Activities calendar

15 September 2016

21:32 - September 15, 2016

ఢిల్లీ : రఫెల్ జెట్ విమానాల కొనుగోలుకు సంబంధించి భారత్-ఫ్రాన్స్ ల మధ్య ఒప్పందం కుదిరింది. మొత్తం 36 ఫైటర్ విమానాలను 7.87 బిలియన్ యూరోలకు భారత్ కొనుగోలు చేయనుంది. రఫెల్ జెట్స్ ఒప్పందంతో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ మెటెఓర్ భారత అమ్ములపొదిలో చేరనుంది. దాదాపు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ప్రత్యర్ధుల ఫైటర్ జెట్లను మెటేఓర్ తో ధ్వంసం చేయొచ్చు. దీంతో దక్షిణ ఆసియాలో ఈ మిస్సైల్ టెక్నాలజీ కలిగిన తొలి దేశంగా భారత్ అవతరించనుంది. పాకిస్తాన్, చైనాలకు ఈ కోవకు చెందిన మిస్సైల్ టెక్నాలజీ అందుబాటులో లేదు. 

 

21:30 - September 15, 2016

బీహార్ : ఆర్జేడి నేత మాజీ ఎంపీ షాహబుద్దీన్‌ జైలు నుంచి విడుదలపై బీహార్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జర్నలిస్టు హత్య కేసులో నిందితుడు షార్ప్ షూటర్‌ మహ్మద్‌ కైఫ్‌తో షాహబుద్దీన్‌, లాలూ తనయుడు కనిపించడం కలకలం రేపింది. దీంతో షాహబుద్దీన్‌ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సివాన్‌ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షాహబుద్దీన్‌పై సిబిఐ విచారణ జరపనుంది. ఓ హత్యకేసులో 11 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన ఆర్జేడికి చెందిన మాజీ ఎంపీ షాహబుద్దీన్‌కు ఉచ్చు బిగుస్తోంది. షాహబుద్దీన్‌ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ హత్యకు గురైన జర్నలిస్టు రాజ్‌దేవ్‌ రంజన్ భార్య సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

సుప్రీంను ఆశ్రయించనున్న నితీష్ సర్కార్..
ఆర్జేడీ అధినేత లాలూ తనయుడు, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్, షహబుద్దీన్ లతో జర్నలిస్టు హత్య కేసు నిందితుడు, షార్ప్ షూటర్‌ మహమ్మద్ కైఫ్ మీడియాలో కనిపించడంతో భయాందోళనకు గురైన బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది. మంత్రి పక్కనే నిందితుడున్నా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. జర్నలిస్టు కుటుంబం భయాందోళన వ్యక్తం చేసింది. కైఫ్ పై రంజన్ హత్యే కాకుండా మరో 5 కేసులు కూడా ఉన్నాయి. సివాన్‌లో చంద్రకేశ్వర్‌ ప్రసాద్‌ ముగ్గురు కుమారుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షాహబుద్దీన్‌కు పట్నా హైకోర్టు శనివారం బెయిల్‌ మంజూరు చేసింది. షాహబుద్దీన్‌ బెయిల్‌ రద్దు చేయాలని చంద్రకేశ్వర్‌ తరపున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. షాహబుద్దీన్‌ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నితీష్‌ ప్రభుత్వం కూడా నిర్ణయించింది.

ప్రతిపక్షాల కుట్ర అన్న తేజ్ ప్రతాప్ యాదవ్..
బీహార్ నాయకులతో ఫోటోలు, వీడియోల్లో ఉంది తానేనని కైఫ్ మీడియాకు చెప్పాడు. తాను పోలీసుల ముందు హాజరుకావడానికి సిద్ధమేనని అన్నాడు. కైఫ్ తో తనకు సంబంధాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఖండించారు. వెయ్యిమందిలో ఎవరో ఒకరు వచ్చి తనతో ఫోటో దిగితే అతడు షూటర్ అని తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్రని ఆరోపించారు. గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన షాహబుద్దీన్‌ను విడుదల చేయడంతో అతని స్వస్థలం సివాన్‌లో భయాందోళన నెలకొంది.

అపెక్స్ కమిటీ సమావేశానికి కేసీఆర్..బాబు..

ఢిల్లీ : ఈనెల 21వ తేదీన కేంద్ర మంత్రి ఉమా భారతి నేతృత్వంలో కృష్ణా జలాలపై అపెక్స్ కమిటీ సమావేశం కానుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్..చంద్రబాబు నాయుడులు హాజరు కానున్నారు. 

శుక్రవారం నెహ్రూ జూపార్కు మూసివేత..

హైదరాబాద్ : నగరంలో శుక్రవారం నెహ్రూ జంతు ప్రదర్శన శాల మూసివేయనున్నారు. భారీ వర్షాల కారణంగా జూలో నిలిచిన వర్షపు నీటిని రేపు తొలగించనున్నారు. 

21:18 - September 15, 2016
21:17 - September 15, 2016

హైదరాబాద్ : అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నిన్నటి నుండి కురుస్తున్న కుండపోత వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. అల్పపీడన ప్రభావం ముఖ్యంగా తెలంగాణపై ఆవరించి ఉండడంతో.. తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటలపాటు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.  కుండపోత వర్షాలతో రంగారెడ్డి జిల్లా అతలాకుతలం అవుతోంది. బుధవారం సాయంత్రం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. గురువారం జిల్లాలోని వికారాబాద్‌లో 17 సెం.మీ, కీసరలో 12.7, బంట్వారంలో 11.4, పెద్దేముల్‌లో 8.8, చేవెళ్లలో 8.6, శామీర్‌పేటలో 8.4, బషీరాబాద్‌లో 4.4, తాండూరులో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగ్నా నదిపై వంతెన తెగడంతో తాండూరు-మహబూబ్‌నగర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్‌ మండలం రాళ్లచిట్టెంపల్లి-పిల్లారం మధ్య వాగు పొంగడంతో రెండు బైక్‌లు, కారు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా..ఏడుగురు గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదు.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. వికారాబాద్‌-పర్లి మార్గంలో రైల్వే ట్రాక్‌ దెబ్బతింది. దీంతో వికారాబాద్‌-పర్లి మార్గంలో పలు రైళ్లను.. ముద్ఖేడ్‌-నిజామాబాద్‌ మీదుగా మళ్లించారు. షిరిడీ-విజయవాడ, పుణె-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, ఔరంగబాద్‌-హైదరాబాద్‌ ప్యాసింజర్‌ రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బీదర్‌-హమ్నాబాద్‌ డెమూ రైలు, హమ్నాబాద్‌-బీదర్‌ డెమూ రైలును రద్దు చేశారు. అలాగే భారీ వర్షాలకు శంకర్‌పల్లి మండలంలోని పత్తేపూర్‌ వద్ద ఉన్న మూసీనది పొంగిపొర్లింది. దీంతో చెవేళ్ల-శంకర్‌పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

హైదరాబాద్ లో..
హైదరాబాద్ లో ఉదయం నుంచి భారీ వర్షం పలుమార్లు కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వనస్థలిపురం ఎన్‌జీవో కాలనీలోని భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలన్నీ నేలకూలాయి. దీంతో ఈ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు చైతన్యపురిలోనూ భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నెలకూలడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాప్రా సర్కిల్‌ ప్రాంతంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి గాంధీనగర్‌లో ఓ పెంకుటిల్లు కూలిపోయింది. అధృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.

మెదక్ జిల్లా..
అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అక్కెనపల్లి, మందపల్లి, కొండంరాజుపల్లి, ఖాతా పలు గ్రామాల్లోని చెక్‌డ్యాంలు, సమీప చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చెరువులు, చెక్‌డ్యాంల్లోకి భారీగా వరద నీరు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు జహీరాబాద్‌ నియోజకవర్గంలోని పలు వాగులు కూడా పొంగిపొర్లాయి. కోహీర్‌ మండలం గొటిగార్‌పల్లి శివారులోని పెద్దవాగు నీటి ఉధృతికి ఆయకట్టు పరిధిలోని పంటపొలాలన్నీ నీటమునిగాయి. ఇక రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్‌ నగరంలోని పాత భవనాలు కుప్పకూలుతున్నాయి. ఖిలా వరంగల్‌ పడమర కోటలో రెండు ఇళ్లు కూలి ఇద్దరు గాయపడ్డారు.

నల్గొండ..
అటు నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట, బొమ్మలరామారం మండలాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో పంటపొలాలకు నీరొచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్‌, ఇల్లంతకుంట, సుల్తానాబాద్‌, మానకొండూరు, కేవశవపట్నం, సైదాపూర్‌, జమ్మికుంట, వీణవంక, ఎల్కతుర్తి తదితర మండలాల్లో వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఖానాపూర్‌లో 11 సెంటీమీటర్ల వర్షం కురవడంతో వాగులు, వంగలు పొంగిపొర్లాయి.

ఏపీలోనూ..
ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లా డోన్‌ మండలంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు గ్రామాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రెండేళ్లుగా ఎండిన చెరువులన్నీ తాజా వర్షాలతో నిండిపోయి జలకలను సంతరించుకున్నాయి. మరోవైపు కొడుమూరులో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పంట పొలాలన్నీ నీటమునిగాయి. ఉల్లి, పత్తి, వేరుశనగ పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఏపీ, తెలంగాణలో మరో 3రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. 

21:04 - September 15, 2016

విజయవాడ : కేంద్రం ఇచ్చే నిధుల్లో ఒక్క పైసా తక్కువొచ్చినా..ఊరుకునే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలో దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్ లు టిడిపిలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రత్యేక హోదాకి సమానమైన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం భరోసా ఇచ్చిందని, కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి వెసులుబాటు కావాలనే ఉద్దేశంతోనే ఆలోచించి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని పేర్కొన్నారు.

రాజకీయ బిక్ష పెట్టింది ఎన్టీఆర్ - దేవినేని..
రాష్ట్ర ప్రజల ఆశలే ఊపిరిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అన్నారు. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన దేవినేని..తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్‌ అని గుర్తుచేసుకున్నారు. తనకు మంత్రి పదవి దక్కడంలో చంద్రబాబు కీలకపాత్ర వహించారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అహర్నిశలు పాటుపడుతున్నారని కొనియాడారు.

20:59 - September 15, 2016

పశ్చిమగోదావరి : జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ దినేశ్ కుమార్ తుందుర్రు ఆక్వాఫుడ్ పార్క్ గురించి ప్రెస్‌మీట్ నిర్వచించారు. ఆక్వాఫుడ్ పార్క్ వల్ల ఏ విధమైన కాలుష్యం ఉండదని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆరంజ్ జోన్ ప్రకటించిందని తెలిపారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి పంపే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఆక్వాఫుడ్ పార్క్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పని చేస్తుందని, ఫ్యాక్టరీ పనులు మాత్రం ఆపే ప్రసక్తే లేదన్నారు.

20:56 - September 15, 2016

హైదరాబాద్ : ఎంసెట్ విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ఎంసెట్ కష్టాలు సీరియల్‌ ఎపిసోడ్స్‌లా సాగిపోతున్నాయి. లీకేజీలు, ప్రభుత్వ నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి అయిన విద్యార్థులను ఇప్పుడు మరో అంశం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. టీఎస్ ఎంసెట్-3 పరీక్ష రాసి ఊపిరి పీల్చుకుంటున్న అభ్యర్థులకు.. కాళోజీ హెల్త్ యూనివర్శిటీ నిబంధనలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. డాక్టర్‌ కావాలని కలలు కంటున్న విద్యార్థులకు మొదటి నుంచి కష్టాలు పలకరిస్తున్నాయి. ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీకేజీ కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్‌-3 పరీక్షను ఈనెల 11న నిర్వహించింది. ఎంసెట్‌-2 లీకేజీ వివాదంతో ర్యాంకర్లు మెడిసిన్‌ సీటు చేజారకుండా ఏపీ, మణిపాల్ సహా ఇతర రాష్ట్రాల్లో కౌన్సెలింగ్‌కు హాజరై అడ్మిషన్లు తీసుకున్నారు. తెలంగాణ ఎంసెట్‌-3లో మెరుగైన ర్యాంకు వస్తే మళ్లీ కౌన్సెలింగ్‌కు హాజరై సీటు సాధించవచ్చేనే భరోసాతో ఉన్నారు. అయితే... కాళోజీ హెల్త్ యూనివర్శిటీ నిబంధన అభ్యర్థులను, తల్లిదండ్రులను కలవర పెడుతోంది.

ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఉంటేనే హాజరు అయ్యే అవకాశం..
ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్, వ్యవసాయ కోర్సుల్లో చేరినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-3 పరీక్ష రాసిన ఇరు రాష్ట్రాలకు చెందిన చాలా మంది విద్యార్థులకు కొత్త చిక్కొచ్చిపడింది. ఎంసెట్‌-3 ఫలితాల అనంతరం ప్రభుత్వం సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనుంది. అయితే... ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆయా విద్యార్థులు ఏపీలో తాము చేరిన కాలేజీల్లో సమర్పించారు. ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ ఉంటేనే తెలంగాణలో మెడికల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అవకాశం ఉంటుంది. లేకుంటే ఇక్కడ సీటు కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇతర రాష్ట్రాల కస్టోడియన్ సర్టిఫికెట్లు చెల్లవని స్పష్టం..
దేశంలో పేరుపొందిన యూనివర్శిటీలన్నీ కస్టోడియన్ సర్టిఫికెట్స్‌ను ప్రాతిపదికగా కౌన్సెలింగ్ నిర్వహిస్తే తెలంగాణలోని కాళోజీ హెల్త్ యూనివర్శిటీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఒరిజినల్స్ కాకుండా ఇతర రాష్ట్రాల కస్టోడియన్ సర్టిఫికెట్లు ఇస్తే అవి చెల్లవని, న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో అడ్మిషన్స్‌ పొందిన విద్యార్థులు.. వారి సర్టిఫికెట్లు తెచ్చుకోవడమే గగనమంటే.. తెచ్చుకున్న కస్టోడియన్ కూడా చెల్లదని ప్రకటించడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

క్షేత్రస్థాయిలో కదలిక ఎక్కడ ? 
మరోవైపు ఎంసెట్‌-3 కౌన్సిలింగ్‌కు హాజరు కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారు తెలంగాణలో పీజీ చేయాలంటే... నాన్ లోకల్‌గా పరిగణించే అవకాశముంది. ఎంసెట్‌-3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు.. తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వాలని ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలను అడిగితే.. ఇవ్వబోమని తెగేసి చెబుతున్నాయి. ఈ విషయాన్ని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండాపోతోంది. ఎంసెట్-3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వాల్సిందిగా ఏపీకి చెందిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు లేఖలు రాశామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో కదలిక కనిపించడం లేదు.

ప్రవేశాల భర్తీ ప్రక్రియ..
ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్, వ్యవసాయ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లకు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తిచేసి... విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ బీ కేటగిరీ సీట్ల భర్తీ పూర్తయింది. అయితే... ఆ రాష్ట్రంలో చేరిన చాలామంది విద్యార్థులకు ఎంసెట్-3లో కనబరిచే ప్రతిభ ఆధారంగా తెలంగాణలో సీటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి... తెలంగాణ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలనుకుంటున్నారు. ఒకవేళ వారు తెలంగాణలో సీటు పొందినా ఏపీలోని మెడికల్ కాలేజీలకు నష్టం లేదు. ఎందుకంటే... ఆ రాష్ట్రంలో ప్రభుత్వ సీట్లకు మొదటి కౌన్సెలింగ్ మాత్రమే పూర్తైంది. కాబట్టి అక్కడ సీటు వదులుకున్న విద్యార్థులు తెలంగాణలో సీటు పొందితే ఆ రాష్ట్రంలో మిగిలిపోయే సీట్లకు రెండోసారి కౌన్సెలింగ్ చేపట్టి.. సీట్లను భర్తీచేసే అవకాశం ఉంటుంది. అలాగే ప్రైవేటు కాలేజీల్లో బీ కేటగిరీలో సీటు పొంది, చేరినవారు ఆ సీటును వదులుకుంటే యాజమాన్యాలకు వచ్చే నష్టమూ లేదు. బీ కేటగిరీ సీటు ఖాళీ అయితే అవి ఎన్‌ఆర్‌ఐ కోటాగా మారుతాయి.
మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో కస్టోడియన్‌ను ప్రాతిపదికగా తీసుకోకపోతే ఎంసెట్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విద్యావేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. 

20:31 - September 15, 2016

హైదరాబాద్ : నగరంలో నిమజ్జన కార్యక్రమం సక్సెస్ పుల్ గా సాగుతోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం నిమజ్జన కార్యక్రమం కోలాహాలంగా సాగుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం మధ్యాహ్నామే జరగడం విశేషం. నిమజ్జనాన్ని మేయర్ బొంతు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. వినాయక నిమజ్జనం అతి పెద్ద పండుగగా భావిస్తారని, సాగర హారం మొత్తం మానవహారంగా మారిపోతోందన్నారు. నిమజ్జన ప్రక్రిక సాఫీగా జరగడానికి గత రెండు నెలలుగా అన్ని శాఖలు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, ఒకే తాటిపైకి వచ్చి వారం వారం మీటింగ్ లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అన్ని ఆలోచించి ఖైరతాబాద్ వినాయక నిమజ్జనోత్సవాన్ని ముందే నిర్వహించడం జరిగిందన్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, భారీ విగ్రహాలు కూడా నిమజ్జనం అయ్యాయని మేయర్ తెలిపారు. 

20:19 - September 15, 2016

హైదరాబాద్ : లిబర్టీ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం కోలాహాలంగా సాగుతోంది. నిమజ్జన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచే గణేష్‌ విగ్రహాల ఊరేగింపు మొదలైంది. భజనలు ఆట పాటలతో కోలాహలంగా మారింది. నిమజ్జనానికి ముందు గణపతి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 'గణపతి బప్పా మోరియా...అగ్‌లే బరస్‌ లౌకర్‌ యా' అంటూ నినాదాలు చేశారు. గణేష్‌ నిమజ్జనాన్ని పురస్కరించుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

బోర్లగూడెంలో మావోయిస్టు డంప్ స్వాధీనం..

కరీంనగర్ : మహాముత్తారం (మం) బోర్లగూడెంలో ఓ ఇంట్లో భారీగా మావోయిస్టు డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. 

టిడిపి, కాంగ్రెస్ లపై హరీష్ విమర్శలు...

మహబూబ్ నగర్ : టిడిపి, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. మల్లన్న సాగర్ కట్టొద్దని టిడిపి, కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేయడం విడ్డూరమన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో టిటిడిపి నేతలు యాక్షన్ చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రా ప్రయోజనాలు ముఖ్యమా..తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల నోటికాడి ముద్దను బాబు లాక్కెళుతున్నారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కోటి ఎకరాలకు నీరందిస్తామని మరో మారు స్పష్టం చేశారు. త్వరలో రూ. 3వేల కోట్టు బడ్జెట్ ను కేటాయించి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హరీష్ రావు పేర్కొన్నారు. 

19:47 - September 15, 2016

హైదరాబాద్ : నగరంలో నిమజ్జన కోలహాలం నెలకొంది. ఉదయం ప్రారంభమైన నిమజ్జనం రాత్రి వరకు కొనసాగుతోంది. ఎంజీ మార్కెట్ లో విపరీతమైన ట్రాఫిక్ నెలకొంది. భారీ విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళుతున్నాయి. హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్ల సహాయంతో వినాయకులను నిమజ్జనం చేస్తున్నారు. ఈ శోభాయాత్రను చూసేందుకు వివిధ జిల్లాల నుండే కాక వివిధ రాష్ట్రాల నుండి రావడం విశేషం. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:39 - September 15, 2016

విజయవాడ : హైదరాబాద్ నాలెడ్జ్ నగరంగా మారిదంటే అడుగడుగునా తన శ్రమ..తన కష్టం దాగి ఉందని ఇది చరిత్రలో తీసేయలేరని ఇదే నగ్న సత్యం అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేవినేని నెహ్రూ..అవినాష్ లు టిడిపి పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విభజించిన పాపం కాంగ్రెస్ దేనని, తాను ఏకపక్షంగా మాట్లాడలేదని, సమన్యాయం చేయాలని ఆనాడు చెప్పడం జరిగిందన్నారు. సమైక్య ఏపీకి ఎక్కువ కాలం సీఎంగా ఉన్న వ్యక్తి తానేనని చెప్పుకొచ్చారు. కట్టుబట్టలతో..అప్పులతో ఇక్కడకు రావడం జరిగిందని, బస్సులో పడుకుని పరిపాలన చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ పదేళ్లు ఉంది కదా...విజయవాడకు ఎందుకు వెళుతున్నారని అడిగారని పేర్కొన్నారు. హైదరాబాద్ తానే అభివృద్ధి చేయడం జరిగిందని, దీని వెనుక పడిన కృషి చూస్తే ఎంతో ఆనందం కలుగుతుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తన మొదటి కర్తవ్యమని పేర్కొన్నారు.

ప్రతిపక్షంపై విమర్శలు..
ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీపై పలు విమర్శళు గుప్పించారు. ప్రతిపక్ష చెప్పుతో కొట్టాలని తనను ఉద్ధేశించి అనడం జరిగిందని, కానీ తాను కూడా ఒక మనిషినేనని..తనకు బాధ..ఆవేశం ఉంటుందన్నారు. ఎన్ని అంటున్నా భరిస్తున్నానని అంటే లక్ష్య సాధన కోసమే భరిస్తున్నాని తెలిపారు. ఏపీని నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలని..ప్రజల కష్టాలు తీర్చాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందన్నారు. తామంతా ఇబ్బందుల్లో ఉన్నామని, నమ్మకంతో ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందని..న్యాయం చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేయడం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 

19:37 - September 15, 2016

విజయవాడ : నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి తాము రక్షణ కవచంలా ఉంటామని దేవినేని నెహ్రూ పేర్కొన్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టిడిపి కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు దేవినేని అవినాష్, కడియాల బుచ్చిబాబులు టిడిపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో దేవినేని మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని, ఏపీ అభివృద్ధిని అడ్డుకోవద్దని కాంగ్రెస్ కు తాను సూచించడం జరిగిందన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని జగన్ అడ్డుకోవాలని చూస్తున్నారని, తామంతా రక్షణ కవచంలా ఉంటామన్నారు. పట్టిసీమ పూర్తయితే ఆనాడు ఏం చెప్పానో గుర్తు చేసుకోవాలని సూచించారు. టిడిపి పార్టీ జెండాను కప్పుకొని చనిపోతానని ఆనాడు చెప్పడం జరిగిందని, తనకు రాజకీయాల భిక్ష పెట్టింది టిడిపియేనన్నారు. ఆనాడు మనస్పూర్తిగా తాను పార్టీని వీడలేదని, తప్పనిపరిస్థితుల్లో పార్టీని వీడానన్నారు. రంగులు మార్చే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాల్లో బాబు ఎంతో కృషి చేయడం జరుగుతోందని, విభజన అనంతరం కష్టాల్లో ఉన్న ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీపై పలు విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని నిర్మాణం..ప్రాజెక్టులను అడ్డుకొంటున్నారని, అమరావతి చంద్రబాబుదని తెలిపారు. రాబోయే భవిష్యత్ ను తీర్చిదిద్దేది అమరావతియేనని, దీనిద్వారా ఉద్యోగాలు..ఉపాధి రావాలంటే బాబే వల్లే సాధ్యమని దేవినేని పేర్కొన్నారు. 

19:16 - September 15, 2016

కడప : జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ గేయానంద్ చేపట్టిన 30 గంటల నిరాహార దీక్ష ముగిసింది. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గేయానంద్‌కు కొబ్బరి నీళ్లు ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడారు. 30 గంటల పాటు చేపట్టిన నిరాహాదీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభించిందని అన్నారు. ప్రభుత్వం కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చాలని కోరారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయం గురించి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎమ్మెల్సీ గేయానంద్ స్పూర్తితో పోరాడాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.

