Activities calendar

02 September 2016

22:04 - September 2, 2016

ఢిల్లీ : మ‌త స్వాతంత్ర్యంలో సుప్రీంకోర్టు జోక్యం తగద‌ని ఆలిండియా ముస్లిం ప‌ర్సన‌ల్ లా బోర్డు స్పష్టంచేసింది. ట్రిపుల్ త‌లాఖ్ విష‌యంలో ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఇస్లాంలో విడాకుల కోసం ట్రిపుల్ తలాఖ్‌కు అనుమ‌తి ఉంద‌ని, భ‌ర్తకే ఈ హ‌క్కు ఉంటుంద‌ని పేర్కొంది. త‌న కుటుంబానికి అన్యాయం చేయ‌కుండా త‌ప్పనిస‌రి ప‌రిస్థితుల్లోనే ట్రిపుల్ త‌లాఖ్‌కు వారు సిద్ధమ‌వుతార‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. పెళ్లి, విడాకులు, భ‌ర‌ణంలాంటివి ఒక్కో మ‌తంలో ఒక్కోలా ఉంటాయ‌ని, ఒక మ‌తానికి సంబంధించిన హ‌క్కుల‌ను కోర్టులు ప్రశ్నించ‌లేవ‌ని బోర్డు చెప్పింది. ఖురాన్ ప్రకారం విడాకులు అవాంఛ‌నీయ‌మే అయినా, త‌ప్పనిస‌రి ప‌రిస్థితుల్లో అలా చేయ‌డానికి అనుమ‌తి ఉంద‌ని స్పష్టంచేసింది. ముస్లిం మ‌హిళ‌ల పిటిష‌న్ మేర‌కు ట్రిపుల్ త‌లాఖ్‌పై సుప్రీంకోర్టు విచార‌ణ జ‌రుపుతోంది. 

22:00 - September 2, 2016

చెన్నై : తమిళనాడు అదనపు గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర రావు ప్రమాణం చేశారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మద్రాసు హైకోర్టు చీఫ్‌ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ విద్యాసాగర్‌రావుతో గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సిఎం జయలలితతోపాటు గవర్నర్‌ కుటుంబ సభ్యులు, మంత్రులు, వివిధ పార్టీల నేతలు, తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా జయలలిత గవర్నర్‌కు మంత్రులను పరిచయం చేశారు. అతి వినయాన్ని ప్రదర్శించిన మంత్రులు జయలలితకు వంగి వంగి నమస్కారాలు చేయడం రాచరిక వ్యవస్థను తలపించింది.
 

 

21:59 - September 2, 2016

డెహ్రడూన్ : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి కార్మికుల సమ్మె షాక్‌ తగిలింది. తన సొంత నియోజకవర్గమైన అమేథీలో పర్యటిస్తున్న రాహుల్‌ కాన్వాయ్‌ను అంగన్‌వాడి కార్యకర్తలు అడ్డుకున్నారు. వేతనాల పెంపు కోసం ఆందోళన చేస్తున్న మహిళా ఆరోగ్య, అంగన్‌వాడీకి చెందిన 2 వందల మంది కార్యకర్తలు రాహుల్‌ వాహనాన్ని నిలిపివేశారు. తమ వేతనాలు పెంచడం లేదని కార్యకర్తలు ఆరోపించారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా జరిగిన సమ్మెలో అంగన్‌వాడి కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. 

21:57 - September 2, 2016

ఢిల్లీ : బీజేపీ ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన న‌వ్‌జ్యోత్ సింగ్ సిద్దు ఏ పార్టీలో చేర‌తార‌న్న స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. ఏకంగా ఓ కొత్త పార్టీకే ఆయ‌న నేతృత్వం వ‌హించ‌నున్నారు. ఆవాజ్‌-ఎ-పంజాబ్ పేరుతో కొత్త పార్టీని పెట్టనున్నట్లు మాజీ క్రికెటర్‌ సిద్ధూ ప్రకటించారు. ఈ నెల 9న ఈ కొత్త పార్టీని ప్రారంభించనున్నారు. హాకీ క్రీడాకారుడు, ఎమ్మెల్యే పర్గత్‌ సింగ్‌, లూథియానాకు చెందిన స్వత్రంత్ర ఎమ్మెల్యేలు సిమర్‌జీత్‌ సింగ్‌ బైన్స్‌, బల్విందర్‌ సింగ్‌ బైన్స్‌లతో కలిసి  సిద్దు ఈ పార్టీ ఏర్పాటు చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను పర్గత్‌ సింగ్‌ త‌న ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్ధూ ఆప్‌లో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. ఆప్‌లో చేరికపై సిద్ధూ గానీ.. ఆప్‌ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

 

21:55 - September 2, 2016

హైదరాబాద్ : తెలంగాణలోనూ సార్వత్రిక సమ్మె విజయవంతమైంది.. అన్ని జిల్లాల్లోనూ కార్మికులు వేకువ జాము నుంచే సమ్మెలో పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మె వల్ల పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలంతా సంఘీభావం తెలపడంతో సమ్మె విజయవంతమైందని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు
కార్మికలోకం కదం తొక్కింది.. 
తెలంగాణవ్యాప్తంగా కార్మికలోకం కదం తొక్కింది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా.. కార్మికలోకం నిర్వహించిన సార్వత్రిక సమ్మె సక్సెస్‌ అయింది. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెబాట పట్టిన కార్మికులు సుందరయ్య పార్క్‌ నుంచి ఇందిరాపార్క్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ నినదించారు. మోదీ ఇప్పటికైనా వెనక్కి తగ్గకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. 
పారిశ్రామిక వాడల్లోనూ స్తంభించిన పని 
ట్రేడ్‌ యూనియన్ల సమ్మె పిలుపుతో రాష్ట్రంలోని దాదాపు అన్ని పారిశ్రామిక వాడల్లోనూ పని స్తంభించింది. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం రోడ్డెక్కిందని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు తెలిపారు. కార్పొరేట్‌ సంస్థలకే మోదీ చెప్పే అచ్ఛేదిన్‌ వచ్చాయని ఆయన మండిపడ్డారు.  
ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగాల కల్పన క్షీణిస్తోందన్న కోదండరాం 
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగా కల్పన క్షీణిస్తోందని.. కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెకు మద్దతిచ్చిన తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. కార్మిక చట్టాలను సవరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా పనిచేస్తోందని అఖిలభారత బీమా కార్మిక సంఘాల ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌ ఆక్షేపించారు. 
వరంగల్‌ జిల్లాలో సమ్మె సంపూర్ణం 
అటు వరంగల్‌ జిల్లాలోనూ సమ్మె సంపూర్ణంగా కొనసాగింది.. ఎస్‌బీహెచ్‌  జోనల్ కార్యాలయం దగ్గర ఉద్యోగులు ధ‌ర్నా చేశారు.. సమ్మెకు మద్దతుగా వ‌రంగ‌ల్  రైల్వే స్టేష‌న్ నుంచి సీపీఎం నేత‌లు ర్యాలీ చేశారు.. కలెక్టరేట్‌ ఎదుట టీఎన్‌జీవోల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.. నేషనల్ ఇనిస్టీట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉద్యోగులు, కార్మికులుకూడా సమ్మెలో పాల్గొన్నారు.. భూపాలపల్లిలో సింగరేణి కార్మికుల సమ్మెతో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది.. దాదాపు 3కోట్ల రూపాయలవరకూ సంస్థకు నష్టం జరిగింది.. 
సమ్మె వల్ల స్తంభించిన జనజీవనం  
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలు సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల్లోనూ సమ్మె వల్ల జనజీవనం స్తంభించిపోయింది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి. చాలా ప్రాంతాల్లో విద్యాసంస్థలకూ సెలవులు ప్రకటించారు. సమ్మె కారణంగా.. అన్ని ప్రధాన పట్టణాల్లోని రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. సికింద్రాబాద్‌, నిజామాబాద్‌లలో ఆందోళనకారులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మెదక్‌లో కలెక్టరేట్‌ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ సమ్మె విజయవంతమైంది. 

 

21:51 - September 2, 2016

విజయవాడ : కార్మికుల సార్వత్రిక సమ్మె ఏపీలో సక్సెస్‌ అయింది. ప్రతి పట్టణంలోనూ కార్మికులు కదం తొక్కారు. న్యాయమైన తమ డిమాండ్లు తీర్చాలంటూ నినదించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంతర పోరు కొనసాగుతుందంటూ గర్జించారు. 
ఏపీలో రోడ్డెక్కిన కార్మికులు
ట్రేడ్‌ యూనియన్‌ల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా.. ఏపీలో కార్మికులు రోడ్డెక్కారు. అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో.. రాష్ట్రంలోని అన్ని చోట్లా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విజయవాడలో ఆటో కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనడంతో.. నిత్యం రద్దీతో కిటకిటలాడే పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ వెలవెలబోయింది. అటు వాణిజ్య సంస్థలనూ స్వచ్చందంగా మూసేశారు. పలు చోట్ల విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 
విజయవాడలో భారీ ర్యాలీ 
విజయవాడలోనే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వామపక్షాలు, అనుబంధ కార్మిక సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను వారు నిరసించారు. కార్మికుల హక్కులను పరిరక్షించకుంటే.. ఐక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 
సమ్మెలో పాల్గొన్న కీలక రంగాల కార్మికులు 
సార్వత్రిక సమ్మెలో సీఐటీయూ, ఎల్‌ఐసీ, బ్యాంకింగ్‌ తదితర కీలక రంగాల్లోని కార్మికులంతా పాల్గొన్నారు. అసంఘటిత రంగాల కార్మికులు, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. గతానికి భిన్నంగా టీటీడీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోని 90శాతం బిఎస్‌ఎన్‌ కార్మికులు, ఎల్‌ఐసీకి చెందిన మొత్తం ఆరువేల మంది కార్మికులూ సమ్మెలో పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణలోని బ్యాంకులకు చెందిన 30వేల మంది కార్మికులు, 17వేల మంది మెడికల్‌ రెప్రెజెంటేటివ్‌లూ సమ్మెలో పాల్గొని కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నినదించారు.
కదం తొక్కిన రైల్వే కార్మికులు 
విజయవాడలో రైల్వే కార్మికులూ కదం తొక్కారు. కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని.. కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలన్న డిమాండ్‌లతో  ఉదయం నుంచీ మండుటెండలో కూర్చుని ఆందోళన నిర్వహించారు. బెజవాడ ఆటోనగర్‌లో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గఫూర్‌ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగించారు. దీంతో లక్ష మందికి పైగా కార్మికులతో కళకళలాడే ఆటోనగర్ వెలవెల బోయింది. 
సమ్మెకు ప్రజల నుంచి విశేష స్పందన
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ విధానాలకు వ్యతిరేకంగా జరిపిన సమ్మెకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజల మద్దతుతోనే సమ్మె విజయవంతమైందని, మోదీ సర్కారు ఇప్పటికైనా కళ్లు తెరిచి.. కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.  

 

21:46 - September 2, 2016

ఢిల్లీ : 10 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. కేరళ, కర్నాటకలో బంద్‌ సంపూర్ణం కాగా...  ఢిల్లీ, ముంబైలో బంద్‌ పాక్షికంగా జరిగింది. దేశవ్యాప్తంగా బస్సులు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రవాణా స్తంభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, టెలికాం సంస్థలు మూతపడ్డాయి. కార్మికుల సమ్మె జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది.
దేశ వ్యాప్తంగా సమ్మె విజయవంతం
ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ 10 కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా సమ్మె విజయవంతమైంది. 18 కోట్ల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఢిల్లీ స్టేట్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, ఆల్‌ ఇండియా ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌ వద్ద ఉద్యోగులు ధర్నా చేశారు.
జంతర్‌ మంతర్‌ నుంచి పార్లమెంట్‌ వరకు ర్యాలీ 
కార్మిక సంఘాలు జంతర్‌ మంతర్‌ నుంచి పార్లమెంట్‌ వరకు ర్యాలీ నిర్వహించాయి. పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. ఈ ధర్నాలో సిఐటియూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌, ఎఐటియుసి కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌ పాల్గొన్నారు.
సమ్మెను నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర 
కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సమ్మెను నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర పన్నిందని ఆరోపించారు. సమ్మెకు నోటీసు ఇవ్వని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ బిఎంఎస్‌తో కేంద్రం చర్చలు జరిపి సమ్మె విరమించినట్లు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు  వ్యతిరేకంగా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని కార్మిక నేతలు హెచ్చరించారు.
కేరళలో సంపూర్ణంగా బంద్‌  
వామపక్షాల పాలనలో ఉన్న కేరళలో సంపూర్ణంగా బంద్‌  జరిగింది. సమ్మెకు ప్రభుత్వ మద్దతు ఉండడంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.
కర్నాటకలో కూడా బంద్‌ విజయవంతం
కాంగ్రెస్‌ పాలనలో ఉన్న కర్నాటకలో కూడా బంద్‌ విజయవంతమైంది. స్కూళ్లు, కళాశాలు మూతపడ్డాయి. బస్సులు, ఆటోలు తిరగలేదు. బెంగళూరులో కొన్నిచోట్ల టాక్సీలు, ఆటో రిక్షాలు నడిచాయి. కస్టమర్ల వద్ద అధికంగా చార్జి వసూల్‌ చేశారు.
ముంబైలో సమ్మె పాక్షికం
ముంబైలో సమ్మె పాక్షికంగా జరిగింది. బస్సులు తిరిగాయి. అత్యవసర సర్వీసులైన పవర్‌, వాటర్‌ సప్లయ్‌లకు అంతరాయం కలగలేదు. కనీస వేతనాలు డిమాండ్‌ చేస్తూ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులు, రేడియాలాజిస్టులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కేసులకు మినహాయింపు నిచ్చారు.
సమ్మెకు దిగిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ కార్మికులు 
కోల్‌ ఇండియా లిమిటెడ్‌ కార్మికులు సమ్మెకు దిగారు. పవర్‌ ప్లాంట్లకు మరో రెండు నెలలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండడంతో సమ్మె ప్రభావం  చూపలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌ అన్నారు.
12 డిమాండ్లపై 10 కార్మిక సంఘాలు సమ్మె 
12 డిమాండ్లపై 10 కార్మిక సంఘాలు సమ్మె చేశాయి. బీమా, రక్షణ, రైల్వే రంగాల్లో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నాయి. కార్మికులకు సామాజిక భద్రత కల్పించి, కనీస వేతనం 18 వేలుగా నిర్ణయించాలని, శ్రామికులకు 3 వేలకు తగ్గకుండా పెన్షన్‌ హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

జహీర్‌ఖాన్‌కు అరుదైన గౌరవం

ఢిల్లీ : భారత మాజీ బౌలర్‌ జహీర్‌ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) ఆయనను జీవితకాల గౌరవ సభ్యత్వం ఇచ్చి గౌరవించింది. 'జీవితకాల గౌరవ సభ్యుడిగా ఎంసీసీ జహీర్‌ఖాన్‌ను ఎంపిక చేసిందని' క్లబ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. సెహ్వాగ్‌ తర్వాత నాలుగు వారాల్లోనే క్లబ్‌లో సభ్యత్వం పొందిన రెండో భారత అంతర్జాతీయ క్రికెటర్‌ జహీర్‌ఖాన్‌ కావడం విశేషం. జహీర్‌ ఈ ఘనత పొందిన 24వ భారత క్రికెటర్‌. గతంలో సునీల్‌ గావస్కర్‌, సచిన్‌ తెందుల్కర్‌, సౌరభ్‌ గంగూలీ తదితరులకు ఈ గౌరవం దక్కింది. 

 

21:37 - September 2, 2016

కరువు మీద జగనాలు, చంద్రాలు కన్నెర్ర... నోరెళ్లవెట్టి చూస్తున్న పల్లి పంట రైతులు, రాచకొండ గుట్టలల తేలిన కోదండరాం... గిరిజన భూముల లేసిన దుమారం, మళ్ల గాలిమోటరెక్కిన నరేంద్రమోడీ.. వారం టూరుకు సూటు... బూటు రెడీ, వరంగల్ పట్నంల సడకెక్కిన సకల జనం.. ఇళ్లు కట్టిచ్చేదాక ఇడిసిపెట్టొద్దు మనం, చెర్లున్న కంపను బాయిలేసిన సర్కార్.. ఔట్ సోర్సింగ్ నౌకరొల బతుకు ఆగమాగం, హరితహారం చెట్టుకు అమాస పూజలు... పట్నం పక్కపోంటే పగటీలి పంచాయితీలు.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

21:17 - September 2, 2016
21:13 - September 2, 2016
21:12 - September 2, 2016
21:11 - September 2, 2016
21:10 - September 2, 2016
21:09 - September 2, 2016
21:07 - September 2, 2016
21:06 - September 2, 2016

మెదక్‌ : జిల్లా కార్మికుల నిరసనతో దద్దరిల్లింది.. ర్యాలీలు, ధర్నాలతో కార్మికులు కదం తొక్కారు.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు.. 
హోరెత్తిన సార్వత్రిక సమ్మె 
మెదక్‌ జిల్లాలో సార్వత్రిక సమ్మె హోరెత్తింది.. సమ్మెలో పాల్గొన్న కార్మికులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. సమ్మెకు సంఘీభావంగా కలెక్టరేట్‌ ఉద్యోగులు... భోజన విరామం సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.. 
జహీరాబాద్‌లో విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు బంద్‌
జహీరాబాద్‌లో విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు బంద్‌ అయ్యాయి.. రోడ్లపై ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి.. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి... నర్సాపూర్‌ నియోజకవర్గంలోకూడా సమ్మెతో పలు కార్యకలాపాలు ఆగిపోయాయి.. కార్మికులు అంబేద్కర్‌ చౌరస్తా దగ్గర ర్యాలీ చేపట్టారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.... తహశీల్దార్‌ కార్యాలముందు ధర్నా చేశారు.. రాజీవ్‌ చౌరస్తా దగ్గర ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు..

 

21:02 - September 2, 2016

నల్లగొండ : కార్మికుల సార్వత్రిక సమ్మె నల్లగొండ జిల్లాలో విజయవంతమైంది.. జిల్లా వ్యాప్తంగా కార్మికులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. పలు రాజకీయ పార్టీలు కార్మికులకు మద్దతు ప్రకటించాయి.. 
సార్వత్రిక సమ్మె సంపూర్ణం
నల్లగొండ జిల్లాలో సార్వత్రిక సమ్మె సంపూర్ణంగా కొనసాగింది.. జిల్లాలోని ఏడు డిపోలనుంచి ఒక్క బస్సుకూడా బయటకు రాలేదు.. జిల్లాలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంబించింది.. కార్మిక సంఘాలకు పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.. నేతలు సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు... విద్య, వ్యాపారసంస్థలు బంద్‌ కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. 
చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై ర్యాలీ 
చౌటుప్పల్‌లో సీఐటీయూ నేతలు, కార్మికులు జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు.. యాదగిరిగుట్టలోకూడా ర్యాలీలతో కార్మికులు హోరెత్తించారు. మిర్యాలగూడలో సమ్మెకు మద్దతుగా ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసివేశారు. నిరసన ప్రదర్శనల్లో సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఆలేరులో కార్మికులు బైక్‌ ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. 

 

20:58 - September 2, 2016

విశాఖ : జిల్లాలో సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొన్నాయి.  అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెకు మద్దతు తెలిపాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మె విశాఖలో ప్రశాంతంగా కొనసాగింది.  అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొని  ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మంది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ,  ప్రైవేటు రంగ ఉద్యోగులు, కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. 

కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై మొత్తం 12 డిమాండ్లతో సమ్మెకు దిగిన కార్మికులు, ఉద్యోగులు తమ నిరసన కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా  బంద్ చేపట్టారు. విశాఖపట్నం నగరంతో పాటు గ్రామీణం, ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు.  ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు  ప్రైవేటు రంగ సంస్థలు మూత పడ్డాయి.  స్టీల్ ప్లాంట్, హెచ్ పీసీఎల్‌,  బీహెచ్ఈఎల్, విశాఖ పోర్టులతో పాటు పారిశ్రామిక వాడల్లోని పలు కంపెనీలు మూతపడ్డాయి. 

కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు చేయాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేసారు. ఉద్యోగుల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో భవిష్యత్ లో నిరవధిక సమ్మె చేసేందుకు కూడా వెనుకాడమని కార్మికులు స్పష్టం చేసారు.  గాజువాక, అనకాపల్లిలో చేపట్టిన బంద్ స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. కార్మికులు స్వచ్ఛంధంగా చేస్తున్న సమ్మెను విచ్చిన్నం చేయడానికి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  దీంతో 160 మందికి పైగా కార్మికులను పోలీసులు అరెస్టు చేసారు.

20:56 - September 2, 2016
20:55 - September 2, 2016
20:54 - September 2, 2016
20:53 - September 2, 2016

ఖమ్మం : జిల్లాలో కార్మికలోకం కదం తొక్కింది.. సమ్మెతో నిరసన గళమెత్తింది.. కార్మికుల సమ్మెతో జిల్లాలోని పలు కార్యకలాపాలు స్తంభించాయి. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఖమ్మం జిల్లాలో కార్మికులు రోడ్డెక్కారు.. ర్యాలీలు, ధర్నాలతో నిరసనలు తెలిపారు.. సమ్మెకు మద్దతుగా విద్య, వైద్య, రవాణా సంస్ధలు, బ్యాంకులు బంద్‌ పాటించాయి.. సింగరేణిలో కార్మికుల సమ్మెతో కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగురు, ఇల్లందులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పాల్వంచలో నవభారత్,  కెటిపిఎస్‌లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. బస్సులు డిపోలకే పరిమతమయ్యాయి.. జిల్లాలోని 3లక్షలమంది సంఘటిత, ఆసంఘటిత రంగ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.. 
సమ్మెకు మద్దతుగా బంద్‌ పాటించిన షాపులు, కాలేజీలు, వ్యాపార సంస్థలు 
ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో షాపులు, కాలేజీలు, వ్యాపార సంస్థలు సమ్మెకు మద్దతుగా బంద్‌ పాటించాయి. కార్మికులు ర్యాలీతో తమ నిరసన తెలియజేశారు.. పినపాక నియోజకవర్గంలోకూడా సమ్మె కొనసాగింది.. సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతుగా విధులకు హాజరు కాలేదు. ప్రైవేట్ విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, పెట్రోల్‌ బంక్‌లు బంద్‌ పాటించాయి. సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచాలంలోనూ కార్మికుల నిరసనలు తెలిపారు.. ఇల్లందులో కార్మికలోకం భారీ ర్యాలీ చేపట్టింది.

