Activities calendar

01 September 2016

రాయలసీమ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

అనంతపురం : రాయలసీమ ప్రాజెక్టులపై జలవనరుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాయలసీమ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. 

22:04 - September 1, 2016

కాటమరాయుడుగా పవన్‌కల్యాణ్‌ రాబోతున్నారు. శుక్రవారం పవర్‌స్టార్‌ బర్త్‌డే సందర్భంగా.. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న మూవీ టైటిల్‌కు సంబంధించి నిర్మాత శరత్‌మరార్‌ ఓ ప్రకటన చేశారు. కాటమరాయుడు పేరుతో పవన్‌ కొత్త సినిమాను నిర్మించనున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. గోపాల గోపాల దర్శకుడు కిశోర్‌కుమార్‌ పార్దసాని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించారు.

22:02 - September 1, 2016

ఢిల్లీ : ఆర్‌ఎస్‌ఎస్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, పరువు నష్టం కేసు విచారణను ఎదుర్కొంటానని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ దాఖలు కేసిన పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో రాహుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈమేరకు రాహుల్‌ తరపు న్యాయవాది కపిల్‌ సిబ్బల్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. వివాదస్పద వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్‌కు క్షమాపణ చెప్పాలి లేదా కింది కోర్టులో కేసు విచారణను ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఇటీవల రాహుల్ గాంధీకి స్పష్టం చేసింది. అయితే క్షమాపణ చెప్పేందుకు సుముఖంగా లేని రాహుల్‌ - ఆర్‌ఎస్‌ఎస్‌తో పోరాడేందుకు సిద్ధమయ్యారు. జాతిపిత మహాత్మాగాంధీని ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లే హత్య చేశారని రెండేళ్ల క్రితం రాహుల్‌ మహారాష్ట్రలోని ఓ సభలో ఆరోపించిన విషయం తెలిసిందే. 

 

22:00 - September 1, 2016

హైదరాబాద్ : సార్వత్రిక సమ్మెకు కార్మికులు సిద్ధమయ్యారు... సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా సమ్మె సైరన్‌ మోగనుంది.... కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా గళం వినిపించబోతున్నారు. కార్మిక దండు కదం తొక్కనుంది.. 12 ప్రధాన డిమాండ్ల సాధనకోసం దేశవ్యాప్తంగా కార్మికలోకం సమ్మె సైరన్‌ మోగించింది.. కేంద్ర, రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాల పిలుపుతో కార్మిక దండు కదలివస్తోంది.. 
కార్మిక, ఉద్యోగ సంఘాలు సమ్మెకు సన్నాహాలు 
మూడు నెలలుగా తెలంగాణలో కార్మిక, ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు సన్నాహాలు చేస్తున్నాయి... ఆగస్టు 9న క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో FDIలను వ్యతిరేకిస్తూ మాస్‌ సత్యాగ్రహాలు నిర్వహించారు.. కార్మిక, ఉద్యోగ సంఘాలు ఐక్య కార్యాచరణగా అన్ని జిల్లాల్లో సదస్సులు, రంగాలవారీగా సమావేశాలు నిర్వహించారు.. జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో సెమినార్లు, రౌండ్‌ టేబుల్‌ మీటింగ్‌లు, బైక్‌ ర్యాలీలు చేపట్టారు.. CITU, AITUC, INTUC, HMS, AIUTUC, IFTU, TUCC, YSRTU, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాలు, బ్యాంకు, ఇన్సూరెన్స్‌,  బిఎస్‌ఎన్‌ఎల్‌, FMRAIలతో పాటు ఇతర స్వతంత్ర సంఘాలు,  ఫెడరేషన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలూ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. 
బీజేపీ సర్కారుతీరుపై మండిపడుతున్న కార్మిక సంఘాలు
బీజేపీ అధికారంలోకి వచ్చాక 45 కార్మిక చట్టాలను రద్దు చేసిందని... 50 మంది కంటే తక్కువ కార్మికులుంటే చట్టాలు వర్తింప జేయకుండా కొత్త చట్టం తెచ్చిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సామాజిక భద్రతా పథకాలపై పలు ఆంక్షలు పెట్టిందని మండిపడుతున్నాయి. కార్మికుల హక్కులన్నింటినీ రద్దు చేయడంతో పాటు పనిగంటలు మార్చడం... సాంఘిక భద్రతను కల్పించే పథకాలు నీరుగారేలా చేయడంపై కార్మిక సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి.. సమ్మెల్లోకి వెళ్లేవారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నాయి.. సమ్మె చేస్తే కఠిన కారాగార శిక్ష విధించే క్లాజును తీసుకురావడాన్ని తప్పుబడుతున్నాయి.. కార్మికులకు కనీస వేతనం 18వేలు చెల్లించాలని పట్టుబడుతున్నాయి.. 
సమ్మెలో పాల్గొననున్న ఆర్టీసీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, విద్యాసంస్థల సిబ్బంది   
తెలంగాణలో ఆర్టీసీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, విద్యాసంస్థల సిబ్బందికూడా సమ్మెలో పాల్గొనబోతున్నారు... మండల, జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలతో నిరసనలు తెలియజేయబోతున్నారు.. హైదరాబాద్‌లో ఉదయం 11గంటలకు ఎస్‌వీకే నుంచి ఇందిరాపార్క్‌ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించబోతున్నారు.. ఆ తర్వాత సభ జరగనుంది.. 

 

ఎమర్జెన్సీ శాఖలన్ని అప్రమత్తంగా పని చేయాలి : జీహెచ్ ఎంసీ కమిషనర్

హైదరాబాద్ : రానున్న 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందని జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. ఎమర్జెన్సీ శాఖలన్ని అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. 

21:49 - September 1, 2016

హైదరాబాద్ : నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడింది. తెలంగాణలో కొలువుల జాతర మళ్లీ మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌2 నోటిఫికేషన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. టీఎస్ పీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్-2 ద్వారా తెలంగాన రాష్ట్ర ప్రభుత్వం 1032 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
గ్రూప్ 2 నోటిఫికేషన్‌ విడుదల 
నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్‌ ఎట్టకేలకు విడుదలైంది. గ్రూప్-2 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 1032 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. శుక్రవారం నుంచి ఈ నెల 23 వరకు  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-2 పోస్టుల్లో డిప్యూటీ తహసీల్దార్-259, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్-156, ఎక్సైజ్ ఎస్‌ఐ-284, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్-90 పోస్టులున్నాయి. గతంలో ఇచ్చిన 439పోస్టులు, ఇటీవల అనుమతించిన 593 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
సీఎం కేసీఆర్‌తో టీఎస్పీఎస్సీ చైర్మన్ భేటీ 
సీఎం కేసీఆర్‌ను టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి గురువారం కలిసి గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వివరించారు. నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారమే ఉద్యోగాల భర్తీని చేపట్టాలని సీఎం కేసీఆర్..  టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణికి సూచించారు. గురుకుల విద్యాసంస్థల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు చక్రపాణి సీఎంకు తెలిపారు. గతేడాది 439 ఖాళీలతో గ్రూప్ 2 నోటిఫికేషన్ కు.. 5 లక్షల 64 వేల 431 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే పలు కారణాలతో ఆ పరీక్ష వాయిదా పడింది. దాంతో ఖాళీల వివరాలను మదింపు చేసి గ్రూప్‌ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. 
జిల్లాల అధికారులతో కమిషన్ ఉత్తర ప్రత్యుత్తరాలు
ఈ అనుబంధ నోటిఫికేషన్‌కు మరో రెండు లక్షల ముప్పై వేల కొత్త దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తంమీద అభ్యర్థుల సంఖ్య ఏడున్నర లక్షలకు పైగా ఉంటుందని బావిస్తున్నారు. పాత, కొత్త అభ్యర్థులకు కలిపి పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ వర్గాలు జిల్లా కలెక్టర్లతో  సంప్రదింపులు జరుపుతున్నాయి. గత ఏప్రిల్‌లో అనుకొన్న సెంటర్లతోపాటు మరిన్ని కేంద్రాలను అదనంగా సిద్ధం చేయాలని కోరినట్టు సమాచారం.

 

21:45 - September 1, 2016

ఢిల్లీ : సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వానికి నాబార్డు మధ్య సెప్టెంబర్‌ 6న ఢిల్లీలో కీలకమైన ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన పథకం కింద ఈ ఒప్పందం జరగనుంది. కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీ సభ్యుడు, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి లేఖ రాశారు. తెలంగాణకు సంబంధించిన దేవాదుల సహా 11 ప్రాజెక్టులకు నాబార్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చనుంది. 

 

21:42 - September 1, 2016

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా రాదనేది దాదాపుగా తేలిపోయింది. ప్యాకేజీ కింద ఎంత మొత్తంలో నిధులు ఇవ్వాలనే దానిపైనే ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. రాజధాని నిర్మాణానికి సాయం, ఆర్ధిక లోటు పూడ్చడం, వెనకబడ్డ జిల్లాలకు సాయం చేయనున్నట్లు తెలిపారు. 
ప్రత్యేక హోదా కాదని.. ప్యాకేజీయేనని తేలిపోయింది...
ఏపీకి ప్రత్యేక హోదా కాదని.. ప్యాకేజీయేనని తేలిపోయింది. రెండు రోజులుగా ఢిల్లీ పెద్దలు జరుపుతున్న కసరత్తు.. ఆంధ్రప్రదేశ్‌కు ఎంత మొత్తంలో నిధులు ఇవ్వాలనే దానిపైనేనని స్పష్టమైంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా గురించి 26 నెలలుగా పోరాటం చేస్తున్నామన్న ఆయన.. కొన్ని సమస్యల వల్ల జాప్యం జరిగిందని అంగీకరించారు. హోదాకు సమానంగా ఏం చెయ్యాలనే దానిపై 'అందరినీ సంప్రదించి లాభ నష్టాలపై తర్జనభర్జనలు జరుగుతున్నాయన్నారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఎదిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. 
నూతన రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నిధులు కేటాయింపు
కేంద్రం ఏపీ నూతన రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తోందని.. అలాగే ఆర్థిక లోటును పూడ్చడంతో పాటు.. వెనకబడిన 7 జిల్లాలకు ఆరేళ్లపాటు 350 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని సుజనా తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని కోరామని .. జీఎస్టీ వచ్చిన తర్వాత ప్రత్యేక పన్ను మినహాయింపునకు వీలు కావట్లేదని సుజనా తెలిపారు. ప్రత్యేక పన్ను మినహాయింపునకు రాష్ట్రానికి కొంత నిధి ఇస్తామంటున్నారని సుజనా తెలిపారు. జాతీయ ప్రాజెక్టులన్నింటికీ నాబార్డు ద్వారా ఓ నిధి ఏర్పాటు చేశారని.. కేంద్రం నిర్మిస్తే ఆలస్యమవుతుందని రాష్ట్రమే నిర్మాణ బాధ్యత తీసుకుంటుందన్నారు.

 

21:38 - September 1, 2016

సమ్మె సైరన్ మోగింది... జంగ్ పిలుపు రమ్మంటోంది... కార్మిక లోకమంతా ఏకమై పిడికిళ్ల పూలు పూయిస్తోంది. సార్వత్రిక సమ్మెకు సై..!! ఇదే అంశంపై ఈరోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలనువీడియోలో చూద్దాం....

21:33 - September 1, 2016
21:27 - September 1, 2016

తెలుగు రాష్ట్రాలల తెర్లుతెర్లుపాలన.. ఎవల్జూడాలేమరి జనం ఆలన, తుపాకీ గురివెట్టిన గురివింద పోలీస్... కరీంనగర్ కాడా కసిర్న నాలుగో సింమం, పెరిగిపోతనేవున్న పెట్రోల్, డీజిల్ ధరలు... అచ్చే దిన్ ఆయేగీ అంటున్న జనాలు, ఆదిలాబాద్ జిల్లాల అమాస పండుగ... కరువులొచ్చెనంటే ఇది గూడ సందడగ, చాయ్ బిస్కెట్ల బూకర్లవడ్డ యూపీ... జనం పైకం ఖరాబైందని పెరిగింది బీపీ, ఇజ్రాలను ఇరగగొట్టిన యూత్ పోరలు... మీదిబాబు రాష్ట్రముల మితి మీరిన కొట్లాట, దొంగలను భయపెడుతున్న సీసీ కెమెరాలు...  ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

21:02 - September 1, 2016

ఢిల్లీ : ఎపికి ప్రత్యేకహోదాతో సమానంగా నిధులు ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించిందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. అయితే ఎంత మొత్తంలో నిధులు ఇవ్వాలనే దానిపైనే కేంద్రం కసరత్తు చేస్తోందని చెప్పారు. రాజధాని నిర్మాణానికి, ఆర్థిక లోటు, వెనకబడ్డ జిల్లాలకు కేంద్రం ఆర్థిక సాయం చేయనుందని చెప్పారు. 

20:53 - September 1, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు తప్పు చేయకపోతే హైకోర్టుకు ఎందుకు వెళ్లారని వైసీపీ నేత ఉమ్మారెడ్డి  ప్రశ్నించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్యాకేజీతో సరిపెడితే రాష్ట్రానికి పెద్ద ప్రయోజనం ఉండదన్నారు. ఎపికి ప్రత్యేక హోదాతోపాటు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదాతోనే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. 

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ ల బదిలీ

హైదరాబాద్ : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ లను బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీగా నవీన్ చందా, ఐజీ పర్సనల్ గా శివధర్ రెడ్డి, హైదరాబాద్ కమిషనర్ గా సందీప్ శాండిల్యా, రాజకొండ ట్రాఫిక్ డీసీపీగా రమేష్ నాయుడు, డీఐజీ ఇంటెలిజెన్స్ గా ప్రభాకర్ రావు, సీఐడీ డీఐజీగా శివశంకర్ రెడ్డి, వరంగల్ డీఐజీగా రవివర్మను నియమించారు. 

తలనీలాల విక్రయం ద్వారా తిరుమల శ్రీవారికి రూ.12.21 కోట్ల ఆదాయం

చిత్తూరు : తిరుమలలో తలనీలాల విక్రయం ద్వారా శ్రీవారికి రూ.12.21 కోట్ల ఆదాయం లభించింది. ఈ..వేలం ద్వారా 11,300 కేజీల తలనీలాలను విక్రయించారు. 

20:29 - September 1, 2016
20:25 - September 1, 2016
20:24 - September 1, 2016

సిడ్నీ : ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. రెడ్‌ రివర్‌ వద్ద ఉన్న ఓ హోటల్‌లో విందు ఆరగిస్తున్న కుటుంబంపై ఓ పక్షి... పామును జారవిడిచింది. పాము వారిపై పడటంతో... వారు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ కుటుంబ సభ్యుల్లో ఒకడైన డగ్గస్‌ వాంగ్‌ ఇదంతా చిత్రించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. 

20:18 - September 1, 2016

కృష్ణా : సెప్టెంబర్ 2న జరుగనున్న సార్వత్రిక సమ్మె చరిత్రలో నిలిచిపోతుందని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. విజయవాడలో మహా ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. సమ్మెలో లక్షలాదిమంది కార్మికులు పాల్గొంటారని.. సెప్టెంబర్ 2 ఉదయం సమ్మె ప్రారంభం అవుతుందని తెలిపారు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు.. కేంద్రం హడావిడి చేస్తుందని... ఆ తర్వాత విస్మరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలు నిర్ణయించడంలో, అమలు చేయడంలో మోసం జరుగుతుందన్నారు. కార్మికులకు ఉద్యోగ బద్రలేదని.. ఉపాధికి రక్షణ, ఈఎస్ ఐ లేదన్నారు. ఉన్న చట్టాలకు ఎసరు పెడుతున్నారని పేర్కొన్నారు. కార్మికులను బానిసలుగా చేస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన నిత్యవసరాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. 

 

20:11 - September 1, 2016
20:05 - September 1, 2016

టీఎస్ పీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేన్ విడుదల

హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేన్ విడుదల అయింది. 1032 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన 439 పోస్టులతోపాటు ఇటీవల అనుమతిచ్చిన 593 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రేపటి నుంచి ఈనెల 23 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని టీఎస్ పీఎస్సీ స్పష్టం చేసింది. 

18:41 - September 1, 2016

ఢిల్లీ : ప్రత్యేక హోదా ఎపి హక్కు అని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల నుంచి ఎపికి ప్రత్యేకహోదా కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి అదనపు సాయం చేయాలని పదే పదే కోరుతున్నామని చెప్పారు. ప్రత్యేకహోదా ఇవ్వడంపై కేంద్రం తర్జన భర్జనలు చేస్తుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో ఎపిని పోల్చవద్దని చెబుతున్నామన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఎపిని విభజించారని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఎపికి పది ఏళ్లు ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరామని..కనీసం ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగామని చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు అన్నారని.. నిధులు ఎవరు కెటాయిస్తారో చెప్పలేదన్నారు. వెనబడిన 7 జిల్లాలకు ఆరేళ్లపాటు రూ.350 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 

 

ప్రత్యేక పరిస్థితుల్లో ఎపి విభజన : సుజనా

ఢిల్లీ : ప్రత్యేక పరిస్థితుల్లో ఎపిని విభజించారని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని తెలిపారు. కనీసం ఐదేళ్లపాటు ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరామని.. పది ఏళ్లు కూడా ప్రత్యేకహోదా ఇవ్వాలని అడిగామని చెప్పారు.

 

రెండేళ్ల నుంచి ప్రత్యేకహోదా కోసం ప్రయత్నిస్తున్నాం : సుజనా

ఢిల్లీ : రెండేళ్ల నుంచి ఎపికి ప్రత్యేకహోదా కోసం ప్రయత్నిస్తున్నామని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఎపి హక్కు అని తెలిపారు. 

18:16 - September 1, 2016
18:14 - September 1, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ మంత్రి వర్గం నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీ భేటీ అయ్యింది. రెండు, మూడు రోజుల్లో నివేదిక అందించాలన్న క్యాబినెట్ ఆదేశాలపై కమిటీ కసరత్తు ప్రారంభించింది. కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీఎస్ రాజీవ్‌శర్మ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.  
కమిటీ ఛైర్మన్‌గా రాజీవ్ శర్మ
కొత్త జిల్లాపై వస్తున్న అభ్యంతరాలపై టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఛైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు సీసీఎల్ ఏ ఛైర్మన్ మెంబర్ కన్వీనర్‌గా, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడి, హోంశాఖ, సీఎం ముఖ్య కార్యదర్శులు శాంతకుమారి, స్మిత సబర్వాల్, ఆర్ధికశాఖ, ట్రాన్స్ పోర్ట్ అండి బిల్డింగ్ ముఖ్య కార్యదర్శులతో పాటు, ఐఎఫ్ ప్రభుత్వ కార్యదర్శి, ఐటిఈసి కార్యదర్శితో పాటు మెదక్, వరంగల్ జిల్లాల కలెక్టర్లతో కలిపి 15 మందితో కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇక కమిటీకి శాశ్వత ఆహ్వానితులుగా డీజీపి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి, సింగరేణి సీఎండీ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లను నియమించారు. 
11 మందితో జిల్లాల డీ కోడింగ్ కమిటీ
వీటితో పాటు పంచాయితీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్  ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా 11 మందితో జిల్లాల డీ కోడింగ్ విధానం ఏర్పాటు కోసం మరో కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇక ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ వీలైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. అయితే తాజాగా ప్రభుత్వం జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌తో వివిధ జిల్లాలు, మండలాల, రెవెన్యూ డివిజన్లపై ఫిర్యాదులు, అభ్యంతరాలు, సలహాలు సూచనలు బాగానే వస్తున్నాయి. 
కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై భారీగా అభ్యంతరాలు
ప్రభుత్వం ఏర్పాటుచేసిన వెబ్ సైట్ కు 16 వేల 149 ఫిర్యాదులు రాగా, అందులో జిల్లాలపై 9 వేల 931, రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై 3 వేల 876 , మండలాలపై 2 వేల 344 వచ్చాయి. ఇందులో అత్యధికంగా వనపర్తి 3 వేల 665, యాదాద్రి  2 వేల 44, జయశంకర్ జిల్లా 559, పెద్దపల్లి 327, వరంగల్ 252, మహబూబ్ నగర్ పై 236, కోమురం భీం జిల్లా 229 ఫిర్యాదులు అత్యధికంగా వచ్చాయి. 
పని విభజన చేస్తున్న టాస్క్ ఫోర్స్ కమిటీ
అయితే ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ నేతృత్వంలో నడుస్తున్న ఈ కమిటీ ఎక్కడికక్కడ పని విభజన చేస్తుంది. కొత్త జిల్లాలకు సంబంధించిన ఫైళ్లను వర్గీకరించి, క్రమపద్దతిలో ఆయా జిల్లాలకు అందించాలని చెప్పారు. ఫైళ్ల వివరాలను నమోదు చేయడానికి కొత్త జిల్లాలకు ఏర్పాటు చేసిన సాప్ట్ వేర్ ఉపయోగించాలని సూచించారు. మొత్తానికి దసరా పండగ లోగా కొత్త జిల్లాల్లో పాలన కూడా ప్రారంభమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోంటుంది. ఉద్యోగుల సర్దుబాటులో కూడా ప్రభుత్వం క్రీయాశీలకంగా వ్యవహారిస్తూ ముందుకు సాగుతోంది. 

 

18:03 - September 1, 2016

మెదక్ : క్షుద్ర పూజలు చేస్తున్నారన్న నేపంతో భార్యా భర్తలపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. మెదక్‌ జిల్లా పటాన్‌చెరు మండలం ఐలాపూర్‌ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుల్తాపూర్‌ శివారు గండిగూడేనికి చెందిన కృష్ణ, భారతి దంపతులు స్థానికంగా వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వీరి వ్యాపారం మందగించడంతో పలువురిని సలహాలు అడిగారు. అమావాస్య రోజున మర్రిచెట్టుకు పూజలు చేస్తే మంచి జరుగుతుందని ఎవరో చెప్పడంతో ఐలాపూర్‌ తండా సమీపంలో ఉన్న మర్రిచెట్టుకు పూజలు చేశారు. వీరిని గమనించిన ఐలాపూర్‌ తండాకు చెందిన మంగమ్మ, ఆమె కుటుంబసభ్యులు మోహన్‌, రమేష్‌, యాదగిరి.. క్షుద్రపూజలు చేస్తున్నారంటూ వారిపై గొడ్డలితో దాడి చేసి కరెంట్‌ స్తంభానికి కట్టేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను విడిపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

17:35 - September 1, 2016

ఒక్కఐడియా జీవితాన్ని మార్చేయడం సంగతేమో కానీ...ఒక్క పతకం తెలుగుతేజం పీవీ సింధు జీవితాన్ని సమూలంగా మార్చివేసింది. రాత్రికి రాత్రే స్టార్ హోదా తెచ్చిపెట్టింది. కాసుల వర్షం, ప్రశంసల వెల్లువ, సత్కారాలజోరుతో గాల్లో తేలిపోయేలా చేసింది. 21 ఏళ్ల చిరుప్రాయంలోనే ఒలింపిక్స్ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన సింధుకు...ఇకముందు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. ప్రపంచ నెంబర్ వన్ స్థానంతో పాటు ..ఒలింపిక్స్ స్వర్ణపతకమే లక్ష్యంగా సింధు...సరికొత్త సవాళ్ళను ఎదుర్కొనడానికి సిద్ధమవుతోంది.

