Activities calendar

13 September 2016

పౌరసరఫరాల శాఖ అధికారులతో రేపు మంత్రి ఈటెల సమీక్ష..

హైదరాబాద్ : ఈనెల 14న పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలలో ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 

రేపటి నుండి గ్రూప్ 1 మెయిన్స్ రీ ఎగ్జామినేషన్..

హైదరాబాద్ : 2011 గ్రూప్ 1 మెయిన్స్ రీ ఎగ్జామినేషన్ పరీక్షలను బుధవారం నుండి నిర్వహించనున్నారు. ఈనెల 14,17,19,21,23,24 తేదీల్లో జరిగే ఈ పరీక్షల కోసం హైదరాబాద్ లో 17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

15నే ఎసెంట్ 3 ఫలితాలు..?

హైదరాబాద్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కాలేజీల సీట్ల భర్తీ కోసం ఈనెల 11న నిర్వహించిన ఎంసెట్ -3 ఫలితాలు 15న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పరీక్షకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

రేపు తెలంగాణ రాష్ట్రంలో హిందీ దివస్..

హైదరాబాద్ : రేపు రాష్ట్రంలో ‌హిందీ దివస్ నిర్వహించనున్నారు. 14 డిసెంబర్ హిందీ భాషా దినోత్సవం కావడంతో దేశ వ్యాప్తంగా హిందీ దివస్‌ను నిర్వహిస్తోన్నారు. 

గురువారం గణేష్ నిమజ్జనం..

హైదరాబాద్ : గణేష్ నిమజ్జన కార్యక్రమం గురువారం జరగనుంది. ఈ నేపథ్యంలో నగర శివారు ప్రాంతాలతో పాటు సిటీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం నుండి ఇవి అమల్లో ఉంటాయి. x 

బుధవారం నుండి యదావిధిగా పాఠశాలలు..

బెంగళూరు : కర్నాటక రాజధాని బెంగళూరులో బుధవారం నుండి యదావిధిగా పాఠశాలలు..కళాశాలలు పనిచేయనున్నారు. కావేరి జల వివాదం కారణంగా సోమవారం నుండి పాఠశాలలను యాజమాన్యాలు మూసివేసిన సంగతి తెలిసిందే. 

ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు...

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి నాలుగు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. భాద్రపదశుద్ధ త్రయోదశి నుంచి బహుళ పాడ్యమి వరకు జరిగే ఈ ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయ శుద్ధి జరుగనుంది. ఈ నేపథ్యంలో రేపు మహా నివేదన అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నట్లు చెప్పారు. 

21:29 - September 13, 2016

ఢిల్లీ : రాజధాని ఢిల్లీలో చికన్‌గునియా విజృంభిస్తోంది. ఇప్పటివరకు చికన్‌గునియా వ్యాధితో ఐదుగురు మృతి చెందారు. సర్‌ గంగారాం ఆసుపత్రిలో చికన్‌గున్యాతో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. సెప్టెంబర్‌ 1 న ఒకరు చనిపోయారు. పరిస్థితి విషమిస్తున్నా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌ ఢిల్లీలో లేకపోవడంపై విపక్షాలు విమర్శించాయి. అయితే తాను, తన మంత్రులకు ఎలాంటి అధికారాలు లేవని, ఒక పెన్ను కూడా తాము కొనలేని స్థితిలో ఉన్నామని కేజ్రీవాల్‌ అన్నారు. అధికారాలన్ని ప్రధాని మోది, ఎల్జీ హస్తగతం చేసుకున్నారని ట్వీట్‌ చేశారు. దోమలను అరికట్టడానికి ఢిల్లీ నగరపాలక సంస్థ ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో 1158 డెంగ్యూ, 1057 చికన్‌గునియా, 21 మలేరియా వ్యాధులు నమోదయ్యాయి.

21:25 - September 13, 2016

హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో..ఏపీ, తెలంగాణలోని పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, గుంటూరు, నల్గొండ, హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. మరో 24గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో గుంటూరు జిల్లా అతలాకుతలం అయింది. కుండపోత వర్షం ధాటికి జనజీవనం స్తంభించింది. గురజాల మండలంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి దండి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాగుకు గండి పడింది. దీంతో మాచర్ల-గుంటూరు రైల్వే ట్రాక్‌ అర కిలోమీటరు మేర కొట్టుకు పోయింది. దీని ప్రభావంతో గురజాల-మాచర్ల-రేపల్లె మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

గుంటూరులో..
గుంటూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి దండివాగుకు గండి పడడంతో వరదనీరు గ్రామంలోకి ప్రవేశించడంతో రోడ్లు, పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వరద ఉధృతికి గురజాలలోని వెంకట్రావ్‌నగర్‌ కాలనీ పూర్తిగా జలమయమైంది. మాచర్ల, పిడుగురాళ్ల ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దుర్గిలో అత్యధికంగా 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాచర్లలోని పలు వార్డుల్లోఇళ్లలోకి వరద నీరు రావడంతో జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటితో పంటపొలాలు నీటమునిగాయి. కారంపూడి మండలం మిరియాల్లో చెరువుకు గండిపడి సుమారు వెయ్యి ఎకరాల్లో పంటలపొలాలు నీటమునిగాయి. దాచేపల్లి మండలం కరాలపాడులో రాత్రి నుంచి కురిసిన వర్షానికి గోడ కూలి మహిళ మృతిచెందింది. కారంపూడి మండలంలోని ఎర్రవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి చేరిన వరద నీటితో నాలుగు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. ముంపుగ్రామాల వాసులను గ్రామాలు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

తెలంగాణలోనూ...
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా సూర్యాపటలో 5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. నేరేడుచర్లలో 110 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. 24 గంటలుగా జిల్లాలో సగటున 35 మిల్లీ మీటర్ల వర్షపాతం నమాదు అయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు జలమయం అయ్యాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో మూసినది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో..కేతపల్లి మూసి ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తుతోంది. వరదనీటితో..చివ్వెంల మండలం, కుడ-కుడ గ్రామం వద్ద మూసి ఎడమకాల్వకు గండి పడటంతో..వరదనీరు గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో అధికారులు మూసికాల్వ నీటి విడుదలను నిలుపివేసారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో టోల్-ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. అధికారులకు సెలవుల్ని రద్దు చేశారు జిల్లా కలెక్టర్ సత్యరానాయణ రెడ్డి. పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో..ముంపు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

హైదరాబాద్ లో..
ఇక రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్‌, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, తార్నాక, నాచారం, ఖైరతాబాద్‌, సోమాజీగూడ, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బక్రీద్‌ ప్రార్థనలకు వెళ్లే ముస్లీం సోదరులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ గ్రేటర్‌ అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సిటీలోని ఎమర్జన్నీ టీంలను రంగంలోకి దింపి రోడ్లపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు మోటర్లతో తోడేస్తున్నారు. అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని కమిషనర్ జనార్థన్‌రెడ్డి తెలిపారు. శిథిలావస్థకు చేరిన భవనాల విషయంలో అప్రమత్తంగా ఉండి అవసరమతే వాటిని కూల్చివేయాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆదేశించామన్నారు.

24గంటల్లో...
భారీ వర్షం కారణంగా రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ పట్టణంలో పురాతన భవనం కూలడంతో భార్యాభర్తలిద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే చికిత్స కోసం మేడ్చల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్వో అక్కడి రోడ్డును తాత్కాలికంగా మూసివేయించారు. రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలో 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం బలపడే అవకాశం లేనప్పటికీ దీని ప్రభావం మరో రెండు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

21:22 - September 13, 2016

హైదరాబాద్ : ప్రజా స‌మ‌స్యల‌పై పోరాటంతో పాటు, పార్టీని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణయించుకున్నారు జనసేన అధినేత పవన్‌. ఇందులోభాగంగానే ఒక పుస్తకాన్ని రాస్తున్నారు. 'నేను-మనం-జనం' పేరుతో పుస్తకాన్ని వెలువరించనున్నారు. ఈ పుస్తకంతో జ‌న‌సేన సిద్ధాంతాలను, ల‌క్ష్యాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకువెళ్లాలని జనసేనాని భావిస్తున్నారు. జనసేన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పవన్‌ కళ్యాణ్‌ కలం పట్టబోతున్నారు. పార్టీ పెట్టడం వెనుక ఆయనకున్న ఉద్దేశాన్ని, ప్రేరేపించిన పరిస్థితులను, చేయాలనుకుంటున్న కార్యక్రమాలను ప్రతిబింబించేలా ఈ పుస్తకం ఉంటుందట. ఇంతకు ముందుకు ప్రచురించిన 'ఇజమ్‌' పుస్తకం కంటే భిన్నంగా, సరళంగా ఉండాలనే ఉద్దేశంతో పవన్‌ ఈ పుస్తకాన్ని రాస్తున్నారని సమాచారం.

పుస్తకంలో జనసేన ఆలోచన విధానాల వివరణ..
వచ్చే ఏడాది ప్రథమార్ధంలో పవన్‌ కల్యాణ్‌ రచనను వెలువరించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు జనసేన పార్టీ తెలిపింది. 'నేను-మనం- జనం' పేరుతో రూపొందుతోన్న ఈ పుస్తకానికి 'మార్పు కోసం యుద్ధం' అనేది ట్యాగ్‌లైన్‌గా పెడుతున్నట్లు తెలిసింది. జనసేన ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఈ పుస్తకంలో పవన్ వివరిస్తారట. ఒక్కమాటలో చెప్పాలంటే.. జనసేన ఆలోచన విధానం మొత్తం ఈ పుస్తకంలో వివరించే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

రాజకీయ వ్యూహం..
తనదైన రాజకీయ వ్యూహంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్న పవన్, ఈ పుస్తకం ద్వారా పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రజలకు కూడా చేరువ కావాలని ఇందుకు ఇదే సరైన మార్గమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఏపీకి ప్రత్యేక హోదాపై జనంలోకి వచ్చిన పవన్‌, తన భవిష్యత్ రాజకీయ వ్యూహం రచించడంలో మునిగితేలుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులోభాగంగానే పుస్తకాన్ని రాస్తున్నారు. 'ఇజం' పుస్తకం ఆశించిన విధంగా ప్రజ‌ల్లోకి వెళ్లనందున.. ఇప్పుడు రాయబోయే పుస్తకంపై ప్రత్యేక దృష్టిసారించారు పవన్‌.

21:20 - September 13, 2016

ఢిల్లీ : ఏపీ, తెలంగాణ ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటన ముగిసింది. మధ్యాహ్నం ప్రధాని మోదీతో భేటీ అయిన గవర్నర్‌.. ఏపీ, తెలంగాణలో తాజా పరిణామాలను వివరించారు. సుదీర్ఘంగా సాగిన భేటీలో.. ఏపీకి ప్యాకేజీ అనంతరం జరిగిన పరిణామాలను మోదీకి వివరించినట్టు సమాచారం. గవర్నర్ ఢిల్లీకి వచ్చిన ప్రతీసారి.. కేంద్ర హోంశాఖ, హోంశాఖ కార్యదర్శులతో భేటీ అయ్యేవారు.. కానీ ఈసారి పర్యటనలో కేవలం ప్రధానితో భేటీ కావడం గమనార్హం. ఈ సమావేశం తరువాత... ఆయన పీఎంవో ఉన్నతాధికారులను కలిశారు. అంతకు ముందు ఉదయం... ఏపీ భవన్‌లో... ఆయన కేంద్రమంత్రి సుజనా చౌదరిని గవర్నర్ మర్యాద పూర్వకంగా కలిశారు.  

21:19 - September 13, 2016

బెంగళూరు : కావేరి జలాల వివాదం.. ఓ నవవధువును కష్టాల్లో ముంచెత్తింది. అల్లరిమూకల హింసాత్మక ఆందోళనలతో కర్నాటక, తమిళనాడుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఓ నవవధువు పెళ్లిచీరలో కాలినడకన పొరుగు రాష్ట్రం తమిళనాడుకు బయలు దేరింది. బెంగళూరుకు చెందిన ప్రేమకు తమిళనాడు యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. బుధవారం తమిళనాడులోని వనియాంబడిలో వీరి వివాహం జరగనుంది. కావేరి వివాదంతో వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో నవవధువు తమిళనాడు సరిహద్దు వరకు ఎలాగోలా చేరుకుంది. అక్కడి నుంచి 20 మంది కుటుంబసభ్యులను తోడుగా తీసుకొని పెళ్లి వేదికకు కాలినడకన బయలుదేరారు. ప్రస్తుత పరిస్థితులతో పెళ్లి సంబరమంతా మాయమైందని నవ వధువు ఆవేదన వ్యక్తం చేసింది.

21:17 - September 13, 2016

బెంగళూరు : కావేరి జల వివాదంతో కర్నాటక, తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బెంగళూరులో కర్ఫ్యూ విధించారు. కావేరి నదీ జలాల విషయంలో కర్ణాటకకు కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని కర్ణాటక సీఎం సిద్ద రామయ్య అన్నారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు. హింసాత్మక ఘటనలతో సంబంధమున్న 350 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కావేరి జలాలను తమిళనాడుకు వదలాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో కర్నాటకలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. బెంగళూరులో 16 సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. పారామిలటరీ దళాలు, 15 వేల మంది పోలీసులు బస్తీల్లో గస్తీ కాస్తున్నారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా విధ్వంసానికి పాల్పడ్డ 350 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు.

అన్యాయం జరుగుతోందన్న సిద్ధరామయ్య..
కావేరి జలాల విషయంలో కొన్నేళ్లుగా తమకు అన్యాయం జరిగుతోందని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియా సమావేశంలో చెప్పారు. నీటి విడుదలపై సుప్రీంకోర్టు తీర్పు కష్టంగా ఉన్నప్పటికీ.. న్యాయస్థానం ఆదేశానుసారం ఆరు రోజుల పాటు తమిళనాడుకు నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు. కన్నడ ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయొద్దని కోరారు. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇస్తే ఆయనకు పరిస్థితిని వివరిస్తానని సిఎం చెప్పారు.

బాధించాయన్న మోడీ..
కర్నాటక, తమిళనాడులో నీటి కోసం జ‌రుగుతున్న హింసాత్మక ఘ‌ట‌నలు తనను వ్యక్తిగ‌తంగా బాధ‌కు గురి చేశాయని ప్రధాని మోడీ అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య కావేరి జలాలు చాలా సున్నిత అంశమని, హింస ద్వారా కాకుండా సంయమనంతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించు కోవాలని ఇరు రాష్ట్రాలకు సూచించారు. ఆందోళనల పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పొరుగు రాష్ట్రాల వారి ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

'సుప్రీం' ఆదేశాలు..
తమిళనాడుకు 10 రోజుల పాటు 12 వేల క్యూసెక్కుల కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్నాటకను ఆదేశించింది. సుప్రీం ఆదేశంతో కర్నాటక భగ్గుమంది. సోమవారం తమిళనాడు పేరిట రిజిస్టర్‌ అయిన 30 బస్సులు, లారీలు, ట్రక్కులు, షాపులను ఆందోళనకారులు తగలబెట్టారు. రామేశ్వరంలో కూడా కర్నాటక బస్సులపై దాడి జరిగింది. చెన్నయ్‌లో వుడ్‌ల్యాండ్‌ హోటల్‌పై పెట్రో బాంబులతో దాడి చేశారు. 

చికెన్ గున్యాతో మరొకరి మృతి..?

ఢిల్లీ : దేశ రాజధానిలో చికెన్ గున్యా ప్రబలుతోంది. ఇప్పటివరకు చికెన్ గునియా వ్యాధితో నలుగురు మృతి చెందారు. తాజాగా సర్ గంగా రామ్ ఆసుపత్రిలో మరొకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. 

20:18 - September 13, 2016

ఇగ బక్రీద్ పండుగంటె ఏంది..?..మళ్ల వానదేవున్కి మనం గుర్తొచ్చినట్టునం..కేటీఆర్ సారు డీజీపికి జెప్పి ఆ సీఐమీద చర్యలు దీస్కోమని చెప్పిండట..తప్పిపోయిన మన్షి మీకు గనిపిస్తె జాడ జెప్పుండ్రి.. పుణ్యానికేంగాదు తగిన పారితోషకం గూడ అప్పజెప్తమంటున్నరు..నిజాంబాదు పట్నంలుంటున్న కొంతమంది లేస్తె లేస్తెనే ఆత్మలను.. శవాలను.. కాష్టాలను జూడాలె..?..అవరావతికి రాజధానొచ్చి అక్కడ కొంతమందికి ఆనందరం రావొచ్చుగని..ఇంక కొంతమందికి మాత్రం చీకట్లొచ్చినయ్ జీవితాలళ్ల..ఎవ్వలు రెచ్చగొట్టకున్నా రెచ్చిపోయి మన్షి పాణం దీసింది ఈ ఫైటింగు..కావేరీ నది నీళ్ల కోసం కాలవెట్టుకునెకాడికొచ్చింది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలళ్ల పంచాది..ఈ అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు' లో 'మల్లన్న' ముచ్చట్లు చెప్పిండు. గరం గరంగా ఉన్న ఈ ముచ్చట్లు చూడాలంటే వీడియోలో చూడండి. 

