Activities calendar

21 September 2016

21:59 - September 21, 2016

వర్షం వణికించింది. ఒక్క రాత్రి వచ్చిన వాన విశ్వనగరం డొల్లతనాన్ని స్పష్టంగా చూపింది. రోడ్లన్నీ సంద్రమై, లోతట్టు ప్రాంతాలు జలమయమై.. జనజీవనం అస్తవ్యవస్తమై.. చివరికి అనేక ప్రశ్నలు రేకెత్తించింది. 2000 సంవత్సరంలో 15 సెంటీమీటర్ల వర్షానికి నగరం విలవిల్లాడింది. ఇప్పుడు కూడా ఆ స్థాయిలో వస్తే.. నగరానికి భరించే సత్తా ఉందా? ఊహించటానికే భయపడాల్సిన పరిస్థితి. భాగ్యనగరం భాగ్య సాగరం ఎందుకవుతోంది? ఈ దుస్థితికి కారణమేంటి? ఈ రోజు ఎపిసోడ్ లో ఇదే అంశంపై స్టోరీ చూద్దాం.. భాగ్య నగరం.. విశ్వనగరం.. అంతర్జాతీయ స్థాయిలో, అన్ని హంగులతో రూపుదిద్దుకుంటున్న నగరం.. ఇలా అనేక రకాలుగా హైదరాబాద్ గురించి గత పాలకులనుంచి, ప్రస్తుత పాలకుల వరకు చెప్పుకునే సందర్భం. కానీ, వాస్తవంలో కనిపించే సీన్ మరోలా ఉంది. ఎందుకీ సమస్య వచ్చింది? ఏ పాపం నగరాన్ని ఇలా శపించింది? ఏ నిర్లక్ష్యం హైదరాబాద్ నేటి దుస్థితికి కారణంగా మారింది..? ఎవర్ని నిందించాలి? ఎవర్ని ప్రశ్నించాలి..? భాగ్యనగరం ప్రపంచ పటంలో గుర్తింపు తెచ్చుకుంటున్నదని గప్పాలు కొట్టుకొంటున్నారు కానీ, వాస్తవం మాత్రం పొంగుతున్న డ్రైనేజీ నీళ్లలా కంపుకొడుతోంది.సిటీ ఆఫ్‌ ధౌజండ్‌ లేక్స్‌…. హైదరాబాద్‌… వేయి సరస్సుల నగరంగా పేరొందిన నగరం…ఒకనాడు నగరంలో ఎటు చూసినా చెరువులు, సరస్సులు .. కానీ, ఇప్పుడు సీన్‌ మారింది. వేయి సరస్సులు మాయమైనయ్‌…. లక్ష సరస్సులు పుట్టుకొచ్చినయ్‌… ఇప్పుడు చినుకు పడితే ప్రతి రోడ్డూ ఒక సరస్సే… విలవిల్లాడే జనాలు…. ఛిద్రమయ్యే జన జీవనం. ఇప్పుడు రోడ్లే సరస్సులుగా ఎలా మారాయి..? చెరువులను మింగిన నగరం ఇది ..కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న నగరం..ఇది ..చిన్న బ్రేక్ తర్వాత..ఇది వేయి చెరువుల నగరం కాదు.. చెరువులను మింగిన నగరం.. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న నగరం.. చినుకును ఒడిసిపట్టి ప్రజల దాహార్తిని తీరుస్తూ, వరదను బయటికి పంపే చెరువులు కాలువలను చేజేతులా నాశనం చేసి ఇప్పుడు చోద్యం చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మన నగరాలకు వరద విపత్తులను తట్టుకునే శక్తి లేదా..? చినుకుపడితే అతలాకుతలం అవ్వాల్సిందేనా? మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయా? గతంలో ముంబయి, హైదరాబాద్, చెన్నై... వరదలు నేర్పిన పాఠాలనుంచి ప్రభుత్వాలు ఏం నేర్చుకున్నాయి? కళ్లుతెరిచేదెప్పుడు? నానాటికి జనాభా పెరుగుతోంది. కానీ, నగరాలల్లో భద్రత కరువవుతోంది. జీవన స్థాయి పడిపోతోంది. ఎండకు వానకు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. నగరంలో బతుకంటే అనుక్షణం పోరాటంగా మారుతోంది. చినుకుపడితే భాగ్య సాగరంగా మారుతున్న నగర డ్రైనేజీ వ్యవస్థలో, చెరువుల పరిరక్షణలో ప్రభుత్వాలు మారకపోతే ఏ ప్రళయం ఎప్పుడు ముంచుతుందో ఊహించటం కష్టమే..మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

21:55 - September 21, 2016

హైదరాబాద్ : ఏ కష్టమొచ్చిందో...ఏ సమస్య చుట్టుముట్టిందో... హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న తీరు ఉలిక్కిపడేలా చేసింది...వారం రోజుల తర్వాత సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు బయటపడ్డాయి..

అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తి..
ఇది నగరంలోని లంగర్‌హౌజ్‌ ప్రాంతం...ఇంద్రారెడ్డి ఫ్లైవర్‌ డౌన్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు...ఫ్లైఓవర్‌ దిగుతున్న ఒక్కో వాహనాన్ని నిశితంగా గమనిస్తూ.. కొంచెం తులుతూ ముందుకు కదులుతున్నాడు..అక్కడ తాను అనుకున్న పని కానట్టుంది...వెంటనే వాహనాల రాకపోకలు తగ్గడంతో రోడ్డు క్రాస్ చేశాడు...ఆ తర్వాత ఒక్కో వాహనాన్ని గమనిస్తున్నాడు...కాని తాను అనుకున్న భారీ వాహనం రాలేదు..అందరిలానే తాను కూడా రోడ్‌ క్రాస్ చేసేందుకు ఉన్నాడనుకున్నారు..వాహనాలు రయ్ మంటూ వెళ్లిపోతున్నాయి..కాని అతను మాత్రం తదేకంగా రోడ్డు క్రాస్ చేయకుండా చూస్తూనే ఉన్నాడు...తాను అనుకున్న వాహనం వేగంతో వచ్చింది...అంతే...

కారు కింద పడ్డం గుర్తు తెలీని వ్యక్తి..
ఈ ఘటన ఈ నెల 14న సాయంత్రం హైదరాబాద్‌ లంగర్‌హౌజ్‌ పరిధిలో జరిగింది..తన కారు కింద ఎవరో పడ్డారని గమనించి బ్రేక్ వేసిన డ్రైవర్‌ వాహనాన్ని ఆపేలోపే ముందు టైర్లు అతనిపై నుంచి దూసుకుపోయాయి...దీంతో తీవ్ర గాయాలైన అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు...

నిమిషాలలో ఒళ్లు జలదరించే ఘటన
ఇదంతా కేవలం ఒక నిమిషం పది సెకన్లలో జరిగిపోయింది...తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని వచ్చిన ఆ వ్యక్తి తనను తాను బలితీసుకున్నాడు...అయితే అతను ఎవరు..? ఎందుకిలా చేసుకున్నాడన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు...

21:51 - September 21, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ నిర్వాసితుల సమస్యలపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రాజెక్ట్‌ వల్ల భూములు నష్టపోతున్న కుల, చేతి వృత్తుల వారికి పునరావాసంపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తరపున ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. పునరావాసం విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై గురువారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. దసరా తర్వాత తీర్పును వెలువరించనున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. 

21:46 - September 21, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.. టీటీడీపీ ఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయడాన్ని పరోక్షంగా తప్పుబట్టింది. ఈ అంశంపై రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. టీటీడీపీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. స్పీకర్ నిర్ణయం తర్వాత విచారణ కొనసాగిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది..

అనర్హత పిటిషన్‌పై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు
తెలంగాణ టీడీపీకి హైకోర్టులో ఊరట లభించింది.. తెలుగు దేశం పార్టీకి చెందిన 12మంది ఎమ్మెల్యేలను టీ.ఆర్.ఎస్.లో విలీనం చేస్తూ బులిటెన్ విడుదల చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది... ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ మధుసుదనాచారిని సూచించింది.

90రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు
ఫిరాయింపు ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని సవాల్‌ చేస్తూ టీడీఎల్పీ నేత రేవంత్‌ రెడ్డి కొద్దినెలలక్రితం హైకోర్టులో పిటిషన్ వేశారు.. ఈ పిటిషన్‌పై కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి.. తాము ఇచ్చిన అనర్హత పిటిషన్లను పక్కనబెట్టి ఇలా విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని రేవంత్‌ తరపు న్యాయవాది వాదించారు.. ఈ పిటిషన్లపై స్పీకర్‌ స్పందించకపోవడంవల్లే తమకు న్యాయం జరగడంలేదన్న లాయర్‌... కాలపరిమితితోకూడిన గడువు ఇవ్వాలని కోర్టును కోరారు.. అటు స్పీకర్‌ కాలపరిమితిపై కోర్టులు రాజ్యాంగ సవాలు చేసే అధికారం లేదని అడ్వకేట్ జనరల్ వాదించారు.. రెండువర్గాల వాదనలు విన్న కోర్టు... పిటిషనర్‌ తరపు లాయర్‌ వాదనతో ఏకీభవించింది.... 90రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది.

కోర్టు ఆదేశాలపై తెలంగాణ టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు....
మొత్తానికి స్పీకర్ నిర్ణయాలపై కాల వ్యవధి విధించే అధికారం కోర్టులకు ఉన్నా... అమలు చేయమని అదేశించే అధికారం న్యాయస్థానాలకు లేదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.. ఈ కేసు రానున్న మూడు నెలల్లో మరెన్ని మలుపులు తీసుకుంటుందో వేచిచూడాలి. 

21:40 - September 21, 2016

ఢిల్లీ : కృష్ణా జలాల వివాదంపై తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్రమంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రాజెక్టుల టెలిమేట్రీతో పాటు మరో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. తెలంగాణ చేపట్టిన డిండి, పాలమూరు ప్రాజెక్టులను ఏపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇక అనేక అంశాలపై చర్చించిన కౌన్సిల్‌.. పరిష్కారం కాని అంశాలపై మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది.

శ్రమశక్తి భవన్‌లో అపెక్స్‌ తొలి సమావేశం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి కేంద్రం పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్‌ కౌన్సిల్‌ తొలి సమావేశం శ్రమశక్తి భవన్‌లో జరిగింది. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా మరోసారి ఇద్దరు చంద్రులు ఢిల్లీలో కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

ఇరు రాష్ట్రాల వాదనలు వినిపించిన కేసీఆర్‌, చంద్రబాబు
కృష్ణ జలాలు, ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు తమ వాదనలను వినిపించారని, మంచి వాతావరణంలో చర్చలు జరిగాయన్నారు ఉమాభారతి. ప్రధానంగా మూడు అంశాలపై చర్చ జరిగిందని, వాటిపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. అయితే డిండి, పాలమూరు ప్రాజెక్టులపై ఏకాభిప్రాయం కుదరలేదని.. సామరస్యపూర్వకంగా చర్చించుకుంటే సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు ఉమాభారతి.

పరిష్కారం కాని సమస్యలపై మరోసారి భేటీ కావాలని నిర్ణయం
ఇక అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో టెలిమేట్రీ ఏర్పాటుకు ఇరు రాష్ర్టాలు అంగీకరించాయని ఉమాభారతి చెప్పారు. నీటి నిర్వహణ, సమస్యల పరిష్కారానికి సీడబ్ల్యుసీ పర్యవేక్షణలో ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కృష్ణా జలాల విషయంలో కర్ణాటక, మహారాష్ట్రల వివాదంపై కూడా సమావేశంలో చర్చించామన్నారు. నదీ జలాల పంపిణీ విషయంలో అన్ని వివాదాలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు ఉమాభారతి. ఈ సమావేశంలో పరిష్కారం కాని అంశాలపై మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ మంత్రులు, అధికారులు తమ రాష్ట్రాలకు జరుగుతున్న నష్టాలను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్లు ద్వారా కేంద్రమంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. 

21:36 - September 21, 2016

హైదరాబాద్ : కుండపోత వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలమైంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. వర్షాల వల్ల.. నగరంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రజారవాణ స్తంభించి పోయింది. వాననీరు... వరదల్లే ముంచుకు రావడంతో, పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై మోకాలి లోతులో నీరు నిలిచింది. వాహనాలు వాన నీటిలో మునిగిపోయాయి. అపార్ట్‌మెంట్లలనూ వాననీరు ముంచెత్తింది. అటు హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది.

వర్ష బీభత్సం
భారీ వర్షాలు భాగ్యనగర ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేశాయి. మంగళవారం రాత్రి నుంచీ ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు తడిసి ముద్దైన నగరంలో పలుచోట్ల ప్రజా రవాణా స్తంభించింది. నగరంలో రాజేంద్రనగర్‌, మెహిదీపట్నం, నాంపల్లి, అబిడ్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, సనత్‌నగర్‌, అమీర్‌పేట్‌, మలక్‌పేట్‌, ఛాదర్‌ఘాట్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో విరామం లేకుండా వర్షాలు కురవడంతో కాలనీలు, రహదారులు నీటి కుండల్లా తయారయ్యాయి. ఆల్వాల్‌, నిజాంపేటల్లో అపార్టుమెంట్లలోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో అక్కడి ప్రజలు బయటకు రాలేక.. పోటెత్తుతున్న వరద ధాటికి ఇళ్లలోనే ఉండలేక నరకయాతన అనుభవించారు.

ఎన్టీఆర్‌ గార్డెన్‌ వద్ద కుంగిపోయిన రోడ్
భారీ వర్షాల వల్ల.. నగరంలోని పలుచోట్ల ప్రజా రవాణ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు ఎన్టీఆర్‌ గార్డెన్‌ వద్ద రోడ్డు భారీ వర్షాల కారణంగా కుంగిపోయింది. వర్షాలకు రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విషయం తెలిసి హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు.. రోడ్డు కుంగిన ప్రాంతంలో బారికేడ్స్‌ ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో ఎవరూ రాకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.

హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు
మరోవైపు... నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 513.57 మీటర్లు. కాగా ఇన్‌ఫ్లో 4,000, ఔట్‌ఫ్లో 2,000 క్యూసెక్కులుగా ఉంది. గంటకు 20 సెంటిమీటర్ల నీటిమట్టం పెరుగుతోంది. బేగంపేట, ప్రశాంత్‌నగర్‌ కాలనీలు నీట మునిగాయి. బుధవారం కూడా అతిభారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో హుసేన్‌సాగర్‌కు మరింతగా నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. దిగువకు భారీ పరిమాణంలో నీటిని వదలాల్సి వుంటుంది. ఫలితంగా, చిక్కడపల్లి, నల్లకుంట నాలాల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.

వర్షం పరిణామాలపై సీఎం కేసీఆర్ ఢిల్లీ నుండి సమీక్ష
నగరంలో వర్షాలు, తాజా పరిణామాలపై సీఎం కేసీఆర్‌..బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి అధికారులు, జీహెచ్‌ఎంసీ యంత్రాంగంతో మాట్లాడారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. హుస్సేన్‌సాగర్‌, చెరువులు, కుంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ
భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. జీహెచ్‌ఎంసీ అధికారులు వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పురాతన భవనాలు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో నివసించేవారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కమిషనర్‌ జానర్ధన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

నగరంలో వర్షపాత వివరాలు
నగరంలో మంగళవారం రాత్రి నుంచి కురిసన వర్షాలకు... షాపూర్‌నగర్‌లో 14.6 సెం.మీ, బొల్లారంలో 8.3 సెం.మీ కూకట్‌పల్లిలో 5.8 సెం.మీ. బాలానగర్‌లో5.6సెం.మీ. వర్షపాతం నమోదైంది.

ఎన్టీఆర్ గార్డెన్ వద్ద కుంగిపోయిన గొయ్యిని పరిశీలించిన జీహెచ్ఎంసీ,జలమండలి
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్టీఆర్‌ మార్గ్‌లో రోడ్డు కుంగిపోయింది. దీంతో భారీ గొయ్యి ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు..గొయ్యిని తవ్వించి పరిస్థితిని సమీక్షించారు. రోజుకు 200 మీలియన్‌ లీటర్లు స్థాయికన్నా ఎక్కువ నీరు ప్రవహించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా ఉండేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని జలమండలి ఎండీ దానం కిషోర్‌ పేర్కొన్నారు.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలాచోట్ల చెరువులు, కుంటలు తెగిపోయి.. వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవులు
రంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. కాలనీలు జలమయమయ్యాయి. బాలాపూర్, కుత్బుల్లాపూర్, మల్కాజ్ గిరి, శేర్ లింగంపల్లిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు డీఈవో సెలవు ప్రకటించారు.

ఎర్రచెరువుకు భారీగా వరద నీరు
వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలోని పలు ప్రాంత్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తొర్రూరు మండలం వలవీడులో ఎర్రచెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలతో పెరిగిన వరదల్లో ముగ్గురు రైతులు చిక్కున్నారు. వారిని అతి కష్టమ్మీద రక్షించారు. పాలకుర్తి మండలం వల్మిడి గ్రామ సమీపంలోని వాగుకు వరదనీరు పోటెత్తడంతో..వాగు మధ్యలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు. వరదనీటిలో చెట్లను పట్టుకుని నిలబడటంతో స్థానికులు వారిని కాపాడారు.