నయా స్టార్ హోదా..
పీవీ సింధు...శతకోటి భారతీయులకు ఏమాత్రం పరిచయం అవసరం లేనిపేరు. కేవలం వారం రోజుల సమయంలోనే భారత బ్యాడ్మింటన్ నయాస్టార్ హోదా సంపాదించిన ఈ తెలుగుతేజం..తన కోచ్ గోపీచంద్ తో కలసి ప్రస్తుతం విజయానందడోలికల్లో తేలిపోతోంది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో సింధుకు పతకాలు సాధించడం ఏమాత్రం కొత్త కాదు. ప్రపంచ బ్యాడ్మింటన్లో రెండు కాంస్య పతకాలు, ఆసియాక్రీడల్లో కాంస్య పతకం, ఉబెర్ కప్ లో మరో రెండు కాంస్య పతకాలు సాధించినా దక్కని గౌరవం, గుర్తింపు...రియో ఒలింపిక్స్ రజత పతకంతో సంపాదించింది. ఒక్కమాటలో చెప్పాలంటే...సింధూ జీవితాన్ని ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ రాత్రికి రాత్రే మార్చేసింది. ఇదంతా మీడియా పుణ్యమే అనేవారు లేకపోలేదు.

70వ స్థానంలో భారత్..
రియో డి జెనీరోలో ముగిసిన2016 ఒలింపిక్స్ లో 118 మంది సభ్యుల భారీ బృందంతో అట్టహాసంగా పాల్గొన్న భారత్..పతకాల పట్టిక 67వ స్థానంలో నిలిచిందంటే అది..తెలుగుతేజం పీవీ సింధు కారణంగానే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హర్యానా రెజ్లర్ సాక్షీ మాలిక్ సాధించిన కాంస్య పతకంతో ...భారత్ పతకాల పట్టిక 70వ స్థానంలో మాత్రమే నిలువగలిగింది. అలాంటి దశలో సింధు సాధించిన సిల్వర్ మెడల్ ఎనలేని గౌరవాన్ని సంపాదించి పెట్టింది.

మీడియా ప్రచారం..
ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ సెమీస్ లో జపాన్ ప్లేయర్ నజోమీ ఒకుహరాను ఓడించిన మ్యాచ్ ద్వారానే...సింధుకు జాతీయ, ప్రాంతీయ మీడియాలు ఎక్కడలేని ప్రచారం కల్పించాయి. ఇక...ఆగస్టు 19న బంగారు పతకం కోసం...స్పెయిన్ ప్లేయర్ కారోలినా మారిన్ తో సింధు తలపడిన ఫైనల్ మ్యాచ్ కు మీడియా విశేషప్రాధాన్యమిచ్చింది. దేశవ్యాప్తంగా ఈ పోటీని కోటీ 72 లక్షల మంది వీక్షించారని స్టార్ ఇండియా అధికారికంగా ప్రకటించడం చూస్తే...సింధు కు లభించిన ఆదరణ...దేశంలోని మరో క్రికెటేతర ప్లేయర్ కు లభించలేదంటే ఆశ్చర్యపోవాల్సిందే.

కోట్ల నగదు..బహుమానాలు..
బంగారు పతకం పోటీలో సింధు పోరాడిన తీరు, ప్రత్యర్థి మారిన్ ను అభినందించిన విధానం ద్వారా మరింతమంది అభిమానులను సంపాదించుకొంది. రజత పతకంతో సింధు స్వదేశానికి తిరిగిరావడానికి ముందే నజరానాల వర్షం కురిసింది. సింధును సత్కరించడానికి, కానుకలతో ఉక్కిరిబిక్కిరి చేయడానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, అధినేతలు పోటీకి దిగారంటే..అవునా...నిజమేనా అనుకోవాల్సిందే. కోట్ల రూపాయల నగదు నజరానాలు, విలాసవంతమైన బీఎండబ్ల్యూ కారు బహుమానం, జాతీయ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న గౌరవం, సీఆర్పీఎఫ్ ప్రచారకర్త హోదాతో..సింధు బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయలకు పెరిగిపోయింది.

సవాళ్లు..
ఇంతవరకూ బాగానే ఉంది. చిన్న వయసులో సాధించిన అతిపెద్ద విజయాన్ని సింధూ పూర్తిస్థాయిలో ఆస్వాదించవలసిందే. అయితే..ఇదంతా అందమైన గతం అనుకొంటూ ఇకముందు ఎదురుకాబోయే సవాళ్లకు సిద్ధంకావాల్సిన సమయం రానే వచ్చింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సంఘం ర్యాంకింగ్స్ ప్రకారం..ప్రస్తుతం 10వ స్థానంలో ఉన్న సింధు...ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించడమే తన లక్ష్యమని, 2020 ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడం తనముందున్న అతిపెద్ద సవాలని సింధు ప్రకటించింది. కోచ్ గోపీచంద్ పర్యవేక్షణలో ఇప్పటి వరకూ సింధు సాధించింది గోరంత మాత్రమే. ఇంకా సాధించాల్సిందే కొండంత ఉంది. ప్రపంచ నెంబర్ వన్ కారోలిన్ మారిన్ తో పాటు చైనా, జపాన్, కొరియా, తైవాన్ ప్రత్యర్థుల నుంచి సింధుకు ఇక అసలు సిసలు పోటీ ఎదురుకానుంది. ఇప్పటి వరకూ ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడిన సింధు...ఇక ప్రత్యర్థులతో పాటు తీవ్ర ఒత్తిడిని సైతం ఎదుర్కొనాల్సి ఉంటుంది.

గంటల తరబడి సాధన..
వచ్చే ఒలింపిక్స్ నాటికి..సింధు 25 సంవత్సరాల వయసుతో...పరిపూర్ణ ప్లేయర్ గా బంగారు వేటకు దిగే అవకాశం ఉంది. పోరాటపటిమ, గంటల తరబడి సాధన చేయటానికి ఇష్టపడే సింధు..ఇకముందు కూడా ఇదే అంకితభావాన్ని ప్రదర్శించాలని కోరుకొందాం. విజయానందాన్ని ఇప్పటికే పూర్తిస్థాయిలో అనుభవించిన..ఈ తెలుగుతేజానికి... విజయంతో వచ్చే మజా ఏస్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా మరి.

17:33 - September 1, 2016

విజయవాడ : ఎపికి ప్రత్యేక హోదాతోపాటు ప్యాకేజీ ఇవ్వాలని ఆర్థిక మంత్రి మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. జీఎస్ టీ బిల్లు అమల్లోకి వస్తే రాష్ట్రం రూ.4,500 కోట్ల ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో పన్నుల వసూళ్లు ఆశించిన మేరకు జరగడం లేదన్నారు. 

 

17:31 - September 1, 2016

కోల్ కతా వేదికగా రేపటి నుంచి రెండు వారాల పాటు జరిగే ప్రపంచ చెస్ ఒలింపియాడ్ పురుషుల విభాగంలో ఆతిథ్య భారత్ 11వ సీడ్ గా బరిలోకి దిగుతోంది. 176 దేశాల జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నీ 82 సంవత్సరాల చరిత్రలో కేవలం 20 దేశాల జట్లు మాత్రమే ఏదో ఒక పతకం గెలుచుకోగలిగాయి. నార్వేలో ముగిసిన గత ప్రపంచ చెస్ ఒలింపియాడ్ లో కాంస్య పతకం సాధించిన భారత్..ఈసారి స్టార్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ లేకుండా పోటీకి సిద్ధమయ్యింది. గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ, విదిత్ గుజరాతీ, అధీబన్, సేతురామన్, కార్తికేయన్ లతో కూడిన జట్టుతో భారత్ పోటీకి దిగుతోంది. భారత జట్టులోని గ్రాండ్ మాస్టర్లకు 2651 సగటు ఎలో రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.

17:30 - September 1, 2016

గుంటూరు : జిల్లా మిర్చియార్డు మాజీ సెక్రటరీ నరహరిపై వేటు పడింది. మిర్చి వ్యాపారుల లైసెన్సుల రెన్యువల్‌లో నరహరి అవినీతికి పాల్పడ్డాడు. నరహరి అవినీతి ఆడియో టేపులను 10 టీవీ బయటపెట్టడంతో.. విచారణ చేపట్టిన మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు.. నరహరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

 

17:28 - September 1, 2016

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ సీజన్ ఆఖరి టోర్నీ... అమెరికన్ ఓపెన్ ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. న్యూయార్క్ లో జరుగుతున్న ఈటోర్నీ 2016 సీజన్ చాంపియన్ల కోసం భారీ మొత్తంలో ప్రైజ్ మనీ సిద్ధంగా ఉంది. గతంలో కంటే 20 శాతం అధికంగా..ఈ ఏడాది విజేతలు ప్రైజ్ మనీ అందుకోబోతున్నారు. గ్లోబల్ గేమ్ టెన్నిస్ లో గ్రాండ్ స్లామ్ సాధించాలంటే ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, అమెరికన్ ఓపెన్లు నెగ్గి తీరాలి. ఈ నాలుగు టోర్నీల్లో ఏ ఒక్కటి నెగ్గినా కనీసం 12 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందుతుంది. గత శతాబ్దకాలంగా జరుగుతూ వస్తున్న ఈ నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లోనూ ప్రైజ్ మనీ..ఏడాది ఏడాదికీ పెరుగుతూనే వస్తోంది. పారిస్ లో ముగిసిన 2016 ఫ్రెంచ్ ఓపెన్, లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ లో ముగిసిన వింబుల్డన్ టోర్నీ చాంపియన్ ప్లేయర్లు...12 కోట్ల రూపాయల కు పైగా ప్రైజ్ మనీ అందుకొన్నారు. అమెరికన్ ఓపెన్ లో మాత్రం..చాంపియన్ల కోసం రికార్డుస్థాయిలో 15 కోట్ల 70 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఎదురుచూస్తోంది. గత సీజన్ అమెరికన్ ఓపెన్ చాంపియన్లకు ఇచ్చిన మొత్తం కంటే..ఇది ఇరవైశాతం ఎక్కువని నిర్వాహక సంఘం చెబుతోంది.

మహిళల విభాగంలో...
ఈ ఏడాది అమెరికన్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ చాంపియన్లు చెరో 15 కోట్ల 70 లక్షల రూపాయల చొప్పున సొంతం చేసుకోనున్నారు. పురుషుల విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ నొవాక్ జోకోవిచ్, ఒలింపిక్ చాంపియన్ యాండీ ముర్రే, అర్జెంటీనా థండర్, ఒలింపిక్ రజత విజేత జువాన్ మార్టిన్ డెల్ పోత్రో హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. మహిళల విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ సెరెనా విలియమ్స్, రెండో ర్యాంక్ ఏంజెలికో కెర్బర్, వింబుల్డన్ చాంపియన్ ముగురుజా..అమెరికన్ ఓపెన్ టైటిల్ కోసం హాట్ ఫేవరెట్లుగా ఢీ కొనబోతున్నారు. పురుషుల సింగిల్స్ లో జోకోవిచ్, మహిళల సింగిల్స్ లో ఫ్లావియో పెనెట్టా డిఫెండింగ్ చాంపియన్ల హోదాలో పోటీకి దిగుతున్నారు. మరి..అమెరికన్ ఓపెన్ ట్రోఫీతో పాటు జాక్ పాట్ ప్రైజ్ మనీ ఎవరు అందుకోగలరన్నదే చూడాలి.

17:25 - September 1, 2016

అమెరికన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మూడోరౌండ్ కు టాప్ సీడ్ నొవాక్ జోకోవిచ్, 4వ సీడ్ రాఫెల్ నడాల్, 9వ సీడ్ సోంగా, 7వ సీడ్ మారిన్ సిలిచ్ చేరుకొన్నారు. డిఫెండింగ్ చాంపియన్ జోకోవిచ్ కు రెండో రౌండ్లో..వాకోవర్ లభించడంతో...ఒక్క బంతీ ఎదుర్కొనకుండానే మూడోరౌండ్ చేరగలిగాడు. యూఎస్ ఓపెన్లో సీడెడ్ స్టార్ల జోరు కొనసాగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్, మాజీ చాంపియన్ రాఫెల్ నడాల్, ఫ్రెంచ్ డైనమైట్ జో ఆల్బెర్ట్ సోంగా అలవోకగా మూడోరౌండ్ కు చేరుకొన్నారు. టాప్ సీడ్ జోకోవిచ్ కు ప్రత్యర్థి జిరీ వెసిలీ నుంచి వాకోవర్ లభించడంతో ఏ మాత్రం చెమటోడ్చకుండానే మూడోరౌండ్ చేరగలిగాడు. అయితే నాలుగో సీడ్, స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ ..మూడు సెట్ల పోరులో ఇటలీ ఆటగాడు యాండ్రీ సెప్పీని 6-0, 7-5, 6-1 తో ఓడించాడు.

రెండో సెట్ లో గట్టిపోటీ..
తొలిసెట్ ను 6-0తో సునాయాసంగా నెగ్గిన నడాల్ కు రెండో సెట్లో మాత్రం గట్టి పోటీ ఎదురయ్యింది. 7-5తో రెండోసెట్ కూడా నెగ్గిన స్పానిష్ బుల్ కు..ఆఖరిసెట్లో పోటీనే లేకుండా పోయింది. 6-1తో సెట్ ను 3-0తో మ్యాచ్ నెగ్గి మూడో రౌండ్లో చోటు ఖాయం చేసుకొన్నాడు.
ఇతర..రెండోరౌండ్ పోటీల్లో...ఫ్రెంచ్ స్టార్ ప్లేయర్ జో విల్ ఫ్రెడ్ సోంగా నాలుగుసెట్ల సమరంలో బ్రిటీష్ ఆటగాడు జేమ్స్ డక్ వర్త్ ను 6-4, 3-6, 6-3, 6-4తో అధిగమించాడు. 7వ సీడ్ మారిన్ సిలిచ్ 6-1, 6-2, 6-3తో సెర్గీ స్టాకోవస్కీని చిత్తు చేసి..మూడోరౌండ్ కు అర్హత సంపాదించాడు. రెండో రౌండ్లోనే పరాజయం పొందిన సీడెడ్ స్టార్లలో 20వ సీడ్ జాన్ ఇస్నర్, 18వ సీడ్ ప్యాబ్లో కువాస్ ఉన్నారు.

17:24 - September 1, 2016

హైదరాబాద్‌ : పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో షీ టీమ్స్‌ సేవలపై అహగాహన కల్పించేందుకు షార్ట్‌ఫిల్మ్‌ను సీపీ మహేందర్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో షీ టీమ్స్‌ సేవలపై మహేందర్‌ రెడ్డి ప్రశంసలు కురిపించారు. నగర మహిళలకు షీటీమ్స్‌ తామున్నామనే భరోసా, భద్రత కల్పిస్తున్నారని ఆయన అన్నారు. తీరు మార్చుకోని ఆకతాయిలపై పీడీ యాక్ట్‌లు కూడా నమోదు చేస్తామని మహేందర్‌ రెడ్డి హెచ్చరించారు.  

 

17:20 - September 1, 2016

సింగపూర్ : సింగపూర్లో 13 మంది భారతీయులకు జికా వైరస్‌ సోకినట్లు టెస్టుల్లో రుజువైందని భారత విదేశాంగశాఖ ధృవీకరించింది. దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే జికా వైరస్ ముఖ్యంగా మహిళలు అందులో గర్భిణీ స్త్రీలకు సోకుతోంది. ఇప్పటికే సింగపూర్‌లో 115 మందికి జికా వైరస్ సంక్రమించింది. గతంలో బ్రెజిల్ ను వణికించిన జికా వైరస్ ప్రస్తుతం సింగపూర్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జికా వైరస్‌కు కారణమైన దోమల నిర్మూలనకు సింగపూర్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గర్బిణీలకు జికా వైరస్ వ్యాప్తి చెందితే పుట్టబోయే పిల్లలు చిన్న తలతో పుట్టడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

 

గండికోట ప్రాజెక్టు పనులను పరిశీలించిన బాబు..

కడప : గండికోట ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వ ద్వారా సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ రోజు ఆయన జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 

రేపు విజయవాడలో మహా ప్రదర్శన- గఫూర్..

విజయవాడ : రేపు ఉదయం నుండే సమ్మె ప్రారంభమౌతుందని, రేపు విజయవాడ నగరంలో మహాప్రదర్శన..బహిరంగ సభ ఉంటుందని సీపీఎం నేత గఫూర్ వెల్లడించారు. లక్షలాది మంది కార్మికులు హాజరౌతారని తెలిపారు.

 

మంత్రి మహేందర్ రెడ్డితో ఉన్నతాధికారుల భేటీ..

హైదరాబాద్ : టీఎస్ రవాణా శాఖ కార్యాలయంలో రవాణా మంత్రి మహేందర్ రెడ్డితో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. కొత్తగా ఏర్పడే జిల్లాలో డీటీసీల నియామకంపై చర్చించారు. డీటీసీల పరిధిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీకి సంబంధించి 2 లేదా 3 జిల్లాలకు ఒక ఆర్ఎంను నియమించాలని,జిల్లా స్థాయిలో డీవీఎంలకు బాధ్యతలివ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

 

17:07 - September 1, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో 144 వ సెక్షన్‌ను ఎత్తివేయాలని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.  పోలీసులు మోహరించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలతో సీపీఎం సమావేశం నిర్వహించింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలు గ్రామాల ప్రజలు హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. భూములను చౌకగా కాజేసేందుకే 123 వ నంబర్‌  జీవో  తెచ్చారని విమర్శించారు. 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి భూములు సేకరించకపోతే ఉద్యమం తప్పదని తమ్మినేని హెచ్చరించారు. 

 

కనిగిరిలో కారు బీభత్సం..

ప్రకాశం : కనిగిరిలో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ముగ్గురు వ్యక్తులపైకి కారు దూసుకెళ్లింది. ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

దేవాదాయ శాఖ డిప్యూటి కమిషనర్ ఇంటిపై ఏసీబీ దాడి..

విజయవాడ : దేవాదాయ శాఖ డిప్యూటి కమిషనర్ విజయసాగర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 1.40 లక్షలు, 35 గ్రాముల బంగారం, కిలో వెండి, జీ +1 ఇల్లు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మూడు బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో శ్రీశైలం ఆలయం ఈవోగా విజయ సాగర్ పనిచేశారు. 

16:37 - September 1, 2016

సీనియర్ స్టార్ 'వెంకటేష్' ముందు ఐదు ఆప్షన్స్ ఉన్నాయి. బెస్ట్ ఆప్షన్ కి ఎంచుకోవడంలో 'వెంకీ' తటాపటాయిస్తున్నట్లు సమాచారం. అన్ని బాగానే నచ్చడంతో సెలెక్షన్ విషయంలో ఈ స్టార్ కి ఏం తోచడం లేదట. ఇంతకీ 'వెంకీ' ముందున్న ఆ ఐదు ఆప్షన్ ఏంటో మీరు ఓ లుక్కెయండి. 'వెంకటేష్' ఇటీవలే 'బాబు బంగారం'గా వచ్చిన విషయం తెలిసిందే. 'వెంకీ' ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం వాటిని అందుకోవడంలో విఫలం అయింది. కమర్షియల్ గా మాత్రం 'బాబు బంగారం' సేఫ్ జోన్ లోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇప్పుడు కొత్త మూవీ విషయంలో 'వెంకీ' డైలామాలో పడినట్లు సమాచారం.

ఐదు కథలు...
ప్రస్తుతం 'వెంకటేష్' ముందు ఐదు కథలు ఉన్నట్లు టాక్. ఇందులో ఏ స్టోరీని ఎంచుకోవాలో ఈ స్టార్ హీరోకి పాలు పోవడం లేదట. ఈ ఎడాది రిలీజైన 'నేను శైలజ'తో హిట్టు కొట్టిన తిరుమల కిశోర్ ఇటీవలే 'వెంకీ'కి స్టోరీ చెప్పి ఒప్పించాడు. దీంతో పాటు బాలీవుడ్ మూవీ 'సాలా ఖండూస్' రీమేక్ పై కూడా 'వెంకటేష్' ఫోకస్ ఉంది. పై రెండు చిత్రాలే కాకుండా 'దృశ్యం' మూవీ ఒరిజినల్ దర్శకుడు జీతు జోసఫ్ సైతం 'వెంకటేష్' కి ఓ స్టోరీ వినిపించాడట. ఈ స్టోరీ కూడా 'వెంకీ'కి బాగా నచ్చింది. ఇక 'రాజుగారి గది' సీక్వెల్ ని 'వెంకటేష్' తో చేయాలని దర్శకుడు 'ఓంకార్' కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. వీటికి తోడు 'రానా', 'నాగచైతన్య'తో మల్టీస్టారర్ చేయాలని 'వెంకటేష్' ఓ దర్శకుడితో స్టోరీ రాయిస్తున్నాడు. వీటిలో 'వెంకటేష్' నెక్ట్స్ ఏ మూవీని చేస్తాడనేది చూడాలి.

16:31 - September 1, 2016

పవర్ అనే పదానికి అర్ధాన్ని వెతికితే ముందుగా కనిపించే పేరు పవన్. టాలీవుడ్ రికార్డుల్ని బద్దలుకొట్టాలన్నా కొత్త రికార్డులు తిరిగిరాయాలన్నా ఆ పవర్ ఉండాల్సిందే. కోట్లాది మంది అభిమానులు ఆయన పేరు చెబితే ఊగిపోతారు. ఎనలేని ఫాలోయింగ్ తో వెలకట్టలేని అభిమానంతో పవనిజం అంటూ చెలరేగిపోతారు. జయాపజయాలకు అతీతంగా, టాలీవుడ్ నడిబొడ్డుమీద తన జెండాని, ఎజెండాను ఎగరేసిన ఆ పవర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంపై 10 టివి ప్రత్యేక కథనం..

పవన్ ఒక బ్రాండ్...
పవన్ కళ్యాణ్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్. టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే ఒక ఫైర్ బ్రాండ్. తన అరుదైన వ్యక్తిత్వంతో, అద్భుతమైన ఆలోచనలతో స్టార్ కథానాయకుడిగా టాలీవుడ్ టాప్ చెయిర్ మీద దర్జాగా కూర్చున్న ఆయనది పవర్ స్టార్ డమ్. పేరు ముందే పవర్ ని నింపుకున్న స్టార్ పవన్ కళ్యాణ్. చిరంజీవి తమ్ముడిగా తెరంగేట్రం చేసినా, స్వశక్తితో తక్కువ టైమ్‌లో అంచలు అంచలుగా ఎదిగి పవర్ స్టార్‌గా అభిమానుల గుండేల్లో చెరగని ముద్రను వెసుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ పిలుపే ఒక ప్రభంజనంలా అభిమానులు చేలరేగిపోతారు. పవన్ ఆలోచనే వైవిధ్యంగా ఉంటాయి. ఎప్పుడూ అభిమానుల శ్రేయస్సు కోసం తపన పడతాడు. వాళ్ల కష్టాల్ని తన కష్టాలుగా భావిస్తాడు. వాళ్ల కోసం సినిమాల్లోనైనా, నిజజీవితంలోనైనా ఏమైనా చేయాలనుకుంటాడు, నిజం నిగ్గుతేల్చాలంటే ప్రశ్నించాలంటాడు. అదే పవనిజం అంటారు ఆయన అభిమానులు. ప్లాప్ కైనా హిట్టు కైనా ఒకేలా స్పందించే ఆయన పేరు పవన్ కళ్యాణ్ అయినా, తీరు మాత్రం పవర్ కళ్యాణ్ . అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు పవన్ కళ్యాణ్. నిజానికి సినిమా రంగంపై అతనికి ఉన్న అభిరుచికి దర్శకుడు అవుతాడని వారి కుటుంబ సభ్యులు భావించారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా నటుడు కావడమే కాకుండా... వరుస విజయాలతోనూ ఊహించని విధంగా స్టార్ డమ్ ను చేజిక్కించుకున్నాడు పవన్ కళ్యాణ్.

