Activities calendar

14 September 2016

రేపే ఎంసెట్ 3 ఫలితాలు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్ 3 పరీక్షా ఫలితాలు గురువారం మధ్యాహ్నం 12గంటలకు విడుదల కానున్నాయి. ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీక్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 

16న గోవాలో బ్రిక్స్ పర్యావరణ మంత్రులు భేటీ..

న్యూఢిల్లీ : బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా (బ్రిక్స్) దేశాలకు చెందిన పర్యావరణ శాఖ మంత్రులు ఈ వారంలో గోవాలో సమవేశం కానున్నారు. 16న జరిగే ఈ సమావేశానికి భారత్ తరపున పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే పాల్గొననున్నారు. 

టిడిపిలో చేరనున్న దేవినేని నెహ్రూ...

విజయవాడ : రేపు సాయంత్రం 4గంటలకు టిడిపి బహిరంగసభ నిర్వహించనుంది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్, ఏపీ ఎంఎస్ వో అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబులు టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు. 

గురువారం వినాయక నిమజ్జనం..

హైదరాబాద్ : గురువారం నగరంలో వినాయక నిమజ్జనం జరగనుంది. ఇందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

 

21:23 - September 14, 2016
21:20 - September 14, 2016

ఢిల్లీ : మల్లన్నసాగర్‌ భూసేకరణలో ప్రభుత్వం 123 జీవోతో అక్రమంగా భూ సేకరణ చేస్తోందన్నారు టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. మల్లన్నసాగర్‌ అక్రమ భూసేకరణ, అక్కడి రైతులపై కొనసాగుతున్న నిర్భంద కాండపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి టి కాంగ్రెస్‌ నేతల బృందం కలిసి ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతిని కలిసిన బృందంలో భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ, దామోదర్‌ రాజనర్సింహ తదితరులు ఉన్నారు. పార్లమెంట్‌ చేసిన 2013 భూ సేకరణ చట్టాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం ఉల్లంఘించి 123 జీవోతో రైతుల భూముల్ని లాక్కొంటుందని రాష్ట్రపతికి వివరించామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 

నగరంలో భారీ వర్షం..

హైదరాబాద్ : నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, ఉప్పల్, నారాయణగూడ, కోఠఙ, దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట, ఉప్పల్ లో భారీ వర్షం పడుతోంది. గణేష్ నిమజ్జనం చేసేందుకు వాహనాలు బారులు తీరాయి. రహదారులపై నీరు నిలవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

20:36 - September 14, 2016

హైదరాబాద్ : వరుసగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ కుదేలవుతున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా రోడ్లన్నీ గతుకుల మయంగా మారుతున్నాయి. ఇప్పటికే రోడ్లపై ఏర్పడ్డ భారీ గుంతలతో వాహనాదారులు తరచుగా ప్రమాదాల భారిన పడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే వేసిన రోడ్లు కూడా అస్తవ్యస్తంగా మారుతుండటం.. బల్దియా పనుల్లో నాణ్యత డొల్లతనాన్ని బయటపెడుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్‌ రోడ్లన్నీ గుంతలమయంగా మారుతున్నాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, కార్పొరేషన్‌ రోడ్లు అని తేడాలు లేకుండా రోడ్లపై గోతులు ఏర్పడి వాహనదారులకు నరకయాతన అనుభవిస్తున్నారు. సాధారణంగా సిటీలో సగటున గంటకు 13 కిలోమీటర్లు మాత్రం వేగం ఉంటుంది. కానీ రోడ్లపై గుంతలు పెరిగిపోవడంతో ఇప్పుడా వేగం కూడా సగానికి పడిపోయింది. ఏ రోడ్డు చూసినా దారిపొడవునా ట్రాఫిక్‌ జాం సర్వసాధరణమై పోయింది. ఇక నగరంలోని ప్రధాన మార్గాల్లో మెట్రో పనులు జరుగుతుండటంతో ఈ దారుల్లో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రమాదాలు...
రోడ్లపై ఏర్పడ్డ గోతుల వల్ల వాహనదారులు తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రతి ఏటా రోడ్ల నిర్వహణ కోసం బల్దియా కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోంది. గడిచిన కొద్ది రోజులుగా గ్రేటర్‌ పరిధిలో వేయి కిలోమీటర్ల రోడ్లను రీ కార్పెట్‌ చేశారు. ఇందుకోసం 320 కోట్లకు పైగా ఖర్చు చేశారు. కానీ రోడ్లన్నీ చెదిరిపోయి గోతులమయం అయ్యాయి. దీంతో బల్దియా పనుల్లో నాణ్యత ఎంతన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు నగర రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే గానీ పరిస్థితి చక్కబడేలా లేదు. రోడ్లపై వెళుతుంటే నడ్డి విరిగే పరిస్థితులు ఉన్నాయని నగరవాసులు వాపోతున్నారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టి నాణ్యమైన పనులు చేపట్టాలని నగర వాసులు కోరుతున్నారు.  

20:32 - September 14, 2016

కడప : జిల్లాలో అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాలపై.. టెన్‌టీవీ కథనాలు.. కలకలం రేపాయి. అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లు దొంగదారిన ఆస్తులను అమ్ముకుంటున్న వైనంపై.. స్థానికులు, ముఖ్యంగా సంస్థ బాధితుల్లో ఆగ్రహాన్ని రగిలించింది. తక్షణమే బద్వేలు రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి.. అగ్రిగోల్డ్ క్రయవిక్రయాలపై అధికారులను నిలదీశారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం, పాపారెడ్డిపల్లిలో.. అగ్రిగోల్డ్ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ అవ్వా సీతారామారావు కుటుంబ సభ్యుల పేరిట వున్న 60 ఎకరాల పట్టాభూమి.. దొంగదారిన అమ్ముకున్న వైనం స్థానికంగా కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి.. అన్ని సాక్ష్యాధారాలతో 10టీవీ ప్రసారం చేసిన కథనాలు.. జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి.

టెన్ టివికి ప్రశంసలు..
అగ్రిగోల్డ్ బాధితులు అగ్రిగోల్డ్ సంస్థ తరఫున పనిచేసిన ఏజెంట్లు. టెన్‌టీవీ కథనాలతో అప్రమత్తమయ్యారు. స్థానికంగా సమావేశమై.. భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. అగ్రిగోల్డ్ సంస్థకు ప్రజల సొమ్ము వసూలు చేసిచ్చిన తాము ఇన్ని కష్టాలు పడుతుంటే ప్రభుత్వం కానీ, విచారణ అధికారులు కానీ స్పందించకపోవడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాపిరెడ్డిపల్లి తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ డైరెక్టర్లకు బినామీ ఆస్తులున్నాయని, వాటన్నింటి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అమ్మి బాధితులకు అప్పగించాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
మొత్తానికి ఆస్తుల విక్రయాల్లో అగ్రిగోల్డ్ డైరెక్టర్ల అక్రమ రీతులపై టెన్‌టీవీ ప్రసారం చేసిన కథనాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా కళ్లు తెరిచి అగ్రిగోల్డ్ దొంగ ఎత్తులను చిత్తు చేసి తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలంగాణలో మరో భారీ హరితహారం..

హైదరాబాద్ : మరో భారీ హరితహారానికి తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాల్లోని జాతీయ రహదారి 44పై 90 వేల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా హరితహారానికి శ్రీకారానికి ఏర్పాట్లను పంచాయతీ రాజ్ మంత్రి జూపల్లి పరిశీలించారు. 

నయీం కేసులో 99 కేసులు - సిట్..

హైదరాబాద్ : నయీం కేసులో ఇప్పటి వరకు 99 కేసులు నమోదు చేసినట్లు సిట్ పేర్కొంది. ఈ రోజు మహబూబ్ నగర్ లో ఐదుగురిని అరెస్టు చేసినట్లు, 83 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేయడం జరిగిందన్నారు. కంట్రోల్ రూంకు 372 ఫోన్ కాల్స్ వచ్చాయని, బాధితులు ఎక్కువ మంది భువనగిరికి చెందిన వాళ్లేనని తెలిపింది. నల్గొండ, హయత్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాలో కేసులు నమోదయ్యాయని పేర్కొంది.

 

రాజోలులో గణేష్ నిమజ్జనంలో దారుణం..

తూర్పుగోదావరి : రాజోలులో గణేష్ నిమజ్జనంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు కానిస్టేబుళ్లపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలైన కానిస్టేబుళ్లను ఆసుపత్రికి తరలించారు. 

వికారుద్దీన్ ఎన్ కౌంటర్ లో నాంపల్లి కోర్టు ఉత్తర్వులు..

హైదరాబాద్ : వికారుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో ఏ 6 నిందితుడు సయ్యద్, ఏ 8 నిందితుడు వినోద్ కుమార్ లపై ఆరోపణలు కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇదే గ్యాంగ్ కు చెందిన ఐదుగురు నిందితులు పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. 

19:56 - September 14, 2016
19:37 - September 14, 2016

ఢిల్లీ : 'అచ్చే దిన్' గొంతులో ఇరుక్కున్న ఎముక లాంటిదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ధ్వజమెత్తాయి. 'అచ్చేదిన్' అనే ఊతపదం పేరిట ఓటర్లను కొల్లగొడుతున్నారని, ప్రస్తుతం బీజేపీ గొంతులో పచ్చి వెలక్కాయపడ్డ చందంగా తయారైందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 'అచ్చే దిన్' అంటూ ప్రజలను బీజేపీ తప్పుదారి పట్టించిందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు చౌహాన్ విమర్శించారు. ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీపై ఇప్పుడు ముఖం చాటేస్తోందని మండిపడ్డారు. అచ్చే దిన్ గొంతులో ఇరుక్కున్న ఎముక లాంటిదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మంగళవారం నాడు ముంబైలో పేర్కొన్నారు. మంచి రోజుల కోసం కొంత సమయం పడుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ చెబితే తాము అధికారంలోకి వస్తే మంచి రోజులు వస్తాయని ఎన్నికల్లో ప్రధాని మోడీ ఢంకా బజాయించిన సంగతి తెలిసిందే. 

19:21 - September 14, 2016
19:20 - September 14, 2016

హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం సందర్భంగా సకాలంలో వినాయక ఊరేగింపులు జరిగే విధంగా మంటప కమిటీలు కృషి చేయాలని గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ సూచించారు. ప్రజలు..వినాయక కమిటీలు సహకరిస్తేనే అధికారులు పోలీసులు నిమజ్జన ప్రక్రియను విజయవంతంగా ముగించే అవకాశం ఉందన్నారు. ఉదయమే నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించాలని, ఎన్జీవోలు, కమిటీలు, నగర వాసులు ఉదయమే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిమజ్జనానికి బయలుదేరాలని సూచించారు. 

19:14 - September 14, 2016

కర్నూలు : జిల్లాలోని ఓర్వకల్లు మండలం శకునాలలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పర్యటించారు. ఆయన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓర్వకల్లులో సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం భూ సేకరణ చేస్తోంది. భూ సేకరణకు వ్యతిరేకంగా నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతు తెలిపేందుకు బుధవారం రాఘవులు అక్కడకు వెళ్లారు. శకునాలలో సభ నిర్వహించాలని యోచించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. కర్నూలు జిల్లాలో అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల నుండి చాకచక్యంగా తప్పించుకున్న రాఘవులు శకునాలకు చేరుకున్నారు. అనంతరం అక్కడ సభ నిర్వహించారు. ఇక్కడకు వచ్చిన పోలీసులు రాఘవులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసు జీపును రైతులు, గ్రామస్తులు అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. రైతులను మోసం చేసిన వారు బాగు పడలేదని, పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 

19:07 - September 14, 2016

రాష్ట్రపతిని కలిసిన టిపిసిసి నేతలు..

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టీపీసీసీ నేతల బృందం కలిసింది. మల్లన్నసాగర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేసింది. 

18:59 - September 14, 2016

యంగ్ హీరో 'రానా' నేనే రాజు నేనే మంత్రి అంటున్నాడు. భళ్లాల దేవుడిగా వావ్ అనిపించిన ఈ హీరోని దర్శకుడు 'తేజ' రాజు, మంత్రిగా చూపించబోతున్నాడు. తేజ, రానా కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ అప్ డేట్స్.. 'బాహుబలి' చిత్రంతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న 'రానా' ప్రస్తుతం 'బాహుబలి 2' షూటింగులో ఉన్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో సోలో గా నటిస్తున్న 'ఘాజీ' సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో 'రానా', 'తేజ' దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం 'నేనే రాజు నేనే మంత్రి' అనే టైటిల్ ను 'తేజ' ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

రానాకు జోడిగా కాజల్..
'తేజ' స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో 'రానా'కి జోడిగా 'కాజల్' నటిస్తోంది. 'లక్ష్మీ కల్యాణం' చిత్రం ద్వారా 'కాజల్' ను తెలుగు తెరకు 'తేజ'నే పరిచయం చేశాడు. ఆ గౌరవంతోనే 'కాజల్' ఈ మూవీలో నటించడానికి ఒప్పుకున్నట్లు వినికిడి. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. వరుస ప్లాప్స్ తో దర్శకుడిగా ఉనికి కోల్పోయిన 'తేజ' ఈ చిత్రంతో సక్సెస్ కొట్టి గాడిలో పడుతాడో చూడాలి.

