Activities calendar

20 September 2016

22:04 - September 20, 2016

ఉత్తర ప్రదేశ్‌ : ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కు తండ్రి ఎస్పీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ మరో ఝలక్‌ ఇచ్చారు. సమాజ్‌వాది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అమర్‌సింగ్‌ను నియమించారు. ఈ విషయాన్ని యూపీ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ ఈ-మెయిల్ ద్వారా మీడియాకు తెలియజేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడానికి పాటు పడాలని అమర్‌సింగ్‌కు రాసిన లేఖలో ములాయం పేర్కొన్నారు. 2010లో పార్టీ నుంచి బహిష్కృతుడైన అమర్‌సింగ్ ఇటీవల సొంతగూటికి తిరిగొచ్చారు. ములాయం ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారు. ఇటీవల పార్టీలో నెలకొన్న సంక్షోభానికి అమర్‌సింగే కారణమని అఖిలేష్‌ చేసిన విమర్శలను ములాయం పట్టించుకోలేదు.

22:03 - September 20, 2016

ఢిల్లీ : తమిళనాడు  రాష్ట్రానికి రేపటి నుంచి ఈనెల 27 వరకు రోజుకు 6వేల క్యూసెక్కుల కావేరీ జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశించింది. తమిళనాడుకు 21 నుంచి సెప్టెంబరు 30 వరకు రోజుకు 3వేల క్యూసెక్కుల కావేరీ జలాలు విడుదల చేయాలని కావేరీ పర్యవేక్షక కమిటీ ఆదేశించింది. ఈ నిర్ణయంపై తమిళనాడు, కర్ణాటక అభ్యంతరం తెలపగా.. అభ్యంతరాలను మూడు రోజుల్లోగా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాడు సాగునీటి కోసం కర్ణాటక తాగునీటిని త్యాగం చేస్తోందని ఆ రాష్ట్ర తరపు న్యాయవాది నారిమన్‌ కోర్టులో వాదించారు. తమిళనాడులో తీవ్ర నీటి కొరత ఉందని ఆ రాష్ట్ర న్యాయవాది ఉమాపతి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తదుపరి విచారణ 27వ తేదీకి వాయిదా పడింది. 

21:59 - September 20, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేధిస్తోందన్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. టీఆర్‌ఎస్‌ ఒత్తిళ్లను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ శిక్షణా తరగతుల రెండో రోజు కార్యక్రమానికి మణిశంకర్‌ అయ్యర్‌ హాజరయ్యారు. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఉత్తమ్‌ దీమా వ్యక్తం చేశారు . 

21:57 - September 20, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీం దుర్మార్గాలు, దురాగతాలపై సీబీఐ Iతో విచారణ జరిపించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. గ్యాంగ్‌స్టర్‌తో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పాత్రపై వస్తున్న ఆరోపణల నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరపాలని అటు బాధితులూ డిమాండ్‌ చేశారు.

ఇందిరాపార్క్ వద్ద నయీం  బాధితుల ధర్నా
గ్యాంగ్‌స్టర్‌ నయీం ముఠా చేతుల్లో హత్యకు గురైన కుటుంబాల సభ్యులు, బాధితులు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ దగ్గర ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల నాయకులు పాల్గొన్నారు.

సీబీఐతో విచారణ జరిపించాలి : ప్రజాసంఘాలు
ప్రభుత్వాలకు రహస్య అజెండాలు ఉన్నంత కాలం నయీం లాంటి గ్యాంగ్‌స్టర్లు పుట్టుకొస్తూనే ఉంటారని ధర్నాలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు, పాలకపక్ష నేతలు నయీంతో సంబంధాలు కొనసాగించిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయనతో పాటు.. ఇతర వామపక్ష, ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

ధర్నాలో పాల్గొన్న నయాం బాధితులు
ధర్నాల్లో పాల్గొన్న బాధితులు... నయీంతోపాటు, అతడి ముఠాసభ్యులు చేసిన బెదిరింపులు, హెచ్చరికలను గుర్తు చేసుకుని వణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ అజ్ఞాతవాసం గడిపాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరయ్యారు. నక్సల్‌ ఉద్యమం నుంచి బయటకొచ్చిన నయీంను పాలకపక్షాలు తమ స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకుని పెంచి పోషించాయని బాధితులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తుతో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదని వారు అనుమానం వ్యక్తం చేశారు. నయీంకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి పోస్టుల నుంచి తలొగించి కేసులు నమోదు చేయాలని కొందరు డిమాండ్‌ చేశారు. 

21:52 - September 20, 2016

గుంటూరు : ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌కు తెరపడింది. తుని ఘటనలో 8 గంటలకు పైగా భూమనను సీఐడీ అధికారులు విచారించారు. విచారణ గంటల తరబడి కొనసాగడంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే భూమన విచారణ నుంచి బయటకు రావడంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

8 గంటలపాటు సీఐడీ విచారణ
గుంటూరు సీఐడీ కార్యాలయం దగ్గర ఉదయం నుంచి కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. తుని ఘటనలో భూమనను ఉదయం 11 గంటల నుంచి విచారించిన సీఐడీ అధికారులు రాత్రి 7 గంటలకు వదిలిపెట్టారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే అంతకుముందు సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భూమనను గంటల తరబడి విచారిస్తుండడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు సీఐడీ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చారు. ఎప్పుడెప్పుడు భూమన బయటకు వస్తాడా ? అని ఎదురుచూశారు. ఒకానొక దశలో వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో సహా పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణ పేరుతో అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని గంటల తరబడి ప్రశ్నించడం సరైంది కాదని వైసీపీ నేతలన్నారు.

ఇరికించే యత్నం : భూమన
ఇక తనకు ఎలాంటి సంబంధంలేని వ్యవహారంలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సీఐడీ విచారణ అనంతరం బయటకు వచ్చిన భూమన అన్నారు. కాపు ఉద్యమానికి మద్దతు తెలిపినందుకే నాపై లేనిపోని కేసులు బనాయించేందుకు చూస్తున్నారన్నారు. తుని ఘటనపై నన్ను కాదు.. చంద్రబాబు, హోంమంత్రి చినరాజప్పకు నోటీసులు జారీ చేయాలన్నారు భూమన. మొత్తానికి భూమన సీఐడీ విచారణ నుంచి బయటకు రావడంతో వైసీపీ నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. 

21:48 - September 20, 2016

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారం దిశగా రేపు కీలక అడుగు పడనుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ.. కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో సమావేశం కానున్నారు. తమ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, పొరుగు రాష్ట్రం అక్రమ వినియోగం.. తదితర అంశాలపై వాదనలు వినిపించేందుకు ఇద్దరు చంద్రులూ సిద్ధమైపోయారు. కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా... చంద్రబాబు రేపు ఉదయం హస్తిన వెళ్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతోన్న ఈ అపెక్స్‌ కమిటీ భేటీలో.. సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కోర్టు సూచన
విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య.. సాగునీటికి సంబంధించిన వివాదాలు మొదలయ్యాయి. రెండున్నరేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం పెరుగుతూ వస్తోంది. ఇరు ప్రాంతాల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటూ.. పరిస్థితిని మరింత జటిలం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం.. వివాద పరిష్కారానికి అపెక్స్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

హాజరు కానున్న ఇద్దరు ముఖ్యమంత్రులు..
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అపెక్స్‌ కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం.. ఇద్దరు ముఖ్యమంత్రులకూ లేఖలు రాసింది. వారి అంగీకారం మేరకు.. ఈనెల21న అంటే బుధవారం నాడు.. అపెక్స్‌ కమిటీ భేటీని నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రులతో పాటు, ఇరు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు, సంబంధిత అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రెండు ప్రాంతాల అధికారులు భేటీకి అవసరమైన సమాచారంతో సన్నద్ధమయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి.. ఢిల్లీ భేటీకి సంబంధించి చర్చించారు.

సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ
అపెక్స్ కమిటీ సమావేశంలో.. పాలమూరు-రంగారెడ్డి, దిండి.. పట్టిసీమ..పోలవరం ప్రాజెక్టులపై వాడివేడి చర్చ సాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపడుతోందని ఏపీ ఆక్షేపిస్తోంది. దీనిపై గట్టిగా వాదన వినిపించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం సమాయత్తమైంది. అయితే.. ఏపీ ఆక్షేపణను తెలంగాణ సర్కారు తోసిపుచ్చుతోంది. ఈ రెండు ప్రాజెక్టులనూ గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినవేనని వాదిస్తోంది. దీంతో పాటే.. పట్టిసీమ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు అంశాలను భేటీలో లేవనెత్తాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టుల వల్ల.. తమకు 90 టీఎంసీలు అదనంగా రావాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. నీటి కేటాయింపుల అంశం కూడా అజెండాలో ఉంది. వాటాకంటే ఎక్కువ నీటిని వాడుకుంటున్నారని.. రెండు రాష్ట్రాలూ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఈ అంశంపైనా అపెక్స్‌ కమిటీ భేటీలో చర్చించనున్నారు.

అపెక్స్ కమిటీ భేటీలో కీలక చర్చ
గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించడంపైనా అపెక్స్ కమిటీ భేటీలో కీలక చర్చ జరగనుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించే ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణాలోనూ నదీజలాల అనుసంధానం ఆధారంగా కొన్ని ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర బేసిన్‌లలోని నీటిని వాడుకునే అంశంపై అవగాహనకు వచ్చేందుకు ఈ భేటీని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. దీనికి జనాభా ప్రాతిపదికనగాని.. లేదా రాష్ట్రాల ప్రాతిపదికన కాని కేటాయింపులు జరగాలని తెలంగాణా ప్రభుత్వం ప్రతిపాదించనుంది.దీంతో పాటే.. ఒక ఏడాది వినియోగించని నీటిని తర్వాతి సంవత్సరాల్లో వాడే అవకాశంపైనా సమావేశంలో చర్చించే వీలుందని చెబుతున్నారు.

కీలకంగా మారిన అపెక్స్ కమిటీ భేటీ..
రివర్‌ బోర్డులు.. ఇరిగేషన్ శాఖ మంత్రుల స్థాయిలో చర్చలు జరిగినా.. నీటి సమస్యలపై ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఈ నేపథ్యంలో జరుగుతోన్న కీలక అపెక్స్ కమిటీ భేటీ.. తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడాలకు ముగింపు పలుకుతుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

21:43 - September 20, 2016

ఢిల్లీ : నవంబర్‌లో పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ సమావేశానికి హాజరు కావొద్దని భారత్ నిర్ణయించింది. భారత్‌ బాటలోనే ఆఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌లు కూడా సార్క్ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న పాకిస్తాన్‌ వైఖరికి నిరసనగానే భారత్‌, ఆఫ్గనిస్తాన్‌లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత్‌లోని ఆఫ్గనిస్తాన్‌ రాయబారి ఓ న్యూస్‌ ఛానల్‌కు వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆఫ్గనిస్తాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ తెలిపారు.

21:41 - September 20, 2016

జమ్ముకశ్మీర్ : యూరీ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత్‌ భగ్నం చేసింది. లచీపురా ప్రాంతంలో 10 మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. మరో ఐదుగురు ఉగ్రవాదుల కోసం ఆపరేషన్‌ కొనసాగుతోంది. సరిహద్దులో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ పాకిస్తాన్‌కు భారత్ ధీటైన జవాబు చెప్పింది. నౌగామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ జవాను అమరుడయ్యాడు.

కాల్పుల విరమణ ఒప్పందానికి మళ్లీ తూట్లు పొడిచిన పాకిస్థాన్
జమ్ముకశ్మీర్‌ సరిహద్దులో పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి మళ్లీ తూట్లు పొడిచింది. యూరీ సెక్టార్‌లోని లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వద్ద పాక్‌ సైన్యం సుమారు 20 రౌండ్ల కాల్పులు జరిపింది. పాక్‌ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పి కొట్టింది. కాల్పుల మాటున ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించాలన్న పాక్‌ వ్యూహాన్ని భారత్‌ భగ్నం చేసింది. లచీపురా సెక్టార్‌లో చొరబడేందుకు యత్నించిన 10 మంది ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. మరో ఐదుగురు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది.

యూరి ఉగ్రదాడిపై ఎన్ఐఏ కేసు న‌మోదు
యూరి ఉగ్రదాడిపై నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ -ఎన్ఐఏ కేసు న‌మోదు చేసింది. ఎన్‌ఐఏ బృందం యూరికి వెళ్లి మరిన్ని ఆధారాలు సేక‌రించ‌నుంది. భారత జవాన్ల చేతిలో హతమైన ఉగ్రవా దుల డీఎన్ఏల‌ను కూడా ఎన్ఐఏ సేక‌రించ‌నుంది. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మ్యాప్‌లు, జిపీఎస్ సెట్స్‌ను కూడా ఎన్ఐఏకు సైన్యం అందజేసింది. ఇప్పటికే ఉగ్రవాదుల వద్ద లభించిన ఆయుధాల‌పై పాకిస్థాన్ గుర్తులున్నట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. యూరి ఘ‌ట‌న‌లో ఆధారాలు సేక‌రించి అంత‌ర్జాతీయ స‌మాజం ముందు పాక్ బండారం బ‌ట్టబ‌య‌లు చేయాల‌ని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో 18 మంది సైనికులు వీరమరణం
ఉగ్రవాద దాడిలో అమరులైన వీరజవాన్లు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. .సైనిక స్థావరంలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.. పాక్‌కు చెందిన జైష్‌-ఏ-మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారే యూరిలో దాడి జరిపినట్లు అనుమానిస్తున్నారు. 

21:21 - September 20, 2016

నదీ వివాదాలు మనదగ్గర కొత్త విషయమేం కాదు. నది పుట్టిన చోటి నుంచి సముద్రంలో కలిసే వరకు అనేక రాష్ట్రాలకు ఆధారం, అనుబంధం. ఇక ఆనకట్టలు కట్టి బతుకుల్ని పునర్వచించుకునే చోట సమస్య మరింత జటిలంగా మారుతోంది... ఇదే అనేక వివాదాలకు కారణమవుతోంది.. అందర్నీ తృప్తిపరిచే పరిష్కారం సాధ్యం కాకపోవచ్చు. కానీ, నదీజలాలపై చట్టాలేం చెప్తున్నాయో వాటిని పకడ్బందీగా అమలు చేయటమే ఇక్కడ పరిష్కారం.. మరి ఈ దిశగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం సాగుతుందా? కృష్ణా నదీ జలాల వివాదానికి తెరపడుతుందా? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..ఆంధ్ర, తెలంగాణ నీళ్ల మధ్య నీటివివాదాలెందుకొస్తున్నాయి? ఎవరి వాటా ఎంత? లెక్కల్లో తేడా ఎక్కడొచ్చింది? అంతర్రాష్ట్ర నదీవివాదాలకు పరిష్కారం ఎప్పుడు? నదీ జలాల వివాదాలు దేశంలో కొత్తవేం కాదు. కృష్ణా నది విషయంలోనూ ఈ గందరగోలం కొనసాగుతూనే ఉంది. 1956 నుంచి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన నాటినుంచి నేటివరకు ఈ సమస్య ఇంకా తేలలేదు. అనేక వాదనలు.. ఆందోళనలు, నిరసనలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సమస్య మరో కొత్త రూపాన్ని తీసుకుంది. అందరి దృష్టి ఈ సమావేశంపైనే ఉంది. కీలక సమావేశంలో సమస్య పరిష్కారమవుతుందా? కృష్ణా జలాల వివాదానికి దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనే దిశలో ఇది ముందడుగు అవుతుందా? రెండు తెలుగు రాష్ట్రాల జలవివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుందా? అందరి దృష్టి ఢిల్లీ వైపే మళ్లిందిపుడు.. ఢిల్లీలో కృష్ణా పంచాయితీ తేలిపోతుందా? పరిష్కారం దొరుకుతుందా? చిన్న బ్రేక్ తర్వాత.. రెండు రాష్ట్రాలు కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత, అవసరాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ పరిస్థితి అంచనా వేసినప్పుడే ఎలాంటి ఉద్రిక్తతలకు అవకాశం ఉండదు. ఎవరి వాటా మేరకు వారు వాడుకోవడం, మొదట కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు, తరవాత మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు నీటి వినియోగం జరగాల్సి ఉంది. లేదంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమకున్న కేటాయింపుల నుంచి పునఃకేటాయింపులు చేసుకోవాలి. అప్పుడే వివాదాలు సద్దుమణుగుతాయనే సూచనలు వినిపిస్తున్నాయి. అర్ధవంతమైన చర్చలు జరిగినప్పుడే పరిష్కారం దొరుకుతుంది. వాస్తవాలు గుర్తిస్తూ, సమస్య తీవ్రతను గమనిస్తూ రెండు రాష్ట్రాల్లోని రైతుల కడగండ్లను గుర్తిస్తేనే పరిస్థితి మారుతుంది. కేటాయింపుల్లో, వాడకంలో పారదర్శకత ఉండేలా రెండు రాష్ట్రాలు అవగామనకు రాగలిగితేనే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఫలితం ఉంటుంది. ఇప్పుడు సీన్ ఢిల్లీకి మారింది. కేంద్రమంత్రి సమక్షంలో...ఇద్దరూ సీఎంలు, రాష్ట్ర మంత్రులు అధికారులు ...అందరి సమక్షంలో సమావేశం జరగనుంది. కృష్ణమ్మ దక్షిణాదికి... ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమైన నది.. కృష్ణా జలాలు ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యవసరమే. కానీ, నీటి లభ్యతను బట్టి, పరివాహప్రాంతాన్ని బట్టి వాస్తపరిస్థితులు బేరీజు వేసుకుని చర్చల ఫలితాన్ని రాబట్టడమే అపెక్స్ కౌన్సిల్ సమావేశం లక్ష్యం కావాలి. మరింత సమాచారానికి వీడియో చూడండి..

