Activities calendar

09 September 2016

21:51 - September 9, 2016

ఛత్తీస్‌గడ్‌ : ఓ బీజేపీ నేత కొడుకు దౌర్జాన్యానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బిజెపి నేత మంతూరాం పవార్‌ కొడుకు నన్ను పవార్‌ ఎస్‌యువి కారులో స్నేహితులతో కలిసి వెళ్తున్నాడు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు చాలాసేప‌టి వ‌ర‌కు కారుకు దారివ్వలేదు. దీంతో కారును రోడ్డు పక్కన ఆపిన నన్నూ పవార్ అతడి స్నేహితులు న‌డిరోడ్డుపై ఇద్దరు యువ‌కుల‌ను చావ‌బాదారు. పిడిగుద్దులు కురిపిస్తూ, కింద ప‌డేసి త‌న్నుతూ హంగామా సృష్టించారు. ఈ ఘ‌ట‌న ఆగ‌స్ట్ 15న రాయ్‌పూర్‌కు 200 కిలోమీట‌ర్ల దూరంలోని ఖేర్‌క‌ట్టా స‌మీపంలో జ‌రిగింది. అయితే ఈ దాడికి సంబంధించి వీడియో సాక్ష్యం ఉన్నా పోలీసులు ఇంత‌వ‌ర‌కు కేసు న‌మోదు చేయక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

21:48 - September 9, 2016

కర్నాటక : తమిళనాడుకు కావేరి జలాలను వదలడానికి నిరసనగా కర్నాటకలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. రాజధాని నగరం బెంగళూరులో స్కూళ్లు, కళాశాలు, ఐటి సంస్థలు మూతపడ్డాయి. బంద్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. హింసాత్మక ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప్రభుత్వం ముంద‌స్తు చర్యలు చేపట్టింది.

సుప్రీంకోర్టు తీర్పును నిర‌సిస్తూ క‌ర్ణాట‌క వ్యాప్తంగా బంద్
త‌మిళ‌నాడుకు కావేరీ జ‌లాల‌ను విడుద‌ల చేయాల‌న్న సుప్రీంకోర్టు తీర్పును నిర‌సిస్తూ క‌ర్ణాట‌క వ్యాప్తంగా బంద్ జరిగింది. ముఖ్యంగా ద‌క్షిణ‌ క‌ర్ణాట‌క పూర్తిగా స్తంభించిపోయింది. బంద్‌ కారణంగా బెంగ‌ళూరు, మైసూరుల‌లో రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రభుత్వ బ‌స్సులు డిపోల‌కే ప‌రిమితమ‌య్యాయి. ఆటోలు, క్యాబ్‌లు కూడా బంద్‌కు త‌మ మ‌ద్దతు తెలపడంతో రవాణా నిలిచిపోయింది.

స్థంభించిన బెంగళూరు
బెంగళూరులో మెట్రో స‌ర్వీసులు కూడా నిలిచిపోవ‌డంతో ఐటీ హ‌బ్ పూర్తిగా స్తంభించిపోయింది. బెంగళూరుకు ప్రధాన తాగునీటి వనరు కావేరి జలాలే కావడంతో ఇన్ఫోసిస్‌, విప్రో తదితర 4 వందల మల్టినేషనల్ కంపెనీలు, విద్యాసంస్థలు, సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం తెరచి ఉంచారు. కేబుల్ ఆపరేటర్లు కూడా బంద్‌కు మద్దతు తెలపడంతో తమిళ చానళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి.

ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జీ
మాండ్యా, మైసూరు ప్రాంతాల్లో నిరసనకారులు టైర్లు తగలబెట్టి రోడ్లను దిగ్బంధించారు. న్యాయవాదులు కూడా మైసూరు టౌన్ హాల్ ఎదుట నిరసన తెలిపారు. మాండ్యాలోని కేఆర్ఎస్ డ్యాం వద్ద భద్రతను రెట్టింపు చేశారు. కావేరి నదిపై నిర్మించిన కెఆర్‌ఎస్‌ డ్యామ్‌ వద్ద ధర్నాకు దిగిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. గుంపును చెదరగొట్టేందుకు గాలిలోకి కాల్పులు జరిపారు.

కర్నాటక సిఎం ప్రధానమంత్రి మోదికి లేఖ
తమిళనాడు సిఎం జయలలితతో సమావేశం ఏర్పాటు చేయాలని కర్నాటక సిఎం ప్రధానమంత్రి మోదికి లేఖ రాశారు. కర్నాటక ఆర్థిక వ్యవస్థ సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీపై ఆధారపడి ఉందని, బంద్‌ కారణంగా ఐటి హబ్‌కు తీరని నష్టం ఏర్పడుతోందని సిద్ధరామయ్య లేఖలో పేర్కొన్నారు.

170కు పైగా కన్నడ సంఘాలు బంద్‌కు మద్దతు
కన్నడ చలనచిత్ర పరిశ్రమ, మాల్స్ యజమానులు, విద్యాసంస్థలు, ఔషద దుకాణాల సంఘాలు, వ్యాపారుల సమాఖ్య, హోటళ్లు, పరిశ్రమల సంఘాలు, సమాఖ్యలు, 170కు పైగా కన్నడ సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి. 

21:43 - September 9, 2016

కరీంనగర్ : సిరిసిల్ల పట్టణాన్ని జిల్లా ఏర్పాటు కోసం చేస్తున్న ఆందోళనలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అధికారపార్టీ కౌన్సిలర్లు వెంటనే రాజీనామా చేయాలంటూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కౌన్సిలర్లు రాజీనామా చేయాలంటూ కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చి తాళం వేసి కార్యాలయం ఎదుటే బైఠాయించారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు సాధ్యం కాదన్న జిల్లా మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆందోళనకారుల నిరసనలకు దిగొచ్చిన కౌన్సిలర్లు జేఏసీ నాయకుల ఎదుటే రాజీనామా పత్రాలపై సంతకాలు చేయడంతో వారు వెనుదిరిగారు. 

21:40 - September 9, 2016

హైదరాబాద్ : కొత్తజిల్లాలపై సీఎస్‌ రాజీవ్‌శర్మ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. జిల్లాలఏర్పాటుతోపాటు కొత్తమండలాలు, రెవెన్యూ డివిజన్లుపై కలెక్టర్లతో కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. జిల్లాలపై గ్రౌండ్‌లెవల్‌ రిపోర్టు ఆధారంగా రిపోర్టును తయారు చేయాలని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కలెక్టర్లకు సూచించింది. రెండు మూడు రోజుల్లో సీఎంతో భేటీ ఉన్న సందర్భంగా .. కొత్తజిల్లాలపై పూర్తి వివరాలతో కూడిన రిపోర్టును అందించాలని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నిర్ణయించింది. 

21:37 - September 9, 2016

హైదరాబాద్ : తీవ్ర గందరగోళం మధ్య ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రత్యేక హోదాపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తంగా మారింది. స్పీకర్‌ మైకును, సభలోని వీడియో కెమెరాలను తొలగించే ప్రయత్నం చేయగా.. మార్షల్స్‌ అడ్డుకున్నారు. వైసీపీ సభ్యులు బల్లలపైకి ఎక్కి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండుసార్లు వాయిదా అనంతరం..సభలో పరిస్థితి మారకపోవడంతో స్పీకర్‌ శాసనసభను రేపటికి వాయిదా వేశారు.

వైసీపీ సభ్యుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో వైసీపీ సభ్యుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. వాయిదాల పర్వం కొనసాగినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే రెండో రోజు కూడా శాసనసభ వాయిదా పడింది.ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ సభ్యులు.. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. కాగితాలు చించి స్పీకర్‌పై విసిరారు. టేబుల్‌పై ఉన్న స్పీకర్‌ మైక్‌ను తొలగించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మార్షల్స్‌ను నెట్టివేయడంతో తీవ్ర పెనుగులాట చోటు చేసుకుంది. దృశ్యాలు చిత్రీకరిస్తున్న వీడియో కెమెరాను తొలగించేందుకు ప్రయత్నించారు. బల్లలపైకెక్కి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తీవ్ర గందరగోళం మధ్య స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

హోదాపై చర్చ చేపట్టాలంటూ వైసీపీ ఆందోళన
ఉదయం సభ ప్రారంభం కాగానే..హోదాపై చర్చ చేపట్టాలంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మాజీ సభ్యుల మృతికి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాల్సిందేనంటూ ఆపార్టీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ.. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత చర్చిద్దామని సూచించారు. ముందు చర్చ.. ఆతర్వాత సీఎం ప్రకటన చేయాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది.

మార్షల్స్ , వైసీపీ సభ్యులకు మధ్య తోపులాట
ప్రత్యేక హోదాపై చర్చను కోరుతూ స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టిన వైకాపా సభ్యులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మార్షల్స్ , వైసీపీ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని, మార్షల్స్‌పై చేయి చేసుకోవద్దని స్పీకర్‌ పదే పదే విజ్ఞప్తి చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఉద్రిక్తంగా మారడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

శనివారానికి సభ వాయిదా
రెండు సార్లు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ప్యాకేజీ నిరసనలపై కేంద్రంలో కదలిక?!..

ఢిల్లీ : ఏపీలో ప్రత్యేకహోదాపై సెంటిమెంట్ బలం పుంజుకుంటుండడంతో బీజేపీ జాతీయ నాయకత్వం వేగంగా స్పందించింది. ఏపీ కేబినెట్ లో మంత్రులుగా ఉన్న బీజేపీ నేతలను వెంటనే ఢిల్లీ రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించారు. దీంతో రేపు ఏపీ బీజేపీ మంత్రులు హస్తినకు బయల్దేరనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.

21:01 - September 9, 2016

తూర్పుగోదావరి : కాకినాడ వేదికగా జనసేనాని గర్జించారు.. ప్రత్యేకహోదాపై మాటతప్పితే అంతచూస్తామని హెచ్చరించారు. చేతకాకుంటే చెప్పండి.. తమ జనసేన రంగంలోకి దిగుతుందని అధికార, ప్రతిపక్షాలకు సవాల్‌విసిరారు. ఆత్మగౌరవసభలో స్పెషల్‌ స్టేటస్‌ కోసం గర్జన చేసిన పవన్.. విపక్షాలపై పలు ప్రశ్నలు సంధించారు.ధాని మోదీ అచ్చేదిన్ నినాదానికి ఇది జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కౌంటర్‌. కాకినాడలో గర్జన గట్టిగానే వినిపించారు. ఏపీకి ఎంతో చేస్తామని రెండు పాచిపోయిన లడ్డూలను చేతిలోపెట్టి సరిపెడతారా? సీమాంధ్రులకు పౌరుషం, ధైర్యం లేదనుకుంటున్నారా? అంటూ మొదలుపెట్టిన పవన్ ప్రసంగం మలుపులు తిరిగింది. ఎంపీలు పోరాడలేకపోతే అప్పుడే రోడ్డెక్కుతానన్న పవన్ కేంద్రమంత్రి వెంకయ్యకు చురకలు అంటించారు. మరింత సమాచారానికి ఈ వీడియో క్లిక్ చేయండి..

20:55 - September 9, 2016

 

తూర్పుగోదావరి : అధికార, ప్రతిపక్షనాయకులకు చేతకాకుంటే చెప్పండి.. మేం రంగంలోకి దిగుతాం.. మా జనసేన బరిలోకి దిగుతుంది.. స్పెషల్‌ స్టేటస్‌ సాధిస్తుంది అని గర్జించారు పవన్‌. కాకినాడలో జరిగిన సభలో... తనదైన స్టైల్లో అలరిస్తూ.. విపక్షాలపై గబ్బర్ సింగ్ గర్జించారు. ప్రతిపక్ష, అధికార పక్షాలకు సాధ్యంకాని ప్రత్యేక హోదాను జనసేన కార్యర్తలు తెచ్చితీరుతారని పవన్‌ అన్నారు.

ఏపీకి రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు : పవన్
ఏపీకి తీపి కబురు వస్తుందంటే ఏంటో అనుకున్నాం.. బీజేపీ, టీడీపీ నాయకులు కలిసి చివరకు ఏపీకి రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్‌ విమర్శించారు. ఆంధ్రులకు చేవ చచ్చిందనుకుంటున్నారా అని పవన్‌ కాకినాడ సభలో ప్రశ్నించారు.

ఉద్వేగంగా మాట్లాడిన జనసేనాని
కాకినాడ ఆత్మగౌరవసభలో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఉద్వేగంగా మాట్లాడారు. అభిమానుల ఇళ్లకు వచ్చి అన్నంపెట్టమని అడుగుతాను. అడుక్కుని తినైనా ప్రజాసమస్యలపై పోరాడుతాను అన్నారు. సినిమాలు వొదిలేయామని చాలామంది అంటున్నారు. సినిమాలు వొదిలేస్తే నాకు అభిమానులే అన్నం పెట్టాలన్నారు పవన్‌ .

ఆత్మగౌరవ సభలో పవన్‌ గర్జన..
తప్పుచేస్తే.. అధికారులకేనా అకౌంటబిలిటీ. రాజకీయనాయకులకు అవసరం లేదా అని పవన్‌ ప్రశ్నించారు. రాజకీయనాయకులు తప్పుచేస్తే నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం సీపీఎం పార్టీ ఇచ్చిన బంద్‌ పిలుపును పవన్‌కళ్యాణ్‌ స్వాగతించారు. హోదా కోసం తలపెట్టిన బంద్‌కు మద్దతివ్వాలని అభిమానులకు పిలుపునిచ్చారు.

సీపీఎం రాష్ట్రబంద్‌కు జనసేన మద్దతు - పవన్‌
ప్రజాసమస్యలను అవకాశవాద రాజకీయాలకు వాడుకోవద్దని పవన్‌ సూచించారు. సమస్యలు పరిష్కరించకపోయినా.. పర్వాలేదు కానీ కొత్త సమస్యలు సృష్టించవద్దని పవన్‌ సూచించారు. 

కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిస్తే.. బీజేపీ పొట్టలో పొడిచింది..

కాంగ్రెస్‌, బీజేపీ కలిసి రాష్ట్రంలో అస్థిరతను సృష్టించాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. కాకినాడ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిస్తే.. బీజేపీ పొట్టలో పొడిచిందన్నారు. పాచిపోయిన రెండు లడ్డూలు ఇచ్చి ఇదే ఏపీకి తీపి కబురు అంటారా అని పవన్‌ మండిపడ్డారు. అంబేద్కర్‌ మీద గౌరవం ఉంటే పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని.. ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉండాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

ఉతికి పారేసిన పవన్
కాకినాడ ఆత్మగౌరవ సభలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ గర్జించారు. తనదైన శైలిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కాంగ్రెస్‌ తీరును ఉతికి పారేశారు. ఏపీకి తీపికబురు వస్తుందంటూ ఊరించి ఊరించి చివరకు రెండు పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారా అని మండిపడ్డారు. ఆంధ్రులు చేవచచ్చారని అనుకుంటున్నారా అంటూ పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ఇచ్చిన మాటలకు విలువ లేదా అని పవన్‌ ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాటమార్చడం సరికాదన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్లయితే మాటకు కట్టుబడి ఉండాలన్నారు.

నా ప్రజలే నా బలం..పవన్ కళ్యాణ్
నా వెనుక ఎవరూ లేరన్న పవన్‌ ప్రజలే నా బలం అన్నారు. రాజకీయాలు అంటే గడ్డం గీసుకున్నంత తేలిక కాదని కొందరంటున్నారని.. మరి గడ్డం గీసుకున్నంత ఈజీగా రాష్ట్రాన్ని ఎందుకు విభజించారని ప్రశ్నించారు. బీజేపీ ప్యాకేజీపై పవన్‌ మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాల కోసం తాను రాలేదని ప్రజాసమస్యలు తెలుసుకుని వచ్చానని పవన్‌ అన్నారు.

వెంకయ్య నాయుడుపై జనసేనాని పవన్‌ ఫైర్‌..
బీజేపీ నేత వెంకయ్య నాయుడుపై జనసేనాని పవన్‌ ఫైర్‌ అయ్యారు. ఓట్లు అడిగే టైంలో అందరికీ అర్ధమయ్యే భాషలో మాట్లాడుతారు.. అధికారంలోకి వచ్చాక అర్థంకాని భాషలో మభ్యపెడుతున్నారని పవన్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిస్తే... బీజేపీ పొట్టలో పొడిచిందని పవన్‌ అన్నారు. అవకాశవాద రాజకీయాలతో తెలంగాణ, సీమాంధ్రలో యువకులు బలయ్యారని పవన్‌ విమర్శించారు. రెండు జాతీయ పార్టీలు కలిసి తెలుగు రాష్ట్రాల్లో అస్థిరత సృష్టించాయని మండిపడ్డారు.

సీపీఎం అంటే గౌరవం..
సీపీఎం పార్టీ అంటే తనకు ఎంతో గౌరవముందని పవన్‌కల్యాణ్‌ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాన్ని మార్చుకుందన్నారు. అదే సీపీఎం రాష్ట్ర విభజనను వ్యతిరేకించిందని.. సీపీఎం జాతీయ నాయకులు సీతారాం ఏచూరీ పార్లమెంట్‌లో మాట్లాడిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయని పవన్‌ గుర్తుచేశారు. సీపీఎంతో కలిసి ముందుముందు పోరాటం చేస్తానని పవన్‌ అన్నారు.

అవంతిపై ఫైర్ అయిన జనసేన..
సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవం కాపాడాలని కోరుతున్న... అనకాపల్లి ఎంపీ అవంతీ శ్రీనివాస్.. తన స్థానానికి రాజీనామా చేయాలని పవన్ సూచించారు. ఆ స్థానం నుంచి తిరిగి గెలిపించే బాధ్యత జనసేనదేనని స్పష్టం చేశారు. టీజీ వెంకటేష్‌పై పవన్‌ మండిపడ్డారు. టీజీ రాజ్యసభ సీటు తాము వదిలేస్తే వచ్చిందని పవన్‌ అన్నారు. మా బిక్షవల్ల ఆ సీట్లో కూర్చొని తమనే విమర్శిస్తారా అని పవన్‌ మండిపడ్డారు.సీమాంధ్రుల ఆత్మగౌరవం కాపాడతామని గద్దెనెక్కి.. ఇప్పుడు తమ వల్ల కాదంటే ఊరుకునేది లేదని పవన్.. టీడీపీ, బీజేపీ నేతలను ఉద్ద్యేశించి అన్నారు. తాను తన అమ్మను, అన్నను, వదినను కాదని.. టీడీపీ, బీజేపీకి అండగా నిలబడ్డానన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించే దమ్ము కోసం కారం తినాలంటూ పవన్ ఘాటుగా స్పందించారు.

అధికార, ప్రతిపక్షనాయకులకు చేతకాకుంటే..జనసేన బరిలోకి దిగుతుంది..
అధికార, ప్రతిపక్షనాయకులకు చేతకాకుంటే చెప్పండి.. తాము రంగంలోకి దిగుతాం.. మా జనసేన బరిలోకి దిగుతుంది.. స్పెషల్‌ స్టేటస్‌ సాధిస్తుంది అని గర్జించారు పవన్‌. ప్రతిపక్ష, అధికార పక్షాలకు సాధ్యంకాని ప్రత్యేక హోదాను జనసేన కార్యర్తలు తెచ్చితీరుతారని పవన్‌ అన్నారు. 

అంబేద్కర్‌ మీద ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించండి..
కాకినాడలో జనగర్జన మార్మోగింది. జనసేనాని ఆత్మగౌరవసభ అధికారపక్షానికి సవాల్‌ విసిరింది. మాటలే బుల్లెట్లుగా బీజేపీ ,టీడీపీలను ఏకిపారేశారు జనసేనాని వపన్‌కళ్యాణ్‌.. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీకి కట్టుబడకుండా.. ప్యాకేజీలంటూ.. మభ్యపెడుతున్నారని పవన్‌కళ్యాణ్‌ ఫైర్‌ అయ్యారు. విభజనచట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు న్యాయంగా దక్కాల్సిన ప్రత్యేకహోదాను బీజేపీనేతలు దక్కకుండా చేస్తున్నారని పవన్‌ విమర్శించారు. రాజ్యంగా నిర్మాత అంబేద్కర్‌ మీద గౌరవం ఉంటే వెంటనే ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ ప్రకటించాలన్నారు.