18:47 - September 14, 2016

ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కలినరీ అసోసియేషన్ (ఇఫ్కా)..నేషనల్ యంగ్ చెఫ్ కాంపిటీషన్ లో హైదరాబాద్ అమ్మాయి వీణ నేషనల్ అవార్డు గెలుపొందింది. జొన్నలు, రాగులు, సజ్జలు, ఉదాలు, కొర్రలు, అరికెలు, వరిగెలు, సామలు, అవిసెలు, క్వినోవా, టెఫ్‌, ఫోయో, అమర్‌నాథ్‌లాంటి తృణధాన్యాలతో వీణ చేసిన వంటకం జాతీయ స్థాయిలో ఉత్తమ వినూత్న వంటకంగా ఎంపికైంది.
మరి ఆ డిష్ ఏంటీ ? డిష్ యొక్క ప్రత్యేకత తెలుసుకోవాలని టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా 'వీణ'తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా 'వీణ' మాట్లాడుతూ...తెలంగాణలో దొరికే 14 రకాల తృణధాన్యాలతో వంట చేయడం జరిగిందని, టర్కీస్ మెథడ్ లో కుక్ చేయడం జరిగిందన్నారు. ఈ వంట బాగుందని నామినేటెడ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు అవార్డు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ డిష్ ను 'వీణ' చేసి చూపించింది. మరి ఆ వంట గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

18:27 - September 14, 2016
18:23 - September 14, 2016

విజయవాడ : తొండంగి మండలంలో దివీస్ ఫ్యాక్టరీ నిర్మాణంపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టెన్ టివితో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన స్టే సంతోషదాయకమని, ప్రభుత్వం బలవంతంగా భూములు గుంజుకొనే ప్రయత్నం చేస్తోందన్నారు. రైతులు తిరగబడుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన స్టే అందరికీ స్పూర్తినిస్తోందన్నారు. కర్నూలు జిల్లాలో ఓ ప్రాంతంలో రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని, అక్కడకు వెళ్లిన రాఘవులుని పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూములను అడ్డగోలుగా గుంజుకొంటోందన్నారు. పదివేల మంది కార్మికులు రొయ్యల సీడ్ కంపెనీల్లో ఉపాధి పొందుతున్నారని, దివీస్ కంపెనీ వస్తే వారి ఉపాధి కొల్పోతుందన్నారు. ఏపీ ప్రభుత్వం చెబుతున్న వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమని, వాస్తవాలు ఉంటే బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. బాధ్యతయుతంగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఒక్క ఎకరానికి మూడు లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని పేర్కొంటున్నారని, పక్కనే ఉన్న భూములు 15లక్షలకు అమ్ముడవుతున్నాయని మధు తెలిపారు. 

18:18 - September 14, 2016

తూర్పుగోదావరి : ఎన్నో నిర్భందాలు..ఎన్నో పోరాటాలు..ఎన్నో ఉద్యమాలు..నిర్భందాల మధ్య 'దివీస్' రైతులు పోరాటం చేస్తున్నారు. వీరు చేస్తున్న పోరాటంపై హైకోర్టు స్పందించింది. తొండంగి మండలంలో దివీస్ ఫ్యాక్టరీ నిర్మాణంపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ రైతులు పిటిషన్ దాఖలు చేశారు. కె.సుబ్బారావుతో పాటు 32 మంది రైతులు వేసిన పిటిషన్ పై హైకోర్టు పై విధంగా స్పందించింది.

ఉద్యమాలు..ఆందోళనలు..
గత కొంతకాలంగా దివీస్ ఫ్యాక్టరీ నిర్మాణంపై రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి ఆందోళనకు మొదటి నుండి సీపీఎం పార్టీ మద్దతు తెలుపుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం నిర్భందం మధ్య చర్యలు తీసుకొంటోంది. టిడిపి పార్టీకి చెందిన యనమల సొంత మండలం..సొంత గ్రామంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. తమ పొట్ట కొట్టవద్దని..తమను అన్యాయం చేయవద్దని రైతులు ఎన్నోమార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో సీపీఎం నేత మధు ఎన్నో సార్లు అరెస్టయ్యారు. కొన్ని సందర్భాల్లో ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీలు సైతం జులిపించారు.
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పునివ్వడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు అప్పారెడ్డి టెన్ టివితో మాట్లాడారు. పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, న్యాయం చేస్తారని ప్రజలు ఆశించారని పేర్కొన్నారు. 

18:00 - September 14, 2016

ఏ మాత్రం గ్యాప్ లేకుండా 'మెగాస్టార్ చిరంజీవి' షూటింగ్ చేస్తున్నాడట. అనుకున్న రిలీజ్ డేట్ కి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే 'చిరు' నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్నట్లు సమాచారం. 'మెగాస్టార్' 'ఖైదీ నెంబర్ 150' సినిమా అప్ డేట్స్. అన్నయ్య 'మెగాస్టార్ చిరంజీవి'ని తెరపై ఎప్పుడెప్పుడు చూడాలని మెగా ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే 'చిరంజీవి' బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొంటున్నాడట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన సీన్స్ ని షూట్ చేస్తున్నట్లు సమాచారం. 'ఖైదీ నెంబర్ 150' సినిమాకి 'వినాయక్' దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

సంక్రాంతికి రిలీజ్...
గతంలో 'వినాయక్', 'మెగాస్టార్' కాంబినేషన్ లో 'ఠాగూర్' వీరివురి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా మిగిలిపోయింది. 'ఖైదీ నెంబర్ 150' చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో 'చిరంజీవి', 'కాజల్' ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్.  'ఖైదీ నెంబర్ 150' సినిమా సెట్స్ పైకి వెళ్లిన నాటి నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అనుకున్న విధంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. అందుకే 'చిరంజీవి'తో సహా ప్రతి ఒక్కరూ పగలు రాత్రి తేడా లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. 

దివీస్ ఫ్యాక్టరీ నిర్మాణంపై హైకోర్టు స్టే..

తూర్పుగోదావరి : తొండంగి మండలంలో దివీస్ ఫ్యాక్టరీ నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ రైతులు పిటిషన్ దాఖలు చేశారు. 

టి.టిడిపి శాఖకు హెచ్చార్సీ లేఖ..

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలపై టిడిపి తెలంగాణ శాఖకు హెచ్చార్సీ లేఖ రాసింది. టిడిపి వద్దనున్న సమాచారాన్ని తమకు అందించాలని హెచ్చార్సీ కోరింది. గతంలో రైతు ఆత్మహత్యలపై హెచ్చార్సీకి టిడిపి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

 

కొండజుటూరులో ఉద్రిక్తత..

కర్నూలు : పాణ్యం (మం) కొండజుటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నానో కెమికల్ ఫ్యాక్టరీ వాహనాలను రైతులు ధ్వసం చేశారు. ఈ ఫ్యాక్టరీ వీల్ల నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ను రైతులు అడ్డుకున్నారు. 

19,20న రైతు దీక్షలు - టి.టిడిపి..

హైదరాబాద్ : జీవో 123ని రద్దు చేసి 2013 చట్ట ప్రకారం భూ సేకరణ చేయాలని, రైతుల సమస్యలపై 19, 20న రైతులు దీక్షలు చేపట్టనున్నట్లు టి.టిడిపి నేతలు రమణ..రేవంత్ లు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న అపెక్స్ కమిటీలో మహారాష్ట్ర ఒప్పందంపై పున సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. 

17:48 - September 14, 2016
17:27 - September 14, 2016
17:24 - September 14, 2016

ఖమ్మం : భువనగిరి సబ్ జైలు సూపరింటెండెంట్ అదృశ్యం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఇతని ఆచూకి కాసేపటి క్రితం లభ్యమైనట్లు సమాచారం. ఇతను ఖమ్మం జిల్లాలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఏషియన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ వేధింపులు భరించలేకపోతున్నట్లు..అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శ్రీనివాస్ లేఖ రాసి వెళ్లిపోయారు. దీనితో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు సబ్ జైలుకు వచ్చి ఆరా తీశారు. ఇటీవలే శ్రీనివాస్‌ను లక్సెట్టిపేటకు బదిలీ చేశారు. దీంతో డీజీ వికే సింగ్ వేధింపులు..బదిలీని భరించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా లేఖలో శ్రీనివాస్ పేర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

17:11 - September 14, 2016

హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతిని సందర్శించుకొనేందుకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. రేపు నిమజ్జనానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దీనితో గణనాథుడిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తున్నారు. అర్దరాత్రి వరకు మాత్రమే దర్శనానికి అనుమతినివ్వనున్నట్లు తెలుస్తోంది. నిమజ్జనం చేసేందుకు చర్యలను ఇప్పటికే తీసుకుంటున్నారు. విగ్రహానికి ఇరువైపులా ఉన్న డెకరేషన్..ఇతరత్రా వాటిని తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఉత్సవ నిర్వాహకుడు మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న నిమజ్జన కార్యక్రమంలో మార్పు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం..పోలీసులు..ఉత్సహ కమిటీ నిర్ణయం ప్రకారం తొలుత నిమజ్జనం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. గురువారం ఉదయం ఆరు గంటలకు ట్రాలీ పైన ఎక్కిస్తామని, అనంతరం పోలీసుల వారి అనుమతితితో ఊరేగింపు ఉంటుందన్నారు. గతంలో 6,300 కిలోల లడ్డూను వచ్చిన భక్తులకు పంచలేకపోయామని, లాఠీ ఛార్జీ జరిగిందని గుర్తు చేశారు. దీనితో ఈసారి ఏర్పాటు చేసిన 500 కేజీల లడ్డూను లైన్ లో వచ్చే భక్తులకు పంచడం జరిగిందన్నారు. 

నిమజ్జనం భారీ ఏర్పాట్లు - జీహెచ్ఎంసీ కమిషనర్..

హైదరాబాద్ : గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేయడం జరిగిందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేక టీంలు..నిమజ్జనం కోసం 7.17 కోట్ల ఇంజినీరింగ్ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ట్యాంక్ బండ్ పై 27 భారీ క్రేన్ లు..ఎన్టీఆర్ మార్గ్ వద్ద 10 భారీ క్రేన్ లు...జీహెచ్ఎంసి పరిధిలో 24 చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎప్పటికప్పుడు వ్యర్థాల తొలగింపు ప్రక్రియను కూడా చేపట్టడం జరుగుతుందని, 200 మంది వాలంటర్లు షిప్టుల వారీగా పనిచేస్తారని..ప్రతి 4 కి.మీటర్ కు ఒక యాక్షన్ టీం ఉంటుందన్నారు. 

16:27 - September 14, 2016

కృష్ణా : జిల్లాలో కామాంధులు రెచ్చిపోయారు. ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాపులపాడు మండలంలోని వేలేరు నుండి వెళుతున్న నలుగురు యువకులు ఓ బాలికను అడ్డగించారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆ యువకులు బెదిరించారు. దీనితో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. చివరకు అమ్మమ్మకు చెప్పడంతో కామాంధులు రాజీ కుదుర్చుకొనేందుకు ప్రయత్నించారు. చివరకు సాహసం చేసిన ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కృష్ణా జిల్లాలో బాలికపై గ్యాంగ్ రేప్..

కృష్ణా : జిల్లా బాపులపాడు (మం) వెలేరులో కామాంధులు రెచ్చిపోయారు. మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

16:17 - September 14, 2016

గుంటూరు : జిల్లాలో ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పల్నాడు ప్రాంతంలో ఉన్న వాగులు..వంకలు..ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి గురజాల వద్దనున్న రైల్వే ట్రాక్ కొట్టుకపోయిన సంగతి తెలిసిందే. దీనిని పునరుద్ధరించేందుకు బుధవారం సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే మాచర్ల మండలం ఎత్తిపోతల జలపాతం వద్ద వరద నీరు పోటెత్తుతోంది. దీనితో దిగువనున్న కృష్ణా నదిలో జలాలు కలుస్తున్నాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. 16 టీంఎసీల నీరు పులిచింతల ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ముంపు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో పలు పంటలు నీట మునిగిపోయాయి. దీనితో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తున్నామని, ప్రస్తుతం వర్షంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

16:14 - September 14, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర టిడిపి నేతలు రాజ్ భవన్ కు తరలి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఆ పార్టీకి చెందిన నేతలు గవర్నర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ ను కోరారు. బుధవారం వీరికి అపాయింట్మెంట్ లభించింది. దీనితో వీరంతా రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని వీరు కోరుతున్నారు. ఒప్పందం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం కలుగుతుందని, అంతేగాకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని టి.టిడిపి పేర్కొంటోంది. రూ. 50వేల కోట్ల ప్రజాధనం వృధా అయ్యే అవకాశం ఉందని కేవలం కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. వెంటనే ఒప్పందాన్ని రద్దు చేసే విధంగా జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను వీరు కోరుతున్నారు. ముఖ్యంగా 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ చేయాలని టి.టిడిపి నేతలు కోరుతున్నారు. వీరి ఫిర్యాదుపై గవర్నర్ నరసింహన్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

గుంటూరులో ఇంకా భారీ వర్షాలు...

గుంటూరు : రెండు రోజులుగా భారీ వర్షాలతో జిల్లాలోల వాగులు..వంకలు పొంగిపొర్లుతున్నాయి. మాచర్ల ఎత్తిపోతల వద్ద వరద నీరు పోటెత్తుతోంది. ఎత్తిపోతల జలపాతం ద్వారా కృష్ణా నదిలో జలాలు కలుస్తున్నాయి. 

గవర్నర్ తో టి.టిడిపి నేతలు..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ తో టి.టిడిపి నేతలు భేటీ అయ్యారు. మహారాష్ట్రతో ప్రభుత్వం కుదుర్చుకున్న నీటి ఒప్పందాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తున్నారు. 

పట్టణీకరణ సవాళ్లు ఎదుర్కొవడమే లక్ష్యం - వెంకయ్య..

విశాఖపట్టణం : పట్టణీకరణ సవాళ్లు ఎదుర్కొవడమే బ్రిక్స్ సదస్సు లక్ష్యమన్నారు. పట్టణీకరణకు అనుకూలంగా మౌలిక సదుపాయాలు కల్పన పెద్ద సవాల్ అని తెలిపారు. 32 శాతం మంది ప్రజలు పట్టణాల్లో నివాసం ఉంటున్నారని, దేశ జీడీపీలో 65 శాతం ఆదాయం పట్టాణాల నుండే వస్తోందని, బ్రెజిల్ లో 84 శాతం మంది పట్టణాల్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. పట్టణీకరణకు అనుగుణంగా లక్ష్యాలు రూపొందించేందుకు ఈ సదస్సు లక్ష్యమన్నారు.  

ఢిల్లీలో చికెన్ గున్యాతో మరొకరు మృతి..

ఢిల్లీ : చికెన్ గున్యా విజృంభిస్తోంది. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. మొత్తం చికెన్ గున్యా మృతుల సంఖ్య 9కి చేరింది. 

డూండీ గణేష్ ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షుడికి బెయిల్...

