Activities calendar

12 September 2016

21:34 - September 12, 2016

కర్నాటక, తమిళనాడు సీఎంలకు రాజ్ నాథ్ ఫోన్..

ఢిల్లీ : కర్నాటక, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. కావేరీ జల వివాదంపై నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. 

కర్నాటక కేబినెట్ అత్యవసర సమావేశం రేపు..

కర్నాటక : మంగళవారం రాష్ట్ర కేబినెట్ అత్యవసర సమావేశం కానుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించనుంది. కావేరీ జల వివాదాలపై తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. బెంగళూరులో 144 సెక్షన్ అమల్లో ఉంది. 

మంగళవారం కాశ్మీర్ లో పలు జిల్లాలో కర్ఫ్యూ..

జమ్మూ కాశ్మీర్ : కాశ్మీర్ లో కల్లోల పరిస్థితుల కారణంగా పలు జిల్లాల్లో కర్ఫ్యూను విధించనున్నారు. సుమారు పది జిల్లాల్లో మంగళవారం కర్ఫ్యూ అమల్లోకి రానుంది.

రేపు కాశ్మీర్ లో ర్యాలీ..

జమ్మూ కాశ్మీర్ : కాశ్మీర్ లో కల్లోల పరిస్థితుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి గౌరవార్థం మంగళవారం బక్రీద్ పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలని వేర్పాలు వాదులు పిలుపునిచ్చారు. శ్రీనగర్ లోని సోనావార్ ప్రాంతంలోని భారత్, పాక్ ల ఐరాస మిలిటరీ అబ్జర్వేషన్స్ గ్రూప్ వరకు ర్యాలీ చేపట్టాలని మద్దతు దారులకు పిలుపునిచ్చారు. 

21:24 - September 12, 2016

స్వదేశీ టెస్ట్ సిరీస్ సీజన్ కు టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది. న్యూజిలాండ్ తో ఈనెల 16 నుంచి జరిగే మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు 15 మంది సభ్యుల జట్టును ఖరారు చేసింది. వెస్టిండీస్ తో ముగిసిన టెస్ట్ సిరీస్ లో పాల్గొన్న జట్టులో ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ, యువఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ స్థానం కోల్పోయారు. మిగిలిన 15 మంది సభ్యులతోనే భారత్ సిరీస్ లో పాల్గోనుంది. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ రెండోర్యాంకర్ టీమిండియా ...స్వదేశీ టెస్ట్ సిరీస్ సీజన్ కు సిద్ధమయ్యింది. 7వ ర్యాంకర్ న్యూజిలాండ్ తో జరిగే మూడుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ సమరానికి విరాట్ ఆర్మీ పూర్తిస్థాయి జట్టుతో సిద్ధమయ్యింది. కరీబియన్ టూర్ కోసం ఎంపిక చేసిన 17మంది సభ్యుల భారతజట్టు నుంచి కర్నాటక ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ, ముంబై యువఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ లను తప్పించి మిగిలిన 15 మంది సభ్యులను కొనసాగించాలని బీసీసీఐ ఎంపిక సంఘం నిర్ణయించింది.

16 నుండి అక్టోబర్ 8 వరకు..
కాన్పూర్, కోల్ కతా, ఇండోర్ వేదికలుగా సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 8 వరకూ జరిగే మూడుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో...ఓపెనర్లు విజయ్, రాహుల్, శిఖర్ ధావన్ లను ఎంపిక చేశారు. జట్టులోని ఇతర సభ్యుల్లో అజింక్యా రహానే, రోహిత్ శర్మ, చతేశ్వర్ పూజారా, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా, ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సమీ ఉన్నారు. 

హాట్ ఫెవరేట్ టీమిండియా..
వెస్టిండీస్ తో ఇటీవలే ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను టీమిండియా 2-0 తో నెగ్గడం ద్వారా ఆత్మవిశ్వాసంతో ఉంటే దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ 2-0 పరాజయంతో డీలా పడిపోయింది. భారత స్పిన్ పిచ్ లపై న్యూజిలాండ్ తో జరిగే మూడుమ్యాచ్ ల టెస్ట్ సమరంలో ఆతిథ్య టీమిండియానే హాట్ ఫేవరెట్ గా సిరీస్ వేటకు సిద్ధమయ్యింది.

21:12 - September 12, 2016

హైదరాబాద్ : తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు భగ్గుమన్నాయి. కావేరీ జల వివాదం చిచ్చు పెట్టింది. బెంగళూరులో సుమారు 40 వాహనాలకు నిప్పు పెట్టారు. బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం కర్నాటక రాష్ట్ర కార్యదర్శి జీవీ శ్రీరామ్ రెడ్డి టెన్ టివితో మాట్లాడారు. పరిస్థితి చాలా గంభీరంగా ఉందని, కర్నాటక వాసులను తమిళనాడులో కొట్టారని వార్తలు వచ్చాయని, ఇది పూర్తిగా దావానంలా వ్యాపించడం జరిగిందన్నారు. దీనితో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాహనాలను తగుల బెట్టారని పేర్కొన్నారు. కర్నాటక రాష్ట్రంలో మొదటిసారిగా మిలటరీ రంగంలోకి దిగిందన్నారు. సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించాలని, భావోద్వేగాలకు గురి కావద్దని సీపీఎం పేర్కొంటూ వస్తోందని తెలిపారు. కావేరీ జల విషయంలో ఇరు రాష్ట్రాలకు రాజకీయం కావాలని విమర్శించారు. ఉద్ధేశ్యపూర్వకంగా జనాలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారని, దీనిని సీపీఎం ఖండిస్తోందన్నారు. రెచ్చగొట్టే విధానాన్ని వదిలిపెట్టి సంప్రదింపులు మాత్రమే చేయాలని కోరుతున్నామని, కర్నాటకలో నీరు చాలా తక్కువగా ఉందని, తమిళనాడులో అదే విధంగా ఉందన్నారు. సెంట్రల్ ఇరిగేషన్ అధ్యక్షతనలో మానిటరింగ్ కమిటీ ఉందని, ఇందులో కేంద్రం మౌనంగా వ్యవహరించిందని విమర్శించారు.
కావేరి జలవివాదంతో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు భగ్గుమన్నాయి. కర్ణాటకలో తమిళులపై.. తమిళనాడులో కన్నడిగులపై దాడులు జరుగుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఆందోళనకారులు విధ్వంసక చర్యలకు దిగారు. వాహనాలకు నిప్పు పెట్టారు. బెంగళూరులో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. తమిళనాడులో కన్నడ ప్రజలు భద్రత కల్పించాలని కర్నాటక సిఎం సిద్ధరామయ్య తమిళనాడు సిఎం జయలలితకు విజ్ఞప్తి చేశారు.

పారా ఒలింపిక్స్ లో మరో పతకం..

ఢిల్లీ : పారా ఒలింపిక్స్ లో దీపా మలిక్ రజత పతకం గెలుపొందింది. రియో ఒలిపింక్స్ 2016లో భాగంగా పారా ఒలింపిక్స్ లో మహిళల షాట్ పుట్ లో దీపా మలిక్ ఈ ఘనత సాధించింది. 

20:39 - September 12, 2016

పెల్లెట్లు దూసుకొస్తున్నాయి. గాయాలవుతున్నాయి. రక్తమోడుతోంది. ప్రాణాలు పోతున్నాయి.. ప్రమాదంలో ఉంది శాంతి భద్రతలు మాత్రమే కాదు.. మేం ఈ గడ్డకు చెందిన వారమే.. మాదీ ఈ దేశమే అనే నమ్మకం. ఫలితం.. ప్రజల్లో ఓ అభద్రత.. అసంతృప్తి.. వెరసి కశ్మీరం అట్టుడుకుతోంది. తుపాకీతో, సాయుధ బలగాలతో పరిస్థితిని అదుపు చేయగలమని నమ్మినంతకాలం కశ్మీరంలో మార్పు సాధ్యమా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ఈ అంశంపై ప్రత్యేక కథనం..అదో నిరంతర గాయాల గానం. రక్త తర్పణాల కాలంలో ప్రతీకార జ్వాలల సమయం. ఆయుధమై పేలుతున్న సర్కారీ దౌర్జన్యం. సామూహిక సానుభూతి సందర్భం...కన్నీరై విలపిస్తున్న సామాన్యుడి దీనత్వం. అదే నేటి కాశ్మీరం. రెండు నెలలుగా తుపాకీ మోతలతో కాశ్మీరీల శరీరాలను ఛిద్రం చేస్తున్న పెల్లెట్ల దాడులతో ఆజాదీ నినాదాల రాళ్ళ దాడులతో నెత్తురోడుతున్న కాశ్మీర్ కు కేంద్రం పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలను తరలిస్తోంది. రాజకీయ పరిష్కారాన్ని కాక ఆయుధ పరిష్కారం వైపే కేంద్రం మొగ్గు చూపుతోంది. జులై 8న జరిగిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ జరిగినప్పటి నుంచి ఆ రాష్ట్రం అల్లర్లతో అట్టుడుగుతోంది.

అఖిలపక్షం పర్యటన అసంపూర్ణం..
ఇలాంటి పరిస్థితుల మధ్య వారం క్రితం జరిగిన అఖిలపక్షం పర్యటన అసంపూర్ణంగా ముగిసింది. చర్చించేందుకు వేర్పాటువాదులు నిరాకరించడంతో ఏం తేలకుండానే ముగిసింది. కాశ్మీర్లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యమంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో 28 మందితో కూడిన అఖిలపక్ష బృందం కాశ్మీర్ పర్యటకు వెళ్లింది. అత్యంత సున్నిత ప్రాంతమైన కాశ్మీర్‌లో నేడు నెలకొన్న పరిస్థితులు దేశ ప్రజలందరినీ కలవర పరుస్తున్నాయి. అక్కడ వద్దంటున్న చట్టాలు అమలవుతున్నాయి. కావాలంటున్నవి రద్దు చేస్తామంటారు. ఓ పక్క వేర్పాటు వాద మిలిటెన్సీ, సీమాంతర ఉగ్రవాదం మరో పక్క భారత మిలిటరీ మధ్యలో నలిగిపోయే కాశ్మీర్ ప్రజలు. దీన్ని అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించే రాజకీయ పక్షాలు. ఇదే నా దశాబ్దాల కాశ్మీర్ చిత్రం.

చర్చలొక్కటే పరిష్కారం..
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్ని సమస్యాయుత వాతావరణం నుంచి బైటపడేందుకు చర్చలొక్కటే పరిష్కారం. కేంద్రంలో, రాష్ట్రంలో వున్న అన్ని రాజకీయ పార్టీలను, శక్తులను చర్చలో భాగస్వాములను చేయాలి. అదే సమయంలో పాకిస్తాన్‌తోనూ చర్చలు జరపాలి. ఇందుకు స్థిరమైన, సృజనాత్మక చర్యలు అవశ్యం. దురదృష్టవశాత్తూ కేంద్రంలోని బి.జె.పి ధోరణి ఆ విధమైన భరోసా ఇచ్చేలా లేదు. కాశ్మీర్‌లో శాంతి కపోతం స్వేచ్ఛగా విహరించాలా లేదా అనేది కేంద్రం చేతుల్లోనే వుంది.

సాధారణస్థితిని పునరుద్ధరించాలి..
మండుతున్న మంచులోయ ఎప్పుడు చల్లారుతుంది? దశాబ్దాలుగా విలపిస్తున్న కాశ్మీరీలకు న్యాయం జరిగేదెప్పుడు? ఏ చట్టాలు రక్షిస్తాయి? ఏ న్యాయస్థానాలు ఆదుకుంటాయి? కేవలం శాంతిభద్రతల యంత్రాంగంతో కాశ్మీర్‌ సమస్యను పరిష్కరించలేం. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో వున్న బి.జె.పి, దాని భాగస్వామ్య పార్టీలు రాష్ట్రంలోని రాజకీయ శక్తులతోను చర్చలు జరిపి సాధారణ స్థితిని పునరుద్ధరించాలి. సమస్యను అభివృద్ధి కోణంలో చూడకుండా రాజకీయంగా పరిష్కరించాలి. సమస్య రాజకీయ స్వభావాన్ని గుర్తించాలి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:32 - September 12, 2016

యోగకే యోగాసనాలు నేర్పిచ్చె గురువు మన బాబా రాందేవు.. పొదుపుగ బట్టలేస్కోని తిర్గెమన్షి.. జనానానికి ఇప్పుడు జీన్సు పాయింట్లు దొడ్గిస్తాంటున్నడు.. మందుల దుకాండ్లు.. పండ్లపొడి ప్యాకెట్ల కంపిండ్లకెళ్లి యోగా యూనివర్సిటీదాక వ్యాపారాలు సుర్వు జేశిండుగదా.?? ఇప్పుడు బట్టల దుకాండ్ల మీద బాగ తన్లాడుతున్నడట ఆయన కథేందో తెలుసుకోవాలంటే వీడియో సూడుండ్రి..

20:30 - September 12, 2016

ఈ కొత్త జిల్లాల పంచాది సల్లగుండ ఇంత గిట్ల ఇరాం ఇయ్యకుండ లోల్లి జోరు అందుకుంటుంది. స్వయాన ఒక కార్పొరేటర్ భర్తను వట్కోని.. మళ్ల అధికార పార్టీ నేత, మీదికెళ్లి పెద్దకులపాయినను వట్కోని మీరు పబ్లీకు తాన పైసలు వసూలు జేస్తున్నరు..అవినీతికి పాల్పడుతున్నరు అని అడ్గుడు తప్పుగాదా..? పోలీసోళ్లకు బీపీ ఎప్పుడు వెర్గుతది చెప్పుండ్రి.. బాగ ఆలోచించుండ్రి..పోలీసోళ్లంటె పబ్లీకుల చీ గాళ్లు మంచోళ్లుగాదు ఎప్పుడు మందినే ముంచుతరు.. అన్న పేరున్నది..యాదగిరి లచ్చిమి నర్సింహస్వామితానికి వోతున్నరా ఎవ్వలన్నా..? పోతెవోండ్రిగని.. రెండు మూడు ముచ్చట్లున్నయ్.. వినాయక చవితి పండుగ పూట ఎసొంటి జాగ్రత్తలు దీస్కోవాలె..పబ్లీకుకు గింత భయం భక్తి లేకుంటైందివా..? అరే అధికార పార్టీ నేత కొడ్కంటె ఎంత గొప్పమన్షి..? రాను రాను రాజుగుర్రం కంచెర గాడిది అయినట్టు.. ఎటువోతున్నది ఈ రాజ్యం ఏమైతున్నది అర్థమైతలేదు.. గిసొంటి ముచ్చట్లు వినాలంటే వీడియో క్లిక్ చేయుండ్రి.

ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీష్ భేటీ..

కరీంనగర్ : ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. జిల్లాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. 

పల్నాడులో బాంబుల కలకలం..

గుంటూరు : పల్నాడులో బాంబులు కలకలం సృష్టించాయి. రొంపిచర్ల (మం) వడ్లమూరువారిపాలెంలో ఆటోలో బాంబులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 30 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు. 

19:50 - September 12, 2016

బెంగళూరు : కర్నాటక రాజధాని బెంగళూరు మండిపోతోంది. కర్ణాటక, తమిళనాడుల మధ్య ఏర్పడిన 'కావేరి' జలాల వివాదం కారణంగా ఇరు రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆందోళనకారులు భారీ విధ్వంసానికి తెగబడుతున్నారు. బస్సులు..లారీలు..వాహనాలను తగులబెడుతున్నారు. నగరంలోని నయందనహళ్లి, బెల్, మైసూర్ రోడ్డు, ఆర్ఆర్ నగర్, కెంగేరి, సుద్దుగుంటె పాల్యా, హోసూర్ రోడ్డు, ఎలెక్ట్రానిక్ సిటీ, విజయ్ నగర్, శ్రీరాంపురం, ఒక్లిపురం, యశ్వంత్ పుర, యలహంక తదితర ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈసందర్భంగా టెన్ టివితో బెంగళూరు వాసులు మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:46 - September 12, 2016

బెంగళూరు : కావేరీ జల వివాదం ముదురుతోంది. బెంగళూరులో విధ్వంసం కొనసాగుతోంది. తమిళనాడుకు చెందిన పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. బెంగళూరులో 20 బస్సులను తగులబెట్టారు. అటు బెంగళూరులో 144 సెక్షన్‌ను పోలీసులు విధించారు. రేపు కర్ణాటక కేబినెట్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనుంది. ఆందోళనకారులు కేపీఎన్ బస్ డిపోలో 20 బస్సులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రికి కర్నాటక సీఎం లేఖ రాశారు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కన్నడిగులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయంపై కేంద్రం దృష్టి సారించింది. రాజధానితో పాటు కావేరీ పరివాహక ప్రదేశాలైన మైసూరు, చామరాజనగర, మండ్య, రామనగర జిల్లాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి తమిళనాడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుకాణాల మూసివేతకు పిలుపునిచ్చారు. తమిళ చిత్రాల ప్రదర్శనలను నిలిపివేశారు. నగరంలో రహదారి కూడళ్ల వద్ద అడ్డంగా రాళ్లు పేర్చడంతో మోటారు వాహనాల సంచారానికి అవరోధం కలిగింది.

