Activities calendar

22 September 2016

21:53 - September 22, 2016

కర్ణాటక : సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా కావేరి జలాలను తమిళనాడుకు వదిలేందుకు కర్నాటక నిరాకరించింది. నీటి విడుదలను మరో 2 రోజులపాటు వాయిదా వేసింది. ఈ విషయంపై చర్చించడానికి ఈ నెల 23న గవర్నరు అనుమతితో ఉభయసభలను సమావేశ పరచాలని బుధవారం జరిగిన అఖిలపక్ష, మంత్రివర్గ భేటీల్లో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కావేరీ జలాలను సెప్టెంబర్‌ 21 నుంచి 27వరకు రోజూ 6 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. దీంతో కర్ణాటక సర్కారు బుధవారమంతా చర్చలు జరిపి తమిళనాడుకు నీరు వదలకూడదని నిర్ణయించింది. అఖిలపక్ష భేటీకి బీజేపీ డుమ్మా కొట్టింది. 

21:50 - September 22, 2016

ముంబై : ఉగ్రవాద అనుమానం నేపథ్యంలో ముంబైలో హై అలర్ట్‌ ప్రకటించారు. కొందరు యువకులు నల్ల దుస్తులు వేసుకుని ఆయుధాలతో సంచరిస్తున్నారన్న వార్త ప్రకంపనలు సృష్టించింది. దీంతో మహారాష్ట్రలో టెర్రర్‌ అలర్ట్‌ జారీ చేశారు. నేవీ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.

ముంబయిలో అనుమానితుల సంచారం కలకలం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో అనుమానితుల సంచారం కలకలం రేపింది. కొందరు వ్యక్తులు ఆయుధాలతో సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు.

నౌకాదళ స్థావరం సమీపంలో అనుమానితుల కదలికలు?
ఉరన్‌ ప్రాంతంలోని నౌకాదళ స్థావరం సమీపంలో ఉదయం 11 గంటల సమయంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో తిరుగుతూ కన్పించినట్లు ఇద్దరు స్కూలు విద్యార్థులు తెలిపారు. నల్లదుస్తుల్లో ఉన్న ఆ వ్యక్తుల వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయని చెప్పారు. వారంతా పఠాన్‌ సూట్స్‌ వేసుకున్నారని, ఏదో అర్థం కాని భాషలో మాట్లాడుకున్నారని, అందులో స్కూల్‌, ఓఎన్‌జీసీ అనే పదాలు వినిపించాయని విద్యార్థులు స్కూల్‌ యాజమాన్యానికి తెలిపారు. వెంటనే వారు పోలీసులకు సమాచారమందించారు. దీంతో మహారాష్ట్ర ఏటీఎస్‌, పోలీసులు, నేవీ అధికారులు అలర్ట్‌ అయ్యారు. ముంబై నగరమంతటా విస్తృత తనిఖీలు చేపట్టారు.

2008లో 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా నగరంలోకి ప్రవేశం
ఉరన్‌ ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉరన్‌కు సమీపంలోనే నెహ్రూ పోర్ట్‌, బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లు ఉన్నాయి. 2008లో 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా నగరంలోకి ప్రవేశించి ప్రముఖ స్థావరాలపై దాడులకు పాల్పడ్డారు. ముంబయిలో జరిగిన ఉగ్రదాడిలో 166మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌లోని ఉరీలో ఉగ్రదాడి నేపథ్యంలో ముంబయిలో అనుమానితుల సంచారం కలకలం రేపింది. 

21:45 - September 22, 2016

ఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్‌... ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు.. మధ్యాహ్నం కేంద్ర కార్మికశాఖామంత్రి బండారు దత్తాత్రేయతో భేటీ అయ్యారు.. కేంద్రం నుంచి వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల్ని త్వరగా విడుదలయ్యేలా చూడాలని కోరారు.. రామగుండం, ఎరువుల కర్మాగానం పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవాలన్నారు.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, వెనకబడిన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి కేటాయించిన 1200కోట్లు త్వరగా వచ్చేలా కేబినెట్‌ను ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు.. ఆ తర్వాత కేసీఆర్‌.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు.. గోదావరి, ప్రాణహిత నదులపరివాహక ప్రాంతాల్లో రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు.. ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని ఐదు ప్రాంతాల్లో రహదారుల అనుసంధానానికి గ్రామీణ రహదారి ప్రణాళిక ద్వారా నిధులు మంజూరు చేయాలని అడిగారు.

21:43 - September 22, 2016

విజయవాడ : ఏపీలో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.. సహాయక చర్యల్ని పర్యవేక్షించాలని మంత్రులను ఆదేశించారు.. అవసరమైతే హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేయాలని సూచించారు.. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి వివరాలు అందించాలని ఆదేశించారు..

21:08 - September 22, 2016

ఢిల్లీ : ‘పనామా’ లీక్స్ తరహాలోనే ‘బహమాస్’ పేపర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. నల్లకుబేరుల గుట్టురట్టు చేస్తున్నాయి. దేశంలోని 475 మంది నల్లకుబేరుల జాతకాలను బట్టబయలు చేశాయి. ఈ 475 మంది పేర్లతోనే లక్షా 75 వేల సంస్థలున్నట్లు ‘బహమాస్’ లీక్ చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురి పేర్లు ఉన్నాయి. ఇందులో ప్రముఖంగా వ్యాపారవేత్త.. నిమ్మగడ్డ ప్రసాద్ పేరు వున్నట్లుగా సమాచారం. సికింద్రాబాద్ నుండి ఒకే అడ్రస్ నుంచి 28 సంస్థలున్నట్లు ‘బహమాస్ ’ బయటపెట్టింది.

అశోక్ నగర్ వాసులకు జీహెచ్ఎంసీ హెచ్చరిక!..

హైదరాబాద్ : నగరంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. ఈ నేపథ్యంలో అశోక్ నగర్ నాలా వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. వర్షం కారణంగా రహదారులు జలమయం అయ్యాయి. పాతబస్తీలోని యాకత్ పురా ఎస్ఆర్ టీ కాలనీలో ఉన్న పురాతన భవనం కూలింది. అయితే, భవనంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చంపాపేట్ లోని ఒక ఇంటి గోడ కూలింది.

రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు..

హైదరాబాద్ : నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. దీంతో, జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు రేపు, ఎల్లుండి సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈఓ సోమిరెడ్డి ఒక ప్రకటన చేశారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయం కావడం, కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

భాగ్యనగరంలో 'పోలియో'కలకలం!..

హైదరాబాద్ : నగరంలో మరోసారి పోలియో వైరస్ కలకలం రేగింది. అంబర్ పేట్- నాగోల్ మూసీనది నాలాలో పోలియో వైరస్ ను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.

సంచలనం సృష్టిస్తున్న ‘బహమాస్’!..

ఢిల్లీ : ‘పనామా’ లీక్స్ తరహాలోనే ‘బహమాస్’ పేపర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. నల్లకుబేరుల గుట్టురట్టు చేస్తున్నాయి. దేశంలోని 475 మంది నల్లకుబేరుల జాతకాలను బట్టబయలు చేశాయి. ఈ 475 మంది పేర్లతోనే లక్షా 75 వేల సంస్థలున్నట్లు ‘బహమాస్’ లీక్ చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురి పేర్లు ఉన్నాయి. ఇందులో ప్రముఖంగా వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పేరు వినపడుతోంది. సికింద్రాబాద్ లోని ఒకే అడ్రస్ నుంచి 20 సంస్థలున్నట్లు ‘బహమాస్ ’ బయటపెట్టింది.

