Activities calendar

18 September 2016

21:57 - September 18, 2016

అమెరికా : న్యూయార్క్‌ పరిధిలోగల మన్‌హటన్‌లోని డంప్‌ యార్డులో రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 29 మంది గాయపడ్డారు. అగ్నిమాపక దళాలు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకి తరలించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఉగ్రవాదుల కుట్రా? అన్న నేపథ్యంలో ఎఫ్‌బీఐ అధికారులు విచారణ జరుపుతున్నట్లు న్యూయార్క్‌ మేయర్‌ తెలిపారు. శనివారం ఉదయం న్యూజెర్సీలో ఛారిటీ రేస్‌ జరుగుతున్న సమయంలో పైప్‌ బాంబు పేలిందని..ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సమావేశానికి హాజరుకావడానికి కొద్ది గంటల ముందే పేలుడు సంభవించడం గమనార్హం. ఈ ఘటనపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపించాల్సిందిగా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

 

21:55 - September 18, 2016

విజయవాడ : కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ రచించిన విభజన కథ పుస్తకాన్ని జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి, కేవీపీలతో పాటు పలువురు సీనియర్‌ పాత్రికేయులు పాల్గొన్నారు. విభజన సమయంలో పార్లమెంట్ కెమెరా ఫీడ్‌ ఆర్టీఐ చట్టం కింద అడిగామని..3 గంటల 1 నిమిషానికి 12 కెమెరాలు ఆగిపోయాయని చెప్పినట్లు తెలిపారు. కెమెరాల్లో సమస్య తలెత్తడం వల్లే నిలిచిపోయినట్లు సమాధానం వచ్చిందన్నారు. ఇలాంటి తప్పులు పునారావృతం కాకూడదనే బుక్‌ రాసినట్లు వివరించారు. పవిత్ర భావంతో తెలుగుజాతి కలిసి ఉంటే అభివృద్ధి జరుగుతుందని సమైక్య ఉద్యమంలో పోరాడానన్నారు కేవీపీ. ఆధిపత్యం కోసమో..పదవుల కోసమో కాదని ఆయన స్పష్టం చేశారు. 

 

21:52 - September 18, 2016

హైదరాబాద్ : ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య సెప్టెంబర్‌ 17 మాటల యుద్ధం పెంచింది. అధికారంలోకి వస్తే సెప్టెంబర్‌ 17న అధికారికంగా నిర్వహిస్తామన్న టీఆర్‌ఎస్‌.. మాట తప్పిందని అమిత్‌షా ఆరోపిణలపై ... గులాబీ నేతలు ఘాటుగానే స్పందించారు. టీఆర్‌ఎస్‌.. ఓవైసీకి భయపడుతుందన్న అమిత్‌షా వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. మతసామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. 
బీజేపీ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న టీఆర్ ఎస్  
కేంద్రంతో సయోధ్యగా అడుగులు వేస్తున్న తెలంగాణా  రాష్ట్ర సమితి నేతలు తమపై విమర్శలు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదనే సంకేతాలను ఇస్తున్నారు. సెప్టెంబర్‌ 17వ తేదీ సందర్భంగా పార్టీలన్నీ ప్రభుత్వం మాటల యుద్ధం చేశాయి. టీఆర్‌ఎస్‌పై అనేక విమర్శలు చేశాయి. అయితే కాంగ్రెస్‌, టీడీపీ నేతల వ్యాఖ్యలను పట్టించుకోని గులాబీ దళం బీజేపీ వ్యాఖ్యలను మాత్రం సీరియస్‌గా తీసుకుంది. 
గులాబీ పార్టీ విరుచుకుపడ్డ అమిత్‌షా  
వరంగల్‌ బహిరంగ సభకు హాజరైన అమిత్‌షా గులాబీ పార్టీ విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో తెలంగాణ ప్రభుత్వం సోకులు చేస్తుందని ఆరోపించారు. సెప్టెంబర్‌ 17వ తేదీని అధికారికంగా నిర్వహిస్తామన్న టీఆర్‌ఎస్‌ ఎందుకు నోరు మెదపడం లేదని అమిత్‌షా ప్రశ్నించారు. ఎంఐఎంతో జతకట్టిన టీఆర్‌ఎస్‌.. తెలంగాణ విమోచనం దినోత్సవం జరిపేందుకు భయపడుతుందని ఆరోపించారు. 
అమిత్‌షా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన టీఆర్‌ఎస్‌ నేతలు  
అమిత్‌షా వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా స్పందించారు. మతసామరస్యానికి ప్రతీకైన తెలంగాణలో రెచ్చగొట్టి లబ్ధి పొందాలని బీజేపీ యత్నిస్తుందని హరీష్‌రావు అన్నారు. విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి దక్కాల్సిన అభివృద్ధి పనులపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదన్నారు. 
అమిత్‌షాకు లెక్కలు సరిగ్గా తెలియదు  : ఎంపీ కవిత  
అమిత్‌షాకు లెక్కలు సరిగ్గా తెలియదని ఎంపీ కవిత అన్నారు. రాజకీయ లబ్ధి కోసం అమితంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కంటే అధికంగా ఎన్ని నిధులు ఇచ్చారో కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మొత్తానికి ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న బీజేపీ-టీఆర్‌ఎస్‌ల మధ్య సెప్టెంబర్‌ 17 మాటల యుద్ధం పెంచింది. మరి ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి.

 

21:48 - September 18, 2016

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ యూరి సెక్టార్‌లో సైనిక శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిని ప్రధాని మోడీతో సహా పలువురు నేతలు ఖండించారు. ముష్కర మూకల దాడి పిరికిపందల చర్య అని మోదీ పేర్కొన్నారు.  ఈ ఘటనలకు పాల్పడ్డవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. దాడిని ఖండించిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి... సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ చర్యలను ఆక్షేపించారు. దేశంలో శాంతి, సామరస్యాలను దెబ్బ తీసేందుకే ఉగ్రమూకలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా మండిపడ్డారు. 
దాడిపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్ష 
జమ్ముకశ్మీర్‌ బారాముల్లా జిల్లా యురి సెక్టార్‌లో సైనిక శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటను ప్రధాని తీవ్రంగా ఖండించారు. దీన్ని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన నీచులకు శిక్ష తప్పదని ట్విట్టర్‌  ద్వారా  హెచ్చరించారు. దేశమాత రక్షణలో ప్రాణాలు కోల్పోయిన  17 మంది వీర జవాన్ల సేవలను దేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారని  మోదీ పేర్కొన్నారు. దాడి తర్వాత కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌తో మాట్లాడారు. 
సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలి : రాజ్‌నాథ్‌సింగ్‌ 
యురిలో సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని సైనికాధికారులను కోరారు. జమ్మూ-కశ్మీర్‌ ముఖ్యమంత్రి, గవర్నర్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. అంతర్జాతీయ సమాజం ముందు.. పాకిస్థాన్‌ను ఏకాకిని చేయాలని ఈ సమావేశం అభిప్రాయపడింది. రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌, ఆ శాఖ సహాయ మంత్రి సుభాశ్‌ ఉగ్రదాడిని ఖండించారు. ఘటన గురించి తెలియగానే.. రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌ హుటాహుటిన శ్రీనగర్‌ బయలుదేరి వెళ్లారు.  సైనిక ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. అటు జమ్మూ-కశ్మీర్‌ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్‌.. పాక్‌ ఉగ్రవాదుల అక్రమ చొరబాట్లను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. 
దాడిని ఖండించిన సోనియాగాంధీ 
యురి సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడిని కాంగ్రెస్‌ అధనేత్రి సోనియాగాంధీ ఖండించారు. దేశంలో శాంతి,  సామరస్యాలను దెబ్బ తీసేందుకు ముష్కరమూకలు ఇలాంటి ఘటనలను పాల్పడుతున్నాయని ఆక్షేపించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు సంతాపం ప్రకటించి, వీరి  కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూరి సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడిని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. ఉగ్రవాదులను ప్రోత్సహించడం పాకిస్థాన్‌ మానుకోవాలని కోరారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలని, చర్చల ద్వారానే కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జులై 7న హిల్‌బుల్‌ కమాండ్‌ బర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ తర్వాత జమ్ము-కశ్మీర్‌లో  చెలగేరిన హింస, వరుసగా జరుగుతున్న ఉగ్రవాదుల దాడులు అన్ని వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 

 

21:40 - September 18, 2016
21:39 - September 18, 2016
21:36 - September 18, 2016

'జాగ్వార్' ఆడియో రిలీజ్  అయింది. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ఈచిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

కాకతీయ మెడికల్ కళాశాలకు బాంబు బెదిరింపు

వరంగల్ : కాకతీయ మెడికల్ కళాశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ కాలేజీలో తనిఖీలు నిర్వహించారు. 

విభజన కథ పుస్తకావిష్కరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్

 హైదరాబాద్ : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన విభజన కథ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

21:13 - September 18, 2016

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని యురిలో సైనిక చర్య కొనసాగుతోందని రణ్ బీర్ సింగ్ డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ అన్నారు. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై దాడి ఘటనలో నలుగురు జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టామని రణబీర్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదుల దాడిలో 17 మంది సైనికులు మరణించారని పేర్కొన్నారు.

గుడిపల్లి రిజర్వాయర్ లో ఇద్దరు యువకులు గల్లంతు

మహబూబ్ నగర్ : నాగర్ కర్నూలు మండలం గుడిపల్లి రిజర్వాయర్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఆరుగురు యువకులు గుడిపల్లి రిజర్వాయర్ లో చూడటానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు రిజర్యాయర్ లో పడి  గల్లంతయ్యారు. గల్లంతైన వారు నాగర్ కర్నూల్ వాసులుగా గుర్తించారు. 

20:42 - September 18, 2016

విజయవాడ : చనిపోయిన తమ స్నేహితురాలి గౌరవార్థం... పూర్వ విద్యార్థులు సామాజిక సేవ చేపట్టిన ఘటన విజయవాడలో జరిగింది. నగరంలోని శిశు విద్యామందిరంకు చెందిన 1984..85 బ్యాచ్ విద్యార్థులు.. పాతికేళ్ల తరువాత కలుసుకున్నారు. తమతో కలిసి చదువుకున్న గౌరీలక్ష్మీ ఇటీవల మృతిచెందడంతో... ఆమె పేరిట.. సేవా కార్యక్రమం చేపట్టారు. స్థానిక అయోధ్యనగర్‌లోని శారదా విద్యాలయంలో హెచ్ ఐవి బాధిత పిల్లలకు, అనాథ పిల్లలకు నిత్యవసర వస్తువులు, పౌష్టికాహారం అందించారు. స్నేహితురాలి పేరిట వీరు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు ప్రశంసించారు. 

 

20:40 - September 18, 2016

విజయవాడ : విభజన గాయాలతో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడ్డారా..? తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమో.. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకో.. వెనక్కి తగ్గారా..? అందుకే ఆర్థిక ప్యాకేజీకి తలొగ్గారా..? వైసీపీని దెబ్బతీసేందుకు బీజేపీతో మైత్రీ సాగిస్తున్నారా..? ఈ అన్ని ప్రశ్నలకూ విశ్లేషకులు అవుననే అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న హోదా రగడపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ..!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆందోళనలు 
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ఆందోళనలు, నిరసనలు.. ఎక్కడ విన్నా.. ఒకటే డిమాండ్‌.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని. కానీ, హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి.. ప్యాకేజీతో సరిపెట్టింది మోదీ ప్రభుత్వం. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. విపక్ష, ప్రజాసంఘాల నేతలు బీజేపీ నేతలను ఘెరావ్‌ చేస్తున్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీకే తలొగ్గిన టీడీపీ తీరును తీవ్రంగా ఎండగడుతున్నారు.
కేంద్రంతో ఎందుకు లాలూచీ పడ్డారని ప్రశ్న
రాష్ర్ట ప్రయోజనాల కోసం ఎందకైనా పోరాటం చేస్తానని పదేపదే కబుర్లు చెబుతున్న చంద్రబాబు.. ప్యాకేజీకి ఎందుకు మొగ్గుచూపారని, కేంద్రానికి ఎందుకు మోకరిల్లారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్రంతో పోరాటం చేయకుండా.. చంద్రబాబు రాజీపడటంలో అనేక కారణాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తన వారసుడు నారా లోకేష్‌ రాజకీయ భవిష్యత్తు కోసమే చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడ్డారన్న విపక్షాల విమర్శల్లో కొంతైనా నిజం లేకపోలేదని విశ్లేషకులూ అభిప్రాయపడుతున్నారు. 
వైసీపీని దెబ్బతీయాలని టీడీపీ ప్లాన్‌
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీని గట్టిగా దెబ్బ తీయాలంటే  కేంద్రం సహకారం అవసరమని, అందుకే ప్రత్యేక హోదాకోసం చంద్రబాబు గట్టిగా పట్టుబట్టలేదని అంటున్నారు. ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రిని ఘాటుగా విమర్శిస్తున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కేంద్రాన్ని మాత్రం పెద్దగా తప్పుబట్టడం లేదు. హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని నిందించకుండా.. ఎంతసేపు అధికారపార్టీనే టార్గెట్‌ చేయడానికి బలమైన కారణాలే ఉన్నాయంటున్నారు. అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడేందుకు.. ప్రత్యేక ఇవ్వని కేంద్రంతో జగన్‌ కొంత జాగ్రత్తగా ఉంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
ఏపీ ప్రయోజనాలను కేంద్రం దెబ్బతీస్తోందా..? 
చంద్రబాబు ఓటుకు నోటు కేసు, జగన్‌ కేసులను అస్ర్తాలుగా చేసుకుని.. రెండు పార్టీల అధినేత లొసుగులను ఆసరాగా చేసుకుని... ఏపీ ప్రయోజనాలను కేంద్రం దెబ్బతీస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకలు. భవిష్యత్తులో లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయడం కోసం చంద్రబాబు ఇప్పటి నుంచే గ్రౌండ్‌లెవల్‌లో ప్లాన్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వొచ్చంటున్నారు. 
ప్యాకేజీ చుట్టే చంద్రబాబు పరుగులు 
హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తేగేసి చెబుతున్నా.. ప్యాకేజీ చుట్టే చంద్రబాబు పరుగులు తీస్తున్నారని అంటున్నారు. ఇటు పవన్‌కళ్యాణ్‌ కూడా ప్రత్యేకహోదా కోసం సీరియస్‌గా పోరాటం చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆవేశంతో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని.. జనాల్నీ రెచ్చగొట్టి.. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉండడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ఏపీలో తనకు తిరుగులేదని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న తెలుగుదేశానికి చెక్‌పెట్టేందుకు వామపక్షాలు అలుపెరగకుండా పోరాటం చేస్తున్నాయంటున్నారు. 
వారసుడిని రాష్ర్టాధినేతగా చూసేందుకు కేంద్రంతో సఖ్యత 
చంద్రబాబుకు వృద్ధాప్యం మీద పడుతుండటంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, వారసుడిని రాష్ర్టాధినేతగా చూసేందుకు కేంద్రంతో సఖ్యత నెరుపుతున్నారని అంటున్నారు. మొత్తంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ సమయంలో బీజేపీతో టీడీపీ చెలిమి భవిష్యత్తులో కలిసి వస్తుందా..? లేక దెబ్బకొడుతుందా..? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. 

