Activities calendar

11 September 2016

ఐసెట్ 2016 సీట్ల కేటాయింపు..

హైదరాబాద్ : ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ఐసెట్ 2016 వెబ్ కౌన్సెలింగ్ కోసం 30,533 మంది విద్యార్థులు తమ సర్టిఫికేట్ల పరిశీలన చేసుకున్నారరు. వారిలో 29,226 మొంది విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి సీట్ల కేటాయింపు ఈనెల 12వ తేదీన సాయంత్రం 8గంటల తరువాత చేయనున్నారు. 

మరో రెండు రోజుల పాటు వర్షాలు..

హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఒడిశా, కోస్తాంధ్ర సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

సోమవారం గజ్వేల్ లో రైతు సంఘీ భావ సభ..

హైదరాబాద్ : మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పరిస్థితిపై కాంగ్రెస్ నేతలు సోమవారం ఉదయం గవర్నర్ నరసింహన్ ను కలువనున్నారు. ముంపు గ్రామాల పరిస్థితిపై గవర్నర్ కు వినతి పత్రం సమర్పించనున్నారు. అనంతరం గజ్వేల్ లో కాంగ్రెస్ నేతలు రైతు సంఘీభావ సభ నిర్వహించనున్నారు.

14న దుర్గమ్మ దర్శనం నిలిపివేత..

విజయవాడ : 14వ తేదీ నుంచి 17వ తేదీ బహుళ పాడ్యమి వరకు విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన మహానివేదన అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు. ఆలయంలో అన్ని దర్శనాలు నిలిపివేస్తారు. 

21:31 - September 11, 2016

సెప్టెంబర్‌ 11... ఈ తేదీ గుర్తుకు రాగానే ప్రపంచమంతా ఉలిక్కిపడుతుంది. అమెరికా వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రవాదులు దాడి చేసి మారణహోమాన్ని సృష్టించిన రోజిది. దుర్ఘటన జరిగి పదిహేనేళ్లు గడచినా నేటికీ అమెరికన్లే కాదు.. ప్రపంచ ప్రజలంతా ఆ దుర్ఘటనను మరచిపోలేదు. అల్‌ఖైదా ఉగ్రమూకలు.. విమానదాడుల ద్వారా దాదాపు మూడు వేల మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ దుశ్చర్యలో మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ.. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా.. మృతులకు నివాళులు అర్పించారు.

పదిహేనేళ్లు..
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్‌ సెంటర్‌ టవర్లపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నేటితో పదిహేనేళ్లు. అల్‌ఖైదా ఉగ్రమూకలు.. నాలుగు విమానాలను హైజాక్‌ చేసి ట్విన్‌ టవర్స్‌ను కూల్చేసిన రోజిది. ఈ దుర్ఘటనలో 2996 మంది మృత్యువాత పడ్డారు. మరో ఆరు వేల మంది జనం గాయపడ్డారు. సెప్టెంబర్‌ పదకొండు నాటి ఘటన తలపునకు వస్తే అమెరికన్లు నేటికీ ఉలిక్కిపడుతుంటారు. అంతటి విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సహా.. ఆదేశ నాయకులు, ప్రజలు నివాళులు అర్పించారు. ట్విన్‌ టవర్స్‌పై ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి.. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా నివాళులర్పించారు.

ట్విట్టర్ లో మోడీ..
సెప్టెంబర్‌ 11వ తేదీ అంటే రెండు విభిన్నమైన ఘటనలు మదిలో మెదులుతున్నాయని, వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రదాడి ఒకటైతే... 1893వ సంవత్సరంలో స్వామి వివేకానంద చికాగాలో చరిత్రాత్మకమైన ప్రసంగం చేసి ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న రోజు అని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అల్‌ఖైదా ఉద్రవాదులు సృష్టించిన ఈ భీకర విధ్వంసం నుంచి తేరుకోవడానికి అమెరికాకు చాలా ఏళ్లే పట్టింది. అనంతరం ఉగ్రమూకల ఏరివేత చర్యల్లో భాగంగా అమెరికా, తమ బలగాలను ఆఫ్ఘనిస్థాన్‌లో మోహరించి.. ఘటన జరిగిన పదేళ్లకు అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ను తుదముట్టించింది.

21:27 - September 11, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాజకీయ కాకను పెంచుతోంది. ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో ఆందోళనలు చేస్తున్నారు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు. బంద్‌లకు పిలుపునిస్తున్నారు. ర్యాలీలు, నిరాహార దీక్షలతో నిరసన తెలియజేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలంటూ ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. అఖిలపక్ష నాయకులు, ప్రజలు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎన్నికైన మంత్రి కేటీఆర్‌ మనస్సు మారాలని జిల్లా జే.ఎ.సీ నేతలు మానేరు నదిలో పిండ ప్రదానం చేసి.. నిరసన తెలిపారు.

కరీంనగర్ లో...
హుస్నాబాద్‌, కోహెడ మండలాలను కరీంనగర్‌ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ.. అఖిలపక్ష నేతలు చేస్తున్న దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. అంబేద్కర్‌ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్దం చేయడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీక్షా శిబిరాన్ని తొలగించారు. మైక్‌సెట్టు, బల్లలు, ఫెక్సీలను తొలగించారు. మరోవైపు అరెస్ట్‌ చేసినవారిని విడుదల చేయాలని రాస్తారోఖో చేయడంతో మరికొంతమంది నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. అఖిలపక్ష నాయకులు హుస్నాబాద్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.

మహబూబ్ నగర్ లో...
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలంటూ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. 16 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. 5 రోజుల నుంచి బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి తల్లోజు ఆచారి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా... ప్రభుత్వం స్పందించకపోవడంతో అఖిలపక్ష నేతలు కల్వకుర్తి నియోజకవర్గం బంద్‌కు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్ష నేతలు బైఠాయించి.. నిరసన తెలిపారు. దీంతో డిపోల నుంచి బస్సులకు బయటకు రాలేదు. వాణిజ్య, వ్యాపార సంస్థల యాజమానులు స్వచ్చందంగా బంద్‌ పాటించారు. ఇటు బీజేపీ కార్యకర్త శ్రీకాంత్‌ కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ.. సెల్‌టవర్‌ ఎక్కాడు. విషయం తెలియగానే జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి.. కిందకు దిగిరావాలని శ్రీకాంత్‌ను కోరారు. అయినా వినిపించుకోకపోవడంతో.. స్థానిక నేతలు విజ్ఞప్తి చేయడంతో శ్రీకాంత్‌ సెల్‌టవర్‌ దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నిజామాబాద్ లో..
నిజామాబాద్‌ జిల్లా బిచ్‌కుంద మండలంలోని పెద్ద కొడప్‌గల్‌ను మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ.. అఖిలపక్ష నేతలు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి... నిరసన తెలియజేశారు. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పెద్ద కొడప్‌గల్‌ను మండలం చేసేవరకు ఆందోళన చేస్తామని స్థానిక నేతలు హెచ్చరించారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా మిగతా ప్రాంతాల్లోనూ రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను, స్థానిక నేతల వినతులను పట్టించుకుంటుందో లేదో చూడాలి. 

21:23 - September 11, 2016
21:22 - September 11, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగునీరును అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు. హైదరాబాద్‌ సోమాజిగూడ కత్రియ హోటల్లో జరిగిన 'రైతు నేస్తం' పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, హరీష్‌రావు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.  మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో చెరువులు కళకళలాడుతున్నాయని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన 'రైతునేస్తం' మాసపత్రిక 12వ వార్షికోత్సవంలో పాల్గొన్న హరీష్‌రావు... తెలంగాణలో కోటిఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు కృషిచేస్తున్నామని.. సాగునీటి ప్రాజెక్టుల కోసం బడ్డెట్‌లో 25వేల కోట్లు కేటాయించామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని 44 మార్కెట్‌ యార్డుల్లో జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని అమలు చేశామని మంత్రి హరీష్‌రావు అన్నారు.

రైతు సమస్యలు పరిష్కరించాలన్న వెంకయ్య...
ఇదే కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలన్నీ కలిసి రైతు సమస్యలు పరిష్కరించడానికి కలిసి కట్టుగా కృషిచేయాలన్నారు. అలాగే ఎలక్ట్రానిక్‌ మీడియా, ప్రింట్‌ మీడియా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డైరీ, యానిమల్ హాస్బెండ్రీని ప్రోత్సాహించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రైతులు కూడా వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్లాలని సూచించారు. 'రైతు నేస్తం' మాసపత్రిక 12వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రంగంలో సేవలందించిన 51 మంది రైతులు, అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు 'రైతు నేస్తం' పురస్కారాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అందచేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి రైతులు, అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

21:20 - September 11, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్యాకేజీ పేరుతో కేంద్రం మరో కొత్త నాటకానికి తెరతీసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్యాకేజీతో హోదాకు పాతరేసే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తోందని.. వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. స్పెషల్‌ స్టేటస్‌ ప్రకటించకపోతే...రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. ప్రత్యేక హోదాకు బదులు.. ప్యాకేజీతో సరిపెట్టాలని చూస్తున్న కేంద్రానికి, ఆ ప్రతిపాదనను అంగీకరించిన తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగళాలు పెరుగుతున్నాయి. ప్యాకేజీతో ఏపీకి కలిగే లాభాలేంటో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరించాలని కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏపీకి హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘంలో ఎక్కడా లేదన్నారు. హోదా ఇస్తామంటేనే ప్రజలు..టీడీపీ, బీజేపీకి ఓట్లేశారన్న ఉండవల్లి.. హోదా విషయంలో వెంకయ్యనాయుడు కూడా అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు.

నేతల విమర్శలు..
ఏపీ అభివృద్ధికోసం పవన్‌ కల్యాణ్‌తో కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్యాకేజీ కింద 2లక్షల 75వేల కోట్లు ఇస్తున్నామని వెంకయ్య..కాదు 70వేలకోట్లు అంటూ చంద్రబాబు...ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. పాచిపోయిన రెండు లడ్డూలను వెంకయ్య, చంద్రబాబులే తినాలని సూచించారు. మోసం చేసిన బీజేపీ మంత్రులకు సన్మానం చేయడం విచిత్రంగా ఉందని రామకృష్ణ విమర్శించారు. అన్ని వనరులున్నా ఉత్తరాంధ్ర ఇంకా అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని రాఘవులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాడి సాధించుకోవాలని సూచించారు. అటు కాపు ఉద్యమనేతలు కూడా ప్రత్యేక హోదా అంశానికి మద్దతు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్‌కల్యాణ్‌ ఉద్యమించాలని...ఆయన ఉద్యమానికి తాము పూర్తి మద్దతునిస్తామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. హోదా కోసం సీఎం ఇంటి ముందు పవన్‌కల్యాణ్‌ దీక్ష చేయాలని సూచించారు. ప్రత్యేక హోదా కోరుతూ మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రతిపక్షాలు పిలుపునిస్తున్నాయి. ఈ దిశగా ప్రజలను చైతన్య పరుస్తూ ఉద్యమాన్ని పటిష్ఠంగా నిర్మించే యోచన చేస్తున్నాయి. 

20:15 - September 11, 2016

పేదలకు రెండు లక్షల ఇళ్లు - నారాయణ..

చిత్తూరు : రాష్ట్రంలో పేదలకు రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. జూన్ లోగా 9వేల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని, తిరుపతి మున్సిపల్ కార్మికుల కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామన్నారు. సాంకేతిక సమస్యల వల్లే హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ అని, ముద్రగడ ఉనికి కోసమే కాపు రిజర్వేషన్లను అడ్డు పెట్టుకుంటున్నారని విమర్శించారు. 

లైడిటెక్టర్ కు సుజనా సిద్ధమా - రఘువీరా..

విజయవాడ : ఏపికి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ బాగుందని జైరాం రమేష్ అన్నారని సుజనా చెప్పడం అబ్ధమని, ఈ విషయంపై లైడిటెక్టర్ కు సుజనా సిద్ధమా అని ఏపీసీసీ చీఫ్ రఘువీరా ప్రశ్నించారు. జైరాం అనని వ్యాఖ్యలకు సుజనా ఆపాదించడం దారుణమన్నారు. 

గుంటూరులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వివాదం..

గుంటూరు : గణేష్ నిమజ్జనంలో బీకే పాడు, గరికపాడు మధ్య వివాదం చెలరేగింది. వైసీపీ, టీడీపీ వర్గాలు రాళ్లు విసురుకున్నాయి. 

జగన్ అజెండాయే..ముద్రగడ అజెంబా - చిన రాజప్ప...

తూర్పుగోదావరి : ముద్రగడ కాపులను తప్పుదోవపట్టిస్తున్నారని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప పేర్కొన్నారు. ముద్రగడ కాపులను గౌరవాన్ని జగన్ వద్ద తాకట్టు పెట్టారని, జగన్ అజెండాయే..ముద్రగడ అజెండా అని పేర్కొన్నారు. ముద్రగడ మాటలనమ్మి కేసులో ఇరుక్కోవద్దని సూచించారు. తాము తలుచుకుంటే తునిలాంటి సభలు అనేకం పెట్టగలమన్నారు. పల్స్ సర్వే తరువాత మంజునాథ కమిషన్ పర్యటిస్తుందన్నారు. 

ముగిసిన కాపుల నేతల సమావేశం..

తూర్పుగోదావరి జిల్లా : రాజమహేంద్రవరంలో కాపు నేతల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ.. కాపుల రిజర్వేషన్ అంశంపై ప్రశ్నిస్తే చంద్రబాబు తిట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

19:34 - September 11, 2016
19:32 - September 11, 2016

విజయనగరం : జిల్లా ఎస్‌.కోటలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం.. మంటపం విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. శ్రీవేంకటేశుని పోలిన భంగిమలోని వినాయకుడిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శిస్తున్నారు. జిల్లాకు చెందిన రాజకీయ ప్రముఖులూ ఇక్కడికొచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఏడుకొండల స్వామిని తలపించే వినాయకరూపం, ఎల్ఈడీ కాంతులలో కొలువుదీరిన గణేశుని విగ్రహం...రథాన్ని అధిరోహిస్తున్న మహేశ్వురుడు...కళ్లు చెదిరే విద్యుత్ వెలుగులు...గణనాథుని భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు. గణపతి నవరాత్రుల సందర్భంగా.. విజయనగరం జిల్లాలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

ఐదు ఎకరాల స్థలం..
జిల్లాలోని ఎస్‌.కోటలో... ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమ... మంటపాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తిరుమలేశుని భంగిమలో.. 18 అడుగుల ఎత్తుతో ప్రతిష్ఠించిన వెంకట వినాయక ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మంటపానికి ముందు భాగంలో 25 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో... వివిధ జంతువులపై రథంయాత్ర చేస్తున్నట్లుండే మహేశ్వర వినాయక విగ్రహాలూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

18 అడుగులు..
ఈ మంటపాన్ని రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులే నిర్వహిస్తున్నాయి. సుమారు 18 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించిన వినాయక ప్రతిమ స్థానికులనే కాదు.. జిల్లాకు చెందిన ప్రముఖులనూ ఆకర్షిస్తోంది. వారు పెద్ద సంఖ్యలో ఈ మంటపాన్ని సందర్శించి.. గణపతికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నెల 14న గణేశ నిమజ్జనాన్ని వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రఖ్యాతిగాంచిన గారడీ కళాకారులు, పులివేషధారులు, విచిత్ర వేషధారులను డప్పువాయిద్య కళాకారులను రప్పిస్తున్నారు. 