20:48 - September 22, 2016

చివరికి హైకోర్ట్ సూచనలు కూడా వచ్చాయి. ఇప్పుడైనా ఈ అంశంలో కదలిక వస్తుందా? నిజానికి గోడదూకే నేతల్ని ప్రోత్సహించటంలో అన్ని ప్రధాన పార్టీలది ఒకే నీతి.. కానీ, దీనిపై నిర్ణయం తీసుకోవలసిన స్పీకర్ నిర్ణయంలో జాప్యం, టీటీడీ ఎమ్మెల్యేల విలీనం మొదలైన అంశాలపై హైకోర్ట్ సూచనలు కొత్త పరిణామాలకు దారితీస్తున్నాయి. స్పీకర్ అధికారాలను కోర్టులు ప్రశ్నించవచ్చా అనే వాదనను లేవనెత్తుతున్నాయి. మొత్తంగా ఫిరాయింపుల అంశంలో ఓ మలుపు స్పష్టంగా కనిపిస్తున్న సందర్భం. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా? నిర్ణయానికి ఇంత జాప్యం ఎందుకు వస్తోంది. స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో కోర్టులు చెప్పగలవా? ప్రజాస్వామ్య విలువలు ప్రశ్నార్ధకంగా మారుతున్న తరుణంగా ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లాంటి వ్యవస్థల మధ్య ఓ సంఘర్షణ కనిపిస్తున్న తరుణం ఇది. టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో టిటిడిపి విలీనంపై హైకోర్టు స్టే.. 90 రోజుల్లోగా ఓ నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ మధుసూదనాచారికి సూచన.. ఈ పరిణామం రాజకీయవర్గాల్లో పెద్ద చర్చనే లేవనెత్తుతోంది. స్పీకర్ నిర్ణయంపై కోర్టులో చర్చ జరగటం, కోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇది రాజకీయ వర్గాల్లో ఒకింత గందరగోళాన్ని రేపుతోందని చెప్పాలి. ఈ పరిణామాలు స్పీకర్ పదవి చుట్టూ ఉన్న అనేక అంశాలపై డిబేట్ మొదలుపెట్టింది. మీ వాళ్లే వస్తున్నారు మా తప్పేం లేదంటారు..రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మా వాళ్లను లాగేసుకుంటున్నారని ఆరోపిస్తారు.. మీది తప్పంటే...., ఈ తప్పు మీరే మొదలు పెట్టారని కౌంటర్ ఇస్తారు. మొత్తానికి ఆపరేషన్ ఆకర్ష్ కి ఏ పార్టీ అతీతం కాదు.. ఇక్కడ టియ్యారెస్.. అక్కడ టీడీపీ ఒకే రకంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ప్రజాప్రతినిధులు పార్టీ మారటం తప్పా? మారే అవకాశం ఉండకూడదా?... రాజకీయపక్షాలది ఒకే నీతి..చెప్పేదొకటి... చేసేదొకటి. ఒక రాష్ట్రంలో తప్పుగా కనిపించేది మరో రాష్ట్రంలో సమర్థింపు అవుతోంది. అంతిమంగా ప్రభుత్వాన్ని కట్టుదిట్టం చేసుకుంటూ విపక్షాన్ని దెబ్బకొట్టడమే టార్గెట్.. ఈ క్రమంలో వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ సైలెన్స్, నిర్ణయాల్లో జాప్యం చర్చకొస్తోంది.ఇదేమీ కొత్తగా పుట్టుకొచ్చిన రోగం కాదు.... దాదాపు 45ఏళ్లు దాటింది. ఇతర పార్టీల నేతల్ని లాగటం ఇప్పటి మాటేం కాదు. గోడమీద పిల్లులు గతంలోనూ ఉన్నారు. కానీ, ఇప్పుడు మరింత పెరిగారు.. ప్రజాప్రతినిధులు పార్టీ మారటం తప్పా? మారే అవకాశం ఉండకూడదా? ఎలాంటి విధానం ఉండాలి? కుంటిసాకులు చెప్తూ పార్టీ మారే ప్రతినిధుల్ని ఏం చేయాలి? ఎలాంటి నియమాలు ఉండాలి..? కేవలం స్వప్రయోజనాలకోసం విలువలకు తిలోదకాలిచ్చే నేతలను, పదవులే ధ్యేయంగా పార్టీలు మారే నేతల్ని ఏం చేయాలి? ఓ సిద్ధాంతం లేదు.. ఏ విలువలు లేవు. స్వప్రయోజనాలే ధ్యేయం. దానికోసం పొద్దునో జెండా మోస్తారు. సాయంత్రం మరో కండువా కప్పుకుంటారు. రాత్రికి రాత్రి దుకాణం ఎత్తేస్తారు. ఇప్పుడున్న ప్రజా ప్రతినిధుల్లో ఇలాంటి నేతలు చాలామంది కనిపిస్తున్నారు. మరి ఈ ఫిరాయింపు ప్రజాప్రతినిధుల భవిష్యత్తు ఏం కాబోతోంది. అనర్హత వేటు పడబోతోందా? స్పీకర్ లో కదలిక రాక తప్పదా? ఇది త్వరలో తేలనుంది. మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

20:47 - September 22, 2016

నిండుగా దొరికింది కదాని ఎనకాముందూ చూడకుండా ఆబగా తింటే ఎట్టాగుంటది?.గిదిగో ఈ పాములెక్కుంటది..దొరికింది కదాని ఓ భారీ సర్పరాజం ఓ జింకను లటుక్కున మింగేద్దామనుకుంది. మింగినాకే తెలిసింది అది తన వల్ల కాదని ..మింగలేకా..కక్కలేకా నానా హైరానా పడిపోతాంది ఈ భారీ సర్పరాజం...వానలతో ఆగమై పోయిన భాగ్యనగరం..తెలంగాణలో జిల్లాల లొల్లి..వానల్లో కూడా జిల్లాల లొల్లిని ఆపన గద్వాల వాసులు..టవర్లకెక్కి పవరునోల్లను డిమాండ్ చేస్తున్న జనాలు..సిరిసిల్లా వస్తే చీరి ఎండేస్తామంటున్న జనాలు..నా మనసంతా జనాలమీదే నంటున్న జగదీశ్ రెడ్డి సారుగారు..సార్లు లేక సక్కడా సర్దుకుపోయిన పాలమూరు బడి..ఆయిల్ ట్యాంక్ బోర్లాపడిండు..డబ్బాలతో ఎగబడిన జనాలు.. ఎంకన్నబాబు ఝలక్ ఇచ్చిన చైనాదేశపోడు..నెత్తెంటుకలు కారు చవకగా అమ్మేత్తన్న చైనా దేశపోడు..పేరు పెరుమాళ్ళది..ఆరగింపు అయ్యవారిది అన్నట్లుగా అనంతపురం సర్కారు దవాఖానల మైకులతో ఊదరగొడుతున్న టీడీపోళ్లు..ఆస్తులు ఊడలాక్కోని అమ్మానాయల్నను బువ్వెట్టకుండా బైటికి తోలేసిన పోలీసోడు..మరిన్ని ముచ్చట్లకోసం ఈ వీడియోను చూడుండ్రి మల్ల..

20:29 - September 22, 2016

ఢిల్లీ : ఎయిమ్స్‌ సెక్యూరిటీ గార్డ్‌పై దాడి చేశారన్న కారణంతో ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌భారతిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిమ్స్ చీఫ్ సెక్యురిటీ అధికారి రావత్‌ ఇచ్చిన ఫిర్యాదుతో సెప్టెంబర్ 9న హోజ్ కాస్ పోలీస్ స్టేషన్లో సోమ్‌నాథ్‌భారతిపై కేసు నమోదైంది. సోమ్‌నాథ్‌ భారతి తమ సెక్యురిటీ గార్డుతో అనుచితంగా ప్రవర్తించినట్టు, ఆస్తులకు నష్టం చేకూర్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో నిన్న ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

20:24 - September 22, 2016

ముంబై : ముంబైలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఉదయం పఠాన్ దుస్తుల్లో ఆయుధాలతో ఉన్న నలుగురు ఆగంతకులు అనుమానాస్పదంగా తిరగడం చూశామని ఇద్దరు స్కూల్‌ విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో మున్నెన్నడూ లేని రీతిలో హై అలర్ట్‌ ప్రకటించారు. కశ్మీర్‌లో ఉగ్రదాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో దేశంలో పలుచోట్ల ఉగ్రమూకలు దాడులకు తెగబడే ప్రమాదం ఉన్నట్లు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో స్కూల్‌ పిల్లలు ఇచ్చిన సమాచారాన్ని భద్రతాదళాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఉరాన్‌లో నల్లని పఠాన్‌ దుస్తులు వేసుకుని ముఖానికి మాస్క్‌లు ధరించిన నలుగురు వ్యక్తులు అపరిచిత భాషలో మాట్లాడుకోవడం చూశామని స్కూల్‌ విద్యార్థులు చెప్పారు. దీంతో వాయుసేన నౌకా దళం తీర ప్రాంతంలో గస్తీ ముమ్మరం చేశాయి. దక్షిణ ముంబైలో హై అలర్ట్‌ను ఏర్పాటు చేశారు.

కొనసాగుతున్న గాలింపు చర్యలు..
ఉరాన్‌లో అనుమానితుల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నయి. ఆగంతకులను పట్టుకునేందుకు ముంబై పోలీసు శాఖ, యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌, విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు కనిపించినట్లు చెబుతున్న ఉరాన్‌.. ముంబై నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2008లో సముద్ర మార్గంలో అక్రమంగా ముంబైలోకి చొరబడ్డ 10 మంది ముష్కరులు మారణహోమం సృష్టించారు. నాటి విధ్వంసక దాడుల్లో 166 మంది చనిపోయారు. ఉరాన్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌, బాబా అణు విద్యుత్‌ కేంద్రం ఉన్నాయి. 