20:48 - September 9, 2016

గొంతు చించుకున్నాడు..చరిత్ర పాఠాలు తవ్వాడు..న్యాయం కావలసిందే అన్నాడు..ఇవన్నీ గతంలో కూడా చెప్పాడు..మరి కొత్తగా ఏం తేల్చాడు..?? కొంత ఆవేశం, ఇంకొంత బిజెపీ పట్ల వ్యతిరేకత పవన్ కల్యాణ్ లో కనిపిస్తున్నాయా? పవన్ తన పయనంలో యూ టర్న్ తీసుకోబోతున్నాడా? కాకినాడ సభ సంకేతాలేంటి? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. తాను ఇంత కాలం మద్దతిచ్చిన బీజెపీపై చేసిన వ్యాఖ్యలను ఎలా అర్ధం చేసుకోవాలి? ఆంధ్రకు ఎందుకు అన్యాయం చేస్తున్నారంటూ బిగ్గరగా ప్రశ్నిస్తున్న పవన్ ఏదిశలో నడుస్తున్నారు.. కార్యాచరణ చెప్పకపోయినా, మీటింగ్ లతో పవన్ ప్రభావం చూపనున్నాడా? ప‌వ‌న్ క‌ల్యాణ్.. జ‌న‌సేన అధినేత‌గా కీల‌క‌స‌మ‌యంలో నిర్వ‌హించిన స‌భ కాబ‌ట్టి కాకినాడ జ‌న‌సేన స‌భ ఆస‌క్తిరేపింది. పెద్ద చ‌ర్చ‌కే దారితీసింది. ప‌వ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌దానిపై చాలా మందిలో వాదోప‌వాద‌న‌లు సాగుతున్న త‌రుణంలో ప‌వ‌న్ స‌భ ఏపీ రాజ‌కీయాల్లో పెద్ద ప్ర‌బావం చూపిస్తుంద‌నే అంచనాల మధ్య సాగింది.ఏపీలో ఇప్పుడు రాజ‌కీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. పైచేయి సాధించ‌డం కోసం అటు పాల‌క‌, ఇటు విప‌క్షాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. స్పెష‌ల్ ప్యాకేజీతో టీడీపీ శాటిస్ఫై అయిపోగా..అది కూడ‌దు..ఖ‌చ్చితంగా హోదా ఇవ్వాల్సిందేనంటూ వైసీపీ ప‌ట్టుబ‌డుతోంది. అసెంబ్లీ వేదిక‌గా చేసుకుని ఉభ‌యులూ పొలిటిక‌ల్ మైలేజీ గేమ్ ఆడుతున్నాయి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో జరిగిన స‌భ ఆసక్తిగా సాగింది..మొత్తానికి పవన్ కాకినాడ సభ రాజకీయ వర్గాల్లో ప్రజల్లో కొంత చర్చను రేకెత్తించిందనే చెప్పాలి. గతంలో లేనట్టుగా బీజెపీపై గొంతెత్తడం, పోరాట పంథా గురించి కొంచెం సీరియస్ గా మాట్లాడటం.. ఎంపీల రాజీనామా ప్రస్థావన, వామపక్షాల పట్ల అభిమానం ప్రకటించటం.. ఇవన్నీ పవర్ స్టార్ లో చెప్పుకోదగ్గ విషయాలుగా కనిపిస్తున్న అంశాలు. ఓవరాల్ గా కొంత ఆవేశం, కాస్త కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ ప్రజాసమస్యపై పోరాడటానికి ముందుకు వస్తానని ప్రకటిస్తే ఆహ్వానించదగ్గ విషయమే.. మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

20:42 - September 9, 2016

విజయవాడ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం మధ్యహ్నాం 4.00లకు కాకినాడ జేఎన్టీయూ గ్ గ్రౌండ్ లో సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈసభలో పవన్ కళ్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తీవ్రంగా విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని ఏపీ ప్రజలను నమ్మించి..ఎన్నో ఆశలు కల్పించి ఇప్పుడు పాచిపోయిన లడ్డూలంటి ప్యాకేజీని ప్రకటించిందని మండిపడ్డారు. సీమాంధ్ర ఎంపీలపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. అలాగే కేంద్రం ఏపీ ప్రకటించిన ప్యాకేజీని వ్యతిరేకిస్తూ ..రేపు అంటే శనివారం నాడు విపక్షాలు బంద్ కు పిలునిచ్చాయి.. బంద్ కు పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. ఈ అంశంపై జిల్లాల్లోని ప్రజల స్పందన ఏవిధంగా వుందో తెలుసుకుందాం..

తిరుపతిలో ..

మేము ఆతృతగా ఎదురు చూశామని..కానీ తిరుపతి ప్రసంగంలో వున్న తీవ్రత కాకినాడ సభలో లేదని తిరుపతి వాసులు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజల తరపున పాల్గొంటానని పవన్ తెలపలేదన్నారు. ప్రత్యేక హోదాపై పవన్ పోరాడితే ఆయన తరపున తామంతావుంటామన్నారు. బీజేపీ పార్టీ వైఖరేంటో ఇప్పటికైనా తెలుసుకున్న పవన్ వచ్చే ఎన్నికల్లోనైనా వారితరపున లేకుండా వుంటాలని తిరుపతివాసులు కోరుతున్నారు.

విజయవాడ లో..
కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై విజయవాడ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎం పార్టీతో కలిసి పనేచేయటానికి తాను సిద్ధంగా వున్నానని పవన్ కళ్యాణ్ చెప్పటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అలాగే అన్ని పార్టీలూ హోదా కోసం పోరాడాలన్నారు. హోదాకోసం పోరాడని పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన ఫలితం అనుభవిస్తారన్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై ప్రత్యక్షంగా పోరాటంలోకి దిగితే తామంతా ఆయన వెంట వుంటామన్నారు.

విశాఖలో..
పవన్ కళ్యాణ్ ప్రసంగంపై విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోరాడాల్సింది ప్రజలు కాదు ప్రజాప్రతినిధులు పోరాడాలనటం స్వాగతిస్తున్నామన్నారు.

పవన్ ను అర్థం చేసుకోవాలి : చంద్రబాబు

హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ‌ జేఎన్టీయూ గ్రౌండ్ లో జరిగిన సభలో జనసేన అధినేత‌, సినీనటుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రసంగం చేసిన దృష్ట్యా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చెయ్యొద్ద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు టీడీపీ నేత‌లకు సూచించారు. హైద‌రాబాద్‌లో అసెంబ్లీ కమిటీ హాలులో టీడీపీ శాసనసభాపక్షం భేటీ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... పవన్‌ వాదనను మ‌నం అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. క్లిష్ట ప‌రిస్థితుల్లో ప్యాకేజీని తిర‌స్క‌రించ‌లేమ‌ని అన్నారు. అయితే, ప్యాకేజీతో స‌రిపెట్టుకోబోమ‌ని, హోదా కోసం ప్ర‌య‌త్నిస్తూనే ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

సీపీఎంకు దాసోహమన్న పవన్..

తూర్పుగోదావరి : రాష్ట్ర విభజన వద్దన్న సీపీఎంకు తాను దాసోహమయ్యానని, పోరాటాలు, బంద్ లకు వెళ్లి యువకుల భవిష్యత్ పాడు చేసుకోవద్దని పవన్ కల్యాణ్ సూచించారు. ఎంపీ టీజీ వెంకటేశ్ పై పవన్ కల్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. కర్నూల్ లో పరిశ్రమలతో కలుషితం చేస్తున్నారని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తాను రాజకీయ డ్రామాలు చేయనని, చేయాలనుకుంటే నేరుగానే తాడోపేడో తేల్చుకుంటానని హెచ్చరించారు.

16మంది బాల నేరస్తులు పరార్..

రాజస్థాన్ : జైపూర్ జువెనైల్ హోం నుంచి 16మంది బాల నేరస్తులు పరారయ్యారు. నిన్న రాత్రి జువైనైల్ హోం ప్రాంగణంలో ఉన్న టాయిలెట్ గోడను కూలగొట్టి బాల నేరస్తులు పరారయ్యారని పోలీస్ అధికారి వెల్లడించారు. పరారైన వారిలో ఒకరు ఇంటికి చేరుకోగా..కుటుంబసభ్యులు అతన్ని తిరిగి అధికారులకు అప్పగించారని తెలిపారు. పరారైన వారి కోసం గాలింపును ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

13న బక్రీదు సెలవు..

హైదరాబాద్: బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13న సెలవు దినంగా ప్రకటించింది. బక్రీద్‌ రోజు సెలవు దినంగా ప్రకటిస్తూ ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్..

తూర్పుగోదావరి : గ్యాస్ లీకేజీ కలకలం రేపుతోంది. అల్లవరం మండలం తాడికోన గ్రామంలో ఓఎన్జీసీ బావి తవ్వుతుండగా గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో గ్రామస్థుల్లో భయాందోళనలకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు, రిగ్ కు చుట్టూ గల 500 మీటర్ల ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. కాగా.. గతంలో నగరం ఘటనలో గ్యాస్ లీకేజీ కారణంగా పెనువిపత్తు సంభవించిన సంగతి తెలిసిందే.

19:34 - September 9, 2016
18:56 - September 9, 2016

ఊహలు గుసగుసలాడే చిత్రంతో సెన్సిటివ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న శ్రీనివాస్ అవసరాల మలిచిన మరో హ్యూమరస్ అటెమ్ట్ జ్యో అత్యుతానంద. నారా రోహిత్, నాగశౌర్య, రెజినా ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా నేడే థియేటర్స్ లోకి వచ్చింది. ఇంతకీ శ్రీనివాస్ అవసరాల రెండో ప్రయత్నం సక్సెస్ అయిందా లేదా ....? ఊహలు గుసగుసలాడే చిత్రంతో శ్రీనివాస్ అవసరాల తానో సెన్సిటివ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. హ్యూమరస్ ట్రీట్ మెంట్ తో రొమాంటిక్ ప్రేమకథాచిత్రంగా మలిచి మంచి సక్సెస్ సాధించాడు. రెండో సినిమా జ్యో అత్యుతానంద కూడా అదే జానర్ లో వెళతాడని అనుకున్నారు కానీ, ఇదో అన్నదమ్ముల కథగా మనం చెప్పుకోవాలి. అన్నదమ్ముల మధ్య చిలిపి తగాదాలు, చిరు గొడవలు నేపధ్యంలో ఈ సినిమాని కూడా చాలా అద్భుతమైన హ్యూమరస్ ట్రీట్ మెంట్ తో ఆద్యంతం నవ్వించాడు. ముఖ్యంగా చమత్కారపు డైలాగ్స్ తో జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేసాడు. సినిమా టేకాఫ్ లోనే తాను దర్శకుడిగా ఎంత ప్రత్యేకమో చాటుకున్నాడు. ఫస్టాఫ్ అంతా హాయిగా ఎలాంటి హర్డిల్స్ లేకుండా తమాషా సన్నివేశాలతో కథనం సాగుతుంది. సెకండాఫ్ లో వేగం మందగించినా బోర్ మాత్రం కొట్టదు. హ్యూమర్ తో ఎమోషన్స్ మిక్స్ చేసి క్లీన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్నితీర్చిదిద్దాడు దర్శకుడు. కానీ ఇదో పక్కా మల్టిప్లెక్స్ మూవీ. ఇందులో లవ్ స్టోరీ పెద్దగా ఉండదు కాబట్టి, దీనికి మాస్ పీపుల్ కనెక్ట్ అవుతారని చెప్పలేం. ముఖ్యంగా బి,సి సెంటర్లలో ఈ సినిమా మనుగడ కష్టమనిపిస్తుంది.

కథ..
అత్యుత్ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో హెచ్ .ఆర్ గా పనిచేస్తుంటాడు, అతడి తమ్ముడు ఆనంద్ మెడికల్ రిప్రజెంటేటివ్స్. వీళ్లిద్దరూ తమ ఇంటిపక్కన కొత్తగా అద్దెకు దిగిన జ్యో ని చూసి ఎట్రాక్ట్ అవుతారు. ఇద్దరూ ఒకిరి తెలియకుండా ఒకరు ఆ అమ్మాయిమీద ప్రేమ పెంచుకుంటారు. ఇద్దరూ అవ్ లెటర్స్ ఇస్తారు. కానీ ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఇద్దరికీ సారీ చెబుతుంది. ఇంతలో చిన్న డిస్ట్రబెన్స్ . అత్యుత్ , ఆనంద్ తండ్రికి గుండెపోటు వస్తుంది. ఈ విషయం జ్యో వాళ్లనాన్నకి చెప్పడం వల్లే గుండెపోటు వచ్చిందని అపార్ధం చేసుకొని ఆ అమ్మాయిని హర్ట్ చేస్తారు.కట్ చేస్తే ఆ అమ్మాయి అమెరికావెళ్ళిపో్తుంది. వీళ్లిద్దరికీ పెళ్లిళ్ళు అయిపోతాయి. అయితే వాళ్లభార్యల మధ్య జ్యో ప్రస్తావన వస్తుంది. దాన్ని కవర్ చేసుకోడానికి అన్నదమ్ములిద్దరూ పడే పాట్లే ఈ సినిమా మిగతా కథ. సినిమా స్టార్టింగ్ లో వీళ్లిద్దరికీ పెళ్లిళ్ళు జరిగిపోయినట్టుగానే చూపించి. ఫ్లాష్ ఎపిసోడ్స్ గా జ్యో అత్యుతానంద ల కథను చెప్పాడు దర్శకుడు. 

 పాత్రల తీరుతెన్నులు... 
నారా రోహిత్, నాగశౌర్యలు ఒకరికొకరు పోటీ పడుతూ మరీ ఈ సినిమాలో కామెడీ పండించారు. అన్నదమ్ములు గా వీరిద్దరి కెమిస్ట్రీ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. అదే మూడ్ ను సినిమా ఆద్యంతం కంటిన్యూ చేసారు. సినిమా బిగిన్ అయిన కొద్దిసేపటికే వీరిద్దరి నటనకు కనెక్ట్ అయిపోతారు ప్రేక్షకులు. ఇక రెజినా గురించి చెప్పాల్సింది పెద్దగా ఏమీలేదు. గ్లామరస్ గా కనిపించింది తక్కువ, పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అంతగా ఏమీ ఉండదు కానీ, ఓకె అనిపిస్తుంది. ఇందులో విలన్స్ ఎవరూ ఉండరు, కానీ కొన్ని ట్విస్టులు మాత్రం జనానికి భలే ఎంటర్ టైన్ మెంట్ నిస్తాయి. ఇక సినిమాలో మూడొంతుల కథ వీరి ముగ్గురు చుట్టూనే నడుస్తుంది. రోహిత్, నాగశౌర్యల భార్యలు గా నటించిన అమ్మాయి లు కూడా ఉన్నంతలో బాగా నటించారు. ఇక సినిమా కి ప్రధాన డ్రా బ్యాక్ ఏంటంటే. లవ్ స్టోరీ ఏమీ లేకపోవడం, డ్యూయెట్స్ అసలు లేకపోవడం అద్భుతమైన డైలాగ్స్ తో , వినసొంపైన సంగీతంతో మాత్రం ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు అవసరాల. ఇందులో ఇద్దరికీ హీరోయిన్స్ గా గ్లామరస్ ముఖాలు ఎవరూ లేరు కాబట్టి, ఇది పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ కాబట్టి మాస్ జనానికి నచ్చడం కష్టం కావచ్చు.

ప్లస్ పాయింట్స్ :
నారారోహిత్, నాగశౌర్యల నటన
సంగీతం
డైలాగ్స్
క్లాసీ స్ర్కీన్ ప్లే.
క్లైమాక్స్ .
మైనస్ పాయింట్స్ :
ప్రేమకథ లేకపోవడం
సెకండాఫ్ స్లో అవడం
రేటింగ్ : 2/5

జనసేనాని ప్రసంగంపై బాబు స్పందన..

తూర్పుగోదావరి : కాకినాడ‌ జేఎన్టీయూ గ్రౌండ్ లో జరిగిన సభలో జనసేన అధినేత‌, సినీనటుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ప్రసంగంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. జ‌న‌సేనాని అన్నీ వాస్తవాలే మాట్లాడారని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తే అంద‌రిక‌న్నా ఎక్కువగా సంతోషించేది తానేనని ఆయ‌న అన్నారు. హోదా వ‌స్తే రాష్ట్రానికి అనేక అంశాల్లో వెసులుబాటు వస్తుందని వ్యాఖ్యానించారు.

ప్రెసిడెన్సీ వర్సిటీలో అగ్నిప్రమాదం

పశ్చిమబెంగాల్ : రాజధాని కోల్‌కతా నగరంలోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వర్సిటీలోని లైబ్రరీలో సర్వర్‌ రూంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటల నుంచి తప్పించుకోబోయి ఓ విద్యార్థి గాయపడినట్లు తెలిపారు. ఐదు అగ్నిమాపక యంత్రాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. 

18:28 - September 9, 2016

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసిన ఎన్డీయే ప్రభుత్వంపై జనసేనాని నిప్పులు చెరిగారు. గెడ్డం గీసుకున్నంత తేలిగ్గా రాష్ట్రాన్ని విడగొట్టారని యూపీఏ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఎంపీల్లారా పార్లమెంట్ కు వెళ్లేటప్పుడు ఒంటికి కారరం రాజుకుని..కారం తిని వెళ్ళండి అంటూఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవ సభపై టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలకపల్లి రవి (ప్రముఖ రాజకీయ విశ్లేషకులు) జూపూడి ప్రభాకర్ (ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్) నాగార్జున (వైసీపీ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తల అభిప్రాయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

18:23 - September 9, 2016

తూర్పుగోదావరి కాకినాడలో జనసేన ఆధ్వర్యంలోనిర్వహించిన బహిరంగ సభలో అపశృతి చోటు చేసుకుంది. పవన్‌కల్యాణ్‌ ప్రసంగించిన అనంతరం స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయాలయినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు కాజులూరు మంలం కుయ్యేరుకు చెందిన వెంకటరమణగా గుర్తించారు. రోడ్డు పక్కన పడి గాయాలపాలయిన వీరి గురించి ఎవరూ పట్టించుకోకపోవటంతో 10టీవీ సిబ్బంది మోటార్ బైక్ పై ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. దీనికంతటికీ ప్రధాన కారణం అభిమానుల అత్యుత్సాహంగా కూడా తెలుస్తోంది. మితిమీరిన అభిమానంతో ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. 

జనసేన సభలో అపశృతి..

తూర్పుగోదావరి : కాకినాడలో జనసేన ఆధ్వర్యంలోనిర్వహించిన బహిరంగ సభలో అపశృతి చోటు చేసుకుంది. పవన్‌కల్యాణ్‌ ప్రసంగించిన అనంతరం స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయాలయినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు కాజులూరు మంలం కుయ్యేరుకు చెందిన వెంకటరమణగా గుర్తించారు. రోడ్డు పక్కన పడి గాయాలపాలయిన వీరి గురించి ఎవరూ పట్టించుకోకపోవటంతో 10టీవీ సిబ్బంది మోటార్ బైక్ పై ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. దీనికంతటికీ ప్రధాన కారణం అభిమానుల అత్యుత్సాహంగా కూడా తెలుస్తోంది.

అచ్చే దిన్ అంటే ఇదేనా : పవన్

తూర్పుగోదావరి : అధికారంలోకి వస్తే అన్నీ హ్యాపీడేస్‌ అని ఎన్నికల ప్రచారంలో చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు అరచేతిలో స్వర్గం చూపించారని పవన్‌ కళ్యాణ్ మండిపడ్డారు. వారు చెప్పిన హ్యాపీ డేస్ ఇప్పుడు కనిపించడం లేదన్నారు. ఓట్లు అడిగేటప్పుడు అర్ధమయ్యే భాషలో మాట్లాడుతారని, ఏదైనా ఇవ్వాల్సి వస్తే మాత్రం అర్థం కాకుండా మాట్లాడుతారని బీజేపీ నేతలను పవన్‌ ఎద్దేవా చేశారు.

పాచిపోయిన లడ్డూలు ఏపీకి ఇచ్చారు..

తూర్పుగోదావరి : ఏపీ ప్రత్యేక హోదా ఇస్తామంటూ గత రెండేళ్ల నుంచీ ఊరించీ..ఊరించీ కేంద్రం ఇప్పుడు పాచిపోయిన రెండు లడ్డూలు ఆంధ్రులకు ఇచ్చిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. భాజపా, తెదేపా నేతలంతా అదిగదిగో అంటూ ప్రజలను ఆశ పెట్టారని.. చివరికి హోదా ఇస్తారనుకుంటే రెండు లడ్డూలు చేతిలో పెట్టారని చెప్పారు. అవకాశవాద రాజకీయాల వల్ల గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారని.. పదవులే ముఖ్యమైతే ప్రజా సమస్యలు ఇలాగే ఉంటాయని విమర్శించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో విభేదాల్లేవని స్పష్టం చేశారు. 

డెంగ్యూ బాధితులరాలిపై డాక్టర్ అత్యాచారం..