హస్తినకు బయలుదేరిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్: రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, భారీ నీటిపారుదలవాఖ మంత్రి హరీష్‌రావు, పలువురు ఇంజినీర్లు, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదంపై కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన రేపు మధ్యాహ్నం అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ భేటీలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరుగనుంది.

20:37 - September 20, 2016

ఆవుదూడకు పాలిచ్చిన శునకరాజం..కుక్కకు పుట్టిన మూడు పిల్లలూ చచ్చిపాయే..లేగదూడ పుట్టినంక గోమాత చనిపాయే..వీరిద్దరికి తల్లీబిడ్డల బంధం కుదిరింది..పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంల జరిగింది గీ ముచ్చట.. పెద్దామె నెత్తి పగుల గొట్టిన 'ఫ్రెండ్లీ'పోలీసులు..గుంటూరు లో గుద్దుకున్న తెలుగు తమ్ముళ్లు..ఏపీ రాజధాని ప్లాట్ల కేటాయింపుల్లో గలాట..అరుసుకుంటా బీపీలు తెచుకుంటున్న జనాలు..కరీంనగర్ జిల్లా సర్వసభ సమావేశంలో చిట్ చాట్ లు ..ముచ్చట్లు పెట్టిన నేతలు.. కార్యాలయంలో మహిళలపై వెకిలిచేష్టలకు పాల్పడ్డాడుతున్న అధికారి... అయ్యప్ప సామికి సిలువేసిన పౌరుల హక్కుల నేత దూసర్లపూడి..గిసువంటి మస్తు ముచ్చట్లు మన మల్లన్న గీరోజుకూడా తీసుకొచ్చిండు..మరి గీ ముచ్చట్లు సూడాలంటే వీడియో చూడాల్సిందే మల్ల..చూడుండ్రి..మస్తు ఖుషీ అవుండ్రి..

20:29 - September 20, 2016

నటుడు శ్రీకాంత్ కుమారుడు 'రోషన్' హీరోగా ఎంటరవుతున్న సినిమా 'నిర్మలా కాన్వెంట్'. 'శ్రియాశర్మ', 'రోషన్' జంటగా నటిస్తున్న ఈ సినిమాలో 'కింగ్' నాగార్జున కీ రోల్ ప్లే చేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాకు తాలీవుడ్ మన్మథుడు నాగార్జున వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా. టీనేజ్ ఫ్రెష్ లవ్ స్టోరీగా తెరముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందే ఫుల్ అంచనాలను పెంచేసింది..అంతేకాదు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి కుమారుడు రోషన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. విడుదల అయిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది..ఈ క్రమంలో సినిమా హీరో 'రోషన్' మ్యూజిక్ దర్శకుడు టెన్ టీవీ లైవ్ షోలో పాల్గొన్నారు. హీరో రోషన్ మాట్లాడుతూ..నాన్న స్క్రిప్ట్ విని సినిమా చేయమన్నారన్నాడు. తాను నాచ్యురల్ గా చేసినట్లు డబ్బింగ్ థియేటర్ లోనే తాను ఎలా చేశాను అనేది తెలిసిందని హీరో రోషన్ చెప్పాడు. రుద్రమదేవిలో చేసిన పాత్ర చేసే సమయంలో టెన్షన్ పడ్డానని చెప్పారు. ఇది చిన్న పిల్లల లౌవ్ స్టోరీ కాదనీ ఆ విషయం సినిమా చూస్తే అర్థమవుతుందన్నాడు రోషన్. 

19:57 - September 20, 2016

బీసీ ఉద్యమ సారధి..ఎమ్మెల్యే బీసీ కృష్ణయ్య..కృష్ణయ్య అంటే నిప్పులాంటివాడనీ..ముట్టుకుంటే కాలుతుందని అంటున్న ఎమ్మెల్యే, బీసీ సంఘం అధ్యక్షుడు అయిన ఆర్. కృష్ణయ్యకు గ్యాంగ్ స్టర్ తో నయాంతో సంబంధాలున్నాయని వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో టెన్ టీవీ ఫేస్ టూ ఫేస్ కార్యక్రమం నిర్వహించింది. నయాంతో ఆయనకు ఎటువంటి సంబంధాలున్నాయో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..కాంగ్రెస్..టీడీపీ ప్రభుత్వాలు గ్యాంగ్ స్టర్ నయాంను పెంచి పోషించాయనీ బీసీ సంఘం అధ్యక్షుడు..ఎమ్మెల్యే అయిన ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నయాంను వాడికుని వదిలేసిందని ఆరోపించారు.

వామపక్షాలు తప్ప అంతా కేసీఆర్ కు భయపడుతున్నాయి : కృష్ణయ్య
వామపక్ష మీడియా తప్ప మిగతా అన్ని మీడియాలు కేసీఆర్ కు భయపడుతున్నాయని టెన్ టీవీ ఫేస్ టూ ఫేస్ కార్యక్రమంలో కృష్ణయ్య పేర్కొన్నారు.

నయాం కేసు సీబీఐకి అప్పగించాలి : కృష్ణయ్య
నయాం కేసు విషయంలో తనపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలి..సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ చేయించాలని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 1986 కాలంలో అన్ని ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమాలు చేశామన్నారు. ఆ సమయంలోనే నయాం భువనగిరిలో చదువుకునేవాడని ..ఆ సమయంలో నయాం ఆర్ఎస్యఊలో ఉన్నప్పుడు తెలుసన్నారు. అలా పెరిగిన పరిచయంతోనే ఫోన్ చేసేవాడని తెలిపారు. అనంతరం నయాంతో ఎటువంటి సంబదాలు లేవనీ..మధ్యలో ఒకసారి ఫోన్ చేశాడే తప్ప..ప్రస్తుతం నాయం ఫోన్ నంబర్ కూడా తనకు తెలిదన్నారు. ఈ మధ్యనే నెలన్నర రోజుల క్రితం తనతో నయాం మాట్లాడినట్లుగా కృష్ణయ్య తెలిపారు. నయాం తనను సీఎంగా చూడాలనే విషయం మీడియా సృష్టేనని పేర్కొన్నారు. తనకూ నయాంకూ ఎటువంటి సంబంధాలు లేవని ఆయన ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలోనే సిట్ విచారణకు పిలిస్తే హాజరవుతానన్నారు. టీఆర్ఎస్ లోకి వచ్చి రెండేళ్లు దాటిందనీ..టీఆర్ఎస్ నాయకులపై నయాం విషయంలో ఆరోపణలు వస్తుంటే ఎందుకు నోరు మెదపటంలేదని ప్రశ్నించారు. తాను చేసే ఉద్యమాలు కేసీఆర్ కు ఇబ్బంది కలిగిస్తున్నాయనీ..టీఆర్ఎస్ లోకి రమ్మని తనకు వచ్చిన పిలుపును తోసిపుచ్చినందుకు కక్షసాధింపు చర్యగా టీఆర్ఎస్ తనపై నిందలు వేస్తోందని కృష్ణయ్య పేర్కొన్నారు. 8వేలకు పైగా ఉద్యమాలు చేసిన చరిత్ర నాదనీ..తాను ఎవ్వరికీ భయపడనని స్పష్టం చేశారు. 

19:50 - September 20, 2016

విజయవాడ : లాభాల సిరులు కురిపిస్తుందనుకున్న రియల్‌ ఎస్టేట్‌.. నిరాశనే మిగిల్చింది. కోట్ల పెట్టుబడులు పెట్టి కొన్న స్థలాలు నష్టాలనే రుచి చూపిస్తున్నాయి. ఊహించని రీతిలో ఢాం అన్న రియల్‌ బూమ్‌ దెబ్బకు విజయవాడలో రియల్‌ వ్యాపారులు, బిల్డర్లు కుదేలవుతున్నారు. పక్కనే అమరావతి రాజధాని వచ్చినా..ఆశించిన స్థాయిలో వ్యాపారాలు లేక నష్టాల్లో కూరుకుపోతున్నారు.

భారీ అంచనాలు పెట్టుకున్న రియల్టర్లు..
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉన్న విజయవాడ నగరానికి ఉద్యోగులు, వ్యాపారులు తరలి వస్తుండడంతో.. ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తుందని భావించారు. అందుకే, రియల్టర్లు, బిల్డర్లు.. బెజవాడలో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టారు. నగరానికి వచ్చే జనం బాగా పెరుగుతున్నా.. రియల్‌ ఎస్టేట్‌ వైపు చూస్తున్నవారి సంఖ్య బాగా తక్కువగా ఉంటోంది. ఇక్కడికి వస్తున్న జనానికి, సరైన ఆదాయవనరులు లేకపోవడంతో తమ స్థాయికి తగ్గట్లుగా అద్దె ఇళ్లల్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ రంగం నష్టాల్లో కూరుకుపోతోంది. రియల్‌ భూం కుదేలవడంతో కోట్లలో పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు లబోదిబోమంటున్నారు.

విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలాలు కొని వెంచర్లు
విజయవాడ రాజధాని అవుతుందన్న ప్రచారంతో.. అప్పట్లోనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలాలు కొని వెంచర్లు చేశారు. బిల్డర్లు కూడా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ అపార్ట్‌మెంట్లు నిర్మించారు. ఇందుకోసం కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టారు. కానీ.. రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో వీరి ఆశలు అడియాశలయ్యాయి. అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టిన అస్తులను నష్టాలకు అమ్ముకోలేక.. అలాగే ఉంచుకుని వడ్డీలు కట్టలేక వ్యాపారులు నష్టాల్లో సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక కొందరు వ్యాపారులు ఆత్మహత్యలకు పాల్పడ్డ ఘటనలూ ఉన్నాయి. దీన్నిబట్టి బెజవాడలో రియల్‌ భూం ఏ స్థాయిలో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

పెట్టుబడి వస్తే చాలనుకుంటున్న రియల్‌ వ్యాపారులు...
విజయవాడ చుట్టూ కొంతకాలంగా అనేక వెంచర్లు ఏర్పాటు వేశారు. వాటితో పాటు వందల ఎకరాల ఖాళీ స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఎకరం కోటి రూపాయల నుంచి పది కోట్ల వరకు వెచ్చించి కొందరు భూముల్ని కొనుగోలు చేశారు. వెంచర్లు వేసినా సరైన డిమాండ్‌ లేక.. పెట్టుబడి పెట్టిన అసలు మొత్తం వస్తే చాలన్న పరిస్థితికి వచ్చారు రియల్‌ వ్యాపారులు.

క్రయవిక్రయాలు లేకుండా నిలిచిపోయిన స్థలాలు
ఒక్క విజయవాడ నగరంలోనే దాదాపు 30 ప్లాట్లు ఎలాంటి క్రయవిక్రయాలు లేకుండా నిలిచిపోయాయి... దీనికి తోడు కేంద్రం తెచ్చిన రెగ్యులేటరీ అథారిటీ బిల్లు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లయిందని బిల్డర్లు, రియల్టర్లు వాపోతున్నారు. అయినా మున్ముందు మంచిరోజులు రాకపోతాయా అన్న ఎదురు చూపులు చూస్తున్నారు రియల్‌ వ్యాపారులు.

నగరంలో ఆకాశాన్నంటుతున్న అపార్ట్ మెంట్స్
మరోవైపు నగరంలో అపార్ట్‌మెంట్ల ధరలు ఆకాశన్నంటాయి. కరెన్సీనగర్‌, రామవరప్పడురోడ్డులో చదరపు అడుగుకు 3500 నుంచి 4000 వరకు, మారుతినగర్‌లో 6500 వరకు, మొఘల్‌ రాజపురం, లబ్బీపేటలో 7000 నుంచి 7500 వరకు ధరలు ఉన్నాయి. ఇక స్థలం ధర ఆయా ప్రాంతాలను బట్టి చదరపు గజం 70 వేల రూపాయల నుంచి లక్షా యాభై వేల రూపాయల వరకు ఉన్నాయి. సామాన్యులకు ఏ మాత్రం అందుబాటులో లేకపోవడం వల్లే రియల్‌ వ్యాపారం పుంజుకోవడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. నిర్మాణ సంబంధిత వస్తువుల ధరలను తగ్గించడంతో పాటు.. రెగ్యులేటరీ అథారిటీ బిల్లు వల్ల తమపై భారం పడకుండా చర్యలు తీసుకోవాలని రియల్‌ వ్యాపారులు కోరుతున్నారు.

19:43 - September 20, 2016

చెన్నై : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని పీసీపీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్యాకేజీ పేరుతో ప్రజలను మభ్య పెడుతూ, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు పీసీసీ చీఫ్‌గా నియమితుడైన తిరునావుక్కరుసును అభినందించేందుకు చెన్నై వచ్చిన రఘువీరారెడ్డి... ప్యాకేజీపై మాట్లాడారు. చంద్రబాబు, మోదీని నమ్మి ఓట్లేసిన ఏపీ ప్రజలను ఈ ఇద్దరు పాలకులు వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

19:39 - September 20, 2016

హైదరాబాద్ : స్విస్‌ చాలెంజ్‌ కేసు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా.. విద్య, ఉపాధి రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని అడ్వకేట్‌ జనరల్ శ్రీనివాస్‌ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేకున్నా అమరావతిలో పనులు చేసేందుకు కాంట్రాక్టు సంస్థ ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంట్రాక్టు తీసుకున్న సంస్థ మాదిరిగా మరేదైనా సంస్థ ముందుకు వస్తే ఆ ప్రతిపాదనలను పరిశీలిస్తామని శ్రీనివాస్‌ హైకోర్టుకు తెలిపారు. 

19:37 - September 20, 2016

విజయవాడ : ప్రజలకు విజ్ఞానం, ఆరోగ్యం, సంపద, సంతోషం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్డీవోలకు ప్రత్యేక అధికారాలు కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నామని సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, డీఎస్పీల సమావేశంలో చంద్రబాబు అన్నారు. విజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లినప్పుడే ఫలితాలు బాగుంటాయని.. 10 రోజుల్లో స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. 

19:30 - September 20, 2016

చిత్తూరు : తిరుపతికి స్మార్ట్ సిటీ హోదా దక్కింది. కేంద్ర ప్రభుత్వం మూడో విడత ప్రకటించిన స్మార్ట్ సిటీస్‌ జాబితాలో తిరుపతిని చేర్చారు. థర్డ్‌ లిస్ట్‌లో మొత్తం 27 నగరాలను ఎంపిక చేశారు. గతంలో రెండు విడతలుగా 33 నగరాలను స్మార్ట్ సిటీస్‌గా ప్రకటించారు. కొత్తగా స్మార్ట్ సిటీస్‌గా ప్రకటించిన నగరాల్లో 66 వేల 883 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. 

సంబరాల్లో తిరుపతి వాసులు..
తిరుపతిని స్మార్ట్‌ సిటీగా ప్రకటించడం పట్ల టెంపుల్‌ సిటీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. నగరపాలక సంస్థ కార్యాలయం దగ్గర ప్రజలు, ఉద్యోగులు కలిసి ఆనందోత్సాహాల మధ్య బాణాసంచా కాల్చారు. 

19:27 - September 20, 2016

గుంటూరు : తుని ఘటనలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని సీఐడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. మరోవైపు సీఐడీ కార్యాలయం వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో... ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని విచారణ పేరుతో తిప్పడం సరైంది కాదన్నారు. దీంతో పోలీసులు చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. 

జూ పార్క్ వద్ద రోడ్డు ప్రమాదం..

హైదరాబాద్ : నెహ్రూ జులాజికల్ పార్కు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కమర్షియల్ ఏరియాలో ఏర్పాటు చేసిన సీసీ పుటేజ్ లో రికార్డయ్యాయి. టూవీలర్ పై వెళ్తున్న వారు రోడ్డు దాటుతుండగా, ఎదురుగా వేగంగా వచ్చిన కారు వారిని బలంగా ఢీ కొట్టింది. దీంతో టూవీలర్ పై వెళ్తున్న ఆ ఇద్దరూ వ్యక్తులు అమాంతం గాల్లోకి ఎగిరిపడ్డారు. దీంతో వారిద్దరికీ తీవ్ర గాయాలు కాగా, టూవీలర్ ధ్వంసమైంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించడంతో, కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాక్ పై పగ తీర్చుకుంటానంటున్న 78ఏళ్ళ యువకుడు!..