20:16 - September 13, 2016

ఆ ఇప్పుడు ప్రకటన.. అగో ప్రకటనలు గూడ జెప్తున్నరా మల్లన్న ముచ్చట్లళ్ల అంటె.. చెప్పవల్సొస్తది అప్పుడప్పుడు.. తప్పిపోయిన వ్యక్తి కోసం ప్రకటన ఇచ్చిండ్రు, మరి ఆ తప్పిపోయిన మన్షి మీకు గనిపిస్తె జాడ జెప్పుండ్రి.. పుణ్యానికేంగాదు తగిన పారితోషకం గూడ అప్పజెప్తమంటున్నరు.. ఇది జూశాక కనిపిస్తె కబురు వెట్టుండ్రి. మరి ఆయన ఎవరు అనేది తెల్సుకోవాలంటే వీడియో సూడుండ్రి..

19:56 - September 13, 2016
19:39 - September 13, 2016
19:38 - September 13, 2016

ఢిల్లీ : రాజధాని ఢిల్లీలో చికెన్ గునియా విజృంభిస్తోంది. ఇప్పటివరకు చికెన్ గునియా వ్యాధితో నలుగురు మృతి చెందారు. సర్‌ గంగారాం ఆసుపత్రిలో ఈ వ్యాధితో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. సెప్టెంబర్‌ 1 న ఒకరు చనిపోయారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌ ఢిల్లీలో లేకపోవడంపై విపక్షాలు విమర్శించాయి. ఢిల్లీ సిఎం, మంత్రుల వద్ద ఎలాంటి అధికారాలు లేవని, ఒక పెన్ను కూడా తాము కొనలేని స్థితిలో ఉన్నామని కేజ్రీవాల్‌ అన్నారు. అధికారాలన్ని ప్రధాని మోది, ఎల్జీ హస్తగతం చేసుకున్నారని ట్వీట్‌ చేశారు. దోమలను అరికట్టడానికి ఢిల్లీ నగరపాలక సంస్థ ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో 1158 డెంగ్యూ, 1057 చికన్‌గునియా, 21 మలేరియా వ్యాధులు నమోదయ్యాయి.

19:36 - September 13, 2016

రంగురంగుల రంగవల్లులు. రకరకాల పూలతో చూడముచ్చటైన అలంకరణలు. ఇళ్లూ వాకిళ్లను అంత్యంత సుందరంగా ముస్తాబు చేసి చిన్నా పెద్దా అంతాకలిసి సందడి చేసే పండుగ ఓనమ్‌. ఓనమ్‌ పండుగ అంటే మలయాళీలకు అత్యంత ప్రీతి పాత్రమైంది. ఓనమ్‌ పండుగ వచ్చిందంటే చాలు.. మలయాళీలు ఎంతో హుషారుగా సందడి చేస్తూ.. ఆటపాటలతో హంగామా చేస్తారు. సాంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో అదరహో అన్పిస్తారు. చెన్నైలో ఓనం సంబరాలపై 10TV ప్రత్యేక కథనం..

ఓనం పర్వదినం..
ఓనం పర్వదినం. కేరళ మలయాళీలకు అత్యంత ఇష్టమైన పండుగ. గత పది రోజులుగా కేరళలో ఓనం ఉత్సవాలు చెన్నైలో వైభవంగా జరుగుతున్నాయి. చివరి రోజైన తిరువోణం సందడి మలయాళీల్లో హుషారు నింపింది. చిన్నా పెద్దా అంతా కలిసి ఓనం సంబరాల్లో సందడి చేస్తున్నారు. ఎక్కడ చూసినా...రంగురంగుల పూలతో చూడముచ్చటైన అలంకరణలు. సాంప్రదాయ బద్ధమైన నృత్యాలతో సందడి వాతావరణం నెలకొంది.

రెండు పండుగల్లో ఒకటి..
మలయాళీయులకు ప్రీతిపాత్రమైన రెండు పండుగల్లో ఒకటి.. కొత్త సంవత్సరాదిగా పిలుచుకునే విషు, రెండోది..శ్రవణోత్సవంగా పిలవబడే తిరువోణం. మలయాళీల మహా పండుగగా చెప్పుకునే ఓనం పదిరోజల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సారి ఓనం ఉత్సవాలకు కేరళ ప్రభుత్వం నాలుగు రోజులు సెలవు కూడా ప్రకటించింది. మహాబలి చక్రవర్తి అహాన్ని అణచి వేసేందుకు మహా విష్ణువు వామనుడి రూపంలో రాగా ఒక్కడుగుతో అతనిలోని అహాన్ని పారద్రోలిన పురాణకథ ఓనం పండుగతో ముడిపడి ఉంది. కేరళను మహాబలి పాలించేటప్పుడు రాజ్యం సుభిక్షంగా ఉండేదని మలయాళీల నమ్మకం.

నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ..
అంతేకాదు.. చింగం మాసంలో పాడిపండలు చేతికందే సమయంతోపాటు రుతుపవానాలు అనుకూలించే సమయం కావటంతో ప్రజా క్షేమ పరిపాలకుడైన మహాబలిని ఆహ్వానిస్తూ మలహాళీలు ఈ పండుగను చేసుకుంటారు. కేరళలో ఈ పండుగను అథమ్ తో ప్రారంభించి చిత్తిర, చోతి, విశాగం, అనిళ, థ్రికెత్త, మూలం, పూరాడం, ఉత్రాడం అంటూ చివరిగా తిరువోనంను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముగ్గులు, ఆటలు, పాటలు, సాంప్రదాయ నృత్యాలు ఈ వేడుకల్లో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి. పెద్దలను గౌరవిస్తూ సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు చేయటం కూడా ఈ పండుగ ప్రత్యేకత.  

19:32 - September 13, 2016

ఢిల్లీ : కర్నాటకలో దాడులు..హింసాత్మక ఘటనలపై సీపీఎం పొలిట్ బ్యూరో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. కావేరీ నది జలాల పంపకాల్లో సుప్రీంకోర్టు నిర్ణయంపై ఇరు రాష్ట్రాలు సంయమనం పాటించాలని, తమ ప్రాంతాల ప్రజల ఆస్తుల పరిరక్షణకు రెండు ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించింది. దశాబ్ధాలుగా కొనసాగుతున్న కావేరీ జల వివాదం చర్చలు..పరస్పర అంగీకారాల ద్వారా మాత్రమే పరిష్కారమౌతుందని, ప్రజల మధ్య విధ్వేషాలు రగల్చడం వల్ల ఎలాటి ప్రయోజనం ఉండదని తెలిపింది. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించింది. 

19:27 - September 13, 2016

హైదరాబాద్ : పార్లమెంట్ లో 'రోహిత్ వేముల' చట్టం కోసం కృషి చేస్తామని టి.కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. . హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో టి.పిసిసి, ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో 'జస్టిస్ ఫర్ రోహిత్ వేముల' పేరిట రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టి.పిసిసి చీఫ్ ఉత్తమ్, భట్టి విక్రమార్క, ప్రొ. కోదండరామ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్, ప్రొ.కోదండరాంలు మాట్లాడారు. చట్టం రూపం దాల్చితేనే యూనివర్సిటీలో దళిత విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఉత్తమ్ పేర్కొన్నారు. యూనివర్సిటీలో దళత విద్యార్థుల వివక్ష లను రూపుమాపడానికి రోహిత్ వేముల చట్టం ఉపయోగపడుతుందని టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ పేర్కొన్నారు. 

19:17 - September 13, 2016

ప్రత్తిపాడులో రోడ్డు ఆక్సిడెంట్..

తూర్పుగోదావరి : జిల్లాలోని ప్రత్తిపాడులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును ట్రాక్టర్ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. 

హరిత సచివాలయంగా నిర్మాణం - మంత్రి నారాయణ..

గుంటూరు : తాత్కాలిక సచివాలయాన్ని హరిత సచివాలయంగా నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. 49 ఎకరాల్లో 22 ఎకరాలను భవనాలను కేటాయించడం జరిగిందని, మిగతదంతా పార్కింగ్, పచ్చదనానికి కేటాయించడం జరిగిందన్నారు. సీఆర్డీఏ అధికారులతో ప్రత్యేకంగా పచ్చదనం కోసం ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు, రెండు, మూడు రోజుల్లో మంత్రులు తాత్కాలిక సచివాలయం నుండి అధికారిక పాలన కొనసాగిస్తారన్నారు. అక్టోబర్ నుండి సీఎం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

మేకింగ్ తెలంగాణ ఈ - మ్యాగజైన్ ఆవిష్కరణ..

హైదరాబాద్ : తెలంగాణ మ్యాగజైన్ ను ఎంపీ కవిత ఆవిష్కరించారు. మేకింగ్ తెలంగాణ ఈ - మ్యాగజైన్ ను ఎంపీ ఆవిష్కరించారు. తెలంగాణ ఇండస్ట్రియల్స్ ఫెడరేషన్ తో టీ జాగృతి ఒప్పందం కుదుర్చుకుంది. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించనున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ పారిశ్రామిక వేత్తలు భాగస్వాములు కావాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. సమైక్య పాలనలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలంగాణ పారిశ్రామిక వేత్తలకు రుణాలివ్వలేదని, పరిశ్రమల ఏర్పాటుకు కోసం ఔటర్ రింగ్ రోడ్డు వద్ద స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు.

కలెక్టర్లతో మాట్లాడిన బాబు..

విజయవాడ : గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్ష బీభత్సంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా జిల్లాల కలెక్టర్లలతో మాట్లాడారు. గురజాలలో దండివాగు ఉధృతికి రైల్వే ట్రాక్ కొట్టుకపోవడంతో ప్రయాణీకులు, స్థానికులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒంగోలులో ట్రాన్స్ కో స్టోర్స్ లో జరిగిన నష్టంపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడారు. మరో 24గంటలూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 

పూంచ్ లో ముగిసిన కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పూంచ్ లో ఉగ్రవాదులు..భారత బలగాలకు మధ్య జరిగిన కాల్పులు కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఓ భవనంలో దాక్కున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు గత మూడు రోజులుగా భారత బలగాలు కృషి చేసిన సంగతి తెలిసిందే. ఘటనా స్థలం నుండి నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలు, 4 ఏకే 47, 16 మ్యాగజైన్ లను స్వాధీనం చేసుకున్నారు. 

18:49 - September 13, 2016

సాగర్..తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు.. ఏళ్లపాటు సాగిన మొగలిరేకులు సీరియల్ ని ఎలా మర్చిపోలేరో.. అందులో 'ఆర్కే నాయుడు' పాత్రలో నటించిన 'సాగర్' ని అంతకంటే మర్చిపోలేరు. 'చక్రవాకం'..'రుతురాగాలు' వంటి సీరియల్స్ లో ట్యాలెంట్ చూపారు. ప్రస్తుతం ఇతను వెండితెరపై కనిపిస్తున్నాడు. 'సాగర్' హీరోగా, రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మించిన చిత్రం 'సిద్దార్థ'. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందింది. దయానంద్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాక్షి చౌదరి, రాగిణి నంద్వాని హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా 'సాగర్'తో టెన్ టివి ముచ్చటించింది. చిత్రానికి సంబంధించిన విషయాలు..ఇతరత్రా విశేషాలను ఆయన వెల్లడించారు. మరి ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియోలో చూడండి. 

18:39 - September 13, 2016

భారత టెన్నిస్ క్వీన్ 'సానియా మీర్జా' ఓ అరుదైన ఘనత సొంతం చేసుకొంది. ప్రపంచ మహిళల డబుల్స్ లో.. వరుసగా 75 వారాల పాటు నెంబర్ వన్ ర్యాంక్ సాధించడం ద్వారా...హేమీహేమీల సరసన నిలిచింది. తన కెరియర్ లో ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో పాటు..మొత్తం 39 డబుల్స్ ట్రోఫీలు అందుకొంది. హైదరాబాదీ షాన్ సానియా డబుల్స్ రికార్డుల కోసం చదవండి..

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు..
సానియా మీర్జా... భారత మహిళా టెన్నిస్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే కాదు...మరోపేరు కూడా. సింగిల్స్ లో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయినా మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ లో మాత్రం సానియా తానేమిటో నిరూపించుకొంటూ వస్తోంది. ప్రపంచ మహిళల డబుల్స్ లో ఆల్ టైమ్ గ్రేట్లు మార్టీనా నవ్రతిలోవా, కారా బ్లాక్, లీజిల్ హ్యూబర్ ల తర్వాతి స్థానంలో నిలిచిన ఏకైక భారత ప్లేయర్ సానియా మాత్రమే. 75 వారాల పాటు ప్రపంచ నెంబర్ వన్ డబుల్స్ ర్యాంక్ నిలుపుకొంటూ వచ్చిన ఘనత సానియాకు మాత్రమే దక్కుతుంది.

టాప్ ర్యాంకర్...
ప్రపంచ మహిళాటెన్నిస్ డబుల్స్ లో మార్టీనా నవ్రతిలోవా 181 వారాలపాటు టాప్ ర్యాంక్ లో ఉంటే కారా బ్లాక్ 145 వారాలు, లీజిల్ హ్యూబర్ 134 వారాలు నెంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతూ వచ్చారు. వారి తర్వాత స్థానంలో సానియా 75 వారాల పాటు టాప్ ర్యాంకర్ గా నిలవడం విశేషం. భారత టెన్నిస్ చరిత్రలో మహేశ్ భూపతి నాలుగు వారాల పాటు, లియాండర్ పేస్ 39 వారాల పాటు డబుల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్లుగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరి మొనగాళ్ల రికార్డును సానియా 75 వారాల రికార్డుతో ఎప్పుడో అధిగమించింది.

మొత్తం 10 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ లో...
2015 ఏప్రిల్ 13 నుంచి 40 వారాల పాటు నెంబర్ వన్ ర్యాంక్ నిలుపుకొన్న సానియాకు మొత్తం 10 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ లో పాల్గొన్న అరుదైన రికార్డు ఉంది. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ మహిళల డబుల్స్ లో నాలుగు ఫైనల్స్, మిక్సిడ్ డబుల్స్ లో ఆరు ఫైనల్స్ లో పాల్గొన్న ఘనత సానియాకు మాత్రమే సొంతం. డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో మొత్తం పది ఫైనల్స్ ఆడిన సానియా..ఆరు టోర్నీల్లో చాంపియన్ గా ట్రోఫీలు అందుకోడం విశేషం.

75 వారాలు..
2016 సీజన్లో మొత్తం 7 డబుల్స్ టైటిల్స్ నెగ్గిన సానియా తన కెరియర్ లో మాత్రం 13 మంది వేర్వేరు భాగస్వాములతో కలసి 39 టైటిల్స్ సొంతం చేసుకొంది. ఇందులో 2014 సీజన్లో కారా బ్లాక్ తో జంటగా రెండు టైటిల్స్, 2015 సీజన్లో మార్టీనా హింగిస్ తో జంటగా 2 టైటిల్స్ గెలుచుకొంది. ఇటీవలే ముగిసిన యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ లో బార్బోరా స్ట్రికోవాతో జంటగా పాల్గొన్న సానియా...క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. నెంబర్ వన్ ర్యాంక్ లో 75 వారాలపాటు ఉండటం తనకు గర్వకారణమంటూ సానియా పొంగిపోతోంది. కొద్దిరోజుల విశ్రాంతి తర్వాత..టోక్యో ఓపెన్ ద్వారా తిరిగి తన పోరాటం కొనసాగిస్తానని సానియా ప్రకటించింది. గతంతో తనకు సంబంధం లేదని తనకు తెలిసిందల్లా పూర్తిఫిట్ నెస్ తో ఆడుతూ పోవడమేనని 29 ఏళ్ల సానియా హైదరాబాద్ లో చెప్పింది. మహిళా టెన్నిస్ లో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి, ఏకైక భారత మహిళ సానియా మాత్రమే.

18:33 - September 13, 2016

కడప : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఎమ్మెల్సీ గేయానంద్‌ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈనెల 14,15 తేదీల్లో కడపలో జరిగే గేయానంద్‌ నిరసనదీక్షకు పలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

సీపీఎం మద్దతు..
కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎమ్మెల్సీ గేయానంద్‌ చేపడుతున్న దీక్షకు సీపీఎం కడప జిల్లా కమిటీ పూర్తి మద్దతు ప్రకటించింది. రాయలసీమకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వైఖరికి నిరసనగానే ఎమ్మెల్సీ దీక్ష చేపట్టాల్సి వస్తోందని, ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీపీఎం ఎప్పుడూ ముందుంటుందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. నారాయణ రెడ్డి తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న స్టీల్‌ ప్లాంట్‌, ప్రత్యేక ప్యాకేజీ నెరవేర్చేంత వరకు తమ పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. రాయలసీమ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాయలసీమ అభివృద్ధి వేదిక చేపడుతున్న అన్ని కార్యక్రమాలకు సీపీఎం అండగా నిలిచి పోరాడుతుందని నారాయణరెడ్డి తెలిపారు.  

