Activities calendar

07 September 2016

కరీంనగర్ లోని శ్రీపాదరావు విగ్రహం ధ్వంసం

కరీంనగర్ : తల్లి చావుకు మాజీ మంత్రి శ్రీధర్ బాబు కారణమని కరీంనగర్ బస్టాండ్ ఎదుట ఉన్న శ్రీపాదరావు విగ్రహాన్ని ధ్వంసం చేసి అక్కడే తల్లి అంత్యక్రియలకు కుమారుడు వినోద్ యత్నించాడు. పోలీసులు వినోద్ ను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 

21:38 - September 7, 2016

ఎపికి ప్రత్యేకహోదాపై కేంద్రమంత్రులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. లక్షా 50 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లి రవి, బీజేపీ నేత శ్రీధర్, కాంగ్రెస్ నేత రామశర్మ పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

కాసేపట్లో అరుణ్ జైట్లీ మీడియా సమావేశం

ఢిల్లీ : కాసేపట్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఎపికి రూ.లక్షా 50 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది. పోలవరానికి రూ.28 వేల కోట్లు, పోర్టు నిర్మాణానికి రూ.20 వేల కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.25 వేల కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

21:24 - September 7, 2016

ఢిల్లీ : ఏపీకి ప్యాకేజీపై కేంద్ర మంత్రులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కేంద్రమంద్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడుతో టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపాటు ఎంపీలు సీఎం రమేష్, కొనకళ్ల నారాయణ సమావేశం అయ్యారు. కేంద్రం ఏపీకి రూ.లక్షా 50 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది. పోలవరానికి రూ.28 వేల కోట్లు, పోర్టు నిర్మాణానికి రూ.20 వేల కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.25 వేల కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు వెనుకబడిన జిల్లాలకు రూ.50 వేల కోట్ల చొప్పున 6 ఏళ్లు, యూనివర్సీటీలకు రూ.30 వేల కోట్లు, ఆర్థికలోటు భర్తీకి రూ.10 వేల కోట్లు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. విశాఖలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. డూప్లికేట్ డ్రాఫ్ట్ పీఎంవో కార్యాలయానికి వెళ్లింది. కాసేపట్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం నిర్వహించి.. ఏపీకి ప్యాకేజీ వివరాలను తెలపనున్నారు.  

జైట్లీతో వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి భేటీ

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో వెంకయ్యనాయుడు, టీడీపీ ఎంపీ సుజనాచౌదరి సమావేశం అయ్యారు. ఎపికి ప్రత్యేకహోదాపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

20:55 - September 7, 2016

వర్షాలు ముఖం చాటేశాయి. భూగర్భ జలాలు పాతాళన్నంటాయి. బోర్లు బావురుమంటున్నాయి. రిజర్వాయర్లు రిక్త హస్తం చూపుతున్నాయి. కరువు కబళిస్తోంది. రైతన్న మెడపై కరువు కత్తి.. ఇదే అంశంపై ఈరోజు ప్రత్యేక వైడాంగిల్ కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:50 - September 7, 2016

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యతో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. తన రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. మరిన్ని విషయాలను ఆయన మాటల్లోనే...
'పార్టీ ఫిరాయింపు రాజకీయాలు అభిలషణీయం కాదు. ఇది జాతీయ సమస్య. ఫిరాయింపుల కట్టడిపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాలి. లేకపోతే రాజకీయానికి చెదలు పడతాయి. వైఎస్ తో సాన్నిహిత్యం ఎక్కువ. చెన్నారెడ్డి, విజయభాస్కరరెడ్డి తలపండిన రాజకీయ నాయకులు. ప్రభుత్వమే అన్నీ సమకూర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండా పార్టీలు వాగ్ధానాలు చేస్తున్నాయి. అన్ని ఉచితం అదే నేటి వివాదంగా మారుతోంది. మా కుటుంబంలో ఆవరించిన పొదుపు మంత్రం ఆర్థిక మంత్రిగా నాకు ఉపయోగపడింది. నా పదవీకాలంలో ఎప్పుడూ ఓవర్ డ్రాఫ్టు కు పోలేదు. తెలంగాణకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు తలకు మించిన భారాలున్నాయి. అప్పు చేసి పప్పు కూడా తగదు. కాలానుగుణంగా మారితేనే రాజకీయ నాయకుడు రాణిస్తారు. ఎపి కుదుట పడటానికి ఏడెనిమిది సంవత్సరాలు పడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ స్వేచ్ఛ ఎక్కువ. తమిళనాడులో పార్టీ క్రమశిక్షణకు క్యాడర్ కట్టుబడుతుంది. నేను పిసినారినే.. కానీ ఆశావాదిని. నా పదవీ కాలంలో జగన్ వర్గ అసమ్మతి, తెలంగాణ ఉద్యమం రెండూ క్లిష్ట సమస్యలే. ప్రత్యక్ష రాజకీయాలకు ఇక నేను దూరం. స్లో ఆండ్ స్టడీ విన్స్ ద రేస్. ఆత్ర పడకుండా సహనంతో ఉంటేనే నాయకత్వం పెరుగుతుందన్నారు. కేంద్రం ఉదారంగా తెలుగు రాష్ట్రాలను ఆదుకోవాలి. రెండు రాష్ట్రాలు సమస్యలపై సంయమనం పాటించాలి' అని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

ఏపీ ప్యాకేజీ ముసాయిదాను పీఎంవోకు పంపిన ఆర్థికశాఖ

హైదరాబాద్ : ఆర్థికశాఖ ఏపీ ప్యాకేజీ ముసాయిదాను పీఎంవోకు పంపింది. ప్యాకేజీ ముసాయిదాకు పీఎంవో ఆమోదం తరువాత ఏపీకీ ప్యాకేజీ ప్రకటించనుంది. జైట్లీ, వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, గడ్కరీ, నిర్మలాసీతారామన్ సమక్షంలో ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది. 

ఎపికి రూ.లక్షా 50 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం

ఢిల్లీ : కాసేపట్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఎపికి రూ.లక్షా 50 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది. పోలవరానికి రూ.28 వేల కోట్లు, పోర్టు నిర్మాణానికి రూ.20 వేల కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.25 వేల కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

19:55 - September 7, 2016

ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వక్తలు తేల్చి చెప్పారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లి రవి, కాంగ్రెస్ నేత రామశర్మ, టీడీపీ నేత చందు సాంబశివరావు పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీలు దోబూచులాట మానుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

19:48 - September 7, 2016

ఢిల్లీ : ప్రముఖ సామాజిక కార్యకర్త, హేతువాది నరేంద్ర దభోల్కర్‌ హత్యకేసులో డాక్టర్‌ వీరేంద్ర తావ్‌డే ప్రధాన సూత్రధారని సిబిఐ పేర్కొంది. హిందుత్వ సనాతన్‌ సంస్థకు చెందిన డాక్టర్‌ వీరేంద్ర తావ్‌డేను ప్రధాన సూత్రధారిగా పేర్కొంటూ సిబిఐ- చార్జిషీట్‌లో పేరు నమోదు చేసింది. వామపక్ష నేత, హేతువాది గోవింద్‌ పన్సారే హత్యకేసులో వీరేంద్ర తావ్‌డేను ఈ ఏడాది జూన్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. నరేంద్ర దభోల్కర్‌ను ఆగస్ట్‌ 20, 2013న పుణెలోని ఆయన ఇంటి సమీపంలో తుపాకితో కాల్చి చంపారు. మహారాష్ట్రలో మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా చట్టం తేవాలని దభోల్కర్‌ పోరాటం చేశారు.

19:43 - September 7, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను కేంద్ర దగ్గర తాకట్టు పెట్టారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఓటుకు నోటు కేసు నుంచి బయపడేందుకే ప్యాకేజీకి ఒప్పుకుంటున్నారని విమర్శించారు. కమిషన్లు దండుకునేందుకే ప్యాకేజీకి ఒప్పుకుంటున్నారని మండిపడ్డారు. 
 

19:38 - September 7, 2016

విజయవాడ : కేంద్రం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కాకుండా ప్రత్యేక హోదానే ఇవ్వాలని మాజీ రాజ్యసభసభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. హోదా ఇస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, పారిశ్రామిక రాయితీలు వస్తాయన్నారు. హోదా ఇవ్వని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. అక్టోబరు మొదటివారంలో ప్రత్యేకహోదాపై విజయవాడలో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని.. ఈ సభకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు. 

 

19:33 - September 7, 2016

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం ఎంఎల్ఏ మంచి రెడ్డిపై మాజీ ఎంఎల్ఏ మల్ రెడ్డి రంగారెడ్డి డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈమేరకు మల్ రెడ్డి రంగారెడ్డి టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. గ్యాంగ్ స్టర్ నయీంతో కలిసి మంచి రెడ్డి  అనేక భూ దందాలు చేశారని మల్ రెడ్డి ఆరోపించారు. ఎంఎల్ఏ మంచి రెడ్డి అతని కుమారుడిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:29 - September 7, 2016

హైదరాబాద్ : గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతున్న ఇండియన్ పోలీస్ అకాడమీ అథ్లెటిక్స్ ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి పద్మారావుతోపాటు డీజీపీ అనురాగ్‌శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు అవార్డులు అందజేశారు. 

 

19:26 - September 7, 2016

తుని ఘటనలో భూమన అరెస్టుకు రంగం సిద్ధం

గుంటూరు : తుని ఘటనలో వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు గుంటూరు సీఐడీ కార్యాలయానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. అరెస్టు అనంతరం రాజమండ్రి సీఐడీ ఆఫీస్‌కు తరిలించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

 

ఏపీకి అన్ని ప్రయోజనాలు చేస్తాం : జైట్లీ

ఢిల్లీ : హోదా పేరు లేకపోయినా.. ఏపీకి అన్ని ప్రయోజనాలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక ప్యాకేజీపై కసరత్తు చేస్తున్నామన్న ఆయన.. వీలైనంత త్వరగా ప్యాకేజీపై ప్రకటన ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా ప్రయోజనాలన్నీ ప్యాకేజీలో ఉంటాయని చెప్పారు. 

ప్రత్యేక హోదాపై క్లారిటీ ఇవ్వడానికి కేంద్రం రెడీ

ఢిల్లీ : ఏపికి ప్రత్యేక హోదాపై క్లారిటీ ఇవ్వడానికి కేంద్రం రెడీ అయ్యింది. సాయంత్ర ఆరున్నరకు కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. మీడియా సమావేశంలోనే ఏపీకి ప్యాకేజీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

18:57 - September 7, 2016

గుంటూరు : తుని ఘటనలో వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు గుంటూరు సీఐడీ కార్యాలయానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. అరెస్టు అనంతరం రాజమండ్రి సీఐడీ ఆఫీస్‌కు తరిలించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

 

18:55 - September 7, 2016

ఢిల్లీ : ఏపికి ప్రత్యేక హోదాపై క్లారిటీ ఇవ్వడానికి కేంద్రం రెడీ అయ్యింది. సాయంత్ర ఆరున్నరకు కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. మీడియా సమావేశంలోనే ఏపీకి ప్యాకేజీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపికి కేంద్రం నుంచి పెద్దమొత్తంలో సాయం అందిందని.. తాజాగా ప్యాకేజీ రూపంలో వీలైనంత ఎక్కువ సాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు అరుణ్‌జైట్లీ చెబుతున్నారు. 

 

18:53 - September 7, 2016

ఢిల్లీ : హోదా పేరు లేకపోయినా.. ఏపీకి అన్ని ప్రయోజనాలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక ప్యాకేజీపై కసరత్తు చేస్తున్నామన్న ఆయన.. వీలైనంత త్వరగా ప్యాకేజీపై ప్రకటన ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా ప్రయోజనాలన్నీ ప్యాకేజీలో ఉంటాయని చెప్పారు. 

 

సీఎంవోలో ఆసక్తిగా గమనిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రులు

హైదరాబాద్ : కాసేపట్లో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం నేపథ్యంలో సీఎంవోలో సీఎం చంద్రబాబు, మంత్రులు ఆసక్తిగా గమనిస్తున్నారు. 

రాజీవ్ శర్మ సీఎంవో అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : సీఎస్ రాజీవ్ శర్మ సీఎంవో అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

రాత్రి 8 గం.లకు అరుణ్ జైట్లీ మీడియా సమావేశం

ఢిల్లీ : రాత్రి 8 గంటలకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఎపికి ప్రత్యేకప్యాకేజీపై ప్రకటన చేసే అవకాశం ఉంది. 

 

18:04 - September 7, 2016

మహారాష్ట్ర : ముంబైలోని కల్యాణ్‌లో ఓ పోలీస్‌ను నీళ్లలో ముంచి చంపే యత్నం జరిగింది. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గణేష్‌ నిమజ్జనం విషయంలో యువకులు డ్యూటీలో ఉన్న పోలీస్‌తో గొడవ పడ్డారు. ఓ యువకుడు పోలీసు దుస్తుల్లో ఉన్న నితిన్ దోగ్డేను నీళ్లలో ముంచి చంపేందుకు యత్నించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనను ఓ యువకుడు మొబైల్‌ ఫోన్‌లో కెమెరాలో చిత్రించాడు. ఈమధ్య ముంబైలో పోలీసులపై దాడులు పెరిగిపోయాయి. ఖార్‌లో ద్విచక్రవాహన దారుడు నిబంధనలు అతిక్రమించడమే కాకుండా ట్రాఫిక్‌ పోలీస్‌పై దాడి చేయడంతో మృతి చెందాడు.15 రోజుల్లో పోలీసులపై దాడి జరగడం ఇది ఏడవసారి.

 

17:26 - September 7, 2016

హైదరాబాద్ : 2019 ఎన్నికల నాటికి కారు పార్టీ షెడ్‌కు చేరడం ఖాయం అని టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసెడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటిదాకా సాగిన కారుజోరు..క్రమంగా తగ్గుతోందన్నారు. టీఆర్‌ఎస్‌లో ప్రజాస్వామ్యం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ చేసిన అభివృద్ధిని కేసీఆర్‌ తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలు తిరిగి సొంతపార్టీలోకి రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ప్రాణహిత..చేవెళ్ల ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం : రమణ
తెలంగాణ రైతుల సమస్యల పరిష్కారం కొరకు ఈ నెల 19,20 వ తేదీల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

17:18 - September 7, 2016

ఆస్ట్రేలియన్ డైనమిక్‌ బ్యాట్స్ మెన్ గ్లెన్‌ మ్యాక్స్ వెల్‌...టీ 20 ఫార్మాట్‌లో రికార్డ్ ల మోత మోగించాడు. పల్లెకల్లె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో మ్యాక్స్ వెల్‌ మ్యాడ్‌మ్యాక్స్ ఇన్నింగ్స్ ఆడి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాడు. వెల్ ధూమ్‌ ధామ్‌ సెంచరీతో టీ 20 ఫార్మాట్లో అత్యధిక టీమ్‌ స్కోర్‌ నమోదు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. పల్లెకల్లె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో మ్యాక్స్ ల్‌ విశ్వరూపమే ప్రదర్శించాడు. ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించిన వెల్‌ తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాడు. భారీ సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన ట్రేడ్‌ మార్క్ షాట్లతో అలరించిన గ్లెన్‌.....రివర్స్ స్వీప్‌ షాట్లతో స్కోర్‌ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు.

