Activities calendar

08 September 2016

22:01 - September 8, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల10న ఏపీ బంద్‌కు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. కేంద్రం ప్రకటనను వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఇందుకు నిరసనగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టాయి. ప్యాకేజీ పేరుతో ఏపీకి ద్రోహం చేస్తున్నారంటూ.. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి.

నెల 9 పవన్ సభకు సీపీఐ, సీపీఎం మద్దతు
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ కేంద్రం చేసిన ప్రకటనపై వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. హోదా ప్రకటనపై కేంద్రం డొల్లతనాన్ని నిరసిస్తూ 10న బంద్ నిర్వహిస్తామని ప్రకటించాయి. ఈ నెల 9న పవన్ సభకు తమ మద్దతు ఉంటుందని సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధు ప్రకటించారు.

ఏపీ చెవిలో కేంద్రం పువ్వులు పెట్టిందన్న జగన్
కేంద్రం ఏపీ చెవిలో పువ్వులు పెట్టిందని జగన్ వ్యాఖ్యానించారు. ప్యాకేజీపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించడానికి చంద్రబాబు ఎవరని జగన్ ప్రశ్నించారు. ఇది కేవలం చంద్రబాబు ఒక్కరి భవిష్యత్ కాదని, ఐదుకోట్ల మంది ప్రజల భవిష్యత్ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా శనివారం రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం దగా చేసింది- మధు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం దగా చేసిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి మధు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను టీడీపీ నమ్మించి మోసం చేసిందని.. బీజేపీ నమ్మకద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకటించిన ప్యాకేజీలో కూడా ఏమీలేదన్నారు. దీనికి నిరసనగా ఈనెల 10 న రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు పిలుపునిచ్చాయి.

ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదు-
కేవీపీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు స్పష్టంచేశారు. రాష్ట్ర బంద్‌కు అందరూ కలిసివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

బంద్ కు సహకరించాలి

ఏపీ బంద్‌కు విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున మద్దతు పలకాలని అన్ని పార్టీలూ పిలుపునిచ్చాయి. బంద్ ను విజయవంతం చేసి కేంద్రానికి ప్రత్యేక హోదాపై తమ సత్తాను చాటాలన్నాయి. 

21:56 - September 8, 2016

ఢిల్లీ : ఏపీకి అన్యాయం జరగకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి విస్తృతంగా కసరత్తు చేశామన్నారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. విభజన చట్టంపై అవగాహన లేకుండా విపక్షపార్టీల నాయకులు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. 14వ ఆర్థికసంఘ సిఫార్స్‌ల ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకావం లేదని ఆర్థికశాఖ నిర్ణయించిందన్నారు వెంకయ్య. 

21:54 - September 8, 2016

హైదరాబాద్ : ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని నిలదీయడానికి తమతో కలిసిరావాలన్నారు.. ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం. కేంద్రప్రభుత్వం దోబూచులాటను ప్రజల ముందు బయటపెట్టడానికి ముఖ్యమంత్రి ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విషయంలో రాజకీయాలు తగది రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 

21:46 - September 8, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీ అట్టుడికింది. హోదాపై చర్చకు పట్టుబడుతూ వైసీపీ సభ్యులు పదే పదే స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. దీంతో స్పీకర్‌ సభను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. తిరిగి సభను ప్రారంభించగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనను కొనసాగించారు. విపక్ష సభ్యుల నినాదాల నడుమ సీఎం చంద్రబాబు జీఎస్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. జీఎస్టీ బిల్లుతో పాటు మరో నాలుగు బిల్లులు అసెంబ్లీ ఆమోదం పొందాయి. ప్రత్యేక హోదాపై ప్రకటన చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి కోడెల శివప్రసాద్‌రావు ప్రకటించారు.

ప్రతిపక్ష సభ్యుల నినాదాలు. అధికార పక్ష సభ్యులు వివరణలు,
ప్రతిపక్ష సభ్యుల నినాదాలు. అధికార పక్ష సభ్యులు వివరణలు, స్పీకర్‌ అనునయింపుల మధ్య ఏపీ అసెంబ్లీ తొలి రోజు తీవ్ర గందరగోళం మధ్య ముగిసింది. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్ష సభ్యులు ఏపీ ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టారు. వైసీపీ సభ్యులు భారీ ఎత్తున నినదాలు చేస్తూ స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకొచ్చారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అంటూ విపక్ష నేత వైఎస్‌ జగన్‌ నినదించారు.

నిరసనల మధ్య జీఎస్టీ బిల్లు ఆమోదం
విపక్షాల నినాదాల నడుమే ముఖ్యమంత్రి చంద్రబాబు జీఎస్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వైసీపీ సభ్యుల తీరును సీఎం చంద్రబాబు, బీజేపీ శాసనసభా పక్ష నేత ప్రత్యేక హోదాపై ప్రకటన చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. దీంతో స్పీకర్‌ కోడెల సభను రెండు సార్లు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనా వైసీపీ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. జీఎస్టీ బిల్లుపై చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలోనూ వైసీపీ నేతలు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు.

జీఎస్టీతో పన్ను భారం తగ్గుతుంది : చంద్రబాబు
జీఎస్టీ బిల్లు 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, జీఎస్టీ దేశ ఆర్థిక రంగానికి ఊతమిస్తోందని, దీనివల్ల వినియోగదారులకు పన్ను భారం తగ్గుతుందని సీఎం అన్నారు. పన్నుల విధానం ప్రక్షాళన అయి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరిగే అవకాశం ఉందని సీఎం అన్నారు. రాష్ట్రాలకు తొలుత ఆదాయం తగ్గే అవకాశం ఉన్నా.. ఆ నష్టాన్ని ఐదేళ్ల పాటు కేంద్రం భరిస్తుందని చంద్రబాబు చెప్పారు.

ప్రకటన చేసేందుకు సిద్ధమన్న సీఎం చంద్రబాబు
ప్రత్యేక హోదాపై తాను ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు పట్టించుకోలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి కోడెల శివప్రసాద్‌రావు ప్రకటించారు.

 

21:15 - September 8, 2016

మహబూబ్ నగర్ : గత పాలకుల హయాంలోనే పాలమూరు ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని మంత్ర హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు మాటలకు మాత్రమే పరిమితయయ్యారని దుయ్యబట్టారు. ఇవాళ ఆయన జొన్నలబొగుడ వద్ద కల్వకుర్తి-2, 3 లిఫ్టు ఇరిగేషన్ ను ప్రారంభించారు. ఇంతకు ముందు కల్వకుర్తి కాలువలో మాటలు మాత్రమే పారాయని ఎద్దేవా చేశారు. ఇవాళ అదే కల్వకుర్తి కాలువలో సాగునీరు పారుతోందని వివిరించారు. ఇదంతా సీఎం కేసీఆర్ కృషి ఫలితమేనని కొనియాడారు. 

20:56 - September 8, 2016

ప్రయోగాత్మక చిత్రాలంటే గుర్తుకువచ్చే నటుడు విక్రమ్. తమిళ నటుడే అయినా తెలుగులో విక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. విలక్షణమైన కథలను ఎన్నుకుంటూ..రొటీన్ కు భిన్నమైన పాత్రలు పోషించే మంచి నటుడు విక్రమ్. తాజాగా విక్రమ్ మరో ప్రయోగాత్మక చిత్రంలో నటించాడు..లేదు లేదు జీవించాడంటేనే సరైంది. తమిళంలో 'ఇరు ముగన్’ సినిమాని తెలుగులో ‘ఇంక్కొక్కడు’అనే టైటిల్ తో తెలుగులోకి విడుదలచేశారు.

సైన్స్ ఫిక్షన్ కథాంశం
‘అరిమనంబి’ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్ కండలుతిరిగిన దేహంతో కొత్త లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నాడు. హారిస్ జయరాజ్ అందించిన సంగీతం మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు 10టీవీ ఇచ్చే రేటింగ్ తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి..

20:47 - September 8, 2016

ప్రెస్ మీట్ అంటూ హడావుడి చేశారు.. స్టేట్ మెంట్ అంటూ ఒకటే రచ్చరచ్చ చేశారు..చివరికి తుస్సుమనిపించారు. ఏ పీ ప్రజలకు సింపుల్ గా హ్యాండిచ్చారు. హామీలు, వాగ్దానాలు మాటలకు మాత్రమే పరిమితం అని, చేతల్లో కనిపించేది శూన్యం అని తేల్చేశారు. మరో పక్క ఈ అంశంపై నిలదీసే ధోరణి వదలి సామరస్యంగా ఉందామంటున్న చంద్రబాబు తీరుపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో ఏపీ ఈ అరకొర సాయంతో ఆగిపోవలసిందేనా? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. రాజకీయ ప్రయోజనాల సాధన... ప్రజల్ని మభ్య పెట్టి కాలం గడుపుకునే ప్రయత్నాలు తప్ప మరొకటి ఉందా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. రెండేళ్లుగా కల్లబొల్లి కబుర్లు చెప్తూ స్పెషల్ స్టేటస్ అని కొన్నాళ్లు, ప్యాకేజీ అని కొన్నాళ్లు..కాలంగడిపి, ఇప్పుడు సాయం మాత్రమే అని చేతులు విదల్చటాన్ని చూసి ప్రజలు మండిపడుతున్నారు. ఈ తరుణంలో పదో తారీఖున ఏపీ బంద్ కు విపక్షాలు పిలుపునిచ్చాయి. మళ్లీ అదే పాట చెప్పుకొచ్చారు. చెప్పించే చెప్పి.. అటుతిప్పి ఇటుతిప్పి ...ప్రత్యేక హోదా మాత్రం ఇవ్వమని తేల్చేశారు. విభజనతో ఆర్ధికంగా కష్టాల్లో ఏపీని ఆదుకుంటామని అప్పట్లో చెప్పిన మాటల్ని ఇప్పుడు రకరకాల సాకులతో మాటతప్పుతున్నారు..అవే పాత మాటలు.. అవే పాత సమాధానాలు.. ప్రశ్నలు ఎంత ఘాటుగా ఉన్నా.. నిజాన్ని నిగ్గుతేల్చాలనుకున్నా.. అదే ముతక సమాధానాన్ని తిప్పి తిప్పి చెప్పారు.అంతిమంగా ప్రయోజనం శూన్యం. ఏపీ విషయంలో బీజెపీ ఏం చేయగలదో స్పష్టంగా బట్టబయలయింది. కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించటం లేదు? ఏపీకి న్యాయం జరిగేదెలా? పాడిందే పాడుతూ కేంద్రం ఏపీకి మొండిచేయి చూపిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా కంటే ఎక్కువే సాయం చేస్తామంటూనే.. దాటవేత కబుర్లు.. కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు. కొన్నాళ్లుగా ఏపీలో వివిధ పక్షాలనుంచి ప్రత్యేక హోదాపై వస్తున్న డింమాండ్లకు సమాధానం చెప్పే ప్రయత్నం తప్ప, డామేజ్ కంట్రోల్ ప్రయత్నం తప్ప... వాస్తవంలో ఏపీకి ఇచ్చిందేం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం తీరుపై చంద్రబాబు ఆహ్వానిస్తున్నాం అనటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కల్లబొల్లి మాటలతో జనాలను మభ్యపెడుతూ వచ్చారు. అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం .... రెండూ ప్రత్యేక ప్రతిపత్తి అంటూ నమ్మబలికి ఇప్పుడు నైస్ గా హ్యాండిస్తున్నాయా? ఇదే జరిగితే ఏపీకి ఎలాంటి సమస్యలు ఎదురుకానున్నాయి? చట్టబద్ధంగా రావాల్సిన నిధులను సాధించుకోవడం రాష్ట్ర ప్రభుత్వ హక్కు. ఏపీ ప్రజల హక్కు.. కేంద్రంపై అందుకవసరమైన ఒత్తిడి తీసుకురావాలి. అయినా ఢిల్లీ సర్కారు దిగి రాకపోతే కేంద్రంపై వత్తిడి మరింతగా పెంచాలి.. ఎన్నికల నాటి హామీలు ఇంకా మరచిపోలేదు. రాజధాని స్వప్నాలు, స్వర్ణాంధ్ర వాగ్దానాలు ప్రజల కళ్లముందే ఉన్నాయి. మాటలకు, విమర్శలకు, సన్నాయి నొక్కుళ్లకు పరిమితం కాకుండా, అన్ని వర్గాలనూ కలుపుకుని కేంద్రంతో కొట్లాడి సాధించాల్సిన బాధ్యత ఏపీ సర్కారుపై ఉంది. మరింత సమాచారానికి ఈ వీడియో క్లిక్ చేయండి..

 

20:24 - September 8, 2016

నల్లగొండ : కొడుకుల దుర్మార్గానికి తండ్రి బలైన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బేగంపేట గ్రామంలో కుమారులు పట్టించుకోకపోవడం, సూటిపోటి మాటలతో.. 80ఏళ్ల శివుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మరణంతో ఊరికి వచ్చిన కుమారులను గ్రామస్తులంతా నిలదీశారు. తండ్రి బతికి ఉన్నప్పుడు పట్టించుకోకుండా.. ఇప్పుడు ఎందుగకు వచ్చారంటూ నిలదీశారు. అంతేకాకుండా.. వారిని ఊరినుంచి వెళ్లగొట్టి... గ్రామస్తులే చందాలు వేసుకొని మృతదేహానికి దహనసంస్కారాలు పూర్తిచేసి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు.

కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్..

తూర్పుగోదావరి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి సానుకూల ప్ర‌క‌ట‌న రానివేళ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లు తెలుపుతున్నారు. మ‌రోవైపు రేపు తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌లోని జేఎన్టీయూ గ్రౌండ్ లో జనసేనాని, సినీనటుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇదే అంశంపై బ‌హిరంగ స‌భలో ప్ర‌సంగించ‌నున్నారు. కొద్ది సేప‌టి క్రితం కాకినాడ‌కు చేరుకున్న ఆయ‌నను చూసేందుకు భారీగా అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు. దీంతో స్వ‌ల్పంగా తోపులాట జ‌రిగింది. ప‌రిస్థితిని అదుపులో తెచ్చేందుకు పోలీసులు ప‌వ‌న్ అభిమానుల‌పై లాఠీఛార్జి చేశారు.

20:04 - September 8, 2016

తూర్పుగోదావరి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి సానుకూల ప్ర‌క‌ట‌న రానివేళ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లు తెలుపుతున్నారు. మ‌రోవైపు రేపు తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌లోని జేఎన్టీయూ గ్రౌండ్ లో జనసేనాని, సినీనటుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇదే అంశంపై బ‌హిరంగ స‌భలో ప్ర‌సంగించ‌నున్నారు. కొద్ది సేప‌టి క్రితం కాకినాడ‌కు చేరుకున్న ఆయ‌నను చూసేందుకు భారీగా అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు. దీంతో స్వ‌ల్పంగా తోపులాట జ‌రిగింది. ప‌రిస్థితిని అదుపులో తెచ్చేందుకు పోలీసులు ప‌వ‌న్ అభిమానుల‌పై లాఠీఛార్జి చేశారు. జీఆర్టీ హోటల్ లో ఆయ‌న‌ బస చేస్తున్నారు. ఏపీలో ఆందోళ‌న‌లు ఉద్ధృతమ‌వుతోన్న వేళ రేప‌టి ప‌వ‌న్ స‌భ‌పై సర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

19:49 - September 8, 2016
19:39 - September 8, 2016

విజయవాడ : ఎంతో కాలంగా..ఎన్నో ఆశలు పెంచుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చిపారేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏ రాష్ర్టానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేసింది. దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తేదీన విపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ ను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశాయి.

తిరుపతిలో నిరసనలు..
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన విభజన హామీలన్నీ నెరవేర్చి తీరాలని తిరుపతివాసులు ఆందోళన చేట్టారు. ఏపీ ప్రత్యేక హోదా తప్ప మరే ప్రత్యామ్నాన్ని ఒప్పుకోవటానికి ఏపీ ప్రజలు సిద్ధంగా లేరని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్యాకేజీల జోలికి వెళ్ళకుండా విభజన చట్టం లో వున్న హామీలన్నీ అమలు చేయాలని తిరుపతి వాసులు డిమాండ్ చేశారు.

గుంటూరు లో ఆందోళనలు..
ఏపీకి కేంద్రం ప్యాకేజీ ప్రకటించంటం పట్ల గుంటూరు జిల్లాలో నిరసనలు తారాస్థాయిలో ఆందోళనా కార్యక్రమాలు చేట్టారు. హోదాకు బదులుగా ప్యాకేజీని ప్రకటించటం బాధకరమని గుంటూరు వాసి పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే తమలాంటివారికి ఉద్యోగాలొస్తాయని విద్యార్థులు పేర్కొన్నారు.

విజయవాడలో నిరసనల హోరు..
రెండు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు కేంద్రం మోసం చేసిందని విజయవాడ వాసులు మండిపడ్డారు. ప్యాకేజీకి ఒప్పుకోవటం రాష్ట్రానికి మంచి కాదన్నారు. 1.70 వేల కోట్లు బీహార్ కు ఎవర్ని అడిగి ప్రకటించారని స్థానికులు ప్రశ్నించారు. ఏపీ ప్రజలు అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా తప్ప మరే ప్యాకేజీలతోనూ అభివృద్ధి జరగదనీ..ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి పున: సమీక్షించాలని కోరారు.

19:00 - September 8, 2016

హైదరాబాద్ : నగర మహిళా ఉద్యమ నిర్మాత, సీపీఎం నగర మొదటి కార్యదర్శి ఎన్‌వీ భాస్కరరావు సతీమణి కామ్రేడ్ సక్కుబాయి అనారోగ్యంతో మరణించారు. నగర ప్రజాతంత్ర ఉద్యమాల్లో సక్కుబాయి చురుగ్గా పనిచేశారని.. ఆమె మృతి ఉద్యమానికి తీరని లోటని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అమీర్‌పేటలోని ఆమె స్వగ్రహంలో పార్ధివ దేహానికి పలువురు ప్రజాసంఘాల నేతలు నివాశులర్పించారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

18:58 - September 8, 2016

హైదరాబాద్ : వైసీపీకి శాసనసభ నియమాల పట్ల చిత్తశుద్ధి లేదని ప్రభుత్వం చీఫ్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. సభ ప్రారంభమైన అనతనం 25 నిమిషాల వరకూ వైసీపీ సభ్యులు సభలోనే రాలేదన్నారు. అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యులు స్పీకర్ పట్ల వ్యవహరించిన తీరు ఆక్షేపమని తెలిపారు. ప్రత్యేక హోదా అంశంపై చర్చించడానికి సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నామన్నా ఆందోళనలు చేయడం దారుణమన్నారు. 