19:30 - September 11, 2016

విజయవాడ : పవన్‌కల్యాణ్‌పై..బీజేపీ నేతలు విమర్శల జోరు పెంచారు. వీధి నాయకుడు మొదలు.. ఢిల్లీ నేతల వరకూ జనసేనానిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఏపీకి లడ్డూలు కాదు..డబ్బులే కావాలని, కేంద్రం వాటినే ఇస్తోందని వెంకయ్య దెప్పిపొడిస్తే..కేంద్రం పొట్టకొట్టలేదని..పొట్ట నింపుతోందని హరిబాబు చెప్పుకొచ్చారు. ఇక బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి అయితే..పవన్‌ కల్యాణ్‌ బేషరతుగా వెంకయ్యకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పనిలోపనిగా.. విభజన చట్టంలో ప్రత్యేక హోదాను ఎందుకు చేర్చలేదంటూ కాంగ్రెస్‌ నేతలపైనా బీజేపి నేతలు విరుచుకుపడుతున్నారు. విభజన చట్టం వల్ల ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలుగు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పోరాడింది కేవీపీ రామచంద్రరావు ఒక్కరేనన్నారు. ఇప్పుడు ఆరాటం.. పోరాటం పేరుతో హడావుడి చేస్తున్నవాళ్లు ఆనాడు నోరు మెదపలేదని విమర్శించారు. ఏపీకి 2.25 లక్షల కోట్లతో ప్రాజెక్టులు వస్తున్నాయి.. చరిత్రలో ఏ రాష్ట్రానికి ఏ ప్రభుత్వమూ ఈ విధంగా సాయం చేయలేదన్నారు.

ఖండించిన సిద్ధార్థనాథ్ సింగ్...
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కించపరిచే విధంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ బీజేపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ సిద్ధార్థనాథ్‌సింగ్‌ అన్నారు. వెంటనే వెంకయ్యనాయుడుకి, ఏపీ ప్రజలకు పవన్‌కల్యాణ్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికి జనసేన పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపి నేతలంతా మూకుమ్మడి దాడి ప్రారంభించారు. హోదాకు మించి కేంద్రం ఏపీకి సాయం చేస్తున్నా..జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మాత్రం హోదా అంటూ అదేపనిగా విమర్శించడం మంచిది కాదని సూచించారు. ఇప్పటికైనా పవన్‌కల్యాణ్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 

నలుగురు ఉగ్రవాదుల హతం..

జమ్మూ కాశ్మీర్ : నౌగామ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలంలో భారీగా మందుగుండు సామాగ్రీ, ఇతర సామాగ్రీని స్వాధీనం చేసుకున్నారు. 

18:32 - September 11, 2016
18:14 - September 11, 2016

విశాఖపట్టణం : ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం పట్ల కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏపీ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు..ఇతరులు ఢిల్లీకి వెళ్లారు. అనంతరం తిరిగి వారు ఆదివారం విశాఖకు పయనమయ్యారు. వీరు వస్తున్నారని తెలుసుకున్న వైసీపీ..సీపీఐ నేతలు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీనితో అక్కడ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ హరిబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీజేపీ ఎంపీలకు నల్ల రిబ్బెన్లతో వైసీపీ, సీపీఐ నేతలు నిరసన తెలిపారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వైసీపీ నేత అమర్నాథ్ తో పాటు పలువురు వామపక్ష నేతలను అరెస్టు చేశారు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని..హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చేతగాని ఎంపీ..గో బ్యాక్ అనే నినాదాలు మిన్నంటాయి. 

18:13 - September 11, 2016

ఢిల్లీ : ఏపీకి 'ప్రత్యేక హోదా'పై కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి కొత్త భాష్యం చెప్పారు. ప్రత్యేక హోదా కల్పించాలంటూ విపక్షాలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై నేతలు భగ్గుమంటున్నాయి. దీనితో బీజేపీ నేతలు, టిడిపి మంత్రులు స్పందిస్తున్నారు. ప్రత్యేక హోదాపై కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. స్టేటస్ వల్ల అన్నీ వచ్చేస్తాయనే భావన సరైనది కాదని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దులు, గిరిజన రాష్ట్రాలకే రఘురామరాజన్‌ కమిటీ ప్రత్యేక హోదా ఇచ్చిందనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రత్యేయ హోదాపై కావాలనే కొందరు రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలవరానికి 100 శాతం నిధులను కేంద్రమే ఇస్తుందని ఆయన అన్నారు. 

విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత..

విశాఖపట్టణం : ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ హరిబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఢిల్లీ నుండి వచ్చిన బీజేపీ ఎంపీలకు నల్ల రిబ్బెన్లతో వైసీపీ, సీపీఐ నేతలు నిరసన తెలిపారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వైసీపీ నేత అమర్నాథ్ తో పాటు పలువురు సీపీఐ నేతలను అరెస్టు చేశారు. 

హోదాపై ప్రజలను తప్పుదోవపటిస్తున్నారు - సుజనా చౌదరి..

ఢిల్లీ : ప్రత్యేక హోదా వస్తే అన్ని వస్తాయని అనుకుంటున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరివిమర్శించారు. కొండప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకే ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో రఘురామన్ కమిటీ చెప్పిందని తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు అంటూ ఏమీ లేవన్నారు. ప్యాకేజీతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయమే చేసిందని, గత ప్రధాని ఇచ్చిన హామీ మేరకు వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తున్నారని తెలిపారు.

17:38 - September 11, 2016

పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం - నారాయణ...

హైదరాబాద్ : పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు సీపీఐ నేత నారాయణ వెల్లడించారు. వామపక్షాలను సంప్రదిస్తామనడం మంచి పరిణామమని, తిరుపతి సభకు..కాకినాడ సభకు మార్పు కనిపించిందన్నారు. ఏపీకి హోదా ఇవ్వలేమని, వెంకయ్యకు ఇప్పుడు తెలిసిందా అని ప్రశ్నించారు. హోదాపై ఆశలు కల్పించి ఇప్పుడు వెనక్కి తగ్గారని విమర్శించారు. 

ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోలుస్తారా - కంభంపాటి..

ఢిల్లీ : ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చడం బాధాకరమని ఎంపీ కంభంపాటి హరిబాబు వ్యాఖ్యానించారు. డబ్బు ఎప్పుడూ తాజాగా ఉంటుందని, పాచిపోదని, విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఏపీ బీజేపీ నేతలు పదవుల కోసం పనిచేయడం లేదని, 1972లో ఆంధ్రా ఉద్యమాన్ని కాంగ్రెస్ అధికారం కోసం వాడుకుందన్నారు. వెంకయ్య చొరవతోనే ఏపీకి ఆర్థిక ప్యాకేజీ వచ్చిందని, విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ తో యువతకు ఉపాధి కలుగుతుందన్నారు. 

17:35 - September 11, 2016

వరంగల్ : గణపతి.. అక్కడ ప్రకృతిరూపుడిగా భాసిల్లుతున్నాడు. శ్వేతార్కమూల గణపతిగా భక్తుల విశేష పూజలందుకుంటున్నాడు. వృక్షమూలంలో ఒదిగిన తొలిపూజల వేలుపు తమను కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నాడని భక్తులు అంటుంటారు. వక్రతుండుడు.. శూర్పకర్ణుడు.. మహాకాయుడు.... ఇవీ విఘ్నవినాశకుడు వినాయకుడి వర్ణనలు. ఎక్కడైనా గణేశుని ఆకారం ఒకటే. అయితే.. ఆ రూపం ఏర్పడ్డ తీరును బట్టి.. ఫలాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా శ్వేతార్క గణపతి అమిత ఫలప్రదాత అన్నది వారి అచంచల విశ్వాసం. శ్వేతం అంటే తెలుపు, అర్కం అంటే జిల్లేడు.. తెల్లజిల్లేడు బెరడుతో చేసే గణపతి ప్రతిమలను శ్వేతార్క గణపతిగా పిలుస్తారు. అతి పురాతనమైన శ్వేతార్కగణపతి విశేషాలు.. కొన్ని దశాబ్దాలుగా మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇంటింటా శ్వేతార్క గణపతి ప్రతిమలను పూజించడం అధికమైంది. ఈ క్రమంలోనే.. ఓరుగల్లు జిల్లా కాజీపేటలో వెలసిన శ్వేతార్క మూల గణపతికి.. ఇటీవలి కాలంలో అత్యంత ప్రాశస్త్యం లభిస్తోంది.

స్వయంగా వెలిశాడంట...
తెల్లజిల్లేడు మొక్క మూలం నుంచి వెలిశాడు కాబట్టి.. ఇక్కడి గణపతిని శ్వేతార్కమూల గణపతిగా పిలుస్తుంటారు. వందేళ్లపైబడిన ఈ ఆలయంలోని మూర్తిని ఏ శిల్పీచెక్కలేదు.. తెల్లజిల్లేడు మొదలుభాగంపై గణనాథుడే స్వయంగా వెలిశాడని చెబుతారు. చెట్టు బెరడుపైని గణపతి మూర్తికి అన్ని అవయవాలు ప్రస్ఫుటంగా కనిపించడం విశేషం..నల్లగొండ ప్రాంతంలో వందేళ్లనాటి తెల్లజిల్లేడు మూలం నుంచి ఏర్పడిన గణపతిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని చెబుతారు. నిజానికి శ్వేతార్కగణపతి దేవళం.. 29ఆలయాల సముదాయం.. ఇక్కడ ఇద్దరు గణపతులు ఉన్నారు. ఒకరు శ్వేతార్క గణపతికాగా..మరొకమూర్తి ఆదిగణపతి. ఇంకా ఈ ఆలయంలో నల్లరాతితో తీర్చదిద్దిన మహాలక్ష్మీ అమ్మవారు ప్రత్యేక ఆకర్షణ. శ్వేతార్కమూలగణపతి భక్తసులభుడు అని నమ్ముతారు. నాలుగు గడ్డిపరకలు, మరికొన్ని పుష్పాలు.. సమర్పిస్తే చాలు.. ఈశ్వతార్క మూలగణపతి ప్రసన్నుడవుతాడని భక్తుల నమ్మిక.

విశిష్ట వినాయక సన్నిధానం..
అరుదైన శ్వేతార్క గణపతి కొలువైఉన్న ఆలయం..విశిష్ట వినాయక సన్నిధానంగా విరాజిల్లుతోంది. ఉత్తర-దక్షిణాది రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉన్న కాజీపేటలో.. వినాయకుని ఆలయం భక్తులపాలిట ఆధ్యాత్మిక ధామంగా వెలుగొందుతోంది. వరంగల్‌ జిల్లా కాజీపేటలోని శ్వేతార్కమూలగణపతి క్షేత్రాన్ని 2కోట్ల రూపాయలతో వ్యయంతో నిర్మించారు. ఈ ఆలయ రూపురేఖలు చూపరులను కన్నులు తిప్పుకోనివ్వవు. శ్వేతవర్ణంలో మెరిసే ఆలయ గోపురాలు..ప్రశాంత పరిసరాలు.. అన్నీ భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలోకి తీసుకెళతాయి.

ధ్యానం చేస్తే మనో వికలాలు తొలగిపోతాయి..
శ్వేతార్కమూలగణపతిని దర్శించుకుని.. ఆలయంలో కూర్చుని కళ్లుమూసుకుని ధ్యానం చేస్తే.. మనోవికలాలు అన్నీ తొలగిపోయి చిత్తం ప్రశాంతమవుతుందని భక్తులు చెబుతారు. ఈ శ్వేతార్క గణపతిని సేవించడానికి నిత్యం వందలాది మంది వస్తుంటారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా.. తమిళనాడు, కర్నాటకలతోపాటు ఛత్తీస్‌గడ్‌, మహరాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలనుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఉత్తర-దక్షిణ రాష్ట్రాలకు మధ్యలో ఉన్న ఖాజీపేట జంక్షన్‌ ద్వారా... నిత్యం 70రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. మంచి రవాణా సదుపాయాలు ఉండటంతో దేశ వ్యాప్తంగా వేలాది మంది ప్రయాణీకులు , భక్తులు ఇక్కడ కొద్దిసేపు ఆగి ఈశ్వేతార్క గణపతిని దర్శించుకుంటారు.

భక్తుల మాలధారణలు..
శ్వేతార్క గణపతి షోడశ రూపాల్లో విశిష్టమన్నది భక్తుల విశ్వాసం. ఇక్కడి వేలుపు కరుణ కోసం.. భక్తులు మాలధారణలూ చేస్తుంటారు. గణేశుడు 62రూపాలలో కరుణిస్తాడని భక్తులు నమ్ముతారు. అందులో 32 రూపాలు విశిష్టమైనవని, వాటిలోనూ షోడశ గణపతులు మహోత్కృష్టమనీ భక్తుల విశ్వాసం. ఆ పదహారు రూపాల్లోనూ శ్వేతార్క గణపతి పరమోత్కృష్టమని భక్తులు చెబుతారు.  ఈ శ్వేతగణపతి నిజరూపానికి తగినట్టుగా తీర్చిదిద్దిన 18కిలోల వెండికవచంతో మూలమూర్తి ద్విగుణీకృత శోభతో దర్శనమిస్తాడు. ప్రతిమంగళవారం ఈ ఆలయంలో హోమం జరుగుతుంది. పంచామృతాలతో స్వామివారికి విశేషరీతిలో అభిషేకం నిర్వహిస్తారు. విబూది, పసుపు, కుంకుమలతోపాటు.. తేనె, పుష్పాలతో నిర్వహించే అభిషేకంలో ఉమాసుతుడు సప్తవర్ణశోభితుడిగా కనిపిస్తాడు.

మరో విశేషం..
కాజీపేటలోని శ్వేతార్కమూల గణపతి ఆలయానికి మరో విశేషమూ ఉంది. ఈ క్షేత్రంలో నవగ్రహాలకు వారివారి దిశలను బట్టి విడివిడిగా ప్రత్యేక ఆలయాలూ ఉన్నాయి. దీంతో దోష నివారణ కోసం.. నిర్దిష్ట గ్రహానికే పూజలు నిర్వహించే వీలు ఈ ఆలయంలో ఉంది. శ్వేతార్క మూల గణపతి ఆలయంలో వందలాది మంది భక్తులు మాలధారణ కూడా చేస్తుంటారు. మండల, అర్ధమండల, పక్షం, లేదా 11 రోజలదీక్షను చేపడుతుంటారు. దాదాపు 17సంవత్సరాలుగా ఈ దీక్షలు నిర్వహిస్తున్నారు. సర్వవిఘ్నాలను నివారిస్తూ.. భక్తులపాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్వేతార్క గణపతిని ..ఈ నవరాత్రుల సమయంలో దర్శించడం మరింత పుణ్యప్రదం అని విశ్వసిస్తోన్న భక్తులు.. ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. 

17:20 - September 11, 2016

హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఏడో రోజు కావడం..ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు మహాగణపతి వద్దకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. దర్శించుకున్న అనంతరం సెల్ఫీలు దిగడానికి యువత ఆసక్తి చూపుతోంది. దీనితో క్యూ లైన్ లలో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. రద్దీని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు, నిర్వాహకులు, వాలంటీర్స్ కృషి చేస్తున్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:12 - September 11, 2016

హైదరాబాద్ : సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం మధ్యాహ్నం కలకలం రేగింది. ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు ప్రయత్నించాడని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...కార్ఖానా ఆపీసులో కానిస్టేబుల్ గా హనుమంతరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇతడిని బదిలీ చేశారు. ఇదిలా ఉంటే భవానీనగర్ లో ఓ ఆటో డ్రైవర్ పోలీసులపై చేసిన జులుంపై హనుమంతరెడ్డి వాట్సాప్ లో పలు పోస్టులు పెట్టాడు. ఫెండ్లీ పోలీసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒకరోజు పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణ కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎంను కలిసిందేకు హనుమంతరెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చాడు. సీఎంను కలిసేందుకు అవకాశం లేకపోవడంతో తీవ్రమనస్థాపానికి గురై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నిండు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం యశోదా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హనుమంతరెడ్డి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. గతంలో కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పోలీసులపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడంతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఇంక్రిమెంట్లు..క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో హనుమంతరెడ్డి తీవ్రమనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు ప్రయత్నించాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఆప్ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్..

ఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతితో పాటు ఇతరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 9వ తేదీన ఏయిమ్స్ లో సెక్యూర్టీ గార్డులపై అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. 

రాజ్ నాథ్ సింగ్ అత్యున్నత సమావేశం..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో అత్యున్నత సమావేశం జరుగుతోంది. కాశ్మీర్ అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఎన్ఎస్ఏ, ఐబీ చీఫ్, బీఎస్ఎఫ్ డీజీ, హోం శాఖ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. 

16:33 - September 11, 2016

హైదరాబాద్ : 'చంద్రన్న చేయూత' పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు హైదరాబాద్ లోని బేగంగపేట న్యూ ఎడ్యుకేషనల్ సొసైటీలో ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. సోలార్ సిస్టంపై ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ లో నూ శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ట్రైనింగ్ తీసుకొనే అభ్యర్థులకు హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. స్పోకెన్ ఇంగ్లీషు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని, క్లాసులు 45 రోజులు పాటు జరిగాయని, సోమవారంతో క్లాసులు ముగుస్తాయన్నారు. 