రాజస్థాన్ : జగ్‌నరైన్‌ సింగ్‌. బిహార్‌కు చెందిన 78ఏళ్ల వృద్ధుడు. 20 ఏళ్ల కిందట చూపు కోల్పోయాడు. కానీ మనోస్థైర్యాన్ని కాదు. ‘నాకు ఓపిక ఉంది. భారత సైన్యం తరఫున నన్ను పాకిస్థాన్‌ పంపించండి. నా కుమారుడి మృతికి పగ తీర్చుకుంటా’ ఇది ఉరీ ఘటనలో అసువులు బాసిన హవల్దార్‌ అశోక్‌కుమార్‌ సింగ్‌(44) మరణవార్త విన్న తర్వాత అతని తండ్రి జగ్‌నరైన్‌ సింగ్‌ నుంచి వినిపించిన స్వరం.

టెన్నెల్ నుండి 7మృతదేహాలు..

చైనా : భారీ వర్షం కురవడంతో గత వారం కుప్పకూలిన ఎక్స్‌ప్రెస్ వే టన్నెల్ నుంచి అధికారులు ఏడు మృతదేహాలను వెలికితీశారు. టన్నెల్ కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు 700మంది సహాయక సిబ్బందిని పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. చైనాలోని గుఝోహు ప్రావిన్స్‌లో సెప్టెంబర్ 13న కార్మికులు నిర్మాణ పనులు చేపడుతుండగా టన్నెల్ కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. 

ఇక నుండి 6వేలంట?!..

ఢిల్లీ: తమిళనాడుకు రేపటి నుంచి 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశించింది. తమిళనాడుకు సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు రోజుకు 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకకు నిర్దేశించింది. కావేరి జలాల పంపిణీని పర్యవేక్షించేందుకు కావేరి యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. 

స్మార్ట్ జాబితాలో తిరుపతి..

చిత్తూరు : తిరుపతికి స్మార్ట్ సిటీ హోదా దక్కింది. కేంద్ర ప్రభుత్వం మూడో విడత ప్రకటించిన స్మార్ట్‌ సిటీస్‌ జాబితాలో తిరుపతిని చేర్చారు. థర్ట్ లిస్ట్ లో మొత్తం 27 నగరాలను ఎంపిక చేశారు. గతంలో రెండు విడతులుగా 33 నగరాలను స్మార్ట్‌ సిటీస్‌ను ప్రకటించారు. కొత్తగా స్మార్ట్‌ సిటీస్‌గా ప్రకటించిన నగరాల్లో 66 వేల 883 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చెపడతారు. 

స్విస్‌ చాలెంజ్‌ కేసు విచారణ వాయిదా..

హైదరాబాద్: హైకోర్టులో స్విస్‌ చాలెంజ్‌ కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా విద్య, ఉపాధి రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని అడ్వకేట్‌ జనరల్ శ్రీనివాస్‌ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేకున్నా అమరావతిలో పనులకు కాంట్రాక్టు సంస్థ ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంట్రాక్టు తీసుకున్న సంస్థ మాదిరిగా మరేదైనా సంస్థ వస్తే ఆ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హైకోర్టుకు ఏజీ తెలిపారు.

పాక్ దళాల దాడుల్లో జవానుకు గాయాలు..

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో పాక్ దళాల దాడులను సైన్యం తిప్పుకొడుతున్న సమయంలోనే హింద్వారాలోని నౌగామ్‌లో ఉగ్రవాదులు సైనికులపైకి కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదులను చుట్టిముట్టింది. మొత్తం ఐదారుగురు ఉగ్రవాదులు ఉన్నట్టు గుర్తించిన సైన్యం కాల్పులు ప్రారంభించింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను తీవ్రంగా గాయపడ్డాడు. ఇరు వర్గాల మధ్య భీకరంగా కాల్పులు కొనసాగుతున్నాయి.

సీఐడీ కార్యాలయం వద్ద వైసీపీ ధర్నా..

గుంటూరు : సీఐడీ కార్యాలయం ఎదుట వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తుని ఘటన కేసులో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని 6 గంటలు సీఐడీ అధికారులు ఎలా విచారిస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమనను విచారణ పేరుతో వేధిస్తున్నారని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. భూమనను వెంటనే బయటకు పంపాలంటూ సీఐడీ కార్యాలయం ఎదుట చెవిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం కావాలనే వైసీపీ నేతలను పీడిస్తోందని చెవిరెడ్డి ఆరోపించారు. 

నయాం ఘాతుకాల్లో మరో హత్య?!..

హైదరాబాద్: నయీం దారుణాల్లో మరో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్‌స్టర్ నయీం, అతని ముఠా సభ్యులు చేసిన దారుణాలపై సిట్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నయీం గ్యాంగ్ విచారణలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. భువనగిరి వ్యాపారి విజయ్‌ను హత్య చేసినట్లు నయీం అనుచరులు ఒప్పుకున్నారు. శంషాబాద్ సమీపంలోని పెద్ద తూప్రాన్ వద్ద మృతదేహాన్ని ఖననం చేసినట్లు వెల్లడించారు. కాగా నయీం అనుచరులు శ్రీధర్‌గౌడ్, సిరాజుద్దీన్‌కు మెట్‌పల్లి కోర్టు తొమ్మిది రోజుల రిమాండ్ విధించింది. దీంతో వీరిద్దరినీ పోలీసు అధికారులు చంచల్‌గూడ్ జైలుకు తరలించారు.

18:12 - September 20, 2016

హైదరాబాద్ : నయాం కేసుతో సంబంధమున్న అధికారులను రాజకీయ నేతలపై చర్యలు తీసుకోవాలని పౌరహక్కుల నేత స్వేచ్ఛారెడ్డి డిమాండ్ చేశారు. గ్యాంగ్ స్టర్ నయాం అది దారుణంగా చంపిన ప్రజాగాయకురాలు బెల్లి లలిత సోదరి మాట్లాడుతూ..నయాం చనిపోయే వరకూ తామంతా భయం గుప్పిట్లోనే బ్రతికామన్నారు. నయాంకు ఎక్కడ అడ్డు వస్తాడోనని నా భర్తను అతి దారుణంగా చంపేశారని ..ఇప్పటికి కూడా తమ జీవితం దుర్భంగానే వుందని పటోళ్ల గోవర్థన్ భార్య విద్యారెడ్డి వాపోయారు. ఆర్.కృష్ణయ్యే తమ కుటుంబాన్ని ఆదుకున్నారని విద్యారెడ్డి తెలిపారు. నా భర్త ఎటువంటు భూ కబ్జాలకు గానీ, బెదిరింపులకు గానీ పాల్పడలేదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నయాం బాధితులంతా నయాంతో సంబంధమున్న ప్రతీ ఒక్కరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద నయీం బాధితులు ధర్నా చేపట్టారు. నయీం ఆగడాలకు అడ్డు వచ్చారనే నేపథ్యంలోనే తమ కుటుంబ సభ్యులను చంపారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నయీంతో సంబంధం ఉన్న అందరిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  

18:03 - September 20, 2016

ఖమ్మం : మనుషుల మధ్య ఆత్మీయత, అనురాగం తగ్గిపోతున్న ఈ రోజుల్లో జంతువుల మీద కూడా తమ ప్రేమను చాటారు ఆ దంపతులు. ఎప్పుడో పద్నాలుగేళ్ల క్రితం ఇంటికి తీసుకొచ్చిన టోనిని తమ సంతానం కంటే ప్రేమగా చూసుకున్నాడా ఇంటి యజమాని. బదులుగా తన విశ్వాసాన్ని నిరూపించుకున్నాడా టోనీ....యజమాని తనువు చాలించినా...ఇంటికి రక్షణగా నిలబడ్డాడు. చివరకు టోనీ ఈలోకాన్ని వీడి ఆ కుటుంబానికి విషాదాన్ని మిగిల్చాడు. టోనీకి కృతజ్ఞతగా, తమ కొడుకు కంటే ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఎవరీ టోని?..ఏంటీ కథ...వాచ్‌దిస్‌ స్టోరీ....

యజమాని మరణించినా కుటుంబానికి రక్షణగా నిలిచిన కుక్క
టోనీ..ఆ కుటుంబానికి కొడుకులాంటోడు...ఎప్పుడో పద్నాలుగేళ్ల క్రితం నుంచి తనను పెంచినందుకు కృతజ్ఙతగా..ఇంటిని విశ్వాసంగా కాపలా కాసాడు. టోని అంటే ఎవరో కాదు ఓ కుక్క ....కన్న కొడుకులే తల్లిదండ్రులను పట్టించుకోని ఈ రోజుల్లో ఓ కుక్క కుటుంబానికి రక్షణగా నిలబడింది. తన జాతిని విశ్వాసానికి మారుపేరుగా మరోసారి నిరూపించింది. 14 సంత్సరాల వయసున్న టోని మరణంతో ఆ కుటుంబం తీవ్ర నిరాశచెందింది. టోనీకి కృతజ్ఞతగా, తమ కొడుకు కంటే ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

14 ఏళ్ల క్రితం 6నెలల కుక్కను పెంచిన చెన్నారావు
ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గండులపల్లి గ్రామానికి చెందిన తుమ్మల చెన్నారావు...14 ఏళ్ల క్రితం 6 నెలల కుక్కను ఇంటికి తీసుకొచ్చి పెంచుకున్నాడు. కుక్కను పెంచిన 6 సంత్సరాల తరువాత ఆయన మరణించారు. ఆయన చనిపోయేనాటికి తన ఇద్దరు కుమార్తెలు వివాహం చేసుకొని అత్తారింటికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి చెన్నారావు భార్యకు ఈ కుక్కే రక్షణగా ఉండేది. అల్లుళ్లు ఇంటికి రావాలన్నా..కుక్క అనుమతి తప్పనిసరి, అంతగా ఇంటిని రక్షించేది టోని.

టోని అంత్యక్రియలు ఘనంగా నిర్వహించిన కుటుంబం
కాలక్రమంలో... నాలుగు రోజుల క్రితం టోని మరణించింది. ఇన్నాళ్లు తోడుగా ఉన్న కుక్క మరణించడంతో ఆ పెద్దావిడ ఉలిక్కిపడింది. వెంటనే వార్తను తన కుమార్తెలు, బంధువులు, గ్రామస్తులకు తెలిపింది. కొడుకు లేని లోటును తీర్చిన కుక్కను ఘనంగా ఊరేగించాలని నిర్ణయించారు. దీంతో భారీస్థాయిలో జనం అక్కడికి చేరుకున్నారు. చనిపోయిన మనిషికి ఏ విధంగా దహనకార్యాలు చేస్తారో..ఆ విధంగానే చేసి టోనిపై తమ ప్రేమను చాటుకున్నారు.

మసకబారుతున్న ప్రేమానురాగాలకు భిన్నంగా
తనను పెంచినందుకు ఆ కుక్క విశ్వాసంగా కాపలాకాసింది. తమను కాపాడినందుకు టోనికి చెన్నారావు కుటుంబమూ కృతజ్ఞతను తెలిపింది. మనుషుల మధ్యే మసకబారుతున్న ప్రేమానురాగాలకు భిన్నంగా జరిగిన ఈ సంఘటన ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. 

17:58 - September 20, 2016

అనంతపురం : ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యంపట్ల ప్రజలకు నమ్మకం పోయిందని ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్ అన్నారు. విషజ్వరాలతో అనంతపురం జిల్లాలో ప్రజలు చనిపోతున్నా.. సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డెంగ్యూ, మలేరియాతో పసిపిల్లలు మృత్యువాత పడుతున్నా..ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా గేయానంద్‌ దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నుంచి రాతపూర్వకంగా భరోసా వచ్చే వరకూ దీక్ష కొనసాగిస్తానని ఆయన చెబుతున్నారు. 

17:54 - September 20, 2016

శ్రీకాకుళం : వర్షాకాలంలో నాటుతున్న మొక్కలు..ఎండాకాలంలో కనిపించకుండా పోతాయి. కోట్లాదిరూపాయల విలువైన మొక్కలు నాటుతున్నా.. కాగితాల్లో మాత్రమే అవి కనిపిస్తాయి. కోట్లాదిరూపాయలు వెచ్చిస్తున్నా.. ఫలితం శూన్యంగా ఉంటోంది. దీనికి చెక్‌పెట్టేందుకు శ్రీకాకుళం కార్పొరేషన్‌ అధికారులు వినూత్న విధానాన్ని అనుసరించారు. పచ్చదనం పెంచేందుకు జియోట్యాగింగ్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు.

నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్
నాటిమొక్కల లెక్కలు కాగితాల్లోనేకాదు.. చివురులు తొడుగుతూ ఏపుగా పెరగడాన్ని కూడా గమనిస్తున్నారు సిక్కోలు కార్పొరేషన్‌ అధికారులు. శ్రీకాకుళం నగర కార్పోరేషన్ నూతన విధానానికి శ్రీకారం చుట్టబోతోంది.. నగరం లోని ప్రధాన రహదారులు, లింకు రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ విధానాన్ని అనుసంధానం చేసి పరిరక్షణ బాధ్యతలను ప్రైవేటు విద్యా సంస్థలకు అప్పగిస్తోంది..

ప్రైవేటు కళాశాల ద్వారా ఒప్పందం
శ్రీకాకుళం నగరంలో డే అండ్ నైట్ జంక్షన్ నుండి ఏడు రోడ్ల కూడలి వరకూ గల డబుల్ లైన్ మధ్యలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అదేవిధంగా ఎనభై అడుగుల రోడ్డులో సుమారు కిలోమీటరు పరిధిలో మొక్కలు ఉన్నాయి. వీటన్నిటినీ సంరక్షించేందుకు ప్రతీ మొక్కకూ జియో ట్యాగింగ్‌ ను తగిలిస్తోంది శ్రీకాకుళం కార్పోరేషన్ . నగర పాలక సంస్థ ఓ ప్రైవేటు కళాశాల ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్ ఫోన్ సాయం తో జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేస్తామంటోంది. తద్వారా నగరం లో నాటి ఇరవై వేల మొక్కలు బతుకుతాయని నగర కార్పోరేషన్ కమిషనర్ శోభ టెన్ టివి తో పేర్కొంటున్నారు.

అధికారుల నిర్ణయంపై సిక్కోలు ప్రజల హర్షం
గతం లో పది శాతం మొక్కలు బతికే అవకాశం కూడా లేకుండాపోయిందని అంగీకరిస్తున్నారు అధికారులు. జియో ట్యాగింగ్ ద్వారా నూటికి నూరు శాతం మొక్కలు బతుకుతాయంటున్నారు. మొత్తానికి కార్పొరేషన్‌ అధికారుల నిర్ణయాన్ని అభినందిస్తున్నారు సిక్కోలు ప్రజలు.

17:48 - September 20, 2016

తూర్పుగోదావరి : రిజర్వేషన్‌ ఉద్యమం పేరుతో ముద్రగడ పద్మనాభం కాపులకు చెడ్డ పేరు తెస్తున్నారని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ మండిపడ్డారు. ముద్రగడ దీక్షపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఏడు రోజులు దీక్ష తర్వాత కూడా బ్లడ్‌ షుగర్‌ 126 ఎంజీగా ఉండడం సాధ్యంకాదన్నారు. దీక్ష చేసినా బ్లడ్‌ షుగర్‌ ఇదే స్థాయిలో ఉంటుందని వైద్యులు నిర్ధారిస్తే కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. 

17:44 - September 20, 2016

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్ని వెంటనే నిర్వహించాలంటూ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.. కలెక్టరేట్‌ ముందు సిలువ ఆకారంలోని కర్రలకు తన చేతులు కట్టుకుని నిరసన తెలిపారు.. ప్రభుత్వం కావాలనే ఎన్నికల్ని ఆలస్యం చేస్తోందని ఆరోపించారు.. ప్రభుత్వ గెజిట్‌ ఆమోదంలోఉన్న 50 డివిజన్లప్రకారం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.. నగరంలో ఏ కార్యక్రమం సరిగాలేకపోయినా వెంటనే స్పందించే దూసర్లపూడి... కార్పొరేషన్‌ ఎన్నికలపై రెండు నెలలుగా విభిన్న రీతిలో పోరాటం చేస్తూనే ఉన్నారు.. ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరసన బాటపట్టారు.. 