 • తమిళనాడుకు రోజుకు 15వేల క్యూసెక్కుల వంతున కావేరీ జలాల్ని విడుదల చేయాలని గత సోమవారం అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
 • కర్నాటకలోని నాలుగు జలాశయాల్లో నీరు అడుగంటుతున్నందున నీటి విడుదల నిలిపివేతకు ఉత్తర్వులని జారీ చేయాలని గత శనివారం రాత్రి కర్నాటక అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.
 • దీనిపై సోమవారం ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
 • ఈనెల 20వరకూ తమిళనాడుకు రోజుకు 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని తీర్పునిచ్చింది. 
19:37 - September 12, 2016

చెన్నై : కావేరి జలవివాదంతో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు భగ్గుమన్నాయి. కర్ణాటకలో తమిళులపై.. తమిళనాడులో కన్నడిగులపై దాడులు జరుగుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఆందోళనకారులు విధ్వంసక చర్యలకు దిగారు. వాహనాలకు నిప్పు పెట్టారు. బెంగళూరులో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. తమిళనాడులో కన్నడ ప్రజలు భద్రత కల్పించాలని కర్నాటక సిఎం సిద్ధరామయ్య తమిళనాడు సిఎం జయలలితకు విజ్ఞప్తి చేశారు. కావేరి జలవివాదం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. బెంగళూరులో తమిళనాడు దుకాణాలు, వాహానాలపై ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. నాలుగు ట్రక్కులను ధగ్దం చేశారు. కర్నాటక నుంచి తమిళనాడుకు వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేశారు. బెంగళూరులో స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. మెట్రో సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంలో పోలీసులు నగరంలో 144 సెక్షన్‌ అమలు చేశారు.

హింసాత్మక ఘటనలు..
పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితి విషమిస్తుండడంతో ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. మరోవైపు కావేరి జలాల విడుదలకు అడ్డుపడుతున్న కర్ణాటక ప్రజలపై తమిళులు కన్నెర్రజేశారు. రామేశ్వరంలో కర్ణాటక వాహనాలు భక్తులపై కొందరు తమిళులు దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. డ్రైవర్‌ను విచక్షణారహితంగా చితకబాదారు. మరో ఘటనలో చెన్నై మైలాపూర్‌లో ఉన్న కన్నడ హోటల్‌ న్యూ వుడ్‌ల్యాండ్స్‌పై పెట్రో బాంబులతో పది మంది దాడి చేశారు. హోటల్ అద్దాలను పగులగొట్టారు. ఆందోళనకారులు అక్కడ ఓ లేఖను వదిలిపెట్టారు. కర్ణాటకలో తమిళులపై దాడి చేస్తే.. అందుకు ప్రతీకారంగా తమిళనాడులోని కన్నడిగులపై దాడులు చేస్తామని లేఖలో హెచ్చరించారు. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడులో కన్నడ స్కూళ్లను మూసివేశారు. ప్రభుత్వం భద్రతను అప్రమత్తం చేసింది.

కర్నాటకకు కొంత ఊరట..
కావేరి జ‌లాల‌పై సుప్రీంకోర్టు కర్నాటకకు కొంత ఊరట నిచ్చింది. సెప్టంబ‌ర్ 5న‌ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు స‌వ‌రించింది. సెప్టెంబ‌ర్ 20వ తేదీ వ‌ర‌కు క‌ర్నాట‌క ప్రతి రోజు 12 వేల క్యూసెక్కుల నీటిని త‌మిళ‌నాడుకు వ‌ద‌లాల‌ని కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. త‌మిళ‌నాడుకు ప్రతి రోజు 15 వేల క్యూసెక్కుల కావేరి జ‌లాల‌ను విడిచి పెట్టాల‌న్న ఆదేశాల‌పై స్టే విధించాల‌ని కర్నాటక సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు- పౌరులు చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌లేర‌ని పేర్కొంది. కోర్టు ఉత్తర్వుల‌ను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 20వ తేదీకి వాయిదా వేసింది.

19:34 - September 12, 2016

విజయవాడ : స్విస్‌ చాలెంజ్ విధానం అమలును నిలుపుదల చేస్తూ.. హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ విధానం లోపాభూయిష్టంగా ఉందంటూ దాఖలైన పిటిషన్‌లను విచారణకు స్వీకరించింది. అమరావతి నిర్మాణంలో పాల్గొనే సంస్థలు.. రెండువేల కోట్ల రూపాయల టర్నోవర్‌ కలిగి వుండాలన్న ప్రభుత్వ షరతుపై పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. స్విస్‌ చాలెంజ్‌ విధానంపై స్టే విధించింది. అక్టోబర్‌ 31వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.

స్విస్ చాలెంజ్ విధానం అమలుపై స్టే విధించిన హైకోర్టు..
స్విస్ చాలెంజ్ విధానంలో ప్రభుత్వం సీ.ఆర్.డీ.ఏ. చట్టాన్ని అనుసరించడం లేదని పిటిషనర్స్ తరపు సీనియర్ కౌన్సిల్ మోదుల వెంకటరమణ, ప్రకాశ్ రెడ్డిలు వాదించారు. ప్రభుత్వం చెప్పేది ఒక్కటి.. చేసేది మరొకటని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్టంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్ అథారిటీని పట్టించుకోకుండా మంత్రులతో కూడిన హైపర్ కమిటీ నిబంధనలు సవరణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం పూర్తిగా చట్ట విరుద్దంగా వ్యవహరిస్తోందని కోర్టుకు వివరించారు. ఏపీ ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకు మేలు జరిగేలా వ్యవహారిస్తోందని వాదనలు వినిపించారు.

బహిర్గతం చేయాలన్న పిటిషనర్లు..
తమకు చట్టప్రకారమే బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించాలని పిటిషనర్‌లు హైకోర్టును కోరారు. ఈ అంశంలో ప్రభుత్వం అన్ని విషయాలను బహిర్గతం చేయాలని ఉన్నత న్యాయస్థానానికి విన్నవించారు. అయితే... ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ప్రపంచ దేశాల్లో అత్యుత్తమైన కంపెనీలతో పనులు జరిపించాలన్న ఉద్దేశంతోనే స్విస్‌ చాలెంజ్ విధానాన్ని ప్రవేశపెట్టామని కోర్టుకు తెలిపారు. పిటిషనర్స్ 500 కోట్లకు మించిన పనులు ఎక్కడా చేయలేదన్నారు. వారు పిటిషన్స్ వేసేందుకు అనర్హులని వాదించారు. ఇరు పక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న ఉన్నత న్యాయస్థానం పిటిషనర్స్ వాదనలతో ఏకీభవిస్తూ... స్వీస్ చాలెంజ్ విధానం అమలుపై స్టే విధించింది.

స్టేపై అప్పీలుకు వెళ్లనున్న రాష్ట్ర ప్రభుత్వం..
స్విస్‌ చాలెంజ్‌ విధానంలో మంగళవారం బిడ్డింగ్‌లను తెరవాలని ఉత్సాహంతో వున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు షాక్‌నిచ్చిందనే చెప్పాలి. ఈనెల 16లోగా టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం గతంలోనే నోటిఫై చేసింది. ఈ తరుణంలో పిటిషనర్‌కు అనుకూలంగా.. హైకోర్టు తీర్పునివ్వడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. దీనిపై తక్షణమే అప్పీల్‌కు వెళ్లి.. టెండర్ల ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర తీర్పుపై స్టే తెచ్చుకునేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లాలా..? లేదా హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళ్లాలా..? అని ప్రభుత్వం అలోచిస్తున్నట్లు సమాచారం. 

బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తత..

బెంగళూరు : నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కావేరీ జల వివాదంపై పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కేపీఎన్ బస్ డిపోలో 20 బస్సులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. 

ఏపీలో ముగ్గురు ఐఏఎస్ ల బదిలీ..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఏపీఐఐసీసీ వీసీ, ఎండీగా సాల్మన్ ఆరోఖ్య రాజ్, ఇన్ క్యాప్ వీసీ, ఎండీగా కె.సాంబశివరావు, గనులు, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బి.శ్రీధర్ నియమితులయ్యారు. 

జయకు సిద్ధరామయ్య లేఖ..

కర్నాటక : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ‌రామ‌య్య త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత‌కు లేఖ రాశారు. కావేరి జ‌లాల వివాదం నేప‌థ్యంలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. త‌మిళ‌నాడులో ఉన్న క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని సీఎం సిద్ధ‌రామ‌య్య త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిని లేఖ‌లో కోరారు. 

అన్నాడీఎంకే సీనియర్ నేతపై వేటు..

చెన్నై : అన్నా డీఎంకే సీనియర్ నేత నాథమ్ విశ్వనాథన్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ తమిళనాడు సీఎం, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన, పార్టీలో పలు కీలక పదవులను నిర్వహించారు. 

19:22 - September 12, 2016

చిత్తూరు : పెళ్లికి పెద్దలు నిరాకరించారని మనస్థాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఇందులో ప్రియురాలు తుది శ్వాస విడవగా ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన వి.కోటలో చోటు చేసుకుంది. వి.కోట సమీప గ్రామంలో నివాసం ఉండే జ్యోతి, సత్యవేలులు ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి పెద్దలు నిరాకరించారు. పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఆత్మహత్య శరణ్యమని భావించారు. సోమవారం వీరిద్దరూ పురుగుల మందు సేవించారు. గ్రామస్తులు గమనించి వీరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందింది. సత్యవేలు పరిస్థితి విషమంగా ఉంది. 

మెడికల్ కాలేజీల ఫీజుల ఖరారు..

హైదరాబాద్ : తెలంగాణలోని 2016-2017 విద్యా సంవత్సరానికి మెడికల్ కాలేజీల్లో ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు సీట్ల శాతంతో పాటు ఖరారు చేసిన ఫీజుల వివరాలను వెల్లడించింది. మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 60 శాతం సీట్లను 'ఏ'కేటగిరీకి కేటాయించింది. 25 శాతం సీట్లను 'బీ'కేటగిరీగా పేర్కొంది. మిగిలిన 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాలో 'సీ'కేటగిరీ కింద కేటాయించింది.

18:39 - September 12, 2016

భారత గడ్డపై మరో అంతర్జాతీయ క్రికెట్ సీజన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. టెస్ట్ క్రికెట్ ఏడవ ర్యాంకర్ న్యూజిలాండ్ తో...మూడు మ్యాచ్ ల టెస్ట్, ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు భారత్ ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 29 వరకూ జరిగే టెస్ట్, వన్డే సిరీస్ ప్రోగ్రామ్ లు జరగనున్నాయి. క్రికెట్ కు 1980 దశకం వరకూ ఓ సీజన్ అంటూ ఉండేది. అయితే..ప్రపంచీకరణ పుణ్యమా అంటూ గత రెండు దశాబ్దాలుగా క్రికెట్ కు ఓ సీజన్, రీజన్ అంటూ లేకుండా పోయింది. సాంప్రదాయ టెస్ట్, ఇన్ స్టంట్ వన్డే, ధూమ్ ధామ్ టీ-20, ఐపీఎల్ లీగ్ లతో ఏడాది పొడుగునా అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగడం ఇప్పుడు సాధారణ విషయంగా మారిపోయింది. టెస్ట్ క్రికెట్ రెండో ర్యాంకర్ టీమిండియా ఇటీవలే కరీబియన్ ద్వీపాలలో నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ముగించుకు వస్తే 7వ ర్యాంకర్ న్యూజిలాండ్...దక్షిణాఫ్రికా పర్యటన పూర్తి చేసుకొని వచ్చింది. రెండో ర్యాంకర్ టీమిండియా ...ప్రస్తుత సీజన్లో తొలిటెస్ట్ సిరీస్ సమరానికి సమాయత్తమయ్యింది. న్యూజిలాండ్ తో మూడు టెస్టులు, ఐదు వన్డేల సిరీస్ లకు ఆతిథ్యమిస్తోంది.

 • మూడుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ సమరం...కాన్పూర్ గ్రీన్ పార్క్ వేదికగా ఈనెల 22న ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 22 నుంచి 26 వరకూ తొలిటెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.
 • సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4 వరకూ జరిగే రెండోటెస్ట్ మ్యాచ్ కు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిస్తుంది.
 • సిరీస్ లోని ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఇండోర్ లో అక్టోబర్ 8న ప్రారంభమై..12న ముగియనుంది.
 • ఇక..ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ అక్టోబర్ 16న ప్రారంభమై...29న ముగియనుంది.
 • సిరీస్ లోని తొలివన్డే ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం వేదికగా అక్టోబర్ 16న డే-నైట్ గా జరుగుతుంది.
 • రెండో వన్డే మ్యాచ్ న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా వేదికగా అక్టోబర్ 20న జరుగుతుంది.
 • మూడో వన్డేను మొహాలీ వేదికగా అక్టోబర్ 23న నిర్వహిస్తారు.
 • నాలుగో వన్డేకు రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఉంటుంది. అక్టోబర్ 26న ఈ మ్యాచ్ జరుగుతుంది.
 • ఐదు మ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి వన్డేకి ..అక్టోబర్ 29ల ఆంధ్ర క్రికెట్ సంఘం ఆతిథ్యమిస్తుంది. విశాఖ ఏసీఏ – వీడీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మొత్తం ఐదువన్డేలూ డే- నైట్ గానే జరుగుతాయి.
18:35 - September 12, 2016

గుంటూరు : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల ద్వారా...ఉపాధి చూపించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఏపి నైపుణ్య శిక్షణ సంస్ధ కార్యదర్శి గంటా సుబ్బారావు తెలిపారు. గూగుల్‌ సంస్ధ భాగస్వామ్యంతో అండ్రాయిడ్ డెవలపర్స్ గా ఇంజనీరింగ్ విద్యార్ధులను తీర్చిదిద్దే ట్రైనింగ్‌కు శ్రీకారం చుట్టామని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల ద్వారా నిరుద్యోగాన్ని రూపుమాపే చర్యలు చేపడుతున్నామన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:33 - September 12, 2016

కాకినాడ : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులందరికీ పట్టిసీమ ప్యాకేజీ అమలు చేయాలని అఖిలపక్షం డిమాండ్‌ చేసింది. పోలవరం నిర్వాసితుల సమస్యలపై కాకినాడలో అఖిలపక్ష రౌండ్‌ టేబుల్ సమావేశం జరిగింది. విభజన చట్టంలోని అంశాలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహించడం తగదన్నారు. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, సీపీఐ, సీపీఎం నేతలు పాల్గొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:31 - September 12, 2016

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడిపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేతకాని తనం వల్లనే హోదా రాలేదని ఆరోపించారు. ప్రధాని మోదీకి చంద్రబాబు భయపడుతున్నారని, రెండులక్షల ఇరవై వేల కోట్లు వస్తాయని వెంకయ్యనాయుడు, డెబ్భై ఐదువేల కోట్లు వస్తాయని చంద్రబాబు ఇద్దరూ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

18:28 - September 12, 2016

ఢిల్లీ : ఏపీకి ప్యాకేజీ పేరుతో భ్రమలు సృష్టిస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. ప్యాకేజీతో ఎటువంటి ఉపయోగం ఉండదని ఆయన ఢిల్లీలో అన్నారు. ప్యాకేజీతో ఎక్కువ లాభాలు కలుగుతాయని చెబుతున్నారని తెలిపారు. గతంలో చేసిన వాగ్ధానాలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పడం లేదన్నారు. ఇచ్చిన హోదా హామీని బీజేపీ సర్కార్‌ ఎందుకు నిలుపుకోవడం లేదని ఏచూరీ ప్రశ్నించారు. విభజన సమయంలో ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా ఇస్తామన్న వెంకయ్యనాయుడు ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు. పవన్‌ కల్యాణ్‌ వామపక్షాలతో కలిసి పనిచేయాలనుకోవడం మంచిదని..ఎంతమంది కలిసొస్తే అంతమందిని ఆహ్వానిస్తామన్నారు. ఈ విషయంలో రాష్ట్ర కమిటీ చర్చించుకుని నిర్ణయం తీసుకుంటుందని ఏచూరి వెల్లడించారు. 

18:25 - September 12, 2016

విజయవాడ : స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణం చేపట్టాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు బ్రేక్‌ వేయడంపై అన్ని రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. న్యాయస్థానం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కందు దుర్గేష్‌ అన్నారు. దొడ్డి దారి ప్రయత్నమని, హైకోర్టు తీర్పు చెంపపెట్టుని అభివర్ణించారు. దొడ్డి దారి ప్రయత్నాలను విరమించుకోవాలని, ఓపెన్ టెండర్ ల ద్వారా నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు సింగపూర్ కంపెనీలకు తాకట్టు పెట్టవద్దని వైసీపీ ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను సూచించారు. అయితే.. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని టీడీపీ ఎమ్మెల్యే బొండా వివరించారు.
స్వాగతించిన సీపీఎం..
స్విస్‌ చాలెంజ్‌ విధానంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సీపీఎం స్వాగతించింది. రాజధాని నిర్మాణంలో రాష్ర్ట ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తోందని సీపీఎం నేత బాబురావు విమర్శించారు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని రద్దు చేసి.. న్యాయ ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. 