18:31 - September 13, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ మోసాలు అన్నీ ఇన్నీ కావు. సంస్థ డైరెక్టర్ల దొంగ ఎత్తుల ముందు.. ఎవరైనా చిత్తవ్వాల్సిందే. లక్షలాది మందిని ముంచి సంపాదించిన ఆస్తుల్ని.. అడ్డగొలుగా అమ్మేసుకుని సొమ్ము చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా చెలరేగి పోతున్నారు. కడప జిల్లా పాపిరెడ్డిపల్లిలోని భూమిని.. సంస్థ డైరెక్టర్‌ అవ్వా సీతారామారావు ఇలాగే అడ్డగోలుగా అమ్మేశారు. ఆస్తుల్ని అమ్మరాదన్న హైకోర్టు ఆదేశాలనూ ఆయన తుంగలో తొక్కేశారు. అగ్రిగోల్డ్ సంస్థ డైరెక్టర్లు బరితెగించేశారు. సంస్థకు చెందిన.. సంస్థ డైరెక్టర్‌లకు చెందిన ఆస్తుల్ని అమ్మరాదంటూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులనూ వీరు బేఖాతరు చేస్తున్నారు. లక్షలాదిమందికి కుచ్చుటోపీ పెట్టి సంపాదించిన ఆస్తుల్ని అమ్మేసుకుని.. దర్జాగా సొమ్ము చేసేసుకుంటున్నారు.

అమ్మిన ఆస్తులు...
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం.. పాపిరెడ్డిపల్లిలో.. అగ్రిగోల్డ్ సంస్థ డైరెక్టర్‌ అవ్వాసీతారామారావు 60 ఎకరాల పట్టాభూమిని.. గుట్టుచప్పుడు కాకుండా అమ్మేశాడు. కనీసం తాను రిజిస్ట్రార్‌ కార్యాలయానికి కూడా రాకుండానే.. ఆస్తి అమ్మకం తంతు ముగించేశాడు. అగ్రిగోల్డ్ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ అవ్వా సీతారామారావు.. 2011లో కడప జిల్లాలో ఓ 60 ఎకరాలను కొనుగోలు చేశారు. తన కుటుంబ సభ్యుల పేరిట వున్న ఆ భూమిని.. హైకోర్టు ఆదేశాలను తోసిరాజంటూ.. అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇంతకీ కడప జిల్లాలో అవ్వా సీతారామారావు అమ్మిన ఆస్తుల వివరాలేంటి..?

వివరాలు..
కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం, పాపిరెడ్డిపల్లిలో.. సుమారు 60 ఎకరాల పట్టాభూమి.. అగ్రిగోల్డ్ డైరెక్టర్‌ అవ్వా సీతారామారావు, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉంది. ఈ మొత్తం 60 ఎకరాల్లో... 40 ఎకరాల దాక అవ్వా సీతారామారావు కుటుంబ సభ్యులు పుష్పలత.. హిమజ పేర్ల మీద వుంది. మిగిలిన ఇరవై ఎకరాలు.. కడప జిల్లాలో, అగ్రిగోల్డ్‌కు కీలకంగా ఉన్న కామిరెడ్డి భగవాన్ రెడ్డి భార్య కామిరెడ్డి సునీత పేరు మీద ఉంది. మరో ఐదు ఎకరాలు సీతారామారావు భార్య పుష్పలత డైరెక్టర్ గా ఉన్న పుష్ప టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్స్ గ్రూప్ లో ఒకరిగా ఉన్న కాటారి శ్రీనివాసులురెడ్డి భార్య వనజాక్షి పేరు మీద వుంది.

60 ఎకరాల భూమి..
మొత్తం అరవై ఎకరాల భూమిని.. అవ్వాసీతారామారావు తదితరులు, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శేగిరెడ్డి బాలగంగాధర్ రెడ్డి కుటుంబ సభ్యులకు అమ్మేశారు. అగ్రిగోల్డ్‌ సంస్థలో హోల్‌టైమ్‌ డైరెక్టర్‌గా వున్న అవ్వా సీతారామారావు, 2011లో తన భార్య అవ్వా పుష్పలత పేరిట.. పాపిరెడ్డిపల్లిలో 31 ఎకరాల భూమిని కొన్నారు. సర్వే నంబర్లు... 271-1, 272-P2, 273-1P1, 274-P2, 276-2P1,276-3,276-4P1,280-P1,281-P1 లలోని భూమి పుష్పలత పేరిట కొన్నారు. అదే సమయంలోనే.. సర్వే నంబర్లు...272-P3, 273-1P2, 274-P3, 276-4P2, 280-P2, 281-P2 లోని ఎనిమిది ఎకరాల భూమిని తన కుమార్తె అవ్వా హిమజ పేరిట కొన్నారు సీతారామారావు.

కామరెడ్డి భగవన్ కూడా..
ఇక అగ్రిగోల్డ్ సంస్థకు.. కడప జిల్లాలో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందిన కామిరెడ్డి భగవాన్‌ కూడా.. 2011లోనే తన భార్య కామిరెడ్డి సునీత పేరిట 21 ఎకరాల భూమిని కొన్నారు. సర్వే నంబర్లు....272-p1, 274-p1, 280-p3, 315-1p1, 315-1p3 లలోని భూమి సునీత పేరిట వుంది. ఈమొత్తం 60 ఎకరాలను.. ఇదే సంవత్సరం ఆగస్టు నెలలో శేగిరెడ్డి బాలగంగాధరరెడ్డి కుటుంబానికి అమ్మేశారు. కడప జిల్లా బద్వేలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈ రిజిస్ట్రేషన్‌ వ్యవహారాన్ని సజావుగా సాగించేశారు.

తెలివైన ఎత్తుగడ...
కడప జిల్లాలోని ఆస్తిని అమ్మేందుకు అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌ అవ్వా సీతారామారావు.. పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఎత్తును వేశారు. కనీసం రిజిస్ట్రార్‌ కార్యాలయానికీ రాకుండానే.. తన పేరిట, తన కుటుంబ సభ్యుల పేరిట వున్న ఆస్తుల్ని హైదరాబాద్‌లో వుంటూనే తెగనమ్మేశారు. అగ్రిగోల్డ్ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ అవ్వా సీతారామారావు.. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం, పాపిరెడ్డిపల్లిలోని ఆస్తిని అమ్మేందుకు.. తెలివైన ఎత్తుగడనే వేశారు. తాను హైదరాబాద్‌ నుంచి కదలకుండానే అమ్మకాన్ని సాగించేశారు. పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఎత్తును వేశారు. సీతారామారావు భార్య పుష్పలత పేరిట వున్న ఆస్తిపై హక్కును.. కడప జిల్లా, లక్కిరెడ్డిపల్లె మండలం, బ్రహ్మన యర్రగుడి మజరా, కాపుపల్లికి చెందిన నెర్వేనుపల్లి సునీల్‌కుమార్‌రెడ్డికి పవర్‌ ఆఫ్‌ అటార్నీ ద్వారా అప్పగించేశారు. ఇంకేముందీ.. ఆయన చక్కగా అమ్మకం.. రిజిస్ట్రేషన్‌ల పని కానించేశారు.

హైదరాబాద్ అడ్రస్ తో..
అవ్వా సీతారామారావు భార్య పుష్పలత .. హైదరాబాద్‌లోని తన ఇంటి అడ్రస్‌తో కడప జిల్లాలో భూమిని కొన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన అడ్రస్‌తో భూమి రిజిష్ట్రేషన్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న భూమిని అమ్మేటప్పుడు ఆ రిజిష్ట్రేషన్ పత్రాలు.. వ్యాలిడేషన్ జరుగాలి. ఈ పనిని కడప జిల్లా రిజిష్ట్రార్‌ కార్యాలయం అధికారి కానించేశారు. ఆయన వ్యాలిడేషన్ చేయడంతో.. బద్వేలు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం అధికారులు ఈ 61 ఎకరాల భూమి అమ్మకాన్ని రిజిష్ట్రేషన్ చేసేశారు. అవ్వా సీతారామారావు కుటుంబసభ్యుల పేరు మీద ఉన్న భూమిని అమ్మే సమయంలో వారెవ్వరూ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయానికి రాలేదు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయపు దస్తావేజుల్లోనూ పొందుపరిచారు. పవర్ ఆఫ్ అటార్నిగా వ్యవహరించిన సునీల్ కుమార్ రెడ్డి ఈ మొత్తం రిజిష్ట్రేషన్ తతంగాన్ని పూర్తి చేశారు. అవ్వా సీతారామారావు భూములు కొన్నవారు... అమ్మేటప్పడు మధ్యవర్తిగా వ్యవహరించిన వారు గతంలో అగ్రిగోల్డ్ సంస్థతో అనుబంధం ఉన్నవారే కావడం ఈ వ్యవహారంలో కొసమెరుపు.

18:24 - September 13, 2016

నిజామాబాద్ : నివాసాల మధ్యే సమాధులు..అడుగు బయట పెట్టగానే సమాధుల దర్శనం..పెళ్లిళ్లయినా.. పేరంటాలైనా.. సమాధులే బంధువులకు ఆసనాలు..
తెల్లారి లేవగానే ఎవరైనా ఓ దేవుడి ఫొటో.. లేదంటే వారికిష్టమైన వారి ముఖాన్ని చూస్తారు. కానీ..ఆ కాలనీ వాసులు మాత్రం ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంతవరకు సమాధుల మధ్యే జీవనం సాగిస్తున్నారు. శవాల చితి మంటలు, వాటి నుంచి వచ్చే దుర్వాసన.. ఇదంతా వాళ్లకు మామూలే. కాలుతున్న కాష్టాల పక్కనే పసిపిల్లల పాఠశాల ఉండటంతో.. స్మశానానికి ఏ శవం వచ్చినా పాఠశాల మూతపడాల్సిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్‌లో స్మశానాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓ కాలనీపై 10TV ప్రత్యేక కథనం. వినడానికి కాస్తంత వింతగా వున్నా.. ఇది నిజం. నిజామాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న అశోక్‌నగర్‌ కాలనీ వాసుల దుస్థితి ఇది. స్థానిక 10వ డివిజన్‌లోని అశోక్‌నగర్‌లో ఐదు స్మశాన వాటికలున్నాయి. వీటి పక్కనే నిరుపేదల ఇళ్లు ఉన్నాయి. ఇక్కడి కాలనీవాసులు ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు సమాధుల మధ్యే జీవనాన్ని గడపాల్సిన దుస్థితి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలన్నా.. బయటి నుంచి ఇళ్లల్లోకి రావాలన్న ఈ సమాధులను దాటికుని వెళ్లాల్సిందే. పండుగలు, శుభకార్యాలతో పాటు ఏ కార్యాక్రమం నిర్వహించాలన్నా... వీరు సమాధుల మధ్య గడపాల్సిందే.

విద్యార్థుల నరకం..
ఈ స్మశానవాటిక పక్కనే వున్న పాఠశాల విద్యార్థులది మరో రకం నరకం. ఏ మృతదేహం వచ్చినా... ఇక్కడే కాల్చుతారు. ఫలితంగా వచ్చే కమురు వాసనతో పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అలాగే, మృతదేహాలను తెచ్చేటప్పుడు చేసే డప్పు చప్పుళ్ల మోతలు చెవులను హోరెత్తిస్తుంటాయి. ఆ సమయంలో పాఠాలు విన్పించక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మృతదేహాలను చూసి వచ్చాక.. పిల్లలు కలలో కూడా కలవరిస్తున్నారంటే ఆ పసిమనసులపై ఇక్కడి దుస్థితి ఎంతగా ప్రభావం చూపుతుందో అర్థమవుతోంది. ఇళ్ల పక్కనే శవాలను కాల్చుతుండటంతో వెలువడే దుర్వాసన స్థానికంగా రోగాలను ప్రబలిస్తోంది. దీనికితోడు.. ఇక్కడి వారు ఏ శుభకార్యం చేసుకోవాలనుకున్నా బంధువులు రావడం లేదు. ఇక ఇక్కడ నివసిస్తున్న పెళ్లీడు అమ్మాయిలకు వరుడు దొరకని పరిస్థితి. స్మశాన వాటికకు ఇళ్లకు మధ్య ప్రహారీ గోడలాంటిది నిర్మించి ఇస్తే.. కాస్తైనా ఉపశమనం కలిగిస్తుందని స్థానికులు ఎంతగా మొత్తుకుంటున్నా.. ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

స్పందించని ప్రజాప్రతినిధులు..
ఇళ్ల మధ్య సమాధుల విషయాన్ని స్థానికులు ఎందరో ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు విన్నవించారు. అయినా ఫలితం శూన్యం. ఇక్కడి నుంచి వెళ్లిపోతాం.. వేరే చోట స్థలాలు ఇవ్వండని కోరినా స్పందించిన ఏలిక లేరు. ఎంతో కాలం నుంచి నరకయాతన అనుభవిస్తున్న తమ సమస్యను ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. వెంటనే సమాధులను తొలగించాలని, లేదంటే తమకు వేరే చోటైనా నివాస స్థలాలు కేటాయించాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.  

18:05 - September 13, 2016

పశ్చిమగోదావరి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇరుక్కపోయారా ? ఏమైంది ? అని అడుగుతున్నారా ? ఏమీ కాలేదు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారు. అక్కడ పోలవరం స్పిల్ వే పనులను ఆయన పరిశీలించారు. ఈ పర్యటన రెండు గంటల్లో ముగియాల్సి ఉంది. కానీ పర్యటన ఆలస్యమైంది. పనులను పరిశీలించిన అనంతరం స్పిల్ వే వద్ద అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ తరుణంలో భారీ వర్షం కురిసింది. దీనితో బాబు తిరుగ ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. వర్షంలో బాబు ఇరుక్కపోయారు. హెలికాప్టర్ ప్రయాణం వీలు కాకపోవడంతో రోడ్డు మార్గాన వెళ్లాలని చంద్రబాబు అనుకున్నారు. పోలవరం పనులు జరుగుతున్న ప్రాంతం మొత్తం ఎత్తు పళ్లాలతో కూడుకుని ఉంటుంది. కాన్వాయ్ వెళ్లడానికి వీలు ఉండదని..ఇక్కడే ఉండాలని అధికారులు సూచించడంతో బాబు ఇక్కడే ఉండిపోయారు. విజయవాడ..రాజమండ్రి వెళ్లాలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

వర్షంలో ఇరుక్కున్న బాబు..

పశ్చిమగోదావరి : పోలవరంలో భారీ వర్షం కురుస్తోంది. పోలవరం స్పిల్ వే వద్ద సీఎం చంద్రబాబు నాయుడు వర్షంలో చిక్కుకున్నారు. వర్షం కారణంగా బాబు అక్కడే ఆగిపోయారు. రోడ్డుమార్గం ద్వారా కూడా బాబు బయలుదేరే అవకాశం లేని పరిస్థితి నెలకొంది. 

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

హైదరాబాద్ : సశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీని కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం స్ధిరంగా కొనసాగుతుండడంతో రేపు, ఎల్లుండి కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి పేర్కొన్నారు.

 

17:49 - September 13, 2016

ప్రిన్స్ 'మహేష్ బాబు' 'మురుగదాస్' డైరెక్షన్ లో చేస్తున్న మూవీలో కూడా అదే రోల్ ప్లే చేస్తున్నాడట. తనకు అచ్చొచ్చిన క్యారెక్టర్ కావడంతో ఈ స్టార్ మరోసారి తనకు బిగ్ సక్సెస్ ఖాయమనే కాన్పిడెన్స్ లో ఉన్నాడట. ఇంతకీ 'మురుగదాస్' మూవీలో 'మహేష్' ప్లే చేస్తున్న క్యారెక్టర్ ఏంటీ ?
'బ్రహ్మోత్సవం' చిత్రం రిజల్ట్ తో డిస్ట్రబ్ అయిన 'పిన్స్' రిలాక్స్ కోసం ఫారెన్ ట్రిప్స్ వేశాడు. 'మురుగదాస్' డైరెక్షన్ లో నటిస్తున్న చిత్రం స్టార్ట్ అయినప్పటికి ఫస్ట్ షెడ్యూల్ లో తనకు సంబంధించిన సీన్స్ లేకపోవడంతో 'మహేష్' కూల్ గా ఉన్నాడు. అయితే ఇటీవల స్టార్ట్ అయిన షెడ్యూల్ లో 'ప్రిన్స్' జాయిన్ అయ్యాడట. ఈ మూవీలో 'మహేష్ బాబు' చేస్తున్న క్యారెక్టర్ పై క్లారిటి వచ్చేసింది.

కాంబినేషన్ తొలిసారి..
'మురుగదాస్' తో 'మహేష్' చేస్తున్న బైలింగ్యువల్ చిత్రంలో 'ప్రిన్స్' సీక్రెట్ కాప్ గా నటిస్తున్నాడని, న్యాయవ్యవస్థతో పోరాడే లాయర్ గా నటిస్తున్నడని రకరకాలుగా వినిపిస్తోంది. కానీ ఇవన్నీ ఒట్టి పుకార్లేనట. ఈ సినిమాలో 'ప్రిన్స్' మరోసారి కాప్ రోల్ కనిపించబోతున్నట్లు టాక్. ఈ విషయంపై యూనిట్ స్వయంగా క్లారిటీ ఇచ్చి గాసిప్స్ కి చెక్ పెట్టింది. 'మహేష్ బాబు' సీక్రెట్ కాప్ గా నటించిన 'పోకిరి', 'దూకుడు' చిత్రాలు ఏ రేంజ్ సక్సెస్ సాధించాయో తెలిసిందే. 'మహేష్ బాబు', 'మురుగదాస్' కాంబినేషన్ తొలిసారి కావడంతో ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అలాంటి అంచనాలకు తగ్గట్టు 'మురుగదాస్' మూవీలో అనేక సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ని ఇన్ క్లూడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'రకూల్' హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు 'ఎస్ జె సూర్య' విలన్ గా నటిస్తుండడం మరో విశేషం. సమ్మర్ కి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో యూనిట్ శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేస్తోంది. మరి ఈ పోలీసు పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

17:19 - September 13, 2016

హైదరాబాద్ : ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం గత సంవత్సరాల కంటే భిన్నంగా ఈ సంవత్సరం జరగనుంది. ఎప్పుడూ అన్ని నిమజ్జనం అయిన తరువాతే ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం జరగనున్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం మొదటే నిమజ్జనం చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. పోలీసులు..నిర్వాహకులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ డీవీఆర్ కు చెందిన 26 టైర్ల భారీ లారీ ఇప్పటికే ఖైరతాబాద్ వద్దకు చేరుకుంది. ఈ లారీ 49 టన్నులను మోయనుంది. 58 అడుగులున్న మహాగణపతి 40 టన్నుల బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్స్ పూర్తి చేసుకున్నారు.ఇప్పటికే షెడ్డు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ ట్రక్ పై ప్రస్తుతం వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈసందర్భగా టెన్ టివితో నిర్శాహకుడు..లారీ డ్రైవర్ మాట్లాడారు. 