17:41 - September 20, 2016

హైదరాబాద్ : కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్‌ అబద్దాలకోరులని... కాంగ్రెస్‌ తెలుగు రాష్ట్రాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్‌ మండిపడ్డారు.. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినవారంతా పనికిరాని సరుకే అని స్పష్టం చేశారు.. ఆ సరుకు పోయినంతమాత్రాన పార్టీకి ఎలాంటి నష్టంలేదని చెప్పారు.. నిజమైన నేతలంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.

17:38 - September 20, 2016

హైదారాబాద్ : అమిత్‌షా కనికట్లు, గారడీలు చేసేందుకు తెలంగాణకు రాలేదని.. ఆ విద్య కేసీఆర్‌కే తెలుసునని బీజేపీ నేత జనార్దన్‌రెడ్డి అన్నారు. ఎంసెట్‌ పేపర్‌ లీక్‌ చేసిన మంత్రి మీద చర్య తీసుకోకుండా.. బ్రోకర్లపై కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారన్నారు. అదేవిధంగా నయీం డైరీ పోలీసుల వద్ద ఉన్నా.. నేతలపై కేసులు పెట్టకుండా మీడియాకు లీకులు ఇస్తూ ప్రత్యర్థులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం టీఆర్‌ఎస్‌ చేస్తుందన్నారు నాగం మండిపడ్డారు. 

17:35 - September 20, 2016

హైదరాబాద్‌ : నగరంలోని రోడ్ల పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు.. ఇంజనీరింగ్ అధికారులకు క్లాస్‌ పీకారు.. రోడ్ల దుస్థితితో ప్రభుత్వం సంపాదించుకున్న మంచి పేరు పోతోందని మండిపడ్డారు.. పనితీరు మెరుగుపడకపోతే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు.. రోడ్ల స్థితిగతులపై సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.. రోడ్ల మరమ్మత్తులకోసం తాత్కాలిక, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు రావాలని జీహెచ్ఎంసీ అధికారుల్ని ఆదేశించారు.. రోడ్ల సమస్యపై పరిష్కారాలు, సలహాలు ఇచ్చేందుకు అందుబాటులోఉన్న నిపుణులతో కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు.. రెండురోజులపాటు భారీవర్షాలు కురిసే అవకాశముందని... అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు.. 

17:32 - September 20, 2016

జమ్ముకశ్మీర్ : కశ్మీర్‌ సరిహద్దులో పాకిస్తాన్‌ మళ్లీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. యూరిలో ఉగ్రవాద ఘటన ఇంకా మరవక ముందే సరిహద్దులో పాక్‌ దళాలుకు కాల్పులకు తెగబడ్డాయి. దాదాపు 20 రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్లు సమాచారం. పాక్‌ దాడులను భారత్ సైన్యం దీటుగా తిప్పి కొడుతోంది.

యూరి ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణ..
యూరి ఉగ్రదాడిపై నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ -ఎన్ఐఏ కేసు న‌మోదు చేసింది. ఎన్‌ఐఏ బృందం యూరికి వెళ్లి ఆధారాలు సేక‌రించ‌నుంది. ఆ ఆధారాలను భారత్‌ అమెరికాకు పంపనుంది. అంతేకాదు...భారత జవాన్ల చేతిలో హతమైన ఉగ్రవాదుల డీఎన్ఏల‌ను కూడా ఎన్ఐఏ సేక‌రించ‌నుంది. ఇప్పటికే ఉగ్ర‌వాదుల వద్ద లభించిన ఆయుధాల‌పై పాకిస్థాన్ గుర్తులున్నట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. యూరి ఘ‌ట‌న‌లో ఆధారాలు సేక‌రించి అంత‌ర్జాతీయ స‌మాజం ముందు పాక్ బండారం బ‌ట్టబ‌య‌లు చేయాల‌ని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌ను వేగ‌వంతం చేసింది. యూరిలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 18 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.

గ్రూప్-2 పరీక్షలో స్వల్ప మార్పు..

హైదరాబాద్: గ్రూప్-2 పరీక్ష ఒక రోజు ముందుకు జరిగింది. ముందుగా ప్రకటించిన తేదీ 12.11.2016 కంటే ఒకరోజు ముందుగా అంటే నవంబర్ 11నే పరీక్షను నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 12న యూపీఎస్సీ వారు ఇండియన్ ఫారెస్టు సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) పరీక్షను నిర్వహిస్తున్నందున కమిషన్ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 

10మంది ఉగ్రవాదులు హతం..

శ్రీన‌గ‌ర్‌: అక్ర‌మంగా మ‌న దేశంలోకి చొర‌బ‌డ‌టానికి ప్ర‌య‌త్నించిన ప‌ది మంది ఉగ్ర‌వాదుల‌ను కాల్చి చంపారు భార‌త సైనికులు. జ‌మ్ముక‌శ్మీర్ యూరి సెక్టార్‌లోని ల‌చీపుర ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆదివారం జ‌రిగిన దాడి తర్వాత బోర్డ‌ర్‌లో గ‌స్తీ పెంచిన ఆర్మీ బ‌ల‌గాలు.. కంచె దాటుతున్న ఉగ్ర‌వాదుల‌ను గ‌మనించారు. వెంట‌నే కాల్పులు జ‌రిపి ఉగ్ర‌వాదులను మ‌ట్టుబెట్టారు. అయితే మరో ఏడుగురు అక్కడే ఉన్నట్లు సమాచారం. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. 

బస్సులో మంటలు..6గురు మృతి!!..

ఒడిశా: బస్సులో చెలరేగిన మంటల కారణంగా ఆరుగురు ప్రయాణికులు మృతిచెందారు. ఈ దుర్ఘటన ఒడిశాలోని డెంకనాల్ జిల్లా భవన్ వద్ద చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తాకడం వల్ల బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో 17 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

17:07 - September 20, 2016

విజయవాడ : సిటీ కేబుల్‌ వ్యవస్థాపకుడు పొట్లూరి రామకృష్ణ కేబుల్‌ రంగానికి ఎనలేని సేవలు చేశారని... సిటీ కేబుల్‌ ఎండీ పొట్లూరి సాయిబాబు కొనియాడారు.. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ కేబుల్‌ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.. విజయవాడ జమ్మిదొడ్డి సెంటర్‌లోని సిటీ కేబుల్‌ కార్యాలయంలో రామకృష్ణ పద్దెనిమిదవ వర్ధంతి కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమానికి సాయిబాబుతోపాటు.. గుంటూరు సిటీ కేబుల్‌ ఎండీ కృష్ణమోహన్‌, పలువురు ఎంఎస్ వో లు హాజరయ్యారు.. రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు..

16:56 - September 20, 2016

జమ్ముకశ్మీర్ : ఇది ఓ భారత సైనికుడి ఆత్మవిశ్వాసం..ఆత్మధైర్యం..భావోద్వేగం..ఈ మాటలకు పదాలు లేవు..భాషకు అక్షరాలు లేవు..పాక్ పై ఉరికిపడి చావుదెబ్బ కొట్టాలన్న భారత జవాన్ సింహనాదం..తోటి జవాన్లు వీరమరణాన్ని కళ్లారా చూసి గుండెల్లోంచి ఎగదన్నుకు వచ్చిన కసి..కవితారూపమై పెల్లుభికింది. గుండె మండింది..అక్షర రూపమై ఎగసిపడింది..దేశంలో ప్రజలు ప్రశాంతంగా..సంతోషంగా..గుండెలమీద చేయి వేసుకుని ధైర్యంగా వుంటున్నారంటే దానికి కారణం దేశ సరిహద్దుల్లో జవాన్లు అహర్నిశలూ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వేయి కళ్ళతో కాపలా కాస్తుంటారు..దేశ భదత కోసం తమ ప్రాణాలను సైతనం తృణప్రాయం వదిలేస్తారు..ఈ వీర జవాన్ల త్యాగాలను చెప్పాలంటే తెలుగు భాషలో అక్షరాలే దొరకవు..మరి అటువంటి సైనికులు దాయాది సైనికుల దొంగదెబ్బకు తోటి సైనికులు అసువులు బాసితే తోటి సైనికుడు గుండె మండిపోదా? సింహంగా దూకి శత్రు సైనికుడి రక్తం తాగేయాలని ఎగసిపడదా..తోటి సైనికులు మంటల్లో తమకళ్ళముందే సజీవదహనం అయిపోతుంటే..కాపాడలేక..అదేసమయంలో దేశ భద్రతకోసం శత్రుసైనికులను ఎదిరించే సయంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కదన రంగంలోకి దూకి శత్రు మూకలపై విరుచుకుపడి వారిని తుదముట్టించాలనే బాధ్యతతో ముందుకు దూకి భారతమాత భద్రతకోసం అదే సమయంలో శతు దేశానికి చేసిన అక్షర హెచ్చరికను మనం వింటే రోమాలు నిక్కబొడుచుకోకుండి వుంటాయా? మరి చూడండి..వినండి..భారతమాత ముద్దుబిడ్డ చేసే సింహనాదాన్ని మనం కూడా విందాం..

భారత జవాను కవితా సింహనాధం..
యూరి సెక్టార్ లో పాక్ ఘాతుకానికి అమరులైన వీర జవానులను తలచుకుని..పాక్ సైన్యానికి భారత సైనికుడు చేసిన హెచ్చరికను చూడండి.. ‘‘పులి, సింహం దేనికీ భయపడవు.. అణుబాంబులకు సయితం మేము భయపడబోం, 1965, 1971, 1999 యుద్ధాల్లో పరాజయాలను పాకిస్తాన్ మరిచిపోయింది. అమెరికా జెట్లనే కూల్చేసిన ఘనత మాది. 90 వేల మంది పాక్‌ సైనికులను మేము బందీలుగా తీసుకున్న సంగతి ఒక్కసారి గుర్తు చేసుకోండి. కశ్మీర్‌ చెక్కు చెదరకుండా ఉంటుంది, పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది. ప్రలోభపెట్టి యువకులను ఉగ్రవాదులుగా మార్చుతున్నారు. మేము తలచుకుంటే పాకిస్తాన్‌లో మహాప్రళయం వచ్చేస్తుంది. మేము తలచుకుంటే గంగా నదీ ప్రవాహం లాహోర్ వైపు వస్తుంది. ఇస్లామాబాద్‌ భవనాలపై భారత పతాకం రెపరెపలాడుతుంది. రావల్పిండి, కరాచీ నేలమట్టమవుతాయి. సింధు నదికి రెండు వైపులా భారత్ ఉంటుంది’’. అంటూ సైనికుడు కవిత వినిపించాడు.

ఉగ్రఘాతుకంలో అమరులైన 18మంది జవాన్లు..
జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర ముష్కరులు తెగబడ్డారు. బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్‌ 12వ బ్రిగేడ్‌ హెడ్‌ క్వార్టర్స్‌పై ఉగ్రమూక విరుచుకు పడింది. భారత సైనికులే లక్ష్యంగా భారీ మారణాయుధాలతో ఆర్మీ క్యాంప్‌లోని అడ్మినిస్ట్రేటీవ్‌ బిల్డింగ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఉగ్ర ఘాతుకంలో 18 మంది భారత జవాన్లు అమరులయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. వెంటనే తేరుకున్న భారత సైన్యం.. నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టింది.

అడ్మినిస్ట్రేటీవ్‌ బిల్డింగ్‌పై కాల్పులు
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలో భారత జవాన్లే లక్ష్యంగా నలుగురు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. యురి సెక్టార్‌లోని 12వ బ్రిగేడ్‌ హెడ్‌క్వార్టర్స్‌లోకి మారణాయుధాలతో చొరబడ్డ దుండగులు.. ఆర్మీ క్యాంప్‌లోని అడ్మినిస్ట్రేటీవ్‌ బిల్డింగ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 18 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు.

బాణసంచా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం..

పశ్చిమ బెంగాల్ : కలకత్తా నగరంలోని ఓబాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగాణాలో ఈ ఘటన జరిగింది. పేలుడు దాటికి కర్మాగారంలోని మందుగుండు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అందులోని బాణసంచా పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. చాలాసేపటి వరకు పేల్లుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై వివరాలు అందాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

16:14 - September 20, 2016

కరీంనగర్ : మల్యాల మండలం మానాల సమీపంలో శ్రీరాంసాగర్‌ ప్రధాన కాకతీయ కాలువకు పడ్డ గండితో... పలు గ్రామాలు నీట మునిగాయి. మేడంపల్లి, చిలువకోడూరులో పంటపొలాలు నీటమునిగాయి. దీంతో అధికారులు.. పరిసర గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

16:11 - September 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వంపై టీఆర్‌ఎస్‌ నేత కర్నె ప్రభాకరరావు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అబివృద్ధిని అడ్డుకునే విధంగా కాంగ్రెస్‌ శిక్షణ కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంగా పూర్తిగా విఫలమైందని.. అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ను భవిష్యత్‌లో ప్రజలు బుద్ది చెబుతారన్నారు కర్నె ప్రభాకరరావు. 

మాల్యా కేసు సెప్టెంబర్‌ 22కు వాయిదా..

హైదరాబాద్‌: జీఎంఆర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌కు ఇచ్చిన రెండు చెక్కులు బౌన్న్ అయిన కేసును హైదరాబాద్‌లోని స్థానిక కోర్టు సెప్టెంబర్‌ 22కు వాయిదా వేసింది. మూడో ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఎం. కృష్ణారావు ఈ కేసులో విజయ్‌ మాల్యా, ఎ.రఘునాథన్‌లను దోషులుగా తేల్చారు. ఒక్కోటీ రూ.50లక్షలు విలువైన రెండు చెక్కులు బౌన్స్‌ కావడంతో వీరిపై నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరైన రఘునాథన్‌ విచారణకు హాజరుకాలేదు. దీంతో కోర్టు కేసు విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది. 

యూరీ సెక్టార్ లో మరోసారి కాల్పులు!..

జ‌మ్ముక‌శ్మీర్‌ : యూరిలో ఉగ్ర‌వాదులు భార‌త సైనికుల‌పై దాడి జ‌రిపి వారిని బ‌లిగొన్నందుకు భార‌త్ ప్ర‌తికారం తీర్చుకోవాల‌ని చూస్తున్న వేళ పాకిస్థాన్ ఆర్మీ మ‌రోసారి అదే సెక్టార్‌లో నేడు దుస్సాహ‌సానికి దిగింది. మరోసారి కాల్పుల విరమణ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించింది. యూరీలో సెక్టార్‌లో 20 రౌండ్ల కాల్పులు జ‌రిపింది. అంత‌ర్జాతీయ స‌మాజం ముందు పాకిస్థాన్ చ‌ర్య‌ల‌ను ఎండ‌గ‌డ‌తామ‌ని ప్ర‌ధాని మోదీతో పాటు రాజ్‌నాథ్‌సింగ్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న నేప‌థ్యంలోనే పాక్ ఈ దుశ్చ‌ర్య‌కు దిగిన‌ట్లు తెలుస్తోంది.

ఉన్మాది పైశాచికత్వం..

ఢిల్లీ: ఒళ్లు తెలియని ఉన్మాదంతో దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు నడిరోడ్డుపై ఓ ఉన్మాది యువతిని దారుణంగా 22 సార్లు కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే..యువతిని పాశవికంగా చంపిన అనంతరం ఆ కిరాతకుడు మృతదేహం చుట్టూ తిరుగుతూ ఆనందంతో డ్యాన్స్ చేశాడట. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తాను యువకుడిని ఆపేందుకు ప్రయత్నించానని, అయితే తనకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని సదరు సాక్షి తెలిపాడు.

అక్టోబర్ 3 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు..

తిరుమల : తిరుపతి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల నిర్వహణతో పాటు పలు అంశాలకు ఆమోదముద్ర వేయడమే లక్ష్యంగా సమావేశమైన టీటీడీ పాలకమండలి కీలక అంశాలకు పచ్చజెండా ఊపింది. బ్రహ్మాండ నాయకుడైన కలియుగ వేంకటేశ్వరుడికి తొమ్మిది రోజులు పాటు తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలు వ‌చ్చేనెల‌ 3 నుంచి ధ్వజారోహణంతో ప్రారంభం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ బ్రహ్మోత్సవాలు 11వ తేదీన ముగియనున్నాయి. ఆప‌ద‌మొక్కులవాడి బ్రహ్మోత్సవాల స‌మ‌యంలో స్వామివారికి నిర్వ‌హించే ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు రద్దు చేయ‌నున్నట్లు పేర్కొంది.

15:45 - September 20, 2016

తిరుపతి : టీటీడీ అధికారుల వైఖరితో కడుపుమండిన జానపద కళాకారులు మరోసారి రోడ్డెక్కబోతున్నారు.. తమ చిన్నపాటి డిమాండ్లను నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బుధవారం నుంచి ఆమరణ నిరాహారదీక్షకు దిగబోతున్నారు.. భజనకారులు వివిధ ప్రాంతాలకు వెళ్లాలంటే చార్జీలు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో వున్నారని జానపద కళాకారులు వాపోయారు. భజన సంప్రదాయాన్ని బతికించాలని ..ఉన్నతాధికారులందరికీ మెమోరాండాలు ఇచ్చినా తమను పట్టించుకోవటంలేదన్నారు. హైందవ సంప్రదాయం గురించి ప్రగల్భాలు పలికేవారందరూ మాటలలో కాకుండా జాపనపద కళాకారులకు చేయూతనిచ్చి చేతలలో తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని జానపద కళాకారుల అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న కళాకారులంతా వారి వారి కళారూపాలను ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్నామని యాదగిరి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కుప్పకూలిన మరో మిగ్ విమానం..