 

19:15 - September 15, 2016

ఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండతో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి సమావేశమయ్యారు. రెండోసారి నేపాల్‌ ప్రధానిగా ఎన్నికైన ప్రచండకు ఏచూరి అభినందనలు తెలిపారు. భూకంప బాధితుల సహాయర్థం నేపాల్‌ ప్రధానమంత్రి సహాయనిధికి రెండో విడతగా 9 లక్షల 72 వేల 479 రూపాయల చెక్కును ఏచూరి అందజేశారు. ప్రచండ భారత్‌ పర్యటన ద్వారా నేపాల్‌, భారత్‌ మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని సీతారాం ఏచూరి తెలిపారు. నేపాల్‌ రాజ్యంగ సమస్యలు పరిష్కరమైతే.. నేపాల్‌, భారత్‌ మధ్య సమస్యలు పరిష్కరమవుతాయని అన్నారు.

19:13 - September 15, 2016
19:09 - September 15, 2016

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న మహా నివేదన అనంతరం అమ్మవారి ఆలయాన్ని మూసివేసిన దుర్గగుడి అధికారులు ఈ రోజు స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గంటలకు ఆలయ తలుపులు తెరిచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. నిన్నటి నుండి ప్రారంభమైన పవిత్రోత్సవాలు ఈనెల 17వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహామంటపం మీదుగా దర్శనానికి క్యూ లైన్ ల ద్వారా
రావాలని అధికారులు సూచిస్తున్నారు. మూడు రోజుల పాటు అనంతరం 17వ తేదీన పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగుస్తుందని ఆలయ పూజారి పేర్కొన్నారు. 

19:07 - September 15, 2016

కడప : జిల్లాలో అగ్రిగోల్డ్‌ ఆస్తుల అమ్మకాలపై టెన్‌టీవీ కథనాలు.. కలకలం రేపాయి. అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లు దొంగదారిన ఆస్తులను అమ్ముకుంటున్న వైనంపై.. స్థానికులు, ముఖ్యంగా సంస్థ బాధితుల్లో ఆగ్రహాన్ని రగిలించింది. ఇప్పటికే బద్వేలు రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి.. అగ్రిగోల్డ్ క్రయవిక్రయాలపై అధికారులను నిలదీసిన బాధితులు..తాజాగా బద్వేలు ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం, పాపారెడ్డిపల్లిలో.. అగ్రిగోల్డ్ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌ అవ్వా సీతారామారావు కుటుంబ సభ్యుల పేరిట వున్న 60 ఎకరాల పట్టాభూమి.. దొంగదారిన అమ్ముకున్న వైనం స్థానికంగా కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి.. అన్ని సాక్ష్యాధారాలతో 10టీవీ ప్రసారం చేసిన కథనాలు జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. టెన్‌టీవీ కథనాలతో అప్రమత్తమైన బాధితులు తాజాగా బద్వేలులో ర్యాలీ నిర్వహించి అనంతరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఆ పిదప కలెక్టర్ సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. బాధితుల వినతి మేరకు ప్రభుత్వానికి అగ్రిగోల్డ్ అక్రమాల మీద ఫిర్యాదు చేస్తున్నట్టు కలెక్టర్ సత్యానారయణ తెలిపారు. పాపిరెడ్డిపల్లి తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ డైరెక్టర్లకు బినామీ ఆస్తులున్నాయని, వాటన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అమ్మి తమకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాలని బాధితులు డిమాండ్‌ చేశారు. 

19:03 - September 15, 2016

హైదరాబాద్ : వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ అనురాగ శర్మ పేర్కొన్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం అనుకున్న టైంలోనే పూర్తి చేశామని చెప్పారు. ఈ అర్థరాత్రి లోపు బాలాపూర్‌ గణనాథుడిని నిమజ్జనం చేస్తామని డీజీపీ వెల్లడించారు. కాగా, వినాయక నిమజ్జనాలపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఈ ఏరియల్‌ సర్వేలో నాయిని వెంట డీజీపీ అనురాగ్‌శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి ఉన్నారు. గణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుందని నాయిని తెలిపారు. 

ట్యాంక్ బండ్ పై నిమజ్జనం సందడి..

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై నిమజ్జన సందడి నెలకొంది. భారీ విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తున్నారు. సాగర్ చుట్టూ భారీ క్రేన్ లు ఏర్పాటు చేశారు. 

రేపు సత్యేంద్ర జైన్ - జేపీ నడ్డా భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి జేపీ నడ్డా - రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ మధ్య భేటీ జరగనుంది. రాష్ట్రంలో ప్రబలుతున్న విష జ్వరాలను అరికట్టే చర్యలపై వీరు చర్చించనున్నారు. 

హోం మంత్రి, డీజీపీ ఏరియల్ వ్యూ..

హైదరాబాద్ : గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని హోం మంత్రి నాయినీ ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. ఆయనతో పాటు డీజీపీ అనురాగ్ శర్మ, పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డిలు కూడా ఉన్నారు. 

18:15 - September 15, 2016

హైదరాబాద్ : నగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ఊపందుకొంది. ఉదయం ప్రారంభమైన నిమజ్జనం కోలహాలంగా సాగుతోంది. ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నమే నిమజ్జనం చేయడం విశేషం. ఎంజీ రోడ్డులో వినాయక నిమజ్జన ఊరేగింపు ఊపందుకొంది. భారీ విగ్రహాలు సాగర్ వైపు తరలుతున్నాయి. చిన్న పాటి విగ్రహం మొదలుకొని భారీ విగ్రహాలు సాగర్ లో నిమజ్జనం చేస్తున్నారు. ఉదయం భారీ వర్షం పడడంతో ప్రజల సంఖ్య తక్కువగా కనిపించింది. కానీ సాయంత్రం అయ్యే సరికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఎంజీ రోడ్డులో శోభాయాత్రను చూసేందుకు వివిధ జిల్లాల నుండి తరలివచ్చారు. కలర్ ఫుల్ గా సాగుతున్న వినాయక ఊరేగింపును ప్రజలు బారులు తీరి నిలబడి చూస్తున్నారు. ఈ శోభయాత్రకు వచ్చిన వారు ఏమనుకుంటున్నారు ? మరింత వివరాలకు వీడియో క్లిక్ చేయండి. మరోవైపు లిబర్టీ రోడ్డులో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి బారులు తీరి నిలుచున్నాయి. ట్యాంక్ బండ్ తీరానికి చేరుకున్న విగ్రహాలను అక్కడున్న సిబ్బంది నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనానికి తరలివస్తున్న గణనాథులకు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ స్వాగతం పలుకుతున్నారు. 

తూర్పుగోదావరిలో రోడ్డు ప్రమాదం..

తూర్పుగోదావరి : రంగంపేట - వడిసలేరు మధ్య రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు - ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 

జూట్ మిల్లు కార్మికులతో మంత్రి ప్రత్తిపాటి సమావేశం..

గుంటూరు : జూట్ మిల్లు కార్మికులతో మంత్రి ప్రత్తిపాటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మోద్గుల, కలెక్టర్ కాంతిలాల్ దండే, కార్మికులు హాజరయ్యారు. జూట్ మిల్లును తెరిపించాలని కార్మికులు స్పష్టం చేశారు. తక్షణమే స్టే ఎత్తివేసేలా ప్రభుత్వం తరపున చర్యలు చేపట్టాలని కార్మిక శాఖను మంత్రి ప్రత్తిపాటి ఆదేశించారు. ఐదుగరు సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

 

ప్రచండను కలిసిన ఏచూరి..

ఢిల్లీ : నేపాల్ ప్రధాని ప్రచండను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కలిశారు. నేపాల్ ప్రధానిగా ఎంపిక కావడం పట్ల ప్రచండకు అభినందనలు తెలిపారు. భూకంప బాధితుల సహాయార్థం రెండో విడతగా ప్రచండకు రూ. 9,72,479 చెక్కును ఏచూరి అందచేశారు. సీపీఎం అనుబంధ సంస్థలు..ప్రజల నుండి సేకరించిన విరాళాలు రూ. 8.50 కోట్లు అందచేయడం జరిగిందని ఈ సందర్భంగా ఏచూరి పేర్కొన్నారు. సీపీఎం సహాయం పట్ల ప్రచండ సంతోషం వ్యక్తం చేశారని, ప్రచండ భారత పర్యటన ద్వారా నేపాల్ - భారత్ మధ్య సంబంధాలు మరింత బలపడుతాయన్నారు. నేపాల్ రాజ్యాంగ సమస్యలు పరిష్కారమయితే ఇరు దేశాల మధ్య సమస్యలు కొలిక్కి వస్తాయన్నారు. 

17:54 - September 15, 2016
17:50 - September 15, 2016

విజయవాడ : రైల్వే జోన్ విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడంతో విశాఖ..విజయవాడ ప్రజల మధ్య అగ్గి రాజుకుంది. తమ ప్రాంతానికే రైల్వే జోన్ ఇవ్వాలని ఇటు విజయవాడ ప్రజలు..అటు విశాఖ వాసులు డిమాండ్ లేవనెత్తుతున్నారు. అన్ని అర్హతలు కలిగిన విజయవాడకు రైల్వే జోన్ కేటాయించాలని బెజవాడ రైల్వే స్టేషన్ ఎదుట ఉద్యమకారులు ఆందోళన నిర్వహించారు. దీనికి సంబంధించి మరింత వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:34 - September 15, 2016

మహబూబ్ నగర్ : హైదరాబాద్ పరిశ్రమలకు ఎంతో సురక్షిత ప్రదేశమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో పీ అండ్ జీ పరిశ్రమలో ప్లానింగ్ సెంటర్ ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిశ్రమల హబ్ గా దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా తయారవుతుందని పేర్కొన్నారు. ఇప్పుడున్న స్కూళ్లలన్నింటినీ రాబోయే కాలంలో డిజిటల్ స్కూల్స్ గా మారుస్తామని, ఇందుకనుగుణంగా కొత్తూరు మండలంలోని 19 గ్రామ పంచాయతీలో ఉన్న స్కూల్స్ లను దత్తత తీసుకుని డిజిటల్ స్కూల్స్ గా ఏర్పాటు చేయాలని పి అండ్ జి కంపెనీ ప్రతినిధులకు సూచించారు. 

వరంగల్ కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం..

వరంగల్ : కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం జరిగింది. నగర అభివృద్ధి పనులు, ముఖ్యమంత్రి హామీలపై చర్చించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మేయర్ నరేందర్ లు హాజరయ్యారు. 

సీఆర్డీఏ కమిషన్, అడిషనల్ కమిషనర్ మంత్రి యనమల భేటీ..

విజయవాడ : సీఆర్డీఏ కమిషన్, అడిషనల్ కమిషనర్ మంత్రి యనమల భేటీ అయ్యారు. డిసెంబర్ లోగా అసెంబ్లీ, శాసనమండలి భవనాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరి నెలాఖరు, ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలుంటాయని మంత్రి యనమల పేర్కొన్నారు. సీఎం, స్పీకర్, మంత్రులు, అధికారుల ఛాంబర్లు, సౌకర్యాలపై చర్చించారు.

 

విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద ఉద్రిక్తత..

విశాఖపట్టణం : ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది. తరగతులు బహిష్కరించి విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. ఫిజికల్ డైరెక్టర్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అప్పటికి ఛాంబర్ తో సహా అన్ని సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

కాసేపట్లో టిడిపిలో చేరనున్న దేవినేని నెహ్రూ..

విజయవాడ : కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో దేవినేని నెహ్రూ, అవినాష్ లు చేరనున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ నుండి భారీ బైక్ ర్యాలీ జరగనుంది. 

16:42 - September 15, 2016

వరంగల్ : తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు, తల్లిదండ్రులకు మళ్లీ టెన్షన్ మొదలైంది. ప్రభుత్వం..కాళోజీ వర్సిటీ వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకు గురి చేస్తోంది. ఫలితాలను వెల్లడించిన వెంటనే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం కాళోజి హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశమంతటా కస్టోడియన్ సర్టిఫికేట్లను ప్రాతిపదికగా తీసుకుని కౌన్సెలింగ్ కు అనుమతినిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికిప్పుడ సబ్మిట్ చేయాలని పేర్కొనడంతో అంతా అయోమయం నెలకొంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

వెలగపూడిలో సీఎం చంద్రబాబు..

