Activities calendar

04 September 2016

21:32 - September 4, 2016

ఢిల్లీ : ప్రపంచ ఆర్థిక వృద్ధికి సమష్టి కృషి చేయాలని జీ-20 దేశాలు నిర్ణయించాయి. చైనాలోని హ్యాంగ్జూలో జరుగుతున్న సదస్సులో జీ-20 దేశాధినేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పరస్పర సహకారంతోనే దేశాల మధ్య ఆర్థిక లోటుపాట్లను అధిగమించాలని నిర్ణయించారు. దీంతో పాటు సృజనాత్మకతపై ఒక టాస్క్‌ఫోర్సు ఏర్పాటుకు కూడా కూటమి ప్రణాళిక సిద్ధం చేసింది. అంతర్జాతీయ ఒడిదొడుకులు, ఆర్థిక సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో దేశాల మధ్య... బేధాభిప్రాయలు ఉండరాదని ప్రధాని మోదీ సూచించారు.

21:31 - September 4, 2016

ఢిల్లీ : ఆశయాలు, ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా భారత్-చైనా సున్నితంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోడీ...చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అన్నారు. చైనాలో జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన మోదీ... జిన్‌ పింగ్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాల మ‌ధ్య ప‌లు ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొన్న నేపథ్యంలో... ఇరువురి మ‌ధ్య స‌మావేశం ప్రాధాన్యత సంత‌రించుకుంది. తాము తప్పకుండా ఇరు దేశాల మధ్య సంబంధాలను, ఆకాంక్షలను గౌరవిస్తామని చైనా అధ్యక్షుడు బదులిచ్చారు. గత మూడు నెలల్లో చైనా అధ్యక్షుడితో మోదీ భేటీ అవడం ఇది రెండోసారి.

21:29 - September 4, 2016

జమ్మూ కాశ్మీర్ : కశ్మీర్‌లో శాంతి కోసం వేర్పాటువాదులంతా చర్చలకు రావాలని అఖిలపక్షం పిలుపు ఇచ్చింది. కల్లోల పరిస్థితులు నెలకొన్న కశ్మీర్‌లో అఖిలపక్షం నాయకుల రెండురోజుల పర్యటన కొనసాగుతోంది. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం అవుతుందని నేతలు వేర్పాటు వాదులకు సూచించారు. తొలిరోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో సమావేశమై... అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కశ్మీర్‌లో 58 రోజులుగా జరుగుతున్న హింసకు చమరగీతం పాడాలన్న ఏకైక లక్ష్యంతో అఖిలపక్ష బృందం పర్యటిస్తోంది. ఈ బృందం క్షేత్రస్థాయి పరిస్థితులను పరీక్షించి సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వనుంది. హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు అధికార, విపక్షాలకు చెందిన 28 మంది ఎంపీలు ఈ పర్యటనలో పాల్గొన్నారు. 

21:28 - September 4, 2016
21:27 - September 4, 2016

నెల్లూరు : వెంకటాచలం స్వర్ణభారతి ట్రస్ట్ లో 15వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వార్షికోత్సవాలకు విశిష్ట అతిధులుగా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఒలింపిక్ రజత పతక విజేత పి.వి.సింధూ, కోచ్ గోపీచంద్ హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రస్టు సేవలను విస్తృతంగా నిర్వహించడానికి చేస్తున్న నిర్వాహకులు దీపా వెంకట్ చేస్తున్న ప్రయత్నాలను సుమిత్రమహాజన్ కొనియాడారు. ఒలింపిక్స్ లో రజతం సాధించిన పి.వి. సింధూని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.

21:23 - September 4, 2016

విజయవాడ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరుగుతున్న మెడికల్‌ కౌన్సెలింగ్‌ రసాభాసగా మారింది. బీ కేటగిరి సీట్ల భర్తీలో గందరగోళం నెలకొంది. సొంత రాష్ట్రానికి చెందిన విద్యార్థులను కాదని, ఇతర రాష్ట్రాల వారికి సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు, వీర తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విశ్వవిద్యాలయంలో ధర్నా చేశారు. కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు. మరోవైపు మెడికల్ సీట్లు కౌన్సెలింగ్‌ పూర్తయ్యింది. డెంటల్‌ సీట్లు మాత్రమే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన 74 వ జీవో ఆధారంగానే బీ కేటగిరి సీట్ల భర్తీకి ఇతర రాష్ట్రాల విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలిచామని కౌన్సెలింగ్‌ కన్వీనర్‌ జయరమేష్‌ అంటున్నారు. 

21:20 - September 4, 2016

ఖమ్మం : తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గద్దెదింపే టైమ్ దగ్గరలోనే ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పాల్వంచలో పోడు సదస్సు జరిగింది. ఆదివాసీల పోడు భూములను ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటుందని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు బంగారు తెలంగాణను కోరుకోవడం లేదని.. తమ బతుకులు బాగుపడాలని కోరుకుంటున్నారని నేతలు తెలిపారు. 

21:18 - September 4, 2016

హైదరాబాద్ : పెళ్లివేడుకలో అత్యుత్సాహం.. ఓ వరుణ్ణి కటకటాల పాల్జేసింది. తనకు పెళ్లవుతోందన్న సంబరమో.. మరో కారణమో తెలీదు కానీ.. ఆ వరుడు.. తన వివాహ వేడుకలో.. రెండు చేతుల్లోనూ పిస్తోళ్లు పెట్టుకుని గాల్లో తూటాలు పేల్చాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో పోలీసులు ఘటనపై ఆరా మొదలుపెట్టారు. తన అత్యుత్సాహం వివాదాస్పదమైందని తెలుసుకున్న వరుడు.. చివరకు పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.  హైదరాబాద్‌ పాతబస్తీలోని ఫలక్‌నుమాలో.. ఓ వరుడు గాల్లో కాల్పులు జరిపిన ఘటన పెనుదుమారం రేపింది. ఆగస్టు 21న ఇర్ఫాన్‌ అనే వరుడు.. తన పెళ్లి బరాత్‌ సందర్భంగా రెండు పిస్తోళ్లతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదిరౌండ్లు కాల్పులు జరిపాడు. మేళతాళాలు.. డప్పుల చప్పుళ్లతో బంధుగణమంతా మాంచి ఉత్సాహంతో ఊగిపోతున్న తరుణంలో.. వరుడు ఇర్ఫాన్‌ అంతకు మించిన ఉత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆలస్యంగా బయటికొచ్చిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీంతో టాస్క్‌ఫోర్స్‌ బృందం రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. పెళ్లిబరాత్‌లో తాను కాల్పులు జరపడం వివాదాస్పదం కావడంతో వరుడు ఇర్ఫాన్‌ పోలీసులకు లొంగిపోయాడు.

నేరమన్న విషయం తెలియదంట..
తొలుత తాను ఉపయోగించిన తుపాకులు డమ్మీవి అని చెప్పిన ఇర్ఫాన్‌.. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించాడు. తాను వాడిన రివాల్వర్లు.. బుల్లెట్లను పోలీసులకు అప్పగించాడు. ఈ రివాల్వర్లు సినీ నిర్మాత ఎస్‌ఎమ్‌ ఆలీకి చెందినవిగా తేలింది. ఇలా తుపాకులు ఉపయోగించడం నేరమన్న విషయం తనకు తెలియదని ఇర్ఫాన్‌ చెప్పాడు. అయితే ఇర్ఫాన్‌ ఇలా కాల్పులు జరపడం ఇదే తొలిసారి కాదు. 2013 లోనూ ఇదే తరహాలో.. కాల్పులు జరిపినట్లు ఇర్ఫాన్‌పై కేసు నమోదైంది. 2014 లోను జహానుమా దగ్గర ఫైరింగ్‌ చేసిన ఘటనలోనూ కేసు నమోదైంది. ఇప్పుడు కూడా ఇర్ఫాన్‌పై పోలీసులు వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. మొత్తానికి పెళ్లి వేడుకల్లో అత్యుత్సాహం.. ఇర్ఫాన్‌ను కటకటాలపాల్జేసింది. ఇకపై ఎవరూ ఇలాంటి ఘటనలను ఫ్యాషన్‌గా భావించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

21:16 - September 4, 2016

హైదరాబాద్ : ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న జిల్లాల ఏర్పాటుపై తమ పోరాటం ఆగని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. జనగామ, గద్వాల్‌ను ప్రత్యేక జిల్లాలుగా ప్రకటించాలని డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య చేపట్టిన 2రోజుల దీక్షను సాయంత్రం విరమించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, ఎంపీ కవితపై డీకే అరుణ విమర్శల వర్షం కుర్పించారు. తాను బొమ్మాళి అయితే పశుపతి మీ నాన్న కేసీఆరా? అని కవితను ప్రశ్నించారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని... జనగామ, గద్వాలను ప్రత్యేక జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వం కూలిపోయే వరకు పోరాటం చేస్తామన్నారు. ప్రజల అభిష్టం మేరకే జిల్లాల విభజన జరగాలని ఆమె డిమాండ్ చేశారు.

ఆందోళన తప్పదన్న పొన్నాల..
జిల్లాల విభజనపై ప్రజాభిప్రాయ సేకరణ జరపకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. దేశంలో జిల్లాల విభజన ఎక్కడ జరిగినా.. సమస్యలు రాలేదని.. తెలంగాణలోనే ఎందుకు ఆందోళనలు జరుగుతున్నాయని పొన్నాల ప్రశ్నించారు. ప్రజల సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేయాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలను శాస్త్రీయత, గైడ్ లైన్స్ లేకుండా విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, విస్తృత స్థాయిలో ప్రజాభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఉత్తమ్ సూచించారు. మొత్తమ్మీద జిల్లాల విభజన ప్రక్రియ విషయంలో టీఆర్‌ఎస్‌ తీరును కాంగ్రెస్ తప్పుపట్టింది. కాంగ్రెస్ నేతల డిమాండ్‌లకు కేసీఆర్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

మీర్ పేటలో నయీం అనుచరుడి ఇంట్లో సిట్ సోదాలు...

హైదరాబాద్ : మీర్ పేట శ్రీనిలయ కాలనీలో నయీం అనుచరుడు యాదగిరి ఇంట్లో సిట్ తనిఖీలు నిర్వహించింది. నయీంకు బినామీగా యాదగిరి ఉన్నట్లు సిట్ భావిస్తోంది. తనిఖీల్లో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నయీం ఎన్ కౌంటర్ అనంతరం యాదగిరి పరారీలో ఉన్నాడు. 

యాదగిరిగుట్టలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం...

నల్గొండ : యాదగిరిగుట్ట బస్టాండులో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. పురుగుల మందు తాగిన వీరిని ఆసుపత్రికి తరలించారు. 

జూబ్లీహిల్స్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటన...

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పర్యటించారు. దెబ్బతిన్న రోడ్లను కమిషనర్ పరిశీలించారు. నార్సింగి మెయిన్ రోడ్డును కమిషనర్ తో పాటు సీఈ సుభాష్ సింగ్ పరిశీలించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతపై నిపుణుల కమిటీ సూచనలు చేయనుంది. 

నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు..

హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. 62 ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేసింది. 280 మంది జీహెచ్ఎంసీ కార్మికులు అందుబాటులో ఉండనున్నారు. 

కేసీఆర్ తో ఇంటెలిజెన్స్ డీఐజీ భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్ భేటీ అయ్యారు. భేటీ గల కారణాలు తెలియరాలేదు. 

20:49 - September 4, 2016

ఎటు చూసినా పచ్చిని చేలతో హాయిగొలిపే చల్లని గాలులతో అన్నా..తమ్ముడు అన్న బంధాలతో తప్ప పేర్లతో పిలుచుకోని ప్రశాంతమైన పల్లెటూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ ఊరుకు ఏమైంది ? ఆ జనం అనుకున్నట్లు ఆ ఊరి నాశనానికి నాంది పలికిన మంత్రగాడు నిజంగా సమ్మయ్యేనా ? రెచ్చగొడితే రెచ్చిపోయే జనం..చచ్చిపోతామన్న భయంతో తమ ప్రాణాలకు హాని కలుగుతున్న భయంతో ఆ మంత్రగాడిని చంపడానికి బయలుదేరారు. ఇద్దరు ఘరానా మోసగాళ్ల మధ్య మొదలైన యుద్ధం ఎంతటి ప్రమాదానికి దారి తీసిందో ? అసలేం జరిగింది ? వీడియోలో చూడండి. 

సమ్మె యథాతథం - గురుకుల టీచర్ల జేఏసీ..

హైదరాబాద్ : సమ్మె యథాతథంగా కొనసాగుతుందని గురుకుల టీచర్ల జేఏసీ ప్రకటించింది. సమ్మెను నీరుగార్చేందుకు కార్యదర్శి అపోహలు సృష్టిస్తున్నారని, 6,7 తేదీల్లో ఈ మెయిల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు తెలిపింది. 

20:25 - September 4, 2016

చట్టాలను అమలు చేయకపోవడం అభివృద్ధా ? రైతుల పొట్టకొట్టి ప్రాజెక్టులు నిర్మించడం అభివృద్దా అని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రశ్నించారు. ఉద్యమాలు చేస్తే తాము సీఎంకు అభివృద్ధి నిరోధకులమా ? అని నిలదీశారు. ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను కూలంకషంగా విశ్లేషించారు. నిర్వాసితుల సమస్యలపై మొఖం చాటేస్తున్నారని, దివీస్ పరిశ్రమ వల్ల..భూములు కోల్పోతున్న వాళ్లకేం చేశారని ప్రశ్నించారు. దివీస్ పరిశ్రమ ప్రాంతం గతంలో ఆర్థిక మంత్రి యనమల నియోజకవర్గంలోనిదని, అక్కడ నిబంధలన్నింటినీ గాలికొదిలేశారని విమర్శించారు. అనంతపురం జిల్లా ఎస్ పీ కుంటలోనూ అదే పరిస్థితి నెలకొందని తెలిపారు. అక్కడ తెలిసినోడికి పరిహారం..రైతులకేమో శఠగోపం అని వ్యాఖ్యానించారు.

నిర్వాసితులు లబోదిబోమంటున్నారు...
రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా నిర్వాసితులు లబోదిబోమంటున్నారని, రాజధానేమో ప్రజా రాజధాని అంటున్నారని..స్విస్ ఛాలెంజింగ్ అంటూ గూడుపుఠాణి నడుపుతున్నారని విమర్శించారు. గంగవరం..కృష్ణపట్నం పోర్టుల వల్ల ఏం ఉద్యోగాలొచ్చాయని ప్రశ్నించారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను బాబు సర్కార్ మోసం చేస్తోందని, లక్ష్మీంపేట ఘటన నిందితులను అరెస్టు చేయకపోతే ఉద్యమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఛలో లక్ష్మీంపేట పేరిట ఆందోళన చేపడుతామని, రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో కడప స్టీల్ ప్లాంట్ ఏమైందని, ఉద్యోగాలు లేక యువత తల్లిడిల్లుతున్నారని తెలిపారు. వస్తే ఇంటికో ఉద్యోగం అన్నారని..ఉద్యోగాలు ఏవనీ నిలదీశారు. భారీ సంఖ్యలో ఖాళీలున్నాయని కమలనాథన్ కమిటీయే చెప్పిందని గుర్తు చేశారు.

'పవన్' వ్యాఖ్యలు స్వాగతిస్తున్నాం...
ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్ చంద్రబాబుదే అనే వాదన కరెక్టే అని, ఈ కుంభకోణంలో దోషులు ఎంతటి వారైనా అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇటీవలే సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. పవన్ పై అవాక్కులు పేలుతున్న టిడిపి ఎంపీలు ఇన్నాళ్లు ఏం చేశారని, ప్రత్యేక హోదాపై పవన్ తో సహా అన్ని పార్టీలతో ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. పవన్ నిలబడుతారా ? నిలబడరా ? అనేది ఆయనపై ఆధార పడి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గో సంరక్షణ పేరిట దాడులను పవన్ ఖండించడం స్వాగతిస్తున్నామని, కమ్యూనిస్టుల ఉద్యమాలపై పవన్ మంచిగానే మాట్లాడారని తెలిపారు. ఉద్యమాల్లో కలిసి పనిచేసేందుకు పవన్ ముందుకు రావాలని సూచించారు. 

మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం లేదు...
ఏపీలో మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం లేదని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. లెఫ్ట్ పార్టీలు బలమైన ఉద్యమాలు నిర్మిస్తే సమీకరణాలు మారొచ్చని, కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధంగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కమిషన్ నిర్ణయాన్ని గౌరవిస్తామని, సాంకేతికాంశాలు..సుప్రీం తీర్పులు..పరిగణలోకి తీసుకోవాలన్నారు.

ఇంకా ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

హోదాకు బాబు కృషి - చిన రాజప్ప..

విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు ఇప్పటికే కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. ఈ విషయంలో ఏ పార్టీ వారైనా సహకరిస్తే స్వాగతిస్తాం అని తెలిపారు. 

హోదాతోనే అభివృద్ధి - రోజా..

చిత్తూరు : ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ త్వరగా అభివృద్ధి చెందుతుందని, ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్‌కు తప్ప మిగిలిన నాయకులెవరికీ క్లారిటీ లేదని నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జగన్ చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. 

19:55 - September 4, 2016

'జబర్ధస్త్' ఒక్క పేరు చాలు తెలుగు టీవీ ప్రేక్షకులను నవ్వుకోవడానికి...ఇప్పుడున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీల్లోని కమెడియన్ లలో చాలా నుండి వచ్చినవారే ఎక్కువగాఉ న్నారు. ఆ విషయానికి వస్తే 'చమ్మక్ చంద్ర' ఈ పేరు తెలియని వారుండరేమో. 'జబర్ధస్త్' షోతో వెరీ పాపులర్ అయ్యాడు. ఇండ్రస్ట్రీలో చెడు..మంచి రెండూ ఉంటాయని 'జబర్ధస్త్' చమ్మక్ చంద్ర పేర్కొన్నారు. వినాయక చవతి పండుగ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి రాకముందు..తన జీవితం..తన కుటుంబ పరిస్థితుల గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. తన కామెడీ ప్రయాణం గురించి తెలిపారు. బాన్సువాడలోని ఓ పల్లెటూరు నుండి తాను రావడం జరిగిందని 'జబర్దస్త్' చందు పేర్కొన్నారు. తాను విలన్ కావాలని రావాలని అనుకోలేదని, అలాంటి లుక్స్ ఉంటాయి కాబట్టి విలన్ గా అయితే బాగుంటుందని అనుకున్నానని తెలిపారు. తనను 'మెగస్టార్' చిరంజీవి మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంటుందన్నారు. తాను చూసిన సిచ్యువేషన్ ను స్ర్కిప్ట్ గా రాసుకోవడం జరుగుతోందన్నారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

బంగాళాఖాతంలో అల్పపీడనం..