18:23 - September 12, 2016

నెల్లూరు : కోర్టు సమీపంలో బాంబ్‌ కలకలం సృష్టించింది. భారీ శబ్ధంతో ప్రెషర్‌కుక్కర్ బాంబ్‌ పేలడంతో కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. న్యాయవాదులు ఎక్కడిక్కడ పరుగులు పెట్టారు. పోలీసులకు సమాచారం తెలియడంతో బాంబ్‌స్క్వాడ్‌, క్లూస్ టీమ్‌, జాగిలాలతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కోర్టులో ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారని న్యాయవాదులు తెలిపారు. పక్కా బాంబ్ బ్లాస్ట్ అని ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు. 

18:06 - September 12, 2016

రేపు కర్నాటక కేబినెట్ అత్యవసర భేటీ..

కర్నాటక : మంగళవారం కర్నాటక కేబినెట్ అత్యవసర భేటీ నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ సమావేశంలో కావేరీ జల వివాదంపై చర్చిస్తారని హో మంత్రి జి.పరమేశ్వర వెల్లడించారు. పది కంపెనీల సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాలు మోహరించాయని, ఇంకా పది కంపెనీల బలగాలను పంపించాలని కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు. 

సాయి డెంటల్ కాలేజీలో ఘర్షణ..

శ్రీకాకుళం : సాయి డెంటల్ కాలేజీలో పూర్వ..పీజీ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పూర్వ విద్యార్థి సంతోష్ పై పీజీ విద్యార్థి ప్రసాద్ దాడి చేశాడు. దీనితో సంతోష్ కు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. 

కాసేపట్లో గవర్నర్ ఢిల్లీకి పయనం..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కాసేపట్లో ఢిల్లీకి పయనం కానున్నారు. ఢిల్లీకి రావాలని కేంద్రం ఆదేశాలతో ఆయన వెళ్లనున్నారు. ప్రధాని..హోం మంత్రితో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

 

హైకోర్టులో సీపీఐ నేత నారాయణ పిల్..

హైదరాబాద్ : హైకోర్టులో సీపీఐ నేత నారాయణ పిల్ దాఖలు చేశారు. గ్యాంగ్ స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

17:40 - September 12, 2016

హైదరాబాద్ : వినాయక నిమజ్జన కోలాహాలం మొదలైంది. పలు కూడళ్లలో ప్రతిష్టించిన వినాయకులను నిమజ్జనం చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు భారీగా గణనాథులు తరలిస్తున్నారు. సాగర్ వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ ల సహాయంతో గణనాథులను నిమజ్జనం చేస్తున్నారు. మరోవైపు చెరువులో చేరుతున్న వ్యర్థాలను హెచ్‌ఎండీఏ అధికారులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ఎన్టీఆర్‌మార్గ్ లో వ్యర్ధాలను తొలగించేందుకు భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు. 

17:36 - September 12, 2016

హైదరాబాద్ : భారీ వర్ష సూచనతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కమిషనర్‌కు ఫోన్‌ చేసిన కేసీఆర్‌ నగరంలో పరిస్థితి, ఎమర్జెన్సీ టీమ్స్ పై ఆరాతీశారు. ప్రజలు ఇబ్బందిపడకుండా చూడాలని ఆదేశించారు. వర్షాలపై సీఎం కేసీఆర్‌ హెచ్చరిక నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో సీపీ మహేందర్‌రెడ్డి, ట్రాఫిక్‌ డీసీపీ జితేందర్‌ రెడ్డి భేటీ అయ్యారు. వర్షాల కారణంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. 

17:33 - September 12, 2016

కరీంనగర్ / మెదక్ : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎవరు అడ్డువచ్చినా వాటిని కట్టితీరుతామని మంత్రి హరీశ్ రావు అన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టులను నిర్మిస్తుంటే మరోపక్క కాంగ్రెస్ పార్టీ రాద్దాంతం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

మల్లన్న సాగర్..వంద రోజులు...
మెదక్ : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామంలో రిలే నిరాహార దీక్షలు వంద రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గజ్వేల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సుకు ముంపు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో కదిలారు. నల్ల చొక్కాలు ధరించి.. నిరసన ర్యాలీతో గజ్వేల్‌లకు బయలుదేరారు. 

17:29 - September 12, 2016

హైదరాబాద్ : కార్పోరేట్ ఆస్పత్రులు మాయమాటలతో రోగులను మోసం చేస్తున్నారన్న పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. కేర్, గ్లోబల్, అపోలో ఆస్పత్రులతో పాటు ఏ.పీ. తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. గ్లోబల్ ఆస్పత్రిలో నిఖిల్ రెడ్డి హైట్ పెంచుతామని... కేర్ ఆస్పత్రిలో సునీత అనే మహిళకు కాన్సర్ లేకున్నా కాన్సర్ అని ట్రీట్మెంట్ ఇవ్వడం.. ఆపోలో ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్ పై దర్యాప్తు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం విచారణ వాయిదా వేసింది.

17:22 - September 12, 2016

హైదరాబాద్ : భర్త కర్కశత్వానికి బలైన సుశ్రుత మృతదేహం సూర్యపేటకు తరలించనున్నారు. ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు తల్లిదండ్రులతో పోలీసులు చర్చించారు. అత్తారింటికి తీసుకెళుతామని తొలుత సుశ్రుత తల్లిదండ్రులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఉద్రిక్తత నెలకొంది. ఈ తరుణంలో పోలీసులు సంప్రదింపులు జరిపారు. చివరకు తల్లిదండ్రులు అంగీకరించారు. సుశ్రుత అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఇద్దరు పిల్లలు విషయంలో కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని సుశ్రుత తల్లిదండ్రులు పోలీసులను కోరారు. రెండు..మూడు గంటలుగా కొనసాగిన ఉద్రిక్తత ఒక కొలిక్కి వచ్చింది.
సూర్యాపేటకు చెందిన సుశృతకి నగరంలోని పూసలబస్తీకి చెందిన నూతలగంటి మోహన్‌తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.. కొన్ని రోజులుగా భర్తతోపాటు అత్త మామలు సుశృతను తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆమెపై అనుమానంతో నిత్యం వేధింపులతో నరకం చూపించేవారు. చివరకి ఆమె ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. 

17:12 - September 12, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ కేసులో సిట్ పరిధిని డీజీపీ పెంచారు. కేసును వేగవంతం చేసేందుకు సిట్ పరిధిని పెంచారు. అదనంగా ఒక ఐపీఎస్, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఒక ఏఎస్పీ, ఒక సీఐలను సిట్ కు కేటాయించారు. నయీం కేసులో ఇప్పటి వరకు 80 మంది అరెస్టు కాగా 72 కేసులు నమోదు చేసింది. నాగిరెడ్డితో పాటు కేసును అడిషనల్ డీజీ అంజనీకుమార్ దర్యాప్తు చేపట్టనున్నారు.
సిట్ బృందంలో కొత్తగా కరీంనగర్ ఓఎస్డీ ప్రియదర్శిని..ఖమ్మం ఏఎస్పీ సాయికృష్ణ, అడిషనల్ డీసీపీ ఇస్మాయిల్..ఏసీపీ ట్రాఫిక్ జైపాల్, సీఐ రామచంద్రరావులను సిట్ బృందంలో చేర్చారు.
గ్యాంగ్ స్టర్ నయీం హత్య కేసులో సంచలనాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నయీం డైరీ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర..పోలీసులు కుమ్మక్కు..రాజకీయ నేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు నయీంతో సత్సంబంధాలు కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక పలు జిల్లాల్లో నయీం బాధితులు కేసులు నమోదు చేశారు. దీనితో ప్రస్తుతం ఉన్న సిట్ బృందం దర్యాప్తుకు సరిపోదని భావించిన డీజీపీ అదనపు సిబ్బందిని చేర్చుకున్నారు. పక్కా ఆధారాలు సేకరించడం..వీవీఐపీల అరెస్టు నేపథ్యంలో పకడ్బందీగా వ్యవహరించాలని డీజీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి నయీం కేసులో ఎవరెవరు అరెస్టు అవుతారు ? అనేది వేచి చూడాలి. 

సీఎంజయలలితకు కర్నాటక సీఎం లేఖ

బెంగుళూరు : క‌ర్నాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య ఇవాళ త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత‌కు లేఖ రాశారు. కావేరి జ‌లాల వివాదం నేప‌థ్యంలో ఇరు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న నిర‌స‌న‌ల‌పై ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌మిళ‌నాడులో ఉన్న క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని సీఎం సిద్ధ‌రామ‌య్య త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిని లేఖ‌లో కోరారు. క‌న్న‌డీయుల‌పై త‌మిళ‌నాడులో జ‌రుగుతున్న దాడుల‌ను ఆపేందుకు రాష్ట్ర అధికారుల‌కు ఆదేశాలు జారీ చేయాల‌ని జ‌య‌ల‌లిత‌ను క‌ర్నాట‌క సీఎం కోరారు.

17:02 - September 12, 2016

హైదరాబాద్ : కట్టుకున్న భర్తే రాక్షసుడిలా ప్రవర్తించాడు. చిన్న కారణానికే ఆమెను తీవ్రంగా కొట్టాడు. అంతేగాక, కుటుంబసభ్యుల ఎదుటే వివస్త్రను చేసి తీవ్ర అవమానానికి గురిచేశాడు. క్షమించమని ఎంత వేడుకున్నా.. ఆ దుర్మార్గుడి హృదయం కరగలేదు. ఈ ఘోర అవమానాన్ని భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.  హైదరాబాద్‌లో భర్త కర్కశత్వానికి ఓ భార్య బలైంది. సూర్యాపేటకు చెందిన సుశృతకి నగరంలోని పూసలబస్తీకి చెందిన నూతలగంటి మోహన్‌తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.. కొన్ని రోజులుగా భర్తతోపాటు అత్త మామలు సుశృతను తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆమెపై అనుమానంతో నిత్యం వేధింపులతో నరకం చూపించేవారు. చివరకి ఆమె ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు.

హీటర్ కారణం..
ఆదివారం ఉదయం సుశృత స్నానం చేయడానికి వేడి నీళ్లు పెట్టుకుంది. అనంతరం స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లింది. ఇంతలో వేడి నీళ్ల కోసం వాటర్‌ హీటర్‌ను ఎక్కువసేపు ఉపయోగించిందంటూ అత్తమామలు ఆమె భర్తను ఉసిగొల్పారు. దీంతో అతడు బాత్రూంలో స్నానం చేస్తుండగానే సుశృతను కొట్టాడు. తప్పయిపోయిందని, క్షమించాలని వేడుకున్నా ఊరుకోలేదు. ఇంటిలో అందరి ముందు గొడును బాదినట్టు బాదాడు. ఇదంతా చూస్తున్న అత్తమామలు కనీసం ఆపడానికి కూడా ప్రయత్నం చేయకుండా.. భర్తను ఇంకాస్త రెచ్చగొట్టారు. దీంతో జరిగిన ఘోర అవమానాన్ని తట్టుకోలేక ఆమె తన తల్లిదండ్రులకు మొబైల్‌లో మెసేజ్‌ పెట్టింది. అవమానం భరించలేక సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆందోళన..
సుశృత తల్లిదండ్రులు ఆమెది ఆత్మహత్య కాదని భర్త, అత్తమామలే చంపారని ఆరోపిస్తున్నారు. ఆమె మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తమ కూతురును కొట్టి చంపారంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:59 - September 12, 2016
16:58 - September 12, 2016

చెన్నై : తమిళనాడు, కర్నాటకల మధ్య కావేరి జలవివాదం ఉద్రిక్తతకు దారి తీస్తోంది. తాజాగా కావేరి జలాల విడుదలకు అడ్డుపడుతున్న కర్ణాటక ప్రజలపై తమిళులు కన్నెర్రజేశారు. రామేశ్వరంలో కర్ణాటక బస్సుపై కొందరు వ్యక్తులు దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. డ్రైవర్‌ను విచక్షణారహితంగా కర్రలతో చితకబాదారు. మరో ఘటనలో చెన్నై మైలాపూర్‌లో ఉన్న కన్నడ హోటల్‌ న్యూ వుడ్‌ల్యాండ్స్‌పై పది మంది దాడి చేశారు. హోటల్ అద్దాలను పగులగొట్టారు. ఆందోళనకారులు అక్కడ ఓ లేఖను వదిలిపెట్టారు.కర్ణాటకలో తమిళులపై దాడి చేస్తే.. తమిళనాడులోని అన్ని కన్నడ హోటళ్లు, షాపింగ్‌ మాళ్లపై పెట్రోల్‌ బాంబులు వేస్తామని లేఖలో హెచ్చరించారు.

బెంగళూరులో ఉద్రిక్తత..
ఇదిలా ఉంటే కావేరి జల వివాదం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో హింసాయుత్మక ఘటనలకు దారి తీస్తున్నాయి. బెంగుళూరులో తమిళనాడు దుకాణాలు, వాహనాలపై ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. నడి రోడ్డుపై ఓ భారీ వాహనాన్ని దగ్ధం చేశారు. తమిళనాడుకు వెళ్లే బస్సులను నిలిపివేశారు. స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. 144సెక్షన్ అమలు చేసి పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితి చేయి దాటుతుండడంతో ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది.

కర్నాటకకు ఊరట..
కావేరి జ‌లాల‌పై సుప్రీంకోర్టు కర్నాటకకు కొంత ఊరట నిచ్చింది. సెప్టంబ‌ర్ 5న‌ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు స‌వ‌రించింది. సెప్టెంబ‌ర్ 20వ తేదీ వ‌ర‌కు క‌ర్నాట‌క ప్రతి రోజు 12 వేల క్యూసెక్కుల నీటిని త‌మిళ‌నాడుకు వ‌ద‌లాల‌ని కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. త‌మిళ‌నాడుకు ప్రతి రోజు 15 వేల క్యూసెక్కుల కావేరి జ‌లాల‌ను విడిచి పెట్టాల‌న్న ఆదేశాల‌పై స్టే విధించాల‌ని కర్నాటక సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు- పౌరులు చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌లేర‌ని పేర్కొంది. కోర్టు ఉత్తర్వుల‌ను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 20వ తేదీకి వాయిదా వేసింది.

నయీమ్ కేసులో సిట్ పరిధి పెంపు : డీజీపీ

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసును వేగవంతం చేసేందుకు సిట్ పరిధిని పెంచినట్లు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. అదనంగా నలుగురు డీఎస్పీలు, ఇద్దరు సీఐలను కేటాయించినట్లు పేర్కొన్నారు. నయీం ఘటనలో ఇప్పటి వరకు 82 మంది ని అరెస్టు చేసి, 77 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 

16:33 - September 12, 2016

నెల్లూరు : జిల్లా కోర్టులో పేలుడు కలకలం రేపుతోంది. పేలింది బాంబా ? అనేది తెలియడం లేదు. ఆర్టీసీ బస్టాండు సమీపంలో కోర్టు కార్యాలయం ఉంది. ఇక్కడ 22 అదనపు కోర్టులున్నాయి. మూడో అదనపు సివిల్ జడ్జి కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న గోడ కొద్దిగా ధ్వంసమైంది. ఓ బ్యాగులో ఉన్న కుక్కర్ పేలడం..పొగ కమ్ముకోవడంతో అక్కడున్న వారు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న బాంబు స్వ్కాడ్..డాగ్ స్వ్కాడ్ ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాంబు పేలే సమయానికి ఈ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉంది. పేలింది బాంబేనా ? కాదా ? అనేది తెలియాల్సి ఉంది. బక్రీద్ పండుగ సందర్భంగా భయబ్రాంతులకు గురి చేయాలనే ఉద్ధేశ్యంతో ఎవరైనా ఇలా చేసి ఉంటారా ? ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా ? అనేది పోలీసుల విచారణలో తేలనుంది. 

నయీమ్ కేసు సీబీఐకి అప్పగించాలి : నారాయణ

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

నకిలీ వీసాతో పట్టుబడ్డ మహిళ

హైదరాబాద్ : నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన మహిళను ఎయిర్ పోర్టు అధికారులు పట్టుకున్నారు. ఆ మహిళ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు వాసిగా గుర్తించారు.

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపి ఏపీ సీఎం

విజయవాడ : రేపు బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లీం సోదరులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడాలి : సీతారాం ఏచూరి

ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం కోసం 20 ఏళ్లు అయిన సందర్భంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ నేతృత్వంలో సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ సీపీఎం నేత సీతారం ఏచూరి, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, డి రాజా, విద్యార్థి నేత కన్హయ్య కుమార్, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ... మహిళా రిజర్వేషన్ కోసం పార్లమెంట్ లో వామపక్షాల తరపున పోరాతున్నామని ఏచూరి తెలిపారు.