గుంటూరు : వెలగపూడిలో తాతాల్కిక సచివాలయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పది రోజుల్లో సచివాలయం మొత్తం పూర్తవుతుందని, సచివాలయం మంచి వాతావరణంలో ఉంటే దాని ప్రభావం ఉద్యోగుల మీద ఉంటుందన్నారు. వెగలపూడిలో దసరా నుండి పాలన కొనసాగిస్తానని, తన కార్యాయంలో ప్రత్యేకంగా సెంట్రల్ కమాండ్ రూంను ఏర్పాటు చేసుకుని నిరంతరం పనులను పరిశీలిస్తానన్నారు. పోలవరం తెలుగు ప్రజల కలల ప్రాజెక్టు అని, హోదాకు సమానంగా ప్యాకేజీని కేంద్రం ఇచ్చినప్పుడు అంగీకరించడం మంచిదేనన్నారు.

16:21 - September 15, 2016

హైదరాబాద్ : నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. పోలీసులు..ఇతర శాఖల సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు చర్యలు తీసుకుంటున్నాయి. భారీ వర్షం కురుస్తున్నా శోభాయాత్రను చూసేందుక భక్తులు పోటెత్తారు. సాయంత్రం వర్షం తగ్గుముఖం పట్టేసరికి భారీ సంఖ్యలో ప్రజలు నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు తరలివెళుతున్నారు. చార్మినార్ లో నిమజ్జన సందడి నెలకొని ఉంది. ఇంకా భారీ విగ్రహాలు రావాల్సి ఉంది. ఈ సందర్భంగా యువతీ, యువకులు తీన్ మార్ డ్యాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని చాటుకున్నారు. 

సెలక్షన్ కమిటీ కోసం ఆడను - గంభీర్..

ఢిల్లీ : తాను సెలక్షన్ కమిటీ కోసం ఆడనని, తాను స్కోర్ కోసం ఆడుతానని భారత బ్యాట్ మెన్ గౌతం గంభీర్ పేర్కొన్నారు. టెస్టు టీంకు గంభీర్ సెలక్షన్ కాలేదన్న విషయం తెలిసిందే.  

16:12 - September 15, 2016
15:56 - September 15, 2016

కురులు..ఆకర్షణీయంగా తయారు కావడంలో శిరోజాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శిరోజాలు సరిగ్గా లేకపోయేసరికి చాలా మందికి విసుగులు కలుగుతుంది. ఇందుకోసంఇ బ్యూటీపార్లర్లు..వివిధ రకాల క్రీంలు వాడుతుంటారు. మరీ ముఖ్యంగా వెంట్రుకలు రాలిపోయే సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. అయితే మెంతులను వాడడం వల్ల శిరోజాల సమస్య తీరే అవకాశం ఉంది.
మెంతులను మందారపూలతో కలిపి మెత్తని పొడిలా చేయాలి. దీనిని జుట్టుకు పట్టించాలి. ఓ అరగంట అనంతరం తలస్నానం చేయాలి. దీనితో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
వేడి కొబ్బ‌రినూనెలో మెంతుల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆ మిశ్ర‌మాన్ని మెత్త‌ని పేస్టులా చేసుకోవాలి. అనంతరం జుట్టు కుదుళ్లకు త‌గిలేలా ప‌ట్టించాలి. 20-30 నిమిషాల పాటు అలాగే ఉండి త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.
కోడిగ్రుడ్డు తెల్లసొనలో మెంతిపొడి కలిపి బాగా గిలకొట్టి తలకు రాసుకుని అరగంట తరవాత తలంటుకుంటే చుండ్రు, దురదలు దరి చేరవు.
ఒక కప్పు మజ్జిగలో నాలుగు చెంచాల మెంతులు వేసి రాత్రంతా నాననివ్వాలి. ఆ మర్నాడు ఉదయాన్నే మెత్తగా రుబ్బి తలకు పట్టించాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయాలి. 

15:46 - September 15, 2016
15:43 - September 15, 2016
15:41 - September 15, 2016

హైదరాబాద్ : లిబియాలో కిడ్నాప్ అయిన ప్రొఫెసర్ బలరాం విడుదలతో వారి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని బలరాం సతీమణి శ్రీదేవి పేర్కొన్నారు. ఫోన్ లో తనతో మాట్లాడడం జరిగిందని, తమను రిలీజ్ చేయడం జరిగిందని, ఎప్పటి వరకు వస్తారో వేచి చూడాలన్నారు. మరోవైపు కిడ్నాప్ కు గురైన గోపికృష్ణ విడుదల కావడంతో శ్రీకాకుళంలోని ఆయన స్వగృహంలో ఆనందం వెల్లివెరుస్తోంది. గోపికృష్ణ తల్లిదండ్రులు సరస్వతి, నారాయణ మూర్తి ఆనందం వ్యక్తం చేశారు. వీరు హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. కిడ్నాప్ కు గురైన వ్యక్తుల విడుదలకు కృషి చేసిన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సుష్మా చొరవ అభినందనీయమన్నారు. తాను స్వయంగా ఐదారుసార్లు సుష్మాను కలుసుకొని విజ్ఞప్తులు చేయడం జరిగిందన్నారు.

  • లిబియాలో గతేడాది జులైలో ఇద్దరు తెలుగు వారు అపహరణకు గురయ్యారు.
  • ఏడాదికి పైగా కిడ్నాపర్ల చెరలో ఏపీకి చెందిన గోపాలకృష్ణ, తెలంగాణకు చెందిన బలరామకృష్ణలు ఉన్నారు.
  • 2015 జులై 29న లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌నకు గురయ్యారు.
  • త్రిపోలీ మీదుగా భారత్‌కు తిరిగి వస్తున్న గోపాలకృష్ణ, బలరామకృష్ణ, విజయ్‌కుమార్‌, లక్ష్మీకాంత్‌లను కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు.
  • తొలుత వీరిని ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు బంధించి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
  • అయితే రెండు రోజుల తర్వాత వీరిలో లక్ష్మీకాంత్‌, విజయ్‌కుమార్‌లను త్రిపోలీలోని భారత అధికారులు రక్షించారు.
  • తాజగా గోపాలకృష్ణ, బలరామకృష్ణలు సురక్షితంగా బయటపడ్డారు. 

ముంబై లో అగ్నిప్రమాదం..

ముంబై : కండివాలి ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం. 

జైట్లీతో ఇన్ఫోసిస్ సీఈవో భేటీ..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా భేటీ అయ్యారు. జీఎస్టీ బిల్లు..వివిధ ప్రాజెక్టుల విషయంపై మాట్లాడడం జరిగిందని విశాల్ సిక్కా పేర్కొన్నారు. 

15:16 - September 15, 2016

కరీంనగర్ : సిరిసిల్లలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద వేప చెట్టు కిందనున్న నాలుగు పిల్లమొక్కలు గుండ్రంగా తిరుగుతున్నాయనే వదంతులు దావానంలా వ్యాపించాయి. సిరిసిల్లలో శాంతినగర్ లో మొండయ్య నివాసం ఉంటున్నారు. ఆయన నివాసంలో ఓ వేప చెట్టు ఉంది. ఈ చెట్టు కింద నాలుగు చిన్న వేప మొక్కలు మొలిచాయి. గురువారం మధ్యాహ్నం చిన్న మొక్కలు గుండ్రంగా తిరుగుతున్నాయని పుకార్లు షికార్లు చేశాయి. దీనితో ఈ వింత ఘటన చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. దైవలీలతోనే ఇదంతా జరుగుతోందని స్థానికులు పేర్కొంటూ పసుపు..కుంకుమ చల్లుతో పూజలు చేస్తున్నారు. చెట్లు తిరుగుతాయా ? లేదా అనే దానిపై టెన్ టివి పలువురితో మాట్లాడింది.

చెట్లు ఎప్పుడూ కదలవు - ప్రొఫెసర్..
నేలలో వేర్లతో ఉన్న చెట్లు ఎప్పుడూ కదలవని ఓయూ ప్రొఫెసర్ బి.ఎన్.రెడ్డి పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. మొలకల కింద నీళ్లు ఉంటే ఇది సాధ్యమౌతుందన్నారు. చెట్టు అనేది కదలకుండా ఉండేదని అర్థమని, వింత అనుకోవడం..దేవుడిని ఆపాదించడం..సరికాదన్నారు.

భక్తికి లింక్ చేయడం సరికాదు - జనవిజ్ఞాన వేదిక..
చిన్న మొలకలని, గట్టిపడి ఉండకపోవచ్చని రమేష్ (జనవిజ్ఞాన వేదిక) పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. మొలకల కింద మట్టి కొద్దిగా లూజ్ కావడం..దాని కింద నీళ్లు చేరి ఉండవచ్చన్నారు. కేవలం మొలకలు కదులుతున్నాయని, గుండ్రంగా తిరడం లేదన్నారు. అక్కడకు వెళ్లి చూస్తే తెలుస్తుందని, ఏదో శక్తికి ఆపాదించడం సరికాదన్నారు. 

15:05 - September 15, 2016

'ఏక్తా టైగర్' జోడి 'సల్మాన్ ఖాన్', 'కత్రినా కైఫ్' 'టైగర్' కోసం మరోసారి జోడికట్టబోతున్నారు. ఇటీవలే కండలవీరుడి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఈ కాంబినేషన్ లో న్యూ మూవీ చేస్తున్నాడు. మాజీ ప్రేమికులు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఆ కొత్త సినిమా సంగతులేంటీ ?
బిలియన్ స్టార్ 'సల్మాన్ ఖాన్' వరుస సక్సెస్ లతో పుల్ స్వీంగ్ లో ఉన్నాడు. 'భజ్ రంగ్ భాయ్ జాన్' తో గత ఎడాది బ్లాక్ బస్టర్ కొట్టిన 'సల్లూ'భాయ్ 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' తో ఓ మాదిరి హిట్టు కొట్టాడు. ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికి 300కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

ఏక్తా టైగర్ కు సీక్వెల్...
ఇక ఇటీవల వచ్చిన 'సుల్తాన్' తో 'సల్మాన్' మరో ఘన విజయం అందుకున్నాడు. ఈ చిత్రం దర్శకుడు 'అలీ అబ్బాస్ జాఫర్' సల్మాన్, కత్రినా లతో కొత్త మూవీకి ప్లాన్ చేశాడు. 'సల్మాన్ ఖాన్ - కత్రినాకైఫ్' కాంబినేషన్ లో 'టైగర్ జిందా హై' సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా గతంలో 'సల్మాన్', 'కత్రినా' జంటగా నటించిన సూపర్ హిట్టు మూవీ 'ఏక్తా టైగర్' కి సీక్వెల్ కావడం విశేషం. ఈ చిత్రాన్ని 'యష్ రాజ్ ఫిల్మ్స్' బ్యానర్ పై 'ఆదిత్య చోప్రా' నిర్మిస్తున్నాడు. మరి ఈ జంట ప్రేక్షకులను ఎలా అలరిస్తారో వేచి చూడాలి. 

14:33 - September 15, 2016

ఎంసెట్ 3 ఫలితాలు..ర్యాంకులు..

హైదరాబాద్ : ఎంసెట్ 3 పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. మొదటి ర్యాంకు ఆర్.పి.మానస (గుడివాడ) 152 మార్కులు..రెండో ర్యాంక్ హరిక (సికింద్రాబాద్) 151 మార్కులు..మూడో ర్యాంకు తేజస్విని (అనంతపురం) 151 మార్కులు..నాల్గొ ర్యాంక్ జి. అహ్మద్ (బహదూర్ పురా) 151 మార్కులు, ఐదో ర్యాంక్ ఇమ్రాన్ ఖాన్ (మెహదీపట్నం) 151 మార్కులు, ఆరో ర్యాంక్ శ్రీకాంతేశ్వరరెడ్డి (సికింద్రాబాద్) 151 మార్కులు, ఏడో ర్యాంక్ ఆలేఖ్య (ఖమ్మం) 150 మార్కులు, 8వ ర్యాంక్ ఫాతిమా (ఆదిలాబాద్) 150 మార్కులు, 9వ ర్యాంక్ కె.కావ్య (బేగంపేట) 150 మార్కులు, 10వ ర్యాంక్ వెంపటి రూపేశ్ (మిర్యాలగూడ) 150 మార్కులు. 

