Activities calendar

06 September 2016

21:50 - September 6, 2016

రిలయన్స్‌ జియో భారీ ఆఫర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు టెలికాం సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ కూడా జియోతో పోటీ పడేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఆఫర్లతో త్వరలోనే మన ముందుకు రానుంది.భారత టెలికాం మార్కెట్‌లో రిలయన్స్‌ జియో ప్రకంపనలు సృష్టిస్తోంది. అతి చవక జియో డేటా ధరలతో ప్రత్యర్థులకు సవాల్‌ విసిరింది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌- బిఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్రణాళికలకు రంగం సిద్ధం చేస్తోంది.జియో డాటా ధరల కనుగుణంగా తాము సరికొత్త ప్రణాళికలతో బిఎస్‌ఎన్‌ఎల్‌ ముందుకు వస్తోంది. ఎక్కువ మొత్తంలో డాటా వినియోగించే వినియోగదారులకు జిబి డౌన్‌లోడ్‌ ధరను రూపాయిలోపే అందించే ఆలోచనతోఉంది. మార్కెట్‌లో నిలదొక్కుకోవాలంటే జియో విసిరిన సవాల్‌ను ఎదుర్కోవాల్సిందేనని బిఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్ అనుపమ్‌ శ్రీవాత్సవ స్పష్టం చేశారు.రిలయన్స్‌ జియోను ఎదుర్కొనేందుకు బిఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఆకర్షణీయ టారిఫ్‌లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌లో ల్యాండ్‌లైన్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ ఆపరేటర్,బ్రాడ్‌ బ్రాండ్‌ లాంటి సౌకర్యాలుండడం తమకు ప్లస్‌ పాయింట్‌గా మారింది.గతనెల దేశవ్యాప్తంగా బిఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ లైన్‌ వినియోగదారులకు ఉచిత అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ సౌకర్యం కల్పించింది. ఇప్పటికే 1,099 రూపాయలకే దేశవ్యాప్తంగా 3జి మొబైల్‌ అన్‌లిమిటెడ్‌ డాటాను బిఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది.బిఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ వినియోగదారులకు ఉచిత వాయిస్‌ కాలింగ్‌ డాటా ఇచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది. రెండు మూడు నెలల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంది.మొత్తానికి రిలయెన్స్‌ జియో ప్రవేశంతో మార్కెట్‌లో కంపెనీల మధ్య పోటీ తత్వం పెరిగి వినియోగదారులకు లాభం చేకూరనుంది.

 

21:46 - September 6, 2016

తమిళనాడు-కర్ణాటక: కావేరి నదీ జలాలను తమిళనాడుకు వదలాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కర్నాటక ప్రజలు కన్నెర్ర చేశారు. తీర్పుకు నిరసనగా ప్రజాందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో తమిళనాడు-కర్నాటకల మధ్య నడిచే బస్సులను నిలిపివేశారు. ఈనెల 9న కర్ణాటక బంద్‌కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి.కావేరీ న‌దీ జ‌లాల‌ను త‌మిళ‌నాడుకు వ‌ద‌లాల‌ని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు క‌ర్నాట‌క‌లో ఆగ్రహ‌జ్వాల‌ల‌కు దారి తీసింది. సుప్రీం తీర్పును వివిధ రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సుప్రీం ఆదేశాల‌కు విరుద్ధంగా క‌ర్నాట‌క రైతులు ఆందోళ‌నకు దిగారు.మాండ్యా జిల్లాలో భారీ ఎత్తున ప్రజ‌లు నిర‌స‌న ప్రద‌ర్శన చేపట్టారు. రైతులకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు కూడా రోడ్డెక్కాయి. బెంగళూరు- మైసూరు జాతీయ రహదారిని స్తంభింపజేశారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. బంద్ వల్ల సుమారు 700 బస్సులు రద్దు అయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జీ జరిపారు.రానున్న ప‌ది రోజుల్లో 15 వందల క్యూసెక్కుల కావేరీ నీటిని త‌మిళ‌నాడుకు విడుద‌ల చేయాల‌ని సుప్రీంకోర్టు ఇటీవ‌ల ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున కావేరి జలాలు విడుదల చేయడం సాధ్యం కాదని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒప్పందం ప్రకారం కావేరి జలాలు విడుదల చేయాల్సిందేనని తమిళనాడు స్పష్టం చేసింది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం అములు చేస్తుందా? లేదా అన్నది వేచి చూడాలి

 

21:40 - September 6, 2016

గుంటూరు : తుని ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసిపి నేత భూమన కరుణాకర్‌ రెడ్డిని సీఐడీ అధికారులు విచారించటం రాష్ట్రంలో హాట్ టాపిక్ మారింది. తొలిరోజు సీఐడీ అధికారులు భూమనను 6 గంటల పాటు విచారించారు. రేపు కూడా తిరిగి విచారణకు హాజరు కావాలని సూచించటంపై సర్వత్రా చర్చకొనసాగుతోంది. రేపు కరుణాకర్‌రెడ్డిని అరెస్ట్ చేయవచ్చన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇంతకీ సీఐడీ తుని ఘటన వ్యవహారంలో ఏం చేయబోతోంది. కరుణాకర్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారా? విచారించి వదిలేస్తారా? అసలేం జరగబోతుంది? రిజర్వేషన్ల కోసం కాపునేత ముద్రగడ పద్మనాభం ఏర్పాటు చేసిన తుని బహిరంగ సభ విధ్వంసానికి దారితీయటంపై విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం ఆబాధ్యతను సీఐడీకి అప్పగించించింది. ఈకేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేయగా, విడతలవారిగా అనేక మంది కాపునేతలను ఉద్యమకారులను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. తాజాగా తుని ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమనతోపాటు, మరికొందరిని.. విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ నోటీసులు పంపింది. తొలి నుండి ఈ ఘటన వెనుక భూమన పాత్ర ఉదంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో అటు సీఐడీ కూడా భూమన పాత్రపై ప్రాధమిక విచారణ చేపట్టింది. తుని ఘటనకు ముందు భూమన కరుణాకర్‌రెడ్డి .. ముద్రగడ పద్మనాభాన్ని కలవటం మొదలు ఎన్నిసార్లు ఫోన్ లో మాట్లాడింది, తరువాత ఎన్నిసార్లు మాట్లాడింది పూర్తి ఫోన్ కాల్ డేను సేకరించిన సీఐడీ దీనిపైనే ప్రధానంగా దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే గుంటూరులోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి పిలిపించి తొలిరోజు ఆరుగంటలపాటు విచారణ జరిపింది. తొలిరోజు విచారణ అంతా ఫోన్ కాల్ డేటా చుట్టూ తిరిగినట్లు తెలుస్తోంది.బుధవారం కూడా తమ విచారణకు హాజరుకావాలని భూమనకు సీఐడీ అధికారులు సూచించారు. విచారణ అనంతరం భూమన కరుణాకర్‌రెడ్డి.... చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కుట్రపూరితంగానే ఇదంతా చేస్తున్నారంటూ ద్వజమెత్తారు

 

 

21:36 - September 6, 2016

హైదరాబాద్ :ఒకే స్వభావం కలిగిన శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తేవాలని కేసీఆర్ నిర్ణయించారు. ఒకే శాఖ కిందకు డీఆర్‌డీఏ, సెర్ఫ్ విభాగాలు తేవాలని కలెక్టర్లకు సూచించారు. భారీ నీటి పారుదల శాఖ పరిపాలనా విభాగం మాత్రం జిల్లా యూనిట్‌గా, ప్రాజెక్టుల వారిగా ఉండాలన్నారు. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్‌ల ఏర్పాటుకు కోటి రూపాయలు, పోలీసు కార్యాలయాల ఏర్పాటుకు 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు సీఎం దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవిన్యూ డివిజన్లు, కొత్త మండలాలు కూడా సమాంతరంగా ప్రారంభమవ్వాలని ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ తెలిపారు. ముందుగా కొత్త మండలాలను నిర్ధారించాలని, తర్వాత రెవిన్యూ డివిజన్లను కూర్పు చేయాలని కలెక్టర్లకు సూచించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో మొదటిరోజు నుంచే రెవెన్యూ, పోలీస్ శాఖలు పని ప్రారంభించాలని ఆదేశించారు.డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ విడుదల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 75 మండలాల కోసం కొత్తగా డిమాండ్లు రాగా, వాటిలో ఇప్పటికే 45 మండలాలను నోటిఫై చేసినట్లు సీఎం చెప్పారు. మరో 30 మండలాల కోసం డిమాండ్లు వచ్చాయని, వాటి సాధ్యాసాధ్యాలపై వెంటనే నిర్ణయం జరగాలని చెప్పారు. కొత్తగా ప్రతిపాదించే మండల జనాభా 35 వేలకు పైగా ఉండాలనే నిబంధన పెట్టుకున్నామన్నారు. అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, చెంచులు నివసించే ప్రాంతాలకు సంబంధించి జనాభా విషయంలో సడలింపు ఇవ్వాలని సూచించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త పరిపాలనా విభాగాల ఏర్పాటుకు సంబంధించి సీనియర్ అధికారులు, కలెక్టర్లు, పోలీస్ అధికారులు తమ ప్రతిపాదనలను సమావేశంలో వివరించారు. ఉద్యోగుల పెంపు, తగ్గింపు, సర్దుబాటు, ఆయా శాఖల పనిభారం ఆధారంగా నిర్ణయించాలన్నారు. జిల్లా యూనిట్లు చిన్నగా ఉంటే ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ సులువు అవుతుందన్నారు.ఆయా ప్రాంతాల స్వభావం, సామాజిక, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వ శాఖల విభాగాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఆదిలాబాద్ లో అంటురోగాలు ఎక్కువ కాబట్టి అక్కడ వైద్య, ఆరోగ్య శాఖను పటిష్టం చేయాలని, ఏజెన్సీ ఏరియా ఎక్కువగా ఉన్న చోట సంక్షేమ అధికారుల నియామకం చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.ఉద్యోగుల సర్దుబాటే ప్రధానాంశంగా సమావేశం సాగింది. అన్ని శాఖల సిబ్బంది సర్దుబాటుపై కూలంకషంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని.. ఇందుకు మరోసారి భేటీ కావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

 

21:30 - September 6, 2016

కృష్ణ : విజయవాడలో సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల ఎనిమిది నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో... GST బిల్లు తో పాటు.. మరో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలని నిర్ణయించింది. సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సవరణ అమల్లోకి వస్తే.. రాష్ట్రంలో ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతులిచ్చే వీలుకలుగుతుంది. ఇక భూ విక్రయాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పుడున్న చట్టానికి పదును పెడుతోంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908లో అవసరమైన మార్పులు తీసుకురావడానికి రానున్న అసెంబ్లీ సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. దీనిప్రకారం ఒకే భూమిని ఇద్దరికి రిజిస్ట్రేషన్ యడానికి ఇకపై వీలు పడదు. దీనివల్ల అవినీతి, మోసాలకు అడ్డుకట్ట వేసినట్టవుతుంది.

ఏపీ వ్యాట్ యాక్ట్ 2005కి చేసిన సవరణలను అసెంబ్లీలో పెట్టడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనిప్రకారం పర్యాటక ప్రాంతాల్లో వున్న 3స్టార్, 5 స్టార్ హోటళ్లలో 14.5 శాతం నుంచి 5శాతానికి వ్యాట్ తగ్గిస్తూ, అదేవిధంగా మొబైల్ ఫోన్ల మీద కూడా వ్యాట్‌ని 5 శాతానికి తగ్గిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కేబినెట్‌ నిర్ణయించింది.అలాగే... కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను, మరో 10 గ్రామాల్లో 7 వేల 214 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకోసం ఎపీఐఐసీకి బేసిక్ వాల్యూ ప్రకారం కేటాయించాలని మంత్రిమండలి నిర్ణయించింది. విశాఖ జిల్లా రూరల్ మండలం పరదేశీపాలెం గ్రామంలో 1.90 ఎకరాల భూమిని 133 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు నిమిత్తం ఏపీ ట్రాన్స్‌కోకు ఎకరాకు రూ.7.26 కోట్లకు అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పిటూరు గ్రామంలో 61.63 ఎకరాల భూమిని సెజ్ విస్తరణ కోసం ఎకరా 12 లక్షల ధరకు ఎపీఐఐసీకి అందించడానికి కేబినెట్‌ ఆమోదించింది.


 

21:25 - September 6, 2016

హైదరాబాద్బం : ధువులే రాబంధులయ్యారా..? ఆస్తి కోసం కిరాతకానికి పాల్పడ్డారా..? రక్త సంబంధాన్ని తెంచేసుకుని రాక్షసులుగా మారారా..?? కన్నవారిని కోల్పోయి మేనత్త,మామల ఇంట్లో ఉంటున్న అమ్మాయిని ఆస్తి కోసం చంపేశారన్న అనుమానాలు పెరుగుతున్నాయి..దీంతో పోలీసులు కూడా లోతైన దర్యాప్తు చేస్తున్నారు..హైదరాబాద్ శివారు మేడిపల్లి పి ఆండ్‌.టి కాలనీలో 17 ఏళ్ల సాహితి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.బాలికను ఆస్తి కోసం మేనత్త, ఆమె భర్త, నాయినమ్మలు కలిసి హత్య చేశారన్న అనుమానాలు కలుగుతున్నాయి...దీనిపై ఇప్పటికే మృతి చెందిన సాహితి బంధువులు ఆరోపిస్తూ పోలీస్‌ స్టేషన్‌ మందు బైటాయించి అందోళన చేశారు.. సాహితి మృతికి కారకులైనా వారి కఠినంగా శిక్షించాలంటు వారు డిమాండ్‌ చేశారు..చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన 17ఏళ్ల సాహితి చిన్నతనంలో తల్లిదండ్రులైన వెంకట్‌ రెడ్డి, సంద్యలు చనిపోవడంతో మేడిపల్లిలో తన ఇంట్లో నానమ్మ, సుగుణమ్మ, మేనత్తలతో కలిసి ఉంటుంది..ఘట్ కేసర్‌లోని ఓ కళాశాలలో ఇంజనీర్ మొదటి సంవత్సరం చదువుతుంది...మరో మూడు నెలల్లో సాహితి మైనార్టీ తీరనుంది..ఈ క్రమంలోనే రాత్రి బాత్‌రూమ్ లో కాలుజారి కింద పడిపోవడం వల్ల చనిపోయిందని ఎల్‌.బి నగర్‌ నాగోల్‌ ఉంటున్న సాహిత తల్లి సోదరుడు మేనమామకు, రేణిగుంటలో ఉన్న సాహితి బంధువులకు సమాచారం ఇచ్చారు..ఉదయం రేణిగుంట నుంచి వచ్చిన బంధువులు సాహితి డెడ్‌బాడీ చూసి అనుమానాలు వ్యక్తం చేశారు...ఆమె పేరిట ఉన్న ఆస్తుల కోసమే నానమ్మ సుగుణమ్మ, మేనత్త అనిత మామ రాంరెడ్డి వరసకు బావైనా హర్షవర్దన్‌రెడ్డిలు హత్య చేశారని ఆరోపిస్తూ మేడిపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.సాహితి 4వ తేదీ రాత్రి బాత్రూమ్లో జారిపడి మృతి చెందినట్లు ఆమె మేనత్త చెప్పటం పలు అనుమానాలు కలిగిస్తున్నాయి...ఇక ఇదే సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..

 

ఏపీకి ప్యాకేజీపై రేపే జైట్లీ ప్రకటన

హైదరాబాద్:బుధవారం సాయంత్రం ప్యాకేజీని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హోదా ప్రయోజనాలన్నీ కలగలిపి ప్యాకేజీ రూపొందించామని కేంద్రం అంటోంది. పారిశ్రామిక రాయితీలతో పాటు..పరిశ్రమలు పెట్టే వారికి ప్రత్యేక రాయితీ, పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్ర భావిస్తోన్నట్లు సమాచారం.

 

21:01 - September 6, 2016

ముంబై: రియో ఒలింపిక్స్‌లో రజత పతకంతో భారత్‌ పరువును నిలిపిన సింధుపై కనకవర్షం కురుస్తూనే ఉంది. ఇటీవలనే డిల్లీ సీఎం కేజ్రీవాల్ నగదు బహుమానం అందించగా తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సింధును, ఆమె కోచ్‌ గోపీచంద్‌ను ముంబైలో ఘనంగా సన్మానించారు. అనంతరం సింధుకు 75 లక్షల రూపాయల చెక్ అందజేశారు. కోచ్ గోపీచంద్‌కు 25లక్షల రూపాయల చెక్ ఇచ్చారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం 5 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు పీవీ సింధూకు ఇచ్చిన విషయం తెలిసిందే .  