20:18 - September 22, 2016

హైదరాబాద్ : క్లాస్‌ రూమ్‌లో పాఠాలు విని బోర్‌గా ఫీలయ్యే వారికోసం సరికొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో విద్యాబోధన అందించేందుకు మలూహా టెక్నాలజీస్‌ ముందుకు వచ్చింది. ఛాప్టర్‌వైజ్‌గా రెండు సంవత్సరాల ఇంటర్మీడియెట్‌ పోర్షన్‌ మొత్తం ఆన్‌లైన్‌లో చదువుకునేందుకు వీలుగా త్రీడీ టెక్నాలజీని మలూహా రూపొందించింది. హైదరాబాద్‌లో మలూహా వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. సినీనటి మంచులక్ష్మి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలోనే.. మలూహా ఆప్‌ని సీనియర్‌ ఐసీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆవిష్కరించారు. విద్యార్థులకు సులువుగా పాఠాలు అర్థమయ్యేందుకు ప్రాక్టికల్‌గా సబ్జెక్టులను వివరిస్తారని ఈ సందర్భంగా శ్రీగాయత్రి విద్యాసంస్థల ఛైర్మన్‌ మూర్తి అన్నారు.

20:13 - September 22, 2016

హైదరాబాద్ : భారీ వర్షాలకు హైదరాబాద్‌లో రోడ్లు చెరువుల్లా మారాయి. ఎల్బీనగర్‌ మాజీ ఎమ్మెల్యే.. కాంగ్రెస్‌ నేత సుధీర్‌రెడ్డి రోడ్లపై చేపలు పడుతూ తన నిరసన తెలిపారు. హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థంగా మారినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.  

20:09 - September 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వర్షపు లెక్కలు గందరగోళంగా మారాయి.. వాతావరణ వివరాలు తెలిపే యంత్రాలు సరిగాపనిచేయడంలేదు.. భారీగా వర్షం పడినా వెదర్‌ స్టేషన్‌లోమాత్రం వర్షమే లేనట్లు చూపిస్తున్నాయి.. ఇక హుసేన్‌సాగర్‌లో ఎంత నీరు వస్తోంది? ఎంత బయటకు వెళుతోందిలాంటి వివరాలపైకూడా స్పష్టతలేకుండా పోయింది.. ఈ వెదర్‌ స్టేషన్లు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

20:04 - September 22, 2016

గుంటూరు : భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులో పడి మొత్తం ఐదుగురు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయలను ప్రభుత్వం ప్రకటించింది. వాగులో చిక్కుకున్న నలుగురిని రెస్క్యూటీం కాపాడింది. వర్ష బాధితులను హోంమంత్రి చినరాజప్ప, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న మంత్రులు చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. జిల్లాలో కురిసిన వానలకు నలుగురు వ్యక్తులు మృతి చెందినట్లుగా మంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. కుప్పగంజి వాగులో చిక్కుకున్న వెంకటేష్అనే వ్యక్తిని స్థానిక యువకులు సాహసంతో కాపాడారనీ..సాహసం ప్రదర్శించిన యువకులకు అవార్డులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా చినరాజప్ప తెలిపారు. ముఖ్యమంత్రిగారి ఆదేశాలతో వరద నీటిలో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు రెండు హెలీకాప్టర్ ను రప్పించి కాపాడేందుకు చర్యలు చేపట్టామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వరద నీటిలో చిక్కుకున్న గ్రామవాసులకు ఆహారం..త్రాగునీరు కల్పించిన బాధితులందరికీ సహాయ చర్యల్ని చేపడుతున్నామని మంత్రి తెలిపారు. 

19:58 - September 22, 2016

గుంటూరు : భారీవర్షాలకు గుంటూరు జిల్లా తడసి ముద్దైంది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి నరసరావుపేట మండలం జొన్నలగడ్డ వాగు ఉద్ధతి పెరగడంతో కాజ్‌వే కొట్టుకుపోయింది. దీంతో గుంటూరు-హైదరాబాద్‌ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్‌పైకి వరద నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. క్రోసూరు మండలంలోని ఊటుకూరు వాగులో చిక్కకుపోయిన ఆర్టీసీ బస్సులోని 47 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు. వరద సహాయ చర్య కోసం జాతీయ విపత్తు స్పందన బృందాలను రప్పించారు.

గుంటూరులో కుండపోత వర్షం..
కుండపోత వర్షాలు గుంటూరు జిల్లా వాసులకు కడగండ్లు మిగిల్చాయి. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లూ నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

కుక్కగంజి వాగులో కొట్టుకుపోయిన ముగ్గురు వ్యక్తులు
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు మార్గాల్లో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు క్రోసూరు మండలంలోని వూటుకూరు వాగులో చిక్కుకుపోయింది. వాగు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వరదనీరు ముంచెత్తడంతో బస్సు మధ్యలో నిలిచిపోయింది. దీంతో ఆపదలో చిక్కుకుపోయిన 47 మంది ప్రయాణికులను అధికారులు, స్థానికులు కలిసి సురక్షితంగా తరలించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఉద్దృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని ఆర్టీసీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. చిలకలూరిపేట మండలంలోని అవిశాయపాలెం-గంగన్నపాలెం మధ్య ఉన్న కుక్కగంజి వాగులో వరద ఉద్ధృతికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు వాగు మధ్యలో ఉన్న చెట్టును పట్టుకుని సహాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. మిగిలిన ఇద్దరు గల్లంతై ఉంటారని భావిస్తున్నారు. సత్తెనపల్లి మండలం గోరంట్ల దగ్గర ఎద్దువాగులో ఆరుగురిలో ఐదుగుర్ని రక్షించారు. మరొకరు గల్లంతయ్యారు. అలాగే అమరావతి-క్రోసూరు మధ్య బయ్యబరం దగ్గర ఆరుగురు, మునుగోడు దగ్గర మరో ఆరుగురు వాగుల్లో చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు ఆర్మీ హెలికాప్టర్లను రప్పించారు.

పులిచింతల ప్రాజెక్ట్‌లోకి 4.6 లక్షల క్యూసెక్కుల నీరు
నల్గొండ, గుంటూరు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో పులిచింతల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్ట్‌లోకి 4.6 లక్షల క్కూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పదిగేట్లను నాలుగు మీటర్ల మేర ఎత్తి నీటిని మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువు ఉన్న కృష్ణా బ్యారేజ్‌లోకి వదులుతున్నారు. ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఎల్లమంద దగ్గర పొంగిప్రవహిస్తున్న ఏడుమంగళ వాగు
నరసరావుపేట.లోని కొత్తచెరువుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో సత్తెనపల్లి రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని చాలా కలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పుడుతున్నారు. గుంటూరు రోడ్డులో స్వర్గపురి వద్ద నాలుగు అగడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. రహదారిపై నీటిని మళ్లించేందుకు డివైడర్లను తొలగించారు. మరోవైపు నరసరావుపేట మండలంలోని ఎల్లమంద గ్రామం వద్ద ఏడుమంగళ వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాగు పరీవాహక ప్రాంతంలోని పలు కాలనీలు జలమయ్యాయి. కేసానిపల్లి, రాయిపాడు, లక్ష్మీనారాయణపురంలోకి భారీగా వరద నీరు రావడంతో అనేక ఇళ్లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. లింగంకుంట్ల గ్రామంలోని మంచినీటి చెరువులోకి భారీగా వర్షపు నీరు చేరడంతో పక్కనే ఉన్న ఎస్సీ కాలనీ జలమయమైంది.

సత్తెనపల్లి-రెడ్డిగూడెం మధ్య కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌
సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా సుమారు 6 గంటలపాటు కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుకాలనీలు నీటిమునిగాయి. రోడ్లపై మోకాలిలోతున వర్షం నీరు చేరింది. సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు పట్టణంలోని బసవమ్మవాగు వద్ద నిలిచిపోయాయి. రాజపాలెం మండలంలోని అనుపాలెం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. సత్తెనపల్లి నుంచి నరసరావుపేట, అచ్చంపేటకు వెళ్లే రహదారులు వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. సత్తెనపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారుల తెలిపారు. గుంటూరు-హైదరాబాద్‌ మార్గంలో సత్తెనపల్లి-రెడ్డిగూడెం మధ్య రైల్వే ట్రాక్‌ కొట్టుకుపోవడంతో ఈ రూటులో ప్రయాణించే రైళ్లు ఎక్కడికి అక్కడలే నిలిచిపోయి. వీరిని గమస్యస్థానాలను చేర్చేందుకు యాభై బస్సులను సిద్ధం చేశారు. అయితే వరద ఉద్ధృతితో బస్సులు ఆయా ప్రాంతాలకు చేరుకోలేని పరిస్థితి ఏర్పండి. మంచినీరు, ఆహారం అభించిక ప్రయాణికులు ఆకలితో అలమటిస్తున్నారు.
పెదనందిపాడు,గుంటూరు, పెదనందిపాడు,పర్చూరు మధ్య రాకపోకలు బంద్‌
భారీ వర్షం కారణంగా పెదనందిపాడులోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. నాగులపాడులో ఓ పెంకుటిళ్లు కుప్పకూలింది. పెదనందిపాడు సమీపంలో ఒగేరువాగు కట్టకు గండి పడటంతో వరి పొలాలన్నీ నీట మునిగాయి. పలు పాఠశాలల్లో నీరు నిలవడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పెదనందిపాడు-గుంటూరు, పెదనందిపాడు-పర్చూరుల మధ్యల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు పొంగి ప్రవహించడంతో పిడుగురాళ్ల సమీపంలోని అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లాలో లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

19:41 - September 22, 2016

పాతాళంలో 'పాక్' స్టాక్ మార్కెట్!..