16:13 - September 12, 2016

న్యూఢిల్లీ : మహిళల వెనుకబాటుతనానికి మనువాదమే కారణమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి 20 ఏళ్లు అయిన సందర్భంగా 'నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్' నేతృత్వంలో సెమినార్ జరిగింది. ఈ సెమినార్ లో ఏచూరి పాల్గొని ప్రసంగించారు. సంప్రదాయం..నయ ఉదార విధానాలు మహిళలపై ప్రభావం చూపుతున్నాయని, మహిళలను ఒక వస్తువుగా చూస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు కూడా మహిళల రిజర్వేషన్ కు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. ఆధునికత ఎంత పెరిగినా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు మహిళలను ముందుకు తీసుకెళ్లేందుకు ఓ ముందడుగు మాత్రమేనని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

గవర్నర్ కు ఢిల్లీ నుండి పిలుపు

హైదరాబాద్ : ఢిల్లీ నుంచి గవర్నర్ నరసింహన్ కు పిలుపు వచ్చింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గవర్నర్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఢిల్లీ టూర్ లో ప్రధాని, హోమంత్రితతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లాకోర్టు సమీపంలో బాంబు పేలుడు

నెల్లూరు : జిల్లా కోర్టు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. కుక్కర్లో బాంబు పేలుడు సంభవిచింది. అయితే కోర్టు ఆవరణలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

15:56 - September 12, 2016

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. 444 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 28,353 వద్ద ముగిసింది. 151 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 8,715 వద్ద ముగిసింది. 

15:53 - September 12, 2016

చెన్నై : తమిళనాడు, కర్నాటకల మధ్య కావేరి జలవివాదం ఉద్రిక్తతకు దారి తీస్తోంది. తాజాగా కావేరి జలాల విడుదలకు అడ్డుపడుతున్న కర్ణాటక ప్రజలపై తమిళులు కన్నెర్రజేశారు. రామేశ్వరంలో కర్ణాటక బస్సుపై కొందరు వ్యక్తులు దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. డ్రైవర్‌ను విచక్షణారహితంగా కర్రలతో చితకబాదారు. మరో ఘటనలో చెన్నై మైలాపూర్‌లో ఉన్న కన్నడ హోటల్‌ న్యూ వుడ్‌ల్యాండ్స్‌పై పది మంది దాడి చేశారు. హోటల్ అద్దాలను పగులగొట్టారు. ఆందోళనకారులు అక్కడ ఓ లేఖను వదిలిపెట్టారు.కర్ణాటకలో తమిళులపై దాడి చేస్తే.. తమిళనాడులోని అన్ని కన్నడ హోటళ్లు, షాపింగ్‌ మాళ్లపై పెట్రోల్‌ బాంబులు వేస్తామని లేఖలో హెచ్చరించారు. 

15:51 - September 12, 2016

గుంటూరు : జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖ రాశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కోర్టుకు వెళుతావా ? నీ అంతు చూస్తామంటూ బెదిరించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'ఒళ్లు ఎలా ఉంది..కేసు వేశావు..దాని మీద హైకోర్ఉటలో స్టే తెచ్చుకుంటే నువ్వు మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాలని అనుకుంటున్నావని..తెలిసింది. మంగళగిరిలోనే చంపుతాం'..అంటే లేఖలో పేర్కొన్నారు.

ఓటుకు కోట్లు..
ఓటుకు కోట్లు..కేసు సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మాట్లాడిన మాటలు రికార్డు అయ్యాయని, ఆ వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించినందున ఈ కేసులో తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసును పునర్విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తనపై విచారణ నిలిపివేయాలంటూ 'చంద్రబాబు' హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాల్సిందిగా ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ఎనిమిది వారాల పాటు స్టే విధించింది. 

15:30 - September 12, 2016

హైదరాబాద్‌ : దారుణం జరిగింది. వేడి నీళ్ల కోసం వాటర్‌ హీటర్‌ను ఎక్కువసేపు వాడిందన్న ఒకే ఒక్క కారణంతో... ఆమె భర్త విచక్షణ మరిచి పశువులా మారాడు. బాతరూంలోనే భార్యను తీవ్రంగా కొట్టాడు. క్షమించు అంటున్నా, వివస్త్రగా ఉన్న ఆమెను కొట్టుకుంటూనే బయటకు తీసుకొచ్చాడు. అత్తామామలు, తోడి కోడలు, ఇతర కుటుంబ సభ్యులు చూస్తుండగా బట్టలు లేకుండానే ఆమెను కొట్టాడు. అత్తమామలు కూడా అతనికే మద్దతు ఇచ్చారు. ఆ అవమానాన్ని ఆమె భరించలేకపోయింది. తీవ్ర మనస్తాపంతో తల్లిదండ్రులకు వాట్సప్‌ మెసేజ్‌ పెట్టి తనువు చాలించింది. ఈ ఘటన సైదాబాద్‌ పరిధిలోని పూసలబస్తీలో ఆదివారం జరిగింది.

ఎనిమిదేళ్ల కిందట వివాహం..
సూర్యాపేటకు చెందిన సుశృతకు పూసలబస్తీకి చెందిన నూతలగంటి మోహన్‌తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మోహన్‌ ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగి. అయితే, కొద్ది రోజులుగా భర్తతోపాటు అత్త మామలు సుశృతను తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆమెపై అనుమానంతో ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం సుశృత స్నానం చేయడానికి వేడి నీళ్లు పెట్టుకుంది. అనంతరం స్నానం చేయడానికి బాతరూంలోకి వెళ్లింది. ఇంతలో వేడి నీళ్ల కోసం వాటర్‌ హీటర్‌ను ఎక్కువసేపు ఉపయోగించిందంటూ అత్తమామలు ఆమె భర్తను ఉసిగొల్పారు. దాంతో అతడు బాతరూంలో స్నానం చేస్తుండగానే సుశృతను కొట్టాడు. ఈసారి తప్పయిపోయిందని, క్షమించాలని వేడుకున్నా ఊరుకోలేదు. బాత్‌రూం నుంచి బయటకు వచ్చిన తర్వాత వివస్త్రగా ఉండగానే మళ్లీ కొట్టాడు. ఇంట్లో అత్తమామలు, తోడి కోడలు, ఆమె పిల్లలు చూస్తుండగా ఒంటిపై దుస్తులు లేకపోయినా విచక్షణరహితంగా కొట్టాడు. మరోసారి వాటర్‌ హీటర్‌ వినియోగించనని ప్రాధేయపడినా వినలేదు. వివస్త్రగా ఉన్న ఆమెపై దాడి చేశాడు. జరిగిన ఘోరాన్ని ఆమె తన తల్లిదండ్రులకు మొబైల్‌లో మెసేజ్‌ పెట్టింది. అవమానం భరించలేక సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్య కాదు..
సుశృత తల్లిదండ్రులు ఆమెది ఆత్మహత్య కాదని భర్త, అత్తమామలే చంపారని ఆరోపించారు. సుశ్రిత మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉస్మానియా మార్చురీ వద్ద సుశ్రిత బంధువులు ఆందోళనకు దిగారు. దీనితో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

ఇద్దరు మంత్రులపై యూపీ సర్కార్ వేటు

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులపై వేటు వేశారు. అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర‌ మైనింగ్‌శాఖ మంత్రి గాయత్రి ప్రసాద్‌ ప్రజాపతి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి రాజ్‌కిషోర్‌ సింగ్‌లను కేబినెట్ నుంచి తొల‌గిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో కొన‌సాగుతున్న అక్రమ మైనింగ్‌పై ఇటీవ‌లే అలహాబాద్‌ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సీబీఐ దర్యాప్తున‌కు కూడా ఆదేశించింది. మంత్రులపై వచ్చిన ఆరోపణలతో ఆ రాష్ట్ర ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

ఉస్మానియా మార్చురీ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ : ఉస్మానియా మార్చురీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సుశృత మృతికి కారణమైన భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరస్థితని చక్కపరుస్తున్నారు.

హైదరాబాద్ పై ఏక్షణమైనా ఉగ్రదాడి:ఐజీ

హైదరాబాద్ : నగరంపై ఏ క్షణమైనా ఉగ్రదాడులు జరగవచ్చని, పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉండాలని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ విభాగాన్ని హెచ్చరిస్తూ, కేంద్రం నుంచి సమాచారం అందింది. బక్రీద్, గణేశ్ నిమజ్జనాలే లక్ష్యంగా ముష్కరులు తెగబడవచ్చని హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

14:50 - September 12, 2016
14:43 - September 12, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులపై టి.కాంగ్రెస్ పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. ఈ మేరకు సోమవారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ ను కలిసింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ కాంగ్రెస్ పై పలు విమర్శలు గుప్పించారు. భారీ దోపిడి అన్న ఉత్తమ్...
తెలంగాణలో ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని.. బలవంతపు భూసేకరణకు మాత్రమే వ్యతిరేకమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మల్లన్నసాగర్ బలవంతపు భూసేకరణపై గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదుచేశారు. ప్రాజెక్టుల పేరిట తెలంగాణలో భారీ దోపిడీ జరుగుతుందని.. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడండని గవర్నర్‌కు విజ్ఞప్తిచేశామని ఉత్తమ్ తెలిపారు.
హస్తం నేతలు మట్టి కొడుతున్నారు - ఎంపీ వినోద్..

తమ పార్టీ భవిష్యత్‌ కోసమే కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో నీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. 2013 భూసేకరణ చట్టం తెచ్చిన మూడునెలలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిందని.. చట్టాన్ని కాంగ్రెస్ నాయకులు ఆధ్యయనం చేయలేదని విమర్శించారు. భూసేకరణ చట్టంలో మార్పులు చేసుకోవచ్చన్నారు. తెలంగాణ రైతుల నోట్లో హస్తం నేతలు మట్టికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

14:41 - September 12, 2016

హైదరాబాద్ : తోడుగా ఉంటానని చెప్పిన మొగుళ్లే కాలయముళ్లా మారుతున్నారు. భార్యలను శారీరకంగా..మానసికంగా హింసిస్తున్నారు. భర్తలు పెట్టే బాధలకు తట్టుకోలేక వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తమ కుమార్తె మరణానికి కారకుడైన ఆ భర్తను ఉరి తీయాలని అమ్మాయి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ వాసి 'సుశ్రుత' ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. 'సుశ్రుత'ను భర్త..అత్తమామలు హత్యచేశారని. భర్తను ఉరితీయాలని బంధువులు ఉస్మానియా మార్చురీ దగ్గర ఆందోళన చేస్తున్నారు. భర్త అక్రమ సంబంధం పెట్టుకుని తమ కుమార్తెను చంపాడని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో 'సుశ్రుత' బంధువులు మాట్లాడారు.

హీటర్ పెట్టుకుందని...
నకిరేకల్ ప్రాంతం వద్దకు రాగానే కుమార్తె నుండి ఫోన్ వచ్చిందని తండ్రి పేర్కొన్నాడు. తనను ఇష్టమొచ్చినట్లుగా కొడుతున్నాడని..హీటర్ పెట్టుకోవడం జరిగిందని..ఎందుకు పెట్టుకున్నావంటూ బూతులు తిట్టాడని అమ్మాయి పేర్కొందని వాపోయారు. తొందరపడకు..వస్తున్నామని సముదాయంపు చేయడం జరిగిందన్నారు. కాళేశ్వరం వెళుతున్నామని..రేపు ఉదయం వస్తామని నిన్న చెప్పడం జరిగిందన్నారు. దర్శనం అనంతరం వద్దామని అనుకుంటున్నామని..అంతలోనే తమ బంధువు నుండి ఫోన్ రావడం జరిగిందని..అమ్మాయి సీరియస్ గా ఉందని ఫోన్ లో తెలపడం జరిగిందన్నారు. గతంలో కూడా దెబ్బలు కొట్టాడని..కానీ బుజ్జగించామన్నారు. కానీ ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదని..అందరూ కొట్టి చంపేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తెల్లగా ఉండే అమ్మాయి కమిలిపోయి ఉందని విలపిస్తూ చెప్పాడు. కఠినాతికఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.
ఘటనకు సంబంధించి తల్లిదండ్రులకు వాట్సాప్ లో మెసేజ్ పెడుతూ 'సుశ్రుత' ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

మంగళగిరి ఎమ్మెల్యే కి బెదిరింపు లేఖ...

గుంటూరు : సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తావా... నీ అంతు చూస్తామంటూ మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి బెదిరింపు లేఖ వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మీడియాకు తెలిపారు.

14:34 - September 12, 2016

పశ్చిమ గోదావరి : తుండూరు ప్రాంతం అంతా ఎమర్జెన్సీ తలపిస్తోంది. వేయి మంది పోలీసులు ఆప్రాంతంలో మోహరించారు. దీనికంతకంటికి కారణం ఆక్వా ఫుడ్ ప్రొడక్ట్ కు వ్యతిరేకంగా పోరాడటమే. ఆక్వాఫుడ్‌ వ్యతిరేక పోరాట సమితికి చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో నిర్వాసితులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఫుడ్‌ ప్రొడక్ట్‌ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. అటు ఫుడ్‌ ప్రొడక్ట్‌ దగ్గరను మిషనరీని సంస్థ యాజమన్యం తరలిస్తోంది.
ఇటీవలే ప్రాజెక్టు సంబంధించిన వారు కొంతమంది వచ్చారు. వీరిని కలిసేందుకు పోరాట సమితి నాయకులు ప్రయత్నించారు. వినతిపత్రం ఇచ్చేందుకు వారు ప్రయాణిస్తున్న కారును ఆపారు. కానీ తమపై హత్యాయత్నం చేసేందుకు నాయకులు ప్రయత్నించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో కొంతమందిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేయడానికి సిద్ధమౌతున్నారు. పరిశ్రమను ఏర్పాటు చేయడానికి తాము వ్యతిరేకమని వారు ఖరాఖండిగా చెబుతున్నారు. 

14:29 - September 12, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నగర పరిస్థితిపై ఆరా తీశారు. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కు సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ఫోన్ చేశారు. భారీ వర్ష సూచనతో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కమిషనర్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. నగరంలో పరిస్థితి, ఎమర్జెన్సీ టీమ్స్‌పై ఆరా తీశారు. ప్రజలు ఇబ్బందిపడకుండా చూడాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా నగరంలో కుంభవృష్టి కురుస్తోంది. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు అస్తవ్యస్థమయ్యాయి. బక్రీద్, వినాయక నిమజ్జనం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులకు సూచించారు. పురాతన భవనాల యజమానులు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే ఖాళీ చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. యజమానులతో మాట్లాడి భవనాలను కూల్చివేయాలని సూచించారు. 

వ్యక్తిగతంగానే ముద్రగడ ఆరోపణలు : ఎమ్మెల్యే బొండా...

విజయవాడ : ప్రభుత్వంపై ముద్రగడ కక్షపూరితంగానేఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు. వ్యక్తిగత స్వార్థం కోసం ముద్రగడ కాపులని అడ్డు పెట్టుకుంటున్నారని విమర్శించారు. బొత్స, చిరంజీవి, దాసరి, రామచంద్రయ్య మంత్రులుగా ఉన్నపుడు కాపులకి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పల్స్ సర్వే తరువాత మంజునాథన్ కమిటీ పర్యటన చేస్తుందని, ప్రభుత్వంపై బురద జల్లేందుకు వైసీపీ నేతలతో కలిసి ముద్రగడ జేఏసీ మీటింగ్ పెట్టారని బోండా ఆరోపించారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ కు సీఎం కేసీఆర్ ఫోన్

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ కమిషనర్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నగరంలో పరిస్థితి, ఎమర్జెన్సీ టీమ్స్ సీఎం ఆరా తీసినట్లు సమాచారం.

నిఖిల్ రెడ్డి ఆపరేషన్ ఘటనపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : నిఖిల్ రెడ్డి (ఎత్తు పెంపు) ఆపరేషన్ పై హైకోర్టు లో విచారణ జరిగింది. గ్లోబల్, అపోల్, కేర్ ఆసుపత్రులతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కౌంటర్ దాఖలు చేయాలని  హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

516 పోస్టుల భర్తీకి టీ.సర్కార్ నోటిఫికేషన్

హైదరాబాద్ :గిరిజన గురుకుల పాఠశాలల్లో 516 పోస్టులకు తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్ట్(బాయ్స్) -18, సంగీతం -32, స్టాఫ్ నర్స్ -50 పోస్టులు, ప్రిన్సి పాల్ -16, టీజీటీలు -350, పీటీ-50 పోస్టులు ఉన్నాయి.

14:01 - September 12, 2016

రీల్ లైఫ్ లో సింగర్ సునీత్ కనిపించబోతోంది. మహిళలు ఎదుర్కొనే సమస్యలపై ఆమె జర్నలిస్టుగా పోరాటం చేయనుంది. సునీత ఫస్ట్ టైమ్ ఓ షార్ట్ ఫిల్మ్ చేసింది. ఇందులోని విశేషాలను పంచుకుంది. ‘రాగం’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తన లైఫ్‌కి దగ్గరగా ఉంటుందని, అందువల్లే చాలా సీన్స్‌ను సింగిల్ టేక్‌లో చేశానంటోంది. తాను యాక్టింగ్‌కి సరిపోనని, అందుకే ఆఫర్స్ వచ్చినా రిజక్ట్ చేయాల్సివచ్చిందని తెలిపింది. కానీ స్మాల్ మూవీలో ఎవరిపై ఆధారపడని మహిళ పాత్ర తనదని, వృత్తి రీత్యా జర్నలిస్ట్ అయినా, పాటలు పాడడమంటే ఆ పాత్రకు చాలా ఇష్టమంటూ కొంత క్లూ ఇచ్చేసింది. ఇక్కడ మరోపాయింట్ ని కూడా గుర్తు చేసింది సునీత. ఈ ప్రాజెక్టులో ఎక్కువమంది మహిళలే పని చేయడాన్ని గుర్తు చేసింది.

