Activities calendar

05 September 2016

8 నుండి ఏపీ అసెంబ్లీ..

విజయవాడ : ఈనెల 8వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జీఎస్టీ బిల్లుతో పాటు రెండు కీలక ఆర్డినెన్స్ లను ఆమోదించుకొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 

7న ఢిల్లీకి ఏపీ సీఎం..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 7వ తేదీన ఆయన హస్తినకు పయనం కానున్నారు. ప్రత్యేక హోదానా ? ప్యాకేజీనా తేల్చుకొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

ఎస్ వోల విభజనపై రేపు వీడియో కాన్ఫరెన్స్...

హైదరాబాద్ : సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్స్ (ఎస్ వో)ల విభజనలో మరోసారి వివాదాస్పదమౌతోంది. కేంద్ర డీవోపీటీ మంగళవారం ఉద్యోగుల విభజనపై వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. ఈ కాన్ఫరెన్స్ లో సెక్రటేరియట్ ఎస్ వోల విభజన అంశంపై చర్చించనున్నారు. 

మంగళవారం ఢిల్లీకి మంత్రి హరీష్ రావు..

ఢిల్లీ : నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి నాబార్డుతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందం కార్యక్రమంలో హరీష్‌రావు పాల్గొననున్నారు. 

కొత్త జిల్లాల కలెక్టర్ల సదస్సు రేపు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జిల్లాలపై మంగళవారం కలెక్టర్ల సదస్సు జరగనుంది. సచివాలయంలో ఉదయం 10.30గంటలకు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. 

21:34 - September 5, 2016

ఢిల్లీ : కావేరి నదీ జలాలను తమిళనాడు రాష్ట్రానికి రోజుకు 15వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమిళనాడు రైతుల దురావస్థను తొలగించేందుకు పది రోజులపాటు ఈ నీటిని విడుదల చేయాలని తీర్పు వెలువరించింది. ట్రిబ్యునల్‌ ఆదేశానుసారంగా నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. ఈ అంశంపై పది రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని పర్యవేక్షక కమిటీకి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.

21:34 - September 5, 2016

ఢిల్లీ : అశ్లీల వీడియో వివాదంలో మంత్రి పదవి నుంచి బహిష్కృతుడైన ఆప్‌ మాజీ నేత సందీప్‌కుమార్‌ను న్యాయస్థానం పోలీస్‌ కస్టడీకి అప్పగించింది. ఆయనపై అత్యాచారం కేసు నమోదవడంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం... మూడు రోజుల పాటు పోలీస్‌ కస్టడీ విధించింది. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి సృహ కోల్పోయిన సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సందీప్‌కుమార్‌పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సందీప్‌ రెండురోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 

21:30 - September 5, 2016

చైనా : జీ20 వేదికగా పాకిస్థాన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాసియా దేశాల్లో ఒక దేశం తమ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్నారు. ఆ దేశం ఏజెంట్లను పంపి ఉగ్రవాదాన్ని విస్తరిస్తోందని మండిపడ్డారు. అయితే ఆ దేశపు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే శక్తి భారత్‌కు ఉందన్నారు. ఈ విషయంలో... ప్రపంచ దేశాలన్నీ ఐక్యతతో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జీ -20 సమావేశంలో తీవ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందకుండా చర్యలు తీసుకునేందుకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటును మోదీ ఆహ్వానించారు

21:29 - September 5, 2016

ఢిల్లీ : ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తోపాటు కేంద్రమంత్రి ప్రకాష్‌జవదేకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఏపీ నుంచి 9మంది..తెలంగాణ నుంచి ఏడుగురు టీచర్లు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం పట్ల టీచర్లు హర్షం ప్రకటించారు. 

21:27 - September 5, 2016

ఢిల్లీ : జమ్ముకశ్మీర్ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమేనని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. కశ్మీర్‌లో శాంతి భద్రతల పునరుద్ధరణకు రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో కశ్మీర్ వెళ్లిన అఖిలపక్ష బృందం పర్యటన ముగిసింది. ఆల్ పార్టీ బృందంతో... చర్చించేందుకు వేర్పాటువాదులు నిరాకరించడంతో.. పర్యటన అసంపూర్ణంగా ముగిసింది. కశ్మీర్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి రెండు రోజుల పాటు జమ్ముకశ్మీర్ వెళ్లిన అఖిలపక్షం ఏం తేలకుండానే ముగిసింది. జూన్ 8న ఉగ్రవాది బూర్హాన్‌ని భారత సైనికులు మట్టుపెట్టడంతో కశ్మీర్‌లో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. దీంతో అక్కడ శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో 28 మందితో కూడిన అఖిలపక్ష బృందం కశ్మీర్ పర్యటకు వెళ్లింది.

చర్చలకు నిరాకరించిన వేర్పాటువాదులు..
రెండు రోజుల పర్యటనలో అఖిలపక్ష బృందం 300మంది సభ్యులతో చర్చలు చేపట్టింది. చర్చల్లో కశ్మీర్ పండిట్లు బృందంతో అసహనం వ్యక్తం చేశారు. వేర్పాటు వాదులైన హురియత్ నేతలతో చర్చల కోసం పాకులాడుతున్న బృందం తమతో చర్చలకు కేవలం 8నిమిషాలు మాత్రమే కేటాయించడాన్ని పండిట్లు తప్పుపట్టారు. మరోవైపు అఖిలపక్షంతో చర్చించడానికి వేర్పాటువాదులు పూర్తిగా నిరాకరించారు. జమ్ముకశ్మీర్ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమేనని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. జమ్మూకశ్మీర్ పరిస్థితిపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, కశ్మీర్‌లో పరిస్థితిని మెరుగుపరచాలనే అభిప్రాయంతోనే తామంతా ఉన్నామని చెప్పారు. అఖిల పక్ష బృందంతో చర్చలకు వేర్పాటువాద నేతలు సుముఖత వ్యక్తం చేయకపోవడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేర్పాటు వాదులు చర్చలకు నిరాకరించినా... తమ పర్యటన కశ్మీర్‌ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. మొత్తమ్మీద అఖిలపక్షం పర్యటన అసంతృప్తిగా ముగియడం పట్ల నేతలు అసహనం వ్యక్తంచేశారు. ఈ పర్యటనలో పూర్తిస్థాయి చర్చలు జరగకపోయినా.. ఈ అంశంపై మరోసారి ఢిల్లీలో సమావేశమవ్వాలని అఖిపక్షం నిర్ణయించింది. 

21:24 - September 5, 2016
21:23 - September 5, 2016

విజయవాడ : భవానీపురంలో కృష్ణానది కరట్టలపై నివసిస్తున్న పేదోళ్ల పట్ల ప్రభుత్వం కక్షకట్టింది. అభివృద్ధి పేరులతో ఇళ్లు కూలగొట్టి... పిల్లపాపలతో రోడ్డుమీద పడేస్తోంది. దీనికి నిరసిస్తూ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న 72 కుటుంబాల ఇళ్లకు.. నీరు, విదుత్‌ సరఫరా నిలిపివేశారు. ఈ చర్యను నిరసిస్తూ బాధితులు చేస్తున్న ఉద్యమానికి సీపీఎం మద్దతు ప్రకటించింది. ఈనెల 9న జాతీయ రహదారి దిగ్బంధించాలని బాధితులు, నేతలు నిర్ణయించారు. పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో బెజవాడ భవానీపురం కృష్ణానది కరకట్టవాసులపై ప్రభుత్వం దమననీతి ప్రదర్శిస్తూ వస్తోంది. పుష్కరాల సమయంలో కరకట్టలపై ఉన్న చాలా ఇళ్లను మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. దీనిని నిరిసిస్తూ బాధితులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల తొలగింపును కరట్టకట్టవాసులు వ్యతిరేకించడంలేదు. కాకపోతే పరిహారం చెల్లించి, ఇళ్ల నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా స్థలం చూపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఆక్రమణల పేరుతో మున్సిపల్‌ అధికారులు వీరి ఆక్రందనలను ఖాతరు చేయడం లేదు.

నిరంతర ఉద్యమం...
భవానీపురం కరకట్టలపై ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ... ఆందోళన చేపట్టిన బాధితులపై అధికారులు కక్షకట్టి మంచినీరు, విద్యుత్‌ సరఫరా కనెక్షన్లు తొలగించారు. దీనిపై 72 మంది బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తే... ఈనెల 7వ తేదీలోగా మంచినీరు, విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ అధికారులు ఇంతవరకు ఈ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై బాధితులు మండిపడుతున్నారు.  భవానీపురం కరకట్టవాసుల ఆందోళనకు సీపీఎం బాసటగా నిలిచింది. బాధితుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. పరిహారం చెల్లించకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ చేయిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని సీపీఎం హెచ్చరించింది. భవానీపురం కరకట్టవాసుల ఆందోళనకు మద్దతుగా ఈనెల 9న జాతీయ రహదారి దిగ్బంధానికి సీపీఎం పిలుపు ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశాలను అధికారులు అమలు చేయకపోతే కోర్టు ధిక్కారం కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే బాధితులతో కలిసి నిరంతర ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని సీపీఎం నేతలు ప్రతిపాదించారు. 

21:20 - September 5, 2016

హైదరాబాద్ : కొత్తజిల్లాల ఏర్పాటుపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజా పరిణామాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి మంగళవారం కలెక్టర్లతో సమావేశం కానున్నారు. డ్రాఫ్టు నోటిఫికేషన్‌ పై వచ్చిన ఫిర్యాదులు, వివిధ ప్రాంతాలలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారనుంది. కొత్తజిల్లాలపై పలు ప్రాంతాలలో నిరసనలు, ఫిర్యాదులు వెలువలా వస్తున్న తరుణంలో సీఎం కలెక్టర్లతో సమావేశం కావాలని నిర్ణయించారు. గద్వాల, జనగామ వంటి ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించాలని ఆందోళనలు ఉదృతంగా జరుగుతున్నాయి. వీటిపైనా సుదీర్ఘంగా చర్చించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగే సమావేశానికి టాస్క్ ఫోర్స్ కమిటీ, కోడింగ్‌ కమిటీ సభ్యులను సైతం హజరుకావాలని సీఎం ఆదేశించడంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఫైళ్ల క్రోడింగ్‌ ,కార్యాలయాల ఏర్పాటుపై సుదీర్ధంగా చర్చ..
ఇటీవల కేబినెట్‌ సమావేశంలో సీఎస్‌ నేతృత్వంలో నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ మూడు రోజలుగా ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. ప్రస్తుతం పలుశాఖల్లో ఉద్యోగుల సంఖ్య, కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్థుబాటు, ఫైళ్ల క్రోడింగ్‌ ,కార్యాలయాల ఏర్పాటు వంటి అంశాలపై వివరాలను సేకరించింది. ఉద్యోగులు జిల్లాలో పనిచేయడం కోసం సర్వ్ టు ఆర్డర్‌ అమలు చేయాలని చూస్తోంది. ఇందులో పంచాయితీరాజ్‌, గ్రామీణ నీటిపారుదల శాఖలను ఒకచోట, చేనేత విభాగాన్ని పారిశ్రామిక రంగం పరిధిలోకి, వ్యవసాయ, ఉద్యానవన సెరీకల్చర్‌ వంటి విభాగాల ఏకీకరణ అంశాల ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసింది. హన్మకొండ జిల్లా ఏర్పాటు విషయంలో కాస్త వెనక్కి తగ్గాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా వరంగల్ రూరల్‌ అంతా కలిపి ఓ జిల్లాగా ప్రకటించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ జారీ అయిన తర్వాత అఖిలపక్ష భేటీకి ముందు.. అధికారులతో, కలెక్టర్లతో సమావేశమయి పూర్తి వివరాలు సేకరించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. 

