Activities calendar

19 September 2016

22:13 - September 19, 2016

తమిళనాడు : రాజధాని చెన్నైలో ఓ కారు బీభత్సం సృష్టించింది. తాగిన మైకంలో ఉన్న లా విద్యార్థి 22 ఏళ్ల వికాస్‌ విజయానంద్‌ పోర్షే కారు నడుపుతూ అదుపు తప్పి పార్కింగ్‌ చేసిన ఆటోలను ఢీకొట్టాడు. తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఓ ఆటోడ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు డ్రైవర్లు గాయపడ్డారు. రోడ్డు పక్కన ఆటోలు ఆపి డ్రైవర్లు నిద్రిస్తున్న సమయంలో కేథడ్రల్‌ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. కారు ఢీ కొనడంతో పార్కింగ్‌ చేసి ఉన్న 12 ఆటోలు ధ్వంసమయ్యాయి. మృతి చెందిన డ్రైవర్‌ అరుముగంకు ఏడేళ్ల పాప ఉంది. అంతకు ముందే తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ పాప అనాథగా మారింది. నిందితుడు విజయానంద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

22:10 - September 19, 2016

బీహార్ : ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధుబని జిల్లాలో అదుపుతప్పిన బస్సు 25 అడుగుల లోతు చెరువులో పడి నీటిలో మునిగి పోయింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 55 మంది ఉన్నట్లు సమాచారం. మధుబని నుంచి సీతామర్హి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి ఆలస్యంగా వచ్చిన పోలీసులు, అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

22:05 - September 19, 2016

హైదరాబాద్ : ఎన్నో హత్యలు చేశారు..అందులో కొన్ని పీకకు చుట్టుకోవచ్చు..లేదంటే ఎవరికైనా ఇబ్బంది కలుగొచ్చు..దీంతో ఏకంగా పోస్టుమార్టంలోనే నివేదికలు అనుకూలంగా మార్చుకున్నారు..అందుకు ఫోరెన్సిక్ వైద్యులను మేనేజ్ చేశారు...ఇది గ్యాంగ్‌స్టర్ నయీం అరాచకాల్లో వెలుగుచూసిన మరో కోణం... హత్యల కేసులకు సంబంధించి వివరాలు సేకరించిన సిట్‌కు నాలుగు హత్యలు కాదు..సాధారణమంటూ వచ్చిన రిపోర్టులపై ఆరా తీస్తున్నారు...ఇక నయీం సహకారం అందించిన పోలీసులు..పొలిటికల్‌తో పాటు ఇప్పుడు ఫోరెన్సిక్‌ వైద్యులకు కూడా నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దమయింది...

24 హత్యలు చేసిన గ్యాంగ్‌స్టర్...
గ్యాంగ్‌స్టర్‌ నయిం కేసుల్లో లోతుగా శోధిస్తున్న సిట్‌కు అనేక విషయాలు తెలుస్తున్నాయి...ఇప్పటికే అన్ని రకాల సహకారం తీసుకున్న నయీం చివరకు పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ వైద్యులను వదల్లేదు..వారికి తాయిలాలు ప్రకటించేసి హత్య కేసుల్లో పోస్టుమార్టం రిపోర్టులను తారుమారు చేసినట్లు తెలుస్తోంది...ఇది తెలిసిన సిట్‌ లోతుగా దర్యాప్తు మొదలుపెట్టింది...నయీం ఇప్పటికి 24 మందిని హత్య చేయించినట్లు గుర్తించిన సిట్‌ అందులో దర్యాప్తు చేస్తుండగా నాలుగు హత్యలకు సంబంధించిన రిపోర్టులు సాధారణంగా ఉన్నాయి..దీంతో మరింతగా ఆలోచిస్తే అసలు విషయం బయటపడింది...పోస్టుమార్టం రిపోర్టులను కూడా తారుమారు చేయడంలో నయీం మేనేజ్ చేశాడని గుర్తించిన సిట్‌ బృందాలు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులను విచారించేందుకు సిద్దమయింది...

కీలకమైన రిపోర్టులు తారుమారు..
ఇప్పటివరకు తెలిసిన 24 హత్యలే గాకుండా మరిన్ని అరాచాకాలు చేసి ఉంటారని సిట్ భావిస్తుంది..హత్యలు చేసిన తర్వాత దర్యాప్తులో కీలకంగా మారే పోస్టుమార్టం రిపోర్టులను నయిం తారుమారు చేయించాడు..అటు పోలీసులను ,పొలిటికల్ లీడర్స్ ను మేనెజ్ చేసిన రాక్షసుడు ఇటు వైద్యులను కూడా తనకు అనుకూలంగా వాడుకున్నాడు...నయానో..భయానో వారిని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది..

మావోయిస్టులతో సంబంధం ఉన్న పోలీసులు..
ఇప్పటి వరకు 30 మంది పోలీస్ అధికారుల పాత్ర ఉన్నట్లు సిట్ గుర్తించింది. గతంలో మావోయిస్టులకు సంబందం ఉన్న పోలీసులు, భువనగిరి ప్రాంతంలో పని చేసిన పోలీసులే ఎక్కవ మంది ఉన్నారు. రాజకీయ నాయకుల్లో ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుంది. వీరందరికి నోటీసులు ఇవ్వాలంటే బలమయిన సాక్షాదారాలు అవసరమని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం భావిస్తుంది. అందుకు ప్రత్యేకంగా రెండు బృందాలు పని చేయనున్నాయి.

భూ కబ్జాలపై వివరాలు కావాలన్న సిట్...
ఇక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సిట్ లేఖ వ్రాసింది. భూకబ్జాలు చేసిన రికార్డుల పై వివరాలు ఇవ్వాల్సిందిగా సిట్ కోరింది. ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములను, వక్ప్ భూములను రెవెన్యూ అధికారుల అండదండలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. 30 యేళ్ల క్రితం నుంచి భూముల రికార్డులను వాటిని ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేశారో వారి వివరాలను సిట్ సేకరించే పనిలో పడింది...

22:02 - September 19, 2016

ఢిల్లీ : కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై సిపిఎం కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీర్‌లో శాంతి నెలకొల్పేందుకు వెంటనే చర్చల ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రానికి సూచించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఉపాధి హామీ, తదితర సమస్యలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది.

3రోజులపాటు సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు
ఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిసాయి. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై కేంద్ర కమిటీ చర్చించింది.

యూరీ దాడిని ఖండించిన సీపీఎం
జమ్ముకశ్మీర్‌ యూరిలో జరిగిన ఉగ్రదాడిలో 18 మంది సైనికులు మృతి చెందడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండించింది. కశ్మీర్‌లో గత 3 నెలలుగా నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీర్‌ ప్రజలతో వెంటనే చర్చల ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని పేర్కొంది. పాక్‌ వ్యతిరేక విధానాలను రెచ్చగొట్టడం ద్వారా బిజెపి ప్రభుత్వం, హిందుత్వ శక్తులు ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని సిపిఎం విమర్శించింది.

ముస్లింలు, దళితులపై జరుగుతున్న దాడులపై సిపిఎం ఆందోళన
గో సంరక్షణ పేరుతో ముస్లింలు, దళితులపై జరుగుతున్న దాడులపై సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. గోరక్షణ సంస్థలను నిషేధించాలని డిమాండ్‌ చేసింది. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ల హిందుత్వ ఎజెండా లౌకికవాద ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా పరిణమించిందని హెచ్చరించింది.దేశంలో ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయ స్థితికి చేరిందని సిపిఎం పేర్కొంది. అభివృద్ధి కుంటుపడిందని, నిరుద్యోగం, ధరల పెరుగుదలతో ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరిగిందని తెలిపింది.

దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కేంద్ర కమిటీ నిర్ణయం
కేరళలో సిపిఎం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజలకిచ్చిన హామీల్లో కొన్ని నెరవేర్చిందని సిపిఎం స్పష్టం చేసిది. బిజెపి, ఆర్.ఎస్.ఎస్‌ కేరళలో మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. విదేశాంగ విధానంలో భారత ప్రభుత్వం అమెరికా ఒత్తడిలకు తలొగ్గుతోందని విమర్శించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఉపాధి హామీ, సంక్షేమ పధకాల అమలు కోసం దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. 

21:57 - September 19, 2016

ఢిల్లీ : కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై సిపిఎం కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీర్‌లో శాంతి నెలకొల్పేందుకు వెంటనే చర్చల ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రానికి సూచించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఉపాధి హామీ, తదితర సమస్యలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. 

21:51 - September 19, 2016

ఢిల్లీ : యూరీ ఉగ్రవాద దాడి ఘటనను భారత్‌ సీరియస్‌గా తీసుకుంటోంది. పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడ్డ మరో జవాన్‌ అమరుడయ్యాడు. ఉగ్రదాడిలో మృతి చెందిన జవాన్ల సంఖ్య 18కి చేరింది. జవాన్ల మృత దేహాలను స్వస్థలాలకు తరలిస్తున్నారు.

ఉగ్రదాడిపై ప్రధానమంత్రి నరేంద్రమోది నివాసంలో ఉన్నత సమావేశం
జమ్ముకశ్మీర్‌ యూరిలో జరిగిన ఉగ్రదాడిపై ప్రధానమంత్రి నరేంద్రమోది నివాసంలో ఉన్నత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్‌ పారీకర్, అరుణ్‌జైట్లీ తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఆర్మీ చీఫ్‌ దల్బీర్‌సింగ్‌ ఉగ్రదాడి తీరును ప్రధానికి వివరించారు. పాకిస్తాన్‌పై చేపట్టాల్సిన చర్యలపై సమావేశం చర్చించింది. ఉగ్రదాడులకు ఊతమిస్తున్న పాకిస్తాన్‌కు ధీటుగా సమాధానం చెప్పాలని నిర్ణయించింది. అంతర్జాతీయ వేదికపై పాక్‌ కుటిల నీతిని ఎండగట్టి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించినట్లు సమాచారం.

ప్రధాని..రాష్ట్రపతి భేటీ..
ప్రధానిమోది రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలుసుకున్నారు. యూరి ఉగ్రదాడి ఘటనను ఆయనకు వివరించారు.

ఏడాదిలో 110 ఉగ్రవాదులు హతం : రన్ బీర్ సింగ్
యూరిలో సైనిక ఆపరేషన్‌ ముగిసిందని, నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని లెఫ్ట్ నెంట్‌ జనరల్‌ రన్‌బీర్‌సింగ్‌ తెలిపారు. గత మూడు నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, ఆహారం, మందులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 110 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చెప్పారు.

జవాన్లకు మెహబూబా ముఫ్తీ నివాళులు
జమ్ముకశ్మీర్‌ యూరీలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నివాళులర్పించారు. ఆమెతో పాటు జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ సతీశ్‌ దువా, డీజీపీ రాజేంద్ర కుమార్‌, పలువురు సీనియర్‌ అధికారులు జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం 92 బేస్‌ ఆర్మీ ఆసుపత్రిలో ఉగ్రదాడిలో గాయపడి చికిత్స పొందుతున్న సైనికులను ముఫ్తీ పరామర్శించారు.

ఉగ్రదాడిపై స్పందించిన ప్రపంచ దేశాలు
ఇండియన్‌ ఆర్మీ బేస్‌పై ఉగ్రదాడిపై ప్రపంచ దేశాలు స్పందించాయి. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. గత 26 ఏళ్లలో భారత ఆర్మీ బేస్‌ జరిగిన పెద్ద ఉగ్రదాడి ఇదే. ఉగ్రదాడిలో మృతి చెందిన జవాన్ల సంఖ్య 18కి చేరింది.

21:45 - September 19, 2016

చిత్తూరు : జస్టిస్‌ మంజునాథ నేతృత్వంలో ఏర్పాటైన ఏపీ బీసీ కమిషన్‌ తిరుపతిలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది. కొత్త కులాలను బీసీల్లో చేర్చడం, గ్రూపుల మార్పు వంటి అంశాలను కమిటీ అధ్యయనయం చేయనుంది. మూడు రోజులపాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న మంజునాథ నేతృత్వంలోని బీసీ కమిషన్‌ తిరుపతితో వివిధ వర్గాల నుంచి ప్రజాభిప్రాయసేకరణ ప్రారంభించింది. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50శాతం మించి ఉండొచ్చని ఏపీ బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మందుజునాథ తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కమిషన్‌ నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తుందని జస్టిస్‌ మంజునాథ తెలిపారు. మరోవైపు కాపులను బీసీల్లో చేర్చొద్దంటూ బీసీలు తిరుపతిలో ఆందోళన చేస్తున్నారు. బీసీల ఐక్యతను దెబ్బతీయోద్దని..వెంటనే ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలని బీసీలు డిమాండ్ చేశారు.  

21:40 - September 19, 2016

ఢిల్లీ : మరోసారి తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికపై దర్శనమియ్యబోతున్నారు. అయితే ఈసారి ఎవరి డిమాండ్లను వాళ్లు వినిపించబోతున్నారు. రెండు రాష్ట్రాల నీళ్ల జగడం ఢిల్లీలో జరిగే అపెక్స్‌ కమిటీ మీటింగ్‌లో తేలే అవకాశం ఉంది.

మంత్రి ఉమాభారతి అధ్యక్షతన భేటీ
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో జరిగే అపెక్స్‌ కమిటీ సమావేశంలో పాల్గోబోతున్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం రెండున్నరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ మంత్రులు, సీఎస్‌లు, భారీ నీటిపారుదలశాఖ కార్యదర్శులు, చీఫ్‌ ఇంజనీర్లు పాల్గోనున్నారు. ఒక్కో రాష్ట్రం నుంచి ఐదుగురు సభ్యులు మాత్రమే రావాలంటూ జలవనరుల శాఖ ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది.

ఆరు అంశాలపై కమిటీలో చర్చ
అపెక్స్ కమిటీ భేటీలో ముఖ్యంగా ఆరు అంశాలపై చర్చించనున్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, నీటి పంపకాలు, రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లో కొలిచేందుకు పారదర్శక ప్రక్రియ, సంవత్సర కాలంలో రెండు రాష్ట్రాలకు కేటాయించిన నీటి విడుదలకు మెకానిజం ఏర్పాటు, కృష్ణానదికి తరలించిన గోదావరి నీటి పంపకాల నిబంధనలు, అపెక్స్‌ కమిటీ చైర్మన్‌ అనుమతితో మిగిలిన అంశాలపై చర్చించనున్నారు.మరోవైపు అపెక్స్ కమిటీ భేటీలో ఏపీ వాదనలు వినిపిస్తామని దేవినేని, తెలంగాణ వాదనలు వినిపిస్తామని హరీష్‌రావు తెలిపారు. ఢిల్లీలోనైనా జల జగడం తేలుతుందో చూడాలి.

21:36 - September 19, 2016

కృష్ణా : ప్రత్యేక హోదా అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయ స్వార్ధప్రయోజనాలకు వాడుకుంటున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. హోదాపై రాద్ధాంతం చేసే బదులు.. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా నిమ్మలూరులో బెల్‌ పరిశ్రమకు శంకుస్థాపనం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు... ప్యాకేజీని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

నిమ్మలూరులో రూ.300 కోట్లతో బెల్‌ నిర్మాణం
కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మలూరులో భారత్‌ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు బెల్‌కు పునాది రాయి వేశారు. మూడు వందల కోట్ల రూపాయలతో పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖకు చెందిన 50 ఎకరాల భూమి కేటాయించింది. బెల్‌ను 2018 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రక్షణ దళాలకు అవసరమైన నైట్‌ విజన్ గాగుల్స్‌ను ఉత్పత్తి చేస్తారు. బెల్‌ పూర్తైతే ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా మరో రెండు వేల మందికి ఉపాధి లభిస్తుంది.

ప్రతిపక్షాలపై బాబు ఆగ్రహం
బెల్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు... ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజమండ్రి విమానాశ్రయం రన్‌ వే విస్తరణ
నిమ్మలూరులో బెల్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత చంద్రబాబు, వెంకయ్యనాయుడు రాజమండ్రి విమానాశ్రయం రన్‌ వే విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో ప్రస్తుతం ఉన్న రన్‌ వేని పటిష్ట పరచడంతోపాటు, విస్తరణకు శంకుస్థాపన చేశారు. ఉయభగోదావరి జిల్లా అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుందని భావిస్తున్నారు. రాత్రి వేళల్లో విమానాలు రాకపోకలు సాగించే పనులు ఇప్పటికే పూర్తి చేశారు. నైట్‌ ల్యాండింగ్‌ ఫెసిలిటీని త్వరలోనే ప్రారంభించాలని నిర్ణయించారు.

వైసీపీ ఉన్మాదిలో వ్యవహరిస్తోంది : బాబు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయంటూ ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఇరువురు నేతలు మండిపడ్డారు. వైసీపీ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్మాదంతో వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి నిరోధక శక్తుల చర్యలను తిప్పికొట్టే విషయంలో ప్రజలు వివేకంతో వ్యవహరించాలని చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కోరారు. 

గవర్నర్ తో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఢిల్లీలో ఈ నెల 21న అత్యున్నత మండలి సమావేశం నేపథ్యంలో గవర్నర్‌తో సీఎం పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, సంబంధిత అంశాలను సీఎం గవర్నర్‌కు వివరించారు.

తుని ఘటనలో ఆసక్తికర విషయాలు..

తూర్పుగోదావరి : తుని హింసాకాండపై సీఐడీ విచారణ వేగవంతం చేసింది. న్యూస్‌ చానల్‌ యజమాని సుధాకర్‌నాయుడు సీఐడీ విచారణ చేసింది. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. చలో కాపు నాడుకు ముందు తనను ముద్రగడ కలిశారని సుధాకర్‌నాయుడు తెలిపారు. సభలో వినియోగించిన డ్రోన్‌ కెమెరాలు కొంతమంది సహకారంతో ముద్రగడ కుమారుడు తెప్పించారని విచారణ సందర్భంగా సుధాకర్ తెలిపారు. సభకు వచ్చినవారిని ముద్రగడే రైల్వే ట్రాక్‌ వైపు తీసుకెళ్లారని, రైల్‌రోకో చేయడం వల్లే అంతమంది గుమిగూడారని తెలిపారు. డ్రోన్‌ కెమెరాలు అందించినవారికీ కూడా నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. 

ఎల్బీ నగర్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : ఎల్బీనగర్ కుంటి జంగయ్యనగర్ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న రూ. 75 వేలు, విలువైన గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. ఇల్లు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు మంటలను ఆర్పివేశారు. బాధితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య?!..

హైదరాబాద్ : పాతబస్తీ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూబాబానగర్‌లో దారుణం జరిగింది. బైక్‌పై వస్తున్న రౌడీషీటర్ అమర్‌హంసాన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. ఇనుపరాడ్లతో అమర్‌హంసాన్‌ను తీవ్రంగా కొట్టారు. దీంతో అక్కడికక్కడే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

20:35 - September 19, 2016

కపిరాజుకు దొరికెను ఓ నారికేళ ఫలము..ఇక సూడాల...కోతికి కొబ్బరికాయ దొరికితే ఏం సేత్తది? చూడుండ్రి..బేకరీ ఐటెమ్ తో వెళ్తున్న బీసీఎం వ్యాన్ బోల్తా..ప్యాకెట్స్ ఎత్తకపోయిన స్థానికులు..పాష్ గా తయారై షాపింగ్ కు ఎల్లి..పట్టుచీరలెత్తుకెత్తున్న ఆడ కేడీలు..బారెడు తుపాకితో పిట్టల్ని కొట్టేస్తున్న పోరడు..బేజారయిపోయిన పోలీసోల్లు..కుక్కకు శవయాత్ర చేసి..సమాధి జేసిన శునక యజమానులు..కోతికి కొబ్బరికాయ్ దొరికితే ఏం సేత్తది? రికిన కొబ్బరికాయ..పాలతో ఫీట్లు సేత్తన్న పోరడు..గాలి పాటలకు పైసల వాన ..ముదిరిపోయిన జిల్లాల లొల్లి..ఆగమాగం చేస్తన్న ఆందోళన కారులు..