  • గురువారం ఉదయం ఆరు గంటలకే శోభాయాత్ర ప్రారంభం కానుంది.
  • వేగవంతంగా ఖైరతాబాద్ వినాయక నిమజ్జన ఏర్పాట్లు.
  • నిమజ్జన పనుల్లో పోలీసు శాఖ..నిర్వాహకుల నిమగ్నం.
  • విజయవాడ నుండి చేరుకున్న 26 టైర్ల భారీ లారీ.
  • ట్రాలి పొడవు 70 అడుగులు..వెడల్పు 11 అడుగులు.
 

పూంచ్ లో కొనసాగుతున్న కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు..భద్రతా దళాలకు మధ్య ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. గత మూడు రోజులుగా ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారు. వీరిని ఏరివేసేందుకు భారత భద్రతా బలగాలు శ్రమిస్తున్నాయి. 

17:05 - September 13, 2016

'రకూల్ ప్రీత్ సింగ్' స్పీడ్ కి 'లావణ్య త్రిపాఠీ' స్పీడ్ బ్రేక్స్ వేస్తోంది. ఓ క్రేజీ మూవీలో సోలో హీరోయిన్ అనుకున్న 'రకూల్' కి 'లావణ్య' ఝలక్ ఇచ్చింది. నెమ్మది స్టార్ హీరోయిన్స్ రేసులోకి వచ్చేసిన 'లావణ్య' 'రకూల్ ప్రీత్' కి ఇచ్చిన షాక్ ఏంటీ ? టాప్ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఎక్స్ ప్రెస్ వేగంతో దూసుకుపోతోన్న 'రకూల్ ప్రీత్' కి 'లావణ్య' రూపంలో షాక్ తగిలింది. 'రామ్ చరణ్', 'మహేష్ బాబు' మూవీస్ లో సోలో హీరోయిన్ గా చెలరేగిపోతోన్న 'రకూల్' లేటేస్ట్ 'నాగ చైతన్య' కొత్త సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అయితే ఈ మూవీలో తనే సోలో హీరోయిన్ అనుకుంటే ఇప్పుడు 'లావణ్య' కూడా ఈ మూవీలోకి ఎంటర్ అయింది.

రకూల్ తో పాటు లావణ్య..
'నాగ చైతన్య'తో 'సోగ్గాడే చిన్ని నాయనా' డైరెక్టర్ 'కళ్యాణ్ కృష్ణ' చేయబోయే మూవీలో 'రకూల్' ని హీరోయిన్ గా తీసుకున్నారు. 'నిన్నే పెళ్ళాడుతా' తరహాలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీలో 'రకూల్' తో పాటు 'లావణ్య త్రిపాఠీ'ని మరో హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో ఇప్పుడు 'లావణ్య త్రిపాఠీ', 'రకూల్' కి కాంపిటీషన్ అవుతోందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 'అక్కినేని' ఫ్యామిలీ మూవీ మనంలో గెస్ట్ రోల్ చేసిన 'లావణ్య' ఈ ఎడాది సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్టు గా నిలిచిన 'సోగ్గాడే చిన్నినాయనా' మూవీలో 'నాగార్జున'కు జోడిగా నటించి వావ్ అనిపించింది. ఇప్పుడు 'నాగ్' వారసుడితో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి 'లావణ్య త్రిపాఠీ' స్టార్ట్ స్టేటస్ కి దగ్గరగా వచ్చేసిందని టాక్. 

17:00 - September 13, 2016

'జనతా గ్యారేజ్' టీం కలెక్షన్లను మరింత పెంచుకోవడానికి కొత్త స్కెచ్ వేసింది. ఫస్ట్ వీక్ లోనే 100కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ క్రమంలో గ్యారేజ్ కి మరింత మైలేజ్ ఇవ్వడానికి 'జనతా' యూనిట్ పబ్లిక్ స్టంట్ కోసం 'శ్రీమంతుడు' మూవీకి వేసిన ప్లాన్ నే 'జనతా గ్యారేజ్' కోసం వాడుతోంది.
చాన్నళ్ల తరువాత ఎన్టీఆర్ కి 'జనతా గ్యారేజ్' రూపంలో భారీ హిట్టు దక్కింది. ఫస్ట్ వీక్ లోనే ఈ చిత్రం100కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంతేకాదు ఇప్పటికీ 'జనతా గ్యారేజ్' బాక్సాఫీసు వద్ద స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే ఈ కలెక్షన్లను ఇలాగే కంటిన్యూ చేయడానికి మరిన్ని కలెక్షన్లను పెంచుకోవడానికి 'జనతా గ్యారేజ్' టీం 'మిర్చి', 'శ్రీమంతుడు' సినిమాలకు చేసిన జిమ్మిక్ నే మరోసారి ప్రయోగిస్తోంది.

గతంలో కూడా..
'జనతాగ్యారేజ్' టీం మొన్నీమధ్యనే సక్సెస్ సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో చిత్రానికి అడిషినల్ గా ఎక్స్ ట్రా సీన్స్ ని కలపనున్నారు. ఈ సీన్స్ ని సోమవారం నుంచే కలపాలనుకున్న కుదరపోవడంతో బుధవారం నుంచి 'జనతా గ్యారేజ్' లో కొత్త సీన్స్ ని చూడొచ్చని యూనిట్ చెప్పుతోంది. ఇంతకు ముందు సినిమాలో లేని కొత్త సీన్స్ ని చూడటానికి ఫ్యాన్స్ మరోసారి సినిమాను చూస్తారు. ఈ విధంగాకలెక్షన్లను మరింత పెంచుకోవచ్చని యూనిట్ ప్లాన్. 'కొరటాల శివ' గత చిత్రాలు 'మిర్చి', 'శ్రీమంతుడి'కి కూడా ఇలాగే చేశారు. 'మిర్చి' సినిమా రెయిన్ ఫైట్ ని 'శ్రీమంతుడు' సినిమాల్లో సెంటిమెంట్ సీన్స్ ని సినిమా రిలీజైయ్యాక 15రోజులకు కలిపారు. కేవలం కలెక్షన్లను పెంచాడానికి ఇలాంటి చేస్తారనడంలో సందేహం లేదు. మరి 'జనతా గ్యారేజ్' కి కొత్తగా కలిపిన సీన్స్ తో ఏ మేరకు బాక్సాఫీసు మైలేజ్ వస్తుందో చూడాలి.

వెంకయ్య రాజీనామా చేయాలి - సీపీఐ రామకృష్ణ..

అనంతపురం : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్రత్యేక హోదాపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి స్పందించారు. ఏపీకి ప్రత్యేక సాయం పేరుతో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబులు ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. వెంకయ్య నాయుడు త‌న కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామా చెయ్యాల‌ని డిమాండ్ చేశారు. 

కేరళలో ఓనం సందడి..

కేరళ : రాష్ట్రంలో ఓనం సందడి నెలకొంది. తిరువంతనపురంలోని పలు మార్కెట్ లలో జనం రద్దీ నెలకొంది. పూలు..పండ్లు..వివిధ రకాల సామాగ్రీని కోనుగోలు చేస్తున్నారు. 

16:51 - September 13, 2016
16:35 - September 13, 2016

పశ్చిమగోదావరి : పోలవరం నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. 2018 కల్లా ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని ఆయన అన్నారు. పనులను వేగవంతంగా చేసేందుకు 70కోట్ల రూపాయల విలువైన ప్రత్యేక యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. పోలవరానికి నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరినట్లు పేర్కొన్నారు. ప్రతి మూడో సోమవారం పోలవం పనులను పరిశీలిస్తానని చెప్పారు. ప్రత్యేక హోదా ఉంటే ఎంత అభివృద్ధి జరుగుతుందో, ప్యాకేజీ వల్ల అంతకన్నా ఎక్కువ లాభం కలుగుతుందని ఆయన అన్నారు. 

16:33 - September 13, 2016

విజయవాడ : కావేరి జలవివాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబులు వేర్వేరుగా స్పందించారు. తమిళనాడు, కర్నాటకలో శాంతిభద్రతలు క్షీణించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోది స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే బాధ కలుగుతోందని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య కావేరి జలాలు చాలా సున్నిత అంశమని, హింస ద్వారా కాకుండా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించు కోవాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమించి విధ్వంసాలకు పాల్పడడం మంచిది కాదని, బాధ్యత గల పౌరులుగా మసలుకోవాలని, ఆస్తులకు నష్టం కలిగించవద్దని ప్రధాని ఇరు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నష్టపోయే ప్రమాదం ఉందన్న బాబు..
కావేరి జలాల వివాదంపై బెంగళూరులో నెలకొన్న పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అభద్రతా భావం వల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆయన గుర్తుచేశారు. 12 టీఎంసీల నీటి కోసం కర్నాటక, తమిళనాడులో ఉద్రిక్తత చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. 

16:30 - September 13, 2016

బెంగళూరు : కావేరీ జలాల వివాదంపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య మంగళవారం మీడియాతో మాట్లాడారు. కావేరీ జలాల అంశంలో తమ రాష్ట్రానికి సుదీర్ఘకాలంగా అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. తమిళనాడుకు 10 రోజుల పాటు 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో కర్నాటకలో పరిస్థితి దిగజారిందన్నారు. 20 వ తేదీన జరిగే విచారణలో సుప్రీంకోర్టు తీర్పుపై పునర్విచారణ చేయల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే హక్కు ఎవరికి లేదని సిఎం అన్నారు. సోమవారం జరిగిన ఘటనలపై చర్యలు చేపట్టామని, పోలీసుల కాల్పుల్లో ఒకరే మృతి చెందినట్లు సిద్ధరామయ్య తెలిపారు.

  • తమిళనాడుకు రోజుకు 15వేల క్యూసెక్కుల వంతున కావేరీ జలాల్ని విడుదల చేయాలని గత సోమవారం అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
  • కర్నాటకలోని నాలుగు జలాశయాల్లో నీరు అడుగంటుతున్నందున నీటి విడుదల నిలిపివేతకు ఉత్తర్వులని జారీ చేయాలని గత శనివారం రాత్రి కర్నాటక అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.
  • దీనిపై సోమవారం ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
  • ఈనెల 20వరకూ తమిళనాడుకు రోజుకు 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని తీర్పునిచ్చింది. 
16:14 - September 13, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసును వేగవంతంగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు నిర్ణయించారు. ఇందుకు సిట్ దర్యాప్తు పరిధిని డీజీపీ పెంచిన సంగతి తెలిసిందే. అడిషనల్ డీజీగా అంజనీకుమార్ ను నియమించారు. మంగళవారం బాధ్యతలు స్వీకరించిన డీజీ నయీం కేసులో విచారణలో పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐజీ నాగిరెడ్డితో పాటు పలువురు అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం అనంతరం మరిన్ని అరెస్టులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 82 కేసులు నమోదు కావడం..
నమోదైన కేసుల్లో ఛార్జీషీట్ దాఖలు చేయాలని నిర్ణయానికి వచ్చారు. గణేష్ నిమజ్జనం తరువాత మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 20 రోజుల్లో దర్యాప్తు కొలిక్కి తీసుకరావాలని పోలీసులు యోచిస్తున్నారు. పోలీసులు, రాజకీయ నేతల సంబంధాలపై సిట్ అధికారులు పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. మరో 30 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

పలువురు నేతల అరెస్టు ? 
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నయీంకు పోలీసులు..ప్రభుత్వ ఉద్యోగులు..రాజకీయ నేతలు సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నయీం రాసుకున్న డైరీలో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనితో పక్కా ఆధారాలు సేకరించిన వారిని అరెస్టు చేసేందుకు సిట్ పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. నయీంతో సంబంధం ఉందని భావిస్తున్న నేతలను ముందే రాజీనామా చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సహకరించిన పోలీసులు ? 
నయింకు సహకరించిన పోలీసు అధికారుల పాత్ర, రెవెన్యూ సిబ్బంది, రాజకీయ నాయకులు అండదండలపై దర్యాప్తు వేగవంతం చేయనున్నారు. ఇప్పటికే వీరి పేర్లతో జాబితాను రూపొందించారు. వి.ఐ.పీ.లను అరెస్ట్ చేయాలంటే కీలక సాక్షాదారాలు అవసరమని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రత్యేక న్యాయసలహాదారు నియామకానికి రంగం సిద్ధం చేశారు.  

నిమజ్జనం తర్వాత ఇక సోదాలు..
వినాయక నిమజ్జనం తర్వాత పోలీస్ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక సమాచారం రాబట్టేందుకు సిద్దమవుతున్నారు. దీంతో పాటు నయీంతో సంబంధాలున్న రాజకీయ నాయకులను అరెస్ట్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
మరి వినాయక నిమజ్జనం తరువాత ఎవరిని అరెస్టు చేస్తారో ? వేచి చూడాలి. 

రాష్ట్రంలో నియంతృత్వ పాలన - జీవన్ రెడ్డి..

హైదరాబాద్ : మల్లన్న సాగర్ నిర్వాసితులకు సంఘీభావం తెలిపితే ప్రతిపక్షాలు టిడిపిలో కలిశామనడం సరికాదని టి.కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పట్టిసీమ, పోలవరాన్ని సమర్థించింది కేసీఆర్ అని, ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టులు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, 50 రోజులు 144 సెక్షన్ ఎలా పెడుతారని నిలదీశారు. 

'జస్టిస్ ఫర్ రోహిత్ వేముల' పేరిట రౌండ్ టేబుల్ సమావేశం

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఛైర్మన్ ఆరేపల్లి అధ్యక్షతనలో 'జస్టిస్ ఫర్ రోహిత్ వేముల' పేరిట రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టి.పిసిసి చీఫ్ ఉత్తమ్, భట్టి విక్రమార్కలు హాజరయ్యారు. 

15:38 - September 13, 2016

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినతే 'పవన్ కళ్యాణ్' మరో పుస్తకం రాస్తున్నారు. ఆయన ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. మొదట 'ఇజమ్' పేరిట ఓ పుస్తకాన్ని రూపొందించారు. తాజాగా మరో పుస్తకాన్ని రాస్తున్నారు. 'నేను - మనం - జనం' పేరిట పుస్తకం రెడీ అవుతోంది. జనసేన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. 'ఇజమ్' పుస్తకంటే ఇది భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఏమేమీ ఉండవచ్చు ?
రాజకీయాలు ఎలా ఉండాలి ? అనే అంశంపై పుస్తకంలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పుస్తకం ట్యాగ్ లైన్ గా 'మార్పు కోసం యుద్ధం' పెట్టనున్నారు. మరో రెండు నెలల్లో ఈ పుస్తకాన్ని విడుదల చేయడానికి పవర్ స్టార్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పవన్ యోచిస్తున్నారు. ఈ పుస్తకం విడుదల అనంతరం ఎలాంటి ప్రకంపనలు సృష్టించనుందో చూడాలి. 

15:32 - September 13, 2016

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అకస్మిక ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం నుండి పిలుపు రావడంతో ఆయన ఢిల్లీకి వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్రం పెద్దలతో గవర్నర్ నరసింహన్ చర్చించారు. ప్రధానంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో గంటకు పైగా భేటీ కావడం విశేషం. కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఉభయ రాష్ట్రాల్లో నెలకొన్న శాంతిభద్రతలు..పాలనా వ్యవహరాలపై మోడీకి గవర్నర్ నివేదిక అందించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు..షెడ్యూల్ 9,10 ఆస్తులు..ఇతరత్రా అంశాలను మోడీతో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఏపకి ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు..ఇటీవలే మూడు రోజుల పాటు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరు తెన్నులపై మోడీకి వివరించినట్లు సమాచారం. అంతేగాకుండా ఏపీ భవన్ కు సంబంధించి వివాదంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. విభజన చట్టం అమలవుతున్న తీరు..పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై కూడా మోడీ దృష్టికి గవర్నర్ నరసింహన్ చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం గవర్నర్ నరసింహన్ ఎయిర్ పోర్టుకు చేరుకుని హైదరాబాద్ కు రానున్నారు. 

