Activities calendar

16 September 2016

21:41 - September 16, 2016

ఢిల్లీ :రాజధాని ఢిల్లీలో ఇద్దరు యువతులపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. ఇద్దరు టీనేజ్‌ యువతులు బాయ్‌ ఫ్రెండ్స్‌తో కలిసి రాత్రి ఎనిమిదిన్నర సమయంలో నడచుకుంటూ అమన్‌ విహార్‌ ప్రాంతంలోని ఓ పార్క్‌కు వెళ్లారు. అక్కడ ఐదుగురు యువకులు బాయ్‌ ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చిన ఇద్దరు యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. దుండగులను అడ్డుకునేందుకు యత్నించిన బాయ్‌ ఫ్రెండ్స్‌ను చితకబాదారు. ఆ తర్వాత ఐదుగురు యువకులు బాయ్‌ ఫ్రెండ్స్‌ ముందే ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. బాధిత యువతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ వారిలో ఇద్దరు మైనర్‌ బాలురున్నారు.


 

21:28 - September 16, 2016
21:22 - September 16, 2016


విజయవాడ : ఏపీలో నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్ టెస్ట్‌లన్నింటినీ ఇకనుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస్‌ తెలిపారు. ఈ విధానం విజయవంతమైతే టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలను కూడా అదే తరహాలో నిర్వహించేందుకు ప్రభుత్వం భావిస్తోందని గంటా తెలిపారు.
 
21:20 - September 16, 2016

హైదరాబాద్ : మళ్లీ అదే జడివాన. కాస్త విరామం ఇచ్చిందని అందరూ సంబరపడ్డా..మళ్లీ హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. రెండుగంటల పాటు కురిసిన కుంభవృష్టికి..నగరం అతలాకుతలం అయింది. రోడ్లపై వర్షపునీరు నిలిచిపోవడంతో రోడ్లన్నీ నదులను తలపించాయి. దీంతో గంటలకొద్ది ట్రాఫిక్‌జాలంతో నగరవాసులు అష్టకష్టాలుపడ్డారు. మరోవైపు తెలంగాణలో ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి.

సుమారు రెండు గంటలపాటు కురిసిన కుండపోత వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, చందానగర్‌, యూసఫ్‌గూడ, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మాదాపూర్‌,కూకట్‌పల్లి, అల్విన్‌కాలనీ, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, చార్మినార్‌, బహదూర్‌పురా, చాంద్రయణగుట్ట, యాకుత్‌పురా, రాజేంద్రనగర్‌, హైదర్షాకోట్‌, కిస్మత్‌పూర్‌, గోషామహల్‌, ధూల్‌పేట్‌, ఖైరతాబాద్‌, కోఠి, అబిడ్స్‌, సికింద్రాబాద్‌, నాచారం, అడ్డగుట్ట, తుకారాంగేట్‌, మారెడ్‌పల్లి, పద్మారావునగర్‌, మెట్టిగూడ, పార్శిగుట్ట, బోయిన్‌పల్లి, బేగంపేట, తిరుమలగిరి, అల్వాల్‌, బొల్లారం ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్ష బీభత్సానికి భారీస్థాయిలో వర్షపు నీరు రహదారులపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రయాణీకులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. భారీ వర్షం కారణంగా జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 12లో భారీగా ట్రాఫిక్‌ జాం కావడంతో రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు జంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌-11లోని దోబీ ఘాట్‌లో గోడ కూలడంతో 10 బైకులు, రెండు కార్లు ధ్వంసం అయ్యాయి.నగరంలో కురిసిన భారీ వర్షానికి బంజారాహిల్స్‌లో దాదాపు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించిపోయింది. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రి సమీప ప్రధాన రహదారి నుంచి బంజారాహిల్స్‌ రోడ్డు నెం.12 లోని పెన్షన్‌ కార్యాలయం వరకు వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచిపోవటం, అక్కడక్కడా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌లో లోపాల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకిదిగి వర్షంలోనే వాహనాలను క్రమబద్ధీకరించారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని జూ పార్క్‌ జలమయం అయింది. మీరాలం ట్యాంక్‌ నుంచి వచ్చే వరద నీరంతా జూ పార్క్‌లోకి చేరడంతో అధికారులు జంతువులను ఎన్‌క్లోజర్లకే పరిమితం చేశారు. సందర్శకులకు అనుమతి నిలిపివేశారు. వర్షం పూర్తిగా తగ్గాలని, జూలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే సందర్శకులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

 

 

21:15 - September 16, 2016

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో తనను ఇరికించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య ఆరోపించారు. తాను రాడికల్‌ యూనియన్‌లో ఉన్నప్పుడు.. నయీంతో పరిచయం ఏర్పడిందని తరువాత ఆయనతో సంబంధాలు లేవన్నారు. గత ఎన్నికల్లో ఎల్‌బినగర్‌ నుంచి పోటీ చేసే సమయంలో నయీం తనకు ఆర్థిక సహాయం చేశానని చెప్పడం వాస్తవం కాదన్నారు. సిట్‌ తనకు నోటీసులు ఇస్తే హాజరై సమాధానం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని ఆయన అన్నారు. గ్యాంగ్‌స్టర్‌ నయీం వ్యవహారంపై సిబిఐతో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని కృష్ణయ్య సూచించారు.
ఎలాంటి శిక్షకైనా సిద్ధం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నయీం కేసుతో సంబంధం ఉన్న ఏ పార్టీ వ్యక్తులనైనా శిక్షించాలని సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవలే ఒక పత్రిక, న్యూస్‌ ఛానల్‌లో నల్లగొండ బ్రదర్స్ పేరుతో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సాక్షాధారాలు ఉంటే నేరుగా పేరు పెట్టి రాయాలని స్పష్టం చేశారు. తాము నేరం చేసినట్లు నిరూపిస్తే, ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.


 

20:24 - September 16, 2016

రజాకార్లు వెట్టిన గోస తల్చుకుంటనె ఇప్పుడు భయమైతున్నది..? మరి అసొంటి గోసకు గోరిగట్టిన దినం ఈ సెప్టెంబర్ 17 తారీకు..ఈ దస్ర సంది తెలంగాణల కొత్త జిల్లాలకు బారసాల కార్యక్రమాలు జేస్తమని ప్రభుత్వం ఓదిక్కు జెప్తుంటే..? మరి మా సంగతేందని ఉద్యమాలు జేశెటోళ్లు అడ్గుతున్నరు.. జనం తల్చుకుంటె.. మంచోన్ని పిచ్చోన్ని జేస్తరు.. పిచ్చోన్ని మంచోన్ని జేస్తరు.. నల్గురు గల్సి ఏ గాడారా..? పిచ్చోడు అంటరు..కటే ఈ కుక్కలు పాడుగాను.. ఎక్కడి కుక్కలు దాప్రమైనయేమే ఈడ..?ప్రతి కుక్కకు ఒక రోజుస్తది అని మా దోస్తులు అంటుంటే..? ఆ ఇగ రాకపోయినాది అనుకుంటుంటి..? కని కుక్కలకు గూడ మంచి రోజు రానే వచ్చింది..సిద్దిపేట జిల్లా అయితున్నదని ఒక జింకపిల్లకు గూడ తెల్సిపోయినట్టుంది..కోతికున్న చరిత్ర ఎంత గొప్పదుల్లా..శెడగోట్టే పనులల్ల ఫస్టు..గుంజుక తినే దాంట్ల ఫస్టు..మన్షులను పర్శన్ జేసుట్ల ఫస్టు..పామును ముద్దువెట్టె డైలగ్ నేను శెప్తని మన ముచ్చట్లకు పోటి వడోస్తుండు..వానలకు పట్నం మొత్తం పశిపోయ్యినటైంది...గిసొంటి ముచ్చట్లను మల్లన్న ఎలా జెప్పిండో చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:21 - September 16, 2016

ఈ కుక్కలు పాడుగాను.. ఎక్కడి కుక్కలు దాప్రమైనయేమే ఈడ..? ఏ ఎవ్వలిదయ్య ఆ కుక్క జర్ర ఎల్లగొట్టుండ్రి.. కుక్కలు దండయాత్ర జేయంగ జూశిండ్రా మీరు ఎన్నడన్న.. ఒకతాన కాలేజీ మీద పగవట్టి అండ్ల పోరగాళ్లను సద్వనిస్తలేవట..? నిజం..వీడియోలో చూడండి. 

20:09 - September 16, 2016

అది మట్టి మనుషుల పోరాటం..దొరతనాన్ని సమాధిచేసిన సాయుధ సమరం..భూమి కోసం భుక్తికోసం, దాస్య శృంఖలాలను తుత్తునియలు చేయటానికి సామాన్యుడు గర్జించిన అపూర్వ సన్నివేశం. మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతిని స్వప్నించి జనం నడిపించిన విప్లవం అది. బాంచన్ దొరా కాల్మొక్తా అన్న గొంతుకలే గొడ్డలిపట్టి భూస్వామ్య దొరతననపు పునాదులను కదిలించిన వైనం అది. ప్రపంచ చరిత్రలో అది చెరగని అధ్యాయం. అదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. తెలంగాణ విలీన దినం సందర్భంగా ప్రత్యేక కథనం.. సెప్టెంబర్17. తెలంగాణ విలీన దినోత్సవం. భూమికోసం భుక్తికోసం బానిసత్వ విముక్తి కోసం సాగిన వీర తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటాన్ని పలువురు పలురకాలుగా స్మరించుకుంటారు. చాలా మందికి ఎవరు ఎందుకు తిరగబడ్డారో, ఎవరి నేతృత్వంలో ఈ పోరాటం జరిగిందో తెలియకపోవచ్చు. కానీ, ప్రపంచ పోరాట చరిత్రలోనే తెలుగుతేజాన్ని రక్తాక్షరాలతో లిఖించిన వీరఘట్టం తెలంగాణా సాయుధ పోరాటం.

1947లో దేశానికి స్వాతంత్ర్యం..
1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. త్రివర్ణ పతాకం దేశమంతా రెపరెపలాడింది. కానీ, కానీ, నిజాం రాజ్యం మాత్రం చీకటిలోనే ఉంది. ఆ పీడన నుండి బయటపడటానికి, నిరంకుశ పాలననుండి స్వేచ్ఛావాయువులు పీల్చటానికి వీర తెలంగాణ ఆయుధాన్ని ధరించింది. దిక్కులదిరేలా గర్జించింది.  ఊరూవాడా ఏకమయింది. వాడవాడా లోకమయింది, నిజాం రక్కసి పాలనపై దండుకట్టి దండయాత్ర చేసింది. తెలంగాణ బానిస సంకెళ్లను తెంచటానికి ఎందరో వీరులు అమరులయ్యారు. ఓరుగల్లు, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఉద్యమకెరటాలు ఎగసిపడ్డాయి. నిజాం తాబేదార్లయిన రజాకార్లు, జమీందార్లు, దేశ్ ముఖ్ ల దారుణాలకు దాష్టీకాలకు అనేకమంది తెలంగాణా యోధులు బలైపోయారు. నాలుగువేలమంది అసువులు బాసారు.

అసలిది విలీనమా? విద్రోహమా? విమోచనమా?..
తెలంగాణ సాయుధ పోరాటం ఎవరి మధ్య జరిగింది? అసలిది విలీనమా? విద్రోహమా? విమోచనమా? ఎందుకిన్ని భిన్నవాదాలు వినిపిస్తున్నాయి. టియ్యారెస్ పార్టీ ఉద్యమ కాలంలో ఓ మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో బాటలో ఎందుకుంది? ఈ పోరాటం ముగిసిందనుకుంటే అది భ్రమే. నాటి ప్రజలకు శత్రువు నిజాం అయితే, నేటి ప్రజలకు శత్రువు ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజాకంటక విధానాలు. దీనినుంచి విమోచనకు, విముక్తికి ప్రజలంతా ఏకం కావలసిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న స్ఫూర్తితో మరింత ముందుకు సాగాల్సి ఉంది. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:59 - September 16, 2016

తెలంగాణ ప్రజలు చేసిన తిరుగుబాటే సాయుధ పోరాటం. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టులు ఆధ్వర్యంలో సాగుతున్న పోరాటాన్ని అణచివేసేందుకు నిజాం సర్కార్ ప్రయోగించిన రజాకార్లను అడ్డుకునేందుకు... రైతాంగం ఆయుధాలు పట్టుకోవడంతో... అదే సాయుధ రైతాంగ పోరాటంగా మారింది. చాకలి ఐలమ్మ తెగువ, దొడ్డి కొమరయ్య బలిదానంతో మొదలైన త్యాగాలు తెలంగాణ చరిత్రలో రక్తాక్షరాలు లిఖించాయి. నిజాం సర్కార్, వారి కింద దొరలు, దేశ్ ముఖ్ లు, జాగీర్దారులు, జమీందారులు, పటేళ్లు వారి దురాగతాలకు వ్యతిరేకంగా సాగిన మహోజ్వల పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), అల్జాపూర్ శ్రీనివాస్ (బీజేపీ), మహేష్ గౌడ్ (కాంగ్రెస్), వకుళా భరణం కృష్ణ మోహన్ (టీఆర్ఎస్), పిట్టల రవీందర్ (టీజేఏసీ) పాల్గొన్నారు. విలీనమా ? విమోచనమా ? అనే దానిపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియోలో క్లిక్ చేయండి..

హైదరాబాద్ లో వర్షపాత వివరాలు..

హైదరాబాద్ : నగరంలో కుండపోత వర్షం కురిసింది. బాలానగర్ లో 68 మి.మీ, కూకట్ పల్లిలో 48 మి.మీ, మాదాపూర్ 47 మి.మీ, ఆసీఫ్ నగర్ లో 41.5 మి.మీ, శ్రీనగర్ కాలనీలో 41మి.మీ, మోండా మార్కెట్ 29 మి.మీ, చిలకలగూడలో 25 మి.మీ, నారాయణగూడలో 22, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద 40.5 మి.మీ వర్షపాతం నమోదైంది.

 

శంషాబాద్ జిల్లాలో మరికొన్ని మండలాలు...

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, శంకర్ పల్లి, షాబాద్ మండలాలను శంషాబాద్ జిల్లాలో కలపాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు చెందిన మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

సీఆర్డీఏ అధికారులతో రేపు యనమల భేటీ..

విజయవాడ : రేపు సీఆర్డీఏ అధికారులతో మంత్రి యనమల భేటీ కానున్నారు. అసెంబ్లీ భవన నిర్మాణ ప్లాన్ పై తుది నిర్ణయం తీసుకొనే అంశంపై చర్చ జరగనుంది. 

ఉన్నతాధికారులతో ముగిసిన టి.సీఎస్ సమావేశం.

హైదరాబాద్ : ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం ముగిసింది. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని, దీనికి అనుగుణంగా జిల్లా కార్యలయాలు, సిబ్బంది పునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదనలు పంపాలని సీఎస్ రాజీవ్ శర్మ పేర్కొన్నారు. ప్రతి శాఖ కొన్ని పరిమితులు ఏర్పర్చుకుని అవసరానికి సరిపడా సిబ్బందిని కేటాయించుకోవాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధుల తీవ్రత, ప్రత్యేక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని వైద్యులు, సిబ్బందిని సర్దుబాటు చేయాలని..సిబ్బంది వివరాలను సీజీజీ వెబ్ సైట్ కు అప్ లోడ్ చేయాలని సూచించారు. 

మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ - కేసీఆర్..

హైదరాబాద్ : మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వినాయక చవితి ఉత్సవాలు జరిగిన తీరు గంగా యమున తెహజీబ్ అనడానికి నిదర్శనమన్నారు. బతుకమ్మ, దసరా, పీర్ల పండుగలను కలిపి జరుకునే సంస్కృతి తెలంగాణ సొంతమని తెలిపారు. పలువురు ముస్లింలు గణేష్ మండపాల వద్ద పూజలు చేశారని, గణేష్ ఉత్సవాల్లో లౌకిక స్పూర్తి విరాజిల్లిందన్నారు. 

కాంగ్రెస్ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు - దేవినేని..

విజయవాడ : పోలవరం తామే మొదలు పెట్టామని కాంగ్రెస్ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ప్రాజెక్టు డిజైన్లు కూడా అప్రూవ్ చేయలేకపోయారని, పట్టిసీమ నుండి నీళ్లు రాలేదని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీడబ్ల్యూసీ నియమాలకు అనుగుణంగానే కాపర్ డ్యాం నిర్మాణం, పోలవరం, అమరావతిపై కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవాలని జగన్ చూస్తున్నారని దేవినేని పేర్కొన్నారు.

రేపటి నుండి సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు..

ఢిల్లీ : శనివారం నుండి మూడు రోజుల పాటు సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు జరగనున్నాయి. కోల్ కతా ప్లీనం నిర్ణయాలు అమలవుతున్న తీరు కాశ్మీర్ అనిశ్చితిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపైనా సమావేశాల్లో కేంద్ర కమిటీ చర్చించనుంది. భవిష్యత్ ప్రజా ఉద్యమాలపై కార్యాచరణపై రూపకల్పన చేయనున్నారు. 