21:18 - September 5, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీంతో సంబంధాల వ్యవహారం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. ఈ వ్యవహారంలో మంచిరెడ్డి, మల్‌రెడ్డిల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. నయీంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి సంబంధాలున్నాయని మల్ రెడ్డి రంగారెడ్డి చేసిన ఆరోపణపై మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఘాటుగానే సమాధానమిచ్చారు. మల్‌రెడ్డిపై పరువు నష్టం దావా వేసే యోచనలోనూ మంచిరెడ్డి వున్నారు. నయీంతో సంబంధాలపై కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరి మీద ఒకరు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తనకు నయీంతో సంబంధాలున్నాయంటూ మల్‌రెడ్డి చేసిన ఆరోపణలపై మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గట్టిగానే ప్రతిస్పందించారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని..ఇందుకు ఇబ్రహీంపట్నం డాగ్స్ బంగ్లా వద్ద బైఠాయించి చర్చకు రావాలని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సవాలు విసిరారు.  గ్యాంగ్‌స్టర్‌ నయీంతో కలిసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డాడన్నది మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపణ. దీనికి సరిపడా ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన చెబుతున్నారు. నయీం పేరుతో పదికోట్లకు ఎకరా భూమిని చౌకగా కొనుగోలు చేశారని.. నయీం డబ్బుల డంపు మొత్తం మంచిరెడ్డి వద్దనే ఉందని విమర్శిస్తున్నారు. దాదాపు రెండువందల కోట్లు కొల్లగొట్టిన కిషన్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఘాటుగా స్పందించిన కిషన్..
మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపణలపై మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఘాటుగానే స్పందించారు. సోమవారం ఇబ్రహీంపట్నం చౌరస్తాలో ఆందోళనకు దిగారు. తనకు నయీంతో సంబంధాలు ఉన్నాయన్న మల్‌రెడ్డి.. ఆ ఆరోపణలను నిరూపించాలని డిమాండ్‌ చేశారు. అవినీతిపరుడైన మల్‌రెడ్డికి మతిభ్రమించిందని, త్వరలో ఆయనను ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి పంపడం ఖాయమన్నారాయన. ఆరోపణలు నిరూపించకుంటే మల్‌రెడ్డిపై పరువునష్టం దావా వేస్తానని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. మొత్తమ్మీద నయీం వ్యవహారం.. రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కాకను పెంచుతోంది. నేతలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణల్లో నిజానిజాలపై ప్రజలు తీవ్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. మల్‌రెడ్డి, మంచిరెడ్డిల మధ్య నడుస్తోన్న వాగ్యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

21:00 - September 5, 2016

'గుంటూరు టాకీస్' తన మొదటి చిత్రం అని, కానీ మూడు..నాలుగు సంవత్సరాల క్రిందట ప్రారంభమైన చిత్రాలున్నాయని యాంకర్ 'రష్మీ' పేర్కొంది. వినాయక చవితి పండుగ సందర్భంగా టెన్ టివి 'రష్మీ'తో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు అంశాలపై రష్మీ నిర్మోహమాటంగా సమాధానాలు చెప్పింది. బోల్డ్..డేటింగ్..గాసిప్స్ లపై స్పందించింది. గతంలో తాను నటించిన సినిమాలు ఇప్పుడు విడుదల చేయవచ్చు కానీ ఆ సినిమాలో తన ష్కర్ట్ ఎగిరితే దానిని చూపిస్తూ రిలీజ్ చేయడం కరెక్టేనా అని ప్రశ్నించింది. అందర్నీ సంతృప్తి పరచాలనే తాను ప్రయత్నించడం జరుగుతోందన్నారు. ఒక షో చేసే సమయంలో యంగ్..టీనేజ్..ఇలా ప్రతొక్కరూ చూస్తుంటారని, ప్రతి ఎపిసోడ్ లో డిఫరెంట్ గా రావడానికి ప్రయత్నిస్తుంటానని, బోల్డ్ తనకు వర్కవుట్ అయ్యిందని, కానీ బోల్డ్ క్యారెక్టర్ల కు మాత్రమే పరిమితం కాదల్చుకోలేదని తెలిపారు. గ్లామర్ ఉన్నంత వరకు చూపించడం జరుగుతుందన్నారు. కానీ గ్లామర్ దానిపై సినిమా నడవదన్నారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియోలో చూడండి. 

యాదాద్రిపై సీఎం కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : యాదాద్రిని అత్యాద్బుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ సూచించారు. . యాదగిరిగుట్టలో టెంపుల్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన లేఔట్లు, డిజైన్లను ఆయన పరిశీలించారు. భవిష్యత్ లో భక్తుల రద్దీ పెరుగుతుందని, రద్దీకి అనుగుణంగా యాదాద్రిలో ఏర్పాటు చేయాలని సూచించారు.

19:54 - September 5, 2016

కాబూల్ లో ఆత్మహుతి దాడి..

అప్ఘనిస్తాన్ : రాజధాని కాబూల్ లో రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈఘటనలో ఏడుగురు మృత్యువాత పడినట్లు సమాచారం. 

కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం - రాజ్ నాథ్..

ఢిల్లీ : జమ్మూలో అఖిలపక్షం బృందం పర్యటించిందని, ఈ బృందం ఢిల్లీలో సమావేశమై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. అఖిలపక్ష బృందాన్ని 18 ప్రతినిధుల బృందం కలిసిందని, లడఖ్ లో కూడా ఈ బృందం పర్యటించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

18:34 - September 5, 2016

విశాఖపట్టణం : ఏపీలో రాష్ట్రంలో వినాయక చవితి పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. నగరంలో గల్లీ గల్లీలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. చిన్న వాల్తేరు లో కృష్ణుడు అవతారంలో ఉన్న 45 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం పూర్తిగా మట్టితో తయారు చేశారు. ఈ సందర్భంగా టెన్ టివితో నిర్వాహకులు మాట్లాడారు. దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:32 - September 5, 2016

విజయవాడ : వినాయక చవితి పండుగ సందర్భంగా డ్రైవర్..కండక్టర్ లు చేసిన నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలు తీసింది. గుండెపోటు వచ్చిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా బస్సులోనే ఉంచడంతో ఆ వ్యక్తి కన్నుమూశాడు. ఈవిషాద ఘటన చల్లపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...ఆవనిగడ్డ నుండి మచిలీపట్నం పల్లెవెలుగు బస్సు వెళుతోంది. చల్లపల్లి వద్ద ఓవ్యక్తి ఎక్కాడు. రామానగరం వరకు ఆ వ్యక్తి టికెట్ తీసుకున్నాడు. చల్లపల్లి ఊరు దాటుతుండగా ఒక్కసారిగ అతనికి గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్ని తోటి ప్రయాణీకులు డ్రైవర్..కండక్టర్ లకు తెలియచేశారు. సమీప ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అక్కడే బస్సును నిలిపారు. అంబులెన్స్ వస్తుందని డ్రైవర్..కండక్టర్ చెప్పడంతో ఆ వ్యక్తి గంటపాటు బస్సులోనే ఉండిపోయాడు. చివరకు తుదిశ్వాస విడిచాడు. డ్రైవర్..కండక్టర్ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. 

వినాయక మంటపం వద్ద షాక్..ఇద్దరు మృతి..

నెల్లూరు : కోవూరు (మం) ఎలమడుగు సమీపంలో వినాయక విగ్రహం మండపం వద్ద అపశృతి చోటు చేసుకుంది. పూల అలంకర చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 

8న జీఎస్‌ఎల్వీ- ఎఫ్‌ 05 రాకెట్ ప్రయోగం..

నెల్లూరు : షార్‌ నుంచి 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు జీఎస్‌ఎల్వీ- ఎఫ్‌ 05 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. వాతావరణ పరిస్థితుల అధ్యయనం కోసం ఇన్‌శాట్‌ 3డీఆర్‌ ఉపగ్రహంను జీఎస్ఎల్వీ నింగిలోకి తీసుకెళ్లనుంది. 

ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందచేసిన మంత్రి జూపల్లి..

మహబూబ్ నగర్ : ఐజా మండలం ముత్తనూరులో ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి జూపల్లి కృష్ణారావు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు. 

18:13 - September 5, 2016
18:10 - September 5, 2016

చిత్తూరు : తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. పలు ప్రాంతాల్లో వినూత్నంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. పర్యావరణలో భాగంగా మట్టి విగ్రహాలు భారీగా నెలకొల్పుతున్నారు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలకుంట గ్రామంలో 'కొబ్బరికాయల'తో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆకట్టుకుంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విగ్రహం ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టెన్ టివితో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఏకో ఫ్రెండ్లీ వినాయకుడిని నెలకొల్పడం జరిగిందన్నారు. పది వేల కొబ్బరికాయలు..11 రోజులు..20 మంది కార్మికులు దీనిని తయారు చేయడం జరిగిందన్నారు. ఇదంతా బాల వినాయక కమిటీ ఆధ్వర్యంలో జరుగుతోందన్నారు. వచ్చే ఆదివారం రోజున నిమజ్జనం ఉంటుందని, నిమజ్జనం అంటే ఉపయోగించిన కొబ్బరికాయలను ప్రజలకు ఉచితంగా అందచేయడం జరుగుతుందన్నారు. మట్టి..నీళ్లు వృధా కాకుండా ఇలా చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే చెవిరెడ్డి పేర్కొన్నారు. తాము ఎంతో కృషి చేయడం జరిగిందని బాలలు పేర్కొన్నారు. మరి ఈ వినాయకుడిని చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

బస్సులో గుండెపోటుతో ప్రయాణీకుడు మృతి..

కృష్ణా : ఆవనిగడ్డ - మచిలీపట్నం వెళుతున్న ఆర్టీసీ బస్సులో చల్లపల్లి వద్ద గుండెపోటుతో ప్రయాణీకుడు మృతి చెందాడు. 

తొండమనాటి చెరువులో విద్యార్థి మృతి..

తిరుపతి : శ్రీకాళహస్తి తొండమనాటి చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇద్దరిని స్థానికులు కాపాడారు. ఒకరు మాత్రం మృతి చెందారు. 

17:53 - September 5, 2016

బాలనటుడిగా ప్రవేశం చేసిన 'నందమూరి కళ్యాణ్ రామ్' జయాపజయాలకు అతీంగా చిత్రాలు చేస్తున్నారు. 13 ఏళ్ల కెరీర్ లో 'అభిమన్యు', 'హరేరామ్', 'ఓమ్ త్రీడి' వంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసి వైవిధ్యానికి పెద్ద పీట వేసే కథానాయకుడిగా ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. 'అతనొక్కడే'..'పటాస్' వంటి బ్లాక్ బస్టర్స్ విజయాలు నమోదు చేసుకున్నాడు. తదనంతరం మాస్ చిత్రంలో కనిపించడానికి ఆసక్తి చూపాడు. ఈ నేపథ్యంలో 'పూరి జగన్నాథ్' దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై 'కళ్యాణ్ రామ్' నిర్మాణంలో 'ఇజం' చిత్రం నిర్మితమౌతోంది. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర యూనిట్ వినాయక చవితి పండుగ సందర్భంగా చిత్ర టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ లో 'కళ్యాణ్ రామ్' స్టైలిష్ గా కనిపించాడు. వెరైటీగా డైలాగ్స్ పలికాడు. పవర్ పుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని చిత్ర యూనిట్ చెబుతున్న ఈ చిత్రంలో జగపతి బాబు, గొల్లపూడి మారుతీరావు, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించారు. ఇక 'కళ్యాణ్ రామ్' సరసన 'ఆదితి ఆర్య' హీరోయిన్ గా నటిస్తోంది. దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. 

17:40 - September 5, 2016

దేశ వాళీ క్రికెట్ రంజీట్రోఫీలో సరికొత్త సీజన్ కు రంగం సిద్ధమయ్యింది. మూడు గ్రూపులు, 28 జట్లతో 2016-17 రంజీ సీజన్ అక్టోబర్ 6 నుంచి జనవరి 11 వరకూ జరిగేలా కార్యక్రమాన్ని ప్రకటించారు. తొలిసారిగా తటస్థవేదికల్లో రంజీమ్యాచ్ లు నిర్వహించాలని నిర్ణయించారు. దేశవాళీ రంజీట్రోఫీ క్రికెట్లో విప్లవాత్మక మార్పులు చేపట్టారు. 2016-17 సీజన్ నుంచి దేశవాళీ క్రికెట్ కే మరోపేరుగా నిలిచే రంజీట్రోఫీని వినూత్నంగా నిర్వహించాలని నిర్ణయించారు. తటస్థ వేదికల్లో మాత్రమే ఇక రంజీలీగ్ మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు...సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని బీసీసీఐ టెక్నికల్ కమిటీ ప్రకటించింది. అగ్రశ్రేణిజట్ల ఎలైట్ గ్రూపులో...డిఫెండింగ్ చాంపియన్ ముంబైతో సహా మొత్తం తొమ్మిదిజట్లు ఢీ కొనబోతున్నాయి.

