Activities calendar

10 September 2016

చీమకుర్తి ఎస్సై సస్పెండ్..

ప్రకాశం : చీమకుర్తి ఎస్సై సుబ్బరాజు సస్పెండ్ కు గురయ్యారు. పలు కేసుల్లో అవకతవకలకు పాల్పడినట్లుగా సమాచారం ఉండటంతో సస్పెండ్ చేసినట్లు ఎస్పీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. 

'మెంటల్ ' వివాదం..

హైదరాబాద్ : నటుడు శ్రీకాంత్ నటించిన మెంటల్ సినిమా దర్శకుడు పేరు మార్పుపై వివాదం నెలకొంది. దర్శకుడిగా తనపేరును తొలగించటంపై పి. బాబ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాపేరు స్థానంలో ఎస్ కే.బషీద్ పేరును పెట్టడం దారుణమన్నారు. ఈ సమస్యను రేపటిలోగా తేల్చకుంటే ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. పి.బాబ్జి పేరు మార్చటంపై దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ తప్పుపట్టారు. 

21:11 - September 10, 2016

గతంలో త్రివిక్ర‌మ్ పంచ్ డైలాగ్స్ ల‌ను పెర్ఫెక్ట్ గా పేల్చే క‌మెడియ‌న్ గా సునీల్ కు మంచి పేరుంది. అసలు త్రివిక్ర‌మ్ ప‌ర్టిక్యుల‌ర్ గా సునీల్ కోస‌మే మంచి మంచి కామెడీ స‌న్నివేశాలు సృష్టించేవాడు. మరి సునీల్ హీరో అయిపోయాక ఆ స్థాయి కమెడియన్ తెలుగు ఇండ్రస్టీలో లేరనే చెప్పుకోవాలి. ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే కమెడియన్ నటుడు దొరికేశాడు..గోదావరి జిల్లాల యాస..కౌంటర్ కు రీ కౌంటర్...టైమింగ్ .. స్పాంటేనియ‌స్..ఆరోగ్యవంతమైన కామెడీ..ఇవన్నీ సరైన మోదాదులో వున్న బెస్ట్ కమెడిన్ 'ప్రవీణ్'. ‘కొత్త బంగారు లోకం’తో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ప్ర‌వీణ్. ప్ర‌వీణ్ ఈ మ‌ద్య‌కాలంలో న‌టించిన ప్రేమక‌థా చిత్రం, స్వామిరారా, ప‌టాస్ లాంటి సినిమాలు ప్రవీణ్ కు మంచి పేరు తెచ్చాయి..నవ్వులు పండించే కమెడియన్ 'ప్రవీణ్'తో టెన్ టీవీ చిట్ చాట్ లో ఎటువంటి అభిప్రాయాలను తెలిపాడో ఆయన మాటల్లోనే విందాం..అవకాశమొస్తే హీరో చేస్తానంటున్నారు కమేడియన్ ప్రవీణ్..రకుల్ ప్రీత్ సింగ్, రాశిఖన్నాతో హీరోయిన్లయితే హోరోగా చేస్తానని తెలిపారు. మరి ప్రవీణ్ చెప్పే మరిన్ని కబుర్లు ఇనాలన్నా..సూడాలన్నా ఈ వీడియోను క్లిక్ చేయాలండి మరి ఆ..మరి ఎందుకు ఆలస్యం..చూడండే బాబు.. 

21:08 - September 10, 2016
21:05 - September 10, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ వర్షా కాల సమావేశాలు ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన భేటీలో ప్రజా సమస్యలపై ఎటువంటి చర్చ చేపట్టకుండానే అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్‌ చేస్తూ.. వైసీపీ సభ్యులు స్పీకర్‌ పొడియం చుట్టముట్టి ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. కొన్ని సందర్భాల్లో వైసీపీ సభ్యులు తీరు రణరంగాన్ని తలపించింది. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరును సభా హక్కుల సంఘానికి నివేదిస్తూ అసెంబ్లీ తీర్మానించింది.

అసెంబ్లీలో చర్చకు రాని ప్రజాసమస్యలు
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఒక్క ప్రజా సమస్యల కూడా చర్చకు రాలేదు. ఈనెల 8న ప్రారంభమైన అసెంబ్లీలో మూడు రోజులు కూడా ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించడంతో సభా సమయం వృధా అయ్యింది.

ప్యాకేజీ అంశాన్ని ఆయుధంగా మలచుకున్న వైసీపీ
అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు రోజు... అంటే ఈనెల 7న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ప్యాకేజీకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని ప్రతిపక్ష వైసీపీ ఆయుధంగా మలచుకుంది. ప్రత్యేక హోదా ప్రకటించకుండా పాక్యేజీని ప్రకటించిన కేంద్ర తీరును, దీనిని అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ... నల్ల చొక్కాలు ధరించి సభకు హాజరైన వైసీపీ సభ్యులు అసెంబ్లీని స్తంభింపజేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే సభలో జీఎస్‌టీ బిల్లును ప్రవేశపెట్టి చర్చ లేకుండానే ఆమోదించారు. ఆ తర్వాత సభ వాయిదా పడింది.

అసెంబ్లీ కార్యదర్శి, సిబ్బంది విధులను అడ్డుకున్న వైసీపీ
రెండో రోజు కూడా పరిస్థితిలో మార్పులేదు. హోదాపై సభలో చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల శివప్రాసదరావు తిరస్కరించారు. ప్యాకేజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రకటన చేసిన తర్వాత చర్చకు సిద్ధమని అధికార పక్షం ప్రకటించింది. దీనికి ససేమిరా... అన్న వైపీసీ సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. స్పీకర్‌ పొడియం వద్దకు వెళ్లిన నిరసన వ్యక్తం చేశారు. సభాధ్యక్ష స్థానంపైకి కాగితాలు విసిరేశారు. స్పీకర్‌ ముందు ఉన్న మైక్‌ను విరగొట్టారు. అసెంబ్లీ కార్యదర్శితోపాటు, సిబ్బందిని విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారు. బెంచీలు ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొడియం దగ్గర ఉన్న మార్షల్స్‌ను తోసివేసే ప్రయత్నం చేశారు. వైసీపీ సభ్యులు తీరును అధికార టీడీపీతోపాటు, మిత్రపక్ష బీజేపీ సభ్యలు తీవ్రంగా ఆక్షేపించారు. వైసీపీ సభ్యుల తీరుతో రెండో రోజు కూడా ఏ అంశాన్ని చర్చించకుండానే సభ వాయిదా పడింది.

మూడో రోజు కూడా అదే పరిస్థితి
మూడో రోజు కూడా పరిస్థితిలో మార్పు లేదు. హోదాపై చర్చించాంటూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి సభను స్తంభింపచేశారు. రెండో రోజు తరహాలోనే స్పీకర్‌ పైకి కాగితాలు విసిరారు. కాగితాలను బంతులుగా చుట్టి వేశారు. వైసీపీ సభ్యులు తీరును ఆక్షేపిస్తున్న అధికార, మితక్షపక్ష సభ్యులు ప్రసంగిస్తున్నప్పుడు అసెంబ్లీ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న కెమెరాలకు అడ్డంగా ప్లకార్డులను అడ్డం పెట్టారు. శాసనసభ కార్యదర్శి బెంచిని లాగేశారు. బెంచీలపైకి ఎక్కి నినాదాలు చేశారు.

వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు మహిళా మార్షల్స్ తో వైసీపీ దౌర్జన్యం
వైసీపీ సభ్యుల తీరును టీడీపీ, బీజేపీ సభ్యులు తీవ్రంగా ఆక్షేపించారు. మార్స్‌లను పెట్టి సభను నడిపించుకునే పరిస్థితి కల్పించిన వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు ప్రతిపక్ష సభ్యులు సభలో ప్రవర్తించిన తీరును సభా హక్కుల కమిటీకి నివేదిస్తూ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు.

స్పీకర్‌,టీడీపీ, బీజేపీ సభ్యులు విజ్ఞప్తులు పట్టించుకోని వైసీపీ
స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, టీడీపీ, బీజేపీ సభ్యులు పదేపదే విజ్ఞప్తి చేసినా వైసీపీ సభ్యులు తమ పంతాన్ని వీడలేదు. వైఖరి మార్చుకోలేదు. సభా కార్యక్రమాలు సజావుగా సాగే అవకాశం లేకపోవడంతో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు. రాష్ట్ర విభజన తర్వాత రెండేళ్ల అసెంబ్లీ చరిత్రలో ఒక్క ప్రజా సమస్య కూడా చర్చకు రాకపోవడం ఇదే మొదటిసారి. 

20:57 - September 10, 2016

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్రం ప్యాకేజీతో సరిపెట్టింది. ఈ అంశంపై విపక్షాలను శనివారం అంటే 10వ తేదీన బంద్ కు పిలునిచ్చాయి. విపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు బంద్ సంపూర్ణంగా ముగిసింది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ.. 5 కోట్ల మంది ప్రజలు బంద్ కు సహకరించారని పేర్కొన్నారు. బంద్ ను విఫలం చేసేందుకు చంద్రబాబు విఫలయత్నం చేశారన్నారు. బంద్ విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ జగన్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ-టీడీపీ కుమ్మకై ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.ఏపీ ప్రజల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలన్న చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదాపై మాట మార్చారన్నారు. రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు అనర్ఘుడనీ..తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

20:45 - September 10, 2016

విజయవాడ : ఒకడుగు ముందుకి రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది ఏపీఎస్ ఆర్టీసీ పరిస్థితి. ఉన్నకొద్దిపాటి లాభాల మాట అటుంచితే నష్టాల పయనమే ఆర్టీసీని పట్టిపీడిస్తోంది. శుభముహూర్తాలు లేకపోవడం, పుష్కరాలకు ఉచిత బస్‌లు నడపడం, చీటికి మాటికి డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల, పెరిగిపోతున్న పర్సనల్ కాస్ట్..వెరసి ఆర్టీసీని మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఉన్నతస్థాయి అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నా ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి ఉపశమనం కల్గించలేకపోతున్నాయి.

రూ. 55 కోట్ల నష్టంలో కృష్ణా, గుంటూరు డిపోలు
ఏపీఎస్ ఆర్టీసీ ని నష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. కొద్దిమేర లాభాలు ఆర్జించి పుంజుకునే సరికి ఇంకోవైపు కోలుకోలేని నష్టాలు వచ్చిపడుతున్నాయి. ఒకటా రెండా ఏకంగా లక్షల నుంచి కోట్లాది రూపాయలు మేర ఆర్టీసీ నష్టాలు చవిచూస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయంపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆర్టీసీకి ఏకంగా 55 కోట్ల రూపాయలపైనే నష్టాల్లో పయనిస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2016 ఏప్రిల్ నుంచి జులై వరకు విడుదలైన త్రైమాసిక ఆర్టిక ఫలితాల్లో ఆర్టీసీ నష్టాలబాట పట్టింది. సంస్థాగతంగా ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినా పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలు ఆర్టీసీకి గుదిబండగా మారుతున్నాయి.