అసాధారణమైన టాలెంట్..
సాధారణమైన ఇమేజ్ తోనే వెండితెరమీద తెరంగేట్రాన్ని ప్రారంభించాడు. కేవలం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగానే ఫోకస్ అయిన పవన్ కళ్యాణ్, తనకున్న అసాధారణమైన టాలెంట్ తో క్రమేపి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ లాంటి ప్రేమకథా చిత్రాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్, పూరీ బద్రి సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ కెరీర్ గ్రాఫ్ అంచెలంచెలుగా పెరిగింది. విభిన్నతరహా పాత్రలతో, విలక్షణమైన కేరక్టరైజేషన్స్ తో పవర్ స్టార్ వెండితెరమీద తన స్టామినాను చాటుకున్నాడు. అక్కడినుంచి ఆయన మేనరిజమ్స్ తో అభిమానులకి పవన్ మ్యానియా పట్టుకుంది.

కొత్తదనానికి పెద్ద పీట..
పవన్ కళ్యాణ్ ముందునుంచి కొత్తదనానికి పెద్ద పీట వేసాడు. ఎంతో మంది కొత్త దర్శకులకి తనతో సినిమా చేసే అవకాశం కల్పించి, వారిలో కొంతమందిని స్టార్ దర్శకుల్ని చేసాడు. ఇందులో ఎక్కువ మంది తమిళ్ దర్శకులే ఉండడం విశేషం. ఆ పద్ధతిని ఇప్పటికీ పాటిస్తునే ఉన్నాడు పవర్ స్టార్. కెరీర్ ప్రారంభంలో ఈవీవీ సత్యనారాయణ, ముత్యాల సుబ్బయ్య, భీమినేని శ్రీనివాసరావు చిత్రాలలో నటించిన పవన్ తొలిసారి 'తొలిప్రేమ'తో కరుణాకరన్ ను దర్శకుడిగా పరిచయం చేశాడు. ఆ సినిమా అఖండ విజయం సాధించడంతో పవన్ లో కొత్తవారి మీద నమ్మకం పెరిగింది. దాంతో ఆ తర్వాత 'తమ్ముడు'తో అరుణ్ ప్రసాద్, 'బద్రి'తో పూరి జగన్నాథ్ పరిచయం అయ్యారు. అలానే పవన్ కెరీర్ లోనూ సూపర్ డూపర్ హిట్ అయిన 'ఖుషీ'తో తమిళ డైరెక్టర్ ఎస్.జె. సూర్య తెలుగులోకి అడుగుపెట్టాడు. ఇంకా బంగారంతో మరో తమిళ్ దర్శకుడు ధరణి అడుగుపెట్టాడు, పంజాతో విష్ణువర్ధన్ తెలుగులో లాంచ్ అయ్యాడు.

ఎన్నో ఎత్తు పల్లాలు..
పవర్ స్టార్ కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలున్నాయి. విజయాలున్నాయి, అపజయాలూ ఉన్నాయి. కానీ వాటన్నిటికీ అతీతంగానే ఆయన కెరీర్ కొనసాగింది. కిందపడిన ప్రతీసారి తన పవర్ క్రేజ్ తో రెట్టించిన వేగంతో పైకి లేచి తన సత్తా చాటుకున్నాడు పవన్ కళ్యాణ్. కెరీర్ ప్రారంభంలో ఉత్తుంగ తరంగంలా లేచిన పవన్ కళ్యాణ్ కెరీర్ 'జానీ'తో ఒక్కసారిగా పడిపోయింది.ఆ తర్వాత చేసిన మరికొన్ని సినిమాలు సైతం ఆశించిన స్థాయిలో అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయాయి. ఇక 'జల్సా'తో తన కెరీర్ లో సూపర్ హిట్ ను జమ చేసుకున్నా, ఆ తర్వాత వచ్చిన 'పులి', 'తీన్ మార్', 'పంజా' చిత్రాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. అదే సమయంలో హిందీ రీమేక్ 'దబాంగ్'ను పవన్ చేపట్టినప్పుడు'తీన్ మార్' పరాజయాన్ని పవన్ పట్టించుకోడేమిటనే సందేహాన్ని చాలామంది వ్యక్తం చేశారు. అయితే, అప్పుడు మాత్రం పవన్ గురి తప్పలేదు... 'గబ్బర్ సింగ్' ఘన విజయం సాధించి తిరిగి పవన్ ను సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కించింది. ఖుషీ తర్వాత దాదాపు 12ఏళ్ళకు కానీ పవర్ స్టార్ కి బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. అయితేనేం ఆయన ఇమేజ్ రవ్వంత కూడా తగ్గలేదు. దటీజ్ పవర్ స్టార్.

రెండో సారి సినిమా చేసిన దర్శకుడితో...
పవర్ స్టార్ తో రెండో సారి సినిమా చేసిన దర్శకుడు ఎవరూ హిట్టు కొట్టలేదనే ఒక అపవాదు ఉంది ఇండస్ట్రీలో. కానీ దాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెరిపేసాడు. ఆ తరువాత ఇప్పుడు మరో దర్శకుడు కూడా చెరిపేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ రెండో సినిమా చేసిన ఏ దర్శకులు హిట్ ఇవ్వలేదని ఆ మధ్య వరకూ చరిత్ర చెప్పింది. కానీ... ఆ సెంటిమెంట్ ను చెరిపేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. 'జల్సా' విజయంతో వీరిద్దరి కాంబినేషన్ కూ బోలెడంత క్రేజ్ ఉంటుందని తెలుసు. ఆ క్రేజ్ ఆధారంగా ఏర్పడిన అంచనాలను అందుకోవడానికి చక్కని హోమ్ వర్క్ చేసి, బరిలోకి దిగింది జోడి. అయితే, వారి లెక్క తప్పలేదు. ఫలితంగా 'అత్తారింటికి దారేది' టాలీవుడ్ లో కొత్త రికార్డులకు దారి తీసింది. ఆ తరువాత పవర్ స్టార్ 'గోపాలా గోపాలా' తీసిన దర్శకుడు డాలి కూడా ఇప్పుడు ఆయనతో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పవర్ స్టార్ ఇమేజ్ ను రెట్టింపు చేసే సినిమాయే అవుతుందంటున్నారు. మరి డాలి కూడా త్రివిక్రమ్ లాగానే రెండో సారి హిట్టు కొట్టి తన సత్తా చాటతాడేమో చూడాలి.

సాదాసీదా ఆనందం..
పది ఎళ్లు తరువాత సూపర్ డూపర్ హిట్ అయినా గబ్బర్‌సింగ్ చిత్రం సక్సెస్‌ను ఒక యోగిలా స్వీకరించాడు. ఆనందానికి అతీతంగా తన ఫామ్ హౌస్‌లో చెట్టు నాట్టుతూ సాదాసీదాగా ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చిన దర్శక, నిర్మాతలకు కనిపించాడట. మన పని మనం చేశాం తప్ప కొత్తగా ఏ పని చేయలేదు. కష్టపడిన దానికి ఫలించి గబ్బర్ సింగ్ హిట్ అయింది. నిర్మాత నష్టపోకుండా లాభం వచ్చేలా మనం చేసిన పని ఫలితం దక్కింది అంటు వచ్చిన నిర్మాత, దర్శకులకు పవన్ చెప్పిన మాటలివి. పవన్ మాటల్లో ఎన్నో ఆర్ధాలు, సత్యాలు కనిపిస్తాయి. మరో హీరో అయితే ఎగిరి గంతులైస్తారు. అంతా నా ప్రతిభే అంటారు. 'అత్తారింటికి దారేది' చిత్రం పైరసీకి పాల్పడి, 60 నిమిషాల చిత్రం యూ ట్యూబ్‌లో ప్రదర్శస్తుంటే, నిబ్బరంగా నిలబడి చిత్రాన్ని విడుదల చేసి కలెక్షన్లు రికార్డులను సృష్టించారు పవన్. పవన్ కళ్యాణ్ ఒక సునామీలా అభిమానుల బలం రోజు రోజుకు పెరిగి పోతోంది. దానిపేరే పవనిజం.

బీభత్సమైన అభిమానులు..
సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా భీభత్సమైన అభిమానులున్నారు పవన్ కి. అదంతా కూడా కేవలం సినిమాల్లో అద్భుతమైన నటన వల్లనో లేక డాన్సులు, ఫైట్లు, సెంటిమెంట్ వంటి అంశాలను చూసి ఇంత మంది అభిమానం ఏర్పడలేదు. అది కేవలం ఆయన వ్యక్తిత్వం వల్లే సాధ్యమైంది. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ప్రభంజనం. మంచితనానికి, సేవాభావానికి, నిజాయితీకి ఆయనొక నిదర్శనం. దేశమంతా తనకు అభిమానులున్నా కూడా ఒక మామూలు సాదాసీదా వ్యక్తిగా ఉండటమే పవన్ కు తెలిసింది. ఎదుటివారికి ఆయనిచ్చే మర్యాదకు ఎంతో మంది సలాం కొట్టారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోకి కూడా లేని ఇమేజ్ పవన్ కళ్యాణ్ సొంతం. ‘‘నిజానికి మిగతా హీరోల వలే పవన్ అద్భుతంగా డాన్సులు, నటన లాంటివి ఏం చేయడు. కానీ.. తనవంతుగా తాను కష్టపడి, ఇష్టపడి చేస్తాడు. కానీ ఇన్ని వేల కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారంటే కారణం తన వ్యక్తిత్వం, నిజాయితీ, సేవాగుణం మాత్రమే. అది చాలు కోట్లాది మంది అభిమానులకి, ఇది చాలు ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించే ఎంతో మంది ఫాలోవర్స్ కి. పన్నెండేళ్ళుగా ఒక్క హిట్టు కొట్టకుండా.. తన ఇమేజ్ ను అలాగే మెయిన్ టెయిన్ చేసిన ఏకైక హీరో పవన్ కళ్యాణ్. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ అవగానే, ఆయన పని అయిపోయిందని కామెంట్స్ చేసుకోవడం కన్నా హాస్యాస్పదం ఇంకేమైనా ఉంటుందా? పడిన ప్రతీసారి రెట్టించిన వేగంతో తిరిగి పైకి లేస్తాడు కాబట్టే ఆయన్ను పవర్ స్టార్ అన్నారు. మళ్లీ పవన్ మరో బ్లాక్ బస్టర్ కొట్టకపోతాడా, విమర్శకుల నోళ్లు మూయించకపోతాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తోంది 10 టివి. 

16:19 - September 1, 2016

యంగ్ టైగర్ 'యన్టీఆర్' నటించిన లేటెస్ట్ మూవీ 'జనతా గ్యారేజ్'. 'మిర్చి', 'శ్రీమంతుడు' సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన 'కొరటాల శివ' మలిచిన మరో సందేశాత్మక చిత్రం ఇది. మరి ఈ సినిమాతో 'యన్టీఆర్' 'కొరటాల' సందేశాన్ని ఎంతవరకు క్యారీ చేసాడో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే.

లేని పంచ్ డైలాగ్స్..
సందేశాన్ని సినిమాగా చెప్పాలంటే వినోదం అవసరం లేదని 'కొరటాల శివ' సినిమాలు చెబుతుంటాయి. అయితే స్టార్ హీరోల్ని దృష్టిలో పెట్టుకొని కథలు అల్లుకొనేటప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ తప్పకుండా ఉండాలి కాబట్టి సందేశాన్ని, మాస్ ఎలిమెంట్స్ ను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా నడపాలి. 'జనతా గ్యారేజ్' ను కూడా 'కొరటాల' అదే రూట్లో ట్రావెల్ చేయించాడు. చక్కటి పాయింట్ ను అతి చక్కని ప్రజెంటేషన్ తో అదరగొట్టాడు. కాకపోతే ఇందులో 'యన్టీఆర్' రెగ్యులర్ సినిమాల మాదిరిగా పంచ్ డైలాగ్స్ ఉండవు, ఆవేశపు డైలాగ్స్ అసలుండవు. కేవలం కథకు అవసరమయ్యే మంచి డైలాగులు మాత్రమే వినిపిస్తాయి. కాకపోతే కథ పాతదే అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన చెత్త సినిమాల వల్ల వచ్చిన పొల్యూషన్ అంతా 'జనతా గ్యారేజ్' తో కొట్టుకుపోతుందని చెప్పుకోవచ్చు. టోటల్ గా 'జనతా గ్యారేజ్' ఓ క్లాసికల్ మాస్ మూవీ అని చెప్పాలి. కథ ఎక్కడా డీవియేట్ అవకుండా అనుకున్న పాయింట్ ను అనుకున్నట్టుగా తెరకెక్కించాడు 'కొరటాల శివ'.

కథ..
ఊళ్ళో జనానికి ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ కి వెళతారు. కానీ పోలీస్ స్టేషన్ లో లభించే న్యాయం కన్నా 'జనతా గ్యారేజ్' హెడ్ సత్యం చేసే న్యాయానికే ఎక్కువ విలువనిచ్చి అతడ్ని దేవుడిలా భావిస్తారు ఊరి జనం. దాని వల్ల తన సొంత తమ్ముడు, అతడి భార్యని కోల్పోతాడు. ఫలితంగా సత్యం తమ్ముడి కొడుకుని, అతడి మేనమామ సత్యానికి దూరంగా తీసుకెళ్లిపోతాడు. మొక్కలంటే ప్రాణం పెట్టే ఆనంద్ కొన్ని పరిస్థితుల వల్ల సత్యమే తన పెదనాన్న అని తెలియకుండానే 'జనతా గ్యారేజ్' లోకి అడుగుపెడతాడు. ఆ తరువాత జరిగే ఆసక్తికరమైన మలుపులతో 'జనతా గ్యారేజ్' ప్రేక్షకుల్ని ఎమోషన్స్ తో కట్టి పడేస్తుంది. ముఖ్యంగా 'యన్టీఆర్', 'మోహన్ లాల్' పాత్రలు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్. ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా నడిచిపోతుంది. ఇంటర్వెల్ దగ్గర దిమ్మతిరిగే బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్ దగ్గరనుంచి సినిమా జనాన్ని కుర్చీలకు కట్టేస్తుంది.

పాత్రల తీరు తెన్నులు...
'మోహన్ లాల్' ను కంప్లీట్ యాక్టర్ అని ఎందుకంటారో ఈ సినిమా చూస్తే అర్ధమౌతుంది. డైలాగ్స్ ఏమీ లేకపోయినా కొన్ని కొన్ని సీన్స్ లో ఆయనిచ్చే ఎక్స్ ప్రెషన్స్ ఎక్స్ ట్రార్డినరీ. ఓన్ వాయిస్ వినిపించలేదని మనకి ఒకటే లోటుగా అనిపిస్తుంది తప్పితే ఆయన పెర్ఫార్మెన్స్ కు ఎవరూ పేరు పెట్టలేరు. అంతేకాదు 'యన్టీఆర్' కూడా ఈ సినిమాతో కంప్లీట్ యాక్టర్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా గ్యారేజ్ లోకి యన్టీఆర్ ఎంటర్ అయిన దగ్గరనుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళుతుంది. కాకపోతే విలన్ తో 'జనతా గ్యారేజ్' కు ఉన్న కాన్ ఫ్లిక్ట్ అంత బలంగా అనిపించదు. విలన్ గా నటించిన 'సచిన్ కేడ్కర్' పాత్ర చివరికి తేలిపోయినట్టు అనిపిస్తుంది. 'మోహన్ లాల్' కొడుకుగా నటించిన 'ఉన్ని ముకుందన్' పాత్ర కూడా ఏమంత గొప్పగా అనిపించదు. అయితే ఇందులో కొన్ని ఎమోషన్ సీన్స్ తో జనం బాగా కనెక్ట్ అయిపోతారు. ముఖ్యంగా 'జనతా గ్యారేజ్' కోసం 'సమంతా' మీద ఉన్న ప్రేమను త్యాగం చేసే సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిపోతుంది. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ లో 'యన్టీఆర్' 'మోహన్ లాల్' దగ్గరకి వచ్చి కొడుకు గురించి చెప్పేసీన్ కూడా బాగా పండింది. 'రాజీవ్ కనకాల' ఆఫీస్ కి 'యన్టీఆర్' వచ్చే సీన్ అయితే అదిరిపోతుంది. ఇక క్లైమాక్స్ సీన్ లో ఎమోషన్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాని మాస్ జనం, ముఖ్యంగా 'యన్టీఆర్' ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే డౌట్. ఎనీహౌ 'జనతా గ్యారేజ్' ఈజ్ ఎ క్లాసిక్ ఎంటర్ టైనర్ .

ప్లస్ పాయింట్స్ :
మోహన్ లాల్, యన్టీఆర్ నటన
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఎమోషన్స్
సెంకడాఫ్ కథ
ఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :
విలన్ కేరెక్టర్
ఎన్టీఆర్ లక్షణాన్ని సెకండాఫ్ నుంచి వదిలి పెట్టడం.
ఇద్దరు హీరోయిన్స్.

రేటింగ్ : 2.75/5

16:18 - September 1, 2016

విజయవాడ : మెడికల్ సీట్ల భర్తీ విషయంలో బ్రోకర్ల మాటలను నమ్మవద్దని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. బీ కేటగిరిలో సీటు వచ్చి డబ్బులు కట్టిన వాళ్లు కన్వీనర్‌ కోటాలో వచ్చిన తర్వాత కట్టిన డబ్బులు పూర్తిగా వాపస్ ఇస్తామని మంత్రి తెలిపారు. ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సీట్ల భర్తీని చేపడతామన్నారు. 

 

16:14 - September 1, 2016

రాయితీ వంటగ్యాస్ ధర పెంపు..

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మరోసారి సబ్సిడీ వంటగ్యాస్ ధరల మోత మోగించింది. రాయితీ సిలిండర్ పై రూ. 2 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. జులై నుండి నెలవారీగా ఈ ధరలు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. 

ప్రాణహిత - చెవేళ్లకు జాతీయ హోదా ఇవ్వాలి - శశిధర్..

హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. రీ డిజైన్ చేసిన ప్రాజెక్టులపై అసెంబ్లీ కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు కానీ జాతీయ హోదా గురించి వివరించలేదన్నారు. 

తమిళనాడులో ప్రసూతి సెలవు పెంపు..

చెన్నై : ప్రభుత్వ ఉద్యోగినులకు ప్రసూతి సెలవును 9 నెలలకు పెంచుతున్నట్టు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఆరు నెలల పాటు వేతనంతో కూడిన సెలవు ఇస్తుండగా, ఇప్పుడు దాన్ని 9 నెలలకు 'అమ్మ' ప్రభుత్వం పెంచింది. 

15:53 - September 1, 2016

ఉల్లికాడలు..మార్కెట్ లో ప్రస్తుతం విరివిగా దొరుకుతుంటాయి. ఇవి కొంతమంది తినడానికి మక్కువ చూపరు. కానీ వీటిని ఆహారంలో తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే చదవండి...

ఉల్లికాడలతో వివిధ రకాలైన వంటలు చేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది.
సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రించడానికి, తగ్గించడానికి దోహద పడుతుంది.
గుండె, రక్తనాళాలకు మంచిది. కొలెస్ట్రాల్ ఆక్సీకరణనను తగ్గించడమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఉల్లికాడల్లో నీటిలో కరిగే కొల్లాయిడల్‌ కార్బోహైడ్రేట్‌ ఉంటుంది. దీని వల్ల పెద్దపేగుకు కేన్సర్‌ సోకే అవకాశాలు ఉండవు.
ఉల్లికాడల్లో వ్యాధి నిరోధక లక్షణాలు ఉండడంతో జలుబు, జ్వరం త్వరగా సోకవు. ఆహారం త్వరగా జీర్ణం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఇవి ఒక ఔషధంగా పనిచేస్తాయి.
ఉల్లికాడలలో క్వర్సేటిన్ బాధనివారక, యాంటి హిస్టమైన్ ప్రయోజనాలను అందిస్తుంది.

15:46 - September 1, 2016
15:43 - September 1, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేశారు. బాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది.

 

15:41 - September 1, 2016

ఏలూరు : సౌదీ రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా వాసి లింగోటి శేషుబాబు మృతి చెందారు. డమమ్ ఎయిర్ ఎయిర్ పోర్టు సమీపంలో ప్రమాదం జరిగింది. సౌదీ ఆస్పత్రి మార్చురీలోనే మృతదేహం ఉంది. రోజులు గడుస్తున్నా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం లేదు. భారత దౌత్య కార్యాలయం అధికారులు స్పందించడం లేదు. మృతుని బంధువులు ఆందోళనలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చుట్టూ మృతుని బంధువులు చక్కర్లు 
కొడుతున్నారు. 

 

జగన్ పై బాబు విమర్శలు..

కడప : రాయచోటి (మం) కంచెరపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఎండిన వేరుశనగ పంటలను పరిశీలించారు. రాయలసీమను కరవురహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతానని, హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి రాయచోటిని ప్రతి ఎకరానికి నీరందిస్తామన్నారు. తాను అభివృద్ధి యజ్ఞం చేస్తుంటే జగన్ రాక్షసుడిలా అడ్డుకుంటున్నారని విమర్శించారు. 

15:33 - September 1, 2016

కృష్ణా : విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు వివాదం కలకలం రేపింది. ఆస్పత్రిలో సిబ్బంది నిర్వాకం మరోసారి బయటపడింది. ఉదయం ప్రసవించిన మహిళకు మధ్యాహ్నం... చనిపోయిన శిశువును అప్పగించారు. అయితే చనిపోయిన శిశువు తమ బిడ్డ కాదని మహిళ బంధువులు ఆస్పత్రి ఎదుట అందోళన చేపట్టారు. డీఎన్ ఏ టెస్టు చేసి తమ బిడ్డను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది, నర్సుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 'బాబు పుట్టాడని.. నేను చూశానని... పుట్టినప్పుడు బిడ్డ ఆరిచిందని' మహిళ బంధువు చెబుతున్నారు.

 

ఓటుకు నోటు కేసు..విచారణ రేపటికి వాయిదా..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో హైకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ రేపటికి వాయిదా పడింది. 

సౌదీలో పశ్చిమ గోదావరి జిల్లా వాసి మృతి..

పశ్చిమగోదావరి : సౌదీలో జిల్లా వాసి లింగోటి శేషుబాబు మృతి చెందాడు. డమమ్ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇతను మృతి చెందాడు. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సౌదీ ఆసుపత్రి మార్చురీలో మృతదేహం భద్రపరిచారు. రోజులు గడుస్తున్నా ఇంకా మృతదేహం రాకపోవడంతో మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. భారత దౌత్య అధికారులు స్పందిండం లేదని తెలుస్తోంది. మృతదేహాన్ని రప్పించాలంటూ మృతుడి కుటుంసభ్యులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. 

ఏడో తేదీన గురుపూజోత్సవం - గంటా..