విశాఖపట్టణం : వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

19:40 - September 4, 2016

బాన్సువాడలోని ఓ పల్లెటూరు నుండి తాను రావడం జరిగిందని 'జబర్దస్త్' చమ్మక్ చంద్ర పేర్కొన్నారు. వినాయక చవతి పండుగ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. తాను కళ్లార చూసిన సిచ్ వేషన్ నే తాను చేయడం జరుగుతోందని, చీర లేపితే ఇంత వర్కవుట్ జరుగుతుందని అనుకోలేదని తెలిపారు. జంట్స్ కంటే లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారని, బాగా ఎంజాయ్ చేస్తామని మహిళలు పేర్కొంటారని పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో ఆయన మాటల్లోనే వినాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:33 - September 4, 2016
19:22 - September 4, 2016

విజయవాడ : వినాయక చవితి సందడి ప్రారంభమైంది. పువ్వులు..పత్రి కోసం మార్కెట్ లకు ప్రజలు బారులు తీరుతున్నారు. మట్టి గణపతుల కోసం ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కానీ అధిక రేట్లు ఉండడంతో ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. విజయవాడలో 15వేల విగ్రహాలకు పోలీసులు అనుమతినిచ్చారు. నగర వ్యాప్తంగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి జనాలు ఆసక్తి చూపుతున్నారు. 'డూండీ గణేష్ కమిటీ' ఆధ్వర్యంలో 72 ఎత్తుల భారీ 'మట్టి గణేష్' విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని చూడటానికి అప్పుడే భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు టెన్ టివితో మాట్లాడారు. ఆ విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.  

19:13 - September 4, 2016

హైదరాబాద్ : ఖైరతాబాద్ వినాయకుడు...తెలుగు రాష్ట్రాల్లో ఎత్తైన వినాయకుడు. ఈసారి 58 అడుగుల ఎత్తులో దర్శనమిస్తున్నారు. అత్యంత భారీగా వినాయకుడిని రూపొందించారు. పసుపు పంచె..నీలం రంగు ధోతితో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఒక రోజు ముందే ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు మండపం దగ్గర భక్తుల తాకిడి నెలకొంది. శక్తిపీఠ నాగేశ్వరుడి అవతారంలో మహా గణపతి దర్శనమిస్తున్నాడు. గణనాథుడి కుడివైపు వెంకటేశ్వరుడు..ఎడమవైపు గోవర్ధనగిరి గోపాలుడులను ప్రతిష్టించారు. శాంబరి..సరస్వతీ పీఠాలు ఆకర్షిస్తున్నాయి. సోమవారం ఉదయం ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తొలి పూజ చేయనున్నారు. 300 మంది వాలంటీర్లు ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని, ప్రైవేటు సెక్యూర్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్వాహకుడు పేర్కొన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మరి విగ్రహం ఎలా ఉంది..అక్కడ భక్తజనం సందడి చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:00 - September 4, 2016

ఆయన అరిస్తే మెరుపులు కాదు...అరుపులే. హీరోగా కనిపించాల్సిన వ్యక్తి వెండి తెరపై కమెడియన్ గా కాలు దువ్వుతున్నాడు. అయినా హీరో కాలేకపోతేనేం...హీరోలను మించిన డైలాగ్స్ తో ఆడియన్స్ ను అదరగొడుతున్నాడు. మాటి మాటికి 30 ఇయర్స్ ఇండ్రస్ట్రీ అంటున్నారు..ఆయన ఎవరో కాదు 'పృథ్వీ'. వినాయక చవితి పండుగ సందర్భంగా 'పృథ్వీ'తో టెన్ టివి ముచ్చటించింది. తనకు ఎవరూ సపోర్టు ఇవ్వలేదని..తల్లి తనకు ఎంతో సపోర్టు ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే 'హీరో'గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు. ఆయన ఎలాంటి విశేషాలు..విషయాలు వెల్లడించారో వీడియోలో చూడండి. 

18:43 - September 4, 2016

'పవన్' సభకు నామకరణం..

కాకినాడ : సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఈనెల 9న కాకినాడలో బహిరంగ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈసభకు సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ అని నామకరణం చేశారు.

18:30 - September 4, 2016

30 ఇయర్స్ ఇండ్రస్ట్రీ అంటూ పేరొందిన నటుడు 'పృథ్వీ'. ప్రస్తుతం టాప్ కమెడీయిన్ గా పేరొందారు. వినాయక చవితి సందర్భంగా 'పృథ్వీ'తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా స్పూఫ్ లపై వస్తున్న విమర్శలపై పృథ్వీ స్పందించారు. 'బాహుబలి' సినిమా స్పూఫ్ పై 'రాజమౌళి' తిట్టారని..ఇలా రకరకాల వార్తలు వచ్చాయని ప్రశ్నించగా అవి నిజం కాదన్నారు. 'ప్రభాస్' డార్లింగ్..డార్లింగ్ అంటారని, 'బాహుబలి 2' లో తాను నటించడం జరుగుతోందన్నారు. అంత కోపం ఉంటుంటే 'రాజమౌళి' తనకు అవకాశం ఇచ్చే వారు కాదని తెలిపారు. సినిమాను..సినిమాలాగే చూడాలని సూచించారు. ప్రేక్షకులను ఆనందంగా ఉంచడం కోసం తాను ప్రయత్నిస్తుంటానని తెలిపారు. 'కబాలి' లాంటి ఒక స్పూఫ్ వదిలేయడం జరిగిందని, స్పూఫ్ లాంటివి రావడం లేదని ఎందుకంటే కథలు అలా ఉన్నాయన్నారు. మిగతా విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:20 - September 4, 2016

సినిమా జన్మనిచ్చిన నటుడు 'ప్రభాకర్' అని, తన గాడ్ అని 'పృథ్వీ' పేర్కొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా పృథ్వీతో టెన్ టివి ముచ్చటించింది. ఆయనలో ఉన్న ఫ్యూచర్స్ అన్ని తనలో ఉన్నాయని, ప్రభాకర్ మీ నాన్న గారా అని అడిగితే అవును అని పేర్కొంటానని తెలిపారు. సినిమాలో నటించాలని, చెన్నైకి వస్తే కలవాలని గతంలో ప్రభాకర్ చెప్పడం జరిగిందన్నారు. మూడు సంవత్సరాల తరవాత ప్రభాకర్ ను కలవడం జరిగిందని, పరిచయం అయిన రెండు రోజుల తరువాత మొదటి ఫ్లైట్ ఆయనతో జరిగిందన్నారు. నేను ఎవరో తనకు తెలియదని, ఆయన గెస్ట్ హౌస్ లో తనను ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి డబ్బులు ఇవ్వాలని ప్రభాకర్ సూచించడం జరిగిందన్నారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

కేసీఆర్ ను విమర్శించే డీకే అరుణకు లేదు - ఎంపీ సుమన్..

హైదరాబాద్ : కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదని ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. ఎన్నికల ఎజెండా ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

తమది రైతు సంక్షేమ ప్రభుత్వం - మంత్రి జోగు రామన్న...

ఆదిలాబాద్ : తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. రైతులను ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఇది చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు.
 

ప్రారంభమైన వినాయక చవితి సందడి..

హైదరాబాద్ : వినాయక చవితి సందడి ప్రారంభమైంది. పువ్వులు..పత్రి కోసం మార్కెట్ లకు ప్రజలు బారులు తీరుతున్నారు. మట్టి గణపతుల కోసం ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. 

కేసీఆర్ ఉద్యమంతో తెలంగాణ రాలేదు - డీకే అరుణ..

హైదరాబాద్ : రాదనుకున్న తెలంగాణను సాధించుకున్నామని, కేసీఆర్ ఉద్యమంతో తెలంగాణ రాలేదని డీకే అరుణ వ్యాఖ్యానించారు. 60 ఏళ్ల ప్రజల ఆకాంక్షతో తెలంగాణ వచ్చిందన్నారు. గద్వాల మారుమూలలో ఉందని నిరూపిస్తే మేం జిల్లా అడగమన్నారు. అవగాహన లేని మంత్రి తమ జిల్లాకు ఉండడం దురదృష్టకరమని, సౌకర్యాలు లేని వనపర్తికి గద్వాల్, ఆలంపూర్ ప్రజలకు వెళ్లరని తెలిపారు. గద్వాల జిల్లా కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. రియల్టర్లు, ఇసుక మాఫియా కోసమే కొత్త జిల్లాలని, అస్తవ్యస్థంగా జిల్లాలు విభజిస్తే పతనం తప్పదన్నారు. 

బాబును విమర్శించే అర్హత జగన్ కు లేదు - మంత్రి పల్లె..

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత జగన్ కు లేదని ఏపీ మంత్రి పల్లె పేర్కొన్నారు. చంద్రబాబుపై జగన్ తల్లిదండ్రులు కేసులు వేసినా నిలబడలేదన్నారు. క్విడ్ ప్రో కింద ఐఏఎస్ లను బలి చేశారని, తండ్రికి..రాజకీయంగా జన్మనిచ్చిన కాంగ్రెస్ కు జగన్ వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. రాయలసీమకు నీరిస్తుంటే సైంధవుడిలా జగన్ అడ్డంకులు సృషిస్టున్నాడని తెలిపారు. 

మల్ రెడ్డికి మంచిరెడ్డి సవాల్..

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి చేసిన ఆరోపణలపై మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మల్ రెడ్డికి దమ్ముంటే పూర్తి ఆధారాలతో రేపు ఇబ్రహింపట్నంకు రావాలని సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసమే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, త్వరలో మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మల్ రెడ్డి రంగారెడ్డి తాడూ బొంగరం లేని వ్యక్తి అని, తన కొడుకు పేరిట ఆదిభట్లలో ఎకరా భూమి ఉన్న మాట వాస్తవమేనన్నారు. 

స్వర్ణ భారత్ ట్రస్టు సేవల్లో పాల్గొన్న స్పీకర్ సుమిత్రా మహజన్...

నెల్లూరు : స్వర్ణ భారత్ ట్రస్టు సేవలు అందరికీ ఆదర్శమని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ పేర్కొన్నారు. స్వర్ణభారత్ ట్రస్టు 15వ వార్షికోత్సవంలో ఆమె పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర, వెంకయ్యతో పాటు ఒలింపిక్ కాంస్య పతక విజేత పీవీ సింధు, కోచ్ గోపిచంద్ లు పాల్గొన్నారు. ఏపీలో 53వేల కోట్లతో పెట్రోలియం శాఖ పెట్టుబడులు వస్తాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర పేర్కొన్నారు. విశాఖలో పెట్రోవర్సిటీ, హెచ్ పీసీఎల్ విస్తరణ, ఆయుల్ రిఫైనరీ ప్లాంట్లు వస్తాయన్నారు. 

కృష్ణా నదిలో ఇద్దరు గల్లంతు...

మహబూబ్ నగర్ : జిల్లాలోని మాగనూరు మండలం వాసునగర్ వద్ద కృష్ణా నదిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

17:41 - September 4, 2016

శ్రీకాకుళం : ఊరూవాడా గణేష్‌ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసినా ఎవరి స్థాయిని బట్టి వారు.. గణనాధుల విగ్రహాలను నెలకొల్పుతున్నారు. కానీ శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో మాత్రం వింత పరిస్థితి నెలకొంది. స్వయంభువుగా వెలసిన ఓ గణపయ్య విగ్రహం ఏ ఏటికా ఏడు పెరుగుతూ వస్తోంది. వినాయక చవితి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ వినాయకుడు నిత్యపూజలు అందుకుంటున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో వింత గణపయ్య దర్శనమిస్తున్నాడు. సంతకవిటి మండలంలోని మారుమూల పల్లె అయిన మంతెనలో వినాయకుడు ఏటా కొద్ది కొద్దిగా పెరగడం చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. శతాబ్దాల నాటిదైన ఈ రాతి విగ్రహం ఒకప్పుడు కొంతకాలం క్రితం చాలా చిన్నగా ఉండేదని, ప్రతిఏటా బొజ్జ గణపయ్య సైజు పెరగుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ముప్పై ఏళ్ల నుంచి ఈ విగ్రహం కొంచెం కొంచెం పెరుగుతూ వస్తోందని భక్తులు చెబుతున్నారు.

రాతి విగ్రహం...
సాధారణంగా వినాయక చవితి వచ్చిందంటే విగ్రహాలు స్థాపించి పూజలు చేస్తారు. కానీ మంతెనలో మాత్రం వ్యాకోచ విగ్రహానికి ఊరూ.. వాడ ఏకమై ఉత్సవాలు చేయడం విశేషం. ఈ రాతి విగ్రహం చాలా కాలం నుంచే పెరుగుతూ వస్తోందని, భక్తుల కోరిన కోర్కెలు తీర్చే బొజ్జ గణపయ్యకు స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇప్పటివరకు మంతెన గ్రామంలో దాదాపు పది విగ్రహాలు బయటపడటం విశేషం. వీటితో పాటు రాతి శిలలు కూడా లభ్యమయ్యాయి. ఈ ప్రాంతంలో బ్రాహ్మణ అగ్రహారం ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. దీంతో పురావస్తుశాఖ లోతుగా అధ్యయనం జరిపితే మరిన్ని పురాతన వస్తువులు బయట పడే అవకాశం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. 

17:37 - September 4, 2016

తూర్పుగోదావరి : ఏ పూజ చేసినా, ఏ కార్యం తలపెట్టినా ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలని మొదట గణపతిని పూజిస్తారు. మట్టి గణపయ్యలకు ప్రాణం పోసే అక్కడి కళాకారులకు కష్టాలు తప్పడం లేదు. మట్టి విగ్రహాల తయారీ వారి ఆకలిని తీర్చడం లేదు. సంప్రదాయ వృత్తిలో కొనసాగలేక..కష్టాల నుంచి బయటపడలేక వలసబాటపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా గాడిలంక గ్రామం. మట్టి వినాయక విగ్రహాల తయారీకి ఈ ఊరు ప్రసిద్ధి. బంకమట్టితో వినాయకుడి ప్రతిమలు అందంగా తీర్చిదిద్దడంలో ఇక్కడి కళాకారులు సిద్దహస్తులు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ మట్టి గణపయ్య విగ్రహాల కోసం దూరభారాల కోర్చి గాడిలంకకు వస్తున్నారంటే ఈ ఊళ్లోని కళాకారుల ప్రతిభ ఏ పాటిదో అర్థమవుతోంది. తరతరాలుగా ఇదే వృత్తిపై ఆధారపడ్డ వీరికి మనుగడకోసం పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మట్టి విగ్రహాలకు రానురాను ఆదరణ తగ్గిపోవడంతో..పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సిన పరిస్థితి నెలకొంది.

భారం..
ముడి సరుకుల పెట్టుబడి పెరగడం రాబడి తగ్గిపోవడం తయారీదారులకు భారంగా మారింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, మిరుమిట్లు గొలిపే రంగులతో చేసిన వినాయకుడి విగ్రహాలవైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ముడిసరుకుల భారం పెరగడంతో ఎంతో మంది కళాకారులు పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారు. ఉన్న కొద్ది మంది కూడా చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ప్రోత్సాహం అందించి ఆదుకోవాలని గాడిలంక కళాకారులు కోరుతున్నారు. బంకమట్టి తొక్కే మిషన్లు ఉచితంగా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపక్షంలో మట్టివిగ్రహాలకు ప్రసిద్ధి గాంచిన గాడిలంకలో ఆ వృత్తి కనుమరుగయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు. 

17:33 - September 4, 2016

హైదరాబాద్ : తెలంగాణలో జోనల్‌ వ్యవస్థను రద్దు చేయవద్దని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించింది. విద్య, ఉద్యోగాలలో సమాన అవకాశాల కోసం జోనల్‌ వ్యవస్థ కొనసాగాలని టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావ రవి అన్నారు. రాజ్యాంగంలోని 371 డి ఆర్టికల్‌ ద్వారా కల్పించబడిన రక్షణచర్యలలో భాగంగానే జోనల్‌ వ్యవస్థ ఏర్పాటైందన్నారు. జోనల్‌ వ్యవస్థను కొనసాగించాలంటూ ఉద్యమానికి సైతం సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. 

17:31 - September 4, 2016

హైదరాబాద్ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్‌ పనిచేయడం లేదని తెలంగాణ ప్రజా వేదిక అధ్యక్షులు జస్టిస్‌ చంద్రకుమార్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రజలు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు ముఖ్యమైన అంశాలతో మొదలైందని ఆయన గుర్తుచేశారు. ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ ప్రజావేదిక పనిచేస్తుందని జస్టిస్‌ చంద్రకుమార్‌ తెలిపారు. 

17:30 - September 4, 2016

మెదక్ : దసరా పండుగరోజున సిద్దిపేటను జిల్లాగా సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారని మంత్రి హరీష్‌రావు తెలిపారు. మెదక్‌ జిల్లా సిద్దిపేటలో పర్యటించిన మంత్రి.. పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. కుమ్మరి సంఘం సామాజిక భవనం, పరుపల్లి వీధిలో స్కూల్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి వారి ఆధ్వర్యంలో మట్టిగణేష్‌ విగ్రహాలను పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్ల కల కేసీఆర్‌ దయతో తీరబోతోందని అన్నారు.

 

17:21 - September 4, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఆపరేషన్‌ ఆకర్ష్‌ దెబ్బకు కుదేలైన తెలంగాణ టిడిపికి పూర్వ వైభవం తీసుకురావాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ బలోపేతం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తల వసలతో బోసిపోయిన టిడిపి కార్యాలయం మళ్లీ కళకళలాడుతోంది.
తెలంగాణ టీడీపీకి జవసత్వాలు కల్పించే దిశగా పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది. ముప్పై ఏళ్ల చరిత్ర కలిగిన టీఎస్‌ టీడీపీ రాష్ట్ర విభజన తర్వాత కొంత బలహీన పడింది. 2014 ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అధికార టీఆర్‌ఎస్‌కు జారుకోవడంతో టీడీపీ ప్రాభవం కోల్పోయింది. ప్రజా ఉద్యమాల ద్వారా పూర్వ వైభవం పొందే దిశగా పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌లో కొద్దో గొప్పో పట్టున్నా... జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం ఒకసీటులో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మెదక్‌, వరంగల్‌ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసినా, అధికార టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉంది. వరంగల్‌, ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూడా పార్టీ పరిస్థితి మెరుగుపడకపోగా, మరింత దిగజారడంతో టీఎస్‌ టీడీపీ నేతలు దిగాలు పడిపోయారు. దీంతో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ ముఖం చూడాలంటేనే పార్టీ నేతలు విముఖత ప్రదర్శించారు.