పుష్కారాల్లో రికార్డుస్థాయిలో ఉచిత బస్సులను నడిపిన ఆర్టీసీ
2015తో పోలిస్తే ఈ ఏడాది ఆర్టీసి నష్టాల బాటలో పయనిస్తోంది. తొలి త్రైమాసికం పూర్తి అన్ సీజన్‌ గా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం శుభ ముహూర్తాలు అనేవి దరిదాపుల్లో లేకపోవడం కూడా ఆర్టీసీ నష్టం చవిచూడాల్సి వచ్చింది. ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకూ 12రోజులపాటు జరిగిన పుష్కర సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో రికార్డుస్థాయిలో ఉచిత బస్ లు నడిపారు. ఈ ప్రభావం ఆర్టీసీపై చూపింది. అలాగే తాత్కాలిక బస్టేషన్లు, ఇతరత్రా సివిల్ నిర్మాణాల వల్ల మొత్తంగా 30 కోట్లకుపైగా ఆర్టీసీ నష్టపోవాల్సి వచ్చింది. ఇంకోవైపు ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ ఎంత ప్రకటిస్తుందన్న అంశంపై మీమాంస నెలకొంది.

కృష్ణా , గుంటూరు రీజియన్‌లో రూ.27, 28 కోట్ల నష్టం
కృష్ణా రీజియన్ 27 కోట్లు, గుంటూరు రీజియన్ 28 కోట్లు నష్టాలబాటలో పయనిస్తోంది. విజయవాడ జోన్ పరిధిలోకి వచ్చే పశ్చిమ గోదావరి రీజియన్ సైతం 5 కోట్ల మేర నష్టాల నావలో కొట్టుమిట్టాడుతోంది. గుంటూరు రీజియన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ రీజియన్ లో ఏ ఒక్క బస్ డిపో కూడా లాభాలు ఆర్జించకపోవడం శోచనీయం. జగ్గయ్యపేట బస్ డిపో 2 కోట్ల రూపాయల నష్టంతో ఉంది. నూజివీడు బస్ డిపో 2 కోట్ల 4 లక్షల రూపాయల నష్టాల్లో పయనిస్తోంది. ఇలా డిపోలన్నీ కోట్లాది రూపాయల నష్టాల్లో కూరుకుపోవడంతో ఏం చెయ్యాలో అర్థంకాక ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ప్రత్యామ్నాయం ఆలోచించాలంటున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు
ఆర్టీసీలో సంస్థాగతంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నా తాత్కాలిక ఫలితాన్నే ఇస్తున్నాయి. ఇంధన పొదుపు, మెటీరియల్ లో పొదుపు పాటించిన ప్రయోజనం లేకుండా పోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు సూచిస్తున్నాయి. 

20:39 - September 10, 2016

మహబూబ్‌నగర్ : పాలమూరులో సాగునీటి విషయమై నాగర్‌కర్నూలు, వనపర్తి గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నీటి వాడకంపై మాకు హక్కు ఉందంటే మాకు ఉందని రెండు గ్రామాల ప్రజలు దాడులు చేసుకుంటున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో... పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

20:38 - September 10, 2016

హైదరాబాద్ : హైదరాబాద్ రవీంద్రభారతిలో చాకలి అయిలమ్మ వర్థంతి కార్యక్రమం తెలంగాణ బాషా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చాకలి అయిలమ్మ తెలంగాణ ఉద్యమ ఐకాన్ అని ఆమె స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత చాకలి అయిలమ్మ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చామని ఆమె తెలిపారు. 

20:36 - September 10, 2016

ఏపీకి ప్రకటించిన ప్యాకేజీలో ఘుమఘుమలాడే లడ్డూలూ ఉండవచ్చు.. అని ఏపీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. పవన్‌కళ్యాణ్‌ భవిష్యత్తులో బీజేపీ పనితీరును స్వాగతిస్తారని ఆయన అన్నారు. చరిత్రలో ఏరాష్ట్రానికి ఇవ్వనంత సహకారాన్ని గత రెండేళ్లలో కేంద్రం ఏపీకి అందించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక హోదా పోరు నేపథ్యంలో.. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసి.. రాష్ట్రంలో పరిస్థితులను వివరించినట్టు మాణిక్యాలరావు చెప్పారు.

20:12 - September 10, 2016

 పాల్వంచలో పైసల గణపతి.. వెంకయ్యపై నారాయణ విసుర్లు..వెంకయ్య పంచెలో ఏమీ లేదంట..ఆనం వివేక ఏసిన వింత ఏషాలు..ఆనం వివేకా కొంప మునిగిపోతందంట..గణేష్ మహరాజ్ టెంపుల్స్ ల బువ్వ తింటున్న జానారెడ్డి.. కరీంనగర్ జైల్ నుండి బైటకు ఉరికిన దొంగలు..పరీక్షల్లో చూచిరాతలు..మధ్యప్రదేశ్ ల అయస్కాంతం మడిసి..అమెరికాల నదిలో చాపలు పట్టాలంటున్న పెద్దాయన..పాల్వంచలో పైసల గణపతి.. 

20:02 - September 10, 2016

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై అఖిలపక్ష పార్టీల పిలుపు మేరకు నిర్వహించిన బంద్‌ సక్సెస్‌ అయింది. విజయవాడ, గుంటూరు, తూర్పుగోదావరి వంటి జిల్లాల్లో ప్రతిపక్ష వైసీపీతో పాటు సీపీఎం, సీపీఐలు బంద్‌లో పాల్గొన్నాయి. ఓటుకు నోటు కేసు కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని పలుచోట్ల నిరసనకారులు ఆందోళన చేపట్టారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై అఖిల పక్షం పిలుపు
ఏపీకి ప్రత్యేక హోదాపై అఖిల పక్షం పిలుపు మేరకు నిర్వహించిన బంద్‌ విజయవంతం అయింది. విజయవాడలో సీపీఎం నేతలు నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. పండిట్ నెహ్రూ బస్‌ స్టేషన్ వద్ద  బస్సులను అడ్డగించిన సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏలూరు రోడ్, బందరు రోడ్‌లో.. పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  బలవంతపు అరెస్ట్‌లతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేయలేరని మధు హెచ్చరించారు.
జాతీయ రహదారుల దిగ్భందం
మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు జాతీయ రహదారుల దిగ్భంద కార్యక్రమం చేపట్టారు. కనకదుర్గమ్మ వారధి వద్ద కృష్ణా, గుంటూరు జిల్లాల నడుమ జాతీయ రహదారి రాస్తారోకో నిర్వహించారు. ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు ప్యాకేజీతో సరిపుచ్చుకోవడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని నేతలు స్పష్టం చేశారు.  
విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో ధర్నా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ సీపీఎం ఏపీ కార్యదర్శి రామకృష్ణతో పాటు ప్రత్యేక హోదా కమిటీ నేతలు చలసాని శ్రీనివాస్‌, సినీ హీరో శివాజీ, ఇతర నేతలు విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. 
నెల్లూరు జిల్లాలో బంద్‌ విజయవంతం
నెల్లూరు జిల్లాలో బంద్‌ విజయవంతం అయింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పలు పార్టీల నేతలు రోడ్డెక్కారు. వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు..  
నిరసనకారుల నినాదాలతో హోరెత్తిన ఏలూరు పట్టణం
వామపక్షాల ఆందోళనలతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణం నిరసనకారుల నినాదాలతో హోరెత్తింది. బంద్‌ సందర్భంగా ఏలూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అడ్డుకున్నారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, టీడీపీ ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేసిందని పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ప్రతిపక్ష వైసీపీ విమర్శించింది. బంద్‌ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, నేతలు బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమై ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.  
పాలకొల్లులో వైసీపీ నిర్వహించిన బంద్‌ విజయవంతం 
పాలకొల్లులో వైసీపీ నిర్వహించిన బంద్‌ విజయవంతం అయింది. బంద్‌ సందర్భంగా పలు వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.  స్థానిక గాంధీ బొమ్మల సెంటర్‌లో ఆందోళన నిర్వహిస్తున్న వామపక్ష కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీష్‌ స్టేషన్‌కు తరలించారు. ఓటుకు నోటు కేసులో అరెస్టవ్వకుండా ఉండేందుకే చంద్రబాబు బీజీపీ ప్రభుత్వం లాలూచీ పడుతున్నాడని ఈసందర్భంగా వామపక్ష నేతలు విమర్శించారు. 
 జంగారెడ్డిగూడెంలో వామపక్షాల బైక్ ర్యాలీ
అటు జంగారెడ్డిగూడెంలోనూ వైసీపీ, సీపీఎం, సీపీఐఎంఎల్‌, సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.  పలు విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్చంధంగా మూతపడ్డాయి. జంగారెడ్డి గూడెంలోని చౌరస్తా వద్ద ప్రతిపక్ష, వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున మానవహారం నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టీల కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 
ప్రకాశం జిల్లాలో ప్రత్యేక హోదా కోసం బంద్‌ 
ప్రకాశం జిల్లాలో ప్రత్యేక హోదా కోసం బంద్‌ నిర్వహిస్తున్న వైసీపీ, సీపీఐ నేతలు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బస్సు డిపో వద్ద ముందస్తు జాగ్రత్తగా పోలీసుల్ని మోహరించి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. గిద్దలూరులో బంద్‌ నిర్వహిస్తున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీష్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఇంకొల్లులో బంద్‌ సంపూర్ణం అయింది. బంద్‌ సందర్భంగా పలు దుకాణాలు మూసివేశారు. నిరసన తెలిపేందుకు వచ్చిన వైసీపీ నేత భరత్‌ను, కార్యకర్తలను అరెస్ట్‌ చేసి పోలీష్‌ స్టేషన్‌కు తరలించారు. 
శ్రీకాకుళం జిల్లాలో అరెస్ట్ లు 
శ్రీకాకుళం జిల్లాలో విపక్షాలు చేపట్టిన బంద్ లో పెద్ద ఎత్తున అరెస్ట్ లకు దారితీసింది. బంద్‌ సందర్భంగా వైసీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, సీఐటీయూ నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని స్థానిక నేతలు ఆరోపించారు. 
గుంటూరు జిల్లాలో నిరసనలు  
అటు గుంటూరు జిల్లాలో నిరసనలు  పెల్లుబికాయి. ఏపీ బంద్‌లో భాగంగా వామపక్షాలతోపాటు వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు.  తాడేపల్లిలో వైసీపీ, వామపక్షాలు నిర్వహించిన బంద్‌ సంపూర్ణం అయింది. ఓటుకు నోటు కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని వైసీపీ నేతలు, కార్యకర్తలు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. చిలకలూరిపేటలో సీపీఎం, సీపీఐ, వైసీపీ మిత్రపక్షాలు బంద్‌ నిర్వహించారు.  స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నిరసన తెలుపుతున్న ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు పిడుగురాళ్లలో వామపక్షాలతో పాటు ప్రతిపక్ష వైసీపీ నేతలు, కార్యకర్తలు బంద్‌ నిర్వహించారు. బంద్‌ సందర్భంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా మూసివేశారు. 
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బంద్‌ 
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బంద్‌ సందర్భంగా ఉద్రిక్త  పరిస్థితులు తలెత్తాయి. నగరంలో బంద్ లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి ఠాణాలకు తరలించారు.  అటు రంపచోడవరంలో బంద్‌ సంపూర్ణం అయింది. బంద్‌ సందర్భంగా పలు వ్యాపార సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. వివిధ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులను ఏజెన్సీ ప్రాంతంలో నిలిపివేశారు. 
రాయలసీమ జిల్లాలో విజయవంతం
ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించకపోవడంపై విపక్షాలు పిలుపునిచ్చిన బంద్ రాయలసీమ జిల్లాలో విజయవంతమైంది. బంద్‌లో భాగంగా సీపీఎం, వైసీపీ, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. డిపోల ముందు బైఠాయించి.. బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. వాణిజ్య, విద్యాసంస్థలు కూడా స్వచ్ఛందంగా మద్దతివ్వడంతో... బంద్ విజయవంతమైంది. 

