Activities calendar

30 August 2016

23:46 - August 30, 2016

విజయనగరం: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దోషి అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈ కేసును ఎంత వేగంగా ముగిస్తే అంతమంచిదన్నారు. ఈ కేసును అడ్డుపెట్టుకుని కేసీఆర్‌ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నా.. కేసు వలన చంద్రబాబు ప్రశ్నించలేక పోతున్నారని ఆరోపించారు. విజయనగరంలో కాంగ్రెస్‌ పార్టీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రఘువీరా... దేవినేని నెహ్రూ పార్టీని వీడటం వల్ల పార్టీకి వచ్చే నష్టం లేదన్నారు.

23:15 - August 30, 2016

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. జీఎస్టీ బిల్లు ఆమోదం సహా, పలు అంశాలను కేసీఆర్‌.. నరసింహన్‌కు వివరించారు. మరోవైపు గవర్నర్‌, సీఎం సమావేశం కొనసాగుతుండగానే.. ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌, అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి గవర్నర్‌ను కలిశారు. అయితే ఓటుకు నోటు కేసు నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

22:55 - August 30, 2016

రియో ఒలంపిక్స్ ల క్రీడాకారులకు ఏ పథకాలు వచ్చినయో కేంద్ర మంత్రిని అడిగితే గిట్టే తెలుస్తది. తెలంగాణ అసెంబ్లీల ఒక్క రోజు ముచ్చట ఒడిసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎట్ల ఉన్నరో లాంటి మస్తు మస్తు ముచ్చట్లను చూడాలంటే గీ వీడియో క్లిక్ చేయుండ్రి మస్త్ మజా అవుండ్రి..

22:47 - August 30, 2016
22:44 - August 30, 2016
22:35 - August 30, 2016

దేశ వ్యాపితంగా కార్మిక సంఘాలు సెప్టెంబర్ 2 న సమ్మెకు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని కార్మిక నేతలు మండిపడుతున్నారు. కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించకుండా మొండి వైఖరితో కార్మికుల హక్కులను కాలరాస్తుందంటూ నేతలు పేర్కొంటున్నారు... ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ఉమా మహేశ్వర రావు (సిఐటియూ), ఒబులేషు (ఎఐటియూసి), వెంకట సుబ్బయ్య (ఐఎన్ టియూసి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారి అభిప్రాయాలు వీడియోలో చూడండి.

21:05 - August 30, 2016
21:03 - August 30, 2016
20:59 - August 30, 2016
20:56 - August 30, 2016
20:46 - August 30, 2016

వరంగల్: జిల్లా కేంద్రంలో అఖిలపక్ష నాయకులు హన్మకొండ జిల్లాను వ్యతిరేకిస్తూ అందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వరంగల్ జిల్లా నుంచి హన్మకొండను వీడదీయవద్దంటూ హన్మకొండలో బస్టాండు ఎదుట వివిధ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. హన్మకొండ జిల్లాను వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఇచ్చిన బంద్‌లో భాగంగా అన్ని వివిధ పార్టీల నాయకులు పాల్గొని బస్టాండు ఎదుట బైటాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్ స్టేషన్‌ నుంచి బస్సులను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. చారిత్రాత్మకమైన వరంగల్‌ నగరాన్ని విచ్ఛిన్నం చేయడం దుర్మార్గమైన ఆలోచన అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండు చేశారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బస్టాండు ఎదుట అందోళన చేస్తున్న అఖిపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

20:39 - August 30, 2016

హైదరాబాద్: తెలంగాణ జాగృతికి నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నుంచి గుర్తింపు వచ్చిన సందర్భంగా సెప్టెంబర్‌ రెండో తేదీన నిర్వహించే కార్యక్రమానికి గవర్నర్‌ నరసింహన్‌ను ఆహ్వానించినట్టు టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈ కార్యక్రమంలో గవర్నర్‌, నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మినిష్టర్‌ రాజీవ్‌ ప్రతాప్‌ కూడా పాల్గొంటారని ఆమె చెప్పారు. 

20:33 - August 30, 2016

మెదక్ : జిల్లా శివ్వంపేట మండలంలో గిరిజనులకు, కొనుగోలుదారులకు మధ్య చోటుచేసుకున్న భూ వివాదం పరిష్కారం కోసం వెళ్లిన పోలీసులపై గిరిజనులు దాడి చేశారు. పోలీసులపై దాడి చేసి మూడు జీపులను ధ్వంసం చేశారు. సీఐ, ఏఎస్‌ఐ, ఓ హెడ్‌ కానిస్టేబుల్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. పెద్దసంఖ్యలో గిరిజనులు.. కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. జిల్లా కేంద్రం సంగారెడ్డి నుంచి ప్రత్యేక బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.  

19:31 - August 30, 2016

హైదరాబాద్ : ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ముందుకు సాగడంలేదు. పలు దేశాలు రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌లు ప్రభుత్వానికి నచ్చడంలేదు. దీంతో మరిన్ని మేలైన ప్లాన్లను అన్వేషించే పనిలో పడింది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేశవిదేశ నగరాలను పరిశీలించి ఆధ్యయనం జరిపేందుకు సర్కార్ సిద్దమౌవుతోంది. మొత్తం నాలుగు బృందాలుగా, నాలుగుదేశాలలో అధికారులు పర్యటనలు జరిపేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.

నాలుగుదేశాల్లో సీఆర్డీఏ కమీషనర్ శ్రీధర్‌ బృందం పర్యటన

ఏపీ ప్రభుత్వం నియమించిన నాలుగు బృందాలలో సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్‌ నేతృత్వంలోని బృందం వచ్చేనెల 6 వ తేదీ వరకు నాలుగుదేశాలలో పర్యటించనుంది. రష్యాతో పాటు దాని పొరుగుదేశం కజకిస్థాన్‌లోని అస్తానా నగరాన్ని తొలుత ఈ బృందం సందర్శించనుంది. అనంతరం జపాన్‌లోని టోక్యోతోపాటు ప్రముఖ నగరాలలో పర్యటించనుంది. చివరగా మలేషియా నూతన రాజధాని పుత్రజయతో పాటు సింగపూర్‌లోనూ పర్యటించనుంది. అలాగే సీఆర్డిఏ చీఫ్‌ ప్లానర్ నాగేశ్వరరావు నేతృత్వంలోని రెండవ బృందం ఆస్తానా, పుత్రజయల్లో పర్యటించనుంది.

3 దేశాలలో మంత్రి నారాయణ బృందం పర్యటన

ఇక మున్సిపల్ మంత్రి నారాయణ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం 3 దేశాలలో పర్యటనలు జరిపేందుకు సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీ నుంచి సెప్టెంబర్‌ ఒకటో తేదీ వరకు చైనాలో పర్యటించనుంది. చైనా రాజధాని బీజింగ్‌ తో పాలు మరికొన్ని ప్రాంతాలలో పర్యటించనుంది. అనంతరం రెండు రోజులపాటు టోక్యోలో పర్యటించనుంది. ఇక డీజీపీ సాంబశివరావు నేతృత్వంలోని నాలుగవ బృందం వచ్చేనెల నాలుగు, ఐదో తేదీలలో సింగపూర్‌లో పర్యటించనుంది. 

19:23 - August 30, 2016

హైదరాబాద్: తెలంగాణలో జిల్లాల విభజన కసరత్తును ప్రభుత్వం శరవేగంగా చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త జిల్లాలకు సంబంధించి ముసాయిదాను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి ప్రత్యేకంగా ఓ పోర్టల్‌, కొత్త జిల్లాల మ్యాపులను విడుదల చేసింది.

పునర్విభజన ముసాయిదా

ప్రస్తుతం రాష్ట్రంలో 10 జిల్లాలు, 44 రెవెన్యూ డివిజన్లు, 459 మండలాలున్నాయి. ఇకపై పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 490 మండలాలుగా రాష్ట్ర పరిపాలన జరగనుంది. మరోవైపు జిల్లాల డ్రాఫ్టులపై భారీగా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ 8,500కు పైగా విజ్ఞప్తులు, అభ్యంతరాలు సర్కార్ ఏర్పాటు చేసిన పోర్టల్ లో నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రత్యేక జిల్లా చేయాలని డిమాండ్ ఉన్న జనగాం, గద్వాల, హన్మకొండ ప్రాంతాలనుంచి ఎక్కువ ఫిర్యాదులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. వనపర్తి , యాదాద్రి జిల్లాల ఏర్పాటు విషయంలో వేర్వేరుగా 1100 ఫిర్యాదులు నమోదవ్వగా, హన్మకొండ జిల్లా ఏర్పాటుచేయాలని ఇప్పటివరకు 730 ఫిర్యాదులు వచ్చాయి. 

19:13 - August 30, 2016

తిరుపతి: తిరుమల కల్యాణకట్ట ఏఈవోగా పనిచేస్తున్న తంగవేలు నివాసంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో తిరుపతిలోని తంగవేలు ఇంటితో పాటు ఆరు ప్రాంతాల్లోని అతని బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గత ఏప్రిల్‌లో నిర్వహించిన దాడుల్లో భారీగా నగలు, నగదు, దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.  

