లో సిఎం పర్యటించారు. ఎండుతున్న వేరుశనగపంటకు రెయిన్ గన్స్ ద్వారా నీటితడి ఇచ్చే విధానాన్ని సీఎం పరిశీలించారు.. అక్కడి రైతులతో మాట్లాడారు.. జిల్లాలో కరవు పరిస్థితులను తెలుసుకోవడంలో ఆలస్యం జరిగిందని బాబు అంగీకరించారు.. కరవు తీవ్రంగా ఉందంటూ అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.. ఒక్కోనియోజకవర్గానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్, రెండు మండలాలకు ఓ గ్రూప్-1 ఆఫీసర్‌తో కరవు పరిస్థితులు సమీక్షిస్తామని తెలిపారు.. తనకల్లు మండలం కోటపల్లిగ్రామ బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడారు...

పంటపై ఆవేదన వ్యక్తం చేసిన రైతులు
అటు అనంతపురం, గార్లదిన్నె మండలాల్లోని నరసనాయినికుంట, కోటంక గ్రామాల్లో సిపిఎం బృందం పర్యటించింది.. స్థానిక రైతులు తమ కష్టాలను సీపీఎం బృందంతో చెప్పుకున్నారు.. వర్షాలులేక పంటలు మొత్తం ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.. ఫాంపాండ్లలో నీరులేవని... అలాంటప్పుడు రెయిన్‌ గన్స్ ఎలా ఉపయోగించుకోవాలని ప్రశ్నించారు. నీరుకొని పంట పండించే స్తోమత లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

రెయిన్ గన్స్ బోగస్ : మధు
అనంతపురం జిల్లాలో వ్యవసాయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు ఆరోపించారు.. రెయిన్ గన్స్ ద్వారా రక్షక తడులివ్వడం బోగస్ కార్యక్రమమని మధు ఆరోపించారు..

రైతుల సమస్యలన్నీ తీర్చాలని మధు ప్రభుత్వాన్ని డిమాండ్
జిల్లాలోని రైతుల సమస్యలన్నీ తీర్చాలని మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. లేకపోతే రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు బంద్‌కు పిలుపునిస్తాయని హెచ్చరించారు.. 

21:38 - August 28, 2016

విజయవాడ : జనసేన అధినేత వపన్‌ కల్యాణ్‌పై టీడీపీ ముప్పేట దాడి ప్రారంభించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనపై ఏపీ ఎంపీలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ వపన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలపై పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అవగాహనాలోపం, అనుభవరాహిత్యంతో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని మండిపడుత్నారు.

ప్రత్యేక హోదా రాజీలేని పోరాటం : చంద్రబాబు
ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ కేంద్రంతో రాజీపడిందని పవన్‌ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోసిపుచ్చారు. హోదా సాధించే వరకు రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు.

పవన కు తిక్క..నాకు పిచ్చి : అవంతి
పవన్ కల్యాణ్‌కు తిక్క ఉంటే తనకు పిచ్చి ఉందని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. టీడీపీ ఎంపీలను ఉద్దేశించి పవన్‌ చేసిన వ్యాఖ్యలపై అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు.

మండిపడ్డ జేసీ
పవన్‌ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై అవాక్కులు, చవాక్కులు మాట్లాడం మానుకోవాలని కోరారు. ఎంపీలు పదవులు పట్టుకుని వేలాడుతున్నారని వపన్‌ చేసిన విమర్శలను దివాకర్‌రెడ్డి తిప్పికొట్టారు.

ప్రత్యేక హోదాపై టీడీపీ రాజీపడలేదు : టీజీ..సోమిరెడ్డి
ప్రత్యేక హోదాపై టీడీపీ రాజీపడలేదని, ఈ విషయంలో పవన్‌ కల్యాణ్‌ పోరాటం చేస్తే మద్దతు ఇస్తామని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌, పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు.

ఆరు నెలలకోసారి ప్రజల ముందుకొచ్చే వపన్‌: విజయసాయిరెడ్డి
మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పవన్‌ వ్యాఖ్యలపై స్పదించారు. ఆరు నెలలకోసారి ప్రజల ముందుకొచ్చే వపన్‌ కల్యాణ్‌ పోరాట పటిమ ప్రజలందరికీ తెలసున్నారు.

పవన్ వ్యాఖ్యల్ని స్వాగతించిన వామపక్షాలు
ఇంకోవైపు పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక హోదా ఉద్యమ కార్యాచరణను సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శలు స్వాగతించారు.

పవన్ వ్యాఖ్యలను పరిశీలిస్తున్న జనసేన నేతలు
తిరుపతి సభలో ప్రత్యేక హోదా విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తోపాటు పార్టీ నాయకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. 

బాబు కన్నెర్ర చేస్తే మోదీ జాన్తానై అంట?!..

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబునాయుడు కన్నెర్ర చేస్తే మోదీ గీడీ ఎక్కడాగుతారంటూ సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. చంద్రబాబు మేధావి, ఏపీకి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు గట్టిగా తలచుకుంటే వచ్చి తీరుందని ఆయన పేర్కొన్నారు. ఆయన తలచుకుంటే వంద ట్రిక్కులు చేయగలడు. ఏపీకి ప్రత్యేకహోదాపై చంద్రబాబుకు ఆసక్తి లేదో ఏమో నాకు అర్థం కావట్లేదు. త్వరలోనే అమరావతి నిజ స్వరూపాన్ని నేను బయటపెడతాను’ అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఉండవల్లి ఇలా పేర్కొన్నట్లుగా సమాచారం.

కవలలకు జన్మనివ్వనున్న యాంకర్..

హైదరాబాద్ : తన గర్భంలో ప్రస్తుతం కవల పిల్లలున్నారని, తమ ఇంట్లో పిల్లల సందడి మొదలవుతుందని మరో వారం రోజుల్లో తల్లి కాబోతున్న స్టార్ యాంకర్ ఉదయభాను చెప్పింది. తమ కుటుంబంలో ఇద్దరు కొత్త వ్యక్తులు రానున్నారనే విషయం తలచుకుంటే ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది. గర్భవతిగా ఉండటం వల్లే తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చానని చెప్పింది. కాగా, పదేళ్ల క్రితంబిజినెస్ మెన్ విజయ్ తో ఉదయ భాను వివాహం జరిగింది.

20:31 - August 28, 2016

మాటల మాంత్రికుడిగా పేరున్న నేత ..కాంగ్రెస్ పార్టీ తరపున రాజమండ్రి నుండి ఎంపీగా పనిచేశారు. తెలివైన..పరిణితి కలిగిన రాజకీయ వేత్త..రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తన మాటల చతురతతో రాష్ట్ర...దేశ రాజకీయాలలో ఆయనదో ప్రత్యేకమైన స్టైల్...ఆయనే ఉండవల్లి అరుణ్ కుమార్..టెన్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యల్ని ఆయన మాటల్లోనే విందాం..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజధాని నగరం అవరావతి నిర్మాణంలో కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయటపెడతాని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ఏపీలో కాంగ్రెస్ కోలుకోవటం అసాధ్యం..
చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాలతో ఆంధ్రప్రదేశ్ ను బలిపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ద్వేషిస్తున్నారన్నారు. ఇప్పట్లో ఏపీలో కాంగ్రెస్ కోలుకోవటం దాదాపు అసాధ్యమన్నారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న అంచనాలు క్రమేపీ సన్నగిల్లుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవటంలేదన్నారు. రానున్న రోజుల్లో ఏపీ భవిష్యత్తు మరింతగా జటిలం కానుందని ఆయన జోస్యం చెప్పారు.అధికారంలో వున్న టీడీపీ ప్రతిపక్షంలో వున్న వైసీపీ రెండు పార్టీలు విఫలమయ్యాయన్నారు. వైసీపీ పార్టీని అనుభవరాహిత్యం వెటాడుతూనే వుందన్నారు. రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలుంటాయని ఉండవల్లి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయం చట్టం లేదనే కారణంతో స్పెషల్ స్టేటస్ ఇవ్వటం కుదరదంటున్న ఎన్డీయే ప్రభుత్వం చట్టంలో వున్న వాటిని కూడా అమలు చేయటంలేదని విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ తో పోలవరం ప్రాజెక్టు పక్కకుపోయే అవకాశాలున్నాయన్నారు.ఉండవల్లి అరుణ్ కుమార్ పేల్చిన మాటల తూటాల్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:04 - August 28, 2016

ఖమ్మం : సెప్టెంబర్‌ 11న రాజమండ్రిలో 13 జిల్లాల కాపుసంఘం నాయకులతో కలిసి భవిష్యత్‌ ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామన్నారు ముద్రగడ పద్మనాభం. ఖమ్మంలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన ఆయన..చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తమ ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.  

20:01 - August 28, 2016

హైదరాబాద్ : ఏపీ ప్రత్యేక హోదా సమస్యకు పరిష్కారంలేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేవదేవుడు ఆదేశిస్తే మినహా ప్రత్యేక హోదాకు మోక్షం లభించదని చెబుతున్నారు. ప్రత్యేక హోదా కోసం పవన్‌ కల్యాణ్‌ ప్రజల్లోకి రావొచ్చిని... అయితే ఉద్యమం పేరుతో విధ్వంసం సృష్టించడం మంచిదికాదని ఆయన సూచించారు. కాగా టీడీపీకి జనసేనల మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి టీడీపీ ఎంపీలతో ఎటువంటి అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

19:57 - August 28, 2016

పశ్చిమగోదావరి : దేవరపల్లిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. దేవరపల్లిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. వాహనాన్ని ఆపినా ఆగకుండా వెళ్లడంతో పోలీసులు గాలిలోకి ఓ రౌండ్‌ కాల్పులు జరిపారు. తప్పించుకు పారిపోతున్న స్మగ్లర్లను పోలీసులు చేజ్‌ చేసి పట్టుకున్నారు. ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 520 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ సేన..

అమెరికా : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లోనూ టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. మ్యాచ్‌లో బిన్నీని పక్కన పెట్టి అమిత్‌మిశ్రాను తుది జట్టులోకి తీసుకున్నారు. కాగా భారత్ జట్టులో  మార్పులు చేర్పులు జరిగాయి.  బౌలర్ స్టూవర్ట్ బిన్నీకి ఈ మ్యాచ్ లో అవకాశం దక్కలేదు. అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా తొలి మ్యాచ్ కు అందుబాటులో లేని విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఈ మ్యాచ్ లోనూ ఆడటం లేదు.

13 టీవీ ఛానెళ్లకు భారీ జరిమానా..

పాకిస్థాన్ : తప్పుడు వార్తా కథనాలను ప్రచురించిన 13 టీవీ ఛానెళ్లకు పాకిస్థాన్ మీడియా వాచ్‌డాగ్ భారీ జరిమానా విధించింది. పాక్ మాజీ క్రికెటర్, ప్రముఖ రాజకీయవేత్త ఇమ్రాన్‌ఖాన్ మూడో పెళ్లికి సంబంధించి తప్పుడు కథనాలు ప్రచురించినందుకు పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ ఒక్కో ఛానెల్‌కు రూ.5 లక్షలు చొప్పున జరిమానా విధించింది. ఇమ్రాన్ ఖాన్‌ పార్టీ పాకిస్థాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ ఫిర్యాదుపై విచారణ జరిపిన పెమ్రా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తప్పుడు వార్తా కథనాలు ప్రచురించరాదనే కారణంతో జరిమానా వేసినట్టు 'పెమ్రా' పేర్కొంది.

టెక్ట్స్ టైల్స్ పార్కులో అగ్నిప్రమాదం..

కరీంనగర్‌ : సిరిసిల్ల టెక్స్‌టైల్స్‌ పార్కులో అగ్నిప్రమాదం సంభవించింది. నూలుకు మంటలు అంటుకోవడంతో అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో అనేక యంత్రాలు దగ్దమయ్యాయి.

ప్రధానితో భేటీ అయిన ఒలింపిక్ విజేతలు..

ఢిల్లీ: ఇవాళ ప్రధాని నరేంద్రమోదీని బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ రజత పతకం విజేత పీవీ సింధు, కోచ్ గోపీచంద్, రెజ్లర్ సాక్షిమాలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూరాయ్ కలిశారు. ఈ సందర్భంగా రియో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచి దేశ ఖ్యాతిని మరోసారి ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన పీవీ సింధు, సాక్షిమాలిక్, దీపాకర్మాకర్‌, జీతూరాయ్ లను ప్రధాని మోదీ అభినందించారు. ఈ నేపథ్యంలో కేంద్ర కీడ్రాశాఖ మంత్రి విజయ్‌గోయల్ ప్రధానితో సమావేశమయ్యారు.

18:51 - August 28, 2016

అనంతపురం : ప్రత్యేక హోదాపై రాజీపడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. శనివారం నాడు తిరుపతిలో జనసేన అధినేత..సినీనటుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ప్రత్యేక హోదాపై మాట్లాడేందుకు సీఎం చంద్రబాబు, ఏపీ ఎంపీలు నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో సోమవారం నాడు సీఎం చంద్రబాబు పర్యటించారు.ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నాపై 25 కేసులు పెట్టారని వాటికే తాను భయపడలేదనీ..ఇప్పుడు ఎవరికీ భయపడాల్సిన పని తనకు లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

పవన్ కు తిక్కుంటే నాకు పిచ్చుంది : అవంతి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎంపీ అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం నాడు తిరుపతిలో జనసేన అధినేత..సినీనటుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు స్పందించిన అవంతి పవన్ కే కాదు మాకూ తిక్కుందన్నారు. ఆరు నెలలకోసారి బయటకొచ్చి మాట్లాడం కాదు..ఆయనకు దమ్ముంటే మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్ చేశారు. 

హోదాకోసం పవన్..కులంకోసం నేను..

ఖమ్మం : సెప్టెంబర్ 11న రాజమండ్రిలో 13 జిల్లాల నాయకులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు చీటింగ్ చేయాలని చూస్తే, తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు గడువిస్తున్నామన్నారు.గడువు లోగా రిజర్వేషన్లపై ప్రకటన చేయకుంటే వచ్చే నెల నుంచి తమ కార్యాచరణను ప్రారంభిస్తామన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా కోసం, తాను కులం కోసం పోరాడుతున్నామని ముద్రగడ పేర్కొన్నారు.

పవన్ కు 'ప్రత్యేక' అభినందనలు: బాబు

అనంతపురం : ప్రత్యేకహోదాపై మాట్లాడిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను అభినందిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక హోదా విషయమై తాను కేంద్రానికి భయపడాల్సిన అవసరం లేదని, ఈ హోదా సాధించే వరకు పోరాటం చేస్తానని అన్నారు. ‘నా జీవితంలో వెనుదిరిగే ప్రసక్తే లేదు. ప్రత్యేకహోదా కోసం గట్టిగా పోరాటం చేస్తున్నానన్నారు.

వరంగల్‌లో నిలిచిపోయిన దురంతో ఎక్స్ ప్రెస్..

హైదరాబాద్‌ : వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో దురంతో రైలు నిలిచిపోయింది. ఏసీలు పనిచేయకపోవడంతో  అధికారులు నిలిపివేసినట్టు తెలిసింది. ప్రయాణికులను ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పంపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

మిట్టపల్లికి చేరుకున్న సీఎం చంద్రబాబు

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం మిట్టపల్లికి చేరుకున్నారు. బైరిపల్లి, గుమ్మిరెడ్డి పల్లిలో పంట సంజీవని గుంతలను పరిశీలించారు. వేరుశెనగ పంటపొలాల్లో జల ఫిరంగుల పనితీరును పరిశీలించారు. అనంతరం వి.కోటలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.

తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

సైకిలెక్కనున్న దేవినేని నెహ్రూ..