19:45 - September 10, 2016

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికర అంశాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో తన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. తన వివాహం..రాజకీయం జీవితంలోని అంశాలను పంచుకున్నారు. తన 23వ ఏటనే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి సిద్ధమయ్యానని..పోటీకి వయస్సు సరిపోదని తనకు అప్పట్లో తెలీదని చిరునవ్వుతో చెప్పారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా పోటీచేసిన నెగ్గానని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కేబినెట్ లోకి తీసుకోమని అడిగాననీ..ఆ తరువాత టి.అంజయ్య కేబినెట్ లో అవకాశం వచ్చిందన్నారు. ఎన్టీఆర్ నటించిన అనురాగ దేవత షూటింగ్ లో జయకృష్ణ పరియచంతో ఎన్టీఆర్ ను కలిశానన్నారు. అప్పుడే రాజకీయాల్లో రమ్మని ఎన్టీఆర్ ను కోరాననీ..అందుకు ఎన్టీఆర్ తన 60 ఏళ్ళ తరువాత ప్రజలకు తన జీవితాన్ని అంకింత చేస్తానని చెప్పారన్నారు. ఆ సమయంలో గుజరాత్ కు ముఖ్యమంత్రిగా వున్న మోదీని రాజీనామా చేయమని కోరాననీ...అలా ఎందుకు కోరాల్సివచ్చిందో మోదీకి తరువాత వివరించానన్నారు. పాచిపోయిన లడ్డులాంటి పాకేజీని ఇచ్చారన్న పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పాచిపోయినవి తీసుకుని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీడనని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోను- చంద్రబాబు
రాష్ట్ర ప్రయోజనాల కోసం రిక్షాపుల్లర్‌ సలహాఇచ్చినా పాటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విషయంలో ఎవరెన్ని విమర్శించినా రాజీపడబోనని బాబు స్పష్టం చేశారు. స్పెషల్‌ స్టేటస్‌పై ప్రజల్లో అనవసర ఆందోళనలు పెంచొద్దని విపక్షాలకు ఆయన సూచించారు.

ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు : బాబు
హైదరాబాద్‌లో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 1980లో మొదటిసారి అసెంబ్లీలోకి ప్రవేశించానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. చివరిసారి అసెంబ్లీ ప్రాంగణమంతా చూశానని.. తనతో కొందరు ఫొటోలు దిగారన్నారు చంద్రబాబు

నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న చంద్రబాబు
శాసనమండలి సమావేశల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సభా భవనం మొత్తం కలియతిరిగారు. ఇవే చివరి సమావేశాలేమో అని మండలిలో ప్రసంగించిన బాబు..అసెంబ్లీహాలుతోనూ తన అనుబంధాన్ని పాతజ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సహచరులతో కలిసి ఫోటోలు దిగారు.

చంద్రబాబు జీవితంలో ఆసక్తికర అంశాలు..

హైదరాబాద్ : మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబు సరదగా చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో తన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. తన వివాహం..రాజకీయం జీవితంలోని అంశాలను పంచుకున్నారు. తన 23వ ఏటనే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి సిద్ధమయ్యానని..పోటీకి వయస్సు సరిపోదని తనకు అప్పట్లో తెలీదని చిరునవ్వుతో చెప్పారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా పోటీచేసిన నెగ్గానని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కేబినెట్ లోకి తీసుకోమని అడిగాననీ..ఆ తరువాత టి.అంజయ్య కేబినెట్ లో అవకాశం వచ్చిందన్నారు.

19:22 - September 10, 2016
19:19 - September 10, 2016

ఖమ్మం : పన్నెండేళ్లు వచ్చినా ఆమె పసిపాపే. ఆడుతూ..పాడుతూ.. గంతులేయాల్సిన వయస్సులో మంచానికే పరిమితమైంది. ఇప్పటికీ తనంతట తాను తినలేని, కదల్లేని దయనీయ దుస్థితి ఆమెది. రెక్కాడితే డొక్కాడని ఆ పేదింట్లో.. ఆ అమ్మాయికి వచ్చిన మాయదారి జబ్బు మిగిల్చిన వేదన అంతా ఇంతా కాదు. తమ పాపను కాపాడుకునేందుకు ఆమె తల్లిదండ్రులు పడని పాట్లు లేవు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పాపకు ప్రాణభిక్ష పెట్టాలని.. వైద్యం కోసం వదాన్యులు ఆర్థిక సాయం చేయాలని ఆ నిరుపేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

చిట్టితల్లికి తీరని కష్టం..
అమాయకంగా కనిపిస్తున్న ఈ పాప పేరు అక్షయ. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గంటా నాగేశ్వరరావు, రాణిల ముగ్గురు పిల్లల్లో.. తొలి సంతానం. అక్షయకు ఇప్పుడు పన్నెండేళ్లు. 2005లో జన్మించిన ఈ చిన్నారికి ఏడాది గడిచినా ఎలాంటి ఎదుగుదల లేకపోవడంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించారు. పాప మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతుందని, మెదడులోని నరాలకు జబ్బు రావడం వల్ల పాప ఎదుగుదల ఆగిపోయిందని వైద్యులు తేల్చి చెప్పారు.

వైద్యానికి రూ.5లక్షల ఖర్చు..
వైద్యం కోసం పాపను అనేక ఆసుపత్రులకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఇప్పటికే ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేదు. విజయవాడ, హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో చూపించి డాక్టర్లు ఇచ్చిన మందులు వేస్తున్నా... పాపలో ఎలాంటి ఎదుగుదల లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. పాప ఇప్పటికీ తన పని తాను చేసుకోలేని ధీనావస్థ. కనీసం కూర్చోలేదు.. లేవలేదు.. నించోలేదు. మంచానికే పరిమితమైన అక్షయకు అన్ని పనులు తల్లిదండ్రులే దగ్గరుండి చేయాల్సిన దైన్యమైన పరిస్థితి. బెంగళూరులో వైద్యుల వద్దకు తీసుకెళితే.. పాపకు ఆపరేషన్‌ చేయాలని, కనీసం 6 లక్షలు ఖర్చవుతుందని చెప్పారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మెదడుకు ఆపరేషన్‌ చేస్తే ఫలితం ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారని చెబుతున్నారు.

దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్ళదీస్తున్న తల్లిదండ్రులు
చిన్నారికి ప్రతిరోజు తల్లే అన్నం తినిపిస్తోంది. తోటి పిల్లలు చెంగుచెంగునా తిరుగుతూ ఆడుకుంటుంటే... తన బిడ్డ పరిస్థితి చూసి ఈ తల్లి తల్లడిల్లని క్షణం లేదు. అందరు పిల్లల్లాగా తన చిట్టితల్లి ఎటూ కదల్లేని స్థితిలో ఉండటం బాధిస్తోందని అక్షయ తల్లి రాణి రోదిస్తోంది. నిరుపేదలైన తమకు వైద్యం చేయించే స్థోమత లేదని, దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్ళదీస్తూ వస్తున్నామని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ భారమైన ఈ తల్లిదండ్రులకు ఉదారవాదులు చేయూత నివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్ద మనసు చేసుకుని తమ పాపకు ప్రాణబిక్ష పెట్టాలని కోరుతున్నారు.

దాతలు సంప్రదించాల్సిన నం : 96030 45263,ఎస్‌బీసీ ఖాతా నెంబర్‌ 30642 939898, IFSC code SBIN0005817 
అక్షయకు ఆర్థిక సాయం అందించాలనుకునే దాతలు గంటా నాగేశ్వరరావు, వెంకటాపురం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా చిరునామాలో సంప్రదించవచ్చు. సెల్‌ నెంబర్‌ 96030 45263 అలాగే ఎస్‌బీఐ ఖాతా ద్వారా ఆర్థిక సాయం అందజేయవచ్చు. ఎస్‌బీసీ ఖాతా నెంబర్‌ 30642 939898, IFSC code SBIN0005817 ఖాతాలో డిపాజిట్‌ చేయవచ్చు. 

19:12 - September 10, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన దృశ్యాలను ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాస్ మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుమతితో అసెంబ్లీ దృశ్యాలను మీడియాకు విడుదల చేసినట్లు కాల్వ పేర్కొన్నారు. ప్రజాస్వామ్రాన్ని ప్రతిపక్ష ఖూనీ చేసిందన్నారు. బూటుకాళ్ళతో స్పీకర్ సెక్రటరీ బెంచ్ లు ఎక్కి..స్పీకర్ మైక్ ను లాగేసి..మార్షల్స్ తో దురుసుగా ప్రవర్తించి ఇలా ప్రతిపక్ష వైసీపీ సభ్యులు అసెంబ్లీలో చేసిన దౌర్జన్యాలు అసెంబ్లీ చరిత్రలో లేవని పేర్కొన్నారు. ప్రజలే ప్రతిపక్షానికి సరైన బుద్ధి చెబుతారనీ..ఇటువంటి ప్రతిపక్షం వుండటం దురదృష్టకరమన్నారు. సభలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు రౌడీలను, గూండాలను తలపిస్తోందన్నారు. మూడు రోజులపాటు జరిగిన నిరసనల వీడియోలను ప్రివిలేజ్ కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. ఈ అంశంపై ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశముందని తెలిపారు. ప్రతిపక్ష సభ్యుల తీరుపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ని కోరుతున్నామని పేర్కొన్నారు. 

19:09 - September 10, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో ఎంబీబీఎస్,బీడీఎస్ కోర్సులకు సీట్ల భర్తీ చేసేందుకు ఈనెల 11వ తేదీన నిర్వహించే ఎంసెట్-3కి జేఎన్టీయూ హైదరాబాద్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎంసెట్-2 పేపర్ లీకేజి నేపథ్యంలో ఈసారి ఎంసెట్-3 పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. పేపర్‌ లేకేజీకి ఆస్కారం లేకుండా నిఘా నీడలో పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. గంట ముందే పరీక్ష హాల్లోకి అనుమతించే విధంగా అధికారులు సర్వం సిద్ధం చేసారు. వన్‌ మినిట్‌ లేట్‌ నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తామని అధికారులు చెప్తున్నారు.

ఎంసెట్‌-3కి సర్వం సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్,బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్-3కి సర్వం సిద్ధం చేసింది జేఎన్టీయూ హైదరాబాద్‌. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటవరకు రాతపరీక్షను నిర్వహించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని 12 ప్రధాన నగరాల్లో 96 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంసెట్‌-3కి మొత్తం 56వేల 153మంది అభ్యర్ధులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే నిర్వహించిన ఎంసెట్-2 పేపర్‌ లీక్‌ కావడంతో మరోసారి పరీక్ష నిర్వహిస్తున్న ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే బ్రోకర్లు, కోచింగ్‌ సెంటర్లు, కార్పొరేట్‌ కాలేజీలపై ప్రత్యేక నిఘా కూడా పెట్టారు. విద్యార్థుల కదలికలను కూడా పోలీసులు గమనిస్తున్నారు. ఎసెంట్‌-3లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.