20:52 - September 6, 2016
20:50 - September 6, 2016
20:48 - September 6, 2016

ఇది చాలా పాత మాట.ఇప్పటికీ ఇదే నిజమని రుజువవుతున్నమాట. భారత్ చాలా సంపన్నదేశం. అవును.. ప్రపంచంలోనే టాప్ టెన్ దేశాల్లో ఉంది. ఇక్కడి ప్రజలు కూడా ధనవంతులే. ఇక్కడ మెలిక ఉంది. అందరూ కాదు. చాలా కొద్దిమంది చాలా ధనవంతులు. సింపుల్ గా చెప్పాలంటే 54శాతం సంపదను అతి కొద్దిమంది పంచుకుంటున్నారు. కోట్లాదిమంది ఆకల కేకల మధ్య, బతుకుబరువుగా ఈడుస్తున్నారు. అంతరాలు ఆకాశాన్నంటుతున్న దేశంలో వెలిగే భారతానికి, రగిలే భారతానికి మధ్య అగాధం పూడ్చలేనంతగా మారుతోంది. దేశం చాలా క్లిష్టపరిస్థితిలో ఉందని చెప్తోంది. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ సున్నాలెన్నున్నాయో లెక్కించలేనంత సొమ్ము.. దేశంలో పిడికెడు ధనవంతుల ఎకౌంట్లలో మూలుగుతోంది. ఎక్కడ ఏ ఆస్తులున్నాయో.. అవి రోజు రోజుకు ఎలా పెరుగుతున్నాయో వాళ్లకే తెలియని పరిస్థితి. ఇదంతా ఓ పక్క.. మరోపక్క తిండి కోసం, గూడు కోసం, పనికోసం కోట్లాది ప్రజలు దీనంగా చూస్తున్న పరిస్థితి. ఏమిటీ అంతరాలు.. ఎక్కడుందీ మూలం..?చీకటి, వెలుగు పక్కపక్కనే. ఎలా వస్తున్నాయీ డబ్బులు. పేదవాడు పేదవాడిగానే ఎలా మిగిలిపోతున్నాడు. డబ్బున్నోడు మరింత ఎక్కువగా ఎలా బలుస్తున్నాడు. స్వయంకృషితో కష్టపడేవారు సంపన్నులైతే , పేదరికానికి కారణం ఏమిటి?మరి కుంభకోణాల జాడలు 2జీలు, బొగ్గుమసి, అంబానీల బాగోతాల చెరగని మరకలేం చెప్తున్నాయి..దేశంలో బిలియనీర్లు ఎలా దూసుకుపోతున్నారో గమనించాం.. సంపదను ఎలా తమ బొక్కసాల్లో నింపుకుంటున్నారో చూస్తున్నాం.. మరి హంగర్ ఇండెక్సులేం చెప్తున్నాయి. నేపాల్ కంటే, పొరుగునే ఉన్న శ్రీలంకకంటే ఆకలి కేకలు మన దగ్గరే ఎక్కువనే సంగతి తెలుసా?ఓపక్క మిలియనీర్లు వెలిగిపోతూనే ఉన్నారు. కోట్లు కోట్లుగా సంపద పోగుబడుతోంది. బ్లాక్ అండ్ వైట్ కరెన్సీ గుట్టలు గుట్టలుగా పోటీపడుతోంది. మరోపక్క మూడు పూటలా తిండిలేని జనాలు ఆకలితో మాడిపోతున్నారు. పేదరికం భారత ముఖచిత్రంగా మారుతోంది. చిన్నారులు పౌష్టికాహారం లేక రోగాలపాలవుతున్నారు. రైతన్నలు వ్యవసాయ జూదంలో ఓడి ఉరికొయ్యకు వేలాడుతున్నారు.. ఎన్నో అనంతమైన వైరుధ్యాలు.. అంతులేని భేదాలు. పెరుగుతున్న అసమానతలు.ప్రపంచంలో భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ దాని సంపద మాత్రం జనాభా అంతటికీ సరిగ్గా పంపిణీ జరగలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలోనే పేదరికం పెరిగిందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పెట్టుబడిదారి విధానాల వల్ల ధనికులు బిలియనీర్లుగా అవతారం ఎత్తుతుంటే.. పేదలు నిరుపేదలుగా మా రిపోతున్నారు. పాలక పక్షాలు ఓట్ల కోసం సంక్షేమ పథకాలు, నోట్ల కోసం బహుళజాతి కంపెనీల అనుకూల విధానాలు అవలంబించినంత కాలం ఈ అంతరాల్లో ఎలాంటి మార్పుండదు.

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

గుంటూరు : జిల్లాలోని యడ్లపాడు మండలం మైదవోలులో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూచెరువులో పడి ప్రహర్షిత, సరస్వతి అనే ఇద్దరు చిన్నారు లు మృతిచెందారు. గట్టుపై నడిచివెళ్తున్న సమయంలో పట్టుతప్పి వీరు చెరువులో పడిపోయినట్లు తెలుస్తోంది. చిన్నారు మృతి చెందడంతో కుటుంబీకులు శోకసంద్రంలో ఉన్నారు.

 

20:34 - September 6, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌ సంస్థపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పేపర్లపై సంతకాలు చేస్తే సరిపోదని.. బాధితులకు డబ్బులిస్తేనే న్యాయం జరుగుతుందని సీరియస్‌గా స్పందించింది. విచారణ సందర్భంగా 26ఆస్తులకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించింది అగ్రిగోల్డ్‌. దీనిపై స్పందించిన హైకోర్టు..బాధితులకు న్యాయం జరిగేలా ప్రవర్తించాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. మార్కెట్ విలువలను అంచనా వేసేందుకు ఫిర్యాదుదారులకు, ప్రభుత్వానికి ఆస్తుల వివరాలు అందించాలని సూచించింది. జూడిషియల్ కమిటికి చెల్లించాల్సిన 10 లక్షల రూపాయలను చెల్లించాలని బ్యాంకులను కూడా అదేశించింది ఉన్నత న్యాయస్థానం. కేసులో తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

 
20:25 - September 6, 2016

విశాఖపట్నం:​ గణేష్‌ ఉత్సవాలు పవిత్రంగా జరగాలి .పవిత్రత దెబ్బతినేలా ఉండకూడదు. నిబంధనలు పాటించాలి..ఏ మాత్రం తేడా ఉన్నా సహించేది లేదు ప్రధానంగా అశ్లీల నృత్యాలు జరిగితే మాత్రం ఊరుకునేది లేదు.ఉక్కునగర పోలీసు కమిషనర్‌ హెచ్చరికలు చేసినా పోలీసుల సాక్షిగానే సింహాచలం పోస్టాఫీస్ వీధి డాన్స్‌లకు వేదికయింది.ఉక్కునగరంలో చార్జి తీసుకున్న అతి కొద్ది కాలంలోనే పోలీసుల టోపీపై కన్పించని నాలుగో సింహంగా పేరుగాంచిన పోలీసు కమిషనర్ యోగానంద్‌ దాదాపు 20 రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేశారు...గణేష్ ఉత్సవాలు పవిత్రంగా జరగాలని ఖరాకండిగా చెప్పేశారు...అన్నింటికి మించి నిబంధనలను పాటించాలని.ముఖ్యంగా అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హుకూం జారీ చేశారు.కాని ఏం లాభం.ఆ ప్రాంతంలో పోలీసులు గస్తీ తిరుగుతూనే ఉన్నారు.విన్పిస్తున్న పాటలను వింటూ ఎంజాయ్ చేశారు..కళ్లారా చూశారుకూడా.ఓ వైపు పోలీసులు వినాయక చవితి సందర్భంగా అసభ్యకరమైన డాన్సులు ఏర్పాటు చేస్తే ఊరుకోమని హెచ్చరించినా పట్టించుకున్నవారు లేరు.. నిర్వహకుల కక్కుర్తికి తోడు డిపార్ట్‌మెంట్లోని కొందరి స్వార్థానికి పోస్టాఫీస్‌ వీధి అసభ్యనృత్యాలకు వేదికైంది...ఒక వైపు వినాయక విగ్రహం..మరోవైపు అశ్లీల నృత్యాలు యదేచ్చగా కొనసాగాయి.పోలీసులు పెట్రోలింగ్ కు వచ్చినా ఎదురుగా అశ్లీల నృత్యాలు జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు..దీంతో రాత్రి మొదలయి తెల్లవార్లు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగాయి. పోలీసు బాస్‌ ఆదేశాలను పట్టించుకోలేదు సిబ్బంది...ఇక పోలీసుల హెచ్చరికలను తుంగలో తొక్కేశారు నిర్వాహకులు..దీంతో మందుబాబులు కాస్త చిందులేశారు...మామూలు భక్తులు మాత్రం భయంతో అటు వైపు వెళ్లలేకపోయారు... 

20:16 - September 6, 2016

తూర్పుగోదావరి : దివిస్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పంపాజీపేటలో సీపీఎం నిర్వహించాలనుకున్న బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు. తొండంగి మండలం పంపాజీపేటలో సీపీఎం నేతలను అరెస్ట్ చేశారు.   దీంతో  ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధుతో పాటు జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి, దేవిరాణి, వేణుగోపాల్‌ను అరెస్ట్‌ చేయడంతో త్రీవ విమర్శలు వస్తున్నాయి. విడుదల అనంతరం మధు మీడియాతో మాట్లాడారు. మళ్లీ వారం రోజుల్లో సభ జరిపి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై  ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.  పోలీసులు రౌడీయిజం చేస్తున్నారని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మధు మండిపడ్డారు. ఇది ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం అని పోలీసు సెక్షన్ల తో పని లేదని ఆయన భావించారు. 

20:09 - September 6, 2016

తిరుపతి : పుస్తకాలు సమాజ అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు ప్రముఖ పాత్రికేయులు తెలకపల్లిరవి. తెలుగుభాష, సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే... యువత పుస్తకాలు చదవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుపతిలో సీకే నారాయణరెడ్డి స్మారక గ్రంథాలయాన్ని తెలకపల్లి రవి ప్రారంభించారు.

మరో సారి ఉలిక్కి పడ్డ బాగ్దాద్

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ మరోసారి పేలుళ్లతో ఉలిక్కిపడింది.ఈ ఘటనలో 12 మంది పౌరులు మృతిచెందారు. దాదాపు 15 కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే దాడికి బాధ్యత వహిస్తూ.. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ఆన్‌లైన్‌లో ప్రకటించింది.

 

ఐసెట్ వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ :ఐసెట్ వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ విడుదలైంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయిన విద్యార్థులు ఈ నెల 7 నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. 12న సీట్ల కేటాయింపు జరగనుంది. WWW.TSICET.NIC.IN వెబ్‌సైట్‌లో కళాశాలలు, ఫీజుల వివరాలు పొందుపరిచినట్లు ఐసెట్ అధికారులు వెల్లడించారు.

 

గొంతు కోసుకుని యువకుని ఆత్మహత్య

పెద్దపల్లి:  మండలంలోని  చీకురాయి గ్రామానికి చెందిన మేకల పోల్‌రాజ్‌  అనే యువకుడు గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  మద్యం మత్తులో గొంతు కోసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

 

18:27 - September 6, 2016

తూర్పుగోదావరి : తొండంగి మండలం పంపాజీపేటలో సీపీఎం నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు కాసేపటి క్రితం విడుదల చేశారు. దివిస్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పంపాజీపేటలో సీపీఎం నిర్వహించాలనుకున్న బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉదయం అక్కడ  ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధుతో పాటు జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి, దేవిరాణి, వేణుగోపాల్‌ను అరెస్ట్‌ చేయడంతో త్రీవ విమర్శలు వస్తున్నాయి. అరెస్టులను ఖండిస్తూ స్థానికులు భారి ఎత్తున్న ఆంధోళన చేశారు. ఈ సభను అడ్డుకున్నంత మాత్రన ఊరుకునేది లేదని, ముందు ముందు మరింత పెద్ద ఎత్తున్న సభ ఏర్పాటు చేస్తామని స్థానికులు తేల్చి చెపారు. పోలీసులు రౌడీయిజం చేస్తున్నారని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మధు మండిపడ్డారు.

 

18:14 - September 6, 2016

గుంటూరు : తుని ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తుని ఘటన కేసులో ఆయనను సీఐడీ పలు కోణాల్లో ఆరు గంటలుగా  విచారించింది. ఆ ఘటనకు , తనకు  ఎలాంటి సంబందం లేదని, ప్రభుత్వం కుట్ర పూరిత చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు భూమన. చంద్రబాబు ప్రభుత్వం కావాలనే తనను ఇరికించాలని చూస్తుందని ఆయన మండిపడ్డారు.పోలీసులు సరైన దర్యాప్తు చేస్తారన్న నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం పదకొండు గంటలనుంచి సీఐడి అధికారులు ఆయనను విచారించారు. ఇదిలా ఉండగా  రేపు కూడా సీఐడీ విచారణ ఉంటున్నట్లు తెలుస్తోంది. 

17:54 - September 6, 2016

హైదరాబాద్ : ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతిచెందిన 10టీవీ గ్రాఫిక్‌ డిజైనర్‌ శ్రీనివాస్‌కు యాజమాన్యం, సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించింది. హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో యాజమాన్యం ఈరోజు సంతాప సభ నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ కుటుంబానికి యాజమాన్య ప్రతినిధులు, సహోద్యోగులు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. శ్రీనివాస్‌ అకాల మరణం సంస్థకు తీరని లోటని 10 టీవీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేణుగోపాల్‌ అన్నారు. శ్రీనివాస్‌ కుటుంబాన్ని అన్ని విధాలా అండగా ఉంటామని సీఓఓ సజ్జాప్రసాద్‌, అసోసియేట్‌ ఎడిటర్‌ శ్రీధర్‌బాబు అన్నారు.

 
17:46 - September 6, 2016

మెదక్ : 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించి భూములు తీసుకోవాలని సిద్ధిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డికి మల్లన్నసాగర్ ముంపుగ్రామాల రైతులు వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వం భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడకుండా భూములు తీసుకోవడం దారుణమని.. రాబోయే రోజులో భునిర్వాసితుల ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని రైతులు తెలిపారు. అధికారులు భూములకు దొంగచాటుగా చేస్తున్న రిజిస్ట్రేషన్ల పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు.

సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

సీఎం కేసీఆర్ కు టీడీపీ నేత రేవంత్ రెడ్డి లేఖ రాసారు. అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన తర్వాతే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జిల్లాల విభజన జరగాలని ఆయన కోరారు. గతం లో జరిగిన అఖిల పక్ష సమావేశం సూచనలను అధారం చేస్కోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

 

17:27 - September 6, 2016

హైదరాబాద్ : నగరంలోని సమస్యలపై సరిగ్గా ఏడాది క్రితం ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు చాలా మాటలు చెప్పింది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా మార్చుస్తాం. ఓల్డ్ సిటిని ఇస్తాంబుల్ చేస్తాం...హైదరాబాద్ కు ప్రత్యేక బ్రాండ్ కల్పిస్తాం...జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రచారం ఇదీ. కానీ ఇందుకు తగ్గట్టుగా నిధులు కేటాయించడంలో మాత్రం రాష్ట్ర సర్కార్ శ్రద్థ పెట్టడంలేదు. ప్రత్యేకంగా ఇవ్వాల్సిన ఫండ్స్ పక్కన బెడితే చట్టం ప్రకారం వచ్చిన సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదు.పాడైపోయిున నగరాన్ని అభివృద్ధి చెయ్యడంతో పాటు అంతర్జాతీయ నగరంగా మారుస్తామంది. ప్రభుత్వం మాటలైతే చెప్పింది కానీ ఆ తీరు చేతల్లో మాత్రం కనబడటం లేదు. హైదరాబాద్ అభివృద్థికి ప్లాన్ చేసిన ప్రాజెక్టులు..వాటి అమలు, అందుకు కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కడా పొంతన లేదు. పైగా కార్పొరేషన్ నిధులను వివిధ అవసరాల పేరుతో ఇతర విభాగాలకు మళ్లిస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతి ఏటా నిధులు వస్తాయి. కానీ రెండేళ్లుగా బల్డియాకు ప్రభుత్వాల నుంచి అందుతున్న నిధులు నామమాత్రం కాగా, కొన్ని నిధులు అసలు రావడం లేదు. దీంతో కార్పొరేషన్ ఖజానా ఖాళీ అయ్యింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి తమకు 2 వేల 819 కోట్లు అవసరమంటూ జీహెచ్ ఎసీ ప్రభుత్వానికి విన్నవిస్తే కేవలం 428 కోట్లు కేటాయించింది. కానీ చివరకు 23 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరానికి 2 వేల 260 కోట్లు తమకు కేటాయించాలని ప్రభుత్వాన్ని బల్దియా కోరింది. కానీ ప్రభుత్వం కేటాయించింది 400 కోట్లకు కూడా మించలేదు. బడ్జెట్ వచ్చి ఆరునెలల పూర్తవుతున్నా ఒక్క రూపాయి కూడా జీహెచ్ఎంసీకి విడుదల చేయలేదు.రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్రాంట్లు, నిధుల సంగతీ పక్కన బెడితే కేంద్రం నుంచి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా సర్కార్ విడుదల చెయ్యడంలేదు. 13 వ ఫైనాన్స్ కమిషన్ నుంచి 130 కోట్లు వచ్చి ఏడాది పూర్తవుతున్నా జీహెచ్ఎంసీకి నిధులు ఇవ్వలేదు. తమకు నిధులు చేయ్యాలని బల్దియా ఎన్ని ఉత్తరాలు రాసినా రాష్ట్ర సర్కార్ చెవిన పట్టడం లేదు. ఇక అధికారపార్టీ స్వలాభం కోసం జీహెచ్ఎంసీ ఎన్నికలను ఏడాది పాటు ఆలస్యంగా నిర్వహించడం కారణంగా 14 వ ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా బల్దియాకు రాలేదు. దీంతో 250 కోట్ల రూపాయల వరకు జీహెచ్‌ఎంసీ నష్టపోయిందని సిటిజన్స్ ఫోరమ్స్ చెబుతున్నాయి.