విజయవాడ : గురుపూజోత్సవ వేడులకను ఈనెల 5వ తేదీకి బదులు ఏడో తేదీన నిర్వహించనున్నట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వినాయక చవితి..ఉపాధ్యాయుల దినోత్సవం రెండూ ఒకే రోజున రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు వివాదం..

విజయవాడ : ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు వివాదం నెలకొంది. ఉదయం ప్రసవించిన మహిళకు మధ్యాహ్నం శిశువు మృతదేహాన్ని సిబ్బంది అప్పగించారు. చనిపోయిన శిశువు తమ బిడ్డకాదని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన నిర్వహించారు. డీఎన్ఏ టెస్టు చేసి తమ బిడ్డను అప్పగించాలని డిమాండ్ చేశారు. 

హోదా..ప్యాకేజీ రెండు కావాలి - యనమల..

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, ప్యాకేజీ కూడా ప్రకటించాలని ఏపీ మంత్రి యనమల పేర్కొన్నారు. కేబినెట్ సబ్ కమిటీ స సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. జీఎస్టీ అమల్లోకి వస్తే రూ. 4వేల కోట్ల ఆదాయం కోల్పోతామని, ఈ ఏడాది రెవెన్యూ వసూళ్లు మందకొడిగా ఉన్నాయన్నారు. ఎక్సైజ్, గనుల శాఖ నుండి ఆదాయం అనుకున్నంతగా లేదన్నారు. ఆదాయం వసూళ్లలో రవాణాశాఖ మెరుగ్గా ఉందని, పుష్కరాలకు అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు చేయడం జరిగిందన్నారు. సచివాలయం నిర్మాణానికి ఇప్పటి వరకు రూ. 6వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. 

14:38 - September 1, 2016

మెదక్ : 'పోలీసులు గుంజి గుంజి కొడుతున్నరు...ఆడ..మగ తేడా లేకుండా మస్తుగా కొడుతున్నరు..సార్..తమను కాపాడండి' అంటూ అక్కడి గిరిజనులు ఆవేదనతో కోరుతున్నారు. వీరంతా అమాయక గిరిజన రైతులు. కొంతమంది గిరిజనులు భూములు అమ్ముకున్నారు. భూములు కొన్న వారు పక్కనే ఉన్న స్థల్లాను సైతం కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దీనితో కొనుగోలు దార్లకు..స్థలాల యజమానులతో వివాదం చెలరేగింది. వీరి మధ్యలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

పెద్దల కన్ను...
జిల్లా శివ్వంపేట మండలం ధర్మానాయక్ తండా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భూములపై పెద్దల కన్ను పడింది. ఆలస్యం చేయకుండా అమాయక గిరిజన రైతుల పొలాలను కారు చౌకగా కొట్టేశారు. అంతేకాదు పక్కనున్న పొలాలను సైతం ఆక్రమించుకొనేందుకు పథకం పన్నారు. పెద్దల కుట్రలకు పోలీసులు వత్తాసు కూడా తోడైంది. రియల్టర్లు..పోలీసుల నిర్భందాల నుండి తమను రక్షించాలని గిరిజనులు కోరుతున్నారు.

ప్రభుత్వం సహాయం చేయాలి.
'పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. అర్ధరాత్రి వేళ వచ్చి గుంజి గుంజి కొట్టిండ్రు. ఆడ..మగ అనే తేడా లేకుండా కొడుతున్నరు. సర్వగోస పెడుతున్నరు. డీఎస్పీ..ఎస్పీ..కలెక్టర్ ఎంతో మందికి చెప్పినా పట్టించుకోవడం లేదు. అప్పట్లో 18 మందిపై కేసులు ఉంటే ఇప్పుడు 40 మంది కేసులో ఇరుక్కున్నం. మా భూములు మాకు కావాలని పోరడుతున్నం. చిన్న చిన్న పోరగాళ్లున్నరు. గెట్ల బతకాలి. జేసీబీ పెట్టి ధ్వంసం చేస్తున్నరు. ప్రభుత్వం సహాయం చేయాలి' అని కోరారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:29 - September 1, 2016
14:28 - September 1, 2016

హైదరాబాద్ : మల్లన్న సాగర్ నిర్వాసితుల గ్రామాల్లో 144 సెక్షన్ విధించడం అప్రజాస్వామికమని భూ నిర్వాసితుల పోరాట కమిటీ నాయకులు పేర్కొన్నారు. భూ నిర్వాసిత కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో 144 సెక్షన్ ప్రతులను ధ్వహనం చేశారు. ప్రభుత్వం జీవో నెంబర్ 123 ప్రకారం బలవంతంగా భూ సేకరణ చేపట్టి నిర్భందం ప్రయోగిస్తోందని, మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వేముల ఘాట్ గత నెల రోజులుగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారని, ఇలా చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు.

14:18 - September 1, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. డీకే పెంచుతున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు డీఏ పెంపుదలకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డీఏ పెంపునకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెంచిన డీఏ ఈ ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి అమలులోకి రానుంది. డీఏ పెంపు పట్ల తెలంగాణ‌ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల‌తో పాటు పలు కార్యాల‌యాల ప్ర‌భుత్వోద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

14:13 - September 1, 2016
14:02 - September 1, 2016

మాతృత్వం స్త్రీ పై ప్రకృతి మోపిన అదనపు భారం. పైగా ఇంటిపని, బైటి పనుల ఒత్తిడితో మాతృత్వం మరింత భారంగా మారుతోంది. సిజేరియన్ లు తప్పితే సాధారణ ప్రసవాలు కష్టంగా మారుతున్న పరిస్థితి. ఇలాంటి స్థితిలో ప్రకృతిని దగ్గరగా ఉంటే, యోగాను ఆశ్రయిస్తే చాలా సానుకూల ఫలితాలున్నాయంటున్నారు నిపుణలు. ఆ పద్ధతులేంటో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. 

14:00 - September 1, 2016

మార్కెట్ కి ముడిసరుకేంటి? ప్రొడక్ట్సే కదా? మరి ఆ ప్రొడక్ట్స్ లోని క్వాలిటీస్ చూపించే కదా వాటిని సేల్ చేసుకోవాలి? ఎందుకు మార్కెట్, ఉమెన్ ని ఎరగా ఎంచుకుంటోంది? ఎందుకు ప్రొడక్ట్స్ కన్నా ఉమెన్ బాడీ మీద ఫోకస్ చేస్తోంది? వాణిజ్య ప్రకటన చూడగానే ఏ ప్రొడక్ట్ కోసమో తెలిసిపోవాలి? అది ఎంత క్వాలిటీనో అర్థం కావాలి? కానీ, ఉదయం లేచింది మొదలు పడుకునే వరకూ కనిపించే వందలాది ప్రకటనల్లో కనిపిస్తున్నదేంటి? అందమైన ఆడవాళ్లు.. అవసరం లేకున్నా వారి శరీరాలను చూపించే ఆకట్టుకునే ప్రయత్నాలు. అందాల ప్రపంచం కొందరికే సొంతమవుతుందనుకునే అపోహ నుండి బయటపడాలి. అచ్చుగీసినట్టుగా ఉండే అందం, చెక్కినట్టుగా ఉండే దేహ సౌందర్యం ఎవరికైనా అసాధ్యమే అనే వాస్తవాన్ని గ్రహించాలి. సాంకేతిక పరిజ్నానం తో వచ్చిన విప్లవాత్మక మార్పు ఎటువంటి మాయాజాలాలు చేస్తుందో, అందుకనుగుణంగా సృజనకారులు ఎటువంటి ప్రయోగాలు చేస్తున్నారో తెలుసుకోవాలి. అందమంటే అంత:సౌందర్యమని అర్థం తెలుసుకోవాలి. అందమంటే శ్రమ సౌందర్యమనే వాస్తవాన్ని తెలుసుకోవాలి.. 

మల్లన్న సాగర్ భూ నిర్వాసితులతో తమ్మినేని భేటీ..

మెదక్ : మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలతో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భూ నిర్వాసితుల రాష్ట్ర కమిటీ కన్వీనర్ ఎన్.మల్లేష్ పాల్గొన్నారు. 

అధికారులు..కాంట్రాక్టర్లపై బాబు గరం గరం..

అనంతపురం : రాయలసీమ జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు..కాంట్రాక్టర్లపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఓపికను పరీక్షిస్తే మంచిది కాదని, మొహమాటంతో శిక్షించకుండా క్షమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై తన వేగానిన్ అందుకోకపోతే వెళ్లిపోవాలని సూచించారు. గడిచిన తన పాలనలో ఇరిగేషన్ శాఖకు అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు. ఏడాదిలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

13:44 - September 1, 2016

మెదక్ : వేలాది వాహనాలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారి అది...కాని చిన్న చినుకుకే రహదారంతా చెరువును తలపిస్తుంది. ముంబై వెళ్లే జాతీయ రహదారిపై తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఏళ్లు గడుస్తున్నా..ఎన్ని ప్రభుత్వాలు మారినా..తీరని సమస్యగానే ఉంటోంది మెదక్‌ జిల్లా ఆర్‌.సి.పురం రహదారి.

చినుకపడితే చెరువును తలపించే ఆర్‌.సి.పురం నేషనల్‌ హైవే
ఇటు హైదరాబాద్‌కు..అటు ముంబైకు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారికి అనుసంధానంగా ఉంటుంది మెదక్‌ జిల్లా ఆర్‌.సి. పురం నాగులమ్మ గుడి నేషనల్‌ హైవే. అంతవరకూ బాగానే ఉంది. కాని చినుకుపడితేనే వస్తుంది చిక్కు.. చిన్న చినుకుపడితే రహదారి చెరువును తలపిస్తుంది. దీంతో చినుకుపతే చాలు..వాహనదారులకు ఈ రోడ్డుపై వెళ్లాలంటే నరకం కనిపిస్తుంది.

రాయసముద్రం చెరువు ఆక్రమణే సమస్యకు కారణం
ఆర్‌.సి.పురం రోడ్డు ఇలా మారడానికి ప్రధాన కారణం... రాయసముద్రం చెరువు ఆక్రమణే. రోడ్డుకు పైన ఉన్న రాయసముద్రం చెరువుకు చెందిన నాలాను కబ్బాదారులు పూర్తిగా ఆక్రమించారు. చెరువు నుంచి కిందికి నీళ్లు వెళ్లే నాలాపై అక్రమ కట్టడాల వల్ల నీరు వెళ్లడానికి వేరే మార్గం లేదు. ఫలితంగా నేషనల్‌ హైవే పైనే నీళ్లు నిలిచిపోతున్నాయి. పదిహేనేళ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా...పట్టించుకున్న నాథుడే లేడు.

ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
నిత్యం వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా లింగంపల్లి నుంచి పటాన్‌చెరుకు రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదంటున్నారు. రోడ్డు జలమయమైన ప్రతిసారి అధికారులు...చర్యలు తీసుకుంటామని చెప్పడం తరువాత మర్చిపోవడం సర్వసాధారణమైపోయిందని ఆరోపిస్తున్నారు వాహనదారులు.

అధికారులు స్పందించాలంటున్న వాహనదారులు
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆర్‌.సి.పురం రహదారిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. రోడ్డు జలమయమైనప్పడు పరిశీలించే అధికారులు...ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని సూచిస్తున్నారు.

కేంద్ర జలసంఘం అధికారులతో జోషి సమీక్ష..

హైదరాబాద్ : కేంద్ర జలసంఘం అధికారులతో నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరుగుతోంది. 

జైపూర్ రాజమాత నిరసన..

జైపూర్ : ట్రిపోలియా గేట్ వద్ద జైపూర్ రాజమాత పద్మినీ దేవి నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్యాలెస్ గేట్లను సీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై రాజ కుటుంబం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. 

13:37 - September 1, 2016

కృష్ణా : జిల్లా గన్నవరం మండలం గూడవల్లిలో ఓ మహిళ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. గూడవల్లిలోని శ్రీ చైతన్య కాలేజీలో రమ్య అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. అయితే 2లక్షల రూపాయల విషయంలో లెక్కల్లో తేడాలు రావడంతో యాజమాన్యం రమ్యను నిలదీసింది. మిస్‌ అయిన 2లక్షల రూపాయలు బాధ్యత రమ్యదే అని యాజమాన్యం నిలదీసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రమ్య,.చైతన్య హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మంత్రి హరీష్ రావుకు కేంద్ర మంత్రి ఉమా భారతి లేఖ..

హైదరాబాద్ : తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి లేఖ రాశారు. 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ఈనెల 6న నాబార్డుతో కుదుర్చుకోనున్న ఎంవోయూకు హాజరు కావాలని ఆహ్వానించారు. కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీ సభ్యుడిగా హరీష్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణకు చెందిన దేవాదులతో పాటు మరో 11 ప్రాజెక్టులకు ఈ ఒప్పందం వర్తించనుంది. 

ఓటుకు నోటు..హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రపై విచారణ జరపాలన్న ఏసీబీ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ మధ్యాహ్నం 2.30కి విచారణకు రానుంది. 

13:34 - September 1, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టారు. ప్రభుత్వ పరిధిలో లేని బెస్మెంట్‌ విధానాన్ని తీసుకువచ్చి... తమపై పని భారం మోపుతున్నారని డీజీవో ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానాన్ని నిరసిస్తూ... ఏలూరులోని డీఈవో కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ అంశంపై మరింత సమాచారం ఈ వీడియో చూడండి..

13:29 - September 1, 2016

ముంబై : టెలికాం కంపెనీలకు షాకిస్తూ రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ సంచలన నిర్ణయాలను ప్రకటించారు. ఇటీవలే రిలయన్స్ ఫ్యామిలీలో చేరిన జియో ఇన్ఫోకామ్ భవిష్యత్ ప్రణాళికను ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఇవాళ జరిగిన 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన యూజర్లపై వరాల వర్షం కురిపించారు. ప్రపంచంలోనే అతి తక్కువ ధరలకు దేశంలో జియో సేవలను అందుబాటులోకి తెస్తున్నామంటూ ముకేశ్ ప్లాన్ వివరాలను ప్రవేశపెట్టారు. 5జీ 6 జీ దిశగా అడుగులు వేస్తున్నామన్నానీ, 5 పైసలకే ఒక ఎంబీ, 50 రూపాయలకే 1 జీబీ డాటా సేవలను అందించనున్నట్టు ప్రకటించారు. తమ జియో సేవలద్వారా ఏ నెట్ వర్క్‌కైనా ఉచిత రోమింగ్, ఉచిత వాయిస్ కాల్స్ సేవలు అందిస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి భారతీయుడి జీవితం డిజిటల్గా రూపాంతరం చెందబోతోందన్నారు. దేశంలో కోటి వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని అంబానీ ప్రకటించారు. పండుగ రోజుల్లో మెసేజ్‌ల బ్లాకేజ్ ఉండదని అంబానీ స్పష్టం చేశారు. 

13:25 - September 1, 2016

గుంటూరు : వెలగపూడి సచివాలయం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ప్రారంభమైంది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన సచివాలయంలో తొలిసారిగా మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయింది. 'పట్టణాభివృద్ధి విధానం- సంస్కరణల'పై ఉప సంఘం చర్చిస్తోంది. ఇవాళ్టి నుంచి వరుసగా 5 మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలను ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి ఆ శాఖ మంత్రి యనమల చేపట్టనున్నారు. తాత్కాలిక సచివాలం ప్రారంభం అయిన తరువాత మొదటి సమావేశం కాబట్టి పనుల ఒత్తిడితో కొందరు మంత్రులు హాజరుకాకపోయినా సమావేశాన్ని కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే మంత్రులందరూ వెలగపూడి సచివాలయం నుంచే పాలన కొనసాగిస్తారని ఈ సందర్భంగా మంత్రి యనమల పేర్కొన్నారు. 

టి.ఉద్యోగుల డీఏ పెరుగుదల..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 3.144 శాతం డీఏ పెంపునకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారు. పెంచిన డీఏ జనవరి 1 నుండి అమలు చేయనున్నారు. 

ఎంబీబీఎస్..యాజమాన్య కోటా సీట్లు ముందుగానే భర్తీ - మంత్రి కామినేని..

విజయవాడ : ఏంబీబీఎస్ బీ కేటగిరి సీట్లలో యాజమాన్య కోటా సీట్లు ముందుగానే భర్తీ చేస్తున్నారని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. కన్వీనర్ కోటాలో సీటు వస్తే బీ కేటగిరి కింద చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేలా యాజమాన్యాలతో మాట్లాడడం జరిగిందని, ఈ నెల 26 తరువాత మరో కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలని, విద్యార్థులు కాలేజీల్లో ఒకసారి రిపోర్టు చేస్తే సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వబడవని పేర్కొన్నారు. 

12:48 - September 1, 2016

విజయవాడ : ఆధ్యాత్మిక శోభతో విజయవాడ నగరం పులకిస్తోంది. విఘ్నేశ్వరుని ఉత్సవ ఏర్పాట్లలో ప్రజలంతా లీనమయ్యారు. బొజ్జగణపయ్య వేడుకలకు సమయం ఆసన్నమవడంతో..వీధి వీధినా విగ్రహాలను ప్రతిష్టించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు నిమగ్నమవుతున్నారు. 'దండాలయ్యా.. ఉండ్రాళ్లయ్యా దయుంచయ్య దేవా అంటూ' హోరెత్తించేందుకు బెజవాడ ముస్తాబవుతోంది.

బెజవాడలో వెల్లువిరుస్తోన్న వినాయక చవితి శోభ
వినాయక చవితి శోభ బెజవాడలో అప్పుడే వెల్లువిరుస్తోంది. గణేశుడి సేవలో తరించేందుకు ప్రజలు...మండపాలను శోభయామానంగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో విజయవాడలోని అనేక ప్రాంతాలలో పండుగ వాతావరణం సంతరించుకుంది. నగరమంతా గణేశుని విగ్రహాలు కొలువుదీరనున్నాయి. ప్రతి ఏడాది వినాయక పందిళ్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా వేళ సంఖ్యలో వినాయక పందిళ్ల ఏర్పాట్లకు శరవేగంగా అడుగులుపడుతున్నాయి.

గణేశుని విగ్రహాలను తీర్చిదిద్దుతున్న కళాకారులు
వినాయక చవితి పండుగకు సమయం కూడా సమీపించడంతో విగ్రహాల తయారీ ఊపందుకుంది. కళాకారులు తమ నైపుణ్యంతో వివిధ ఆకృతుల్లో గణనాథున్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు ఇప్పటిదాకా హైదరాబాద్ కే పరిమితమయ్యాయి. ఇక ఏపీ నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో... 72 అడుగుల వినాయకుడు కొలువుదీరబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

సందడికి సిద్ధమవుతున్న ఆయా ప్రాంతాలు
వినాయక చవితి పందిళ్ళలో పూజలందుకునేందుకు గణనాధుని ప్రతిమలు సిద్ధమయ్యాయి. నిత్యావసర ధరలు పెరుగుతున్నా.. విఘ్నాలను తొలగించే వినాయకుని పూజించేందుకు నగరంలో పందిళ్ళు తయారవుతున్నాయి. బందరు రోడ్, ఏలూరు రోడ్, బీసెంట్ రోడ్, పాతబస్తీ, తదితర ప్రాంతాలలో చవితి సందడి ఆస్వాదించేందుకు పూజా సామాగ్రి, పచ్చటి తోరణాలు, డెకరేషన్లు సిద్ధం చేస్తున్నారు.

ఊరు...వాడా...గణేషుడి సందడి
ఊరు...వాడా...అంతా గణేశుని పూజలో తరించేందుకు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. పండుగ రావడమే తరువాయి అన్నట్టు నగరమంతా చవితి వైభవం సంతరించుకుంది. 

12:42 - September 1, 2016

మెగస్టార్ చిరంజీవి..నటిస్తున్న 150వ సినిమాపై అందరి దృష్టి నెలకొంది. చిరు సినిమాలో ఎంట్రీ అప్పటి నుండి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఓ టీజర్ అభిమానులను సంతోషపరిచింది. 'ఖైదీ నెంబర్ 150' అని నామకరణం కూడా చేసేశారు. వి.వి.వినాయక్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'కాజల్' హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి కొత్త విశేషాలు ఏమన్నా తెలుస్తాయా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సినిమాలో ఎవరూ ఊహించని వ్యక్తి నటిస్తారని ప్రచారం జరుగుతోంది. మెగా కుటుంబం నుండి వెండి తెరకు ఇటీవలే కనిపించిన నాగబాబు కుమార్తె 'నిహారిక' చిరు సినిమాలో నటించనుందని ప్రచారం జరుగుతోంది. 'ఒక మనసు' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఈమె చిరు 150వ చిత్రంలో ఓ చిన్న అతిధి పాత్రలో కనిపించబోతోందట. ఈ వార్త బయటకు రాగానే అభిమానుల్లో ఆసక్తి కాస్త ఎక్కువైంది. కానీ ఈ విషయంపై ఇంకా మెగా క్యాంప్ నుండి..చిత్ర యూనిట్ నుండి ఎలాంటి సమాచారం అందలేదు. మరి నిహారిక నటిస్తుందా ? లేదా ? అన్నది చిత్ర యూనిట్ చెప్పాలి. 

12:42 - September 1, 2016

హైదరాబాద్ : నిజాం షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం రావాలని ఎంపీ కవిత అన్నారు. రైతులు కొ ఆపరేటివ్ పద్దతిలో ముందుకొస్తే నడిపేందుకు తమ టీఆర్‌ఎస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. తప్పకుండా ఫ్యాక్టరీకి పూర్వవైభవం వస్తుందని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ పునరుద్దరణకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన చెరుకు రైతులకు కష్టాలు వచ్చిపడ్డాయని అన్నారు. చెరుకు ఉత్పత్తి ఉన్నా నష్టాల్లో చూపారని విమర్శించారు. చెరుకు రైతులకు టీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

12:38 - September 1, 2016

అనంతపురం : జిల్లాలో ఎండిపోయిన పంటలపై వచ్చే ఆరు రోజుల్లోగా తగిన చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాయలసీమలో నెలకొన్న కరవు పరిస్థితులపై సీఎం చంద్రబాబు అనంతపురంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రెయిన్‌ గన్స్ ను అధిక సంఖ్యలో వాడి ఎండిన పంటలను కాపాడాలన్నారు. ప్రస్తుతం ఏపిలో వర్షాలు పడడం శుభపరిణామమన్నారు.

12:36 - September 1, 2016

విజయవాడ : సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని విజయవాడ నగర కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. రేపు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి ముజఫర్ అహ్మద్ తెలిపారు. కార్మికులను మభ్యపెట్టే విధానాలను మాని.. వారికి చట్టబద్ధత కల్పించడంతోపాటు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం18 వేలు వేతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

12:32 - September 1, 2016

విజయవాడ : మాజీ సీఎం మళ్లీ పాత గూటికి చేరుకోనున్నారా.. రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీతో ఏర్పడిన విభజన... ఐక్యత వైపు అడుగు వేయనుందా... ఆయన మళ్లీ పార్టీలోకి వస్తే వర్కవుట్ అవుతుందా.. లుక్

ఏపీ చివరి సీఎం తిరిగి కాంగ్రెస్ లో చేరనున్నారా?..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోనున్నారా ? ఇన్ని రోజులపాటు అనధికార అజ్ఞాతాన్ని పాటించిన నల్లారి.. మళ్లీ హస్తం ఆహ్వానాన్ని అందుకోనున్నారా ? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు. సోనియాగాంధీ ఇప్పటికే ఈ విషయంపై గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు... గులాంనబీ ఆజాద్‌, దిగ్విజయ్‌సింగ్‌లతో కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది.