సభ్యుల సూచనలు పాటిస్తాం : మేయర్ బొంతు

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా రోడ్లు, నాలాల సమస్యలపై చర్చ జరిగిందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. 214 ట్రాఫిక్ జంక్షన్లను అభివృద్ధి చేయాలని సభ్యులు కోరారని చెప్పారు. కొన్ని నాలాలపై రిటైనింగ్ వాల్స్ కట్టి వరదలు తగ్గించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. శానిటేషన్ పద్ధతిలో మార్పులకు సభ్యుల సూచనలు పాటిస్తామని స్పష్టం చేశారు.

20:02 - September 19, 2016
20:00 - September 19, 2016

2016లో మిస్ ప్లానెట్ ఎర్త్ కాంపిటీషన్లో ఇండియా తరపున పాల్గొని 'మిస్ ప్లానెట్ ఇండియా' అవార్డును గెలుచుకున్న తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రష్మీ ఠాకూర్ తో టెన్ టీవీ లైవ్ షో...అందం..ఆత్మవిశ్వాసం..సమయస్ఫూర్తి..ఇవీన్నీ మిక్స్ చేస్తే రష్మీ ఠాకూర్ చెప్పే విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..మోడలింగ్ రంగం నుండి బ్యూటీ కాంటెస్ట్ లోకి వచ్చాని రష్మీ తెలిపారు. అందాల పోటీలలో పాల్గొనేవారికి అందంతో పాటు సమయస్ఫూర్తి కూడా ఇంపార్టెంట్ అని రష్మీ చెప్పారు. అందం అంటే భాహ్య సౌందర్యమే కాదనీ..హృదయ సౌందర్యం కూడా అందం కూడా అందమేనని 'మిస్ ప్లానెట్ ఇండియా' విన్నర్ రష్మీ ఠాకూర్ తెలిపే మరిన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

19:36 - September 19, 2016

ప్రత్యేక హోదా కంటే రాష్ట్రాని ప్యాకేజీతోనే లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ విషయంపై తాను కట్టుబడి వున్నానని కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశంపై కేంద్ర మంత్రులతో పలు చర్చలు...హోదా ఇస్తానన్న ఏపీకి కేంద్రం రిక్త హస్తాలు చూపెట్టింది..హోదా కావాలని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు..హోదా ఇచ్చే అవకాశం లేదు..భారీ ప్యాకేజీ ఇస్తామంటూ కేంద్రప్రభుత్వం..ఇలా ప్రత్యేక హోదా..భారీ ప్యాకేజీ ఈ అంశాలు ఏపీని కుదిపేశాయి..పలు ఆందోళనలు మిన్నంటాయి..ఇప్పటికీ హోదా యే కావాలి ప్యాకేజీ వద్దంటూ విపక్షాలు..పలు విమర్శలు గుప్పిస్తున్నాయి..ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త మరియు తెలుగుదేశం పార్టీ ఎంపీ..కేంద్రమంత్రి అయిన సుజనా చౌదరితో టెన్ టీవీ ఫేస్ టూ ఫేస్.. కార్యక్రమం నిర్వహించింది. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై సుజనా ఏమంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం...ఏపీకి హోదా ఇచ్చే అవకాశం లేనందుకే ప్యాకేజీకి ఒప్పుకున్నామని మంత్రి సుజనా పేర్కొన్నారు. ప్యాకేజీకి ఒప్పుకున్నందుకు రాజకీయం గా టీడీపీకి ఎటువంటి నష్టం జరగదన్నారు. ప్రస్తుతం ఆందోళనలో వున్నా ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. ప్యాకేజీ విషయంలో కేంద్రంతో జరిపే చర్చల్లో మంత్రి అశోక్ గజపతిరాజును పక్కన పెట్టారనే ప్రశ్నకు సమాధానంగా ప్యాకేజీ విషయంలో ఆయన్ని దూరం పెట్టారనటం వాస్తవం కాదన్నారు. ఆయనంటే తనకు చాలా గౌరవమన్నారు. ప్యాకేజీ చర్చలు జరుగుతున్న సమయంలో ఆయన ఢిల్లీలో లేరని తెలిపారు. ప్యాకేజీ అంశంలో భాగమైన పోలవరం ప్రాజెక్టును కేంద్రం 100శాతం నిధులు ఇస్తామనటం సంతోషదాయకమన్నారు. పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామంటున్న మంత్రి సుజనా చౌదరి ఎటువంటి అంశాలను ప్రస్తావించారో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

19:11 - September 19, 2016

ఢిల్లీ : ఏపీ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పిటిషనర్‌ శ్రీమన్నారాయణ పోరాడుతున్నారు. ఈ నెల 30తో పిటిషనర్‌ వాదనలు ముగియనున్నాయి. ఇవాళ వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్‌ 30 తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో రాజధానికి తాను వ్యతిరేకం కాదని.. వరద ప్రభావ ప్రాంతంలో రాజధాని నిర్మిస్తున్నందుకే వ్యతిరేకిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

19:08 - September 19, 2016

పశ్చిమగోదావరి : భీమవరం మండలం తుందుర్రులో గోదావరి ఆక్వాఫుడ్‌ పార్క్ నిర్మాణాన్ని ఆపాలంటూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు.. మొగల్తూరు తహశిల్దార్‌ కార్యాలయముందు ఆందోళన చేపట్టారు.. ఈ ఫ్యాక్టరీతో గొంతేరు కాలువ కలుషితం అవుతుందంటూ నిరసన చేపట్టారు..కు వినతిపత్రం అందజేశారు..

18:58 - September 19, 2016

అనంతపురం : ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యంపట్ల ప్రజలకు నమ్మకం పోయిందని ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్ అన్నారు. విషజ్వరాలతో అనంతపురం జిల్లాలో ప్రజలు చనిపోతున్నా..సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. డెంగ్యూ,మలేరియాలతో పసిపిల్లలు మృత్యువాత పడుతున్నా..ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా గేయానంద్‌ దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నుంచి రాతపూర్వకంగా భరోసావచ్చేవరకూ దీక్ష కొనసాగిస్తానని గేయానంద్‌ పేర్కొన్నారు.

18:56 - September 19, 2016

గుంటూరు : ఏపీ రాజధాని పరిధిలోని శాఖమూరు గ్రామంలో ప్లాట్ల కేటాయింపు సదస్సు గందరగోళంగా మారింది.. తమ రెవెన్యూ పరిధిలో భూములు తీసుకున్న ప్రభుత్వం... వేరే రెవెన్యూ పరిధిలో ప్లాట్లు ఎలా కేటాయిస్తుందని అధికారులను స్థానికులు నిలదీశారు. తమ గ్రామంలోనే నివాస, వాణిజ్య స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు కొందరు రైతులు తమ సందేహాలపై అధికారులతో మాట్లాడుతుండగా... ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రైతులు దీనికి అడ్డుతగిలారు.. దీంతో రెండువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.. తమ సమస్యలు పరిష్కరించకుండా ప్లాట్లు తీసుకోమని రైతులు తేల్చిచెప్పడంతో అధికారులు అక్కడినుంచి వెనుదిరిగారు..

18:54 - September 19, 2016

తూర్పుగోదావరి : తలలో మెదడున్నవారు ఎవరూ ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని వ్యతిరేకించరని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. మూడొందల కోట్ల రూపాయలతో చేపడుతున్న రాజమండ్రి విమానాశ్రయ రన్‌ వే పటిష్టత, విస్తరణ పనులను పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి వెంకయ్య శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా జరిగిన సభలో వెంకయ్యనాయుడు ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయల ప్యాకేజీని వ్యతిరేకించడం అర్థరహితమని వ్యాఖ్యానించారు.

వైసీపీ ఉన్మాదిలా వ్యవహరిస్తోంది : చంద్రబాబు
వైఎస్ కాంగ్రెస్‌ అన్ని విషయాల్లో ఉన్మాదంతో వ్యవహరిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రతిపక్ష వైసీపీ అభివృద్ధి నిరోధక శక్తిగా మారిందని మండిపడ్డారు. రాజమండ్రి విమానాశ్రయ రన్‌ వే పటిష్టత, విస్తరణకు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతి రాజుతో కలిసి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రత్యేక ప్యాకేజీని వ్యతిరేకిస్తున్న వైరసీపీ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

18:49 - September 19, 2016

విజయవాడ : ప్రకృతి వ్యవసాయ నిపుణులు పాలేకర్‌ డాక్టరేట్‌ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. పాలేకర్‌కు డాక్టర్‌రేట్‌ ఇస్తామనడాన్ని నిరసిస్తూ గుంటూరులో వ్యవసాయశాఖ ఉద్యోగులు నల్లబాడ్జిలతో విధులకు హాజరయ్యారు. పాలేకర్‌కు డాక్టరేట్‌ ఇవ్వాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలంటూ నిరసన తెలిపారు. వ్యవసాయరంగానికి పాలేకర్‌ కంటే ఎక్కువ సేవ చేసిన వారు చాలా మంది ఉన్నారని.. వారిని గుర్తించి డాక్టరేట్‌ ఇవ్వాలని వ్యవసాయశాఖ ఉద్యోగుల సంఘం నేత ప్రవీణ్‌ కోరారు. మరోవైపు ప్రకృతి వ్యవసాయం కూడా వ్యవసాయరంగంలో భాగమేనని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పాలేకర్‌కు డాక్టరేట్‌ ఇవ్వటంలో తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

స్కూల్ బస్ బోల్తా..15మందికి గాయాలు..

నల్లగొండ : యాదగిరిగుట్ట మండలం కాచారం వద్ద ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

జైపాల్ రెడ్డి ఫెక్సీకి చెప్పుల దండ..

కృష్ణా : కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి ఫ్లెక్సీకి కొందరు దుండగులు చెప్పుల దండ వేసిన ఘటన కలకలం రేపింది. నూజివీడు చిన గాంధీ బొమ్మ సెంటర్‌లో ఉన్న ఆయ‌న ఫ్లెక్సీ వ‌ద్ద‌కు ఈరోజు మ‌ధ్యాహ్నం బైక్‌పై వ‌చ్చిన యువకులు చెప్పుల దండ వేసి వెళ్లిపోయారని స్థానికులు పేర్కొన్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఫ్లెక్సీకి వేసిన చెప్పుల దండను తొలగించారు.

18:18 - September 19, 2016

హైదరాబాద్ : నయీం కేసులో రాజకీయనేతలు, పోలీసుల లింకులపై.. సిట్ ఆధారాల సేకరణ పనిలో పడింది. ఇందుకోసం రెండు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ విషయంలో పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. నోటీసులు ఇవ్వడానికి ఇప్పుడున్న ప్రాథమిక ఆధారాలు సరిపోవని సిట్‌ భావిస్తోంది. మరోవైపు నయీం 24 హత్యలు చేసినట్టు గుర్తించిన దర్యాప్తు అధికారులు... నాలుగు హత్యకేసుల్లో పోస్టుమార్టం నివేదికను వైద్యులు సాధారణ మరణంగా ఇచ్చినట్టు గుర్తించారు. దీంతో ఆ నివేదిక ఇచ్చిన వైద్యులకు కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని సిట్ భావిస్తోంది. 

18:12 - September 19, 2016

నల్లగొండ : జిల్లా భువనగిరి మండలం హన్మాపూర్‌ గ్రామ పరిధిలో సుఖీభవ నూతన వెంచర్‌ను సంస్థ అధిపతి గురురాజు ప్రారంభించారు. సుఖీభవ వెంచర్‌లో ప్లాట్‌ కొంటే సుఖంగా ఉండొచ్చని ఆయన అన్నారు. వెంచర్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా సినీ నటి రిచా పనాఐ, బాహుబలి ప్రభాకర్‌, సెలబ్రిటీ మంగ్లీ, పలువురు రియల్‌ఎస్టేట్‌ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పటికే ఐదు వెంచర్లు పూర్తి చేసుకుని ఆరోవెంచర్‌ ప్రారంభించిన గురురాజును పలువురు అభినందించారు.

18:10 - September 19, 2016

ఖమ్మం : సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు ముగిశాయి. ఈ పోటీలను డాక్టర్‌ రాజేశ్‌గార్గ్‌, గ్లోబల్‌ టేబుల్‌ టెన్నిస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.రాము, ఈవెంట్‌ మేనేజర్‌ వి. శ్రీధర్‌ ఏర్పాట్లను సమీక్షించారు. మూడు రోజులపాటు కొనసాగిన పోటీల్లో 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పది అంశాల్లో పోటీలు నిర్వహించగా మూడు అంశాల్లో జాతీయ క్రీడాకారుడు స్నేహిత్‌కు మొదటి స్థానం రాగా, చంద్రచూడ్ రెండోస్థానం, ఆకుల శ్రీజ మూడోస్థానంలో నిలిచారు.. 

18:07 - September 19, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్ధానానికి షెడ్యుల్ విడుదలైంది. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రాజీనామాతో ఖాళీ ఏర్పడిన ఈ స్ధానానికి ఆక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. మాజీమంత్రి రామిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన పాలేరు ఉప ఎన్నికల్లో శాసన సభ్యుడిగా ఎన్నికైన తుమ్మల నాగేశ్వరరావు... మే 23న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానానికి ఈనెల 26న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 3న నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీకాగా... 17న ఎన్నిక జరగనుంది.

18:03 - September 19, 2016

హైదరాబాద్ : సాయుధ పోరాటం గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. సాయుధ పోరాటాన్ని హిందు, ముస్లిం వివాదంగా చిత్రీకరించడం దారుణమన్నారు. కేంద్రం నుంచి రాష్టానికి ఎన్ని నిధులు వచ్చాయో టిఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఈ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు. రాబోయే రోజుల్లో కలసి వచ్చే వామపక్ష ,సామాజిక, ప్రగతిశీల శక్తులతో కలసి ప్రత్యామ్నాయ విదానాలకై పోరాడతామన్నారు చాడ.  

17:59 - September 19, 2016

హైదరాబాద్ : ఉద్యోగుల విభజన సమస్యలపై టీఎన్జీవో నేతలు మంత్రి కేటీఆర్‌తో సచివాలయంలో చర్చలు జరిపారు.. ఈ విషయంపై స్పందించిన కేటీఆర్‌.. దసరానాటికి ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని టీఎన్జీవో నేతలు తెలిపారు. ఉద్యోగులు ఆందోళన విరమించాలని కోరినట్టు వారు తెలిపాయి. 

17:53 - September 19, 2016

మెదక్ : ప్రేమోన్మాదం మళ్లీ పంజా విసిరింది..ఈ సారి డిగ్రీ స్టూడెంట్‌పై...నిత్యం నీడలా వెంటాడుతున్న యువకుడు ఇక ఆమె తనను ఇష్టపడడం లేదని శాడిస్టుగా మారాడు..భయంతోనైనా లొంగదీసుకోవాలనుకున్నాడు...దాంతోనే కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్‌పై బ్లేడ్‌తో అటాక్ చేశాడు... అమ్మాయి ఆస్పత్రి పాలుకాగా ప్రేమోన్మాది పరారీలో ఉన్నాడు..మెదక్ జిల్లాలో జరిగిన ఘటన కలకలం రేపింది..

బ్లేడ్‌తో అటాక్ చేసిన సతీష్..
ఆస్పత్రిలో కట్లు కట్టుకున్న ఈ అమ్మాయి పరిస్థితి నిలకడగా ఉంది..కాని ఆమెలో మాత్రం భయం పోలేదు...అందుకు కారణం ప్రేమోన్మాది పంజా... ఊహించని రీతిలో అటాక్ చేసిన సతీష్ 

ప్రేమించాలంటూ డిమాండ్ ..
మెదక్ జిల్లా సదాశివపేట పట్టణంలోని పద్మనాభ డిగ్రీ కాలేజీలో బీకాం ఫైనల్‌ ఇయర్ చదువుతున్న అమ్మాయిని అదే గ్రామానికి చెందిన సతీష్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు...రోజూ ఉదయాన్నే కాలేజీకి వెళ్లే అమ్మాయి వెంటపడుతూ ప్రేమిస్తున్నానని వేధించేవాడు..దీంతో ఆమె ఎన్నోసార్లు తనకు ఇష్టం లేదని చెబుతూ వచ్చింది...కాని సతీష్ మాత్రం అమ్మాయిని బెదిరించైనా..దక్కించుకోవాలనుకున్నాడు..ఉన్మాదిగా మారి పంజా విసిరేందుకు వెనకాలే వెళ్లి బ్లేడ్‌తో ఎక్కడబడితే అక్కడ కోశాడు..

రక్త స్రావంతో కేకలు..స్టూడెంట్‌ అరుపులతో వచ్చిన జనం..
అమ్మాయిపై దాడికి తెగబడ్డంతో అరుపులు..కేకలు విన్న జనం పరుగున వచ్చేసరికి ప్రేమోన్మాది సతీష్ పారిపోయాడు...రక్తస్రావంతో ఉన్న ఆమెను వెంటనే ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స చేస్తున్నారు... విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి వివరాలు తీసుకుని సతీష్ కోసం గాలింపు చేపట్టారు..ప్రేమోన్మాదం పంజా విసిరింది...నిత్యం వెంటాడుతున్నా ఆ అమ్మాయి కన్నవారికి గాని..పోలీసులకు గాని చెప్పకపోవడంతో మౌనం అంగీకారమనుకున్నాడు..దాంతోనే ఉన్మాదిగా మారి పంజా విసిరాడు...

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

ముంబై : స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 35 పాయింట్లు లాభపడి 28,634 వద్ద ముగిసింది. నిఫ్టీ 28 పాయింట్లు లాభపడి 8808 వద్ద ముగిసింది. 

యూపి, మణిపూర్ లో పర్యటించనున్న ఈసీ..

ఢిల్లీ : ఉత్తరప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు పర్యటించనున్నారు. ఎన్నికల నిర్వాహణపై అక్కడి అధికారులతో చర్చించనున్నారు. మణిపూర్ లో మంగళశారం, యూపీలో 26వ తేదీన పర్యటించనున్నారు. శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. 