 
17:24 - September 6, 2016
17:16 - September 6, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరవు తీవ్రంగా ఉందని.. వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుందని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్‌ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వర్షాలు లేక పంటలు దెబ్బతిన్నాయని.. బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వకపోవడంతో.. ప్రైవేటు రుణాలను తీసుకుంటున్నారన్నారు. కరవు, రైతాంగ సమస్యలపై ప్రభుత్వానికి మెమోరాండం అందజేస్తామన్నారు. అక్టోబర్ 2న గాంధీ విగ్రహాల వద్ద మౌనదీక్ష చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

 

కొనసాగుతున్న భూమన విచారణ

తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన విధ్వంస ఘటనలపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని సీఐడీ పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. ఐదు గంటల  నుంచి ఈ విచారణ కొసాగుతోంది.

 

16:57 - September 6, 2016

2016 వేసవి ఒలింపిక్స్ ను విజయవంతంగా నిర్వహించిన బ్రెజిల్...కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే పారా ఒలింపిక్స్ కు సిద్ధమయ్యింది.బుద్ధిమాంద్యం, అంగవైకల్యం , బదిరుల కోసం ప్రత్యేకంగా నిర్వహించే పారా ఒలింపిక్స్ కు అంతర్జాతీయ పారా ఒలింపిక్ సంఘం నేతృత్వంలో బ్రెజిల్ ఒలింపిక్ సంఘం భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది.ప్రపంచంలోనే అతిపెద్ద సాకర్ వేదిక రియో డి జెనీరోలోని మరకానా స్టేడియం వేదికగా సెప్టెంబర్ 7 నుంచి 18 వరకూ జరిగే ఈ స్పెషల్ ఒలింపిక్స్ లో 176 దేశాలకు చెందిన 4 వేల 500మంది అథ్లెట్లు పోటీపడబోతున్నారు.మొత్తం 23 రకాల క్రీడలకు చెందిన 528 అంశాలలో పోటీలు నిర్వహించబోతున్నారు.పుట్టుకతోనే మానసికంగా, శారీరకంగా పదిరకాల వైకల్యాలు ఉన్న క్రీడాకారులను మాత్రమే పారా ఒలింపిక్స్ లో పాల్గొనటానికి అనుమతి ఇస్తారు. నాలుగేళ్లకోసారి జరిగే సాధారణ ఒలింపిక్స్ తో ఏమాత్రం సంబంధం లేకుండా  1960లో మొట్టమొదటిసారి పారా ఒలింపిక్స్ నిర్వహించారు.1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి మాత్రమే సాధారణ ఒలింపిక్స్ కు అనుబంధంగా పారా ఒలింపిక్‌ నిర్వహిస్తూ వస్తున్నారు. వేసవి ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చిన వేదికలోనే పారా ఒలింపిక్స్ ను సైతం నిర్వహించేలా మార్పులు చేశారు.1960 నుంచి 2012 వరకూ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతూ వస్తున్న పారా ఒలింపిక్స్ లో భారత్ కు సైతం 48 సంవత్సరాల చరిత్ర ఉంది.ఇప్పటి వరకూ భారత అథ్లెట్లు రెండు స్వర్ణాలతో సహా మొత్తం ఎనిమిది పతకాలు మాత్రమే సాధించారు. ఇందులో మూడేసి రజత, కాంస్య పతకాలు సైతం ఉన్నాయి.హీడెల్ బర్గ్ వేదికగా 1972లో జరిగిన పారా ఒలింపిక్స లో భారత స్విమ్మర్ పెట్కార్ 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈతలో 37. 331 సెకన్ల ప్రపంచ రికార్డు టైమింగ్ తో బంగారు పతకం సాధించింది. పారా ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు ఇదే తొలి స్వర్ణపతకం కావడం విశేషం.1984 పారా ఒలింపిక్స్ పురుషుల షాట్ పుట్ లో జోగిందర్ సింగ్ బేడీ రజత పతకం అందించాడు. జావలిన్, డిస్కస్ త్రో అంశాలలో సైతం కాంస్య పతకాలు సాధించాడు.జావలిన్ త్రోలో భీమ్ రావ్ కెసార్కర్ రజత పతకం గెలిచి దేశానికే గర్వకారణంగా నిలిచాడు.2004 ఏథెన్స్ పారా ఒలింపిక్స్ జావలిన్ త్రో లో దేవేంద్ర జాజరియా బంగారు పతకం సాధిస్తే పవర్ లిఫ్టింగ్ 56 కిలోల విభాగంలో రాజేందర్ సింగ్ కాంస్య పతకం గెలుచుకొన్నాడు.ఇక 2012 లండన్ ఒలింపిక్స్ పురుషుల హైజంప్ లో...గిరీశ నాగరాజ గౌడ రజత పతకం సాధించి..భారత పరువు నిలబెట్టాడు. గిరీశ పతకం పుణ్యమా అంటూ..భారత్ పతకాల పట్టిక 67వ ర్యాంక్ లో నిలిచింది.ప్రస్తుత రియో పారా ఒలింపిక్స్ లో మాత్రం..గతంలో ఎన్నడూ లేనంతగా 17 మంది సభ్యుల బృందంతో భారత్ పోటీకి దిగుతోంది. 15 మంది పురుషులు, ఇద్దరు మహిళలతో కూడిన భారత అథ్లెట్ల జట్టు ఏమాత్రం అంచనాలు లేకుండా ఐదురకాల క్రీడల్లో మాత్రమే పాల్గొంటోంది.ప్రధాన ఒలింపిక్స్ లో 118 సభ్యుల భారీ బృందంతో పాల్గొని రెండంటే రెండు పతకాలతో 67వస్థానంలో నిలిచిన భారత్ 17 మంది సభ్యుల జట్టుతో పాల్గొంటున్న పారా అథ్లెట్ల నుంచి పతకాలు ఆశించడం అత్యాశే అవుతుంది.
 

గణేశ్ నిమజ్జనానికి వెళ్లి యువకులు మృతి

 ప్రకాశం : జిల్లా లోని త్రిపురాంతకం మండలం కంకణాలపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కంకణాలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గణేశుడి నిమజ్జనానికి వెళ్లారు. అయితే నిమజ్జన సమయంలో ప్రమాదవశాత్తూ చెరువులో మునిగినపోయి మృత్యువాత పడ్డారు. స్థానికులు ఎంత ప్రయత్నించినా యువకుల ఆచూకీ లభించలేదు. ఈ సంఘటనపై మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

 

16:44 - September 6, 2016

అదిలాబాద్ : కొత్త తరానికి బొమ్మల్లో చూపించడమే తప్ప మరెక్కడా కనిపించని పక్షిరాజం అది. జీవ వైవిధ్యం పతనావస్థకు సూచికలవి.. ఒకప్పుడు ఊరిచివర గుంపులుగా కనిపించిన ఈ పక్షులు అంతరించిపోతున్న జీవాలుగా మారాయి. అవి మరేంటోకావు.. రాబందులు. ప్రపంచంలోనే అరుదైన పక్షిజాతిగా పేరొందిన రాబందులు ఆదిలాబాద్‌ జిల్లా బెజ్జుర్‌ మండలంలోని సందడి చేస్తున్నాయి. నేడు అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవం సందర్భంగా అంతరించిపోతున్న రాబందులపై 10 టీవీ ప్రత్యేక కథనం..!
    అంతరించిపోతున్న జీవ జాతుల జాబితాలో ముందు వరుసలో ఉన్న జీవులు రాబందులు. గతంలో గ్రామాల పొలిమేరల్లో గుంపులు గుంపులుగా దర్శనమిచ్చే రాబందులు మానవ తప్పిదాలతో దాదాపు కనుమరుగయ్యాయి. దేశంలో మొత్తం తొమ్మిది రాబందు జాతులుంటే అందులో రెండు జాతులు, వీటిలో పొడుగు ముక్కు రాబందు జాతి మనుగడ ప్రమాదంలో పడినట్లు అంతర్జాతీయ ప్రకృతి -సహజవనరుల పరిరక్షణ సంస్థ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాబందులు కనుమరుగైనట్లు రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ప్రకటించిన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా బెజ్జుర్ మండలంలోని పాలరావు గుట్టపై రాబందులు ఉన్నట్లు 2014లో అటవీశాఖ అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి వాటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. వాటికి ఆహారాన్ని అందించడం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అంతేకాదు.. రాబందుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించింది. ప్రస్తుతం పాలరావు గుట్టపై 19 పెద్ద రాబందులు, 7 చిన్న రాబందులు సందడి చేస్తున్నాయి.
అంతరించి పోయాయనుకున్న రాబందులు రాష్ట్రంలో తిరిగి కనిపించడం శుభ పరిణామం. దేశంలో వేగంగా అంతరించి పోతున్న రాబందుల జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ చేపట్టిన చర్యలు కొంతమేరకు ఫలితాలు ఇస్తున్నాయి. గతేడాదితో పోల్చితే వీటి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు రాబందుల సంరక్షణ ప్రాజెక్టు అధికారులు గుర్తించారు.  ప్రపంచం అంతటా సంవత్సరానికి 10,000 జాతులు అంతరించి పోతున్నాయి. ఈ విధంగా జాతులు అంతరించిపోతే జీవం మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
 

16:32 - September 6, 2016
16:29 - September 6, 2016
16:21 - September 6, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో భూ వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి . అధికారులు తమకు భూమి కౌలుకు ఇవ్వడం లేదని రైతులు  ఆందోళనకు దిగారు. భూ సమీకరణకు భూములు తీసుకుని, మొదటి ఏడాది కౌలు ఇచ్చిన అధికారులు రెండవ ఏడాది కౌలు, ప్లాట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటూ మందడం గ్రామం రైతులు ఆందోళనకు దిగారు. సమీకరణ కోసం ఇచ్చిన భూములను ట్రాక్టర్లతో దున్ని నిరసన వ్యక్తం చేశారు.దీనికి సంబందించి తమ గోడును ఏ అధికారి పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. మంత్రులు, పై అధికారులు చోరువ తీసుకుని వెంటనే ఈ భూ వివాదాలను సర్ధుమనిగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 
16:04 - September 6, 2016
15:50 - September 6, 2016

హైదరాబాద్ : సీజనల్‌ ఫీవర్స్ జనం ప్రాణాలు తీస్తున్నాయి. పల్లే, పట్టణం తేడాలేకుండా జనం జ్వరాల బారీన పడి మూలుగుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు డెంగ్యూ జ్వరాలు విజృభింస్తున్నాయి. ప్రభుత్వ , ప్రైవేటు అనే తేడా లేకుండా ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమైందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు అంతా విషజ్వరాల బారినపడి అవస్థలు పడుతున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలడంతో పలుజిల్లాల్లో ప్రైవేటు , ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. కొన్ని ఆసుపత్రుల్లో బెడ్స్‌ ఖాళీ లేక రోగులను తిప్పిపంపుతున్న పరిస్థితి నెలకొంది. ఆర్థిక స్థోమత లేని నిరు పేదలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కాని కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవతున్నారు.

ఫాగింగ్‌ కూడా చేయని మున్సిపల్‌ సిబ్బంది..
అటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. వైద్యానికనివస్తే కొత్త జబ్బులు అంటుకుంటున్నాయిని రోగులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రుల్లో ఎక్కడపడితే అక్కడ చెత్తచెదారం పేరుకుపోయి ఉంటోంది. కొద్దిపాటి వర్షం వచ్చినా.. మురుగునీరు నిలిచి వచ్చిపోయే రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రులన్నీ మురుగుకూపాలుగా మారినా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడంలేదని పేద రోగులు ఆవేదన వ్యక్తం చేప్తున్నారు. రోగాలు ప్రబలకుండా ఫాగింగ్‌లాంటివి కూడా చేయడంలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలతో మరింత విజృంభిస్తున్న రోగాలు...
ఇటు హైదరాబాద్‌లోనూ సీజనల్‌ రోగులు ప్రబలిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులు క్యూకడుతున్నారు. అయితే గత నెలతో పోల్చుకుంటే ఈనెలలో జ్వరాలు తగ్గాయంటున్నారు ఫీవర్ హాస్పటల్ వైద్యులు. కాని కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని రోగాల బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవలంటున్నారు. ఏకొద్దిపాటి జలుబు, దగ్గు అనిపించినా చిన్న పిల్లల్ని స్కూల్స్ కి పంపవద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. వర్షాలు జోరుగా పడుతుండటంతో దోమలు విజృంభిస్తున్నాయి. గ్రామాలు, పట్ణణాలు అనే తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా జనం రోగాల బారిన పడి విలవిల్లాడుతున్నారు. ఇప్పటికైనా వైద్యారోగ్యశాఖ స్పందించి.. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలతో కలిసి.. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

15:46 - September 6, 2016

నిజామాబాద్ : భద్రత లేదు సరే.. ఇప్పుడు ఉద్యోగాలు కూడా లేవు. 106 మంది బతుకులను నిర్ధాక్షణ్యంగా ప్రభుత్వం రోడ్డు పాలు చేసింది. ఏళ్ల నాటి కొలువును ఒక్క ఆదేశంతో తప్పించింది. ప్రత్యేక తెలంగాణాతో భవిష్యత్తు బంగారం అవుతుందనుకుంటే బతుకు భారంగా మారింది. నిజామాబాద్‌ గృహ నిర్మాణ శాఖలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. దీంతో ఉద్యోగుల దిక్కుతోచని స్థితిలోపడ్డారు. న్యాయం కావాలంటూ రోడ్డెక్కారు. కలెక్టరేట్‌ ముందు ఆందోళనలు చేపట్టారు.

106 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు..
పని భారం లేదనే కారణాన్ని చూపి..గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులను ప్రభుత్వం ఇతర శాఖల్లోకి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. 40 మందిని గృహ నిర్మాణ సంస్థ నుంచి.. జిల్లా నుంచి సాగనంపుతూ..ఉత్తర్వులు జారీ చేశారు. 17 మంది ఏఈలకు హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్‌ రిపోర్టు చేయాలని.. ఐదుగురు ఏఈలను పంచాయతీరాజ్‌ శాఖలో.. వర్క్ ఇన్స్ పెక్టర్లు ఇతర సిబ్బందిని మాత్రం తెలంగాణ బ్రేవరేజెస్‌ కార్పొరేషన్‌కు వెళ్లి రిపోర్టు చేయాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా వివిధ హోదాల్లో పనిచేసిన 106 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది.

అకారణంగా తొలగించారని ఆరోపణ...
గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వం తప్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో 37 సంవత్సరాల పాటు సంస్థతో వారికున్న అనుబంధం ఒక్కసారిగా తెగిపోయినట్లైయింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ బతుకులు బాగుపడతాయనుకుంటే తమను అకారణంగా బదిలీలు చేశారని తొలగించారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయకపోగా పూర్తిగా తొలగించారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వేరే శాఖలోనైనా ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు.

సమస్యగా మారనున్న లావాదేవీల వ్యవహారం..
గృహ నిర్మాణ సంస్థను 1979లో ఏర్పాటు చేయగా.. 1981 నుంచి పనులు ప్రారంభించింది. ఇందిరమ్మ ప్రారంభం నుంచి 2లక్షల 61 వేల 887 ఇళ్లు మంజూరైతే లక్షా 58 వేల ఐదు వందలు మాత్రమే పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు ఉద్యోగులను తొలగించడంతో దాదాపు గృహ నిర్మాణ సంస్థ కనుమరుగుకానుంది. దీంతో ఆ సంస్థ ద్వారా ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల వ్యవహరం సమస్యగా మారనుంది. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పంచాయతీరాజ్ రహదారులు భవనాల శాఖలకు అప్పగించింది. ఇది వరకు నిర్వహించే కార్యాలయ బాధ్యతలను మాత్రం పీఆర్ అధికారులు చూడనున్నారు. ఇకపై ఇళ్ల నిర్మాణంతో గృహ నిర్మాణ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండకపోగా.. ఆ సంస్థ ఉద్యోగులను ఒక్కో శాఖకు బదిలీ చేయడంతో వారు చెట్టుకొకరు.. పుట్టకొకరుగా మారారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. అయితే వారి మొరను ప్రభుత్వం ఎంత వరకు పట్టించుకుంటుందో వేచిచూడాలి.

15:43 - September 6, 2016

విశాఖపట్టణం : సమయానికి వెళ్లి..ఏవో రెండు పాఠాలు చెప్తే చాలు..జీతం వచ్చేస్తుంది కదా..అనుకునే ఉపాధ్యాయులకి ఆమె భిన్నం..పాఠాలు నేర్పడంతో పాటు, గిరిజనుల భాషకు జీవం పోస్తున్నారు..మరుగున పడిపోతున్న గిరిజన సంప్రదాయాలకు వెలుగునిస్తున్న ఆ వ్యక్తే... ఆంధ్రా యూనివర్సీటి ప్రొఫెసర్‌ ప్రసన్న శ్రీ..ఆమె కృషిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రకటించింది. ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయనిగా ఎంపికైన ప్రసన్న శ్రీ పై 10టివి స్పెషల్‌ స్టోరీ. మాతృ భాషనే మరిచిపోయి..విదేశీభాషల మత్తులో చిక్కుపోతున్న ఈ సమాజంలో..జాతుల భాషలు చరిత్రలకే పరిమితమవుతున్నాయి. ఆధునిక భాషల ప్రభావంతో మృతస్థితిలో కొట్టుమిట్టాడుతూ..మరుగున పడిపోతున్న భాషలను చిగురింపజేసి..సజీవంగా నిలిపేందుకు ఓ ఉపాధ్యాయురాలు కృషి చేస్తోంది. ఒక్కటికాదు, రెండు కాదు ఏకంగా 18 గిరిజన భాషలకు లిపిని రూపొందించిన ఏకైక వ్యక్తిగా అరుదైన రికార్డ్ సృష్టించారు విశాఖకి చెందిన ప్రసన్నశ్రీ.