దెబ్బలగూడలో విషాదం..

రంగారెడ్డి : కందుకూరు (మం) దెబ్బలగూడలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు. ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా మరొకరి మరొకరి మృతదేహం కోసం గాలింపులు చేపడుతున్నారు. మృతులు శిల్ప (14), సృజన్ (13), నాని (10), శివ (12)లుగా గుర్తించారు. 

స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ తీర్పుపై ఏపీ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులు కొట్టేయాలని ఏపీ అడ్వకేట్ జనరల్ కోరారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. 

ఎంసెట్ 3 పరీక్షలో తప్పులు - పాపిరెడ్డి..

హైదరాబాద్ : ఎంసెట్ 3 పరీక్షలో 8 తప్పులు వచ్చాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. పరీక్ష రాసిన విద్యార్థులందరికీ 8 మార్కులు కలుపుతామని పేర్కొన్నారు. 

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల లేమిపై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల లేమిపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రజా ప్రతినిధుల వద్ద పీఏలుగా ఉన్న ఉపాధ్యాయులను సొంత క్యాడర్ కు పంపించామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 5కి వాయిదా పడింది. 

14:15 - September 15, 2016

హైదరాబాద్ : జై బోలో గణేష్ మహరాజ్ కి జై..అనే నినాదాలతో ఎంజీ రోడ్డు మారుమాగుతోంది. వేలాది మంది ప్రజలు నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు తరలివస్తున్నారు. వివిధ గణనాథులను నిమజ్జనం చేసేందుకు ఎంజీ రోడ్డు మీదుగా ట్యాంక్ బండ్ కు వెళుతున్నారు. ఇక్కడ రద్దీ నెలకొండా ఉండేందుకు పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. కాసేపటి క్రితం భారీ వర్షం కురవడంతో విగ్రహాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తిరిగి వర్షం తగ్గుముఖంపట్టేసరికి వినాయక శోభాయాత్ర ప్రారంభమైంది. 

మహాగణపతి నిమజ్జనం పూర్తి..

హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. ఉదయం ప్రారంభమైన గణేష్ శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. చరిత్రలో తొలిసారిగా మధ్యాహ్నానికే మహాగణపతి నిమజ్జనం జరిగింది.

 

13:56 - September 15, 2016

హైదరాబాద్ : మహా లంబోదరుడి మహా నిమజ్జన కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.  భక్తులు మేళ, తాళాల మధ్య, భక్తుల తీన్మార్‌ స్టెప్పులతో గణనాథులు నిమజ్జనానికి తరలివచ్చారు. మధ్య మధ్యలో వర్షం పలుకరించి వెళ్తున్నా గణనాథుని వీడ్కోలుకు మాత్రం ఏమాత్రం ఆటంకం కలగకుండా అధికారులు..పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు శోభా యాత్రలో పాల్గొని తమ భక్తి శ్రద్ధలు చాటుకుంటున్నారు. నగరంలోనే అతి భారీ గణనాధుడైన ఖైరతాబాద్ గణపయ్యకు నిమజ్జనం నిర్విఘ్నంగా పూర్తయ్యింది.  ఈ శోభాయాత్రను చూసేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ మహాగణపయ్యను నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక క్రేన్ ను ఉపయోగించటం అనేది ప్రతీ ఏటా జరిగేదే.  కాగా ఎన్నడూ లేని విధంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర గురువారం ఉదయం 8.30 గంటలకే ప్రారంభం కావటం ఒక విశేషమైతే..మధ్యహ్నాం 2.00లలోపే మహాగణపయ్య నిమజ్జనం కావటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు..30ఏళ్ళ చరిత్రలోనే ఇది జరగలేదని జీహెచ్ఎంసీ మేయర్ తెలిపారు. గత రెండు నెలలుగా అన్నిశాఖలు కలిసి చేసిన కృషి ఫలితంతోనే ఖైరతాబాద్ గణపతి నిమజ్జన ప్రదేశానికి తరలిరావటం దీనికి  నిదర్శనమన్నారు. తిది, నక్షత్రం ప్రకారం, జనసందోహం మధ్య ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగుతుండటం ఆనందంగా ఉందని మేయర్ తెలిపారు. 

13:43 - September 15, 2016

1994 వేలం ప్రారంభం..
1994 నుండి బాలాపూర్ లడ్డూను వేలం వేస్తూ వస్తున్నారు. ఆ ఏడాది గ్రామానికి చెందిన కొలను మోహన్ రెడ్డి రూ.450కి సొంతం చేసుకున్నారు. దానిని కొంత ఇంట్లో వారు తిని మరికొంత బంధువులకు పంచి మిగిలింది తన పొలంలో చల్లారు. అప్పటి నుండి తన పంటల దిగుబడి పెరిగిందని ఆయన నమ్మకం. ఆ తరువాత ఏడాది నుండి వరసగా 17 ఏళ్లు స్థానికులే ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. 2012లో స్థానికేతరుడు పన్నాల గోవర్ధన్ రెడ్డి ఈ లడ్డూను రూ.7.50 లక్షలకు సొంతం చేసుకున్నాడు. తన తండ్రి చివరి కోరిక మేరకు లడ్డూను సొంతం చేసుకున్నట్లు తెలిపారు. 2014లో మాజీ మేయర్, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూను దక్కించుకున్నందుకే తాను ఎమ్మెల్యేనయ్యానని ఆయన భావిస్తున్నారు. 2015 సంవత్సరం వేలం పాటలో 10 లక్షల 32 వేలకు కళ్లెం మదన్‌మోహన్‌ లడ్డూను దక్కించుకున్నారు. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో రూ.14.65 లక్షలకు స్కైలాబ్‌రెడ్డి బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూను కైవసం చేసుకున్నారు.

సంవత్సరం పేరు  ధర
1994 కొలను మోహన్ రెడ్డి  రూ. 450.00
1995 కొలను మోహన్ రెడ్డి రూ. 4,500.00
1996 కొలను కృష్ణా రెడ్డి రూ. 18,000.00
1997 కొలను కృష్ణా రెడ్డి రూ. 28,000.00
1998 కొలను మోహన్ రెడ్డి రూ. 51,000.00
1999 కల్లెం ప్రతాప్ రెడ్డి రూ. 65,000.00
2000 కల్లెం అంజిరెడ్డి రూ. 66,000.00
2001 జి.రఘునందన రెడ్డి రూ. 85,000.00
2002 కందాడ మాదవ్ రెడ్డి రూ.1,05,000.00
2003 చిగిరింత బాల్ రెడ్డి  రూ. 1,55,000.00
2004 కొలను మోహన్‌రెడ్డి రూ. 2,01,000.00
2005 ఇబ్రహిం శేఖర్ రూ. 2,08,000.00
2006 చిగురింత తిరుపతిరెడ్డి రూ. 3,00,000.00
2007 జి.రఘునందనాచారి రూ. 4,15,000.00
2008 కొలను మోహన్‌రెడ్డి  రూ. 5,07,000.00
2009 సరిత రూ. 5,10,000.00
2010 శ్రీధర్‌బాబు రూ. 5,35,000.00
2011 కొలను ఫ్యామిలీ రూ. 5,45,000.00
2012 పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ. 7,50,000.00
2013 తీగల కృష్ణారెడ్డి రూ. 9,26,000.00
2014 సింగిరెడ్డి జయేందర్ రెడ్డి  రూ. 9,50,000.00
2015 కళ్లెం మదన్‌మోహన్‌  రూ. 10,32,000.00
2016 స్కైలాబ్ రెడ్డి రూ. 14,65,000.00
2017       ? ? ?        ? ? ?

రెండో రోజు బ్రిక్స్ సదస్సు..

విశాఖ : బుధవారం ప్రారంభ‌మైన‌ బ్రిక్స్ (బ్రెజిల్, ర‌ష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల స‌ద‌స్సు రెండో రోజు కొన‌సాగుతోంది. ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రాల‌పై గురువారం నేతలు చ‌ర్చిస్తున్నారు. దీనికి సంబంధించిన వైజాగ్ క‌మిష‌న‌ర్ హ‌రినారాయ‌ణ ప్ర‌జంటేష‌న్ ఇస్తున్నారు. స్టార్ట్ సిటీల ఏర్పాటులో తీసుకుంటున్న చ‌ర్య‌లు, ఉప‌యోగిస్తోన్న సాంకేతిక‌త వివ‌రాల‌ను ఆయా దేశాల ప్ర‌తినిధులు తెలుపుతున్నారు.

అధికారులతో మంత్రి కడియం సమీక్ష..

వరంగల్: వరంగల్ కలెక్టరేట్‌లో ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే అధికారుల సమీక్ష సమావేశం జరుగుతుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఓఆర్‌ఆర్, రోడ్లు, బ్రిడ్జిల డీపీఆర్ త్వరగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. 2018 నాటికి నిర్మాణ పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

నిమజ్జన స్థలానికి చేరుకున్ మహాగణనాథుడు..

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. భక్తుల కోలాహలం నడుమ గణపయ్య ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నాడు. ట్యాంక్‌బండ్‌పై క్రేన్‌నెంబర్ 4వద్ద ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం జరుగనుంది. సాయంత్రంలోగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యే అవకాశం ఉంది. తక్కువ సమయంలో ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం ఇదే తొలిసారి.

ఎంసెట్-3 పరీక్షల ఫలితాలు విడుదల..

హైదరాబాద్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈ నెల 11వ తేదీన నిర్వహించిన ఎంసెట్-3 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలతోనే ఎంసెట్-3 పరీక్షకు సంబంధించిన తుది కీని విడుదల చేశారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ... ఎంసెట్-3 పరీక్షలో ఎనిమిది తప్పులు దొర్లాయి. ఎంసెట్-3 రాసిన అందరు అభ్యర్థులకు 8 మార్కులు కలుపుతామని తెలిపారు. ఈ పరీక్షలకు 40,500 మంది విద్యార్థులు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. 37,199 మంది పరీక్షలకు హాజరయ్యారు.

12:45 - September 15, 2016
12:42 - September 15, 2016

హైదరాబాద్ : గత 30 సంత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖైరతాబాద్ గణనాధుడ్ని మ.1.00లకల్లా నిమజ్జం చేసేందుకు ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. సాయంత్రంలోగా నిమజ్జనం పూర్తిచేస్తామని జీహెచ్ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోషన్‌ తెలిపారు.. ఎప్పటికప్పుడు చెత్త తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని..భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రతీ గంటకూ ఒకసారి నీటిలో వున్న చెత్తను తొలగిస్తున్నామని తెలిపారు. దీంతో నీరు కలుషితం కావటాన్ని నివారించవచ్చన్నారు. గత రెండు నెలలుగా అన్నిశాఖలు కలిసి చేసిన కృషి ఫలితం ఇప్పుడు కనిపిస్తోందని అన్నారు. తిది, నక్షత్రం ప్రకారం, జనసందోహం మధ్య ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగుతుండటం ఆనందంగా ఉందని మేయర్ తెలిపారు. నగరంలో వున్న గణనాధులను రాత్రి.10.30ల్లోపుగా నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హుసేన్‌ సాగర్‌లో ప్రశాంతంగా కొనసాగుతోంది.. మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

12:26 - September 15, 2016

ఢిల్లీ : లిబియాలో గతేడాది జులైలో అపహరణకు గురైన ఇద్దరు తెలుగువారు సురక్షితంగా బయటపడ్డారు. ఏడాదికి పైగా కిడ్నాపర్ల చెరలో ఉన్న ఏపీకిచెందినగోపాలకృష్ణ, తెలంగాణకు చెందిన బలరామకృష్ణను సురక్షితంగా కాపాడామని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.2015 జులై 29న లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌నకు గురయ్యారు. త్రిపోలీ మీదుగా భారత్‌కు తిరిగివస్తున్న గోపాలకృష్ణ, బలరామకృష్ణ, విజయ్‌కుమార్‌, లక్ష్మీకాంత్‌లను కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. తొలుత వీరిని ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు బంధించి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రెండు రోజుల తర్వాత వీరిలో లక్ష్మీకాంత్‌, విజయ్‌కుమార్‌లను త్రిపోలీలోని భారత అధికారులు రక్షించారు. మిగతా ఇద్దరు ఇవాళ సురక్షితంగా బయటపడ్డారు. అయితే వీరిని ఎవరు కిడ్నాప్‌ చేశారన్న దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది.

