Activities calendar

17 September 2016

22:20 - September 17, 2016

హైదరాబాద్ : అశేష జనవాహిని మధ్య దళిత హక్కుల ఉద్యమనేత బొజ్జా తారకం అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానం స్మశానవాటికలో.. అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు, ప్రజా, పౌర హక్కుల సంఘల నేతలు, సాహితీ ప్రియులు ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. 
ముగిసిన బొజ్జా తారకం ప్రస్థానం 
దళిత ఉద్యమనేత బొజ్జా తారకం ప్రస్థానం ముగిసింది. నిండైన విగ్రహం చెదిరిపోయింది. అణగారిన, పీడిత వర్గాల గొంతుక శ్వాశ్వతంగా మూగబోయింది. కళ్లు చెమర్చాయి పీడిత ప్రజల గొంతుక తరలివెళ్తుంటే.. వేవేల గుండెలు వర్షించాయి. అంతులేని అభిమానం పొంగి పొర్లింది. దళిత ఉద్యమ నేత బొజ్జా తారకంను కడసారి చూసేందుకు జనం పొటెత్తారు. బొజ్జా అంతిమయాత్ర అశేషజన వాహిని మధ్య సాగింది. బరువెక్కిన హృదయాలతో సాహితి ప్రియులు, పౌర, ప్రజా సంఘాల నేతలు, అభిమానులు ఆయనను స్మరించుకుంటూ బొజ్జా పార్థివ దేహం వెంట నడిచారు. కవిగా, రచయితగా, న్యాయవాదిగా బహుముఖ సేవలందించిన బొజ్జా తారకం అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని కేసీఆర్‌ తన సందేశంలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బొజ్జ తారకం పార్థివదేహానికి ప్రముఖులు నివాళులు 
అంతకుముందు బొజ్జా తారకం పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉంచారు. ఆయన పార్థివదేహానికి ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ర్ట మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, కడియం శ్రీహరి, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, హరీష్‌రావు, తలసాని, మోత్కుపల్లి, మధుయాష్కి, వైఎస్‌ జగన్‌ తదితరులు నివాళులర్పించారు. 
బొజ్జా తారకం పార్థివదేహానికి సీపీఎం నేతలు నివాళులు
బొజ్జా తారకం పార్థివదేహాన్ని సీపీఎం నేతలు డిజి నర్సింగరావు, నంద్యాల నర్సింహ్మారెడ్డి, బి.వెంకట్‌, జ్యోతి, మల్లు స్వరాజ్యం, సందర్శించి నివాళులర్పించారు. ఆయన మృతి వామపక్ష, దళిత ఉద్యమానికి తీరని లోటు అన్నారు. కోదండరాం, గద్దర్‌, జస్టిస్‌ చంద్రకుమార్, విమలక్క, కత్తి పద్మారావు, మంద కృష్ణమాదిగ, జూపూడి ప్రభాకరరావు, గొరంటి వెంకన్న, నారాయణమూర్తి, ఆర్‌. కృష్ణయ్య, పుల్లెల గోపిచంద్‌తో సహా పలువురు బొజ్జా తారకం పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన పోరాటాలను, విజయాలను గుర్తు చేసుకున్నారు. తన విశిష్ట ఉద్యమ పంథాతో ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న బొజ్జా తారకం ఇక సెలవంటూ శాశ్వతంగా వెళ్లిపోయారు. 

 

22:03 - September 17, 2016

వరంగల్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ధర్మసాగర్‌ రిజర్వాయర్‌లో సరదాగా ఈతకు వెళ్లిన ఐదుగురు బీటెక్‌ విద్యార్థులు నీట మునిగి చనిపోయారు. వరంగల్‌ వాగ్దేవి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన వీరు ‌ సీఎస్‌ఈ థర్డ్‌ఇయర్‌ చదువుతున్నారు. ఐదుగురు విద్యార్థులు మృతి చెందడంతో సర్వత్రా విషాదం అలుముకుంది.
రిజర్వాయర్‌లో పడి ఐదుగురు విద్యార్థులు మృతి 
విహారయాత్ర విషాద యాత్రగా ముగిసింది. నాలుగు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. రిజర్వాయర్‌లో పడి ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్ రిజర్వాయర్ సందర్శనకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడిపోయారు. అయితే వీరిలో ఒక్కరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. 
వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు
విద్యార్థులంతా వరంగల్‌లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలకు చెందినవారు. సీఎస్‌ఈ థర్డియర్ చదువుతున్న వీరు.. ధర్మసాగర్ రిజర్వాయర్ సందర్శనకు వచ్చారు. ప్రమాదవశాత్తూ రమ్య అనే అమ్మాయి నీళ్లలోకి జారి పోతుండగా ఆమెను కాపాడే ప్రయత్నంలో మిగతా విద్యార్ధులు రిజర్వాయర్‌లో పడి గల్లంతయ్యారు. వీరిని స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. మృతిచెందిన విద్యార్థులు పత్తి శ్రావ్యారెడ్డి, పొల్లినేని వినూత్న, పొల్లినేని శివసాయికృష్ణ, కర్నె శివసాయి, శ్రీనిధిలుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పిల్లల మృతదేహాలు చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. 
సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ప్రమాదం...? 
శివసాయి కృష్ణ, వినూత్న అక్కా తమ్ముళ్లు. శివసాయి కృష్ణ ఇంటర్ చదువుతున్నాడు. అక్కతో పాటు విషార యాత్రకు వెళ్లాడు. చెరువు దగ్గర సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు రిజర్వాయర్‌ పరిసరాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

22:00 - September 17, 2016

ఢిల్లీ : సెప్టెంబర్‌ 17 ను విమోచనం, విజయోత్సవం అనడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సెప్టెంబర్‌ 17న భారతదేశంలో తెలంగాణ విలీనం జరిగింది కాబట్టి విలీనదినోత్సవంగా చెప్పడం సరైనదని అన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో భాగంగా ఢిల్లీ వెళ్లిన తమ్మినేని.. తెలంగాణలో అమలు చేసిన కార్యాకలాపాలను కేంద్రకమిటీలో వివరిస్తామన్నారు. 

 

21:46 - September 17, 2016

కరీంనగర్ : తెలంగాణ విలీన వేడుకలను కరీంనగర్ జిల్లాలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యవసాయ కార్మికుల వెట్టి చాకీరీలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని ప్రభుత్వం విస్మరించడం సరికాదని పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఇది మత, కులపరమైనది కాదని ప్రజాస్వామిక హక్కుల కోసం జరిగిన పోరాటమని గుర్తుచేశారు. 

 

21:44 - September 17, 2016

హైదరాబాద్ : హడావుడిగా కొత్త జిల్లాల ప్రతిపాదనలు జరిపారని టీజాక్ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. టీజాక్ కార్యాలయంలో విలీన దినోత్సవానికి ఆయన హాజరై, ప్రసంగించారు.1974 చట్టం ప్రకారం జిల్లాల విభజన అసమగ్రంగా ఉందన్నారు. చట్టంలో మార్పులు తెచ్చి జిల్లాల్ని విభజిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్‌ 17న విలీనదినంగా పాటిస్తున్నామని చెప్పారు. రైతాంగ ఉద్యమంలో 4వేలమందిని చంపేశారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సెప్టెంబర్‌ 17 మరుగున పడిపోయిందని... తెలంగాణ వచ్చాక వెలుగులోకి వచ్చిందన్నారు. విలీన దినోత్సవాన్ని ప్రభుత్వం తరపున నిర్వహిస్తే బావుంటుందన్నారు. 

 

21:39 - September 17, 2016

నల్లగొండ : జిల్లాలోని మూసీ నది పరివాహక ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ జలాశయంలో భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 644.7 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నాలుగువేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో నాలుగువేల క్యూసెక్కులుగా ఉంది. 

 

తిరుపతి విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం

చిత్తూరు : తిరుపతి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. స్పైట్ జెన్ విమానం రన్ వే దాటి మట్టిలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. విమానంలో ఆన రామనారాయణరెడ్డితోపాటు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్ జెట్ విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చింది.

 

21:02 - September 17, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. కన్వీనర్‌ కోటాలో ఎంబిబిఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ఎంసెట్‌-3లో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు  సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్, వరంగల్‌తో పాటు నాన్ లోకల్ విద్యార్థులకు విజయవాడలో సెంటర్ ఏర్పాటు చేశారు. 
కన్వీనర్ కోటాలో ఎంబిబిఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ
తెలంగాణలో కన్వీనర్ కోటాలో ఎంబిబిఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమయ్యింది. మెడికల్ కౌన్సెలింగ్‌లో మొదటి విడత వెరిఫికేషన్ ప్రక్రియను కాళోజి హెల్త్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి 23వ తేదీ వరకు జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 సెంటర్లలో కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు. నాన్‌లోకల్ విద్యార్ధుల కోసం ఏపిలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో కూడా ఒక సెంటర్‌ని ఏర్పాటు చేసారు. విద్యార్ధులు ఎక్కడికక్కడ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని..తక్కువ సమయం ఉండటంతో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 
ర్యాంకుల్లో భారీ తేడా : తల్లిదండ్రులు 
ఎంసెట్ 2 పేపర్ లీకేజి తరువాత ఎంసెట్‌ 3ని నిర్వహించడం వల్ల ర్యాంకుల్లో భారీ తేడా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు. విద్యార్ధుల మానసిక ఒత్తిళ్లకు కేవలం అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు తల్లిదండ్రులు. విద్యార్ధులను పరీక్ష పేరుతో 4నెలల పాటు నిద్రాహారాలకు దూరం చేశారని విమర్శిస్తున్నారు. చివరికి ఎంసెట్-3లో కూడా 11ప్రశ్నలు తప్పులు ఇచ్చారని..దాంట్లో చివరికి 8మార్కులు కలిపారని మండిపడుతున్నారు. ఇంత జరిగినా అధికారుల్లో మార్పు రాకపోవడం శోచనీయమని వారు అభిప్రాయపడ్డారు. 
ఇటువంటి పునరావృత్తం కాకుండా జాగ్రత్త వహించాలి : తల్లిదండ్రులు 
అయితే భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు సూచించారు. అధికారుల అలసత్వం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చివరికి ఇబ్బందులు పడింది మాత్రం తమ పిల్లలేనంటూ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేసారు. మరోవైపు రెండో విడత కౌన్సిలింగ్‌ను ఈనెల 24,25,26 తేదీల్లో నిర్వహించి..సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈనెలాఖరువరకు కౌన్సిలింగ్‌ ప్రక్రియను ముగించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత అక్టోబర్‌ మొదటి వారం నుంచి క్లాసులు నిర్వహించాలన్న ఆలోచనతో అధికారులు కసరత్తు చేస్తున్నారు.  