మొత్తం పది జట్లు...
గ్రూప్-ఏ లీగ్ మిగిలిన జట్లలో బరోడా, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ,బెంగాల్, ఉత్తరప్రదేశ్ , తమిళనాడు , రైల్వేస్ ఉన్నాయి. ఇక ద్వితీయ శ్రేణిజట్లతో కూడిన గ్రూప్ - బీ లీగ్ లో సైతం తొమ్మిదిజట్లే తలపడబోతున్నాయి. గ్రూప్- బీ లీగ్ లో సౌరాష్ట్ర, ఒడిషా, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక,విదర్భ, రాజస్థాన్, అసోమ్, జార్ఖండ్ జట్లు పోటీపడతాయి. తృతీయ శ్రేణి జట్ల గ్రూప్- సీ లీగ్ లో ఏకంగా 10 జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత దేశవాళీ క్రికెట్లో 28వ జట్టుగా చత్తిస్ ఘడ్ ..తొలిసారిగా బరిలోకి దిగనుంది. గ్రూప్- సీ లీగ్ లో తలపడుతున్న మొత్తం 10 జట్లలో మాజీ చాంపియన్ హైదరాబాద్, హర్యానా, కేరళ, ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, సర్వీసెస్, గోవా, జమ్ము-కాశ్మీర్, చత్తిస్ ఘడ్ ఉన్నాయి.

40 వేదికలు...
గ్రూప్ - బీ లీగ్ లో అత్యుత్తమంగా రాణించినజట్లకు గ్రూప్-ఏలో చోటు కల్పిస్తారు. అలాగే..గ్రూప్- సీ లీగ్ మొదటి రెండుస్థానాల్లో నిలిచినజట్లను గ్రూప్- బీ లీగ్ కు ప్రమోట్ చేస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 40 వేదికల్లో రాయపూర్, బెల్గావీలకు చోటు కల్పించారు. 82 సంవత్సరాల రంజీచరిత్రలో అత్యధికంగా ముంబై మాత్రమే 40సార్లు విజేతగా నిలవడం ద్వారా..తనకు తానే సాటిగా నిలిచింది. మరి జనవరి 7 నుంచి 11 వరకూ జరిగే టైటిల్ సమరంలో చాంపియన్ గా ఏ జట్టు నిలుస్తుందన్నదే ఇక్కడి అసలు పాయింట్.

17:37 - September 5, 2016

అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ చరిత్ర సృష్టించింది. మోడ్రన్‌ టెన్నిస్‌లో తిరుగులేని సెరెనా గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా హిస్టరీ క్రియేట్ చేసింది. టెన్నిస్‌ ఆల్ టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ 307 గ్రాండ్‌స్లామ్‌ విజయాల రికార్డును సమం చేసి తనకు తాను మాత్రమే సాటి అని మరోసారి నిరూపించింది. 34 ఏళ్ల సెరెనా విలియమ్స్...మహిళల గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో తన తర్వాతే ఎవరైనా అని నిరూపించింది. 2016 అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో...జొహన్నా లార్సన్‌ను ఊదిపారేసిన సెరెనా గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీల్లో హిస్టరీ క్రియేట్‌ చేసింది. న్యూయార్క్ లోని ఆర్థర్ ఏష్ స్టేడియం వేదికగా ముగిసిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో స్వీడన్‌కు చెందిన జొహన్నా లార్సన్‌తో పోటీ పడిన సెరెనాకు అసలే మాత్రం పోటీనే లేకుండా పోయింది. హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టాప్ సీడ్‌ సెరెనా జోరు ముందు జొహన్నా తేలిపోయింది. తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో చెలరేగిన సెరెనా కేవలం 55 నిమిషాల్లోనే ప్రత్యర్ధిని చిత్తు చేసి ప్రీ క్వార్టర్‌ఫైనల్‌ రౌండ్‌కు దూసుకెళ్లింది.

ఇదే జోరు కొనసాగితే...
వరుసగా 6-2,6-1తో జొహన్నా లార్సన్‌ను ఓడించడం ద్వారా...కెరీర్‌లో 307వ గ్రాండ్ స్లామ్ విజయం నమోదు చేసింది.ఇప్పటివరకూ 306 గ్రాండ్‌ స్లామ్‌ విజయాలతో టాప్‌ ప్లేస్‌లో ఉన్న టెన్నిస్‌ క్వీన్‌...ఆల్‌ టైం గ్రేట్‌ మార్టీనా నవ్రతిలోవా రికార్డ్‌ను సెరెనా బ్రేక్‌ చేసింది. అంతేకాదు గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలోనే అత్యధికంగా 307 విజయాలు సాధించిన స్విస్‌ ఏస్‌ రోజర్ ఫెదరర్ రికార్డును సైతం...సెరెనా సమం చేసింది. ప్రస్తుత యూఎస్ ఓపెన్‌లో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొడుతున్న అమెరికన్‌ బ్లాక్‌థండర్‌ ఇదే జోరు కొనసాగిస్తే 23 గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. 

17:35 - September 5, 2016

సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ స్టార్‌ చేశాడు. భారత్‌కు 2011 వన్డే, 2007 టీ20 ప్రపంచకప్‌ అందించడంలో కీలక పాత్ర పోషించిన యువీ బిజినెస్‌మేన్‌గా మారాడు. పంజాబీ పుత్తర్‌ కొత్తగా ఫ్యాషన్‌ మార్కెట్‌లో అడుగుపెట్టాడు. 'యువీ కెన్‌' పేరుతో ఎప్పుడో ఓ స్వచ్చంద సంస్థ ఆరంభించిన యువరాజ్‌...ఇప్పుడు అదే పేరుతో దుస్తుల బ్రాండ్‌ను ఆవిష్కరించాడు. ఈ ఈవెంట్‌కు ఇంటర్నేషనల్‌ క్రికెటర్లతో పాటు, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, బాలీవుడ్‌ బ్యూటీలు హాజరయ్యారు. టీమిండియా మాజీ క్రికెటర్లు సెహ్వాగ్‌, కైఫ్‌, జహీర్‌ ఖాన్‌తో పాటు ప్రస్తుత క్రికెటర్లు రోహిత్‌ శర్మ, ఇషాంత్‌ శర్మ, కరీబియన్‌ క్రికెటర్లు క్రిస్‌ గేల్‌, డ్వేన్‌ బ్రావో సైతం హాజరయ్యారు.
భారత్‌లోనే టాప్‌ క్లాస్‌ మోడల్స్‌తో పాటు, క్రికెటర్లు సైతం ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. ర్యాంప్‌ వాక్‌లో యువరాజ్‌ సింగ్‌ ప్రియురాలు హేజిల్‌ కీచ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్‌ బ్యూటీలు దీపికా పదుకొనే, కాజోల్‌, నేహా ధూపియా, సయామీ ఖేర్‌తో పాటు యువరాజ్‌ సింగ్‌ సన్నిహితులందరూ 'యువీ కెన్‌ ఫౌండేషన్‌' విజయవంతమవ్వాలని...ఫ్యాషన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

17:32 - September 5, 2016

వరంగల్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదివాసీ రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. వరంగల్ జిల్లాలోని కేసముద్రం మండలంలో అటవీశాఖ అధికారులు ధ్వంసం చేసిన పంట పొలాలను వామపక్ష పార్టీ నాయకులు సందర్శించారు. గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని వామపక్ష నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాల భూముల్లో గిరిజనులు సాగులు చేసుకుంటున్నారని తమ్మినేని తెలిపారు. సాగు చేసే భూములకు పట్టాలివ్వాలని చట్టం వచ్చిందని, ఈ చట్టం వచ్చి పదేళ్లు దాటిందన్నారు. సాగులో ఉన్న భూమి పది ఎకరాలకు తక్కువ కాకుండా ఇవ్వాలని ఉందన్నారు. 

17:29 - September 5, 2016

నిజామాబాద్‌ : జిల్లాలో గత ఐదు సంవత్సరాల నుంచి భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రవితేజ గణేష్ మండపం నిర్వాహకులు. 54 అడుగుల మట్టి విగ్రహానికి 11 రోజులు పూజల అనంతరం వినాయకుడిని విగ్రహ ఏర్పాటు ప్రాంగణంలోనే నిమజ్జనం చేస్తారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

17:26 - September 5, 2016

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడలా వినూత్న రీతిలో గణనాథులు పూజలందుకుంటున్నారు. ఉదయం నుంచే భక్తి ప్రవత్తులతో గణనాథులను పూజిస్తున్నారు. మరికొందరేమో మేళతాళాలతో 'గో గ్రీన్‌ గణేశా' అంటూ సందడి చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వినాయకుడు వాడవాడలా కొలువుదీరుతున్నాడు. భజనలు, పాటలతో భక్తులు గణేశ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రజలంతా.. చవితి పర్వదినాన్ని కోలాటాలు.. ఆటపాటలతో.. అనందోత్సాహాలు, భక్తిప్రపత్తుల నడుమ జరుపుకుంటున్నారు.

ఖమ్మం జిల్లా భద్రాచలంలో వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉద్యోగుల ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. పట్టణంలోని వివిధ కాలనీల్లో.. చలువపందిళ్లు వేసి.. గణనాథుని విగ్రహాలను ప్రతిష్ఠించి విశిష్ట పూజలు నిర్వహిస్తున్నారు. అటు ఆదిలాబాద్ జిల్లాలోను గణనాథుడి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు గణనాథులకు పూజలు చేసి నవరాత్రులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రి జోగు రామన్న, మున్సిపల్‌ చైర్మన్‌ రంగినేని మనీషా పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడాలంటూ.. మట్టి వినాయకులను పంపిణీ చేశారు. రంగురంగుల పూలతో విద్యార్థులు తయారుచేసిన గణనాథులు అలరించాయి.  ఉత్తర తెలంగాణ కేంద్రమైన వరంగల్ జిల్లాలోను గణనాథులు వినూత్నరీతిలో పూజలందుకుంటున్నారు. విగ్రహాల కొనుగోళ్లతో వీధులన్ని సందడిగా మారాయి. నగరంలో ఎటుచూసినా వెరైటీ మంటపాలలో కొలువుదీరిన విగ్రహాలు అలరిస్తున్నాయి. కాజీపేటలోని శ్వేతార్క గణపతి ఆలయానికి భక్తులు పోటెత్తారు.  కరీంనగర్ జిల్లాలోనే గణనాథులు విశేష పూజలందుకుంటున్నారు. వాడవాడలా గణనాథులు కొలువుదీరడంతో జిల్లా అంతా సందడి వాతావరణం నెలకొంది. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ రకాల మండపాలలో కొలువుదీరుతున్నాడు లంబోదరుడు.

వెరైటీ...
హైదరాబాద్‌లో వెరైటీ వినాయకుడు పూజలందుకుంటున్నాడు. కూకట్‌పల్లిలో పినాకిల్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీ ఆధ్వర్యంలో విద్యార్థులు 40 కిలోల కేకుతో బాల గణపతి విగ్రహాన్ని రూపొందించారు.పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కేకు, చెర్రీ పళ్లు, కోకోనట్‌ పౌడర్లను ఉపయోగించి తయారు చేసిన ఈ వెరైటీ వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. నిజామాబాద్ జిల్లాలోను వినాయకుడు తొలిపూజలు అందుకుంటున్నాడు. జిల్లావ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 5 వేలకు పైగా భారీ విగ్రహాలు జిల్లాలో కొలువుదీరాయి.  మహబూబ్‌నగర్ జిల్లాలోను నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు ఉదయం నుంచే విఘ్నాలను తొలగించాలంటూ గణపతికి పూజలు చేస్తున్నారు.  అటు నల్లగొండ జిల్లాలోను గణేశ్‌ నవరాత్రి ఉత్సావాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు మట్టిగణనాథులకే జై కొడుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్‌ పారిస్‌ వద్దు మట్టి గణనాథులే ముద్దు అంటూ ప్రచారం చేస్తున్నారు పర్యావరణ ప్రేమికులు. దీనికి విశేష స్పందనే లభించింది. మొత్తానికి పల్లె.. పట్నం అన్న తేడా లేకుండా భక్తులు.. తెలంగాణవ్యాప్తంగా వినాయకచవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. గల్లీ.. గల్లీలో గణనాథుడి నామస్మరణలు.. భజనలు మార్మోగుతున్నాయి. 