ఉగ్ర చెరనుండి సురక్షితంగా బైటపడ్డ తెలుగువారు..

ఢిల్లీ: లిబియాలో గతేడాది జులైలో అపహరణకు గురైన ఇద్దరు తెలుగువారు సురక్షితంగా బయటపడ్డారు. ఏడాదికి పైగా కిడ్నాపర్ల చెరలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి.గోపాలకృష్ణ, తెలంగాణకు చెందిన సి.బలరామకృష్ణను సురక్షితంగా కాపాడినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 2015 జులై 29న లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌నకు గురయ్యారు. త్రిపోలీ మీదుగా భారత్‌కు తిరిగివస్తున్న గోపాలకృష్ణ, బలరామకృష్ణ, విజయ్‌కుమార్‌, లక్ష్మీకాంత్‌లను కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. తొలుత వీరిని ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు బంధించి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

11:28 - September 15, 2016
11:27 - September 15, 2016

హైదరాబాద్ : నగరంలో గణేష్ ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రతీఏడాదీ చూస్తూనే వుంటాం. మరి ఈ ఉత్సవాలలో విభిన్న ఆకృతులతో..విన్నూత్న గణపతులు కొలువై పూజలందుకుంటూంటారు. అటువంటి విభిన్న గణనాధుడ్ని చూడాలంటూ మనం పాతబస్తీలోని గౌలిపురాలో అంబా మల్వీశ్వరా భక్తి సమాజం వారు ఏర్పాటు చేసిన గణేషుడిని చూసి తీరాల్సిందే. గౌలిపురాలో హరిత హారం గణపతి భక్తులను ఆకట్టుకుంటున్నాడు. స్కూలు యూనిఫాంలో వున్న విద్యార్థులు మొక్కలు నాటుతున్నట్లుగా వున్న ఈ గణనాథులకు చూస్తే సమాజానికి మొక్కలు నాటండి అనే సందేశాన్నిస్తున్నట్లుగా వుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సమాజంలో వున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి విభిన్నంగా గణేషులను తయారు చేస్తుంటామనీ వారు తెలిపారు. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని హరితహారం గణపతిని తయారుచేశామని వారు తెలిపారు. 

11:04 - September 15, 2016
10:46 - September 15, 2016

హైదరాబాద్ : గణేశ్‌ నిమజ్జనపర్వం మొదలైంది. ఉదయం నుంచే నిమజ్జనానికి బొజ్జ గణపయ్యలు సిద్దమయ్యారు. 11 రోజులుగా విశేష పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి కదులుతున్నారు. ఈ సందర్భంగా చార్మినార్ నుండి గణేషుల యాత్రకు ఎటువంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం..ఈ సందర్భంగా డీసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ..ఈరోజు 12.00 అనంత చతుర్థతి కారణంగా ముహూర్తపు ఘడియలలో నిమజ్జనం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ప్రతీ ఏడాదీ ఖైరతాబాద్ వినాయకుడు యాత్ర ప్రారంభం కావటానికి దాదాపు అర్థరాత్రి సమయం పట్టేది.కానీ ఈ ఏడాది 10.30గంటలకే మహాగణనాథుడి యాత్ర ప్రారంభం కావటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా 12వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. గత ఏడాది ఈ సమయానికి ప్రారంభంకాలేదనీ ఈ సంవత్సం ఇప్పటికే రెండువేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. ఈరోజు సాయంత్రానికి సుమారు 50వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. పోలీసులు, జిహెచ్‌ఎంసీ, నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయంతో నిమజ్జనం సాఫీగా సాగేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 25 వేల పోలీసులను, 12 వేల సీసీ టీవీలను నిమజ్జనం సందర్భంగా ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు డైరెక్ట్‌ లైవ్‌ సౌకర్యం ఉన్న అత్యంత నాణ్యత గల కెమెరాలతో నిఘా పర్యవేక్షిస్తున్నారు.కాగా భద్రతకు సోషల్ మీడియాను కూడా ఈ ఏడాది అధికారులు ఉపయోగించుకోవటం మరో విశేషం. 

లడ్డూకోసం 2ఏళ్లుగా యత్నం : స్కైలాబ్ రెడ్డి

హైదరాబాద్ : ప్ర‌తి ఏటా వేలంపాటలో త‌న రికార్డుల‌ను తానే బ‌ద్ద‌లు కొట్టుకుంటూ వ‌స్తోన్న బాలాపూర్ గ‌ణేశ్ ల‌డ్డు ఈ ఏడాది కూడా తన రికార్డును తాను బద్దలుకొట్టిందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది వేలంలో రూ.14.65 లక్షలకు అమ్ముడుపోయి రికార్డు ధ‌ర ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ల‌డ్డూని సొంతం చేసుకున్న భ‌క్తుడు స్కైలాబ్ రెడ్డి మాట్లాడుతూ... ల‌డ్డూను సొంతం చేసుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. గ‌త రెండేళ్ల నుంచి బాలాపూర్‌ ల‌డ్డూ కోసం చాలా తిప్ప‌లు ప‌డిన‌ట్లు పేర్కొన్నారు. ఇటువంటి అవ‌కాశం దొర‌క‌డం ఎంతో అదృష్ట‌మ‌ని పేర్కొన్నారు.

10:18 - September 15, 2016

హైదరాబాద్ : గణేశ్‌ నిమజ్జనపర్వం మొదలైంది. ఉదయం నుంచే నిమజ్జనానికి బొజ్జ గణపయ్యలు సిద్దమయ్యారు. ఎప్పటిమాదిరిగా కాకుండా ఈసారి ఉదయమే ఖైరతాబాద్‌ గణనాధుడు నిమజ్జనానికి తరలివెళుతున్నాడు. ఈరోజు మధ్యహ్నాంలోగా నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. గణేషుడు శోభాయాత్రలో రాష్ట్రానికి సంబంధించే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా భక్తులు తరలివచ్చి మహాగణపతిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. ఈ శోభాయాత్రకు అధికారులు భారీ భద్రతా ఏర్పట్లు చేపట్టారు. యాత్రలో పాల్గొన్న భక్తులు నృత్యాలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. కాగా ఖైరతాబాద్ శ్రీశక్తిపీఠ గణేషుడి శోభాయాత్ర కొనసాగుతోంది.

జీహెచ్ ఎంసీ భారీ ఏర్పాటు..
గణేష్‌ మహా నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌ ప్రాంతాల్లో 40 ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అధికారులు 24 గంటలూ విధుల్లో ఉంటారని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ.రఘుమారెడ్డి తెలిపారు. నిమజ్జన సందర్భంగా ఎలాంటి విద్యుత అంతరాయాలూ ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఖైరతాబాద్‌ భారీగణపతి, బాలాపూర్‌ గణనాథుడుతో పాటు పలుప్రాంతాల నుంచి భారీ గణనాథులు ప్రయాణించే మార్గాన్ని ఇప్పటికే పరిశీలించి అన్ని చర్యలూ తీసుకున్నామన్నారు. గ్రేటర్‌పరిధిలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రవాణా శాఖ అధికారులు 11చోట్ల 800కు పైగా వాహనాలను అందించే కేంద్రాలను ఏర్పాటుచేశారు. హుస్సేన్‌ సాగర్‌లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తున్నామని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం 8 ఎంఎంటీఎస్‌ ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. నిమజ్జన ఉత్సవా లను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని.. నగరమంతా పకడ్భందీ ఏర్పాట్లు చేశామని డీజీపీ అనురాగ్‌ శర్మ అన్నారు. 

10:06 - September 15, 2016

హైదరాబాద్ : బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ముగిసింది. రికార్డు స్థాయిలో రూ.14.65లక్షలకు స్కైలాబ్‌రెడ్డి బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూను కైవసం చేసుకున్నారు. వేలంపాటలో మొత్తం 25 మంది పాల్గొనగా ఈసారి నలుగురు స్థానికేతరులు కూడా పాల్గొన్నారు. గతేడాది బాలాపూర్‌ లడ్డూ రూ.10.32 లక్షలు పలికింది. వేలం పాటలో లడ్డూను దక్కించుకున్న స్కైలాబ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలం పాట ప్రక్రియ 1980 నుంచి ప్రారంభమైంది. లడ్డూ వేలంపాట ద్వారా వచ్చిన మొత్తాన్ని గణేశ్‌ ఉత్సవ కమిటీ గ్రామాభివృద్ధి, సామాజిక సేవా కార్యాక్రమాల కోసం వినియోగిస్తూంటారు.  హైదరాబాద్ నగరం అంటే గణేష్ నవరాత్రులకు పెట్టింది పేరు. గణేష్ ఉత్సవాలను నగరవాసులు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. నగరంలో ఖైరతాబాద్ గణేషుడికి ఎంత ప్రత్యేకత ఉందో బాలాపూర్ గణేషుడి లడ్డూకి కూడా అంతే ప్రత్యేకత వుంది. బాలాపూర్ లడ్డూను దక్కించుకోవటానికి రాజకీయ నాయకుల నుండి పారిశ్రామికవేత్తలు ఇలా పలు రంగాలవారు పోటాపడుతుంటారు. అంత విశిష్టత వున్న లడ్డూ వేలం పాట ప్రారంభమయ్యింది. కాగా గత సంవత్సరంలో వేలం పాటలో 10 లక్షల 32 వేలకు కళ్లెం మదన్‌మోహన్‌ లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూను ఎవరు దక్కించుకోనున్నారో నని భక్తులంతా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత బాలాపూర్ కొత్త డివిజన్ గా ఏర్పడిందని బాలాపూర్ గణేష్ నిర్వాహకులు తెలిపారు. బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న వారు ఉన్నత పదవుల్లో వున్నారని తెలిపారు. ఈ సందర్భంగా గతకాలంలో లడ్డూను వేలంలో దక్కించుకున్నవారి పేర్లను ప్రకటించారు. లడ్డూను సొంతం చేసుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉందని వేలంపాట విజేత స్కైలాబ్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి అవ‌కాశం దొర‌క‌డం ఎంతో అదృష్ట‌మ‌ని ఈ సందర్భంగా ఆయన అన్నారు. 

వైసీపీ నేత దారుణ హత్య?..

విశాఖ: వైసీపీ 29వ వార్డు అధ్యక్షుడు దారుణహత్యకు గురయ్యారు. ఇంట్లో నిద్రిస్తున్న ఆతడిని బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు ఇంట్లోకి బయలకు లాక్కువచ్చి వచ్చి కత్తులతో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. కాగా హత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. కాగా వ్యాపారంలో తలెత్తిన వివాదంతోనే ఈ హత్య జరిగినట్లుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

రోజుకు 5వరకట్న కేసులు నమోదు..

ఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని గుర్‌గామ్‌లో రోజుకు ఐదు వరకట్నం వేధింపుల కేసులు నమోదు కావడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. వివాహ సమయంలో వరకట్నం తీసుకోవడమే కాకుండా పెళ్లయ్యాక అదనంగా కట్నం తీసుకురమ్మని భర్తలతోపాటు అత్తింటివారు వేధిస్తున్నారని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మహిళా పోలీసుస్టేషనుకు వరకట్న వేధింపుల కేసుల్లో బాధితులు బారులు తీరుతున్నారట. వరకట్నం కేసుల్లో నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు.

ఆంధ్రా వర్శిటీలో విద్యార్థి ఆత్మహత్య..

విశాఖ: ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కిటికీకి ఉరివేసుకుని యశస్వీ(22) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి ఎవరూ కారణం కాదంటూ సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టినట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్యకు మద్యం అలవాటే కారణమని యశస్వీ నోట్‌లో పేర్కొన్నాడు. యశస్వి స్వస్థలం గుంటూరు జిల్లా చిలకలూరిపేటవాసిగా గుర్తించారు.

బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభం..