ఈ ఏడాది ఉత్తమ ఉపధ్యాయినిగా ఎంపిక...
ఆంధ్రా యూనివర్సిటీ లో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ప్రసన్నశ్రీ... గిరిజన సంస్కృతి, సంప్రదాయాల మీద విశేష పరిశోధనలు చేసారు. ఆంధ్రప్రదేశ్‌లోని బగత, గదబ, కోయ, సుగాలి, ఎరుకల, సవర, గౌడు, గోండు, కొలమి, కొండదొర, కమ్మర, కుపియా, రానా, మల్లి, జాతాపు, పొర్జ, ముఖదొర, కొటియా భాషలకి లిపిని సృష్టించారు. ఆసియాలోనే ఇలా అనేక భాషలకి లిపిని రూపోందించిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. మహిళ విమెన్ అచీవ్మెంట్ అవార్డు దక్కంచుకున్న మహిళగా రికార్డు సృష్టించారు. ప్రభుత్వ గుర్తింపుతో ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు.

అవి అంతరించిపోయే ప్రమాదం- ప్రసన్న శ్రీ..
దేశ విదేశాల నుంచి ఎన్ని అవార్డులు అందుకున్నా గిరిజన భాషలకు లిపిని రూపొందించడమే తనకు సంతృప్తినిచ్చిందని చెబుతున్నారు ప్రసన్నశ్రీ. గిరిజనులకు వారి భాషలో విద్యను ప్రోత్సహిస్తే తప్ప వారిలో మార్పులు తీసుకురాలేమని అంటున్నారు. దీనిని అమలు చేయగలిగితే గిరిజనులకు ఎంతో మేలుకలుగుతుందని వివరించారు. మనిషి ఔన్నత్యాన్ని చాటేది సంస్కృతి ఒక్కటేనన్నారు. ఆ సంస్కృతి, భాషలను బతికించుకోకపోతే అవి అంతరించిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరవకపోతే గిరిజన సంస్కృతి మంటగలిసిపోయే ప్రమాదం ఉందన్నారు. గిరిజనుల్లో మార్పులు తీసుకురావాలంటే అదే భాషలో మాట్లాడే విద్యను వారికి అందించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. గిరిజన అభివృద్ది కోసం ఎవరూ ముందుకురాకపోతే తానే స్వయంగా నేషనల్ ట్రైబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని అంటున్నారు.

15:39 - September 6, 2016

గుంటూరు : తుని ఘటనలో సీఐడీ నోటీసులు ఇవ్వడంతో వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి గుంటూరులో విచారణకు హాజరయ్యారు. మూడున్నర గంటలకు పైగా ఈ విచారణ కొనసాగుతోంది. దీనితో ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నేతలంతా ఇక్కడ మోహరించారు. చంద్రబాబుది కుట్రపూరిత ఆలోచన అని, అవినీతి కుంభకోణంపై జగన్ నిలదీయనున్నారని ఆ పార్టీకి చెందిన చెవిరెడ్డి పేర్కొన్నారు. దీనితో డైవర్ట్ చేయడం కోసం ఇలాంటివి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలకతీతంగా ముద్రగడతో స్నేహం ఉంటుందని పేర్కొన్నారు.

ఎలాంటి సంబంధం లేదన్న భూమన...
తనను అప్రతిష్ట పాలుచేయడానికే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తుని ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న వారిని చంద్రబాబు శత్రువులుగా భావిస్తున్నారని ఆయన విమర్శించారు. న్యాయబద్ధమైన కాపుల ఉద్యమాన్ని చంద్రబాబు నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నరని ఆరోపించారు భూమన. తుని ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని అయినా చట్టంపై గౌరవం ఉండడంతో విచారణకు హాజరయ్యానన్నారు. దురుద్దేశంతోనే సీఐడీ నోటీసులు ఇచ్చిందని కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు.

15:14 - September 6, 2016

విశాఖపట్టణం : వేదాంత ట్రాన్స్ పోర్టు వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల ధర్నాకు దిగారు. న్యాయం చేయాలంటూ నినదించారు. గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని తొలగించి కొత్తవారిని పనిలోకి తీసుకోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

15:07 - September 6, 2016

జిల్లా కలెక్టర్లు, ఆధికారులతో సీఎం కేసీఆర్ భేటీ...

హైదరాబాద్ : ఎంసీహెచ్ ఆర్డీలో జిల్లా కలెక్టర్లు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కొత్తజిల్లాల ఏర్పాటుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ...

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి ప్రతిపాదనలు వచ్చిన తర్వాతే స్పందించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 3 గంటల పాటు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది.ఐటీ, ఐఓటీ పాలసీల్లో మార్పులు, సవరణలకు సీఎం ఆదేశించారు. డబుల్ రిజిస్ట్రేషన్లపై చట్ట సవరణకు కేబినెట్ నిర్ణయించింది.

అక్బరుద్దీన్ కేసు విచారణ రేపటికి వాయిదా...

హైదరాబాద్ : చంద్రాయణగుట్టలో తనపై జరిగిన దాడి కేసులో స్టేట్ మెంట్ రికార్డు కోసం అక్బరుద్దీన్ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన పై దాడి చేసిన ఘటనలో 13 మంది నిందితులను అక్బరుద్దీన్ గుర్తించినట్లు తెలిపారు. తుపాకులు, కత్తులతో నాపై దాడి చేశారని... నా శరీరంలో ఇంకా ఒక బుల్లెట్ ఉందని పేర్కొన్నారు. దాడి జరిగిన సమయంలో నా పిస్టల్ లాక్ లో ఉందన్నారు. తన పిస్టల్ తిరిగి ఇవ్వాలని అక్బరుద్దీన్ కోరారు. హైకోర్టు తదుపరి విచారణ రేపట్టికి వాయిదా వేసింది.

14:22 - September 6, 2016

విశాఖపట్టణం : అదో పుణ్యక్షేత్రం..సింహాచలం..ఎంతో మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. పండుగల సమయంలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి అసభ్యతకు..అపశృతులు చోటు చేసుకోకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వినాయక చవితి పర్వదినాన అపచారం చోటు చేసుకుంది. ఏకంగా రికార్డింగ్ డ్యాన్స్ లు పెట్టడం కలకలం సృష్టించింది. సింహాచలం ప్రధాన వీధియైన పోస్టాపీసు వీధుల్లో రికార్డింగ్ డ్యాన్స్ లు పెట్టారు. రాత్రి 12.30గంటల తరువాత ఈ డ్యాన్స్ లు నిర్వహించారు. మద్యం సేవించిన యువతులు అసభ్యకరంగా నృత్యాలు చేశారు. పెట్రోలింగ్ చేస్తూ అక్కడకు వచ్చిన పోలీసులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెళ్లిపోవడం భక్తులకు ఆగ్రహాన్ని తెప్పించింది. వెంటనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

14:18 - September 6, 2016

హైదరాబాద్ : టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ సీఎస్ రాజీవ్ శర్మ నేతృత్వంలో సచివాలయం జరిగిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణ జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై ప్రధానంగా చర్చ జరిగింది. 34వేల అభ్యంతరాలు నమోదు కావడం జరిగింది. 19 వేల ఫిర్యాదులు జిల్లాలపై వచ్చినట్లు తెలుస్తోంది. అదనంగా రెండు జిల్లాలు ఏర్పడుతుండడం..వీటిపై నెలకొనే సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో ఉద్యోగుల సర్దుబాటు ప్రధాన అంశంగా పేర్కొనవచ్చు. కొన్ని శాఖలను విలీనం చేయాలని దానిపై ఉద్యోగుల నుండి వచ్చిన అభ్యంతరాలపై చర్చించించారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే భేటీలో టాస్క్ ఫోర్స్ కమిటీ రూపొందించిన నివేదికపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ఎలాంటి దిశా..నిర్ధేశం చేయనున్నారో కాసేపట్లో తెలియనుంది. 

14:15 - September 6, 2016

విజయవాడ : జీఎస్టీ సవరణ బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గత నాలుగు గంటలుగా కేబినెట్ సమావేశం జరుగుతోంది. ప్రైవేటు రంగంలో వ్యవసాయం, ఉద్యానవన కళాశాలలకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. కాలువలు, నీటి పారుదల ప్రాజెక్టులు, రహదారులలను మూడు నెలలకొకసారి తనిఖీలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రతిపక్షాల నుండి వచ్చే ఆరోపణలను ఎదుర్కోవాలనే అనే దానిపై చర్చ జరుగుతోంది. ఓటుకు నోటు కేసులో స్టే తెచ్చుకున్న నేపథ్యంలో విపక్షాలు పలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. సభ సాక్షిగా జరిగే విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే దానిపై కూలంకుశంగా చర్చిస్తున్నారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వ వైఖరిపై విపక్షాలు చేసే ఆరోపణలపై ధీటైన సమాధానం చెప్పాలని కేబినెట్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పలు సంస్థలకు భూములిచ్చే దానిపై కూడా చర్చ జరిగింది. మొత్తంగా 17 అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చిస్తోంది. భేటీ అనంతరం కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకొందో తెలియనుంది. 

అక్టోబర్ 2న గాంధీ విగ్రహాల వద్ద మౌన దీక్షలు : ప్రో.కోదండరాం

హైదరాబాద్ : రైతు సమస్యలపై అక్టోబర్ 2న గాంధీ విగ్రహాల వద్ద మౌన దీక్షలు చేపట్టనున్నట్లు ప్రో.కోదండరాం పేర్కొన్నారు. కరువు, పంటరుణాలపై ఎస్వీకేలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్య్రకమంలో ప్రొ.కోదండరాం, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.... వ్యవసాయం సంక్షోభంలో ఉందని, ఇప్పటి వరకు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందలేదని, రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే ప్రైవేటు రుణాలు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయ విధానాన్ని ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

జీఎస్టీ బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం

విజయవాడ: జీఎస్టీ బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 17 అంశాలపై ప్రధానంగా చర్చజరుగుతోంది. ఇందులో భాగంగా పలు అంశాలపై కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. డబుల్ రిజిస్ట్రేషన్లు లేకుండా రిజిస్ట్రేషన్ల చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ప్రైవేట్ రంగంలో వ్యవసాయ, ఉద్యానవన కళాశాలలకు ఆమోద ముద్ర వేసింది. కాలువలు, నీటిపారుదల ప్రాజెక్టులు, రహదారులను 3 నెలలకోసారి డ్రోన్లతో తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఆక్రమణల గుర్తింపునకు డ్రోన్లు వినియోగించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

13:49 - September 6, 2016

నగరంలో చైన్ స్నాచింగ్...

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ ప్రాంతంలో చైన్‌స్నాచింగ్ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న లక్ష్మమ్మ (65) అనే మహిళ మెడలోంచి బైకుపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు మూడు తులాల బంగారు గొలుసును అపహరించుకు పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

13:44 - September 6, 2016

ఉత్తర‌ప్రదేశ్‌ : అసెంబ్లీ ఎన్నిక‌ల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కిసాన్‌ యాత్ర ప్రారంభించారు. దేవరియా నుంచి ఢిల్లీ వరకు కిసాన్‌ యాత్ర కొనసాగనుంది. రాహుల్‌ సుమారు 2 వేల 5 వందల కిలోమీటర్లు యాత్రలో పాల్గొంటారు. ఇందులో భాగంగా రైతులు, ముస్లింలు, పేదలు, కార్మికులను ఆయన కలుసుకోనున్నారు. తొలి రెండు రోజులు రైతులతో సమావేశమై సమస్యలపై చర్చిస్తారు. దళితులతో ఆయన సహపంక్తి భోజనాలు చేయనున్నారు. ఈ పర్యటనలో ఆయన రైతులను ఆకర్షించే యత్నం చేస్తున్నారు. దాదాపు 27 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ యూపీ అసెంబ్లీకి దూర‌మైంది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

13:42 - September 6, 2016

నిజామాబాద్ : జిల్లాలో రోజురోజుకు నేరాల సంఖ్య పెరుగుతోంది. నేరాల నియంత్రణకు పోలీసు శాఖ ఏర్పాటుచేసిన నిఘా కెమెరాలు పనిచేయకుండా అలంకార ప్రాయంగా మిగిలిపోయాయి. దీంతో నేరాల అదుపుకోసం అమర్చిన నిఘా కెమెరాలు మున్నాళ్ల ముచ్చటగా మారాయి.

నిజామాబాద్ లో అలంకారప్రాయంగా మారిన సీసీ కెమెరాలు
నిజామాబాద్ జిల్లా నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. జనాభా కూడా అంతకంతకు పెరుగుతోంది. దీంతో పాటు నేరాల సంఖ్యా భారీగా నమోదవుతున్నాయి. పోలీసు శాఖ నేరాల నియంత్రణకు సమస్యాత్మక కూడళ్లలో సీసీ కెమెరాలను అమర్చింది. కానీ ఈ సీసీ కెమెరాలు నాలుగురోజులు మాత్రమే మురిపించాయి.

నగరంలో 12 కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు
జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా నగరానికి వచ్చి వెళుతుంటారు. అయితే నగంరలోని మమత చౌరస్తా, ఓల్డ్ ఎల్ఐసీ, పూలాంగ్, ఎన్టీఆర్, బోధన్ బస్టాండ్, ఖలీల్ వాడి, దేవి టాకీస్ రోడ్డు, కంఠేశ్వర్ న్యాల్ కల్ తదితర ప్రాంతాల్లో తదితర ప్రధాన కూడళ్లలో రోజురోజుకు వీపరీతంగా రద్దీ పెరుగుతోంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో చోరీలు,నేరాలు కూడా భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నగరంలోని 12 సమస్యాత్మక కూడళ్లలో సీసీకెమెరాలను ఏర్పాటుచేసింది. అయితే సీసీ కెమెరాల ఏర్పాటయితే చేసిందీ కానీ నిర్వహాణ బాధ్యతను మరిచిపోయింది. దీని పర్యవసానంగా నాలుగు రోజులు పనిచేసిన సీసీకెమెరాలు ఆతర్వాత పనిచేయకుండా అలంకారప్రాయంగా మారాయి.

నిఘా లేకపోవడంతో రెచ్చిపోతున్న అసాంఘీక శక్తులు
దీంతో పోకీరీలు, అసాంఘీక శక్తులు రెచ్చిపోతున్నారు. నగరంలోని బోధన్ బస్టాండ్, వీక్లీమార్కెట్, గాంధీగంజ్, కుమార్ గల్లీ తదితర ప్రాంతాల్లో రోజురోజుకు వీరి ఆగడాలు మరింతగా పెరిగిపోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో దోంగతనాలు, చైన్ స్నాచింగ్ లు, వాహనాల చోరీలకు పాల్పడుతున్నారు.

నేరాలు పెరుగుతున్నా మెద్దునిద్రవీడని పోలీసులు
ఇంత జరుగుతున్నా పోలీసులు శాఖ మాత్రం మొద్దునిద్ర వీడటం లేదు. దీనికితోడు సీసీకెమెరాల నిర్వహాణ మా పని కాదంటూ చెప్పుకోస్తుంది. నిర్వహాణ బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటుందని బాధ్యత నుంచి తప్పుకుంటోంది. దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ కూడా స్పందిస్తూ నిర్వహాణ మా బాధ్యత కాదంటూ సమాధానం చెబుతున్నారు. దీనికితోడు స్ధానిక ఎంపీ కవిత సీసీ కెమెరాల ఏర్పాటు కోసం 25 లక్షల రూపాయల నిధులను మంజూరుచేస్తానని ఇచ్చిన హమీ నేటికి అమలుకు నోచుకోవడం లేదు. దీంతో నగరంలో అసాంఘికశక్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా పోలీస్, మున్సిపల్ కార్పొరేషన్ శాఖలు రెండు సమన్వయంతో పనిచేసి పనిచేయకుండా పోయిన నిఘా కెమెరాలను వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనితో పాటు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోని మరింతగా నిఘా పటిష్టత కోసం చర్యలు తీసుకోవాలి.

13:37 - September 6, 2016

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల కష్టాలు కన్నీళ్ల స్థాయిని దాటిపోయాయి. ఒక వైపు ఇచ్చిన భూములకు సకాలంలో కౌలు అందక అల్లాడుతుంటే... మరోవైపు భూముల కొలతలను తగ్గించి కౌలు చెల్లిస్తున్న సీఆర్డీయే అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఏటేటా పెరగాల్సిన కౌలును తగ్గించి చెల్లిస్తుండటంతో సీఆర్డీయే కార్యాలయం ముందే రైతులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం ఇప్పుడు రాజధాని ప్రాంతంలో

రెండు ఎకరాల భూమికి రెండు నుంచి మూడు సెంట్లు తగ్గింపు
అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచక్క చందంగా మారింది. కౌలు చెల్లింపు నుంచి భూముల కొలతల నిర్ధారణ వరకు అన్నింటా అక్రమాలే చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీఆర్‌డీఏ కార్యాలయం చట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న రైతులు
భూములు ఇచ్చిన రైతులతో ప్రభుత్వం కుదర్చుకున్న ఒప్పందాల ప్రకారం ప్రతి ఏటా కౌలు పెంచుకుంటూపోవాలి. మొదటి ఏడాది సక్రమంగా కౌలు చెల్లించిన సీఆర్డీయే అధికారులు.. రెండో సంవత్సరం నుంచి కోతలు విధించడం మొదలు పెట్టారు. రెండెకరాలు భూమి ఇచ్చిన రైతులకు మూడు నుంచి నాలుగు సెంట్లు తక్కువ చూపుతూ కౌలు లెక్కకడుతుండటంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఈ మతలబు ఎంటో అంతుపట్టక... అధికారులను కలుసుకుని వాస్తవాలు తెలుసుకునేందుకు సీఆర్డీయే కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా తమకు సిబ్బంది నుంచి చీత్కారాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జరిగిన నష్టాన్ని పూడ్చాలంటూ రైతుల  ఆవేదన
రాజధానికి ఇచ్చిన భూమిలో మూడు సెంట్లు తక్కువ చూపి రెండో ఏడాది కౌలు లెక్కకట్టడంతో కలత చెందిన రైతు ఉమ్మా రాంబాబు... తుళ్లూరులోని సీఆర్డీయే కార్యాలయానికి వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. జరిగిన నష్టాన్ని పూడ్చాలంటూ కాళ్లా, వేళ్లాపడి అధికారులను వేడుకున్నా.. ఎవరూ పట్టించుకోలేదన్న మనస్తాపంతో బాటిల్‌లో తన వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. దీనిని స్థానికులు, పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అయితే విధులకు ఆటంకం కలిగించాడని కేసు పెట్టి అరెస్టు చేశారు. ఒక రోజు స్టేషన్‌లో ఉంచి ఆ తర్వాత విడిచిపెట్టారు.