 

14:00 - September 12, 2016

ఇదంతా పోటీ ప్రపంచం. ఇందులో ఫ్యాషన్ ప్రపంచం ఎప్పుడూ ఒక స్టెప్ ముందే ఉంటుంది. మరి ఇలాంటి ఫ్యాషన్ ప్రపంచంలో వచ్చిన ట్రెండ్స్ తో ఏంటో ఇవాళ్టి సొగసులో చూద్దాం. వివరాలను వీడియోలో చూద్దాం....

13:58 - September 12, 2016

పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో దూసుకుపోతున్న మహిళలు, వ్యాపార రంగంలోనూ సత్తా చాటుకుంటున్నారు. వైవిధ్యమైన ఉత్పత్తులతో, సరికొత్త ఆలోచనతో తమదైన ప్రత్యకతను సాధించుకుంటున్నారు. అలా సరికొత్త ప్రాడెక్ట్స్ తో మార్కెట్ లోకి ప్రవేశించిన మహిళా వ్యాపార వేత్త అనుభవాలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్ఫూర్తి.
వ్యాపారమంటే ఆటుపోటులతో పయనం.
వ్యాపారమంటే ఆటుపోటులతో పయనం. లాభనష్టాల సమ్మిళితం. అటువంటి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారు వాటన్నింటికీ సిద్ధపడాల్సిందే. నష్టాలు వీడి, లాభాలబాట పట్టేందుకు ఎంత కాలమైనా ఓపికగా ఎదురుచూడాల్సిందే. అలాంటి ఆత్మస్థయిర్యంతోనే అడుగు వేస్తున్నారు హైదరాబాద్ నగరానికి చెందిన శైలజ.
కొత్త స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ శైలజ  
టేస్టీ టేస్టీ చాక్లెట్స్ మేకింగ్ లో కొత్త స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన శైలజకి మానవి అభినందనలు తెలియచేస్తోంది. ఎందరికో స్పూర్తిని కలిగించాలని ఆశిస్తోంది. పూర్తి వివరాలను వీడియలో చూద్దాం...

 

13:51 - September 12, 2016

కలం, గళం ఏకమై ప్రభంజనాన్ని సృష్టించాయి. ఆట పాట ఒక్కటై వేదికలను దద్దరిల్లేలా చేశాయి. పల్లెల విధ్వంసాన్ని, పల్లెల సోయగాన్ని, గల్లి బతుకుల ధీనత్వాన్ని సంతలో వాతావరణాన్ని ఒకటనేమిటీ మన చుట్టూ ఉండే ప్రతి వాతావరణాన్ని, ప్రతి సంగతిని తనదైన స్వరంతో, తనదైన కవిత్వంతో మన ముందుంచాడాయన. ఆ ఆ పాట ఒక్క చినుకుగా, ఒక్క నీటి బిందువుగా మొదలై వానలా, వరదలా, ఒక వెల్లువలా మనల్ని ముంచెత్తి  ఒక అలౌకి ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది. 
అలాంటి కవిత్వాన్ని, గేయ కవిత్వాన్ని ప్రజా కవి, మన కాలపు వాగ్గేయకారుడు గోరటి వెంకన్న. కాళోజీ నారాయణరావు స్మారక అవార్డును గోరటి వెంకన్నకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టెన్ టివి అక్షరం ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా గోరటి వెంకన్న పలు అసక్తికరమైన విషయాలను వివరించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

13:49 - September 12, 2016

'మెంటల్' సినిమా దర్శకుడి పేరు మార్పుపై వివాదం నెలకొంది. ఈ చిత్రానికి ఔట్ రైట్ తీసుకున్న బషీర్... దర్శకుడు బాబ్జీ పేరుకు బదులుగా బషీర్ తన పేరు వేసుకున్నారు. దీంతో సినిమా వివాదం నెలకొంది. బాబ్జీ న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఈనేపథ్యంలో బాబ్జీతో టెన్ టివి నిర్వహించింది. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..  'నా పేరు తీస్తే ఎలా బతకాలి. సెన్సార్ పూర్తి అయిన తర్వాత పేర్లు మార్చుకోవచ్చని చిత్ర సీమలోని కొంతమంది పేరున్న ఇడియట్స్ అంటున్నారు. దర్శకులు రాజమౌళి, కృష్ణవంశీకి అన్యాయం జరిగితే ఊరుకుంటారా..? మౌత్ టాక్ వల్ల పబ్లిక్ సినిమాకు వెళ్తున్నారు. మెంటల్ సినిమా దర్శకుడి బషీర్ గా వేసుకున్నారు.. ఆయన పేరును తొలగించి నాపేరు వేయాలి. నాకు న్యాయం చేయాలి. లేదంటే ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడానని' హెచ్చరించారు. దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ ఫోన్ ఇన్ లో మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

భూసేకరణ ముసాయిదా బిల్ తయారీకి కమిటి...

హైదరాబాద్: భూసేకరణ ముసాయిదా బిల్ తయారీకి అధికారులతో కమిటీ వేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రెవిన్యూశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఛైర్మన్ గా కమిటీ వేశారు.

13:31 - September 12, 2016

మహబూబ్ నగర్ : ఎటుచూసినా...బురద.. మురుగునీరు.. పురుగులు..ఆ ప్రాంతంలోనే పాల శీతలీకరణ జరిగేది.. అక్కడ నుంచే ప్రజలకు తరలించేది. పరిశుభ్రత లేదు.. అధికారుల పర్యవేక్షణ లేదు. ఇది వనపర్తి పాలశీతలీకరణకేంద్రం పరిస్థితి.  
ప్రశ్నార్థకంగా మారిన ప్రజారోగ్యం
నిత్యం ప్రజలకు.. విద్యార్థులకు..రోగులకు పాలను సప్లై చేసే పాలశీతలీకరణ కేంద్రం సమస్యల వలయంలో చిక్కుకుంది.  దీంతో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి గ్రామంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం 1985 సంవత్సరంలో మహబూబ్‌నగర్‌ జిల్లా..వనపర్తిలో పాలశీతలికరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడకు నిత్యం వివిధ మండలాల నుంచి ఐదు వేల ఐదు వందల లీటర్ల పాలు వస్తాయి. కేంద్రానికి వచ్చిన పాలను శీతలకరించి విజయ పాల డెయిరీకి పాలను తరలిస్తారు. అలాగే ఇక్కడ నుంచే ప్రభుత్వ వసతి గృహాలకు..ప్రభుత్వ ఆస్పత్రికి కూడా పాలను సప్లై చేస్తామని సూపర్‌వైజర్‌ చెప్పారు. 
దుర్గంధంగా మారిన పాలకేంద్రం
అయితే పాలను కూలింగ్‌ చేసే ట్యాంకర్ల పక్కన పరిసరాలను శుభ్రం చేయనందున ఆ ప్రాంతంలో పురుగులు స్వైర విహారం చేస్తున్నాయి. నిత్యం పరిసరాలను శుభ్రం చేయకపోవడంతో పాల కేంద్రం దుర్గంధంగా మారిపోయింది. అలాగే పాల కేంద్ర భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది.  
చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు
పురాతన భవనం వల్ల సమస్యలు నెలకొంటున్నాయని పాల కేంద్రం సిబ్బంది చెబుతున్నారు. పాలను శీతలీకరించేటప్పుడు ఒక్క పురుగు అందులో పడ్డ పాలన్నీ కలుషితమవుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాలకేంద్రాన్ని శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

13:30 - September 12, 2016

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారా ? ఎక్కడ ? ఏ సమయం ? అని అనుకుంటున్నారా ? ప్రస్తుతం టాలీవుడ్...రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం మాత్రం ఉంది. అయితే అదేందో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి 'హెచ్.డి.కుమార స్వామి' తనయుడు 'నిఖిల్ గౌడ' హీరోగా పరిచయం అవుతున్నాడు. 'జాగ్వార్' పేరిట ఓ సినిమా రూపొందుంతోంది. 'నిఖిల్'కు జోడిగా 'దీప్తి' నటించింది. ఈ సినిమాలో 'జగపతి బాబు', 'సంపత్', 'బ్రహ్మానందం' ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ కథా రచయిత 'విజయేంద్ర ప్రసాద్' ఈ సినిమాకి స్క్రిప్ట్ అందించగా 'తమన్' మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ కన్నడ సినిమా తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే ఇటీవలే 'కుమార స్వామి' 'పవన్ కళ్యాణ్' ను కలిసిన సంగతి తెలిసిందే. తాము మంచి స్నేహితులమని 'కుమార స్వామి' భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. గత 8 ఏళ్లుగా తమ మధ్య అనుబంధం వుందని.. 'పవన్ కళ్యాణ్' తనకి సోదరుడి లాంటి వాడు మాత్రమే కాకుండా తాను సైతం 'పవన్‌'కి వీరాభిమానిని ఆ సందర్భంగా 'కుమారస్వామి' అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు 'కుమార స్వామి' ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్. ఈ ఆడియో కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 'కేసీఆర్'...జనసేన పార్టీ అధినేత 'పవన్ కళ్యాణ్'లను ఆహ్వానించాలని 'కుమార స్వామి' యోచించినట్లు టాక్. సెప్టెంబర్ 18వ తేదీన హైదరాబాద్ లో ఆడియో ఫంక్షన్ జరగనున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ ఆడియో కార్యక్రమానికి కేసీఆర్..పవన్ కళ్యాణ్ లు హాజరౌతారా ? లేదా ? అనేది వేచి చూడాలి. 

సుప్రీంలో కర్ణాటకకు స్వల్ప ఊరట

ఢిల్లీ: కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేసి విషయంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి స్వల్ప ఊరట లభించింది. పదిరోజుల పాటు రోజుకు 15,000 క్యూసెక్కుల నీరును తమిళనాడుకు విడుదల చేయాలంటూ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సోమవారం సవరించింది. ఈనెల 20వ తేదీ వరకూ రోజుకు 12,000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని తాజాగా ఆదేశాలిచ్చింది. 

సాంకేతికలోపంతో ఆగిన దురంతో ఎక్స్ ప్రెస్

చీరాల :ఇంజిన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దురంతో ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. చెన్నై నుంచి విజయవాడకు వెళ్తుండా ప్రకాశం జిల్లా వేటపాలెం సమీపంలో సోమవారం రైలులో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. అధికారులు రైలు పునరుద్ధరణ పనులు చేపట్టారు. కాగా రెండు గంటలుగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆ రూట్లో ప్రయాణిస్తున్న రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది.

గోదావరి, కృష్ణా జలాలను వీలైనంత త్వరగా తీసుకొస్తాం : ఎంపి వినోద్

హైదరాబాద్: గోదావరి, కృష్ణా జలాలను వీలైనంత త్వరగా భూములకు మళ్లించాలని ప్రభుత్వం కృషి చేస్తోందని టిఆర్ ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. 2013 భూ సేకరణ చట్టం అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త చట్టాలు తయారు చేసుకోవచ్చని మాజీ ప్రధాని మన్మోహన్ చెప్పినట్లు గుర్తు చేశారు. 2013 చట్టం దేశంలో ఎక్కడా అమలు కాలేదని, కర్ణాటక భూ సేకరణకు సొంత చట్టం చేసుకుందని ఎంపి వినోద్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు నిర్మించలేదని, ఇపుడు నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో ఎక్కడ అవినీతి జరిగిందో కాంగ్రెస్ నిరూపించాలని వినోద్ సవాల్ విసిరారు.

మహారాష్ట్రతో ఒప్పందం కాంగ్రెస్ కు మింగుడు పడటం లేదు: హరీష్ రావు

కరీంనగర్ : రైతుల కష్టాలు తెలుసుకొని ప్రాజెక్టులు కడుతుంటే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని మంత్రి హరీష్ రావు విమర్శించారు. మహారాష్ట్రతో ఒప్పందం కాంగ్రెస్ కు మింగుడు పడటం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్ జిల్లా సస్యశ్యామలమవుతుందని తెలిపారు. మల్లన్న సాగర్ లో 8 గ్రామాలే ముంపుకు గురవుతుంటే కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 

పార్లమెంట్ చట్టాలపై కాంగ్రెస్ కు అవగాహనలేదు : ఎంపీ సుమన్

హైదరాబాద్ : పార్లమెంట్ చట్టాలపై కాంగ్రెస్ కు అవగాహన లేదని ఎంపి బాల్క సుమన్ అన్నారు. రాజకీయం కోసం విపక్షాలు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నాయని మండి పడ్డారు. అబద్ధాల యూనివర్శిటీకి టీడీపీ, కాంగ్రెస్ ఆఫీసులు బ్రాంచీలుగా మారాయని, తమ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనే కాంగ్రెస్, టీడీపీలకు భయం పట్టుకుందని ఆరోపించారు.

12:42 - September 12, 2016

జయతి ప్రధాన పాత్రలో 'లచ్చి' చిత్రం రాబోతుంది. ఈ చిత్రానికి ఈశ్వర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. జె9 4షోస్‌ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తునన్నారు. హైదరాబాద్ లో ఈ చిత్ర టీజర్‌ విడుదలయింది. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర సలహాదారు వేణుగోపాలచారి టీజర్‌ను రిలీజ్ చేశారు. 

కిరోసిన్ ధర రూ.2 పెంచిన టీ.సర్కార్!?

హైదరాబాద్ : తెలంగాణలో ఆహార భద్రత పథకం కింద రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే కిరోసిన్ ధరను లీటరుకు రూ. 2 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అంతర్గత సర్క్యులర్ జారీ చేసినట్టు సమాచారం.

12:36 - September 12, 2016

హైదరాబాద్ : ఆర్టీసీ యాజమాన్య వేధింపులు ఆపాలంటూ టీఎంయూ నేడు బంద్ కు పిలుపిచ్చింది. యూనియన్ పిలుపుతో బంద్‌ కొనసాగుతోంది. బంద్ సందర్భంగా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను టీఎంయూ రాష్ట్ర నేతలు ఖండించారు. అరెస్ట్‌ చేసిన హైదరాబాద్‌ రీజియన్‌ నేతల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ రీజియన్‌లో వెయ్యికిపైగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. 

 

12:32 - September 12, 2016

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం సృష్టించింది. మస్కట్ మీదుగా కువైట్ వెళుతున్న ముహీర్ అహ్మద్‌ అనే ప్రయాణికుడి నుంచి ఎయిర్‌పోర్టు అధికారులు బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని పాతబస్తీ తలాబ్‌కట్టకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

 

12:28 - September 12, 2016

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తుండూరు ఆక్వాఫుడ్‌ ప్రొడక్ట్‌ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది... ఆక్వాఫుడ్‌ వ్యతిరేక పోరాట సమితికిచెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.. దీంతో నిర్వాసితులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.. ముందుజాగ్రత్త చర్యగా ఫుడ్‌ ప్రొడక్ట్‌ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు.. అటు ఫుడ్‌ ప్రొడక్ట్‌ దగ్గరను మిషనరీని సంస్థ యాజమన్యం తరలిస్తోంది.

న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు భారత్ జట్టు ప్రకటన

హైదరాబాద్ : న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించింది. జట్టులో మురళీవిజయ్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అశ్విన్, సోహా, రహానె, రాహుల్, షమి, పుజారా, భువనేశ్వర్ ఉన్నారు. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఎన్నికయ్యారు.

12:13 - September 12, 2016

హైదరాబాద్ : ఎపి సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురయింది. ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగలింది. ఏపీ రాజధాని స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై హైకోర్టు స్టే విధించింది. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని సవాల్ చేస్తూ రెండు ప్రైవేట్ సంస్థలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు వాదనలతో కోర్టు ఏకీభవించింది. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై హైకోర్టు స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. తదుపరి విచారణ అక్టోబర్‌ 31కి వాయిదా వేసింది. కౌంటర్ పటిషన్ దాఖలు చేయాలని ఎపి సర్కార్ ను కోర్టు ఆదేశించింది. 
స్విస్ ఛాలెంజ్ విధానంపై స్టే స్వాగతిస్తున్నాం : బాబురావు ...
ఎపి రాజధాని స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం మళ్లీ అప్పిల్ కు వెళ్లాళనుకోడం సిరికాదు. ప్రభుత్వం ఏకపక్షంగా స్విస్ ఛాలెంజ్ కు వెళ్లింది. రాజధాని విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిండం లేదు. ఒక తంతుగా చేసుకుని మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడింది. అవినీతికి ఆస్కారం కల్పించే విధంగా ఉంది. విదేశీ కంపెనీలకు భూములును కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుంది. ప్లాట్లు చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందకు ప్రయత్నిస్తున్నారు. టెండర్ లో అనేక లోపాలున్నాయి. రాజధాని పేరుతో 33 వేల ఎకరాలను సేకరించింది. ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ ను ఎంచుకోవడమే తప్పు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో టెండర్లను పిలవడం తప్పు. ఓపెన్ టెండర్లు పిలవాలి. 1690 ఎకరాల భమూని విదేశీ కంపెనీలను అప్పగిస్తున్నారు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పూనుకున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానం నుంచి ప్రభుత్వం తప్పుకోవాలి' అని అన్నారు.
హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాం : గఫూర్ 
'ఎపి రాజధాని స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నాం. హైకోర్టు తీర్పు చాలా మంచిది. టెండర్ ను ప్రభుత్వం దాచుకుంటుంది. ఓపెన్ టెండర్ వేయాలి. సింగపూర్ కంపెనీకి మేలు చేసే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోచే పనిలో ఉంది. స్విస్ ఛాలెంజ్ విధానం విదేశీ కంపెనీలకు మాత్రమే ఉపయోగకరం. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు స్విస్ ఛాలెంజ్ విధానం ఉపయోగపడదు' అని తెలిపారు. 