నల్లగొండ జిల్లాలో గ్రామాల మధ్య వరద నీటిలో కారు కొట్టుకు పోయిన రోడ్లు
నల్లగొండ జిల్లాలో మంగళవారం రాత్రి భారీగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. నార్కట్ పల్లి, చిట్యాల, కట్టంగూరు మండలాల్లో కుంటలు ,చెరువులు నిండుకుండలా మారి అలుగులు పారుతున్నాయి. వరద ఉధృతికి నార్కట్ పల్లి మండలం చెర్పు గట్టు యల్లగూడెం గ్రామాల మధ్య వరద నీటిలో కారు కొట్టుకు పోయింది. స్థానికులు కారులోని ప్రయాణీకులను తాళ్ల సాయంతో సురక్షితంగా కాపాడారు. నార్కట్‌పల్లి మండలం చిన్నతుమ్మల గూడెం వద్ద వరద నీటిలో బైక్ కొట్టుకు పోయింది. మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 

భట్టుగూడెం-పెద్దరావులపల్లి వంతెన పై నిలిచిపోయిన  రాకపోకలు
హైదరాబాద్‌లోమూసీనది ఒక్కసారిగా మూడింతలు నీరు చేరి ప్రవహించడంతో.. భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి మండలాలకు పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం వల్ల బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మున్సిపల్‌ కేంద్రంలో పలు చోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి మురికి నీరు రోడ్ల పైకి చేరడంతో ప్రజలు ఇంబ్బందులు పడుతున్నారు. మూసీకి భారీగా వ‌ర‌ద‌ పోటెత్తడంతో భట్టుగూడెం-పెద్దరావులపల్లి వంతెన పై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

మెదక్ జిల్లాలో పొంగి పొర్లుతున్న రెల్లగడ్డవాగు
మెదక్‌ జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రెల్లగడ్డవాగు పొంగి పొర్లుతోంది. పటాన్‌చెరు సమీపంలో వాగు దాటుతుండగా.. వేణు అనే వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. చెట్ల మధ్యలో చిక్కుకుని కాపాడాలని కేకలు వేయడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వేణును కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

జగన్నాథపూర్‌ ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం జగన్నాథపూర్‌ ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు వచ్చి చేరింది. చింతగూడకు చెందిన రజియోద్దీన్‌ అనే యువకుడు పెద్దవాగులో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఒక్కసారిగా నీటి ఉధృతి పె రగడంతోనే రజియొద్దీన్‌ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అధికారులు, పోలీసులు సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

భారీ వర్షాలకు మూసినది ఉద్ధృతం
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసినది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నల్లగొండ జిల్లా పోచంపల్లి మండలం పిలయపల్లి గ్రామం వద్ద వరద ఉద్ధృతికి లారీ, డీసీఎంలు అదుపుతప్పాయి. చాకచక్యంగా డ్రైవర్లు, క్లీనర్లు తప్పించుకున్నారు. ఘాట్‌కేసర్‌ నుంచి చౌటుప్పల్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

వర్షాలపై సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి ఉన్నతాధికారులతో సమీక్ష
హైదరాబాద్‌లో కుండపోతగా కురుస్తున్న వర్షాలపై సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి ఉన్నతాధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారులకు సూచించారు. చెరువులు, కుంటల పరిస్ధితిని ఎప్పటికప్పుడూ సమీక్షించాలని..అవసరమైతే పోలీస్, డిజార్డర్, ఆర్మీ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని... అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు కేసీఆర్ సూచించారు .

జలదిగ్బంధంలో కాకినాడ
కుండపోత వర్షానికి తూర్పుగోదావరి జిల్లా తడిచిముద్దయ్యింది. జిల్లా కేంద్రం కాకినాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్లపై మోకాలి లోతున నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోకి కూడా వర్షం నీరు చేరింది. ఆనంద భారతి మైదానం పూర్తిగా నీట మునిగింది.

కడపలో వర్షాలు హోరెత్తిపోతున్నాయి...
కడపలో వర్షాలు హోరెత్తిపోతున్నాయి... పలు కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరింది.. గంజికుంట కాలనీ, మృత్యుంజయకుంట, భాగ్యనగర్‌ కాలనీ, సింహపురి కాలనీ, భరత్‌ నగర్‌వాసులు వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి..

శరణార్థుల పడవ మునక..29మంది మృతి!..

ఈజిప్టు : దాదాపు 600 మంది శరణార్థులతో వెళ్తున్న పడవ ఈజిప్టు తీరంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 29 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. వారిలో 18 మంది పురుషులు ఉండగా, 10 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరందరూ ఈజిప్టు, సిరియా, ఆఫ్రికాకు చెందిన శరణార్థులు యూరప్‌కు తరలివెళ్తున్నారు. ఇప్పటి వరకు 150 మంది శరణార్థులను రెస్క్యూ సిబ్బంది కాపాడినట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

20:57 - September 21, 2016

మొలేసిన మొక్కల్ని పీకేసిన రైతన్నలు..ఖమ్మం జిల్లాల రైతల గోస..అధికారుల్ని లోపలేసి తాళమేసిన అన్నదాతలు..పిల్లిని ఇంట్లో ఏసి కొట్టినట్లుగా జిల్లాల లొల్లి..కేటీఆర్ కు చుట్టుకున్న సిరిసిల్లలో లొల్లి..మహిళల్ని బూతులు తిట్టిన సీఐపై ఫిర్యాదుల పత్రం..దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యనట్లుగా..రోడ్డెక్కిన తిరుమల జానపద కళాకారులు..కట్టెపుల్లను ఇరిసినట్టు మడుసులను సంపేస్తున్న సాటి మడుసులు..వానలతో గుంతలైపోతున్న రోడ్లు..ఆగమైపోతన్న జనాలు..మొక్కుబడిగా పరామర్శించిన నేతలు..మరిన్ని ముచ్చట్ల కోసం ఈ వీడియో చూడుండ్రి..

పడవ మునిగి 13మంది మృతి..

బంగ్లాదేశ్‌ : దక్షిణప్రాంతంలోని ఒక నదిలో 50 మందితో ప్రయాణిస్తున్న పడవ బలమైన ప్రవాహం కారణంగా ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోగా మిగితా వారు గల్లంతయ్యారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు ఏఎస్‌పీ మొటలెబ్‌ హుస్సేన్‌ తెలిపారు. గల్లైంతైన వారిలో 25 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా, మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఎంసెట్-2 లీకేజీలో మరో 4గరు అరెస్ట్..

హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో సీఐడీ అధికారులు డాక్టర్‌తోపాటు నలుగురు దళారులను అరెస్ట్ చేశారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో డాక్టర్ కోట గంగాధర్‌రెడ్డి, పల్లం వెంకటదాస్, రామకోటేశ్వర్‌రావు, మహ్మద్ అబ్దుల్ రహ్మాన్ అలీ, తాజా మొయినుద్దీన్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.కాగా తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఎంసెట్-2 వ్యవహారంలో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. 

ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాకేశ్ లంచం తీసుకుంటూ సికింద్రాబాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఒక అపార్టుమెంట్ నిర్మాణ పనుల అనుమతుల నిమిత్తం బిల్డర్ కొండలరావు నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు.

ఆయన్ని ప్రధానిని చేస్తే కశ్మీర్ కు పరిష్కారమట?!..

ఢిల్లీ : ముస్లిం కులస్తుడిని కావడం వల్లే తాను ప్రధాని పదవిని పొందలేకపోతున్నానని సమాజ్ వాదీ పార్టీ నేత అజమ్ ఖాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.తనను కనుక ప్రధానిని చేస్తే, కేవలం ఏడాదిలోపే కాశ్మీర్ సమస్యను ఒక కొలిక్కి తెస్తానని.. అఖండ భారత్ ను నిర్మిస్తానని అన్నారు. యూరీ సెక్టార్ పై ఉగ్ర దాడుల ను పిరికిపంద చర్యలుగా ఆయన అభివర్ణించారు. యూరీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానాలేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై విమర్శల చేసే ప్రత్యర్థులు ‘మొరిగే కుక్కలు’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

19:53 - September 21, 2016

ఉమా భారతితో బాబు ప్రత్యేక భేటీ..

ఢిల్లీ : అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు చర్చలు జరిపారు. ప్రధానంగా పోలవరంకు సంబంధించి ప్యాకేజీలో ఇచ్చిన అంచనాలను తప్పుగా పేర్కొన్నారని, ఆ అంచనాలను సవరించాల్సిన అవసరం ఉందని కోరారు. అలాగే ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ఆయన ఉమా భారతితో చర్చించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమక్షంలో చెప్పలేని కొన్ని విషయాలను చంద్రబాబు ఉమాభారతికి వెల్లడించినట్లుగా సమాచారం.

దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు విచారణ వాయిదా..

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు విచారణకు నిందితుల తరపు న్యాయవాదులు గైర్హాజరయ్యారు. కొత్త న్యాయవాదుల నియామకానికి గడువు ఇవ్వాలని నిందితులు కోర్టును కోరారు. నిందితులు ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తున్నారని ఎన్‌ఐఏ కోర్టుకు ఫిర్యాదు చేసింది. అయితే నిందితులకు మరో అవకాశం ఇచ్చి కేసు విచారణను ఈనెల 26కు వాయిదా వేస్తున్నట్లు ఎన్‌ఐఏ కోర్టు తెలిపింది.

సహారా ఆస్తుల వేలం?..

హైదరాబాద్ : సహారా గ్రూప్‌నకు చెందిన 13 ఆస్తులను వేలం వేయడానికి సెబీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేలం ద్వారా రూ.1,400 కోట్లు వస్తాయని సెబీ అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని సెబీ నేడు ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో రూ.710కోట్లు రిజర్వు ధర ఉన్న ఆస్తులను అక్టోబర్‌ 27న హెచ్‌డీఎఫ్‌సీ రియాల్టీ ఆధ్వర్యంలో వేలం వేస్తారు. మరో రూ.672కోట్లు విలువైన ఆస్తులను అక్టోబర్‌ 25న ఎస్‌బీఐ క్యాపిటల్‌ ఆధ్వర్యంలో వేలం వేయనున్నారు.

సినీ నిర్మాత కార్యాలయంపై ఐటీ తనిఖీలు..

హైదరాబాద్ : వారాహి చలన చిత్రం అధినేత, ప్రముఖ సినీ నిర్మాత కొర్రపాటి సాయి ఆఫీసుపై ఐటీ శాఖాధికారులు దాడులు నిర్వహించారు. ‘ఈగ’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల విడుదలైన ‘జ్యో అచ్యుతానంద’ సినిమా హిట్ టాక్ వచ్చింది.

ప్రధాని నివాసంలో అత్యవసర సమావేశం..

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి రాజ్#నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. ఉడి ఉగ్రదాడి, తాజా పరిణామాలపై ఈ భేటీలో చర్చ జరుపుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సఫ్దార్‌జంగ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..

ఢిల్లీ: ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రిలో ఇవాళ సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది రోగులను ఆస్పత్రి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు. అధికారులు మూడు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

సఫ్దార్‌జంగ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..

ఢిల్లీ: ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రిలో ఇవాళ సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది రోగులను ఆస్పత్రి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు. అధికారులు మూడు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

19:11 - September 21, 2016

అనంతపురం : ఎమ్మెల్సీ గేయానంద్‌ దీక్ష విరమించారు.. ప్రభుత్వాస్పత్రిలో వైద్యపోస్టులు భర్తీ చేయాలని... ఆస్పత్రిని అభివృద్ధి చేయాలంటూ మూడురోజులక్రితం గేయానంద్ దీక్ష చేపట్టారు.. ఇవాళ ఆరోగ్యం క్షిణించడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు.. తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ దీక్ష విరమించనంటూ గేయానంద్‌ ఆస్పత్రిలోనే నిరసన కొనసాగించారు.. మూడు నెలల్లో ఆస్పత్రి సమస్యల్ని పరిష్కరిస్తామని కలెక్టర్‌ కోన శశిధర్‌నుంచి హామీ రావడంతో ఆయన దీక్ష విరమించారు.. 

18:58 - September 21, 2016

పశ్చిమగోదావరి : ఆచంట కొత్తూరు సెంటర్‌లో యువతిపై దాడి జరిగింది. ఇటీవల కాలంలో నిర్భయ కేసులో నిందుతులైన నెక్కంటి శ్రీను, సుశీల దంపతులు తమపై ఫిర్యాదు చేసిన యువతిపై దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. తనకు మత్తు పానీయాలిచ్చి వ్యభిచారం చేయాలంటూ ఈ దంపతులు ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు గతంలో కేసు పెట్టింది. దీంతో దంపతులను నిర్భయ కేసు కింద పోలీసులు అరెస్ట్‌ చేశారు. యువతిపై కక్ష పెంచుకున్న దంపతులు...బెయిల్‌ పై బయటకు వచ్చి అర్థరాత్రి ఆమెపై దాడికి పాల్పడ్డారు.

18:55 - September 21, 2016

విశాఖ : ఉక్కు నగరం విశాఖపట్టణంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి... ఎన్నడూ లేని విధంగా అటు రౌడీ గ్యాంగ్‌ల దాడులు ఇటు కొలిక్కి రాని కేసులు వాటికి తోడు గుర్తు తెలియని హత్యలు నగరవాసులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.. విభజన నేపథ్యంలో విశాఖకు ప్రముఖల తాకిడి, ప్రపంచస్థాయి సదస్సులు ఎక్కువయ్యాయి. పోలీసులు బందోబస్తుకే సరిపోతుండడంతో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి..

రౌడీ షీటర్ల మధ్య అధిపత్యపోరు..
విశాఖ నగరం రాను రాను రౌడీల రాజ్యంలా మారుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖకు చాలా ప్రత్యేకత ఉంది.. ఓ వైపు సముద్ర తీరం.. మరోవైపు పచ్చదనం.. ఇది ఒకప్పుడు పరిస్థితి. ఇప్పుడు నగరంలో రౌడీ షీటర్లు మధ్య అధిపత్యపోరుతో భయాందోళనలు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు చేసుకుంటూ రక్తచరిత్ర లిఖిస్తున్నారు.

రెండు రౌడీ గ్యాంగ్ గ్రూపులు
నగరంలో రెండు రౌడీ గ్యాంగ్ గ్రూపులు ఉన్నాయి.. ఓ వర్గంకు అనిల్.. రెండవ వర్గంకు పొడుగు కిరణ్ నాయకత్వం వహిస్తూ వచ్చారు. వీరి మధ్య ఆధిపత్యపోరుతో ఇప్పటివరకూ ఆరుగురు మరణించారు.. ఇటీవలే ఈ గ్యాంగ్‌ల బాస్‌లు కూడా మరణించడంతో రక్త చరిత్ర ఆగిందనిపించింది.. అయితే తాజాగా పారిశ్రామిక నగరంలో ఆయిల్ మాఫియా కోరలు చాచింది.. ఆయిల్ వ్యాపారంలో అరితేరిన తోట రామరావు అలియాస్ ఆయిల్ రామును ఆయన ఇంట్లోనే హత్య చేశారు దుండగులు.. ఇదే సమయంలో భీమిలి పరిధిలో ఓ మహిళ అత్యాచారినికి దారుణ హత్యకు గురైంది.. ఇదే సమయంలో పూర్ణమార్కెట్ లో ఓ యువకుడిని కత్తులతో పొడిచి చంపారు..

విశాఖలో కేసుల విచారణలో జాప్యం
విశాఖనగర పొలీస్‌ కమీషనర్‌గా యోగానంద్‌ బాధ్యతలు తీసుకున్న వెంటనే అవినీతి అరోపణలు ఎదుర్కుటున్న పలువురు అధికారులను నిర్మొహామాటంగా విధుల నుంచి తొలగించారు సీపీ.. దీంతో విశాఖ పరిస్థితి మెరుగవుతుందని ఇక్కడి ప్రజలు భావించారు.. అయితే కేసుల విచారణలో జాప్యం జరుగుతుండటం..మరో వైపు అనకాపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన లావణ్య విషయంలో పోలీసుల వ్యవహారం అనేక విమర్శలకు తావిచ్చింది

నగరంలో వివిధ సభలు సమావేశాలు
కొద్ది కాలంగా నగరంలో వివిధ సభలు సమావేశాలు జరుగతూ ఉన్నాయి. బ్రిక్స్ సదస్సులో దేశ ,విదేశాల ప్రతినిధులు రావడం జరిగింది.. వారానికి కనీసం ఒక్కసారైన కేంద్రమంత్రో, ముఖ్యమంత్రో విశాఖకు వస్తున్నారు. దీంతో ఉన్న పోలీసులు అందరు వీవీఐపీల భద్రతకే సరిపోతున్నారు. వీఐపీల భద్రతకే ప్రాధాన్యతను ఇస్తూ ప్రజల రక్షణను గాలికి వదిలేస్తున్నారని నగరవాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు నేరాలకు పాల్పడే వారినపై నిఘాపెట్టి.. తమకు భద్రత కల్పించాలని విశాఖ ప్రజలు కోరుతున్నారు..

18:50 - September 21, 2016

విశాఖ : తగరపువలసలో జాతీయ రహదారిపై ఆయిల్‌ ట్యాంకర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌ సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడటంతో డీజిల్‌ కోసం స్థానికులు ఎగబడ్డారు. క్యాన్లు, డబ్బాలతో డీజిల్‌ పట్టుకునేందుకు పోటీపడ్డారు. 

18:48 - September 21, 2016

తూర్పుగోదావరి : కుండపోత వర్షానికి తూర్పుగోదావరి జిల్లా తడిచిముద్దయ్యింది. జిల్లా కేంద్రం కాకినాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్లపై మోకాలి లోతున నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోకి కూడా వర్షం నీరు చేరింది. ఆనంద భారతి మైదానం పూర్తిగా నీట మునిగింది. కాకినాడలో వర్షం బీభత్సంపై మా ప్రతినిధి శంకర్‌ మరిన్ని వివరాలు అందిస్తారు. 