15:24 - September 13, 2016

గుంటూరు : ప్రభుత్వాసుపత్రి అంటేనే పేదలకు ఒక నమ్మకం..కానీ గుంటూరు జీజీహెచ్ వైద్యులు మాత్రం సర్కారీ ఆసుపత్రిని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. గతంలో ఎలుకల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా బతికి ఉన్న పసికందు మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..
డాక్టర్ పాలెం ప్రాంతానికి చెందిన నాగబాబు, భవాని దంపతులు ఆసుపత్రికి వచ్చారు. భవానీ ఏడు నెలల గర్భిణీ. నొప్పులు రావడంతో జీజీహెచ్ ఆసుపత్రికి వచ్చారు. అనంతరం భవానీ బాలుడికి జన్మనించింది. బాలుడులో చలనం లేకపోవడంతో మృతి చెందాడని వైద్యులు భావించారు. పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు. తీవ్ర ఆవేదనతో తల్లిదండ్రులు..బంధువులు బాలుడిని ఇంటికి తీసుకెళ్లారు. తీరా చూసే సరికి బాలుడు బతికే ఉన్నాడు. వెంటనే శిశువును తీసుకుని తిరిగి ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు..బంధువులు మండిపడ్డారు. అక్కడ అందోళన చేశారు. తాము పొరపాటు చేశామని గ్రహించిన వైద్యులు ఆ పసికందుకు వైద్యం అందించారు. వైద్యులు చెప్పినట్లుగానే ఖనన కార్యక్రమాలు చేస్తే పరిస్థితి ఏంటనీ వైద్యులను నిలదీశారు.

మంత్రి కామినేని స్పందన..
ఘటన విషయం తెలుసుకున్న మంత్రి కామినేని గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరిటెండెంట్ కు ఫోన్ చేశారు. చనిపోయినట్లు ఎలా ధృవీకరించారని ప్రశ్నించారు. విచారణ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

పుస్తకాన్ని రాసున్న పవన్..

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని రాయబోతున్నారు. 'నేను - మనం - జనం' పేరిట పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని రాయనున్నారు. జనసేన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్ యోచిస్తున్నారు. 'ఇజమ్' పుస్తకం కంటే భిన్నంగా ఈ పుస్తకం ఉండనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో అందుబాటులోకి తీసుకరావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ముగిసిన నరసింహన్ ఢిల్లీ పర్యటన..

ఢిల్లీ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. కాసేపట్లో ఆయన ఎయిర్ పోర్టుకు చేరుకుని హైదరాబాద్ కు రానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో గవర్నర్ నరసింహన్ భేటీ గంటకు పైగా కొనసాగింది. 

రంగనాయకసాగర్ సొరంగ కాల్వ పనుల్లో అపశృతి...

మెదక్ : చిన్న కోడూరు (మం) రంగనాయకసాగర్ సొరంగ కాల్వ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. బండరాయి మీద పడి డేవిడ్ అనే కార్మికుడు మృతి చెందాడు. 

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం..

గుంటూరు : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యం వహించారు. నెలలు నిండకుండానే జన్మించిన శిశువు మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. అప్పగించిన పసికందును బంధువులు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వచ్చిన అనంతరం పసికందు బతికే ఉండడంతో తిరిగి ఆసుపత్రికి బంధువులు చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. తిరిగి ఆ పసికందుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

నెల్లూరులో బాంబు పేలుడు అల్ ఉమా ఉగ్రవాదుల పనే ?

నెల్లూరు : నిన్న కోర్టు ఆవరణలో జరిగిన బాంబు పేలుడు ఘటనా స్థలాన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు పరిశీలించారు. అల్ ఉమా ఉగ్రవాదుల చర్య అని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గతంలో కేరళ, మైసూర్, చిత్తూరులలో ఇదే తరహా పేలుళ్లు జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

14:35 - September 13, 2016

జమ్మూ కాశ్మీర్ : కాశ్మీర్ లో కల్లోల పరిస్థితులు ఇంకా నెలకొంటూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా అక్కడ పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా బందీపూర్ షోఫెయిన్ లో జరిగిన వేర్వేరు ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఫోఫెయిన్ లో భద్రతా దళాలకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఇందులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పరిస్థితి విషమించడండంతో కాశ్మీర్ లో పది జిల్లాల్లో మళ్లీ కర్ఫ్యూను విధించారు. బుర్హాన్ పూర్ ఎన్ కౌంటర్ తరువాత జరిగిన కాశ్మీర్ లో ఇప్పటి వరకు 70 మంది దాక మృతి చెందారు. 

14:29 - September 13, 2016

హైదరాబాద్ : నగరంలో మంగళవారం కురిసిన వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతిసారి ఇలాగే జరుగుతుండడంతో ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై భారీగా నీరు చేరుతుండడంతో వాహనదారులు..పాదచారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. కనీసం నడవలేని పరిస్థితులు ఉండడంతో పాదాచారులు ఇబ్బందులకు గురయ్యారు. ఖైరతాబాద్ మహాగణపతికి వెళ్లే మార్గంలో నీళ్లు నిలిచిపోయాయి. 225 ప్రాంతాల్లో నీరు నిలుస్తోందని జీహెచ్ఎంసీ గుర్తించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిబ్బంది నిలిచిన నీటిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేక జనరేట్ ను వినియోగిస్తున్నారు. మ్యాన్ హోల్స్ తెరిచి నీళ్లను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సెలవు దినం కావడంతో 'మహాగణపతి'ని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా ఖైరతాబాద్ కు వస్తున్నారు. భారీ వర్షంతో ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నా కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఇంకా వేగవంతంగా పనిచేయాల్సినవసరం ఉందని నగర వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

14:20 - September 13, 2016

గుంటూరు : వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవాలి.. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలి..ఇందుకు చర్యలు తీసుకుంటున్నాం అని ప్రభుత్వాలు చెబుతుంటాయి. ప్రతి వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉంటున్నారు. వర్షాకాలంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు విఫలం చెందుతుండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
గుంటూరు జిల్లాలో భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఏకంగా గురజాల గ్రామాన్ని వరద ముంచెత్తింది. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. వరద ఉధృతిని నుండి ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. గురజాలలో 'దండి వాగు' ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో మాచర్ల - గుంటూరు రైల్వే ట్రాక్ అరకిలోమీటర్ కొట్టుకపోయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా ట్రాక్ కొట్టుకపోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గురజాలలోని వెంకట్రావ్‌నగర్‌ కాలనీ నీట మునిగిపోయింది. ఇళ్లపైకి ఎక్కి పలువురు ప్రాణాలు కాపాడుకున్నారు. గురజాల ఆర్టీసీ బస్టాండును సైతం వరద ముంచెత్తింది. బస్సుల్లో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కారంపూడి మండలంలోని ఎర్రవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి చేరిన వరద నీటితో నాలుగు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. పల్నాడు ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. 

ఏపీ అంశాలపై వెంకయ్య నాయుడు సమీక్ష..

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారులు, రాజధాని అనుసంధానానికి రోడ్ల నిర్మాణంపై గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఇచ్చిన వాగ్ధానాలపై చర్చించారు.

పోలవరం పనులను పరిశీలించిన సీఎం బాబు...

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. మంగళవారం జిల్లాకు చేరుకున్న బాబు ఏరియర్ సర్వే ద్వారా పనులను పరిశీలించారు. 

అశోక్ గజపతి రాజు కనిపించడం లేదని పీఎస్ లో ఫిర్యాదు..

తిరుపతి : కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కనిపించడం లేదని ఈస్ట్ పోలీసులకు వామపక్ష నేతలు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక హోదా దక్కక రాష్ట్ర ప్రజలు తల్లడిల్లుతుంటే ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించిన అశోక్ గజపతి రాజు ఏమయ్యారని నేతలు ప్రశ్నించారు. 

మోడీతో ముగిసిన నరసింహన్ భేటీ..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. తెలుగు రాష్ట్రాల పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. 

స్విస్ ఛాలెంజ్..సుప్రీంను ఆశ్రయిస్తాం - డిప్యూటి సీఎం..

విజయవాడ : రాజధాని అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి 'స్విస్ చాలెంజ్' విధానంలో సింగపూర్ కన్సార్షియం దాఖలు చేసిన ప్రతిపాదనకు పోటీ బిడ్ ల ఆహ్వానంపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. 

13:58 - September 13, 2016

మెగాస్టార్ 'చిరంజీవి' మూవీ 'జగదేకవీరుడు అతిలోక సుందరి' మూవీని 'రామ్ చరణ్' తో రీమేక్ చేయడానికి ఓ బిగ్ ప్రొడ్యూసర్ స్కెచ్ వేసినట్లు టాక్. 'రాజమౌళి' డైరెక్షన్ లో ఈ రీమేక్ కి సన్నాహాలు చేసినట్లు టాక్. అయితే రీమేక్ విషయంలో ఆ ప్రొడ్యూసర్ సరికొత్త టర్న్ తీసుకున్నట్లు సమాచారం. ఇంతకీ 'జగదేకవీరుడు అతిలోకసుందరి' రీమేక్ విషయంలో జరుగుతున్న ప్రయత్నాలేంటో తెలుసుకోవాలంటే చదవండి. 

90టీస్ లో పెను సంచలనం..
'చిరంజీవి' కెరియర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' నిలిచింది. అంతేకాదు తెలుగు పరిశ్రమలోని ఎవర్ గ్రీన్ మూవీస్ లో కూడా ఈ చిత్రం ముందు వరసలో ఉంటుంది. 'రాఘవేంద్రరావు' దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. సోషల్ ఫాంటసీగా రూపొందిన ఈ చిత్రంలో 90టీస్ లో భారీ వర్షాల్లో సైతం బాక్సఫీసు వద్ద పెను సంచలనం సృష్టించి ఆ ఎడాది నెంబర్ వన్ హిట్టుగా నిలిచింది.

తెరపైకి జక్కన్న..
'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రానికి సీక్వెల్ ని 'రామ్ చరణ్' తో తీయాలని నిర్మాత 'అశ్వీనిదత్' కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వార్త మళ్లీ తెరపైకి రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ కాకుండా రీమేక్ చేసే ఆలోచనలో నిర్మాత 'అశ్వనీదత్' ఉన్నట్లు తాజా సమాచారం. అంతేకాదు మొదట ఈ రీమేక్ ని దర్శకుడు 'రాజమౌళి'తో ప్లాన్ చేయాలని ఈ నిర్మాత భావించాడట. అయితే ఇప్పుడు 'జక్కన్న' కాకుండా మరో దర్శకుడితో రీమేక్ కి ప్లాన్స్ జరుగుతున్నాయట.

వినాయక్ ఎంట్రీ..
'రాజమౌళి' దర్శకత్వంలో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' రీమేక్ ని అద్భుతదృశ్యంగా తెరకెక్కించాలని నిర్మాత 'అశ్వినీదత్' భావించాడు. కానీ ప్రస్తుతం 'జక్కన్న' వరుసగా తీరిక లేని షెడ్యూల్ తో ఉండడంతో ఈ రీమేక్ ని మరో దర్శకుడితో ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ రీమేక్ ని 'వినాయక్' తో తీయాలనే ఆలోచనలో 'అశ్వినీదత్' ఉన్నాడట. మరి ఈ రీమేక్ పై సరైన క్లారిటి వచ్చే వరకు వేచి చూడాలి.

13:51 - September 13, 2016

రియో ఒలింపిక్స్ లో పివి.సింధు రజత పతకం, సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించారు. పారాఒలింపిక్స్ లో దీపా మాలిక్ రజత పథకం  సాధించారు. ఈనేపథ్యంలో మానవి నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో సురేష్ పాటిల్, పీఈటీ టీచర్ నర్సింహ్మ, టీచర్ రాధిక పాల్గొని, మాట్లాడారు. క్రీడల పట్ల సరైన అవగాహన కల్గివుండాలన్నారు. ఆడ పిల్లల పట్ల వివక్ష చూపించవద్దని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:40 - September 13, 2016

ఢిల్లీ : పారాఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వచ్చింది. షాట్‌పుట్‌ విభాగంలో దీపామలిక్‌ రజత పతకం సాధించింది. పారాఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి మహిళగా దీప చరిత్ర సృష్టించారు. దీపామలిక్ విజయం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 17ఏళ్లుగా ఆమె చక్రాల కుర్చీకే పరిమతమైంది. దీపామలిక్ విజయం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతోషం వ్యక్తంచేశారు. హరియాణా ప్రభుత్వం దీపకు నాలుగు కోట్ల రూపాయలు నజారానాగా ప్రకటించింది. 

 

13:37 - September 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి వివిధ ప్రాజెక్టుల కింద సేకరించాల్సిన భూముల విషయంలో అడుగడుగునా ఆటంకాలు  ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ సేకరణ చట్టాన్ని కాదని..తనకు తానుగా పెట్టుకున్న నిబంధనలతో 123  జీవోను అమలు చేసింది రాష్ట్ర్ర ప్రభుత్వం. దీంతో మల్లన్నసాగర్ విషయంలో ప్రభుత్వానికి న్యాయస్ధానం నుంచి వరుస చిక్కులు  రావడంతో సర్కార్ ప్రతిష్టకు ఇది సవాల్ గా మారింది. అయితే భూసేకరణ చట్టంలోని చిన్న వెసులుబాటును అడ్డుపెట్టకుని మరో  ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని ట్రై చేస్తోంది.
123 జీవో పై హైకోర్టు మొట్టికాయలు
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ పెద్ద సవాల్ గా మారింది. ఉన్న చట్టాన్ని కాదని, తన ఇష్టానుసారంగా  చేయాలని చూసిన సర్కార్ కు హైకోర్టు మొట్టికాయలు వేసి మరీ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇదేమీ పట్టనట్లు వ్యవహరించిన  ప్రభుత్వం కోర్డు అడిగే వరకు అఫిడవిడ్ లో ఉన్న అంశాలేవి పట్టించుకోలేదు. కానీ ఇలాగే భవిష్యత్ లో చాలా అంశాల్లో  భూసేకరణ చేయాల్సి ఉంది. ఇలాగే భూ సేకరణ 2013 చట్టం అమలు చేయాలంటే సాధ్యంకాదని చెబుతున్న ప్రభుత్వానికి  ఇటు123 జీవోను కూడా అమలుచేయడం సమస్యగానే ఉంటుందనేది స్పష్టం అవుతోంది. దీంతో మధ్యే మార్గంగా మరో  ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం పదును పెట్టింది.
భూసేకణ యాక్ట్, 123 జీవోలకు ప్రత్యమ్నాయం
ఇటు భూసేకణ యాక్ట్, అటు 123 జీవో ఈ రెండింటికి ప్రత్యమ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కొత్త యాక్ట్ తీసుకురావలని  చూస్తుంది. ఇందులో భాగంగానే భూసేకరణ కోసం చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు  చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. చైర్మన్ గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి, న్యాయశాఖ  కార్యదర్శి, అడ్వకేట్ జనరల్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు కానుంది. కమిటీ సమావేశాల్లో అవసరమైన అధికారులను  ఆహ్వానించేందుకు ఉత్తర్వుల్లో ఛాన్స్ కల్పించారు. 
ఉత్తమమైన చట్టం అమలుకు రాష్ట్ర సర్కార్ యోచన 
అయితే ఇందులో ఏ రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వ భూసేకరణ 2013 చట్టం కేంటే మెరుగైన ప్రత్యామ్నాయాలు  కల్పించగలిగిన నిర్ణయం తీసుకుంటే...దానినే అమలు చేయడానికి వెసులుబాటు ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే దేశంలో  రాజస్థాన్, కేరళ, గోవా రాష్ట్రాలు భూసేకరణ చట్టానికి సవరణలు చేసి అమలు చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో అమలవుతున్న  చట్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది.
123 జివోపై సర్కార్ వెనక్కి 
2013 భూ సేకరణ చట్టంలో నిర్వాసితులకు పరిహరం అందడంలో ఆలస్యమవుతుందని చెప్పుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 123  జోవోను తీసుకోచ్చింది. అయితే ఈ విషయం ఇంకా న్యాయస్థానంలో స్పష్టత రాకుండానే తాజాగా మరో అధ్యయనానికి కమిటీ నియమించడంతో 123 జివోపై సర్కార్ వెనక్కి తగ్గినట్లుగా స్పష్టమవుతోంది.    