16:29 - September 11, 2016
16:27 - September 11, 2016

పశ్చిమగోదావరి : ఈనెల 13వ తేదీన పోలవరంలో పర్యటించి ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. జపాన్ నుండి తీసుకొచ్చిన అత్యాధునిక యంత్రాలను సీఎం బాబు ప్రారంభిస్తారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా జానంపేట వద్ద పోలవరం కుడి కాల్వపై నిర్మించిన అక్వడెడ్ ను మంత్రి దేవినేని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మీడియాతో మాట్లాడారు. 2018 పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టాలనే మహా సంకల్పంతో కృషి చేయడం జరుగుతోందన్నారు. జగన్ పై నిప్పులు చెరిగారు. 175 ఏళ్ల కల సీఎం చంద్రబాబు నెరవేర్చారని, జగన్ చరిత్ర హీనుడవుతాం. ప్రతి దానికి అడ్డు పడుతున్నావని, ఎన్నో కేసులు వేస్తున్నారని ఆరోపించారు. 

16:24 - September 11, 2016

నల్గొండ : తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాట 68వ వార్షికోత్సవాల సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ యాదాద్రిలో బస్సు, సైకిల్, బైక్ యాత్ర నిర్వహించారు. యాదగిరిగుట్టలో అమరవీరుల స్థూపానికి నారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి నుండి 17వ తేదీ వరకు యాత్ర నిర్వహించనున్నట్లు నారాయణ పేర్కొన్నారు. 17వ తేదీన హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, యాదాద్రి పేరిట కాకుండా బోన్ గిరికి చెందిన స్వతంత్ర సమరయోధుడు రావి నారాయణరెడ్డి పేరిట జిల్లాను ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. 

సీఎం క్యాంపు కార్యాలయం వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం...

హైదరాబాద్ : సీఎంక్యాంపు కార్యాలయం వద్ద కానిస్టేబుల్ హనుమంతరెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన అధికారులు ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నార్త్ జోన్ డీసీపీ ఆఫీసు కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్నా కానిస్టేబుల్ గా హనుమంతరెడ్డి పని చేస్తున్నాడు. కార్ఖానా పీఎస్ లో పనిచేస్తూ డీపీసీ ఆఫీస్ కు అటాచ్ మెంట్ ఉన్న హనుమంతరెడ్డి వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందువల వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చని, హనుమంతరెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగనే ఉందని నార్త్ జోన్ డీసీపీ తెలిపారు.

ఏపీలో ఫైబర్ గ్రిడ్ సేవలు ప్రారంభం...

తూ.గో : జిల్లాలోని సఖినేటి పల్లి మండలం మోరిలో ఫైబర్ గ్రిడ్ సేవలు ప్రారంభం అయ్యాయి. దీంతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఫైబర్ గ్రిడ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

నిర్వాసితులకు అండగా కాంగ్రెస్ : ఉత్తమ్

హైదరాబాద్ : రీడిజైన్ పేరుతో ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని టి.పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ముంపు ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. 144 సెక్షన్ విధించి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఉత్తమ్ స్పష్టం చేశారు.

తెలంగాణలో లోక్‌తంత్ర కాదు.. కేవలం ఏక్‌తంత్ర :జైపాల్ రెడ్డి...

హైదరాబాద్: తెలంగాణలో లోక్‌తంత్ర లేదని, కేవలం ఏక్‌తంత్ర నడుస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఓ నియంత అని, ఆయన ప్రజాకంటకంగా మారారని దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం నిర్బంధించబడిందన్నారు. మల్లన్నసాగర్‌ సాంకేతికంగా సాధ్యం కాదని జైపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక మల్లన్నసాగర్‌ భూములను తిరిగి ఇచ్చేస్తామని, లేదంటే 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని ఈ సీనియర్ నేత హామీ ఇచ్చారు.

గ్రేటర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి : జీహెచ్ ఎంసీ కమిషనర్

హైదరాబాద్ : నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ ఎంసీ అనేక హెచ్చరికలు జారీ చేసింది. గ్రేటర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలని, ప్రమాదకరంగా ఉన్న భవనాలను కూల్చివేయాలని, సెల్లార్ గుంతల వద్ద యజమానులు జాగ్రత్తలు పాటించాలని జీహెచ్ కమిషనర్ జనార్థన్ రెడ్డి సూచించారు.

15:31 - September 11, 2016
15:29 - September 11, 2016

నల్గొండ : జిల్లాలో బ్లాస్టింగ్స్ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. యాదాద్రికి వచ్చే భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. యాదాద్రి అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ పెద్దగుట్టపై చదును చేయడానికని చెన్నైకి చెందిన సన్ సైన్ సంస్థకు సర్కార్ పనులు అప్పగించింది. కానీ నిబంధనలను తుంగలో తొక్కిన సదరు సంస్థ బ్లాస్టింగ్ నిర్వహిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం రోజుల క్రితం స్థానిక వడ్డెర బస్తీ, ఇందిర కాలనీ ఇళ్లపై బండరాళ్లు ఎగిరిపడ్డాయి. దీనితో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజాగా యాదాద్రి నర్సింహ స్వామి దర్శనానికి వచ్చిన కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన రామకృష్ణ కారుపై బండరాళ్లు పడ్డాయి. దీనితో కారు పాక్షికంగా ధ్వంసమైంది. ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న వెంకయ్య

హైదరాబాద్: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ రోజు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. ఆయన తో పాటు మంత్రి హరీష్ రావు కూడా దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు మంత్రులకు శాలువాలు కప్పి సత్కరించారు.

ఇరురాష్ట్రాలకు భారీవర్ష సూచన

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరో 24 గంటల్లో కోస్తాంధ్ర సమీపంలో అల్పపీడనంగా మారే అవకాశముందని అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. 

15:11 - September 11, 2016

విజయవాడ : విరామం లేకుండా రైలు కూతలతో మార్మోగే విజయవాడ రైల్వే స్టేషన్‌ ఒక్కసారిగా మూగబోనుంది. నిత్యం ప్రయాణికులతో కళకళలాడే రైల్వే ప్రాంగణం బోసిపోనుంది. వారం రోజుల పాటు బెజవాడలో రైళ్ల రాక‌పోక‌లు నిలిచిపోనున్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఈ నెల 20 నుంచి 28 వరకు విజయవాడ మీదుగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. విజయవాడ కేంద్రంగా రాకపోకలు సాగించే 241 రైళ్లు పూర్తిగా, 361 రైళ్లు పాక్షికంగా రద్దు కానున్నాయి. ఇవి కాకుండా మరో 215 రైళ్లను దారి మళ్లించనున్నారు. ముఖ్యంగా విజయవాడ నుంచి కాజీపేట్ మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్ వెళ్లే రైళ్లను నిలిపివేయనున్నారు. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు...

20 నుంచి 25 వరకు పలు రైళ్ల దారి మళ్లీంపు...

ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, ఏపీ ఎక్స్‌ప్రెస్, సాయినగర్-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఈ నెల 20 నుంచి 25 వరకు దారి మళ్లీస్తారు. ఏలూరు, విజయవాడ బైపాస్ రాయనపాడు కొండపల్లి స్టేషన్‌ల మీదుగా నడ‌ప‌నున్నారు. ఇక ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ విజయవాడ మార్గంలో కాకుండా పగిడిపల్లి, గుంటూరు, తెనాలి స్టేషన్‌ల మీదుగా తిరుపతికి దారి మళ్లీస్తారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ సేవలు విజయవాడ, కాజీపేట్ మార్గంలో నిలిచిపోనున్నాయి. కొండపల్లి-విజయవాడ బైపాస్ మార్గంలో గుడివాడ, రాజమండ్రి మీదుగా మళ్లిస్తారు. మొత్తంగా వారం రోజుల పాటు విజయవాడ రైల్వే స్టేషన్‌లో రైళ్ల సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే 20 నుంచి 28 తేదీల్లో రిజర్వేషన్లు చేయించుకున్న ప్రయాణీకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  

15:07 - September 11, 2016

కర్నూలు : సోలార్ పవర్ ప్లాంట్ నిర్మిస్తామంటూ... రైతుల నుంచి విలువైన భూములను లాక్కుంది రాష్ట్ర ప్రభుత్వం. తీసుకొన్న భూమికి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి.. రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ నష్టపరిహాం అందలేదు. మరోవైపు సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయి. దీంతో కడుపుమండిన రైతులు పరిహారం కోసం ఆందోళన బాట పట్టారు.

ఆందోళన బాటలో రైతులు....

సోలార్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాటపట్టారు. ఓర్వకల్లు మండంలోని శకునాల, గని గ్రామంలో 5 వేల ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ భూముల్లో 4 వేల ఎకారాలు గని, శకునాల గ్రామానికి రైతుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కొంతమంది రైతులకు మాత్రమే నష్ట పరిహారమందించి.... మిగిలిన రైతులకు పరిహారమందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో పరిహారం కోసం రైతులు ఆందోళన బాట పట్టారు.

తమకు నష్టపరిహారం అందలేదంటూ రైతుల ఆగ్రహం.....

2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోయిన రైతులకు... నష్టపరిహారం అందిన తర్వాతనే అక్కడ అభివృద్థి పనులు చేపట్టాలి. కాని రాష్ట్ర ప్రభుత్వం అలా చెయ్యడం లేదు. కొంతమందికి మాత్రమే పరిహారమందించి పనులను కానిచ్చేస్తున్నారు అధికారులు. పరిహారం కోసం పవర్ ప్లాంట్ ఎదుట బైఠాయించి తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. సాగు భూములతో జీవనం సాగిస్తున్న తమను సోలార్ పేరుతో రాష్ట్ర సర్కార్‌ తీవ్రంగా నష్టపరిచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులు సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తే ఊరుకోం-ప్రభాకర్ రెడ్డి ...

సోలార్ పవర్ ప్లాంటు రైతుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. రైతులు సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. భూములు కోల్పోయి రైతులకు పరిహారం అందక, వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించి, తమకు పరిహారం అందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

15:05 - September 11, 2016

హైదరాబాద్ : మహాంకాళీ పీఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మరమ్మత్తులు చేస్తుండగా గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే...చంద్రలోక్ కాంప్లెక్సులో శ్రీనివాస్ అనే వ్యక్తి మరమ్మత్తులు చేపడుతున్నాడు. ఒక్కసారిగా గోడ కుప్పకూలడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇతను గోల్నాక వాసిగా గుర్తించారు. అడ్డా మీద ఉన్న కూలీలను కాంట్రాక్టర్ తీసుకొచ్చినట్లు, అందులో శ్రీనివాస్ వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

14:58 - September 11, 2016

సీజనల్ వ్యాధులతో తస్మాత్...!

ప్రతి సీజన్‌లోనూ రకరకాల వ్యాధులు ప్రజల ప్రాణాలను అరచేతపట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం వర్షాలతో కొత్త నీరు రావడం, కొన్ని చోట్ల నిలువ ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, పారిశుధ్యం తదితర కారణాలతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అలాగే ఆహారం, మంచి నీరు, దోమలు, ఈగల వల్ల కూడా అనేక వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆహారం పరిశుభ్రత లోపిస్తే అతిసార, జాండీస్, టైఫాయిడ్‌, మంచినీరు, పరిశుభ్రత లోపిస్తే అతిసార, కలరా, టైఫాయిడ్‌, దోమ కాటుతో మలేరియా, డెంగ్యూ, ఈగలతో టైఫాయిడ్‌, ఇతర అంటువ్యాధులు, అనూహ్యంగా స్వైన్‌ఫ్లూ వంటి భయంకర వ్యాధులు పేషెంట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రజలను ఏలుతున్న వారు విఫలమవుతున్నారు. ఫలితంగా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.. 
జలుబు... దగ్గు...

వర్షాకాలం వస్తే చాలు అప్పటివరకూ ఎక్కడ వుంటుందో తెలియదు కాని ఒక్కసారిగా వచ్చి పట్టేస్తుంది జలుబు. పెద్దవాళ్లయితే ఏదో విధంగా తట్టుకుంటారు కాని పిల్లలు నీరసించిపోతారు. ఒకరి నుంచి ఒకరికి వెంటనే వ్యాపించే ఈ జలుబు, దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్ సమస్యలకు కొన్ని నివారణ సూచనలు.
జలుబు, జ్వరం లక్షణాలు కనిపించగానే ఎక్కువ హానికరం కాని పారాసిటమాల్ టాబ్లెట్‌లు వాడవచ్చు. జలుబు పూర్తిగా దారికి వచ్చే వరకు రోజుకు మూడుసార్లు వేడి నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిటపట్టాలి.
రోజులో కనీసం మూడుసార్లయినా పసుపు లేదా, అదుబాటులో ఉండే జండూబామ్ వేసుకుని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు గొప్ప రిలీఫ్ వస్తుంది.
ఈ సీజన్‌లో నీళ్ల నుంచి అనేక జబ్బులు వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ దాకా కాచి, వడపోసిన నీళ్లు మాత్రమే తాగితే మంచిది.
నిమ్మపండు ఈ సీజన్‌లో వచ్చే జలుబు లక్షణాలను త్వరగా తగ్గిస్తుంది. వేడి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జబ్బు నుంచి త్వరగా ఉపసమనం పొందుతారు.
మిరియాలు, వెల్లుల్లి, అల్లం.. ఇవన్నీ కూడా ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో రిలీఫ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి.
జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లల ఛాతీపై ఆవనూనెకు వెల్లుల్లి కలిపి మసాజ్ చేయాలి. చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ మెల్లగా మసాజ్ చేయాలి.
శరీరానికి మంచినీరు ఎంతో అవసరం. పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఎక్కువ సార్లు మంచినీరు తాగించాలి. అప్పుడు శరీరం వ్యాధితో సమర్థంగా పోరాడగలదు. కోల్పోయిన నీటి శాతం వెంటనే భర్తీ అవుతుంది.

డెంగీ ఫీవర్...

సీజనల్‌ ఫీవర్స్ జనం ప్రాణాలు తీస్తున్నాయి. పల్లే, పట్టణం తేడాలేకుండా జనం జ్వరాల బారీన పడి మూలుగుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు డెంగ్యూ జ్వరాలు విజృభింస్తున్నాయి. ప్రభుత్వ , ప్రైవేటు అనే తేడా లేకుండా ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ప్రత్యేకంగా డెంగ్యూ అనగానే సామాన్యుడికి వణుకు పడుతుంది. అంటువ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనది డెంగ్యూ. డెంగ్యూ కేసులు రోజురోజుకి డెంగ్యూ కేసులు పెరిగుతున్నాయి. ఎడిస్‌ ఎజిప్టై దోమ కుట్టడం వల్ల ఈ వైరస్ ప్రబలుతోంది. డెంగ్యూ వ్యాధి వచ్చిన రోగిని కుట్టిన దోమ... మరొకరిని కుట్టినా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తుండటం వల్ల.. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే.. సమస్యను ముందుగానే తెలుసుకుని.. మందులు తీసుకుంటే.. ప్రమాదం నుంచి బయటపడవచ్చు. డెంగ్యూ లక్షణాలు అందరికి ఒకేలా ఉండవు. కాబట్టి ఏ మాత్రం అనుమానం వచ్చినా.. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఇంతకీ డెంగ్యూ సోకినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలేంటో ఒకసారి చూద్దాం..

వ్యాధి లక్షణాలు.....
- ఉన్నట్టుండి జ్వరం అధికంగా వస్తుంది.
- తలనొప్పి అధికంగా ఉంటుంది.
- కంటిలోపల నొప్పి వచ్చి కంటి కదలికలను తగ్గుతాయి. శ్రీ కన్ను కదిలినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది.
- కండరాలు, కీళ్ల నొప్పులు.
- వాంతి అవుతున్నట్లు అనిపిస్తుంది.
- నోరు(డీహైడ్రేషన్) ఎండిపోతుంది. దాహం ఎక్కువగా అవుతుంది.
- ప్లేట్ల టెల్స్ కౌంట్ తగ్గిపోవడం...
- లో బీపీ, చర్మంపై దద్దుర్లు, పొట్టలో వికారంగా ఉండటం,
పై లక్షణాలు ఏ ఒక్కటి కలిగి ఉన్నా వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చూయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. డెంగ్యూ నివారణకు ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు. వెంటనే స్పందించి జ్వర తీవ్రతను గుర్తించి చికిత్స తీసుకోవాలి.


వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలి....
దోమతెరలు, నివారణ మందులు వాడి దోమ కాటు నుండి విముక్తి పొందవచ్చు. పొడుగు ప్యాంట్లు, పొడుగు చేతులు గల చొక్కాలు ధరించాలి. అన్ని భాగాలు రక్షణ కలిగే విధంగా వేసుకోవాలి.పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పేటట్లు దుస్తులు వేయాలి. సొంత చికిత్స చేయకూడదు. ఆస్ప్రిన్‌, బ్రూఫెన్‌, కాంబిఫ్లామ్‌, అనాలజిన్‌ లాంటి మాత్రలు తీసుకోకూడదు. జ్వరం వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

14:53 - September 11, 2016

చెన్నై : రియో పారాఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన మరియప్పన్‌ సొంత గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. మరియప్పన్ సాధించిన విజయం పట్ల అతని తల్లి సరోజ సంతోషం వ్యక్తం చేసింది. తమిళనాడులోని సేలం జిల్లా పెరియవడకపట్టికి చెందిన తంగవేలు, సరోజల నాలుగో సంతానమైన మరియప్పన్ ఐదేళ్ల వయస్సులో జరిగిన బస్సు ప్రమాదంలో వికలాంగుడయ్యాడు. తల్లి కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించేది. తల్లికి చేదోడువాదోడుగా మరియప్పన్ కూడా కూలిపనులకు వెళ్లేవాడు. స్నేహితుల సాయంతో హైజంప్ నేర్చుకున్నాడు. రియోలో బంగారు పతకం గెలవడంతో మరియప్పన్‌కు తమిళనాడు ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 75లక్షలు ప్రకటించింది.

14:39 - September 11, 2016

కరీంనగర్ : రాత్రి కురిసిన కుండపోత వర్షానికి కరీంనగర్ జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. కరీంనగర్‌లో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. తిరుమల నగర్‌లో కాలువపై నిర్మించిన కల్వర్ట్ కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జగిత్యాలలో 38.4సె.మీ, ధర్మపురి 32, మాల్యాల 57, పెగడపల్లి 65 సెంటీ మీటర్ల భారీ వర్షం కురిసింది. నగర మేయర్ రవీందర్ సింగ్ వార్డుల్లో పర్యటిస్తూ సిబ్బందితో సహయక చర్యలు చేపట్టారు. 

14:37 - September 11, 2016

హైదరాబాద్ : మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో చెరువులు కళకళలాడుతున్నాయని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన 'రైతునేస్తం మాసపత్రిక' 12వ వార్షికోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని సాగునీటి ప్రాజెక్టుల కోసం బడ్డెట్‌లో 25 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. 

14:34 - September 11, 2016

విశాఖపట్టణం : అన్ని వనరులున్నా ఉత్తరాంధ్ర ఇంకా అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. ఏపీకి ప్రత్యేక ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు..లేకపోతే పోరాడి సాధించుకోవాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన ఉత్తరాంధ్ర..రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయన్నారు. ఉత్తరాంధ్ర మాత్రం వెనుకబడటానికి రాజకీయ కారణాలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమే కారణమన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చేశామని చెప్పారని, కానీ తెలంగాణ మాత్రం అభివృద్ధి కాలేదన్నారు. ప్రకటనలతో ప్రజలను మభ్య పెడుతున్నారని, బీజేపీ, టిడిపిలు ప్రజలను నిట్టనిలువునా ముంచుతున్నారని విమర్శించారు. హోదా పదేళ్లు కావాలని గంభీరాలు పలికిన నేతలు నేడు ప్లేటు ఫిరాయిస్తున్నారని, ప్యాకేజలు అయితే తెచ్చుకోవచ్చు..పంచుకోవచ్చన్నారు. వాగ్ధానాలను ఎందుకు మరిచిపోతారని ? వారు తెలివి తక్కువ వాళ్లు కాదన్నారు. ప్రతొక్కరూ హోదా కావాలని కోరుకుంటున్నారని, హోదా ఇవ్వకపోతే రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:31 - September 11, 2016

విజయవాడ : తనను టెర్రరిస్ట్‌గా చిత్రీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. రాజమండ్రిలో 13 జిల్లాల కాపు జేఏసీ నేతలతో ముద్రగడ భేటీ అయ్యారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కాపులకు ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు ఢిల్లీలో అమ్మేశారని, ప్రతి మాటికి ఆర్థిక పరిస్థితి బాగా లేదంటారా? అని సూటిగా ప్రశ్నించారు. విదేశాలు తిరగడానికి..ప్రత్యేక విమానాలు తిరగడానికి మాత్రం డబ్బులంటాయా ? అని ప్రశ్నించారు. 

14:26 - September 11, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్-3 మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కోసం ఎస్‌2 సెట్ కోడ్ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగింది. వన్ మినిట్ నిబంధన కారణంగా.. విద్యార్థులు కనీసం గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షకు ఎస్‌2 సెట్ కోడ్ ప్రశ్నాపత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని.. నిమిషం ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతించమని తెలపడంతో అభ్యర్థులు ఉదయం నుంచే పరీక్షా కేంద్రాలకు బారులు తీరారు. ఉస్మానియా యూనివర్శిటీ దూర విద్యాకేంద్రంలో ఓ విద్యార్థిని ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. ఇక్కడ తప్పితే మిగిలిన అన్ని చోట్ల అభ్యర్థులందరూ సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఎంసెట్‌-2 పేపర్ లీకేజీ కారణంగా.. ఈ పరీక్షను నిర్వహించారు.

ఆర్టీసీ బస్సు ఛార్జీల మినహాయింపు ఎక్కడ ? 
గతానుభవాల దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తుతో పాటు బాంబ్‌స్కాడ్‌లు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 14 ప్రాంతీయ కేంద్రాలు, 96 టెస్ట్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్-3 పరీక్షా షెడ్యూల్ విడుదల చేసినప్పుడు విద్యార్థులకు ఆర్టీసీ బస్సు చార్జీలు మినహాయింపుస్తామని సీఎం ప్రకటించారని.. అయితే ఆర్టీసీ సిబ్బంది మాత్రం చార్జీలు వసూలు చేశారని కొంతమంది అభ్యర్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఇవాళ సాయంత్రం ప్రాథమిక కీ విడుదల చేసి, ఈ నెల 14 వరకు వాటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఈ నెల 16న అధికారులు తుది ఫలితాలు విడుదలచేస్తారు.. అక్కడక్కడ కొన్ని సంఘటనలు తప్ప మొత్తమ్మీద ఎంసెట్‌-3 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 

'మెడికల్ సీట్ల కుంభకోణంపై మంత్రి కామినేని చర్చకు రావాలి'

విజయవాడ : మెడికల్ సీట్ల కుంభకోణంపై మంత్రి కామినేని చర్చకు రావాలి' ఎస్ ఎఫ్ఐ, ఏఐఎస్ ఎఫ్ డిమాండ్ చేశాయి. ఈ మేరకు విజయవాడలో మెడికల్ బీ కేటగిరీ సీట్ల భర్తీలో అవకతవకలపై ఎస్ ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత వైవీ పాల్గొన్నారు.

వపన్ విమర్శల్లో పస లేదు : ఎంపీ కంభంపాటి

ఢిల్లీ : పవన్ విమర్శల్లో పసలేదని విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ...ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చడం బాధాకరం అని అన్నారు. ఈ ప్యాకేజీ రావడానికి వెంకయ్య చొరవే కారణం అని, ఢిల్లీలో ఏపీకి పెద్ద దిక్కు వెంకయ్యనేనని కంభంపాటి తెలిపారు. వెంకయ్యపై వ్యక్తిగత విమర్శిలు చేయడం దురదృష్టకరమని, విమర్శలు చేసేముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. బిజెపి నాయకులెవరూ పదవుల కోసం పని చేయడం లేదని, ఏపీ ప్రజల పొట్టనింపడానికి బిజెపి కృషి చేస్తోందన్నారు.

కేంద్రంతో సఖ్యతగా ఉంటే రాష్ట్రానికి మంచిది: కామినేని

హైదరాబాద్ : కేంద్రంతో సఖ్యతగా ఉంటే రాష్ట్రానికి మంచిదని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదాను ప్రజల్లో సెంటిమెంట్ గా మార్చారని, కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం తెగతెంపులు చేసుకుంటే అన్నం పెట్టే చేతులను నరుక్కోవడమే నని కామినేని హెచ్చరించారు.

13:25 - September 11, 2016

నల్గొండ : నల్లగొండ జిల్లా కోదాడలో డివైఎఫ్ ఐ తెలంగాణ మహాసభలు రెండోరోజు కొనసాగుతున్నాయి. తెలంగాణ నుంచి 400మంది యువజన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామని సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్‌ చెప్పారు. 

 

13:21 - September 11, 2016

ప్యాకేజీపై చర్చకు సిద్ధం : సిద్ధార్థనాథ్ సింగ్

ఢిల్లీ : పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ప్యాకేజీని అర్థం చేసుకుని మాట్లాడాలని ఏపీ బిజెపి ఇన్ ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. ప్యాకేజీపై పవన్ తో సహా ఎవరితోనైనా చర్చకు సిద్ధమని, వెంకయ్యకు పవన్ కల్యాణ్ సర్టి:ఇకేట్ అవసరం లేదని, ఎన్ డీఏలో జనసేన ఎపుడు చేరింతో... వెప్పుడు వెళ్లిందో... పవన్ చెప్పాలని సింగ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, వైపీసీ పాచిపోయిన లడ్డూలు అని జన సేన కూడా ఆ జాబితాలో చేరాలనుకుంటోందని సిద్ధార్థనాథ్ సింగ్ ఎద్దేవా చేశారు.

13:15 - September 11, 2016

విజయవాడ : ఏపీ అభివృద్ధికోసం పవన్‌ కల్యాణ్‌తో కలిసి పనిచేస్తామని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్యాకేజీకింద 2లక్షల 75వేల కోట్లు ఇస్తున్నామని వెంకయ్య... కాదు 70వేలకోట్లు అంటూ చంద్రబాబు... ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.. వ్యాపారులు, కోటీశ్వరులు ప్రజాప్రతినిధులు ఎన్నికవడంవల్లే రాష్ట్రానికి ఈ ఖర్మ పట్టిందని ఆరోపించారు.. ఎంపీ గల్లా జయదేవ్‌ గుంటూరు రోడ్లను ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు.. పాచిపోయిన రెండు లడ్డూలను వెంకయ్య, చంద్రబాబులే తినాలని సూచించారు.. మోసం చేసిన బీజేపీ మంత్రులకు సన్మానం చేయడం విచిత్రంగా ఉందని రామకృష్ణ విమర్శించారు.. 

 

13:13 - September 11, 2016
13:11 - September 11, 2016

కర్నూలు : జిల్లాలోని విషాదం చోటు చేసుకుంది. సి.బెళగల్‌ మండలం కొండాపురంలో గొంతులో చాక్లెట్ ఇరుక్కొని ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

 

తమ ప్యాకేజీల కోసమే ప్యాకేజీలు అడుగుతున్నారు : రాఘవులు.

హైదరాబాద్ : విశాఖ నగర అభివృద్ధినే ఉత్తరాంధ్ర అభివృద్ధిగా ప్రచారం చేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పై విశాఖ లో ఓ సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఒకప్పుడు హోదా కోసం డిమాండ్ చేసిన బిజెపి, టీడీపీ నేతలు తమ ప్యాకేజీల కోసమే రాష్ట్రానికి ప్యాకేజీలు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. జన సేన అధినేత పవన్ బయటికి వచ్చి మాట్లాడటం మంచిదేనని... అయితే కార్యాచరణ రూపొందించుకోవాలని రాఘవులు సూచించారు.

12:51 - September 11, 2016

హైదరాబాద్ : ఆయన్ను ముభావి అంటారు. నవ్వితే నవరత్నాలు రాలతాయేమోనన్నట్లుగా సీరియస్‌గా ఉంటాడంటారు. పనిరాక్షసుడన్నదీ ఆయనకున్న విశేషణం. అలాంటి వ్యక్తి.. తన తత్త్వానికి భిన్నంగా.. నవ్వుతూ.. నవ్విస్తూ.. సరదాగా.. ఉల్లాసంగా గడిపారు. చెంతకు వచ్చిన ప్రతివారినీ ఆప్యాయంగా పలుకరించారు. వారితో కలిసి ఫోటోలకు ఫోజులూ ఇచ్చారు ఇంతకీ ఎవరాయన...? అసలాయనలో ఇంత ఉల్లాసాన్ని నింపిన అంశమేంటి..?వాచ్‌ దిస్‌ స్టోరీ. 
సీఎం చంద్రబాబులో ఉత్సాహం
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా ముగిశాయి. కానీ ఏపీ సీఎం చంద్రబాబులో ఆ టెన్షన్‌ కొంచెమైనా కనిపించలేదు. ఎప్పుడూ పార్టీ, ప్రభుత్వ పనులు.. అవి కలిగించే ఒత్తిళ్లతో ఎప్పుడూ గంభీరంగా కనిపించే చంద్రబాబు.. శనివారం మాత్రం చాలా ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపించారు. అంతేనా.. తనను కలిసిన మీడియాతోను, మండలిలో ప్రసంగం సందర్భంలోనూ.. పాతికేళ్ల వయసప్పటి నుంచి ఇప్పటిదాకా తన జీవితంలో ఎదురైన వివిధ ఘట్టాలను... మధుర స్మృతులను పంచుకున్నారు. 
ఉల్లాసంగా కనిపించిన చంద్రబాబు 
శనివారం తమ పెళ్లిరోజు కావడంతో.. చంద్రబాబు చాలా ఉల్లాసంగా కనిపించారు. యవ్వనం నుంచి తన రాజకీయ ఎదుగుదల క్రమాన్ని గుర్తు చేసుకున్నారు. శాసనమండలికి పోటీ చేయడం ద్వారానే తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని తాను భావించానని చంద్రబాబు చెప్పారు. అయితే అప్పట్లో పోటీ నాటికి తనకు 23 ఏళ్లే కావడంతో.. తన కోరిక నెరవేరలేదన్నారు. అయితే ఐదేళ్ల లోపే 1978లో తన 28వ ఏట తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, అదే స్పీడ్‌లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డిని కలిసి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరానన్నారు. కొంతకాలం ఆగవోయ్.. అప్పుడే తొందరైతే ఎలా అని ఆయన సర్దిచెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అంజయ్య మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిని కాగలిగానని చెప్పారు. 
నందమూరి ఫ్యామిలీతో చంద్రబాబు పరిచయం..
ఇక నందమూరి ఫ్యామిలీతో తన పరిచయం.. అనుబంధంగా మారడం.. మొదలైన తీపి సంగతులనూ చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. తాను తొలిసారి మంత్రి అయిన రోజుల్లో.. ఎన్‌టీఆర్‌ పెద్దకుమారుడు జయకృష్ణ.. ఎగ్జిబిటర్‌గా ఉండేవారని.. ఆయన, తాను తరచూ కలిసేవారమని చంద్రబాబు చెప్పారు. ఆయనతో కలిసే.. ఎన్టీఆర్‌ను తొలిసారిగా అనురాగదేవత సినిమా షూటింగ్‌లో చూశానన్నారు. ఆతర్వాత ఏడాదిలోపే.. ఎన్టీఆర్‌ తన కుమార్తె భువనేశ్వరీదేవిని తనకిచ్చి పెళ్లి చేశారని.. అలా నారా-నందమూరి  కుటుంబాలమధ్య బంధం ఏర్పడిందన్నారు.. మద్రాసులో  తమ వివాహం అంగరంగవైభవంగా జరిగిందంటూ నాటి రోజులను గుర్తుచేసుకున్నారు.. చంద్రబాబు. 
మంత్రి అని మీకు పిల్లనివ్వలేదన్న ఎన్ టీఆర్   
కాంగ్రెస్‌ రాజకీయాలతో ఓసారి తన పదవికి ఎసరు వచ్చిందని, అదే విషయాన్ని ఎన్టీఆర్‌కు చెబితే మంత్రి అని మీకు పిల్లనివ్వలేదన్న భరోసా ఇచ్చారని, ఎన్టీఆర్‌లోని కమిట్‌మెంట్‌ను తెలియజేస్తుందని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానించింది తానేనని, అయితే 60 ఏళ్ల వరకు తన జీవితం కుటుంబానికి.. ఆ తర్వాత ప్రజలకు అంకితం చేస్తానని ఎన్టీఆర్‌ చెప్పినట్లు చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 
ప్రధానిగా జ్యోతిబసు పేరును ప్రతిపాదించా : చంద్రబాబు
నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఆయన రాజీనామాను తాను ఏపరిస్థితుల్లో కోరానో ఆయనకే వివరించారనని చంద్రబాబు చెప్పారు. పార్టీలో నైతిక విలువలు పాటించడం వల్లే తనకు జాతీయ స్థాయిలో పలుకుబడి ఉందని వెల్లడించారు. ప్రధానిగా తన పేరును ప్రతిపాదించినప్పుడు.. తాను మాత్రం పశ్చిమబెంగాల్‌ అప్పటి ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరును ప్రతిపాదించానని బాబు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో పదోతరగతి చదువుతున్న తన కుమారుడు లోకేశ్‌ కూడా ప్రధాని పదవి తాత్కాలికమని, ముఖ్యమంత్రి పదవే శాశ్వతమని తనతో అన్నట్లు చంద్రబాబు వెల్లడించారు. పవన్‌ కల్యాణ్‌ పాచిపోయిన లడ్డూల కామెంట్‌కు స్పందనగా.. తానేమీ తెలివితక్కువ వాడిని కానని, స్టేటస్‌తో పాటు పోలవరం, ఇతర ప్రాజెక్టులు తన ముందున్న లక్ష్యాలని చెప్పుకొచ్చారు. 
హైదరాబాద్‌ అసెంబ్లీలో ఇవే చివరి సమావేశాలు : చంద్రబాబు 
కొత్తరాజధాని అమరావతి నుంచి పాలన ప్రారంభమైనా.. అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఉమ్మడిరాజధాని హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. అన్ని అనుకూలిస్తే.. వచ్చే సమావేశాలు అమరావతిలోనే జరగనున్నాయని భావిస్తున్న చంద్రబాబు..  ఇదే విషయాన్ని మండలి సభ్యులతో పంచుకున్నారు. హైదరాబాద్‌ అసెంబ్లీలో ఇవే చివరి సమావేశాలు కావొచ్చని ఆయన ప్రకటించారు. అనంతరం.. అసెంబ్లీ హాలును తనవితీరా చూస్తూ...తన 40ఏళ్ల రాజకీయజీవితాన్ని నెమరువేసుకున్నారు. తన జీవితంలో చోటుచేసుకున్న  పలు అనుభవాలను ఆయన గుర్తుచేసుకున్నారు.
భావోద్వేగానికి గురైన చంద్రబాబు
తమ పెళ్లిరోజు కావడం.., అసెంబ్లీ హాలుతో తీరనున్న అనుబంధం కలగలిపి.. చంద్రబాబు ఒకింత భావోద్వేగానికీ గురయ్యారు. అంతలోనే చిరునవ్వులు పూయిస్తూ.. సహచరులతో సెల్ఫీలు దిగారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ వరుసగా పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతుండటంతో.. ముఖ్యమంత్రిలో ఉత్సాహం రెట్టించినట్లుగా కనిపించింది. 