మల్లన్నసాగర్‌ భూసేకణ ఉద్యమం..
ఈ నేపథ్యంలో పార్టీకి జవసత్వాలు కల్పించి, పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యతలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ భుజానికి ఎత్తుకున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో తరచు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీకి కాయకల్ప చికిత్సచేసే ప్రయత్నం ప్రారంభించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా హైదరాబాద్‌ వచ్చినప్పుడల్లా పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. నేతలల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించి, నైతిక స్థైర్యం నింపే దిశగా ప్రోత్సహించే చర్యలు చేపట్టారు. దీంతో నేతల్లో కొత్త ఉత్సాహం నెలకొనడంతో పార్టీ పరిస్థితి కొద్దిగా మెరుగుపడిందన్న భావన తెలంగాణ టీడీపీ నేతల్లో ఉంది. ప్రజా సమస్యలతోపాటు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలపైనా పోరాటాలు చేస్తున్నారు. మల్లన్నసాగర్‌ జలాశయం భూసేకరణ ఉద్యమంతోపాటు, గోదావరి సాగునీటి ప్రాజెక్ట్‌పై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహారాష్ట్రతో కుదర్చుకున్న ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ఉద్యమానికి మంచి స్పందన వచ్చింది. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో తెలంగాణ టీడీపీ నేతల్లో కొత్త ఊపు కనిపిస్తోంది.

జిల్లాలో విస్తృతంగా పర్యటించాలని రేవంత్‌రెడ్డి నిర్ణయం..
వీటికి తోడు ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ శాఖకు ప్రత్యేక కార్యాలయాలను ప్రారంభించారు. పార్టీ అనుబంధ విభాగాలైన తెలుగు మహిళ, తెలుగు యువత, టీఎన్‌టీయూసీలకు కొత్త కమిటీలను ప్రకటించారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీల నియాయకాన్ని త్వరతిగతిన పూర్తి చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వారంలో మూడు రోజులు పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు. ఇవన్నీ పార్టీలో కొత్త ఉత్సహాన్ని నింపేందుకు దోహనం చేస్తున్నాయన్న భావంతో టీడీపీ నాయకత్వం ఉంది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్యమాలే ఊపిరిగా పని చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇలాంటి చర్యలతో తిరిగి ప్రజాదరణ పొందాలని తెలంగాణ టీడీపీ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సత్ఫలితాలిస్తాయో చూడాలి. 

31 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు..

హైదరాబాద్ : ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 31 మంది ఉపాధ్యాయులు అవార్డులను అందుకోనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన అవార్డుల ప్రధానం జరగనుంది. 

ఖైరతాబాద్ కు బయలుదేరిన భారీ లడ్డూ..

తూర్పుగోదావరి : తాపేశ్వరం నుండి ఖైరతాబాద్ కు 500 కేజీల లడ్డూ బయలుదేరింది. రేపు ఖైరతాబాద్ మహాగణపతికి లడ్డూను సమర్పించనున్నారు. 

ఏపీలో అవినీతి పెచ్చుమీరింది - కోట్ల..

కర్నూలు : ఏపీలో అవినీతి పెచ్చుమీరిందని మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ లిద్దరూ రాయలసీమ ద్రోహులేనని తెలిపారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై త్వరలో పోతిరెడ్డిపాడు నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేస్తానని కోట్ల పేర్కొన్నారు. 

సిద్ధిపేట కల నెరవేరబోతోంది - హరీష్ రావు..

మెదక్ : కేసీఆర్ వల్లే సిద్ధిపేట జిల్లా కల నెరవేరబోతోందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. వచ్చే దసరా నాటికి సిద్ధిపేట జిల్లాను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. 

గురుకుల పాఠశాలల్లో న్యూ క్వాలిటీపై వెనక్కి తగ్గిన టి.సర్కార్..

హైదరాబాద్ : గురుకుల పాఠశాలల్లో న్యూక్వాలీటీ పాలసీపై టి.సర్కార్ వెనక్కి తగ్గింది. విధానంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

 

నదుల అనుసంధానం ఘతన బాబుకే - కేఈ..

తూర్పుగోదావరి : నదులు అనుసంధానం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని డిప్యూటి సీఎం కేఈ పేర్కొన్నారు. పట్టిసీమ గోదావరి - కృష్ణాతో కలపడంతో రాయలసీమకు నీరు వచ్చిందని, రాయలసీమలో పంటలు ఎండిపోకుండా రెయిన్ గన్స్ తో కాపాడారని తెలిపారు. 

16:51 - September 4, 2016
16:36 - September 4, 2016
16:34 - September 4, 2016

ఖమ్మం : గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం సింగభూపాలెం పంచాయతీ రూప్లాతండాకు చెందిన బోడా బిక్కు రోడ్డు ప్రమాదానికి గురై.. కోమాలోకి వెళ్లాడు. చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకువస్తే చనిపోయాడని చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు బిక్కును స్వస్థలానికి తీసుకెళ్లారు. ఈలోగా బిక్కులో కదలిక రావడాన్ని గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా బిక్కు కోమా నుంచి బయటపడ్డాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

16:32 - September 4, 2016

విజయవాడ : జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. వినాయకచవతి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతుంది. విజయవాడ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో జరిగిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో సిటీ కేబుల్ ఎండి సాయిబాబు తో పాటు కృష్ణా జిల్లా చైర్ పర్సన్ గద్దె అనురాధ, దేవినేని అవినాష్ పాల్గొన్నారు. మట్టి వినాయక విగ్రహాల పంపిణీపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:30 - September 4, 2016

అమెరికా : మానవతా మూర్తి మదర్‌ థెరిసాకు సెయింట్‌ హోదా ప్రకటించారు. వాటికన్‌ సిటీలో మత గురువుల జాబితాలో చేర్చే ఉత్సవంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ థెరిసాకు సెయింట్‌ హోదా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది థెరిసా అభిమానులు తరలివచ్చారు. భారత్‌ నుంచి విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం హాజరైంది. మదర్‌ థెరిసా స్థాపించిన మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీకి చెందిన సిస్టర్‌ మేరీ ఆధ్వర్యంలో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన 40 మందికి పైగా నన్స్‌ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

16:28 - September 4, 2016

కాకినాడ : ఈ నెల 9వ తేదీన కాకినాడలో జరగనున్న జనసేన బహిరంగ సభకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సభ కోసం జేఎస్టీయూ కాలేజీ గ్రౌండ్‌ను నాయకులు సిద్ధం చేస్తున్నారు. సభను జయప్రదం చేయడం కోసం జనసేన కార్యకర్తలు సమావేశమయ్యారు. సభను కనివీని ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు గ్రౌండ్‌లో భద్రత ఏర్పాట్లను జిల్లా పోలీస్ యంత్రాంగం పరిశీలించింది. ఈ సందర్భంగా జనసేన కార్యకర్త మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై పోరాటంలో గళమెత్తాడానికి పవన్ రాబోతున్నారని, అందుకు జిల్లా వ్యాప్తంగా యాక్టివ్ గా ఉండే కార్యకర్తలు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. సభకు వచ్చే మహిళలు..వృద్ధుల కోసం ఏం చేయాలని చర్చించడం జరిగిందన్నారు. 

16:26 - September 4, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీంతో కలిసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డాడని కాంగ్రెస్‌ నేత మల్లారెడ్డి ఆరోపించారు. తమ దగ్గర అందుకు సంబంధించిన పత్రాలున్నాయని.. వీటిని దర్యాప్తు సంస్థ సిట్‌కు ఇచ్చామని తెలిపారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధికారపార్టీలో ఉండడంతో తమకు సిట్‌పై నమ్మకం లేదని అందుకే ప్రెస్‌మీట్ పెట్టామన్నారు. దాదాపు రెండువందల కోట్లు కొల్లగొట్టిన కిషన్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేయడం లేదని మల్లారెడ్డి ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో వందలాది భూములను అదిరించి..బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకుని దుర్మార్గంగా ఎవరైనా ప్రజాప్రతినిధి ఉన్నాడా ? అంటే అది మంచిరెడ్డి కిషన్ రెడ్డి అని ఘాటు ఆరోపణలు చేశారు.

16:14 - September 4, 2016

డీకే అరుణ దీక్ష విరమణ..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ నేత డీకే అరుణ రెండు రోజుల పాటు చేసిన దీక్షను విరమించారు. గద్వాల్‌, జనగామాను జిల్లాలుగా ప్రకటించాలని ఆమె దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. 

16:05 - September 4, 2016

ఓటుకు నోటు కేసుతో బాబుకు సంబంధం లేదు - రావెల..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసుతో సీఎం చంద్రబాబు ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారని ఏపీ మంత్రి రావెల పేర్కొన్నారు. వైసీపీ నేతలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసుతో బాబుకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. 

లొంగిపోయిన38 మంది నక్సల్స్

ఛత్తీస్ గడ్ : నారాయణ పూర్ లో 38మంది నక్సల్స్ లొంగిపాయరు. ఆదివారం 45/46 ఐటీబీపీ మరియు సీజీపీ దళాలకు వీరు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 7గురు మహిళలున్నారు.

 

15:53 - September 4, 2016

ఒక్క ఫొటో సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తోంది. పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ముక్కుపచ్చలారని చిన్నారి కుర్దీ సముద్రపు ఒడ్డున విగతజీవిగా పడి ఉన్న ఫొటో యావత్ ప్రపంచాన్ని కన్నీరు పెట్టించింది. ఆ చిత్రాన్ని చూసిన జనం చలించిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఫొటో కూడా వైరల్ గా మారిపోయింది. మిషెల్లీ బర్దన్ ఓ పోలీసు ఆఫీసర్. అమెరికా అలబామాలోని బర్మింగ్ హోమ్ లో మంగళవారం ఓ అపార్ట్ మెంట్ నుండి అత్యవసర నంబన్ కు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే మిషెల్లీ తన బృందంతో వెళ్లింది. ఓ ఇంట్లో తండ్రి చనిపోయి...తల్లి సృహలో లేకుండా విషమంగా ఉండడం కనిపించింది. వీరు అధికంగా డ్రగ్స్ సేవించడంతో ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం. ఇదిలా ఉంటే వారి పక్కనే దీనంగా రోదిస్తూ నలుగురు పిల్లలు ఉండడం మిషెల్లీ గమనించింది. నలుగురి పిల్లలను ఏం చేయాలో తెలియక..తమ వెంట పీఎస్ కు తీసుకెళ్లారు. ముగ్గురిని ఎలాగో అలా బుజ్జగించారు. కానీ నెల వయస్సున చిన్నారిని ఎలా ఓదార్చాలో పోలీసులకు అంతుబట్టలేదు. చివరకు మిషెల్లీ ఆ చిన్నారి బాధ్యతను భుజాలకెత్తుకుంది. తన తుపాకి తీసి పక్కన పెట్టింది..బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ విప్పేసింది. ఓ తల్లిగా ఆ చిన్నారిని గుండెలకు హత్తుకుని లాలించింది. ఆ రోజంతా పీఎస్ లోనే ఉండిపోయింది.

భర్త కంగారు...
మరోవైపు మిషెల్లీ భర్త బ్రియన్ బర్టన్ కంగారుపడిపోయాడు. మిషెల్లీ ఇంటికి ఎందుకు రాలేదని పీఎస్ కు ఫోన్ చేశాడు. జరిగిన విషయం మిషెల్లీ భర్తకు వివరించింది. చిన్నారిని గుండెలకు హత్తుకొని లాలిస్తున్న తన భార్య మిషెల్లీ ఫొటోను చూసి భర్త బర్టన్ మురిసిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో వెల్లడించాడు. స్వయంగా ఇద్దరు పిల్లల తల్లైన మిషెల్లీ తాను పోలీసు అధికారిని అనే అహాన్ని పక్కనబెట్టి మరీ ఆ చిన్నారిని లాలించిందని, అలా లాలిస్తున్న ఫొటోలో ఆమె ఎప్పుడూ లేనంత అందంగా కనిపించిందని ఆయన పేర్కొన్నారు. ఓ మాతృమూర్తిలా ఆ చిన్నారికి మిషెల్లీ పంచిన ప్రేమ నెటిజన్లను కదిలించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మర్నాడు ఉదయం నలుగురు పిల్లల్ని పోలీసులు బాలల సంక్షరణ కేంద్రానికి అప్పగించారు.

నయీం అనుచరులతో మంచిరెడ్డికి సంబంధాలు - మల్ రెడ్డి..

హైదరాబాద్ : నయీం అనుచరులతో మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధాలున్నాయని మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. శ్రీహరితో పాటు మంచిరెడ్డిని కూడా అరెస్టు చేయాలని, మంచి ఇన్ ఫ్రా పేరిట శ్రీహరితో కలిసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు.

 

లొంగిపోయిన పెళ్లి కొడుకు..

హైదరాబాద్ : పాతబస్తీ కాల్పుల కేసులో పెళ్లి కొడుకు లొంగిపోయాడు. రెండు రోజుల క్రితం బారాత్ లో పెళ్లి కొడుకు మోసిన్ కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

 

ఖైరతాబాద్ వద్ద భక్తుల సందడి...

హైదరాబాద్ : ఒక రోజు ముందే ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు మండపం దగ్గర భక్తుల తాకిడి నెలకొంది. శక్తిపీఠ నాగేశ్వరుడి అవతారంలో మహా గణపతి దర్శనమిస్తున్నాడు. గణనాథుడి కుడివైపు వెంకటేశ్వరుడు..ఎడమవైపు గోవర్ధనగిరి గోపాలుడులను ప్రతిష్టించారు. శాంబరి..సరస్వతీ పీఠాలు ఆకర్షిస్తున్నాయి. 

సింగపూర్ కు ఏపీ మంత్రి నారాయణ..

విజయవాడ : పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ రెండ్రోజుల పర్యటనకు సింగపూర్ వెళుతున్నారు. ఈనెల 4, 5 తేదీల్లో ఆయన సింగపూర్‌లో అధికారిక సమావేశాల్లో పాల్గొననున్నారు. 

15:26 - September 4, 2016

వరల్డ్ కప్ హీరో, ప్లే బాయ్ 'యువరాజ్ సింగ్' త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ప్రేయసి 'హేజిల్ కీచ్' తో యువీ ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహంపై పలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. వీరు ఎప్పుడు వివాహం చేసుకుంటారా ? అని అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. ఈ విషయంపై 'యువీ' స్పందించాడు. ముంబై లో నిర్వహించిన ఫ్యాషన్ కార్యక్రమంలో 'యువీ', 'హేజిల్' లు పాల్గొన్నారు. 'హేజిల్' తో కలిసి 'యువరాజ్' ర్యాంప్ వాక్ చేశాడు. డిసెంబర్ మొదటి వారంలో 'హేజిల్' ను వివాహం చేసుకుంటానని 'యువీ' వెల్లడించాడు. గతంలో వివాహంపై 'యువీ' స్పందించాడు. 'అవును, మా నిశ్చితార్థం జరిగింది. హేజిల్ కీచ్ రూపంలోనా జీవితకాల స్నేహితురాల్ని పొందాను. హేజిల్ అంతా మా అమ్మ ప్రతిబింబంలా ఉంది ” అంటూ ట్విట్టర్ లో యువీ పేర్కొన్నాడు. అలాగే, హేజిల్ కీచ్ కూడా 'అవును, ఇది నిజం. అద్భుతమైన వ్యక్తిని పొందుతున్నందుకు కృతజ్ఞతురాలిని' అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. సో..యువీ డిసెంబర్ లో ఓ ఇంటివాడు అవుతున్నాడన్నమాట...

15:12 - September 4, 2016

యంగ్ టైగర్ 'జనతా గ్యారేజ్' తో భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టాడు. ఈ మూవీ పై భారీ హైప్ క్రియేట్ కావడంతో అనుకున్నట్లుగానే 'ఎన్టీఆర్' టార్గెట్ ని రిచ్ అయ్యాడు. అంతేకాదు ఏకంగా 'జనతా గ్యారేజ్' ఫస్ట్ డే కలెక్షన్లలో థర్డ్ ప్లేస్ ని ఆక్రమించింది. భారీ ఒపెనింగ్స్ తో 'ఎన్టీఆర్' సక్సెస్ సంబరాలకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రపంచవ్యాప్తంగా రిలీజైన 'ఎన్టీఆర్' 'జనతాగ్యారేజ్' ఫస్ట్ డే కలెక్షన్లతో దుమ్మురేపింది. అంతేకాదు మిక్స్ టాక్ స్ప్రెడ్ అయినప్పటికి కలెక్షన్లపై ఆ ప్రభావం లేకపోవడం విశేషం. ఓవరాల్‌గా తొలిరోజు 'జనతా గ్యారేజ్' రూ.20 కోట్లు కలెక్ట్ చేసింది. జెస్ట్ మిస్ లో 'జనతా గ్యారేజ్' థర్డ్ ప్లేస్ లోకి వెళ్లింది. లేదంటే తొలిరోజు కలెక్షన్లలో ఈ చిత్రం సెకండ్ ప్లేస్ ని ఆక్రమించేదే.

100 కోట్లు ? 
ఫస్ట్ డే కలెక్షన్లలో 22 కోట్ల తో 'బాహుబలి' పస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇక 'పవన్ కళ్యాణ్' 'సర్దార్ గబ్బర్ సింగ్' రూ. 21 కోట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. 19కోట్లతో థర్డ్ ప్లేస్ లో ఉన్న 'శ్రీమంతుడి'ని వెనక్కి నెట్టి 'జనతా గ్యారేజ్' రూ. 20 తో థర్డ్ ప్లేస్ ని ఆక్రమించింది. చాలా కాలం తరువాత 'ఎన్టీఆర్' తొలిరోజు ఈ రేంజ్ కలెక్షన్లను సాధించడం విశేషం. 'జనతా గ్యారేజ్' ఫస్ట్ వీక్ లో ఈజీగా రూ. 50కోట్లను కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే స్పీడ్ ని కంటిన్యూ చేస్తే ఈ చిత్రం లాంగ్ రన్ లో అవలీలగా 100కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని భావిస్తున్నారు. చాలా కాలం తరువాత బిగ్ సక్సెస్ దక్కడంతో 'ఎన్టీఆర్' ఈ సక్సెస్ సంబరాలను జరపడానికి 'ఎన్టీఆర్' ఏర్పాటు చేస్తున్నాడట.