 

20:35 - September 18, 2016

హైదరాబాద్ : వెంకయ్యనాయుడు,..ఓ మాటల మాంత్రికుడు. తన మాటల అల్లికతో మంత్ర ముగ్దులను చేసే బిజెపి సీనియర్ నేత. ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ప్రజల నుండి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలు తిప్పిగొట్టే ప్రయత్నంలో భాగంగా ఆయన చేస్తున్న మరో ప్రయత్నం కొత్త చిక్కుల్లో పడేసింది. దీంతో వెంకయ్య నాయడి మాటలన్నీ బొంకులే అని మరోమారు నిరూపించాయి. 
మాటల గారడి చేసి బోల్తాపడిన వెంకయ్య
ఆది అంత్య ప్రాసలతో.. మాటల అల్లికతో బిజెపి అభిమానులను మంత్ర ముగ్దులను చేసే వెంకయ్య నాయుడు,..మరోసారి మాటల గారడి చేసి బోల్తాపడ్డారు. ఎంతో తెలివిగా మాట్లాడుతూ..ప్రత్యర్థుల ఆరోపణలను తనదైన శైలిలో తిప్పికొట్టే వెంకయ్య ..ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మాత్రం అసలు విషయం చెప్పి నాలుక కరుచుకున్నారు. 
హోదా పదేళ్లు కావాలని రాజ్యసభలో గర్జించిన వెంకయ్య నాయుడు  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తే..కాదు కాదు పదేళ్లు కావాలని రాజ్యసభలో వెంకయ్య నాయుడు గర్జించారు. ఆ తరువాత ప్రత్యేక హోదా అంశం తన పోరాటంతోనే తెరపైకి వచ్చిందని గొప్పలు చెప్పుకొని సన్మానాలు, సత్మారాలు చేయించుకున్నారు. దీంతో ప్రజలంతా వెంకయ్య నాయుడు పోరాటంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చిందని నమ్మారు. కానీ బీజేపి అధికారం చేపట్టాక ప్రజలకు అసలు విషయం తెలిసింది. వెంకయ్య..చెప్పిందంతా ఉత్తుత్తిదేనని. దీంతో ప్రజల్లో వెంకయ్య నాయుడుపై తీవ్ర అసంతృప్తి, ప్రత్యర్థి పార్టీల నుండి తీవ్ర ఆరోపణలు వెళ్లువెత్తాయి. విభజన చట్టంలో పెట్టనందునే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామని కొత్త పల్లవి ఎత్తుకొని తప్పించుకొనే ప్రయత్నం చేసి..తప్పంతా కాంగ్రెస్‌ పార్టీపై తోసే ప్రయత్నం చేశారు. ఇది కూడా నిజమేనేమో అని కొందరు నమ్మారు కూడా. 
విజయవాడలో హడావిడి 
అయితే వెంకయ్య నాయుడు ప్రత్యేక ప్యాకేజ్ రూపంలో లడ్డులు తానే తెప్పిస్తున్నానని మరో ఎత్తుగడ వేసి నానా హంగామా చేశారు. ఇందులో భాగంగా విజయవాడలో హడావిడి చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి కొనసాగిన ఈ తంతు విజయవాడలోని సభ వరకు అడుగడుగునా అబ్బో అనిపించారు. ఏపికి ప్రత్యేక ప్యాకేజ్ కూడా తన చలువే అనే ప్రజల్ని నమ్మించేందుకు టిడిపి మంత్రులను, నేతలను ఆహ్వానించి ప్రజల్లోకి మరో మెసేజ్ పంపే యత్నం చేశారు. అంతా బాగానే ఉంది. తన ప్రసంగానికి వస్తున్న స్పందన చూసి ఆవేశంలో, సోలోలో వెంకయ్య అసలు విషయం బయటకు కక్కారు. తనకు ప్రత్యేక హోదా రాష్ట్రానికి రాదని, అవకాశం లేదని ముందుగానే తెలుసని..అయితే రాజ్యసభలో ఆనాడు ఉన్న వేడిలో తాను ప్రత్యేక హోదా కావాలని మాట్లాడానని చెప్పి తన నాటకాన్ని తన నోటితోనే బయటపెట్టేశారు. అంతలోనే తేరుకొని ప్రత్యేక హోదా చట్టంలో పెట్టి ఉంటే ఆ వేడిలో చట్టం అమలయ్యేదని చెప్పుకొచ్చారు.
భగ్గుమంటున్న ప్రతిపక్షాలు  
వెంకయ్యనాయుడు ఎత్తుగడ తిరగబడడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి మాటలు మాట్లాడటం వెంకయ్య నాయుడు వయసుకు దగదని..ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి. రాజ్యసభలో హైడ్రామా చేశానని, అబద్దాలు చెప్పానని స్వయంగా ఒప్పుకున్న వెంకయ్యపై వైసిపి నాయకులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రానికి హోదా ఇస్తామని చెప్పి..ఇప్పుడు హోదా కాదు ప్యాకేజీ అంటూ రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసిన వెంకయ్యనాయుడిపై వామపక్షాలు విజయవాడ భవానీపురం పీఎస్‌లో 420కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అయితే తొలుత ఫిర్యాదును సీఐ స్వీకరించకుండా బయటకువెళ్లిపోయారు. దీంతో వామపక్షాలు పీఎస్‌ ముందు ఆందోళనకు దిగడంతో పీఎస్‌కు వచ్చిన సీఐ ఫిర్యాదును స్వీకరించారు. 
మభ్యపెట్టే పద్ధతి మానుకోవాలంటున్న ప్రజలు 
మొత్తానికి వెంకయ్య రాజ్యసభలో చేసిన హడావిడి అంతా పెద్ద డ్రామానేది ప్రజలందరికి తెలిసిపోయింది. చేసిన తప్పును తన నోటితోనే ఒప్పుకొన్న వెంకయ్య నాయుడు ఇంకా కింద పడ్డా తనదే పైచేయి అన్నట్లు ప్రవర్తించడం సరైంది కాదని విపక్షాలు అంటున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే పద్ధతి మానుకోవాలని సూచిస్తున్నారు. 

20:24 - September 18, 2016

విజయవాడ : ఏపీకి ఇచ్చిన అభివృద్ధి నిధులను తెలంగాణకు కూడా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. విజయవాడలో ఆయన స్నేహితుడు రఫీ కూతురు వివాహానికి హాజరైన నాయిని.. వధువరులను ఆశీర్వదించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరు సీఎంలు కృషి చేయాలన్నారు. 

 

20:20 - September 18, 2016

వరంగల్‌ : జీవో 123 జీవో సరైనది కాదని... ఈ జీవో ప్రకారం భూములు తీసుకుంటే ఊరుకునేది లేదని సీపీఎం నేత, భూపోరాట సమితి నాయకులు బి.వెంకట్‌ అన్నారు. 2013 చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో భూపోరాట సమితి నాయకులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. టెక్స్‌టైల్‌ పార్క్‌ పేరుతో 3 వేల ఎకరాలు బలవంతంగా లాక్కుంటున్నారని పేర్కొన్నారు. రైతులను బెదిరిస్తూ భూములను లాక్కుంటున్నారని తెలిపారు. అధికారులు చట్టాలను ఉల్లంఘిస్తే కోర్టుకీడుస్తామన్నారు. వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మాటలను నమ్మడానికి వీలు లేదని చెప్పారు. జిల్లాలో టెక్స్‌టైల్‌ పార్క్‌ కోసం గీసుకొండ, శాయంపేట మండలాల్లో బలవంతంగా భూముల లాక్కుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతులను బెదిరించి భూములు లాక్కుంటున్నారని జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఎకరాకు కేవలం ఐదారు లక్షలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. న్యాయపరమైన పరిహారమివ్వకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

 

20:09 - September 18, 2016

విశాఖ : రాష్ట్రాన్ని నాలెడ్జ్ సెంటర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నంలో విద్యాశాఖలో భారీ సంస్కరణలు చేపడుతున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో సత్యసాయి విద్యాజ్యోతి పథకాన్ని మంత్రి ప్రారంభించారు. విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా 900 స్కూళ్లను దత్తత తీసుకుని లక్షా 80 వేల మంది విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించనున్నారని తెలిపారు. గ్లోబలైజేషన్ మోడరైజేషన్ వచ్చిన తరువాత విద్యా వ్యవస్థలో నైతిక విలువలు పతనం అవుతున్నాయని గంటా విచారం వ్యక్తం చేశారు. 

 

20:07 - September 18, 2016

శ్రీకాకుళం : ప్రత్యేక హోదా అంశంపై సమాధానాన్ని కేంద్రమంత్రి అశోక గజపతి రాజు దాటవేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయితీ భవనంలోని సోలార్ పవర్ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ప్రత్యేక ప్యాకేజీపై నవ్యాంధ్ర ప్రజలు ఎందుకు కొంత అసహనంతో ఉన్నారో అన్న విషయాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తామని తెలిపారు. ప్రతీచోట హోదా గురించే ఇదే విషయం మాట్లాడటం సరికాదన్నారు. 

 

20:00 - September 18, 2016

విశాఖ : ప్రత్యేక హోదా వల్ల వచ్చే మేలు గురించి చర్చించే దమ్ము బీజేపీకి గానీ, టీడీపీకీ గానీ ఉందా అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. అటు వెంకయ్యనాయుడు ఇటు చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడుతూ రాష్ర్ట ప్రజలను మోసం చెస్తున్నారని ఆయన ఆరోపించారు. త్వరలో ప్రత్యేక హోదా గురించి రాష్ట్ర వ్యాప్తంగా 6 చోట్ల భారీ సభలు నిర్వహిస్తున్నామన్నారు. 

 

న్యూడెమోక్రసీ టేకులపల్లి ఏరియా దళ కమాండర్ గణేష్ అరెస్టు

ఖమ్మం : గుండాల మండలం కాంచనపల్లిలో న్యూడెమోక్రసీ టేకులపల్లి ఏరియా దళ కమాండర్ గణేష్ అరెస్టు చేశారు. అతని నుంచి రివాల్వర్, 7 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 

19:48 - September 18, 2016

హైదరాబాద్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ భవన్ లో బంగారు తెలంగాణ బతుకమ్మ పోస్టర్ ను ఎంపీ కవిత రిలీజ్ చేశారు. పాటల పుస్తన్నా కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక బతుకమ్మను ధైర్యంగా ఆడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. 

19:22 - September 18, 2016

నెల్లూరు : జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై చర్చ వేదిక నిర్వహించారు. పునర్‌ విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో పొందుపరచనప్పటికీ పలు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని..ఏపీకి కూడా ఇవ్వాలని జనవిజ్ఞాన జిల్లా అధ్యక్షుడు బుజ్జయ్య డిమాండ్ చేశారు. 
 

19:18 - September 18, 2016

విశాఖ : పట్టణానికి ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలన్న ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సీఐటీయు ఈ అంశాన్ని అట్టడుగు కార్మికుల వరకూ తీసుకేళ్లే విధంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. కరపత్రాలు పంచడంతో పాటు పరిశ్రమల వద్ద గేట్ మీటింగ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కించిన టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ఇప్పుడు విశాఖకు రావాల్సిన రైల్వే జోన్‌ను వేరే ప్రాంతానికి ప్రయత్నం చేస్తున్నారని సీఐటీయు నేతలు విమర్శించారు. సెప్టెంబర్ 23న విశాఖ నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

19:14 - September 18, 2016

కృష్ణా : ఎంతో చారిత్రక ప్రాముఖ్యత గలిగిన ఆ కళాశాల స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పాత్ర పోషించింది. ఎందరో మహానుభావులను దేశానికి అందించింది. బ్రిటిష్‌ వృత్తులపై తిరుగుబాటు చేసిన ఘనత కూడా ఆ కాలేజీకి ఉంది. ఇంతటి యశస్సును సొంతం చేసుకున్న ఆ సుప్రసిద్ధ కళశాల.. ఇప్పుడు తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది. అక్రమార్కుల పడగ నీడలో.. చారిత్రక కళాశాల ఆస్తులు అన్యాక్రాంతమైపోతున్నాయి. కబ్జాలతో కుంచించుకు పోతున్న మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాలపై 10టవి ప్రత్యేక కథనం...! 
స్వాతంత్ర్యోద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన కళాశాల
కృష్ణా జిల్లా మచిలీపట్నం నడిబొడ్డున గల ఆంధ్రజాతీయ కళాశాల. స్వాత్రంత్య ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ఈ కళాశాల ఇప్పుడు ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది. కళాశాల ప్రాంగణం అంతా కబ్జాకోరుల చేతుల్లో చిక్కి కళాశాల మూతపడే దుస్థితికి  చేరుకుంది.  
1907లో ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్తు స్థాపన
1907లో ప్రముఖ స్వాతంత్ర యోధుడు బిపిన్‌ చంద్రపాల్‌ పిలుపు మేరకు జాతీయ కాంగ్రెస్‌ అప్పటి అధ్యక్షుడు పట్టాభి సీతారామయ్య, కృష్ణా పత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు సహాయంతో కొంపెల్లి హన్మంతరావు 500 ఎకరాలు సమీకరించి ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్తును నెలకొల్పారు. 1921, 1933లో గాంధీజీ ఈ కళాశాలను సందర్శించి... ఇలాంటి విద్యాసంస్థ అవసరం దేశానికి ఎంతో ఉందని కొనియాడారు. ఆంధ్ర జాతీయ కళాశాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజలపై ఉన్నదని, ఈ కళాశాల దేశానికే గర్వకారణమని ఏనాడో గాంధీజీ కూడా ప్రశంసించారు. స్థానికులు నేటికీ వాటిని స్మరించుకుంటున్నారు. 
ఐటీఐతో ప్రారంభమై ఆంధ్ర జాతీయ కళాశాలగా రూపాంతరం 
ఐటీఐతో ప్రారంభమైన ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్తు కాలక్రమేణా ఇంటర్, డిగ్రీ కోర్సులతో ఆంధ్ర జాతీయ కళాశాలగా రూపాంతరం చెందింది. ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణ కొరకు బీఈడీ, పదో తరగతి వరకు ఓరియంటల్ స్కూల్స్‌ వున్నాయి. 1921 లో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో మహాత్మాగాంధీ మనకు ఒక జాతీయ జెండా అవసరం అన్న పిలుపును అందుకుని పింగళి వెంకయ్య నాయకత్వంలో ఇదే కళాశాలలో త్రివర్ణ పతాకానికి రూపకల్పన చేశారు.  
కళాశాల భూములను కాజేసే యత్రం 
ఎంతో చారిత్రక నేపథ్యం, ప్రాముఖ్యత కలిగిన ఆంధ్ర జాతీయ కళాశాల భూములను కొందరు కబ్జాకోరులు కాజేయాలని చూస్తుండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. కొంతకాలంగా కళాశాల భూములు, ప్రాంగణం అక్రమార్కుల పాలవుతున్న పట్టించుకున్న నాథుడే లేడు. ఈ కళాశాల ఆస్తులకు సంబంధించి వారసులెవరూ లేరని అప్పట్లోనే కొంపెల్లి హన్మంతరావు స్పష్టం చేశారు. అయినా కొంపెల్లి వారసుడినంటూ ఇటీవల ఓ డిఎస్పీ కళాశాల ఆస్తులపై ఆజమాయిషీ చెలాయించడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే న్యాయస్థానంలో రెండుసార్లు కేసు ఓడినప్పటికీ.. సదరు డిఎస్పీ కళాశాల ఆస్తుల్ని ఆక్రమించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికి తోడు 60 ఎకరాల కళాశాల భూములు స్థానిక టీడీపీ కార్యకర్త గుడిసె రామారావు కబ్జా చేసినా పట్టించుకున్న వారే లేరన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  
అసంబద్ధ నిర్ణయాలతో దేవాదాయశాఖ పరిధిలోకి కళాశాల  
ఎన్టీఆర్‌ హయాంలో... మాజీ ఎమ్మెల్యే వడ్డే రంగారావు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల ఆంధ్ర కళాశాల అంతా దేవాదాయశాఖ పరిధిలోకి వెళ్లింది. ప్రస్తుతం ఈ కళాశాల మూడు కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో నడుస్తోంది. మైదానం, భవన సముదాయాలు ఉన్నా.. కొత్త కోర్సులు ప్రవేశ పెట్టక, విద్యార్థుల సంఖ్య ఏటికేడు తగ్గుతోంది.  ఇప్పటికే చాలా మంది అధ్యాపకులు రిటైర్‌ కావడంతో అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది.  కళాశాల పునర్‌ వైభవానికి స్థానిక నేతలు, పాలకులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 

19:03 - September 18, 2016

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర ముష్కరులు తెగబడ్డారు. బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్‌ 12వ బ్రిగేడ్‌ హెడ్‌ క్వార్టర్స్‌పై ఉగ్రమూక విరుచుకు పడింది. భారత సైనికులే లక్ష్యంగా భారీ మారణాయుధాలతో ఆర్మీ క్యాంప్‌లోని అడ్మినిస్ట్రేటీవ్‌ బిల్డింగ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఉగ్ర ఘాతుకంలో 17 మంది భారత జవాన్లు  అమరులయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. వెంటనే తేరుకున్న భారత సైన్యం.. నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టింది. 
అడ్మినిస్ట్రేటీవ్‌ బిల్డింగ్‌పై కాల్పులు 
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలో భారత జవాన్లే లక్ష్యంగా నలుగురు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. యురి సెక్టార్‌లోని 12వ బ్రిగేడ్‌ హెడ్‌క్వార్టర్స్‌లోకి మారణాయుధాలతో చొరబడ్డ దుండగులు..  ఆర్మీ క్యాంప్‌లోని అడ్మినిస్ట్రేటీవ్‌ బిల్డింగ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 17 మంది భారత జవాన్లు  ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. 
సైన్యం కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం 
కాల్పుల్లో గాయపడ్డ జవాన్లను ప్రత్యేక హెలికాప్టర్లలో చికిత్స కోసం శ్రీనగర్ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు జవాన్లు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగాయి. సైన్యం కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమవగా... మరికొంత మంది ఉగ్రవాదులు పరిసరాల్లో ఉండొచ్చన్న భావనతో.. భారత సైన్యం ప్రత్యేక చాపర్లతో గాలింపు చర్యలు చేపట్టింది. 
ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి
ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఉగ్రఘటనను ఖండించారు. అటు రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌... ఆర్మీ చీఫ్‌ ప్రత్యేక చాపర్‌లో ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యురి టెర్రర్ ఎటాక్‌పై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. రష్యా, అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. తక్షణమే తన నివాసంలో ఉన్నతస్థాయిలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ చీఫ్‌, డైరెక్టర్‌ జనరల్ మిలటరీ ఆపరేషన్స్‌ లెఫ్టినెంట్‌ జనరల్ రణబీర్‌సిగ్‌, డిఫెన్స్‌ సెక్రటరీ జీ మనోహర్‌ కుమార్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ డీజీ హాజరయ్యారు. 
ఇది పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల పనే : ఇంటలిజెన్స్‌ వర్గాలు 
సైనిక కేంద్రాలపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. ఇది పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదుల పనేనని ఇంటలిజెన్స్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పదేళ్ల కాలంలో కశ్మీర్‌లో ఇంత పెద్ద దాడి ఇదే మొదటి సారి. ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టుల్లోనూ  కేంద్రం  హైఅలెర్ట్‌ ప్రకటించింది. 