మైనార్టీ గురుకుల పాఠశాలలపై సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : మైనార్టీ గురుకుల పాఠశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే మైనార్టీ పిల్లలకు మంచి విద్య అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 160 మైనార్టీ గురుకుల పాఠశాలలు ప్రారంభం కావాలని, ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే 71 మైనార్టీ గురుకుల పాఠశాలలు ప్రారంభించుకున్నట్లు పేర్కొన్నారు. 

రేపు విమోచన దినోత్సవాలు - దత్తాత్రేయ..

హైదరాబాద్ : శనివారం తెలంగాణ వ్యాప్తంగా విమోచన ఉత్సవాలు జరుపుతామని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. రేపు వరంగల్ సభలో అమిత్‌ షా పాల్గొంటారని దత్తాత్రేయ తెలిపారు.

 

19:22 - September 16, 2016

నిజాం సర్కార్, వారి కింద దొరలు, దేశ్ ముఖ్ లు, జాగీర్దారులు, జమీందారులు, పటేళ్లు వారి దురాగతాలకు వ్యతిరేకంగా సాగిన మహోజ్వల పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. భూముల దురాక్రమణలు, వెట్టిచాకిరి, రకరకాల పన్నులు, వీటన్నింటికీ మించిన స్త్రీలపై సాగించిన అకృత్యాలు వీటన్నింటి మీద తెలంగాణ ప్రజలు చేసిన తిరుగుబాటే సాయుధ పోరాటం. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టులు ఆధ్వర్యంలో సాగుతున్న పోరాటాన్ని అణచివేసేందుకు నిజాం సర్కార్ ప్రయోగించిన రజాకార్లను అడ్డుకునేందుకు... రైతాంగం ఆయుధాలు పట్టుకోవడంతో... అదే సాయుధ రైతాంగ పోరాటంగా మారింది. చాకలి ఐలమ్మ తెగువ, దొడ్డి కొమరయ్య బలిదానంతో మొదలైన త్యాగాలు తెలంగాణ చరిత్రలో రక్తాక్షరాలు లిఖించాయి. నాటి సాయుధ పోరాటంలో నాలుగు వేలమంది అమరులయ్యారు. లక్షలాది మంది గాయపడ్డారు. పది వేల మందికి పైగా కమ్యూనిస్టులు, ప్రజాపోరాట యోధులు మూడు నాలుగేళ్లపాటు నిర్బంధ శిబిరాలలో, జైలు జీవితం గడిపారు. వారి పోరాటం ఇప్పుడు పార్టీలకు రాజకీయ అంశంగా మారింది. రేపు తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుతామని బీజేపీ చెబుతుంటే... అధికార టీఆర్ఎస్ మాత్రం మౌనంగా ఉంటోంది. 

19:20 - September 16, 2016

పిట్ట కొంచెం కూత ఘనం సామెత ఆ చిన్నారికి సరిగ్గా సరిపోతుంది. 12 ఏళ్ల వయసులోనే అద్భుతాలు సృష్టిస్తోంది. బలాడ్యుల క్రీడలో సత్తా చాటుతోంది. జాతీయ స్థాయి పోటీల్లో పతకాల మోత మోగిస్తోంది. సునాయాసంగా వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తూ అందరిని అబ్బురపరుస్తోంది. వందల కిలోల బరువెత్తే బలాఢ్యుల క్రీడ. కండబలం, గుండెబలం దండిగా ఉన్నవారి ఆట. చిరు ప్రాయంలోనే వెయిట్‌ లిఫ్టింగ్‌లో అద్భుత ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తూ ఔరా అనిపిస్తోంది.. కాకినాడకు చెందిన 12 ఏళ్ల అభిషిక్త. జాతీయ స్థాయి పోటీల్లో పతకాల మోత మోగిస్తోంది.

ఆర్థిక చేయూత..
అభిషిక్త ప్రతిభను గుర్తించిన ఆమె తండ్రి..వెయిట్‌ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకునేందుకు ప్రోత్సాహించారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో కోచ్‌ నుంచి మెలకువలు నేర్చుకున్న చిన్నారి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ తరఫున పతకాలు సాధిస్తోంది. 8వ తరగతి చదువుతున్న అభిషిక్త.. అలవోకగా బరువులు ఎత్తూతూ అందరినీ అబ్బురపరుస్తోంది. 63 కిలోల జూనియర్‌ కేటగిరిలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటి పలు మెడల్స్ దక్కించుకుంది. స్కూల్‌ గేమ్స్ ఫెడరేషన్‌ నిర్వహించిన పోటీల్లో ఉన్నత స్థానంలో నిలిచింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో ప్రతిభ కనపరుస్తున్న అభిషిక్త.. ఆర్థిక చేయూత లేక సతమతమవుతోంది. ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని ఆమె తండ్రి కోరుతున్నారు. సునాయసంగా బరువులెత్తుతున్న అభిషిక్తకు మంచి భవిష్యత్తు ఉందని ఆమె కోచ్‌ అంటున్నారు. తనకి మెరుగైన సదుపాయాలు కల్పిస్తే వెయిట్‌ లిఫ్టింగ్‌లో తన సత్తా ఏమిటో నిరూపిస్తానని అభిషిక్త అంటుంది. క్రీడాసక్తి ఉన్న సంస్థలు తనను ప్రోత్సాహించాలని కోరుకుంటుంది. 

19:16 - September 16, 2016

విజయవాడ : జిల్లాలో ప్రజారోగ్యం పడకేసింది. విష జ్వరాలు విజృంభించడంతో ప్రజలు విలవిలాడుతున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ కేసులు రోజుకి పెరిగిపోతున్నాయి. మురికివాడల్లోని పలు ప్రాంతాల్లో అనుమానిత కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. సింగ్ నగర్, పాయకాపురం, ప్రకాశ్ నగర్, సుందరయ్య నగర్, నాలా పరిసరాలు, బుడమేరు కట్ట ప్రాంతాల్లో ప్రజలను జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ బారిన పడి జనం మంచం పట్టారు.

జ్వరాలు ప్రబలుతున్నా వైద్యారోగ్యశాఖ మీనమేషాలు..
విష జ్వరాలు సోకినవారిలో ప్లేట్ లెట్ కౌంట్ పడిపోతున్నాయి. దీంతో రోగులు స్ధానిక ప్రభుత్వాసుత్రులకు వెళ్లినప్పటికీ అక్కడ సరైన వసతులు లేకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దీంతో డబ్బులు లేని పేద ప్రజలు అప్పులపాలవుతున్నారు. తమ బాగోగులు పట్టించుకునే వారే కరువయ్యారని రోగులు ఆవేదన చెందుతున్నారు. అపరిశుభ్ర వాతావరణం, కలుషితమైన నీరు సేవించడం వల్లే జ్వరాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పరిసరాల శుభ్రతతో పాటు నీరు నిల్వవుండకుండా చర్యలు తీసుకుంటే దోమల సంతతిని నిరోధించవచ్చంటున్నారు.

జ్వర పీడితులకు పరామర్శ..
సీపీఎం నేతల బృందం మురికివాడల్లో పర్యటించి జ్వరపీడితులను పరామర్శించింది. వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే నగరపాలక సంస్ద ప్రాధమిక ఆరోగ్యకేంద్రలలో నెలకోన్న సౌకర్యాలను పరిశీలించారు. ప్రభుత్వం, నగర పాలక సంస్థ ప్రజల ప్రాథమిక సమస్యలను తీర్చకుండా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాయని సీపీఎం నేతలు విమర్శించారు. బెజవాడలో పెరిగిపోతున్న విషజ్వరాలపై పరిశీలన జరిపేందుకు ఉన్నతస్థాయి వైద్యుల బృందం పర్యటించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్ధ, వైద్యాధికారులు స్పందించి విజయవాడలో ప్రబలుతున్న విషజ్వరాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.  

18:34 - September 16, 2016

'శ్రీకాంత్' కొడుకు 'రోషన్' హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా 'నిర్మలా కాన్వెంట్'. 'శ్రియాశర్మ', 'రోషన్' జంటగా నటిస్తున్న ఈ సినిమాలో 'కింగ్' నాగార్జున కీ రోల్ ప్లే చేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా. టీనేజ్ ఫ్రెష్ లవ్ స్టోరీగా తెరముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందే ఫుల్ అటెన్షన్ కొట్టేసింది. అంతే కాదు 'నాగార్జున' కూడా ఫస్ట్ నుంచీ మూవీ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. జి. కోటేశ్వరరావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మరికొన్ని యాడెడ్ ఎట్రాక్షన్స్ ఉన్నాయి. మరి ఫ్రెష్ లవ్ స్టోరీతో 'రోషన్' చేసిన ఈ సినిమా ఎలా ఉంది ? తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

18:25 - September 16, 2016

మొగలిరేకులు సీరియల్ లోని ఆర్ కె నాయుడు పాత్రతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సాగర్ , వెండితెరమీద హీరో గా చేసిన తొలి ప్రయత్నమే 'సిద్ధార్ధ'. 'సాక్షి చౌదరి', 'రాగిణి ద్వివేది' తారాగణంతో దయానంద రెడ్డి డైరెక్ట్ చేసిన యాక్షన్ లవ్ స్టోరీ 'సిద్ధార్ధ'. బుల్లి తెరమీద చేసినంత ఎఫెక్టివ్ గా వెండితెరమీద చేసాడా? అసలు ఈ సినిమా కథా, కమామిషు ఏంటో తెలుసుకోవాలంటే చదవండి.. టివి నటులు బిగ్ స్ర్కీన్ మీదకు అడుగుపెడితే ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. అదే టైమింగ్. టీవి సీరియల్ లో సావకాశంగా నటించొచ్చు. అది పూర్తిగా విజువల్ ఓరియెంటెడ్ . అదే సినిమా దగ్గరకొచ్చేసరికి ఇది పూర్తిగా విజువల్ ప్లస్ డైలాగ్ ఓరియెంటెడ్ . వీలైనన్ని హావభావాలన్నీ ఒకేసారి చూపిచేయాల్సి వస్తుంది. అందుకే చాలా మంది టీవి నటులు హీరోలుగా రాణించలేకపోయారు. సాగర్ కూడా దీనికి మినహాయింపేమీకాదు. ఒకటే ఎక్స్ ప్రెషన్. సినిమా కూడా సీరియల్ కి ఏ మాత్రం తీసిపోని నెరేషన్ తో జనం సహనానికి పెద్ద పరీక్ష పెట్టింది. చెప్పుకోడానికి ఇందులో కొత్తదనమేమీలేదు. రొటీన్ కథ, రొటీన్ సన్నివేశాలు. స్టార్ డైరెక్టర్లందరూ ఎప్పుడో వాడేసిన పాతచింతకాయ పచ్చడి లాంటి కక్షలు, గొడవలు నేపధ్యంలో సాగుతుంది సినిమా. అలాగని పూర్తిగా అదే టింట్ లో ఉండదు. ఆ బ్యాక్ డ్రాప్ లో ఓ లవ్ స్టోరీ. ఈ సినిమా వల్ల 'సాగర్' కి పెద్దగా ఒరిగేదేమీ లేదు. టోటల్ గా 'సిద్ధార్ధ' సినిమా ఓ వృధాప్రయత్నం అని చెప్పుకోవాలి.

కథ..
ఊరిజనం కోసం మైనింగ్ కాంట్రాక్ట్ ను ప్రతి సంవత్సరం పాడుకుని అందులో మైనింగ్ ఏమీ చేయకుండా ఊరికి ఉపకారం చేస్తుంటాడు హీరో తండ్రి. అది గిట్టని వారు అతడ్ని హత్య చేస్తారు. దానికి బదులుగా తన తండ్రిని హత్యచేసిన వాడ్ని హత్య చేస్తాడు హీరో సూర్య. తల్లికిచ్చిన మాటకోసం ఊరిగొడవలకు దూరంగా మలేసియా వెళ్లిపోతాడు హీరో. అక్కడ 'సిద్ధార్ధ' అని పేరు మార్చుకొని కొత్త ఐడెంటిటీతో కొన్నాళ్లు గడుపుతాడు. ఈ ప్రయాణంలో అతడికి సహస్ర అనే ఒక అమ్మాయి పరిచయమౌతుంది. ఇంతలో ఆ ఊరినుంచి 'సిద్ధార్ధ'కు రాజీ పిలుపొస్తుంది. గొడవలు మానేసి రెండు వర్గాలు ఊరికోసం సంతోషంగా ఉందామని ప్రపోజల్ వస్తుంది సిద్ధార్ధకు. అలాగే వాళ్ల ఇంటి అమ్మాయిని పెళ్లిచేసుకోమని షరతులు కూడా విధిస్తారు. ఊరిజనం కోసం తన ప్రేమను చంపుకొని పెళ్లికి సిద్ధపడతాడు సూర్య. మరి సూర్యను మలేసియా లో ప్రేమించిన సహస్ర దీనికి ఎలా రియాక్ట్ అయింది? చివరికి కథ ఏ రూట్లో ప్రయాణించిందన్నదే మిగతా కథ.

పాత్రల తీరుతెన్నులు..
ఈ సినిమాలో చెప్పుకోదగ్గ నటనను ప్రదర్శించిన వాళ్లెవరూ లేకపోవడం విడ్డూరం. సీరియల్స్ లో క్రేజ్ వచ్చినంత మాత్రాన సినిమాలో కూడా సాగర్ కి క్రేజ్ వస్తుందనుకోవడం పొరపాటు. ఏ విధంగానూ ఇందులో సాగర్ కొత్తదనం చూపించలేకపోయాడు. అలాగే మిగిలిన పాత్రధారులు కూడా రొటీన్ నటననే ప్రదర్శించారు. అజయ్, సుబ్బరాజులు తమకు బాగా అలవాటైన హావభావాలే ప్రదర్శించారు. కోట శ్రీనివాసరావు యాజ్ యూజువల్ గా పెద్ద మనిషి వేషం వేసారు. ఇక సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ప్రభాస్ శ్రీను లు కాస్త నవ్వించడానికి ప్రయత్నించారు. వాళ్ల సీన్స్ దగ్గరే జనం కొంచెం రిలాక్స్ అవుతారు. మణిశర్మ సంగీతం కూడా అంత గొప్పగా అనిపించదు, అలాగే యస్.,గోపాలరెడ్డి కెమెరా తో కూడా పెద్దగా అద్భుతాలేమీ చూపించలేదు. జస్ట్ మామూలు రొటీన్ సినిమాగా చేయడానికి మాత్రమే ఈ సీనియర్ టెక్నీషియన్స్ మిగిలారు. డైరెక్టర్ గా పరిచయమైన దయానంద రెడ్డి కూడా కొత్తదనమేమీ చూపించలేకపోయాడు. ఆయన అనుభవ రాహిత్యం రొటీన్ నెరేషన్ లోనే కనిపిస్తుంది. సో.. టోటల్ గా సాగర్ వెండితెర ఎంట్రీ జనాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా అతడి సీరియల్ అభిమానులకి.

ప్లస్ పాయింట్స్ :
కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ, కథనాలు
స్లో నెరేషన్
మ్యూజిక్
కొత్తదనం లేకపోవడం
రేటింగ్ : 1/5

18:17 - September 16, 2016
18:10 - September 16, 2016
18:08 - September 16, 2016

గుంటూరు : ఏపీ నూతన సచివాలయం భద్రతా బాధ్యతలను ప్రభుత్వం ప్రత్యేక భద్రతా దళానికి అప్పగించింది. ఎస్పీఎఫ్ డీఐజీ ఏసురత్నం ఇతర పోలీసు అధికారులతో కలిసి సచివాలయంలో అడుగు పెట్టారు. అంతకంటే ముందు ఆయుధ పూజ చేశారు. ఇప్పటి వరకు గుంటూరు రూరల్ పోలీసులు సచివాలయానికి భద్రత ఇస్తూ వస్తున్నారు. సచివాలయం పూర్తి కావస్తుండడం..మంత్రులు కార్యాలయాలు ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పూరిస్థాయిలో భద్రతను నిర్వహిస్తామని డీఐజీ మీడియాకు తెలిపారు. బాధ్యతలు ఈ రోజు నుండి స్వీకరిస్తున్నామని, కాంపౌండ్ వాల్ లేదని, బ్లాక్ వైజ్ సెక్యూర్టీకి ప్లాన్ చేసినట్లు తెలిపారు. 

పీవీ ఎక్స్ ప్రెస్ పై కార్లు ఢీ..

హైదరాబాద్ : పీవీ ఎక్స్ ప్రెస్ హైవైపై నాలుగు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. దీనితో ఎక్స్ ప్రెస్ హైవైపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాయిదా..

హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా రేపు జరగాల్సిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ వాయిదా పడింది. సోమవారం ఈ సమావేశం జరగనుంది. 

సిట్ నోటీసులిస్తే విచారణకు సిద్ధం - ఆర్.కృష్ణయ్య..