 

20:53 - September 17, 2016

సాహిత్యాన్ని,  సంఘసంస్కరణను కలగలిపి  పోరాటం సాగించిన ధీరుడు.. దళిత జాతి అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితమిచ్చిన కవి...  ఆయనే తొలి దళిత వైతాళికుడు కుసుమ ధర్మన్న.  ఆయన నడకతో గోదావరీ తీరం పునీతమయింది. సుదీర్ఘకాలం అందుబాటులో లేని ఆయన సాహిత్యం ఇప్పుడు ప్రజల ముందుకొస్తోంది. ప్రజాశక్తి ప్రచురించిన ఆయన రచనలు రాజమండ్రిలో విడుదలవుతున్న సందర్భంగా టెన్ టీవీ స్పెషల్ ఫోకస్.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.....

జగన్‌కు సమన్లు జారీ చేసిన ఈడీ కోర్టు

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. 

 

20:48 - September 17, 2016

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. రాంకీ పెట్టుబడులపై ఈడీ అభియోగపత్రం దాఖలు చేయగా.. కోర్టు విచారణకు స్వీకరించింది. జగన్‌తోపాటు విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డికి కోర్టు సమన్లు జారీ అయ్యాయి. రాంకీ పెట్టుబడులు మనీల్యాండరింగ్‌ చట్టానికి విరుద్ధమని అభియోగపత్రంలో ఈడీ పేర్కొంది. 

 

20:46 - September 17, 2016

డైరెక్టర్ ఆర్ పి పట్నాయక్ తో టెన్ టివి స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. 'మనలో ఒక్కడు' వివరాలను వివరించారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:32 - September 17, 2016

హైదరాబాద్ : దళితులు, బలహీనవర్గాల సమస్యలు ఎక్కడున్నా తనదైన శైలిలో వారికి అండగా నిలిచేవారు బొజ్జా తారకం. కారంచేడు, చుండూరు, నీరుకొండ, లక్ష్మింపేటతో పాటు పలుచోట్ల దళితులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా పోరాడారు. మానవ హక్కుల కోసం తుదిశ్వాస విడిచే వరకూ ఉద్యమించారు. దళిత హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన పౌరహక్కుల నేత, హేతువాది బొజ్జా తారకం. 
1939 జూన్‌ 27న జన్మించిన బొజ్జా తారకం
దళిత హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్పవ్యక్తి బొజ్జా తారకం. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్పలో బొజ్జా తారకం 1939 జూన్‌ 27న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మావూళ్లమ్మ, అప్పలస్వామి, తండ్రి ఉపాధ్యాయుడు. 1952 నుంచి 62 వరకు అమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. తాత గోవింద దాసు ఆధ్యాత్మిక ప్రసంగాల్లో దిట్ట. కాకినాడ పిఠాపురం రాజా కళాశాలలో బీఏ పట్టా పొందిన తారకం.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఎల్‌ డిగ్రీ పొందారు. తిరిగి 1966లో కాకినాడలో వెళ్లి.. అక్కడే ప్రాక్టీసు ప్రారంభించారు. ప్రముఖ కవి బోయి భీమన్న కుమార్తె విజయభారతిని 1968లో వివాహమాడారు. ఆమె అప్పట్లో నిజామాబాద్‌లో ఉద్యోగం చేయడంతో ఆయన కూడా అక్కడే లాయర్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. 
ఎమర్జెన్సీ కాలంలో జైలుకెళ్లిన బొజ్జా
బొజ్జాతారకంకు  ఒక కుమారుడు, ఒక కుమార్తె. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుత హైదరాబాద్‌ కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ఆయన కుమారుడే. 1975లో ఎమర్జెన్సీ కాలంలో జైలుకెళ్లారు. ఏడాది పాటు చంచల్‌గూడ జైలులో ఉన్నారు. 1979 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. అనేక కీలక కేసులు వాదించారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ప్రకాశం జిల్లా కారంచేడులో దళితులపై దాడి ఘటనకు నిరసనగా.. న్యాయవాద వృత్తిని వదిలేసి దళత నేత కత్తి పద్మారావుతో కలిసి దీక్షలో కూర్చున్నారు. నీరుకొండ, చుండూరుల్లో దళితులపై దాడులు జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అనంతరం దళిత మహాసభ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. పోలీసుల ఎన్‌కౌంటర్లపై కేసులు నమోదు చేసి సుప్రీంకోర్టులో పోరాడి విజయం సాధించారు బొజ్జా తారకం. 
దళిత, పౌర హక్కుల ఉద్యమంలో బొజ్జా తారకం క్రియాశీలక పాత్ర
దళిత, పౌర హక్కుల ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన బొజ్జా తారకం.. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ప్రఖ్యాతి గడించారు. 'పోలీసులు అరెస్ట్‌ చేస్తే?'.. 'కులం-వర్గం', 'నది పుట్టిన గొంతుక', 'నేల నాగలి-మూడెద్దులు', 'దళితులు-రాజ్యం', 'పంచతంత్రం', నాలాగే గోదావరి, నది పుట్టిన గొంతుక ఇలా పలు  పుస్తకాలను రచించారు. ఆయన మృతి కుటుంబ సభ్యులకే కాకుండా.. బలహీనవర్గాలకు, సాహితీ ప్రియులకు, హక్కుల కోసం పోరాడేవారికి తీరని లోటే. 
బయ్యారం గనుల వ్యవహారంపై పోరాటం
పేదల అభ్యున్నతి కోసం తపించిన తారకం సామాజిక, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారు. రైతుల భూములను లాక్కుని సెజ్‌లకు కట్టబెట్టడం, బయ్యారం గనుల వ్యవహారంలో ఉమ్మడి ప్రభుత్వంలో జరిగిన దోపిడీపై పోరాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన అవిశ్రాంతంగా శ్రమించారు. దళిత, వామపక్ష, పౌరహక్కుల ఉద్యమాల్లో క్రియాశీలంగా ఉన్న ఆయన.. దళిత మహాసభ ఏర్పాటులో ప్రముఖపాత్ర పోషించారు. 

 

20:26 - September 17, 2016

ఢిల్లీ : ప్యాకేజీ.. స్టేటస్‌ పేరుతో.. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు నాటకాలాడాయని.. వాటి బండారం బయటపడిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం జనం ఆందోళనలు చేస్తున్నారని.. ఈ ఆందోళనలు మరింత ఉధృతమవుతాయని రాఘవులు అన్నారు. 

 

విదేశాల్లో ఉద్యోగుల పేరిట మహిళలకు వల

చిత్తూరు : జిల్లాను మహిళల అక్రమ రవాణా వ్యవహారం కుదిపేస్తోంది. విదేశాల్లో ఉద్యోగుల పేరిట మహిళలకు వలవేసి రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షలకు విదేశాల్లో  అమ్మేస్తున్నారు. మలేషియా కేంద్రంగా వ్యాపారం గుట్టుగా సాగుతోంది. పోలీసుల అదుపులో వ్యభిచారగృహ నిర్వాహకులు, బ్రోకర్లు, కీలక దళారులు పాండ్యరాజన్‌, రఫీ ఉన్నారు. 6నెలలలో సుమారు 300మంది మహిళలను విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు.  తమను హింసిస్తున్నారని బాధితులు గోడు వెల్లబోసుకుంటున్నారు.  విదేశాల్లో చిక్కుకున్న మహిళలను సొంతగ్రామాలకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

20:22 - September 17, 2016

చిత్తూరు : జిల్లాను మహిళల అక్రమ రవాణా వ్యవహారం కుదిపేస్తోంది. విదేశాల్లో ఉద్యోగుల పేరిట మహిళలకు వలవేసి రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షలకు విదేశాల్లో  అమ్మేస్తున్నారు. మలేషియా కేంద్రంగా వ్యాపారం గుట్టుగా సాగుతోంది. పోలీసుల అదుపులో వ్యభిచారగృహ నిర్వాహకులు, బ్రోకర్లు, కీలక దళారులు పాండ్యరాజన్‌, రఫీ ఉన్నారు. 6నెలలలో సుమారు 300మంది మహిళలను విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు.  తమను హింసిస్తున్నారని బాధితులు గోడు వెల్లబోసుకుంటున్నారు.  విదేశాల్లో చిక్కుకున్న మహిళలను సొంతగ్రామాలకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

తాడికొండ ఎస్సై కృష్ణయ్యపై కేసు నమోదు

గుంటూరు : జిల్లాలోని తాడికొండ ఎస్సై కృష్ణయ్యపై మోసం కేసు నమోదైంది. పెళ్లి పేరుతో కృష్ణయ్య తనను మోసం చేశాడని సుభాషిణి అనే మహిళ అరండాల్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తన భర్తతో విడాకులు ఇప్పించి...ఇప్పుడు మొహం చాటేశాడని బాధితురాలి ఆరోపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

20:19 - September 17, 2016

గుంటూరు : జిల్లాలోని తాడికొండ ఎస్సై కృష్ణయ్యపై మోసం కేసు నమోదైంది. పెళ్లి పేరుతో కృష్ణయ్య తనను మోసం చేశాడని సుభాషిణి అనే మహిళ అరండాల్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తన భర్తతో విడాకులు ఇప్పించి...ఇప్పుడు మొహం చాటేశాడని బాధితురాలి ఆరోపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

20:12 - September 17, 2016
20:10 - September 17, 2016

హుస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లోకి పెరుగుతున్న వరదనీరు

హైదరాబాద్ : జంట జలాశయాలు హుస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లోకి వరదనీరు పెరుగుతోంది. హిమాయత్ సాగర్ లోకి వరదనీరు పెరుగుతోంది. హుస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1767 అడుగులుగా ఉంది. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 1732 అడుగులుగా ఉంది. 

 

వేములవాడ మరో రెండు మార్కెట్ కమిటీ చైర్మన్ ల ప్రకటన

కరీంనగర్ : మరో రెండు మార్కెట్ కమిటీ చైర్మన్ ల ప్రకటించారు. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా శ్రీలత 
మహేష్, మేడిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముక్కెల గంగాధర్ ఎన్నికయ్యారు.