 

18:59 - September 18, 2016

ఉగ్రదాడిని ఖండించిన రాష్ట్రపతి ప్రణబ్

ఢిల్లీ : యురి సెక్టార్ లో ఉగ్రదాడిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ఖండించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన సైనికులకు నివాళులర్పించారు. సైనికుల కుటుంబాలకు రాష్ట్రపతి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 
 

నలుగురు జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టాం : రణబీర్ సింగ్

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై దాడి ఘటనలో నలుగురు జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టామని డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ తెలిపారు. అతని నుండి 4 ఏకే..47, గ్రనేడ్లు, 4 రాకెట్ లాంచర్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఉగ్రవాదుల దాడిలో 17 మంది సైనికులు మరణించారని పేర్కొన్నారు. 

 

బంగారు బతుకమ్మ పోస్టర్ ను రిలీజ్ చేసిన కవిత

హైదరాబాద్ : బంగారు బతుకమ్మ పోస్టర్ ను టీఆర్ ఎస్ ఎంపీ కవిత విడుదల చేశారు. తెలంగాణ భవన్ లో ఆమె ఓ బతుకమ్మ పేరుతో ఉన్న పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం ఆమె ప్రసంగించారు.

 

18:27 - September 18, 2016

తూర్పుగోదావరి : కాకినాడ జేఎన్టీయూలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి కన్వెన్షన్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాము సూర్యారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలు యూనివర్సిటీల నుంచి విద్యార్థుల భారీగా తరలివచ్చారు. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాల పెరుగుదలకు ప్రభుత్వం ప్రయత్నించాలని రాము సూర్యారావు అన్నారు. విదేశీ మోజులో ఉన్నత యూనివర్సిటీలను దిగజార్చడం సరికాదని తెలిపారు. విద్యార్థుల ఉద్యమానికి తామంతా అండగా ఉంటామన్నారు.

 

కేంద్రంపై మంత్రి హరీష్ రావు ఫైర్

హైదరాబాద్ : కేంద్రప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బీజేపీ బహిరంగ సభలో నిన్న ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. మతసామరస్యానికి తెలంగాణ ప్రతీక అభివర్ణించారు. తెలంగాణకు ఎందుకు ప్యాకేజీ ఇవ్వరని నిలదీశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు జరుపలేదని ప్రశ్నించారు. 'తిరంగయాత్ర' కాశ్మీర్ లో చేసుకోండని ఉచిత సలహా ఇచ్చారు. 

 

17:36 - September 18, 2016

హైదరాబాద్ : కేంద్రప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. విమర్శల జడివాన కురిపించారు. కేంద్రం పనితీరును ఎండగట్టారు. బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. బీజేపీ బహిరంగ సభలో నిన్న ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. మతసామరస్యానికి తెలంగాణ ప్రతీక అభివర్ణించారు. తెలంగాణకు ఎందుకు ప్యాకేజీ ఇవ్వరని నిలదీశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు జరుపలేదని ప్రశ్నించారు. 'తిరంగయాత్ర' కాశ్మీర్ లో చేసుకోండని ఉచిత సలహా ఇచ్చారు. 

 

17:12 - September 18, 2016

కర్నూలు : జిల్లాలోని ఓర్వకల్లు మండలంలోని రాతివనాల వద్ద హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనాస్థలాన్ని డీఎస్పీ రమణమూర్తి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై మంత్రి శిద్ధా రాఘవరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 

 

కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన మోడీ

ఢిల్లీ : కాశ్మీర్ ఉగ్రదాడిని ప్రధాని నరేంద్రమోడీ ఖండించారు. ఉగ్రదాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వీర మరణం పొందిన సైనికులకు వందనాలు తెలిపారు. 

కాశ్మీర్ ఉగ్రదాడితో కేంద్రం అప్రమత్తం

ఢిల్లీ : కాశ్మీర్ ఉగ్రదాడితో కేంద్రం అప్రమత్తం అయింది. దేశంలోని అన్ని విమానాశ్రయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కాశ్మీర్ సరిహద్దుల వెంట భారీగా బలగాలను మోహరించారు. వాయుమార్గంలో పారా కమాండోలతో నిఘా పెంచారు. ఎల్ వోసీ, బారాముల్లా సహా పలు రహదారులను మూసివేశారు. 

 

రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అత్యవసర భేటీ

ఢిల్లీ : కేంద్రం హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అత్యవసర భేటీ అయ్యారు. ఉగ్రదాడిపై ఆర్మీ అధికారులతో రాజ్ నాథ్ సింగ్ చర్చలు జరిపారు. పాక్ ప్రోద్బలంతోనే ఉగ్రదాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ను ఏకాకిని చేయాలని పులుపిచ్చారు. 

 

జగన్ వి బూటకపు మాటలు : కళా వెంకట్రావు

శ్రీకాకుళం : జగన్ వి బూటకపు మాటలని.. ప్రజలు నమ్మరని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ప్రతిపక్ష నేతకు అవగాహన లేదని విమర్శించారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని జగన్ ప్లాన్ చేశారని ఆరోపించారు. 

 

ఉగ్ర దాడులు కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కాదు : ఏచూరి

ఢిల్లీ : ఉగ్ర దాడులు కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కాదని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఉగ్రదాడుల వల్ల సమస్యలు మరింత పెరుగుతాయన్నారు. ఉగ్రవాదం, కాశ్మీర్ సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలతో రాజకీయ చర్చలు జరపాలని కోరారు. అఖిలపక్ష బృందం సూచనలను కేంద్రం, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాలు అమలు పరచాలని సూచించారు. సైనికుల సమస్యలను కేంద్రం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

16:30 - September 18, 2016

ఢిల్లీ : కాశ్మీర్ లో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. భారత్ పై పాక్ జోక్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్.. ఉగ్రవాద గ్రూపులకు మద్దతివ్వడం ఆపాలన్నారు. ఉగ్ర దాడులు కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కాదని తెలిపారు. ఉగ్రదాడుల వల్ల సమస్యలు మరింత పెరుగుతాయన్నారు. ఉగ్రవాదం, కాశ్మీర్ సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలతో రాజకీయ చర్చలు జరపాలని కోరారు. అఖిలపక్ష బృందం సూచనలను కేంద్రం, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాలు అమలు పరచాలని సూచించారు. సైనికుల సమస్యలను కేంద్రం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

 

డబ్బులేనప్పుడు క్యాంప్ ఆఫీసుకు కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి : రావుల

హైదరాబాద్ : పేదలకు కట్టించే ఇళ్లకు డబ్బులేనప్పుడు క్యాంప్ ఆఫీసుకు కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. నిజాం కాలంలో కూడా ఇన్ని బిల్డింగ్ లు కట్టి ఉండరని పేర్కొన్నారు. నగరంలో రోడ్లు చూస్తే పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం పాలనంతా ఫాంహౌస్ చుట్టే కొనసాగుతుందని విమర్శించారు. 

 

కాశ్మీర్ లో ఉగ్రదాడులను ఖండిస్తున్నాం : ఏచూరి

ఢిల్లీ : కాశ్మీర్ లో ఉగ్రవాద దాడులను ఖండిస్తున్నామని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఉగ్రదాడుల వల్ల సమస్యలు మరింత పెరుగుతాయన్నారు. ఉగ్రవాదం, కాశ్మీర్ సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలతో రాజకీయ చర్చలు జరపాలన్నారు. అఖిలపక్ష బృందం సూచనలను కేంద్రం, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాలు అమలు పరచాలని సూచించారు. సైనికుల సమస్యలను కేంద్రం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

 

టీఆర్ ఎస్ అనవసర రాద్ధాంతం : గాలి ముద్దుకృష్ణమ

హైదరాబాద్ : టీఆర్ ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ అన్నారు. కృష్ణా, గోదావరి మిగులు జలాల్లో కర్నాటక, తెలంగాణకు హక్కు లేదన్నారు. 

15:46 - September 18, 2016

కరీంనగర్ : వర్షం పడితేచాలు ఆ మూరుమూల గ్రామాల పరిస్థితి అగమ్యగోచరమే. ఎటూ వెళ్లేలేని పరిస్థితి. వాగులు పొంగితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. కొన్నేళ్లుగా అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నా.. స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. 'మాకో వంతెన ఏర్పాటు చేసి, బస్సు సౌకర్యాలు కల్పించండి' మహాప్రభో అంటూ వేడుకుంటున్నారు. 
మహదేవ్‌పూర్‌ మండల ప్రజల కష్టాలు
ద్విచక్ర వాహనాలైనా, ఎడ్ల బండ్లైనా ఈ వాగుదాటుకుంటూ వెళ్లాల్సిందే..! మరి వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తే.. పరిస్థితేంటి..? ప్రాణాలు పోవాల్సిందే..! కరీంనగర్‌ జిల్లా మంథని డివిజన్‌లోని మహదేవ్‌పూర్‌ మండల ప్రజలు పడుతున్న కష్టాలివి. ఈ ప్రాంతంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించదు. కనీస సౌకర్యాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా గడుపుతున్న ఇక్కడి పల్లెవాసులకు వర్షాకాలం వస్తే వణుకుపుడుతోంది. అంబట్ పల్లి-పెద్దంపేట గ్రామాల మధ్య ఉన్న ఈ వాగును ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాటుతున్నారు. వర్షాలు భారీగా కురిసినప్పుడు ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. అంతేకాదు.. 16 గ్రామాలకు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. 
ప్రభుత్వ పాఠశాలల్లో ఆశ్రయం 
పనుల కోసం వరంగల్‌, కరీంనగర్‌ లేక ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు.. తిరిగి సొంతుళ్లకు చేరాలంటే.. వరద తగ్గేవరకూ అంబట్‌పల్లి, సూరారం గ్రామాల్లోని బంధువులు, లేదా ప్రభుత్వ పాఠశాలల్లో ఆశ్రయం పొందుతారు. ఇక గర్భిణుల పరిస్థితి మరీ దయనీయం. సరైన సమయంలో వారిని ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోతే.. ఇక అంతే సంగతులు. అత్యవసర పరిస్థితుల్లో వాగుదాటుతూ ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. 
ఇప్పటికీ బస్సుసౌకర్యం లేదు
మరోవైపు అంబట్‌పల్లి తర్వాత ఉన్న గ్రామాలకు ఇప్పటికీ బస్సుసౌకర్యం లేదు. ఆటోల్లోనే వెళ్లాల్సిందే..! మారుమూల అటవీ ప్రాంతాలు కావడం, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలుగా ముద్రపడటంతో అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. 2014లో మంథని ఎమ్మెల్యే పుట్టమధు పెద్దంపేట వంతెనకు శంకుస్థాపన చేశారు. కానీ, నిర్మాణం ఇంకా పూర్తికావడం లేదు. నిధులున్నా.. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లేక.. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు.. పెద్దంపేట వంతెన నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, మహదేవ్‌పూర్‌ మండలంలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

15:31 - September 18, 2016

నల్గొండ : భువనగిరిలో 200 మంది ఎస్ ఎల్ ఎన్ ఎస్ ఎస్ వెంచర్ ప్లాట్ల ఓనర్లను ఎస్పీ ప్రకాశ్ రెడ్డి విచారిస్తున్నారు. నయీం అనుచరులు బెదిరించి తమ ప్లాట్లను బలవంతంగా లాక్కున్నారని ఎస్ ఎల్ ఎన్ ఎస్ ఎస్ వెంచర్ ప్లాట్ల ఓనర్లు ఎస్పీకి  తెలిపారు. నయీం అనుచరుల బెదిరింపులపై ఎస్పీ ఆరా తీస్తున్నారు. 

 

ఎస్ ఎల్ ఎన్ ఎస్ ఎస్ వెంచర్ ప్లాట్ల ఓనర్లను విచారిస్తున్న ఎస్పీ

నల్గొండ : భువనగిరిలో 200 మంది ఎస్ ఎల్ ఎన్ ఎస్ ఎస్ వెంచర్ ప్లాట్ల ఓనర్లను ఎస్పీ ప్రకాశ్ రెడ్డి విచారిస్తున్నారు. నయీం అనుచరులు బెదిరించి తమ ప్లాట్లను బలవంతంగా లాక్కున్నారని ఎస్ ఎల్ ఎన్ ఎస్ ఎస్ వెంచర్ ప్లాట్ల ఓనర్లు ఎస్పీకి  తెలిపారు. నయీం అనుచరుల బెదిరింపులపై ఎస్పీ ఆరా తీస్తున్నారు. 

ఎస్సై కృష్ణయ్య తండ్రి పీఎస్‌లో ఫిర్యాదు

గుంటూరు : ఎస్సై కృష్ణయ్య కేసులో కొత్త హైడ్రామా చోటుచేసుకుంది. సుభాషిణి వ్యవహారంలో ఎస్సై కృష్ణయ్య తండ్రి పాత గుంటూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కులం పేరుతో సుభాషిణి తమను దూషించిందని కృష్ణయ్య తండ్రి ఫిర్యాదు చేశారు. అయితే ఎస్సై కృష్ణ తనను మోసం చేశాడని నిన్న సుభాషిణి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

 

15:16 - September 18, 2016

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. బారాముల్లా జిల్లాలోని సరిహద్దు ప్రాంతం యురి సెక్టార్‌లో ఉన్న సైనిక కార్యాలయంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం దాడిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఉగ్రవాదులకు, భారత సైనికులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఇంకా ఉగ్రవాదులకు, భారత సైన్యానికి మధ్య హోరాహోరి కాల్పులు జరుగుతున్నాయి. అయితే ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తన రష్యా పర్యటనను అర్థాంతరంగా క్యాన్సిల్‌ చేసుకున్నారు. ఉగ్రవాదుల కాల్పులపై ఢిల్లీలో రాజ్‌నాథ్‌సింగ్‌ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. 

 

14:58 - September 18, 2016

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో పోలీసులు రెచ్చిపోతున్నారు. కనిపించిన ప్రతి వ్యక్తిని అరెస్ట్‌ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దీంతో గ్రామంలో ఒక్క మనిషికూడా కనిపించని పరిస్థితి నెలకొంది. చివరకు చర్చిలో కూడా పోలీసులు ప్రార్థనలను అడ్డుకున్నారు. చేసేదిలేక చర్చి బయటే గ్రామస్తులు ప్రార్థనలు చేసుకుననారు. ఆక్వాఫుడ్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. చివరకు కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులకు కూడా పోలీసులు బెదిరిస్తున్నారు. 