ముగిసిన కృష్ణా ట్రిబ్యునల్‌ వాదనలు..

ఢిల్లీ: కృష్ణా ట్రిబ్యునల్‌లో ఇవాళ వాదనలు కొనసాగాయి. బ్రిజేష్ అధ్యక్షతన ఏర్పడిన ట్రైబ్యునల్‌లో కేంద్రం, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నాలుగు రాష్ర్టాలు రెండోరోజు తమ వాదనలు వినిపించాయి. కృష్ణా జలాలను నాలుగు రాష్ర్టాలకు పంచాలా? తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు మధ్య పంచాలా? అనే అంశంపై వాదనలు ముగిశాయి. వాదనల అనంతరం ట్రైబ్యునల్ తీర్పును వాయిదా వేసింది. తీర్పును మూడు వారాల తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది.

5గురు నయాం అనుచరులు లొంగుబాటు..

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరులు ఐదుగురు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ కోర్టులో గురువారం లొంగిపోయారు. భూదందాలు, సెటిల్‌మెంట్లు చేశారనే ఆరోపణలతో వనస్థలిపురం పోలీసులు 20రోజుల కిందట 16మంది నయీం అనుచరులపై కేసులు నమోదు చేశారు. వీరిలో శ్రీధర్‌గౌడ్‌తో పాటు పలువురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నారు. వీరంతా ఈరోజు హయత్‌నగర్‌ కోర్టుకు వచ్చి లొంగిపోయారు. వీరికి న్యాయమూర్తి 14రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.

18:26 - September 8, 2016

ఢిల్లీ : ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి ఇంత ఆర్థిక సహాయం అందలేదన్నారు. హోదా ఇచ్చే ప్రక్రియ‌ ఇప్పుడు లేనందునే నిధులు ఇస్తున్నారని స్ప‌ష్టం చేశారు. కొందరు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఇది సరైందికాదన్నారు. రాష్ట్ర విభజన జరుగుతున్న తరుణంలో ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ప్రకటిస్తూ తాను పదేళ్లకు పట్టుబట్టినట్లుగా గుర్తుచేశారు. అందుకనే ఈరోజు ఏపీకి పదేళ్ళ ఆర్థిక సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రం తీసుకుందని తెలిపారు. హోదా ఇచ్చే అవ‌కాశం లేన‌ప్పుడు ప్యాకేజీ ఇవ్వాల‌ని కోరిన‌ట్లు ఆయన తెలిపారు. ఏపికి వున్న రెవెన్యూ లోటు కేంద్రమే భరిస్తుందని ఆర్థిక సంఘం పేర్కొందని తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ముఖ్యమ‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రాన్ని విభ‌జన చేసినవారే ఇప్పుడు మోదీ దిష్టిబొమ్మ‌లు ద‌హ‌నం చేస్తున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైల్వేజోన్ ఇవ్వాల‌ని కేంద్రం ఆలోచిస్తోందన్నారు. ఈ విషయంపై ప్ర‌క‌ట‌న రాకముందే ఆందోళ‌లు చేయటం సరికాదన్నారు. 18 సంవత్సరాలు కర్నాటక వాసులు తనను ఆదరించారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 

కొత్త పార్టీ పెట్టిన మాజీ క్రికెటర్..

చండీగఢ్‌: ఇటీవల కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన బీజేపీ మాజీ ఎంపీ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధు గురువారం పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. చండీగఢ్‌లో జరిగిన కార్యక్రమంలో ‘ఆవాజ్‌-ఇ-పంజాబ్‌’ పార్టీని ప్రారంభించారు. పంజాబ్‌ పునర్నిర్మాణం, పునరుద్ధరణే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేందుకేనని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని సిద్ధు పేర్కొన్నారు. ‘వంద మంది చెడు వ్యక్తుల కంటే.. ఓ మంచి వ్యక్తి ఎంతో నయం. పంజాబ్‌ గెలుస్తుంది.. పంజాబీలు గెలుస్తారు.. ఇదే మా నినాదం’ అంటూ సిద్ధు భాజపా, అకాళీదళ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

జీఎస్టీకి రాష్ట్రపతి ఆమోదం..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం కోసం తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్ టీ) బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ బిల్లుపై గురువారం రాష్ట్రపతి  సంతకం చేశారు. ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో ఇక దీనిని చట్టంగా చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. 2017 ఏప్రిల్ 1 నుంచి దీనిని అమల్లోకి తేనున్నారు. కాగా, జీఎస్ టీ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు గత నెలలో ఆమోదం తెలిపాయి. దేశంలోని 31 రాష్ర్టాల్లో ఇప్పటికే 16 రాష్ట్రాలు జీఎస్ టీ బిల్లుకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేశాయి.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 119 పాయింట్లు లాభపడి 29,045 వద్ద ముగిసింది. నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 8,952 వద్ద ముగిసింది. కాగా, హైదరాబాద్ నగర బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.31,930గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.29,850కి అమ్ముడవుతోంది. కిలో వెండి ధర రూ.50,844 పలుకుతోంది.

జీఎస్ ఎల్వీ విజయవంతం..

నెల్లూరు :  అంతరిక్ష రంగంలో మరో అద్బుతం చోటుచేసుకుంది. జీఎస్‌ఎల్వీ ఎఫ్-05 ఉప గ్రహం నిప్పులు చిమ్ముతూ నింగికెగింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి 29 గంటల కౌంట్ డౌన్ అనంతరం సాయంత్రం 04.50 నిమిషాలకు ఉప గ్రహంను ప్రయోగించారు. ఇన్సాట్ 3డీఆర్ ఉపగ్రహాన్ని ఈ నౌక మోసుకెళ్తోంది.17 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. సముద్ర, భూ ఉపరితల ఉష్ణోగ్రతను కొలిచే సామర్థ్యం, సెర్చ్ అండ్ రెస్క్యూ ట్రాన్స్‌పాండర్ల సాయంతో సముద్రంలో చిక్కుకున్న నౌకల సమాచారాన్ని చేరవేసే సామర్థ్యం కలిగి ఉంది.

17:37 - September 8, 2016

ఢిల్లీ : విభజన చట్టంలోని అన్ని మామీలను అమలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా వుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీపై ఆయన మాట్లాడుతూ..ప్రత్యేక హోదా కోసం బుధవారం వరకూ పట్టుపట్టామని తెలిపారు. తన 40 సంత్సరాల రాజకీయ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో రాష్ట్రానికి నిధులను కేటాయించటం ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఆర్థిక శాఖ నిర్ణయించిందనీ..ఆ కారణంతోనే విస్తృత చర్చల తరువాతనే ప్యాకేజీని ప్రకటించటానికి నిర్ణయించామన్నారు. ఈ విషయాన్ని తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరముందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 100 శాతం నిధులు కేంద్రమే భరిస్తుందని తెలిపారు. రైల్వే జోన్ పై ప్రకటన రాకముందే ఆందోళన చేపట్టం సరికాదన్నారు. రాష్ట్రానికి ఉన్న లోటును చ‌ర్చించిన త‌రువాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై కేంద్రం ప్ర‌త్యేక దృష్టి పెట్టింద‌ని, ప్ర‌త్యేకంగా సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకుంద‌ని వెంకయ్య అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లు ఈ విష‌యాన్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయాలని ఆయ‌న సూచించారు. పోల‌వ‌రం అంశాన్ని గ‌త ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంవ‌హించిందని, ఆ ప్రాజెక్టుపై ఎన్డీఏ ప్ర‌భుత్వం ఎంతో దృష్టి పెట్టిందని అన్నారు దాన్ని పూర్తి చేయ‌డానికి కృషిచేస్తోందని వివ‌రించారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేయబోదని చెప్పారు. ప‌శ్చిమ‌ బెంగాల్, ఒరిస్సా, ఏపీ ప్రాంతాల‌కు రెవెన్యూ లోటును భ‌ర్తీ చేయాల‌ని, ప్ర‌త్యేకంగా ఏ రాష్ట్రానికి హోదా ఉండ‌బోద‌ని ఆర్థిక సంఘం చెప్ప‌క‌నే చెప్పింద‌ని వెంక‌య్య అన్నారు. 

17:34 - September 8, 2016

నెల్లూరు :  ఇస్రో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకొంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌05 రాకెట్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. సాయంత్రం 4.50 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌05 నింగిలోకి దూసుకెళ్లింది. కౌండ్ డౌన్ నిరంతరాయంగా 29 గంటలపాటు కొనసాగిన అనంతరం జీఎస్‌ఎల్‌వీ నింగిలోకివెళ్లింది. పైకెగసిన 17 నిమిషాల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యింది.
ఇంధనం 1,255 కిలోలు, జీవితకాలం పదేళ్లు
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో కోస్టుగార్డు, భారతీయ విమానయానసంస్థ, నౌకా సంస్థలు, సైనిక దళాలకు దీని ద్వారా సేవలు అందనున్నాయి.కర్ణాటక హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ కేంద్రం జీఎస్ఎల్వీ ప్రయోగాలను ఆ వ్యవహారాలను చూసింది. అంతకు ముందు ప్రయోగంపై ఉత్కంఠ నెలకొంది. రాకెట్ ఫ్యూయల్ వాల్వ్‌లో సమస్య ఏర్పడటంతో.. కౌంట్ డౌన్ నిలిపివేశారు. అనంతరం సమస్య పరిష్కరించి కౌంట్ డౌన్ తిరిగి ప్రారంభించారు. దీంతో ప్రయోగం 40 నిమిషాలు వాయిదా పడింది. తరువాత జీఎస్ఎల్వీ సక్సెస్‌ ఫుల్‌గా ఇన్సాట్‌ ను కక్ష్యలోకి చేర్చడంతో... షార్‌లో ఆనందం వెల్లివెరిసింది. శాస్త్రవేత్తలు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కక్ష్యలోకి చేరిన ఇన్సాట్ -3 డీఆర్ శాటిలైట్ బరువు 2,211 కిలోలు. జీవితకాలం పదేళ్లు. ఈ ప్రయోగానికి ఇస్రో 500కోట్లు ఖర్చుచేసింది. 

దూసుకెళుతున్న జీఎస్ఎల్వీ..

నెల్లూరు : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి గురువారం సాయంత్రం జియోసింక్రనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-ఎఫ్‌05 (జీఎస్‌ఎల్‌వీ) నింగిలోకి దూసుకెళుతోంది. ఉపగ్రహం బరువు 2,211 కిలోలు. ఇందులో ఇంధనం 1,255 కిలోలు. జీవితకాలం పదేళ్లు. ఇస్రో చేసిన వ్యయం రూ.250కోట్లు. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు మరో రూ.250 కోట్లు ఖర్చు చేశారు.

ర‌తనాల సీమ‌గా రాయలసీమ..చంద్రబాబు

హైదరాబాద్ : రాయ‌ల‌సీమ‌ను ర‌తనాల సీమ‌గా చేస్తామ‌ని చంద్రబాబు అన్నారు. వ‌ర్షాలు ప‌డని ప‌రిస్థితుల్లో కూడా రైతుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా రెయిన్ గ‌న్ లు తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు. రాజ‌ధాని విష‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు ఇబ్బందులు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాయని ఆయ‌న అన్నారు. రాష్ట్రానికి ఏర్పడే లోటును ఐదు సంవ‌త్సరాలు భ‌రిస్తామ‌ని కేంద్రం తెలిపిన‌ట్లు చెప్పారు. రాయ‌ల‌సీమ‌లో ప్రాజెక్టుల‌న్నీ పూర్తి చేస్తామ‌ని చెప్పారు. 

16:51 - September 8, 2016

హైదరాబాద్ : ఏపీ శాసనమండలిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ సభ్యుడు రామచంద్రయ్య మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏపీ ప్యాకేజీపై కేంద్రం చేసిన ప్రకటనపై సీఎం చంద్రబాబు నాయుడు శాసనమండలిలో ప్రకటన చేశారు. ఆ రోజు చేసిన పాపాన్ని ఇప్పుడు కాంగ్రెస్ అనుభవిస్తోందని విమర్శించారు. దీనితో కాంగ్రెస్ సభ్యుడు సి. రామచంద్రయ్య అడ్డుతగిలారు. విభజనకు లెటర్ ఇచ్చారు కదా అని ప్రశ్నించారు. దీనితో బాబు..రామచంద్రరావుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని తాను పోరాడడం జరిగిందని, కానీ కాంగ్రెస్‌ నేతలు అప్పుడు పట్టించుకోలేదన్నారు. దొడ్డి దారిన వచ్చి విభజించుకోవడం జరిగిందని, విభజన అనంతరం చేతులు కాల్చుకున్నారని కాంగ్రెస్ ను ఉద్ధేశించి పేర్కొన్నారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో రెండు శాతం ఓటింగ్ రాలేదని విమర్శించారు. 20 ఏళ్లు టీడీపీలో ఉన్న రామచంద్రయ్య గురించి తనకు బాగా తెలుసు అని చంద్రబాబు పేర్కొన్నారు. కొద్దిసేపటి అనంతరం బాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేంద్రం రూ. 3,975.57 కోట్లు ఇచ్చిందని, కడపలో స్టీల్ ప్లాంట్ పై ఇంకా స్పష్టత ఇవ్వలేదని బాబు గుర్తు చేశారు. 14వ ఆర్థిక సంఘంతో సంబంధం లేకుండా హోదా ఇవ్వాలని కోరడం జరిగిందని, రాజధాని నిర్మాణానికి సహకరించాలని కేంద్రాన్ని కోరడం జరిగిందని, సెంట్రల్ వర్సిటీ, గిరిజన యూనివర్సిటీ రావాలన్నారు. విశాఖలో రైల్వే జోన్ రావాలని ఆ రోజు స్పష్టం చేయడం జరిగిందన్నారు. కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా తాను రాజీ పడే అవకాశం లేదని ఖరాఖండిగా చెప్పారు. 

జ‌నాభా దాషామాలో ఏపీ భవన్ విభజన : బాబు

హైదరాబాద్ : ఏపీ భ‌వ‌న్‌ను జ‌నాభా దాషామాలో విభ‌జించేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని చంద్రబాబు పేర్కొన్నారు. తాజా అంచ‌నాల ప్ర‌కారం పోల‌వ‌రానికి 25వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల ఖ‌ర్చు అవుతుందని చెప్పారు. పోల‌వ‌రానికి రాష్ట్రం పెట్టిన ఖ‌ర్చును రీయింబ‌ర్స్ చేస్తామ‌ని కేంద్రం చెప్పిన‌ట్లు పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చింది మొత్తం తీసుకుంటామని, రావాల్సింది అడిగి తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.

ఇద్దరు వడ్డీ వ్యాపారస్తులు అరెస్ట్..

రంగారెడ్డి : నాచారంలో వీరేశం, శ్రీనివాస్ అనే ఇద్దరు వడ్డీ వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్దనుండి రూ.58.20లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ.9.5కోట్ల చెక్కులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తూ..ప్రజలను పలు ఇబ్బందులకు గురిచేస్తున్న ఆరోపణలతో వారిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. 

ఇచ్చింది తీసుకోకుంటే మరింతగా నష్టం : బాబు

హైదరాబాద్ : ప్రత్యేక ప్యాకేజీపై శాసనమండలిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ఇప్పటికూ డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కాకపోతే ఇప్పుడు రాష్ట్రం వున్న ఆర్థిక లోటు పరిస్థితుల్లో కేంద్ర ఇచ్చింది తీసుకోకుంటే మరింతగా రాష్ట్రం నష్టపోతుందని పేర్కొన్నారు. విశాఖకు రైల్వే జోన్ అంశంపై కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామాన్నారు. ఈ అంశంపై కేంద్ర పరిశీలిస్తోందని పేర్కొన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ పై ఇంకా ఎటువంటి స్పష్టతా రాలేదని తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

16:32 - September 8, 2016

హైదరాబాద్ : ఆనాడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని అడగడం జరుగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. బుధవారం రాత్రి ఏపీకి ప్యాకేజీ విషయంపై కేంద్రం చేసిన ప్రకటనపై విపక్షాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని గురువారం ఉదయం పలు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం చేసిన ప్రకటనపై ప్రభుత్వం ఒక స్టేట్ మెంట్ ఇవ్వాలని యోచించింది. శాసనసభలో వైసీపీ ఆందోళనతో ప్రకటన చేయడం వీలు కాలేదు. దీనితో సీఎం చంద్రబాబు నాయుడు శాసనసమండలిలో ప్రకటన చేశారు.

ప్రధాని హామీని అమలు చేయమన్నాం..
అప్పటి ప్రధాన ఇచ్చిన 'హోదా' హామీని అమలు చేయాలని కోరడం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రకటనలో నాలుగు అంశాలు జైట్లీ పేర్కొనడం జరిగిందన్నారు. అసెంబ్లీలో స్టేట్ మెంట్ ఇచ్చే అవకాశం రాలేదని, ప్రభుత్వం చెప్పే ప్రకటనను వినే స్థితిలో విపక్షం లేదన్నారు. తన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో రాజీ పడే అవకాశం లేదని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుందన్నారు. తాము పడిన తపనను ప్రజలు అర్థం చేసుకున్నారని, ఒక క్లిష్ట సమయంలో తనపై నమ్మకం పెట్టుకున్నారని తెలిపారు. న్యాయం చేస్తారని అనుకుని ప్రజలు తన వెనుక నిలబడ్డారని, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే విధంగా తాను వ్యవహరించడం జరగదని ఖరాఖండిగా చెప్పారు.