ఎంసెట్‌-3 కి పటిష్టమైన చర్యలు
ఎంసెట్‌-3లో మాల్ ప్రాక్టీస్‌కి తావు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఈసారి బయోమెట్రిక్‌ విధానం ఉండడం వల్ల విద్యార్ధులంతా పరీక్షా కేంద్రాల్లోకి గంట ముందే చేరుకోవాలని పాపిరెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఇక అభ్యర్థులు చేతి గడియారాలు, ఎలక్ర్టానిక్‌ వస్తువులు, సెల్‌ఫోన్లు వంటివి తీసుకురాకుండా నిషేధం విధించారు. అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా నిరంతరం సమయం తెలుసుకునేందుకు పరీక్షా కేంద్రాలన్నింటిలో గోడ గడియారాలను ఏర్పాటు చేశారు. విద్యార్ధులు ఒక్క నిమిషం ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నా హాల్లోకి అనుమతించేది లేదని పాపిరెడ్డి స్పష్టం చేశారు.

ఈసారి బయోమెట్రిక్‌ విధానం
ఎంసెట్‌-3 ప్రాథమిక సోమవారం విడుదల చేయనున్నారు. ఇక పరీక్ష ఫలితాలను ఈనెల 15న విడుదల చేయడానికి జేఎన్టీయూ  ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 30వరకు వీలైనంత వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ ఒక కొలిక్కి తేచ్చేందుకు ప్రయత్నం చేస్తామని..లేనిపక్షంలో గడువు కోసం కోర్టుకు వెళతామని పాపిరెడ్డి అన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆయన తెలిపారు. 

19:01 - September 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ సామాజిక, సమగ్రఅభివృద్ధి సాధనకై మహాజన పాదయాత్ర చేపడుతున్నట్టు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. అక్టోబర్‌ 17నుంచి 2017 మార్చినెల వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారి ఆకాంక్షలను చాటుతూ.. ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజలముందు ఉంచుతామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 4వేల కిలోమీటర్ల పాదయాత్రను చేపడుతున్నట్టు తమ్మినేని తెలిపారు. హైదరాబాద్‌లోని బీసీ సాధికారత భవన్‌లో జరిగిన చర్చాగోష్టిలో తమ్మినేని మాట్లాడారు. 

18:58 - September 10, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టి యాభై రోజులు పూర్తవుతుందన్న సందర్భంగా 14వ తేదీన భూసేకరణపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని కాంగ్రెస్ నేత మల్లురవి తెలిపారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. రైతులకు సంఘీభవంగా గద్వేల్‌లో ఈ నెల12న సభను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 

16:51 - September 10, 2016

విశాఖ : ధర్నాలు.. రాస్తారోకోలు.. ప్రదర్శనలు..అరెస్టులతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టం స్తంభించింది. ప్రత్యేక హోదా కావాలంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన ఏపీ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. రవాణా వ్యవస్థ  స్తంభించింది. వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. విశాఖలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగుతోంది.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేపట్టారు.. పూర్తి వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

16:47 - September 10, 2016

పశ్చిమగోదావరి : నర్సాపురంలోని తొండూరు గ్రామంలో పోలీసులు రెచ్చిపోయారు. గ్రామంలో ఉన్న ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేసిన గ్రామస్తులు, సీపీఎం కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారు. లాఠీచార్జీలో పలువురికు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం నిరసనకారులను నర్సాపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

16:45 - September 10, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్‌మ్మోహన్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని మంత్రి పీతల సుజాత అన్నారు. జగన్ కాలకేయలాగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మహిళ సభ్యులను అడ్డుపెట్టుకుని అసెంబ్లీలోని మహిళా మార్షల్స్ మీద దాడి చేయించడం దారుణమంటున్నారు. మహిళా ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకుని జగన్ అసెంబ్లీలోనూ..మీడియా పాయింట్ వద్ద వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ఏపీకి అభివృద్ది పథంలో నడిపించటానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తుంటే అడ్డుకోవటానికి వైసీపీ యత్నింస్తోందని విమర్శించారు. 

గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఏర్పాట్లు..

హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈమేరకు కమిషన్ సభ్యుడు విఠల్ మాట్లాడుతూ పరీక్ష నిర్వహణ కోసం పటిష్ట ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఈనెల 13 నుంచి 23 వరకు మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. ఈమేరకు పరీక్ష ఏర్పాట్లపై విఠల్ అధికారులతో సమీక్ష జరిపారు. పరీక్ష కోసం ఏర్పాట్లు చేస్తోన్న అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

జనసేనాని ఔదార్యం..

హైదరాబాద్ : శుక్రవారం కాకినాడలో జరిగిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వెంకటరమణ కుటుంబానికి, జనసేన అధ్యక్షుడు పవన్ రూ. 5 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తన అభిమాని వెంకటరమణ మృతి తీవ్రంగా కలచి వేసిందని పవన్‌కల్యాణ్‌ అన్నారు. తన వల్ల ఎవరూ నష్టపోవడం ఇష్టం ఉండదని పవన్ చెప్పారు. ఉద్యమానికి వేరే మార్గాన్ని ఆలోచిస్తానని పవన్‌కల్యాణ్ తెలిపారు. సభల్లో కార్యకర్తలు ప్రమాదాల బారిన పడి మృతి చెందడంతో పవన్ కల్యాణ్ ఎంతో ఆవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బహిరంగ సభలు రద్దు చేసుకునే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్లు సమాచారం.

16:29 - September 10, 2016

తూర్పుగోదావరి : కాకినాడ వేదికగా జనసేనాని గర్జించారు.. ప్రత్యేకహోదాపై మాటతప్పితే అంతచూస్తామని హెచ్చరించారు. చేతకాకుంటే చెప్పండి.. తమ జనసేన రంగంలోకి దిగుతుందని అధికార, ప్రతిపక్షాలకు సవాల్‌విసిరారు. ఆత్మగౌరవసభలో స్పెషల్‌ స్టేటస్‌ కోసం గర్జన చేసిన పవన్.. విపక్షాలపై పలు ప్రశ్నలు సంధించారు. ప్రధాని మోదీ అచ్చేదిన్ నినాదానికి ఇది జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కౌంటర్‌. కాకినాడలో గర్జన గట్టిగానే వినిపించారు. ఏపీకి ఎంతో చేస్తామని రెండు పాచిపోయిన లడ్డూలను చేతిలోపెట్టి సరిపెడతారా? సీమాంధ్రులకు పౌరుషం, ధైర్యం లేదనుకుంటున్నారా? అంటూ మొదలుపెట్టిన పవన్ ప్రసంగం మలుపులు తిరిగింది. ఎంపీలు పోరాడలేకపోతే అప్పుడే రోడ్డెక్కుతానన్న పవన్ కేంద్రమంత్రి వెంకయ్యకు చురకలు అంటించారు. మరింత సమాచారానికి ఈ వీడియో క్లిక్ చేయండి..

16:02 - September 10, 2016

గుజరాత్‌ : భావ్‌నగర్‌లో దారుణం జరిగింది. 8 మంది యువకులు ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన సిసిటివిలో రికార్డ్ అయింది. కింద పడిన ఆ వ్యక్తికి విచక్షణా రహితంగా కొట్టడంతో అతడు మృతి చెందాడు. పోలీసుల కథనం బాధితుడైన కూరగాయల వ్యాపారి రఫిక్‌ హుసేన్‌ తానుండే ప్రాంతంలో 25 లక్షలకు ఓ ఇల్లు కొన్నాడు. కొందరు యువకులు డబ్బులివ్వాలని రఫిక్‌ను బలవంతం చేశారు. డబ్బులిచ్చేందుకు రఫిక్‌ నిరాకరించడంతో కోపోద్రిక్తులైన యువకులు ఇలా కొట్టి చంపారు. నిందితులను గుర్తించామని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు.

15:57 - September 10, 2016

నెల్లూరు : ధర్నాలు.. రాస్తారోకోలు.. ప్రదర్శనలు..అరెస్టులతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టం స్తంభించింది. ప్రత్యేక హోదా కావాలంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన ఏపీ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. రవాణా వ్యవస్త స్తంభించింది. వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. రోడ్లపై బైఠాయించిన కాంగ్రెస్‌, లెఫ్ట్ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెల్లూరు జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పలు పార్టీల నేతలు రోడ్డెక్కారు.. వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీని ఆహ్వానిస్తున్నాడని వామపక్ష నేతలనే విమర్శించారు. ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకూ తమ ఆందోళనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. 

15:54 - September 10, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కోసం ప్రజాప్రతినిధులు పోరాటం చేయాలని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మరోసారి స్పష్టం చేశారు. అవసరమైతే రాజీనామా చేసి హోదా కోసం పోరాడాలని పవన్‌ అన్నారు. ఉద్యమం పట్ల తనకు స్పష్టమైన వైఖరి ఉందన్నారు పవన్‌కల్యాణ్‌. 

15:51 - September 10, 2016

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ప్యాకేజీని గుడ్డిగా వ్యతిరేకించడం అర్థరహితమని వ్యాఖ్యానించారు. ఇటువంటి వారికి తాను సమాధానం చెప్పాల్సిన పనిలేదన్నారు. రాష్ట్ర దీర్ఘకాల ప్రయోజనాల కోసమే ప్యాకేజీ ప్రకటించామని చెప్పారు. 

పీఎస్ లో పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు..

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హైదరాబాదులోని నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఓ పిర్యాదు నమోదయ్యింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ‘సీమాంధ్రుల ఆత్మగౌరవం సభ’ పేరిట నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ... పవన్ కల్యాణ్ పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

15:20 - September 10, 2016

హైదరాబాద్ : హైదరాబాద్ లో ఇవే చివరి సమావేశాలు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ శాసనమండలిలో ఏపీ సీఎం తన పాత జ్ఞాపకాలను నెవరువేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...హైదరాబాద్ లో ఇవే చివరి సమావేశాలు కావచ్చు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత బ్లాకులన్నీ ఒక్కసారి కలియతిరిగి చూసుకున్నానని చిన్నపాటి ఉద్వేగానికి లోనయ్యారు. 1980లో శాసనమండలికి వచ్చానని ఈసందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ 38ఏళ్ళలో చాలా సమస్యలను పరిష్కరించగలిగామన్నారు. తెలుగు జాతికి గొప్ప రాజధాని వుండాలని హైదరాబాద్ ను డెవలప్ చేశారన్నారు.దానికోసం ఎంతో కృషి చేశానన్నారు చంద్రబాబు. ఇప్పుడు హైటెక్‌ సిటీ చూస్తుంటే సంతోషం వేస్తుందన్నారు. చివరిసారి అసెంబ్లీ ప్రాంగణమంతా చూశానని.. తనతో కొందరు ఫొటోలు దిగారన్నారు చంద్రబాబు హైదరాబాద్ లో హైటెక్ సిటీ చూస్తూ ఆనందంగా వుంటుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో విద్యుత్ కొరతలు లేకుండా చేశామన్నారు. తోటపల్లి ప్రాజెక్టు పూర్తిచేసిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను ఇబ్బందిలేకుండా చేశామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేసానన్నారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనన్నారు. 

15:20 - September 10, 2016

తమన్నా హీరోయిన్ గా చేస్తునే ఛాన్స్ దొరికితే ఐటం సాంగ్స్ తో అదరగొట్టుతుంది. లేటేస్ట్ ఈబ్యూటీ మరో రెండు  ఐటం సాంగ్స్ చేయడానికి ముస్తాబవుతోందట. శృతిహాసన్ కి వచ్చిన ఐటం ఆఫర్ ని మిల్కీ బ్యూటీ చీఫ్ అండ్ బెస్ట్ లో లాగేసుకుందట. ఇంతకీ మిల్కీ చేస్తున్న ఆ ఐటం సాంగ్స్ ఏంటో ఈ వార్త చదవండి..