17:22 - September 5, 2016

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణనాథుడు తొలి పూజ అందుకున్నాడు. ఎప్పటిలాగే తనదైన ప్రత్యేకతతో మహా గణపతి.. శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర రూపంలో దర్శనమిస్తున్నారు. తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ దంపతులు వినాయకుడికి తొలి పూజలు నిర్వహించారు. ఈ భారీ వినాయకుడిని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో ఖైరతాబాద్‌కు తరలివస్తున్నారు. ఖైరతాబాద్‌లో కొలువుతీరిన 58 అడుగుల భారీ వినాయకుడు శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. విగ్రహానికి కుడి వైపు తిరుపతి బాలాజీ, ఎడమవైపు గోవర్థనగిరీ ప్రతిమలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. ఉదయం ఖైరతాబాద్‌ వినాయకుడికి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు తొలి పూజ నిర్వహించారు. ప్రజలందరికీ శుభం కలగాలని గవర్నర్‌ నరసింహన్‌ ఆకాంక్షించారు. గవర్నర్‌ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. ఖైరతాబాద్‌ వినాయకుడికి ఎంతో ప్రత్యేకత ఉందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఎంతో చరిత్ర ఉన్న ఖైరతాబాద్ భారీ వినాయకుడిని చూడడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. జై బోలో గణేష్‌ మహారాజుకి జై అంటూ ఖైరతాబాద్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 

17:19 - September 5, 2016

హైదరాబాద్ : కొండంత భక్తిభావంతో .. వినాయకుణ్ని కొలుస్తోందా ఆ భక్తురాలు. వినాయకచవితి రోజుల్లోనే కాదు.. నిరంతరం ఏకదంతుని ధ్యాసలోనే ఉంటుంది. ఇంట్లో ఉన్నా .. ఊరుకెళ్లినా.. గణపతి విగ్రహం కనబడితే చాలు.. కొనితెచ్చి ఇంట్లో పెట్టి .. లంబోధరునిపై ఉన్న భక్తిభావాన్ని చాటుకుంటోంది హైదరాబాద్‌కు చెందిన అరుణ. మనసంతా నిండిన భక్తిభావంతో .. ఇల్లంతా గణేశుని ప్రతిమలతో నింపేసింది.. ఈ భక్తురాలు.. విఘ్నలు రాకుండా చూడాలని.. విఘ్ననాయకుణ్ని ఇష్టదైవంగా కొలుస్తోంది.. హైదరాబాద్‌ బేగంపేటకు చెందిన అరుణకు గణపతి అంటే అత్యంతప్రేమ..భక్తిభావం. ఎక్కడికి వెళ్లినా వినాయకుడి ప్రతిమతను కొనో ఇలా ఇంటికి తెచ్చుకుంటారీమె. ఇలా 14ఏళ్లుగా 300 రకాలకు పైగా వందలాది విగ్రహాలను సేకరించి ఇంటికి తెచ్చానంటున్నారు అరుణ. గణేశుని విగ్రహాల సేకరణను హాబీగా మార్చుకున్నాని చెబుతున్న అరుణ.. తాను సేకరించిన వివిధ రకాల విగ్రహాలతో భవిష్యత్తులో ప్రదర్శనను ఏర్పాటు చేస్తానంటున్నారు. వక్రతుండునిపై ఉన్న వల్లమాని భక్తిని ఇలా విగ్రహాల రూపంలో ప్రదర్శిస్తూ.. భక్తిపారవశ్యాన్ని పొందుతున్నారు బేగంపేటకు చెందిన అరుణ.

17:09 - September 5, 2016

రేపు జిల్లా కలెక్టర్లతో భేటీ కానున్న సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. సీఎస్ రాజీవ్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా సమావేశం కానుంది. ఉద్యోగుల సర్దుబాటు, భవనాలు..వసతుల ఏర్పాటుపై చర్చించనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు..అభ్యంతరాలపై చర్చించనున్నారు. 

ఢిల్లీకి బయలుదేరిన మోడీ..

చైనా : హాంగ్‌ఝౌ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ బయల్దేరారు. వియత్నాం పర్యటన ముగించుకుని జీ20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు మోడీ చైనా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ జీ20 దేశాల సదస్సులో పాల్గొన్నారు. ఆయా దేశాల ప్రధానులు, అధ్యక్షులతో మోడీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

మారికో మక్రీకి మోడీ ధన్యవాదాలు..

చైనా : హోంగ్‌ఝౌలో జరుగుతున్న జీ20 దేశాల సదస్సు సందర్భంగా అర్జెంటీనా అధ్యక్షుడు మారికో మక్రీతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వానికి మద్దతు తెలిపినందుకు మారికో మక్రీకి మోడీ ధన్యవాదాలు చెప్పారు.

 

జమ్మూలో అఖిలపక్ష బృందం పర్యటన..

జమ్మూ కాశ్మీర్ : అఖిలపక్ష బృందం జమ్మూలో పర్యటించింది. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు హోటళ్లు, ట్యాక్సీ ఆపరేటర్ల సంఘాల ప్రతినిధులు కలిశారు. 

16:53 - September 5, 2016

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' సతీమణి స్నేహారెడ్డి కూడా బిజినెస్ రంగంలో అడుగు పెట్టారు. ఏదో హోటల్..క్లాత్ షోరూం..ఆభరణాలు...ఇతర వ్యాపార రంగంలో కాకుండా ఇతర రంగంలో అడుగు పెట్టారు. 'పికాబో' అనే పేరిట ఫొటో స్టూడియోను ప్రారంభించింది. ఈ విషయాన్ని 'అల్లు అర్జున్' ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. క్యాండిడ్ ఫొటోల్ని తీయ‌డం ప్ర‌త్యేక‌త‌. జీవితంలోని మధురక్షణాలు..సందర్భాలను ఈ స్టూడియో అద్భుతంగా ఫొటో తీస్తుందంటూ ట్వీట్ చేశారు. ఫొటోల్ని ఓ మ‌ధుర జ్ఞాప‌కంలా మారుస్తూ అంద‌మైన ఆల్బ‌మ్‌లు త‌యారు చేయించి ఇస్తుంటారు. 'పికాబో' స్టూడియో తీసిన కొన్ని ఫొటోల కొలేజ్ ను 'బన్నీ' పోస్టు చేశారు. అల్లు అర్జున్ త‌న భార్య గ‌ర్భంతో ఉంద‌న్న విష‌యం..ఇతర ఫొటోలు అందులో ఉన్నాయి. ఇదిలా ఉంటే 'అల్లు అర్జున్' ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో 'డీజే (దువ్వాడ జగన్నాథమ్) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'బన్నీ'తో మరోసారి 'కాజల్' జత కట్టనున్నట్లు సమాచారం. 

16:25 - September 5, 2016
16:24 - September 5, 2016

విజయవాడ : 11 రోజుల పాటు ఘనంగా పూజలు నిర్వహిస్తామని డూండీ గణేష్ ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షురాలు బోండా ఉమ పేర్కొన్నారు. విజయవాడ నగరంలో 72 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుండే విగ్రహాన్ని చూడటానికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో బోండా ఉమ మాట్లాడారు. ప్రతి రోజు పలువురు ప్రజాప్రతినిధులు విగ్రహాన్ని సందర్శించడం జరుగుతుందని, సీఎం చంద్రబాబు నాయుడు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రసాదం..మంచినీళ్లు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. చివరి రోజున ప్రజలందరి సమక్షంలో మంచినీటితో వినాయకుడిని కరిగించడం జరుగుతుందని పేర్కొన్నారు. 

16:23 - September 5, 2016
16:10 - September 5, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి పట్టుకుని ఏకవచనంతో సంబోధిస్తే నడిరోడ్డుపై నాలుక చీరేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. జిల్లాల విభజనపై కాంగ్రెస్ అధికార పార్టీపై పలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి తలసాని సోమవారం మీడియాతో మాట్లాడారు. జిల్లాలపై ఎప్పుడైనా అధ్యయనం చేశారా ? అని ప్రశ్నించారు. గద్వాలా..జనగామ .జిల్లాలు చేయాలని అఖిలపక్షం సమావేశంలో ఎందుకు చెప్పలేదని నిలదీశారు. సిరిసిల్లను కూడా జిల్లా చేయాలని డిమాండ్ ఉన్నా పాలనా సౌలభ్యం కోసం పెద్దపల్లిని జిల్లా చేయడం జరుగుతోందన్నారు.

 

పాక్ పై మోడీ మండిపాటు..

చైనా : జీ 20 సదస్సులో పాక్ పై భారత ప్రధాని మండిపడ్డారు. దక్షిణాసియాలో ఓ దేశం ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తోందని, ప్రపంచం అంతా ఒకటై ఉగ్రవాదంపై పోరాడాలని సూచించారు. 

15:56 - September 5, 2016

తాగండి..అంటే ఏదో అనుకోకండి..జ్యూస్ లు...వీటిని సేవించడం వల్ల బరువు తగ్గిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. జ్యూస్ లతో కూడా ఎన్నో ప్రయోజనాలు దాగుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా అందరూ స్థూలకాయంతో బాధపడుతున్నారు. తింటున్న ఆహారం ఈ మార్పులకు కారణమవుతోంది. అయితే శరీర బరువును తగ్గించుకునేందుకు రకరకాల ఎక్సర్‌ సైజులతో పాటు ఆహారపదార్ధాలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే చాలా మందికి పండ్లు తినడం ఇష్టము ఉండదు. బరువు తగ్గించే జ్యూస్‌ లు కూడా ఉన్నాయి. అవేంటంటే…
కీరదోస..టమోట...క్యారెట్..బీట్ రూట్..యాపిల్..నిమ్మకాయ..పుచ్చకాయ..జ్యూస్ లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశాలున్నాయి.
ఉదయం ఆరు గంటలకు లేవగానే కొత్తిమీర జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తీసుకోవాలి.
అనంతరం 11గంటలకు ఓ గ్లాస్ బత్తాయి రసం..మధ్యాహ్నం 1గంటకు బొప్పాయి జ్యూస్ రెండు గ్లాసులు తీసుకోవాలి.
ఇక సాయంత్రం 4గంటలకు కమలాపండ్ల రసం ఒక గ్లాస్ తీసుకోవాలి.
రాత్రి 8గంటలకు కీరదోసకాయ జ్యూస్ చివరగా పడుకొనే ముందు ఓ గ్లాస్ మజ్జిగ తీసుకుని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గే అవకాశాలున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. సో..ట్రై చేసి చూడండి..

15:48 - September 5, 2016

మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రామ్ చరణ్'కి ఈసారి దసరా సెంటిమెంట్ వర్కవుట్ కాదేమో అనిపిస్తోంది. ఆయన నటించిన గత చిత్రాలు దసరా సందర్భంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. గతేడాది దసరాకు విడుదలైన 'బ్రూస్ లీ' బాక్సాపీస్ వద్ద బొక్కబోర్ల పడిన సంగతి తెలిసిందే. అయినా కూడా 'చెర్రీ' మరోసారి దసరాను టార్గెట్ చేశాడు. ఇదిలా ఉంటే ఈసారి 'ధృవ' వెనక్కి వెళుతున్నట్లు టాలీవుడ్ టాక్. 'తనీ ఒరువన్' ను తెలుగులో 'ధృవ' పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పైనే మెగా అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. దసరాకు కానుకగా అక్టోబర్ 7న విడుదలవుతుందని అందరూ ఆశించారు. కానీ 'ధృవ' దసరా బరిలో నిలిచే సూచనలు కనిపించడం లేదని టాక్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వల్లే రిలీజ్ లో ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. తొందరపడకుండా లేటైనా కాస్త టైమ్ తీసుకుని పక్కాగా పూర్తి చేయాలని నిర్మాత అల్లు అరవింద్ అనుకుంటున్నారని తెలుస్తోంది. దసరాకు వస్తాడా ? దీపావళికి వస్తాడా ? అనేది చూడాలి. 

15:39 - September 5, 2016

'మంచు లక్ష్మీ' ప్రధాన పాత్రలో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో 'లక్ష్మీ బాంబ్' చిత్రం రూపొందుతోంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. మంచు లక్ష్మీ జడ్జీ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కుల భరతం పట్టడానికి..న్యాయాన్ని కాపాడటానికి ఓ మహిళ ఏం చేసిందన్నదే కథాంశంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. తాను ఈ చిత్రంలో చాలెజింగ్ పాత్ర చేస్తున్నానని ఇటీవలే మంచు లక్ష్మి పేర్కొన్న సంగతి తెలిసిందే. క్లైమక్స్ లో మంచు మనోజ్ ఆధ్వర్యంలో ఫైట్ ను చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. 