పోలవరం గుండెకాయ..
ఏపీకి పోలవరం గుండెకాయ అని, దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని..సాగు..తాగునీరు వస్తుందన్నారు. 18వేల టీఎంసీలు నీరు సముద్రంలోకి వెళ్లాయని, పట్టిసీమకు న్యూ టెక్నాలజీ ద్వారా గోదావరి నీళ్లను కృష్ణా నదిలో కలపడం జరిగిందన్నారు. పట్టిసీమ కోసం నెలకొకసారి వెళ్లి సమీక్షలు చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అడ్డం పడడం మంచిది కాదని రైతులకు చెప్పడం జరిగిందన్నారు. దీనితో కోర్టులో ఉన్న కేసులను రైతులు విత్ డ్రా చేసుకోవడం జరిగిందన్నారు. 2018 లోపున పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని ముందుకు వెళుతున్నట్లు, ఇందుకు రూ. 1800 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. తాజా అంచనాల ప్రకారం పోలవరానికి రూ. 25వేల కోట్లు నుండి రూ. 30వేల కోట్లు అవుతుందన్నారు. అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు పనిచేయడం జరుగుతుందని, రాజీనామాలు చేయాలని కోరడం కరెక్టు కాదన్నారు.

పదేళ్లు కావాలన్నారు...
ప్రత్యేక హోదా కావాలని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కోరడం జరిగిందని, పదేళ్లు కావాలని ఇప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడడం జరిగిందన్నారు. వెసుబాటు రావడం లేదని..కష్టాలున్నాయని, హోదా సెంటిమెంట్ ఉందని కేంద్రంతో చెప్పడం జరిగిందన్నారు. 14వ ఆర్థిక సంఘం అవసరం లేదని, కొన్ని రాష్ట్రాలు నష్టపోతుంటే స్పెషల్ గా ఫైనాన్స్ చేయడం జరిగిందని కేంద్రం పేర్కొనడం జరిగిందన్నారు. 2019-20 వరకు ఏపీ లోటు బడ్జెట్ లో ఉంటుందని ఇది తమకు అవసరం లేదని కేంద్రంతో చెప్పడం జరిగిందన్నారు. స్పెషల్ స్టేటస్ వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో అవి నెరవేరుస్తామని, 14వ ఆర్థిక సంఘంలో పేర్కొన్న విధంగా చేయడం జరుగుతుందని జైట్లీ ప్రకటించారని తెలిపారు.

రాజధాని నిర్మాణంలో విపక్షాలు అడ్డు తగులుతున్నాయి...
రూ. 3979.05 కోట్లు ఇచ్చారని, మిగతాది ఇన్ స్టాల్ మెంట్ ద్వారా ఇస్తామని పేర్కొనడం జరిగిందన్నారు. రాజధాని నిర్మాణ విషయంలో ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయన్నారు. రూ. 1500 కోట్లు ఇచ్చారని..వేయి కోట్లు గుంటూరు..ఇతరత్రా జిల్లాలకు ఇచ్చారని తెలిపారు. ఇంకా వేయి కోట్లు ఇస్తామన్నారని, ఇది సరిపోదని చెప్పడం జరిగిందన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కృషి చేయాలని అడగడం జరుగుతోందన్నారు. ఒక్కో జిల్లాకు ఏటా రూ. 50 కోట్లు ఇచ్చారని, ఆరు సంవత్సరాలు ఇస్తామని చెబుతున్నారని, రూ. 300 కోట్లతో అభివృద్ధి సాధ్యం కాదని, ఎక్కువ ఇవ్వాలని కోరడం జరుగుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.  

2018 నాటికి పోలవరం పూర్తి : చంద్రబాబు

హైదరాబాద్ : శాసనమండలిలో కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై చంద్రబాబు మాట్లాడుతున్నారు. 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు ఎంతగా వ్యతిరేకించినా పట్టిసీమ ప్రాజెక్టు కట్టితీరామన్నారు. దీంతో గోదావరి-కృష్ణా జలాలను అనుసంధానం చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు వస్తే రాష్ట్ర్ం అభివృద్ధి చెందుతుందన్నారు. 1 ఏప్రిల్ 2014 నుండి పోలవరానికి వంద శాతం నిధులను కేటాయిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. పోలవరం పూర్తి కావటానికి 26,790 కోట్లు ఖర్చువతుందని తెలిపారు.

హోదా హామీని అమలు చేయాలని కోరాం - బాబు..

హైదరాబాద్ : అప్పటి ప్రధాన ఇచ్చిన 'హోదా' హామీని అమలు చేయాలని కోరడం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏపీకి ప్యాకేజీపై కేంద్రం చేసిన ప్రకటనపై ఆయన ఏపీ శాసనమండలిలో ప్రకటన చేస్తున్నారు. ప్రకటనలో నాలుగు అంశాలు జైట్లీ పేర్కొనడం జరిగిందన్నారు. అసెంబ్లీలో స్టేట్ మెంట్ ఇచ్చే అవకాశం రాలేదని, ప్రభుత్వం చెప్పే ప్రకటనను వినే స్థితిలో విపక్షం లేదన్నారు. తన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో రాజీ పడే అవకాశం లేదని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుందన్నారు. తాము పడిన తపనను ప్రజలు అర్థం చేసుకున్నారని, ఒక క్లిష్ట సమయంలో తనపై నమ్మకం పెట్టుకున్నారని తెలిపారు.

సాంకేతిక కారణాలతో జీఎస్‌ఎల్వీ ఆలస్యం..

నెల్లూరు : జీఎస్‌ఎల్వీ రాకెట్ ప్రయోగం 40 నిమిషాలు ఆలస్యం కానుంది. రాకెట్‌లో ఏర్పడ్డ సాంకేతిక కారణాల వల్ల 4.10 బదులు 4.50 గంటలకు రాకెట్‌ను అధికారులు ప్రయోగించనున్నారు. మూడోదశలోని క్రయోజనిక్ ఇంజిన్‌లో ఏర్పడ్డ సాంకేతికలోపం వల్ల వాల్వ్ మూతపడలేదు. దీంతో వెంటనే కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. అలాగే ఇంజిన్‌లో ఏర్పడ్డ లోపాన్నిశాస్త్రవేత్తలు సరిచేస్తున్నారు.

ప్రత్యేక హోదాపై బాబు ప్రకటన..

హైదరాబాద్ : ఏపీకి ప్యాకేజీలపై కేంద్రం చేసిన ప్రకటనపై గురువారం మధ్యాహ్నం ఏపీ శాసనమండలిలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తున్నారు. ఏపీ శాసనసభలో వైసీపీ ఆందోళన చేయడంతో సభను రేపటికి స్పీకర్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

ఢీల్లీ సీఎంపై గాజులు విసిరిన మహిళలు..

పంజాబ్ : ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌లు పలువురు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. వారిపై కేజ్రీవాల్‌ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, అకాలీదళ్ నేత‌లు డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ గో బ్యాక్ అంటూ నిర‌స‌న తెలిపారు. నిర‌స‌న తెలుప‌డానికి వ‌చ్చిన‌ కొంత మంది మహిళలు కేజ్రీవాల్ పైకి గాజులు విసిరారు. అంత‌కు ముందు ఢిల్లీ రైల్వే స్టేషన్ లో కూడా కేజ్రీవాల్ కు ఇటువంటి అనుభ‌వ‌మే ఎదురైంది. స్టేషన్ లో మహిళలు ఆయ‌న‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఫిలింక్లబ్ సొసైటీ భవనం కూలిన ఘటనలో ఇద్దరుఅరెస్ట్..

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీ (ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌) లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిన ఘటనలో ఎఫ్‌ఎన్‌సీసీ ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత కేఎస్‌ రామారావు, కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్‌పై వారిని విడుదల చేశారు. గత నెలలో ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు కేఎస్‌ రామారావు, రాజశేఖర్‌రెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం వారికి రూ. 5వేలు చొప్పున పూచీకత్తుతో స్టేషన్ బెయిల్‌ మంజూరు చేశారు.

ఒబామాతో మోడీ భేటీ..

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాతో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మరోసారి సమావేశమయ్యారు. ఏషియాన్ (అసోసియేష‌న్ ఆఫ్ సౌత్ ఈస్ట‌ర్న్ నేష‌న్స్) స‌ద‌స్సులో భాగంగా గురువారం ఈ ఇద్ద‌రు నేత‌లు ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు.

ఒక కుటుంబం కోసం ప్రభుత్వం పని చేస్తోంది - సిద్ధూ..

పంజాబ్ : ఎక్క‌డైనా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌ని, పంజాబ్‌లో మాత్రం ఒక కుటుంబం కోసం మాత్ర‌మే ప‌నిచేస్తోంద‌ని ఆవాజ్‌-ఎ-పంజాబ్ పార్టీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నారు. అద్వాన స్థితిలో ఉన్న పంజాబ్‌కు విముక్తి, పున‌రుత్తేజం క‌లిగించే పార్టీ తమది అని తెలిపారు. 

15:36 - September 8, 2016

విశాఖ : విభజనకు కాంగ్రెస్నే కారణమని చంద్రబాబు పదే పదే ఆరోపణలు చేయటం సరికాదని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ విషయంలో చంద్రబాబుకు వున్న చీకటి ఒప్పందాలను బయటపెట్టాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. విశాఖకు రైల్వే జోన్ ను ప్రకటించి ఇప్పుడు ఇవ్వలేమనటం సరికాదన్నారు. ప్యాకేజీల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేంద్రంతో చర్చించేందుకు సీనియర్ నేత అశోక్ గజపతిరాజును కాకుండా కేసులలో నిందితులుగా వున్నవారిని చంద్రబాబు నియమిండంలో వున్న అంతర్ధామేమిటో తెలపాలన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసిన ఆయన..అధికారంలో ఉన్నవారు మాట తప్పారని ఆరోపించారు. బీజేపీ మాట నిలబెట్టుకోవాలని హితవు పలికారు. 

15:28 - September 8, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదా అంశంలో ప్రభుత్వం డిఫెన్స్ లో పడలేదని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం పూర్తి మోజారిటీ వుందనీ.. బీజేపీతో టీడీపీ పొత్తు తెంచుకున్నంత మాత్రాన బీజేపీకి ఎటువంటి నష్టం జరగదన్నారు. సానుకూలంగా వుంటూ రాష్ట్రానికి వీలైనన్ని నిధులు రాబట్టేందుకే బీజేపీతో కొనసాగుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం దేశంలో ఏ సీఎం కూడా కలవనన్ని సార్లు ప్రధానిని చంద్రబాబు కలిసి మాట్లాడారన్నారు. ప్రత్యేక హోదా రాకుంటే బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధంగా వున్నామన్నారు. బీజేపీ వైసీపీతో కలిసినా తమకు ఎటువంటి అభ్యంతరంలేదన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

బాబు ఆరోపణలు చేయడం సరికాదు - కేవీపీ..

విశాఖపట్టణం : విభజనకు కాంగ్రెస్సే కారణమని చంద్రబాబు పదేపదే ఆరోపణలు చేయడం సరికాదని ఎంపీ కేవీపీ పేర్కొన్నారు. ప్యాకేజీకి ఒప్పుకోవడం వెనుక చంద్రబాబుకు ఉన్న చీకటి ఒప్పందాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ కూలిన ఘటనలో ఇద్దరు అరెస్టు..

హైదరాబాద్ : నిర్మాణంలో ఉన్న ఫిలింక్లబ్ కల్చరల్ క్లబ్ భవనం కూలిన ఘటనలో క్లబ్ ప్రతినిధులు రామారావు, రాజశేఖరరెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. 

15:16 - September 8, 2016

ఎన్నో ఔషధ లక్షణాలు కలిగిన సుగందభరితం సున్నిపిండి. వంటింట్లో దొరికే వస్తువులతోనే ఈ పిండిని తయారు చేసుకోవచ్చు. సున్నిపిండిని వాడడం వల్ల చర్మం నునుపుగా మారుస్తుంది. అంతేగాకుండా వ్యాధుల బారి నుండి రక్షిస్తుంది. ఇప్పటికీ గ్రామాల్లో సబ్బులు వాడరు. స్నానానికి సున్నిపిండిని మాత్రమే ఉపయోగిస్తుంటారు. మరి ఈ సున్నిపిండి వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దామా...
అసలు సున్నిపిండిని ఎలా తయారు చేస్తారు .పెసలు..శనగపప్పు..బియ్యం..వీటన్నింటినీ తగినన్ని మోతాదులో తీసుకుని గిర్నీ పట్టుయోవాలి. ఇందులో అదనంగా పసుపు, ముల్తానీ మట్టి కలుపుకోవాలి. మెంతాకులు..తమలపాకులు..గులాబీ రేకులు..వేపాకులను ఎండలో బాగా ఎండిన తరువాత వాటిని పొడిగా చేసి సున్నిపిండిలో కలుపుకోవాలి. దీనిని ఒక సీసాలా భద్ర పరుచుకోవచ్చు. స్నానం చేసే సమయంలో కొంత పిండిని తీసుకుని నీళ్లు కలుపుకోవాలి. ఈ పేస్టును శరీరానికి పట్టించాలి. పది నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇది చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. పసుపు చర్మంపై సూక్ష్మజీవులను తొలగిస్తుంది. ముఖంపై మెటిమలను నివారిస్తుంది. పసుపు..మినపప్పు వీటి మిశ్రమాన్ని నీటిలో కలుపుకుని రాసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఎలాంటి రంగు చర్మానికైనా సున్నిపిండిని వాడుకోవచ్చు. ట్రై చేసి చూడండి. 

15:03 - September 8, 2016

గ్యాస్ ట్రబుల్..ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా వస్తోంది. ఇది మనిషిని చాలా ఇబ్బంది కలుగ చేస్తుంది. దీనినే ఒక విధంగా 'కడుపు ఉబ్బరం' అని కూడా అంటారు. కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఇది తలెత్తుతుంది. వేళకు ఆహారం తీసుకోకపోవడం..మానసిక వత్తిడికి గురి కావడం...రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం..మసాలాతో కూడుకున్న ఆహారాన్ని భుజించడం..ఇలా కొన్ని కారణాలు గ్యాస్ ట్రబుల్ కు దారి తీస్తాయి. హార్మోన్ల అస్తవ్యవస్థత తదితర కారణాలు కూడా గ్యాస్ ట్రబుల్ ను కలిగిస్తాయి.
ఇక దీని లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం..
ఆకలి లేకపోవడం..అన్నం ఇష్టంగా అనిపించకపోవడం..
ఆపానవాయువు ఎక్కువగా పోతుండడం..
నోట్లో నీళ్లు ఊరడం..వాంతులు కావడం..
ఛాతిలో మంటలు తేన్పులు అధికంగా వస్తుండడం..
ఆహారం తీసుకున్న అనంతరం జీర్ణం కాక కడుపునొప్పి రావడం..అలాగే మలబద్ధకం ఏర్పడడం..ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి.
మరి నివారణకు..
ఆహారాన్ని ముద్దలుగా చేసుకుని బాగా నమిలి మింగాల్సి ఉంటుంది..
నిల్వ ఉంచిన పచ్చళ్లను తినేయడం మానేయాలి. .
మసాలాలు వేపుళ్లు..ఆయిల్ ఫుడ్స్..ఫాస్ట్ ఫుడ్..ఆల్కాహాల్..టీ..కాఫీలు అధికంగా తీసుకోవడం మానేయాలి..
పీచు పదార్థాలు..ఎక్కువగా తాజాగా ఉన్న కూరగాయాలు తీసుకోవాలి..
కడుపునిండుగా ఒకేసారి ఆహారం తీసుకోవద్దు..
మరీ ముఖ్యంగా వేళకు ఆహారం తీసుకోవడమే కాకుండా ఎక్కువగా నీరు తాగాలి. 

జీఎస్టీతో పాటు మరో 4 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ జీఎస్టీ బిల్లుతో పాటు మరో నాలుగు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం పలికింది. డబుల్ రిజిస్ట్రేషన్లపై చట్టసవరణ బిల్లు, వాణిజ్య పనుల వ్యాట్ వివరణ బిల్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు, ఎన్డీ రంగా వర్శిటీ సవరణ బిల్లులకు సభ ఆమోదం పలికింది.కేంద్ర ప్రభుత్వం పతిష్టాత్మకంగా చేపట్టిన చేపట్టిన జీఎస్టీ బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రాలకు పంపగా బిల్లుకు మద్దతు ఇస్తూ ఏపీ శాసనసభ గురువారం జీఎస్టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో ప్రవేశపెట్టారు.

ప్రారంభం కానున్న రెండోదశ టీ హబ్..

హైదరాబాద్: త్వరలో రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ టీ హబ్‌ను ప్రారంభించనున్నట్టు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. ఇవాళ ఆయన టీ-హబ్ ఇన్నోవేట్ ఫర్ డిజిటల్ ఇండియా ఛాలెంజ్ 2.0ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. డిజిటల్ తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని స్పష్టం చేశారు. సిలికాన్ వ్యాలీలో టీ హబ్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో టీ హబ్ రెండో దశను ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్‌లో ఇండియా టెక్నికల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో జెడ్‌ఎఫ్ గ్రూప్ ఒప్పందం చేసుకుందని తెలిపారు.

టీచింగ్,నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ..

హైదరాబాద్ : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 657 నాన్ టీచింగ్ అండ్ టీచింగ్ భర్తీకి ప్రభుత్వం అనుమతిని ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అటవీ కళాశాలకు 19మంది ఉద్యోగుల నియామకం..

హైదరాబాద్: మెదక్ జిల్లా ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు ప్రభుత్వం ఉద్యోగులను నియమించింది. 19 మంది ఉద్యోగులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

స్విస్ చాలెంజ్ పై పూర్తి అయిన వాదనలు..

హైదరాబాద్: ఏపీ రాజధాని నిర్మాణం చేపట్టిన స్విస్ చాలెంజ్ పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సీఆర్డీయే తరపున అటార్నీ జన్ రల్ వాదనలు వినిపించింది. అనంతరం తీర్పును 12వ తేదీకి వాయిదా వేసింది. స్విస్ చాలెంజ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఓ ప్రయివేట్ సంస్థ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.

కల్వకుర్తి ఎత్తిపోతలను ప్రారంభించిన హరీష్ రావు..

మహబూబ్‌నగర్: మహాత్మా గాంధీ కల్వకుర్తి-2,3 లిఫ్టుల ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. జొన్నలబొగుడ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు లిఫ్టులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

మరోసారి బాంబులతో దద్దరిల్లిన కాబూల్..