16:49 - September 19, 2016

ఆయన అభినయ పాఠశాల..అనుభవాల కళాశాల..నవరసాల పానశాల.. ఏడు దశాబ్దాలకు పైగానే తెలుగు సినీ సీమఏలిన ఆయన పేరు 'అక్కినేని నాగేశ్వరరావు'. అభినయానికి అనుభవానికి మధ్యవారధి ఆయన. ఆయన 92వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..తెలుగు సినిమాకి నడక, నడత నేర్పింది 'ఏఎన్నార్‌'. హీరోయిజానికి, సాంఘీక సినిమాకి సరికొత్త నిర్వచనం చెప్పింది 'అక్కినేని'. అంతేకాదు పరిశ్రమకు దిశానిర్ధేశం చేసింది కూడా ఆయనే. తెలుగునాట 'అక్కినేని' అందగాడుగా సుప్రసిద్ధుడు. తెలుగు సినిమా వినీలాకాశంలో 'అక్కినేని' వంటి 'ప్రేమాభిషేకం' చేయించుకున్న  నటుడు లేనే లేడు. ఇంకా కాలేజీ కుర్రాడిగానే అనిపించే మానసికోల్లాసం ఆయన సొంతం. తెలుగు సినిమా వయసు 79 అయితే తెలుగు తెరమీద నటుడిగా ఆయన వయసు 69. జస్ట్ టెన్ ఇయర్స్ వెనుకగా ఆయన తెలుగు సినిమాతో కలసి నట-బాటసారి అయి నడిచారు. తెలుగు తెర మీద ఈ 'దేవదాసు' వెంట పడని పార్వతి లేదు. దట్ మీన్స్.. తెర మీద ఆయన వెంట పడని హీరోయిన్ లేరంటే నిజంగా అతిశయోక్తికాదు. అవార్డులు కూడా అలాగే ఆయన్ను వరిస్తూ వచ్చాయని చెప్పవచ్చెమో. మూడు పద్మాలను కైవసం చేసుకున్న ముచ్చటైన నటదిగ్గజం 'అక్కినేని'. ఆయన ప్రస్థానం, ఆయన ప్రస్థావన ఒక పెద్ద గ్రంధమే అవుతుంది. 

రొమాంటిక్ రోల్స్...
'ఎఎన్నార్' లో ఒక్కో అక్షరానికి ఆయన నటజీవితానికి ముడిపెట్టి చెబితే ఎక్టర్ ఆఫ్ నావలిస్టిక్ అండ్ రొమాంటిక్ రోల్స్ అని అభివర్ణిస్తే బావుంటుందేమో. నవ్య నవలానాయకుడిగా వాటిల్లో కూడా శృంగారాత్మక పాత్రలను అమోఘంగా పోషించి శెభాష్ అనిపించిన నటుడిగా 'ఎఎన్నార్' తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ప్రేమ భగ్నమై... రెండు వేళ్ల మధ్య నలిగే సిగరెట్టు, మరో చేత్తో మందుగ్లాసు, చుట్టూ పొగలు, మనసులో ప్రేమగుబులు... ఈ తరహా పాత్రలు పోషించడంలో 'ఎఎన్నార్' కి సపరేటు డిగ్రీలున్నాయి. సాంఘీక కథా చిత్రాల నాయకుడిగా ఆయన విశేష నటన కనబరిచారు. సామాన్య మానవుడికి చెందిన అన్ని కోణాలు దాదాపు ఆయన తెరమీద ఆవిష్కరించి నటనంటే నాగేశ్వర్రావే అనిపించేశాడు. ఆయన అభినయానికి కొలమానాలుగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఆయన్ను వరించి తరించాయి. పుట్టగానే పువ్వుపరిమళిస్తుందంటారు. అలా అక్కినేని పుట్టగానే అభినయం ఆనంద తాండవం చేసింది.

నాటకాల మీద మక్కువ..
చిన్నప్పటినుంచి నాటకాలమీద మక్కువతో చదువుని కూడా లెక్కచేయకుండా సినీ రంగ ప్రవేశం చేసారు. 1924 సెప్టెంబరు 20న కృష్ణాజిల్లా, గుడివాడ తాలూకా, వెంకటరాఘవాపురంలో జన్మించిన నాగేశ్వరరావు, 1941లో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాడు. తొలి చిత్రం 'ధర్మపత్ని'. నవ రసనాయకుడిగా పేరు పొందిన 'అక్కినేని' నటనలోకి అడుగుపెట్టిన నాటి వయసు పదిహేడేళ్లే  కావడం విశేషం. తొమ్మిదో ఏట నటనకు శ్రీకారం చుట్టి దాదాపు ఏడున్నర  దశాబ్దాల కాలం పాటు అలుపెరగక పరుగులు తీసిన నటవిభూషణుడు. ఆయన నటించిన ఆఖరి చిత్రం 'మనం'. తన ఆఖరి ఊపిరి వరకూ అభినయాన్నే ఉచ్వాస నిచ్వాసలుగా చేసుకున్నారు 'అక్కినేని'. 

సాంఘీక పాత్రలకు జీవం..
ఒకటా? రెండా? ఎన్ని చిత్రాలూ.. ? ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు, ఇంకెన్నో ప్రయోగాత్మక పాత్రలు, మరెన్నో మరిచిపోలేని పాత్రలు. వేరెవరికీ సాధ్యంకాని ఎన్నో సాంఘిక పాత్రలకు జీవం పోసి తన సత్తా చాటుకున్నారు. తెలుగుతెర వెంబడి కాసేపలా వెనక్కు నడిస్తే... 'అక్కినేని' ఎన్నో పౌరాణిక, చారిత్రిక, సాంఘీక పాత్రల్లో కనిపిస్తూ తళుకులీనడం కనిపిస్తుంది. 'మాయాబజార్', 'తెనాలి రామకృష్ణ', 'కాళిదాసు', 'దేవదాసు', 'మిస్సమ్మ', 'డాక్టర్ చక్రవర్తి', 'అర్ధాంగి', 'మూగమనసులు', 'దసరా బుల్లోడు', 'ప్రేమనగర్', 'ప్రేమాభిషేకం' వంటి చిత్రాలు ఆయన నటనకు నిలువుటద్దాలై వెలుగులు చిమ్మడం తెలుస్తుంది. 'దాసరి నారాయణరావు' దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమాభిషేకం' కేవలం ప్రేమకు మాత్రమే కాదు.. తెలుగు తెరకు కలెక్షన్ల పట్టాభిషేకం చేయించి నభూతో... అనిపించింది ఇంకా ఎవరూ మరవనేలేదు. ఈ సినిమా ఒక్క హైదరాబాద్ లోనే 533రోజులు ఆడగా, వరుసగా ఏడాది పాటు ఆడిన తెలుగు సినిమాగానూ నిలవడం 'ఎఎన్నార్' స్టామినా ఏమిటో చెప్పక చెబుతుంది. ఆయన్నే పని గట్టుకుని ఎందుకిన్నేసి పద్మలు వరించాయో స్పష్టం చేస్తుంది.

ఎన్టీఆర్ తో చిత్రాలు...
'అక్కినేని' ఆనాటికి పెద్ద స్టార్ నటుడయినా, సాటి స్టార్ నటులతో ఎన్నో చిత్రాలను చేశారు. అయితే 'అక్కినేని' ఎంతమందితో నటించినా 'యన్టీఆర్' తో ఆయన అనుబంధమే వేరు. ఇద్దరు ఒకరికొకరు పోటీపడుతూ నటిస్తున్నా సరే, సినిమా వేరు, జీవితం వేరు అని చాటిచెప్పారు ఆ ఇద్దరు దిగ్గజాలు. ముఖ్యంగా యన్టీఆర్ తో 'ఎఎన్నార్' 15 చిత్రాలు చేసి రికార్డు సృష్టించారు. అందులో 'మిస్సమ్మ', 'గుండమ్మ కథ', 'మాయాబజార్', వంటి సూపర్ డూపర్ హిట్లు అనేకం. ఆనాడు 'ఎఎన్నార్' తో సమానంగా పోటీ పడుతున్న మరో మహానటుడు 'ఎన్టీఆర్'. 'ఎన్టీఆర్' ఒక పక్క 'శ్రీరామ', 'శ్రీకృష్ణ' వంటి పాత్రలతో ప్రేక్షక జనుల పాలిట దేవదేవుడిగా చెలరేగి పోతుంటే... మదిలో ప్రేక్షకులనే దైవంగా భావించి... ఎందరో భక్త శిఖామణుల పాత్రలను పోషించి పోటీని రసవత్తరం చేశాడు 'ఎఎన్నార్'. అలా తెరమీది పోటీని తెలివిగా అధిగమించిన ఘనపాటి అక్కినేని. 

అవార్డుల నిలయం..
'అక్కినేని' అంటే అవార్డుల నిలయం. బిరుదుల మయం. సన్మానాలు, సత్కారాలు, గౌరవ డాక్టరేట్లు ఎన్నో ఎన్నెన్నో... వాటన్నిటికోసం ఆయన ప్రత్యేకించి ఒక బిల్డింగ్ నే కేటాయించుకున్నారు 'అక్కినేని'. తెరమీద నటించుకుంటూ పోతుంటే తెర బయట అవార్డులు వరించుకుంటూ వచ్చాయి. అసలే ఒక పక్క సూపర్ హిట్ సినిమా షీల్డులు. వాటి మధ్య ఆయన యశస్సుకు... మరింత వన్నె తెచ్చే ఈ బిరుదులు అవార్డులూ. నటనలో బహుదూరం నటించిన ఈ బాటసారిని అవార్డులూ రివార్డులూ ఏరీ కోరి రావడానికి విజయ రహస్యం ఏమిటి. అవి 'అక్కినేని' మాత్రమే ఎందుకు వెతుక్కుంటూ వచ్చేవి. ఆయన నటజీవితాన్ని మరి కాస్త పరిశీలించుకుంటూ వెళ్తే కానీ ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. 1971లో 'అక్కినేని' 'పద్మశ్రీ' అవార్డును పొందారు. అక్కడి నుంచీ ఆయన నటన అవార్డుల పంట పండిస్తూ వస్తోందని చెప్పాలి. 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చి.. సత్కరించింది. 88- 89 వరుస సంవత్సరాల్లో సాహితీ సాంస్కృతిక సంస్థ తెనాలి వారిచే విశిష్ట వ్యక్తి అవార్డు, కిన్నెర్ ఆర్ట్స్ థియేటర్స్, హైదరాబాద్ వారిచే రాజ్ కపూర్ స్మారక అవార్డు వచ్చాయి. 1988లో భారత ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్ అవార్డు ఆయన్ను వరించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారి, కాళిదాస్ సమ్మాన్, తమిళనాడు గవర్నమెంటుచే అన్నా అవార్డునూ చేజిక్కించుకుని తనలోని నటనా ప్రతిభకు భాషాబేధాల్లేవని నిరూపించాడు. అంతేనా దాదాసాహెబ్ అవార్డు, ఎన్టీఆర్ జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుని అదరహో అక్కినేని అనిపించాడు. నటసామ్రాట్, మహానటుడు వంటి బిరుదులుతోపాటు కళాప్రపూర్ణ వంటి గౌరవ డాక్టరేట్లను సైతం దక్కించుకుని ఇతర నటులెవరికీ అందనంత ఎత్తులకు ఎదిగారు అక్కినేని.

నివాళులు..
అక్కినేని అంటే ఓ నట శిఖరం. తెరమీద అలుపెరుగక చివరికివరుకూ నటిస్తునే ఉన్న  ఓ సంపూర్ణ నటతత్త్వం. అభినయాన్ని తన ఇంటిపేరు చేసుకొని  లెక్కకు మించిన పాత్రలతో దాదాపు ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ కాలం పాటు తెలుగు చిత్రసీమకు సేవ చేసిన 'అక్కినేని' నిజంగా ధన్యజీవి. ఆయనకు 10 టివి ఘన నివాళులు అర్పిస్తోంది. 

16:32 - September 19, 2016

హైదరాబాద్‌ : నగర రోడ్ల దుస్థితిపై నిరసన వ్యక్తం చేస్తూ టి టిడిపి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. అందులో భాగంగా శ్రీనగర్‌ కాలనీలో టి టిడిపి బృందం పర్యటించింది. గుంతలమయంగా ఉన్న రోడ్లపై టి టిడిపి వర్కింగ్‌ ప్రెసిడింట్‌ రేవంత్‌రెడ్డి మొక్కలు నాటి నిరసన తెలిపారు. అయితే రేవంత్‌రెడ్డి పర్యటనను టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. రంగలోకి దిగిన పోలీసులు..రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. జీహెచ్ఎంసీలో నిధులు పుష్కలంగా ఉన్నా...ప్రభుత్వం మాత్రం గుంతల రోడ్లను మరమ్మతు చేయడంలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

16:28 - September 19, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు హాట్‌హాట్‌గా ప్రారంభమయ్యాయి. రోడ్లు, నాలాల ఆధునీకరణ, జ్వరాలపై చర్చకు బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, ఎంఐఎం కార్పొరేటర్లు పట్టుబట్టారు. దీంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రధాన అంశాలపై చర్చించాల్సి ఉందని మేయర్ తెలిపారు. అయితే రోడ్ల దుస్థితి, నగర ఆరోగ్య పరిస్థితిపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ప్రస్తుతం కౌన్సిల్ సమావేశం వాడీవేడీగా జరుగుతోంది. నగరంలో రోడ్ల దుస్థితిపై ప్రధానంగా చర్చించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీసైతం రోడ్ల పరిస్థితిపై అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా నాలాల ఆధునీకరణ విషయంపై ప్రభుత్వం, జీహెచ్ఎంసీ దృష్టి సారించాలని, కావాల్సిన నిధులను కేటాయించాలని మేయర్, కమిషనర్‌కు కార్పొరేటర్లు సూచించారు. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు. క్రమ పద్దతిలో చర్చ జరుపుతామని మేయర్ చెప్పిన్నప్పటికీ కార్పొరేటర్లు తమ ఆందోళన కొనసాగించారు.

16:27 - September 19, 2016

మీలో ఎవరు 'కోటీశ్వరుడు' పేరు చెప్పగానే 'నాగార్జున' పేరు గుర్తుకొస్తుంది. వరుసగా 3 సీజన్ల పాటు ఆ కార్యక్రమాన్ని రక్తికట్టించిన ఘనత మన్మధుడిదే. అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు.. బుల్లితెరపై అత్యథిక వ్యూవర్ షిప్ కలిగిన మహిళా ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయడంలో నాగ్ వందకు 2వందల శాతం సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు మేనేజ్ మెంట్ మాత్రం నాగ్ పై వేటు వేసింది. వరుసగా 3 సీజన్లు చేసిన నాగ్ ను ఆ షో నుంచి తప్పించింది. ఆ స్థానంలో చిరంజీవిని పెట్టింది. స్టార్ గ్రూప్ నకు చెందిన మాటీవీలో ఈ షోను ఇకపై చిరంజీవి నిర్వహించనున్నారు. ప్రస్తుతం 150వ సినిమా పనిలో బిజీగా ఉన్న చిరంజీవి… డిసెంబర్ నుంచి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది.

తొలి ఎపిసోడ్...
ఈ సీజన్ తొలి ఎపిసోడ్ అత్యంత ఆకర్షణీయంగా జరగబోతోందని సమాచారం. షో ప్రారంభం అయిన వెంటనే… నాగార్జున వచ్చి ఈ రోజు నుంచి నా స్థానంలో చిరంజీవి ఉంటారంటూ పరిచయం చేస్తూ… తన సీటులో చిరంజీవిని కూర్చోబెడతారట. ఆ తర్వాత హాట్ సీట్ లో నాగార్జున కూర్చుంటాడట. ఇద్దరూ కలిసి ఖైదీ నంబర్-150, ఓం నమో వేంకటేశాయ సినిమాల గురించి మాట్లాడుకుంటారట. ఎందుకంటే… ఈ రెండు సినిమాలు షో ప్రసారమయ్యే టైమ్ కు విడుదల అవుతాయి. అలా మొదటి ఎపిసోడ్ ముగిసిన తర్వాత… రెండో ఎపిసోడ్ నుంచి చిరు వ్యాఖ్యాతగా మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్-4 ప్రారంభం అవుతుందట.

తుమ్మల ఖాళీ చేసిన ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్..

ఖమ్మం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 26న నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్ చివరి తేదీ అక్టోబర్ 3..అక్టోబర్ 17న పోలింగ్..అదే రోజు కౌంటింగ్ జరగనుంది. 

పెరిగిన జవాన్ల మృతుల సంఖ్య..

జమ్ము కశ్మీర్: యూరీ సెక్టార్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన జవాన్ల సంఖ్య 18కి చేరింది. ఈ ఘటనలో గాయపడి ఢిల్లీలోని ఆర్‌ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్ వికాస్ జనార్ధన్ మృతిచెందారు. ఇవాళ ఉదయం యూరీ సెక్టార్‌లోని ఆర్మీ బేస్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. పదిహేడు మంది జవాన్లు మృతిచెందారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలక మండలిలు..

హైదరాబాద్ : వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలక మండలిని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా బండ్ల లక్ష్మీదేవి, కరీంనగర్ జిల్లా జగిత్యాల మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా ప్రియాంక, వరంగల్ జిల్లా నెక్కొండ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా సోమయ్యలను నియమించారు. 

నయీం కేసులో రెండు బృందాలు ఏర్పాటు చేసిన సిట్..

హైదరాబాద్ : నయీం కేసులో రాజకీయ నేతలు..పోలీసుల లింకులపై ఆధారాల సేకరణకు సిట్ రెండు బృందాలు ఏర్పాటు చేసింది. పక్కా ఆధారాలు సేకరించిన తరువాత నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నోటీసులు ఇవ్వడానికి ఇప్పుడున్న ప్రాథమిక ఆధారాలు సరిపోవని సిట్ భావిస్తోంది. ప్రాథమిక ఆధారాలను ల్యాబ్ కు పంపించాలని, నయీం మొత్తం 24 హత్యలు చేశాడని సిట్ భావిస్తోంది. నాలుగు హత్య కేసుల్లో సాధారణ మరణంగా వైద్యులు పోస్టుమార్టం నివేదిక ఇచ్చారు. దీనితో వైద్యులకు సిట్ అధికారులు నోటీసులివ్వనున్నట్లు తెలుస్తోంది. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డీజీకి సిట్ లేఖ రాసింది. కబ్జాలు చేసిన ల్యాండ్ వివరాలను కావాలని కోరింది. 

పాలేకర్ కు డాక్టరేట్ పై వివాదం..

గుంటూరు : పాలేకర్ కు డాక్టరేట్ పై వివాదం నెలకొంది. నల్ల బ్యాడ్జీలతో వ్యవసాయ శాఖ ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. డాక్టరేట్ ఇవ్వడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని వ్యవసాయ శాఖ ఉద్యోగుల సంఘం నేత ప్రవీణ్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి పాలేకర్ కంటే ఎక్కువ సేవ చేసిన వారు చాలా మంది ఉన్నారని, వారిని గుర్తించి డాక్టరేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

అందుకే ఇంక్ జల్లా : బ్రజేష్

ఢిల్లీ : ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిసోడియాపై ఇంక్ చల్లిన యువకుడు బ్రజేష్ శుక్లాను పోలీసులు అదుపులోకి తీసుకోగా, తానెందుకు ఆ పని చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని అతను వివరించాడు. "ఢిల్లీ ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారు. ఫిన్ ల్యాండ్ లో తిరుగుతూ సముద్రాల వద్ద ఫోటోలు దిగుతున్నారు. మీ ప్రజల డబ్బుతో జల్సాలు నాయకులు చేస్తున్నారని మండిపడ్డాడు. మళ్లీ ఢిల్లీకి వచ్చి గత పాలకులను విమర్శిస్తూ, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వీరేనా పాలకులు? అందుకే నా నిరసన తెలియజేశాను" అని అన్నాడు. 

వీర జవాన్లకు జోహార్లర్పించిన సినీ ప్రముఖులు..