విజవాడ : కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ టీడీపీలో చేరే యోచనలో వున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి గుణదలలోని తన నివాసంలో అనుచరులతో నెహ్రూ సమావేశమయ్యారు. కాగా కాంగ్రెస్ యూత అధ్యక్షుడిగా వున్న నెహ్రూ కుమారుడు అవినాష్ ..జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో నారా లోకేష్ తో కూడా ఆయన భేటీ అయ్యారు. 

18:04 - August 28, 2016
17:55 - August 28, 2016

హైదరాబద్ : సి.కళ్యాణ్‌ వల్లే మా నాన్న ఆస్పత్రిలో చేరారన్నారు నిర్మాత నట్టి కుమార్‌ కుమార్తె కరుణ. కళ్యాణ్‌ తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వకుండా.. కుటుంబ సభ్యులపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ తండ్రికి ఏదైనా జరిగితే సి.కళ్యాణ్‌, అశోక్‌కుమార్‌, శివరామకృష్ణలదే బాధ్యత అన్నారు. త్వరలోనే సి.కళ్యాణ్‌ చేసిన అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు కరుణ.

17:52 - August 28, 2016

నల్లగొండ : నయీం కేసులో సిట్‌ బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. నల్లగొండ జిల్లా వలిగొండలో నయీం అనుచరుల ఇళ్లలో సిట్‌ బృందాలు సోదాలు నిర్వహించాయి. గతంలో నయీం నుంచి బైక్‌లను బహుమతిగా పొందిన ఇద్దరు రిపోర్టర్ల కోసం గాలింపు కొనసాగుతోంది. అలాగే భువనగిరిలో జడ్పీటీసీ సందెల సుధాకర్‌ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్‌ నయీం ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. ప్రస్తుతం సుధాకర్‌ పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్నాడు. భువనగిరి జడ్పీటీసీ సందెల సుధాకర్‌ కి సంబంధించిన 10 మంది అనుచరులను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

17:28 - August 28, 2016

మెదక్ : శనివారం నాడు తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చేసిన వ్యాఖ్యల్ని ఆహ్వానిస్తున్నామని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పేర్కొన్నారు. సీపీఎం పార్టీ ఆపవన్ కళ్యాణ్ ఆంతరంగికంగా ఎటువంటి ఉద్ధేశ్యం వుందో తెలీదుగానీ..ఆయన ప్రత్యేకహోదాపై చేసిన వ్యాఖ్యల్ని మాత్రం ఆహ్వానించగినదిని ఆయన పేర్కొన్నారు. వామపక్షాల పోరాటాలపట్ల ఆయన గమనిస్తున్నందుకు సంతోషమన్నారు. గతంతో యూపీఏ ప్రభుత్వం అవలంభించిన విధానాలనే ఇప్పటి ఎన్డీయే ప్రభుత్వం కూడా అవలంభిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం సంస్కరణలను చాలావేగంగా అమలు చేసేందుకు యత్నిస్తోందనీ..దీంతో కార్మికులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందన్నారు. యూపీఏ...ఎన్డీయే ప్రభుత్వాలకు పేరులోనే తప్ప విధివిధానాల్లో ఏమాత్రం తేడా లేదన్నారు.

నేరేడుచర్లలో పేలుడు..ముగ్గురికి గాయాలు..

నల్లగొండ : నేరేడుచర్లలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రంగా గాయాలపాలయ్యారు. దీంట్లో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. గణేష్ ఉత్సవాలకోసం బాణసంచా తయారుచేస్తుండగా పేలుడు జరిగినట్లుగా తెలుస్తోంది. 

సాక్షి పై బాబు ఫైర్ ..

అనంతపురం : సాక్షి పత్రిక రాతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాకు ప్రభుత్వం నీరు ఇవ్వడం లేదంటూ కథనాలు రాయడంపై ఆయన మండిపడ్డారు. కరువుతో అల్లాడుతున్న జిల్లాకు నీరు తెచ్చేందుకు తాను ప్రయత్నిస్తుంటే తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జిల్లాకు నీళ్లు తేవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తుంటే..ఇష్టానుసారంగా, బాధ్యతా రహిత్యంగా పత్రికలో రాస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

16:59 - August 28, 2016
16:56 - August 28, 2016

అనంతపురం : వర్షాభావంతో ఎండిపోతున్న వేరుశనగ పంటను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా రైతులకు హామీ ఇచ్చారు. పంటల పరిశీలనకు ప్రతి నియోజకవర్గానికి ఒక ఐఏఎస్ అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమిస్తామని చెప్పారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం కోటపల్లిలో కరవుతో ఎండిపోయిన పంటలను చంద్రబాబు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. ప్రతి మండలానికి గ్రూప్‌ వన్‌ అధికారికి పంటలు పరిశీలించే బాధ్యతలు అప్పగిస్తున్నామని చెప్పారు. వర్షాభావంతో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు వీరు చర్యలు తీసుకుంటారని చెప్పారు. జిల్లాలోని 31 మండలాల్లో కవరు తీవ్రంగా ఉందని, పంటను కాపాడేందుకు మహారాష్ట్ర నుంచి రెండువేల రెయిన్‌ గన్లు తెప్పిస్తున్నామని హామీ ఇచ్చారు.

16:48 - August 28, 2016

విజయవాడ : గాంధీ, నెహ్రూలు దేశ విభజనకు ఒప్పుకుని ద్రోహం చేశారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాటి పరిస్థితుల్లో వీరు దేశ విభజనకు ఒప్పుకున్నా... ఆ దుష్పరిణామాలను ప్రజలు, పాలకులు ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు.

వవన్ వ్యాఖ్యలకు జేసీ స్పందన..
శనివారం తిరుపతి సభలో పవన్ కళ్యాణ సభా వేదికపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత జేసీ దివాకర్ ఆయన స్టైల్లో స్పందించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేసేందుకు టీడీపీ నేతలు ఎందుకు భయపడుతోందని పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు ముఖ్యమంత్రి అమాయకుడనుకుంటున్నావా..తెలివితక్కువాడనుకుంటున్నావా? ఆయన రాజనీతిజ్ఞుడు కాబట్టే రాష్ట్ర ప్రయోజనాలకోసం సమన్వయంతో ..ఓపికతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మంచితనంతోనే రాష్ట్రానికి నిధులు..ప్రాజెక్టులు రాబట్టుకునేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని పవన్ వ్యాఖ్యలకు సమాధానంగా మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు ఎంతో ఓపికగా..సమర్థవంతంగా సమస్యలను పరిష్కరించుకోవటానికి యత్నిస్తున్నాడని తెలిపారు. ప్రత్యేక హోదా తెస్తానని పవన్ కళ్యాణ్ అంటే ఆయన వెంట తామంతా నడుస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎంపీలు పదవులు పట్టుకుని వేలాడుతున్నారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించడాన్ని దివాకర్‌రెడ్డి తప్పుపట్టారు. టీడీపీ ఎంపీలకు పదవులు ముఖ్యంకాదన్నారు. పవన్ బాబూ నీకు అనుభవం తక్కువ..వయసు తక్కువ ఆయన గురించి తెలీకనే నీవలా మాట్లాడుతున్నావనీ సున్నితంగా విమర్శించారు. 

16:31 - August 28, 2016

తూర్పుగోదావరి : రాజమండ్రికి చెందిన ఓ యువకుడు గిన్నిస్‌ బుక్‌లో స్థానం కోసం సరికొత్త ఫీట్‌ ప్రదర్శించాడు. పొట్టమీద నుంచి ఏకంగా 100 బుల్లెట్‌ వాహనాలు పోనిచ్చి తన సత్తా చాటాడు. ఇప్పటి వరకు గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డులో పొట్టమీద పది బుల్లెట్లు మాత్రమే నడిపించుకున్న రికార్డు ఉంది. రాజమండ్రి 21వ వార్డు కార్పొరేటర్‌ శ్రీనివాస్‌ కుమారుడు ఉజ్వల్‌ పుష్కర్‌ ఘాట్‌ వద్ద 100 బుల్లెట్లతో ఈ ఫీట్‌ ప్రదర్శించాడు. ఉజ్వల్‌ ఇప్పటికే కరాటే, త్వైక్వాండో, ఫైర్‌ ఆర్ట్స్‌ తదితర మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావిణ్యం సాధించాడు.  Watch Full News in Video.

పవన్ వెంట వెళ్ళడానికి సిద్ధమన్న జేసీ..

విజయవాడ : పవన్ బాబూ నీకు అనుభవం తక్కువ..వయసు తక్కువ అందుకే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు అని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. పవన్ కు ముందు నడిచి ప్రత్యేక హోదా కోసం నిలబడితే 'వీ విల్ అప్రిసియేట్ యు' అని ఆయన అన్నారు. మేము ఏ పార్టీకి చెందిన వారైనా నీ వెంట రావడానికి సిద్దంగా ఉన్నాము. పవన్ ప్రజల ముందుకు వచ్చి జిందాబాద్ అనిపించుకుని, మమ్మల్ని మురాదాబాద్ అనిపించడం బాగోలేదు. ప్రత్యేక హోదా విషయమై, ఎంపీలందరూ రాజీనామా చేసినా ప్రధాని నరేంద్ర మోదీ వెంట్రుక కూడా తెగదు’ అంటూ జేసీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

హిమంలో భూప్రకంపనలు..

హిమాచల్‌ప్రదేశ్‌ : భూకంపం సంభవించింది. చంబా ప్రాంతంలో మధ్యాహ్నం 2.49 గంటలకు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయపడి ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదైనట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు.

గోదావరి జిల్లా కుర్రాడి రికార్డు..

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరానికి చెందిన యువకుడు కొమ్మ ఉజ్వల్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. మోస్ట్ బైక్స్ టు రన్ ఓవర్‌ ఏ పర్సన్ విభాగంలో వంద బైక్‌లను ఎక్కించుకుని రికార్డు నెలకొల్పాడు. రాజమండ్రి పుష్కరఘాట్‌లో జరిగిన ఉజ్వల్‌ ప్రదర్శన చేసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

 

పవన్ కే కాదు మాకూ తిక్కుంది : ఎంపీ అవంతి

విశాఖ : పవన్ కళ్యాణ్ పై ఎంపీ అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం నాడు తిరుపతిలో జనసేన అధినేత..సినీనటుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు స్పందించిన అవంతి పవన్ కే కాదు మాకూ తిక్కుంది అన్నారు. ఆరు నెలలకోసారి బయటకొచ్చి మాట్లాడం కాదు..ఆయనకు దమ్ముంటే మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్ చేశారు.  

పవన్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు..

విజయవాడ : ప్రత్యేక హోదాపై రాజీపడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. శనివారం నాడు తిరుపతిలో జనసేన అధినేత..సినీనటుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ప్రత్యేక హోదాపై మాట్టాడేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ నేతలు ఎందురు భయపడుతున్నారని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆయన మాటలకు స్పందించిన చంద్రబాబు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నాపై 25 కేసులు పెట్టారని వాటికే తాను భయపడలేదనీ..ఎవరికీ భయపడాల్సిన పని తనకు లేదన్నారు.

పెద్దమనసుతో ప్రవర్తించాలి : మందకృష్ణ

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణ బిల్లు అంశంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాదిగల పట్ల పెద్దమనసుతో ప్రవర్తించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌ఎఫ్‌ మహాసభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌ శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం మరింత తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురానున్నట్లు చెప్పారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఖిలపక్షాలతో దిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని మందకృష్ణ కోరారు.

15:48 - August 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం... మోస్ట్ ప్రామిసింగ్‌ స్టేట్‌ అవార్డుకు ఎంపికైంది.. ప్రతి ఏడాది సీఎన్ బీసీ టీవీ 18 నిర్వహించే ఇండియా బిజినెస్‌ లీడర్ అవార్డుల్లో భాగంగా ఈ పురస్కారం దక్కింది.. జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకు , పరిశ్రమ, క్రీడా, సామాజిక, కళలు, వినోద రంగాల్లోని విజేతలకు ఏటా సీఎన్ బీసీ గ్రూప్‌ అవార్డులు ప్రదానం చేస్తోంది.. ఈ నెల 30న ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగబోతోంది.. తెలంగాణ తరపున మంత్రి కేటీఆర్‌కు కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ఈ పురస్కారాన్ని అందించబోతున్నారు.. తమ ప్రభుత్వ పాలనకు, పారదర్శకతకు ఈ అవార్డు సాక్ష్యంగా నిలుస్తోందని కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.. 

15:45 - August 28, 2016

కరీంనగర్ : ఏర్పడుతున్న జిల్లాల్లో పనులు ఊపందుకున్నాయి. జిల్లా కేంద్రంలో కార్యాలయాల ఏర్పాటుకు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలో కొత్తగా ఏర్పడబోతున్న జగిత్యాలలో.. ప్రభుత్వ కార్యాలయాల కోసం అధికారులు భవనాలను పరిశీలిస్తున్నారు. న్యాక్‌ కేంద్రంలో కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఊపందుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ..
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఇందులో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పడుతున్న ప్రాంతాల్లో కార్యాలయాల కోసం భవనాల పరిశీలన జరుగుతోంది. కరీంనగర్‌ జిల్లాలో కొత్తగా ఏర్పడుతున్న జగిత్యాలలో నూకపెల్లి శివారులోని న్యాక్‌ కేంద్రంలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.

పాడైన పాత భవనాలు..
తొలుత ఈ కార్యాలయాలను థరూర్‌ క్యాంప్‌ ఎస్సారెస్పీ భవనాల్లో ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే... భవనాలు పాతబడటం.. వాటి మరమ్మతులకు చాలా నిధులు వెచ్చించాల్సి రావడంతో.. అన్ని సౌకర్యాలున్న న్యాక్‌ కేంద్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జగిత్యాలకు 10 కిలోమీటర్ల దూరంలోని న్యాక్‌ భవనానికి అర్భన్‌ కాలనీ నుంచి రహదారి వేసేందుకు అంచనాలు రూపొందించాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు ఆదేశాలందాయి. మరోవైపు ఉన్నతాధికారుల నివాసాలను జగిత్యాలలో ఏర్పాటు చేయనున్నారు. ఇక జిల్లా పాలనాధికారి క్యాంప్‌ కార్యాలయం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేస్తుండగా.. పంచాయతీరాజ్‌ విశ్రాంతి భవనంలో సబ్‌కలెక్టర్‌ నివాసం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అంతేకాకుండా ఇతర ఉన్నతాధికారుల నివాసాల కోసం పలు భవనాలను పరిశీలిస్తున్నారు.

జిల్లా కార్యాలయాలపై స్పష్టత కోరుతున్న స్థానికులు
పోలీసు మినహా అన్ని శాఖల కార్యాలయాలు నూకపల్లిలోనే ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. డీఎస్పీ కార్యాలయాన్ని పోలీసు విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అయితే.. కలెక్టర్‌ వెంటనే జిల్లా కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

జగిత్యాల జిల్లాగా ఏర్పడ్డంతో స్థానికుల హర్షం..
జగిత్యాలను కొత్తగా జిల్లా ఏర్పాటు చేస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. జిల్లా కేంద్ర కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారో త్వరగా స్పష్టం చేయాలంటున్నారు.

15:40 - August 28, 2016

విశాఖ : చీకటి పడితే విన్పిస్తున్న శబ్దాలు... పగలు రాత్రి లేదు.. భయంతో వణుకుతున్నారు...ఏ చిన్న శబ్దం విన్పించినా హడలిపోతున్నారు..వారంతా విద్యార్థులు ..చదువుకుంటున్నవారిలో మూఢనమ్మకం పెరిగిపోయింది..దెయ్యాలున్నాయన్న భయంతో విద్యార్థినీలు పారిపోతున్న ఘటన విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో కలకలం రేపుతోంది. ఎప్పుడేం జరుగుతుందోనని గుబులు..