జుమ్మూకశ్మీర్ : శ్రీ‌న‌గ‌ర్ విమానాశ్ర‌యం వ‌ద్ద బుధవారం మిగ్-21 విమానం కుప్ప‌కూలింది. విమానాన్ని ల్యాండింగ్ చేస్తోన్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అయితే పైల‌ట్ సుర‌క్షితంగా బయటపడ్డాడని అధికారులు తెలిపారు. విమానం కూలడంతో అక్క‌డి రన్ వే పూర్తిగా ధ్వంస‌మైంది. ఎయిర్‌పోర్టులో విమానసర్వీసులు నిలిపివేశారు. వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మరం చేశారు.

30మంది పోలీస్ అధికారులకు సిట్ నోటీసుల జారీ?..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీమ్ అక్రమాల వెనుక తమవంతు సహకారాన్ని అందించిన ఆవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లోని 30 మంది పోలీసు అధికారులకు సిట్ బృందం నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. వీరందరి ప్రమేయంపై ఇప్పటికే ఆధారాలు సేకరించిన బృందం వీరిని ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టాలని భావిస్తోంది. ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారుల నుంచి సీఐ, ఎస్ఐల వరకూ ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. నయీమ్ కేసు విచారణ బాధ్యతలను సీనియర్ ఆఫీసర్ అంజనీ కుమార్ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసులో కొంతమంది పదవీ విరమణ చేసిన వారికీ నోటీసులు పంపనున్నట్టు సమాచారం. 

15:12 - September 20, 2016

పంజాబ్ : పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌లో మంగళవారం  ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూలు బ‌స్సు విద్యార్థుల‌ను ఇంటికి తీసుకువెళుతున్న స‌మ‌యంలో అదుపుత‌ప్పి అట్టారీ ప్రాంత సమీపంలోని ముహావా కాలువ‌లో ప‌డిపోయింది. ఈ బ‌స్సులో మొత్తం 50 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందగా, మ‌రో 10 మంది విద్యార్థుల‌కు గాయాల‌య్యాయి. వీరిలో కొందరి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. గాయాల‌పాల‌యిన విద్యార్థుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. కాగా విద్యార్థులంతా నర్సరీ చదివే చిన్నారులు కాబట్టి ఈతరాని కారణంగా చిన్నారులు బైటకు రాలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అమృతసర్ ఎస్పీ సంఘటనాస్థలానికి చేరుకుని  పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. 

కాలువలో పడ్డస్కూల్ బస్..5 చిన్నారులు మృతి..

పంజాబ్ : అమృత్ సర్ లోని ఓ కెనాల్ లో ఓ స్కూల్ బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో 5గురు విద్యార్థులు మృతి చెందారు. మరో 10మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి, గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. స్కూల్ బస్ లో 50మంది విద్యార్థులున్నట్లుగా సమాచారం..

కావేరీ జలాలపై ప్రారంభమైన విచారణ..

ఢిల్లీ : కావేరీ నదీ జలాలపై దేశ అత్యున్నత న్యాయం స్థానం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమయ్యింది. కావేరి జలాలను విడుదల చేయాలంటూ తాజాగా పర్యవేక్షణ కమిటీ ఇచ్చిన ఆదేశాలను నిరసిస్తూ స్థానిక రైతులు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు. కర్ణాటకలో కృష్ణ రాజసాగర్, కబిని జలాశయాల నుంచి నీటిని విడుదల చేసిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం మెట్టూరు డ్యామ్ నుంచి రైతులకు నీళ్లను వదిలింది. కాగా, సుప్రీంకోర్టులో కావేరి నది జలాల వివాదం కేసు విచారణ ప్రారంభమయ్యింది. 

గుంతల్లో యూనివర్శెల్ సిటీ..

హైదరాబాద్‌: హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని గుంతల నగరం చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. హైదరాబాద్‌ ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసున్నారని వారు విమర్శించారు. జీహెచ్‌ఎంసీ నిధులను దారి మళ్లిస్తున్నారని వారు ఆరోపించారు. మూసీ నాలాలో పడిన క్రాంతి మృతదేహం ఇప్పటికీ లభ్యంకాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

'కావేరీ' కోసం మట్టి తిన్న రైతన్నలు..

హైదరాబాద్ : కావేరి జలాల కోసం కర్ణాటక రాష్ట్ర రైతులు వినూత్న పద్ధతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. మాండ్యా జిల్లాలోని రైతులు మట్టిని తింటూ తమ ఆందోళన నిర్వహించారు. కావేరి జలాలను విడుదల చేయాలంటూ తాజాగా పర్యవేక్షణ కమిటీ ఇచ్చిన ఆదేశాలను నిరసిస్తూ స్థానిక రైతులు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు. కర్ణాటకలో కృష్ణ రాజసాగర్, కబిని జలాశయాల నుంచి నీటిని విడుదల చేసిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం మెట్టూరు డ్యామ్ నుంచి రైతులకు నీళ్లను వదిలింది. కాగా, సుప్రీంకోర్టులో కావేరి నది జలాల వివాదం కేసు విచారణ ఈ రోజు జరగనుంది.

త్వరలో బీసీ కమిషన్ ఏర్పాటు : కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో బీసీ కమిషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు బీసీ సంక్షేమంపై ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ కులాల సమగ్ర అభివృద్ధి కోసం త్వరలో ఈ కమిషన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. సమాజంలో సగభాగం ఉన్న బీసీల పురోగతి అవసరమన్నారు. బీసీ కులాల ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో త్వరలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. బీసీ సంక్షేమం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని, బీసీ స్టడిల్ సర్కిల్ లో అత్యున్నత ప్రమాణాలు ఉండేలా చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.

ఉమెన్ కమిషన్ చీఫ్ పై ఏసీబీ కేసు..

ఢిల్లీ : మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాల్వాపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. మహిళా కమిషన్‌లో నిబంధనలకు వ్యతిరేకంగా అవినీతికి పాల్పడి నియామకాలు చేపట్టారని ఆమెపై ఆరోపణలు మోపారు. ఐపీసీ 13/అవినీతి నిరోధక యాక్ట్ 409, 120బీ కేసులు నమోదు చేశారు. నిబంధనలను అనుసరించి నియామకాలు చేపట్టామని, ఢిల్లీ మహిళా కమిషన్ మంచిగా పనిచేస్తుందని స్వాతి మాల్వా తెలిపారు. గత మహిళా కమిషన్ల తరహాలో ఐఏఎస్, ఐపీఎస్‌ల భార్యలను మేము మహిళా కమిషన్‌లో నియమించలేదని ఆమె వెల్లడించారు. కేసులకు భయపడే తత్వం తనది కాదని, నిజాయితీని నిరూపించుకుంటానని తెలిపారు. 

జీహెచ్ఎంసీ వద్ద కాంగ్రెస్ ఆందోళన..

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు మంగళవారం కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోడ్లు, నాలాలు దుర్భర స్థితికి చేరడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కారణమంటూ ధర్నా చేశారు. జీహెచ్‌ఎంసీ అసమర్ధత వల్ల అనేక మరణాలు సంభవించాయని, నాగోల్ ప్రాంతంలోని నాలా వద్ద ఓ యువకుడు గల్లంతైనా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ ఆందోళనలో స్థానిక కాంగ్రెస్ నేతలు సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

'అపెక్స్' పై కేసీఆర్ కసరత్తులు..

హైదరాబాద్: బుధవారం ఢిల్లీలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రేపటి సమావేశం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అపెక్స్ కౌన్సిల్‌లో వినిపించాల్సిన వాదనలపై గత రెండు మూడు రోజులుగా నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం కసరత్తు చేస్తున్నారు.

14:41 - September 20, 2016
14:37 - September 20, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టార్‌ నయీం బాధితులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రజాఫ్రంట్‌ ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన నయీం బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సిట్‌ దర్యాప్తుతో తమకు న్యాయం జరగదంటున్నారు బాధితులు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి.. న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ ధర్నాలో బాధితులు ప్లకార్డులు పట్టుకుని.. ఆందోళన చేశారు. ఈ ధర్నాకు సీపీఐ నేత నారాయణ హాజరయ్యారు. నయీం కేసులో పేర్లు బయటపడుతున్న పోలీసు అధికారులు, రాజకీయ నేతలను తక్షణమే అరెస్ట్‌ చేయాలని నారాయణ డిమాండ్‌ చేశారు. 

14:33 - September 20, 2016

ఢిల్లీ : రాజధాని నగరం ఢిల్లీలో అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. బురాడీ పరిధిలోని సంత్‌నగర్‌లో 34 ఏళ్ల వ్యక్తి 21 ఏళ్ల యువతిపై దాడి చేశాడు. ప్రేమించలేదన్న కారణంతో యువతిపై కత్తితో 22 సార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ యువతిని సమీపంలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఉదయం 9 గంటలకు జరిగిన ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి. ప్రేమ వ్యవహారమే హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకుడు సురేంద్ర కంప్యూటర్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. హత్యకు గురైన యువతి టీచర్‌గా పనిచేస్తోంది. అక్కడున్న జనాలు ఆ దృశ్యం చూసి పారిపోయారు.

దేశ రాజధానిలో యువతి దారుణ హత్య!..

ఢిల్లీ: దేశ రాజ‌ధానిలో మ‌రో దారుణం చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి 21 ఏళ్ల‌ మ‌హిళ‌ను 22 సార్లు క‌త్తితో పొడిచి దారుణంగా హ‌త్య చేశాడు. మంగ‌ళ‌వారం ఉద‌యం అంద‌రూ చూస్తుండ‌గానే పట్టపగలు నడిరోడ్డుపై ఈ ఘ‌ట‌న జ‌రిగింది. హత్యకు గురైన యువతి పేరు కరణ.. ఆమె ఓ టీచ‌ర్‌. 34 ఏళ్ల సురేంద‌ర్ అనే వ్య‌క్తి ఏడాది కాలంగా క‌రుణ‌ను వెంట‌ప‌డుతూ వేధిస్తున్నాడు. ఐదు నెల‌ల కింద‌టే అత‌ని గురించి క‌రుణ కుటుంబం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. సురేంద‌ర్ ఇప్ప‌టికే మ‌రో మ‌హిళ‌కు విడాకులు ఇచ్చాడు. ఆ కేసు ఇంకా కొన‌సాగుతూనే ఉంద‌ని పోలీసులు చెప్పారు.

ఉగ్రదాడిని ఖండించిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు..

ఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని యూరీ మిలిటరీ బేస్ క్యాంపుపై నిన్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఖండించారు. ఇది దుశ్చర్యగా అభివర్ణించారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టనున్న ప్రతీ కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఇండియాకు మద్దతు తెలిపినందుకు ఘనీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

 

బీసీ సంక్షేమశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : బీసీ సంక్షేమశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. బీసీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలు, విధివిధానాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

ఢిల్లీలో దారుణం

ఢిల్లీ : హస్తినలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై 22 ఏళ్ల యువతిపై ఉన్మాది కత్తితో దాడి చేశాడు. కత్తితో 20 సార్లు విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో యువతి మృతి చెందింది.

 

13:56 - September 20, 2016

ఖమ్మం : జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో పనిచేస్తున్న ఓ అధికారి వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. కిందిస్థాయి ఉద్యోగినులను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనతోపాటు టూర్లకు రావలసిందేనంటూ బెదిరిస్తున్నాడని.. తన మాట వినకపోతే ఉద్యోగం ఉండదంటూ భయపెడుతున్నాడని ఉద్యోగినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కామకీచకుడి బాధలు భరించలేక మహిళలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.  అధికారి వేధింపు భరించలేక ఓ బాధితురాలు మీడియాముందుకొచ్చింది. తన గోడును వెళ్లబోసుకుంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. 
బాధితురాలు
'వేరే వారి దగ్గర నా గురించి బ్యాడ్ గా చెబుతున్నారు. వారి గురించి నా దగ్గర చెడ్డగా చెబుతున్నాడు. తన వెంట టూర్లకు రావాలంటూ బలవంతం చేస్తున్నాడు. లేకపోతే ఉద్యోగం నుంచి తీసివేస్తానని బెదిరిస్తున్నాడు. ఆర్థిక పరిస్థితులను ఆసరగా చేసుకుని మహిళలను లొంగదీసుకోవాలని చూస్తున్నాడు. ఆడప్లిలను కనాలంటే భయమేస్తుంది' అని చెప్పింది. 

 

13:49 - September 20, 2016

మహిళలు... రొమ్ము క్యాన్సర్.. నివారణ అనే అంశంపై మానవి నిర్వహించిన వేదిక చర్చ కార్యక్రమంలో అంకాలజిస్టు డా.సదాశివుడు, గైనకాలజిస్ట్ స్వప్న పాల్గొని, మాట్లాడారు. మహిళలకు రొమ్ము క్యాన్సర్ ఎలా వస్తుంది..?  నివారణ చర్యలు ఏం తీసుకోవాలి వంటి పలు ఆరోగ్య అంశాలను వివరించారు. పలు సలహాలు, సూచనలు చేశారు. ఆ వివరాలను వీడియాలో చూద్దాం...
  

13:47 - September 20, 2016

అనంతపురం : జిల్లాలో విషజ్వరాల బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. 3 రోజుల క్రితం డెంగ్యూతో ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటన మరవకముందే మరో ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో తాజాగా మరో చిన్నారి చనిపోవడం ఆందోళన కల్గిస్తోంది. మడకశిర ప్రాంతానికి చెందిన నవిత అనే చిన్నారి డెంగ్యూ జ్వరంతో బాధపడుతుండడంతో 3 రోజుల క్రితం కుటుంబ సభ్యులు హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. దీంతో చిన్నారి చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించి చనిపోయింది. ప్రస్తుతం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో వందలాది మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అయితే.. ఆస్పత్రిలో సరైన వసతులు లేవని రోగులు, వారి బంధువులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉందంటున్నారు. 

 

13:40 - September 20, 2016

వరంగల్ : జనగామ జిల్లాకోసం జనగర్జన మహాసభను జేఏసీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ సభకు సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ మాజీ ఎంపీ అజీజ్‌పాషా, జేఏసీ నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సభకు హాజరవగా...ప్రజలంతా గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

డీఎస్పీలు, ఆర్డీవోలతో సీఎం చంద్రబాబు సమావేశం

విజయవాడ : డీఎస్పీలు, ఆర్డీవోలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. 'దోమల మీద దండయాత్ర...పరిసరాల పరిశుభ్రత' పై పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. 

 

మున్సిపల్ శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ : మున్సిపల్ శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి జీహెచ్ ఎంసీ మేయర్, కమిషనర్, అధికారులు హాజరయ్యారు. జీహెచ్ ఎంసీలో రహదారులపై కేటీఆర్ సమీక్షిస్తున్నారు. 

 

13:05 - September 20, 2016
13:02 - September 20, 2016

హైదరాబాద్‌ : నగరంలోని రాజేంద్రనగర్‌ పీఎస్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. బుద్వేల్‌ కల్లు కాంపౌండ్‌లో హత్యకు గురైన ఈ మహిళను తోట లక్ష్మమ్మగా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త బుచ్చయ్యే హత్యచేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బుచ్చయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

 

13:00 - September 20, 2016

గుంటూరు : ఎపికి ప్రత్యేక హోదాపై వెంకయ్యనాయుడు మాట తప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. జిల్లాలోని చిలకలూరిపేటలో నూతనంగా నిర్మించిన ఆ పార్టీ కార్యాలయాన్ని సురవరం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ చిలకలూరిపేట కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అనాడు రాజ్యసభలో చెప్పిన వెంకయ్యనాయుడు.. ఇప్పుడు ఎందుకు హోదాపై మాటా మార్చారని పేర్కొన్నారు. 
 