ముంబై: జమ్మూకశ్మీర్ లోని యూరి పట్టణంలో విదేశీ ఉగ్రమూకలు సాగించిన మారణకాండ జాతియావత్తను నివ్వెరపరించింది. సైనిక స్థావరాలను లక్ష్యంగా ముష్కరులు చేసిన దాడిలో 20 మంది సైనికులు వీరమరణం పొందారు. మారణహోమం సృష్టించిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఉగ్రదాడిని జాతియావత్తు ముక్తకంఠంతో ఖండించింది. బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ కిరాతక దాడిని తీవ్రంగా ఖండించారు. తమ ట్విట్లర్ లో అమరజవానులకు జోహార్లు అర్పించారు.

హస్తినకు అపెక్స్ కమిటీ..

ఢిల్లీ: రాష్ర్టాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్హమవతోంది.ఈనెల 21న జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించనుంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి నేతృత్వంలోని ఈ కమిటీ శ్రమశక్తి భవన్‌లో 2.30 గంటలకు సమావేశం కానుంది. తెలంగాణ తరపున మంత్రి హరీష్‌రావు, చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, భారీ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎన్‌కే జోషీ, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ మురళిధర్ రావు హాజరుకానున్నారు. మొత్తం ఆరు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

15:37 - September 19, 2016

మెగా ఫ్యామిలీ హీరోల్లో స్టార్ స్టేటస్ ఉన్న వాళ్లే నలుగురు హీరోలున్నారు. మొదటగా మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లిస్ట్ లో ఉంటే.. ఆ నెక్ట్స్ రామ్ చరణ్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు స్టార్ లీగ్ లో ఉంటారు. తర్వాత స్థానంలో సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ, అల్లు శిరీష్ సెటిలైపోయారు. ఇక వీరంతా వరుసగా సినిమాలు రిలీజ్ చేసేస్తే ఆ మెగా హంగామా ఎలా ఉంటుంది? ఊహించుకోవడం ఎందుకని.. చేసి చూపించేస్తున్నారు మెగా టీమ్. 2017 బిగినింగ్ నుంచి మెగా హంగామా స్టార్ట్ కాబోతోంది....

గ్యాంగ్ లీడర్ చిరంజీవి...
ఈ మొత్తం మెగా టీమ్ కు గ్యాంగ్ లీడర్ మెగా స్టార్ చిరంజీవి. ఆయన 150 సినిమాతో వచ్చేసంవత్సరం బోణి కొట్టబోతున్నాడు. వివి వినాయక్ డైరెక్షన్ లో వస్తున్న చిరు 150 ఖైదీ నెం. ఈ చిత్రం మెగా ధమాకాకి ఆరంభం కాబోతోంది. చిరు 150 సినిమాకోసం ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్నారు. ఇంతకాలం మంచి కథకోసం చిరంజీవి వెయిట్ చేసారు. తమిళ్ సినిమా కత్తి చిరంజీవిని ఎంతో ఆకర్షించింది. దాన్ని ఆయన స్టైల్ కు అనుగుణంగా తీర్చిదిద్దడానికి దర్శకుడిగా వివి వినాయక్ ఆ సినిమా రీమేక్ కోసం రంగంలోకి దిగాడు. మొత్తం మీద చిరు 150వ సినిమాగా ఖైదీనెం. 150 పట్టాలెక్కింది. అప్పుడే ఈ సినిమా ను 40 శాతం వరుకూ కంప్లీట్ చేసేసాడట వినాయక్. హీరోయిన్ గా అందాల కాజల్ ఎంపికైంది. సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్ రంగంలోకి దిగాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కత్తి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. చిరంజీవి ఇమేజ్ కు అనుగుణంగా ఈ సినిమా అన్ని రకాల మసాలాలను అద్దుకొని 2017 సంక్రాంతికి రిలీజ్ కు రెడీ అయిపోతోంది. మిగతా మెగాహీరోలని ఇన్సపైర్ చేస్తూ మెగా స్టార్ చిరంజీవి వచ్చేసంవత్సరం జనవరిలోనే ఖైదీనెం.150తో బోణీ కొట్టబోతున్నారు. చిరంజీవి జనవరిని ఆక్యుపై చేస్తే ఆయన తనయుడు రామ్ చరణ్ ఫిబ్రవరిని ఆక్రమించేసాడు. సుకుమార్ తో చేయబోతున్న ఓ వెరైటీ లవ్ స్టోరీ ఈ అక్టోబర్ లో స్టార్ట్ అయి వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

చెర్రీ...
హీరోలకి డిఫరెంట్ కేరక్టరైజేషన్స్ క్రియేట్ చేసే బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్. ముఖ్యంగా ఆయన క్రిటికల్ స్ర్కీన్ ప్లేస్ జనాన్ని కొంత కన్ఫ్యూజన్ కు గురిచేస్తాయి. అయినా సరే ఆయన బ్రిలియన్సీని ఇష్టపడతారు ప్రేక్షకులు.ఈ సంవత్సరం యన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో లాంటి వెరైటీ రివెంజ్ స్టోరిని తెరకెక్కించి జనాన్ని బాగానే థ్రిల్ చేసాడు. సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ తో తెరకెక్కించబోతున్నాడు. అక్టోబర్ నాటికి చరణ్ ధృవ సినిమానుంచి ఫ్రీ అయిపోతాడు. ఆ నెల్లోనే సుకుమార్ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సారి సుకుమార్ రామ్ చరణ్ ను ఒక విలేజ్ బాయ్ గాక ప్రజెంట్ చేయబోతున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాకోసం రామ్ చరణ్ డిపరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇక సినిమాను శరవేగంగా పూర్తి చేసి వచ్చేసంవత్సరం ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.

పవర్ స్టార్..
చిరంజీవి తరువాత అంతటి క్రేజ్ ఉన్న మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సంవత్సరం ఏప్రిల్ లో సర్దార్ గబ్బర్ సింగ్ తో ప్లాప్ టేస్ట్ చేసిన పవన్ తర్వాత సినిమాతో ఎలాగైనా హిట్టుకొట్టాలనే కసితో చేస్తున్న సినిమా కాటమరాయుడు. ఈ సినిమాను పవర్ స్టార్ 2017 మార్చ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. డాలి డైరెక్షన్ లో పవర్ స్టార్ హీరోగా తెరకెక్కబోతున్న ఫ్యాక్షన్ అండ్ యాక్షన్ లవ్ స్టోరీ రీసెంట్ గా లాంఛ్ అయింది. ఈ సినిమా ఈ నెల 24నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది. గబ్బర్ సింగ్ తరువాత పవర్ స్టార్ సరసన శృతి హాసన్ మరోసారి జోడి కడుతోంది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ ప్రత్యేకించి సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ లో కనిపించబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక కాటమరాయుడు సినిమాను మార్చ్ 25న రిలీజ్ చేయడానికి ఇప్పటినుంచి ప్లాన్ చేస్తున్నారు. గోపాలా గోపాలాతో పవన్ కళ్యాణ్ కి మంచి హిట్టిచ్చిన డాలి ఈ సినిమాకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ తో నిరాశచెందిన పవన్ అభిమానులు, ఈ సినిమా లాంచ్ అవ్వడంతో మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే అంచనాల్ని పెంచేసిన కాటమరాయుడు పవర్ స్టార్ కు ఏ రేంజ్ హిట్టిస్తుందో చూడాలి.

బన్నీ...
ఇక పవన్ తరువాత క్యూలో ఉన్న మరో మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ సంవత్సరం ఏప్రిల్ లో సరైనోడు తో సరైన హిట్టుకొట్టిన బన్నీ వచ్చే సంవత్సరం కూడా అదే నెలకు గురిపెట్టాడు. హరీష్ శంకర్ తో డిజె అనే సినిమాను ప్రస్తుతం ట్రాక్ లో పెట్టాడు బన్నీ. ఈ సినిమా కోసం సెంటిమెంట్ గా మళ్లీ ఏప్రిల్ నెలనే ఎన్నుకుంటున్నాడు బన్నీ. సినిమా సినిమాకి ఎదుగుతూ కోట్లు కొల్లగొట్టే హీరోగా ఎదిగాడు బన్నీ. టాక్ తో సంబంధం లేకుండా బన్నీ సినిమాలు బాక్సాఫీస్ ను కొల్లగొడతాయని సన్నాఫ్ సత్యమూర్తి , సరైనోడు సినిమాలు నిరూపించాయి. ఈ రెండు సినిమాలకు ముందు నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. కానీ కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. సరైనోడు సినిమా దాదాపు 100కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి మొత్తం మీద 70కోట్లకు పైగానే షేర్ వసూలు చేసింది. ఈ సినిమాను ఈ సంవత్సరం ఏప్రిల్ 22న రిలీజ్ చేసారు. అందుకే బన్నీ ఇప్పుడు హరీష్ శంకర్ తో చేస్తున్నడిజె సినిమాను కూడా వచ్చేసంవత్సరం ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. డిజె దువ్వాడ జగన్నాథంగా అల్లు అర్జున్ చేయబోయే రచ్చ ఎలా ఉండబోతోందో అన్న క్యూరియాసిటీ కలుగుతోంది అందరిలోనూ. గత మూడేళ్లనుంచి ఏప్రిల్ లో వచ్చి బీభత్సమైన హిట్స్ కొడుతున్నబన్నీకి వచ్చే ఏప్రిల్ డిజె కు ఏ రేంజ్ హిట్టిస్తుందో చూడాలి.

సాయి ధరమ్ తేజ..
ఇక బన్నీ తర్వాత క్యూలో ఉన్న మరో మెగా హీరో సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ. రీసెంట్ గా తిక్క సినిమాతో డిజాస్టర్ టేస్ట్ చేసిన సాయిధరమ్ తేజ ఇప్పుడు గోపిచంద్ మలినేనితో ఒక సినిమా చే్స్తున్నాడు. స్పోర్ట్స్ నేపధ్యంలో సాగే యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం మే నెలను టార్గెట్ చేసింది. పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ నమోదు చేసుకున్న సాయిధరమ్ తేజ 20 కోట్ల హీరోగా అవతరించాడు. అతడితో దాదాపు పదికోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే నిర్మాతకి 20 కోట్లు ఈజీగా వసూళ్లవుతాయని ఈ మూడు సినిమాలతో ప్రూవ్ చేసాడు సాయిధరమ్ తేజ. అందుకే సాయి ఇప్పుడు టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరో అయిపోయాడు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ సినిమాను వచ్చనెల మే లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాయిధర్మ్ తేజ సరసన హెబ్బా పటేల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అంతేకాదు ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ఒక అథ్లెట్ పాత్ర కూడ చేస్తోంది. ఈ సినిమాకోసం సాయిధరమ్ తేజ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో రాబోతున్నాడు.

అల్లు శిరీష్..
ఇక వీళ్ల తరువాత వస్తున్న మరో మెగా హీరో అల్లు శిరీష్. రీసెంట్ గా శ్రీరస్తు శుభమస్తుతో మంచి సక్సెస్ కొట్టిన ఈ హీరో దీని తరువాత ఒక పిరియాడికల్ మూవీ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమాను ఈ సంవత్సరంలోనే స్టార్ట్ చేసి వచ్చే సంవత్సరం జూన్ లేదా జూలై నాటికి రిలీజ్ చేయడానికి ఇప్పటినుంచి సన్నాహాలు జరుగుతున్నాయి. గౌరవం, కొత్త జంట సినిమాలతో వరస ప్లాప్స్ టేస్ట్ చేసిన అల్లు శిరీష్ కు ఎట్టకేలకు శ్రీరస్తు శుభమస్తుతో మంచి కమ్ బ్యాక్ లభించింది. పెట్టిన పెట్టుబడిని రాబట్టడమే కాకుండా మంచి లాభాల్ని కూడా ఆర్జించింది ఈ సినిమా. ఇక ఈ సినిమా తరువాత శిరీష్ సినిమా మీదనే అందరి ఆసక్తి. ఈ సినిమా తరువాత శిరీష్ చేయబోయేది ఒక పిరియాడికల్ మూవీ అని తెలుస్తోంది. దాదాపు 700 సంవత్సరాలకు పూర్వం జరిగిన కథతో ఈ మూవీ తెరకెక్కబోతోంది. వియస్ఎన్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా వచ్చేనెల్లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అంతేకాదు ఈ సినిమాకి జగదేకవీరుని కథ అనే టైటిల్ పెడుతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా ను వచ్చే సంవత్సరం జూన్ లేదా జూలై లో రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ఇప్పటినుంచి ప్లాన్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్..
ఇక మిగిలిన మరో మెగా హీరో వరుణ్ తేజ మాత్రం వీరందరికన్నా ఒక మెట్టు ముందే ఉన్నాడు. ప్రస్తుతం వరుణ్ చేస్తున్న శ్రీనువైట్ల సినిమా మిస్టర్ అందరు మెగా హీరోల సినిమాలకన్నా ముందే వస్తున్నాడు. అదెలా అంటారా? ముకుంద, కంచె, లోఫర్ అనే మూడు డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేసిన వరుణ్ తేజ ఈ మూడు సినిమాలతో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్నాడు. మంచి టేస్టున్న హీరోగా కూడా ముద్రవేయించుకున్నాడు. అయితే ఈ మూడు సినిమాల తరువాత వరుణ్ రొటీన్ ఫార్ములాలో సినిమాలు చేసే శ్రీను వైట్లతో సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే శ్రీను వైట్ల ఆగడు, బ్రూస్లీ సినిమాలతో వరస ప్లాప్స్ తీసాడు. అయినా సరే శ్రీను వైట్ల పై నమ్మకముంచి ఈ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ. ఎక్కువ శాతం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకుంటున్న మిస్టర్ సినిమాను వీలైనంత తొందరలో కంప్లీట్ చేసి ఈ సంవత్సరం డిసెంబర్ లోనే రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాను వచ్చే సంవత్సరం రిలీజ్ చేయాలనుకుంటే మిగతా మెగా హీరోలతో పోటీగా దింపాలి. అందుకే వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి డిసెంబర్ నాటికి మిస్టర్ ను కంప్లీట్ చేయడానికి శ్రీను వైట్ల తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో కూడా ఉన్నాడు. ఉన్న ఏడుగురు మెగా హీరోలు .. వచ్చే సంవత్సరం వరసగా ఆరు సినిమాలతో ఆరు నెలలనీ ఆక్రమిస్తే మెగాభిమానులకు నిజంగా మెగా ధమాకానే . ఒకో హీరో ఒకో జానర్ లో ఒకో నెలలో తమ సినిమాలను బరిలోకి దింపుతున్నారు. మరి ఇందులో ఎంత మంది మెగా హీరోలు సక్సెస్ లు కొడతారో చూడాలి. 

మౌనదీక్షకు సిద్ధమవుతున్న కోదండరాం?..

హైదరాబాద్ : తెలంగాణ రాజ‌కీయ జేఏసీ ఛైర్మ‌న్ ప్రొ.కోదండ‌రాం వ‌చ్చే గాంధీజ‌యంతి హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్కు వ‌ద్ద మౌన‌దీక్ష చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రైతుల స‌మ‌స్య‌ల‌పైనే తాము మౌనదీక్ష చేప‌ట్ట‌నున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టుల కోసం తెలంగాణ‌ ప్ర‌భుత్వం చేప‌డుతున్న భూసేక‌ర‌ణ నిర్ల‌క్ష్యంగా, నిరంకుశంగా ఉందంటూ ఆయ‌న విమ‌ర్శించారు. మ‌ల్ల‌న్నసాగ‌ర్ డీపీఆర్ ఇంత‌వ‌ర‌కు పూర్తికాలేదని, భూసేక‌ర‌ణ ఆపాల‌ని కోరుతున్నట్లు చెప్పారు.

ముగిసిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు..

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. జాతీయ..అంతర్జాతీయ..రాజకీయ..ఆర్థిక పరిస్థితులు..రాష్ట్రాల్లో పరిస్థితులపై చర్చించింది. అలాగే కలకత్తా పీనం నిర్ణయాలను అమలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. 

సెక్రటేరియట్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ ప్రయత్నం..ఉద్రిక్తత..

హైదరాబాద్ : సెక్రటేరియట్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ ప్రయత్నం చేసింది. మంత్రి ఈటెల కారును విద్యార్థులు అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ ఐ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఈటెల కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనితో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెస్ ఛార్జీలు, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థులను గోషామహల్ పీఎస్ కు తరలించారు. 

ఏపీ సెక్రటేరియట్ తరలింపు వేగవంతం..

హైదరాబాద్ : ఏపీ సచివాలయం తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. ఈనెల 25వ తేదీ నుండి పైలట్ ప్రాజెక్టు కింద శాఖలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 60వేల ఫైళ్లను ప్రభుత్వం స్కాన్ చేసింది. ప్రతి శాఖ నుండి ఇద్దరు ఉద్యోగులను హైదరాబాద్ లో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. 

15:13 - September 19, 2016

హైదరాబాద్ : తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చలో హైదరాబాద్ పేరిట ర్యాలీ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని, హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌చార్జీలు పెంచాలంటూ డిమాండ్‌ చేశారు. ర్యాలీ మధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ర్యాలీ చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని విద్యార్థి సంఘల నాయకులు ఆరోపించారు. అక్రమ అరెస్ట్ లను ఖండిస్తూ తమ ఆందోళనను రేపు కూడా కొనసాగిస్తామని విద్యార్థి సంఘం నాయకులు పేర్కొన్నారు. 

రోడ్లపై మొక్కలు నాటే ప్రయత్నం చేసిన రేవంత్..

హైదరాబాద్ : నగరంలో రోడ్ల దుస్థితిపై టి.టిడిపి నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు. శ్రీనగర్ కాలనీలో రోడ్లపై రేవంత్ రెడ్డి మొక్కలు నాటే ప్రయత్నం చేశారు. దీనిని అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ నేతలు యత్నించారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్న టి.టిడిపి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

2018 నాటికి బెల్ పూర్తి - వెంకయ్య...

కృష్ణా : ఇక్కడి ప్రాజెక్టులకు సహాయం చేయాలని సీఎం చంద్రబాబు తరచూ కోరుతున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. బెల్ కోసం భూములివ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు ముందుకొచ్చారని, 2018 నాటికి బెల్ పరిశ్రమ పూర్తవుతుందన్నారు. నాయకులకన్నా ప్రజలే తెలివైన వారని, ప్రజలు ప్యాకేజీని స్వాగతించారని, మోడీ..చంద్రబాబులు జనం కోసం పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. తనను విమర్శించడం వల్ల లాభం లేదని, దేశానికి వ్యవసాయం..పరిశ్రమలు రెండు కళ్లలాంటివని అభివర్ణించారు. 

బెల్ సంస్థకు భూమి పూజ..

విజయవాడ : పామర్రు (మం) నెమ్మలూరులో బెల్ సంస్థకు భూమి పూజ జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడులు పాల్గొన్నారు.

 

21న అపెక్స్ కమిటీ - దేవినేని..

విజయవాడ : ఇరు రాష్ట్రాల నీటి పంపకాలపై 21న ఢిల్లీలో అపెక్స్ కమిటీ సమావేశం ఉంటుందని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొంటారని, నీటి పంపకాలపై ఏపీ వాదనను వినిపిస్తామన్నారు. పోలవరంపై ప్రతిపక్షాలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాయని, ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతుంటే ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్టుని గాలికి వదిలేశారని తెలిపారు.

 

విశాఖలో విష జ్వరాలపై అవగాహన సదస్సు...