ప్రస్తుతం మిల్కీ బ్యూటీ కెరీర్ పీక్ స్టేజ్ లో రన్ అవుతోంది. వరుసగా హ్యట్రిక్ హిట్స్ అందుకున్న తమన్నా ఛాన్స్ దొరికితే ఐటం సాంగ్స్ తో కేక పెట్టిస్తోంది. అల్లుడు శ్రీనుతో ఐటం బ్యూటీ అవతారం ఎత్తిన మిల్కీ ఆ తరువాత ఇదే హీరో చేసిన స్పీడున్నోడు కోసం మరో ఐటం సాంగ్ చేసి అలరించింది. కొత్తగా మరో రెండు బిగ్ మూవీస్ లో తమన్నా ఐటం సాంగ్స్ లో అందాల ప్రదర్శన చేయబోతుందట.

ఐటం సాంగ్స్ కి సంబంధించి రెమ్యూనరేషన్ విషయంలో తమన్నా పెద్దగా బెట్టు చేయడం లేదు. ఇదే అంశం ఈ బ్యూటీ బాగా కలిసొస్తుంది. ఇచ్చిన అమౌంట్ తీసుకుని ఐటం నంబర్ లో ఆడిపాడటానికి మిల్కీ బ్యూటీ ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదు. లేటేస్ట్ గా   కన్నడ మూవీ జాగ్వార్ లో తమన్నా ఐటం సాంగ్ చేయబోతుంది. 

నిజానికి జాగ్వార్ సినిమాలో ఐటం సాంగ్ కోసం ముందు శృతిహాసన్ ని అడిగారు. కానీ శృతి 1 కోటి ఇస్తే కాని సాంగ్ చేయను అనేసిందట. దీంతో మిల్కీని సంప్రదిస్తే కేవలం 25 లక్షలకు ఐటం సాంగ్ చేయడానికి ఒప్పేసుకుందట. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఖైదీనెంబర్ 150లో సైతం ఈ బ్యూటీ ఐటం బ్యూటీగా మురిపించబోతున్నట్లు సమాచారం. తమన్నా వాలకం చూస్తుంటే అందినకాడికి మనీ పొగేసుకోవాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది.

15:16 - September 10, 2016


యంగ్ హీరో నిఖిల్ ఆ మూవీ సీక్వెల్ ని ఒకే చేశాడు. ప్రస్తుతం కొత్త సినిమాతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో త్వరలోనే సీక్వెల్ ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. తన కెరీర్ ని మార్చేసిన ఆ మూవీ సీక్వెల్ నిఖిల్ మరో భారీ సక్సెస్ కొట్టాలని భావిస్తున్నాడు. ఇంతకీ ఈ హీరో ఏ మూవీకి రెండో భాగం చేస్తున్నాడో ఏంటో స్టోరీ చదవండి.

వరుసగా సక్సెస్ లతో దూసుకుపోతున్న ఉన్న నిఖిల్ కి శంకరాభరణం మూవీ స్పీడ్ బ్రేక్స్ వేసింది. ఈ మూవీ ప్లాప్స్ తో ఖంగుతిన్న ఈ యంగ్ బాయ్ కొత్త సినిమా కోసం గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం నిఖిల్ ఎక్కడికిపోతావు చిన్నవాడా అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దగ్గరపడింది.దీంతో ఈ యంగ్ హీరో తన సూపర్ హిట్టు మూవీకి సీక్వెల్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

నిఖిల్ కెరీర్ ఎండ్ స్టేజ్ చేరిన టైంలో వచ్చిన స్వామిరారా చిత్రం ఈ హీరో కెరీర్ ని మలుపుతిప్పింది. సుధీర్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి ఇప్పుడు రెండో భాగం ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ కి కూడా సుధీర్ వర్మనే దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లుతున్నాట్లు సమాచారం.
 

15:12 - September 10, 2016

నేచురల్ స్టార్ నాని జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. ఈ ఎడాది ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేసిన ఈ హీరో మరో రెండు సినిమాలు రిలీజ్ చేయబోతుండడం విశేషం. మజ్నుగా త్వరలో రాబోతున్న నాని నేను లోకల్ మూవీ కూడా ఎడాదే రిలీజ్ చేయబోతున్నాడు. మరి ఈ మూవీస్ రిలీజింగ్ డేట్స్ ఎప్పుడో తెలుసుకుందాం..

నేచురల్ స్టార్ నాని స్పీడ్ తో దూసుకుపోతున్నాడు .హీరోలు  ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేసేందుకే నానా తంటాలు పడుతున్నారు. కానీ నాని మాత్రం అందుకు భిన్నంగా సినిమాల మీద సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఎడాది ఫిబ్రవరిలో కృష్ణగాడి వీరప్రేమ గాథతో నవ్వించిన నాని జూలైలో జెంటిల్ మేన్ తో వావ్ అనిపించాడు. ఇప్పుడు మజ్నుతో రెడీగా ఉన్నాడు.
మజ్నుగా  నాని సెప్టెంబర్ 22న ఆడియన్స్ ముందుకు రానున్నాడు. సినిమా చూపిస్త మామా ఫేమ్ త్రినాథ రావు డైరెక్షన్ లో నాని నటిస్తున్న నేను లోకల్ సినిమా షూటింగ్ 50శాతానికి పైగా పూర్తయిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా  ఎడాదిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.  

నేను లోకల్ సినిమాను క్రిస్మస్ ఫెస్టివల్ కి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ చివరి వరకు షూటింగ్ ఫినిష్ చేసి నవంబర్ లో ఎడిటింగ్ ఇతర పనులు కంప్లీట్ చేసి డిసెంబర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఆగస్ట్ లో మొదలైన ఈ మూవీ షూటింగ్ కేవలం నెల రోజుల్లో హాఫ్ పార్ట్ కంప్లీటైందంటే నాని ఏ రేంజ్ లో స్పీడ్ గా ఉన్నాడో తెలుస్తోంది.  ఇతర హీరోలు ఎడాదికి ఒక్క సినిమా చేయడానికే  నానా తంటాలు పడుతున్నారు. కానీ మాత్రం పక్కా ప్లాన్ ఇలా నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఎంతైనా నాని ప్లానింగ్ సూపర్ అనాల్సిందే.

15:08 - September 10, 2016

స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్ న్యూ మూవీ దువ్వాడ జగన్నాథమ్ ఈ మధ్యే ముహుర్తం జరుపుకుంది. ఇంకా షూటింగ్ స్టార్ట్ కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేయడం విశేషం.ఈ కొత్త మూవీ రిలీజ్ డేట్ విషయంలో బన్నీ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్లు వినికిడి. మరి దువ్వాడ జగన్నాథమ్ ఆడియన్స్ ముందుకి ఎప్పుడు రానున్నాడో ఓ లుక్కేద్దాం.

సరైనోడు సినిమాతో అల్లుఅర్జున్ బాక్సఫీసు వద్ద కలెక్షన్ల మోత మోగించాడు. ఈ సినిమా సక్సెస్ తో స్టార్ గా బన్నీ రేంజ్ మరింత హెట్స్ కి వెళ్లింది. ఇప్పటి వరకు క్లాస్ టచ్ ఉండే మాస్ పాత్రలు  చేసిన అల్లుఅర్జున్ సరైనోడు మూవీ లో మాత్రం ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ మాస్ లో అదరగొట్టాడు. ఈ భారీ సక్సెస్ ని మిస్ యూజ్ చేసుకోవద్దనే ఉద్దేశ్యంతో బన్నీ కొత్త సినిమా విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు.

దువ్వాడ జగన్నాథమ్ హరీశ్ శంకర్ డైరెక్షన్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇంకా షూటింగ్ కి కూడా వెళ్లని ఈ చిత్రానికి ఓ సెంటిమెంట్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. సరైనోడు ఫిబ్రవరిలో వచ్చి భారీ హిట్టు అందుకుంది. ఈ సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకునే దువ్వాడ జగన్నాథమ్ చిత్రాన్ని కూడా వచ్చే ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని యూనిట్ ఫిక్స్ అయింది.

దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో బన్నీకి జోడిగా పూజాహెగ్డే నటిస్తోంది. ఈ బ్యూటీ బాలీవుడ్ ప్లాన్స్ బెడిసికొట్టడంతో మళ్లీ టాలీవుడ్ వైపు టర్న్ తీసుకుంది.బన్నీ అయిన తన ఫేట్ మారుస్తాడేమోనని ఈ తెలుగు గోపికమ్మ ఆశపెట్టుకుంది. ఇక మెగా హీరోలతో హరీశ్ శంకర్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. పవన్ తో గబ్బర్ సింగ్, సాయిధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో హిట్స్ కొట్టిన హరీశ్ శంకర్ బన్నీతో కూడా అలాంటి హిట్టుని రిపీట్ చేయాలని భావిస్తున్నాడు.

వెలిగొండ ప్రాజెక్టు బాధ్యత నాదే : చంద్రబాబు

హైదరాబాద్ : ఏపీ శాసనమండలిలో సీఎం తన పాత జ్ఞాపకాలను నెవరువేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్ లో ఇవే చివరి సమావేశాలు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శాసనమండలి సభలో మాట్లాడుతున్న సందర్భంగా ఈవిషయాన్ని ప్రస్తావించారు. 1980లో శాసనమండలికి వాచ్చనని ఈసందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ 38ఏళ్ళలో చాలా సమస్యలను పరిష్కరించగలిగామన్నారు. తెలుగు జాతికి బ్రహ్మాండమైన రాజధాని ఉండాలని హైదరాబాద్ లో హైటెక్ సిటీ చూస్తూ ఆనందంగా వుంటుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో విద్యుత్ కొరతలు లేకుండా చేశామన్నారు.

చాకలి ఐలమ్మ వర్ధంతి ..

నల్లగొండ: తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడలో చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి జగదీష్‌రెడ్డి నివాళులర్పించారు. ఐలమ్మ జ్ఞాపకార్థం నిర్వహించిన క్రీడలను ఆయన ప్రారంభించారు.

రేపు ఎంసెట్ పరీక్షకు ఏర్పాట్లు..

హైదరాబాద్: ఎంసెట్ పరీక్ష నిర్వహణ కోసం అధికారులు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు కన్వీనర్ యాదయ్య వెల్లడించారు. శనివారం సాయంత్రానికి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు అభ్యర్థులకు సూచించారు. పాత హాల్ టికెట్లతో పరీక్ష హాల్‌లోకి అనుమతి ఉండదని కన్వీనర్ వెల్లడించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా హాల్‌లోకి అనుమతించబోమని హెచ్చరించారు.

కశ్మీర్ లో మరోసారి అల్లర్లు..