విజయవాడ : డూండీ గణేష్ ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షుడు మాగంటి సత్యనారాయణకు కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. ఈనెల మూడో తేదీన సత్యనారాయణ అరెస్టయిన సంగతి తెలిసిందే. 

15:41 - September 14, 2016

బెంగళూరు : కావేరీ జల వివాదాలతో అట్టుడికిన కర్నాటక రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుండడంతో పరిస్థితులు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బెంగళూరులోని 16 ప్రాంతాల్లో కర్ఫ్యూని ఎత్తివేశారు. 144 సెక్షన్ ను మాత్రం కొనసాగిస్తున్నారు. బుధవారం కొన్ని విద్యా సంస్థలు తెర్చుకున్నాయి. 15వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న 500 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమపై దాడులు జరుగుతుండడంతో తమిళ కుటుంబాలు బెంగళూరు నగరాన్ని వదిలిపెట్టి వెళుతున్నారు. ఇప్పటి వరకు రూ. 22వేల కోట్ల నష్టం జరిగినట్లు అసోచామ్ వెల్లడించింది. 

15:36 - September 14, 2016

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని చికెన్ గున్యా వణికిస్తోంది. ఈ వ్యాధి వేగంగా ప్రబలుతోంది. దీనితో ఈ వ్యాధి బారిన పడిన వారు పలు ప్రభుత్వ ఆసుపత్రులు..ప్రైవేట ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా మరొకరు మృతి చెందారు. దీనితో ఈ వ్యాధి కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. ఒంటి నొప్పులు..జ్వరంతో వందలాది మంది బాధితులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. చికెన్ గున్యా మరణాలన్నీ ఒకే ఆసుపత్రిలో సంభవించాయని దీనిపై దర్యాప్తు చేయడం జరుగుతోందన్నారు. దోమలను అరికట్టడానికి ఢిల్లీ నగర పాలక సంస్థ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో 1158 డెంగ్యూ..1057 చికెన్ గున్యా..21 మలేరియా కేసులు నమోదయ్యాయి. 

15:28 - September 14, 2016

విశాఖపట్టణం : పట్టణ జనాభా పెరుగుతోందని, పట్టణాల్లో మురికివాడల నిర్వాహణ సవాల్ తో కూడుకొందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జిల్లాలో బ్రిక్స్ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...భవిష్యత్ లో పట్టణీకరణదే ప్రధాన పాత్ర పోషిస్తుందని, 2050 నాటికి ప్రపంచంలో అధిక జనాభ పట్టణాల్లోనే నివసిస్తుందన్నారు. పట్టణాల్లో సీసీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించవచ్చని తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధి రేటు వేగంగా పెరుగుతోందని, దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రధాన మంత్రి దేశ విదేశాల్లో పర్యటిస్తూ దేశాభివృద్దికి కృషి చేస్తున్నారని తెలిపారు. 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన దేశాల్లో తొలి మూడు రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా భవన నిర్మాణ అనుమతులను ఆన్ లైన్ లో చేపడుతున్నట్లు, ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇంటింటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. 

గవర్నర్ పై వీహెచ్ విమర్శలు..

హైదరాబాద్ : మల్లన్న సాగర్ రైతుల ఇబ్బందులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి గవర్నర్ ఎందుకు చెప్పరని కాంగ్రెస్ నేత వీహెచ్ ప్రశ్నించారు. రైతులపై చేసిన లాఠీఛార్జ్ గవర్నర్ కు కనిపించదా ? అని ప్రశ్నించారు. నరసింహన్ ఆంధ్రా గవర్నర్ గా వ్యవహరిస్తున్నారని, గవర్నర్ గుళ్లూ గోపురాలు తిరగడం తప్ప తెలంగాణ ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించినట్లే పాలనలో చూపించాలని సూచించారు. 

లోకేష్ కు ఐటీ శాఖ ?

విజయవాడ : దసరాకు ఏపీ మంత్రివర్గంలో మార్పులు..చేర్పులు జరగనున్నాయి. ఏపీ కేబినెట్ సంఖ్య 20 నుండి 26 కు విస్తరించనున్నట్లు, లోకేష్ కు ఐటీ శాఖతో పాటు, కీలక బాధ్యతలు అప్పచెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈనెలాఖరుకు కొత్తవారి పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. కోడెలకు మంత్రి పదవి కట్టబెట్టి ధూళిపాళ్లకు స్పీకర్ బాధ్యతలు అప్పచెబుతారని తెలుస్తోంది. గంటా, శిద్ధా, చినరాజప్ప పదవుల్లో మార్పులు ఉంటాయని, కేబినెట్ లో సుజయ్ కృష్ణా, భూమా, జ్యోతులకు బెర్త్ కల్పించనున్నారని సమాచారం. మంత్రి యనమలకు అదనపు బాధ్యతలు ఇస్తున్నట్లు

సమాచారం. 

ప్రముఖ రచయిత రుక్మిణి (రాంరెడ్డి) అస్తమయం..

హైదరాబాద్ : ప్రముఖ రచయిత రుక్మిణి (రాంరెడ్డి) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన నిమ్స్ లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున కన్నుమూశారు. ప్రజానాట్య మండలిలో రాంరెడ్డి పనిచేశారు. గతంలో వరంగల్ జిల్లా డోర్నకల్ ఎంఈవోగా పనిచేశారు. 

25వేల మందితో బందోబస్తు - సీపీ..

హైదరాబాద్ : రేపు గణేష్ నిమజ్జనం కోసం 25 వేల మంది బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. 24 గంటలూ సీసీ కెమెరాలతో పర్యవేక్షించడం జరుగుతోందని, అనుకున్న సమయం కన్నా ముందే నిమజ్జనాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

నయీం కేసు..సిట్ దూకుడు..

హైదరాబాద్ : నయీం కేసులో సిట్ దూకుడు పెంచింది. ప్రజాప్రతినిధులకు, రిటైర్డ్ పోలీసు అధికారులకు సీఆర్పీసీ 160 ప్రకారం నోటీసులను ఇవ్వనుంది. నయీం వ్యవహారాల్లో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పాత్ర ఉన్నట్లు ఆధారాలు గుర్తించింది. నోటీసుల అనంతరం సిట్ అధికారులు విచారించనున్నారు. నయీం కేసులో భువనగిరి సబ్ రిజిష్ట్రార్ వాయిద్ ఖాన్ ను భువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీం చేసిన కబ్జాలకు వాయిద్ ఖాన్ సహకరించినట్లు ఆరోపణలున్నాయి. 

రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుపై ఏపీలో సదస్సు...

విశాఖపట్టణం : రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో అవకాశం అంశంపై సదస్సు ఏర్పాటైంది. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రష్యాకు చెందిన నౌకా నిర్మాణ పరిశ్రమ విశాఖలో ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చిస్తున్నారు. రక్షణ రంగంలో రష్యా చాలా బలంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 

14:48 - September 14, 2016

హైదరాబాద్ : జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణతో తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రం మరికొన్ని నెలల్లో కొత్త రూపం సంతరించుకోనుంది. కొత్త జిల్లాలు, మండలాలు, రెవిన్యూ డివిజన్లతో రాష్ట్ర అంతర్గత నైసర్గిక స్వరూపం మారనుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ నూతన పట్టణాలు ఏర్పాటు కానున్నాయి. పెరిగే జనాభాకు అనుగుణంగా నివాసం, ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కొత్త పట్టణాల ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. 13 పట్టణాల ఏర్పాటు బాధ్యతలు హెచ్ఎండీకు అప్పగించింది.  వచ్చే అక్టోబర్‌ నుంచి కొత్త జిల్లాల్లో పాలన చేపట్టేదిశగా తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. 10 జిల్లాలకు తోడు మరో 17 జిల్లాలు అదనంగా ఏర్పాటు కానుండటంతో.. రాష్ట్ర అంతర్గత స్వరూపం పూర్తిగా మారబోతుంది. ఔటర్‌ రింగు రోడ్డు సరిహద్దులో 13 నూతన పట్టణాల ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తం మూడు దశల్లో రాష్ట్రంలో పట్టణీకరణ చేయాలని భావిస్తుంది. తద్వారా అత్యాధునిక పరిశ్రమలు, సకల సదుపాయాలతో కూడిన టౌన్‌షిప్‌లు ఆవిర్భవించనున్నాయి. మూడుదశల్లో వీటి నిర్మాణం చేపట్టేందుకు హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ కార్యాచరణ రూపొందిస్తోంది.

ప్రభుత్వానికి నివేదిక..
తొలిదశలో బాహ్య వలయ రహదారి చుట్టూ 13 పట్టణాలు ఏర్పడనున్నాయి. ఇక్కడ రహదారులు,వసతుల కల్పనకు సుమారు 13 వేల కోట్ల వ్యయమవుతుందని హెచ్ఎండీఏ అంచనా వేస్తుంది. హెచ్ఎండీఏ పరిధిలో ప్రస్తుతం 1.06 కోట్ల జనాభా ఉంది. 2041 నాటికి ఈ సంఖ్య 1.92 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. వీరికీ ఆవాసం, ఉపాధి కల్పించడం సమస్యగా మారింది. పెరిగే జనాభాను దృష్టిలో ఉంచుకుని ఆధునిక పట్టణాలను నిర్మించే పనిని రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీకు అప్పగించింది. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసిన లీ సలహా సంస్థ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికకు అనుగుణంగా పట్టణాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు హెచ్‌ఎండీఏ అధికారులు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేశారు.

హైదరాబాద్ పరిధిలో నో పరిశ్రమలు..
ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నూతన పట్టణాల రూపకల్పనకు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇకపై హైదరాబాద్‌ పరిధిలో నూతన పరిశ్రమలు ఏర్పాటుకు అనుమతి ఇవ్వరని సమాచారం. రంగారెడ్డి, శంషాబాద్, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక ప్రభుత్వం మార్క్ చేసిన ప్రాంతాల్లో 550 ఎకరాలు, అంతకంటే ఎక్కువ భూమిని రైతుల నుంచి హెచ్‌ఎండీఏ సమీకరించాలని నిర్ణయించింది. రెండో దశలో బీబీనగర్‌, భువనగిరి, చేవెళ్ల, చౌటుప్పల్‌, దౌవుద్‌గూడ, ఫరూక్‌నగర్‌, గుండ్లగూడ, ఇబ్రహీంపట్నం, జీడిమెట్ల, మల్కాపూర్‌, సంగారెడ్డి, షాబాద్‌ ప్రాంతాల్లో మరో 13 కొత్త పట్టణాలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ కూడా మూడొంతుల భూభాగంలో ఎంపికచేసిన పరిశ్రమలను ఏర్పాటుచేస్తారు. మిగతా స్థలాలను టౌన్‌షిప్‌లుగా మారుస్తారు. మూడోదశ కింద నర్సాపూర్‌, యాచారం, తుర్కపల్లి, దండుమైలారం, ములుగు సహా 45 ప్రాంతాల్లోనూ పరిశ్రమలు, టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తారనే ప్రచారం వినిపిస్తోంది. 

14:35 - September 14, 2016

తూర్పుగోదావరి : 'అన్నవరం' పుణ్యక్షేత్రం..ఈ దేవస్థానం ప్రముఖ ఆలయాల్లో ఒకటి. వేలాది మంది వచ్చే ఈ ప్రాంతంలో భద్రతను అధికారులు గాలికొదిలేశారు. భద్రత కొండెక్కింది.. భక్తులకు రక్షణగా ఉండాల్సిన సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఉద్యోగులు, అధికారులు అందరూ నిద్రమత్తులో జోగుతున్నారు. రాత్రి షిఫ్ట్ లో భక్తులకు సహాయంగా ఉండాల్సినవారంతా పనులన్నీ వదిలేసి నిద్రపోతున్నారు. మరికొందరు బయటి వ్యక్తులకు ఈ పనులు అప్పగించి గుర్రుపెట్టేస్తున్నారు. ఈ ఆలయం రక్షణకోసం ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా సిబ్బంది మాత్రం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది తీరు చూసిన భక్తులు కొండపై అనుకోని సంఘటన జరిగితే బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ప్రశ్నించినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. టెన్ టివి నిఘాలో బయటపడిన ఈ కథనంపై అధికారులు స్పందిస్తారా ? లేదా ? అనేది వేచి చూడాలి. 

14:32 - September 14, 2016

హైదరాబాద్ : నయీం కేసు వ్యవహారంలో సిట్‌ దూకుడు పెంచింది. కేసుకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, రిటైర్డ్‌ పోలీస్‌ అధికారులకు సీఆర్పీసీ 160 ప్రకారం సిట్‌ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. నయీం వ్యవహారాల్లో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పాత్ర ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. నోటీసుల అనంతరం సిట్‌ అధికారులు వారిని విచారించనున్నారు. మరోవైపు నయీం కేసులో భువనగిరి సబ్‌రిజిస్ట్రార్‌ వాయిద్‌ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీం కబ్జాలకు వాయిద్‌ఖాన్‌ సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

14:30 - September 14, 2016

హైదరాబాద్ : ప్రముఖ రచయిత రుక్మిణి కన్నుమూశారు. రుక్మిణి అసలుపేరు రాంరెడ్డి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రుక్మిణి నిమ్స్ లో చికిత్సపొందుతూ చనిపోయారు. ప్రజానాట్య మండలిలో పనిచేసిన రాంరెడ్డి పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. గతంలో వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ ఎఈవోగా పనిచేశారు. 1945 ఏప్రిల్ లో డోర్నకల్ లో జన్మించిన రాంరెడ్డి బిఎస్సీ వరకు చదివారు. వృత్తిరీత్యా టీచర్ అయినప్పటికీ అనేక కథలు రాసారు. ఇటు రచయితగా, కార్టూనిస్టుగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. వివిధ వారపత్రికల్లో, మాస పత్రికల్లో 15వందలకు పైగా కార్టూన్లు వేసారు. గులాబి, కోతులు, నీడ అనే నవలల్ని కూడా రచించారు. మూడుసార్లు జాతీయ స్థాయిలో పురస్కారాలను పొందారు. 10టీవిలో ప్రసారమైన మాయా మశ్చింద్రా అనే కార్యక్రమానికి చాలాకాలం పాటు సేవలందించారు. 2013 లో తెలుగు యూనివర్శిటీ రాంరెడ్డికి కీర్తి ప్రతిష్టాపురస్కారం అందజేసి సత్కరించింది. రుక్మిణి అనేక పలు కథల్ని తెలుగులోకి అనువదించారు. రుక్మిణి మృతిపట్ల పలువురు కళాకారులు సంతాపం ప్రకటించారు.