అడ్డొస్తే లోపల వేస్తాం - మంత్రి తలసాని...

హైదరాబాద్ : జిల్లాల విభజన తమ ఇష్టానుసారం చేయలేదని టి.మంత్రి తలసాని పేర్కొన్నారు. మా కార్యక్రమాలకు అడ్డొస్తే లోపల వేస్తామని ప్రతిపక్ష నేతలను హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని, తమకు సంస్కారం ఉన్నందుకే తెలంగాణ ఇచ్చిన సోనియాకు సీఎం అసెంబ్లీలో కృతజ్ఙతలు చెప్పారని తలసాని గుర్తు చేశారు. 

ఎన్జీటీలో పోలవరం కేసుపై విచారణ...

ఢిల్లీ : పోలవరం కేసుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై స్టే విధించాలని మధ్యంతర పిటిషన్ ను రేలా స్వచ్చంద సంస్థ దాఖలు చేసింది. గతంలోనూ ఒడిశా వాసి దరిలింగా పిటిషన్ దాఖలు చేశారు. పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్స్ ను ఎందుకు పొడిగిస్తున్నారని ఏపీనీ ఎన్ జీటీ ప్రశ్నించింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని ఎన్జీటీ దృష్టికి ఏపీ తెచ్చింది. పోలవరం నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఇవ్వడంపై రెండు వారాల్లోగా వైఖరి తెలపాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆదేశించింది. తదుపరి విచారణనను అక్టోబర్ 19వ తేదీకి వాయిదా వేసింది.

 

కాణిపాకం ఆలయానికి పోటెత్తిన భక్తులు...

చిత్తూరు : కాణిపాకం వరసిద్ధి వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. కాణిపాకం ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నారు. స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లో భక్తులు భారీగా వేచి ఉన్నారు. వీఐపీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాబుకు నారాయణ లేఖ...

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడికి సీపీఐ నేత నారాయణ లేఖ రాశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఎంబీబీఎస్ బీ కేటగిరి సీట్ల కౌన్సెలింగ్ లో రూ. 500 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కౌన్సెలింగ్ ను రద్దు చేసి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

మంచిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు - మల్ రెడ్డి...

హైదరాబాద్ : మంచిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. నయీంతో సంబంధాలు కప్పిపుచ్చుకోవడానికి తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. నయీంతో సంబంధాలు లేవంటున్న వ్యక్తి ఆయన అనుచరుడు శ్రీహరితో ఆదిభట్లలో భూమి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటాడని ప్రశ్నించారు. నయీంతో కలిసి సంపాదించిన ఆస్తులు బయటపడుతాయనే మంచిరెడ్డి టీఆర్ఎస్ లో చేరాడని పేర్కొన్నారు. మంచిరెడ్డిని అరెస్టు చేసేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 

సందీప్ కుమార్ కు పోలీసు కస్టడీ..

ఢిల్లీ : ఆప్ మాజీ మంత్రి సందీప్ కుమార్ కు మూడు రోజుల పాటు పోలీసు కస్టడీ కోర్టు విధించింది. సెక్స్ సీడీ స్కాంలో ఆయన ఇరుక్కున్న సంగతి తెలిసిందే. 

రేపు ఉదయం ఏపీ కేబినెట్ మీటింగ్...

విజయవాడ : రేపు ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అనంతరం సాయంత్రం 4గంటలకు సీఎంతో టిడిపి స్ట్రాటజీ కమిటీ భేటీ కానుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనుంది. 

కొనసాగుతున్న కావేరీ నది జలాల వివాదం..

ఢిల్లీ : కావేరీ నదీ జలాలలపై వివాదం కొనసాగుతోంది. నీటి విడుదలపై కర్ణాటక వాదనలు సుప్రీంకోర్టు తిరస్కరించింది. తమిళనాడుకు 15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సుప్రీం ఆదేశించింది. పది రోజుల పాటు నీరు విడుదల చేయాలని పేర్కొంది. 

14:30 - September 5, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కోరుతూ కొందరు ప్రైవేటు వ్యక్తులు రూపొందించిన సాంగ్‌ యూ ట్యూబ్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. హోదా అంశాన్ని మరిచి పోవద్దంటూ ఇందులో ప్రధాని మోదీకి, ఏపీ సీఎం చంద్రబాబుకు, పవన్‌ కల్యాన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ సాంగ్‌కు 65 వేలకు పైగా లైక్‌లు కూడా వచ్చాయి. 

14:28 - September 5, 2016

విజయవాడ : భవానీపురం కరకట్టవాసులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇళ్లు బలవంతంగా ఖాళీ చేయిస్తుండడంతో 72 కుటుంబాలు హైకోర్టుకు వెళ్లాయి. దీంతో మున్సిపల్‌ సిబ్బంది వారిపట్ల నిరంకుశంగా వ్యవహరించారు. వాటర్‌, కరెంట్‌ సప్లైని నిలిపివేశారు. విద్యుత్‌, నీటి సరఫరా పునరుద్ధరించాలన్న హైకోర్టు ఆదేశాలను అధికారులు బేఖాతర్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా వినాయకచవితి పండుగ సందర్భంగా అధికారులకు బుద్ధిని ప్రసాదించాలని వినాయకుడికి పూజలు నిర్వహించారు. విద్యుత్..నీటి సరఫఱా పునరుద్ధరించాలని గణపయ్యకు విన్నపాలు చేశారు. 

14:11 - September 5, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి...టిడిపి నుండి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఇరువురు నేతలు ఆరోపణలు గుప్పిస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవలే ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీంతో మంచిరెడ్డికి సంబంధాలున్నాయని, వేల కోట్లు సంపాదించాడని మల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీనికి సంబంధించిన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. దీనిపై మంచిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, ఇబ్రహింపట్నంకు రావాలని సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించేందుకు మల్‌రెడ్డి సిద్దమా? ఇబ్రహీంపట్నం చౌరస్తాలో చర్చకు వస్తావా ? అని మంచిరెడ్డి సవాల్‌ విసిరాడు. రాజకీయ లబ్ధి కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని.. ఒకవేళ ఆరోపణలు నిరూపించకపోతే మల్‌రెడ్డి రాజకీయ సన్యాసం చేస్తాడా ? అని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. దీనితో సోమవారం మధ్యాహ్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రహింపట్నంకు వచ్చారు. ఈసందర్భంగా మంచిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని తాను ఇక్కడకు రావడం జరిగిందన్నారు. ఎలాంటి తప్పులు..అవకతవకలు చేయలేదని, పది గంటల నుండి పన్నెండు గంటల వరకు కూర్చొంటానని చెప్పడం జరిగిందన్నారు. ఆధారాలు బయటపెట్టాలని, లేనిపక్షంలో రాజకీయ సన్యాసం తీసుకోవాలని మల్ రెడ్డికి సూచించారు. ఒక ప్రజాప్రతినిధిగా..శాసనసభ్యుడిగా ఉన్న తనపై అవాక్కులు..చెవాక్కులు పేలడం సరికాదని, సుమోటోగా చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మల్ రెడ్డి రంగారెడ్డి నల్గొండకు రావాలని సవాల్ విసిరినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ భేటీ కావడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

నిన్న మల్ రెడ్డి ఏమన్నారు ? 
నిన్న మల్‌రెడ్డి రంగారెడ్డి... మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గ్యాంగ్‌స్టర్‌ నయీంతో కలిసి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డాడని రంగారెడ్డి ఆరోపించారు. తమ దగ్గర అందుకు సంబంధించిన పత్రాలున్నాయని.. వీటిని దర్యాప్తు సంస్థ సిట్‌కు ఇచ్చామని తెలిపారు. దాదాపు రెండువందల కోట్లు కొల్లగొట్టిన కిషన్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేయడం లేదని మల్లారెడ్డి ప్రశ్నించారు. 

యాక్టర్ పృథ్వీకి స్వల్పగాయాలు..

హైదరాబాద్ : కామెడీ యాక్టర్ పృథ్వీకి స్వల్ప గాయాలయ్యాయి. రోప్ షాట్ లో పృథ్వీ జారిపడ్డాడు. ప్రమాదం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. క్షేమంగానే ఉన్నానని ఫేస్ బుక్ లో పృథ్వీ పోస్టు చేశారు. 

13:52 - September 5, 2016

మెదక్‌ : వాడవాడలా వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది భక్తులు మట్టి వినాయకులను పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రసాయనాలతో తయారుచేసే విగ్రహాల వల్ల కలిగే అనర్ధాలపై జన విజ్ఞాన వేదిక ప్రజల్లో అవగాహన కలిగించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్టు వారి సహాయంతో గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కెమికల్స్ తో తయారు చేసిన విగ్రహాలకు పూజలు చేసి ఉత్సవాల అనతరం వాటిని నీటిలో నిమజ్జనం చేస్తే దాంతో నీరు కలుషితమయ్యే ప్రమాదముందని జన విజ్ఞాన వేదిక నేత సత్యం పేర్కొన్నారు. 

ఆర్ బీఐ గవర్నర్ గా పటేల్..

ముంబై : ఆర్ బీఐ 24వ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రఘురాం రాజన్ మూడేళ్ల పదవీ కాలం ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిలందే. 2013 జనవరి నుండి ఉర్జిత్ పటేల్ ఆర్బీఊ డిప్యూటి గవర్నర్ గా ఉన్నారు. 

ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ప్రధానోత్సవం..

ఢిల్లీ : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయులు 2015 అవార్డు ప్రధానోత్సవం జరుగుతోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఉపాధ్యాయులు అవార్డులు అందుకున్నారు.

 

మంగళగిరిలో కేంద్ర బృందం పర్యటన..

గుంటూరు : మంగళగిరిలో కేంద్ర బృందం పర్యటించింది. ఎయిమ్స్ స్థలాన్ని బృందం పరిశీలించింది. జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఎయిమ్స్ నిర్మాణానికి సంబంధించి ఈనెలలో గ్లోబల్ టెండర్లు పిలిచి డిజైన్ ఖరారు చేస్తామని బృందం తెలిపింది. 2019 నాటికి ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొంది.

 

13:48 - September 5, 2016

తమిళనాడు : దేశవ్యాప్తంగా గణనాధులు కొలువుతీరుతున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రూపంలో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేశారు. చెన్నై టీ-నగర్‌లో ఏర్పాటు చేసిన వెరైటీ వినాయకుడు అందరినీ ఆకర్షిస్తోంది. గత 26 సంవత్సరాలుగా వెరైటీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న టీ-నగర వినాయక ఉత్సవ కమిటీ.. ఈసారి తీపి బండారాలతో గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని.. సముద్రంలోని జీవచలరాశులకు ఆహారం అందించాలనే ఉద్దేశంలో ఇలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. 

అందుకే నేతల రాద్ధాంతం - హరీష్...

మెదక్ : కొత్త జిల్లాల ఏర్పాటుతో కేసీఆర్ కు మరింత పేరొస్తుందని, అందుకే కాంగ్రెస్, టిడిపి నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. 50 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ జిల్లాల పునర్ విభజన ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే ఉత్తమ్, డీకే అరుణలు దీక్షలు చేపట్టారని విమర్శించారు. దసరా రోజు జిల్లాల ఏర్పాటు ఉత్సవాలను అడ్డుకొంటే కాంగ్రెస్ నేతలను ప్రజలు క్షమించరని విమర్శించారు. 

13:46 - September 5, 2016

హైదరాబాద్ : గాంధీభవన్‌లో టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వినాయకచవితి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలందరికీ ఉత్తమ్‌ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ ఎలాంటి విఘ్నాలు లేకుండా అంతా శుభం జరగాలని ఆయన ఆకాంక్షించారు.


ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో వినాయకచవితి వేడుకలు..
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరిగాయి. నేతలంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నాలన్నీ తొలగి 2019లో తెలంగాణ అధికార పగ్గాలు చేపట్టే విధంగా చూడాలని దేవుడ్ని కోరుకున్నట్లు ఎల్‌.రమణ తెలిపారు.

లోటస్ పాండ్ లో చవితి వేడుకలు..
హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో పాటు పలువురు నేతలు ప్రత్యేక పూజలు చేశారు.

రాజ్ భవన్ లో చవితి వేడుకలు..
ఢిల్లీ ఏపీ భవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బీజేపీ కార్యాలయం వినాయకుడి వేడుకలు..
బీజేపీ కార్యాలయంలోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, పార్టీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు.