విశాఖపట్టణం : డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా నివారణపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, డీఎంహెచ్ వోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొబైల్ మెడికల్ వెహికల్స్ ను కలెక్టర్ ప్రారంభించారు. లక్ష జనాభాకి ఒకటి చొప్పున 20 బృందాలు ఏర్పాటయ్యాయి.

 

చెత్తనగరాల్లో హైదరాబాద్ కు ఫస్ట్ ప్రైజ్?!..

హైదరాబాద్‌: నగరంలో అభివృద్ధి చేయలేకపోతున్నామని మంత్రి కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని చెత్తనగరంగా మార్చారని ఎద్దేవా చేశారు. ఇస్తాంబుల్ చేయనవసరంలేదు ఉన్నది ఉన్నట్లు ఉంచండన్నారు. చెత్తనగరాల పోటీ పెడితే హైదరాబాద్‌కే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని నగరాన్ని అలా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని రేవంత్ పేర్కొన్నారు. 

14:55 - September 19, 2016

తూర్పుగోదావరి : కాకినాడ తీరం ప్రాంతం భగ్గుమంటోంది. కొండంగి మండలం తిరుగబడుతోంది. మాకొద్దీ మందుల పరిశ్రమ అంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి. మరోవైపు నిర్వాసితులు సభలు జరపకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇలా ఆందోళనలు చేస్తుంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యమకారుల మీద, వామపక్షాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ తీరంలో ఇంత అలజడికి కారణం ఏమిటి? స్థానికులు మందుల పరిశ్రమను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇక్కడ మందుల పరిశ్రమను పెట్టడం వల్ల పర్యావరణానికి జరిగే అనర్ధాలేమిటి? ఈ పరిశ్రమ వల్ల ఉపాధి పొందేదెవరు? ఉన్న ఉపాధిని పోగొట్టుకుని వీధినపడేందెదరు? ఇదే ఇవాళ్టి స్పెషల్ స్టోరీ.

దివీస్ మందుల ఉత్పత్తి కేంద్రానికి వ్యతిరేక పోరాటం
కాకినాడ తీర ప్రాంతంలో దివీస్ మందుల ఉత్పత్తి కేంద్రానికి వ్యతిరేక పోరాటం తీవ్రమవుతోంది. అక్కడ మాయదారి మందుల పరిశ్రమ పెట్టొద్దంటూ జనం ఉద్యమిస్తున్నారు. హైకోర్టు కూడా స్టే ఇవ్వడం వీరి పోరాటానికి మరింత నైతిక ప్రోత్సాహాన్నందిస్తోంది. ఓ వైపు మందుల పరిశ్రమ ఏర్పాటుకు చకచకా ప్రయత్నాలు జరుగుతుంటే, మరోవైపు భూములు కోల్పోతున్నవారికి ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు.

సెప్టెంబర్ 6 రణరంగం
ఇది కొద్ది రోజులుగా కాకినాడ తీర ప్రాంతంలో కనిపిస్తున్న దృశ్యం. మొన్న సెప్టెంబర్ 6న తూర్పు గోదావరి జిల్లాలోని పంపాదిపేట రణరంగాన్ని తలపించింది. ఆ చిన్న గ్రామంలో రెండు వేల మంది పోలీసులు మొహరించారు. దానిపక్కన వున్న తాటాకులపాలెం, కొత్తపాకల గ్రామాల్లోనూ పోలీసులు భారీగా మొహరించారు. 144 సెక్షన్ విధించారు. ఇళ్ల నుంచి బయటకు వస్తే అరెస్టు చేస్తామంటూ హెచ్చరించారు. తీర ప్రాంత గ్రామాల్లో పోలీసులు దాదాపు 10 అవుట్ పోస్టులు ఏర్పాటు చేశారు.

వామపక్ష నేతలను అడ్డుకున్న పోలీసులు
ఆనాటి సభకు హాజరవుతున్న సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపి మధును సైతం పోలీసులు అడ్డుకున్నారు. సభాస్థలికి చేరుకోకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఆనాడు అక్కడ జరిగిన దృశ్యాలు, ఆ సభను విచ్చిన్నం చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు మనం ప్రజాస్వామ్య సమాజంలోనే జీవిస్తున్నామా? అన్న అనుమానాన్ని కలిగించాయి.

దివీస్ మందుల పరిశ్రమను వ్యతిరేకిస్తున్న స్థానికులు
పచ్చటి కాకినాడ సముద్ర తీరం ప్రాంతంలో ఇంత ఉద్రిక్తత ఏర్పడడానికి కారణం అక్కడ ఏర్పాటు చేయబోతున్న దివీస్ మందుల పరిశ్రమ. కాకినాడ సమీపంలోని తొండంగి మండలంలో దివీస్ లేబరేటరీస్ మూడో ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో వుంది. ఇక్కడ ఈ ఫ్యాక్టరీ పెడితే తమ జీవితాలు సర్వనాశనం అవుతాయన్నది స్థానికుల ఆందోళన. ఎక్కడైనా పరిశ్రమల స్థాపనకు భూమిని సేకరించే ముందు ప్రజాభిప్రాయం సేకరించి, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి వుంటుంది కానీ, ఇక్కడ ఇంత వరకూ పరిహారం చెల్లించకపోవడం తో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు.

ప్రకృతి సౌందర్యానికి నిలయం తూర్పు తీరం
తూర్పుగోదావరి జిల్లాలోని తొండంగి ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి నిలయం. సరుగుడు, జీడి, వేరు సెనగ పంటలతో కళకళలాడే ఈ సముద్రతీర ప్రాంతం ఎంతో చూడముచ్చటగా వుంటుంది. ఎకరం పాతిక నుంచి ముప్పై లక్షల రూపాయల చొప్పున విలువ చేసే సారవంతమైన, చక్కటి భూములున్నాయిక్కడ.

తొండంగి ప్రాంతంలో 300కి పైగా హేచరీలు
ఈ పచ్చటి సౌందర్యాన్ని, ఈ ప్రకృతి రమనీయతను ఆస్వాదిస్తూ ఇక్కడ కొన్ని వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. రెండు వేల మంది మత్స్యకారులు చేతినిండా ఉపాధి పొందుతున్న ప్రాంతమిది.ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో వందల హేచరీస్ వెలిశాయి. 300 కు పైగా హేచరీస్ తో ఇదో కొత్త కళను సంతరించుకుంది. ఒక్కొక్క హేచరీలో 50 మంది చొప్పున కనీసం 15వేల మంది ఇక్కడ బతుకునావను సాగిస్తున్నారు. ఇప్పుడు వీరందరి గుండెల్లోనూ అలజడి సృష్టిస్తోంది దివీస్ లేబరేటరీస్. ఇక్కడి ప్రజల ఆవేదనను వినే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. వీరి మాటలు ఆలకించడం లేదు. వీరి అభ్యంతరాలు పట్టించుకోవడం లేదు.

ప్రజా ఉద్యమాలను, ప్రజల మనోభావాలను పట్టించుకోని సర్కార్
ప్రజా ఉద్యమాలను, ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఇక్కడ మందుల పరిశ్రమ పెట్టితీరాలన్న పట్టుదలతో ముందుకు సాగుతోంది ప్రభుత్వం. ఇప్పటికే జీవోలు జారీ చేసింది. భూ సేకరణకు శ్రీకారం చుట్టింది. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు, నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు.

505 ఎకరాల సేకరణకు జీవో
తొండంగి మండలంలో దివీస్ లేబొరేటరీస్ కు స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం 2015లో జీవో నెంబర్ 73 విడుదల చేసింది. 505 ఎకరాల ఏపిఐఐసి భూములను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాంత రైతులతో చర్చించకుండా, వారి అభిప్రాయాలు తెలుసుకోకుండానే ఇదంతా జరిగిపోయింది. దీంతో రైతుల్లో, మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది. తమ జీవితాలు ఏమవుతాయోనన్న దిగులుతో కంటి మీద కునుకుపట్టడం లేదు. వారి ఆవేదన ఆగ్రహంగా మారుతోంది. అదొక ఉద్యమరూపం సంతరించుకుంది.

దివీస్ తో ప్రజల్లో ఆందోళన
వారితో గొంతుకలిపారు. మీకు మేమున్నామంటూ రంగంలోకి దిగారు. సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు కూడా స్వయంగా రంగంలోకి దిగడం, ఆ ప్రాంతంలో ఒకటికి రెండుసార్లు పర్యటించడం సమస్య తీవ్రతను చెబుతోంది.ఇంత మంది ఇన్ని రకాలుగా అభ్యంతరాలు చెబుతున్నా, హితోపదేశాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దివీస్ లేబరేటరీస్ కు మేళ్లు చేసిపెట్టేందుకు తమ జీవితాల్లో నిప్పులు పోస్తున్నారన్న ఆవేదన ఇక్కడ ప్రజల్లో గూడుకట్టుకుంటోంది.

505 ఎకరాలు కేటాయిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం
తొండంగి ప్రాంతంలో దివీస్ లేబరేటరీస్ మందుల ఉత్పత్తి ప్రారంభిస్తే, పర్యావరణం సర్వనాశనం అవుతుందన్నది స్థానికుల ఆవేదన. దాదాపు 20 వేల మంది ఉపాధి కోల్పోతారన్నది వీరి ఆందోళన. దివీస్ లేబరేటరీస్ కి ఇప్పటికే హైదరాబాద్, విశాఖపట్టణ సమీపాలలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. హైదరాబాద్ లో 500 ఎకరాల్లో 13 ఉత్పత్తి కేంద్రాలున్నాయి. విశాఖపట్టణం సమీపంలోని భీమిలి మండలం చిప్పాడ దగ్గర 40 ప్లాంట్లలో మందులు తయారవుతున్నాయి. విశాఖపట్టణం సమీపంలో మందుల పరిశ్రమ స్థాపించే ముందు దివీస్ యాజమాన్యం చెప్పిన హామీలేవీ నెరవేర్చలేదు. ఆ మందుల పరిశ్రమల వల్ల పర్యావరణం ఘోరంగా దెబ్బతింది. మత్స్య సంపద నాశనమైంది. వాయు, జల కాలుష్యాలు ఒక్కసారిగా పడగవిప్పి, బుసలు కొట్టాయి. ఫ్యాక్టరీ సమీపంలోని చిట్టినగర్, కోనవానిపాలెం, నమ్మివానిపాలెం, ఆసిపాలెం, అన్నవరం, చిప్పాడ, మూలకుద్ది, పెద్దనాగయ్యపాలెం ఇలా అనేక గ్రామాలు కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. పచ్చటి పంట పొలాలు నాశనమయ్యాయి. భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయి. చివరకు మంచినీళ్లు కూడా కొనుక్కుని తాగాల్సిన దుస్థితి దాపురించింది. కలుషిత నీరు, గాలి పీల్చడం వల్ల చర్మవ్యాధులు, టీబీ, కీళ్లనొప్పులు, గుండె, కంటి, శ్వాసకోశ వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతూనే వున్నారు. కంపెనీ వ్యర్ధాలను, రసాయనాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి నేరుగా వదులుతుండడంతో చేపలు చనిపోతున్నాయి. మత్స్యకారులు ఉపాధి కోల్పోయి వీధినపడుతున్నారు. ఇలాంటి భయంకర అనుభవాలు వుండబట్టే, దివీస్ పరిశ్రమ తొండంగి తీర ప్రాంత ప్రజలు ఉద్యమిస్తున్నారు.

హైదరాబాద్, విశాఖపట్టణం సమీపంలో దివీస్ ఉత్పత్తి కేంద్రాలు
దివీస్ పరిశ్రమ కోసం పచ్చటి ప్రాంతాన్ని నాశనం చేసే బదులు మరొక ప్రాంతాన్ని ఎంపిక చేయాలన్నది తొండంగి ప్రాంత వాసుల సూచన. నిజానికి వేరే ప్రత్యామ్నాయాలు కూడా వున్నాయి. మందుల పరిశ్రమలు సరియైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల, కాలుష్య నివారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పర్యావరణ దెబ్బతింటోంది. ఆ చుట్టు పక్కల ప్రాంతాలవారు రకరకాల వ్యాధుల బారినపడుతున్నారు. అయితే, పరిశ్రమలు లేకుండా ఆధునికాభివృద్ధి అసాధ్యం. అసలు పరిశ్రమలు పెట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. పరిశ్రమల కోసం ఎంపిక చేస్తున్న ప్రాంతాల విషయంలోనే విబేధిస్తున్నారు. ఇప్పుడు కొండంగి యూనిట్ విషయంలోనూ అదే జరుగుతోంది. కాకినాడ సెజ్ పేరుతో ఇప్పటికే పది వేల ఎకరాలు సేకరించారు. ఆ భూమి ఇప్పుడు ఖాళీగానే వుంది. ఇంతకు ముందు కేటాయించిన సెజ్ భూములు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నిలయంగా మారుతున్నాయి. మనస్సు పెట్టి వెదికితే, ఇలాంటి ప్రత్యామ్నాయాలు అనేకం కనిపిస్తాయంటున్నారు ఉద్యమకారులు.

2 వేల ఉద్యోగాలొస్తాయంటు ఆశలు
తొండంగి ప్రాంతంలో పెట్టబోయే దివీస్ లేబరేటరీస్ మందుల ఉత్పత్తి కేంద్రం వల్ల దాదాపు 2 వేల ఉద్యోగాలొస్తాయంటున్నారు. భీమిలీ ప్రాంతంలో పరిశ్రమ పెట్టబోయే ముందు కూడా భారీగా ఉద్యోగాలొస్తాయంటూ ఆశలు కల్పించారు. కానీ, స్థానికులకు వచ్చిన ఉద్యోగాలు చాలా స్వల్పం. చాలా కొద్ది మందికి ఏమాత్రం భద్రతలేని కాంట్రాక్ట్ ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఉద్యోగాలు పొందినవారు పదుల సంఖ్యలో వుంటే, ఆ పరిశ్రమ వెదజల్లే విష వాయువుల కారణంగా అనారోగ్యం పాలవుతున్నవారి సంఖ్య వేలల్లో వుంటోంది. తొండంగి ప్రాంతంలో 20 వేల మంది ఉపాధి పొందుతున్నారు. 2 వేల మంది ఉపాధి చూపించే మందుల పరిశ్రమ కోసం 20 వేల మంది జీవితాలను ఫణంగా పెట్టాలా? ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి.

వచ్చేది 2వేల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయేది 20 వేల మంది
దివీస్ మందుల పరిశ్రమకు వ్యతిరేకంగా తొండంగి ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి. ప్రజల అభ్యంతరాలను ఓపికగా వినాలి. బల ప్రయోగంతో ఉద్యమాన్ని అణచివేయాలనుకోవడం అవివేకం. అది అసలు సమస్యకు పరిష్కారం కాదు. దివీస్ పరిశ్రమకు వేరే ప్రత్యామ్నాయ స్థలం వెదికే విషయంలో ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకూడదు. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపిస్తున్నట్టుగా వామపక్షాలు పరిశ్రమలను వ్యతిరేకించడం లేదు. అయితే, ఆ పరిశ్రమల కారణంగా పర్యావరణం దెబ్బతినకుండా, స్థానికుల ఉపాధికి ఎసరురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించాలంటున్నారు. ఇదీ ఇవాళ్టి స్పెషల్ స్టోరీ.

 

పవన్ కు అర్థమయ్యేలా చెబుతాం : సుజనా

విజయవాడ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా కలిసి, కేంద్రం ఇచ్చిన ప్యాకేజీతో రాష్ట్రానికి కలిగే లబ్దిని గురించి వివరించనున్నట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. హోదా అన్న పేరు మాత్రమే లేదని, అంతకుమించిన నిధులు ప్యాకేజీ రూపంలో వచ్చాయని విడమరిచి చెబితే, పవన్ సంతోషిస్తారని వ్యాఖ్యానించిన సుజనా, ఈ పనిని తానే స్వయంగా పూర్తి చేస్తానని చెప్పారు. 

నక్సలైట్లకు ఎదురు దెబ్బ..

ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లకు ఎదురు దెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లా పోలీసుల ఎదుట ఐదుగురు నక్సలైట్లు లొంగిపోయారు. వీరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.

14:18 - September 19, 2016

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' కూడా ఇప్పుడు ఈ లిస్ట్ లోకి చేరాడు. 'బ్రూస్లీ' డిజాస్టర్ తరువాత 'చెర్రీ' పట్టుదలగా చేస్తున్న చిత్రం 'ధృవ'. ఇందులో 'చరణ్' ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా చేస్తున్నాడు. నిజంగా ఈ పాత్ర 'రామ్ చరణ్' కి సరికొత్త మేకోవరే. 'రామ్ చరణ్' ఇంతవరకూ పోలీస్ గెటప్ వేయలేదు. బాలీవుడ్ లో 'జంజీర్' సినిమాలో కనిపించినా అది టాలీవుడ్ కౌంట్లోకి రాదు. అయితే 'ధృవ'లో 'రామ్ చరణ్' చేయబోయేది మామూలు సినిమాల్లో కనిపించే పోలీస్ కేరక్టర్ కాదు, ధైర్య, సాహసాలతో పాటు తెలివితేటలు కలిగిన సిన్సియర్ పోలీస్ పాత్ర. తమిళ్ మూవీ 'తనీ ఒరువన్' ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 'సురేంద్రరెడ్డి' డైరెక్ట్ చేస్తున్నాడు. ఉద్యోగంలోకి జాయిన్ కాక ముందునుంచే ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒంటరిగానే సేకరించడం మొదలు పెడతాడు హీరో. అప్పుడు అతడికి కొన్ని నిజాలు తెలుస్తాయి. ఏంటా నిజాలు అన్నది తెరమీద చూడాల్సిందే. సీన్ సీన్ కి ఆసక్తిని రేకెత్తించే ఈ సినిమా తమిళ్ వెర్షన్ లో విలన్ గా నటించిన 'అరవింద్ స్వామి' నే ఇందులో కూడా విలన్ గా నటిస్తుండడం విశేషం. నిజంగా ఈ సినిమాలోని పాత్ర రామ్ చరణ్ కి సరికొత్త మేకోవర్. 

14:04 - September 19, 2016

డాన్స్ అంటే ఒక ఆర్ట్ ఫామ్.. డాన్స్ అంటే ఈ తరానికి ఎక్ర్సాకరిక్యులర్ యాక్టివిటీ. డాన్స్ అంటే ఆడియన్స్ అప్లాస్.. ఇదే మనకు తెలిసింది.. కానీ డాన్సంటే  ఆనందాన్ని పొందడం. ఆనందాన్ని పంచడం. డాన్సంటే ఆరోగ్యంగా ఉండటం. అంతకు మించి డాన్సంటే అనేక శాస్త్రాల సమ్మిళితం అంటున్న ఓ లెజెండరీ అంతరంగంతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్ఫూర్తి.
డాన్స్ ని మానవసంబంధాలకు అన్వయిస్తే
నృత్యాన్ని ఒక పాఠంగా అభ్యసిస్తే అందులో ప్రావీణ్యత సంపాదిస్తాం. తిరిగి ఆ రంగంలో గురువులుగా మారతాం. కానీ, డాన్స్ ని ఇతర శాస్త్రాలకు కూడా అనుసంధానం చేస్తే, మానవసంబంధాలకు కూడా వాటిని అన్వయిస్తే అందులోని తాద్య్మకం అర్థమవుతుందంటారు భరతనాట్య గురువు రాజేశ్వరి సాయినాథ్.
నాట్యం క్రమశిక్షణ నేర్పుతుంది
సంప్రదాయ నాట్యమంటే ఖరీదైన దుస్తులు, అందమైన ఆభరణాలనే అభిప్రాయం తప్పంటారు. నాట్యం ఒక క్రమశిక్షణను నేర్పుతుంది. జీవితం పట్ల ఒక నిబద్ధతను అలవరుస్తుంది అంటారు రాజేశ్వరి సాయినాథ్.
రాజేశ్వరి సాయినాథ్ కు మానవి వందనాలు
నృత్యంలోని అనేక కోణాలను, పార్వ్శాలను అధ్యయనం చేస్తూ, వాటిని ఆచరణాత్మకంగా కళ్లముందు ఆవిష్కరిస్తున్న నాట్యగురువు రాజేశ్వరి సాయినాథ్ కు మానవి వందనాలు తెలియచేస్తోంది. ఆ మువ్వలసవ్వడి ఇలాగే అప్రతిహితంగా కొనసాగాలని ఆకాంక్షిస్తోంది.