జమ్మూ కశ్మీర్: ఉగ్రవాది బుర్హనుద్దీన్ వని ఎన్‌కౌంటర్ తర్వాత చెలరేగిన అల్లర్లు కార్చిచ్చులా వ్యాపిస్తూనే ఉన్నాయి. ఈమేరకు ఇవాళ షోఫియాన్‌లో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఉధ్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక ఆందోళనకారుడు మృతిచెందాడు. ఈ దుర్ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ స్పందిస్తూ.. రాళ్లు విసురుకున్న ఘటనలో సోఫియాన్‌లో ఒకరు మృతిచెందడం తనకు బాధకలిగించిందన్నారు. ఆందోళనకారుని మృతిపట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

14:29 - September 10, 2016

హైదరాబాద్ : శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనమండలిలో సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా కరవుపై మాట్లాడారు. హంద్రినీవా ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం తనకు రావడం అదృష్టమని, డిసెంబర్‌లో కుప్పం వరకు నీరు తీసుకెళ్తున్నామని అన్నారు. అనంతపురం జిల్లాలో నీటి కరువు పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతపురంలో ఇప్పటివరకూ గన్స్ నే చూసామనీ..ఇప్పుడు రెయిన్ గన్స్ ద్వారా రైతులకు రెయిన్ గన్స్ ద్వారా రైతులకు సాగు, త్రాగునీరు అందింస్తున్నామని తెలిపారు. ఇన్ పుట్ సబ్సిటీ ఇచ్చి రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు. పంట సంజీవని కింద నరేగా నిధులను వినియోగించుకుంటున్నామన్నారు. 

14:12 - September 10, 2016

పశ్చిమగోదావరి : రాష్ట్ర బంద్ సందర్భంగా ఏలూరులో వామపక్షనేతలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ సర్కార్ పై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు ధ్వజ మెత్తారు. నేతలను అరెస్టు చేయొచ్చేమో గానీ.. ప్రజల కోరికలను అరెస్టు చేయలేరని తెలిపారు. హోదాకు, ప్యాకేజీకి తేడాలేదని చెబుతున్న బాబు ఆ లెక్కలేమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 

 

కరెంట్ కోత లేకుండా చేశాం : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : కరెంట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో కరెంట్ కోత లేకుండా చేశామని తెలిపారు. రాష్ట్రాన్ని కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయిన్నారు. 1980సం.లో శాసనమండలికి వచ్చానని తెలిపారు. ఈ 38 ఏళ్లలో చాలా సమస్యలు పరిష్కరించగలిగామన్నారు. తెలుగువారికి బ్రహ్మాండమైన రాజధాని ఉండాలని అనుకున్నాను.. హైదరాబాద్ లో హైటెక్ సిటీని చూస్తే ఆనందంగా ఉంటుందన్నారు.  

13:56 - September 10, 2016

హైదరాబాద్ : ఎపికి ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడమని మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. ప్యాకేజీతోపాటు హోదా కోసం పోరాడుతామని చెప్పారు. హోదా కోసం ప్రత్యేక వ్యూహం రచిస్తున్నామని తెలిపారు. హోదా కోసం చూసుకుంటే రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతుందని వివరించారు. రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో ఇచ్చిన ప్యాకేజీ తీసుకోవాలన్నారు. ప్రత్యేకహోదా, ప్యాకేజీ రెండూ మిళితమైన అంశాలని తెలిపారు. 
తమకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదని పేర్కొన్నారు

13:48 - September 10, 2016

కాకినాడ : ఎపికి ప్రత్యేకహోదా కోసం అవసరమైతే రాజీనామాలు చేసి పోరాడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈమేరకు ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడారు. హోదా కోసం ప్రజా ప్రతినిధులు పోరాటం చేయాలని సూచించారు. ఉద్యమం పట్ల తనకు స్పష్టమైన వైఖరి ఉందని తెలిపారు. తన అభిమాని చనిపోవడం బాధాకరమన్నారు. 

13:41 - September 10, 2016

హైదరాబాద్ : నగరంలో ఇవే చివరి సమావేశాలు అనుకుంటున్నామని ఎపి సీఎం చంద్రబాబు అన్నారు. ఎపి శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనమండలి సమావేశాలకు సీఎం హాజరై, ప్రసంగించారు. కరెంట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని తెలిపారు. ఏపీలో కరెంట్ కోత లేకుండా చేశామని తెలిపారు. రాష్ట్రాన్ని కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయిన్నారు. 1980సం.లో శాసనమండలికి వచ్చానని తెలిపారు. ఈ 38 ఏళ్లలో చాలా సమస్యలు పరిష్కరించగలిగామన్నారు. తెలుగువారికి బ్రహ్మాండమైన రాజధాని ఉండాలని అనుకున్నాను.. హైదరాబాద్ లో హైటెక్ సిటీని చూస్తే ఆనందంగా ఉంటుందన్నారు.  

 

కొనసాగుతున్న ఎపి శాసనమండలి సమావేశాలు

హైదరాబాద్ : ఎపి శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు మండలిలో మాట్లాడారు. కరెంట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని తెలిపారు. రాష్ట్రాన్ని కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయిన్నారు. 

కాసేపట్లో కరువుపై సీఎం చంద్రబాబు ప్రకటన

హైదరాబాద్ : కాసేపట్లో సీఎం చంద్రబాబు కరువుపై ఎపి శాసనమండలిలో ప్రకటన చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకోనున్నారు. 

13:17 - September 10, 2016

హైదరాబాద్ : అరెస్టులతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయలేరని... వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈమేరకు టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలు పక్కనబెట్టి స్వార్థపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏపీకి చాలా అన్యాయం జరిగిందని వాపోయారు. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పార్లమెంట్‌లో ప్రకటించారని... ఇప్పుడు కుదరదంటున్నారని పేర్కొన్నారు. ఫైనాన్స్‌ కమిషన్‌కు ప్రత్యేక హోదాకు సబంధంలేదన్నారు. హోదాకోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. టీడీపీకి ప్రజాప్రయోజనాలు అవసరంలేదని విమర్శించారు.

 

13:10 - September 10, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ, వామపక్షనేతలు బంద్‌ కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచే బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ధర్నాలు చేపట్టారు. పలుచోట్ల పలువురిని అరెస్ట్‌ చేశారు. 
విజయవాడలో కొనసాగుతున్న బంద్‌ 
'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు' అంటూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బెజవాడలో వామపక్ష నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న పలువురు నేతలను అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడుతుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అంటున్నారు. 
కాంగ్రెస్‌ నేతలు రాస్తారోకో 
విజయవాడలో ప్రత్యేక హోదా బంద్‌ కొనసాగుతుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ నేతలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
సీపీఐ నేతల భారీ ర్యాలీ
ఏపీ ప్రత్యేక హోదా బంద్‌ విజయవాడలో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా సీపీఐ నాయకులు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వెళ్తూ రోడ్డుపై తెరిచి ఉన్న షాప్‌లను మూసివేయించారు. బంద్‌కు అందరూ సహకరించాల్సిన కోరారు. అయితే ఆందోళన నిర్వహిస్తున్న నాయకులు పోలీసులు అరెస్టు చేశారు. 

12:58 - September 10, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. వైసీపీ సభ్యులు మూడు రోజులుగా సభా కార్య్రమాలను అడ్డుకున్నారు. సభలో ఒక్కరోజు కూడా ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు. ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుపట్టిన వైసీపీ సభ్యులు రభస సృష్టించారు. స్పీకర్‌ పైకి కాగితాలు విసిరారు. అసెంబ్లీ కార్యదర్శి బెంచినీ లాగేసి, సిబ్బందిని పనిచేయనీయకుండా చేశారు. బల్లలపైకి వెళ్లి ఆందోళనచేశారు. దీంతో మూడో రోజు కూడా సభ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు  అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు.
రోజా క్షమాపణ చెబుతూ స్పీకర్‌కు లేఖ 
గతేడాది డిసెంబర్‌ 18న అసెంబ్లీలో జరిగిన ఘటనపై వైపీసీ ఎమ్మెల్యే రోజా భేషరతుగా క్షమాపణ చెబుతూ స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. సస్పెన్షన్‌ను తొలగించాలని కోరారు. దీనిని స్పీకర్‌ కొడెల శివప్రసాదరావు సభ ముందు ఉంచారు.  టీడీపీ ఎమ్మెల్యే అనితను దూషించడంతో  గతేడాది డిసెంబర్‌లో రోజాను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. రోజా లేఖపై సభలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా... ప్రత్యేక హోదాపై వైసీపీ సభ్యుల నిరసనతో సభను నిరవధికంగా వాయిదా వేశారు.
చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా 
చంద్రబాబు సర్కార్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి హోదాను కాపాడుకోవడం కోసం.. ప్రత్యేక హోదాను కేంద్రం కాళ్ల దగ్గర పెట్టడం దురుదృష్టకరమన్నారు. చట్టబద్ధత, కాలపరిమితి లేని ప్యాకేజీ ప్రకటనను బాబు స్వాగతించడం విచారకరమన్నారు. 

 

కరీంనగర్‌ జైలు నుంచి పరారైన ఖైదీలు

కరీంనగర్‌ : జిల్లా జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గోడ దూకి పరారయ్యారు. ఖైదీలు ఇద్దరూ మహారాష్ట్ర గ్యాంగ్‌కు చెందిన ముఠా సభ్యులు యోగేష్‌, జితేందర్లుగా గుర్తించారు. వీరిద్దరిని పోలీసులు పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. 

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు : జగన్

హైదరాబాద్ : ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్రంపై పోరాటం చేయాలని లేని ఎడల తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను బాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబ దిక్కుమాలిన వ్యక్తిని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 

12:30 - September 10, 2016

ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్రంపై పోరాటం చేయాలని లేని ఎడల తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను బాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబ దిక్కుమాలిన వ్యక్తిని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రకటనను స్వాగతిస్తున్నామని చెబుతూ చంద్రబాబు మళ్లీ స్టేట్ మెంట్ ఇస్తామనని చెబుతున్నారని... ఇలాంటి వ్యక్తి 
సీఎంగా ఉండడం దురదృష్ణమన్నారు. ప్రజలకు తోడుగా ఉండి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ప్రతి పార్టీ, ప్రజా సంఘాలు, ప్రజలు తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. రాదనుకున్న తెలంగాణ రాష్ట్రంను కేసీఆర్ సాధించారని.. మనం కూడా ప్రత్యేకహోదా కోసం పోరాటం చేయాలన్నారు. హోదా కోసం అందరూ పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. 

 

12:17 - September 10, 2016

విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో బంద్‌ కొనసాగుతోంది. బెజవాడలో ఉదయం నుంచే వామపక్షాలు బస్సు డిపోల వద్ద బస్సులను అడ్డుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధుతోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

 

ప్రత్యేక ప్యాకేజీలో ఏముందో బయట పెట్టాలి : బివి.రాఘవులు

హైదరాబాద్ : కేంద్రం ఎపికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో ఏముందో సీఎం చంద్రబాబు బయటపెట్టాలని సీపీఎం పొలిట్ బ్యూర్ సభ్యుడు బివి.రాఘవులు అన్నారు. బంద్ ను విచ్చిన్నం చేయడమే బాబు ఉద్దేశమని చెప్పారు.

12:02 - September 10, 2016

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైసీపీ సభ్యులు ధర్నా చేపట్టారు. టీడీపీ దౌర్జన్యానికి పాల్పడుతుందన్నారు. సభలోనే కాకుండా మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. 

 

గాంధీ విగ్రహం వద్ద వైసీపీ సభ్యుల ధర్నా

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద  వైసీపీ సభ్యులు ధర్నా చేపట్టారు. టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. 