కస్తూర్భా బాలికల పాఠశాలలో దెయ్యం పుకార్లు..
ఇది విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి పంచాయతీలోని కస్తూర్భా బాలికల పాఠశాల. ఇక్కడ 180 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. కొన్ని రోజులుగా ఓ భయం వీరిని వెంటాడుతోంది. రాత్రి పగలు తేడాలేకుండా హాస్టల్‌లో ఉండాలంటేనే విద్యార్థినులు హడలెత్తిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనచెందుతున్నారు.

దెయ్యం దాడి చేస్తుందంటూ పరుగులు
ఇక హాస్టల్‌లో విద్యార్థినులు రాత్రిపూట వింతగా ప్రవర్తిస్తున్నారు. దెయ్యాలు తమపై దాడి చేస్తున్నాయని అరుపులు కేకలు పెడుతున్నారు. స్కూల్లో దెయ్యం తిష్టవేయడం వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పుకుంటున్నారు.

30 మంది విద్యార్థినులు పరారీకి యత్నం
విద్యార్థినులకు చదువు కన్నా దెయ్యం గురించి మాట్లాడుకోవడమే ఎక్కువైంది. హాస్టల్‌లో ఇదే విషయాన్ని పదే పదే చర్చించుకుని క్షణక్షణం భయం భయంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో 9, 10 తరగతులకు చెందిన కొంతమంది విద్యార్థినులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన స్కూల్‌ యాజమాన్యం 10 మంది విద్యార్థినులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మరోవైపు నిజాలు నిగ్గుతేల్చేందుకు విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. దెయ్యం భయంతో చేస్తున్నారా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. 

15:30 - August 28, 2016

హైదరాబాద్ : సంచలనాలు కలిగిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌కు కీలక బాధ్యతలు ఇచ్చినప్పటికీ... పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురౌతున్నాయి. పోలీసు స్టేషన్‌ సౌకర్యం లేకపోవడంతో సిట్‌ అధికారుల బృందం దర్యాప్తులో స్థానికంగా ఉన్న పీఎస్‌లపైనే ఆధారపడాల్సి వస్తోంది. దశాబ్దకాలంగా నయీం ఆగడాలకు వెన్నుదన్నుగా నిలిచిన పోలీస్‌స్టేషన్లకు వెళ్లేందుకు ఫిర్యాదుదారులు సుముఖత చూపడం లేదు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులనే బుట్టదాఖల చేసిన స్టేషన్‌ ఇన్‌ఛార్జీలు ప్రస్తుతం కూడా ఇదే వైఖరిని అనుసరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో చాలా కేసులు సిట్‌ దృష్టికి రావడం లేదు.

పోలీసు స్టేషన్‌ హోదాలేని సిట్‌...
గ్యాంగ్‌స్టార్‌ నయీం ఆధిపత్యం కొనసాగిన రోజుల్లో బాధితులకు స్టేషన్లలో ఏమాత్రం న్యాయం జరిగేది కాదు. కనీసం ఫిర్యాదు కూడా స్వీకరించే వారు కాదు. ఇప్పుడు నయీం రక్త చరిత్రకు తెరపడింది. బాధితులు స్వేచ్ఛగా ఫిర్యాదు చేయాలని సిట్‌ అధికారులు ప్రకటనలు జారీ చేశారు. అయితే... వాస్తవానికి మాత్రం ఇప్పటికీ బాధితులకు న్యాయం జరగడం లేదు. సిట్‌కు పోలీసు స్టేషన్‌ హోదాలేదు... కాబట్టి కేసులు నమోదు చేసే అధికారం ఉండదు. దీంతో ఎవరైనా బాధితులు సిట్‌ కంట్రోల్‌ రూంకు ఫిర్యాదు చేస్తే సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి వివరాలు తెలియజేయాలని సలహా ఇస్తున్నారు. సిట్‌ సూచన మేరకు పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బాధితులకు అక్కడ ఇబ్బందులు ఎదురౌతున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు స్టేషన్‌లో ఉన్న సీఐలు నిరాకరిస్తున్నారు. వేర్వేరు కారణాలు చూపించి ఫిర్యాదు తీసుకోకుండా పంపించి వేస్తున్నారు.

కేసు నమోదు చేసే అధికారం లేని సిట్ ..
నయీం... భువనగిరిలో ఒక స్థలాన్ని కబ్జా చేశాడు. స్థలం జోలికి వస్తే ప్రాణాలు పోతాయని హయాత్‌నగర్‌లోని గెస్ట్‌హౌస్‌కు పిలిచి హెచ్చరించాడు. నయీం ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో అప్పట్లో స్టేషన్‌కు వెళ్లినా బాధితుడికి ఫలితం కనిపించలేదు. ప్రస్తుతం సిట్‌ సలహా మేరకు స్టేషన్‌కు వెళ్తే... 'మీ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయండి' అని సూచిస్తున్నారు. సరేనని ఆస్తులు ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్తే... ఎక్కడైతే నయీం బెదిరించాడో అక్కడికి వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. ఈ విషయాన్ని మళ్లీ సిట్‌ దృష్టికి తీసుకొస్తే... తమకు కేసు నమోదు చేసే అధికారం లేదని... ఏదో ఒక స్టేషన్‌లో కేసు పెట్టాలని సూచిస్తున్నారు. ఇలా క్షేత్రస్థాయిలో నయీం బాధితులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మహిళ నుంచి కేసు స్వీకరించని పోలీసులు..
ప్రస్తుతం సిట్‌కు పోలీసు స్టేషన్‌ హోదా లేకపోవడంతో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటే ఏదో ఒక పీఎస్‌ను ఉపయోగించుకోవాలి. కేసును దర్యాప్తు చేసే బాధ్యత ప్రస్తుతం ఆయా పోలీసు స్టేషన్లకు మాత్రమే ఉంది. సిట్‌కు కేవలం సమన్వయం చేసే అధికారం మాత్రమే ఉంది. దీంతో స్టేషన్ల సిబ్బంది కష్టపడి దర్యాప్తు చేస్తే గుర్తింపు మాత్రం సిట్‌కు వస్తుంది. పైగా ఎప్పటి నుంచో నయీం అనుచరులతో కిందిస్థాయి సిబ్బందికి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఇప్పటికీ నయీంకు వ్యతిరేకంగా కేసుల నమోదుకు ఆసక్తి చూపించడం లేదు. ఆదిభట్ల పీఎస్‌లో ఒక మహిళ నయీంపై కేసు పెట్టేందుకు వెళ్తే... మూడు గంటల పాటు స్టేషన్‌లోనే ఉంచి... ఆమె నుంచి కేసు తీసుకోకుండానే పంపించారు. ఇలాంటి ఘటనలను రంగారెడ్డి, సైబరాబాద్‌, నల్గొండ జిల్లాల్లోని పలు స్టేషన్లలో బాధితులు ఎదుర్కొంటున్నారు. సిట్‌కు పోలీసు స్టేషన్‌ హోదా కల్పిస్తే... క్షేత్రస్థాయిలో కేసు దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. నయీం బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందని అంతా భావిస్తున్నారు. 

15:21 - August 28, 2016

హైదరాబాద్ : దేశసరిహద్దులో ఉన్న సైనికుల త్యాగాల ఫలితంగానే ఇవాళ దేశం సురక్షితంగా ఉందని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. కార్గిల్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పేరేడ్‌ మైదానంలో అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులర్పించారు. దత్తాత్రేయతో పాటు సైనికాధికారులు, మాజీ సైనికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

15:12 - August 28, 2016

ఆదిలాబాద్ : తెలంగాణలో వర్షాలు మొకం చాటేయడంతో ఆదిలాబాద్ జిల్లాలో పంటపొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఆగస్టు నెలంతా వర్షాల్లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పత్తి, సోయా, పెసర పంటలు ఎండిపోతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

15:09 - August 28, 2016

విజయవాడ : సెప్టెంబర్2 న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు వామపక్షాలు మద్దతిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు తెలిపారు. విజయవాడలోని శ్రీ శ్రీ భవన్ లో విద్యుత్ అమరవీరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యుత్ ఛార్జీల పెంపునపై శాంతియుత ఆందోళన చేస్తుంటే అప్పటి టిడిపి ప్రభుత్వం కాల్పుల ద్వారా ఉద్యమాన్ని అణచి వేయాలని చూసి ముగ్గురిని బలి తీసుకుందన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీ కరణ చేస్తే ఉద్యమాల ద్వారా అడ్డుకుంటామని బాబురావు హెచ్చరించారు.

15:04 - August 28, 2016

విశాఖపట్నం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరు నెలలకోసారి ప్రజల ముందుకు వచ్చి నామమాత్రంగా బీజేపీ-టీడీపీలను విమర్శిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇంతవరకు పవన్ ఎందుకు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పై పోరాడే విషయంలో పవన్ లో స్పష్టత కనిపించడం లేదని విజయసాయిరెడ్డి అన్నారు.

 

15:02 - August 28, 2016

విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. విభజన బిల్లులోని అంశాలను పక్కన బెట్టి, ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కుదరదని చెప్పుతున్న వెంకయ్యనాయుడిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించినట్లుగా ఏపీ ఎంపీలందరూ పోరాడేవారు కాదన్నారు. అందరూ పారిశ్రామికవేత్తలేనని, అందుకే ఎవరికీ రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని రామకృష్ణ ఆరోపించారు. 

14:54 - August 28, 2016

విజయవాడ : శనివారం తిరుపతి సభలో పవన్ కళ్యాణ సభా వేదికపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత జేసీ దివాకర్ ఆయన స్టైల్లో స్పందించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేసేందుకు టీడీపీ నేతలు ఎందుకు భయపడుతోందని పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు ముఖ్యమంత్రి అమాయకుడనుకుంటున్నావా..తెలివితక్కువాడనుకుంటున్నావా? ఆయన రాజనీతిజ్ఞుడు  కాబట్టే రాష్ట్ర ప్రయోజనాలకోసం సమన్వయంతో ..ఓపికతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మంచితనంతోనే రాష్ట్రానికి నిధులు..ప్రాజెక్టులు రాబట్టుకునేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని పవన్ వ్యాఖ్యలకు సమాధానంగా మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు ఎంతో ఓపికగా..సమర్థవంతంగా సమస్యలను పరిష్కరించుకోవటానికి యత్నిస్తున్నాడని తెలిపారు. ప్రత్యేక హోదా తెస్తానని పవన్ కళ్యాణ్ అంటే ఆయన వెంట తామంతా నడుస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎంపీలు పదవులు పట్టుకుని వేలాడుతున్నారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించడాన్ని దివాకర్‌రెడ్డి తప్పుపట్టారు. టీడీపీ ఎంపీలకు పదవులు ముఖ్యంకాదన్నారు. పవన్ బాబూ నీకు అనుభవం తక్కువ..వయసు తక్కువ అందుకే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు. 

ఆరు నెలలకోసారి బయటకొచ్చి మాట్లాడ్డం కాదు : విజయసాయిరెడ్డి

విశాఖ: ప్రత్యేక హోదాపై పవన్‌కల్యాణ్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఆరునెలలకు ఒకసారి బటయకొచ్చి పవన్భ మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు ప్రజలను విడదీసిన కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాన్ తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపవని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

గంజాయి స్మగ్లర్లపై పోలీసులు కాల్పులు..

పశ్చిమగోదావరి : క్రమంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను వెంబడించిన పోలీసులు వారిపై ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి దేవరాపల్లి మండలంలో చోటు చేసుకుంది. గంజాయిని డీసీఎం వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్లను విజయవాడ పోలీసుల సహకారంతో పశ్చిమ గోదావరిలోని మూడు మండలాల పోలీసులు పక్కా సమాచారంతో జాయింట్ ఆపరేషను నిర్వహించి నిందితులను సినీఫక్కీలో వెంబడించారు. వారు ఎంత సేపటికి ఆగకపోవడంతో గాలిలోకి ఒక రౌండు కాల్పుల జరిపారు.

నగర శివారులో భారీ చోరీ..

రంగారెడ్డి : శంకర్‌పల్లిలో భారీ చోరీ జరిగింది. 20 ఇండ్లలో చోరీకి పాల్పడిన దొంగలు 20 తులాల బంగారం, 70 తులాల వెండి, రూ. లక్ష నగదును అపహరించారు. బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన నివాసాలను పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అనంత, చిత్తూరులో అత్యవసర పరిస్థితి - బాబు..

అనంతపురం : అనంత, చిత్తూరు జిల్లాలో అత్యవసర పరిస్థితిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జిల్లాలో కరవును గుర్తించడంతో ఆలస్యమైందన్నారు. జిల్లాలో విపత్తు దర్భాల్లో తీసుకొనే చర్యలు చేపడుతామని, నియోజకవర్గాల్లో ఐఏఎస్ అధికారితో సహా రెండు మండలాలలో గ్రూప్ 1 అధికారిని నియమిస్తామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని తెలిపారు. ఫైరింజన్లు, వాటర్ ట్యాంకులు..ఫారం పాండ్ల ద్వారా ఎండిన పంటలను ఆదుకుంటామన్నారు. 

నిజామాబాద్ కు బయలుదేరిన కేసీఆర్..

మెదక్ : ఫాం హౌస్ నుండి సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాకు బయలుదేరారు. బాల్కొండ ఎమ్మెల్యే, తెలంగాణ వాటర్ గ్రిడ్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ప్రశాంత్‌రెడ్డిని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ వేల్పూరు మండల కేంద్రానికి వెళ్ళారు.

షాబాద్ లో అఖిలపక్షం రాస్తారోకో..

రంగారెడ్డి : జిల్లా షాబాద్ మండలం సర్ధార్ నగర్ వద్ద అఖిలపక్షం నాయకులు రాస్తారోకో చేపట్టారు. షాబాద్ మండలాన్ని శంషాబాద్ లో చేర్చాలని వీరు ఆందోళన చేపట్టారు. 

దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన..

తూర్పుగోదావరి : దివీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జిల్లాలోని తొండంగి మండలం వాకదారిపేటలో ఆందోళన చేపట్టారు. 

13:31 - August 28, 2016

విశాఖపట్టణం : సెప్టెంబర్ 2వ తేదీన జరిగే దేశ వ్యాప్త సమ్మెకు విశాఖ స్టీల్ సిటీ సన్నద్ధమవుతోంది. స్టీల్ ప్లాంట్‌లోని ప్రధాన కార్మిక సంఘాలు అయిన ఐఎన్టీయూసీతో పాటుగా సీఐటీయు, ఏఐటీయూసీ , వైసీపీ ట్రేడ్ యూనియన్ ఇతర కార్మిక సంఘాలన్నీ కలిసి సంయుక్త కార్యాచరణ రూపొందించుకున్నాయి. ఈ సందర్భంగా టెన్ టివితో వివిధ కార్మిక సంఘ నేతలు మాట్లాడారు. సమ్మె జయప్రదం చేయడానికి తీసుకుంటున్న కార్యచరణ..ప్రభుత్వం చేపడుతున్న వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం..తదితర అంశాలపై వారు మాట్లాడారు. వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:28 - August 28, 2016

కరీంనగర్ : జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మహదేవపూర్‌ మండలంలోని బెగ్లూరు గ్రామంలో విషజ్వరాలు విజృంభించడంతో ఇప్పటికే గ్రామంలో 15మంది మృత్యువాత పడ్డారు. గ్రామం పరిస్థితిని తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌, స్థానిక ఎమ్మెల్యే గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అయినా గ్రామంలో మాత్రం పరిస్థితులు మారలేదు. ప్రతి ఇంట్లో విషజ్వరంతో బాధపడుతూ కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

చర్యలు తీసుకున్నాం - డీఎంఅండ్ హెచ్ వో...
ఈ సందర్భంగా డీఎంఅండ్ హెచ్ వో అధికారి రాజేష్ టెన్ టివితో ఫోన్ లో మాట్లాడారు. వైరల్ ఫీవర్ గా ఎక్కువగా వస్తున్నాయని, ఆగస్టు 4వ తేదీ నుండి వైద్య బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల దోమలు..వైరస్ బ్యాక్టీరియ వృద్ధి చెందుతోందన్నారు. మండలం పరంగా 11 మంది మృత్యువాత పడ్డారని, జిల్లా వ్యాప్తంగా 15 మంది మృతి చెందారన్నారు. వెంటనే తాము మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పరీక్షలు చేయడం జరుగుతోందన్నారు. 