 

13:58 - September 19, 2016

హైదరాబాద్ : ఎస్ ఎఫ్ ఐ నేతృత్వంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేపట్టారు. అనంతరం విద్యార్థులు ర్యాలీగా చలో సెక్రటేరియెట్ కు వెళ్లారు. పెండింగ్ లో ఉన్న రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. 

 

13:54 - September 19, 2016

ఢిల్లీ : ప్యాకేజీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్రమంత్రి సుజనాచౌదరి అన్నారు. ప్యాకేజీ పట్ల ఏపీ ప్రజలు సానూకూలంగానే ఉన్నారని చెప్పారు. కేంద్రప్రభుత్వ సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సూచన కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని అన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం 100 శాతం నిధులు ఇవ్వడం చరిత్రాత్మక విషయమని చెప్పారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తుందని అన్నారు. త్వరలో రైల్వేజోన్‌ విషయంలో  నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

13:49 - September 19, 2016

ఢిల్లీ : యురి టెర్రర్‌ ఎటాక్‌పై రాజ్‌నాథ్‌సింగ్‌ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో నిన్నటి టెర్రర్‌ ఎటాక్‌పై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌, ఆర్మీ చీఫ్‌, బీఎస్ ఎఫ్, సీఆర్ పీఎఫ్ డీజీలు, ఐబీ చీఫ్‌, హోంశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో యురి సెక్టార్‌లోని తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యూహ ప్రతివ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ..కేబినెట్‌ సబ్‌కమిటీతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి మనోహర్‌పారికర్‌, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ, ఎన్ ఎఎస్ ఏ అజిత్‌ ధోవల్‌తో పాటు ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. వీరితో పాటు ఆర్మీ చీఫ్‌ దల్బీర్‌సింగ్‌, బీఎస్ ఎఫ్, సీఆర్ ఎఫ్ డీజీలు, ఐబీ చీఫ్‌, హోంశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. యురి సెక్టార్‌లోని తాజా పరిస్థితులు, వైఫల్యాలు, దేశ అంతర్గత భద్రతపై ప్రధానితో కేంద్రమంత్రులు చర్చిస్తున్నారు. భేటీ అనంతరం ఉగ్రదాడిపై భారత్‌ తదుపరి చర్యలపై కేంద్రం ఓ ప్రకటన చేయనుంది.  

 

బీహార్ లో లోయలో పడిన బస్సు..

బీహార్ : రాష్ట్రంలో ఓ బస్సు లోయలో పడిపోయింది. మధుబన్ నుండి ఈ బస్సు వెళుతోంది. ఈ ఘటనలో నలుగురి మృతదేహాలు వెలికి తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

జవాన్లు మృతి చెందడంపై బిగ్ బి ఆవేదన..

ఢిల్లీ : యూరీ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 మంది జవాన్లు వీరమరణం పొందడంపై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరగడం బాధాకరమని, కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై ధృడమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. 

13:24 - September 19, 2016

చిత్తూరు : జస్టిస్‌ మంజునాథ నేతృత్వంలో ఏర్పాటైన ఎపి బిసి కమిషన్‌ తిరుపతిలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది. కొత్త కులాలను బిసిల్లో చేర్చడం, గ్రూపుల మార్పు వంటి అంశాలను కమిటీ అధ్యయనయం చేయనుంది. మూడు రోజులపాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న మంజునాథ నేతృత్వంలోని బిసి కమిషన్‌ తిరుపతితో వివిధ వర్గాల నుంచి ప్రజాభిప్రాయసేకరణ ప్రారంభించింది. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50శాతం మించి ఉండొచ్చని ఎపి బిసి కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మందుజునాథ తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కమిషన్‌ నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తుందని జస్టిస్‌ మంజునాథ తెలిపారు. మరోవైపు కాపులను బీసీల్లో చేర్చొద్దంటూ బీసీలు తిరుపతిలో ఆందోళన చేస్తున్నారు. బీసీల ఐక్యతను దెబ్బతీయోద్దని..వెంటనే ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలని బీసీలు డిమాండ్ చేశారు.  
 

 

13:20 - September 19, 2016

బీహార్ రాష్ట్ర వీర జవాన్లకు సీఎం ఆర్థిక సహాయం..

బీహార్ : యూరీలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందిన బీహార్ జవాన్లకు సీఎం నితీష్ కుమార్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. 

13:12 - September 19, 2016

ఢిల్లీ : యూరి ఘటనపై హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఉన్నతస్థాయి సమావేశం ముగిసింది. తాజా పరిస్థితులపై రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌, ఆర్మీచీఫ్‌, బీఎస్ ఎఫ్, సీఆర్ పీఎఫ్ డీజీలు ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. మరికాసేపట్లో    రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌  ప్రధానిని కలవనున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని రక్షణశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాక్‌ చర్యను తిప్పికొట్టేందుకు ఏ క్షణమైనా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పాక్‌ నుంచి వచ్చే ఉగ్రమూకలపై భారత జవాన్లు డేగకన్ను వేశారు. యూరి టెర్రర్ అటాక్ కు కేంద్రం సిద్ధమైంది. యూరి సెక్టార్‌లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. 

గాయపడిన జవాన్లను పరామర్శించిన ముఫ్తీ..

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి 92 బేస్ హాస్పిటల్ కు చేరుకున్నారు. గాయపడి చికిత్స పొందుతున్న జవాన్ల ఆరోగ్య పరిస్థితిని వైద్యులనడిగి తెలుసుకున్నారు. యూరీలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. పలువురు జవాన్లు గాయపడ్డారు. 

మోడీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ సమావేశం..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరుగుతోంది. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్, పారికర్, అరుణ్ జైట్లీ, సమావేశానికి ఆర్మీ చీఫ్, ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యూరీ దాడులు..సరిహద్దులో భద్రతపై చర్చిస్తున్నారు. 

కేసీఆర్ ను కలిసిన దానం..

హైదరాబాద్ : సచివాలయంలో మంత్రి కేసీఆర్ ను మాజీ మంత్రి దానం నాగేందర్ రెడ్డి కలిశారు. భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

సదాశివపేటలో ప్రేమోన్మాది ఘాతుకం..

మెదక్ : ప్రేమించలేదని డిగ్రీ విద్యార్థినిపై ప్రేమోన్మాది సతీష్ కత్తితో దాడి జరిపాడు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. 

12:53 - September 19, 2016

ఈ లిస్ట్ లో ఉన్న మరో సీనియర్ హీరో 'వెంకీ'. లేటెస్ట్ గా 'వెంకీ' చేసిన మూస మాస్ చిత్రం 'బాబు బంగారం' జనాన్ని బాగా నిరాశపరచడంతో, దీని తరువాత చేయబోయే గురు తో సరికొత్త మేకోవర్ తో రాబోతున్నాడు 'వెంకీ'. మరి 'గురు' స్పెషాలిటీస్ ఏంటీ ?
'విక్టరీ వెంకటేష్' తన ప్రతి సినిమాకూ సరికొత్త కథతో రావాలనే చూస్తాడు. అయితే ఒకేసారి కొన్ని విషయాల దగ్గర లాక్ అవ్వకతప్పదు. అలా 'వెంకీ' చేసిన రొటీన్ సినిమానే 'బాబు బంగారం'. ఈ సినిమా తో 'వెంకటేష్' జనాన్ని బాగా నిరాశపరిచాడు. అందుకే దీని తరువాత తెరకెక్కబోతున్న 'గురు' తో 'వెంకటేష్' సరికొత్త మేకోవర్ తో వస్తున్నాడు. ఈ సినిమాలో 'వెంకీ' మొట్టమొదటసారిగా బాక్సింగ్ కోచ్ అవతారమెత్తబోతున్నాడు. హిందీలో 'సాలా ఖడూస్', తమిళ్ లో 'ఇరుదు సుట్రు'గా ఏకకాలంలో తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో 'వెంకటేష్' తో 'గురు'గా తెరకెక్కిస్తున్నారు. 'మాధవన్' చాలా కష్టపడి చేసిన ఆ పాత్రను 'వెంకటేష్' తన ఓన్ చేసుకోబోతున్నాడు. ఇందులో కోచ్ గా కనిపించేందుకు 'వెంకీ' అవసరమైన వర్కౌట్స్ చేస్తున్నట్టు సమాచారం. హిందీ, తమిళ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన 'సుధ కొంగర'నే 'గురు' ను డైరెక్ట్ చేయబోతోంది. మరి ఈ కొత్త గెటప్ వెంకీకి ఎలా ఉంటుందో చూడాలి.

12:50 - September 19, 2016

స్టార్ హీరోలు ఎప్పటికప్పుడు సరికొత్త మేకోవర్ తో వస్తేనే జనానికి కిక్. రొటీన్ పాత్రలతో ఎంతకాలం మేనేజ్ చేయగలరు. ఎప్పటికప్పుడు తనకు తాను అప్డేట్ అవుతూ, ఇప్పటి యూత్ కి నచ్చేవిధంగా కొత్త కొత్త కథలతో సరికొత్తగా రావడమే హీరోల పని. అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో కొంత మంది స్టార్ హీరోలు సరికొత్తగా వస్తున్నారు. ముందుగా ఈ లిస్ట్ లో ముందువరసలో ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ. తెలుగు నేలను పాలించిన ఒకటవ శతాబ్దపు రాజు 'శాతకర్ణి' జీవిత కథ ఆధారంగా తెరెకెక్కుతున్న 'గౌతమీ పుత్ర శాతకర్ణి' తో రాబోతున్నారు బాలయ్య. నిజంగా ఇది బాలయ్యకు సరికొత్త మేకోవరే. నందమూరి బాలకృష్ణ గతంలో చేసిన ఒకే ఒక చారిత్రక చిత్రం అక్బర్ సలీం అనార్కలి. అది కూడా అప్పటికింకా, ఆయన హీరో అవ్వని క్రితం చేసినది. అందుకే 'గౌతమీ పుత్ర శాతకర్ణి'ని బాలయ్య చేయబోతున్న మొట్టమొదటి చారిత్రక చిత్రంగా చెప్పుకోవాలి. క్రిష్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే ఒక అరుదైన చిత్రంగా తెరకెక్కబోతోంది. శాతకర్ణుడు లేక శాలివాహనుడు తన పూర్వీకుల పాలనలో కోల్పోయిన మధ్య దక్కను ప్రాంతాలను యుద్ధాలు చేసి తిరిగి సంపాదించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి కాలములో శాతవాహన ప్రాబల్యం దక్షిణాన కంచి వరకు వ్యాపించింది. ఇలాంటి అద్భుతమైన పాత్ర చేయడం బాలకృష్ణ కు దక్కిన అరుదైన అవకాశంగా చెప్పుకోవాలి. బాలయ్యకు నిజంగా ఇది సరికొత్త మేకోవర్. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా గౌతమీ పుత్రశాతకర్ణి రాబోతున్నాడు. 

12:33 - September 19, 2016

కన్నడలో ఘన విజయం సాధించిన 'రణతంత్ర' చిత్రం 'ఇది పెద్ద సైతాన్‌' పేరుతో తెలుగులో తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్ రాఘవేంద్ర, హరిప్రియ జంటగా నటిస్తున్నారు. ఆదిరామ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొదింది. శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి లతా మార్టోరి సమర్పణలో నిర్మాత వెంకట్రావ్‌ మార్టోరి అందిస్తున్నారు. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 30న రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రం హిట్ అవుతుందో లేదో చూడాలి మరి. 

 

టిడిపి పాలనపై ఏపీ కాంగ్రెస్ వాస్తపత్రం విడుదల..

విజయవాడ : టిడిపి పాలనపై కాంగ్రెస్ వాస్తవపత్రం విడుదల చేసింది. ప్రజలకు వాస్తవ పత్రాలు అందచేస్తామని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. ఎన్నికల హామీలు..ప్రత్యేక హోదాపై 28 నుండి ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తామన్నారు. 

17 మంది వీర జవాన్లకు శ్రద్ధాంజలి..

జమ్మూ కాశ్మీర్ : యూరీ సెక్టార్ లో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 17 మంది జవాన్లకు శ్రద్ధాంజలి కార్యక్రమం జరిగింది. సీఎం మహబూబా ముఫ్తీ పాల్గొని వీరమరణం పొందిన జవాన్లకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. 

12:22 - September 19, 2016
12:19 - September 19, 2016

యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' కు 'జనతా గ్యారేజ్' చిత్రం మంచి విజయాన్ని సాధించి పెట్టింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. విడుదల సమయంలో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. 'జనతా గ్యారేజ్' సూపర్ హిట్ కావడంతో 'ఎన్టీఆర్', దర్శకుడు 'కొరటాల శివ' సహా చిత్ర యూనిట్ మొత్తం సంతోషంగా ఉంది. కలెక్షన్ల విషక్ష్మీంలో తక్కువ సమయంలోనే రెండో తెలుగు సినిమాగా 'జనతా గ్యారేజ్' రికార్డులకెక్కింది.
18 రోజుల్లోనే రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఓవర్సీస్‌లో 16 రోజుల్లోనే 1.76 మిలియన్ డాలర్లు సంపాదించిన ఈ చిత్రం 'నాన్నకు ప్రేమతో' రికార్డును బద్దలు కొట్టే దిశగా ముందుకు సాగుతోంది. 2016లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇలాగే స్టడీగా కలెక్షన్లు సాధిస్తే.. రూ.150 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలున్నాయి. తెలుగుతోపాటు, దక్షిణాదిలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. 

12:18 - September 19, 2016

స్టేట్ లెవల్ బ్యాంకర్స్ సమావేశం..

హైదరాబాద్ : గన్‌ఫౌండ్రీలో ఉన్న ఎస్‌బీహెచ్ మెయిన్ ఆఫీసులో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు పలు బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

యూరీ ఉగ్రదాడిపై చండీఘడ్ లో నిరసనలు..

ఢిల్లీ : యూరీలో ఉగ్రదాడిపై నిరసనలు పెల్లుబికుతున్నాయి. చండీఘడ్ లో యూత్ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. 

12:00 - September 19, 2016

రంగారెడ్డి : నార్సింగ్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసమే అమీనాను హత్య చేసినట్టు నిందితుడు అక్బర్‌ పోలీసుల విచారణలో వెల్లడించాడు. అమీనాపై అత్యాచారం చేయలేదని చెప్పాడు. డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ విషయంలో అక్బర్ అమీనాను ఇంటి వద్దే బ్లేడుతో గాయపరిచాడు. అయితే తనను ఆస్పత్రికి తీసుకెళ్తే డబ్బులు ఇస్తానని అమీనా చెప్పడంతో ఆమెను తీసుకొని బయల్దేరాడు. డబ్బులు వెంట తీసుకురాలేదని తెలుసుకున్న అక్బర్‌ అమీనాను మార్గమధ్యలోనే హత్య చేశాడు.

 

హోదా వస్తే ఉద్యోగాలు రావు - సుజనా..

విజయవాడ : 'హోదా' వ‌స్తే ఉద్యోగాలు వ‌స్తాయ‌ని అనుకోవ‌డం భ్ర‌మేన‌ని, హోదాతో ఉద్యోగాలు రావని కేంద్ర సహాయ మంత్రి సుజ‌నా చౌద‌రి చెప్పారు. హోదా వ‌స్తే అది వ‌చ్చింద‌న్న పేరే త‌ప్పా అంత‌కు మించి రాష్ట్రానికి ఏమీ రాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. హోదాతో స‌మానంగా వ‌చ్చే సాయంతో పాటు ప్రత్యేక ప్ర‌యోజ‌నాలు కూడా అందుతాయ‌ని తెలిపారు. 

11:57 - September 19, 2016

ఢిల్లీ : యూరి సెక్టార్‌పై నిన్న జరిగిన ఉగ్రదాడిలో భారత జవాన్ల మృతుల సంఖ్య 20కి చేరింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురు భారత జవాన్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీగనగర్ ఆసుపత్రిలో మరో 30 మంది జవాన్లు ప్రాణాలతో పోరాడుతున్నారు. అయితే ఉగ్రదాడిపై తాజాగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కాసేపటి క్రితం తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌తోపాటు బీఎస్ ఎఫ్, సీఆర్ పీఎఫ్ డీజీలు, ఐబీ చీఫ్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ ప్రధానిని కలిసి పరిస్థితిని వివరించనున్నారు. మరోవైపు యూరి సెక్టార్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిపై కేంద్రం తీవ్ర ఆగ్రహంతో ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న భారత జవాన్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రక్షణశాఖ ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. ఏ క్షణంలోనైనా పాక్‌చర్యను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్మీ, వాయుదళాలను ఆదేశించినట్లు సమాచారం. 

 

బీసీల్లో 11 కులాలను చేర్చాలనే డిమాండ్ ఉంది - బీసీ కమిషన్ ఛైర్మన్..

తిరుపతి : 11 కులాలను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ ఉందని బీసీ కమిషన్ ఛైర్మన్ మంజునాథ్ పేర్కొన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ ఉన్నా కొందరు వ్యతిరేకిస్తున్నారని, అందరి డిమాండ్లను ఆధారాలతో పరిశీలిస్తామన్నారు.

 

ప్యాకేజీతో రాష్ట్రం అభివృద్ధి - సుజనా..

విజయవాడ : ప్యాకేజీతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం సూచనల కారణంగా హోదా రాలేదని, ప్యాకేజీని ఏపీ ప్రజలు ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. సాధ్యసాధ్యౄలను పరిశీలించాకే ప్యాకేజిని ఇచ్చారని, కేంద్రం సహకారంతో ఏపీని సస్యశ్యామలం చేస్తామన్నారు. రైల్వే జోన్ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. 

సంతోష్ నగర్ లో దారుణం..

హైదరాబాద్ : పాతబస్తీ సంతోష్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రయాణ ఛార్జీ అడిగినందుకు ఆటో డ్రైవర్ ను ఓ వ్యక్తి పొడిచాడు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కౌన్సిల్ సభ్యులు అడిగిన 14 ప్రశ్నలపై కౌన్సిల్ చర్చించనుంది. స్టాండింగ్ కమిటీ తీర్మానాలపై చర్చ జరగనుంది. 

రేవంత్ అభ్యర్థనను తిరస్కరించని సుప్రీం..

ఢిల్లీ : పార్టీ ఫిరాయింపుల కేసులో ఇంపీడ్ పిటిష‌న్ దాఖ‌లు చేసేందుకు టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి అభ్య‌ర్థ‌న పెట్టుకున్నారు. దీన్ని సుప్రీం తిర‌స్క‌రించింది.