11:55 - September 10, 2016
11:52 - September 10, 2016

విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో బంద్‌ కొనసాగుతోంది. బెజవాడలో ఉదయం నుంచే వామపక్షాలు బస్సు డిపోల వద్ద బస్సులను అడ్డుకున్నారు. పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది.. వామపక్షాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు.
విశాఖ జిల్లాలో 
రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కొనసాగుతున్న బంద్‌ అనంతపురంలో ఉద్రిక్తంగా మారింది. పోసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా వైపీసీ కార్యకర్తలు నినాదాలు చేశారు. 
విజయనగరం జిల్లాలో...
విజయనగరం జిల్లాలో...ప్రత్యేక హోదా బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్‌ నేపథ్యంలో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద సీపీఎం..సీపీఐ..వైసీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఆందోళన చేస్తున్న వామపక్షాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఇక్కడ కొనసాగుతున్న బంద్‌పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు..
నెల్లూరు జిల్లాలో  
నెల్లూరు జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పలు పార్టీల నేతలు రోడ్డెక్కారు.. వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.
విజయవాడలో బంద్‌ 
విజయవాడలో బంద్‌ కొనసాగుతోంది. బంద్‌ ప్రభావంతో రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. బస్సు సర్వీసులను అడ్డుకుంటుండటంతో..ప్రయాణికులు రైళ్లపై ఆధారపడుతున్నారు. బంద్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నా..ప్రత్యేక హోదా కోసం సంతోషంగా వాటిని భరిస్తామని ప్రయాణికులు చెబుతున్నారు. 
చిత్తూరు జిల్లాలో 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. తిరుచానూరులో వైసీపీ, వామపక్ష నేతలు ఆందోళనకు దిగారు. పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

 

కొనసాగుతున్న ఎపి బంద్

విజయవాడ : కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌లో బంద్‌ కొనసాగుతోంది. కాంగ్రెస్, వైసీపీ, వామపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయమే ఆర్టీసీ బస్సు డిపోల వద్దకు చేరుకున్న వైసీపీ, వామపక్ష నేతలు బస్సులను అడ్డుకున్నారు. 

11:34 - September 10, 2016

హైదరాబాద్ : వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ పైకి పేపర్లు విసిరారు. నినాదాలు చేశారు. స్పీకర్ ఎంత చెప్పినా నిరసన విరమమించలేదు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

 

నిరవధికంగా వాయిదాపడిన ఎపి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రత్యేక హోదాకు పట్టుబట్టారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ పైకి పేపర్లు విసిరారు. స్పీకర్ ఎంత చెప్పినా వినలేదు. దీంతో స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. 

 

11:20 - September 10, 2016

కాకినాడ : కాంగ్రెస్‌, బీజేపీ కలిసి రాష్ట్రంలో అస్థిరతను సృష్టించాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. కాకినాడ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిస్తే.. బీజేపీ పొట్టలో పొడిచిందన్నారు. పాచిపోయిన రెండు లడ్డూలు ఇచ్చి ఇదే ఏపీకి తీపి కబురు అంటారా అని పవన్‌ మండిపడ్డారు. అంబేద్కర్‌ మీద గౌరవం ఉంటే పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని.. ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉండాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. 
కాకినాడ ఆత్మగౌరవ సభలో పవన్ 
కాకినాడ ఆత్మగౌరవ సభలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ గర్జించారు. తనదైన శైలిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కాంగ్రెస్‌ తీరును ఉతికి పారేశారు. ఏపీకి తీపికబురు వస్తుందంటూ ఊరించి ఊరించి చివరకు రెండు పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారా అని మండిపడ్డారు. ఆంధ్రులు చేవచచ్చారని అనుకుంటున్నారా అంటూ పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ఇచ్చిన మాటలకు విలువ లేదా అని పవన్‌ ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాటమార్చడం సరికాదన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్లయితే మాటకు కట్టుబడి ఉండాలన్నారు. 
పవన్‌ ప్రజలే నా బలం : పవన్  
నా వెనుక ఎవరూ లేరన్న పవన్‌ ప్రజలే నా బలం అన్నారు. రాజకీయాలు అంటే గడ్డం గీసుకున్నంత తేలిక కాదని  కొందరంటున్నారని.. మరి గడ్డం గీసుకున్నంత ఈజీగా రాష్ట్రాన్ని ఎందుకు విభజించారని ప్రశ్నించారు. బీజేపీ ప్యాకేజీపై పవన్‌ మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాల కోసం తాను రాలేదని ప్రజాసమస్యలు తెలుసుకుని వచ్చానని పవన్‌ అన్నారు.
కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిస్తే... బీజేపీ పొట్టలో పొడిచింది : పవన్‌
కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిస్తే... బీజేపీ పొట్టలో పొడిచిందని పవన్‌ అన్నారు. అవకాశవాద రాజకీయాలతో తెలంగాణ, సీమాంధ్రలో యువకులు బలయ్యారని పవన్‌ విమర్శించారు. రెండు జాతీయ పార్టీలు కలిసి తెలుగు రాష్ట్రాల్లో అస్థిరత సృష్టించాయని మండిపడ్డారు. 
వెంకయ్యపై పవన్‌ ఫైర్‌ 
బీజేపీ నేత వెంకయ్య నాయుడుపై జనసేనాని పవన్‌ ఫైర్‌ అయ్యారు. ఓట్లు అడిగే టైంలో అందరికీ అర్ధమయ్యే భాషలో మాట్లాడుతారు.. అధికారంలోకి వచ్చాక అర్థంకాని భాషలో మభ్యపెడుతున్నారని పవన్‌ మండిపడ్డారు. తెలంగాణ అంటే తనకు ఎంతో ప్రేమ అన్నారు పవన్‌. తెలంగాణకు జరిగిన అన్యాయంలో సీమాంధ్ర నేతల పాత్ర ఎంత ఉందో.. తెలంగాణ ప్రాంత నాయకుల పాత్ర కూడా అంతే ఉందన్నారు. 
సీపీఎం పార్టీ అంటే తనకు ఎంతో గౌరవం : పవన్‌ కల్యాణ్‌ 
సీపీఎం పార్టీ అంటే తనకు ఎంతో గౌరవముందని పవన్‌కల్యాణ్‌ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాన్ని మార్చుకుందన్నారు. అదే సీపీఎం రాష్ట్ర విభజనను వ్యతిరేకించిందని.. సీపీఎం జాతీయ నాయకులు సీతారాం ఏచూరీ పార్లమెంట్‌లో మాట్లాడిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయని పవన్‌  గుర్తుచేశారు.  సీపీఎంతో కలిసి ముందుముందు పోరాటం చేస్తానని పవన్‌ అన్నారు.
రాష్ట్రాన్ని విభజిస్తే 11 రోజులు అన్నం తినలేదు : పవన్‌ 
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే 11 రోజులు అన్నం తినలేదని పవన్‌ అన్నారు. 1997లో రాష్ట్రాన్ని విభజిస్తామన్న బీజేపీ ఎందుకు అన్ని రోజులు ఆలస్యం చేసిందని పవన్‌  ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలంటే కేంద్రానికి వివక్ష ఉంటుందని పవన్‌ ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి ఒక్క ప్రతినిధైనా తెలంగాణకుగాని.. ఆంధ్రాకుగానీ వచ్చి బలిదానాలపై క్షమాపణలు కోరలేదన్నారు. ఉత్తరాదివాళ్లే భారతీయులా అని పవన్‌ ప్రశ్నించారు.
అవంతీ శ్రీనివాస్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయాలి : పవన్ 
సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవం కాపాడాలని కోరుతున్న... అనకాపల్లి ఎంపీ అవంతీ శ్రీనివాస్.. తన స్థానానికి రాజీనామా చేయాలని పవన్ సూచించారు. ఆ స్థానం నుంచి తిరిగి గెలిపించే బాధ్యత జనసేనదేనని స్పష్టం చేశారు. టీజీ వెంకటేష్‌పై పవన్‌ మండిపడ్డారు. టీజీ రాజ్యసభ సీటు తాము వదిలేస్తే వచ్చిందని పవన్‌ అన్నారు. మా బిక్షవల్ల ఆ సీట్లో కూర్చొని తమనే విమర్శిస్తారా అని పవన్‌ మండిపడ్డారు.
చేతకాకుంటే చెప్పండి.. తాము రంగంలోకి దిగుతాం : పవన్  
సీమాంధ్రుల ఆత్మగౌరవం కాపాడతామని గద్దెనెక్కి.. ఇప్పుడు తమ వల్ల కాదంటే ఊరుకునేది లేదని పవన్.. టీడీపీ, బీజేపీ నేతలను ఉద్ద్యేశించి అన్నారు. తాను తన అమ్మను, అన్నను, వదినను కాదని.. టీడీపీ, బీజేపీకి అండగా నిలబడ్డానన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించే దమ్ము కోసం కారం తినాలంటూ పవన్ ఘాటుగా స్పందించారు. అధికార, ప్రతిపక్షనాయకులకు చేతకాకుంటే చెప్పండి.. తాము రంగంలోకి దిగుతాం.. మా జనసేన బరిలోకి దిగుతుంది.. స్పెషల్‌ స్టేటస్‌ సాధిస్తుంది అని గర్జించారు పవన్‌. ప్రతిపక్ష, అధికార పక్షాలకు సాధ్యంకాని ప్రత్యేక హోదాను జనసేన కార్యర్తలు తెచ్చితీరుతారని పవన్‌ అన్నారు. మొత్తానికి పవన్‌ ఆత్మగౌరవ సభ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టినట్లైంది. ఇటు జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. 

 

11:03 - September 10, 2016

కరీంనగర్‌ : జిల్లా జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గోడ దూకి పరారయ్యారు. ఖైదీలు ఇద్దరూ మహారాష్ట్ర గ్యాంగ్‌కు చెందిన ముఠా సభ్యులు యోగేష్‌, జితేందర్లుగా గుర్తించారు. వీరిద్దరిని పోలీసులు పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. 

10:59 - September 10, 2016

విజయవాడ : కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌లో బంద్‌ కొనసాగుతోంది. కాంగ్రెస్, వైసీపీ, వామపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయమే ఆర్టీసీ బస్సు డిపోల వద్దకు చేరుకున్న వైసీపీ, వామపక్ష నేతలు బస్సులను అడ్డుకున్నారు. దీంతో పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో వామపక్షాలతోపాటు వైసీపీ నేతలు నిరసన తెలిపారు. ఏలూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సీపీఎం, వైసీపీ నేతలను అరెస్ట్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రణస్థలంలో సీఐటీయూ నేతలను అరెస్ట్‌ చేశారు. తిరుపతిలో భూమన కరుణాకర్‌ రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలను అరెస్ట్‌ చేశారు. రేణిగుంటలో సీపీఎం నేతలను అరెస్ట్‌ చేశారు. కడప జిల్లాలో వామపక్షాలతోపాటు వైసీపీ నేతల నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సీపీఎం, వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపో ఎదుట వైసీపీ ఆందోళన చేపట్టింది. బస్సులను బయటకు రానీయకుండా నేతలు  అడ్డుకున్నారు. 
విశాఖలో 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్‌ ప్రకటించాలంటూ విశాఖలో వైసీపీ, వామపక్షాలు బంద్‌ నిర్వహిస్తున్నాయి. డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. భారీగా మోహరించిన పోలీసులు బంద్‌ నిర్వహిస్తున్న నేతలను అరెస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 
తిరుపతిలో  
తిరుపతిలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. డిపోలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
కడపలో 
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కడపలో వామపక్షాలు.. వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాగా ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆందోళనలో పాల్గొన్న సీపీఎం.. వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
నెల్లూరు జిల్లాలో
నెల్లూరు జిల్లా.. కావలిలో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేపట్టిన బంద్‌లో భాగంగా కావలిలో వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