19:09 - August 30, 2016

హైదరాబాద్: ముద్రగడ పద్మనాభం ఒంటరివాడు కాదని.. ఆయన ఉద్యమానికి ప్రతి కాపు సోదరుడు అండగా ఉంటారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. దాసరి నారాయణ రావు నివాసంలో కాపు రిజర్వేషన్ల అంశంపై ముద్రగడ పద్మనాభంతో జరిగిన సమావేశంలో పాల్గొన్న అంబటి.. కాపులను బీసీల్లో చేర్చుతామన్న టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. అన్ని జిల్లాల కాపునేతలను సంప్రదించాక ముద్రగడ పద్మనాభం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు. దాసరి నారాయణ రావు మాట్లాడుతూ... కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం పట్టువదలని విక్రమార్కుడిలా నిరంతర ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ముద్రగడ ఉద్యమానికి మద్దతిచ్చిన కాపు పెద్దలతో సమావేశమై చర్చించినట్లు తెలిపారు. ముద్రగడకు గౌరవసూచకంగానే తన నివాసంలో లంచ్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.      

19:02 - August 30, 2016

హైదరాబాద్: కాపు ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు కాపులను విస్మరించడం క్షమించరాని విషయమని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. దాసరి నారాయణ రావుతో సమావేశం అయిన తరువాత ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ... సెప్టెంబర్‌11న రాజమండ్రిలో కాపు సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తాము నిద్రపోము.. సీఎం చంద్రబాబును కూడా నిద్రపోనివ్వమని తెలిపారు. కాపులను దగా చేస్తే ఏం చేయాలనే దానిపై దాసరి సూచనలు కోరినట్లు తెలిపారు. 

18:55 - August 30, 2016

హైదరాబాద్ : ప్రతిపక్షాలకు ప్రజల సమస్యలు పట్టవని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్ రావు మండిపడ్డారు. జూపుడి ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ, కాంగ్రెస్ సీఎం చంద్రబాబు నాయుడు గారిపై ఓటుకు నోటు పేరుతో బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రజలకోసం పోరాడుతున్నది చంద్రబాబు నాయుడు, ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా తీసుకువచ్చే సత్తా చంద్రబాబు గారికే ఉందని, పవన్ కళ్యాన్ మాట్లాడినా, ప్రతి పక్షాలు మాట్లాడినా... చంద్రబాబు ను విమర్శించే స్థాయి లేదు. అభివృద్ధికి మారు పేరు సీఎం చంద్రబాబు అని చెప్పారు. ఎవరికి ఎవరు భయపడరని పేర్కొన్నారు. 

18:03 - August 30, 2016

గుంటూరు: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పల్నాడు ప్రాంతంలో వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. గురజాల, కారంపూడి, మాచర్లలో నాగులేరు, చంద్రవంక వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరోవైపు అచ్చంపేట దగ్గర ఎద్దువాగు వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. స్థానికులు ప్రొక్లెయిన్‌న రప్పించి బస్సును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కాలనీల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

17:15 - August 30, 2016

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులను టీఆర్‌ఎస్‌ పార్టీ నిసిగ్గుగా కొనసాగించడం దారుణమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్. అసెంబ్లీ మీడియాపాయింట్‌లో మాట్లాడిన ఆయన కేసీఆర్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని, లేదా అనర్హులుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు దస్తి నోటీసులకు స్పీకర్‌ సమాధానమివ్వాలని కోరారు. 

16:09 - August 30, 2016

హైదరాబాద్: జీఎస్టీ బిల్లుకోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అన్న ప్రభుత్వం...మరో మూడు ఆర్డినెన్సులను ఆమోదించుకునేందుకు ప్రయత్నిస్తోందని టి టిడిఎల్పీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం ఏదైనా ఆర్డినెన్సులను బిల్లుల రూపంలోకి మార్చుకోవాలంటే రెండు రోజుల ముందే సభ్యులకు విషయం తెలియచేయాలనే నిబంధనలున్నా, ప్రభుత్వం ఏకపక్ష దోరణిని ప్రదర్శిస్తోందన్నారు. 

15:44 - August 30, 2016

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌ 20 నుంచి 10రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అలాగే టిడీఎల్పీకి కార్యాలయం ఏర్పాటుపైనా బీఏసి చర్చించింది. కరవు, ప్రాజెక్టులు, శాంతిభద్రతలు, రైతు రుణమాఫీ, కొత్త జిల్లాలు పలు అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని బీఏసీ నిర్ణయించింది. 

15:38 - August 30, 2016

హైదరాబాద్ : దాసరి నారాయణరావు నివాసంలో కాపు నేతలు సమావేశమయ్యారు. కాపుల రిజర్వేషన్లపై ప్రభుత్వం విధించిన గడువు ముగియనుండటంతో భవిష్యత్తు కార్యాచరణపై కాపు నేతలు చర్చిస్తున్నారు. వచ్చే నెల11న బహిరంగ సభ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. జిల్లాల వారీగా జేఏసీలను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీలోని కాపు నేతలు చిరంజీవి, వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తో పాటు కాపు ఉద్యమాన్ని ముందుండి నడుపుతున్న ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు. 

14:27 - August 30, 2016

అద్దె గర్భం (సరోగసీ) ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విధానాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా మార్గదర్శకాలను రూపొందించింది. కాగా ఈ ముసాయిదా బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ఆమోదించనున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో వేదిక చర్చను చేపట్టింది. ఈ చర్చలో డా.సమిత్ శేఖర్ ( కిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్), డా. రమాదేవి(జనవిజ్ఞానవేదిక(,గిరిజ (సామాజిక కార్యకర్త) పాల్గొన్నారు. ఈ అంశంపై వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి ..మరింత సమాచారం తెలుసుకోండి..

14:15 - August 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం స్పీకర్ మధుసూధనాచారి ఛాంబర్లో ప్రారంభమయ్యింది. వినాయకచవితి పండుగ తరువాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం వున్నట్లు గా తెలుస్తోంది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలా? వద్దా? అనే అంశంపై నేతలు చర్చిస్తున్నారు. సమావేశం అనతరం దీనిపై ఏ విషయం అనేది తెలియనుంది.

14:06 - August 30, 2016
14:03 - August 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో జీఎస్‌టీ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీల సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు వల్ల రాష్ర్టాభివృద్ధికి దోహదపడుతుందన్నారు.

రాష్ట్రాలు ఆమోదిస్తేనే అది పూర్తిస్థాయి బిల్లు : కేసీఆర్
జీఎస్టీ బిల్లును దేశంలో ఉన్న సగం రాష్ట్రాలు ఆమోదిస్తేనే అది పూర్తిస్థాయి బిల్లుగా మారుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. జీఎస్టీ బిల్లును ఇప్పటికే 8 రాష్ట్రాలు ఆమోదించాయని తెలిపారు. జీఎస్టీబిల్లు పై ఆయన అసెంబ్లీ సమావేశంలో వివరించారు. రాష్ట్రాలు జీఎస్టీని ఆమోదించిన తరువాత జీఎస్టీ కౌన్సిల్‌.. పార్లమెంట్‌ ఉభయసభలలో బిల్లును ప్రవేశపెడుతుందని చెప్పారు. పార్లమెంట్‌ ఆమోదంతో జీఎస్టీ బిల్లుగా మారుతుందని తెలిపారు. జీఎస్టీ బిల్లు వల్ల పన్ను విషయంలో రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇంతవరకూ సర్వీస్‌టాక్స్‌లో వాటా కేంద్రప్రభుత్వానిదేనని, రాష్ట్రాలకు అందులో హక్కులేదని తెలిపారు. ఈ బిల్లు వల్ల సర్వీస్‌టాక్స్‌లో రాష్ట్రాలకు 50 శాతం వాటా లభిస్తుందని అన్నారు.

జీఎస్‌టీ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు : చిన్నారెడ్డి
జీఎస్‌టీ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ సభ్యులు చిన్నారెడ్డి తెలిపారు. సేవా పన్ను 18శాతం ఉంటే రాష్ర్టానికి లాభం అని వెల్లడించారు. జీఎస్‌టీ వల్ల పన్నుల ఎగవేత తక్కువగా ఉంటుందని, దేశం మొత్తం ఒకే పన్ను విధానం ఎంతో ప్రయోజనకరమన్నారు. పెట్రోల్‌, డిజీల్‌ ఇంధన ధరలపై విధించే ట్యాక్స్‌ను తగ్గించాలని కోరారు.

చిన్న తరహా పరిశ్రమలు నష్టపోకుండా ట్యాక్సులు వసూలు చేయాలి : సండ్ర
జీఎస్‌టీ సవరణకు బిల్లుకు తెలుగుదేశం పూర్తి మద్దతు తెలుపుతోందన్నారు సండ్ర వెంకట వీరయ్య. చిన్న తరహా పరిశ్రమలు నష్టపోకుండా ట్యాక్సులు వసూలు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

దేశచరిత్రలో జీఎస్టీ మైలురాయి : కిషన్ రెడ్డి
జీఎస్టీ బిల్లు ద్వారా 17రకాల పన్నుల భారం తగ్గనుందని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్‌రెడ్డి అన్నారు. జీఎస్టీ అంటే గ్రేట్‌ స్టెప్‌బై టీమిండియా అని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా జీఎస్టీ బిల్లును రాష్ట్రాలు ఆమోదిస్తున్నాయని ఆయన తెలిపారు. జీఎస్టీ బిల్లు దేశచరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.

జీఎస్టీకి చట్టబద్ధత ఇవ్వాలి : సున్నం రాజయ్య
జీఎస్టీ వల్ల నష్టం జరగకుండా రాష్ట్ర ప్రయోజనాలకు చట్టబద్దమైన రక్షణ చర్యలు చేపట్టాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు.జీఎస్టీ వల్ల జరిగే ఆర్థిక లోటును కేంద్రప్రభుత్వమే భరించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రానికి నష్టం జరగకుండా ఉండే పద్దతులను చూడాలని ఆయన సూచించారు. జీఎస్టీవల్ల జరిగే నష్టాన్ని తమ పార్టీ ఇంతకు ముందే రాజ్యసభలో తెలియజేసిందని ఆయన గుర్తు చేశారు.