 

12:55 - September 20, 2016

కరీంనగర్‌ : జిల్లాలోని సిరిసిల్లలో బంద్‌ కొనసాగుతోంది. జేఏసీ 48గంటల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్‌ సాగుతోంది. సిరిసిల్ల బంద్‌కు కుల సంఘాలు, వాణిజ్య, వ్యాపార సంఘాలు, ప్రైవేటు విద్యాసంస్థలు సహకరిస్తున్నాయి. ఆర్టీసీ డిపో ఎదుట అఖిలపక్ష నేతలు ధర్నా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో ఆందోళనకారులు రోడ్లపై టైర్లను తగులబెట్టారు. పాత బస్టాండ్‌ వద్ద ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌పై దాడి చేసి.. అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టారు. సిరిసిల్ల ప్రజల మనోభావాలను గౌరవించి.. సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

 

12:51 - September 20, 2016

గుంటూరు : తుని ఘటనతో వైసీపీని దెబ్బతీయాలని చంద్రబాబు ప్లాన్‌ చేస్తున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపణలు చేశారు. గుంటూరు వైసీపీ కార్యాలయం నుంచి భూమన సీఐడీ విచారణకు వెళ్లారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తుని ఘటనలో అరెస్టుల పేరుతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. సీఐడీ అధికారులు తనను అరెస్ట్‌ చేస్తే... బయటికొచ్చిన తర్వాత..కాపు ఉద్యమంలో ఒక కార్యకర్తగా పోరాటం చేస్తానని చెప్పారు. 

జనగాం జిల్లా కోసం జనగర్జన మహాసభ

వరంగల్ : జనగాం జిల్లా కోసం జనగర్జన మహాసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ మాజీ ఎంపీ అజీజ్ పాషా, జేఏసీ నాయకులు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గో బ్యాక్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు.

 

ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తున్న నయీం బాధితులు

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం బాధితులు ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని..తమను ఆదుకోవాలని కోరారు.  తమ పిల్లలకు విద్యా, ఉద్యోగాలు కల్పించాలని వేడుకున్నారు. 

 

12:32 - September 20, 2016
12:29 - September 20, 2016

కృష్ణా : ప్రత్యేకహోదా కోసం విజవాయడలోని లెనిన్ సెంటర్ లో ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరై, మాట్లాడారు. ఎపికి ప్రత్యేకహోదా కావాలని అందరూ కోరారని తెలిపారు. ప్రత్యేకహోదా కావాలని వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు కోరారని ఇప్పుడు మాట తప్పుతప్పారని విమర్శించారు. వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ చెప్పే మాటలకు పొంతన లేదన్నారు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు, వెంకయ్యనాయుడు కలిసిపోతున్నారని విమర్శించారు. ప్రత్యేకహోదా వచ్చి ఉంటే ఇవాళ ఎవరినీ అడుక్కొనే పిరిస్థితి వచ్చేదికాదని పేర్కొన్నారు. అనంతరం సాధన సమతి నేత మాట్లాడుతూ సుజనా చౌదరి బ్రోకర్ లాగా వ్యవహరిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. 

 

సీఎం చంద్రబాబుపై భూమన ఫైర్

గుంటూరు : సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీని సమూలంగా నాశనం చేయాలని చంద్రబాబు చూస్తున్నాడని పేర్కొన్నారు. దండగులు రైలును దగ్ధం చేస్తే దాన్ని సాకుగా చూపి చంద్రబాబు వైసీపీని దగ్ధం చేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. సీఐడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 

11:55 - September 20, 2016
11:54 - September 20, 2016

ఢిల్లీ : కశ్మీర్ సమస్యను పరిష్కరించకపోవడం వల్లే అక్కడ ఉగ్రదాడులు జరుగుతున్నాయని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏచూరి కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కశ్మీర్‌ పరిస్థితులపై అఖిలపక్షం చేసిన సూచనలు అమలు చేయాలని, కశ్మీరీలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ఏచూరి కేంద్రానికి సూచించారు. ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని, నిరుద్యోగం పెరుగుతోందని, ధరల పెరుగుదలతో ప్రజలపై ఆర్థిక భారం పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో సిపిఎం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లు  ఏచూరి చెప్పారు. గోరక్షణ పేరిట దళితులపై దాడులకు పాల్పడుతున్న సంస్థలను నిషేధించాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. 

నేడు 'సుప్రీం'లో 'కావేరీ' జలాల వివాదం కేసు విచారణ

ఢిల్లీ : నేడు సుప్రీంకోర్టులో కావేరీ నదీ జలాల వివాదం కేసు విచారణ జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం విచారణ కానుంది. కావేరీ పర్యవేక్షక కమిటీ ఇచ్చిన తీర్పును కర్ణాటక సుప్రీంలో సవాల్ చేయనుంది. 

11:45 - September 20, 2016

ఢిల్లీ : నేడు సుప్రీంకోర్టులో కావేరీ నదీ జలాల వివాదం కేసు విచారణ జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం విచారణ కానుంది. కావేరీ పర్యవేక్షక కమిటీ ఇచ్చిన తీర్పును కర్ణాటక సుప్రీంలో సవాల్ చేయనుంది. రేపటి నుండి సెప్టెంబర్ 30 వరకు రోజు 3వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు ఇవ్వాలని కావేరీ పర్యవేక్షక కమిటీ తీర్పు ఇచ్చింది. కావేరీ పర్యవేక్షక కమిటీ తీర్పు పట్ల తమిళనాడు, కర్ణాటక అసంతృప్తిగా ఉన్నాయి. గతంలో 12వేల క్యూసెక్కుల నీరు తమిళనాడుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ తమిళనాడుకు నీరు ఇచ్చేది లేదని కర్ణాటక తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు విచారణ నేపధ్యంలో కర్ణాటకలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. సంయమనంతో ఉండాలని కర్ణాటక ప్రభుత్వం రైతులకు సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు, కర్ణాటక ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

 

11:38 - September 20, 2016

కృష్ణా : విజయవాడ రైల్వే స్టేషన్‌లో రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ పనులు కారణంగా రేపటి నుంచి 28వ తేదీ వరకు మెగా లైన్‌ బ్లాక్‌ను తీసుకొంటున్నట్లు సీనియర్‌ డీసీఎం ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ కారణంగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని పాక్షికంగా రద్దు చేస్తామని, కొన్నింటిని దారి మళ్లించి నడుపుతామని చెప్పారు.  గుంటూరు-విశాఖపట్టణం - గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ నెల 22, 23, 24 తేదీల్లో పూర్తిగా రద్దయ్యే అవకాశాలున్నాయి. గుంటూరు-సికింద్రాబాద్‌- గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని 23వ తేదీ వరకు రద్దు చేయనున్నారు.

రేపటి నుంచి 28వ తేదీ వరకు మెగా లైన్‌ బ్లాక్‌ : డీసీఎం ఉమామహేశ్వరరావు

కృష్ణా : విజయవాడ రైల్వే స్టేషన్‌లో రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ పనులు కారణంగా రేపటి నుంచి 28వ తేదీ వరకు మెగా లైన్‌ బ్లాక్‌ను తీసుకొంటున్నట్లు సీనియర్‌ డీసీఎం ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ కారణంగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని పాక్షికంగా రద్దు చేస్తామని, కొన్నింటిని దారి మళ్లించి నడుపుతామని చెప్పారు. 

 

11:32 - September 20, 2016

గుంటూరు : తుని ఘటనలో మరికాసేపట్లో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని సీఐడీ విచారించనుంది. తుని ఘటనలో భూమనను రెండోసారి అధికారులు విచారించనున్నారు. భూమన గుంటూరు చేరుకున్నాడు. మీడియాతో మాట్లాడారు. వైసీపీని సమూలంగా నాశనం చేయాలని చంద్రబాబు చూస్తున్నాడని పేర్కొన్నారు. దండగులు రైలును దగ్ధం చేస్తే దాన్ని సాకుగా చూపి చంద్రబాబు వైసీపీని దగ్ధం చేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. సీఐడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 

 

11:23 - September 20, 2016

కరీంనగర్ : జిల్లాలోని మల్యాల మండలం మానాల సమీపంలో శ్రీరాంసాగర్‌ ప్రధాన కాకతీయ కాలువకు గండిపడి నీరు పెద్ద ఎత్తున వృథాగా పోతుంది.  కాలువకు గండిపడటంతో మానాల చెరువు తెగి .. సమీప  గ్రామాస్థులు భయందోళనకు గుర‌వుతున్నారు. ఇప్పటికే మ్యాడం పల్లి గ్రామానికి ప్రమాదం పొంచి ఉండటంతో గ్రామ‌స్థుల‌ను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందలాది ఎకరాల్లో పంటలు ముంపున‌కు గురయ్యాయి. ఎగువ నుంచి వ‌చ్చే నీటి ప్ర‌వాహాన్ని త‌గ్గించేందుకు అధికారులు య‌త్నిస్తున్నారు. కెనాల్‌ పరిస్థితిని ఎమ్మెల్యే శోభ పరిశీలించారు. 

 

11:18 - September 20, 2016

మహబూబ్నగర్ : ఓ వ్యక్తి.. తన కారుతో మరో వ్యక్తిని ఢీకొట్టాడు. అసలు ఏం జరిగిందనే కనీస ప్రయత్నం చేయలేదు సరికదా..! కారును ఆపకుండా వేగంగా పోనిచ్చాడు. ఢీకొన్నప్పుడే ఆ వ్యక్తి అమాంతం కారుపైనే పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ విధంగా టాపుపై శవంతోనే తన కారును 3 కిలోమీటర్లు అలాగే పోనిచ్చాడు. మానవత్వమే సిగ్గుతో తలదించుకొనే ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల-బూరెడ్డిపల్లి గ్రామాల మధ్య నిన్న రాత్రి జరిగింది. కర్నూలు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు జడ్చర్ల సమీపంలో రోడ్డు దాటుతున్న పట్టణంలోని నిమ్మగడ్డ బావికి చెందిన శ్రీనును ఢీకొట్టింది. దాంతో అతను కారు టాపుపై పడ్డాడు. ఇది గమనించని వాహనదారుడు కారుతో అలాగే 3 కిలోమీటర్లు వెళ్లాడు. కావేరమ్మపేట గ్రామం దాటాకా కారు టాపుపై వ్యక్తి ఉండటాన్ని గమనించిన ద్విచక్ర వాహనదారులు కారును వెంబడించి, మాచారం గ్రామం వద్ద అడ్డుకున్నారు. కారుపై వ్యక్తి పడి ఉండటాన్ని చూసిన వాహనదారుడు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు అక్కడే శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. శ్రీను ఓ ఇనుప సామాను దుకాణంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. కారు కూకట్‌పల్లి సమీపంలోని అత్తాపూర్‌కు చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

 

ఎస్ ఆర్ ఎస్పీ కాకతీయ కెనాల్ కు గండి

కరీంనగర్ : మల్యాల మండలం మానాల వద్ద ఎస్ ఆర్ ఎస్పీ కాకతీయ కెనాల్ కు గండి పడింది. వరద నీరు పొలాల్లోకి చేరుతోంది. కెనాల్ పరిస్థితిని ఎమ్మెల్యే శోభ పరిశీలిస్తున్నారు. 

కరీంనగర్ లో బంద్... ఉద్రిక్తత

కరీంనగర్ : కరీంనగర్ లో 48 గంటలపాటు బంద్ కు పిలుపిచ్చారు. కరీంనగర్ బస్ డిపో ఎదుట జేఏసీ నేతలు బైఠాయించారు. బంద్ లో చేనేత కార్మికులు కార్మికులు పాల్గొన్నారు. వ్యాపారులు మద్దతు తెలిపారు.  కరీంనగర్ జిల్లాలో 48 గంటలపాటు బంద్ పిలుపిచ్చారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. 

 

09:45 - September 20, 2016

హైదరాబాద్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్  స‌ర్వస‌భ్య స‌మావేశం ప్రశాంతంగా ముగిసింది. స్టాండింగ్ కమిటీ తీర్మానించిన పలు ప్రతిపాదనలకు సమావేశం ఆమోదం తెలిపింది. నగరంలో తిష్టవేసిన సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఎంఐఎం సభ్యులు మాత్రం ఎల్‌ఈడీ బల్బుల ప్రతిపాదనను వ్యతిరేకించారు. 
మొత్తం 98 ప్రశ్నలు రాగా 14 ప్రశ్నల‌పై మాత్రమే చ‌ర్చ 
హైదరాబాద్‌లోని గ్రేటర్ మున్సిపల్ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ సమావేశం దాదాపుగా ప్రశాంతంగా జరిగింది. సమావేశంలో కార్పొరేటర్ల నుంచి మొత్తం 98 ప్రశ్నలు రాగా 14 ప్రశ్నల‌పై మాత్రమే చ‌ర్చ జరిగింది.   స‌మావేశం ప్రారంభమవ్వగానే తాము ఇచ్చిన ముఖ్యమైన ప్రశ్నల‌ను చ‌ర్చకు పెట్టలేద‌ని ఎంఐఎం కార్పొరేట‌ర్లు ఆందోళ‌న చేశారు. అలాగే వ‌ర్షాల కార‌ణంగా న‌గ‌రంలో రోడ్లు భారీగా దెబ్బతిన్నాయ‌ని, వాటి నిర్వహ‌ణ పై అధికారులు వేగంగా స్పందించ‌డం లేద‌ని కార్పొరేట‌ర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. న‌గ‌రంలో దోమ‌ల నివార‌ణ స‌క్రమంగా జ‌రగడంలేద‌ని.. దీంతో నగరవాసులు మ‌లేరియా, డెంగీ లాంటి వ్యాధుల బారినప‌డుతున్నారని.. ప్రత్యేక మెడిక‌ల్ క్యాంపులు నిర్వహించ‌డంతోపాటు ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌ను బ‌లోపేతం చేయాలని కోరారు.
నామ‌మాత్రంగా నాలాల పూడికతీత                                   
ఇక నాలాల పూడిక తీత కూడా నామ‌మాత్రంగా సాగుతోందని..  కౌన్సిల్  దృష్టికి తెచ్చారు కార్పొరేట‌ర్లు.  ట్రాన్స్ ఫోర్ట్ విభాగాన్ని ప్రక్షాళ‌న చేసినా ఖ‌ర్చులు ఎక్కువ అవుతున్నాయ‌ని.. కార్పొరేష‌న్ మాత్రమే  నిర్వహించేలా వాహ‌నాలు కొనుగోలు చేయ్యాల‌ని ఖైర‌తాబాద్ కార్పొరేట‌ర్లు  డిమాండ్ చేశారు. ఇక  అక్రమ‌నిర్మాణాలను నిర్మూలించ‌డంలో టౌన్ ప్లానింగ్ అధికారులు విఫ‌ల‌మౌతున్నార‌ని..  ఒక్క ఫ్లోర్ కు ప‌ర్మిష‌న్ తీసుకుని నాలుగైదు అంత‌స్తులు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం మండిపడ్డారు.
స‌స్పెన్షన్  బ్రిడ్జి నిర్మాణ డిపిఆర్ త‌యారీకి కౌన్సిల్ ఆమోదం
కుత్బుల్లాపూర్ స‌ర్కిల్ ప‌రిధిలోని పార్కు స్థలం గుండా దైవజ్ఞ శ‌ర్మకు చెందిన ప్లాట్ కు 30ఫిట్ల అప్రోచ్ రోడ్డు ఇవ్వడానికి స్టాండింగ్ కమీటి చేసిన తీర్మానాన్ని కౌన్సిల్ స‌మావేశం వ్యతిరేకించింది. దుర్గం చెరువుపై నిర్మించ‌త‌ల పెట్టిన‌ స‌స్పెన్షన్  బ్రిడ్జి నిర్మాణ డిపిఆర్ త‌యారీకి కౌన్సిల్ ఆమోదం తెలిపింది.  అలాగే 406.86 కోట్ల వ్యయంతో న‌గ‌రంలో ఏర్పాటు చేయ‌నున్న ఎల్ఈడి లైటింగ్‌కు.. 32ప్రాంతాల్లో డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి 143 జంక్షన్ల అభివృద్ధికి అవ‌స‌ర‌మైన ప‌రిసాల‌న అనుమ‌తులు ఇవ్వాల‌ని ప్రభూత్వానికి నివేదించింది. ఒకటిరెండు అంశాలు మినహా కౌన్సిల్ సమావేశం అంతా ప్రశాంతంగా జ‌రిగింది. అయితే  తాము అడిగిన ప్రశ్నల‌కు స‌మాధానం రాక‌పోవ‌డంతో  కొంతమంది  కార్పొరేట‌ర్లు నిరసన వ్యక్తం చేశారు. 

09:37 - September 20, 2016

హైదరాబాద్ : నిన్న రాత్రి 11 గంటలకు హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కుత్బుల్లాపూర్‌ సమీపంలోని జగద్గిరిగుట్ట,  బీరప్పనగర్, దావమ్మబస్తీ, పాపిరెడ్డినగర్ ప్రాంతాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. వెంటనే భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. కేవలం 2 సెకన్లు మాత్రమే కంపించడంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

సిరిసిల్లలో కొనసాగుతున్న బంద్

కరీంనగర్ : సిరిసిల్లలో బంద్ కొనసాగుతోంది. సిరిసిల్లను జిల్లాగా చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ పిలుపు ఇచ్చారు. పెట్రోల్ బంక్ పై ఆందోళన కారులు దాడి చేయడంతో ఫర్మీచర్ ధ్వంసమైంది. సిరిసిల్ల బస్ డిపో ఎదుట జేఏసీ నేతలు బైఠాయించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సుపై ఆందోళనకారులు దాడి చేశారు. పట్టణంలో రహదారులపై ఆందోళనకారులు టైర్లు దగ్ధం చేశారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో సిద్ధిపేటకు చెందిన బస్సుపై ఆందోళనకారులు దాడి చేసి నిప్పు పెట్టేందుకు యత్నించారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. 
 