ఆఫ్ఘనిస్థాన్‌ : దేశ రాజధాని కాబూల్‌ నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఈ వారంలోనే బాంబు పేలుళ్లు జరగడం ఇది మూడోసారి. తైయని ప్రాంతంలోని ఐదో వీధిలో సైకిల్‌కు అమర్చిన ఐఈడీ బాంబు పేలినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో ముగ్గురు గాయపడినట్లు తెలిపారు. సెప్టెంబరు 5,తేదీలో కాబూల్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్లలో 24 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో 6న కూడా నగరంలో మరో పేలుడు జరిగింది.ఈ క్రమంలో వరుస పేలుళ్ళతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

14:30 - September 8, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదా..ప్యాకేజీపై కేంద్రం చేసిన ప్రకటనపై ఏపీ భగ్గుమంది. విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం నుండి ముగింపు వరకు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేక హోదాపై చర్చించాల్సిందేనంటూ వైసీపీ సభ్యులు పట్టుబట్టాయి. కానీ స్పీకర్ దీనికి అంగీకరించలేదు. తొలుత ప్రశ్నోత్తరాలు చేపడుదామని, అనంతరం ప్రభుత్వం హోదాపై ప్రకటన చేస్తుందని తరువాత చర్చ చేపట్టాలని ఏపీ శాసనసభా వ్యవహరాల మంత్రి యనమల పేర్కొన్నారు. ఈ గందరగోళం మధ్య కొద్దిసేపు ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. వైసీపీ సభ్యులు ఆందోళనలను మరింత ఉధృతం చేశార. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. ఈనేపథ్యంలో రెండుసార్లను సభను స్పీకర్ కోడెల వాయిదా వేశారు. చివరకు మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే జీఎస్టీ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. జీఎస్టీ బిల్లును అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని పేర్కొన్నారు. కానీ ప్రతిపక్షం మాత్రం ఈ విధంగా ఆందోళన చేయడం సబబు కాదన్నారు. ఈ తరుణంలో ప్రత్యేక హోదాపై తాను స్టేట్ మెంట్ ఇవ్వడం జరుగుతుందని వైసీపీ సభ్యులు కూర్చొవాలని బాబు సూచించారు.

అన్యాయమన్న విష్ణు..
వైసీపీ ఈ విధంగా ఆందోళన చేయడం అన్యాయమని, దేశ వ్యాపితంగా జీఎస్టీ బిల్లుకు ఆమోదం వేసిందని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం అడ్డు తగలడం దారుణమన్నారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వం స్టేట్ మెంట్ ఇస్తామంటే సభ్యులు కూర్చొరా అని ప్రశ్నించారు. వారి వారి సీట్లలో కూర్చొని సీఎం స్టేట్ మెంట్ పై అభ్యంతరాలు తెలియవచ్చన్నారు. నిరంకుశంగా వ్యవహరించడం దౌర్భాగ్యమన్నారు. ఈ తరుణంలో వైసీపీ సభ్యుల ఆందోళనకు తెరపడలేదు. హఠాత్తుగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల ప్రకటించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

చర్చి వేడుకల్లో అపశృతి..17మంది మృతి..

తమిళనాడు : నెల్లయ్‌లో మాతా చర్చి ఫెస్ట్‌లో అపశృతి చోటుచేసుకుంది. చర్చిలో వేడుకలు జరుపుకుంటుండగా విద్యుతాఘాతం సంభవించింది. విద్యుత్ షాక్‌తో 17 మంది మృతిచెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల నిరసనలు కొనసాగతున్నాయి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నిరసలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు జీఎస్టీ బిల్లుపై మాట్లాడుతున్నారు. జీఎస్టీ బిల్లుతో వినియోగదారులకు ట్యాక్స్ భారం తగ్గుతుందని తెలిపారు. ఈ బిల్లుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇటువంటి బిల్లు సభలో ప్రవేశపెడుతుంటే ప్రతిపక్ష సభ్యులు సభ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభా సంప్రదాయలను మర్చిపోవద్దని ప్రతిపక్ష సభ్యులకు చంద్రబాబు సూచించారు.

14:14 - September 8, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి మార్పు రాలేదు. గురువారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో వైసీపీ ఆందోళన చేపట్టింది. ప్రత్యేక హోదా..ప్యాకేజీలపై కేంద్రం ఇచ్చిన ప్రకటనను నిరసిస్తూ వైసీపీ సభలో ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో రెండుసార్లు సభను స్పీకర్ కోడెల వాయిదా వేశారు. అనంతరం మధ్యాహ్నం ప్రారంభమైన సభలో జీఎస్టీ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. 13 సంవత్సరాల నుండి ఈ బిల్లు పెండింగ్ లో ఉందని, ఇటీవల కాలంలో అన్ని రాజకీయ పార్టీలు బిల్లును పాస్ కావడం జరిగిందన్నారు. అదనపు అమ్మకం పన్ను, వ్యాట్ లు ఇతర పన్నులు ఉండవన్నారు. భవిష్యత్ లో ఆర్థిక వ్యవస్థ బలమైన ఊతం ఇస్తుందని పేర్కొన్నారు. వస్తు తయారీ, విక్రయాలు, సేవలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే పరోక్ష పన్నులన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయని తద్వార వినియోగదారులకు లాభం జరుగుతుందన్నారు. ధరలు తగ్గే ప్రసక్తి వస్తుందని, ప్రస్తుతం ఉన్న వ్యాట్ వల్ల సమస్యలున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెరిగే అవకాశం ఉందని, ప్రారంభంలో రాష్ట్రాలకు సమస్యలు వచ్చే అవకాశం ఉందని, ఇందుకు ఐదు సంవత్సరాల గ్యారంటీ ఇచ్చేందుకు ముందుకొచ్చారని తెలిపారు. ఈ బిల్లును దేశం మొత్తం పాస్ చేయించారని, కానీ ఇక్కడ ప్రతిపక్ష సభ్యులు సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిందిగా చంద్రబాబు స్పీకర్ ను కోరారు. అనంతరం బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. 

14:02 - September 8, 2016

గోవా బ్యూటీ 'ఇలియానా' గురించి సంచలన వార్త వినిపిస్తోంది. ఈ బ్యూటీ సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నట్లు బాలీవుడ్ లో హాట్ హాట్ న్యూస్ రన్ అవుతోంది. గోవా బ్యూటీ ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్‌ 'ఆండ్రూ'తో పీకల్లోతు లవ్ లో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ తెల్లబాబు 'ఇల్లి' కొంతకాలంగా సహజీవనం చేస్తుందనే సంగతి తెలిసిందే. కానీ ఇది సహజీవనం కాదని కాపురం చేస్తుందని బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది.

ఆండ్రూ తో మ్యారేజ్...?
'ఇలియానా' గత డిసెంబర్‌లో 'ఆండ్రూ'ని సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందని బాలీవుడ్ అసలు విషయం బయటపెట్టింది. ఫ్యామిలీ, బంధువుల సమక్షంలో 'ఆండ్రూ'తో మూడు ముళ్లు వేయించుకుని, ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలని 'ఇల్లి' బంధువుల దగ్గర ప్రామిస్‌ కూడా తీసుకుందని సమాచారం. అయితే ఆమె బంధువుల్లో ఒకరు నోరు జారడంతో ఈ విషయం లేటేస్ట్ గా బయటపడింది. మ్యారేజ్ వ్యవహరంపై దుమారం రేపుతున్నా నోరు మెదపడకుండా 'ఇలియానా' సైలెంట్ గా ఉంది. రీసెంట్‌గా ఆమె నటించిన 'రుస్తుం' 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇప్పుడున్న టైమ్‌లో అసలు విషయం చెప్పితే ఆఫర్స్ తగ్గిపోతాయని భావనలో గోవా బ్యూటీ ఉన్నట్లు సినీ లవర్స్ వాదన. మరి 'ఇలియనా' మ్యారేజ్ చేస్తుందా లేదా అనేది ఆమె చెప్పితేనే కానీ తెలియదు. మరీ మ్యాటర్ పై గోవా భామ ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి. 

13:48 - September 8, 2016

ఇదంతా పోటీ ప్రపంచం. ఇందులో ఫ్యాషన్ ప్రపంచం ఎప్పుడూ ఒక స్టెప్ ముందే ఉంటుంది. మరి ఇలాంటి ఫ్యాషన్ ప్రపంచంలో వచ్చిన ట్రెండ్స్ తో ఏంటో వీడియో క్లిక్ చేయండి.  

ఎపి ప్రత్యేకహోదా కోసం ఎంపీ అవంతి శ్రీనివాస్ అందోళన

విశాఖ : ఎపి ప్రత్యేకహోదా కోసం ఎంపీ అవంతి శ్రీనివాస్ అందోళన చేపట్టారు. ఎపికి ప్రత్యేక హోదా, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు.

 

 

13:46 - September 8, 2016

పర్యావరణానికి హాని కలుగుతోంది. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అత్యవసర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందరం బాధ్యతగా ఉండాలి. కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించుకోవాలి. ఈ నినాదాన్ని వ్యాపారానికి పెట్టుబడిగా ఎంచుకున్న మహిళా పారిశ్రామిక వేత్త అనుభవాలతో 'మానవి' 'స్పూర్తి' ప్రత్యేక కథనం.. కొత్తగా చేయాలి. కొత్తగా కనిపించాలి. కాలుష్యం లేకుండా ఉండాలి. అందంగా కనిపించాలి. అందరూ మెచ్చాలి. లాభసాటిగా ఉండాలి. ఈ ఆలోచనలే జ్యూట్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శైలజను భిన్నంగా నిలబెట్టాయి. బాధ్యతల భారంతో ఉద్యోగం, ఉపాధిని కొంతకాలం పక్కకు పెట్టినా, అభిరుచి ఆసక్తి ఉంటే, తిరిగి తమ శక్తియుక్తులను ఎప్పుడైనా వెలికితీయచ్చు. విజయాలు సాధించొచ్చు. నలుగురికి ఉపాధి చూపించొచ్చని రుజువు చేస్తున్న శైలజకి మానవి అభినందనలు తెలియచేస్తోంది. 

13:45 - September 8, 2016

ఉరుకుల పరుగుల జీవితంలో మాతృత్వాన్ని, ప్రసవాన్ని కూడా అంతే పరుగులాటలతో ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది. తర్వాతి కాలంలో అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా, తప్పని స్థితిలో సిజేరియన్స్ కే వెళ్తున్న పరిస్థితి. ఇలాంటి స్థితిలో ప్రకృతికి దగ్గరగా ఉంటే, యోగాను ఆశ్రయిస్తే చాలా సానుకూల ఫలితాలున్నాయంటున్నారు నిపుణులు. సహజ ప్రసవం తేలికగా జరుతుందంటున్నారు. ఆ పద్ధతులేంటో వీడియో క్లిక్ చేయడం..

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రెండు లిఫ్టులు ప్రారంభం

మహబూబ్ నగర్ : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రెండు లిఫ్టులను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ లిఫ్టుల ద్వారా 3 లక్షల 65వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 

కాకినాడలో రేపు పవన్ కళ్యాణ్ బహిరంగ సభ

తూర్పుగోదావరి : కాకినాడలో రేపు జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సభ జరుగనుంది. అభిమానులు, కార్యకర్తలు సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

13:36 - September 8, 2016

అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగాలా? అనారోగ్యం వెంటాడితేనో, అనుకోని రీతిలో వైకల్యానికి గురైతేనో జీవితం ప్రశ్నార్థకంగా మారిపోవాలా? కాదు కదా? సంకల్పబలముంటే, అన్నీ సాధ్యమే అంటున్నారు. వెన్నెముక సహకరించక పోయిన నిండైన వ్యక్తిత్వంతో నిలబడుతున్న వారు. సమస్యలెన్ని ఎదురైనా, నిటారుగా నిలబడే పరిస్థితి లేకపోయినా, అంతకుమించిన ఆత్మస్థయిర్యంతో నిలబడుతున్న వీరందరికీ మానవి అభినందనలు తెలియచేస్తోంది. మరెందరికో స్పూర్తిని కలిగించాలని ఆశిస్తోంది. 

13:32 - September 8, 2016

అమ్మ ఒడిలో హాయిగా నిద్రించాల్సిన పిల్లలు, నాన్న భుజాల మీద ఆడుకోవాల్సిన చిన్నారులు ఇప్పుడు గూడు లేక, నీడలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆదుకునే వారెవరైనా ముందుకొస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అమ్మా నాన్నకి దూరమైన ఈ చిన్నారులను, అయినవారి ఆదరణ లేని ఈ చిట్టితల్లులను ఆదుకునే వారు ముందుకొస్తారని మానవి భావిస్తోంది. ఏవైనా సంస్థలు వీరిని అక్కున చేర్చుకోవాలని ఆంక్షాస్తోంది.  

హోదాపై ప్రభుత్వం డిపెన్స్ లో పడలేదు : గోరంట్ల

హైదరాబాద్ : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే బీజేపీ.. జగన్ కు కులుపుకొని పోయినా అభ్యంతరం లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకహోదాపై ప్రభుత్వం డిపెన్స్ లో పడలేదని స్పష్టం చేశారు. 

విభజన హామీలు నెరవేర్చడానికి రెండేళ్లు సరిపోలేదా..? : రామకృష్ణ

విజయవాడ : విభజన హామీలు నెరవేర్చడానికి రెండేళ్లు సరిపోలేదా అని సీపీఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. లోటు బడ్జెట్ కూడా పూడ్చని కేంద్రం.... ప్రత్యేక హోదాకి సమానంగా నిధులు ఇస్తామంటే ఎలా నమ్మాలని అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం ధైర్యం తెచ్చుకోవాలన్నారు. ప్రత్యేకహోదాపై బాబు కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. 

 

13:21 - September 8, 2016

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ పై మంత్రి రావెల కిషోర్ బాబు నిప్పులు చెరిగారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్వలేకపోతుందని ఘాటుగా విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకహోదాపై అసెంబ్లీలో గందరగోళం సృష్టించడం దారుణమన్నారు. హోదా కోసం ఎవరి కృషి ఏపాటిదో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

13:11 - September 8, 2016

హైదరాబాద్ : ఏపీ ప్రత్యేక హోదా..ప్యాకేజీపై బుధవారం అర్ధరాత్రి కేంద్రం చేసిన ప్రకటనపై ఏ స్టేట్ మెంట్ చేయాలనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. ప్రత్యేక హోదా కాదని ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రకటనపై ఎలా స్పందించాలనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. కేంద్ర ప్రకటన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. హోదా కావాల్సిందేనని చెబుతూనే కేంద్ర ప్రకటనను స్వాగతిస్తున్నట్లు బాబు వెల్లడించారు. దీనిపై విపక్షాలు మాత్రం భగ్గుమన్నాయి. ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనంటూ గురువారం ఉదయం నుండి ఏపీ ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

వైసీపీ ఆందోళన..
మరోవైపు గురువారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో వైసీపీ అసెంబ్లీని స్తంభింప చేసింది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన నిర్వహించారు. దీనితో స్పీకర్ కోడెల సభను రెండుసార్లు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన చేయనున్నారు. ఇందుకు సంబంధింత మంత్రులు..కీలక నేతలతో బాబు చర్చలు జరుపుతున్నారు. ప్రకటన ఎలా ఉండాలి అనే దానిపై బాబు కసరత్తు చేస్తున్నారు. శాసనసభలో వైసీపీ చేస్తున్న ఆందోళన దృష్ట్యా శాసనసమండలిలో మధ్యాహ్నం 2.30గంటలకు ఓ ప్రకటన చేయాలని బాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఆ ప్రకటన ఎలా ఉంటుందో వేచి చూడాలి. 

13:00 - September 8, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదా విషయంలో ఏపీ శాసనసభలో రెండు సార్లు తీర్మానం చేయడం జరిగిందని, బుధవారం ఉదయం నుండి రాత్రి వరకు హై డ్రామా నడిపించారని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజు విమర్శించారు. గురువారం ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేతులెత్తేయడాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుబట్టింది. హోదా విషయంపై చర్చ చేపట్టాలని వైసీపీ పట్టుబట్టింది. దీనితో సభను స్పీకర్ కోడెల రెండుసార్లు వాయిదా వేశారు. ఈసందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం వద్ద దాడిశెట్టి రాజు టెన్ టివితో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు..రాజధాని భూ కుంభకోణాల నేపథ్యంలో కేంద్రాన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో బాబు ఉన్నారని తెలిపారు. ఐదుకోట్ల మంది ప్రజలను తాకట్టు పెట్టే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం జగన్ ముందునుండి పోరాటం చేయడం జరుగోందని, హోదాను ఎలాగైనా సాధించి తీరాలని వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. 

బీజేపీది నమ్మక ద్రోహం : మధు

వివజయవాడ : ఎపికి ప్రత్యేకహోదడా విషయంలో బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఎపికి ప్రత్యేకహోదా లేదు.. ప్రత్యేక ప్యాకేజీలో కూడా ఏమీ లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలన మరోసారి మోసం చేసింది. రాష్ట్ర ప్రజానీకం బంద్ కు సహకరించాలని కోరారు. 

12:43 - September 8, 2016

విజయవాడ : ప్రత్యేక హోదా..ప్యాకేజీ విషయంలో కేంద్రం మరోసారి మోసం చేసిందని..నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తరువాత దృష్టి సారిస్తే రైల్వే జోన్ ప్రకటించాలి..ఉక్కు పరిశ్రమ ప్రకటించాలి కదా అని ప్రశ్నించారు. సెంట్రల్ యూనివర్సిటీ..గిరిజన యూనివర్సిటీ పెద్ద వాటిని పక్కన పెట్టి చిన్న చిన్న వాటివి కల్పిస్తారా ? అని నిలదీశారు. పూర్తిస్థాయి నిధులు కల్పిస్తేనే యూనివర్సిటీలు నడుస్తాయన్నారు. మరోసారి నమ్మించి మోసం చేసిందని, నమ్మకద్రోహం చేసిందన్నారు. ఈ నమ్మక ద్రోహానికి టిడిపి జత కట్టిందని, అవకాశ వాదం ఎక్కువైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అఖిలపక్ష సమావేశం పిలవాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి బంద్ కు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
విభజన హామీలు నెరవేర్చడానికి రెండేళ్లు సరిపోలేదా..? : రామకృష్ణ
విభజన హామీలు నెరవేర్చడానికి రెండేళ్లు సరిపోలేదా అని సీపీఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. లోటు బడ్జెట్ కూడా పూడ్చని కేంద్రం.... ప్రత్యేక హోదాకి సమానంగా నిధులు ఇస్తామంటే ఎలా నమ్మాలని అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం ధైర్యం తెచ్చుకోవాలన్నారు. ప్రత్యేకహోదాపై బాబు కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:37 - September 8, 2016
12:35 - September 8, 2016

విశాఖపట్టణం : రైల్వే జోన్ అంశం విశాఖ జిల్లా వాసులను మోసం చేసిందని విపక్షాలు పేర్కొంటున్నాయి. ఉత్తరాంధ్ర చిరకాల వాంఛ రైల్వే జోన్ అని, ఎందుకు ప్రకటించడం లేదని టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖ రైల్వోజోన్ ప్రకటించాలనే డిమాండ్ తో ఎంపీ అవంతీ శ్రీనివాస్ గురువారం విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం దగ్గర పార్టీ కార్యకర్తలతో కలసి దీక్ష చేపట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని దశల వారీగా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రెండున్నరేళ్లు అయినా కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ప్రకటించ లేదని, రైల్వే జోన్ ఇవ్వకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మరోసారి స్పష్టం చేశారు. 