సీపీఎం నేతలు ఆగ్రహం
రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల పొట్ట కొట్టే విధంగా సీఆర్డీయే వ్యవహరిస్తున్న తీరుపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఆర్డీయే అధికారుల వ్యవహారాలపై దృష్టి పెట్టాలంటున్న బాధితులు
రాజధానికి రైతులు ఇచ్చిన భూముల కొలతలు తగ్గిస్తూ కౌలు లెక్కిస్తున్న సీఆర్డీయే అధికారుల వ్యవహారాలపై పాలకులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. లేకపోతే అన్నదాతలను ఏకం చేసి ఐక్యపోరాటాలు చేస్తామని సీఆర్డీయే తోపాటు ప్రజా సంఘాల నేతల హెచ్చరిస్తున్నారు. 

13:25 - September 6, 2016

తూర్పుగోదావరి : దురుద్దేశంతోనే తనకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. తుని ఘటనలో సీఐడీ నోటీసులు ఇవ్వడంతో భూమన గుంటూరులో విచారణకు హాజరయ్యారు. తుని ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని.. అయినా చట్టంపై గౌరవం ఉండడంతో విచారణకు హాజరయ్యానన్నారు భూమన.

13:23 - September 6, 2016

విజయవాడ : తిరుమలలోని దైవ దర్శనానికి వెళ్లి రోజా రాజకీయాలు మాట్లాడడం దారుణమని మంత్రి పీతల సుజాత అన్నారు. నెలకొకసారి బయటకు వచ్చి స్టేట్‌మెంట్లు ఇవ్వడం తప్ప ప్రతిపక్ష నాయకుడు జగన్‌..రోజా చేస్తుందేమీ లేదన్నారు. రాయలసీమ కరువు రైతులను ప్రభుత్వం ఆదుకోవడానికి అనేక చర్యలు చేపట్టిందని అన్నారు. ప్రతిపక్ష నేతలు తమ వైఖరి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

13:21 - September 6, 2016

హైదరాబాద్ : భాగ్యనగరం ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ కార్నివాల్‌కు వేదిక కానుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈనెల 24 నుంచి 27 వరకు కార్నివాల్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. 

13:19 - September 6, 2016

ఢిల్లీ : ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకం కింద తెలంగాణలో 11 సాగునీటి ప్రాజెక్ట్‌లకు నిధులు సమకూర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం....నాబార్డ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. నాబార్డ్‌ అందించే రుణంతో చేపట్టే ప్రాజెక్ట్‌ల్లో దేవాదుల కూడా ఉంది. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద ఆర్థిక సహాయం అందుకునే ప్రాజెక్ట్‌లను నిర్ధిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా మూడు దశల్లో 99 ప్రాజెక్ట్‌లకు సహాయం అందిస్తారు. మొదటి దశలో చేపట్టే 23 ప్రాజెక్ట్‌లను 2016-17లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల కోసం నాబార్డు నుంచి తీసుకునే రుణాన్ని పదిహేనేళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

పంపాజీపేటలో తీవ్ర ఉద్రిక్తత..

కాకినాడ : తొండంగి (మం) పంపాజీపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివీస్ పరిశ్రమ నిర్మాణ స్థలం వద్ద ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

హైకోర్టులో మల్లన్న సాగర్ భూ సేకరణపై విచారణ..

హైదరాబాద్ : మల్లన్న సాగర్ భూ సేకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ వారం గడువు కోరారు. దీనితో విచారణను 13కి వాయిదా వేసింది.

మెట్రోకోచ్ పై గ్రామసభ..

విజయవాడ : మెట్రోకోచ్ పై నిడమానూరులో గ్రామసభ జరిగింది. మెట్రోకోచ్ ను గన్నవరం ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని రైతులు తేల్చిచెప్పారు. రైతులు..ప్రజల అభిప్రాయాన్ని సీఎంకు వివరిస్తానని వల్లభనేని వంశీ తెలిపారు. రైతులకు నష్టం కలిగేలా వ్యవహరించడం జరగదని పేర్కొన్నారు.

పార్టీ నేతలతో జగన్ సమీక్ష..

విజయవాడ : త్వరలో ఎన్నికలు జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. పాల్గొన్న ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్, మున్సిపల్ అజ్వర్లర్లు, నియోజకవర్గాల అసెంబ్లీ, కో ఆర్డినేటర్లు సమావేశానికి హాజరయ్యారు.

 

కేంద్రం - నాబార్డు మధ్య ఎంవోయూ సమావేశం..

ఢిల్లీ : కేంద్రం - నాబార్డు మధ్య ఎంవోయూ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి ఉమా భారతి, నా బార్డు ఛైర్మన్, టీఎస్ మంత్రి హరీష్ రావు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులపై ఒప్పందం జరిగింది. దేవాదుల ఎత్తిపోతల సహా రాష్ట్రానికి సంబంధించిన 11 ప్రాజెక్టులపై ఒప్పందాలు జరిగాయి.

12:53 - September 6, 2016

మలేషియా : రాజధాని కౌలాలంపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంక హైకమిషనర్‌పై దాడి జరిగింది. శ్రీలంక రాయబారి ఇబ్రహీం సాహెబ్‌ అన్సార్‌ ఎయిర్‌పోర్టులో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అన్సార్‌ స్వల్పంగా గాయపడ్డారు. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు, భద్రతా సిబ్బంది అన్సార్‌పై దాడికి చేసిన గుంపును చెందరగొట్టారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలులోకి వచ్చింది. ఈఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను మలేషియా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనను శ్రీలంక తీవ్రంగా స్పందించింది. మలేషియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశ అధికారులకు రక్షణ కల్పించడంలో మలేసియా ప్రభుత్వం విఫలమయ్యిందని మండిపడింది. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. 

హైకోర్టులో స్విస్ ఛాలెంజ్ విధానంపై విచారణ..

హైదరాబాద్ : స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టులో విచారణ జరిగింది. రేపు మధ్యాహ్నం 02.30 పిటిషనర్ల వాదనలను కోర్టు విననుంది.

12:51 - September 6, 2016

ఢిల్లీ : ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం దేశద్రోహం, పరువునష్టం కేసుల కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పోలీసులు, దిగువ కోర్టులు గమనించాలని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఉదయ్‌ యూ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వంపై చేసే విమర్శలు హింసను ప్రోత్సహించి, శాంతి భద్రతలకు భంగం కలిగించినప్పుడు మాత్రమే దేశద్రోహ నేరం కేసులు పెట్టొచ్చని చెప్పింది. దేశద్రోహం, పరవునష్టం కేసుల్లో ఎఫ్ఐఆర్ లు నమోదు చేసేటప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసం గతంలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా జారీ అయిన మార్గదర్శకాలను అనుసరించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కేదార్‌నాథ్‌ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌ కేసులో 1962 లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు ప్రస్తావించారు. దేశద్రోహం కిందకు వచ్చే ఐపీసా లోని 124 ఎ- సెక్షన్‌ చెల్లబాటులను సుప్రీంకోర్టు ర్యాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించిన విషయాన్ని న్యాయమూర్తులు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఉదయ్‌ యూ లలిత్‌ నేతృత్వంలోని బెంచ్‌ గుర్తు చేసింది.

12:47 - September 6, 2016

విజయవాడ : 72 అడుగుల భారీ గణపతికి 31 టన్నుల మహాలడ్డూను నివేదించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోని తాపేశ్వరం గ్రామానికి చెందిన శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ నిర్వాహకులు 31 టన్నుల మహాలడ్డూను తయారు చేశారు. తాపేశ్వరం నుంచి ప్రత్యేక వాహనంలో మహాలడ్డూను విజయవాడకు తరలిస్తున్నారు. మరోవైపు గిన్నీస్ రికార్డులో స్థానం కోసం శ్రీభక్తాంజనేయ స్వీట్స్ , సురుచి ఫుడ్స్ సంస్థల మధ్య పోటీ నెలకొంది. ఏ సంస్థ తయారు చేసిన లడ్డూ గిన్నీస్‌ రికార్డుకు అర్హత సాధిస్తుందన్న ఉత్కంఠ నేడు వీడనుంది. 

12:42 - September 6, 2016

హైదరాబాద్ : బాల గణపతి.. బొజ్జ గణపయ్య.. చెరకు తోట వినాయకుడు.. ఇలా రకరకాల ఆకారాల్లో గణనాథులు కొలువుదీరుతున్నారు. కొత్త దనానికి తోడు..కాస్త సృజనాత్మకతను జోడించడంతో ఈసారి వినూత్న వినాయకులు భక్తుల పూజలందుకుంటున్నారు. పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన ఫలితంగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల ఏర్పాటూ పెరుగుతోంది. మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణానికి తాము మిత్రులమని చాటుతున్నారు కొందరు భక్తులు. .

40 కిలోల కేకుతో బాల గణపతి
హైదరాబాద్‌లో వెరైటీ వినాయకుడు పూజలందుకుంటున్నాడు. కూకట్‌పల్లిలో పినాకిల్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీ ఆధ్వర్యంలో విద్యార్థులు 40 కిలోల కేకుతో బాల గణపతి విగ్రహాన్ని రూపొందించారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కేకు, చెర్రిపండ్లు, కోకానట్‌ పౌడర్లను ఉపయోగించి తయారు చేసిన వెరైటీ వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. బాల గణపతి విగ్రహ తయారీలో కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

వడియాలతో గణపతి
కడప నగరానికి చెందిన వంకదార రాము తన సృజనాత్మకతను వెలికితీసి వినూత్న రీతిలో వినాయకుడిని తయారు చేశాడు. భక్తులను, చూపరులను ఆకట్టుకునేలా వడియాలతో గణపతిని రూపొందించారు. తన స్నేహితులతో కలిసి రాము శ్రీ చక్రాలను పోలిన వడియాలతో పద్మంలో కూర్చున్న 12 అడుగుల ధ్యాన గణపతిని తయారు చేశారు. వెదురు దెబ్బలు, తడికెలు, కాగితం గుజ్జుతో చేసిన ఈ గణపతికి మైదాతో వడియాలను అంటించారు. పర్యావరణానికి హాని చేయని విధంగా ఈ విగ్రహం తయారు చేశామని, అలాగే ఈ విగ్రహానికి పూలమాలలకు బదులుగా 20 వేల పానీ పూరీలతో అలంకరణ చేస్తున్నామని రాము చెబుతున్నాడు.

మొక్కజొన్న పొత్తుల గణనాథుడు
మొక్కజొన్న పొత్తులు. బంతి పూల స్వాగతాలతో చెరకు తోటను తలపిస్తూ.. పచ్చని చెట్ల నడుమ వెలసిన బొజ్జ గణపయ్య విగ్రహం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం జై గణేశ్‌ ఆలయంలో భక్తులను అలరిస్తోంది. వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఆలయం మొత్తాన్ని చెరుకు గడలు, మొక్కజొన్న పొత్తులు, బంతిపూలతో నింపేయడంతో ఇక్కడికి వచ్చే భక్తులు వినూత్న అనుభూతికి లోనవుతున్నారు. 16 టన్నుల చెరకు, 5 వేల మొక్కజొన్న పొత్తులు, 300 కిలోల బంతిపూలతో వినాయకుడిని ఏర్పాటు చేయడం విశేషం.

పర్యావరణ వినాయకుడు
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో 40 అడుగుల భారీ మట్టి వినాయకుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం మట్టితో తయారు చేసిన ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఈ భారీ విగ్రహాన్ని తయాచు చేసేందుకు 40 రోజులు పట్టిందని నిర్వాహకులు తెలిపారు. శ్రీ గణపతి మహోత్సవ కమిటీ.. స్థానిక శివాలయంలో ఈ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ప్రొద్దుటూరు భారీ మట్టి వినాయక విగ్రహం రాయలసీమలోనే తొలి భారీ విగ్రహంగా రికార్డు నెలకొల్పడం విశేషం.

ప్రత్యేక హోదా గణపయ్య
పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కోమటిగుంటలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలని కోరుతూ.. గ్రామంలోని యువకులు 1008 కిలోల లడ్డూను తయారుచేసి విఘ్నేశ్వరుడికి సమర్పించారు. వచ్చే వినాయక చవితి లోపల ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి రాష్ట్రం సుఖసంతోషాలతో ఉండాలని గ్రామస్తులు ఈ లడ్డూను సమర్పించినట్లు భక్తులు తెలిపారు. ఏపీ ప్రత్యేక హోదా లడ్డూను చూడ్డటానికి స్థానికులు, భక్తులు భారీగా తరలివస్తున్నారు.

150 కిలో తీపి తినుబండారాలతో పర్యావరణ గణేషుడు
పర్యావరణ పరిరక్షణలో ఎప్పుడూ ముందుంటామని చెన్నైవాసులు మరోసారి నిరూపించారు. టీ-నగర్‌ వినాయక ఉత్సవ కమిటీ వినూత్నంగా తీపి బండారాలతో రూపొందించిన వినాయక విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. 150 కిలో తీపి తినుబండారాలతో పర్యావరణ హితమైన బొజ్జ గణపయ్యను రూపొందించి పర్యావరణం పట్ల తమకున్న ప్రేమాభిమానాల్ని చాటుకున్నారు. జలరాశులకు ఆహారంగా ఉండే విధంగా ఏటా తినుబండారాలతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్న నిర్వాహకులు... ఈసారి పప్పు, నువ్వుల చెక్కలు, ఎండు ద్రాక్షతో 150 కిలోల బరువు, 26 అడుగుల ఎత్తైన వినాయకుడిని కొలువు దీర్చారు. దీంతో నగరం నలుమూలల నుంచి పర్యావరణ గణపతికి పూజలు చేసేందుకు భక్తులు తరలివస్తున్నారు. నల్గొండ జిల్లా సూర్యపేటలోని బొడ్డురాయి బజార్‌లో కేఎంఆర్  స్టీల్‌ షాప్‌ వారు ఏర్పాటు చేసిన స్టీల్‌ వినాయక విగ్రహం అందరినీ అలరిస్తోంది. పర్యావరణానికి హాని తలపెట్టకుండా ఉండేందుకు దుకాణం యజమాని కొత్త సురేష్‌ సృజనాత్మకంగా తన దుకాణంలోని స్టీల్‌ సామానులతోనే గణేషున్ని ప్రతిష్టించాడు. స్టీల్‌ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపిస్తున్నారు. 

12:34 - September 6, 2016

తూర్పుగోదావరి : తొండంగి మండలం పంపాజీపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.దివిస్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పంపాజీపేటలో సీపీఎం నిర్వహించాలనుకున్న బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధుతో పాటు జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి, దేవిరాణి, వేణుగోపాల్‌ను అరెస్ట్‌ చేశారు. పోలీసులు రౌడీయిజం చేస్తున్నారని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మధు మండిపడ్డారు.

12:32 - September 6, 2016

గుంటూరు : నవ్యాంధ్ర రాజధానిలో మరో వివాదం నెలకొంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన తమను ప్రభుత్వం పట్టించుకోవడం రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండో విడత కౌలు చెల్లించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో రైతులు తమ భూములను ట్రాక్టర్లతో దున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

12:27 - September 6, 2016

జమ్ము కశ్మీర్ : పాకిస్థాన్‌ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. భారత్‌-పాక్‌ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి జమ్ము-కశ్మీర్‌ పూంచ్‌ సెక్టార్‌లోకి కాల్పులు జరిపారు. భారత్‌ సైనిక పోస్టుల లక్ష్యంగా మోర్టార్లు ప్రయోగించారు. తుపాకులు, ఆటోమేటిక్‌ ఆయుధాలతో కాల్పుల జరిపారు. పాక్‌ సైనికుల కాల్పులను మన సైనికులు తిప్పికొట్టారు. పాక్‌ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఈ వారంలో ఇది రెండోసారి. ఈనెల 2న జమ్ము జిల్లాలోని అఖ్నూర్‌ సెక్టార్‌లో మన సైనిక పోస్టులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. గత నెల 14న కూడా పాక్‌ సైనికలు రెండు సార్లు పూంచ్‌ సెక్టార్‌లోకి కాల్పులు జపరడంతో ఒక మహిళ గాయపడింది. 2015లో పాక్‌ సైనికులు 405 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి 253 సార్లు, నియంత్రణ రేఖ దగ్గర 152 సార్లు కాల్పులకు తెగబడ్డారు. ఈఘటనల్లో 16 మంది పౌరులు మరణించారు. మరో 71 మంది గాయపడ్డారు. 