ఢిల్లీ : ఐక్యరాజ్యసమితి వేదికగా, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా వస్తున్న వార్తలు, ఉగ్రవాదాన్ని పాక్ అరికట్టాల్సిందేనంటూ పలు దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి పాక్ లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను తీవ్రంగా దెబ్బతీశాయి. ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిన బెలూచిస్థాన్ అంశం, కాశ్మీర్ పై దాడులతో దౌత్యపరమైన ఒత్తిడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించేందుకే మొగ్గు చూపారు. దీంతో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏకంగా 569 పాయింట్లు నష్టపోయింది. అత్యంత కీలకమైన మద్దతు స్థాయిగా పరిగణించే 40 వేల పాయింట్ల నుంచి పడిపోయి 39,771 పాయింట్లకు చేరుకుంది.

కాటన్ బ్యారేజ్ 175 గేట్లు ఎత్తివేత..

తూర్పుగోదావరి : గోదావరి జిల్లా వారధి..ఆంధ్రప్రదేశ్ కు మకుటాయమానమైన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర వరదనీరు భారీగా చేరుతోంది. నీటి మట్టం 10.8 అడుగులకు చేరింది. దీంతో, 175 గేట్లు ఎత్తివేసి.. 2.65 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. కాల్వలకు 4,500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.

పులిచింతల ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత..

గుంటూరు : ఇటీవల కురుస్తున్న వర్షాలకు పులిచింతల ప్రాజెక్ట్ కు వరద నీరు భారీగా వచ్చి ఏరుతోంది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 4.6 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2.5 లక్షల క్యూసెక్కులు గా ఉంది. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కాగా, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ 10 గేట్లను ఎత్తివేశారు. ఒక అడుగు మేరకు గేట్లను ఎత్తివేసినట్లు జలవనరుల శాఖాధికారులు పేర్కొన్నారు. దీంతో, 7,250 క్యూసెక్కుల నీరు సముద్రంలో కలవనుంది.

కోర్టులో మ్యాగీ నూడిల్స్..

ఢిల్లీ : గడువుతీరిన మ్యాగీ నూడిల్స్ ధ్వంసం చేసే విషయమై నెస్లే ఇండియా సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గడువు తీరిన 550 టన్నుల నూడిల్స్ నిల్వలను ధ్వంసం అనుమతి విషయమై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అంగీకరించకపోవడంతో సంస్థ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నెస్లే సంస్థ గతంలో ఇదే సమస్యను లేవనెత్తిందని, ఈ వ్యవహారంలో జస్టిస్ అటార్నీ జనరల్ ముకుల్ సూచనలను పాటించాల్సి ఉందని ఎఫ్ఎస్ఎస్ఏఐ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సి.

18:14 - September 22, 2016
18:13 - September 22, 2016

విజయవాడ : ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివర్గం కొనసాగుతోంది. కృష్ణా నదీ జలాల విషయంలో బుధవారం దేశరాజధాని ఢిల్లీలో ఉమాభార‌తి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన అపెక్స్ క‌మిటీ భేటీలోని అంశాలు, వ‌చ్చే నెల 3 నుంచి అమ‌రావ‌తి నుంచి ప్ర‌భుత్వ పాల‌న అంశాలపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మంత్రుల‌తో చ‌ర్చిస్తున్నారు. అంతేగాక‌, అమ‌రావ‌తి నిర్మాణానికి అనుస‌రిస్తోన్న‌ స్విస్ ఛాలెంజ్ విధానంపై వేసిన కేసు..రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు..తీసుకోవాల్సిన చర్యలు.. రాష్ట్రంలో వైద్యవిధానం కుంటుపడుతోందని విపక్షాల విమర్శలపై ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యసదుపాయం..త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలు..ఎన్నికల్లో ముందుకెళ్లేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు వంటి పలు కీలక అంశాలపై మంత్రులు చర్చిస్తున్నారు. 

ఏపీలో మరో గ్రేట్ కన్వెన్షన్?..

చిత్తూరు : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదిక కానుంది. ఇటీవ‌లే విశాఖ‌ప‌ట్నంలో బ్రిక్స్ దేశాల ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రుల స‌ద‌స్సు జ‌రిగిన విషయం తెలిసిందే. అలాగే ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ స‌ద‌స్సు కూడా ఏపీలోనే నిర్వ‌హించాల‌ని సంబంధిత అధికారులు ఈరోజు నిర్ణ‌యించుకున్నారు. తిరుపతి పట్టణం ఈ స‌ద‌స్సుకు వేదిక కానుంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 3న ఈ స‌ద‌స్సు ప్రారంభం కానుంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ స‌ద‌స్సును ప్రారంభించి ఉప‌న్యాసం చేయ‌నున్నారు.

విశాఖ జిల్లా వాసులకు శుభవార్త...

విశాఖ: విశాఖ జిల్లా వాసులకు శుభవార్త. జిల్లా నుంచి దేశ రాజధాని ఢిల్లీవెళ్లే ప్రయాణీకులు ఇక ఇబ్బంది పడనక్కర్లేదు. ఎందుకంటే వచ్చే నెల అక్టోబర్‌ 28న ఢిల్లీ నుంచి విశాఖకు ప్రత్యేక విమానం నడవనుంది. రాత్రి 7.50గంటలకు బయల్దేరి రాత్రి 10.10 గంటలకు చేరుకుంటుంది. అంటే కేవలం 2గంటల 6నిమిషాలకే ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకుంటుందన్న మాట. కాగా అదే రోజు విశాఖ నుంచి 10.40గంటలకు హైదరాబాద్‌కు విమానం రానుంది.

17:45 - September 22, 2016

హైదరాబాద్ : విశ్వనగరంకాదు విశ్వనరకంలా హైదరబాద్ మారింది. వర్షాలు పడితే చాలు నగర రహదారులు కాస్తా నరకపు దారులను తలపిస్తున్నాయి. రోడ్ల పై ప్రయాణిస్తూ నిత్యం నరకం చూస్తున్న ప్రజలు ప్రభుత్వం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రోజురోజుకు దిగజారుతున్న హైదరాబాద్ రోడ్ల పరిస్ధితి
హైదరాబాద్ నగరంలోని రోడ్ల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. అభివృద్ధి వైపు హైదరాబాద్ అడుగులు వేస్తోందని చెబుతున్న పాలకుల, అధికారుల మాటలు నీటిమీద రాసిన మాటలేనని నగర రోడ్లను చూస్తే అర్థమవుతోంది. వివిధ శాఖల మధ్య సమన్వయలోపం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, స్థానిక పాలకులు పట్టించుకోకపోవడం వంటి కారణాలతో ప్రజలకు నిత్యం ఇబ్బందులు తప్పటం లేదు. స్థానికంగా ఉండే ప్రజలు ఎన్ని విన్నపాలు చేసిన అధికారుల్లో చలనం రావడం లేదు. నగరంలోని రోడ్ల పై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మల్కాజ్ గిరీ ప్రాతంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానం
నగరంలోని ప్రధానమైన ఏరియాల్లో ఒకటైన మల్కాజ్ గిరి ప్రాతంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. రోడ్ల పై పైప్ లైన్ల కోసం, టెలికం వైర్ల కోసం, నాలా పనుల కోసం తవ్వకాలు జరిపి ఏడాది గడిచినప్పటికీ మళ్లీ రోడ్డు వేయలేదు. ఇసిఐల్ నుండి నేరేడ్ మెట్, మాల్కాజ్ గిరి, సికింద్రాబాద్ ప్రధాన రహదారి పై దాదాపుగా 3 కిలోమీటకర్ల మేర రోడ్లు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఇలాంటి అధ్వాన రోడ్ల పై ప్రయాణించి అనారోగ్యాల పాలవడమే కాక ప్రమాదాల భారిన పడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పలు ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నం
ఇదే పరిస్థితి నగరంలోని ప్రధానమైన ప్రాంతాలు సికింద్రాబాద్, మలక్ పేట, చిలకల గూడా, ఆర్ టి సి క్రాస్ రోడ్స్, మాదాపూర్, దిల్ సుఖ్ నగర్, చాలా ప్రాంతాల్లో ఉంది. తాత్కాలికంగా రోడ్లను వేయడంతో వాటిలో నాణ్యత లోపం వలన తేలికపాటి వర్షాలకే రోడ్ల పై గోతులు పడుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్న పాలకులు ముందుగా పటిష్టమైన రోడ్లను నిర్మించాలని గ్రేటర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