 

12:04 - September 12, 2016

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్‌ను కలిసిన టీకాంగ్రెస్ నేతలు కలిశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుపై గవర్నర్‌కు ఫిర్యాదుచేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర నరసింహారెడ్డి, జగ్గారెడ్డి తదితరులు ఉన్నారు. 

 

కావేరి జలాలపై సుప్రీంలో విచారణ

ఢిల్లీ : కావేరి జలాల వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈనెల 5న ఇచ్చిన తీర్పును సవరించాలని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం ను ఆశ్రయించింది. 15వేల క్యూసెక్కులు విడుదల చేయాలన్న తీర్పును 10 వేల క్యూసెక్కులకు కుదించాలని కర్ణాటక సర్కార్ కోరింది.

11:53 - September 12, 2016

వరంగల్ : కాకకతీయు కళాప్రాభవానికి ఆ కళాఖండం సజీవ సాక్షం. చరిత్రకారులు, పర్యాటకులు మదిలో చెరగని ముద్రవేసుకున్న అపురూప కట్టడం. ప్రాచీన శిల్పకళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం.  దాదాపు పుష్కరకాలంగా  కొనసాగున్న ఆ కళాఖండం పునర్నిర్మాణ పనులు ఇంకా ఒక కొలిక్కిరాకపోవడంతో భక్తులు, పర్యాటకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నత్తనడకన సాగున్న వరంగల్‌ వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణంపై 10 టీవీ ప్రత్యేక కథనం.... వేయిస్తాంభాల గుడి... అద్భుత కట్టడం
ఇది వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి. కాకతీయ రాజులు నిర్మించిన అద్భుత కట్టడం. వరంగల్‌ వచ్చిన పర్యాటకులెవరూ ఈ దేవాలయాన్ని దర్శించి, రుద్రేశ్వరునికి పూజలు చేయకుండా వెళ్లరు. నల్ల గ్రానైట్‌ రాళ్లపై చెక్కిన భక్తులు, పర్యాటకులు మనసు దోచుసుకుంటాయి. ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ కల్యాణ మండపం కొన్నేళ్ల క్రితం  కుంగిపోయింది. పునర్మర్మాణానికి పుష్కరకాలం క్రితం ప్రారంభించిన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. 
గుడి  పునర్నర్మాణానికి రూ.7కోట్ల ఖర్చు 
కోటి కాదు.. రెండు కోట్లు కాదు... వేయి స్తంభాల గుడి  పునర్నర్మాణానికి ఇంతవరకు  ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరో రెండు కోట్లతో పనులు చేపట్టారు. ఇవి కాక మరో రెండు కోట్లైనా అవసరం అవుతాయని చెబుతున్నారు. ఏటేటా  అంచనాలు పెరుగుతోండటంతో నిధులు ఇచ్చేందుకు కేంద్ర పురావస్తుశాఖ సవాలక్ష కారణాలతో  కొర్రీలు పెడుతోంది. దీంతో నిర్మాన పనుల్లో జాప్యం జరుగుతోంది.  ఈ దేవాలయనానికి పూర్వ వైభవం తీసుకురావడానికి మరో రెండేళ్లైనా పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే అప్పటికి కూడా పూర్తవుతుందని కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. దీంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
పురావస్తుశాఖ అధికారుల మధ్య లోపించిన సమన్వయం 
పనులు చేపట్టిన పురావస్తు శాఖ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. నిర్మాణంలో పాల్గొంటున్న శిల్పులకు సకాలంలో  డబ్బు ఇవ్వకపోవడంతో కొన్ని సార్లు పనులు ఆగిపోయి, జాప్యానికి కారాణమయ్యింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం తోడయిందన్న విమర్శలున్నాయి. మరో రెండువేల సంవత్సరాల వరకు చెక్కుచెదర కుండా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవడం వలన జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. సాధ్యమైనంత తర్వగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని భారత జాతీయ కళలు, వారసత్వ సంపద పరిరక్షణ సంస్థ ప్రతినిధి పాండురంగారావు చెబుతున్నారు. వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణ పనుల్లో జాప్యం  మరింత జాప్యం జరగకుండా ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని భక్తులు, పర్యాటకులు కోరుతున్నారు. 

కొనసాగుతున్న కేంద్ర మంత్రివర్గ సమావేశం

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ నియామకంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

11:49 - September 12, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ముచ్చటగా మూడో సారి ఎంసెట్ నిర్వహించింది. అయితే నెలలు గడుస్తున్నా ఎంసెట్‌-2 లీకేజీ వ్యవహారం మాత్రం కొలిక్కి రాలేదు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని వచ్చిన వదంతులకు... పోలీసుల దర్యాప్తు తీరే అద్దం పడుతోంది. ఇప్పటి వరకు బ్రోకర్లను మాత్రమే అరెస్ట్ చేసిన సీఐడీ కీలక నిందితులను అరెస్ట్ చేయడంలో అలసత్వం వహిస్తుందన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. 
కొనసాగుతున్న దర్యాప్తు  
తెలంగాణ ప్రభుత్వం... ముచ్చటగా మూడో సారి ఎంసెట్‌ నిర్వహించినా.. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం కేసు దర్యాప్తు  మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వందల మంది పోలీసులు ఏకకాలంలో దర్యాప్తు చేసి కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సూత్రధారులు, పాత్రధారులు కళ్లముందే తిరుగుతున్న ఆధారాల పేరుతో అలస్యం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడిన లీక్ వీరులను ఎందుకు ఉపేక్షిస్తున్నారనే అనుమానాలపై అధికారులు స్పందించిన దాఖలాలు కూడా లేవు. దీనికి తోడు ఇంకా దర్యాప్తు ఎన్ని రోజులు పడుతుందో కూడా స్పష్టత లేదు. 
జేఎన్‌టీయూ అధికారుల పాత్ర  
దాదాపు రెండు నెలల నుంచి దర్యాప్తు కొనసాగిస్తున్న సీఐడీ.. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా జేఎన్‌టీయూ అధికారుల పాత్ర ఉందని తేల్చింది. ఎంసెట్‌ లీకేజీ వ్యవహారంలో 36 మంది పాత్ర ఉందని, ఇందులో రెండు వందల మంది విద్యార్థులు  లబ్ధి పొంది ఉంటారని అంచనా వేశారు. కానీ ఇంతవరకు ప్రధాన సూత్రదారుడిని మాత్రం పట్టుకోలేకపోయారు. జేఎన్టీయూకి చెందిన పీఆర్‌వోని మాత్రమే ఎఫ్ఐఆర్‌లో నిందితునిగా చేర్చారు. 
కన్వీనర్‌, పరీక్ష విభాగ అధిపతిని వదిలి బ్రోకర్లను, విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థులను సీఐడీ అధికారులు విచారించారు. ఇప్పటి వరకు 21 మంది బ్రోకర్లను మాత్రమే అరెస్ట్‌ చేసిన పోలీసులు.. లీకేజీ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక నిందితులను వదిలేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేరం జరుగుతోందని తెలిసినా.. దాచిపెట్టినందుకు విద్యార్థుల తల్లిదండ్రులను ఛార్జీషీట్‌లో చేర్చనున్నారు. 
నిబంధనలను బేఖాతరు చేసిన కన్వీనర్‌  
ఈ కేసులో జేఎన్‌టీయూ కన్వీనర్ పాత్రపై సరైన రీతిలో విచారణ జరపడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. ప్రశ్నపత్రాల ప్రింటింగ్‌ విషయంలో నిబంధనలను కన్వీనర్‌ బేఖాతరు చేశారన్న ఆరోపణలున్నాయి. జెఎన్‌టీయూ నిబంధనల ప్రకారం ప్రతి సెట్‌ ప్రశ్నపత్రాలను.. కనీసం మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రింటింగ్‌ ప్రెస్‌లకు ఇవ్వాలి. పేపర్‌ ఎక్కడ ప్రింట్‌ చేయిస్తున్నది కేవలం కన్వీనర్‌, పరీక్ష విభాగం అధిపతికి తప్ప.. మరొకరికి తెలియకుండా జాగ్రత్త వహించాలి. కానీ ఎంసెట్‌-2 పేపర్లను ఒకే ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఇచ్చినట్లు నిర్ధారణ అయింది. కన్వీనర్‌, పరీక్ష విభాగం అధిపతి కలిసి ఒకే ప్రింటింగ్‌ ప్రెస్‌లో ప్రశ్నపత్రాలు ప్రింట్‌ చేయించినట్లు స్పష్టంగా తెలిసినా... వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వీరిపాత్రపై చార్జిషీట్‌లో వెల్లడిస్తామని చెప్పడం ద్వారా సీఐడీ అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ ఎంసెట్‌-2 లీకేజీలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేయకపోవడాన్ని బట్టి చూస్తే.. పైస్థాయి ఒత్తిళ్ల ద్వారా కేసు పక్కదారి పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

 

11:44 - September 12, 2016

అనతికాలంలో టాలీవుడ్‌లో బిజీ అయిపోయిన హీరోయిన్ రకుల్ క్రీడాకారిణి (స్ర్పింటర్)గా ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. మహేష్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇలా అందరి హీరోలతో వెండితెరపై కనిపించింది. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్‌లో మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్న ఈఅమ్మడు... గోపీచంద్ మలినేని- సాయిధరమ్ తేజ్ కాంబోకి ఈ బ్యూటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసిందనే టాక్ వినపడుతోంది. ఇందులో తాజా ప్రాజెక్టులో ఇంతవరకు చేయని కొత్త రోల్‌లో కనిపిస్తానని, ఈ మూవీ కోసం తనకు ఇష్టమైన ఫుడ్‌కి దూరమవుతున్నానంటూ మనసులోని మాటను బయటపెట్టింది. 

11:42 - September 12, 2016

వరంగ‌ల్ : రైల్వేస్టేష‌న్ వ‌ద్ద తృటిలో పెను ప్రమాదం త‌ప్పింది. గుజ‌రాత్ నుంచి వ‌రంగ‌ల్ కు యూరియా తీసుకువ‌స్తున్న గూడ్స్ రైలు వ‌రంగ‌ల్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ప‌ట్టాలు తప్పింది. ఈ ఘ‌ట‌న‌లో రైలు నుంచి నాలుగు బోగిలు ప‌ట్టాల నుంచి ప‌క్కకు ఒరిగాయి. విష‌యం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘ‌ట‌నా స్థలానికి చేరుకొని మ‌ర‌మ్మతులు చేస్తున్నారు. 

 

11:40 - September 12, 2016

ముంబాయి : స్టాక్ మార్కెట్‌ భారీ నష్టాలతో ప్రారంభమైంది. 400 పాయింట్లకు పైగా సెన్సెక్స్‌ పడిపోగా.. నిఫ్టీ 120 పాయింట్లకు పైగా నష్టపోయింది. 

 

11:38 - September 12, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను కలిసిన ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు కలిశారు. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై గవర్నర్‌కు బాబు వివరిస్తున్నారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ, అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై చర్చిస్తున్నారు. అసెంబ్లీలో వైసీపీ వ్యవహరించిన తీరు, రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు వంటి పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 

 

11:38 - September 12, 2016

ఆకు కూరల్లో పుదీనా ఆకుకు ప్రత్యేకమైన ఔషధ గుణాలున్నాయి. కూరలకు తిరుగులేని రుచిని ఇచ్చే పుదీనా ఆకులో క్యాన్సర్ ను నయం చేసే గుణాలున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. పుదీనా ఆకు తరుచూ వాడటం వల్ల పెద్ద ప్రేగులో వచ్చే క్యాన్సర్ ను నిరోధించవచ్చని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ అండ్ కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ (CIMAP AND CISR )లకు చెందిన సైంటిస్టులు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైందట. పెద్ద ప్రేగులో వచ్చే క్యాన్సర్ కారక కణాలను పుదీనా లో ఉండే ఎల్ మెంథాల్ అనే పదార్ధం నాశనం చేస్తుందని స్టడీ లో పేర్కొన్నారు. క్యాన్సర్ కారక కణ విభజన జరగకుండా ఆపడంతో బాటు, క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు సోకకుండా ఎల్ మెంథాల్ నిరోధిస్తుందని తేల్చారు. 

11:34 - September 12, 2016

మహబూబ్ నగర్ : జిల్లాల పునర్విభజనపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంతమంది జిల్లాల ఏర్పాటు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో తమ మండలాలు వేరే జిల్లాల్లో కలపాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేయాలంటూ కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.
ఉధృతమవుతున్న ఆందోళనలు  
మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలంటూ రోజురోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ప్రజలు వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. కల్వకుర్తి బంద్‌ నిర్వహించడంతో పాటు ధర్నాటు చేపట్టారు. ప్రజల ఆందోళనలకు ప్రతిపక్ష నేతలు మద్దతు తెలుపుతుండగా.. మరికొంత మంది అధికార పార్టీ నాయకులు కూడా ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు.
టి.ఆచారి ఆమరణ నిరాహార దీక్ష 
కల్వకుర్తి రెవెన్యూ డివిజన్‌ కోసం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అన్ని వసతులున్న కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఆచారి దీక్షకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మద్దతు తెలిపారు. గతంలో కూడా కల్వకుర్తికి అన్యాయం జరిగిందన్నారు. 
కొత్త జిల్లాల ముసాయిదాపై మండిపాటు
ఇక కొత్త జిల్లాల ముసాయిదాపై కూడా పలు ప్రాంతాలు ప్రజలు మండిపడుతున్నారు. తమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని కొన్నిచోట్ల.. తమను ఇంకో జిల్లాలో కలపవద్దని మరోచోట.. ఇలా చాలా ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు రెవెన్యూ డివిజన్లు, మండలాల విషయంలో వ్యతిరేకతలకు అంతేలేకుండా ఉంది. ఇక నూతనంగా ఏర్పడే కడ్తల్‌, చారకొండ మండలాలను ఏ జిల్లాలో కలుపుతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కల్వకుర్తి విడిపోవడం ఇది రెండోసారి...
నియోజకవర్గాలు ఏర్పడిన తర్వాత కల్వకుర్తి విడిపోవడం ఇది రెండోసారి అని స్థానికులంటున్నారు. గతంలో రెండు మండలాలు కోల్పోయిందని.. ప్రస్తుతం జిల్లాల పునర్విభజనతో మూడు మండలాలు వేరే జిల్లాకు పోయే అవకాశాలున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కల్వకుర్తి ముక్కలుగా మారి పూర్వవైభవాన్ని కోల్పోయే ప్రమాదముందంటున్నారు. 
ఆ మూడు మండలాలను శంషాబాద్ లో కలపాలి ...
మరోవైపు నియోజకవర్గంలోని తలకొండపల్లి, ఆమనగల్లు, మాడ్గుల మండలాలను శంషాబాద్‌లో కలపాలని స్థానిక నేతలు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే మండల పరిషత్‌లో తీర్మానాలు కూడా చేశారు. అయితే ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని విడగొట్టకుండా ముసాయిదా జాబితా విడుదల చేసింది. యదావిధిగా కల్వకుర్తిలోని ఐదు మండలాలను నాగర్‌కర్నూలు జిల్లాలోనే ఉంచింది. అదేవిధంగా ముందునుంచి ఆశిస్తున్న రెవెన్యూ డివిజన్‌ను కూడా ఇవ్వకుండా అచ్చంపేటను ప్రకటించింది.
కల్వకుర్తి నుంచి మూడు మండలాలను విడదీస్తే ఎంతో నష్టం 
ఇదిలావుంటే.. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి మూడు మండలాలను విడదీస్తే ఎంతో నష్టం జరుగుతుందని స్థానికులంటున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గాన్ని విడగొడితే.. రెండు మండలాలుమాత్రమే మిగులుతాయని దీని వల్ల రెవెన్యూ డివిజన్‌ రాదని స్థానికులు భావిస్తున్నారు. అయితే.. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్‌ కోసం నేతలంతా ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ? వేచి చూడాలి. 

అరెస్టులను ఖండించిన టీఎంయూ

హైదరాబాద్ : ఆర్టీసీ యాజమాన్య వేధింపులు ఆపాలని టీఎంయూ పిలుపుతో హైదరాబాద్ రీజియన్ లో బంద్ కొనసాగుతుంది. వెయ్యి బస్సులకు పైగా నిలిచిపోయాయి. బంద్ లో పాల్గొన్న టీఎంయూ నేతలను అరెస్టు చేశారు. నేలతల అరెస్టులను టీఎంయూ ఖండించింది.

