Activities calendar

03 September 2016

ఈనెల 6న టాస్క్ ఫోర్స్ కమిటీ భేటీ

హైదరాబాద్ : ఈనెల 6న సీఎస్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ కమిటీ భేటీ కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై సచివాలయంలో కలెక్టర్లు, అధికారులతో సీఎస్ భేటీ కానున్నారు. 

 

21:48 - September 3, 2016
21:46 - September 3, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. దసరా రోజున కొత్త జిల్లాలు ప్రారంభం కావాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం... ఈనెల 6న... కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే సీఎస్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ కొత్త జిల్లాలపై కసరత్తు పూర్తి చేసింది. 

 

21:42 - September 3, 2016

విజయవాడ : జగన్‌ ధర్నాల పేరుతో రైతులను తప్పుదారి పట్టిస్తున్నాడని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. చంద్రబాబు కరవుపై యుద్ధం చేసి పంటలను రక్షిస్తుంటే.. ప్రతిపక్ష నేత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్‌కు అధికార దాహం తప్ప మరో ఆలోచన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

రేపటి నుంచి పోడుభూమి కేంద్రాల్లో వామపక్ష నేతల పర్యటన

హైదరాబాద్ : పోడుభూమి రైతులకు మద్దతుగా రేపటి నుంచి 3 రోజులపాటు పోడుభూమి కేంద్రాల్లో వామపక్ష నేతలు పర్యటించనున్నారు. 4న ఖమ్మం, 5న వరంగల్, 6న మహబూబ్ నగర్ లో సీపీఎం రాష్ట్ర కమిటీ పర్యటించనుంది. 

 

21:23 - September 3, 2016

చంద్రాలు చెమ్డలుతీస్తున్న జగనాలు... కరువుమీద పరువుతీసే ప్రయత్నాలు, పదవిని కొనుకోజూసిన పవిత్ర నాయకురాలు...మోసం జరిగిందని పోలీసొళ్లకు విన్నపాలు, ఓయూ లైబ్రరిలో చదివే పోరగాళ్ల ఉస ఉస...ర్యాలీలు, ధర్నాలు అని సుడివేడుతున్నారట ఒస, బట్టతల మీద మంత్రిగారి ప్రయోగం... తప్పట్లు గొట్టిమరి జనం ఆమోదం, 
గణపతి పండుగను గమనించురి.. కొన్ని జాగ్రత్తలున్నాయి పాటించురి, అల్లంగడ్డకు వినాయకుని అలంకారం.... పూజలు పువ్వులు పెట్టుడు ఆచారం... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

21:05 - September 3, 2016

విశాఖ : తాతలు ముత్తాతల నుంచి వారంతా అక్కడే ఉన్నారు. తమకున్న భూముల్లోనే సాగు చేస్తూ జీవిస్తున్నారు. జిరాయితీ రైతులుగా..ప్రభుత్వానికి శిస్తు కూడా కడుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడా గ్రామాల ప్రజలు త్రిశంకు స్వర్గంలో పడ్డారు. ఆ భూములు తమవని ఓవైపు దేవస్థానం.. వాటిపై ఎవరికీ ఎలాంటి హక్కులు లేవంటూ మరోవైపు రెవిన్యూ యంత్రాంగం వాదిస్తున్నాయి. దీంతో ఎన్నో గిరిజన కుటుంబాలు కలవరపాటుకు గురవుతున్నాయి. దశబ్దాలుగా ఎటూ తేలకుండా ఉన్న పంచగ్రామాల భూ వివాదంపై 10టివి ప్రత్యేక కథనం...! 
ఎప్పుడో ఏళ్ల కిందట మొదలైన భూ సమస్య 
ఎప్పుడో ఏళ్ల కిందట మొదలైన భూ సమస్య ఇంకా రగులుతూనే ఉంది. విశాఖ సింహాచల దేవస్థానాన్ని ఆనుకుని ఉన్న పంచగ్రామాల భూ వివాదం ఓ కొలిక్కి రాకపోడంతో సంబంధిత గ్రామాల ప్రజలు త్రిశంకు స్వర్గంలో పడ్డారు. తాతలు ముత్తాతల నుంచి ఈ గ్రామాల ప్రజలు దాదాపు 1730 ఎకరాల భూమి సాగు చేస్తూ వస్తున్నారు. సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచగ్రామాలైన అడవి వరం, వెంకటాపురం, వేపగుంట, పురుషోత్తపురం, చీమలపల్లి పరిధిలో పల్లం, మెట్ట, బంజరు, పోరంబోకు భూములున్నాయి. ఈ ఐదు గ్రామాల రైతులు వారి పూర్వీకులు అనాధిగా వాటిని సాగు చేస్తూ జీవిస్తున్నారు. 1903లో గిల్‌మెన్‌ సర్వే ప్రకారం ఈ రైతులంతా కూడా జిరాయితీ రైతులుగా గుర్తించబడి అప్పటి నుంచి జిరాయితీ శిస్తు కూడా కడుతున్నారు.  రైతులకు 1977లో అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌లో కూడా జిరాయితీ రైతులుగా సీలింగ్‌ చేసి సర్టిఫికెట్లు కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఇంతవరకు సజావుగానే ఉన్నా... 1996లో చినగదిలీ, పెందుర్తీ ఎమ్మార్వోలు పంచగ్రామాల్లోని భూములు దేవస్థానం పరిధిలోనివని పట్టాలివ్వడంతో వివాదం ప్రారంభమైంది.  దీనికై అవసరమైన రైతులకు, నివాసులకు ఏ విధమైన నోటీసులు ఇవ్వలేదు. వారి వాదనలు వినకుండానే పట్టాలిచ్చారు. 
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రైతు సంక్షేమ సంఘం  
సాగు చేసుకుంటూ బతుకుతున్న తమ భూములు దేవస్థానానివని అధికారులు అనడంతో అడవివరం రైతు సంక్షేమ సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఒక్క అడవివరం పరిధిలోనే దాదాపు 470 ఎకరాల జిరాయితీ భూములున్నాయి. అనేక ఏళ్ల నుంచి గిరిజనులు ఈ భూముల్లే నమ్ముకుని బతుకులు వెళ్లదీస్తూ వస్తున్నారు. ఈ భూములు తమవంటూ దేవస్థానం అధికారులు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. విజయనగర రాజులు దేవస్థానానికి ఇనాం భూములుగా ఇచ్చారని పేర్కొనడంతో.. బాధిత రైతులు ఎటూ పాలుపోని స్థితిలో సతమతమవుతున్నారు. 
భూములైతే సాగు చేసుకుంటున్నారు కానీ
భూములైతే సాగు చేసుకుంటున్నారు కానీ ఆ భూముల్లో బోర్లు వేయడానికి గానీ, బ్యాంకు లోన్లు పొందడానికి గానీ రైతులకు అవకాశం లేకుండా పోతోంది. ఇనాం భూములని బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు. రైతు రుణమాఫీ పథకాన్నీ అమలు చేయడం లేదు. సోలార్‌ పంపు సెట్లు, గ్రామాల్లో ఇళ్ల మరమ్మతులకు కూడా పంచగ్రామాల రైతులు నోచుకోవడం లేదు. 
వివాదాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం 
ఏళ్ల తరబడిగా కొనాసాగుతున్న పంచగ్రామాల భూ సమస్య వివాదాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఎంతో కాలంగా పంటలు పండిస్తున్న భూములపై తమకు ఎలాంటి హక్కులు లేకుండా చేయడం దారుణమని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచారణలను దేవస్థానం అధికారులు అడ్డుకుంటున్నారని.. అటు ప్రభుత్వమూ ఈ వివాదాన్ని ఎటూ తేల్చకపోవడం బాధాకరమని గిరిజన రైతులు అభిప్రాయపడుతున్నారు. 
విశాఖ సింహాచలం దేవస్థాన పరిధిలో 
విశాఖ సింహాచలం దేవస్థాన పరిధిలో విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తరంతో పాటు పెందుర్తి, భీమిలి నియోజక వర్గాల్లో ఈ గ్రామాలు ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో వందల ఏళ్ల నుంచి గిరిజనులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దేవస్థానం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులు ఎప్పటి నుంచో సొంత భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. సర్వే నెంబర్‌ 275లో కైలాసగిరితో పాటు ఇతర  కొండల్లో ఎక్కువ భాగం రిజర్వు ఫారెస్టుగా ప్రకటించారు. దీంతో ఈ భూములు  ఫారెస్ట్‌ పరిధిలోకి వస్తాయి. కానీ పట్టా మాత్రం దేవస్థానానికి ఇచ్చారు. ఇప్పటికే ఈ కొండలపై అనేక మంది నిరుపేదలు ఇళ్లు, గుడిసెలు నిర్మించుకుని ఉంటున్నారు. ఒక్క 275 సర్వే నెంబర్‌లోనే పదివేలకు పైగా కుటుంబాలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఆ నివాసాలను రెగ్యులరైజ్‌ చేస్తామని కూడా ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. 
బ్రిటిష్‌ ప్రభుత్వం హయాంలో గిల్‌మెన్‌ సర్వే
1903లో బ్రిటిష్‌ ప్రభుత్వం హయాంలో గిల్‌మెన్‌ సర్వే కూడా నిర్వహించారు. ఈ సర్వేలో దేవస్థానానికి సుమారు 560 ఎకరాల భూమి ఉందని నిర్ధరించారు. దీనికి విరుద్ధంగా దేవస్థానం మాత్రం 9 వేల ఎకరాల భూమి తమదేనని వాదిస్తోంది. పంచగ్రామాలైన అడవివరం, వేపగుంట, పురుషోత్తపురం, వెంకటాపురం, చీమలపల్లి గ్రామాలు జమిందారీ గ్రామాలుగా ఉండేవి. ఈ పంచగ్రామాల పరిధిలో బంజరు, పోరంబోకు, గ్రామకంఠాలు, జిరాయితీ, ఫారెస్ట్‌ భూములున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మార్వోలు వినియోగంలో లేని భూముల్ని సైతం ఇనాం భూములుగా తేల్చడం పలు విమర్శలకు తావిస్తోంది. 
రైత్వారీ పట్టాలు చెల్లవని ఆర్డీవో తీర్పు 
1996లో దేవస్థానం ఇచ్చిన రైత్వారీ పట్టాలు చెల్లవని కూడా ఆర్డీవో తీర్పిచ్చింది. దీనిపై సింహాచలం దేవస్థానం అధికారులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఓ వైపు ఆర్డీవో స్థాయి అధికారి తీర్పు ఇస్తే... మరోవైపు దేవస్థానం ఉన్నతాధికారిగా నియమించబడ్డ మరో అధికారి ఉన్నత న్యాయస్థానం నుంచి స్టే పొందడం గమనార్హం. దీనికి తోడు అడవివరం పంచాయతీలోని టీడీ నెంబర్‌ 1180లో విజయరామపురం అగ్రహారంలో దాదాపు 100 ఎకరాల  భూమి కబ్జాకు గురైంది. దీనిపై సీపీఎం హైకోర్టులో పిల్‌ కూడా వేయడంతో పాటు.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ శాసనమండలిలో కూడా లేవనెత్తారు. 2014లో ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించగా 14 మంది అధికారులు భూ కబ్జాకు సహకరించారని తేలింది. అయినా ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.  ప్రభుత్వం నియమించిన కమిటీ అడవివరం పంచాయతీలోని భూ రికార్డులను పరిశీలించి 1996లో దేవస్థానానికి ఇచ్చిన పట్టా కూడా సక్రమం కాదని తేల్చింది. పోరంబోకు బంజరు భూములకు పట్టాలివ్వడం ఇనాం చట్టం 1869, ఇనాం ఎబాలిష్‌ యాక్ట్‌ సెక్షన్‌ ఏ కు విరుద్ధమని స్పష్టం చేసింది. 
దేవస్థానం అధికారుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు 
1996లో చిన్నగదిలీ, పెందుర్తీ ఎమ్మార్వోలు ఇచ్చిన రికార్డులు తప్పా.. దేవస్థానం అధికారుల వద్ద ఎలాంటి ఆధారాలు, రికార్డులు లేకపోవడం గమనార్హం.  పై పెచ్చు దేవస్థానం వారు పంచగ్రామాల భూములు తమవే అని వాదించడం విడ్డూరంగా ఉంది. పంచగ్రామాల పరిధిలో కొందరు ప్రజాప్రతినిధులు సైతం భూములు కొన్నట్లు తెలుస్తోంది. సింహాచలం కొండ ప్రాంతంలోని కాలనీల్లో జీహెచ్ఎంసీ రోడ్లు, కులాయిలను ఏర్పాటు చేయకుండా తరచూ దేవస్థానం అడ్డుకుంటోంది. ఇళ్ల మరమ్మతులు, ఇళ్లు అమ్ముకునే సౌకర్యం కూడా లేకుండా ఎండోమెంట్ శాఖ అనుమతులు నిరాకరించడం శోచనీయం.  రెవిన్యూ భూమి అయితే పట్టాలివ్వాల్సి వస్తోందని, అదే దేవస్థానం భూములుగా పరిగణిస్తే భూములన్నీ కబ్జాకోరుల పరం చెయ్యొచ్చన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ భూ సమస్యను పరిష్కరించడం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. 
వందల ఏళ్ల నుంచి అక్కడే నివాసం
వందల ఏళ్ల నుంచి అక్కడే నివాసం. ఇంకా చెప్పాలంటే సింహాచల దేవస్థానానికి ప్రాచుర్యం రాకముందు నుంచే సింహాచలేశుడి సేవలో తరించారు. కానీ ఇప్పుడు.. ఆ దేవస్థానమే వారిని అక్కడి నుంచి వెళ్లగొడుతోంది. ఇన్నాళ్లు దేవునికి సేవ చేశారన్న కనికరం కూడా చూపకుండా పొమ్మన లేక పొగ పెడుతోంది. ఇదే అంశం ఇప్పుడు గిరిపుత్రులను తీవ్రంగా కలచివేస్తోంది. సింహాచలం దేవస్థానంలో వందల ఏళ్ల నుంచి పూజలు చేస్తూ... కొండపై గల భూముల్లో పోడు వ్యవసాయం చేస్తూ నివసిస్తున్న గిరిజనులు.. సమీపంలో దొరికే అటవీ ఉత్పత్తులనే ఆధారంగా చేసుకున్నారు. చాలాకాలంగా కొండపైన వివిధ దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందిన గిరిజనులు.. కొంతకాలంగా దేవస్థానం అధికారులు ఖాళీ చేయించడంతో వారంతా రోడ్డున పడ్డారు. చేసేది లేక అనేక కుటుంబాలు ఇప్పటికే కొండ కిందకు వెళ్లిపోయాయి. ఎన్నో ఏళ్ల నుంచి సమస్య అలాగే ఉన్నా.. పరిష్కారం చూపకుండా.. ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు మాట దాటవేస్తూ వస్తున్నారని బాధితులు వాపోతున్నారు. 
మౌలిక సదుపాయాలు లేవు
కొండపైన దాదాపు 100 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ... వారికి మౌలిక సదుపాయాలు కూడా లేవు. అంతేకాదు.. క్రమంగా విద్యుత్‌, తాగునీరు వంటి సదుపాయాలను గిరిజనులకు దూరం చేస్తున్నారు. కొండపైన ఉండే వైద్యశాలను కూడా కొండ కిందకి తరలించడంతో అనేక కుటుంబాలు అనారోగ్యం బారిన పడ్డప్పుడు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో మాదిరి దేవస్థానం ఉద్యోగాలు కూడా కల్పించకపోవడంతో కొండమీదనే భక్తులకు మజ్జిగ అమ్ముకోవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తున్నారు. ఇంతకాలం దేవున్ని నమ్ముకున్నందుకు.. ఉన్న ఊళ్లు, ఇళ్లకు దూరం కావాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ పర్యటించిన పలువురు రాజకీయ నేతలు.. కొండమీద గిరిజనులను ఎటూ కదల్చమని చెప్పారని గిరిజనులు చెబుతున్నారు. తమ తాతలు, తండ్రులు ఇక్కడే పుట్టారని, తామూ ఇక్కడే బతుకుతామని, చావైనా రేవైనా.. ఇక్కడే అంటున్నారు గిరిజనులు. 
తమకు న్యాయం చేయడం లేదు : పంచగ్రామాల ప్రజలు 
ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా... భూములపై ఎలాంటి హక్కుల్ని కల్పించకుండా.. సింహచలం దేవస్థానం అధికారులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రభుత్వం కూడా ఈ విషయంలో తమకు న్యాయం చేయడం లేదని సింహాచలం పంచగ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 
పంచగ్రామాల భూ వివాదం అలాగే 
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామంది ప్రభుత్వం. కానీ రెండున్నరేళ్లైనా... పంచగ్రామాల భూ వివాదం అలాగే ఉంది. నేతలు మాత్రం ఇదిగో.. అదిగో .. అంటూ ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. కోర్డు కేసులను సాకుగా చెబుతూ గిరిజనుల భూ సమస్యను మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఇంచు కూడా కదల్చడం లేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. విశాఖలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనూ సీఎం చంద్రబాబు సింహాచల దేవస్థాన భూముల సమస్యను వంద రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లైనా ఇంతవరకు సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది.  రెవిన్యూ అధికారులిచ్చిన పట్టాలను రద్దు చేసి.. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాల్సివ్వాల్సిన ప్రభుత్వం.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు, కబ్జాకోరులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానం పేరిట ఇచ్చిన పట్టాలను రద్దు చేసి ఏళ్ల తరబడి సాగు చేస్తున్న రైతులకు పట్టాలివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 
దేవస్థానం వైఖరి మరోలా 
గిరిజనుల భూముల విషయంలో దేవస్థానం వైఖరి మరోలా ఉంది. రైతుల వద్ద ఎలాంటి రైత్వారీ పట్టాలు లేవని,  కేవలం లీజు పట్టాలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. దేవస్థానానికి దాదాపు 11 వేల ఎకరాల భూమిని విజయనగర  సంస్థానాధీశులు ఇచ్చారని చెబుతున్నారు. 1977లోనే ఇనాం అబాలిష్‌యాక్ట్‌ సెక్షన్‌  త్రీ త్రీ ప్రకారం పంచ గ్రామాల్లోని భూమి దేవస్థానానికి ఉంటుందని డిక్లరేషన్‌ ఇచ్చామని, దాని ప్రకారమే దేవస్థానానికి 1996లో ఎమ్మార్వోలు పట్టాలిచ్చారని చెబుతున్నారు. ఆ భూమిలో ఉండే హక్కు, అనుభవించే హక్కు తప్పా.. అమ్ముకునే హక్కు లేదని దేవస్థానం అధికారులు స్పష్టం చేస్తున్నారు. సింహాచలం దేవస్థానం భూ సమస్య పరిధిలో భీమిలీ, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, విశాఖ ఉత్తరం, పెందుర్తీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1978లో ఉడా 178 ఎకరాలను రైతుల వద్ద నుంచి తీసుకుంది. అప్పుడు దేవస్థానం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దేవస్థానం సమీపంలో దాదాపు 12 వేల నిర్మాణాలు జరిగాయి. వాటిని రెగ్యులరైజ్‌ చేయాలని స్థానికులు చాలా కాలంగా కోరుతున్నారు. 60 గజాల లోపు నివాసాలు ఉన్న వారికి రెగ్యులరైజ్‌ చేయడంతో పాటు.. మిగిలిన వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చూస్తామని స్థానిక ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 
భూ సమస్య పరిష్కారంలో జాప్యం : మంత్రి గంటా
సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారంలో జాప్యం జరిగిందని మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం అంగీకరించారు. ప్రభుత్వ శాఖల మధ్య భూ వివాదం, కోర్టు కేసులు తదితర కారణాల వల్ల ఈ జాప్యం జరిగిందని ఆయన అన్నారు. ఇప్పటికే ఎండోమెంట్ విభాగంతోనూ, సీఎస్‌ తోనూ చర్చించామని, ఈ సమస్యపై యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో మంత్రి వర్గ కమిటీ పనిచేస్తోందని తెలిపారు. 
భూమి ఎవరిదో తేల్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం 
ఏళ్ల తరబడిగా భూమి ఎవరిదో తేల్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏవి పోరంబోకు, ఏవి ఇనాం భూములో తేల్చడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఉన్నతాధికారుల బృందం చొరవ తీసుకోవాలని సూచించినా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఒడిగట్టలేదు. తొలుత 1996లో ఎమ్మార్వోలు ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలి.. దానికంటే ముందు కోర్టు కేసులు ఓ కొలిక్కి రావాలి. ఏ భూములు పేదలకు చెందుతాయో ఆ భూములకు సంబంధించి పేదలకు పట్టాలివ్వాలి. ఇప్పటికైనా ఎండోమెంట్‌, రెవిన్యూ భూముల విషయంలో ఓ స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై  ఉందని, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి పంచగ్రామాల భూ సమస్యకు చరమగీతం పాడాలని ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ అభిప్రాయపడ్డారు. 
అలాగే నిలిచిన నేతల హామీలు   
2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ ఈ భూ సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చాయి. 2013లో చంద్రబాబు పాదయాత్రలో సైతం ఇదే హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు మారాయి. ప్రజాప్రతినిధులూ మారారు. కానీ నేతల హామీలు మాత్రం అలాగే నిలిచిపోయాయి. 