 

20:51 - September 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సార్వత్రిక సమ్మె విజయవంతంగా సాగింది. వేకువ జాము నుంచే కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, బంద్‌లో పాల్గొన్నారు. బస్సులు తిరగనీయలేదు. దుకాణాలను మూయించారు. సార్వత్రిక సమ్మె వల్ల జంటనగరాల్లో జనజీవనం స్తంభించిపోయింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలంతా సంఘీభావం తెలపడంతో సమ్మె విజయవంతమైందని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. 
సార్వత్రిక సమ్మె సక్సెస్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా.. కార్మికలోకం నిర్వహించిన సార్వత్రిక సమ్మె సక్సెస్‌ అయింది. ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మహాత్మాగాంధీ బస్‌స్టాండ్‌ ప్రయాణికులు లేక వెలవెలపోయింది. సమ్మె సంగతి తెలియక బస్టాండ్‌కు వచ్చిన వారు కొంత ఇబ్బందులు పడ్డారు. 
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెబాట పట్టిన కార్మికులు 
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెబాట పట్టిన కార్మికులు సుందరయ్య పార్క్‌ నుంచి ఇందిరాపార్క్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ నినదించారు. మోదీ ఇప్పటికైనా వెనక్కి తగ్గకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగా కల్పన క్షీణిస్తోందని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. కార్మిక చట్టాలను సవరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా పనిచేస్తోందని అఖిలభారత బీమా కార్మిక సంఘాల ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌ ఆక్షేపించారు.
పారిశ్రామిక వాడల్లోనూ స్తంభించిన పని
ట్రేడ్‌ యూనియన్ల సమ్మె పిలుపుతో హైదరాబాద్‌లోని అన్ని పారిశ్రామిక వాడల్లోనూ పని స్తంభించింది. కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో.. పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం రోడ్డెక్కిందని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు తెలిపారు. మేకెన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా నినాదాలు అన్నీ మోసపూరితమని ఆయన అన్నారు. కార్పెరేట్‌ సంస్థలకే మంచిరోజులు వచ్చాయని సాయిబాబు మండిపడ్డారు.  
డిపోలకే పరిమితమైన బస్సులు 
సమ్మె కారణంగా జంటనగరాల్లోని అన్ని డిపోల్లోనూ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జంటనగరాల్లో ప్రజారవాణా స్తంభించింది. కార్మికులు డిపోల ఎదుట ధర్నాలకు కూర్చోవడంతో బస్సులేవీ బయటకు రాలేదు. రేతిఫైల్ బస్‌స్టాప్‌ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటోల టైర్ల గాలిని తీసి కార్మికులు నిరసన తెలిపారు. సమ్మె కారణంగా ప్రజారవాణా వ్యవస్థ స్తంభించడంతో.. ప్రయాణికులు రాకపోకల కోసం ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడ్డారు. దీంతో, ప్రైవేటు ఆపరేటర్లు ప్రయాణికులను నిలువు దోపిడీ చేశారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం
కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ.. కార్మికులు సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ వద్ద... కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అటు సమ్మె ప్రభావం యూనివర్సిటీ విద్యార్థులపైనా పడింది. జేఎన్‌ టీయూ, ఓయూ పరిధిలో జరగాల్సిన ఎంబీఏ , ఎంసీఏ, బీటెక్ , బీఫార్మసీ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. అయితే కంబైన్డ్‌ గ్రాడ్యువల్‌ లెవల్‌ పరీక్షలను మాత్రం యథావిధిగా నిర్వహించారు. 

20:47 - September 2, 2016
20:45 - September 2, 2016

వినాయక ఉత్సవంలో రాజకీయం జోక్యం తగదు : కోగంటి

హైదరాబాద్ : రాజకీయ గూండాలు ఎమ్మెల్యేలుగా ఎదిగి దైవ కార్యక్రమంలో గొడవలు పెట్టారని దూండి గణేష్ సేవా సమితి మాజీ అధ్యక్షుడు కోగంటి సత్యనారాయణ అన్నారు. వినాయక ఉత్సవంలో రాజకీయం జోక్యం తగదన్నారు. ఉత్సవం పేరుతో దండుకునేందుకు బోండా ఉమ కమిటీలో చేరారని ఆరోపించారు.
 

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకుల్లో పాల్గొన్న కొడాలి నాని

కృష్ణా : పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకుల్లో కొడాలి నాని పాల్గొన్నారు. జనసేన పార్టీలో చేరాలంటూ నినాదాలు చేశారు. 

దూండి గణేష్ సేవా సమితిపై ఎమ్మెల్యే బోండా ఉమా పెత్తనం

విజయవాడ : దూండి గణేష్ సేవా సమితిపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పెత్తనం చెలాయిస్తున్నాడు. కమిటీ సభ్యుల్లో గొడవలను ఆసరాగా చేసుకుని గౌరవ అధ్యక్షుడిగా కమిటీని ప్రకటించుకున్నారు.

 

20:15 - September 2, 2016

కర్నూలు : అమ్మఒడిలో హాయిగా  నిద్రించాల్సిన వయసులో ఆ చిట్టితల్లులు ..ఆలనాపాలనకు దూరమయ్యారు. ముక్కు పచ్చలారని వయసులో తల్లిఅనారోగ్యంతో మృతి చెందడంతో ఐదుగురు చిన్నారుల బతుకుదెరువు ప్రశ్నార్థకంగా మారింది. గ్రామస్థులు పెట్టిందితిని కాలం గడుపుతున్నారా పసివాళ్లు. గుండెలుపగిలే వేదన మనసులో దాచుకుని వారు వేస్తున్న ఆకలి కేకలు పలువురికి కన్నీరు పెట్టిస్తున్నాయి. 
చిన్నవయసులోనే చిట్టితల్లులకు పెద్దకష్టం..
కర్నూలు జిల్లా పత్తికొండ మండల పరిధిలో ఐదుగురు అడబిడ్డల రోదన అరణ్యరోదనగా మారింది. బుగ్గతండా గ్రామానికి చెందిన బనావత్ రమణమ్మ ,రాంబాబునాయక్‌ కూలిపనిచేసుకుని జీవనం సాగిస్తుండేవారు. వారికి ఐదుగురు సంతానం. 8ఏళ్ల  మల్లిక ,ఏడేళ్ల శశిరేఖ,ఆరేళ్ల ఇందు,ఐదేళ్ల లోకేశ్వరి, నాలుగేళ్ల సింధు వారి సంతానం. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు కష్టాలు మొదలయ్యాయి. 
పచ్చకామెర్లతో తల్లి మృతి... అనాథలుగా మారిన చిన్నారులు
బుగ్గతండాకు చెందిన రమణమ్మ ఆరునెలలక్రితం పచ్చకామెర్లతో మరణించింది. భార్యను పోగొట్టుకున్న రాంబాబు పిల్లల ఆలనాపాలనా చూడకుండా తాగుడుకు బానిసై చిన్నారులను వదిలేసి వెళ్లిపోయాడు. నాటి నుండి అనాధలుగా మారిన చిట్టితల్లులను గ్రామంలోని ఓ కుటుంబం చేరదీసింది. వరుసకు అమ్మమ్మ అయిన వెంకటమ్మ వారి ఆలనాపాలనా చూస్తోంది. గ్రామస్తులు పెట్టింది తింటూ.. స్కూల్లో పెట్టే మద్యాహ్న భోజనంతోనే వారుకాలం వెళ్లదీస్తున్నారు.  వెంకటమ్మకు వృద్ధాప్యం రావడంతో ప్రస్తుతం ఈ చిన్నారుల ఆలనాపాలనా కష్టంగా మారింది.
తోబుట్టువులకు పెద్దదిక్కుగా పెద్దక్క మల్లిక 
చేరదీసిన వెంకటమ్మ వృద్ధాప్యంతో బాధపడతుంటే.. ఈ చిన్నారుల్లో పెద్దదైన మల్లిక తన నలుగురు తోబుట్టువులకు పెద్దదిక్కుగా మారింది.  తల్లిలా లాలిస్తోంది. తండ్రిలా ఆడిస్తోంది. ఏడ్చినా సముదాయిస్తోంది..  స్థానిక ప్రభుత్వపాఠశాలలోని మద్యాహ్న భోజనంతోనే తన చెల్లెళ్ల కడుపునింపుతోంది. తాము రోజు ఒకపూటే భోజనం చేస్తున్నామని చెబుతున్న ఈచిన్నారి మాటలు హృదయం ఉన్న వారిని కలచివేస్తోంది.
దాతల కోసం ఎదురుచూస్తున్న చిన్నారులు 
తమ కంటకన్నీరు తుడిచే దాతల కోసం ఆ చిన్నారులు ఎదురుచూస్తున్నారు. చిన్నారులను ఆదుకునే దాతలు బనావత్ మల్లిక స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అకౌంటు నెంబరు 35203857251 కి మనీ ట్రాన్సఫర్ చేయాలని కోరుతున్నారు. మరిన్ని వివరాల కోసం 9505652928 నెంబరుకు కాల్‌ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

20:09 - September 2, 2016

హైదరాబాద్ : ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకోని అవంతరాలు ఎదురువుతున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇ్దందుకు కారణం లేకపోలేదు. ప్రత్యేకహోదాపై అధికార టీడీపీని ఇరుకున పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న ఆ పార్టీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. హోదాపై టీడీపీ,బీజేపీని నిలదీసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఇప్పుడా పార్టీకి కొరకరాని కొయ్యలా తయారయ్యారు. 
ఏపీలో బలమైన రాజకీయశక్తిగా ఎదిగిన వైసీపీ
రాష్ట్ర విభజన అనంతరం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన రాజకీయ శక్తిగా అవతరించిన వైఎస్సార్ సీపీ..అధికారపార్టీపై ఉధృతంగా ఎదురుదాడి చేస్తోంది. రెండేళ్లుకు పైగా ఏపీ రాజకీయాల్లో అధికార, విపక్ష పార్టీల మధ్య ప్రత్యేక హోదా చిచ్చు రగులుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంతో....కేంద్రంపై  బలంగా ఒత్తిడి పెంచడం లేదనే విమర్శలను ఎదుర్కొంటోంది. ఇదే అవకాశాన్ని అదనుగా తీసుకుని వైసీపీ రాజకీయంగా బలపడాలని ఎత్తులు వేస్తోంది. ప్రత్యేక హోదా రాకపోవడానికి  తెలుగుదేశం పార్టీ ప్రధాన కారణమన్న వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోంది. 
ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన పవన్‌
ఈ సమయంలో గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమికి పరోక్ష కారణమైన పవన్ మరో సారి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.  జనసేన పేరుతో  జనంలోకి వెళ్లేందుకు మరోసారి పవన్ స్కెచ్ వేసుకుని అమలు చేసే పనిలో పడ్డారు. దీంతో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ వ్యవహారం ఆపార్టీకి మింగుడు పడడం లేదు. 
జనసేనాని ఎఫెక్ట్ తమకు తప్పదని ఆందోళనలో నేతలు 
ప్రత్యేక హోదా ఎజెండాతో వచ్చే ఎన్నికల నాటికి బలపడాలని వైసీపీ వ్యూహానికి పవన్ గండికొటుతున్నారనే వాదన  ప్రధాన ప్రతిపక్ష నేతల్లో వినిపిస్తోంది. రెండేళ్లుగా తిరుగులేని అస్త్రంగా తాము వాడుకుంటున్న హోదా అంశాన్ని పవన్  హైజాక్ చేస్తున్నాడని వైసీపీ నేతలు ఉడికిపోతున్నారట.  ఇదే పరిస్థితి కొనసాగితే....... హోదా అంశంపై స్పష్టత రాకపోయినా వైఎస్సార్ సీపీ చేస్తున్న ఉద్యమానికి పవన్ ఉద్యమ కార్యాచరణ ఎఫెక్ట్ తప్పదన్న ఆందోళన నేతల్లో కనిపిస్తోంది. జిల్లాల వారిగా సభలు నిర్వహించేందుకు జనసేనాని సిద్ధమైతే ప్రధానప్రతిపక్షంగా ఎలా వ్యవహరించాలన్న అంశంపై  పార్టీలో జోరుగా  చర్చ సాగుతోంది. మొత్తం మీద వైఎస్సార్ సీపీ జనసేనలు ప్రత్యేక హోదాపై  ప్రజల్లోకి వెళుతుండడం రాజకీయంగా ఏపీలో ఎలాంటి పరిస్థితులు దారి తీస్తాయనేదినేది ఆసక్తిగా మారింది.

19:55 - September 2, 2016

కృష్ణా : విజయవాడలో రైల్వే కాంట్రాక్ట్‌ కార్మికులు కదం తొక్కారు. కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని.. కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ రైల్వేస్టేషన్‌ రైల్వే కాంట్రాక్ట్‌ శానిటేషన్‌ కార్మికులు ధర్నా చేపట్టారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉదయం నుంచి మండుటెండలో కూర్చుని ఆందోళన చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియాలో చూద్దాం...

 

19:53 - September 2, 2016

కర్నూలు : దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కర్నూలు జిల్లాలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. కర్నూలు నగరంలో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పలుచోట్ల సమ్మె కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలు, ర్యాలీలతో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్రభుత్వాలకు నిరసన తెలిపారు. 
సీఐటియూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ర్యాలీ 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మికుల వ్యతిరేకవిధాలను వ్యతిరేకిస్తూ కర్నూలులో సీఐటియూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. నగరంలోని పాతబస్టాండ్ నుండి రాజ్ వీహార్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కార్మికులు పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ వైఖరి అవలభిస్తున్నాయని, ఈ విధాలను తిప్పికొట్టేందుకు  సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చామన్నారు.   కార్మికుల చట్టాలను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలను నిర్వీర్యం చేసిందని దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని  కార్మిక నేతలు తెలిపారు. పెట్టుబడిదారి వ్యవస్థకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భారీ రాయితీలు అందిస్తున్నాయని, కార్మికులకు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని వారు మండిపడ్డారు. ఇప్పటికైన కార్మికుల సమస్యలను ప్రభుత్వాలు గుర్తించి వాటి పరిష్కరానికి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
భారీ ర్యాలీ 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కర్నూలులో సీఐటియూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. నగరంలోని సీఐటియూ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్లొని భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలో ప్రతి కార్మికునికి కార్మిక చట్టం ప్రకారం కనీసవేతనం 18వేల రూపాయాలను చెల్లించాలని, ఉద్యోగ భద్రతను  కల్పించాలని సమ్మెలో పాల్గొన్న కార్మికులు డిమాండ్ చేశారు.   సీఐటియూ, ఏఐటియూసీ, ఐఎన్టీయూసీ, ఎపీఎన్జీవోలు సమ్మెలో  పాల్గోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరునూ నిరసీస్తూ నిరసన చేపట్టారు. జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా సీఐటీయూ, ఏఐటీయూసీ , మున్సిపల్‌, ఆర్టీసీ కార్మికులు భారీ ఎత్తున ర్యాలీ, ధర్నా నిర్వహించారు. కనీస వేతనాలు, కార్మిక సంక్షేమ కార్యక్రమాల అమలు చేపట్టాలని, కార్మికులకు  న్యాయం  చేయాలని ఈ సందర్భంగా కార్మిక నేతలు ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. 
డిపోల్లోనే నిలిచిపోయిన బస్సులు 
సమ్మె సందర్భంగా నగరంలో బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించి రో డ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సమ్మెలో భాగంగా ధర్నా చేపట్టిన సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు, కార్మికులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కార్మికులకు కనీసం 18 వేల రూపాయల వేతనం చెల్లించే వరకు ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కార్మిక నేతలు స్పష్టం చేశారు. పెంచిన నిత్యవసర ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కర్నూలు నగరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కర్నూలు టౌన్‌ ఆయిల్‌ అండ్‌ రైస్‌మిల్‌ వర్కర్స్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

19:42 - September 2, 2016

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా తుని విధ్వంసం ఘటనలో తాజాగా మరో 20 మందికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి, నెంబర్‌-1 న్యూస్‌ ఛానల్‌ అధినేత సుధాకర్‌నాయుడు సహా 20 మందికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సెప్టెంబరు 4న గుంటూరు, రాజమహేంద్రవరంలోని సీఐడీ కార్యాలయాల్లో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తుండగా అక్కడికి చేరుకున్న సీఐడీ పోలీసులు నోటీసు అందజేశారు. వారం రోజులుగా కరుణాకర్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో తిరుపతి ప్రెస్‌క్లబ్‌ వద్ద నోటీసు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. 

 

ఆ కుటుంబాలకు 20 శాతం అదనంగా నష్టపరిహారం : చినరాజప్ప

గుంటూరు : మావోయిస్టుల దాడిలో చనిపోయిన వారి కుటుంబాలు ఇచ్చే నష్టపరిహారం 20 శాతం అదనంగా ఇవ్వాలని నిర్ణయించామని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తుని ఘటనపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతుందన్నారు. 

 

జీఎస్టీ వల్ల రాష్ట్రానికి రూ.2,400 కోట్ల నష్టం : యనమల

గుంటూరు : జీఎస్టీపై యనమల అధ్యక్షతన నిర్వహించిన భేటీ ముగిసింది. జీఎస్టీపై కౌన్సిల్ లో మాట్లాడాల్సిన అంశాలపై చర్చించామని జీఎస్టీ వల్ల రాష్ట్రానికి రూ.2,400 కోట్ల నష్టం కలుగుతుందని యనమల రామకృష్ణుడు అన్నారు. నష్టాన్ని కేంద్రం పదేళ్లు భరించాలని కోరారు. 

నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీష్ రావు సమీక్ష

నల్గొండ : జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఎస్ ఆర్ ఎస్ పీ పనులపై నెలకోసారి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. 10న నాగార్జున సాగర్ లెవల్ కెనాల్ డ్రై రన్, 25న వెట్ రన్ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. 

 

రెండవ ఏఎన్ ఎంల సమ్మె తాత్కాలికంగా వాయిదా

హైదరాబాద్ : ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రెండ ఏఎన్ ఎంలు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. గత 47 రోజులుగా రెండవ ఏఎన్ ఎంలు సమ్మె చేస్తున్నారు. రెండో ఏఎన్ ఎంల సమస్యల్ని పరిష్కరించాలని.. లేని పక్షంలో మళ్లీ సమ్మె చేస్తామని ప్రభుత్వానికి హచ్చరించారు. 

 

18:49 - September 2, 2016

వరంగల్ : పర్యావరణాన్ని కాపాడ్డానికి వరంగల్ వాసులు నడుంబింగించారు. మట్టితో చేసిన గణేశ్‌ విగ్రహాలనే పెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్లాస్టర్‌ఆఫ్‌ పారీస్‌ విగ్రహాలకు ధీటుగా మట్టివినాయకులను  అందంగా రూపొందిస్తున్నారు. వీరికి గణేశ్‌ ఉత్సవ కమిటీలు కూడా సై అనడంతో .. అందరూ మట్టిగణపయ్యలకు జైకొడుతున్నారు. 
గణేశ్‌నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోన్న ఓరుగల్లు 
గణేశ్‌నవరాత్రి ఉత్సవాలకు ఓరుగల్లునగరం ముస్తాబవుతోంది. వాడవాడలా గణేశ్‌ప్రతిమలను కొలువుదీర్చేందుకు ఉత్సవకమిటీలు సిద్ధం అయ్యాయి. అయితే ఈసారి పర్యావరణ అనుకూలగణపతులనే పెడతామంటున్నారు భక్తులు. అటు వరంగల్ కార్పొరేషన్‌ అధికారులు కూడా మట్టివిగ్రహాలనే ప్రతిష్టించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  దీంతో నగరంలోని గణేశ్‌ ఉత్సవ మండళ్లు మట్టివిగ్రహాలనే పెడతామంటున్నారు. 
ఆకర్షిస్తున్న మట్టివిగ్రహాలు  
మట్టివిగ్రహాలే అయినా.. రసాయనాలతో తయారైయ్యే విగ్రహాలకంటే ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. తెలంగాణతల్లితోపాటు అమరవీరుల స్థూపం నమూనాలో తయారు చేసిన విగ్రహాలు బాగా ఆర్షిస్తున్నాయి. అంతేకాదు బాహుబలి, డ్రాగన్‌ ఆకృతిలో ఉన్న మట్టిగణపతులకోసం యువభక్తులు ఎగబడుతున్నారు.అయితే గతంలో నగరపాలక సంస్థ, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థలు మట్టివినాయకులను తయారు చేసి భక్తులకు అందుబాటులో ఉంచేవి. కాని..ఈసారి మాత్రం విగ్రహాల తయారీని వదిలేశాయి. దీంతో మట్టివిగ్రహాల తయారీదారులు ధరలను అమాంతం పెంచేశారు. ఒక్కో విగ్రహం ధర 10వేల నుంచి 70వేల రూపాయల వరకు చెబుతున్నారని భక్తులు అంటున్నారు. 
మట్టివిగ్రహాలనే ఏర్పాటు చేసుకోవాలని ప్రచారం  
మొత్తనానికి భక్తిభావంతో .. లోకకళ్యాణం కోసంమే దేవుణ్ని కొలుస్తామంటున్న భక్తులందరూ... పర్యావరణ అనుకూల మట్టివిగ్రహాలనే ఏర్పాటు చేసుకోవాలని వరంగల్‌ నగరపాలక సంస్థ ప్రచారం చేస్తోంది. దీంతో ఈసారి ఓరుగల్లులో ఎకోఫ్రెండ్లీ వినాయకుడే కొలుదీరనున్నాడని ప్రజలు సంతోషపడుతున్నారు. 

18:44 - September 2, 2016

హైదరాబాద్ : టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్‌ పదవి దక్కబోతోంది. కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్‌ కోటానుంచి ఆయన్ని గవర్నర్‌గా నియమించే అవకాశాలున్నాయి.. తాజాగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన గవర్నర్‌ స్థానాల్లో మోత్కుపల్లిని కూర్చోబెట్టే ప్రక్రియపై కేంద్రం కసరత్తు చేస్తోంది.. 
మోత్కుపల్లిని గవర్నర్‌గా ఎంపిక చేయాలని సిఫారసు 
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన మోత్కుపల్లి నరసింహులు గవర్నర్‌ రేసులో ముందున్నారు. వివాద రహితుడుగా పేరున్న మోత్కుపల్లిని గవర్నర్‌గా ఎంపిక చేయాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు సిఫారసు చేశారు. బాబు రికమండేషన్‌తో ఇటీవల ఖాళీ అయిన రాష్ట్రాల్లో గవర్నర్‌గా మోత్కుపల్లి పేరును కేంద్రం పరిశీలిస్తోంది.  
గవర్నర్‌ పదవి కోసం మోత్కుపల్లి ఎదురుచూపులు
గవర్నర్‌ పదవికోసం దాదాపు రెండున్నరేళ్లుగా మోత్కుపల్లి ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని నామినేటెడ్‌ పదవిగానీ... రాజ్యసభ సభ్యత్వం గానీ ఆశించారు.. తన కోరికను పలు సందర్భాల్లో చంద్రబాబుకు విన్నవించారు.. తిరుపతి మహానాడు వేదిక సాక్షిగా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు.. మోత్కుపల్లి కోరికను మన్నించిన బాబు గవర్నర్‌ పదవి ఇప్పించేందుకు ప్రయత్నించారు.. కొన్ని కారణాలతో ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది.. 
తమిళనాడు, త్రిపుర రాష్ట్రాలకు మోత్కుపల్లికి అవకాశం
తాజాగా త్రిపుర, మిజోరాం, గోవా, తమిళనాడు, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లో గవర్నర్లను నియమించే ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. దక్షిణ భారత దేశం నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఛాన్స్‌ మోత్కుపల్లికి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. తమిళనాడు, త్రిపుర రాష్ట్రాలకు ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మోత్కుపల్లితో పాటు.. గుజరాత్‌ మాజీ సీఎం ఆనందిబెన్‌, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రికమండ్‌ చేసిన శాంతారెడ్డికూడా గవర్నర్‌ పదవి బరిలో ఉన్నట్లు తెలుస్తోంది.. 
టూర్‌ తర్వాత కొత్త గవర్నర్ల ఎంపికపై స్పష్టత
ఈ నెల మూడునుంచి ప్రధాని మోదీ మయన్మార్‌ దేశంలో పర్యటించబోతున్నారు.. ఈ టూర్‌ తర్వాత కొత్త గవర్నర్ల ఎంపికపై తుదిరూపు ఇవ్వనున్నారు. మరోవైపు మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి ఇస్తే తెలంగాణలో టీడీపీ బలోపేతం అయ్యే అవకాశముందని నేతలు అంచనావేస్తున్నారు.. మోత్కుపల్లి గవర్నర్‌ అవుతున్నారంటూ ఆయన అనుచరుల్లో అప్పుడే సంతోషం కనిపిస్తోంది. 