హైదరాబాద్ : నయీంతో తనకున్న సంబంధాలు ఆర్థికపరమైనవి కావని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. రాడికల్ యూనియన్ లో పనిచేస్తున్నప్పుడు మాత్రమే నయీంతో పరిచయం ఏర్పడిందని, నయీం కేసులో తనపై ప్రభుత్వం బురదజల్లుతోందన్నారు. సిట్ నోటీసులు జారీ చేస్తే విచారణకు సిద్ధమని వెల్లడించారు. సిట్ దర్యాప్తులో పారదర్శకత లేదని, కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో నయీం డబ్బు ఇచ్చాడన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. నయీం వ్యవహారంలో అధికార పార్టీ నేతలే ఎక్కువ మంది ఉన్నారని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. 

మరో ఆవర్తనం..

హైదరాబాద్ : పశ్చిమ బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడింది. రానున్న 24గంటల్లో కోస్తా, తెలంగాణలో వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. 

17:31 - September 16, 2016

నిజామాబాద్ : దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రతొక్కరూ పోరాటం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఆనాటి వీరుల త్యాగాలను..వారు ఆశించిన లక్ష్యాలను ఈనాటి తరానికి తెలియచేయడానికి సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోనిర్వహించిన జీపు యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. 

17:27 - September 16, 2016

మహబూబ్ నగర్ : టి.కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి చేస్తున్న ఆమరణ నిరహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఆయన మూడు రోజులుగా ఈ దీక్ష చేస్తున్నారు. శుక్రవారం నాడు దీక్షా స్థలికి పోలీసులు రావడంతో ఉద్రిక్తంగా మారింది. వంశీచంద్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో వంశీచంద్ రెడ్డి సతీమణి ఆశ్లేషరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 

17:19 - September 16, 2016

హైదరాబాద్ : అందరి సహకారం వల్లే గ్రేటర్ హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం శాంతియుతంగా ముగిసిందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా ముగిసినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డిలు మాట్లాడారు. ఓ వైపు భారీ వర్షాలు..బక్రీద్ ఉన్నా అన్ని విభాగాల సమన్వయంతో నిమజ్జనాన్ని విజయవంతంగా పూర్తి చేశామని జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నగర ప్రజల సహకారం తోడైనందు వల్లే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. బక్రీద్ సాయంత్రం నుండి భారీ వర్షం కురిసిందని తెలిపారు. అనంతరం వినాయక నిమజ్జన కార్యక్రమం ఉందని, ఈ నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయడం జరిగిందన్నారు.

కృతజ్ఞతలు తెలిపిన సీపీ..
నగర ప్రజల సహకారంతోనే బక్రీద్..వినాయక నిమజ్జనాన్ని విజయవంతంగా పూర్తి చేశామని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. పండుగలను నగర ప్రజలు శాంతియుత వాతావరణంలో కోటుకుంటున్నారని కాబట్టే శాంతియుతంగా జరిగిందన్నారు. ఇందుకు నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. 

17:11 - September 16, 2016

డేవిస్ కప్ నుండి నడాల్ అవుట్.. ?

ఢిల్లీ : శనివారం డేవిస్ కప్ ప్రారంభమౌతోంది. అయితే ఈ పోటీన ఉండి నడాల్ నిష్ర్కమించినట్లు సమాచారం. కడుపునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఆదివారం జరిగే రివర్స్ సింగిల్స్ లో నడాల్ తో సాకేత్ మైనేని పోటీ పడాల్సి ఉంది.

నగరంలో మళ్లీ వర్షం..

హైదరాబాద్ : నగరంలో మళ్లీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, నాంపల్లి, కోఠి, ఆబిడ్స్, గచ్చిబౌలి, దిల్ సుఖ్ నగర్, బాగ్ లింగంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.  

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 186 పాయింట్ల లాభంతో 28,599 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 37 పాయింట్ల లాభంతో 8,779 వద్ద నిఫ్టీ ముగిసింది. 

16:54 - September 16, 2016

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఘట్టానికి...కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా మరో వారం రోజుల్లో తెరలేవనుంది. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా సెప్టెంబర్ 22 నుంచి జరిగే తొలిటెస్ట్ ద్వారా టీమిండియా రికార్డుల్లో చేరనుంది. క్రికెట్...మూడక్షరాల ఆట మాత్రమే కాదు. మూడు రకాల ఫార్మాట్లతో అలనాటి బ్రిటీష్ కామన్వెల్త్ దేశాల అభిమానులను ఓలలాడిస్తున్న క్రీడ. ఐదు రోజుల పాటు జరిగే సాంప్రదాయ టెస్ట్ క్రికెట్, ఒక్కరోజులో అటో ఇటో తేలిపోయే ఇన్ స్టంట్ వన్డే క్రికెట్ కేవలం మూడున్నర గంటల్లో ధూమ్ ధామ్ గా ముగిసిపోయే టీ-20 క్రికెట్. అభిమానుల సౌలభ్యం కోసం మూడు ఫార్మాట్లుగా ఉన్న ఈ క్రికెట్లో అసలు సిసలు క్రికెట్ ఏదంటే ...సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ మాత్రమే అన్న సమాధానం వస్తుంది. ఐదు రోజుల పాటు..రోజుకు 90 ఓవర్ల చొప్పున నాలుగు ఇన్నింగ్స్ గా సాగే టెస్ట్ క్రికెట్ ను...MOTHER OF ALL క్రికెట్ గా చెబుతారు. అభిమానుల ఇష్టాఇష్టాలు ఎలా ఉన్నా...టెస్ట్ క్రికెట్ ను మాత్రమే అసలు సిసలు క్రికెట్ గా నాటినేటి క్రికెట్ గ్రేట్లు చెబుతూ ఉండటం సాధారణ విషయమే.

భారత్ రికార్డులు...
అలాంటి టెస్ట్ క్రికెట్లో...టెస్ట్ క్రికెట్ రెండో ర్యాంకర్ టీమిండియా ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యింది. కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా ఈనెల 22 నుంచి న్యూజిలాండ్ తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ ద్వారా 500 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అతికొద్ది దేశాలలో ఒకటిగా భారత్ నిలువబోతోంది. భారత్ క్రికెట్ రికార్డులను ఓసారి తిరగేస్తే ఎన్న అరుదైన రికార్డులు మన కళ్లముందు కదలాడుతాయి. తెలుగుతేజం కర్నల్ కఠారీ కనకయ్యనాయుడు కెప్టెన్సీలో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 1932లో భారత్ టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన నాటినుంచి గత 74 సంవత్సరాల కాలంలో భారత టెస్ట్ క్రికెట్ ప్రస్థానం నిరాటంకంగా సాగుతూనే వస్తోంది.

 • టెస్ట్ హోదా పొందిన అన్ని దేశాలతోనూ టీమిండియా గత ఏడు దశాబ్దాల కాలంలో 499 టెస్ట్ మ్యాచ్ లు ఆడి..సగటున 30 శాతం విజయాలు నమోదు చేసింది.
 • ఇంగ్లండ్ తో 1932 నుంచి 2015 వరకూ ఆడిన 112 టెస్టుల్లో టీమిండియా 21 విజయాలు,43 ఓటమి, 48 డ్రాల రికార్డుతో ఉంది.ఆస్ట్రేలియాతో 90 టెస్టుల్లో 24 గెలుపు, 40 ఓటమి, 25 డ్రా, 1 టై మ్యాచ్ ఫలితాలు నమోదు చేసింది.
 • టెస్ట్ క్రికెట్ పసికూన బంగ్లాదేశ్ తో ఆడిన ఎనిమిది టెస్టుల్లో టీమిండియా 6 విజయాలు, 2 మ్యాచ్ ల డ్రా రికార్డుతో ఉంది.
 • న్యూజిలాండ్ తో ఇప్పటి వరకూ ఆడిన 54 టెస్టుల్లో 18 విజయాలు, 10 పరాజయాలు, 26 డ్రా రికార్డు సాధించింది.
 • చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆడిన మొత్తం 59 టెస్టుల్లో 9 గెలుపు, 12 ఓటమి, 38 డ్రాల రికార్డు నమోదు చేసింది.
 • సౌతాఫ్రికాతో ఆడిన 33 టెస్టుల్లో 10 గెలుపు, 13 ఓటమి, 10 డ్రాలతో నిలిచింది.
 • శ్రీలంకతో 38 టెస్టులు ఆడి16 విజయాలు, 7 పరాజయాలు, 15 డ్రా ఫలితాలు సాధించింది.
 • ప్రపంచ మాజీ నెంబర్ వన్ వెస్టిండీస్ తో ఇటీవలే ముగిసిన నాలుగుమ్యాచ్ ల సిరీస్ వరకు ఆడిన 94 టెస్టుల్లో 18 విజయాలు, 30 పరాజయాలు, 46 డ్రా ఫలితాల రికార్డుతో ఉంది.
 • జింబాబ్వేతో కేవలం 11 టెస్టులు మాత్రమే ఆడిన టీమిండియా 7 గెలుపు, 2 ఓటమి, 2 డ్రాల రికార్డుతో ఉంది.
 • మొత్తం మీద గత 74 సంవత్సరాలలో టీమిండియా 499 టెస్టుల్లో... 129 విజయాలు, 157 పరాజయాలు, 212 డ్రా, 1 టై ఫలితాలతో...అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచింది.
  కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగే 500వ టెస్ట్ మ్యాచ్ ఆతిథ్య టీమిండియాకు చిరస్మరణీయంగా మిగిలిపోవాలని కోరుకొందాం.
16:49 - September 16, 2016

కర్ణాటక సంగీత సౌరభాలను ప్రపంచమంతటా విరజిమ్మిన మహా విద్వాంసురాలు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి శతజయంతి ఈరోజు. మహాద్భుత గాన మాధుర్యంతో ఈ జగతిని మురిపించి మైమపిరించేందుకు ఈ భూమ్మీదకు వచ్చిన అద్వితీయ అతిథి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి. ఈ సంగీత సామ్రాజ్ఞి శత జయంతి రోజున ఆమెను స్మరించుకోవడం అంటే... స్వర పద సంగమ సమ్మోహనంలో తేలిపోవడమే. కాంతి వత్సరాల అనంతయాత్రలో కొన్ని సంవత్సరాలను కాంతిమంతం చేయడానికి పుడుతుంటారు కొందరు కారణజన్ములు. ప్రకృతిలోని చరాచర జీవుల శాబ్దిక విన్యాసాలను స్వర తంత్రంగా నిర్మించి.. కర్ణాటక సంగీతంగా రచించి... ఆ స్వర మాయాజాలంలో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసిన రుషి తుల్యుల్లాంటి మహనీయలకు ఇరవయ్యో శతాబ్దపు వారసురాలు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి.

ఏడు దశాబ్దాల సంగీతయాత్రలో..
ఏడు దశాబ్దాల సంగీతయాత్రలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, మరాఠీ వంటి అనేక భాషల్లో వేలాది కచ్చేరీలు నిర్వహించిన ఈ వీణావాణి.... కోట్లాది శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశారు. తన మార్మిక స్వర విన్యాసాలతో ఈ గాలిని రాగరంజితం చేశారు. హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం అన్న కవి వాక్కుకు అర్థం చెప్పారు. అనంత లోకాలకు వెళ్లిపోయినా... నిరంతరం తర తరాల హృదయాలను తన గాత్రంతో వెలిగిస్తూనే ఉన్నారు. నుదుట కుంకుమ.. కొప్పున మల్లెలు.. కళ్ళల్లో కాంతి రేఖలు.. పెదవుల మీద చిద్విలాసం.. ఆ ప్రసన్నవదనంలోంచి స్వర ప్రవాహం మొదలైతే... మహా మహా విద్వాంసులే మైమరిచిపోయేవారు. 1916 సెప్టెంబర్ 16న జన్మించిన కుంజమ్మే ఆ తరువాత ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా ఎదిగారు. చిన్నప్పటి నుంచే పాటై పల్లవించిన సుబ్బలక్ష్మి.. సంగీతమే తన జీవితంగా మార్చుకున్నారు. అందుకు మనం ఇద్దరు వ్యక్తులకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఒకరు.. ఆమె స్కూల్ టీచర్. ఆరో తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి బడికి ఆలస్యంగా వెళ్ళారట. అందుకని.. ఆ మాస్టారు ఆమెను కొట్టాడు. దాంతో ఆమె బడి మానేశారు. పూర్తిగా సంగీతం నేర్చుకోవడంలో మునిగిపోయారు. ఈ మాస్టారుతో పాటు ప్రఖ్యాత కర్ణాటక విద్వాంసుడు అరియక్కుడి రామానుజ అయ్యర్ కు కూడా ధన్యవాదాలు చెప్పాల్సిందే.

స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో..
1932లో మద్రాసు మ్యూజిక్ అకాడమీలో కచ్చేరికి రావలసిన రామానుజ అయ్యర్.. ఆ రోజున తనకు వీలు కావడం లేదని సుబ్బలక్ష్మిని కచ్చేరీ ఇవ్వమని పంపించారు. పదహారేళ్ళ సుబ్బలక్ష్మి ఆరోజున సమర్పించిన గాన కచ్చేరి విన్న మహామహులు... అమ్మా నీ స్వరంలో వీణా తంత్రులు మోగుతున్నాయని అని ఆశీస్సుల వర్షం కురిపించారు.  స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో జాతీయవాదిగా... ధార్మికురాలిగా జీవితం కొనసాగించి... సంగీతంతో స్వరారోహణ చేసిన సుబ్బలక్ష్మి సేవాసదన్, శకుంతల, సావిత్రి, మీరా వంటి చిత్రాల్లో నటించారు. భర్త సదాశివన్ సహకారమే నా సంగీతానికి ఊపిరి అని చెప్పుకున్నారు. ఆమె పాటలో భారతజాతి పల్లవించింది. ఆమె నగుమోములో నిశ్శబ్ద సంగీతాన్ని విని మురిసిపోయింది. ఆమె అసలు సిసలు భారతరత్నం.

16:45 - September 16, 2016

న్యూఢిల్లీ ఆర్కే ఖన్నా ఇండోర్ స్టేడియం వేదికగా మూడు రోజుల పాటు జరిగే ఈ పోరులో ప్రపంచ నాలుగో ర్యాంక్ ఆటగాడు రాఫెల్ నడాల్ నాయకత్వంలోని స్పెయిన్ జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఫ్లడ్ లైట్ల వెలుగులో తొలిసారిగా డేవిస్ కప్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. టెన్నిస్ పురుషుల ప్రపంచ టీమ్ చాంపియన్లకు ఇచ్చే డేవిస్ కప్..ప్లే ఆఫ్ సమరానికి మాజీ చాంపియన్ స్పెయిన్, మాజీ రన్నరప్ భారత్ సై అంటే సై అంటున్నాయి. భారత గడ్డపై ఫ్లడ్ లైట్ల వెలుగులో తొలిసారి డేవిస్ కప్ పోరు నిర్వహిస్తున్నారు.

 • పోటీల తొలి రోజున జరిగే ప్రారంభ సింగిల్స్ లో స్పానిష్ నెంబర్ వన్ రాఫెల్ నడాల్ తో..భారత రెండో ర్యాంకర్ రామ్ కుమార్ పోటీ పడతాడు. ఈ పోటీలో 14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత నడాల్ కు..ప్రపంచ 203వ ర్యాంకర్ రామ్ కుమార్ ఏమాత్రం పోటీ ఇవ్వగలడన్నది అనుమానమే.
 • రెండో సింగిల్స్ లో స్పానిష్ రెండో ర్యాంక్ ఆటగాడు డేవిడ్ ఫెరర్ తో సాకేత్ మైనేని తలపడతాడు. ఫెరెర్ ప్రపంచ 13వ ర్యాంకర్ గా ఉంటే.. సాకేతి మైనేని 119వ ర్యాంక్ లో ఉన్నాడు. రెండో సింగిల్స్ లో సైతం డేవిడ్ ఫెరర్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 • శనివారం జరిగే కీలక డబుల్స్ పోరులో స్పానిష్ జోడీ ఫెల్షియానో లోపేజ్ - మార్క్ లోపేజ్ లతో ...భారత జంట లియాండర్ పేస్- రోహన్ బొపన్న ఢీ కొంటారు. తన కెరియర్ లో ఇప్పటికే 42 డేవిస్ కప్ డబుల్స్ విజయాలు సాధించిన పేస్..మరొక్క మ్యాచ్ నెగ్గితే..సమఉజ్జీగా ఉన్న ఇటలీ ఆటగాడు నికోలా పీటరాంజీని అధిగమించగలుగుతాడు.
 • ఆదివారం జరిగే రివర్స్ సింగిల్స్ లో రామ్ కుమార్ తో ఫెరెర్, నడాల్ తో సాకేత్ మైనేని పోటీపడాల్సి ఉంది. అయితే.. స్పెయిన్ ప్రత్యర్థిగా డేవిస్ కప్ లో భారత్ కు 1-2 రికార్డు ఉండటం విశేషం.
16:41 - September 16, 2016

చిత్తూరు : తిరుమలేశుడి దర్శనాన్ని పక్కా కమర్షియల్‌గా మార్చిపారేస్తోంది ప్రభుత్వం. గగన మార్గంలో.. విమానాలు ఎక్కి వచ్చేవారికి శ్రీవారి దర్శనం సులువైపోతుంటే.. పేదలకు స్వామి దర్శనమే గగనమై పోతోంది. అదేంటయా అంటే పర్యాటకాభివృద్ధి మరి అంటూ బదులిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం.. శ్రీవారి భక్తుల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు పర్యటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచనలు చేస్తోంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే శ్రీశైల మల్లికార్జునుడిని, తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునేలా ఓ పర్యటక ప్యాకేజీని రూపొందిస్తోంది. పర్యాటకాభివృద్ధి పేరుతో ఆలయాలను హెలికాప్టర్‌లో దర్శించుకునే వీలు కల్పిస్తే ఎవరికి ఇబ్బందిలేదు. కాని గగనయాత్ర చేసేవారికి బ్రేక్‌ దర్శనాన్ని కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని సామాన్య భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు.