09:11 - September 20, 2016
09:06 - September 20, 2016

కరీంనగర్ : సిరిసిల్ల జిల్లా కోసం కరీంనగర్ బంద్ కు జేఏసీ పిలుపిచ్చింది. కరీంనగర్ బస్ డిపో ఎదుట జేఏసీ నేతలు బైఠాయించారు. బంద్ లో చేనేత కార్మికులు కార్మికులు పాల్గొన్నారు. వ్యాపారులు మద్దతు తెలిపారు.  కరీంనగర్ జిల్లాలో 48 గంటలపాటు బంద్ పిలుపిచ్చారు. 

సిరిసిల్ల జిల్లా కోసం కరీంనగర్ బంద్ కు పిలుపిచ్చిన జేఏసీ

కరీంనగర్ : సిరిసిల్ల జిల్లా కోసం కరీంనగర్ బంద్ కు జేఏసీ పిలుపిచ్చింది. కరీంనగర్ బస్ డిపో ఎదుట జేఏసీ నేతలు బైఠాయించారు. బంద్ లో చేనేత కార్మికులు కార్మికులు పాల్గొన్నారు. వ్యాపారులు మద్దతు తెలిపారు.  కరీంనగర్ జిల్లాలో 48 గంటలపాటు బంద్ పిలుపిచ్చారు. 

 

08:58 - September 20, 2016

శృతిహాసన్ యూ టర్న్ తీసుకుంది. అంతేకాదు లేటేస్ట్ గా ఈ బ్యూటీ ఓ డిసిసన్ తీసుకున్నట్లు సమాచారం. తన ప్లాన్ బెడిసికొట్టడంతోనే ఈ చెన్నై చిన్నది ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ కమల్ గారాల పట్టి తీసుకున్న తాజా నిర్ణయం ఏంటో వాచ్ దీస్ స్టోరీ.
మళ్లీ టాలీవుడ్ వైపు శృతి
శ్రీమంతుడు సినిమా తరువాత శృతిహాసన్ తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. ఇందుకు మంచి రీజనే ఉంది. సౌత్ లో మంచి స్టార్ డమ్ రావడంతో ఇక బాలీవుడ్ ని దున్నేయాలనే కలతో ఈ బ్యూటీ తెలుగు సినిమాలు తగ్గించేసింది. తీరా బాలీవుడ్ లో చేసిన ఒకటి, రెండు సినిమాలు బెడిసికొట్టడంతో మళ్లీ తెలుగు వైపు చూస్తోందట.
శృతి బాలీవుడ్ ప్లాన్స్ బెడిసికొట్టాయి 
2014, 2105లో శృతిహాసన్ తెలుగుతో పాటు తమిళంలో వరుస సక్సెస్ తో ఊపు ఊపేసింది. దీంతో ఈ బ్యూటీ ఇక సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పాతుకుపోయినట్లే అనుకున్నారంతా, కానీ ఈ భామ టార్గెట్ బాలీవుడ్ కావడంతో మరోసారి అటు వైపు ట్రై చేద్దామని ఇక్కడ సినిమాలకునో చెప్పడం మొదలుపెట్టింది. కానీ ఈసారి కూడా శృతి బాలీవుడ్ ప్లాన్స్ బెడిసికొట్టాయి. దీంతో చేసేదేమి లేక ఇక తెలుగులోనే కంటిన్యూ కావాలని తాజాగా  నిర్ణయించుకుందట. 
నాగచైతన్య తో జోడికట్టుతోన్న శృతిహాసన్ 
శృతిహాసన్ ప్రస్తుతం నాగచైతన్య తో ప్రేమమ్ మూవీలో జోడికట్టుతోంది. ఈ మూవీ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది.ఇక కాటమరాయుడు చిత్రం కోసం పవన్ కల్యాణ్ తో మరోసారి నటిస్తోంది. ఇవే కాకుండా సింగం3, శభాష్ నాయుడు సినిమాలు చేస్తోంది.ఇకపై తెలుగులో గ్యాప్ రాకుండా ఉండేందుకు తెలుగు దర్శకులతో టచ్ ఉండేలా ప్రణాళికలు వేసుకుంటుందట. మిగతా సౌత్ హీరోయిన్స్ త్రిష,అసిన్, లాగే శృతిహాసన్ బాలీవుడ్ కలలు ఫలించలేదు. 

 

08:49 - September 20, 2016

ఎట్టకేలకు మాస్ రాజా రవితేజ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతోంది. పవర్ తోనే దర్శకుడు బాబీ డైరెక్షన్ లోనే మాస్ రాజా న్యూ మూవీ చేయబోతున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ తో నిరాశ పరిచినప్పటికి  డైరెక్టర్ గా బాబీపై ఉన్న నమ్మకంతో రవితేజ మరో ఛాన్స్ ఇస్తున్నాడు. పవర్ తో మాస్ పవర్ చూపించిన మాస్ రాజా, దర్శకుడు బాబీల కొత్త మూవీ విశేషాలేంటో 
మీరే చూడండి.
కొత్త సినిమాకి రవితేజ సైన్ 
ఎడాది గ్యాప్ తరువాత రవితేజ కొత్త సినిమాకి సైన్ చేశాడు. జెట్ స్పీడ్ తో సినిమాలు చేసే మాస్ రాజా గత ఎడాది చేసిన సినిమాలు రిజల్ట్ తేడా కొట్టడంతో అలార్ట్ అయ్యాడు. దీంతో మంచి స్టోరీ కోసం ఎడాది టైం తీసుకున్నాడు. ఇప్పుడు స్టోరీ పక్కాగా రెడీ కావడంతో త్వరలోనే తన కొత్త సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాడానికి సన్నాహాలు చేస్తున్నాడు. 
దర్శకుడు బాబీతో రవితేజ కొత్త సినిమా
రవితేజ దర్శకుడు బాబీతో కొత్త సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన పవర్ బాక్సఫీసు వద్ద మంచి రిజల్ట్ నే రాబట్టింది. ఈ కారణంగానే బాబీ చేసిన సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడకపోయినప్పటికి మాస్ రాజా ఈ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ కొత్త సినిమాకి సంబంధించిన స్టోరీ రెడీ కావడంతో ఇక సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
క్రాక్ టైటిల్ తో సినిమా 
క్రాక్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రం షూటింగ్ ని అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి కంటిన్యూగా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు అనవసరంగా బడ్జెట్ ని పెంచకుండా కేవలం 18 కోట్లలోపు ఈ సినిమాను ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.కిక్ 2,బెంగాల్ టైగర్ సినిమాలు కాస్ట్ ఫెల్యూలర్స్ గా నిలిచాయి. దీంతో ఈ సినిమాను పక్కా బడ్జెట్ లో తీయాలని భావిస్తున్నారట. ఈ సినిమాను సమ్మర్ కి రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది.

రెండో రోజు వికారాబాద్ జిల్లా బంద్

రంగారెడ్డి : రెండో రోజు వికారాబాద్ జిల్లా బంద్ కొనసాగుతోంది. శంషాబాద్ లో 3 మండలాలను కలపడాన్ని నిరసిస్తూ బంద్ చేట్టారు. 

08:33 - September 20, 2016

జనతా గ్యారేజ్ తో చాలా కాలం తరువాత భారీ సక్సెస్ కొట్టిన ఎన్టీఆర్, ప్లాప్ కాంబినేషన్ లో న్యూ మూవీ చేస్తున్నాట్లు సమాచారం. గతంలోయంగ్ టైగర్ కి ప్లాప్ ఇచ్చిన ఓ దర్శకుడు ఇటీవల భారీ హిట్టు కొట్టాడు. సక్సెస్ కి ప్లాప్ ఇచ్చి ఈసారి సక్సెస్ కొట్టాలని ప్లాన్ చేస్తున్న ఆ దర్శకుడెవరో ఈ న్యూ మూవీ విశేషాలేంటో మీరు ఓ లుక్కెయండి.
జనతా గ్యారేజ్ తో ఆ కోరిక తీరింది  
ఎన్టీఆర్ టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో ఏబో యావరేజ్ లను చవిచూశాడు. ఇలాంటి టైంలో భారీ సక్సెస్ కోసం ఎదురుచూసిన యంగ్ టైగర్ కి జనతా గ్యారేజ్ తో ఆ కోరిక తీరింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ మూవీ సక్సెస్ హ్యంగోవర్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ లాంటి భారీ హిట్టు తరువాత ఈ మాస్ హీరో తనతో ప్లాప్ ఇచ్చిన ఓ మాస్ డైరెక్టర్ తో న్యూ మూవీ చేయబోతున్నాడని వినికిడి.
ఎన్టీఆర్ తో బోయపాటి మరోసారి మూవీ 
ఈ ఎడాది సరైనోడుతో భారీ హిట్టు కొట్టిన బోయపాటి శ్రీను ఎన్టీఆర్ తో మరోసారి మూవీ చేస్తున్నాడట. వీరి కాంబినేషన్ లో వచ్చిన దమ్ము మూవీ హై ఎక్స్ పెటేన్షన్స్ తో వచ్చి నిరాశ పరిచింది. అయిన కూడా దర్శకుడిగా బోయపాటి మాస్ గ్రిప్ పై నమ్మకంతో ఎన్టీఆర్ మరోసారి సినిమా చేయడానికి సై అన్నాడట. ఈ దర్శకుడు కూడా ఈసారి ఎన్టీఆర్‌కి అదిరిపోయే రేంజ్ లో మాస్ హిట్టు ఇవ్వాలని కసిగా ఉన్నాడట.
ఎన్టీఆర్ కోసం హై ఓల్టేజ్ మాస్ స్టోరీ రెడీ 
బోయపాటి శ్రీను ఎన్టీఆర్ కోసం హై ఓల్టేజ్ మాస్ స్టోరీని రెడీ చేశాడట. ఈ మూవీ యంగ్ టైగర్ ఇమేజ్‌‌ ని రెట్టింపు చేస్తుందని దర్శకుడు చెప్పుతున్నాడు. ప్రస్తుతం బోయపాటి, బెల్లంకొండ శ్రీనివాస్‌తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా ఈ మూవీని కంప్లీట్ చేసి ఎన్టీఆర్ తో కొత్త సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట. మరి బోయపాటి, ఎన్టీఆర్ కి దమ్మును మరిచిపోయే రేంజ్ హిట్టు ఇస్తాడో చూడాలి.

08:25 - September 20, 2016
08:23 - September 20, 2016

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిని భారతదేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా పరిగణించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీకాంగ్రెస్ నేత కైలాష్ బాబు, బిజెపి నేత టి.ఆచారి, విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు పాల్గొని, మాట్లాడారు. టెర్రరిస్టు దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. భారత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:14 - September 20, 2016

హైదరాబాద్ : తెలంగాణలో బకాయిల కోసం ఉపాధి హమీ కూలీలు ఆశగా ఎదురు చూస్తున్నారు. నెలలు గడిచినా ఇంతవరకూ కూలీలకు వేతనం దక్కలేదు. దీంతో మరో సారి వలసలే తమకు దిక్కంటున్నారు. రాష్ట వ్యాప్తంగా 7 లక్షల మంది కూలీలకు రెండువందల కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టడంతో ఉపాధికూలీలు నానా అవస్థలు పడుతున్నారు. 
గ్రామీణ పేదలు వలసబాట 
ఉన్న ఊరిలోనే పనికల్పించి.. వలసలు నివారించడమే ప్రధాన లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం.. లక్ష్యాన్ని నీరుగారుస్తోంది తెలంగాణ ప్రభుత్వం. నెలల తరబడి కూలీడబ్బులు ఇవ్వకపోవడంతో.. బతుకుదెరువులేక మరోసారి వలసబాటపడుతున్నారు గ్రామీణ పేదలు. 
పెండింగ్‌లో రూ.200 కోట్ల బకాయిలు
తెలంగాణలో మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకం కింద పనిచేసిన 7లక్షల మంది కూలీలూ తమ 200 కోట్ల బకాయిల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.  నిబంధనల ప్రకారం చేసిన పనులకు 14 రోజుల్లోపే బిల్లులు చెల్లించాలి. కాని పలు కారణాల సాకు చూపుతూ ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన 200 కోట్ల మేర బకాయిలను చెల్లించకుండా నెలల తరబడి వాయిదా వేస్తున్నారు. 
గణనీయంగా పెరిగిన ఉపాధి హామీ కూలీలు 
మూడు సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా కరువు నెలకొనడంతో ఉపాధి హమీ పథకం మీద ఆధారపడిన కుటుంభాల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఈ ఏడాది ఇరవైమూడున్నర లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించిన ప్రభుత్వం... చెరువులు, కాల్వల పూడికతీతతో పాటు వ్యవసాయ పనులను సైతం చేపట్టింది. బీడు భూములను సాగుకు అనువుగా మార్చడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహరం కార్యక్రమానికి సైతం ఉపాధిహమీని అనుసంధానం చేసి.. లక్షల మంది కూలీలను చెట్లు నాటే కార్యక్రమంలో భాగస్వాములను చేసింది. 
కూలీ డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కూలీలు 
ఉపాధి కూలీల సహయంతో 3.41 వేల కోట్ల విలువ గల 5.71 లక్షల పనులను ఇప్పటికే పూర్తి చేసింది. అందుకోసం వేయి కోట్లరూపాయల వరకు ఉపాధి హమీ వేతనాలు చెల్లించాల్సి ఉండగా.... అందులో 200 కోట్ల వరకు బకాయి పెట్టింది ప్రభుత్వం. జూలైలో చేపట్టిన హరితహరం కార్యక్రమంలో చెట్లు నాటిన తమకు.. నేటికి కూలీ డబ్బులు రాలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తీరుపై సీపీఎ నేతల ఆగ్రహం
పెండింగ్ బకాయిలపై, ఉపాధి హామీని పర్యవేక్షిస్తున్న గ్రామీణాభివృద్ధి శా‌ఖ అధికారులు మాత్రం ....రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదంటున్నారు. నిధులు విడుదలైన వెంటనే ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలను చెల్లిస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని సీపీఎం నేతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వలసల నివారణ కోసం ఉద్దేశించిన ఉపాధి హమీ ఉద్దేశం ఆచరణలో మాత్రం నీరుగారిపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 200 కోట్ల ఉపాధి హమీ నిధులను విడుదల చేయాలని కూలీలు కోరుతున్నారు. 

08:08 - September 20, 2016

హైదరాబాద్ : ప్రభుత్వాసుపత్రులు నిర్లక్ష్యపు నిలయాలుగా మారాయి. వైద్యులు, సిబ్బంది ఉదాశీనవైఖరితో విలువైన ప్రాణాలు గాల్లోకలిసి పోతున్నాయి. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో  తిష్టవేసిన నిర్లక్ష్యంపై రోగుల బంధువులు ఆందోళనకు దిగుతున్నారు. 
ధర్మాసుపత్రికి నిర్లక్ష్యపు రోగం
రాష్ట్రంలోని పేదప్రజలందరికి వైద్యసేవలందించే ప్రభుత్వ పెద్దాస్పత్రులు నిర్లక్ష్యపు రోగంతో కునారిల్లుతున్నాయి. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో సకాలంలో వైద్యం అందక ఓ యువకుడు ప్రాణం విడిచాడు. దీంతో మృతునిబంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు.
సకాలంలో వైద్యం అందక యువకుడు మృతి 
నల్లగొండ జిల్లా, రాజుపేట మండలం, బేగంపేట గ్రామానికి చెందిన యువకుడు ప్రకాష్.. ద్విచక్రవాహణపైన వెళుతూ  జారికిందపడిపోయాడు.  ఈప్రమాదంలో తీవ్రగాయాల పాలైన అతన్ని సికింద్రాబాద్ లోని  గాంధీ అసుపత్రికి తరలించారు. అయితే అక్కడి  వైద్యులు సిటీ స్కాన్ పని చేయడం లేదని..పేషెంట్‌ను  ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు. అక్కడ సిటీ స్కాన్ చేసిన అనంతరం వెంటిలేటర్లు పనిచేయడం లేదని తిరిగి గాంధీ ఆసుపత్రికి పంపించారు. ఇలా గాయపడి ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని టెస్ట్‌లపేరుతో నాలుగు గంటలకు పైగా ఆస్పత్రులచుట్టూతిప్పారు. దీంతో  సమయానికి  వైద్యం అందక ప్రకాష్ మృతి చెందాడు.
డాక్టర్ల నిర్లక్ష్యంతో గాల్లోకలిసిన విలువైన ప్రాణం
పేషెంట్‌ ఎందుకు చనిపోడని అడిగితే.. గాంధీ ఆస్పత్రి వైద్యాధికారులు కూడా నిర్లక్ష్యంగానే సమధానం ఇస్తున్నారు. పేషెంట్‌కు ఎలాంటి టెస్ట్‌లు చేయాలో నిర్ణయించడానికే డాక్టర్ల బృందం గంటలకొద్ది చర్చలు జరిపారట. ఈలోగా ప్రాణాలు నిలపడానికి అవకాశం ఉన్న విలువైన సమయంకాస్తా కరిగిపోయింది. 
ఖర్చుపెడుతున్న కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయి..?
ప్రభుత్వం ఎటా వంద కోట్లు  గాంధీ ఆసుపత్రికి కేటాయిస్తున్నా .. ఫలింతం మాత్రం శ్యూన్యంగా ఉంటోంది. కోట్లరూపాయలు ఖర్చుపెడుతున్నా.. కనీస వైద్యపరికరాలు కూడా లేకుండా పోతున్నాయి. ఇప్పటికైన ఉన్నతాదికారులు స్పందించి ఆసుపత్రిలో సౌకర్యలు కల్పంచాలని కోరుతున్నారు.