 

 

20:38 - September 3, 2016

పవర్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇటీవల విడుదలైన జనతా గ్యారేజ్ సినిమా విశేషాలను వివరించారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే....
'స్టార్ హీరోలను అన్ని వర్గాల వారు లవ్ చేస్తారు. నేను ఒక సెక్షన్ కోసం సినిమా చేయను. అన్ని వర్గాలవారి కోసం సినిమా చేస్తాను. మెసేజ్ ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. కంటెంటే నా సీక్రెట్. కంటెంటుంటే స్టార్ అవుతారోమో. మహేష్ బాబుతో మళ్లీ సినిమా చేస్తాను. ఎన్ టిఆర్ కు స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటుంది' అని పేర్కొన్నారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.... 
  

ప్రత్యేక హోదాపై అపోహలు తొలగించాలి : పురందేశ్వరి

విజయవాడ : ప్రత్యేక హోదాపై ఉన్న అపోహలు తొలగించాల్సిన అవసరముందని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి అన్నారు. 14 వ ఫైనాన్స్ కమిషన్ లో ప్రత్యేక హోదా అనే పదం లేదని 13 రాష్ట్రాలకు ఆర్థికసాయం చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. 16 వేల కోట్ల ఆర్థికలోటు ఉందని ప్రభుత్వం నివేదిక ఇచ్చిందన్నారు. 

 

20:20 - September 3, 2016

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న భవనంపై కప్పు కూలి ఆరుగురికి గాయాలయ్యాయి.  రెండో అంతస్తులో శ్లాబ్‌ వేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిలో భవన యజమాని నీలేష్‌, కూలీలు శ్రీను, నూర్‌ హుస్సేన్‌, అద్నానన్‌, లక్ష్మయ్య, మహేష్‌, షబ్బీర్‌లు ఉన్నారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. 

20:15 - September 3, 2016

విజయవాడ : ఛైర్మన్‌తో సహా ముగ్గురు డైరెక్టర్ల పదవులు ఖాళీ అవడంతో విజయా డెయిరీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఛైర్మన్‌ ఎన్నిక అంశం రసవత్తరంగా మారింది. సుదీర్ఘ కాలం పాటు పదవి అనుభవించిన ఇప్పటి ఛైర్మన్‌తో పాటు ఆశావాహులు పోటీకి సై అంటుండటంతో  డెయిరీ ఎన్నికలు మరింత వేడెక్కనున్నాయి. 
హీటెక్కుతోన్న రాజకీయ వాతావారణం 
వచ్చే నెల 12న విజయ డెయిరీ ఛైర్మన్‌, మరో ముగ్గురు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికల జరగనున్న నేపథ్యంలో విజయవాడలో రాజకీయ వాతావారణం హీటెక్కుతోంది. ప్రస్తుతం ఛైర్మన్‌ మండవ జానకి రామయ్య మొవ్వ మండలం నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా, నూజివీడు నియోజకవర్గంలోని మొఖాసా నరసన్న పాలెం సొసైటీకి యనమదల మహంకాళరావు, అలాగే మైలవరం నియోజకవర్గం  రెడ్డిగూడెం సొసైటీకి ఉయ్యూరు అంజిరెడ్డి డైరెక్టర్లుగా వ్వవహరిస్తున్నారు. ఇప్పుడీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు విజయ డెయిరీ సంస్థ రంగం సిద్ధం చేస్తోంది. ఎలాగైనా పదవులను దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఆశావాహులు పక్కా వ్యూహాలు రూపొందించే పనిలో పడ్డారు. 
విజయ డెయిరీ పాలకవర్గంలో 15 మంది డైరెక్టర్లు 
విజయ డెయిరీ పాలకవర్గంలో 15 మంది డైరెక్టర్లు ఉంటారు. ఏటా  ముగ్గురు డైరెక్టర్ల పదవులు ఖాళీ అవుతాయి.  జిల్లాలోని 427 సొసైటీల్లో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉండటంతో.. పాలకవర్గంలోని 15 మంది డైరెక్టర్లు, ఛైర్మన్‌ మండవ జానకి రామయ్య సుదీర్ఘకాలంగా పదవుల్లో కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ సీటును డాక్టర్ వల్లభనేని వంశీమోహన్‌కు కేటాయించడంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావును బుజ్జగించి ఆయనకు విజయ డెయిరీ ఛైర్మన్‌ పదవి కట్టబెడతామని హామీ ఇచ్చారు. 
మూడు డైరెక్టర్ పదవులకు జరిగిన ఎన్నికలు  
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక విజయ డెయిరీలో ఖాళీ అయిన మూడు డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఛైర్మన్ జానకిరామయ్య పదవి వదలుకోవడానికి సిద్ధపడకపోవడంతో కొంతమంది సొసైటీ సభ్యులు ఒక వర్గంగా ఏర్పడి జానకి రామయ్య  వర్గీయులపై పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో జానకి రామయ్య బలపర్చిన వారే డైరెక్టర్లుగా గెలుపొందడంతో ఛైర్మన్ కుర్చీ నుంచి మండవను దింపుదామనుకున్నా పార్టీలోని కొందరి ఎత్తుగడ బెడిసికొట్టినట్టయింది. పార్టీ తరపున ఏర్పాటైన ఎర్రన్నాయుడు, బుచ్చయ్య చౌదరిల కమిటీ ముందు 2011లో ఏడాది తర్వాత పదవి నుంచి తప్పుకుంటాననన్న మండవ ఆ హమీ నిలబెట్టుకోలేదు.  దీంతో రాజ్యసభ సభ్యులు, నేటి కేంద్రమంత్రి సుజనా చౌదరిని పార్టీ దూతగా పంపి మంతనాలు జరిపారు. అప్పుడు కూడా పాల ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌, కురియన్‌, కాకాని విగ్రహాలను ఏర్పాటు చేసి సీటు ఖాళీ చేస్తానని చెప్పుకొచ్చిన మండవ జానకి రామయ్య.. ఈ సారి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. 2014లో  జరిగిన ఎన్నికల్లోనూ మండవదే పై చేయి కావడంతో అందరూ ఆయనతో రాజీకి రాక తప్పలేదు.  2015లోనూ ముగ్గురు డైరెక్టర్ల పదవులు ఖాళీ 
2015లో కూడా ముగ్గురు డైరెక్టర్ల పదవులు ఖాళీ అయ్యాయి. ఆ సందర్భంలోనూ మండవ జానకి రామయ్య వర్గీయులే ఎన్నికయ్యారు. 2016లో ఛైర్మన్‌ మండవ పదవి ఖాళీ అవుతుండటంతో మరోసారి ఛైర్మన్‌ పదవిని ఆశిస్తున్న వారిలో ఆశలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే మండవ జానకి రామయ్యను తప్పించి.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావుకు గానీ, లేదా మరొకరికి గానీ ఛైర్మన్‌ పదవి ఇవ్వాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది.  అయితే ఏదేమైనా పార్టీ నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతుందని పార్టీవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 
ఛైర్మన్‌ పదవి రేసులో చలసాని ఆంజనేయులు  
రైతు సంఘ నాయకుడు, టీడీపీ నేత చలసాని ఆంజనేయులు కూడా ప్రస్తుతం ఛైర్మన్‌ పదవి రేసులో ఉన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ల కాలంలోనూ ఆయన రైతు సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తూ.. అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షుడు, నేటి జలవనరుల శాఖ మంత్రి  దేవినేని ఉమామహేశ్వరరావుకు సన్నిహితుడిగా పనిచేశారు.  తనకు డెయిరీ ఛైర్మన్‌ పదవి ఇచ్చి తగిన గుర్తింపు ఇవ్వాలని ఆయన ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.  
పదవి కోసం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు ఎదురుచూపులు
మరోవైపు.. గన్నవరం శాసనసభ సీటు వదలుకున్నందుకు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం తనకు డెయిరీ ఛైర్మన్‌ పదవి వస్తుందన్న ఆశతో మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు ఎదురు చూస్తున్నారు. ఈసారి కూడా పదవి రాకపోతే డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేస్తానని.. ఇప్పటికే బాలవర్ధనరావు సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అయితే అధిష్ఠానం గట్టిగా చెబితే తప్ప..మండవ జానకిరామ్య ఛైర్మన్‌ పదవి వదిలేట్టు కనిపించడం లేదు. సీఎం సరైన నిర్ణయం తీసుకుంటే తప్ప.. జానకి రామయ్య సీటు వదులుకోరన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. 
బాలవర్ధనరావుకు పదవి ఇవ్వాలని పార్టీలో అభిప్రాయం   
నూతన రాజధానికి విజయ డెయిరీ నుంచి రెండు విడతలుగా 15 కోట్లు విరాళంగా ఇచ్చిన మండవ.. దాంతోనే అధినేతకు మరింత దగ్గరయ్యారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. విజయ డెయిరీ బోనస్‌ను ఫణంగా పెట్టి జానకి రామయ్య పదవిని కాపాడుకుంటున్నారన్న అభిప్రాయమూ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఇచ్చిన మాట ప్రకారం బాలవర్ధనరావుకు విజయ డెయిరీ ఛైర్మన్‌ పదవి ఇవ్వాల్సిందేనన్న అభిప్రాయం పార్టీలో వెల్లడవుతోంది. 