 

18:40 - September 2, 2016

హైదరాబాద్ : విదేశాలకు వెళ్లి ఆరేళ్ల తరువాత తిరిగి హైదరాబాద్‌ చేరుకున్న ఎన్‌ఆర్‌ఐ దారుణ హత్యకు గురయ్యాడు. బోయిన్‌పల్లి శివారు ప్రాంతంలో సగం కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కెన్యాకు వ్యాపారం చేసేందుకు వెళ్లిన గౌతం రెడ్డి బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. ఆరేళ్ల తరువాత మూడు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చాడు. సాయంత్ర సమయంలో వాకింగ్‌కు వెళతానని మళ్లీ తిరిగి రాలేదు. మూడు రోజుల తరువాత ఈరోజు మధ్యాహ్నం మృతదేహం లభించింది.

18:39 - September 2, 2016

హైదరాబాద్ : మిషన్‌ కాకతీయ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న తమ వాదనకు ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తలే నిదర్శనమని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అన్నారు. రాష్ట్రంలోని మిషన్‌ కాకతీయ పనులు, ప్రాజెక్టుల టెండర్లపై అసెంబ్లీలో ఒకరోజు చర్చ చేపట్టాలని షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

 

18:35 - September 2, 2016

వరంగల్ : జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గోన్నారు. కార్మికులంతా కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వరంగల్ ఎంజీఎం హస్పటల్ ముందు మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసనగా నినాదాలు చేశారు. 

18:33 - September 2, 2016

హైదరాబాద్ : ప్రస్తుతం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని, దాని వల్ల ఉద్యోగ కల్పన తగ్గిపోతోందని జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగానే కార్మికులు తలపెట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతంగా కొనసాగుతోందన్నారు. 

 

మల్లేపల్లిలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు

హైదరాబాద్ : నాంపల్లి పీఎస్ పరిధిలోని మల్లేపల్లిలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. లిక్కర్ చాక్లెట్ల తయారీ కంపెనీలో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ చాక్లెట్ కంపెనీలో 6 లీటర్ల కంటే ఎక్కువ మద్యం ఉన్నట్లు గుర్తించారు. 

 

17:46 - September 2, 2016
17:30 - September 2, 2016

పనాజీ : గోవా ఆర్‌ఎస్‌ఎస్‌లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గోవా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ సుభాష్‌ వోలింగ్‌కర్‌ను తొలగించడంతో సంక్షోభం ముదిరింది. సుభాష్‌కు మద్దతుగా 4 వందల మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు రాజీనామాలు చేశారు. తనను పదవి నుంచి తప్పించడం వెనక కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారీకర్‌ హస్తముందని సుభాష్‌ వోలింగర్‌ ఆరోపిస్తున్నారు. గోవాలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌లో ముసలం బిజెపికి తలనొప్పిగా మారింది. వచ్చే ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా పనిచేస్తామని సుభాష్‌ వోలింగ్‌కర్‌ హెచ్చరించారు. అవసరమైతో కొత్త పార్టీ పెడతామని తెలిపారు. కోంకణ్‌, మరాఠీ భాషాల స్థానంలో ఇంగ్లీష్‌ను ప్రవేశపెట్టడాన్ని సుభాష్‌ వోలింగ్‌కర్‌ వ్యతిరేకిస్తున్నారు.

 

17:23 - September 2, 2016

లాటిన్ అమెరికా పెద్దన్న బ్రెజిల్...మూడు వారాల వ్యవధిలో రెండో ఒలింపిక్స్ కు సిద్ధమవుతోంది. 2016 ప్రధాన ఒలింపిక్స్ కు విజయవంతంగా ఆతిథ్యమిచ్చిన సాంబాల్యాండ్...సెప్టెంబర్ 7 నుంచి 18 వరకూ జరిగే 'పారా ఒలింపిక్స్' కు సైతం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. భారత్.. 17 మంది సభ్యుల బృందంతో ఏమాత్రం అంచనాలు లేకుండా పోటీకి దిగుతోంది. పారా అథ్లెట్ల నుంచి పతకాలు ఆశించడం అత్యాశే అవుతుంది. 2016 వేసవి ఒలింపిక్స్ ను విజయవంతంగా నిర్వహించిన బ్రెజిల్ కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే పారా ఒలింపిక్స్ కు సిద్ధమయ్యింది. బుద్ధిమాంద్యం, అంగవైకల్యం , బదిరుల కోసం ప్రత్యేకంగా నిర్వహించే పారా ఒలింపిక్స్ కు...అంతర్జాతీయ పారా ఒలింపిక్ సంఘం నేతృత్వంలో బ్రెజిల్ ఒలింపిక్ సంఘం భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద సాకర్ వేదిక రియో డి జెనీరోలోని మరకానా స్టేడియం వేదికగా సెప్టెంబర్ 7 నుంచి 18 వరకూ జరిగే ఈ స్పెషల్ ఒలింపిక్స్ లో 176 దేశాలకు చెందిన 4 వేల 500మంది అథ్లెట్లు పోటీపడబోతున్నారు.

1988 నుండి..
మొత్తం 23 రకాల క్రీడలకు చెందిన 528 అంశాలలో పోటీలు నిర్వహించబోతున్నారు. పుట్టుకతోనే మానసికంగా, శారీరకంగా పదిరకాల వైకల్యాలు ఉన్న క్రీడాకారులను మాత్రమే పారా ఒలింపిక్స్ లో పాల్గొనటానికి అనుమతి ఇస్తారు. నాలుగేళ్లకోసారి జరిగే సాధారణ ఒలింపిక్స్ తో ఏమాత్రం సంబంధం లేకుండా 1960లో మొట్టమొదటిసారి పారా ఒలింపిక్స్ నిర్వహించారు. 1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి మాత్రమే..సాధారణ ఒలింపిక్స్ కు అనుబంధంగా పారా ఒలింపిక్‌ నిర్వహిస్తూ వస్తున్నారు. వేసవి ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చిన వేదికలోనే పారా ఒలింపిక్స్ ను సైతం నిర్వహించేలా మార్పులు చేశారు. 1960 నుంచి 2012 వరకూ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతూ వస్తున్న పారా ఒలింపిక్స్ లో భారత్ కు సైతం 48 సంవత్సరాల చరిత్ర ఉంది.

పోటీల్లో భారత్...
ఇప్పటి వరకూ భారత అథ్లెట్లు రెండు స్వర్ణాలతో సహా మొత్తం ఎనిమిది పతకాలు మాత్రమే సాధించారు. ఇందులో మూడేసి రజత, కాంస్య పతకాలు సైతం ఉన్నాయి. హీడెల్ బర్గ్ వేదికగా 1972లో జరిగిన పారా ఒలింపిక్స్ లో భారత స్విమ్మర్ పెట్కార్ 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈతలో 37. 331 సెకన్ల ప్రపంచ రికార్డు టైమింగ్ తో బంగారు పతకం సాధించింది. పారా ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు ఇదే తొలి స్వర్ణపతకం కావడం విశేషం. 1984 పారా ఒలింపిక్స్ పురుషుల షాట్ పుట్ లో జోగిందర్ సింగ్ బేడీ రజత పతకం అందించాడు. జావలిన్, డిస్కస్ త్రో అంశాలలో సైతం కాంస్య పతకాలు సాధించాడు. జావలిన్ త్రోలో భీమ్ రావ్ కెసార్కర్ రజత పతకం గెలిచి దేశానికే గర్వకారణంగా నిలిచాడు. 2004 ఏథెన్స్ పారా ఒలింపిక్స్ జావలిన్ త్రో లో దేవేంద్ర జాజరియా బంగారు పతకం సాధిస్తే...పవర్ లిఫ్టింగ్ 56 కిలోల విభాగంలో రాజేందర్ సింగ్ కాంస్య పతకం గెలుచుకొన్నాడు.

భారత్ పతకాలు సాధిస్తుందా ? 
ఇక..2012 లండన్ ఒలింపిక్స్ పురుషుల హైజంప్ లో...గిరీశ నాగరాజ గౌడ రజత పతకం సాధించి..భారత పరువు నిలబెట్టాడు. గిరీశ పతకం పుణ్యమా అంటూ భారత్ పతకాల పట్టిక 67వ ర్యాంక్ లో నిలిచింది. ప్రస్తుత రియో పారా ఒలింపిక్స్ లో మాత్రం గతంలో ఎన్నడూ లేనంతగా 17 మంది సభ్యుల బృందంతో భారత్ పోటీకి దిగుతోంది. 15 మంది పురుషులు, ఇద్దరు మహిళలతో కూడిన భారత అథ్లెట్ల జట్టు ఏమాత్రం అంచనాలు లేకుండా ఐదురకాల క్రీడల్లో మాత్రమే పాల్గొంటోంది. ప్రధాన ఒలింపిక్స్ లో 118 సభ్యుల భారీ బృందంతో పాల్గొని రెండంటే రెండు పతకాలతో...67వస్థానంలో నిలిచిన భారత్...17 మంది సభ్యుల జట్టుతో పాల్గొంటున్న పారా అథ్లెట్ల నుంచి పతకాలు ఆశించడం అత్యాశే అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

17:20 - September 2, 2016

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని మర్దాన్‌ జిల్లా కోర్టులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు మరో 40 మంది గాయపడ్డారు. మృతుల్లో న్యాయవాదులు, పోలీసులు, పౌరులు ఉన్నారు. 52 మందిని ఘటన స్థలం నుంచి కాపాడినట్లు చీఫ్‌ రిస్క్‌ అధికారి హారిస్‌ హబీబ్‌ తెలిపారు. ఉదయం కోర్టు కిట కిటలాడుతున్న సమయంలో ఓ వ్యక్తి ముందుగా గ్రెనేడ్లు విసిరి ఆ తర్వాత తనని తాను పేల్చుకున్నాడు. ఆత్మహుతి దాడిపై ఇంతవరకు ఏ సంస్థ ప్రకటన చేయలేదు.

 

17:18 - September 2, 2016

ఢిల్లీ : జిఎస్‌టి బిల్లును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వద్దకు పంపడానికి మార్గం సుగమమైంది. జిఎస్‌టి బిల్లును ఇదివరకే 15 రాష్ట్రాలు ఆమోదించగా తాజాగా ఒడిషా విధానసభ కూడా బిల్లును పాస్‌ చేసింది. జిఎస్‌టి బిల్లును ఆమోదించిన16 రాష్ట్రాల్లో 8 బీజేపీ పాలిత సంకీర్ణ ప్రభుత్వాలు కాగా మిగిలిన 8 ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు. దీంతో దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదించాలన్న నిబంధనను సంతృప్తిపరచినట్లయింది. ఈ నేపథ్యంలో  బిల్లును ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ట్వీట్‌ చేశారు. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తర్వాత, జీఎస్‌టీ కౌన్సిల్‌ను ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. ఏయే ఉత్పత్తులు, సేవల మీద ఎంత శాతం పన్ను విధించాలి!? ఎంత శాతం సెస్సులు విధించాలనే అనే అంశాలను జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్ణయిస్తుంది. జిఎస్‌టి డెడ్‌లైన్ ఏప్రిల్‌ 1, 2017తో ముగుస్తుంది.

17:18 - September 2, 2016

యూఎస్ ఓపెన్ వేదిక... ఆర్థర్ యాష్ స్టేడియంలో వర్షం దెబ్బతో మ్యాచ్ లు నిలిచిపోయే రోజులకు కాలం చెల్లింది. కుండపోతగా వర్షం పడుతున్నా నిరంతరాయంగా మ్యాచ్ లు నిర్వహించే సదుపాయం ఏర్పడింది. ఆ సదుపాయం ఏంటో చూడాలంటే చదవండి..
రాయల్ గేమ్ టెన్నిస్సా..మజాకానా..అనుకోవాల్సిందే. అమెరికన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీల్లో ఆఖరి చాంపియన్షిప్. గత శతాబ్దకాలంగా నిరంతరాయంగా జరుగుతూ వస్తున్న టోర్నీ. అంతేకాదు...గ్రాండ్ స్లామ్ సర్క్యూట్ లో అత్యధికంగా ప్రైజ్ మనీ ఇచ్చే చాంపియన్షిప్ యూఎస్ ఓపెన్ మాత్రమే. అయితే...కుండపోతగా వర్షం పడితే మాత్రం ఆర్ధర్ ఏష్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్ లకు గత ఏడాది వరకూ అంతరాయం కలుగుతూ ఉండేది. 2016 సీజన్ నుంచి మాత్రం ఆ బాధ తప్పింది. సింగిల్స్ రెండోరౌండ్ పోటీలు జరుగుతున్న సమయంలో భారీ వర్షం రావడంతో...రిట్రాక్టబుల్ రూఫ్ తో ఏర్పాటు చేసిన కదిలే పైకప్పును తొలిసారిగా ఉపయోగించారు.

ఏడు నిమిషాల పాటు...
గత ఏడాది వెయ్యికోట్ల రూపాయల ఖర్చుతో ఈ పైకప్పును ఏర్పాటు చేశారు. వర్షం మొదలయ్యిందంటే చాలు ఈ కప్పు పూర్తిస్థాయిలో తెరుచుకోడానికి ఏడు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్- యాండ్రియాస్ సెప్పీ ల మధ్య ముగిసిన రెండోరౌండ్ మ్యాచ్ సమయంలో ఈ రిట్రాక్టబుల్ రూఫ్ ను తొలిసారిగా ఉపయోగించారు. మ్యాచ్ ను ఏడున్నర నిమిషాలపాటు నిలిపి మరీ..కదిలే పైకప్పు పూర్తిగా విచ్చుకొనేలా చేశారు. దీంతో మ్యాచ్ ఏలాంటి అంతరాయం లేకుండా సాగింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపూ వెలుతురు సాధారణ స్థాయిలోనే ఉన్నా..అభిమానుల అరుపులు, కేకలు, కరతాళ ధ్వనులతో మాత్రం స్టేడియం హోరెత్తిపోయినట్లుగా నిర్వహాక సంఘం గుర్తించింది.

టెన్నిస్సా..మజాకా..
మొత్తం మీద...గ్రాండ్ స్లామ్ టెన్నిస్ వేదికల్లో రిట్రాక్టబుల్ రూఫ్ సదుపాయం ఏర్పాటు చేసిన మూడో వేదికగా అమెరికన్ ఓపెన్ రికార్డుల్లో చేరింది. ఇంతకు ముందే మెల్బోర్న్ లోని ఆస్ట్రేలియన్ ఓపెన్, లండన్ లోని వింబుల్డన్ స్టేడియాలు ..రిట్రాక్టబుల్ రూఫ్ కమ్ కదిలే పైకప్పు సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోగలిగాయి. పారిస్ లోని రోలాండ్ గారోస్ వేదికగా జరిగే ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహక సంఘం మాత్రం రిట్రాక్టబుల్ రూఫ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోడానికి ఏమంత ఆసక్తిచూపడం లేదు. వర్షం కురిసే సమయంలో మాత్రమే తెరుచుకొనే స్టేడియం పైకప్పుకోసమే వెయ్యికోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే రాయల్ గేమ్ టెన్నిస్సా...మజాకానా..అనుకోవాల్సిందే మరి.

17:14 - September 2, 2016

హైదరాబాద్ : దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులంతా సమ్మె బాట పట్టారు. సుందరయ్య పార్క్‌ నుంచి ఇందిరాపార్క్‌ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం చేపడతున్న విధానాలను నిరసిస్తూ కార్మికులంతా నినాదాలు చేపట్టారు. మోదీ ఇప్పటికైనా వెనక్కి తగ్గకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:42 - September 2, 2016
16:41 - September 2, 2016

రేపటి నుండి మహాగణపతి సందర్శనకు అనుమతి..

హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి సందర్శనకు రేపటి నుండి అనుమతినివ్వనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈసారి శ్రీ శివశక్తి పీఠ నాగేంద్ర మహా గణపతిగా 58 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణనాథుడు కొలువుదీరాడు. 

ఎస్సారెస్పీ పనులను వేగవంతం చేయాలి - హరీష్..

హైదరాబాద్ : నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఎస్సారెస్పీ రెండో దశ పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది ఎస్సారెస్పీ రెండో దశకు నీరివ్వాలని అధికారులను ఆదేశించారు. 

16:29 - September 2, 2016

ఢిల్లీ : దేశవ్యాప్త సార్వత్రికి సమ్మె ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలోను కనిపించింది. పెద్దఎత్తున కార్మిక సంఘాలు రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు తెలుపుతూ సమ్మెలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

6న ఏపీ మంత్రివర్గం సమావేశం..

విజయవాడ : ఈనెల 6వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11గంటలకు కేబినెట్ సమావేశం కానున్నట్లు, గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల సమీక్షతో పాటు పలు అంశాలపై మంత్రివర్గ అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. 

లాభాల్లో స్టాక్ హార్కెట్లు..

ముంబై : గురువారం నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 108.63 పాయింట్లు లాభపడి 28,531.11 వద్ద ముగియగా నిఫ్టీ 35 పాయింట్ల లాభంలో 8,809.65 వద్ద ముగిసింది. 

సిద్ధూ కొత్త పార్టీ..

పంజాబ్ : ఇటీవలే బీజేపీకి గుడ్ బై చెప్పి ఆప్ లో చేరుతారని అనుకున్న సిద్ధూ కొత్త పార్టీని స్థాపించారు. ఈ నెల 9న ఆవాజ్-ఇ-పంజాబ్ అనే రాజకీయపార్టీని సిద్ధూ ప్రారంభించనున్నట్లు సమాచారం. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు సిద్ధూను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే. 

16:16 - September 2, 2016

చాయ్..సమోస..కు ఎంత ఖర్చు అవుతుంది ? అంటే ఆ ఎంత చాయ్ ఆరు రూపాయలు..సమోస పది రూపాయలు..మొత్తం రూ. 12 అవుతుంది అని అంటుంటారు. ఆయా ప్రాంతాలను బట్టి ధర మారుతుంది అని అంటారు కదా.. కానీ చాయ్..సమోస కోసం లక్షలు ఖర్చయితే ఎలా ? అని అంటే ఆశ్చర్యపోతారు కదా ? కానీ ఇది నిజం..కేవలం చాయ్ సమోస కోసం రూ. 8 కోట్ల 78 లక్షల 12 వేలు ఖర్చు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగేండ్లలో ఇదంతా ఖర్చు చేశారంట. ఇందులో అత్యధికంగా ఖర్చు చేసిన జాబితాలో అరుణ్ కుమార్ కోరి ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆయన ఏకంగా రూ. 22.93 లక్షలు ఖర్చు చేశారు. రూ. 22.86 లక్షలతో ఆజంఖాన్ తరువాతిస్థానంలో నిలిచారు. ఈ లెక్కలను స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పేర్కొనడం విశేషం. మంత్రులను కలిసేందుకు రోజుకు వందల మంది వస్తుంటారని.. వారికి కనీసం చాయ్, సమోసా కూడా ఇవ్వొద్దా..? అని ఎదురు ప్రశ్నించారంట.

16:07 - September 2, 2016

తూర్పుగోదావరి : దేశవ్యాప్త సమ్మె కాకినాడలో ప్రశాంతంగా కొసాగుతుంది. బంద్ ప్రభావంతో కాకినాడ పట్టణంలో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పారిశ్రామిక వాడలన్ని నిర్మానుష్యంగా మారాయి. కాకినాడ సీ పోర్టు వద్ద కార్మికులు సమ్మెకు మద్దతు తెలిపి ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:05 - September 2, 2016

ఉదయం లేచిన తరువాత వివిధ పనుల్లో నిమగ్నమౌతుంటాం. కానీ కొంతమంది మహిళలు ఇంట్లోనే ఉంటుంటారు. కొద్దిమంది మహిళలు ఎక్కువగా కూర్చొంటుంటారు. దీనివల్ల పలు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశ ఉందని, ఇలా కాకుండా గంటల కొద్ది కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి అటు ఇటు తిరగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు పేర్కొంటున్నారు. మరి ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చూద్దాం..
చాలా సేపు నిల్చోవడం వల్ల నడుం సమస్య వస్తుందని అంటుంటారు. ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల కూడా నడుం సమస్య వస్తుంది.
ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల డయాబేటిస్ సమస్య వస్తుంది.
గుండె ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా భవిష్యత్ లో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ఎప్పుడూ కూర్చుని ఉండే వాళ్ళకు డిస్కుల అరుగుదల ఎక్కువగా ఉండడంతో పాటు వెన్నుపూస డిస్కుల మీద శరీర భారమంతా పడి ఆ డిస్కులు త్వరగా క్షీణిస్తాయి. అలా కాకుండదంటే నడుముకు సంబందించిన వ్యాయామాలు తప్పకుండా చేసి తీరాల్సిందేనని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
వీలైతే నడక, సైక్లింగ్‌ చేస్తే కొంతవరకూ ఈ సమస్యను అధిగమించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

15:57 - September 2, 2016

అనంతపురం : ప్రాజెక్టులను పూర్తి చేసి అనంతపురాన్ని సుశ్యామలం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం పర్యటనలో ఉన్న చంద్రబాబు వేరుశనగ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతపురంపై వర్షాభావ పరిస్థితి తీవ్రంగా ఉందని అన్నారు. టీడీపీని గౌరవించే అనంతపురం తనకు అత్యంత ప్రీతివంతమైన జిల్లా అని పేర్కొన్నారు. పంటసంజీవని, రెయిన్‌గన్  విధానాలతో...నదుల అనుసంధానంతో జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి... అనంతపురాన్ని సుశ్యామలం చేస్తామని చెప్పారు. 