18:47 - September 21, 2016

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీన్ కలిసాడు. ఏపీకి ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత పై చర్చించారు. ప్యేకేజీకి చట్టబద్దత కల్పించాలని అరుణ్ జైట్లీని ఆయన కోరారు. 

18:44 - September 21, 2016

ఢిల్లీ : వివాదాలతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ప్రయోజనం ఉండదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో అన్నారు. ఇరు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి ఢిల్లీలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం రెండున్నర గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ పాల్గొన్నారు. ఎంతో అనుభవం ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చించుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని ఉమాభారతి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మూడు అంశాలపై ఏకాభిప్రాయం కుదరగా.. డిండి, పాలమూరు ప్రాజెక్టులపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఇంజనీర్ల కమిటీని వేయనున్నట్లు ఉమాభారతి తెలిపారు. 

నగరంలో 200ల ఎమర్జన్సీ టీమ్స్..

హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 200 అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. వర్షాలపై పలు శాఖల అధికారులతో జనార్ధన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాలు పూర్తి సహకారం అందించడంతో నగరంలో వర్షాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. 

నగరంలో 200ల ఎమర్జన్సీ టీమ్స్..

హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 200 అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. వర్షాలపై పలు శాఖల అధికారులతో జనార్ధన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాలు పూర్తి సహకారం అందించడంతో నగరంలో వర్షాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. 

17:58 - September 21, 2016

నల్లగొండ : నయీం కేసులో సిట్‌ వేగం పెంచింది. నయీం వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి తెరపైకి వచ్చిన నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ముఖ్య అనుచరుడు పలుగుల శ్రీనివాస్‌ను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌ ఎమ్మెల్సీకి బినామీగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. శ్రీనివాస్‌ తుర్కపల్లి మండలం మాదాపూర్‌ గ్రామస్తుడు. శ్రీనివాస్‌ను సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో నయీంతో సంబంధాలున్న నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

17:54 - September 21, 2016

హైదరాబాద్ : జంట నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఎదురువున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ 220 అత్యవసర బృందాలను ఏర్పాటు చేసింది. పొంగిపొర్లుతున్న డ్రెయిన్లు, నాలాలు, నీటి మునిగిన కాలనీలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2.00గలకు 518 ఫిర్యాదులొచ్చినట్లుగా జీహెచ్ఎంసీ అధికారి తెలపారు. నార్త్ అండ్ వెస్ట్ లలో ఇబ్బందులెక్కువగా వున్నాయని తెలిపారు. నాలా పరీవాహక ప్రాంతంలో వున్నవారికి పలు సూచనలందించినట్లుగా కూడా అధికారులు పేర్కొంటున్నారు. శానిటేషన్ కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

17:51 - September 21, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణపై అభ్యంతరాలకు గడువు నేటితో ముగిసింది. ప్రభుత్వానికి లక్ష కుపైగా దర్యాప్తులు అందాయి. దీంతో డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. రెవెన్యూ డివిజన్లు 44 నుంచి 58కి.. మండలాలు 459 నుంచి 534 కి పెరగనున్నాయి. అయితే డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా చిన్నగూడూరును సీఎం కేసీఆర్‌ మండలంగా ప్రకటించారు. అదేవిధంగా వికారాబాద్‌ జిల్లా పరిధిలోకి వచ్చే శంకర్‌పల్లి, మొయినాబాద్‌, షాబాద్‌లను శంషాబాద్‌ జిల్లాలో కలపాలని కేసీఆర్‌ ఆదేశించారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

17:48 - September 21, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఢిల్లీలో కేంద్రమంత్రి ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి చంద్రబాబు, కేసీఆర్‌తో పాటు.. ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మూడు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని.. మరో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదని ఉమాభారతి అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరిస్తామని.. కృష్ణా, గోదావరి జల వివాదాల పరిష్కారానికి సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఇంజనీర్ల కమిటీ వేయనున్నట్లు ఉమాభారతి తెలిపారు. 

భారత్ కే ఎక్కువ నష్టం..

జమ్ము కశ్మీర్ : ఉగ్రవాదంపై పోరులో, ఉగ్రవాదులు జరుపుతున్న దాడిలో అధికంగా నష్టపోతున్నది ఇండియానేనని స్పష్టమవుతోంది. 2016లో ఇప్పటివరకూ ఉగ్రవాదుల చేతుల్లో 64 మంది జవాన్లు మరణించినట్టు ఎస్ఏటీపీ (సౌత్ ఆసియా టెర్రరిజమ్ పోర్టల్) వెల్లడించింది. ఇదే సమయంలో వాస్తవాధీన రేఖ వెంబడి 31 మంది ఉగ్రవాదులు మాత్రమే మరణించారని చెప్పింది. గడచిన ఆరేళ్లలో ఇంత అధికంగా భారత్ తన జవాన్లను పోగొట్టుకోలేదని తెలిపింది.

ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ పెంపు..

ఢిల్లీ : స్వాతంత్య్ర సమరయోధులకు పింఛన్ పెంచుతానని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ నెరవేరనుంది. స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే ఫింఛన్ 20 శాతం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, ఈరోజు ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకున్నారు. నాడు మోదీ చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాగా, స్వాతంత్ర్య సమరయోధులకు లేదా వారసులకు ఇచ్చే పింఛన్ ను 20 శాతం, డీఏ కూడా పెంచుతామని ఆగస్టు 15న ఎర్రకోట పై నుంచి మోదీ నాడు చేసిన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే.

కశ్మీర్ లో భారీగా డంప్ స్వాధీనం..

జమ్ముకాశ్మీర్‌ : ఉగ్రవాదులకు సంబంధించిన భారీ డంప్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది. సిఆర్‌పిఎఫ్, జమ్ముకాశ్మీర్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఈ డంప్ బయటపడింది. త్రాల్‌లోని కమ్లా అటవీ ప్రాంతంలో ఈ డంప్‌ బయటపడింది. ఏకే56 రైఫిల్, స్నిఫర్ రైఫిల్, మిషన్ గన్, ఇతర పేలుడు పదార్ధాలు, పెద్ద ఎత్తున బుల్లెట్లు లభించాయి.

కశ్మీర్ లో భారీగా డంప్ స్వాధీనం..

జమ్ముకాశ్మీర్‌ : ఉగ్రవాదులకు సంబంధించిన భారీ డంప్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది. సిఆర్‌పిఎఫ్, జమ్ముకాశ్మీర్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఈ డంప్ బయటపడింది. త్రాల్‌లోని కమ్లా అటవీ ప్రాంతంలో ఈ డంప్‌ బయటపడింది. ఏకే56 రైఫిల్, స్నిఫర్ రైఫిల్, మిషన్ గన్, ఇతర పేలుడు పదార్ధాలు, పెద్ద ఎత్తున బుల్లెట్లు లభించాయి.

16:59 - September 21, 2016

1932 లో ప్రపంచ క్రికెట్ మక్కా లండన్ లార్డ్స్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో భారత్ తొలిటెస్ట్ మ్యాచ్ ఆడటం ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసింది. నాటినుంచి నేటివరకూ..భారత్ 499 మ్యాచ్ లు ఆడి..అత్యధిక టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అతికొద్ది దేశాలలో ఒకటిగా రికార్డుల్లో చేరింది. ఈసందర్భంగా టెన్ టివి చర్చా వేదిక చేపట్టింది. ఈ చర్చా వేదికలో చంద్రశేఖర్ (బీసీసీఐ స్కోరర్, అంపైర్), విశ్వనాథ్ (స్పోర్ట్స్ ఎడిటర్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:58 - September 21, 2016

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ..టీమిండియా 500వ మ్యాచ్ ను అట్టహాసంగా నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 22 నుంచి 26 వరకూ జరిగే ఈ మ్యాచ్ కు...టీమిండియా మాజీ కెప్టెన్లందరినీ ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించాలని బీసీసీఐ నిర్ణయించింది. 
1932 లో ప్రపంచ క్రికెట్ మక్కా లండన్ లార్డ్స్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో భారత్ తొలిటెస్ట్ మ్యాచ్ ఆడటం ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసింది. నాటినుంచి నేటివరకూ..భారత్ 499 మ్యాచ్ లు ఆడి..అత్యధిక టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అతికొద్ది దేశాలలో ఒకటిగా రికార్డుల్లో చేరింది. తెలుగుతేజం కర్నల్ కఠారి కనకయ్య నాయుడు కెప్టెన్ గా మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన భారత జట్టుకు 158 పరుగుల పరాజయం తప్పలేదు.
ఆ తర్వాత 24 సంవత్సరాలకు...చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా జరిగిన 50వ టెస్ట్ మ్యాచ్ లో పాలీ ఉమ్రిగర్ నాయకత్వంలో పోటీకి దిగిన భారత్ ఇన్నింగ్స్ 5 పరుగుల ఓటమి చవిచూసింది. భారత జట్టు ఆడిన 100వ టెస్ట్ మ్యాచ్ లో మన్సూర్ అలీఖాన్ పటౌడీ కెప్టెన్ గా వ్యవహరించారు. బర్మింగ్ హామ్ వేదికగా 1967లో జరిగిన ఈమ్యాచ్ లో ఇంగ్లండ్ 132 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది.
1977లో చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా...ఇంగ్లండ్ తో 150వ టెస్ట్ఆడిన భారత జట్టుకు...లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ బిషిన్ సింగ్ బేడీ నాయకత్వం వహించారు. ఈ మ్యాచ్ లో సైతం భారత్ కు 200 పరుగుల భారీ ఓటమి తప్పలేదు.
లాహోర్ గడ్డాఫీ స్టేడియం వేదికగా 1982లో 200వ టెస్ట్ మ్యాచ్ ఆడిన భారత్ కు..ఓపెనర్ సునీల్ గవాస్కర్ నాయకత్వం వహించారు. ఈ మ్యాచ్ హోరాహోరీ డ్రాగా ముగియడం విశేషం. 1988 సీజన్లో ..చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ..ఆల్ రౌండర్ రవిశాస్త్రి సారథ్యంలో భారత్ 250వ టెస్ట్ మ్యాచ్ లో పాల్గొంది. వెస్టిండీస్ ప్రత్యర్థిగా భారత్  ఈ మ్యాచ్ లో 255 పరుగుల భారీవిజయం నమోదు చేసింది.
1996 సీజన్లో అహ్మదాబాద్ సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన భారత 300వ టెస్టు లో మాస్టర్ సచిన్ టెండుల్కర్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్ లో భారత్ 64 పరుగులతో విజేతగా నిలిచింది. భారత జట్టు 2002 సీజన్లో ఆడిన 350వ టెస్ట్ మ్యాచ్ లో సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించాడు. నాగపూర్ విదర్భ స్టేడియం వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 101 పరుగుల భారీవిజయం నమోదు చేసింది.
2006 సీజన్లో ...కింగ్ స్టన్ సబైనా పార్క్ వేదికగా..వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ భారత్ కు 400వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలో భారత్ 49 పరుగుల సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
భారత జట్టు 450వ టెస్ట్ మ్యాచ్ ను సైతం విదేశీ గడ్డపైనే ఆడింది. 2011 సిరీస్ లో భాగంగా బ్రిడ్జిటౌన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించాడు. ఈ మ్యాచ్ సైతం డ్రాగానే ముగిసింది.
నవతరం కెప్టెన్ విరాట్ కొహ్లీ నాయకత్వంలో టీమిండియా...ఇప్పుడు 500వ టెస్ట్ మ్యాచ్ కు సిద్ధమయ్యింది. ఏడేళ్ల విరామం తర్వాత గ్రీన్ పార్క్ వేదికగా జరుగనున్న ఈ చిరస్మరణీయ మ్యాచ్ లో 7వ ర్యాంకర్ న్యూజిలాండ్ పై విరాట్ ఆర్మీ విజేతగా నిలవాలని కోరుకొందాం.

16:53 - September 21, 2016

ఢిల్లీ : ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌కు ఉచ్చు బిగుస్తోంది. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలంటూ అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశ పెట్టారు. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన టెడ్‌ పో, డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన డానా రోహ్రాబాకర్‌ ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. నాలుగు నెలల్లోపూ 'ద పాకిస్తాన్‌ స్టేట్‌ స్పాన్సర్‌ ఆఫ్‌ టెర్రరిజం డిజిగ్నేషన్‌ యాక్ట్' పేరిట ఈ బిల్లును రూపొందించనున్నారు. పాకిస్తాన్‌ అవిశ్వాసనీయ మిత్రదేశమని, ఎన్నో ఏళ్లుగా అమెరికా శత్రువులను పాక్‌ పెంచి పోషిస్తోందని టెడ్‌ పో ఆరోపించారు. తమ బిల్లుకు ఒబామా ప్రభుత్వం జవాబు చెప్పాల్సి ఉంటుందన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ప్రసంగానికి ముందు ఈ చర్య ఆ దేశాన్ని సిగ్గుతో తలవంచుకునేలా ఉందని నిపుణులు చెబుతున్నారు.

16:49 - September 21, 2016

పంజాబ్ : కొత్త పార్టీని ఆర్భాటంగా ఆరంభించిన మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం వెనక్కి తగ్గారు. పార్టీ నిలదొక్కుకునేందుకు మరో రెండు మూడేళ్ల సమయం పడుతుందని ఓ ప్రకటనలో సిద్ధూ తెలిపారు. తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా బాదల్‌-అమరీందర్‌ పార్టీల ఓట్లను చీల్చడం తనకిష్టం లేదని సిద్ధూ చెప్పారు. అయితే రాజకీయాల్లో తమ పార్టీ 'ఆవాజ్‌ ఎ పంజాబ్' చురుకుగా పాల్గొంటుందన్నారు. బిజెపి తనను నిర్లక్ష్యం చేస్తోందన్న అసంతృప్తితో సిద్ధూ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.

16:46 - September 21, 2016

ఢిల్లీ : మహిళా కమిషన్‌లో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఎసిబి ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఢిల్లీ మహిళా కమిషన్‌లో 85 మందిని అక్రమంగా భర్తీ చేశారంటూ మాజీ ఛైర్మన్‌ బర్ఖా శుక్లాసింగ్‌ ఫిర్యాదు మేరకు ఎసిబి దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌పై ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడమే కాకుండా ఆమెను రెండు గంటలపాటు విచారించింది. ప్రధాని మోది సూచనల మేరకే సిఎంగా ఉన్న తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌లో తన పాత్రపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు. దీనిపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని తెలిపారు. మహిళా కమిషన్‌ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. 

శాంతియుత వాతావరణంలో చర్చలు - ఉమా భారతి..

ఢిల్లీ : శాంతియుత వాతావరణంలో చర్చలు జరిగాయని, టెలిమెట్రి విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ఉమా భారతి పేర్కొన్నారు. కాసేపటి క్రితం అపెక్స్ కమిటీ సమావేశం ముగిసింది. ఇంజనీర్ల కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని, కమిటీలో రెండు రాష్ట్రాల అధికారులుంటారని పేర్కొన్నారు. నీటి వాడకం, పంపకాలను కమిటీ పర్యవేక్షించనుందన్నారు. సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ఇంజనీర్ల కమిటీ ఉంటుందని, సమావేశంలో మూడు అంశాలపై చర్చించడం జరిగిందని, సుప్రీంకోర్టు ఆదేశానుసారమే ఈ సమావేశం జరిగిందన్నారు. 

16:44 - September 21, 2016

పశ్చిమగోదావరి : జిల్లా భీమవరంలో డిసెంబర్‌ 21నుంచి 23వరకూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి.. విద్యారంగ సమస్యలపై ఇందులో చర్చిస్తామని... ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి తెలిపారు.. ఈ కార్యక్రమానికి కేరళ విద్యాశాఖామంత్రితోపాటు, పలువురు హాజరవుతారని తెలిపారు..

16:42 - September 21, 2016

హైదరాబాద్ : తెలంగాణ సామాజిక, సమగ్ర అభివృద్ధి సాధనకోసం మహాజన పాదయాత్ర చేపడుతున్నామని... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.. ఈ అక్టోబర్‌ 17నుంచి వచ్చే ఏడాది మార్చి 12వరకూ రాష్ట్రవ్యాప్తంగా యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు... హైదరాబాద్‌లోని ఎస్వీకే లో పాదయాత్రకు సంఘీభావంగా దళితుల సమస్యపై చర్చాగోష్టి జరిగింది.. ఈ కార్యక్రమానికి తమ్మినేని హాజరయ్యారు..

అల్పపీడనంగా ఉపరితలం..

విశాఖపట్టణం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాను ఆనుకుని ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా కొనసాగుతోంది. రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 50 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 

ముగిసిన అపెక్స్ కమిటీ సమావేశం..

ఢిల్లీ : అపెక్స్ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన శ్రమశక్తి భవన్ లో ఈ భేటీ కొనసాగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. కృష్ణా..గోదావరి జలాల పంపిణీపై చర్చ జరిగింది. 

వృద్ధ కేన్సర్ పేషెంట్ పై అత్యాచారం..