హైదరాబాద్: నగరంలో నిమజ్జన సందడి మొదలైంది. ఎక్కడ చూసినా గణనాధులు భారీ నిమజ్జనానికి బయలుదేరారు. మరోపక్క బాలాపూర్‌లో లడ్డూ వేలం మొదలైంది. లడ్డూను సొంతం చేసుకునేందుకు ప్రముఖులు, రాజకీయవేత్తలు పోటీపడుతుంటారు. గతేడాది బాలపూర్ రూ.10.32 లక్షలు పలుకగా, ఈసారి ఎంత మొత్తంలో లడ్డూ ధర పలుకుతుందో మరికాసేపట్లో తేలనుంది. 

రెండు రైళ్లు ఢీ..6గురు మృతి..

పాకిస్తాన్ : పాకిస్థాన్ లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.మరో 150 మంది గాయపడ్డారు. గురువారం ఉదయం ముల్తాన్ సమీపంలోని ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అవమ్ ఎక్స్ ప్రెస్ ఓ గూడ్స్ రైలును ఢీకొంది. ఈ ప్రమాదంలో అవమ్ ఇంజిన్ పూర్తిగా ధ్వంసం కాగా, నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా గాయపడినవారిలో 10మంది పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.

08:48 - September 15, 2016

హైదరాబాద్ : గణనాథులు నిమజ్జనానికి తరిలారు. తొమ్మిది రోజుల పాలు పూజలందుకున్న గణనాథుడికి మేళతాళాల మధ్య వీడ్కోలు పలుకుతున్నారు. ఒక వైపు వానచినుకులు..మరో వైపు జైజై గణేషా నినాదాలతో హైదరాబాద్‌ నగరం కోలాహలంగా మారింది. గణేష్‌ మహా నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌ ప్రాంతాల్లో 40 ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అధికారులు 24 గంటలూ విధుల్లో ఉంటారని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ.రఘుమారెడ్డి తెలిపారు. నిమజ్జన సందర్భంగా ఎలాంటి విద్యుత అంతరాయాలూ ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఖైరతాబాద్‌ భారీగణపతి, బాలాపూర్‌ గణనాథుడుతో పాటు పలుప్రాంతాల నుంచి భారీ గణనాథులు ప్రయాణించే మార్గాన్ని ఇప్పటికే పరిశీలించి అన్ని చర్యలూ తీసుకున్నామన్నారు. గ్రేటర్‌పరిధిలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రవాణా శాఖ అధికారులు 11చోట్ల 800కు పైగా వాహనాలను అందించే కేంద్రాలను ఏర్పాటుచేశారు. హుస్సేన్‌ సాగర్‌లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తున్నామని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం 8 ఎంఎంటీఎస్‌ ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. నిమజ్జన ఉత్సవా లను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని.. నగరమంతా పకడ్భందీ ఏర్పాట్లు చేశామని డీజీపీ అనురాగ్‌ శర్మ అన్నారు. 

08:34 - September 15, 2016

హైదరాబాద్ : గణేశ్‌ నిమజ్జనపర్వం మొదలైంది. ఉదయం నుంచే నిమజ్జనానికి బొజ్జ గణపయ్యలు సిద్దమయ్యారు. ఎప్పటిమాదిరిగా కాకుండా ఈసారి ఉదయమే ఖైరతాబాద్‌ గణనాధుడు నిమజ్జనానికి తరలివెళ్లనున్నాడు. ఈరోజు అర్ధరాత్రిలోగా నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

లంబోదరుని విగ్రహమంటేనే గుర్తుకొచ్చే ఖైరతాబాద్ గణనాథుడు
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఏకదంతుని రూపం ఒక ప్రత్యేకత అయితే... లడ్డూది మరో విశిష్టత. లంబోదరుని విగ్రహమంటేనే ఖైరతాబాద్ గణనాథుడు గుర్తొస్తాడు. అలాగే లడ్డూ పేరు వింటేనే బాలాపూర్ లడ్డూ ఫేమస్‌. ఏటికేడాది లడ్డూ గిరాకీ పెరగడమే అందుకు కారణం. స్వామి లడ్డూ సొంతం చేసుకుంటే ఇక తిరుగులేదని భక్తుల విశ్వాసం. అందుకు ఎంతైనా ఆ మహాప్రసాదాన్ని దక్కించుకునేందుకు అనేకమంది భక్తులు పోటీపడుతుంటారు. 

సైకిలెక్కనున్న దేవినేని నెహ్రూ వర్గం..

విజయవాడ : కాంగ్రెస్ నేత ఉన్న దేవినేని నెహ్రూ, తన కుమారుడు, యూత్ కాంగ్రెస్ ఏపీ మాజీ అధ్యక్షుడు అవినాష్, మరో కాంగ్రెస్ నేత కడియాల బుచ్చిబాబు సహా తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని నేడు పుచ్చుకోనున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు సమక్షంలో వీరంతా టీడీపీలో చేరనుండగా, ఇందుకోసం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 

వర్షంతో పలు రైళ్ల దారిమళ్లింపు..

హైదరాబాద్ : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వికారాబాద్ - పర్లి మార్గంలో రైల్వే ట్రాక్ ధ్వంసం కాగా, పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో వెళ్లే ప్రధాన రైళ్లను ముద్ఖేడ్ నుంచి నిజామాబాద్ మీదుగా మళ్లిస్తున్నట్టు వివరించారు. షిరిడీ నుంచి విజయవాడకు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు, పుణె - హైదరాబాద్ ఎక్స్ ప్రెస్, ఔరంగాబాద్ - హైదరాబాద్ పాసింజర్ రైళ్లు నిజామాబాద్ మీదుగా నడుస్తాయని తెలిపారు. బీదర్ - హమ్నాబాద్ ల మధ్య తిరిగే డెమో రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొన్నారు.

పొంగిపొర్లుతున్న మూసీ..

రంగారెడ్డి : మూసీనది పొంగి పొర్లుతోంది. శంకర్ పల్లి మండలం ఫతేపూర్వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రహదారిపై రాకపోకలు నిలిపివేశారు.

ఇంటర్ సిటీకి తప్పిన ప్రమాదం..

రంగారెడ్డి : వికారాబాద్ ఇంటర్ సిటీకి ప్రమాదం తప్పింది. వికారాబాద్-మందాన్ పల్లి మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. గ్రామస్థుల అప్రమత్తతతో రైల్వే అధికారులు సమాచారాన్ని చేరవేయంతో రైలును నిలిపివేశారు. దీంతో పెను ముప్పు తప్పింది. 

వర్షానికి కూలిపన కాగ్నానది వంతెన..

రంగారెడ్డి : తాండూరులో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి కాగ్నా నది వంతెన కూలిపోయింది. దీంతో తాండూరు-మహబూబ్ నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

10 గంటలకు బాలాపూర్‌ లడ్డూ వేలం..

హైదరాబాద్‌: బాలాపూర్‌ గణేశ్‌ గ్రామోత్సం గురువారం ఉదయం ప్రారంభమైంది. గణనాథుడికి ఈ ఏడాది చివరి పూజ నిర్వహించారు. శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు సిద్ధం చేశారు. యాత్ర అనంతరం 10గంటలకు స్వామివారి లడ్డూ వేలంపాట నిర్వహించనున్నారు. గతేడాది బాలాపూర్‌ లడ్డూను కళ్లెం మదన్‌మోహన్‌రెడ్డి రూ.10.32 లక్షలకు దక్కించుకున్నారు.

నిమజ్జన వేడుకల్లో అపశృతి..

హైదరాబాద్: చంపాపేట గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. గణనాథుడిని ట్రాక్టర్‌పై ఊరేగింపుగా తీసుకెళ్తుండగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్‌షాక్‌కు గురై న్యాయవాది వెంకటేశ్వరశర్మతో పాటు సరూర్‌నగర్‌కి చెందిన సందీప్ అనే వ్యక్తి మృతిచెందాడు. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి..

హైదరాబాద్ : కన్నడిగుల హృదయాల్లో తనకంటూ గొప్ప స్థానాన్ని ఏర్పరచుకున్నారు సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన 156వ జయంతి సందర్భంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయి. చిక్కబళ్ళాపురం జిల్లాలోని ముద్దేనహళ్ళి గ్రామం సన్నద్దమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయన నిర్మించిన కేఆర్‌ఎస్‌ డ్యాం చుట్టూనే ప్రస్తుతం కావేరీ వివాదం కూడా పెనవేసుకుని ఉండడం గమనార్హం. 

నేడే ఎంసెట్-3 ఫలితాలు..

హైదరాబాద్ : నేడు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఎంసెట్-3 ఫలితాలను విడుదల చేయనున్నారు. కాగా తెలంగాణ ఎంసెట్-2 పరీక్షను కాన్సిల్ చేసిన ఎంసెట్-3ను నిర్వహించిన విషయం తెలిసిందే. 

07:30 - September 15, 2016

హైదరాబాద్ : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఏకదంతుని రూపం ఒక ప్రత్యేకత అయితే... లడ్డూది మరో విశిష్టత. లంబోదరుని విగ్రహమంటేనే ఖైరతాబాద్ గణనాథుడు గుర్తొస్తాడు. అలాగే లడ్డూ పేరు వింటేనే బాలాపూర్ లడ్డూ ఫేమస్‌. ఏటికేడాది లడ్డూ గిరాకీ పెరగడమే అందుకు కారణం. స్వామి లడ్డూ సొంతం చేసుకుంటే ఇక తిరుగుండదని భక్తుల విశ్వాసం. అందుకు ఎంతైనా ఆ మహాప్రసాదాన్ని దక్కించుకునేందుకు అనేకమంది భక్తులు పోటీపడుతుంటారు. 
లడ్డూ వేలం పాటలకు ఎంతో ప్రాధాన్యత 
విఘ్నాలు తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం.  అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులు ఎంతో ఎదురుచూస్తుంటారు. ఇక నవరాత్రులు నిర్వహించిన లడ్డూ వేలం పాటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నవరాత్రుల్లో గణపతితో పాటు పూజలందుకునే లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకుంటే.. సాక్షాత్తు ఆ లంబోదరుడు ఇంటికి వస్తాడని.. తద్వారా సకల శుభాలూ చేకూరుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే లడ్డూ వేలాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఎంత ధరైనా వెచ్చించేందుకు సిద్ధపడతారు. అందుకే వినాయకుడి లడ్డూ వేలం పాటలు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. 
1980 నుంచి లడ్డూ ప్రసాదం ప్రస్థానం
ఇక భాగ్యనగరంలో అన్ని లడ్డూల కంటే బాలాపూర్‌ లడ్డూకు ఉన్న క్రేజే వేరు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా దాన్ని దర్శించి పూజించిన వారు సైతం సుఖ సంతోషాలతో ఉంటారన్నది ఇక్కడి భక్తుల నమ్మకం. మొదట్లో వేల రూపాయలు పలికిన బాలాపూర్‌ లడ్డూ ఆ తరువాత లక్షలకు చేరింది. 1980 నుంచి లడ్డూ ప్రస్థానం  మొదలైంది. ముప్పై ఏళ్లకు పైగా అప్రతిహతంగా సాగుతోంది. లడ్డూ వేలం ప్రతి ఏడాది చరిత్ర సృష్టిస్తోంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రసాదం వేలం ఇక్కడి నుంచే మొదలైంది.
లడ్డూ రికార్డ్..
1994లో బాలాపూర్ లడ్డూ వేలం రూ. 450 ,1995లో రూ.4,500
1996లో రూ.18 వేలు,1997లో రూ. 28వేలు,1998లో రూ. 51వేలు
1999లో రూ. 65వేలు,2000లో రూ.66 వేలు,2001లో రూ. 85 వేలు,2002లో రూ. 1లక్షా 5వేలు,2003లో రూ. లక్షా 55 వేలు
2004లో రూ. 2 లక్షల వెయ్యి,2005లో రూ. 2 లక్షల 8 వేలు
2006లో రూ. 3లక్షలు ,2007లో 4 లక్షల 15 వేలు,2008లో రూ. 5లక్షల 7 వేలు
1980లో బాలాపూర్‌లో  మొదటిసారి గణపతిని ప్రతిష్ట..
1980లో బాలాపూర్‌లో  మొదటిసారి గణపతిని ప్రతిష్టించారు. 1994లో ఇక్కడి లడ్డూకు వేలం నిర్వహించారు. మొదటిసారి  450 రూపాయలు పలికిన లడ్డూ ధర ఊహించని విధంగా వేలంపాటలో పెరుగుతూ వచ్చింది. 2005లో రెండు లక్షల 8వేలు, 2006లో మూడు లక్షలు, 2007లో నాలుగు లక్షల పదిహేను వేలు, 2008లో ఐదు లక్షల ఏడు వేలు పలికింది. బాలాపూర్ లడ్డూ బరువు కేవలం 21 కేజీలే. ఇక్కడ ప్రసాదం పరిమాణం చిన్నదే అయినా ఆ లడ్డూ దక్కించుకుంటే గణపతి కటాక్షం దక్కుతుందన్న సెంటిమెంట్‌ గా భావిస్తారు భక్తులు. 
పెరిగిన లడ్డూ క్రేజ్..
2009లో రూ. 5లక్షల 10 వేలు,2010లో రూ. 5లక్షల 35 వేలు
2011లో రూ. 5లక్షల 45 వేలు,2012లో రూ. 7లక్షల 50వేలు
2013లో రూ. 9.26 లక్షలు,2014లో రూ.9 లక్షల 50 వేలు
2015లో రూ.10 లక్షల 32 వేలు,బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్న మదన్‌మోహన్‌ 
దూసుకుపోతున్న లడ్డూ ధర
2009లో ఐదులక్షల పదివేలు అమ్ముడైన లంబోదరుడి ప్రసాదం 2010లో రూ.5.35లక్షలు పలికింది. 2011 లో 5 లక్షల 45 వేలకు కొలన్ లక్ష్మారెడ్డి సొంతం చేసుకున్నారు. 2012లో  లక్షా 95వేలు అధికంగా వెచ్చించి 7 లక్షల 50వేలకు పన్నాల గోవర్దన్ రెడ్డి దక్కించుకున్నారు.  2013లో స్వామి లడ్డూ ఏకంగా 9 లక్షల 26 వేలు పలికింది. 2014లో 9 లక్షల 50 వేలు పలికింది. గతేడాది 10 లక్షల మార్క్‌ను దాటి రికార్డ్‌ సొంతం చేసుకుంది బాలాపూర్‌ లడ్డూ. వేలం పాటలో 10 లక్షల 32 వేలకు కళ్లెం మదన్‌మోహన్‌ లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూ ఇంత ప్రాచుర్యం పొందడానికి కారణం ఈ లడ్డూని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం. లడ్డూ సొంతం చేసుకున్న వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. అందుకే ప్రతియేటా పోటాపోటీగా బాలాపూర్ లడ్డూ లక్షల్లో పలుకుతూ దూసుకుపోతోంది. మరీ ఈ ఏడాది ఆ భాగ్యం ఎవరికీ దక్కుతుందో..! 