 

17:09 - September 22, 2016

మహారాష్ట్ర : చ‌రిత్ర‌లోనే తొలిసారిగా నేవీ అధికారులు ముంబైలో అత్యంత అప్రమత్తత ప్ర‌క‌టించారు. ముంబై సహా అన్ని నౌకా స్థావరాలకు అధికారులు పట్టిష్టమైన భద్రత ను పెంచారు.ముంబయ్ సమీపంలోని ఉరాన్‌లో అనుమానితులు సంచ‌రిస్తున్నారంటూ ప‌లువురు విద్యార్థులు ఇచ్చిన‌ స‌మాచారం క‌ల‌క‌లం రేపుతోంది. ఇండియ‌న్ నేవీ ఆయుధాగారం ఐఎన్ఎస్ అభిమన్యు సమీపంలోని యురాన్ ప్రాంతంలో ఆయుధాలు ధరించిన నలుగురు వ్యక్తులు అపరిచిత భాషలో మాట్లాడుకుంటున్నట్లుగా ఇద్దరు విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ముంబైపోలీసులు రంగంలోకి దిగారు. ముంబై పోలీసులు, మ‌హారాష్ట్ర యాంటీ టెర్ర‌ర్ స్క్వాడ్ అలెర్ట‌య్యారు. ముంబై నగరం మొత్తం విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు  అనుమానితులుగా భావిస్తున్నవారు ఉగ్ర‌వాదులా? అనే కోణంలో పోలీసులు యుద్ధప్రాతిపదికన దర్యాప్తును చేపట్టారు. దీంతో యూరాన్ ప్రాంతంలో నేవీ,ఎయిర్ ఫోర్స్ అధికారులు దక్షిణ ముంబై ప్రాంతంతో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. అనంతరం హెలీకాప్టర్ తో అనుమానితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. అపరిచితులుగా సంచరిస్తున్నవారిపై సమాచారం అందించాలని ముంబై పోలీసులు ఫోన్ నంబర్లను ప్రకటించారు. కాగా మంబై నగరానికి ఉరాన్ నగరం దాదాపు 50 కి.మీటర్లు వుంటటంతో అధికారులు అప్పమత్తమయ్యారు.
తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు ..
ఉరాన్‌లో అనుమానితుల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నయి. ఆగంతకులను పట్టుకునేందుకు ముంబై పోలీసు శాఖ, యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌, విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు కనిపించినట్లు చెబుతున్న ఉరాన్‌.. ముంబై నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2008లో సముద్ర మార్గంలో అక్రమంగా ముంబైలోకి చొరబడ్డ 10 మంది ముష్కరులు మారణహోమం సృష్టించారు. నాటి విధ్వంసక దాడుల్లో 166 మంది చనిపోయారు. ఉరాన్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌, బాబా అణు విద్యుత్‌ కేంద్రం ఉన్నాయి. 

క్రీడలనేవి ఒక స్పూర్తి..వివక్షత లేదు - ఎంఎస్ కే ప్రసాద్...

విజయవాడ : సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎంఎస్ కే ప్రసాద్ కలిశారు. ఈసందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. క్రికెట్ ను భారతీయులు గౌరవిస్తారని తెలిపారు. ఇండియాకు మంచి టీమ్, విజయవాలు తీసుకొచ్చే దిశగా తమ సెలక్షన్ కమిటీ పనిచేస్తుందన్నారు. క్రికెట్ ను గ్రామీణస్థాయికి చేరువ చేసి మంచి క్రికెటర్లను దేశానికి అందిస్తామన్నారు. క్రికెటర్లకు స్టైఫండ్ ఇచ్చి ప్రోత్సాహిస్తామని, క్రీడలనేవి ఒక స్పూర్తి..వివక్షతకు చోటు లేదన్నారు. 

16:55 - September 22, 2016

రాజ్ నాథ్ తో ముగిసిన కేసీఆర్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింఘ్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేసీఆర్ జరిపిన భేటీ కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారికి రూ. 1290 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం చేసేలా చూడాలని కేసీఆర్ అభ్యర్థించారు. గోదావరి ప్రాణహిత వెంట అటవీ ప్రాంతంలో నివాసం ఉండేవారికి రహదారి సౌకర్యం కల్పించాలని, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ. 300కోట్లు ఆర్ఆర్ పీ కింద మంజూరు చేయాలని కోరారు. గ్రామీణ రహదారుల పథకం కింద అదనపు నిధులివ్వాలని తెలిపారు. 

ఉమా భారతితో సిద్ధరామయ్య భేటీ..

ఢిల్లీ : కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రి ఉమా భారతితో ఆయన భేటీ అయ్యారు. కావేరీ జల వివాదంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.  

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం..

విజయవాడ : ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది. పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. 

ఉరాన్ లో హై అలర్ట్..

మహారాష్ట్ర : ఉరాన్ ప్రాంతంలోని నౌకాదళ స్థావరం వద్ద నల్లదుస్తులు ధరించి..మారణాయుధాలతో కనిపించారని పాఠశాల విద్యార్థులు పేర్కొన్నారు. దీనితో పోలీసులు హై అలర్ట్ ప్రకటించి గాలింపులు చేపట్టారు. 

15:58 - September 22, 2016

హైదరాబాద్‌ : మళ్లీ భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, చిక్కడపల్లి, అల్వాల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. నిన్న, మొన్న కురిసిన భారీ వర్షాలతో ఇంకా జలదిగ్బంధంలోనే పలు కాలనీలు ఉన్నాయి. ఇళ్లల్లోకి మోకాళ్లలోతు నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల నాలాలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

15:53 - September 22, 2016

వరంగల్ : భారీ వర్షాలతో వరంగల్‌ జిల్లా తడిసిముద్దయింది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురవడంతో వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. నగరంలో ఉన్న రామప్ప, లక్నవరం, పాకాల, గణపతిచెరువులన్నీ నిండి జలకళను సంతరించుకున్నాయి. వరంగల్‌లో కురిసిన భారీ వర్షానికి బొందివాగు ఉధృతంగా ప్రవహించడంతో దాని ప్రభావం సమీప బస్తీలపై పడింది. ఎన్టీఆర్‌ నగర్‌, గాయత్రి నగర్‌, సంతోషిమాతా కాలనీ, భద్రకాళీ నగర్ జలమయం అయ్యాయి. దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి.

15:51 - September 22, 2016

హైదరాబాద్‌ : మళ్లీ భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, చిక్కడపల్లి, అల్వాల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. నిన్న, మొన్న కురిసిన భారీ వర్షాలతో ఇంకా జలదిగ్బంధంలోనే పలు కాలనీలు ఉన్నాయి. ఇళ్లల్లోకి మోకాళ్లలోతు నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల నాలాలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగర రహదారులలో వాహనాలు ఎక్కడక్కడ నిలిచిపోయిన పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న జీహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్ పనులను చేపట్టినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో ప్రజల నుండి ఫిర్యాదులు ఆందుకునేందుకు కంట్రోల్ రూమ్ ను ఏర్పాట్లు చేసి ప్రతీక్షణం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