విమర్శలు...
ఇప్పటికే తిరుమలలో ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 పేరుతో ఇస్తున్న బ్రేక్‌ దర్శనాల వల్ల రోజూ ఉదయం రెండు గంటల పాటు సామాన్యులను దర్శనానికి అనుమతించడం లేదు. మళ్లీ కొత్తగా గగనవిహార భక్తులకూ బ్రేక్‌ దర్శనాలు కల్పిస్తే.. ఆకొద్దిపాటి దర్శన భాగ్యమూ తమకు దూరమవుతుందని భక్తులు ఆందోళన చెందుతున్నారు.  ప్రభుత్వ ప్రోటోకాల్‌లోని వ్యక్తుల సమయం విలువైనది కాబట్టి... అలాంటి వారికి బ్రేక్‌ దర్శనం చేయించారంటే అర్థముంది. హెలికాప్టర్‌లో వచ్చిన వారికి బ్రేక్‌ దర్శనం టికెట్లు కేటాయించడం వ్యాపారమే కదా అని సామాన్య భక్తులు మండిపడుతున్నారు. సంపన్నుల కోసం టీటీడీ ఏర్పాటు చేసిన వీఐపీ బ్రేక్ దర్శనానికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఇందుకు దళారీలను కూడా ఆశ్రయిస్తుంటారు. అలాంటి బ్రేక్‌ దర్శనంతో ఇప్పడు ప్రభుత్వమే హెలికాప్టర్‌ ద్వారా వ్యాపారం చేయాలనుకోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా అధికారులు స్పందించి దర్శనాన్ని వ్యాపారంగా మార్చొద్దని సామాన్య భక్తులు కోరుతున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి దర్శనం కోసం వస్తున్న తమలాంటి వారిని దృష్టి పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 

16:39 - September 16, 2016

హైదరాబాద్ : కర్నాటక హుమ్నాబాద్‌ వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన నలుగురు మియాపూర్‌-మదీనాగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌ సైదాబాద్‌కు చెందిన ఎల్లయ్యగౌడ్‌ తన కుటుంబంతో కలిసి 14వ తేదీన కావేరీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలు దేరారు. ప్రమాదం జరిగి ఇంతసేపైనా ట్రావెల్స్ యాజమాన్యం స్పందించడం లేదని బాధితులు ఆరోపించారు. ప్రమాద ఘటనలో ఎల్లయ్యగౌడ్‌తో పాటు అతని కుమారుడు కుమార్‌గౌడ్‌, కోడలు దివ్య, మనుమరాలు వర్షిక, మనువడు దీక్షిత్‌ గాయపడ్డారు.

ఒక్కసారిగా మంటలు...
కావేరి ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో... ఓ బాలుడు సజీవ దహనమయ్యాడు. గురువారం రాత్రి 8.30గంటలకు షిర్డీ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన బస్సు ఇవాళ తెల్లవారుజామున 3గంటలకు కర్ణాటకలోని హుమ్నాబాద్‌ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా.. మంటలు చెలరేగాయి. భయంతో డ్రైవర్‌ బస్సును వదిలేసి పరారయ్యాడు. సమీపంలో ఉన్న దాబా సిబ్బంది రాళ్లతో అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను కాపాడారు. క్షణాల్లో బస్సు మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ఆరేళ్ల బాలుడు విహాన్‌ సజీవ దహనమయ్యాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు వ్యాపించిన సమయంలో అందరూ బస్సులోంచి కిందకు దిగినప్పటికీ విహాన్‌ను ఎవరూ గమనించకపోవడంతో బాలుడు సజీవదహనమయ్యాడు. క్షతగాత్రులను హుమ్నాబాద్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కావేరి ట్రావెల్స్‌ బస్సు పాండిచ్చేరి రిజిస్ట్రేషన్‌తో ఉండటంతో ఆందోళనకారులు నిప్పుపెట్టిఉంటారని తొలుత భావించారు. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని షార్ట్‌సర్క్యూట్‌ రణంగానే ప్రమాదం జరిగిందని బీదర్‌ ఎస్పీ నికమ్‌ ప్రకాశ్‌ తెలిపారు. ప్రమాదంపై తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్పందించారు. ఏసీ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు మంత్రికి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. 

16:24 - September 16, 2016

ఢిల్లీ : గోరక్షా దళ్ పేరిట దళితులను దాడులను వెంటనే ఆపాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో స్వాభిమాన్ యాత్రలో సురవరం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. దళితులను అంటరానివారిగా చిత్రీకరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. సంఘ్ పరివార్ శక్తుల అండతోనే దళితులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. గోరక్షా దళాలు అనేవి సంఘ వ్యతిరేక శక్తుల యొక్క రాజ్యాంగేతర స్వతంత్ర సంస్థ అని, సంఘ్ పరివార్ యొక్క ఆశీస్సులతో..వారి యొక్క మద్దతుతో సంఘాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇంకా తీవ్రస్థాయిలో ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఆందోళనలో పాల్గొన్న డీఎస్ఎంఎం జాతీయ నేత..
దేశ వ్యాపితంగా దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా న్యూఢిల్లీలో దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. దళిత స్వాభిమాన్ సంఘర్ష్ పేరిట ఆరు దళిత సంఘాలు ఏకమై పార్లమెంట్ స్ట్రీట్ లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఆందోళనలో డీఎస్ఎంఎం జాతీయ నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. నోటితో నవ్వి నొసిటితో వెక్కిరించిన చందంగా కేంద్ర ప్రభుత్వం దళితులపై నవ్వి నోసిటితో వెక్కిరించిన చందంగా ఉందని పేర్కొన్నారు. నగరంలో మీటింగ్ అనంతరం దాడులు పెరిగాయని, ఒక పథకం ప్రకారం గోరక్షక్ దళ్ దాడులు కొనసాగిస్తోందన్నారు. దళిత సంఘాల మధ్య ఘర్షణ ఉందని, ప్రపంచీకరణ..ప్రైవేటీకరణ వల్ల లాభం జరుగుతుందని కొన్ని దళిత సంఘాలు పేర్కొంటున్నాయని శ్రీనివాస్ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:46 - September 16, 2016

ఇండస్ట్రీ జనాలు 'నాని' ఇప్పుడు ఫ్రూవ్ చేసుకోవాలంటున్నారు. ఈ నేచురల్ స్టార్ రేంజ్ ఏంటో ఇప్పుడు తెలిసిపోతుందని అంతా అంటున్నారు. అంతేకాదు ఇప్పుడు కనుక 'నాని' సత్తా చూపిస్తే ఆ రేంజ్ వేరేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వరుస సక్సెస్ లతో 'నాని' ఆడియన్స్ అలరిస్తున్నాడు. అయితే ఈ న్యాచురల్ స్టార్ అసలు ఏ క్లబ్ కు చెందినవాడు అనేదే మాత్రం క్లారిటి రావడం లేదు. 'మజ్ను' మూవీతో డైలామాకు చెక్ పడుతుందని ఇండస్ట్రీ జనాలు భావిస్తున్నారు. గురుడు 'మజ్ను' సినిమాతో కనుక గట్టి హిట్టు కొడితే తిరుగుండదని అంటున్నారు.
ఊహించని రీతిలో 'భలే భలే మగాడివోయ్' సినిమా 25 కోట్లు షేర్ వసూలు చేసింది. దీంతో ఈ యంగ్ హీరో ఇక 20 కోట్ల క్లబ్ హీరోగా అవతరించినట్లే అనుకున్నారంతా,

జెంటిల్మన్ రూ. 18 కోట్లు..
అయితే అంతలోనే వచ్చిన 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికి కలెక్షన్లు మాత్రం రాలేదు. ఈ చిత్రం కేవలం 10 కోట్ల వరకే కలక్ట్ చేసిందని టాక్. అయితే మధ్య వచ్చిన 'నాని' 'జెంటిల్మన్' మాత్రం ఏకంగా 18కోట్లు షేర్ వసూలు చేసింది. దీంతో 'నాని' ఏ కేటగిరీ హీరో అనే దానిపై సందేహాలున్నాయి. మంచి కంటెంట్ తో ఈ హీరో సినిమా చేస్తే కలెక్షన్లను బాగుంటాయనేది 'భలే భలే మగాడివోయ్', 'జెంటిల్ మేన్' సినిమాలతో తెలిసిపోయింది. అయితే సినిమా నార్మల్ గా ఉన్న స్టామినాతోనే కలెక్షన్లను రాబడితేనే స్టార్ అంటారు. మరి ఇప్పుడు 'మజ్ను'తో మనోడు ఏ కేటగిరీ హీరో అనిపించుకుంటాడో చూడాలి. 

15:42 - September 16, 2016

'మహేష్ బాబు'..ఓ భారీ హిట్టు అంతలోనే ఓ భారీ ప్లాప్ .ఇది ఈ మధ్య 'మహేష్' ట్రాక్ రికార్డ్ . 'ఆగడు', 'వన్' సినిమాలతో వరుసగా డిజాస్టర్స్ చవిచూసిన ప్రిన్స్ 'శ్రీమంతుడు'తో భారీ హిట్టు కొట్టి ఫాంలోకి వచ్చేశాడు. అయితే 'శ్రీమంతుడు' సక్సెస్ అనుభూతిని 'బ్రహ్మోత్సవం' ఆవిరిచేసింది. దీంతో ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా 'ప్రిన్స్' కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. 'మురుగదాస్' దర్శకత్వంలో 'మహేష్ బాబు' కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నెల కిందట ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే ఇప్పటి వరకు 'ప్రిన్స్' ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కాలేదు. లేటేస్ట్ 'ప్రిన్స్' ఈ మూవీ షూటింగ్ కి అటెండ్ అయినట్లు తెలుస్తోంది. చైన్నై సమీపంలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోందట.
'రకూల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే 'మురుగదాస్' సోషల్ కంటెంట్ కి కమర్షయల్ హంగులను అద్ది ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు వినికిడి. ఈ సినిమా 'మహేష్' కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నాడు. మరి 'మురుగదాస్' 'ప్రిన్స్' ఆశలను ఏ మేరకు నిజం చేస్తాడో చూడాలి. 

విజయవాడలో రేపు కేంద్ర మంత్రి వెంకయ్య పర్యటన..

విజయవాడ : విజయవాడలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రేపు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఓ సభలో ఏపీకి ప్యాకేజీ, ఉపయోగాలపై వెంకయ్య ప్రసంగించనున్నారు. 

ఏపీలో అన్ని పరీక్షలు ఆన్ లైన్ లో - మంత్రి గంటా..

విజయవాడ : ఇక నుంచి ఏపీలో అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, దాని కోసం ముందుగా కొన్ని నమూనా పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. ఈ విధానం వల్ల అక్రమాలకు అవకాశం ఉండదన్నారు.

పోలవరాన్ని కేంద్రమే నిర్మించాలి - పొంగులేటి..

హైదరాబాద్ : పోలవరంను కేంద్రమే నిర్మించాలని టి.కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలవరంకు తాము వ్యతిరేకం కాదని, ప్రస్తుతం డిజైన్ ప్రకారం కడితే భద్రాచలం, మణుగూరు, దుమ్ముగూడెంకు ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతున్నా సీఎం కేసీఆర్ స్పందించడం లేదని, ఖమ్మంకు జరుగుతున్నా అన్యాయంపై ప్రధానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. 

సహారా చీఫ్ కు పెరోల్ గడువు పెంపు...

ఢిల్లీ : సహారా చీఫ్ సుబ్రతా రాయ్ కి పెరోల్ గడువు పెంచింది. సెప్టెంబర్ 23వ తేదీ వరకు గడువు పెంచుతున్నట్లు సుప్రీం పేర్కొంది. అపెక్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రూ. 352 కోట్లను సహారా డిపాజిట్ చేయడంతో పెరోల్ గడువు పెంచినట్లు తెలుస్తోంది. 

15:23 - September 16, 2016
15:22 - September 16, 2016

అరుణాచల్‌ ప్రదేశ్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ సంక్షోభంలో పడింది. కాంగ్రెస్‌ చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు పీపుల్స్ పార్టీలో చేరారు. పిపిఏలో చేరిన వారిలో ప్రస్తుత ముఖ్యమంత్రి పెమ ఖండు కూడా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీని పీపుల్స్ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌లో విలీనం చేసినట్లు సిఎం పెమ ఖండు స్పీకర్‌కు తెలిపారు. కాంగ్రెస్‌కు 46 మంది ఎమ్మెల్యేలుండగా 43 మంది ఎమ్మెల్యేలు పిపిఏలో చేరారు. 60 సీట్లున్న అరుణాచల్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 46, బిజెపికి 11 మంది ఎమ్మెల్యేలున్నారు.

15:20 - September 16, 2016

ఢిల్లీ : దేశ రాజధానిలో దళిత్ స్వాభిమాన్ యాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పార్లమెంట్ స్ట్రీట్ లో దళిత సంఘాల ఐక్య వేదిక ఈ నిరసన చేపట్టింది. దళిత హక్కుల పరిరక్షణ కోసం రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, భారతీయ ఖేద్ మజ్దూర్ యూనియన్, దళిత సోషన్ ముక్తీ మంచ్, దళిత్ అధికార్ రక్ష్ రాష్ట్రీయ అభియాన్, అఖిల భారతీయ ఖేద్ మజ్దూర్ యూనియన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ దళిత్ హ్యూమన్ రైట్స్ సంఘాలు ఏకమై ఆందోళన బాట పట్టాయి. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు పాల్గాన్నాయి. దళిత్ స్వాభిమాన్ సంఘర్ష్ ధర్నాకు సీపీఎం జాతీయ కార్యదర్శి, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, ప్రకాష్ అంబేద్కర్, రాధిక వేముల తదితరులు మద్దతు తెలిపారు.

దాడులు ఆపాలి - ఏచూరి...
గోరక్షక్ దళ్ పేరిట దళితులపై దాడులు చేయడం అమానుషమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఒక్క ఏడాదిలోనే సుమారు 4,300 మంది దళితులపై దాడులు చేశారని తెలిపారు. దళితులపై వెంటనే దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. 

నీరందకుండా బాబు కుట్ర - ఈటెల..

కరీంనగర్ : చంద్రబాబు తెలంగాణ ప్రజల కళ్లల్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణకు నీరందకుండా చంద్రబాబు కుట్ర పన్నుతుంటే టి.టిడిపి నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. రైతులకు నీళ్లందకుండా పైపు లైన్లు పగలగొట్టడం దుర్మార్గమన్నారు. చేనేత సంఘాలు స్వశక్తిగా నిలబడేందుకు ఎంతైనా ఖర్చు చేస్తామని, చేనేతలకు ఇచ్చిన రుణాలు రద్దు చేసేలా చూస్తామన్నారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ విమర్శలు..

హైదరాబాద్ : కేసీఆర్, హరీష్, కేటీఆర్ తలో మాట మాట్లాడుతున్నారని, ప్రాజెక్టులకు చంద్రబాబు ఏనాడూ అడ్డుపడలేదని టిటిడిపి నేత రేవంత్ పేర్కొన్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు కేటాయించిన నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. కాంట్రాక్టులను ఆంధ్రులకు కేటాయిస్తున్న కేసీఆర్ మమ్మల్ని ఆంధ్రా తొత్తులని ఎలా దూషిస్తున్నారని విమర్శించారు. నయీం డైరీని అడ్డుపెట్టుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, నయీం డైరీని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 

14:56 - September 16, 2016

2016 పారా ఒలింపిక్స్ హోరాహోరీగా సాగిపోతున్నాయి. ఫెన్సింగ్, షూటింగ్ అంశాలలో చైనా, ఆర్చరీలో ఇరాన్, పవర్ లిఫ్టింగ్ లో ఈజిప్టు, ట్రై సైకిల్ రేస్ లో అమెరికా బంగారు పతకాలు గెలుచుకొన్నాయి. పారా ఒలింపిక్స్ ఆరో రోజు పోటీల విశేషాలు..
బ్రెజిల్ వేదికగా జరుగుతున్న 2016 పారా ఒలింపిక్స్ పోటాపోటీగా జరుగుతున్నాయి. రియో ఒలింపిక్స్ స్టేడియంలో జరిగిన వివిధ క్రీడల్లో అమెరికా, చైనా ఆధిపత్యం ప్రదర్శించాయి. మహిళల పవర్ లిఫ్టింగ్ బంగారు పతకాన్ని ఈజిప్టు లిఫ్టర్ రాండా మహ్మద్ గెలుచుకొంది. పురుషుల 97 కిలోల విభాగంలో ఈజిప్టు, ఇరాన్ లిఫ్టర్లకు ఆప్ఘనిస్థాన్ లిఫ్టర్ గట్టిపోటీ ఇచ్చాడు. మహిళల ఏర్ రైఫిల్ షూటింగ్ 50 మీటర్ల విభాగంలో...చైనా షూటర్ జాంగ్ కుపింగ్ బంగారు పతకం సొంతం చేసుకొంది.
వెరోనికా రజత, కొరియా షూటర్ లీ యుంగ్ కాంస్య పతకాలతో సరిపెట్టుకొన్నారు.