12:24 - September 6, 2016

కర్నాటక : కావేరి నదీ జలాల వివాదంతో కర్నాటక రగిలిపోతోంది. తీవ్ర కరవుతో తల్లడిల్లుతున్న తమిళనాడుకు కావేరి నుంచి పది రోజులపాటు నిత్యం 15 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై కర్నాటక వాసులు మండిపడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి రోజూ 10 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడానికి కర్నాటక ప్రభుత్వం సిద్ధమయ్యింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ కర్నాటకలోని మండ్య జిల్లాలో ఇవాళ బంద్‌ జరుగుతోంది. బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. కేఎస్ఆర్టఈసీ మండ్య, మైసూర్‌ ప్రాంతాలకు వెళ్లే 700 బస్సు సర్సీసులను రద్దు చేసింది. తమిళనాడుకు కావేరి నదీ జలాలు విడుదల చేయాలన్న కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బెంగళూరు, మైసూరుల్లో కూడా ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి. ఇవాళ జరుగుతున్న బంద్‌ మండ్య జిల్లాకే పరమితం కాగా.... కన్నడ అనుకూల సంఘాలు శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చాయి. 

11:32 - September 6, 2016
11:31 - September 6, 2016

టాలీవుడ్ లో ఓ కుటుంబంపై సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' కుమారుల పెళ్లిళ్లపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 'నాగ చైతన్య' – సమంతలు వివాహం చేసుకోబోతున్నట్లు, అలాగే ప్రేమిస్తున్న అమ్మాయితో 'అఖిల్' పెళ్లి జరగనుందని టాలీవుడ్ లో కోడై కూసింది. దీనికంతటికీ 'నాగ్' తెరదించాడు. మంచి ముహూర్తం చూసుకుని.. ఆ డేట్ ను అతి త్వరలోనే అనౌన్స్ చేస్తానని 'నాగ్' వెల్లడించాడు. 'నిర్మల కాన్వెంట్' ప్రమోషన్ లో పాల్గొన్న నాగ్.. ఈ వ్యాఖ్యలు చేశారు. అంత వరకు కొంచెం ఓపిక పట్టాలని, డెఫినెట్ గా అనౌన్స్ చేస్తానని.. మంచి ముహూర్తం చూసుకుని.. అందరికీ చెబుతానన్నాడు. శుభముహూర్తం అంటే డిసెంబర్ లో ఉన్నాయని..ఆ మాసంలోనే పెళ్లిళ్లు జరుగుతాయని తెలుస్తోంది. మరి 'నాగ చైతన్య' వివాహం 'సమంత'తోనే జరుగుతుందా ? లేదా ? అనే దానిపై క్లారిటీ రావడం లేదు. ఏమైనా 'అక్కినేని' ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగడం ఖాయమన్నమాట. 

ఏపీ కేబినెట్ ప్రారంభం.

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, పుష్కరాలు, రాయలసీమలో కరవుపై మంత్రులు చర్చించనున్నారు. జీఎస్టీ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాష్ట్రానికి కేంద్రం సాయంపైనా మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి....

రంగారెడ్డి: ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో చోటుచేసుకుంది. మృతురాలి వివరాలు తెలియరాలేదు. యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

11:22 - September 6, 2016

'పవన్ కళ్యాణ్'..'దాసరి నారాయణరావు' కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్నట్లు ఎప్పటి నుండో వినిపిస్తున్న వార్తలే. 'దాసరి' ప్రొడక్షన్లో 'పవన్' సినిమాను ఎవరు తీస్తారో తెలియదు కాని.. 'దాసరి' సొంత సంస్థ 'తారకప్రభు ఫిలింస్' 'పవన్' తో తమ ప్రొడక్షన్ నెం.38 టేకాఫ్ అవుతున్నట్లు ప్రకటించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం 'పవన్ కళ్యాణ్'..'శరత్ మరార్' కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనికి 'కాటమరాయుడు' అని నామకరణం కూడా చేసేశారు. అనంతరం 'తివిక్రమ్' సినిమాలో 'పవన్' నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే 'దాసరి' నిర్మించబోయే చిత్రాన్ని 'బోయపాటి' డైరెక్షన్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు 'బోయపాటి' తో 'దాసరి' చర్చలు కూడా చేశారని టాక్. ప్రస్తుతం 'బోయపాటి' 'బెల్లంకొండ శ్రీనివాస్' తో ఒక సినిమా చేస్తున్నారు. అది పూర్తికాగానే 'మెగాస్టార్ చిరంజీవి'తో 'బోయపాటి' చిత్రం ఉంటుందని తెలుస్తోంది. అనంతరం దాసరి..పవన్ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

ఏపీ రాజధాని ప్రాంతంలో మరో వివాదం

గుంటూరు : ఏపీ రాజధాని ప్రాంతంలో మరో వివాదం చోటుచేసుకుంది. కౌలు చెక్కులు, ప్లాట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మందడం గ్రామానికి చెందిన 20 మంది రైతులు ఆందోళనకు దిగారు. అంతే కాకుండా తాత్కాలిక సచివాలయం సమీపంలోరి తమ భూములను రైతులు దున్నుకుంటున్నారు.

11:11 - September 6, 2016

'జనతా గ్యారేజ్' టీం ఆనందంతో ఉప్పొంగిపోతోంది. 'కొరటాల శివ' దర్శకత్వంలో 'జూనియర్ ఎన్టీఆర్' హీరోగా నటించిన 'జనతా గ్యారేజ్' కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తోంది. ఈనెల 1వ తేదీన రిలీజైన ఈ చిత్రం ప్రతి చోటు నుండి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. భారీ వసూళ్లను సాధిస్తోంది. దీనితో చిత్ర యూనిట్ తెగ సంతోష పడిపోతోంది. 'టెంపర్'..'నాన్నకు ప్రేమతో' వంటి సినిమాలతో 'ఎన్టీఆర్' మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. 'శ్రీమంతుడు' చిత్రం ద్వారా తానేమిటో 'కొరటాల' నిరూపించారు. జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న 'మోహన్ లాల్' ఈ చిత్రంలో నటించడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలు తగ్గట్టే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించారు. దీనితో సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు 'థాంక్స్' చెప్పాలని చిత్ర యూనిట్ భావిస్తోందంట. అందులో భాగంగా విశాఖలో ఓ ఫంక్షన్ ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలో గ్యారేజ్ కలెక్షన్లు బాగుండడం...అన్ని కలిసి వచ్చేలా వచ్చే ఫ్రైడే అంటే 9న విశాఖలో ఫంక్షన్ చేస్తే ఎలా ఉంటుందని చిత్ర యూనిట్ యోచిస్తోందని తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

పోలీసులు రౌడీయిజం చేస్తున్నారు : పి.మధు

తూ.గో : పోలీసులు రౌడీయిజం చేస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శి పి. మధు విమర్శించారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా లో దివిస్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పంపాజీపేటలో సీపీఎం ఆధ్వర్యంలో జరపతలపెట్టిన బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు. అంతే కాక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, తూ.గో జిల్లా సీపీఎం జిల్లా కార్యదర్శి, కార్యకర్తలు దేవిరాణి, వేణుగోపాల్ సహా పలువురిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ...ప్రజాస్వామ్య విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

11:07 - September 6, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ నేతలను గ్యాంగ్ స్టర్ నయీం డైరీ వెంటాడుతూనే ఉంది. నల్గొండ జిల్లాలో నయీం గ్యాంగ్ చేసిన సెటిల్‌మెంట్లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. డైరీలో వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించకపోవడంతో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు డైరీ అంశాన్ని తమ అస్త్రంగా మార్చుకోవడంతో అధికార పార్టీ చిక్కుల్లో పడింది.

నేతి విద్యాసాగర్‌పై మాత్రమే ఎఫ్‌ఐఆర్ నమోదు
గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు స్వాధీనం చేసుకున్న నయీం డైరీ టీఆర్‌ఎస్ నేతలను వెంటాడుతోంది. ఎన్‌కౌంటర్ జరిగి దాదాపు నెల రోజులు గడుస్తున్నా డైరీలోని వాస్తవాలు పెద్దగా బయటకు రావడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పేరు మాత్రమే అధికారికంగా ఎఫ్ఐఆర్ లో నమోదైంది. కాని ఇంకా ఎంతో మంది నేతలు నయీంతో సత్సంబంధాలు కొనసాగించారన్న విషయం బహిరంగ రహస్యం అన్న ప్రచారం కూడా ఉంది.

మంచిరెడ్డిపై ఆరోపణలు చేసిన మల్‌రెడ్డి రంగారెడ్డి
నల్గొండ జిల్లాలో అధికారపార్టీకి చెందిన శాసనసభ్యులతో పాటు శాసనమండలి సభ్యుల పేర్లపై కూడా జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి వ్యవహారం తెరపైకి వచ్చింది. నియోజకవర్గంలో పెరిగిన రియల్ జోరులో ఈ గ్యాంగ్ ను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి భారీగా సెటిల్ మెంట్లు చేశారని మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపిస్తున్నారు. గులాబి పార్టీలో చేరడానికి కూడా ఇదే కారణమని వెల్లడించారు. దీంతో ఈ విషయంలో ఏం చేయాలో తెలియక అధికార పార్టీ సందిగ్ధంలో పడింది.

డైరీ ఆధారంగానే కేసులు నమోదు
మల్‌ రెడ్డి ఆరోపణలను మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఖండించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. అయితే దీనిపై మంచిరెడ్డి మాత్రమే స్పందించారు తప్పా.. పార్టీ నేతలెవరు రియాక్ట్ కాలేదు. మరోవైపు నయీం డైరీ అసలు గుట్టు విప్పని పోలీసులు.. దాని ఆధారంగానే కేసులు నమోదు చేస్తున్నామన్న సంకేతాలను మాత్రం ఇస్తున్నారు. అయితే సిట్ విచారణ పూర్తయ్యేంత వరకు ఎంతమంది నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తుందోనన్న ఆందోళన అన్ని పార్టీల నేతలను వెంటాడుతోంది.

కశ్మీర్ సీఎం ను కుక్కతోకతో పోల్చిన సుబ్రమణ్యస్వామి...

హైదరాబాద్ : సంచలనాలకు కేంద్ర బిందువైన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్ లో నెలకొన్న తాజా పరిస్థితులను ప్రస్తావించిన ఆయన ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తీని కుక్క తోకతో పోల్చారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ముఫ్తీపై విరుచుకుపడ్డారు. ''కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించాలి. కుక్క తోక వంకర పోనట్లే... ముఫ్తీ వైఖరిలోనూ ఏ మార్పూ లేదు. ఇక ఎప్పటికి కూడా ముఫ్తీ వైఖరి మారదు. ఆమెకు ఉగ్రవాదులతో లింకులున్నాయి.

11:02 - September 6, 2016

విజయవాడ : విజయవాడలో డూండి గణేష్‌ సేవా సమితి అత్యుత్సాహం ప్రదర్శించింది. గణేష్‌ ఉత్సవాలను నిర్వాహకులు టీడీపీ ఉత్సవాలుగా మార్చారు. స్వాగత బ్యానర్లను టీడీపీ నేతల ఆహ్వాన బ్యానర్లుగా మార్చడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాగత ద్వారాల మార్పు గురించి తనకేమీ తెలియదని సేవాసమితి ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బారావు చెప్పారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ

విజయవాడ : కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాలు, పుష్కరాలు, రాయలసీమలో కరవుపై మంత్రులు చర్చించనున్నారు. జీఎస్టీ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాష్ట్రానికి కేంద్రం సాయంపైనా మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది.

10:57 - September 6, 2016

తూర్పుగోదావరి : సీపీఎం జిల్లా కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి పంపాదిపేటలో సీపీఎం చేపట్టనున్న బహిరంగ సభకు  అనుమతి కోరామనీ..అనుమతి పత్రంపై ఏమీ స్పందించకుండా ఇప్పుడు నేతలను అరెస్ట్ చేయటం అన్యాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించటానికి తమ చేతిలో ఎటువంటి ఆయుధాలూ లేవనీ..సభకు తరలివస్తున్న నేతలను గృహనిర్భంధం చేయటం..అరెస్ట్ చేయటాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. దివీస్‌ భూసేకరణకు వ్యతిరేకంగా నేడు తూర్పుగోదావరి జిల్లా తొండంగి పంపాదిపేటలో సీపీఎం చేపట్టనున్న బహిరంగ సభను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గృహనిర్బంధం, అరెస్ట్ లతో నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పంపాదిపేట, తాటాకులపాలెం, కొత్తపాకల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పలువురు సీపీఎం నేతలతో పాటు తుని వైసీపీ ఎమ్మెల్యే దాడి శెట్టి రాజాను గృహ నిర్బంధం చేశారు. సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హాజరుకానున్నారు. 

10:51 - September 6, 2016

 రక్తంలో ఉండే చాలా కీలకమైన అంశాలే ప్లేట్‌లెట్స్. సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000ల ప్లేట్లెట్స్‌ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలాచేసి, దానిని తొందరగా తగ్గించేలా పనిచేస్తాయి, ప్లేట్లెట్స్‌ శరీరంలో రక్తానికి సంబంధించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి. ఇప్పటికే డేంగ్యూ ఫీవర్ గురించి వినే ఉంటారు. ఈ ఫీవర్ వచ్చినప్పుడు, శరీరంలో ప్లేట్ లెట్ స్థాయిలో తీవ్రంగా తగ్గిపోతాయి. దాంతో ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. లోబ్లడ్ ప్లేట్ లెట్స్ ను టెక్నికల్ గా థ్రోమ్బోసైటోఫినియా అని పిలుస్తారు . ఈ వైరస్ కు కారణం జన్యుపరమైన, మెడికేషన్స్, ఆల్కహాల్, వైరస్, గర్భాధారణ మరియు ఇతర కొన్ని ప్రత్యేకమైన వ్యాధుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందవచ్చు. అలా వ్యాప్తి చెందకుండా ఉండాలన్నా, లేదా ప్లేట్ లెట్ స్థాయిలు తగ్గకుండా ఉండాలన్నా, ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరంలో ప్లేట్ లెట్స్ తగ్గినప్పుడు అతి తక్కువ సమయంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ది చేసే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడం వల్ల నేచురల్ గానే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. ఒకవేళ ప్లేట్లెట్స్‌ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్‌ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బీపి, గుండెపోటు, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్‌ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. బ్లడ్‌ టెస్ట్‌ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్‌ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్‌ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్‌ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే ఈ క్రింది ఆహార పదార్థాలను వాడితే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.

1.బీట్ రూట్: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.

2.క్యారెట్: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .

3.బొప్పాయి: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.

4.వెల్లుల్లి : శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.

5. ఆకుకూరలు: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.

6.దానిమ్మ: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.

7.ఆప్రికాట్ : ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.

8.ఎండు ద్రాక్ష : రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.

9. ఖర్జూరం : ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.

10. బొప్పాయి : బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది. అందుకు మీరు చేయాల్సిండి బొప్పాయి ఆకులను జ్యూస్ ను త్రాగడం లేదా బొప్పాయి ఆకులను కొద్దిగా నీళ్లు పోసి మీడియం మంట మీద ఉడికించాలి. ఆ నీటిని వడగట్టి రోజుకు రెండు సార్లు త్రాగడం వల్ల ప్లేట్ లెట్స్ తగ్గుతాయి.

10:44 - September 6, 2016

విజయవాడ : మరికాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం విజయవాడ 11 గంటలకు జరుగనుంది. ఈ సమావేశంలో ఆర్థిక లోటును ఎలా భర్తీ చేయాలి? అనే అంశంపై మంత్రులు చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం..ఏపీకి ప్రత్యేక హోదాపై కార్యాచరణపై వ్యూహం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించనున్న సభపై నేతలు చర్చించనున్నారు. హోదా అంశంపై అన్ని వర్గాల నుండి వస్తున్న ఆరోపణలు..ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల విమర్శలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై మంత్రులు చర్చించనున్నారు.

10:29 - September 6, 2016

హైదరాబాద్ : కొత్తజిల్లాల ఏర్పాటుపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజా పరిణామాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి మంగళవారం కలెక్టర్లతో సమావేశం కానున్నారు. డ్రాఫ్టు నోటిఫికేషన్‌ పై వచ్చిన ఫిర్యాదులు, వివిధ ప్రాంతాలలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారనుంది. ఇటీవల కేబినెట్‌ సమావేశంలో సీఎస్‌ నేతృత్వంలో నియమించిన టాస్క్ ఫోర్స్‌ కమిటీ మూడు రోజలుగా ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. ప్రస్తుతం పలుశాఖల్లో ఉద్యోగుల సంఖ్య, కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్థుబాటు, ఫైళ్ల క్రోడింగ్‌ ,కార్యాలయాల ఏర్పాటు వంటి అంశాలపై వివరాలను సేకరించింది. హన్మకొండ జిల్లా ఏర్పాటు విషయంలో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా వరంగల్ రూరల్‌ అంతా కలిపి ఓ జిల్లాగా ప్రకటించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.. 