20:08 - September 3, 2016
20:06 - September 3, 2016
20:05 - September 3, 2016

హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణా-వాణిలకు సర్జరీ చేయడానికి ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సింగపూర్, లండన్  డాక్టర్ల బృందం వీణా-వాణిల విషయంలో వెనుదిరిగిన నేపథ్యంలో తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఆసుపత్రులు వీణా వాణిల సర్జరీకి ముందుకు వచ్చాయి.
వీణా-వాణిల శస్త్రచికిత్స.... ముందుకొచ్చిన మెల్‌బోర్న్‌లోని ఆస్పత్రి వర్గాలు
అవిభక్త కవలలు వీణా-వాణిల శస్త్రచికిత్సపై ఆశలు చిగురిస్తున్నాయి. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లోని రాయల్ చిల్డ్రన్ హాస్పిటల్ వర్గాలు వీణా-వాణిల ఆపరేషన్‌పై సానుకూలంగా స్పందించాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్‌లో ఆ హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వీణా- వాణిల శస్త్రచికిత్సపై డాక్టర్లతో చర్చించారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారు. 
గతంలో వీణా-వాణిలను పరిశీలించిన లండన్‌ వైద్య బృందం
నిలోఫర్ హాస్పిటల్‌లో ఉన్న వీణా-వాణిలను గతంలో లండన్‌కు చెందిన గ్రేట్ అర్మండ్ స్ట్రీట్ వైద్య బృందం పరిశీలించింది. ఆపరేషన్‌కు 10 కోట్లు ఖర్చు అవుతుందని, 9 నుంచి 12 నెలల సమయం పడుతుందని నివేదికను అందించారు. కానీ, ఇంతవరకు అవిభక్త కవలల శస్ర్తచికిత్సపై అడుగుముందుకు పడలేదు. ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందంపై రాష్ర్ట వైద్య, ఆరోగ్యశాఖ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీణా-వాణిల హెల్త్‌రిపోర్ట్స్‌ను ఆస్ట్రేలియా ప్రతినిధులకు అందించామని, దానిపై సమాధానం లేకుండా.. వీణా-వాణిలను పరిశీలించకుండా... సంప్రదింపులేంటని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వైద్యుల బృందం కాకుండా ప్రతినిధుల బృందం వైద్య, ఆరోగ్యశాఖను సంప్రదించకుండా.. నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అపాయిట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తుండడంపై ఆరోగ్యశాఖ గుర్రుగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. 
హైకోర్టులో హెల్ఫింగ్ హ్యాండ్ సంస్థ పిల్ దాఖలు 
ఇదిలా ఉంటే.. వీణా వాణిల సర్జరీ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా.. తాత్సారం చేస్తోందని హెల్ఫింగ్ హ్యాండ్ సంస్థ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది.

19:57 - September 3, 2016

హైదరాబాద్ : ఆన్‌లైన్‌లో గ్రూప్స్ పరీక్షలు నిర్వహిచొద్దంటూ ఏపీ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు.. ఇందిరాపార్క్‌ దగ్గర ధర్నా చేపట్టారు.. పాత విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బాబు వస్తే జాబు అంటూ ప్రచారం చేశారని... ఇప్పుడు గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. 

19:53 - September 3, 2016

గుంటూరు : వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్‌ లెక్చరర్లు ఆందోళనకు దిగారు. వీసీలతో గంటా సమావేశం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాన్ని స్క్రీనింగ్‌ టెస్ట్‌ పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారని కాంట్రాక్ట్‌ లెక్చరర్లు ఆరోపించారు. వినతి పత్రం తీసుకునేందుకు మంత్రి గంటా నిరాకరించడంతో కాంట్రాక్ట్‌ లెక్చరర్లు ఆందోళనకు దిగారు. 

 

అగ్రిగోల్డుకు రూ.2,670 కోట్ల ఆస్తులు : సీఐడీ అడిషనల్ డీజీ

హైదరాబాద్ : అగ్రిగోల్డుకు రూ.2,670 కోట్ల ఆస్తులు ఉన్నట్లు సీఐడీ అడిషనల్ డీజీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రూ.3,900 కోట్లు బాధితులకు రావాల్సి ఉందన్నారు. అగ్రిగోల్డులో మొత్తం 32 లక్షల ఖాతాలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో 19 లక్షల ఖాతాలు, 13 లక్షల మంది బాధితులు ఉన్నారని తెలిపారు. 

 

యూనివర్సిటీల వీసీలతో మంత్రి గంటా సమావేశం

గుంటూరు : సచివాలయంలో యూనివర్సిటీల వీసీలతో మంత్రి గంటా సమావేశం నిర్వహించారు. మీటింగ్ హాల్ లో బయట కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాన్ని స్క్రీనింగ్ టెస్టు పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేశారు. 

జిల్లాల పునర్విభజనపై స్పష్టమైన గైడ్ లైన్స్ ప్రకటించాలి : మల్లు భట్టివిక్రమార్క

హైదరాబాద్ : టీఆర్ ఎస్ రాజకీయ అవసరాల కోసం జిల్లాలను ఏర్పాటు చేస్తామంటే కాంగ్రెస్ ఊరుకోదని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. జిల్లాల పునర్విభజనపై స్పష్టమైన గైడ్ లైన్స్ ప్రకటించాలన్నారు. గద్వాల, జనగామ ప్రజల పోరాటానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. 

ఎంసెట్ 2 పేపర్ లీకేజీ.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన సీఐడీ

హైదరాబాద్ : ఎంసెట్ 2 పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. విశాఖలోని అక్కయపాలెంకు చెందిన పెద్దాడ దామోదర్ అలియాస్ రామకృష్ణతో పాటు.. హైదరాబాద్‌కు చెందిన డీకొండ రమేష్‌లను అరెస్ట్ చేశారు. 

 

19:08 - September 3, 2016

హైదరాబాద్ : ఎంసెట్ 2 పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. విశాఖలోని అక్కయపాలెంకు చెందిన పెద్దాడ దామోదర్ అలియాస్ రామకృష్ణతో పాటు.. హైదరాబాద్‌కు చెందిన డీకొండ రమేష్‌లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 64లక్షల నగదు, ఒక ప్లాటు స్వాధీనం చేసుకున్నారు. 52 మంది విద్యార్థులకు పుణెలో శిక్షణ ఇచ్చినట్లు వీరు అంగీకరించారు. 

18:54 - September 3, 2016

ఢిల్లీ : దాదాపు రెండున్నర నెలలుగా అల్లర్లతో అట్టుడుకున్న కశ్మీర్‌లో పరిస్థితిని అంచనావేసి, చక్కదిద్ద లక్ష్యంతో అఖిలపక్ష ప్రతినిధి బృందం ఆది, సోమవారాల్లో ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. వివిధ వర్గాలలో చర్చించే ఈ ప్రతినిధి బృందానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నాయకత్వం వహిస్తారు. కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌తోపాటు మరో 25 మంది ఎంపీలు   అఖిలపక్ష ప్రతినిధి బృందంలో ఉన్నారు. కశ్మీర్‌లో పర్యటించే ప్రతినిధి బృందానికి అక్కడ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు  హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రెండు రోజులు పర్యటనలో ఎంపీలు ఎవరితో మాట్లాడాలన్న అంశంపై చర్చించారు. కశ్మీర్‌లో పర్యటించే అఖిలపక్ష బృందం అన్ని విషయాల్లో ఏకాభిప్రాయంతో ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది. హురియత్‌ నేతలను అఖిపక్షంతో చర్చలకు పిలవాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సూచించారు.

18:51 - September 3, 2016

మహబూబ్‌ నగర్‌ : జిల్లాలోని జడ్చర్ల మండలం గంగాపూర్‌లో దళిత విద్యార్థిపై సహ విద్యార్థుల దాడి కలకలం రేపింది. తనను కులం పేరుతో దూషించి..శ్రీనివాస్‌, పవన్‌ కుమార్‌, చంద్రశేఖర్‌, రవికుమార్‌ అనే విద్యార్థులు..స్పృహ కోల్పోయేలా చితకబాదారని బాధితుడు సంతోష్‌ ఆరోపిస్తున్నాడు. మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన బాధితుడు సంతోష్‌ తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో.. బంధువులతో కలిసి వారు స్కూల్‌ వద్ద ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   

 

18:48 - September 3, 2016

కరీంనగర్ : చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక ఓ యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్‌ జిల్లా బోయినిపల్లి మండలం రత్నంపేటకు చెందిన కందారపు రాజు.. తన రెండెకరాలలో పత్తి పంట వేశాడు. విత్తనాలు మొలకెత్తకపోవడం,.. అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు రాజును వేములవాడలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజు మృతి చెందాడు. దీంతో రాజు కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

 

డబుల్ బెడ్ రూం రెండో దశలో 4,538 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు

హైదరాబాద్ : డబుల్ బెడ్ రూం రెండవ దశలో 4,538 ఇళ్ల నిర్మాణానికి జీహెచ్ ఎంసీ టెండర్లు పిలిచింది. 11 ప్రాంతాల్లో రూ.334 కోట్లతో 4,538 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. 

 

సామాజిక, సమగ్ర అభివృద్ధి సాధనకు మహాజన పాదయాత్ర : తమ్మినేని

హైదరాబాద్ : సామాజిక, సమగ్ర అభివృద్ధి సాధన కోసం మహాజన పాదయాత్ర చేపడతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. అక్టోబర్ 15 నుంచి 2017 మార్చి 5 వరకు 3,500 కిమీ మేర సుదీర్ఘ పాదయాత్ర ఉంటుందని తెలిపారు. సభలు, సెమినార్లు, కళా రూపాల ద్వారా పాదయాత్రకు విస్తృత ప్రచారం కల్పిస్తామని చెప్పారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ నమూనాను ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. 

 

ఏ ప్రాతిపదికన జిల్లాల విభజన : షబ్బీర్ అలీ

హైదరాబాద్ : జిల్లాల విభజనకు వ్యతిరేకంగా కాదు.. కానీ ఏ ప్రాతిపదికన విభజన చేస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. పద్ధతి.. పాడు లేకుండా జిల్లాల విభజన చేస్తున్నారని మండిపడ్డారు. డీకే.అరుణకు భయపడే ప్రభుత్వం గద్వాలను పక్కన పెట్టిందని ఎద్దేవా చేశారు. 

 

18:11 - September 3, 2016

హైదరాబాద్ : తెలంగాణలో సామాజిక, సమగ్ర అభివృద్ధి సాధనకోసం మహాజన పాదయాత్ర చేస్తామని.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ ఎంబీ భవన్‌లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో పాదయాత్రపై చర్చించామని పేర్కొన్నారు. అక్టోబర్‌ 15నుంచి మార్చి 5వరకూ 3వేల ఐదువందల కిలోమీటర్ల దూరం ఈ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. 

 

18:08 - September 3, 2016

అనంతపురం : రైతులను విస్మరిస్తే ఏ ప్రభుత్వమైనా పతనంకాక తప్పదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా చిలమత్తూర మండలంలో పంటల్ని ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరాతో కలిసి ఆయన పరిశీలించారు. రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ సీమలో పంట నష్టపోయిన వేరుసెనగ రైతులందరకీ ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రెయిన్‌ గన్స్‌వల్ల ఎలాంటి ఉపయోగంలేదని విమర్శించారు. 

 

18:02 - September 3, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో అగ్రిగోల్డ్ సంస్థ లక్షలాదిమందిని మోసం చేసిందంటూ విచారణలో తేలిందని సీఐడీ స్పష్టం చేసింది. సంస్థ ఆస్తుల్ని చాలావరకూ అటాచ్‌ చేశామని సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఏజెంట్లకు ఇంకా ఏమైనా ఆస్తులు తెలిసిఉంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అగ్రిగోల్డ్‌ బాధితులతో ఏపీ సీఐడీ పోలీసులు సమావేశమయ్యారు. 2015 నుంచి ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తును బాధితులకు వివరించారు. అయితే ఈ వివరాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాధితులు.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అధికారులు విచారణను తప్పుబట్టేలా మాట్లాడటం సరికాదని సూచించారు.

 

17:58 - September 3, 2016

ఢిల్లీ : కశ్మీర్ లో పెల్లెట్ గన్స్ వాడకం నిషేధించాలని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ లో రెండు నెలలుగా తీవ్ర అశాంతి నెలకొందన్నారు. కశ్మీర్ అల్లర్లలో నష్టపోయినవారికి పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. పౌరులు నివసించే ప్రదేశాల్లో సైనిక అధికార ప్రత్యేక చట్టాన్ని అమలు చేయరాదని సూచించారు. 