మూడు నెలలు పదవీకాలం ఉండగానే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా
రాష్ట్ర విభజన నేపథ్యంలో మరో మూడు నెలలు పదవీకాలం ఉండగానే అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి,... కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విభజన వల్ల నష్టాలుంటాయని.. పార్టీ నష్టపోవడం ఖాయమని కిరణ్‌ వాదించారు. అయితే అధిష్టానం విభజనకే మొగ్గు చూపడంతో కిరణ్‌ సీఎం పదవితో పాటు.. దశాబ్ధాల అనుబంధం ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఎన్నికలకు ముందు జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించి.. ప్రజల్లోకి వెళ్లారు. అయితే అప్పటికే విభజన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండటం.. విభజన ఆగడం అసంభవమనే భావనకు రావడంతో సీఎంగా ఉండి పార్టీ పెట్టినా... కిరణ్‌ను ఎవరూ విశ్వసించలేదు. దీంతో చివరకు ఆయన సొంత నియోజకవర్గం పీలేరులో ఓడిపోయారు.

అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నల్లారి
అనంతరం జరిగిన పరిణామాలతో కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మధ్యలో ఓ బుక్‌ ఫంక్షన్‌లో మెరిశారు. అయితే బీజేపీలో చేరేందుకు కిరణ్‌ ప్రయత్నించినట్లు.. ఆ పార్టీ కూడా ఆసక్తి చూపినట్లు ప్రచారం జరిగింది. అయితే మిత్రులు, స్నేహితుల సలహా మేరకు వెనక్కి తగ్గారు. కిరణ్‌ తండ్రి అమర్‌నాథ్‌రెడ్డి కాలం నుంచి ఆ కుటుంబం కాంగ్రెస్‌ పార్టీకి హార్డ్‌కోర్‌ ఫ్యామిలీగా గుర్తింపు పొందింది. అలాగే వారు చూపిన నిబద్ధతే కిరణ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవి వరించేలా చేసింది. దీంతో బీజేపీలో చేరాలనే కిరణ్‌ ఆలోచనపై సొంత అనుచరుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనట్లు సమాచారం. అందుకే తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు కిరణ్‌ రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

వెంటిలేటర్‌పై ఉన్న పేషంట్‌లా కాంగ్రెస్
ఇక రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్న పేషంట్‌లా తయారైంది. పార్టీలో మెజార్టీ శ్రేణులు టీడీపీ, వైసీపీలో చేరిపోయారు. అయితే ఈ మధ్య కేవీపీ రాజ్యసభలో ప్రత్యేకహోదాపై ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెట్టడంతో మళ్లీ ఏపీలో కొంత చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి.. పార్టీకి కాయకల్ప చికిత్స చేసేందుకు సిద్ధమవుతున్నారనేది ఆయన అనుచర వర్గం టాక్‌. అయితే కిరణ్‌.. రాహుల్‌ నాయకత్వంపై పూర్తిస్థాయి అంచనాకు రాలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కిరణ్‌ సోదరుడు సంతోష్‌రెడ్డికి టీడీపీ గాలం వేసింది. అయితే సంతోష్‌రెడ్డి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ కిరణ్‌ గనుక కాంగ్రెస్‌లో చేరితే.. దానిని బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కిరణ్‌ కాంగ్రెస్‌లో చేరుతారా ? లేదా ? చూడాలి. 

12:30 - September 1, 2016

యంగ్ హీరో 'నిఖిల్' ఆ మూవీ సీక్వెల్ ని ఒకే చేశాడు. ప్రస్తుతం కొత్త సినిమాతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో త్వరలోనే సీక్వెల్ ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. తన కెరీర్ ని మార్చేసిన ఆ మూవీ సీక్వెల్ 'నిఖిల్' మరో భారీ సక్సెస్ కొట్టాలని భావిస్తున్నాడు. ఇంతకీ ఈ హీరో ఏ మూవీకి రెండో భాగం చేస్తున్నాడు ?  వరుసగా సక్సెస్ లతో దూసుకుపోతున్న ఉన్న 'నిఖిల్' కి 'శంకరాభరణం' మూవీ స్పీడ్ బ్రేక్స్ వేసింది. ఈ మూవీ ప్లాప్స్ తో ఖంగుతిన్న ఈ యంగ్ బాయ్ కొత్త సినిమా కోసం గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం 'నిఖిల్' 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దగ్గరపడింది. దీంతో ఈ యంగ్ హీరో తన సూపర్ హిట్టు మూవీకి సీక్వెల్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. 'నిఖిల్' కెరీర్ ఎండ్ స్టేజ్ చేరిన టైంలో వచ్చిన 'స్వామిరారా' చిత్రం ఈ హీరో కెరీర్ ని మలుపుతిప్పింది. సుధీర్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి ఇప్పుడు రెండో భాగం ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ కి కూడా సుధీర్ వర్మనే దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

బాబుకు ఎంపీ గుత్తా లేఖ..

నల్గొండ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ రాశారు. పులిచింతల నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని లేఖలో కోరారు. 

బాబుకు ఎంపీ గుత్తా లేఖ..

నల్గొండ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ రాశారు. పులిచింతల నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని లేఖలో కోరారు. 

12:22 - September 1, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎదిగే సమయంలో ముఖం చాటేసిన వరుణుడు కరుణ చూపించడంతో పంటల దిగుబడిపై ఆశలు పెట్టుకుంటున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖా అధికారులు పేర్కొనడంతో చెరువుల్లో నీరు చేరే అవకాశమూ ఉంది. ఆశించిన మేర నీరు వస్తే రబీలో పంటల సాగుకు ఇబ్బంది ఉండందంటున్నారు రైతన్నలు.

ఓవైపు రైతుల దిగులు..మరోవైపు కరవు ..రైతన్నల ఆందోళన
వానలు లేక ఓవైపు రైతుల దిగులు..మరోవైపు కరవు మళ్లీ తాండివిస్తుందోమోననే ఆందోళన... ఇలాంటి సందేహాలతో నిండిన రైతులలో ఉపరితల ఆవర్తన ఫలితంగా కురిసిన వర్షాలు...కొండంత ధైర్యాన్నిచ్చాయి. 15 ఏళ్ల తరువాత అంతటిస్థాయిలో కురిసిన వర్షాలతో పంటల సాగుపై రైతుల ఆశలు చిగురించాయి.

107లక్షల ఎకరాలకు 80 లక్షల ఎకరాల్లోనే పంటలు వేసిన రైతులు
ఈ సంవత్సరం వర్షాలు అధికంగా కురుస్తాయని ప్రకటనలు రావడంతో ఖరీఫ్ సాగుపై ఆశలు పెరిగాయి. ఈ ఖరీఫ్‌ సీజన్ లో 107 లక్షల ఎకరాల్లో పంట సాగు కావాల్సి వుండగా 80 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారని ప్రకటించింది వ్యవసాయ శాఖ. ఆరంభంలో బాగానే కురిసిన వర్షాలతో సాగు ఉత్సాహంగానే కనిపించింది. అయితే పంటలు ఎదుగుతున్న దశలోనే వర్షాలు ముఖం చాటేయడంతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఏర్పడింది. ఈ పంటలు ఎదుగుతున్న దశ కావడం నీరు అవసరం మరింతగా ఉండే దశలో వర్షాభావం తలెత్తడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో చిగురించిన ఆశలు
సరిగ్గా ఈ దశలోనే బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురవడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పడు పడ్డ వర్షాలతో పంటలకు మేలు చేకూరుతుంది. ఇప్పుడు వర్షాలు కురిసినప్పటికీ ఆయా పంటల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కానీ పంటలు పూర్తిగా ఎండి పోయే పరిస్థితి నుండి ఈ వర్షాలు కాపాడాయంటున్నారు అన్నదాతలు.

రెండు రోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ
మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతా వరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అత్యల్ప వర్షపాతం నమోదయిన ప్రాంతాల్లో వర్షాలు పడితే పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశమూ ఉంది. రబీలో నైనా ఆశించిన మేర పంటల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. 

శ్రీ చైతన్య కళాశాలలో ఉద్యోగిని సూసైడ్..

విజయవాడ : కృష్ణా జిల్లా గన్నవరం మండలం గూడవల్లిలోని శ్రీ చైతన్య కళాశాలలో మహిళా ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. 

12:07 - September 1, 2016

మానవత్వాన్ని వెక్కిరిస్తున్న మరో ఘటన. మానసిక వికలాంగుడిని రోజంతా కొట్టిన రాక్షసత్వం. తుదిశ్వాస వీడడంతో బేరం పెట్టిన పెద్దలు..

ఇంట్లో డబ్బు మాయం..దానికి తోడు మొదలైన అనుమానం..ఆ చోరీ వికలాంగుడే చేశాడని బలమైన నమ్మకం..విచక్షణ కోల్పోయి దుర్మార్గం..మానవత్వాన్ని మరిచిపోయిన మనుషులు...

 

కళ్లముందు ఘోరం జరుగుతున్నా చూస్తుండిపోయారు. ఎవరూ నోరు మెదపలేదు. ఆ ఊరే మూగబోయింది. కొట్టిన దెబ్బలకు తాళలేక మానసిక వికలాంగుడి కేకలు వినిపిస్తున్నాయి. ఇలా అరచి..అరచి..చివరకు శ్వాస విడిచాడు. ఆ తరువాత ఎంట్రీ ఇచ్చిన పెద్దలు బేరం పెట్టారు. రెండు లక్షలకు రాజీ కుదిర్చారు. మానవత్వాన్ని వెక్కిరించే ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతోంది. చెట్టుకు కట్టేసి రోజంతా కసితీరా కొట్టారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని పెదచర్లపల్లి మండలం పోతవరం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

11:50 - September 1, 2016

పుణ్యక్షేత్రానికి ఆక్టోపస్ కవచం..తిరుమలలో పెరగనున్న మరింత భద్రత..శత్రుదుర్భేధ్యంగా తయారీ..ప్రతి క్షణం నిఘా..అనుక్షణం గస్తీ..

పవిత్ర పుణ్యక్షేత్రమైన 'తిరుమల'కు శాశ్వతంగా 'ఆక్టోపస్' కవచం ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు పునాదిరాళ్లు పడగా కొండపై శ్రీవారికి సమీంపలో కమెండోల కనుసన్నలలో తిరుమల భధ్రత ఉండనుంది. ఉన్నతమైన నిఘా వ్యవస్థ హెచ్చరికల నేపథ్యంలో ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన 'ఆక్టోపస్' దళాలు తిరుమలలో పూర్తిస్థాయిలో కొలువుతీరనున్నాయి. ఇప్పటికే పనులు మొదలుపెట్టగా శరవేగంగా ఈ పనులు జరుగుతున్నాయి. దీనితో 'ఆక్టోపస్' బలగాలు తిరుమల క్షేత్రంలో పెరిగే అవకాశం ఉంటుంది. ఇక నిఘా పటిష్టమై శత్రు దర్భేధ్యంగా మారనుంది. దీని గురించి మరింత వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.  

జియో టెక్నాలజీ కొత్త శకానికి నాంది - ముఖేష్..

ముంబై : జియో టెక్నాల‌జీ కొత్త శకానికి నాంది ప‌లుకుతుందని రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. విద్య, వ్య‌వ‌సాయ రంగాల‌కు జియో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, 4 జీ స్మార్ట్ ఫోన్ల‌ను అందుబాటు ధ‌ర‌కు అందిస్తామ‌ని చెప్పారు. ప్ర‌పంచంలో అన్ని రంగాల్లో స‌మూల మార్పులు వ‌స్తున్నాయని ఆయ‌న అన్నారు. 

11:40 - September 1, 2016

మహబూబ్‌నగర్‌ : విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన హాస్టల్‌ సిబ్బంది..వారిని చితకబాదిన సంఘటన పాలమూరు జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని బాలసదన్‌ హాస్టల్లో ఉండే తొమ్మిది మంది విద్యార్థులపై హాస్టల్లో పనిచేసే వంటమనిషి తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. విద్యార్థులను ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో భయపడ్డ విద్యార్థులు వెంటనే హాస్టల్‌ గేటుదూకి సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఆత్మకూరు మండల టీఆర్‌ఎస్‌ నాయకులు..విద్యార్థులకు న్యాయం చేసేలా పోలీసులు వార్డెన్‌ చర్యలు తీసుకోవాలని పోలీసులు ఫిర్యాదు చేశారు. 

11:36 - September 1, 2016

విశాఖ : స్టీల్‌ ప్లాంట్‌లో గేట్‌ మీటింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మైక్‌, ఇతర సామాగ్రిని తీసుకెళ్లారు. సమావేశానికి అనుమతి ఇచ్చి... అడ్డుకోవడాన్ని నిరసిస్తూ...స్టీల్‌ప్లాంట్‌ మెయిన్‌గేట్‌ వద్ద కార్మిక సంఘాలు ధర్నాకు దిగాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. విశాఖ గేట్ మీటింగ్ లు జరగటం అనంతరం సమ్మె చేయటం అనేది పద్ధతిగా వస్తోందని రసీఐటీయూ నేత నర్శింగరావు పేర్కొన్నారు. నూటికి నూరు శాతం రేపు సమ్మె జరిపితీరతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమ్మెలో స్టీల్ ప్లాంట్ లో రేపు జరగబోయే సమ్మెలే 20వేల మంది పాల్గొననున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సమ్మెకు అనుమతినిచ్చి ఇప్పుడు అడ్డుకోవటం సరికాదన్నారరు. ప్రభుత్వానికి తాపేదార్లుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని సీఐటీయూ నేతలు పేర్కొన్నారు. 

11:33 - September 1, 2016

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలోనే స్థిరంగా కొనసాగుతుందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఇవాళ కూడా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు వివరించాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వైపునకు రుతుపవన శాఖల నుంచి తేమ బలంగా రావడంతో తెలంగాణ, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. మరో వైపు హైదరాబాద్‌లో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఎమర్జెన్సీ టీంలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ ఆదేశించారు. పురాత భవనాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశంపై మరింత సమచారానికి ఈ వీడియో చూడండి..

11:31 - September 1, 2016

ఆ సినిమాపై ఐదుగురు ఆశలు పెట్టుకున్నారు. ఆ ఒక సినిమాతో ఐదుగురుకి బ్రేక్ వస్తుందనే కాన్పిడెంట్ తో ఉన్నారు. చిన్న సినిమానే కానీ పెద్ద విజయం కొట్టాలని ఆ చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ ? ప్రస్తుతం తెలుగులో రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాల్లో 'జ్యో అచ్యుతానంద' సినిమా అందరిని అట్రాక్ట్ చేస్తోంది. అయితే ఈ మూవీపై ఇప్పుడు నలుగురు బోలెడు అంచనాలు పెట్టుకున్నారు. కాన్ఫిడెంట్ గా ఈ మూవీ భారీ సక్సెస్ ఇస్తోందని ఆ నలుగురు మంచి అంచనాలతో ఉన్నారు.

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం...
'నాగశౌర్య','నారా రోహిత్' ,'రెజీనా' కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రానికి 'అవసరాల శ్రీనివాస్' దర్శకత్వం వహించాడు. అన్నదమ్ములు ఇద్దరు ఓకే అమ్మాయి ప్రేమించడం అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఈ చిత్రం రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఈ నెల 9న రిలీజ్ కి సిద్దంగా ఉన్న ఈ చిత్రాన్ని సాయికొర్రపాటి నిర్మించారు. 'సాయి కొర్రపాటి' ఈ మధ్యకాలంలో నిర్మించిన ఏ చిత్రం సక్సెస్ కాలేదు అందుకే ఈ 'జ్యో అచ్యుతానంద' సినిమా హిట్టవ్వడం ఈ నిర్మాతకి ఎంతో అవసరం. అదే విధంగా ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా కూడా 'రెజీనా' స్టార్ హీరోయిన్ స్టాటస్ మాత్రం రాలేదు. ఇక హీరోలుగా 'నారా రోహిత్', 'నాగశౌర్య' పరిస్థితి తెలిసిందే. ఇక దర్శకుడిగా 'అవసరాల శ్రీనివాస్' 'ఊహలు గుసగుసలాడే' తో హిట్టు కొట్టిన ఛాన్స్ లు మాత్రం రాలేదు. దీంతో ఈ ఐదుగురుకి 'జ్యో అచ్యుతానంద' మూవీ భారీ హిట్టు ఇస్తోందని పుల్ కాన్పిడెంట్ గా ఉన్నారు. వీరి ఆశలను ఈ చిత్రం ఏం చేస్తోందో చూడాలి.

11:28 - September 1, 2016

తమిళనాడు : బెజవాడలో శ్రీలక్ష్మి అనే స్టూడెంట్‌ను కాలేజీ క్లాస్‌రూంలోనే నరికేశాడో దుర్మార్గుడు...ఈ ఘటన గుర్తొచ్చిన ప్రతీసారి విద్యార్థుల్లో భయాన్ని సృష్టిస్తోంది..ప్రేమోన్మాదానికి ఇలా ఎందరో స్టూడెంట్స్‌ బలవుతున్నారు...తమిళనాడులో జరుగుతున్న ఘోరాలు వణుకుపుట్టిస్తున్నాయి..మొన్నటికి మొన్న రైల్వేస్టేషన్‌లో టెక్కీని చంపేశాడో ఉన్మాది...నేడు మరో శాడిస్టు ప్రేమించడం లేదని ఇంజనీరింగ్ విద్యార్థినిని తరగతి గదిలోనే కొట్టి చంపాడు..

కాలేజీ గదిలోనే మరో కిరాతకం...
కాలేజీలో పాఠాలు చెబుతున్నారు...అందరి స్టూడెంట్స్‌లానే ఆమె కూడా శ్రద్దగా వింటోంది....అప్పుడే ఆ గదిలోకి ఎంటర్‌ అయిన ఓ యువకుడు దుడ్డుకర్రతో ఒక్కసారిగా స్టూడెంట్‌పై దాడి చేశాడు...తలపై కొట్టడంతో కుప్పకూలింది..అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న కాలేజీలో అలజడి మొదలయింది...రక్తపు మడుగులో స్టూడెంట్‌ విలవిలలాడింది...

సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్ సోనాలి..ఇది తమిళనాడులోని కరూర్‌లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ....ఇక్కడే శివగంగై జిల్లా మానామదురై చెందిన సోనాలి మూడో సంవత్సరం సివిల్ ఇంజినీరింగ్ చదువుతోంది...రోజూలానే కాలేజీకి వచ్చింది..తరగతి గదిలో ప్రొఫెసర్ చెప్పే పాఠాలను వింటూ కూర్చుంది. ఈ సమయంలో హఠాత్తుగా లోనికి ప్రవేశించిన మాజీ స్టూడెంట్‌ ఉదయకుమార్ ఘాతుకానికి పాల్పడ్డాడు...
ఉన్మాది ఘాతుకానికి బలయిన స్టూడెంట్..
ఉన్మాదిగా మారిన ఉదయ్‌కుమార్‌ అక్కడి విద్యార్థులు తేరుకునేలోపు సోనాలిపై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు...రక్తపు మడుగులో పడి ఉన్న సోనాలిని సహచర విద్యార్థులు, కళాశాల సిబ్బంది స్థానికంగా ఉన్న సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మదురైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఉదయకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు...ఉదయకుమార్ కళాశాల నుంచి సస్పెండ్ అయినట్టు తేలుస్తోంది....

ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు..తిరస్కరించడంతో కక్షగట్టాడు..
కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న ఉదయ్‌కుమార్‌ను తిరస్కరించింది సోనాలి..దీంతో కక్ష పెంచుకున్న ఉదయ్‌ ఆమెను చంపాలని డిసైడ్‌అయి కాలేజీకి కర్రతో వచ్చాడు...అనుకున్న ఘోరానికి తలపడ్డాడు...సోనాలి తండ్రి నాలుగు నెలల క్రితం మరణించగా ఆమె తల్లి చెన్నైలో ఓ చిన్న సంస్థలో పని చేస్తూ తన కుమార్తెను చదివిస్తుంది.

 

11:26 - September 1, 2016

'జనతా గ్యారేజ్' ఓవర్సీస్ పై భారీ టార్గెట్ పెట్టుకుంది. గ్యారేజ్ తో అక్కడ భారీ కలెక్షన్లు కొట్టాలని యూనిట్ భావిస్తోంది. ఓవర్సీస్ లో బాహుబలి రికార్డ్స్ కలెక్షన్లతో పోటీ పడాలని గ్యారేజ్ టీం భావిస్తోంది. 'జనతా గ్యారేజ్' ఓవర్సీస్ టార్గెట్ ఏంటో తెలుసుకుందామా...'కొరటాల శివ' దర్శకత్వంలో రూపొందిన 'జనతా గ్యారేజ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కాంబినేషన్ పరంగా ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోను చిత్రం భారీ వసూల్ సాధిస్తోందని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగా 'జనతా గ్యారేజ్' ఓవర్సీస్ లో 'బాహుబలి' కలెక్షన్ల కు తీసిపోకుండా కలెక్ట్ చేయాలని యూనిట్ భావిస్తోంది. 'ఎన్టీఆర్' నటించిన 'టెంపర్' ఓవర్సీస్ సినిమా అక్కడ 1మిలియన్ డాలర్లు వసూల్ చేసంది. అలాగే 'నాన్నకు ప్రేమతో' సినిమా సైతం 2 మిలియన్ డాలర్లు వసూల్ చేసింది. ఈ నేపథ్యంలో 'జనతా గ్యారేజ్' తో 3 మిలియన్ డాలర్లను రాబట్టుతుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తున్నారు. ఈ అంచనాను ఈ సినిమా అవలీలగా అందుకుంటుందనే నమ్మకంతో 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ వున్నారు.

బాహుబలి..
'బాహుబలి' ఓవర్సీస్ లో ఏకంగా 30కోట్లు వసూల్ చేసింది. ఇంత రేంజ్ లో కాకపోయిన 'జనతా గ్యారేజ్'తో 20కోట్లు అయిన కొల్లగొట్టాలని 'ఎన్టీఆర్', 'కొరటాల' భావిస్తున్నారు. 'కొరటాల శివ' గత చిత్రం 'శ్రీమంతుడు' ఓవర్సీలో 15కోట్ల వరకు కలెక్ట్ చేస్తోంది. ఈ సక్సెస్ 'జనతా గ్యారేజ్' కి కలిసొస్తుందని నమ్మకంగా ఉన్నారు. అంతేకాదు సినిమా కాన్సెప్ట్ కూడా యూనివర్శల్ కావడంతో సక్సెస్ పై కాన్పిడెంట్ ఉన్నారు. మరి 'జనతా గ్యారేజ్' ఈ అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.

11:22 - September 1, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీం కుటుంబీకులపై ఎక్కుపెట్టిన పోలీసుల గురి ఇప్పుడు అనుచరులపై పడింది...నయీం సంబంధీకుల ద్వారా విషయాలు తెలుసుకున్న పోలీసులు ఇక గ్యాంగ్‌సభ్యులను అదుపులోకి తీసుకుంటున్నారు...తవ్వినకొద్దీ బయటపడుతున్న అరాచకాలకు నయీం అనుచరులే కీలకం... వారి ద్వారానే ఎన్నో ఘోరాలు..కబ్జాలు..దందాలు చేశాడు...దీంతో అనుచరులను పట్టుకుని విచారించేపనిలో పడ్డారు పోలీసులు..