బిల్లుకు టీఆర్‌ఎస్ సభ్యులందరూ సంపూర్ణ మద్దతు..
జీఎస్‌టీ సవరణ బిల్లుకు టీఆర్‌ఎస్ సభ్యులందరూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. జీఎస్‌టీ బిల్లుతో రాష్టాభివృద్ధికి మేలు జరుగుతుందన్నారు. 

13:54 - August 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో జీఎస్‌టీ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీల సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు వల్ల రాష్ర్టాభివృద్ధికి దోహదపడుతుందన్నారు.

రాష్ట్రాలు ఆమోదిస్తేనే అది పూర్తిస్థాయి బిల్లు : కేసీఆర్
జీఎస్టీ బిల్లును దేశంలో ఉన్న సగం రాష్ట్రాలు ఆమోదిస్తేనే అది పూర్తిస్థాయి బిల్లుగా మారుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. జీఎస్టీ బిల్లును ఇప్పటికే 8 రాష్ట్రాలు ఆమోదించాయని తెలిపారు. జీఎస్టీబిల్లు పై ఆయన అసెంబ్లీ సమావేశంలో వివరించారు. రాష్ట్రాలు జీఎస్టీని ఆమోదించిన తరువాత జీఎస్టీ కౌన్సిల్‌.. పార్లమెంట్‌ ఉభయసభలలో బిల్లును ప్రవేశపెడుతుందని చెప్పారు. పార్లమెంట్‌ ఆమోదంతో జీఎస్టీ బిల్లుగా మారుతుందని తెలిపారు.

13:47 - August 30, 2016

విజయవాడ : మారిన రాజకీయ పరిస్థితులకు అనుగునంగానే తాను టీడీపీలోకి చేరినట్టు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అన్నారు. తనతో పాటు తన కుమారుడు అవినాష్‌ కూడా టీడీపీలోకి చేరినట్లు ఆయన తెలిపారు. తన రాజకీయ జీవితం టీడీపీ నుంచే ప్రారంభమైందని, మళ్లీ టీడీపీలోకి రావడం పుట్టింటికి వచ్చినట్లుందని దేవినేని అన్నారు. సెప్టెంబర్ 15 న అనుచరులతో కలిసి అధికారికంగా టీడీపీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు.

అభివృద్ధిలో పాలుపంచుకునేందుకే పార్టీ మారాం: అవినాశ్
నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అభివృద్ధిలో పాలుపంచుకునేందుకే తెలుగుదేశం పార్టీలో చేరామని దేవినేని అవినాశ్‌ తెలిపారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ పార్టీకి ఉదయమే రాజీనామా చేసి కృష్టా జిల్లా పార్టీ అధ్యక్షునికి సమర్పించానని అవినాశ్‌ అన్నారు. సీఎం చంద్రబాబు చేసే అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు తప్ప ఇతర ఏ కారణాలు లేవని అవినాశ్‌ అన్నారు.

13:41 - August 30, 2016

విజయవాడ : కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో వెంటనే ఆయన్ని చికిత్స కోసం విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ని హార్ట్ అండ్ బ్రెయిన్ విభాగంలోని ఐసీయూ విభాగానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే జయేంద్ర సరస్వతి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నట్లు తెలుస్తోంది. షుగర్‌, బీపీ లెవల్స్‌ తగ్గాయని..సాయంత్రం వరకు అబ్జర్వేషన్‌లో ఉంచుతున్నట్లు ఆంధ్రా ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ పీవీ రమణమూర్తి తెలిపారు. అయితె ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితిని తెలుసుకునేందుకు ఐదుగురు వైద్యం బృందం పనిచేస్తోందని పీవీ రమణమూర్తి తెలిపారు.

టీటీడీ ఉద్యోగి తంగవేలు ఇంట్లో ఏసీబీ సోదాలు

తిరుపతి: టీటీడీ ఉద్యోగి తంగవేలు ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. తిరుమల కల్యాణ కట్టలో పనిచేస్తున్న తంగవేలు వద్ద భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తంగవేలు బంధువుల ఇళ్లలోనూ కూడా సోదాలు కొనసాగుతున్నాయి. 

సెప్టెబర్ 20నుండి టీ.అసెంబ్లీ..

హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో బీఏసీ సమావేశమైంది. సమావేశంలో వర్షాకాల సమావేశాల ఎజెండాపై చర్చించారు. వచ్చే నెల 20 నుంచి శాసనసభ తిరిగి ప్రారంభం కానుంది. 10 పనిదినాలు ఉండేలా సమావేశాలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ సమావేశంలో తెలిపారు. స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆయా పార్టీల సభ్యులు హాజరయ్యారు. ఇవాళ జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందింది.

కేసీఆర్ సోదరుడి కుమార్తె అరెస్ట్..

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమార్తె రమ్యను హైదరాబాదులో పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే...చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బోడిగ శోభను అరెస్టు చేయాలంటూ ఆమె గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. చిన్నాన్నతో విభేదించి కాంగ్రెస్ లో చేరిన రమ్య ఆందోళన చేయడంతో అక్కడికి కాంగ్రెస్ నాయుకుల తాకిడి పెరిగుతోంది. ఇది మరింత పెరిగే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు, ఆమెను అదపులోకి తీసుకున్నారు.

13:15 - August 30, 2016

కరీంనగర్‌ : రాయపట్నం వంతెన దగ్గర విషాదం చోటుచేసుకుంది. బీకామ్‌ విద్యార్థిని వేదిక వంతెన పైనుంచి గోదావరి నదిలోకి దూకింది. విద్యార్థిని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వేదిక గొల్లపల్లి మండలం వేణుగమట్ల వాసిగా గుర్తించారు. నదిలోకి దూకేముందు విద్యార్థిని నేను చనిపోతున్నా, 9490051919 నెంబర్‌కు ఫోన్‌ చేయండి అని కాగితంపై రాసి ఆత్మహత్య చేసుకుంది.

13:12 - August 30, 2016

కరీంనగర్‌ : జిల్లా చొప్పదండి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బొడిగె శోభను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ.. కాంగ్రెస్‌ మహిళా నేత రమ్య గన్‌పార్క్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. 2013లో కరీంనగర్‌లో ఉన్న తన ఫంక్షన్‌హాల్‌పై బొడిగె శోభ, కొంతమంది మహిళా నేతలతో కలిసి దాడి చేశారని ఆరోపించారు. తక్షణమే ఎమ్మెల్యే శోభను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతుండడంతో ఆందోళన చేపట్టవద్దని పోలీసులు ఆమెకు సూచించారు. రమ్య వినిపించుకోకపోవడంతో.. అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

టీ.అసెంబ్లీ అరగంట వాయిదా

హైదరాబాద్ : శాసనసభ అరగంట పాటు వాయిదా పడింది. జీఎస్టీ బిల్లుకు సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపిన అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. టీ విరామం అనంతరం సభ ప్రారంభం కానుంది. బీఏసీ సమావేశానికి సభ్యులను స్పీకర్ ఆహ్వానించారు. మరికాసేపట్లో అసెంబ్లీ ప్రాంగణంలో బీఏసీ సమావేశం కానుంది.

13:02 - August 30, 2016

హైదరాబాద్ :.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లు తీర్మానాన్ని సంపూర్ణ మద్దనిస్తున్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈ బిల్లు మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. మరో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ..ఈ బిల్లు రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఒకప్పుడు కార్లు, జనరేటర్లు కొనాలంటే పాండిచ్చేరి వెళ్లాల్సివచ్చేదనీ..ఎందుకంటే అక్కడ టాక్స్ తక్కువగా వుంటాయనే కారణంతో ఆ ప్రాంతంలోనే కొనుగోలు చేసేవారని తెలిపారు. ఒకే పన్ను విధానంతో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు చాలా మేలు జరుగుతుందన్నారు. మరో ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..జీఎస్టీ బిల్లుకు టీఆర్ఎస్ పార్టీ తరపును ఆమోదం తెలుపుతున్నామన్నారు. 

12:47 - August 30, 2016

హైదరాబాద్  : జీఎస్టీ బిల్లు తీర్మానంపై చ‌ర్చ‌లో భాగంగా రాజ‌య్య మాట్లాడుతూ...జీఎస్టీ బిల్లుపై నష్టాలుంటాయని పేర్కొన్నారు. ఈ బిల్లుపై పున:పరిశీలించాల్సిన అవసరముందని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ ఆదాయాలకు గండి పడకుండా ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ బిల్లు ద్వారా రాష్ట్ర హక్కులకు నష్టం కలిగించే పరిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌నే అనుమానాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

160 దేశాలోల్ జీఎస్టీ బిల్లు అమలు : కిషన్ రెడ్డి
 ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాలు జీఎస్టీ బిల్లును అమలు చేస్తున్నాయని తెలిపారు. పన్నుల చెల్లింపులో అలసత్వాన్ని రూపుమాపేందుకు ఈ బిల్లు ఉపయోగపడతుందన్నారు. అసెంబ్లీలో జీఎస్టీ బిల్లు సీఎం కేసీఆర్ జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు.ఈ అంశంపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ..జీఎస్టీ బిల్లును పార్లమెంట్ ఉభయసభలలోనూ ఆమోదింపజేసిన ప్రధాని సమర్థతపై కిషన్ రెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు. 2009లో ఈ బిల్లుకు రూపకల్పన చేస్తే..బిల్లు ఆమోదానికి 16 సంవత్సరాలు పట్టిందన్నారు. జీఎస్టీ బిల్లు అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉటుందని ఆయన పేర్కొన్నారు. వ్యాపార, వాణిజ్య, ఉత్పత్తి వర్గాలకు జీఎస్టీ బిల్లు ఉపయోగపడుతుందన్నారు. 17 రకాల పన్నులు లేకుండా ఒకేపన్ను విధానం ఈ బిల్లుతో సాధ్యపడుతుందని తెలిపారు. పన్నులంటే భయపడే పరిస్థితి నుండి జీఎస్టీ బిల్లు ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదంతో దేశ ఆర్థిక వ్యవస్థ అంతా సింగిల్ విండోగా మారబోతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడేందుకు జీఎస్టీ బిల్లు ఆమోదం తెలిపేందుకు పార్టీలకు అతీతంగా ముందుకొస్తున్నాయన్నారు. ఇప్పటివరకూ 32 శాతంగా వున్న ఆర్థిక రేటు 42 శాతంగా పెంచేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందన్నారు. 90 రాజకీయ పార్టీలు,29 రాష్ట్రాలు కలిపి ఈరోజు జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలుపుతున్నాయని తెలిపారు. దీంతో వినియోగదారుడు లబ్దిపొందుతాడని తెలిపారు. జీఎస్టీ బిల్లుకు భారతీయ జనతాపార్టీ తరపున సంపూర్ణంగా మద్ధతు తెలుపుతున్నామని తెలిపారు.