 

తుందుర్రులో పోలీసు నిర్బంధం

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో పోలీసులు రెచ్చిపోతున్నారు. కనిపించిన ప్రతి వ్యక్తిని అరెస్ట్‌ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దీంతో గ్రామంలో ఒక్క మనిషికూడా కనిపించని పరిస్థితి నెలకొంది. చివరకు చర్చిలో కూడా పోలీసులు ప్రార్థనలను అడ్డుకున్నారు. చేసేదిలేక చర్చి బయటే గ్రామస్తులు ప్రార్థనలు చేసుకున్నారు. ఆక్వాఫుడ్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. చివరకు కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులకు కూడా పోలీసులు బెదిరిస్తున్నారు. 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

కర్నూలు : ఓర్వకల్లు రాక్ గార్డెన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. 

తుందుర్రులో చీకటి రాజ్యం..

పశ్చిమగోదావరి : తుందుర్రులో చీకటి రాజ్యం నెలకొంది. పోలీసు నిర్భందంతో గ్రామంలో పురుషుడు కనిపించడం లేదు. కనిపించిన ప్రతి వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. కేసులను బనాయిస్తున్నారు. చర్చిలో ప్రార్థనలను కూడా అడ్డుకుంటున్నారు. దీనితో గ్రామస్తులు చర్చి బయటే ప్రార్థనలు జరుపుతున్నారు. అక్వాఫుడ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. 

ఉగ్ర దాడి..పాక్ పనేనా ?

ఢిల్లీ : యూరీ సెక్టార్ లోని ఆర్మీ బేస్డ్ క్యాంప్ ను రక్షణ శాఖ మంత్రి పారికర్, ఆర్మీ చీఫ్ లు సందర్శించారు. కాశ్మీర్ ళో అశాంతిని సృష్టించేందుకు పాకిస్తాన్ పన్నాగం పన్నినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

13:44 - September 18, 2016
13:38 - September 18, 2016

గుంటూరు : జిల్లాలోని తాడికొండలో ఎస్ఐ కృష్ణయ్య కేసులో హై డ్రామా నెలకొంటోంది. పెళ్లి పేరుతో కృష్ణయ్య తనను మోసం చేశాడని సుభాషిణి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఫిర్యాదు నేపథ్యంలో అరండాల్‌పేట పోలీసులు ఎస్ఐ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఎస్ఐ కృష్ణయ్య మాత్రం ఇప్పటికీ కూడా స్పందించలేదు. మరోవైపు ఎస్ఐ సతీమణి ఆత్మహత్యాప్రయత్నం చేసింది. ఈమె ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో కులం పేరిట దూషించారని సుభాషిణిపై పాత గుంటూరులో ఎస్ఐ తండ్రి ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సుభాషిణికి బెదిరింపు కాల్స్..?
మరోవైపు సుభాషిణికి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుభాషిణి ఎక్కడుందో తెలియరావడం లేదు. ఆమె ఫోన్ కూడా స్విచ్చాఫ్ ఉన్నట్లు, సుభాషిణిపై తీవ్ర వత్తిడిలు వస్తున్నట్లు సమాచారం. పెళ్లి పేరుతో కృష్ణయ్య తనను మోసం చేశాడని సుభాషిణి పేర్కొంటోంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తన భర్తతో విడాకులు ఇప్పించి...ఇప్పుడు మొహం చాటేశాడని బాధితురాలి ఆరోపిస్తోంది. వాస్తవాలు ఏంటో కొద్ది రోజుల్లో బయటకు రానున్నాయి. 

13:33 - September 18, 2016

హైదరాబాద్ : వివాహిత సుశ్రుత ఆత్మహత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మామ జైలులో మృతి చెందడం కలకలం రేగింది. ఆదివారం గుండెపోటు రావడంతో శంకర్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న శంకర్ కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. పోస్టుమార్టం నిర్వహిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. శంకర్ అనారోగ్యంతో ఉన్నాడని, గుండెపోటుతో వచ్చినా జైలు సిబ్బంది స్పందించలేదని బంధువులు ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య అనంతరం శుశ్రుత బంధువులు తమ దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నారని, ఆ డబ్బును వెంటనే తిరిగి ఇచ్చేయాలని శంకర్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆనాడు ఏం జరిగింది ?
సూర్యాపేటకు చెందిన సుశృతకు పూసలబస్తీకి చెందిన నూతలగంటి మోహన్‌తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మోహన్‌ ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగి. అయితే, కొద్ది రోజులుగా భర్తతోపాటు అత్త మామలు సుశృతను తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆమెపై అనుమానంతో ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 11వ తేదీ ఆదివారం ఉదయం సుశృత స్నానం చేయడానికి వేడి నీళ్లు పెట్టుకుంది. అనంతరం స్నానం చేయడానికి బాతరూంలోకి వెళ్లింది. ఇంతలో వేడి నీళ్ల కోసం వాటర్‌ హీటర్‌ను ఎక్కువసేపు ఉపయోగించిందంటూ అత్తమామలు ఆమె భర్తను ఉసిగొల్పారు. దాంతో అతడు బాతరూంలో స్నానం చేస్తుండగానే సుశృతను కొట్టాడు. ఈసారి తప్పయిపోయిందని, క్షమించాలని వేడుకున్నా ఊరుకోలేదు. బాత్‌రూం నుంచి బయటకు వచ్చిన తర్వాత వివస్త్రగా ఉండగానే మళ్లీ కొట్టాడు. ఇంట్లో అత్తమామలు, తోడి కోడలు, ఆమె పిల్లలు చూస్తుండగా ఒంటిపై దుస్తులు లేకపోయినా విచక్షణరహితంగా కొట్టాడు. మరోసారి వాటర్‌ హీటర్‌ వినియోగించనని ప్రాధేయపడినా వినలేదు. వివస్త్రగా ఉన్న ఆమెపై దాడి చేశాడు. జరిగిన ఘోరాన్ని ఆమె తన తల్లిదండ్రులకు మొబైల్‌లో మెసేజ్‌ పెట్టింది. అవమానం భరించలేక సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

13:24 - September 18, 2016

ఢిల్లీ : కాశ్మీర్ లో 'ఉగ్ర' దాడి అనంతరం కేంద్రం మేల్కొంది. దేశమంతటా అప్రమత్తత ప్రకటించారు. గత పదేళ్లలో ఎన్నడూ జరగని దాడి ఈ రోజు జరిగింది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17మంది జవాన్లు వీరమరణం పొందారు. దీనితో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసరంగా సమావేశాన్ని నిర్వహించారు. గోవా నుండి హుటాహుటిన రక్షణ శాఖ మంత్రి పారికర్ దేశ రాజధానికి చేరుకున్నారు. రాజ్ నాథ్ సింగ్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి బీఎస్ఎఫ్, ఐబీ, రా చీఫ్ లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాశ్మీర్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ పై చర్చిస్తున్నారు. ఉగ్రదాడిని ఎలా ఎదుర్కొవాలి ? దాడి జరిపిన అనంతరం పరిస్థితులు..17 మంది వీర జవాన్ల మృతి చెందడంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఆర్మీ చీఫ్ శ్రీనగర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన దానిపై కేంద్రానికి ఆర్మీ చీఫ్ నివేదిక అందించనున్నారు. ఉగ్రదాడి ఘటనను ప్రధాన మంత్రికి తెలియచేశారు. దీనిపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

నేతల దిగ్ర్భాంతి..
ఇదిలా ఉంటే యూవి సెక్టార్ లో జరిగిన దాడిపై నేతలు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. జవాన్లు వీరమరణం పొందడం పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు సంతాపం తెలియ చేశారు. జవాన్లు మృతి చెందడంపై వామపక్షాల నేతలు కూడా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మరోవైపు ఉగ్రవాదాన్ని సహించేది లేదని కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు.

ఏం జరిగింది ? 
ఎల్ ఓసీకి అతి దగ్గరగా ఉండే యూరీ సెక్టార్ లోని 12వ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున ఆర్మీ క్యాంప్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోకి టెర్రరిస్టులు చొరబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన భారత జవాన్లు కాల్పులను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రయత్నాలు చేశారు. వాయుమార్గంలో కమెండోలను తరలించారు. చివరకు నలుగురు ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చగా భారత్ మాత్రం 17 మంది సైనికులను కోల్పోయింది. 

ఇంటెలిజెన్స్ హెచ్చరికలు..
ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసినా భద్రతా అధికారులు నిర్లక్ష్యంగా వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో పంజాబ్ లోని పఠాన్ కోట్ దాడిలో ఏడుగురు జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. సైన్యమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఇందులో పలువురు సైనికులు వీరమరణం పొందుతున్నారు. ప్రస్తుతం జరిగిన ఉగ్రదాడిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 

చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీ మృతి..

హైదరాబాద్ : చంచల్ గూడ జైలులో గుండెపోటుతో రిమాండ్ ఖైదీ శంకర్ మృతి చెందాడు. కొద్ది రోజుల కిందట సైదాబాద్ పూసలబస్తీలో వాటర్ హీటర్ ఎక్కువగా వాడిందని భార్యను భర్త కిరాతకంగా కొట్టిన సంగతి తెలిసిందే. దీనితో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అనంతరం భర్త..అత్త..మామ శంకర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని రిమాండ్ కు తరలించారు. 

13:02 - September 18, 2016

తెలుగు తమ్ముళ్లకు 'శిక్ష'ణ...

విజయవాడ : ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలతో జరిపిన సర్వేలో ఈ వాస్తవం బయటపడింది. ప్రజాప్రతినిధుల పనితీరుపై అనేక విషయాలు గ్రహించిన ఆయన వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం మూడురోజులపాటు వర్క్ షాప్‌ నిర్వహించనున్నారు.

సమర్థవంతంగా పనిచేయని ప్రతినిధులపై బాబు అసంతృప్తి..

ఏపీలో టీడీపీ సర్కారు రెండున్నరేళ్లలో ఆయా పథకాలు ప్రవేశపెట్టింది. అయితే ప్రజాప్రతినిధులు వాటిని పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఆయన సూచనలతో జరిగిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. ప్రభుత్వ పథకాలు, ప్రజాప్రతినిధుల పనితీరు వంటి అంశాలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కేవలం 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పథకాలను సమర్థవంతంగా తీసుకెళ్లినట్లు తెలిసింది. మిగిలిన ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహిస్తున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

గుంటూరు కేఎల్‌ యూనివర్సిటీలో శిక్షణ తరగతులు

ఈనెల 24 నుంచి 26 వరకు ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్‌ నిర్వహించాలని టీడీపీ అధినేత డిసైడ్‌ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కేఎల్‌ యూనివర్సిటీలో ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి. గ్రామస్థాయిలో ఉన్న నాయకులతో చంద్రబాబే స్వయంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ వర్క్ షాప్‌లో 200 మందికి పైగా ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

 

హైదరాబాద్ : నేర సామ్రాజ్యానికి నయీం రాజైతే, సైన్యాధికారి శేషన్న! టార్గెట్ ను ఎంచుకోవడం మొదలు, రెక్కీలు నిర్వహించడం, స్కెచ్ వేయడం దాన్ని పక్కాగా అమలుచేడం ఇవన్నీ నయీం గ్యాంగ్ లో నంబర్ 2గా కొనసాగిన శేషన్న పనులు. నయీం ఎన్‌కౌంటర్ అనంతరం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన శేషన్న గ్యాగ్ లీడర్ గా మళ్లీ కార్యాకలాపాలు మొదలుపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనేపధ్యంలో ప్రపంచానికి తెలియని శేషన్న ఫోటోను పోలీసులు విడుదల చేశారు.

శేషన్న దొరికితే దర్యాప్తు కొలిక్కి వచ్చే ఛాన్స్..
నయీం ఎన్‌కౌంటర్ తర్వాత నయీం స్ధావరాల నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బు, భూములు రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా సిట్ రంగంలోకి దిగింది. ఇప్పటికే నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నయీం అనుచరులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. అయితే నయీంకు ఆత్మలా వ్యవహరించిన శేషన్న దొరికితే దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని సిట్ అధికారులు భావిస్తున్నారు.

నయీం తరపున డీల్స్ చేసేది శేషన్ననే..
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శేషన్న గతంలో పీపుల్స్‌వార్ పార్టీలో పనిచేశాడు. బయటికి వచ్చీరాగానే.. అప్పటికే దందాలు నడుపుతున్న నయీం పంచన చేరాడు. క్రమక్రమంగా గ్యాంగ్‌లో నంబర్ 2గా ఎదిగాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని మన్ననూరు, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్ నగర్ లతో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తదితర ప్రాంతాలు శేషన్న ఆధిపత్యంలో ఉండేవి. అయితే ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు నయీం తరపున డీల్స్ చేసింది శేషన్న అని ఆరెస్టయిన అనుచరులు వెల్లడించారు. శేషన్న గురించి మరిన్ని ఆసక్తి ర విషయాలు సిట్ అధికారుల విచారణలో వెల్లడయ్యాయి.

కీలకంగా మారిన శేషన్న ఆరెస్ట్..
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు ప్రజా సంఘాల నేతల హత్యల్లో శేషన్న సూత్రధారిగా ఉన్నాడు. మాజీ మావోయిస్టులను చిత్రహింసలకు గురిచేసి, తిరిగి వారిని నయీం గ్యాంగ్ లోచేర్చుకోవడంలో శేషన్నదే కీలక పాత్ర. నయీంను ఎవరెవరు కలిశారు? అతిని ముఠాతో ఎవరెవరకి సంధాలున్నాయనే పూర్తి ఆధారాలు శేషన్నదగ్గరే ఉన్నాయి. అందుకే ఈ కేసులో శేషన్న ఆరెస్ట్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు శేషన్న ఫోటోను విడుదల చేశారు. శేషన్న దొరికితే నయీం కేసులో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాక బెదిరింపులు, కబ్జాల ద్వారా నయీం వసూలు చేసిన భారీ మొత్తంలోని డబ్బును డంప్ ల రూపంలో దాచి ఉండొచ్చని, ఆడంప్ లు ఎక్కడెక్కడున్నాయో శేషన్నకు కచ్చితంగా తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు . దీంతో శేషన్న ఆరెస్ట్ కీలంగా మారింది. 

12:58 - September 18, 2016

విజయవాడ : ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలతో జరిపిన సర్వేలో ఈ వాస్తవం బయటపడింది. ప్రజాప్రతినిధుల పనితీరుపై అనేక విషయాలు గ్రహించిన ఆయన వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం మూడురోజులపాటు వర్క్ షాప్‌ నిర్వహించనున్నారు.

సమర్థవంతంగా పనిచేయని ప్రతినిధులపై బాబు అసంతృప్తి..
ఏపీలో టీడీపీ సర్కారు రెండున్నరేళ్లలో ఆయా పథకాలు ప్రవేశపెట్టింది. అయితే ప్రజాప్రతినిధులు వాటిని పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఆయన సూచనలతో జరిగిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. ప్రభుత్వ పథకాలు, ప్రజాప్రతినిధుల పనితీరు వంటి అంశాలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కేవలం 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పథకాలను సమర్థవంతంగా తీసుకెళ్లినట్లు తెలిసింది. మిగిలిన ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహిస్తున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

గుంటూరు కేఎల్‌ యూనివర్సిటీలో శిక్షణ తరగతులు..
ఈనెల 24 నుంచి 26 వరకు ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్‌ నిర్వహించాలని టీడీపీ అధినేత డిసైడ్‌ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కేఎల్‌ యూనివర్సిటీలో ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి. గ్రామస్థాయిలో ఉన్న నాయకులతో చంద్రబాబే స్వయంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ వర్క్ షాప్‌లో 200 మందికి పైగా ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. 

12:56 - September 18, 2016

తీగలగుట్టపల్లిలో దారుణం...

కరీంనగర్ : తీగలగుట్టపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మద్యం షాపు సమీపంలో మహిళను వివస్త్రను చేసి దుండగులు వదిలివెళ్లారు. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ : తీగలగుట్టపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మద్యం షాపు సమీపంలో మహిళను వివస్త్రను చేసి దుండగులు వదిలివెళ్లారు. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. 