బెంగళూరు-మైసూరు రహదారిని దిగ్బంధించిన రైతులు

కర్ణాటక: తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై నిరసనగా కర్ణాటకలోని మాండ్యాలో బంద్‌ కొనసాగుతోంది. బెంగళూరు- మైసూరు జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. రైతుల ఆందోళనల దృష్ట్యా భారీగా పోలీసులు మోహరించారు. తమిళనాడుకు 15 వేల క్యూసెక్కుల కావేరి జలాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కావేరి జలాల వివాదంపై ఇవాళ అఖిలపక్ష భేటీకి కర్ణాటక సీఎం సిద్దరామయ్య పిలుపునిచ్చారు. కావేరి జలాల విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమావేశంలో చర్చించనున్నారు.

గణేశ్ నిమజ్జనంలో అపశృతి

గుంటూరు : గణేశ్ నిమజ్జనానికి వెళ్లి 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలం అందుగల కొత్తపాలెంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

కాసేపట్లో కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ...

హైదరాబాద్ : మరికాసేపట్లో డ్రాప్టు నోటిఫికేషన్ పై వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ అయి చర్చించనున్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు పై మరోసారి చర్చించే అవకాశం కనిపిస్తోంది.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై : స్టాక్‌మార్కెట్లు ఈ ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 272 పాయింట్లు లాభపడి 28, 804 సూచీ వద్ద అదేవిధంగా నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 8,883 సూచీ వద్ద ట్రేడ్‌లో కొనసాగుతున్నాయి. 

నేటి నుంచి రాహుల్ కిసాన్ యాత్ర...

లక్నో : కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ నేటి నుంచి యూపీలో కిసాన్ యాత్ర నిర్వ‌హించ‌నున్నారు. డియోరియా నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాహుల్ ప్ర‌చారం మొద‌లుపెట‌నున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఈ యాత్రతో రాహుల్ గాంధీ తెర‌లేప‌నున్నట్లు సమాచారం.

 

కౌలాలంపూర్ లో శ్రీలంక రాయబారిపై దాడి

హైదరాబాద్ : కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే శ్రీలంక రాయబారిపై దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే... మలేసియాలోని కౌలాలంపూర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో శ్రీలంక రాయబారి ఇబ్రహిం సాహిబ్‌ అన్సార్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఎయిర్‌పోర్టులో నడుచుకుంటూ వెళ్తున్న ఆయనపై .. అకస్మాత్తుగా ఓ గుంపు అడ్డుకుని పిడిగుద్దులు గుద్దారు. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని గుంపును చెదరగొట్టారు.

 

09:52 - September 6, 2016

తూర్పుగోదావరి : జిల్లాలో సీపీఎం బహిరంగసభను అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నాలు ఆరంభించారు. దివీస్ భూ సేకరణకు వ్యతిరేకంగా నేడు సీపీఎం బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనితో పలువురు సీపీఎం నేతలను గృహ నిర్భందం చేశారు. సీపీఎం జిల్లా కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. సీపీఎంకు సీపీఐ, వైసీపీ, పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈనేపథ్యంలో ఆ ప్రాంతంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. దివీస్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. రైతులకు అండగా నిలిచేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. ఇవాళ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయించాయి. అయితే సభను అడ్డుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

400 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు సర్కార్  యత్నం..
దివీస్‌ను వ్యతిరేకిస్తున్న రైతులకు అండగా నిలిచేందుకు..పంపాదిపేటలో బహిరంగ సభ నిర్వహించాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. దీంతో సభను అడ్డుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తొండంగి మండలంలోని పంపాదిపేట, కొత్తపాకల, తాటాకులపాలెం గ్రామాల పరిధిలో దివీస్‌ ఫార్మా ఫ్యాక్టరీ నిర్మాణానికి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మూడు గ్రామాల్లో 400 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే దీనిని ఆయా గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. గ్రామస్తుల పోరాటాన్ని అణిచివేసేందుకకు కంపెనీ యాజమాన్యం, జిల్లా యంత్రాంగం అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. బాధిత రైతులకు, ప్రజలకు అండగా నిలుస్తున్న సీపీఎం నాయకులతో పాటు ఇతర నాయకులపై కేసులు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారు. 

'ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రాజద్రోహం కిందకు రావు'...

ఢిల్లీ: ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం రాజద్రోహం కిందికి రాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘‘ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం పరువునష్టం కిందికో, రాజద్రోహం కిందికో రాదు’’ అని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది.అంతేకాకుండా ఈ తీర్పును అనుసరించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వ అధికారులు, పోలీసులు, జడ్జిలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అటువంటి విమర్శలు హింసకు దారితీసినా, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కారణమైనా అప్పుడు అది రాజద్రోహం కిందకి వస్తుందని స్పష్టం చేస్తూ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఉదయ్ యు లలిత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది.

నేడు సీఐడీ విచారణకు భూమన..

చిత్తూరు : వైసీపీ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేడు సీఐడీ విచారణ ఎదుట హాజరు కానున్నారు. తునిలో జరిగిన విధ్వంసంపై కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీఐడీ అధికారులు విచారణకు రావాలంటూ మొన్న భూమనకు తిరుపతిలో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

టీనేజర్ ఆరుషి హత్య కేసులో నుపూర్ తల్వార్ విడుదల..

ఉత్తర్ ప్రదేశ్ : టీనేజర్ ఆరుషి తల్వార్ హత్య కేసులో నుపూర్ తల్వార్ జైలు నుండి విడుదలయ్యాడు. గత రాత్రి విడుదలైన ఆయనకు పెరోల్ మంజూరైంది. 2008 మే 16వ తేదీన ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జలవాయువిహార్‌లో సెక్టార్ 25లో డాక్టర్ రాజేష్ తల్వార్ కుమార్తె ఆరుషి దారుణ హత్యకు గురైందన్న వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐదేళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది. చివరకు కన్నకుమార్తెతో పాటు పని మనిషిని హత్య చేసింది దంత వైద్య దంపతులైన నుపూర్ తల్వార్, రాజేష్ తల్వార్లేనని ఘజియాబాద్ ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. 

బంద్ కు పిలుపునిచ్చిన కావేరీ హోర్తా..

కర్నాటక : తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న సుప్రీం ఆదేశాలను నిరసిస్తూ కావేరీ హోర్తా మంద్య ప్రాంతంలో బంద్ కు పిలుపునిచ్చింది. దీనితో 2400 మంది పోలీసులు మోహరించారు. నీటి విడుదలపై కర్ణాటక వాదనలను నిన్న సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. తమిళనాడుకు 15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సుప్రీం ఆదేశించింది. పది రోజుల పాటు నీరు విడుదల చేయాలని పేర్కొంది. 

09:06 - September 6, 2016

రాష్ట్ర విభజనానంతరం ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటిస్తూ యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీపై గతం రెండున్నర కాలంగా ఇదే అంశంపై పార్టీలు..నేతల మధ్య మాటల యుద్ధాలు..కసరత్తులు..ఆందోళనలు.ఈ అఈంశం చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి..అసులు హోదా ఇస్తుందా లేదా అనేది పక్కన పెడితే..భిన్న ప్రకటనలతో ఏపీ ప్రజలకు నేతలు గందగోళానికి గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో తీపికబురు అందుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు... ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా తొలగించేలా చర్చలు తీసుకుంటున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో వేసిన కమిటీ సిఫార్స్ చేసిన అంశం... మరో వైపు ఏపీని అన్నివిధాల ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుందని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి తెలిపారు. 14 వ ఆర్థిక సంఘం యూపీఏ హయాంలో ఏర్పడిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని సంఘం చెబుతోందని తెలిపారు. 11 రాష్ట్రాలతో సమానంగా ఏపీకి ప్రత్యేకప్యాకేజీ ఇవ్వనున్నామని పురంధేశ్వరి పేర్కొన్నారు.. ..ఇలా మూడు అంశాలు విభిన్నంగా వున్నాయి. దీంట్లో ఏది వాస్తవం? ఏది అవాస్తవం? ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో భిన్నవాదనలు..విభిన్నమైన ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఉమామహేశ్వరరావు(సీఐటీయూ నేత) అద్దేపల్లి శ్రీధర్(ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి) సూర్య ప్రకాశరావు (టీడీపీ నేత) పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్తత..

తూర్పుగోదావరి : జిల్లాలో సీపీఎం బహిరంగసభను అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నాలు ఆరంభించారు. దివీస్ భూ సేకరణకు వ్యతిరేకంగా నేడు సీపీఎం బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనితో పలువురు సీపీఎం నేతలను గృహ నిర్భందం చేశారు. సీపీఎం జిల్లా కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. సీపీఎంకు సీపీఐ, వైసీపీ, పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.

08:50 - September 6, 2016

నిజామాబాద్‌ : తన వయస్సు పిల్లలతో ఆడుతూ-పాడుతూ గంతులేయాల్సిన వయస్సులో ఓ చిన్నారి మంచానికే పరిమితమైంది. నడవలేని పరిస్థితుల్లో నిత్యం తల్లడిల్లుతోంది. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఆ పాపకు చికిత్స చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. నిత్యం పనిచేస్తేగానీ పొట్టగడవని పరిస్థితి ఆ కుటుంబానిది. ఈ పరిస్థితుల్లో తమ కూతురు ప్రాణాలు కాపాడాలని దాతలను వేడుకుంటున్నారు ఆ నిరుపేద దంపతులు..!

రెండేళ్ల వయస్సులో ఆడుకుంటూ కిందపడ్డ అలేఖ్య
అమ్మ చేత్తో ఎంతో ఇష్టంగా గోరుముద్దలు తింటున్న ఈ చిన్నారికి పెద్ద కష్టమే వచ్చింది. నాన్న సాయంతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్న ఈ చిన్నారి ప్రాణంతక వ్యాధితో బాధపడుతోంది.

ఎడమకాలు, చేయి, కన్ను పనిచేయని పరిస్థితి
నిజామాబాద్‌ మండల కేంద్రంలోని గొల్‌హన్మన్‌ ప్రాంతంలో నివసిస్తున్న రవీందర్‌, శారద దంపతుల పాప ఈ చిన్నారి. పేరు అలేఖ్య. రెండేళ్ల వయస్సున్నప్పుడు ఆడుకుంటూ వెళ్లి.. ఐదు అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. దీంతో మెదడు, కుడికాలికి బలమైన గాయాలు కావడంతో దగ్గరలోని ఆస్పత్రిలో చూపించారు. అయినా చిన్నారి కోలుకోలేదు. డాక్టర్ల సూచనల మేరకు అన్ని ఆస్పత్రులు తిరిగారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో తలకు సర్జరీ చేశారు. అయినా.. అలేఖ్య కోలుకోలేదు. అందరిలా నడవలేకపోతోంది. ప్రస్తుతం కుడిచేయి, కుడికాలు, ఎడమ కన్ను మాత్రమే పనిచేస్తున్నాయి. మరోకాలు, చేయి, కన్ను పనిచేయడం లేదు.

రూ. 8లక్షలు ఖర్చు చేసిన నిరుపేద దంపతులు
చిన్నారి కోలుకోవడం కోసం తల్లిదండ్రులు తిరగని ఆస్పత్రి లేదు. అలేఖ్యను పరీక్షించిన వైద్యులు.. ట్రామాటిక్‌ బ్రెయిన్‌ సమస్యతో బాధపడుతోందని తేల్చారు. పై నుంచి కిందపడడం వల్ల తలకు బలమైన గాయం అయ్యి.. కండరాల బలహీనతకు గురయ్యిందని చెప్పారు. చిన్నారికి ఆపరేషన్‌ చేస్తే.. కోలుకుంటుందని వివరించారు. శస్ర్తచికిత్సకు కనీసం ఆరు లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. రోజు కూలిపని చేసుకుని జీవించే ఈ దంపతులు ఇప్పటికే 8 లక్షల వరకు అప్పు చేసి.. వైద్యానికి ఖర్చు పెట్టారు. ఇప్పుడు మరో 6 లక్షలు ఎలా సమకూర్చాలో తెలియక కుమిలిపోతున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి చూసి తల్లడిల్లిపోతున్నారు.

దాతల కోసం నిరుపేద దంపతుల ఎదురుచూపులు
కూతురు వైద్యానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఈ నిరుపేద దంపతులు దాతల కోసం ఎదరుచూస్తున్నారు. అలేఖ్యకు ఆర్థిక సహాయం చేసి.. ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.

మనసున్న మారాజులూ స్పందించండి..
చిన్నారి వైద్యఖర్చులకు మీరిచ్చే ప్రతి రూపాయి అలేఖ్య ప్రాణాలు కాపాడుతాయి. ఒక కుటుంబంలో సంతోషాలు పంచుతాయి. రండి.. మనసున్న మారాజులు ముందుకొచ్చి.. చిన్నారి అలేఖ్య ప్రాణాలు కాపాడండి. ఈ నిరుపేద కుటుంబంలో దీపాన్ని వెలగించండి.

08:44 - September 6, 2016

కర్నూలు : సోలార్ పవర్ ప్లాంట్ నిర్మిస్తామంటూ విలువైన భూములను లాక్కోంది ఏపీ ప్రభుత్వం. రైతుల నుంచి తీసుకొన్న భూమికి నష్టపరిహారం చెల్లిస్తామంది..కానీ నెలలు గడుస్తున్నా ఇప్పటీకి నష్టపరిహాం ఊసెత్తడం లేదూ. కానీ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం వేగంగా చేస్తోంది. దీంతో కడుపుమండిన రైతులు పరిహారం కోసం ఆందోళన బాట పట్టారు. కర్నూల్ జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూములు కొల్పోయిన రైతులపై టెన్ టీవీ ప్రత్యేక కథనం...

504 మంది రైతులకు చెందిన 1500 ఎకరాలు భూమి స్వాధీనం
కర్నూలు జిల్లా గడివేములు మండలం గని గ్రామంలో 2వేల ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ భూముల్లో గని గ్రామానికి చెందిన 504 మంది రైతులకు చెందిన 1500ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పవర్ ప్లాంట్ కోసం స్వాధీనం చేసుకున్న రైతుల భూములకు ఇప్పటికి నష్టపరిహరం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ఆగ్రహంతో రైతులు తమకు అందాల్సిన పరిహారం కోసం ఆందోళనకు దిగారు. పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు పూనుకున్నారు.

2013 భూసేకరణ చట్టం ప్రకారం సర్కార్ పరిహారం చెల్లించాలి
2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహరం అందిన తర్వాత అక్కడ అభివృద్థి పనులు నిర్వహించుకోవాలని చట్టాలు చెప్పుతున్నా..రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నాతాధికారులు రైతుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తూ..రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని భూములు కోల్పోయిన రైతులు ఆరోపిస్తున్నారు.

రైతులు ఆందోళనకు దిగొచ్చిన అధికారులు
సోలార్ ప్లాంట్ లో భూములు కోల్పోయిన రైతులు ఆందోళనను ఉధృతం చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. రైతుల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. జిల్లాలో క్రిష్ణాపుష్కరాలు రావడంతో వీరికి అందుబాటులో లేకపోయామని అధికారులు అంటున్నారు. ఈ నెల చివరి వారంలో నష్టపరిహారం అందించి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళనను విరమించారు.

రైతులకు పరిహారం చెల్లించకుంటే ఆందోళన ఉధృతం- కాటసాని
ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంటు రైతుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. రైతులు సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సోలార్ పవర్ ప్లాంట్ కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ప్రజాసంఘాలు, పలు పార్టీల ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమ ఆందోళనలు మరింత ఉధృతవుతాయని హెచ్చరిస్తున్నారు. 

08:32 - September 6, 2016

హైదరాబాద్ : తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లలో నూతననైపుణ్య విధానం పేరుతో జరుగుతున్న గొడవ ముదురుతోంది. విద్యావిధానంలో సమూల మార్పులు తెచ్చేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటి సెక్రటరీ ప్రవీణ్ కుమార్ కృషి చేస్తున్నారని కొందరంటుంటే..ఇష్టమొచ్చిన విధానాలను పెట్టి ఉపాధ్యాయులను ఇరకాటంలో పెడుతున్నారంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. విద్యార్ధులకు మేలు జరిగే ఏ విధానాలనైనా ప్రోత్సహించాలంటున్నారు మేధావులు.

కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్
తెలంగాణ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో నూతననైపుణ్య విధానం లాభమా.. నష్టమా.. అనే అంశంపై కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. దీనిపై వక్తలు విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు. తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ పాలన పైనా భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి.

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన
అభివృద్ధి ఫలాలను ఆశించకుండా కార్యదర్శిపైనే కుట్రలు జరుగుతున్నాయంటూ కొందరు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేశారు. అసలు విద్యార్ధుల సమస్యలు పట్టించుకోకుండా కొత్త పాలసీలు ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

కొత్తవిధానాలతో ఉపాధ్యాయులను మానసికంగా ఇబ్బందులు
మరోవైపు విద్యార్ధులకు మౌళిక సదుపాయాలు తీర్చలేకపోతోంది ప్రభుత్వం. దీనికితోడు కొత్తవిధానాలతో ఉపాధ్యాయులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుందంటూ కొందరు ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే సమ్మెకు పిలుపునిచ్చిన తమను సెమినార్ల పేరుతో ఇబ్బందులు పెడుతూ భయభ్రాంతులకులోను చేస్తున్నారంటున్నారు ఉద్యోగులు. కాని ఉపాధ్యాయుల తీరు మారాల్సిన అవసరం ఉందంటున్నారు కొందరు విద్యార్థి సంఘాల నేతలు.