జైట్లీ ప్రకటనతో పోలవరానికి లబ్ధి : యనమల

హైదరాబాద్ : అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి యనమల రామకృష్ణుడు చిట్ చాట్ నిర్వహించింది. నిన్నటి జైట్లీ ప్రకటనతో పోలవరానికి లబ్ధి చేకూరిందని యనమల అన్నారు. తొలుత 70 శాతం నిధులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 100శాతం నిధులు కేంద్రమే భరిస్తుందన్నారు. విదేశీ రుణంలో 90 శాతం కేంద్రమే చెల్లిస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో వెనక్కి తగ్గేదిలేదన్నారు. 

 

12:24 - September 8, 2016

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. తొలిసారి వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై తెరకెక్కనున్న 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌' చిత్రం కోసం వీరు కలవబోతున్నారు. ఈ చిత్రానికి విజరుకృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. అమీర్‌ నటించిన 'ధూమ్‌ 3' చిత్రానికి కూడా విజరుకృష్ణ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాపై బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ నెలకొంది. వచ్చే ఏడాది దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

12:15 - September 8, 2016

విజయవాడ : ప్రత్యేక హోదాపై కేంద్రం చేతులేత్తయడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. బుధవారం అర్ధరాత్రి కేంద్రం చేసిన ప్రకటనపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. గురువారం ఉదయం ఏపీలో పలు జిల్లాలో టిడిపి, బిజెపి పార్టీలు తప్పించి మిగతా పార్టీలన్నీ రోడ్డెక్కాయి. పలు కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాయి. వీరిని అరెస్టు చేయడంతో అక్కడక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

విశాఖలో..
రైల్వే జోన్ విజయవాడకు తరలివెళుతోందనే వస్తున్న ప్రకటనలపై వామపక్షాలు భగ్గుమన్నాయి. వెంటనే విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశాయి. రైల్వే రైల్వే డీఎంఆర్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నేత సీహెచ్ నర్సింగరావు టెన్ టివితో మాట్లాడారు. విజయవాడకు తరలించాలనే దానిని అడ్డుకుంటామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని తెలిపారు. బీజేపీ, టిడిపి కుట్రలను ప్రజానీకం సహించదన్నారు. విశాఖ జోన్ సాధించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, లేనిపక్షంలో ఉత్తరాంధ్ర పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఓ మహిళా నేత తెలిపారు.

విజయవాడలో..
విజయవాడలో కూడా ఆందోళనలు జరిగాయి. కార్యకర్తలు పెద్ద ఎత్తున్న రోడ్లుపై బైఠాయించారు. ప్రత్యేక హోదా కావాలని, ప్యాకేజీ వద్దని నినదించారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం మోసం చేసిందని విమర్శించారు. 

చిత్తూరులో..
ప్రత్యేక హోదా కావాలంటూ చిత్తూరులో వామపక్షాలు ఉద్యమాట బట్టాయి. బీఎస్ఎన్ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ప్యాకేజీ వద్దని..హోదా కావాలని నినదించారు. నిరసన తెలియచేస్తున్న వీరిని పోలీసులు అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. 

12:13 - September 8, 2016

హీరో ధనుష్‌ త్వరలో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'పవర్‌ పాండి' పేరుతో తమిళంలో తెరకెక్కుతున్న చిత్రానికి ధనుష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. చిత్రం ఫస్ట్‌లుక్‌ను ధనుష్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో రాజ్‌కిరణ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సహాయ నటులుగా ప్రసన్న, ఛాయాసింగ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా : వెల్‌రాజా కాగా... సీన్‌ రోల్డన్‌ సంగీతం అందిస్తున్నారు. ధనుష్‌ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

12:04 - September 8, 2016

'చరణ్' కొత్త సినిమా కోసం 'మెగా ఫ్యాన్స్' ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. 'చెర్రీ' గత చిత్రాలు నిరాశపరచడం ఒకటైతే, రెండోవది మెగా తనయుడు కొత్త సినిమాలో చాలా డిఫరెంట్ లుక్ తో దర్శనమివ్వబోతున్నాడు. దీంతో సహజంగానే 'చరణ్' కొత్త సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 'సురేందర్ రెడ్డి' దర్శకత్వం వహిస్తోన్న 'ధ్రువ' సినిమా ప్రారంభోత్సవం రోజే దసరాకు రిలీజ్ చేస్తామని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం షూటింగ్ ని షూటింగ్ ని యూనిట్ శరవేగంగా కంప్లీట్ చేస్తోంది. అయితే ఇప్పుడు అనుకోని విధంగా 'అరవింద్ స్వామి' రూపంలో ఈ చిత్రం రిలీజ్ రెండు నెలలు వెనక్కి వెళ్లినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

రెండు నెలల సమయం..
నిజానికి 'ధృవ' చిత్రం వచ్చే నెల అక్టోబర్ న రిలీజ్ కావాల్సింది. అయితే 'అరవింద్ స్వామి' అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమయ్యేలా కనిపిస్తోందని వినికిడి. దీంతో ఆయనకు సంబంధించిన షూటింగ్ కి మరింత టైం పట్టనుందట. దీంతో ఈ చిత్రానికి దసరా నుంచి తప్పించి డిసెంబర్ విడుదల చేయాలని 'చరణ్' భావిస్తున్నాడట. అంతే కాదు రెండు నెలల సమయం దొరకడంతో ప్రమోషన్స్ కి కూడా కావాల్సినంత టైం దొరినట్లైందని యూనిట్ భావిస్తోంది.

స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టులో వాదనలు

హైదరాబాద్ : స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ వాదనలు వినిపించారు. 

విశాఖకు రైల్వే జోన్ కోరుతూ ఎంపీ అవంతి శ్రీనివాస్ దీక్ష

విశాఖ : గాంధీ విగ్రహం వద్ద ఎంపీ అవంతి శ్రీనివాస్ దీక్ష చేపట్టారు. విశాఖకు రైల్వేజోన్ కోరుతూ అవంతి శ్రీనివాస్ ఆందోళన చేపట్టారు. 

మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్ : మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. సభలో ప్రత్యేక హోదా ప్రకటనపై చంద్రబాబు చర్చిస్తున్నారు. 

11:44 - September 8, 2016

హైదరాబాద్ : వైసీపీ సభ్యులు సంఘ విద్రోహ శక్తులని టిడిపి సభ్యురాలు అనిత పేర్కొన్నారు. గురువారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో వైసీపీ మొదిటిలాగానే ఆందోళన చేపట్టింది. ప్రత్యేక హోదా..ప్యాకేజీపై బుధవారం అర్ధరాత్రి చేసిన ప్రకటనను వైసీపీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రత్యేక హోదాపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల అనంతరం చర్చిద్దామని, ప్రత్యేక హోదాపై ప్రభుత్వం ఓ ప్రకటన చేస్తుందని అనంతరం దీనిపై చర్చించాలని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై వైసీపీ ఏమాత్రం అంగీకరించలేదు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను స్పీకర్ కోడెల రెండు సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా టిడిపి, వైసిపి ఎమ్మెల్యేలతో అసెంబ్లీ ప్రాంగణం వద్ద టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఇరువురు పార్టీ నేతలు ఆరోపణలు గుప్పించుకున్నారు. చర్చించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేదని టిడిపి సభ్యురాలు అనిత పేర్కొన్నారు. ప్రత్యేక హోదా..ప్యాకేజీపై ప్రభుత్వం స్టేట్ మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, గతంలో కూడా ఎన్నో సార్లు చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తులు చేశారని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారని ప్రశ్నించారు. సంఘ విద్రోహ శక్తులుగా వైసీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బీఏసీ సమావేశంలో ఒప్పుకున్నదే జరుగుతోందని, ప్రశ్నోత్తరాలు జరగడం సబబే అని తెలిపారు. అనంతరం ప్రత్యేక హోదా గురించి మాట్లాడవచ్చు కదా ? అని తెలిపారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని వైసీపీని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. దీనికి వైసిపి సభ్యుడు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేక హోదా కంటే ముఖ్యమైన మరో విషయం ఉండదని, దీనిపై చర్చించాలని పట్టుబట్టడం జరిగిందన్నారు. గొడవ చేస్తూనే ఉన్నా కూడా ప్రభుత్వానికి చెందిన సభ్యులకు మాత్రం మైక్ మాత్రం ఇస్తూనే ఉంటారని తెలిపారు. 

గుంటూరులో సీపీఎం, సీపీఐ, వైసీపీ నేతలు ఆందోళన

గుంటూరు : బీఎస్ ఎన్ ఎల్ కార్యాలయం వద్ద సీపీఎం, సీపీఐ, వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. బీఎస్ ఎన్ ఎల్ కార్యాలయంలోకి నేతలు దూసుకెళ్లారు. 

కేంద్ర ప్రకటనను నిరసిస్తూ వామపక్షాలు, వైసీపీ సభ్యులు నిరసన

విజయవాడ : హోదాపై కేంద్రం ప్రకటనకు నిరసిస్తూ రేడియో స్టేషన్ వద్ద వామపక్షాలు, వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. హోదాపై కేంద్ర ప్రకటనకు నిరసిస్తూ రేడియో స్టేషన్ వద్ద వామపక్షాలు, వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మధు, రామకృష్ణ, వైసీపీ నేత పార్థసారథి పాల్గొన్నారు. 

11:32 - September 8, 2016

చిత్తూరు : ప్రత్యేక హోదాపై చేతులేత్తిసిన కేంద్రంపై వామపక్షాలు కన్నెర్ర చేశాయి. తొలి నుండి పోరాటం చేస్తున్న వామపక్షాలు ఆందోళనను మరింత ఉధృతం చేశాయి. తిరుపతిలో గురువారం ఉదయం వామపక్షాలు ఆందోళన నిర్వహించాయి. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి టెన్ టివితో మాట్లాడారు. ఐదేళ్లు కాదు..పదేళ్లు కావాలని ఆనాడు చెప్పిన వెంకయ్య ఈనాడు దిగజారిపోయారని తీవ్రంగా విమర్శించారు. నీచంగా మోసం చేయవచ్చని బీజేపీ తీరు తేటతెల్లం చేస్తోందని, టిడిపి ఎందుకు మోకారిల్లుతోందో తెలియడం లేదన్నారు. కేసులకు భయపడి..అవినీతికి భయమో..కేంద్రం ఇస్తున్న ప్యాకేజీలు..నిధుల్లో కమిషన్ ఆగిపోతుందా ? అనే భయం ఉందా ? అని ప్రశ్నించారు. కేంద్రం వైఖరికి నిరసన తెలియచేస్తుంటే పోలీసులను మోహరించి అరెస్టు చేయడం సబబు కాదన్నారు. దీనింతటినీ నిరసిస్తూ ఎల్లుండి బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని, ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మరింత వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఎపి అసెంబ్లీలో జీఎస్ టీ బిల్లును ప్రవేశపెట్టిన యమనల

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీలో ఆర్థికమంత్రి యమనల రామకృష్ణుడు జీఎస్ టీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా  వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు మధ్యే యమనల బిల్లును ప్రవేశపెట్టారు. 
 

11:30 - September 8, 2016

విజయవాడ : ప్రత్యేక హోదా..ప్యాకేజీలపై కేంద్రం చేసిన ప్రకటనపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. బుధవారం అర్ధరాత్రి కేంద్ర మంత్రులు జైట్లీ, వెంకయ్య నాయుడు లు ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనను విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. గురువారం ఉదయం విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద వామపక్షాలు..వైసీపీ సభ్యులు..ప్రజా సంఘాలు బైఠాయించారు. ఈ సందర్భంగా టెన్ టివితో పలువురు నేతలు మాట్లాడారు. టిడిపి అవకాశవాదానికి తారాస్థాయి అని, ప్రత్యేక హోదా లేదని కేంద్రం తిరస్కరించిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. పదవులు..అధికారం కోసం బీజేపీతో తెగదెంపులు చేసుకోకుండా ఉంటున్నారని తెలిపారు. పదో తేదీకి బంద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. బాబు సంతృప్తి చెందారని..రాష్ట్ర ప్రజలు మాత్రం సంతృప్తి చెందలేదని సీపీఎం నేత బాబురావు పేర్కొన్నారు. బీజేపీ దగా..బాబు మోసాన్ని ప్రజలు ఎండగడుతున్నారని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత కోసం పోరాడుతున్నామని ప్రత్యేక హోదా సాధన సమితి చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. దొంగ ప్యాకేజీ అనౌన్స్ చేశారని, హోదాను ఎత్తివేశారని విమర్శించారు. హోదా కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రులు పోరాట యోధులని, నిజమైన పోరాటం పదో తేదీ నుండి ప్రారంభమౌతుందని సీపీఐ నేత పేర్కొన్నారు. మిగతా వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

తెలంగాణ ప్రభుత్వంతో జెడ్ ఎఫ్ గ్రూప్ ఒప్పందం

హైదరాబాద్ : నగరంలో ఇండియా టెక్నికల్ సెంటర్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో జెడ్ ఎఫ్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

11:22 - September 8, 2016

హైదరాబాద్ : జీఎస్టీ బిల్లును ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. గురువారం నాడు ఏపీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. 'ప్రత్యేక హోదా..ప్యాకేజీ'పై కేంద్రం బుధవారం అర్ధరాత్రి చేసిన ప్రకటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. వైసీపీ సభ్యులు అసెంబ్లీలో తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ప్రత్యేక హోదాపై చర్చించాలని పట్టుబట్టాయి. దీనిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, అనంతరం చర్చించాలని ప్రభుత్వం పేర్కొంది. కానీ వైసీపీ సభ్యులు శాంతించలేదు. దీనితో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్యే జీఎస్టీ బిల్లును ఏపీ శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడారు. వైసీపీ తీరును తప్పుబట్టారు.

సస్పెండ్ చేయాలన్న బీజేపీ..
స్పీకర్ సీటు వద్దనున్న సభ్యులు పక్కకు రావాలని బీజేపీ సభ్యుడు సూచించారు. ఇందుకు జగన్ కృషి చేయాలని, ఎంతో వినయంగా..స్పీకర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. చూస్తూ ఊరుకోవడానికి ఏ ప్రజాప్రతినిధి లేరని పేర్కొన్నారు. సభ్యులను సస్పెండ్ చేయాల్సినవసరం ఉందని ఆయన తెలిపారు. 

వారిని సస్పెండ్ చేయాలి : విష్ణుకుమార్ రాజు

హైదరాబాద్ : పోడియం వద్ద బైఠాయించిన సభ్యులను సస్పెండ్ చేయాలని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. కాగితాలు చింపి సిబ్బందిపై విసురుతున్న సభ్యులను సస్పెండ్ చేయాలని.. లేదంటే మేము వెల్ లోకి వస్తామన్నారు. 

ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రటకన చేస్తారు : యనమల

హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రటకన చేస్తారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. వైసీపీ సభ్యులందరూ వచ్చి కూర్చోవాలని కోరారు. 

 

ఎపి శాసనమండలి నుంచి ప్రతిపక్షాలు వాకౌట్

హైదరాబాద్ : ఎపి శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. హోదాపై కేంద్రం ప్రకటనకు నిరసనగా ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.

 

ఎపి అసెంబ్లీ మళ్లీ పది నిమిషాలపాటు వాయిదా

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ మళ్లీ వాయిదా పడింది. స్పీకర్ రెండోసారి సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభంకాగానే ఎపి ప్రత్యేకహోదాపై వైసీపీ సభలో నిరసన తెలిపింది. సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో పది నిమిషాలపాటు సభను వాయిదా వేశారు.   

 

11:03 - September 8, 2016

ప్రత్యేకహోదాపై సీపీఎం, సీపీఐ నేతలు నిరసన

చిత్తూరు : ప్రత్యేకహోదాపై కేంద్రం ప్రకటనను నిరసిస్తూ తిరుపతిలోని బీఎస్ ఎన్ ఎల్ కార్యాలయం వద్ద సీపీఎం, సీపీఐ నేతలు నిరసన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. 