ఆకాశమే హద్దు..
ఆకాశమే హద్దుగా చెలరేగిన మ్యాక్స్ వెల్‌....లంక బౌలర్లతో ఆటాడుకున్నాడు. ఫటా ఫట్‌ ఇన్నింగ్స్ ఆడి మెరుపు సెంచరీ నమోదు చేశాడు. 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్ దాటిన గ్లెన్‌... 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పూర్తైన తర్వాత కూడా మ్యాక్స్ వెల్‌ ఏ మాత్రం తగ్గలేదు. మ్యాక్సీ దూకుడు ముందు లంక బౌలింగ్‌ ఎటాక్‌ తేలిపోయింది. టీ 20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన మ్యాక్స్ వెల్‌....65 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్ లతో 145 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వెల్‌ ధూమ్‌ ధామ్‌ సెంచరీతో ఇంటర్నేషనల్‌ టీ 20 మ్యాచ్‌ల్లో అత్యధిక టీమ్‌ స్కోర్‌ నమోదు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. 20 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు చేసిన కంగారూ టీమ్‌...ఇప్పటివరకూ శ్రీలంక పేరుతో ఉన్న రికార్డ్ ను బద్దలు కొట్టింది.
శ్రీలంకను 85 పరుగుల తేడాతో కంగారూ టీమ్‌ చిత్తు చేయగా ....మెరుపు సెంచరీతో జట్టు విజయం సాధించిన మ్యాక్స్ వెల్‌కే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్ దక్కింది. ఈ ఇన్నింగ్స్ తో మ్యాక్స్ వెల్‌ తన స్టామినా ఏంటో మరోసారి క్రికెట్‌ ప్రపంచానికి తెలిసేలా చేశాడు. 

హోదా ప్రయోజనాలన్నీ ప్యాకేజీలో - జైట్లీ...

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై కసరత్తు చేయడం జరుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్యాకేజీ ప్రకటనపై నిర్ణయానికి రాలేదని, వీలైనంత తొందరలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేయడం జరుగుతుందన్నారు. హోదా వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ ప్యాకేజీలో పొందుపరుస్తామని, 30 శాతం నిధులు ఏపికి ప్యాకేజీ రూపంలో అందించే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రత్యేక హోదా వల్లే వచ్చే ప్రయోజనాలన్నీ ప్యాకేజీలో ఉంటాయని, హోదా పేరు లేకపోయినా ఏపీకి అన్ని ప్రయోజనాలు చేస్తామన్నారు. 

17:10 - September 7, 2016

అమెరికన్‌ ఓపెన్‌లో బ్రిటన్‌ వండర్‌ యాండీ ముర్రే షో కొనసాగుతోంది. ఈ టోర్నీలో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన యాండీ సులువుగా నాలుగో రౌండ్‌ను అధిగమించాడు. బల్గేరియన్‌ స్టార్‌ గ్రిగర్‌ దిమిత్రోవ్‌పై బ్యాక్‌ టు బ్యాక్‌ సెట్లలో నెగ్గి క్వార్టర్‌ ఫైనల్స్ బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు. యాండీ ముర్రే ఆకాశమే హద్దుగా చెలరేగడంతో హోరాహోరీగా సాగుతుందనుకున్న పోటీ కాస్తా...ఏకపక్షంగా ముగిసింది. సెమీస్‌ బెర్త్ కోసం ముర్రే క్వార్టర్‌ ఫైనల్‌లో జపనీస్‌ రైజింగ్‌ స్టార్‌ కై నిషికోరీతో పోటీపడనున్నాడు.  

17:08 - September 7, 2016

అమెరికన్ ఓపెన్‌లో ఇండియన్‌ టెన్నిస్‌ క్వీన్ సానియా మీర్జా పోటీ ముగిసింది. బార్బరా స్ట్రికోవాతో కలిసి తొలి సారిగా డబుల్స్ లో బరిలోకి దిగిన సానియా క్వార్టర్‌ ఫైనల్‌ రౌండ్‌ అధిగమించలేకపోయింది. క్వార్టర్‌ ఫైనల్‌లో సానియా జోడీకి కరోలిన్‌ గార్షియా-లాడెనోవిచ్‌ జోడీ షాకిచ్చింది. ఈ టోర్నీలో 7వ సీడ్‌గా బరిలోకి దిగిన సానియా-స్ట్రికోవా జోడీ తొలి సెట్‌లో ఆఖరి వరకు పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. వరుసగా 6-7, 1-6తో ఓడిన సానియా జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

 

17:07 - September 7, 2016

అమెరికన్ బ్లాక్ థండర్..వరల్డ్ నెంబర్‌ వన్‌ సెరెనా విలియమ్స్ చరిత్ర సృష్టించింది. మహిళల టెన్నిస్‌లో తిరుగులేని సెరెనా గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఏకంగా టెన్నిస్‌ ఆల్ టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ గ్రాండ్‌స్లామ్‌ విజయాల రికార్డునే బ్రేక్‌ చేసిన బ్లాక్‌ థండర్‌ ... మోడ్రన్‌ టెన్నిస్‌లో తనకు తాను మాత్రమే సాటి అని నిరూపించింది.
2016 అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో యరోస్లావా ష్వెడోవాను ఊదిపారేసిన సెరెనా గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీల్లో హిస్టరీ క్రియేట్‌ చేసింది. న్యూయార్క్ లోని ఆర్థర్ ఏష్ స్టేడియం వేదికగా ముగిసిన నాలుగో రౌండ్‌ మ్యాచ్‌లో సెరెనాకు అసలే మాత్రం పోటీనే లేకుండా పోయింది. ఈ టోర్నీలో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టాప్ సీడ్‌ సెరెనా జోరు ముందు ష్వెడోవా తేలిపోయింది.

64 నిమిషాల్లో ప్రత్యర్థి చిత్తు...
తన ట్రేడ్‌ మార్క్ షాట్లతో చెలరేగిన సెరెనా కేవలం 64 నిమిషాల్లోనే ప్రత్యర్ధిని చిత్తు చేసి క్వార్టర్‌ ఫైనల్‌ రౌండ్‌కు దూసుకెళ్లింది. వరుసగా 6-2,6-3తో ష్వెడోవాను ఓడించడం ద్వారా...కెరీర్‌లో 308వ గ్రాండ్ స్లామ్ విజయం నమోదు చేసింది. మూడో రౌండ్‌ మ్యాచ్‌ విజయంతో ఆల్‌ టైం గ్రేట్‌ మార్టీనా నవ్రతిలోవా 306 గ్రాండ్‌ స్లామ్‌ విజయాల రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన సెరెనా...ప్రీ క్వార్టర్‌ఫైనల్‌ విజయంతో మరో అరుదైన రికార్డ్‌ తన ఖాతాలో వేసుకుంది.గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలోనే అత్యధికంగా 307 విజయాలు సాధించిన స్విస్‌ ఏస్‌ రోజర్ ఫెదరర్ రికార్డును సెరెనా అధిగమించింది. ప్రస్తుత యూఎస్ ఓపెన్‌లో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొడుతున్న అమెరికన్‌ బ్లాక్‌థండర్‌...ఇదే జోరు కొనసాగిస్తే 23 గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్న సెరెనా విలియమ్స్‌....అత్యుత్తమ టెన్నిస్‌ క్రీడాకారిణిగా టెన్నిస్‌ చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

మంత్రి తుమ్మల సమీక్ష..

హైదరాబాద్ : ఆర్ అండ్ బి శాఖ అధికారులు, ప్రిన్స్ పల్ సెక్రటరీ, అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల్లో రోడ్ల విస్తరణ, భవనాల నిర్మాణంపై చర్చించారు. 

ఆల్ ఇండియా పోలీసు అథ్లెటిక్స్ ముగింపు వేడుక..

హైదరాబాద్ : ఆల్ ఇండియా పోలీసు అథ్లెటిక్స్ ముగింపు వేడుక జరిగింది. సీఎం కేసీఆర్, మంత్రి పద్మారావు, డీజీపీ అనురాగ్ శర్మలు హాజరయ్యారు. కొన్ని సంవత్సరాల తరువాత అథ్లెటిక్స్ నిర్వహించడం సంతోషంగా ఉందని, క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 

16:47 - September 7, 2016

రంగారెడ్డి : గ్యాంగ్ స్టర్ నయీం అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజా నయీం ఇంట్లో దొరికిన బాలికల నుండి రాంజేంద్రనగర్ మెజిస్ట్రేట్ వాంగ్మూలం నమోదు చేసింది. నయీం తమను నిత్యం శారీరకంగా వేధించాడని..పలుమార్లు అత్యాచారం చేశారని బాలికలు వాంగ్మూలంలో పేర్కొన్నారు. అత్యాచారం చేసిన అనంతరం ఏవో మందులు తాగించే వాడని తెలిపారు. రాక్షసుడిలా ప్రవర్తించేవాడని..పైశాచికత్వం ప్రదర్శించేవారని తెలిపారు. అతను చెప్పిన మాటలు వినిపించుకోకపోతే కారం నీళ్లను తాగించే వాడని మెజిస్ట్రేట్ కు బాలికలు వాంగ్మూలం ఇచ్చారు.

 

16:42 - September 7, 2016
16:41 - September 7, 2016

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో సుజనాచౌదరి, కొనకళ్ల నారాయణ భేటీ అయ్యారు. నేడు ప్రత్యేకహోదాపై ప్రకటన అనుమానంగానే ఉంది.

 

16:39 - September 7, 2016

టాలీవుడ్ కు 'జాగ్వార్' భయం పట్టుకుందంట. అది కన్నడ సినిమా కదా ? ఇక్కడ భయం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? నిజంగానే ఇది కన్నడ సినిమానే. కానీ ఇక్కడ కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ చిత్రం టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కథ 'రాజమౌళి' తండ్రి 'విజయేంద్ర ప్రసాద్ అందించారు. అంతేగాకుండా 'రాజమౌళి శిష్యుడు 'మహాదేవ' ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం విశేషం. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తన తనయుడు 'నిఖిల్ కుమార్ గౌడ'ను హీరోగా ఈ చిత్రం రూపొందింది. సుమారు రూ. 75 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందడం గమనార్హం. ఇక ఈ సినిమా ఆడియో విడుదలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ ఆడియో వేడుకకు టాలీవుడ్ అతిరథ మహా రథులను పిలవడానికి 'కుమారస్వామి' ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'పవన్ కళ్యాణ్' ను 'కుమార స్వామి' కలిసిన సంగతి తెలిసిందే.

దసరాకు 'జాగ్వార్'...
'కుమారస్వామి' కర్నాటక ముఖ్యమంత్రిగా పని చేసిన నేపధ్యం ఆయన తండ్రి 'హెచ్‌డి దేవెగౌడ' భారత ప్రధానిగా పని చేసిన నేపధ్యంలో టాలీవుడ్ సినిమా రంగంతో కూడ 'కుమార స్వామి'కి మంచి పరిచయాలు ఉండటం 'నిఖిల్ గౌడ'కు అదృష్టంగా మారిందనే టాలీవుడ్ లో అభిప్రాయాలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దసరా పండుగ నేపథ్యంలో 'జాగ్వార్'ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందంట. ఊహించని విధంగా దూసుకొస్తున్న 'జాగ్వార్' ను చూసి టాలీవుడ్ లో పలువురు భయపడుతున్నట్లు టాక్. మరి 'జాగ్వార్' ఎలాంటి సంచనాలు సృష్టిస్తాడో చూడాలి. 

విమానాశ్రయంలో ఆయిల్ క్యాన్ల కలకలం..

చిత్తూరు : తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఆయిల్ క్యాన్లు కలకలం సృష్టించాయి. ఆయిల్ క్యాన్లను సీజ్ చేసిన అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్యాన్లలోని ద్రవానికి పేలుడు సామర్థ్యం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటనలో నలుగురిని ఎయిర్ పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంలో ఢిల్లీకి వెళుతుండగా వీరిని పట్టుకున్నారు. 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు కోల్పోయి 28926 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ పాతిక పాయింట్లు నష్టపోయి 8,918 పాయింట్ల వద్ద ముగిసింది.

నయీం ఇంట్లో బాలికల నుంచి వాంగ్మూలం రికార్డు

రంగారెడ్డి : గ్యాంగ్ స్టర్ నయీం ఇంట్లో బాలికల నుంచి రాజేంద్రనగర్ మెజిస్ట్రేట్ వాంగ్మూలం రికార్డు చేశారు. నయీం తమను నిత్యం శారీరకంగా వేధించేవాడని.. పలుమార్టు అత్యాచారం కూడా చేశారని బాలికలు తెలిపారు.
అత్యాచారం చేశాక ఏవో మందులు తాగించేవాడని పేర్కొన్నారు. చెప్పిన మాట వినకుంటే కారం కలిపిన నీళ్లు తాగించేవాడని మెజిస్ట్రేట్ కు వాంగ్మూలం ఇచ్చారు.

నయీం అత్యాచారం చేసేవాడు - బాలికలు..

రంగారెడ్డి : నయీం ఇంట్లో దొరికిన బాలికల నుండి రాంజేంద్రనగర్ మెజిస్ట్రేట్ వాంగ్మూలం నమోదు చేసింది. నయీం తమను నిత్యం శారీరకంగా వేధించాడని..పలుమార్లు అత్యాచారం చేశారని బాలికలు పేర్కొన్నారు. అత్యాచారం చేసిన అనంతరం ఏవో మందులు తాగించే వాడని తెలిపారు. అతను చెప్పిన మాటలు వినిపించుకోకపోతే కారం నీళ్లను తాగించే వాడని మెజిస్ట్రేట్ కు బాలికలు వాంగ్మూలం ఇచ్చారు. 

ఎపికి ప్రత్యేకహోదా అవసరం లేదు : శ్యామ్ కిశోర్

విజయవాడ : ఎపికి ప్రత్యేకహోదా అవసరం లేదని ఎపి బిజెపి అధికార ప్రతినిధి శ్యామ్ కిశోర్ అన్నారు. ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని తెలిపారు. హోదా కంటే మించిన ప్యాకేజీని కేంద్రం ఇస్తుందని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హోదా సాధ్యం కాదని తెలిసిన కూడా బిజెపిని విమర్శించడం సరికాదని పేర్కొన్నారు.

16:00 - September 7, 2016

విశాఖకు రైల్వేజోన్ లేదనడంపై సీఎం చంద్రబాబు అభ్యంతరం

విజయవాడ : విశాఖకు రైల్వేజోన్ లేదనడంపై ఎపి సీఎం చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైల్వేమంత్రి సురేష్ ప్రభుతో బాబు ఫోన్ లో మాట్లాడారు.  ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మరిచిపోవద్దని సూచించారు. ఇతర రాష్ట్రాలు అభ్యంతరం చెబితే ఎలా మారుస్తారని సురేష్ ప్రభును బాబు ఫోన్ లో ప్రశ్నించారు.

ఎపికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నాం : పురందేశ్వరీ

హైదరాబాద్ : ఎపికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నామని బీజేపీ నాయకురాలు పురందేశ్వరీ అన్నారు. ఎపికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు బీజేపీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఎపి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

15:52 - September 7, 2016

విజయవాడ : విద్యావిధానంలో సమూల మార్పులు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఉత్తముపాధ్యాయులను బాబు సత్కరించారు. భవిష్యత్తులో మంచిఫలితాలు రాబట్టేలా టెక్నాలజీని ఉపయోగించి విద్యావ్యవస్థను సంస్కరిస్తామన్నారు. టెక్నాలజీ సహాయంతో విద్యార్థులు అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందన్నారు. 

15:51 - September 7, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసును నీరు కార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌తో మాట్లాడింది చంద్రబాబేనని ఆడియో టేపులు స్పష్టం చేస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు. టేపుల్లోని స్వరం చంద్రబాబుది కాకపోతే ఆరోపణలు ఎందుకు ఖండించడంలేదని ప్రశ్నించారు. గొంతు నాది కాదు అని బాబు నోటి వెంట ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. నాది అని తేలితే రాజీనామాకు సిద్ధం..విచారణకు సిద్ధం అనే మాట ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. 