మౌళికసదుపాయాలను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : విద్యావేత్తలు...
నూతన నైపుణ్య విధానం వల్ల విద్యార్ధులకు నాలెడ్జ్ జరుగుతుందంటే..ఉపాధ్యాయులు అందుకు అనుగుణంగా మారాల్సిన అవసరం వుందంటున్నారు మేధావులు. విద్యార్ధులకు జ్ఞానం పెరగటం ముఖ్యమైన విషయమని అందుకుకావాల్సిన మౌళికసదుపాయాలను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటున్నారు విద్యావేత్తలు.  

08:09 - September 6, 2016

హైదరాబాద్ : కొత్తజిల్లాల ఏర్పాటుపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజా పరిణామాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి మంగళవారం కలెక్టర్లతో సమావేశం కానున్నారు. డ్రాఫ్టు నోటిఫికేషన్‌ పై వచ్చిన ఫిర్యాదులు, వివిధ ప్రాంతాలలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారనుంది.

సీఎం కలెక్టర్లతో సమావేశం
కొత్తజిల్లాలపై పలు ప్రాంతాలలో నిరసనలు, ఫిర్యాదులు వెలువలా వస్తున్న తరుణంలో సీఎం కలెక్టర్లతో సమావేశం కావాలని నిర్ణయించారు. గద్వాల, జనగామ వంటి ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించాలని ఆందోళనలు ఉదృతంగా జరుగుతున్నాయి. వీటిపైనా సుదీర్ఘంగా చర్చించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగే సమావేశానికి టాస్క్‌ఫోర్స్ కమిటీ, కోడింగ్‌ కమిటీ సభ్యులను సైతం హజరుకావాలని సీఎం ఆదేశించడంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మూడురోజులుగా ఉన్నతాధికారులతో సమావేశమయిన సీఎస్‌
ఇటీవల కేబినెట్‌ సమావేశంలో సీఎస్‌ నేతృత్వంలో నియమించిన టాస్క్ ఫోర్స్‌ కమిటీ మూడు రోజలుగా ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. ప్రస్తుతం పలుశాఖల్లో ఉద్యోగుల సంఖ్య, కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్థుబాటు, ఫైళ్ల క్రోడింగ్‌ ,కార్యాలయాల ఏర్పాటు వంటి అంశాలపై వివరాలను సేకరించింది.

ఉద్యోగులకు సర్వ్ టు ఆర్డర్‌ అమలుకు ప్లాన్‌
ఉద్యోగులు జిల్లాలో పనిచేయడం కోసం సర్వ్ టు ఆర్డర్‌ అమలు చేయాలని చూస్తోంది. ఇందులో పంచాయితీరాజ్‌, గ్రామీణ నీటిపారుదల శాఖలను ఒకచోట, చేనేత విభాగాన్ని పారిశ్రామిక రంగం పరిధిలోకి, వ్యవసాయ, ఉద్యానవన సెరీకల్చర్‌ వంటి విభాగాల ఏకీకరణ అంశాల ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసింది.

రాష్ట్ర వ్యాప్తం నిరసనలతో వెనక్కి తగ్గిన సర్కార్
హన్మకొండ జిల్లా ఏర్పాటు విషయంలో కాస్త వెనక్కి తగ్గాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా వరంగల్ రూరల్‌ అంతా కలిపి ఓ జిల్లాగా ప్రకటించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ జారీ అయిన తర్వాత అఖిలపక్ష భేటీకి ముందు.. అధికారులతో, కలెక్టర్లతో సమావేశమయి పూర్తి వివరాలు సేకరించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. 

08:00 - September 6, 2016

విజయవాడ : ఏపీని అన్నివిధాల ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుందని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి తెలిపారు. 14 వ ఆర్థిక సంఘం యూపీఏ హయాంలో ఏర్పడిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని సంఘం చెబుతోందని తెలిపారు. 11 రాష్ట్రాలతో సమానంగా ఏపీకి ప్రత్యేకప్యాకేజీ ఇవ్వనున్నామని పురంధేశ్వరి చెప్పారు.

07:56 - September 6, 2016

కరీంనగర్ : కుల పెద్దల మాట వినలేదని...ఊరు నుంచి బహిష్కరించడం. బహిష్కరణకు గురైన కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా..తమ బాధలు వినేవారెవరూ లేరని తీవ్ర నిరాశలతో ఉన్నా..ఆ కుటుంబాలను ఆదుకునే నాథుడే లేకపోవడం...ఇదేదో పాత హిట్‌ సినిమా స్టోరీ కానేకాదు. 68 ఏళ్ల స్వతంత్ర్య భారతావనిలో ఇంకా ఇలాంటివి జరుగుతుండటం..యావత్‌ దేశానికే అవమానకరం. ఎక్కడిలా జరిగింది...ఎవరిలా చేశారు...వాచ్‌ దిస్ స్టోరీ...

దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందంటూ నాయకుల ప్రసంగాలు
దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందని ఓ వైపు రాజకీయ నాయకుల ఊక దంపుడు ప్రసంగాలు. మరోవైపు దేశ నాయకుల విశ్లేషణలు..నిజమే అనిపించేలా ఉన్నా..ఇప్పటకీ కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి సంఘటనలు చూస్తే..మనమింకా...ఇలాంటి స్థితిలోనే ఉన్నామా..అన్న ఆలోచనలో పడేస్తాయి...అలాంటి సంఘటనే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గోపాల్ రావు పేట లో జరిగింది.

కులపెద్దల మాట వినలేదంటూ 8 కుటుంబాల కుల బహిష్కరణ
కుల పెద్ద మాట వినలేదనే కారణంతో 8 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. గ్రామంలో శుభకార్యాలకు ...కూలి పనులకు పిలువద్దంటూ కుల పెద్దలు హుకుం జారీ చేశారు. బహిష్కరించిన వారితో మాట్లడితే వారిని కులం నుంచి బహిష్కరిస్తామంటూ.... పెద్దలు హెచ్చరించడంతో, గ్రామస్థులెవ్వరు వీరితో మాట్లాడటం లేదు.... కులపెద్ద మాట కాదన లేక బిక్కు బిక్కు మంటు కాలం వెళ్లదీస్తున్నారు.

సంవత్సరానికో గొర్రె ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చిన కుల పెద్దలు
గుండి గోపాల్ రావు పేట లో కురుమ కులానికి చెందిన 100 కుటుంబాలు 20 ఏళ్లుగా గొర్రెలు,మేకల వ్యాపారం చేస్తూ...మటన్ షాపులను నిర్వహిస్తూ...జీవనోపాధి పొందుతున్నారు. అయితే మటన్ షాపులు నిర్వహిస్తున్నటు వంటి వ్యక్తులు సంవత్సరానికి ఒక గొర్రె పిల్ల చొప్పున కులానికి ఇవ్వాలంటూ కుల పెద్దలు నిర్ణయించారు. కుల పెద్దల నిర్ణయం ప్రకారం గ్రామంలోని కులస్తులంతా గొర్రె పిల్లలను ఇస్తునే వచ్చారు. అయితే గత రెండేళ్లుగా కరవు సంభవించడంతో... లాభసాటిగా వ్యాపారం లేక పోవడంతో గొర్రె పిల్లను ఇవ్వలేకపోయాయి 8 కుటుంబాలు. దీంతో కుల పెద్దలు ఆ కుటుంబాలను కులం నుంచి బహిష్కరించారు.

తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన బక్కయ్య
కుల పెద్దలను ఎంత బ్రతిమలాడిన ఫలితం లేకుండా పోయింది. కుల సంఘానికి శాశ్వత ప్రాతి పాదికపై 40వేల రూపాయాలను చెల్లిస్తామని చెప్పినా కుల పెద్దలు వినలేదు. బహిష్కరణ చేయడంతో పాటు గ్రామంలో అదే కులానికి చెందిన మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడంటూ...అక్రమ కేసులు పెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దయాల బక్కయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు సమయానికి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మరో బాధితుడు బీరయ్య కూతురు వివాహం జరగదంటూ పెద్దలు హెచ్చరించారు. అయినా మేనరిక సంబంధం కావండంతో చివరకు పెళ్లి జరిగింది.

న్యాయం చెయ్యాలంటు బాధితులు
ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చెయ్యాలంటూ బహిష్కరణకు గురైన కుటుంబాలు కోరుతున్నాయి.

07:49 - September 6, 2016

కరీంనగర్ : ఈ ఏడాది వర్షాలు బాగానే కురుస్తాయనుకున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ఖరీఫ్ లోనూ కరవుఛాయలు కమ్ముకోవడంతో సాగు సంక్షోభంలో కూరుకుపోతుంది. వానలు ముఖం చాటేయడంతో వరి పొలాలు ఎండిపోతుండగా..పత్తి, మొక్కజొన్న సహా ఆరుతడి పంటల పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీంతో ఖరీఫ్ కాలం రైతులకు కన్నీటినే మిగిల్చింది. కరీంనగర్‌లో ఖరీఫ్‌ రైతుల కష్టాలపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ.

రైతన్నలకు కన్నీళ్లు మిగిల్చిన ఖరీఫ్
కరీంనగర్ జిల్లాలో ఖరీఫ్ లోనూ అన్నదాతలను కష్టాలు వెంటాడుతున్నాయి. వరుసగా రెండేళ్ల కరువుతో అల్లాడిన రైతులు...ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన పంటలు సాగు చేయడానికి సిద్ధపడ్డారు. పొలాలను దున్ని నారు వేసుకున్నప్పటికీ నాట్లు వేసే సమయానికి వర్షాలు కురవకపోవడంతో సాగునీటి కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు జిల్లాకు సాగునీరు అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో తగ్గడంతో ఆయకట్టు రైతులు ఖరీఫ్ పై ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు అనుకూలిస్తాయని భావించినా అన్నదాత ఆశలు
1.60 లక్షల హెక్టార్లు వరి సాగవుతుందని అంచనా వేసిన అధికారులు
ఖరీఫ్ సీజన్‌లో 5లక్షల 20 వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా..ఇప్పటి వరకు 3లక్షల హెక్టార్లలో 68 శాతం పంటలు సాగయ్యాయి. వరి 1 లక్షా 60 వేల హెక్టార్లలో సాగవుతుందని అధికారులు అంచనా వేయగా..80వేల 185 హెక్టార్లలో మాత్రమే సాగైంది. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు నీళ్లందక వాడిపోతున్నాయి. పొలాలు నెర్రలు చాస్తున్నాయి. బోరుబావి ద్వారా నీళ్లందించినా ఎండలకు ఆవిరవుతున్నాయి. దీంతో ఏం చెయ్యాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.

కరీంనగర్, హుజురాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి డివిజన్లలో దారుణ పరిస్థితి
కరీంనగర్, హుజురాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి డివిజన్ లలో వరి పంట పరిస్థితి దయనీయంగా మారింది. కెనాల్ కాలువల ఆయకట్టు కింద దాదాపు లక్షన్నర ఎకరాలు సాగవుతుండగా నీటిని అందించే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. తిమ్మాపూర్ లో పొలాలకు నీరు రావడం లేదంటూ కాకతీయ కెనాల్ కాలువకు గండి పెట్టి నీటిని మళ్ళించుకున్నారు. చొప్పదండి, జగిత్యాల, ధర్మపురిలో సాగునీటి కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి.

అధికారులు స్పందించాలంటున్న రైతులు
వర్షకాలం కూడా ఎండాకాలన్ని తలపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎస్సారెస్పీ, మానేర్ డ్యాంలోకి వస్తాయనుకున్నా...ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

07:15 - September 6, 2016

తూర్పుగోదావరి : జిల్లాలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. దివీస్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. రైతులకు అండగా నిలిచేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. ఇవాళ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయించాయి. అయితే సభను అడ్డుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అడుగడుగునా.. ఆంక్షలు విధిస్తూ.. రైతులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

400 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు
దివీస్‌ను వ్యతిరేకిస్తున్న రైతులకు అండగా నిలిచేందుకు..పంపాదిపేటలో బహిరంగ సభ నిర్వహించాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. దీంతో సభను అడ్డుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తొండంగి మండలంలోని పంపాదిపేట, కొత్తపాకల, తాటాకులపాలెం గ్రామాల పరిధిలో దివీస్‌ ఫార్మా ఫ్యాక్టరీ నిర్మాణానికి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మూడు గ్రామాల్లో 400 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే దీనిని ఆయా గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. గ్రామస్తుల పోరాటాన్ని అణిచివేసేందుకకు కంపెనీ యాజమాన్యం, జిల్లా యంత్రాంగం అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. బాధిత రైతులకు, ప్రజలకు అండగా నిలుస్తున్న సీపీఎం నాయకులతో పాటు ఇతర నాయకులపై కేసులు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారు.

సభకు వచ్చేవారిని అరెస్ట్‌ చేయాలని పోలీసుల వ్యూహాం
ఒక్కో గ్రామానికి సుమారు 300 మంది చొప్పున బలగాలను దించాలని ఇప్పటికే పోలీసు శాఖకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. బహిరంగసభ కోసం వచ్చే పార్టీ నేతలు, ప్రతినిధులను అరెస్ట్‌ చేయాలనేది పోలీసుల వ్యూహాంగా తెలుస్తోంది.

దివీస్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్షాలు
ఈ సభకు సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి పీ. మధుతో సహా పలువురు నేతలు హాజరుకాబోతున్నారు ఈ నేపథ్యంలో సభను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సభ కోసం వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాల నేతల ప్రయత్నాలు చేస్తుంటే..పోలీసుల సాయంతో ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది.

 

07:06 - September 6, 2016

నల్లగొండ : యాదాద్రిని అత్యద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నందున రాబోయే కాలంలో భక్తుల రద్దీ బాగా పెరుగుతుందని, దీనికి అనుగుణంగా యాదగిరి గుట్టలో ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. యాదాద్రి అభివృద్ధి పనులను క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.

యాదాద్రి దేవస్థానం అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష
నల్లగొండ జిల్లాలోని యాదాద్రి దేవస్థానం అభివృద్ధి పనులపై అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావుతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టెంపుల్ సిటీ లేఅవుట్లు, డిజైన్లను సీఎం పరిశీలించారు.

250 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టాల్సిన పనుల నమూనాలు ఖరారు
అనంతరం సీఎం మాట్లాడారు. యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నందున రానున్న కాలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని, భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 850 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ నగరం ఏర్పాటు చేయాలని సూచించారు. కాటేజీలు, విశాలమైన రోడ్లు, పార్కింగ్, ఉద్యానవనాలు, పుట్‌పాత్‌లు, ఫుడ్‌కోర్టులు, ఇన్ఫర్మేషన్ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. మొదటి దశలో 250 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టాల్సిన పనుల నమూనాలను ఖరారు చేశామని చెప్పారు.

86 ఎకరాల విస్తీర్ణంలో 200 కాటేజీలు
86 ఎకరాల విస్తీర్ణంలో 200 కాటేజీలు, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్‌కోర్టులు, 7 ఎకరాల విస్తీర్ణంలో మంచినీరు, మరుగు నీటి నిర్వహణ వ్యవస్థ, 12 ఎకరాల్లో గ్రీనరీ, 62 ఎకరాల్లో రోడ్లు, 26 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్, 42 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. యాదాద్రిలో కాటేజీలు నిర్మించడానికి సింగరేణి, జెన్‌కోతో పాటు దేశ వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయని చెప్పారు. కంపెనీలకు కేటాయించిన 1000-1500 గజాల ఓపెన్ ప్లాట్లను సిద్ధం చేయాలన్నారు. కాటేజీలు నిర్మించే ప్రాంతంలో రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పించాలని సూచించారు.

భక్తులను గుట్టపైకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక రవాణా సదుపాయం
ప్రధాన ఆలయానికి వెళ్లేందుకు, వచ్చేందుకు రెండు వేర్వేరు రహదారులు నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న దారిని గుట్టపైకి వెళ్లేందుకు ఉపయోగించి..గుట్ట కిందకు వచ్చేందుకు కొత్త రహదారిని నిర్మించాలన్నారు. భక్తులను గుట్టపైకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించే యోచనలో ఉన్నామన్నారు. నిర్మాణాలు పూర్తయ్యాక నిర్వహణ బాధ్యతలు చూసేందుకు అవసరమైన వ్యూహం కూడా ఖరారు చేయాలని తెలిపారు. యాదాద్రి పనులను నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్షించాలి అని సీఎం ఆదేశించారు.

టెంపుల్ సిటీపై అధికారులతో కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలోని యాదాద్రి దేవస్థానం భివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావుతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టెంపుల్ సిటీ లేఅవుట్లు, డిజైన్లను సీఎం పరిశీలించారు. 

కలెక్టర్లతో భేటీ కానున్న కేసీఆర్..

హైదరాబాద్ : నేడు కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్ల సదస్సు జరగనుంది. సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖల పునర్ వ్యవస్థీకరణ కూడా ప్రజలకు ఎక్కువ మేలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

400 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత..

నెల్లూరు : సూళ్లూరుపేట టోల్‌ప్లాజా వద్ద సోమవారం అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న 400 బస్తాల రేషన్‌ బియ్యాన్ని ఎస్సై గంగాధర్‌ పట్టుకున్నారు. టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా లారీని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

జంట పేలుళ్ళలో 10మంది మృతి..

ఆఫ్ఘనిస్తాన్ : కాబూల్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం సమీపంలో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 10 మంది మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుళ్లు సంభవించిన ప్రాంతంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

బైక్-ట్యాంకర్ ఢీ..ఇద్దరు మృతి..

మెదక్ : పటాన్‌చెరులోని ఇస్నాపూర్ వద్ద ట్యాంకర్ లారీ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతుల వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Don't Miss