 

కమ్యూనిస్టులను విమర్శించే హక్కు వెంకయ్యకు లేదు : నారాయణ

హైదరాబాద్ : కమ్యూనిస్టులను విమర్శించే హక్కు వెంకయ్యకు లేదని సిపీఐ నారాయణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆశలు కల్పించి మోసం చేయడం బిజేపీకే దక్కిందని విమర్శించారు. నయీం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

12:42 - September 11, 2016

హైదరాబాద్‌ : నగరంలోని ఉప్పల్‌ ఆర్టీసీ బస్సు డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించారు. డిపోలో పనిచేసే రత్నకుమారి అనే మహిళ కండక్టర్‌ను అకారణంగా బదిలీచేశారని.. వెంటనే కండక్టర్‌ బదిలీని నిలిపివేయాలని.. లేనిపక్షంలో నగరమంతా ఆందోళనలు ఉధృతం చేస్తామని కార్మికులు ఆర్టీసీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. 

 

12:39 - September 11, 2016

విశాఖ : ప్రభుత్వాల వైఫల్యాలే ఉత్తరాంధ్ర వెనుకబాటుకు కారణమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘువులు విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విశాఖలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఉత్తరాంధ్ర చాలా వెనుకబడి ఉందన్నారు. ఉత్తరాంధ్రలో చాలా సమస్యలున్నాయని పేర్కొన్నారు. పుష్కలంగా నీళ్లున్నా అభివృద్ధి లేదని చెప్పారు. నీళ్లన్నీ సముంద్రం పాలవుతున్నాయని వాపోయారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు దీర్ఘకాలిక కారణాలున్నాయని చెప్పారు. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాలని తెలిపారు. ఉత్తరాంధ్రలో ప్యూడల్ ప్రభావం అత్యఅధికంగా ఉందన్నారు. ప్యూడల్ వ్యవస్థలో స్వంతం గురించే ఆలోచిస్తారని.... ప్రజల కోసం ఆలోచన చేయరని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో చాలా గొప్ప పేరు, ప్రతిష్టలున్న జమిందారులున్నారని తెలిపారు. వీరు జమిందారీ వ్యవస్థను బలపరచడానికి పోరాడారు తప్ప... భగత్ సింగ్ లాగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారు కాదని స్పష్టం చేశారు. ఇక్కడి జనానికి ఎదురు తిరిగే లక్షణాన్ని చంపేశారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు చాలా సౌమ్యులని కొనియాడారు. ఇక్కడి ప్రజల నుంచి తాను ఎప్పుడూ బూతు పదాన్నే వినలేదన్నారు. ఎంత కోపమొచ్చిన పరుష పదాలు వాడరని తెలిపారు. 

 

12:35 - September 11, 2016

అవకాడ పండు..ఈ పేరు ఎపుడో ఎక్కడో విన్నట్లు అనిపిస్తోందా. అవునులేండి ఈ పండు మన దేశంలో అంత విరివిగా వాడుకలో లేదు. ఇది మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన ఫలం. ఈ మధ్యకాలంలో సూపర్ మార్కెట్లలో లభ్యమౌతున్నాయి. అవకాడోను వెన్న పండు అని కూడా పిలుస్తారట దీనిని ఇంగ్లీషులో ఎవకాడో (Avocado) అని కూడా పిలుస్తారు. ఇది చూడటానికి ఆకుపచ్చని రంగులో కాడవైపు సన్నగా, వెనుక వేపు లావుగా ఉంటుంది. ఇది మెత్తగా తినడానికి కొద్దిగా ఆవు వెన్న రుచిగానూ, కొద్దిగా చిరు చేదుగానూ ఉంటాయి. అవకాడో పండ్లలో ఎక్కువ కేలరీలనిచ్చే పండు. వందగ్రాము పండులో 167 కేలరీలనిస్తాయి. అవకాడో పండులో విటమిన్ ఏ,ఇ పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఈ పండు తినడం వల్ల మంచి చర్మ తేజస్సు కలిగి ఉంటారు. అవకాడో గుజ్జు, దోసగుజ్జు, తేనె, పెరుగు సమపాళ్లలో కలిపి మొహానికి ప్యాక్ లా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. కాంతివంతమైన, తోజోవంతమైన చర్మం మీ సొంత అవుతుందని బ్యూటీషియన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదండోయ్ గుండె ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన మోనో-సాచురేటెడ్ ఫాట్'ని కలిగి ఉన్నందున శరీరంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను ( హెచ్ డీఎల్) పెంచి, కొవ్వు పదార్థాల స్థాయిలను (ఎల్ డీఎల్) తగ్గిస్తాయి. బీటా-సిటోస్టిరాల్, మోనో-సాచురేటెడ్ ఫాట్ రెండిని కలిగి ఉన్న అవకాడో కొవ్వులను తగ్గేలా చేస్తుంది. కేన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్ లను అదుపు చేసే లక్షణం కూడా వెన్న పండుకు ఉన్నది. అవకాడో అధిక స్థాయిలో పొటాషియం కలిగి ఉంటుంది. ఇది రక్త పీడనం సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడొలు ఫోలిక్ ఆమ్లం కలిగి ఉంటాయి. మరి ఇంకెదుకు ఆలస్యం... వెంటనే ఆవకాడో కోసం వేట మొదలెడదాం.

12:25 - September 11, 2016
12:23 - September 11, 2016

విజయవాడ : ఎపికి ప్రత్యేకహోదా అవసరం లేదనకున్నప్పుడు పార్లమెంట్ లో ప్రత్యేకహోదా ఎందుకు అడిగారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వవద్దని 14 వ  ఆర్థిక సంఘం నివేదికలో చెప్పలేదన్నారు. వెంకయ్యనాయుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎపికి ప్రత్యేకహోదా అవసరమా.. లేదా.. చెప్పాలన్నారు. లోటు బడ్జెట్ ను ఎలా పూడుస్తారో చెప్పాలన్నారు. ఏపీని మరో రాష్ట్రంతో పోల్చడానికి వీల్లేదని పేర్కొన్నారు. హోదా ఇస్తామంటేనే టీడీపీ, బీజేపీలకు ప్రజలు ఓట్లేశారని తెలిపారు. అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి రాష్ట్రాన్ని విడదీశారని ఆరోపించారు. పరిశ్రమలన్నీ హైదరాబాద్ కే పరిమితమయ్యాయని తెలిపారు. 

హోదా కోసం పవన్ తో కలిసి పోరుకు సిద్ధం: రామకృష్ణ

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత పవన్ తో కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు పూటకో మాటాల మాట్లాడుతున్నారని విమర్శించారు. గుంటూరులో 18,19 తేదీలో సీపీఐ కోర్ కమిటీ వర్క్ షాప్ నిర్వహించకోనున్నట్లు తెలిపారు.

11:58 - September 11, 2016

శ్రీకాకుళం : జిల్లాలో ఉన్న ప్రతిష్ఠాత్మక రిమ్స్ పరిస్థితి రానురాను దిగాజారిపోతోంది. జిల్లాలోని ఏకైక వైద్య విద్యాలయం సేవలు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి. పలు కీలక పోస్టులలో ఖాళీలు ఏర్పడడంతో.. వైద్య విద్య భవితవ్యం అయోమయంలో పడింది. దీనికితోడు వైద్యసేవలు సక్రమంగా అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రిమ్స్‌లో పారిశుద్ధ్యం, జవాబుదారీతనం కొరవడి పెద్దాసుపత్రి పరువు బజారున పడుతోంది. రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. వైద్య విద్యాలయం పేరు చెబితేనే రోగులు వణికిపోతున్నారు
పెద్దాసుపత్రికి మాయరోగం  
శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వం తరుపున సేవలందిస్తున్న పెద్దాసుపత్రికి మాయరోగం దాపురించింది. ప్రభుత్వం నిర్లక్ష్యం, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో  రిమ్స్‌ నిర్లక్ష్యానికి నిదర్శంగా మారింది. ప్రస్తుతం రిమ్స్‌లో డైరెక్టరు పోస్టు ఇంచార్జీతోనే కాలం వెల్లదీస్తున్నారు. పలు అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, డీన్, రిజిస్ట్రార్ లాంటి కీలక పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో వైద్య విద్య భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. 
సిబ్బంది లేమి, నిధుల సమస్య 
రిమ్స్‌లో సిబ్బంది లేమి, నిధుల సమస్య అభివృద్దికి అడ్డంకిగా మారాయి. మరోవైపు జిల్లాకు పెద్దదిక్కు అయిన రిమ్స్‌లో వైద్యం బాధ్యతాయుతంగా లేదని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. రిమ్స్ లో పారిశుద్ధ్యం అంతంత మాత్రమే కావడంతో.. పెద్ద సంఖ్యలో పందులు తిష్ఠవేశాయి. దీంతో రోగాలు తగ్గించుకునేందుకు ఆసుపత్రికి వస్తున్న రోగులకు మరిన్ని రోగాలు వచ్చే ప్రమాదం ఏర్పడింది.  పెద్దసుపత్రిలోని పలు బ్లాకులు  చెత్తచెదారం, మురుగు పేరుకు పోవడంతో  రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
ప్రశ్నార్ధకంగా వైద్య విద్య, రోగులకు వైద్యం 
ఇటు వైద్య విద్య, అటు రోగులకు వైద్యం రిమ్స్‌లో ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఖాళీగా ఉన్న కీలక పోస్టులు భర్తీ చేసి రిమ్స్‌ను పూర్తిస్థాయి వైద్య విద్యాలయంగా తీర్చిదిద్దాలని శ్రీకాకుళం జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.  

 

11:54 - September 11, 2016

కరీంనగర్ : ఈ ఏడాది వర్షాలు బాగానే కురుస్తాయనుకున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ఖరీఫ్ లోనూ కరవుఛాయలు కమ్ముకోవడంతో సాగు సంక్షోభంలో కూరుకుపోతుంది. వానలు ముఖం చాటేయడంతో వరి పొలాలు ఎండిపోతుండగా..పత్తి, మొక్కజొన్న సహా ఆరుతడి పంటల పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీంతో ఖరీఫ్ కాలం రైతులకు కన్నీటినే మిగిల్చింది. కరీంనగర్‌లో ఖరీఫ్‌ రైతుల కష్టాలపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ. 
అన్నదాతలను వెంటాడుతున్న కష్టాలు  
కరీంనగర్ జిల్లాలో ఖరీఫ్ లోనూ అన్నదాతలను కష్టాలు వెంటాడుతున్నాయి. వరుసగా రెండేళ్ల కరువుతో అల్లాడిన రైతులు...ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన పంటలు సాగు చేయడానికి సిద్ధపడ్డారు. పొలాలను దున్ని నారు వేసుకున్నప్పటికీ నాట్లు వేసే సమయానికి వర్షాలు కురవకపోవడంతో సాగునీటి కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు జిల్లాకు సాగునీరు అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో తగ్గడంతో ఆయకట్టు రైతులు ఖరీఫ్ పై ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు అనుకూలిస్తాయని భావించినా అన్నదాత ఆశలు అడియాసలయ్యాయి. 
రైతుల్లో ఆందోళన 
ఖరీఫ్ సీజన్‌లో 5లక్షల 20 వేల  హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా..ఇప్పటి వరకు 3లక్షల  హెక్టార్లలో 68 శాతం పంటలు సాగయ్యాయి. వరి 1 లక్షా 60 వేల   హెక్టార్లలో సాగవుతుందని అధికారులు అంచనా వేయగా..80వేల 185 హెక్టార్లలో మాత్రమే సాగైంది. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు నీళ్లందక వాడిపోతున్నాయి. పొలాలు నెర్రలు చాస్తున్నాయి. బోరుబావి ద్వారా నీళ్లందించినా ఎండలకు ఆవిరవుతున్నాయి. దీంతో ఏం చెయ్యాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. 
వరి పంట పరిస్థితి దయనీయం 
కరీంనగర్, హుజురాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి డివిజన్ లలో వరి పంట పరిస్థితి  దయనీయంగా మారింది. కెనాల్ కాలువల ఆయకట్టు కింద దాదాపు లక్షన్నర ఎకరాలు సాగవుతుండగా నీటిని అందించే పరిస్థితి లేకపోవడంతో రైతులు  ఆందోళనలు చేపడుతున్నారు. తిమ్మాపూర్ లో పొలాలకు నీరు రావడం లేదంటూ కాకతీయ కెనాల్ కాలువకు గండి పెట్టి నీటిని మళ్ళించుకున్నారు. చొప్పదండి, జగిత్యాల, ధర్మపురిలో సాగునీటి కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. 
ఆదుకోవాలని కోరుతున్న రైతులు 
వర్షకాలం కూడా ఎండాకాలన్ని తలపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి  నీళ్లు ఎస్సారెస్పీ, మానేర్ డ్యాంలోకి వస్తాయనుకున్నా...ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

 

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురి మృతి

హైదరాబాద్: అసోంలోని చిరాంగ్‌ జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం ఢీకొని ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారుల మృతికి నిరసనగా జాతీయరహదారిపై గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో అసోం-బంగాల్‌ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి.