 

సాగునీటి సమస్యపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : సాగునీటి సమస్యపై సీఎం కేసీఆర్ సమీక్ష చేశారు. మంత్రి హరీష్ రావు, ఇరిగేషన్ అధికారులు, అపెక్స్ కమిటీ సమావేశం ఎజెండాపై చర్చ చేపట్టారు. 

 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

అనంతపురం : గోరంట్ల మండలం బుదిలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారు. 

 

హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు

హైదరాబాద్ : భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఒక గేటు తెరచి అధికారులు నీటిని దిగువకు వదిలారు. 

18:40 - September 17, 2016

ఢిల్లీ : ప్రారంభ సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ కు దక్షిణ భారత సినీరంగ జట్లు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12 వరకూ జరిగే ఈ పోటీల్లో మొత్తం 48 మంది ప్లేయర్లు ఢీ కొనబోతున్నారు. హైదరాబాద్ అంచె పోటీలు మాత్రం అక్టోబర్ 22న గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతాయి.
సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ హంగామా వివరాలు ఓసారి చూద్దాం....
వ్యాపారంగా మారిన క్రీడలు  
క్రీడలు వినోదంగా మాత్రమే కాదు..లాభసాటి వ్యాపారంగా కూడా మారిపోయాయి. వివిధ లీగ్ ల పేరుతో భారత క్రికెట్ బోర్డు, బ్యాడ్మింటన్, కుస్తీ, హాకీ, వాలీబాలీ, టెన్నిస్ సమాఖ్యలు ఓ వైపు వ్యాపారం చేస్తుంటే...మరోవైపు..దేశంలోని సినీస్టార్లు సైతం తమ గ్లామర్ ను ఆటలకు జోడించి లీగ్ ల పేరుతో వ్యాపారం మొదలు పెట్టారు.
బ్యాడ్మింటన్ వైపుకు చూపు 
సెలబ్రిటీ సినిమా లీగ్ పేరుతో ఇప్పటికే గత మూడుసీజన్లుగా టీ 20 క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న దక్షిణ భారత సినిమా రంగం చూపు ఇప్పుడు..బ్యాడ్మింటన్ వైపుకు మళ్లింది. దక్షిణ భారత సినీరంగానికి చెందిన తెలుగు, తమిళ, కన్నడ, మళయాళీ సినీ కమ్ బ్యాడ్మింటన్ స్టార్లతో ఓ లీగ్ నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12 వరకూ జరిగే ఈ లీగ్ లో టోలీవుడ్ థండర్స్, చెన్నై రాకర్స్, కేరళ రాయల్స్, కర్ణాటక ఆల్ఫ్స్ జట్లు ఢీ కొనబోతున్నాయి.
టోలీవుడ్ థండర్స్ కు సుధీర్ బాబు నాయకత్వం 
టోలీవుడ్ థండర్స్ కు సుధీర్ బాబు నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులోని ఇతర సభ్యుల్లో తరుణ్ , నిఖిల్ సిద్ధార్ధ, కుశాల్ మందా, నవీన్, సత్య, అనీల్, కృష్ణ చైతన్య ఉన్నారు. మహిళల జట్టులో సీరత్ కపూర్, సంజన, తేజస్విని, అపూర్వ శ్రీనివాసన్ సభ్యులుగా ఉంటారు. టోలీవుడ్ థండర్స్ జట్టుకు టీమ్ మోటివేటర్ గా మంచులక్ష్మి, బ్రాండ్ అంబాసిడర్ గా నాగచైతన్య వ్యవహరిస్తారు. హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో టోలీవుడ్ థండర్స్ టీమ్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. చార్మీ, సంజన, మంచు లక్ష్మి, తరుణ్, నాగచైతన్య,  సుధీర్ బాబు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేరళ రాయల్స్ జట్టుకు జయరామ్ నాయకత్వం
కేరళ రాయల్స్ జట్టుకు జయరామ్, చెన్నై రాకర్స్ జట్టుకు ఆర్య, కర్ణాటక ఆల్ఫ్స్ జట్టుకు దిగ్ నాథ్ నాయకత్వం వహిస్తున్నారు. ఒక్కోజట్టులో 12 మంది సభ్యుల చొప్పున ఉంటారు. లీగ్ తొలిరౌండ్ పోటీలు చెన్నై నెహ్రూ స్టేడియంలో ఈనెల 18న ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 24న జరిగే రెండోరౌండ్ పోటీలకు కొచ్చీ ఆర్ ఎస్ సీ స్టేడియం వేదికగా ఉంటుంది. అక్టోబర్ 22న జరిగే మూడోరౌండ్ పోటీలకు హైదరాబాద్ గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. నవంబర్ 11న జరిగే నాలుగోరౌండ్ పోటీలకు మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని కెఎల్ బ్యాడ్మింటన్ అకాడెమీ స్టేడియం వేదికగా ఉంటుంది. నవంబర్ 12న లీగ్ గ్రాండ్ ఫైనల్స్ నిర్వహిస్తారు. ఈ లీగ్ నిర్వహణకు 15 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు.

18:33 - September 17, 2016

పాట్నా : బీహార్‌లో రాజకీయ నేతల కుమారులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎమ్మెల్యే కొడుకు కారును ఓవర్‌ చేయడంతో ఓ యువకుడు భారీ మూల్యాన్నే చెల్లించుకున్న ఘటన ఔరంగాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తన కారును ఓవర్‌ టేక్‌ చేశాడన్న కారణంతో ఆర్జేడీ ఎమ్మెల్యే వీరేంద్ర సిన్హా కుమారుడు కునాల్‌ ప్రతాప్‌ ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడు. కునాల్‌ ప్రతాప్‌ శుక్రవారం రాత్రి ఓబ్రాలో తన కారులో వెళ్తుండగాన్న పింటూ అనే యువకుడు కారును ఓవర్‌టేక్‌ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన కునాల్‌..పింటూను కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పింటూని  పట్నాలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కునాల్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

 

18:30 - September 17, 2016

డెహ్రడూన్ : ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా శివపాల్‌ యాదవ్‌ను ములాయం నియమించినందుకు సిఎం అఖిలేష్‌ యాదవ్‌ అభినందనలు తెలిపారు. బాబాయ్‌కు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్‌కు అందరూ అండగా నిలవాలని, ఆందోళన విరమించాలని తన మద్దతుదారులకు అఖిలేష్‌ విజ్ఞప్తి చేశారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. శివపాల్‌ యాదవ్‌తో భేటి తర్వాత అఖిలేష్‌ ఈ ప్రకటన చేశారు.

 

17:57 - September 17, 2016

ఢిల్లీ : దళితులపై దాడులకు వ్యతిరేకంగా అక్టోబర్‌ 3న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. పొలిట్ బ్యూరో సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. తమ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నామని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, విద్య కాషాయీకరణ, దళితులపై దాడులు, కశ్మీర్‌ అనిశ్చితి తదితర అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. 

ఎపిలో ఎస్సై ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ : ఎపిలో నిరుద్యోగులకు శుభవార్త. ఎస్సై ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలయింది. మొత్తం 707 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఎపిలో ఎస్సై ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ : ఎపిలో నిరుద్యోగులకు శుభవార్త. ఎస్సై ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలయింది. మొత్తం 707 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 

తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి విద్యా సదస్సు

విజయవాడ : తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సమాజాన్ని నాలెడ్జ్ హబ్ గా చేయగల శక్తి టీచర్లదేనని చంద్రబాబు కొనియాడారు. యువత ప్రపంచస్థాయికి ఎదిగేలా ఉపాధ్యాయులే తీర్చిదిద్దాలన్నారు. 

 

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సీపీఐ బహిరంగ సభ

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సీపీఐ బహిరంగ సభ నిర్వహించారు. సీసీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ నేతలు, చాడ వెంకట్ రెడ్డి, నారాయణ, ప్రొ. కోదండరాం, పాశం యాదగిరి హాజరయ్యారు. 

 

16:54 - September 17, 2016

గుజరాత్ : ప్రధానమంత్రి నరేంద్రమోది తన 66 వ పుట్టినరోజును స్వరాష్ట్రం గుజరాత్‌ జరుపుకున్నారు. ఉదయమే గాంధీనగర్‌ చేరుకున్న మోది తల్లి హీరాబెన్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మోది తల్లితో అరగంటసేపు గడిపారు. హీరాబెన్‌ తాను స్వయంగా తయారు చేసిన మిఠాయిని కుమారుడికి తినిపించారు. ప్రధాని మోది దాహోద్‌ జిల్లాలో పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీకి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, బిజెపి చీఫ్‌ అమిత్‌షా, కేంద్రమంత్రులు ట్విట్టర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ ఠాకూర్‌ ప్రధానిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ తీరంలో మోదీ సైకత శిల్పాన్ని రూపొందించి.. శుభాకాంక్షలు తెలియజేశారు.
 

16:52 - September 17, 2016

ముంబై : ప్రముఖ బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌కు డెంగ్యూ వ్యాధి సోకింది. రెస్ట్‌ తీసుకోవాలని ఆమెకు వైద్యులు సలహా ఇచ్చారు. విద్యాబాలన్‌కు డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆమె నివసించే అపార్ట్‌మెంట్‌లో బిఎంసి అధికారులు సోదా జరిపారు. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ నివాసంలోని స్విమ్మింగ్‌ పూల్‌లో డెంగీని వ్యాప్తి చేసే దోమలు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. డెంగ్యూను అరికట్టడం విఫలమయ్యారన్న కారణంతో విద్యాబాలన్‌, షాహిద్‌కపూర్‌లతో పాటు మరో అపార్ట్‌మెంట్‌ నివాసికి మున్సిపల్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. విద్యాబాలన్‌, షాహిద్‌ కపూర్‌ ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉంటున్నారు.

 

16:47 - September 17, 2016

కరీంనగర్ : జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ బావిలో పడి నలుగురు మృతి చెందారు. సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో ట్రాక్టర్... బావిలో పడిపోయి నలుగురు మృతి చెందారు. అదికారులు మృతదేహాలను వెలికి తీశారు. మృతులను శ్రీకాంత్, రాజు, సంతోష్, శివగా గుర్తించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని మంత్రి ఈటెల రాజేందర్ సందర్శించారు. 