అగ్రిగోల్డు బాధితులు, ఏజెంట్లతో సీఐడీ పోలీసులు ప్రత్యేక సమావేశం

విజయవాడ : అగ్రిగోల్డు బాధితులు, ఏజెంట్లతో సీఐడీ పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేసు పురోగతిపై బాధితులకు సీఐడీ వివరించింది. తాము బతికుండగా న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 

17:48 - September 3, 2016

ఆదిలాబాద్ : కొత్త తరానికి బొమ్మల్లో చూపించడమే తప్ప మరెక్కడా కనిపించని పక్షిరాజం అది. జీవ వైవిధ్యం పతనావస్థకు సూచికలవి.. ఒకప్పుడు ఊరిచివర గుంపులుగా కనిపించిన ఈ పక్షులు అంతరించిపోతున్న జీవాలుగా మారాయి. అవి మరేంటోకావు.. రాబందులు. ప్రపంచంలోనే అరుదైన పక్షిజాతిగా పేరొందిన రాబందులు ఆదిలాబాద్‌ జిల్లా బెజ్జుర్‌ మండలంలోని సందడి చేస్తున్నాయి. నేడు అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవం సందర్భంగా అంతరించిపోతున్న రాబందులపై 10 టీవీ ప్రత్యేక కథనం..!
గతంలో గ్రామాల పొలిమేరల్లో గుంపులు గుంపులుగా 
అంతరించిపోతున్న జీవ జాతుల జాబితాలో ముందు వరుసలో ఉన్న జీవులు రాబందులు. గతంలో గ్రామాల పొలిమేరల్లో గుంపులు గుంపులుగా దర్శనమిచ్చే రాబందులు మానవ తప్పిదాలతో దాదాపు కనుమరుగయ్యాయి. దేశంలో మొత్తం తొమ్మిది రాబందు జాతులుంటే అందులో రెండు జాతులు, వీటిలో పొడుగు ముక్కు రాబందు జాతి మనుగడ ప్రమాదంలో పడినట్లు అంతర్జాతీయ ప్రకృతి -సహజవనరుల పరిరక్షణ సంస్థ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాబందులు కనుమరుగైనట్లు రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ప్రకటించిన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా బెజ్జుర్ మండలంలోని పాలరావు గుట్టపై రాబందులు ఉన్నట్లు 2014లో అటవీశాఖ అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి వాటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. వాటికి ఆహారాన్ని అందించడం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అంతేకాదు.. రాబందుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించింది. ప్రస్తుతం పాలరావు గుట్టపై 19 పెద్ద రాబందులు, 7 చిన్న రాబందులు సందడి చేస్తున్నాయి. 
తిరిగి కనిపించడం శుభ పరిణామం
అంతరించి పోయాయనుకున్న రాబందులు రాష్ట్రంలో తిరిగి కనిపించడం శుభ పరిణామం. దేశంలో వేగంగా అంతరించి పోతున్న రాబందుల జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ చేపట్టిన చర్యలు కొంతమేరకు ఫలితాలు ఇస్తున్నాయి. గతేడాదితో పోల్చితే వీటి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు రాబందుల సంరక్షణ ప్రాజెక్టు అధికారులు గుర్తించారు. ప్రపంచం అంతటా సంవత్సరానికి 10,000 జాతులు అంతరించి పోతున్నాయి. ఈ విధంగా జాతులు అంతరించిపోతే జీవం మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

 

17:45 - September 3, 2016

ఖమ్మం : సిరులు కురిపించే సింగరేణి బోగ్గు గనులు. విద్యుత్ వెలుగులు విరజిమ్మే కేటీపీఎస్..దేశంలోనే రెండొవ స్ధానంలో నిలిచిన భారజల కర్మాగారం..అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఐటీసీ పేపర్ బోర్డ్స్ లాంటి పలు కంపెనీలు కేంద్రీకృతమైన కేంద్రం కొత్తగూడెం. జిల్లాల పునర్విభజనతో జిల్లాగా మారనున్న కొత్తగూడెం పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో పయనించే అవకాశముంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక జిల్లాగా మారనున్న కొత్తగూడెంపై టెన్ టీవీ ప్రత్యేక కథనం..
కొత్త జిల్లాగా ఆవిర్భవించనున్న కొత్తగూడెం 
జిల్లాల పునర్విభజనలో భాగంగా ఖమ్మం జిల్లా నుంచి కొత్తగూడెం విడిపోయి..కొత్త జిల్లాగా ఆవిర్భవించనుంది. రాష్ట్రానికి అవసరమయ్యే ప్రధాన పరిశ్రమలు ఈ ప్రాంతంలోకి రానున్నాయి. ఏజెన్సీ ప్రాంతం కావడం..ప్రధాన పరిశ్రమలన్ని ఈ ప్రాంతంలోనే ఉండడంతో కొత్తగూడెం పారిశ్రామిక జిల్లాగా మరింత అభివృద్ధి చెందే అవకాశముంది. తెలంగాణకు విద్యుత్ వెలుగులు అందించే సింగరేణి సంస్ధ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రస్తుతం సింగరేణి పరిధిలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధిస్తున్న మూడు ఏరియాల్లో గనులు జిల్లాలోనే ఉండనున్నాయి. హైదరాబాద్ జిల్లా తర్వాత రాష్ట్రంలో భారీ పరిశ్రమలు ఉన్న జిల్లాగా కొత్తగూడెంకు ప్రత్యేక గుర్తింపు రానుంది. 
కీలకంగా సింగరేణి కాలరీస్ కంపెనీ 
తెలంగాణకే తలమానికంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్ధ సింగరేణి కాలరీస్ కంపెనీ నూతనంగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లాలో కీలకం కానుంది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ వెలుగులు అందిస్తోంది. దాంతో పాటు కొత్తగూడెంలోని నవభారత్ వెంచర్స్ లిమిటెడ్ పరిశ్రమ అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకొంది. పరిశ్రమలో సిలికో మాంగనీస్, ఫెర్రో సిలికాన్ ఉత్పత్తి చేస్తుంటారు. అంతేకాక విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా ఉన్న నవభారత్ పరిశ్రమలో 3యూనిట్ల ద్వారా 114 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. నవభారత్ ఎనర్జీ లిమిటెడ్ మరో యూనిట్ ద్వారా 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీంతో పాటు ఇక్కడే ఉన్న సిల్  కర్మాగారాన్ని  నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌ లో విలీనం చేశారు. ఈ కర్మాగారం ఇనుపరాయి, బొగ్గు, సున్నపురాయిని వినియోగించి స్పాంజ్  ఐరన్‌ను ఉత్పత్తి చేస్తుంది. 
ఐటీసీ పేపర్ బోర్డ్స్ అంతర్జాతీయ ఖ్యాతి 
భద్రాచలం సమీపంలోని సారపాకలో ఏర్పాటు చేసిన ఐటీసీ పేపర్ బోర్డ్స్ అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. 1978లో స్ధాపించిన ఈ కర్మాగారంలో ప్రస్తుతం 1600 మంది పర్మినెంట్‌ కార్మికులు, 12 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. భారతదేశంలోనే మణుగూరులో 1985లో స్ధాపించిన భారజల కర్మాగారం రెండోది కూడా ఇక్కడే ఉంది. ప్లాంట్ ద్వారా ఏడాదికి 185 మెట్రిక్ టన్నుల భారజలాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తానికి జిల్లాల పునర్విభజనతో కొత్తగూడెంకు కొత్త వైభవం రానుంది. పారిశ్రామిక అభివృద్ధి వైపు అడుగులు వేసి, స్ధానిక ప్రజలకు ఉపాధి కల్పించి మరింత అభివృద్ధి సాధించే అవకాశం కనిపిస్తోది.  

 

17:39 - September 3, 2016

హైదరాబాద్‌ : నీలోఫర్‌ ఆస్పత్రిలో బాల భీముడు జన్మించాడు. బోరబండకు చెందిన షబానా అనే మహిళ ఆరు కిలోల బరువున్న శిశువుకు జన్మనించింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. సాధారణంగా జన్మించే శిశువులు మూడు కిలోల వరకు ఉంటారని.. ఈ బాలుడు ఆరు కిలోలు ఉండటానికి డయాబెటిక్‌ ఇబ్బందులు కారణమని వైద్యులు తెలిపారు. ఇదిలావుంటే శిశువుని చూసి బంధువులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

 

17:36 - September 3, 2016

హైదరాబాద్ : ఎప్పటికైనా కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన పార్లమెంట్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశం వివరాలను జితేందర్‌రెడ్డి మీడియాకు వివరించారు. కశ్మీర్‌ పర్యటనలో గాయపడ్డ ప్రజల్ని, సీఆర్‌పీఎఫ్‌ సైనికులను పరామర్శించి పరిస్థితులను తెలుసుకుంటామన్నారు. భారతదేశమంతా ఒకటే అని చాటి చెప్పడానికి కశ్మీర్‌కు అఖిలపక్ష బృందం వెళ్తుందని జితేందర్‌రెడ్డి తెలిపారు. 

 

17:32 - September 3, 2016

హైదరాబాద్‌ : టీఎస్‌ ప్రభుత్వం ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లు జిల్లాల్ని విభజిస్తోందని.. తెలంగాణ ప్రతిపక్ష నేత జానారెడ్డి ఆరోపించారు. జిల్లాల పునర్విభజనలో శాస్త్రీయత లేదని విమర్శించారు. ఎన్నికలకుముందు ఇచ్చిన హామీలుఏవీ ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని యువత నిలదీయాల్సిన అవసరముందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలో ఆపేశారని విమర్శించారు. వీటిని పూర్తిచేస్తే 5లక్షలమందికి నివాసం దొరుకుతుందని చెప్పారు.

కశ్మీర్ లో 2నెలలుగా తీవ్ర అశాంతి : ఏచూరీ

ఢిల్లీ : కశ్మీర్ లో 2నెలుగా తీవ్ర అశాంతి నెలకొందని  సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ లో పెల్లెట్ గన్స్ వాడకం నిషేధించాలని డిమాండ్ చేశారు. కశ్మీర్ అల్లర్లలో నష్టపోయినవారికి పరిహారం చెల్లించాలన్నారు. పౌరులు నివసించే ప్రదేశాల్లో సైనిక అధికార ప్రత్యేక చట్టాన్ని అమలు చేయరాదని సూచించారు. 

17:11 - September 3, 2016

హైదరాబాద్ : తెలంగాణలో జిల్లాల పునర్విభజనకు శాస్త్రీయ పద్ధతి అంటూలేదని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. గద్వాల, జనగామలను జిల్లా చేయాలంటూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ దగ్గర జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని, మాట్లాడారు. శాస్త్రీయ పద్ధతిలేకుండా విభజనకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గద్వాల, జనగామ చారిత్ర ప్రాధాన్యత ఉన్న జిల్లాలని తెలిపారు. సీఎం కేసీఆర్‌ బుర్రలో ఏ ఆలోచనవస్తే దానిని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా జిల్లాలను విభజిస్తే ఆందోళనలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

 

17:04 - September 3, 2016

కడప : జిల్లాలో రైతు మహాధర్నా వేదికగా..ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. రెయిన్‌గన్‌, స్ప్రింక్లర్లను రాష్ట్రానికి తానే పరిచయం చేసినట్లుగా చంద్రబాబు రైతుల చెవిలో పూలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రెయిన్‌గన్‌ అన్నది అందరికీ తెలిసిన పరికరమే అన్నారు. పులివెందుల మండలంలో 4 వేల ఎకరాల పంటకు 4 రెయిన్‌గన్‌లతో నీరు అందిస్తామని చెప్పడం హాస్యాస్పందంగా ఉందన్నారు. ఏరియల్‌ సర్వేతో కరువు అంచనా వేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. 

 

17:00 - September 3, 2016

ఢిల్లీ : విజయ్‌ మాల్యా ఆస్తుల జప్తు పరంపర కొనసాగుతోంది. మాల్యాకు చెందిన 6,630 కోట్ల రూపాయల ఆస్తులు, షేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఎటాచ్‌ చేశారు. ముంబయి, బెంగళూరుతోపాటు ఇతర రాష్ట్రాల్లో మాల్యాకు ఉన్న ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. ఎటాచ్‌  చేసిన ఆస్తుల్లో  కర్నాటకలోని మాండ్యాతోపాటు బెంగళూరులో ఉన్న యునైటెడ్‌ బ్రూవరీస్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌ ఆస్తులు, షేర్ల కూడా ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గత నెలలో కూడా మాల్యాకు చెందిన ఆస్తులును జప్తు చేశారు. 
 

కరువు పరిస్థితులపై సమీక్షలు చేయడం లేదు : జగన్

కడప : సింగపూర్ కంపెనీలకు భూములు ఇచ్చేందుకు కేబినెట్ సమావేశాలు పెడుతున్నారు కానీ కరువు పరిస్థితులపై సమీక్షలు చేయడం లేదని వైసిపి అధినేత జగన్ విమర్శించారు. ప్రతిపక్షానికి భయపడి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం వాయిదా వేశారని తెలిపారు. 

 

విజయ్ మాల్యా ఆస్తులను జప్తు చేసిన ఈడీ

న్యూఢిల్లీ : విజయ్ మాల్యా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. బెంగళూరు, ముంబై సహా ఇతర ప్రాంతాల్లోని మాల్యాకు చెందిన రూ.6,630 కోట్ల ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  

ప్లానింగ్ శాఖ డైరెక్టర్లు, అధికారులతో మంత్రి యనమల సమీక్ష

గుంటూరు : వెలగపూడి సచివాలయంలో ప్లానింగ్ శాఖ డైరెక్టర్లు, అధికారులతో మంత్రి యనమల రామకృష్ణుడు సమీక్ష చేపట్టారు. ఈ ఏడాది 15 శాతం వృద్ధిరేటు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు యనమల తెలిపారు. కొన్ని జిల్లాల్లో జీఎస్ టీపీ రేటు తక్కువగా ఉందని..దానిని అధిగమించేందుకు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. 