14:28 - September 14, 2016

గుంటూరు : జిల్లాలోని జూట్‌ మిల్‌ను తెరిపించాలంటూ కార్మికులు సామూహిక నిరాహరదీక్షలకు దిగారు. కలెక్టరేట్‌ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు టెన్ టివితో మాట్లాడారు. యాజమాన్యం, ప్రభుత్వం నియంతృత్వపు పోకడలతో ముందుకెళుతోందని, భజరంగ్ జూట్ మిల్లును వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మిల్లును తెరిపిస్తామని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని, రాష్ట్ర మంత్రులు కూడా మాట్లాడారని గుర్తు చేశారు. కానీ యాజమాన్యం నెపం పేరిట తప్పించుకోవాలని చూడడం సరైంది కాదన్నారు. మిల్లుకు చెందిన స్థలాలు అమ్ముకుంటున్నారని, యాజమాన్యం రిజిస్ట్రేషన్ చేసిన సంబంధిత డ్యాక్యుమెంట్లను ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందన్నారు. అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రేపు జరిగే సమావేశంలో ప్రభుత్వం స్పందిస్తుందని భావనతో ఉంటున్నట్లు, యజామాన్యంతో కుమ్మక్కై ఉంటే ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. యాజమాన్యం చర్చలకు రాకపోతే చర్చలను బాయ్ కాట్ చేస్తామని, మిల్లును తెరిపించడం తప్ప ప్రత్యామ్నాయం లేదన్నారు.

14:25 - September 14, 2016

కర్నూలు : జిల్లాలో సోలార్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం రైతుల భూములు లాక్కోవడం దారుణమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు అన్నారు. కర్నూలు జిల్లాలోని ప్లాంట్‌ నిర్మాణం జరగబోయే గ్రామాల్లో ఆయన పర్యటించారు. పంట భూముల్లో ప్లాంట్‌లు నిర్మించి, ఎవరిని ఉద్ధరిస్తారని ఆయన ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడుతున్న రైతులపై కేసులు పెట్టడం సరికాదని అన్నారు. రైతులకు న్యాయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభత్వంపైనే ఉందని చెప్పారు. దేశానికి కావాల్సింది రైతులని, వారు పండిస్తేనే అందరికీ ముద్ద లోపలికి వెళుతుందన్నారు. రైతాంగాన్ని నాశనం చేసి ఎవరు ప్రయోజనం కోసం చేస్తున్నారని సూటీగా ప్రశ్నించారు. 

14:21 - September 14, 2016

విశాఖపట్టణం : రైల్వేజోన్‌ ఉద్యమం మరింత ఉధృతమవుతోంది.. ప్రత్యేక రైల్వే జోన్‌ కోసం సీపీఎం, సీపీఐ, వైసీపీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైల్‌ రోకో చేపట్టారు. పెందుర్తి దగ్గర విశాఖ రాయ్‌గఢ్‌ రైలును అడ్డుకున్నారు. రైలు పట్టాలపైనే బైఠాయించి నిరసన తెలిపారు. వీరందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రైలును పంపేశారు.

ఎమ్మెల్యే వంశీచంద్ ఆమరణ నిరహార దీక్ష..

మహబూబ్ నగర్ : కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ గా చేయాలంటూ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆమరణ నిరహార దీక్షకు కూర్చొన్నారు. ఈ దీక్షకు మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, మాజీ ఎమ్మెల్యే ఎడ్మా కృష్ణారెడ్డి లు మద్దతు తెలిపారు. 

కౌలాత్ నాలా ప్రాజెక్టు నిండింది..

నిజామాబాద్ : కౌలాత్ నాలా ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీనితో ప్రాజెక్టు నాలుగు గేట్లను అధికారులు ఎత్తివేశారు. 

కేంద్ర మంత్రి నడ్డా సమీక్ష..

న్యూఢిల్లీ : ఢిల్లీతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో చికున్ గున్యా, డెంగ్యూ కేసులు ఎక్కువైన నేప‌థ్యంలో కేంద్ర‌మంత్రి ఇవాళ ఆరోగ్య‌శాఖ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. చికున్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధుల‌కు దేశంలో మందుల కొర‌త ఏమీ లేద‌ని జేపీ న‌డ్డా తెలిపారు. 

సిద్ధూ...నవజ్యోత్ కౌర్ బీజేపీకి గుడ్ బై..

పంజాబ్ : మాజీ రాజ్యసభ సభ్యుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆయన భార్య నవజ్యోత్ కౌర్ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. వీరిద్దరూ పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. 

రేపు సెలవు..

హైదరాబాద్ : గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా గురువారం నాడు సెలవు ప్రకటిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి ప్రతిగా నవంబర్ 12న రెండో శనివారం నాడు సెలవును పనిదినంగా మారుస్తూ జీవో జారీ చేసింది.

13:41 - September 14, 2016

న్యాయసలహాలు..సూచనలు అందించే మైరైట్ కార్యక్రమం ఈరోజు కూడా మన ముందుకు వచ్చేసింది. ఈరోజు 'మైరైట్' కార్యక్రమంలో విడాకులు..పునర్వివాహ చట్టం.. గురించి తెలిపేందుకు అడ్వకేట్ పార్వతిగారు మనముందుకు వచ్చారు. వివాహం అనంతరం భార్యా భర్తలకు సఖ్యత కుదరని పక్షంలో..వేరే కారణాలతో ఇద్దరు విడిపోవాలనుకోవాలని నిర్ణయించుకున్నవారికి చట్టం కల్పించే అవకాశం విడాకులు...అనంతరం వారు ఎవరి జీవితాన్ని వారు ఏర్పరచుకోవటానికి వీలైనది పునర్వివాహ చట్టం. ఈ విషయంలో చాలా అనుమానాలు వస్తూంటాయి... మీ అనుమానాలను నివృతి చేసుకోవాలంటే ఈ వీడియోను చూడండి... 

13:32 - September 14, 2016

హైదరాబాద్ : రాజధాని అమరావతి నిర్మాణంలో స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై ఉమ్మడి హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ అడ్వకేట్ జనరల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిని స్వీకరించేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. రెగ్యులర్ పిటీషన్ దాఖలు చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. దీంతో ప్రభుత్వం సాధారణ అప్పీలుకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. దీనిపై రేపు విచారణకు రానుంది. కాగా, స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో హైకోర్టు స్టే కారణంగా పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.సీఆర్‌డీఏ నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో సాంకేతిక అర్హత బిడ్లు దాఖలు చేసేందుకు గడువు మంగళవారంతో ముగిసింది. 

13:14 - September 14, 2016

విజయవాడ : ఏపీ క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయా? అంటూ అవుననే అనుకోవాల్సిన వస్తోంది. దసరా పండుగ నాటికి ఏపీ మంత్రివర్గంలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. లోకేష్ ను క్యాబినెట్ లోకి తీసుకోవాలని గత కొంతకాలంలో వార్తలు వినవస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్త కూడా ఖాయం కానున్నట్లు సమాచారం. అలాగే వైసీపీ నుండి వచ్చిన నేతలు సుజ్ కృష్ణ, భూమ, జ్యోతుల నెహ్రూలకు కేబినెట్ లో బెర్త్ ఖరారుకానుంది. లోకేష్ కు ఐటీ శాఖతో పాటుగా కీలక బాధ్యతల్ని అప్పగించనుట్లు తెలుస్తోంది. కేబినెట్ సంఖ్య 20 నుండి 26కు విస్తరించనున్నారు. ఈ నెలాఖరు నాటికి కొత్తవారి పేర్లు వెల్లడించే అవకాశముంది. ప్రస్తుతం స్పీకర్ గా వున్ కోడెలకు మంత్రి పదవి..ధూళిపాళ్లకు స్పీకర్ బాధ్యతలు అప్పగించనున్నట్లుగా తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావు, నిమ్మకాల చినరాజప్ప పదవుల్లో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. కాగా ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా వున్న యనమలకు అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. 

లోయలో పడ్డ కారు..4గురు మృతి..

ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అల్మోరాలోని దన్‌పో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు లోయలో పడిపోయిన ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కారు సుమారు 70 మీటర్ల ఎత్తు నుంచి లోయలోకి పడిపోవడంతో దుర్ఘటన చోటుచేసుకుంది.

12:51 - September 14, 2016

వరంగల్ : పోరాటాల ఖిల్లా వరంగల్‌ జిల్లాలో రైతులు పోరుబాట పట్టారు. మెగా టెక్స్‌టైల్‌ పార్కు భూసేకరణకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ధర్నాలు, రిలేదీక్షలతో హోరెత్తిస్తున్నారు. అభివృద్ధి పేరుతో రెండు పంటలు పండే భూములను లాక్కోవద్దని ఆక్రోశిస్తున్నారు. పంటభూముల్లో కాకుండా ప్రభుత్వ భూముల్లో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యమ జ్వాలలు
వరంగల్‌ జిల్లాలో మెగా టెక్స్ టైల్ పార్కు వ్యతిరేక ఉద్యమ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అన్నదాతల ఆందోళనలతో సంగెం, గీసుకొండ మండలాలు అట్టుడుకుతున్నాయి. టెక్స్‌టైల్‌ పార్కు భూసేకరణను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములు ఇచ్చేదే లేదని పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు.

మిన్నంటిన మెగా టెక్స్‌టైల్ పార్కు వ్యతిరేక ఆందోళనలు
వరంగల్‌ జిల్లాలోని గీసుకొండ, సంగెం మండలాల్లో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు కోసం 2 వేల ఎకరాలు సేకరించాలని అధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఊకల్, చింతాలపల్లి, శాయంపేట, కృష్ణ నగర్ గ్రామాల్లో వ్యవసాయ భూములు సేకరిస్తారన్న ప్రచారం స్థానిక రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. భూ సేకరణ సర్వేకు వ్యతిరేకంగా రైతులు కదం తొక్కారు. ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహించడాన్ని నిరసిస్తూ 4 గ్రామాల రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అసైన్డ్‌ భూముల పేరుతో పంటపొలాలు లాక్కునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అవసరమైతే ప్రాణాలు ఇస్తాం కానీ భూములు మాత్రం ఇవ్వమని తెగేసి చెబుతున్నారు.

4 గ్రామాల రైతుల రిలే నిరాహార దీక్షలు
ఒకవేళ భూసేకరణ తప్పనిసరైతే ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం కాకుండా మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమలు, అభివృద్ధి పేరుతో రైతుల భూములు లాక్కోవద్దని భూ సంరక్షణ సమితి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సంగెం, గీసుకొండ మండలాల్లో భూసేకరణ చేపడితే 8 వందల రైతు కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదముందంటున్నారు. ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని.. కాదని ప్రభుత్వం మొండికేస్తే మల్లన్న సాగర్ కన్నా పెద్దఎత్తున పోరాటం చేసేందుకు రైతులు సిద్దంగా ఉన్నారని హెచ్చరిస్తోంది.

ప్రభుత్వ భూముల్లో టెక్స్‌టైల్‌ పార్కు నిర్మించాలని డిమాండ్‌
మొత్తానికి మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు ప్రతిపాదన సంగెం, గీసుకొండ మండలాల్లో అగ్గిరాజేస్తోంది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  

12:47 - September 14, 2016

హైదరాబాద్‌ : గురువారం జరగబోయే గణేశ్ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఈసారి భిన్నంగా నిమజ్జన ఏర్పాట్లలో టెక్నాలజీని వినియోగిస్తామంటున్నకమిషనర్‌ మహేందర్‌ రెడ్డి తెలిపే వివరాలకు వీడియో చూడండి..

12:43 - September 14, 2016

కడప : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో... ఎమ్మెల్సీ గేయానంద్‌ నిరాహార దీక్ష ప్రారంభించారు. విభజన చట్టంలో పేర్కొన్న స్టీల్‌ప్లాంట్‌ను కడపలో ఏర్పాటు చేయాలంటూ ఆయన 30 గంటల నిరసన దీక్షను చేపట్టారు. గేయానంద్‌ నిరాహాదీక్షకు పలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉక్కు పరిశ్రమ ఏర్పడే వరకూ తన పోరాటం ఆగదని... స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వం రంగంలోనే నిర్మిచాలని గేయానంద్‌ స్పష్టం చేశారు.

12:40 - September 14, 2016

రంగారెడ్డి : మైలార్ దేవ్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. హౌసింగ్ బోర్డ్ లో నివాసముంటున్న గాయత్రి అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారంకోసం వీడియో చూడండి..

12:32 - September 14, 2016
12:30 - September 14, 2016

కర్నాటక : ఆందోళనకారులు బెంగళూరులో విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వం, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. తమిళనాడుకు చెందిన వాహనాలు, బస్సులకు నిప్పుపెట్టారు. ఈ ఘటనల కారణంగా భారత సిలికాన్‌ వ్యాలీగా పేరు పొందిన బెంగళూరులో ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన సంస్థలు మూతపడ్డాయి. మరికొన్ని సంస్థలు తమ ఉద్యోగులను ఇంటిదగ్గర నుంచే పని చేయాలని సలహా ఇచ్చాయి. ప్రముఖ ఐటీ కంపెనీల ప్రధాన కార్యాలయాన్నీ బెంగళూరులోనే ఉండటంతో, కావేరి విధ్వంసం వీటిపై పడింది. తమ కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించాయి. ప్రపచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ రిటెయిల్‌ వ్యాపార సంస్థ.. తమ డెలివరీ ఆపరేషన్లు దెబ్బతినడంతో.. భారీ నష్టం వచ్చినట్టు ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా మళ్లీ కార్యకలాపాలను పునఃప్రారంభిస్తామని చెప్పింది.