డిప్యూటి స్పీకర్ బుద్ధ ప్రసాద్ సమీక్ష..

కృష్ణా : చల్లపల్లి ఎండీవో కార్యాలయంలో రైతులు ఇరిగేషన్ అధికారులతో డిప్యూటి స్పీకర్ బుద్ధ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. చివరి భూములకు సాగునీరందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బుద్ధప్రసాద్ సూచించారు.

 

120 జీవో 420తో సమానం - వెంకట్..

వరంగల్ : ప్రభుత్వం తీసుకొచ్చిన 120 జీవో 420తో సమానమని బి. వెంకట్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో టెక్స్ టైల్స్ పార్కు కు బలవంతంపు భూ సేకరణనను నిరసిస్తూ యాత్ర చేపట్టింది. ఈ యాత్రలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి, వెంకట్, భాస్కర్ లు పాల్గొన్నారు. భూములు కొల్పోతున్న రైతులకు 2013 చట్ట ప్రకారమే న్యాయం చేయాలని, రైతులకు అన్యాయం చేస్తే ఉద్యమం తీవ్రతరమౌతుందన్నారు. 

పట్టా భూములు లాక్కొంటున్నారు - జూలకంటి..

వరంగల్ : డీపీఆర్ ప్రకటించకుండా భూములను లాక్కొవడం తగదని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి వెల్లడించారు. వరంగల్ జిల్లాలో టెక్స్ టైల్స్ పార్కు కు బలవంతంపు భూ సేకరణనను నిరసిస్తూ యాత్ర చేపట్టింది. ఈ యాత్రలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి, వెంకట్, భాస్కర్ లు పాల్గొన్నారు. టెక్స్ టైల్ పార్క్ కు అసైన్డ్ భూములు తీసుకుంటామని చెప్పి పట్టా భూములను లాక్కొంటున్నారని విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తక్కువ ధరకు భూములు కొని వ్యాపారం చేయాలని అనుకుంటున్నారని తెలిపారు. 

రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమావేశం..

ఢిల్లీ : కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీఎస్ఎఫ్, ఐబీ, రా చీఫ్ లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాశ్మీర్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ పై చర్చిస్తున్నారు. యూరీ సెక్టార్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. 

12:20 - September 18, 2016
12:15 - September 18, 2016

దాములూరులో విషాదం..

కృష్ణా : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నందిగామ (మం) కూడలిలోని దాములూరులో మున్నేరు వాడులో పడి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. 

12:13 - September 18, 2016
12:00 - September 18, 2016

ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న 'వరుణ్ తేజ్' మరో మూవీకి ఒకే చెప్పినట్లు వినిపిస్తోంది. లేటేస్ట్ గా ఈ మెగా ప్రిన్స్ కి దర్శకుడు కొండా విజయ్ కుమార్ చెప్పిన కన్ ప్యూజన్ కామెడి లవ్ స్టోరీ తెగ నచ్చేసిందట. దీంతో 'వరుణ్' వెంటనే ఈ కొత్త సినిమాకి కూడా కమిట్ అయ్యాడట. అరంగ్రేటం చేసిన ఎడాదిలోనే 3 సినిమాలు చేసేసి సూపర్ స్పీడ్ చూపించిన 'లోఫర్' తరువాత స్పీడ్ తగ్గించాడు. అయితే ఇప్పుడు మరోసారి తనదైన స్టైల్ లో ఈ మెగా హీరో ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు. 'శ్రీను వైట్ల'తో 'మిస్టర్' చేస్తున్న ఈ హీరో మరోవైపు 'శేఖర్ కమ్ముల'తో 'ఫిదా' చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

గుండె జారి గల్లంతయ్యిందే రీమెక్ ? 
'గుండెజారి గల్లంతయ్యిందే' ఫేమ్ విజయకుమార్ కొండా ఇటీవలే 'వరుణ్ తేజ్' కి ఓ స్టోరీ చెప్పాడట. ఈ దర్శకుడు చెప్పిన రెండున్నర గంటల స్టోరీ నెరేషన్ 'వరుణ్' కి విపరీతంగా నచ్చేశాయట. దీంతో 'మిస్టర్', 'ఫిదా'ల తర్వాత ఈ దర్శకుడితోనే సినిమా చేసేందుకు మెగా హీరో డేట్స్ కూడా ఇచ్చినట్లు వినిపిస్తోంది. 'వరుణ్ తేజ్' తో కొండా విజయ్ కుమార్ చేయనున్న స్టోరీ రొమాంటిక్ కామెడీ అని తెలుస్తోంది. 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమా మాదిరే ఈ స్టోరీ కూడా కన్ ప్యూజన్ కామెడీ గా ఉంటుందని వినికిడి. దీంతో ఇది 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రానికి సీక్వెల్ కావచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ చిత్రాన్ని డిసెంబర్ చివరి వరకు స్టార్ట్ చేసేలా 'వరుణ్' ప్లాన్ చేస్తున్నాడట.

11:44 - September 18, 2016

ఒకప్పుడు బాలీవుడ్ లో 'షారుఖ్ ఖాన్' అంటే ఓ సునామీ. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు బాలీవుడ్ షేక్ అయ్యేది. అలాంటిది ఈ పదేళ్లులో 'షారుఖ్' మూస సినిమాలు చేసి ఘోరంగా దెబ్బతిన్నాడు. అయితే ఎట్టకేలకు 'ఫ్యాన్' గా వచ్చి ఆడియన్స్ ని మరోసారి సర్ ప్రైజ్ చేశాడు. బట్ యాక్టింగ్ పరంగా 'ఫ్యాన్'లో 'షారుఖ్' ఇరగదీసిన అంచనాలను అందుకోవడంలో మాత్రం ఈ చిత్రం నిరాశను పరిచింది.

మరుగుజ్జుగా...
'షారుఖ్' తన తర్వాతి సినిమాలో మరుగుజ్జుగా నటించబోతున్నాడు. 'తను వెడ్స్ మను' సిరిస్ మూవీస్ తో పాటు 'రాంజానా' లాంటి సినిమాలు తీసిన 'ఆనంద్.ఎల్.రాయ్' ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇదొక గొప్ప కథ అని, 'షారుఖ్ ఖాన్' ను సరికొత్త అవతారంలో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాడని దర్శకుడు ఆనంద్.ఎల్.రాయ్. చెప్పుతున్నాడు. ఈ చిత్రం వచ్చే ఎడాది సెట్స్ పైకి వెళ్లుతున్నట్లు సమాచారం. 'షారుక్' కి జోడిగా ఈ చిత్రంలో 'పరిణీతి చోప్రా' హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడు ఆలోచన చేస్తున్నాడట. స్వయంగా 'షారుఖ్ ఖాన్' నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018 క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బాలీవుడ్ 'బాద్ షా' 'రాయీస్', 'ది రింగ్' సినిమాలు చేస్తున్నాడు.

11:40 - September 18, 2016

'పెళ్లిచూపులు' సినిమా సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం అంచనాలు మించి విజయం సాధించింది. అంతేకాదు ఇప్పుడు ఓవర్సీస్ లో స్టార్ హీరోలు కూడా సాధ్యం కానీ న్యూ రికార్డ్ ని సెట్ చేసి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. ఓవర్సీస్ లో 'పెళ్లిచూపులు' సెట్ చేసిన ఆ న్యూ రికార్డ్ ఏంటీ ? ఒకప్పుడు సినిమాల విజయాల్ని అర్ధశత దినోత్సవం.. శతదినోత్సవం సెంటర్ల లెక్కలతో కొలిచేవాళ్లు. ఐతే గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. ఇప్పుడు సెంటర్ల సంగతి పక్కకు వెళ్లిపోయి కలెక్షన్ల లెక్కలు మాత్రమే చూస్తున్నారు. అయితే ఇలాంటి టైంలో 'పెళ్లి చూపులు' సినిమా ఇటు కలెక్షన్ల పరంగానే కాకుండా లాంగ్ రన్ పరంగా కూడా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ రికార్డ్ ని ఓవర్సీస్ క్రియేట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

బాక్సాపీస్ షేక్...
కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్ ఇలా అంతా కొత్త వాళ్లతో వచ్చిన 'పెళ్లి చూపులు' బాక్సాఫీసు ని షేక్ చేసింది. లేటేస్ట్ గా ఈమూవీ అమెరికాలో అనూహ్యమైన రికార్డు సాధించింది. అక్కడ ఈ చిత్రం 10 కేంద్రాల్లో యాభై రోజులు రన్ అయి సరికొత్త రికార్డ్ ని నెలకొల్పింది. మన స్టార్ హీరోలు సినిమాలు కూడా అక్కడ 50 రోజులు నడిచిన సందర్భం లేదు. అలాంటి 'పెళ్లి చూపులు' అక్కడ ఏకంగా 10 కేంద్రాల్లో 50 రోజులు నడిచి గ్రేట్ రికార్డ్ దక్కించుకుంది. 'పెళ్లి చూపులు' జులై 29న విడుదలైంది. కోటిన్నర బడ్జెట్ లో తీసిన ఈ సినిమా ఒక్క ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ కలెక్షన్లను దక్కించుకుంది. అంటే ఒక్క అమెరికాలోనే ఈ చిత్రం 6కోట్లు కలెక్ట్ చేసింది. ఇక తెలుగులో ఈ చిత్రం 10కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు వినికిడి. అంటే ఎంత లేదన్న బడ్జెట్ తో పోల్చుకుంటే ఈ చిత్రం 25టైమ్స్ ఎక్కువ విజయం సాధించింది. మొత్తానికి 'పెళ్లిచూపులు' గ్రేట్ సక్సెస్ ని చవి చూసింది.

రాజేంద్రనగర్ లో దారుణం..

రంగారెడ్డి : రాజేంద్రనగర్ మండలం రాధానగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కరెంటు వైర్ పెట్టుకోనివ్వడం లేదని వాచ్ మెన్..భార్య వెంకటమ్మలపై సెంట్రింగ్ కాంట్రాక్టర్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వాచ్ మెన్ మల్లేష్ కు తీవ్రగాయాలు కాగా వెంకటమ్మ మృతి చెందింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వైరా నదిలో పడి యువకుల మృతి..

కృష్ణా : వీరులపాడు (మం) కొణతాలపల్లె వద్ద వైరా నదిలో పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. బైక్ ను శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

11:29 - September 18, 2016
11:26 - September 18, 2016

కరీంనగర్ : భార్యలను తగలబెట్టే ఘటనలు చూస్తుంటాం. కానీ ఓ భార్య..భర్తను తగులబెట్టే ప్రయత్నం చేసింది. ఇందులో అత్త కూడా సహకరించింది. కానీ ఆ భర్త ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని సారంగాపూర్ లో చోటు చేసుకుంది. గంగాధర్..రజితలు భార్య భర్తలు. గంగాధర్ అత్తవారింట్లో ఉన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో గంగాధర్ పై రజిత..అత్త శ్యామల కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలైన గంగాధర్ ను ఇతరులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనితో కాలిన గాయాలతో రెండు గంటలకు పైగా గంగాధర నరకయాత్రన అనుభవించాడు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై కుటుంబసభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. 

11:18 - September 18, 2016
11:16 - September 18, 2016

జమ్మూ కాశ్మీర్ : భారత సైన్యమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. గత కొన్ని రోజులుగా భారత సైన్యంపై కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాశ్మీర్ లో ఈ రోజు పెద్ద ఎత్తున ఎన్ కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17 మంది సైనికులు వీరమరణం పొందారు. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఉదయం 5గంటలకు ప్రారంభమైన కాల్పులు కాసేపటి క్రితం ముగిసింది.

ఉదయం 5గంటలు..
ఎల్ ఓసీకి అతి దగ్గరగా ఉండే యూరీ సెక్టార్ లోని 12వ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున ఆర్మీ క్యాంప్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోకి టెర్రరిస్టులు చొరబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన భారత జవాన్లు కాల్పులను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రయత్నాలు చేశారు. వాయుమార్గంలో కమెండోలను తరలించారు. చివరకు నలుగురు ఉగ్రవాదులను హతమార్చగా భారత్ మాత్రం 17 మంది సైనికులను కోల్పోయింది.

రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమావేశం..
విషయం తెలుసుకున్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన రష్యా..యూఎస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. గోవాలో ఉన్న రక్షణ శాఖ మంత్రి పారికర్ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. ఆపరేషన్ గురించి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రితో రాజ్ నాథ్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి పారికర్, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఉగ్రవాదులు జరిపిన దాడిపై చర్చించనున్నారు. 

17 మంది సైనికుల వీరమరణం..

జమ్మూ కాశ్మీర్ : యూరీ సెక్టార్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17 మంది సైనికులు వీరమరణం పొందారు. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

 

11:04 - September 18, 2016

కోలీవుడ్ స్టార్ హీరో డైరెక్షన్ పై ఫోకస్ పెట్టాడు. హీరోగా, సింగర్ గా, నిర్మాతగా సత్తా చాటిన ఆ స్టార్ హీరో ఇప్పుడు డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ చూపించాలని ఉత్సాహపడుతున్నాడు. డైరెక్షన్ లో వేలుపెట్టిన ఆ తమిళ స్టార్ హీరో ఎవరు ? తమిళ స్టార్ 'ధనుష్' ఇప్పటికే ఆల్ రౌండర్ అనిపించుకొంటున్నాడు. హీరోగా సింగర్ గా, ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయ్యాడు. అంతేకాదు హీరోగా నేషనల్ అవార్డ్ అందుకున్న 'ధనుష్' 'కొలవెర్రీ' సాంగ్ తో వరల్డ్ వైడ్ గా వెర్రీ ఎక్కించాడు. ఇన్ని రకాలుగా ప్రతిభ చాటుతున్న ఈ బక్కపలుచని బాబు ఇప్పుడు దర్శకుడిగా కూడా సక్సెస్ కావాలని ప్లాన్ చేస్తున్నాడు. హీరోగా క్షణం తీరిక లేకుండా ఉన్న 'ధనుష్' తాజాగా డైరెక్టర్ గా కూడా మారాడు. 'పవర్ పాండీ' అనే సినిమాకి ఆయన స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. 'ధనుష్' హీరోగా టర్న్ తీసుకోకముందు తన అన్నయ్య శ్రీరాఘవ దగ్గర అసిస్టెంట్ గా చేసిన అనుభవం ఉంది. దీంతో ఈ సినిమాకు దర్శకత్వం వహించాలని ఫిక్స్ అయ్యాడట. 

10:23 - September 18, 2016
10:12 - September 18, 2016

ఢిల్లీ : ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా కాశ్మీర్ లో దాడులకు తెగబడుతున్నారు. తాజాగా యూరి సెక్టార్ లోని ఆర్మీ బేస్ట్ క్యాంపుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు వీరమరణం పొందారు. 16 మంది సైనికులకు తీవ్రగాయాలయైనట్లు సమాచారం. గాయాలైన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పటాన్ కోట్ తరహాలో ఉగ్రవాదులు ఈ దాడులకు పూనుకున్నారు. జారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ లో 12వ ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ లోకి చొచ్చుకొని వచ్చారు. అనంతరం క్యాంపు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో వెళ్లి భారత బలగాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న భారత బలగాలు ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారు. మొత్తం నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరివద్ద భారీగా మందుగుండు సామాగ్రీ, మారణాయుధాలు ఉన్నట్లు సమాచారం. వీరిని ఏరివేసేందుకు మరికొన్ని బలగాలు చేరుకోనున్నాయి.

రాజ్ నాథ్ పర్యటన వాయిదా..
విషయం తెలుసుకున్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యా..యూఎస్ పర్యటన వాయిదా వేసుకున్నారు. అనంతరం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు గోవా నుండి రక్షణ శాఖ మంత్రి పారికర్ ఢిల్లీకి చేరుకోనున్నారు. కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితిపై చర్చించనున్నారు. పాక్ నుండి ఉగ్రవాదులు వచ్చినట్లు రక్షణ శాఖ భావిస్తోంది. 

హైటిక్ సిటీ వద్ద కారు బీభత్సం..

హైదరాబాద్ : హైటెక్ సిటీ వద్దనున్న మలేషియా టౌన్ షిప్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు డివైడర్ పని చేస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 2ఇద్దరికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ముంబైలో గల్లంతైన బోట్ కోసం గాలింపు..