15:07 - September 4, 2016

దసరా సీజన్ లో బాక్సాఫీసు వద్ద పెద్దగా పోటీ లేదనుకున్నారంతా, కానీ ఇప్పుడు ఏకంగా నాలుగు క్రేజీ సినిమాలు దసరాను టార్గెట్ చేశాయి. దసరాకు మెగా వారసుడి ఒక్కడే 'రచ్చ' చేస్తాడనుకుంటే ఇప్పుడు 'చెర్రీ'కి పోటీగా మరో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. గతేడాది 'దసరా'కు 'బ్రూస్ లీ', 'అఖిల్' సినిమాలు దున్నేస్తాయి అనుకుంటే రెండూ కూడా బొక్కబోర్లా పడ్డాయి. ఇప్పుడు 'రామ్ చరణ్' మరోసారి దసరాను టార్గెట్ చేశాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ధృవ'తో 'చెర్రీ' అక్టోబర్ 7రావడానికి సిద్దమవుతున్నాడు. అయితే ఇప్పుడు అనుహ్యంగా 'చెర్రీ'కి పోటీగా మరో మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

నాగ చైతన్య..కళ్యాణ్ రామ్..తమన్నా..
లేటేస్ట్ గా 'నాగ చైతన్య' కూడా దసరాకు తన ఎంట్రీని ఖరారు చేశాడు. చందు మొండేటి దర్శకత్వంలో 'చైతూ', 'శృతిహాసన్' జోడిగా నటిస్తున్న 'ప్రేమమ్' దసరా బరీలో నిలువనుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరగుతున్నాయి. అలాగే 'కళ్యాణ్ రామ్', 'తమన్నా'లు కూడా తమ సినిమాలతో దసరా కలెక్షన్లపై కన్నేసినట్లు సమాచారం.
'కళ్యాణ్ రామ్' తో 'పూరి జగన్నాథ్' తీస్తున్న 'ఇజం' మూవీ కూడా దసరా క్యూ లైన్ లోకి వచ్చేసింది. ఇకపోతే మిల్కీ బ్యూటి 'తమన్నా' 'అభినేత్రి' సినిమాను కూడా అప్పుడే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దసరా పెద్ద హాలిడే సీజన్ కాబట్టి పండుగ కలెక్షన్లను క్యాష్ చేసుకోవాలని చాలా మంది హీరోలు భావిస్తున్నారు. మరిసారైనా దసరా సీజన్ మన హీరోలకు కలిసొస్తుందో చూడాలి.

15:03 - September 4, 2016

'అనుష్క' స్టార్ హీరోల రేంజ్ కి వెళ్లింది. అంతేకాదు నిర్మాతలు ఆమెపై ఎంత బడ్జెట్ పెట్టడానికైనా జంకడం లేదు. ఇందుకు ఆమె కొత్త సినిమా 'భాగమతి'నే బెస్ట్ ఎగ్జాంపుల్. 'అనుష్క'ను నమ్ముకునే ఈ సినిమాపై కోట్లు కుమ్మరిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ 'అనుష్క' 'భాగమతి' బడ్జెట్ విశేషాలేంటీ ? 'అరుంధతి', 'రుద్రమదేవి' సినిమాలతో 'అనుష్క' రేంజ్ మారిపోయింది. నిర్మాతలు ఈ భామను నమ్ముకుని సినిమాలు చేసే స్థాయికి చేరుకుంది. ఓ పక్కా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తునే మరో పక్కా లేడి ఓరియెంటెడ్ మూవీస్ తో అదరగొట్టుతోంది. ఈ క్రమంలో ఆమె కొత్త సినిమా 'భాగమతి'కి సంబంధించిన ఫీల్మ్ నగర్ లో ఓ సన్సేషనల్ న్యూస్ వినిపిస్తోంది. 'అనుష్క' న్యూ ప్రాజెక్ట్ 'భాగమతి' కోసం అన్నపూర్ణ స్టూడియోలో మూడు కోట్లతో ఓ సెట్ రెడీ చేస్తున్నట్టు టాక్.

అనుష్కకు జోడీగా..
నైజాం కల్చర్‌నే కాకుండా, తమిళ సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని ఈ సెట్ ని డిజైన్ చేస్తున్నారట. ఈ చిత్రం హిస్టరీ మూవీ కాదన్న యూనిట్ ఇప్పుడు ఈ సెట్ ఎందుకు వేస్తుందనేది ఆడియన్స్ కి అర్ధం కావడం లేదు. 'భాగమతి'లో 'అనుష్క'కు జోడీగా 'ఆది పినిశెట్టి' నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వీలైతే ఈ ఎడాది లాస్ట్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు 'అనుష్క' 'బాహుబలి 2', 'సింగం 3' లో నటిస్తోంది. అలాగే 'నాగార్జున'' ఓం నమో వెంకటేశాయ' చిత్రంలో కూడా కీ రోల్ ప్లే చేస్తోంది. 

15:00 - September 4, 2016

'నాగార్జున' తన వారసుల అప్ కమింగ్ ఫీల్మ్స్ పై క్లారిటి ఇచ్చాడు. తన సూపర్ హిట్టు డైరెక్టర్స్ తో అక్కినేని యంగ్ బాయ్స్ నెక్ట్స్ మూవీస్ ఉంటాయని నాగ్ అఫిషియల్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీంతో తన వారసుల కొత్త సినిమాల విషయంలో వినిపిస్తున్న గాసిప్స్ కి నాగ్ చెక్ పెట్టాడు. 'నాగర్జున', 'నాగచైతన్య', 'అఖిల్' ల కొత్త సినిమాలకు సంబంధించిన సన్పెన్స్ పై క్లారిటి ఇచ్చాడు. ముఖ్యంగా 'అఖిల్ ' రెండో సినిమాకి సంబంధించి డైరెక్టర్ విషయంలో కొంతకాలంగా రకరకాలు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వాటికి 'నాగ్' అఫిషియల్ స్టేట్ మెంట్ తో ఎండ్ కార్డ్ వేశాడు. ఇక 'అఖిల్' మూవీ సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అనే విషయాన్ని కాన్పామ్ చేశాడు.

అఖిల్ రెండో మూవీ...
'అఖిల్' సెకెండ్ మూవీకి సంబంధించి 'వంశీ పైడిపల్లి' నుంచి 'హను రాఘవపూడి' వరకు చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే లేటేస్ట్ 'నాగ్' నా ఇద్దరి సూపర్ హిట్టు దర్శకులతో తన వారసుల సినిమాలు ఉండబోతున్నాయని అనౌన్స్ చేశాడు. 'సోగ్గాడే చిన్నినాయనా' ఫేం 'కళ్యాణ్ కృష్ణ' డైరక్షన్ 'నాగచైతన్య' సినిమా ఉంటుందని, అలాగే 'మనం' ఫేం విక్రమ్ 'కుమార్' డైరక్షన్ లో 'అఖిల్' సినిమా ఉంటుందని క్లారిటి ఇచ్చాడు. 'నాగార్జున' స్టేట్ మెంట్ తో 'అఖిల్' కొత్త సినిమా విషయంలో సన్పెన్స్ కి తెరపడినట్లే. ఇక ఈ అక్కినేని యంగ్ హీరోల సినిమాలకు సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం. ప్రస్తుతం 'ఓం నమో వెంకటేశా' షూటింగ్ లో 'నాగ్' బిజీగా ఉన్నాడు. ఇక 'నాగచైతన్య' 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా రిలీజ్ తో పాటు 'ప్రేమమ్' రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. సో ఒక్క స్టేట్ మెంట్ తో 'నాగ్' అన్ని గాసిప్స్ కి చెక్ పెట్టేశాడు. 

జగన్ ఓర్వలేకపోతున్నారు - బొజ్జల..

హైదరాబాద్ : రాయలసీమకు మేలు జరుగుతుంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్ ఓర్వలేకపోతున్నారని టీడీపీ నేత బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి విమర్శించారు. 

ప్రజలంతా బాబు వైపే - రావెల..

హైదరాబాద్ : ఏపీ ప్రజలంతా చంద్రబాబు వెంటే ఉన్నారని మంత్రి రావెల కిశోర్ బాబు పేర్కొన్నారు. ఏపీ ప్రతిపక్షనేత జగన్‌‌‌పై మంత్రి రావెల విమర్శలు గుప్పించారు. 

14:42 - September 4, 2016
14:41 - September 4, 2016
14:37 - September 4, 2016

హైదరాబాద్ : రాయలసీమ కరవును ప్రతిపక్ష నేత జగన్‌ రాజకీయం చేస్తున్నారని టీడీపీ విమర్శించింది. కరవు నివారణ చర్యలపై నిర్మాణాత్మక సలహాలు ఇవ్వకుండా కలెక్టరేట్ల దగ్గర జగన్‌ ధర్నాలు చేయడాన్ని పార్టీ తప్పుపట్టింది. రెయిన్‌ గన్ల సహాయంలో వేరుసెనగకు నీరు అందిస్తున్న విషయాన్ని ప్రతిపక్ష నేత గుర్తు పెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు సూచించారు. ఆయన మనస్సు బండపారిపోయిందని..ఒక్కసారి జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.

14:34 - September 4, 2016

హైదరాబాద్ : ఇందిరాపార్క్ దీక్ష వేదికగా డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య కేసీఆర్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. శాస్త్రీయంగా జిల్లాల విభజన చేయకపోతే కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. పట్టుదలకు పోకుండా గద్వాల్‌, జనగామాను జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారు టెన్ టివితో మాట్లాడారు. ముఖ్యమంత్రి అబద్దాలు చెబుతున్నారని, అబద్ధాలు..మానుకో వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయం సేకరణ..విధి విధానాలు ప్రకటించాలని, ఎన్నికల్లో చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని పొన్నాల సూచించారు.
గద్వాల, జనగామా జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేతలు చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరింది. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌లో డికే అరుణ, పొన్నాల లక్ష్మయ్య దీక్షకు పలువురు కాంగ్రెస్ సీనియర్లు సంఘీభావం ప్రకటించారు. ప్రాంతాల మధ్య తగదాలు పెట్టడానికి సీఎం కేసీఆర్ జిల్లా విభజన చిచ్చు పెట్టారని మాజీ రాజ్యసభ సభ్యులు వీహెచ్‌ ఆరోపించారు. ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని గద్వాల్‌, జనగామాలను జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మట్టి వినాయకులను పంపిణీ చేసిన మంత్రి జగదీష్..

నల్లగొండ: సూర్యాపేటలో జరిగిన కార్యక్రమంలో మట్టి విగ్రహాలను మంత్రి జగదీష్‌రెడ్డి పంపిణీ చేశారు. 10 వేల మట్టి విగ్రహాలను స్థానికులకు ఉచితంగా అందజేశారు. 

బీజేపీతో తెగదెంపులకు సిద్ధం - మంత్రి కొల్లు..

పశ్చిమగోదావరి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధమేనని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీలతో కలిసి పోరాడుతామన్నారు. 

14:09 - September 4, 2016

మదర్ థెరిస్సాకు 'సెయింట్ హోదా'..

వాటికన్ సిటీ : మదర్ థెరిస్సాకు 'సెయింట్ హోదా' కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. 

14:07 - September 4, 2016

తెలంగాణలో ఎందరో యువకవులున్నారు. సమాజంలోని అనేకానేక సమస్యలను చూసి స్పందించి కవిత్వం రాస్తున్నారు. అలాంటి వారిలో వరంగల్ కు చెందిన బిల్ల మహేందర్ ఒకరు. పోరుగానం , పిడికిలి, గెలుపు చిరునామా , కొన్ని ప్రశ్నలు , కొన్ని జ్ఞాపకాలు లాంటి కవితా సంకలనాలను ఆయన  వెలువరించాడు. అభ్యుదయకవి బిల్ల మహేందర్ పరిచయ కథనం ఇప్పుడు చూద్దాం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:06 - September 4, 2016

సాహిత్యం మానవసమూహాలను కదిలిస్తుంది. ఆలోచింప చేస్తుంది. ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోస్తుంది. సామాజిక పరిణామాలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంది. ఎందరో సృజనకారులు తమ రచనలచేత ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. అలాంటి వారిలో అభ్యుదయ కవి బిల్ల మహేందర్ పరిచయ కథనంతో పాటు కస్తాల వెంకన్న జనం పాట, వివిధ సాహితీ వేదికల వేడుకల సమాహారంగా ఈ వారం మీముందుకొచ్చింది 10 టి.వి.అక్షరం.

పాట మనిషిని కదిలిస్తుంది. మనసుకు ఊరట నిస్తుంది.  ప్రజాసమూహాలను  చైతన్యబాట లో నడిపిస్తుంది. పాటకు అంతటి శక్తి ఉంది. అలాంటి పాటలు రాసిన ప్రజాకవి కస్తాల వెంకన్న. అక్షరాలను జ్వలిత రాగాలుగా వెలుగు దీపాలుగా మార్చి ప్రజలకు చైతన్య బాటచూపిన గేయకవి ఆయన. కస్తాల వెంకన్నను పరిచయం చేస్తున్నారు ప్రముఖ గేయకవి స్ఫూర్తి నేటి జనం పాటలో..

కొత్త విధానాలతో పంటలు కాపాడుతున్న బాబు - కాల్వ..

హైదరాబాద్ : వర్షాభావ పరిస్థితుల్లో ఎండిపోతున్న పంటలను కొత్త విధానాలతో పంటలను కాపాడుతున్నారని ఏపీ ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రెయిన్ గన్స్ తో నీళ్లు అందించే ప్రయత్నం చేస్తున్నారని, జగన్ రాయలసీమలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా జగన్ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. 

జగన్ వ్యాఖ్యలు అభ్యంతకరం - కోన రవి..

హైదరాబాద్ : న్యాయస్థానాలపై జగన్ వ్యాఖ్యలు అభ్యంతకరమని కోన రవి వ్యాఖ్యానించారు. కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలుగా భావిస్తున్నామని, న్యాయ నిపుణులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. 

ఎంపీ కవితపై మందకృష్ణ మాదిగ విమర్శలు..

హైదరాబాద్ : ఎంపీ కవిత అధికార పొగరుతో మాట్లాడుతున్నారని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే కొత్త జిల్లాలను వాడుకుంటున్నారని, ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేసీఆర్ నిజాం రాజులా వ్యవహరిస్తున్నారని, శాస్త్రీయంగా జిల్లాల విభజన జరగాలన్నారు. 

13:55 - September 4, 2016

ఒకప్పటి కంబైన్డ్ స్టేట్ క్యాపిటల్ 'కర్నూలు'. రాష్ట్ర విభజన అనంతరం 'అమారవతి' రాజధానిగా మారిన నేపథ్యంలో ఈ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పోకడలు ఎలా ఉన్నాయి ? తుంగభద్రత నదీ తీరాన వెలిసిన 'కందెనవోలు'. నేటి 'కర్నూలు'. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అక్టోబర్ 1. 1953 నుండి 31 అక్టోబర్ 1956 వరకు రాజధానిగా ఉన్న నగరం. రాయలసీమ ప్రాంతానికి ఆహ్వాన తోరణం. బిజినెస్, ఎడ్యుకేషన్..ఎంప్లాయిమెంట్ కు స్కోప్ ఉన్న ఈ కర్నూలు నగరానికి ఇతర జిల్లాలు..కర్నూలు సమీపంలో నుండి వచ్చి ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. రాయలసీమ యూనివర్సిటీ..పుల్లా రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలు..తదితర కాలేజీలున్నాయి. మరి కర్నూలులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉందో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:54 - September 4, 2016

దేశంలో అడపిల్లలు తగ్గిపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. అబ్బాయిలతో పోల్చితే బాలికల సంఖ్య తక్కువవుతుంది. ఇది రాబోయే కాలంలో ఆందోళన కలిగించే విషయమే. బాలిక జనాభా తగ్గడానికి ప్రధాన కారణం సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షతే. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు కొందరు ప్రవర్తిస్తుండడం ఎన్నో ఘోరాలకు కారణమవుతోంది. కడుపులో పెరిగేది ఆడబిడ్డ అని తెలిసిన వెంటనే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. ఇక లోకం చూడకముందే పుట్టిన బిడ్డను ముళ్లపొదళ్లో పడేస్తున్నారు. అవసరమైతే బిడ్డ తల్లులను చంపేందుకు వెనుకాడడం లేదు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కూడా కడుపులో ఆడబిడ్డనే పెరుగుతుందని భూత వైద్యుడు చెప్పినమాటలతో, మూఢత్వంతో ఆత్త, ఆడపడచులు చేసిన ఘోరం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ఇది కథకాదు... ఏ రియల్ స్టోరీ.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:52 - September 4, 2016