 

15:52 - September 2, 2016

వాషింగ్టన్ : అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసా ప్రయోగ కేంద్రం సమీపంలో స్పెస్‌ఎక్స్ రాకెట్‌ లాంచింగ్ సందర్భంగా పెద్ద పేలుడు సంభవించింది. ఎప్పటిలాగే రాకెట్‌ను ప్రయోగిస్తుండగా..ఒక్కసారిగా భారీ శబ్ధంతో రాకెట్‌ పేలింది. మానవరహిత స్పేస్ ఎక్స్‌ను పరీక్షించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా..ఈ ఘటన చోటుచేసుందని నాసా వెల్లడించింది. కెన్నెడీ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం పక్కనే ఉన్న కేప్ కార్నివాల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో జరిగిన ఈ పేలుడుతో కొన్ని మైళ్ల దూరం వరకున్న భవనాల్లో అద్దాలు పగిలిపోయాయి. అయితే మొదటి పేలుడు జరిగిన కాసేపటికే మరో రెండుసార్లు పేలుళ్లు పెద్ద ఎత్తున జరిగాయి. దీంతో ఆ ప్రాంతమంతా భారీ శబ్దాలతో దద్దరిల్లింది. రాకెట్‌ పేలుడుతో జరిగిన నష్టం వేలకోట్లలో ఉంటుందని నాసా అంచనా వేస్తోంది. 

 

15:50 - September 2, 2016

హైదరాబాద్ : గద్వాలను జిల్లాగా ప్రకటించాల్సిందేనని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్ చేశారు. గద్వాలను జిల్లా చేయాలని కోరుతూ రేపు ఇందిరాపార్క్‌ దగ్గర రెండు రోజుల నిరాహర దీక్షకు రెడీ అంటున్న డీకే అరుణ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. గద్వాలను వనపర్తిలో కలపకుండా గద్వాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు సిద్ధమన్నారు. గద్వాలను వనపర్తిలో కలపొద్దన్నారు. వనపర్తిని జిల్లా చేయోద్దంటూ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. మరోసారి సీఎం దృష్టికి గద్వాల అభిప్రాయాన్ని తీసుకెళ్లేందుకే నిరాహార దీక్ష అన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరంజన్‌ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని చెప్పారు. 

 

చంబలో ఆరుగురు యాత్రికుల మృతి..

హిమాచల్ ప్రదేశ్ : చంబ లోని ఓ లోయలో వ్యాన్ (హెచ్ పి 54ఎ 1999) పడిపోవడంతో ఆరుగురు యాత్రికులు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. 

15:42 - September 2, 2016

బాలీవుడ్..టాలీవుడ్..కోలీవుడ్..ఇలా ఏ వుడ్ లోనైనా హిట్ ఫెయిర్ అంటూ ఓ జంట ఉంటుంటంది. వీరు నటించే సినిమాలన్నీ విజయవంతం అవుతుంటాయి. దీనితో దర్శక..నిర్మాతలు వీరినే హీరో..హీరోయిన్స్ గా నటింపచేస్తుంటారు. ఈ జాబితాలో 'కాజల్', 'అల్లు అర్జున్' చేరారు. వీరు గతంలో నటించిన 'ఆర్య -2', 'ఎవడు' ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. వీరిద్దరీ కెమిస్ట్రీకి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఇదిలా ఉంటే 'అల్లు అర్జున్' తాజా చిత్రం 'డీజే' (దువ్వాడ జగన్నాథమ్) నటిస్తున్న సంగతి తెలిసిందే. 'హరీశ్ శంకర్' దర్శకత్వంలో 'దేవీశ్రీ ప్రసాద్' సంగీతంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 'బన్నీ' సరసన 'కాజల్' నటింపచేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు టాక్. మరి ఈ చిత్రంలో 'కాజల్' నటిస్తుందా ? లేదా ? అన్నది వేచి చూడాలి. 

గోరటి వెంకన్నకు కాళోజీ అవార్డు..

హైదరాబాద్ : ప్రజాకవి గోరటి వెంకన్నకు కాళోజీ అవార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అవార్డుతో పాటు రూ. 1,01,116 ప్రధానం చేయనుంది. 

కోర్టులో నయీం ఇంట్లో దొరికిన పిల్లలు..

హైదరాబాద్ : హతమైన గ్యాంగ్ స్టర్ నయీం ఇంట్లో దొరికిన నలుగురు పిల్లలను రాజేంద్రనగర్ కోర్టులో నార్సింగి పోలీసులు ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం రాజేంద్రనగర్ లో ఓ ఆశ్రమంలో పిల్లలు ఉంటున్నారు. 

అదృశ్యమైన ఎన్ఆర్ఐ దారుణ హత్య..

హైదరాబాద్ : బోయిన్ పల్లిలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఎన్ఆర్ఐ గౌతంరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. కెన్యా నుండి ఆరేళ్ల తరువాత తిరిగి వచ్చిన రోజు నుండే గౌతంరెడ్డి కనిపించలేదు. 

15:31 - September 2, 2016

మెదక్ : సంగారెడ్డిలో సార్వత్రిక సమ్మె ప్రశాతంగా కొనసాగుతోంది. అన్ని రంగాల కార్మికులు సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు టెన్ టివితో మాట్లాడారు. సమ్మె అద్భుతంగా జరుగుతుందన్నారు. ఆటో, రిక్షా, హమాలీలుకార్మికులతో పాటు పలు కార్మిక సంఘాలు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నాయని తెలిపారు. కార్మిక సంఘాల ఐక్యవేదిక అధ్వర్యంలో ఐక్యత సాధిస్తామన్నారు. క్షేత్రస్థాయి కార్మిక సంఘాల ఆధ్వర్యంలోనే ఐక్యత సాధ్యమని స్పష్టం చేశారు. కార్పొరేట్ సేవలో కేంద్రప్రభుత్వం మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. మోడీ సర్కార్ కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. కార్మిక హక్కుల కోసం ఐక్య పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

జాను సురేష్ కుమార్ కుటుంబానికి రూ. పది లక్షల విడుదల..

వరంగల్ : తెలంగాణ అమరవీరుల పథకం కింద వరంగల్ జిల్లాకు ఊరుగోండకు చెందిన జాను సురేష్ కుమార్ కుటుంబానికి రూ. 10 లక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 

రాజీ భవన్ గా రాజ్ భవన్ - సి.రామచంద్రయ్య...

కడప : రాజ్ భవన్ రాజీ భవన్ గా మారిపోయిందని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసు ఏపీ అభివృద్ధికి గుదిబండగా మారిందన్నారు. చంద్రబాబు నిప్పులాంటి మనిషి అయితే ఓటుకు నోటు కేసులో విచారణకు సహకరించాలని సూచించారు.

వీణా - వాణిలకు ఆపరేషన్ కు ఆస్ట్రేలియా వైద్యులు...

హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణా-వాణీలకు ఆపరేషన్ చేసేందుకు ఆస్ట్రేలియా వైద్యుల బృందం ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. 

పాకిస్తాన్ లో వరుసగా ఉగ్రదాడులు.

పాకిస్థాన్ : వరుసగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మర్దన్ పట్టణంలో రెండు చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగాయి. పది మంది మృతి చెందగా 40 మందికి గాయాలయ్యాయి. కొద్దిసేపటి క్రితమే పెషావర్ లోని క్రిస్టియన్ కాలనీలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ సందర్భంగా పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. 

15:22 - September 2, 2016

హైదరాబాద్ : యువతకు ఉత్తమమైన శిక్షణ ఇస్తామని టీఆర్ ఎస్ ఎంపీ కవిత తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం డిజైన్ సెంటర్ ప్రారంభం అయింది. ఈ సెంటర్ ను ఎంపీ కవిత, కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు రంగాల్లో యువతకు తెలంగాణ జాగృతి శిక్షణ ఇస్తుందని చెప్పారు. తెలంగాణ జాగృతి సొంత ప్రయోజ ప్రజల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తుందన్నారు. దేశంలో 5 శాతం నిరుద్యోగులు ఉన్నారని.. 7.3శాతం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు నిరుద్యోగులుగా ఉన్నారని తెలిపారు. ఎంపవర్ మెంట్ అభివృద్ధి.. రియల్ డెవలప్ మెంట్ అని అన్నారు. మనిషి.. మానవ వరులను అభివృద్ధి చేసుకున్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి దత్తాత్రేయతోపాటు పలువురు ప్రముఖలు హాజరయ్యారు. 

 

సిక్కోలులో నేతల అరెస్టు..

శ్రీకాకుళం : జిల్లాలో కేఆర్ పురంలో సమ్మెలో పాల్గొన్న 50 మంది కార్మికులు, సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం నుండి పోలీసులు తాగునీరు, భోజనం కల్పించలేదు. 

లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధియే లక్ష్యం - రూఢీ..

హైదరాబాద్ : అశోక్ నగర్ లోని జాగృతి ఆధ్వర్యంలోని స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం డిజైన్ సెంటర్ ప్రారంభమైంది. ఈ సెంటర్ ను కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీ కవిత, ఎమ్మెల్యే లక్ష్మణ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రూఢీ మాట్లాడారు. లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని, టీఎస్ యువతకు నైపుణ్య శిక్షణలు ఇస్తున్న తెలంగాణ జాగృతికి అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నైపుణ్య శిక్షణకు అవసరమైన నిధులిస్తామన్నారు. 

రాజేంద్రనగర్ కు చేరుకున్న రాజ్ నాథ్ సింగ్..

హైదరాబాద్ : రాజేంద్రనగర్ లోని నేషనల్ పోలీసు అకాడమీకి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేరుకున్నారు. అకాడమీలో కొత్తగా నిర్మించనున్న క్యాంటీన్ ను రాజ్ నాథ్ ప్రారంభించనున్నారు. ట్రైనీ ఐపీఎస్ లతో రాజ్ నాత్ ఇష్టాగోష్టి నిర్వహించనున్నారు. 

సింగరేణిపై సమ్మె ఎఫెక్ట్..

కరీంనగర్ : సింగరేణిపై సమ్మె ప్రభావం కనిపించింది. రామగుండం రీజియన్ పరిధిలోని నాలుగు ఓపెన్ కాస్టులు 9 భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రూ. 2 కోట్ల మేర నష్టం కలిగింది.  

సమ్మె విచ్ఛిన్నానికి కుట్రలు - తపన్ సేన్...

ఢిల్లీ : జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వరకు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో తపన్ సేన్..అమర్ జిత్ కౌర్ లు పాల్గొన్నారు. సమ్మె విచ్ఛిన్నానికి కేంద్ర మంత్రులు కుట్రలు చేధిస్తూ కార్మికులు పెద్దు ఎత్తున సమ్మె చేపట్టారని తపన్ సేన్ వ్యాఖ్యానించారు. 13 రాష్ట్రాల్లో పూర్తి బంద్ వాతావరణం నెలకొందని, దేశ వ్యాప్తంగా రవాణా రంగం పూర్తిగా స్తంభించిందన్నారు. కులం..మతం పేరిట ప్రజలను విభజిస్తున్న కేంద్రం కార్మికులను విభజించే ప్రయత్నం చేసిందన్నారు. బీఎంఎస్ నేతలు సమ్మెకు దూరంగా ఉన్నా బీఎంఎస్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని పేర్కొన్నారు.

ఏపీ టూరిజంలో అభివృద్ధి లేదు - మంత్రి యనమల..

గుంటూరు : జిల్లాలో వెలగపూడిలో ట్రెజరీస్, ఏపీ జీఎల్ఐ, టూరిజం పాలసీపై మంత్రి యనమల నిర్వహించిన సమీక్ష ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి యనమల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఆలస్యం కాకుండా వేతనాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి యనమల తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే ఏజెన్సీలు తొలి వారంలోనే వేతనం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.గత రెండేళ్లుగా ఏపీ టూరిజంలో అభివృద్ధి చెందలేదని, రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు.

14:29 - September 2, 2016

సినిమా రంగంలోకి రావాలని ఎంతో మంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఎలాగో అలా ఈ రంగంలోకి అడుగడిన తరువాత ఇతర వుడ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుపుతుంటారు. బాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్లు హాలీవుడ్ లో ఎంట్రీకి ఉత్సాహం చూపుతుంటారు. అందులో కొందరు హీరోయిన్స్ సక్సెస్ అయ్యారు. దీపికా పదుకొనే..ప్రియాంక చోప్రా వంటి నటీమణులు ఇప్పటికే హలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'త్రిఫుల్‌ ఎక్స్'లో దీపికా పదుకొనె, 'బేవాచ్‌'లో ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం విదితమే. తాజాగా వీరి జాబితాలో పరిణీతి చోప్రా కూడా చేరింది. ఇటీవల ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న పరిణీతి హాలీవుడ్ ఎంట్రీపై స్పందించారు. కేవలం తాను ఇక్కడ ఆరు సినిమాలు మాత్రమే చేయడం జరిగిందని, ఇంకా ప్రేక్షకులు మెచ్చే మరెన్నో సినిమాల్లో నటించాల్సి ఉందన్నారు. ఇప్పటికైతే బాలీవుడ్ లో రాణించడమే తన టార్గెట్ అని కానీ మంచి స్ర్కిప్ట్ తో హాలీవుడ్ లో అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని ఖరాఖండిగా చెప్పింది. ప్రస్తుతం గాయనిగా 'మేరీ ప్యారీ బిందు' చిత్రంలో పరిణీతి నటిస్తోంది. 

14:25 - September 2, 2016

'నిప్పు'రా అంటున్న బాబు..

విజయవాడ : ఓటుకు నోటు కేసు పునర్విచారణను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తనపై వెల్లువెత్తుతున్న విమర్శలను టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తిప్పికొట్టారు. రాయలసీమలోని కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిత్వం గురించి ప్రస్తావిస్తూ తన పాలన తీరుపైనా వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను నిప్పులా బతుకుతున్నా. అవినీతికి తావు లేకుండా... నీతి నిజాయతీతో పాలన సాగిస్తున్నా’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రెండో రోజు కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

గుంటూరు : వెలగపూడి సచివాలయంలో రెండో రోజు కేబినెట్ సబ్‌కమిటీ సమావేశమైంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో టూరిజం పాలసీ, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు సమాచారం. 

జాగృతి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభం..

హైదరాబాద్ : అశోక్‌నగర్‌లో జాగృతి స్కిల్ డెవలప్‌మెంట్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కేంద్ర మంత్రి రాజీవ్‌ప్రతాప్‌రూడీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కవిత ప్రారంభించారు. 

నగరంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్..

హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మలు రాజ్ నాథ్ సింగ్ కు సాదర స్వాగతం పలికారు. 

ఇందిరాపార్కు వద్ద సభ ప్రారంభం..

హైదరాబాద్ : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు ఎస్వీకే నుండి భారీ ప్రదర్శన నిర్వహించాయి. అనంతరం ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. 

లెనిన్ సెంటర్ లో భారీ బహిరంగ సభ..

విజయవాడ : దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా లెనిన్ సెంటర్ లో కార్మిక సంఘాలు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. సీపీఎం, సీపీఐ, వైసీపీ నేతలు మధు, గఫూర్, రామకృష్ణ, గౌతం రెడ్డిలు పాల్గొన్నారు. 

13:56 - September 2, 2016

ఫ్యాషన్ ప్రపంచంలో చీరలదెప్పుడూ ఎవర్ గ్రీన్ కాస్ట్యూమే. అందుకే రోజూవారీ ఆఫీసులకైనా, స్పెషల్ అకేషన్ కైనా చీరలకే ఫస్ట్ ప్రయారిటీ. అలాంటి ఎవర్ గ్రీన్ కాస్టూమ్ డిజైన్స్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు. 

అరికెరలో సీఎం బాబు పర్యటన..

కర్నూలు : జిల్లాలోని అరికెరలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. రైతులకు రెయిన్ గన్ లను పంపిణీ చేసి పంటలను సీఎం బాబు పరిశీలించారు. 

13:54 - September 2, 2016

ఈ తరం అమ్మాయిలకు చదువు, ఉద్యోగం, ఆర్థిక స్వావలంబన ఎంత అవసరమో.. ఆత్మరక్షణా మార్గాలు తెలిసుండడం కూడా అంతే అవసరం. అందుకే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి నిర్భయ. 

13:51 - September 2, 2016

ముస్లింల తలాక్ విషయంలో దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్రం జోక్యం చేసుకోవాలని వ్యాఖ్యానించింది.

హాజీ అలీ దర్గాలోని అంతర్భాగంలోకి మహిళల ప్రవేశానికి అనుమతినివ్వాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. తీర్పు వెలువరిస్తూ, మహిళల భద్రతకు ప్రభుత్వం, దర్గా ట్రస్ట్‌ బాధ్యత పడాలని కోర్టు పేర్కొంది.

దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ కు ప్రత్యేక గౌరవం దక్కింది. యూఎన్ విమెన్ మహిళా విభాగానికి ఎంపికై ప్రత్యేకత చాటుకుంది.

‘బాహుబలి’ సినిమాలో శివగామి(రమ్యకృష్ణ) పాత్ర గుర్తుందా! అందులో ఆమె నీళ్లలో మునిగిపోతూ కూడా పసివాడిని అలాగే చేతిలో నీళ్లపై తేలేలా పట్టుకున్న సన్నివేశం గుర్తొచ్చిందా! ఇంచుమించు అలాంటి సంఘటనే ఇటీవల అమెరికాలో జరిగింది. నీళ్లలో పడిన రెండేళ్ల వయసు కుమారుడిని కాపాడుకునే క్రమంలో ఓ తల్లి తన ప్రాణాలను తృణప్రాయంగా ఎంచింది. తాను మునిగిపోతూ కూడా తన బిడ్డను అలాగే నీళ్లపై తేలే విధంగా ఎత్తిపట్టుకుంది. కన్నబిడ్డను సురక్షితంగా కాపాడుకుని...తాను మాత్రం ప్రాణాలు వదిలేసింది.

జీవితంలో చాలా సాధించాలనుకుంటాం. డబ్బులు బాగా సంపాదించి.. ప్రపంచాన్ని చుట్టిరావాలని కలలు కంటాం. కొందరు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వారి లక్ష్యాలు పక్కన పెట్టి కుటుంబాన్ని పోషించేందుకు జీవితం అంకితం చేస్తారు. మరికొందరికి ఆర్థికంగా బాగానే ఉన్నా.. ప్రపంచాన్ని చుట్టేసే తీరిక.. ఆసక్తి ఉండదు. కానీ.. ఓ వృద్ధురాలు తన కలను 101ఏళ్ల వయస్సులో నెరవేర్చుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పుడు పాస్‌పోర్టును తీసుకుని విస్మయపరిచింది.

పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు రికార్డు సృష్టించారు. బోయింగ్ 777 విమానాన్ని అలవోకగా నడిపేశారు. 

13:35 - September 2, 2016
13:31 - September 2, 2016

విజయవాడ : కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు జరుగుతున్న సార్వత్రిక సమ్మె విజయవాడలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆటోనగర్‌లో కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో లక్షమంది పైగా పనిచేసే ఆటోనగర్ వెలవెల బోతుంది. ఆటో కార్మికులు కేంద్ర ప్రభుత్వం మొండివైఖరిని వ్యతిరేకిస్తూ స్వచ్చంధంగా బంద్ నిర్వహించారు. లక్ష మంది ఆటోనగర్ లో కార్మికులున్నారని, వీరంతా సమ్మెలో పాల్గొనడం జరిగిందన్నారు. 

13:31 - September 2, 2016

'జోష్'సినిమాతో తెరగ్రేటం చేసిన అక్కినేని వారసుడు..తెలుగు సినిమా మన్మధుడు నాగార్జున తనయుడు నాగచైతన్య. ఇప్పటికే గౌతమ్ మీనన్ సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నాడు చైతూ..గౌతమ్ మీనన్ సినిమాలలో నటనకు ప్రాధాన్యం ఎంతగా వుంటుందో అందరికీ తెలిసిందే.. నాగ చైతన్య, మంజిమా మోహన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలోని వెళ్లిపోమాకే వీడియో సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు. గౌతం మీనన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలోని వెళ్లిపోమాకే అని సాగే ఈ పాట ఈ చిత్రానికి హైలైట్ అంటున్నారు. స్వర మాంత్రికుడు ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. బిగ్గెస్ట్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ లో తనతో కూడా ఓ సినిమా చేయమని నాగార్జున గౌతమ్ మీనన్ ని రిక్వెస్ట్ చేశారు. దీనికి చిరునవ్వు నవ్విని గౌతమ్ ని చూసి ఎప్పుడు అడిగినా ఇలాగే నవ్వుతారు తప్ప ఓకే అనరనీ..మళ్లీ ఎప్పుడో వచ్చిన చైతూని 'సినిమా చేద్దాం'అని తీసుకుపోతారని నాగార్జున అనటంతో ఆడియో ఫంక్షన్ లో నవ్వులు పూశాయి. కాగా గౌతమ్ మీనన్ సినిమా చాలా ప్రత్యేకంగా వుంటుంది. మరి పాటల విషయంలో లిరిక్ నుండి సంగీతం వరకూ కూడా కళ్లు మూసుకుని పాట వింటే పాట అయ్యేంతవరకూ కూడా తెరవాలని అనిపించదు మరి..దీనికి ఆయన పిక్చరైజేషన్ ఒక ఎత్తు అయితే స్వరాల మాంత్రికుడు రెహమాన్ స్వరాలు మరొక ఎత్తుగా వుంటాయి. ఈ సినిమాలో ప్రతీపాట ఇప్పటకే హిట్ అయిన విషయం తెలిసిందే.

13:30 - September 2, 2016

నిజామాబాద్ : జిల్లాలో సార్వత్రిక సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాటు పట్టారు. 1988 మోటారు రవాణా చట్టం సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా పోరాటం చేస్తామంటున్నారు. ఉదయమే నుండే జేఏసీ నేతలు బస్ డిపోల ఎదుట బైఠాయించారు. కార్మిక హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని నేతలు విమర్శించారు. రోడ్డు భద్రత చట్టానికి సవరణలు చేసి దొడ్డిదారిన బిల్లును ప్రవేశ పెట్టారని, వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంస్థలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వారిని తీసుకరావాలని ప్రయత్నిస్తోందన్నారు. 

13:27 - September 2, 2016

కడప : వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపాయల చేరుకున్న జగన్ వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పించారు. జగన్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు విజయలక్ష్మి, భారతి, షర్మిళ, పార్టీ ఎంపీలు అవినాష్ రెడ్డి, వై.వి సుబ్బారెడ్డి మరియు ఎమ్మెల్యేలు అంజాంద్ పాషాలతో పాటు పలువురు నివాళులర్పించారు. వై.ఎస్ సమాధి వద్ద జగన్, విజయలక్ష్మిలతో పాటు కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్దనలు చేశారు.

ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు...
వైఎస్‌ఆర్ హయాంలోనే ఇంతకు ముందెన్నడూలేని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. మాజీ సీఎం వైఎస్‌ఆర్ ఏడవ వర్థంతి సందర్భంగా వైసీపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు దుస్తులు పంచారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు రాజమోహన్‌రెడ్డి, ఎంపీ బుట్టారేణుక, లక్ష్మీపార్వతి ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

13:23 - September 2, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని పిటీషనర్‌ తరపు న్యాయవాది తెలిపారు. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు గతంలో చాలా స్పష్టంగా తీర్పులిచ్చానా వాటిని పరిగణలోకి తీసుకోకుండా స్టే విధించిందని పిటీషనర్‌ తరపు లాయర్ అన్నారు. సమగ్ర వివారలతో కూడిన కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు.

బాబుకు ఊరట..
ఓటుకు నోటు కేసులో హైకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపై ఏసీబీ కోర్టు చంద్రబాబును విచారించాలని తీర్పునిచ్చింది. అయితే ఏసీబీ కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ సీఎం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇస్తూ తీర్పునిచ్చింది. వివరంగా కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు తరుపున సీనియర్‌ కౌన్సిల్‌ సిద్ధార్థ లూథా వాదనలు వినిపించారు.

అందుకే హైకోర్టును ఆశ్రయించారు..
దోషిగా తేలితే భవిష్యత్తు దెబ్బతింటుందనే భయంతోనే చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారని ఎమ్మెల్యే రామకృష్ణరెడ్డి అన్నారు. కేవలం ఏసీబీ కోర్టు మెమోపై 8 వారాలు మాత్రమే స్టే ఇచ్చిందని అన్నారు. ఈ స్టే వెకేట్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హైకోర్టులో కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. 

13:15 - September 2, 2016

కడప : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. కడప జిల్లాకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్ఎల్ బీసీ మీటింగ్ రివ్యూ మీటింగ్ జరగాల్సి ఉన్నా ఇంతవరకు మీటింగ్ నిర్వహించడం లేదన్నారు. మూడు తుపాన్ లు రావడంతో వరదల ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించడం జరిగిందని, ఎన్నో హామీలిచ్చారని తెలిపారు. 2013-14 సంవత్సరంలో ఒక్క రూపాయి ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, 2015-16 సంవత్సరంలో ఇన్ పుట్ సబ్సిడీ ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. రూ. 1600 కోట్లు ఇవ్వాలని కలెక్టర్లు నివేదికలు సమర్పిస్తే దానిని రూ. 6 కోట్లకు తగ్గించారని ఆరోపించారు. 8 లక్షల హెకార్టలో వేరు శనగ పంటలు నష్టానికి గురయ్యాయనే ప్రాథమిక అంచనాలు ఉన్నాయన్నారు. 

ఇంత పెద్ద సమ్మె ఎన్నడూ చూడలేదు : కోదండరాం

హైదరాబాద్ : రెడ్ హిల్స్ నుండి ఎల్ఐసీ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. పాల్గొన్న ఎల్ఐసీ జాతీయ నేత వేణుగోపాల్, టీ,జాక్ అధ్యక్షుడు ప్రొ.కోదంరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ..దేశంలో ఇంత పెద్ద సమ్మెను ఎన్నడూ చూడలేదన్నారు. నానాటికీ ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు. బీడీ కార్మికులకు కనీసవేతనాలు అందటంలేదని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వ రంగ సంస్థలలోనూ ఉద్యోగాలను భర్తీ చేయటంలేదన్నారు. వ్యవసాయరంగం పూర్తిగా కొడుకట్టిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

మీడియాతో మాట్లాడుతున్న వైసీపీ నేతకు సీఐడీ నోటీసులు..

విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా తుని విధ్వంసం ఘటనలో తాజాగా మరో 20 మందికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. వైకాపా నేత భూమన కరుణాకర్‌రెడ్డి, సుధాకర్‌నాయుడు సహా 20 మందికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సెప్టెంబరు 4న గుంటూరు, రాజమండ్రికి వచ్చి విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తుండగా అక్కడికి చేరుకున్న సీఐడీ పోలీసులు నోటీసు అందజేశారు. గత వారం రోజులుగా కరుణాకర్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో తిరుపతి ప్రెస్‌క్లబ్‌ వద్ద నోటీసు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. 

రెండురోజులు దీక్ష చేస్తా :డీకే అరుణ

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం అశాస్త్రీయంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. ఈ అంశంపై సర్కార్ తీరుకు నిరసనగా ఈ నెల 3,4తేదీలలో ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపడతానని ఆమె తెలిపారు. ఎంపీ నిరంజన్ రెడ్డి అహకారంతో మాట్లాడుతున్నారనీ..ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రజల అభిప్రాయంతోనే జిల్లాల విభజన చేస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారన్నారన్నారు. పుష్కరాల పనులతో బ్లాక్ మెయిల్ చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో లేఖలు తీసుకున్నారని దుయ్యబట్టారు. 

12:55 - September 2, 2016

శ్రీకాకుళం : జిల్లాలో సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. జిల్లాలోని పరిశ్రమల ఎదుట ట్రేడ్ యూనియన్లు నిరసనలకు దిగాయి. కార్మికులకు కనీస వేతనం 18 వేలు చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. పైడి భీమవరం, రాజాం, పలాస పారిశ్రామిక వాడల్లో సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. పారిశ్రామిక వాడలో బంద్ ఎలా జరుగుతోంది ? కార్మిక సంఘాల నేతల అభిప్రాయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

దేశవ్యాప్త ఆందోళన బాటలో 'సిస్టర్స్'..

ఢిల్లీ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సులు, రేడియాలజిస్టులు ఆందోళన బాట పట్టారు. జీతాల పెంపు కోరుతూ అఖిల భారత నర్సుల సంఘం నేడు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఆందోళన చేస్తున్న నర్సులను పోలీసులు బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. తమ ఆందోళన కొనసాగుతున్నప్పటికీ అత్యవసర సేవల్లో పాల్గొననున్నట్లు ఆ సంఘం అధికారిక ప్రతినిధి తెలిపారు.

12:52 - September 2, 2016

విజయవాడ : దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. సార్వత్రిక సమ్మెలో 18 కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారు. దీంతో రవాణా పూర్తిగా స్తంభించింది. బ్యాంకులు, టెలికాం సంస్థల కార్యాలయాలు మూతపడ్డాయి. 12 డిమాండ్లు పరిష్కరించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కార్మికుల సమ్మెకు రాజకీయపార్టీలు మద్దతు పలికాయి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సమ్మె ఉధృతంగా సాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా విజయవాడలో కార్మిక సంఘాలు కదంతోక్కాయి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం వీడియో క్లిక్ చేయండి.

 

12:50 - September 2, 2016

మెదక్‌ : దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. సార్వత్రిక సమ్మెలో 18 కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారు. దీంతో రవాణా పూర్తిగా స్తంభించింది. బ్యాంకులు, టెలికాం సంస్థల కార్యాలయాలు మూతపడ్డాయి. 12 డిమాండ్లు పరిష్కరించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కార్మికుల సమ్మెకు రాజకీయపార్టీలు మద్దతు పలికాయి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సమ్మె ఉధృతంగా సాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

మెదక్ లో...
జిల్లాలో సార్వత్రిక సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. కార్మికులందరూ సమ్మెలో పాల్గొని ఆందోళనలు తెలియజేస్తున్నారు. తమ హక్కుల సాధన కోసం నిరసనలు తెలియజేస్తున్నారు. జిల్లాలోని పారిశ్రామిక వాడలు మూతపడ్డాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

సుప్రీంకోర్టు కెళ్లతా : ఆళ్ళ రామకృష్ణారెడ్డి

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో విచారణపై స్టే విధించిన హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. కోర్టు స్టే విధించిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ కేసులో వెలుగులోకి వచ్చిన ఆడియో టేపుల్లో ఉన్న గొంతు చంద్రబాబునాయుడిదేనని నిరూపించే ఫోరెన్సిక్ నివేదికలను సుప్రీంకోర్టుకు అందిస్తామని ఆయన అన్నారు. కేసులో తనకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే చంద్రబాబు విచారణ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

12:47 - September 2, 2016

ఖమ్మం : కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు జరుగుతున్న సార్వత్రిక ఖమ్మంలో విజయవంతంగా కొనసాగుతోంది. విద్యా, వైద్యా, బ్యాంక్‌ ఉద్యోగులు, రవాణా సంస్థలు బంద్ ను పాటిస్తున్నాయి. సింగరేణి కార్మికులు బంద్‌లో పాల్గొనటంతో కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లందులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పాల్వంచలో నవభారత్, కెటిపిఎస్ లో కార్మికులు సమ్మెబాట పట్టడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యయి. జిల్లాలో దాదాపు 3లక్షల మంది సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు బంద్‌లో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియో క్లిక్ చేయండి. 

12:46 - September 2, 2016

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. సార్వత్రిక సమ్మెలో 18 కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారు. దీంతో రవాణా పూర్తిగా స్తంభించింది. బ్యాంకులు, టెలికాం సంస్థల కార్యాలయాలు మూతపడ్డాయి. 12 డిమాండ్లు పరిష్కరించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కార్మికుల సమ్మెకు రాజకీయపార్టీలు మద్దతు పలికాయి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సమ్మె ఉధృతంగా సాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు..
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆలిండియా ఇన్స్యూరెన్స్ అసోసియేషన్స్‌ అధ్యక్షులు కె.వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల్లో సవరణలు తీసుకొస్తున్నారని అన్నారు. సార్వత్రిక సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కీలక రంగాల్లోనూ ఎఫ్‌డీఐలను తీసుకొస్తున్నారని, పబ్లిక్‌ రంగాన్ని రెవెన్యూ బడ్జెట్‌ను, రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు ఒకసాధనంగా ఉపయోగిస్తున్నారని వేణుగోపాల్‌ అన్నారు. 

12:43 - September 2, 2016

అనంతపురం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగో రోజు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ధర్మవరం మండలం ఉప్పునేశనపల్లి గ్రామంలో వేరుశనగ పంటను సీఎం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..అవసరాన్ని బట్టి రెయిన్‌గన్‌ టెక్నాలజీని ఇతర జిల్లాలకు విస్తరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే వర్షాభావం వల్ల పంటలు ఎండకుండా కాపాడాలని, రక్షక తడులతో రాయలసీమ నాలుగు జిల్లాల్లో 3,27,008 ఎకరాలలో పంటలను కాపాడామని సీఎం తెలిపారు. 

12:31 - September 2, 2016
12:29 - September 2, 2016

చిత్తూరు : తుని రైలు దహనం ఘటన కేసు ఓ కొలిక్కి రావడం లేదు. దీనిపై సీఐడీ దర్యాప్తు చేపుడుతున్న సంగతి తెలిసిందే. రైలు దహనం కేసులో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 4వ తేదీన సీఐడీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించింది. ప్రెస్ క్లబ్ కు వచ్చిన భూమన కిందకు వెళుతుండగా ఒక్కసారిగా అక్కడ సీఐడీ పోలీసులు ప్రత్యక్షమయ్యారు. వెంటనే నోటీసులు అందచేశారు. దీనిపై స్పందించడానికి కరుణాకర్ రెడ్డి నిరాకరించారు. కిర్లంపూడికి వెళ్లి ముద్రగడను కరుణాకర్ రెడ్డి కలవడం జరిగిందని..ఆ వెంటనే సభకు కూడా వెళ్లారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అనంతరం రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనమైంది. ఇందులో భూమన హస్తం ఉందనే ఆరోపణలున్నాయి.

 • జనవరి 31వ తేదీన కాపు రిజర్వేషన్ల సాధన కోసం తూర్పుగోదావరి జిల్లాలో కాపు గర్జన సదస్సు ఏర్పాటైంది.
 • కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రైలు పట్టాలపై ఉద్యమాన్ని సాగిద్దామని చెప్పిన వెంటనే వేలాదిగా ఆందోళనకారులు ఒక్కసారిగా అక్కడికి చేరి రెచ్చిపోయారు.
 • తుని రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు ఆ సమయంలో అక్కడే ఆగివున్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ముట్టడించారు.
 • రెచ్చిపోయిన ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో రైలు మొత్తం కాలిపోయింది.
 • డ్రైవర్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి విద్యుత్‌ నిలిపివేయించడంతో పెనుప్రమాదం తప్పింది.
 • దీని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కేసును సీఐడీకి అప్పగించింది.
 • అనంతరం దీనిపై పలువురిని సీఐడీ అరెస్టు చేసింది. అరెస్టును నిరసిస్తూ ముద్రగడ మరోసారి దీక్ష చేపట్టారు.
 • అమాయకులను అరెస్టు చేస్తున్నారని, వెంటనే వారిని వదిలిపెట్టాలని ఆయన దీక్ష చేశారు.
 • నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టారు.
 • ప్రస్తుతం భూమనకు సీఐడీ నోటీసులు అందచేయడంపై ఎలాంటి స్పందన వ్యక్తమవుతాయో చూడాలి. 
12:04 - September 2, 2016

మెగాస్టార్ చిరజీవి ఈ పేరు చెబితే అభిమానులు వైబ్రేషన్ కు గురవుతారు. చిరంజీవి రాజకీయాల్లో మెగా కాకపోయినా..సినిమాలలో ఆయన తరువాతనే ఏ హీరో అయినా అన్నట్లుగా వుంటుంది. కాకపోతే తమ్ముడు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎటువంటిదో కొత్తగా చెప్పదేమీ లేదు. చిరంజీవి తమ్ముడిగా వచ్చినా స్వయంగా ప్రేక్షకుల్లో 'పవర్ రేంజ్'ని సృష్టించుకున్నాడు. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే పవన్ స్థాయిని మించాలంటే చిరంజీవి 150 సినిమా ఏ రేంజ్ లో వుండాలో..మోగాస్టార్ ఇమేజ్ ను నిలబెట్టుకునేందుకు చిరంజీవి సుదీర్ఘంగా కసరత్తులు చేస్తున్నవిషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా 150 సినిమా సినిమా షూట్ తో బిజీగా వున్నాడు మెగాస్టార్..ఈ సినిమా పూర్తికాకుండానే 151 వ సిసినిమాకు ఫిక్స్ అయినట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 150 సినిమాకే దర్శకుల హంట్ చేసిన చిరంజీవి 151 సినిమా ఏ రేంజ్ దర్శకుడితో వస్తారా అనేది ప్రస్తుత టాక్..ఈ సినిమాకు ఇప్పటి నుండి మోగాస్టార్ కసరత్తులు చేస్తున్నట్లుగా సమాచారం. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో 'ఖైదీ నెం.150' బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ ట్యాగ్ లైన్ తో రానున్న చిత్రంతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్‌. ఎట్టకేలకూ 151వ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేయనున్నారని సమాచారం. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించే ఈచిత్రానికి బోయపాటి ఇప్పటికే ఓ అద్భుతమైన స్క్రిప్ట్‌ ప్రిపేర్‌ చేశారట. దీంతో చిరు 151వ చిత్రానికి కథ, దర్శకుడు, బ్యానర్‌ అన్నీ రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 'సరైనోడు' చిత్రం సాధించిన విజయంతో సక్సెస్‌ మూడ్‌లో ఉన్న బోయపాటి మెగాస్టార్‌తో చేసే సినిమా కోసం మరింతగా హార్ట్ వర్క్ చేస్తున్నాడట. మరి మెగాస్టార్ తో డేట్స్ దొరకటేమ మహాభాగ్యం, మరి ఆయనతో 151వ చిత్రం అంటే మాటలా..ఆ మాత్రం చేయాల్సిందే..

11:51 - September 2, 2016

'తమన్నా' హీరోయిన్ గా చేస్తునే ఛాన్స్ దొరికితే ఐటం సాంగ్స్ తో అదరగొడుతోంది. లేటేస్ట్ ఈబ్యూటీ మరో రెండు ఐటం సాంగ్స్ చేయడానికి ముస్తాబవుతోందట. 'శృతిహాసన్' కి వచ్చిన ఐటం ఆఫర్ ని మిల్కీ బ్యూటీ చీఫ్ అండ్ బెస్ట్ లో లాగేసుకుందట. ఇంతకీ మిల్కీ చేస్తున్న ఆ ఐటం సాంగ్స్ ఏంటీ ? ప్రస్తుతం మిల్కీ బ్యూటీ కెరీర్ పీక్ స్టేజ్ లో రన్ అవుతోంది. వరుసగా హ్యట్రిక్ హిట్స్ అందుకున్న 'తమన్నా' ఛాన్స్ దొరికితే ఐటం సాంగ్స్ తో కేక పెట్టిస్తోంది. 'అల్లుడు శ్రీను'తో ఐటం బ్యూటీ అవతారం ఎత్తిన మిల్కీ ఆ తరువాత ఇదే హీరో చేసిన 'స్పీడున్నోడు' కోసం మరో ఐటం సాంగ్ చేసి అలరించింది. కొత్తగా మరో రెండు బిగ్ మూవీస్ లో 'తమన్నా' ఐటం సాంగ్స్ లో అందాల ప్రదర్శన చేయబోతుందట.

బెట్టు చేయడం లేదంట...
ఐటం సాంగ్స్ కి సంబంధించి రెమ్యూనరేషన్ విషయంలో 'తమన్నా' పెద్దగా బెట్టు చేయడం లేదు. ఇదే అంశం ఈ బ్యూటీ బాగా కలిసొస్తుంది.
ఇచ్చిన అమౌంట్ తీసుకుని ఐటం నంబర్ లో ఆడిపాడటానికి మిల్కీ బ్యూటీ ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదు. లేటేస్ట్ గా కన్నడ మూవీ 'జాగ్వార్' లో 'తమన్నా' ఐటం సాంగ్ చేయబోతుంది. నిజానికి 'జాగ్వార్' సినిమాలో ఐటం సాంగ్ కోసం ముందు 'శృతిహాసన్' ని అడిగారు. కానీ శృతి 1 కోటి ఇస్తే కాని సాంగ్ చేయను అనేసిందట. దీంతో మిల్కీని సంప్రదిస్తే కేవలం 25 లక్షలకు ఐటం సాంగ్ చేయడానికి ఒప్పేసుకుందట. దీంతో పాటు 'మెగాస్టార్ చిరంజీవి' 'ఖైదీ నెంబర్ 150'లో సైతం ఈ బ్యూటీ ఐటం బ్యూటీగా మురిపించబోతున్నట్లు సమాచారం. 'తమన్నా' వాలకం చూస్తుంటే అందినకాడికి మనీ పొగేసుకోవాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. 

బాబుకు ఊరట ..

హైదరాబాద్ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ఊరట లభించింది. ఓటుకు నోటు కేసును పునర్విచారించాలంటూ తెలంగాణ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం చెప్పిన తీర్పుపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు స్టే విధించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.

11:41 - September 2, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు...ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలతో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఏసీబీలో కోర్టు కేసు వేయడంతో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయడు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏసీబీ విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం వాదనలు జరిగాయి. శనివారం వరకు వాయిదా వేసింది. శనివారం తిరిగి విచారణ చేపట్టింది. బాబు దాఖలు చేసిన కౌంటర్ పై హైకోర్టు స్టే విధించింది. ఏసీబీ మెమో దాఖలు చేయడం జరిగిందని, మెమోకు విలువ లేదని హైకోర్టు పేర్కొంది. ఏదైనా అభ్యంతరాలు ఉంటే కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డికి..ఏసీబీకి కోర్టు సూచించింది. తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్‌ సభ్యుడు స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారన్న అరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేసిన కేసు ఏసీబీ కోర్టు గత సోమవారం (సెప్టెంబర్‌ 29) విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

కీలక మలుపు...
ఏడాదిన్నర క్రితం జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరిగింది. నామినేటెడ్‌ ఎమ్మెల్యీ స్టీఫెన్‌ సన్‌ను లోబరచుకుని, తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికి, జైలుకు వెళ్లొచ్చారు. స్టీఫెన్‌ సన్‌ను లోబరచుకునేందుకు చంద్రబాబు ఈయనతో జరిపిన సంభాషణల రికార్డులు ఉన్నాయి. అయినా ఏసీబీ ఈ కేసులో చంద్రబాబును నిందితునిగా చేర్చకపోవడాన్ని తప్పుపడుతూ గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈనెల 8న ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.

ఏం జరిగింది ? 

 • ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బు ఎరచూపి 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇస్తున్నారన్న ఆరోపణపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంతో ఒక్కసారిగా సంచలనం రేగింది.
 • దర్యాప్తులో భాగంగా ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను కూడా అరెస్టు చేశారు.
 • ఈ కేసుతో సంబంధం ఉందని మరో ఐదుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
 • 5 కోట్లకు స్టీఫెన్‌సన్‌తో బేరం కుదుర్చుకుని 50 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారని ఎసిబి ఛార్జిషీటులో స్పష్టం చేసింది.
 • ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో పాటు ఓ కేంద్రమంత్రికి, మరికొందరు ఎంపీలకు నోటీసులు ఇచ్చి విచారిస్తారని ప్రచారం జరిగింది.
 • ఓటుకు నోటు కేసుకు కౌంటర్‌గా ఏపీ సిఐడి ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును నమోదు చేసింది.
 • సీఎం హోదాలో ఉన్న చంద్రబాబునాయుడితో పాటు పలువురి ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్‌ చేసిందని సీఐడి అధికారులు కేసులు నమోదు చేశారు.
 • ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నమోదైన కేసులన్నీ ఒకేసారి పరిశోధించి పూర్తి స్థాయిలో కేసు నమోదు చేయడానికి వీలుగా సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు.
 • ఈ కేసులో తెలంగాణ సిఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉందని ఊహాగానాలు రేగాయి.
 • రెండు ప్రభుత్వాలకు చెందిన దర్యాప్తు సంస్థలు దూకుడుగా దర్యాప్తును సాగించడంతో ఉత్కంఠతకు దారితీసింది.
 • ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరుగుతున్న వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం రంగంలోకి దిగిందని... కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నాలు చేశారని ప్రచారం జరిగింది.
11:35 - September 2, 2016

లాంగ్ లీవ్ అక్కినేని నాగేశ్వరావు మూడోతరం వారసుడు అఖిల్..ఇప్పటికే యాడ్స్ తో ఈ యువహీరో అదరగొడుతున్నాడు. కాగా అఖిల్ పేరుతోనే వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేదు. ఈ క్రమంలో ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి అఖిల్ ఆచీతూచీ అడుగులేస్తున్నాడు. మొదటి సినిమా ఫెయిల్యూర్ తో గ్యాప్ ఎక్కువగా తీసుకున్నాడు.కానీ ప్రేక్షకులు ఊరుకుంటారా? అఖిల్ రెండో సినిమాకోసం ఎదురు చూస్తున్నారు. దీంతో రెండో సినిమాకు కథ రెడీగా వున్నా..దర్శకుల విషయంలో మాత్రం పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పలువురు దర్శకల పేర్లు అఖిల్ సినిమాను డైరెక్ట్ చేయనున్నట్టు గతంలో వార్తలు వచ్చిన అవన్నీ పుకార్లుగానే మిగిలాయి. రీసెంట్‌గా అఖిల్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. దర్శకుడు హను రాఘవపూడితో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. అదికూడా అబద్దమని తేలింది.రెండోసారి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రెండో సినిమా చేస్తున్నట్టు మళ్లీ ప్రకటించాడు అఖిల్. ఈ క్రమంలో అఖిల్ మాట్లాడుతూ..నా అభిమాన దర్శకుడు విక్రమ్ కుమార్‌తో సెకండ్ మూవీ చేస్తున్నట్టు చెప్పడం థ్రిల్లింగ్‌గా ఉందని , ఈ ప్రాజెక్ట్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు . రెండో సినిమాను లేట్ చేసినందుకు ఫ్యాన్స్‌కి క్షమాపణలు తెలిపాడు . విక్రమ్ తో చేయబోవు చిత్రం అభిమనులను తప్పక అలరించనుందని అఖిల్ పేర్కొన్నాడు. విక్రమ్ తెరకెక్కించిన మనం చిత్రంలో అఖిల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా అద్భుతమై స్క్రీప్లేతో విక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మనం సినిమా ఎంత గొప్పగా వుందో తెలిసిన విషయమే.. ’13 బీ’, ‘ఇష్క్’ 24 సినిమాకూడా అద్భుతమైన పనితనంతో ప్రేక్షకులను కట్టిపడేశాడు విక్రమ్..మరి విక్రమ్ డైరక్షన్ లో అఖిల్ రెండో సినిమాపై ఎలా వుంటుందో ఎదురు చూడాల్సిందే...