 

10:55 - September 10, 2016

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రత్యేకహోదా, సభా పరిణామాలపై ఇరువురు వాదోపవాదాలు చేసుకున్నారు. ఒకరిపైమరొకరు విమర్శలు చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం నశించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. మీడియా పాయింట్ ను ఎన్ టీఆర్ భవన్ గా మార్చేశారని విమర్శించారు. మరోవైపు మీడియా పాయింట్ ను లోటస్ పాండ్ గా మార్చేశారంటూ టీడీపీ సభ్యులు ఆరోపించారు. వైసీపీ సభ్యులను పోలీసులు అరెస్టు చేసేందకు యత్నిస్తున్నారు. వైసీపీ సభ్యులు మీడియా పాయింట్ వద్ద బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
వైసీపీ సభ్యుడు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
'అసెంబ్లీలో మాట్లాడనివ్వరు. ప్రజల తరపున మాట్లాడనివ్వరు. ప్రజా సమస్యలను మీడియా పాయింట్ వద్ద అయినా చెప్పుకుందామంటే ఇక్కడ కూడా మాట్లాడనివ్వడం లేదు. ఇదెక్కడి అన్యాయం. దళిత సభ్యులు, మహిళా సభ్యుపై దాడులు చేశారు. జగన్ మాట్లాడేందుకు మైక్ ఇవవ్వడం లేదు. 'అసెంబ్లీలో పాతేస్తాం.. నా కొడుకుల్లారా' అంటున్నారు.
టీడీపీ... పీతల సుజాత
'రాష్ట్రంలోని ఏ ఒక్క సమస్యపై చర్చించడానికి వైసీపీ ముందుకు రావడం లేదు. సభను అడ్డుకోవడం, స్పీకర్ పై డాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆందోళన చేపట్టే వైసీపీ సభ్యులను వచ్చే ఎన్నికలకు అనుమతించరాదు. వైసీపీకి ఎపికి ప్రత్యేకహోదా అడిగే హక్కు లేదు. ప్యాకేజీ కోసం తల్లి, పిల్ల కాంగ్రెస్ పార్టీలు ఎపిని విభజించారు. ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని' అని మండిపడ్డారు. 

 

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఎపి అసెంబ్లీ

హైదరాబాద్ : వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రత్యేక హోదాకు పట్టుబట్టారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ పైకి పేపర్లు విసిరారు.

శాసనసభను హింసాత్మకంగా మారుస్తున్న వైసీపీ : కాల్వ

హైదరాబాద్ : శాసనసభను హింసాత్మకంగా మారుస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైసీపీ సభ్యులు రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

శాసనసభ గౌరవాన్ని మంటగలిన వైసీపీ సభ్యులు : మంత్రి అచ్చెన్నాయడు

హైదరాబాద్ : వైసీపీ సభ్యులు శాసనసభ గౌరవాన్ని మంటగలిపారని మంత్రి అచ్చెన్నాయడు విమర్శించారు. నిన్న ఆందోళన చేసిన వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. 

ఎపి టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రత్యేకహోదా, సభా పరిణామాలపై ఇరువురు వాదోపవాదాలు చేసుకున్నారు.

09:53 - September 10, 2016

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే ఎపికి ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీంతో స్పీకర్ సభను పది నిమిషాలపాటు వాయిదా వేశారు. అంతకముందు మంత్రి అచ్చెన్నాయడు మాట్లాడుతూ వైసీపీ సభ్యులు శాసనసభ గౌరవాన్ని మంటగలిపారని విమర్శించారు. నిన్న ఆందోళన చేసిన వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. శాసనభకు హింసాత్మకంగా మారుస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైసీపీ సభ్యులు రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వైసీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రతిపాదించారు. 

ఎపి అసెంబ్లీ పది నిమిషాలపాటు వాయిదా

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. సమావేశాలు మొన్న ప్రారంభమయ్యాయి. నేటితో సమావేశాలు ముగియనున్నాయి. 

 

మూడో రోజు ప్రారంభమైన ఎపి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. సమావేశాలు మొన్న ప్రారంభమయ్యాయి. 

 

ప్రత్యేక హోదా కోసం వామపక్షాలు, వైసీపీ నిరసన

కడప : ప్రత్యేక హోదా కోసం వామపక్షాలు, వైసీపీ నిరసన తెలిపాయి. సీపీఎం, వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

ప్రత్యేక హోదా కోసం ప.గో జిల్లాలో వైసీపీ, వామపక్షాలు నిరసన

ప.గో : ప్రత్యేక హోదా కోసం జిల్లాలో వైసీపీ, వామపక్షాలు నిరసన తెలుపుతున్నాయి. ఏలూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఎం, వైసీపీ నేతలను అరెస్టు చేశారు. 

విజయనగరం జిల్లాలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

విజయనగరం : ప్రత్యేక హోదా బంద్ నేపథ్యంలో జిల్లాలో ఆర్టీసీ బస్సులు డీపోలకే పరిమితం అయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సీపీఎం, సీపీఐ, వైసీపీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కె.కామేశ్వరరావు, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆర్.శ్రీరామ్ మూర్తిని పోలీసులు ముందుస్తుగా అరెస్టు చేశారు. 

08:07 - September 10, 2016

ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని వక్తలు స్పష్టం చేశారు. ఎపికి ప్రత్యేకహోదా, పవన్ కళ్యాణ్ బహిరంగ సభతోపాటు పలు అంశాలపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు సీతారత్నకుమారి, కాంగ్రెస్ నేత రామశర్మ, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవి ఇవ్వాల్సిందేనని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కోదాడలో నేటి నుంచి డీవైఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు

నల్గొండ : కోదాడలో నేటి నుంచి డీవైఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలు జరుగనన్నాయి. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి ఎంపికైన ప్రతినిధులు హాజరుకానున్నారు. మహాసభలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

 

07:24 - September 10, 2016
07:22 - September 10, 2016

విజయవాడ : ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి నిరసనగా వైసీపీ, వామపక్షాలు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు కాంగ్రెస్ మద్దతిచ్చింది. ఏపీ బంద్ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఆర్టీసీ డిపోల ముందు ధర్నా చేస్తున్న పలువురు నేతలను అరెస్ట్‌ చేశారు. కడపలో ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్‌ చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా డిపోలో 930 బస్సులు నిలిచాయి. మాజీ ఎమ్మెల్యేభూమన కరుణాకర్‌రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. చిత్తూరులో వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. జిల్లాల్లో పెద్ద ఎత్తున పోలీసులు  మోహరించారు. బంద్‌ కారణంగా ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య పరీక్షలు రద్దు చేశారు. 

 

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు అరెస్ట్

చిత్తూరు : ఎపి రాష్ట్ర బంద్ నేపథ్యంలో వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. జిల్లాల్లో పెద్ద ఎత్తున పోలీసులు  మోహరించారు. బంద్‌ కారణంగా ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య పరీక్షలు రద్దు చేశారు. 

కడపలో వైసీపీ నేతల అరెస్ట్‌

కడప : ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి నిరసనగా వైసీపీ, వామపక్షాలు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. కడపలో ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్‌ చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా డిపోలో 930 బస్సులు నిలిచాయి.

మాజీ ఎమ్మెల్యేభూమన కరుణాకర్‌రెడ్డి అరెస్ట్‌

కడప : ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి నిరసనగా వైసీపీ, వామపక్షాలు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు కాంగ్రెస్ మద్దతిచ్చింది. ఏపీ బంద్ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేభూమన కరుణాకర్‌రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఏపీ బంద్ నేపథ్యంలో ముందస్తు అరెస్టులు

విజయవాడ : ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి నిరసనగా వైసీపీ, వామపక్షాలు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు కాంగ్రెస్ మద్దతిచ్చింది. ఏపీ బంద్ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఆర్టీసీ డిపోల ముందు ధర్నా చేస్తున్న పలువురు నేతలను అరెస్ట్‌ చేశారు. కడపలో ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్‌ చేశారు.

07:08 - September 10, 2016

విజయవాడ : ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని..ప్యాకేజీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ  వామపక్ష, కాంగ్రెస్‌,వైసీపీ పార్టీలు ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రతి ఒక్కరు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేశాయి.   
కాకినాడలో వామపక్షాలు బైక్‌ ర్యాలీ 
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి..హోదాను ఇవ్వని కేంద్ర, టీడీపీ వైఖరికి నిరసనగా పిలుపునిచ్చిన బంద్‌ను విజయవంతం చేయాలంటూ కాకినాడలో వామపక్షాలు బైక్‌ ర్యాలీ చేపట్టాయి. ప్రత్యేకహోదా ఇస్తామన్న కేంద్రం రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందని నేతలు మండిపడ్డారు
సీఎం చంద్రబాబు ప్రజల్ని ఇంకా మోసం చేస్తున్నారు : రామకృష్ణ 
ప్రత్యేకహోదాపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు ప్రజల్ని ఇంకా మోసం చేస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రెండు లక్షల కోట్లు ఇచ్చామని వెంకయ్యనాయుడు చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం 8 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర బంద్‌కు సహకరించాలని ప్రజలకు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. 
ప్యాకేజీ ప్రకటనపై మండిపడ్డ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ 
ఏపీకి కేంద్రం ప్యాకేజీ ప్రకటనపై మాజీ ఎంపీఉండవల్లి అరుణ్‌కుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ ప్రజల్ని కేంద్రం మోసం చేసిందని ఆరోపించారు. టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. 
తిరుపతిలో విద్యార్థి నాయకులు ఆందోళన 
ఏపీకి కావల్సింది ప్యాకేజీలు కాదని.. ప్రత్యేకహోదానే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తిరుపతిలో విద్యార్థి నాయకులు ఆందోళన చేశారు. నగరంలో పెద్ద ఎత్తున అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ప్రత్యేకహోదా కల్పించకపోతే ఉద్యమాలు తప్పవని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.  
అసాంఘీక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు : డీఎస్పీ 
ప్రతిపక్షాలబంద్‌ కారణంగా గుంటూరు జిల్లా నరసారావుపేట డివిజన్‌ పరిధిలో ఎవరైనా అసాంఘీక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు డీఎస్పీ నాగేశ్వరరావు.
డిపోలకే పరిమితమైన బస్సులు  
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ..ప్రతిపక్షాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్థంభించనుంది. ఇప్పటికే అర్థరాత్రి నుంచే బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆటో యూనియన్లు బంద్‌కు మద్దతు తెలపడంతో అర్థరాత్రి నుంచే ఆటోలు రోడ్లపైకి రాలేదు. ఇక వ్యాపార, వాణిజ్య సముదాయాలు కూడా పూర్తిగా మూతపడనున్నాయి. బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలపడంతో దుకాణాలన్నీ మూతపడ్డాయి. 

 

శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక హోదా కోసం విపక్షాలు బంద్

శ్రీకాకుళం : ప్రత్యేక హోదా కోసం నేడు విపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్ష నేతలు బస్సులను అడ్డుకున్నారు. పలు చోట్ల పోలీసులు ముందస్తు  అరెస్టులు చేశారు. 

నిడమానూరు బెస్టు ఫ్రైస్ గోదాంలో అగ్నిప్రమాదం

విజయవాడ : నిడమానూరు బెస్టు ఫ్రైస్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. 

Don't Miss