11:26 - September 12, 2016

విశాఖ : పోరాడితే పోయేది ఏమీ లేదు.. బానిస సంకెళ్లు తప్పా.. అని ఓ కవి చెప్పినట్లుగా విశాఖ జిల్లాలో కార్మిక వర్గాలు హక్కుల సాధన కోసం పోరాట మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. గతంలో బ్రాండెక్స్ కంపెనీలో మహిళా కార్మికులు తమ వేతనాల కోసం పోరాడి విజయం సాధించగా.. తాజాగా వాలం కంపెనీకి చెందిన కార్మికులు అదే బాటను ఎంచుకున్నారు. ఈరోజు కలెక్టరేట్‌ ముట్టడికి సిద్ధమయ్యారు. 
బ్రాండెక్స్ కార్మికుల స్ఫూర్తితో మరో పోరాటం 
పోరాడితే సమస్యలు పరిష్కారమవుతాయి...  వేతనాలు పెరుగుతాయన్న సూత్రాన్ని నమ్మిన కార్మికులు పోరాటన్ని తమ మార్గంగా ఎంచుకుంటున్నారు. బ్రాండెక్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని విశాఖలో కార్మిక సంఘాలు సమస్యల పరిష్కారానికి పోరుబాట పడుతున్నాయి.  
వాలం అగ్రీ ఇండియా కెంపనీ కార్మికుల పోరాటం
గతంలో బ్రాండెక్స్ కంపెనీలో పనిచేసిన మహిళా కార్మికులు తమ వేతనాల పెంపు కోసం సమ్మెలోకి దిగారు. అయితే కార్మికులంతా సమ్మెలోకి దిగడంతో కంపెనీ దిగొచ్చి కొంత మేరకు జీతాలు పెంచింది. దీంతో బ్రాండిక్స్ కార్మికుల పోరాట స్ఫూర్తితో ఇప్పుడు వాలం అగ్రీ ఇండియా ప్రైవేటు కంపెనీకి చెందిన కార్మికులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. 
విశాఖలో వాలం కంపెనీకి ఆరు బ్రాంచిలు
విశాఖ జిల్లాలోని మాకవరపుపాలెం, నర్సీపట్నం, బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంటలో వాలం కంపెనీ దాని అనుబంధ  విభాగాలు  నడుస్తున్నాయి. ఈ ఆరు బ్రాంచిలలో దాదాపు రెండు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సేకరించిన జీడిపిక్కలను ప్రాసెస్ చెయ్యడం వీరి పని...అయితే వీరికి రోజుకు వేతనం 183 రూపాయలే చెల్లిస్తుంది కంపెనీ. కార్మికులకు ఉండాల్సిన కనీస హక్కులేవి వీరికి లేవు. దీంతో చైతన్యవంతులైన కార్మికులు తమకు కనీసం వేతనం  పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం గత కొద్దిరోజులుగా కార్మకులంతా ఆందోళనకు దిగారు. అయినప్పటికీ కూడా వాలం కెంపనీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తమ ఆందోళనలను కార్మికులు మరింతగా తమ పోరాటాన్నిఉధృతం చేస్తున్నారు. కార్మికుల ఆందోళనలకు సీఐటీయూ మద్దతు తెలిపింది. కార్మికుల రోజువారి వేతనాన్ని పెంచాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 
కలెక్టరేట్‌ ముట్టడికి కార్మికులు సిద్ధం 
వాలం కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో పోరాటాన్ని ఉదృతం చేసేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. ఈరోజు కలెక్టరేట్‌ ముట్టడికి కార్మికులంతా సిద్ధమవుతున్నారు. మరి ప్రభుత్వం స్పందించి కార్మికులకు ఏ విధంగా న్యాయం చేస్తుందో చూడాలి. 

 

వ్యభిచార గృహాలపై పోలీసుల మెరుపు దాడులు

చిత్తూరు : జిల్లాలో వివిధ ప్రాంతాలలో వ్యభిచార గృహాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో 14 మంది నిర్వాహకులు, ఐదుగురు బ్రోకర్లు, 9 మంది విటులు, 11 మంది మహిళలు అరెస్టు చేశారు. అంతే కాకుండా వారి వద్ద నుండి రూ.40వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

చెన్నైలో కర్నాటక బస్సులపై దాడి

హైదరాబాద్ : కావేరీ జలాల వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. చెన్నైలో కర్నాటక బస్సులపై దాడి చేశారు. అంతే కాకుండా కర్నాటకు చెందిన ఓ హోటల్ పై పెట్రోలు బాంబు దాడి చేశారు. ఈ జల వివాదంలో ప్రధాని జోక్యానికి కర్నాటక సర్కార్ డిమాండ్ చేస్తోంది.

మల్లన్న భూసేకరణ పై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

హైదరాబాద్ : రాజ్ భవన్ లో టీ కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిసి మల్లన్న సాగర్ భూసేకరణ పై ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్, షబ్బీసర్ అలీ, సునీత, ఇతర నేతలు ఉన్నారు.

ఏపీ రాజధాని స్విస్ ఛాలెంజ్ విధానం పై హైకోర్టు స్టే

హైదరాబాద్ : ఏపీ రాజధాని స్విస్ ఛాలెంజ్ విధానం పై హైకోర్టు స్టే ఇచ్చింది. పిటిషనర్ తరపు వాదనలకు హైకోర్టు ఏకీభవించింది. తదుపరి విచారణ 31కి వాయిదా వేసింది.

విజయవాడకు బల్దేరిన ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు ఇరు రాష్ట్రాల గవర్నర్ నర్సింహన్ భేటీ ముగిసింది. అనంతరం ఆయన విజయవాడకు బయలుదేరారు.

నా 53 ఎకరాల భూమిని కబ్జా చేశారు: కొత్తపల్లిగీత

హైదరాబాద్: రాత్రికి ర్రాతే టీఐఐసీ అధికారులు, జాయింట్ కలెక్టర్ కలిసి నాస్థలం కబ్జా చేశారని అరకు ఎంపి కొత్తపల్లి గీత ఆరోపించారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి కక్షపూరితంగానే రాయదుర్గంలో సర్వే నెం 83/2 లో 53 ఎకరాల భూమిని కబ్జా చేశారని విమర్శించారు. ఈ స్థలానికి సంబంధించిన అన్ని ప్రతాలు ఉన్నాయని, నా స్థలం నాకు దక్కేవరకు న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం రేగింది. మస్కట్ మీదుగా కువైట్ వెళుతున్న ముషీర్ అహ్మద్ నుంచి ఎయిర్ పోర్టు అధికారులు బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు.

10:37 - September 12, 2016

శ్రీకాకుళం : జిల్లాలో అరకులోయను తలపించే అందమైన పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నా.... ఒక్కటి కూడా అభివృద్ధికి నోచుకోలేదు. శ్రీకూర్మం, అరసవల్లి వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నా యాత్రికులు  బస చేయడానికి సరైన వసతులు లేవు. దీంతో  దేశ దర్శనానికి వస్తున్న భక్తులు ఎప్పటికప్పుడు స్వస్థలాకు తిరిగి వెళుతున్నారు. అభివృద్ధికి  అవకాశం ఉన్న పొన్నాడ కొండలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే జిల్లాకు అన్ని విధాల కలిసొస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
పొన్నాడ కొండలు
ఇవి శ్రీకాకళం జిల్లాలోని పొన్నాడ కొండలు. ఒక వైపు పరవళ్లు తొక్కే నాగవళి నది. మరోవపు ఊరకలు వేసే సెలయేళ్ల గలగలు. నది మధ్యలో ద్వీపాన్ని తలపించే ప్రాంతాలు.  విశాఖ జిల్లాలోని అరకులోయ మాదిరిగా ప్రకృతి రమణీయ దృశ్యాలు ఈ ప్రాంతం సొంతం.  పర్యాటక అభివృద్ధి చేసే అవకాశాలున్నా... అటు పాలకులుకానీ,  ఇటు అధికారులుకానీ పట్టించుకోపోవడం ఈ ప్రాంతానికి శాపంగా మారిందన్న విమర్శలున్నాయి. 
పర్యాటకాభివృద్ధికి ముందుకొచ్చిన ప్రైవేటు సంస్థలు 
ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారుతున్న పొన్నాడ కొండల విస్తీరణం 58 ఎకరాలు. ఇది రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కొన్ని ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి. పెట్టుబడులు పెట్టి... కాటేజీలు,  కన్వెషన్‌ హాలు, రిసార్ట్ల నిర్మాణంతోపాటు  స్పాలు అభివృద్ధి చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. మూలికావనాలను పెంచేందుకు  ముందుకొచ్చాయి. కానీ ప్రైవేటు సంస్థల ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా పొన్నాడ కొండలను టూరిస్ట్‌ హబ్‌గా మార్చేందుకు ముందుకు రాలేదు. దీంతో పాలకులు వైఖరి అమ్మ పెట్టదు... అడుక్కుతిన్నవదు.. అన్న చందంగా  మారిందన్న విమర్శలున్నాయి. 
టూరిస్ట్‌ హబ్‌గా మార్చేందుకు ఎన్నో అవకాశాలు  
నాగావళి నది అభిముఖంగా ఉన్న పొన్నాడ కొండల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే... పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం, శ్రీకూర్మం, శాలిహుండం ప్రాంతాలు ఇక్కడకు సమీపంలోనే ఉన్నాయి. ఈ ఏరియాలను కలుపుతూ టూరిస్ట్‌ హబ్‌గా మార్చేందుకు ఎన్నో అవకాశాలున్నా... ఎవరూపట్టించుకోవడం దురదృష్టకరమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 
శిల్పారామం, సాంస్కృతిక కళావేదిక నిర్మాణం 
పొన్నాడ కొండలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న ప్రజల డిమాండ్‌ను గుర్తించిన ప్రభుత్వం.... ఈ ప్రాంతంలో శిల్పారామం, సాంస్కృతిక కళావేదిక నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాయి. ఐదు కోట్ల రూపాయలతో పది ఎకరాల్లో వీటిని చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  శిల్పారామం, సాంస్కృతక కళావేదికలైనా త్వరగా పూర్తి చేస్తే పొన్నాడ కొండలు కొంతవరకైనా పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ దిశగా సత్వరం కార్యాచరణ ప్రారంభించాలని కోరుతున్నారు. 

 

బక్రీదు సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు : సీపీ

హైదరాబాద్: బక్రీద్‌ పండుగ సందర్భంగా ఈనెల 13వ తేదీన నగరంలోని పలు ఈద్గాల వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు విధించామని నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

10:30 - September 12, 2016

హైదరాబాద్: ప్రేమ చిత్రాలకు చిరునామాగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు గౌతంమేనన్‌. ఇప్పుడు విలన్‌గా వెండితెరకు పరిచయం కానున్నారు. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఇమైక్క నొడిగల్‌’. ఇందులో అధర్వ హీరో కాగా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో గౌతంమేనన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. సినీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఈ కథ బాగా నచ్చడంతోనే విలన్‌గా నటించేందుకు గౌతం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 

10:28 - September 12, 2016

హైదరాబాద్ : ఖాళీ జాగా కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోయి..జెండా పాతేస్తున్నారు కబ్జారాయుళ్లు.. ఇక్కడ.. అక్కడ అనే తేడా లేదు.. అన్ని చోట్లా ప్రభుత్వ భూములను వశం చేసుకుంటున్నారు. రాత్రికి రాత్రే నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ఇలా గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇప్పటికే వందల ఎకరాల చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. తాజాగా మ‌న్సూరాబాద్ పెద్ద చెరువును క‌బ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించడంతో... అధికారులు రెవెన్యూ అధికారులు ఆగమేఘాలపై కదిలారు. 
ప్రస్తుతం 29 ఎక‌రాల 6 గుంట‌ల విస్తీర్ణంలో చెరువు 
హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ మండలంలోని మన్సూర్‌బాద్‌ చెరువు ఇది. ఒకప్పుడు 45 ఎకరాలకు పైగా ఉండేది. కొందరు చెరువును కబ్జా చేయడంతో ప్రస్తుతం 29 ఎక‌రాల 6 గుంట‌ల విస్తీర్ణం కలిగి ఉంది. కబ్జాలతో ఈ చెరువు తన సహజ స్వరూపాన్ని పూర్తిగా కోల్పోయింది. 
లోకాయుక్తా మొట్టికాయలు... కదిలిన అధికార యంత్రాంగం
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతుండడంతో ఎందుకు స్పందించడం లేదంటూ లోకాయుక్తా మొట్టికాయలు వేయడంతో అధికార యంత్రాంగం మేల్కొంది. దీంతో కబ్జాలకు గురైన చెరువులపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగానే మన్సూర్‌బాద్‌ చెరువుకు అధికారులు కంచె వేశారు. అయితే..చెరువులో తమ భూమి ఉందంటూ కొందరు ఇరిగేషన్‌ అధికారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ లోపల మళ్లీ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. 
మన్సూర్‌బాద్‌ చెరువు కబ్జాదారుల కంచె 
మన్సూర్‌బాద్‌ చెరువుకు ఇరిగేషన్‌ అధికారులు వేసిన ఫెన్సింగ్‌ మాదిరిగానే మరో కంచెను ఏర్పాటు చేశారు కబ్జాదారులు. దీని వెనుక పెద్ద ఉద్దేశమే ఉందంటున్నారు స్థానికులు. కొన్నాళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంచెను సులభంగా తొలగించవచ్చనేది కబ్జాదారుల ప్రయత్నమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం స్థానిక తహశీల్దార్‌కు తెలియడంతో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన కంచెను జేసీబీలతో తొలగించారు. చెరువులను ఎవరైనా కబ్జాలు చేస్తే కఠినంగా ఉంటామని  రెవెన్యూ అధికారులు అంటున్నారు. 
సిటిజన్స్‌ ఆందోళన 
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కూడా ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాకు గురవుతున్నాయని సిటిజన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని అంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని చెరువులు, కుంటల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కబ్జాదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను రక్షించాలని కోరుతున్నారు. 

నష్టాల్లో ష్టాక్ మార్కెట్లు...

ముంబై : ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 546 నష్టంతో మొదలవగా.. నిఫ్టీ 8,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఈ ఏడాది బ్రెగ్జిట్‌ తర్వాత ఇదే అత్యంత ఆరంభ పతనమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం నిఫ్టీ 400 పాయింట్లకు పైగా, సెన్సెక్స్‌ 120 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతున్నాయి.

09:57 - September 12, 2016

విజయనగరం : గజం జాగా కన్పిస్తే చాలు...గద్దల్లా వాలిపోతారు. రాత్రికి రాత్రే భూములను కబ్జాచేసి రాళ్లు పాతేస్తారు. ఇదేంటని అడిగితే...రౌడీలతో బెదిరిస్తారు. ఇది విజయనగరం జిల్లాలో సాగుతున్న రియల్ దందా. తాత, తండ్రుల నుంచి సాగు చేస్తున్న ఇనాం భూములపై రియల్టర్లు కన్ను పడింది. దీంతో కోట్లాది రూపాయల విలువ చేసే భూములన్నీ ధారాదత్తం అయిపోతున్నాయి. విజయనగరం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో సాగుతున్న రియల్ కబ్జాల పర్వంపై 10టీవీ ప్రత్యేక నిఘా రిపోర్ట్ 
చెలరేగిపోతున్న రియలర్టర్లు 
ఇక్కడ మీరు చూస్తున్న ఈ చెరువు రియల్టర్లు చేతిలో చిక్కి ఇలా చన్నిబోయి కన్పిస్తోంది. విజయనగరం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చింతలవలస పంచాయతీ పరిధిలో రియలర్టర్లు చెలరేగిపోతున్నారు. గెడ్డలు, పోరంబోకు, ప్రభుత్వ భూములే కాదు..చెరువు గర్భాలను వదలడం లేదు. గజం జాగా కనిపిస్తే చాలు..పాగా వేసేస్తున్నారు. కబ్జా వ్యవహారంలో స్థానిక ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండటంతో పాటు దండిగా మామూళ్లు అందడంతో రెవిన్యూ అధికారులు కిమ్మనడం లేదు. లేఅవుట్ల ముసుగులో అడ్డుగా ఉన్న గెడ్డలు, వాగులను కప్పేస్తుండటంతో చెరువుల్లోకి నీరు చేరే పరిస్థితి లేదు. ఫలితంగా ఆ చెరువుల కింద ఉన్న పంట పొలాలన్నీ బీడువారిపోతున్నాయి.
జోరుగా రియల్ ఎస్టేట్‌ వ్యాపారం 
చింతలవలస పంచాయతీలో ఎక్కువగా ఇనాం భూములే ఉన్నాయి. ఈ భూములకు అడంగళ్లు, టైటిల్‌ డీడ్‌లు, పట్టాపాసుపుస్తకాలు వంటి రికార్డులేమీ లేవు. కానీ..తాత తండ్రుల నుంచి స్థానిక రైతులు ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఎప్పటి నుంచో వీరు రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితంలేదు. మరోపక్క ఈ భూములకు సంబంధించి రైతులకు, మాన్సాస్‌ సంస్థకు మధ్య కోర్టు వివాదం ఏళ్లుగా నడుస్తుంది. అయినా ఇక్కడి భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మాత్రం జోరుగా సాగుతోంది. 
నీళ్లు లేక నాట్లకు దూరమైన 90 ఎకరాలు పంటపొలాలు 
ఇటీవల సర్వే నెంబర్‌ 172, 173, 178లోని గెడ్డలను కప్పేసి సుమారు 5 ఎకరాలకు పైగానే భూమిని లేఅవుట్‌లో కలిపేశారు. ఈ గెడ్డల ద్వారా నీరు రాకపోవడంతో గ్రామ పొలిమేరలో ఉన్న ఎర్ర చెరువులో నీరు లేక దాని ఆయకట్టు పరిధిలోని సుమారు 90 ఎకరాల పంటపొలాలు నాట్లకు దూరమయ్యాయి. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాల వెనుక గ్రామ సర్పంచ్‌తో పాటు ఎంపిటీసీ సభ్యుడు సహకారంతో రియల్టర్లు ఇనాం భూములతో పాటు చెరువుల్లోకి నీరు పారే గెడ్డలు, వాగులను కూడా ఆక్రమిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 
కబ్జాదారులకు సహకరిస్తున్న రెవిన్యూ అధికారులు 
మరోపక్క రెవిన్యూ అధికారులు ఈ అక్రమాలపై పెదవి విప్పడం లేదు. ఇనాం భూముల వ్యవహారం కోర్టులో ఉన్నందున ఆ భూములపై ఎవరికీ హక్కు లేదంటూనే  కబ్జాదారులకు సహకరిస్తున్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు ప్రభుత్వ..రాయితీలు, రుణాలు ఇచ్చేందుకు మాత్రం రికార్డులు కావాలంటున్న అధికారులు,.అదే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కబ్జాలపై మాత్రం అడ్డుపడటం లేదు. పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్‌లు, అడంగళ్లు ఇలా ఏ కాగితమూ లేని భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుంది. 