రాష్ట్ర ఆదాయానికి జీఎస్టీ ఉపయోగం : సండ్ర వెంకట వీరయ్య
హైదరాబాద్ : జీఎస్టీబిల్లుకు తమ పార్టీ తరపు నుండి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. జీఎస్టీ బిల్లుపై ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు. దేశమంతా ఒకేపన్ను విధానం రావటం మంచిపరిణామన్నారు. రాష్ట్ర ఆదాయానికి గండిపడకుండా జీఎస్టీ ఉపయోగపడతుందని తెలిపారు. 

జీఎస్టీ బిల్లుపై నష్టాలుంటాయి: సున్నంరాజయ్య

హైదరాబాద్ : జీఎస్‌టీబిల్లుపై నష్టాలుంటాయని సీపీఎం పార్ల‌మెంటులోనూ సూచించింద‌ని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజ‌య్య ఈరోజు శాస‌న‌స‌భ‌లో గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఈరోజు జీఎస్‌టీ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు తీర్మానంపై చ‌ర్చ‌లో భాగంగా రాజ‌య్య మాట్లాడుతూ... జీఎస్టీ బిల్లుపై త‌మ నాయ‌కుడు సీతారాం ఏచూరీ పార్ల‌మెంటులో ప‌లు సూచ‌న‌లు చేశార‌ని అన్నారు. బిల్లు ద్వారా రాష్ట్ర హక్కులకు నష్టం కలిగించే పరిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌నే అనుమానాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. 

జీఎస్‌టీ బిల్లు తీర్మానాన్ని స్వాగతించిన కిషన్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ‌ శాసనసభలో సీఎం కేసీఆర్ ఈరోజు జీఎస్‌టీ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై బీజేపీ తెలంగాణ నేత కిష‌న్‌రెడ్డి మాట్లాడుతూ... జీఎస్‌టీ బిల్లు తీర్మానంపై చ‌ర్చ‌ను స్వాగ‌తిస్తున్న‌ట్లు తెలిపారు. ముఖ్య‌మంత్రికి కేసీఆర్‌కి అభినంద‌న‌లు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. యావత్ దేశం బిల్లుని స్వాగ‌తిస్తోందని ఆయ‌న అన్నారు. జీఎస్‌టీ బిల్లు భార‌త ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల్లో ఓ మైలురాయిగా మిగిపోతుందని వ్యాఖ్యానించారు. ప‌న్నుల విధానంలో అక్ర‌మాలు ఉండ‌వని అన్నారు. 

గుజరాజ్ సీఎంగా మోదీ జీఎస్టీని వ్యతిరేకించారు : చిన్నారెడ్డి

హైదరాబాద్ : జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం తెల‌ప‌డ‌మే ల‌క్ష్యంగా తెలంగాణ శాసనసభ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. శాసనసభలో సీఎం కేసీఆర్ జీఎస్‌టీ బిల్లును ప్రవేశపెట్టిన అనంత‌రం కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి బిల్లుపై మాట్లాడారు. ఒకే దేశం ఒక ప‌న్ను విధానానికి బిల్లును 2011లోనే యూపీఏ ప్ర‌భుత్వం పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టిందని ఆయ‌న గుర్తు చేశారు. రాజ‌కీయ పార్టీలు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆ బిల్లు పాస్ కావ‌డానికి ఇన్నాళ్లు ప‌ట్టిందని ఆయ‌న అన్నారు. ఈ బిల్లుపై చాలా మందికి అపోహ‌లు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

11:47 - August 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం సీఎం కేసీఆర్ జీఎస్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లు గురించి కేసీఆర్ సభాసభ్యులు వివరించారు. అనంతరం జీఎస్టీ బిల్లుకు పార్టీలకు అతీతంగా మద్ధతునివ్వాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడారు. జీఎస్టీ బిల్లుపై చాలా మందికి అపోహలున్నాయన్నారు. జీఎస్టీ బిల్లును ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న నరేంద్రమోదీ వ్యతిరేకించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో జీబీపీలో 57 శాతం ఆదాయం సర్వీస్ ట్యాక్స్ ద్వారానే వస్తుందన్నారు. తెలంగాణలో సర్వీస్ టాక్స్ 14.5 శాతంగా వుందని తెలిపారు. ఈ బిల్లు అమలైతే సర్వీస్ టాక్స్ ఆదాయం 18 శాతం పెరుగతుందన్నారు. సర్వీస్ టాక్స్ ఆదాయంతో రాష్ట్ర ఖజానాకు నిధులు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. చాలా దేశాల్లో తక్కువ టాక్స్ ను ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. జీఎస్టీ బిల్లుతో కెనడాలో 5 శాతం మాత్రమే వసూలు చేస్తోందనీ..పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గినే ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. టాక్స లు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వుండాలని వేదాలలో వేదవ్యాసుడు కూడా తెలిపాడనీ..అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు కూడా ప్రభుత్వం విధించే పన్నులు ప్రజలకు బాధ కల్గింకూడదని తెలిపాడని ఈ సందర్బంగా జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్ధతు తెలుపుతోందని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి తెలిపారు. 

11:23 - August 30, 2016

హైదారబాద్ : తెలంగాణ ఒక్కరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమయ్యింది. ప్రారంభమైన కొద్ది సేపటికే సీఎం కేసీఆర్ జీఎస్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.  జీఎస్టీ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..గత యూపీఏ ప్రభుత్వం నుండి నేటి ఎన్డీఏ ప్రభుత్వం వరకూ జీఎస్టీ బిల్లుకు రాజ్యాంగ సవరణబిల్లుకు ఆమోదించాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశంలో పేర్కొన్నారు. దేశమంతా ఒకే వస్తు వినిమయ పన్ను విధానం అవలంభించేందుకు కేంద్రం జీఎస్టీ బిల్లును పార్లమెంట్ ఉభయసభలలోనూ అమోదించాయని తెలిపారు. అనంతరం దేశంలోని అన్ని రాష్ట్రాలకూ కేంద్రం పంపించిందన్నారు. ఇప్పటికే పార్టీలకు అతీతంగా బీహార్ , అరుణాచల్ ప్రదేశ్ వంటి తొమ్మిది రాష్ట్రాలు కేంద్రానికి పంపించాయని తెలిపారు. ఈ బిల్లుకు ఆమోదం పలికితే పదవ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం వుంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపితే దేశంలో జీఎస్టీ బిల్లు అమలులోకొస్తుందని పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం జీఎస్టీ కౌన్సిల్ పరిధిలోకి వెళ్తుందని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. ఈ బిల్లు అమలులోకి వస్తే పెట్రోల్ కు వర్తించదనీ..కేవలం వ్యాట్ పరిధిలోకి వచ్చే పనులకు మాత్రమే జీఎస్టీ వర్తిస్తుందని కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ జీఎస్టీ బిల్లుకు ఆమోదం పలకాలని ఈ సందర్బంగా కేసీఆర్ కోరారు.

ఏసీబీకి చిక్కిన తహశీల్దార్ ..

మెదక్: రూ. రెండు లక్షల లంచం తీసుకుంటూ మెదక్ తహసీల్దార్ ఏసీబీ అధికారులకు చిక్కారు. నాలా కన్వర్షన్ కోసం శ్రీనివాస్ అనే వ్యక్తిని రూ. మూడు లక్షలు లంచం ఇవ్వాలని దౌల్తాబాద్ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశాడు. చివరికి రూ.2లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీ అధికారులు ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రవీందర్‌రెడ్డి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

10:54 - August 30, 2016

నల్లగొండ : వెంచర్లలో ప్లాట్లు వదల్లేదు...భూములపై కన్నేసి పెట్టాడు..ఇలా వాళ్లూ..వీళ్లని లేదు..ఎవరైనా ఫర్వాలేదు... ఎంతటికైనా తెగించే అనుచరులను పెట్టుకుని కొనుగోలు చేసిన ప్లాట్లను సైతం కబ్జా చేశారు..ఎదురు మాట్లాడినవారిని గడపదాటనీయకుండా చేశాడు..నయీం ఎన్‌కౌంటర్‌తో మూగబోయిన గొంతుకలు విన్పిస్తున్నాయి..