కేరళ : కామంతో కళ్లు మూసుకుపోయినప్పుడు ఎవరికీ భయపడటం కానీ సిగ్గుమాలిన పని చేస్తున్నామనే పాపభీతి కానీ ఉండవు. ఇవే లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఓ ప్రబుద్ధుడు ఓ వృద్ధ మహిళపై అత్యాచారం చేశాడు. ఆ మహిళ వయస్సు 90 ఏళ్లు. పైగా కేన్సర్ పేషెంట్ కూడా. దక్షిణ కొల్లాం సమీపంలోని కడక్కల్‌లో ఉన్న వృద్ధ మహిళ ఇంట్లోకి అర్ధరాత్రి వేళ చొరబడిన ఆగంతకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈనెల 14న ఈ ఘటన చేటుచేసుకున్నప్పటికీ బుధవారంనాడు వెలుగుచూసింది.

16:15 - September 21, 2016

చిత్తూరు : టీటీడీ నిర్వహించే ఉత్సవాల్లో తమకు అవకాశం కల్పించాలని జానపద కళాకారులు టీటీడీ పరిపాలన భవనం దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. కళాకారులకు జానపద కళాకారుల సంఘ జాతీయ అధ్యక్షులు యాదగిరి మద్దతు పలికారు. యాదగిరితో పాటు ఆరుగురు కళాకారులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కళాకారుల సమస్యల పరిష్కారం కోసం చావుకైనా సిద్ధమే అంటున్న జానపద కళాకారుల సంఘ జాతీయా అధ్యక్షులు యాదగిరి పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:13 - September 21, 2016

హైదరాబాద్ : నగరంలోని లంగర్ హౌస్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. లంగర్ హౌస్ నుండి టోలీచౌకీ వెళ్లేదారిలో కారుకింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేసమయానికి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గుర్తు తెలియని ఆ వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగి వారం రోజులైనట్లుగా సమాచారం. సమీపంలోని సీసీ కెమోరాల పుటేజ్ ఆధారంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకునే ఉద్దేశ్యంతోనే వ్యక్తి ప్రయత్నించాడు తప్ప తన తప్పేమీ లేదని కారు డ్రైవర్ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. కాగా మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడికాలేదు. ఈ విషయంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పుటేజీలోని దృశ్యాలను పరిశీలిస్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే సదరు వ్యక్తి యత్నించినట్లుగా స్పష్టమవుతోంది.

సిట్ అదుపులో నయీం మరో అనుచరుడు..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయాం అనుచరులు ఒక్కొక్కరినీ సిట్ అదుపులోకి తీసుకుంటోంది. పలుగుల శ్రీనివాస్ అనే అనుచరుడిని గురువారం సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీకి శ్రీనివాస్ ముఖ్య అనుచరుడిగా పనిచేసేవాడు. నాయం కీలక వ్యవహారాల్లో శ్రీనివాస్ చురుగ్గా పనిచేస్తుండేవాడు. ఇప్పటికే సిట్ అధికారులు పలువురు అనుచరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

సీసీ కెమోరాలు వద్దు : సుప్రీంకోర్ట్

ఢిల్లీ : మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లకు అనుమతులు, నిబంధనలపై సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. డ్యాన్స్ బార్లలో సీసీ కెమెరాల నిఘా అవసరం లేదని అభిప్రాయపడింది. బార్లలోని సీసీటీవీల కనెక్షన్లు సమీపంలోని పోలీసు స్టేషన్లకు అనుసంధానమై ఉండాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బార్ యజమానులు కోర్టుకు వెళ్లగా, సీసీటీవీ కెమెరాలు అక్కడికి వెళ్లే కస్టమర్ల ప్రైవసీని పాడు చేస్తాయని కోర్టు అభిప్రాయపడింది. 

ఢిల్లీ వేస్ట్ అంట!..

హైదరాబాద్ : మహిళా ఉద్యోగుల భద్రతలో తెలంగాణ రాష్ట్రానికి రెండో ర్యాంకు లభించింది. అలాగే ఉద్యోగాలు చేసే మహిళలకు ఢిల్లీ నగరం పరమ వేస్ట్ అని, ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం బెస్ట్ అని తేలింది. అలాగే రెండోస్థానంలో తెలంగాణ నిలవగా, ఆంధ్రప్రదేశ్‌కు ఆరోస్థానం లభించింది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్), నాథన్ అసోసియేట్స్ సంస్థలు సంయుక్తంగా చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 

కొరియర్ బోయ్ గా వచ్చి చోరీ..

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్గదర్శి కాలనీ రోడ్ నెంబర్-6లో బంగారు దొంగతనం జరిగింది. ఓ నివాసం వద్దకు వచ్చిన దొంగ కొరియర్ వచ్చిందని డోర్ కొట్టాడు. ఇంట్లో ఉన్న మహిళ కళ్ళల్లో కారం చల్లి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగ లాక్కెళ్లాడు. బాధిత మహిళ చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు ఓమ్ని ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తోంది.

15:19 - September 21, 2016

హైదరాబాద్ : నగరంలో మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసంది. దీనితో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్వాల్ లో రహదారులు..కాలనీలు నీట మునిగిపోయాయి. ప్రధానంగా టెంపుల్ అల్వాల్ లో పరిస్థితి దారుణంగా తయారైంది. నాలాలు పొంగి పొర్లుతుండడంతో సమీప కాలనీలు నీట మునిగిపోయాయి. సుమారు మూడు ఫీట్ల మేర నీరు నిలవడం..కాంప్లెక్స్ సెల్లార్ లు నీటితో నిండిపోయాయి. వాహనాలు పూర్తిగా మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా అల్వాల్ లోని మోత్కుల కుంట నిండిపోయింది. పక్కనే ఉన్న అలుగు నుండి భారీగా నీరు వెళుతోంది. దీనితో రోడ్డంతా ధ్వంసమైంది. ఈ నీరంతా సమీపంలో ఉన్న కాలనీలకు వెళుతోంది. స్థానికంగా ఉండే కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:13 - September 21, 2016

ఢిల్లీ : 'అపెక్స్' కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. బుధవారం మధ్యాహ్నం ఈ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్..చంద్రబాబు నాయుడులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి ఉమా భారతి అధ్యక్షతనలో ఈ భేటీ జరుగుతోంది. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కృష్ణా యాజమాన్య బోర్డు ప్రజంటేషన్ ఇచ్చింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల వైఖరిని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాదనలు వినిపిస్తున్నారు. అనంతరం కేంద్ర మంత్రి ఉమా భారతి మాట్లాడనున్నారు. ఈ సమావేశం అనంతరం మీడియాకు వివరాలు తెలియచేయనున్నారు.

విభజన అనంతరం..
విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య.. సాగునీటికి సంబంధించిన వివాదాలు మొదలయ్యాయి. రెండున్నరేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం పెరుగుతూ వస్తోంది. ఇరు ప్రాంతాల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటూ.. పరిస్థితిని మరింత జటిలం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం.. వివాద పరిష్కారానికి అపెక్స్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు అపెక్స్ కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం.. ఇద్దరు ముఖ్యమంత్రులకూ లేఖలు రాసింది. వారి అంగీకారం మేరకు.. ఈనెల 21న అంటే బుధవారం అపెక్స్ కమిటీ భేటీ నిర్వహిస్తోంది.

వాడి వేడి చర్చ..
'అపెక్స్' కమిటీ సమావేశంలో.. పాలమూరు-రంగారెడ్డి, దిండి.. పట్టిసీమ..పోలవరం ప్రాజెక్టులపై వాడివేడి చర్చ సాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపడుతోందని ఏపీ ఆక్షేపిస్తోంది. దీనిపై గట్టిగా వాదన వినిపించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం సమాయత్తమైంది. అయితే.. ఏపీ ఆక్షేపణను తెలంగాణ సర్కారు తోసిపుచ్చుతోంది. ఈ రెండు ప్రాజెక్టులనూ గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినవేనని వాదిస్తోంది. దీంతో పాటే.. పట్టిసీమ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు అంశాలను భేటీలో లేవనెత్తాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.

దేవెగౌడను కలువనున్న సిద్ధరామయ్య...

కర్నాటక : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి దేవెగౌడను కలుసుకోనున్నారు. సాయంత్రం జరిగే ఈ భేటీ కావేరీ జల వివాదంపై చర్చించనున్నారు. 

అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం..

ఢిల్లీ : 'అపెక్స్' కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లు హాజరయ్యారు. తొలుత కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది. 

ఎమ్మెల్సీ గేయానంద్ దీక్ష విరమణ..

అనంతపురం : ఎమ్మెల్సీ గేయానంద్ దీక్షను విరమించారు. ప్రభుత్వాసుపత్రిలో సమస్యలను మూడు నెలల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ హామీనివ్వడంతో ఆయన దీక్షను విరమించారు. 

ఉండవల్లి కట్టుకథలు - జైపాల్...

హైదరాబాద్ : ఉండవల్లి పుస్తకంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 2014 ఫిబ్రవరి 18వ తేదీన ఏం జరిగిందో ఉండవల్లికి తెలియదని, కేసీఆర్ కు కూడా స్పీకర్ ఛాంబర్ లో ఏం జరిగిందో తెలియదన్నారు. ఉండవల్లి కట్టుకథలు రాశారని, సుష్మా స్వరాజ్ కాళ్లను పొన్నం ప్రభాకర్ పట్టుకోవడాన్ని ఉండవల్లి వ్యంగ్యంగా రాయడం దురదృష్టకరమన్నారు. టివి ప్రసారాలు నిలిపివేయడానికి బిల్లు ఆమోదింపచేయడానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. పెప్పర్ స్ర్పే కొట్టినందుకు టివి ప్రసారాలు నిలిపివేయడం జరిగిందన్నారు. 

14:50 - September 21, 2016

విజయవాడ రైల్వే జంక్షన్ ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయి. విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దుచేయగా, మరికొన్ని రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. ఉత్తర, దక్షణ భారతదేశాల మధ్య నడిచే రైళ్లకు మాత్రమే కొన్ని ప్లాట్ ఫారమ్స్ పైకి అనుమతిస్తున్నారు. ఆధునీకరణ పనులపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:47 - September 21, 2016

హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో జలమయ్యాయి. భారీ వర్షానికి మోత్కూర్ లో జనజీవనం అతలాకుతలం అయ్యింది. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో స్దానికులు చీకట్లోనే గడిపారు. చెరువులకు గండ్లు పడటంతో భారీగా పంటలు నీట మునిగాయి. మోత్కూర్ లో గతంలో నాలా ఉన్న ప్రదేశంలో అపార్ట్ మెంట్ నిర్మించటంతో వరద నీరు ఇండ్లల్లోకి చేరింది. దీంతో నాలాపై నిర్మించిన అపార్ట్ మెంట్ ను తొలగించాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు. మోత్కూర్ మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చెరువులు వరద నీటితో పూర్తిగా నిండి తెగిపోవడంతో బిక్కెరు వాగు పొంగి పొర్లుతుంది. దీంతో వాహనాదారులు, పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వరంగల్ లో..
వరంగల్ జిల్లాలో భారీ వర్షాలుకు కురుస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంత్లాలో వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. తొర్రూరు మండలం వలవీడులో భారీ వర్షం కురవడంతో ఎర్రచెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో పెరిగిన వరదల్లో ముగ్గురు రైతులు చిక్కున్నారు.

మూసీ నది ఉగ్రరూపం...
మంగ‌ళ‌వారం రాత్రి నుంచి ఎడతెరిపి లెంకుండా కురుస్తున్న వర్షాలకు నల్లగొండ‌ జిల్లాలో పలు చోట్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మూసి నది ఉగ్రరూపం దాల్చడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లో మూసి నది మూడింతలు పెరిగి ప్రవహిస్తోంది. దీంతో భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి మండలాలకు పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మున్సిపల్‌ కేంద్రంలో పలు చోట్ల డ్రైనేజి వ్యవస్ధ అస్తవ్యస్థంగా మారి మురికి నీరు రోడ్ల పైకి చేరడంతో ప్రజలు ఇంబ్బదులు పడుతున్నారు. ప్రధానంగా మూసీ న‌దిపై వంతెనలు స‌రిగా లేకపోవడంతో ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూసీ కి భారీగా వ‌ర‌ద‌ రావడంతో భట్టుగూడెం-పెద్దరావులపల్లి వంతెన పై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

హైదరాబాద్ లో..
హైదరాబాద్‌లోని ఆల్విన్‌కాలనీని వర్షం ముంచెత్తింది. అపార్ట్‌మెంట్లలోకి వరదనీరు వచ్చి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వర్షం ధాటికి ఎల్బీనగర్‌లోని రోడ్లన్నీ కొట్టుకుపోయి గుంతలమయం కావడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చుదిద్దుతామని చెబుతున్న నాయకులు రోడ్లను మాత్రం పట్టించుకోవడం లేదంటూ...టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానికులు నిరసన తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని డిమాండ్‌ చేశారు.

14:39 - September 21, 2016

ఢిల్లీ : ప్రత్యేక రైల్వే బడ్జెట్‌కు కేంద్రం చరమగీతం పాడింది. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేసింది. ఇకపై రైల్వే బడ్జెట్‌ ప్రత్యేకంగా ఉండదని, సాధారణ బడ్జెట్‌లో భాగంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. రైల్వేకు సంబంధించి ప్రత్యేక చర్చ మాత్రం కొనసాగుతుందని తెలిపారు. మార్చి 31లోపు బడ్జెట్‌ కసరత్తు పూర్తవుతుందని జైట్లీ పేర్కొన్నారు.

14:36 - September 21, 2016

ఢిల్లీ : 'అపెక్స్' కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది.  ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లు హాజరయ్యారు. తొలుత కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ తరపున ప్రజెంటేషన్‌ ఉంటుంది. దాని తర్వాత 2 గంటల 35 నిమిషాలకు అజెండా అంశాలపై చర్చిస్తారు. అపెక్స్ కౌన్సిల్‌లో మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన ఈ అపెక్స్ కౌన్సిల్‌ సమావేశం తొలిసారిగా జరగబోతోంది. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దతపై జైట్లీతో చర్చించారు. ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని అరుణ్ జైట్లీని సీఎం చంద్రబాబు కోరారు. 

సమావేశం ఏర్పాటు చేయాలని కోర్టు సూచన..
విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య.. సాగునీటికి సంబంధించిన వివాదాలు మొదలయ్యాయి. రెండున్నరేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం పెరుగుతూ వస్తోంది. ఇరు ప్రాంతాల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటూ.. పరిస్థితిని మరింత జటిలం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం.. వివాద పరిష్కారానికి అపెక్స్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

మరో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు..

ఢిల్లీ : మరో ఆప్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆప్ ఎమ్మెల్యే అమనుతుల్లా ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

14:18 - September 21, 2016

ఇయ్యాళ పేరు జనానికి బీపీ చాల వెర్గుతున్నది గదా..? ఉత్తుత్తనే కీసులాడుతున్నరు. గోటితోని వొయ్యెదాన్ని గొడ్డలిదాక దెచ్చుకోని ఆగమాగమైతున్నడు మనిషి. తన కోపమే తనకు శత్రువు.. తన శాంతమే తనకు రక్ష అన్న సుమతి శత్కం ముచ్చట ఎవ్వలు వట్టిచ్చుకుంటలేరు. కత్తులతో కాదురా కంటి సూపుతో సంపేస్తా అనే కాలమొచ్చింది. గుంటూరు జిల్లాల జర్రంతల జంగు ఎట్ల తయ్యారైందో సూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:06 - September 21, 2016

'కరీంనగర్' జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నదుల్లా..? జిల్లాకు ఎట్లైనా ఉన్నదిగని.. జిల్లా పరిషత్కు గూడ ఉన్నదన్న సంగతి చాల తక్వమందికి దెల్సు.. ఇద్వరకు ఒకపారి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం అయితే సభ్యులు సమస్యల మీద స్పందించిన తీరు ఒకపారి జూపెట్టిన.. అయినా మారనట్టుండ్రి మళ్ల పాతబాటలనే పయణమైండ్రట. జిల్లా పరిషత్ సర్యసభ్య సమావేశాలు జూడాల్నంటే కరీంనగర్ జిల్లాలనే జూడాలె. శాంతి కపోతం గూడ తల్కాయ కిందికి వెట్టి నమస్తే వెడ్తది. లొల్లి వెట్టరు.. అట్లనిజెప్పి అక్కెరకొచ్చె పనిజేయరు. రైతులు గోసగోసవడ్తుంటే ప్రభుత్వ పథకాలు అందక జనం అవస్థవడ్తుంటే మనం గెల్పిచ్చుకున్న లీడర్లు సభల ఎంతగనం తన్లాడుతున్నరు సూడు.. ఏ జనం కినవారేస్తె వాళ్ల మానాన వాళ్లు బత్కుతరుగని.. మనోళ్లంత కులాసాగున్నరా అన్నట్టు ఎవ్వలికి వాళ్లు ముచ్చట్లు వెడ్తున్నరు. గీ సమావేశంపై 'మల్లన్న' ఎట్ట ముచ్చట్లు చెప్పిండో సూడాలంటే వీడియో సూడుండ్రి..

13:53 - September 21, 2016

హిందు వివాహచట్టం... విడాకులు అనే అంశంపై మానవి నిర్వహించిన మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. హిందు వివాహచట్టం, విడాకులు విషయంపై మాట్లాడారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే...
'సెక్షన్ 13, 1955 ప్రకారం... హిందు వివాహ చట్టం ప్రకారం విడాకులు తీసుకునే అవకాశం ఉంది. వైవాహికేతర సంబంధాలతో అత్యధికంగా విడాకులు కోసం దంపతులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కలిసి జీవించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు భార్యభర్తలు విడాకులు కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు. అయితే వివాహం అయిన సం.తర్వాతే కోర్టును ఆశ్రయించి విడాకులు పొందే అవకాశం ఉంది' అని తెలిపారు. కాలర్స్ అడిగిన పలు ప్రశ్నలు, సందేశాలకు
సమాధానం చెప్పారు. వారికి పలు సలహాలు, సూచనలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

 

13:47 - September 21, 2016

ఢిల్లీ : తొలిసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగబోతుంది. ఢిల్లీలో మ.2. గం.లకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. సమావేశానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు హాజరుకానున్నారు. మ.2.05 గం.లకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రజెంటేషన్ ఇవ్వనుంది. మ.2.15 గం.లకు ఆంధ్రప్రదేశ్ తరపున ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మ.2.35 గం.లకు అజెండా అంశాలపై చర్చించనున్నారు. మ.3.15 గంటలకు అపెక్స్ కౌన్సిల్ లో ఎపి సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. 