ముంబై : చేపట వేటకు వెళ్లి గల్లంతైన బోట్ కోసం గాలింపులు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 14 మందిని రక్షించారు. ఇంకా 5గురి ఆచూకి తెలియాల్సి ఉంది. శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వాతావరణం సరిగ్గా లేకపోయేసరికి గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. 

09:40 - September 18, 2016

ముంబై : ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంలో రూపొందించిన స్వదేశీ యుద్ధ నౌక ముర్ముగావ్ ను ముంబైలో ప్రారంభించారు. దీనిని ఇండియన్ నేవీ చీఫ్ సునిల్ లాంబా సతీమణి రీనా లాంబా ప్రారంభించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌక ప్రపంచంలోనే అత్యుత్తమంగా పని చేస్తుందని, అనేక పరీక్షల అనంతరం దీనిని సముద్రంలోకి ప్రవేశపెడుతున్నట్టు సునీల్ లాంబా చెప్పారు. ప్రాజెక్ట్ 15బిలో భాగంగా దీనిని విశాఖపట్నంలోని మజ్ గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్‌ రూపొందించింది. సముద్ర భద్రతకు ముర్ముగావ్‌ రక్షణ కవచంలా మారనుంది. 7 వేల 3 వందల టన్నుల బరువు కలిగిన ముర్ముగావ్‌ 30 నాట్ల వేగంతో సముద్రంలో పయనించనుంది.

ఉగ్రదాడి..ఆరుగురు సైనికుల వీరమరణం..

జమ్మూ కాశ్మీర్ : కాశ్మీర్ లోని యూరీ సెక్టార్ లోకి చొచ్చుకుని వచ్చిన ఉగ్రవాదులకు..భారత బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు సైనికులు మృతి చెందారు. ఇంకా కొంతమంది సైనికులకు గాయాలయ్యాయి. 

09:34 - September 18, 2016

టాలీవుడ్ లో విలక్షణ నటుడు ఎవరు అంటే ఠక్కున 'మోహన్ బాబు' అని చెప్పేస్తారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయి. విలనిజం, మేనరిజం, హీరోయిజాన్ని కలబోసుకున్న ఈ నటుడికి విశాఖలో సన్మాన కార్యక్రమం జరిగింది. టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా మోహన్‌బాబుకు 40 సంవత్సరాల సినీ ప్రస్థాన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సినీ తారలు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన మోహన్‌బాబు పలు విషయాలు ప్రస్తావించారు. ఇప్పటి జనరేషన్‌లో చాలా మంది హీరోయిన్లు వస్తున్నారని, కానీ 'జయప్రద' వాట్ ఏ బ్యూటీ అంటూ ఆమెను పొగిడారు. ఇప్పటికీ చూస్తే అంటూ.. ‘నా భార్య ఉంది గానీ లేకపోతే తాను అప్పుడప్పుడూ 'జయప్రద'ను చూసినప్పుడు లొట్టలేసుకుంటూ ఉంటానని సరదా వ్యాఖ్యలు చేశారు. 'జయప్రద' ఓ మంచి నటి అని తాను అసిస్టెంట్ డైరక్టర్‌గా చేసినప్పుడే ఆమె హీరోయిన్‌ అని అన్నారు. 'జయప్రద'తో హీరోగా, విలన్‌గా చేశానని, అలాంటి 'జయప్రద' ఎంతో దూరం నుంచి రెండు మూడు ఫ్లైట్‌లు మారుతూ వైజాగ్ కు చేరుకున్నారని తెలిపారు. ఇందుకు తాను హృదయపూర్వకంగా అభినందనలు 'జయప్రద'కు తెలిజేస్తున్నానని అన్నారు. 

సచివాలయంలో ఆంక్షలు...

హైదరాబాద్ : సచివాలయం చుట్టూ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆంక్షలు విధించారు. రెండు నెలల పాటు ఇవి అమలులో ఉంటాయన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతుండంతో రెండింటికీ ఈ అంక్షలు వర్తిస్తాయి. ఈ మేరకు సచివాలయం పరిధిలో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. 

09:14 - September 18, 2016

విజయవాడ : అమరావతి నుంచి పూర్తి స్దాయి పాలన దిశగా ఏపీ సర్కార్ కసరత్తు వేగవంతం చేస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోగా...విజయదశమి నాటికి సీఎం చంద్రబాబు కూడా వెలగపూడి నూతన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు. దసరా నాటికల్లా హైదరాబాద్ లోని సచివాలయాన్ని పూర్తిస్ధాయిలో వెలగపూడికి తరలించేలా ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది.

2015 దసరాకు కొత్త రాజధానికి శంకుస్ధాపన..
విజయదశమి నాటికి ఏపీ నూతన రాజధాని అమరావతి నుంచే పాలన సాగించేందుకు ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2014లో దసరా పండగ రోజు అధికారికంగా ఏపీ సచివాలయం హైదరాబాద్ లోని తన ఛాంబర్ లోకి ప్రవేశించారు. 2015 దసరాకు కొత్త రాజధానికి శంకుస్ధాపన చేశారు. ఈ ఏడాది దసరాకు వెలగపూడిలోకి సీఎం రానున్నారు. ఈ ఏడాది నుంచే దసరా నుంచి వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నుంచి పాలన పూర్తిస్ధాయిలో ప్రారంభం కానుంది. గత ఆగస్టులోనే నూతన సచివాలయం నుంచి పాలన సాగించాలని తొలుత భావించినప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో ఒక్కో మంత్రి సచివాలయంలో తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నారు.

క్యాబినెట్ లో మొత్తం 19 మంది మంత్రులు..
క్యాబినెట్ లో మొత్తం 19 మంది మంత్రులు ఉండగా ఇప్పటి వరకు 16 మంది మంత్రులు తమ కార్యాలయాలను వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, దేవాదాయశాఖ కార్యాలయంతో పాటు మరిన్ని కార్యాలయాలు ప్రారంభించాల్సి ఉంది. కొత్త సచివాలయంలో చిన్నపాటి పనులు మినహా దాదాపు పనులు పూర్తి కావస్తున్నాయని మంత్రులు చెబుతున్నారు. ఈ నెలాఖరు లోగా హైదరాబాద్ లోని సచివాలయంలోకి వివిధ శాఖల ఉద్యోగులను కూడా వెలగపూడికి తరలించేలా ప్రభుత్వం గట్టిగా బావిస్తోంది.

వెలగపూడిలో పూర్తికాని నిర్మాణాలు..
వెలగపూడిలో పూర్తి స్ధాయిలో నిర్మాణాలు సిద్ధం కాకపోవడంతో సచివాలయ ఉద్యోగులు అక్కడ విధులు నిర్వహించడం లేదు. మరోవైపు దసరా నాడు కొత్త ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరిస్తాని చంద్రబాబు ప్రకటించారు. శాఖల రివ్యూ సమావేశాలు కూడా ఇక మీదట వెలగపూడి నుంచే నిర్వహించాలని సీఎం మంత్రులను ఆదేశించారు.

సిబ్బందికి వసతి సౌకర్యాల ఏర్పాటు..
అమరావతి నుంచే పనిచేస్తున్న హెచ్ఓడీ డైరెక్టరేట్ల కార్యాలయాల సిబ్బందికి అనుకూలంగా ప్రభుత్వం వసతి సౌకర్యాలను సిద్థం చేసింది. ప్రత్యేకంగా మహిళా ఉద్యోగుల కోసం ఉచిత వసతిని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగుల కోసం ప్రతిరోజు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. అయితే సచివాలయ నిర్మాణం పూర్తికాగానే, రోడ్లు-మౌళిక వసతులు సిద్థం అవుతాయని అధికారులు చెబుతున్నారు. దసరా నుంచి పూర్తిగా నూతన సచివాలయ నుంచి పాలన చేసేందుకు తుది ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి ఒక్క ఫైల్ ను కూడా వెలగపూడికి తరలించకుండా అంతా పేపర్ లెస్ పాలన సాగించే దిశగా అడుగులు వేస్తున్నారు.

వచ్చె బడ్డెట్ సమావేశాలు వెలగపూడి నుంచే..
మరో వైపు అసెంబ్లీ భవనాలు కూడా పూర్తిస్దాయిలో నిర్మాణం చేయడానికి కసరత్తు ప్రారంభం అవుతోంది. ఎట్టిపరిస్ధితుల్లో వచ్చే బడ్జెట్ సమావేశాలు వెలగపూడిలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. శీతాకాల సమావేశాలు జరపకుండా నేరుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు.

09:09 - September 18, 2016

ఢిల్లీ : మరోసారి కాశ్మీర్ ఉలిక్కిపడింది. గత కొద్ది రోజులుగా ఉగ్రవాదులు భారత బలగాలపై కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా యూరీలోని ఆర్మీ 12 బ్రిగేడ్ సెక్టార్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎల్ వోసీకి చాలా దగ్గరలో ఉన్న ఆర్మీ బేస్ క్యాంప్ లోకి ఉగ్రవాదులు చొచ్చుకుని వచ్చారు. అనంతరం ఓ భవంతిలో తలదాచుకుని సైనికులపైకి కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న భారత బలగాలు కాల్పులను తిప్పికొడుతున్నారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రక్షణ శాఖ మంత్రి పారికర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజ్ నాథ్ సింగ్ రష్యా, యూఎస్ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ బేస్ ల మధ్య భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

జమ్మూలో ఉగ్రదాడి..ఇద్దరు సైనికుల మృతి ?

జమ్మూ కాశ్మీర్ : యూరీ సెక్టార్ లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు, మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడే అవకాశాలున్నట్లు ఆర్మీ భావిస్తోంది. ప్రస్తుతం ఉగ్రవాదులు..భారత బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. 

09:01 - September 18, 2016

'మోహన్ బాబు'..'చిరంజీవి'.. వీరిపై టాలీవుడ్ లో రకరకాల కథనాలు వెలువడుతుంటాయి. వీరి మధ్య వైరం ఉందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. తాజాగా చిరు..మోహన్ బాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలో ఆదివారం రాత్రి సుబ్బరామిరెడ్డి జన్మది వేడుకలు జరిగాయి. ఇదే వేడుకలో 'మోహన్ బాబు'కు సన్మాన కార్యక్రమం కూడా జరిగింది. ఈ మహోత్సవానికి టాలీవుడ్ తారలు...ఇతర రాజకయ నేతలు తరలివచ్చారు. ఈ వేడుకకు మెగాస్టార్ 'చిరంజీవి' కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ..ఫంక్షన్ కు రావాలని 'మోహన్ బాబు' స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని పేర్కొన్నారు. ఇంతకు ముందు తన దగ్గర డేట్స్ ఉండేవని, కానీ ప్రస్తుతం సినిమా షూటింగ్ ఉండటంతో ఏం చేసినా ముందే ప్లాన్ చేసుకోవాల్సి వస్తోందన్నారు. వాస్తవానికి నేడు కూడా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందని, కానీ ఇక్కడికి రాకపోతే ఓ రాక్షసుడితో గొడవైపోతుందన్నారు. వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేయండని యూనిట్ సభ్యులకు చెప్పినట్టు 'చిరంజీవి' తెలిపారు. 'మోహన్ బాబు' చూపే ప్రేమ రాక్షస ప్రేమని, దాని వెనుక ఎంతో వాత్సల్యం దాగుంటుందని 'చిరంజీవి' పేర్కొన్నారు. 

రాజ్ నాథ్ సింగ్ రష్యా..యూఎస్ పర్యటన రద్దు..

ఢిల్లీ : కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యా, యూఎస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

08:24 - September 18, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నయీం ఎన్ కౌంటర్ అనేక రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికే నయీం డైరీలో పొందుపర్చిన వివరాలతో పార్టీలకతీతంగా నాయకులందరూ కంటికి నిద్రలేకుండా గడుపుతున్నారు. అయితే తాజాగా టీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు విపక్ష పార్టీలోని కొంతమంది కీలక నేతలు నోటీసులు జారీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్యాంగ్ స్టర్ నయీంతో సంబంధాలున్న రాజకీయ నాయకులు సంగతి తేల్చే పనిలో పడింది కేసీఆర్ సర్కార్. అధికార పార్టీ అయినా...విపక్ష పార్టీల నేతలైనా ఎవరిని ఉపేక్షించకూడదనుకుంటున్నారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో నయీంతో సంబంధమున్న రాజకీయ నాయకులకు నేడో రేపో నోటీసులిచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈనెల చివరి వారంలో శాసనసభ వర్షాకాల సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆలోగానే ఈ కేసును తేల్చే పనిలో పడింది. సభలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంశంపై వివాదం తలెత్తకుండా అప్పటివరకు ముగించాలనుకుంటున్నారు.

అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలో పాటు...
నయీంతో సంబంధాలున్నరాజకీయ నేతలెవరన్నది ప్రభుత్వానికి తెలుసు. దీనిపై సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో అధికార పార్టీని ఇరుకున పెట్టెందుకు విపక్షాలు రెడి అయ్యాయి. అందుకే సమావేశాలకంటే ముందే నయీంతో సంబంధాలున్న వారికి పోలీసులు నోటీసులు పంపనున్నారు. దీంతో నయీంతో సంబంధాలున్న రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నోటీసులిస్తారనుకుంటున్న నేతలు ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలతో పాటు...విపక్ష పార్టీలకు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులకు నోటీసులిచ్చేందుకు రంగం సిద్థం అయ్యింది. విపక్ష పార్టీలకు చెందిన వారిలో నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉండగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. నయీంతో సంబంధం ఉన్న నేతలకు నోటీసులు ఇచ్చి సరిపుచ్చుతారా ? లేక కఠిన చర్యలు తీసుకుంటారా ? తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. 

08:21 - September 18, 2016

హైదరాబాద్ : క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న అధికారులకు డ్రెస్‌ కోడ్‌ అమలు చేసే అంశాన్ని జీహెచ్ఎంసీ పరిశీలిస్తోంది. తద్వారా గ్రేటర్‌ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయొచ్చని భావిస్తోంది. డ్రెస్‌ కోడ్‌లో ఉన్న అధికారులను ప్రజలు తేలిగ్గా గుర్తించే వీలుంటుంది. ఇది క్రమశిక్షణకు దోహపడుతుందని భావిస్తున్నారు. సరికొత్త సంస్కరణ దిశగా జీహెచ్‌ఎంసీ అడుగులు వేస్తోంది. పాలనపై తనదైన ముద్ర వేస్తున్న కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి... క్షేత్ర స్థాయిలో పని చేసే గ్రేటర్‌ అధికారులకు డ్రెస్‌ కోడ్‌ అమలు చేసే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.

అధికారి హోదాను బట్టి డ్రెస్‌ కోడ్‌ అమలు..
ఇప్పటికే పారిశుధ్య సిబ్బందికి రేడియం జాకెట్లతో డ్రెస్‌ కోడ్‌ అమలు చేస్తున్నారు. ఇకపై దీనిని అధికారులందరికీ వర్తింపచేసే అంశాన్ని పరిశీలిస్తోంది. కార్మికుడి నుంచి కమిషనర్‌ వరకు అందరూ డ్రెస్‌ కోడ్‌ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్న యోచనలో ఉన్నారు. అధికారి హోదాను బట్టి డ్రెస్ కోడ్‌ అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆయా స్థాయి అధికారులను సులభంగా గుర్తించేందుకు వీలవుతుంది. అధికారులతోపాటు అసిస్టెంట్‌ కమిషనర్లతోపాటు డిప్యూటీ కమిషనర్లు, జోనల్‌ కమిషన్లు, అదపు కమిషనర్లకు వివిధ రంగుల రేడియం జాకెట్లు ధరించేలా ప్రణాళికల రూపొందిస్తున్నారు. అలాగే ఇంజినీరింగ్‌, వైద్యారోగ్య విభాగం అధికారులకు కూడా డ్రెస్‌ కోడ్‌ అమలు చేయాలని ప్రతిపాదించారు. జీహెచ్‌ఎంసీ లోగోతో జాకెట్లను డిజైన్‌ చేయాలని భావిస్తున్నారు. ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి. 