గుజరాత్ : డెంగ్యూతో బాధ‌ప‌డుతూ ఐసీయూలో చేరిన ఓ 21 ఏళ్ల యువ‌తిపై అత్యాచారం చేశాడు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్ అపోలో హాస్పిట‌ల్‌లో జ‌రిగింది. ఆసుప‌త్రిలో డాక్ట‌ర్‌తోపాటు స్వీప‌ర్ కూడా రెండు రోజుల పాటు అత్యాచారం చేశారు. బాధిత యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వాళ్లు డాక్ట‌ర్ ర‌మేష్ చౌహాన్‌తోపాటు స్వీప‌ర్‌ను కూడా అరెస్ట్ చేశారు. రేప్ చేసే ముందు త‌న‌కు ఏదో మ‌త్తు మందు ఇచ్చార‌ని, అందువల్ల తాను అచేత‌నంగా ఉండిపోయాన‌ని ఆ యువ‌తి ఫిర్యాదులో పేర్కొంది. ఆ యువ‌తిపై అత్యాచారం జ‌రిగిన‌ట్లు వైద్య ప‌రీక్ష‌ల్లో కూడా నిర్ధారిత‌మైంది. 

18:03 - September 9, 2016
17:31 - September 9, 2016

తూర్పుగోదావరి : ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజలు చట్టసభలకు పంపించిన ప్రజా ప్రతినిధులు ఉండగా.. విద్యార్ధులు బంద్ లో పాల్గొనటమేంటన్నారు. ప్రజాప్రతినిధులు  పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకు వస్తారన్న భావనతోనే తాను రోడ్లపైకి రాలేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించాడు. తాను ముందుకు కదిలితే అభిమానులంతా రోడ్లపైకి వస్తారని..తద్వారా వారు పలు ఇబ్బందులకు గురవుతారన్నారు. అందుకనే తాను రాలేదన్నారు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో పాటు బీజేపీ కూడా హోదాను తెచ్చేందుకు కృషి చేయాలనీ..ఎన్నికైన ప్రజా ప్రతినిధులుగా అది వారిపై ఉన్న బాధ్యతని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చానని పవన్ చెప్పాడు. హోదా తేవటం చేతకాదని ప్రజాప్రతినిధులు చెబితే తాను పోరాడేందుకు సిద్ధంగా వున్నానన్నారు.

పదవుల్లో వున్నవారే బంద్ లో పాల్గొన్నాలి : పవన్
రేపు అఖిలపక్ష నేతలు ప్రకటించిన బంద్ గురించి ప్రస్తావిస్తూ, దానిలో పాల్గొంటారా? వద్దా? అన్నది కార్యకర్తల ఇష్టమని చెప్పాడు. అయినా "మీరెందుకు కష్టపడాలి? పదవుల్లో కూర్చున్నవారూ..పార్లమెంటులో కూర్చున్నవారు..పార్లమెంట్ క్యాంటీన్లో సబ్సిడీ ఫుడ్ తింటున్నవారు రోడ్లమీదికి వచ్చి పోరాడాలని డిమాండ్ చేశారు. మీరు చదువుకోవాలి. మీరు ఉద్యోగాలు చేయాలి. మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. ఇకపై నేతల పప్పులు ఇక ఉడకవు. వారు పోరాటం చేయాల్సిందేనన్నారు. పోరాటం చేయాలని వారిని నిలదీయండి" అంటూ తన అభిమానులకు పిలుపునిచ్చాడు పవన్.  

17:07 - September 9, 2016

తూర్పుగోదావరి : కాకినాడ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఎంపీలపై పవన్ సెటైర్లు వేశారు. సీమాంధ్ర ఎంపీలకు పౌరుషం రావాలంటే పార్లమెంట్ కు వెళ్లేటప్పుడు ఒంటికి కారం రాసుకుని..పచ్చిమిర్చి తిని పార్లమెంట్ వెళ్ళాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పుడైనా పౌరుషం వస్తుందేమోనని ఎద్దేవా చేశారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం అవంతి శ్రీనివాస్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తే జనసేన నుంచి అనకాపల్లి టికెట్ ఇచ్చి తాను అక్కడే కూర్చుని గెలిపిస్తానంటూ పేర్కొన్నారు. అలాగే తాను ఎంపీ కావాలనుకుంటే గతంలో పీఆర్పీ నుంచే పోటీ చేసి గెలిచేవాడినన్నారు. అలాగే టీడీపీ ఎంపీ మురళీ మోహన్ పై చురకలేశారు. వ్యాపారం చేసుకోవటం తప్పుకాదనీ..కానీ ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎంపీగా స్పందించాల్సిన అవుసరముందని మురళీమోహన్ కు చురకలు వేశారు. స్వంతలాభం కొంతమానుకుని ..ప్రజలకోసం ఆలోచించాల్సిన అవుసరముందన్నారు. తెలుగువారై వుండి ఏపీకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇచ్చిన ప్యాకేజీని సమర్థించటం సరైందికాదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు సూచించారు.  సీమాంధ్రుల  ఆత్మగౌరవాన్ని నిలబెట్టే బాధ్యత వెంకయ్య నాయుడుపై వుందన్నారు. ఏపీలో కరవు ప్రాంత జిల్లాల్ని చూసి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాననీ..పార్లమెంట్ లో చేసిన ప్రకటనకు మీరు విలువనిచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా? లేదా?అని ప్రశ్నించారు. ఉత్తరాది నాయకులు సీమాంధ్రుల్ని తిట్టినా ఏ ఒక్క ఎంపీలు మాట్లాడలేదన్నారు. సీమాంధ్ర నాయకుల్ని తన్ని బయటకు పంపి రాష్ట్రాన్ని విడదీశారన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత తాను 11 రోజులపాటు భోజనం తినలేదన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సింది విద్యార్థులు కాదనీ...ప్రజాప్రతినిధులేనన్నారు. నాయకులు చేసిన తప్పులకు విద్యార్ధులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

16:44 - September 9, 2016

తూర్పుగోదావరి : కాకినాడ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వందలాదిమంది ప్రాణాల్ని త్యాగం చేశారన్నారు...ఎట్టకేలకూ తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చింది. కానీ చనిపోయిన బిడ్డల పట్ల సానుభూతి కానీ ..సంతాపం కానీ ఆనాటి యూపీఏ ప్రభుత్వం  ప్రకటించలేదన్నారు. కనీసం ఒక్క క్షమాపణ కూడా చెప్పలేదన్నారు. ఈ రోజు ఏపీకి ఇంత అన్యాయం జరుగుతుంటే..ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి..పాచిపోయిన లడ్డూలాంటి ప్యాకేజీకి ఏపీ మొహాన విసిరేశారు తప్ప ..కేంద్రం నుండి ఒక్క నాయకుడు కూడా ఏపీకి వచ్చి ఈ అంశంపై మాట్లాడటంలేదన్నారు.దీనికంతటికీ కారణం ఒక్కటే ననీ.. ఉత్తరాది అహంకారమే కారణమని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలంటే ఉత్తరాది నాయకులకు చిన్నచూపన్నారు. దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో అంతర్భాగంగా కాదాని ప్రశ్నించారు. కేంద్రం ప్రభుత్వం వద్ద ఎవ్వరూ సీమాంధ్రులు తలవంచి అడుక్కోవాల్సిన పనిలేదనీ..డిమండ్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి..ప్రజాప్రతినిధులకు ప్రత్యేక హోదా కోసం పోరాడటం చేతకాకపోతే జనసేన పార్టీ పోరాడి సాధిస్తుందన్నారు. 

16:14 - September 9, 2016

తూర్పుగోదావరి : కాకినాడ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవ సభ ప్రారంభమయ్యింది. పంచ్ డైలాగ్స్ తో పవన్ అదరగొట్టారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఊరించి..ఊరించి..పాచికంపు కొట్టే రెండు లడ్డూలని ఏపీ ప్రజల మొహాన కొట్టారని ఎన్డీయే ప్రభుత్వంపై జనసేనా తీవ్ర పదాలతో విమర్శించారు. ఏపీకి ఎన్డీయే ప్రభుత్వం ఏదో చేస్తుందని మీకులానే నేను కూడా ఎదురు చూసానన్నారు. మరి టీడీపీ ప్రభుత్వం పాచి లడ్డూలను చూసుకుంటుందా? ఆ పాచిలడ్డూలు ఎంపీలకే చాలవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గెడ్డం గీసుకున్నంత తేలిగ్గా రాష్ట్రాన్ని విడగొట్టారని కాంగ్రెస్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవకాశపు రాజకీయాలు చేయటానికి నేను రాలేదని తెలిపారు. నేను సినిమా హీరోని కావచ్చు కానీ వేలాది కోట్ల ప్రజల సొమ్ముని తినటానికి రాజకీయాల్లో రాలేదన్నారు. తాను దిగువ మధ్య తరగతి కుటుంబలోంచి వచ్చిన వాడినన్నారు. మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అనే వంశం మాది కాదన్నారు. అతి సామాన్యుగా బ్రతకటమే తనకు ఇష్టమన్నారు. నావెనుక ఏదో రాజకీయ పార్టీ వుందని కొందరు విమర్శిస్తున్నారనీ..తన వెనుక వున్నది తన అభిమానులేని మరోసారి స్పష్టం చేశారు. తన అభిమానులే తన బలమన్నారు. తనకు ఏపార్టీ లపై విభేదాలు లేవన్నారు.

 

‘కరవుపై గన్ క్షేత్ర‌స్థాయి నివేదిక’ పుస్తకావిష్కరణ..

హైదరాబాద్ : అనంత‌పురంలో ఇటీవ‌ల వ‌చ్చిన క‌ర‌వు సామాన్య‌మైంది కాదని ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు అన్నారు. ‘కరవుపై గన్-క్షేత్ర‌స్థాయి నివేదిక’ పుస్త‌కాన్ని హైద‌రాబాద్‌లో ఈరోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆవిష్క‌రించింది. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు, స్పీకర్ కోడెల, మంత్రులు చిన‌రాజ‌ప్ప‌, కేఈ కృష్ణ‌మూర్తి, ప్ర‌త్తిపాటి పుల్లారావుతో పాటు ప‌లువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కోడెల మాట్లాడుతూ... అనంత‌పురంలో ఏర్ప‌డ్డ క‌ర‌వు ప్ర‌భావం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి ప్ర‌భుత్వం ఎంతో కృషి చేస్తోంద‌ని అన్నారు.

15:38 - September 9, 2016

‘కరవుపై గన్ క్షేత్ర‌స్థాయి నివేదిక’ పుస్తకావిష్కరణ..

హైదరాబాద్ : అనంత‌పురంలో ఇటీవ‌ల వ‌చ్చిన క‌ర‌వు సామాన్య‌మైంది కాదని ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు అన్నారు. ‘కరవుపై గన్-క్షేత్ర‌స్థాయి నివేదిక’ పుస్త‌కాన్ని హైద‌రాబాద్‌లో ఈరోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆవిష్క‌రించింది. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు, స్పీకర్ కోడెల, మంత్రులు చిన‌రాజ‌ప్ప‌, కేఈ కృష్ణ‌మూర్తి, ప్ర‌త్తిపాటి పుల్లారావుతో పాటు ప‌లువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కోడెల మాట్లాడుతూ... అనంత‌పురంలో ఏర్ప‌డ్డ క‌ర‌వు ప్ర‌భావం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి ప్ర‌భుత్వం ఎంతో కృషి చేస్తోంద‌ని అన్నారు.

15:33 - September 9, 2016

నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా నటించిన చిత్రం జో అచ్చుతానంద. ఈ చిత్రంపై టాలీవుడ్ సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి ప్రశంసల జల్లు కురిపించారు. ‘జ్యో అచ్యుతానంద’ చిత్రం క్లైమాక్స్ పది నిమిషాలు హృదయాలను పిండేస్తుందని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. శక్రవారం విడుదలైన ఈ చిత్రాన్ని చూసిన రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిప్రాయం వ్యక్తం చేశారు. వారాహి సీసీ, అవసరాల శ్రీనివాస్, కల్యాణ్ రమణ కాంబినేషనల్ లో మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘జో అచ్యుతానంద’ అని, చక్కటి వినోదాన్ని పండించిన ఈ చిత్రంలోని హీరోలిద్దరూ నిజమైన అన్నదమ్ముల్లాగా వున్నారన్నారు. రెజీనాను నటన బాగుందని రాజమౌళి కితాబిచ్చారు.వెంకట్ ఫొటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్టర్ రామ పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

 

15:31 - September 9, 2016

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చేతులెత్తేసూ కేంద్రం చేసిన ప్రకటనపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కువైతున్నాయి. దీనిపై వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. అసెంబ్లీ వేదికగా చేసుకుని పోరాటం చేస్తోంది. ఈ రోజు జరిగిన అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన వైసీపీ నేతలను మార్షల్స్ అడ్డుకున్నారు. రెండుసార్లు వాయిదా పడిన అసెంబ్లీ శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. బాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

17 సార్లు చదివారు..
కేంద్ర 'స్టేట్ మెంట్' ను సీఎం చంద్రబాబు స్వాగతిస్తే ఈ పెద్దమనిషికి నిజాయితీ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ప్యాకేజీకి సంబంధించిన సమాచారం మొత్తాన్ని 17 సార్లు చదివారని, అనంతరం అప్రూవల్ ఇచ్చేశారని..అనంతరం విదేశాల్లో ఉన్న ప్రధాన మంత్రికి చేరడం..ఆయన పరిశీలించడం..తిరిగి మళ్లీ బాబుకు వద్దకు నివేదిక చేరిందన్నారు. అనంతరం అర్ధరాత్రి జైట్లీ ప్రకటన చేశారని..ఇదిగో ఇస్తున్నా..అదిగో ఇస్తున్నానంటూ..ఉదయం నుండి రాత్రి వరకు బిల్డప్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ప్రతి రోజు తాను 9.3గంటలకు పడుకుంటానని ఆ రోజు రాత్రి మాత్రం లేట్ గా పడుకోవడం జరిగిందన్నారు.

జైట్లీ ప్రకటనలో కొత్తేమీ లేదు..
జైట్లీ ప్రకటనలో కొత్తేమీ లేదని, కేంద్ర మంత్రులు సృజనా చౌదరి..వెంకయ్య నాయుడులను కూర్చొబెట్టుకుని అర్ధరాత్రి స్టేట్ మెంట్ ఇచ్చారని తెలిపారు. అనంతరం బాబు ప్రెస్ మీట్ పెట్టి స్వాగతిస్తున్నానని చెప్పారని తెలిపారు. అంతేగాకుండా 'హోదా వీలు కాదనప్పుడు ప్రత్యామ్నాయాన్ని' కాదంటామా ? ఏదీ తీసుకోనప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యం' అని బాబు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందన్నారు. కేంద్రానికి బుద్ధి వచ్చే విధంగా పోరాటం చేయడం..మంత్రులను ఉపసంహరించుకోవడంలాంటి పనులు చేయాలని సూచించారు.

ఓటుకు కోట్లు..
వీడెవండి స్వాగతించడానికి ? బాబు ఎందుకు ప్రశ్నించలేక పోతున్నారు ? ఎందుకు నిలదీయడం లేదు ? ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ ఈయన పాత్రపై విచారణ చేయమని చెప్పడంతోనే డ్రామా స్టార్ట్ అయ్యిందన్నారు. వెంటనే కేంద్రంపై బాబు బేరసారాలు నడిపారని, కేంద్రం వెళ్లిపో అన్నా బాబు వెళ్లిపోరని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనేందుకు కోట్ల రూపాయలు వెచ్చిస్తూ నల్లధనం ఇస్తూ ఆడియో..వీడియో టేపుల్లో దొరికారని, ఇలా..ఐదు కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడిచారని తీవ్ర విమర్శలు గుప్పించారు.

బాబు రాజీనామా చేయాలన్న జగన్..
తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, వెంటనే కేంద్ర మంత్రులను ఉపసంహరించుకోవాలని..బాబు వెంటనే రాజీనామా చేయాలని..ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాబును అసెంబ్లీలో నిలదీస్తుంటే..స్టేట్ మెంట్ ఇస్తారని ప్రభుత్వం..స్పీకర్ లిద్దరూ పేర్కొంటున్నారని, దీనిపై తాము తీవ్ర ఆగ్రహంగా ఉంటుంటే సభలో స్టేట్ మెంట్ ఇస్తారని చెప్పడం ఎక్కడి ప్రజాస్వామ్యం అని నిలదీశారు. ప్రతిపక్షం చెప్పే విషయాలను వినిపించుకొనే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యే సస్పెండ్ కాకపోయినా మార్షల్స్ ను ప్రయోగించడం మొదటిసారి చూస్తున్నట్లు జగన్ వెల్లడించారు.
మరి జగన్ చేసిన ఈ విమర్శలపై ప్రభుత్వం..టిడిపి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

15:18 - September 9, 2016

నితిన్ కొత్త చిత్రం ఒపెనింగ్ జరుపుకుంది. అ ఆ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో బిగ్ బ్యానర్ లో రిసెంట్ గా నానితో హిట్టు కొట్టిన డైరెక్టర్ తో లవ్ స్టోరీకి రెడీ అయ్యాడు. మరి నితిన్ చేస్తున్న ఆ కొత్త సినిమా విశేషాలేంటో తెలుసుకుందాం.. చిన్నదానా నీ కోసం సోసో అనిపించిన నితిన్ 'అఆ' తో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు.ఈ యంగ్ హీరో కెరీర్ పరంగా అఆ మూవీ నెంబర్ వన్ హిట్టుగా నిలిచిపోయింది. ఈ చిత్రం 50కోట్లు వసూల్ చేయడంతో పాటు హీరోగా నితిన్ రేంజ్ ని పెంచింది. ఈ భారీ సక్సెస్ ని మిస్ యూజ్ చేయొద్దనే ఉద్దేశ్యంతో మంచి కథ కోసం ఇంతకాలం వెయిట్ చేసిన నితిన్ ఇప్పుడు కొత్త సినిమాను ఒకే చేశాడు. నితిన్ .దర్శకుడు హను రాఘవపూడితో కొత్త సినిమాను పట్టాలెక్కించాడు. వేసవిలో ఈ దర్శకుడు నానితో చేసిన కృష్ణగాడి వీరప్రేమగాథ మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ బ్యానర్ లో నితిన్ చిత్రం చేస్తుండడం విశేషం. రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట నిర్మిస్తోన్న ఈ సినిమా డిఫరెంట్ లవ్ స్టోరీతో తెరకెక్కనున్నట్లు సమాచారం. నవంబర్ రెండవ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ కోసం సర్చ్ చేస్తున్నారు. టైటిల్ ఫైనల్ కానీ ఈ చిత్రం ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

మరి కాసేపట్లో పవన్ ఆత్మగౌరవ సభ..

తూర్పుగోదావరి : మరికాసేపట్లో కాకినాడలో పవన్‌ ఆత్మగౌరవ సభ ప్రారంభం కానుంది. కాకినాడ జేఎన్టీయూ మైదానానికి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హోదాపై ఏపీలో జరుగుతున్ పోరుపై పవన్ కళ్యాణ్ స్పందించనున్నారు. 

ప్రివిలేజ్ కమిటీ అత్యవసరంగా సమావేశం..

హైదరాబాద్ : ఈ ఉదయం నుంచి వైకాపా సభ్యులు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరుపై చర్చించేందుకు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. పోడియంలోకి రావడంతో పాటు స్పీకర్ కుర్చీని ఆక్రమించాలని చూడటం, మార్షల్స్ తో గొడవలు, స్పీకర్ మైక్ ను విరగ్గొట్టడం, కెమెరాలు తోసివేయడం వంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్న గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలోని ప్రివిలేజ్ కమిటీ సభ్యులు కఠిన చర్యలకు సిఫార్సు చేయనున్నట్టు తెలుస్తోంది. 

14:57 - September 9, 2016

ముంబై : 'కపిల్ శర్మ'..తన షో ద్వారా హాస్యం పంచుతుంటారు. ఒక్కసారిగా ఆయన అవినీతిపై గళమెత్తారు. బీజేపీ ప్రభుత్వంపై..మోడీపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ కార్యాలయంలో పనికోసం వెళ్లిన కపిల్‌కు చేదు అనుభవం ఎదురవడంతో ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
తనకు ఎదురైన అనుభవాన్ని ఏకంగా ప్రధాని మోదీకే ట్వీట్ చేశారు. ప్రతియేటా ప్రభుత్వానికి 15 కోట్లు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నానని, తన ఆఫీస్ కోసం ముంబైలోని బిఎంసికి 5 లక్షలు లంచం ఇచ్చినట్లు పేర్కొన్నారు. 'మీ పాలనలో అచ్ఛేదిన్ అంటే ఇదేనా' అని ప్రధాని మోదీకి ట్విట్ చేశారు. 'కపిల్‌శర్మ' ఆరోపణలను స్పందించిన బిఎంసి అవినీతి అధికారి పేరు చెప్పాలని, ఆయనపై విచారణ జరిపిస్తామని విజిలెన్స్‌ విభాగం చీఫ్‌ ఇంజనీర్ మనోహర్‌ పవార్‌ పేర్కొన్నారు. 'కపిల్‌శర్మ' ట్వీట్‌పై సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ వివరాలిస్తే అవినీతిపై విచారణ జరపిస్తామని, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ట్వీట్‌ చేశారు.  