నెల్లూరు : అణువిద్యుత్...ఈ పదం వింటేనే స్మశానాలను తలపించిన జపాన్‌ పుకుషిమా, రష్యా చెర్నోబిల్‌ ఘటనలు గుర్తొస్తాయి. విధ్వంసకర ప్రమాదాలు కళ్ల ముందు మెదలుతాయి. అంతటి భయానక పరిస్థితులను సృష్టించే అణువిద్యుత్‌ కేంద్రాలే ఇప్పుడు నెల్లూరు జిల్లా వాసులను కలవరపెడుతున్నాయి. అణవిద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్థానికుల్లో ఆగ్రహాన్ని, అంతకు మించి ఆందోళనను కలిగిస్తోంది. భవిష్యత్‌లో ఎలాంటి విధ్వంసాలను చూడాల్సి వస్తుందోనని అణువిద్యుత్‌ కేంద్రాన్ని అడ్డుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. 
అణు రియాక్టర్‌ పేలితే విధ్వంసం 
గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్న అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు ...అణు రియాక్టర్‌ పేలితే సంభవించే విధ్వంసం అంతా ఇంతా కాదు... ఒక్క అణువిద్యుత్‌ కేంద్రం భారీ ఆటంబాంబుతో సమానం. పరమాణువు విచ్ఛిన్నం వల్ల వచ్చే వేడి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తే అణువిద్యుత్. ఈ అణువిద్యుత్‌ను తయారు చేసే కేంద్రాలే అణువిద్యుత్‌ కేంద్రాలు.  ప్రపంచంలో తొలిసారిగా 1954లో నాటి సోవియట్ రష్యా ఒబ్నింస్క్ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఉత్పత్తయ్యే విద్యుత్ ఉత్పాదనలో 14% అణు విద్యుత్‌దే. అందులో అమెరికా, ఫ్రాన్స్, జపాన్‌లదే 50 శాతం వాటా ఉంటుంది. ఇక మన దేశంలో మొత్తం 16 అణు రియాక్టర్లు, ముంబై, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, యూపీ, గుజరాత్ లలో అణు విద్యుత్‌ కేంద్రాలున్నాయి.  
అణువిద్యుత్ భారీ ఆటంబాంబుతో సమానం 
అణువిద్యుత్ కేంద్రమనేది భారీ ఆటంబాంబుతో సమానం. దీని వల్ల ఒనగూరే లాభాలకంటే నష్టాలే ఎక్కువ. అణురియాక్టర్లు పేలడం కానీ, లేదా లీకవడం కాని జరిగితే సంభవించే ప్రమాదం భయంకరంగా ఉంటుంది. ఊహించని ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  రష్యాలో చెర్నోబిల్ , జపాన్ లోని ఫుకుషిమా లో జరిగిన ప్రమాదాలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు.  
కావలి పరిసర ప్రాంతాల్లో అణువిద్యుత్ కేంద్రం
ఇంతటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెల్లూరు జిల్లాలోని కావలి పరిసర ప్రాంతాల్లో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించడం గమనార్హం. 2031 నాటికి 30,000 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఈ మెగా న్యూక్లియర్ పవర్ ప్లాంటును ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి భూసేకరణ కూడా చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వాసుల్లో భయాందోళన నెలకొంది. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే దీని ప్రభావం సుమారు 170 కి.మీ వరకు ఉంటుందనేది నిపుణులు చెపుతున్న మాట. అంటే నెల్లూరు జిల్లాతోపాటు పక్కనున్న ప్రకాశం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది.   అందుకే అణువిద్యుత్‌ కేంద్రం అంటేనే ఇప్పుడు నెల్లూరు జిల్లా వాసులు హడలిపోతున్నారు.  
కొత్తగా అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి 
ఇంతటి ఘోర ప్రమాదాలు కళ్ల ముందు మెదలుతున్నా మన కేంద్ర ప్రభుత్వం మాత్రం కొత్తగా అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటుపై దృష్టి సారించింది. ఇప్పటికే ముంబై, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో అణువిద్యుత్ కేంద్రాలుండగా, ఇపుడు ఏపీలోని నెల్లూరు జిల్లాలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. నెల్లూరు జిల్లా సముద్ర తీరప్రాంతం కావడం, భూకంప పరిస్థితులు లేకపోవడం, పొరుగు జిల్లా అయిన కడపలో భారీగా యురేనియం నిల్వలుండడంతో ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని  నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
అణువిద్యుత్ కేంద్రంపై నిరసన గళం 
భవిష్యత్ లో ఎలాంటి ఘోరాన్ని చవిచూడాల్సి వస్తుందోనన్న భయాందోళనతో స్థానిక ప్రజలు అణువిద్యుత్ కేంద్రంపై నిరసన గళం వినిపిస్తున్నారు. 169 కిలోమీటర్లున్న సముద్రతీర ప్రాంతంలోని మత్స్య సంపద పూర్తిగా నాశనమవుతుందని, ప్రమాదకరమైన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విశాఖ ప్రాంతంలో కేవలం యురేనియం నిల్వల తవ్వకాల వల్లే అనేక మంది పిల్లలు అంగవైకల్యంతో, మరగుజ్జుతనంతో పుడుతున్నారని,  నెల్లూరు జిల్లాలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుచేసి యురేనియంను మండిస్తే దాని ద్వారా వచ్చే రేడియేషన్, పొల్యూషన్ తీవ్ర ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  
వాతావరణానికీ, జనాలకీ ముప్పు...
గ్రీన్‌పీస్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు అణుశక్తి పెను భారమనీ, వాతావరణానికీ, జనాలకీ ముప్పేనని అంటున్నాయి. ఇతర రకాల ప్రమాదాలతో పోలిస్తే, అణు కేంద్రాల్లో ప్రమాదాలు చాలా భయంకరమైన పరిణామాలకు దారితీస్తాయంటున్నా..మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం ఏమీ పట్టడం లేదు. నెల్లూరు జిల్లాలో అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం తలపెడితే  మాత్రం ఉద్యమం తప్పదంటున్నారు జిల్లా ప్రజలు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ, తమిళనాడు కూడంకుళం ప్రాంతాల్లో అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఎదురైన నిరసనలు, ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.  
అణువిద్యుత్ కేంద్రాల వైపు చూస్తున్న పాలకులు 
ఒక పక్క ప్రపంచంలోని అనేక దేశాలు అణువిద్యుత్ కేంద్రాల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని గ్రహించి వాటిని పక్కనపెడుతుంటే..మన పాలకులు మాత్రం అణువిద్యుత్ కేంద్రాల వైపే చూడటమనేది పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. పాలకులు పచ్చనోట్లకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజల ప్రాణాలకు ఇస్తున్నట్లు కనపడడంలేదు. అంటే ఆదాయాలు పాలకులకు  ప్రాణాపాయాలు ప్రజలకు..అన్నది స్పష్టంగా అర్ధమవుతోంది. ఇప్పటికైనా పాలకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుపై మరోసారి పునరాలోచించాల్సిన అవసరం ఉంది.     

 

13:47 - September 4, 2016

హైదరాబాద్ : గద్వాల, జనగామా జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేతలు చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరింది. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌లో డికే అరుణ, పొన్నాల లక్ష్మయ్య దీక్షకు పలువురు కాంగ్రెస్ సీనియర్లు సంఘీభావం ప్రకటించారు. ప్రాంతాల మధ్య తగదాలు పెట్టడానికి సీఎం కేసీఆర్ జిల్లా విభజన చిచ్చు పెట్టారని మాజీ రాజ్యసభ సభ్యులు వీహెచ్‌ ఆరోపించారు. ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని గద్వాల్‌, జనగామాలను జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

 

13:46 - September 4, 2016

తెలుగు రాష్ట్రాల్లోని రియల్ ఎస్టేట్, నిర్మాణ సంగతులు..వాటి విశేషాలు తెలియచేసేదే టెన్ టివి 'రైట్ ప్రాపర్టీ'...గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో నిర్మాణ రంగం తీరుతెన్నులు మారుతున్నాయి. రెసిడెన్షియల్..కమర్షియల్, హై రేంజ్ బిల్డింగ్స్...ఇలాంటి నిర్మాణాలు ఊపందుకున్నాయి.
నగరంలో జనాభా పెరుగుతూనే ఉంది. విద్య..ఉద్యోగ..ఉపాధి అవసరాల కోసం నగరానికి చేరుకుంటున్న జనం నివసించడానికి ఇల్లు కావాలి. ఈ నేపథ్యంలో నగరంలో నిర్మాణం రంగం ఊపందుకొంటోంది. అతి తక్కువ సమయంలో వీటిని నిర్మిస్తున్నారు. బాలానగర్, ఏఎస్ రావ్ నగర్, బోడుప్పల్, గచ్చిబౌలి, నాగోల్ తదితర ప్రాంతాల్లో 'ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్' హౌసింగ్ కోనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అంశం గురించి..హౌసింగ్ రెంట్స్..ఇతరత్రా సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

జిల్లాల విభజనపై ప్రతిపక్షాల సూచనలు పాటించని ప్రభుత్వం : రేవంత్

హైదరాబాద్ : జిల్లాల విభజన అంశంలో టీసర్కార్ ప్రతిపక్షాల సూచనలు పాటించడం లేదని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం హడావుడిగా చేసే జిల్లాల విభజన నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. జనాభా ప్రాతిపదిక సహేతుకంగా లేదన్నారు. వరంగల్, హన్మకొండ జంట నగరాలను విడగొట్టారని పేర్కొన్నారు. 

13:39 - September 4, 2016

హైదరాబాద్ : రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాల పునర్విభజన చేస్తున్నారని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లుగా జిల్లాలను విడగొడుతున్నారని మండిపడ్డారు. జిల్లాల ఏర్పాటు ముసాయిదా లోపభూయిష్టంగా ఉందన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలేవి నెరవేర్చలేదని విమర్శించారు.

13:23 - September 4, 2016

కృష్ణా : విజయవాడ ఎన్ టిఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మెడికల్‌ కౌన్సెలింగ్‌ రసాభాసగా మారింది. B కేటగిరి సీట్ల భర్తీలో  గోల్‌మాల్‌ వ్యవహారాలు జరగుతున్నాయని ఆరోపిస్తూ...  విద్యార్థులు, వీరి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్వంత రాష్ట్రానికి చెందిన వారికి  సీట్లు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల వారికి అమ్ముకుంటున్నారని  ఆరోపిస్తూ ధర్నా చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:20 - September 4, 2016

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తినే ఆహారం ఏంటీ ? ఠక్కున అన్నం అంటారు. అవును మన ప్రాంతంలో ప్రధాన ఆహార పంట. కానీ ప్రస్తుతం తెల్లగా రెండు..మూడరుసార్లు పాలిష్ చేసిన అన్నం తింటున్నారం. పోషకాలన్నీ పాలిష్ లో వెళ్లిపోయి రోగాలు మాత్రం మనకు మిగులుతున్నాయి. అందుకే 'బ్రౌన్' రైస్ బెస్ట్ అంటున్నారు వైద్యులు. బ్రౌన్ రైస్ అంటే దంపుడు బియ్యం అని అర్థం. మరి ఈ రైస్ తినడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో చూద్దామా...

  • బ్రౌన్ రైస్ శరీరంలో షుగర్ తగ్గిస్తుంది. ఒక కప్పు బ్రౌన్ రైస్ లో దాదాపు 21 శాతం మెగ్నీషియం దొరుకుతుంది.
  • బియ్యంలో పెద్ద మొత్తంలో ఉన్న పీచు జీర్ణవాహికలో క్యాన్సర్ రసాయనాలను బయటకు పంపుతుంది.
  • వైట్ రైస్ వారానికి ఐదుసార్లన్నా తినేవారిలో 17 శాతం షుగర్ వస్తుందట. అల్సర్స్ తగ్గిపోతాయి.
  • ఉబ్బసంతో బాధపడే వారిలో దాని తీవ్రతను తగ్గిస్తుంది. బ్రౌన్ రైస్ లోని సెలీనియం కూడా ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.
  • విటమిన్ బి కాంప్లెక్సు ఎక్కువ. థైమిన్, రైబోప్లేవిన్, సయనకోబాలమిన్ అనే విటమిన్లు వుంటాయి. ఇవి నరాల శక్తి పెరుగుదలనిస్తాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
  • బ్రౌన్‌రైస్‌ ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు కూడా ఎల్‌ డి ఎల్‌ కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు రక్తంలో చెక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
  • వయసు మళ్ళిన మహిళలపై జరిపిన అధ్యయనంలో బ్రౌన్‌ రైస్‌ వంటి ధాన్యాహారాన్ని తినడం వలన ఎంటరోల్యాక్టోన్‌ స్థాయిని పెంచుతుందని తెలుస్తుంది.
13:18 - September 4, 2016
12:58 - September 4, 2016

కాకినాడ : ప్రత్యేక హోదా కోసం.. పవన్‌ పోరాటానికి వేదిక ఖరారైంది. కాకినాడలో హోదా పోరుసభను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లక్ష్యాన్ని సాధించేవరకూ పవన్‌ పోరాడతారా..? తన ప్రశ్నలతో ప్రభుత్వాలను ఇరుకున పెడతారా..? లేక సభలో మొక్కుబడిగా ఓ నాలుగు ప్రశ్నాస్త్రాలు సంధించి.. షూటింగ్‌లకు వెళ్లిపోతారా..? ఇప్పుడు పవన్‌ అభిమానులందరినీ వేధిస్తున్న ప్రశ్నలివి..!
ఆయన స్టైలే సెపరేటు 
పవన్‌ కల్యాణ్‌..! ఈ పేరంటేనే యూత్‌ ఉర్రూతలూగిపోతుంది. పవన్‌ మాటల్లోని పంచ్‌లు.. ఏలికలపై సంధించే ప్రశ్నాస్త్రాలంటే.. అభిమానులకు అంతులేని క్రేజ్‌. కానీ పవన్‌ను అభిమానించే వారిలో చాలామందికి ఆయన తీరే అంతబట్టదన్న వాదన వుంది. పవన్‌ కల్యాణ్‌ ఒకరు చెబితే వినరు. అనుకున్నదే చేస్తారు. సినిమా అయినా.. రాజకీయమైనా.. ఆఖరికి వ్యక్తిగత జీవితమే అయినా. ఏదైనా ఆయన స్టైలే సెపరేటు. ఇదే ధోరణితో... ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు అంటూ.. 2014 ఎన్నికలకు ముందు.. ఆయన జనసేన పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి వేళ్లపై చెప్పుకోదగ్గ సందర్భాల్లో మాత్రమే ఆయన ప్రశ్నాస్త్రాలు సంధిస్తూ వచ్చారు. నిజానికి షూటింగ్‌ల విరామంలో రావడం.. ప్రభుత్వాలపై ఓ నాలుగు ప్రశ్నాస్త్రాలను సంధించడం.. పవన్‌ శైలిగా మారిందన్న వాదనా లేకపోలేదు. పైగా పాలక పక్షంపై తనదైన శైలిలో నిలదీయడం లేదన్నది ఆయన అభిమానుల నోట వినిపిస్తోన్న మాట. 
విమర్శలపై స్పందించేందుకూ గ్యాప్‌ తీసుకుంటున్న పవన్‌  
పవన్‌ జూలు విదిల్చి ఏలికలపై విమర్శలు గుప్పించిన వెంటనే.. వారి నుంచి ప్రతి విమర్శలు వస్తున్నా.. వాటిపై స్పందించేందుకూ పవన్‌ ఎంతో గ్యాప్‌ తీసుకుంటున్నారు. అసలు తమ నాయకుడిపై విమర్శలను తిప్పికొట్టే యంత్రాంగమే జనసేనకు లేకపోవడం పెద్ద లోపమనే చెప్పాలి. పవన్‌ కల్యాణ్‌... జనసేన పార్టీని ప్రారంభించి రెండున్నరేళ్లు దాటిపోయింది. ఇంతవరకూ పార్టీకి కేడర్‌నూ ఏర్పాటు చేసుకోలేదు. ఆఖరుకు ఆ పార్టీకి సొంతంగా ఒక కార్యాలయమూ లేదు. ఆపార్టీకి అభిమానులే తప్ప కార్యకర్తలు లేరు. దీంతో ఆ పార్టీ తరఫున ఏమి మాట్లాడాలన్న పవన్‌ ఒక్కడే. రాష్ట్రంలో ఏమి జరిగినా తనకు ఇష్టమైనప్పుడే ఆయన స్పందిస్తారు. ఓ సారి ప్రశ్నించాక మరో ప్రశ్నకు చాలా టైమే తీసుకుంటారన్నది అభిమానుల ఆవేదన. 
హడావుడిగానే పవన్‌ నిర్ణయాలు : విశ్లేషకులు 
పవన్‌ కల్యాణ్‌ నిర్ణయాలూ... హడావుడిగానే ఉంటాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. హత్యకు గురైన తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించేందుకు తిరుపతి వెళ్లిన పవన్‌.. అక్కడే ప్రత్యేక హోదాపై మాట్లాడేందుకు సభను ఏర్పాటు చేయడాన్ని విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. తిరుపతి సభలో పవన్‌ కల్యాణ్‌.. తనకు కులాల మురికిని అంటించే ప్రయత్నాన్నీ ప్రశ్నించారు. అయితే ఎంత కాదన్నా.. ఆయన అభిమానుల్లో అత్యధికులు కాపులే. వీరు ఎక్కడ సమావేశమైనా రాష్ట్రంలో తామే రాజకీయ ప్రత్యామ్నాయమని.. అన్నయ్యతో కానిది.. తమ్ముడితో సాధిస్తామని మాట్లాడుకుంటున్నారన్నదీ నిజం. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా ఎన్నికల్లో గెలుచుకున్న కొన్ని అసెంబ్లీ స్థానాలు కూడా.. కాపుల ప్రభావం ఉన్నవే కావడం గమనార్హం. ప్రజారాజ్యం పార్టీని కాపులు విపరీతంగా ప్రమోట్‌ చేయడం వల్ల.. అప్పట్లో ఇతర వర్గాలు ఆపార్టీకి దూరమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు పవన్‌ కూడా ఇదే పరిస్థితుల్లో కొన్ని వర్గాలకు దూరమవుతున్నాడని అంటున్నారు. 
పవన్ అకూలంగా కొందరు బీసీ నేతలు 
రాష్ట్రంలో కమ్మ, రెడ్డి కులస్తులు రాజకీయంగా పవన్‌ను.. ఆయన స్థాపించిన జనసేనను వ్యతిరేకించినా.. కొందరు బీసీ నేతలు ఆయనకు అనుకూలంగా ఉండడం కలిసొచ్చే అంశమంటున్నారు విశ్లేషకులు. అయితే దీన్ని పవన్‌ ఎంతవరకూ క్యాష్‌ చేసుకుంటాడో అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. 
పవన్‌ ఆ నిర్ణయంపై వ్యతిరేకత 
సినిమాల్లో నటిస్తూనే, రాజకీయాలను కొనసాగించాలన్న పవన్‌ నిర్ణయంపై వ్యతిరేకత వస్తోంది. ఇది సత్ఫలితాలు ఇవ్వదన్న భావన వ్యక్తమవుతోంది. చంద్రబాబు, జగన్‌ లాంటి ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్స్‌ని తట్టుకోవాలంటే పవన్‌ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోక తప్పదంటున్నారు. జనసేన రాజకీయ పార్టీనా ? లేక సంస్థనా ? అన్నది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉందని సీనియర్ జర్నలిస్ట్ లు అంటున్నారు. 
కాకినాడ వేదికగా పవన్‌ సమాధానమిస్తారా...?
మోదీని, చంద్రబాబులను ఓసారి పొగుడుతూ... మరోసారి తిడుతూ సాగిన ప్రసంగాన్ని ఎలా స్వీకరించాలో అర్థం కావడం లేదని అంటున్నారు అభిమానులు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. ఎన్నో రంగాల కార్మికులు, ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. పవన్‌ ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు కాకినాడ వేదికగా ఉద్యమాన్ని కొనసాగిస్తానంటున్న పవన్‌ను ఎలా నమ్మాలి..? కాకినాడ సభ తర్వాత మళ్లీ సినిమా షూటింగ్‌కే పరిమితమైతే ఎలా..? ఇప్పుడు అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలివి. వీటికి కాకినాడ వేదికగా పవన్‌ సమాధానమిస్తారా..? వేచి చూడాలి. 