15:49 - September 7, 2016

విజయవాడ : ఏపీ అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెండైన వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈసారి సమావేశాలకు హాజరవుతారా ? సమావేశాలకు తనను అనుమతించాలని న్యాయ పోరాటం చేసిన రోజా ఒక అడుగు వెనక్కి తగ్గారా ? అసెంబ్లీలో జరిగిన సంఘటనలపై క్షమాపణ చెబుతూ స్పీకర్‌కు లేఖ సమర్పించారు ఎమ్మెల్యే రోజా. మరి ఆమె సస్పెన్షన్‌కి సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తిగా మారింది. రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈసారి వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గతేడాది అసెంబ్లీలో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తన సస్పెన్షన్ విషయమై రోజా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావచ్చునంటూ కోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీచేసింది. దీనిపై అసెంబ్లీ అధికారులు హైకోర్టుకి వెళ్లడంతో..సింగిల్‌ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఈసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు రోజా. కేసు విచారణ సందర్భంగా సభకు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు రోజాను సూచించింది.

తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన రోజా..
సీఎం చంద్రబాబుతోపాటు ఇతర టీడీపీ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలపై వెనక్కితగ్గేది లేదన్న రోజా వెనక్కి తగ్గారు. మరో రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమౌతున్నాయనగా తాను సభలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ కోరుతూ స్పీకర్‌ లేఖ ఇచ్చినట్లు సమాచారం. సీఎంపై తాను ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేయలేదంటూ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని స్పష్టం చేసినట్లు సమాచారం. రోజా ఇచ్చిన వివరణపై తుది నిర్ణయం స్పీకర్‌ పై ఆధారపడి ఉంది. మరోవైపు రోజా క్షమాపణలు చెప్పినా ఆమెను సభకు అనుమతించకూడదని అధికార పార్టీ భావిస్తోంది. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రోజాపై సస్పెన్షన్ ఎత్తివేసినా...ఆయన్ని అవమానించేలా మాట్లాడటంతో ఆమెపై చర్యలు తీసుకునేలా అధికార పార్టీ నేతలు పట్టుపట్టే అవకాశముంది. అంతేకాకుండా రోజాను సభలోకి రానివ్వకుండా చెయ్యాలని అధికార పార్టీ గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

15:16 - September 7, 2016
15:15 - September 7, 2016
15:13 - September 7, 2016

రంగారెడ్డి : ఎలాంటి కారణాలు తెలుపకుండానే 'మైక్రోమ్యాక్స్' ఉద్యోగులను తొలగించడంపై కలకలం రేగింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మహేశ్వరంలోని రావిరాల ప్రాంతంలో మైక్రోమ్యాక్స్ కంపెనీ ఉంది. ఇక్కడ పనిచేస్తున్న 600 మంది ఉద్యోగులను బుధవారం ఉదయం గేటు వద్దే ఆపివేశారు. ఉద్యోగాల నుండి యాజమాన్యం తొలగించిందని..లోనికి రావద్దని సెక్యూర్టీ గార్డులు చెప్పడంతో ఉద్యోగులు హతాశులయ్యారు. యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గేటు ఎదుటే బైఠాయించారు. విషయం తెలియడంతో సీపీఎం నేతలు వీరి ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. సీపీఎం నేతల ఆందోళన..ఉద్యోగుల నిరసనతో మైక్రోమ్యాక్స్ యాజమాన్యం దిగొచ్చింది. వారితో చర్చలు ప్రారంభించింది. స్టాఫ్ ఎక్కువగా ఉన్నారని అందుకే తొలగించడం జరిగిందని యాజమాన్యం తెలిపింది. ఇలా చేయడం కరెక్టు కాదని సీపీఎం నేతలు ఖరాఖండిగా చెప్పడంతో తిరిగి విధుల్లోకి చేర్చుకొనేందుకు యాజమాన్యం అంగీకరించింది. కానీ రెండు నెలల పాటు కొద్దిపాటి జీతం ఇస్తామని..అనంతరం మూడు నెలల నుండి పూర్తి జీతం ఇస్తామని యాజమాన్యం పేర్కొంది. కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని మాత్రమే ఉద్యోగాల నుండి తొలగించడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

14:59 - September 7, 2016

సూపర్ స్టార్ 'రజిని' సినిమా ప్రారంభం నుండి రిలీజ్ అయ్యేంత వరకు అభిమానుల్లో సందడే సందడి నెలకొంటుంది. ఇటీవలే ఆయన నటించిన 'కబాలి' సినిమా విడుదలై రికార్డుల కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన 'రోబో -2' షూటింగ్ లో నిమగ్నమైపోయారు. ఈ సినిమా అనంతరం 'పా రంజిత్' దర్శకత్వంలో 'రజిని' నటించనున్నారు. ఈ సినిమా 'కబాలి'కి సీక్వెల్ ఉంటుందని అందరూ భావించారు. కానీ దీనిని 'పా రంజిత్' ఖండించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇద్దరు హీరోయిన్లు ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 'అమలాపాల్' ను చిత్ర యూనిట్ ఎంపిక చేసిందని టాక్. మరో హీరోయిన్ సౌత్ బ్యూటీ 'నయన తార'ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 'నయన్' ఇప్పటికే 'రజిని' కలిసి రెండు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. 'నయన తార' డేట్స్ కుదరకపోతే 'త్రిష'ను తీసుకోవాలని దర్శక నిర్మాతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి 'రజిని' సరసన ఎవరు నటించనున్నారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు.

నేటి నుండి వినాయక నిమజ్జనం కార్యక్రమం..

హైదరాబాద్ : వినాయక నిమజ్జనం సాయంత్రం అధికారికంగా ప్రారంభం కానుంది. సాయంత్రం 4గంటలకు ఎన్టీఆర్ మార్గ్ లో నిమజ్జనం క్రేన్లు ప్రారంభం కానున్నాయి.

'హోదా' అవసరం లేదు - బీజేపీ..

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి శ్యామ్ కిశోర్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని, హోదా కంటే మించిన ప్యాకేజీని కేంద్రం ఇస్తుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హోదా సాధ్యం కాదని తెలిసి బీజేపీని విమర్శించడం సరికాదన్నారు. రాష్ట్రానికి రెవెన్యూ లోటు రూ. 7వేల కోట్లు మాత్రమేనని, రూ. 16వేల కోట్లు అని టిడిపి తప్పుడు లెక్కలు చెబుతోతందన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. 

14:31 - September 7, 2016

విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి త్వరలో మంచి ప్యాకేజీని ప్రకటిస్తామని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి వెల్లడించారు. ప్యాకేజీని ప్రకటించి చేతులు దులుపుకోమని రాష్ట్రాభివృద్దికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పేర్కొన్నారు. ఏపీకి త‌మ పార్టీ కేంద్ర మంత్రులు చేసే ప్యాకేజీ ప్ర‌క‌ట‌న కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు. కేంద్రం ఇక ముందు కూడా ఏపీని అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు. ఏపీకి న్యాయం చేసేందుకే అన్ని విధాల కృషి చేస్తున్నామ‌ని చెప్పారు.

14:22 - September 7, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని తేలిపోయింది. మెరుగైన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుండి సరియైన స్పందన రాకపోయేసరికి 'ఏపీ ప్యాకేజీ'పై ప్రతిష్టంభన నెలకొంది. గత కొన్ని రోజులుగా ఏపీకి ఆర్థిక సాయంపై కేంద్రం తర్జనభర్జనలు పడుతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా బుధవారం ఓ ప్రకటన విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. కానీ కేంద్రం వ్యూహాత్మక అడుగులు వేసింది ప్రత్యేక హోదా లేదని..ఏపీకి భారీ ప్యాకేజీ ఇస్తామని తేల్చిచెప్పింది. దీనిపై మధ్యాహ్నం 2.30గంటలకు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ సమక్షంలో ప్యాకేజీ వివరాలు ప్రకటిస్తారని తొలుత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే ఢిల్లీకి రావాలని బాబుకు ఆహ్వానిస్తూ కేంద్రం ఎత్తుగడ వేసింది. కానీ దీనిని బాబు సున్నితంగా తిరస్కరించారు. కేంద్రం ఎదుట 9 ప్రతిపాదనలు పెడుతున్నట్లు దీనికి అంగీకరిస్తేనే ఢిల్లీకి వస్తానని బాబు ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా ఎన్డీసీకి పంపిస్తారని మరో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రం ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో 'ఏపీ ప్యాకేజీ ప్రకటన'పై ఎలాంటి సమావేశం జరగలేదు. పారిశ్రామిక పన్నుల్లో రాయితీ, ఆర్థిక లోటు, రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి..తదితర అంశాలపై కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదని తెలుస్తోంది. 

14:13 - September 7, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా..ప్యాకేజీపై కేంద్రం..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏపీకి ఆర్థిక సహాయం అందించడంపై బుధవారం ఢిల్లీలో కేంద్రం సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం నుండి ఏపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు సీఎం రమేష్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా..ఇతరత్రా అంశాలను కేంద్రం ముందుంచారు. కానీ హోదాను కేంద్రం పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనితో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు.

బాబును ఆహ్వానించిన వెంకయ్య...
ఈ నేపథ్యంలో కేంద్రం అనుహ్యంగా ఓ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి దగ్గరి నుండి బాబుకు ఫోన్ వచ్చింది. ఢిల్లీకి రావాలని వెంకయ్య కోరారు. దీనిని బాబు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. కేంద్రం ఎదుట 9ప్రతిపాదనలు పెట్టడం జరుగుతోందని, దీనికి ఒప్పుకొంటనే ఢిల్లీకి రావడం జరుగుతుందని బాబు తేల్చిచెప్పినట్లు సమాచారం. కానీ కొన్ని కీలక అంశాలపై ఇంకా క్లారిటీ రావడం లేదని తెలుస్తోంది. ఏపీకి వచ్చే ప్యాకేజీ ఎలా ఉంటుందో కొద్ది గంటల్లో స్పష్టత రానుంది. 

టి.టిడిపి నేతల భేటీ..

హైదరాబాద్ : టి.టిడిపి నేతలు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులు ఎదుర్కుకుంటున్న సమస్యలపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. 

డీజీపీని కలిసిన మల్ రెడ్డి..

హైదరాబాద్ : డీజీపీ అనురాగ్ శర్మను కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కలిశారు. ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి భూ దందాలపై విచారణ జరిపించాలని ఫిర్యాదు చేశారు. నయీం అనుచరుడు శ్రీహరితో కలిసి ఆదిభట్లలో భూములు కబ్జా చేశారని ఆరోపించారు. మంచిరెడ్డిని విచారిస్తే నయీం అక్రమాలు..భూ దందాలు బయటపడుతాయని పేర్కొన్నారు. 

13:47 - September 7, 2016

న్యాయసలహాలు..సూచనలు అందించే 'మైరైట్' కార్యక్రమం ఈరోజు కూడా మన ముందుకు వచ్చేసింది. ఈరోజు మైరైట్ కార్యక్రమంలో 'జ్యుడిషియల్ సెపరేషన్' అంటే ఏమిటి? అనే అంశంపై న్యాయ సలహాలు అందించేందుకు అడ్వకేట్ పార్వతిగారు మైరైట్ కార్యక్రమానికి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..న్యాయపరమైన సలహాలను తెలుసుకోండి..

13:42 - September 7, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను కేంద్ర దగ్గర తాకట్టు పెట్టారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. కమిషన్లు దండుకునేందుకే ప్యాకేజీకి ఒప్పుకుంటున్నారని మండిపడ్డారు. 

13:39 - September 7, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోసమే తాము ప్రయత్నిస్తున్నామని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి సుజనాచౌదరి చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీనా... హోదా.. అన్న అంశంపై సాయంత్రానికి స్పష్టత వస్తుందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లను పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అనంతరం టీపీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ చెప్పారు. 

13:34 - September 7, 2016

విజయవాడ : ప్రత్యేక హోదా అంశంపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చంద్రబాబు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చంద్రబాబుకు ఫోన్‌ చేశారు. రాష్ట్రానికి మెరుగైన ప్యాకేజీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ రావాలని చంద్రబాబును కోరారు. దీంతో చంద్రబాబు మంత్రులతో సమావేశమై ఢిల్లీ పరిణామాలపై చర్చించారు. 9 ప్రతిపాదనలను ఏపీ సర్కార్‌ కేంద్రం ముందు ఉంచింది. ఇందులో ప్రధానంగా విశాఖకు రైల్వే జోన్‌కు సంబంధించిన అంశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరిస్తే చంద్రబాబు ఢిల్లీ అవకాశం కనిపిస్తోంది.

అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. వెలగపూడి వెళ్లి తాత్కాలిక సచివాలయ సందర్శన కార్యక్రమాన్ని కూడా క్యాన్సిల్‌ చేసుకున్నారు. ఢిల్లీ పరిణామాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేయాలని టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులను ఆదేశించారు. మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు తొందరపడి ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం ప్రకటన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు స్పందించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియోను చూడండి..

ప్రజాభిప్రాయంతో జిల్లాలు ఏర్పాటు చేయాలి - డీకే అరుణ..

హైదరాబాద్ : ప్రజాభిప్రాయంతో జిల్లాలు ఏర్పాటు చేయాలిని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్ చేశారు. గద్వాలపై ఒక వ్యక్తి నుండే ఆరు వేల అభ్యంతరాలు వచ్చాయని సీఎం అనడం సరైంది కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి గద్వాలపై ఎందుకంత కోపం అని ప్రశ్నించారు. 

రేపే ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

హైదరాబాద్ : రేపటి నుండి మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 7.30గంటలకు ఎన్టీఆర్ ఘాట్ లో సీఎం చంద్రబాబు నివాళులర్పించి అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఉదయం 8.30గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. రెండు సెషన్ లలో అసెంబ్లీ జరగనుంది. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2గంటల వరకు తొలి సెషన్..సాయంత్రం 4 నుండి రాత్రి 9గంటల వరకు రెండో సెషన్ జరగనుంది. 

పోలీసు..ఇతర అధికారులతో స్పీకర్ కోడెల సమావేశం..

హైదరాబాద్ : అసెంబ్లీలోని తన ఛాంబర్ లో పోలీసు ఉన్నతాధికారులు ఇతర అధికారులతో స్పీకర్ కోడెల సమావేశం నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భద్రతపై చర్చించారు. 

హోదా కోసం వైసీపీ పోరాటం - రోజా..

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాటం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ప్యాకేజీలు వస్తే టిడిపి నేతలకు కమిషన్లు వస్తాయని, అందుకే ప్యాకేజీలతో టిడిపి సంతృప్తి పడుతుందన్నారు. కొందరు షూటింగ్ లు లేని సమయంలో హోదా నినాదం ఎత్తుకుంటున్నారని, ప్రభుత్వం మద్దతుతోనే పవన్ సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. 

13:03 - September 7, 2016

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని, పోలవరం ప్రాజెక్టులకు నిధులు తదితర 9 అంశాలకు చెందిన డిమాండ్లను కేంద్రం ముందు పెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. వీటన్నింటికీ కేంద్రం సానుకూలంగా స్పందిస్తేనే ఢిల్లీకి వెళతానని, లేని పక్షంలో వెంకయ్య ఆహ్వానాన్ని సున్నితంగానే తిరస్కరిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి కేంద్రం స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ ప్రకటిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన అత్యవసర భేటీ ముగిసింది. ఇప్పటిదాకా ముగిసిన భేటీలో కేంద్రం ప్రకటన గురించిన వెలుగులోకి వచ్చిన అన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. తనను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీకి ఆహ్వానించినట్లుగా చంద్రబాబు మంత్రులకు తెలిపారు. 

కోవెలకుంట్ల సబ్ ట్రెజరీపై ఏసీబీ దాడి..

కర్నూలు : కోవెలకుంట్ల సబ్ ట్రెజరీ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేపట్టింది. రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సీనియర్ అకౌంటెంట్ సబ్రుద్దీన్ పట్టుబట్టాడు.

 

12:54 - September 7, 2016

గుంటూరు : కాపుల రిజర్వేషన్స్ కోసం తాను ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా వున్నానని వైసీపీ నేత భూమనక కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తనను కుట్ర పూరితంగా తుని ఘటనలో ఇరికించారని వైసీపీ నేత భూమనక కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తుని విధ్వంసం ఘటన కేసులో రెండో రోజు ఆయన సీడీఐ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ... తుని ఘటనలో ప్రభుత్వం తనను బలిపశువు చేస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. అన్నింటికీ సిద్ధపడే తాను విచారణకు హాజరయ్యానన్నారు. ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించటానికే తుని ఘటనలో భూమనను అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టటానికి అన్యాయంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైసీపీ నేతలు అంబటి రాంబాబు..చెవిరెడ్డి పేర్కొన్నారు.