 

13:41 - September 5, 2016

హైదరాబాద్ : ప్రజలందరికీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్‌ వినాయకుడికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా తలసాని తెలిపారు.

13:35 - September 5, 2016

మాజీ రాష్ట్రపతి, తాత్వికవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహిళా టీచర్ల సమస్యలేంటి? వారు కోరుకుంటున్న పరిష్కారాలేంటి? ఈ అంశంపై వేదిక చర్చను చేపట్టింది. ఈ చర్చలో మల్లీశ్వరి (తెలంగాణ ఉమెన్స్ టీచర్స్ ఫెడరేషన్),శాంతి( జాహ్నవి ఉమెన్స్ కాలేజ్) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:57 - September 5, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలోని పాలకొల్లులో 60 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. 15 రోజుల పాటు కష్టపడి ఈ మట్టి విగ్రహాన్ని తయారుచేశారు. రెల్లీ కుల యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ గణనాథుడి విశేషాలను మరింతగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

కశ్మీర్ భారత్ లో అంతర్భాగమంటున్న మంత్రి..

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ నాడు, నేడు, ఎప్పుడూ కూడా భారతదేశంలో అంతర్భాగమేనని.. అందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. ఇక ఎప్పటికీ కూడా జమ్ము భారత్ లో అంతర్భాగంగానే ఉంటుందన్నారు. కశ్మీర్ అంశాన్ని పార్లమెంట్ తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ లో పర్యటించిన అఖిలపక్ష బృందం స్థానిక నేతలతో మాట్లాడిందని చెప్పారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డా.సంజయ్ రాయ్ నేతృత్వంలో కశ్మీర్ సమస్యల పరిష్కారానికి నోడల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

12:30 - September 5, 2016

పెళ్లిచూపులు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న కమేడియన్ ప్రియదర్శితో టెన్ టీవీతో ప్రత్యేక లైవ్ షోను నిర్వహించింది. మరి ప్రియదర్శి వినాయక చవితి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..చిన్నప్పటి నుండి తమ ఇంట్లో మట్టి వినాయుడ్నినే పూజించేవారమని ప్రియదర్శి తెలిపారు. 'నా చావు నేను ఛస్తా నీకెందుకు'అనే టైటిల్ తో ఓ పుస్తకం రాద్దామనుకుంటున్నానని కమెడియన్ ప్రియదర్శి తెలిపాడు...మరి ప్రియదర్శి ఏమేమి విశేషాలను అభిమానులతో పంచుకున్నారో తెలుసుకోవాంటే ఈ వీడియోను చూడండి..మరిన్ని విషయాలను తెలుసుకోండి..

జీఎస్టీ సాహమంటున్న అమెరికా అధ్యక్షుడు..

ఢిల్లీ : జీఎస్టీ బిల్లుపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. ప్రస్తుతం జీ20 సమావేశాల్లో భాగంగా చైనాలో ఉన్న ఒబామా... నిన్న మోదీని కలిసిన సందర్భంగా జీఎస్టీని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో... పన్నుల సంస్కరణల విషయంలో ధైర్యంగా ముందుకెళ్లారని ఆయన మోదీని ప్రశంసించారు. జీఎస్టీ రూపంలో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని కూడా మోదీని ఒబామా కొనియాడారు.

11:56 - September 5, 2016
11:52 - September 5, 2016

చిత్తూరు : తిరుపతిలో పార్లమెంట్‌ తరహాలో సెట్‌ చేసిన వినాయక మండపం విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రత్యేక హోదా కావాలని వినాయకుడు డిమాండ్‌ చేయడం ఇక్కడ మరో విశేషం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఈ ప్రత్యేక హోదా గణనాథుడికి అంకురార్పణ చేశామని నిర్వాహకులు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి బుద్ధిని ప్రసాదించి కష్ట నష్టాలలో వున్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని ఈసందర్భంగా వారు డిమాండ్ చేశారు. కాగా గతంలో కూడా దేశంలో నెలకొన్న అధిక ధరలు వంటి పలు సమస్యలకు అద్దంపడుతున్నట్లు విగ్రహాలను తయారుచేయటం ఇక్క డి ప్రత్యేకగా నిర్వాహకులు తెలిపారు. దీనిపై మరింత సమచారం కోసం ఈ వీడియో చూడండి..

11:46 - September 5, 2016

విజయవాడ : దేశమంతా వినాయకచవిత సందడి నెలకొంది. విజయవాడలో 72 అడుగుల ఎత్తైన సిద్దిబుద్ది కైలాస మహాగణపతి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. చెన్నైకు చెందిన శిల్పి రాజన్‌ అత్యంత సుందరంగా తీర్చదిద్దారు. కాగా ఈ విగ్రహాన్ని పూర్తిగా మట్టితో తయారుచేశామని విగ్రహాన్ని రూపశిల్పి రాజన్ తెలిపారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..మరిన్ని విశేషాలను తెలసుకోండి..

11:38 - September 5, 2016

చిత్తూరు : కాణిపాకంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. మరోవైపు స్వామివారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం ధ్వజారోహనంతో బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు అంకురార్పణ చేయనున్నారు. 

27 కి.మీ రోడ్ ను తవ్వేసిన నక్సల్స్..

ఛత్తీస్‌గఢ్‌ : నక్సలైట్లు దుశ్చర్యలకు పాల్పడ్డారు. దంతేవాడ జిల్లాలోని పలు చోట్ల పోలీసు వాహనాలు తమ ప్రాంతాలకు రాకుండా ఉండేందుకు రోడ్లను తవ్వేశారు. నక్సలైట్లు వివిధ ప్రాంతాల్లో 150 ప్రాంతాల్లో 27 కిలో మీటర్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టారు. 

కాణిపాక గణపతికి పట్టువస్త్రాలు..

చిత్తూరు : కాణిపాకంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వినాయకుడిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. మరోవైపు స్వామివారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం ధ్వజారోహనంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు.

మహాగణపతికి గవర్నర్ దంపతులు పూజ ..

హైదరాబాద్: వినాయక ఉత్సవాల్లో భాగంగా గవర్నర్ నరసింహన్ దంపతులు ఇవాళ ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజలో పాల్గొననున్నారు. కాసేపట్లో మహా గణపతి వద్దకు 500కిలోల లడ్డూ ప్రసాదం చేరుకోనుంది. ఖైరతాబాద్ మహాగణపతికి పరంపరలో భాగంగా పద్మశాలి సంఘం ప్రతినిధులు 75అడుగుల నూలు కండువా, జంజం, పట్టువస్ర్తాలను సమర్పించారు. 

మహాగణపతికి తొలిపూజలందించిన గవర్నర్ దంపతులు..

హైదరాబాద్: వినాయక ఉత్సవాల్లో భాగంగా గవర్నర్ నరసింహన్ దంపతులు ఇవాళ ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజలో పాల్గొననున్నారు. కాసేపట్లో మహా గణపతి వద్దకు 500కిలోల లడ్డూ ప్రసాదం చేరుకోనుంది. ఖైరతాబాద్ మహాగణపతికి పరంపరలో భాగంగా పద్మశాలి సంఘం ప్రతినిధులు 75అడుగుల నూలు కండువా, జంజం, పట్టువస్ర్తాలను సమర్పించారు. 

10:17 - September 5, 2016

హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా నగరంలోని ఖైరతాబాద్ మహాగణపతిని తెలుగు రాష్ట్రాల గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా గవర్నర్ నరసింహన్ దంపతులు ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్ శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతికి తొలి పూజలందించారు. మహాగణపతికి పరంపరలో భాగంగా పద్మశాలి సంఘం ప్రతినిధులు 75అడుగుల నూలు కండువా, జంజం, పట్టువస్ర్తాలను సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ గవర్నర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. 58 అడుగుల ఎత్తులో, 28 అడుగుల వెడల్పుతో ప్రతిష్ఠించిన గణనాథుడు శాంకరి, సరస్వతీ దేవి సమేతుడై ఆరు చేతులతో శంఖ చక్ర గదాధారిగా భక్తులకు దర్శనమిస్తూ నయనానందం కలిగిస్తున్నాడు.

భారీగా తరలివస్తున్న భక్తులు..
58అడుగుల ఎత్తులో 28అడుగుల వెడల్పుతో శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా దర్శనమిస్తున్న ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

పాత కక్షలతో 17మందికి గాయాలు..

విజయనగరం : నెలిపర్తిలో ఇరువర్గాల మధ్య పాతకక్షలు భగ్గుమన్నాయి. చిన్న ఘర్షణతో మొదలైన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సాలూరు సీఐ జి.రామకృష్ణ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. 30న వాటర్‌ట్యాంక్‌ విషయమై ఇరు వర్గాల మధ్య తగాదా ఏర్పడ్డంతో రెండు వర్గాలమధ్య ఘర్షణ చోటుచేసుకుందని సీఐ తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని సీఐ పేర్కొన్నారు. 

ఆర్టీఎస్ కాలువలో అరుదైన చేప..

మహబూబ్‌నగర్ : వడ్డేపల్లి మండలం పెద తాండ్రపాడు శివారులోని ఆర్డీఎస్ కాలువలో అరుదైన చేప దొరికింది. గ్రామానికి చెందిన రైతు శంకర్ తన పొలానికి నీరు పెడుతున్న సమయంలో కాలువ తూము నుంచి ఇది బయటకు వచ్చింది. దాదాపు ఐదున్నర అడుగుల పొడవున్న దీనిని చూసిన శంకర్ తొలుత అది పాము అనుకుని భయపడ్డాడు. పాము కాదని నిర్ణయించుకుని తోటి రైతులతో కలిసి దానిని పట్టుకున్నారు. ఐదున్నర అడుగుల పొడవు, 15 కిలోల బరువున్న ఈ చేపను ‘ములుగు చేప’గా గుర్తించారు. ఇక అరుదైన ములుగు చేప దొరికిందన్న విషయం గ్రామస్తులకు తెలియడంతో దానిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

09:31 - September 5, 2016
09:30 - September 5, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని బోలాపూర్ లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బోలాపూర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది గణేషుడి లడ్డు. ఉత్సవాల అనంతరం ఈ లడ్డూని సొంతం చేసుకోవటానికి భక్తులు పోటీ పడతారు. లడ్డూ వేలంపాటలో  లక్షల రూపాయలు  బోలాపూర్ లడ్డూను దక్కించుకోవటానికి భక్తులు పోటీ పడతారు. ఈ లడ్డూను దక్కించుకుంటే వారి ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. 
2015లో రూ.10.32లు పలికిన లడ్డూ..
 గ్రామోత్సవం తర్వాత లడ్డూ వేలం నిర్వహించగా కళ్లెం మదన్ మోహన్ రెడ్డి రూ. 10.32 లక్షలకు అడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డూ ధర గతేడాది కన్నా రూ.82 వేలు ఎక్కువగా పలికింది. చివరి వరకు పోటాపోటీగా కొనసాగిన బాలాపూర్ లడ్డూ వేలంలో కళ్లెం మదన్ మోహన్ రెడ్డి,పోరేటి బ్రదర్స్ పోటీపడ్డారు. మొదటి సారిగా రూ.10 లక్షలు దాటిన లడ్డూ..బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ వేలంపాటలో మంత్రి మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.9.50 లక్షలు పలికింది. ఇలా లడ్డూని దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడతారు. బోలాపూర్ గణేషుడి ఉత్సవ విశేషాలను ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. ఈ వివరాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

09:24 - September 5, 2016

విజయవాడ : విజయవాడ భవానీపురం కరకట్టవాసులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇళ్లు బలవంతంగా ఖాళీ చేయిస్తుండడంతో 72 కుటుంబాలు హైకోర్టుకు వెళ్లాయి. దీంతో మున్సిపల్‌ సిబ్బంది వారిపట్ల నిరంకుశంగా వ్యవహరించారు. వాటర్‌, కరెంట్‌ సప్లైని నిలిపివేశారు. విద్యుత్‌, నీటి సరఫరా పునరుద్ధరించాలన్న హైకోర్టు ఆదేశాలను అధికారులు బేఖాతర్‌ చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ బాధితులు చేపట్టిన ఆందోళనకు సీపీఎం అండగా నిలిచింది. కరకట్ట వాసుల ఇళ్లు తీసుకోవాల్సి వస్తే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిండచంతోపాటు, ప్రత్యామ్నాయంగా ఇళ్లు నిర్మించుకోడానికి 100 గజాల స్థలం ఇవ్వాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. కరకట్ట వాసుల ఆందోళనకు మద్దతుగా ఈనెల 9న జాతీయ రహదారి దిగ్బంధించాలని నిర్ణయించారు.  