11:31 - September 2, 2016

గుంటూరు : జిల్లా వ్యాప్తంగా సమ్మెను ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ ఆందోళనలు..నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో కార్మిక సంఘాల నేతలు మాట్లాడారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను శక్తిహీనం చేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు. దేశ రక్షణ..దేశ ప్రజల భవిష్యత్..కార్మిక..ఇతర వర్గాల ప్రాధాన్యతకు సమ్మె జరుగుతోందన్నారు. నగరంలో వేలాది మంది సమ్మెలో పాల్గొనడం హర్షణీయమని, ఇదే పరిస్థితి కొనసాగితే బూర్జువా వర్గాల అధికారం నుండి కిందకు దిగిపోవడం ఖాయమన్నారు. 

11:26 - September 2, 2016

వరంగల్ : జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. వివిధ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆర్టీసీ..టెలికాం..ఇలా అన్ని రంగాల వర్గాల వారు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా సమ్మెకు సహకరిస్తున్నారు. హన్మకొండ ఆర్టీసీ బస్టాండు వద్ద 9 డిపోల పరిధిలోని 950 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 4500 ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా హన్మకొండ ఆర్టీసీ బస్టాండు వద్ద నిరసన చేపడుతున్న కార్మికులతో టెన్ టివి మాట్లాడింది. కార్మిక వర్గాలకు వ్యతిరేకంగా కేంద్రం విధానాలు అవలింబిస్తోందని, ఎన్ని నష్టాలు ఉన్నా ఆర్టీసీని కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కానీ కార్మికులు రోడ్డు మీద పడే విధంగా..ఆర్టీసీని నిర్వీర్యం చేసే విధంగా కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. 

11:25 - September 2, 2016

విజయవాడ : రోడ్డు భద్రతా బిల్లు..కేంద్రం ఈ బిల్లును ప్రవేశ పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే ఎన్నో రంగాల్లో ఉన్న వారిపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కానీ కేంద్రం మాత్రం మొండిగా ముందుకెళుతోంది. సెప్టెంబర్ 2..దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. 'రోడ్డు భద్రతా బిల్లు'ను వ్యతిరేకిస్తూ పలు కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. విజయవాడ జిల్లాలో కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. రోడ్డు భద్రతా బిల్లును వ్యతిరేకిస్తూ ఆటో యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. దీనితో ఎక్కడికక్కడే ఆటోలు నిలిచిపోయాయి. పండిట్ నెహ్రూ బస్టాండు వద్ద ఆటోలు నిలిపి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు భద్రతా బిల్లు రావడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని, ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుందని ఆటో డ్రైవర్లు టెన్ టివికి తెలిపారు. 

11:19 - September 2, 2016

మాస్ దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలంటే యువతకు మహాక్రేజ్..ఎందుకంటే తన సినిమాలలో హీరోలను సరికొత్త లుక్ తో చూపిస్తాడు. నందమూరి హీరోలకు అభిమానుల కొదవే లేదు. వీరిద్దరి కాంబినేషన్ అంటే అదీ మాస్ ఎంటర్ టైన్మెంట్ అంటే ఇక అంచనాలు ఎలా వుంటాయనేది ఊహించటం కష్టమే మరి.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌తో 'ఇజం' అనే మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ న్యూ లుక్ లో కనిపించనుండగా ఆయన సరసన అదితి ఆర్య కథానాయికగా నటిస్తోంది. అల్లు అర్జున్, మహేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన పూరీ.. హీరోల లుక్ లకు పూర్తిగా మార్చేసాడు. పూరీ దర్శకత్వంలో రానున్న 'ఇజం' మూవీలోను కళ్యాణ్ రామ్ ని కూడా సరికొత్తగా చూపించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ బర్త్ డే కానుకగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని విడుదల చేసింది . ఇందులో కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ సరికొత్త లుక్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. పోస్టర్ పై ‘టఫ్ నెస్ లైస్ ఇన్ ది బ్లడ్’ అనే క్యాప్షన్ రాసి ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా పూరీ స్టైల్లో కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతున్నట్లుగా సమాచారం. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్ గా కనిపించనున్నారు. జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతం అందిస్తున్నారు.

11:10 - September 2, 2016

హైదరాబాద్ : 'కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..12 డిమాండ్లు పరిష్కరించాల్సిందే..కార్మిక చట్టాలను పరిరక్షించాలి' అని కార్మికుల చేసిన నినాదాలు మిన్నంటాయి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలను సవరణలు చేస్తూ కార్మికులను అష్టకష్టాల పాల్జేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. నేడు దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతోంది. నగరంలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆర్టీసీ బస్సులు..ఆటోలు ఎక్కడికక్కడనే నిలిచిపోయాయి. దీనితో జనజీవనం స్తంభించింది. సమ్మె సందర్భంగా ఎస్వీకే నుండి భారీ ర్యాలీ నిర్వహించడానికి కార్మిక సంఘాలు సన్నద్ధమయ్యాయి. ఈసందర్భంగా టెన్ టివితో వివిధ కార్మిక సంఘాల నేతలు మాట్లాడారు. సెప్టెంబర్ 2వ తేదీన సమ్మె నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగిందని, గత సంవత్సరంలో కూడా సమ్మె చేయడం జరిగిందన్నారు. ఆ రోజు ఇచ్చిన హామీలు అమలు చేయని పరిస్థితిలో కేంద్రం ఉందని, ప్రస్తుతం ఇచ్చిన సమ్మెతో రవాణా..జనజీవనం స్తంభించిందన్నారు. ప్రజాగ్రహాన్ని గుర్తించి 12 డిమాండ్లను పరిష్కరించాలని, సమ్మెను విచ్ఛిన్నం చేయాలని మంత్రివర్గం ఉపసంఘం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయన్నారు. నగరంలో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా తిరగడం లేదని, షాపుల్లో పనిచేసే కార్మికులు సైతం రోడ్డెక్కారని పేర్కొన్నారు. ఈ సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు కూడా పాల్గొంటున్నారు. సెకండ్ ఏఎన్ఎం కార్మికులకు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, సమ్మె విరమిస్తే మాట్లాడుతామని చెబుతున్నారని తెలిపారు. కానీ ఇంతవరకు మాట్లాడడం జరగడం లేదన్నారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఆర్టీఏ తనిఖీలు..18బస్సులు సీజ్..

హైదరాబాద్: నగరంలోని పలుప్రాంతాల్లో ఈ ఉదయం ఆర్టీఏ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. విజయవాడ- హైదరాబాద్ మార్గంపై చేపట్టిన తనిఖీల్లో భాగంగా అనుమతులు లేని బస్సులకు అధికారులు 8 బస్సులను సీజ్ చేశారు. ఫిట్‌నెస్ లేని 2 బస్సులపై కేసులు నమోదు చేశారు. కాగా బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారిపై చేపట్టిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 6 బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.

11:01 - September 2, 2016
11:00 - September 2, 2016
10:56 - September 2, 2016

గుంటూరు : వేయి మాటలకంటే..వంద ప్రసంగాలకంటే ఒక పాట కదిలిస్తుంది...ఆలోచింపజేస్తుంది. ప్రజలలోకి..హృదయాలలోకి సూటిగా దూసుకుపోతుంది. రంజింపజేస్తుంది...స్పందింపజేస్తుంది...ఆలోచింపజేస్తుంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో దేశవ్యాప్త సమ్మె సందర్భంగా కార్మికులు పాటలతో వారి బాధలను, కష్టాలను.. ఆవేదనలను వినిపించారు. మరి వారు ఎలాంటి పాటలు పాడారు..వారి ఆవేదన ఏంటో వీడియోలో చూడండి. 

సమ్మె ఎఫెక్ట్ తో జేబు కు చిల్లు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక బంద్ విజయవంతంగా సాగుతోంది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఆర్టీసీ సిటీబస్సులు నిలిచిపోయాయి. ఆటోలు కూడా అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. దాంతో సామాన్యులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. సిటీబస్సులు లేకపోవంతో కార్యాలయాలకు వెళ్లాల్సిన వాళ్లు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ప్రతిరోజూ వందలాది బస్సులు నడిపే వేలాది ట్రిప్పులలో లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. కానీ సార్వత్రిక సమ్మె పేరుతో ఆర్టీసీ సిటీబస్సులు ఆగిపోవడంతో.. ఇక సెట్విన్ బస్సులు, షేర్ ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది.

10:28 - September 2, 2016

చిత్తూరు : కార్మికుల కడుపు మండితే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. అత్యంత విజయవంతంగా సమ్మె కొనసాగుతోంది. టిటిడి పరిపాలన భవనం ఎదుట కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాసుల రెడ్డి టెన్ టివితో మాట్లాడారు. కనీస వేతనాలు అమలు చేయాలని, జీవో 151 అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా 11 రకాల కార్మిక సంఘాలు, టిటిడిలో 13వేల మంది ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. 151వ జీవో ప్రకారం కనీస వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని, చాలి చాలనీ జీతాలతో వెట్టిచాకిరి చేస్తున్నారని విమర్శించారు. పదివేల మంది ఉద్యోగుల కొరత ఉందని, 24గంటల పాటు పని చేయడం జరుగుతోందన్నారు. సులభ్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించలేని స్థితిలో టిటిడి ఉందన్నారు. 

ప్రసూతి సెలవులు పొడిగింపు..

తమిళనాడు : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం 110 నిబంధనల మేరకు సీఎం జయలలిత ప్రత్యేక ప్రకటనలు చేశారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను పొడిగిస్తూ ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఇది వరకు ఆరు నెలలుగా ఉన్న ఈ సెలవుల్ని తాజాగా తొమ్మిది నెలలకు పొడిగించారు.

టీటీడీపై కాంట్రాక్టు కార్మికుల మహాధర్నా..

తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 151 ని వర్తింప చేయాలని కోరుతూ తితిదే కాంట్రాక్టు కార్మికులు మహాధర్నా చేపట్టారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. తితిదేలో పనిచేస్తున్న 13వేల మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక సందర్భాల్లో తితిదే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని సీఐటీయూ నేతలు ఆరోపించారు.

కరువుపై టెలీకాన్ఫరెన్స్..

విజయవాడ : రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్ధితులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఈరోజుతో పంట రక్షక తడులు మిషన్‌-1 పూర్తవుతుందని, ఒక బృందంగా సమన్వయంతో పనిచేసి విజయం సాధించామని సీఎం పేర్కొన్నారు. కరువుతో సతమతమవుతున్న రాయలసీమ రైతులకు ఓ దారి చూపామని, వర్షాభావాన్ని టెక్నాలజీతో ఎదుర్కోవచ్చనే భరోసా రైతుల్లో నింపామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

10:18 - September 2, 2016

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆటో యూనియన్లు సమ్మెలో పాల్గొంటుండడంతో ఆటోలు తిరగలేదు. ఈ సందర్భంగా పలు కార్మిక సంఘాలు కాసేపట్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో పలు కార్మిక సంఘాల నేతలు మాట్లాడారు. పారిశ్రామిక వాడల్లో కార్మికులు విధులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చారని, రాష్ట్రంలో బస్సులు తిరగడం లేదన్నారు. కార్మిక సంఘాలు పేర్కొంటున్న 12 డిమాండ్ల పరిష్కారం కోసం చర్చలు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. 15 కోట్లు ఆనాడు సమ్మెలో పాల్గొంటే ఈనాడు 25 కోట్ల మంది సమ్మెలో పాల్గొనడానికి సిద్ధమయ్యారని తెలిపారు. ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేశామని చెప్పడం పచ్చిబూటకమన్నారు. ప్రభుత్వం నియమించిన కమిషన్ చెప్పిన ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

సమ్మె ఎఫెక్ట్ తో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి..

ఆదిలాబాద్: దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొంటుండడంతో సింగరేణి వ్యాప్తంగా మొత్తం 18 బావుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలోగల మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, తదితర డివిజన్‌లేగాక కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని, రామగుండం రీజియన్‌లోగల 10 భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కాగా... మొత్తం ఈ రెండు జిల్లాల్లోని 19 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు.

హైదరబాద్ లో స్థంభించిన ఆర్టీసీ సేవలు..

హైదరాబాద్ : దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నగరంలో ఆర్టీసీ బస్సులు స్థంభించిపోయాయి. ప్రయాణీకులు నానా ఆగచాట్లు పడుతున్నారు. ఉదయం లేచింది మొదలు సామాన్యులు ఆశ్రయించే ఒకే ఒక్క ట్రాన్స పోర్ట్ సర్వీస్ ఆర్టీసీ అనే విషయం తెలిసిందే. దేశవ్యాప్త సమ్మెతో నగరంలో 3,600ల బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు, విద్యార్థులు, చిరు ఉద్యోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. 

10:10 - September 2, 2016

విజయవాడ : దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె మొదలైంది. విజయవాడలో సమ్మె జయప్రదంగా కొనసాగుతోంది. బ్యాంకులు..వర్తక వాణిజ్య..విద్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఎన్జీవోలు, ప్రజా సంఘాలు..వామపక్షాలు బంద్ పాటిస్తున్నాయి. కాసేపటి క్రితం రథం సెంటర్ వద్ద మహా ప్రదర్శన ప్రారంభమైంది. ఈ సందర్భంగా టెన్ టివితో కార్మిక నేతలు మాట్లాడారు. 11 కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు. ఈఎస్ఐ, పీఎఫ్ లేకుండా కార్మికులు అవస్థలు పడుతున్నా కేంద్రం, రాష్ట్రం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. కేవలం మూడు..నాలుగు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, అసంఘటిత కార్మికులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారు ఇంకా ఎలాంటి డిమాండ్లు వ్యక్తపరిచారో వీడియోలో చూడండి. 

పెషావర్ లో ఉగ్రదాడి..

పాకిస్థాన్ : పెషావర్ నగర పరిధిలో ఉన్న ఓ క్రిస్టియన్ కాలనీపై కొద్దిసేపటి క్రితం ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఓ యువకుడు మరణించాడు. తెల్లవారుఝామున ఈ ఘటన జరుగగా, విషయం తెలుసుకున్న భద్రతాదళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు మరణించారని, ఇంకా ఎంత మంది ముష్కరులు మిగిలి ఉన్నారన్న విషయం తెలియరాలేదని పాక్ దినపత్రిక 'డాన్' వెల్లడించింది. ఉగ్రదాడిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

విశాఖలో ర్యాలీ,నిరసనలకు అనుమతిలేదు: పోలీస్ శాఖ

విశాఖ : స్టీల్ ప్లాంట్, బీహెచ్ పీవీ, జింక్, కోరమాండల్ పరిశ్రమల్లో సమ్మె కొనసాగుతోంది. ఈ మూడు పరిశ్రమల్లో కేవలం మూడు శాతం కార్మికులు మాత్రమే విధులకు హాజరయ్యారు. స్టీల్ ప్లాంట్ లో మార్నింగ్ షిప్టు కు మాత్రమే కార్మికులు హాజరయి విధులు నిర్వహించారు. నగర పరిధిలో ఎటువంటి ర్యాలీలు, నిరసనలకు అనుమతులు లేవని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో హెచ్ పీసీఎల్ మెయిన్ గేట్ వద్ద పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

09:59 - September 2, 2016

కడప / ఖమ్మం : జిల్లాలో సార్వత్రిక సమ్మె విజయంతంగా కొనసాగుతోంది. జిల్లాలోని విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నాయి. సింగరేణి సంస్థ ఉద్యోగులు సమ్మెలో భాగమయ్యారు. దీనితొ కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లందులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాలో మూడు లక్షల మంది సంఘటిత..అసంఘటిత రంగ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. 56 రంగాలకు చెందిన కార్మికులు పాల్గొంటున్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ, టీఆర్ఎస్ కేవీ, టీఎన్ టీయూసీ, టీఎన్జీవో తదితర కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయవద్దని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలంటూ కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.

కడపలో..
కడప :
దేశ వ్యాప్తంగా చేపట్టిన సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. కడప జిల్లాలో కూడా ప్రశాంతంగా సమ్మె జరుగుతోంది. జిల్లాలోని సిమెంట్ పరిశ్రమలు మంగంపేట బైరెటీస్ గనులు కూడా మూతబడ్డాయి. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్, ఆర్టీసీ కార్మికులు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారు. దాదాపు ఏడు డిపోల బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రజా రవాణా మొత్తం స్తంభించింది. కార్మిక సంఘాల డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

టీ.ఎస్ లో ఐసీఎస్ ల బదిలీలు..

హైదరాబాద్ : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇంటెలిజెన్స్ ఐజీగా నవీన్ చంద్, పర్సనల్ ఐజీగా శివధర్ రెడ్డి, సైబరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య, ఇంటెలిజెన్స్ డీఐజీగా ప్రభాకర్ రావు, వరంగల్ రేంజ్ డీఐజీగా రవివర్మ, ఇంటెలిజెన్స్ డీఐజీగా శివశంకర్ రెడ్డి, రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా రమేష్ నాయుడు బదిలీ అయ్యారు.

చట్టంగా మారనున్న జీఎస్టీ బిల్లు..

హైదరాబాద్ : సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ)’ బిల్లు చట్టంగా మారడం ఇక లాంఛనమే. పార్లమెంటులో ఆమోదం పొందిన ఈ బిల్లుకు దేశంలోని సగం రాష్ట్రాలకు పైగా ఆమోద ముద్ర వేశాయి. రాష్ట్రపతి ఆమోదం లభించాలంటే సదరు బిల్లుకు కనీసం 16 రాష్ట్రాల మద్దతు అవసరమైంది. బుధవారానికి 15 రాష్ట్రాలు ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా... నిన్న ఒడిశా కూడా తన మద్దతును తెలిపింది. దీంతో ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లాంఛనప్రాయమే. నేడో, రేపో కేంద్రం ఈ బిల్లును రాష్ట్రపతి భవన్ కు పంపనుంది. రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే ఈ బిల్లు చట్టంగా మారుతుంది.

09:45 - September 2, 2016

విశాఖపట్టణం : కేంద్ర కార్మిక సంఘాలు శుక్రవారం తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం అవుతోంది. ఉదయం నుండే కార్మికులు కదం తొక్కారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె విజయవంతమైంది. ఈ సందర్భంగా కార్మిక సంఘం నేతలతో టెన్ టివి మాట్లాడింది. స్టీల్ ప్లాంట్ ను ఎట్టిపరిస్థితుల్లో కాపాడుకోవాలని, ప్రైవేటు పరం కావద్దని అనుకుంటున్న వారు పోరాటంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారని కార్మిక సంఘం నేతలు పేర్కొన్నారు. వీరికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నామని, చట్టాలను సమూలంగా మారుస్తూ ఉద్యోగాలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఇలాగే వ్యవహరిస్తే మాత్రం ఉద్యమాలు ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

కర్నూలులో కొనసాగుతున్న సమ్మె..

కర్నూలు : జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. 750 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొత్తబస్టాండ్ వద్ద సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు కార్మికులను, నేతలను అరెస్ట్ చేశారు.

 

నాకు ఏ రాజకీయాలు వద్దు : రోశయ్య..

తమిళనాడు : తమిళనాడు గవర్నర్ గా పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, ఇకపై విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నానని తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు బాధ్యతలు అప్పగించి హైదరాబాద్ చేరుకున్న ఆయన రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని తెలిపారు. తన జీవితంలో 60 సంవత్సరాల పాటు రాజకీయాలతోనే సరిపోయిందన్నారు. ఏపీలో రాజకీయాలు కూడా తనకు వద్దని చెప్పటం గమనార్హం.

09:37 - September 2, 2016

హైదారాబాద్ : చర్లపల్లి..నగరంలో పేరొందిన పారిశ్రామిక వాడల్లో ఒకటి..ఇక్కడ నిత్యం ఏదో రకంగా కార్మికులు పోరాటం కొనసాగిస్తుంటారు. తమ సమస్యలు తీర్చాలని కదం తొక్కుతుంటారు. వీరు చేసే పోరాటాలకు యాజమాన్యాలు కనీసం స్పందించవు. కానీ ప్రస్తుతం కార్మికులంతా ఒక తాటిపైకి వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతున్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై శుక్రవారం దేశ వ్యాప్త సమ్మె సైరన్ మోగింది. చర్లపల్లి పారిశ్రామక వాడలో సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది. కార్మిక చట్టాలకు భంగం కలిగించ కూడదని, కనీస వేతనం అమలు చేయాలని వీరు డిమాండ్ చేశారు. 90 శాతం కంపెనీల్లో ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ లాంటివి అమలు చేయడం లేదని, కేంద్రం అనుసరిస్తున్న విధానాలు అమలైతే చర్లపల్లి కార్మికులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. 

పైడిభీమవరంలో సీఐటీయూ నేతల అరెస్ట్..