ఏపీ నిరుద్యోగ మహగర్జన..

హైదరాబాద్: నగరంలోని ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం జరుగుతున్న ఏపీ నిరుద్యోగ మహగర్జనలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొన్నారు.ఏపీలో చేపట్టనున్న పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో అభ్యర్థుల వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలని కోరుతూ నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ఐదేళ్ల వయోపరిమితి..కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంపు..ఎస్సై పోస్టులను 1,500 చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించనుండటంతో..అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు.

మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్థం..ఉద్రిక్తత..

కరీంనగర్ : సిరిసిల్లను ప్రత్యేక జిల్లా చేయాలని కోరుతూ.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలు తీవ్రతరం దాల్చుతున్నాయి. సిరిసిల్లను జిల్లా కేంద్రం చేయాలని అన్ని పార్టీలు కదం తొక్కుతున్నాయి. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమకారులు ఐటీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉద్యమకారులను అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా.. తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

14:51 - September 9, 2016

హైదరాబాద్ : తలవంచటం ఆయనకు తెలియదు. అందుకే అక్షరాలు ఫిరంగులను తలదన్నాయి. అధికార దర్పానికి జీహుజూర్‌ అనలేదు. కాబట్టే ఆయన ప్రజా కవి అయ్యారు. మాయమైపోతున్న మనిషితనాన్ని, కాలగర్భంలో కలిసిపోతున్న మంచితనాన్ని, తన కవిత్వ కొరడాతో కొట్టిలేపిన మహామనిషి. హేతువును అణిచివేయజూసిన తీతువుల భరతం పట్టిన ధైర్యశాలి. అన్యాయాన్ని ఎదిరించిన నాడే నాకు ముక్తి, అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడని చాటిన నిగర్వి.

ధిక్కార స్వరానికి అసలు సిసలైన ప్రతీక..
పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది. కేవలం 6 పదాల్లో మనిషి జీవిత లక్ష్యం ఇదే అని సూటిగా సుత్తి లేకుండా చెప్పిన ప్రజాకవి కాళోజి. మనసుకు కష్టం కలిగినప్పుడు కాళోజీ భోరున విలపించిన సంధర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా అని ఆయన సున్నిత మనస్కుడేం కాదు. ధిక్కార స్వరానికి అసలు సిసలైన ప్రతీక.

1930 నుంచే గ్రంధాలయోద్యమంలో చురుకైన పాత్ర..
ప్రజాకవి కాళోజీ 1914, సెప్టెంబర్‌ 9న కర్ణాటకలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు. అక్కడి నుంచి వరంగల్ జిల్లాకు వచ్చిన కాళోజీ కుటుంబం వరంగల్ జిల్లా మడికొండలో స్ధిరపడింది. ప్రాధమిక విద్యానంతరం హైదరాబాద్‌కు వచ్చిన కాళోజీ ఉన్నత చదువులు చదివారు. చిన్ననాటి నుంచే సామాజిక స్పృహ కల్గిన కాళోజీ 1930 నుంచే గ్రంధాలయోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. విద్యార్ధి దశలోనే నిజాం ప్రభుత్వ ఆజ్ఞలను కాళోజీ ఉల్లంఘించారు. తీవ్ర నిర్బంధంలోనూ వరంగల్‌ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిన ధైర్యశాలి కాళోజీ. సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్న కాళోజి జైలు శిక్షను కూడా అనుభవించారు.

బడి పలుకుల భాష కాదు.. పలుకు బడుల భాష కావాలి..
సాహిత్యం కేవలం సంపన్న వర్గానికే పరిమితమైన రోజుల్లో తెలుగు,ఉర్దూ, కన్నడ బాషల్లో కవిత్వాన్ని సామాన్యుడి వాకిట్లోకి పంపించిన అసామాన్యుడు కాళోజీ. తెలంగాణ యాస అంటూ ఛీత్కరింపులు రాజ్యమేలుతున్న తరుణంలో అది యాస కాదు, భాష అని బల్లగుద్ది చెప్పిన ఏకైక వ్యక్తి కాళోజీ. అందుకే మనకు బడి పలుకుల భాష కాదు.. పలుకు బడుల భాష కావాలి అంటూ నినదించారు. కాళోజి 2002 నవంబర్‌ 13న తుది శ్వాస విడిచారు. జీవించినంత కాలం నిండైన ఆత్మగౌరవంతో భాష కోసమే బతికిన ఏకైక కవి కాళోజీ. స్వతంత్ర భారతం పూర్తి స్ధాయి ప్రజాస్వామికంగా మారకుంటే ఏ రాజ్యమైనా ఒకటేనంటూ విమర్శించిన ప్రజాస్వామ్య ప్రవక్త, ప్రజాకవి కాళోజీ.

గోరటి వెంకన్నకు కాళోజీ సాహితీ పురస్కారం అందజేయనున్న కేసీఆర్..
ప్రజాకవి కాళోజీ నారాయణరావు 102వ జయంత్యుత్సవాన్ని రవీంద్రభారతి ప్రాంగణంలో ఘనంగా నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ వేడుకలో కాళోజీ సాహితీ పురస్కారాన్ని ప్రముఖ ప్రజాకవి గోరటి వెంకన్నకు అందజేయనున్నారు. 

ఘోర రోడ్డు ప్రమాదం..16మంది మృతి..

ఒడిశా : అనుగుల్‌ జిల్లాలోని అత్మాలిక్‌ ప్రాంతంలో శుక్రవారం ఉద‌యం బస్సు ప్ర‌మాదం జ‌రిగింది. మనిత్రి వంతెనపై నుండి వస్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు ఒక్కసారిగా లోయ‌లో ప‌డ‌డంతో 16 మంది ప్ర‌యాణికులు మృతిచెందారు. మ‌రో 17 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్ష‌తగాత్రుల‌ను రెస్క్యూ సిబ్బంది బ‌య‌ట‌కు తీసి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ప్ర‌మాదంపై ఆ రాష్ట్రం సీఎం నవీన్‌ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయాల‌పాల‌యిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

విభజన చట్టాన్ని ఎన్డీయే పక్కదారి పట్టిస్తోంది..

ఢిల్లీ : చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని జైరాం రమేష్ ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏటా రూ.60వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో అన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదన్నారు. హోదా ఇవ్వని పాపం మోదీ ప్రభుత్వానిదేనని జైరాం రమేష్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం సరికాదన్నారు. ఒకవేళ అప్పగిస్తే చట్టసవరణ అవసరం అని ఆయన అన్నారు. 

చంద్రబాబు తో సుజనా భేటీ..

హైదరబాద్ : సీఎం చంద్రబాబుతో కేంద్రమంత్రి,టీడీపీ నేత అయిన సుజనా చౌదరి సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలను చంద్రబాబు సుజనా చర్చిస్తున్నట్లుగా సమాచారం. కాగా ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ప్రకటనలో భాగంగా జరిగిన సందర్భాలను కూలకషంగా చర్చిస్తున్నారు. 

14:29 - September 9, 2016

తూర్పుగోదావరి : కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న 'సీమాంధ్ర ఆత్మగౌరవ సభ'లో రైతులు ఆందోళన చేశారు. దీనితో ఒక్కసారిగా అక్కడ అలజడి నెలకొంది. 'కాకినాడ సెజ్ తమకొద్దు' అని ప్లకార్డులు ప్రద్శించారు. కాకినాడ సెజ్ ప్రాంతంలో పర్యటించాలని ఈ సందర్భంగా రైతులు పవన్ కు సూచించారు. గతంలో సెజ్ కోసం తీసుకున్న భూములు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

గోరేటి వెంకన్నకు కాళోజీ పురస్కార ప్రధానం..

హైదరాబాద్‌: హైదరాబాద్‌ రవీంధ్రభారతిలో ప్రజాకవి కాళొజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగాప్రజాకవి గోరటి వెంకన్నకు కాళొజీ పురస్కారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో మండలి స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు కడియం,ఈటల,నాయిని, సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ రసమయి బాలకృష్ణ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, నారదాసు లక్ష్మణ్‌రావు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నకిలీ కరెన్సీ గుట్టురట్టు..

హైదరాబాద్ : నకిలీ కరెన్సీ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 11.95 లక్షల కరెన్సీని సౌత్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

14:25 - September 9, 2016

తూర్పుగోదావరి : కాకినాడ జేఎన్టీయూలో అప్పుడే సందడి నెలకొంది. ఈ రోజు జనసేన 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ' ప్రారంభం కానుంది. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సభ నాలుగు గంటలకు ప్రారంభం కానుంది. ఉదయం నుండే అభిమానులు భారీగా పోటెత్తడంతో గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. ఒక్కసారిగా అందరి చూపు కాకినాడలో జరిగే ఈ సభపై పడిపోయింది. ప్రత్యేక హోదా కోసం పవన్ ఇచ్చే పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని పవన్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. భారీగా అభిమానులు తరలివస్తుండడంతో కంట్రోల్ చేయడం అక్కడున్న వాలంటీర్లకు కావడం లేదు. భారీగా పోలీసులు మోహరించారు. కాసేపట్లో పవన్ చేసే ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. 

మొదటి సభ తిరుపతిలో...
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటానికి దిగుతున్నట్లు ప్రకటించి.. కాకినాడ సభకు పిలుపునిచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌.. రాజమహేంద్రవరం చేరుకున్నారు. మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కాకినాడ చేరుకున్నారు. తొలుత తిరుపతిలో ఆయన బహిరంగ సభ నిర్వహించి ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. మరి ప్రత్యేకహోదాపై జనసేనాని గర్జిస్తారా.. కాకినాడ సభలో పవన్‌ పవర్‌ పంచ్‌లు ఎవరిమీద..? మోదీని టార్గెట్‌ చేస్తారా.. చంద్రబాబుపై ఉరుముతారా...? లేదా ఎప్పటిలాగే కాంగ్రెస్‌ను తిట్టిపోస్తారా...? అనేది చూడాలి...

పాస్ పోర్ట్ ఇస్తే వస్తా ..

ఢిల్లీ : భారత్ రావడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఢిల్లీలోని పాటియాల కోర్టులో కింగ్‌ఫిషర్‌ మాజీ అధినేత విజయ్‌ మాల్యా పిటిషన్ వేశారు. అయితే పాస్‌ పోర్టు రద్దవడంతో భారత రాలేకపోతున్నానని చెప్పారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని న్యాయస్థానాన్ని కోరారు. విజయ్‌ మాల్యాకు గత వారం ముంబైలో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేశారు.

ఆరని కావేరీ జలాల చిచ్చు..

కర్నాటక : కావేరీ జలాల విడుదలకు వ్యతిరేకంగా కర్నాటకలో బంద్‌ జరుగుతోంది. దీంతో అక్కడ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసించిందే. దీంతో సిద్ద రామయ్య ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసింది. తమిళనాడుకు నీరు విడుదల చేయడం తమకు ఇబ్బందిగా మారిందని కర్నాటక రైతులు నిరసనకు దిగారు. శుక్రవారం కర్నాటక బంద్‌ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి.

14:14 - September 9, 2016

హైదరాబాద్ : ఏపీ శాసనసభ...పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు..అధికార పక్షం..విపక్షాలు ఎవరికి వారు పట్టుబడడంతో సభ స్తంభించిపోతోంది.. ఏపీ వర్షాకాల శాసనసభా సమావేశాలు రెండో రోజు కూడా వైసీపీ ఆందోళన బాట పట్టింది..ప్రత్యేక హోదాపై చర్చించాల్సిందేనని పట్టుబట్టింది..స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టింది..అక్కడే ఉన్న మార్షల్స్ వీరిని అడ్డుకోవడం..ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి..రెండుసార్లు సభ వాయిదా పడినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు...

నల్లటి దుస్తులతో వచ్చిన వైసీపీ సభ్యులు...
ఉదయం 9గంటలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు కూడా నల్లటి దుస్తులు ధరించి వచ్చారు. 'ప్రత్యేక హోదా'పై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. తొలుత సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తారని..అనంతరం చర్చించాలని ప్రభుత్వం పేర్కొంది. కానీ వైసీపీ మాత్రం దీనిని వ్యతిరేకించింది. ఒకసారి అనౌన్స్ మెంట్ చేసిన అనంతరం క్లారిఫికేషన్స్ మాత్రమే అవకాశం ఉంటుందని, ఎలాంటి చర్చ ఉండదని వైసీపీ పేర్కొంది.

మార్షల్స్ వర్సెస్ వైసీపీ...
అనంతరం వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. సభ ప్రారంభమైన తరువాత వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అక్కడున్న మార్షల్స్ తో వాగ్వాదానికి దిగారు ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీనితో సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.

స్పీకర్ పై పేపర్లు..
తిరిగి ప్రారంభమైనా సభలో పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. వైసీపీ సభ్యులు మళ్లీ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మార్షల్స్ తో వాగ్వాదానికి దిగారు. ఈ తరుణంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో స్పీకర్ సంతాప తీర్మానం చదువుతున్నారు. ఒక్కసారిగా స్పీకర్ మైక్ ను లాగిపడేశారు. అనంతరం పేపర్లు చించి పడేశారు. స్పీకర్ ఎదుట నున్న టేబుళ్లపైకి ఎక్కి నినాదాలు చేశారు. దీనితో అసెంబ్లీ రణరంగంగా మారిపోయింది. అనంతరం సభను పదిహేను నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల ప్రకటించారు. తిరిగి ప్రారంభమైనా అదే పరిస్థితి కొనసాగడంపై స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి దురుసుగా ప్రవర్తించడం తనకు బాధించిందని, అడ్డుకోవడం బాధాకరమన్నారు. శనివారానికి సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు.

బాబు ప్రెస్ మీట్ ? 
ఇదిలా ఉంటే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు..ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై ఏపీ శాసనసభలో చెప్పాల్సిన మాటలను సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటిలో ప్రెస్ మీట్ లో చెప్పనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత మంత్రులు..ఇతరులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమైనట్లు సమాచారం. బాబు ప్రెస్ మీట్ అనంతరం టిడిపి ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర ప్యాకేజీపై కేంద్రం ఇచ్చిన ప్రకటనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాబు దశా..దిశా నిర్ధేశం చేయనున్నారు. ఇక శనివారం నాడు ప్రారంభమయ్యే సమావేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయా ? లేదా ? అనేది చూడాలి. 

ఎపి శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్ : ఎపి శాసనసభ రేపటికి వాయిదా పడింది. నేడు రెండో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే ప్రత్యేకహోదాపై కేంద్రం ప్రకటనకు నిరసనగా సభలో వైసీపీ నిరసన తెలిపింది. స్పీకర్ ఎంత చెప్పినా వినలేదు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను పదినిమిషాల పాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభం అవ్వగానే సభలో అదే పరిస్థితి నెలకొంది. మళ్లీ 15 నిమిషాలు వాయదా పడింది. పలు మార్లు సభ వాయిదా పడింది. 
చివరికి రేపటికి వాయిదా వేశారు. 

13:58 - September 9, 2016

సీడీలు..డీవీడీలు పాటలు వినడానికో..కావాల్సిన డేటా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతాయి. కొంతకాలానికి అవి పాడై పోతాయి. మరి వాటిని డస్ట్ బిన్ లో పారేసుకోవడమేనా ? అవసరం లేదు. అందమైన షో పీస్ తయారు చేసుకోవచ్చు. అదెలాగో వీడియో క్లిక్ చేయండి. 

13:49 - September 9, 2016

మొక్కై వంగనది మానై వంగుతుందా ? అంటారు పెద్దలు. అందుకేనేమో ఈతరం పిల్లలకు అమ్మానాన్నలు అన్ని రకాల విద్యలను చిన్నప్పటి నుండే నేర్పించేందుకు సిద్ధమౌతున్నారు. ముఖ్యమంగా సెల్డ్ డిఫెన్స్ ను నేర్చుకొనేందుకు పెద్దలు ఎంత ఆసక్తి చూపుతున్నారో చిన్నారులు కూడా అంతే ఆసక్తి చూపుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:44 - September 9, 2016

ఢిల్లీ : కేంద్రం అన్ని హామీలు నెరవేరుస్తుందని, బీజేపీ చిత్తశుద్ధిని శంకించాల్సినవసరం లేదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు పేర్కొన్నారు. ఏపీకి ప్యాకేజీ ప్రకటనపై రాష్ట్ర బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని ఏపీ నేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా టెన్ టివితో హరిబాబు మాట్లాడారు. ఏపీకి ఎక్కువ రీతిలో ప్రయోజనాలు అందుతున్నాయని, రాజకీ యాల కోసం దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. రెండేళ్లలో ఇంత సహాయం అందిందో లేదో అని చెప్పాలని ప్రశ్నించారు. బంద్ లు చేయడం..ఆందోళన చేయడం విపక్షాలకు హక్కులున్నాయని, విద్యా సంస్థల విషయంలో, రక్షణ పరిశ్రమలకు గాని 2.20 కోట్ల ప్రాజెక్టులు ఏపీలో ఏ విధంగా జరుగుతున్నాయో వివరాలు చెప్పడం జరుగుతోందన్నారు. 

'హోదా' ఇవ్వని పాపం మోడీ సర్కార్ దే : జైరాం రమేష్

ఢిల్లీ : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14 వ ఆర్థిక సంఘం చెప్పలేదని కాంగ్రెస్ జాతీయ నేత జైరాం రమేష్ తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వని పాపం ఆర్థిక సంఘానిది కాదని.. మోడీ సర్కార్ ది అని విమర్శించారు. వెంకయ్యనాయుడు చెబుతున్నవి కంటితుడుపు మాటలే అని అన్నారు. 

13:36 - September 9, 2016
13:35 - September 9, 2016

హైదరాబాద్ : ఏపీకి కేంద్రం ప్యాకేజీ ప్రకటనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ ప్రజల్ని కేంద్రం మోసం చేసిందని ఆరోపించారు. టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. ఏపీ ప్రజల్ని కేంద్రం మోసం చేసిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఆరోపించారు. ప్యాకేజీ ప్రకటన కేవలం కంటితుడుపు చర్యని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

వైసీపీకి ప్రజాస్వామ్యంపై గౌవరం లేదు : మంత్రి పత్తిపాటి

హైదరాబాద్ : వైసీపీకి ప్రజాస్వామ్యంపై గౌవరం లేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. స్పీకర్, మార్షల్స్ పై దాడి చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రతిపక్షం అనుభవ రాహిత్యం స్పష్టంగా కనబడుతోందన్నారు. చర్చకు రావాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానిస్తోందని తెలిపారు. 

 

రాష్ట్ర ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం : మంత్రి పల్లె

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి తమకు ముఖ్యమని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ రాజకీయ చర్రితలో హీనుడుగా మిగిలిపోతారని ఘాటుగా విమర్శించారు. 

 

13:20 - September 9, 2016

నితిన్‌ కథనాయుకుడిగా నూతన చిత్రం రాబోతోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. హనురాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో సినిమా రానుంది. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ''అ..ఆ' చిత్రంతో నితిన్ మంచి విజయాన్ని అందుకున్నాడు. హనురాఘవూడి దర్శకత్వంలో వచ్చిన 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నారు. ఈ చిత్రం ఎలా ఉండబోతుందో చూడాలి మరి. 

 

13:18 - September 9, 2016

హైదరాబాద్ : వైసీపీపై ఏపీ మంత్రులు ఎదురు దాడికి దిగుతున్నారు. ప్రత్యేక హోదాపై చర్చించాలంటూ రెండో రోజు ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో వైసీపీ ఆందోళన చేసింది. స్పీకర్ పై పేపర్లు చించివేసి మైక్ ను లాగేశారు. దీనిపై ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఘాటు విమర్శలు గుప్పించారు.

ఆక్షేపించిన మంత్రి పల్లె..
అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరును రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆక్షేపించారు. స్పీకర్‌ పొడియం దగ్గరకు దూసుకువెళ్లి రౌడీల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన వైసీపీ సభ్యులకు ప్రజలే తగ్గిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  రాజకీయ ఉనికికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ ఒక స్వార్థ పరుడు..అవినీతి పరుడని పేర్కొన్నారు. శాసనసభలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు బాధాకరమని, జగన్ చూస్తే అపరిచితుడు గుర్తుకు వస్తున్నాడని, కల్లబొల్లి కబుర్లు చెబుతాడని..అభివృద్ధి జరగవద్దని జగన్ లోపల వ్యక్తి కోరుకుంటూ ఉంటాడని తెలిపారు.