11:50 - September 11, 2016

హైదరాబాద్ : తెలంగాణను ప్రజలను వాన పలకరించింది. రాజధాని భాగ్యనగంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురవగా... కరీంగనర్, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో చిరుజుల్లులు కురిశాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల.. మంగళవారం నుంచి తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  
హైదరాబాద్ చిరు జల్లులు
హైదరాబాద్ మహానగరంలో శనివారం ఓ మోస్తారు వర్షాలు కురిసాయి. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వానలు పడ్డాయి. కొద్దిపాటి చినుకులకే రోడ్లు వాగులను తలపించాయి. దీంతో చాలాచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 
తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు 
హైదరాబాద్ తో పాటుగా తెలంగాణలోని వరంగల్ , కరీంనగర్, రంగారెడ్డి, నల్గగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ నెల 13 నాటికి అది బలపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తెలంగాణలో అధికంగా వర్షాలు పడతాయన్నారు. 
అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి కేటీఆర్ 
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. మంత్రి కేటీఆర్‌..  జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు ఎమర్జెన్సీ టీంలను సిద్థం చేయాలని కేటీఆర్ సూచించారు. 

ముద్రగడను నమ్మితే కాపులే నష్టపోతారు : చినరజాప్ప

తూ.గో : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను నమ్మితే కాపులే నష్టపోతారని హోం మంత్రి చినరాజప్ప స్పస్టం చేశారు. ఆయన కొద్ది సేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ...ప్రత్యేక హోదాపై పవన్ పోరాడుతాననడం మంచిదే అని, అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గూండాల్లా వ్యవహరించారని ఆరోపించారు.

 

11:45 - September 11, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ 3 మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రారంభమైంది. పరీక్ష కోసం ఎస్‌2 సెట్ కోడ్ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుంది. వన్ మినిట్ నిబంధన ఉండటంతో.. విద్యార్థులు ఉదయం నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తెలంగాణ, ఏపీలోని 12 ప్రధాన నగరాల్లో 96 పరీక్షాలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 15న ఎంసెట్‌ 3 ఫలితాలు విడుదల చేయనున్నారు. 

 

11:42 - September 11, 2016

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణిగా నటిస్తుండగా, ఆయన భార్య వశిష్టి దేవి పాత్రకు అందాల తార శ్రియ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ రోజు (ఆదివారం) శ్రియ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని శ్రియ లుక్ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్లో మహారాణి గెటప్ లో శ్రియ కనిపిస్తుండగా, 'హ్యాపీ బర్త్ డే వశిష్టి దేవి' అన్న క్యాప్షన్ కూడా ఉంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు చిత్తరంజన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం భారీ బడ్జెట్తో క్రిష్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం చేస్తున్న ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి 2017 సంక్రాంతికి విడుదల చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

11:41 - September 11, 2016

ఢిల్లీ : పారాలింపిక్స్‌లో భారత్‌ బోణీ కొట్టింది. పురుషుల హై జంప్‌ విభాగంలో భారత అథ్లెట్‌ మరియప్పన్‌ తంగవేలు స్వర్ణ పతకం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఇదే ఈవెంట్‌లో పంజాబ్‌ అథ్లెట్‌ వరుణ్‌ సింగ్‌ భటీ సైతం కాంస్య పతకం దక్కించుకోవడంతో  పారాలింపిక్స్‌లో భారత్‌కు ఒకే ఈవెంట్‌తో రెండు పతకాలు సొంతమయ్యాయి.  
చరిత్ర సృష్టించిన మరియప్పన్‌ తంగవేలు  
పారా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్‌ మరియప్పన్‌ తంగవేలు చరిత్ర సృష్టించాడు. మెన్స్‌ హై జంప్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకున్న తమిళనాడు అథ్లెట్‌ మరియప్పన్‌...భారత దేశానికే గర్వకారణంగా నిలిచాడు. మెన్స్‌ హై జంప్‌ టీ42 ఈవెంట్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మరియప్పన్‌ పెద్ద సంచలనమే సృష్టించాడు.  ఫైనల్‌ రౌండ్‌లో విజయవంతంగా జంప్‌ చేయడం మాత్రమే కాదు...మూడు ట్రయల్స్‌లో అత్యుత్తమ ఎత్తు నమోదు చేసి సంచలనం సృష్టించాడు.  ఏ మాత్రం తడబడకుండా..ఎక్కడా బ్యాలెన్స్ కోల్పోకుండా రికార్డ్ లెవల్లో 1.89 మీటర్లు జంప్ చేసి విజేతగా నిలిచాడు. పారాలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్ నెగ్గిన మూడవ భారత అథ్లెట్‌గా రికార్డ్‌ నమోదు చేశాడు. 
వరుణ్‌ సింగ్‌ భటీకి బ్రాంజ్‌ మెడల్‌ 
ఇదే ఈవెంట్‌లో భారత్‌కే చెందిన వరుణ్‌ సింగ్‌ భటీ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్‌ మెడల్‌ సొంతం చేసుకున్నాడు. 1.86 మీటర్లు జంప్‌ చేసిన వరుణ్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు. పారాలింపిక్స్‌లో భారత్‌ ఒకే ఈవెంట్‌లో రెండు పతకాలు సొంతం చేసుకోవడం ఇదే తొలి సారి కావడం విశేషం. మన దేశానికి ఇటువంటి అరుదైన ఘనత అందించిన పారాఅథ్లెట్లుగా మరియప్పన్‌ తంగవేలు,వరుణ్‌ సింగ్‌ భటీ చరిత్రలో భారత క్రీడా చరిత్రలో నిలిచిపోతారనడంలో ఎటువంటి సందేహం లేదు.  
24వ స్థానానికి చేరుకున్న భారత్‌ 
ఒక స్వర్ణం, కాంస్యంతో  ప్రస్తుత పారాలింపిక్స్‌ మెడల్‌ ట్యాలీలో భారత్‌ 24వ స్థానానికి చేరుకుంది. మొత్తం మీద ఈ ఇద్దరు  సాధించిన మెడల్స్‌తో పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ ఓవరాల్‌ పతకాల సంఖ్య 10కి పెరిగింది. 

 

11:38 - September 11, 2016

డమస్కస్ : సిరియా అంత‌ర్యుద్ధానికి తెర‌ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఐదేళ్లుగా సిరియాలో సాగుతున్న మార‌ణ‌హోమాన్ని ఆపేందుకు అగ్రదేశాలు అమెరికా, ర‌ష్యా ఒక్కట‌య్యాయి. సిరియాలో కాల్పులు విర‌మ‌ణ పాటించాల‌ని ఇరు దేశాలు నిర్ణయించాయి. సోమ‌వారం నుంచి కాల్పుల విర‌మ‌ణ అమ‌లులోకి రానుంది. 
కాల్పుల విరమణకు అమెరికా, రష్యా అంగీకారం
అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియాలో శాంతిని నెలకొల్పేందుకు అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా ముందుకు వచ్చాయి. అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌ కెర్రీ, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్‌ జెనివాలో సమావేశమై చర్చలు జరిపారు. ఓ ప్రణాళిక ప్రకారం సిరియాలో కాల్పుల విరమణ పాటించాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు.
సిరియా రెబ‌ల్స్, ప్రభుత్వం ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది 
తాజా ఒప్పందం ప్రకారం సిరియా రెబ‌ల్స్, ప్రభుత్వం ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. రెబెల్స్‌ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో సిరియా ప్రభుత్వ బ‌ల‌గాల దాడుల‌ను ఉపసంహరించుకోవాలి. రెబెల్స్‌ గ్రూప్‌కు అమెరికా....సిరియా దళాలకు రష్యా సహకారాన్ని నిలివేయాలి. అగ్ర దేశాలు సూచించిన ప్లాన్‌కు కట్టుబడి ఉంటామని ఇప్పటికే రెబెల్స్‌ వెల్లడించారు.
అమెరికా, రష్యాలు ఐసిస్‌ ఉగ్రవాదంపై దృష్టి 
కొత్త ప్లాన్ అమ‌లులోకి వ‌చ్చిన వారం రోజుల త‌ర్వాత అమెరికా, రష్యాలు ఐసిస్‌ ఉగ్రవాదంపై దృష్టి పెట్టనున్నాయి. ఐఎస్‌ఐఎస్‌, ఆల్‌-ఖ‌యిదా, నుస్రా లాంటి ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు జాయింట్ ఇంప్లిమెంటేష‌న్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేయ‌నున్నాయి. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాల్లో అమెరికా, ర‌ష్యా ద‌ళాలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తాయి. మిగ‌తా ప్రాంతాల్లో సిరియా ద‌ళాలు పనిచేస్తాయి.
సిరియాలో రాజకీయ మార్పు 
తాజా ఒప్పందం వల్ల సిరియాలో రాజకీయ మార్పు వస్తుందని అగ్రదేశాలు భావిస్తున్నాయి. సంక్లిష్టమైన ఈ ప్రణాళిక అమలు చేయడం అంత సుళువు కాదని నిపుణలు అభిప్రాయ పడుతున్నారు. అమెరికా, రష్యా సంయుక్త ప్రణాళికను ఐక్యరాజ్యసమితి స్వాగతించింది. సిరియా అంతర్యుద్ధంలో 5 లక్షల మంది మృతి చెందారు.

 

11:29 - September 11, 2016

ఢిల్లీ : యూపిఏ హయాంలో రక్షణ ఒప్పందానికి సంబంధించిన మరో కుంభకోణం బయటపడింది. భారత్‌, సౌదీ అరేబియాతో జెట్‌ విమానాల అమ్మకపు ఒప్పందం కుదుర్చుకునేందుకు- బ్రెజిల్‌ కంపెనీ ఎంబ్రెయర్‌ భారీగా ముడుపులు ముట్టజెప్పినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై అమెరికా దర్యాప్తు జరుపుతోంది.
రక్షణ ఒప్పందానికి సంబంధించిన స్కాం 
యూపిఏ హయాంలో వీవీఐపీ హెలికాప్టర్ల స్కాం మరువకముందే మరో భారీ రక్షణ ఒప్పందానికి సంబంధించిన కుంభకోణం వెలుగు చూసింది. 2008లో యూపిఏ ప్రభుత్వ హయాంలో డిఆర్‌డిఓ మూడు ఈఎంబి 145 జెట్‌ విమానాలను కొనుగోలు చేసేందుకు బ్రెజిల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ కంపెనీ ఎంబ్రాయర్‌తో 208 మిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కోసం మధ్యవర్తిగా వ్యవహరించిన బ్రిటన్‌కు చెందిన డిఫెన్స్‌ ఏజెంట్‌ సంస్థకు భారీగా ముడుపులు చెల్లించినట్లు బ్రెజిలియన్‌ వార్తాపత్రిక ఫోల్హా డిసౌ పౌలో ప్రచురించింది. ఈ వ్యవహారంపై అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ 2010లోనే దర్యాప్తు ప్రారంభించిందని బ్రెజిల్‌ పత్రిక ఫోల్హా డిసౌ పౌలో తెలిపింది. మరోవైపు దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని బ్రెజిల్‌ కంపెనీ ఎంబ్రెయర్‌ పేర్కొంది.
భారత్‌ కు ఈఎంబీ 145 యుద్ధవిమానాలు కొనుగోలు 
గగనతల ముందస్తు హెచ్చరికలు, నియంత్రణ వ్యవస్థకు సంబంధించి ర్యాడార్‌కు అనుసంధానం చేసేందుకు ఈఎంబీ-145 యుద్ధవిమానాలను భారత్‌ కొనుగోలు చేసింది.  మొదటి విమానం 2011లో, మిగతా రెండు విమానాలు ఆ తర్వాత భారత్‌ చేరాయి. భారత రక్షణ వ్యవస్థ ప్రకారం మధ్యవర్తుల ద్వారా ప్రయత్నాలు చేసి ఒప్పందం కుదుర్చుకోవడం నిషేధం. వివిఐపి చాపర్‌ స్కాం తర్వాత రక్షణ ఒప్పందంతో ఇది రెండో అతిపెద్ద స్కాంగా భావిస్తున్నారు. మరోవైపు బ్రెజిల్‌ యుద్ధవిమానాల తయారీ సంస్థ ఎంబ్రెయర్‌తో ఒప్పందం విషయంలో అక్రమాలు జరిగిన విషయం డీఆర్‌డీవోకు తెలియదని రక్షణమంత్రిత్వశాఖ తెలిపింది.

 

హోదాను చంద్రబాబు ఢిల్లీలో అమ్మేశారు : ముద్రగడ

రాజమండ్రి : ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలతో పాలన కొనసాగిస్తున్నారని, ప్రత్యేక హోదాను చంద్రబాబు ఢిల్లీ అమ్మేశారని కాపు ఉద్యమ నేత విమర్శించారు. అలాంటి చంద్రబాబు మాయలో పవన్ పడద్దని సూచించారు.13 జిల్లాల జేఏసీ నేతలతో ముద్రగడ భేటీ అయ్యారు. ఉద్యమ కార్యాచరణ పై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే సహించం అని హెచ్చరించారు. కాపు ఉద్యమాన్ని కొందరు అవహేళన చేశారని, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. 

ప్రజలను వెంకయ్య తప్పుదోవ పట్టిస్తున్నారు : వుండవల్లి

విజయవాడ : ఏపీ ప్రజలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ ఎంపీ వుండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఆయన విజయవాడలో మీడియాతో ఆమట్లాడుతూ.... ్రపత్యేక హోదా అవసరం లేదనుకున్నపుడు పార్లమెంట్ లో ఎందుకు అడిగారని, లోటు బడ్జెట్ ను ఎలా పూడుస్తారో చెప్పాలని సూటిగా వెంకయ్యను ప్రశ్నించారు.

11:09 - September 11, 2016

పవన్ కల్యాణ్ పై నాంపల్లి పీఎస్ లో ఫిర్యాదు

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నాంపల్లి పీఎస్ లో తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ఫిర్యాదు చేసింది. కాకినాడలో సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆ ఫిర్యాదులో జేఏసీ పేర్కొంది. రాష్ట్ర విభజన సమయంలో 11 రోజులు అన్నం కూడా తినలేదని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించారు కానీ ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

10:59 - September 11, 2016

తూర్పుగోదావరి : దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అమలాపురంలో భారీ ర్యాలీ జరిగింది. దళితుల ఆత్మగౌరవ సదస్సు పేరుతో కోనసీమలోని దళితులంతా చలో అమలాపురం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో 16 మండలాల నుంచి వేలాది మంది దళితులు హాజరయ్యారు. ర్యాలీ అనంతరం జరిగిన సదస్సులో మాజీ మంత్రి విశ్వరూప్, మాజీ ఎంపీ హర్షకుమార్, దళిత సంఘ నాయకులు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. 
ఆత్మగౌరవ సభ
దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కోనసీమలోని దళితులు గర్జించారు. అమలాపురంలో వేలాది మంది దళితులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం రిపబ్లికన్‌ పార్టీ జాతీయ నాయకుడు డి.బి. లోక్ అధ్యక్షతన ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన దళిత నాయకులు ప్రభుత్వాల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దళితులపై దాడులను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. తమను రక్షించలేని ప్రభుత్వాలు.. ఆత్మరక్షణకు లైసెన్స్ తుపాకులు అందించాలని సమావేశంలో డిమాండ్‌ చేశారు. స్వచ్ఛభారత్‌ వంటి కార్యక్రమాల్లో సైనికుళ్లా పనిచేస్తున్నది దళితులేనని...అలాంటి దళితులపై గోసంరక్షణ పేరుతో దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. 
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలులో నిర్లక్ష్యం : దళిత నేతలు
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ప్రభుత్వాలు సమర్థవంతంగా అమలు చేయడం లేదని దళిత నాయకులు ఆరోపించారు. ఈ చట్టం ద్వారా జీవితఖైదుకు బదులు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.  హైకోర్టు, సుప్రీం కోర్ట్‌ న్యాయమూర్తుల నియామకంలో రూల్‌ఆఫ్‌ రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని, దళిత మహిళలను వేధింపుల నుంచి కాపాడేందుకు దళిత మహిళా ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని... సదస్సులో ప్రసంగించిన దళిత నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

గొంతులో చాక్లెట్ ఇరుక్కుని 8ఏళ్ల బాలుడు మృతి

కర్నూలు: సి.బెలగల్ మండలం కొండాపురంలో విషాదం చోటు చేసుకుంది. గొంతులో చాక్లెట్ ఇరుక్కుని 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

10:55 - September 11, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదాతో ప్రయోజనాలున్నాయని... కానీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన మీడియా మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం సూచన మేరకు ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదన్నారు. విభజన చట్టం ఏర్పాటులోనే లోపాలున్నాయని తెలిపారు. విభజన చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసిందని విమర్శించారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చలేదని తెలిపారు. ఎపికి న్యాయం చేయాలని పోరాడిందే కెవిపి ఒక్కరే అని చెప్పారు. విభజన చట్టంలోని లొసుగులను సరిదిద్ది ఎపికి న్యాయం చేయాలనేదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. పోలవరానికి అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేశామని చెప్పారు. రూ.22 వేల కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడిందని.. లోటును భర్తీ చేసేందుకు ఎపికి రూ.22 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 

 

ఎస్ఆర్ నగర్ పీఎస్ లో సెబాస్టియన్ పై ఫిర్యాదు

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో నిందితుడైన సెబాస్టియన్ ఎస్ఆర్ నగర్ పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. సెబాస్టియన్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆయన కోడలు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు సెబాస్టియన్ పై ఐపీసీ 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

హోదాతో ప్రయోజనాలు ఉన్నాయ్: వెంకయ్య

హైదరాబాద్: ప్రత్యేక హోదాతో ప్రయోజనాలున్నాయని... కానీ ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 14వ ఆర్థిక సంఘం సూచన మేరకు ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదన్నారు. విభజన చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసిందని విమర్శించారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో కాంగ్రెస్ చేర్చలేదని తెలిపారు.