న్యాయం చేయండి సారూ...
సారూ...ఇంతకాలానికి బయటకు వచ్చాం...న్యాయం చేయండి సారూ...ఇంతకాలం భయపెట్టి బతికాడు.గ్యాంగ్‌స్టర్‌ బాధితులు.ఒక్కొక్కరుగా...నయీం స్వస్థలంలో విన్పిస్తున్న గొంతుకలు..ఇంతకాలం అంగబలం..అర్థబలంతో వణికించుకున్న గ్యాంగ్‌స్టర్‌ నయీం అరాచకాలు బయటకు రాకపోవడానికి కారణం వీరే...ఇలాంటివారెందరో అమాయకులు భయంతో గడప దాటలేదు...తమకు అన్యాయం జరిగిందని ధైర్యంగా చెప్పుకోలేకపోయారు..కాని ..ఇప్పుడా అవకాశం వచ్చింది...ఇంతకాలం వణుకుతూ మూగబోయిన గొంతుకలు విన్పిస్తున్నాయి...తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నాయి...

క్యూ కడుతున్న బాధితులు...
న్యాయం కోసం ప్రాధేయపడుతున్న చేతులు...ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని నల్లగొండ జిల్లా భువనగిరి స్వస్థలాల్లో ప్లాట్లు కొనుగోలు చేసుకుంటే గ్యాంగ్‌స్టర్, అతని అనుచరులు భయపెట్టి కబ్జాలు చేశారని బాధితులు చెబుతున్నారు...శృతినగర్ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసుకున్నవారి నుంచి లాక్కున్న నయీం అనుచరుల నుంచి తమను కాపాడాలని...తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు...తమ గోడు వెల్లబుచ్చుకునేందుకు సిట్‌ అధికారులను కలిసేందుకు వచ్చిన వారిని కదిలిస్తే ఒక్కొక్కరూ ఒక్కో గాథ చెబుతున్నారు...

కబ్జా చేశారని చెబితే ఎవరూ స్పందించటేదంటున్న బాధితులు
గతంలో కాస్త ధైర్యం చేసి తమ ప్లాట్లను కబ్జా చేశారని చెబితే ఎవరూ స్పందించలేదంటున్నారు...నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత బాధితులకు న్యాయం చేస్తామంటూ అధికారులు భోరాస ఇస్తుండడంతో ముందుకు వచ్చామని బాధితులు అంటున్నారు...

ఆర్డీఓ కార్యాలయం ముందు ప్లకార్డులతో బాధితుల ఆందోళన
ఇక ఇదే ప్రాంతంలో లక్ష్మినర్సింహ వెంచర్ సంబంధించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..దీంతో రెవెన్యూ అధికారులు విచారణకు ఆదేశాలు కూడా జారీ చేశారు..అయితే ఆ రోజున జరగాల్సిన విచారణ అనివార్యకారణాల వల్ల వాయిదా పడిందంటున్నారు..ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మోసపోయామని..భయంతో బయటకు రాలేదని చెబుతున్నారు.. ఇకనైనా న్యాయం చేయాలంటూ ఆర్డీఓ కార్యాలయం ముందు ప్లకార్డులతో ఆందోళన చేశారు.

10:47 - August 30, 2016

వరంగల్ : హన్మకొండ జిల్లాను వ్యతిరేకిస్తూ వరంగల్ జిల్లా కేంద్రంలో అఖిలపక్ష నాయకులు అందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వరంగల్ జిల్లా నుంచి హన్మకొండను వీడదీయవద్దంటూ హన్మకొండలో బస్టాండు ఎదుట వివిధ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. హన్మకొండ జిల్లాను వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఇచ్చిన బంద్‌లో భాగంగా అన్ని వివిధ పార్టీల నాయకులు పాల్గొని బస్టాండు ఎదుట బైటాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్ స్టేషన్‌ నుంచి బస్సులను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. చారిత్రాత్మకమైన వరంగల్‌ నగరాన్ని విచ్ఛిన్నం చేయడం దుర్మార్గమైన ఆలోచన అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండు చేశారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బస్టాండు ఎదుట అందోళన చేస్తున్న అఖిపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

10:45 - August 30, 2016

గుంటూరు : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుంటూరు రూరల్ ప్రాంతం శివారు టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఓబులనాయుడు పాలెంలో టీడీపీ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏమినేడి వెంకటేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. రక్తపుమడుగులో పడివున్న వెంకటేశ్వరరావును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటీన సంఘటనాస్థలాన్ని చేరుకున్న గుంటూరు అర్బన్‌ దక్షిణమండల డీఎస్పీ బి. శ్రీనివాసరావు, సీఐ కె. శ్రీనివాసరావులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. అనంతరం కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గత కొంతకాలంలో వెంకటేశ్వర్రావు టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విభజనానంతరం ఏపీ రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ ఊపందుకోవటంతో చోటామోటా నాయకులు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో వెంకటేశ్వర్రావు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపార లావాదేవీలు నేపథ్యంలో ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఇంట్లో ఒంటరిగా ఉన్న వెంకటేశ్వరరావును తెల్లవారుజామున దుండగులు హత్య చేసి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు.

వర్షాలకు కూలిన భవనం..ఇద్దరు మృతి..

మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని ఛతర్‌పూర్‌లో భారీ వర్షం కురిసింది. వర్షానికి మూడు అంతస్తుల భవనం కూలింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

10:20 - August 30, 2016
10:18 - August 30, 2016

ఆదిలాబాద్: కెరమెరి పోలీస్‌క్వార్టర్స్ లో విషాదం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీధర్‌ చేతిలో గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో ఎస్సై తలకు తీవ్రంగా గాయాలవటంలో తో ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. కాగా చికిత్స పొందుతూ శ్రీధర్ మృతి చెందాడు. దీంతో ఆప్రాంతంలో విషాదయ ఛాయలు అలుముకున్నాయి. మూడు రోజుల క్రితమే ఎస్‌ఐగా శ్రీధర్‌ బాధ్యతలు చేపట్టారు .  గన్ మిస్ ఫైర్ విషయంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా గన్ మిస్ ఫైర్ కాదు.. కుటుంబ కలహాలతో ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు కూడా వినిపిస్తూండటం గమనించాల్సిన విషయం. ఇది ఎంతకూ వాస్తవమో దర్యాప్తు అనంతరం తేలనుంది.

గన్ మిస్ ఫైర్..ఎస్సై మృతి..

ఆదిలాబాద్: కెరమెరి పోలీస్‌క్వార్టర్స్‌లో తుపాకీ మిస్‌ఫైర్‌ అయింది. ఎస్‌ఐ శ్రీధర్‌ చేతిలో రివాల్వర్‌ పేలింది. ఎస్‌ఐ శ్రీధర్‌కు తీవ్రమైన గాయాలు కావడంతో అత్యవసర చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీధర్ మృతి చెందాడు. మూడు రోజుల క్రితమే ఎస్‌ఐగా శ్రీధర్‌ బాధ్యతలు చేపట్టారు. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడంతో కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబై : స్టాక్‌మార్కెట్లు ఈరోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 150 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 50 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.67.10 పైసలు వద్ద కొనసాగుతోంది. ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, హాంగ్‌సెంగ్‌, ఆమ్టెక్‌ ఆటో, ఏబీబీ, ఏజిస్‌ లాజిస్టిక్‌, ఏసీసీ, హెక్సావేర్‌టెక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

కంచి పీఠాధిపతికి అస్వస్థత..

విజయవాడ: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మంగళవారం ఉదయం తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. సూర్యరావు పేటలోని ఆంధ్రా ఆసుపత్రిలో హర్ట్ అండ్ బ్రెయిన్ విభాగంలోని ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆంధ్రా ఆసుపత్రి అధినేత డాక్టర్ పీవీ రమణమూర్తి తెలిపారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఐదుగురు డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు.

అఖిలపక్ష నేతలు అరెస్ట్..

వరంగల్ :హన్మకొండ జిల్లాను వ్యతిరేకిస్తూ జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీలు మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆర్టీసీ బస్సులు బయటికి రాకుండా హన్మకొండ బస్టాండు వద్ద వివిధ పార్టీల నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బస్టాండ్‌ ఎదుట బైఠాయించారు. హన్మకొండ పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేయడంతో ప్రస్తుతం బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. వివిధ పార్టీల ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

09:20 - August 30, 2016

వర్గాల మధ్య ఘర్షణ..పోలీసులకు గాయాలు..

మెదక్: జిల్లాలోని తుప్రాన్ పోలీస్ సర్కిల్ పరిధిలోని శివ్వంపేట్ గ్రామపంచాయితీకి చెందిన తాళ్లపల్లి తాండలో భూమి గురించి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘర్షణ అడ్డుకోవడానికి యత్నించారు. ఈ క్రమంలో సీఐ, ఐదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు వాహనాలు ధ్వసమయ్యాయి. ఏఎస్‌ఐ శివకుమార్ తలకు తీవ్రగాయమైంది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడినవారిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు.

09:11 - August 30, 2016

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలుపుతూ... తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రెండుగా విభజించిన సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ల ఆర్డినెన్స్‌కు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నేడు జరిగే అసెంబ్లీ సమావేశంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశం ఒకేరోజు మాత్రమే జరగనుంది.

జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన కేబినెట్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఒక్కరోజే నిర్వహించాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. దాదాపు రెండున్నర గంటల పాటు సమావేశమైన కేబినెట్‌.. జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్ ఆమోదం కోసమే మంగళవారం అసెంబ్లీ సమావేశం జరుగుతోంది. జీఎస్టీ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత.. బీఏసీ సమావేశం జరగనుంది.