15:47 - September 22, 2016

గుంటూరు : జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు మార్గాల్లో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు క్రోసూరు మండలంలోని విప్పూరు వాగులో ఈరోజు మధ్యాహ్నం చిక్కుకుపోయింది. వాగు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వరదనీరు ముంచెత్తడంతో బస్సు మధ్యలో నిలిచిపోయింది. దీంతో బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్‌ ద్వారా అధికారులు..పోలీసులు 30మంది ప్రయాణీకులను రక్షించారు. ఇప్పటికే జిల్లా అధికారులు ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్తిపాటి పుల్లారావు,నిమ్మకాయల చినరాజప్ప సహాయక చర్యల్ని పరిశీలిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన అధికారులు చర్యల్ని చేపట్టారు. ఇబ్బందుల్లో వున్న ప్రజలకు వాటర్, ఆహార సదుపాయాలను చేపట్టారు. భారీ వర్షాలకు రోడ్డు మార్గంలో వెళ్లే వీలు లేకపోవటంతో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యల్ని చేపట్టినట్లుగా తెలుస్తోంది.
వర్షాలపై చంద్రబాబు ఢిల్లీ నుండి సమీక్ష..
గుంటూరు జిల్లా సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా సుమారు 6 గంటలపాటు కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సత్తెనపల్లి నుంచి నరసరావుపేట, అచ్చంపేటకు వెళ్లే రహదారులు వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. సత్తెనపల్లిలో కురిసిన భారీ వర్షంతో పట్టణంలోని నాగన్నకుంట, సుందరయ్యనగర్‌, వెంకటపతికాలనీ, యానాదికాలనీ, కొత్తపేట ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సత్తెనపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. వరద ఉధృతికి సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు పట్టణంలోని బసవమ్మవాగు వద్ద నిలిచిపోయాయి. క్రోసూరు మండలం విప్పర్ల వద్ద వాగులో ఆర్టీసి బస్సు చిక్కుకుంది. దీంతో ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయాణికులు బస్సుపైకి ఎక్కారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయం కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. అటు రాజపాలెం మండలంలోని అనుపాలెం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు..అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వరద ప్రాంతాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్ ను రప్పిస్తున్నాం : కలెక్టర్ కాంతిలాల్ 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాత్రి నుంచి ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ప్రధానంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండి అలుగు పడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం అవిశాయపాలెంలో కుప్పగంజివాగు ఉధృతంగా ప్రవహించడంతో అందులో పడి నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. అయితే ఇద్దరు వ్యక్తులు మాత్రం చెట్లను పట్టుకొని ప్రాణాలను దక్కించుకోగా..మరో ఇద్దరి ఆచూకీ మాత్రం లభించలేదు. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చెట్లను పట్టుకొని ప్రాణాలను దక్కిచుకున్న వారిని సురక్షితంగా కాపాడేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఎన్టీఆర్‌ఎఫ్‌ దళాలను రంగంలోకి దింపింది. వారిని కాపాడేందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను కూడా రప్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే తెలిపారు. 

కింగ్ ఫిషర్ సీఎఫ్ కు జైలు శిక్ష..

హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో కింగ్ ఫిషర్ సీఎఫ్ఓ రఘునాథ్ కు ఎర్రమంజిల్ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో విజయ్ మాల్యా ఏ 1 నిందితుడు. 

డాక్టర్లు..సిబ్బందిని అప్రమత్తం చేసిన టి.మంత్రి లక్ష్మారెడ్డి..

హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో డాక్టర్లు..సిబ్బందిని టి.మంత్రి లక్ష్మారెడ్డి అప్రమత్తం చేశారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వైద్య శాలల్లో ఓపి కౌంటర్లను పెంచాలని, ప్రతి రోజూ ఓపీ సమయం ముగిసినా చివరి పేషెంట్ వరకు వైద్యం అందించాలని సూచించారు. మందుల కొరత లేదని, అవసరమైన మందులు తెప్పించుకోవాలని..వైద్యం అందక ఏ ఒక్కరూ ఇబ్బంది పడవద్దన్నారు. 

పులిచింతలకు భారీగా వరదనీరు - దేవినేని..

విజయవాడ : పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోందని, 400 క్యూసెక్కుల వరదనీరు వస్తోందని ఏపీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెక్టు నుండి ప్రకాశం బ్యారేజ్ కి మూడు లక్షల క్యూసెక్కుల నీరును విడుదల చేయడం జరిగిందన్నారు. ఇరిగేషన్ శాఖాధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్టీసీ బస్సులను వాగులు దాటించే ప్రయత్నం చేయవద్దని, ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. 

వరద పరిస్థితిపై బాబు సమీక్ష..

విజయవాడ : వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి వివరాలు అందించాలని బాబు సూచించారు. అవసరమైతే హెలికాప్టర్ లలో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

15:08 - September 22, 2016

'ఎస్. జానకి' పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సుస్వారాలకు ఆమె కేరాఫ్ అడ్రస్. శ్రావ్యమైన గాత్రంతో స్వరాభిషేకం చేసే గొంతు ఆమె సొంతం. ఆమెది కోయిల గానం. 1938 ఏప్రిల్ 23వ తేదీన 'జానకి' జన్మించారు. గుంటూరు జిల్లా రేపల్లె ఆమె స్వస్థలం. చిన్నతనం నుండే ఆమె పాటలపై ప్రేమను పెంచుకొంది. ఇలా కొన్ని వేల పాటలు పాడారు. పసిపిల్లాడిలా పాడాలన్నా..యవ్వనంలో ఉన్న అమ్మాయిలా మురిపించాలన్న అది ఒక్క 'జానకి'కే సొంతం. కుర్రకారును ఊహలోకాల్లో విహరింపజేసే ప్రేమ గీతాలే కాకుండా మహిళకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించగల సందేశాత్మక పాటలు కూడా 'జానకి' పాడారు. దాదాపు 60 ఏళ్ల పాటు గాయనిగా కొనసాగారు. ఇలా ఎన్నో పాటలు పాడి ఎంతో మందిని అభిమానులు సంపాదించుకున్న 'జానకి' ఇక పాటలు పాడరాదని నిర్ణయం తీసుకన్నారట. ఓ మలయాళ పాటతో తన కెరీర్ కు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. 'నూప్ మీనన్'- 'మీరా జాస్మిన్' లు '10 కాల్పనికాల్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పాడే పాట చివరి పాట అని 'జానకి' వెల్లడించారు. 'ఇదే నా చివరి పాట. ఇకపై నేను ఏ రికార్డింగులలోనూ పాల్గొనను.. అలాగే ఎక్కడా స్టేజ్ లపై పాడబోను' అని 'జానకి' తేల్చేసిందని టాక్. అనేక భాషల్లో పాటలు పాడడం జరిగిందని, ఇకపై విశ్రాంతి తీసుకోవాలని 'జానకి' అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 'జానకి' నిర్ణయంపై ఎవరు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

వర్షాలపై ఏపీ సీఎం సమీక్ష..

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పులిచింతల ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరగడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పులిచింతలకు ఇన్‌ఫ్లో 2 లక్షల 27 వేల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల నీటి నిల్వ 26.75 టీఎంసీలుగా నమోదు అయ్యింది. దీంతో అధికారులు పట్టిసీమ నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. పులిచింతల ప్రాజెక్టుకు 30 టీఎంసీల నీటి నిల్వ తర్వాత గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు.

మూసీ గేట్లు ఎత్తివేత..

నల్లగొండ: జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాల కారణంగా మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. దీంతో కేతనపల్లిలోని ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తివేసిన వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 643.5 అడుగులు కాగా, పూర్థిస్థాయి నీటిమట్టం 645 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 13 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 7వేల క్యూసెక్కులుగా ఉంది.

కోనసీమలో కుండపోత..

తూర్పుగోదావరి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంలో తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలోకుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. మంగళవారం రాత్రి నుంచి కోనసీమంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి పాయలకు వరద ఉద్ధతి పెరగడంతో లంక గ్రామాలు జలమయమయ్యాయి. అమలాపురంతో పాటు అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అల్లవరం, కొత్తపేట, రాజోలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుడటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. సముద్ర తీర, లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

ముంబైలోనూ వర్షాలే..

ముంబై : భారీ వర్షాలతో ముంబయి అతలాకుతలమవుతోంది. గడిచిన 48 గంటల్లో భారీ వర్షాలు కురవడమే కాకుండా మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బుదవారం ఉ.8 గంటల నుంచి గురువారం 8 గంటల వరకు నగరంలో 84.7మి.మీ., నగరం పశ్చిమవైపు శివారు ప్రాంతంలో 95.89మి.మీ., దహానులో 111.5, అలీబాగ్‌లో 72.8, మహాబలేశ్వరంలో 106.2, హర్నైల్‌లో 218.9మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఈరోజు నగరంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

కాసేపట్లో సాగర్ నీరు విడుదల..జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు..

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ లో భారీగా నీరు వచ్చి చేరుతోంది. కాసేపట్లో నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నగరంలో పర్యటిస్తున్నారు. గత రెండు రోజులుగా నగరంలో భారీ వర్షం కురవడంతో కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం భండారీ లేవు అవుట్ లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. కాలనీ వాసుల నుండి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. 

సాగర్ ఎర్త్ డ్యాం వద్ద కూలిన వాటర్ ట్యాంక్..

నల్గొండ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. సాగర్ ఎర్త్ డ్యాం దగ్గర రోడ్డు పక్కన పాత వాటర్ ట్యాంక్ కూలింది. వాటర్ ట్యాంక్ చాలా పెద్దది కావడం, రహదారిపై కూలడంతో హైదరాబాద్-మాచర్ల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

కాల్పుల్లో గాయపడిన ఆర్ఎస్ఎస్ నేత మృతి..