ఉగ్రవాదుల కాల్పుల్లో కానిస్టేబుల్ మృతి

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ లోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లు ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. 

10:38 - September 11, 2016

హైదరాబాద్: సికింద్రాబాద్ కార్ఖానాలోని ఓ బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం 8గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే సంభవించి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇంకా మంటలు అదులోకి రాలేదని...ఇప్పటికే 4 అగ్నిప్రమాక శకటాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ లో దట్టమైన పొగలు అలముకున్నాయి. దీంతో చుట్టు పక్కల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. మరో వైపు ఈ రోజు ఆదివారం, అదీగాక ఉదయం కావడంతో సిబ్బంది ఎవరూ రాలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మరి కాసేపట్లో వెలువడనున్నట్లు తెలుస్తోంది.

మరో సారి దీక్ష చేస్తా : ముద్రగడ

తూ.గో :కాపులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకుంటే మరోసారి దీక్ష చేపడతానని కాపుఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. ఈ రోజు ఉదయం రాజమహేంద్రవరంలో కాపు ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్ల సాధన కోసం తదుపరి ఎలాంటి కార్యాచరణకు దిగాలన్న విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు. తన రోజువారీ కార్యక్రమాలపై ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆరోపించారు. తన ఫోన్ కాల్స్ ట్రాప్ చేస్తున్నారని, అందుకు తనకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని తెలిపారు.

విభజన చట్టం ఏర్పాటులోనే లోపాలు : వెంకయ్యనాయుడు

హైదరాబాద్ : విభజన చట్టం ఏర్పాటులోనే లోపాలున్నాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.  విభజన చట్టంలోని లొసుగులను సరిదిద్ది ఎపికి న్యాయం చేయాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ఎపికి న్యాయం చేయాలని పోరాడింది కెవిపి ఒక్కరే అని చెప్పారు.

సికింద్రాబాద్ ఈజీవై వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఖార్ఖానా ప్రాంతంలోని ఈజీవై వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. 

 

09:47 - September 11, 2016

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ ఎంసెంట్ 3 పరీక్ష జరుగునుంది. ఎంసెట్ 3కి ఎస్ 2 ప్రశ్నాపత్రం కోడ్ ను ఎంపిక చేశారు. ఎస్ 2 ప్రశ్నాపత్రం కోడ్ ను టీఎస్ సీహెచ్ ఈ చైర్మన్ ప్రొ.తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈనెల 30 లోపు ప్రక్రియ మొత్తం పూర్తిచేస్తామని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగనుంది. తెలంగాణ, ఎపిలోని 12 ప్రధాన నగరాల్లో 96 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 56, 153మంది పరీక్ష రాయనున్నారు. 

 

09:39 - September 11, 2016

హైదరాబాద్ : 60 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలకు బీమా రంగాన్ని విస్తరించండంలో ఎల్‌ఐసీ మంచి పాత్ర పోషించిందని అఖిల భారత బీమా ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు అమానుల్లా ఖాన్‌ అన్నారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో హైదరాబాద్ ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఎల్‌ఐసీ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు పలువురు ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

09:36 - September 11, 2016

ఏలూరు : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సీనియర్ సీపీఎం నాయకులు అన్నే వెంకటేశ్వరరావు శతజయంతి సభ ఏలూరులో ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా సీపీఎం పొలిట్ బ్యూరోసభ్యులు బీవీ రాఘవులు హాజరయ్యారు. అన్నే వెంకటేశ్వరరావు 12 సంవత్సరాలు జైలు జీవితం గడిపారని.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేశారని రాఘవులు తెలిపారు. 

09:34 - September 11, 2016

హైదరాబాద్‌ : ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షంషేర్‌గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ తుక్కు దుకాణంలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దుకాణంలోని ఎలక్ర్టానిక్స్‌ వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను అదుపుచేశాయి. 

09:32 - September 11, 2016

కాసేపట్లో తెలంగాణ ఎంసెంట్ 3 పరీక్ష

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ ఎంసెంట్ 3 పరీక్ష జరుగునుంది. ఎస్ 2 ప్రశ్నాపత్రం కోడ్ ను ఎంపిక చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగనుంది. తెలంగాణ, ఎపిలోని 12 ప్రధాన నగరాల్లో 92 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 56, 153మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష నిర్వహిణకు జేఎన్ టీయూ సర్వంసిద్ధం చేసింది. 

 

09:16 - September 11, 2016

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ ఎంసెంట్ 3 పరీక్ష జరుగునుంది. ఎస్ 2 ప్రశ్నాపత్రం కోడ్ ను ఎంపిక చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగనుంది. తెలంగాణ, ఎపిలోని 12 ప్రధాన నగరాల్లో 92 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 56, 153మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష నిర్వహిణకు జేఎన్ టీయూ సర్వంసిద్ధం చేసింది. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరించనున్నారు. హైదరాబాద్ లో 35 సెంటర్లు ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద ఉన్న స్టేషనరీ, జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. ప్రతి సెంటర్ వద్ద 144 సెక్షన్ విధించిన వాతావరణం నెలకొంది. ఎంసెట్ 2 లో వచ్చిన అక్రమాలు, అవకతవకలు ఎంసెట్ 3 లో పునరావృత్తం కాకుండా చూడాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. 

 

08:59 - September 11, 2016

సూపర్ స్టార్ మహేష్ బాబు కోలీవుడ్‌లో తన మార్కెట్‌ని మరింత విస్తృతం చేసుకునేందుకు తమిళ భాషని కూడా ఉపయోగించుకోవడానికి మహేష్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌ నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్ర తమిళ వెర్షన్‌కి మహేష్‌బాబే డబ్బింగ్‌ చెప్పనున్నారట. ఒరిజినల్‌ వాయిస్‌లో చెబితే తమిళనాట తన సినిమాకి చాలా హెల్ప్‌ అవుతుందని ఆయన భావిస్తున్నారట. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో చిత్రం తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

08:50 - September 11, 2016

హీరోయిన్ నిత్యామీనన్.. విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించే అవకాశాన్ని కొట్టేసింది. వెంకటేష్ తో కలిసి నిత్యామీనన్ తొలిసారి నటించనుంది. వెంకీతో కలిసి అమ్మడు స్టెప్పులేయనుంది. ఇటీవలే 'జనతా గ్యారేజ్‌', 'ఇంకొక్కడు' చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నిత్య మరో మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇప్పటికే అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోలతో ఆడిపాడిన నిత్య తాజాగా వెంకటేష్‌ సరసన నటించనుంది. ఇష్క్ సినిమాలో నితన్ సరసన నటించిన మంచి విజయాన్ని అందుకుంది. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న 'ఆడాళ్లు మీకు జోహార్లు' చిత్రంలో వెంకటేష్, నిత్యామీనన్ నటించనున్నారు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'సాలా ఖడూస్‌' చిత్ర తెలుగు రీమేక్‌లోనూ వెంకటేష్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'గురు' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. కిశోర్ తిరుమల 'నేను శైలజ' వంటి సూపర్‌ హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. మహిళా నేపథ్యంలో రూపొందబోయే ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. 

విద్యుత్ షాక్ తో శానిటేషన్ కార్మికురాలు మృతి

హైదరాబాద్ : బంజారాహిల్స్ జీవీకే వద్ద విద్యుత్ షాక్ తో శానిటేషన్ కార్మికురాలు మృతి చెందారు. మృతురాలి కుటుంబానికి మేయర్ రామ్మోహన్ రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 

 

08:22 - September 11, 2016

చిత్తూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. బబ్బార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తోంది. మార్గంమధ్యలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం మొగిలిఘాట్ వద్ద మూల మలుపులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు బెంగళూరుకు చెందిన వారుగా గుర్తించారు. అలాగే క్షతగాత్రుల్లో కూడా ఎక్కువ మంది బెంగళూరుకు చెందినవారుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గాయపడినవారిలో 6 మంది విజయవాడ వాసులున్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు అంటున్నారు. 

 

కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో నేడు వినాయకుడికి గజవాహన సేవ

చిత్తూరు : కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో నేడు వినాయకుడికి గజవాహన సేవ జరుగనుంది. 

07:40 - September 11, 2016

హైద‌రాబాద్‌ : నగరంలో వినాయ‌క నిమ‌జ్జనాల‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది జీహెచ్ ఎంసీ గణేష్‌ శోభ‌యాత్రకు ఎలాంటి ఇబ్బందులు క‌లగ‌కుండా ప్లాన్ రూపొందించింది బల్దియా. నిమ‌జ్జనాలు జ‌రిగే హుస్సేన్‌సాగ‌ర్‌తోపాటు, స్పెషల్‌ కొల‌నులు భారీగా ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌సాగ‌ర్‌లో నిర్మించిన బేబిపాండ్‌ను హోంమంత్రి నాయిని, మేయ‌ర్ బోంతు రామ్మోహ‌న్‌లు ప్రారంభించారు. 
388 కిలోమీట‌ర్ల మేర గణేష్‌ శోభ‌యాత్ర
గ్రేటర్‌ హైదరాబాద్‌లో గ‌ణేశ్‌ నిమ‌జ్జనానికి బ‌ల్దియా భారీ ఏర్పాట్లు చేస్తోంది. న‌గ‌రంలో 388 కిలోమీట‌ర్ల మేర జ‌రగ‌నున్న శోభ‌యాత్రకు ఎలాంటి ఆటంకాలు త‌లెత్తకుండా మినిట్ టూ మినిట్ ప‌ర్యావేక్షణ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 162 గ‌ణేశ్‌ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. అంతేకాదు.. 2 వేల 763 మంది పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచింది. 
గణేష్‌ నిమజ్జనానికి 23 భారీక్రేన్లు ఏర్పాటు 
ట్యాంక్‌బండ్ వ‌ద్ద ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను సిద్దం చేశారు బల్దియా అధికారులు. గ‌ణేశ్‌ నిమ‌జ్జనాల‌కు 23 భారీక్రేన్లు ఏర్పాటు చేశారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్తకుండా.. ప్రతి మూడు క్రేన్లకు 21 మంది చొప్పున 531 మంది వ‌ర్కర్లు పని చేయనున్నారు. నిమజ్జనం సందర్భంగా గ‌ణ‌నాథుల వెంట తెచ్చే పూలు, ప‌త్రి, ఇత‌ర వ‌స్తువులు నీటిలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటారు. 35 శానిట‌రీ సూప‌ర్‌వైజ‌ర్లు, 364 మంది శానిట‌రీ ఫిల్డ్ అసిస్టెంట్లు మూడు షిఫ్టుల్లో 24 గంట‌లు అందుబాటులో ఉంటారు. 
చెత్తను డంప్‌ చేసేందుకు 25 ట‌న్నర్స్ వాహ‌నాలు 
చెత్తను త‌ర‌లించేంద‌కు 25 ట‌న్నర్స్ వాహ‌నాలు, 740 మినిటిప్పర్లు, ఆరు లోడ‌ర్లు, నాలుగు జేసీబీలు, 20 స్మాల్, ఆరు బిగ్ స్వీపింగ్ మిష‌న్లను వినియోగిస్తున్నారు. శోభ‌యాత్ర జ‌రిగే అన్ని ప్రాంతాలతోపాటు, నిమ‌జ్జన కేంద్రాల వద్ద మోబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక లైటింగ్ కోసం నూత‌నంగా 26 వేల లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. 
పోలీసుల భారీ బందోబస్తు 
హైకోర్టు ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కొల‌నుల‌ను ఏర్పాటు చేసింది. హుస్సేన్‌సాగ‌ర్ నెక్లెస్ రోడ్డులో నిర్మించిన కొల‌నును హోంమంత్రి నాయిని, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్  ప్రారంభించారు. 
అందుబాటులోకి 9 కొల‌నులు : మేయ‌ర్ రామ్మోహ‌న్  
న‌గ‌ర వ్యాప్తంగా 7కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేసి 9 కొల‌నులు అందుబాటులోకి తెచ్చామని, న‌గ‌ర వాసులంద‌రూ ఈ కొల‌నుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మేయ‌ర్ రామ్మోహ‌న్ కోరారు. 
రెండు ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు 
అన్ని విభాగాల‌కు చెందిన అధికారులు నిత్యం స‌మ‌న్వయంతో ప‌నిచేసేందుకు హుస్సేన్‌సాగ‌ర్ వ‌ద్ద రెండు ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటిని అందించ‌డంతో పాటు మెడిక‌ల్ క్యాంపులు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

 

07:31 - September 11, 2016

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో జాతీయస్థాయి పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహించడానికి కాన్ఫడరేషన్ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకోసం సీఐఐకి అమరావతిలో పది ఎకరాలను మంజూరు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించి  సీఐఐ పరిశ్రమల విభాగం కార్యదర్శి ఇంద్రజిత్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం చంద్రబాబుతో భేటీ అయింది. 
జనవరిలో సీఐఐ సదస్సు 
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేషనల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ ఫర్ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఎంటర్‌ న్యూ ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి సీఐఐ ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో చర్చించింది. అమరావతిలో నిర్మించబోయే భవన సముదాయంలో యువ పారిశ్రామిక వేత్తలకు బ్రిజేష్ నేతృత్వంలోని నిపుణులు శిక్షణ ఇస్తారని ఇంద్రజిత్‌ వివరించారు. జనవరిలో  సీఐఐ సదస్సు నిర్వహిస్తామని, ఇందుకోసం పూర్తి ప్రణాళికలతో వస్తామని ఆయన తెలిపారు. 
సదస్సు నిర్వహణకు పది ఎకరాలు మంజూరు
సీఐఐ నిర్వహించే ఈ సదస్సుకు  పది ఎకరాలు మంజూరు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనికి  పూర్తి సహకారం అందించాలని.... ఎకనమిక్‌ డెలప్‌మెంట్‌ బోర్డు సీఈఓ కృష్ణకిషోర్‌ను సీఎం ఆదేశించారు. ఏపీ పారిశ్రామిక భవిష్యత్తు కోసం వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని చంద్రబాబు సీఐఐ ప్రతినిధులను కోరారు. 
అమరావతిని గ్రీన్‌ క్యాపిటల్‌గా తీర్చిదిద్దటమే ధ్యేయం : బాబు
గతంలో తాను హైదరాబాద్‌లో గ్రీన్‌ బిల్డింగ్‌ నిర్మించానని...దానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని చంద్రబాబు గుర్తు చేశారు. అదే ఆలోచనతో రాజధాని అమరావతిని గ్రీన్‌ క్యాపిటల్‌గా తీర్చిదిద్దటమే తన ధ్యేయమని ఆయన అన్నారు. అమరావతిని హరిత రాజధానిగా నిర్మించడానికి తాము సంపూర్ణ సహకారమందిస్తామని సీఐఐ ప్రతినిధులు తెలిపారు. 