లొంగిపోతున్న నయీం అనుచరులు..
గ్యాంగ్‌స్టర్ నయీం....ఎన్‌కౌంటర్‌ తర్వాత మూలాలను కనుగొనేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు వేగవంతమయ్యాయి...ఇప్పటికే నయీం కుటుంబీకులు, బంధువులపై గురిపెట్టిన సిట్‌ దాదాపు అందరినీ అదుపులోకి తీసుకుంది...ఇంకా కొందరిపై నిఘా పెట్టింది...ఇక కుటుంబీకుల వరకు పూర్తి కావడంతో గ్యాంగ్‌స్టర్ అనుచరులపై దృష్టి పెట్టింది....నయీం అనుచరులు ఎక్కడున్నారు..? ఎవరెవరున్నారు..? ఏయే హోదాలో ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? ఇలాంటి విషయాలన్నీ ఇప్పటికే కుటుంబీకుల విచారణలో తెలుసుకున్న సిట్‌ అధికారులు.

సొహ్రాబుద్దీన్‌ కేసులో శ్రీహరి మోస్ట్‌వాంటెడ్...
గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మరో కీలక అనుచరుడు బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రత్యక్షమయ్యాడు...నయీం కీలక అనుచరుడు శ్రీహరిగా గుర్తించిన పోలీసులు నాటకీయంగా అదుపులోకి తీసుకున్నారు...శ్రీహరి సొహ్రాబుద్దీన్ గుజరాత్ ఎన్కౌంటర్ కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు...నయీం ఎన్కౌంటర్ తర్వాత మాయమైన శ్రీహరి అజ్క్షాతంలో ఉండి కోర్టులో లొంగిపోయేందుకు వచ్చాడు.. శ్రీహరి లొంగుబాటుతో మరిన్ని కేసులు కొలిక్కి వచ్చే అవకాశంతో పాటు నయీం సంబంధించిన ఎన్నో విషయాలు బయటపడనున్నాయి...

నయీం న్యాయవాది అరెస్టు...
రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌లో భువనగిరికి చెందిన న్యాయవాది ఎంఏ రహీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..అక్రమ భూదందాలు, యాన్స్‌ యాక్ట్‌ కింద రహీంపై భువనగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది...నయీంకు రహీం చట్టపరమైన సేవలందించేవాడు...రహీంపై అక్రమ ఆయుధాల కేసుతో పాటు 120బి, 386, 384 సెక్షన్ల కింద కేసులున్నాయి...ఇక నయీంకు కీలకమైన వ్యక్తి నల్లగొండ జిల్లా వలిగొండ ఎంపీపీ శ్రీరాములును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..శ్రీరాములు నయీంతో కలిసి ఎన్నో దందాలు చేశాడని తేలింది...శ్రీరాములు నయీం అనుచరుడు పాశం శ్రీనుకు మామ...ఇప్పటికే సుమారు 50 మంది నయీం అనుచరులను సిట్ బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. మరికొందరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. 

11:20 - September 1, 2016

విజయవాడ : నగరంలో విషాదం చోటు చేసుకుంది. మురుగు కాల్వలో పడి ఆరేళ్ళ బాలుడు శ్రీకాంత్ గల్లంతయ్యాడు. ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.  చేపలు పట్టేందుకు కాల్వ వద్దకు శ్రీకాంత్ వెళ్ళినట్లు స్నేహితుతుడు తెలిపారు. దీంతో మురుగు కాల్వలో ప్రొక్లెయిన్లతో పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కొటుకువచ్చిన తూడు,చెత్తలతో కాల్వ నిండిపోవటంతో పోలీసులు ప్రొక్లెయిన్నలతో చెత్తను తొలగిస్తూ బాలుడికోసం గాలిస్తున్నారు. ఎంతకీ శ్రీకాంత్ ఆచూకీ లభించకపోవటంతో శ్రీకాంత్  భోరున విలపిస్తోంది. కాగా నగరంలోని పాత రాజరాజేశ్వరి పేటలో శ్రీకాంత్ కుటుంబం నివాసముంటోంది. పండ్ల వ్యాపారం చేసుకునేందుకు తాను బైటకు వెళితే ఇంటి బాధ్యతను శ్రీకాంతే చూసుకునేవాడని తల్లి పేర్కొంది. వయస్సులో చిన్నవాడైనా మతిస్థిమితం లేని సోదరి బాధ్యతను కూడా తాను చూసుకేనేవాడనీ ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. 

ఏపీలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ ప్రారంభం..

గుంటూరు : యనమల అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. పట్టణాభివృద్ధి, పాలన సంస్కరణలపై చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి ఏపీ సీఎస్ టక్కర్, ఆర్థిక శాఖాధికారులు హాజరయ్యారు. 

పట్టుబడ్డ ఇద్దరు ఉగ్రవాదులు..

జమ్మూ కాశ్మీర్ : పటాన్ ప్రాంతంలో భద్రతా దళాలు నిర్వహించిన ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరి వద్ద రెండు ఏకే 47, గ్రెనేడ్ లాంచర్స్, గ్రేనేడ్స్ లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. 

మురుగు కాల్వలో పడిన ఆరేళ్ల బాలుడు..

విజయవాడ : జిల్లాలో విషాదం నెలకొంది. ఆరేళ్ల బాలుడు శ్రీకాంత్ మురుగు కాల్వలో పడి గల్లంతయ్యాడు. ఘటనాస్థలికి అధికారులు చేరుకున్నారు. కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

11:00 - September 1, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీం కుటుంబీకులపై ఎక్కుపెట్టిన పోలీసుల గురి ఇప్పుడు అనుచరులపై పడింది...నయీం సంబంధీకుల ద్వారా విషయాలు తెలుసుకున్న పోలీసులు ఇక గ్యాంగ్‌సభ్యులను అదుపులోకి తీసుకుంటున్నారు...తవ్వినకొద్దీ బయటపడుతున్న అరాచకాలకు నయీం అనుచరులే కీలకం... వారి ద్వారానే ఎన్నో ఘోరాలు..కబ్జాలు..దందాలు చేశాడు...దీంతో అనుచరులను పట్టుకుని విచారించేపనిలో పడ్డారు పోలీసులు..

లొంగిపోతున్న నయీం అనుచరులు..
గ్యాంగ్‌స్టర్ నయీం....ఎన్‌కౌంటర్‌ తర్వాత మూలాలను కనుగొనేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు వేగవంతమయ్యాయి...ఇప్పటికే నయీం కుటుంబీకులు, బంధువులపై గురిపెట్టిన సిట్‌ దాదాపు అందరినీ అదుపులోకి తీసుకుంది...ఇంకా కొందరిపై నిఘా పెట్టింది...ఇక కుటుంబీకుల వరకు పూర్తి కావడంతో గ్యాంగ్‌స్టర్ అనుచరులపై దృష్టి పెట్టింది....నయీం అనుచరులు ఎక్కడున్నారు..? ఎవరెవరున్నారు..? ఏయే హోదాలో ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? ఇలాంటి విషయాలన్నీ ఇప్పటికే కుటుంబీకుల విచారణలో తెలుసుకున్న సిట్‌ అధికారులు. 

సొహ్రాబుద్దీన్‌ కేసులో శ్రీహరి మోస్ట్‌వాంటెడ్...
గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మరో కీలక అనుచరుడు బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రత్యక్షమయ్యాడు...నయీం కీలక అనుచరుడు శ్రీహరిగా గుర్తించిన పోలీసులు నాటకీయంగా అదుపులోకి తీసుకున్నారు...శ్రీహరి సొహ్రాబుద్దీన్ గుజరాత్ ఎన్కౌంటర్ కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు...నయీం ఎన్కౌంటర్ తర్వాత మాయమైన శ్రీహరి అజ్క్షాతంలో ఉండి కోర్టులో లొంగిపోయేందుకు వచ్చాడు.. శ్రీహరి లొంగుబాటుతో మరిన్ని కేసులు కొలిక్కి వచ్చే అవకాశంతో పాటు నయీం సంబంధించిన ఎన్నో విషయాలు బయటపడనున్నాయి...

నయీం న్యాయవాది అరెస్టు...
రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌లో భువనగిరికి చెందిన న్యాయవాది ఎంఏ రహీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..అక్రమ భూదందాలు, యాన్స్‌ యాక్ట్‌ కింద రహీంపై భువనగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది...నయీంకు రహీం చట్టపరమైన సేవలందించేవాడు...రహీంపై అక్రమ ఆయుధాల కేసుతో పాటు 120బి, 386, 384 సెక్షన్ల కింద కేసులున్నాయి...ఇక నయీంకు కీలకమైన వ్యక్తి నల్లగొండ జిల్లా వలిగొండ ఎంపీపీ శ్రీరాములును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..శ్రీరాములు నయీంతో కలిసి ఎన్నో దందాలు చేశాడని తేలింది...శ్రీరాములు నయీం అనుచరుడు పాశం శ్రీనుకు మామ...ఇప్పటికే సుమారు 50 మంది నయీం అనుచరులను సిట్ బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. మరికొందరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. 

13 మంది భారతీయులకు 'జికా' వైరస్..

ఢిల్లీ : సింగపూర్ లో నివాసం ఉంటున్న 13 మంది భారతీయులకు 'జికా' వైరస్ సోకింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. 

ప్రకాశం బ్యారేజీ నుండి నీటి విడుదల..

తూర్పుగోదావరి : ప్రకాశం బ్యారేజీ నుండి నీటి విడుదల కొనసాగుతోంది. 14 గేట్లు ఎత్తివేసి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. 8,2061 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 18,131 క్యూసెక్కులు ఉండగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 11.2 అడుగులుగా ఉంది. 

ఇరిగేషన్ శాఖాధికారులతో సీఎం బాబు సమావేశం..

అనంతపురం : ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఇరిగేషన్ శాఖాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. 

10:54 - September 1, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక సచివాలయం నుంచి పాలనకు మార్గం సుగమవుతోంది. ఇప్పటికే 13మంది మంత్రులు తమ కార్యాలయాలను ప్రారంభించారు. మంత్రులతో పాటు శాఖల కార్యదర్శులు కూడా కొత్త సచివాలయంలోకి అడుగుపెడుతున్నారు..

ఏపీ తాత్కాలిక సచివాలయం నుంచి పాలన ప్రారంభమయ్యేనా?
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నుంచి పాలన ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక అటు ఉద్యోగులు, ఇటు ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.. జాన్‌ 27 నుంచి సచివాలయం నుంచే పాలన ప్రారంభమని.. హడావిడిగా రెండు శాఖలను ప్రారంభించిన ప్రభుత్వం, ఆగస్ట్ నెల ముగిసినా పలుశాఖలు పనులు ప్రారంభించలేదు.

జూన్ నెలఖారు నుంచి వెలగపూడి నుంచే పాలనఅన్న చంద్రబాబు..
జూన్‌ నెలాఖరు నుంచే పాలన ప్రారంభించాలని.. లేకపోతే ఉద్యోగులు అమరావతికి తరలిరారన్న ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో నెలకొంది. దీంతో ఉద్యోగులందరూ జూన్‌ చివరినాటికి అమరావతికి తరలిరావాలని హడావుడిగా ఉత్తర్వులు జారీచేశారు. అయితే మొదటగా తాత్కాలిక సచివాలయంలో కార్యాలయాలు ప్రారంభించిన ఇద్దరు మంత్రులు అయ్యన్నపాత్రుడు, మృణాళిని శాఖలకు సంబంధించిన ఒక్క ఉద్యోగి కూడా సచివాలయంలో విధులు నిర్వర్తించడం లేదు.

పూర్తి పాలన ఎప్పుడు అనే విషయంపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
ప్రస్తుతం మంత్రులందరూ సెక్రటేరియట్‌లో కార్యాలయాలు ప్రారంభిస్తున్నా.. పూర్తి పాలన ఎప్పుడు ప్రారంభిస్తారో అనే క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. విజయవాడ , గుంటూరుకు తరలి వచ్చిన ఉద్యోగులందరూ వెలగపూడిలో పాలన ఎప్పుడు ప్రారంభిస్తారో అని వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.

 

10:51 - September 1, 2016

హైదరాబాద్ : కుంభవృష్టి హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. పదహారేళ్ల తర్వాత జంటనగరాల్లో భారీ వర్షపాతం నమోదయ్యింది. దీంతో నగరం తడిచి ముద్దయ్యింది.

2000 సంవత్సరం తర్వాత భారీ వర్షం
కుండపోత వర్షం భాగ్యనగరాన్ని ముంచెత్తింది. రోడ్లన్నీ తటాకాలుగా మారాయి. నగరంలోని కొన్ని చోట్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యింది. 2000 సంవత్సరం తర్వాత నగరంలో ఇంత భారీ వర్షం రికార్డు కావడం ఇదే మొదటిసారి. కొన్ని ప్రాంతాల్లో వంద మిల్లీమీటర్లకు మించి వర్షం కురిసింది. అంబర్‌పేటలో అత్యధికంగా 120 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దీంతో ఈ ప్రాంతమంతా జలమయం అయ్యింది.

ఖైరతాబాద్‌లో 79 మి.మీ. అమీర్‌పేటలో 71 మిం.మీ.
సైదాబాద్‌, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్‌, ఖైరతాబాద్‌లో కూడా అతి భారీ వర్షం కురిసింది. సైదాబాద్‌, మల్కాజ్‌గిరిలో 92 మిల్లీ మీటర్ల వంతున వర్షపాతం నమోదయ్యింది. కుత్బుల్లాపూర్‌లో 81 మిల్లీ మీటర్లు, ఖైరతాబాద్‌లో 79 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అమీర్‌పేటలో 71 మిల్లీ మీటర్లు, బహదూర్‌పురాలో 66, కీసరలో 64 మిల్లీ మీటర్లు, హిమాయత్‌నగర్‌, చార్‌మినార్‌ ప్రాంతాల్లో 61 మిల్లీ మీటర్ల వంతున వర్షపాతం నమోదయ్యింది. మరోవైపు భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌ ప్రమాద స్థాయికి చేరుకోవడంతో గేట్లు తెరిచి 150 క్యూసెక్కుల నీటిని దిగవుకు విడుదల చేశారు.

కుంభవృష్టితో జంటనగరాలు అతలాకుతలం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో వర్షాలు తెలుగురాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. 15 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షంతో పలు గ్రామాలు నీటమునిగాయి.. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి..

రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం
రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. తాండూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో మహబూబ్‌నగర్‌, సంగారెడ్డిలకు రాకపోకలు నిలిచిపోయాయి.. మంచనపల్లి వాగు ఉప్పొంగడంతో చుట్టుపక్కల గ్రామాలు నీటమునిగాయి..

నల్లగొండ జిల్లాలో విస్తారంగా వర్షాలు
నల్లగొండ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.. పులిచింతల ప్రాజెక్టు నీటిమట్టం 12 టీఎంసీలకు చేరుకుంది... దీంతో ముంపు గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.. నెమలిపురి, వెల్లటూరు, అడ్డూరు ముంపు గ్రామాల్లోకికూడా వరద నీరు చేరింది. రెండురోజులుగా విద్యుత్‌లేక ఈ గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి.. జిల్లాలో పరిస్థితిని మంత్రి జగదీశ్‌ రెడ్డి సమీక్షించారు..

కరీంనగర్‌ జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు
కరీంనగర్‌ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. కోతిరాంపూర్‌లో ఆటోగ్యారేజీలోకి భారీగా వరదనీరు చేరడంతో కార్లు నీటిలో మునిగిపోయాయి.. సిరిసిల్లలో వర్షాలకు హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై చెట్టు కూలిపోయింది.. ఈ సమయంలో అక్కడ వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.. చెట్టు రోడ్డుపై పడిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది

వరంగల్‌ లో భారీ వర్షం
వరంగల్‌ లో భారీ వర్షం కురిసింది. వరదనీరు చేరడంతో రోడ్లు చెరువుల్లా మారాయి.. వ‌రంగ‌ల్ రైల్వే బ్రిడ్జి దగ్గర వర్షపు నీరు నిల‌వ‌డంతో రాక‌పోక‌ల‌కు ఇబ్బంది ఏర్పడింది..

మెదక్‌ జిల్లాలో రెండు రోజులనుంచి వర్షాలు
మెదక్‌ జిల్లాలో రెండు రోజులనుంచి వర్షాలు కురుస్తున్నాయి.. సిద్దిపేట్‌ నియోజకవర్గంలో వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది.. వర్షాలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

నాలుగు రోజులుగా గుంటూరు జిల్లాలో వర్షాలు
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంటూరు జిల్లా.. పిడుగురాళ్లలో వాగులు.. కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. మాచవరం..పిడుగురాళ్ల మండలాల్లో పలు గ్రామాలు చిత్తడిగా మారాయి. దాచేపల్లిలో ఇళ్లలోకి నీరు చేరింది. దుకాణాలలో నీరు చేరడంతో వ్యాపారులు భారీగా నష్టపోయారు.. గ్రామాల్లో పలు పంటలు నీటమునిగాయి.. కారెంపూడిలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాగులు పొంగిపొర్లడంతో ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకుపోయాయి... వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

తిరుమల, తిరుపతిలోనూ కుండపోత వర్షం
తిరుమల, తిరుపతిలోనూ కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపిలేకుండా కురిసిన కుండపోత వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయం ముందు భారీగా చేరిన వర్షపు నీటిని అగ్నిమాపక సిబ్బంది తోడేశారు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా.. భక్తులు బయటకే రాకపోవడంతో.. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా కనిపించింది. 

10:42 - September 1, 2016

ఢిల్లీ : ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రజత విజేత సింధుకు ఓ జ్ఞాపికతో పాటు...2 కోట్ల రూపాయల చెక్కును అందచేశారు. రెండురోజుల క్రితమే దేశఅత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అందుకొన్న సింధు...ఈనెలలోనే జరిగే జపాన్ ఓపెన్ మాస్టర్స్ టోర్నీలో పాల్గొనటానికి సిద్ధం కానుంది.

10:38 - September 1, 2016

హైదరాబాద్ : కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే హిట్ సినిమాల దర్శకుడిగా పేరున్న కొరటాల శివ..కొన్ని ప్లాప్ లు వచ్చినా ఏమాత్రం తగ్గని ఎన్టీఆర్ ..మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వంటి బిగ్గెస్ట్ బినేషన్ పరంగా ఈ సినిమాపై అటు సినీ వర్గంలోనూ..ఇటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు వున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ చిత్రం భారీ వసూల్ సాధిస్తుందని భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా జనతా గ్యారేజ్ ఓవర్సీస్ లో బాహుబలి కలెక్షన్ల కు తీసిపోకుండా కలెక్ట్ చేయాలని యూనిట్ భావిస్తోంది. జనతా గ్యారేజ్ సినిమా టిక్కెట్లపై సినిమా కథాంశాన్ని తెలిపేవిధంగా టిక్కెట్లపై ముద్రించారు. ఈ సినిమా విడుదల అవుతున్న విడుదల అవుతున్న థియేటర్ల వద్ద అభిమానులు మొక్కలన్ని పంచుతున్నారు.

ధియేటర్ల వద్ద అభిమానుల సందడి..
జనతా గ్యారేజ్ విడుదల అయిన థియేటర్ల వద్ద అభిమానుల సందడి చేస్తున్నారు. సినిమా ఆడియో ఫంక్షన్ లో కటౌట్లకు పాలభిషేకం చేయవద్దనీ..మూగజీవాలను బలి ఇవ్వవద్దని ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అటువంటి కార్యక్రమాలను ఆపివేశామని అభిమానులు తెలిపారు. భారీ అంచనాలతో విడుదల అవుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందనీ..భారీ కలెక్షన్లను వసూలు చేస్తుందని అభిమానులు ధీమాతో వున్నారు. టిక్కెట్లకోసం రాత్రి నుండే క్యూలైన్లలో నిలిబడిన సందర్భాలు కూడా వున్నాయి. ఏది ఏమైనా అభిమానులు సినిమా చూసేందుకు తీవ్ర ఉద్వేగంతో ఎదురు చూస్తున్నారు. 

రెయిన్ గన్ తో నూతన శకం - చంద్రబాబు..

అనంతపురం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురంలో పర్యటిస్తున్నారు. వేరు శనగ పంటను పరిరక్షించేందుకు చేపట్టిన రెయిన్ గన్ ఆపరేషన్ పై అధికారులతో బాబు సమావేశమయ్యారు. రెయిన్ గన్ టెక్నాలజీతో వ్యవసాయం రంగంలో నూతన శకం ఆరంభించడం జరిగిందని బాబు తెలిపారు. వర్షాలు లేకున్నా పంటలను కాపాడుకోవచ్చనే ధీమా రైతుల్లో వచ్చిందని, ఆరు రోజుల్లో పరిస్థితి అదుపులోకి తేవడం జరిగిందన్నారు. నీళ్లు లేక పంట ఎండిపోవడమనేది ఏపీలో జరగకూడదని తెలిపారు. 

10:13 - September 1, 2016

ప్రతి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు ఉరుకుల పరుగులతోనే సమయం గడిచిపోతుంది. అలసి..సొలసి..ఇంటికి వచ్చి రాత్రి పడుకొనే సయమంలో 'బెడ్' కీలక పాత్ర పోషిస్తుంటుంది. బెడ్ కరెక్టుగా లేకపోతే నిద్ర కూడా సరిగ్గా పట్టదు. దీనితో మరుసటి రోజు నిద్రతో ఒకవైపు..అలసటతో మరోవైపు అవస్థలు పడుతుంటారు. అందుకని చక్కటి బెడ్ ఇందుకు పరిష్కారం చూపుతుంటుంది. ఏవో మార్కెట్లో దొరికే బెడ్స్ తీసుకుంటూ అవస్థలు పడుతుంటారు. చక్కటి బెడ్ తో మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగపడుతుంది. అన్ని సమస్యలు మరిచిపోయి హాయిగా కునుకు తీయాలంటే మెత్తని పరుపు , అందుకు తగిన బెడ్ ఉండాలి.
పరుపు కొనడానికి వెళ్ళే ముందు ఒకసారి పరిశోధన చేసుకోవాలి. ఫలితంగా మీరు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ప్రాథమికంగా ఓ అంచనాలకు రావొచ్చు. మ్యాట్రసెస్‌ బ్రాండ్స్‌ ఎప్పటికప్పుడు కొత్తవి అందుబాటులోకి వస్తున్నాయి. వాతావరణ మార్పులకు అనుగుణంగా వాటి మెత్తదనంతో పాటు మారేటువంటి లక్షణాలను కలిగి ఉంటున్నాయి.
దూది పరుపులు, పీచు పరుపుల స్థానానే ఇప్పుడు మార్కెట్‌లో టెక్నాలజీ పరుపులు , రకరకాల బెడ్ షీట్లు లభ్యమౌతున్నాయి.
బెడ్ స్కిన్ పై కూడా ప్రభావం చూపిస్తుంటుంది. నిద్రపోయే సమయంలో చర్మం నుండి కొన్ని మృతకణాలు బయటకు వెళుతుంటాయి. ఫలితంగా బెడ్ మీద బ్యాక్టిరీయా, ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంది.
విటమిన్ ఈ, ఆలోయి వెరా తదితర రకాలతో కూడిన బెడ్స్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. అంతేగాకుండా మృతకణాలు పెరిగిపోకుండా అరికట్టే బెడ్ షీట్స్ కూడా మార్కెట్ లో లభ్యమౌతున్నాయి.
పరుపు కొనే సమయంలో వెన్ను భాగానికి సరైన ఆధారాన్ని అందిస్తుందా ? లేదా ? అనేది చెక్ చేసుకోవాలి. ముందుగా దానిపై వెల్లకిలా పడుకోవాలి. అప్పుడు నడుం వెనుకగా మీ అరచేతిని పోనివ్వాలి..మీ చేయి సులభంగా వెళ్తుంటే అది మరీ మెత్తగా ఉన్నట్లు. అలా లేదంటే మరీ గట్టిగా ఉన్నట్లు అర్థం.
నడుంనొప్పితో బాధపడుతున్న వారికి ఈ రెండు తరహాలు పనికిరావు. ఈ రెండు రకాలకు మధ్యస్థంగా ఉండే పరుపును ఎంపిక చేసుకోవాలి.
ప్రతి పది సంవత్సరాలకొకసారి పరుపును మార్చేయాలి.
అప్పటికే చాలా రకాల పరుపులు పలుచగా తయారై ఉండలు కట్టి పరుపు మీద పడుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది. 