08:18 - September 18, 2016

మహబూబ్ నగర్ : హరితహారం కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఆదివారం బెంగళూరు హైవేపై మొక్కలు నాటనున్నారు. ఆలంపూర్ వుకు 180 కి.మీటర్ల వరకు మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ దర్గా వద్ద మంత్రులు జోగు రామన్న, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావులు పాల్గొనున్నారు. ఉదయం 9.30గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

08:10 - September 18, 2016

జమ్మూ కాశ్మీర్ : ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. భారత బలగాలపై దాడులకు తెగబడుతున్నారు. గతంలో పంజాబ్ లోని పఠాన్ కోట్ లో జరిగిన ఉగ్రదాడి లాగానే మరోసారి ఘటన చోటు చేసుకుంది. గత రాత్రి ఉత్తర కాశ్మీర్ లో యూరీ సెక్టార్ లోని ఆర్మీ సెక్టార్ పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భారత సరిహద్దును దాటిన ఉగ్రవాదులు ఆర్మీ సెక్టార్ లోకి చొచ్చుకవచ్చారు. రక్షణ వలయాన్ని చేధించుకుని వచ్చిన ముష్కరులు ఆర్మీ సెక్టార్ లో ఉన్న ఓ భవంతిలో తలదాచుకున్నారు. ఒక్కసారిగా భారత బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న భారత బలగాలు కాల్పులను తిప్పికొట్టారు. భవంతిలో ముగ్గురు లేదా నలుగుర ఉగ్రవాదులున్నట్లు తెలుస్తోంది. వీరు ఏ క్షణమైనా ఆత్మాహుతి దాడికి తెగబడే అవకాశాలున్నాయని ఆర్మీ భావిస్తున్నట్లు సమాచారం. 

08:04 - September 18, 2016

మన్ హట్టన్ లో బాంబు పేలుళ్లు..

అమెరికా : మన్ హట్టన్ రాష్ట్రంలోని చెల్సియా జిల్లాలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి. పైపు బాంబుతో పేలుళ్లకు దుండగులు పాల్పడ్డారు. పేలుడుకు కొద్దిక్షణాల ముందు జరిగిన చారిటీ రేసులో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. 

ప్రకాశంలో రోడ్డు ప్రమాదం..

ప్రకాశం : జిల్లాలోని సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. 

గుంటూరులో భారీ చోరీ..

గుంటూరు : జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో రెండున్నర లక్షల విలువైన బంగారు నగలను దుండగులు అపహరించారు. 

07:45 - September 18, 2016

హైదరాబాద్ : క్యాన్సర్‌ మహమ్మారి తెలంగాణ ప్రజలను భయపెడుతోంది. ఈ వ్యాధి బారిన పడుతున్న రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. క్యాన్సర్‌ వ్యాధి నిర్ధారణకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సంచార వైద్య శిబిరాల్లో వెల్లడవుతున్న అంశాలను వైద్యులను నివ్వెర పరుస్తున్నాయి. వ్యాధి బారిన పడిన వారికి భయంతో వణికిపోతున్నారు. క్యానర్.. ప్రాణాంతక వ్యాధి. వైద్యం కోసం లక్షలు ధారపోసినా బతుకుపై భరోసా లేదు. ఇప్పుడు ఈ వ్యాధి తెలంగాణ ప్రజలను భయపెడుతోంది. కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌ మహిళలను కలవరపెడుతోంది.

జడ్జర్ల వైద్య శిబిరంలో 180 మందికి క్యాన్సర్‌ పరీక్షలు..
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంచార వైద్య పరీక్ష శిబిరాల్లో క్యానర్స్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అరవై మందిని పరీక్షిస్తే... వీరిలో పది మంది మహిళకు రొమ్ము క్యాన్సర్‌ ఉందని తేలింది. ఇంది అంత్యంత ఆందోళనకర పరిణామం. రాష్ట్రంలో రెండేళలో క్యాన్సర్‌ రోగుల సంఖ్య 21 శాతం పెరిగినట్టు గుర్తించారు. రెండు నెలల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్జర్లలో నిర్వహించిన మొబైల్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంపులో 180 మంది మహిళలను పరీక్షించారు. వీరిలో 60 మందికి రొమ్ములో గడ్డలు ఉన్నట్టు తేలింది. రక్త పరీక్షల్లో పది మందికి క్యాన్సర్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. మరో 60 మందిని పరీక్షిస్తే... 12 శాంతం మందికి క్యాన్సర్‌ ఉన్నట్టు తేలింది. దీంతో క్యాన్సర్‌ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వైద్య శిబిరాలు...
రాష్ట్రంలో పెరుగుతున్న క్యానర్స్‌ రోగుల సంఖ్య ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. 2014-15లో నిర్వహించిన వైద్య శిబిరాలకు హాజరైన వారిలో 27 శాతం మందికి క్యాన్సర్‌ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. మరుసటి సంవత్సరం 2015-16లో ఇది 48 శాతానికి చేరింది. ఏడాది కాలంలో క్యాన్సర్‌ రోగులు 21 శాతం పెరిగారంటే... వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్య శ్రీ పథకం కింద 2014-15లో పది వేల మంది క్యాన్సర్‌ వైద్యం చేయించుకున్నారు. ఈ పథకానికయ్యే ఖర్చులో 80 శాతం క్యాన్సర్‌ రోగులకే వెచ్చిస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్‌ను గుర్తించి... వైద్యం చేసేందుకు సంచార వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. వ్యాధిని గుర్తించి తొలిదశంలో వైద్యం చేస్తే పది శాతం ఖర్చు ఖర్చు అవుతుంది. తర్వాత ఆరోగ్య శ్రీ పథకం కింది క్యాన్సర్‌ చికిత్సకు అయ్యే 80 శాతం ఖర్చు తగ్గుతుందని అధికారులు లెక్క వేశారు. దీనిలో భాగంగా సంచార వైద్య శిబిరాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

'బీఫ్' వివాదం ఇష్యూ కాదన్న హర్యానా సీఎం..

హర్యానా : రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న జంట హత్యలు, అక్కా చెల్లెళ్ల గ్యాంగ్ రేప్, మేవాత్ లో బిర్యానీలో బీఫ్ తదితర సంచలనం కలిగించిన నేరాలను చాలా చిన్న విషయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. దీనితో ఆయనపై విమర్శలు చెలరేగుతున్నాయి. 

07:28 - September 18, 2016

సాహిత్యాన్ని, సంఘ సంస్కరణను కలగలిపి పోరాటం సాగించిన ధీరుడు.. దళిత జాతి అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితమిచ్చిన కవి తొలి దళిత వైతాళికుడు కుసుమ ధర్మన్న. ఆయన నడకతో గోదావరీ తీరం పునీతమయింది. మాకొద్దీ నల్ల దొరతనం అంటూ కవిత్వమై మండిపడి, సమాజంలోని అగ్రకుల దాష్టీకాలను ఎదిరించాడాయన. అట్టడుగు వర్గాల ప్రజలను ఏకం చేయడానికి ప్రయత్నించాడు. జయభేరి పత్రికను పెట్టి ఎన్నో వాస్తవ కథనాలను ప్రచురించారు. సుదీర్ఘకాలం అందుబాటులో లేని ఆయన సాహిత్యం ఇప్పుడు ప్రజల ముందుకొస్తోంది. ప్రజాశక్తి ప్రచురించిన ఆయన రచనలు రాజమండ్రిలో విడుదలవుతున్న సందర్భంగా తొలి తెలుగు దళిత కవి కుసుమ ధర్మన్న గురించి పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

07:26 - September 18, 2016

సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేస్తుంది. మానవాళి హితం కోసం ఎందరో సృజనకారులు సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. మానవ విలువలకోసం, ఉన్నతమైన సమాజం కోసం కవులు రచయితలు తమ కలాలకు పదును పెడుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ కవి దిలావర్..కాంతి హలాన్ని భుజాన వేసుకొని స్వేద కిరణాలతో పొలాల మధ్య అరుణారుణంగా మండే సూర్యుణ్ణి... తరుణ హృదయాల్లో ఆవిష్కరిస్తున్నాను. అంటూ మూడు దశాబ్దాల క్రితమే చక్కని కవిత్వం రాసిన అభ్యుదయకవి దిలావర్. ఒక కవిగా, విమర్శకుడిగా, కథారచయితగా బహముఖ ప్రజ్ఞను ప్రదర్శంచిన కవి ఆయన. అయస్కాంతం కోసం అన్వేషిస్తున్నకవి అంటూ గతంలో గుంటూరు శేషేంద్ర వర్మచే కితాబందుకున్న ప్రముఖ కవి దిలావర్ గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

బారాముల్లాలో ఉగ్ర దాడి..

జమ్మూ కాశ్మీర్ : బారాముల్లాలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ పై ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేశారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

నేడు విభజన కథం పుస్కకావిష్కరణ..

హైదరాబాద్ : నేడు మాజీ ఎంపీ ఉండవల్లి రచించిన 'విభజన కథ' పుస్తకం ఆవిష్కరణ జరగనుంది. ఈ పుస్తకాన్ని జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించనున్నారు. 

నేడు సెంట్రల్ టెట్..

హైదరాబాద్: నేడు సెంట్రల్ టెట్ పరీక్ష జరగనుంది. తెలంగాణ రాష్ట్రం నుండి 17,200 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. నగరంలో 15 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

నేడు చేనేత వృత్తి కార్మికుల సదస్సు..

హైదరాబాద్ : నేడు ఆర్టీసీ కళాభవన్ లో చేనేత వృత్తి కార్మికుల సదస్సు జరగనుంది. దత్తాత్రేయ అధ్యక్షతన సదస్సు జరగనుంది. 

06:49 - September 18, 2016

హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్‌లో చెత్త తొలగింపు ప్రక్రియ ఊపందుకుంది. హైద‌రాబాద్‌లో వినాయ‌క నిమ‌జ్జనం సందర్భంగా చెరువులో పెరుకుపోయిన వేలాది టన్నుల చెత్తను తొలగించేందుకు యంత్రాలను వినియోగిస్తున్నారు. గతేడాది ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం రెట్టించిన వేగంతో పనులు పూర్తిచేసేందుకు హెచ్ఎండిఎ చర్యలు చేపట్టింది. గణనాథుల నిమజ్జనానికి అనాదిగా ఆతిథ్యమిస్తోంది హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌. వేలాది విగ్రహాలను తన ఒడిలో చేర్చుకుంటుంది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా..ఆ త‌ర్వాతే ప‌రిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. విగ్రహాల తయారీకి ఉపయోగించిన ర‌సాయ‌నాలు, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, ప్లాస్టిక్‌ వ్యర్థాలు సాగ‌ర్ జ‌లాలను మరింత కలుషితం చేస్తున్నాయి. పరిసరాలను దుర్గంధభరితంగా మారుస్తున్నాయి. గ‌త కొన్నేళ్లుగా సాగ‌ర్ ప్రక్షాళన కొన‌సాగుతూనే ఉంది. వినాయక నిమజ్జనం సందర్భంగా ఏటా వేలాది ట‌న్నుల వ్యర్థాలు సాగ‌ర్‌లో కలిసిపోతున్నాయి.

గడిచిన ఆరేళ్లుగా...
వినాయక నవరాత్రులు ప్రారంభమైన మూడవ రోజు నుంచే హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన చేస్తున్నారు. నిమజ్జనం చేసిన విగ్రహాల వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 5 వేల ట‌న్నుల వ్యర్థాలను వెలికితీశామని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యర్థాలను ఇందిరాపార్కు దగ్గర ఉన్న జీహెచ్ఎంసీ ట్రాన్స్ ఫర్‌ కేంద్రానికి అక్కడి నుంచి జ‌వ‌హార్ న‌గ‌ర్ డంపింగ్ యార్డుకు త‌ర‌లిస్తున్నట్లు చెప్పారు. గ‌డిచిన‌ ఆరేళ్లుగా హుస్సేన్ సాగ‌ర్‌లో నిమజ్జనమైన గణేష్‌ విగ్రహాల వ్యర్థాలను అధికారులు తొలగిస్తున్నారు. కేవలం ఎన్టీఆర్ మార్గం వైపు మాత్రమే తొల‌గించడంతో.. ట్యాంక్‌బండ్ మార్గంలో వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. పూడిక పేరుకుపోయి విగ్రహాలు నీటిలో మున‌గని పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్ మార్గంలో మాత్రమే పూడిక‌ను తొల‌గించాలని ఆదేశాలున్నాయని హెచ్ఎండిఎ అధికారులు చెప్పడం గమనార్హం. ఇప్పటికే 5 వేల టన్నుల వ్యర్థాలు వెలికితీసిన హెచ్ఎండీఏ మ‌రో వెయ్యి ట‌న్నుల వ‌ర్థాలు చెరువులో ఉన్నట్లు అంచ‌నా వేస్తుంది. ఈ వ్యర్థాలను వేగంగా వెలికితీయాలని సిబ్బందిని ఆదేశిస్తోంది. 

06:47 - September 18, 2016

హైదరాబాద్ : తెలంగాణలో డీలా పడిన కాంగ్రెస్‌కు పునర్‌వైభవం తెచ్చే దిశగా టీపీసీసీ ముమ్మర కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో క్యాడర్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. నేతలకు పార్టీ సిద్దాంతాలను నూరిపోసేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ముందుకెళ్తుంది. తాత్కాలిక నేతలు కాకుండా పార్టీకి అంకితభావంతో పనిచేసే నాయకులను తయారుచేసే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లినా..టీఆర్‌ఎస్ ప్రభంజనం ముందు సత్తా చాటలేకపోయింది. అధికారానికి దూరమై ప్రతిపక్షానికే పరిమితమైన హస్తం పార్టీని..అధికారపార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఉక్కిరిబిక్కిరి చేసింది. పార్టీలో కీలక నేతలు గులాబి గూటికి క్యూ కట్టడాన్ని జీర్ణించుకోలేకపోయింది. నిరాశ, నిస్పృహలతో కూరుకుపోయిన క్యాడర్‌కు జవసత్వాలు తెచ్చేందుకు కొత్త వ్యూహాలను టీపీసీసీ రచిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది.

రెండు రోజులు..
పార్టీ బలోపేతం కావాలంటే ముందు పునాది గట్టిగా ఉండాలని టీపీసీసీ భావిస్తోంది. అదే జరిగితే పార్టీలో జోష్‌ రావడంతో పాటు వలసలకు ఆస్కారం ఉండదనుకుంటుంది. ఇప్పటికే జులైలో గాంధీభవన్‌లో నేతలకు శిక్షణ తరగతులు నిర్వహించింది. ప్రధానంగా పార్టీ నుంచి గెలిచిన మున్సిపల్‌ ఛైర్మన్‌, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు పార్టీ సిద్ధాంతాలను బోధించింది. కాంగ్రెస్ సీనియర్లు, పార్టీ సానుభూతిపరులైన మేధావులతో ప్రజాప్రతినిధులకు తరగతులు చెప్పించింది. మరో దఫాగా సోమ, మంగళ వారాల్లో రెండు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

బలోపేతం అవుతుందా ? 
ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌, సింగిల్‌ విండో ఛైర్మన్లు, సభ్యులకు పాఠాలు బోధించనున్నారు. ట్రైనింగ్‌ క్లాసెస్‌కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌, కొప్పుల రాజు నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ తరగతులకు పాండిచ్చేరి సీఎం నారాయణ స్వామి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దేశానికి కాంగ్రెస్ చేసిన సేవలు, పార్టీ మూల సిద్దాంతాలు.. ప్రజలతో మరింత మమేకం కావాలంటే చేపట్టాల్సిన కార్యక్రమాలను నేతలకు వివరించనున్నారు. శిక్షణ తరగతులతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కానుందా? వలసలకు అడ్డుకట్ట పడనుందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 

06:44 - September 18, 2016

కృష్ణా : జిల్లాలో బందరు పోర్ట్, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కోసం భూముల సమీకరణకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌పై రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో ఈసారి భూసమీకరణ అస్త్రం ప్రయోగించేందుకు సమాయత్తమవుతోంది. ఏదీ ఏమైనా తమ జీవనాధారమైన పంటభూములను వదులుకోలేమని రైతులు తెగేసి చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో మరో భారీ భూసమీకరణకు చంద్రబాబు సర్కార్‌ రంగం సిద్ధం చేస్తోంది. మచిలీపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు చేసేందుకు సుమారు 25 వేల ఎకరాల భూములు సమీకరించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. బందరు పోర్టుపై దృష్టిసారించిన ప్రభుత్వం..మొదట భూ సేకరణకు గతేడాది ఆగస్ట్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు, ప్రజలు, ప్రతిపక్షాల తీవ్రంగా వ్యతిరేకించారు. భూసేకరణపై నిరసనలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన సర్కార్‌ ఈ సారి భూసమీకరణ అస్త్రం ప్రయోగించాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఫిబ్రవరిలో మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేసింది.