 

ఎన్ టీఆర్ యూనివర్సిటీలో ఎంబిబిఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ గందరగోళం

గుంటూరు : ఎన్ టీఆర్ యూనివర్సిటీలో ఎంబిబిఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. 371 డీ ప్రకారం ఆంధ్రా, తెలంగాణ, జమ్మూకాశ్మీర్ విద్యార్థులను మాత్రమే కౌన్సిలింగ్ కు అనుమతించాలని కౌన్సిలింగ్ కేంద్రం వద్ద  తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. 

 

15:10 - September 3, 2016

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. గణేష్ మండపాలు సిద్ధమయ్యాయి. విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా మట్టి వినాయకుల ఏర్పాటుపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. రసాయనాలతో చేసే విగ్రహాలకు దూరంగా ఉండాలన్నారు. మట్టి గణపయ్యే ముద్దని తెలిపారు. సంతోషకరంగా జరుపుకునే వినాయక చవితిని కాలుష్యకారకంగా జరుపుకోవద్దని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

గుంటూరు ఎండో మెంట్ డిప్యూటీ కమిషనర్ ఆస్తులపై ఎసిబి విచారణ

గుంటూరు : ఎండో మెంట్ డిప్యూటీ కమిషనర్ విజయసాగర్ బాబు ఆస్తులపై ఎసిబి విచారణ కొనసాగుతోంది. గుంటూరులో ఆంధ్రా బ్యాంక్ లో ఎసిబి లాకర్ ను తెరిచింది. రూ.49 లక్షల నగదు, రూ. 2 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

నీలోఫర్ ఆస్పత్రిలో 6 కిలోల శిశువు జననం

హైదరాబాద్ : నీలోఫర్ ఆస్పత్రిలో 6 కిలోల శిశువు జన్మించింది. బోరబండాకు చెందిన షబానా 6 కిలోల బాలుడికి జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. 

 

కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు రద్దాంతం చేయడం తగదు : మంత్రి జూపల్లి

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు రద్దాంతం చేయడం తగదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతిపక్షాలు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శాస్త్రీయంగా జిల్లాల పునర్ విభజన జరుగుతుందని చెప్పారు. 

జిల్లాల పునర్విభజన ఆందోళనకరం : డీకే.అరుణ

హైదరాబాద్ : జిల్లాల పునర్విభజన ఆందోళనకర అంశమని కాంగ్రెస్ నాయకురాలు డీకే.అరుణ అన్నారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు.  ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల ఏర్పాటు జరగాలన్నారు.  ముసాయిదాకు అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలిపాయని టీఆర్ ఎస్ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని తెలిపారు. 

14:08 - September 3, 2016

రంగారెడ్డి : రెండు రోజులుగా జిల్లాలో కురిసిన వర్షాలకు..రంగారెడ్డి జిల్లా..శంకర్‌పల్లి దగ్గర మూసీవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగు దాటడానికి వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. వాగు దాటుతుండగా బైక్‌తో సహ ఓ వాహనదారుడు వాగులో పడిపోయాడు ..దీంతో స్థానికులు వాహనదారుడిని కాపాడారు. ప్రవాహానికి బైక్‌ మాత్రం కొట్టుకుపోయింది. 

14:04 - September 3, 2016

హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గద్వాలను కొత్త జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఇందిరాపార్క్‌ వేదికగా రెండు రోజుల నిరాహార దీక్షకు దిగారు. వనపర్తి జిల్లా వద్దంటున్న ప్రభుత్వం మాత్రం వనపర్తిని జిల్లా చేస్తూ గద్వాలకు మొండిచేయి చూపిస్తోందని డీకే అరుణ ఆరోపించారు. ప్రజలు ఏది కోరకుంటే దాన్ని జిల్లాగా ప్రకటించాలంటూ ఆమె డిమాండ్ చేశారు. డీకే అరుణ నిరాహార దీక్షకు మద్దతు పలికేందుకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ కూడా డీకే అరుణ దీక్షకు మద్దతు తెలుపుతూ ఆమెతో పాటు దీక్షలో పాల్గొన్నారు. ఇక వరంగల్ జిల్లాలోని జనగామను కొత్త జిల్లాగా ప్రకటించాలంటూ మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా డీకే అరుణతో పాటు రెండు రోజుల దీక్షను ప్రారంభించారు. జనగామను జిల్లా చేయాలని పెద్ద ఎత్తున విన్నపాలు వస్తున్నా..ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని పొన్నాల ఆరోపించారు. 

గద్వాలను జిల్లాగా ప్రకటించాల్సిందే-డీకే అరుణ
జిల్లాల విభజన శాస్త్రీయంగానే జరిగిందని ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డీకే అరుణ్‌ ప్రభుత్వానికి సవాల్‌ చేసింది. మరో 24గంటల్లోగా ఇందిరాపార్క్‌ దగ్గరకు సీఎం కొడుకు కేటీఆర్‌గానీ, అల్లుడు హరీష్‌రావుగానీ వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 

13:47 - September 3, 2016

ఢిల్లీ : కశ్మీర్‌ సంక్షోభంపై హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ అధ్యక్షతన పార్లమెంట్ భవనంలో అఖిలపక్ష నేతలు  భేటీ అయ్యారు. సమావేశానంతరం కశ్మీర్ లో శాంతియుత వాతావరణ నెలకొల్పటానికి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తమ సంఘీభావం తెలుపుతున్నామని టీడీపీ ఎంపీలు  పేర్కొన్నారు.  ఈ సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీలూ ఏకాభిప్రాయాన్ని తెలిపాయని ఈ సందర్బంగా తెలిపారు. కశ్మీర్ లో రెండురోజుల పర్యటన నేపథ్యంలో కశ్మీర్‌ పరిస్ధితులపై ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను అఖిల పక్ష సమావేవంలో హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ 20 పార్టీలకు చెందిన ఎంపీలకు వివరించారు.

13:42 - September 3, 2016

హైదరాబాద్ : తెలంగాణలో రుణమాఫీ అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ వల్ల నిజంగా రైతులకు మేలు జరిగిందా? బ్యాంకుల్లో రైతులకు అప్పులు లభిస్తున్నాయా? రుణమాఫీ అమలు జరిగాకా రైతు పెట్టుబడుల కోసం ఏం చేస్తున్నాడు అనే అంశాలపై టెన్ టీవి స్పెషల్ స్టోరీ.

రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్నా సీఎం కేసీఆర్‌
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామన్న టీఆర్‌ఎస్‌ పార్టీ ..ఆ హామీకి కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఒకే సంవత్సరంలో రుణమాఫీ చేయడం సాధ్యం కాదని.. నాలుగేళ్లలో సంవత్సరానికి నాలుగో వంతు చొప్పున పూర్తిగా మాఫీ చేస్తామన్నారు.

రైతులకు రుణలివ్వని బ్యాంకులు..వ్యాపారుల వేధింపులకు రైతుల ఆత్మహత్యలు
తెలంగాణలో మొత్తం పంట రుణాలు ' పద్దెనిమిది వేల కోట్లు'గా తెల్చిన సర్కారు ఏటా '4 వేల2వందల 50 కోట్ల' రూపాయలు రుణమాఫీ కోసం బ్యాంకులకు జమ చేస్తోంది. పావు వంతు మొత్తాన్ని రుణమాఫీగా జమ చేసుకుని ..ప్రతిఏటా రైతులకు కొత్త రుణాన్ని బ్యాంకులు మంజూరు చేయాల్సిఉంది. కానీ బ్యాంకులు మాత్రం పాత రుణాలకు వడ్డీ లెక్కగట్టి మొత్తం రుణాన్ని కట్టాల్సిందేనిని స్పష్టం చేస్తున్నారు. దీంతో పంటల పెట్టుబడి కోసం అన్నదాతలకు ప్రైవేటు అప్పే శరణ్యమైంది. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చిన రైతులు వడ్డీ వ్యాపారుల వేధింపులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

రైతు రాజ్యం అని గొప్పగా చెబుతున్న టీసర్కార్‌
ఇరవై అయిదు శాతం చొప్పున రెండు విడతల రుణ మాఫీ చేసిన కేసిఆర్ సర్కార్‌..మాది ముమ్మాటికి రైతు రాజ్యం అని.. రుణ మాఫీయే దానికి సాక్ష్యం అంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. బ్యాంకులేమో గత ఆర్థిక సంవత్సరంలో 18 వేల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామని.. ఈ సంవత్సరం కూడా రుణాలు ఇచ్చేందుకు 29 వేల కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్ణయించుకున్నామని ప్రకటించాయి. అయితే పూర్తిగా చెల్లించిన వారికి మాత్రమే రీ షెడ్యూల్ చేసి రుణాలు ఇస్తుండటంతో చాలామందిరైతులకు ప్రైవేట్‌ అప్పులే దిక్కయ్యాయి.

ప్రభుత్వం చెప్పేదొకటి.. బ్యాంకుల్లో జరిగేది మరొకటి
ప్రభుత్వం ఒకటి చెబుతుంటే.. బ్యాంకులు మరొకరకంగా వ్యవహరిస్తున్నాయి. చివరికి అన్నదాతకు అప్పుల బాధలు ఎప్పటిలాగే మిగిలిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం.. రుణమాఫీలో లొసుగులను. పరిష్కరించి.. బ్యాంకుల్లో కొత్తగా రుణాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. లేదంటే.. వేలకోట్లరూపాయల రుణమాఫీ పథకం రైతుకు ఉపయోగంలేకుండా పోయే అవకాశంఉందని వ్యవసాయరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

13:40 - September 3, 2016

నల్లగొండ : భువనగిరి ఆర్డీవో కార్యాలయానికి గ్యాంగ్‌స్టర్‌ నయీం బాధితులు క్యూ కడుతున్నారు. భువనగిరి మండలం బొమ్మాయిపల్లి శివారులోని సర్వే నెంబర్‌ 722 నుండి 733 వరకు ఉన్న 170 ఎకరాల భూమిని నయీం కబ్జా చేశాడని బాధితులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి ఆర్డీవో గోపాల్‌రెడ్డి..నయీం ఆక్రమించిన ఎస్ఎల్ఎన్ఎస్ భూములపై విచారణ మొదలుపెట్టారు. 

13:39 - September 3, 2016

హైదరాబాద్ : కొత్తజిల్లాల పోరు రాజధానికి చేరుకుంది. గద్వాలను జిల్లాగా చేయాలంటూ కాంగ్రెస్‌నేత గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ఇందిపార్క్ వద్ద దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అశాస్త్రీయంగా జిల్లా విభజన జరిగిందన్నారు. దీనిపై జ్యుడిషియల్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఏ ప్రాతిపదిక ఏర్పాటు చేశారో తెలపాలని ఆమె డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సూచనల్ని ప్రభుత్వం భేఖాతరు చేసిందన్నారు. రాజకీయ స్వార్థంకోసమే జిల్లాల విభజన జరిగిందని ఆమె విమర్శించారు.  ప్రజల అభీష్టం మేరకు జిల్లాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ఇష్టారాజ్యంగా వుంది తప్ప ప్రజాస్వామ్యం రాష్ట్రంలో లేదని విమర్శించారు. స్వంత ప్రయోజనాలకోసమే అరుణ గద్వాలను జిల్లాగా ప్రకటించమంటున్నారనే ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఏరకమైన మార్గదర్శకాలతో జిల్లా ప్రక్రియను చేపట్టారని ఆమె ప్రశ్నించారు. మేము చేసే పోరాటానికి సమాధానం చెప్పలేకే తమకు విమర్శిస్తున్నారనీ..దీనికి ప్రజలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి సరైన సమాధానం చెబుతారన్నారు. జిల్లాల పునర్విభజన విషయంలో ప్రభత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గద్వాలను జిల్లాగా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌జిల్లా గద్వాలతోపాటు వరంగల్‌ జిల్లా జనగామను కూడా జిల్లాగా చేయాలనీ..కొత్తజిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇస్తోందని విమర్శించారు. 

13:37 - September 3, 2016

విజయవాడ : తనను హైటెక్ చీఫ్ మినిస్టర్‌గా చెప్పుకునే చంద్రబాబు...? సోషల్ మీడియాలో మాత్రం వెనుకబడ్డారా...? గత ఎన్నికలలో కలిసొచ్చిన ఫేస్ బుక్ మంత్రం ప్రస్తుతం వికటిస్తోందా...? ఆన్‌లైన్ మీడియాలో టీడీపీ ఎదురీతకు కారణాలేంటి.? ముఖ్యమంత్రిగా అధికార యంత్రాగాన్ని పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు.. సోషల్ సైట్స్ లో మాత్రం ఎందుకు వెనుకబడిపోయారు... బాబు దూకుడు తగ్గడానికి కారణాలేంటి.. వాచ్ దిస్ స్టోరీ..

టీడీపీ అధికారిక పేజీని ఫాలోఅవుతున్న వారు 18లక్షలు
హైటెక్ హంగులకు తానే మారుపేరు అని చెప్పుకుంటారు చంద్రబాబు. రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలోనే సాంకేతిక పరిజ్ణానాన్ని రాజకీయాలకు అనుసంధించిన ఏకైక వ్యక్తిని అంటున్నారు. ఆదినుండి తెలుగుదేశం పార్టీ సాంకేతికతకు పెద్దపీట వేసింది. ఇక ఫేస్ బుక్ ను సైతం విస్తృతంగా ఉపయోగించుకున్న చరిత్ర టిడిపిదే.. టిడిపి అధికారిక ఫేస్ బుక్ పేజీనీ పద్దెనిమిదిన్నర లక్షల మంది ఫాలో అవుతున్నారంటే సోషల్ మీడియాలో టిడిపి హవా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. సాక్షాత్తు యువనేత నారాలోకేషే బాధ్యత వహించి ఆన్‌లైన్‌ ప్రమోషన్ ను విజయవంతంగా నడిపారు.

అధికారంలోకి రాగానే సోషల్ మీడియాకు దూరం
కానీ ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అధికారిక కార్యక్రమాలలో నిమగ్నమైపొయిన అధినేత, పార్టీ ముఖ్యనాయకత్వం సోషల్ మీడియాను నిర్లక్ష్యం చేశాయి. ఫలితంగా కొంతకాలంగా సోషల్ మీడియాలో టీడీపీకి ఆదరణ తగ్గుతోంది.