13:25 - August 28, 2016

మెదక్ : విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు ఆరోపించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో '25 ఏళ్ల సంస్కరణలు-కార్మికులపై ప్రభావం' అంశంపై సదస్సు జరిగింది. ఈ సెమినార్‌కు రాఘవులు ముఖ్య అతిథిగా హజరయ్యారు. బషీర్ బాగ్ విద్యుత్ అమరవీరుల త్యాగాలను మరిచిపోలేమని రాఘవులు అన్నారు.

13:23 - August 28, 2016

హైదరాబాద్ : కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సీపీఐ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శలు చేశారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ సర్కార్‌కు వ్యతిరేకంగా వామపక్షాలంతా కలిసి భవిష్యత్తు కార్యచరణ ప్రకటించి.. ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. 

13:22 - August 28, 2016

హైదరాబాద్ : గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ర్టంలో ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలు కొనసాగుతున్నాయని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. బషీర్ బాగ్ ప్రెస్‌ క్లబ్‌లో... 'ప్రజా ఉద్యమాలు- ప్రభుత్వ అణిచివేత' అంశంపై సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షాలన్నీ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వామపక్షాలతో కలిసి వచ్చే.. వారిని కలుపుకొని ముందుకు వెళ్లాలని కోరారు. 

13:19 - August 28, 2016

హైదరాబాద్ : మహారాష్ట్రలో తెలంగాణ హక్కులను తాకట్టుపెట్టి ..టీఆర్‌ఎస్ నేతలు విజయోత్సవ సభలు జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి అన్నారు. మహా ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై భారం పడుతుందన్నారు. అబద్ధాలు చెప్పడంలో మామ, అల్లుళ్లు పోటీ పడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు.

 

నాచారంలో సదస్సు..హాజరైన ప్రొ.కోదండరాం..

హైదరాబాద్ : నాచారంలో తెలంగాణ అభివృద్ధి నమూనా - తెలంగాణ జేఏసీ ఆలోచన అంశంపై రాష్ట్ర సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు ప్రొ.కోదండరాం, వివిధ జిల్లాల జేఏసీ కన్వీనర్ లు హాజరయ్యారు. 

ఆమడుగూరులో బాబు పర్యటన...

అనంతపురం : ఆమడుగూరులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అక్కడ వేరుశనగ పంట పొలాలను ఆయన పరిశీలిస్తున్నారు. ఆయన వెంటనే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారు. 

యూటీఎఫ్ కార్యాలయంలో వైద్య రంగంపై సదస్సు..

హైదరాబాద్ : యూటీఎప్ కార్యాలయంలో వైద్య రంగంపై రాష్ట్ర సదస్సు జరిగింది. ఐద్వా, డీవైఎఫ్ఐ, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేరళ సీపీఎం ఎంపీ శ్రీమతి హాజరయ్యారు. జస్టిస్ చంద్రకుమార్, హరగోపాల్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ తదితరులు హాజరయ్యారు. 80 శాతం వైద్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారానే అందాలని, ఏజెన్సీ ప్రాంతాలకు ప్రాధాన్యతనిచ్చి సిబ్బంది, మందులను కేటాయించాలని సూచించారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడిని నియంత్రించాలని పేర్కొన్నారు. 

12:47 - August 28, 2016

విజయవాడ : పవన్ వ్యాఖ్యలపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు స్పందించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ స్పందనను స్వాగతిస్తున్నామని, కమ్యూనిస్టుల ఉద్యమాలపై పవన్ స్పందన బాగుందన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి అధ్యాత్మిక కార్యక్రమాల్లో పబ్బం గడుపుతోందన్నారు. ఆవు సంరక్షణ పేరిట బీజేపీ తీరును తప్పుబట్టారని, తనకు కులం..మతం..ప్రాంతీయయతత్వం లేదని పవన్ పేర్కొనడం జరిగిందని, దీనిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిస్టులంటే తనకు ఇష్టమని, కమ్యూనిస్టులు చేసే కార్యక్రమాలు బాగున్నాయని తెలపడం జరిగిందని, ప్రత్యక్ష ఉద్యమాల్లో పవన్ పాల్గొంటే బాగుంటుందన్నారు. 

12:43 - August 28, 2016

తల్లి రొమ్ము తెలువని..నా పెదవుల మీద..తడి ఆరని చనుబాల చారిక..పుండయి సలిపిన పసితనాన్ని ప్రేమగా పునికిన..ఫకీరు నెమలి ఈక....గుండె చెమర్చిపోయేలా చేసే ఈ వాక్యాలు.. నారాయణస్వామి ప్రచురించిన వానొస్తద అనే కొత్త కవితల పుస్తకంలొనివి. కల్లోల కలల మేఘం తో కవిత్వావరణంలోకి అడుగుపెట్టారు. అప్పుడు పెనుగాలులై వీచి.. జడివానలై కురిసి నల్లమబ్బులై విరిసి కవిత్వాక్షరాలుగా తనను తాను ఆవిష్కరించుకున్న నారాయణస్వామి... అమెరికాలో స్థిరపడిన తరువాత తన మూలాలను వెతుక్కుంటూ జ్ఞాపకాలతో మూటగట్టిన సందుకను రెండో పుస్తకంగా ప్రచురించారు. తాజాగా తెలంగాణ ఉద్యమంలోని సామూహిక వ్యక్తీకరణను.. వెలివాడల ఆత్మాభిమానాల దురాక్రమణలను ప్రశ్నిస్తూ.. ఒక్కొక్క పెంకును దగ్గర చేర్చి కొత్తకుండను చేసే చూపుల కోసం... వానొస్తద అంటూ ఒక ఆశగా వ్యక్తమయ్యారు తన మూడో పుస్తకంలో.. విప్లవ విద్యార్థి దశ ఆయన సాగించిన మూడు దశాబ్దాల కవిత్వయానంలోని మలుపులేవో... నడిపించిన అడుగులేవే తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

12:40 - August 28, 2016

హైదరాబాద్ : మహా ఒప్పందాలు తెలంగాణకు మేలా..? చేటా..? ఇప్పుడు రాష్ట్రంలో ఇదే చర్చ. ఈ ఒప్పందాన్ని చరిత్రాత్మకం అని పాలక పక్షం కాలర్‌ ఎగరేస్తుంటే.. దీన్ని చీకటి ఒప్పందమంటూ విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ రెండు పక్షాల వాదనల్లో నిజమెంత..? ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలేంటి..? వచ్చి పడే నష్టాలేంటి..? 10టీవీ ప్రత్యేక కథనం..

తుమ్మిడిహట్టి 152 అడుగులు..
తుమ్మిడిహట్టి ఎత్తు 152 అడుగులకు బదులు 148 అడుగులకు అంగీకారం..!కేసీఆర్‌ నిర్ణయం వల్ల తెలంగాణకు ఒరిగేదేంటి..? మహా ఒప్పందం వల్ల ఎవరికి లాభం..? రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్న వాదోపవాదనలివి. మహారాష్ట్రతో ఒప్పందాన్ని చరిత్రాత్మకం అంటున్న కేసీఆర్‌ సర్కారు.. నీటికోసం యుద్ధాలు జరగకుండా నివారించామని చెప్పుకుంటోంది. పైగా సామరస్యంతో రైతులకు సాగునీటిని ఇచ్చే పరిస్థితిని తెచ్చామంటోంది. కానీ విపక్షాలు మాత్రం..తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కేసీఆర్‌ మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం అంశంపై పాలక, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం తారాస్థాయిలో జరుగుతోంది.

మహారాష్ట్రతో చర్చలు...
తుమ్మిడిహట్టి బ్యారేజీని 152 అడుగుల ఎత్తుతో నిర్మించాలన్నది చాలా కాలం నుంచీ ఉన్న ప్రతిపాదన. కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలోనే దీనికి సంబంధించి మహా ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. అయితే 152 అడుగుల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే.. తమ ప్రాంతంలో చాలా భాగం ముంపునకు గురవుతుందని.. భూసేకరణ, పునరావాస కల్పన తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయన్న భావనతో.. మహా సర్కారు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ బ్యారేజీ ఎత్తును 148 అడుగులకే అంగీకరిస్తూ కేసీఆర్‌ సర్కారు ఒప్పందం కుదుర్చుకు వచ్చింది. అందుకు ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మించేందుకు ప్రతిపాదించింది. అక్కడి నుంచి షేక్ హ్యండ్ బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు ప్రణాళికలు తయారు చేసింది.

విపక్షాల ప్రశ్నలు...
తుమ్మడిహట్టికి సంబంధించి మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం చారిత్రకం ఎలా అవుతుందన్నది విపక్షాల ప్రశ్న. మహా సర్కారు చెప్పినట్లల్లా తలాడించడం ఏమేరకు చరిత్రాత్మకం అని విపక్షాలు సర్కారును నిలదీస్తున్నాయి. పైగా 148 అడుగుల ఎత్తు కారణంగా.. తుమ్మిడిహట్టి వద్ద నీటి సేకరణ ఇబ్బందిగా మారే ప్రమాదం లేకపోలేదని నిపుణులూ హెచ్చరిస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు సాధ్యమే కాదని కేసీఆర్ నియమించిన రిటైర్డ్ ఇంజనీర్ల బృందం కూడా నివేదించడం గమనార్హం.

వేల కోట్ల దోపిడి అంటున్న కాంగ్రెస్...
గత ప్రభుత్వాల హయాంలో 152 అడుగుల ఎత్తుతో నిర్మాణం చేపట్టాలని ప్రయత్నిస్తే.. కేసీఆర్‌ సర్కారు ప్రాజెక్టును 148 అడుగుల ఎత్తుతోనే నిర్మించేందుకు అంగీకరించి వచ్చారన్నది కాంగ్రెస్‌ పక్షం వాదన. ప్రాజెక్టుల పేరిట రాష్ట్రంలో వేలకోట్ల దోపిడి జరుగుతోందన్నది కూడా ప్రతిపక్ష కాంగ్రెస్‌ వాదన. కానీ తుమ్మడిహట్టి ప్రాజెక్టు ఎత్తు అంశంలో నెలకొన్న స్తబ్ధతను తాము తొలగించడం చరిత్రాత్మకమేనని పాలక పక్షం వాదిస్తోంది. సుదీర్ఘ కాలంగా ప్రాజెక్టు అంశం పెండింగ్‌లో పడిందని.. తాము సామరస్యంతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల.. సమస్య శాశ్వతంగా పరిష్కారమైందంటూ సీఎం విమర్శకులకు సమాధానం ఇస్తున్నారు. కాంగ్రెస్‌ నేతల ఆరోపణలను నిరూపించాలంటూ ఘాటైన పదజాలంతో సవాల్‌ విసిరారు. అయితే.. ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ఒప్పందం చేసుకోవడం అనేది తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మహారాష్ట్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టడమే అవుతోందని, ఆర్థిక భారం తప్పా ఎలాంటి ప్రయోజనం ఉండదని విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

ఒప్పందం చరిత్రాత్మకమా ? 
ప్రభుత్వం చెబుతున్నట్లు.. అసలు ఈ ఒప్పందం చరిత్రాత్మకమా...? ప్రతిపక్షాలు ఆరోపిస్టున్నట్లు చారిత్రక తప్పిదమా...? ఈ ఒప్పందంలో వాస్తవాలెలా ఉన్నాయి..? దాదాపు నాలుగు దశాబ్దాలుగా నానుతున్న సమస్యకు ఇప్పుడు జరిగిన ఒప్పందమే పరిష్కారామా..? ఇంతకీ ఏది నిజం..! మహా ఒప్పందంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాదనలు తీవ్ర స్థాయికి చేరాయి. ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే జైలుకు పంపేందుకు కూడా వెనుకాడనని సీఎం ఘాటుగానే హెచ్చరించగా, విపక్షాలు సైతం దేనికైనా సిద్ధమన్న సంకేతాలిచ్చేలా విమర్శలకు దిగాయి. ప్రాజెక్టులకు సంబంధించి వాస్తవాలను చూస్తే... ప్రాణహిత నది గోదావరి బేసిన్ లోని 8 జీ పరిధిలోకి వస్తుంది. 160 టీఎంసీల నీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వాడుకోవచ్చని గతంలోనే గోదావరి బేసిన్‌లోని నాలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. దీనికి సంబంధించి 1975లో అప్పటి ముఖ్యమంత్రుల మధ్య ఓ ఒప్పందం కూడా జరిగింది. నీటి వినియోగం కోసం జరిగిన ఒప్పంద వివరాలను ఆ తర్వాత ఏర్పాటైన బచావత్‌ అవార్డులో పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాలంలో తెరపైకి వచ్చిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టు నిర్మాణం వివాదంగా మారింది.

83వేల కోట్లు...
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ఒప్పందానికి రావడానికి అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహన్ తో డిల్లీలో భేటీ అయిన కిరణ్ కుమార్ రెడ్డి 152 అడుగుల ఎత్తును ప్రతిపాదించారు. కానీ మహారాష్ట్ర సర్కారు అంగీకరించలేదు. ఈ లోపు జరిగిన రాష్ట్ర విభజన ఉద్యమం వల్ల అది వెనక్కి పోయింది. ఎన్నికల్లో ప్రాణహిత ముంపు ప్రాంతం నుంచి పోటీ చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంపు లేకుండా చూస్తానని సంబంధిత ప్రజలకు హామీ ఇచ్చారు. మహారాష్ట్ర సర్కారుకు మాత్రమే మేలు చేసేలా ఉన్న ఈ ఒప్పందం తెలంగాణకు ఎలాంటి లబ్ధి చేకూర్చకపోగా.. ఆర్థిక భారంగా మారే అవకాశమూ ఉందనేది నిపుణుల వాదన. 38 వేల కోట్ల అంచనాతో ప్రారంభమైన ప్రాజెక్టు ఇప్పటికే 83 వేల కోట్లకు చేరిందని, ఇక ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కనీసం ఎనిమిదేళ్లు పట్టే అవకాశం ఉందని నిపుణుల వాదన. అప్పటికి ప్రాజెక్టు వ్యయం లక్షకోట్లకు చేరే అవకాశం ఉందని, వెరసి ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఆర్థిక భారం తీవ్రమయ్యే అవకాశమూ కనిపిస్తోంది.  