అరాచక శక్తులన్న మంత్రి దేవినేని..
వైసీపీ ఎమ్మెల్యేలు అరాచక శక్తులుగా మారారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ స్పీకర్‌తోపాటు సిబ్బందిపై దాడికి ప్రయత్నించడాన్ని తప్పుపట్టారు. జగన్‌ డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగిందన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సిబ్బంది విధులు అడ్డుకోవడం తప్పని, స్పీకర్ పై దాడికి ప్రయత్నించడం దారుణమని ఏపీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. 

వైసీపీ అభివృద్ధి నిరోధక శక్తి - మంత్రి పల్లె...
వైసీపీ అభివృద్ధి నిరోధక శక్తిగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకుని స్పీకర్‌పై దాడికి యత్నించడాన్ని తప్పుపట్టారు. కేందం ప్రకటించిన ప్యాకేజీ ప్రయోజనాలను తెలుసుకోకుండా గుడ్డిగా వ్యతిరేకించడాన్ని ఆక్షేపించారు. 

13:12 - September 9, 2016

హైదరాబాద్ : ఏపీ శాసనసభ రెండో రోజు రణరంగాన్ని తలపించింది. మొదటి రోజు జరిగినట్లుగానే రెండో రోజు సభ స్తంభించిపోయింది. అధికారపక్షం..విపక్షాలు ఎవరికి వారు పట్టు పడుతుండడంతో సభ జరగడం లేదు. రెండో రోజు సభకు వైసీపీ సభ్యులు నల్లటి దుస్తులు ధరించి సభకు వచ్చారు. ప్రత్యేక హోదాపై చర్చించాలని పట్టుబట్టారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వం స్టేట్ మెంట్ ఇస్తుందని, తదనంతరం చర్చించాలని ప్రభుత్వం పేర్కొంది. ఒకసారి ప్రకటన చేసిన తరువాత క్లారిఫికేషన్స్ కు మాత్రమే అవకాశం ఉంటుందని చర్చ ఎలా సాగుతుందని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ పోడియంను చుటుమట్టిన వైసీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మార్షల్స్ పై దాడి చేయవద్దని స్పీకర్ సూచించారు. కానీ మార్షల్స్ లే తమపై దాడి చేశారని వైసీపీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. వీరిని సస్పెండ్ చేయాలని టిడిపి సభ్యులు కొంతమంది పేర్కొన్నట్లు సమాచారం. దీనికి సీఎం చంద్రబాబు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. సస్పెండ్ చేస్తే ప్రజల్లో ప్రభుత్వం చులకన అయ్యే విధంగా ఉంటుందని, వారికి ఎక్కువ ప్రచారమయ్యే అవకాశం ఇచ్చినట్లవుతుందని బాబు పేర్కొన్నట్లు సమాచారం. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రెస్ మీట్ లో బాబు మాట్లాడననున్నారు. ప్యాకేజీపై కేంద్రం ప్రకటనను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేలకు బాబు సూచించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు 3గంటలకు జరిగే టిడిపి సమావేశంలో బాబు ఎమ్మెల్యేలకు దిశా నిర్ధేశం చేయనున్నట్లు సమాచారం. రెండు సార్లు సభ వాయిదా పడిన అనంతరం ప్రారంభమయ్యే సభ శనివారానికి వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

ఘనంగా కాళోజీ 102వ జయంతి

హైదరాబాద్ : రవీంద్రభారతిలో కాళోజీ 102వ జయంతోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, రసమయి బాలకిషన్, గోరటి వెంకన్న హాజరయ్యారు. గోరటి వెంకన్నకు కాళోజీ అవార్డు ప్రదానం చేశారు. 

 

13:04 - September 9, 2016

విజయవాడ : ఉత్తరాఖండ్ కు ప్రత్యేకహోదా ఎలా ఇచ్చారో... ఏపీకీ కూడా ప్రత్యేకహోదా ఇవ్వాలని కాంగ్రెస్ నేత జేడీ.శ్రీలం డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఎపి ప్రజలను ఇంకా మోసం చేయొద్దని పేర్కొన్నారు. ప్రత్యేకహోదాపై రాజకీయాలు చేయొద్దని హితవుపలికారు. ప్రత్యేకహోదా కోసం ప్రత్యేక జేఏసీ ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పోరాడుదామని చెప్పారు. 

 

వెంకయ్యనాయుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి : జేడీ.శ్రీలం

విజయవాడ : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ నేత జేడీ.శ్రీలం అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాఖండ్ కు ప్రత్యేకహోదా ఎలా ఇచ్చారో... ఏపీకీ కూడా ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

12:58 - September 9, 2016
12:58 - September 9, 2016

ఏపీ అంటే బీజేపీకి ఎందుకంత చిన్నచూపు : ఉండవల్లి

హైదరాబాద్ : ఏపీ అంటే బీజేపీకి ఎందుకంత చిన్నచూపు అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కేంద్రానిది కంటితుడుపు చర్య అని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారు...ఎందుకు ఇంత నమ్మకం ద్రోహం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఒకే అసత్యాన్ని పదే పదే చెబుతున్నారు.  

 

12:24 - September 9, 2016

వెంకయ్యనాయుడును కలిసిన ఏపీ బీజేపీ నేతలు

ఢిల్లీ : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును ఏపీ బీజేపీ నేతలు కలిశారు. ప్యాకేజీ ప్రకటించినందుకు నేతలు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. రైల్వే జోన్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెంకయ్యనాయుడు అన్నారు.

 

12:18 - September 9, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా బాధిస్తున్నాయని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనితో సభ రెండుమార్లు వాయిదా పడింది. స్పీకర్ మైక్ ను లాక్కొని..పేపర్ చించి వేశారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. విభజన జరిగిన తరువాత ఏపీకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యూహాలను వ్యవహరించడం జరిగిందని, స్పీకర్ మైక్ ను విరిచి పడేశారని వీరిని ఉన్మాదులు అనాలా ? ఏమనాలి ? అని ప్రశ్నించారు. స్పీకర్ అంటే తటస్థంగా వ్యవహరిస్తారని, ప్రజాస్వామ్యం సిగ్గుపడే విధంగా వైసీపీ వ్యవహరించిన తీరు చాలా బాధ పడ్డానని తెలిపారు. శాసనసభలో ప్రకటన వీలు కాకపోతే శాసనమండలిలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన తరువాత ఎంతసేపైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

ప్రతిపక్షం పూర్తిగా విఫలం..
ఐదు కోట్ల మంది ప్రజల సమస్యలు..పరిష్కారం కోసం చర్చించే వేదిక శాసనసభ అని, దీనిని ఉపయోగించుకోవడంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలం చెందిందని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. జగన్ ఒక స్వార్థ పరుడు..అవినీతి పరుడని పేర్కొన్నారు. శాసనసభలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు బాధాకరమని, జగన్ చూస్తే అపరిచితుడు గుర్తుకు వస్తున్నాడని, కల్లబొల్లి కబుర్ల చెబుతాడని..అభివృద్ధి జరగవద్దని జగన్ లోపల వ్యక్తి కోరుకుంటూ ఉంటాడని తెలిపారు. 

వైసీపీ తీరు దురదృష్టకరం : మంత్రి అచ్చెన్నాయుడు

హైదరాబాద్ : అసెంబ్లీలో వైసీపీ తీరు దురదృష్టకరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సభలో వైసీపీ సభ్యులు రణరంగాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకహోదాపై చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైసీపీ సభ్యులు ఇప్పటికైనా చర్చకు ముందుకు రావాలన్నారు. 

జిల్లాల కలెక్టర్లతో టాస్క్ ఫోర్స్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాల కలెక్టర్లతో సీఎస్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.

 

11:59 - September 9, 2016

హైదరాబాద్ : గణేష్‌ ఉత్సవాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది. యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఐదురోజుల పూజలు ముగుస్తుండటంతో నిమజ్జనాలు ఊపందుకున్నాయి. నగరంలోని ఆయా ప్రాంతాల్లోని చెరువులతో పాటు, హుస్సేన్‌సాగర్ దగ్గర భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
నిమజ్జనానికి రెడీ
భాగ్యనగరంలో వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇరిగేషన్, పోలీస్‌, ట్రాఫిక్, జలమండలి, హెచ్‌ఎండీ శాఖలను కోఆర్డినేట్‌ చేస్తూ..జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి సెంట్రల్‌ కమిషనర్‌ గౌరవ్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. నిమజ్జన యాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పటిష్టంగా చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 
హుస్సేన్‌సాగర్ దగ్గర ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు 
జల కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు 
హుస్సేన్‌సాగర్ దగ్గర అన్ని విభాగాలతో కూడిన ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మూడు షిఫ్టుల్లో అధికారులు అందుబాటులో ఉండనున్నారు. జీహెచ్‌ఎంసీ టోల్‌ ఫ్రీ నెంబర్‌తో పాటు, అవసరమైతే సాగర్‌ వద్ద ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. జలకాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి  9 ప్రాంతాల్లో ప్రత్యేక కొలనులను అందుబాటులోకి తీసుకురానున్నారు. 
శానిటేషన్ రక్షణపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి 
నిమజ్జన ఉత్సవాల్లో శానిటేషన్ రక్షణపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 168 యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దించనుంది. అన్ని ప్రాంతాల్లో 6వేల మంది కార్మికులు 24 గంటలు పనిచేయనున్నారు. ఇక అదే రోజు బక్రీద్‌ పండుగ ఉండటంతో దానికి కూడా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు. నిమజ్జనంలో భాగంగా ఇళ్ల దగ్గర ఉత్పత్తి అయ్యే చెత్తను సేకరించేందుకు దాదాపు లక్షా 50వేల ప్లాస్టిక్‌ కవర్లను అన్ని ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు. తాము  చేపడుతున్న నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ప్రజలు పూర్తి సహకారం అందించాలని అధికారులు కోరుతున్నారు. 

 

11:53 - September 9, 2016

నల్గొండ : పచ్చని పల్లెలు...రాగద్వేషాలకు దూరంగా ఉండే పల్లెవాసులు..వీటన్నింటికీ మించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించే పల్లెసీమల్లో ప్రేమాభిమానాలు కూడా అంతే...కలిసి బతికాం..కలిసే మట్టిలో కలిసిపోతాం...ఈ రెండింటికి మధ్య ఉన్న సమయాన్ని వృధా చేయకుండా ప్రేమాభిమానాలను పంచుకోవాలని చాటి చెప్పే పల్లెల్లో ఇంకా ఆ వాతావరణం ఉందని నిరూపించారు...కన్నకొడుకులు దూరం చేసినా పల్లె ఆదరించింది...కోడళ్లు గడపతొక్కనీయకున్నా అభిమానం చూపారు. జీవితంపై విరక్తి చెంది చివరి శ్వాస విడిస్తే పట్టించుకోని ఆ పుత్రరత్నాలపై వారిలో కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని చవిచూపారు.
కోడళ్ల అతికి ఎన్నో అనర్థాలు 
ఇంటి కోడలంటే వెలుగులు నింపే దీపంలాంటిదంటారు...పుట్టింటి నుంచి వచ్చిన క్షణం నుంచి మెట్టినింటి బాధ్యతలు తీసుకుని తనదిగా భావిస్తూ ఆ ఇంటి క్షేమాన్ని...ఆ ఇంటి గౌరవాన్ని కాపాడతారంటారు..కాని... నల్లగొండ జిల్లాలోని ఓ పల్లెలో కోడళ్ల అతికి ఎన్నో అనర్థాలు జరిగాయంటూ గ్రామస్థులు దుమ్మెత్తి పోస్తున్నారు. వారిని ఆ ఇంటి గడప తొక్కనిచ్చేది లేదంటూ తీర్మానం చేసుకున్నారు.
పల్లెవాసుల ఆగ్రహం 
ఇదీ సంగతి...ఇక కోడళ్లు మొగుళ్లను మార్చడం వల్లే కన్నతండ్రిని కూడా పట్టించుకోలేదని పల్లెవాసుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది... జన్మనిచ్చిన తండ్రి బతికుండగా కనీసం గంజినీళ్లు కూడా పోయని కొడుకులు...దహనసంస్కారాలు చేసి ఉన్నది మూటకట్టుకునేందుకు వచ్చారంటూ ఆగ్రహించారు పల్లెవాసులు...వారి ఆవేశం.. ఆవేదన...అంతకు మించి కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో అన్నదమ్ములిద్దరూ తన్నులు తిన్నారు. పల్లెవాసుల ఆగ్రహాన్ని చవిచూసి ఒళ్లు హూనమయ్యేలా దేహశుద్ధి చేయించుకున్న ఆ పుత్రరత్నాలు వెనక్కి తగ్గక తప్పలేదు.
పల్లెవాసుల ప్రేమాభిమానాలు 
మానవత్వం వెల్లివిరిసింది...పల్లెవాసుల ప్రేమాభిమానాలు కన్పించాయి...తమతో కలిసి బతికిన పెద్దాయనకు చివరి వీడ్కోలు పలికారు..కన్నీటి సంద్రమైన ఆ పల్లె వాసులే దహనసంస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు...పచ్చని పల్లెల్లో ప్రేమాభిమానాలు ఇంకా ఉన్నాయని చాటి చెప్పారు..కన్నతండ్రిని పట్టించుకోని కొడుకులకు బుద్ది చెప్పారు...కోడళ్లను కనుచూపుమేరకు రాకుండా చేశారు.
పదేళ్లుగా పట్టించుకోని కొడుకులు...
ఇతను 80 ఏళ్ల శివుడు...రాజాపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన శివుడికి ఇద్దరు కొడుకులు...చేనేత కార్మీకుడిగా ఎన్నో కష్టాలు అనుభవించి కొడుకులను పెద్ద చేసి ప్రయోజకులను చేశాడు. వృద్ధాప్యంలో తోడుగా..నీడగా ఉంటారనుకున్నాడు.. కాని కలికాలం...యాంత్రికజీవనంతో పాటు పుత్రరత్నాల్లో పెరిగిన స్వార్థం వృద్ధాప్యానికి వచ్చిన శివుడికి ఆదరణ దొరకలేదు...
భార్య మరణంతో కృంగిపోయిన శివుడి
శివుడి భార్య మరణంతో కృంగిపోయాడు...కొడుకులున్నారన్న ధైర్యంతో ఉన్నా వారు కనీసం తండ్రిని ఆదరించలేదు...దీనికి తోడు కోడళ్లు కూడా శివుడిని దగ్గరకు రానీయలేదు..రాకుండా అడ్డుకున్నారు..దీంతో మనస్తాపం చెందిన శివుడు పల్లెలోనే ఉంటూ కాలం వెళ్లదీశాడు..పదేళ్లుగా పట్టించుకోపోవడంతో పాటు..చరమాంకానికి చేరిన శివుడు కొడుకుల దగ్గరకు వెళ్లాడు..
అవమానించిన కోడళ్లు..
సత్తువ లేకపోయినా జవసత్వాలు కూడగట్టుకుని శివుడు కన్నకొడుకు ఆదరణ కోసం వెళ్తే ఊహించని అవమానం జరిగింది...గడప తొక్కనీయకుండా కోడళ్లు అడ్డుకున్నారు..వారి కొంగు పట్టుకున్న కొడుకులు కన్నతండ్రి అన్న జ్ఞానం లేకుండా ప్రవర్తించారు..తన కష్టమేదో తాను చేసుకుంటూ ఎంతో ఆత్మాభిమానంతో బతుకు వెళ్లదీసిన శివుడిని జరిగిన అవమానం మరింతగా కృంగదీసింది..ఇక తనకు తోడెవరూ లేరని...రారన్న దిగులుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వృద్ధుడు ఆత్మహత్య
జరగరాని ఘోరం జరిగిపోయింది...ఆరుగాలం శ్రమించి ఎనిమిది పదుల వయస్సులో శివుడు తనకు తాను ప్రాణం తీసుకున్నాడు..జరిగిన అవమానం..అంతకు మించిన విరక్తితో ఆత్మహత్య చేసుకోవడంతో బేగంపేట వాసుల్లో ఆవేదన ఉప్పొంగింది.. అందులోంచి వచ్చిన ఆవేశం కట్టలు తెంచుకుంది..అదే సమయంలో తండ్రి చనిపోయిన విషయం తెలిసి తాపీగా వచ్చిన కొడుకులను పట్టుకుని చితగ్గొట్టారు..కొడుకులను తండ్రి దేహాన్ని కూడా తాకనీయలేదు...పల్లెవాసులే డబ్బులు పోగు చేసి మానవత్వాన్ని...పల్లె ప్రేమాభిమానాలను...తమతో కలిసి ఉన్న శివుడికి వారే దహనసంస్కారాలు చేశారు...
కన్నకొడుకులకు దేహశుద్ధి 
ఇలాంటి పరిస్థితి ఏ కన్నతండ్రికీ రావొద్దు..అందుకు మనం తీసుకునే నిర్ణయమే కనువిప్పు కావాలంటూ పల్లెవాసులు కన్నకొడుకులకు దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పడమే గాకుండా మూకుమ్మడిగా సంతకాలు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

11:49 - September 9, 2016

ఆహార పదార్థాల్లో ఎందెందు చూసినా అందందే 'పచ్చిమిరప' ఉండును అనేంత ప్రత్యేకత ఉంటుంది. సూప్ కానీ..అల్పాహారం కానీ..కూరగాయాలు..ఇలా ఏ ఆహార వంటకంలోనైనా 'పచ్చిమిర్చి'ని వాడుతుంటారు. కానీ కొంతమంది 'పచ్చిమిర్చి'ని అసలు ఇష్టపడరు. పచ్చిమిర్చిని భుజించడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
పచ్చిమిర్చి తినడం వల్ల కేన్సర్ నుండి రక్షణ లభిస్తుంది. ప్రోస్టెట్ గ్రంథి సమస్యలకు పచ్చిమిరపకాయలు మంచి పరిష్కారం.
రక్తంలో కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయులను తగ్గించడం ద్వారా ధమనుల లోపల కొవ్వు ఏర్పడకుండా పచ్చిమిరపలోని రసాయనాలు అడ్డుకుంటాయి.
రక్తంలో షుగర్ స్థాయులను కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకే మధుమేహులు ప్రతిరోజు తమ ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాలి.
ఫైబర్‌ గుణాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
మిరపకాయలతో వచ్చే మంట నొప్పి ఉపశమనంగా పనిచేస్తుంది. జీర్ణమవడానికి, మంట ఏర్పడకుండా ఉండేందుకు కూడా ఉపకరిస్తాయి.
విటమిన్‌-ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కళ్లకు మేలుచేస్తుంది. చర్మం కాంతిమంత మవుతుంది.
పచ్చిమిర్చిలో విటమిన్ కె కూడ తగినంత ఉంటుంది. ఇది అస్టియోపోరోసిస్ రిస్క్ ను తగ్గించడమే కాకుండా బ్లీడింగ్ సమస్య లేకుండా చేస్తుంది.
పచ్చిమిరప తినడం వల్ల శరీరంలోని అనసవర బ్యాక్టీరియా నాశనమవుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది.
పచ్చిమిరపలో ఉండే విటమిన్‌-సీ కారణంగా విటమిన్లను శోషించుకునే గుణం శరీరానికి లభిస్తుంది.

ఒరిస్సాలో రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి

భువనేశ్వర్ : ఒరిస్సాలోని ఆంగుల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై నుంచి ప్రమాదవశాత్తు ఓ ప్రైవేట్ బస్సు 
కిందపడింది. ఈప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మరో 17మందికి గాయాలయ్యాయి. 