 

ముగ్గురి మృతదేహాలు వెలికితీత

వరంగల్ : జిల్లాలో విషాదం నెలకొంది. ధర్మసాగర్ రిజర్వాయర్ లో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ముగ్గురి మృత దేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. గల్లంతైన వారు వాగ్దేవి విద్యార్థులుగా గుర్తించారు. గల్లంతైన విద్యార్థులు శ్రావ్యారెడ్డి (19), వినూత్న(18), కొలినేని శివసాయికృష్ణ (20), శివసాయి (19)లుగా తెలుస్తోంది. 

 

అసెంబ్లీ నిర్మాణం, పోలీసు భద్రతపై ముగిసిన యనమల సమావేశం

గుంటూరు : అసెంబ్లీ నిర్మాణం, పోలీసు భద్రతపై ఆర్థికమంత్రి యనమల రాకృష్ణుడు సమావేశం ముగిసింది. ఈ ఏడాది శీతాకాల సమావేశాలు లేనట్టేనని మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ అన్నారు. డిసెంబర్ నాటికి అసెంబ్లీ నిర్మాణం పూర్తయితే శీతాకాల సమావేశాలపై ఆలోచిస్తామని చెప్పారు. 
 

భూమనకు సీఐడీ మళ్లీ నోటీసులు

తిరుపతి :తునీ ఘటన కేసులో ఆరోపనలు ఎదుర్కుంటున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ  మళ్లీ నోటీసులు జారీ చేసింది.  ఎల్లుండి ఆయన తిరుపతిలోని సీఐడీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంది.ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో భూమనను సీఐడీ విచారించిన విషయం తెలిసిందే.

15:22 - September 17, 2016

తిరుపతి :తునీ ఘటన కేసులో ఆరోపనలు ఎదుర్కుంటున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ  మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో భూమనను సీఐడీ విచారించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో భూమన 10టీవీతో మాట్లాడారు.  పోలీసులు తమను వేదిస్తున్నట్లు, కావాలనే ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ చర్యపై వైసీపీ నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కేవలం చంద్రబాబు  ఆదేశాల మేరకే సీఐడీ పోలీసులు నడుచుకుంటున్నారని వారు ఆరోపించారు. అయితే ఎల్లుండి ఆయన తిరుపతిలోని సీఐడీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంది.

 
14:51 - September 17, 2016

నల్గొండ:తెలంగాణ సాయుధ పోరాటం అనగానే నల్లగొండ జిల్లా గుర్తుకొస్తుంది. విసునూరు రామచంద్రారెడ్డి దురాగతాలు, దౌర్జన్యాలు కళ్లలో మెదులుతాయి. ప్రాణాలు ఫణంగా పెట్టి, పోరాడిన వీరుల చరిత్ర గుర్తుకొస్తుంది.దొరలు, దేశ్ ముఖ్ లు, జాగీర్దారులు, జమీందారులు, పటేళ్లు వారికి మద్దతుగా నిజాం సర్కార్. వీరందరి దురాగతాలకు వ్యతిరేకంగా సాగిన మహోజ్వల పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. భూముల దురాక్రమణలు, వెట్టిచాకిరి, రకరకాల పన్నులు, వీటన్నింటికీ మించిన స్త్రీలపై సాగించిన అకృత్యాలు వీటన్నింటి మీద తెలంగాణ ప్రజలు చేసిన తిరుగుబాటే సాయుధ పోరాటం. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆనాటి పోరాటానికి నాయకత్వం వహించింది కమ్యూనిస్టులు, ఆంధ్రమహాసభ.ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టులు ఆధ్వర్యంలో సాగుతున్న పోరాటాన్ని అణచివేసేందుకు నిజాం సర్కార్ ప్రయోగించిన కిరాతక మూకలే రజాకార్లు. తొలుత కర్రలు, ఒడిసెలతో రజాకార్లను ఎదుర్కొన్న సంఘాలు ఆ తర్వాత నాటు తుపాకీలు, గ్రెనెడ్లు, రైఫిళ్లు పట్టుకున్నారు. అదే సాయుధ రైతాంగ పోరాటంగా మారింది.చాకలి ఐలమ్మ తెగువ, దొడ్డి కొమరయ్య బలిదానంతో మొదలైన త్యాగాలు తెలంగాణ చరిత్రలో రక్తాక్షరాలు లిఖించాయి. నాటి సాయుధ పోరాటంలో నాలుగు వేలమంది అమరులయ్యారు. లక్షలాది మంది గాయపడ్డారు. పది వేల మందికి పైగా కమ్యూనిస్టులు, ప్రజాపోరాట యోధులు మూడు నాలుగేళ్లపాటు నిర్బంధ శిబిరాలలో, జైలు జీవితం గడిపారు. యాభై వేల మందికి పైగా ప్రజలు పోలీస్ క్యాంపుల్లో, మిలటరీ క్యాంపుల్లో చిత్ర హింసలు అనుభవించారు. వేలాది గ్రామాల మీద పోలీసులు, మిలటరీ దాడులు చేసి బీభత్సం సృష్టించారు. తొలుత నైజామ్, అతని రజాకార్ సాయుధ బలగాలు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికీ, హైదరాబాద్ సంస్థానానికి చెందిన సాయుధ బలగాలు ఐదేళ్ల పాటు తెలంగాణ ప్రజలపై పోలీస్ యాక్షన్ ప్రయోగించారు.ఈ పోరాటం కొన్ని విజయాలందించింది. గడీల నుంచి, గ్రామాల నుంచి భూస్వాములను వెళ్లగొట్టింది. వారి పొలాలను రైతులు స్వాధీనం చేసుకున్నారు. పది లక్షల ఎకరాల భూమిని పేదలు పంచుకున్నారు. బేదఖళ్లు నిలిచిపోయాయి. వెట్టిచాకిరీ రద్దయ్యింది. వడ్డీ వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్టపడింది. వ్యవసాయ కూలీల రేట్లు పెరిగాయి. కనీస వేతనం అమలులోకి వచ్చింది. అడవి బిడ్డలకు స్వేచ్ఛ లభించింది. దేశంలో భూ సంస్కరణలు ఎజెండా మీదకు వచ్చాయి. దాదాపు ఏడాదిన్నరకాలం పాటు మూడు వేల గ్రామాల్లో ప్రజారాజ్యం ఏర్పాటయ్యింది. ఆ 18 నెలలు ప్రజలే పాలించుకున్నారు. నాటి తెలంగాణ సమాజం ప్రదర్శించిన పోరాట పటిమ, ఆనాడు చేసిన త్యాగాలు ఎన్నటికీ మరచిపోలేనివి.తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశ చరిత్రలో ఓ మహోజ్వల ఘట్టం. తరతరాలకు తరగని స్పూర్తిన్నిచ్చే ఈ వీరోచిత పోరాటానికి కేంద్ర బిందువుగా నిలిచింది నల్లగొండ జిల్లా. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో వున్న జనగామ తాలుకా నాడు నల్లగొండ జిల్లాలో వుండేది. నాటి దొరతనపు క్రూరత్వానికి ప్రతినిధి విసునూరు రామచంద్రారెడ్డి. జనగామ తాలూకాలో 40వేల ఎకరాల భూస్వామి. ఇతని పాపాలకు పరాకాష్ట చాకలి ఐలమ్మ మీద దౌర్జన్యం చేయడం. ఐలమ్మపొలంలో పంటను కోసుకురండంటూ నౌకర్లను, వంద మంది గూండాలను పంపించాడు విసునూరు రామచంద్రారెడ్డి. ఆ గూండాలను చేతి కర్రలతోనే తరిమికొట్టారు 28 మంది వాలంటీర్లు. వారే పొలంలో పంట కోసి ఐలమ్మ ఇంటికి చేర్చారు. దీంతో విసునూరు రామచంద్రారెడ్డి దిమ్మ తిరిగిపోయింది. పోలీసులను రంగంలోకి దింపారు. ఐలమ్మ ఇంటిలోని ధాన్యాన్ని ముట్టుకునే సాహసం చేయలేకపోయారు పోలీసులు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో అంతులేని ఉత్తేజం నింపింది.ఈ ఘోర పరాభవంతో రామచంద్రారెడ్డి మరింత రెచ్చిపోయాడు. పోలీసుల సహకారంతో కడివెండి గ్రామ నాయకులను హత్య చేసేందుకు పధకం వేశాడు. 1946 జులై4న విసునూరు గూండాలు సంఘం నాయకుల ఇళ్ల మీద రాళ్లు వేశారు. ఊరి జనమంతా ఏకమై, పెద్ద ర్యాలీ తీశారు. ఈ ఊరేగింపు జమీందారు ఇంటిముందుకు రాగానే అక్కడే మాటు వేసిన గూండాలు కాల్పులు జరిపారు. తుపాకీ తూటా తగిలి దొడ్డి కొమరయ్య అక్కడికక్కడే చనిపోయాడు. ఆయన అన్న మల్లయ్య కాలికి తూటా తగిలి కిందపడిపోయాడు. మరికొందరు గాయపడ్డారు. తెలంగాణ సాయుధపోరాటంలో దొడ్డి కొమరయ్య తొలి అమరుడు.కొమరయ్య మరణంతో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి రెండు వేల మంది తరలివచ్చారు. ఎండుగడ్డి మోపులతో జమీందారు భవనానికి నిప్పంటించేందుకు సిద్ధమయ్యారు. కొంతమందిని గడీని చుట్టుమాట్టారు. మరికొందరు ఊరి పొలిమేరల్లో కాపలా వున్నారు. ఈ సంగతి తెలిసిన రామచంద్రారెడ్డి కుమారుడు జగన్ మోహన్ విసునూరు నుంచి కత్తులు, పిస్తోళ్లు, బల్లేలతో 200 మంది గూండాలను తీసుకొచ్చాడు. అయితే, కాపలాదళం ఊరి పొలిమేరల్లోనే వారిని అడ్డుకుంది. అదే సమయంలో 60మంది రిజర్వ్ పోలీసులు గ్రామానికి వచ్చారు. గూండాలపై చర్య తీసుకుంటామంటూ చెప్పి, ప్రజలను అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత గూండాలను సురక్షితంగా జమీందారుకు అప్పగించారు.కొమరయ్య అమరత్వం తర్వాత సంఘ చైతన్యం మరింత పెరిగింది. ఎక్కడికక్కడ సంఘాలు ఏర్పడ్డాయి. వెట్టి, అక్రమ నిర్బంధ వసూళ్లు, బేదఖళ్లు ఇక సాగవంటూ ప్రకటించేవారు. అదేసమయంలో ఖాసి రజ్వీ ఆధ్వర్యంలో నిజాం ప్రయివేట్ సైన్యం ఆయుధాలతో సంఘం సభ్యులపై దాడులు చేసేది. దీంతో తాము కూడా ఆయుధాలు చేపట్టాలంటూ 1947 సెప్టెంబర్ 11న జరిగిన భువనగిరి సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. దీంతో రజాకార్లు ఒక్క అడుగు వెనక్కి తగ్గారు. కమ్యూనిస్టు దళాలను ఎదుర్కొనేందుకు గుర్రాల ఫౌజ్ మిలిటరీని రంగంలోకి దింపాడు నిజాం నవాబు. గుర్రాల ఫౌజ్ రాకతో చెరువు అన్నారం, కలిమెర లలో మెరకిల్లాంటి నాయకులు ప్రాణాలు కోల్పోయారు.నాటి తెలంగాణ సాయుధ పోరాటానికి రక్తతర్పణ చేసిన మరో గ్రామం మల్లారెడ్డి గూడెం. ఖాసింరజ్వీ దురాగతాలకు వ్యతిరేకంగా ఈ గ్రామంలోని చిన్నపిల్లలు సైతం వరిసెలు, రాళ్లు పట్టుకున్నారు. 1946 డిసెంబర్ 1న నిజాం మిలటరీ ఈ గ్రామం మీద పడి, కాల్పలు జరపడంతో అప్పిరెడ్డి, ముంగి వీరయ్య, నందిరెడ్డి నర్సిరెడ్డి, అలుగుల వీరమ్మ నేలకొరిగారు. మరో 400 మందిని అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. 8 మందికి ఉరిశిక్షలు విధించారు. చివరకు ఏడో తరగతి చదివే విద్యార్థికి కూడా ఉరిశిక్ష విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాతి పరిణామాల్లో కేసు వీగిపోయింది. ఆనాటి ఉరిశిక్ష నుంచి తప్పించుకున్న ఆ విద్యార్థి ఇప్పటికీ కమ్యూనిస్టుగానే వున్నారు.నాటి పోరాటంలో రక్తందారపోసిన మరో గ్రామం గుండ్రాంపల్లి. ఖాసీం రజ్వీ అనుచరుడు మఖ్బూల్ అరాచకాలను ప్రతిఘటించిన గ్రామమిది. తమను ఎదురించిన కమ్యూనిస్టు దళ సభ్యులతో పాటు మొత్తం 200 మందిని ఊచకోత కోసి, మసీదు సమీపంలోని బావిలో పడేసి క్రూరత్వాన్ని చాటుకున్నారు రజాకార్లు.నాటి అమరవీరుల జ్ణాపకాలకు గుర్తుగా నిర్మించిన భారీ స్థూపాన్ని జాతీయ రహదారి విస్తరణలో తొలగించారు. మసీదుకు ఎదురుగా మరో స్థూపాన్ని ఆవిష్కరించారు.  