శ్రీకాకుళం : సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లాలో సమ్మె సైరన్ మోగింది. జిల్లా వ్ప్తాంగా 150కి పైగా పరిశ్రమల్లో 5లక్షలమంది కార్మికులు విధులను బహిష్కరించారు. శ్రీకాకుళం, పలాజ, రాజాం, పాలకొండ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. పైడి భీమవరం పారిశ్రామికవాడలో పోలీసులు సీఐటీయూ నాయకులను అరెస్ట్ చేశారు. 100మందికి పైకా కార్మికులను కూడా అరెస్ట్ చేశారు.

 

09:34 - September 2, 2016

హైదరాబాద్ : 'ప్రజాగ్రహాన్ని చూడండి..ప్రజా గుండె చప్పుళ్లను వినాలి..జ్ఞానం తెచ్చుకోండి..బుద్ధి తెచ్చుకోండి'..అని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా పేర్కొన్నారు. సెప్టెంబర్ 2 దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయంతంగా కొనసాగుతోంది. ఎంజీబీఎస్ డిపో నుండి ఉదయం నుండి బస్సులు బయటకు రాలేదు. దూర ప్రాంతాల నుండి వచ్చిన బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సాయిబాబా టెన్ టివితో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం..కార్మిక లోకం మోడీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారని, ఎంజీబీఎస్ లో బస్సులు నిద్రపోయాయని తెలిపారు. వేయి కేంద్రాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి అంతా మేడిపండు అని తాము చెబుతున్నది నిజం అవుతోందని, అచ్చే దిన్ లు పెట్టుబడిదారీ వర్గానికి వచ్చాయన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలకు తిరుగుబాటుగా పరిగణిస్తున్నామని, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సమ్మె విచ్చిన్నం చేయడానికి ప్రయత్నాలు చేశారని తెలిపారు. కార్మిక సంఘాలతో చర్చించకుండా కార్మిక చట్టాలను సవరణలు చేయాలని చూస్తే తిరగబడుతామన్నారు. పాతిక కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న సమ్మెలో ప్రజాగ్రహం చూడాలని, ఇలాగే కొనసాగితే మాత్రం ప్రభుత్వాలకు శంకరగిరిమాన్యాలు పట్టకతప్పదని సాయిబాబా హెచ్చరించారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఇంకా లభ్యంకాని శ్రీకాంత్ ఆచూకీ..

విజయవాడ : గురువారం నాడు మురగు కాల్వలో పడిన ఆరేళ్ళ బాలుడు శ్రీకాంత్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గురువారం నుండి ప్రొక్లెయిన్లతో గాలిస్తున్ పోలీసులకు గల్లంతైన శ్రీకాంత్ ఆచూకీ ఇంతవరకూ లభ్యం కాలేదు.దీంతో ఎన్టీఆర్ ఎఫ్ సింబ్బందిని రప్పించేదిశంగా అధికారులు యత్నాలు చేస్తున్నారు. గురువారం నుండి కుటుంబ సభ్యులు ఆందోళనలోనే వున్నారు. అసలు శ్రీకాంత్ ప్రాణాలతోనే ఉన్నాడా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా విజయవాడ నగరంలోని పాత రాజరాజేశ్వరీ పేటలో ఆరేళ్ళ బాలుడు శ్రీకాంత్  మురుగుకాల్వలో గల్లంతైన సంగతి తెలిసిందే. 

 

బోల్తా పడిన ఆటో..5గురికి గాయాలు..

ప్రకాశం : గిద్దలూరు మండలం ముండ్లపాడు ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

నేడు వైఎస్ రాజశేఖర్ వర్థంతి..

కడప : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏడవ వర్థంతిని పురస్కరించుకుని వైఎస్సార్ సమాధికి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా వైసీపీ కార్యకర్తలు తెలుగు రాష్ల్రాలలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

నేడు సంగారెడ్డి ఐబీ వద్ద బహిరంగ సభ..

మెదక్ : సార్వత్రిక సమ్మెలో భాగంగా నేడు సంగారెడ్డి ఐబీ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంయలో బహిరంగ సభ జరుగనుంది. ఈ సందర్బంగా రెడ్ షర్ట్ వాలంటీర్లతో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఐటీయూ నేత చుక్కారాములు హాజరుకానున్నారు. 

09:17 - September 2, 2016

గుంటూరు : జిల్లాలో సార్వత్రిక సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం 12 డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపుగా 10 లక్షల మంది ఉద్యోగులు..కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా రవాణా స్తంభించింది. కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కదం తొక్కారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు పుణ్యవతి టెన్ టివితో మాట్లాడారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసిందని, ఈ ప్రయత్నాలన్నీ విఫలం చెందాయన్నారు. ప్రజాప్రతినిధులు జీతాలు పెంచుకుంటున్నారని, కానీ కాయకష్టం చేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇవ్వడానికి ఏడుస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాల రూపంలో, కార్మికుల రూపంలో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛ భారత్ పేరిట మున్సిపల్ ఉద్యోగాలను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మున్సిపల్ కార్మికులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏ మాత్రం స్పందన ఉంటే వీరికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా కార్మిక సమస్యలు పరిష్కరించాలని సూచించారు. 

09:03 - September 2, 2016

విజయవాడ : జిల్లాలో సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుండే వ్యాపార సంస్థలు..ఇతర సంస్థలు స్వచ్చందంగా సమ్మెలో పాల్గొంటున్నాయి. నిత్యం రద్దీగా ఉండే బీసెంట్ రోడ్డు ప్రస్తుతం బోసిపోతోంది. నూతన కార్మిక, పెట్టుబడిదారీ విధానాలను వ్యతిరేకిస్తూ నేడు సార్వత్రిక సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కార్మిక చట్టాలను హరించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొంటోందని, వెంటనే ఈ ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని పలు కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మరికాసేపట్లో బహిరంగసభ నిర్వహించనున్నారు. కనీస వేతనం రూ. 18.000 ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. 

09:02 - September 2, 2016

విజయవాడ : కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ డిమాండ్ చేశారు. నూతన కార్మిక, పెట్టుబడిదారీ విధానాలను వ్యతిరేకిస్తూ నేడు సార్వత్రిక సమ్మె జరుగుతోంది. ఈ సమ్మెకు విజయవాడ ఆటోనగర్ మద్దతు తెలిపింది. సమ్మెలో లక్షలాది మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో గఫూర్, ఇతర నేతలు మాట్లాడారు. కార్మికలను బలవంతంగా అణిచివేసి పనిచేయించుకోవాలని చూస్తున్నారని, దీనిపై ఆగ్రహ జ్వాలలు ఉన్నాయన్నారు. ఆర్టీసీలో 60 శాతం మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లక్ష మంది ఎల్ ఐసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:01 - September 2, 2016

ఆదిలాబాద్ / కరీంనగర్ : నూతన కార్మిక, పెట్టుబడిదారీ విధానాలను వ్యతిరేకిస్తూ నేడు జరిగే సార్వత్రిక సమ్మెలో బ్యాకింగ్, టెలికాం సహా అన్ని రంగాలకు చెందిన దాదాపు పదిహేను కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు పాల్గొంటున్నారు. సమ్మె నేపథ్యంలో బ్యాంకులు..ప్రభుత్వ కార్యాలయాలు..వాణిజ్య సంస్థలు..ఫ్యాక్టరీలు మూతలపడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాలో సమ్మె ప్రభావం కనిపించింది. ఉదయం నుండే కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్ డిపోల ఎదుట కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహించాయి.

కరీంనగర్ లో....
కరీంనగర్ :
ఆర్టీసీ బస్టాండులో ఒక బస్సు కూడా బయటకు రాలేదు. 11 డిపోల పరిధిలో 900 బస్సులు తిరుగుతుంటాయి. ప్రస్తుతం ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. సింగరేణిలో కూడా సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. కార్మికులు ఎవరూ కూడా విధులకు హాజరు కాలేదు. చేనేత పవర్ లూం కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. సంఘటిత, అసంఘటిత కార్మికులందరూ సమ్మె బాటపట్టారు. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:52 - September 2, 2016

ఢిల్లీ : సెప్టెంబర్ 2..దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. నూతన కార్మిక, పెట్టుబడిదారీ విధానాలను వ్యతిరేకిస్తూ నేడు జరిగే సార్వత్రిక సమ్మెలో బ్యాకింగ్, టెలికాం సహా అన్ని రంగాలకు చెందిన దాదాపు పదిహేను కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు పాల్గొంటున్నారు. అసలు సమ్మె ఎందుకు చేపడుతున్నారు ? వారి డిమాండ్లు ఏంటో ఒకసారి చూద్దాం.
 

ధరలు తగ్గించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ అందరికీ అందుబాటులోకి తీసుకరావాలి.
నిరుద్యోగాన్ని తగ్గించి, ఉద్యోగ కల్పనకు నిర్మాణాత్మక విధానాలు రూపొందించాలి.
ఎటువంటి మినహాయింపు లేకుండా ప్రాథమిక కార్మిక చట్టాలు అమలు చేయాలి. కార్మిక చట్టాల ఉల్లంఘనకు అడ్డుకట్ట వేయాలి.
కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించాలి.
కనీస వేతనం రూ. 18.000 ఇవ్వాలి.
మొత్తం శ్రామిక జనాభాకు రూ. 3.000లకు తక్కువ లేకుండా పెన్షన్ హామీ ఇవ్వాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల అమ్మకాలు ఆపాలి.
పర్మినెంట్ పోస్టుల ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా శాశ్వత ప్రాతిపదికనే భర్తీ చేయాలి. ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగుల వలే వేతనం మరియు ప్రయోజనాలు కల్పించాలి.
బోనస్, ప్రావిడంట్ ఫండ్ ఇచ్చేందుకు చెల్లింపులు, అర్హతలు తొలగించాలి. బోనస్ పెంచాలి.
దరఖాస్తు చేసిన 45 రోజుల్లోనే కార్మిక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి. తక్షణమే ఇండియన్ లేబర్ ఆర్గనేజేషన్ (ఐఎల్ ఒ) కన్వెన్షన్ సి87 మరియు సి98 లను ఆమోదించాలి.
కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించాలి.
రైల్వే, ఇన్సూరెన్స్, డిఫెన్స్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్ డిఐ)లను వ్యతిరేకించాలి. 
08:47 - September 2, 2016

ఓటుకు నోటు కేసు విచారణపై నేడే..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసును పునర్విచారించి సమగ్ర నివేదిక అందించాలన్న తెలంగాణ ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సవాల్ చేశారు. గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ విచారణకు స్వీకరించిన అనంతరం తదుపరి విచారణను శుక్రవారంకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుందన్న విషయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.

లారీని ఢీకొన్న కారు..దంపతులు మృతి..

నల్లగొండ: మునగాల మండలం బరాఖత్‌గూడ వద్ద హైదరాబాద్ నుంచి హుజూర్‌నగర్ వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు మృతి చెందారు. సమచారం అందుకున్న పోలీసులకు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

08:39 - September 2, 2016

చిత్తూరు : జిల్లాలో సార్వత్రిక సమ్మె జయప్రదంగా కొనసాగుతోంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. శ్రీవారి లడ్డూ మోసే వ్యక్తి నుండి మరుగుదొడ్డి శుభ్రం చేసే కార్మికుడి వరకు సమ్మెలో పాల్గొంటున్నారు. తెల్లవారుజామున నుండే కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నేతలు టెన్ టివితో మాట్లాడబారు. టిటిడి కార్మికులు, పరిశ్రమల్లో కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. కార్మికులను మభ్య పెట్టేందుకు ప్రచారం చేశారని, కానీ కార్మికులు ఎవరూ ఈ ప్రచారాన్ని నమ్మలేదన్నారు. టిటిడిలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారని, కానీ టిటిడి మాత్రం వీరిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మల..మూత్రాలను ఎత్తివేస్తున్న వారిపట్ల కనీసం కనికరం చూపడం లేదని, వారిని నిర్లక్ష్యంగా చూస్తున్నారని విమర్శించారు. కనీస వేతనం చట్టం అమలు చేయాలని..లేదా జీవో నెంబర్ 150 ప్రకారం జీతాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ఏవీ పట్టించుకోకుండా టిటిడి అధికారులు వీఐపీల సేవలో తరిస్తున్నారని విమర్శించారు. మానవసేవయే..మాధవ సేవ అంటూ చెబుతున్న టిటిడి వాస్తవానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందన్నారు.

జీ-20 సదస్సుకు ప్రధాని మోదీ..

ఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు వియత్నాం బయలుదేరనున్నారు. వియత్నాంకు భారత్ చేసే సాయంపై చర్చలు జరుపుతారు. అనంతరం చైనా బయలుదేరనున్నారు. హాంగ్జూ నగరంలో జరిగే జీ-20 సదస్సుకు హాజరవుతారు. చైనా, వియత్నాంల మధ్య ఇటీవల సంబంధాలు చెడిన నేపథ్యంలో మోదీ పర్యటన ఆ రెండు దేశాల్లో అగ్గిని రాజేసే అవకాశాలున్నట్లు సమాచారం. 

08:30 - September 2, 2016

విశాఖపట్టణం : జిల్లాలో సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండడంతో రవాణా రంగం స్తంభించింది. ఆటో వర్కర్స్ యూనియన్..ఇలా అన్ని యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా టెన్ టివితో పలు కార్మిక సంఘాల నేతలు మాట్లాడారు. విదేశీ పెట్టుబడులు తీసుకరావడానికి మోడీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొంటోందని దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. అధిక ధరలను కంట్రోల్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చారని విమర్శించారు. కార్మిక సంఘాలు సమ్మె చేస్తామని చెప్పినా వారితో చర్చలు జరపడానికి కేంద్రానికి సమయం లేదని ఘాటుగా విమర్శించారు. స్టీల్ ప్లాంట్ లో పనిచేసే కాంట్రాక్టు వర్కర్స్ లకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఐదు లక్షల మంది కార్మికులున్నారని, స్టీల్ ప్లాంట్ లో ఉన్న వారు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ లో సమ్మె పూర్తిగా కొనసాగుతోందని తెలిపారు. 

 

స్టీల్ ప్లాంట్, బీహెచ్ పీవీల్లో నిలిచిపోయిన ఉత్పత్తి..

విశాఖ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిన్న అర్ధరాత్రి నుంచే మొదలైన సార్వత్రిక సమ్మె ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా పడింది. విశాఖలోని స్టీల్ ప్లాంట్, బీహెచ్ పీవీ, పోర్టులకు చెందిన కార్మికులంతా సమ్మెలో పాల్గొంటున్నారు.స్టీల్ ప్లాంట్, బీహెచ్ పీవీల్లో ఉత్పత్తి నిలిచిపోగా, పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు బొగ్గు ఉత్పత్తిలో దేశంలో అగ్రగామి సంస్థగా ఎదిగిన సింగరేణి కాలరీస్ కు కూడా సమ్మె దెబ్బ తగిలింది. సింగరేణిలోని భూపాలపల్లి డివిజన్ కు చెందిన 4 వేల మంది కార్మికులు సమ్మెకు జైకొట్టారు.

ఖమ్మం సమ్మెలో 3లక్షలమంది కార్మికులు..

ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా సమ్మెలో దాదాపు 3లక్షలమంది కార్మికులు పాల్గొన్నారు. సత్తుపల్లి, కొత్తగూడెం డివిజన్లలోని ఆర్టీసీ డిపోలలో బస్సులు నిలిచిపోయాయి. విద్యాసంస్థలు స్వచ్ఛంధంగా సమ్మెలో పాల్గొన్నారు. 

పాతబస్తీలో భారీ చోరీ..

హైదరాబాద్: నగంలోని పాతబస్తీ ఫతేదర్వాజాలో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి వచ్చేసరికి దుండగులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. 30 తులాల బంగారు నగలు, రూ. 10 వేలను అపహరించుకుపోయారు. ఫిర్యాదు మేరకు పోలీసులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సమ్మెలో వేములవాడ ఆలయ ఉద్యోగులు..

కరీంనగర్ : దేశవ్యాప్త కార్మిక సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 11 డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. సింగిరేణి, వేములవాడ ఆలయ ఉద్యోగులు, ఎన్టీపీసీ సమ్మెలో పాల్గొన్నారు. నగరంలో అసంఘటిత కార్మికుల భారీ ర్యాలీ చేట్టారు.

జేఎన్టీయూ పరిధిలో పరీక్షలు వాయిదా..

హైదరాబాద్: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కారణంగా నేడు జేఎన్‌టీయూహెచ్ పరిధిలో జరుగనున్న బీటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ (డీఈ) ఆంజనేయప్రసాద్ తెలిపారు. శుక్రవారం జరుగాల్సిన ఫస్ట్‌ఇయర్ బీటెక్, బీ ఫార్మసీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 13న, ఎంబీఏ, ఎంసీఏ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 16న నిర్వహించనున్నట్టు వెల్లడించారు. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని, వర్సిటీ పేర్కొన్న తేదీలలో పరీక్షలకు హాజరుకావాలని ఆయన కోరారు.

నల్లగొండ జిల్లా సమ్మె ప్రభావం..

నల్లగొండ : సార్వత్రిక సమ్మెలో నల్లగొండ ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 7 డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛంధంగా సమ్మెలో పాల్గొన్నారు. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి.

08:13 - September 2, 2016

హైదరాబాద్ : నూతన కార్మిక, పెట్టుబడిదారీ విధానాలను వ్యతిరేకిస్తూ నేడు సార్వత్రిక సమ్మె జరుగుతోంది. ఈ సమ్మెలో బ్యాంకింగ్, టెలికాం సహా అన్ని రంగాలకు చెందిన కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. సార్వత్రిక సమ్మెలో 18 కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారు. దీనితో రవాణా పూర్తిగా స్తంభించింది. కార్యాలయాలు మూతపడ్డాయి. 12 డిమాండ్లు పరిష్కరించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమ్మెకు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.

ఎంజీబీఎస్ వద్ద...
ఎంజీబీఎస్ బస్టాండులో ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. రవాణా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణ వల్ల పెను నష్టం కలుగుతుందని ఎస్ఎడబ్ల్యూఎఫ్ నేత టెన్ టివితో పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సంస్కరణల పేరిట పలు చర్యలు తీసుకొంటోందని, సంస్కరణలు పెట్టుబడిదారీ విధానాలకు అనుకూలంగా ఉంటున్నాయన్నారు. కనీస వేతనం గురించి ప్రభుత్వాలు స్పందించడం లేదని, పది గంటల పేరిట పెద్దఎత్తున దాడి చేస్తున్నారన్నారు. ఎనిమిది గంటల పని కోసం ఎన్ని పోరాటాలు చేస్తున్నా స్పందించడం లేదన్నారు. కార్మిక సంఘాలకే కాకుండా దేశ సౌర్వభౌమత్యానికి భంగం కలిగే అవకాశం ఉందన్నారు. బీఎంఎస్ మినహా ఐక్యంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, సమ్మె జయప్రదంగా కొనసాగుతోందన్నారు. 

న్యూజిలాండ్‌ లో భారీ భూకంపం!..

న్యూజిలాండ్‌ : శుక్రవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1 గా నమోదైంది. సముద్రంలో ఓ చిన్నపాటి సునామి సంభవించింది. భూకంప దాటికి న్యూజిలాండ్‌లోని ఉత్తర ద్వీపం వణికిపోయింది. గిస్‌బోర్నే పట్టణానికి ఈశాన్యంగా 160 కిలోమీటర్ల దూరంలో 19 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. 2011లో సంభవించిన భూకంపంలో 185 మంది మృతిచెందడంతో పాటు తీవ్ర నష్టం నమోదైంది.

డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు..

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారు. నల్లగొండ జిల్లాలో 7 డిపోల పరిధిలో అదేవిధంగా మహబూబ్‌నగర్‌లో 9 డిపోల్లో, కరీంనగర్‌లో 11 డిపోల్లో, నగరంలోని ముషీరాబాద్ 1, 2, కాచిగూడ, బర్కత్‌పురా డిపోల్లో, ఆదిలాబాద్‌లోని ఆరు డిపోల్లో, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 

మెదక్ జిల్లాలో నిలిచిపోయిన 107 ఆర్టీసీ బస్సులు..

మెదక్ : జిల్లా వ్యాప్తంగా సమ్మె ప్రభావం కనిపిస్తోంది. దీంతో జహీరాబాద్ బస్ డిపోలో 107 బస్ లు నిలిచిపోయాయి. డిపో ఎదుట కార్మిక సంఘాలు ధర్నా చేపట్టారు. పటాన్ చెరు, పాశమైలారం, ఐలాలలో పరిశ్రమలు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 5లక్షలమంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. 

08:02 - September 2, 2016

దేశవ్యాప్తంగా కార్మికలోకం సమ్మె సైరన్ మోగించారు. పది జాతీయకార్మిక సంఘాలు ఏకకాలంలో సమ్మెకు రెడీ అయ్యాయి. కనీసవేతనాలు, సామాజికభద్రతకోసం కార్మికసంఘాలు డిమాండ్ చేస్తూ సమ్మెలో పాల్గొన్నాయి. సమ్మె ఉదృతం ఉదయం నుండి ప్రారంభమైంది. కార్మికవ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దేశవ్యాప్తంగా గత ఏడాది 14కోట్ల మంది సమ్మెలో పాల్గొంటే.. ఈ సమ్మె 18కోట్ల మంది కార్మికులు సార్వత్రిక సమ్మెకు నడుంకట్టారు. 12 ప్రధాన డిమాండ్లతో స్ట్రైక్‌కు వెళ్లుతున్నట్టు ట్రేడ్‌యూనియన్లు సమ్మెలో పాల్గొన్నాయి. ప్రధానంగా కనీసవేతనంగా 18వేలరూపాయలు, 3వేల రూపాయల పెన్షన్‌తోపాటు ధరల పెరుగుదలను అరికట్టడం..వంటి డిమాండ్లతో కార్మికులు సమ్మెబాట పట్టారు. కార్మికుల సమ్మెతో దేశవ్యాప్తంగా రోడ్డురవాణా, నౌకాశ్రయాలు, విమానసర్వీసులు ఆగిపోనున్నాయి. కోల్‌ ఇండియా, గెయిల్‌, ఓన్‌జీసీ, ఓఐఎల్‌, ఎన్‌టీపీసీలతో పాటు బీహెచ్‌ఇఎల్‌ ,హాల్‌ లాంటి జాతీయ పరిశ్రమలు ఒకరోజు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వీరయ్య (నవ తెలంగాణ దినపత్రిక ఎడిటర్), ప్రకాశ్ రెడ్డి (బీజేపీ నేత) పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమచారం కోసం ఈ వీడియో చూడండి..సమగ్ర సమాచారం తెలుసుకోండి.

కాకినాడలో మూతపడిన భారీ పరిశ్రమలు..

తూర్పుగోదావరి : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కారణంగా కాకినాడలో భారీ పరిశ్రమలు మూతపడ్డాయి. కాకినాడ పోర్టులో పూర్తిగా కార్యకలాపాలు స్తంభించాయి. పలు చోట్ల కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. 

శ్రీకాకుళంలో సమ్మెలో 5 లక్షల మంది కార్మికులు..