11:34 - September 9, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన వలస ఎమ్మెల్యేలు అయోమయంలో కొట్టు మిట్టాడుతున్నారు. అధికార పార్టీలో చేరినా...కక్కలేక మింగ లేక అన్న చందంగా వారి పరిస్థితి తయారైంది. ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులతో పరిస్థితి ఎక్కడికి దారితీస్తోందో అన్న ఆందోళన శాసనసభ్యుల్లో కనిపిస్తోంది.
వలసలను ప్రోత్సహించిన టీఆర్ ఎస్
తెలంగాణా అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ ఎస్..పార్టీ పరంగా బలోపేతం అయ్యేందుకు మొదట్లో భారీగా వలసలను ప్రోత్సహించింది. దీంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన శాసనసభ్యులు పెద్ద ఎత్తున గులాబి గూటికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షాన్నే టీఆర్ ఎస్ లో విలీనం చేసే వరకు పరిస్థితి దారి తీసింది. వైసీపీ, సీపీఐలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా కారెక్కారు. ఇంత వరకు అంతా సవ్యంగానే సాగింది. కాని ఇప్పుడు పరిస్థితులు వలస నేతలకు అంతు చిక్కని విధంగా మారాయి.
పెద్ద ఎత్తున కారెక్కిన నేతలు 
పెద్ద ఎత్తున కారెక్కిన నేతలు ఆయా పార్టీల హై కమాండ్‌ల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ..న్యాయ పరమైన అంశాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. కోర్టులు జారీ చేస్తున్న నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో వలస నేతలు తేల్చుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తుది నిర్ణయం స్పీకర్‌దే అన్న ధీమా నేతల్లో వ్యక్తం అవుతున్నా..కోర్టు సూచనలతో రాజకీయంగా తమ భవితవ్యం ఎలా ఉంటుందో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. 
సీఎంను కలుసుకోవడం గగనంగా మారిందంటున్న నేతలు
టీఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నప్పుడు..ఇప్పటి పరిస్థితులను నేతలు అంచనా వేసుకుంటున్నారు. పార్టీలో చేరాకా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంప్రదింపులు జరిపినా..ఇప్పుడు ముఖ్యమంత్రిని కలుసుకోవడమే గగనంగా మారిందని నేతలు వాపోతున్నారు. ఓ వలస ఎమ్మెల్యే సుమారు 6నెలల క్రితం సీఎం కేసీఆర్‌ అపాయింట్ మెంట్ కోసం కోరినా..ఇప్పటికీ సమయం ఖరారు కాలేదని సమాచారం. దాదాపు ఎమ్మెల్యేల అందరి పరిస్థితి ఇదే విధంగా ఉందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తం అవుతోంది.
టీఆర్ ఎస్ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో ధీమా
అధికార పార్టీ తరపున విజయం సాధించిన శాసనసభ్యుల్లో కొంత ధీమా కనిపిస్తున్నా..వలస ఎమ్మెల్యేల్లో మాత్రం అయోమయం రోజురోజుకు పెరుగుతోంది. కోర్టు సూచనలతో స్పీకర్ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అన్న టెన్షన్ నేతల్లో మరింత ఆందోళన పెంచుతోంది.

 

11:30 - September 9, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో యుద్ధవాతవరణం నెలకొంది. ఒకరేమో రూల్స్ కు విరుద్ధంగా నడుస్తున్నారని..రూల్స్ ప్రకారమే నడుస్తున్నామని మరొకరు పేర్కొంటున్నారు. దీనితో ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండో రోజు ప్రారంభమైన సభ రెండుమార్లు వాయిదా పడింది. మొదటి సారి సభ వాయిదా పడిన అనంతరం ప్రారంభమైన సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ మైక్ ను లాగేశారు..పేపర్లు చించేశారు. దీనితో సభను పదిహేను నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల ప్రకటించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో పలువురు ఎమ్మెల్యేలతో టెన్ టివి మాట్లాడింది. బీఏసీలో నిర్ణయం తీసుకున్న ప్రకారం ఉదయం..సాయంత్రం వరకు సభ జరగాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఎమ్మెల్సీ గేయానంద్ టెన్ టివికి తెలిపారు. అన్ని పార్టీలు దీనికి ఒప్పుకున్నాయని, ప్రజా సమస్యలపై చర్చించకుండా..పై చేయి ఎలా సాధించాలనే దానిపై రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, రెండు పార్టీలు కూడా పునరాలోంచించి సభను ఎలా నడవాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అనంతరం వైసీపీ సభ్యులు..టిడిపి సభ్యులు టెన్ టివితో మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేలు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారని టిడిపి సభ్యురాలు అనిత ఆరోపించారు. మరింత వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:28 - September 9, 2016

అక్కినేని వారి ఇంట పెళ్ళి భాజాలు మోగనున్నాయి. నాగచైతన్య, అఖిల్‌ పెళ్లిళ్లపై తండ్రి అక్కినేని నాగార్జున స్పష్టత ఇచ్చారు. డిసెంబర్‌ 9న అఖిల్‌ నిశ్చితార్థం జరగనున్నట్టు మీడియాకి తెలిపారు. నాగచైతన్య ఎప్పుడంటే అప్పుడు పెళ్ళి చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. బహుశా వచ్చే ఏడాది పెళ్లి ఉండవచ్చని తెలిపారు. అఖిల్‌ నిశ్చితార్థం మాత్రం డిసెంబర్‌ 9న జరుగుతుందని చెప్పారు. గత కొద్దికాలంగా చైతన్య, సమంతల బంధంపై మీడియాలో కథనాలు వెలువడుతున్న విషయం విధితమే. ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రేయా భూపాల్‌తో అఖిల్‌ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

 

11:25 - September 9, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో రెండో రోజు యుద్ధవాతావరణం నెలకొంది..స్పీకర్ పై పేపర్లు చించేశారు..మైక్ ను లాగేశారు..'వి వాంట్ జస్టిస్'..'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు'..'హోదా'పై చర్చించాల్సిందే' నంటూ వైసీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు..అడ్డుకుంటున్న మార్షల్స్ తో వైసీపీ సభ్యుల తోపులాట..ఒక్కసారిగా అసెంబ్లీలో యుద్ధవాతావరణం నెలకొంది..

చర్చ చేయాల్సిందే..
ఏపీ అసెంబ్లీలో రెండో రోజు కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. వైసీపీ సభ్యులు నల్లదుస్తులతో అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రత్యేక హోదాపై చర్చించాల్సిందేనని వైసీపీ పట్టుబడుతోంది. ప్రభుత్వం ప్రకటన చేస్తుందని అనంతరం చర్చించాలని ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ స్టేట్ మెంట్ తరువాత చర్చకు అనుమతినివ్వరని అందుకని చర్చ మొదలు పెట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన వైసీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు.  మార్షల్స్ తో వైసీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. దీనితో సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల ప్రకటించారు.

స్పీకర్ మైక్ ను లాగేశారు...
అనంతరం తిరిగి సభ ప్రారంభమైంది. సభలో ఏ మాత్రం మార్పు లేదు. మృతి చెందిన వారికి స్పీకర్ కోడెల సంతాప తీర్మానంపై మాట్లాడారు. స్పీకర్ పోడియాన్ని వైసీపీ సభ్యులు మొత్తం చుట్టుముట్టారు. స్పీకర్ కు రక్షణగా మార్షల్స్ నిలిచారు. ఒక్కసారిగా స్పీకర్ మైక్ ను లాగేశారు. పేపర్ లను చించి స్పీకర్ పై పడేశారు. అసెంబ్లీలో ఒక విధంగా యుద్ధవాతవరణం నెలకొంది. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పదిహేను నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు. 

ఏపీ అసెంబ్లీ మళ్లీ వాయిదా

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ మళ్లీ వాయిదా పడింది. పదిహేను నిమిషాలపాటు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సమావేశాలు ప్రారంభం  అయిన కొద్దిసేపటికే పది నిమిషాలపాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. సభలో వైసీపీ సభ్యులు నిరసన సాగించారు. స్పీకర్ పోడియం వద్ద దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. స్పీకర్ మైక్ ను లాగేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

11:14 - September 9, 2016

తూర్పుగోదావరి : ​ప్రత్యేకహోదాపై జనసేనాని గర్జిస్తారా.. కాకినాడ సభలో పవన్‌ పవర్‌ పంచ్‌లు ఎవరిమీద..? మోదీని టార్గెట్‌ చేస్తారా.. చంద్రబాబుపై ఉరుముతారా...? లేదా ఎప్పటిలాగే కాంగ్రెస్‌ను తిట్టిపోస్తారా...? 
కాకినాడ వైపు అందరి చూపు నెలకొంది. 'పవన్ కళ్యాణ్' నిర్వహించే సభపై అందరి ఉత్కంఠ నెలకొంది. 'ప్రత్యేక హోదా'పై నేరుగా 'పవన్' రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తిరుపతి సభ అనంతరం నేడు కాకినాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇప్పటికే 'పవన్' కాకినాడకు చేరుకున్నారు. సభ నిర్వహించే జేఎన్టీయూలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు గంటలకు సభ ప్రారంభమౌతుంది. కాకినాడ సభలో పవన్ ఏం మాట్లాడుతారు ? ఎలా స్పందిస్తారు ? అనేదానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. జనాలు భారీగానే తరలివస్తారని అంచనా వేసుకుంటున్నామని, వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు పలువురు ఫ్యాన్స్ టెన్ టివికి తెలిపారు. రాజకీయంగా 'పవన్' ఏం మాట్లాడుతారో తెలియదని, 'హోదా'పై మాట్లాడుతారని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి సభ అనంతరం కేంద్రంలో కదలిక వచ్చిందని, తర్జనభర్జనలు పడుతోందన్నారు. పవన్ ఏం మాట్లాడుతారు ? ఎలా స్పందిస్తారు ? అనేది తెలియాలంటే కొన్ని గంటల పాటు వేచి ఉండాల్సిందే. 

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఎపి అసెంబ్లీ

హైదరాబాద్ : వాయిదా అనంతరం ఎపి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. సభలో వైసీపీ సభ్యులు నిరసనలు కొనసాగుతున్నాయి. సభ్యులు స్పీకర్ పోడియం వద్ద దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. స్పీకర్ మైక్ ను లాగేశారు.  

రైల్వే జోన్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : వెంకయ్యనాయుడు

హైదరాబాద్ : రైల్వే జోన్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యాసంస్థలన్నీ 10 ఏళ్ల కంటే ముందే ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెండున్నర ఏళ్లలో 90 శాతం విద్యాసంస్థలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 

 

అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న సీఆర్ డీఏ అధికారులు

 విజయవాడ : యనమలకుదురులో అక్రమ నిర్మాణాలు సీఆర్ డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. భవనాలు తొలగిస్తున్న అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

10:21 - September 9, 2016

హైదరాబాద్ : వర్షాకాల సమావేశాలు రెండో రోజు కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన వైసీపీ సభ్యులను మార్షల్స్ నిలువరించారు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు. స్టేట్ మెంట్ ఇచ్చిన అనంతరం ఎలాంటి చర్చ ఉండదని వైసీపీ పేర్కొంటుంటే చర్చ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రత్యేక హోదా సాధించాల్సినవసరం ఉందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. కాసేపటి క్రితం సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీకి చేరుకున్నారు. రెండు రోజు జరుగుతున్న పరిణామాలపై సీఎం బాబు తన మంత్రులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు అసెంబ్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే కాకుండా మధ్యాహ్నం మూడు గంటలకు టిడిపి ఎల్పీ సమావేశం కూడా జరగనుంది. 

రెండో రోజు శాసనమండలి సమావేశం ప్రారంభం

హైదరాబాద్ : రెండో రోజు శాసనమండలి సమావేశం ప్రారంభం అయింది. పలు అంశాలపై మండలిలో సభ్యులు చర్చించనున్నారు. 

10:13 - September 9, 2016

మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 2,3 లిఫ్టులు ప్రారంభమయ్యాయి. ఈ పథకంతో... కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాలకు ప్రస్తుతం లక్ష, మరో మూడు నెలల్లో మరో రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీటితో పాటు తాగు నీరు అందుతుందని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. 
రెండు లిఫ్టులను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు  
కల్వకుర్తి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జొన్నలబొగుడ (లిఫ్టు 2), గుడిపల్లిగట్టు (లిఫ్టు 3) లను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మూడో లిఫ్టులో రెండు మోటారును సెప్టెంబరు-అక్టోబరులో పూర్తి చేస్తామన్నారు మంత్రి. ఈ పథకం ద్వారా.. వచ్చే ఖరీఫ్ నాటికి 6 లక్షల ఎకరాలకు సాగునీరి అందిస్తామన్నారు.
గత పాలకుల హయాంలోనే పాలమూరు ప్రాజెక్టులకు అన్యాయం : హరీష్ రావు
అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. గత పాలకుల హయాంలోనే పాలమూరు ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు మాటలకు మాత్రమే పరిమితయయ్యారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తైందన్నారు. 
కల్వకుర్తి పనులు 70 శాతం పూర్తి : హరీష్ రావు 
కల్వకుర్తి పనులు 70 శాతం పూర్తయ్యాయయని, మరో 30 శాతం పనులు ఇంకా జరగాల్సి ఉందన్నారు. తొమ్మిది నెలల్లో మిగతా పనులు కూడా చేసి తీరుతామన్నారు హరీష్ రావు. 
కాంగ్రెస్ నేతల మాటలకు చేతలకు పొంతనేలేదు : హరీష్ రావు
కాంగ్రెస్ నాయకుల మాటలకు చేతలకు పొంతనేలేదన్నారు హరీశ్ రావు. ఆనాడే అడిగి నిలదీసి ఉంటే ఇవాళ పాలమూరు ప్రజలకు ఈ గతి పట్టేదా అని ప్రశ్నించారు.  పాలమూరు ఎత్తిపోతలను ఆపాలని ప్రయత్నించిన టీడీపీకి తెలంగాణలో ఉండే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతోపాటు పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. 

 

10:12 - September 9, 2016

కాకినాడ : సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత 'పవన్ కళ్యాణ్' కాకినాడలో మకాం వేశారు. 'ప్రత్యేక హోదా' విషయంపై ఆయన నేరుగా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తిరుపతిలో జరిగిన మొదటి మీటింగ్ లో ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి సభను కాకినాడలో ఏర్పాటు చేస్తానని చెప్పిన 'పవన్ కళ్యాణ్' అనుకున్న విధంగానే గురువారం సాయంత్రం కాకినాడకు చేరుకున్నారు. దీనితో అందరి దృష్టి 'పవన్' సభపై నెలకొంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ వైపే కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్న తరుణంలో 'ప్రత్యేక హోదా' సాధన కోసం 'పవన్‌' భవిష్యత్తు చేపట్టనున్న కార్యాచరణ ఏమిటన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. పవన్ స్పందన ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది.

భారీ ఏర్పాట్లు..బందోబస్తు..
ఇదిలా ఉంటే ఆయన బస చేసిన హోటల్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరినీ కూడా లోనికి రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలో పవర్ ఫ్యాన్స్ అసోసియేషన్..జనసేన పార్టీ నేతలతో 'పవర్' స్టార్ 'పవన్ కళ్యాణ్' భేటీ కానున్నారు. ఓ హోటల్ లో వీరు సమావేశం కాబోతున్నారు. ఉద్యమ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. జెన్టీయూ క్రీడా మైదానంలో జరిగే బహిరంగసభలో ఎప్పటిలాగానే సభలో 'పవన్' కళ్యాణ్ ఒక్కరే మాట్లాడుతారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకున్న తరువాత అక్కడ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అనంతరం నేరుగా సభకు వెళ్లనున్నారు. సభలో ఎలాంటి ప్రసంగం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. 

కాసేపట్లో జనసేన నేతలు, పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో పవన్ భేటీ

కాకినాడ : కాసేపట్లో జనసేన నేతలు, పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జనసేన అధినతే పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. కాకినాడలోని ఓ హోటల్ లో సమావేశం కానున్నారు. ప్రత్యేకహోదా కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. 

 

ఎపి ప్రజల డిమాండ్ మేరకే నిరసనలు : శివప్రసాద్ రెడ్డి

హైదరాబాద్ : కేంద్రం ఎపికి ప్రత్యేకహోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. దీంతో ఎపి ప్రజలు మండిపడుతున్నారు. ఎపి ప్రజల డిమాండ్ మేరకే నిరసనలు తెలుపుతున్నామని శివప్రసాద్ రెడ్డి తెలిపారు. 

ఎపి ప్రజల డిమాండ్ మేరకే నిరసనలు : శివప్రసాద్ రెడ్డి

హైదరాబాద్ : కేంద్రం ఎపికి ప్రత్యేకహోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. దీంతో ఎపి ప్రజలు మండిపడుతున్నారు. ఎపి ప్రజల డిమాండ్ మేరకే నిరసనలు తెలుపుతున్నామని శివప్రసాద్ రెడ్డి తెలిపారు. 

09:59 - September 9, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యా. సభ ప్రారంభం కాగానే పది నిమిషాల పాటు వాయిదా పడింది. మార్షల్స్ వైసీపీ సభ్యులను అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 'ప్రత్యేక హోదా'పై సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తారని, ఆ తరువాత చర్చించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కానీ స్టేట్ మెంట్ ఇచ్చిన అనంతరం ఎలా చర్చ ఉంటుందని వైసీపీ పేర్కొంటోంది. ఈసందర్భంగా వైసిపి..టిడిపి సభ్యులతో టెన్ టివి ముచ్చటించింది.

క్లారిఫికేషన్ కు మాత్రమే అవకాశం - రాజన్న దొర...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టేట్ మెంట్ ఇచ్చిన తరువాత క్లారిఫికేషన్ కు మాత్రమే అవకాశం ఉంటుందని, చర్చ జరిగే అవకాశం లేదని వైసీపీ సభ్యుడు రాజన్న దొర టెన్ టివికి తెలిపారు. చర్చలో తప్పొప్పులు బయటకు వస్తాయని, ఇది ఒక విధంగా ప్రభుత్వానికి కూడా మంచిదన్నారు. ఏపీ భవిష్యత్ కోసం ఏమైనా ఫర్వాలేదని, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టొద్దని తెలిసినా వెళుతున్నామన్నారు.

వైసీపీది వితండవాదం - యామిని బాల..
ప్రతిపక్షం చేస్తున్న వితండ వాదం చేస్తున్నారని, సభా సంప్రదాయాలు పాటించడం లేదని ప్రభుత్వ విప్ యామిని బాల పేర్కొన్నారు. దాడి చేయడం కరెక్టేనా ? అని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇబ్బంది లేదని, సంపద దృష్టి..వ్యూహాల్లో సీఎం చంద్రబాబు నాయుడు దిట్ట అని కొనియాడారు.

పోరాటం చేస్తున్నాం - వైసీపీ..
ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే సమయంలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం ఆనవాయితీగా వస్తోందని వైసీపీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. తాము స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టే సందర్భంలో మార్షల్స్ తమపై దాడి చేయడం జరిగిందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ని స్వాగతించిన తరువాత ఇంకా స్టేట్ మెంట్ ఎలా ఇస్తారని సూటిగా ప్రశ్నించారు.

చర్చ చేయవచ్చు - అనిత..
ప్రత్యేక హోదాపై స్టేట్ మెంట్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని అనిత పేర్కొన్నారు. శాసనసభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో మండలిలో ప్రకటన చేయడం జరిగిందని, అనంతరం శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటన చేస్తారని తెలిపారు. 'హోదా'పై స్టేట్ మెంట్ ఇచ్చిన తరువాత చర్చించడానికి ఎందుకు భయమని ప్రశ్నించారు. స్టేట్ మెంట్ ఇచ్చిన తరువాత చర్చించడానికి ఎంతైనా సమయం కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొనడం జరిగిందని తెలిపారు.

09:55 - September 9, 2016

కేంద్రం ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ప్రకటించడం పట్ల ప్రజలు అసంతృప్తికరంగా ఉన్నారని వక్తలు తెలిపారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ గేయానంద్, టీడీపీ నేత రామానాయుడు, వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, కాంగ్రెస్ నేత తులసీరెడ్డిలు పాల్గొని, మాట్లాడారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర దేశంలోనే అంత్యంత వెనుకబడిన ప్రాంతాలని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు చాలా అన్యాయం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియాలో చూద్దాం...

 

09:43 - September 9, 2016

రాయలసీమకు ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలని గేయానంద్ పిడిఎఫ్ ఎమ్మెల్సీ గేయానంద్ డిమాండ్ చేశారు. ఇవాళ్టి జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పంట నష్టం ఆధారంగా బీమాను  వర్తింపచేయాలన్నారు. వేరు శనగను ప్రధానమంత్రి బీమాలో ప్రకటించాలని కోరారు. 'ఉభయ తెలుగు రాష్ట్రాలను వర్షాభావం పీడిస్తోంది. చాలా ప్రాజెక్టులలో నీళ్లు అడుగంటాయి. భూగర్భ జలాలు పడిపోతున్నాయి. రాయలసీమలో పరిస్థితి మరీ దుర్భరంగా వుంది. వేరుసెనగతో పాటు వివిధ రకాల పంటలు ఎండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏం చేయాలి?  అనంతపురం జిల్లాల్లో వాటర్ గన్స్ తో పంటలు రక్షించేందుకు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్నిస్తున్నాయి? రాయలసీమలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఏమిటి? ఇలాంటి అంశాలపై గేయానంద్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియాలో చూద్దాం...

 

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు : చెవిరెడ్డి

హైదరాబాద్ : ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. 