 

ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం..

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ కమిటీ కాసేపటి క్రితం ముగిసింది. సాధారణ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ విలీనానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై ద్రవ్య వినిమయ బిల్లు ఒక్కటే ఉంటుందని ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు. 

13:38 - September 21, 2016

అనంతపురం : ఎమ్మెల్సీ గేయానంద్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. వైద్యానికి గేయానంద్ నిరాకరిస్తున్నారు. కీటోన్, షుగర్, పొటాషియం లెవల్స్ పడిపోయాయి. అనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వైద్య పోస్టులను భర్తీ, ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు కల్పించాలని మూడు రోజులుగా గేయానంద్ దీక్ష చేస్తున్నారు. గేయానంద్ ను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి పల్లె రఘునాథరెడ్డిని వామపక్ష కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు, వామపక్ష కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యకర్తల నినాదాల మధ్య మంత్రి పల్లె వెనుదిరిగారు. ఈక్రమంలోనే ఎమ్మెల్సీ గేయానంద్ దీక్షను పోలీసులు భగ్నం చేసి.. ఆయన్ను అరెస్టు చేశారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో గేయానంద్ దీక్ష కొనసాగిస్తున్నారు. అంతకముందు మంత్రి కామనేని శ్రీనివాస్ తో గేయానంద్ ను ఫోన్ లో మాట్లాడించడం జరిగింది. కానీ సమస్యల పరిష్కారం విషయంలో కామినేని నుంచి ఎలాంటి హామీ రాలేదు. కామినేని నుంచి స్పష్టమైన హామీ వస్తేనే దీక్ష విరమిస్తానని గేయానంద్ తేల్చి చెప్పారు. అనంతపురం ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 
 

ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశ రాజధానికి చేరుకున్నారు. కాసేపటి క్రితం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని బాబు కోరారు. 

నగరంలో మళ్లీ వర్షం..

హైదరాబాద్ : నగరంలో మళ్లీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు వర్షం కురిసింది. మళ్లీ మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం కురుస్తోంది. 

గేయానంద్ అరెస్టుకు యత్నం..కొనసాగుతున్న దీక్ష..

అనంతపురం : ఎమ్మెల్సీ గేయానంద్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి గేయానంద్ నిరాకరిస్తున్నారు. కాసేపటి క్రితం గేయానంద్ ను మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పరామర్శించారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు దీక్ష విరమించబోనని గేయానంద్ ఖరాఖండిగా చెప్పారు. అనంతపురం జిల్లాలో ప్రబలిస్తున్న విష జ్వరాలపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని..124 జీవో ప్రకారం 510 పోస్టులను భర్తీ చేయాలని..ప్రబలుతున్న రోగాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.

 

అల్వాల్ లో రహదారులు జలమయం..

హైదరాబాద్ : భారీ వర్షానికి నగరంలోని ఆల్వాల్ జలమయమైంది. నాలాలు పొంగిపొర్లుతుండడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పార్క్ చేసిన కార్లు నీట మునిగాయి.

అఖిలపక్ష సమావేశానికి బీజేపీ, జేడీఎస్ పార్టీలు డుమ్మా..

ఢిల్లీ : కావేరీ వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావద్దని బీజేపీ, జేడీఎస్ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. 

12:57 - September 21, 2016

హైదరాబాద్ : నిన్న సాయంత్రం నుంచి ఇవాళ ఉదయం వరకు హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాలు, రహదారులు జలమయమ‌య్యాయి. వర్షాలతో హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా నీరు చేరడంతో ఎప్పటికప్పుడు నీటిని బయటికి వదులుతున్నారు. రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్ పల్లి ప్రాంతాల్లో నివాస ప్రాంతాల్లోకి నీరు చేరింది.  కూకట్ పల్లిలోని ఆల్విన్ కాలనీ, జీడిమెట్లలోని సూరారం కాలనీల్లో నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, బేగంపేట్,  ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడళ్ల వద్ద రోడ్లపై వర్షం నీరు చేరింది. అర్థరాత్రి నుంచి చాలాచోట్ల ప్రధాన మార్గాల్లో వాహనాలు నిలిచిపోయాయి. నాలాల కబ్జాలతోనే ఈ పరిస్థితి నెలకొందని, జీహెచ్ఎంసీ సిబ్బంది సకాలంలో స్పందించడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, పెద్దలు వర్షంపు నీటిలోనే రాత్రంతా జాగారం చేస్తూ బిక్కుబిక్కు మంటూ గడిపారు. మరోవైపు నగరంలో రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, నాంపల్లి, అబిడ్స్ తోపాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, బాలానాగర్, సనత్ నగర్, అమీర్ పేట్, మలక్ పేట్, ఛాదర్ ఘాట్, దిల్ షుక్ నగర్ ప్రాంతాల్లో విరామం లేకుండా వర్షం పడింది. ఫలితంగా తెల్లవారే సరికి కానీల్లో రహదారులు నీటి కుండల్లా తయారయ్యాయి.
పొంగి పొర్లుతున్న నాలాలు 
హైదరాబాద్ లో నిన్న కురిసిన వర్షంతో నగరంలోని నాలాలు పొంగి పొర్లుతున్నాయి. నివాసప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. తెల్లవారుజాము 4 గంటల వరకు అత్యధికంగా కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్ నగర్ లో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బొల్లారంలో 87, కూకట్ పల్లిలో 65, బాలానగర్ లో 62, తిరుమలగిరిలో 60, అమీర్ పేట్ లో 57, రామచంద్రాపురంలో51, ఖైరతాబాద్ లో 48 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇప్పటికే హుస్సేన్‌సాగర్ పూర్తి స్థాయిలో నిండిపోయింది. రాత్రి కురిసిన వర్షానికి కూకట్ పల్లి బాలానగర్ నాలాల నుంచి భారీగా వరదనీరు సాగర్ లోకి చేరుతుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమ‌య్యారు. కుత్బుల్లాపూర్, అల్వాల్, కూకట్ పల్లి, దోమల్ గూడ, నల్లకుంటతోపాటు దిగువ ప్రాంతాల్లోని కాలనీల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పురాతన భవనాలు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో నివసించేవారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కమిషనర్ అధికారులను అదేశించారు. మియాపూర్‌, కూక‌ట్‌ప‌ల్లి, లింగంప‌ల్లి,  బాచుపల్లి త‌దిత‌ర ప్రాంతాల్లో వ‌ర్షం నీరు అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లోకి చేర‌డంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చెరువులా మారిన నిజాంపేట ప్రాంతం 
భారీవర్షాల కారణంగా హైదరాబాద్ శివార్లలోని నిజాంపేట ప్రాంతం మొత్తం చెరువులా మారిపోయింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయం నుంచి మొదలైన వర్షం తెల్లవారుజాము వరకు కురుస్తూనే ఉండటంతో ఆ ప్రాంతం మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఇక్కడ అపార్టుమెంట్లు ఎక్కువ కావడంతో దాదాపు ప్రతి అపార్టుమెంటు సెల్లార్‌లోను నీళ్లు భారీగా చేరుకున్నాయి. కార్లు సగానికి పైగా మునిగిపోయాయి. మనుషులు నిలబడి ఉంటే దాదాపు పీకల వరకు కూడా నీళ్లు వస్తున్నాయి. చెరువుకు గండి పడటం వల్ల అక్కడి నుంచి నీళ్లు ఇటువైపు వచ్చాయని అంటున్నారు. వర్షం భారీగా కురుస్తుండటంతో ఇంతకుముందు అనుభవంతో కొన్ని వాహనాలను ముందు జాగ్రత్తగా రోడ్ల మీదకు తీసుకొచ్చేశారు. అలా కాకుండా వదిలేసిన కార్లు మాత్రం మొత్తం మునిగిపోయాయి. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా కూడా లేదని, చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నామని స్థానికులు చెబుతున్నారు. బాలాజీ నగర్ ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ దాదాపు 40 శాతం అపార్టుమెంట్ల సెల్లార్లలోకి నీళ్లు చేరిపోయాయి. నీళ్లు ఎక్కువగా చేరుకోవడంతో పాములు కూడా తిరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతికి కార్లు కూడా కొట్టుకుపోయాయని చెబుతున్నారు. సెల్లార్లలో పూర్తిగా నీళ్లలో మునిగిన కార్లను బయటకు లాగేందుకు స్థానికులు నానా కష్టాలు పడుతున్నారు. కారుకు తాళ్లు కట్టి.. వాటిని పది పదిహేను మంది లాగుతున్నారు.
వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష 
హైదరాబాద్‌లో కుండపోతగా కురుస్తున్న వర్షాలపై సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి ఉన్నతాధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారులకు సూచించారు. చెరువులు, కుంటల పరిస్ధితిని ఎప్పటికప్పుడూ సమీక్షించాలని..అవసరమైతే పోలీస్, డిజార్డర్, ఆర్మీ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని... అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు కేసీఆర్ సూచించారు .
అల్వాల్‌లో పలు కాలనీలు జలమయం 
అల్వాల్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా పలు కాలనీలు జలమయం అయ్యాయి. పలు చెరువులు నిండి వరద నీరు కాలనీల్లోకి చేరడంతో రోడ్లన్ని జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న కాలనీల్లో స్ధానిక ఎమ్మెల్యే కనకారెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొని పరిస్థితిని పరిశీలించారు. 

 

నీళ్లల్లో కార్లు..ద్విచక్రవాహనాలు..

హైదరాబాద్: మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు నగరంలో భారీ వర్షం కురిసింది. దీనితో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కూకట్ పల్లి, నిజాంపేట, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో ఉన్న అపార్ట్ మెంట్లు జలదిగ్భందానికి గురయ్యాయి. అపార్ట్ మెంట్ ల సెల్లార్ లు నీట మునిగాయి. దీనితో వాహనాలన్నీ జలమయమయ్యాయి. 

ఎన్టీఆర్ గార్డెన్ వద్ద రోడ్డుపై గొయ్యి..

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ ను ఆనుకుని ఉన్న ప్రధాన రహదారిపై ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద రోడ్డు కుంగింది. భారీగా కుంగడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. 

12:28 - September 21, 2016
12:26 - September 21, 2016

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ప్రస్తుతం ఎక్కడున్నాడు ? ఇటీవలే ఏపీ 'ప్రత్యేక హోదా'పై పలు బహిరంగసభలు పెట్టి 'పవన్' ప్రసంగించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన సినిమా షూటింగ్ నిమిత్తం బెంగళూరుకు వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ లో 'పవన్' పాల్గొనలేదని, సెప్టెంబర్ 24వ తేదీన టీంతో 'పవన్' కలువనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం 'పవన్' జిమ్ లో భారీగా వర్కవుట్స్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రతి సినిమా కంటే కొన్ని రోజులు ముందు బెంగళూరులో 'పవన్' ప్రత్యేకంగా జిమ్ చేస్తాడని వినికిడి. 'సర్ధార్ గబ్బర్ సింగ్' టైంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆరు గంటల పాటు ఆయన జిమ్ లో కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'శృతి హాసన్' జంటగా కనిపిస్తోంది. మూవీపై అభిమానులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. వీలైనంత త్వరగా ఈ చిత్ర షూటింగ్‌ని 'పవన్' పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని త‌రువాత‌ 'త్రివిక్రమ్‌'తో కలిసి పని చేయనున్నట్టు సమాచారం.

12:12 - September 21, 2016

24ప్రమోగంతో ఫాంలోకి వచ్చిన సూర్య మాస్ విశ్వరూపం చూపించడానికి సిద్ధమయ్యాడు. సింగం సిరీస్ లతో బాక్సఫీసుని దడదడలాడించిన ఈ తమిళ స్టార్ సింగం3 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. సూర్య సింగం 3 రిలీజింగ్ డిటేల్స్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
మాస్ క్యారెక్టర్లలతో అదరగొడతున్న సూర్య 
సూర్యను చూస్తే క్లాస్ గా కనిపిస్తాడు. కానీ అతను మాస్ క్యారెక్టర్లలోనూ అదరగొడతాడని, ఫెరోషియస్ క్యారెక్టర్ లో కూడా రెచ్చిపోగలడని సింగం సినిమాతో రుజువు చేశాడు. ఈ చిత్రం ముందు వరకు కూడా సూర్య అంటే యాక్షన్, ఎక్స్ పర్ మెంటల్ హీరోగానే గుర్తింపు ఉంది. కానీ సింగం సినిమాతో సూర్య మాస్ క్యారెక్టర్స్ కి కూడా బెస్ట్ ఆప్షన్ అనిపించాడు.
తమిళ, తెలుగు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల మోత 
సింగం1సింగం2 సిరిస్ లతో సూర్య అటు తమిళ బాక్సఫీసుని ఇటు తెలుగు బాక్సఫీసు వద్ద కలెక్షన్ల మోత మోగించాడు. ఇలాంటి సిరిస్ లో భాగంగా వస్తున్న సింగం 3 రిలీజ్ కన్ ఫర్మ్ అయింది. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. 
సింగం3ని స్వయంగా నిర్మిస్తున్న సూర్య 
టైటిల్ తో రూపొందుతున్న సింగం3ని సూర్య స్వయంగా నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రం మెజారిటీ పార్ట్ ఫారిన్ లోనే షూట్ చేశారు. మొదటి రెండు భ భాగాల్లో సూర్యకు జోడిగా నటించిన అనుష్కఈ మూడో భాగంలో కూడా ఆయనకు జోడిగా నటిస్తోంది. ఇక మరో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. సింగం తొలిమలి సిరీస్ లకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తే ఈ మూడో భాగానికి మాత్రం హ్యారిస్ జైరాజ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. మరి మూడో సింగంగా సూర్య బాక్సఫీసుని ఏ రేంజ్ లో షేక్ చేస్తాడో చూడాలి.

 

ఇరిగేషన్ శాఖలో ఎమర్జెన్సీ..

హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా ఇరిగేషన్ శాఖలో ఎమర్జెన్సీని విధించారు. ఇంజనీర్ల సెలవులను రద్దు చేశారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, చెరువులకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. గండ్లు పడిన చోట యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. 

అనంతపురం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత..

అనంతపురం : ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రోజులుగా ఎమ్మెల్సీ గేయానంద్ దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. బుధవారం గేయానంద్ ను పరామర్శించేందుకు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వచ్చారు. మంత్రి పల్లెను వామపక్ష కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనితో పోలీసులు..వామపక్ష కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యకర్తల ఆందోళనతో మంత్రి పల్లె వెనుదిరిగారు. 

12:09 - September 21, 2016

దోమ ఎంత పనిచేసింది ? అని 'ఇషాంత్ శర్మ' అనుకుంటున్నాడంట. ఎందుకంటే దోమ వల్ల ఇషాంత అరుదైన అవకాశాన్ని కోల్పోయాడు. రేపు చారిత్రాత్మక భారత్ 500వ టెస్టు ఆడుతున్న సంగతి తెలిసిందే. కాన్పూర్ లో న్యూజిలాండ్ తో భారత్ ఢీకొనబోతోంది. ఈ టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మ్యాచ్‌కు భారత మాజీ క్రికెటర్లందర్నీ ఆహ్వానిస్తోంది. గురువారం ప్రారంభం కాబోయే ఈ టెస్టు కోసం అజహర్, సచిన్, కపిల్, గంగూలీ, రవిశాస్త్రి తదితర మాజీ క్రికెటర్లందరికీ ఆహ్వానం అందింది. ఇదిలా ఉంటే 'ఇషాంత్ దోమకాటుకు గురయ్యాడు. 'చికెన్ గున్యా' వ్యాధి సోకడంతో తొలి టెస్టులో ఆడే అవకాశాన్ని ఇషాంత్ కోల్పోయాడు. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన టెస్టు సిరీస్ లో 8 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఇషాంత్ స్థానంలో మరో పేసర్ ను తీసుకొస్తామని టీమిండియా చీఫ్ కోచ్ కుంబ్లే పేర్కొన్నారు. కివీస్ జట్టు భారత్ తో మొత్తం మూడు టెస్టులు..ఐదు వన్డేలు ఆడనుంది. 

12:00 - September 21, 2016

హైదరాబాద్ : నగరంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షంతో అల్వాల్ అతలాకుతలమైంది. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరుకుంది. వరద నీటితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గుడిసెలు వేసుకుని నివసించే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. రాత్రంతా నీటిని బయటికి తోడిపోస్తున్నామని గృహిణులు వాపోతున్నారు. మొత్తం 300 గుడిసెలుండగా అందులో 110 మంది నివాసుముంటున్నారు. ఇళ్లలోకి భారీ నీరు చేరడంతో వంట చేసుకోవడానికి వీళ్లేకపోవడంతో సమాన్లతో రోడ్లపైకి వచ్చారు. అందరూ సామూహికంగా వంట చేసుకుంటున్నారు. అధికారులు ఎవరూ రాలేదని వాపోయారు. నిరుపేదలకు సీఎం ఎలాంటి సహాయం చేయలేదని బాధపడుతున్నారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 

11:49 - September 21, 2016

గణేష్ ఉత్సవాల సమయంలో మాయమైన 9 ఏళ్ల బాలుడు నల్గొండ జిల్లాలో అదృశ్యమై వారం రోజుల తరువాత ఖమ్మం జిల్లాలోని ఓ బావిలో శవమై తేలాడు. అసలు బాలుడిని కిడ్నాప్ చేసింది ఎవరు ? హత్య చేయడానికి గల కారణాలు ఏంటీ ?