 

12:50 - September 4, 2016

కృష్ణా : జిల్లాలో మహిళా ఉద్యమ నిర్మాత నాగెళ్ల రాజేశ్వరమ్మ కన్నుమూశారు. దాదాపు ఏడు దశాబ్ధాల పాటు మహిళల సాధికారత కోసం రాజేశ్వరమ్మ అలుపెరగని పోరాటం చేశారు. నాటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా మహిళలను చైతన్యవంతులను చేసి వారిని ఉద్యమపథంలో నడిపించిన ధీరోదాత్తురాలు.  రాజేశ్వరమ్మ స్వస్థలం ఉయ్యూరు మండలం కాటూరు గ్రామం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరమ్మ ఈరోజు మృతి చెందారు. రాజేశ్వరమ్మ మృతికి ఐద్వా నాయకురాళ్లు రమాదేవి, స్వరూపరాణి సంతాపం తెలిపారు. 

మహిళా ఉద్యమ నిర్మాత నాగెళ్ల రాజేశ్వరమ్మ మృతి

కృష్ణా : జిల్లాలో మహిళా ఉద్యమ నిర్మాత నాగెళ్ల రాజేశ్వరమ్మ కన్నుమూశారు. దాదాపు ఏడు దశాబ్ధాల పాటు మహిళల సాధికారత కోసం రాజేశ్వరమ్మ అలుపెరగని పోరాటం చేశారు. నాటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా మహిళలను చైతన్యవంతులను చేసి వారిని ఉద్యమపథంలో నడిపించిన ధీరోదాత్తురాలు.  

12:44 - September 4, 2016

నల్లగొండ : జిల్లాలోని ఆలేరు వద్ద ప్రమాదవశాత్తు రైలు కింద పడి 10టీవీ ఉద్యోగి శ్రీనివాస్‌ మృతి చెందాడు. శ్రీనివాస్‌ 10టీవీలో గ్రాఫిక్‌ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. రాత్రి డ్యూటీ చేసుకుని ఉదయం జనగామకు వెళ్తుండగా కాలు జారి రైలు కింద పడి మృతి చెందాడు. శ్రీనివాస్‌ స్వస్థలం వరంగల్‌ జిల్లా జనగామ. శ్రీనివాస్‌కు భార్య, ఏడాది వయసున్న కుమార్తె ఉంది. కుటుంబానికి ఆధారంగా ఉన్న కుమారుడు మృతి చెందడంతో శ్రీనివాస్‌ తల్లి, భార్య, కూతురు శోకసముద్రంలో మునిగారు. శ్రీనివాస్‌ కుటుంబానికి 10టీవీ యాజమాన్యం, సిబ్బంది ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

 

రాజధాని ప్రాంతంలో అవినీతి పెరిగిందని లేఖలు

గుంటూరు : ఎపి నూతన రాజధాని గ్రామాల్లో ఆకాశ రామన్న లేఖలు కలంకలం రేపాయి. రాజధాని ప్రాంతంలో అవినీతి పెరిగిందని లేఖలలో పేర్కొన్నారు. అధికారులను అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. 

12:01 - September 4, 2016

కృష్ణా : జిల్లాలోని మచిలీపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం భూ సమీకరణకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న 28 రెవెన్యూ గ్రామాల్లో ఈ భూమిని సమీకరించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్డీవో కార్యాలయ సిబ్బంది భూ సమీకరణపై దృష్టిసారించారు.  
మరో ఏడాది నోటిఫికేషన్ గడువు పొడిగింపు 
బందరు పోర్టు భూ సేకరణ నోటిఫికేషన్ గడువు 2016 ఆగస్టు 29వ తేదీతో ముగియడంతో మరో ఏడాది నోటిఫికేషన్ గడువును పొడిగించారు. మరోవైపు మచిలీపట్నం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ -ఎంఏడీఏ ద్వారా భూసమీకరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఎంఏడీఏ పరిధిలో 28 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో 14 వేల ఎకరాలకుపైగా ప్రైవేట్ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూమి పక్కనే ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూమిని సైతం సమీకరించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతంలో ఉన్న మేకవానిపాలెం, గోపువానిపాలెం, కరగ్రహారం, మంగినపూడి, పోతేపల్లి, తపసిపూడి గ్రామాల్లో 2,282.20 ఎకరాల ప్రైవేట్ భూమిని సమీకరించాలని అధికారులు నిర్ణయించారు. ప్రైవేట్ భూమి పక్కనే ప్రభుత్వ, అసైన్డ్ భూమి ఉంటే దానిని సమీకరించాలని అధికారులు నిర్ణయించారు. మిగిలిన 22 గ్రామాల పరిధిలోని ప్రైవేట్, అసైన్డ్ భూమి 27 వేల ఎకరాల వరకు సమీకరించేందుకు రంగం సిద్ధం అవుతోంది.  
తొలుత బందరు పోర్టు నిర్మాణం జరిగే గ్రామాల్లో భూ సమీకరణ 
తొలుత బందరు పోర్టు నిర్మాణం జరిగే గ్రామాల్లో భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు భావించారు. పోర్టు నిర్మాణం కోసం 4,800 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వ, అసైన్డ్ భూమి 2,300 ఎకరాలు ఉంది. పోర్టు నిర్మాణం, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం ఒకే విడతలో భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎంత భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తారనేది గోప్యంగానే ఉంచుతున్నారు. భూసమీకరణ నోటిఫికేషన్ జారీ అయితే రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకార పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటిస్తుంది. ఈ ప్యాకేజీలు ప్రకటించిన తర్వాత ఎంత మంది రైతులు తమ అంగీకార పత్రాలను ఇస్తారనేదానిపై భూసమీకరణ ఆధారపడి ఉంటుంది. తమ భూముల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఆక్షేపణీయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
భూములను వదులుకునేందుకు సుముఖంగా లేని రైతులు  
అటు రైతులు మాత్రం తమకు జీవనాధారమైన భూములను వదులుకునేందుకు ఏ మాత్రం సుముఖంగా లేరు. పచ్చని పంటలు పండించే భూముల్ని ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం పోర్టు కడితే బంజరు భూముల్లో కట్టాలని సూచిస్తున్నారు. 
పంట పొలాలను తీసుకునే ప్రయత్నం మానుకోవాలి : రైతులు 
భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ అయితే పరిస్థితులు ఎలా మారుతాయే భవిష్యత్‌ నిర్ణయించాలి. ఓవైపు రైతులు భూములిచ్చేది లేదంటుంటే.. మరోవైపు ప్రభుత్వం భూ సమీకరణకు సన్నద్ధమవుతోంది. అన్నదాతల ఆక్రందనను అర్ధం చేసుకుని ప్రభుత్వం పచ్చని పంట పొలాలను తీసుకునే ప్రయత్నం మానుకోవాలని బందర్‌ పోర్టు సంబంధిత రైతులు కోరుతున్నారు. 

 

11:55 - September 4, 2016

నల్గొండ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరొకరు అరెస్ట్‌ అయ్యారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంకు చెందిన బాలకిషన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

11:43 - September 4, 2016

కరీంనగర్ : స్థానికులకు ఉపాధి ఆశ చూపారు. వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ విస్తరణ పేరుతో ఊళ్లకు ఊళ్లనే ఖాళీ చేయించి ఆ భూముల్ని కలుపుకొన్నారు. ప్రభావిత గ్రామాల అభివృద్ధి పేరుతో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటోంది కంపెనీ. ప్రజల ప్రాణాలకు...పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఆ కంపెనీయే బిర్లా. కరీంనగర్‌ జిల్లాలోని బసంత్‌నగర్‌ సిమెంట్‌ పరిశ్రమ వల్ల ఎన్నో గ్రామాలు శిథిలావస్థకు చేరుకుంటున్న పరిస్థితిపై 10టివి ప్రత్యేక కథనం....! 
బసంత్ నగర్ లో సిమెంట్ ఫ్యాక్టరీ
రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి సమీపంలో సున్నపురాయి గనులు ఎక్కువగా ఉండటంతో 1969లో బిర్లా యాజమాన్యం బసంత్ నగర్ లో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. అప్పట్లో స్థానికులకే ఉపాధి కల్పిస్తామని...సున్నపురాయి నిక్షేపాలున్న 360 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి కారుచౌకగా కొట్టేసింది. ఇంతవరకు బాగనే ఉన్నా... ఫ్యాక్టరీ వల్ల... బసంత్ నగర్, పాలకుర్తి, ఈసాల తక్కళ్ళపల్లి, పుట్నూరు, రామారావుపల్లి, కొత్తపల్లి, కన్నాల గ్రామాలు  సిమెంట్‌ పరిశ్రమ వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నాయి. ముఖ్యంగా కంపెనీ విడుదల చేసే వ్యర్థాలతో పాటు కాలుష్యంతో ప్రభావిత గ్రామాల్లోని ప్రజలు  అనేక రోగాల బారిన పడుతున్నారు. కంపెనీ నుంచి వచ్చే రసాయన వ్యర్థాలతో సమీప చెరువులోని చేపలు చనిపోయి మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. అవే రసాయనాలు పొలాల్లోకి వెళ్లడంతో పంటలు సరిగా పండటం లేదు.  సమపీంలోని ఏ గ్రామాన్ని కదిలించినా సిమెంట్ కర్మాగారంతో సర్వం కోల్పోతున్నామని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు 
ఫ్యాక్టరీ ప్రభావిత గ్రామాలకు ఉపాధి కల్పిస్తామన్న కంపనీ పెద్దలు ఇంత వరకు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు సరికదా... కనీసం కాంట్రాక్టు కార్మికులను కూడా సవ్యంగా చూసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికే కార్మికులను బానిసలుగా చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కనీసం తమ కష్టాలను బయటకు చెప్పుకోవాలన్న ఉన్న ఉద్యోగం ఊడుతోందన్న భయం వారిలో నెలకొందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
అనుమతులు లేకుండా సున్నపురాయి తోడివేత  
బిర్లా గ్రూపు కంపెనీగా ప్రారంభమైన బసంత్‌నగర్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ.. మైనింగ్‌ విస్తరించిన ప్రాంతం అంతా బసంత్‌నగర్‌ అటవీ శాఖ ప్రాంతంగా ఉంది. అయినా ఎలాంటి అనుమతులు లేకుండానే కావాల్సిన సున్నపురాయిని యథేచ్చగా తోడేస్తున్నారు. పేదల పట్టా భూములను సైతం మైనింగ్‌ భూముల్లో కలుపుకొన్నారన్న ఆరోపణలున్నాయి. అక్రమ మైనింగ్‌తో పాటు బ్లాస్టింగ్‌ తీవ్రతను పెంచి గ్రామాలను శిథిలావస్థలో పడేస్తున్నారన్నది సమీప గ్రామాల్లోని పరిస్థితులను బట్టి చూస్తే తెలుస్తోంది. ఇప్పటికే ఫ్యాక్టరీ ప్రభావిత గ్రామాల్లో ఇళ్లన్నీ బీటలు వారి కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయి. బసంత్‌నగర్‌, పాలకుర్తి, ఈసాల తక్కళ్లపల్లి గ్రామాలకు కూతవేటు దూరంలోనే మైనింగ్‌ బ్లాస్టింగ్‌ జరుగుతుంది. బ్లాస్టింగ్‌ కారణంగా లేచి వచ్చే పెద్ద పెద్ద రాళ్లతో సమీప గ్రామస్తుల పాలిట శాపంగా మారాయి. బ్లాస్టింగ్‌ ద్వారా వెలువడే వ్యర్థాలతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు, కంటిచూపు మందగించడం, జీర్ణకోశ వ్యాధులు తీవ్రమవుతున్నాయని బాధిత గ్రామాల ప్రజలు వాపోతున్నారు. 
మైనింగ్ బ్లాస్టింగ్‌ వల్ల తీవ్ర జల కాలుష్యం 
మైనింగ్ బ్లాస్టింగ్‌ వల్ల జల కాలుష్యం తీవ్రంగా ఉందని, కనీసం మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నా.. పట్టించుకున్న నాథుడే లేడు. సున్నపురాయి తవ్వకాలు జరిపిన ప్రదేశంలో ఏర్పడ్డ పెద్ద పెద్ద గోతుల్లో ఇసుక నింపి పర్యావరణాన్ని కాపాడాల్సింది పోయి ఆ గుంతల్లోకి వచ్చే నీటితో కేశోరాం ఫ్యాక్టరీ యాజమాన్యం రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకుంది. వర్షపు నీటిని అక్రమంగా రిజర్వాయర్లకు తరలించి అడ్డుకోవడంతో సమీప గ్రామాల ప్రజలు రాస్తోరోకోలు, నిరసనలు తెలిపారు. రిజర్వాయర్లలోని నీటిని గ్రామాలకు వదలాలని గతంలో కలెక్టర్‌ ఆదేశాలిచ్చినా... నీటిని విడుదల చేయడం లేదు. అటు ఉపాధి కోల్పోయి, ఇటు వ్యవసాయం  చేసుకోలేని పరిస్థితి ఉందంటే గ్రామస్తులకు రావడానికి కారణం సిమెంట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
ప్రభావిత గ్రామాల ప్రజలకు ఇబ్బందులు 
బసంత్‌నగర్‌ ఫ్యాక్టరీ ఆవరణలోని బ్యాంకు, పోస్టల్‌ కార్యాలయాలకు వెళదామన్నా..ఫ్యాక్టరీ నిర్వాహకులు అనుమతించడం లేదన్న ఆరోపణలున్నాయి. చీటికి మాటికీ భద్రతా కారణాలను సాకుగా చూపి ప్రభావిత గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని  సమీప గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం తమను కనీసం మనుషులుగా చూడటం లేదని...దేశ సరిహద్దుల్లో కూడా ఇలాంటి పరిస్థితులుండవని ఆవేదన చెందుతున్నారు. తమ స్థలాలను తీసుకుని తమనే అంటరానివారిగా చూస్తున్నారని ప్రభావిత గ్రామస్తులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
కేశోరాం కంపెనీ విచ్చలవిడిగా బ్లాస్టింగ్ 
కేశోరాం కంపెనీ విచ్చలవిడిగా బ్లాస్టింగ్ చేయడంతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోన్నా.. పొల్యుషన్‌ బోర్డు అధికారులు ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. సహజ వనరులకు నష్టం వాటిల్లుతున్నా మైనింగ్‌ అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న వాదనలూ ఉన్నాయి. అనేక గ్రామాలకు నష్టం వాటిల్ల జేస్తున్న కేశోరం సిమెంట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభావిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.  

11:32 - September 4, 2016
11:31 - September 4, 2016

రామ్‌, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న హైపర్ చిత్రం టీజర్ రిలీజ్ అయింది. చిత్ర నిర్మాత రామ్‌ ఆచంట ట్వీట్‌ ద్వారా టీజర్ ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాకు సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వ వహిస్తున్నాడు. 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా నాటికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. 

 

11:23 - September 4, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కానిస్టేబుళ్ల రాతపరీక్ష ఖరారైంది. అక్టోబర్‌ 23న ఫైనల్‌ పరీక్ష నిర్వహించబోతున్నారు. ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 4లక్షల 93వేలమంది హాజరుకాగా... లక్షా 92వేలమంది అర్హత సాధించారు. వీరందరికీ ఫిజికల్‌ టెస్ట్‌ నిర్వహించగా 80వేలమంది క్వాలిఫై అయ్యారు. ఫైనల్‌ పరీక్షలో మార్కుల ఆధారంగా 9వేల 281 పోస్టులు భర్తీ చేయనున్నారు. సివిల్‌ నియామకాల్లో 33శాతం రిజర్వేషన్‌ కల్పించారు. 

 

11:21 - September 4, 2016

హైదరాబాద్‌ : ఈస్ట్‌ మేడిపల్లి పీఎస్‌ పరిధిలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. మల్కాజిగిరి డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 250 మంది పోలీసులు.. ఇందిరానగర్‌, దేవేంద్రనగర్‌, వీరారెడ్డినగర్‌లో తనిఖీలు నిర్వహించారు. 36 బైక్‌లు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరిని పాత నేరస్తులుగా గుర్తించారు. 

 

రైలు కిందపడి వ్యక్తి మృతి

నల్గొండ : ఆలేరు రైల్వే స్టేషన్ లో ప్రమాదవశాత్తు రైలు కిందపడి బి.శ్రీనివాస్ మృతి చెందాడు. 10 టీవీలో అతను గ్రాఫిక్స్ డిజైనర్ గా పని చేస్తున్నారు. 

శ్రీనగర్ లో అఖిలపక్ష బృందం పర్యటన

జమ్మూకశ్మీర్ : శ్రీనగర్ లో రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష బృందం పర్యటిస్తుంది. జమ్మూకాశ్మీర్ లో గత రెండు నెలలుగా జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో అఖిలపక్ష బృందం పర్యటిస్తుంది. కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబెట్టేందుకు అఖిలపక్షం యత్నిస్తుంది. అల్లర్లలో గాయపడిన బాధితులను నేతలు పరామర్శించనున్నారు. 

ఎన్ టిఆర్ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా

విజయవాడ : ఎన్ టిఆర్ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు సీట్లు కేటాయిస్తూ తెలుగు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన చేస్తున్నారు. ఎంబీబీఎస్ బీ కేటగిరి సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. 

 

10:04 - September 4, 2016
09:44 - September 4, 2016

గుంటూరు : ఈ ఏడాది 15శాతం వృద్ధిరేటును లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ జిల్లాలలో జీయస్‌టీపీ వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ధరల నియంత్రణకు ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని వేశామని యనమల తెలిపారు. 