 

13:28 - September 13, 2016

నల్గొండ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజుర్‌నగర్‌ నియోజకవర్గాల్లో భారీ వర్షం పడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. జిల్లాలో టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటుచేసినట్టు కలెక్టర్ తెలిపారు. చివ్వెంల మండలం కుడకుడ వద్ద మూసీ కాల్వకు గండిపడడంతో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో 6.62 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

 

13:26 - September 13, 2016

కర్నాటక : బెంగళూరులో అల్లర్లు మళ్లీ చెలరేగాయి. విధ్వంసకారులపై పోలీసులు రబ్బరుబుల్లెట్‌లతో కాల్పులు జరిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 10 కంపెనీల కేంద్ర బలగాలు బెంగళూరుకు తరలివెళ్లాయి. బెంగళూరులోని స్కూళ్లు, ఐటీ సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ వివాదంలో ప్రధాని మోదీ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆసహనం వ్యక్తంచేశారు. ప్రధానిని కలవడానికి అన్ని పార్టీలతో కలిసి కమిటీ వేయాలని నిర్ణయించామన్నారు. 
సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి : మోడీ  
కావేరి జలవివాదంపై తమిళనాడు, కర్నాటకలో శాంతిభద్రతలు క్షీణించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే బాధ కలుగుతోందని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య కావేరి జలాలు చాలా సున్నిత అంశమని, హింస ద్వారా కాకుండా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించు కోవాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమించి విధ్వంసాలకు పాల్పడడం మంచిది కాదని, బాధ్యత గల పౌరులుగా మసలుకోవాలని, ఆస్తులకు నష్టం కలిగించవద్దని ప్రధాని ఇరు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
సామరస్యపూర్వక చర్చలు అవసరం : వెంకయ్యనాయుడు 
మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. తమిళనాడు, కర్ణాటక మధ్య తరచూ కావేరీ నీటి వివాదం ఇబ్బందిగా ఉందన్నారు. ఆందోళనల పేరిట ఆస్తులను ధ్వంసం చేయడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదన్నారు. ఆందోళనలతో సమస్య పరిష్కారం కాదు.. సామరస్యపూర్వక చర్చలు అవసరమని ఇరు రాష్ర్టాలకు వెంకయ్య సూచించారు. కావేరీ నదీ జలాల వివాదంపై మీడియా సంస్థలు సంయమనం పాటించాలనిజ.. రెచ్చగొట్టేలా ప్రసారాలు చేయొద్దని ఆయన కోరారు.

 

13:17 - September 13, 2016

హైదరాబాద్ : నగరంలో అగ్నిప్రమాదం జరిగింది. బోయిన్ పల్లి బాపూజీనగర్ లో డెనిమ్ షోరూంలో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేసింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

ప్రధాని మోడీతో గవర్నర్ నరసింహన్ భేటీ

ఢిల్లీ : ప్రధాని మోడీతో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భేటీ అయారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులపై చర్చిస్తున్నారు.

విధ్వంసకారులపై రబ్బరు బుల్లెట్లతో కాల్పులు

కర్నాటక : బెంగళూరులో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. విధ్వంసకారులపై పోలీసులు రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. పరిస్థితిని అదుపుచేసేందుకు బెంగళూరుకు 10 కంపెనీల కేంద్ర బలగాలు తరలివెళ్లాయి. స్కూళ్లు, ఐటీ సంస్థలకు సెలవు ప్రకటించారు. 

13:07 - September 13, 2016

కర్నాటక : బెంగళూరులో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. విధ్వంసకారులపై పోలీసులు రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. పరిస్థితిని అదుపుచేసేందుకు బెంగళూరుకు 10 కంపెనీల కేంద్ర బలగాలు తరలివెళ్లాయి. స్కూళ్లు, ఐటీ సంస్థలకు సెలవు ప్రకటించారు. కర్నాటక సిద్ధరామయ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విదాదంలో ప్రధాని నరేంద్రమోడీ తీరుపై సిద్ధరామయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

12:57 - September 13, 2016

గుంటూరు : జిల్లాలోని గురజాల మండలంలో రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. గురజాలలోని దండి వాగు ఉద్ధృతికి మాచర్ల-గుంటూరు రైల్వే ట్రాక్‌ అర కిలోమీటరు మేర కొట్టుకు పోయింది. గురజాల గేట్‌హల్ట్‌ సమీపంలోని దండివాగు ప్రవాహానికి ట్రాక్‌ పలు చోట్ల దెబ్బతింది. దీంతోగురజాల మాచర్ల రేపల్లె మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతికి గురజాలలోని వెంకట్రావ్‌నగర్‌ కాలనీ జలమయమైంది. పలువురు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. గురజాల గ్రామాన్ని వాగులు ముంచెత్తాయి. గురజాల ఆర్టీసీ బస్టాండ్‌లోకి భారీగా వర్షపునీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కారంపూడి మండలంలోని ఎర్రవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి చేరిన వరద నీటితో నాలుగు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఇంటిగోడ కూలి మహిళ మృతి
గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం దాటికి పిడుగురాళ్ల మండలం కరాలపాడులో గోడకూలి మహిళ మృతి చెందింది. పందిళ్ల కృష్ణవేణమ్మ అనే మహిళ ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో రాత్రి కురిసిన భారీ గోడ కూలి పైన పడడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. 

 

12:47 - September 13, 2016

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం న్యాయ చిక్కులను ఎదుర్కొంటోంది. మాస్టర్‌ డెవలపర్‌ ఎంపికకు స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిని ఎంచుకున్న ప్రభుత్వానికి హైకోర్ట్‌ షాక్‌ ఇచ్చింది. ఈ విధానం అమలుపై స్టే విధించింది. దీంతో.. రాజధాని నిర్మాణ ప్రక్రియకు బ్రేక్‌ పడ్డట్లుగా భావిస్తున్నారు. 
టీడీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో సర్కార్‌ ఎంచుకున్న స్విస్‌ చాలెంజ్‌ విధానంపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ప్రభుత్వానికిది ఎదురుదెబ్బగా చెబుతున్నారు. ప్రపంచ స్థాయి నగర నిర్మాణం కోసమే స్విస్‌ చాలెంజ్‌ విధానం అని చెబుతున్న ప్రభుత్వం... ఆ మేరకు రాజధాని ప్రాంతంలో 1600 ఎకరాలకు పైగా భూమిని సింగపూర్‌ కంపెనీలకు అప్పగించేందుకు సిద్ధమైంది. అయితే.. ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌, చెన్నైకి చెందిన ఎన్‌వీఎన్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు.. స్విస్‌ చాలెంజ్‌ విధానం లోపభూయిష్టమంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. 
స్విస్‌ చాలెంజ్‌ విధానం ఎందుకు..?
స్విస్‌ చాలెంజ్‌ విధానంలో.. భారతదేశం వెలుపల నిర్మాణ రంగంలో అనుభవముండాలన్న నిబంధనను పిటిషనర్‌లు తప్పుబట్టారు. వీరి వాదనను హైకోర్టు కూడా సమర్థించింది. పారదర్శకమైన సీల్డ్‌ కవర్‌ విధానం అందుబాటులో ఉండగా... స్విస్‌ చాలెంజ్‌ విధానం ఎందుకని ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఉత్తర్వులతో.. ప్రభుత్వం రాజధాని నిర్మాణ ప్రక్రియలో స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని అనుసరించే అవకాశం లేదు. దీంతో.. హుటాహుటిన అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
స్విస్‌ చాలెంజ్‌ విధానంలో లొసుగులు : విపక్షాలు 
ఏపీ ప్రభుత్వ స్విస్‌ చాలెంజ్‌ విధానంలోని లొసుగులను విపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. ఈ విధానంలో పారదర్శకత లేదంటున్నాయి. చంద్రబాబు తమకు అనుకూలురైన వారికి టెండర్లు అప్పగించేందుకే స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని ఎంచుకున్నారని.. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు ప్రభుత్వానికి ఇటీవలి కాలంలో కోర్టు వ్యవహారాల్లో తరచూ చుక్కెదురవుతుండడం విశేషం. మొన్నటికి మొన్న ఓటుకు నోటు కేసును పునర్విచారించాలంటూ ఏసీబీ న్యాయస్థానం ఆదేశిస్తే.. తాజాగా రాజధాని అమరావతి నిర్మాణం అంశంలోనూ ఉన్నత న్యాయస్థానం నుంచి ప్రతికూల పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వం తాజా అవరోధాన్ని ఏవిధంగా అధిరోహిస్తుందో వేచి చూడాలి. 

 

12:44 - September 13, 2016

విశాఖ : వారంతా కామ్రేడ్‌లు ఎప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఉంటారు. నిత్యం ఏదో ఒక ప్రజా ఉద్యమంతో తీరిక లేకుండా గడుపుతారు. అలాంటి ఉద్యమ నేతలందరూ ఒకచోట చేరి గతస్మృతులను నెమరవేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ఉక్కు నగరం విశాఖపట్టణంలో సీపీఎం నేతల ఆత్మీయసమావేశం జరిగింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల సీనియర్ సీపీఎం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిలో సీపీఎం పోలిట్ బ్యూరో మెంబర్ బీవీ.రాఘవులతో పాటు సీనియర్ నేత చౌదరీ తేజేశ్వరావు, సీఐటీయూ రాష్ర్ట అధ్యక్షుడు నర్సింగరావు, సీపీఎం నేతలు పుణ్యవతి, ఎంవీఎస్.శర్మ ఉన్నారు. ఎమర్జెన్సీ రోజుల నుంచి విద్యార్ధి , కార్మిక, వామపక్ష ఉద్యమంలో పాలుపంచుకున్న మిత్రులందరం ఓసారి కలుసుకుని ఆ పాత జ్ఞాపకాలను పంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు సీపీఎం పొలిట్ బ్యూరోసభ్యులు బీవీ రాఘవులు తెలిపారు.

 

12:41 - September 13, 2016

కావేరి జలవివాదాలపై స్పందించిన మోడీ

ఢిల్లీ : కావేరి జలవివాదాలపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. రెండు రాష్ట్రాల్లో చెలరేగిన హింస ఆందోళన, జలవివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. 
 

పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన బాబు

ప.గో : పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. 

12:28 - September 13, 2016

'దబాంగ్‌'..బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన యాక్షన్‌ చిత్రం. అభినవ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రంలో సల్మాన్‌ఖాన్‌, సోనాక్షిసిన్హా నాయకానాయికలుగా నటించారు. తర్వాత దీనికి సీక్వెల్‌గా 2012లో 'దబాంగ్‌ 2' చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో సల్మాన్‌, సోనాక్షి జోడీగా అర్బజ్‌ఖాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రమూ బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సీక్వెల్‌గా 'దబాంగ్‌ 3' చిత్రం తెరకెక్కబోతుంది. అయితే గత రెండు చిత్రాలు సల్మాన్‌, సోనాక్షి కాంబినేషన్‌లో రూపొందాయి. కానీ తాజా చిత్రంలో సోనాక్షికి బదులు అమీజాక్సన్‌ని తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు అర్బజ్‌ అమీకి పూర్తి స్క్రిప్ట్‌ నెరేట్‌ చేశారట. స్క్రిప్ట్‌ నచ్చటంతోపాటు, సల్మాన్‌ వంటి స్టార్‌ హీరో సరసన నటించే అవకాశం రావడంతో అమీ సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. సోనాక్షి సిన్హాలాగా ప్రేక్షకులను అమీ జాక్సన్ అలరిస్తుందా.. లేదా...? దబాంగ్, దబాంగ్ 2 చిత్రాల్లాగా దబాంగ్ 3 కూడా ఘన విజయం సాధిస్తుందో లేదో చూడాలంటే చిత్రం రిలీజ్ అయ్యే వరకు వేచిచూడాల్సిందే. 

12:16 - September 13, 2016
12:11 - September 13, 2016

గతంలో కథానాయుకులుగా నటించిన హీరోలు ఇటీవల విలన్ పాత్రలో నటిస్తున్నారు. హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలరించిన నటులు ప్రస్తుతం విలన్స్ గా దర్శనమిస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా నటులు జాకీ షరాఫ్‌, గౌతమ్‌ మీనన్‌ ప్రతినాయకులుగా నటిస్తున్నారు. వీరు రెండు వేర్వేరు చిత్రాల్లో విలన్స్ గా నటిస్తున్నారు. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో 'సర్కార్‌ రాజ్‌' కు సీక్వెల్ గా 'సర్కార్‌ 3' చిత్రాన్ని తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో నాయకుడిగా అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నాడు. ప్రతినాయకుడిగా జాకీ షరాఫ్‌ నటిస్తున్నారు. గతంలో ఇదే కాంబినేషన్‌లో విధు వినోద్‌ చోప్రా 'ఏకలవ్య' రూపొందిందని విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇటు తెలుగులోను, అటు తమిళంలోనూ రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా అందరినీ అలరించిన గౌతమ్‌ మీనన్‌ ఇకపై ప్రతినాయకుడిగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో 'ఇమైక్క నొడిగల్‌' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో గౌతమ్‌ మీనన్‌ విలన్‌గా నటించేందుకు అంగీకరించడంతో కోలీవుడ్‌లోనే కాదు సామాజిక మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో అధర్వ హీరోగా, నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

 

కాసేపట్లో ప్రధాని మోడీతో గవర్నర్ నరసింహన్ భేటీ

ఢిల్లీ : కాసేపట్లో ప్రధాని మోడీని ఎపి, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

11:48 - September 13, 2016

హైదరాబాద్ : బక్రీద్, గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి అవాంచనీయం సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశామని చెప్పారు. 20 వేల మంది పోలీసు సిబ్బంది ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో సీపీ టీవీ కెమెరాల అమర్చి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా నిఘా కొనసాగుతుందన్నారు. శాంతి భద్రలు పూర్తి స్థాయిలో ప్రశాంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. ప్రజలు పోలీసు వ్యవస్థకు సహకరించాలని కోరారు. యువతీయువకులను వాలంటీర్లుగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. బక్రీద్, గణేష్ నిమజ్జనం సమయంలో రోడ్లపై ఏర్పడే చెత్తను తొలగించేందుకు లక్ష క్యారీ బ్యాగ్స్ ను పంపిణీ చేశామని పేర్కొన్నారు. జీహెచ్ ఎంసీ కూడా లక్ష క్యారీ బ్యాగ్ లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అన్ని పోలీసు స్టేషన్ల ఏరియాలో ప్రజా రక్షణకు భంగం కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 

 

11:39 - September 13, 2016

తూర్పుగోదావరి : కాకినాడలో దివీస్ పెట్టవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు సీసీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఎస్ ఈజెడ్ ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని ఎద్దేవా చేశారు. తుండూరు ఆక్వాఫుడ్‌ పార్క్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ ఈజెడ్ ల పేరుతో 37 వేల ఎకరాల భూమిని సేకరించారని.. అందులో 1 శాతం భూమి కూడా వినియోగంలోకి రాలేదన్నారు. లేపాక్షి, వాన్ పిక్, తుండూరు ఆక్వా ఫుర్ పార్కుల నిర్మాణం చేయాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని పేర్కొన్నారు. మెగా ఆక్వాఫుడ్ పార్కు నిర్మించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కమ్యూనిస్టులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సీఎం చంద్రబాబు అనడం సరికాదన్నారు. కమ్యూనిస్టులు పరిశ్రమలకు వ్యతిరేకమని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా భూములు లాకుంటే వాళ్ల తరపున పోరాడుతున్నామన్నారు. దివీస్ కంపెనీకి భూములు ఇవ్వని రైతులపై కిరాతకంగా దాడులు చేయడం దారుణమన్నారు. సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం వచ్చే భూములకు మూడు లక్షల రూపాయల నష్టపరిహారం సరిపోదని తెలిపారు. దివీస్, భీమవరం మెగాఫుడ్ వర్క్స్‌ కంపెనీలు గ్రామాల్లో కాకుండా దూరంగా పెట్టుకోవాలని సూచించారు. రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

 

 

పటాన్ చెరు రామచంద్రాపురంలో భారీ వర్షం

మెదక్ : పటాన్ చెరు మండలం రామచంద్రాపురంలో భారీ వర్షం కురిసింది. ఎన్ హెచ్ పై వర్షపు నీరు భారీగా చేరింది. దీందో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. 

బక్రీద్, గణేష్ నిమజ్జనంపై సీపీ మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్

హైదరాబాద్ : బక్రీద్, గణేష్ నిమజ్జనం సందర్భంగా బందోబస్తు ఏర్పాటుపై సీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 
20 వేల మంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

 

10:42 - September 13, 2016
10:41 - September 13, 2016
10:36 - September 13, 2016

కర్నాటక : బెంగళూరులో కొనసాగుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. 200 లారీలు,55 బస్సులను నిరసనకారులు ధ్వంసం చేశారు. దీంతో బెంగళూరులోని 16 ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. బెంగళూరు మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయొద్దని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాసేపట్లో బెంగళూరు రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానుంది. 