చంద్రబాబుతో భేటీ కానున్న దేవినేని నెహ్రూ..

విజయవాడ : కాంగ్రెస్ సీనియర్ దేవినేని నెహ్రూ భేటీ మరికాసేపట్లో సీఎం చంద్రబాబుతో కానున్నారు. దేవినేని టీడీపీలో చేరేందుకు తేదీ ఖరారుకావటంతో మంగళవారం నాడు సీఎంను కలవనున్నారు. ఇప్పటికే నెహ్రూ లోకేష్, టీడీపీ అగ్రనేతలతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. 

తమిళనాడు రాష్ట్ర బంద్..

తమిళనాడు : తమిళనాడు అన్నదాతలు మంగళవారం రాష్ట్రవ్యాప్త బంద్‌ చేపట్టనున్నారు. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నదీ జలాలు ఆగిపోవడంతో తమిళనాడులో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు తమిళనాడులోని సుమారు వెయ్యి ప్రాంతాల్లో రాస్తారోకోలు, వంద చోట్ల రైల్‌రోకోలు నిర్వహించడానికి రైతుల సంఘాల సమన్వయ కమిటీ సన్నాహాలు చేపట్టింది. డీఎంకే, కాంగ్రెస్‌, టీఎంసీ, ముస్లిం లీగ్‌, వీసీకే తదితర పార్టీలూ బంద్ లో పాల్గొననున్నాయి.

బోల్తా పడిన లారీ..ఇద్దరు మృతి..

కడప : ముద్దనూరు- జమ్మలమడుగు రహదారిపై ఎత్తులోటకట్ట మలుపు వద్ద మంగళవారం ఉదయం లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బియ్యంలోడుతో కదిరి వెళ్తున్న లారీ ముద్దనూరు సమీపంలో ఎత్తులోటకట్ట మలుపు వద్దకు రాగానే వేగాన్ని నియంత్రించలేక అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన లారీ ఓనర్‌ రోహిణి కుమార్‌(40)తో పాటు క్లీనర్‌ ఏసు(35) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌ పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

చెత్తకుండీలో ప్రత్యక్షమైన ఒలింపిక్ గోల్డ్ మెడల్!..

అమెరికా : ఒలింపిక్ గోల్డ్ మెడల్ పోయిందని బాధపడుతున్న ఆమెరికా అథ్లెట్ చెంతకు పతకం చేరడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 1992లో బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్ లో రోయింగ్ విభాగంలో జో జాకోబి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అయితే మాజీ ఒలింపియన్ జో జాకోబి గత జూన్ లో తన పతకం పోయిందని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. తన కారులో నుంచి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని పతకాన్ని ఎవరో చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడంతో అందరికీ ఆ విషయం తెలిసిపోయింది.

అసెంబ్లీ పరిధిలో నిషేదాజ్ఞలు..

హైదరాబాద్ : శాసన సభ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ హాల్‌కు చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో నిషేదాజ్ఞలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం. మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఈనెల 30వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి వచ్చే నెల 2వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అమలులో ఉంటాయని కమిషనర్ పేర్కొన్నారు. నిషేదాజ్ఞలు ఉన్నందున ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించరాదని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ నేపథ్యంలో నిషేదాజ్ఞలు విధిస్తున్నట్టు వివరించారు. 

ట్రక్-మినీ బస్ ఢీ..9మంది మృతి..

కంబోడియా : సోమవారం అర్థరాత్రి తర్వాత సమయంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా, మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. కంబోడియాలోని బట్టాంబాంగ్ ప్రాంతంలో మాంగ్ రస్సె జిల్లాలో వేగంగా వెళ్తున్న ట్రక్, మినీ బస్ ఢీకొన్నట్లు ఓ అధికారి తెలిపారు.

ఐశ్వర్యా ధనుష్ కు అరుదైన గౌవరం..

తమిళనాడు : తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె, ప్రముఖ నటుడు ధనుష్ భార్య, దర్శకురాలు..బహుముఖ ప్రజ్ఞాశాలి  ఐశ్వర్యకు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం (యూఎన్‌-విమెన్‌) భారత్‌ లో స్త్రీ, పురుష సమానత్వం, మహిళా సాధికారత ప్రత్యేక సలహాదారుగా నియమిస్తున్నట్టు 'యూఎన్ విమెన్' శాఖ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐశ్వర్య మాట్లాడుతూ, సాధికారత, సమానత్వం కోసం మహిళల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.

ప్రధాని మోదీపై చైనా మీడియా ఫైర్..

చైనా : భారత్ పేరెత్తితే ఉలిక్కిపడే చైనా మీడియా మరోమారు పొరుగు దేశంపై అక్కసు వెళ్లగక్కింది. బలూచిస్థాన్ విషయంలో భారత ప్రధాని వైఖరిపై ధ్వజమెత్తింది. మోదీ సహనం కోల్పోయారంటూ పిచ్చిరాతలు రాసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రబాధిత ప్రజలకు పరిహారంపై దుమ్మెత్తి పోసింది. బలూచిస్థాన్‌పై మోదీ వ్యాఖ్యలను ప్రస్తావించిన అధికారక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆయన బలూచిస్థాన్ గురించి మాట్లాడారని ఆరోపించింది. ‘ఇండో-పాక్' సంబంధాల పునరుద్ధరణపై నరేంద్రమోదీకి అంతగా ఇష్టం లేదు.

పవన్‌కళ్యాణ్‌పై హెచ్ ఆర్సీలో ఫిర్యాదు..

హైదరాబాద్ : సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు నమోదైంది. తిరుపతిలో జరిగిన బహిరంగసభలో కుల,మతాలను కించపరిచేవిధంగా ప్రసంగించారని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు దేరంగుల ఉదయ్‌కిరణ్ సోమవారం హెచ్చార్సీలో ఫిర్యాదుచేశారు. తనకు కులాలు, మతాల పేరు చెబితే అరికాళ్ల నుంచి మంటపుడుతుందని సభలో పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదులో ఉదయ్ పేర్కొన్నారు.

అనంతపురం జిల్లాలో మంత్రుల పర్యటనలు..

విజయవాడ : మంగళవారం నాడు సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా ధర్మవరం, పెనుగొండ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అలాగే పలువురు మంత్రులు పలు నియోజకవర్గాల్లో పర్యటించి రెయిన్ గన్ ల పనితీరును పరీక్షించనున్నారు. అనంతపురం జిల్లాలోని అనంతపురం, ధర్మవరం నియోజకవర్గాల్లో మంత్రి ప్రత్తిపాటి, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో మంత్రి పీతల సుజాత ..పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో మంత్రి పరిటాల సునీత, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లో మంత్రి రావెల కిశోర్ బాబు పర్యటించి రెయిన్ గన్ ల పనితీరును మంత్రులు పరీశీలించనున్నారు.

ఐసెట్ ప్రవేశాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ..

హైదరాబాద్ : నేడు ఐసెట్ ప్రవేశాలకు కొనసాగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ జరుగనుంది. 50,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు నేడు అధికారులు వెరిఫికేషన్ చేయనున్నారు. ఎన్ సీసీ కేటగిరిలో 30,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగనుంది. 

స్విస్ ఛాలెంజ్ పై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్: స్విస్ ఛాలెంజ్ పై నేడు హైకోర్టులో విచారణ చేపట్టనుంది. దీనిపై చంద్రబాబు సర్కార్ కు హైకోర్టు ఆదేశాలిచ్చే అవకాశాలున్నట్లుగా సమచారం..

వరంగల్ జిల్లాలో బంద్ కు అఖిలపక్షం పిలుపు..

వరంగల్ : జిల్లాలో బంద్ కు అఖిలపక్షం నేతలు బంద్ కు పిలుపునిచ్చారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ఊపందుకున్న నేపథ్యంలో ప్రతిష్ఠాత్మకమైన హన్మకొండను ప్రత్యేక జిల్లాగా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై సర్వత్రా నిరశన వ్యక్తమవుతోంది. వరంగల్, హన్మకొండ వేరువేరు కాదని, అలాంటప్పుడు రెండు జిల్లాలు చేయడమేంటని అఖిలపక్షం నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో బంద్ కు పిలుపునిచ్చారు. వరంగల్ బస్టాండ్ వద్ద అఖిలపక్షం నేతలు ధర్నా చేస్తున్నారు.

టీడీపీ నేత దారుణ హత్య?!..

గుంటూరు : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుంటూరు ప్రధాన పట్టణం శివారు ప్రాంతమైన ఓబులనాయుడు పాలెంలో టీడీపీ నేత వెంకటేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న ఆయనపై దుండగులు కత్తులతో దాడి చేశారు. కత్తిపోట్లకు గురైన వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందారు. దీనిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

07:36 - August 30, 2016

సెప్టెంబర్ 2 సమ్మెను విజయవంతం చేసేందుకు సింగరేణి కార్మిక సంఘాలు కసరత్తు చేస్తున్నాయి. ఓపెన్ కాస్ట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు సమాన పనికి సమానవేతనం అన్న డిమాండ్ ను వినిపిస్తున్నాయి. వారసత్వ ఉద్యోగ హక్కును పునరుద్ధరించాలని కోరుతున్నాయి.