ఒక్కడే కొడుకు...కొడుకు కోసం ఆ తల్లి ఆవేదేన..ఊరు ఊరంత బాలుడి క్షేమంగా ఉండాలని కోరుకుంది. నల్గొండ జిల్లాలోని కోదాడ మండలం..మొగలాయి కోటలో గోపాల్ రెడ్డి, రమాదేవి కుటుంబం నివాసం ఉంటోంది. గోపాల్ రెడ్డి 15 ఏళ్ల పాటు సీఆర్పీఎఫ్ లో పనిచేశారు. ఇతని కుమారుడు పూరి జగన్నాథ్ రెడ్డి (9). ఉద్యోగం నుండి విరమణ పొందిన గోపాల్ రెడ్డి బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఇటీవలే జరిగిన గణపతి ఉత్సవాల్లో పూరి జగన్నాథ్ రెడ్డి పాల్గొన్నాడు. అనంతరం అదృశ్యమయ్యాడు. కానీ ఖమ్మం జిల్లాలో ఓ బావిలో పూరి జగన్నాథ్ రెడ్డి శవమై తేలాడు. మరి ఎందుకు చంపారు ? చిన్నారిపై కక్ష పెంచుకున్నది ఎవరు ? తదితర వివరాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి. 

11:47 - September 21, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ లో టీడీఎల్పీ విలీనం పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనర్హత పిటిషన్ పై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు హైకోర్టు సూచించింది. టీఆర్ఎస్ లో టీడీఎల్పీ విలీనంపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్ వేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 
హైకోర్టు తీర్పు శుభసూచికం : రేవంత్ 
'హైకోర్టు తీర్పు శుభసూచికం. హైకోర్టు తీర్పుతో స్పీకర్ కార్యాలయానికి కనువిప్పు కలగాలి. పార్టీ ఫిరాయించిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి. తక్షణమే ఉప ఎన్నికలకు రండి. గతంలో సోమేశ్ కుమార్ ను తమ స్వార్థ రాజకీయాలకు టీసర్కార్ ఉపయోగించుకుని అనంతరం ఆయన్ను బలి చేశారు. కొందరు అధికారులు స్పీకర్ కార్యా లయాన్ని తప్పుదోవబట్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ ఎస్ తమ రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వ సంస్థలన్నింటినీ వినియోగించుకుంటున్నారు. స్పీకర్ కార్యాలయాన్ని, అన్ని వ్యవస్థలను దుర్వినియోగపరుస్తున్నారు. చేసిన తప్పులకు సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి. దుర్మార్గమైన రాక్షస, రాజకీయ క్రీడకు కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడు. చట్టాలను తయారు చేసేవారే వాటిని ఉల్లంఘిస్తే వాటికి ఇంక అర్థమేమి ఉంటుంది. స్పీకర్ పదవి తాత్కాలికం, స్పీకర్ కార్యాలయం శాశ్వతం. స్పీకర్ గారు.. మీరు టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మల్యేలు ఎన్నుకుంటే స్పీకర్ కాలేదు... అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎనున్నకుంటే స్పీకర్ అయ్యారన్న సంగతి గుర్తించాలి' అని పేర్కొన్నారు. 

 

హైకోర్టు తీర్పు కనువిప్పు కలగాలి - రేవంత్...

హైదరాబాద్ : హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని..తీర్పు చెంప పెట్టు అని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ లో టీడీఎల్పీ విలీనం పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనర్హతపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని టి.స్పీకర్ కు హైకోర్టు సూచించింది. టీఆర్ఎస్ లో టీడీపీ విలీనంపై హైకోర్టును రేవంత్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపులను ప్రోత్సాహించే విధంగా స్పీకర్, గవర్నర్ కార్యాలయం ఉండడంతో ఉపద్రవం పొంచి ఉందన్నారు.

కొనసాగుతున్న కేంద్ర కేబినెట్ కమిటీ..

ఢిల్లీ : భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ భేటీ కొనసాగుతోంది. ఈ భేటీకి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి జైట్లీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ లు హాజరయ్యారు. 

రంగారెడ్డి జిల్లాలో పాఠశాలలకు లీవ్..

రంగారెడ్డి : జిల్లాలో ప్రభుత్వ..ప్రైవేటు పాఠశాలలకు లీవ్ ప్రకటించారు. మంగళవారం సాయంత్రం నుండి నగరంలో భారీ వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. దీనితో బాలానగర్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రఘునందన్ ఆదేశాలు జారీ చేశారు. 

ఢిల్లీకి ఏపీ సీఎం..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనమయ్యారు. కృష్ణా జలాలపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి సమక్షంలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. 

10:49 - September 21, 2016

హైదరాబాద్ : నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి ఉన్నతాధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. చెరువులు, కుంటల పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షించాలని సూచించారు. పోలీస్, డిజార్డర్, ఆర్మీ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తంగాఉండాలని తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

విలీనం పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు..

హైదరాబాద్ : టీఆర్ఎస్ లో టీడీఎల్పీ విలీనం పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనర్హతపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు హైకోర్టు సూచించింది. 

వరదలో చిక్కుక్కున్న రైతులు..

వరంగల్ : తొర్రూరు మండలంలోని వలివీడులో భారీ వర్షం కురిసింది. ఎర్రచెరువుకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీనితో ముగ్గురు రైతులు వరదనీటిలో చిక్కుకున్నారు. వరద ఉధృతి పెరగడంతో రైతుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. 

10:40 - September 21, 2016
10:33 - September 21, 2016

హైదరాబాద్‌ : నగరంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. రాత్రంతా ఎడతెరిపిలేని వర్షం పడింది. వర్షం ధాటికి రోడ్లు  జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హుస్సేన్‌సాగర్‌లో భారీగా నీటిమట్టం పెరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు కాలనీలు నీటి మునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో నగరవాసులు అవస్థలు పడుతున్నారు. పాత భవనాలు ఖాళీ చేసి, సురక్షి ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచనలు చేశారు. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
వాహనదారులు ఇక్కట్లు 
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా పంజాగుట్ట, ఖైరతాబాద్‌ నుంచి కూకట్‌పల్లి ఇలా నగరంలో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో ఉద్యోగులు, రోజువారి కూలీలు, విద్యార్థులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
రికార్డు స్ధాయిల్లో వర్షపాతం 
హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. అయితే ఈ భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో రికార్డు స్ధాయిల్లో వర్షపాతం నమోదవుతుంది. కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 9.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. బొల్లారం 8.9సెం.మీ, బాలానగర్‌ 2 సెం.మీ, రామచంద్రాపురం 3.5 సెం.మీ, మాదాపూర్‌ 3, కూకట్‌పల్లి 5, తిరుమలగిరి 6 వర్షపాతం నమోదైంది. అలాగే ఖైరతాబాద్‌లో‌-4.8 సెం.మీ, శ్రీనగర్‌ కాలనీలో 5.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇక ఆసిఫ్‌నగర్‌లో 3.8 సెం.మీ, మల్కాజ్‌గిరిలో 4, షాపూర్‌ 10 సెం.మీ వర్షపాతం కురిసింది.

రాయ్ పూర్ లో నల్ల మందు స్వాధీనం..

ఛత్తీస్ గఢ్ : రాయ్ పూర్ లో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరి వద్ద 15 కిలోల నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 15 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. 

10:22 - September 21, 2016

మొటిమలు..
శ్రీ గంధం పేస్ట్..ఒక చెంచా చందనం పేస్ట్ మిశ్రమంలా చేసుకుని ముఖంపై రాసుకోవాలి. ఇలా 20 నిమిషాల సేపు దానిని అలాగే ఉంచాలి. ఆ తరువాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి. బొప్పాయి పండును క్రమం తప్పకుండా తినడం వయస్సు పై బడినట్లుగా కనిపించకుండా చేస్తోంది. బొప్పాయి గుజ్జుకు అరచెంచా వెనిగర్ కలిపి ఈ మిశ్రమాన్ని మొటిమలపై అప్లయి చేయండి.
నల్లబడడం..
అర చెంచా తేనె, అర చెంచా నిమ్మరసం, నల్లద్రాక్ష గుజ్జుకు ఇవన్నీ కలపాలి. దీనికే శ్రీ గంధం అరచెంచా, ఎర్రచందనం అరచెంచా, అర చెంచా పసుపు కలుపుకోవాలి. దీనిని పేస్టులా చేసుకోవాలి. ముఖంపై నల్లబడిన ప్రాంతంపై ఈ పేస్టును రాసుకోవాలి. కాసేపటి అనంతరం గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.
జుట్టు రాలడం..చుండ్రు...
అరకప్పు తులసీ దళాల రసానికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ నిమ్మరసం జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నెత్తిపై రాసుకుని అరగంట ఉంచుకోవాలి. అనంతరం తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది.
ఇంట్లో ఓ ఫేస్ ప్యాక్...
ఒక క్యారెట్..ఓ చిన్న ముక్క కీరా తీసుకోవాలి. దీనిని పేస్టులా చేసుకోవాలి. దీనికి అర చెంచా తేనె, రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలు కలపాలి. ఈ పేస్టును ముఖంపై..మెడపై రాసుకోవాలి. కాసేపటి అనంతరం గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. 

నేటి నుండి సచివాలయం తరలింపు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సచివాలయం తరలించే ప్రక్రియ బుధవారం నుండి మొదలు కానుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 3వ తేదీ నుండి ఏపీ సచివాలయం నుండి పాలన వ్యవహారాలు అధికారికంగా మొదలు కానున్నాయి. 

09:51 - September 21, 2016

హైదరాబాద్ : తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవి నేడు మరింతగా పెరుగుతాయని తాజా అంచనా. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడటంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అధికంగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. . గురువారం రాష్ట్రంలో ఒక మాదిరి వర్షాలుపడే అవకాశాలున్నాయి. మంగళవారం పగలు రాష్ట్రంలోని 294 చోట్ల ఒక మాదిరి వర్షాలు కురిశాయి. వీటిలో 22 చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షం కురిసి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

 

09:48 - September 21, 2016

హైదరాబాద్‌ : నగరంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. రాత్రంతా ఎడతెరిపిలేని వర్షం పడింది. రాత్రి కురిసిన వర్షపు ధాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం ధాటికి రోడ్లు  జలమయమయ్యాయి. చెరువులను తలపించేలా రహదారులు కనిపిస్తున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరవాసులు తీవ్ర అవస్థల్లో ఉన్నారు. హుస్సేన్‌సాగర్‌లో భారీగా నీటిమట్టం పెరిగింది. నగరంలో రాత్రి నుంచి కురిసిన వర్షానికి అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకూడదని హెచ్చరించారు. 

 

09:42 - September 21, 2016

హైదరాబాద్‌ : నగరంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. గత ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం ధాటికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుత్బుల్లాపూర్, అల్వార్‌, కూకట్‌పల్లి వాసులకు హై అలర్ట్‌ ప్రకటించారు. మియాపూర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లోకి నీరు చేరింది. నగరశివారులోని పలు చెరువులకు గండ్లు పడ్డాయి. పలు కాలనీలు నీటమునిగాయి. కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చింతల్‌లోని సుభాష్‌నగర్, వెంకటేశ్వర కాలనీలు జలమయం అయ్యాయి. ప్రకాశ్‌నగర్, బేగంపేటలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఆల్విన్‌కాలనీ నగర్‌, ధరణి నగర్‌లో భారీగా ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. 

 

వర్షాలపై ఢిల్లీ నుండి కేసీఆర్ సమీక్ష...

ఢిల్లీ : హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలపై ఢిల్లీ నుండి సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కేసీఆర్ మాట్లాడారు. ప్రజలను అప్రమత్తం చేయాలని, వర్షాలపై అప్రమీత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. సహాయక చర్యల్లో పోలీసుల సేవలు వినియోగించుకోవాలని, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. కంట్రోల్ రూంకు వచ్చే ఫిర్యాదులను వెంటనే స్పందించాలని, మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 

09:30 - September 21, 2016

పశ్చిమగోదావరి : తణుకులో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయయ్యాయి. రోడ్లపై మోకాళ్లలోతూ నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాఠశాలకు వెళ్లేటప్పుడు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని అపార్ట్‌మెంట్లలోకి వరదనీరు చేరింది. 

 

కెనాల్ లో పడిన స్కూల్ బస్సు..ఏడుగురు చిన్నారుల మృతి..

పంజాబ్ : అమృత్ సర్ లో ఓ స్కూల్ బస్సు కెనాల్ లో పడిపోవడంతో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పంజాబ్ రాష్ట్ర మంత్రి దల్జీత్ చీమా గాయపడిన చిన్నారులను పరామర్శించారు. 

కాసేపట్లో రాజ్ నాథ్ రివ్యూ సమావేశం..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర లో నెలకొన్న పరిస్థితులు..ఉరి ఘటనపై చర్చించనున్నారు. ఉదయం 10.30గంటలకు ఈ సమావేశం జరగనుంది. 

గుజరాత్ లో అగ్నిప్రమాదం...

గుజరాత్ : సూరత్ లోని కిమ్ ప్రాంతంలో ఉన్న ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 యంత్రాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 

09:28 - September 21, 2016

హైదరాబాద్ : నగరంలో మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. అయితే ఈ భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో రికార్డు స్ధాయిల్లో వర్షపాతం నమోదవుతుంది.  కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 9.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. బొల్లారం-8.9సెం.మీ, బాలానగర్‌-2 సెం.మీ, రామచంద్రాపురం-3.5 సెం.మీ, మాదాపూర్‌-3, కూకట్‌పల్లి-5, తిరుమలగిరి-6 వర్షపాతం నమోదైంది. అలాగే ఖైరతాబాద్‌లో‌-4.8 సెం.మీ, శ్రీనగర్‌ కాలనీలో-5.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇక ఆసిఫ్‌నగర్‌లో-3.8 సెం.మీ, మల్కాజ్‌గిరిలో-4, షాపూర్‌-10 సెం.మీ వర్షపాతం కురిసింది.

 

హుస్సేన్‌సాగర్‌ లో భారీగా చేరుతున్న వరదనీరు

హైదరాబాద్ : నగరంలో గత 10ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న కుండపోత వర్షాలకు హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే హుస్సేన్‌సాగర్‌ నిండిపోయి ప్రమాదకరస్థాయికి చేరింది. నగరంలోని వివిధ నాలాల నుంచి  హుస్సేన్‌సాగర్‌కు 4వేల కూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో 1500 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.

09:22 - September 21, 2016

హైదరాబాద్ : నగరంలో గత 10ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న కుండపోత వర్షాలకు హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే హుస్సేన్‌సాగర్‌ నిండిపోయి ప్రమాదకరస్థాయికి చేరింది. నగరంలోని వివిధ నాలాల నుంచి  హుస్సేన్‌సాగర్‌కు 4వేల కూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో 1500 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. అయితే హుస్సేన్‌సాగర్‌ నుంచి పెద్ద మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తుందన్నందున ఇందిరాపార్క్ నుంచి అబంర్ పేట వరకు ఉన్న బస్తీవాలసుందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మరో మూడు గంటలపాటు హైదరాబాద్‌లో అతిభారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్‌ వాతావరణశాఖ హెచ్చరించడంతో నగరంలోని లోతట్టు ప్రాంతవాసులను ఖాళీ చేయించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి జనాలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నారు.  