12:33 - August 28, 2016

చిత్తూరు : తిరుమలేశుని పరమ భక్తాగ్రేశ్వరుడు.. హథీరాం బాబా మఠం ఆస్తులు కబ్జాకు గురవుతున్నాయి. ఇప్పటికే హథీరాం బాబా మఠానికి చెందిన వేల ఎకరాలు.. కబ్జా కోరుల కోరల్లో చిక్కి రూపురేఖలు మారిపోయాయి. దాదాపు ఏడు వందల ఎకరాల భూములను కబ్జా చేసిన భూబకాసురులు...రాత్రికి రాత్రే కబ్జా చేసిన భూముల్లో వాలిపోయి.. తెల్లారగానే కోర్టు ఆదేశాలను తెచ్చుకుని దర్జా వెలగబెడుతున్నారు. ఇప్పటికైనా కోట్ల విలువైన మఠం భూములను కాపాడకపోతే.. ఈ ఆక్రమణల పరంపర ఇలాగే కొనసాగే ప్రమాదం ఉందని భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ జాగ కనబడితే కబ్జా...గజం భూమి ఉన్నా ఆక్రమణ..కబ్జాకోరుల చేతుల్లోకి ఏడు వందల ఎకరాల మఠం భూములు ఇదీ.. హథీరాం బాబాజీ మఠం భూముల స్వాహా అయిన వ్యవహారం. వందల సంవత్సరాల చరిత్ర గల హథీరాం బాబాజీ మఠానికి వేల ఎకరాల భూములు ఉన్నాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో సైతం వందలాది ఎకరాల భూములు ఉన్నాయి. ఇప్పుడా భూముల్లో వందల ఎకరాల కబ్జా కోరుల చేతుల్లో ఆక్రమణకు గురయ్యాయి. కోట్లాది రూపయాల విలువైన ఈ భూములు భారీగా కబ్జాకు గురైనా ప్రభుత్వం, అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండి పోతున్నారు.

విజయనగరం...
విజయనగర సామ్రాజ్య హయాంలో ఆలయానికి దక్షిణ భాగాన హధీరాంజీ మఠం నిర్మాణం జరిగింది. చాలా ఏళ్ల వరకు తిరుమల శ్రీవారి ఆలయం హథీరాంజీ మఠం పర్యవేక్షణలోనే ఉండేది. మఠం నిర్వాహకులే ఆలయంలో అన్ని రకాల కైంకర్యాలు నిర్వహించేవారు. శ్రీవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి, ఈ మఠానికి దానధర్మాలు ఇచ్చేవారు. అలా ఈ మఠానికి కోట్లాది రూపాయల ఆస్తులు సమకూరాయి. 1933లో శ్రీవారి ఆలయ నిర్వహణ బాధ్యతలు... టీటీడీ ఆధ్వర్యంలోకి వెళ్లాయి. అయితే అప్పటికే మఠానికి చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు అన్యాక్రాంతానికి గురయ్యాయి.

చిత్తూరు జిల్లాలో...
ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఇప్పటి వరకు సుమారు 700 ఎకరాలు అక్రమణకు గురయ్యాయంటే... భూ కబ్జాకోరుల ఆగడాలు ఏ స్థాయిలో శృతి మించాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఇలా ఆక్రమణకు గురైన భూముల ఖరీదు దాదాపు వేయి కోట్ల రూపాయల పై మాటే. కబ్జా చేసిన మఠం భూముల్లో ఇప్పటికే భవనాలు, కార్యాలయాలు, ఇళ్లు వెలిశాయి. రాత్రికి రాత్రి కబ్జా చేయడం, ఉదయం కల్లా కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవడం కబ్జాకోరులకు పరిపాటిగా మారింది. హథీరాం మఠం భూముల కబ్జాకోరుల్లో... రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులతో పాటు పోలీసులు, పారిశ్రామికవేత్తలు ఎందరో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు స్వయంగా మఠం సిబ్బంది సైతం ఆక్రమణదారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వందల ఎకరాలు కబ్జా చేస్తున్నా కబ్జా కోరుల ఆగడాలను మఠం సిబ్బంది గానీ, ప్రస్తుత మఠం కస్టోడియన్‌గా వ్వవహరిస్తున్న అర్జున్‌దాసు మహంత్‌ గానీ ఆపలేకపోతున్నారు. చాలా భూములు లీజులో ఉన్నాయి. కొన్ని భూములు ఇప్పటికే లీజు ముగిసినా మఠానికి తిరిగి ఇవ్వడం లేదు. లీజుదారులు కూడా కోర్టులను ఆశ్రయించి మఠం భూములను అనుభవిస్తున్నారు. ప్రత్యేక కమిటీ వేసి మఠం భూముల్ని పరిరక్షించాలని స్థానిక బీజేపీ నేతలు కోరుతున్నారు.

కబ్జా కోరుల్లో బడా బాబులే...
ఎంత కట్టుదిట్టంగా వ్యవహరించినా...ఆక్రమణలను అరికట్టలేకపోతున్నామని, సిబ్బంది కూడా తగినంత లేరని ఉద్యోగులు అంటున్నారు. భూ కబ్జా కోరుల్లో బడా బాబులే ఉన్నారని హథీరాంబాబాజీ మఠం ముఖ్య కస్టోడియన్‌ అర్జున్‌ దాస్‌ మహంతు అంటున్నారు. భూముల పరిరక్షణకు సాయశక్తులా కృషి చేస్తున్నామని మఠం సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు తెలిపారు. ఓ వైపు మఠంలో సమర్థవంతమైన నిర్వహణ కొరవడడం, మరోవైపు ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో మఠం భూములు దోపిడీకి గురవుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం కల్పించుకుని ఆక్రమణకు గురైన భూములు తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, లేకుండే భవిష్యత్ లో హథీరాంజీ మఠం ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

బీహార్ లో పేలిన బాంబు..మహిళకు గాయాలు..

బీహార్ : రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో క్రూడ్ బాంబ్ పేలడంతో ఓ మహిళకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న బాంబ్ స్వ్కాడ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇంకా ఆరు క్రూడ్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. 

12:14 - August 28, 2016

కరీంనగర్ : జిల్లాలో అదో మారు మూల ప్రాంతం. ప్రస్తుతం ఆ ఊర్లో జనాలు కనబడడం లేదు. ఏ ఇంటికి చూసిన తాళం కనపడుతోంది. ఊర్లోకి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఏదో దెయ్యం..ఇతరత్రా మూఢ నమ్మకాల వల్ల కాదు..విష జ్వరాలు వ్యాపిస్తుండడంతో ఊరి ఖాళీ చేసేస్తున్నారు. ఇదంతా కరీంనగర్ జిల్లాలోని మహదేవ్ పూర్ మండలంలోని బెగ్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటి వరకు 15 మంది మృతి చెందారు. వరంగల్..కరీంనగర్ తదితర జిల్లాలకు చికిత్స నిమిత్తం తరలివెళుతున్నారు. చికిత్స అనంతరం తిరిగి గ్రామంలోకి రావడానికి భయపడుతున్నారు. సమీప బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. గ్రామ పరిస్థితిని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే పుట్టా మధు ఈనెల 16వ తేదీన గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో వైద్య సిబ్బందిని నియమించినా పరిస్థితిలో మార్పు రావడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు 30 శాతం మంది ఊరి వదిలి వెళ్లిపోయారని తెలుస్తోంది.

వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం - ఎమ్మెల్యే మధు...
తమకు తెలవగానే గ్రామాన్ని సందర్శించడం జరిగిందని, వైద్యులు..వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంథని ఎమ్మెల్యే పుట్టా మధు పేర్కొన్నారు. అయినా ప్రజల్లో కొంత అవగాహన లోపం ఉందని..వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలు తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడడం జరిగిందన్నారు. దీనికి చాలా కారణాలున్నాయని, చెప్పడానికి ఇబ్బంది అవుతుందన్నారు.

బెగ్లూరులో ప్రబలుతున్న విష జ్వరాలు..

కరీంనగర్ : జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మహదేవ్ పూర్ మండలంలోని బెగ్లూరు గ్రామంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటి వరకు 15 మంది మృతి చెందారు. గ్రామంలోకి వెళ్లడానికి భయపడుతున్నారు. గ్రామ పరిస్థితిని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో వైద్య సిబ్బందిని నియమించినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. 

ధ్యాన్ చంద్ కు శ్రద్ధాంజలి - మోడీ..

ఢిల్లీ : ధ్యాన్ చంద్ కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ మాట్లాడారు. ధ్యాన్ చంద్ సేవలను ప్రతొక్కరూ మననం చేసుకోవాలని, ధ్యాన్ చంద్ క్రీడాస్పూర్తి, దేశ భక్తి నిరుపమానమన్నారు. దేశానికి ఒలింపిక్స్ పతకాలు సాధించి పెట్టిందని ఆడపిల్లలే అని తెలిపారు. మోడీ యాప్ ద్వారా ఒలింపిక్స్ పై ఎంతో మంది స్పందించారని తెలిపారు. జిమ్నాస్టిక్స్ లో దీపా కర్మాకర్ తన ప్రతిభ ద్వారా అందరి మనస్సు దోచుకుందన్నారు. 

పవన్ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలి - సీపీఎం...

అనంతపురం : పవన్ వ్యాఖ్యలపై సీపీఎం నేత మధు స్పందించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ స్పందనను స్వాగతిస్తున్నామని, కమ్యూనిస్టుల ఉద్యమాలపై పవన్ స్పందన బాగుందన్నారు. పవన్ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటే బాగుంటుందని, ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి అధ్యాత్మిక కార్యక్రమాల్లో పబ్బం గడుపుతోందన్నారు. 

పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం - సి. రామచంద్రయ్య...

కడప : పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. టిడిపి చేసిన తప్పును కాంగ్రెస్ నెట్టడం సరికాదని, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ అని, పవన్ అవగాహనతోనే మాట్లాడారని తెలిపారు. 

మహా ఒప్పందంతో ఏపీకి అన్యాయం - విజయసాయిరెడ్డి...

విశాఖపట్టణం : మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాల ఒప్పందంతో ఏపీకి అన్యాయం జరుగుతుందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడడం లేదని, ఓటుకు నోటు కేసు బయటకు వస్తుందని బాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ఆరు నెలలకొకసారి ప్రజల ముందుకొచ్చి హడావుడి చేసే పవన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోమన్నారు. 

11:28 - August 28, 2016
11:26 - August 28, 2016
11:22 - August 28, 2016

కరీంనగర్ : సింగరేణి లో ఏదైనా ఉద్యోగం వస్తే అమాంతం ఆ సంతోషానికి అవధులుండవు. ఆ సంస్థలో ఉద్యోగం రావాలని ఎంతో మంది ప్రయత్నాలు చేస్తుంటారు. వీరి ప్రయత్నాలు చూసిన దళారులు ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలుకుతారు. లక్షలు..లక్షలు..వసూలు చేసి మొండి చేయి చూపిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలో మెడికల్ అప్ సెట్, మరణించిన కార్మికుల స్థానంలో ఉద్యోగాలిప్పిస్తామన్న దళారుల మోసం బయటపడింది. వివిధ వ్యక్తుల నుండి రూ. 12-14 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఇందుకు ప్రామిసరీ నోటు, పూచికత్తు రాసిచ్చారు. దీనితో డబ్బులిచ్చిన వారికి నమ్మకం ఏర్పడింది. కానీ రోజులు గడుస్తున్నా వారికి ఉద్యోగం రాక పోయేసరికి అనుమానాలు కలిగాయి. గోదావరిఖని -1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఒకే రోజు పది మంది బాధితుల ఫిర్యాదు చేశారు. మూడేళ్లలో సింగరేణి వ్యాప్తంగా రూ. 100 కోట్ల మేర వసూలు చేసినట్లు సమాచారం. గతంలో కూడా మెడికల్ బోర్డులో భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బెల్లంపల్లి, గోదావరిఖనిలో పెద్ద ఎత్తున్న బాధితులున్నట్లు తెలుస్తోంది. ఓ బాధితుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడని తెలుస్తోంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

11:16 - August 28, 2016

సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం..

కరీంనగర్ : జిల్లాలో మెడికల్ అప్ సెట్, మరణించిన కార్మికుల స్థానంలో ఉద్యోగాలిప్పిస్తామన్న దళారుల మోసం బయటపడింది. మూడేళ్లలో సింగరేణి వ్యాప్తంగా రూ. 100 కోట్ల మేర వసూలు చేసినట్లు సమాచారం. గోదావరిఖని -1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఒకే రోజు పది మంది బాధితుల ఫిర్యాదు చేశారు. 

11:12 - August 28, 2016

హైదరాబాద్ : ప్రజా ఉద్యమాలు ఎగసేలా స్ఫూర్తి నింపిన బషీర్ బాగ్ కాల్పుల ఘటనకు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. అమరులైన ముగ్గురు వీరుల స్మృతి చిహ్నం నాటి ఘట్టాన్ని నేటికీ కళ్లకు కడుతూ ఉంది. ఈ సందర్భంగా వామపక్ష నేతలు ఘనంగా అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడారు.

కార్పొరేట్ సంస్థల హావా - సురవరం...
ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత దేశాన్ని చేతుల్లోకి తీసుకోవాలని కార్పొరేట్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలున్నాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను శాసించడానికి ప్రయత్నం చేస్తున్నాయని, అమరవీరుల స్పూర్తితో ఫాసిస్టు అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినవసరం ఉందన్నారు.

కేసీఆర్ ది అదే దారి - తమ్మినేని...
శాంతియుతంగా ఆనాడు నిరసన తెలియచేస్తుండగా ఆ నాటి ప్రభుత్వం ముగ్గురిని పొట్టన పెట్టుకుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కాల్పులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వైఎస్ ముదిగొండలో తిరిగి కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందేనన్నారు. అనంతరం జరిగిన పోరాటంలో కేసీఆర్ పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కేసీఆర్ కూడా అదే దారిలో నడుస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్, భూ శక్తులకు కొమ్ము కాసే విధంగా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే చట్టవిరుద్ధంగా మల్లన్న సాగర్ లో కాల్పులకు తెగబడుతున్నారని, పెద్ద వాళ్లకు ఊడిగం..పేద వారిని అణిచివేసే విధంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారచు. పరిపాలించే వ్యవస్థ మారాలని పిలుపునిచ్చారు. వామపక్షాలు ఐక్యంగా ముందుకు సాగాలన్నదే లక్ష్యమని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న అన్ని శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ముగ్గురు అమరయోధులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. ఇంకా పలువురు వామపక్ష నేతలు మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

అమరవీరులకు వామపక్షాల నివాళులు..

హైదరాబాద్ : బషీర్ బాగ్ కాల్పుల్లో మృతి చెందిన అమరవీరులకు వామపక్ష నేతలు నివాళులర్పించారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు, ఇతర వామపక్ష నేతలు పాల్గొన్నారు. 

10:33 - August 28, 2016

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా రిలీజ్ కూడా కాలేదు. అప్పుడే పలు కథనాలు వెలువడుతున్నాయి. నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తారు ? ఏ బ్యానర్ లో చేస్తారు ? ఇలా పలు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరి ఏ బ్యానర్ లో చేస్తారు అనేది తెలుసుకోవాలంటే చదవండి..
చాలాకాలం తరువాత చిరంజీవి మేకప్ వేసుకున్నారు. 150వ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చిరు నటిస్తున్నారు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. అనుకున్న ప్రకారం 2017 జనవరి 13వ తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి 'ఖైదీ నెంబర్ 150' అని పేరు కూడా పెట్టారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం అయిపోయిన తరువాత నెక్ట్స్ ఏ సినిమా చేస్తారనే దానిపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. 151వ సినిమా విషయంలో దర్శకుడెవరు అన్నది ఇంకా ఖరారవ్వలేదు కానీ.. బేనర్ మాత్రం ఓకే అయిపోయిందని టాక్. తనకు అత్యంత కలిసి వచ్చిన బేనర్ గీతా ఆర్ట్స్ లోనే చిరు తన తర్వాతి సినిమా చేయాలనుకుంటున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చిరు 151వ సినిమా తమ బేనర్లోనే ఉంటుందని గీతా ఆర్ట్ వర్గాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కానీ దర్శకుడు ఎవరో తెలియడం లేదు. బోయపాటి..బెల్లంకొండ శ్రీనివాస్..పూరి జగన్నాథ్ లలో ఒకరిని చిరు ఎంపిక చేయనున్నట్లు టాక్. 