పంజాబ్‌ : రాష్ట్రానికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత జగదీశ్‌ గగ్నేజ(65) గురువారం లూధియానాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత నెల 6న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతపై జలంధర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జగదీశ్ శరీరంలోకి 3 బుల్లెట్లు దూసుకుపోయాయి. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతిచెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇండియా 185/4..

కాన్పూర్ : గ్రీన్ పార్క్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీ విరామ సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. 

ఆగని ఆప్ ఎమ్మెల్యేల అరెస్ట్ లు..

హైదరాబాద్: ఆప్ పార్టీకి దెబ్బదెబ్బ మీద దెబ్బ తాకుతోంది. న్యూఢిల్లీని ఎయిమ్స్ ఆస్పత్రి సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఆప్ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని పోలీసులు అరెస్టు చేయక ముందే మరో ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయనను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఖాన్ బంధువైన ఒక 32 ఏళ్ల మహిళను ఖాన్ లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. అయితే ఖాన్ ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. 

ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాలు..కొనసాగుతున్న సహాయక చర్యలు...

గుంటూరు : ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి (మం) గోరంట్ల సమీపంలో వాగులో నలుగురు యువకులు చిక్కుకున్నారు. వీరిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. అమరావతి (మం) మునుగోడు వద్ద చెట్లపై యువకులు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు హెలికాప్టర్ లను ఏర్పాటు చేశారు. క్రోసూరు (మం) విప్పర్ల వద్ద వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకపోయింది. 

14:19 - September 22, 2016

ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుందని ఘంటాపథంగా చెప్పిన నవ యుగ వైతాళికుడు గురజాడ. సమాజంలో వేళ్లూనుకుని పోయిన దురాచారాలను, మహిళల అభివృద్ధిని ఆటంకపరిచే సంప్రదాయాలను కూకటివేళ్లతో సహా పెకిలించకపోతే, సమాజ మనుగడ తిరోగమనంలో పయనిస్తుందని చెప్పిన సంఘ సంస్కర్త గురజాడ..సెప్టెంబర్ 21 గురజాడ జయంతి సందర్భంగా మానవి ప్రత్యేక కథనం గురజాడ... జాడలో..
మహాకవి గురజాడ
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అంటూ చాటిచెప్పిన మహాకవి గురజాడ, సంఘ సంస్కరణకోసం కలంపట్టారు. స్త్రీజనోద్ధారణ, మూఢనమ్మకాల ఖండన అనే రెండంచుల కత్తితో సమకాలిన సమస్యలపై  పోరాటానికి కలాన్ని కత్తిలా ఝుళిపించారు.
బాల్యవితంతువులకు పునర్వివాహం నిషేదించారు
బాల్యవివాహాలు, వితంతువివాహ నిషేధం, కన్యాశుల్కము వంటి సాంఘిక దురాచారాలు స్త్రీల జీవితాన్ని ఛిన్నా భిన్నం చేసేవి. డబ్బుకాశపడి, కన్నబిడ్డలనే ప్రేమకూడా లేకుండా కన్యాశులము తీసుకుని చిన్న ఆడపిల్లని కూడా వయసుమీరిన వాళ్ల కిచ్చిచేసేవారు. వయసు మీరి వీరు చనిపోతే, వయసులో ఉన్న ఈ బాల్యవితంతువులకు పునర్వివాహం నిషేదించారు.
గురజాడ తాత్వికుడు  
గురజాడ అప్పారావు రచయిత మాత్రమే కాదు. తాత్వికుడు కూడా! ఆయన దర్శించినవాస్తవ జీవితతత్వాన్ని కన్యాశుల్కము నాటకం ద్వారా, ముఖ్యంగా మధురవాణిపాత్ర ద్వారా,నివేదించారు. మహిళలు తమ సమస్యలను తామే గుర్తించేలా, వాటికి పరిష్కరాలు తామే వెతుక్కునేలా దిశా నిర్దేశం చేసిన దార్శనికుడు గురజాడ . ఆ మహనీయునికి  మానవి వందనాలు తెలియచేస్తోంది.  

14:17 - September 22, 2016

హైదరాబాద్ : వర్షం పడుతుంటేనే నగర వాసులు వణికిపోతున్నారు. చిన్న చినుకు పడినా మళ్లీ ఎలాంటి ఇబ్బందులు పడానో అని భయపడిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. గత కొద్ది రోజులుగా నగరంలో భారీ వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు పూర్తిగా జలమయం కావడంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. గంటల తరబడి వాహనాలు రద్దీలో చిక్కుకపోతున్నాయి. దీనితో వాహనదారులు..పాదచారులు నరకయాతన పడుతున్నారు. నాంపల్లి, కోఠి, ఎల్బీ నగర్, కూకట్ పల్లి, సైదాబాద్, దిల్ సుఖ్ నగర్, బాలానగర్, బోయిన్ పల్లి, కుషాయిగూడ, ఈసీఐఎల్, జీడిమెట్ల, ఖైరతాబాద్, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ, మల్కాజ్ గిరి, లాలాపేట, తార్నాక, ఉప్పల్, బంజారాహిల్స్, మాదాపూర్, చార్మినార్, చంపాపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

మంగళవారం రాత్రి భారీ వర్షం..
మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీనితో కూకట్ పల్లి, నిజాంపేట, కేపీహెచ్ బీ కాలనీ, అల్వాల్ తదితర ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చెరువులకు గండ్లు..నాలాలు ఒక్కసారిగా పొంగిపోర్లాయి. దీనితో కాలనీల్లో ఉన్న అపార్ట్ మెంట్ లో ఉన్న సెల్లార్ లోకి వరదనీరు చేరిపోయింది. సెల్లార్ లో ఉన్న వాహనాలు నీట మునిగిపోయాయి. దీనితో ఆయా అపార్ట్ మెంట్ లో ఉన్న వారు ఇంటికే పరిమితమైపోయారు. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే హుస్సేన్ సాగర్ లో వరదనీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం సాగర్ నీటి సామర్థ్యం 593 అడుగులకు చేరింది. దీనితో అధికారులు నీటిని బయటకు పంపించే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం భారీ వర్షం పడుతుండంతో చర్యలకు ఆటంకం కలుగోంది. వర్షం తగ్గిన అనంతరం చర్యలు చేపట్టే అవకాశం ఉంది. 

కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలిసిన సీఎం కేసీఆర్..

ఢిల్లీ : కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయని సీఎం కేసీఆర్ కలిశారు. కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు..సహాయం..అమలు చేయాల్సిన కార్యక్రమాల విషయంలో చొరవ చూపాలని కేసీఆర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న పనుల జాబితాను దత్తాత్రేయకు అందచేశారు. వెనుకబడిన జిల్లాలకు అందాల్సిన రెండో విడత ఆర్థిక సాయం విడుదలకు కృషి చేయాలని సీఎం విన్నవించారు. రామగుండంలో ఫర్టిలైజర్ ప్లాంట్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం కేసీఆర్ కోరారు. 

బీసీల సమస్యలపై చర్చా గోష్టి..

హైదరాబాద్ : ఎస్ వీకేలో బీసీల సమస్యలపై చర్చా గోష్టి జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. తెలంగాణ సామాజిక సమగ్ర అభివృద్ధి సాధనకై అక్టోబర్ 17 నుండి మార్చి 12వరకు మహాజన పాదయాత్ర నిర్వహించనున్నట్లు తమ్మినేని తెలిపారు. ప్రభుత్వం బీసీల అభివృద్ధిని విస్మరించిందని, బీపీ సబ్ ప్లాన్ సాధనకు ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందన్నారు. 

14:00 - September 22, 2016

కన్పూర్ : టెస్ట్ క్రికెట్ రెండోర్యాంకర్ టీమిండియా 500వ టెస్ట్ మ్యాచ్...కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో వేడుకగా ప్రారంభమయ్యింది. అజిత్ వాడెకర్, మహ్మద్ అజరుద్దీన్, దిలీప్ వెంగ్ సర్కార్, మాస్టర్ సచిన్ టెండుల్కర్ తో సహా భారత మాజీ కెప్టెన్లందరూ...ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండుజట్ల జాతీయ గీతాలను ఆలపించారు. 1932లో టెస్ట్ అరంగేట్రం చేసిన భారత్ గత 84 సంవత్సరాల కాలంలో 499 మ్యాచ్ లు ఆడితే...282 మంది క్రికెటర్లు భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించారు.

భారీ వర్షాలు..ఏపీలో హెల్ప్ లైన్..

విజయవాడ : ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో మచిలీపట్నంలో హెల్ప్ లైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ నెంబర్ 08672- 252572, టోల్ ఫ్రీ నెంబర్ 1077

13:58 - September 22, 2016

మెదక్‌ : జిల్లాలోని కుకునూరు ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై హైకోర్టులో విచారణ జరిగింది. సూసైడ్‌ నోట్‌లో రాసిన నిందితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చామని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. డీఎస్పీ శ్రీధర్‌గౌడ్‌తో పాటు ఇతర పోలీసు అధికారుల పేర్లను నిందితులుగా చేర్చారు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి భార్య విజ్ఞప్తి చేస్తోంది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది. 