రాజకీయ కబాలి?!..

తమిళనాడు : తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై తమిళనాడులో మళ్లీ చర్చమొదలైంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందని ఆయన అభిమానులు చెబుతున్నారు. అబ్దుల్ కలాం విజన్ ఇండియా పార్టీ వ్యవస్థాపకుడు పొన్‌రాజ్‌తో రజనీకాంత్ భేటీ కావడాన్ని ఇందుకు కారణంగా చెబుతున్నారు. వీరిద్దరి కలయిక నేపథ్యంలో రజనీ రాజకీయ రంగప్రవేశంపై తమిళనాట మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

హైదరాబాద్ : వచ్చే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండడంతో ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడనుంది. అల్పపీడనం స్థిరంగా కొనసాగితే కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

కాసేపట్లో మహాగణపతికి గవర్నర్ పూజలు..

హైదరాబాద్ : ఖైరతాబాద్‌లో కొలువైన శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతికి గవర్నర్ దంపతులు మరికొద్ది సేపట్లో తొలిపూజలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటలకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు ఖైరతాబాద్ చేరుకుని భారీ గణపతికి పూజలు నిర్వహిస్తారు. ఆయన రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

08:40 - September 5, 2016

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి పండుగ భక్తులు విశేషంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో గణేషుడు వేడుకలు ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు. నగరవ్యాప్తంగా లెక్కవేస్తే వేలాదిగా విగ్రహాలు ప్రతీ గల్లీలోనూ దర్శనమిస్తూంటాయి. ఇలా ఎన్ని గణనాథులు వున్నా నగరంలో అతి ముఖ్యంగా ఖైరతాబాద్ గణపతి ఎప్పుడూ ప్రధాన ఆకర్షణగా వుంటాడు. పండుగకు దాదాపు మూడు నెలల ముందుగానే ఈ విగ్రహం ఏర్పాట్లు జరుగుతుంటాయంటే ఈ గణపయ్యకు ఎంతటి విశిష్టం వుంటుందో ఇట్లే తెలిసిపోతుంది కదా? ఒకో సంవత్సరం ఒకో అవతారంతో భక్తులను ఆకట్లుకుంటున్న ఖైరతాబాద్ గణేషుడు ఈ ఏడాది శ్రీశక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. 58 అడుగుల ఎత్తులో, 28 అడుగుల వెడల్పుతో ప్రతిష్ఠించిన గణనాథుడు శాంకరి, సరస్వతీ దేవి సమేతుడై ఆరు చేతులతో శంఖ చక్ర గదాధారిగా దర్శనమిస్తున్నాడు. ఈ గణేష్ మూర్తిని తయారుచేసేందుకు మూడు నెలలపాటు దాదాపు 150మంది కళాకారులు భక్తిప్రపత్తులతో శ్రమించి తయారు చేశారు.

మహాగణపతికి భారీ అలంకరణలు..
మహాగణపతికి 75 అడుగుల నూలు కండువా, జంధ్యం, పట్టువస్ర్తాలను హెచ్‌ఎండీఏ కమిషనర్ టీ చిరంజీవులు, సీఐడీ ఏసీపీ ఎం శ్రీనివాస్, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ సురేంద్ర మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై సమర్పిస్తారని సంఘం అధ్యక్షుడు కడారి శ్రీధర్ తెలిపారు. మరి ఖైరతా బాద్ గణపయ్య పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

08:24 - September 5, 2016

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త జిల్లాల ప్రక్రియపై విమర్శలు, ఆందోళనలు, దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే గద్వాలను జిల్లాగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే.అరుణ, జనగామను జిల్లాగా ప్రకటించాలనీ..జిల్లాల విభజన ప్రక్రియ శాస్త్రీయంగా జరగలేదంటూ మరో కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య రెండురోజుల పాటు ఇందిరాపార్క్ లో దీక్షలు చేపట్టారు. ఇదేక్రమంలో టీ.టీడీపీ నేతల రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలకోసమే జిల్లాల పునర్విభజన జరుగుతోందంటూ విమర్శలు గుప్పింస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నిరసన ప్రక్రియలు ఎక్కడికక్కడ కొనసాగతున్నాయి..ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేట్టింది. ఈ చర్చలో వకుణాభరణం కృష్ణమోహన్ (టీఆర్ఎస్ అధికార ప్రతినిధి)అద్దంకి దయాకర్ (టా.జేఏసీ నేత) తెలకపల్లి రవి (ప్రముఖ రాజకీయ విశ్లేషకులు) దినకర్ (టీడీపీ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న నేతలు ఎటువంటి అభిప్రాయాలు తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి...సమగ్రసమచారం తెలుసుకోండి.

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు..

హైదరాబాద్: వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. బంగారు తెలంగాణ సాధనకు వినాయకుడి ఆశీస్సులు ఉండాలని సీఎం కేసీఆర్ ఆ దేవున్ని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ సకల విఘ్నాలు తొలిగించే దేవుడు విఘ్నేశ్వరుడన్నారు. వినాయకుడి ఆశీస్సులు మనందరిపై ఉంటాయని కాంక్షిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.

నేటి నుండే రిలయన్స్‌ జియో సేవలు..

హైదరాబాద్ : నేటి నుంచి రిలయన్స్‌ జియో సర్వీసులు ఆరంభం అయ్యాయి. 2 లక్షల స్టోర్లలో జియో సిమ్‌కార్డులు అందుబాటులో ఉంచారు. 10 కోట్ల మంది వినియోగదారులు లక్ష్యంగా కంపెనీ జియో సిమ్ కార్డులు విక్రయిస్తోంది.

08:16 - September 5, 2016

విజయవాడ : వినాయక చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో బొజ్జ గణపయ్య వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. భక్తులతో వినాయక ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత 30సంవత్సరాలుగా బీసెంట్ రోడ్ లో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే ఈ ఏడాదికూడా ఆలయ నిర్వాహకులు ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలను భక్తులు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. పలు సాంస్తృతిక కార్యక్రమాలను ఏర్పాట్లు చేశారు. మరి బీసెంట్ రోడ్ జరుగుతున్న గణేష్ ఉత్సవాల వేడుకలను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

ఏపీకి గుడ్ న్యూస్ ?!..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో తీపికబురు అందుతుందని, అయితే అదేదో ముందే తెలిస్తే అందులో ఉన్న మజా పోతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దేశాభివృద్ధి కోసం ఆలోచించడంలో విరామం ఉండదని పేర్కొన్న వెంకయ్య విభజన నష్టాన్ని పూడ్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తన శాఖ నుంచి రాష్ట్రానికి రూ.36 వేల కోట్లు మంజూరు చేస్తే కొందరు దానిని ముష్టి అంటున్నారని తెలిపారు. అటువంటి విషయాలను తాను పట్టించుకోబోనన్నారు. ఏపీకి హోదా ఇచ్చినా కేంద్రం నుంచి అందే సాయం మాత్రం పదేళ్లపాటు కొనసాగాలనదే తన అభిమతమని వివరించారు. 

31మంది ఉపాధ్యాయులకు అవార్డులు..

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 31మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. వీరిలో 17మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2016కు, మరో 14 మంది నేషనల్ ఫౌండేషన్ టీచర్స్ వెల్ఫేర్-2016 అవార్డుకు ఎంపిక అయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న రవీంద్రభారతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం కేసీఆర్ అవార్డులను ప్రదానం చేస్తారు. బంగారు పతకంతోపాటు శాలువా కప్పి సన్మానిస్తారు. అవార్డు కింద రూ.10 వేల నగదు పురస్కారాన్ని అందజేస్తారు.

07:34 - September 5, 2016

విఘ్నేశ్వరుడి పూజకు వినాయక మండపాలు ముస్తాబవుతున్నాయి. పత్రి మార్కెట్‌ లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడలో వినాయక చవితి ఉత్సవాలపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి...వినాయక చవితి విశిష్ఠతను తెలుసుకోండి.

07:30 - September 5, 2016

తూర్పుగోదావరి : ఈ నెల 9వ తేదీన కాకినాడలో జరగనున్న జనసేన బహిరంగ సభకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సభ కోసం జేఎస్టీయూ కాలేజీ గ్రౌండ్‌ను నాయకులు సిద్ధం చేస్తున్నారు. సభను జయప్రదం చేయడం కోసం జనసేన కార్యకర్తలు సమావేశమయ్యారు. సభను కనివీని ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు గ్రౌండ్‌లో భద్రత ఏర్పాట్లను జిల్లా పోలీస్ యంత్రాంగం పరిశీలించింది.

తిరుపతి సభలో నిప్పులు కురిపించిన జనసేన అధినేత 
కాకినాడలో జనసేన బహిరంగసభకు ప్రారంభమైన సన్నాహాలు. లడేంగే..లడేంగే..హమ్‌ జీతే తక్‌ లడేంగే అంటూ ప్రత్యేక హోదా సాధన కోసం...నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. గత నెల 28న జరిగిన జనసేన సభలో అందరికీ తనదైన స్టైల్లో చురకలంటించారు. అదే ఊపుతో.. సెప్టెంబర్‌-9న బహిరంగ సభను నిర్వహిస్తానని ఆరోజే ప్రకటించారు. దీంతో సభ ఏర్పాట్లకు ఆ పార్టీ కార్యకర్తలు చర్యలు చేపడుతున్నారు.

జనసేన సభ కోసం జేఎస్టీయూ కాలేజీ గ్రౌండ్‌ సిద్ధం
ఏపీకి ప్రత్యేక హోదాపై కొంతకాలం మౌనం వహించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన కార్యచరణ మూడు దశల్లో ఉంటుందని తిరుపతి వేధికగా ఇటీవలే ప్రకటించారు. అందులో భాగంగానే గత నెల 28న తిరుపతిలో సభ నిర్వహించారు. ప్రత్యేక హోదా కోసం...తాను, సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీ తిరుపతిలో చర్చించుకున్నామని..అందుకే ఇక్కడ సభ పెట్టానని స్పష్టం చేశారు. అలాగే తన తదుపరి సభ కాకినాడలో ఉంటుందని ప్రకటించారు. జనసేనుడి అభీష్టం మేరకు సభను జయప్రదం చేయడం కోసం జనసేన కార్యకర్తలు సమావేశమయ్యారు. సభను కనివీని ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

సభకు ఏర్పాట్లు చేస్తున్న కార్యకర్తలు
సభ ఏర్పాట్లకు సంబంధించి పనులను వేగవంతం చేసేందుకు జనసేన కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. మరోవైపు గ్రౌండ్‌లో భద్రత ఏర్పాట్లను జిల్లా పోలీస్ యంత్రాంగం పరిశీలించింది. జనసేనుడి గర్జనకు ఈసారి కాకినాడ వేదిక కానుంది.

07:17 - September 5, 2016

గుంటూరు : చిత్తూరులో దినేష్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌పై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు జరిపారు. ప్రస్తుతం దినేష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. రెండేళ్లుగా బెంగళూరులో దినేష్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. చిత్తూరులో తమకు ఎవరితో గొడవలు లేవని దినేష్‌ తల్లిదండ్రులు అంటున్నారు. దినేష్‌ పై కాల్పులు జరిపిన దుండగులు హిందీలో మాట్లాడినట్లు దినేష్‌ తల్లిదండ్రులు చెప్పడంతో... బెంగళూరు వ్యక్తులే కాల్పులకు తెగబడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

07:14 - September 5, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ సర్కార్‌కు కొత్త జిల్లాల సెగ తీవ్రమవుతోంది. ఇప్పటి వరకు స్థానికంగా జరుగుతున్న ఆందోళనలు ఇప్పుడు హైదరాబాద్ వేదికగా మరింత ముదురుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓవైపు టీ-టీడీపీ నేతలు విమర్శలు చేస్తుంటే..మరోవైపు కాంగ్రెస్ చేసిన రెండు రోజుల దీక్షలపై గులాబీ పార్టీ నేతలు మండి పడుతున్నారు.