పది పన్నెండు ప్రధాన డిమాండ్లపై సమ్మె
సంఘటిత, అసంఘటితరంగంలోని కార్మికులతో పాటు ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, ఫైనాన్స్ రంగ ఉద్యోగులంతా ఏకమవుతున్నారు. సెప్టెంబర్ 2 సమ్మె కు సిద్ధమవుతున్నారు. గత సంవత్సరం జరిగిన సమ్మెలో దాదాపు 15 కోట్ల మంది పాల్గొనగా, ఈ ఏడాది అంతకు మించిన సంఖ్యలో పాల్గొంటారన్న అంచనాలున్నాయి. పది పన్నెండు ప్రధాన డిమాండ్లపై జరుగుతున్న ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు సైతం పాల్గొంటున్నారు.

నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలో మారుతున్ కార్మిక చట్టాలు
కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లలో కార్మిక చట్టాలలో అనేక మార్పులొచ్చాయి. కార్మిక సంక్షేమానికి దోహదపడే కొన్ని చట్టాలను రద్దు చేయగా, మరికొన్నింటిలో మార్పులు చేశారు. చట్టాలలో వస్తున్న మార్పులు కార్మికుల జీవితాలను, ఉద్యోగ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తెలంగాణలోని సింగరేణి కార్మికులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ లో సింగరేణిది ప్రధానపాత్ర...
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ లో సింగరేణిది ప్రధానపాత్ర. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్లు, వివిధ పన్నుల రూపంలో ఏటా 15 నుంచి 16వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చిపెడుతోంది. నిరుద్యోగ యువతకు అదొక వర ప్రదాయిని. అయితే, సంస్కరణల యుగంలో సింగరేణి సంస్థ ఉద్యోగ కల్పనా సామర్థ్యం కోల్పోయింది. ఒకప్పుడు లక్షన్నర మందితో కళకళలాడిన సింగరేణి ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 60 వేలకు పడిపోయింది. అండర్ గ్రౌండ్స్ స్థానంలో ఓపెన్ కాస్ట్ లొచ్చాయి. వీటి రాకతో సింగరేణి యావత్తు బొందల గడ్డగా మారుతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఓపెన్ కాస్ట్ లను నిలిపివేసి, అండర్ గ్రౌండ్స్ కే ప్రాధాన్యతనిస్తామన్నది ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ చెప్పిన మాట. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాల హక్కును పునరుద్ధరిస్తామన్నది మరో వాగ్ధానం. కానీ, ఇవేవీ అమలుకాలేదు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థకు చరమ గీతం పాడాలన్న సంకల్పమూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల తర్వాత కూడా సాకారం కాలేదు.

6లక్షల మంది కార్మకులకు 45శాతం మంది కాంట్రాక్ట్ వర్కర్సే
సింగరేణితో పాటు ప్రభుత్వరంగంలోని అన్ని కోల్ మైన్స్ లో దాదాపు ఆరు లక్షల మంది కార్మకులుండగా అందులో 45శాతం మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. రెగ్యులర్ ఉద్యోగులతో పోల్చితే, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు చాలా స్వల్పం. బొగ్గుగనుల్లో రెగ్యులర్ కార్మికుల సగటు వేతనం 27వేల రూపాయలుంటే, కాంట్రాక్ట్ కార్మికుల సగటు వేతనం 13 వేల రూపాయలు మాత్రమే వున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న రాజ్యాంగ స్పూర్తికి ప్రభుత్వరంగ సంస్థలే తూట్లు పొడుస్తుండడం అత్యంత బాధాకరం. ఉద్యోగ భద్రత లేకపోవడం మరో శాపం. నరేంద్రమోడీ ప్రభుత్వం దూకుడుగా అమలు చేస్తున్న సంస్కరణలు ఉద్యోగభద్రతను మరింత దూరం చేస్తాయన్నది కార్మిక సంఘాల ఆరోపణ. 

07:30 - August 30, 2016

సెప్టెంబర్ 2 సమ్మెకు విభిన్న వర్గాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనబోతున్నారు. సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మెకు దారితీసిన కారణాలేమిటి? ఈ సమ్మె సందర్భంగా సింగరేణి కార్మికులు ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సింగరేణిలో వచ్చిన మార్పులేమిటి? సింగరేణి కార్మికులకు టిఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెట్టుకుంది? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు 10టీవీ స్టూడియోకి వచ్చారు. సెప్టెంబర్ 2న సమ్మెపై కార్మికుల సమస్యలపై సాయిబాబు తెలిపే అభిప్రాయాలను తెలుసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి..మరింత సమాచారం తెలుసుకోండి..

07:25 - August 30, 2016

ఖమ్మం : ఏడు పదుల స్వతంత్ర భారతావనిలో.. నేటికీ కుల దురహంకారం రాజ్యమేలుతోంది. అగ్రకుల అహంకారం.. నిమ్నకులాలను బతకనివ్వని దౌర్భాగ్యం పల్లెసీమల్లో నేటికీ కనిపిస్తోంది. ఏదో ఒక కారణంతో దళితులపై వేధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ అగ్రకుల దురహంకారం

ఉత్సవాల్లో చల్లగూడ పట్టలేదంటూ పది రజక కుటుంబాల వెలి..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో దారుణం..ఆరెగూడెంలో బయటపడ్డ అగ్రకుల దురహంకారం..ఉత్సవాల్లో చల్లగూడ పట్టలేదంటూ పది రజక కుటుంబాల వెలి..

టెక్నాలజీ దూసుకుపోతున్న కాలంలోనూ కుల దురహంకారాలు
శాస్త్ర సాంకేతిక రంగాల్లో నింగే లక్ష్యంగా దూసుకు వెళుతున్న సమాజంలోనూ.. అధోగతిలో సాగుతున్న దురహంకారాలూ వెలుగు చూస్తున్నాయి. దీనికి నిదర్శనమే ఈ దురాగతం. శ్రావణమాసం సందర్భంగా ఆరెగూడెంలో ముత్యాలమ్మ బోనాలు నిర్వహించారు. రజకులు, కుమ్మరులు, దళితులు ప్రధాన పాత్ర పోషించే ఈ వేడుకల్లో.. మొదట రజకులు ఇంటింటికి తిరిగి చల్లగూడును ఎత్తడం ఆనవాయితీ. అలాగే దొడ్డి ముత్యాలమ్మ, ముత్యాలమ్మల పేరిట కోళ్లు, మేకల పీకలు కోయడమూ వీరి వంతుగా వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన వేడుకల్లో చల్లగూడు ఎత్తలేమని రజకులు గ్రామపెద్దలకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన గ్రామపెద్దలు, అగ్రకులస్తులు కచ్చితంగా చల్లగూడు ఎత్తాలని హుకుం జారీ చేశారు. అయినా తమ వల్ల కాదని రజకులు తేల్చి చెప్పడంతో .. అగ్రకుల దురహంకార గ్రామ పెద్దలు.. కోపోద్రిక్తులై రజకులను ఎవరూ పనికి పిలవొద్దని, పిలిచిన వారికి 1000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామంలో టముకు వేయించారు. అంతటితో ఆగకుండా రజకులను బోనాల వద్దకు రాకుండా అడ్డుకున్నారు. రజకులు చేయాల్సిన పనులు పక్క గ్రామాల కూలీల చేత పూర్తి చేయించారు.

కుల బహిష్కరణపై మండి పడుతున్న ప్రజాసంఘాలు
జిల్లా కేంద్రానికి కేవలం 29కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో కుల బహిష్కరణ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఘటనపై ప్రజాసంఘాలు, మేధావులు తీవ్రంగా మండిపడుతున్నారు. రజకుల చేత వెట్టిచాకిరి చేయించుకోవడమే కాకుండా.. తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారని బాధితుల ఆవేదన
గ్రామంలో అగ్రకుల పెత్తందారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని, తరచూ తమపై పెత్తనాన్ని రుద్దుతూ తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. వయస్సు పై బడుతున్నందున సాంప్రదాయంగా వస్తున్న కొన్ని పనులను చేయలేకపోతున్నామని రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులం పేరుతో బహిష్కరించడం, జరిమానాలు విధించడం సిగ్గుచేటని, రజకుల ఆత్మగౌరవాన్ని కించపరిచిన వారిపై పోలీసులు, ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు, మేధావులు డిమాండ్‌ చేస్తున్నారు.

07:16 - August 30, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్ కథ ఎప్పటికీ కంచికి చేరడం లేదు. ఓ వైపు సింగపూర్.. మరోవైపు జపాన్.. రూపొందిస్తున్న మాస్టర్‌ప్లాన్‌లు మాత్రం చంద్రబాబు సర్కార్‌కు నచ్చడంలేదు. దీంతో మరిన్ని విదేశి పర్యటనలు చేపట్టడానికి ఏపీ అధికారులు రెడీ అయ్యారు. ఆయా దేశాల్లోని ప్రఖ్యాత నగరాలకు సంబధించిన పలుఅంశాలపై సమగ్ర అధ్యయనం చేయనున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత నగారాల్లో మరోమారు విదేశీ పర్యటనలు
ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ముందుకు సాగడంలేదు. పలు దేశాలు రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌లు ప్రభుత్వానికి నచ్చడంలేదు. దీంతో మరిన్ని మేలైన ప్లాన్లను అన్వేషించే పనిలో పడింది ఏపీ సర్కార్‌. ఇందుకోసం ప్రపంచప్రఖ్యాతి గాంచిన దేశవిదేశ నగరాలను పరిశీలించి ఆధ్యయనం జరిపేందుకు సర్కార్ సిద్దమౌవుతోంది. మొత్తం నాలుగు బృందాలుగా.. నాలుగుదేశాలలో అధికారులు పర్యటనలు జరిపేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.