 

10:37 - September 8, 2016

హైదరాబాద్ : ఏపీ మండలి వర్షాకాల సమావేశాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. ప్రత్యేక హోదా..ప్యాకేజీపై కేంద్రం చేసిన ప్రకటనపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. కానీ దీనికి ఛైర్మన్ అనుమతినివ్వలేదు. ప్రభుత్వం ఓ ప్రకటన చేస్తుందని, అనంతరం దీనిపై విపక్షాలు సమాధానం చెప్పవచ్చని మంత్రి గంటా పేర్కొన్నారు. చివరకు ప్రశ్నోత్తరాలను మండలి ఛైర్మన్ చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన యూనివర్సిటీలపై టిడిపి సభ్యులు పలు ప్రశ్నలను ప్రభుత్వానికి సంధించారు. మదనపల్లికి టూరిజం యూనివర్సిటీ వస్తోందని, చిత్తూరు జిల్లాలో స్థలం సేకరణ చూస్తున్నారని గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు పేర్కొన్నారు. మదనపల్లిలో టూరిజం యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన యూనివర్సిటీని విజయనగరంలో సంతోషం పెట్టడం సంతోషంగా ఉందని, ఎక్కడ పెడుతున్నారో క్లారిటీ లేదని టిడిపి సభ్యురాలు సంధ్యారాణి ప్రశ్నించారు. విజయనగరంలో అశోక్ గజపతి రాజుకు చెందిన స్థలం ఉందని, పార్లమెంట్ నియోజకవర్గానికి దగ్గరగా ఉంటుందని తెలిపారు. అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో ఎలాంటి ఇనిస్టిట్యూట్స్ లేవని, తమను కూడా పట్టించుకోవాలన్నారు.
సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానం చెప్పారు. అన్ని జిల్లాలకు సమాన బాధ్యత ఇవ్వాలని బాబు సూచనల మేరకు ఏడు ఇనిస్టిట్యూట్స్ కొన్ని జిల్లాల్లో పెట్టడం జరిగిందన్నారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో ఇనిస్టిట్యూట్స్ లేవని, ట్రిపుల్ ఐటీ ఒంగోలులో పెట్టడం జరుగుతోందన్నారు. ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాన్ని మార్చలేమని, కొత్తవలస మండలంలోని రెల్లిలో ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. నెల్లూరులో యూనివర్సిటీ ఉందని, భవిష్యత్ లో ఏవైనా వచ్చినప్పుడు సభ్యులు చెప్పిన సూచనలు పరిగణలోకి తీసుకుంటామని మంత్రి గంటా తెలిపారు. 

కేంద్రం ప్రకటనను మేం ఆహ్వానించలేదు : మంత్రి అచ్చెన్నాయుడు

హైదరాబాద్ : ఎపికి ప్రత్యేకహోదాపై కేంద్రప్రభుత్వ ప్రకటనను తాము ఆహ్వానించలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఇప్పటికీ తాము ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. ప్యాకేజీపై అసెంబ్లీలో ప్రకటన చేస్తామని చెప్పారు. జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 

 

10:02 - September 8, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వానికి ఎందుకంత భయమని వైసీపీతో కలిసి రావాలని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీనివాసుల రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 'ప్రత్యేక హోదా'పై కేంద్రం చేసిన ప్రకటనను వైసీపీ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ సభలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టాయి. ప్రత్యేక హోదాపై చర్చించడానికి అనుమతినివ్వాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం మాత్రం ఒక స్టేట్ మెంట్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. ఈ సందర్భంగా టెన్ టివితో వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసుల రెడ్డి మాట్లాడారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని..ఎన్నో పరిశ్రమలు..రాయితీలు..అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. ఇందుకు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలే ఉదహారణ అని చెప్పుకొచ్చారు. ఎందుకంత భయం అని వైసీపీతో కలిసి రావాలని సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాల నేపథ్యంలో చేయడం కరెక్టు కాదని శ్రీనివాసుల రెడ్డి పేర్కొన్నారు. 

09:56 - September 8, 2016

హైదరాబాద్ :'ప్రత్యేక హోదా' విషయంలో ఏపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వైసీపీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత స్వార్థాన్ని అలుసుగా తీసుకుని కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు లు ఏపీ రాష్ట్రాన్ని అథోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు. ఐదేండ్లు కాదు..పదేండ్లు ఇవ్వాలని చెప్పిన వెంకయ్య నాయుడు ఎక్కడ దాక్కున్నారని విమర్శించారు. భగవంతుడి సాక్షిగా ఇచ్చిన హామీని ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ, టిడిపి పార్టీలు దొంగ నాటకాలు ఆడుతోందని, ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు..తెచ్చేంత వరకు అన్ని పార్టీలను..ప్రజలను కలుపుకుని వైసీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 

ఎల్లుండి ఎపి బంద్ కు ప్రతిపక్షాలు పిలుపు

హైదరాబాద్ : ప్రతిపక్షాలు ఎల్లుండి ఎపి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఎపి ప్రత్యేకహోదాపై కేంద్రం ప్రకటనకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ కు వైసీపీ, లెఫ్టు పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఎల్లుండి జాతీయ రహదారుల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 

09:50 - September 8, 2016

హైదరాబాద్ : 'ప్రత్యేక హోదా'పై మాట్లాడే హక్కు వైసీపీకి లేదని, ఆ పార్టీకి చెందిన నేతలు గుండెలపై చేయి వేసుకొని చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యులు చేపడుతున్న ఆందోళనపై ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత రెండు సంవత్సరాలుగా 'ప్రత్యేక హోదా' గురించి కేంద్రం దృష్టికి తీసుకరావడం జరుగుతోందన్నారు. దీనితో కేంద్రం నిన్న ఓ ప్రకటన చేసిందని తెలిపారు. సభ కూడా రెండుసార్లు తీర్మానం చేయడం జరిగిందన్నారు. అనేక విధాలుగా కేంద్రంపై వత్తిడి తీసుకరావడం జరుగుతోందన్నారు. ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదాపై కాకుండా సొంత పనుల గురించి మాట్లాడుతున్నారని వైసీపీని ఉద్ధేశించి ఘాటు విమర్శలు గుప్పించారు. దీనితో సభలో ఇంకా గందరగోళం నెలకొంది. 

09:49 - September 8, 2016

హైదరాబాద్ : 'స్పెషల్ స్టేటస్' పై కేంద్రం చేసిన అనౌన్స్ మెంట్ పై ప్రభుత్వం స్పందించాల్సినవసరం ఉందని, సభలో ప్రభుత్వం చేసే ప్రకటనపై చర్చించవచ్చని ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల పేర్కొన్నారు. వైసీపీ సభ్యులు చేస్తున్న ఆందోళనను ఆయన తప్పుబట్టారు. బీఏసీ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని, కానీ వైసీపీ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. జాతీయ గీతాలాపన బాయికాట్ చేశారని, వీరికి దేశభక్తి లేదని విమర్శించారు. ఎలాంటి ప్రశ్నలకైనా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని యనమల ప్రకటించారు. 

ఎపి అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా పడింది. ఎపి అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ప్రత్యేహోదాపై కేంద్రం వైఖరికి నిరసనగా వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. ఈనేపథ్యంలో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

 

09:44 - September 8, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. అందరూ ఊహించినట్టే జరుగుతోంది. ఈసారి కూడా సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రత్యేక హోదాపై కేంద్రం చేసిన ప్రకటనను వైసీపీ తీవ్ర అభ్యంతరం తెలియచేసింది. సభను అడ్డుకుంటామని పేర్కొంది. అనుకున్నట్లుగానే సభను అడ్డుకొంటోంది. దీనితో సభను స్పీకర్ కోడెల పది నిమిషాల పాటు వాయిదా వేశారు...

బాబు నివాళి..వైసీపీ ర్యాలీ..
అంతకంటే ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి అసెంబ్లీకి వచ్చారు. ప్రతిపక్ష వైసీపీ సభ్యులు 'నల్ల డ్రస్సులు' వేసుకుని టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహం నుండి అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. బుధవారం అర్ధరాత్రి కేంద్రం చేసిన ప్రకటనను..చంద్రబాబు ఈ ప్రకటనను ఆహ్వానిస్తున్నానడం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని, ఎల్లుండి రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు.

బీఏసీ సమావేశం..
స్పీకర్ కోడెల అధ్యక్షతన ఏపీ బీఏసీ సమావేశం జరిగింది. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, సాయంత్రం 4నుంచి 9గంటల వరకూ రెండు పూటలా సభ నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. 15 రోజుల పాటు సభ నడపాలని వైసీపీ డిమాండ్ చేసింది.

సభలో గందరగోళం...
జాతీయ గీతాలాపనను వైసీపీ బాయ్ కాట్ చేసింది. జాతీయగీతాన్ని బాయికాట్ చేయడం ప్రతిపక్షానికి సలక్షణం కాదని శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల పేర్కొన్నారు. అనంతరం ఏపీ అసెంబ్లీలో తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. ప్రత్యేక హోదా..ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ..నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. దీనితో సభ ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సందర్భంగా ప్రభుత్వ మంత్రులు..సభ్యులు ఒక్కొక్కరుగా మాట్లాడారు..

'హోదా'పై సభలో ప్రకటన – యనమల..
స్పెషల్ స్టేటస్' పై కేంద్రం చేసిన అనౌన్స్ మెంట్ పై ప్రభుత్వం స్పందించాల్సినవసరం ఉందని, సభలో ప్రభుత్వం చేసే ప్రకటనపై చర్చించవచ్చని యనమల పేర్కొన్నారు. బీఏసీ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని, కానీ వైసీపీ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. జాతీయ గీతాలాపన బాయికాట్ చేశారని, వీరికి దేశభక్తి లేదని విమర్శించారు. ఎలాంటి ప్రశ్నలకైనా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని యనమల ప్రకటించారు.


వైసీపీ నేతలు గుండెలపై చేయివేసుకోండి - బోండా..
ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదని, ఆ పార్టీకి చెందిన నేతలు గుండెలపై చేయి వేసుకొని చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యులు చేపడుతున్న ఆందోళనపై ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత రెండు సంవత్సరాలుగా 'ప్రత్యేక హోదా' గురించి కేంద్రం దృష్టికి తీసుకరావడం జరుగుతోందన్నారు. దీనితో కేంద్రం నిన్న ఓ ప్రకటన చేసిందని తెలిపారు. సభ కూడా రెండుసార్లు తీర్మానం చేయడం జరిగిందన్నారు. అనేక విధాలుగా కేంద్రంపై వత్తిడి తీసుకరావడం జరుగుతోందన్నారు. ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదాపై కాకుండా సొంత పనుల గురించి మాట్లాడుతున్నారని వైసీపీని ఉద్ధేశించి ఘాటు విమర్శలు గుప్పించారు. దీనితో సభలో గందరగోళం నెలకొంది.

బాబు ప్రకటనను ఆహ్వానిస్తారా - జగన్..
ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీ రెండు సార్లు తీర్మానాలు చేయడం జరిగిందని, ప్రత్యేక హోదా కుదరదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనను సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తున్నామని అంటారా ? అని సూటిగా ప్రశ్నించారు.
 అనంతరం మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు మాట్లాడారు. అసెంబ్లీ జరిగిన తీరు..సభ్యుల నినాదాలు..ఆందోళనలు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నామని చంద్రబాబు ఎలా అంటారు : జగన్

హైదరబాద్ : ఇదే సభలో ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసి పంపితే... ఎపి ప్రత్యేకహోదాపై అరుణ్ జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నామని సీఎం చంద్రబాబు ఎలా అంటారని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని మండిపడ్డారు. ప్రత్యేకహోదాతోనే ఎపికి న్యాయం జరుగుతుందని చెప్పారు. 

రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ నిరసన : బోండా

హైదరాబాద్ : రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ నిరసన తెలుపుతుందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ విఫలం అయిందన్నారు. గల్లీలో కాదు.... ఢిల్లీలో వైసీపీ పోరాటం చేయాలని తెలిపారు.

వైసీపీకి దేశభక్తి లేదు : యనమల

హైదరాబాద్ : వైసీపీకి దేశభక్తి లేదని ఎపి రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఎపి అసెంబ్లీ సమావేశాలలో యనమల మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

ఎపి అసెంబ్లీలో గందరగోళం

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ప్రత్యేహోదాపై కేంద్రం వైఖరికి నిరసనగా వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేస్తున్నారు. 

 

కొనసాగుతున్న ఎపి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభం ఆయ్యాయాయి. మూడు రోజులపాటు సమావేశాలు జరుగున్నాయి. రెండు పూటల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 

09:17 - September 8, 2016

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రానికి 'ప్రత్యేక హోదా..ప్యాకేజీ'పై కేంద్రం అర్ధరాత్రి చేసిన ప్రకటనపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహం నుండి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. ఆ రోజు విభజన సమయంలో కెమెరాలు ఆఫ్ చేసి..లైవ్ టెలికాస్ట్ ఆపు చేసి, ఏపీ ఎంపీలందరినీ బయటకు పంపించేసి విభజన చేయడం జరిగిందని గుర్తు చేశారు. అదే విధంగా నిన్న 'ప్రత్యేక హోదా..ప్యాకేజీ'పై కేంద్రం ప్రకటన చేసిందని, 'స్పెషల్ స్టేటస్' ఇవ్వమని ప్రెస్ మీట్ చూస్తే అర్థమౌతుందన్నారు.

రాష్ట్ర వ్యాప్త బంద్...
'స్పెషల్ కేటగిరి'కి మించిన 'ప్యాకేజీ' ప్రకటన వస్తుందని రకరకాల లీక్ లు మీడియాకు అందించారని, దీనితో అందరూ ఏదో ప్రకటన వస్తుందని ఆశించారని పేర్కొన్నారు. కానీ చెవిలో క్యాబేజీ ప్రకటన చేశారని ఎద్దేవా చేశారు. మంత్రులను దగ్గరగా పెట్టి ఏపీ సీఎం బాబు ప్రకటన చేయించారని, స్పెషల్ హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే పారిశ్రామిక రాయితీలు వస్తాయని తెలిపారు. కేంద్ర చేసిన ప్రకటన..ఈ ప్రకటనను సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తున్నానడం యువతను ఖూనీ చేశారని తెలిపారు. ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిందని..సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కరిగా సంబంధించిందా ? అని సూటిగా ప్రశ్నించారు. వీరిద్దరి వైఖరికి నిరసనగా ఎల్లుండి ఏపీ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. 

09:12 - September 8, 2016

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం స్పీకర్ కోడెల ప్రశ్నోత్తరాలను చేపట్టారు. 

ఎల్లుండి ఏపీ రాష్ట్ర వ్యాప్త బంద్ - జగన్..

హైదరాబాద్ : ప్రత్యేక హోదా..ప్యాకేజీ ప్రకటనపై కేంద్రం చేసిన ప్రకటన...ఈ ప్రకటనను సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తున్నానడం కరెక్టు కాదని వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. దీనికి నిరసనగా ఎల్లుండి ఏపీ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు కమ్యూనిస్టు పార్టీలతో మాట్లాడడం జరిగిందని, అందరం కలిసికట్టుగా ఉండి బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

ఎన్టీఆర్ ఘాట్ వద్ద సీఎం బాబు..

హైదరాబాద్ :ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సభకు హాజరయ్యే ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. 

08:50 - September 8, 2016
08:47 - September 8, 2016
08:42 - September 8, 2016

విక్రమ్‌ హీరోగా, నయనతార, నిత్యమీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న 'ఇంకొక్కడు' చిత్రం ఇవాళ విడుదల కానుంది. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తమిళంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 'ఇంకొక్కడు' పేరుతో ఎన్‌.కె.ఆర్‌.ఫిలింస్‌ బ్యానర్‌పై ఆ సంస్థ అధినేత నీలం కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విక్రమ్‌, నయనతార, నిత్యమీనన్‌ నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు ఏమాత్రం 
ఆదరిస్తారో చూడాలి మరి. 

 

ప్రత్యేక హోదాపై నేడు వైసీపీ వాయిదా తీర్మానం

హైదరాబాద్ : ఇవాళ ఉదయం 9 గంటలకు ఎపి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేకహోదాపై సభలో వైసీపీ వాయివా తీర్మానం ప్రవేశపెట్టనుంది. 

ప్రత్యేక హోదాపై నేడు వైసీపీ వాయిదా తీర్మానం

హైదరాబాద్ : ఇవాళ ఉదయం 9 గంటలకు ఎపి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేకహోదాపై సభలో వైసీపీ వాయివా తీర్మానం ప్రవేశపెట్టనుంది. 

ఉదయం 9 గం.లకు ఎపి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : ఇవాళ ఉదయం 9 గంటలకు ఎపి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జీఎస్ టీ బిల్లుతోపాటు మరో మూడు బిల్లులు సభ ముందకు రానున్నాయి. వీటిపై సభ్యులు చర్చించనున్నారు. 

 

కాసేపట్లో బీఏసీ సమావేశం ప్రారంభం

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కాసేపట్లో బీఏసీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

08:11 - September 8, 2016

ఎపికి ప్రత్యేకహోదా కావాలని వక్తలు కోరారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత విజయ్ కుమార్, బీజేపీ నేత రాకేష్ రెడ్డి, వైసీపీ నేత కరణం ధర్మశ్రీ, సీపీఎం నేత ఎంఎ గఫూర్ పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ, టీడీపీ రెండు పార్టీలు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాయని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం...

 

08:05 - September 8, 2016
08:01 - September 8, 2016

శ్రామిక మహిళల సమస్యలను పరిష్కరించాలని శ్రామిక మహిళా సంఘం నేత ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై జనపథంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. 'ఈ నెల 28 నుంచి గుంటూరులో శ్రామిక మహిళల జాతీయ మహాసభలు జరగబోతున్నాయి.   కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రయివేట్ సంస్థలు, విభిన్న స్కీమ్ లలో పనిచేసే మహిళా ప్రతినిధులు ఈ సభలకు హాజరుకాబోతున్నారు. శ్రామిక మహిళా జాతీయ మహాసభల లక్ష్యం ఏమిటి? ఈ సభల్లో ఏయే అంశాలను చర్చించబోతున్నారు? ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న మహిళల ఎదుట ఉన్న  చాలెంజెస్ ఏమిటి?  బ్యాంకింగ్,   ఇన్య్సూరెన్స్ లాంటి ఫైనాన్సియల్ రంగంలో పనిచేస్తున్నవారి  పరిస్థితి ఏమిటి? వివిధ రకాల ప్రయివేట్ పరిశ్రమలు, సెజ్ లలో పనిచేస్తున్న మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వివిధ రకాల ప్రభుత్వ స్కీమ్ లలో పనిచేస్తున్న మహిళల వర్కింగ్ కండిషన్స్ ఎలా వున్నాయి? వర్కింగ్ ఉమెన్ విషయంలో ప్రభుత్వ పాలసీలు ఎలా వున్నాయి? అనే అంశాలపై ధనలక్ష్మీ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియాలో చూద్దాం...