 

వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌లో విషాదం

వరంగల్‌: ధర్మసాగర్‌ జలాశయంలోపడి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మిగిలిన వారికికోసం పోలీసులు గాలింపు చర్యలు చేప్పట్టారు. 

14:44 - September 17, 2016

వరంగల్: జిల్లాలో విషాదం నెలకొంది. ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వరంగల్ శివారులోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో సీఈసీ మూడో సంవత్సరం చదువుతున్న శ్రావ్యారెడ్డి, వినూత్న, శ్రీనిధి, శివసాయి, శివసాయికృష్ణ సరదాగా ఈతకని ధర్మసాగర్‌ రిజర్వాయర్‌లోకి దిగారు. ఈత రాకపోవడంతో ఐదుగురు అందులో మునిగిపోయారు. వీరిలో నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.

 

 

13:57 - September 17, 2016
13:56 - September 17, 2016

రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్ధిర రంగం ఊపందుకొన్నట్లే కనబడుతుంది. అటు ఆంధ్రలో అసెంబ్లీ, సెక్రట్రియెట్ ఇతర ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలు, ఇటు తెలంగాణ కొత్త జిల్లాలు కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, నిర్మాణరంగం కొత్తపుంతలు తొక్కుతున్నట్లుందీ పరిస్ధితి. ఇంకోవైపు హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్ధలు నగరాభివృద్ధికి మెగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నయి. తెలంగాణ ప్రభుత్వం ఆహ్వనం మేరకు బహుళజాతి సంస్ధలు పెట్టుబడులకు సరే అంటున్నాయి. ఈ అభివృద్ధి అంశాలను దృష్టిలో ఉంచుకొని వివిధ నగరాల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణరంగ సంస్ధలు తమ వెంచర్లను ప్రారంభించాయి. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ నగరాల్లో నిర్మాణరంగ అభివృద్ధి చెందుతోంది. గోదారినది ఒడ్డున వెలసిన రాజమండ్రిలో ఇప్పుడు రియల్ ఏస్టేట్ రంగం అభివృద్ధి దిశలో పయనిస్తొంది. ఆ విశేషాలతో పాటు రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్టుబడికి, అసెట్స్ కొనుగోలు, స్థిరావాసాల ఏర్పాటుకు సంబంధించిన సమస్త సమాచారం వీడియోలో చూడండి. 

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : టీఆర్ఎస్ నేత‌లు తెలంగాణ విలీన దినోత్స‌వం నిర్వ‌హిస్తోంటే, బీజేపీ, టీడీపీ నేత‌లు విమోచన దినం నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు బీజేపీ నేత‌, ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డి త‌మ పార్టీ కార్యాల‌యంలో కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం హైద‌రాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగ‌ణంలో జాతీయ జెండాను ఎగురవేసేందుకు వెళ్లారు. అయితే, వాహ‌నంలో అసెంబ్లీ గేటు నుంచి లోప‌లికి వెళుతుండ‌గా ఆయ‌న‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయ‌న పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసుల‌కి, కిష‌న్‌రెడ్డికి మ‌ధ్య వాగ్వివాదం జ‌రిగింది.

13:48 - September 17, 2016

చిత్తూరు : జిల్లాను మహిళల అక్రమ రవాణా వ్యవహారం కుదిపేస్తోంది. విదేశాల్లో ఉద్యోగుల పేరిట మహిళలకు వలవేసి రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షలకు విదేశాల్లో అమ్మేస్తున్నారు. మలేషియా కేంద్రంగా వ్యాపారం గుట్టుగా సాగుతోంది. పోలీసుల అదుపులో వ్యభిచారగృహ నిర్వాహకులు, బ్రోకర్లు, కీలక దళారులు పాండ్యరాజన్‌, రఫీ ఉన్నారు. 6నెలలలో సుమారు 300మంది మహిళలను విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. తమను హింసిస్తున్నారని బాధితులు గోడు వెల్లబోసుకుంటున్నారు. విదేశాల్లో చిక్కుకున్న మహిళలను సొంతగ్రామాలకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

13:46 - September 17, 2016

విజయవాడ : కొంతమంది కావాలనే హోదాపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.అభివృద్ధికి అవకాశం లేని రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా వర్తిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్రత్యేకీ ప్యాకేజీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ సాధించిన వెంకయ్యకు ఆ పార్టీ నేతలు.. కార్యకర్తలు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. విజయవాడలో వెంకయ్యకు సన్మానసభ నిర్వహించారు. నాయకుల కంటే ప్రజలు చాలా తెలివైన వాళ్లని.. ప్యాకేజీపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకే విజయవాడ వచ్చానని వెంకయ్య చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాలేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. వెనకబడిన రాష్ట్రాలకు మాత్రమే ఇప్పటిదాకా ప్రత్యేక హోదా ఇచ్చారన్నారు. ప్రత్యేకహోదా కంటే ప్యాకేజీ వల్లనే ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి.. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపామని వెంకయ్య తెలిపారు.  

13:42 - September 17, 2016

హైదరాబాద్ : దళిత హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన పౌరహక్కుల నేత, హేతువాది బొజ్జా తారకానికి రాజకీయనేతలు, సాహితీవేత్తలు నివాళులర్పిస్తున్నారు. ఎస్‌వీకేలో బొజ్జా తారకం మృతదేహానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు హరీశ్ రావు, కడియం శ్రీహరి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం నివాళులు అర్పించారు.. బొజ్జా తారకంతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు..ప్రజాకవి గోరేటి వెంకన్న..10టీవీ ఎండీ వేణుగోపాల్, పీవో డబ్ల్యూ సంధ్య, విమలక్క,ప్రజాకవి జయరాజ్, విరసం నేత వరవరరావు బొజ్జా తారకం జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బొజ్జా బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఆయన పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు బొజ్జాతారం సమాజానికి తీరని లోటనీ ఆయనతో వున్న అనుబంధాన్ని హోంమంత్రి నాయిని గుర్తు చేసుకున్నారు. కోదండరామ్ మాట్లాడుతూ..సాటిమనిషిని ప్రేమించటం సమాజంలో వున్న సమస్యలపట్ల పోరాటం ఆయన సహజ లక్షణమన్నారు. 

పోర్టులో కాంట్రాక్టు కార్మికుల మెరుపుసమ్మె..

విశాఖపట్నం : పోర్టులో కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు మెరుపుస‌మ్మెకు దిగారు. ఒక మ‌హిళా కార్మికురాలిపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది చేయిచేసుకున్నారంటూ 1500 మంది కార్మికులు విధులు బ‌హిష్క‌రించి నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో పోర్టులో ట్రాన్స్‌పోర్ట్ ప‌నులు పూర్తిగా నిలిచిపోయాయి. మ‌హిళ‌పై దాడి జ‌రిగిన ఘ‌ట‌న గురించి తాము ఐటీఎల్ జీఎం, ట్రాన్స్‌పోర్ట్ ఇంఛార్జ్ ల‌కు చెప్పామ‌ని, అయితే సీఐఎస్ఎఫ్ సిబ్బంది వారిపై కూడా దాడి చేశార‌ని కార్మికులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం..8మంది మృతి..

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 8 మంది మృతి చెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు అతి వేగంతో టర్న్ తీసుకునే క్రమంలో ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

నల్లగొండ జిల్లాలో సీఎస్ రాజీవ్ శర్మ పర్యటన..

నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లాలో పర్యటిస్తున్నారు. భువనగరిలో యాదాద్రి జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను పరిశీలించారు. హైదరాబాద్ రోడ్డులోని పగిడిపల్లి వద్ద క్రిస్టల్ హైస్కూల్‌ను కలెక్టరేట్ భవనంగా, జగదేవ్‌పూర్ రోడ్డులో ఉన్న పాత బీఈడీ కళాశాలను ఎస్పీ ఆఫీస్‌గా ఎంపిక చేశారు. భవనాలను పరిశీలించిన అనంతరం సీఎస్ సూర్యాపేటకు బయల్దేరారు. అక్కడ కూడా నూతన జిల్లా కార్యాలయాలను సీఎస్ పరిశీలించనున్నారు.

టీ.టీడీపీ రైతుదీక్ష వాయిదా..

హైదరాబాద్ : ఈనెల 19,20 తేదీలలో టీ.టీడీపీ తలపెట్టిన రైతుదీక్ష కార్యక్రమం వాయిదా పడింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. 

12:37 - September 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ విలీన దినోత్సవం సందర్బంగా టీ.జాక్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ టీ.జేఏసీ కార్యాలయం జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజాస్వామిక పునరుద్ధరణ కోసం సెప్టెంబర్ 17ను జరుపుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయ్యాక సెప్టెంబర్ 17 వెలుగులోకి వచ్చిందన్నారు. అనేక చర్చల అనంతరం సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా జరపాలని నిర్ణయానికొచ్చామన్నారు. ఈరోజును ప్రభత్వుం అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్బంగా కోదండరామ్ సూచించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 

12:33 - September 17, 2016

విజయవాడ: విభజన అనేతి గతం అనీ..అభివృద్ధే ఇప్పుడు అందరి ప్రధాన లక్ష్యమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చినందుకు రాష్ట్ర బీజేపీ నేతలు వెంకయ్యనాయుడుకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, అభివృద్ధికి అవకాశం లేని రాష్ట్రాలకే హోదా ఇచ్చారని, నాయకుల కంటే ప్రజలు తెలివైన వారన్నారు.ప్యాకేజీపై అవగాహన కల్పించేందుకే విజయవాడ వచ్చానన్నారు. 2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చి...2014 వరకు కాంగ్రెస్ తెలంగాణ ఊసెత్తలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పడాలని గతంలో అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జై ఆంధ్రా ఉద్యమానికి కాంగ్రెస్‌ నేతలు వెన్నుపోటు పొడిచారని, 1972లోనే విడిపోయి ఉంటే ఏపీ ముఖచిత్రం వేరుగా ఉండేదని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. రాజధాని హైదరాబాద్ లో వుండటంతో విజయవాడ డెవలప్ కాలేదన్నారు. 

విమోచన దినం జరుపుతామనలేదు : నాయిని

హైదరాబాద్‌: అధికారంలోకి వస్తే విమోచన దినం జరుపుతామని అనలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సెప్టెంబర్‌ 17 సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను హోంమంత్రి ఎగురువేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమోచన దినాన్ని జరపాలనేది బీజేపీ డిమాండ్ అని చెప్పారు. భారత్‌లో విలీనమవుతామని వల్లభాయ్‌పటేల్‌కు ఆనాడు నిజాం చెప్పారని గుర్తు చేశారు. మతసామరస్యం, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కేసీఆర్‌ పాలన ఉందని తెలిపారు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన రోజు ఇది అని హోంమంత్రి నాయిని పేర్కొన్నారు.

11:55 - September 17, 2016

హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్‌ కుమార్ ఒంటరితనంతోనే ఆత్మహత్యకు చేసుకున్నాడని మాదాపూర్ డీసీపీ కార్తీకేయ తెలిపారు. ప్రవీణ్ రూంలో ఓ నోట్ స్వాధీనం చేసుకున్నామని.. ఆ నోట్ ప్రకారం అతను కొన్ని రోజులుగా ఒంటరితనంతో బాధపడుతన్నట్టు తెలుస్తోందని చెప్పారు. 

11:51 - September 17, 2016

హైదరాబాద్ : దళిత హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన పౌరహక్కుల నేత, హేతువాది బొజ్జా తారకం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి పదకొండున్నర గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తరలించారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ, సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి, జి.రాములు, విరసం నేత వరవరరావు, చుక్కా రామయ్య, టీ.జాక్ అధ్యక్షులు కోదండరాం, మంత్రి నాయిని, కంచె ఐలయ్య, వైసీపీ నేత జగన్, పలు ప్రజాసంఘ నేతలు నివాళులర్పించారు. ఇంకా ప్రముఖ సాహితీవేత్తలు, వామపక్ష నేతలు, కవులు, ఉద్యమకారులు పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం కొనసాగుతోంది. 

11:47 - September 17, 2016

కృష్ణా : రామవరప్పాడు రింగ్‌రోడ్డు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పర్యటనను అడ్డుకునేందుకు లెఫ్ట్‌ నేతలు యత్నించారు. ప్రత్యేక హోదాపై కేంద్రం మాట మార్చిందంటూ వెంకయ్యనాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు లెఫ్ట్ నాయకులను అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇవాళ వెంకయ్య నాయుడుకు బీజేపీ నేతలు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

తెలంగాణ భవన్‌లో విలీన దినోత్సవ వేడుకలు..

హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో విలీన దినోత్సవ వేడుకలు జరిగాయి. సెప్టెంబర్ 17 సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో పాటు టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ఇవాళ రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన రోజు అని తెలిపారు. సెప్టెంబర్ 17న నైజాం సర్కార్‌ను భారత్‌లో విలీనం చేయడం జరిగిందని గుర్తు చేశారు. హైదరాబాద్ స్టేట్‌ను ఏపీలో కలిపితే పోరాడి తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. 

కమ్యూనిస్టులపై మంత్రి ఛలోక్తులు!..

ఢిల్లీ : కమ్యూనిస్టుల వల్ల తయారీ, ఉత్పత్తి తగ్గి టెన్షన్ పెరిగిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అది పంచాలి, ఇది పంచాలి అంటూ వారు డిమాండ్ చేస్తుంటారని, ఏదైనా పెంచకుండా పంచితే చివరకు మిగిలేదని పంచేనంటూ చలోక్తులు విసిరారు. కార్మికుడు, యజమాని రెండు చక్రాల్లాంటి వారని, వారు కలిసే ప్రయాణం సాగించాల్సి ఉంటుందన్నారు.  అభివృద్ధికి అడ్డుపడడం మంచిది కాదని సూచించారు. అసంఘటిత రంగ కార్మికులపై కేంద్రం దృష్టి సారించిందని పేర్కొన్నారు.

పార్లమెంట్ కు రానున్న షూటింగ్ బిల్?!..

ఢిల్లీ : బహిరంగ ప్రదేశాల్లో సినిమా షూటింగ్ లకు అనుమతులు తెచ్చుకోవాలంటే నిర్మాతలకు తల ప్రాణం తోకకు వస్తుంటుంది. ఎన్నో శాఖల నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. ఈ సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగేస్తోంది. ఈ మేరకు పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది. శీతాకాల సమావేశాల్లో గానీ బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు.

షాక్ కు షాక్ ఇచ్చిన మోదీ..

ఢిల్లీ : బలూచిస్థాన్‌ విషయంలో తన వైఖరిని ప్రకటించి పాక్‌ వెన్నులో వణుకు పుట్టించిన భారత్ ఇప్పుడు మరోసారి పాక్‌ను కలవరపాటుకు గురిచేసింది. బలూచిస్థాన్‌లో శుక్రవారం నుంచి ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభమయ్యాయి. బలూచిస్థాన్ వ్యవహారంలో తలదూర్చిన భారత్‌పై ఇప్పటికే మండిపడుతున్న పాక్‌ తాజా ఘటనతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బలూచ్‌లో ఆకాశవాణి ప్రసారాలపై ప్రధాని మోదీ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

చైనా చరిత్రను వణికిస్తున్న మెరాండీ తుపాను..

చైనా : మెరాండి తుపాను సృష్టించిన బీభత్సానికి ప్రజలు వణికిపోతున్నారు. తుపాను దాటికి ఇప్పటి వరకు ఏడుగురు మృత్యవాత పడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు. హుజియాన్, జెజియాంగ్ రాష్ట్రాలను మెరాండీ అతలాకుతలం చేసింది. హుజియాన్ రాష్ట్రంలో సమాచార, విద్యుత్, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. 16 వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 23 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా 25 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్టు అధికారుల అంచనా. మూడు లక్షల మందికిపైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది.

శంషాబాద్ లో అమిత్ షా స్వచ్ఛ్ భారత్..

హైదరాబాద్: ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని శంషాబాద్‌ బస్‌ స్టాండ్‌లో శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వచ్ఛ భారత కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలన్న డిమాండ్‌తో బీజేపీ వరంగల్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. 

ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు..

ప్రకాశం: అద్దంకిలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. అద్దంకిలో సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. జిల్లాలో వారంలో రెండో సారి భూప్రకంపనలు సంభవించాయి.కాగా ఇటీవలి కాలంలో ప్రకాశం జిల్లా పరిధిలో భూప్రకంపనలు సంభవిస్తూండటం జరుగుతున్న విషయం తెలిసిందే. 

నేటి నుండి ఎంసెట్-3 కౌన్సెలింగ్..

హైదరాబాద్ : 2016-17 విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్‌, బీడీఎ్‌సలలో ప్రవేశాల భర్తీ కోసం నిర్వహించిన టీఎస్‌ ఎంసెట్‌-3 ర్యాంకర్లకు శనివారం నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌సైన్సెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కౌన్సెలింగ్‌లో నగరంలో రెగ్యులర్‌ ర్యాంకుల కోసం మూడు సెంటర్లు, ప్రత్యేక కేటగిరీల విద్యార్థులకు ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు.

08:32 - September 17, 2016
08:27 - September 17, 2016

కరీంనగర్ : సైదాపురం మండలం దుద్దెనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఢీకొన్న ట్రాక్టర్ బావిలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. బైక్ పై వెళ్తున్న ఎస్సై, మరో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందినవారు చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన శివ, సంతోష్, రాజు, శ్రీకాంత్ లకుగా గుర్తించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సహాయక చర్యల్ని చేపట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు మిషన్ భగీరథకు సంబంధించిన భారీ క్రేన్ తో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.