నాలుగుదేశాల్లో సీఆర్డీఏ కమీషనర్ శ్రీధర్‌ బృందం పర్యటన
ప్రభుత్వం నియమించిన నాలుగు బృందాలలో సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్‌ నేతృత్వంలోని బృందం వచ్చేనెల 6 వ తేదీ వరకు నాలుగుదేశాలలో పర్యటించనుంది. రష్యాతో పాటు దాని పొరుగుదేశం కజకిస్థాన్‌లోని అస్తానా నగరాన్ని తొలుత ఈ బృందం సందర్శించనుంది. అనంతరం జపాన్‌లోని టోక్యోతోపాటు ప్రముఖ నగరాలలో పర్యటించనుంది. చివరగా మలేషియా నూతన రాజధాని పుత్రజయతో పాటు సింగపూర్‌లోనూ పర్యటించనుంది. అలాగే సీఆర్డిఏ చీఫ్‌ ప్లానర్ నాగేశ్వరరావు నేతృత్వంలోని రెండవ బృందం ఆస్తానా, పుత్రజయల్లో పర్యటించనుంది.

3 దేశాలలో మంత్రి నారాయణ బృందం పర్యటన
ఇక మున్సిపల్ మంత్రి నారాయణ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం 3 దేశాలలో పర్యటనలు జరిపేందుకు సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీ నుంచి సెప్టెంబర్‌ ఒకటో తేదీ వరకు చైనాలో పర్యటించనుంది. చైనా రాజధాని బీజింగ్‌ తో పాలు మరికొన్ని ప్రాంతాలలో పర్యటించనుంది. అనంతరం రెండు రోజులపాటు టోక్యోలో పర్యటించనుంది. ఇక డీజీపీ సాంబశివరావు నేతృత్వంలోని నాలుగవ బృందం వచ్చేనెల నాలుగు, ఐదో తేదీలలో సింగపూర్‌లో పర్యటించనుంది.

ఆయా నగరాల విశిష్టతలను పరిశీలించనున్న బృందాలు
నాలుగు బృందాల పర్యటనలలో... ప్రముఖ నగరాల నిర్మాణాలు , కట్టడాలఆకృతి, మౌళిక సదుపాయాలు, నగరజీవనం, సామాజికభద్రతా.. లా అండ్ ఆర్డర్ ఇతరత్రా అంశాలపై అధికారులు అధ్యయనం చేయనున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలోపు పర్యటనలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా ఈ బృందాల పర్యటన సాగనుంది.

07:09 - August 30, 2016

తూర్పుగోదావరి : గోదావరితీరాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. గ్రామాలలో డెంగ్యూ ఉగ్రరూపం దాలుస్తోంది. డెంగ్యూ, విషజ్వరాల బాధితులతో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులన్ని కిక్కిరిసిపోతున్నాయి. తూర్పుగోదావరిజిల్లాలో రోజురోజుకు వీరి సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో అందోళన వ్యక్తమవుతోంది.

అధికారిక లెక్కల ప్రకారం 40 డెంగ్యు కేసులు నమోదు
తూర్పుగోదావరిజిల్లాలో విషజ్వరాలు,డెంగీ విజృంభిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో బాధితులు ఆస్పత్రులలో చేరుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 40 డెంగ్యు కేసులు నమోదయ్యాయి. జిల్లాలో జ్వరాలు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో గ్రామాలకు గ్రామాలే మంచానపడుతున్నాయి.

పెద్దాపురం మండలంలో 10 మందికి డెంగ్యూ లక్షణాలు
తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం డివిజన్‌లోని పలుగ్రామాల్లో డెంగ్యూ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల పెద్దాపురం మండలం పొలమూరు గ్రామంలోనే పదిమందికి డెంగ్యులక్షణాలు కనిపించాయి. దీంతో రోగులను హుటాహుటిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికితోడు విషజర్వాలు వ్యాపిస్తుండడంతో .. అనేకచోట్ల ప్రజలు మంచానపడుతున్నారు.

హెల్త్ క్యాంపులు ఏర్పాటు లేకపోవటంతో స్థానికుల ఆగ్రహం
కనీసం గ్రామాలలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలోని చిన్నా, పెద్దా విషజ్వరాల బారినపడి ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

విషజ్వరాల అధికారుల ఆందోళన
మరోవైపు అధికారులు కూడా విషజ్వరాల పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. డెంగ్యూ బారిన పడకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అంటున్నారు.

రోగులకు వైద్యం అందిస్తున్నాం : జీజీహెచ్‌ సూపరిండెంట్‌
ఇదిఇలా ఉంటే రోగులకు తగిన స్థాయిలో వైద్యం అందిస్తున్నామని కాకినాడ జీజీహెచ్‌ సూపరిండెంట్‌ తెలిపారు. కొందరిలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తున్న మాట వాస్తవమేనని వారికి ప్రత్యేకవార్డులలో చికిత్స అందిస్తున్నామన్నారు.

మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేయాలని కోరుతున్న బాధితులు
తూర్పుగోదావరిజిల్లాలో గ్రామాలకు గ్రామాలే విషజ్వరాలతో తల్లడిల్లుతున్నా ప్రభుత్వం

స్పందించకపోవడం దారుణం. తక్షణమే ప్రభుత్వం స్పందించి జిల్లా కేంద్రాల్లో అత్యవసర చికిత్సా కేంద్రాలు.. గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేయాలని బాధితులు కోరుతున్నారు. 

07:00 - August 30, 2016

ఖమ్మం : బంగారుతెలంగాణ అంటే పోడుభూములను లాక్కోవడమేనా అని ప్రశ్నించారు సీపీఐ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఖమ్మం జిల్లాలో సీపీఎం బృందం పర్యటించి పోడు భూములను పరిశీలించింది. దళితులకు, గిరిజనులకు సీపీఎం అండగా ఉంటుందని స్పష్టంచేశారు. హరితహారం పేరుచెప్పి గిరిజనులు సాగుచేసుకునే భూమిని ప్రభుత్వం లాగేసుకుంటోందని ఆరోపించారు.

ఖమ్మంజిల్లాలో సీపీఎం నేతల పర్యటన
తెలంగాణలోని ఖమ్మంజిల్లాలో సీపీఎం నేతలు పర్యటించారు. ఖమ్మంజిల్లా దమ్మాపేట ఆశ్వారావుపేట మండలాలలో పర్యటించారు. మందలపల్లిలో సీపీఎం పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. పోడుసాగుదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని గిరిజనుల సమస్యలపై చర్చించారు.

కమ్యూనిస్టులు చేసిన ఉద్యమాలఫలితంగానే అటవీ హక్కులు
కమ్యూనిస్టులు చేసిన ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వాలు అటవీ హక్కులు చట్టాన్ని తెచ్చాయన్నారు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనివీరభద్రం. అటవీహక్కుల చట్టంప్రకారం గిరిజనులకు 10 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వాలన్న నిబంధనలు ఉన్నాయని వాటిని ప్రభుత్వలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 2005 కంటే ముందుగా సాగులో ఉన్న భూముల్లోకి కేసీఆర్‌ సర్కార్ బలగాలను పంపి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.

గిరిజనులపై ఆక్రమదాడులు, ఆరెస్ట్ లు దారుణం
అసంఘటిత కార్మికులందరూ నానా ఇబ్బందులు పడుతున్నారని సున్నంరాజయ్య అన్నారు. ఉద్యోగ భద్రత న్యాయమైనహక్కు అని అన్నారు. గిరిజనులది భూమి సమస్య అని, బతుకు సమస్య అని అన్నారు శాసనసభ్యులు సున్నం రాజయ్య. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ గిరిజనులపై దాడులు చేయడం దారుణమని అన్నారు వెంటనే దాడులను ఆపాలని.. పోడువ్యవసాయం గిరిజనుల హక్కు అని అన్నారు రాజయ్య. టీఆర్ఎస్‌పార్టీ గిరిజనులను అడవినుంచే దూరం చేసే ఆలోచన చేస్తుందన్నారు.

గిరిజనులపై దాడులు ఆపాలని డిమాండ్
గిరిజనులకు తమ భూములపై హక్కు ఉందని.. అడవి నుండి గిరిజనులను దూరం చేస్తే సీపీఎం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు నేతలు. ప్రభుత్వం ఇకనైనా గిరిజనులపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. 

06:56 - August 30, 2016

విజయవాడ : తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగు భాష కోసం గిడుగు రామ్మూర్తి చాలా కృషి చేశారన్నారు. జీవనోపాధి కోసం ఇంగ్లీష్‌ నేర్చుకున్నా.. తెలుగుని మర్చిపోవద్దన్నారు చంద్రబాబు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో తెలుగు భాష నేర్పించాలన్నారు చంద్రబాబు. 

కొనసాగుతున్న అల్పపీడనం..

హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురియనున్నాయి. తెలంగాణలో తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

11.గంటకు ప్రారంభం కానున్న టీ.ఎస్ అసెంబ్లీ ..

హైదరాబాద్ : మంగళవారం ఉదయం 11గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. దేశమంతా ఒకే పన్ను విధానం అమలుతో రానున్న జీఎస్టీ బిల్లు తీర్మానాన్ని ఈ సభ ఆమోదించనుంది. ఆలయ కమిటీ సభ్యుల సంఖ్య పెంపు, సైబరాబాద్ కమిషనరేట్ విభజన, ఆర్డినెన్స్ లపై సభలో చర్చించనున్నారు. 

వెంకట్రామ్ రెడ్డి నగర్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : జీడిమెట్ల వెంకట్రామ్ రెడ్డి నగర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ పరిశ్రమ నుండి రసాయనాలు లీక్ అవ్వటంతో డంపింగ్ కాల్వలో దాదాపు 2 కిలోమీటర్ల వరకూ మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలోని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 

Don't Miss