డబ్బుల కోసమే అమీనా హత్య..

హైదరాబాద్ :డబ్బుల కోసమే అమీనాను హత్య చేసినట్లు తేలింది. నార్సింగిలో అమీనాను అక్బర్ దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అమీనాపై అత్యాచారం చేయలేదని, డబ్బు కోసమే అమీనాను హత్య చేసినట్లు అక్బర్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఇంటి వద్దే బ్లేడుతో అమీనాను అక్బర్ గాయపరిచాడు. ఆసుపత్రికి తీసుకెళ్తే డబ్బులు ఇస్తానని చెప్పడంతో అమీనాను అక్బర్ తీసుకెళ్లాడు. డబ్బులు తీసుకరాలేదని తెలియడంతో మార్గమధ్యంలో అమీనాను హత్య చేశాడు. విద్యార్థిని అమీనా చాంద్రాయణగుట్ట బండ్లగుడ వాసి. 

ప్రధాన మంత్రితో పారికర్ భేటీ..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో రక్షణ మంత్రి పారికర్ భేటీ అయ్యారు. యురి దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ప్రధాన మంత్రికి పారికర్ తెలియచేశారు. 

మల్కాజ్ గిరి పటేల్ నగర్ లో ఉద్రిక్తత..

హైదరాబాద్ : మల్కాజ్ గిరి పటేల్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైల్వే భూముల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు. 

తిరుపతి బీసీ కమిషన్..

తిరుపతి : మున్సిపల్ కార్యాలయంలో బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. కాపులను బీసీల్లో చేర్చాలని పెద్ద ఎత్తున్న విజ్ఞప్తులు వచ్చాయి. 

10:53 - September 19, 2016

జయంత్‌ సి.పరాన్జీ డైరెక్షన్ లో మరో చిత్రం తెరకెక్కనుంది. నీలేష్‌ ఈటి హీరోగా, ప్రముఖ మోడల్‌ ఇజబెల్‌ హీరోయిన్‌గా ఉగ్రం చిత్రం రూపొందించబోతున్నారు. 'ఈ చిత్రం ద్వారా నీలేష్‌ ఈటి హీరోగా, ప్రముఖ మోడల్‌ ఇజబెల్‌ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఇషాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవంబర్‌లో షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రస్తుతం రవి గంటా కథానాయుకుడిగా 'కాళహస్తి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రేమించుకుందాం.. రా, ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్‌, బావగారూ బాగున్నారా, లక్ష్మీ నరసింహా, శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌, తీన్‌మార్‌ వంటి హిట్ చిత్రాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఈ చిత్రం కూడా హిట్ అవుతుందో లేదో చూడాలి మరి.

10:35 - September 19, 2016

హైదరాబాద్ : గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల సౌకర్యాల కొరత ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. సకాలంలో వైద్యం అందక యువకుడు మృతి చెందాడు. నల్లగొండకు చెందిన ప్రకాష్‌ యాదగిరిగుట్ట దగ్గర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్సం కోసం అతన్ని హైదరాబాద్‌ తరలించారు. గాంధీ ఆసుపత్రిలో సీటీ స్కానింగ్‌ లేదని ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. దీంతో ప్రకాష్‌కు నాలుగు గంటలకు పైగా వైద్యం అందలేదు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు తిరిగి ప్రకాష్‌ కన్నుమూశాడు. దీంతో ఆస్పత్రుల్లో సౌకర్యాల కొరతపై మృతుని బంధువులు మండిపడుతున్నారు. సౌకర్యాలు కల్పించని టీసర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
  

కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం..

హైదరాబాద్ : కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్ సభ్యులు అడిగిన 14 ప్రశ్నలపై కౌన్సిల్ చర్చించనుంది. స్టాండింగ్ కమిటీ తీర్మానాలపై చర్చ జరగనుంది. 

10:27 - September 19, 2016

జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులు..

మహబూబ్ నగర్ : జూరాల ప్రాజెక్టు నీటి మట్టం 318.390 అడుగులు ఉంటే పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 18 వేలు ఉండగా ఔట్ ఫ్లో 27,230 క్యూసెక్కులుగా ఉంది.

 

రాజంపేటలో మంత్రి గంటా అకస్మిక తనిఖీలు..

కడప : రాజంపేటలో మంత్రి గంట అకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోడ్లపై చెత్తా చెదారం పేరుకపోవడంతో మంత్రి గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పాక్..భారత్ మధ్య యుద్ధ మేఘాలు..

ఢిల్లీ : ఉగ్రవాదుల దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 మంది జవాన్లు వీరమరణం పొందారు. చికిత్స పొందుతున్న మరికొందరి జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యూరీ దాడి వెనుక పాక్ హస్తం ఉందని రక్షణ భావిస్తున్నట్లు, దీనితో పాకిస్తాన్ తో కఠినంగా ఉండాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో రాజ్ నాథ్ సింగ్ అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. సరిహద్దుకు అదనపు బలగాలను తరలించారు. దేనికైనా సిద్ధంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి పారికర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

శ్రీనగర్ కు ఎన్ఐఏ..

ఢిల్లీ : యూరీ ఘటనలో మృత్యుల సంఖ్య 20కి చేరింది. మరో 30 మంది జవాన్లు ప్రాణాలతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే యూరీ దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు శ్రీనగర్ కు ఎన్ఐఏ అధికారులు బయలుదేరారు. 

నీరు - ప్రగతిపై సీఎం బాబు సమీక్ష..

గుంటూరు : నీరు - ప్రగతిపై అధికారులు..కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పంట కుంటల పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 

10:02 - September 19, 2016

కోడిగుడ్డు..రోజుకు ఒకసారి తినండి..ఆరోగ్యంగా ఉండండి అంటూ టీవీల్లో...ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు వస్తుంటాయి. కోడిగుడ్డు బలవర్ధకమైన ఆహారం కావడంతో పలువురు వీటిని తినడానికి ఆశక్తి చూపుతుంటారు. కానీ ఈ కోడి గుడ్లు మంచివేనా ? అనే సందేహం మాత్రం రాదు.
ఈస్ట్రోజన్ తో తయారైన ఎగ్స్ తింటే ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు కూడా ఉంటాయి.
కోడిగుడ్డుకు షైన్ కొద్దిగా త‌క్కువ‌గా ఉంటుంది. కల్తీ కోడి గుడ్డు మెరుస్తుంది.
అస‌లైన గుడ్డు క‌న్నా న‌కిలీ కోడిగుడ్డును పైన తాకితే గట్టిగా అనిపిస్తుంది.
న‌కిలీ గుడ్ల‌కు అస‌లు నీచు వాస‌న ఉండ‌దు. అస‌లు కోడిగుడ్ల‌కు ఎంత లేద‌న్నా కొద్దిగా నీచు వాసన వ‌స్తుంది.
గుడ్డును చిన్న‌గా ట‌క్‌ ట‌క్‌మ‌ని కొట్టి చూడాలి. అస‌లు కోడిగుడ్డు అయితే ట‌క్ ట‌క్‌మ‌ని బాగా వినిపిస్తుంది.
నకిలీ కోడిగుడ్డును ప‌గ‌ల గొట్ట‌గానే అందులోని ద్ర‌వాలు మ‌న ప్రమేయం లేకుండానే సుల‌భంగా క‌లిసిపోతాయి.
కోడిగుడ్డును కొనేటప్పుడు ఊపి చూడాలి. లోపల నుంచి ఏవైనా సౌండ్స్ వ‌స్తే దాన్ని న‌కిలీగా గుర్తించాలి.
న‌కిలీ గుడ్ల‌లో ప‌చ్చ‌ని సొన కొన్ని సార్లు మ‌ధ్య‌లో తెల్ల‌గా క‌నిపిస్తుంది. 

వైద్యం అందక యువకుడి మృతి..

హైదరాబాద్ : గాంధీ..ఉస్మానియా ఆసుపత్రుల్లో సౌకర్యాల కొరత వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండకు చెందిన ప్రకాష్ యాదగిరిగుట్ట వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. గాంధీలో సిటీ స్కానింగ్ లేదని ఉస్మానియాకు తరలించారు. వెంటిలెటర్స్ లేవని తిరిగి గాంధీకి ఉస్మానియా వైద్యులు పంపించారు. గాంధీ..ఉస్మానియా ఆసుపత్రుల చుట్టూ తిరిగి ప్రకాష్ కన్నుమూశాడు. 

09:42 - September 19, 2016

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో మరో ముగ్గురు భారత జవాన్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అమరులయ్యారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 17 నుంచి 20కి చేరుకుంది. భారత బాలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనేడ్లతో, ఎకె 47 తుపాకులతో యురి సెక్టార్‌లో సైనిక శిబిరంపై విరుచుకుపడ్డారు. దీంతో నిన్న ఉగ్రవాద దాడిలో 17 మంది భారత జవాన్లు అమరులయ్యారు. తాజాగా శ్రీనగర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు భారత జవాన్లు మృతి చెందారు. అలాగే శ్రీగనగర్ ఆసుపత్రిలో మరో ఐదుగురి జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంఒది. అయితే ఉగ్రదాడిపై నిన్న అత్యవసరం సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌...ఇవాళ కూడా మరోసారి అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు తన నివాసంలో జమ్మూకశ్మీర్‌ తాజా పరిస్థితిపై సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌తోపాటు హోంశాఖ కార్యదర్శి హాజరుకానున్నారు.  

 

09:37 - September 19, 2016

శ్రీనగర్ : యురి సెక్టార్ ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. మరో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. నిన్న ఉగ్రదాడిలో 17 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనలో గాయపడి శ్రీనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు జవాన్లు నేడు మృతి చెందారు. చికిత్స పొందుతున్న మరో ఐదుగురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది. 

ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్న కేంద్ర హోం మంత్రి..

ఢిల్లీ : భద్రతపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి పారికర్, ఎన్ఎన్ఏ, ఐబీ, కేంద్ర హోం, రక్షణ శాఖల కార్యదర్శులు, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ డీజీలులు పాల్గొననున్నారు. 

మోడీతో భేటీ కానున్న పారికర్..

ఢిల్లీ : యూరీ దాడి ఘటనపై ప్రధానితో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ భేటీ కానున్నారు. దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ప్రధాని మోడీకి ఆయన తెలియచేయనున్నారు. 

బాలిక హత్యకేసు..పోలీసుల అదుపులో నిందితుడు

రంగారెడ్డి : నార్సింగిలో బాలిక హత్యకేసులో నిందితుడు అక్బర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు అక్బర్ ను పోలీసులు గుర్తించారు. 

గయాలో జవాన్ ఇంట్లో విషాద ఛాయలు...

బీహార్ : గయాలో జవాన్ నాయక్ ఎస్ కే విదార్థి నివాసంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆదివారం యూరీ సెక్టార్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నాయక్ వీరమరణం పొందాడు. 

శ్రీనగర్ లో కొనసాగుతున్న ఆంక్షలు..

జమ్మూ కాశ్మీర్ : కాశ్మీర్ లో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎదురు కాల్పుల్లో మరణించిన తరవాత రాష్ట్రంలో హింసాకాండ చెలరేగిన సంగతి తెలిసిందే. దీనితో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూను విధించి తరువాత కొన్ని రోజులకు ఎత్తివేశారు. ప్రస్తుతం 73వ రోజు కూడా పలు ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.

09:11 - September 19, 2016
09:08 - September 19, 2016

రంగారెడ్డి : జిల్లాలోని నార్సింగ్ లో దారుణం జరిగింది. యువతిపై అత్యాచారానికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నార్సింగి శివారు గండిపేట రోడ్డులో యువతిపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువతి తలపై దుండగులు బండరాయితో మోది హత్య చేశారు. యువతి జీన్స్ ప్యాంట్, టీషర్ట్ ధరించింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి దుండుగుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. హత్య గావించబడిన యువతి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. అయితే యువతిని బైక్ పై ఎక్కించుకుని ఓ యువకుడు రోడ్డుపై వెళ్తున్న విజవల్స్ మాత్రం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. యువతి బురఖా ధరించి బైకుపై కూర్చుంది. 

 

రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దారుణం

రంగారెడ్డి : జిల్లాలోని నార్సింగ్ లో దారుణం జరిగింది. యువతిపై అత్యాచారానికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేశారు. 

08:47 - September 19, 2016

హైదరాబాద్ : నాంపల్లిలోని టీఎన్ జీవోఎస్ భవన్ లో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణకు చెందిన నాల్గో తరగతి ఉద్యోగులు టీఎన్ జీవోస్ భవన్ గేటు తాళాలు పగలగొట్టి పెట్రోల్ డబ్బాలతో లోపల బైఠాయించారు. ఆంధ్రాకు కేటాయించిన ఉద్యోగాలు తిరిగి తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమకు కేటాయించకపోతే ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉత్రిక్త వాతావరణం నెలకొంది.

08:37 - September 19, 2016

ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని అణచివేయాలని వక్తలు అన్నారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణ్ రావు, టీడీపీ నేత విజయ్ కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఎన్ విఎన్ ఎస్ ఎస్ ప్రభాకర్, వైసీపీ నేత గౌతంరెడ్డి పాల్గొని, మాట్లాడారు. జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల పంజా..  ఇది చాలా క్రూరమైన సంఘటన అని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తమ విదేశాంగ విధానాన్ని సమీక్షించుకోవాలని సూచించారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:25 - September 19, 2016

ఉద్దేశ్యపూర్వకంగానే దళితులపై దాడులు జరుగుతున్నాయని కెవిపిఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు పేర్కొన్నారు. జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. గో రక్షక దళాల పేరుతో దళితులపై దాడులకు  పాల్పడుతున్నారని తెలిపారు. ఆర్ ఎస్ ఎస్ రాజ్యాంగేతర శక్తిగా మారిందని ఆరోపించారు. మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు అధికమయ్యాయని తెలిపారు. గో రక్షక దళాలను నిషేధించాలన్నారు. 'దేశంలో దళితుల మీద దాడులు ఆగడం లేదు. అహ్మదాబాద్ లో  బక్రీద్ నాడు ఒకరిని కొట్టి చంపడం, దళిత ఉద్యమనేతను అరెస్టు చేయడం లాంటి సంఘటనలు గుజరాత్ ను కుదిపేస్తున్నాయి. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట దళితులను టార్గెట్ చేసి, దాడులు చేస్తున్న వార్తలొస్తున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? గడిచిన రెండేళ్లలో దళితుల మీద దాడులు పెరగడానికి కారణం ఏమిటి? దళితుల మీద దాడులు చేస్తున్నవారి విషయంలో అధికార బిజెపి అనుసరిస్తున్న వైఖరి ఎలా వుంది? దళితులకు రక్షణ కల్పించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

08:20 - September 19, 2016

పార్లమెంట్ లో చర్చ జరిగిన తర్వాత కూడా దళితులపై దాడులు ఆగడం లేదు. గ్రామాలు, పట్టణాలు, యూనివర్సిటీలు  ఇలా అన్ని చోట్లా దళితులను టార్గెట్ చేసి, హింసిస్తున్న సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. 
బిజెపి పాలిత రాష్ట్రాల్లో దాడులు
దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటూ ఓ వైపు ప్రధాని నరేంద్రమోడీ ఉపన్యాసాలిస్తున్నారు. మరోవైపు, ఆయన పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్న సందర్భంలోనే తన సొంత రాష్ట్రానికి చెందిన దళిత ఉద్యమ నేత జిగ్నేశ్ మేవానిని అరెస్టు చేయడం వివాదస్పదమైంది. ఇంకో వైపు యూనివర్సిటీలలో దళిత విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. బిజెపి అధికారంలో వున్న గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలాంటి రాష్ట్రాల్లో దళితుల మీద దాడులు చేస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ దళితులు దాడులకు, అవమానాలకు గురవుతూనే వున్నారు. ఇటీవల నేషనల్ క్రైమ్ బ్యూరో విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారమే బిజెపి అధికారంలోకి వచ్చిన  తొలి ఏడాది 2014లో దళితులపై దాడులు 19శాతం పెరిగాయి. 2015 అధికారిక సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు. నడుస్తున్న 2016లోనూ దాడుల ఉధ్రుతి  పెరిగింది. 2014లో మొత్తం 47వేల కేసులు నమోదైతే   ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ నాలుగు రాష్ట్రాల్లోనే సగానికంటే ఎక్కువ రికార్డయ్యాయి. ఇటీవల కాలంలో హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లోనూ  ఈ జాఢ్యం మరింత ముదిరింది. 
వ్యూహాత్మకంగా దళితులపై దాడులు
గ్రామాలు, పట్టణాలు, యూనివర్సిటీలు అన్న తేడా లేకుండా ఒక పద్ధతి ప్రకారం, వ్యూహాత్మకంగా దళితులను టార్గెట్ చేస్తున్నట్టు గత రెండేళ్ల అనుభవం బోధపరుస్తోంది. చనిపోయిన జంతువుల చర్మాన్ని వలిచి, దానితో బ్యాగులు, బెల్టులు, చెప్పులు  లాంటి లెదర్ వస్తువులు తయారుచేయడం ఎన్నో తరాలుగా సాగుతున్న వృత్తి. నిజానికి, జంతువుల చర్మం వలచడం ఆరోగ్యానికి అత్యంత హానికరమైన వృత్తి. తరతరాలుగా  ఈ ప్రమాదకర వ్రుత్తిని ఎక్కువగా దళితులే నిర్వహిస్తున్నారు. వాడలోని దళితులు తయారుచేసిన తోలు చెప్పులను ఇష్టపూర్వకంగా ధరించిన ఊరి పెద్దలు, దొరలు  చాలామంది ఇప్పటికీ వున్నారు. అయితే, ఈ వాస్తవాలు గుర్తించలేని కొంతమంది ఆధునిక మూఢులు చనిపోయిన జంతువుల చర్మం వలచడాన్నే గో హత్యగా వక్రీకరిస్తూ, దళితుల మీద దాడులు చేస్తున్నారు.  ఇలాంటి దాడులకు బిజెపి పాలిత రాష్ట్రాలు కేంద్రాలవుతున్నాయి.
గోవులను హత్య చేస్తున్నది దళితులు కాదు
నిజానికి మనదేశంలో గోవులను హత్య చేస్తున్నది దళితులు కాదు. వారే వాటిని పోషిస్తున్నారు. కాపలాకాస్తున్నారు.  వాటిని పచ్చిక బయళ్లలో మేపడం, గడ్డిమోపలు తీసుకురావడం, పేడ తీయడం ఇలాంటి అన్ని పనుల్లోనూ దళితులు శ్రమిస్తున్న తీరు ఏ గ్రామానికి వెళ్లినా కళ్లకు కడుతుంది. మనదేశంలో 1623 జంతువధ శాలలున్నాయి. మహారాష్ట్రలో 310, ఉత్తరప్రదేశ్ లో 285, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  183 జంతు వధశాలలున్నాయి. కానీ, వీటి యజమానులు దళితులు కాదు.  జంతు వధశాలల యజమానులు కూడా తమ పార్టీకి  భారీగా నిధులిస్తున్నట్టు బిజెపి చెప్పుకున్న సందర్భాలున్నాయి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఆర్థిక సంవత్సరంలో భారతదేశం జంతు మాంసం ఎగుమతుల ద్వారా దాదాపు 30 వేల కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది. అలాంటప్పుడు గో సంరక్షణ స్టిక్కర్లు తగిలించుకుని, అశాంతి రాజేస్తున్నవారు ఏ ముఖం పెట్టుకుని దళితులను నిందిస్తారు? 
బిజెపి హయాంలో పెరిగిన దళిత విద్యార్థుల ఆత్మహత్యలు  
మరో వైపు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలలో దళిత విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయి. ఒక్క ఏడాది కాలంలో 25  మంది యూనివర్సిటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే అందులో 23 మంది దళితులే కావడం  వారి మీద జరుగుతున్న  మానసిక వేధింపులకు నిదర్శనం. 
72శాతం దళిత కుటుంబాలు దుర్భర దారిద్ర్యం 
మన దేశంలో 72శాతం దళిత కుటుంబాలు నిరుపేదలు దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్నాయి. 55 శాతం మందికి సెంటు భూమి కూడా లేదు. 67శాతం మంది  క్యాజువల్ లేబర్ గా పనిచేస్తున్నారు. కేవలం 12శాతం మందికే పక్కా గృహాలున్నాయి.  దళితులకిచ్చే వేతనాల విషయంలోనూ వివక్ష కొనసాగుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. చివరకు ప్రభుత్వరంగంలోనూ దళితులకు, ఇతర సామాజిక వర్గాలకు మధ్య దాదాపు 19శాతం వేతన వ్యత్యాసం వుందన్నది ఆ అధ్యయనం సారాంశాం. ప్రయివేట్ రంగంలో ఈ వ్యత్యాసం 31 శాతం పై మాటే.  క్లీనింగ్, ఊడ్చడం, మురుగు కాల్వలను శుభ్రం చేయడం, చనిపోయిన పశువుల చర్మాన్ని వలవడం లాంటి అనేక వృత్తుల్లో 90శాతం మంది దళితులే కనిపిస్తారు. కానీ, ఆయా రంగాల్లో వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయకపోగా, వారి మీదే దాడులు చేయడం బిజెపి పాలనలో పెరిగిన మరో అమానుషత్వం. 