మహిళల పోటీలు..
మహిళల 10 మీటర్ల మిక్సిడ్ ఏర్ రైఫిల్ విభాగంలో ..ఉక్రెయిన్ షూటర్ వాసెలీ కోవల్ చుక్ స్వర్ణపతకం గెలుచుకొంది. కొరియా షూటర్ కిమ్ గున్ సూ రజత, అమెరికన్ షూటర్ మెకెన్నీ కాంస్య పతకాలు దక్కించుకొన్నారు. పురుషుల ఆర్చరీ రికర్వ్ బంగారు పతకాన్ని ..ఇరానీ ఆర్చర్ రహీమ్ గెలుచుకొన్నాడు. గోల్డ్ మెడల్ ఫైట్ లో థాయ్ ఆర్చర్ హెన్రిచీ నెట్ సిరి పై 7-3తో విజేతగా నిలిచాడు. కాంస్య పతకం పోటీలో బ్రెజిల్ ఆర్చర్ లూషియానో రెజెండీ పై ఇరాన్ ఆర్చర్ ఇబ్రహీం విజేతగా నిలిచాడు. మహిళల T-20 400 మీటర్ల పరుగులో అమెరికన్ అథ్లెట్ బెరిన్నా క్లార్క్ విజేతగా నిలిచింది. మెరుపువేగంతో దూసుకెళ్లిన క్లార్క్ ప్రత్యర్థులు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. మహిళల 1500 మీటర్ల ట్రై సైకిల్ రేస్ స్వర్ణపతకాన్ని...అమెరికా అథ్లెట్ తాత్యానా గెలుచుకొంది. పురుషుల ట్రైసైకిల్ 1500 మీటర్ల రేస్ గోల్డ్ మెడల్ ను థాయ్ లాండ్ కు చెందిన ప్రావాత్ వహ్ రామ్ గెలుచుకొన్నాడు. తెరచాప పడవల పోటీల టీమ్ విభాగంలో ...ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, పోలెండ్, కెనడా జట్లు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. 

చైనా అథ్లెట్లు అధిక్యం..
మహిళల వీల్ చెయిర్ బాస్కెట్ బాల్ ఫైనల్స్ కు జర్మనీ, గ్రేట్ బ్రిటన్ జట్లు చేరుకొన్నాయి. తొలి క్వార్టర్ ఫైనల్లో జర్మనీ 76-28 పాయింట్లతో ఫ్రాన్స్ ను చిత్తు చేసింది. మరో క్వార్టర్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్ 57-38తో చైనాను కంగు తినిపించింది. మహిళల ఫెన్సింగ్ లో...చైనా ఫెన్సర్ బియాన్ విజేతగా నిలిచింది. తనదేశానికే చెందిన ప్రత్యర్థి పై నెగ్గి బంగారు పతకం సొంతం చేసుకొంది. 5-A సైడ్ ఫుట్ బాల్ పోటీలో స్పెయిన్ ఒకే ఒక్కగోల్ తో మెక్సికో పై విజయం సాధించింది. మొత్తం మీద...పారా ఒలింపిక్స్ ఆరోరోజు పోటీల్లో సైతం అమెరికా, చైనా దేశాల అథ్లెట్లు తమ ఆధిక్యాన్ని నిరూపించుకోగలిగారు.

14:53 - September 16, 2016

గుంటూరు : నగరంలో బజరంగ్ జూట్ మిల్లు పునఃప్రారంభించే విషయంలో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు యాజమాన్యానికి, ఇటు కార్మికులకు మధ్య చర్చల నడుస్తున్నాయి. తాజాగా మంత్రి పత్తిపాటి సమక్షంలో ఇరుపక్షాలు భేటి అయ్యాయి. మిల్లు తెరిపించాలని కార్మికనేతలు పట్టుబట్టగా, యాజమాన్యం అందుకు నిరాకరించింది. దీంతో కార్మికశాఖ కమిషనర్ సమక్షంలో మరోసారి సమావేశం కానున్నారు.

40 ఏళ్ల చరిత్ర..
40 ఏళ్ళ చరిత్ర కలిగిన గుంటూరు నగరంలోని బజరంగ్ జూట్ మిల్లు మూతపడటంతో 3వేల మంది కార్మికులకు ఊపాధి లేకుండా పోయింది. మిల్లు పునఃప్రారంభించాలంటూ ఏడాది కాలంగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలో గుంటూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరనున్నాయి. అధికార టిడిపికి జూట్ మిల్లు కార్మికుల ఓటు బ్యాంక్ కీలకంగా మారిన నేపథ్యంలో జూట్ మిల్లు సమస్యకు ఓ పరిష్కారం చూపించాలని అధికారపార్టీ నేతలు తాపత్రయపడుతున్నారు. పరిహారం ఇప్పించి వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి ఎన్నికల్లో లబ్దిపొందాలనే వ్యూహరచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కార్మిక నేతలు మాత్రం మిల్లు తెరిపించాలని పట్టుబడుతుండటంతో అధికార పార్టీ పెద్దలకు ఇది మింగుడుపడని పరిణామంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం గుంటూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో కార్మిక నేతలు జూట్ మిల్ యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు.

కార్మిక సంఘాల అసంతృప్తి..
మిల్లు పునఃప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి ఏడాదికాలం కావస్తున్నా ఇంతవరకు హామీ నెరవేరకపోవటంపై కార్మిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిహారం తీసుకునేందుకు ఎట్టిపరిస్ధితుల్లో అంగీకరించేది లేదంటున్నారు. నష్టాలు లేని మిల్లును యజమాన్యం అత్యాశకుపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మకం పెట్టిందంటూ ఆరోపిస్తున్నారు.

పరిహారం చెల్లిస్తే ఒప్పుకోమంటున్న కార్మికులు..
మరోవైపు మిల్లు నడపలేమని యాజమాన్యం చెబుతోందని.. పరిహారం విషయంపై చర్చిస్తే బాగుంటుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి వ్యాఖ్యానించటంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. త్వరలో కార్మికశాఖ కమిషనర్ వరప్రసాద్ సమక్షంలో మరోసారి చర్చలు జరిపి సమస్యకు ఓ పరిష్కారం కనుగొనాలని సమావేశంలో నిర్ణయించారు. దీనిపై ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కార్మిక శాఖ అధికారులను అదేశించారు. జూట్‌ మిల్లు సమస్యకు ప్రభుత్వం కమిటీ వేసి చేతులు దులుపుకుంటుందో లేక చిత్తశుద్దితో కార్మికుల పక్షాన నిలబడి మిల్లును పునఃప్రారంభిస్తుందో చూడాలి. 

14:50 - September 16, 2016

హైదరాబాద్ : టీడీపీ నాయకత్వం.. తెలంగాణాలో పార్టీని పట్టాలెక్కించే పనిలో పడింది. ఇందుకుగాను మిషన్‌ 99 పేరుతో సరొకొత్త కార్యక్రమాన్ని నిర్దేశించుకుంది. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మిషన్‌-99ను రూపొందించుకున్నారు. ఇంతకీ ఏంటీ మిషన్‌-99..?  మిషన్‌-99..! తెలంగాణ తెలుగుదేశం పార్టీ సరికొత్త వ్యూహం. తెలంగాణ ఉద్యమంలో రెండు కళ్ల సిద్ధాంతంతో.. స్థానికుల ఆగ్రహానికి గురైన టీడీపీ.. రాష్ట్ర విభజన తర్వాత కూడా కోలుకోలేక పోయింది. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ దెబ్బ మీద దెబ్బ తింటూ వస్తోంది. ఏ ఎన్నికలోనూ పార్టీ విజయం సాధించలేక పోయింది. పార్టీ నాయకత్వంలో విభేదాలకు తోడు.. సీనియర్లలో చాలామంది టీఆర్‌ఎస్‌లో చేరటం లాంటి కారణాల వల్ల తెలంగాణలో ఆపార్టీ ఉనికే ప్రశ్నార్థకమైంది. ఈ దశలో టీటీడీపీ మిషన్‌-99ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2019 ఎన్నికల్లో 99 స్థానాలు గెలవడమే ఈ మిషన్‌ ఉద్దేశం.

తెలంగాణ నాయకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు..
రెండేళ్లుగా టీడీపీ కోలుకోలేని దెబ్బలు తింటూనే ఉంది. దీంతో తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టేందుకు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు.. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. సీరియస్‌గానే దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోటీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలకు గాలం వేయాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్‌ శాసన సభ్యుడికి సన్నిహితుడుగా ఉన్న ప్రదీప్‌ చౌదరి.. మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డికి సన్నిహితుడైన శ్రీనివాసరెడ్డిని టీ-టీడీపీలోకి ఆహ్వానించారు. దీంతో పాటే.. టీడీపీ అనుబంధ విభాగాలను కూడా పటిష్టం చేసేందుకు కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 19, 20 తేదీల్లో రైతు గర్జన పేరుతో రైతు సమస్యలపై నిరసన దీక్ష చేపట్టనున్నది. తెలంగాణాలో టీడీపీ అభివృద్ధికి నాయకత్వం చేపడుతున్న చర్యలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి. 

14:45 - September 16, 2016

చెన్నై : తమిళనాడులో బంద్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు బంద్‌ కొనసాగనుంది. దాదాపు 4,600 పెట్రోల్ బంక్‌లు, 18వేల ప్రైవేట్ స్కూల్స్, 22లక్షల వ్యాపారసంస్థలు మూతపడ్డాయి. లక్ష మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో కేంద్ర బలగాలను మోహరించారు. కావేరి డెల్టా జిల్లాలైన తిరుచ్చి, తరంజావూరు, నాగపట్నం, తిరవూరు, అరియళూరులో రైల్‌రోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. డీఎంకే నేత స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

14:24 - September 16, 2016

షార్ట్ పిరియడ్ లోనే 'యూవీ క్రియేషన్స్ బ్యానర్' మంచి పేరుంది. కథా బలమున్న వైవిధ్యమైన చిత్రాలను నిర్మించే ఈ సంస్థగా నిర్మాతలు 'ప్రమోద్, వంశీ'లు పేరు తెచ్చుకున్నారు. తొలి సినిమా 'మిర్చి'తో భారీ హిట్టు అందుకున్న ఈ నిర్మాతలు ఆ తరువాత కూడా 'రన్ రాజా రన్', 'భలే భలే మగాడివోయ్', 'ఎక్స్ ప్రెస్ రాజా సక్సెస్' సినిమాలతో సక్సెస్ పరంపరను కొనసాగించారు. ఇప్పుడు ఈ బ్యానర్ తో 'చరణ్' తో మూవీకి రెడీ అయింది.

యూవీ క్రియేషన్స్..
ప్రస్తుతం 'ధృవ' సినిమా చేస్తున్న ఆ తరువాత 'యూవీ' క్రియేషన్స్ లో ఓ మూవీకి చేసేందుకు డేట్స్ ఇచ్చినట్లు వినికిడి. ఈ సంస్థ ప్రస్తుతం 'అనుష్క' తో 'భాగమతి' సినిమా చేస్తోంది. ఆ తరువాత వచ్చే ఏడాది ప్రథమార్థంలో 'ప్రభాస్' హీరోగా మరో సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ తరువాత 'చరణ్' సినిమా ఉంటుందని సమాచారం. యూవీ క్రియేషన్స్ లో 'చరణ్' నటించే సినిమాకి 'మేర్లపాక గాంధీ' దర్శకత్వం వహించే ఛాన్స్ ఉన్నట్లు టాక్. 'చెర్రీ' కోసం ఈ దర్శకుడు 'మెగా ఎక్స్ ప్రెస్' టైటిల్ తో ఓ స్టోరీని సిద్దం చేసినట్లు వినిపిస్తోంది. దర్శకుడు 'గాంధీ'కి 'ఎక్స్ ప్రెస్' పై ఉన్న సెంటిమెంట్ తోనే ఈ టైటిల్ ని అనుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రం వచ్చే ఎడాదిలోనే స్టార్ట్ అయ్యేలా కనిపిస్తోంది. 

14:19 - September 16, 2016

హైదరాబాద్ : గురువారం ఉదయం ప్రారంభమైన నిమజ్జనం శుక్రవారం మధ్యాహ్నానికి ముగిసింది. నిమజ్జనం ప్రశాంతంగా జరగడంపై ఉన్నతాధికారులు ఊపిరిపీల్చుకున్నారు. నిమజ్జనం అనంతరం వ్యర్థాలను తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి టెన్ టివితో మాట్లాడారు. గత నెల రోజుల ముందంటి నుండి అన్ని శాఖలతో సమన్వయం చేశామని, అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. ఈ సమన్వయం చక్కగా జరిగిందన్నారు. బక్రీద్..భారీ వర్షం..వినాయక నిమజ్జనంలను ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. దసరా..బతుకమ్మ..ఇతర కార్యక్రమాలు ఏవీ జరిగినా ప్రపంచం మొత్తం నగరం వైపు చూస్తుందని, ఎలాంటి సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరగడం నగర ప్రతిష్ట పెరుగుతుందన్నారు. నగరంలో ఒక రోజు చెత్త 4,500 మెట్రిక్ టన్నులు ఉంటుందని, కానీ నిన్న ఒక్క రోజు చెత్త 2,500 ఉందని ఉన్నతాధికారి తెలిపారు. జవహర్ డంపింగ్ యార్డుకు చెత్తను తరలించేందుకు 150 ట్రక్కులను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

డెబ్రీస్ తొలగింపు...
నిన్న ఉదయం ప్రారంభమైన నిమజ్జన కార్యక్రమం నిర్విరామంగా 30గంటలకు పాటు కొనసాగింది. వినాయకులను డెబ్రీస్ ను తొలగించేందుకు అన్ని శాఖల అధికారులు పని చేస్తున్నారు. పైకి తేలిన చెత్తా చెదారాన్ని కొంతమంది తొలగిస్తుండగా ఇతర వ్యర్థాలను ఇతర సిబ్బంది తొలగిస్తున్నారు. 

14:14 - September 16, 2016

'అక్కినేని' హీరో 'అఖిల్' సెకెండ్ మూవీ డైరెక్టర్ ఎవరనే దానిపై 'నాగార్జున' క్లారిటీ ఇచ్చేశాడు. ఇక 'నాగ్' రెండో వారసుడితో జోడి కట్టే హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. 'నాని' రీసెంట్ మూవీలో వావ్ అనిపించిన ఓ కేరళ బ్యూటీని 'అఖిల్' పక్కన సెట్ చేసినట్లు టాక్. 'అఖిల్' రెండవ సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అలాంటి వాటికి రీసెంట్ గా 'నాగర్జున' క్లారిటీ ఇచ్చి పుల్ స్టాప్ట్ పెట్టాడు. 'విక్రమ్ కుమార్' దర్శకత్వంలో 'అఖిల్' సెకెండ్ మూవీ ఫిక్స్ అయింది. ఆల్రెడీ కథ రెడీ అయిందనీ .. త్వరలో సెట్స్ పైకి వెళుతుందని ఇటీవలే 'నాగ్' స్వయంగా చెప్పాడు. అప్పటి నుంచి ఈ సినిమాలో 'అఖిల్' పక్కన ఛాన్స్ దక్కించుకునే అదృష్టం ఏ హీరోయిన్ వరిస్తుందా అని అంతా చర్చిస్తున్నారు.

ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్..
'అఖిల్' పక్కన 'నివేదా థామస్' హీరోయిన్ గా సెట్ చేసినట్లు సమాచారం. ఇటీవల రిలీజైన 'నాని' 'జెంటిల్ మన్' లో ఈ కేరళ బ్యూటీ నటన పరంగా, అటు లుక్స్ పరంగా మెస్మరైజ్ చేసింది. ఈ కారణంగా 'నివేదా'ను హీరోయిన్ గా తీసుకుంటే 'అఖిల్' ఫిల్మ్ కి హెల్ప్ అవుతుందని దర్శకుడు భావించాడట. అన్నట్లు ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుందని వినికిడి.  

చిత్తూరులో ఇంటర్ విద్యార్థి సూసైడ్...

చిత్తూరు : మదనపల్లి జవహార్ నవోదయ స్కూల్ ఇంటర్ విద్యార్థి సాగర్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి మందలించిందని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్ లో సాగర్ పేర్కొన్నాడు.

 

వినాయక నిమజ్జనం ముగిసింది...