 

09:20 - September 21, 2016

హైదరాబాద్‌ : నగరంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. రాత్రంతా ఎడతెరిపిలేని వర్షం పడింది. వర్షం ధాటికి రోడ్లు  జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హుస్సేన్‌సాగర్‌లో భారీగా నీటిమట్టం పెరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు కాలనీలు నీటి మునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో నగరవాసులు అవస్థలు పడుతున్నారు. పాత భవనాలు ఖాళీ చేసి, సురక్షి ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచనలు చేశారు. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

09:13 - September 21, 2016

ప్రభాస్ ఇక నుంచి భారీ ఫీట్స్ నే ట్రై టార్గెట్ గా పెట్టుకోవాలని డిసైడైనట్లు ఫీల్మ్ నగర్ లో వినిపిస్తోంది. బాహుబలి పరంపరను కంటిన్యూ చేయడానికి ఈ స్టార్ స్కెచ్ వేస్తున్నాడు. అంతేకాదు నేషనల్ వైడ్ మార్కెట్ ని ఇమేజ్ పెంచుకోవడానికి ప్రభాస్ సరికొత్త ప్లాన్స్ వేసినట్లు టాక్. ఇంతకీ ప్రభాస్ పెట్టుకున్న ఆ టార్గెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం....
బాహుబలి 2 రిలీజ్ కు సినిలవర్స్ ఎదురుచూపులు
సినిలవర్స్ అందరూ బాహుబలి 2 రిలీజ్ గురించే ఎదురుచూస్తున్నారు. బాహుబలి భారీ విజయంతో ప్రభాస్ ఫ్యాన్స్ క్యాలుక్లేషన్లు టోటల్ గా మారిపోయాయి. నిజానికి బాహుబలి సినిమా ఊహించని విజయం సాధిచింది. దీంతో ప్రభాస్ రేంజ్ కూడా బాగా పెరిగింది.  బాహుబలి 2 రిలీజ్ తరువాత ఆయన రేంజ్ మరింత పెరగడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ కాన్పిడెంట్ గా ఉన్నారు.అయితే బాహుబలి ఇమేజ్ ని కంటిన్యూ చేయడానికి ప్రభాస్ సరికొత్త స్కెచ్ వేస్తున్నాడట.
సుజిత్ డైరక్షన్ లో మూవీ చేయడానికి ప్రభాస్ సిగ్నల్ 
బాహుబలితో పెరిగిన మార్కెట్ ని ప్రభాస్ సరిగ్గా వినియోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. బాహుబలి2 తరువాత ఈ స్టార్ రన్ రాజా రన్ ఫేం సుజిత్ డైరక్షన్ లో మూవీ చేయడానికి సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని కూడా 80 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళం, హిందీల్లో ఏకకాలంలో నిర్మించాలని ప్లాన్ వేసినట్లు సమాచారం. ఇందుకు మూడు లాగ్వేంజ్ కి సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.
బాహుబలితో ప్రభాస్ కి నేషనల్ వైడ్ ఫాలోయింగ్ 
బాహుబలితో ప్రభాస్ కి నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ ఫాలోయింగ్ ని కంటిన్యూ చేయడానికే ఇలా త్రిభాష చిత్రాలు చేసేలా ప్రణాళికలు వేస్తున్నాడట. ప్రభాస్ ఇలా చేయడానికి పెద్ద రిజనే ఉందట.బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్,షారూఖ్ ,అమీర్ రేంజ్ లో తను కూడా నేషనల్ స్టార్ గా 400కోట్ల మార్కెట్ ని సెట్ చేసుకోవాలని భావిస్తున్నాడట. నిజంగానే ఈ ఫార్మాట్ లో ప్రభాస్ సక్సెస్ అయ్యాడంటే సౌత్ ప్రభాస్ ని మించిన స్టార్ ఉండరనే చెప్పాలి.

 

09:02 - September 21, 2016

ఈ నెల 22న నాని మజ్నుగా రాబోతున్నాడు. ఈ క్రమంలో నేచురల్ హీరో తన కెరీర్ కి సంబంధించిన అనేక విషయాల్లో ఒపెన్ అయిపోయాడు. అంతేనా తన డ్రీమ్ రోల్ గురించి కూడా నాని కుండబద్దలు కొట్టేశాడు. ఇంతకీ ఈ నేచురల్ హీరో డ్రీమ్ ఏంటో ఈ స్టోరీ చూడండి.
22న మజ్ను రిలీజ్  
నాని స్పీడ్ అలా ఇలా లేదు. ఈ ఎడాది ఇప్పటికే రెండు సినిమాలతో అలరించిన ఈ హీరో నటించిన మజ్ను 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రం సక్సెస్ విషయంలో నాని కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. ఇది ఉండగానే డిసెంబర్ లాస్ట్ లో నేను లోకల్ తో రావడానికి సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలో నాని తన డ్రీమ్ రోల్ ఏంటో చెప్పేశాడు. 
డ్రీమ్ రోల్ కోసం నాని వెయిట్ చేస్తున్నాడట
ఇప్పటివరకూ తను నటించిన సినిమాలు నటుడిగా శాటిస్ఫై చేసినా, నాని డ్రీమ్ రోల్ కోసం వెయిట్ చేస్తున్నాడట. వార్ నేఫథ్యంలో ఉండే కింగ్ రోల్ ని ప్లే చేయాలని ఈ యంగ్ హీరో ఆశపడుతున్నాడు. హాలీవుడ్ మూవీ గ్లాడియేటర్ లాంటి మూవీ చేయాలనేదే డ్రీమ్ అని చెప్పుతున్నాడు. 
విషయం రివీల్ 
ఈ డ్రీమ్ రోల్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పేసిన నాని, గతంలో తాను ఈ మాట చెబితే అందరూ నవ్వుతారేమో అనుకుని చెప్పలేదట. కాని ఇప్పుడు బాహుబలి పుణ్యమా అని డేర్ చేసి తన డ్రీమ్ మూవీ చెప్పగలుగుతున్నాని అసలు విషయం రివీల్ చేశాడు. ఏదో ఒక రోజు తన డ్రీమ్ నేరవేరుతుందనే నమ్మకం ఉందని నాని చెప్పుతున్నాడు. మరి నాని కల కలాగనే ఉంటుందో కార్యరూపం దాలుస్తుందో కాలమే నిర్ణయించాలి.

 

పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు

హైదరాబాద్ : తిరుమలగిరి 60, శ్రీనగర్ కాలనీ 57, మాదాపూర్ 52 మిమీ, అసిఫ్ నగర్ 38, నారాయణగూడ 34 మి.మీ వర్షపాతం నమోదు అయింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. అల్విన్ కాలనీ, జీడిమెట్ల, సూరారం కాలనీ, ప్రకాశ్ నగర్, బేగంపేటలోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. నగరవాసులు బయటికి రావొద్దని జీహెఎంసీ ఆదేశించింది. అప్రమత్తంగా ఉండాలని నగరవాసులకు సూచించింది. 

 

కుత్బుల్లాపూర్ లో నీటి మునిగిన పలు కాలనీలు

హైదరాబాద్ : నగరంలో భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్ లో పలు కాలనీలు నీటి మునిగాయి. చింతల్, శ్రీనివాసనగర్, బాలాజీనగర్ లో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.  

శాఖమూరు రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్ల పంపిణీ

గుంటూరు : మ. 3 గంటలకు శాఖమూరు రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్ల పంపిణీ జరుగనుంది. 1580 మందికి సీఆర్ డీఏ అధికారులు ప్లాట్లు పంపిణీ చేయనున్నారు.  

స్విస్ ఛాలెంజ్ విధానంపై నేడు హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : స్విస్ ఛాలెంజ్ విధానంపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. కోర్టు తీర్పు వెల్లడించనుంది. 

నేటి నుంచి కర్నాటకకు రోజుకు 6 వేల క్యూసెక్కుల కావేరీ జలాలు

ఢిల్లీ : నేటి నుంచి 27 వరకు రోజుకు 6 వేల క్యూసెక్కుల కావేరీ జలాలను కర్నాటక.. తమిళనాడుకు విడుదల చేయనుంది. 

08:26 - September 21, 2016

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని వక్తలు సూచించారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు, టీఆర్ఎస్ నేత వకుళాభరణం కృష్ణమోహన్, టీడీపీ నేత రామకృష్ణ ప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. సమస్యలపై వివాదాలు పెంచుకుని ఘర్షణలకు దిగకుండా ఇరు రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

08:19 - September 21, 2016

జానపద కళాకారుల సమస్యలు పరిష్కరించాలని జానపద వృత్తి కళాకారుల సంఘం నేత యాదగిరి డిమాండ్ చేశారు. ఇవాళ్టి జనపథం చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. భజన కళాకారులు తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. 'తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని భజన కళాకారులు పోరుబాటపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన భజన కళాకారులు ఇవాళ్టి నుంచి టిటిడి ఇవో కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. భజన కళాకారుల నిరాహార దీక్షకు కారణమేమిటి? వీరు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆశిస్తున్నదేమిటి? భజన కళాకారుల విషయంలో టిటిడి పాలకమండలి వ్యవహరిస్తున్న తీరు ఎలా వుంది? ఇలాంటి అంశాలపై యాదగిరి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:13 - September 21, 2016

భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక, పురాణ, ఇతిహాసాలను ప్రచారం చేస్తున్న జానపద కళాకారులు తిరుమల వెంకన్న సన్నిధిలో తమ కళను ప్రదర్శించినప్పుడు పొందే అనుభూతే వేరు. ప్రయాణ చార్జీలు కూడా తామే భరించి, తిరుమలకు వెళ్లి ఎందరెందరో కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శిస్తుంటారు. అయితే, వీరి సమస్యలను, కష్టసుఖాలను టిటిడి పాలకమండలి సహృదయంతో అర్ధం చేసుకోవాలి. వారి గుండెచప్పుడు అవలోకించాలి. 
అవకాశాల కోసం ఎదురుచూస్తున్న గ్రామీణ కళాకారులు  
తన కొచ్చిన కళను పది మంది ముందు ప్రదర్శించాలనుకోవడం కళాకారుడి స్వాభావిక లక్షణం. కోలాటం, చెక్కభజన, పండరి భజన, పిల్లంగట్లు, కులుకు భజన, కావడి భజన, తప్పెటగుళ్లు, డప్పులు, గురవయ్యలు, ఉరుములు ఇలా అనేక కళారూపాలను ప్రదర్శించే గ్రామీణ కళాకారులు అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. తిరుమల వెంకన్న సన్నిధిలో   కళను ప్రదర్శించే అవకాశం దక్కడాన్ని చాలామంది కళాకారులు అదృష్టంగా భావిస్తుంటారు. ఇలాంటి అవకాశాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన గ్రామీణ కళాకారులు తపిస్తుంటారు.  ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కళాకారులు లక్షన్నర మంది దాకా వుంటారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో దాదాపు పదివేల కళాబృందాలున్నాయి. ఇలాంటి కళాబృందాలకు టిటిడి అవకాశం కల్పిస్తూ వుంటుంది. తిరుమల అఖండ నామ సంకీర్తన వేదికలో రోజుకు పన్నెండు కళా బృందాలకు అవకాశం కల్పిస్తున్నారు. దీనివల్ల సంవత్సరానికి 4392 కళాబృందాలకు తమ కళను ప్రదర్శించే అవకాశం దక్కుతోంది. గ్రామీణ కళాకారులకు ఇదొక సంతోషకర విషయం. అయితే, పున్నమి గరుడ సేవలో పాల్గొనే అవకాశం తమకు రావడం లేదన్న అసంతృప్తి కళాకారుల్లో వ్యక్తమవుతోంది.
తిరుమల వెంకన్న స్వామికి ఏటా బ్రహ్మోత్సవాలు 
తిరుమల వెంకన్న స్వామికి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఏటా రెండు వేల బృందాలకు తమ కళను ప్రదర్శించే అవకాశం లభిస్తోంది. అయితే, కళాబృందాల ఎంపిక విషయంలో పారదర్శకత లోపిస్తోందన్న విమర్శలున్నాయి.  పైరవీలకే పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలున్నాయి.  అన్నమయ్య వర్ధంతి, జయంతి సందర్భంగా నిర్వహించే మెట్లోత్సవాలలోనూ కళాబృందాల ఎంపిక విషయంలోనూ గందరగోళం కనిపిస్తోంది. ఈ లోపాలను సరిదిద్దితే, ఏటా పది వేల కళా బృందాలకు కనీసం ఒక్కసారైనా అవకాశం కల్పించవచ్చన్న సూచనలను టిటిడి ఆలకించాలి.
అయితే, తిరుమలలో జరిగే  ప్రదర్శనలలో పాల్గొనే గ్రామీణ కళాకారులు ప్రయాణ చార్జీలు తామే భరిస్తున్నారు. ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి, సాక్షాత్తు ఏడుకొండలవాడి సన్నిధిలోనే  కళను ప్రదర్శిస్తున్న ఈ పేద కళాకారులకు కనీసం లడ్డూ ప్రసాదం కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమ సొంత చార్జీలతో ఎక్కడి నుంచో వచ్చి, ప్రదర్శనలిస్తున్న కళాకారులకు పాతిక రూపాయల లడ్డూ ప్రసాదాన్ని వీరి చేతిలో  పెట్టడం టిటిడికి పెద్ద భారమేమీ కాదు.  

 

08:00 - September 21, 2016

విశాఖ : ఉక్కు నగరం విశాఖపట్టణంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ఎన్నడూ లేని విధంగా అటు రౌడీ గ్యాంగ్‌ల దాడులు ఇటు కొలిక్కి రాని కేసులు వాటికి తోడు గుర్తు తెలియని హత్యలు నగరవాసులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.. విభజన నేపథ్యంలో విశాఖకు ప్రముఖల తాకిడి, ప్రపంచస్థాయి సదస్సులు  ఎక్కువయ్యాయి. పోలీసులు బందోబస్తుకే సరిపోతుండడంతో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి.
విశాఖ నగరంలో రౌడీల రాజ్యం 
విశాఖ నగరం రాను రాను రౌడీల రాజ్యంలా మారుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖకు చాలా ప్రత్యేకత ఉంది.. ఓ వైపు సముద్ర తీరం.. మరోవైపు పచ్చదనం.. ఇది ఒకప్పుడు పరిస్థితి. ఇప్పుడు నగరంలో రౌడీ షీటర్లు మధ్య అధిపత్యపోరుతో భయాందోళనలు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు చేసుకుంటూ రక్తచరిత్ర లిఖిస్తున్నారు. 
నగరంలో రెండు రౌడీ గ్యాంగ్ గ్రూపులు 
నగరంలో రెండు రౌడీ గ్యాంగ్ గ్రూపులు ఉన్నాయి.. ఓ వర్గంకు అనిల్.. రెండవ వర్గంకు పొడుగు కిరణ్ నాయకత్వం వహిస్తూ వచ్చారు. వీరి మధ్య ఆధిపత్యపోరుతో ఇప్పటివరకూ ఆరుగురు మరణించారు.. ఇటీవలే ఈ గ్యాంగ్‌ల బాస్‌లు కూడా మరణించడంతో రక్త చరిత్ర ఆగిందనిపించింది.. అయితే తాజాగా పారిశ్రామిక నగరంలో ఆయిల్ మాఫియా కోరలు చాచింది.. ఆయిల్ వ్యాపారంలో అరితేరిన  తోట రామరావు అలియాస్ ఆయిల్ రామును ఆయన ఇంట్లోనే హత్య చేశారు దుండగులు.. ఇదే సమయంలో భీమిలి పరిధిలో ఓ మహిళ అత్యాచారినికి దారుణ హత్యకు గురైంది.. ఇదే సమయంలో పూర్ణమార్కెట్ లో ఓ యువకుడిని కత్తులతో పొడిచి చంపారు.. 
అవినీతి అరోపణలు.. పలువురు అధికారుల తొలగింపు 
విశాఖనగర పొలీస్‌ కమీషనర్‌గా యోగానంద్‌ బాధ్యతలు తీసుకున్న వెంటనే అవినీతి అరోపణలు ఎదుర్కుటున్న పలువురు అధికారులను నిర్మొహామాటంగా విధుల నుంచి తొలగించారు సీపీ.. దీంతో విశాఖ పరిస్థితి మెరుగవుతుందని ఇక్కడి ప్రజలు భావించారు.. అయితే కేసుల విచారణలో జాప్యం జరుగుతుండటం..మరో వైపు అనకాపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన లావణ్య విషయంలో పోలీసుల వ్యవహారం అనేక విమర్శలకు తావిచ్చింది
ప్రజల రక్షణ గాలికి.. 
కొద్ది కాలంగా నగరంలో వివిధ సభలు సమావేశాలు జరుగతూ ఉన్నాయి. బ్రిక్స్ సదస్సులో దేశ ,విదేశాల ప్రతినిధులు రావడం జరిగింది.. వారానికి కనీసం ఒక్కసారైన కేంద్రమంత్రో, ముఖ్యమంత్రో విశాఖకు వస్తున్నారు.  దీంతో ఉన్న పోలీసులు అందరు వీవీఐపీల భద్రతకే సరిపోతున్నారు. వీఐపీల భద్రతకే ప్రాధాన్యతను ఇస్తూ ప్రజల రక్షణను  గాలికి వదిలేస్తున్నారని నగరవాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు నేరాలకు పాల్పడే వారినపై నిఘాపెట్టి.. తమకు  భద్రత కల్పించాలని విశాఖ ప్రజలు  కోరుతున్నారు.

 

07:54 - September 21, 2016

హైదరాబాద్ : అంతా అయోమ‌యం.. ఆర్థిక ఇబ్బందుల‌నుండి గ‌ట్టెక్కెదెలా? బల్దియా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందా? సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆదాయ మార్గాన్వేషణే లక్ష్యంగా ట్రేడ్ లైసెన్స్ వ‌సూళ్లపై దృష్టి పెట్టింది. 
నిధులలేమితో ఇబ్బందులు పడుతున్న బల్దయా
గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ నిధులలేమితో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పెరిగిన ఖర్చులు..  కొత్త పథకాలతో బల్దియా ఖజానా ఖాళీఅయ్యింది. దీంతో ఆదాయ మార్గాల‌పై దృష్టి పెట్టింది జీహెచ్ఎంసి. న‌గ‌రంలో ల‌క్షల సంఖ్యలో క‌మ‌ర్షియ‌ల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఉన్నాయి. వాటినుంచి ట్రేడ్ లైసెన్స్ రూపంలో ప్రతి ఏటా 25 కోట్ల ఆదాయం కార్పొరేష‌న్ ఖ‌జానాకు చేరుతుంది. ఈ ఏడాది ఇప్పటికే రూ. 29కోట్లు వసూలు చేసిన బల్దియా అధికారులు.. ఇందులో ప‌లు లోపాలున్నాయని గుర్తించారు. వాటిని అధిగమిస్తే రూ. 100కోట్ల వ‌ర‌కు లైసెన్స్‌ ఫీజు వ‌స్తుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. 
ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయాలని నిర్ణయం
ఇక న‌గ‌రంలో ఉన్న భారీ మ‌ల్టీప్లెక్స్‌లు, వంద‌ల సంఖ్యలో సినిమా హాల్స్ ఉన్నాయి. వీటి నుండి ట్రేడ్  లైసెన్స్ ఫీజు వ‌సూలు చేయాల‌ని ఉన్నతాదికారుల‌ నుంచి క్షేత్రస్థాయి అదికారుల‌కు ఆదేశాలు వెళ్లాయి. దీంతో త‌మ త‌మ ప‌రిధిలో ఉన్న సినిమా హాళ్లకు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వ‌సూలు చేసేందుకు  స‌ర్కిల్ అధికారులు సిద్ధమ‌వుతున్నారు. ఒక్కొక్క సినిమా థియేట‌ర్ నుండి 2ల‌క్షల నుండి 2.5ల‌క్షల రూపాయల వ‌ర‌కు ఆస్తిప‌న్ను వసూలు అవుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు త‌గ్గిపోవ‌డంతో కొత్త కొత్త మార్గాల‌ను అన్వేషిస్తున్నారు బ‌ల్దియా అధికారులు. అయితే ఆదాయం అర్జించ‌డ‌మే ల‌క్ష్యం కాకుండా అందుకు త‌గ్గట్లుగానే సౌక‌ర్యాలు పెంచాలని సిటిజ‌న్స్ అంటున్నాడు.