08:19 - September 17, 2016

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఎఫ్‌ఏ మొదటి సంవత్సరం విద్యార్థి ప్రవీణ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూనివర్సిటీ హాస్టల్లోని ఎల్‌బ్లాక్‌లోని తన గదిలో ప్రవీణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం 4.00గంటలకు ఫ్యాన్ కు ఉరివేసుకుని మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గమనించిన తోటి విద్యార్థులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రికి తీసుకెళ్లిన కొంతసేపటికే ప్రవీణ్ మృతి చెందాడు. నెలరోజుల క్రితమే హాస్టల్ వచ్చాడనీ..ఇంతలోనే ఇలా జరగటంతో హాస్టల్ లోని విద్యార్థులంతా విషాదంలో మునిగిపోయారు. ప్రవీణ్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విద్యార్థిగా పోలీసులు పేర్కొన్నారు. ప్రవీణ్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. హోమ్ సిక్ తో గానీ, లేక వ్యక్తిగత కారణాలేమైనా వున్నాయా అనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ప్రవీణ్ తల్లిదండ్రులు యూనివర్శిటీకి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు వస్తే కొంతవరకూ దర్యాప్తుకు సంబంధించి వివరాలు తెలిసే అవకాశం వుంది. విద్యార్థి సంఘాలు కూడా సంఘటనాస్థలికి చేరుకున్నట్లుగా సమాచారం.

07:55 - September 17, 2016

సెప్టెంబర్ 17వ తేదీ. తెలంగాణాలోని అన్ని రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 17 చుట్టే తిరుగుతుంటాయి. నిజాం పాలన నుంచి విముక్తి లభించిన ప్రాంతాలు తెలంగాణాతో పాటు కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఆగస్ట్ 15 న దేశానికి స్వాతంత్ర్యానికి వచ్చినప్పటికీ నిజాం ఏలుబడిలో తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు నిజాం పాలనలోనే కొనసాగాయి. అనంతరం జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీన నిజాంను గద్దె దింపి ఈ మూడు రాష్ట్రాల్లోని ప్రాంతాలను ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది. తాము గెలిస్తే అధికారికంగా నిర్వహిస్తామన్న కేసీఆర్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీ గురించి ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. పార్టీ పరంగా మాత్రం తెలంగాణా భవన్ లో పతాకావిష్కరణ మాత్రం యధావిధిగా నిర్వహిస్తోంది. కాగా అధికార ..విపక్షాలు సెప్టెంబర్ 17 ను విమోచన దినోత్సవం అనీ..విలీన దినం అని..విద్రోహ దినం అనే భిన్నవాదనలు లేవనెత్తుతున్నాయి. అసలు సెప్టెంబర్ 17తేదీ పై క్లారిటీ ఎప్పటికి రానుంది? ఈ వాదనలకు ఎప్పటికి ఫుల్ స్టాప్ పడనుంది? ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నంద్యాల నర్శింహారెడ్డి (సీపీఎం నేత) తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత) శ్రీధర్ రెడ్డి (బీజేపీ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్ వక్తల అభిప్రాయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో ను చూడండి..

 

07:40 - September 17, 2016

అరుణాచల్‌ ప్రదేశ్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ సంక్షోభంలో పడింది. ప్రస్తుత ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్‌ చెందిన 44 మంది ఎమ్మెల్యేలు కొత్త పార్టీ పిపిఏలో చేరారు. మాజీ సిఎం నబం టుకీ ఒక్కరే కాంగ్రెస్‌లో మిగిలారు.
కాంగ్రెస్‌ పార్టీని వీడి పిపిఏలో చేరిన 44 మంది ఎమ్మెల్యేలు
అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజకీయాలు మళ్లీ సంక్షోభంలో పడ్డాయి. ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలు పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌లో చేరడంతో రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా వీరి బాటనే పట్టారు. కాంగ్రెస్‌ పార్టీని పీపీఏలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌ను కలిసి వెల్లడించినట్లు పెమఖండూ తెలిపారు. మాజీ సిఎం నబమ్‌ టుకి ఒక్కరే కాంగ్రెస్‌లో మిగిలారు.

మునిగిపోతున్న నావ కాంగ్రెస్ పార్టీ : వెంకయ్య నాయుడు
కాంగ్రెస్‌ పార్టీని మునిగిపోతున్న నావగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. కాంగ్రెస్‌ నాయకత్వంపై విసిగిపోయి నేతలు పార్టీ వీడుతున్నారని తెలిపారు. బిజెపిపై నిందలు వేసిన కాంగ్రెస్‌ ఇపుడేం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు తీర్పుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

కొద్దినెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పుతో అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. నబమ్‌టుకి స్థానంలో నాటకీయ పరిణామాల మధ్య పెమా ఖండూను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రకటించింది. అప్పుడు కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోయిన 30 మంది శాసనసభ్యులు తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరి ఖండూకు మద్దతిచ్చారు.

పదవిని కోల్పోయిన పుల్‌ మనస్థాపంతో ఆత్మహత్య
కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కలిఖోపుల్‌ రెబల్‌గా మారి నబమ్‌టుకి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. బిజెపి మద్దతుతో సీఎం అయిన పుల్‌ సుప్రీంకోర్టు తీర్పుతో పదవి కోల్పోయారు. అనంతరం పెమా ఖండూ ముఖ్యమంత్రి అయ్యారు. పదవిని కోల్పోయిన పుల్‌ తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.60మంది శాసనసభ్యులున్న అరుణాచల్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 45, బిజెపికి 11 మంది ఎమ్మెల్యేలున్నారు. 2016 మేలో బిజెపి ఏర్పాటు చేసిన ఈశాన్య డెమోక్రటిక్‌ అలయన్స్‌ కూటమిలో పీపీఏ కూడా ఉంది. పిపిఏ 1979లో ప్రాంతీయ పార్టీగా అవతరించింది.

07:34 - September 17, 2016

ఢిల్లీ : నేటి నుంచి ఢిల్లీలో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల కార్యదర్శులు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో రాష్ట్రాలలో నెలకొన్న పరిస్థితులు, ప్రజా పోరాటాలపై కేంద్ర కమిటీకి రాష్ట్ర కమిటీలు నివేదికలు ఇవ్వనున్నాయి. కాశ్మీర్‌ అనిశ్చితిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుతో పాటు పలు అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. అలాగే భవిష్యత్‌ ప్రజా ఉద్యమాలపై కార్యాచరణను రూపొందిస్తారు. 

07:31 - September 17, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఎంబీబీఎస్‌.. బీడీఎస్‌ సీట్ల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు మొదటి విడత కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు తెలంగాణ సర్కారు యోచిస్తుంది. కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ సహకారంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది.

రేపటి నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌
రాష్ట్రంలో ఈ నెల పదో తేదీన నిర్వహించిన ఎంసెట్‌-3 పరీక్షకు సంబంధించిన ఫలితాలు 15వ తేదీన విడుదలయ్యాయి. ఈ పరీక్షకు 37 వేల మంది హాజరవ్వగా..66 శాతం మంది క్వాలీఫై అయ్యారు. దీనికి సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రారంభం కాబోతుంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్‌ నిర్వహణకు ఆరు కౌన్సెలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 85 శాతం సీట్లను స్థానికులతో, 15 శాతం సీట్లను అన్‌ రిజర్వ్‌డ్ కోటాలో భర్తీ చేయనున్నారు.

21, 22 తేదీల్లో రెండో దశ కౌన్సెలింగ్‌
కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ని కాళోజీ యూనివర్శిటీ ఇప్పటికే విడుదల చేసింది. దీని ప్రకారం నేటినుంచి 20 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌... 21, 22వ తేదీల్లో అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు ఎంపిక ఉంటుంది. 23న అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. అవసరమైతే రెండో దశ కౌన్సెలింగ్‌ కూడా నిర్వహిస్తారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ జేఎన్‌టీయూ..ఉస్మానియా మారెడ్‌పల్లి గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ.. ఏవీ కాలేజీలలో జరగనుంది. వీటితో పాటు వరంగల్‌ కేయూలో కూడా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

కౌన్సెలింగ్‌ గడువు కోసం కోర్టులో పిటిషన్‌
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి కన్వీనర్‌ కోటాలో మొత్తం 3వేల 550 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీబీఎస్‌ సీట్లలో 1050 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, మిగాతా సీట్లు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్నాయి. అయితే ఈ సీట్ల భర్తీ ఈ నెలాఖారులోగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. మరింత గడువు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది.. గడువు కోసం మరింత ఒత్తిడి చేసే అవకాశం ఉంది. 

07:27 - September 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సమైన జూన్ రెండో తేదీకి ఎంత ప్రాధాన్యత ఉందో... సెప్టెంబర్ 17వ తేదీకి అంతే ప్రాధాన్యత. దీంతో తెలంగాణాలోని అన్ని రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 17 చుట్టే తిరుగుతుంటాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షంలో ఉంటే ఎలాంటి డిమాండ్లైనా చేస్తాయి.. అధికార పక్షంలో ఉంటే రాజకీయాలు ఎందుకులే అన్న వైఖరితో ఉంటాయి. సరిగ్గా తెలంగాణాలో అధికార పార్టీగా అవతరించిన గులాబి దళపతి కూడా ఇందుకు ఏమాత్రం తీసిపోరు.

తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి
నిజాం పాలన నుంచి విముక్తి లభించిన ప్రాంతాలు ప్రస్తుత తెలంగాణాతో పాటు కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఆగస్ట్ 15 న దేశానికి స్వాతంత్ర్యానికి వచ్చినప్పటికీ నిజాం ఏలుబడిలో ఉన్న ఈ ప్రాంతాలు నిజాం పాలనలోనే కొనసాగాయి. ఆతర్వాత భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని సెప్టెంబర్ 17వ తేదీన నిజాంను గద్దె దింపి ఈ మూడు రాష్ట్రాల్లోని ప్రాంతాలను ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది.