వివాదంగా మారిన కావేరీ జలాలు
కావేరి జలాల వివాదం సందర్భంగా తలెత్తిన ఘర్షణలు, ఆస్తుల విధ్వంసం కర్నాకటకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. తాత్కాలిక అంచనాల ప్రకారం 25 వేల కోట్ల వరకు వ్యాపార నష్టం జరిగినట్టు అసోచామ్‌ వెల్లడించింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

విధ్వంసం నష్టం రూ. 22 వేల నుంచి 25 వేల కోట్లు
తమిళనాడు-కర్నాటకల మద్య తలెత్తిన కావేరి జలాల వివాదం భారీ నష్టానికి దారితీసింది. తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ.... కన్నడిగులు సృష్టించిన విధ్వంసం అసోసియేటెడ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ... అసోచాం... తాత్కాలికంగా అంచనా వేసింది. విధ్వంస కాండ కారణంగా జరిగిన నష్టం 22 వేల నుంచి 25 వేల కోట్ల వరకు ఉంటుందని వెల్లడించింది. కొన్ని సంస్థలకు ఇది కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు.

ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చాం -ఫ్లిప్‌కార్ట్‌
బెంగళూరులో నెలకొన్న విధ్వంసకర పరిస్థితులు తమ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపాయని మన దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఉద్యోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో సంస్థ డెలివరీ కార్యక్రమాలు స్తంభించాయి. ఈ విషయాన్ని ఖాతాదారులకు ముందుగానే తెలపడంతో పరిస్థితిని అర్థం చేసుకుని... సహకరిస్తున్నారని తెలిపింది. భారత సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్‌, విప్రోలు కూడా రెండు రోజుల పాటు మూతపడ్డాయి. దీంతో విదేశీ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంలో కొద్దిగా జాప్యం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బహుళజాతి సంస్థలు శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఒరాకిల్‌, ఎంఫాసిస్‌ సంస్థలకు కూడా నష్టం వాటిల్లింది. స్టార్టప్‌ కంపెనీలకు కోలుకోలేని దెబ్బతగింది. అకౌంటింగ్‌ దిగ్గజ సంస్థ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాతోపాటు, పలు ప్రైవేటు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేయడంతో ఆదాయాన్ని కోల్పోయాయి. కావేరి జల వివాదం అన్ని రంగాలపై ప్రభావం చూపింది.

 

12:21 - September 14, 2016
12:19 - September 14, 2016

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంలా తీర్చ దిద్దాలనుకుంటున్న ప్రభుత్వం.... రోడ్లను కూడా అదే విధంగా నిర్మించాలని నిర్ణయించింది. అమరావతి నుంచి దేశంలోని ఎక్కడికైనా సులువుగా చేరుకునేలా రహదారి అనుసంధాన వ్యవస్థను రూపొందిస్తోంది. ఫ్రాన్స్‌, జపాన్‌, సింగపూర్‌ దేశాల్లో రోడ్ల నిర్మాణంలో అనుసరిస్తున్న అధునాత సాంకేతిక పద్ధతలను అమరావతిలో కూడా అవలంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

2020, 2030 నాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం
ఏపీ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. రోడ్లన్నీ అద్దంగా మెరిసిపోవాలి. ఇదే సమయంలో ప్రమాదరహితంగా ఉండాలన్న భావంతో ముందుకు సాగుతోంది. 2020, 2030 నాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం ఏడు ప్రధాన రోడ్లకు వారం లేదా పది రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం. కనకదుర్గ వారధి బోరుపాలెం స్పీడ్‌ యాక్సిస్‌ రోడ్డుకు శంకుస్థాపన

10 సంవత్సరాలకు అంచనాతో రోడ్ల నిర్మాణం
అమరావతి విస్తరణతోపాటు భవిష్యత్‌లో పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది. వచ్చే నాలుగేళ్లు... అంటే 2020 నాటికి ఉండే జనాభా.. ఆ తర్వాత మరో పదేళ్లకు పెరిగే జనసంఖ్యను అంచనావేసి రోడ్లను తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముందుగా ఏడు ప్రధాన రహదారుల నిర్మాణానికి వారం లేదా పది రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉంది. విజయవాడ కనకదుర్గ వారధి నుంచి బోరుపాలెం వరకు నిర్మించతలపెట్టిన స్పీడ్‌ యాక్సిస్‌ రోడ్డుకు ఇప్పటికే శంకుస్థానం జరిగింది. కొత్తగా నిర్మించే రోడ్లలో ఎక్కడెక్కడ అండర్‌ పాస్‌లు రావాలి, ఎక్కెడెక్కల ఫ్లై ఓవర్లు రావాలన్న అంశంపై సింగపూర్‌ సంస్థలతో ప్రభుత్వం చర్చించింది. అలాగే ఒకచోట ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర ఆగిన వావాహచోదకులు మరో మూడు సిగ్నల్స్‌ దగ్గర ఆగకుండా నేరుగా వెళ్లేలా రహదారి వ్యవస్థ ఉండాలన్న భావంతో ప్రభుత్వం ఉంది.

పచ్చదనం కోసం మొక్కల పెంపకం
రోడ్ల పక్కన పచ్చదనం కోసం మొక్కలు పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే మురుగునీరు, వర్షంనీరు పోవడంతోపాటు మంచినీటి సరఫరాకు ప్రత్యేక పైలులైన్ల ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ నుంచి సమకూర్చుకునే అవకాశం
అమరావతిలో నిర్మించే రోడ్ల ప్రణాళికల వరకు అంతా బాగానే ఉన్నా... వీటి నిర్మాణానికి అవసరమై నిధులు ఎక్కడ నుంచి తెస్తారన్న అంశంపై ప్రభుత్వానికి స్పష్టతలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో మౌలిక సదుపాయాలకు నిధుల సమకూర్చే అంశం ఉందన్న వాదాన్నివినిపిస్తోంది. అయితే ఇది ఎప్పటికి అందుతుందన్న అంశంపై మాత్రం పాలకులు నోరు మెదపడంలేదు. అమరావతి రహదారి వ్యవస్థ... విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్ట్‌లా మారకూడదని ప్రజలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తుందని, విదేశీ ఆర్థిక సంస్థలు రుణం వస్తుందన్న నమ్మకంతో చేపట్టిన బెజవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ ఇంకా బాలారిష్టాలను కూడా అధిగమించలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అమరావతి రోడ్లకు ఈ గతిపట్టించకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

12:09 - September 14, 2016

హైదరాబాద్ : మలక్‌పేట్‌ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించుకుపోయింది. అధిక సంఖ్యలో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. మెట్రో పనులకు తోడు ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు రెండు కిలోమీటర్ల మేర వెహికల్స్ స్తంభించుకుపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

12:05 - September 14, 2016

హైదారబాద్ : రాబోయే 20 రోజుల్లో ఇప్పటివరకు అయిన కేసుల చార్జిషీట్లు దాఖలు చేయాలి...ఇక గ్యాంగ్‌స్టర్ కు సహకరించిన పోలీసు అధికారులు.. రాజకీయ నేతలపై ఉన్న అభియోగాలు రుజువు చేస్తూ ఆధారాలు సేకరించాలి...ఆ వెంటనే అరెస్టులకు రంగం సిద్దం చేయాలి... మరో రెండ్రోజుల్లో నిమజ్జనం పూర్తి...ఆ తర్వాత నయీం కేసులపై స్పీడ్ పెంచాలి....సిట్‌ కొత్త రక్తం దూకుడు పెంచనుంది...ఇందుకు కొత్త బాస్‌ ఆదేశాలు జారీ చేశారు...జస్ట్‌ కొన్ని రోజుల్లోనే ఇంకా పెద్దోళ్ల జాతకాలు బయటకు రానున్నాయి...

దర్యాప్తు బృందంతో అదనపు డీజీ సమీక్ష...
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో స్పీడ్ పెంచేందుకు అదనపు డీజీ అంజనీకుమార్ బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే సమీక్షా సమావేశం నిర్వహించారు...సిట్‌ పాత సభ్యులతో పాటు కొత్తగా చేరిన వారితో కలిసి వివరాలు ఆరా తీశారు...రాబోయే 20 రోజుల్లోనే కేసులకు సంబంధించి కొలిక్కి తీసుకురావాలని సూచించారు...వినాయక నిమజ్జనం తర్వాత ఏకకాలంలో పట్టుసాధించాలని యోచిస్తున్నారు...ఇప్పటికి 72 కేసుల్లో 80 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు బెయిల్ పై బయటకు వచ్చారు...

బెయిల్ రాకుండా చూసుకోవాలంటున్న డీజీ అంజనీ కమార్ ...
నయీం ఎన్‌కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాలు...తెలంగాణాలోని జిల్లాల్లో నమోదయిన కేసులకు సంబంధించిన చార్జీషీట్ దాఖలు చేసేంత వరకు నిందుతులను బయటకు రానివ్వకుండా కోర్టులో అడ్డుకోవాలని అడిషనల్ డీజీ అంజనీ కుమార్ సూచించారు... దీనికి సంబంధించి ఎక్కడైతే పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు...వీలయినంత త్వరగా చార్జీషీట్ దాఖలు చేసేందుకు రేడీగా ఉండాలని సూచించారు..అక్రమ ఆయుధాలు కల్గిఉన్నారని ఆర్మ్ యాక్ట్ బలంగా ఉండటంతో నిందుతులకు బెయిల్ లభించకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

పోలీసులు..లీడర్ల అరెస్టులుంటే అవకాశం..
ఇక నయీంకు సహాకరించిన పోలీస్ అధికారులను ఇప్పటికే గుర్తించిన సిట్‌ ఆధారాలు సేకరిస్తున్నారు...చాలా మంది పోలీసులు ఉన్నప్పటికీ నయీంకు వెన్నంటే ఉంటూ సహకరించినవారిలో ముఖ్యులుగా ఆరుగురిని గుర్తించారు...అయితే వారికి సంబంధించిన అరెస్టులు గణేష్ నిమజ్జనం తర్వాత

మరో 30 కేసులు నమోదయ్యే అవకాశం...
ఇక రాజకీయ నేతల అండదండలపై నల్లగొండకు చెందిన ముగ్గురు నేతలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి...భయాందోళనకు గురి చేశారని బాధితుల నుంచి కూడా ఫిర్యాదులు అందాయి...ప్రధానంగా అధికారిక పార్టీకి చెందినవారితో పాటు ఇతర లీడర్లు కూడా ఉన్నారు...వీరందిరిని పదవులకు రాజీనామా చేయించి అరెస్టు చేసేందుకు ప్రభుత్వం నుంచి కూడా సిగ్నల్ తీసుకున్నట్లు తెలుస్తోంది...ఇప్పటికే కొంత మంది నేతల వాగ్మూలం రికార్డు చేశారు...ఓ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ముఖ్యనేతతో పాటు మరికొంత మంది ప్రతిపక్షనేతల పాత్ర పై సిట్ అదారాలు సేకరిస్తుంది...మొత్తం మరో 30 కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

పెద్దలు, పోలీస్ ఉన్నతాధికారులపై కేసులు నమోదయ్యే అవకాశం
నయిమోద్దీన్ కేసులో న్యాయపరమయిన చిక్కులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి...బాధితులకు న్యాయం చేయాలంటే న్యాయస్థానాల్లో కేసులు నిలబడాలి. ఇప్పటికే హైకోర్టులో రెండు ప్రజాప్రయోజానాల వాజ్యం దాఖలు కావడంతో అడ్వకేట్ జనరల్ తో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తానికి 45 రోజులుగా కోనసాగుతున్న దర్యాప్తులో మరో 20 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని సిట్ బావిస్తుంది....నిక్కచ్చిగా దర్యాప్తు కొనసాగితే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పోలీస్ ఉన్నతాధికారులపై కేసులు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. 

11:55 - September 14, 2016

విశాఖపట్నం : బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు బుధవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేనందువల్లనే ఇబ్బందుల్లో వున్న ఏపీకి కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించిందన్నారు. హోదా తో రాలేని లబ్ది ప్యాకేజీతో వస్తుందన్నారు. ఏపీ ప్రజలు ఇది అర్థం చేసుకోవాల్సిన అవుసరం ఎంతైనా వుందన్నారు. 'ప్రత్యేక హోదా' కు పారిశ్రామిక రాయితీలకు ఎంటువంటి సంబంధం లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రత్యేక హోదా వున్న రాష్ట్రాలలోనే పరిశ్రమలు స్థాపిస్తామని ఏ పారిశ్రామికవేత్తలు చెప్పలేదన్నారు. ఏపీకి వున్న రెవెన్యూ లోటును 5ఏళ్ళపాటు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అ సందర్భంగా 'హొదా'కు 'ప్యాకేజీ'కి వున్న వ్యత్యాసాన్ని ఆయన వివరించారు. ప్రత్యేక హోదా వుంటే కేంద్రం 60 శాతం నిధులిస్తే రాష్ట్రం నుండి 40 శాతం ఖర్చుపెట్టాల్సి వుంటుందనీ..అదే ప్యాకేజీ అయితే 90 శాతం కేంద్రం ...రాష్ట్ర 10 శాతం ఖర్చుపెట్టాల్సి వుంటుందన్నారు. రాష్ట్రానికి ఏది మేలో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఏపీకి వున్న రెవెన్యూ లోటును 5 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధుల బాధ్యతను పూర్తిగా కేంద్రమే భరిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్ధేశ్యంతో తాను చొరవ తీసుకుని తెలంగాణలో ఏడు మండలాలను ఏపీలో కలిపేందుకు ప్రతిపాదన తీసుకువచ్చానన్నారు. దీనికి మోదీ ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. దీన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్, ఖమ్మం లలో తన దిష్టిబొమ్మను దగ్థం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బిక్స్ దేశాల సదస్సులో పాల్గొనేందకు విశాఖ వచ్చిన మంత్రి వెంకయ్యనాయుడుకు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనతరం విమానాశ్రయం నుంచి బీచ్‌రోడ్డులోని ఎంపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ హరిబాబుతో పాటు పలువురు భాజపా నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీపీఎం కార్యాలయానికి చేరుకున్న పోలీసులు..