శ్రీకాకుళం : జిల్లాలో సార్వత్రిక సమ్మె సైరన్ మోగింది. జిల్లా వ్యాప్తంగా 150కి పైగా కర్మాగారాల్లో 5 లక్షల మంది కార్మికులు విధులు బహిష్కరించారు. 

హెచ్ పీసీ ఎల్ ప్రధాన గేట్ వద్ద పోలీసులు..కార్మికుల మధ్య వాగ్వాదం..

విశాఖపట్టణం : స్టీల్ ప్లాంట్, జీహెచ్ పీవీ, జింక్, కోరమండల్ పరిశ్రమల్లో సమ్మె కొనసాగుతోంది. విధులకు పది శాతం ఉద్యోగులు హాజరయ్యారు. స్టీల్ ప్లాంట్ లో మార్నింగ్ షిప్టు మాత్రమే విధులకు హాజరయ్యారు. విశాఖపట్టణం నగర పరిధిలో అనుమతి లేకుండా ర్యాలీలు, నిరసనలు చేపట్టవద్దని పోలీసులు హుకుం జారీ చేశారు. హెచ్ పీసీ ఎల్ ప్రధాన గేటు వద్ద కార్మిక సంఘాలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

నెల్లూరులో మూతపడిన పరిశ్రమలు..

నెల్లూరు : దేశ వ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. పలు పరిశ్రమలు మూతపడ్డాయి. 

07:49 - September 2, 2016

విజయవాడ : ఆసియా ఖండంలోనే అతిపెద్ద కార్మిక రంగమైన విజయవాడ ఆటోనగర్ లో పనిచేస్తున్న దాదాపు లక్షమంది కార్మికులు నేడు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు. దాదాపు లక్షమంది కార్మికులు పనిచేస్తున్న ఆటోనగర్ లో దేశవ్యాప్తం సమ్మెలో పాల్గొన్నాయి. ఎన్డీయే ప్రభుత్వం కార్మిక చట్టాలను ఏకపక్ష నిర్ణయాలతో నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. పలు ప్రాంతాలలో సమ్మెలో పాల్గొన్న కార్మికులను, కార్మిక నాయకులను అరెస్టు చేస్తున్నారనీ..అయిన ఏమాత్రం భయపడని కార్మికులు మొక్కవోని దీక్షలో సమ్మెలో పాల్గొంటున్నారని ఏపీ సీఐటీయూ కార్యదర్శి గఫూర్ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్న కార్మికులు
దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మెశంఖారావం పూరించారు. పది జాతీయకార్మిక సంఘాలు ఏకకాలంలో సమ్మెకు రెడీ అయ్యాయి. కనీసవేతనాలు, సామాజికభద్రతకోసం కార్మికసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్‌పట్ల కేంద్రప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతోనే సమ్మెకు దిగినట్టు కార్మికులు చెబుతున్నారు. కార్మికవ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా గత ఏడాది 14కోట్ల మంది సమ్మెలో పాల్గొంటే.. ఈసారి ఏకంగా 18కోట్ల మంది కార్మికులు సార్వత్రిక సమ్మెకు నడుంకట్టారు. 12 ప్రధాన డిమాండ్లతో స్ట్రైక్‌కు వెళ్లుతున్నట్టు ట్రేడ్‌యూనియన్లు ఇప్పటికే ప్రకటించాయి. వీటిలో ప్రధానంగా నెలకు 18వేలరూపాయల కనీసవేతనం, 3వేల రూపాయల పెన్షన్‌తోపాటు ధరలపెరుగుదలను అరికట్టడం.. లాంటి డిమాండ్లుతో సమ్మెకు దిగారు. కార్మికుల సమ్మెతో దేశవ్యాప్తంగా రోడ్డురవాణా, నౌకాశ్రయాలు, విమానసర్వీసులు ఆగిపోనున్నాయి. కోల్‌ ఇండియా, గెయిల్‌, ఓన్‌జీసీ, ఓఐఎల్‌, ఎన్‌టీపీసీలతో పాటు బీహెచ్‌ఇఎల్‌ ,హాల్‌ లాంటి జాతీయ పరిశ్రమలు ఒకరోజు సమ్మెలో పాల్గొంటున్నాయి.

07:38 - September 2, 2016

హైదరాబాద్ : బల్దియాను ఆర్ధిక కష్టాలు వెంటాడుతున్నాయి. దీనికోసం పన్నువసూళ్లపై అధికారులు దృష్టిపెట్టారు. పన్నుల రూపంలో వసూలు కావాల్సిన వందల కోట్లరూపాయల్లో .. చెక్‌బౌన్స్‌లే ఎక్కువగా ఉంటున్నాయి. చెక్‌బౌన్స్‌ చికాకుల నుంచి బయటపడడానికి జీహెచ్‌ఎంసీ చర్యలకు రెడీ అయ్యింది.

జీహెచ్‌ఎంసీకి ఏటా రూ. 1100 కోట్ల ఆస్తిపన్ను ఆదాయం
గ్రేటర్‌హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ప్రధాన ఆదాయవనరు.. ఆస్తిపన్ను. ఏటా సుమారు 11వందల కోట్లరూపాయలు ఆస్తిపన్ను రూపంలో బల్దియా ఖాతాలోకి జమఅవుతాయి. వాస్తవానికి మరో 6వందల కోట్లరూపాయల వరకు వసూళ్లకు అవకాశం ఉన్నా.. వివిధకారణాలతో అవి అందకుండా పోతున్నాయి. వీటిలో ప్రధానంగా చెక్‌బౌన్స్‌ రూపంలో బల్దియాఖజానాకు తూట్లుపెడుతున్నాయి.

గ్రేటర్‌సిటీ పరిధిలో 14లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులు
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 14లక్షలకు పైగా ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వీరి నుంచి దాదాపు 17వందల కోట్లరూపాయలు ఆస్తిపన్ను వసూళ్లకు అవకాశం ఉంది. కాని గత ఏడాది వసూలైన ప్రాపర్టీట్యాక్స్‌ 1120కోట్లుమాత్రమే. ఇక ట్రేడ్‌ లైసెన్స్‌ చెల్లింపుదారులు లక్షా50వేల వరకు ఉన్నారు.

చెక్‌బౌన్స్‌లతో ఏటా రూ. 50కోట్ల ఆదాయానికి గండి
అయితే... జీహెచ్‌ఎంసీకి వస్తున్న చెక్కుల్లో కొన్ని బౌన్స్‌ అవుతున్నాయి. దీంతో కోట్లాదిరూపాయల ఆదాయానికి గండిపడుతోంది. ప్రతిఏటా 40 నుంచి 50కోట్ల రూపాయల వరకు చెక్‌బౌన్స్‌ల రూపంలో ఆదాయాన్ని కోల్పోతోంది జీహెచ్‌ఎంసీ. ఈఏడాది ఇప్పటికే ఏకంగా 16వందల చెక్కులు బౌన్స్‌ అయినట్టు అధికాలు చెబుతున్నారు. దీనివల్ల వచ్చే ఆదాయం సకాలంలో రాకపోగా.. చెక్‌బౌన్స్‌దారుల చుట్టూ తిరగడం అధాకారులకు ఇబ్బందిగా మారింది. అందుకే ఇక నుంచి చెక్‌బౌన్స్‌లపై ఇక కఠినంగా వ్యవహరించాలని బల్దియా డిసైడ్‌ అయింది. ఇప్పటిదాకా తమ లీగల్‌సెల్‌ద్వారా కేవలం నోటీసులు ఇచ్చి సరిపెడుతుండడం.. పన్నుఎగవేత దారులకు మంచి అవకాశంగా మారింది. పైకా లీగల్‌సెల్‌ద్వారా ఇష్యూచేస్తున్న ప్రతినోటీసుకు 135రూపాలు ఖర్చుచేస్తోంది జీహెచ్‌ఎంసీ.

చెక్‌బౌన్స్‌లపై కఠిచర్యలు తీసుకోవాలి : కమిషనర్
చెక్‌బౌన్స్ లకు పాల్పడటమేకాకుండా.. నోటీసులు ఇచ్చినా స్పందించడంలేదు చాలామంది. మెండికేస్తున్నవారినుంచి పన్నువసూళ్లు చేయడం తలనొప్పిగా మారింది. అందుకే ఇక నుంచి చెక్‌బౌన్స్‌లపై కఠిచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనర్దన్‌రెడ్డి. నింబంధనల ప్రకారం కేసులు కూడా నమోదు చేయాలని నిర్ణయించారు. ఇలాగైనా పన్నుఆదాయాన్ని పెంచుకోవాలని జీహెచ్‌ఎంసీ ఆసిస్తోంది. 

07:35 - September 2, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై విచారణ చేయాలన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను నిలిపివేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం... దీనిపై విచారణను నేటికి వాయిదా వేసింది.

ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేసిన బాబు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ విచారణను నిలిపివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గత సోమవారం ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ప్రత్యేక కోర్టు ఆదేశాలపై స్పందించిన ఏసీబీ
చంద్రబాబుపై ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏసీబీ స్పందించింది. ఓటుకు నోటు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కుట్రలో పాత్రధారులెవరో కనిపెట్టే దిశగా దర్యాప్తు చేస్తున్నామని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది. కుట్రను నిరూపించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ప్రత్యేక కోర్టులో ఏసీబీ మెమో దాఖలు చేసింది.

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్‌
ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన చంద్రబాబుపై దర్యాప్తు చేయాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలంటూ ప్రత్యేక కోర్టు ఆదేశించిందని, అయితే ఇప్పటికే కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో.. మరో ఎఫ్‌ఐఆర్ జారీచేయాల్సిన అవసరం లేదని ఏసీబీ హైకోర్టుకు నివేదించింది. దర్యాప్తులో వెలుగుచూసిన అంశాల ఆధారంగా అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు పురోగతిని ఈ మెమో ద్వారా ఏసీబీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చింది.

07:29 - September 2, 2016

విజయవాడ : ఏపీ ప్రభుత్వంలో స్టార్ వార్ కొనసాగుతోంది. సీఎం మెప్పుపెందేందుకు అధికారులు పోటీపడుతున్నారు. అద్భుత పనితీరుప్రదర్శించాలనే ఒత్తిడితో ఆపసోపాలు పడుతున్నారు. శాఖల వారీగా పెరుగుతున్న అత్యుత్సాహంతో అధికారులు తప్పటడుగులు వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

శాఖ పనితీరు మెరుగుపరచుకోవాలనే ఉద్దేశ్యంతో ఉద్యోగుల్లో స్టార్ వార్
తమ శాఖ పనితీరు మెరుగుపరచుకోవాలనే ఉద్దేశ్యంతో ఉద్యోగుల్లో స్టార్ వార్ మొదలైంది. తన పాలనా తీరుతెన్నులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారు. ఈవైఖరే అధికారుల పాలిట శాపంగా మారింది. సీఎం మెప్పుపొందేందుకు ఏపీ అధికారుల శాఖల మద్య పోటీని పెంచుకుంటున్నారు. సీఎం మెప్పు పొందాలన్న ఆతృతలో తప్పులకు తావిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్న అభివృద్దిశాఖలు
ఏపీలోని వివిధశాఖల ద్వారా అమలుకావాల్సిన అభివృద్ది, సంక్షేమ పథకాలు నూతన ఒరవడికి తెరతీస్తున్నాయి. వివిధ శాఖల ప్రగతిని ఆన్ లైన్ లో పొందుపరిచేలా చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వ శాఖలు. ఈ అంశాలకు మార్కులు కేటాయిస్తూ..ఆయా శాఖలకు స్టార్ రేటింగ్స్‌ కూడా ప్రకటిస్తున్నారు. ఇదంతా బాగానేఉన్నా.. పలుశాఖల్లో ప్రగతి ఆశించిన స్థాయిలో లేదని ఇటీవల రేటింగులు వస్తుండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బాగా పనిచేస్తున్న శాఖలకు మూడు నక్షత్రాలు, మోస్తరుగా పనిచేసే వాటికి రెండు, నామమాత్రంగా పనిచేస్తున్న వాటికి ఒక స్టార్ , అస్సలు బాగాచేయని శాఖలకు ఖాళీ బాక్సులతో ఫలితాలు వెల్లడవుతున్నాయి.

త్రీస్టార్‌ రేటింగ్ కోసం పోటీపడుతున్న పలు ప్రభుత్వ శాఖలు
శాఖల పనితీరు ఫలితాలు అటుంచితే.. త్రీస్టార్ రేటింగ్ కోసం పోటీపడుతూ కీలక రహస్య సమాచారం ఉండే ఆర్థిక, పోలీసు శాఖలకు కూడా స్టార్ వార్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటివరకు ప్రకటించిన రేటింగ్స్‌ ఫలితాల్లో ఆర్థికశాఖకు ఒక స్టార్‌,పోలీస్‌శాఖకు రెండు స్టార్లు, లభించాయి. దీంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే స్టార్‌వార్‌పై భిన్నాభిప్రాయాలు నెలకొంటున్నాయి. కీలకమైన హోం శాఖలో నేరాల సంఖ్యను,ఏ జిల్లాలో ఏయే రకాల నేరాలు జరుగుతున్నాయనే వివరాలు వెల్లడించడం సరైంది కాదని వినిపిస్తోంది.

స్టార్‌వార్‌ లో అధికారులకు పరుగులు
ఏదిఏమైనా ఏపీప్రభుత్వ శాఖల మద్య సాగుతున్న స్టార్‌వార్‌ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. స్టార్‌వార్‌తో రహస్యాలు బయటపెడుతున్న తరుణంలో.. రానురాను ఈ వార్‌ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాలి.

07:23 - September 2, 2016

హైదరాబాద్ : సార్వత్రిక సమ్మె తెలుగురాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో ప్రభావాన్ని చూపెడుతోంది. ఒక్క తెలంగాణలోనే 70లక్షల మంది కార్మికులు సమ్మెలో దిగుతున్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులు ఉద్యోగాల క్రమబద్దీకరణకోసం డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించడానికి కార్మికలోకం ఉరకలు వేస్తోంది. బ్యాంకులు, పోస్టాఫీసులతోపాటు వ్యాపారసంస్థలు పూర్తిగా స్తంభించనున్నాయి. అటు తెల్లవారుజామునుంచే ఆర్టీసీడిపోల ముందు కార్మికులు బైఠాయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆటోలు కూడా పూర్తిస్థాయిలో బంద్‌కు దిగుతుండటంతో ..ప్రజారావాణ ఎక్కడిదక్కడే ఆగిపోతోంది. మోదీ ప్రభుత్వం సంస్కరణల పేరిట హక్కులను కాలరాస్తోందని, దేశంలో ట్రేడ్‌యూనిన్లే లేకుండా చేయాలనే కుట్ర పన్నుతోందని సీఐటీయూ నేతలు విమర్శిస్తున్నారు.

సార్వత్రిక సమ్మెకు టీజేఏసీ మద్దతు..
హైదరాబాద్
: సార్వత్రిక సమ్మెకు టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ మద్దతు ప్రకటించారు. సరళీకృత ఆర్థిక విధానాల తర్వాత కార్మికుల హక్కులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధనకు కార్మికులు సంఘటితం కావాలని కోదండరామ్‌ పిలుపు ఇచ్చారు. 

07:21 - September 2, 2016

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మెశంఖారావం పూరించారు. పది జాతీయకార్మిక సంఘాలు ఏకకాలంలో సమ్మెకు రెడీ అయ్యాయి. కనీసవేతనాలు, సామాజికభద్రతకోసం కార్మికసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్‌పట్ల కేంద్రప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతోనే సమ్మెకు దిగినట్టు కార్మికులు చెబుతున్నారు. కార్మికవ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా గత ఏడాది 14కోట్ల మంది సమ్మెలో పాల్గొంటే.. ఈసారి ఏకంగా 18కోట్ల మంది కార్మికులు సార్వత్రిక సమ్మెకు నడుంకట్టారు. 12 ప్రధాన డిమాండ్లతో స్ట్రైక్‌కు వెళ్లుతున్నట్టు ట్రేడ్‌యూనియన్లు ఇప్పటికే ప్రకటించాయి. వీటిలో ప్రధానంగా నెలకు 18వేలరూపాయల కనీసవేతనం, 3వేల రూపాయల పెన్షన్‌తోపాటు ధరలపెరుగుదలను అరికట్టడం.. లాంటి డిమాండ్లుతో సమ్మెకు దిగారు. కార్మికుల సమ్మెతో దేశవ్యాప్తంగా రోడ్డురవాణా, నౌకాశ్రయాలు, విమానసర్వీసులు ఆగిపోనున్నాయి. కోల్‌ ఇండియా, గెయిల్‌, ఓన్‌జీసీ, ఓఐఎల్‌, ఎన్‌టీపీసీలతో పాటు బీహెచ్‌ఇఎల్‌ ,హాల్‌ లాంటి జాతీయ పరిశ్రమలు ఒకరోజు సమ్మెలో పాల్గొంటున్నాయి.

సార్వత్రిక సమ్మెకు సిద్ధమైన కార్మికులు

సార్వత్రిక సమ్మెకు కార్మికులు సిద్ధమయ్యారు... నేడు దేశవ్యాప్తంగా పాలన స్థంభించనుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా గళం వినిపించబోతున్నారు.

12 ప్రధాన డిమాండ్ల సాధనకోసం దేశవ్యాప్త సమ్మె..
కార్మిక దండు కదం తొక్కనుంది.. 12 ప్రధాన డిమాండ్ల సాధనకోసం దేశవ్యాప్తంగా కార్మికలోకం సమ్మె సైరన్‌ మోగించింది. కేంద్ర, రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాల పిలుపుతో కార్మిక దండు కదలివస్తోంది. మూడు నెలలుగా తెలంగాణలో కార్మిక, ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు సన్నాహాలు చేస్తున్నాయి... ఆగస్టు 9న క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఎఫ్డీఐ లను వ్యతిరేకిస్తూ మాస్‌ సత్యాగ్రహాలు నిర్వహించారు.. కార్మిక, ఉద్యోగ సంఘాలు ఐక్య కార్యాచరణగా అన్ని జిల్లాల్లో సదస్సులు, రంగాలవారీగా సమావేశాలు నిర్వహించారు.. జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో సెమినార్లు, రౌండ్‌ టేబుల్‌ మీటింగ్‌లు, బైక్‌ ర్యాలీలు చేపట్టారు.. సీఐటీయూ,ఏఐటీయూసీ,ఐఎన్ టీయూసీ,హెచ్ ఎంఎస్,ఐఎఫ్ టీయూ,టీయూసీసీ.వైఎస్ ఆర్ టీయూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాలు, బ్యాంకు, ఇన్సూరెన్స్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎఫ్ ఎంఆర్ ఏఎల్ లతో పాటు ఇతర స్వతంత్ర సంఘాలు, ఫెడరేషన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలూ సమ్మెకు మద్దతు ప్రకటించాయి.

45 కార్మిక చట్టాలను రద్దు చేసిందంటూ ఆరోపణ
బీజేపీ అధికారంలోకి వచ్చాక 45 కార్మిక చట్టాలను రద్దు చేసిందని... 50 మంది కంటే తక్కువ కార్మికులుంటే చట్టాలు వర్తింప జేయకుండా కొత్త చట్టం తెచ్చిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సామాజిక భద్రతా పథకాలపై పలు ఆంక్షలు పెట్టిందని మండిపడుతున్నాయి. కార్మికుల హక్కులన్నింటినీ రద్దు చేయడంతో పాటు పనిగంటలు మార్చడం... సాంఘిక భద్రతను కల్పించే పథకాలు నీరుగారేలా చేయడంపై కార్మిక సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి.. సమ్మెల్లోకి వెళ్లేవారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నాయి.. సమ్మె చేస్తే కఠిన కారాగార శిక్ష విధించే క్లాజును తీసుకురావడాన్ని తప్పుబడుతున్నాయి.. కార్మికులకు కనీస వేతనం 18వేలు చెల్లించాలని పట్టుబడుతున్నాయి.. 

కంచెరపల్లిలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు..

కడప : రాయచోటి మండలం కంచెరపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఎండి వేరుశనగ పంటను చంద్రబాబు పరిశీలించారు. 

హోదానా?ప్యాకేజీనా? ..

విజయవాడ : భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు అరుణ్‌సింగ్, సిద్దార్థనాథ్‌సింగ్‌లు శనివారం విజయవాడకు రానున్నారు. ఈ సందర్బంగా నగర పార్టీ నేతలతో వారు సమావేశం కానున్నారు. అలాగే రాష్ట్ర ఆఫీసు బేరర్లు, జిల్లా అధ్యక్షులతో కూడా భేటీ కానున్నారు. సంస్థాగతంగా పార్టీ పటిష్ఠతపై వీరు స్థానిక నేతలతో చర్చించనున్నారు. కాగా... ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదానా, లేక ప్యాకేజీనా అన్న అంశంపై కూడా సమావేశంలో చర్చించే అవకాశముందని సమాచారం.

శ్రీవారి సేవలో రిలయన్స్ అధినేత..

తిరుమల : మొబైల్ ఫోన్ వినియోగదారులకు తీపి కబురు అందించిన మరుక్షణమే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నిన్న ముంబైలో ఫ్లైటెక్కి నేరుగా తిరుమల వెంకన్న సన్నిధికి చేరుకున్నారు. కుమారుడు అనంత్ అంబానీతో కలిసి తిరుమల వచ్చిన ముఖేశ్ కు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి జరిగిన అభిషేక సేవలో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత ముఖేశ్ కు టీటీడీ అధికారులు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు.

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన బ్యాంకింగ్, రవాణా సేవలు..

హైదరాబాద్ : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు 11 కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రేపు బ్యాంకులు, రవాణా సేవలు నిలిచిపోనున్నాయి. పలు ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించడంతో పలు బ్యాంకులు మూతపడనున్నాయి. కాగా, ఈ సమ్మెకు ఆటో సంఘాల ఐకాస సైతం మద్దతు తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సేవలు నిలిచిపోనున్నాయి. కార్మిక చట్టాలను సవరించాలని, కార్మికులకు ఈఎస్ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని, కనీసవేతనం రూ.18 వేలు ఇవ్వాలన్న పలు డిమాండ్లతో కార్మిక సంఘాలు ఈ సమ్మె చేపడుతున్నాయి.

మోగిన సమ్మె సైరన్..

హైదరాబాద్ : బీజేపీ సర్కారు వైఖరికి నిరసనగా అన్ని ప్రధాన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ నిన్న అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. దాదాపుగా దేశంలోని అన్ని ప్రధాన కార్మిక సంఘాలన్నీ ఈ బంద్ లో పాలుపంచుకుంటున్నాయి. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి నుంచే రోడ్లపైకి వచ్చిన కార్మిక సంఘాల నేతలు ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే బంద్ అమల్లోకి వచ్చినట్లైంది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగానే భారత్ బంద్ కు పిలుపునిచ్చినట్లు కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. 

Don't Miss