10:32 - September 13, 2016

కడప : బ్రాహ్మణి ఉక్కు..రాయలసీమ హక్కు. కడప జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన ఉక్కు పరిశ్రమ.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా శంకుస్థాపన దశకే పరిమితమైంది. తొమ్మిదేళ్లుగా ఒక్క అడుగూ ముందుకు సాగడం లేదు. విభజన చట్టంలోనూ బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ పూర్తిని ప్రస్తావించారు. కానీ ప్రభుత్వాలు ఆదిశగా చిత్తశుద్ధిని కనబరచిందే లేదు. అందుకే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనతను ఎండగడుతూ.. బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటును కోరుతూ.. ఎమ్మెల్సీ గేయానంద్‌ రేపటి నుంచి నిరాహార దీక్ష చేయబోతున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి స్టీల్స్‌ పూర్వాపరాలపై ఓ అవలోకనం. 
బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఊసే లేదు...
కరవు సీమలో ప్రస్తావించిన బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఊసులో లేకుండా పోయింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. బ్రాహ్మణి స్టీల్స్‌ ఆలోచన పురుడు పోసుకుంది. ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా వున్న కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్‌ను నెలకొల్పాలని, తద్వారా సీమలో నిరుద్యోగ సమస్యను తీర్చవచ్చన్న భావనతో ఈ ఫ్యాక్టరీని తలపెట్టారు. అప్పట్లో కర్నాటక పర్యటక మంత్రి, గనుల అధినేత గాలి జనార్దనరెడ్డి ఈ ప్రాజెక్టును స్థాపించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అనుకున్నదే తడవుగా.. 2007 జూలై 30వ తేదీన బ్రాహ్మణి స్టీల్స్‌ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
ఉక్కు ప‌రిశ్రమ తొలి ద‌శ నిర్మాణ వ్యయం రూ.20 వేల కోట్లు
ఉక్కు ప‌రిశ్రమ తొలి ద‌శ నిర్మాణ వ్యయం దాదాపు 20 వేల కోట్లు. నాలుగు మిలియ‌న్ ట‌న్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలన్నది ప్రధాన లక్ష్యం. ప్రత్యక్షంగా 25 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్సించాలన్నది ఫ్యాక్టరీ నిర్మాణ సంకల్పం. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం దాదాపు 1300 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కేటాయించాల్సిన భూముల్ని బ్యాంకుల్లో తనఖా పెట్టి గాలి జనార్ధన్‌రెడ్డి దాదాపు 350 కోట్ల రుణాలు పొందారు. బ్రాహ్మణి స్టీల్స్‌ నిర్మిస్తానన్న గాలి జనార్దనరెడ్డి... అక్రమ మైనింగ్‌ కేసుల్లో ప్రధాన ముద్దాయిగా జైలు పాలయ్యారు. అనంతర కాలంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూడా హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.  దీంతో  ఉక్కు ఫ్యాక‌ర్టీ  ప్రారంభ దశలోనే ఆగిపోయింది. 
ఉక్కు ఫ్యాక్టరీపై ఎన్నో ఆశలు 
ఉక్కు ఫ్యాక్టరీపై రాయలసీమ వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాక్టరీ వల్ల తమ బిడ్డలకు ఉపాధి లభిస్తుందన్న ఆశతో ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో సెయిల్‌ ఆధ్యర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఇంతవరకు ఆ హామీ అమలు దిశగా చర్యలు లేవు. పాలకులు కానీ, అధికారులు కానీ, కనీసం ఫ్యాక్టరీ ప్రారంభిస్తామన్న వారు కానీ పట్టించుకోక ఫ్యాక్టరీ ప్రతిపాదిత ప్రాంతంలో.. దుండగులు ఇనుప ఖనిజాన్ని మాయం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల తొమ్మిది లారీల్లో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమలోని ఇనుమును అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పాలకుల విధానాలు, నిర్లక్ష్యం కారణంగా బ్రాహ్మణి స్టీల్స్‌ కల నెరవేరకుండా పోతోంది.  
ఆగిపోయిన ఫ్యాక్టరీ కోసం ఉద్యమిస్తున్న వామపక్షాలు 
2007సం.లో ఆగిపోయిన ఫ్యాక్టరీ కోసం వామపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూనే ఉన్నాయి. వివిధ రూపాల్లో ప్రజల ఆకాంక్షల్ని వివరిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో.. .ఉక్కు పరిశ్రమ ఏర్పాటును కోరుతూ... ఈ నెల 14, 15 తేదీల్లో... కడప నగరంలో ఎమ్మెల్సీ గేయానంద్‌ నిరాహారదీక్ష చేపట్టబోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇచ్చిన హామీల ప్రకారం... ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ గేయానంద్‌ హెచ్చరిస్తున్నారు. 
బ్రాహ్మణి ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి చేయాలి : ప్రజలు 
విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్నట్లుగా బ్రాహ్మణి ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి చేయాలని రాయలసీమ ప్రజలు కోరుతున్నారు. అసలే వెనకబడిన సీమలో ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి మరింత దూరమవుతోందని అంటున్నారు. వివిధ పార్టీలు అనవసర రాజకీయాలు మాని ఉక్కు ఫ్యాక్టరీ కోసం కలిసికట్టుగా ఉద్యమించాలని ప్రజలు కోరుతున్నారు.  

 

10:25 - September 13, 2016

హైదరాబాద్ : ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీర ప్రాంతానికి అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని.. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 
హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వర్షం
హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది.  కూకట్‌పల్లి, మియాపూర్‌, లింగంపల్లి, ఖైరతాబాద్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌ల్లో వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తోంది.  మాదాపూర్‌లో 28 మి.మీ, కూకట్‌పల్లిలో 2.4 మి.మీ, అమీర్‌పేట్‌లో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గుంటూరు జిల్లాలో వర్షం 
గుంటూరు జిల్లా పల్నాడులో భారీ వర్షం కురిసింది. గురజాలలో దండి వాగుకు గండి పడింది. దీంతో గురజాల గ్రామంతా జలమయమవ్వడంతో గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పిడుగురాళ్లలో ఇంటిగోడ కూలి ఓ మహిళ మృతి చెందింది. 

 

బెంగళూరులో నిలిచిపోయిన మెట్రో సర్వీసులు

కర్నాటక : బెంగళూరులో కొనసాగుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. 200 లారీలు,55 బస్సులను నిరసనకారులు ధ్వంసం చేశారు. దీంతో బెంగళూరులోని 16 ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. బెంగళూరు మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయొద్దని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాసేపట్లో బెంగళూరు రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానుంది. 

 

కాకినాడలో దివీస్ పెట్టొద్దు : సీపీఎం నేత మధు

తూర్పుగోదావరి : కాకినాడలో దివీస్ పెట్టవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు సీసీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. 

 

09:44 - September 13, 2016

ఎపి రాజధాని స్విస్ చాలెంజ్ విధానంలో చాలా లోటుపాట్లున్నాయని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత బాబురావు, టీడీపీ నేత చందు సాంబ శివరావు పాల్గొని, మాట్లాడారు. సింగపూర్ కంపెనీలకు భూములు కట్టబెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానం అమలు చేస్తున్నారని విమర్శించారు. సింగపూర్ కంపెనీలను కాకుండా స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించాలన్నారు. మరిన్ని వివరాలను వీడియాలో చూద్దాం...
 

09:34 - September 13, 2016

ముస్లింల మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆవాజ్ నేత అబ్బాస్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ముస్లిం మైనారిటీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. 'ఇవాళ ముస్లింలు త్యాగానికి నిర్వచనమైన బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముస్లిం మైనార్టీలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరు ఎలా వుంది? వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:24 - September 13, 2016

తెలంగాణలో ముస్లింల సంఖ్య అధికం. మైనార్టీల అభివృద్ధి సాధించకుండా తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం కాదు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన ముస్లింల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం వుంది. తెలంగాణలో దాదాపు 45 లక్షల మంది ముస్లింలున్నారు. ఇది తెలంగాణ జనాభాలో  12.68 శాతం.  దాదాపు సగం మంది జీహెచ్ ఎంసి పరిధిలో వున్నారు.  పట్టణ ప్రాంతాల్లో దాదాపు ముప్పై మూడున్నర లక్షల మంది వుంటే, గ్రామీణ ఫ్రాంతాల్లో  పదకొండున్నర లక్షల మంది వున్నారు.  ఇంత సంఖ్యలో వున్న ముస్లింల అభివృద్ధి సాధించకుండా తెలంగాణ సమగ్రాభివృద్ధి సాద్యం కాదు. తెలంగాణలో ముస్లింలు ఆర్థికంగానూ, విద్యాపరంగానూ వెనకబడి వున్నారన్నది ఓ వాస్తవం. రోడ్ల పక్కన పండ్లు, కూరగాయలు, చెప్పులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. సైకిళ్లకు, బైక్ లకు పంక్చర్లు వేస్తూ, చిన్నచిన్న రిపేర్లు చేస్తూ  జీవనయానం సాగిస్తున్నారు.  ముస్లింలలో భూములు, సొంత ఇళ్లు వున్నవారి సంఖ్య చాలా తక్కువ. నిరక్షరాస్యత ఎక్కువ. స్త్రీలను బయటకు రానివ్వని ఛాందసత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇవన్నీ ముస్లింల వెనకబాటుకి కారణాలే.  వీరి సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి మరింత కృషి చేయాల్సిన అవసరం వుంది. 
ముస్లింల జీవన స్థితిగతుల్లో మార్పేమీ రాలేదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ముస్లింల జీవన స్థితిగతుల్లో మార్పేమీ రాలేదు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ ప్రాధాన్యత దక్కడం లేదు. గత మూడు బడ్జెట్లను పరిశీలిస్తే  ఈ విషయం బోధపడుతుంది. 
టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్లతో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లో మైనార్టీలకు కేటాయించింది కేవలం 1030 కోట్లు. ఇందులో ఖర్చు చేసింది 320 కోట్ల రూపాయలు మాత్రమే. 2015 -16 బడ్జెట్ లో 1105 కోట్లు కేటాయించి 490 కోట్లు మాత్రమే వినియోగించారు. ఇవి కూడా షాదిముబారక్; స్కాలర్ షిప్, రంజాన్ ఇఫ్తార్ విందులకు, బట్టలకు ఖర్చు చేశారు.  ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు పెంచే మార్గాలు, శాశ్వత ప్రాతిపదిక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వెచ్చించడం లేదు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎంత మంది లబ్దిపొందుతున్నారన్నది ప్రశ్నార్ధకం. 
రూ.150 కోట్లు కేటాయింపు... అందని రుణం 
2016 లో మైనార్టీ కార్పొరేషన్ కు 150 కోట్లు కేటాయించారు కానీ ఎవ్వరికీ నయా పైసా రుణం ఇవ్వలేదు. స్వయం ఉపాధి పథకాల కోసం లక్షా 59వేల మంది దరఖాస్తు చేసుకున్నా ఫలితం దక్కలేదు. గ్రేటర్ హైదరాబాద్ లో మూడు వేల మంది దరఖాస్తుదారులకు రుణాలివ్వాలన్న లక్ష్యం పెట్టుకోగా, 361 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకీ వాస్తవాలకీ ఎంత తేడా వున్నదో అర్ధం చేసుకోవడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. 
కొద్దిమందికే పరిమితమైన ఇమాం మౌజన్ గౌరవ వేతనం 
మసీదులలో పనిచేస్తున్న ఇమాం మౌజన్ లకు వెయ్యి రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తామన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన కూడా చాలా కొద్దిమందికే పరిమితమైంది. 4900 మంది ఇమాంలు, 4000 మంది మౌజ్జన్ లు  దరఖాస్తు చేసుకుంటే కేవలం 551 మందిని మాత్రమే ఎంపిక చేశారు. చాలా దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తికాలేదు. మైనార్టీ ముస్లింలకు ఆటోలు ఇస్తామన్న వాగ్ధానం కూడా నెరవేరలేదు. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో 16వేల మంది, హైదరాబాద్ లో 2700 మంది దరఖాస్తు చేసుకుంటే, 550 మందికి మాత్రమే ఇచ్చారు. ఈ ఆటోలకు 75వేలు ప్రభుత్వ సబ్సిడీ, 75వేలు బ్యాంక్ లు ఇవ్వాల్సి వుండగా, బ్యాంక్ లు దరఖాస్తులను పెండింగ్ లో పెడుతున్నాయి. 
ప్రశ్నార్థకంగా మైనార్టీలకు 71 గురుకుల పాఠశాలు  
మైనార్టీలకు 71 గురుకుల పాఠశాలల వ్యవహారమూ ఇలాగే వుంది. మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలకు స్థలం పెద్ద సమస్యగా మారింది. వేల ఎకరాల వక్ఫ్ భూములు కబ్జా అయ్యాయి. మరికొన్ని లీజుదారుల చేతుల్లో వున్నాయి. దీంతో మైనార్టీ గురుకుల పాఠశాలలకు భూమి లేకుండా పోయింది. చంచల్ గుడ జైలు, రేస్ కోర్సులను శివార్లలోకి తరలిచంి, అక్కడ మైనార్టీ గురుకులాలు నిర్మించాలన్న ఆలోచన కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో అద్దె భవనాల్లోనే గురుకుల పాఠశాలలు నడపాల్సి వస్తోంది.  ఇలాంటి పరిణామాలన్నీ మైనార్టీ సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి వుందన్న అనుమానం కలుగుతోంది. 

09:05 - September 13, 2016

ఢిల్లీ : జిఎస్‌టీ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కౌన్సిల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలోని ఈ క‌మిటీలో మొత్తం 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఉంటారు. జీఎస్టీలో కీల‌క‌మైన ప‌న్ను రేటును ఈ కౌన్సిలే నిర్ణయిస్తుంది. సెప్టెంబర్‌ 22, 23 తేదీల్లో కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. జిఎస్‌టి బిల్లు అమలు చేయడానికి ఏప్రిల్‌ 1, 2017 డెడ్‌లైన్. జిఎస్‌టి అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉంటుంది.

09:04 - September 13, 2016

గుంటూరు : జిల్లాలోని పల్నాడులో భారీ వర్షం కురిసింది. గురజాల గ్రామంలో దండివాగుకు గండి పడింది. గురజాల గ్రామం జలమయం అయింది. దీంతో గ్రామస్తులు తీవ్రఅవస్తలు పడుతున్నారు. పిడుగురాళ్లలో ఇంటి గోడకూలి ఓ మహిళ మృతి చెందింది. పంట పొలాలు నీట మునిగాయి. పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.

 

09:00 - September 13, 2016

హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి ఆనుకోని మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మరో మూడు రోజులుమోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ హెచ్చరికలు 
జీహెచ్ ఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 

అల్పపీడనానికి ఆనుకోని మరో ఉపరితల ఆవర్తనం

హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి ఆనుకోని మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

08:00 - September 13, 2016

విజయవాడ : దేశంలో ఎక్కడాలేని విధంగా రెయిన్‌గన్స్‌తో పంటపొలాలను కాపాడితే దానిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో రెయిన్‌గన్స్ వినియోగం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించామని ఆయన తెలిపారు.  180 కోట్ల రూపాయలు కూడా ఖర్చుకాని రెయిన్‌గన్స్ కోసం 230 కోట్లకు మించి ఖర్చు పెట్టారని కొన్ని పత్రికలు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

 

07:58 - September 13, 2016

హైదరాబాద్ : రాష్ట్రానికి భారీ వర్ష సూచనలు వెలువడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. అన్ని జిల్లాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో, హైదరాబాద్‌ నగరంలోనూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలన్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌రూమ్‌ ప్రారంభించాలని,.. ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. 

 

నేడు ఢిల్లీలో గవర్నర్ నరహింసన్ పర్యటన

ఢిల్లీ : హస్తినలో నేడు గవర్నర్ నరహింసన్ పర్యటించనున్నారు. ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులతో గవర్నర్ భేటీ కానున్నారు. 

 

నేడు ఎన్ టీపీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు

కరీంనగర్ : నేడు ఎన్ టీపీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు అన్ని ఏర్పాట్లు చేశారు. 

07:35 - September 13, 2016

పశ్చిమగోదావరి : పోలీసుల ఉరుకులు పరుగులు.. అడుగడుగునా తనిఖీలు..అక్రమ అరెస్టులు..గృహ నిర్భందాలు.. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణ సామాగ్రి తరలింపులో పోలీసుల అత్యుత్సాహం.. భీమవరం మండలంలోని మూడు గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కొనసాగించారు. 
అగ్గిరాజేస్తోన్న ఆక్వాఫుడ్‌ పార్క్ నిర్మాణం 
గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ పార్క్ నిర్మాణ వ్యవహారం పశ్చిమ గోదావరి జిల్లాలో అగ్గిరాజేస్తోంది. కంసాలబేతపూడి, జొన్నలగరువు, తుందురు మత్స్యకార గ్రామాల ప్రజలు మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆక్వాఫుడ్‌ పార్క్‌ ఏర్పాటైతే పచ్చటి పొలాలు, భూగర్భ జలాలు, వాతావరణం కాలుష్యమై ప్రజారోగ్యం దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్క్‌ ఏర్పాటు చేయొద్దంటూ కదం తొక్కుతున్నారు. మరోవైపు పోలీసుల అత్యుత్సాహం ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు రగిలిస్తోంది. 
ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు
ఆక్వాఫుడ్‌ పార్క్ నిర్మాణ సామాగ్రి తరలింపు సందర్భంగా.. పోలీసులు కంసాలబేతపూడి, జొన్నలగరువు, తుందురు గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడు గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. నిత్యావసరాలకు బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న పోరాట కమిటీ సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  
పోలీసుల చర్యలను ఖండించిన నేతలు  
పోలీసుల చర్యలను స్థానిక నేతలు తీవ్రంగా ఖండించారు. ఆక్వాఫుడ్‌ పార్క్ యజమాన్యానికి కొమ్ముకాసే చర్యలను మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం  స్పందించి ఆక్వాఫుడ్‌ పార్క్ నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని  కంసాలబేతపూడి, జొన్నలగరువు, తుందురు వాసులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.  