జిల్లాల విభజనపై మండిపడుతున్న ప్రతిపక్షాలు
తెలంగాణాలో పాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలకు అదనంగా మరో 17 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముసాయిదాను విడుదల చేసింది. దీనికి సంబంధించిన కసరత్తు అధికారికంగా ఓ వైపు ముమ్మరంగా సాగుతోంది. అదే స్థాయిలో డిమాండ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో మండలాలు, డివిజన్లకు సంబంధించిన ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళలనలను మరింత తీవ్రతరం చేసేందుకు ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తూనే..దీక్షలను చేపట్టడం అధికార పార్టీకి మింగుడుపడటం లేదు.

రాజకీయ ప్రయోజనాలకోసమే జిల్లాల పునర్విభజన- రేవంత్‌ రెడ్డి
కొత్త జిల్లాల ఏర్పాటుపై టీ-టీడీపీ నేతలు విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలకోసమే జిల్లాల పునర్విభజన చేస్తున్నారని..టీడీపీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి విమర్శించారు.. ఇష్టంవచ్చినట్లుగా జిల్లాలను విడగొడుతున్నారని మండిపడ్డారు.. గద్వాల్‌, జనగామ ప్రాంతాలను ఎందుకు జిల్లాలు చేయరని ప్రశ్నించారు.

జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదు- డీకే అరుణ
మరోవైపు కాంగ్రెస్ నేతలు ఇందిరాపార్క్ దగ్గర చేసిన నిరసన దీక్షలు గులాబి పార్టీ నేతలను కదిలిస్తున్నాయి. జిల్లాల ఏర్పాటుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ నిప్పులు చెరిగారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని... జనగామ, గద్వాలను ప్రత్యేక జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వం కూలిపోయే వరకు పోరాటం చేస్తామన్నారు. ప్రజల అభిష్టం మేరకే జిల్లాల విభజన జరగాలని ఆమె సూచించారు.

సమాయత్తమవుతున్న ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు అధికార పార్టీ
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీ కవిత ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా స్పందిస్తున్నారు. ఇంకా మిగిలిన నేతలు ప్రతిపక్షాలపై విరుచుకు పడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

07:07 - September 5, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది శ్రీశక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. 58 అడుగుల ఎత్తులో, 28 అడుగుల వెడల్పుతో ప్రతిష్ఠించిన గణనాథుడు శాంకరి, సరస్వతీ దేవి సమేతుడై ఆరు చేతులతో శంఖ చక్ర గదాధారిగా దర్శనమిస్తున్నాడు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా గవర్నర్ ఈ ఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు తొలిపూజ నిర్వహిస్తారు. 11 గంటలకు మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ముఖ్య అతిథులుగా హెచ్‌ఎండీఏ..జీహెచ్‌ఎంసీ
మహాగణపతికి 75 అడుగుల నూలు కండువా, జంధ్యం, పట్టువస్ర్తాలను హెచ్‌ఎండీఏ కమిషనర్ టీ చిరంజీవులు, సీఐడీ ఏసీపీ ఎం శ్రీనివాస్, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ సురేంద్ర మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై సమర్పిస్తారని సంఘం అధ్యక్షుడు కడారి శ్రీధర్ తెలిపారు.

విద్యుద్దీపాల వెలుగులో మెరిసిపోతున్న గణేషుడు
విగ్రహ పనుల కోసం ఏర్పాటు చేసిన కర్రలు, సామాగ్రి శనివారం సాయంత్రం తొలగించడంతో బొజ్జగణపయ్య విద్యుద్దీపాల వెలుగులో మెరిసిపోయాడు. వినాయకుడికి ఓ వైపు తిరుపతి వెంకటేశ్వరుడు, మరోవైపు గోవర్ధనోద్ధారి ప్రతిమలు కనువిందు చేస్తున్నాయి.ఈ నవరాత్రుల్లో గణపయ్యను దర్శించుకునేందుకు నగరం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

గణేశుడి ప్రాంగణంలో 200 సీసీ కెమెరాలు
ఖైరతాబాద్ మహాగణపతి ప్రాంగణం వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గణేశుడి ప్రాంగణం నలుదిక్కులా 200 మీటర్ల వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. దాదాపు 100 మంది పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.  

కాణిపాకంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు..

చిత్తూరు: చిత్తూరు జిల్లా కాణిపాకంలో వినాయక చవితి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు జరగనున్నాయి. స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

నగర శివారులో భారీ చోరీ..

హైదరాబాద్ : మౌలాలీ డివిజన్ గాయత్రినగర్‌లో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. రూ.27 లక్షల నగదుతో పాటు, సుమారు 100 తులాల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. గాయత్రినగర్‌లో నివాసం ఉండే రిటైర్డ్ ఉద్యోగి తేరాల రాజేంద్రం సింగపూర్‌టౌన్‌షిప్‌లో ఉండే కూతురు ఇంటికి కుటుంబ సభ్యులతో వెళ్లాడు. ఈ సమయంలో దొంగలు ఇంటి కిటికీ పగలగొట్టి లోపలికి వెళ్లి బీరువాలో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. 

దేశవ్యాప్తంగా వినాయక చవితి కళ..

హైదరాబాద్ : వినాయక నవరాత్రులకు ఊరూ వాడా సమాయత్తమైంది. ఎక్కడ చూసినా వీధుల్లో మండపాలు వెలిసి విగ్రహాలు కొలువు తీరుతున్నాయి. వీధి వీధిలో యువత ఉత్సవాల ఏర్పాట్లలో మునిగితేలుతున్నారు. 

06:52 - September 5, 2016

గుంటూరు : గణేష్‌ చవితి సందర్భంగా..పర్యావరణాన్ని కాపాడేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రకృతి ప్రేమికులు ముందుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు మట్టి వినాయక ప్రతిమలు ప్రతిష్టించాలని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కొన్ని సంస్థలు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి.

పర్యావవరణంపై స్వచ్ఛంద సంస్థల పిలుపులు
పండగ పూట దేవున్ని పూజిస్తూ.. పర్యావరణాన్ని కాలుష్యం చేయోద్దు అంటూ స్వచ్ఛంద సంస్థలు పిలుపునిస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని కోరుతున్నాయి. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, రసాయనాల వినాయక విగ్రహాలు వద్దు వద్దు.. మట్టి, పేపర్‌, సహజ రంగుల వినాయక విగ్రహాలే ముద్దు ముద్దు.. అంటూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి.

స్పీకర్ కోడెల ఉచితంగా మట్టి గణపతిల పంపిణీ
ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తన కుమారుడు కోడెల సత్యనారాయణ మెమోరియల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలను అందజేశారు. నరసరావుపేట పట్టణంలోని శివుడు బొమ్మ సెంటర్, గడియారం స్తంభం సెంటర్లలో దాదాపు 20 వేల మట్టి గణేష్‌ విగ్రహాలను ట్రస్ట్ అధినేత డాక్టర్ కోడెల శివ రామక్రిష్ణ చేతుల మీదుగా పంపిణి చేశారు. రసాయనాలతో తయారు చేసిన గణేష్‌ విగ్రహాలను పూజకు వాడొద్దంటూ గుంటూరు జిల్లా బాపట్లలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మట్టి వినాయకుని విగ్రహాలను పంపిణి చేశారు. 

మట్టి గణేష్‌ ప్రతిమలను పంపిణి చేసిన ఆర్యవైశ్య సంఘం
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలంలో ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో వెయ్యికిపైగా మట్టి గణేష్‌ ప్రతిమలను పంపిణి చేశారు. కెమికల్స్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణ కాలుష్యం అవుతుందని, అందువల్ల అందరూ మట్టి విగ్రహాలనే పూజించాలని ఆర్యవైశ్య సంఘం సభ్యులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

పర్యావరణాన్ని రక్షిద్దామంటున్న ఫాక్ అసోసియేషన్‌
పర్యావరణాన్ని రక్షిద్దాం అంటూ హైదరాబాద్‌ ఫాక్ అసోసియేషన్‌ ముందుకొచ్చింది. ఎల్బీనగర్‌ డివిజన్‌ సహార ఎస్టేట్‌లోని స్థానికులకు మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా అందజేశారు. గణేష్‌ చవితిని భక్తి శ్రద్ధలతో పర్యావరణ హితంగా జరుపుకొందాం అంటూ పర్యావరణ ప్రేమికులు పిలుపునిస్తున్నారు. 

06:46 - September 5, 2016

హైదరాబాద్ : వినాయక చవితి. వక్రతుండ మహాకాయ.. అంటూ ఏ పని మొదలు పెట్టినా మొట్ట మొదట పూజించేది విఘ్నేశ్వరుడినే. తాము చేయబోయే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండాలని బొజ్జ గణపయ్యకు ఉండ్రాళ్లు, లడ్డూలు నైవేద్యంగా పెట్టి ప్రత్యేక పూజలు చేస్తాం. ఈ సారి కూడా వినాయక నవరాత్రులకు ఊరూ వాడా సమాయత్తమైంది. ఎక్కడ చూసినా వీధుల్లో మండపాలు వెలిసి విగ్రహాలు కొలువు తీరుతున్నాయి. వీధి వీధిలో యువత ఉత్సవాల ఏర్పాట్లలో మునిగితేలుతున్నారు.

పల్లె.. పట్నం తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి కళ
పల్లె.. పట్నం తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి కళ సంతరించుకుంది. ఎక్కడ చూసినా.. వీధి వీధుల్లో మండపాలు వెలిసి అందులో వినాయకుడి విగ్రహాలు కొలువుతీరుతున్నాయి. భారీ ఎత్తున యువకులు ఏర్పాట్లలో నిమగ్నమై విగ్రహాలు ప్రతిష్టిస్తున్న సందడే కనబడుతోంది. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అంతా కలిసి ఉల్లాసంగా.. ఉత్సాహంగా వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటున్నారు.

పర్యావరణ గణేషుడుకి మొగ్గుచూపుతున్న భక్తులు
ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే వాడాలని విస్తృత ప్రచారం చేపట్టిన నేపథ్యంలో ఈసారి ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలకు స్వస్తి చెప్పి మట్టి విగ్రహాల ఏర్పాటుకు భక్తులు మొగ్గుచూపుతున్నారు. విశాఖ పట్నంలో వినాయకచవితి ఉత్సవాలకు అంతా సిద్ధమవుతున్నారు. నగరంలో ఎక్కడ చూ సినా చిన్న చిన్న మట్టి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.

ఓరుగల్లు నగరం వినాయక చవితి వేడుకలకు ముస్తాబు
అటు తెలంగాణలో ఓరుగల్లు నగరం వినాయక చవితి వేడుకలకు ముస్తాబవుతోంది. నగరంలో ఎక్కడ చూసినా వినాయక మండపాలు వెలిసి సందడి వాతావరణం నెలకొంది. భక్తులను ఆకట్టుకునేలా విభిన్న ఆకృతులతో భారీ సెట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనా ఈసారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని యువత కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.

ప్రధాన రహదారిలో సిద్ధంగా గణపయ్య విగ్రహాలు
గతేడాదితో పోలిస్తే ఈసారి మట్టి వినాయకులను ప్రతిష్టంచడానికే భక్తులు, ఉత్సవాల నిర్వాహకులు మక్కువ చూపుతున్నారు. వరంగల్‌, హన్మకొండ ప్రధాన రహదారిలో సిద్ధంగా ఉంచిన విగ్రహాలను కొనేందుకు భారీ ఎత్తున వివిధ గ్రామాల నుంచి భక్తులు వస్తున్నారు.

ధరల విషయంలో మాత్రం భక్తులు మిశ్రమ స్పందన
ఈ యేడు వినాయక చవితికి అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నప్పటికీ... ధరల విషయంలో మాత్రం భక్తులు మిశ్రమ స్పందన వెల్లడవుతోంది. విగ్రహాలు తక్కువ ధరలకే లభిస్తున్నప్పటికీ పూలు, పండ్లు, పూజా సామాగ్రి ధరలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. కొన్ని చౌకగా ఉన్నప్పటికీ... మరికొన్ని వస్తువులు మాత్రం వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పండుగ సమయంలో ధరలు పెరగడం కామనే కదా అంటున్నారు వినియోగదారులు

పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు
వినాయక చవితి సందర్భంగా అటు పోలీసులు సైతం భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లకు సన్నద్ధమయ్యారు. ఉత్సవాల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఉత్సవ కమిటీలతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి... ఎక్కడికక్కడ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తానికి సోమవారం నుంచి ఎక్కడ చూసినా గణపతి బప్పా..మోరియా అంటూ ఊరూ వాడా మారుమోగబోతోంది.

 

Don't Miss