జూలకంటి దీక్ష విరమణ..

నల్గొండ : మిర్యాలగూడ మున్సిపాల్టీ ఎదుట మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నిరహార దీక్ష విరమించారు. మున్సిపల్ కమిషనర్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని మున్సిపల్ కమిషనర్ హామీనిచ్చారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు తీర్చాలంటూ జూలకంటి రెండు రోజుల పాటు నిరహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. 

ఢిల్లీకి బాబు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్నాహ్నం 3గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే కేంద్రం ముందు 9 ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం ఉంచింది. ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఒకే అంటే ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

12:30 - September 7, 2016

ఢిల్లీ : ఈరోజు మ‌ధ్యాహ్నం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదాపై కాకుండా ప్యాకేజీపై ఓ కీల‌క‌ ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని వార్తలు వ‌స్తోన్న నేప‌థ్యంలో టీడీపీ నేత, కేంద్ర స‌హాయ‌ మంత్రి సుజనా చౌదరి స్పందించారు. ఢిల్లీలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్య నాయుడుల‌తో చ‌ర్చించిన‌ అనంతరం ఆయ‌న ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదానే తాము కోరామని ఆయన తెలిపారు. హోదాపై ఢిల్లీలో చర్చలు కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదానే తాము కోరుతున్న‌ట్లు పేర్కొన్నారు. విభజన చట్టంలో కేంద్ర పొందుప‌రిచిన‌ అంశాల అమలు, ఏపీ భవన్ విభజనల‌పై కేంద్ర‌మంత్రుల‌తో తాను చర్చించినట్లు ఆయ‌న తెలిపారు.

చంద్రబాబుకు వెంకయ్య నాయుడు ఫోన్
దేశ రాజధాని ఢిల్లీలో ఏపీకి సాయంపై కేంద్రం తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఫోన్ చేశారు. రాష్ట్రానికి మెరుగైన ప్యాకేజీ ఇస్తామని వెల్లడించారు.

మంత్రులందరూ అందుబాటులో ఉండాలి : చంద్రబాబు
ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన నేపథ్యంలో టిడిపి యంత్రాంగం అప్రమత్తమైంది. ఢిల్లీ పరిణామాలను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అన్ని కార్యక్రమాలను బాబు రద్దు చేసుకున్నారు. మంత్రులందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు తొందరపడి ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం ప్రకటన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు స్పందించనున్నారు.

తిరుమలలో 'ప్యాకేజీ' అందోళనలు..
ఏపీకి ప్రత్యేక హోదాను కోరుతూ..తిరుపతిలో ఆందోళనలు చేపట్టారు. ప్రత్యేక ఏపీకి ప్రత్యేక హోదాకు తిలోదకాలిచ్చి, స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీకి కేంద్రం రంగం సిద్ధం చేస్తున్న తరుణంలో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. రాయలసీమ పోరాట సమితి పేరిట రంగంలోకి దిగిన కొందరు నేతలు నేటి ఉదయం తిరుపతిలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు తిరుపతి కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు వీలు కాకపోతే... విజయవాడ మినహా ఏ ప్రాంతం కనిపించలేదా? అని వారు ప్రశ్నించారు. విశాఖ, విజయవాడలను మాత్రమే అభివృద్ధి చేసి రాయలసీమకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని, అదే జరిగితే ఏపీ అగ్ని గుండంగా మారుతుందని హెచ్చరించారు. తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్ ను ప్రకటించడమే కాకుండా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఎర్రచందనం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా విజయవాడకు తరలిస్తున్నారని మండిపడ్డారు.   

12:29 - September 7, 2016

చూయింగ్ గమ్..పిల్లలతో పాటు పెద్దలు కూడా దీనిపై ఆసక్తి చూపుతుంటారు. దీనిని నమలడానికి ఓ స్టైల్ గా భావిస్తుంటారు. టీనేజ్ పిల్లలకు ఇది ఒక వ్యవసనంగా మారిందని చెప్పవచ్చు. ఈ చూయింగ్ నమలడం వల్ల అనే దుష్ర్పభావాలు ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
పిల్లల్ని ఎదగనీయకుండా అడ్డుకుంటుంది. పిల్లలో కండరాల పెరుగుదలలో లోపాలుంటాయి.
చూయింగ్ గమ్ ని పదే పదే నమలడం ద్వారా ఆరోగ్యానికి అవసరమయ్యే పండ్లు..ఇతరత్రా వాటిని తీసుకోవాలని అనిపించదు.
గమ్‌ను నమలడం వలన జాయింట్స్‌ అంటే పండ్ల దవడల సమస్యలు పెరుగుతాయి.
అంతర్గతంగా జాయింట్స్‌, కండరాల నొప్పి కలిగిస్తుంది. అంతేగాకుండా తలనొప్పి, అలర్జీలు కలుగుతాయి.
అదే పనిగా చూయింగమ్‌ని తింటే దంతాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఇందులో షుగర్ ఆర్ట్ ఫిషియల్ షుగర్ ఉందని అధ్యయనాల్లో తేలిందని, వీటి వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా చూయింగ్ గమ్ నమలడం వల్ల చెడు అలవాటు అని, వెంటనే దీనిని నుండి బయటపడాలని వైద్యులు సూచిస్తున్నారు. ~

బాబుకు వెంకయ్య ఫోన్..

విజయవాడ : దేశ రాజధాని ఢిల్లీలో ఏపీకి సాయంపై కేంద్రం తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఫోన్ చేశారు. రాష్ట్రానికి మెరుగైన ప్యాకేజీ ఇస్తామని వెల్లడించారు. 

అప్రమత్తమైన టిడిపి..బాబు ఆదేశాలు..

విజయవాడ : ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన నేపథ్యంలో టిడిపి యంత్రాంగం అప్రమత్తమైంది. ఢిల్లీ పరిణామాలను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అన్ని కార్యక్రమాలను బాబు రద్దు చేసుకున్నారు. మంత్రులందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు తొందరపడి ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం ప్రకటన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు స్పందించనున్నారు. 

బలిపశువు చేస్తున్నారు - భూమన..

గుంటూరు : తుని ఘటనలో ప్రభుత్వం తనను బలిపశువు చేస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. అన్నింటికీ సిద్ధపడే తాను విచారణకు వచ్చానని, తనను అక్రమంగా జైలు పాల్జేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. 

11:42 - September 7, 2016
11:41 - September 7, 2016

విశాఖ : నేడు కేంద్రం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేయనున్న నేపథ్యంలో విజయవాడకు రైల్వే జోన్ ను ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు విశాఖపట్నంలో ఆందోళన చేపట్టారు. టీడీపీ ఎన్నికల సందర్బంగా ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైల్వే జోన్ ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీపీఎం నేత నర్శింగరావు మాట్లాడుతూ..అభివృద్ధి అనేది ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అయితే అనర్ధాలు జరుగతాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో అమరావతి పరిసరప్రాంతాల్లోనే అభివృద్ధిని కేంద్రీకరించకుండా అన్ని ప్రాంతాలకూ వికేంద్రీకరణ జరగాలని ఆయన డిమండ్ చేశారు. రైల్లే జోన్ కు కావాల్సిన మౌలిక వసతులన్నీ విశాఖలో వున్నాయన్నారు. అభివృద్ధిని ఒకేప్రాంతంలో కాక అన్ని ప్రాంతాలకు చెందేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భం ఆయన డిమాండ్ చేశారు. 

సింగపూర్ లో రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు చూశాం - నారాయణ...

గుంటూరు : అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణానికి సింగపూర్ లో కొన్ని ప్రతిపాదనలు చూడడం జరిగిందిన మంత్రి నారాయణ వెల్లడించారు. వచ్చే 50 సంవత్సరాలకు రద్దీని తట్టుకొనేలా రోడ్ల నిర్మాణం చేయనున్నట్లు, స్విస్ ఛాలెంజ్ విధానంపై రాద్ధాంతం చేయడం తగదని తెలిపారు. డిసెంబర్ కల్లా రాజధాని డిజైన్ ను ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీలకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూంలు రాజధానిలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 

హోదా కోసమే పట్టు - సుజనా..

ఢిల్లీ : ప్రత్యేక హోదాపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయని, తాము హోదా కోసమే పట్టుబడుతున్నామని కేంద్ర సహాయమంత్రి సుజనాచౌదరి తెలిపారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, వెంకయ్యతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీసీతో పుణ్యకాలం కాస్తా అయిపోతుందని తెలిపారు. 

రైల్వే జోన్ లేదనడంపై బాబు అభ్యంతరం ?

విజయవాడ : విశాఖకు రైల్వేజోన్‌ లేదనడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఏపీకి ఆర్థిక సాయంపై ఢిల్లీలో కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. రైల్వే జోన్ లేదని తెలుసుకున్న సీఎం బాబు వెంటనే రైల్వే మంత్రి సురేష్‌ప్రభుతో మాట్లాడినట్లు తెలుస్తోంది. 

11:26 - September 7, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనపై కేంద్రం కసరత్తులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ఎంపీలు హస్తినలో సంబంధిత కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడుతో సీఎం.రమేష్, సుజనా చౌదరి మంతనాలు సాగిస్తున్నారు. ఏపీకి సంబంధించిన అభ్యర్థనలను వివరిస్తున్నారు. 'హోదా' ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా ఎంపీలు తెలిపారు. ఈ అంశంపై ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి ఒక ప్రకటన రానుంది. పోలవరం ప్రాజెక్టు..వెనుకబడిన జిల్లాలు..రాజధాని నిర్మాణం..రైల్వే జోన్ ఏర్పాటు.. ఏపీలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు..జిల్లాల పునర్ వ్యవస్థీకరణ..వంటి పలు అంశాలపై ఎంపీలు కేంద్రాన్ని వివరిస్తున్నారు. ప్యాకేజీలో భాగంగా కేంద్రం నిధుల్లో 90శాతం గ్రాంట్ చేసే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. రూ.10వేల కోట్ల వరకూ ఏపీ రెవెన్యూ లోటు భర్తీచేసే అవకాశమున్నట్లుగా కనిపిస్తోంది. తొలివిడతగా రూ. 18వేల కోట్ల రుణాన్ని కేంద్రం గ్రాంట్ చేయనున్నట్లుగా సమచారం. ఏది ఏమైనా ఏపీకి ప్యాకేజీ ఇచ్చేందుకే కేంద్రం మొగ్గుచూపుతోంది. ఏపీకి ప్రత్యేక హోదాపై మొదటి నుండి విముఖతను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే...మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

మధ్యాహ్నం బాబు ఢిల్లీకి ?

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మధ్యాహ్నం బాబు ఢిల్లీకి రావాలని కేంద్రం భావిస్తున్నట్లు, కేంద్ర మంత్రి సుజనా ఆహ్వానం ద్వారా బాబును ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు వెలగపూడి పర్యటన రద్దయ్యింది. 

లక్షకు చేరిన 'మై జీహెచ్ ఎంసీ'యాప్..

హైదరాబాద్ : 'మై జీహెచ్ ఎంసీ'యాప్ డౌన్ లోడ్స్ లక్షకు చేరాయి. ఇప్పటి వరకు 54,247 బర్త్ సర్టిఫికేట్లు, 6,235 డెత్ సర్టిఫికేట్లను నగర వాసులు డౌన్ లోడ్ చేసుకున్నారు. 11,047 సమస్యలపై ఫిర్యాదులు అందితే 9,017 సమస్యలను జీహెచ్ఎంసీ పరిష్కరించింది. 

మార్కెటింగ్ శాఖలో మెరుగైన విధానాలు - మంత్రి హరీష్..

హైదరాబాద్ : నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ వర్క్ షాప్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ లో పది జిల్లాల మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ...మార్కెటింగ్ శాఖలో మెరుగైన విధానాలు కొనసాగించేందుకు ఇది తొలి ప్రయత్నమని, రైతులకు మరింత మెరుగైన సేవలందించడమే లక్ష్యమన్నారు. రైతు బజార్ లను మరింత పటిష్టం చేస్తామని, ప్రతి రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో రైతు బజార్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కూరగాయలు..పండ్లు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్ లను ఏర్పాటు చేస్తామన్నారు. నాణ్యమైన పంటలతో రైతులకు రెట్టింపు ఆదాయం వస్తుందన్నారు. 

సర్వేపై బాబు టెలీకాన్ఫరెన్స్..

విజయవాడ : ప్రజా సాధికార సర్వేపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.సెప్టెంబర్‌ 30నాటికి స్మార్ట్ పల్స్ సర్వే పూర్తిచేయాలని ఆదేశించారు. ఏపీలో మొత్తం 5.23కోట్ల జనాభాకు గాను ఇప్పటివరకు 2.66కోట్లమందిని సర్వే చేశారని సీఎం పేర్కొన్నారు. స్మార్ట్ పల్స్‌ సర్వే 52శాతం పూర్తయిందన్నారు.

లోటస్ పాండ్ లో వైసీపీ సీఎల్పీ సమావేశం..

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతనలో లోటస్ పాండ్ లో వైసీపీ శాసనసభా సక్ష సమావేశం జరుగుతోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. 

ప్యాకేజీలో లేని రాజధాని నిధులు?..

ఢిల్లీ : హోంశాఖ అధికారిక నివాసానికి చేరుకున్న సుజనా చౌదరి, సీఎం రమేశ్ లతో చర్చలు జరిపపారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణం భాధ్యతను పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రకటించనున్న స్పెషన్ డెవలప్ మెంట్ ప్యాకేజీలో రాజధానికిచ్చే నిధుల ప్రస్తావన ఉండబోదని కూడా ఆయన తేల్చిచెప్పారు. రాజధానిలో నిర్మించనున్న భవనాల డీపీఆర్ లు అందజేసిన తర్వాత మాత్రమే సదరు నిధులను మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

10:31 - September 7, 2016

ఢిల్లీ : ఏపీ భవితవ్యాన్ని నిర్ణయించనున్న కీలక ప్రకటన మరికొద్ది గంటల్లో రానుంది. ఏపీ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ...మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు...ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు కేంద్ర సాయం ఏ మేర లభిస్తుందని ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విభజన నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించిన 'ప్రత్యేక హోదా' తప్ప మిగిలిన అన్ని అంశాలను ఇచ్చేందుకు సిద్ధంగా వున్నట్లు కేంద్రం నుండి సంకేతాలు అందుతున్నాయి. 'హోదా' ఇచ్చే అవకాశాలు కనుచూపుమేర కానరాకపోవటంతో టీడీపీ ప్రభుత్వం ప్యాకేజీకి ఒప్పుకుంటుందా? లేక హోదాకు పట్టుపడుతుందా? అనేది కొద్ది గంటల్లో తెలియనుంది. ఇతర రాష్ట్రాలు కూడా ఈ అంశాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో ను చూడండి..

10:10 - September 7, 2016

ఢిల్లీ : కశ్మీర్‌లో పర్యటించి వచ్చిన అఖిలపక్ష ఎంపీల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ భేటీ కానున్నారు. హో మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలోని 20 పార్టీలకు చెందిన 26 మంది పార్లమెంటు సభ్యులు ఈనెల 4,5 తేదీల్లో శ్రీనగర్‌లో పర్యటించి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేశారు. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను పార్లమెంటు సభ్యులు మోదీ దృష్టికి తీసుకెళతారు. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తారు. హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ తర్వాత ఈ ఏడాది జులై 8 నుంచి కశ్మీర్‌లో జరిగిన అల్లర్లలో 70 మంది మరణించారు. దాదాపు పదివేల మంది గాయపడ్డారు. కశ్మీర్‌లో పర్యటించిన ఎంపీ ల బృందాన్ని కలుసుకోడానికి వేర్పాటువాదులు నిరాకరించిన అంశంపై మోదీ చర్చిస్తారు. 