 

07:28 - September 13, 2016

హైదరాబాద్ : బక్రీద్‌, వినాయక నిమజ్జనం కోసం హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 20 వేల మంది పోలీసులతో పహారా కాయనున్నారు. బందోబస్తు కోసం కేంద్ర బలగాలను వినియోగించనున్నారు. భద్రత ఏర్పాట్లపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి ఉమ్మడిగా సమీక్ష నిర్వహించారు. పాతబస్తీలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
సిటీ పోలీసులు అలెర్ట్ 
ఓ వైపు బక్రీద్‌, మరో వైపు గణేష్‌ నిమజ్జనం హైదరాబాద్‌ పోలీసులకు సవాల్‌గా మారింది..రెండు రోజుల వ్యవధిలోనే ఈ రెండు వేడుకలు ఉండడంతో సిటీ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో గణేష్‌ ఉత్సవ కమిటీ నిమజ్జనోత్సవంపై నిర్వహించిన సమావేశానికి సీపీ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషన్‌ జనార్ధన్‌రెడ్డి హాజరయ్యారు. గణేష్‌ నిమజ్జనం, బక్రీద్‌ సందర్భంగా నగరంలో 20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. 
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ 
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి 24గంటలూ ఉద్యోగులను అందుబాటులో ఉంచనున్నారు. రెవెన్యూ, వాటర్‌ వర్క్స్‌, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం చేయనున్నారు. బక్రీద్‌ సందర్భంగా జరిగే సామూహిక ప్రార్థనలకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తామన్నారు సీపీ. గణేష్‌ నిమజ్జనం కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. కెమెరాలను కంట్రోల్‌ రూంతో అనుసందానం చేసినట్లు ఆయన తెలిపారు. 6 గంటల నుంచే నిమజ్జనం ప్రక్రియ ప్రారంభం చేయాలని మహేందర్‌రెడ్డి చెప్పారు. సున్నితమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తామని తెలిపారు. సిటీలో బందోబస్తు కోసం కేంద్ర బలగాలనూ రప్పించామన్నారు సీపీ మహేందర్‌రెడ్డి. పాతబస్తీలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాతబస్తీలో కవాతు నిర్వహించారు.  
ఉ. 8 నుంచి 11.30 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు
బక్రీద్ పండుగ నేపథ్యంలో సిటీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. మీరాలం ట్యాంక్, సికింద్రాబాద్‌ ఈద్గాల వద్ద ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు వన్ వే అమలులో ఉంటుంది. ఈద్గా వైపు వెళ్లే వాహనాలను పురానాపూల్, బహదూర్‌పుర పోలీసుస్టేషన్ మీదుగా పంపిస్తారు. శివరామ్‌పల్లి, నేషనల్ పోలీసు అకాడెమీ మీదుగా బహుదూర్‌పుర వచ్చే ట్రాఫిక్‌ను టి జంక్షన్ నుంచి ఇంజన్ బౌలీ మీదుగా పంపిస్తారు. ఈద్గా వద్దకు కార్లు, బస్సులు, లారీలు ఇతర వాహనాలను అనుమతించరు. వీటిని మీరాలం ఫిల్టర్ బెడ్ టి జంక్షన్ వద్ద కేటాయించిన ప్రాంతాల్లో పార్క్ చేసుకోవాలి. 

 

07:21 - September 13, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో మధ్యంతర రిపోర్టును సీఎం కేసీఆర్‌కు డీజీపీ అందజేశారు. మరోవైపు దర్యాప్తు సంస్థ సిట్‌ స్థాయి పెంచారు. ఇకపై అదనపు డీజీపీ స్థాయి అధికారి కనుసన్నల్లో దర్యాప్తు వేగం పుంజుకోనుంది. నయీం కేసులో విన్పిస్తున్న పెద్దోళ్లతోపాటు పోలీసు అధికారులు..రెవెన్యూ సిబ్బంది పేర్ల జాబితాను సిట్‌ తయారు చేసింది.గణేష్ నిమజ్జనం తర్వాత నేతల అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 
ప్రభుత్వం కీలక నిర్ణయాలు 
గ్యాంగ్ స్టార్ నయిం కేసును మరింత వేగంగా దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దర్యాప్తు సంస్థ సిట్‌స్థాయిని పెంచడంతో పాటు సిట్ పర్యవేక్షకుడిగా అడిషనల్ డీజీ అంజనీకుమార్‌ను నియమించారు. దీంతో పాటు సిట్‌ టీంలో మరో 5గురు పోలీసు అధికారులను కేటాయిస్తూ అదనపు బలాన్ని చేకూర్చారు...మరోవైపు నయీం కేసులో మధ్యంతర నివేదికను డీజీపీ అనురాగ్‌శర్మ సీఎం కేసీఆర్‌కు అందజేశారు. కేసును వేగంగా విచారించేందుకు పోలీసులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 
వేగం పెంచనున్న సిట్...
నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతున్న అరాచకాలను లోతుగా దర్యాప్తు చేసేందుకు సిట్ ను బలోపేతం చేశారు. పోలీసు ఉన్నతాధికారులను విచారించేందుకు అడిషనల్ డి.జీ. లా అండ్ అర్డర్ అంజనీ కుమార్ పర్యవేక్షణలో జరగనుంది... ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర పై అంజనీ కుమార్ దర్యాప్తు చేయనున్నారు. సిట్ కు తోడుగా మరిన్ని టీంలను ఏర్పాటు చేశారు. అందుకు పోలీస్ అధికారులుగా కరీంనగర్ ఓఎస్డీ ఐ.పీ.ఎస్. ప్రియదర్శిని, ఖమ్మం అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ, అడిషనల్ డిసిపి ఎస్బీ ఇస్మాయిల్, ట్రాఫిక్ ఎసీపీ జైపాల్, నార్సింగ్ సి.ఐ. రాంచందర్‌ను నియమించారు. మొత్తం 16 మంది అధికారులు దర్యాప్తు చేయనున్నారు. 
నయీంకు సహకరించిన పోలీసులు...
నయింకు సహకరించిన పోలీసు అధికారుల పాత్ర, రెవెన్యూ సిబ్బంది, రాజకీయ నాయకులు అండదండలపై దర్యాప్తు వేగవంతం చేయనున్నారు. ఇప్పటికే వీరి పేర్లతో జాబితాను రూపొందించారు. వి.ఐ.పీ.లను అరెస్ట్ చేయాలంటే కీలక సాక్షాదారాలు అవసరమని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రత్యేక న్యాయసలహాదారు నియామకానికి రంగం సిద్ధం చేశారు.  
నిమజ్జనం తర్వాత ఇక సోదాలు..
వినాయక నిమజ్జనం తర్వాత పోలీస్ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక సమాచారం రాబట్టేందుకు సిద్దమవుతున్నారు. దీంతో పాటు నయీంతో సంబంధాలున్న రాజకీయ నాయకులను అరెస్ట్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

 

07:17 - September 13, 2016

విజయవాడ : కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్యాంకర్లను ఆదేశించారు. రుణ అర్హత పత్రాలు లేవన్న నెపంతో బ్యాంకులు కౌలు రైతులకు రుణాలు నిరాకరిస్తుండటాన్ని తప్పుపట్టారు. బంగారం తాకట్టు పెట్టుకుని వ్యవసాయ రుణాలు ఇచ్చే పద్ధతిని ప్రోత్సహించవద్దని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీలో చంద్రబాబు కోరారు. 
రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ సమావేశం 
రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు కౌలు 
కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు నిరాకరిస్తున్న అంశంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. భూములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న రైతులకు రుణాలు ఇవ్వాలని చంద్రబాబు బ్యాంకర్లను ఆదేశించారు.  కౌలు రైతులు కూడా బ్యాంకు రుణాలు పొందేందుకు వీలుగా రుణ అర్హత పత్రాలు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే 74 వేల మందికి రుణార్హత పత్రాలు జారీ చేసినట్టు బ్యాంకర్ల కమిటీ దృష్టికి తెచ్చారు. బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు ఇవ్వడాన్ని ప్రోత్సహించవద్దన్నారు. పొలం, బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు ఇవ్వాల్సిన  అవసరమేంటని ప్రశ్నించారు. రైతుల బాధను బ్యాంకర్లు అర్ధం చేసుకోవాలని కోరారు. రైతులు బాగుంటేనే బ్యాంకింగ్‌ వ్యవస్థ కూడా బాగుంటుందన్న వాస్తవాన్ని బ్యాంకర్లు గ్రహించాలని సూచించారు. 
పంట రుణాల లక్ష్య సాధనపై చంద్రబాబు సమీక్ష 
17 ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల లక్ష్య సాధనపై చంద్రబాబు సమీక్షించారు. ఈ ఏడాది 83 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని నిర్దేశించుకోగా... జూన్‌ 30 నాటికి 23,990 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సాధించారు. నిర్ణీత లక్ష్యంలో ఇది కేవలం 28.90 శాతం మాత్రమే. దీనిని మరింత పెంచాలని  ముఖ్యమంత్రి కోరారు. గత  ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి 20,168 కోట్ల రుపాయల వ్యవసాయ రుణాలు ఇచ్చామని, గతంతో పోలిస్తే ఈసారి 18.95 శాతం అదనపు పరపతి కల్పించాలని బ్యాంకర్లు  చంద్రబాబుకు వివరించారు. చిన్న, మధ్య తరహాల పరిశ్రమలు నెలకొల్పేందుకు ఈ ఏడాది జూన్‌ 30 నాటికి 7,487 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామని బ్యాంకర్లు లెక్కలు చెప్పారు. అలాగే ప్రాధాన్యతారంగాలకు 33,188 కోట్ల రుణాలు అందించామని చెప్పారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజా సాధికారత సర్వేలో బ్యాంకు ఖాతాలు లేనివారిని గుర్తించామని, వీరితో కూడా అకౌంట్లు తెరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని... చంద్రబాబునాయుడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ దృష్టికి తెచ్చారు. 

07:11 - September 13, 2016

విజయవాడ : స్విస్‌ చాలెంజ్‌ విధానంపై హైకోర్టు ఇచ్చిన స్టే తుది తీర్పు కాదని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. దీనిపై అప్పీల్‌కు వెళ్తామని ఆయన చెప్పారు. అమరావతి కేపిటల్‌ సిటీలో 1691 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన సీడ్‌క్యాపిటల్‌పై హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. రాజధాని వస్తే తమ బతుకులు బాగుపడుతాయనే.. రైతులంతా స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని నారాయణ చెప్పారు. 

07:08 - September 13, 2016

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం అనురిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును విపక్షాలు స్వాగతించాయి. న్యాయస్థానం తీర్పు రాష్ర్ట ప్రభుత్వానికి చెంపపెట్టని, ఇప్పటికైనా స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని రద్దు చేసి.. ముందుకెళ్లాలని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. 
'స్విస్ చాలెంజ్' పై హైకోర్టు స్టే 
అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం అనురిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్న ఆదేశాలను విపక్షాలు స్వాగతించాయి. తీర్పుపై హర్షం వ్యక్తం చేశాయి. 
స్విచ్‌ చాలెంజ్‌పై హైకోర్టు తీర్పును స్వాగతించిన సీపీఎం 
స్విచ్‌ చాలెంజ్‌పై హైకోర్టు తీర్పును సీపీఎం స్వాగతించింది. మొదటి నుంచి స్విచ్‌ చాలెంజ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తున్నా.. రాష్ర్ట ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని.. రైతుల భూములను సింగపూర్‌ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని బాబురావు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్విచ్‌ చాలెంజ్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
స్విస్‌ చాలెంజ్‌ విధానంలో లొసుగులు : కాంగ్రెస్ 
స్విస్‌ చాలెంజ్‌ విధానంలో లొసుగులున్నాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ వ్యవహారంలో తక్షణమే అప్పీల్‌కు వెళ్లి.. టెండర్ల ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. మొత్తంగా హైకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. 

07:03 - September 13, 2016

బెంగళూరు : కర్నాటక, తమిళనాడు మధ్య కావేరి చిచ్చు హింసాత్మకంగా మారింది. ఆందోళనలతో రెండు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి.  బెంగళూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమిళనాడుకు కావేరి జలాల విడుదల కొనసాగించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో .. కన్నడిగులు విధ్వంసానికి దిగారు. కేపీఎస్‌ బస్టాండ్‌లో ఆగివున్న తమిళనాడుకు చెందిన 50 బస్సులను దగ్ధం చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో బెంగళూరులో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందాడు. పరిస్థితిని సమీక్షిచేందుకు ఇవాళ మధ్యాహ్నం కర్నాటక మంత్రిమండలి అత్యవసరగా భేటీ కానుంది. 
అదుపు తప్పిన కావేరి జల వివాదం 
కావేరి జల వివాదం అదుపు తప్పింది. తమిళనాడు-కర్నాటకల్లో పరిస్థితి చేయిదాటిపోయింది. తమిళనాడుకు  ఈనెల 16 వరకు రోజుకు 15 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును సవరించాలని కర్నాటక మళ్లీ అత్యున్నత న్యాయస్థానాన్ని అశ్రయించింది. రోజుకు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేసేలా తాజాగా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.  దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం... ఈనెల 20 వరకు రోజుకు 12 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని ఆదేశించింది. 
సుప్రీంకోర్టు తీర్పుతో రోడ్లపైకి కన్నడిగులు  
సుప్రీంకోర్టు తీర్పుతో కన్నడిగులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. తమిళనాడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగళూరుతోపాటు కావేరి పరీవాహక ప్రాంత ప్రదేశాలైన మైసూరు, చామరాజనగర, మండ్య, రామనగర జిల్లాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి బలవంతంగా షాపులు మూయించారు. తమిళనాడుకు చెందిన హోటళ్లు, మొబైల్‌ ఫోన్‌ షాపులను బద్ధలు కొట్టారు. తమిళనాడులో కర్నాటకకు చెందిన లారీని దగ్ధం చేశారన్న  సమాచారం  దావానలంలా వ్యాపించడంతో కన్నడిగుల విధ్వంసం మరింత శృతిమించింది.  బెంగళూరులో పరిస్థితి అదుపుతప్పింది. కేసీఎస్‌ బస్టాండ్‌లో తమిళనాడుకు చెందిన 50కి పైగా బస్సులను తగలబెట్టారు. దీంతో ఈ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది. అలాగే  పన్నెండుకుపైగా లారీలను కాల్చివేశారు. అల్లర్లు, హింసతో బెంగళూరులో పౌరజీవనం స్తంభించింది.
కర్నాటకలో తమిళుల లక్ష్యంగా దాడులు 
కర్నాటకలో తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో కనిపించిన వాహనాల్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణ, పాండవపుర, మద్దూరు విధ్వంసం తీవ్ర స్థాయికి చేరింది. చిత్రదుర్గ, హసన్‌, ధర్వాడ ఇదే పరిస్థితి నెలకొంది. కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో తమిళులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. దీంతో బెంగళూరుతోపాటు రాష్ట్రంలోని  కొన్ని  ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ విధించారు. తమిళులు నివసిస్తున్న ప్రాంతాల్లో అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరులో పది కంపెనీల కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు, మరో పది కంపెనీల ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలతో భద్రత  ఏర్పాటు చేశారు. సాధారణ, సాయుధ పోలీసు బలగాల్ని కలిపి 20 వేల మంది శాంతిభద్రతల పరిరక్షణ విధులు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో 200 మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావేరి జల వివాదానికి సంబంధించిన సున్నితమైన ప్రాంతాల్లో కూడా భద్రత పెంచారు. 
తమిళనాడులో కూడా ఆందోళనలు 
కర్నాటకలో తమిళులపై జరిగిన దాడులను నిరసిస్తూ తమిళనాడులో కూడా ఆందోళనలు మిన్నముట్టాయి. చెన్నైలో కన్నడిగులకు చెందిన  ఒక హోటల్‌పై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్‌ బాంబు విసిరారు. రామేశ్వరం సందర్శనకు వెళ్లిన కర్నాటక పర్యాటకులపై దాడుల జరిగాయి. రెండు బస్సులతోపాటు మరో రెండు కార్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనలతో సంబంధం ఉన్న 10 మందిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య.... తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రాశారు. కర్నాటకలో నివసిస్తున్న తమిళులను తాము రక్షణ కల్పిస్తున్నామని, ఇదే తరహాలో తమిళనాడులో ఉంటున్న కన్నడిగులకు కూడా  రక్షణ  కల్పించాలని కోరారు. మరోవైపు పరిస్థితిని సమీక్షించేందుకు కర్నాటక మంత్రివర్గం ఈ మధ్యాహ్నం అత్యవసరంగా భేటీ కానుంది. 
 

నేడు మేడిగడ్డ ప్రాజెక్టు భూ నిర్వాసిత గ్రామాల్లో సీపీఎం బృందం పర్యటన

కరీంనగర్ : నేడు మేడిగడ్డ ప్రాజెక్టు భూ నిర్వాసితుల గ్రామాల్లో సీపీఎం బృందం పర్యటించనుంది. ఈ బృందం నిర్వాసితుల సమస్యలు తెసుకోనుంది. ఈ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొననున్నారు. 
 

అరుణాచల్ ప్రదేశ్ గరవ్నర్ గా వి.షణ్ముగనాథన్

ఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ గరవ్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్ వాను పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మేఘాలయ గవర్నర్ గా ఉన్న వి.షణ్ముగనాథన్ ను నియమించారు. మేఘాలయతోపాటు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించననున్నారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ అధికారులు వెల్లడించాలి. 

 

నేడు పోలవరంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

ప.గో : సీఎం చంద్రబాబు నేడు పోలవరంలో పర్యటించనున్నారు. ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానున్నారు. 

Don't Miss