భూసమీకరణ అస్త్రం ప్రయోగించేందుకు పావులు..
గతేడాది విడుదల చేసిన భూ సేకరణ నోటిఫికేషన్ ఆగస్టుతో గడువు ముగియడంతో మరో ఏడాదిపాటు పొడిగిస్తూ జిల్లా కలెక్టర్ బాబు ఇటీవల మరో నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 25 వేల 55 ఎకరాల భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 21 గ్రామాల్లో భూములు సమీకరించాల్సి ఉండగా.. ఇప్పటికే 15 గ్రామాల్లో భూముల తనిఖీలు పూర్తయ్యాయి. మరో 6 గ్రామాల్లో పట్టా భూములకు సంబంధించి 14 వేల ఎకరాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారు.

వివరాల నమోదు...
మరోవైపు బందరు పోర్టు, పరిశ్రమల ఏర్పాటు కోసం పంటభూములను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని రైతులు చెబుతున్నారు. మొదట బందర్‌ పోర్టు భూసమీకరణకు అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్దకు నివేదిక వెళ్లగా..పోర్టుకు అవసరమైన భూములను ఒకేసారి తీసుకోవాలని చెప్పడంతో ఆ దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు భూములకు సంబంధించి ఆర్ఎస్ఆర్ వివరాలు, సర్వే నెంబర్లు, రైతుల పేర్లు, అడంగల్ తదితర వివరాలను సమగ్రంగా సిద్ధం చేస్తున్నారు. 

06:41 - September 18, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు పేర్కొంది. మరోవైపు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు... వర్షాల ముప్పు తొలగడం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ మరో 3 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో.. కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందన్నారు. తెలంగాణ, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని.... ఫలితంగా రాగల 3 రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు చెప్పారు. 4 రోజుల తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. ఈనెల 21న ఉపరితల ఆవర్తనం బలపడే అవకాశముందని ఫలితంగా అదే రోజు రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టంచేశారు.

విష్ణుపురి నుంచి 28 వేల క్యూసెక్కులు..
మరోవైపు ఎగువన కురుస్తున్న భారీవర్షాలతో శ్రీశైలంకు వరద ఉధృతి పెరిగింది. జురాల నుంచి 62వేల 500 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 49వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో... నీటిమట్టం పెరుగుతోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 871.40 అడుగులకు చేరింది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో 41,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని అధికారులు వెల్లడించారు. విష్ణుపురి నుంచి 28 వేల క్యూసెక్కులు, ఆమ్రేడ్ నుంచి 1,22,000 క్యూసెక్కుల నీటిని వదిలినట్టు అధికారులు తెలిపారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ జలాశయంలో భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 644.7 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నాలుగువేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఇన్‌ఫ్లో నాలుగు వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ఎడమ, కుడి కాల్వలకు నీటిని విడుదల చేశారు.

వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం..
ఇటు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లక్డీకాపూల్-మాసాబ్ ట్యాంక్, ఎన్టీఆర్ గార్డెన్స్-తెలుగుతల్లి జంక్షన్, ఎంజే మార్కెట్-అబిడ్స్, అఫ్జల్‌గంజ్-ఎస్.ఏ.బజార్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ కనిపించింది.

06:38 - September 18, 2016

హైదరాబాద్‌ : శేరిలింగంపల్లిలో అకస్మాత్తుగా మారుతి కారులో మంటలు చెలరేగాయి. శేరిలింగంపల్లి నుంచి నుంచి మియాపూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వాహనాన్ని గ్యాస్ తో నడపడంతో గ్యాస్ లీక్ అయి ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అయితే కారులోని ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఫైరింజన్ ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఈ కారు పూర్తిగా దగ్థం అయ్యింది. 

06:37 - September 18, 2016

విజయవాడ : 'ప్రత్యేక హోదా' అంశంతో మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు ఏపీ కాంగ్రెస్ సిద్దమవుతోంది. ఇప్పటికే కోటి సంతకాలు, నీరు, మట్టి సేకరణ వంచి కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ ఈసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక హోదా కావాలా.. వద్దా అనే అంశంపై ప్రజాభిప్రాయాలు సేకరించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రజా బ్యాలెట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం..ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్రం ప్రకటించినప్పటి నుంచి ఏపీలో నిరసనలు మొదలయ్యాయి. ప్రజలు, ప్రతిపక్షాలు స్వచ్చంధంగా ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షపార్టీలు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. దీనిలో భాగంగా ఏపీ కాంగ్రెస్ ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది.

తాజాగా ప్రజా బ్యాలెట్ కార్యక్రమం..
ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టిన కాంగ్రెస్, రాష్ట్ర వ్యాప్తంగా కొటి సంతకాల సేకరణ, నీరు, మట్టి సేకరణ వంటి కార్యక్రమాలు నిర్వహించింది. ఇక తాజాగా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేం..ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామనడంతో కాగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అంతే కాకుండా ప్రత్యేక హోదా సాధించే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తెస్తామంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక హోదాపై ప్రజాభిప్రాయం సేకరించేందుకు ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రత్యేక హోదా కావాలా..వద్దా...
ఈ నెల 28 నుంచి తిరుపతిలో ఈ కార్యక్రమం ప్రారంభం చేయనున్నట్లు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా కావాలా..వద్దా అనే రెండు ప్రశ్నలతో కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళతామంటున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇద్దరూ కలిసి ప్రత్యేక హోదాపై ప్రజల్ని మభ్య పెట్టే పయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రత్యేక హోదాపై ప్రజల తీర్పును అనుసరించే దమ్ము, ధైర్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయా ? అని సవాల్ విసురుతున్నారు. అంతేకాక ప్రజా బ్యాలెట్ లో ప్రత్యేక హోదా వద్దని అని మెజారిటీ ప్రజలు కోరుకుంటే చంద్రబాబు, వెంకయ్యనాయుడులకు కాంగ్రెస్ నేతలు సన్మానం చేస్తామంటున్నారు.

రెండవ ప్రశ్నగా ఎన్నికల హమీల ప్రస్తావన..
ఇక ప్రజా బ్యాలెట్ లో రెండవ ప్రశ్నగా ఎన్నికల హమీలను ప్రస్తావించనున్నారు. ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హమీలు, అమలు చేశారా లేదా అనే ప్రశ్నతో ప్రజా బ్యాలెట్ తో ప్రజల్లోకి వెళ్లనున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఈ ప్రయత్నాలు ప్రజల నుంచి ఏమేరకు స్పందన వస్తుందో వేచిచూడాలి. 

06:34 - September 18, 2016

విజయవాడ : ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతోనే ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ ల‌బ్ధి చేకూరుతుంద‌ని కేంద్రమంత్రి వెంక‌య్యనాయుడు అన్నారు. కాంగ్రెస్‌ కుట్రల వల్లే ఏపీ నష్టపోయిందన్న ఆయన 1972లోనే రాష్ట్రాన్ని విభజించి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రమే మారేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ సాధించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు ఆ పార్టీ నేతలు.. కార్యకర్తలు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయవాడకు ర్యాలీగా బయలుదేరారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ సాధించిన వెంక‌య్యకు విజయవాడలోని ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్‌లో అభినంద‌న స‌భ‌ ఏర్పాటు చేశారు. ఏపీపై ప్రత్యేక శ్రద్ధ ఉన్నందునే ఇక్కడ కేంద్రీయ సంస్థలు ఏర్పాటు చేశామ‌న్న ఆయన .. విభ‌జ‌న హామీల‌న్నీ చిత్తశుద్ధితో నెర‌వేరుస్తున్నామ‌ని చెప్పారు. కాంగ్రెస్ చేసిన కుట్రవ‌ల్లే ఏపీ న‌ష్టపోయింద‌ని అన్నారు. ఏపీ ఏపీ అభివృద్ధి, ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలపై వెంకయ్య వివరించారు.

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు...
దేశంలో కొండ ప్రాంతాలైన నాగాలాండ్‌, మిజోరాం, అసోం, సిక్కిం, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌ వంటి రాష్ట్రాలను ప్రత్యేకంగా చూడాలని.. వీటికి మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పరిస్థితి లేదన్నారు. చారిత్రక కారణాల వల్ల సరైన అభివృద్ధి లేని రాష్ట్రాలు ఉన్నాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన సమయంలో పార్లమెంట్‌లో అడిగానని.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్ర స్పష్టం చేసిందని వెంకయ్య తెలిపారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం చేర్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు.

కాంగ్రెస్ పై విమర్శలు..
2004 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పిందని.. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఏమాత్రం పట్టించుకోలేదని వెంకయ్య విమర్శించారు. 2004లో కాంగ్రెస్‌ తీర్మానం చేశాక అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పడాలని ఉత్తరాలు ఇచ్చాయని అన్నారు. 1972లోనే ఏపీని విభజించి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రమే మారేదని వెంకయ్యనాయుడు అన్నారు. జై ఆంధ్రా ఉద్యమంలో తాను కూడా పాల్గొన్నాన‌ని ఆ నాటి సంగతులను వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్‌కి కలిగే లాభాలను వివరించారు. ఏ పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించలేకపోయారో చెప్పారు. కార్యక్రమంలో ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు, దేవినేని ఉమ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం వెంకయ్యను నేతలు ఘనంగా సన్మానించారు. 

06:31 - September 18, 2016

వరంగల్ : కేసీఆర్‌ మజ్లిస్‌తో జతకట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తుంటే.. తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. సీఎం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో బీజేపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సభకు హాజరైన బీజేపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షాకు బీజేపి శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆ తర్వాత సభలో పాల్గొన్న అమిత్‌షా.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు అధికారికంగా నిర్వహించట్లేదో చెప్పాలని ప్రశ్నించారు. సెప్టెంబర్‌ 17న మహారాష్ట్ర, కర్ణాటక విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు తెలంగాణకు స్వాతంత్య్రం రాలేదని అమిత్‌షా అన్నారు. సర్దార్‌ పటేల్‌ చొరవ, తెలంగాణ యోధుల పోరాటం వల్లే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని పేర్కొన్నారు.

ప్రజలే గుణపాఠం చెబుతారు..
భద్రకాళి, రాణీ రుద్రమదేవి పుట్టిన పుణ్యభూమి తెలంగాణ అని అమిత్‌షా కొనియాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధులకు విమోచన దినోత్సవం జాతీయ అజెండాగా మారిందని అన్నారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసింది తెలంగాణ ప్రజలని..వారి మనోభావాలకు అనుగుణంగా ఆయన నడుచుకోవాలని అమిత్‌షా సూచించారు. సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా మజ్లీస్‌కు వత్తాసు పలికితే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. హన్మకొండలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి సహా పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు.

06:29 - September 18, 2016

హైదరాబాద్ : 'జగన్‌' సంస్థల్లో రాంకీ కంపెనీ పెట్టుబడులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. నేరాభియోగ పత్రాన్ని ఈడీ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. చార్జిషీటులోని అభియోగాలను పరిశీలించిన న్యాయమూర్తి జగన్‌కు సమస్లు జారీ చేశారు. జగన్‌తోపాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూడా సమన్లు జారీ అయ్యాయి. విజయసాయిరెడ్డి జగన్‌ సంస్థలకు ఆడిటర్‌గా పని చేశారు. పెట్టుబడులకు సంబంధించిన విషయాన్ని ఈయనే చూసుకున్నారన్న అభియోగాలు ఉన్నాయి.

ఈనెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశం..
వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా... ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్‌ అక్రమంగా ఆస్తులు సంపాందిచారన్న ఆరోపణపలై సీబీఐ దర్యాప్తు చేసి, కోర్టులో చార్జీషీట్లు దాఖలు చేసింది. కోర్టు నుంచి ఈ చార్జిషీట్ల కాపీలను తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రత్యేకంగా దర్యాప్తు చేసి... నేరాభియోగ ప్రతాలు ఈడీ కోర్టులో దాఖలు చేస్తోంది. జగన్‌ సంస్థల్లో రాంకీ పెట్టుబడులపై తాజాగా ఈడీ ప్రత్యేక కోర్టు వైసీపీ అధినేతకు సమన్లు జారీ చేసింది. ఈనెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. రాంకీ కంపెనీ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో పది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడులు మనీ ల్యాండరింగ్‌ చట్టానికి విరుద్ధమని చార్జిషీటులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పేర్కొంది. జగతి పబ్లికేషన్స్‌లో పది కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా రాంకీ సంస్త 133 కోట్ల రూపాయల లబ్ధి పొందిందని అభియోగపత్రంలో ఈడీ ప్రస్తావించింది. దీంతో రాంకీ అధిపతి ఆయోధ్య రామిరెడ్డితోపాటు, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఐఏఎస్‌ అధికారి వెంకట్రామిరెడ్డికి కూడా ఈడీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

మార్చి 28న కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా జగన్‌కు ఈడీ కోర్టు సమస్లు జారీ చేసింది. అప్పట్లో అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్‌.. జగన్‌ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై దాఖలు చేసిన చార్జిషీటు ఆధారంగా సమన్లు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో 18 మందికి కూడా ఈడీ కోర్టు అప్పట్లో సమన్లు జారీ చేసిన ఈడీ కోర్టు, మార్చి 28న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్‌ సంస్థల్లో ఆయా కంపెనీలు పెట్టిన పెట్టుబడులు, ఇందుకు ప్రతిఫలంగా అవి పొందిన లబ్ధి, మనీల్యాండరింగ్‌ చట్ట నిబంధనల ఉల్లంఘనలపై ఈడీ దాఖలు చేస్తున్న చార్జిషీట్ల ఆధారంగా సమన్లు జారీ అవుతున్నాయి. 

మదీనాగూడలో కారులో పేలిన సిలిండర్...

హైదరాబాద్ : మియాపూర్ మదీనాగూడలో కారులో ఉన్న సిలిండర్ పేలింది. దీనితో కారు దగ్ధమైంది. కారులో ఉన్న వారు ప్రాణాలు కాపాడుకున్నారు. 

బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు..

ఢిల్లీ : బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టపరంగా రామమందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని, దీపావళి తరువాత నవంబర్ మొదటివారంలో రామమందిర నిర్మాణంపై సుప్రీంకోర్టులో ప్రత్యేక బెంచ్ ఏర్పాటవుతుందని, 2017 ఫిబ్రవరిలో రామమందిరంపై తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. 2017-18లో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి దర్శనానికి అనుమతినిస్తారని పేర్కొన్నారు.

 

సెమీస్ లో సౌరవ్ ఓటమి..

ఢిల్లీ : మకావ్ ఓపెన్ స్వ్కాష్ టోర్నీ సెమీస్ లో భారత క్రీడాకారుడు సౌరవ్ ఘోషల్ పరాజయం చెందాడు. నాలుగో సీడ్ డరెల్ సెల్బై (ఇంగ్లాండ్) 8-11, 11-14, 11-7, 11-0 తో రెండో సీడ్ సౌరవ్ పై విజయం సాధించాడు. 

దీపావళికి 'భక్త రామదాసు' ప్రారంభం..

ఖమ్మం : దీపావళి రోజున సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భక్త రామదాసు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈమేరకు శనివారం మంత్రి తుమ్మల ఈ విషయాన్ని వెల్లడించారు. 

19 నుండి ఇక్రిశాట్ బోర్డు సమావేశాలు..

హైదరాబాద్ : 19వ తేదీ నుండి ఇక్రిశాట్ (ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రోపిక్స్) బోర్డు సమావేశాలు పటన్ చెరులోని ఇక్రిశాట్ లో నిర్వహించనున్నారు. 

బెంగళూరు హైవేపై నేడు హరితహారం..

హైదరాబాద్ : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపులా భారీ సంఖ్యలో మొక్కలు నాటనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ వరకు మొక్కలు నాటనున్నారు. 

Don't Miss