కశ్మీర్‌ వేర్పాటువాదుల భద్రతపై కేంద్రం సమీక్ష
కశ్మీర్‌ వేర్పాటువాదులకు కల్పిస్తున్న భద్రతను సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. యురియత్‌ నేత సయీద్‌ అలీ షా గిలానీతోపాటు జేకేఎల్ఎఫ్ నేత యాసిన్‌ మాలిక్‌ తదితరులకు కల్పిస్తున్న జెడ్‌ కేటగిరీ భద్రతను కుదించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. వీరికి కల్పిస్తున్న ఇతర సదుపాయాలను కూడా తగ్గించాలన్న ఆలోచనలో ఉంది. వేర్పాటువాదుల పాస్‌పోర్టులను కూడా రద్దు చేయాలని భావిస్తోంది. ఈనెల 4,5 తేదీల్లో కశ్మీర్‌లో పర్యటించిన అఖిలపక్ష ఎంపీల బృందాన్ని కలుసుకునేందుకు ఏర్పాటువాదులు నిరాకరించారు. పైగా వీరి అనుచరులు పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేయడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. వేర్పాటువాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. 

10:05 - September 7, 2016

మెదక్  : జైలు..! నేరస్తులను ఇరవై నాలుగ్గంటలూ నాలుగ్గోడల మధ్యే బంధించే హాలు. బయట ప్రపంచంతో కించిత్తు సంబంధం కూడా లేకుండా..  కోర్టు ఉత్తర్వుల మేరకు నేరస్తులు శిక్షను అనుభవించే చోటు. నేరం చేసిన వారికే జైలు జీవితం. కానీ ఇప్పుడు ఎలాంటి తప్పు చేయని వారు కూడా..  జైలు జీవితం అనుభవించే  వెసులుబాటు ఉంది. ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం. జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులకు.. మెదక్‌ జైలు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఆ కథాకమామిషేంటో ఈ కథనంలో చూడండీ...
జైలు అంటే విభిన్న ప్రపంచం..
జైలు జీవితం అంటే.. నేరస్తుల పాలిట శాపం. నేరస్తులకు శిక్ష. చిన్నా చితకా నేరాలు మొదలు.. ఎంతటి ఘోరాలు చేసినా న్యాయస్థానాల్లో విధించిన శిక్షను అనుభవించే చోటే జైలు. జైలుకు వెళ్లిన ఖైదీలకు అదో విభిన్న ప్రపంచం. అక్కడి నియమాలు, నిబంధనలు బయటి ప్రపంచపు జీవనానికి ఏ మాత్రం పొంతన ఉండదు. అంతేకాదు... తిండి తినాలన్నా, నిద్రపోవాలన్నా అంతా కూడా జైలు నిబంధనల మేరకే ఉంటుంది. విలాసాలకు దూరంగా.. బంధువుల కులాసాలతో  సంబంధం లేకుండా.. స్వేచ్ఛకు దూరంగా నిందితులు, నేరస్థులు జీవించాల్సి వుంటుంది. 
అనుభవించిన వారికే తెలుస్తుంది జైలు జీవితం అంటే 
జైలు జీవితం.. దాన్ని అనుభవించిన వారికే తెలుస్తుంది. కానీ.. ఇప్పుడు సాధారణ పౌరులు కూడా జైలు జీవితాన్ని.. అది కూడా ఏ తప్పూ చేయకుండానే అనుభవించ వచ్చు. అవును. ఇటీవల జైళ్లశాఖ ఈ వినూత్న అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. అసలు జైలంటే ఎలా ఉంటుందో తెలియని వారికి.. జైలును చూసే... జైల్లో ఉండి అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకునే అవకాశాన్ని కల్పించింది. 
తెలంగాణ జైళ్లశాఖ వినూత్న  అవకాశం
జైల్లో ఖైదీలను ఎలా చూస్తారు.. వాళ్లకెలాంటి ఆహారం అందిస్తారు. బందిఖానాలో ఉన్నప్పుడు వారి దినచర్యలేంటి..? ఇలా.. మొత్తానికి జైలు జీవితం రుచి చూపించేందుకు తెలంగాణ జైళ్లశాఖ ఓ అవకాశాన్ని కల్పించింది. కాకపోతే.. జైలుకెళ్లాలనుకునే వాళ్లు చేయాల్సిందల్లా కొంత మొత్తం చెల్లించాలి. ఐదు వందల రూపాయలు చెల్లించిన వారెవరైనా సరే ఒక్కరోజు జైలు జీవితం అనుభవించవచ్చు. మామూలు ఖైదీల్లాగే గడుపుతూ అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. 
జైలు జీవితాన్ని పరిచయం చేస్తున్న సంగారెడ్డి జిల్లా పాత జైలు
డబ్బులు చెల్లించి జైలు జీవితం అనుభవించాలనుకునే వారెవరైనా మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి జిల్లా పాత జైలుకు వస్తే చాలు. జైలు జీవితం పరిచితమైపోతుంది. హైదరాబాద్‌కు సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డి జైలు సాలర్‌జంగ్‌ హయాంలో 1796లో నిర్మితమైంది. 1981లో  జైళ్ల శాఖ ఆధీనంలోకి తీసుకొని జిల్లా జైలుగా మార్చింది. పెరుగుతున్న ఖైదీలకు అనుగుణంగా ఈ జైలు సరిపోక పోవడంతో.. జిల్లా జైలును 2012  సంగారెడ్డి మండలంలోని కంది గ్రామ శివారుకు మార్చారు. పాత జైలు నిరుపయోగంగా మారడంతో.. జైళ్లశాఖ డీజీ వినయ్‌ కుమార్‌ సింగ్‌ ఈ సరికొత్త ఆలోచనకు ఓ రూపమిచ్చి... ఫీల్‌ ది జైల్‌ కార్యక్రమాన్ని రూపొందించారు. 
 మ్యూజియంగా మారిన చారిత్రక జైలు
సాధారణ పౌరులకు జైలు జీవితం అనుభవం కల్పించడం ద్వారా వాస్తవ పరిస్థితులపై అవగాహన పెరుగుతోందన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు.  చారిత్రక జైలును మ్యూజియంగా మార్చడం నిజంగా విశేషమే అంటున్నారు సంబంధిత అధికారులు.  
పురాతన కట్టడాల సోయగం..మెదక్‌ జిల్లా పాత జైలు 
మెదక్‌ జిల్లా పాత జైలు కేవలం ఖైదీల బందిఖానాయే కాదు.. అక్కడ తరచి చూస్తే చరిత్ర కూడా తెలుసుకునే వీలుంటుంది. పురాతన కట్టడాల సోయగం.. అప్పటి శిక్షా విధానం అన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. మొత్తానికి ఒక్కరోజు జైలు జీవితం సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  
నేటి తరానికి ఎన్నో విశేషాలను అందిస్తున్న మెదక్ జైలు
మెదక్‌ జిల్లా పాత జైలు.. నేటి తరానికి ఎన్నో విశేషాలను అందిస్తోంది. జీవితంలో ఒక్కసారి కూడా జైలు ముఖం చూడని వారు.. ఒక్కసారైనా జైలు జీవితాన్ని చవిచూడాలనుకునే వారు.. ఈ జైలుకు వెళ్లి ఖైదీల శిక్షలు, వారికి అందించే భోజనం, జైలు గదులు... ఇలా మొత్తానికి ఖైదీల దినచర్యను ఆకళింపు చేసుకునే అవకాశం ఉంటుంది. జైలులో పురాతన వస్తువులు, ఫొటోలు, ప్రముఖులు ఎవరైనా జైల్లో ఉన్నప్పుడు ఉపయోగించిన వస్తువులను సందర్శించే వీలుంది. సెల్‌లో జీవితానికి... స్వేచ్ఛా జీవితానికి తేడా ఏంటో ప్రత్యక్షంగా తెలుసుకునే వీలు ఇక్కడ కలుగుతోంది. 
జైలు గదుల్లో తెలంగాణ చరిత్ర
జైలు గదుల్లో పురాతన వస్తువులను  భద్రపచడంతో పాటు తెలంగాణ చరిత్ర, ఖైదీలకు విధించే శిక్షల గురించి కళ్లకు కట్టినట్లుగా చిత్రాలను ఏర్పాటు చేశారు. మొత్తానికి బయటకు జైలుగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం పర్యటక కేంద్రంగా రూపుదిద్దుకుంది. 
జైలు గోడలపై చరిత్ర స్మృతులు
జైలు గోడలపై చరిత్ర స్మృతులు, నేరాలకు వేసే శిక్షల దృశ్యాలను కళాత్మకంగా చిత్రీకరించారు. నేరాలు చేసిన ఖైదీలకు కఠిన శిక్షలు అమలు చేయడం, కాళ్లు..చేతులకు సంకెళ్లు వేసి.. నడిపించడం, ఇనుప రింగులతో కూడిన బరువైన రాయిని భుజాలపై మోపి సెంట్రల్‌ టవర్‌ చుట్టూ ఖైదీలను తిప్పించడం, తిరగలిలో ధాన్యాన్ని పిండి చేయించడం లాంటి విషయాలపై అవగాహన కలిగే అవకాశం ఉంది. ఖైదీలకు సమాచారం, వినోదం కోసం 1901లో రేడియో వినే ఏర్పాటు చేశారు.  ఇక్కడి జైలులో చెక్కతో రూపొందించిన భారీ తాళం చెవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 
జైల్లో కచ్చితంగా పాటించాల్సిన  టైమ్ టేబుల్
జైలు మ్యూజియం. నిజమైన జైలు జీవితానికి ఏ మాత్రం తీసుపోకుండా.. అన్ని దినచర్యలు ఇక్కడ ఉంటాయి. జైల్లో పాటించాల్సిన టైమ్‌ టేబుల్‌ కచ్చితంగా ఇక్కడ కూడా ఉంటుంది.   ఒకరోజు ఖైదీలకు మంచి భోజనం, శుభ్రమైన బ్యారక్, దుప్పట్లను అందిస్తారు. ఆసక్తి గల వారికి వ్యాయమం యోగాతో పాటు కంప్యూటర్‌ శిక్షణనూ 
సంగారెడ్డి మ్యూజియం జైలులో ఒకరోజు ఖైదీలుగా ఉండేందుకు వచ్చే వారికి మంచి భోజనం, శుభ్రమైన బ్యారక్, నిద్రించేందుకు దుప్పట్లను అందిస్తారు.  టీ, టిఫిన్‌తో పాటు  సాధారణ ఖైదీల మాదిరిగా యోగా, క్రమశిక్షణను నేర్పిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాకప్‌లో ఉంచుతారు. 
వేకువ ఝామునే నుండే  దినచర్య
6.30 గంటల నుంచి వ్యాయామం, యోగా శిక్షణ ఉంటుంది. 7.30 గంటలకు టీ తో పాటు టిఫిన్ ఇస్తారు. తర్వాత పరేడ్ నిర్వహిస్తారు. 8 నుంచి 9.30 గంటల వరకు విద్యాదానం కార్యక్రమం, 9.30 గంటలకు మ్యూజియం పర్యవేక్షణ అధికారి రౌండ్‌కు వస్తుంటారు.  ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు భోజన సమయం. 10.30 గంటల నుంచి తిరిగి విద్యాదానం కార్యక్రమం కొనసాగుతుంది. 
టీ టైమ్ టూ లాకప్  
మధ్యాహ్నం 12.30 గంటలకు టీ, 12.35 నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి, 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తిరిగి విద్యాదానంలో భాగంగా ఖైదీల ఆసక్తిని బట్టి కంప్యూటర్ విద్య, ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తారు. సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు యోగా, 4.30 గంటల నుంచి బ్యారక్‌ను శుభ్రం చేసుకోవడం వంటి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 5.30 గంటలకు భోజనం ముగిసిన తర్వాత తిరిగి 6 గంటలకు లాకప్ చేస్తారు.
మరచిపోలేని అనుభూతులతో జైలు జీవితం
మొత్తానికి ఒక్కరోజు జైలు జీవితం తీక్షణంగా పరిశీలిస్తే జీవితంలో మరిచిపోలేని అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరింకెందుకు ఆలస్యం.. మీకూ జైలు జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఉంటే ఛలో సంగారెడ్డి జైలు మ్యూజియం...!

 

ఏపీకి ప్యాకేజీ వివరాలు ఇవే ?

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోద కంటే ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్యాకేజీ వివరాలను తెలియచేయనున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు రాయితీలు..ప్యాకేజీతో కేంద్రం నిధుల్లో 90 శాతం గ్రాంటు..తొలి విడతగా నాబార్డు నుండిరూ. 18 వేల కోట్ల రుణం..రూ. పది వేల కోట్లకు రెవెన్యూ లోటును భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అమరావతి నిర్మాణానికి ఏటా రూ. 500 కోట్లు.. కేటాయించే అవకాశాలున్నాయి. 

రాజ్ నాథ్ తో సుజనా భేటీ..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కేంద్ర మంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా..ప్యాకేజీ అంశాలపై చర్చిస్తున్నారు. కాసేపట్లో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులు చేరుకోనున్నారు. 

పల్స్ సర్వేపై బాబు టెలికాన్ఫరెన్స్...

విజయవాడ : అమరావతి పల్స్ సర్వేపై అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 30లోగా పల్స్ సర్వే పూర్తి చేయాలని, 52 శాతం స్మార్ట్ పల్స్ సర్వే పూర్తయ్యిందని బాబు పేర్కొన్నారు. ఇంకా 2.5 కోట్ల మందిని సర్వే చేయాల్సి ఉందని, పల్స్ సర్వేలో అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, ఉభయ గోదావర జిల్లాలు ముందంజలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన జిల్లాలు కూడా త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని...మూడు నెలల్లో ఏపీ వ్యాప్తంగా డిజిటల్ డోర్ నెంబర్లు ఏర్పాటు చేయాలని...అర్హులందరికీ చంద్రన్న బీమా వర్తింప చేయాలని..భవన నిర్మాణ కార్మికులు బీమా వినియోగించుకొనేలా చేయాలని సూచించారు. 

09:41 - September 7, 2016

ఈ సంక్రాంతికి వచ్చిన 'నేను శైలజ' చిత్రంతో 'రామ్' జెన్యూన్ హిట్టు కొట్టాడు. ఈ యంగ్ హీరో తన ఆటిట్యూడ్ కి భిన్నంగా 'నేను శైలజ'తో ప్యూర్ లవ్ స్టోరీ అంటెంట్ చేశాడు. అయితే మరోసారి తనదైన మాస్ చిత్రంతో బాక్సాఫీసు వద్ద రెచ్చిపోవడానికి 'రామ్' 'హైపర్' మూవీతో రెడీ అవుతున్నాడు. 'రామ్ సంతోష్ శ్రీనివాస్' దర్శకత్వంలో 'హైపర్' మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయింది. 'రాశీఖన్నా' హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 14రిల్స్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట. గోపీఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పుల్ లెంగ్త్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది.

సక్సెస్ అవుతుందా ? 
'సంతోష్ శ్రీనివాస్' గతంలో 'రామ్' తో 'కందిరీగ' లాంటి సూపర్ హిట్టు మూవీ తీశాడు. దీంతో 'హైపర్' ఆ సక్సెస్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని యూనిట్ నమ్మకంగా ఉంది. అయితే ఈ దర్శకుడు యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' తో చేసిన 'రభస' డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు 'రామ్' 'రాశిఖన్నా' కాంబినేషన్ లో వచ్చిన 'శివం' డిజాస్టర్ అనిపించుకుంది. మరి 'రామ్ సంతోష్ శ్రీనివాస్' 'కందిరీగ' సక్సెస్ ని రిపీట్ చేస్తారా లేక 'శివం', 'రభస' చిత్రాలను గుర్తుకు తెచ్చారా అనేది కాస్త ఇంట్రెస్టింగ్ ఉంది.