కర్నూలు : సోలార్ పవర ప్లాంట్ నిర్వాశితులను పరామర్శించేందుకు వెళ్తున్న సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులును అడ్డుకునేందుకు పోలీసులు సీపీఎం కార్యాలయాన్ని చేరుకున్నారు. ఓర్వకల్లు మండలం శకునాలలో 144 సెక్షన్ అమలులో వున్నందున పర్యటనకు అనుమతి లేదని పోలీసులు పేర్కొంటున్నారు. 

హస్తిన బాట పట్టిన టీ.కాంగ్ నేతలు..

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తిన బాట పట్టారు. మల్లన్న సాగర్ భూసేకరణపై టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదుచేసేందుకు ఢిల్లీ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సా.5గంటలకు రాష్ట్రపతి తో భేటీ కానున్నారు. 

ప్యాకేజీ వెంకయ్యకు ఘన స్వాగతం..

విశాఖ: బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు బుధవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో భాజపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బీచ్‌రోడ్డులోని ఎంపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ హరిబాబుతో పాటు పలువురు భాజపా నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్‌ స్టేటస్‌ కంటే ఎన్నో ప్రయోజనాలు కలిగిన ప్రత్యేక ప్యాకేజీ సాధించారని కేంద్రమంత్రి వెంకయ్యకు ఆపార్టీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.

గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశృతి..

నిజామాబాద్‌ : దోమకొండలో వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. గ్రామంలో నటరాజ్‌ యూత్‌క్లబ్‌ ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా విద్యుత్‌ దీపాలు వెలిగించేందుకు విద్యుత్‌ లైన్‌కు కొండీలు వేస్తున్న సమయంలో వైరు కిందపడటంతో ఇంటర్‌ విద్యార్థి ఐరేని వివేక్‌ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.

టోల్ గేట్ సిబ్బందిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్..

మెదక్ : కొండపాక మండలం దుద్దెడ టోల్‌గేట్ వద్ద ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు టోల్‌గేట్ సిబ్బంది పైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో టోల్‌గేట్ సిబ్బంది పరశురాములుకు కాలు విరిగింది. బాధితుడిని చికిత్స నిమిత్తం సిద్ధిపేట ఆస్పత్రికి తరలించారు. 

విశాఖకు బయల్దేరిన చంద్రబాబు..

విశాఖ : సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి విశాఖకు బయలుదేరారు. అలాగే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు విశాఖపట్నం చేసుకున్నారు. వెంకయ్యనాయుడు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొననున్నారు. 

మణిపూర్‌ లో భూప్రకంపనలు..

మణిపూర్‌ : రాష్ట్రంలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. సేనాపతి జిల్లాలో ఈ ఉదయం భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌ పై ఈ ప్రకంపనల తీవ్రత 3.7గా నమోదైంది. ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కదిలిపోవడంతో స్థానికులు భయాందోళనల్లో మునిగిపోయారు. దీంతో ఇళ్ల లోంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రకంపనలు స్వల్పమేనని, వీటి కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.

జైల్ సూపరిండెంట్ అదృశ్యం..

హైదరాబాద్‌: జైళ్ల శాఖ డీజీ వికే సింగ్ వేధింపులు భరించలేక పోతున్నాను. అందుకే వెళ్లిపోతున్నాను అని భువనగిరి సబ్ జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ లేఖ రాశారు. ఇటీవలే శ్రీనివాస్‌ను లక్సెట్టిపేటకు బదిలీ చేశారు. అయితే ఆయన రాత్రి నుంచి కనిపించడంలేదు. అతడి ఫోన్ కూడా స్విచ్‌ఆఫ్ వస్తుండడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

10:37 - September 14, 2016

బ్రెజిల్ : బ్రెజిల్ వాణిజ్య రాజధాని రియో డి జెనీరో వేదికగా జరుగుతున్న 2016 పారా ఒలింపిక్స్ మహిళల విభాగంలో భారత్...తొలిపతకం గెలుచుకొంది. మహిళల షాట్ పుట్ లో...45 ఏళ్ల దీపా మాలిక్ రజత పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. పారా ఒలింపిక్స్ లో పతకం నెగ్గిన తొలి భారత మహిళగా రికార్డుల్లో చోటు సంపాదించింది.

మహిళల షాట్ పుట్ లో దీపా మాలిక్ కు రజతం
2016 పారా ఒలింపిక్స్ మహిళల షాట్ పుట్ లో...భారత అథ్లెట్ దీపా మాలిక్ రజత పతకం గెలుచుకొంది. కేవలం 17 మంది సభ్యులతో పాల్గొన్న భారతజట్టు ఇప్పటికే మూడు పతకాలు సాధించి...పతకాల పట్టిక మొదటి 60 స్థానాల్లో నిలిచింది. అమెరికా 46 స్వర్ణాలతో సహా మొత్తం 121 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

దేవేంద్ర ఝఝారియా ప్రపంచ రికార్డు
పారా ఒలంపిక్స్ లో మరో భారత అథ్లెట్‌ సత్తా చాటాడు.. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌ 46 ఈవెంట్లో దేవేంద్ర ఝఝారియా ప్రపంచ రికార్డు సాధించాడు.. అంతకుముందు తన పేరుతోఉన్న రికార్డును తానే బద్దలుకొట్టాడు.. 63.97 మీటర్ల దూరం జావెలిన్‌ విసిరి రికార్డును తిరగరాశాడు.. 2004 అథెన్స్ పారా ఒలంపిక్స్‌లో దేవేంద్ర ఈ ఘనత సాధించాడు.. 

10:27 - September 14, 2016

నల్లగొండ : భవనగిరి సబ్ జైల్ సూపరిండెంట్ శ్రీనివాస్ అదృశ్యమయ్యారు. జైళ్ల శాఖ డీజీ వికే సింగ్ వేధింపులు భరించలేక పోతున్నాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ శ్రీనివాస్‌ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవలే శ్రీనివాస్‌ను లక్సెట్టిపేటకు బదిలీ చేశారు. దీంతో డీజీ వికే సింగ్ వేధింపులు..బదిలీని భరించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా లేఖలో శ్రీనివాస్ పేర్కొన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయిన కుటుంబ సభ్యులు భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

10:16 - September 14, 2016

హైదరాబాద్ : ఆ పార్టీలో సమర్ధులకు కొదవే లేదు.. వారికి మంత్రి పదవులు నిర్వహించిన అనుభవమే కాదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన చరిత్ర కూడా ఉన్న నేతలు. కానీ.. అలాంటి నేతల్లో ప్రస్తుతం అంతర్మథనం మొదలైంది. తమ రాజకీయ భవిష్యత్‌పై పునరాలోచనలో పడ్డారు. తమ పార్టీ అధినేతకు అండగా ఉండటం మాట అటుంచితే.. కనీసం పార్టీ దరిదాపుల్లో కూడా కనిపించకపోవడం విచిత్రం.

కాంగ్రెస్ నుండి వైసీపీ లో చేరిన నాయకులు
వైఎస్‌ జగన్‌ పార్టీ స్థాపించినప్పుడు వైఎస్సార్‌తో అత్యంత సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్‌లో కొనసాగిన నేతలంతా వైసీపీలో చేరారు. వైఎస్‌తో విభేదించిన కొంతమంది నేతలు సైతం జగన్‌తో సన్నిహితంగా ఉంటామనే ధీమాతో వైసీపీలో చేరారు. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార పార్టీ గూటికి చేరారు. ఇంకా ఉన్న కొద్దిమంది నేతలు కూడా పదవులు దక్కకపోయినా

అసంతృప్తితోనే వైసీపీలో కొనసాగుతున్నారు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ఎంతో పట్టున్న నేతగా గుర్తింపు పొందిన ధర్మాన ప్రసాదరావు వైసీపీలో ఉన్నా.. గతంలో వ్యవహరించినంత చురుగ్గా రాజకీయాలపై ఆసక్తి చూపడం లేదు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు వైసీపీలాంటి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అదేబాటలో మరో సీనియర్‌ నేత కొణతాల రామకృష్ణ కూడా నడుస్తున్నారు. వీరిద్దరూ వైఎస్‌కు అనుంగు అనుచరులుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలే. ఇక వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించిన కొత్తపల్లి గీత.. సాంకేతికంగా వైసీపీలోనే ఉన్నా.. ఆమె పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు. అదేవిధంగా మరో సీనియర్‌ నేత మైసూరారెడ్డి పరిస్థితి కూడా ఇదే.

ధర్మానకు ఏ బాధ్యతలు అప్పగించని జగన్
ఇక ధర్మాన విషయంలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి 30 మందికిపైగా నేతలను ఇన్‌చార్జ్ లుగా నియమించినా.. ధర్మానకు ఏ బాధ్యతలు అప్పగించలేదు. దీంతో ధర్మాన వైసీపీకి దూరమైనట్లేనన్న అనుమానాలు బలపడుతున్నాయి.

జగన్ వ్యవహార శైలితో ఇబ్బంది పడతున్న నేతలు
అదేవిధంగా పార్టీలో యాక్టివ్‌గా ఉన్న మరికొంతమంది నేతలు కూడా పార్టీ అనుసరిస్తున్న విధానాలపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికంతటికి వైఎస్‌ వ్యవహారశైలే ప్రధాన కారణమనే వాదన కూడా వినిపిస్తోంది.

09:59 - September 14, 2016

హైదరాబాద్ : గణేష్‌ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన నిమజ్జనం ఊరేగింపులకు పోలీసులు ఏర్పాట్లుచేశారు. ఊరేగింపు మార్గాల్లో పటిష్ట మైన బందోబస్తు ఏర్పాటుచేశారు. హైదరాబాద్ నగరంలోని అన్ని జోన్ల నుంచి నిమజ్జనం రోడ్‌ మ్యాప్‌ను పోలీసులు ఖరారు చేశారు.

నిమజ్జనం రూట్‌ మ్యాప్‌
వినాయక విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో ఊరేగింపు మార్గాల్లో పోలీసులు ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గం ఇది. బాలాపూర్‌ నుంచి మొదలయ్యే ఊరేగింపు కేశవగిరిమీదుగా నాగుల్‌చింత, ఫలక్‌నుమ, చార్మినార్‌, మదీనా, అఫ్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్‌, అబిడ్స్, బషీర్‌బాగ్‌, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకొని నిమజ్జనం జరుగుతుంది.

ఐఎస్‌సదన్‌ నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు...
ఇక ఐఎస్‌సదన్‌ నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు..సైదాబాద్ మీదుగా నల్గొండ క్రాస్‌రోడ్‌, చాదర్‌ఘాట్‌ బ్రిడ్జ్‌, కోఠీ, ఎంజే మార్కెట్‌, నాంపల్లి, లిబర్టి మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది. అలాగే ఆసిఫ్‌నగర్‌ నుంచి వచ్చే వినాయక విగ్రహాలు..దారుసలాం మీదుగా ఎంజే మార్కెట్‌, ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది. అలాగే ఎస్సార్‌నగర్ నుంచి వచ్చే ఊరేగింపు..అమీర్‌పేట, పంజాగుట్ట, వివి విగ్రహం, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది. ఇక ముషీరాబాద్‌ నుంచి వచ్చే ఊరేగింపు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, లిబర్టి మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్‌ నుంచి వచ్చే ఊరేగింపు ప్యారడైజ్‌, కర్బలామైదాన్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది.

బేగంపేట నుంచి మొదలయ్యే ఊరేగింపు రసూల్‌పురామీదుగా
ఇక బేగంపేట నుంచి మొదలయ్యే ఊరేగింపు రసూల్‌పురామీదుగా మినిస్టర్‌రోడ్‌, ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది. అలాగే దూల్‌పేట నుంచి మొదలయ్యే ఊరేగింపు అప్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది. ఇక ఈస్ట్‌జోన్‌ నుంచి ఉప్పల్‌ మీదుగా రామంతాపూర్‌, అంబర్‌పేట, ఓయూ ఎన్‌సీసీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, ఇందిరాపార్క్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌ చేరుకుంటుంది. అలాగే వెస్ట్ జోన్‌ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్‌ లేదా సెక్రటేరియట్‌ దగ్గర ప్రధాన ఊరేగింపుతో కలుస్తుంది.

భారీగా పోలీస్ బందోబస్తు..
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు జరిగే మార్గాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నగర శివార్లతో పాటు సిటీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ఖాళీ వాహనాలకు ప్రత్యేక రూట్లను కేటాయించారు. సందర్శకులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటుచేశారు.

09:56 - September 14, 2016

హైదరాబాద్ : అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.. తెలంగాణలో పలు చోట్ల భారీవర్షం కురిసింది.. నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వర్షాలధాటికి వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కలెక్టరేట్‌లోకి వర్షపు నీరు చేరింది. నల్లగొండ, దేవరకొండలో 9 సెం.మీ. వర్షపాతం నమోదైంది..

గుంటూరు జిల్లాలో మట్టిమిద్దెకూలి వృద్ధురాలు మృతి
ఏపీలోకూడా వర్షాలు కొనసాగుతున్నాయి.. గుంటూరు జిల్లా కరాలపాడులో మట్టిమిద్దెకూలి వృద్ధురాలు మృతి చెందింది.. గురజాలలో వంద మీటర్లవరకూ రైల్వేట్రాక్‌ కొట్టుకుపోయింది.. పలు చోట్ల పంటపొలాలు నీటమునిగాయి.. మరోవైపు కోస్తాంధ్రలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా 6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. కోస్తాంధ్ర తీరంపైకి అల్పపీడనం చేరుకోవడంతో రాగల 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

భాగ్యనగరంలో భారీ వర్షం..
మంగళవారం కురిసిన వానధాటికి హైదరాబాద్ జలమయమైంది. హయత్‌నగర్, ఎల్బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, మలక్‌పేట్, అబిడ్స్, కోఠి, నాంపల్లి, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, మెహిదీపట్నం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు పలు దఫాలుగా కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించి పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

లారీ ని ఢీకొన్న కారు..

తూర్పుగోదావరి : ప్రత్తిపాడు వద్ద ఆగివున్న లారీ ని ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి చెందగా..ఎస్సై..మరో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి..

హైదరాబాద్‌ : హయత్‌నగర్ మండలం కోహెడలో పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. దీంతో తనకు రూ.5 లక్షల నష్టం జరిగిందని గొర్రెల యజమాని కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

08:56 - September 14, 2016

బస్ ను ఢీకొన్న లారీ..