రాష్ట్ర విభజన అనంతరం ఇక్కడి సాంకేతికకు గుడ్‌బై
ఒకప్పుడు హైదరాబాద్ సైబర్ సిటి వేదికగా సామాజిక మాధ్యమాలలో టీడీపీని అగ్రస్థానంలో నిలబెట్టారు పార్టీ అభిమానులు. ప్రస్తుతం రాష్ట్రవిభజన జరగడం... సైబరాబాద్ తెలంగాణ ప్రాంతం కావడం ..ఇక్కడ టిడిపి అధికారానికి దూరం అవ్వడం లాంటి చర్యలతో.. సాంకేతిక నిపుణులకు దూరం కావాల్సి వచ్చింది. అయితే నాడు బ్రింగ్ బాబు బ్యాక్ అంటూ... సుమారు 40వేల మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు రెండు రాష్ట్రాలలో కూడా భారీగా ప్రచారం సాగించారు. వారెవరినీ కూడా ఎన్నికల అనంతరం పట్టించుకోకపోవడంతో... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన తెలుగునాడు నెట్‌వర్కింగ్‌ వింగ్‌ కూడా దాదాపు పార్టీలో తెరమరుగయ్యింది.

పుష్కరాల విజయోత్సవాన్ని సోషల్ ప్రచారానికి వాడుకోవాలని డిసైడ్‌
ఇలా లోపాలను అంచనావేసుకున్న టిడిపి నష్టనివారణా చర్యలకు శ్రీకారం చుట్టింది. విచ్చిన్నం అయిన తెలుగునాడు సాంకేతిక విభాగం నిపుణులను ఒక్కగూటికి చేర్చి... మరోమారు సోషల్ ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కించేదుకు రెడి అవుతోంది. పుష్కరాల విజయోత్సవాన్ని సోషల్ ప్రచారానికి వాడుకోవాలని డిసైడైన పార్టీ ఇప్పటికే థ్యాంక్యూ సీయం సార్ అంటూ క్యాంపెయిన్ సాగిస్తోంది..

చంద్రబాబు పేజీని ఫాలోఅవుతున్న వారు 7లక్షలు
ఒక్క ఫేస్ బుకే కాకుండా...ఐవిఆర్ ఎస్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వ పథకాల ప్రచారం, వాట్స్ ఆప్, ట్విట్టర్ ద్వారా ప్రభుత్వ వాయిస్‌ను ప్రజల్లోకి పంపేదుకు టీడీపీ సిద్దమౌవుతోంది. మరి ఈ ప్రయత్నంతోనైనా...సామాజిక మాధ్యమాలలో టీడీపీ పునర్వైభవాన్ని సాధిస్తుందో లేదో వేచి చూడాలి.

 

13:35 - September 3, 2016

ఢిల్లీ : కశ్మీర్‌ సంక్షోభంపై హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ అధ్యక్షతన కాసేపట్లో అఖిలపక్ష భేటీ కానుంది. పార్లమెంట్‌లో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో కశ్మీర్‌ పరిస్ధితులపై ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను ఎంపీలకు వివరించనున్నారు. ఆదివారం ఖరారు కానున్న రెండురోజుల కశ్మీర్‌లో అఖిలపక్ష పర్యటన ఎజెండాతో ఈ సమావేశం ప్రారంభం కానుంది. అఖిలపక్ష సమావేశానికి హాజరుకానున్న 20 పార్టీల నుండి 27 మంది ఎంపీలు హాజరుకానున్నారు. కశ్మీర్‌ పర్యటలో అరుణ్‌జైట్లీ, అనంతకుమార్‌, జితేందర్‌సింగ్‌, రాంవిలాస్‌ పాశ్వాన్‌ పాల్గొననున్నారు. కాగా సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి రాజ్యసభ సమావేశంలో కశ్మీర్ అంశంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. సీపీఎం నుండి సీతారాం ఏచూరీ,సీపీఐ నుండి రాజా వెళ్ళనున్నారు. అఖిలపక్ష పర్యటనలో భాగస్వామ్యం కాలేమని కశ్మీర్ హురియత్ కార్ఫరెన్స్ నాయకులు పేర్కొంటున్నారు. కాగా స్థానికులు, స్థానిక సంస్థలు, వేర్పాటు వాదులు అఖిలపక్ష పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. 

కశ్మీర్ సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం..

ఢిల్లీ : కశ్మీర్ లో నెలకొన్న సంక్షోభంపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశంకానుంది. మరికాసేట్లో పార్లమెంట్ లో అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. రెండురోజులపాటు కశ్మీర్ లో అఖిలపక్ష నేతలు పర్యటించనున్న సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి దాదాపు 20 పార్టీలకు సంబంధించిన నేతలు పాల్గొననున్నారు. 

మథుర అల్లర్ల ఘటనలో 104మందిపై చార్జ్ షీట్..

ఉత్తరప్రదేశ్ : ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని మథురలో జరిగిన జవహార్‌ పార్కు అల్లర్ల ఘటనలో 104 మందిపై పోలీసులు ఛార్జ్ షీట్‌ దాఖలు చేశారు. పార్కును పోలీసులు స్వాధీనం చేసుకునే క్రమంలో జూన్‌ 2న మథురలో పెద్దఎత్తున ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో ప్రధాన సూత్రధారి రామ్‌ వృక్ష్ యాదవ్‌ సహా మరో 104 మంది నిందితులుగా తేలడంతో వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

భారత్-వియత్నాం..కీలక ఒప్పందాలు..

వియత్నాం : విపయత్నాం పర్యటన సందర్భంగా హనోయ్‌లో ఆదేశ ప్రధానితో మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో భారత్‌-వియత్నాం మధ్య 12 ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిగాయని తెలిపారు. రక్షణ, భద్రత రంగాల్లో ఒప్పందాలు సంతోషకరమని పేర్కొన్నారు.ఈ ఒప్పందంతో ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి అవకాశముందన్నారు. వియత్నాం బలమైన ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. జాతీయ దినోత్సవం సందర్భంగా వియత్నాం ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 

మాజీ సీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు!..

చండీఘడ్ : హ‌ర్యానీ మాజీ సీఎం భూపిందర్ సింగ్ హూడా ఇంట్లో ఇవాళ ఉద‌యం సీబీఐ అధికారులు సోదాలు చేశారు. మ‌నేస‌ర్‌లో అక్ర‌మంగా భూములు కేటాయించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై మాజీ సీఎం ఇంట్లో త‌నిఖీలు జ‌ర‌గుతున్నాయి. హూడా అక్ర‌మంగా అనేక‌ భూ ఒప్పందాలు చేశార‌ని ఓ కేసులో మాజీ న్యాయ‌మూర్తి ఇచ్చిన తీర్పు ఆధారంగా సీబీఐ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. కాంగ్రెస్ అధినేత‌ సోనియా గాంధీ అల్లుడు రాబ‌ర్ట్ వ‌ద్రాకు కూడా మాజీ సీఎం హూడా అక్ర‌మంగా భూములు క‌ట్ట‌బెట్టార‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. 

10:24 - September 3, 2016

పశ్చిమగోదావరి : క్రికెట్ బెట్టింగ్ ఆస్తులనే కాకుండా వ్యక్తుల ప్రాణాలను కూడా బలి తీసుకునే ప్రమాదకర స్థితికి చేరుకుంది. నానాటికీ ఇదొక వ్యసనంగా మారిపోతోంది. ఈ అంశంలో పోలీస్ యంత్రాంగం ఎన్ని చర్చలు తీసుకుంటున్నా ఏదొక ప్రాంతంలో ఈ బెట్టింగ్ ల హవా సాగుతూనే వుంది. బెట్టింగ్ ల మోజులో పడిన యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇటువంటి పరిణామం పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలులో చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుకున్న రవిప్రసాద్ అనే యువకుడు ఖాళీగా వున్నాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ పట్ల ఆకర్షితుడయ్యాడు. బెట్టింగ్ కోసమంటూ స్నేహితుల వద్ద రూ6వేలు అప్పు చేశాడు. దీనికి సంబంధించిన రవి వద్ద నుండి ఓ తెల్లకాగితంపై సంతకాలు పెట్టించుకున్నారు. అప్పు తీర్చాలంటూ స్నేహితులు రవిపై ఒత్తిడి తెచ్చారు. కానీ అప్పు ఎలా తీర్చాలో తెలీని రవిప్రసాద్ ఇంట్లో తెలిస్తే ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో అనే భయంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘటన మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అసలు రవికి అప్పు ఇచ్చిన స్నేహితులు ఎవరు? అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేట్టారు. కాగా ఇటీవల భీమవరంలో పట్టుబడిన క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న వారివద్ద నుండి పోలీసులు 24సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలైన తణుకు, తాడేపల్లిగూడె,నర్సాపురం వంటి ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. అప్పుల పాలవుతున్నారు. 

4 బస్సులు ఢీ..10మందికి గాయాలు..

నల్లగొండ: విజయవాడ జాతీయ రహదారిపై వెళ్తున్న నాలుగు బస్సులు అదుపుతప్పి వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి స్టేజ్ వద్ద చోటుచేసుకుంది. పెను ప్రమాదం తప్పినప్పటికీ 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

10:02 - September 3, 2016

హైదరాబాద్ : వేతనాలు.. నిర్వహణ డబ్బులు చెల్లించాలని చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ..ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బంది నేటి నుంచి సమ్మెలోకి దిగుతున్నారు. అయితే గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మెకు దిగుతున్నామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి చెప్పారు.జిల్లా వ్యాప్తంగా 18 ప్లాంట్ల పరిధిలో సిబ్బంది సమ్మెలో పాల్గొంటారని ఆయన చెప్పారు. సిబ్బంది సమ్మెతో 800 గ్రామాల్లో నిలిచిపోనున్న నీటి సరఫరా నిలిచిపోనుంది. 

09:56 - September 3, 2016

ఫిలిప్పిన్స్ : పేలుళ్ళతో దావా దద్దరిల్లింది. ఫిలిప్పిన్స్ లోని దావోలో వోలో బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 14 మంది మృతి చెందారు. 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఫిలిప్పిన్స్‌ అధ్యక్షుడి సొంత నగరంలో ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గా దావోస్‌ నగరంలో రెండు వేల మంది భారతీయ విద్యార్థులున్నారు. అందులో 600 మంది తెలుగు విద్యార్థులు..అయితే వారంతా క్షేమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. 

09:23 - September 3, 2016

హైదరాబాద్ : దేశాభివృద్ధికి అందరూ పాటుపడాలని..కుల..మత..లింగబేధాలకు అతీతంగా సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులవ్వాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్ వద్ద బీజేపీ తిరంగా యాత్ర కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ ..జర్నలిస్టు కాలనీ..తెరాస భవన్‌ మీదుగా ఈ ర్యాలీ సాగింది. దేశం అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేయడం జరుగుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి.. దత్తాత్రేయ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌.. కిషన్‌రెడ్డి.. మురళిధర్‌రావు పాల్గొన్నారు.
ఉత్సాహంగా తిరంగా యాత్ర..
నగరంలోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద బీజేపీ తిరంగా యాత్ర కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు.. దత్తాత్రేయ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌.. కిషన్‌రెడ్డి.. మురళిధర్‌రావు పాల్గొన్నారు. మరికాసేపట్లో ఈ యాత్ర ప్రారంభంకానుంది. జూబ్లీహిల్స్‌..జర్నలిస్టు కాలనీ..తెరాస భవన్‌ మీదుగా ఈ ర్యాలీ కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరిస్తున్నాయి.

09:20 - September 3, 2016

విజయవాడ : డూండీ గణేష్ సేవా సమితి కమిటీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. సేవా సమితి మాజీ గౌరవాధ్యక్షులు కోగంటి సత్యనారాయణపై పారేపల్లి రాకేష్‌ అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం కోగంటి సత్యనారాయణ పోలీసుల అదుపులో ఉన్నాడు. తనకు కోగంటి నుంచి ప్రాణహాని ఉందని బోండా ఉమ గ్రూపు కమిటీలోని సభ్యుడు పారేపల్లి రాకేష్‌ ఫిర్యాదు చేశాడు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

09:09 - September 3, 2016

విజయవాడ : విజయవాడలో నిర్మితమవుతున్న 72 అడుగుల భారీ గణేష్ విగ్రహవివాదం తీవ్రరూపం దాల్చుతోంది. ఎమ్మెల్యే బోండా ఉమ జోక్యంతో వివాదం మరింత ముదురుతోంది. గణేశ్‌ఉత్సవ కమిటీ గత అధ్యక్షుడు కోగంటి సత్యనారాయణ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలతో కొత్త కమిటీని ఏర్పాటుచేయడంతో వివాదం రాజకీరంగు పులుముకుంది.

గత అధ్యక్షుడు కోగంటి హయాంలో అవకతవకల ఆరోపణలు
ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న 72 అడుగుల వినాయక విగ్రహం వివాదం ముదురుతోంది. డూండీ గణేష్‌ సేవాసమితి కమిటీలో అవకతవకలు జరిగాయని నూతన కమిటీని ఏర్పాటుచేయడంపై గత అధ్యక్షుడు కోగంటి అభ్యంతరం తెలిపారు. ఒకే కులానికి చెందిన వారిని కమిటీలో సభ్యులుగా తీసుకోవడంపై తీవ్ర విమర్శలు చేశారు.

డూండీ గణేష్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్న ఎమ్మెల్యే బొండ
ఈ ఏడాది డూండీ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండ ఉమా. గత అధ్యక్షుడి హయాంలో అవకతవకలు జరిగాయని .. అందుకే నూతన కమిటీని ఏర్పాటుచేశామన్నారు బొండ ఉమా. గణేష్‌ ఉత్సవాల వద్ద ఎవరు అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా వారిపై పోలీసు కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

అధికార అహంతో గూండాలా వ్యవహరిస్తున్నారన్న కోగంటి
ఇది ఇలా ఉంటే వినాయక ఉత్సవాలు సవ్యంగా జరుగుతున్నాయని.. అధికార అహంకారంతో ఎమ్మెల్యే బొండ గుండాలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కమిటీ గౌరవాధ్యక్షుడు కోగంటి సత్యనారాయణ. అందినకాడికి దండుకునేందుకే బొండఉమా డూండీ గణేష్‌ ఉత్సవకమిటీలో చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. భక్తిభావం ఉండాల్సిన చోట వివాదాలెందుకని తాము సామాన్య భక్తుల్లానే వస్తామంటున్నారు కోగంటి.