 

07:23 - September 15, 2016

హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో మరో రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురవనున్నాయని.. ఇవాళ హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

07:19 - September 15, 2016

హైదరాబాద్ : గణేశ్‌ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. బాలాపూర్‌లో పూజలు ప్రారంభమయ్యాయి. కాసేపట్లో బాలాపూర్‌ నుంచి శోభాయాత్ర మొదలుకానుంది. ఇక నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్‌తో పాటు.. నగరంలో 24 చెరువులు, 9 కొలనులు సిద్ధం చేశారు. 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ఉదయం నుంచే నిమజ్జనానికి బొజ్జ గణపయ్యలు తరలిరానున్నారు. ఎప్పటిమాదిరిగా కాకుండా ఈసారి ఉదయమే ఖైరతాబాద్‌ గణనాధుడు నిమజ్జనానికి తరలివెళ్లనున్నాడు. ఈరోజు అర్ధరాత్రిలోగా నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఉదయం పూజలు పూర్తి చేసి ఊరేగింపు ప్రారంభించనున్నారు. 

07:12 - September 15, 2016

వరంగల్‌ : గణేశ్‌ నిమజ్జనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గణనాథుల సామూహిక నిమజ్జనోత్సవంతో కాకతీయుల రాజధాని ఓరుగల్లు హోరెత్తింది. గణేశ్‌ విగ్రహాల ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది.
పదవ రోజు సామూహికంగా నిమజ్జనం
వరంగల్‌లో గనేశ్‌ నిమజ్జనోత్సవాలు ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను పదవ రోజు సామూహికంగా నిమజ్జనం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించిన గణేశ్‌ శోభాయాత్రల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో భారీగా గణేశ్‌ విగ్రహాలను నిమజ్జనం చేశారు. పోలీసులు బందోబస్తు మధ్య దాదాపు 25 వేల విగ్రహాలను చెరువుల్లో కలిపారు.

పద్మాక్షిగుండం చెరువులో నిమజ్జనం
వరంగల్‌ నగరంలో గణేశ్‌ నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేలాది విగ్రహాలను పద్మాక్షిగుండం చెరువులో నిమజ్జనం చేశారు. గణేశ్‌ నిమజ్జనం కోసం ప్రత్యేకంగా బల్లకట్టలను తయారు చేయించారు. తరలివచ్చిన విగ్రహాలను క్రేన్ల సాయంతో బల్లకట్టలపై ఉంచి చెరువుల మధ్యలోకి తీసుకెళ్లి జలధిలో కలిపారు. వరంగల్, హన్మకొండ, కాజీపేలల్లోని వేర్వేరు చెరువుల్లో గణేశ్‌ ప్రతిమలను నిమజ్జనం చేశారు.

భారీగా తరలివచ్చిన భక్తులు
నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పోలీసులు, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో గణేశ్‌ నిమజ్జనం సాఫీగా పూర్తయ్యింది. 

07:06 - September 15, 2016

హైదరాబాద్ : గణేష్‌ నిమజ్జానికి సర్వం సిద్ధమైంది. పోలీసులు, జిహెచ్‌ఎంసీ, నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయంతో నిమజ్జనం సాఫీగా సాగేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 25 వేల పోలీసులను, 12 వేల సీసీ టీవీలను నిమజ్జనం సందర్భంగా ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు డైరెక్ట్‌ లైవ్‌ సౌకర్యం ఉన్న అత్యంత నాణ్యత గల కెమెరాలతో నిఘా పర్యవేక్షిస్తున్నారు.

నిమజ్జనానికి.. సర్వం సిద్ధం
గణేష్‌ నిమజ్జనానికి ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. ఊరేగింపు జరిగే ప్రధాన మార్గాలను సర్కిల్స్‌గా విభజించి ఐపీఎస్‌ అధికారులను ఇన్‌ఛార్జీలుగా నియమించారు. అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 20 కిలోమీటర్ల దూరం వరకు సుమారు 12 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనికి తోడు నేరుగా బషీర్‌బాగ్‌లోని ప్రధాన కమాండ్‌ కంట్రోల్‌కు విజువల్స్‌ పంపించే శాటిలైట్‌ సౌకర్యాన్ని కూడా కల్పించారు. అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ల ద్వారా పరిశీలిస్తూ ఉంటారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా.. శాంతియుతంగా ఉత్సవాలను ముగించుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సూచించారు.
భారీ పోలీస్ బందోబస్తు..
ప్రస్తుతం 4 వేల వైర్‌లెస్‌ సెట్లు ఉండగా దానికి అదనంగా మరో 500 ఏర్పాటు చేశారు. మఫ్టీలో పెద్ద సంఖ్యలో పోలీసులు విధుల్లో హాజరవుతున్నారు. వీరు ప్రజల్లో ఉండి అనుమానితులను అదుపులోకి తీసుకుంటారు. ఎక్కడ ఏ అవసరం వచ్చినా క్షణాల్లో అక్కడికి బలగాలు చేరుకునేలా ప్రత్యేక దళాలను సిద్ధం చేశారు. పాతబస్తీ నుంచి గణేష్‌ విగ్రహాలు తెల్లవారు జామునుంచే బయలుదేరే విధంగా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతానికి కనీసం 50 శాతం విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాత్రి 12 గంటలకు ఖైరతాబాద్‌ గణేష్‌తో సహా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. నిమజ్జన ఊరేగింపు సాగే ప్రాంతాల్లో రాకపోకలు నిషేధించారు. ఈ నిషేదాజ్ఞలు 16వ తేదీ ఉదయం 8 గంటల వరకు అమలులో ఉంటాయి. ప్రజలు, వినాయక మండప కమిటీలు, ఎన్జీవోలు ఉదయమే పూజా కార్యక్రమాలు ముగించుకుని నిమజ్జనానికి బయలుదేరాలని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సూచించారు.

సోషల్ మీడియాపై ఖాప్స్ దృష్టి..
ఎన్నడూ లేని విధంగా ఈసారి సోషల్‌ మీడియాపై పోలీసులు దృష్టి సారించారు. ఫేస్‌బుక్‌, వాట్సప్‌ లాంటి మీడియా ద్వారా ఎవరైనా వదంతులు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తే వారిని కఠినంగా శిక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

వణుకుతున్న భాగ్యనగరం..

హైదరాబాద్ : గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించగా, ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాంనగర్ నాలా పొంగి పొరలుతుండటంతో నాగమయ్య కుంటలోని గుడిసెలు నీట మునిగాయి. వరద నీటిలో మునిగి నారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు. చిక్కడ్ పల్లి అంబేద్కర్ కాలనీలో ఇల్లు కూలింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ సూచించడంతో, మునిసిపల్ మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మేహన్ లు పరిస్థితి సమీక్షించారు.

కు.ని శిబిరాలు వద్దు : సుప్రీంకోర్టు

ఢిల్లీ : ఇండియాలో ఇక కుటుంబ నియంత్రణ శిబిరాలు అక్కర్లేదని, వాటి స్థానంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కు.ని ఆపరేషన్లు చేస్తున్న చోట, శిబిరాల నిర్వహణ సక్రమంగా లేక, పలు రాష్ట్రాల్లో మహిళలు మరణిస్తుండటాన్ని గుర్తు చేస్తూ, దేవికా బిశ్వాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

చికెన్ గున్యాతో 6గురు మృతి..

ఢిల్లీ : దేశ రాజధానిలో చికెన్ గున్యా వ్యాధి సోకి ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. పలు ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. గత రెండు నెలలుగా ఈ పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చికెన్ గున్యాతో 180 మంది ఎయిమ్స్‌లో చేరారని వైద్యాధికారులు చెప్పారు. వీటితో పాటు వెయ్యి డెంగీ కేసులు, 21 మలేరియా కేసులు నమోదు అయ్యాయి. దోమల మందులు కొట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు చనిపోతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరూ నగరంలో లేరని విపక్షాలు ఆరోపించాయి.

చెన్నమనేని లలితా దేవి మృతి..

హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు సతీమణి, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు తల్లి చెన్నమనేని లలితా దేవి (89) ఇక లేరు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం తుదిశ్వాస విడిచారు. లలితమ్మ భౌతికకాయాన్ని బంధువులు, ప్రజల సందర్శనార్థం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలోని ఆమె నివాసానికి తరలించారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, మంత్రి ఈటల , ఎంపీలు వినోద్‌కుమార్, కె.విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఇ.

నిమజ్జనానికి సెలవు ప్రకటించిన టీ.సర్కార్..

హైదరాబాద్ : గణేశ్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గురువారంను సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనాన్ని పురస్కరించుకొని హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం గురువారం సెలవు ప్రకటించింది. దీనికి బదులుగా నవంబర్ 12వ తేదీన రెండో శనివారం పని చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వు జారీ చేశారు.

గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం..

హైదరాబాద్: గణేశ్ నిమజ్జన పర్వానికి భాగ్యనగరం సర్వ సన్నద్ధమైంది. భారీ ఊరేగింపు.. టపాసుల మోతలు.. బాణసంచా వెలుగులు.. బ్యాండ్ మేళాలు.. డీజే హోరు.. భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా నేడు జరగనున్న వేడుకకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నిమజ్జనోత్సవానికి అన్ని ప్రభుత్వ విభాగాలు ఏర్పాట్లు పూర్తిచేశాయి. నగరంలోని అన్ని మార్గాలనూ కలుపుకుని సుమారు 388.5 కిలోమీటర్ల మేర సాగనున్న శోభాయాత్రలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు విభాగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది.

Don't Miss