హైదరాబాద్ లో ఇవాళ కూడా భారీ వర్షం..

హైదరాబాద్ : నగరంలో ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పురాతన భవనాలు గుర్తించి చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా జీహెచ్ఎంసీ పలు చర్యలు తీసుకొంటోంది. 

భూప్రకంపనల కలకలం..

న్యూజిల్యాండ్‌ : ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. నేపాల్..జపాన్ ..భారత్ ఇలా పలు దేశాలలో ఇటీవలి కాలంలో భూప్రకంపలు తరచూ సంభవించటం ఆందోళన కలిస్తోంది. తాజాగా న్యూజిలాంట్ లోని గిస్బోర్న్ ప్రాంతంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6గా నమోదు అయ్యింది. అయితే ప్రస్తుతం ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

09:37 - September 1, 2016

జూనియర్ ఎన్టీఆర్..కొరటాల శివ కాంబినేషన్ లో నిత్యా మీనన్, సమంత, మోహన్ లాల్ నటించిన 'జనతా గ్యారేజ్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై అటు చిత్ర యూనిట్, ఇటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. చిత్రం విజయం సాధిస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. 'టెంపర్'..'నాన్నకు ప్రేమతో' వంటి సినిమాలతో 'ఎన్టీఆర్' మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. 'శ్రీమంతుడు' చిత్రం ద్వారా తానేమిటో 'కొరటాల' నిరూపించారు. జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న 'మోహన్ లాల్' ఈ చిత్రంలో నటించడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అసలు చిత్ర కథ ఏంటీ ? అనేది తెలుసుకోవాలంటే చదవండి...

కథ...
హైదరాబాద్ లో 'జనతా గ్యారేజ్' (ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడుతాయి) పేరిట ఓ గ్యారేజ్ ఉంటుంది. దీనిని సత్యం (మోహన్ లాల్), తమ్ముడు (రెహమాన్) నడుపుతుంటారు. తమ్ముడు (రెహమాన్) కొడుకు ఆనంద్ (ఎన్టీఆర్) ను 'జనతా గ్యారేజ్' కి దూరంగా పెంచడానికి మేనమామ (సురేష్)కి ఇచ్చి ముంబై పంపించేస్తాడు. ఎందుకంటే గ్యారేజ్ లో సమస్య అంటూ ఎవరొచ్చినా దానికి పరిష్కారం చూపిస్తుంటారు. దీనితో శత్రువులు పెరుగుతారు. ఆనంద్ కు హైదరాబాద్ లో ఓ కుటుంబం ఉందనే విషయం తెలియకుండా (సురేష్) పెంచుతాడు. ఇక ఆనంద్ (ఎన్టీఆర్) విషయానికి వస్తే ఇతనికి మొక్కలంటే పిచ్చి ప్రేమ. మొక్కకు హానీ జరిగితే ఊరుకోడు. దీనితో ఇతనికి కూడా ముంబైలో శత్రువులు పెరుగుతారు. ఓసారి హైదరాబాద్ కు ఆనంద్ (ఎన్టీఆర్) వస్తాడు. ఇక్కడకు వచ్చాక సత్యం (మోహన్ లాల్) ను కలుస్తాడు. సత్యం (మోహన్ లాల్) తన పెదనాన్న అని ఆనంద్ (ఎన్టీఆర్) కు తెలిసిందా ? అసలు జనతా గ్యారేజ్ ఎందుకు వచ్చాడు ? అలాంటి అవసరం ఏమొచ్చింది ? అనేది కథ. ఈ చిత్రంలో మోహన్ లాల్ పాత్ర కీలకం. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ తో కనిపించాడు. మరి ప్రేక్షకుల అభిమానం పొందిందా ? లేదా ? అనేది తెలుసుకోవాలంటే టెన్ టివి ఫర్ట్ ఫెక్ట్ రివ్యూలో చూడండి. 

సమావేశం కానున్న ఏపీ పీసీసీ కార్యవర్గం..

విజయవాడ : నగరంలో నేడు పీసీసీ కార్యవర్గ సమావేశం కానుంది. ప్రత్యేక హోదా, పోలవరం, తాగు, సాగునీటి సమస్యలపై నేతలు చర్చించనున్నట్లు సమచారం.

దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు..

నల్లగొండ : దామరచర్లలో స్థానికంగా కిరాణా దుకాణంలో నకిలీ నోట్లు మారుస్తుండగా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా ఏపీలోని గుంటూరు జిల్లా జంగులకుంటకు చెందినవారు. వీరి వద్ద నుంచి రూ. 18 విలువైన నకిలీనోట్లు, ముద్రణ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

స్టీల్ ప్లాంట్ వద్ద కార్మిక సంఘాల ధర్నా...

విశాఖపట్టణం : స్టీల్ ప్లాంట్ లో గేట్ మీటింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. మైక్, ఇతర సామాగ్రిని పోలీసులు తీసుకెళ్లారు. సమావేశానికి అనుమతినిచ్చి అడ్డుకోవడాన్ని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. 

ఖమ్మంలో భారీగా ఎస్ఐల బదిలీలు..

ఖమ్మం : జిల్లాలో భారీగా ఎస్ఐలు బదిలీ అయ్యారు. 58మంది ఎస్ఐల ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐ లకు పోస్టు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

గుర్ గావ్ లో మళ్లీ భారీ వర్షం..

గుర్ గావ్ : మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీనితో జనజీవనం స్తంభించింది. రహదారులపై ప్రయాణించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాల లైట్స్ వేసుకుని మెల్లిగా వెళ్లాలని గుర్ గావ్ పోలీసులు సూచిస్తున్నారు. 

నకిలీ కారం పొడి తయారీ..

విజయవాడ : పొలిటికల్ కేపిటల్ విజయవాడ కేంద్రంగా నకిలీ కారం పొడి తయారీ వెలుగు చూసింది. నగరంలోని కొత్తూరు తాడేపల్లి రోడ్ లోని నీలిమ ఎంటర్ ప్రైజెస్ పేరిట ఏర్పాటైన కర్మాగారంలో నకిలీ కారం పొడి తయారీ యథేచ్ఛగా సాగుతోంది. స్థానికుల సమచారాంతో దాడి చేసిన పోలీసులకు నకిలీలతో తయారు చేసిన కారం, కంది, కొత్తిమీర, పుదీనా పొడులు భారీ ఎత్తున పట్టుబడ్డాయి. దీంతో కంపెనీ యజమాని వనం జనార్దన్ తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

రెండో రోజు సిరిసిల్ల బంద్..

కరీంనగర్ : రెండో రోజు సిరిసిల్ల బంద్ కొనసాగుతోంది. సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ తో బంద్ జరుగుతోంది. వేముల వాడ డిపో ఎదుట న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు బస్సులను అడ్డుకున్నారు. పలువురు జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి కోనరావుపేట పీఎస్ కు తరలించారు. 

నేడి నుండి ధూల్ పేట పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్‌: గణేష్‌ విగ్రహాల కొనుగోలు వూపందుకున్న సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ శాఖ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. సెప్టెంబరు1 నుంచి 6 వరకు ధూల్‌పేట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నామని అదనపు పోలీస్‌ కమిషనర్‌ జితేందర్‌ తెలిపారు.

నేడు కడపకు సీఎం చంద్రబాబు.

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నేడు కడప జిల్లాకు వెళ్లనున్నారు. బీడువారిన పంటల పరిశీలన కోసం చంద్రబాబు వెళుతున్నారు. కడప జిల్లాలోని రాయచోటి మండలం మాధవరంలో ఎండుతున్న వేరుశనగ పంటలను చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతపురం, చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నిన్న రాత్రికి విజయవాడ చేరుకున్నారు. 

నేడి నుండి డిగ్రీ, పీజీ కళాశాలల బంద్..

హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణలో ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌ పాటించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. ఈ బంద్‌ను 3 రోజుల పాటు కొనసాగిస్తామని వారు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వానికి తెలిపినా మా డిమాండ్‌‌ను పట్టించుకోవడం లేదని వారు తెలుపుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాకపోవడం వల్ల సిబ్బందికి జీతాలు చెల్లించలేకున్నామని వారు తెలుపుతున్నారు. దీని వల్ల మరోవైపు విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని కాలేజీ యాజమాన్యాలు తెలుపుతున్నాయి.

వెలగపూడిలో నేడు తొలి కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

విజయవాడ : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో నేడు కీలక సమావేశం జరగనుంది. తొలి కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. ఆరుగురు మంత్రులు పాల్గొంటున్న ఈ సబ్ కమిటీ భేటీకి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షత వహించనున్నారు. 

నేడూ వర్షాలు..

హైదరాబాద్ : పశ్చిమ బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాను ఆనుకుని స్థిరంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో గురువారం కూడా అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

ధూల్ పేట లో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ : వినాయక చవితి పండుగ సమీపిస్తున్న సందర్భంలో ధూల్ పేట పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణేష్ విగ్రహాల కొనుగోలుకు ధూల్ పేటకు ప్రజలు వస్తుంటారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుండి 6వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. 

నేడు ఢిల్లీకి మంత్రి కడియం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి జవేదకర్ తో సమావేశం కానున్నారు. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ గురించి ఆయన హోం శాఖ అధికారులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.  

'బైబిల్'పట్టనున్న ప్రకాశ్ రాజ్?!..

తమిళనాడు : విలక్షణమైన నటనకు ప్రతిరూపం ప్రకాశ్‌రాజ్‌. ఎలాంటి పాత్ర ఇచ్చినా.. అందుకు కొత్తరూపాన్ని తీసుకురావడం ఆయన ప్రత్యేకత. ప్రస్తుతం ఆయన నూతన దర్శకుడు గౌతం రామచంద్రన్‌ రూపొందిస్తున్న చిత్రంలో క్రైస్తవ మతబోధకుడిగా నటిస్తున్నారు. ఇందులో నివిన్‌ పాలి, నట్టి, శ్రద్ధాదాస్‌, లక్ష్మీప్రియ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. ప్రకాశ్‌రాజ్‌కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. 

పాలి'ట్రిక్స్'లోకి నయా హీరోయిన్..

హైదరాబాద్ : రాజకీయాలకు, సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. రెండూ పబ్లిక్ తో సంబంధమున్నవే. సినిమా ఫీల్డ్ గ్లామర్ తో ముడిపడి ఉంది. అయితే ... రాజకీయరంగానికి పబ్లిక్ టచ్ ఎక్కువ ఉంటుంది. అందుకే... సినిమాల్లోంచి పాలిటిక్స్ లోకి వెళ్లినవారూ, వెళ్లాలనుకుంటున్న వారూ చాలామందే ఉన్నారు. టిన్సెల్ వరల్డ్ నుంచి లేటెస్ట్ గా మరో హీరోయిన్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్యొచ్చని తెలుస్తోంది. 

08:20 - September 1, 2016

నెల్లూరు : బ్రెయిన్ డెడ్‌ అయిన డి. విజయభాస్కర్ అనే వ్యక్తి అవయవాలను నెల్లూరు నారాయణ హాస్పిటల్స్ వైద్యులు సేకరించారు. సేకరించిన అవయవాలలో గుండెను చెన్నైలోని ఫోతీస్ హాస్పిటల్‌కు... లివర్‌ను విశాఖపట్టణంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు.  

08:14 - September 1, 2016

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ .. కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విచారిస్తామని అవినీతి నిరోధక శాఖ అధికారులు మోమోలో ప్రస్తావించారు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈ కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేసి సెప్టెంబర్‌ 29 నాటికి నివేదిక అందజేస్తామని తెలిపారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్‌ 29న విచారణకు హాజరకావాలని రేవంత్‌రెడ్డి, ఉదయసింహ, సెబాస్టియన్లకు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో శ్రీరాములు (టీడీపీ నేత), కరణం ధర్మశ్రీ (వైసీపీ నేత) లక్ష్మణరావు (మాజీ ఎమ్మెల్సీ,సీఐటీయూ నేత )పాల్గొన్నారు. ఈ అంశంపై వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి..

08:09 - September 1, 2016

రేపు దేశవ్యాప్త సమ్మె జరగబోతోంది. ఉద్యోగ కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ సార్వత్రిక సమ్మెకు విభిన్న వర్గాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఫ్యాఫ్టో ఎఫ్ఏఎఫ్ టీవో కూడా సెప్టెంబర్ 2 సమ్మెకు మద్దతు ప్రకటించింది. ఇవాళ, రేపు ర్యాలీలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 2 సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాలు ర్యాలీలు నిర్వహించడానికి కారణం ఏమిటి? 2004 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఎదురవుతున్న కష్టాలేమిటి? విద్యారంగంలో జరుగుతున్న పరిణామాలు ఉపాధ్యాయుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఫ్యాఫ్టో చైర్మన్, యుటిఎఫ్ నేత పి. బాబురెడ్డి 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోన క్లిక్ చేయండి..మరింత సమచారం తెలుసుకోండి..

08:03 - September 1, 2016

ఢిల్లీ : సెప్టెంబర్ 2 సమ్మె హీట్ పెరుగుతోంది. 15 కోట్ల మందికి పైగా సమ్మెలో పాల్గొంటారన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమవుతోంది. కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లను అంగీకరించినట్టు కేంద్ర మంత్రులు చెబుతుండగా, కేంద్ర మోసపూరితంగా వ్యవహరిస్తోందంటున్న కార్మిక సంఘాలు వెనక్కి తగ్గేది లేదంటున్నాయి. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి.

తగ్గిపోతున్న పర్మినెంట్ ఉద్యోగాలు..పెరుగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగాలు
ఓ వైపు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కుదించుకుపోతున్నాయి. ఉద్యోగమో రామచంద్రా అంటూ ఇప్పటికే 12 కోట్ల మంది నిరుద్యోగులు ఆక్రందిస్తున్నారు. మరోవైపు కార్మిక చట్టాలలో చేస్తున్న మార్పులు ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడిపోతుందో అంతుబట్టని పరిస్థితిని సృష్టిస్తున్నాయి. అన్నిరంగాలలో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతూ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. స్టీల్ పరిశ్రమలో 75శాతం మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. పెట్రోలియం గ్యాస్ రంగంలో 60శాతం, విద్యుత్ రంగంలో 55శాతం మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. ప్లాంటేషన్ రంగంలో 50శాతం మంది, కోల్ మైన్స్ లో 45శాతం మంది కాంట్రాక్ట్ కార్మికులుగా బతుకుబండిని లాగిస్తున్నారు. వాటర్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో ఒకప్పుడు లక్ష 7వేల మంది పర్మినెంట్ ఉద్యోగులుండగా ఇప్పుడు వారి సంఖ్య 65వేలకు పడిపోయింది. రేపటి పౌరులను తయారుచేసే విద్యాలయాలలోనూ ఇదే దుస్థితి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ టీచర్లను, ప్రొఫెసర్లను నియమిస్తున్న దౌర్భాగ్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో సుమారు 24 లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుంటే, ప్రభుత్వ విద్యాసంస్థల్లో 10 లక్షల మంది వున్నారు.

2004 సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ ను ఎత్తివేత
అన్ని రంగాలలోనూ కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రవేశపెడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. సామాజిక భద్రత పథకాలకు ఎగనామం పెడుతున్నాయి. పెన్షన్ లకు చెల్లుచీటీ చెబుతున్నాయి. సరిగ్గా పుష్కర కాలం క్రితమే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలులోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ ను ఎత్తేసి, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను అమలు చేస్తున్నాయి. ఉద్యోగుల వేతనం, కరువు భత్యం నుంచి పది శాతం చొప్పున ప్రతి నెలా వసూలు చేసి, ఆ డబ్బులను తీసుకెళ్లి, స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత స్టాక్ మార్కెట్ కదలికల మీదనే వీరికొచ్చే పెన్షన్ ఆధారపడి వుంటుంది.

ప్రభుత్వ పెన్షన్ లేని ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంఖ్య 46 లక్షలు
కొత్త విధానం కారణంగా ఇప్పటికే మన దేశంలో ప్రభుత్వ పెన్షన్ లేని ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంఖ్య 46 లక్షలు దాటింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీరి సంఖ్య దాదాపు 3 లక్షలు. తెలంగాణలో లక్షా 15వేల మంది, ఆంధ్రప్రదేశ్ లో లక్షా 56వేల మంది ఈ జాబితాలో చేరిపోయారు. ఇంత మంది జీవితాలు ఇప్పుడు స్టాక్ మార్కెట్ తో అనుసంధానమై, వారి పెన్షన్ లు గాలిలో దీపాల్లా మారిపోయాయి. స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.

ప్రయివేట్, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేవారి పరిస్థితి మరింత అధ్వాన్నం
ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల పరిస్థితి ఇలా వుంటే, ప్రయివేట్, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేవారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతోంది. ప్రయివేట్ స్కూళ్లు, కాలేజీలలో జీతాలు చాలా తక్కువ. ఏ రోజు జీతం ఇస్తారో తెలియదు. ఒకటో తేదీన జీతాలిచ్చేవారిని మంచి యజమానులుగా భావించుకోవాల్సిన రోజులొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 2న జరుగుతున్న సమ్మెకు ఉపాధ్యాయ సంఘాలు కూడా మద్దతు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. 

07:58 - September 1, 2016

ఢిల్లీ : వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్‌ ఇచ్చింది. పెట్రో ధరలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ లీటర్‌కు 3 రూపాయల 38 పైసలు పెరిగింది. డీజిల్ లీటర్‌కు 2 రూపాయల 67 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

07:53 - September 1, 2016

హైదరాబాద్ : గృహ నిర్మాణ శాఖ-జాయింట్ వెంచ‌ర్ ప్రాజెక్ట్ లు పూర్తి చేసేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ కసరత్తు ప్రారంభించింది. పలు కార‌ణాలతో ఆగిపోయిన ప్లాట్లు,విల్లాల రిజిస్ట్రేష‌న్ కోసం డెవ‌ల‌ప‌ర్స్‌కు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. గృహ నిర్మాణ శాఖ‌కు రావాల్సిన బ‌కాయిలు, రెవెన్యూ షేర్,ఇత‌ర ష‌ర‌తులు అంగీక‌రించే సంస్థలకు ఈ అవకాశం ఇవ్వాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది.

ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్
గృహనిర్మాణశాఖ-ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో చేపట్టిన జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి సచివాలయంలో కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశమైంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన ఆర్థిక మంత్రి ఈటెల, రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఈ భేటీకి హాజరయ్యారు. రాంకీ, సుప్రభాత్ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ డెవలపర్స్... రాంకీ, సుప్రభాత్ డెవలపర్స్‌తో మంత్రులు చర్చించారు.

జాయింట్‌ వెంచర్‌ ప్రాజెక్ట్‌లపై గృహ నిర్మాణ శాఖ నజర్‌
గ‌చ్చిబౌలి, వ‌రంగల్‌లో రాంకీ చేప‌ట్టిన గృహనిర్మాణాలపై మంత్రివ‌ర్గ ఉప సంఘం ఆరా తీసింది. గ‌చ్చిబౌలిలో బ‌ల‌హీన వ‌ర్గాల కోసం ఉద్దేశించిన ఇళ్ల నిర్మాణం రాంకీ యాజ‌మాన్యం స‌కాలంలో పూర్తి చేయ‌లేక పోయింద‌ని అధికారులు క్యాబినెట్ స‌బ్ క‌మిటీకి వివ‌రించారు. పూర్తైన నిర్మాణాలకు రాంకీ రెవెన్యూ షేర్‌ను చెల్లించ‌క‌పోవ‌డంతో రిజిస్ట్రేష‌న్లు నిలిచిపోయిన‌ట్లు తెలిపారు.

గ‌చ్చిబౌలి, వ‌రంగల్‌లో రాంకీ గృహనిర్మాణాలపై ఆరా
గృహ నిర్మాణ శాఖకు బ‌కాయిప‌డ్డ రెవెన్యూ షేర్‌ చెల్లింపు, ఇత‌ర ష‌ర‌తుల‌కు రాంకీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ ప్రతినిదులు అంగీకరించడంతో ప్లాట్లు, విల్లాల రిజిస్ట్రేష‌న్‌కు కేబినెట్‌ సబ్‌ కమిటీ అనుమ‌తినిచ్చింది. గ‌చ్చిబౌలి వెంచ‌ర్‌పై రెవెన్యూ షేర్ కింద గృహ నిర్మాణ శాఖ‌కు రాంకీ సుమారు 37 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. విల్లాలు, ప్లాట్లు రిజిస్ట్రేష‌న్ ఫీజులు,వ్యాట్‌ రూపేణా ప్రభుత్వానికి మరో 70 కోట్లు ఆదాయం సమకూరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వ‌రంగ‌ల్‌లో నిర్మించిన రాంకీ వెంచ‌ర్‌పై సుమారు 22.65 కోట్లు రెవెన్యూ షేర్ గృహ నిర్మాణ శాఖ‌కు, రిజిస్ట్రేష‌న్ల ద్వారా ప్రభుత్వానికి మరో 27 కోట్ల ఆదాయం రానుంది. ఇక సుప్రభాత్‌ ఇన్ ఫ్రా ఖ‌మ్మం జిల్లాలో చేప‌ట్టిన ప్రాజెక్ట్‌పై కూడా మంత్రివ‌ర్గ ఉప సంఘం చర్చించింది. ఈ సంస్థ నుంచి సుమారు 16 కోట్ల ఆదాయం రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. 

07:48 - September 1, 2016

హైదరాబాద్ : కేంద్రప్రభుత్వ సాహాయం.. ప్రవాసభారతీయుల చేయూత..ప్రజల విరాళాలు.. మిషన్‌కాకతీయ పథకానికి నిధులు అందుతున్న మార్గాలివి. వేలకోట్లరూపాయల ఖర్చుతో కొనసాగుతున్న మిషన్‌కాకతీయ పథకంలో పాడుడబడిన చెరువులు క్రమంగా జీవకళను సంతరించుకుంటుంటే... వేలకోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతున్నాయనే విమర్శలూ వస్తున్నాయ్‌. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకంతో వందల ఏళ్లనాటి చెరువులు జీవకళను సంతరించుకుంటున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చెరువులు కళకళ్లాడుతున్నాయి.