కావాలనే చేస్తున్నారంటున్న పాతకమిటీ..
అధికార పార్టీ నేతలు డూండీ గణేష్‌ సేవా సమితిలో తలదూర్చడంతోనే వివాదం నెలకొందని పాతకమిటీ ఆరోపిస్తోంది. అధికార పార్టీనేతలు కావాలనే రచ్చ చేస్తున్నారని అంటున్నారు. విమర్శలు ప్రతివిమర్శలతో డూండీ గణేష్ సేవాసమితి రగడ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాలి. 

విద్యుత్ షాక్ తో లైన్ మెన్ మృతి..

హైదరాబాద్‌ : సరూర్‌నగర్ సబ్‌స్టేషన్ పరిధిలో కమలానగర్‌లో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీశైలం (38) అనే లైన్ మెన్ ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. కాలనీలోని ఓ ట్రాన్స్‌ఫార్మర్ మీద ఫీజు సరి చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాలనీవాసులు వెంటనే స్పందించి... పోలీసులతోపాటు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు.

ఎస్ఐ వేధింపులతో హోంగార్డ్ ఆత్మహత్యాయత్నం..

మెదక్ : సిద్ధిపేటలో అన్వర్ అనే హోంగార్డు కిరోసిన్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్పందించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సిద్ధిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందటంతో అన్వర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ షేక్ లాల్ అహ్మద్ ఆసుపత్రికి చేరుకుని అతడిని పరామర్శించారు. ట్రాఫిక్ ఎస్ఐ వేధింపుల కారణంగానే అన్వర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. 

వల్లభాయ్‌ అయితే వేరుగా వుండేది ..

హైదరాబాద్: దేశ సమైక్యతకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశాభివృద్ధి కోసం పోరాడిన సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ను అందరూ స్మరించుకోవాలని ఆయన తెలిపారు. కశ్మీర్‌ అంశాన్ని వల్లభాయ్‌ పటేల్‌కు అప్పగించి ఉంటే ఇవాళ మనకు ఈ సమస్య ఉండేది కాదని వెంకయ్యనాయుడు అన్నారు. అందరిలో జాతీయభావం నింపడానికే తిరంగా యాత్ర ప్రారంభించామన్నారు. మతం పేరుతో ప్రజలను వేరుచేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరంగా యాత్రలో పాల్గొన్న  సందర్భంగా హెచ్చరించారు. 

ప్రారంభమైన తిరంగాయాత్ర..

హైదరాబాద్‌: కేబీఆర్‌ పార్క్‌ నుంచి భాజపా తిరంగా యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఫిల్మ్‌నగర్‌ బసవతారకం ఆసుపత్రి మీదుగా తిరిగి కేబీఆర్‌ పార్కు వరకు 5 కి.మీ మేర యాత్ర సాగనుంది. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పలువురు భాజపా నేతలు, వివిధ పాఠశాలల విద్యార్థులు యాత్రలో పాల్గొన్నారు.

వియత్నాం అమరవీరులకు మోదీ నివాళి..

వియత్నాం: భారత ప్రధాని నరేంద్రమోదీ వియత్నాం పర్యటన కొనసాగుతోంది. స్థానిక ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌లో ప్రధాని మోదీకి భద్రతా దళాలు గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా వియత్నాం అమరవీరులకు మోదీ నివాళులర్పించారు. అనంతరం ప్రధాని ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో సహకారంపై చర్చించనున్నారు.

బెజవాడకు బీజేపీ నేతలు..

విజయవాడ: నేడు బీజేపీ విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. 

రెడ్డి వర్సెస్ రెడ్డి?..

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి..హైకోర్టులో ఓ విచారణ నిమిత్తం హాజరు కావాల్సి వచ్చింది. ఎన్నికల్లో కోమటిరెడ్డి తాను బీఈ చదివినట్లు అఫిడవిట్ లో తప్పుడు విద్యార్హతలను పేర్కొన్నారని భూపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అఫిడవిట్ లో తప్పుడు విద్యార్హతలు పేర్కొన్న కోమటిరెడ్డి ఎన్నిక చెల్లదని, ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని భూపాల్ రెడ్డి పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.

నువ్వు రౌడీ..కాదు నువ్వే రౌడీ..

విజయవాడ : ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, నగరానికి చెందిన పారిశ్రామికవేత్త కోగంటి సత్యంల మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నువ్వు రౌడీ అంటే... కాదు నువ్వే రౌడీవంటూ వారిద్దరూ పరస్పరం సంధించుకున్న విమర్శలతో సమితి రెండుగా చీలిపోయింది. ఆ తర్వాత కోగంటి సత్యంపై బొండా ఉమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సూర్యారావుపేట పోలీసులు కోగంటి సత్యంను నిన్న రాత్రికే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

ఇందిరా పార్క్ వద్ద డీకే అరణ దీక్ష..

 హైదరాబాద్: జిల్లాల విభజనలో టీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా వ్యవహరిస్తోందని నిరసిస్తూ.. నేటి నుంచి రెండు రోజుల పాటు ఇందిరా పార్క్ వద్ద మాజీ మంత్రి డీకే అరుణ నిరాహారదీక్ష.

హోరో శివాజీపై తమ్ముళ్ళ ఫైర్ ..

విజయవాడ : ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడినంటూ బయల్దేరిన సినీ హీరో శివాజీ నోరు అదుపులో పెట్టుకోవాలని విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమ హెచ్చరించారు. విదేశాల్లో ఉండి స్కైప్ వీరుల్లా ఇంటర్వ్యూలు ఇవ్వడం కాదని.. స్థానికంగా వచ్చి పోరాడాలని ఆయన సవాల్ విసిరారు. ఢిల్లీలో కష్టపడి పోరాటం చేస్తున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీలను విమర్శించే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. శివాజీకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడికి వచ్చి పోరాడాలని ఆయన సవాలు విసిరారు.

మరో విజయానికి 'షార్'శ్రీకారం!..

నెల్లూరు: ఇప్పటికే పలు విజయాలకు తన ఖాతాలో వేసుకున్న షార్ మరో ప్రయోగానికి సిద్ధమయ్యింది. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు జీఎస్‌ఎల్వీ- ఎఫ్‌ 05 రాకెట్‌‌ను నింగిలోకి షార్ పంపనుంది. దీనికోసం లాంచ్ వెహికల్ దగ్గరకు జీఎస్‌ఎల్వీ- ఎఫ్‌ 05 రాకెట్‌‌ను తీసుకెళ్లారు. వాతావరణ పరిస్థితుల అధ్యయనం కోసం ఇన్‌శాట్‌ 3డీఆర్‌ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్వీ నింగిలోకి తీసుకెళ్లనుంది.

డ్రంకన్ డ్రైవ్ లో 38మందికి శిక్ష ఖరారు?!..

హైదరాబాద్ : పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నా... డ్రంకన్ డ్రైవ్ కేసులు తగ్గడం లేదు. మందుబాబులు ఫుల్లుగా మద్యం పట్టించి వాహనాలపై రోడ్డెక్కుతూనే ఉన్నారు. కాచిగూడ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా 38 మంది పట్టుబడ్డారు. వీరిని పోటీసులు ఎర్రమంజిల్ కోర్టులో ప్రవేశపెట్టారు. పట్టుబడినవారిలో డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ నేరాల లిస్ట్ ఆధారంగా రూ.2 వేల జరిమానా..ఐదు రోజుల జైలుశిక్ష..నలుగురికి రూ.2 వేల జరిమానా విధించారు.సామాజిక సేవ చేయాలంటూ ఐదుగురికి ఆదేశాలు జారీ చేశారు.

హీరో నాలుక చీరేస్తానంటున్న ఎంపీ?!..

చిత్తూరు : ఏపీకి ప్రత్యేక హోదాపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సినీ నటుడు శివాజీపై నిన్న టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ఏపీకి ప్రత్యేక హోదా రానిపక్షంలో సీఎం చంద్రబాబు ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని, హోదా విషయంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని శివాజీ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శివాజీ వ్యాఖ్యలను ప్రస్తావించిన శివప్రసాద్... మరోమారు చంద్రబాబు, సుజనా చౌదరిల మాటెత్తితే శివాజీ నాలుక తెగ్గోస్తానని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. 

కానిస్టేబుల్ పోస్టుల ప్రాథమిక 'కీ'..

హైదరాబాద్: రవాణా,ఆబ్కారీ కానిస్టేబుళ్ల పోస్టులకు జులైలో నిర్వహించిన పరీక్ష ప్రాథమిక 'కీ'ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం వెల్లడించనుంది. ఈ ప్రాథమిక 'కీ' పై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 6 నుంచి 7వ తేదీ వరకు కమిషన్‌కు పంపించవచ్చని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ తెలిపారు.

07:40 - September 3, 2016

ఐదుకోట్ల మంది ఆంధ్రుల హక్కు, పార్లమెంట్ సాక్షిగా అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ..రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తున్నట్లుగా ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చినా హామీ ఎన్డీయే ప్రభుత్వం నీరుగార్చేతీరుగా వ్యవహరిస్తోంది. దేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తివేసినట్లుగా కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో ఇక ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి వుండదనీ.. ఇప్పటివరకూ ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు కూడా రద్దు చేస్తున్నట్లు..కేంద్ర ప్రభుత్వ విధానంలో మార్పులు చేస్తున్నట్లుగా ..కేబినెట్ లో త్వరలో ఈ ప్రతిపాదన రాబోతున్నట్లుగా..కేంద్రం ప్రభుత్వం సంకేతాలిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితులు లేనట్లుగా సమాచారం.ఈ క్రమంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో కొండారాఘవరెడ్డి (వైసీపీ నేత) చందూరి సంబశివరావు (టీడీపీ నేత) గపూర్ (సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు) పాల్గొన్నారు. చర్చలోపాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...

బి-కేటగిరీ మెడికల్ సీట్లకు కౌన్సెలింగ్

విజయవాడ: నేడు బి-కేటగిరీ మెడికల్ సీట్లకు కౌన్సెలింగ్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉదయం తొలివిడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 

కేబీఆర్‌ పార్కు వద్ద తిరంగా యాత్ర..

హైదరాబాద్: నేడు కేబీఆర్‌ పార్కు వద్ద తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని ఖైరతాబాద్‌ శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన సమరయోధుల త్యాగాలు, వారి సేవలను భావితరాలకు అందించడానికి ప్రధాని మోడీ పిలుపు మేరకు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. కేబీఆర్‌ పార్కు చుట్టూ 5.2 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందన్నారు. ఇందులో వెయ్యి సైకిళ్లు, 25 బుల్లెట్లు, పరుగు, నడకతో యాత్ర ప్రారంభమవుతుందన్నారు. యాత్రను మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు.

07:03 - September 3, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనుందనే వాదన బలంగా వినిపిస్తోంది. కేంద్రం కూడా ఆ దిశ‌గానే వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే ఈ ప్యాకేజీలో ఏం ప్రక‌టిస్తారనే దానిపై ప్రస్తుతం అంద‌రి దృష్టి నెల‌కొంది. కేంద్రం సిద్ధం చేస్తున్న ప్యాకేజీ అంశాన్ని ఏపీ ప్రభుత్వం నిశితంగా గ‌మ‌నిస్తోంది.

ఏపీకీ ప్యాకేజీ ప్రక‌ట‌న దిశ‌గా కేంద్రం వ‌డివ‌డిగా అడుగులు
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అందించే ప్యాకేజి పై చ‌ర్చలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. త్వర‌లోనే ఏపికి కేంద్రం ఏం చేయ‌బోతుందే అనే అంశం పై స్పష్టత రానుంది. ఇప్పటికే.. ప్రత్యేక హోదా పై రాజ‌కీయంగా వేడి రాజుకోవ‌టంతో.. దీనిపై కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా.. కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఫ‌లితంగా.. త్వర‌లోనే ఏపికి కేంద్రం నుంచి అందే సాయంపై ప్రక‌ట‌న రానుంది. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌తో పాటుగా కేంద్రం ఇచ్చిన హామీల అమ‌లు దిశ‌గా ఈ ప్యాకేజి ఉంటుంద‌ని ఏపి ప్రభుత్వం అంచ‌నా వేస్తోంది.

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చంద్రబాబు డిమాండ్
అయితే, కీల‌క‌మైన ప్రత్యేక హోదా పై మాత్రం కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంద‌నే దాని పై స్పష్టత రావాల్సి ఉంది. తాము ప్రత్యేక హోదా పేరు లేకుండా.. ఏపికి ద‌క్కాల్సిన అన్ని ప్రయోజ‌నాల‌ను అందిస్తామ‌ని కేంద్ర మంత్రులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు మాత్రం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేస్తున్నారు.

రూ.14000 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడినట్లు కాగ్ నివేదిక
ఇక‌ తొలి ఏడాది రెవిన్యూ లోటు భ‌ర్తీ ఇప్పటి వ‌ర‌కు ఇంకా పూర్తి కాలేదు. దాదాపు 14వేల కోట్ల మేర లోటు ఏర్పడిన‌ట్లు కాగ్ నిర్ధారించిన‌ప్పటికీ.. కేంద్రం నుంచి మూడు ద‌ఫాలుగా 3,979 కోట్లు మాత్రమే అందాయి. అటు పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఇప్పటివరు 845 కోట్లు మాత్రమే అందాయి. అయితే, పోల‌వ‌రానికి కావాల్సిన నిధుల‌ను నాబార్డ్ ద్వారా ఇప్పిస్తామ‌ని కేంద్రం చెబుతున్నా...దీని పై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు కేంద్రం చేస్తున్న క‌స‌ర‌త్తు తుది ద‌శ‌కు వ‌చ్చింద‌ని..త్వర‌లోనే ప్రక‌ట‌న ఉంటుందని కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి అంటున్నారు.

ప‌రిశ్రమ‌ల‌కు మ‌రిన్ని ప్రత్యేక రాయితీల దిశ‌గా నిర్ణయం..?
అటు క‌డ‌ప లో స్టీల్ క‌ర్మాగారం... పెట్రో యూనివ‌ర్సిటీతోపాటు..కీల‌క‌మైన ప్రత్యేక రైల్వే జోన్ అంశం పైనా కేంద్రం సానుకూలంగా నిర్ణయం ప్రక‌టించే అవ‌కాశం ఉంద‌ని ఏపినాయకులు అంచనా వేస్తున్నారు. మరో వారంరోజుల్లో కేంద్రం దీనిపై స్పష్ఠమైన ప్రక‌ట‌న చేస్తుంద‌ని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.. కేంద్ర ప్రకటన ఆంధ్రప్రదేశ్‌కు ఎంత వ‌ర‌కు మేలు చేస్తుందో వేచి చూడాల్సిందే..