 

09:38 - September 9, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పరిస్థితులు రెండో రోజు కూడా కొనసాగాయి. స్పీకర్ పోడియాన్ని వైసీపీ సభ్యులు చుట్టుముట్టారు. వైసీపీ సభ్యులు..మార్షల్స్ మధ్య వాగ్వాదం..తోపులాట చేసుకుంది. దీనితో సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. మార్షల్స్ తమపై దాడి చేయడం గర్హనీయమని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతించిన తరువాత ఇంకా ఎలాంటి స్టేట్ మెంట్ ఇస్తారని సూటిగా ప్రశ్నించారు. అసలు అర్ధరాత్రి ఎందుకు ప్రకటన చేశారని నిలదీశారు. మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని, 'హోదా' వదిలి 'ప్యాకేజీ'కి సిద్ధమౌతున్నారని విమర్శించారు. శాసనసభ ప్రారంభమైన తరువాత డిప్యూటి ఫ్లోర్ లీడర్ రామచంద్రారెడ్డి మాట్లాడడం జరిగిందని, హోదాపై చర్చించాలని..అనుమతినివ్వాలని కోరడం జరిగిందని వైసీపీ సభ్యుడు పేర్కొన్నారు. ప్రకటనకు మాత్రమే పరిమితమై ఉన్నామని..ప్రత్యేక ప్యాకేజీకి సంతృప్తి చెందానే అర్థమయ్యే రీతిలో మంత్రి యనమల వెల్లడించారని తెలిపారు. ప్రకటన చేసిన అనంతరం ఎలా మాట్లాడుతామని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు కట్టబెడితే కాంట్రాక్టులు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. యనమల ఒళ్లంతా వెటకరామేనని, ప్రతిపక్ష సభ్యులపై వెటకారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 

వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన స్పీకర్ కోడెల

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. మార్షల్ పై దౌర్జన్యం చేయొద్దని స్పీకర్ సూచించారు. వైసీసీ సభ్యులు తప్పు చేస్తున్నారని స్పీకర్ మండిపడ్డారు. స్పీకర్ స్థానాన్ని గౌరవించండని తెలిపారు. 

 

వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన స్పీకర్ కోడెల

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. మార్షల్ పై దౌర్జన్యం చేయొద్దని స్పీకర్ సూచించారు. వైసీసీ సభ్యులు తప్పు చేస్తున్నారని స్పీకర్ మండిపడ్డారు. స్పీకర్ స్థానాన్ని గౌరవించండని తెలిపారు. 

 

09:29 - September 9, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ..రెండో రోజు ..అదే టెన్షన్..అవే నినాదాలు..'ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు..' వైసీపీ సభ్యుల నినాదాలు హోరెత్తించాయి.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు..మార్షల్స్ అడ్డుకోవడంతో వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనితో ఒక్కసారిగా ఏపీ అసెంబ్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ కోడెల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సేమ్ సీన్..
రెండో రోజు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నెలకొన్న పరిస్థితులు రెండో రోజు కూడా కొనసాగాయి. 'ప్రత్యేక హోదా'పై చర్చించాల్సిందేనని వైసీపీ పట్టుబట్టింది. శుక్రవారం ప్రారంభమైన సభలో వైసీపీ సభ్యులు నల్ల దస్తులు ధరించి సభకు వచ్చారు. 'ప్రత్యేక హోదా' పై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. 'హోదా'పై చర్చించాల్సిందేనని వైసీపీ సభ్యులు నినదించారు. తొలుత సీఎం ప్రకటన చేస్తారని..ఆ తరువాత చర్చించాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల సూచించారు. దీనికి వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోటస్ పాండ్ రూల్స్ ఇక్కడ పాటించవని, అసెంబ్లీ రూల్స్ మాత్రమే వర్తిస్తాయని యనమల పేర్కొన్నారు.

బీఏసీలో నిర్ణయం - కాల్వ..
బీఏసీలో తొలుత నిర్ణయం తీసుకున్నారని టిడిపి సభ్యుడు కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. సభ 15 రోజులు జరగాలని కోరుకున్నారని..కానీ 15 నిమిషాలు పాటు సభ జరిగే పరిస్థితి లేదన్నారు. 'హోదా' అనే అంశంపై చర్చిద్దామని..ప్రభుత్వం తరపున ప్రకటన చేస్తానని..ఆ తరువాత చర్చించాలని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వైసీపీకి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. రెండో రోజు కూడా వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చిందని..కావాలని సభా కార్యకలాపాలను స్తంభింప చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

అడ్డుకున్న మార్షల్...
ఈ దశలో స్పీకర్ పోడియాన్ని వైసీపీ సభ్యులు చుట్టుముట్టారు. వీరిని మార్షల్స్ అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట..వాగ్వాదం చోటు చేసుకుంది. ఇలా చేయడం సరికాదని, సభ్యులు వెంటనే వెనక్కి వెళ్లాలని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. మార్షల్ పై దౌర్జన్యం చేస్తారా అని కోడెల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలని తెలిపారు. చాలా పొరపాటు చేస్తున్నారని వైసీపీ సభ్యులనుద్దేశించి వ్యాఖ్యానించారు.సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ జరుగుతున్న పరిణామాలపై వైసీపీ సభ్యుడు టెన్ టివితో మాట్లాడారు. 

ఏపీ అసెంబ్లీ పది నిమిషాల పాటు వాయిదా..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. స్పీకర్ పోడియాన్ని వైసీపీ సభ్యులు చుట్టుముట్టారు. వీరిని మార్షల్స్ అడ్డుకున్నారు. దీనితో వైసీపీ సభ్యులు..మార్షల్స్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ కోడెల పది నిమిషాల పాటు సభను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

ఏపీ అసెంబ్లీలో టెన్షన్..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అడ్డుగా ఉన్న మార్షల్ తో వైసీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. 

సీఎం ప్రకటన చేస్తారు - యనమల..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. హోదాపై చర్చించాలని వైసీపీ పట్టుబడుతోంది. సీఎం చంద్రబాబు ప్రకటన చేస్తారని..ఆ తరువాత చర్చించాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల వెల్లడించారు.

 

రెండో రోజు ఏపీ అసెంబ్లీ ప్రారంభం..

హైదరాబాద్ : రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. హోదాపై చర్చకు వైసీపీ పట్టుబడుతోంది. ప్రత్యేక హోదాపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. 

09:05 - September 9, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు 'హోదా'పై చర్చించాల్సిందేనంటూ వైసీపీ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. దీనితో శాసనసభను శుక్రవారానికి స్పీకర్ కోడెల వాయిదా వేశారు. శుక్రవారం కూడా వైసీపీ సభ్యులు నల్లటి బ్యాడ్జీలు ధరించి సభకు వస్తున్నారు. విశ్వవిద్యాలయాల పట్టిష్టతపై ప్రభుత్వం చర్యలు..మార్కెట్ ఇంటర్ వెన్షన్ పన్ను కేటాయింపు...వర్షాభావ పరిస్థితులు..ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చ జరగనుంది. జీవో 271 వల్ల రైతుల ఇబ్బందులు, రాజధాని ప్రాంతంలో అంకు కంపెనీలపై కూడా చర్చ జరగనుంది. కానీ వైసీపీ 'ప్రత్యేక హోదా'పై వాయిదా తీర్మానం ఇచ్చింది. 'హోదా'పై చర్చించాల్సిందేనని వైసీపీ సభ్యులు ఆందోళన చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో టెన్ టివితో వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడారు. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజలకు ఎంతో లాభదాయకమని, ప్యాకేజీలో స్పష్టత లేదని, చాలా పదాల్లో ఎన్నో తేడాలున్నాయన్నారు. కేంద్రం కప్పదాట్లు వ్యవహారం చేస్తోందని, రాష్ట్ర ప్రయోజనాలు గుర్తించి పార్టీలను కలుపుకుని వెళ్లి రాష్ట్రాన్ని స్తంభిస్తే కేంద్రం దిగొస్తుందని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. అసెంబ్లీ ప్రారంభమౌతున్న సందర్భంలో అర్ధరాత్రి ప్రకటన చేశారని పేర్కొన్నారు. మరి అసెంబ్లీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

08:50 - September 9, 2016

అత్యంత కీలకమైన ఆగస్టు నెలలో వానలు ముఖం చాటేశాయి. సరిగ్గా అదే సమయంలో  ప్రభుత్వం కృష్ణా పుష్కరాల నిర్వహణలో తలమునకలైంది. రైతులను పట్టించుకునేవారు కరవయ్యారు. పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు వర్షాలు పడ్డా లాభం లేదంటున్నారు రైతులు.  కృష్ణా పుష్కరాల నిర్వహణకు మించిన పెద్ద బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద వుంది. కరవును ఎదుర్కోవడానికి ప్రభుత్వం  యంత్రాంగం యుద్ధ ప్రాతిపదకన కదలాలి. 
ఆగస్టు కనికరించలేదు..   
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా రాయలసీమలో ఏ రైతును పలకరించినా ఇలాగే బాధపడుతున్నారు. జూన్ లో చక్కగా వానలు పడడంతో చాలామంది రైతులు హుషారుగా వ్యవసాయం పనులు ప్రారంభించారు. జులైలో మనస్సును కొంత కీడు శంకించింది. జులైలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడడంతో ఆగస్టు నెల ఆదుకోకపోతుందా? అనుకున్నారంతా. కానీ, ఆగస్టు  కనికరించలేదు.  
ఆ మూడు నెలలు వ్యవసాయరంగానికి అత్యంత కీలకం
జూన్, జులై, ఆగస్టు నెలలు వ్యవసాయరంగానికి అత్యంత కీలకం. ఈ మూడు నెలలు అదును ప్రకారం వానలు కురిస్తేనే పంటలు సమృద్ధిగా పండుతాయి. ఈ మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ సగటు వర్షపాతం 403 మిల్లీమీటర్లుకాగా, 368  మిల్లీమీటర్లే నమోదైంది.  ఈ లెక్క చూస్తే పెద్దగా లోటు వున్నట్టు కనిపించదు. అయితే, జూన్ లో 69 శాతం అధికంగా వర్షపాతం నమోదుకాగా, జులైలో 19శాతం, ఆగస్టులో 44శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. పంటలు ఇంతగా దెబ్బతినడానికి కారణం ఆగస్టులో వానదేవుడు ఆదుకోకపోవడమే.  ఆగస్టులో సగటు వర్షపాతం 158 మిల్లీమీటర్లు కాగా, 88 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది.  దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. వర్షాల మీదనే ఆధారపడి వ్యవసాయం చేసేవారి పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఎకరానికి 20 వేల రూపాయల చొప్పున ఖర్చు పెట్టిన రైతులు ఈ నష్టం పూడేదెలా? అంటూ బావురమంటున్నారు. అసలే వానలు రాక పంటలు ఎండిపోతుంటే, మరోవైపు నాసిరకం విత్తనాలు  వేరుసెనగ రైతులను మరింత దారుణంగా దెబ్బతీశాయి. 
కళ తప్పిన ప్రాజెక్టులు   
జూన్, జూలై, ఆగస్టులలో సాధారణ వర్షాలు కురిసినా ప్రాజెక్టులు కళకళలాడుతాయి. అయితే, ప్రాజెక్టులు కళ తప్పాయి. ఆంధ్రప్రదేశ్ లోని  ప్రధాన రిజర్వాయర్ ల నీటి నిల్వ సామర్థ్యం 815 టిఎంసిలు కాగా,  వీటన్నింటిలో కలిపి 458 టిఎంసిల నీళ్లు మాత్రమే వున్నాయి. పెన్నా బేసిన్ లోని సోమశిల, కండలేరు, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లలో పరిస్థితి ఘోరంగా వుంది.78 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం వున్న  సోమశిల రిజర్వాయర్ లో 12 టిఎంసిలు, 68 టిఎంసిల సామర్థ్యం వున్న కండలేరు 23 టిఎంసిల నీళ్లు మాత్రమే వున్నాయి. 17 టిఎంసిల సామర్థ్యం వున్న వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో 9 టిఎంసిల  నీళ్లే వున్నాయి.  అటు ఏలేరు రిజర్వాయర్ అడుగంటింది. 24 టిఎంసిల సామర్థ్యం వున్న ఏలేరు రిజర్వాయర్ లో ఆరు టిఎంసిల కంటే తక్కువ నీళ్లే వున్నాయి. ఇక కృష్ణా బేసిన్ లోని తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్,  పులిచింతల ప్రాజెక్ట్ లలోని నీటి నిల్వలు కలవరపెడుతున్నాయి. 100 టిఎంసిల సామర్థ్యం వున్న తుంగభద్ర డ్యాంలో 50 టిఎంసిల నీళ్లే వున్నాయి. 215 టిఎంసిల సామర్థ్యం వున్న శ్రీశైలం ప్రాజెక్ట్ లో 151 టిఎంసిలు మాత్రమే వున్నాయి. 312 టిఎంసిల సామర్థ్యం వున్న నాగార్జునసాగర్ లో 137 టిఎంసిలే వున్నాయి. 45 టిఎంసిలకు పైగా సామర్థ్యం వున్న పులిచింతల ప్రాజెక్ట్ లో 17 టిఎంసిలే వున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ లో తగ్గిన పంటల విస్తీర్ణం 
వానలు పడక, రిజర్వాయర్ లలో నీళ్లు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో పంటల విస్తీర్ణం తగ్గిపోయింది. ఈ ఖరీఫ్ సీజన్ లో 43 లక్షల 86 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేయాలన్న లక్ష్యం పెట్టుకోగా, 31 లక్షల 64వేల హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. వీటిలో చాలా పంటలు ఎండిపోతున్నాయి.  17 లక్షల 50 వేల హెక్టార్లలో వరి సాగు చేయాలన్నది లక్ష్యం కాగా 10 లక్షల 81 వేల ఎకరాలలో మాత్రమే సాగవుతోంది. ఇందులో ఎంత చేతికొస్తుందో తెలియదు. పరిస్థితి ఇంత దుర్భరంగా వున్నా ప్రభుత్వం వెంటనే అప్రమత్తం కాలేదు. ప్రభుత్వ పెద్దలంతా కృష్ణా పుష్కరాలలో మునిగితేలారు. దీంతో అన్నదాత కష్టాల గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. ఫలితం ఇప్పుడు రైతులు అనుభవించాల్సి వస్తోంది. అయిదు ఎకరాలు సాగు చేసిన రైతుకు లక్ష రూపాయల నష్టం తప్పేలా లేదు. ఈ నష్టాన్ని పూడ్చేదెవరు? రైతుల ఘోష వినేదెవరు? చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా, పంటలన్నీ ఎండిపోయిన తర్వాత వాటర్ గన్స్ వల్ల ఉపయోగం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు రైతులు. కృష్ణా పుష్కరాలు 12 రోజుల ఈవెంట్. దానిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహుబాగుగా నిర్వర్తించారు. చాలా డబ్బు ఖర్చు చేశారు. ఒక సీజన్ లో కరువు కాటేస్తే  ఆ బాధ పుష్కరకాలం వెన్నాడుతూనే వుంటుంది. కరువు గాయాన్ని మాన్పడానికి ఇప్పటికైనా తక్షణ ఉపశమన చర్యలు ప్రారంభించాలి. 
ఎండిపోతున్న వేరుసెనగ పంట
అనంతపురం జిల్లాలో వేరుసెనగ పంటలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఆగస్టులో వర్షాలు పడకపోవడంతో నాలుగున్నర లక్షల హెక్టార్లలో పంటలు ఎండిపోతున్నాయి. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పంటలను ఎంత వరకు రక్షిస్తాయన్నది ప్రశ్నార్ధకమే. 
4.5 లక్షల హెక్టార్లలో ఎండుతున్న పంట
అంతా అయిపోయింది. అనంతపురం జిల్లా రైతులు వేరు సెనగ పంట మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలై పోయాయి. మళ్లీ కరవు దెబ్బకొట్టింది. అనంతపురం జిల్లాలో జూన్ లో 3.5 లక్షల హెక్టార్లు, జులైలో 1.90 హెక్టార్లు, ఆగస్టులో 60 వేల హెక్టార్లలో పంటలు సాగుచేశారు.    నాలుగున్నర లక్షల హెక్టార్లలో వేరుసెనగ పంట ఎండిపోతోంది.  ఇప్పుడు రెయిన్ గన్స్  అంటూ హడావిడి చేస్తున్న ప్రభుత్వం ఓ రెండు వారాల క్రితం మేల్కొని వుంటే తమ పంటలకు ఈ దుస్థితి వచ్చేది కాదంటున్నారు రైతులు. 
దెబ్బతీసిన ఆగస్టు నెల 
అనంతపురం రైతులను ఆగస్టు నెల దారుణంగా దెబ్బతీసింది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 88.7 మిల్లీమీటర్లు కాగా, కేవలం 4.5 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదయ్యింది. చుక్కనీరు లేకపోవడంతో వేరుసెనగ రైతులకు కన్నీళ్లే మిగిలాయి. 2 లక్షల హెక్టార్లలో ఊడ దశలోనూ, రెండున్నర లక్షల హెక్టార్లలో పిందె దశలోనూ వుంది. నీళ్లు పెట్టాల్సిన సమయంలో వానలు ముఖం చాటేయడం శాపంగా మారింది. కదిరి డివిజన్ లో 60 వేల హెక్టార్లలో వేరు సెనగ సాగు చేయగా మొత్తం ఎండు దశలో వుంది. ఉరవకొండ డివిజన్ లో 56 వేల హెక్టార్లు,  రాయదుర్గం డివిజన్ లో 50 వేల హెక్టార్లు, అనంతపురం డివిజన్ లో 45 వేల హెక్టార్లలో వేరుసెనగ వాడిపోయే దశలో వుంది. మడకశిర, ధర్మవరం డివిజన్ లలో 40 వేల హెక్టార్ల చొప్పున, పెనుకొండ డివిజన్ లో 39 వేల హెక్టార్లు, హిందూపురం డివిజన్ పరిధిలో 30 వేల హెక్టార్లలోనూ అదే పరిస్థితి.
భూగర్భ జలాల పరిస్థితి మరీ దయనీయం
అనంతపురం జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి మరీ దయనీయంగా వుంది. అమరాపురం , లేపాక్షి, రొద్దం, యాడికి మండలాల్లో 60 నుంచి 64 మీటర్ల లోతుకి భూగర్భ జలాలు పడిపోయాయి. నల్లచెరువు, గాండ్లపెంట మండలాల్లో 50 నుంచి 55 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి.  గుడిబండ, బుక్కపట్టణం, తలుపుల, గుమ్మగట్ట,  మండలాల్లో 40 నుంచి 45  మీటర్ల లోతుకి భూగర్భ జలాలు పడిపోయాయి. మడకశిర, తాడిమర్రి, హిందూపురం, సోమందేపల్లి మండలాల్లో 35 నుంచి 40  మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే, వలసలతో సగం జిల్లా ఖాళీ అవుతుందన్న ఆందోళన వ్యక్త మవుతోంది.
ఆరు రోజుల్లో లక్షా 80 వేల ఎకరాలకు ఆరుతడి 
ఆరు రోజుల్లో లక్షా 80 వేల ఎకరాలకు ఆరుతడి ఇచ్చినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. రక్షక తడుల కోసం 5082 రెయిన్ గన్స్, 4755 స్ర్పింక్లర్లు, 2404 డీజిల్ ఇంజన్లు, 1, 28, 300 పైపులు వినియోగించినట్టు అధికారులు చెబుతున్నారు.  పంటలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రులు చెబుతున్నారు. పుష్కరాల్లో మునిగి తేలిన ప్రభుత్వం ఆలస్యంగా చేపట్టిన ఈ చర్యలు ప్రచారానికే తప్ప తమకు ఏమాత్రం మేలు  చేయలేదన్న విమర్శలున్నాయి. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది. 

 

 

08:47 - September 9, 2016

హైదరాబాద్ : కాసేపట్లో రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వైసీపీ సభ్యులు నేడు కూడా నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరుకానున్నారు. ప్రత్యేకహోదాపై సభలో చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. నేడు ఎపీ అసెంబ్లీలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. విశ్వవిద్యాలయాల పటిష్టతపై ప్రభుత్వం చర్యలు, వర్షాభావ పరిస్థితులపై తీసుకుంటున్న చర్యలు, జీవో 271 వల్ల రైతుల ఇబ్బందులు, రాజధాని ప్రాంతంలో అంకుర కంపెనీల ఏర్పాటు వంటి పలు అంశాలు చర్చకు రానున్నాయి. 

 

నేడు ఎపీ అసెంబ్లీలో చర్చకు రానున్న అంశాలు

హైదరాబాద్ : నేడు ఎపీ అసెంబ్లీలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. విశ్వవిద్యాలయాల పటిష్టతపై ప్రభుత్వం చర్యలు, వర్షాభావ పరిస్థితులపై తీసుకుంటున్న చర్యలు, జీవో 271 వల్ల రైతుల ఇబ్బందులు, రాజధాని ప్రాంతంలో అంకుర కంపెనీల ఏర్పాటు వంటి పలు అంశాలు చర్చకు రానున్నాయి.  

 

నేడు కూడా నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరుకానున్న వైసీపీ సభ్యులు

హైదరాబాద్ : కాసేపట్లో రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వైసీపీ సభ్యులు నేడు కూడా నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరుకానున్నారు. 

ఎపి అసెంబ్లీలో నేటి వాయివా తీర్మానాలు

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీలో నేటి వాయివా తీర్మానాలు. ప్రత్యేకహోదాపై సభలో చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. 