సెప్టెంబర్ 17పై అన్ని పార్టీలు రాజకీయాలు
అప్పటి నుంచి ఈ తేదీ వస్తుందంటే.. రాజకీయ పార్టీలన్నీ తమకు అనుకూలమైన నినాదాలు అందుకోవడం అనవాయితీగా మారింది. ఇందుకు అధికార పార్టీ మినహాయింపు కూడా కాదు..... తెలంగాణా ఉద్యమానికి కీలకంగా ఉన్న సెప్టెంబర్ 17వ తేదీ గురించి గులాబి బాస్ ఉద్యమ సమయంలో ఎన్నో డిమాండ్లు చేశారు. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి సరైందన్న అభిప్రాయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.....తెలంగాణాలో సెప్టెంబర్ 17వ తేదీని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామన్న హామీలు ఇచ్చారు. కెసిఆర్ ఇచ్చిన హామీలపై ప్రతిఏటా చర్చ జరుగుతూనే ఉంది. అయినా.....అధికార పార్టీగా పార్టీ నేతలు ఈ విషయంలో తాము ఇతర పార్టీలకు ఏమాత్రం తీసిపోమన్న చందంగా వ్యవహరిస్తున్నారు.

సెప్టెంబర్ 17 పై భిన్న భావనలు
కానీ ఇదంతా.... ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ. ఇప్పుడు ఈ హామీ గురించి ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. పార్టీ పరంగా తెలంగాణా భవన్ లో పతాకావిష్కరణ మాత్రం యధావిధిగా పార్టీ నిర్వహిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 17 ను విమోచన దినోత్సవం, విలీన దినం, విద్రోహ దినం అన్న పేర్లతో నిర్వహిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగానే డిమాండ్లు చేస్తున్నాయి.

 

ఘోర రోడ్డు ప్రమాదం..4గురు మృతి..

కరీంనగర్ : సైదాపురం మండలం దుద్దెనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఢీకొన్న ట్రాక్టర్ బావిలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. బైక్ పై వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్ కు గాయాలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందినవారు చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన శివ, సంతోష్, రాజు, శ్రీకాంత్ లకుగా గుర్తించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సహాయక చర్యల్ని చేపట్టారు.

హెచ్‌సీయూలో విద్యార్థి ఆత్మహత్య..

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఎఫ్‌ఏ మొదటి సంవత్సరం విద్యార్థి ప్రవీణ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూనివర్సిటీ వసతిగృహం ఎల్‌బ్లాక్‌లోని తన గదిలో ప్రవీణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

07:07 - September 17, 2016

హైదరాబాద్ : నిజాం నరమేధానికి ఎర్రజెండా ఎదురొడ్డి నిలిచింది. గడ్డి కోసిన చేతులే కొడవళ్లు పట్టాయి. బువ్వొండిన చేతులే తుపాకులు పట్టాయి. దొరను చూసి గజగజ వణికే జనం, గడీ తలుపులను బద్దలుకొట్టి దొరలను తరిమికొట్టారు. పొలం దున్నే రైతులు, కత్తులు పట్టి రాక్షస రజాకార్లపై విరుచుకుపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరులయ్యారు.

1947 సెప్టెంబర్‌ 11న సాయుధ పోరు ప్రారంభం
చదువు లేని జనంతో అక్షరాలు రాయించారు కమ్యూనిస్టులు. బానిస బతుకుల నుంచి బయటపడాలంటే దొరల బతుకును అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. సంఘం పెట్టారు. దేశ్‌ముఖ్‌ గూండాలను తరిమికొట్టారు. దొరల అహంకారానికి సమాధానం చెప్పారు. ఎర్రజెండా అండతో దొరలకు ఎదురు నిలిచారు. దీంతో దున్నేవాడిదే భూమి అనే నినాదం మార్మోగిపోయింది. 1947 సెప్టెంబర్‌ 11న తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైంది.

మతం పేరుతో చిచ్చుకు యత్నం
దడ పుట్టిన దొరలు నిజాం దగ్గరకు పరిగెత్తారు. రక్తం పారించైనా శవాల కుప్పలుగా వేసైనా తమ పెత్తనం సాగించుకోవాలని కుట్రలు పన్నారు. రజాకార్ల పేరుతో ఓ సైన్యాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. కమ్యూనిస్టు అనేవాడిని కనపడకుండా చేయాలనుకున్నారు. కులాల పేరుతో, మతాల పేరుతో జనాలను చీల్చాలని దుష్ట పన్నాగాలు పన్నారు. రజాకార్లు ఊర్ల మీద పడ్డారు. ఊచకోత కోశారు. నెత్తుటి ధారలు కారాయి. ఉద్యమకారుల గుండెలు బుల్లెట్లతో నిండిపోయాయి. ఆడవారిని చెప్పలేని విధంగా హింసలు పెట్టారు. తెలంగాణ అంతా అట్టుడికిపోయింది.

ఆరుట్ల కమలాదేవి..భీంరెడ్డి నరసింహ..తుపాకీ పట్టిన మల్లు స్వరాజ్యం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి తెగువ చూపింది. భీంరెడ్డి నరసింహారెడ్డి సింహనాదం చేశాడు. మల్లు స్వరాజ్యం తుపాకీతో తూటాలు వదిలింది. కమ్యూనిస్టు వీరులు జూలు విదిల్చారు. కత్తులు, కర్రలు, తుపాకులు ఆఖరికి కారం పొట్లాలు కూడా ఆయుధాలే. ప్రజలు సాయుధపోరాటానికి దిగారు. ఒకవైపు ఉద్యమకారులు కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతున్నా ఏ మాత్రం భయపడలేదు. నిజాం నవాబు, దొరల ఎత్తుగడలు వేల మంది నెత్తురును పారించాయి. అయినా ఒక ఉద్యమకారుడు చనిపోతే.. అది వేలమందిలో పోరాటస్ఫూర్తిని రగిలించింది. రోజురోజుకు రైతాంగ సాయుధ పోరాటం ఉధృతమైంది. 30 వేల గ్రామాల్లో 12 లక్షల ఎకరాలను కమ్యూనిస్టులు పంచిపెట్టారు.

చరిత్రపుటల్లో బైరాన్‌పల్లి దుర్ఘటన
1948 ఆగస్టు 27న నరమేధం జరిగింది. వరంగల్ జిల్లా బైరాన్ పల్లిలో మహిళలను నగ్నంగా చేసి, బతుకమ్మ ఆడించిన రజాకార్ల పైశాచిక ఆనందం నేటికీ వారి మనసుల్లో మానని గాయంగానే మిగిలిపోయింది. 400 మంది సైనికులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీంతో 118 మంది వీరమరణం పొందారు. బైరాన్‌పల్లి పోరాటం స్ఫూర్తిగా సమీపంలోని కూటిగల్‌ గ్రామప్రజలు సైతం రజాకార్లపై తిరుగుబాటు చేశారు.

07:02 - September 17, 2016

హైదరాబాద్ : దళిత హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన పౌరహక్కుల నేత బొజ్జా తారకం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటలకు తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్పలో 1939 జూన్‌ 27న బొజ్జా తారకం జన్మించారు. కాకినాడలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన బొజ్జా తారకం.. 1966లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. ప్రముఖ కవి బోయి భీమన్న కుమార్తె విజయభారతిని 1968లో వావాహం చేసుకున్నారు. ఆమె వృత్తిరీత్యా నిజామాబాద్‌లో పని చేస్తుండడంతో బొజ్జా తారకం నిజామాబాద్‌లో న్యాయవాద వృత్తిని కొనసాగించారు. అక్కడే అంబేద్కర్‌ యువజన సంఘాన్ని ప్రారంభించారు. 1975లో ఎమర్జెన్సీ కాలంలో జైలుకెళ్లారు. ఆ తర్వాత 1979 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. ప్రజా ఉద్యమాలకు సంబంధించిన అనేక కేసులను ఆయన హైకోర్టులో చేపట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కారంచేడు మారణహోమం తర్వాత న్యాయవాద వృత్తిని వదిలి.. దళిత ఉద్యమాలపై పోరాడారు. పోలీసుల ఎన్‌కౌంటర్లపై కేసులు నమోదు చేసి సుప్రీంకోర్టులో పోరాడి విజయం సాధించారు బొజ్జా తారకం.

ఐదు దశాబ్దాల పాటు అన్యాయాలపై గొంతెత్తి పోరాడిన న్యాయవాది
దళిత, పౌర హక్కుల ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన బొజ్జా తారకం.. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ప్రఖ్యాతి గడించారు. 'పోలీసులు అరెస్ట్‌ చేస్తే?'.. 'కులం-వర్గం', 'నది పుట్టిన గొంతుక', 'నేల నాగలి-మూడెద్దులు', 'దళితులు-రాజ్యం' తదితర పుస్తకాలను రచించారు.

అణగారిన వర్గాలకు తీరని లోటు -కేసీఆర్‌
బొజ్జా తారకం మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, న్యాయవాదిగా బహుముఖ సేవలందించిన బొజ్జా తారకం అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ.. తెలంగాణ ఉద్యమంలోని ధర్మాన్ని గుర్తించారని.. తనకు, ఉద్యమానికి మద్దతుగా నిలిచారన్నారు కేసీఆర్‌. ఆయన మృతి కుటుంబ సభ్యులకే కాకుండా.. బలహీనవర్గాలకు, సాహితీ ప్రియులకు, హక్కుల కోసం పోరాడేవారికి తీరని లోటని కేసీఆర్‌ అన్నారు. బొజ్జా తారకం కుమారుడు.. హైదరాబాద్‌ కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జాతో పాటు కుటుంబ సభ్యులకు కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బొజ్జా తారకం మృతికి పలువురు సంతాపం తెలిపారు. పీడిత ప్రజల తరబడి నిలబడి ఎన్నో పోరాటాలు చేశారని.. ఆయన మృతి అణగారిన వర్గాలకు తీరని లోటని పలువురు తెలిపారు. 

డెంగ్యూతో విద్యార్థి మృతి..

హైదరాబాద్ : డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ ఇంటర్ విద్యార్థి శుక్రవారం మృతిచెందాడు. హైదరాబాద్‌లోని బోడుప్పల్ శ్రీసాయినగర్‌కాలనీకి చెందిన సాయివిశ్వనాథరాజు(16) అనే విద్యార్థి చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. కాగా ఇటీవల నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు విషజ్వరాలు ప్రబలిన విషయం తెలిసిందే.

పోస్టల్ విభాగంలో 55వేల పోస్టుల భర్తీ..

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా పోస్టల్ విభాగంలో మొత్తం 55వేల గ్రామీణ డాక్‌సేవక్ పోస్టులను నవంబర్‌లో భర్తీ చేయనున్నట్టు భారత పోస్టల్ విభాగం సెక్రెటరీ బీవీ సుధాకర్ తెలిపారు. పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో చేపట్టనున్నామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, నవంబర్‌లో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

Don't Miss