09:39 - September 7, 2016

హైదరాబాబ్ : సికింద్రాబాద్ తుకారాంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఉదయం ఆరు గంటల సమయంలో ఓ కారు రైలు నిలయం సమీపంలో బీభత్సం సృష్టించింది. ఫుట్ పాత్ ఎక్కి గోడను ఢీకొంది. ఈ ఘటనలో ఫుట్ పాత్ పైన ఉన్న చెరుకు బండి,టీ బండి ధ్వంసం కాగా, గోడ కూలిపోయింది. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుందనే విషయం తెలిసిందే. ప్రమాదం జరిగింది 6 గంటలకు కావడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా కారు డ్రైవర్ చేస్తున్న యువకుడు మైనర్.. లైసెన్స్ లేనట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా సమయానికి కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్నవారు కూడా సురక్షితంగా బయటపడినట్లుగా తెలుస్తోంది. 

09:37 - September 7, 2016

లేటేస్ట్ స్టార్ హీరోయిన్ 'రకూల్ ప్రీతిసింగ్' సీనియర్ స్టార్ హీరోయిన్స్ కు దడ పుట్టిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 బడా సినిమాలు చేస్తూ ఎవరి అందనంత స్పీడ్ లో దూసుకెళ్లుతోంది. మరి 'రకూల్' చేస్తున్న ఆ బడా సినిమాలేంటి ? ప్రస్తుతం ఇండస్ట్రీలో 'రకుల్ ప్రీత్ సింగ్' టైం నడుస్తోంది. ఈ బ్యూటీకి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. గత ఎడాది ప్లాప్స్ తో కాస్త వెనుకపడనట్లు కనిపించింది. కానీ ఈ ఎడాది ప్రారంభంలో ఈ ముంబై చిన్నది 'నాన్నకు ప్రేమతో' ఓ మోస్తరు విజయం అందుకున్న 'రకూల్' 'సరైనోడు' భారీ సక్సెస్ తో ఫాం అందుకుంది. 'సరైనోడు' బ్లాక్ బస్టర్ తో 'రకూల్' స్పీడ్ మరింత పెరిగింది. 'రామ్ చరణ్' తో చేసిన 'బ్రూస్ లీ' డిజాస్టర్ అయినప్పటికి 'చెర్రీ' 'ధృవ' మూవీ కోసం మరోసారి 'రకూల్' నే తీసుకున్నాడు. ఇక 'బ్రహ్మోత్సవం'లో 'మహేష్' తో నటించే ఛాన్స్ మిస్ అయిందని బాధపడ్డ ఈ ముద్దుగుమ్మకి 'మురుగదాస్' తో చేస్తున్న సినిమాతో 'ప్రిన్స్' తో నటించాలనే కోరిక తీరనుంది.

నాగ చైతన్యతో కూడా ?
అలాగే దర్శకుడు 'మలినేని గోపీచంద్' 'సాయిధరమ్ తేజ్' తో చేస్తున్న మూవీలో కూడా 'రకూల్ 'నే హీరోయిన్ గా తీసుకున్నారు. వీటితో పాటు లేటేస్ట్ గా మరో క్రేజీ ఛాన్స్ అందుకుంది. తాజాగా 'నాగచైతన్య'తో మరో మూవీ కమిట్ అయినట్టు సమాచారం. 'కళ్యాణ కృష్ణ' దర్శకత్వంలో 'చైతూ' చేయనున్న సినిమాలో ఈమెనే హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలుస్తోంది. అలాగే 'వరుణ్ తేజ్' కొత్త మూవీలో కూడా హీరోయిన్ చేస్తోంది. 'రకూల్ ప్రీత్ సింగ్' దూకుడుతో 'సమంత', 'కాజల్', 'తమన్నా', 'శృతి హసన్' వంటి హీరోయిన్లు జెలసీగా ఫీలవుతున్నారేమోనని ఫిల్మ్ నగర్ జనాలు గుసగుసలు పెడుతున్నారు. 

ప్రారంభంకానున్న పారా ఒలింపిక్స్..

హైదరాబాద్ : ప్రపంచమంతా ఆశ్చర్యపడేలా ఇప్పటికే ఒలింపిక్స్ ను నిర్వహించిన రియో నెల రోజుల వ్యవధిలోనే పారాలింపిక్స్ క్రీడలను నిర్వహించబోతున్నది. పన్నెండు రోజుల పాటు క్రీడాభిమానులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే పారాలింపిక్స్‌లో ఈసారి 176 దేశాలు పోటీపడుతున్నాయి. శారీరక వైకల్యం ఉన్నా.. చెరగని ఆత్మవిశ్వాసాన్ని ఆలంభనగా మలుచుకుంటూ మొత్తం 2882 మంది ఆటగాళ్లు తమ తమ దేశాల తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరంతా 23 క్రీడా విభాగాల్లో పోటీపడనున్నారు. 

09:21 - September 7, 2016

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం అభిమానులే కాక టాలీవుడ్ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై రకరకలా కథనాలు వినిపిస్తున్నాయి. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రానికి 'ఖైదీ నెంబర్ 150' అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'చిరు'తో 'కాజల్' నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పలు సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ మూవీలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉన్నట్లు టాక్. ఈ సాంగ్ లో ఎవరిని నటింప చేయాలని చిత్ర యూనిట్ తర్జనభర్జనలు పడిందంట. చివరకు 'కేథరిన్' అయితే ఒకే అని చిత్ర యూనిట్ భావించిందంట. దాదాపు మూడు నెలల కిందటే 'కేథరిన్' ఈ మూవీలో సాంగ్ కోసం సంతకం చేసిందని టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 'చిరు', 'కేథరిన్' లపై సాంగ్స్ చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. 

బీజేపీ కార్యాలయంపై బాంబు దాడి..

కేరళ : బీజేపీ పార్టీ కార్యాలయంపై బాంబులు విసిరిన ఘటన తిరువనంతపురంలో కలకలం రేపింది. కార్యాలయం ప్రధాన ద్వారంపైకి గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి సమయంలో బాంబును విసరడంతో ద్వారానికి ఉన్న అద్దాల తలుపులు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు నిర్ధారించారు.

వృద్ధురాలి చెవి..ముక్కు కోసిన దుండగులు...

పశ్చిమగోదావరి : జీలుగుమిల్లి (మం) మొలగలంపల్లిలో వృద్ధురాలిపై దండుగులు దాడికి పాల్పడ్డారు. చెవి..ముక్కు కోసం నాలుగు కాసుల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. 

అరబిందో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

శ్రీకాకుళం : రణస్థలం (మం) పైడి భీమవరంలో అరబిందో ఫ్యాక్టరీ పీడీ - 6 బ్లాక్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. 

తమిళనాడుకు కావేరి నీళ్లు విడుదల..

కర్నాటక : కృష్ణ సాగర్ డ్యామ్ నుండి తమిళనాడుకు నీళ్లను విడుదల చేశారు. రైతుల నిరసనల మధ్య కర్నాటక నీళ్లు విడుదల చేసింది. 

సింహాచల్ రికార్డింగ్ డ్యాన్స్ లపై చర్యలు..

విశాఖపట్టణం : సింహాచలం పోస్టాపీస్ వీధిలో అశ్లీల నృత్యాలపై పోలీసు అధికారులు స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏసీపీ భీమారావు, సీఐ బాలసూర్యారావును కంట్రోల్ రూంకు బదిలీ చేశారు. ఘటనపై సీపీ టి.యోగానంద్ విచారణకు ఆదేశించారు. 

ఏపీకి ప్యాకేజీ..హోదాపై నేడు స్పష్టత..

విజయవాడ : ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై నేడు కేంద్రం స్పష్టతనివ్వనుంది. ప్రత్యేక హోదాకు ధీటుగా ప్యాకేజీపై కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉంది. విజయవాడ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

పుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు..

హైదరాబాద్ : తుకారం పీఎస్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రైల్ నిలయం వద్ద పుట్ పాత్ పైకి కారు దూసుకెళ్లడంతో టీ స్టాల్, చెరుకు రసం బండి ధ్వంసమయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి మైనర్ అని తెలుస్తోంది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలస్తోంది. జనసమ్మర్థం లేని సమయంలో ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. 

'పిండా'కూడు ప్యాకేజీ..

విజయవాడ : ఏపీకి కేంద్రం ప్రకటిస్తుందని భావిస్తున్న ప్రత్యేక ప్యాకేజీపై ప్రత్యేక హోదా సమితి నేత..నటుడు శివాజీ కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్రం ఇవ్వనున్న ప్రత్యేక ప్యాకేజీ పిండాకూడులా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ రైల్వే జోన్ తో లాభాలు వస్తాయన్న ఆయన... విజయవాడలో జోన్ ఏర్పాటు చేస్తే గొడవలు ఉత్పన్నమవుతాయన్నారు. రాజధానికిచ్చే రూ.2,500 కోట్లు రోడ్లకు కూడా సరిపోవన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగితే... బ్యాంకు లోన్లిస్తామనడం చిప్ప చేతికివ్వడమే అని ఆయన వ్యాఖ్యానించారు.

కర్నాటకలో కొనసాగుతున్న ప్రజల ఆందోళన..

కర్నాటక : రాష్ట్రంలో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కావేరి నది జలాలను తమిళనాడుకు వదలాలన్న సుప్రీం తీర్పుపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీర్పుకు నిరసనగా ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. బుధవారం మండ్యలోని సంజయ్ సర్కిల్ లో రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

ఆర్మీ స్థావరంపై ఉగ్ర దాడి...

జమ్మూ కాశ్మీర్ : ఆర్మీ స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపారు. హంద్వారాలో జరిగిన ఈ దాడిలో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

రాష్ట్రపతిని కలువనున్న రాజ్ నాథ్ సింగ్...

ఢిల్లీ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కలువనున్నారు. సాయంత్రం 6గంటలకు జరిగే ఈ భేటీలో హోం కార్యదర్శి కూడా పాల్గొననున్నారు. 

ఏపీలో పశువుల అందాల పోటీలు..

పశ్చిమగోదావరి  : 15 నుంచి 17 వరకు పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మార్కెట్‌ యార్డులో రాష్ట్రస్థాయిలో ఆవులు, గేదెల అందాల పోటీలు, పాల పోటీలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్థకశాఖ ఈ మేరకు సంయుక్తంగా నిర్ణయించాయి. ముర్రా జాతి గేదెలు, ఒంగోలు జాతి ఆవులు, గిరి, పుంగనూరు విభాగాల్లో పాల పోటీలు ఉంటాయి. రోజుకు 12 లీటర్లు పాలు ఇచ్చే ముర్రా జాతి గేదెలు, గిరి జాతి ఆవులు, రోజుకు ఎనిమిది లీటర్లు పాలు ఇచ్చే ఒంగోలు జాతి ఆవులు, రోజుకు ఐదు లీటర్లు పాలు ఇచ్చే పుంగనూరు జాతి ఆవులు పోటీలో పాల్గొనడానికి అర్హమైనవని పశుగణాభివృద్ధి సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

08:37 - September 7, 2016

ఖమ్మం : మార్కెట్‌లో విక్రయించే మిర్చి విత్తనాలు అసలివా..నకిలీవా అని తెలియక..దుకాణదారుల మాటలు నమ్మి విత్తనాలు కొనుగోలు చేశారు. తీరా అవి నకిలీవని తేలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నకిలీ మిర్చి విత్తనాలు నిండా ముంచడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఖమ్మం జిల్లా రైతుల ఆవేదనపై 10 టీవీపై ప్రత్యేక కథనం.

నకిలీ మిర్చి విత్తనాలతో మోసపోయిన రైతులు
నకిలీ విత్తనాలతో ఖమ్మం జిల్లా రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. వ్యసాయశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. జూన్‌ 30న టెన్‌టీవీ నకిలీ మిర్చి విత్తనాలపై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసినా..అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో నకిలీ విత్తనాలను కొనుగోలు చేసిన అధికారులు తీవ్రంగా నష్టపోయారు.

హరి ఆగ్రో ఏజెన్సీస్‌లో విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు
ఖమ్మం జిల్లా కామేడిపల్లి మండలం గరిడేపల్లి గ్రామానికి చెందిన రైతులు హరి ఆగ్రో ఏజెన్సీస్‌లో జేకేహెచ్ పీహెచ్ -178, జేకే దివ్య ఎఫ్ -1 హైబ్రీడ్‌ మిరప విత్తనాలను కొన్నారు. తరువాత సుమారు వంద ఎకరాల్లో మిర్చి విత్తనాలు వేశారు. విత్తనాలు నారు దశలో బాగానే ఉన్నా...ఎదుగుదల విషయంలో మాత్రం ఆశించిన విధంగా లేదని రైతులు వాపోయారు. విత్తనాలు వేసి నెల రోజులు కావస్తున్నా..ఇప్పటివరకూ పూత రాలేదని రైతులు చెబుతున్నారు.

ఉడాయించిన హరి ఆగ్రో ఏజెన్సీస్‌ యజమాని
పంట పరిస్థితిని చూసి రైతులు.. విత్తానాల షాపు యజమానిని నిలదీశారు. దీంతో పంటను చూడటానికి వచ్చిన దుకాణ యజమాని టిఫిన్‌ చేసి వస్తానని చెప్పి ఉడాయించాడు. దుకాణాన్ని మూసివేసి అందుబాటులో లేకుండా పారిపోయాడు. లక్షల్లో పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయామని కన్నీరుమున్నీరవుతున్నారు రైతులు.

తమకు న్యాయం చేయాలంటున్న రైతులు

ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి తమకు న్యాయం చెయ్యాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

08:27 - September 7, 2016

విశాఖ : సింహాచలం పోస్టాఫీస్‌ వీధిలో అశ్లీల నృత్యాలు చేస్తున్న వైనంపై 10 టీవీ కథనాలపై ప్రభుత్వం స్పందించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏసీపీ భీమరావు, గోపాలపట్నం సీఐ బాలసూర్యారావులను కంట్రోల్‌రూమ్‌కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాపునకు సీపీ ఆదేశించారు.

సింహాచలాన్ని అపవిత్రం చేశారని భక్తుల మండిపాటు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో అపచారం చోటు చేసుకుంది. వినాయకచవితి సందర్భంగా పోస్టాఫీసు వీధుల్లో రికార్డింగ్‌ డాన్సులు నిర్వహించారు. యువతీ యువకులు మద్యం సేవించి అసభ్యకరంగా చిందులేశారు. పెట్రోలింగ్‌కు వచ్చినా పోలీసులు పట్టించుకోవడంలేదు. దీంతో పుణ్యక్షేత్రమైన సింహాచలానికి రావాలంటే భయపడాల్సి వస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

మరో ప్రయోగానికి సిద్ధమైన షార్..

నెల్లూరు: షార్‌ నుంచి 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు జీఎస్‌ఎల్వీ- ఎఫ్‌ 05 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. జీఎస్‌ఎల్వీ సీరిస్‌లో ఇది 10వ ప్రయోగమని అధికారులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితుల అధ్యయనం కోసం ఇన్‌శాట్‌ 3డీఆర్‌ ఉపగ్రహంను జీఎస్ఎల్వీ నింగిలోకి తీసుకెళ్లనుంది. షార్‌లో మిషన్‌ రెడీ రివ్యూ మీటింగ్ ముగిసింది. 