 

ఉగ్రదాడిపై విచారణ చేయనున్న ఎన్ ఐఏ

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో యురి సెక్టార్ లో ఉగ్రదాడిపై ఎన్ ఐఏ విచారణ చేయనుంది. ఎన్ ఐఏ యురి సెక్టార్ కు చేరుకుంది. 

 

నేడు రాజమండ్రిలో సీఎం చంద్రబాబు పర్యటన

 తూర్పుగోదావరి : నేడు రాజమండ్రిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎయిర్ పోర్టు విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 

 

నేడు జీహెచ్ ఎంసీ కౌన్సిల్ సమావేశం

హైదరాబాద్ : నేడు జీహెచ్ ఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. 14 అంశాలపై కౌన్సిల్ చర్చించనుంది. హైదరాబాద్ రోడ్ల దుస్థితి, నాలాల పునరుద్ధరణపై చర్చించనున్నారు. 

నేడు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉద్యోగుల ధర్నా

తిరుపతి : నేడు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉద్యోగుల ధర్నా చేపట్టనున్నారు. 1300 మంది ఉద్యోగులు విధులు బహిష్కరించనున్నారు. 

07:47 - September 19, 2016
07:46 - September 19, 2016

కృష్ణా : దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో సకల ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రతి సారి 10రోజులు జరిగే ఉత్సవాలను ఈసరి 11రోజులు పాటు జరిపేందుకు ఆలయ అధికారులు సిద్ధమయ్యారు. లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెబుతున్నారు. 
ఉత్సవాలకు అధికారులు ఏర్పాటు 
విజయవాడలోని దుర్గమ్మ సన్నిధి.. దసరాఉత్సవాలకు సిద్ధం అవుతోంది. ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు అధికారులు సకల ఏర్పాటు చేస్తున్నారు. దసరా పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఈసారి ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు కన్నుల పండువగా జరగనున్నాయి. అక్టోబర్‌ 1నుంచి  ప్రారంభమయ్యే వేడుకల్లో  భక్తలకు అన్నిసౌకర్యాలు కల్పిస్తున్నారు.
11 అవతారాల్లో భక్తులకు దర్శనం 
ఈసారి దసరా ఉత్సవాల్లో అమ్మవారు 11 అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రతిఏడాది 10 అవతారల్లో మాత్రమే కినించే దుర్గమ్మను .. ఈసారి మాత్రం 11 రూపాల్లో అలంకరణ చేయనున్నారు. కృష్ణాపుష్కరాలను విజయవంతంగా నిర్వహించామంటున్న ప్రభుత్వం ... దసరా ఉత్సవాలను కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చస్తోంది. ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబతున్నారు. 

07:42 - September 19, 2016

ఢిల్లీ : ఒక గొప్ప క్రీడా సంబరం విషాదంతో ముగిసింది. వైకల్యాన్ని జయించి ప్రపంచ క్రీడా వేదికపై సత్తా చాటుతూ ఎందరికో స్ఫూర్తినిచ్చిన పారా అథ్లెట్లు.. ఓ విషాద వార్తతో భారంగా రియో నుంచి నిష్క్రమించారు.  సైక్లింగ్‌రేస్‌లో ఇరాన్‌ క్రీడాకారుడు బహ్మాన్‌ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. 48 ఏళ్ల బహ్మాన్‌ రేసులో పోటీ పడుతూ కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బహ్మాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉండగానే అతను మృతిచెందాడు. దురదృష్టవశాత్తూ బహ్మాన్‌ ప్రాణాలు కోల్పోయాడని పారాలింపిక్ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. 

07:40 - September 19, 2016

అనంతపురం : ఎక్కడ చూసిన అపరిశుభ్రత ... కలుషితమైన తాగునీరు... దోమల బెడదతో రోగాలు ప్రభలిపోతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌లతో అనంతపురం జిల్లా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రెండు నెలల నుంచి విషజవరాలతో జనం విలవిల్లాడుతున్నా.. వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఎటువంటి చలనంలేదు. అనంతపురంజిల్లాలో విష జ్వరాలతో ప్రజలు గజగజ ణికిపోతున్నారు. జిల్లాలో ప్రభుత్వ ,ప్రైవేట్‌ ఆస్పత్రులు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. 
రోగాలభారిన పడుతున్న జనం 
అపరిశుభ్రవాతారణంతోపాటు, తాగునీరు కలుషితమై జనం రోగాలభారిన పడుతున్నారు. దాదాపు మూడు నెలల నుంచి విషజ్వరాలు విజృంభిస్తున్నా... ముందుజాగ్రత్తలు తీసుకోవడంలో వైద్యాధికారులు విఫలం అయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. గత మూడు నెలల్లో జిల్లావ్యాప్తంగా  6వందల మలేరియకేసులతో పాటు, 190 దాకా డెంగ్యూ కేసులు నమోదైనట్టు అధికారులే చెబతున్నారు. డెంగ్యూరోగుల్లో 12 మంది మృతిచెందడంతో  జిల్లా ప్రజలు గజగజలాడిపోతున్నారు. 
దోమల నివారణకు చర్యలు శూన్యం 
మలేరియాకు కారణమవుతున్న దోమలన నివారణకు వైద్యాధికారులుగాని, కార్పొరేషన్‌ అధికారులుగాని ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు అంటున్నారు. జిల్లాలోని మొత్తం 19 మండలాల పరిధిలో దాదాపు 350గ్రామాల్లో ప్రజలు  విషజ్వరాల భారిన పడి నానా అవస్థలు పడుతున్నారు. 
పారిశుధ్యం అస్తవ్యస్తం
అనంతపురం పట్టణంలో ఎక్కడ చూసినా పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. డ్రైనేజీ దుర్గంధంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరంలో 600 మంది పారిశుధ్య కారిూకులను తొలగించిన అధికారులు పారిశుద్యాన్ని గాలికొదిలేశారు. దీంతో సీజనల్‌ రోగాలతో అనంతప్రజలు ఆస్పత్రుల ముందు క్యూకడుతున్నారు. 
కేంద్ర ఆస్పత్రుల్లో మాత్రమే వ్యాధినిర్ధారణ కేంద్రాలు
డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అనంతపురంతోపాటు హిందూపురం కేంద్రఆస్పత్రుల్లో మాత్రమే ఉండటంతో జిల్లావ్యాప్తంగా రోగులు ఇక్కడికే రావాల్సి వస్తోంది. డెంగ్యూతో చిన్నారులు చనిపోవడంతో అధికారులు తెగహడావుడి చేసి ఆతర్వాత ఎప్పటిమాదిరిగానే సైలెంట్‌ అయ్యారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు జిల్లాలో పారిశుద్యంతోపాటు తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  

 

07:31 - September 19, 2016

చెన్నై : తమిళనాడులో సంచలనం సృష్టించిన  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్‌కుమార్ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటూ జైలులో ఉన్న రామ్‌కుమార్..విద్యుత్ వైర్లు పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు జైలు సిబ్బంది చెబుతున్నారు.  ఈ విషయాన్ని స్వాతి హత్య కేసుపై దర్యాప్తు జరుపుతున్న పోలీసు అధికారి శంకర్ కూడా ధ్రువీకరించారు. విద్యుత్ వైర్‌ను రామ్‌కుమార్ పట్టుకోగానే సెక్యూరిటీ గార్డులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారన్ని ఆయన తెలిపారు. అయితే అప్పటికే రామ్‌కుమార్‌ మృతిచెందినట్టు శంకర్‌ అన్నారు. 
మరోవైపు  నిందితుడి తరపు లాయర్  మాత్రం  రామ్‌కుమార్‌ను అతనిల్‌ సెల్‌లోనే హత్య చేశారని ఆరోపించారు. జూలై 24న నుగంబాక్కం రైల్వే స్టేషన్‌లో స్వాతిని నరికి చంపాడనే అభియోగంపై రామ్‌కుమార్‌ను జూలై 1న  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

07:29 - September 19, 2016

తూర్పుగోదావరి : ఉన్నత విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.  యూనివర్సిటీల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాకినాడ జెన్టీయూలో ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీ కన్వెన్షన్‌లో ప్రధానంగా చర్చించారు. యూనివర్సిటీకి ఒక్క రూపాయి కూడా కేటాయించమన్న మంత్రి యనమల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్‌లను ప్రైవేటీకరించాలనుకునే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. 

 

07:27 - September 19, 2016

వరంగల్‌ : జిల్లాలో టెక్స్‌టైల్స్‌ పార్క్‌ కోసం చేస్తున్న భూసేకరణ ..వివాదంగా మారుతోంది. పార్కునిర్మాణానికి తమ భూమలిచ్చేది లేదిని రైతులు తేల్చిచెబుతున్నారు. ఒకవేళ సర్కారు తమ భూముల్ని బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తే... వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తు ఉద్యమిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. 
రైతుల భూ పోరాటం
వరంగల్‌జిల్లాలో రైతులు ఉద్యమబాట పట్టారు. టెక్స్‌టైల్స్‌ పార్క్‌ నిర్మాణానికి అడ్డదారుల్లో భూసేకరణ చస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. రైతులకు భూపోరాటసమితి అండగా నిలుస్తోంది. 
3వేల ఎకరాల సేకరణకు సర్వే
వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని శాయంపేట, గీసుకోండ మండాలల్లోని నాలుగు గ్రామాల నుంచి దాదాపు 3 వేల ఎకరాల భూమిని సేకరించాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అడ్డదారుల్లో భూములను లాక్కోవాలని చూస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    ఎకరాల అసైన్డ్ భూములను ఎరగా చూపుతూ.. పట్టాభూములను కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని..  రైతులు  అధికారులను అడ్డుకుంటున్నారు. జిల్లాలోని ఊకల్, శాయంపేట, కృష్ణనగర్, చింతల్ పల్లి గ్రామాలకు చెందినా రైతులు. టెక్స్‌టైల్స్‌ పార్కు కోసం తమ భూములిచ్చే ప్రసక్తే లేదంటున్నారు 
రైతులు ఆందోళన 
నిజానికి నిబంధనల ప్రకారం.. ఆయాగ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి.. అనుమతి తీసుకుని మాత్రమే భూసేకరణ చేయాల్సి ఉంది. కాని ఎటువంటి గ్రామసభలు జరపకుండానే అధికారులు తమ భూముల్లో సర్వే నిర్వహిస్తున్నారని రైతులు ఆందోళన పడుతున్నారు. భూములను కాపాడుకునేందుకు వామపక్షాల ఆధ్వర్యంలో పోరుబాటపట్టారు. గత పదిహేను రోజులుగా నిరవదిక నిరాహార దీక్షలు చస్తున్నారు. 
రైతుల భూములన్ని లాక్కునేందుకు 123జీవో
రైతుల భూములను ప్రభుత్వం 123 జీవోతో తీసుకోనేందుకు ప్రయాత్నిస్తుందన్నారు భూపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్. 123 జీవోనే ఒక పెద్ద 420 జీవో అన్నారు. రైతుల భూములను తక్కువ మొత్తనికి తీసుకోని అనంతరం రియాలెస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నరని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్ లు వస్తే మంచిదే కానీ దానిపై ఒక డీపీఆర్ లేకుండ రైతులకు న్యాయం చేయకుండ ప్రాజెక్ట్ లు నిర్మిస్తే.. ఎవరికి లాభమో తెలపాలని సీపీఎం నేతలు  డిమాండ్‌ చేశారు. భూసేకరణలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే..ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని భూపోరాట సమితి నాయకులు అంటున్నారు. 

 

07:22 - September 19, 2016

కరీంనగర్ : సిరిసిల్ల జిల్లా కోసం పోరుయాత్ర చేస్తున్న ఓయూ జేఏసీ నేతలను... ముస్తాబాద్‌ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్నారు. సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలంటూ దరువు ఎల్లన్న బృందం పాటలు పాడుతూ పట్టణంలో పర్యటిస్తుండగా.. బస్టాండ్‌ వద్ద కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు జేఏసీ బృందాన్ని అడ్డుకుని దాడి చేశారు. పరుష పదజాలంతో దూషించారు. దీంతో పోలీసులు  ఇరువర్గాలను చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీచార్జ్‌ చేశారు. 

 

నేడు తూ.గో జిల్లా కలెక్టరేట్ ఎదుట దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆందోళన

కాకినాడ : దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ ఎదుట నిర్వాసితులు ఆందోళన చేపట్టనున్నారు. 

రోడ్ల దుస్థితిపై నేడు టీడీపీ వినూత్న నిరసన

హైదరాబాద్ : రోడ్ల దుస్థితిపై నేడు టీడీపీ వినూత్న నిరసన తెలపనుంది. రోడ్లపై పడిన గోతుల్లో టీడీపీ నేతలు మొక్కలు నాటనున్నారు. 

07:03 - September 19, 2016

విజయవాడ : ప్రతిరోజు వేలాది మంది ప్రయాణీకులతో కిటకిటలాడే విజయవాడ రైల్వే స్టేషన్ వారంరోజుల పాటు మూతపడనుంది. సిగ్నలింగ్ వ్యవస్థలో నూత‌న టెక్నాల‌జీని అందుబాటులోకి తీసుకొస్తున్నందున ..స్టేషన్‌ను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు రైల్వే అధికారులు చెప్పారు. 
నిలిచిపోనున్న రైళ్ల రాక‌పోక‌లు 
వారంరోజుల పాటు విజయవాడకు రైళ్ల రాక‌పోక‌లు నిలిచిపోనున్నాయి. రూట్ రిలే ఇంట‌ర్ లాకింగ్ సిస్టం సిగ్నలింగ్ వ్యవస్థలో తీసుకురాబోతున్నఆధునీకరణ పనులు చేపడుతున్నందున ఈ నెల 21 నుంచి 28 వరకు రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడనుంది. వారంరోజల్లు విజయవాడ కేంద్రంగా రాకపోకలు సాగించే 241 రైళ్లు పూర్తిగా, 361 రైళ్లును పాక్షికంగా రద్ద కానున్నాయి. అటు విజయవాడ నుండి కాజీపేట్ మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు సైతం ఆగిపోనున్నాయి. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంపిక చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
పలు ముఖ్యమైన రైళ్ల దారి మళ్లింపు 
హైదరాబాద్, హౌరా మధ్య రాకపోకలు సాగించే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ, విశాఖ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్, సాయినగర్ కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లు ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు విజయవాడ స్టేషన్‌కు వెళ్లవు. ఈ ట్రైన్‌లను ఏలూరు, విజయవాడ బైపాస్ రాయనపాడు కొండపల్లి స్టేషన్‌ల మీదుగా నడ‌ప‌నున్నారు. ఇక ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ భువనగిరి, రాయగిరి, ఆలేరు, జనగామ, కాజీపేట్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ మార్గంలో కాకుండా పగిడిపల్లి, గుంటూరు, తెనాలి స్టేషన్‌ల మీదుగా తిరుపతికి రాకపోకలు సాగిస్తుంది. అలాగే ముంబై సీఎస్‌టీ-భువనేశ్వర్ మధ్య సికింద్రాబాద్ మీదుగా నడిచే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ సేవలు విజయవాడ, కాజీపేట్ మార్గంలో నిలిచిపోనున్నాయి. కొండపల్లి-విజయవాడ బైపాస్ మార్గంలో గుడివాడ, రాజమండ్రి మీదుగా మళ్లిస్తారు. 
ఆందోళనలో ప్రయాణికులు 
నిత్యం అత్యంత ర‌ద్దీగా ఉండే రైల్వే స్టేష‌న్‌లో వారం రోజులు రైల్లు ర‌ద్దవ‌డంతో ప్రయాణికులు అందోళ‌న చెందుతున్నారు. ఇప్పటికే ముంద‌స్తు బుకింగ్ చేసుకున్నవారు వేరే మార్గాల్లో వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.  అయితే స్టేష‌న్ సిగ్నలింగ్ వ్యవ‌స్థలు ఆధునీకరణ చేస్తున్నందునే ఈ  అంతరాయమని.. ప్రయాణికులు సహకరించాలని.. రైల్వే అధికారులు సూచిస్తున్నారు. 

06:55 - September 19, 2016

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడితో ఉలిక్కిపడిన సైనికాధికారులు.. మరిన్ని దాడులు జరగొచ్చన్న సమాచారంతో అప్రమత్తమయ్యారు. దేశవ్యాప్తంగా కీలక సైనిక శిభిరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దు ప్రాంతాలన్నింటిని భారత సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. సరిహద్దులకు వచ్చే రహదారులన్నింటిని మూసివేసింది. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘాను ఉంచారు. అయితే ఇప్పటికే దేశంలోకి మరికొందరు ముష్కరులు చొరబడిఉండొచ్చన్న అనుమానంతో భద్రతా దళాలు వేట ప్రారంభించాయి. 1990 తర్వాత ఇంత భారీగా ప్రాణనష్టం కలిగించిన సంఘటన ఇదేనని ఉన్నతాధికారులు అంటున్నారు. మరోవైపు యూరిలో ఉగ్రదాడిని అమెరికా సహా పలు దేశాలు ఖండించాయి. 

 

నేటి నుంచి ఐక్య రాజ్యసమితి సమావేశాలు

హైదరాబాద్ : నేటి నుంచి ఐక్య రాజ్యసమితి సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించనున్నారు.

నేడు తెలంగాణ ఎస్ ఎస్ ఎఫ్ 'చలో హైదరాబాద్'

హైదరాబాద్ : నేడు తెలంగాణ ఎస్ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేపట్టనున్నారు. 

Don't Miss