 

07:53 - September 8, 2016

ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో వర్కింగ్ ఉమెన్ సంఖ్య తక్కువ.  టీచింగ్, బ్యాంకింగ్, ఇన్య్సూరెన్స్, ఐటీ లాంటి రంగాలలో ఇటీవల కాలంలో మహిళల సంఖ్య పెరుగుతున్న మాట నిజమే అయినా, మొత్తం వర్క్ ఫోర్స్ లో మహిళల సంఖ్య తగ్గిపోతున్నట్టు అంతర్జాతీయ సంస్థల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
పెరుగుతున్న ఉద్యోగిణిల సంఖ్య  
మన దేశంలో మహిళల అక్షరాస్యతతో పాటు ఉద్యోగిణిల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా టీచింగ్, బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, పోస్టల్స్; ఐటి లాంటి ఫైనాన్సియల్, సేవా రంగాలలో మహిళల సంఖ్యతో పాటు అధికారిణిల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదొక శుభపరిణామం.  1990 నుంచి 2005 మధ్య కాలంలో  వర్కింగ్ ఉమెన్  సంఖ్య 37 శాతానికి పెరిగింది. అయితే, 2005 నుంచి 2014 మధ్య కాలంలో మన దేశంలో వర్కింగ్ ఉమెన్ సంఖ్య  27శాతానికి తగ్గినట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయనం వెల్లడించింది. ఇది ఆందోళన కలిగించే పరిణామం.  వర్కింగ్ ఉమెన్ విషయంలో మన ఆలోచనా ధోరణిని, మన విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. 
పెరుగుతోన్న పట్టణజనాభా సంఖ్య 
మన దేశంలో గత కొన్నేళ్లుగా పట్టణజనాభా సంఖ్య పెరుగుతోంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి.  పట్టణాలలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పనిచేస్తే తప్ప ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టం.  వివిధ సాంఘిక సంస్కరణల, ఉద్యమాల ఫలితంగా మహిళల విద్యా స్థాయి, చైతన్యాలు పెరగడానికి తోడు  కుటుంబ ఆర్థిక అవసరాలు కూడా వైట్ కాలర్ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తున్నాయి.  వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, తమ తమ రంగాలలో రాణిస్తున్న మహిళలకు కొదవలేదు.  కెరీర్ లో అత్యున్నత శిఖరాలను అధిరోహించే ప్రయత్నంలో  అవమానాలనూ భరాయిస్తూ, కన్నీళ్లను దిగమింగుతున్న మహిళలెందరో. 
మహిళలను తీవ్రంగానే వేధిస్తున్న కొన్ని సమస్యలు 
విభిన్నరంగాలలో, విభిన్న సంస్థల్లో పనిచేస్తున్న మహిళలను కొన్ని సమస్యలు తీవ్రంగానే వేధిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది జెండర్ వివక్ష. ఇప్పటికీ స్త్రీ పురుషుల మధ్య వేతన వ్యత్యాసాలు అధికంగానే వున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ఈ వివక్ష తప్పడం లేదు. 2011లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్న పురుషుల  ఒక రోజు సగటు వేతనం 617 రూపాయలు కాగా, మహిళల సగటు వేతనం  265 రూపాయలు మాత్రమే.   మహిళలకు   లైంగిక వేధింపులు సర్వసాధారణం.  భద్రత ఎండమావి.   తాము పనిచేసే సంస్థల్లో భద్రతలేని కారణంగా ఉద్యోగాలు మానేస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగం మానేస్తున్నవారిలో 82శాతం మందిని అభద్రతాభావం వెన్నాడుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.   పెళ్లి, పిల్లలు  ఈ రెండింటి కారణంగా ఉద్యోగాలు మానేస్తున్నవారి సంఖ్యా తక్కువేమీ లేదు.  పిల్లలు పుట్టిన తర్వాత 66శాతం మంది ఉద్యోగాలు మానేస్తున్నట్టు ఢిల్లీలో జరిగిన ఓ అధ్యయనం వెల్లడించింది.   సమయానుకూలంగా రవాణా సదుపాయాలు లేకపోవడం, ట్రాఫిక్ జామ్ లు  లాంటి కారణాలు కూడా వర్కింగ్ ఉమెన్ కి  పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి.   ట్రాన్స్ పోర్ట్ కష్టాల కారణంగా ఉద్యోగాలు మానేస్తున్న మహిళల సంఖ్య ఎక్కువగానే వుంటోంది.  ఇక ఆఫీసుల్లో,  స్కూల్స్ లో, ఫ్యాక్టరీలలో , చిన్నచిన్న సంస్థలలో పనిచేసే మహిళలకు టాయ్ లెట్స్ లేకపోవడం, వాటిని సక్రమంగా నిర్వహించకపోవడం మరో శాపంగా మారుతోంది. 

 

07:47 - September 8, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల అమలుకు సర్వం సిద్ధమయ్యింది. జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై చర్చలు కొనసాగుతున్నప్పటికీ, పెద్దగా మార్పులు చేసేందుకు సర్కార్ ఆసక్తి కనపర్చడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాలన్నీ పొలిటికల్ మైలేజ్ కోసమేనని కొట్టి పారేస్తున్న కేసీఆర్..అనుకున్నట్లుగా దసరా నుండే కొత్త జిల్లాలు అమలులోకి రావాలని తేల్చి చెప్పారు. దీనికనగుణంగా ట్రయల్ రన్ పేరుతో అక్టోబర్ 1 నుంచే కొత్త జిల్లాలు అమల్లోకి తేనున్నారు. అధికారులు, పరిపాలనా భవనాల కోసం ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేయడంతో ఈ వర్క్స్ మరింత స్పీడప్ అవుతుందని అధికారం యంత్రాంగం చెబుతోంది. 
మొత్తం 27 జిల్లాలు
తెలంగాణలో మొత్తం 27 జిల్లాలు..పేర్లు కాస్త అటూ, ఇటూ అయినా ఇదే ఫైనల్ లెక్క. ఇప్పటికే ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసి, ఫిర్యాదులు స్వీకరిస్తున్న సర్కార్...జిల్లాల విషయంలో పునరాలోచన చేసే అవకాశం లేదు. ఒకటి రెండు మినహా మార్పులు చేర్పులు ఎక్కువగా ఉండవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. హన్మకొండ విషయంలో మాత్రమే ఇంకాస్త స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై త్వరలో జరగబోయే కలెక్టర్ల సమావేశంతో పాటు అఖిలపక్ష భేటీలో ప్రభుత్వం నిర్ణయించబోతుంది. 
దసరా నుంచే కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం
అయితే కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు అన్ని దసరా నుంచే మొదలుకావాలని సీఎం డెడ్ లైన్ విధించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఆఘమేఘాల మీద అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే కొత్త కార్యాలయాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఉద్యోగుల సర్దుబాటులో ఎన్ని సమస్యలు ఉన్నా అనుకున్న సమయానికి అనుకున్నట్లు జరగాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. అయితే ఇటీవల టాస్క్ ఫోర్స్ కమిటీ ఇచ్చిన నివేదికలో మరింత స్పష్టత రావాలని సీఎం సూచించారు. దీనికోసం మరోసారి భేటీ కావాలని కూడా చెప్పారు.
అక్టోబర్ 1వ తేదీ నుంచి ట్రయల్‌రన్ 
అక్టోబర్ 11 నుంచే పాలన ప్రారంభించాలని అధికారికంగా నిర్ణయించినా, అక్టోబర్ 1వ తేదీ నుంచే అనధికారంగా కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల నుంచి పరిపాలన మొదలు చేయాలని  ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ పదిరోజుల్లో  కావాల్సినన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలని ఉన్నతాధికారులు సలహా ఇస్తున్నారు. తద్వారా వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేర్పుల, ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్న అధికారులు అక్టోబర్ 1 నుంచి ట్రయల్ షురూ చేయనున్నారు. 
కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో సర్కార్ 
ఇప్పుడున్న అధికారుల్లో జిల్లాల పునర్విభజనపై పెద్దగా అనుభవం, పట్టున్న అధికారులు లేరు. దీంతో పక్కా వ్యూహంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో సర్కార్ ఉంది. ఆచరణలో దీని పరిస్ధితి ఎలా ఉంటుందో చూడాలి.  

 

07:42 - September 8, 2016

తూర్పుగోదావరి : విభజన గాయాలు, ఆర్థికలోటుతో కూనరిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించేవరకూ విశ్రమించనని చెప్పి..ఏపీ రాజకీయాల్లో తుఫాన్‌ సృష్టించారు జనసేన అధినేత. హోదాకోసం పోరాటానికి దిగుతున్నట్లు ప్రకటించి..కాకినాడ సభకు పిలుపునిచ్చారు. సీమాంధ్రుల ఆత్మగౌరవ సభగా నామకరణం చేసి..మరింత హైప్‌ తీసుకొచ్చారు జనసేనాని. దీంతో ఇప్పుడు ఐదున్నర కోట్లమంది చూపు ఆ సభ వైపే. హోదా ఇవ్వమని.. స్పెషల్‌ ప్యాకేజీ ఇస్తామని కేంద్రం స్పష్టం చేయడంతో..కాకినాడ సభలో పవన్‌ ఏం చెప్పబోతున్నారానే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 
9న కాకినాడ జేఎన్‌టీయూ మైదానంలో బహిరంగ సభ
ఆలోచించి చేసేవారు కొందరైతే..మనసుకు నచ్చింది చేసేవారు మరికొందరు. ఆ కోవలోకి వచ్చేవారిలో ముందుంటారు పవన్‌కళ్యాణ్‌. మరో హీరో అభిమాని చేతిలో హత్యకు గురైన తన అభిమాన కుటుంబాన్ని ఓదార్చేందుకు తిరుపతికి వెళ్లిన పవన్‌..అప్పటికప్పుడే బహిరంగసభకు పిలుపునిచ్చి..సభ పెట్టారు. అభిమానుల తీరుపై సభలో మాట్లాడుతారేమో అని అంతా భావించారు. కానీ, ఆ అంశంపై మాట్లాడలేదు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లెవనెత్తి..రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారు. హోదాను సాధించేందుకు ప్రత్యేక కార్యచరణను కూడా ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన కాకినాడ జేఎన్‌టీయూ మైదానంలో బహిరంగ సభకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు.
కాకినాడ సభలో పవన్‌ ఏం మాట్లాడుతారు..?
తనంతట తానే రాజకీయ రణరంగంలోకి దిగుతున్నట్లు పవన్‌ ప్రకటించడంతో..ఇక ఫుల్‌టైం పొలిటిషియన్‌గా మారినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 9న కాకినాడ సభలో పవన్‌ ఏం మాట్లాడుతారు అనే దానిపై చర్చ సాగుతోంది. కాకినాడలో సభను ఏర్పాటు చేయడం వెనుక పవన్‌ వ్యూహాం లేకపోలేదు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని తిరుపతిలో సభపెట్టినప్పుడు జనం భారీగా తరలివచ్చారు. ఊహించినదానికన్నా ఎక్కువగానే సభ సక్సెస్‌ అయ్యింది. కాకినాడలో పక్కా రాజకీయ సభ కావడంతో పాటు ప్రత్యేక హోదా నినాదం జోడించి ఉండడంతో అంతా ఈ సభవైపే ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సభ సూపర్‌ హిట్‌ కావాలనే ఉద్దేశంతోనే పవన్‌కళ్యాన్‌ కాకినాడ ప్రాంతాన్నే ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. తన సామాజిక వర్గంతో పాటు ఆయన అభిమానులు కూడా పవర్‌ ఫుల్‌గా ఉన్న సెంటర్‌ కావడం కాకినాడ సభపై భారీ అంచనాలున్నాయి. 
పవన్ ఎలా ముందడుగు వేస్తారో..? 
ప్రత్యేక హోదా సాధించుకోవడం కోసం పోరాటం చేయాలని పవన్‌ భావిస్తున్నారు. కానీ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం..ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కుండబద్దలు కొట్టింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు..ఎలా ముందడుగు వేస్తారో వేచి చూడాలి.

07:36 - September 8, 2016

విజయవాడ : శాసనసభా సమావేశాలకు ప్రధానప్రతిపక్ష పార్టీ వైసీపీ రెడీ అయింది. పార్టీ అధినేత జగన్ సమక్షంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఇందుకు సంబంధించిన వ్యూహాన్ని పార్టీ ఖరారు చేసింది. అధికార పార్టీ  వ్యవహరిస్తున్న  తీరును సభలో ఎండగట్టాలని వైసీపీ భావిస్తోంది. 
నేతలకు జగన్ దిశా నిర్దేశం 
ప్రభుత్వం నామమాత్రంగా అసెంబ్లీని నిర్వహించాలని చూస్తోందన్న అనుమానాలను వైసీపీ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. 30 కి పైగా అంశాలను సభలో చర్చించాల్సి ఉన్నా...అధికార పార్టీ సమావేశానికి త్వరగా ముగించాలని చూస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నేతలకు దిశా నిర్దేశం చేశారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో పాటు పలువురు ముఖ్యనేతలు శాసనసభాపక్ష సమావేశానికి హాజరయ్యారు. 
శాసనసభ సమావేశాలు వాడివేడిగా..?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఓ వైపు రాష్ట్రానికి ప్రత్యేకహోదా లేదనే సంకేతాలు స్పష్టంగా వచ్చాయి. దీంతో  ప్రత్యేక హోదా అంశంపైనే ప్రధాన ప్రతిపక్షం అధికారపార్టీని నిలదీయాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నా  హోదా దక్కకపోవడానికి తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు కారణమని పార్టీ ఇప్పటికే అరోపణలు చేస్తోంది.  తెలుగుదేశంపార్టీకి  ప్రత్యేకహోదా కంటే  ప్యాకేజీలపైనే మక్కువ అని ఎమ్మెల్యే రోజా  ఆరోపిస్తున్నారు.
టీడీపీని ఇరుకున పెట్టేందుకు వైసీపీ 
తెలుగురాష్ట్రాల్లో దూమారం రేపిన ఓటుకునోటు వ్యవహారం కూడా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు వైసీపీ ప్లాన్‌ చేస్తోంది. చంద్రబాబు ఈ  కేసులో ప్రధాన నిందితుడన్న విమర్శలను చేస్తోంది వైసీపీ .  అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై  ఇప్పటికే అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని వైసీపీ నేతలు వాపోతున్నారు. జైట్లీ హోదా లేదని ప్రకటించినా బాబు తీరు మారడంలేదని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. 
అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్న వైసీపీ  
ప్రత్యేక హోదాపై నీళ్లు చల్లిన టీడీపీ స్వాగతించడంపై అసెంబ్లీలో నిలదీసేందుకు వైసీపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. కేంద్రం
నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చినందునే బాబు రాజీపడ్డారనే  ఆరోపణలు చేస్తోంది వైసీపీ పార్టీ. ఏదిఏమైనా ప్రత్యేక హోదా సాధించే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉండాలని వైసీపీ డిసైడ్‌ అయింది. 

 

నేడు మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన

మహబూబ్ నగర్ : మంత్రి హరీష్ రావు నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మెదక్ : పటాన్ చెరు మండలం పోచారం వద్ద ఎన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమదం జరిగింది. బైక్, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 

07:25 - September 8, 2016

విజయవాడ : ఏపీ అసెంబ్లీ వర్షకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తొలుత బీఏసీ నిర్వహించి అసెంబ్లీ అజెండాను ఖరారు చేయనున్నారు. 0జీఎస్టీ బిల్లుతో పాటు మరో మూడు ప్రధాన బిల్లులకు సభ ఆమోదం తెలపనుంది. రాష్ట్రానికి ప్రత్యేక సాయంపై ఢిల్లీ పరిణామాలు, కరవు నివారణ చర్యలు తదితర అంశాలపైనా కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనసభ పరిసరాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.   
వ్యూహాలను సిద్ధం చేసుకున్న పాలక, ప్రతిపక్షాలు  
ఏపీ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పాలక, ప్రతిపక్షాలు వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు.. సహచర మంత్రులతో అసెంబ్లీ వ్యూహాలపై చర్చించారు. ఈ భేటీలో ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఇతర సీనియర్ నేతలు, హాజరయ్యారు. ఈ సమావేశాల్లో జీఎస్టీతో పాటు మరో మూడు చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తేనుంది. 
వైసీపీ వ్యూహలకు ధీటుగా ప్రతివ్యూహలతో సిద్ధమైన పాలకపక్షం
రెండున్నర ఏళ్ల కాలంలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని..సంక్షేమ కార్యక్రమాలను సభ ముందు ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపక్షం వైసీపీ సంధించే అన్ని ప్రశ్నలకు దీటుగా సమాధానాలు ఇచ్చేలా వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది.  రాజధాని నిర్మాణం- స్విస్ ఛాలెంజ్ , రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్ధితులు, కాపులకు రిజర్వేజన్లు, కృష్ణా పుష్కరాల నిర్వహణ, కృష్ణా-గోదావరి-పెన్నా నదులు అనుసంధానం, స్మార్ట్ పల్స్ సర్వే, ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి అభినందనలు, నీరు ప్రగతి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించాలని అధికార పక్షం భావిస్తోంది. మొత్తం 13 అంశాలను బీఏసీ ఆమోదానికి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. విపక్ష వైసీపీ కూడా అధికార పక్షాన్ని వివిధ సమస్యలపై నీలదీసేందుకు సిద్ధమవుతుండటంతో సమావేశాలు వాడీవేడీగా జరిగే అకాశం ఉంది. 
భారీగా పోలీసు బందోబస్తు 
గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న సభ సెప్టెంబర్ 10 వరకు జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఈసమావేశాలకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసెంబ్లీ చట్టూ భారీగా పోలీసులను మోహరించారు. 