07:48 - September 7, 2016

రాష్ట్ర విభజనానంతరం ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన ఏపీకి 5 సంవత్సరాల పాటు 'ప్రత్యేక హోదా'ను ప్రకటించింది. అప్పటి ప్రతిపక్షంగా వున్న బీజేపీ 5 కాదు 10సంవత్సరాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఈ అంశంపై అధికారంలోకి వచ్చాక ఎన్డీయే ప్రభుత్వం రకరకాల జిమ్మిక్కులకు పాల్పడుతోంది. దీనిపై ఏపీలో పలు ఆందోళనలు..ఉద్యమాలు..అధికార పక్షంపై విమర్శలు..ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎవరెన్ని విన్నపాలు చేసినా..ఏపీలో ఎవరెన్ని ఉద్యమాలు చేసినా...కేంద్రం మాత్రం ఏపీకి ప్యాకేజీవైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రం ప్యాకేజీని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హోదా ప్రయోజనాలన్నీ కలగలిపి 85వేల కోట్లు ప్యాకేజీ రూపొందించామని కేంద్రం చెబుతోంది..మరోవైపు ఏపీకి త్వరలో తీపి కబురు అందనుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు..మరోవైపు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా తొలగించేలా చర్చలు తీసుకుంటున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో వేసిన కమిటీ సిఫార్స్ చేసిన అంశం... మరి కేంద్ర ప్రకటించే ఆ తీపి కబురు ఏమైవుంటుంది? ఇంతకీ ఏపీకి కేంద్రం ప్రకటించేది హోదానా? ప్యాకేజీనా? ఈ సస్పెన్స్ కు ఈరోజు అంటే బుధవారం సాయంత్రానికి తెరపడే అవకాశం వున్నట్లు కనిపిస్తోంది. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా హోదా వచ్చే సూచనలు కానరాకపోవటంతో ఏపీ ప్రభుత్వం ప్యాకేజీ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా సమచారం..హోదాతో రాష్ట్రానికి వచ్చే లాభాలేంటి? రాకపోతే జరిగే నష్టాలేంటి? ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీహెచ్ బాబూరావు (సీపీఎం నేత),తులసిరెడ్డి ( ఏపీ కాంగ్రెస్ నేత), మాల్యాద్రి (టీడీపీ నేత),నడింపల్లి సీతారామరాజు (ప్రముఖ విశ్లేషకులు) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు తెలిపిన అభిప్రాయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో ను క్లిక్ చేయండి...మరింత సమాచారం తెలుసుకోండి..

07:26 - September 7, 2016

గొర్రెల మేకల పెంపకందారులను సీజనల్ కష్టాలు వెన్నాడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు పెద్ద సమస్యగా మారాయి. ఓ వైపు చాలా ప్రాంతాల్లో మేతకు కరవొస్తే, మరోవైపు అంటువ్యాధులు మూగజీవాల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ వృత్తిలో రోజురోజుకి కష్టాలు పెరుగుతుండడంతో గొర్రెల మేకల పెంపకం నుంచి తప్పుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో డిమాండ్ కి తగ్గట్టుగా మాంసం ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఎదురవుతోంది.

గొర్రెల మేకల సంపదలో తెలుగు రాష్ట్రాలదే ప్రథమ స్థానం..
భారతదేశంలోనే అత్యధిక గొర్రెల మేకల సంపద వున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలది ప్రథమ స్థానం. దాదాపు ఆరు లక్షల కుటుంబాలకు ఇవే జీవనాధారం. అయితే వీటి పెంపకం సంప్రదాయ పద్ధతుల్లోనే నడుస్తోంది. దీంతో సీజన్ మారినప్పుడల్లా సమస్యలు తప్పడం లేదు. పచ్చిక బయళ్లు, అటవీ ప్రాంతాలు, బీడు భూముల్లో లభించే పచ్చిక వీటికి ప్రధాన వనరు. అయితే, జులై, ఆగస్టు నెలల్లో సక్రమంగా వర్షాలు కురవకపోవడంతో చాలా ప్రాంతాల్లో గొర్రెలు, మేకలకు మేత ప్రధాన సమస్యగా మారింది. మేత కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. మేత కోసం రోజంతా తిరగడం వల్ల ఎక్కవు శక్తి ఖర్చవుతోంది. వీటిని మేపేందుకు సుదీర్ఘ దూరం ప్రయాణం చేయడం వల్ల గొర్రెల మేకల పెంపకందారులు తరచూ మోకాళ్ల నొప్పుల బారినపడుతున్నారు. అపరిశుభ్రమైన నీరు తాగడం, అందుబాటులో వున్న మేత తినడం వల్ల మూగజీవాలు తరచూ వ్యాధులబారిన పడుతున్నాయి. అంటువ్యాధుల కారణంగా ప్రతి ఏటా 20శాతం దాకా గొర్రెలు మేకలు చనిపోతున్నట్టు అంచనా. వెటర్నరీ ఆస్పత్రుల సేవలు విస్తరించకపోవడం, వ్యాధి నిరోధక టీకాలు, మందులు సకాలంలో లభ్యంకాకపోవడంతో మృత్యువాత పడుతున్నాయి.

అందుబాటులో లేని మేత..ఎదుగుదల లోపం
ప్రతి రోజూ సరియైన మేత దొరకకపోవడం వల్ల గొర్రె పిల్లల ఎదుగుదల లోపిస్తోంది. సరియైన మేత దొరికితే, రోజుకి 150 నుంచి 200 గ్రాముల చొప్పున బరువు పెరుగుతాయి. కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో ఇది 50 నుంచి 75 గ్రాములకే పరిమితమవుతోంది. దీంతో గొర్రెల మేకల పెంపకందారులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. గొర్రెల మేకల దొంగతనాలూ మరో సమస్యగా మారాయి. చెరువు గట్ల మీద వుండే తుమ్మ చెట్లను నరికివేయడం, బీడు భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తుండడం వల్ల మేత దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. మేత కోసం రోజుకి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లాల్సిన పరిస్థితి వుంది. చెరువు గట్ల వెంట నిద్రించే గొర్రెల పెంపకందారులను పాములు కాటు వేసి, ప్రాణాలు తీస్తున్నాయి. ఇలా ప్రమాదవశాత్తు చనిపోయినవారికి అయిదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటూ గొర్రెల మేకల పెంపకందారుల సంఘాలు కొంతకాలంగా కోరుతున్నాయి. 

07:21 - September 7, 2016

వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు గొర్రెల, మేకల పెంపకందారులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత రెండు నెలలుగా అదను ప్రకారం వర్షాలు పడకపోవడంతో అనేక ప్రాంతాల్లో గొర్రెలు, మేకలకు మేత సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో గొర్రెల మేకల పెంపకందారులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై ఇవాళ్టి జనపథంలో చర్చించేందుకు ఆ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

07:17 - September 7, 2016

హైదరాబాద్ : మొన్న పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్...నిన్న జిల్లాల డిమాండ్‌ పై నిరాహార దీక్షలతో జోరుమీదున్న కాంగ్రెస్..ఇప్పడు సర్కార్‌తో సమరానికి సై అంటోంది. ఇన్నాళ్లు ఆరోపణలు, విమర్శలకే పరిమితమైన హస్తం పార్టీ..ప్రత్యక్ష పోరుకు కాలుదువ్వుతోంది. ఇందుకోసం అన్నదాతల సమస్యలే ఎజెండాగా..రైతు దీక్ష పేరున సర్కార్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది.

కొత్తజిల్లాల అంశంతో దీక్షల రూపంలో టీఆర్‌ఎస్‌పై టార్గెట్‌
కాంగ్రెస్‌లో ఇప్పుడు దీక్షల జోరు కనిపిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులపై జలదృశ్యం రూపంలో విమర్శలు గుప్పించిన హస్తం పార్టీ..కొత్త జిల్లాల అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసింది.జిల్లాల విభజన అస్తవ్యస్తంగాఉందని ఆరోపిస్తూ..సర్కార్‌పై దాడికి గద్వాల, జనగామ పంచాయితీలను వాడుకుంది. ఈ జిల్లాల డిమాండ్‌తో గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల చేపట్టిన నిరాహార దీక్షతో అధికార పార్టీని టార్గెట్‌ చేసింది. ఇప్పడు మరో దీక్షతో టీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో నెట్టేందుకు రెడీ అవుతోంది.

అధికార పార్టీపై మరో అస్త్రంతో రంగంలోకి కాంగ్రెస్
అధికార పార్టీపై ఒకదాని తర్వాత మరొక అంశాలను తెరపైకి తెస్తూ ఊపు మీదున్న కాంగ్రెస్...అధికార పార్టీపై మరో అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే అంశాన్ని తెరపైకి తేనుంది. రైతుల రుణమాఫీపై కేసీఆర్ మాటతప్పారని విమర్శలకు దిగబోతోంది. మరోవైపు ఖరీఫ్‌ ప్రారంభమైనా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచకపోవడం వంటి అంశాలను విమర్శనాస్త్రాలుగా ఉపయోగించుకోనుంది.

రైతు సమస్యలే ఎజెండాగా కాంగ్రెస్ 48 గంటల దీక్ష
రైతు సమస్యలే ఎజెండాగా 48 గంటలపాటు దీక్ష చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దీక్షకు దిగనున్నారు. ఇంతకుముందు డీకే అరుణ, పొన్నాల దీక్షచేపట్టిన దర్నాచౌక్ నే మరోసారి వేదిక చేసుకోనుంది కాంగ్రెస్. అయితే అసెంబ్లీ సమావేశాలు ఈనెల 20 నుంచి జరగనున్న నేపథ్యంలో సమావేశాలకు ముందు ఈనెల 17 నుంచే దీక్ష చేపట్టనున్నట్లు సమాచారం. 

07:08 - September 7, 2016

హైదరాబాద్ : చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై జరిగిన హత్యాయత్నం కేసులో విచారణ వేగవంతమైంది. ఇప్పటికే 19 మంది సాక్ష్యాలను విచారించిన నాంపల్లి కోర్టు.. అక్బరుద్దీన్ వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసింది. తనపై దాడి చేసిన 13 మంది నిందితులను న్యాయమూర్తి సమక్షంలో గుర్తించిన అక్బర్‌..తుపాకీతో కాల్చి, కత్తులతో దాడి చేశారని వాంగ్మూలం ఇచ్చారు. అక్బర్ నుంచి మరింత స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనుంది నాంపల్లి కోర్టు.

2011 ఏప్రిల్‌ 30న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి
2011 ఏప్రిల్‌ 30వ తేదీన పాతబస్తీ చంద్రాయణగుట్ట బార్కాస్‌లో MIM MLA అక్బరుద్దీన్ ఓవైసీపై రౌడీషీటర్ మహ్మద్ పహిల్వాన్, అతని అనుచరులు దాడి చేశారు. అక్బర్‌పై కాల్పులు జరిపి, కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అక్బరుద్దీన్‌ శరీరంలో మూడు బుల్లెట్లు శరీరంలోకి దిగాయి. ఐదు కత్తిపోట్లతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్బర్‌కు శస్ర్తచికిత్స చేసి.. అతని ప్రాణాలు కాపాడారు డాక్టర్లు. ఇప్పటికీ ఒక బుల్లెట్‌ అక్బర్‌ శరీరంలో ఉండిపోయింది.

19మంది ప్రత్యక్ష సాక్ష్యాల వాంగ్మూలాలు రికార్డు
ఈ ఘటనపై సకాలంలో చార్జ్‌షీట్ దాఖలు చేసిన చంద్రాయణగుట్ట పోలీసులు అక్బరుద్దీన్‌ను 20వ సాక్షిగా కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇప్పటికే 19 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను రికార్డ్ చేసిన నాంపల్లి కోర్టు...తాజాగా అక్బర్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. అక్బర్ వాంగ్మూలం రికార్డ్ చేయాల్సిన సమయంలో ప్రధాన నిందితుడు మహ్మద్ ఫహిల్వాన్ సహా మరో 12 మందిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. తనపై దాడి చేసిన నిందితులను గుర్తించిన అక్బర్..దాడిలో ఉపయోగించిన రివాల్వర్లను, కత్తులను గుర్తించారు. దీంతో పాటు ఈ కేసులో సీజ్ చేసిన తన రివాల్వర్‌ను ఇప్పించాలని న్యాయమూర్తికి అప్పీల్ చేసుకున్నారు అక్బరుద్దీన్‌. పిటిషన్ దాఖలు చేయాలని అక్బరుద్దీన్‌కు న్యాయస్థానం సూచించింది.

మరింత స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనుంది నాంపల్లి కోర్టు...
అక్బరుద్దీన్‌తో పాటు అతని ప్రత్యర్థులు కోర్టుకు హాజరుకావడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఎమ్మెల్యే అక్బర్ నుంచి మరింత స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనుంది నాంపల్లి కోర్టు. 

07:04 - September 7, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం అరాచకాలు, అతని అనుచరుల భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క భూములే కాకుండా...స్థలాల కబ్జాలు..సెటిల్‌మెంట్ల వివరాలు సిట్‌ దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. నయీంతో కలిసి నేరాల్లో పాలుపంచుకున్న అతని అనుచరులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. తాజాగా నయీం కేసులో సామసంజీవరెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఇటు రంగారెడ్డి జిల్లాలో 11 మంది రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేశారు.

సామ సంజీవరెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు
గ్యాంగ్‌స్టార్‌ నయీం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లు నయీం, అతని అనుచరులు సాగించిన అరాచకాలు బయటపడుతున్నాయి. నయీం బాధితులు బయటకొస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా సామ సంజీవరెడ్డిని అరెస్ట్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హిమామ్‌గూడ శ్రీరామ్‌ కాలనీలో నయీం బాధితులు యాదగిరిరెడ్డి, బుక్కారామిరెడ్డి, అంజిరెడ్డి ఫిర్యాదుల మేరకు సంజీవరెడ్డిని అరెస్ట్‌ చేశారు. నయీం భూ కబ్జాలు, ల్యాండ్‌ రిజిస్ర్టేషన్లకు సహకరించిన రంగారెడ్డి జిల్లాలోని 11 మంది రెవెన్యూ అధికారులపై పోలీసులు

దర్యాప్తులో బయటపడుతున్న ఆసక్తికర విషయాలు
నయీం కేసును సిట్‌ బృందం సీరియస్‌గా దర్యాప్తు చేస్తోంది. నయీం అనుచరుల్లో ఉన్న లీడర్లు ఎవరు..? సహకరించిన పోలీసులు ఎంతమంది..? రిజిస్ట్రేషన్లకు వెన్నుదన్నుగా ఉన్న రెవెన్యూ బాబులెవరు..? ఇలా ఎన్నో విషయాలపై ఆరా తీస్తున్న పోలీసులకు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. మరోవైపు టీఆర్‌ఎస్‌ నేతలను గ్యాంగ్ స్టర్ నయీం డైరీ వెంటాడుతూనే ఉంది. నల్గొండ జిల్లాలో నయీం గ్యాంగ్ చేసిన సెటిల్‌మెంట్లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. డైరీలో వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించకపోవడంతో రోజుకో పేరు తెరపైకి వస్తోంది.

డైరీలోని వాస్తవాలు బయటకు రావడం లేదని ప్రచారం
మరోవైపు ప్రతిపక్ష పార్టీలు డైరీ అంశాన్ని తమ అస్త్రంగా మార్చుకోవడంతో అధికార పార్టీ చిక్కుల్లో పడింది. ఎన్‌కౌంటర్ జరిగి దాదాపు నెల రోజులు గడుస్తున్నా డైరీలోని వాస్తవాలు పెద్దగా బయటకు రావడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. తవ్వినకొద్దీ బయటపడుతున్న అరాచకాలకు నయీం అనుచరులే కీలకం... వారి ద్వారానే ఎన్నో ఘోరాలు.. కబ్జాలు..దందాలు చేశాడు. దీంతో అనుచరులను పట్టుకుని విచారించే పనిలో పడ్డారు పోలీసులు. గ్యాంగ్‌స్టర్ నయీం....ఎన్‌కౌంటర్‌ తర్వాత మూలాలను కనుగొనేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు వేగవంతమయ్యాయి.