చిత్తూరు : గుడిపాల మండలం చీలపల్లె సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పలువురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎడ్‌సెట్‌ సీట్ల కేటాయింపు..

హైదరాబాద్‌ : తెలంగాణవ్యాప్తంగా రెండేళ్ల బీఈడీ సీట్ల భర్తీకి నిర్వహించిన టీఎస్‌ఎడ్‌సెట్‌-2016 తొలి దశ సీట్ల కేటాయింపు వివరాలను బుధవారం విడుదల చేయనున్నారు. ఓయూలోని పీజీఆర్‌ఆర్‌సీడీఈలోని ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌లో ఉదయం 11 గంటలకు ఓయూ ఉపకులపతి ప్రొ.ఎస్‌.రామచంద్రం వివరాలను విడుదల చేస్తారని ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొ.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలను వెబ్‌సైట్‌ www.tsedcet.tsche.inలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. సీటు పొందిన అభ్యర్థుల సెల్‌ఫోన్‌కు సమాచారం అందిస్తామని తెలిపారు.

స్వర్ణ విజేతకు ప్రధాని అభినందనలు..

ఢిల్లీ: రియో పారాలింపిక్స్ లో భారత్‌కు స్వర్ణం సాధించిన ఝుఝురియాకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. అద్భుత ప్రదర్శనతో ఝుఝురియా చరిత్రాత్మక విజయం నమోదు చేశారని పేర్కొన్నారు. జావెలిన్‌ త్రో విభాగంలో దేవేంద్ర ఝఝారియా బంగారు పతకాన్ని సాధించాడు. జావెలిన్‌ను 63.97 మీటర్లు విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2004 ఏథెన్స్ పారాలింపిక్స్ లోనూ ఝఝారియా స్వర్ణం గెలవడం విశేషం. ఇప్పటి వరకు భారత్‌ ఖాతాలోకి రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం చేరాయి. పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

భారత్ ఖాతాలో మరో స్వర్ణం..

ఢిల్లీ : రియో పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో స్వర్ణపతకం వచ్చి చేరింది. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న ఆటగాళ్లు సాధించలేని ఘనతను దివ్యాంగులు సాధించి దేశ పరువు ప్రతిష్ఠలు ఇనుమడింపజేస్తున్నారు. హైజంప్ లో తమిళనాడుకు చెందిన ఆటగాడు భారత్ కు రియో పారా ఒలింపిక్స్ లో తొలి స్వర్ణ పతకం సాధించగా, తాజాగా జావెలిన్ త్రోలో దేవేంద్ర ఝుఝురియాకు స్వర్ణ పతకం వచ్చింది. 63.97 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరిన ఝుఝురియా ఇప్పటి వరకు జావెలిన్ త్రోలో భారత ఆటగాళ్లు ఎవరూ చేయలేని ప్రదర్శనను చేయడం విశేషం.

దగ్థమైన ఐఏఎఫ్ యుద్ధ విమానం..

ఢిల్లీ : భారత వైమానిక దళానికి చెందిన (ఐఏఎఫ్) యుద్ధ విమానం జాగ్వార్‌ లో మంటలు చెలరేగాయి. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విమానంలో మంటలు చెలరేగాయి. మంటలు రేగడంతో అప్రమత్తమైన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. మంటల్లో విమానం పూర్తిగా కాలి దగ్థమైందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.

భారత్ రానున్న అష్రాఫ్ ఘనీ..

హైదరాబాద్ : ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ నేడు భారత్ కు రానున్నారు. రెండు రోజుల పర్యటనకు భారత్ రానున్న ఆయనకు విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు స్వాగతం పలకనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ లో భారత ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రాజెక్టుల పురోగతి, ఇతర విషయాలపై ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న బంధం బలోపేతం దిశగా ఈ పర్యటన ఉంటుందని రెండు దేశాలు భావిస్తున్నాయి. కాగా, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద బాధిత దేశాలైన భారత్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు మిత్ర దేశాలన్న సంగతి తెలిసిందే.

భాగ్యనగరంలో భారీ వర్షం..

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, మీయాపూర్, ఖైరతాబాద్, కోఠి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్లో వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు జలమయమైనాయి.  భారీ వర్షాంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 

07:53 - September 14, 2016

ప్రపంచవ్యాప్తంగా నీటి కోసం జరుగుతున్న ఉద్యమాలు, పోరాటాలు చూస్తుంటే భవిష్యత్‌లో ప్రపంచ యుద్ధాలు సంభవిస్తే అవి నీటి కోసమే అని నిపుణులు చెప్పేమాట నిజమే కావొచ్చు అనిపిస్తున్నది. ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర, విభజన అనంతరం ఆంధ్రా-తెలంగాణ, అలాగే కర్నాటక-తమిళనాడు నీటి యుద్ధాలు ఈరోజువీ కాదనే విషయం అందరికీ తెలిసిందే..తాజాగా కావేరీ జలల వివాదంతో కర్నాటక అట్టుడికిపోతోంది. కావేరి జల వివాదంతో కర్నాటక, తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బెంగళూరులో కర్ఫ్యూ విధించారు. కావేరి నదీ జలాల విషయంలో కర్ణాటకకు కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతోందని కర్నాటక సీఎం సిద్ద రామయ్య వాదన వుంటే .. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటితో సంబంధమున్న 350 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పారామిలటరీ దళాలు రంగంలోకి దిగాయి. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొవద్దని సీఎం సిద్ధరామయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంతో జరుగుతున్న ఘర్షణలతో ఇప్పటికే ప్రభుత్వ,ప్రయివేటు సంస్థలకు చెందిన రూ.25వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారి లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా వుంటే ఐటీ కంపెనీలకు కూడా ఈ సెగ తగిలింది. పలు ఐటీ సంస్థలు మూతపడ్డాయి..ఈ నేపథ్యంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నడింపల్లి సీతారామరాజు( ప్రముఖ విశ్లేషకులు), నంద్యాల నర్శింహారెడ్డి (సీపీఎం నేత),పాదూరి కరుణ(బీజేపీ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తల అభిప్రాయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

07:32 - September 14, 2016

ఆపదసమయంలో అత్యవసర వైద్య సేవలందిస్తున్న 108 సర్వీసుల భవిష్యత్తేమిటి? దీని నిర్వహణ బాధ్యతను ఎవరికి అప్పగించబోతున్నారు? పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో నడుస్తున్న 108 వ్యవస్థ నిర్వహణలో ప్రయివేట్ భాగస్వామ్యం అవసరమా? 108 నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే ఎందుకు నిర్వర్తించకూడదు?

2005 లో 108 ప్రారంభం..17 రాష్ట్రాల్లో 108 సేవలు
2005 ఆగస్టు 15న హైదరాబాద్ లో 17 వాహనాలతో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన 108 అంబులెన్స్ సర్వీస్ వ్యవస్థ ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో పనిచేస్తోంది. ప్రాణాపాయ, ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న వారికి అత్యవసర వైద్య సేవలు అందించడం దీని లక్ష్యం. ఇది పూర్తి ఉచితంగా అందించే సేవ. 24 గంటలూ అందుబాటులో వుండడం మరో విశిష్టత. 17 రాష్ట్రాల్లో దాదాపు పది వేల వాహనాలు, 20 వేల మంది మెడికల్ ప్రొఫెషనల్స్ సేవలందిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలందించి లక్షలాది ప్రాణాలు నిలబెట్టిన చరిత్ర 108 కు వుంది. ఫోన్ కాల్ అందుకున్న పదిహేను 20 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకోవడం 108 సిబ్బంది ప్రదర్శిస్తున్న వృత్తి నిబద్ధతకు నిదర్శనం.

వేతనాల కొరతతో ఇబ్బంది పడుతున్న 108 సిబ్బంది
మొదట్లో సత్యం కంప్యూటర్స్ సంస్థ సహకారంతో 108 అంబులెన్స్ సర్వీసులను నిర్వహించగా, ఆ తర్వాత దీని నిర్వహణా బాధ్యతను జివికె సంస్థకు అప్పగించారు. అంబులెన్స్ ల నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుండగా, జివికె సంస్థ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అయితే, అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది విషయంలో ఆ సంస్థ ప్రవర్తించిన తీరు వివాదస్పదమైంది. యాజమాన్య వైఖరిని నిరసిస్తూ గతంలో సమ్మెలు కూడా జరిగాయి. అంబులెన్స్ నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్న ఆరోపణలూ వున్నాయి. దొంగ లెక్కలు చూపిస్తూ, నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలూ వున్నాయి. 108 సిబ్బందికి కనీస వేతన చట్టాలు అమలు కావడం లేదు. పిఎఫ్, ఇఎస్ఐ లాంటి సదుపాయాలు లేవు. ఉద్యోగ భద్రత లేదు. దీనికితోడు వేధింపులు షరామామూలు. ఇన్ని సమస్యల మధ్య కూడా ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నవారికి 108 సిబ్బంది అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. సెప్టెంబర్ 30తో జీవికె తో కుదుర్చుకున్న ఒప్పందం ముగుస్తోంది. దీంతో నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే స్వీకరించాలన్న సూచనలొస్తున్నాయి.

ఇబ్బందుల్లో 108 సేవలు
108 అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ అత్యంత బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. ప్రాణాపాయ స్థితిలో వున్నవారికి అదొక సంజీవని. లాభాపేక్షతో కాకుండా సామాజిక నిబద్ధతతో పనిచేయాల్సి వుంటుంది. ప్రయివేట్ సంస్థలు లాభాపేక్ష లేకుండా ఎంత వరకు పనిచేస్తాయన్నది సందేహస్పదమే. 108 అంబులెన్స్ సర్వీసుల ద్వారా కొన్ని లక్షల ప్రాణాలను నిలబెట్టిన మాట వాస్తవమే అయినా, ఇప్పటికీ కొన్ని లోటుపాట్లు వెన్నాడుతూనే వున్నాయి. కొన్ని వాహనాలు తుప్పుపట్టి పోతే, మరికొన్ని వాహనాలలో అత్యవసర మందులు వుండడం లేదు. కొన్నింటిని షెడ్డులకే పరిమితం చేస్తున్నారు. ఇలాంటి లోపాలన్నీ సరిదిద్దేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలి. 

07:25 - September 14, 2016

108 అంబులెన్స్ సర్వీసుల వ్యవహారం కీలకమలుపులో వుంది. 108 అంబులెన్స్ నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి జివికె సంస్థకు కుదిరిన ఒప్పందం ఈ నెల 30తో ముగుస్తోంది. దీంతో కొత్త సంస్థను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత అనుభవాల దృష్ట్యా 108 అంబులెన్స్ సర్వీసుల నిర్వహణను ప్రయివేట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే నిర్వహించాలంటూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ కోరుతోంది. ఈ నేపథ్యంలో 108 అంబులెన్స్ నిర్వహణలో జివికె సంస్థ వ్యవహరించిన తీరు ఎలా వుంది? ఈ సంస్థకు లేదా మరో ప్రయివేట్ సంస్థకు అప్పగించే ప్రయత్నాలను ఎంప్లాయీస్ యూనియన్ ఎందుకు వ్యతిరేకిస్తోంది? 108 అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ విషయంలో ఎంప్లాయీస్ యూనియన్ చేస్తున్న సూచనలేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నేత యాదానాయక్ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

07:22 - September 14, 2016

పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 500 రోజుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 2018 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. దసరా నుంచి హెడ్‌వర్క్స్ కాంక్రీట్‌ పనులను చేపట్టాలని కోరారు. కుంటిసాకులతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం చేస్తే సహించేదిలేదని చంద్రబాబు హెచ్చరించారు.

పోలవరాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించారు. నిర్మాణ పురోగతిని పరిశీలించారు. ప్రాజెక్ట్‌ కోసం తీసుకొచ్చిన యంత్రాలను ప్రారంభించి, స్వయంగా నడిపారు. పనుల పరోగతిపై కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు, నీటిపారుదల శాఖ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బదిలీ చేసిన నేపథ్యంలో...ఇకపై పనులను పరుగులు తీయించాలని చంద్రబాబు నిర్ణయించారు.

పోలవరంపై ఈనెల 19 విజయవాడంలో ఉన్నత స్థాయి సమీక్ష
2018 నాటికి పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించకపోవడం పట్ల చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వేగాన్ని పెంచాలని ఆదేశించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం వచ్చే నెల 2 నుంచి పోలవరం హెడ్‌వర్క్స్ నిర్మాణాన్ని ప్రారంభించాల్సి ఉంది. కానీ అక్టోబర్‌ 11 దసరా నుంచి ఈ పనులు చేపడతామని కాంట్రాక్టర్లు చంద్రబాబు దృష్టికి తీసుకురాగా, సీఎం ఇందుకు అంగీకరించారు. పోలవరంపై ఈనెల 19న కాంట్రాక్ట్ సంస్థలు, నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇకపై ప్రతినెలా మొదటి సోమవారం ప్రాజెక్ట్‌ పురోగతిని సమీక్షించి, మూడో సోమవారం పోలవరం పనులను తనిఖీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అలాగే నాలుగు నెలలకు ఒకసారి ఢిల్లీ వెళ్లి కేంద్ర జల సంఘం అధికారులతో సమీక్షించాలని ప్రతిపాదించారు.

పాజెక్టు ఖర్చు భరించనున్న కేంద్ర ప్రభుత్వం..
పోలవరం నిర్మాణానికయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది. అయితే జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే చేపట్టాల్సి ఉంది. పోలవరం నిర్మాణానికి రాష్ట్రం చేసే ఖర్చను ఎప్పటికప్పడు కేంద్రం నుంచి రాబట్టేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. సాగునీరు సమస్య విషయంలో ప్రజల్లో అభద్రాతా భావం ఉండకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. అభద్రతా భావం ఏర్పడితే పరిస్థితులు ఎలా ఉంటాయో కర్నాటక-తమిళనాడు రాష్ట్రంల్లో జరిగిన ఘటనలే నిదర్శనమన్నారు. పోలవరం ప్రతి పనికి తేదీలతో సహా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగాలని కాంట్రాక్టర్లు, అధికారును చంద్రబాబునాయుడు ఆదేశించారు.