 

07:20 - September 8, 2016

విజయవాడ : ఏపీకి ప్రత్యేకహోదాపై నీళ్లు చల్లిన కేంద్రంపై సీఎం చంద్రబాబు స్పందించారు. కేంద్ర ప్రకటనను స్వాగతిస్తున్నానని అన్నారు. కేంద్రం ఏం ఇచ్చినా తీసుకోవడమేనని..ఏపీకి వేరే ఆప్షన్‌ లేదని బాబు తెలిపారు. కేంద్రం ఇచ్చింది సరిపోదని.. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయని అన్నారు. ప్యాకేజీ ఎలా ఎప్పుడు ఇస్తారన్న దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు చంద్రబాబు.  
ఏపీకి  ప్రత్యేకహోదా ఇస్తే చాలా సంతోషిస్తాం : బాబు
ఏపీకి  ప్రత్యేకహోదా ఇస్తే చాలా సంతోషిస్తానన్నారు చంద్రబాబు. సాంకేతిక సమస్యలు ఉన్నాయని భావిస్తే ఏమిస్తారో స్పష్టంగా చెప్పాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.  కేంద్రం ఇచ్చిన హామీల వల్ల కొంత వరకు వెసులుబాటు వస్తుందని బాబు తెలిపారు. ఇచ్చినవాటితో సంతృప్తి చెందడం లేదని..ప్యాకేజీ ఎంతిస్తారన్నది తెలపాలన్నారు చంద్రబాబు. 
విభజనచట్టం అమలు, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు
విభజనచట్టం అమలు, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, మన్మోహన్ హామీలు, నీతి అయోగ్ సిఫార్సులను జైట్లీ చెప్పారని చంద్రబాబు తెలిపారు. పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి 100 శాతం నిధులు ఇస్తామన్నారు. పోలవరానికి నిధులు నాబార్డ్ ద్వారా సమకూరుస్తామన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రమే భరిస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 1800 కోట్లు ఖర్చు పెట్టామని బాబు స్పష్టం చేశారు. 
హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తే సంతోషమన్న బాబు
ప్రత్యేకహోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ ప్రత్యేక ప్యాకేజీ కింద అందిస్తామని కేంద్రం చెప్పిందన్నారు చంద్రబాబు. ప్రత్యేక హోదాకు సమానమైన ప్రయోజనాలు ఇస్తామన్నప్పుడు తీసుకోకపోతే నష్టపోతామన్నారు చంద్రబాబు. ఇచ్చింది తీసుకోకుండా ఏం చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాజధానికోసం ఇప్పటివరకు 2,500 కోట్లు ఇచ్చారని కేంద్రం చెప్పిన విషయంతో చంద్రబాబు ఏకీభవించారు. అయితే అది సరిపోదు మరింత సాయం చేయాల్సి ఉందని కేంద్రాన్ని ఆయన కోరారు. రాజధాని అంటే భవన నిర్మాణాలు కాదు..నగర నిర్మాణం..ఈ శతాబ్దంలో కట్టే రాజధాని అమరావతి ఒక్కటేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
రాష్ట్రానికి 4 ఇండస్ట్రియల్ క్లస్టర్స్‌  : బాబు
నాలుగు ఇండస్ట్రియల్ క్లస్టర్స్‌కు 2 వేల నుంచి 3 వేల కోట్లు ఇస్తామన్నారని చంద్రబాబు చెప్పారు. 11 కేంద్ర సంస్థలు ప్రకటించారు..అందులో 2 సంస్థలు ఇంకా తేల్చాల్సి ఉందని బాబు తెలిపారు. దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ప్లాంట్..హెచ్‌పీసీఎల్ ప్రాజెక్టుల అంశాలు తేల్చాల్సి ఉందన్నారు. సాంకేతిక కారణాలతో ఆలస్యం చేస్తే నష్టపోతామని కేంద్రానికి చంద్రబాబు సూచించారు. రైల్వే ప్రాజెక్టులపై కేంద్రమంత్రి సురేష్‌ ప్రభు ప్రకటిస్తారని తెలిపారు. 
ప్యాకేజీపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలి : బాబు 
ప్రత్యేకహోదా ఇస్తే సంతోషించే వాళ్లమని.. ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు..హోదాకు బదులుగా ఇస్తున్న ప్రయోజనాలు ఏ స్థాయిలో ఉంటాయి..ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టం చేయాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని..కేంద్ర ప్రతిపాదనలపై సూచనలు చేయాలి కాని అడ్డుకోవడం సబబు కాదన్నారు.  

 

07:10 - September 8, 2016

ఢిల్లీ : చెప్పిందే చెప్పారు. అరిగిపోయిన గ్రామ్‌ఫోన్‌ రికార్డులాగా పదే పదే పాత మాటల్నే తిరగేశారు. ఏపీ నోట్లో మట్టి కొడుతూ చావు కబురు కాస్తా చల్లగా చెప్పారు. ఏపీకి హోదా ఇవ్వరనే అనుమానాల్ని తేటతెల్లం చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఇన్నాళ్లూ ఊరించి ఊరించి చివరకు ఊసురుమనిపించారు. ఇదీ ఏపీకి ప్రత్యేక హోదాపై బుధవారం కేంద్రం ఆడిన వింత నాటకం. అందరూ అనుమానించినట్లే...అందరూ ఊహించినట్లే కేంద్రం తన నిర్ణయాన్ని ఎంతో నిర్భయంగా మీడియా ప్రకటించింది. దీంతో ఏపీకి ఇక ప్రత్యేక హోదా రాదు..రాబోదు అనే విషయం అధికారికంగా స్పష్టమైంది. ఇంతకీ ఈ జగన్నాటం అంతటికి సూత్రధారులుగా నిలిచిన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరిలు మీడియా ముందు ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. 
పాత మాటనే తిరిగి చెప్పిన జైట్లీ 
ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పిన పాత మాటనే మళ్లీ మళ్లీ తిరగేసి చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అనేక అంశాలపై సమీక్ష నిర్వహించామని..విభజన కారణంగా ఏపీ ఆదాయాన్ని కోల్పోయిందని నాలుగు సానుభూతి మాటలు మాట్లాడారు. 2014-15లో 3,975కోట్ల రెవెన్యూ లోటు ఇచ్చాం. మిగిలింది దశలవారీగా ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. 
పునర్విభజన చట్టం హామీల్ని నెరవేరుస్తాం : జైట్లీ 
ఏపీ పునర్విభజన చట్టం, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, గత ప్రధాని సభలో చేసిన హామీ, నీతి ఆయోగ్‌ సిఫార్సులు పరిగణనలోకి తీసుకున్నామన్నారు జైట్లీ. 42శాతం నిధులు ఇవ్వడం, రెవెన్యూ లోటును చట్టప్రకారం 100శాతం కేంద్రం భర్తీ చేస్తుందన్నారు. అప్పటి ప్రధాని ఇచ్చిన ప్రతిహామీ ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నెరవేరుతుందని జైట్లీ హామీ ఇచ్చారు. ఇక బెంగళూరు- చెన్నై, విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు 12వేల కోట్లు నిధులు సహా రైల్వేజోన్‌, నియోజకవర్గాల పునర్‌విభజన సహా అనేక అంశాలు పరిశీలనలో ఉన్నాయని వాటిపై త్వరలోనే  నిర్ణయం తీసుకుంటామన్నారు.14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదని హోదాపై కుండబద్దలు కొట్టారు. ఇక పన్ను మినహాయింపులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా గురువారం విడుదల చేస్తామని జైట్లీ అన్నారు. 
పోలవరం మొత్తం ఖర్చు కేంద్రమే భరిస్తుంది : జైట్లీ 
ఇక పోలవరం ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చు కేంద్రమే భరిస్తుందని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ. 2014 ఏప్రిల్‌-1 నుంచి పోలవరం ప్రాజెక్టుకు అయిన ఖర్చు కూడా కేంద్రమే చెల్లిస్తుందన్నారు. రెవెన్యూలోటుకు సంబంధించి 14వ ఫైనాన్స్‌ కమిషన్ ఆమోదించిందని జైట్లీ చెప్పారు.  
ఏపీకి సాయం నిరంతర ప్రక్రియ :వెంకయ్య 
ప్రత్యేక ప్రకటన అనంతరం..కేంద్ర మంత్రి వెంకయ్య మాట్లాడుతూ..ఏపీకి సాయం అనేది నిరంతర ప్రక్రియన్నారు. ఇతర రాష్ట్రాలతో ఏపీ సమాన స్థాయికి చేరే వరకు కేంద్రం చేయూత అందిస్తుందని చెప్పారు. ఏపీని కేంద్రం ప్రత్యేక రాష్ట్రంగా గుర్తిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ సొంత కాళ్లపై నిలదొక్కుకునేంత వరకు రాష్ట్రానికి కేంద్రం సాయం చేస్తూనే ఉంటుందని వెంకయ్య అన్నారు. రాష్ట్ర బీజేపీ పెద్దలతో మాట్లాడిన తరువాతే..ఆర్థిక మంత్రి ప్రకటన చేశారని కేంద్ర మంత్రి వెంకయ్య అన్నారు. చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. 
చట్టంలో లేని ప్రత్యేక హోదాపైనే ఇబ్బంది : వెంకయ్య 
ప్రధాని మంత్రి ఆరోజు ఏ అంశాలయితే పేర్కొన్నారో వాటిలో ఐదు విషయాలపై ఎలాంటి అభ్యంతరాల్లేవు..ఇబ్బందల్లా చట్టంలో చేర్చకుండా ఇచ్చిన ప్రత్యేక హోదా మీదేనని కేంద్రమంత్రి వెంకయ్య అన్నారు. ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఏ ప్రయోజనాలైతే ఉంటాయో ఆ ప్రయోజనాన్ని ఎక్స్‌‌టర్నలైజ్డ్ ప్రాజెక్టుల ద్వారా దాన్ని పూర్తి చేస్తామని నిర్ధిష్టమైన హామీని అరుణ్ జైట్లీ ఇచ్చారన్నారు. పన్నుల మినాహాయింపు హామీలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్‌‌ త్వరలోనే ప్రకటన చేస్తుందన్నారు. 
హామీలను 10ఏళ్లలోపు అమలు చేయాలి : వెంకయ్య 
కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ విభజన చట్టంలోని ఫీజబులిటిని సరిచేస్తుందన్నారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. అంతేగానీ స్టీల్ ప్లాంట్ పెడతారని ఎక్కడా చెప్పలేదన్నారు. దీనిపై తుది నివేదిక వచ్చిన తరువాతే దానిపై టాస్క్ ఫోర్స్ వేస్తామన్నారు. చట్టంలో ఇచ్చిన హామీలన్నీ 10 ఏళ్లల్లోపు అమలు చేయాలని తెలిపారు. అంత సమయం కూడా తీసుకోకుండానే ఇంకా ముందే అన్ని హామీలు అమలు చేస్తామని వెంకయ్య క్లారిటీ ఇచ్చారు. 
కేంద్రం ప్రకటనపై భగ్గుమన్న విపక్షాలు 
ఏది ఏమైనప్పటికీ..రెండున్నరేళ్లుగా ప్రత్యేక హోదాపై ఊరించిన కేంద్రం...చివరకు హోదా ఇవ్వడంలేదని తేల్చిచెప్పింది. కేంద్రం ప్రకటనపై విపక్షాలు భుగ్గముంటున్నాయి. కేంద్రం ప్రకటన తీరుపై మండిపడ్డ విపక్షాలు ఆందోళనలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. హోదా ఇచ్చేంతవరకు నిరసనలు, ఆందోళనల్ని ఉధృతం చేయాలని కూడా వ్యూహరచన చేశారు. దీంతో ప్రత్యేక హోదాపై ఏపీలో ఆందోళనలు మరింత ఊపందుకోనున్నాయి.  

 

06:57 - September 8, 2016

ఢిల్లీ : ఎంతో కాలంగా..ఎన్నో ఆశలు పెంచుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చిపారేసింది. అందుకు ఎప్పుడూ చెబుతున్న కారణాన్నే తిరిగి వల్లె వేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏ రాష్ర్టానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేసింది. దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది.
ఎపికి కేంద్రం మొండిచేయ
విభజన గాయాలతో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని రెండున్నరేళ్లు జోలపాడిన మోడీ ప్రభుత్వం చివరకు మొండిచేయే చూపింది. ఐదున్నర కోట్ల ఆంధ్రులను మభ్య పెట్టేందుకు 11 గంటలు సుదీర్ఘ కసరత్తు చేసిన జైట్లీ బృందం చివరకు ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించబోతున్నారంటూ ఉదయం నుంచి రాత్రి వరకు నానా హడావిడి చేశారు. టీడీపీ మంత్రులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మంతనాలు జరపడం, మధ్య మధ్యలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ..ఏ క్షణంలోనైనా ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం ఉందన్న రీతిలో హైడ్రామా నడిపించారు. చివరకు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు విషయాన్ని బయటపెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దానికి ప్రతిగా ప్రత్యేక ప్యాకేజీ సిద్ధం చేసినట్టు వెల్లడించారు. 
ప్యాకేజీలో ఏముందన్న విషయంపై స్పష్టత కరువు
ప్యాకేజీలో ఏముందన్న విషయాన్ని కూడా కేంద్రమంత్రి వివరించకుండా గురువారం ఉదయం అందుకు సంబంధించి ఒక నోట్ విడుదల చేస్తామన్నారు. అయితే అందులో ప్రకటించిన అంశాలు కూడా ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం సాధ్యం కాదని కుండబద్దలు కొట్టారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేరుతాయా అంటే కూడా కేంద్ర మంత్రులు స్పష్టత ఇవ్వలేకపోయారు. ప్రతి అంశంలోనూ ఫీజిబిలిటీ రిపోర్టు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని చట్టంలో చెప్పినందున వాటిని పరిశీలిస్తున్నామని దాటవేశారు.
ఏపీకి స్పెషల్ ప్యాకేజీతోనే సరిపెట్టిన కేంద్రం
విశాఖ రైల్వే జోన్‌ విషయంలో జైట్లీ స్పష్టత ఇవ్వలేదు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై జైట్లీ ఇంతకు ముందు ఏదైతే చెప్పారో మళ్లీ అదే చెప్పుకొచ్చారు. ఎప్పట్నుంచే ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీయేనన్న కేంద్రం ఏపీకి స్పెషల్ ప్యాకేజీతోనే సరిపెట్టుకుంది. విభజన గాయాలు, ఆర్థిక లోటుతో అల్లాడుతున్న రాష్ట్రానికి సాయంపై మొండిచేయ్యి చూపిందనే విమర్శలు వస్తున్నాయి. 
ఎలాంటి అదనపు కేటాయింపులు వెల్లడించిన జైట్లీ
ఉదయం నుంచి ఆశలు రేపిన అరుణ్‌జైట్లీ చివరకు ఉసూరుమనిపించారు. గతంలో చేసిన ప్రకటనలనే అటు ఇటుగా మరోసారి చెప్పారు. ఎలాంటి అదనపు కేటాయింపులు కూడా వెల్లడించలేదు. నాడు మన్మోహన్‌ చెప్పిందే తాము చేస్తామన్నారు. చివరికి చేసే సాయమేమిటో స్పష్టంగా చెప్పలేక మొహం చాటేశారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడుతున్న మోడీ ప్రభుత్వం... హోదా ఇవ్వకుండా ప్యాకేజీతో సరిపెట్టి... ఏపీ ప్రజల ఆశలను సజీవ సమాధి చేసింది. 

 

నేడు జీఎస్ ఎల్వీ ఎఫ్..05 ప్రయోగం

నెల్లూరు : నేడు జీఎస్ ఎల్వీ ఎఫ్..05 ప్రయోగం చేయనున్నారు. శ్రీహరికోట నుంచి సాయంత్రం 4.10 గంటలకు ప్రయోగం జరుగనుంది. ఇన్ షాట్ 3 డీఆర్ ఉప గ్రహాన్ని నిర్ణీత కక్షలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు. ఇది వాతావరణ పరిశోధనకు సంబంధించిన ప్రయోగం. 

 

స్విస్ ఛాలెంజ్ విధానంపై నేడు ఎపి ప్రభుత్వం తరపున వాదనలు

హైదరాబాద్ : స్విస్ ఛాలెంజ్ విధానంపై నేడు ఎపి ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ వాదనలు వినిపించనున్నారు. 

నేటి నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : నేటి నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 8.30 గంటలకు ఎపి అసెంబ్లీ బీఏసీ సమావేశం జరుగనుంది. 

 

ప్రత్యేక హోదా ఇస్తే చాలా సంతోషం : సీఎం చంద్రబాబు

విజయవాడ : ప్రత్యేక హోదా ఇస్తే చాలా సంతోషమని సీఎం చంద్రబాబు అన్నారు. సాంకేతిక సమస్యలు ఉన్నాయని మీరు భావిస్తే ఈరోజు కేంద్రం ఇచ్చిన హామీ వల్ల కొంతవరకు వెసులబాటు వస్తుందన్నారు. హామీలకు చట్టబద్ధత కల్పించాలని తెలిపారు. నిర్ణీత సమయంలో నెరవేర్చాలన్నారు. ఏమిస్తారో స్పష్టంగా చెప్పాలన్నారు. 

ఎపికి పోలవరం జీవనాడి : సీఎం చంద్రబాబు

విజయవాడ : పోలవరం ఎపికి జీవనాడి అని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తయితే రాష్ట్రంలో కరవు లేకుండా చేయొచ్చని తెలిపారు. పోలవరానికి ఖర్చు చేసిన రూ.1800 కోట్లు వెంటనే ఇవ్వాలన్నారు. రైల్వే జోన్ విశాఖకే ఇవ్వాలనే విషయానికి కట్టుబడి ఉన్నా.. హక్కుల కోసం పోరాడుతూనే అభివృద్ధిపై దృష్టి సారిస్తామని చెప్పారు. 

రాజధానికి రూ.2500 కోట్లు ఇచ్చారు : సీఎం చంద్రబాబు

విజయవాడ : రాజధానికి రూ.2500 కోట్లు ఇచ్చారని.. మరో వెయ్యి కోట్లు ఇస్తామన్నారని ఇది చాలదని సీఎం చంద్రబాబు అన్నారు. విభజన చట్టం అమలు, 14 వ ఆర్థిక సంఘం సిఫార్సులు, మన్మోహన్ హామీలు, నీతి ఆయోగ్ సిఫార్సులు జైట్లీ చెప్పారని తెలిపారు. పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి 100 శాతం నిధులు ఇస్తామన్నారని పేర్కొన్నారు. 

 

ఎపికి ఇవ్వాల్సింది చాలా ఉంది : సీఎం చంద్రబాబు

విజయవాడ : కేంద్రప్రభుత్వ ప్రకటనపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం అయ్యారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామని అరుణ్ జైట్లీ చెప్పారు. నీతి ఆయోగ్ చెప్పిందే జైట్లీ చెప్పారని పేర్కొన్నారు. ఎపికి ఇవ్వాల్సింది చాలా ఉందన్నారు. ప్యాకేజీ ఎప్పుడు ఇస్తామన్నది కేంద్రం చెప్పాల్సి ఉందని పేర్కొన్నారు. 

 

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై అరుణ్ జైట్లీ ప్రకటన

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఏపీ రూ.2500 కోట్లు ఇచ్చామన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు రూ.1050 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఇప్పటికే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని తెలిపారు. 

 

Don't Miss