 

07:55 - September 20, 2016

తూర్పుగోదావరి : కాకినాడ సమీపంలో నిర్మించతలపెట్టిన దివీస్ లేబరేటరీస్ వ్యతిరేక పోరాటం ఉధృతమవుతోంది. ఇప్పటికే విభిన్న రూపాల్లో ఆందోళన చేస్తున్న తొండంగి మండల ప్రాంతవాసులు ఇవాళ కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
దివీస్ పై పోరాటం
కాకినాడ తీర ప్రాంతంలో మాకొద్దీ దివీస్ మందుల పరిశ్రమ అన్న నినాదం హోరెత్తుతోంది. వందలాది మత్స్యకారులు కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పంపాదిపేట, తాటాకులపాలెం, కొత్తపాకల  తదితర గ్రామాల ప్రజలు నిరంతర పోరాటాలు సాగిస్తున్నారు. ఇక్కడ దివీస్ మందుల పరిశ్రమను ఏర్పాటు చేస్తే  తమ జీవితాలు దుర్భరంగా మారుతాయన్నది వీరి ఆందోళన. 
20 వేల మంది ఉపాధి ప్రశ్నార్ధకం 
తొండంగి మండలంలో సరుగుడ, జీడి, వేరుసెనగ పంటలు పండిస్తారు. ఈ ప్రాంతంలో దాదాపు 300 హేచరీలున్నాయి. వీటిలో 15వేల మందికి పైగా జీవనోపాధి పొందుతున్నారు. రెండు వేల మంది మత్స్యకారులున్నారు. దివీస్ మందుల పరిశ్రమను నెలకొల్పితే, హేచరీస్ దెబ్బతింటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దివీస్ పరిశ్రమ వల్ల రెండు వేల మందికి ఉద్యోగాలొస్తాయన్న అంచనాలున్నా, 20 వేల మంది ఉపాధి ప్రశ్నార్ధకంగా మారుతోంది. 
మరో ఉత్పత్తి కేంద్రం నెలకొల్పేందుకు ప్రయత్నం 
ఇప్పటికే హైదరాబాద్, విశాఖ పట్టణం సమీపంలో మందుల ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పిన దివీస్ లాబొరేటరీస్ యాజమాన్యం తొండంగి మండలంలో మరో ఉత్పత్తి కేంద్రం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి 505 ఎకరాలు కేటాయిస్తూ 2015లో ప్రభుత్వ జీవో నెంబర్ 73 విడుదల చేసింది. భూ సేకరణకు నడుంబిగించిన ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు నష్టపరిహారం చెల్లించకపోవడం మరింత వివాదస్పదమైంది.
రసాయనాలు సముద్ర నీటిలో కలవడం వల్ల మత్స్యసంపద నాశనం..? 
మందుల పరిశ్రమ నుంచి విడుదలయ్యే రసాయనాలు సముద్ర నీటిలో కలవడం వల్ల మత్స్యసంపద నాశనమయ్యే ప్రమాదం వుంది. ఇప్పటికే భీమిలీ సమీపంలో మందుల ఉత్పత్తి చేస్తున్న దివీస్ యాజమాన్యం పర్యావరణ పరిరక్షణలో విఫలమైందన్న ఆరోపణలున్నాయి. ఈ పరిశ్రమ కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లో అనేకరకాల చర్మవ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో అక్కడ కూడా పోరాటాలు సాగుతున్నాయి. స్థానికులకు ఆశించిన స్థాయిలో ఉద్యోగాలూ రాలేదు. కనీస వేతనచట్టాలుకానీ, పిఎఫ్ లాంటి సదుపాయాలు కానీ కల్పించడం లేదన్న ఫిర్యాదులున్నాయి. 
మా జీవితాలను నాశనం చేయొద్దు : ప్రజలు
ప్రకృతి సౌందర్యానికి నిలయంగా, చక్కటి ఉపాధి కేంద్రంగా వున్న తమ ప్రాంతంలో మందుల పరిశ్రమను పెట్టి, తమ జీవితాలను నాశనం చేయొద్దంటున్నారు తొండంగి మండల ప్రజలు.  ఓ వైపు స్థానికులు చేస్తున్న పోరాటాలను అణచివేసే వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది. గ్రామాల్లో పోలీసులను మోహరించి, 144 సెక్షన్ లు విధిస్తోంది. సభలు, సమావేశాలకు అనుమతులివ్వడం లేదు. చివరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధును సైతం ఆ ప్రాంతంలోని సభలకు హాజరుకాకుండా అడ్డుకోవడం తీవ్ర వివాదస్పదమైంది.
మరో ప్రాంతంలో పరిశ్రమను ఏర్పాటు చేయాలి : స్థానికులు 
ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా పర్యావరణానికి హాని కలగని రీతిలో మరో ప్రాంతంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయాలంటున్నారు స్థానిక మత్స్యకారులు. అయితే, వీరి అభ్యంతరాలను పట్టించుకోని ప్రభుత్వం ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వామపక్షాలను అభివృద్ధి నిరోధకులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోంది. 

 

నేడు టీటీడీ ట్రస్టు బోర్డు సమావేశం

చిత్తూరు : నేడు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సమావేశం జరుగనుంది. పలు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. 

ఎస్ ఆర్ నగర్ పీఎస్ పరిధిలో కార్డనె సెర్చ్

హైదరాబాద్ : ఎస్ ఆర్ నగర్ పీఎస్ పరిధిలో కార్డనె సెర్చ్ నిర్వహించారు. వెస్టు జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 
400 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 41 బైకులు, కారును సీజ్ చేశారు. 

 

07:38 - September 20, 2016

హైదరాబాద్ : ఇంటింటికి నల్లా నీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు వివిధ బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు అందుతున్నాయి. తాజగా యూనియన్ బ్యాంక్ ఆప్ ఇండియా 2 వేల కోట్ల రుపాయాలను అందించేందుకు ముందుకు వచ్చింది. 
మిషన్ భగీరథలో భాగమయ్యేందుకు ముందుకొచ్చిచన యుబిఐ 
కోట్లాది మంది ప్రజల దాహార్తి తీర్చే మిషన్ భగీరథలో భాగం అయ్యేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. మహబూబ్ నగర్ సెగ్మెంట్‌కు 2 వేల కోట్ల రూపాయల రుణాన్ని అందించేందుకు బ్యాంకు ఉన్నతాధికారులు ఒప్పుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఆర్ డబ్ల్యుఎస్ ఆండ్ ఎస్ ప్రధాన కార్యాలయంలో ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డిని కలిసి, తమ అంగీకారాన్ని తెలిపారు.
మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు వేగవంతం : జలవనరుల శాఖ  
మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, 2017 డిసెంబర్ చివరి నాటికి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయనున్న సర్వీస్ రిజర్వాయర్‌లకు శుద్ధి చేసిన నదీ జలాలను సప్లై చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. 
యుబిఐకి అధికారులు కృతజ్ఞతలు 
మహబూబ్ నగర్ సెగ్మెంట్ కు 2 వేల కోట్ల రుపాయల రుణం ఇవ్వడానికి ఒప్పుకున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మిషన్ భగీరథ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. 

07:33 - September 20, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో ఖాళీ అయిన శాసనమండలి సభ్యుడి ఎన్నిక షెడ్యూల్ వెలువడడంతో.....అధికార పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించడంతో నాయకులంతా సైలెంట్ గా ఉన్నారు. వచ్చే ఏడాది ఖాళీ అవుతున్న స్థానాలపై నేతలు భారీగా ఆశలు పెంచుకున్నారు.
తుమ్మల వదిలేసిన సీటు మరో వలసనేతకే..
శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తుమ్మల నాగేశ్వరరావ్ ..తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో మండలి  స్థానం ఖాళీ అయింది.  తుమ్మల వదిలేసిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో వలస నేతకే అధికార పార్టీ  ప్రాధాన్యత నిచ్చింది. ఈ స్థానాన్ని మైనార్టీ నేతతో భర్తీ చేయాలనే నిర్ణయించింది అధికాపార్టీ.
మైనార్టీకోటాలో భాగంగా ఫరీదుద్దీన్‌కు ఛాన్స్‌ 
డిప్యూటీ సీఎం గా ఉన్నమహ్మూద్ అలీ  తర్వాత  మైనార్టీల నుంచి ఆ స్థాయి నాయకులు పార్టీలో  పెద్దగా లేరు. దీంతో  మైనార్టీ నేతలకు ప్రాధాన్యత నివ్వాలనే ఉద్దేశ్యంతో  మాజీ మంత్రి ఫరీదుద్దీన్  కు కేసీఆర్‌ ఛాన్స్‌ ఇచ్చినట్టు టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పుకుంటున్నారు. 
సీఎం నిర్ణయంతో ఆశలు వదులుకున్న నేతలు
పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే ఫరీదుద్దీన్ కు  ముఖ్యమంత్రి  శాసనమండలి సభ్యడిగా అవకాశం కల్పిస్తామనే హామీ ఇచ్చారు.  ఈ హామీని పార్టీ అధినేత బహిరంగంగా ప్రకటన చేయడంతో ప్రస్తుతం  మండలిలో సభ్యత్వం దక్కవచ్చని భావించిన నేతలు ఈ విడత ఆశలు వదులు కున్నారు. ఇతర పార్టీలకు కూడా శాసనసభలో  పెద్దగా బలం లేకపోవడంతో అధికార పార్టీకే ఈ స్థానం ఖాయంగా కనిపిస్తోంది. 

07:26 - September 20, 2016

చిత్తూరు : జస్టిస్‌ మంజునాథ అధ్యక్షతన ఏర్పాటైన ఎపి బిసి కమిషన్‌ తిరుపతిలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. కమిషన్‌కు వినతిపత్రాలు ఇచ్చేందుకు వచ్చిన కాపు, బీసీ సంఘాల నేతలు కలహించుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాపులను బీసీల్లో చేర్చొదంటూ బీసీ సంఘాలు, తమను వెనుకబడిన తరగతుల జాబితాల్లో చేర్చాలంటూ కాపు సంఘాల నేతలు ఘర్షణకు దిగడంతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రణరంగాన్ని తలపించింది. 
తిరుపతిలో ప్రజాభిప్రాయ సేకరణ 
బీసీ జాబితాలో కొత్త కులాలు చేర్చే అంశాన్ని పరిశీలించేందుకు జస్టిస్‌ మంజునాథ అధ్యక్షతన ఏర్పాటైన ఏపీ బీసీ కమిషన్‌ తిరుపతిలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది. నగర పాలక సంస్థ  కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాపు, బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమను బీసీ జాబితాలో చేర్చాలంటూ కాపులు బీసీ కమిషన్‌ను కోరారు. ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థితిలో ఉన్న కాపు, బలిజ కులాలను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చొందంటూ బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగి, పరస్పరం కలహించుకోవడంతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. 
ప్రాజభిప్రాయ సేకరణకు అంతరాయం 
ఇరు వర్గాల నినాదాలతో జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ ప్రాజభిప్రాయ సేకరణకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. పోలీసులు కాపు, బీసీ నేతలకు సర్దిచెప్పి, శాంతింప చేసేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. జస్టిస్‌ మంజునాథ కూడా రెండు వర్గాలకు నచ్చ చెప్పేందుకు కృషి చేశారు. కానీ అటు కాపు సంఘాల నేతలు, ఇటు బీసీ నాయకులు వినిపించుకోలేదు.  దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేయడంతో ఉద్రిక్తతలు సద్దుమణిగాయి.
తమకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు తగ్గిపోతాయి : బీసీ సంఘాలు   
కాపులను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చితే విద్య, ఉద్యోగాల్లో తమకు అవకాశాలు తగ్గిపోతాయని బీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
తమను బీసీల్లో చేర్చాల్సిందే :  కాపు సంఘాల నేతలు  
మరోవైపు తమను బీసీల్లో చేర్చాల్సిందేనని కాపు సంఘాల నేతలు తెగేసి చెబుతున్నారు. బీసీ కమిషన్‌ ముందు వాదనలు వినిపించేందుకు వచ్చిన తమను  అడ్డుకోవడం బీసీ నేతలకు తగదని కాపు సంఘాల నేతలు చెబుతున్నారు. కాపు, బీసీ సంఘాల ఘర్షణతో మొదటి రోజు ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో మంగళవారం జరిగే కార్యక్రమానికి  భద్రత పెంచాలని పోలీసులు నిర్ణయించారు. 

 

07:21 - September 20, 2016

అదో హాలీవుడ్  సినిమా. ఈ సినిమాను మీ జన్మలో చూడలేరు అనేది. అనేది ఉప శీర్శిక. సినిమా విడుదల తేదీ నవంబర్ 18, 2115. ఏంటీ ఈ వెబ్ సైట్ వాళ్లు సంవత్సరాన్ని తప్పు రాశారు అనుకుంటున్నారా? అయితే మీరే తప్పులో కాలేశారు. నిజంగానే ఈ సినిమా మరో వందేళ్ల తర్వాత విడుల కాబోతోంది. అంటే 2115లో అన్నమాట. 
ఈ సినిమా పేరు 100 ఇయర్స్. మనం ఎలాగూ చూడలేము కాబట్టి. 'ద మూవీ యూ విల్ నెవర్ సీ' అనే సబ్ టైటిల్  సింబాలిక్ గా పెట్టారు. నోరెళ్లబెట్టారా? వాస్తవానికి ఈ రోజు పుట్టిన బిడ్డకూడా మరో వందేళ్ల తర్వాత ఈ సమయానికి ఉండకపోవచ్చు.  ఈ అలాంటిది దర్శకుడు, నిర్మాత, చిత్ర యూనిట్ ఎలా ఈ సినిమాను చూస్తారన్నదే కదా మీ నెక్ట్స్ క్వష్చన్. దీనికి చిత్ర యూనిట్ సమాధానం చెబుతోంది. ఈ సినిమా రీల్ బుల్లెట్ ఫ్రూఫ్ లాకర్ లో పెట్టి సరిగ్గా నవంబంర్ 18, 2115లో మాత్రమే ఓపెన్ అయ్యేలా సెట్ చేశారు. అంతకంటే ముందు ప్రీమియర్ షోకు మాత్రం వెయ్యి మందిని ఇన్వైట్ చేస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్. దీని ట్రైలర్ మాత్రం గత సంవత్సరం నవంబర్ లోనే విడుదల చేశారు.
ఈ సినిమా రైటర్ జాన్ మార్కోవిచ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కాగా సెన్సేషన్ సృష్టించే ఈ తరహా విడుదల తేదీ ప్రకటించడంతో ప్రపంచ సినీ ప్రేమికులు మొత్తం ఓ సారి ఈ '100 ఇయర్స్' గురించి మాట్లాడుకునేలా చేసింది. మరి ఇది ప్రమోషన్ స్టంటా..? నిజంగానే 100 ఏళ్ల తర్వాత విడుదల చేస్తారా.! చూడాలి. 

నేడు రాత్రి ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్ బృందం

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బృందం ఇవాళ రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు అపెక్స్ కౌన్సిల్ భేటీ జరుగనుంది. ఐదు అంశాల ఎజెండాపై కౌన్సిల్ లో చర్చ జరుగనుంది.

సీపీఐ ఆధ్వర్యంలో నేటి నుంచి ప్రజా బ్యాలెట్

గుంటూరు : ప్రత్యేకహోదా, ప్యాకేజీలపై సీపీఐ ఆధ్వర్యంలో నేటి నుంచి 10 రోజులపాటు ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.  

 

Don't Miss