07:16 - September 14, 2016

హైదరాబాద్ : ఎట్టకేలకు 2011 గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు నేటి నుంచి జరగనున్నాయి. దీనికి సంబంధించి ఏపీ, తెలంగాణ సర్వీస్‌ కమిషన్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది.

2011 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధం
2011గ్రూప్ 1 అభ్యర్ధుల నిరీక్షణకు తెరపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 గ్రూపు1 మెయిన్స్ రీ ఎగ్జామ్‌ను ఈనెల 14 నుంచి నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ, టీఎస్పీఈఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఒక్క హైదరాబాద్‌లోని 17 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. బయోమెట్రిక్ విధానం అమలులో ఉండటం వల్ల 9గంటల 15నిమిషాల లోపే పరీక్ష హాల్లోకి వెళ్లాలని టీఎస్పీఈఎస్సీ సూచించింది.

2011లో గ్రూప్1 నోటిఫికేషన్ విడుదల చేసిన అప్పటి ఎపీపీఎస్సీ
2011లో అప్పటి ఎపీపీఎస్సీ 312 గ్రూప్1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2012 మే 27న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షకు లక్షా70 వేల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. మెయిన్స్‌కు 1:50 నిష్పత్తి చొప్పున 15వేల 600 మందిని ఎంపికచేశారు. అందులో 8వేల 600 మంది మెయిన్స్ రాయగా వారిలోంచి మెరిట్ ప్రకారం 1:2 నిష్పత్తిన 606 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ప్రిలిమ్స్ పరీక్ష కీలో ఆరు పట్ల న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అభ్యర్థులు
అయితే ప్రిలిమ్స్ పరీక్ష కీలో ఆరు తప్పులున్నట్లు అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తారు. దీనిపై కోర్టుకి వెళ్లడంతో ఆరు ప్రశ్నల్ని తొలగించి మిగితా మెరిట్ జాబితా రూపొందించాలని కోర్ట్‌ ఆదేశించింది. ఆ జాబితాలో ఉన్న మెరిట్‌ అభ్యర్థులకు మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దీంతో 144 ప్రశ్నలతో మరోసారి వాల్యూయేషన్ చేసారు. ఫలితంగా అభ్యర్థుల మార్కులు తలకిందులయ్యాయి. దీనిపై అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో మరోసారి పరీక్ష నిర్వహంచాలని తెలుగు రాష్ట్రాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

పూర్తి బందోబస్తు మధ్య జరనున్న పరీక్షలు..
సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు స్పందించిన రెండు రాష్ట్రాలు రేపటి నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాయి. పరీక్షకు 45నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు స్పష్టంచేసారు. హాల్ టికెట్ తో పాటు ఒక ఐడెంటిటీ కార్డు కూడా తీసుకురావాలని తెలిపారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకెళ్లడానికి వీలు లేదని అధికారులు స్పష్టం చేశారు. అన్ని కేంద్రాల్లో పూర్తి బందోబస్తు మధ్య పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. 

07:08 - September 14, 2016

విశాఖపట్నం : విశాఖలో నేటి నుంచి మూడు రోజులపాటు బ్రిక్స్‌ సదస్సు జరగనుంది. దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. గతంలో భాగస్వామ్య సదస్సు, నావికాదళ సమీక్షలను విజయవంతం చేసినట్లుగానే ఈ సదస్సును సక్సెస్‌ చేసేలా ఏర్పాట్లు చేశారు.

హాజరుకానున్న 500 మంది ప్రతినిధులు
విశాఖ నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్‌ దేశాల సదస్సు నేటి నుంచి జరగనుంది. బ్రిక్స్‌ సభ్య దేశాల నుంచి ఈ సదస్సుకు 500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇందులో 100 మంది విశిష్ట అతిథులు ఉండనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఆయా దేశాల్లో పట్టణీకరణ సమస్యలు-పరిష్కారాలపై చర్చించి విశాఖ డిక్లరేషన్‌ రూపొందిస్తారు. దీనిపై వచ్చే నెలలో గోవాలో జరిగే బ్రిక్స్‌ సదస్సులో చర్చిస్తారు. తొలిరోజు సమావేశానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.

'ఆపర్చునిటీ ఇన్‌ డిఫెన్స్‌ మాన్యుఫాక్చరింగ్‌' సదస్సు
ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో చంద్రబాబు విశాఖ చేరుకుంటారు. 'ఆపర్చునిటీ ఇన్‌ డిఫెన్స్‌ మాన్యుఫాక్చరింగ్‌' అంశంపై గ్రాండ్‌బే హోటల్‌లో జరిగే సదస్సులో పాల్గొంటారు. మధ్యాహ్నం వెంకయ్యనాయుడు ఇచ్చే విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారు. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేలా ప్రదర్శనలు
సదస్సుకు బ్రిక్స్‌ సభ్య దేశాల నుంచి అనేకమంది హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. నగరాన్ని అందంగా ముస్తాబు చేశారు. విమానాశ్రయం నుంచి వేదిక వరకు అధికారులు సరికొత్తగా తీర్చిదిద్దారు. అతిథులకు స్టార్‌హోటళ్లలో వసతి కల్పించారు. తెలుగువారి ప్రత్యేక వంటలతో వారికి విందులు ఏర్పాటుచేశారు. రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలు తెలిసేలా ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పలు దేశాల నుంచి అతిథులు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసులను తరలించారు. గతంలో భాగస్వామ్య సదస్సు, అంతర్జాతీయ నావికాదళ సమీక్షలను విజయవంతంగా నిర్వహించిన విధంగానే బ్రిక్స్ సదస్సును సక్సెస్‌ చేయాలని సర్కార్‌ భావిస్తోంది. 

07:02 - September 14, 2016

కర్నాటక : కావేరి జల వివాదంతో కర్నాటక, తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బెంగళూరులో కర్ఫ్యూ విధించారు. కావేరి నదీ జలాల విషయంలో కర్ణాటకకు కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని కర్ణాటక సీఎం సిద్ద రామయ్య అన్నారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు. హింసాత్మక ఘటనలతో సంబంధమున్న 350 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పారామిలటరీ దళాలు, 15 వేల మంది పోలీసులతో భద్రత
కావేరి జలాలను తమిళనాడుకు వదలాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో కర్నాటకలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. బెంగళూరులో 16 సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. పారామిలటరీ దళాలు, 15 వేల మంది పోలీసులు బస్తీల్లో గస్తీ కాస్తున్నారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా విధ్వంసానికి పాల్పడ్డ 350 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు.

ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొవద్దని విజ్ఞప్తి : సిద్ధరామయ్య
కావేరి జలాల విషయంలో కొన్నేళ్లుగా తమకు అన్యాయం జరిగుతోందని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియా సమావేశంలో చెప్పారు. నీటి విడుదలపై సుప్రీంకోర్టు తీర్పు కష్టంగా ఉన్నప్పటికీ.. న్యాయస్థానం ఆదేశానుసారం ఆరు రోజుల పాటు తమిళనాడుకు నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు. కన్నడ ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయొద్దని కోరారు. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇస్తే ఆయనకు పరిస్థితిని వివరిస్తానని సిఎం చెప్పారు.

హింసాత్మక ఘటనలు బాధకు గురి చేశాయి : మోదీ
కర్నాటక, తమిళనాడులో నీటి కోసం జ‌రుగుతున్న హింసాత్మక ఘ‌ట‌నలు తనను వ్యక్తిగ‌తంగా బాధ‌కు గురి చేశాయని ప్రధాని మోది అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య కావేరి జలాలు చాలా సున్నిత అంశమని, హింస ద్వారా కాకుండా సంయమనంతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించు కోవాలని ఇరు రాష్ట్రాలకు సూచించారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదు : మంత్రి వెంకయ్యనాయుడు
ఆందోళనల పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పొరుగు రాష్ట్రాల వారి ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశంతో తమిళనాడుకు 12 వేల క్యూసెక్కుల నీరు విడుదల
తమిళనాడుకు 10 రోజుల పాటు 12 వేల క్యూసెక్కుల కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్నాటకను ఆదేశించింది. సుప్రీం ఆదేశంతో కర్నాటక భగ్గుమంది. సోమవారం తమిళనాడు పేరిట రిజిస్టర్‌ అయిన 30 బస్సులు, లారీలు, ట్రక్కులు, షాపులను ఆందోళనకారులు తగలబెట్టారు. రామేశ్వరంలో కూడా కర్నాటక బస్సులపై దాడి జరిగింది. చెన్నయ్‌లో వుడ్‌ల్యాండ్‌ హోటల్‌పై పెట్రో బాంబులతో దాడి చేశారు.

ఘర్షణలతో రూ.25వేల కోట్లు నష్టం
కావేరి జలాల వివాదం సందర్భంగా తలెత్తిన ఘర్షణలు, ఆస్తుల విధ్వంసం కర్నాకటకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. తాత్కాలిక అంచనాల ప్రకారం 25 వేల కోట్ల వరకు వ్యాపార నష్టం జరిగినట్టు అసోచామ్‌ వెల్లడించింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

విధ్వంసం నష్టం రూ. 22 వేల నుంచి 25 వేల కోట్లు
తమిళనాడు-కర్నాటకల మద్య తలెత్తిన కావేరి జలాల వివాదం భారీ నష్టానికి దారితీసింది. తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ.... కన్నడిగులు సృష్టించిన విధ్వంసం అసోసియేటెడ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ... అసోచాం... తాత్కాలికంగా అంచనా వేసింది. విధ్వంస కాండ కారణంగా జరిగిన నష్టం 22 వేల నుంచి 25 వేల కోట్ల వరకు ఉంటుందని వెల్లడించింది. కొన్ని సంస్థలకు ఇది కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు.

ఐటీ కంపెనీలపై విధ్వంసం ప్రభావం
ఆందోళనకారులు బెంగళూరులో విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వం, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. తమిళనాడుకు చెందిన వాహనాలు, బస్సులకు నిప్పుపెట్టారు. ఈ ఘటనల కారణంగా భారత సిలికాన్‌ వ్యాలీగా పేరు పొందిన బెంగళూరులో ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన సంస్థలు మూతపడ్డాయి. మరికొన్ని సంస్థలు తమ ఉద్యోగులను ఇంటిదగ్గర నుంచే పని చేయాలని సలహా ఇచ్చాయి. ప్రముఖ ఐటీ కంపెనీల ప్రధాన కార్యాలయాన్నీ బెంగళూరులోనే ఉండటంతో, కావేరి విధ్వంసం వీటిపై పడింది. తమ కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించాయి. ప్రపచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ రిటెయిల్‌ వ్యాపార సంస్థ.. తమ డెలివరీ ఆపరేషన్లు దెబ్బతినడంతో.. భారీ నష్టం వచ్చినట్టు ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా మళ్లీ కార్యకలాపాలను పునఃప్రారంభిస్తామని చెప్పింది.

ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చాం -ఫ్లిప్‌కార్ట్‌
బెంగళూరులో నెలకొన్న విధ్వంసకర పరిస్థితులు తమ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపాయని మన దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఉద్యోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో సంస్థ డెలివరీ కార్యక్రమాలు స్తంభించాయి. ఈ విషయాన్ని ఖాతాదారులకు ముందుగానే తెలపడంతో పరిస్థితిని అర్థం చేసుకుని... సహకరిస్తున్నారని తెలిపింది. భారత సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్‌, విప్రోలు కూడా రెండు రోజుల పాటు మూతపడ్డాయి. దీంతో విదేశీ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంలో కొద్దిగా జాప్యం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బహుళజాతి సంస్థలు శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఒరాకిల్‌, ఎంఫాసిస్‌ సంస్థలకు కూడా నష్టం వాటిల్లింది. స్టార్టప్‌ కంపెనీలకు కోలుకోలేని దెబ్బతగింది. అకౌంటింగ్‌ దిగ్గజ సంస్థ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాతోపాటు, పలు ప్రైవేటు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేయడంతో ఆదాయాన్ని కోల్పోయాయి. కావేరి జల వివాదం అన్ని రంగాలపై ప్రభావం చూపింది. 

నేడి నుండి బ్రిక్స్ సదస్సు..

విశాఖపట్నం : నేటి నుండి విశాఖలో నగరంలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. బ్రిక్స్ లో భాగస్వామ్య దేశాలైన బ్రెజిల్, దక్షిణాఫ్రికా, రష్యా,చైనా ప్రతినిధులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. బ్రిక్స్ తొలిరోజు సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు. ఈ సదస్సును వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. 

నేటి నుండి దుర్గమ్మ పవిత్రోత్సవాలు..

విజయవాడ : నేటి నుంచి బెజవాడ దుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు. మధ్యాహ్నం అమ్మవారికి మహానివేదన... అనంతరం ఆలయం మూసివేయనున్నారు. తిరిగి రేపు ఉదయం 10.00 గంటలకు అమ్మవారి పునర్ దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

నేటి నుండి గ్రూప్ -1 మెయిన్స్..

హైదరాబాద్ : నేటి నుంచి ఐదు దేశాల బ్రిక్స్‌ సదస్సు విశాఖపట్నం నగరంలో జరగనుంది. బ్రిక్స్‌లో భాగస్వామ్య దేశాలైన బ్రెజిల్, దక్షిణాఫ్రికా, రష్యా ప్రతినిధులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. అయితే చైనా దేశ ప్రతినిధులు ఇంకా రావాల్సి ఉంది. బ్రిక్స్ తొలిరోజు సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు. ఈ సదస్సును మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు.

ఐటీ కంపెనీలకు కావేరీ ఎఫెక్ట్..

కర్నాటక : కావేరి జలాల వివాదం బెంగళూరులోని ఐటీ కంపెనీలు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. సోమవారం నుంచి జరుగుతున్న ఆందోళనలు కారణంగా రవాణా సదుపాయాలు లేకపోవడంతో ఉద్యోగులు ఇళ్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆందోళనల కారణంగా వినియోగదారులకు డెలివరీ చేయాల్సిన వస్తువులను చేయలేకపోయామని, త్వరలోనే వాటిని డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తామని అమెజాన్‌ సంస్థ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. 

Don't Miss