 

09:41 - September 4, 2016

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని కొత్తకోట వద్ద హైవేపై రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని వనపర్తి ఆస్పత్రికి తరలించారు. మరో ప్రమాదం ఉల్లెకొండ హైవేపై చోటు చేసుకుంది. మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయి ఆర్టీసీ బస్సు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా.. మరో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

09:36 - September 4, 2016
09:35 - September 4, 2016

నయీం కేసులో మరొకరి అరెస్టు

నల్గొండ : నయీం కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. రామన్నపేట మండలం తుమ్మలగూడెంకు చెందిన బాలకిషన్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

 

09:27 - September 4, 2016

ఢిల్లీ : కశ్మీర్‌లో పర్యటించునున్న అఖిలపక్ష బృందంలో తెలంగాణ నుంచి టీఆర్ ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎపి నుంచి టీడీపీ ఎంపీ తోట నరసింహం ఉన్నారు. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ బృందంలో కశ్మీర్‌ లో పర్యటించాల్సి ఉన్నప్పటికీ, అనివార్య కారణాలతో వెళ్లటంలేదు. అయితే కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి కేంద్రం తీసుకునే చర్యలకు మద్దతు ఉంటుందని వైసీపీ ప్రకటించింది. కశ్మీర్‌ పర్యటను దూరంగా ఉంటున్న ఎస్ పీ, బీఎస్ పీ కూడా కేంద్రం తీసుకునే చర్యలకు మద్దతు ఇస్తామని వెల్లడించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, ఆహార శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ కూడా కశ్మీర్‌ వెళుతున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా కశ్మీర్‌ వెళుతున్న ప్రతినిధి బృందంలో ఉన్నారు. 
 

08:57 - September 4, 2016


ఢిల్లీ : విధాన నిర్ణయాల్లో రిజర్వు బ్యాంకుకు స్వేచ్చ అవసరమని ఆర్ బీఐ గవర్నర్‌గా మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న రఘురాం రాజన్‌ మరోసారి స్పష్టం చేశారు. కేంద్రబ్యాంకు  వ్యవహారాల్లో పాలకుల జోక్యం తగ్గాలన్న వాదాన్ని వినిపించారు. దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా  స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఆర్ బీఐకి ఉండాలని చెప్పారు. భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఆదివారం పదవీ విరమణ చేయనున్న రఘురాం రాజన్‌... శనివారం ముంబైలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండిపెండెన్స్‌ ఆఫ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అన్న అంశంపై ప్రసంగిస్తూ... తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు.  ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణకు లోబడి  పనిచేస్తూనే.. ఆర్ బీఐ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా విధంగా పటిష్టం కావాలన్న వాదాన్ని రఘురాం రాజన్‌ వినిపించారు. బ్యాంకులపై నియంత్రణ, పర్యవేక్షణ, లైసెన్స్‌ల మంజూరు, బడ్జెట్‌ల వంటి అంశాల్లో ఆర్‌బీఐకి స్వతంత్రం అవసరమని సూచించారు. ప్రభుత్వ జోక్యంతో  చాలా కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. 
---------------------------------

08:54 - September 4, 2016

ఢిల్లీ : దాదాపు రెండు నెలలుగా అల్లర్లతో అట్టుడుకున్న కశ్మీర్‌లో పరిస్థితిని అంచనావేసి, చక్కదిద్దే లక్ష్యంతో అఖిలపక్ష ప్రతినిధి బృందం కశ్మీర్ పర్యటన ఖరారైంది. రేపటి నుంచి 2 రోజుల పాటు అఖిలపక్షం పర్యటించనుంది. వివిధ వర్గాలలో చర్చించే ఈ ప్రతినిధి బృందానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నాయకత్వం వహిస్తారు. కశ్మీర్‌లో పర్యటించే అఖిలపక్ష బృందం అన్ని విషయాల్లో ఏకాభిప్రాయంతో ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది. హురియత్‌ నేతలను అఖిపక్షంతో చర్చలకు పిలవాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సూచించారు.  
నేడు, రేపు పర్యటన 
కశ్మీర్‌లో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు అఖిలపక్ష ఎంపీల ప్రతినిధి బృందం ఆది, సోమవారాల్లో  ఈ రాష్ట్రంలో పర్యటించనుంది. పర్యటనలో పాల్గొనే ఎంపీల బృందంతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఢిల్లీలో భేటీ అయ్యారు. కశ్మీర్‌ పరిస్థితులు, పర్యటన విధి విధానాలపై   పార్లమెంటు సభ్యులకు అవగాహన కల్పించారు. పార్లమెంటరీ  వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్‌, ప్రధాన మంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. 
కశ్మీర్‌కు అఖిపక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయం 
గత నెల 12న ప్రధాన మోడీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో కశ్మీర్‌కు అఖిపక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకున్నారు. రెండన్నర నెలలుగా కశ్మీర్‌ ఆరని అగ్నిగుండంగా మారడానికి దారితీసిన పరిస్థితులను ఎంపీల దృష్టికి తెచ్చారు . జులై 7న హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్ బర్హాన్‌ వని ఎన్‌కౌంటర్‌ తర్వాత రాష్ట్రంలో అల్లర్లు చెలరేగిన తరుణంలో జరుగునున్న ఈ అఖిలపక్షం పర్యటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేశారు. కశ్మీర్‌లోని వాస్తవ పరిస్థితులతో పాటు, వివిధ వర్గాల ప్రజలు, నేతలు, పార్టీలు, గ్రూపులు అభిప్రాయాల గురించి పార్లమెంటు సభ్యులకు అవగాహన కల్పించారు. కశ్మీర్‌లో పర్యటించే అఖిలపక్షం అన్ని విషయాల్లో ఏకాభిప్రాయంతో ఉండాలని నిర్ణయించింది.  కశ్మీర్‌లో రెండు రోజులు పర్యటించి ఢిల్లీ తిరిగి వచ్చిన తర్వాత ఈ బృందం మళ్లీ సమావేశం అవుతుందని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. 
హురియత్‌ నేతలను చర్చలకు ఆహ్వానించాలి : ఏచూరి 
కశ్మీర్ పర్యటనలో.. హురియత్‌ నేతలను అఖిలపక్షంతో చర్చలకు ఆహ్వానించాలని  సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి సూచించారు. అలాగే పెల్లెట్ గన్ల వాడకాన్ని నిషేధించాలని కోరారు. కశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దాలన్న లక్ష్యంతో అఖిలపక్షం వెళుతోందని పర్యటనలో పాల్గోనున్నలోక్‌సభలో తెలుగుదేశం పక్ష నేత తోట నరసింహం, టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డిచెబుతున్నారు. 
 ప్రత్యేక విమానంలో శ్రీనగర్‌ కు 
అఖిలపక్ష ఎంపీల బృందం ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఈ బృందం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి శ్రీనగర్‌ చేరుకుంటుంది. 2 రోజలు పాటు వివిధ వర్గాలతో చర్చిస్తుంది. అల్లర్లలో గాయపడిన పౌరులతో పాటు, పోలీసులు, సైనికాధికారులు, జవాన్లను కలుసుకుని పరామర్శిస్తుంది. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతోపాటు, గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రాతో... ఎంపీలు భేటీ కానున్నారు.   హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన కశ్మీర్‌లో పర్యటించే అఖిలపక్ష బృందంలో ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ, ఆహార శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ కూడా ఉంటారు. కాంగ్రెస్‌ నుంచి గులాంనబీ ఆజాద్‌, మల్లికార్జున ఖర్గే, అంబికా సోనీ,  జేడీయూ నుంచి శరద్‌ యాదవ్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కశ్మీర్‌లో పర్యటించే బృందంలో ఉన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా,  తెలంగాణ నుంచి టీఆర్‌ఎస్‌ పీఎం జితేందర్‌రెడ్డి, మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఏపీ నుంచి టీడీపీ ఎంపీ తోట నరసింహం, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఎన్సీపీ నుంచి తారీఖ్‌ అన్వర్‌, టీఎంసీ ఎంపీ సౌగతరాయ్‌, శివసేన  తరుపున సంజయ్‌ రౌత్‌, ఆనందరావు అద్సుల్‌ ఈ పర్యటనలో పాల్గొంటారు. 

 

08:47 - September 4, 2016

హైదరాబాద్ : సీజనల్‌ ఫీవర్స్ జనం ప్రాణాలు తీస్తున్నాయి.  పల్లే, పట్టణం తేడాలేకుండా జనం జ్వరాల బారీన పడి మూలుగుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు డెంగ్యూ జ్వరాలు విజృభింస్తున్నాయి.  ప్రభుత్వ , ప్రైవేటు అనే తేడా లేకుండా ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. ప్రభుత్వం నివారణ  చర్యలు చేపట్టడంలో విఫలమైందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
ఆస్పత్రి పాలవుతున్న రోగులు 
తెలంగాణా జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా, టైఫాయిడ్‌తో పాటు చికెన్‌గున్యా, డెంగ్యూ లాంటి విష జ్వరాలు సోకడంతో ఇప్పటికే అనేక మంది రోగులు ఆస్పత్రి పాలవుతున్నారు. మహిళలు, చిన్నారులు,  వృద్ధులు అంతా విషజ్వరాల బారినపడి అవస్థలు  పడుతున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలడంతో పలుజిల్లాల్లో ప్రైవేటు , ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. కొన్ని ఆసుపత్రుల్లో బెడ్స్‌ ఖాళీ లేక రోగులను తిప్పిపంపుతున్న పరిస్థితి నెలకొంది. ఆర్థిక స్థోమత లేని నిరు పేదలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కాని  కనీస సౌకర్యాలు లేక  ఇబ్బందులకు గురవతున్నారు. 
ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్యలోపం
అటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. వైద్యానికనివస్తే కొత్త జబ్బులు అంటుకుంటున్నాయిని  రోగులు ఆందోళన  చెందుతున్నారు. ఆస్పత్రుల్లో ఎక్కడపడితే అక్కడ చెత్తచెదారం పేరుకుపోయి ఉంటోంది. కొద్దిపాటి వర్షం వచ్చినా.. మురుగునీరు నిలిచి వచ్చిపోయే రోగులు నానా  అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రులన్నీ మురుగుకూపాలుగా మారినా  ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడంలేదని పేదరోగులు ఆవేదన వ్యక్తం చేప్తున్నారు. రోగాలు ప్రభలకుండా ఫాగింగ్‌లాంటివి కూడా చేయడంలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
హైదరాబాద్‌లో పీడిస్తున్న సీజనల్‌రోగాలు
ఇటు హైదరాబాద్‌లోనూ సీజనల్‌రోగులు ప్రభలిపోతున్నాయి.  ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులు క్యూకడుతున్నారు. అయితే గత నెలతో పోల్చుకుంటే ఈనెలలో జ్వరాలు తగ్గాయంటున్నారు ఫీవర్ హాస్పటల్ వైద్యులు.  కాని కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని రోగాల  బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవలంటున్నారు. ఏకొద్దిపాటి  జలుబు, దగ్గు అనిపించినా చిన్న పిల్లల్ని స్కూల్స్ కి పంపవద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.  
విజృభిస్తున్న దోమలు  
వర్షాలు జోరుగా పడుతుండటంతో దోమలు విజృభిస్తున్నాయి. గ్రామాలు, పట్ణణాలు అనే తేడాలేకుండా తెలంగాణ వ్యాప్తంగా జనం రోగాలభారిన పడి విలవిల్లాడుతున్నారు. ఇప్పటికైనా వైద్యారోగ్యశాఖ స్పందించి.. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలతో కలిసి.. పారిశుద్ధ్యకార్యక్రమాలు చేపట్టాల్సిన  అవసరం ఉంది.  

 

08:39 - September 4, 2016

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో కాల్పులు కలకలం రేపాయి. ఫలక్ నుమా వివాహ వేడుకల్లో తుపాకీ కాల్పుల ఘటన చేటుచేసుకుంది. పెళ్లి కొడుకు రెండు రివాల్వర్లతో గాల్లోకి పది రైండ్లు కాల్పులు జరిగిపారు. ఈ ఘటన స్థానికంగా  కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలో నివసిస్తూ పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న పలుకుబడి కల్గిన ఓ వ్యక్తి కుమారుని వివాహం ఆగస్టు 22న జరిగింది. ఈ సందర్భంగా రాత్రి 12 గంటల సమయంలో బరాత్ నిర్వహించారు. స్నేహితులతో కలిసి పెళ్లి కొడుకు డ్యాన్స్ చేశారు. ఆనందం ఎక్కువై పెళ్లి కుమారుడు రెండు రివాల్వర్లతో గాల్లోకి 11 రౌండ్లు కాల్పులు జరిపాడు. పెళ్లి కుమారుడు పాతబస్తీకి చెందిన ఓ ఎసిపి బంధువు కావడంతో అతనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ

బీజింగ్ : చైనాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మోడీ సమావేశం అయ్యారు. హాంగ్ ఝాలో జరిగే జీ20 సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. 

 

 

ఫలక్ నుమా పెళ్లి వేడుకల్లో వివాదం

హైదరాబాద్ : ఫలక్ నుమా పెళ్లి వేడుకల్లో వివాదం నెలకొంది. పెళ్లి కొడుకు రెండు రివాల్వర్లతో గాల్లోకి 10 రౌండ్ల కాల్పులు జరిపారు. 

07:47 - September 4, 2016

విశాఖ : పరిశ్రమలు వస్తే తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ఆశపడ్డారా గ్రామస్తులు. అందుకోసం బంగారుపంటలు పండే తమ భూములను వదులుకున్నారు.. ఏళ్లు గడిచాయి.. పరిశ్రమలు వచ్చాయి కానీ.. ఉపాధి మాత్రం అందనిద్రాక్షే అయింది.  న్యాయంచేయాలని  ప్రభుత్వాన్ని వేడుకున్నా పట్టించుకునే వారేలేరు.  పైగా రైల్వే లైన్ పేరుతో మరికొన్ని భూములను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విశాఖనగర శివారు గ్రామస్తులు. 
విశాఖ నగరం అనేక పరిశ్రమలకు పెట్టింది పేరు.. 
ఒకప్పుడు పచ్చగా ఉన్న గ్రామాలు.. ఇప్పుడు మసిని, బూడిదను నింపుకున్నాయి. విశాఖ నగరం అనేక పరిశ్రమలకు పెట్టింది పేరు.. ఎన్నో పరిశ్రమలు ఇక్కడ కేంద్రంగా ఏర్పడ్డాయి.. అలా ఏర్పడిన పరిశ్రమలే హిందూజా, ఎన్టీపీపీసీ వపర్ ప్లాంట్ లు.. 1991లో సరళీకృత అర్ధిక విధానాలు మొదలైన తరువాత ఈ రెండు పరిశ్రమలు విశాఖలో స్థాపితమయ్యాయి.. గాజువాక, పెందుర్తీ నియోజకవర్గ సరిహద్దులోని దేవాడ, పాలవలస, కేఎణ్.పాలేం చినపాలెం, అప్పికొండ, పిట్టవానిపాలెం గ్రామాలలోని భూములను తొలి దశ కింద ఎన్టీపీసీకు దాదాపు 2 వేల ఎకరాలు.. హిందూజా సంస్థకు 1500 ఎకరాల భూములను ఇచ్చింది ప్రభుత్వం.. గ్రామస్తులకు మాత్రం నష్టపరిహారం చెల్లించలేదు.. 
5 వేల ఎకరాలలో పరిశ్రమల ఏర్పాటు
5 వేల ఎకరాలలో ఈ పరిశ్రమలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. పరిశ్రమలను ప్రారంభించే సమయంలో స్థానికంగా ఉన్న యువతకు ఉపాధీ అవకాశాలు కల్పిస్తామని ఆయా పరిశ్రమలు హామీ ఇచ్చాయి.. ఇంతవరకూ ఆ హామీ అమలుకాలేదు. పరిశ్రమలకు భూములు ఇవ్వగా మిగిలిన భూములను రైల్వే ట్రాక్ కోసం సేకరించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది.. పైగా ఈ భూములు మీవీ కావని వక్ఫ్ బోర్డుకు చెందినవని జీవో నెంబర్ 10 తీసుకువచ్చింది.
పరిహారం గురించి మాట్లాడని హిందూజా యాజమాన్యం 
ఇదే సమయంలో అక్కడ నివాసం ఉంటున్న గ్రామస్థులతో పరిహారం గురించి మాట్లాడని హిందూజా యాజమాన్యం ఏకంగా వక్స్ఫ్ అధికారులతో మాట్లాడటం ప్రారంభించింది. ఇదే సమయంలో హిందూజా, ఎన్టీపీసీ కంపెనీలకు మధ్య ఒక పైప్ లైన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి కొత్తగా 84 ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో గ్రామస్తులలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.. 
గ్రామస్తులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు
గ్రామస్తులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలన్ని విశాఖ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగాయి.. ఇంతే కాకుండా ప్రజలంతా కలిసి సంఘటితంగా ఎదుర్కొంటేనే సమస్య పరిష్కారం అవుతుందనని దానికోసం పోరాటం చెయ్యలాని నేతలు సూచిస్తున్నారు. 
గ్రామస్తులకు న్యాయం చేయాలి : సీపీఎం
ఇప్పటికైనా ప్రభుత్వం రైల్వే లైన్ నిర్మాణ ఆలోచన మానుకోవాలని.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని.. గ్రామస్తులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని సీపీఎం హెచ్చరించింది. 