 

కాసేపట్లో రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : కాసేపట్లో రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పలు అంశాలపై వాడివేడిగా చర్చలు జరుగునున్నాయి. ఈనెల 10 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం ప్రకటనను నిరసిస్తూ నిన్న సభలో వైసీపీ అందోళన చేపట్టింది. ఈనేపథ్యంలో స్పీకర్ సభను నేటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

నేడు రెండో రోజు ఎపి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : నేడు రెండో రోజు ఎపి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. పలు అంశాలపై వాడివేడిగా చర్చలు జరుగునున్నాయి. ఈనెల 10 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం ప్రకటనను నిరసిస్తూ నిన్న సభలో వైసీపీ అందోళన చేపట్టింది. ఈనేపథ్యంలో స్పీకర్ సభను నేటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

 

08:08 - September 9, 2016

హైదరాబాద్ : ఢిల్లీలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని కేటీఆర్‌తో సమావేశమయ్యారు. విభజన చట్టాన్ని పూర్తిస్ధాయిలో అమలుపరచాలని అరుణ్ జైట్లీని కోరామని కేటీఆర్ తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు నీతి అయోగ్ సూచించిన విధంగా 24 వేల 500 కోట్లు నిధులు వెంటనే ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు జిల్లాకు 50 కోట్ల చొప్పున 5 ఏళ్లు ఇవ్వాలని కోరామన్నారు. ఏపీకి సహాకారం అందించడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్న కేటీఆర్.... తెలంగాణ అభివృద్థికి సహకరించాలని కోరారు. 

నేడు గజ్వేల్, సిద్ధిపేట నియోజకవర్గాల్లో మంత్రి హరీష్ రావు పర్యటన

మెదక్ : నేడు గజ్వేల్, సిద్ధిపేట నియోజకవర్గాల్లో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. 

08:00 - September 9, 2016

విశాఖ : ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలతో ఉత్తరాంధ్ర అగ్నిగుండంలా మారింది. విశాఖకు రైల్వేజోన్‌పై కేంద్రం క్లారీటీ ఇవ్వకపోవడంతో నిరసనలు హోరెత్తుతున్నాయి. పార్టీలకు అతీతంగా నాయకులంతా ఏకమై..ఆందోళనలు చేస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్న విశాఖకు రైల్వేజోన్‌ ప్రకటించాలని అందరూ డిమాండ్‌ చేస్తున్నారు. ఏపీ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరిస్తున్న నాయకులు.. డిమాండ్ సాధించుకునే వరకూ పోరాడుతామని స్పష్టం చేస్తున్నారు. 
విశాఖ రైల్వేజోన్‌ పై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆందోళనలు 
ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే నినాదాలు వినిపిస్తున్నాయి. విశాఖ రైల్వేజోన్‌.. ఉత్తరాంధ్రవాసుల చిరకాల స్వప్నం. రాష్ర్ట విభజన తర్వాత విశాఖకు రైల్వేజోన్‌ వస్తుందని అంతా సంబరపడ్డారు. కానీ, ఏపీకి ఇచ్చే ప్యాకేజీపై మాట్లాడిన కేంద్రం పెద్దలు.. రైల్వేజోన్‌ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో ఉత్తరాంధ్రలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. 
విశాఖ రైల్వే డీఆర్ఎం ఆఫీసు ముట్టడి 
రైల్వేజోన్‌ విశాఖకు కాకుండా విజయవాడకు తరలివెళ్తుందన్న ప్రచారం సాగడంతో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. విశాఖకు రైల్వేజోన్ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రతిపక్షాలు విశాఖ రైల్వే డీఆర్ఎం ఆఫీసును ముట్టడించాయి. దీంతో అక్కడే ఉన్న పోలీసులు నేతలను, కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి.. వ్యాన్‌లలో ఎత్తిపడేశారు.
ఎంపీ హరిబాబు రాజీనామా చేయాలి : నర్సింగరావు 
బీజేపీ నేత, విశాఖ ఎంపీ హరిబాబు తక్షణమే రాజీనామా చేయాలని సీపీఎం నేత నర్సింగరావు డిమాండ్‌ చేశారు. విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్‌ ఇచ్చేంత వరకూ రైళ్లను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. 
ఆందోళన చేపట్టిన ఎంపీ అవంతి 
ఇటు అధికార పార్టీకి చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ కూడా ఆందోళన చేపట్టారు. విశాఖ జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహం నుంచి రైల్వే డీఆర్‌ఎం ఆఫీసు వరకూ ర్యాలీగా వెళ్లారు. విశాఖకు రైల్వేజోన్‌ ఇవ్వకపోతే రాజీనామ చేస్తానని ప్రకటించారు. విభజన గాయాలతో, ఆర్థిక లోటుతో కష్టాల్లో ఉన్న ఏపీని కేంద్రం మోసం చేస్తోందన్నారు అనకాపల్లి ఎంపీ. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వేజోన్ వచ్చేవరకూ పోరాటం ఆగదంటున్నారు. రైల్వేజోన్‌కు కావాల్సిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నా.. ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రజల సహనాన్ని కేంద్రం పెద్దలు పరీక్షించవద్దని హెచ్చరిస్తున్నారు. 
విశాఖ రైల్వేజోన్‌ సాధించేవరకూ పోరు : ప్రతిపక్షాలు 
విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ ఇవ్వాల్సిన పనిలేదని ప్రభుత్వం గతంలో వేసిన జోన్‌ రీ ఆర్గనైజేషన్‌ కమిటీ నివేదిక ఇవ్వడంతో ఉత్తరాంధ్ర అగ్నిగుండంలా మారింది. ప్రస్తుతమున్న తూర్పు కోస్తా రైల్వేలోనే విశాఖ డివిజన్ కొనసాగించాలని నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం. మొత్తంగా విశాఖకు రైల్వేజోన్‌ సాధించేవరకూ పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు ప్రతినబూనాయి. తమ భవిష్యత్తు కార్యచరణ కూడా ప్రకటించాయి. 

07:49 - September 9, 2016

విజయవాడ : ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ప్రకటనపై ప్రతిపక్షాలు కదంతొక్కాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. హోదాపై మాటతప్పిన బీజేపీతో టీడీపీ అంటకాగుతోందని నేతలు విమర్శించారు. హోదాపై కేంద్రం వైఖరికి నిరసనగా విపక్షాలు ఈనెల 10న బంద్‌కు పిలుపునిచ్చాయి.
విజయవాడలో కదం తొక్కిన అఖిలపక్షాలు 
విజయవాడలో అఖిలపక్షాల నేతలు కదంతొక్కారు. ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం ప్రకటనపై ఆంధ్రప్రదేశ్‌లో విపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీ -టీడీపీలు ప్రజలను మోసగించాయని మండిపడ్డాయి. ప్రత్యేకహోదా ఏపీ ప్రజల హక్కన్న నినాదంతో... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించాయి. విజయవాడలో వైసీపీ, వామపక్షాలు, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో విజయవాడలో  ప్రజలు  పోరుబాటపట్టారు. 
రాజమహేంద్రవరంలో వామపక్షాలు భారీ ర్యాలీ 
అటు రాజమహేంద్రవరంలో వామపక్షాలు భారీ ర్యాలీ చేపట్టాయి. నిరసనలో  నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
వామపక్షాలు, వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గుంటూరులో వామపక్షాలతోపాటు వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి.. హోదా ఇస్తామని హమీలిచ్చిన బీజేపీ.. ఇప్పుడు మాట తప్పి ప్రజల్ని మోసం చేస్తోందని నేతలు ఆరోపించారు. 
శ్రీకాకుళం జిల్లాలో రోడ్లపైకి వచ్చిన జనం 
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ.. శ్రీకాకుళం జిల్లాలో జనం రోడ్లపైకి వచ్చారు. విపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. 
కర్నూలు నిరసనలు 
ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో కర్నూలు నిరసనలు వెల్లువెత్తాయి. 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం మాటతప్పిందని విపక్ష నేతలు విమర్శించారు. 
అనంతపురం జిల్లాలో కాంగ్రెస్‌ నిరసన 
ఎపిసిసి అధ్యక్షుడు రఘవీరారెడ్డి ఆధ్వర్యంలో... అనంతపురం జిల్లా మడకశిరపట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ నిరసనకు దిగింది. ప్యాకేజీ అయితే లీకేజీలకు అవకాశం ఉంటుంది కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకున్నారని రఘువీరా విమర్శించారు. 
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రత్యేకహోదా పోరు 
పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ప్రత్యేకహోదా పోరు హోరెత్తుతోంది. ఏలూరులో వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతృత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదించారు. 
తిరుపతిలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు
ప్రత్యేక హోదాకోసం తిరుపతిలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. బీఎస్ ఎన్ ఎల్ ఆఫీసు దగ్గర నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.. వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. ఏపీకి ప్రత్యేకహోదాపై బీజేపీ నమ్మకద్రోహానికి పాల్పడుతుంటే.. చంద్రబాబు గట్టిగా నిలదీయలేకపోయారిని విమర్శిస్తున్నారు. కేంద్రంలో పదవులు పట్టుకుని వేలాడుతున్న  వెంకయ్యనాయుడుతోపాటు టీడీపీ నేతలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈనెల 10న తలపెట్టిన బంద్‌కు మద్దతుగా నిరసనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

 

యూఎస్ ఓపెన్ సెమీ ఫైనల్ లో సెరెనా విలియమ్స్ ఓటమి

హైదరాబాద్ : యూఎస్ ఓపెన్ సెమీ ఫైనల్ లో సెరెనా విలియమ్స్ ఓటమి పాలయింది. ప్లిస్కోవా చేతిలో 2...6, 6...7 తేడాతో పరాజయం అయ్యారు. 

07:37 - September 9, 2016

హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలకోసం రాజీ పడే సమస్యే లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత లోటు బడ్జెట్‌‌లో ఉన్న ఏపీకి సహాయం చేయడంలో కేంద్ర సాయం ఆలస్యమైందని, విభజన హామీలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నామని తెలిపారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై సీఎం ఏపీ శాసనమండలిలో ప్రకటించారు. 4 అంశాలపై అరుణ్‌జైట్లీ స్పష్టతనిచ్చారని, సకాలంలో సహాయం అందకపోతే నిలదొక్కుకోలేమని చంద్రబాబు అన్నారు.
ప్యాకేజీపై సీఎం చంద్రబాబు శాసనమండలిలో ప్రకటన
కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై ఏపీ సీఎం చంద్రబాబు శాసనమండలిలో ప్రకటించారు. 4 అంశాలపై కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టతనిచ్చారని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చే నిధులు సరిపోవని, రాజధానికి మౌలిక సదుపాయాలే కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధానికి 2500 కోట్లు ఇచ్చారని, మరో వెయ్యి కోట్లు ఇస్తామన్నారని తెలిపారు. రాజధానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేస్తున్నారని, ఇది సరికాదని చంద్రబాబు అన్నారు. రాజధాని అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. పన్ను రాయితీలపై నోటిఫికేషన్‌ ప్రకటించాల్సి ఉందన్నారు. ఇచ్చినవి తీసుకుంటాం, రావాల్సిన వాటిపై పోరాడతామని తెలిపారు. 
ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధం : సీఎం చంద్రబాబు 
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకోసం రాజీ పడే సమస్యే లేదని అన్నారు. పట్టిసీమను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూసినా.. అనుకున్న విధంగా పూర్తి చేశామని అన్నారు. పోలవరం ఖర్చును వందశాతం కేంద్రం భరిస్తామని చెప్పినట్లు బాబు తెలిపారు. నిధులు సక్రమంగా అందితే 2018కి పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ చంద్రబాబు మండిపడ్డారు.
కేంద్రాన్ని నిలదీయడానికి తమతో కలిసిరావాలి : ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం 
ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని నిలదీయడానికి తమతో కలిసిరావాలని ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం దోబూచులాటను ప్రజల ముందు బయటపెట్టడానికి ముఖ్యమంత్రి ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విషయంలో రాజకీయాలు తగది రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 
విపక్ష సభ్యులు అభ్యంతరం  
కేంద్రం ఇచ్చిన డ్రాఫ్ట్‌లో హోదా అంశాన్ని ఏపీ హక్కుగా చూపకుండా... ఓ సెంటిమెంట్‌గా చూపడం సరిగా లేదంటూ విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను తీసుకుంటూనే.. రావాల్సిన వాటిని సాధించుకోవాలని మండలి ఛైర్మన్‌ సూచిస్తూ.. సభను శుక్రవారానికి వాయిదా వేశారు. 

 

07:31 - September 9, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనపై కేంద్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏపీకి చేయనున్న సాయం వివరాలను ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో వెబ్‌సైట్‌లో కేంద్రం పొందుపరిచింది. నాలుగు కేటగీరీల కింద ఏపీకి ప్రత్యేక సాయం చేయనున్నామని ఈ నోట్‌లో తెలిపింది. 
కేంద్ర అధికారిక వెబ్‌సైట్ పీఐబీలో వివరాలు 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన వివరాలను కేంద్ర అధికారిక వెబ్‌సైట్ పీఐబీలో పొందుపరిచింది. నాలుగు కేటగీరీల కింద ఏపీకి సాయం చేయనున్నామని వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఏపీ విభజన చట్టం, రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీ, 14వ ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్ సిఫార్సుల కింద సాయం చేయనున్నామని నోట్‌లో తెలిపింది. 
పలు భవనాలకు ఆర్థిక సాయం
సెక్షన్ 94 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధానిలో చేపట్టనున్న హైకోర్టు, రాజ్‌భవన్‌, అసెంబ్లీ, శాసనమండలి, సచివాలయం వంటి భవనాలకు ఆర్థిక సాయం చేయనున్నామని తెలిపింది. అలాగే  వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక ప్యాకేజీ వివరాలతోపాటు 13 షెడ్యూల్లో ఏయే అంశాలు ఉన్నది, సంస్థలు ఏ విధంగా విభజన చేయాలన్నది కూడా తెలిపారు. రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని మన్మోహన్ ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని.. అయితే ప్రత్యేక హోదాను ఏ  రాష్ట్రానికి ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం సూచించిందనే వివరాలను ఈ నోట్ ద్వారా తెలిపారు.
రాజధాని నిర్మాణానికి మరో రూ. 1000 కోట్లు 
ఏపీకి ఇప్పటికే 3,979.50 కోట్ల రెవెన్యూ లోటు బడ్జెట్‌ను ఇచ్చామని, మిగిలిన బ్యాలెన్స్‌ను వాయిదాలుగా, తొలి ఏడాది ఏపీకి వచ్చిన రెవెన్యూ లోటును వార్షిక వాయిదాల్లో ఇస్తామని అందులో తెలిపారు. రాజధాని నిర్మాణానికి 2,500 కోట్లు ఇచ్చామని.. మరో వెయ్యి కోట్లు కూడా ఇస్తామని వెల్లడించారు. వెనుకబడిన జిల్లాలకు 1,050 కోట్లు ఇచ్చామని, మిగిలిన రూ.1,050 కోట్లు ఇస్తామని... పోలవరం ప్రాజెక్ట్‌కు అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ఏపీకి అదనంగా రూ.7,787 కోట్లు 
కర్నూలులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్శిటీ, పెట్రో వర్శిటీ, ఐఐటీ, ఎన్ఐడీ, ట్రిపుల్‌ఐటీ తదితర విద్యాసంస్థల వివరాలు, ఏపీకి ఏమిచ్చారు.. ఏమేమి పరిశీలనలో ఉన్నాయి లాంటి విషయాలను అందులో ప్రస్తావించారు. స్టీల్‌ ప్లాంట్ ఏర్పాటు, పెట్రో కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టుల అప్‌గ్రేడేషన్, భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. పన్నుల వాటా పెంచాక ఏపీకి అదనంగా రూ.7,787 కోట్లు ఇస్తున్నామంటూ విభజన చట్టంలోని అన్ని అంశాలను గౌరవించి, అమలు చేస్తామని కేంద్ర ఈ వెబ్ సైట్లోని నోట్‌లో తెలిపింది. మొత్తమ్మీద ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేశాము, ఇక ముందు ఏం చేస్తామన్న వివరాలే తప్ప.. ఏపీకి లక్షా 50 వేల కోట్ల సాయం అంటూ వచ్చిన ఊహాగానాలకు ఈ నోట్‌లో సమాధానం లేదు. 
 

 

07:24 - September 9, 2016

కాకినాడ : పవన్‌ ఉద్యమ శంఖం పూరించారు. ఆంధ్రుల ఆత్మగౌరవ సభతో  ఉద్యమానికి కొత్త ఊపు తీసుకొస్తున్నారు. కాకినాడ సభతో  ప్రత్యేక సెగలను ఢిల్లీని తాకేలా వ్యూహాన్ని రూపొందించారు.  ఇప్పటిదాకా వరిగడ్డిమంటనే తలపిస్తున్న ఉద్యమాన్ని అగ్నిపర్వతంలా మండిస్తారా.. కాకినాడ సభ నుంచి పవన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఏమని సందేశం ఇవ్వనున్నారు.
కాకినాడ చేరుకున్న పవన్  
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటానికి దిగుతున్నట్లు ప్రకటించి.. కాకినాడ సభకు పిలుపునిచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌.. రాజమహేంద్రవరం చేరుకున్నారు. మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కాకినాడ చేరుకున్నారు. 
కాకినాడ సభలో పవన్‌ ఏం మాట్లాడుతారు...?
ప్రత్యేకహోదాపై జనసేనాని గర్జిస్తారా.. కాకినాడ సభలో పవన్‌ పవర్‌ పంచ్‌లు ఎవరిమీద..? మోదీని టార్గెట్‌ చేస్తారా.. చంద్రబాబుపై ఉరుముతారా...? లేదా ఎప్పటిలాగే కాంగ్రెస్‌ను తిట్టిపోస్తారా...? తిరుపతి సభలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తి..రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారు. హోదాను సాధించేందుకు ప్రత్యేక కార్యచరణను కూడా ప్రకటించారు. కాకినాడ జేఎన్‌టీయూ మైదానంలో బహిరంగ సభకు పిలుపునిచ్చారు పవన్‌ కళ్యాణ్‌. ఇప్పటికే  పవన్‌ కాకినాడ చేరుకోవడంతో.. అభిమానులు, కార్యకర్తలతో పట్టణం కోలాహలంగా మారింది. 
ఇక ఫుల్‌టైం పొలిటిషియన్‌గా పవన్ కళ్యాణ్..!
తనంతట తానే రాజకీయ రణరంగంలోకి దిగుతున్నట్లు పవన్‌ ప్రకటించడంతో..ఇక ఫుల్‌టైం పొలిటిషియన్‌గా మారినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  కాకినాడ సభలో పవన్‌ ఏం మాట్లాడుతారు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.  అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని తిరుపతిలో సభపెట్టినప్పుడు జనం భారీగా తరలివచ్చారు. ఊహించినదానికన్నా ఎక్కువగానే సభ సక్సెస్‌ అయ్యింది. ఇక కాకినాడలో పక్కా రాజకీయసభ కావడంతో పాటు దానికి ప్రత్యేక హోదా నినాదం జోడించడంతో  అంతా ఈ సభవైపే ఆసక్తిగా చూస్తున్నారు. సభకు అభిమానుల పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో... పవన్‌ కాకినాడ నుంచి 5కోట్ల ఆంధ్రప్రజలకు  ఎలాంటి సందేశం ఇస్తారు... ప్రత్యేక హోదాపై ఎలా ముందడుగు వేస్తారో వేచి చూడాలి.

 

నేడు ఏపీ బీజేపీ నేతలతో ఢిల్లీ పెద్దలు చర్చలు

విజయవాడ : నేడు ఏపీ బీజేపీ నేతలతో ఢిల్లీ పెద్దలు చర్చలు జరుపనున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 320 గ్రా. బంగారం సీజ్

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు  తనఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 320 గ్రాముల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. 
 

నేడు విశాఖ ఏజెన్సీ బంద్ కు పిలుపు

విశాఖ : నేడు విశాఖ ఏజెన్సీ బంద్ కు గిరిజన సంఘం పిలుపిచ్చింది. విశాఖలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, ఆస్పత్రుల్లో వైద్యులను నియమించాలని డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహించనున్నారు. 

నేడు విశాఖ ఏజెన్సీ బంద్ కు పిలుపు

విశాఖ : నేడు విశాఖ ఏజెన్సీ బంద్ కు గిరిజన సంఘం పిలుపిచ్చింది. విశాఖలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, ఆస్పత్రుల్లో వైద్యులను నియమించాలని డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహించనున్నారు. 

నేడు కాకినాడలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ

తూర్పుగోదావరి : కాకినాడలో నేడు జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సభ జరుగనుంది. అభిమానులు, కార్యకర్తలు సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

Don't Miss