10:14 - August 28, 2016

ఢిల్లీలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ?

ఢిల్లీ : జమయా నగర్ లో ఓ మైనర్ బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఒలింపిక్ స్టార్లను అభినందించిన సచిన్...

హైదరాబాద్ : ఒలింపిక్ స్టార్లు పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ లను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. గోపిచంద్ అకాడమీలో అథ్లెట్లతో కలిసి సచిన్ సెల్ఫీ తీసుకున్నారు. ఒలింపిక్ స్టార్లకు బీఎండబ్ల్యూ కార్లను సచిన్ అందచేశారు. కోచ్ గోపిచంద్ కు కూడా బీఎండబ్ల్యూ కారును అందచేశారు. పతకాలు సాధించిన వారికి అభినందనలు తెలియచేస్తున్నట్లు, దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారని తెలిపారు.

డా.శ్రీధర్ రెడ్డికి అరుదైన గౌరవం..

విజయవాడ : రెడ్ క్రాస్ లో అత్యుత్తమ సేవలందించినందుకు గాను దంత వైద్యులు డా.శ్రీధర్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. గోల్డ్ మెడల్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పతకాన్ని శ్రీధర్ రెడ్డి అందుకోనున్నారు. 

ఫాం హౌజ్ లో సీఎం కేసీఆర్..

మెదక్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జగదేవ్ పూర్ మండలంలోని ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. శనివారం రాత్రి ఫాం హౌజ్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. 

09:33 - August 28, 2016

హైదరాబాద్ : మాస్టర్ బ్లాస్టర్..క్రికెట్ గాడ్..భారత రత్న..రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ కొద్దిసేపటి క్రితం నగరానికి చేరుకున్నారు. శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో సచిన్ కు పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సచిన్ నేరుగా పుల్లెల గోపీచంద్ అకాడమీకి బయలుదేరారు. రియో ఒలింపిక్స్ లో సత్తా చాటిన పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ లకు సచిన్ బీఎండబ్ల్యూ కార్లను అందచేశారు. కోచ్ గోపిచంద్ కు కూడా ఆయన బీఎండబ్ల్యూ కారును అందచేశారు. ఇదిలా ఉంటే గోపిచంద్ అకాడమీ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అకాడమీలోనికి ఇతరులను ఎవరినీ పంపించడం లేదు. ఈ కార్యక్రమం కొద్దిసేపు మాత్రమే జరగనున్నట్లు సమాచారం. బహుమానం కార్యక్రమం అనంతరం పతక విజేతలు ప్రత్యేక ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీరు సమావేశం కానున్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం అందచేసే ఖేల్ రత్న అవార్డులను అవార్డు గ్రహీతలు స్వీకరించనున్నారు.

దీపా కర్మాకర్ : త్రిపుర రాష్ట్రంలోని అగర్తలా ప్రాంతానికి చెందిన దీపా కర్మాకర్ రియో ఒలింపిక్స్ – 2016 జిమ్నాస్టిక్ విభాగంలో నాలుగో స్థానం సాధించారు. రియో ఒలింపిక్స్ లో పతకం గెలవకపోయినా కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకుంది. పోటీల అనంతరం అగర్తలా చేరుకున్న దీపా కర్మాకర్ కు ఘన స్వాగతం లభించింది.

సింధు : తెలంగాణ రాష్ట్రానికి చెందిన సింధు మొన్నటి వరకు సాధారణ షట్లర్‌గా ఉండేది. కోచ్ గోపిచంద్ శిక్షణలో రాటుదేలింది. రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి భారతీయలు హృదయాలను గెలుచుకుని స్టార్ ప్లేయర్‌గా మారిపోయింది. ఒలింపిక్స్ లో రజతం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.

సాక్షి మాలిక్ : హర్యానా రాష్ట్రంలోని రోహ్ తక్ కు చెందిన రెజ్లర్ సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్ లో మహిళల ఫ్రీ స్టైల్‌ 58 కిలోల రెజ్లింగ్‌ విభాగంలో దేశానికి తొలి పతకం సాధించింది. ఆమె కాంస్య పతకాన్ని సాధించింది. హర్యానాలోని స్వగ్రామంలో ఆమెను సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. 

గోపిచంద్ అకాడమీలో సచిన్..

హైదరాబాద్ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గోపిచంద్ అకాడమీకి చేరుకున్నారు. ఒలింపిక్ పతక విజేతలతో సచిన్ మాట్లాడారు. కాసేపట్లో ఒలింపిక్ పతక విజేతలకు బీఎండబ్ల్యూ కార్లను సచిన్ అందచేయనున్నారు. 

హైదరాబాద్ చేరుకున్న సచిన్..

హైదరాబాద్ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నగరానికి చేరుకున్నారు. ఉదయం 9గంటలకు గోపిచంద్ అకాడమీలో సింధు, కోచ్ గోపిచంద్, దీపా కర్మాకర్ లకు సచిన్ బీఎండబ్ల్యూ కార్లను బహుకరించనున్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న దేవగౌడ..

విజయవాడ : ఇంద్రకీలాద్రి దుర్గమ్మను మాజీ ప్రధాని దేవగౌడ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

విజయ డెయిరీ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ...

విజయవాడ : విజయ డెయిరీ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఛైర్మన్ పదవితో సహా మూడు డైరెక్టర్ పదవులు ఖాళీ అయ్యాయి. దీనితో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఛైర్మన్ రేసులో పలువురు నేతలున్నారు. 

టిడిపిలోకి దేవినేని నెహ్రూ ?

విజయవాడ : కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమౌతోంది. అభిమానులు..కార్యకర్తలతో దేవినేని గుణదలలో సమావేశమయ్యారు. ఇప్పటికే లోకేష్..ఇతర అగ్రనేతలతో నెహ్రూ చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే నెహ్రూ రాకను టిడిపి నేతలు కూడా ఆహ్వానిస్తున్నారు. నెహ్రూ బాటలోనే మరికొందరు కాంగ్రెస్ నేతలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నెహ్రూ కాంగ్రెస్ ను వీడకుండా కాంగ్రెస్ అగ్రనేతలు చర్చలు జరుపుతున్నారు. 

బందరు రోడ్డులో రోడ్డు ప్రమాదం..

విజయవాడ : బందర్ రోడ్డులో ఆర్టీసీ బస్సు - కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఇతడి పరిస్థితి విషమంగా ఉంది. 

08:22 - August 28, 2016

హైదరాబాద్ : ప్రమాదం జరగని రోజంటూ లేదు. ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూ నిండు ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. ఇందుకు ఎన్నో కారణాలున్నాయి. తాజాగా చేవేళ్ల మండలం దామరగిద్దలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు-కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీనితో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చేవెళ్లలో రోడ్డు ప్రమాదం..

రంగారెడ్డి : చేవెళ్ల (మం) దామరగిద్ద వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు - కారు డీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

లక్షల రూపాయలతో దేవాలయం అలంకరణ..

గుజరాత్ : వడోదరలోని ఓ హనుమాన్ ఆలయాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించారు. మొత్తం 11 లక్షల కరెన్సీ డబ్బులు ఇందుకు ఉపయోగించారు. 

08:07 - August 28, 2016

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) చరిత్రలో మరో విజయం నమోదైంది. నేటి ఉదయం సరిగ్గా 6 గంటలకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) నుంచి ఇస్రో ప్రయోగించిన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ వెహికిల్ (ఏటీవీ) రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఎయిర్ బ్రీతింగ్ రాకెట్ గా పిలుస్తున్న ఈ రాకెట్... స్క్రాంజెట్ మోటార్ ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రతేశపెట్టింది.
ఏటీవీ రాకెట్ కేవలం ఇంధనం మాత్రమే తీసుకెళ్లి భూ వాతావరణంలోని ప్రాణవాయువు తీసుకుని ఇగ్వేషణ్ ప్రక్రియ కొనసాగించింది. గతంలో ఇంధనం మండించేందుకు అమోనియం క్లోరేట్స్ ఆక్సిజన్ వినియోగంచే వారు. రాకెట్ లోని మొదటి దశ 70 కి.మీ.ఎత్తుకెళ్లింది. అనంతరం కూస్టింగ్ దశలో రాకెట్ సెకనకు 2 కి.మీ. వేగంతో నింగిలోకి వెళ్లింది. రామ్ జెట్ ఇంజిన్ ను ఐదు సెకన్ల పాటు పరీక్షించారు. ఏటీవీని పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ప్రయోగంమ వల్ల భవిష్యత్ లో రాకెట్ ప్రయోగాల వ్యయం తగ్గనుంది. బరువైన రాకెట్లను నింగిలోకి ప్రయోగించే అవకాశం ఉంది. 

07:40 - August 28, 2016

ఏ వుడ్ లోనైనా ఒక్క సినిమా హిట్ కాగానే ఇతర వుడ్ లో హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. నటించడమే కాకుండా పాటలు కూడా పాడేస్తున్నారు. వారి చిత్రాల్లోనే హీరోయిన్లు పాడడం చూస్తుంటాం. కానీ ఒక హీరోయిన్ కోసం మరొక హీరోయిన్ పాట పాడింది. అవును 'తమన్నా' కోసం 'శృతి' గాత్రం చేసింది. తమిళంలో కామెడీ ఫిల్మ్ గా 'కత్తి సండాయ్' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా విశాల్ సరసన హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. ఈ చిత్రంలో శృతి హాసన్ చేత పాట పాడించాలని దర్శకుడు సూరజ్ నిర్ణయించుకుని ఆమెచేత పాట పాడించాడంట. ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ను విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 29 న విడుదల చేయనున్నారు. తెలుగులో 'ఒక్కడొచ్చాడు' పేరుతో నిర్మాత హరి విడుదల చేయనున్నారు. ఈ చిత్రం లో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. జి. హరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి హిప్ ఆప్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అక్టోబరు 29 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు.

నగరానికి రానున్న ముద్రగడ..

హైదరాబాద్ : కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేడు హైదరాబాదు రానున్నారు. ఆయన మూడు రోజుల పాటు హైదరాబాదులోనే మకాం వేయనున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు చిరంజీవి, దాసరి, పలువురు కీలక నేతలతో ముద్రగడ భేటీ కానున్నారు. 

07:21 - August 28, 2016

వర్షాకాలం..ఈ కాలంలో వాతవరణం చల్లగా..తేమగా ఉంటుంటుంది. మంచినీళ్లు తాగడానికి చాలా మంది బద్దకిస్తుంటుంటారు. మంచినీళ్లు తాగాలని అనిపించదు. ఇలా చేయడం వల్ల జబ్బులు విజృంభించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. నీళ్లు సమృద్ధిగా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో జలుబు..దగ్గు..తరచూగా వస్తుంటాయి. వీటిని నిరోధించాలంటే వీలైనంత వరకు ద్రవ పదార్థాలను తీసుకోవాలి. వీటివల్ల మలినాలు తొలగిపోవడం..ఇన్ ఫెక్షన్ల దాడి నుండి బయటపడొచ్చు.
మంచినీళ్లు సమృద్ధిగా తీసుకోకపోవడం వల్ల డీ హైడ్రైషన్ ఏర్పడడం..మూత్రనాళ సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యల నుండి బయటపడాలంటే నీళ్లను వీలైనంత ఎక్కువగా సేవించాలి. గంటకో సారైనా గ్లాసుడు నీళ్లు తాగడం తప్పనిసరిగా చేసుకోవాలి.
ఇక ప్రయాణం..ఆఫీసు..ఇతరత్రా పనులపై బయటకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా మంచినీటి బాటిల్ ను తీసుకెళ్లండి. అపరిశుభ్రమైన మంచినీటిని సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ఈకాలంలో చల్లార్చిన మంచినీళ్లనే సేవించడం మంచిది.
చాలా చర్మ సమస్యలకు మనం తాగే, వాడే నీళ్లే కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి నీళ్లు ఏ మాత్రం కలుషితంగా ఉన్నా.. అందులో కంటికి కనిపించని సూక్ష్మక్రిములు కొత్త సమస్యలని తెచ్చిపెడతాయి. కాబట్టి ముఖాన్ని మంచినీళ్లతో కడుక్కుంటేనే మంచిది. రంగు మారిన, కాలుష్యతమైన నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.

07:12 - August 28, 2016

ఆరోగ్యకరమైన గోళ్లు చేతులకు ఎంతో అందాన్నిస్తాయి. చేతి గోళ్లనుంచీ వేసుకునే దుస్తులదాకా అన్నీ, ప్రతిదీ ప్యాషన్‌మయమే. గోళ్లను శుభ్రంగా ఉంచుకోవటం, పాలిష్ చేసుకోవటం మాత్రమే కాదు.. వీటిని అందంగా తీర్చిదిద్దేందుకు అతివల అవస్థలు పడుతుంటారు. గోళ్లకు రంగులు వేసుకొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దామా...

  • గోళ్ల రంగు వేసినప్పుడు బబుల్స్ ఏర్పడకుండా ఉండాలంటే బాటిల్ ను ఎక్కువగా ఊపకుండా ఉంటే మంచిది.
  • స్నానం చేసిన వెంటనే గోర్లకు నెయిల్ పాలిష్ పెట్టకూడదు. తడిగా ఉండడం వల్ల పాలిష్ ఆరడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. తడి ఆరాక గోళ్లకు రంగు పెట్టుకోవచ్చు.
  • పాలిష్ చేసుకున్న అనంతరం గోళ్లను ఐస్ క్యూబ్స్ కరిగించిన చల్లని నీళ్లలో ముంచాలి. వేసుకున్న రంగు చిటికెలో ఆరిపోతుంది.
  • నెయిల్ స్టిక్కర్స్ వాడే సమయంలో వాటిని గోరు అంచుల దాక అంటించాలి. దాని మీద పూసే టాప్ కోట్ నెయిల్ పాలిష్ గోరు అంచుల వరకూ వేయాలి.
  • బ్రష్ నిండుగా రంగు తీసి ఒక్కసారిగా వేయకూడదు. రంగును కొంచెంగా తీసుకుంటూ గోరు మధ్య భాగం నుంచి చివరి వరకు వేయాలి. ఈ సమయంలో గోళ్ల చుట్టూ టిష్యూ పేపర్ లేదా దూదిని ఉంచితే అదనపు రంగు దానికి అంటుతుంది.
  • గోళ్లు పుచ్చిపోయినట్లు ఉంటే రంగు వేయడం కంటే గోరింటాకు పెట్టుకుంటే బాగుంటుంది.
  • గోళ్ల రంగు ఆకర్షణీయంగా కన్పించాలంటే రెండు కోటింగ్‌లు వేస్తే బాగుంటుంది. మొదటి కోటింగ్ పూర్తయ్యాకనే మరోసారి వేయాలి. చివరగా పారదర్శక రంగు వేస్తే గోళ్లు చక్కగా మెరుస్తాయి.

ఏటీవీ రాకెట్ ప్రయోగం సక్సెస్..

నెల్లూరు : ఏటీవీ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 6గంటలకు నిండిలోకి ఏటీవీ రాకెట్ దూసుకెళ్లింది. ఐదు సెకన్లలో 70 కిలోమీటర్ల లక్ష్యాన్ని రాకెట్ చేరుకుంది. పూర్తిస్థాయా స్వదేశీ పరిజ్ఞానంతో ఏటీవీ రూపొందింది. ఈ రాకెట్ ప్రయోగం వల్ల భవిష్యత్ లో రాకెట్ ప్రయోగాల వ్యయం తగ్గనుంది. 