 

07:26 - September 11, 2016

హైదరాబాద్ : పాలమూరు..రంగారెడ్డి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణను రెవెన్యూ, నీటిపారుదలశాఖాధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. తెలంగాణ సచివాలయం నుంచి పాలమూరు, రంగారెడ్డి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సర్వేను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి రోబో ఇసుకను  వాడే విషయంపై అధికారులతో చర్చించి మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కర్వెన ప్రాంతంలో రిజర్వాయర్ కు సంబంధించిన డిజైన్లను వారంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. 

07:23 - September 11, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ... ప్రత్యేక హోదాను ఆయుధంగా తీసుకుని... అధికార పార్టీపై పోరుకు సిద్ధమైంది. హోదా అంశాన్ని అస్ర్తంగా తీసుకుని పోరాటాలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. కేంద్రం నుంచి ఏపీకి ప్యాకేజీ లభించడంతో... హోదా కోసం తమ పోరాటం ఆగదని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. 
హోదా సాధ్యం కాదని తేల్చిన కేంద్రం
రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్లు రెండేళ్లుగా వినిపిస్తున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదు. హోదా కోసం ప్రతిపక్షాలన్నీ పోరాటం చేస్తున్నా.. ఆచరణలో ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని, ప్యాకేజీ ఇస్తామంటూ కేంద్రం ప్రకటన చేసింది. దీంతో ఏపీలోని ప్రతిపక్షాలు పోరుబాట పట్టాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్‌ చేస్తున్నాయి. 
హోదా వచ్చే వరకు పోరు : జగన్  
ఈ వ్యవహారం రాజకీయంగా వేడి రగిలిస్తుండడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. తమ భాగస్వామ్య పక్షమైన టీడీపీ అధికారంలో ఉండడంతో హోదాకి బదులు అదే స్థాయిలో సహాయం అందిస్తామని కేంద్రం ప్రకటించింది. కేంద్ర నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. కేంద్ర వైఖరిని నిరసిస్తూ శనివారం ఏపీ బంద్‌కు కూడా పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని, అందువల్లే ఏపీకి ప్రత్యేక హోదా దక్కడం లేదని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం ఆగదని జగన్‌ స్పష్టం చేశారు.

 

07:18 - September 11, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ వర్షాకాల సమావేశాలు మూడు ఘర్షణలు ఆరు నిరసనలుతో ముగిశాయి. అసెంబ్లీ సమావేశాల ముందురోజు ప్రత్యేకప్యాకేజీ గురించి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రతిపక్షాల ఆగ్రహజ్వాలలను మరింత తారాస్థాయికి తీసుకెళ్లింది. ఎటువంటి చర్చలు లేకుండానే నిరవధిక వాయిదా పడ్డాయి. 
మొక్కుబడిగా సమావేశాలు 
ఆంధ్రప్రదేశ్‌ వర్షాకాల సమావేశాలు ఉద్రిక్త పరిస్థితుల మధ్య ముగిశాయి. మూడు రోజుల సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ సభ్యులు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేపట్టారు. స్పీకర్‌నే టార్గెట్‌గా చేసుకుని పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రతిపక్షపార్టీ నిరసనలతో సభ ముందుకు సాగలేదు. ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకపోవడంతో.. అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడిగానే ముగిశాయి.
సభలో వైసీపీ ఆందోళన
అసెంబ్లీ ప్రారంభానికి ముందు రోజు కేంద్రం ఏపీకి ప్యాకేజీని ప్రకటించింది. ఏపీకి కావాల్సింది ప్యాకేజీలు కాదని...వైసీపీ ఆందోళ బాట పట్టింది. మొదటిరోజు ఎలాంటి ప్రశ్నోత్తరాలు చర్చకు రాకుండా వైసీపీ నేతలు అడ్డుతగిలారు. ఆందోళనల మధ్యే సీఎం చంద్రబాబు జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు. వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే స్పీకర్‌ బిల్లును ఆమోదించారు. అయినా వైసీపీ నేతలు ఆందోళనలు కొనసాగించడం... స్పీకర్‌ సభ్యులను సహకరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో.. సభను వాయిదా వేశారు. 
రెండోరోజు మారని వైసీపీ సభ్యుల వ్యవహారశైలి 
రెండోరోజు వైసీపీ సభ్యుల వ్యవహారశైలి విమర్శలకు కారణమైంది. స్పీకర్‌ పోడియాన్ని రెండువైపులా ముట్టడించి చైర్‌ మీదకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రశ్నోత్తరాల కాపీలను చింపి సభాపతిపై విసరడం... మైకును లాగి సమావేశాలకు ఆటంకం కల్గించారు. పలుమార్లు మార్షల్స్‌తో  పెనుగులాట జరిగినా నేతల తీరు మారలేదు. దీంతో మూడుసార్లు సభను స్పీకర్‌ వాయిదా వేసినా..  వైసీపీ సభ్యులు ఆందోళనలు కొనసాగించడంతో ... ఎటువంటి కార్యక్రమాలు లేకుండానే  రెండోరోజు స్పీకర్‌ సభను వాయిదా వేశారు. 
మూడోరోజు సభలో అదుపు తప్పిన పరిస్థితులు 
మూడోరోజు సభలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ప్రత్యేక హోదాపై ప్రభుత్వం వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి విజ్ఞప్తి చేసినా ఆగ్రహంతో ఊగిపోయారు నేతలు. స్పీకర్‌ పోడియం పైకి ఎక్కి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. స్పీకర్‌ ను అసభ్య పదజాలంతో దూషించినందుకు, ఫైళ్లు సభాపతిపైకి విసిరినందుకు సభాహక్కుల ఉల్లంఘన కింద క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సంఘానికి సిఫార్సు చేస్తూ స్పీకర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 
సభ నిరవధిక వాయిదా 
హైదరాబాద్‌లో ఇవే ఏపీ చివరి సమావేశాలని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మొత్తంగా సభలో ప్రతిపాదించిన బిల్లులన్నీ ఆమోదం పొందకుండానే సభ నిరవధికంగా వాయిదా పడింది.

 

ఏపీ సెట్ కోడ్ సెట్ 1 ఎంపిక

విశాఖ : నేడు ఏపీ సెట్ పరీక్ష జరుగనుంది. ఏపీ సెట్ కోడ్ సెట్ 1ను ఎంపిక చేశారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పరీక్ష జరుగనుంది. 100 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

చిత్తూరు : బంగారుపాల్యం మండలం మొగిలిఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. 

07:04 - September 11, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో ఎంబిబిఎస్ , బిడిఎస్ కోర్సులకు సీట్ల భర్తీ చేసేందుకు ఇవాళ జరగనున్న ఎంసెట్ 3 పరీక్షకి జెఎన్ టియూ హైదరాబాద్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎంసెట్ 2 పేపర్ లీకేజి నేపథ్యంలో ఈసారి ఎంసెట్ 3 పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. పేపర్‌ లేకేజీకి ఆస్కారం లేకుండా నిఘా నీడలో పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. గంట ముందే పరీక్ష హాల్లోకి అనుమతించే విధంగా అధికారులు సర్వం సిద్ధం చేసారు. వన్‌ మినిట్‌ లేట్‌ నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తామని అధికారులు చెప్తున్నారు. 
ఎంసెట్ 3 కి సర్వం సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో ఎంబిబిఎస్ , బిడిఎస్  కోర్సుల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ 3కి సర్వం సిద్ధం చేసింది జెఎన్ టియూ హైదరాబాద్‌. ఇవాళ  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటవరకు రాతపరీక్షను నిర్వహించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని 12 ప్రధాన నగరాల్లో 96 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంసెట్‌-3కి మొత్తం 56వేల 153మంది అభ్యర్ధులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే నిర్వహించిన ఎంసెట్-2 పేపర్‌ లీక్‌ కావడంతో మరోసారి పరీక్ష నిర్వహిస్తున్న ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే బ్రోకర్లు, కోచింగ్‌ సెంటర్లు, కార్పొరేట్‌ కాలేజీలపై ప్రత్యేక నిఘా కూడా పెట్టారు. విద్యార్థుల కదలికలను కూడా పోలీసులు గమనిస్తున్నారు. ఎసెంట్‌-3లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. 
ఈసారి బయోమెట్రిక్‌ విధానం 
ఎంసెట్‌ 3లో మాల్ ప్రాక్టీస్‌కి తావు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఈసారి బయోమెట్రిక్‌ విధానం ఉండడం వల్ల విద్యార్ధులంతా పరీక్షా కేంద్రాల్లోకి గంట ముందే చేరుకోవాలని పాపిరెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఇక అభ్యర్థులు చేతి గడియారాలు, ఎలక్ర్టానిక్‌ వస్తువులు, సెల్‌ఫోన్లు వంటివి తీసుకురాకుండా నిషేధం విధించారు. అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా నిరంతరం సమయం తెలుసుకునేందుకు పరీక్షా కేంద్రాలన్నింటిలో గోడ గడియారాలను ఏర్పాటు చేశారు. విద్యార్ధులు ఒక్క నిమిషం ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నా హాల్లోకి అనుమతించేది లేదని పాపిరెడ్డి స్పష్టం చేశారు. 
రేపు ప్రాథమిక 'కీ' విడుదల 
ఎంసెట్‌ 3 ప్రాథమిక కీ రేపు విడుదల చేయనున్నారు. ఇక పరీక్ష ఫలితాలను ఈనెల 15న విడుదల చేయడానికి జెఎన్ టీయూ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 30వరకు వీలైనంత వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ ఒక కొలిక్కి తేచ్చేందుకు ప్రయత్నం చేస్తామని..లేనిపక్షంలో గడువు కోసం కోర్టుకు వెళతామని పాపిరెడ్డి అన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆయన తెలిపారు. 

 

06:58 - September 11, 2016

ఢిల్లీ : వామపక్ష, ప్రజాతంత్ర శక్తులకు పెట్టని కోటగా నిలుస్తున్న ప్రతిష్టాత్మక జేఎన్‌యూలో ఈసారి కూడా లెఫ్ట్‌ కూటమి ఘన విజయం సాధించింది. విద్యార్థి సంఘానికి జరిగిన నాలుగు స్థానాల్లోనూ లెఫ్ట్‌ అభ్యర్థులు తిరుగులేని విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఎబివిపి, బాప్సా విద్యార్థి సంఘాలు.. గెలుపే లక్ష్యంగా ప్రలోభాలకు తెరతీసినా.. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసినా.. లెఫ్ట్‌ ప్యానల్‌ గెలుపుతో రికార్డు తిరగరాసింది. ఎబివిపి మూడోస్థానానికి పరిమితమైంది.  
నాలుగు స్థానాల్లోనూ లెఫ్ట్‌ అభ్యర్థులు విజయం..
ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థి సంఘానికి జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్‌ ప్యానల్‌ ఘన విజయం సాధించింది. నాలుగు స్థానాల్లోనూ లెఫ్ట్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఏబీవీపీకి కౌంటర్‌గా ఎస్‌ఎఫ్‌ఐ ఐసాలతో కూడిన లెఫ్ట్‌ కూటమి ఈ సారిలో బరిలో నిలిచింది. ఏబీవీపీ, లెఫ్ట్‌ కూటమి మధ్యే ప్రధానంగా పోటీ జరిగింది. అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన లెఫ్ట్‌ అభ్యర్థి మోహిత్‌ ఘన విజయం సాధించారు. బాప్సా అభ్యర్థి రాహుల్‌ రెండో స్థానంలో నిలవగా.. ఏబీవీపీ అభ్యర్థి జాహ్నవి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఉపాధ్యక్ష పదవి కూడా లెఫ్ట్‌ కూటమి కైవసం చేసుకుంది. సమీప ప్రత్యర్థి ఏబీవీపికి చెందిన రవిరాజన్‌పై దాదాపు వెయ్యి ఓట్ల పైచిలుకు తేడాతో లెఫ్ట్‌ కూటమి అభ్యర్థి అమల్‌ ఘన విజయం సాధించారు. ఇక జనరల్‌ సెక్రటరీ, జాయింట్‌ సెక్రటరీ పదవులు కూడా లెఫ్ట్‌ కూటమి అభ్యర్థులనే వరించాయి. జనరల్‌ సెక్రటరీ పదవికి జరిగిన పోటీలో లెఫ్ట్‌ కూటమి అభ్యర్థి శతరూప తన సమీప ప్రత్యర్థి విజయ్‌(ఏబీవీపీ)పై 900 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జాయింట్‌ సెక్రటరీకి జరిగిన పోటీలో లెఫ్ట్‌ కూటమి అభ్యర్థి తబ్రేజ్‌ తన సమీప ప్రత్యర్థి ప్రతిమ్‌(డీఎస్‌ఎఫ్‌ఐ)పై గెలిచారు. 
ఏబీవీపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం
శుక్రవారం జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో భారీగా 60 శాతం పోలింగ్‌ నమోదైంది. గత రెండేండ్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. జేఎన్‌యూలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో దేశద్రోహం అభియోగాలతో అరెస్ట్‌ అయిన కన్నయ్యకుమార్‌, అనిర్భాన్‌ భట్టాచార్య, ఉమర్‌ ఖాలిద్‌ల నేతృత్వంలోని వారి వారి సంఘాలు ఎన్నికల్లో పోటీలో లేకపోయినా.. ఏబీవీపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఏబీవీపీ ఓటమే లక్ష్యంగా విద్యార్థులంతా కదం తొక్కారు. విజయవావుటా ఎగురవేశారు.
మూడోస్థానానికి పరిమితమైన ఏబీవీపీ 
రెండు లెఫ్ట్‌ సంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ ఐసా కూటమిగా ఏర్పడడం ఇదే మొదటిసారి. ఏబీవీపీ, ఇతర విద్యార్థి సంఘాలు సోషల్‌ మీడియాలో ప్రచార ఉద్యమాన్ని హోరెత్తించాయి. హంగు, ఆర్భాటాలకు దూరంగా నిలిచిన ఫ్ట్‌ సంఘాలకే విద్యార్థులు పట్టం కట్టడం ఇక్కడ విశేషం. జేఎన్‌యూలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఎన్నికలు దేశప్రజలంతా ఆసక్తిగా గమనించారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఏబీవీపీ, బాప్సా చేపట్టిన విపరీత ప్రచార పద్ధతులు, భారీ ఖర్చుపై మీడియాలో, విద్యార్థి లోకంలో బాగా చర్చ సాగింది. విద్యార్థులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలపై తమ వైఖరులేమిటో చెబుతూ వారిని ఆకట్టుకోవడానికి బదులు, డబ్బు, తదితర ప్రలోభాలతో తెరలేపారు. అయినా విద్యార్థులు లెఫ్ట్‌ ప్యానల్‌కే పట్టం కట్టారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ మూడోస్థానానికే పరిమితమైంది. 
ఒక స్థానంలో ఎన్‌ఎస్‌యూఐ విజయం
ఇటు ఢిల్లీ యూనివర్శిటీలో జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబీవీపీ మూడుస్థానాల్లో, ఎన్‌ఎస్‌యూఐ ఒక స్థానంలో విజయం సాధించాయి. గత ఆరేండ్లతో పోలిస్తే ఈ ఏడాది అతి తక్కువ పోలింగ్‌ శాతం నమోదైంది. 

 

నేడు ఇందిరాపార్కు వద్ద మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా

హైదరాబాద్ : నేడు ఇందిరాపార్కు వద్ద మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామం వేములఘాట్ ప్రజలకు మద్దతుగా నిరసన తెలుపనున్నారు. 

నేడు 13 జిల్లాల కాపు జేఏసీ ప్రతినిధులు భేటీ

రాజమండ్రి : నేడు 13 జిల్లాల కాపు జేఏసీ ప్రతినిధులు భేటీ కానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

 

నేడు తెలంగాణ ఎంసెట్ 3

హైదరాబాద్ : నేడు తెలంగాణ ఎంసెట్ 3 నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలకు వరకు పరీక్ష ఉంటుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

Don't Miss