06:59 - September 3, 2016

హైదరాబాద్ : తెలంగాణలో మరో ఉద్యమ వేదిక ఆవిర్భవించబోతోంది. సామాజిక తెలంగాణే లక్ష్యంగా ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నామన్నారు జస్టిస్‌ చంద్రకుమార్‌. అట్టడుగు వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందినప్పుడే నిజమైన అభివృద్ధి అంటున్నారు జస్టిస్‌ చంద్రకుమార్‌. ప్రత్యేక తెలంగాణలోనూ సామాన్యులకు న్యాయం జరగడం లేదని జస్టిస్‌ చంద్రకుమార్‌ పేర్కొన్నారు. సామాన్యులు అధికారంలో రావాలనీ..అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలనీ.. అట్టడుగు వర్గాల గొంతుకగా ఉద్యమ వేదికగా నిలుస్తామని జస్టిస్‌ చంద్రకుమార్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

06:54 - September 3, 2016

హైదరాబాద్ : కొత్తజిల్లాల కసరత్తును తెలంగాణ సర్కార్‌ వేగవంతం చేసింది. ఇప్పటికే కొత్తజిల్లాల ఏర్పాటుపై దాదాపుగా స్పష్టతవచ్చిన నేపథ్యంలో.. ఉద్యోగుల కేటాయింపులపై దృష్టిపెంటింది అధికార యంత్రాంగం.

కొత్తజిల్లాలకు సిబ్బంది కేటాయింపుపై సర్కార్‌ దృష్టి
దసరాపండుగ నాటికి కొత్తజిల్లాలను మనుగడలోనికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను ఇప్పటికే ఓ కొలిక్కి తీసుకొచ్చింది. కొత్తజిల్లాల ఏర్పాటుపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సర్కార్‌ తాజాగా ఉద్యోగుల విజనపై దృష్టిపెట్టింది.

ఉద్యోగుల కేటాయింపుపై కసరత్తు పూర్తిచేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ
కొత్తజిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు ఎలా చేయాలన్న దానిపై సీఎస్‌ రాజీవ్‌శర్మఅధ్యక్షతన ఏర్పడిన టాస్క్‌ఫోర్స్‌ పనులను స్పీడప్‌ చేసింది.అన్నిశాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్షలు జరిపింది. హోంశాఖ, లా, ఐటీ, ఆర్ధిక, రావాణా, సంక్షేమశాఖలతోపాటుమొత్తం 30డిపార్ట్‌మెంట్లకు సంబంధించి ఉద్యోగుల కేటాయింపు ఎలాఉండలన్న దానిపై చర్చలు పూర్తిచేశారు. ప్రిన్సిపల్‌సెక్రెటరీలు, హెచ్‌ఓడీలతో విస్తృతంగా చర్చించారు సీఎస్‌ రాజీవ్‌శర్మ. ఉద్యోగుల విభజనతోపాటు జిల్లాలవారీగా కేటాయింపులు , పదోన్నతుల విషయంలో ఒక ఫార్మాట్‌ను రూపొందించాలని సీఎస్‌ అన్నిశాఖల ఉన్నతాధికారులకు సూచించారు.

కలెక్టరేట్ల ఏర్పాటు, రెవెన్యూ కార్యాలయాల ఏర్పాటుపై సమీక్ష
ఇక జిల్లాస్థాయిలో కలెక్టరేట్ల ఏర్పాటు, రెవెన్యూడివిజినల్‌ కార్యాలయాలతోపాటు కల్లెక్టరేట్లతో సంబంధం ఉండని మంత్రిత్వశాఖలకు సంబంధిచిన ఆఫీసులు, సిబ్బంది పంపకాలపైకూడా సీఎస్‌ అధికారులతో చర్చించారు. ఈ అన్ని అవివరాలతో మరో రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌కు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నివేదికను ఇవ్వనుంది.

నివేదిక ఇవ్వడానికి మంత్రులు సిద్ధం
ఇక మంత్రులు కూడా తమ శాఖలకు సంబంధించి సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహేందర్‌రెడ్డి, జూపల్లికష్ణారావు తమ శాఖలకు ఉద్యోగుల కేటాయింపు ..కార్యాలయాల ఏర్పాటుపై చర్చించారు. అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీతోపాటు.. మంత్రులు కూడా ముఖ్యమంత్రికి నివేదికలు ఇవ్వడానికి

అన్ని కసరత్తులు పూర్తిచేశారు. 

06:51 - September 3, 2016

వరంగల్ : జిల్లావిడిపోతేనే అభివృద్ధి అంటున్నారు వరంగల్‌ ప్రజలు. దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చిన్నజిల్లా అయితే మంచిదంటున్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వ పాలనమొత్తం హన్మకొండనుంచే సాగడంతో.. అభివృద్ధి మొత్తం ఒక ప్రాంతానికే పరిమితం అయిందంటున్నారు. కొత్తగా జిల్లా ఏర్పడితే.. చారిత్రక నగరంగా ఉన్న వరంగల్‌సిటీ అభివృద్ధిలో పరుగులుపెట్టే అవకాశం ఉందంటున్నారు.

జిల్లా విభజన మంచిదే అంటున్న వరంగల్‌ ప్రజలు
వరంగల్‌జిల్లా విభజనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని మారుమూల ప్రాంతాలు ఇలాగైనా బాగుపడతాయంటున్నారు. పేరుకే జిల్లాకేంద్రంగా ఉన్న వరంగల్‌నగరంలో అభివృద్ధిజాడలే కనింపించడంలేదు. అభివృద్ధి అంతా హన్మకొండలోనే కేంద్రీకృతం కావడంతో... వరంగల్‌ ప్రజలు.. కొత్తగాజిల్లా ఏర్పడంపై సంతోషంగా ఉన్నారు.

జిల్లాలుగా వేరుపడుతున్న వరంగల్‌, హన్మకొండ నగరాలు
దశాబ్దాలుగా కలిసిఉన్న వరంగల్‌, హన్మకొండ పట్టణాలు రెండు జిల్లాలుగా వేరుకానున్నాయి. ఉమ్మడిజిల్లాలో వరంగల్‌ కేంద్రం అయినప్పటికీ అభివృద్ధి జరగలేదు. వంరగల్‌నగరంలోని ఖిలావరంగల్‌. కరీమాబాద్‌ఉర్సూ, కాశీబుగ్గ, శివనగర్‌ ప్రాంతాలు ఇప్పటికీ గ్రామీణవాతావరణాన్నే తలపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, పనులు అన్నీ హన్మకొండకే పరిమితం కావడంతో.. వరంగల్‌ అబివృద్ధిలో వెనుబడిపోయింది. ప్రత్యేకజిల్లాలోతోనే ఓరుగల్లు రూపురేఖలు మారతాయంటున్నారు ప్రజలు.

జిల్లాలుగా వీడిపోతో కేంద్రపథకాలు దక్కవేమో..!
అయితే కొందరు నాయకులు మాత్రం జిల్లా ఏర్పాటుతో కేంద్రం అందించే హృదయ్‌, స్మార్ట్‌సిటీ లాంటి పథకాలు వెనక్కువెళ్లిపోతయంటున్నారు. ఈ వాదనను ప్రజలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేకజిల్లాగా ఏర్పడితేనే పాలన సులభంగా మారి.. అభివృద్ధికి అవకాశం వస్తుందంటున్నారు. జిల్లా విభజనవల్ల వరంగల్‌నగరం వాణిజ్యసముదాయాలకు, ఎనుమాములలోని వ్యవసాయమార్కెట్, పండ్ల ,కూరగాయల మార్కెట్లు అభివృద్ధికి దోహద పడుతాయంటున్నారు. అటు ఖిలావరంగల్‌ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధియేయొచ్చంటున్నారు. మొత్తానికి వరంగల్‌జిల్లా విభజనతో కొత్తగా వరంగల్‌ ప్రాంతం అభివృద్ధికి నోచుకుంటుందని... జిల్లాప్రజలు ఆశిస్తున్నారు. 

06:48 - September 3, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల లొల్లి ఇప్పుడు హైదరాబాద్‌ను తాకింది. నిన్న మొన్నటి వరకు జిల్లాకే పరిమితం అయిన గద్వాల్‌జిల్లా సాధన పోరు ఇపుడు రాజధానికి చేరింది. నిన్నటిదాకా ధర్నాలు, రాస్తారోకోలు,బంద్‌లతో హోరెత్తించిన నేతలు... ఇపుడు రాష్ట్ర సర్కార్‌కు సూటిగా తగిలేలా రాజధానినే పోరువేదికగా మార్చుకున్నారు. గద్వాలజిల్లాకోసం ఉద్యమిస్తున్న కాంగ్రెస్‌నేత డీకే అరుణ ఇందిరాపార్క్‌లో దీక్షకు రెడీ అయ్యారు.

.11 గంటల నుండి 4 గం. వరకు ఇందిరాపార్క్‌ వద్ద డీకెఅరుణదీక్ష
తెలంగాణలో కొత్తజిల్లాల ఆందోళనలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. గద్వాలజిల్లా కోరుతున్న మాజీ మంత్రి , కాంగ్రెస్‌నేత డీకే అరుణ తాజాగా రెండు రోజుల నిరాహార దీక్షకు రెడీఅవడం..కొత్తజిల్లాలపోరును మరింత మండిస్తోంది. జిల్లాల పునర్విభజన తెరపైకి వచ్చిన నాటినుండి గద్వాలను జిల్లాగా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతోంది. ధర్నాలు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో ...రెండు రోజులపాటు ఇందిరాపార్క్‌ వద్ద నిరాహారదీక్షకు దిగుతున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇందిరాపార్క్‌ వద్ద కాంగ్రెస్‌నేత డీకేఅరుణ దీక్ష చేపట్టనున్నారు. గద్వాలపై ప్రభుత్వం కక్షచూపుతోందని అన్ని అర్హతలు ఉన్నా.. గద్వాలను కాదని నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారామె.

కొత్త జిల్లాల ముసాయిదా అశాస్తీయంగా ఉందన్న డీకెఅరుణ
కొత్తజిల్లాల ముసాయిదా అశాస్త్రీయంగా ఉందని డీకే అరుణ విమర్శించారు. ఇష్టానుసారంగా జిల్లాల విభజన చేస్తున్నారని మండిపడ్డారు. గద్వాల, జనగామలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గద్వాలను పట్టించుకోని ప్రభుత్వతీరుకు నిరసనగానే ఇందిరాపార్క్‌ వద్ద రెండు రోజులపాటు నిరాహారదీక్షకు దిగుతున్నానని డీకెఅరుణ తెలిపారు.

దీక్షప్రభావం ప్రభుత్వంపై ఉంటుందా
నిన్నమొన్నటి వరకు జిల్లా కేంద్రాలకే పరిమితమైంది జిల్లాల పునర్విభజన రగడ. ఇందిరాపార్క్ వద్ద తలపెట్టే నిరాహారదీక్షతోనయినా.. ప్రభుత్వంకదలిక వస్తుందా.. లేక పాతప్రతిపాదనలకే కట్టుబడుతుందా.. దీక్షప్రభావం ప్రభుత్వంపై ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది.

ధర్నా చేపట్టనున్న వైసీపీ ..

కడప : రాయలసీమకు సాగు నీటి సరఫరా విషయంలో ప్రభుత్వం విఫలమైందంటూ వైసీపీ అధినేత జగన్ జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టనునన్నారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఎమ్మెల్యే అంజాద్ బాషా తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు ధర్నా ప్రారంభి ఒంటిగంటకు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించి ధర్నా విరమిస్తామని తెలిపారు. 

సిద్ధూ కొత్తపార్టీ?!..

పంజాబ్ : ఇటీవల భాజపాకు రాజీనామా చేసిన మాజీ ఎంపీ నవజ్యోత్‌సింగ్‌ కొత్త పార్టీ పెట్టనున్నారు. హకీ క్రీడాకారుడు, ఎమ్మెల్యే పర్గత్‌ సింగ్‌, లూథియానాకు చెందిన స్వత్రంత్ర ఎమ్మెల్యేలు సిమర్‌జీత్‌ సింగ్‌ బైన్స్ , బల్విందర్‌ సింగ్‌ బైన్స్ లతో కలిసి ఈనెల 9న ‘ఆవాజ్‌-ఎ-పంజాబ్‌’ పేరుతో పార్టీ ప్రారంభించనున్నట్లు సిద్ధు ప్రకటించారు. పంజాబ్‌ వ్యతిరేకులపై పోరాడేందుకే కొత్త పార్టీ పెడుతున్నట్లు సిద్ధు పేర్కొన్నారు.

భారీ పేలుడు..12మంది మృతి..

ఫిలిప్పిన్స్ : దావావోలో బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 12 మంది మృతి చెందారు. 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఫిలిప్పిన్స్‌ అధ్యక్షుడి సొంత నగరంలో ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

హోదాను మించి అంటున్న మంత్రి ..

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదాను మించిన సాయం ఆంధ్రప్రదేశ్‌కు అందించేందుకు కేంద్రం యత్నిస్తోందనీ మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా.. ప్రత్యేక హోదా అని నినదిస్తున్నారని, దాని వల్ల ప్రయోజనం ఏపాటిదో ఇది వరకు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాల్లోకి వెళ్లి చూస్తే తెలుస్తుందని చెప్పారు.

గోరటి వెంకన్నకు కళోజీ పురస్కారం..

హైదరాబాద్: ప్రజా కవి కాళోజీ నారాయణరావు పురస్కారం-2016కుకవి, గాయకుడు గోరటి వెంకన్న ఎంపికయ్యారు. ఈ మేరకు నియమించిన కమిటీ సిఫారసు చేయగా.. దానికి సర్కారు ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురస్కారం కింద రూ.లక్షా వేయి నూట పదహార్లు నగదు అందజేస్తారు. కాళోజీ జయంతి వేడుకల్లో పురస్కారం ప్రదానం చేస్తారు.

 

Don't Miss