06:59 - September 7, 2016

ఢిల్లీ : ఉద్యోగులకు కేంద్రం శుభవార్తను అందించింది. ఈఎస్ఐసీ వర్తించడానికి ఉండాల్సిన నెలసరి వేతనాన్ని 15,000 నుంచి 21,000 వేలకు పెంచుతూ ఈఎస్ఐసీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బోర్డు ఛైర్మన్‌, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వివరాలను వెల్లడించారు. దీని వల్ల మరో 50 లక్షల మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈఎస్ఐసీ పరిధిలో 2కోట్ల 60లక్షల మంది సభ్యులుగా ఉన్నారని,..కనీసం కుటుంబానికి నలుగురు చొప్పున తీసుకున్నా 10 కోట్ల మంది లబ్ది పొందుతారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అలాగే ఈపీఎఫ్‌ పరిధి కూడా పెంచే యోచనలో ఉన్నామని, తదుపరి సమావేశంలో బోర్డు సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

06:57 - September 7, 2016

విజయనగరం : కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ద్వారపూడి గ్రామ విద్యార్థులకు ఆయన కిండిల్స్‌ను అందచేశారు. ఈ పరికరం వల్ల ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకుని... చదివే అవకాశం కలుగుతుందన్నారు. ద్వారపూడిలో వచ్చిన ఫలితాలను ఆధారంగా ఇతర ప్రాంతాల విద్యార్థులకు కిండల్స్ అందిస్తామన్నారు. ద్వారపూడిలో నిరక్ష్యరాస్యులైన తల్లిదండ్రులకు విద్యార్థులే పాఠాలు నేర్పిన విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు భావోద్వేగానికి గురయ్యారు. ముందుగా విజయనగరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కిండిల్స్‌ను అందచేశారు. గ్రంథాలయానికి వచ్చిన యువతతో మాట్లాడారు. తరువాత కోరుకొండ పాలెంలో ఆర్ వో ప్లాంట్ ను ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ శోభ స్వాతిరాణి, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, కలెక్టర్ వివేక్ యాదవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

06:53 - September 7, 2016

విజయవాడ : ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు అధికార ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధం అవుతున్నాయి. ఈ నెల 8 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడంతో అసెంబ్లీ సమావేశానికి ముందే వేడి రాజుకుంది. ఈ సమావేశాల్లో జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపాలను కుంటోంది సర్కార్‌. కరువు, ప్రత్యేకహోదా తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టాలనుకుంటోంది వైసీపీ.

8 నుండే అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల8 నుంచి నిర్వహించాలని అధికారపార్టీ నిర్ణయించింది. ఈసమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలపై అధికార టీడీపీ ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. ప్రతిపక్షం సంధించే ప్రతి అస్త్రాలను తిప్పికొట్టేందుకు రెడీ అయింది. ఓటుకు నోటు కేసు వంటి అంశాలను సభలో ప్రస్తావిస్తే విపక్షాన్ని కట్టడి చేయడానికి ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది సర్కార్‌. ప్రత్యేకహోదాపై ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటోంది వైపీపీ.

జీఎస్టీ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాలనుకుంటున్న సర్కార్‌
శాసనసభ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాలని కృతనిశ్చయంతో ఉంది ఏపీ సర్కార్‌. దీంతోపాటు మరో మూడుబిల్లులకు ఆమోదం తెలపాలని ప్లాన్‌ చేస్తోంది సర్కార్‌. ఓటుకు నోటు కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరించే విధంగా వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారని టీడీపీనేతలు అంటున్నారు. దీనికితోడు కాంగ్రెస్‌ హయాంలో వైఎస్‌ఆర్‌ చట్టాలను ఎలా ఉల్లంఘించారన్న దానిపై అసెంబ్లీలో ప్రస్తావించి వైసీపీకి గట్టి షాక్‌ ఇవ్వాలనుకుంటోంది టీడీపీ సర్కార్‌. ఇటీవల జరిగిన కృష్ణా పుష్కరాలు, స్విస్‌ఛాలెంజ్‌ నదుల అనుసంధానం,ప్రత్యేకహోదా, కరువునివారణ చర్యల వంటి అంశాలపై అధికారపార్టీ అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు స్పష్టం చేయాలనుకుంటోంది సర్కార్‌.

రైల్వేజోన్‌, ప్రత్యేకహోదా అంశాలపై చర్చకు వైసీపీ ప్లాన్‌
ఇక వైసీపీ ..రాష్ట్రానికి కీలకమైన రైల్వేజోన్‌, ప్రత్యేకహోదా అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటోంది. స్విస్‌ఛాలెంజ్‌ పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను అస్త్రాలుగా మలచుకోవాలని వైసీపీనేతలు ప్లాన్‌ చేస్తున్నారు. పుష్కరాల్లో వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. వాటిలెక్కలు, ఖర్చుల వివరాలు చెప్పాలని డిమాండ్ చేయాలనుకుంటోంది వైపీపీ. ఈ సమావేశాలను మూడురోజులపాటు కాకుండా.. 15 రోజులైనా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రారంభానికి ముందే హీటెక్కిస్తున్న వర్షాకాల సమావేశాలు
వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే హీటెక్కిస్తున్నాయి. మరి నేతలు విమర్శలకే పరిమితమవుతారా.. లేక ప్రతిపక్ష వ్యూహాలతో ప్రజా సమస్యలపై చర్చిస్తారా అన్నది వేచిచూడాలి.   

06:47 - September 7, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల్లో కలెక్టరేట్‌ల ఏర్పాటుకు కోటి రూపాయలు, పోలీసు కార్యాలయాల ఏర్పాటుకు 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. జిల్లాల ఏర్పాటుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒకే స్వభావం ఉన్న శాఖలన్నింటినీ ఒకే అధికారి పరిధి కిందికి తేవాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.

కలెక్టర్లతో ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష
కొత్త జిల్లాల ఏర్పాటు, ఉద్యోగుల సర్దుబాటుపై కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు జగదీష్‌రెడ్డి, మహేందర్ రెడ్డి, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.

ఒకే స్వభావం కలిగిన శాఖలను ఒకే గొడుగు కిందకి తేవాలని నిర్ణయం
ఒకే స్వభావం కలిగిన శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తేవాలని కేసీఆర్ నిర్ణయించారు. ఒకే శాఖ కిందకు డీఆర్‌డీఏ, సెర్ఫ్ విభాగాలు తేవాలని కలెక్టర్లకు సూచించారు. భారీ నీటి పారుదల శాఖ పరిపాలనా విభాగం మాత్రం జిల్లా యూనిట్‌గా, ప్రాజెక్టుల వారిగా ఉండాలన్నారు. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్‌ల ఏర్పాటుకు కోటి రూపాయలు, పోలీసు కార్యాలయాల ఏర్పాటుకు 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

దసరా నుంచే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు
దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవిన్యూ డివిజన్లు, కొత్త మండలాలు కూడా సమాంతరంగా ప్రారంభమవ్వాలని ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ తెలిపారు. ముందుగా కొత్త మండలాలను నిర్ధారించాలని, తర్వాత రెవిన్యూ డివిజన్లను కూర్పు చేయాలని కలెక్టర్లకు సూచించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో మొదటిరోజు నుంచే రెవెన్యూ, పోలీస్ శాఖలు పని ప్రారంభించాలని ఆదేశించారు.

75 మండలాల కోసం కొత్తగా డిమాండ్లు
డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ విడుదల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 75 మండలాల కోసం కొత్తగా డిమాండ్లు రాగా, వాటిలో ఇప్పటికే 45 మండలాలను నోటిఫై చేసినట్లు సీఎం చెప్పారు. మరో 30 మండలాల కోసం డిమాండ్లు వచ్చాయని, వాటి సాధ్యాసాధ్యాలపై వెంటనే నిర్ణయం జరగాలని చెప్పారు. కొత్తగా ప్రతిపాదించే మండల జనాభా 35 వేలకు పైగా ఉండాలనే నిబంధన పెట్టుకున్నామన్నారు. అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, చెంచులు నివసించే ప్రాంతాలకు సంబంధించి జనాభా విషయంలో సడలింపు ఇవ్వాలని సూచించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త మండలాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు.

యూనిట్లు చిన్నవిగా ఉంటేనే పథకాలు ప్రజలకు చేరుతాయి-సీఎం
పరిపాలనా విభాగాల ఏర్పాటుకు సంబంధించి సీనియర్ అధికారులు, కలెక్టర్లు, పోలీస్ అధికారులు తమ ప్రతిపాదనలను సమావేశంలో వివరించారు. ఉద్యోగుల పెంపు, తగ్గింపు, సర్దుబాటు, ఆయా శాఖల పనిభారం ఆధారంగా నిర్ణయించాలన్నారు. జిల్లా యూనిట్లు చిన్నగా ఉంటే ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ సులువు అవుతుందన్నారు.

ఆదిలాబాద్‌లో వైద్య, ఆరోగ్య శాఖను పటిష్టం చేయాలన్న కేసీఆర్‌
ఆయా ప్రాంతాల స్వభావం, సామాజిక, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వ శాఖల విభాగాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఆదిలాబాద్ లో అంటురోగాలు ఎక్కువ కాబట్టి అక్కడ వైద్య, ఆరోగ్య శాఖను పటిష్టం చేయాలని, ఏజెన్సీ ఏరియా ఎక్కువగా ఉన్న చోట సంక్షేమ అధికారుల నియామకం చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.

కూలంకషంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం
ఉద్యోగుల సర్దుబాటే ప్రధానాంశంగా సమావేశం సాగింది. అన్ని శాఖల సిబ్బంది సర్దుబాటుపై కూలంకషంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని.. ఇందుకు మరోసారి భేటీ కావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 

కేంద్రం ఏపీకి అందించే తీపి కబురు ఏంటి?

ఢిల్లీ : ఏపీకి ఆర్థిక ప్యాకేజీపై నేడు ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు సమాచారం. కేంద్రమంత్రులు జైట్లీ, వెంకయ్యనాయుడు కలిసి మధ్యాహ్నం ప్రకటన చేసే అవకాశమున్నట్లు కేంద్రం నుండి సంకేతాలు అందుతున్నాయి. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధానం..

విజయవాడ: నేడు ఏపీలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధానం చేయనున్నారు . మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ కాలనీలోని ఏ-ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో అవార్డుల సభ జరుగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరుకానున్నారు. 

యాదాద్రికి వెళ్ళనున్న కేసీఆర్..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ నేడు యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. యాదాద్రి అభివృద్ధి పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు. 

06:31 - September 7, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో తీపి కబురు అందనుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేస్తున్న ఏపీ ప్రజల అభీష్టం మేరకు రాష్ట్రానికి తీపి కబురు అని ఆయన చెప్పడం అటు ప్రజల్లో..ఇటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు తెరలేపినట్లయింది. ఇంతకీ ఏపీకి కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తుందా లేక హోదానా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇవాళ సాయంత్రం కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ దీనికి తెరదించుతారని సమాచారం. అయితే కేంద్రం కబురు తియ్యనిదా..? చేదు గుళికా..?

తీపి కబురు అంటూ కేంద్రం సంకేతాలు
ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో తీపి కబురు అందనుందని కేంద్రం సంకేతాలు పంపింది. ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేస్తున్న ఏపీ ప్రజల అభీష్టం మేరకు రాష్ట్రానికి తీపి కబురు అందుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో ప్రజల్లో మరోసారి ప్రత్యేక హోదాపై ఆశలు పెరిగిపోయాయి. వెంకయ్య చెప్పిన తియ్యటి కబురు కచ్చితంగా ప్రత్యేక హోదాయే అయి వుంటుందన్న భావన ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే.. వెంకయ్య చెప్పినట్లుగా హోదా కాకుండా ప్యాకేజీతో ఏమైనా సరిపుచ్చుతారా..? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

ప్రత్యేక హోదా హుళక్కేనా?
ఇంతకీ రాష్ట్రానికి కేంద్రం ఏం ఇవ్వబోతుంది..? హోదా హుళక్కే అన్న భావనను సాక్షాత్తు టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులే స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ముందునుంచీ ఫాలోఅప్‌ చేస్తున్నట్లు చెప్పుకుంటున్న సుజనాచౌదరి కూడా ఈ మధ్యలో కేంద్రం ఏపీకి మంచి ప్యాకేజీ ఇచ్చే యోచనలో ఉందని ప్రకటించారు. అంతేనా కేంద్ర మాజీ మంత్రి.. బీజేపీ నాయకురాలు పురంధ్రీశ్వరి కూడా ఇదే తరహాలో స్పందించారు.

ప్యాకేజీవైపే కేంద్రం మొగ్గు

పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చురుగ్గా ఉండే నాయకులే ప్యాకేజీ వస్తుందని చెబుతున్నారు. అంటే వెంకయ్య చెప్పిన తియ్యటి కబురూ ఇదేనా..? పైగా నీతి అయోగ్ నియమించిన శివరాజ్ సింగ్ చౌహాన్ కమిటీ తాజా ప్రతిపాదన కూడా ఇదే నంటూ వార్తలు షికార్లు చేస్తుండటం కూడా హోదాపై ఆశల్ని నీరుగారేలా చేస్తున్నాయి.

సాయంత్రం అరుణ్‌జైట్లీ ప్రకటించే అవకాశం
అయితే ఎవరెన్ని విన్నపాలు చేసినా..ఏపీలో ఎవరెన్ని ఉద్యమాలు చేసినా...కేంద్రం మాత్రం ఏపీకి ప్యాకేజీవైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్యాకేజీపై కేంద్రం చేసిన కసరత్తు కూడా కొలిక్కి వచ్చింది. బుధవారం సాయంత్రం ప్యాకేజీని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హోదా ప్రయోజనాలన్నీ కలగలిపి ప్యాకేజీ రూపొందించామని కేంద్రం చెబుతోంది. ఇందులో ప్రాజెక్టులకు నిధులు, రాజధాని నిర్మాణంపై కేంద్రం స్పష్టంగా చెప్పబోతోంది. పోలవరానికి 100శాతం నిధులపై తన బాధ్యతేనని కేంద్రం ప్రకటించబోతోంది. నాబార్డు ద్వారా రుణం వచ్చే ఏర్పాటు చేసి.. అది కూడా తన బాధ్యతగా కేంద్రం తీసుకోబోతున్నట్లు చెప్పబోతోంది. పరిశ్రమలకు రాయితీలపై 500 కోట్లతో ప్రత్యేక నిధిని కేంద్రం ప్రకటించబోతోంది. పారిశ్రామిక రాయితీలతో పాటు..పరిశ్రమలు పెట్టే వారికి ప్రత్యేక రాయితీ, పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రం భావిస్తోన్నట్లు సమాచారం. రాజధానికి నిధులు, రెవెన్యూ లోటు భర్తీపై..స్పష్టమైన భరోసాను కేంద్రం ఇవ్వనుంది. ప్రత్యేక హోదా నిధులు, సాధారణ నిధుల మధ్య ఉన్న..30 శాతం తేడాను ప్యాకేజీలో కేంద్రం కలపనుంది. కీలకమైన రాజధాని నిర్మాణంపైన కేంద్రం స్పష్టంగా చెప్పబోతోందని తెలుస్తోంది. రాజధానిని కట్టుకోవడానికి ఎంత నిధులు ఇస్తారు..ఎప్పుడు అనే సంగతి చెప్పబోతున్నారు. దీంతో పాటు లోటుపైనా కేంద్రం స్పష్టంత ఇస్తుందని సమాచారం.

ఏపీ సర్కార్ ఎలా స్పందించనుంది?
మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా విషయమై ఢిల్లీ వెళ్లి రేపో మాపో పెద్దల్ని కలుస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇటు ఈనెల 9 న ప్రత్యేక హోదా పై కాకినాడలో జరిగే పవన్‌ సభపై టీడీపీ, బీజేపీలో చర్చ ఊపందుకుంది. ఇంకోవైపు.. ఈ నెల 8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ప్రత్యేక హోదా అంశం.. సభలోనూ తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో.. కేంద్రం ఒకవేళ ప్యాకేజీయే ఇస్తామంటే పాలక టీడీపీ ఎలా స్పందిస్తుంది..? ఇప్పుడీ ప్రశ్నలు రాష్ట్ర ప్రజలను వేధిస్తున్నాయి. 

Don't Miss