హైదరాబాద్ : వినాయక నిమజ్జనం ముగిసింది. జీహెచ్ఎంసీ సిబ్బంది వ్యర్థాలను తొలగిస్తున్నారు. సహకరించిన అన్ని డిపార్ట్ మెంట్లకు కమిషనర్ ధన్యావాదాలు తెలియచేశారు. అనంతరం ట్యాంక్ బండ్ పై ఆంక్షలను ఎత్తివేసినట్లు, యదావిధిగా వాహనాలు రాకపోకలు సాగించవచ్చని ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ పేర్కొన్నారు.

డీఎస్సీ, సీఐలపై ఎఫ్ఐఆర్ కు కోర్టు ఆదేశం..

హైదరాబాద్ : ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. డీఎస్పీ శ్రీధర్, సీఐపై మరోసారి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణనను మంగళవారానికి వాయిదా వేసింది. 

అమరావతికి పర్యావరణ అనుమతులపై విచారణ వాయిదా..

ఢిల్లీ : ఏపీ రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులపై దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 19వ తేదీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాయిదా వేసింది. 

వంశీచంద్ రెడ్డి దీక్ష భగ్నం..

మహబూబ్ నగర్ : ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి దీక్ష భగ్నం అయ్యింది. ఆయన్ను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కల్వకర్తిని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని మూడు రోజులుగా వంశీచంద్ రెడ్డి ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. 

సంక్షోభంలో అరుణాచల్ సర్కార్..

అరుణాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం దిశగా వెళుతోంది. 44 మంది ఎమ్మెల్యేలలో 42 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. పీపుల్స్ పార్టీ వైపు ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. 

నయీం కేసును సీబీఐకి అప్పగించాలి - కోమటిరెడ్డి..

నల్గొండ : నయీమొద్దీన్ కేసును సీబీఐకి అప్పగించాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణలో అసలు దొంగలెవరో తెలుస్తుందని, నయీం కేసులో ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, తమ రాజకీయ ఎదుగుదదలను ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 

13:48 - September 16, 2016
13:29 - September 16, 2016

అరుణాచల్ ప్రదేశ్ : అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. 44నాలుగు మంది కాంగ్రెస్ సభ్యుల్లో 42మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. దీంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. కాంగ్రెస్ ను వీడిన ఎమ్మెల్యేలు పీపుల్స్ పార్టీవైపు వెళ్లినట్లుగా తెలుస్తోంది. 

13:24 - September 16, 2016

మెదక్ : కుకునూరు ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసుకు సంబంధం ఉన్న సిద్ధిపేట మాజీ డీఎస్‌పీ శ్రీధర్, సీఐలపై రీ ఓపెన్ చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు పోలీసులను ఆదేశించింది. డీఎస్‌పీ, సీఐల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రామకృష్ణారెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో డీజీపీ అనురాగ్‌శర్మ చర్యలు తీసుకుంటూ కేసుకు సంబంధం ఉన్న డీఎస్‌పీతో పాటు మరో ఏడుగురి పోలీసులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కుటుంబ సభ్యులతో పాటు మరో న్యాయవాది కోర్టులో పిటీషన్ దాఖలు చేయటంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విషయంలో కుటుంబ సభ్యులు సీఎం కు కూడా లేఖ వ్రాసినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

13:18 - September 16, 2016

హైదరాబాద్ : నగరంలోని చిక్కడపల్లి అచ్చయ్యనగర్ లో నలుగురు బాలికలు అదృశ్యమయ్యారు. నిన్న సాయంత్రం గణేష్ నిమజ్జనం చూసేందుకు బైటకు వెళ్లిన బాలికలు గాయత్రి(15), పావని(13), రుచిత(13), దివ్య(15) ఇంటికి తిరిగిరాలేదు. దీంతో అర్థరాత్రి వరకూ ఎదురు చూసిన తల్లిదండ్రులు శనివారం ఉదయం చిక్కపల్లి పీఎస్ ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.  

12:57 - September 16, 2016

హైదరాబాద్‌ : నగరంలో గణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా జరగడం పట్ల జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. జీహెచ్‌ఎంసీతో పాటు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్లనే నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని కమిషన్ పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనం రెండో రోజూ ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి గణనాథులు గంగమ్మ తల్లి ఒడికి చేరుకునేందుకు బారులుతీరారు. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వెళ్లి రావయ్యా.. బొజ్జ గణప్పయ్యా అంటూ ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. దీనిపై మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

12:51 - September 16, 2016

విశాఖ పట్నం : అనకాపల్లిలో భారీ స్థాయిలో గంజాయి పోలీసులకు పట్టుబడింది.. ఆయిల్‌ ట్యాంకర్‌లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.. ఈ గంజాయి విలువ కోట్లలో ఉంటుందని అంచనావేస్తున్నారు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 

12:48 - September 16, 2016

కరీంనగర్‌ : హుజురాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. పీవీ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్పందన అనే విద్యార్థిని శుక్రవారం ఉదయం 9.300గంటలకు హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రూమ్ ను శుభ్రం చేసేందుకు వచ్చిన హాస్టల్ సిబ్బంది గమనించి యాజమాన్యానికి సమాచారం అందించటంతో హాస్టల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హాస్టల్ కు చేరుకుని పోలీసలు సంఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీస్ దర్యాప్తులో తేలనున్నాయి. కాగా అందరితోనూ కలివిడిగా తిరిగే స్పందన హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవటంతో తోటి విద్యార్థినులు విషాదయంలో మునిగిపోయారు. 

12:40 - September 16, 2016

ఢిల్లీ : ఓటుకు నోటు కేసు నుంచి మత్తయ్యను తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం... మత్తయ్య తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణను రెండు వారాలు వాయిదావేసింది.. గతంలో ఓటుకు నోటు కేసులో మత్తయ్యను తొలగిస్తూ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈకేసులో నిందితుడు మత్తయ్య తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవటంతో సుప్రీకంకోర్టు విచారణను రెండువారాలపాటు వాయిదా వేసింది. కాగా రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు ఎంతటి సంచలనం కలిగించిందో తెలిసిన విషయమే.

12:28 - September 16, 2016

కర్ణాటక : తమిళనాడులో బంద్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు బంద్‌ కొనసాగనుంది. దాదాపు 4,600 పెట్రోల్ బంక్‌లు, 18వేల ప్రైవేట్ స్కూల్స్, 22లక్షల వ్యాపారసంస్థలు మూతపడ్డాయి. లక్ష మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో కేంద్ర బలగాలను మోహరించారు. కావేరి డెల్టా జిల్లాలైన తిరుచ్చి, తరంజావూరు, నాగపట్నం, తిరవూరు, అరియళూరులో రైల్‌రోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. డీఎంకే నేత స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

స్టాలిన్ అరెస్ట్..

తమిళనాడు : కావేరీ జల వివాదంపై ఆందోళన చేస్తున్న తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఎగ్మోర్‌ రైల్వే స్టేషన్‌ ఎదుట నిరసన చేపట్టిన స్టాలిన్‌, మరో నలుగురు డీఎంకే ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావేరి జలాల వివాదంపై తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం బంద్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఎం.ఎస్.సుబ్బలక్షి ప్రపంచానికే ఆదర్శం : చదలవాడ

తిరుపతి: ప్రముఖ సంగీత విద్వాంసురాలు భారతరత్న ఎం.ఎస్ సుబ్బలక్ష్మి అందించిన సంగీతం ప్రపంచానికే ఆదర్శమని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తితిదే, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో శుక్ర‌వారం తిరుపతిలో నిర్వహించిన ఎం.ఎస్ సుబ్బలక్ష్మి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. తిరుపతి పూర్ణకుంభం కూడలిలోని సుబ్బలక్ష్మి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు, తమిళ, కన్నడ సహా పలు భాషల్లో భక్తిరస పాటలు అందించారని తెలిపారు. ఎమ్‌ఎస్‌ సుబ్బలక్ష్మి ఆలపించిన శ్రీవారి సుప్రభాతం భక్తుల మనస్సు నుంచి చెరిగిపోదని ఆయన అన్నారు.

ఓటుకు నోటు కేసు వాయిదా..

ఢిల్లీ : ఓటుకు నోటు కేసు నుండి మత్తయ్యను తొలగించటంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిందితుడు మత్తయ్య తరపు న్యాయవాది అందబాటులో లేకపోవటంతో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు విచారణను రెండువారాలపాటు వాయిదా వేసింది. గతంలో మత్తయ్యను కేసునుండి తొలగిస్త రాష్ట్ర న్యాయస్థానం హైకోర్టు తీర్పునిచ్చింది., దీంతో తెలంగాన ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు ఎంతటి సంచలనం కలిగించిందో తెలిసిన విషయమే.

కల్వర్టును ఢీకొన్న స్కూల్ బస్..

నిజామాబాద్‌ : తాడ్వాయి మండలంలోని ఎరాపహాడ్‌ గ్రామం నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఎస్‌పీఆర్‌ ప్రైవేట్‌ పాఠశాల బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా గ్రామ శివారులో ఉన్న కల్వర్టును డీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 12మంది విద్యార్థుల్లో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కల్వర్టు పటిష్టంగా ఉండటంతో బస్సు కల్వర్టును డీకొట్టి ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.

11:29 - September 16, 2016

కర్ణాటక: కర్నాటకలో బస్ దగ్ఘమైన ఘనటపై బీదర్ ఎస్పీ స్పందించారు. షార్ట్ సర్క్యూట్ తోనే బస్ దగ్థమైందని బీదర్ ఎస్పీ నికమ్ ప్రశాశ్ వెల్లడించారు. కర్నాటకలోని హుమ్నాబాద్ వద్ద కావేరి ట్రావెల్స్‌కు చెందిన షిర్డీ-హైదరాబాద్ బస్సు దగ్ధమైంది. బస్ దగ్థం ప్రాంతంలో నెలకొన్న గందరగోళంతో కావేరీ జలాల విషయంలో కర్ణాటకలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల రీత్యా కర్ణాటక ఆందోళనకారులే బస్ కు నిప్పు పెట్టినట్లుగా భావించారు. కానీ ఇంజన్ వేడెక్కిపోవటంతో  ఇంజన్ లో వ్యాపించిన మంటలు ఆయిల్ ట్యాంకర్ కు సమీపించటంతో ఒక్కసారిగా ఆయిల్ ట్యాంక్ పేలిపోయింది. దీంతో బస్ దగ్థమయినట్లుగా బీదర్ ఎస్పీ  నిర్థారించారు. ఈ దుర్ఘటనలో మూడేళ్ల చిన్నారి విహాన్ మృతిచెందాడు. విహాన్ కుటుంబం పశ్చిమగోదావరి జిల్లా తణుకు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనలో మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులకు హుమ్నాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బస్సు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి ఆరా తీస్తున్నారు. కాగా జహీరాబాద్‌కు 35 కిలోమీటర్లు దూరంలో జరిగిన ఈ ప్రమాద స్థలానికి జహీరాబాద్ సీఐ చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు..కాగా కావేరీ ట్రావెల్స్ బస్ నం: పీవై 01 సీకే గా గుర్తించారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. 

11:08 - September 16, 2016

హైదరాబాద్ : చెరువుతో తెలంగాణ జన జీవనానికి విడదీయలేని అనుబంధం ఉంది. ఊరికి ఆదెరువుగా ఉన్న చెరువులు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురయ్యాయి. అటువంటి చిన్న నీటి వనరులను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకమే మిషన్ కాకతీయ. రెండేళ్లుగా సాగుతున్న మిషన్ కాకతీయ పనుల తీరుతో పల్లెల్లో వచ్చిన మార్పులేంటి..? ప్రజలకు చెరువుల పునరుద్ధరణతో చేకూరిన ఫలితాలేంటి..? అనే అంశంపై 10టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ..!

జలకళతో ఉట్టిపడుతున్న చెరువులు
పల్లెల్లో నీటి వనరులను కాపాడి.. తాగు, సాగునీటి కటకటను పారద్రోలే సదుద్దేశంతో తెలంగాణ సర్కార్‌ చేపట్టిన పథకమే మిషన్‌ కాకతీయ. ఈ పథకం ఆశించిన ఫలితాలను అందిస్తుందనడానికి జలకళతో ఉట్టిపడుతున్న చెరువులే నిదర్శనం. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో మిషన్ కాకతీయలో పునరుద్ధరించిన కొన్ని చెరువులు ఇటీవల కురుస్తోన్న వర్షాలకు నిండా నీరు చేరి మత్తల్లు తొక్కుతున్నాయి.

మొదటి విడతలో 550 చెరువులను పునరుద్ధణకు లక్ష్యం
ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడతలో భాగంగా 550 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. వీటి పరిధిలో ఉన్న 68 వేల ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి విడత పనుల్లో భాగంగా 552 చెరువులను పునరుద్ధరించారు. ఈ సందర్భంలో 38 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించారు.

తూములు మత్తళ్లను మరమ్మతులు
అనేక ప్రాంతాల్లో చెరువు కట్టలను పటిష్ట పరిచి తూములు మత్తళ్లను మరమ్మతులు చేశారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో పునరుద్ధరించిన చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా డ్యాంగాపూర్‌ చెరువు పూడిక తీతతో భారీ ఎత్తున నీరు వచ్చి చేరింది.

పచ్చని పైరులతో నేలతల్లి కళకళ
తరతరాలుగా పంటసిరులను అందించిన చెరువులు.. వర్షాలు కురవక, ఒకవేళ కురిసినా ఆ వర్షపు నీటిని తమలో నిలుపుకోలేక నిరుపయోగంగా మారాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయతో అనేక వందల చెరువులు పూర్వవైభవం సంతరించుకున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా... పచ్చని పైరులతో నేలతల్లి కళకళలాడుతోంది.

ఖమ్మం జిల్లాలో మొదటి విడతగా 812 చెరువుల పునరుద్ధరణ
ఖమ్మం జిల్లాలో ఉన్న మొత్తం 4,517 చెరువులకు గానూ.. మొదటి విడతలో 812 చెరువులను పునరుద్ధరించారు. 240 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పనుల్లో భాగంగా కోటీ ఇరవై లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించారు. సత్తుపల్లి నియోజక వర్గంలోని వేంసూర్ మండల పరిధిలో మిషన్ కాకతీయ పథకాన్ని గొలుసుకట్టు చెరువులకు అనుసంధానించడంతో 52 చెరువులకు నీటి సుస్థిరత లభించింది.

సద్వినియోగం చేసుకోవటమే మిషన్ కాకతీయ లక్ష్యం : తుమ్మల
ఖమ్మం జిల్లాలో చెరువులను పునరుద్ధరించడంతో పాటు నీటి వనరులకు సుస్థిరత కలిగించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. వాగులు, వంకల వల్ల ప్రవహించే నీటిని సముద్రాల పాలు జేయకుండా.. సద్వినియోగం చేసుకోవడమే మిషన్‌ కాకతీయ లక్ష్యం అంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సంకల్పంతో చేపట్టిన మిషన్‌ కాకతీయ ఫలితాలను అన్నదాతలు ఎంతో ఆనందంతో ఆస్వాదిస్తున్నారంటున్న మంత్రి తుమ్మలపేర్కొన్నారు. ప్రభుత్వం సత్సంకల్పంతో మిషన్‌ కాకతీయ పథకాన్ని చేపట్టిందన్నారు. చెరువుల పునరుద్ధరణ రైతన్నలకు మంచి ఫలితాలను ఇస్తోందని తెలిపారు. వాగులు, వంకల ద్వారా ప్రవహించే నీటిని కాపాడుకోవడమే లక్ష్యంమనీ..వర్షపు నీటిని వృథా చేయకుండా సుస్థిర పరచుకుందామన్న మంత్రి తుమ్మల ఈ సందర్భంగా తెలిపారు.

షార్ట్ సర్క్యూట్ తోనే బస్ దగ్థం : బీదర్ఎస్పీ

హైదరాబాద్ : కర్నాటకలో బస్ దగ్ఘమైన ఘనటపై బీదర్ ఎస్పీ స్పందించారు. షార్ట్ సర్క్యూట్ తోనే బస్ దగ్థమైందని బీదర్ ఎస్పీ నికమ్ ప్రశాశ్ వెల్లడించారు. కాగా హైదరాబాద్-షిర్డీ బస్ లో మంటలు చెలరేగాయి. కర్నాటకలోని హుమ్నాబాద్ వద్ద బస్సులో మంటలు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు సజీవదహనం కాగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మరికొందరు మృతి చెందినట్లుగా సమాచారం. మృతుడు పశ్చిమగోదావరి జిల్లా తునికి చెందిన బాలుడు నిహాన్ గుర్తించారు. ప్రయాణీకుల్లో ఎక్కువమంది తెలుగువారే వున్నట్లుగా సమాచారం.