నేడు హైదరాబాద్ కు సచిన్..

హైదరాబాద్ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేడు నగరానికి రానున్నారు. ఉదయం 9గంటలకు గోపిచంద్ అకాడమీలో సింధు, కోచ్ గోపిచంద్, దీపా కర్మాకర్ లకు సచిన్ బీఎండబ్ల్యూ కార్లను బహుకరించనున్నారు. 

06:44 - August 28, 2016
06:42 - August 28, 2016

ఫ్లోరిడా : టీ-20లో విండీస్‌ విజృంభించింది. చెలరేగి ఆడిన విండీస్‌ ఆటగాళ్లు 246 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్‌ ముందుంచారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. ఒకానొక దశలో గెలుస్తుందని అందరూ ఊహించారు. అయితే చివరి బంతికి ధోనీ ఔట్‌ కావడంతో.. ఒక్క పరుగుతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అమెరికాలో విండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. విజయానికి చివరి ఓవర్‌లో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో.. డ్వేన్‌ బ్రావో అద్భుత బౌలింగ్‌తో కట్టడిచేయడంతో చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉన్నా.. భారత్‌ మాత్రం కేవలం ఆరు పరుగులు మాత్రమే సాధించగలిగింది. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. ధోనీ ఔట్‌ కావడంతో భారత్‌ ఓటమిపాలైంది.

ఆఖరి ఓవర్..
తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. ఆరు వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. 246 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభం కలిసిరాలేదు. ఓపెనర్‌ అజింక్య రహానే మూడో ఓవర్‌లో.. ఆ తర్వాత విరాట్‌కోహ్లి.. 16 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ దశలో రోహిత్‌శర్మ దూకుడుగా ఆడి.. స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. 22 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు. రోహిత్‌కు తోడు కేఎల్‌ రాహుల్‌ కూడా చెలరేగి ఆడాడు. 137 పరుగుల వద్ద రోహిత్‌ భారీ షాట్‌కు యత్నించి.. బౌండరీ లైన్‌ వద్ద దొరికిపోయాడు. ఆ తర్వాత చెలరేగి ఆడిన రాహుల్‌.. 46 బంతుల్లో సెంచరీ చేశాడు. టీ-20 కెరీర్‌లో రాహుల్‌కు తొలి సెంచరీ కాగా.. భారత్‌ నుంచి అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన తొలి ఆటగాడుగా.. ప్రపంచవ్యాప్తంగా రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక 17 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ గెలుపు దిశగా పయనించింది. ధోనీ కూడా సిక్సర్ల మోత మోగించాడు. అయితే చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా.. ధోనీ ఔటయ్యాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్...
అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ జట్టు క్రిస్‌గేల్‌ లేకుండానే చెలరేగిపోయింది. ఆ జట్టు ఓపెనర్లు జాన్సన్‌ చార్లెస్‌, ఎవిన్‌ లెవిస్‌లు చెలరేగి ఆడారు. లెవిస్‌ 49 బంతుల్లో సెంచరీ చేయగా.. చార్లెస్‌.. 79 పరుగులు చేశాడు. రన్‌రేట్‌ 12కు తగ్గకుండా ఆటడంతో విండీస్‌.. 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి.. 245 పరుగులు చేసింది. ఇక విండీస్‌ ఆటగాళ్ల కట్టడికి భారత్‌ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఏవీ సఫలం కాలేదు. అంతేకాకుండా స్టూవర్ట్‌ బిన్నీ ఓవర్లలో లెవిస్‌ ఐదు సిక్స్‌లు బాదాడు. యువీ పేరున ఉన్న ఆరు సిక్సర్ల రికార్డ్‌ను సమం చేసేలా కనిపించాడు. కానీ.. చివరి బంతికి సింగిల్‌ మాత్రమే తీయడంతో ఆ అవకాశం మిస్సయ్యింది.
ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తే అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా భారత్‌ రికార్డుల్లోకి నిలిచేది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చేసిన 489 పరుగులే టీ-20ల్లో నమోదైన అత్యధిక మొత్తం కావడం విశేషం. ప్రస్తుతం సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో విండీస్‌ ఉండగా.. ఈరోజు రెండో టీ-20 మ్యాచ్‌ జరగనుంది. 

06:38 - August 28, 2016

హైదరాబాద్ : ప్రజాందోళన ప్రజ్వరిల్లిన రోజది. తూటాలకు ఎదురొడ్డి నిలిచిన ఎర్రదండు ఆవేశమది. నూతన సహస్రాబ్దిని సమరశీల యుగంగా మార్చిన విప్లవశంఖారావమది. అడ్డగోలుగా విద్యుత్‌ ఛార్జీలు పెంచిన పాలకుల మెడలు వంచిన సందర్భమది. విప్లవించిన బషీర్‌బాగ్ విద్యుత్తేజమది. దేశ,రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు, ప్రజా ఉద్యమాలు ఎగసేలా స్ఫూర్తి నింపిన బషీర్ బాగ్ కాల్పుల ఘటనకు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఓ ఉద్యమం ప్రజాగ్రహాన్ని ఏకం చేసింది. ఓ సమరనాదం ప్రభుత్వాన్ని కూల్చింది.ఓ పోరాటం ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. ముగ్గురి బలిదానం కోట్ల గుండెలను రగిలించింది. ఆగస్టు 28. సోమవారం. 2000 సంవత్సరం. హైదరాబాద్‌ నడిబొడ్డున గల బషీర్‌బాగ్...తెలుగు రాష్ట్రాల చరిత్రలో, దేశ ఉద్యమ ప్రస్థానంలో విప్లవాక్షరాలతో లిఖించదగిన ఘటన బషీర్‌బాగ్ పోరాటం. అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచిన నాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజాలు పడ్డ మహోజ్వల నిరసన. అక్కడ పేలిన తూటాలు, విరిగిన లాఠీలు, నెత్తురోడిన రోడ్లు, క్షతగాత్రులతో నిండిన ఆసుపత్రులు నాడు తొమ్మిదేళ్ల బాబు సర్కారును దింపడమే కాదు ఇప్పటికీ ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తి.

బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటనకు 16 ఏళ్లు..
బషీర్‌బాగ్‌ కాల్పులకు ఆగస్టు 28తో 16 ఏళ్లు పూర్తయ్యాయి. అమరులైన ముగ్గురు వీరుల స్మృతి చిహ్నం నాటి ఘట్టాన్ని నేటికీ కళ్లకు కడుతూ ఉంది. నాడు జరిగిన కాల్పులు, అశ్వికదళం అరాచకాలు, ఖాకీల లాఠిన్యానికి సజీవ సాక్ష్యంగా రగులుతూనే ఉంది. విద్యుత్‌ ఉద్యమానికి వేదికయిన బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటన ఉద్యమాల స్వరూపాన్ని మార్చింది. నూతన సహస్రాబ్దిని సమరశీలంగా మార్చి రాబోయేది పోరాటాల యుగమని చేసిన తొలి హెచ్చరిక బషీర్‌బాగ్‌ ఆందోళన.

అమానుషంగా కాల్పులు..
విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా తొమ్మిది వామపక్షాల ఆధ్వర్వంలో ఉద్యమం ఊపందుకుంది. వీటికి పతాకస్థాయిగా ఆగస్టు 28న ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి ఐక్య వామపక్ష కూటమి. దీంతో అన్ని జిల్లాల నుంచి భారీగా సీపీఎం సహా అన్ని వామపక్ష పార్టీల కార్యకర్తలు హైదరాబాద్‌కు ఎగసిపడే కెరటాల్లా కదిలివచ్చారు. అయితే వీరిని ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు భారీగా పోలీసు బలగాలను మోహరించింది. ఉద్యమాన్ని అణివేయాలన్న కసితో పోలీసులకు సకల అధికారాలు అప్పగించింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో పోలీసులు ఆందోళనకారులపై కర్కశంగా ప్రవర్తించారు. దొరికిన వారిని దొరికినట్టుగా లాఠీలతో బాదారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న వారిపై అమానుషంగా కాల్పులు జరిపారు.

నెత్తురోడిన బషీర్ బాగ్...
పోలీసుల కాల్పులతో బషీర్‌బాగ్ నెత్తురోడింది. బాలస్వామి, విష్ణువర్ధన్‌, రామకృష్ణ పోలీసు తూటాలకు తీవ్రంగా గాయపడి...ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రాణాలకు వెరవని ఆ అమరులకు ప్రపంచం మొత్త లాల్ సలాం చేసింది. చేస్తూనే ఉంటుంది. కాల్పుల ఘటనపై రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఉద్యమాలు ఎగసిపడ్డాయి. చంద్రబాబు సర్కారుపై నిరసనలు హోరెత్తాయి. వికసించిన విద్యుత్తేజం, మార్మోగే భూ పోరాట స్వరాలు పాలకుల గుండెల్లో ప్రకంపనలు పుట్టిస్తూనే వుంటాయి. ఎప్పటికైనా సమరశీల పోరాట మార్గమే ప్రజలకు నిజమైన రక్షణ. అదే బషీర్‌బాగ్‌ ఉద్యమం రగిలించిన ఉద్యమ స్ఫూర్తి.

06:35 - August 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం... పార్టీ నేతలకు పదవుల పందేరం మొదలు పెట్టింది. మండలి పదవులకు అభ్యర్థుల నియామకంతో.. ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.. గులాబీ బాస్. త్వరలో మరికొన్ని రాష్ట్ర స్థాయి పదవులు కూడా భర్తీ చేసేందుకు కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా అధికార పార్టీనేతలను ఊరిస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు దృష్టి సారించారు. అప్పుడు... ఇప్పుడు..అంటూ వాయిదా పడుతున్న పదవులు త్వరలో నేతలకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొన్ని పదవులను మాత్రమే భర్తీ చేశారు. కొంత కాలం క్రితం.. మార్కెట్ యార్డుల్లో రిజర్వేషన్‌ను అమలుచేస్తూ కమిటీలను నియమించిన గులాబీ బాస్‌... ఇప్పుడు రాష్ట్ర స్థాయి పదవుల భర్తీపై దృష్టి సారించారు.

శాసనమండలి చీఫ్ విప్, విప్ పదవుల నియామకం...
శాసనసభ వర్షకాల సమావేశాల నేపథ్యంలో శాసనమండలి నుంచే పదవుల భర్తీ ప్రక్రియ మొదలైంది. శాసనసభమండలిలో ఖాళీగా ఉన్న చీఫ్ విప్ పదవిలో పాతూరి సుధాకర్ రెడ్డిని, విప్‌లుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, బోడే కుంటి వెంకటేశ్వర్లును ఖరారు చేశారు గులాబీ బాస్‌. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.

నేడో రేపో రాష్ట్ర స్థాయి పదవులు...
పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన పాతూరి సుధాకర్ రెడ్డిని గత సమావేశాల్లో చీఫ్ విప్ గా నియమిస్తారనే ప్రచారం జరిగినా అమలు కాలేదు. పార్టీలో చురుగ్గా వ్యవహరించడంతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి విప్ పదవి దక్కిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాల నిర్వహణతో పాటు సభ్యత్వ నమోదులో కూడా పల్లా కీలకంగా వ్యవహరించారు. రాజేశ్వర్ రెడ్డి... నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బోడేకుంటి వెంకటేశ్వర్లు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి శాసనమండలి సభ్యుడిగా ఉన్నా... తాజాగా గవర్నర్ కోటాలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాసనమండలి స్ధానాన్ని దక్కించుకున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తికావడంతో బోడెకుంటికి విప్ గా అవకాశం దక్కిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక రాష్ట్ర స్ధాయి కార్పొరేషన్లకు సంబంధించిన కసరత్తు కూడా ముమ్మరంగా జరగుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రాష్ట్ర స్థాయి పదవులు కొన్ని ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పదవుల పంపిణీ మొదలు కావడంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

06:32 - August 28, 2016

హైదరాబాద్ : చదివిస్తానని అమ్మాయిలను తీసుకొచ్చి పైశాచిక వాంఛలు తీర్చుకోవడం..మాట వినకపోతే వారికి పచ్చిమిర్చి జ్యూస్ తాగించడం..నెలలో 20 రోజులు గోవాలో ఎంజాయ్‌ చేయడం..నగ్నచిత్రాలు చూపించి లైంగికంగా హింసించడం..ఎదురుతిరిగిన వారిని అంతం చేయడం..ఇవి ఏ సైకో చేష్టలు కాదు..కరుడుగట్టిన నయీం అరాచకాలను అతడి వంటమనిషి ఫర్హానా బయటపెట్టిన సంచలన విషయాలు. పోలీసులు తవ్వేకొద్దీ అక్రమాలే..విచారించే కొద్దీ దారుణాలే. దర్యాప్తు చేసే కొద్దీ దుర్మార్గాలే. నరరూప రాక్షసుడిగా మారిన నయీం సాగించిన అరాచకాలు భయానికే భయం పుట్టించేలా ఉన్నాయి. గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కీలక విషయాలను వంట మనిషి ఫర్హానా పోలీసులకు వెల్లడించింది. నయీంకు హైదరాబాద్‌, నల్గొండ, భువనగిరి, ఛత్తీస్‌గఢ్, గోవా, వైజాగ్, ఒంగోలు, అనంతపురం, రాయ్‌పూర్‌లలో భూములు, ఇళ్లు, ఆస్తులు ఉన్నాయని ఫర్హానా పేర్కొంది. తన ఆస్తులు పెంచుకునేందుకు, దందా చేసేందుకు వెళ్లిన ప్రతిసారి మహిళలను రక్షణగా తీసుకెళ్లేవాడని తెలిపింది.

నెలలో 20 రోజులు గోవా గెస్ట్‌హౌస్‌లో ఎంజాయ్‌..
తన భర్త మరణించడంతో నయీం వద్ద వంటమనిషిగా చేరానని చెప్పింది ఫర్హానా. చదివిస్తానని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి సాదియా, మాలియా, జోహా అనే ముగ్గురు అమ్మాయిలను తీసుకొచ్చి నానారకాలుగా హింసించి వాంఛలు తీర్చుకున్నాడంది. ఎవరికైనా చెబితే చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చేవాడని తనను కూడా లైంగికంగా వేధించి చిత్రహింసలు పెట్టాడని వాపోయింది. తన ఎదుటే ఆడపిల్లలపై లైంగిక దాడులకు తెగబడేవాడని పేర్కొంది. నెలలో 20 రోజుల పాటు నయీం గోవాలోని కోకోనట్ గా పిలుచుకునే గెస్టు హౌస్ లో ఎంజాయ్ చేసేవాడని, గోవా వెళ్లిన ప్రతిసారీ అమ్మాయిలను తీసుకెళ్లి అరాచకాలు చేసేవాడని ఆమె చెప్పారు. తన మాట వినని అమ్మాయిలతో నయీం పచ్చిమిర్చి జ్యూస్ తాగించి రాక్షసంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది ఫర్హానా. నయీం దుర్మార్గాలు తనకు తెలిసాయని గుండు గీయించాడని తెలిపింది.