పూంచ్ లో కొనసాగుతున్న కాల్పులు

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పూంచ్ లో కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదుల కాల్పులను భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి. మినీ సచివాలయం నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. ఈ ఘటనలో ఓ పోలీసు కానిస్టేబుల్, ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. 

శిశువును పీక్కుకుతున్న కుక్కలు ..

రంగారెడ్డి : వికారాబాద్ బస్టాండులో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువును దుండుగులు వదిలి వెళ్లారు. వీధి కుక్కలు శిశువు పీక్కు తిన్నాయి. దీంతో శిశువు మృతి చెందింది. 

09:26 - September 12, 2016

మంచు విష్ణు సరసన హన్సిక మరోసారి నటిస్తోంది. మంచు విష్ణుతో కలిసి హన్సిక స్టెప్పులేయనుంది. విష్ణు, హన్సిక హీరోహీరోయిన్స్ గా 'లక్కున్నోడు' చిత్రం తెరకెక్కుతోంది. ఎం.వి.వి.సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాజ్‌ కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 'గీతాంజలి', 'త్రిపుర' వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలకు రాజ్‌కిరణ్‌ దర్శకత్వం వహించారు. విష్ణు, హన్సిక నటించిన 'దేనికైనా రెడీ', 'పాండవులు పాండవులు తుమ్మెద' వంటి చిత్రాలు విజయవంతం అయ్యాయి. విష్ణు, హన్సిక జోడీగా రాబోతున్న ఈ చిత్రం మరోసారి మ్యాజిక్‌ చేయబోతోందా..? వారికిది హ్యాట్రిక్‌ చిత్రమవుతుందా..? చూడాలి మరి....  

 

తుండూరు ఆక్వాఫుడ్ ప్రొడక్టు వ్యతిరేక పోరాట సమితి సభ్యుల అరెస్టు

పశ్చిమగోదావరి : తుండూరు ఆక్వాఫుడ్ ప్రొడక్టు వ్యతిరేక పోరాట సమితికి చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఫుడ్ ప్రొడక్టు వద్దకు మిషనరీని యజమాన్యం తరలిస్తోంది. నిర్వాసితులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఫుడ్ ప్రొడక్టు వద్ద పోలీసులు భారీగా మోహరిస్తున్నారు. 

 

వరంగల్ రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పిన గూడ్స్

వరంగల్ : గూడ్స్ రైలు వరంగల్ రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పింది. యూరియా వేగన్ షెడ్ లో నాలుగు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి.  రైల్వే అధికారులు రైల్వే ట్రాక్ మరమ్మతు చేస్తున్నారు. 

 

08:27 - September 12, 2016

హైదరాబాద్ : పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరో 24 గంటలో ఉపరిత అవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రతోపాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఉత్తర తెలంగాణలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

 

కోస్తాంధ్రతోపాటు తెలంగాణలో భారీ వర్షాలు

 హైదరాబాద్ : పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.  మరో 24 గంటలో ఉపరిత అవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రతోపాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

 

08:17 - September 12, 2016

ఎపి రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి,  టీడీపీ నేత దినకర్, టీఆర్ ఎస్ నేత తాడూరు శ్రీనివాస్ రావు, బీజేపీ నేత కోటేశ్వర్ రావు పాల్గొని, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎపి రాష్ట్రన్ని మోసం చేస్తుందన్నారు. రాష్ట్ర విభజన విషయంలో బీజేపీ ద్వంద వైఖరి అవలంభించిందని ఆరోపించారు. ఏకాభిప్రాయంతో విభజన జరిగితే సమస్యలు వచ్చేవి కావన్నారు. కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:10 - September 12, 2016

2011 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో మ్యాగ్జిమమ్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉందని రాజధాని ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ శంకర్ రెడ్డి తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బేసిక్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. 'రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 23 వరకు జరిగే ఈ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రూప్ వన్ 1 మెయిన్స్ లో మంచి స్కోరింగ్ కు అవకాశం వున్న పేపర్ డేటా అప్రిసియేషన్, ఇంటర్ ప్రిటేషన్ అండ్ ప్రాబ్లం సాల్వింగ్. 150 మార్కులుండే ఈ పేపర్ ను ఎలా ఫేస్ చేయాలి? ఈ పేపర్ ప్రాధాన్యత ఏమిటి? మంచి మార్కులు సాధించాలంటే అనుసరించాల్సిన చిట్కాలేమిటి? రిఫరెన్స్ పుస్తకాలేమిటి?' ఇలాంటి అంశాలపై శంకర్ రెడ్డి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం.. 

 

07:53 - September 12, 2016

ఢిల్లీ : యూస్ ఓపెన్ టెన్నిస్ పురుఘల సింగిల్స్ లో వావ్రింకా విజేతగా నిలిచాడు. ఫైనల్ లో జకోవిచ్ పై ఘన విజయం సాధించారు. జకోవిచ్ పై 6-7, 6-4, 7-5, 6-3 తేడాతో వావ్రింకా విజయం సాధించారు. 

 

07:49 - September 12, 2016

రంగారెడ్డి : జిల్లాలోని తాళ్లపల్లి గూడెం దగ్గర అనుమతి లేకుండా... బైక్‌రేసింగ్‌ పోటీల్లో పాల్గొన్న 52 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ నేషనల్‌ ర్యాలీ అనే సంస్థ బైక్‌ రేసింగ్‌ పోటీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. బైక్‌రేసింగ్‌లో పాల్గొన్న వారిలో ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. 

07:46 - September 12, 2016
07:43 - September 12, 2016

కృష్ణా : విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి బాలరిష్టాలు తప్పడం లేదు. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిడమనూరులో మెట్రోరైలు కోచ్‌ డిపో కోసం భూసేకరణ విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆరునూరైనా తమ భూములు ఇచ్చేది లేదని రైతులు చెబుతుండటంతో.. ప్రజాభిప్రాయసేకరణ కోసం వచ్చిన అధికారులు వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
ప్రాజెక్టు అధికారుల ఉక్కిరిబిక్కిరి 
బెజవాడలో మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. కొత్త కొత్త సమస్యలు మెట్రోరైలు ప్రాజెక్టు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బందర్‌రోడ్డు మీదుగా వెళ్లాల్సిన మెట్రో మార్గాన్ని రాజకీయ కారణాలతో అలైన్‌మెంట్‌ మారుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో.. నిడమనూరు రైతులు మెట్రోరైలు కోచ్‌ డిపో భూసేకరణకు ససేమిరా అంటున్నారు. 
మెట్రోరైలు నిర్మాణానికి అడ్డంకులు 
విజయవాడకు 10 కిలోమీటర్ల దూరంలోని నిడమనూరులో మెట్రోరైలు కోచ్‌ డిపో ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. భూసమీకరణకు అధికారికంగా నోటిఫికేషన్‌ ఇవ్వకపోయినప్పటికీ.. 66 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం నిడమనూరు వచ్చిన అధికారులను రైతులు గట్టిగా నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. మార్కెట్‌ రేటు ప్రకారం 10 కోట్లు విలువ చేసే ఎకరం భూమిని..రిజిస్ట్రేషన్‌ విలువ లెక్కన 66 లక్షలు చెల్లిస్తే తాము నష్టపోతామంటున్నారు. 
మెట్రో కోచ్ గన్నవరంలో ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే వల్లభనేని  
మెట్రోరైలు కోచ్‌ డిపో నిర్మాణం కోసం భూములు ఇస్తే ఏ రైతుకు అన్యాయం జరగకుండా చూస్తామని సబ్‌ కలెక్టర్ సృజన అంటున్నారు. మెట్రోరైలు కోచ్‌ డిపో భూసమీకరణకు నిడమనూరులో రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ స్పందించారు. మెట్రోకోచ్‌ డిపో నిడమనూరులో కాకుండా గన్నవరంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం సేకరించిన భూముల్లో సుమారు 100 ఎకరాల వరకు నిరుపయోగంగా ఉన్నాయని..ఇక్కడ మెట్రోకోచ్‌ డిపో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. 
సందిగ్ధంలో ప్రాజెక్టు అధికారులు  
నిడమనూరులో రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో మెట్రోరైలు ప్రాజెక్టు అధికారులు సందిగ్ధంలో పడ్డారు. రైతుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. 

నేడు డీవోపీటీ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల విభజనపై నేడు డీవోపీటీ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

నేడు తిరుపతిలో రైల్వే బోర్డు చైర్మన్ మిట్టల్ పర్యటన

చిత్తూరు : నేడు తిరుపతిలో రైల్వే బోర్డు చైర్మన్ మిట్టల్ పర్యటించనున్నారు. 

07:11 - September 12, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రెండురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు  కురవగా... కరీంనగర్‌లో కుండపోత వర్షాలు కురిసాయి.  బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల.. మరో మూడురోజుల పాటు  విస్తారంగా వర్షాలు పడే ఛాన్సుంది. రెండురోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్ మహానగరంలో రెండురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో  లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
కరీంనగర్ జిల్లాలో కుండపోత వర్షం
హైదరాబాద్ తో పాటు కరీంనగర్ లో రెండురోజులుగా భారీగా వర్షాలు కరుస్తున్నాయి. శనివారం, ఆదివారం కుండపోత వర్షానికి  కరీంనగర్ జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. కరీంనగర్‌లో లోతట్టు ప్రాంతాలన్నిజలమయమయ్యాయి.  తిరుమల నగర్‌లో  కాలువపై నిర్మించిన కల్వర్ట్ కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జగిత్యాలలో 38.4సె.మీ, ధర్మపురి 32,  మాల్యాల 57, పెగడపల్లి 65 సెంటీ మీటర్ల భారీ వర్షం కురిసింది.
తెలుగు రాష్ట్రాల్లో 3రోజుల పాటు విస్తారంగా వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం  ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరో 24 గంటల్లో కోస్తాంధ్ర సమీపంలో  అల్పపీడనంగా మారే అవకాశముందని అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు  కురుస్తాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రెండురోజుల పాటు తెలంగాణలో భారీ  నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకశాముంది.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి కేటీఆర్ 
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. మంత్రి కేటీఆర్‌..  జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు ఎమర్జెన్సీ  టీంలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆదివారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి గ్రేటర్‌ పరిధిలో అధికారులు  అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 

07:07 - September 12, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో తమ రాష్ట్రంలో ప్రాజెక్టు రూపకల్పన చేసుకోనేందుకు ఇతర రాష్ట్రాలు ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మహరాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. 
మిషన్ భగీరథపై ఇతర రాష్ట్రాల ఆసక్తి
తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ  ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగా అందరిని దృష్టిని ఆకర్షించింది. గతంలో కొన్ని రాష్ట్రాలు మిషన్ భగీరథపై ఆసక్తి చూపించాయి. ఆయా రాష్ట్రాల అధికారులు సైతం వచ్చి ఇక్కడి ప్రాజెక్టు పై అధ్యయనం చేసి వెళ్లారు. తాజాగా ఇప్పుడు మహరాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పై అధ్యయనం చేయటానికి తమ అధికారుల బృందాన్ని పంపింది.
మహరాష్ట్రలో మిషన్ భగీరథ ఏర్పాటుకు ఆసక్తి
నిర్వహణ, పర్యవేక్షణకు ఎలాంటి విధానం అవలంబించబోతున్నారు? నిధుల కొరత రాకుండా ఎలాంటి ఆర్థికవ్యూహాన్ని అనుసరిస్తున్నారన్న అంశాలపై మహారాష్ట్ర ఇంజినీర్ల బృందం భగీరథ ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 
మిషన్ భగీరథ పథకం బేషుగ్గా ఉంది- మంత్రి బాబన్‌రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం బేషుగ్గా ఉందన్నారు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి బాబన్‌రావు లోనికర్. మిషన్ భగీరథ మంచి పథకమని శ్లాఘించారు. ఇవాళ ఆయన మెదక్ జిల్లాలోని పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో మిషన్ భగీరథ పనులు, ఇంటెక్ వెల్స్‌ను పరిశీలించారు.  మహారాష్ట్రలో మూడేళ్ల నుంచి తీవ్ర కరువు నెలకొని ఉందన్న ఆయన...  గతేడాది లాతూరు ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడటంతో రైళ్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశామన్నారు. తీవ్ర నీటికొరతతో అల్లాడే మరాఠ్వాడ ప్రాంతంలో మిషన్ భగీరథ తరహా పథకాన్ని ప్రారంభించాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. 
డెడ్ లైన్ కంటే ముందే పూర్తి చేయడానికి సమాయత్తం
మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న మిషన్ భగీరథ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇతర రాష్ట్రాలుఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపడంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథను డెడ్ లైన్ కంటే ముందే పూర్తి చేయడానికి సమాయత్తమవుతోంది. 

 

07:00 - September 12, 2016

తూర్పుగోదావరి : కాపు రిజర్వేషన్‌ను అమలు చేయకపోతే..త్వరలోనే సర్కార్‌పై సమరం సాగిస్తామన్నారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలపెట్టుకోవాలని...లేకపోతే తమ సత్తా ఏంటో మారోసారి చూపిస్తామని హెచ్చరించారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు. 
సర్కార్‌పై సమరశంఖం 
కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరోసారి సర్కార్‌పై సమరశంఖం పూరించారు. కాపు రిజర్వేషన్‌ను అమలు చేస్తామని హామీ ఇచ్చిన సర్కారు..కాలం వెళ్లదీస్తోందని రాజమండ్రిలో 13జిల్లాల కాపు జేఏసీ కార్యచరణ సదస్సులో ముద్రగడ విమర్శించారు. ప్రభుత్వం తనపైనా, ముఖ్య నేతలపైనా నిరంతరం నిఘాను కొనసాగిస్తోందని ముద్రగడ ఆరోపించారు. చంద్రబాబు సర్కార్ తనను టెర్రరిస్ట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తుందని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేసారు. 
కాపులకు ఏం న్యాయం చేశారు : ముద్రగడ
ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే కాపులను బీసీల జాబితాలో చేరుస్తానని చంద్రబాబు హమీ ఇచ్చి..రెండేళ్ళు పూర్తవుతున్నా కాపులకు ఏం న్యాయం చేసారని ముద్రగడ సూటిగ ప్రశ్నించారు. ఉద్యమాలను మధ్యలో వదిలేసే ముద్రగడతో కాపులు ప్రయాణం చేస్తున్నారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సత్తా ఉంటే తనపై ఆరోపణలు చేస్తున్న వారితో తుని తరహలో బహిరంగ సభను ఏర్పాటు చేయగలిగితే ఉద్యమం నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ముద్రగడ సవాల్ విసిరారు. ప్రత్యేకహోదాను చంద్రబాబు ఢిల్లీలో ఎప్పుడో తాకట్టు పెట్టేసారని ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాయలో పడవద్దని సూచించారు. మొత్తానికి కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి పోరుకు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన హామీని నిలపెట్టుకోవాలని లేకపోతే..మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత వావ్రింకా

ఢిల్లీ : యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా వావ్రింకా నిలిచాడు.  జకోవిచ్ పై 6..7, 6..4, 7....5, 6...3 తేడాతో గెలుపొందాడు. 

న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు నేడు భారత్ జట్టు ఎంపిక

ఢిల్లీ : న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు నేడు భారత్ జట్టును ఎంపిక చేయనున్నారు. 

నేడు బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం

హైదరాబాద్ : ఉదయం 10 గంటలకు బ్యాంకర్లతో ఎపి సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం జరుగనుంది. పలు అంశాలపై వారితో సీఎం చర్చించనున్నారు. 

 

నేడు గవర్నర్ ను కలవనున్న ఎపి సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : నేడు ఎపి సీఎం చంద్రబాబు గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. 

Don't Miss