10:56 - September 16, 2016

తమిళనాడు : తమిళనాడు- కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం కొనసాగుతూనే ఉంది. కర్ణాటకలో తమిళులపై దాడులకు నిరసనగా ఇవాళ తమిళనాడు రాష్ట్రమంతటా బంద్‌ జరుగుతోంది. రైతు సంక్షేమ సంఘాల సమాఖ్య, వ్యాపార సంఘాలు సంయుక్తంగా ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు అన్ని రాజకీయ పక్షాలు, సినీ పరిశ్రమ మద్దతు తెలిపాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాల విక్రయ దుకాణాలను మూసివేయనున్నట్లు పాల సంఘాలు పేర్కొన్నాయి. అలాగే పెట్రోలు బంక్‌లను కూడా మూసివేయన్నుట్లు పెట్రో డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు మురళి పేర్కొన్నారు. దాదాపు 4,600 బంక్‌లకు మూసేయనున్నట్లు చెప్పారు. దీంతో నిన్న సాయంత్రం నుంచే పలు బంకులు కిటకిటలాడాయి. నగరంలో ఎప్పటిలాగే ఎంటీసీ బస్సులు నడుస్తాయని.. వ్యాను, ఆటోలు తిరగవని సంబంధిత సంఘాలు ప్రకటించాయి. మరోవైపు సినీ ప్రదర్శనలను కూడా ఆపివేయనున్నట్లు థియేటర్‌ యజమానులు తెలిపారు.

ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్..

ఢిల్లీ: దేశ రాజ‌ధానిలో మ‌రో దారుణం జ‌రిగింది. స్నేహితుల ముందే ఇద్ద‌రు యువ‌తుల‌పై న‌లుగురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న గురువారం రాత్రి జ‌రిగింది. ఆ ఇద్ద‌రు యువ‌తులు గురువారం రాత్రి 8.30 ప్రాంతంలో మ‌రో ఇద్ద‌రు యువ‌కుల‌తో క‌లిసి ఢిల్లీలోని ఓ మెట్రో స్టేష‌న్ ద‌గ్గ‌రికి వెళ్లిన స‌మ‌యంలో న‌లుగురు వ్య‌క్తులు వారిని వెంబ‌డించారు. ఆ ఇద్ద‌రు యువ‌కుల‌ను చిత‌క‌బాది వారి ముందే యువ‌తుల‌పై అత్యాచారం చేశారు. పోలీసుల‌కు చెబితే చంపేస్తామ‌ని బెదిరించారు. 

10:20 - September 16, 2016

కర్ణాటక : కర్ణాకటలోని హుమ్నాబాద్ లో బస్సుకు ఆందోళనాకారులు నిప్పుపెట్టారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. అలాగే ఆ బస్సులో మరికొంతమంది మృతులున్నట్లు సమాచారం. కావేరీ నదీ జలాల విషయంపై కర్ణాటక రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ ఆందోళనలు పలు విధ్వంసాలకు పాల్పడ్డారు. దీంతో కోట్లకొద్దీ ప్రభుత్వ..ప్రయివేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం షిర్డీ- హైదరాబాద్‌ బస్సుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన విహాన్ అనే యువకుడు సజీవ దహనమయ్యాడు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న మరికొంత మంది కూడా సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. కాగా... ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువగా తెలుగు వారే ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బస్సు టీఎస్ రిజిస్ట్రేషన్‌తో ఉండగా తమిళనాడు(టీఎన్) రాష్ట్రానికి చెందిన బస్సు అనుకుని ఆందోళనకారులు నిప్పుపెట్టినట్లుగా సమాచారం. ఆందోళకారులు బస్సుకు నిప్పు పెడుతున్న సమయంలో ప్రయాణీకులు బస్ నుండి దిగిపోగా బస్ లో చిక్కుపోయిన నిహాన్ అనే వ్యక్తి మాత్రం మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో పటేల్ అనే ఓ పోలీస్ అధికారి కూడా మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు. 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు నేడు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 242 పాయింట్లు లాభపడి 28,655 సూచీ వద్ద అదేవిధంగా నిఫ్టీ 69 పాయింట్లు లాభపడి 8,811సూచీ వద్ద ట్రేడ్‌లో కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 66.87గా ఉంది. టాటా మోటార్స్, యునైటెడ్ బ్రేవరీ, లీడ్, నేచురల్ గ్యాస్, పీఎన్‌బీ వంటి తదితర కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా నికెల్, జేఎస్‌డ్ల్యూ, అపోలో హాస్పటల్, జింక్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి తదితర కంపెనీల షేర్ల నష్టాల బాటలో ఉన్నాయి.

షిర్డీ బస్ లో మంటలు..ఒకరు మృతి..

హైదరాబాద్ : హైదరాబాద్-షిర్డీ బస్ లో మంటలు చెలరేగాయి. కర్నాటకలోని హుమ్నాబాద్ వద్ద బస్సులో మంటలు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు సజీవదహనం కాగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మరికొందరు మృతి చెందినట్లుగా సమాచారం. మృతుడు పశ్చిమగోదావరి జిల్లా తునికి చెందినట్లుగా గుర్తించారు. ప్రయాణీకుల్లో ఎక్కువమంది తెలుగువారే వున్నట్లుగా సమాచారం.

సౌమ్య హత్యకేసులో ఉరిశిక్ష రద్దు..

కేరళ : సౌమ్య హత్య కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న గోవిందచామి‌కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎదుర్కొంటున్న మరణశిక్షను రద్దు చేసిన న్యాయస్థానం ఆ శిక్షను ఏడేళ్లకు తగ్గించింది.

గాయత్రి కేసులో నిందితుల గుర్తింపు..

హైదరాబాద్ : ఆకతాయిల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న గాయత్రి కేసులో నిందితులను గుర్తించామని మైలార్‌దేవ్‌పల్లి ఎస్సై మహేంద్రనాథ్‌ తెలిపారు.శుక్రవారం నిందితులను అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్నారు. కాగా గాయత్రి ఆత్మహత్యకు కారకులైన వారిని ఎన్‌కౌంటర్‌ చేయాలని బీజేపీ నేత బండి ప్రతాప్‌రెడ్డి డిమాండ్‌చేశారు. గాయత్రి కుటుంబసభ్యులకు ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

నేడు తమిళనాడు బంద్..

తమిళనాడు : కావేరి జలాల విడుదలకు సంబంధించి కర్ణాటకలో తమిళులపై దాడులు చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం రాష్ట్రంలో బంద్‌ పాటించనున్నారు. రాష్ట్రంలో రైతు సంక్షేమ సంఘాల సమాఖ్య, వ్యాపార సంఘాలు సంయుక్తంగా సంకల్పించిన ఈ బంద్‌కు డీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే, వీసీకే, ఎస్‌డీపీఐ, ఐజేకే, వామపక్షాలు, కాంగ్రెస్‌, భాజపా తదితర పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. 

08:30 - September 16, 2016

హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనం కొనసాగుతుంది. నిమజ్జనానికి తరలివస్తున్న గణనాథులతో, భక్తజన సందోహంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఎంజే మార్కెట్ ప్రాంతంలో శోభాయాత్రలు ముగిశాయి. ఎంజే మార్కెట్ మీదుగా రావాల్సిన తూర్పు, పశ్చిమ, దక్షిణ మండల ప్రాంతాల అన్ని గణేశ్ విగ్రహాలు ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్నాయి. దీంతో ఎంజే మార్కెట్ మీదుగా సాధారణ వాహనాలకు పోలీసులు అనుమతిచ్చారు. ట్యాంక్‌బండ్‌పై నేటి మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది. దీంతో హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 2,500 టన్నుల చెత్తను తొలగించినట్లుగా అధికారులు తెలిపారు. కంట్రోల్ రూమ్ నుండి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో మినహా అన్ని ప్రాంతాల విగ్రహాలు హుస్సేన్ సాగర్ కు తరలిచినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ 35వేల విగ్రహాల విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లుగా అధికారులు పేర్కొన్నారు. మరో రెండు మూడు గంటలపాటు నిమజ్జన కార్యక్రమం కొనసానున్నట్లుగా సమాచారం. 

08:24 - September 16, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి అనుసరిస్తున్న స్విస్‌ చాలెంజ్‌ విధానంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగనుంది. స్విస్‌ చాలెంజ్‌పై హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం విధించిన స్టే ఉత్తర్వలను రద్దు చేయాలని ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌ని ఆశ్రయించింది. ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం... విచారణనను ఇవాళ్టికి వాయిదా వేసింది.

సీఆర్‌డీఏ నోటిఫికేషన్లపై స్టే ఇచ్చిన జస్టిస్‌ రామచంద్రరావు
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అనుసరిస్తున్న స్విస్‌ చాలెంజ్‌ విధానం అమలును నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. ఈ విధానంలో సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదనలకు పోటీ బిడ్‌లను ఆహ్వానిస్తూ సీఆర్‌డీఏ కమిషనర్‌ జారీ చేసిన నోటిఫికేషన్లలో తదుపరి చర్యలను నిలిపివేస్తూ జస్టిస్‌ రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శితోపాటు సీఆర్‌డీఏ కమిషనర్‌ ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు.
బుధవారం మధ్యాహ్నం అప్పీలు దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
బుధవారం కోర్టు ప్రారంభమైన వెంటనే ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ అప్పీలు విషయాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంఘనాథన్‌ నేతృత్వంలోని ధర్మసనం దృష్టికి తెచ్చారు. స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలు దాఖలు చేస్తున్నామని, అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు.ముందుగా అప్పీలు దాఖలు చేస్తే గురువారం విచారణ జరుపుతామని ధర్మానం సూచించింది. దీనికి అనుగుణంగా బుధవారం మధ్యాహ్నమే అప్పీలు దాఖ చేశారు. స్విస్‌ చాలెంజ్‌ విధానంపై వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఈనెల 12న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని అప్పీల్‌లో పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఆధారంగా తీసుకున్న తీర్పులు ఈ కేసుకు వర్తించవని అప్పీలు పిటిషన్‌లో ధర్మాసనం దృష్టికి తెచ్చారు. స్విస్‌ చాలెంజ్‌ విధానంలో సీఆర్‌డీఏ చట్టాన్ని అనుసరించలేదన్న పిటిషన్ల వాదన సరికాదన్నారు. చట్టంలో ఉన్న విధంగా ఏపీ మౌలికసదుపాయాల సంస్థను పట్టించుకోకుండా...మంత్రుల సాధికార కమిటీ నిబంధనలను సవరించిందన్న పిటినర్ల వాదనను పరిగణలోకి తీసుకుని ఏకసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని అప్పీల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. అన్నీ చట్ట ప్రకారమే జరుగుతున్నాయని వివరించారు. ఈ పిటిషన్‌ విచారణకు స్వీకరించిన ద్విసభ్య ధర్మాసనం, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. 

టేక్ డైవర్షన్ @పాట్నా ఎక్స్ ప్రెస్..

సికింద్రాబాద్: సికింద్రాబాద్ నుంచి ఈ నెల 17న బయలుదేరనున్న సికింద్రాబాద్-పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు రూట్ మారినట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. అలహాబాద్ వద్ద బ్రిడ్జి బ్లాక్ కావడం వల్ల రెగ్యులర్‌గా వెళ్లే రూట్‌లో కాకుండా మానిక్‌పూర్, చియోకీ జంక్షన్, బదూరి కలాన్, వారణాసి జంక్షన్‌ల మీదుగా రైలు వెళ్తుందని అధికారులు వెల్లడించారు.

నయీం కేసులో మాజీ మంత్రి?..

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసు దర్యాప్తులో వేగం పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తాజాగా ఓ మాజీ మంత్రికి నోటీసులు జారీ చేసింది. నయీంను ముందుపెట్టి కోట్లాది రూపాయలు దండుకుంటున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నగరానికి చెందిన ఆ మాజీ మంత్రి గత కొన్ని రోజులుగా అడ్రస్ లేకుండా పోయారు. దీంతో ఆయనను విచారించేందుకు నోటీస్ పంపినట్టు తెలుస్తోంది. ఆయనతోపాటు విపక్షానికి చెందిన ఓ ఎమ్మెల్యేను కూడా విచారించాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. 

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ క్యాంటిన్లు..

గుంటూరు : రాష్ట్రంలో 35చోట్ల ఎన్టీఆర్‌ క్యాంటిన్లు ఏర్పాటు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ సమీపంలోని ఎన్టీఆర్‌ క్యాంటీనను గురువారం మధ్యాహ్నం ఆమె సందర్శించారు. ఆహార పదార్ధాలు ఎలా ఉన్నాయని అక్కడ భోజనం చేస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. నూతన రాజధాని పరిధిలో మరో రెండు క్యాంటిన్లు..రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఎన్టీఆర్‌ క్యాంటిన్లను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

వెలగపూడికి ఎస్పీఎఫ్ సెక్యూరిటీ?..

గుంటూరు : వెలగపూడిలో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) భద్రత కల్పించనున్నారు. ఈమేరకు శుక్రవారం ఉదయం 11గంటలకు సచివాలయం ఆవరణలో ఓ కార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, వివిధ విభాగాల ముఖ్య అధికారులు పాల్గొననున్నారు.

టూడే గణేష్ నిమజ్జనాలు..

హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనం కొనసాగుతుంది. నిమజ్జనానికి తరలివస్తున్న గణనాథులతో, భక్తజన సందోహంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఎంజే మార్కెట్ ప్రాంతంలో శోభాయాత్రలు ముగిశాయి. ఎంజే మార్కెట్ మీదుగా రావాల్సిన తూర్పు, పశ్చిమ, దక్షిణ మండల ప్రాంతాల అన్ని గణేశ్ విగ్రహాలు ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్నాయి. దీంతో ఎంజే మార్కెట్ మీదుగా సాధారణ వాహనాలకు పోలీసులు అనుమతిచ్చారు. ట్యాంక్‌బండ్‌పై నేటి మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది. దీంతో హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

విరిగిపడిన కొండచరియలు..

విశాఖపట్టణం : విశాఖలోని కేకే లైన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. గత రెండు రోజులుగా విశాఖ ఏజెన్సీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కిరోండల్ రైల్వే లైన్‌లో కొండ చరియలు విరిగిపడడంతో శివలింగాపురం- తైడా స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. అలాగే రైల్వే లైన్లపై కొండ చరియలు విరిగిపడడంతో ఓహెచ్‌సీ లైన్లు దెబ్బతిన్నాయి.

తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం..

తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శుక్రవారం ఉదయం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. 30 మలుపు వద్ద డివైడర్ ను కారు ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన భక్తులకు గాయాలయ్యాయి. వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

బ్యాంక్ లో దొంగల బీభత్సం..

పశ్చిమగోదావరి : అత్తిలి మండలం ఉలికిలి సొసైటీ బ్యాంక్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి చోరీకి వచ్చిన దొంగలు రూ. 2 లక్షలు, రెండు కంప్యూటర్లు చోరీ చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అదేవిధంగా రికార్డులు దగ్ధం చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంక్‌ను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

గరుడవాహనంపై శ్రీవారు..

తిరుమల : ఈరోజు పౌర్ణమి సందర్భంగా శ్రీవారు గరుడవాహనంపై దర్శనమవివ్వనున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

07:42 - September 16, 2016
07:40 - September 16, 2016

సెప్టెంబర్ 21న తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టులు..నదీ జలాల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఈ భేటీలో నదీ జలాల వివాదంపై సీఎంలు చర్చంచనున్నారు. ఇటీవల కర్నాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదం తారాస్థాయికి చేరుకుంది. దీన్ని గుణపాఠంగా తీసుకుని ఇరువురు ఏకాభిప్రాయానికి వస్తే రెండు రాష్ట్రాలకూ మేలు జరుగనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాస్ట్రాల మధ్య సఖ్యత నెలకొనాలన్నా..వివాదాలు సద్దుమణగాలన్నా..కర్నాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య రగులుతున్న నీటి చిచ్చు పరరిస్థితి తెలుగు రాష్ట్రాల మధ్య రాకుండా వుండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవుసరం ఎంతైనా వుంది. ఈ భేటీతో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సాగునీటి కష్టాలు ఈ భేటీతో తీరిపోనున్నాయా? వేచి చూడాల్సిందే..ఈ క్రమంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సారంపల్లి మల్లారెడ్డి (సీపీఎం నేత, రైతుసంఘం నాయకులు), బెల్యానాయక్ (టీ.పీసీసీ అధికార ప్రతినిథి)ప్రకాశ్ రెడ్డి (బీజేపీ నేత) చందు సాంబశివరావు(టీడీపీ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తల అభిప్రాయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

ముంబై వెళ్ళనున్న గవర్నర్ నరసింహన్..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ నేడు ముంబై వెళ్లనున్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావుతో భేటీ కానున్నారు. 

ముద్రగడతో భేటీకానున్న దాసరి?..

తూర్పుగోదావరి : నేడు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో దాసరి నారాయణరావు భేటి, ఉద్యమం, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు. కాగా కాపుల రిజర్వేషన్ కోసం ఇటీవల ఉద్యమాలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

07:17 - September 16, 2016

చేనేతరంగంలో అలజడి రేగుతోంది. ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకున్న చేనేతకు కొత్త కష్టాలొస్తున్నాయి. జౌళి శాఖ నుంచి విడదీసి, చేనేతకు చేయూతనిస్తామంటూ ఉద్యమకాలంలో పదేపదే చెప్పిన టిఆర్ఎస్ ఇవాళ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. పరిశ్రమల శాఖలో విలీనం చేస్తోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేతన్నలు పోరుబాటపట్టారు.