నయీంకు తల్లి, అత్త, సోదరి, భార్య సహకరించేవారు..
ఇక నయీం చేసిన పలు హత్యలకు తానే ప్రత్యక్ష సాక్షినని ఫర్హానా బట్టబయలు చేసింది. బావ నదీంను గోవాలోనే అత్యంత కిరాతకంగా హతమార్చాడని వెల్లడించింది. గగన్‌పాల్‌లోని ఇంట్లోనే నస్రీన్‌ను నయీం కుటుంబ సభ్యులు కొట్టి చంపారని ఆమె చెప్పింది. నయీం బాధలు భరించలేకే సదా, శామి, నవీలు మిస్సయ్యారని వాపోయింది. నయీం అరాచకాలు బయటపెడితే తన పిల్లలను చంపేస్తానని బెదిరించాడని, అందుకే తాను నోరుమెదపలేదని చెప్పింది. తన పిల్లలను నయీం విచక్షణా రహితంగా కొట్టడంతో వాళ్లు నడవలేని స్థితికి చేరుకున్నారని..గాయాలైనా కనీసం ఆస్పత్రిలో చూపించేవాడు కాదని కన్నీటి పర్యంతమైంది. నయీం అరాచకాలన్నింటికీ అతని తల్లి, అత్త, సోదరి, భార్య సహకరించేవారని ఫర్హానా పోలీసుల విచారణలో తెలిపింది. 

06:28 - August 28, 2016

అనంతపురం : వరుణుడు ఊరించి ఉసూరుమనిపించాడు. అదునులో ముఖం చాటేయడంలో సాగుచేసిన పంటలు ఎండిపోయాయి. కరవు కాటేయడంతో సాగు కోసం చేసిన అప్పుతీరే మార్గంలేకపోవడంలో అనంతపురం జిల్లాలో అన్నదాతలు ఊళ్లు వదలి కూలికోసం వలస పోవాల్సిన దుస్థితి దాపురించింది. కరవు తీవ్రతను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాయలసీమలో అనంతపురం జిల్లా అన్ని విషయాల్లో అత్యంత వెనుకబడిన జిల్లా. వర్షపాతం కూడా అత్యల్పం. వరుసగా మూడో ఏడు కూడా కరవు కోరలు సాచడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురయ్యింది. రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగుచేసిన వేరుసెనగ పంట ఎండిపోయింది. టమాటతోపాటు ఇతర పంటలు పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. తాండవిస్తున్న కరవును చూసి తల్లిడిల్లిపోతున్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌ జూన్‌, జులైలో కురిసిన వర్షాలకు రైతుల ముఖంలో అనందం నింపాయి. రెండేళ్ల తర్వాత వరుణుడు కరుణించాడని సంతోషిస్తూ అప్పులు చేసి పైర్లు సాగు చేశారు.

తల్లడిల్లుతున్న రైతులు..
గతంలో చేసిన అప్పులు కూడా ఈసారి తీరిపోతాయాని అనుకున్నారు. ఏపుగా ఎదిగి, దిగుబడినిచ్చేందుకు ఆగస్టులో కురిసే వర్షాలే కీలకం. ఇటువంటి తరుణంలో అసలు వర్షాలే లేకపోవడంతో అన్నదాతల ముఖాల్లోని అనందం అంతలోనే ఆవిరైపోయింది. నెలంతా ఆకాశం వైపు దిగాలుగా ఎదురు చూసినా చినుకు రాలకపోవడంతో... దిగాలు పడిపోయారు. పాత అప్పులకు ఇప్పుడు కొత్త అప్పులు తోడవడంతో సాగుచేసిన పంటలు వదిలేసి కూలీ, నాలీ కోసం ఊరొదిలి వెళ్లాల్సిన దయనీయ పరిస్థితులు వచ్చాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మూడో ఏడు కూడా కరువ తాండవిస్తుండటంతో బతుకు దర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం వేలకు వేలు ఖర్చు చేశారు. ఇప్పుడు పంటచేతికి రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తల్లడిల్లుతున్నారు.

రానున్న బాబు..
మరోవైపు తీవ్ర వర్షాభావం నెలకొన్న అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ పర్యటించనున్నారు. తనకల్లు మండలంలోని కోట్లపల్లె, కదిరి డివిజన్‌ పరిధిలోని ఆమడుగూరుల్లో ఎండిపోయిన పంటలన పరిశీలిస్తారు. ఎండిపోతున్న పంటలను కొంతవరకైనా కాపాడే ప్రయత్నాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న రెయిన్‌ గన్ల పనితీరును స్వయంగా పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి వీరి కష్టాలు తెలుసుకుంటారు. చంద్రబాబుతో తమ సమస్యలు చెప్పుకొనేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న పంటరుణాలను మాఫీ చేయడమో...లేకపోతే తిరిగి చెల్లింపును వాయిదా వేయడమో... చేయాలని విన్నవించనున్నారు. అలాగే ప్రత్యామ్నాయ పైర్ల సాగుకు సబ్సిడీపై విత్తనాల సరఫరా, ఎండిపోయిన పంటలకు పరిహారం చెల్లించాలన్న అంశాలను...చంద్రబాబు దృష్టికీ తీసుకెళ్లాని భావిస్తున్నారు. అన్నదాతల అశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. 

06:26 - August 28, 2016

హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించడంపై టిడిపి స్పందించింది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము ఎవరికీ భయపడంలేదని, భయడాల్సిన పని కూడా లేదని పార్టీ ప్రజా ప్రతినిధులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పదవులు తమకు తృణప్రాయమని, వీటిని పట్టుకుని వేలాడాల్సిన పనిలేదన్న వాదాన్ని విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని వినిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశిస్తే కేంద్రంలోని టిడిపి మంత్రులు సహా, పార్టీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు.

స్పందించిన టిడిపి..
ప్రత్యేక హోదాపై తిరుపతి సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సుతిమెత్తగా అంటించిన చురకలపై టీడీపీ స్పందించింది. హోదా సాధన విషయంలో కేంద్రాన్ని చూసి రాష్ట్ర ఎంపీలు ఎందుకు భయపడుతున్నారని నిలదీయండంపై తెలుగుదేశం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కేంద్రంలో బ్రహ్మరాక్షసులు లేరని, అక్కడ ఉంది కూడా మనలాంటి మనుషులే... కదా.. అలాంటప్పుడు భయడాల్సిన అవసరం ఏమొచ్చిందని పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శ టీడీపీని కదిలించింది. కాంగ్రెస్‌ ఎంపీలు గతంలో మేడం... మేడం.. అంటూ బతిమిలాడేవారిని పరోక్షంగా సోనియాగాంధీని వేలెత్తి చూపించారు. ఇప్పుడు ఎంపీలు సార్‌... సార్‌.. అంటూ బతిమిలాడుతున్నారని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించిన వ్యాఖ్యానించారు. ఈ పద్ధతి మానుకోవాలని చెప్పారు.

పదవులు తృణప్రాయమన్న నేతలు..
ప్రత్యేక హోదా కోసం పార్లమెంటును స్తంభింపచేయాలని ఏపీ ఎంపీలకు పవన్‌ కల్యాణ్‌ చేసిన సూచనపై టీడీపీ స్పందించింది. తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి పదవులు పట్టుకుని వేలాడకండని, వీటిని త్యాగం చేసి పోరాడితే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారంటూ పవన్‌ కల్యాణ్‌ వాఖ్యలపై కూడా తెలుగుదేశం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటును స్తంభింపచేసిన విషయాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని, రెండేళ్లుగా పోరాడుతున్న అంశాన్ని బొండా ఉమామహేశ్వరరావు గుర్తు చేశారు. పదవులు తమకు తృణప్రాయమని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న వాదాన్ని కేశినేని వినిపించారు. చంద్రబాబు ఎప్పుడు చెబితే అప్పుడు కేంద్ర మంత్రులు సహా, టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్నారు.
ప్రత్యేక హోదా కోసం తాము రెండేళ్లుగా పోరాటం చేస్తున్నామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఉద్యమం కార్యచరణ ప్రకటించారన్నది టీడీపీ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు వాదన. మరోవైపు ప్రత్యేక హోదా కోసం పవన్‌ కల్యాణ్‌ చేసిన ఉద్యమ ప్రకటనను సీపీఎం ఆంధ్రప్రదేశ్‌ కమిటీ స్వాగతించింది. మొత్తానికి ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ... ఏపీలోని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. 

06:23 - August 28, 2016

చిత్తూరు : ఎప్పుడో ఒకసారి బహిరంగ సభ, ఏదో ఒక సందర్భంలో పర్యటన , అప్పుడప్పుడూ ట్వీట్లతో స్పందించే జనసేన పార్టీ రాజకీయంగా తొలి అడుగు వేసింది. ప్రత్యేక హోదా ప్రాతిపదికగా రాజకీయ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. మూడు దశల ఉద్యమానికి జనసేన అధినేత పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామమైన బహిరంగ సభ జనసేన భవిష్యత్ ప్రస్థానానికి ఒక సోపానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భవించిన రెండున్నర సంవత్సరాల తర్వాత ఎఫ్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనసేన ఇక జనంలోకి రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సెంటిమెంటుగా మారిన ప్రత్యేక హోదా పై ఉద్యమ శంఖారావం పూరించింది. తిరుపతిలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోందన్న విషయాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాల్లో ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తోందనే భావన ప్రజల్లోనూ, రాజకీయ పక్షాల్లోనూ నెలకొని ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదా కూడా వచ్చే అవకాశమే లేదన్న సంగతినీ పార్టమెంటు సాక్షిగా ఇటీవల స్పష్టం చేసేశారు. దీంతో ప్రజలు తీవ్ర నిరాశా నిస్పృహల్లో మునిగిపోయారు. కేంద్రంలోనూ భాగస్వామ్య పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఉన్న బలహీనతల కారణంగా పోరాట పంథా చేపట్టలేకపోతోంది.

బీజేపీకి శరాఘాతం..
విపక్షమైన వైసీపీ క్రెడిబిలిటీ గ్యాప్‌తో ఈ అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లడంలో వైఫల్యం చెందుతోంది. ఇక కాంగ్రెస్‌ ఎంతగా ప్రయత్నించినా ప్రజల్లో ఆ పార్టీ పట్ల గూడు కట్టుకుని ఉన్న ఆగ్రహం కారణంగా ప్రజల్లో పట్టు దొరకడం లేదు. దీంతో తగినంత ప్రజా మద్దతు కూడగట్ట లేకపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు జనసేన సరైన సమయాన్నే ఎంచుకున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మూడు దశల ఉద్యమ కార్యాచరణ కూడా ప్రజల్లోకి పార్టీని చేరువ చేసేందుకు అనువుగా తోడ్పడగలదనే భావన కూడా వ్యక్తమవుతోంది. ప్రత్యేకించి కేంద్రలో ఉన్న భారతీయ జనతాపార్టీ రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న తరుణంలో నిన్న మొన్నటి వరకూ మిత్రపక్షంగా తటస్థ రాజకీయ శక్తిగా ఉన్న జనసేన ఎదురు తిరగడం బీజేపీకి శరాఘాతంగానే చూడాల్సి ఉంటుంది.

ప్రత్యేక హోదా పేరుతో జనసేన ప్రజల్లోకి వెళితే ఇందుకు ఆటంకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని ప్రతిచోటా దుయ్యబట్టాల్సి ఉంటుంది. దీనివల్ల రాజకీయంగా బీజేపీకి ఎదురు దెబ్బే. అదే సమయంలో రాజకీయ శూన్యతను అందిపుచ్చుకోలేక వైఫల్యం చెందుతున్న వైసీపీకి కూడా తన ప్రాధాన్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికార భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రేక్షకపాత్రలో మిగిలిపోవడం రాజకీయంగా ఆ పార్టీకి కూడా ప్రతిష్ఠను మసకబార్చే పరిణామమే. సెంటిమెంటుతో ముడిపడిన స్పెషల్‌ స్టెటస్‌ అస్త్రాన్ని చూకచక్యంగా ఉందిపుచ్చుకున్న జనసేన ధీటైన కార్యచరణతో ముందుకు వెళినప్పుడు మాత్రమే ఆ పార్టీకి కూడా ఆశించిన రాజకీయ ప్రయోజనాలు నెరవేరతాయి. ఉద్యమ పంథ లేకుండా తూతూ మంత్రం ప్రకటనలకు, మొక్కుబడి ఆందోళనలకు పరిమితమైతే జనసేన ఉనికికే నష్టం వాటిల్లుతుంది.

స్పెషల్ స్టేటస్ హాట్ టాపిక్...
బహిరంగ సభలో పవన్‌ ప్రసంగంలో కనిపించిన సీరియస్‌నెస్‌ కార్యరూపంలో ప్రజాక్షేత్రంలో ప్రతిబింబించినప్పుడు మాత్రమే జనసేనకు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో బలమైన భూమిక లభిస్తుంది. ఇందుకు ఎంత పకడ్బందీ వ్యూహంతో జనసేన ముందడుగు వేస్తోందనే అంశంపై ఆధారపడి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం నడవబోతోంది. లాభనష్టాల సంగతెలా ఉన్నా.. మరికొంత కాలం పాటు ఏపీ స్పెషల్‌ స్టేటస్‌ హాట్‌ టాపిక్‌ ఆంధ్ర రాజకీయాలను అట్టుడికించడం ఖాయంగా కనిపిస్తోంది.  

బషీర్ బాగ్ లో నివాళులర్పించనున్న పది వామపక్ష పార్టీలు..

హైదరాబాద్ : విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉదయం 10.30గంటలకు బషీర్ బాగ్ లో పది వామపక్ష పార్టీలు నివాళులర్పించనున్నాయి. ఉదయం 11గంటలకు ప్రెస్ క్లబ్ లో సదస్సు జరగనుంది. 

నేడు మహబూబ్ నగర్ లో నెలనెలా వెన్నెల..

మహబూబ్ నగర్ : ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నెలనెలా వెన్నెల కార్యక్రమానిన్ ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రం మున్సిపల్ టౌన్ హాల్ లో నిర్వహించనున్నట్లు జిల్లా కళాకారుల సంస్థ పేర్కొంది. 

నేడు అనంతపురంకు రానున్న సీఎం బాబు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పరిస్థితులను తెలుసుకొనేందుక బాబు పర్యటించనున్నారు. కదిరి డివిజన్ పరిధిలో ఆమడగూరు, తనకల్లు మండలం కోట్లపల్లెలో ముఖ్యమంత్రి వేరుసెనగ పంటలను పరిశీలించనున్నారని తెలుస్తోంది. 

30న ఇండో - యూఎస్ చర్చలు..

వాషింగ్టన్ : భారత - అమెరికాల మధ్య ఈనెల 30న వ్యూహాత్మక, వాణిజ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, వాణిజ్య మంత్రి పెన్నీ రిట్జ్ కర్ సహా 12 మందితో కూడిన బృందం చర్చల కోసం ఈనెల 29న ఇండియాకు రానున్నది. 

భారత్ పై వెస్టిండీస్ విజయం..

అమెరికా : రెండు టీ 20 సిరీస్ ల తొలి మ్యాచ్ లో ధోనిసేన ఒక్క పరుగు తేడాతో అనూహ్య పరాజయం చవి చూసింది. 246 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ విజయానికి అత్యంత చేరువగా వచ్చి తృటిలో ఓటమి చవి చూసింది. రాహుల్ తో పాటు రోహిత్ శర్మ (62: 28 బంతుల్లో 4x4, 4x6) చెలరేగినా ధోని (43: 25 బంతుల్లో 2x4, 2x6) ఓ దశలో బాగానే ఆడినా చివరి ఓవర్ లో పరిస్థితి మారిపోయింది. ఆరు బంతుల్లో 8 పరుగులు అవసరమయ్యాయి. కానీ డ్వేన్ బ్రావో (2/37) అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఆరు పరుగులే ఇచ్చి భారత్ కు ఓటమి మిగిల్చాడు.

ఇటలీలో పెరిగిన భూకంప మృతులు..

అమట్రీన్ : ఇటలీలో సంభవించిన ఘోర భూకంప ధాటికి మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికి 281 మంది మృత్యువాత పడ్డారు. 388 మంది గాయపడ్డారు. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఐదు రోజుల పాటు వర్షాలు..

హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వచ్చే ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. 

Don't Miss