 

07:41 - September 4, 2016

హైదరాబాద్ : మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో రాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా  60 కార్లు, 86 బైక్‌లలను  స్వాధీనం చేసుకున్నారు.  మద్యంమత్తులో వాహనాలను నడిపిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. కౌన్సెలింగ్‌  తర్వాత నిందితులును కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా బైక్‌ రేసింగ్‌ నిర్వహిస్తున్న  యువకుల నుండి 24 వాహనాలను సీజ్ చేశారు.  వీరి తల్లిద్రండులను పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

విజయవాడ బందర్ రోడ్డులో హ్యాపీ సండే కార్యక్రమం

కృష్ణా : విజయవాడ బందర్ రోడ్డులో హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

 

07:29 - September 4, 2016
07:26 - September 4, 2016

మహబూబ్ నగర్ : నమ్మినవారిని నట్టేట ముంచిందో మహిళ.  పొదుపు సంఘం పేరుతో దాదాపు మూడుకోట్ల రూపాయలతో ఉడాయించింది. పిల్లల చదువులకు, పెళ్లిల్లకు దాచుకున్న డబ్బుతిరిగిదేమోనిని  బాధితులు లబోదిబోమంటున్నారు.    మహబూబ్‌నగర్‌ జిల్లాలో బోర్డుతిప్పేసిన ప్రతిభ సహకార పొదుపు సంఘంపై టెన్‌టీపీ స్టోరీ...
జనాలనెత్తిన కుచ్చుటోపి 
పదిహేనేళ్లుగా నమ్మకంగా ఉంటూ.. పొదుపు సంఘం పేరుతో నమ్మిన వారిని నట్టేటముంచింది. మూడుకోట్లు వసూలు చేసి జనాలనెత్తిన కుచ్చుటోపి పెట్టింది. మహబూబ్‌నగర్‌ జిల్లా అయిజకు చెందిన కృష్ణవేణి అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తోంది. దీంతో పాటు  సహకార పరపతి సంఘాన్ని నిర్వహిస్తోంది. పదిహేను సంవత్సరాలుగా బాగా నడుస్తుండటంతో ఖాతాదారులలోను నమ్మకం పెరిగింది. దీంతో అయిజ, వడ్డేపల్లి, ఇటిక్యాల, మల్దకల్‌ తో పాటు  గట్టు, ఎమ్మిగనూరు, అలంపూర్‌, కర్నూలు ప్రాంతాలకు చెందిన సుమారు 2 వేల 500 మంది ఈ సంఘంలో డబ్బు పొదుపు చేశారు. ఇందులో ఖాతాదారులుగా చేరిన వారు ఐదేళ్లపాటు నెలనెలా చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైతే కొంతమొత్తం రుణం తీసుకునే అవకాశం కల్పించి కొందరికి వడ్డీతో కలిపి డబ్బులను ఇచ్చారు.   
రూ. 3కోట్లతో ఉడాయించిన నిర్వాహకురాలు 
డబ్బు ఇబ్బడిముబ్బడిగా డబ్బులు జమకావడంతో పెద్దమొత్తంతో ఉడాయించడానికి ప్లాన్‌వేసింది. కొన్నినెలలుగా ఖాతాదారులకు చెల్లింపులను నిలిపివేసింది. ఖాతాదారులు ఒత్తిడిచేయడంతో డబ్బులతో మాయమైయింది నిర్వాహకురాలు కృష్ణవేణి. సంఘంలో దాదాపు రెండువేలకు పైగా ఖాతాదారులు ఉండగా, వారి వద్ద నుంచి మూడుకోట్ల రూపాయలు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
బ్యాంకు పుస్తకాలను అందజేసిన నిర్వాహకురాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకార చట్టం 1995 ప్రకారం రిజిస్టర్ జీవో ఆధారంగా నగదును పొదుపు చేస్తున్నట్లు ఖాతాదారులకు బ్యాంకు పుస్తకాలను సైతం అందజేసిందని బాధితులు అంటున్నారు. నిర్వహకురాలిని వెంటనే అదుపులోకి తీసుకుని తమకు డబ్బు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

 

07:18 - September 4, 2016

ఖమ్మం : జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వందల టాక్టర్లలో ఇసుకను తరలిస్తూ కోట్ల రూపాయలు మింగేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపెడుతున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతో సాగుతున్న ఇసుక దందాపై టెన్‌టీవీ ఫోకస్‌..
రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో ఇసుక దందా 
ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలో ఇసుక దందా.. రెవెన్యూ అధికారుల కనుసేన్నల్లోనే సాగుతోంది.  మండలంలో ఇసుక రవాణాకోసం 4ర్యాంప్‌లను గుర్తించింది ప్రభుత్వం.  ట్రాక్టర్లద్వారా మాత్రమే ఇసుకను తరలించాలని నింధనలుపెట్టారు.  ఒక్కో ట్రాక్టర్‌ ట్రక్కులో పట్టే 3క్యూబిక్‌మీటర్ల ఇసుకకు.. వెయ్యిరూపాయలను డీడీరూపంలో చెల్లించాల్సి ఉంది. డీడీనీ తహశీల్దార్‌ కార్యాలయంలో ఇచ్చి అక్కడ నుంచి కూపన్లు పొందిన తర్వాతే ఇసుక రవాణాకు అనుమతి ఇస్తారు.  ర్యాంపులు ఏ గ్రామపరిధిలో ఉంటే ఆగ్రామానికి చెందిన  పంచాయతీ కార్యదర్శి  కూపన్లు తీసుకుని వేబిల్‌రాసి.. లోడింగ్‌ టైంకూడా వేసి రిసిప్ట్‌ ఇస్తారు. ఇదీ ర్యాంపునుంచి ఇసుకను పొందాలంటే జరగాల్సిన ప్రాసెస్‌. 
అక్రమంగా తరలుతున్న కోట్ల రూపాయల ఇసుక
కాని..అంతా సాఫీగా జరిగితే అనుకోవడమెందుకు.. నింబంధనలన్నీ పక్కాగా ఉన్నా.. కోట్ల రూపాయల ఇసుక అక్రమ మార్గాల్లో తరలిపోతోంది.  డిడీ చెల్లించి పొందిన కూన్‌ను ఒక్కసారే ఉపయోగించాల్సి ఉండగా.. ఇక్కడ మాత్రం... అధికారుల ఆశీస్సులు ఉంటే.. ఒకే కూపన్‌పై ఎన్నిలోడ్‌ల ఇసుకనైనా తరలించుకోవచ్చు. ఒక ట్రాక్ట్‌ర్‌ లోడ్‌కోసమే కూపన్‌ తీసుకుని మూడు ట్రాక్టర్ల  ఇసుకను తరలిస్తున్నారు అక్రమార్కులు. ఈ దందాలో.. గ్రామపంచాయతీ కార్యదర్శి నుంచి , సర్పంచి, లోకల్‌రాజకీయ నాయకులతోపాటు.. రెవెన్యూ సిబ్బందికీ .. ఎవరి వాటాలు వారికి జేబుల్లోకి చేరుతున్నాయి. అక్రమంగా తోలుకునే ఒక్కోట్రిప్పుకు 500 నుంచి 750 రూపాయలు మామూళ్లు ఇస్తున్నట్టు ట్రాక్టర్‌యజమానులు చెబుతున్నారు. ఈవ్యవహారం అంతా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. కాని.. ఇంతచక్కగా నడిచిపోతున్న ఇసుకభాగోతంలో తహశీల్దారు చిచ్చుపెట్టారట. 
మామూళ్ల పంపకాల్లో తేడాలు
ఈ మధ్య తహశీల్దారు సెలవులపై ఊరుకు వెళ్లారు. దాంతో... పెద్దవాటను పంచాల్సిన పనిలేకుండా పోయింది రెవెన్యూ సిబ్బందికి. సెలవుల్లో ఉన్న తహశీల్దారుకు వాటా ఇవ్వకుండానే... పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులతోపాటు ఇతర రెవెన్యూ సిబ్బంది మాత్రమే అక్రమ సొమ్మును పంచుకుంటున్నారట. విషయం తెల్సిన తహశీల్దారు అగ్గిమీద గుగ్గిలం అయ్యారట. నేను సెలవుల్లో ఉన్నా ..నావాటా నాకు ఇవ్వాల్సిందే అని.. ఆఫీసు నుంచి కూపన్లు జారీచేయడం ఆపేయించారు. దీంతో ఇసుక రవాణాకు బ్రేక్‌ పడింది. 
విలేఖర్ల పేరుతో ఇసుక దందా చేస్తున్న రెవెన్యూ వర్కర్లు 
ఇదిలావుంటే.. పిట్టపోరు పిట్టపోరు పిల్లితీర్చినట్టు.. మధ్యలో కొందరు రెవెన్యూ ఆఫీసులో పనిచేసే వర్కర్లు విలేఖర్ల అవతారం ఎత్తారు. ఇసుకను తోలుకోండి .. అనుమతుల విషయాలు మేంజూసుకుంటాం ..అని.. ఏకంగా ఇసుక రీచ్‌లదగ్గరకే వెళ్లి .. ట్రాక్టర్లకు లోడింగ్‌ చేయించేస్తున్నారు. 
అక్రమార్కుల ఇష్టారాజ్యం
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో.. ఇసుక తరలింపు అక్రమార్కుల ఇష్టారాజ్యంగా మారిపోయింది. బడితె ఉన్నోడిదే బర్రె అన్నట్టు.. రాజకీయనాయకులు, రెవెన్యూ అధికారుల అండదండలతో ఇసుక దందా జోరుగా సాగుతోంది. అడిగేవారే లేకపోవడంతో.. రోజుకు దాదాపు 50వేల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు దక్కకుండా పోతోంది. 
ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలంటున్న ప్రజలు
తహశీల్దారే అక్రమరవాణాను ప్రోత్సహిస్తుండటంతో.. ఇసుక దోపిడీకీ అడ్డేలేకుండా పోయింది. అధికారుల మధ్య వాటాలు తెగక ఇసుక రవాణా ఆగిపోవడంతో నిర్మాణపనులకు ఆటంకం కలుగుతోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. కోట్లదారూపాయల ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. 

 

07:09 - September 4, 2016

హైదరాబాద్ : కొత్తగా ఏర్పడుతున్న జిల్లాలతోపాటు వివిధశాఖల నిర్వాహణలోను మార్పులు తేవాలని తెలంగాణసర్కార్‌ భావిస్తోంది. ఇప్పటివరకు ఒకేరకమైన విధులనునిర్వహిస్తున్న వేర్వేరు విభాగాలను ఒకే గొడుగుకిందకు తీసుకురావాలని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడే జిల్లాలలో ఉద్యోగుల సర్థుబాటు కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్‌ కొత్త ప్రతిపాదనలు సైతం సిద్ధం చేస్తోంది. 
శాఖల ఏకీకరణకు ప్లాన్‌ 
తెలంగాణలో ఒకే రకమైన విధులు నిర్వహిస్తున్న శాఖల ఏకీకరణకు ప్లాన్‌ చేస్తోంది సర్కార్‌. అందులో భాగంగానే సాంఘీక సంక్షేమశాఖలోని కొన్నింటిని కలపి షెడ్యుల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ గా మార్చింది సర్కార్‌. అయితే తాజగా కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగుల సర్ధుబాటు అంశం తెరపైకి రావడంతో కీలక శాఖలోని సిబ్బందిని అడ్జస్ట్ చేయడం కోసం... శాఖల పునరేఖికరణ అంశం మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది.  
శాఖలవారీగా కసరత్తు
రాష్ట్రంలో దసరా నుంచి 17 కొత్త జిల్లాలు ఉనికిలోకి రానున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో శాఖల వారిగా కసరత్తు జరుపుతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సమస్యల మీద ప్రధానంగా  దృష్టిసారించినట్లు తెలిసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రౌండ్  లేవల్ లో  పంచాయతీరాజ్‌శాఖ ద్వారానే అమలు చేస్తున్నారు.  దీంతో ఆ శాఖపై ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది. దీనికోసం  పీఆర్‌వో డిపార్ట్ మెంట్‌ను  మరింత బలోపేతం చేస్తే సరిపోతుందని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై  ఉన్నతాధికారులు ఇప్పటికే  కసరత్తుపూర్తిచేశారు.  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల విలీనానికి ప్రతిపాదనలు కూడా చేసినట్లు తెలుస్తోంది. 
ఒకేవిధమైన విధులు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ
ప్రస్తుతం రాష్ట్ర, జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థలు ఒకే విధమైన విధులు నిర్వహిస్తున్నప్పటికీ రెండు శాఖలు వేర్వేరుగా పని చేస్తున్నాయి. జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ కింద జిల్లాపరిషత్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి, జిల్లాపంచాయతీరాజ్ అధికారులున్నారు. జిల్లాపరిషత్తు సీఈవో ఆధీనంలో ఎంపీడీవోలు, కార్యదర్శులు, జిల్లా పంచాయతీఅధికారి ఆధీనంలో మండల విస్తరణ అధికారులు పనిచేస్తున్నారు. 
శాఖల అభివృద్ధికి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారితో పనులు
మరోవైపు .. సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను కలిపి వాడుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇందులో పంచాయతీరాజ్, సెర్ప్, ఉపాధిహామీ, సీపార్డ్, ఈజీఎంఎం, సోషల్ అడిట్  విభాగం, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం, తదితర విభాగాలన్నీ ఈ అధికారి ఆధీనంలోకి తీసుకువచ్చి.. జిల్లాస్థాయిలో మాత్రం సీనియర్ అధికారిని నియమించి ఆయన ఆధ్వర్యంలో పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.  ప్రస్తుతం మిషన్‌ భగీరథ విభాగాన్ని కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలోనే విలీనం చేయాలని 2 రోజులపాటు సాగిన సమావేశంలో ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు సమాచారం. 
ప్రతిపాదనలపై కిందిస్థాయి అధికారుల నుండి వ్యతిరేకత 
అయితే ప్రభుత్వ ఉన్నతాధికారులు చేస్తున్న ఈ ప్రతిపాదనలపై కిందిస్థాయి అధికారులనుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  నూతన ప్రతిపాదనల కారణంగా తమకు భవిష్యత్‌లో అన్యాయం జరిగే అవకాశం ఉందని.. ఇటువంటి ప్రపోజల్స్‌ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.

 

07:02 - September 4, 2016

హైదరాబాద్ : చంద్రబాబు మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. విభజనల హామీలు నెరవేర్చడంలో భాగంగా.. కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తుందని వార్తలు రావడంతో... ఈ అంశంపై స్పష్టత కోసమే బాబు ఢిల్లీ వెళ్తున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. 
ఈనెల 7న ఢిల్లీ పయనం
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 6న విజయవాడలో కేబినెట్‌ సమావేశానికి చంద్రబాబు హాజరవుతారు.. ఈ భేటీలో ఢిల్లీ టూర్‌పై చర్చించనున్నారు.. ఈ సమావేశం తర్వాత 7న దేశ రాజధానికి సీఎం ప్రయాణమవుతారు.. ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ఆ స్థాయిలో సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం సిద్ధమవుతోందని ఏపీ సర్కార్‌ ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే ఈ ప్యాకేజీ ఏ తరహాలో ఉంటుంది? నిధులు ఎలా వస్తాయన్నదానిపై క్లారిటీ లేదు.. ఈ వివరాలు తెలుసుకునేందుకే బాబు ఢిల్లీ వెళ్తున్నట్టు సమాచారం. 
ఏపీలో కొనసాగుతున్న లోటు బడ్జెట్‌
మరోవైపు ఏపీలో లోటు బడ్జెట్‌ కొనసాగుతోంది.. మొదటి ఏడాది రెవెన్యూ లోటు ఇప్పటివరకూ భర్తీ కాలేదు.. దాదాపు 14వేల కోట్లవరకూ లోటు ఏర్పడిందని కాగ్‌ నిర్ధారించింది.... కేంద్రంనుంచి కేవలం 3వేల 979కోట్ల రూపాయలు మాత్రమే అందాయి.. ఈ లోటుకు సంబంధించి ప్యాకేజీలో కేంద్రం ఏం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.. ఇక పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా.. కేంద్రంనుంచి కేవలం 845కోట్లు మాత్రమే అందాయి.... ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4వేల కోట్లు ఖర్చుచేసింది.. పోలవరానికి నాబార్డ్‌ ద్వారా నిధులిప్పిస్తామని కేంద్రం చెబుతున్నా ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు.. తాజా ప్యాకేజీలో ఈ ప్రాజెక్టుకు ఇచ్చే నిధులు కూడా కీలకం కానున్నాయి.. అటు రాజధాని నిర్మాణానికి కేంద్రంనుంచి అందిన సహాయం చాలా తక్కువగా ఉంది.. అమరావతికి ఎన్ని నిధులు ఇస్తారన్న విషయంపైకూడా బాబు చర్చించే అవకాశముంది. మొత్తానికి చంద్రబాబు ఢిల్లీ టూర్‌ అనంతరం.. ఏపీకి కేంద్రం ఎంత మేరకు సాయం చేస్తుందనే అంశంపై స్పష్టత రానుంది. 

 

06:58 - September 4, 2016

వాటికన్‌ సిటీ : మానవతా మూర్తికి మహాగౌరవం దక్కింది. భారతరత్న, నోబెల్‌శాంతి బహుమతి విజేత మదర్‌థెరీసాకు ఇవాళ సెయింట్‌హుడ్‌ హోదాను ప్రధానం చేయడానికి వాటికన్‌ సిటీ సిద్ధమైంది. పోప్‌ఫ్రాన్సిస్‌ పునీతహోదా ప్రదానం చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా అభిమానులు  ఈకార్యక్రమానికి హాజరవుతున్నారు. భారత్‌నుంచి విదేశాంగమంత్రి సుష్మస్వరాజ్‌తోపాటు బెంగాల్‌సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎంకేజ్రీవాల్‌ నేతృత్వంలో ప్రతినిధుల బృందాలు ఇప్పటికే వాటికన్‌ సిటీకి చేరుకున్నాయి. 

 

నేడు టీడీపీ స్టాటజీ కమిటీ సమావేశం

హైదరాబాద్ : నేడు టీడీపీ స్టాటజీ కమిటీ సమావేశం జరుగనుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

నేడు పీవీ సింధూ, గోపీచంద్ లకు సన్మానం

హైదరాబాద్ : నేడు పీవీ సింధూ, గోపీచంద్ లకు సన్మానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ హాజరుకానున్నారు. 

హైదరాబాద్ లోని పలు చోట్ల పోలీసుల డ్రంక్ ఆండ్ డ్రైవ్

హైదరాబాద్ : నగరంలోని పలు చోట్ల పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. 111 మందిపై కేసులు నమోదు చేశారు. 45 కార్లు, 66 బైకులు సీజ్ చేశారు.

 

నేడు థెరిసాకు సెయింట్ హుడ్ బహూకరణ

హైదరాబాద్ : నేడు థెరిసాకు సెయింట్ హుడ్ బహూకరణ చేయనున్నారు. భారత్ తరపున కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ బృందం వాటికన్ సిటీకి వెళ్లనుంది. 

నేటి నుంచి కశ్మీర్ లో పర్యటించనున్న అఖిలపక్ష ఎంపీల బృందం

ఢిల్లీ : దాదాపు రెండున్నర నెలలుగా అల్లర్లతో అట్టుడుకున్న కశ్మీర్‌లో పరిస్థితిని అంచనావేసి, చక్కదిద్ద లక్ష్యంతో అఖిలపక్ష ప్రతినిధి బృందం ఆది, సోమవారాల్లో ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. వివిధ వర్గాలలో చర్చించే ఈ ప్రతినిధి బృందానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నాయకత్వం వహిస్తారు. కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌తోపాటు మరో 25 మంది ఎంపీలు   అఖిలపక్ష ప్రతినిధి బృందంలో ఉన్నారు.

Don't Miss