నాడు విదేశీ వస్త్ర బహిష్కరణ..కొరవడిన జాతీయోద్యమ స్పూర్తి
జాతి ఔన్నత్యానికీ, గ్రామీణ చేతి వృత్తుల నైపుణ్యానికి చేనేత ప్రతిబింబం. బ్రిటీషోడిని తన్ని తరిమివేసిన జాతీయోద్యమ పోరాటంలో విదేశీ వస్త్ర బహిష్కరణ అత్యంత ముఖ్యమైన పోరాట రూపం. మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందిని ఉపాధి చూపించే చేనేత రంగానికి తెల్లదొరల కాలంలోనే కష్టాలు మొదలయ్యాయి. స్వాతంత్ర్యానంతరం చేనేత రంగ పరిరక్షణకు కొన్ని చట్టాలు చేసినా, అవి సమర్ధవంతంగా అమలుకాకపోవడం, జాతీయోద్యమకాలం నాటి స్పూర్తిని ఆ తర్వాతి తరం పాలకులు కొనసాగించకపోవడం చేనేత రంగాన్ని సంక్షోభంలోకి ఈడ్చుకెళ్లాయి. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా, జీవితం ఎంత నిస్సారంగా వున్నా ఇప్పటికీ చేనేత రంగాన్ని అంటిపెట్టుకుని కొన్ని లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తెలంగాణలో లక్షకు పైగా మగ్గాలున్నాయి.

గతకాలంలో వైభవంగా చేనేత వృతి..
చేనేత ఓ విశిష్ట వృత్తి. అద్భుత నైపుణ్యాల కాణాచి. హైదరాబాద్ లోని కాటేదాన్, పాతపట్నం ఒకప్పుడు చేనేత కుటుంబాలతో కళకళలాడేవి. ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనూ చేనేతన్నలు భారీ సంఖ్యలో వుండేవారు. అంతెందుకు పదేళ్ల క్రితం వరకు వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో చేనేత మగ్గాలు సందడి చేస్తుండేవి. మెదక్, కరీంనగర్ జిల్లాల్లో చేనేత కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.

అభివృద్ధి చెందిన దేశాల్లో చేనేతకు పెరుగుతున్న డిమాండ్
గ్లోబల్ వార్మింగ్ యుగంలో నిజానికి చేనేత ప్రాధాన్యత పెరుగుతోంది. అధిక ఉష్ణాల నుంచి శరీరాన్ని రక్షించేది చేనేత. ఈ వాస్తవాన్ని గుర్తించిన అభివృద్ధి చెందిన దేశాల్లో మన చేనేతకు డిమాండ్ పెరుగుతోంది. విదేశీయులు మన చేనేత వైపు క్రేజీగా చూస్తున్నారు. కాబట్టి, చేనేతను ప్రోత్సహించడం, ఆ రంగంలో వున్న సంక్షోభాన్ని పారదోలడం వల్ల కొన్ని లక్షల మంది ఉపాధిని నిలబెట్టడమే కాకుండా, భారీగా విదేశీ మారకద్రవ్యం సంపాదించే వీలుంది. కానీ, మన ప్రభుత్వాలు చేనేతను చిన్నచూపు చూస్తున్నాయి. జౌళిరంగం మీద మమకారం ప్రదర్శిస్తున్నాయి. జౌళిరంగానికి సబ్సిడీలు, ప్రోత్సహాకాలు, బ్యాంక్ ల ద్వారా పెట్టుబడులు సమకూరుస్తూ నేతన్నను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రభుత్వాల ప్రోత్సహకాలతో జౌళిరంగంలోని పరిశ్రమాధిపతులు లాభాలు జుర్రుకుంటుంటే, ప్రభుత్వాల ఆదరణ కొరవడిన చేనేత కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి.

చేనేతకు ప్రత్యేక పాలసీ ప్రకటిస్తామన్న టీఆర్ఎస్ సర్కార్
తెలంగాణ ఉద్యమకాలంలో చేనేత కార్మికుల సమస్యలు ఓ ఎజెండాగా వున్నాయి. ఆనాటి ఉద్యమపార్టీ టిఆర్ఎస్ చేనేత రంగాన్ని జౌళి శాఖ నుంచి విడిదీస్తామంటూ వాగ్ధానం చేసింది. చేనేతకు ప్రత్యేక పాలసీ ప్రకటిస్తామన్నారు. చేనేతకు ప్రత్యేక బడ్జెట్ లు ఇస్తామన్నారు. కానీ, ఇవేవీ అమలు చేయకపోగా, చేనేత అస్థిత్వానికే పెనుముప్పు తెచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నారు. జౌళి శాఖ నుంచి విడదీసి చేనేతకు చేయూతనివ్వకపోగా, పరిశ్రమల శాఖలో విలీనం చేస్తున్నారు. ఇప్పటికే బక్కచిక్కిన చేనేతను పరిశ్రమల శాఖలో విలీనం చేస్తే, ఈ మాత్రం మనుగడైనా వుంటుందా? అన్న భయమేస్తోంది.

పోరుబాట పట్టనున్న నేతన్నలు..
తెలంగాణలో చేనేతరంగం ఉవ్వెత్తున లేచినిలబడడానికి కావల్సిన పరిస్థితులన్నీ వున్నాయి. తెలంగాణలో పత్తి పంట విస్తీర్ణం ఎక్కువ. కానీ, నూలులు మిల్లులు లేవు. సహకార మిల్లులను మూతపెట్టారు. పట్టు పరిశ్రమను దెబ్బతీశారు. దీంతో నూలు, పట్టును ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో దళారీలు రెచ్చిపోతున్నారు. పట్టు, నూలు ధరలు అడ్డగోలుగా పెంచేస్తున్నారు. వీటిని నియంత్రించాలన్న సోయి ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చేనేతకు చేటు తెచ్చే నిర్ణయాలు మానుకోవాలి. పిడికెడు మంది పరిశ్రమాధిపతుల కోసం కాకుండా, లక్షలాది చేనేత కార్మికుల జీవితాలను యాదిలో వుంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటికే తెలంగాణ నుంచి 50 వేల మంది చేనేతకారులు ఇతర రాష్ట్రాలకు వలసపోయారు. అక్కడ పవర్ లూమ్స్ లో అతి తక్కువ వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తున్నారు. వాళ్లని తిరిగిరప్పించాలంటే, ఇక్కడ చేనేతను నిలబెట్టాలి. ప్రోత్సహించాలి. పరిశ్రమల శాఖలో విలీనం చేస్తే చేనేతను రక్షించుకోవడం సాధ్యమవుతుందా? జిల్లాల ఏర్పాటు కారణంగా పెరగబోయే ఆర్ధికభారాన్ని తగ్గించుకోవడం కోసం తమను బలిపీఠం ఎక్కిస్తున్నారన్న ఆవేదన ఇప్పటికే చేనేతరంగంలో ఏర్పడింది. కొత్త ఉత్సాహం నింపాల్సిన తరుణంలో నిరాశ నిస్పృహలు పెంచే నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. 

07:06 - September 16, 2016

చేనేతరంగానికి కొత్త కష్టం వస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో వివిధ శాఖలను విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం చేనేతరంగానికి ఆశనిపాతంలా మారుతోంది. చేనేతను పరిశ్రమల శాఖలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేనేత అఖిలపక్ష ఐక్య వేదిక ఆందోళనలకు సిద్ధమవుతోంది. ఈ నెల 21న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. చేనేత రంగాన్ని పరిశ్రమల శాఖలో విలీనం చేయడాన్ని చేనేత కార్మికులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీనివల్ల చేనేత రంగానికి జరిగే కీడు ఏమిటి? తెలంగాణలో చేనేత రంగం బతికి బట్టకట్టాలంటే వాస్తవంగా చేయాల్సిందేమిటి? చేనేతరంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు చేనేత అఖిలపక్ష ఐక్య వేదిక కన్వీనర్ కూరపాటి రమేష్ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

07:00 - September 16, 2016

ముంబై : గణేష్‌ నిమజ్జనోత్సవం ఘనంగా ముగిసింది. గణేష్‌ నిమజ్జన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచే గణేష్‌ విగ్రహాల ఊరేగింపు మొదలైంది. భజనలు ఆట పాటలతో ముంబై కోలాహలంగా మారింది. నిమజ్జనానికి ముందు ముంబైలోని ప్రఖ్యాత లాల్‌బాగ్‌ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు హాజరయ్యారు. 'గణపతి బప్పా మోరియా...అగ్‌లే బరస్‌ లౌకర్‌ యా' అంటూ నినాదాలు చేశారు. గణేష్‌ నిమజ్జనాన్ని పురస్కరించుకుని 40 వేల మంది పోలీసులు, సిసిటివి కెమెరాలతో ముంబైలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 80 ప్రాంతాల్లో గణేష్‌ నిమజ్జనం జరగనుంది.

06:58 - September 16, 2016

హైదరాబాద్ : కోలాటాలు, డప్పు చప్పుళ్లు, తీన్మార్ స్టెప్పులు, కేరింతలతో గణేష్‌ నిమజ్జనోత్సవం అంబరాన్నంటింది. తెలంగాణ జిల్లాల్లో వినాయక నిమజ్జన వేడుకలు అంత్యంత ఘనంగా జరిగాయి. గణనాథుల శోభాయాత్రలను వైభవంగా నిర్వహించారు. ఆద్యంతం అత్యంత కోలాహలంగా సాగిన నిమజ్జనోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

ఎక్కడ చూసినా సందడి వాతావరణం..
తెలంగాణ జిల్లాల్లో గణేశ్‌ నిమజ్జనోత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. గణేశ్‌ నవరాత్రుల్లో పూజలందుకున్న గణనాథులను ఆయా జిల్లాల్లోని చెరువులు, బావులు, కాల్వల్లో నిమజ్జనం చేశారు. లంబోదరుడి శోభాయాత్రలు నేత్రపర్వంగా సాగాయి. ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపించింది.

నిజామాబాద్‌ ..
నిజామాబాద్‌ జిల్లాలో గణపతి నిమజ్జనోత్సవం సంప్రదాయ బద్ధంగా సాగింది. జిల్లా కేంద్రం నిజామాబాద్‌లో జరిగిన యాత్రలో రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌, అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, మేయర్‌ సుజాత, జిల్లా పోలీసు సూపరింటెండెండ్‌ విశ్వప్రసాద్‌, జిల్లా కలెక్టర్‌ యోగితారాణ పాల్గొన్నారు. అనాధికాలంగా వస్తున్న ఆచార, సంప్రదాయాలు, ఆనవాయితీ ప్రకారం గణేశ్‌ రథానికి ఎడ్లబళ్లను కట్టి శోభాయాత్ర ప్రారంభించారు. నగరంలోని ప్రధాన మార్గాల్లో సాగిన శోభాయాత్ర భక్తులను రంజింపచేసింది. ఆ తర్వాత వినాయక్‌నగర్‌ గణేశ్‌ బావిలో ప్రతిమలను నిమజ్జనం చేశారు.

ఖమ్మం ..
ఖమ్మంలో బొజ్జ గణపయ్య నిమజ్జనవేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నగరంలోని గాంధీచౌక్‌లో ప్రారంభమైన గణేశ్‌ శోభాయాత్రలో జిల్లా కలెక్టర్‌ లోకేశ్‌ కుమార్‌, ఎస్‌పీ షానవాజ్‌ ఖాసీం, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌ ..
ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాన్ని అంత్యంత భక్తిశ్రద్ధలతో సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శోభాయాత్రను ప్రారంభించారు. గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు మండపాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు స్థానికులను అలరించాయి. జిల్లా కేంద్రంలో జరిగిన గణేశ్ నిమజ్జనోత్సవంలో అటవీశాఖ మంత్రి జోగురామన్న, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వరంగల్‌ ..
వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లో జరిగిన సామూహిక గణేశ్‌ నిమజ్జనోత్సవం ఆద్యంతం అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సాహభరితంగా సాగింది. యువతీ యువకుల నృత్యాలు, తీన్‌మార్‌ డాన్స్‌తో గణనాథులను తరలించి మున్నేరులో నిమజ్జనం చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, మున్సిల్‌ చైర్‌పర్సన్‌ ఉమ, డీఎస్పీ రాజమహేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కరీంనగర్‌ ..
కరీంనగర్‌ జిల్లాలో గణేశ్‌ నిమజ్జనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్‌తోపాటు రామగుండం, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లో జరిగిన గణనాథులు శోభయాత్రల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రం కరీనంగర్‌లోని మానకొండూరు చెరువుతోపాటు మరో మూడు ట్యాంకుల్లో నిమజ్జనం చేశారు.

ఆదిలాబాద్‌..
గణేశ్‌ నిమజ్జనోత్సవాల సందర్భంగా అన్ని చోట్ల భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా భైంసాలో గతంలో గణేశ్‌ నిమజ్జనోత్సవాల సందర్భంగా రెండువర్గాల మధ్య జరిగిన ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని ఈసారి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మొత్తంమీద తెలంగాణ జిల్లాల్లో గణేశ్‌ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

06:51 - September 16, 2016

హైదరాబాద్ : వినాయక నిమజ్జనం అనగానే ముందుగా గుర్తొచ్చేది బాలాపూర్‌ లడ్డు. ఈ లడ్డూ కోసం కైవసం చేసుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే బాలాపూర్‌ లడ్డూకు ఏటేటా విపరీతమైన పోటీ పెరుగుతూ వస్తోంది. అందుకే ఈ ఏడాది లడ్డూ రికార్డ్ ధర పలికింది. వేలంపాటలో కీసరకు చెందిన స్కైలాబ్‌రెడ్డి 14.65 లక్షలకు సొంతం చేసుకున్నారు.

14.65 లక్షలకు లడ్డూను దక్కించుకున్న స్కైలాబ్ రెడ్డి
వినాయకుడి పండుగొచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది బాలాపూర్‌ లడ్డూ. ఈ లడ్డూను సొంతం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. అంతటి ప్రఖ్యాతి గాంచిన బాలాపూర్ లడ్డూకు ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. హోరాహోరీగా సాగిన వేలంపాటలో 14.65 లక్షల రూపాయలకు స్కైలాబ్‌రెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్‌ లడ్డూ 10.32 లక్షల రూపాయలు పలికేతే ఈసారి మరో 4.33 లక్షలు రూపాయలు అధికంగా పలికింది.

ఉత్కంఠంగా సాగిన వేలంపాట
వేలం మన్యం బలవంత్‌రెడ్డి, స్కైలాబ్‌రెడ్డి మధ్య ఉత్కంఠంగా సాగింది. చివరకు స్కైలాబ్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ లడ్డూను దక్కించుకోవడం తన కలని స్కైలాబ్‌రెడ్డి అన్నారు. గత రెండేళ్లుగా బాలాపూర్ లడ్డూను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. లడ్డూ గెలుచుకున్నవారికి అన్ని రకాల మంచి జరుగుతోందన్న విశ్వసాన్ని భక్తులు వ్యక్తం చేస్తున్నారు. లడ్డూను సొంతం చేసుకున్న స్కైలాబ్‌రెడ్డిని ఉత్సవ సమితి సభ్యులు సన్మానించి బాలాపూర్ లడ్డూను అందజేశారు. అనంతరం సమితి అధ్యక్షుడికి స్కైలాబ్‌రెడ్డి నగదును అందజేశారు.

ట్రాక్ పునరుద్ధరణ..

హైదరాబాద్: భారీ వర్షాలతో వికారాబాద్-సదాశివపేట మధ్య రైల్వే ట్రాక్ ట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ మార్గాన్ని రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు. భారీ వర్షంతో వికారాబాద్-పర్లీ మార్గంలో సదాశివపేట-వికారాబాద్ మధ్య ట్రాక్ దెబ్బతిన్నది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేసిన అధికారులు... ముద్ఖేడ్-నిజామాబాద్ మార్గంలోకి మళ్లించారు. షిర్డీ-విజయవాడ, పుణె-హైదరాబాద్, ఔరంగాబాద్-హైదరాబాద్ రైళ్లను మళ్లించారు. రంగంలోకి దిగిన అధికారులు... ట్రాక్‌కు మరమ్మతులు చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.

నిమజ్జనంలో అపశృతి..

నిజామాబాద్‌: నిజామాబాద్‌లో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుది. ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో విద్యుత్తు తీగలు తగిలి ఓ యువకుడు మృతిచెందాడు. గణేశ్‌ విగ్రహం తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బంధువులు ఆందోళనకు దిగారు.

పిడుగుపాటుకు 3గురు మృతి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లో ముగ్గురు గురువారం పిడుగుపాటుతో ముగ్గురు మృతిచెందారు. ఆదిలాబాద్ జిల్లా తానూర్ మండలం ఉమ్రి(కే) కు చెందిన స్వర్ణమాల(28) పొలంలో పనిచేస్తుండగా కుభీర్ మండలం సొనారికి చెందిన ఒడ్డొటి (55) పశువులను మేపేందుకు వెళ్లగా, కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండంలోని మొలంగూర్‌లో పిడుగుపడి మేడిచెలిమల రాజయ్య(35)అనే వ్యక్తి మృతిచెందాడు.

Don't Miss