మిషన్‌కాకతీయకు నాబార్ట్ రుణం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయక పథకానికి ఆర్థిక సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వరంగ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే 750కోట్ల రూపాయలు అందించిన నాబార్డ్‌ .. తాజాగా మరో వెయ్యికోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. తెలంగాణలోని మొత్తం 46వేల చెరువుల్లో పూడికతేసేందుకు దాదాపు 20వేల కోట్లరూపాయలు అవసరమవుతాయని రాష్ట్రప్రభుత్వం అంచనావేసింది. అందులో భాగంగానే విడతవారీగా చెరువుల మరమ్మత్తులను చేపట్టింది. మొదటి విడతలో 16వందల కోట్లరూపాయలతో 8వేల చెరుల్లో పూడికతీత, కట్టలు పటిష్ట పరచడం లాంటి పనులు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు.

మిషన్‌కాకతీయకోసం పెద్ద మొత్తంలో అందుతున్న విరాళాలు
మిషన్‌కాకతీయ కోసం 5వేల కోట్లరూపాయల నిధుల అందించాలని కేంద్రాన్ని కోరింది తెలంగాణ ప్రభుత్వం. అటు నీతీఆయోగ్‌ కూడా తెలంగాణ ప్రభుత్వం కోరినసహాయాన్ని మూడేళ్లలో అందించాలని కేంద్రానికి సిఫారస్‌ చేసింది. మరోవైపు మిషన్‌కాకతీయకోసం విరాళాలు కూడా పెద్దమొత్తంలో అందుతున్నట్టు అధికారులు అంటున్నారు. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు ఏకంగా 30 చెరువులను దత్తత తీసుకుని బాగుచేయిస్తుండగా.. మరో 17కోట్ల రూపాయలు విరాళంగా అందినట్టు చెబుతున్నారు.

మిషన్‌ కాకతీయ సక్సెస్‌పై ప్రజల్లో అనుమానాలు
మిషన్‌ కాకతీయ పథకంలో అటు కేంద్రప్రభుత్వం,ఇటు ప్రజలు , సహాయసకారాలు అందిస్తున్న నేపథ్యంలో పథకాన్ని ఎంతవరకు సక్సెస్‌ చేస్తారోననే అనుమానాలు రాష్ట్ర ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. వేల కోట్లరూపాయల పనుల్లో ... అధికార పార్టీ నేతలే కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తుండటంతో .. పెద్దమొత్తంలో ప్రజాథనం పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆందోళ వ్యక్తం చేస్తున్నాయి.

07:43 - September 1, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పుంజుకోవడంతో.. అధికార పార్టీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తమ నాయకత్వం బలపడుతోందన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనపడుతోంది. పార్టీ పటిష్టం కోసం ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాల మొదలు పెట్టని గులాబి దళపతి.. కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత జిల్లాల్లో బలమైన నాయకత్వాన్ని సిద్ధం చేయాలని పావులు కదుపుతున్నారు.

టీఆర్‌ఎస్ నేతల్లో ఆశలు రేపుతోన్న కొత్త జిల్లాల ఏర్పాటు
తెలంగాణలో జరుగుతున్న జిల్లాల పునర్విభజన అధికార పార్టీ నేతల్లో ఆశలు రేపుతోంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటి పోయినా.... జిల్లాల్లో ఎక్కడా అధ్యక్షులు మినహా ఇతర కార్యవర్గాలు ఏర్పాటు చేయలేదు..కాని కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం పార్టీలో కూడా మార్పులు తేవాలని గులాబి దళపతి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ నాయకత్వానికి అనుకూలంగా కొత్త జిల్లాలు
ప్రస్తుతం 27 జిల్లాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అభిప్రాయ సేకరణ జరుపుతున్న ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా నాయకత్వాన్ని కూడా పెంపొందించుకునేందుకు అంతర్గతంగా కసరత్తు చేస్తోంది. అనూహ్యంగా తెరపైకి వచ్చిన కొన్ని జిల్లాల విషయంలో పార్టీ అగ్రనాయకత్వం కూడా ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలొస్తున్నాయి.

మరికొన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రజల ఆందోళనలు
మరోవైపు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు పార్టీ నేతలు అంటున్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించి హన్మకొండ తెరపైకి రావడం ఆ జిల్లా నేతలే సమర్ధించడం లేదు. అదే సమయంలో జనగాం జిల్లా కోసం భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వ పరంగా చలనం లేదు.

ఆగని జిల్లాల ఆందోళన
అటు మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నా....అదనంగా గద్వాల జిల్లా డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఈ ప్రాంతాలను పరిశీలిస్తే........పార్టీ పరంగా ఆ రెండు డిమాండ్లు ఉన్న జిల్లాలో అధికార పార్టీకి బలమైన నేతలు లేకపోవడం కూడా మైనస్ పాయింట్లుగా గులాబి నేతలు చెబుతున్నారు. ఇలాంటి అంశాలను మొత్తం పరిగణలోకి తీసుకుంటూనే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతోందన్న సంకేతాలను పార్టీ కీలక నేతల నుంచే వస్తున్నాయి. 

07:38 - September 1, 2016

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ఎడ్లపొలాలపండుగకు రైతన్నలు సిద్దం అయ్యారు. వందల ఏళ్లుగా కొనసాగుతున్న పశువుల ఉత్సవానికి సర్వంసిద్దంచేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు గ్రామాల్లో ఎడ్ల ఊరేగింపులు జాతరగా జరుగుతున్నాయి.

రైతులు ఎడ్లపొలం పండుగ
ఆదిలాబాద్ జిల్లాలో ఎడ్లపొలాల పండుగ ఉత్సాహం.ఎద్దులను అలంకరించి ఉత్సవాలు చేస్తున్న రైతన్నలు .ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎడ్లపొలం పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. రాఖీపౌర్ణమితర్వాత శ్రావణమాసం చివరలో వచ్చే అమావాస్యనాడు ఎడ్లపొలాల పండుగను ఘనంగా జరుపుకుంటారు రైతులు. వ్యవసాయపనుల్లో ఆరుగాలం కష్టపడితమతో పాటు శ్రమించే మూగజీవాలకు కృతజ్ఞతలు తెలుపుకోవడమే ఎడ్లపొలాలపండుగ.

మహారాష్ట్రనుండి వచ్చిన సంప్రదాయం
ఎడ్లను పూజించే పండగసాంప్రదాయం మహారాష్ట్రనుండి వచ్చిందంటున్నారు ఇక్కడి రైతులు. వందల ఏళ్లుగాఈ ఎడ్ల పొలాలపండుగ ఆదిలాబాబాద్ కర్షకుల సంస్కృతిలో భాగమైంది. పండుగకు ఎడ్లను అలంకరించడం కొత్తముకుతాళ్లు వేయడం, గిట్టలకు రంగులు అద్దడం పండుగలో భాగమే.

బసవన్నలకు అలకరణ..
ఎడ్లను అందంగా అలంకరించి మురిసిపోయే రైతన్నలు.. ఎడ్లతో గ్రామంలోని చావడివద్దకు చేరుకుంటారు. మేళతాళాలతో గ్రామంలోని అన్ని దేవాలయాలకు ఊరేగింపుగా తిప్పుతారు. అంతే కాదు దేవాలయాల వద్ద ఎడ్లకు మొక్కు చెల్లే వరకు ఇళ్లలో ఎవరు చుక్కనీరు ముట్టకపోవడం మరోవిశేషం.

ఎడ్ల పండుగ రోజున ఆడపడుచులకు కానుకలు
ఎడ్ల పండుగ రోజున ఆడపడుచులకు కానుకలు ఇవ్వడం మరో సాంప్రదాయం. ఈ ఎడ్లపొలాలపండుగ గ్రామంలో ఐక్యతను సాధుజంతువులపట్ల మనిషికి ఉండాల్సిన దయను తెలుపుతాయడంలో సందేహమే లేదు.  

07:31 - September 1, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ .. కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విచారిస్తామని అవినీతి నిరోధక శాఖ అధికారులు మోమోలో ప్రస్తావించారు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈ కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేసి సెప్టెంబర్‌ 29 నాటికి నివేదిక అందజేస్తామని తెలిపారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్‌ 29న విచారణకు హాజరకావాలని రేవంత్‌రెడ్డి, ఉదయసింహ, సెబాస్టియన్లకు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది.

దర్యాప్తు పురోగతిపై కోర్టులో మెమో దాఖలు చేసిన ఏసీబీ
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్రపై దర్యాప్తుచేసి, నిందితునిగా చేర్చాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తో ఏసీబీలో కదలిక వచ్చింది. దర్యాప్తు పురోగతిపై ఏసీబీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి, చంద్రబాబును నిందితునిగా చేర్చలేమని ఏసీబీ అధికారులు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పాత ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే దర్యాప్తు కొనసాగించి, చంద్రబాబు పాత్రపై సెప్టెంబర్‌ 29 నాటికి నివేదిక ఇస్తామని మెమోలో ప్రస్తావించారు.

చార్జిషీటులో 52 సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావన
ఓటుకు నోటు కేసులో ఆధారాలు సేకరించేందుకు ఏసీబీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తారా... లేదా.. అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీటులో చంద్రబాబు పేరును ఏసీబీ 52 సార్లు ప్రస్తావించింది. కాబట్టి దాని ఆధారంగా నేరుగా కోర్టే విచారణ చేయాలని విజ్ఞప్తి చేయొచ్చన్నచర్చ జరుగుతోంది. దీనిపై సెప్టెంబర్‌ 29న స్పష్టత వచ్చే వీలుంది. ఓటుకు నోటు కేసులో మరో అదనపు చార్జిషీటు దాఖలు చేస్తామని న్యాయస్థానం దృష్టికి తెచ్చిన ఏసీబీ.... చంద్రబాబును నిందితుల జాబితాలో చేర్చే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

తాజాగా సీసీ నెంబర్‌ 15/2016 కేటాయింపు
ఓటుకు నోటు కేసు నమోదైన తర్వాత 90 రోజులకు గతేడాది జులై 27న ఏసీపీ చార్జిషీటు దాఖలు చేసింది. తక్కువ కాలంలో చార్జిషీటు ఫైల్‌ చేయడంతో కొన్ని సాంకేతిక కారణాల వల్ల.. కోర్టు దాన్ని ఏడాదిపాటు పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు దీనికి సి.సి.నెంబర్‌ 15/2016 కేటాయించింది. దాంతోపాటే.. చార్జిషీటులో నిందితులుగా పేర్కొన్న రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహలు సెప్టెంబర్‌ 29న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌లో జెరూసలెం ముత్తయ్య పేరును తొలగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ముగ్గురు నిందితులకే సమన్లు జారీ చేసింది.

నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు హైకోర్టు షాక్..
మరోవైపు ఓటుకు నోటు కేసులో ఫిర్యాదుదారు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు హైకోర్టు షాకిచ్చింది. కోర్టుకు హాజరు కావాల్సిందిగా జారీ చేసిన వారెంట్లను ఆయన పట్టించుకోక పోవడాన్ని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టు ధిక్కరణకు గాను లక్ష రూపాయల పరిహారం చెల్లించి.. సెప్టెంబర్‌ 30 లోగా హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. 

07:27 - September 1, 2016

హైదరాబాద్ : సెప్టెంబర్‌ 2 సమ్మెకు కార్మిక లోకం సన్నద్ధమైంది.. తెలుగు రాష్ట్రాల్లో కార్మిక లోకమంతా సమర శంఖం పూరిస్తోంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెలోకి దిగుతున్నాయి.. సమ్మెను విజయవంతం చేసేందుకు పలు ప్రాంతాల్లో సమావేశాలు కొనసాగాయి..

కదం తొక్కనున్న కార్మికలోకం..
దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 2న కార్మికులు కదం తొక్కబోతున్నారు.. కార్మిక హక్కులు, కనీస వేతనాల అమలుతోపాటు పలు డిమాండ్ల సాధనకోసం కార్మికులు ఈ సమ్మె చేపట్టారు... ఈసమ్మెపై ప్రచారంలోభాగంగా కరీంనగర్‌ జిల్లా సింగరేణిలో జాతీయ, ప్రాంతీయ సంఘాలు సమావేశమయ్యాయి.. సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకట్రావు కార్మికులను కోరారు....

సమ్మెకు సిద్ధమైన శ్రామికులు
సెప్టెంబర్‌ 2 సమ్మెకు విశాఖ జిల్లాలో కార్మికులంతా సిద్ధమయ్యారు.. సీఐటీయూ,ఏఐటీయూసీ,ఐఎన్ టీయూసీ,వైరసీపీ, ట్రేడ్‌ యూనియన్‌, బీఎంఎస్ లతోపాటు... ఇతర ఉద్యోగసంఘాలు మద్దతు ప్రకటించాయి.. సమ్మెపై ప్రచారంలోభాగంగా విశాఖలో ఎల్‌ఐసీ వర్కింగ్‌ యూనియన్‌ సమావేశమైంది... ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటుపరం చేయొద్దని నేతలు డిమాండ్ చేశారు..

సమ్మెకు సన్నద్ధమైన వరంగల్ కార్మికులు
వరంగల్‌లో కార్మికలోకం సమ్మెకు సన్నద్ధమైంది.. దాదాపు 4 వేలమంది కార్మికులు ఈ నిరసనలో పాల్గొంటారని సీఐటీయూ నేతలు చెప్పారు.. సెప్టెంబర్‌ 2న రైల్వే స్టేషన్‌నుంచి భారీ ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించారు.. కార్మికుల డిమాండ్లతోకూడిన కరపత్రాన్ని కార్మిక సంఘం నేతలు ఆవిష్కరించారు

ఎస్‌వీకేలో రౌండ్‌ టేబుల్‌
కార్మిక సమ్మెకు మద్దతుగా ఎస్‌వీకేలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.. మేధావులు, ప్రజాసంఘాలు, సీఐటీయూ నేతలు ఇందులో పాల్గొన్నారు.. కార్మికులకు కనీస వేతనం 18వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు..సమ్మెపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచారంచేసిన కార్మిక సంఘాలు.. ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు.. 

07:21 - September 1, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఆందోళనబాట పట్టాయి. ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల పాటు బంద్‌కు రెడీ అయ్యాయి. ప్రభుత్వానికి విన్నవించినా తమగోడు వినిపించుకోవడం లేదని.. ఇవాళ్లి నుంచి కాలేజీలను బంద్‌చేస్తున్నట్టు ప్రైవేట్‌ యాజమాన్యాలు చెబుతున్నాయి.

మూడు రోజుల పాటు ప్రైవేటు డిగ్రీ కాలేజీల బంద్‌
తెలంగాణలో ప్రైవేటు డిగ్రి, పీజి కాలేజీల యాజమాన్యాలు ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చారు. రెండున్నరేళ్ల నుంచి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్నామని కాలేజీ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

సీఎంను కలిసినా ప్రయోజనం లేదని వాపోతున్నా యాజమాన్యాలు
ఫీజుబకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. గత మే నెలలో ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరినా.. ఇంతకవరకు కదలిక లేదని వాపోతున్నారు.

రూ. 3000 కోట్ల బకాయిలకు గాను ప్రభుత్వం..
2014-15, 2015-16 సంవత్సరాలకు సంబంధించిన బకాయిలు దాదాపుగా మూడు వేల కోట్లు విడుదల కావాల్సి ఉండగా కేవలం వెయ్యి కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల సంఘం నేతలు మండిపడుతున్నారు.

తక్షణమే తమ హామీలు నెరవేర్చాలని డిమాండ్‌
మరోవైపు డిగ్రి అడ్మిషన్లు ఆన్‌లైన్ లోనే పూర్తిచేయాలన్న ప్రభుత్వం నిర్ణయం అర్ధరహితమైందని.. ఈవిధానం కార్పోరేట్ కాలేజీలకే ఉపయోగపడుతోందని వారు అంటున్నారు. అంతేకాకుండా 2016-17 విద్యాసంవత్సరానికి ఈ పాస్ విద్యార్ధులకు స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ కోసం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సిఎం కేసిఆర్ ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని.. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. 

భద్రకాళి అమ్మవారికి సీఎం మొక్కులు..

హైదరాబాద్ : వరంగల్ లో కొలువై ఉన్న భద్రకాళి అమ్మవారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మొక్కులు చెల్లించుకోనున్నారు. రూ.3కోట్లతో అమ్మవారికి స్వర్ణ కిరీటం బహుకరించనున్నారు. ఇటీవలే అందుకు సంబంధించి బంగారు కిరీటం కోసం కొలతలు తీసుకొని అంచనాలు తయారు చేశారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే వివిధ ఆలయాల్లోని దేవుళ్లకు నగలు చేయిస్తానని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. 

07:09 - September 1, 2016

తూర్పుగోదావరి : జ‌న‌సేనపార్టీలో సరికొత్తజోష్‌ మొదలైంది. తిరుప‌తిలో ప్రక‌టించిన‌ట్లుగానే అన్ని జిల్లాల్లో స‌భ‌లు నిర్వహించేందుకు ప్లాన్స్‌ రెడీ చేస్తోంది. ఇప్పటివ‌ర‌కూ పార్టీలో ప‌వ‌న్ త‌ప్ప ఇంకెవ‌రూ లేరనే ప‌రిస్థితి నుంచి జనాలపార్టీగా మారేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందాపార్టీ. ఇందులో భాగంగా జిల్లాల్లో కోర్డినేట‌ర్లను నియ‌మించేందుకు జ‌న‌సేనాని క‌స‌ర‌త్తులు చేస్తోంది.

ప్రత్యేకహాదాపై తిరుపతిలో గ‌ళ‌మెత్తిన ప‌వ‌న్..
ప్రత్యేకహాదాపై తిరుపతిలో గ‌ళ‌మెత్తిన ప‌వ‌న్.. అదే అస్త్రంగా ప్రజ‌ల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకోసం మూడు ద‌శ‌ల్లో పోరాటం చేసేందుకు తీవ్రక‌స‌ర‌త్తు చేస్తున్నారు. మెద‌టిద‌శ‌లో భాగంగా 13 జిల్లాల్లో బహిరంగస‌భ‌లు నిర్వహించేందుకు ప‌క్కా ప్రణాళిక‌లు ర‌చిస్తున్నారు.

కాకినాడ‌లో సెప్టెంబ‌ర్ 9 న‌ స‌భ నిర్వహించనున్న జనసేనపార్టీ
జనసేనపార్టీ తిరుపతిసభ తర్వాత కాకినాడ‌లో సెప్టెంబ‌ర్ 9 న‌ స‌భ నిర్వహించాలని డిసైడ్‌ అయింది. అయితే కాకినాడస‌భ త‌రువాత విజ‌య‌వాడ‌లో భారీ బహిరంగ స‌భ నిర్వహించ‌నున్నట్లు ప‌వ‌న్ స‌న్నిహితవ‌ర్గాలు చెబుతున్నారు. అనంత‌రం మిగిలిన జిల్లాల్లోను స‌భ‌లు నిర్వహించాలనుకుంటున్నారు ప‌వ‌న్.

అభిమానులే కార్యకర్తలుగా మారి సభల నిర్వహణ
ప‌వ‌న్‌పార్టీ పెట్టిన‌ప్పటి నుండి పార్టీకి చెందిన ఎలాంటి అధికార ప్రతినిధులు, కోర్డినేట‌ర్లు లేరు. కాని ప‌వ‌న్ అభిమానులే జ‌న‌సేన కార్యక‌ర్తలుగా మారి స‌భ‌ల నిర్వహ‌ణ‌కు సంబంధించిన‌ ఏర్పాట్లు చేస్తున్నారు. జ‌న‌సేనపార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 20 ల‌క్షలకు పైగా కార్యక‌ర్తలు ఉన్నట్లు ప‌వ‌న్ స‌న్నిహితవ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక నుండి 13 జిల్లాల్లో వ‌రుస‌గా బహిరంగ స‌భ‌లు నిర్వహించ‌నున్న నేప‌థ్యంలో కొందరికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

నాయకుల వెతుకులాటలో జనసేన
తిరుపతిసభ తర్వాత జనసేనపార్టీలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. పవన్‌ సభల కోసం పనిచేస్తున్న నాయకుల కోసం పార్టీ వెతుకుతున్నట్టు తెలుస్తోంది. మరి పవన్ ఎవరిని తన సైనికులుగా మార్చుకుంటారోనని అభిమానులు.. జనసేన కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

07:01 - September 1, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. టీడీపీ నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, హామీలను అమలుచేసేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, రాజధాని నిర్మాణ హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీని రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ప్రత్యేకహోదాపై త్వరలోనే స్పష్టత వస్తుందని తాను భావిస్తున్నట్లు బాబు చెప్పారు.

06:56 - September 1, 2016

అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురంజిల్లాలో విస్తృతంగా పర్యటించారు. వ్యవసాయంలో సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పెనుగొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రెయిన్‌గన్‌లను ప్రారంభించారు. అటు ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై అనంతపురంలో పార్టీనాయకులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అన్నదాలకు రెయినగన్స్..
ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనలో భాగంగా పెనుగొండ నియోజకవర్గంలో పొలాల్లో రెయిన్‌గన్లను ప్రారంభించారు. దేశంలోనే తక్కువ వర్షపాతం ఉండటంవల్ల అనంతపురం జిల్లాలో నిత్యం కరువు తాండవిస్తోందని.. దానికి అధిగమించడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను కొంతైనా తర్చాలనే ఉద్దేశంతోనే అన్నదాలకు రెయినగన్‌లు అందిస్తున్నామన్నారు. రెయిన్‌ గన్‌లతో ఎండిపోతున్న పంటలను కాపాడుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి.

అయోమయంలో అన్నదాతలు
రెయిన్‌గన్లు అని ప్రభుత్వం తెగహడావుడి చేస్తుంటే.. వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అనంత రైతులు పెదవి విరుస్తున్నారు.15రోజుల ముందు ఈ రెయిన్‌గన్లు ఇచ్చినట్టైతే వేరుశనగ పంటకు మేలు జరిగేదంటున్నారు. ఎండిన పొలంలో నీరుచిలకరిస్తే.. పశువులకు మేత తప్ప పంటచేతికి రాదని వాపోతున్నారు.

రైతుల ఆవేదన
అనంతపురం జిల్లాలో కరువును పారదోలుతాం అని ముఖ్యమంత్రి అంటుంటే.. రైతులు మాత్రం పెదవి విరుస్తున్నారు. సీఎం వస్తున్నారని తెగహడావుడి చేసిన అధికారుల ఆతర్వాతీ కంటికి కనిపించకుండా పోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెయిన్‌గన్లద్వారా ప్రయోజనం రైతులందరికీ చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

ఎండుతున్న పంటలను కాపాడే యత్నం : నారాయణ
ఎండుతున్న పంటలను కాపాడ్డానికే రెయిన్‌గన్స్‌ను రైతుల చెంతకు తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. చిత్తూరుజిల్లా పుంగనూరులో ఆయన రెయిన్‌గన్స్‌ను ఇరిగేషన్‌ను పరిశీలించారు. పొలాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. రెయిన్‌గన్స్‌ ఉపయోగాన్ని అడిగి తెలుసుకున్నారు. 

ప్రత్యేక ప్రకకటన వస్తుంది : చంద్రబాబు

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదాపై త్వరలోనే స్పష్టత వస్తుందని అనుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన హామీల అమలుపై కేంద్రం కసరత్తు చేస్తోందని, కేంద్రానికి సంబంధించిన పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, దీంతోపాటు పోలవరం, రాజధాని నిర్మాణం, ఆర్థిక లోటు భర్తీ, బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ వంటి డిమాండ్లను కేంద్రం నెరవేర్చాలన్నారు.

Don't Miss