 

07:46 - September 21, 2016

మహబూబ్నగర్ : కొత్త జిల్లాల ఆందోళనలు.. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, గ్రామాల కలయికలు, తీసివేతల నిరసనలతో తెలంగాణ దద్దరిల్లింది....  సిరిసిల్లలో బంద్‌ ఉద్రిక్తంగా మారగా... చేవెళ్లలో ఐదురోజులుగా రాకపోకలు స్తంభించాయి.
సిరిసిల్ల ఉద్రిక్తంగా మారిన బంద్‌  
కొత్త జిల్లాలకోసం తెలంగాణలో ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి.. తమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలంటూ సిరిసిల్ల జిల్లా సాధనసమితి ఆధ్వర్యంలో బంద్‌ ఉద్రిక్తంగా మారింది.. పోలీసులకు, నేతలకు మధ్య తోపులాట జరిగింది.. 35రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.. బంద్‌ను పట్టించుకోలేదంటూ రెండు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఆర్టీసీ డిపో ఎదుట అఖిలపక్ష నేతలు ధర్నా చేపట్టారు. పాత బస్టాండ్‌ దగ్గర ఓ పెట్రోల్‌ బంక్‌పై ఆందోళనకారులు దాడి చేశారు.... అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు.  
జనగామను జిల్లా చేయాలంటూ ఆందోళనలు 
అటు జనగామను జిల్లాగా చేయాలంటూ కూడా ఆందోళనలు ఉధృతమయ్యాయి... జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటైన జనగర్జన సభకు సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ మాజీ ఎంపీ అజీజ్‌పాషా హాజరయ్యారు... సభకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వస్తుండగానే ప్రజలంతా గోబ్యాక్‌ అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.. 
చేవెళ్లను జిల్లా చేయాలంటూ స్థానికంగా బంద్‌ 
రంగారెడ్డి జిల్లా చేవెళ్లను జిల్లాగా చేయాలంటూ స్థానికంగా బంద్‌ కొనసాగుతోంది.. ఐదురోజులుగా రవాణా స్తంభించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.. అఖిలపక్షంతోపాటు చేవెళ్ల జిల్లా పోరాటసమితి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు..
పరిగి నియోజకవర్గాన్ని శంషాబాద్‌లో కలపాలంటూ కాంగ్రెస్‌ రిలే దీక్షలు 
కొత్త జిల్లాల ఆందోళనలు ఇలా ఉంటే కొత్త మండలాల ఏర్పాటు, గ్రామాల కలయికలు, తీసివేతలపైనా నిరసనలు హోరెత్తిపోతున్నాయి.. పరిగి నియోజకవర్గాన్ని శంషాబాద్‌లో కలపాలంటూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు.. 
కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌ చేయాలంటూ రిలే దీక్షలు 
మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌ చేయాలంటూ రిలేదీక్షలు 29వరోజుకు చేరాయి.. బీఎస్‌పీ నేతలు, సర్పంచ్‌లు, ఎంపిటిసి, జెడ్ పిటిసి, ఎంపిపిలు, మండలాల అధ్యక్షులు దీక్షలో ఉన్నారు.. 
నిరసనలతో దద్దరిల్లిన కందుకూరు  
మరోవైపు యాదగిరిగుట్ట మండలంలోని చిన్న కందుకూరు గ్రామం నిరసనలతో దద్దరిల్లింది.. తమ గ్రామాన్ని మోటకొండూరు మండలంలో కలపొద్దంటూ గ్రామస్తులు రోజుకోరకంగా నిరసనలు తెలియజేస్తున్నారు.. వైకుంఠద్వారంనుంచి తహశిల్దార్‌ కార్యాలయంవరకూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు.. భువనగిరి ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వంనుంచి స్పందన రాలేదని చిన్నకందుకూరు ఎంపీటీసీ గడ్డమీది స్వప్న రవీందర్‌ గౌడ్‌, సర్పంచ్‌ నెమిల పాండు, ఉప సర్పంచ్‌ మల్లేశ్‌తోపాటు ఎనిమిదిమంది వార్డు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు.. 
నాగిరెడ్డిపేట్‌పై కొనసాగుతున్న గందరగోళం
అటు నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట్‌పై గందరగోళం కొనసాగుతోంది.. కామారెడ్డిలో కలపాలని కొందరు.. మెదక్‌ జిల్లాలో కలపాలని మరికొందరు రాస్తారోకోలు, నిరాహారదీక్షలు చేస్తున్నారు.. రెండువర్గాలుగా విడిపోయిన స్థానికులు పరస్పరం ఘర్షణపడ్డారు.. దీంతో అక్కడ 144సెక్షన్‌ను పోలీసులు అమలు చేస్తున్నారు. మొత్తానికి చాలా ప్రాంతాల్లో జనాలు ఆందోళనబాటపట్టారు.. తమ డిమాండ్ల సాధనకోసం పోరాడుతున్నారు.

 

07:37 - September 21, 2016

ఢిల్లీ : నీడలా వెనకాలే వచ్చాడు...గమనించని యువతి అడుగులో అడుగేస్తూ నడుస్తూనే ఉంది...ఆ రోడ్డులో ఎవరిపనుల్లో వారు వెళ్తూనే ఉన్నారు..కాని నీడలా వెనకాల వచ్చిన ఆ దుర్మార్గుడి చేతిలో కత్తి యువతిపై పంజా విసిరింది...అలా రోడ్డుమీద నెట్టుకుంటూ..నెట్టూకుంటూ పోతూనే పొడిచాడు..22 సార్లు కత్తితో దేహంలో గుచ్చి గుచ్చి చంపేశాడా రాక్షసుడు..ఇదంతా అందరూ చూస్తూనే ఉన్నారు... వెళ్లిపోతూనే ఉన్నారు...దీనిపై పెదవి విప్పేందుకు భయంతో వణుకుతున్నారు..చివరకు నిఘా నేత్రాలే ఈ ఘోరానికి సాక్షిగా నిలిచాయి...దేశ రాజధానిలో ప్రేమోన్మాదం పెచ్చరిల్లి నడిరోడ్డుపై రక్తం చిందించింది..
ఒక్కసారిగా కత్తితో దాడికి తెగబడ్డాడు.. 
రాజధాని నగరం ఢిల్లీ... ఎవరిపనుల్లో వారు వెళ్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ రోడ్డులో యువతి. ఆమె గమనించలేదు...తన మృత్యువు వెనకాలే ఉందని.. ఒక్కసారిగా కత్తితో దాడికి తెగబడ్డాడు.. నాలుగు నుంచి ఆరు కత్తిపోట్లు పొడుస్తూ ఆమెను పట్టుకున్న పట్టు వదల్లేదు....కిందపడిపోయింది... అయినా వదల్లేదు....ఆ దుర్మార్గుడి చేతిలో కత్తి అదే వేగంలో ఆమె దేహంలో గుచ్చుకుంటూనే ఉంది... ఎదురుగా నడుస్తూ వెళ్తున్నవాడు వచ్చి చూసి భయంతో వెనుదిరిగాడు....అయినా ఆ కత్తి మాత్రం ఆగలేదు.. కిందపడిపోయి రక్తం కారుతున్నా ఆ యువతిని మాత్రం పొడుస్తూనే ఉన్నాడు...దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో ఆ కిరాతకుడి చేతిలోని కత్తి పొడుస్తూనే ఉంది... మొత్తం మీద 22 కత్తిపోట్లతో కాస్త తగ్గాడు... ఎదురొచ్చినవారిని బెదిరించాడు..కత్తితో వారిని అదరగొట్టాడు.. ఆ వైపుగా కార్లు...ద్విచక్రవాహనాలు వెళ్తూనే ఉన్నాయి...వస్తూనే ఉన్నాయి...కళ్ల ముందు జరుగుతున్నదాన్ని చూస్తూ ఎవరికి వారు భయంతో వణుకుతూ అక్కడి నుంచి జారుకున్నారు...అప్పటికీ వాడి కసి తీరలేదు..వాడిలో ఉన్మాదం ఇంకా పెరుగుతూనే ఉంది... అటూ ఇటూ చూసి చనిపోయిందో లేదోనని చూసిన వాడు కాలుతో తన్నాడు..ఆ తర్వాత ఆ యువతిపై కూర్చుని పీక నులిమాడు...
నడిరోడ్డుపై దారుణ హత్య 
రాజధాని నగరం ఢిల్లీలో అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. బురాడీ పరిధిలోని సంత్‌నగర్‌లో 34 ఏళ్ల వ్యక్తి 21 ఏళ్ల యువతిపై దాడి చేశాడు. ప్రేమించలేదన్న కారణంతో యువతిపై కత్తితో 22 సార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ యువతిని సమీపంలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకుడు సురేంద్ర కంప్యూటర్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. హత్యకు గురైన యువతి టీచర్‌గా పనిచేస్తోంది...ఉదయం 9 గంటలకు జరిగిన ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి. కలకలం రేపిన ఈ ఘటన దేశ రాజధానిలో వణుకుపుట్టించింది.

 

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు ఎపి భవన్ కు చంద్రబాబు చేరుకోనున్నారు. మ.12.30 గంటలకు అరుణ్ జైట్లీతో బాబు భేటీ కానున్నారు. మ. 2 గం.లకు అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు. రాత్రి 7.30 గ.లకు తిరిగి విజయవాడకు బయల్దేరనున్నారు. 

 

టీడీపీఎల్పీ.. టీఆర్ ఎస్ ఎల్పీలో విలీనంపై నేడు హైకోర్టు తుది తీర్పు

హైదరాబాద్ : టీడీపీఎల్పీని టీఆర్ ఎస్ ఎల్పీలో విలీనంపై నేడు హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. 

 

సిగ్నల్ వ్యవస్థ ఆధునీకరణ పనులు....పలు రైళ్లు రద్దు

విజయవాడ : రైల్వేస్టేషన్ లో సిగ్నల్ వ్యవస్థ ఆధునీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. 192 రైళ్లను రద్దు చేశారు. మరో 210 రైళ్లను అధికారులు దారి మళ్లించారు. 

హుస్సేన్ సాగర లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జీహెచ్ ఎంసీ కమిషనర్

హైదరాబాద్ : హుస్సేన్ సాగర లోతట్టుప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందున పురాతన భవనాల్లో నివసించే వారు ఖాళీ చేయాలని సూచించారు. ఇంజనీరింగ్, డిప్యూటీ కమిషనర్లు ఫీల్డులో అప్రమత్తంగా ఉండాలన్నారు. 

 

07:08 - September 21, 2016

కరీంనగర్ : ప్రశాంతంగా ఉన్న పల్లెలను వరద ముంచెత్తింది. పోలాలను నీట ముంచింది. పిల్ల పాప,పశువులతో బయటకు తరలి వెళ్లిపోయేల చేసింది. ఊహించని రీతిలో పోటెత్తిన వరదతో ఆ పల్లే జనం ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అధికారుల నిర్లక్ష్యం...నాసిరకం పనులు...సమన్వయం లేక పోవడంతో కరీంనగర్ జల్లా మల్యాల మండలం మానాల వద్ద శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కెనాల్ కు గండి పడింది. హఠాత్తుగా ముంచెత్తిన వరదతో కరీంనగర్‌జిల్లా మల్యాల మండల ప్రజలు ఉక్కిరిబిక్కిరైయ్యారు. ఊహించని వరద గ్రామాలను చుట్టుముడితే.. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం ఊళ్లన్నీ ఖాళీచేశారు. 
ఎస్ ఆర్ ఎస్పీ నుంచి లోయర్‌మానేర్‌ కు నీటి విడుదల
నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరుగుతుండడంతో కరీంనగర్ జిల్లా అవసరాలకోసం లోయర్ మానేర్ డ్యామ్‌కు  నీటిని విడుదల చేశారు అధికారులు.  గతంలో ఎన్నాడు లేని విధంగా శ్రీరామ్ సాగర్ డి 65 కెనాల్ కు 7000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో మానాల గ్రామం వద్ద కెనాల్ కు 25 మీటర్ల వెడల్పుతో గండి పడింది. దీంతో కాలువ కిందిప్రాంతాల్లో ఉన్న గ్రామాలను నీరు ముంచెత్తింది. 
వందల ఎకరాల్లో పంటలు నీటిపాలు
వరద పోటెత్తడంతో మానాల, మేడంపల్లి, సిద్దపల్లి గ్రామాల్లో భారీగా నీరు చేరింది. ఇళ్లన్నీ నీట మునిగాయి. వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వరి, మొక్కజోన్న, పత్తి పంటలకు తీవ్రనష్టం జరిగింది. మేడంపల్లి గ్రామంలోని పెద్ద చెరువు, దమ్మక్క చెరువులకు నీరు పోటెత్తడంతో ఆ చెరువులకు సైతం గండిపడి వరద ఉదృతి మరింత పెరిగింది. కాలువకు గండిపడటంతో పోలీస్, రోవెన్యు అధికారులు గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 
ముంపు గ్రామాల ప్రజలను ఆదుకుంటాం : ఈటెల 
ఎస్ ఆర్ ఎస్పీ కాలువకు గండి పడిన స్థలాన్ని మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించారు. ముంపు గ్రామల ప్రజలను ఆదుకుంటమంటామన్నారు. తక్షణ సాయం కింద ఒక్కో ఇంటికి 20 కిలోల బియ్యంతో పాటు 3800 రూపాయాలను అందిస్తమన్నారు. 
30ఏళ్ల కిందట నిర్మించిన ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలు
ఎస్ఆర్ ఎస్పీ కెనాల్ కాలువను 30యేళ్ల క్రితం నిర్మాణం చేయడంతో కాల్వగట్లు అక్కడక్కడా బలహీనంగా మారిపోయాయి.   ఇటివల అధికారులు కాల్వకు తాత్కలికంగా మరమ్మత్తులు చేసి వదిలి వేశారు. సామర్థ్యాన్ని మించి నీరు విడుదల చేయడంతో... కెనాల్‌కు గండిపడి మూడుఊళ్లను వరద ముంచెత్తింది. ఇళ్లు, పంటపొలాలు పూర్తిగా వరదపాలైపోయాయాని.. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని  బాధిత గ్రామస్తులు  కోరుతున్నారు.  

 

07:01 - September 21, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. దీనిప్రభావంతో రుతుపవనాలు చురుకుగా మారాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో మరో రెండు రోజుల పాటు ఏపీ తెలంగాణల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్‌లో రాత్రంతా కుండపోతగా వర్షం పడింది. నాలాలు పొంగి పలు కాలనీల్లో వర్షపునీరు పోటెత్తింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీవర్షంపడటంతో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

 

సిరిసిల్లలో రెండో రోజు కొనసాగుతోన్న బంద్

కరీంనగర్ : సిరిసిల్లలో రెండో రోజు బంద్ కొనసాగుతోంది. సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళనకారులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. జీవై నగర్ లో టీఆర్ ఎస్ జెండా గద్దెను కూల్చివేశారు.

06:45 - September 21, 2016

హైదరాబాద్ : నగరంలో రాత్రంతా కుండపోత వర్షం కురుస్తోంది. హైదరాబాద్ చెరువుల్లా మారింది. రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టుప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హుస్సేన్ సాగర్ లో భారీగా వర్షంపు నీరు చేరింది. దీంతో నీటిమట్టం భారీగా పెరిగింది. హుస్సేన్ సాగర్ నీటిమట్టం 513.43 అడుగులకు చేరింది. పెద్దమొత్తంలో నీటిని విడుదల చేయాలని హెచ్ ఎండీఏ నిర్ణయం తీసుకుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ లో అత్యధికంగా 15.4 సె.మీ వర్షపాతం నమోదు అయింది. మరో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

 

కుత్బుల్లాపూర్ లో రికార్డుస్థాయిలో వర్షం

హైదరాబాద్ : నగరంలో రాత్రంతా కుండపోత వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్ లో రికార్డుస్థాయిలో 12.7 సెం.మీ వర్షం కురిసింది. బొల్లారం 87, బాలానగర్ 62, మల్కాజ్ గిరి 53 మి.మీ వర్షం పడింది.
 

హైదరాబాద్ లో భారీ వర్షంతో హైఅలర్ట్

హైదరాబాద్ : నగరంలో భారీ వర్షంతో హైఅలర్ట్ ప్రకటించారు. మరో 2 గంటలపాటు భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 

హైదరాబాద్ లో రాత్రి నుంచి భారీ వర్షం

హైదరాబాద్ : నగరంలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది. హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు చేరింది. 

Don't Miss