 

13:56 - September 22, 2016

ప్రకాశం : జిల్లాలోని గిద్దలూరులోని నల్లమల అటవీప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాచర్లమండలం ఆకవీడులో నదులలోకి వరద నీరు చేరడంతో గుండ్లకమ్మ వాగు పొంగిపొర్లుతోంది. నల్లమలలో కురిసిన భారీ వర్షానికి జంపలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదధాటికి రోడ్లు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

 

13:54 - September 22, 2016

హైదరాబాద్‌ : బేగంపేటలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. అల్లంతోటబావి ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు 90 లక్షల రూపాయలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పలుప్రాంతాల్లో పరిస్థితిని గమనించారు. వర్షం వల్ల వచ్చిన ఇబ్బందులను మంత్రి  స్థానికులను అడిగితెలుసుకున్నారు. 

 

13:52 - September 22, 2016

గుంటూరు : వరద నీటిలో బతుకు పోరాటం చేస్తున్నారు. చుట్టూ నీరు..మధ్యలో నీటి మీద ప్రాణం... వరద నీటిలో బతుకు పోరాటం చేస్తున్నారు. ఈ ఘటన కుప్పగంజివాగులో చేటుచేసుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాత్రి నుంచి ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ప్రధానంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండి అలుగు పడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం అవిశాయపాలెంలో కుప్పగంజివాగు ఉధృతంగా ప్రవహించడంతో అందులో పడి నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. అయితే ఇద్దరు వ్యక్తులు మాత్రం చెట్లను పట్టుకొని ప్రాణాలను దక్కించుకోగా..మరో ఇద్దరి ఆచూకీ మాత్రం లభించలేదు. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చెట్లను పట్టుకొని ప్రాణాలను దక్కిచుకున్న వారిని సురక్షితంగా కాపాడేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఎన్టీఆర్‌ఎఫ్‌ దళాలను రంగంలోకి దింపింది. వారిని కాపాడేందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను కూడా రప్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే తెలిపారు. 

 

13:46 - September 22, 2016

పశ్చిమగోదావరి : సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ప్రత్యేకహోదా మీ నాయిన సొత్తా..లేదా మీ అత్తగారి సొత్తా' అని చంద్రబాబును ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు. ఏలూరులో ఆ పార్టీ నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేకహోదాపై ఐదున్నర కోట్ల ప్రజల జీవితాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. కేంద్రం ప్రత్యేకప్యాకేజీ ఇస్తే చంద్రబాబు స్వాగతించారని చెప్పారు. ప్రత్యేకప్యాకేజీని స్వాగతించడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రత్యేకహోదా కావాలని అసెంబ్లీలో తీర్మానం చేశాడని.. అదే చంద్రబాబు ప్రత్యేకహోదా వస్తే స్వాగతించాడని తెలిపారు. 'నా వల్లే ప్రత్యేకహోదా వస్తుందని ఊదరగొట్టిన చంద్రబాబు... ప్యాకేజీ ప్రకటించగానే ప్రధానికి కృతజ్ఞతలు చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రత్యేకప్యాకేజీని బాబు ఎందుకు స్వాగతించారో అర్థంకాని విషయమన్నారు. ఇలాంటి వ్యక్తి రాష్ర్టానికి సీఎంగా కొనసాగడానికి అర్హుడా అని ప్రశ్నించారు. ప్రత్యేకప్యాకేజీని చంద్రబాబు స్వాగతించడంపై అసెంబ్లీలో గట్టిగా నిలదీశామని గుర్తు చేశారు. అసెంబ్లీలో నిలదీస్తున్నామని చెప్పి.... శాసనమండలికి వెళ్లారని ఎద్దేవా చేశారు. గతంలో వెంకయ్యనాయుడు ప్రత్యేకహోదా సంజీవిని అన్నాడని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా ఐదేండ్లు కాదు.... పదేండ్లు ఇవ్వాలని అడిగిన వెంకయ్యనాయుడు ఇవాళ ప్రత్యేకహోదా వద్దనడం శోచనీయమన్నారు. 

 

హైదరాబాద్ లో మళ్లీ వాన..

హైదరాబాద్ : నగరంలో మళ్లీ వర్షం కురుస్తోంది. గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళవారం నాడు కురిసిన వర్షంతో ఇంకా కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 

ఢిల్లీలో అగ్నిప్రమాదం..

ఢిల్లీ : దేశ రాజధానిలో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కమలానగర్ మార్కెట్ లో ఉన్న ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. 14 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 

బేగంపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన..

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ బేగంపేటలో పర్యటించారు. అల్లంతోటబావి నాలాను పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు రూ. 90 లక్షలు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

'ప్యాకేజీ'..నువ్వెవ్వడయ్యా స్వాగతించడానికి - జగన్..

పశ్చిమగోదావరి : ప్రత్యేక హోదా అవశ్యకతపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రసంగిస్తున్నారు. ఏలూరులో వైసీపీ యువభేరీ నిర్వహిస్తోంది. హోదా కాకుండా ప్యాకేజీని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ అసెంబ్లీ రెండు సార్లు తీర్మానం చేయడడం జరిగిందని, ఈ విషయంపై అసెంబ్లీలో తాము నిలదీయడం జరిగిందన్నారు. 

ఎస్ఐ ఆత్మహత్యపై హైకోర్టులో విచారణ..

మెదక్ : ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై హైకోర్టులో విచారణ జరిగింది. సూసైడ్ నోట్ లో రాసిన నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్ లో నిందితులుగా చేర్చామని హైకోర్టుకు పోలీసులు తెలిపారు. డీఎస్పీ శ్రీధర్ గౌడ్ తో పాటు పోలీసు అధికారుల పేర్లను నిందితులుగా పోలీసులు చేర్చారు. సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని భార్య విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. 

12:57 - September 22, 2016

గుంటూరు : జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. పాలు ప్రాంతాలు జలయమయ్యాయి. చిలకలూరిపేట మండలం అవిశాయిపాలెంలోని కుప్పగంజివాగులో నలుగురు గల్లంతయ్యారు. చెట్లను పట్టుకొని ఇద్దరు ప్రాణాలు దక్కించుకున్నారు. మరో ఇద్దరి ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన ఇద్దరి కోసం అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. 
ఈమేరకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడుతూ గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసిందన్నారు. ఐదారు మండలాల్లో పెద్దఎత్తున వర్షం పడిందన్నారు. 22 నుంచి 26 సెంమీ వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. రాజుపాలెం మండలంతోపాటు పలు ప్రాంతాల్లో పలు చెరువులు తెగాయని పేర్కొన్నారు. వరదప్రాంతాల్లో అన్ని సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. రెస్క్యూ టీంను రంగంలోకి దింపామని... వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలను రప్పిస్తున్నామని పేర్కొన్నారు. పదివేల మందికి రిలీఫ్ క్యాంపు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఆహారం, మంచినీరు పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రజలను అన్ని విధాల ఆదుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. 

నల్గొండలో ఎస్ఐ ఆత్మహత్య..

నల్గొండ : జిల్లాలో ఎస్ఐ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిర్యాలగూడలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారుల వేధింపులే కారణమని మృతుడు కిరణ్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ కిరణ్ కు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారని ఆరోపిస్తున్నారు. కిరణ్ మృతికి కారకులైన వారిని చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

హరీష్ రావుకు దేవినేని ఉమ ఫోన్..

నల్గొండ : పులిచింతలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 2.5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంటోంది. దీనితో ఏపీ మంత్రి దేవినేని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు ఫోన్ చేశారు. నల్గొండ జిల్లా అధికారులు..ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి దేవినేని కోరారు. దీనికి మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారు. ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

మధ్యప్రదేశ్ లో చెరువులోకి దూసుకెళ్లిన బస్సు...

మధ్యప్రదేశ్ : రాజ్ పూర్ నుండి కెలి వెళుతున్న ఓ బస్సు చెరువులో పడిపోయింది. ఈ ఘటన సెంద్వాలో చోటు చేసుకుంది. గాయపడదిన 25 మందిని ఆసుపత్రికి తరలించారు. 

వైసీపీ యువభేరీ..

పశ్చిమగోదావరి : వైసీపీ అధ్యక్షుడు జగన్ ఏలూరుకు చేరుకున్నారు. ప్రత్యేక హోదా అవశ్యకతపై వైసీపీ యువభేరీ నిర్వహిస్తోంది. ఈ యువభేరీలో జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. 

12:23 - September 22, 2016

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. కేతెపల్లి మండలకేంద్రంలో మూసీరైట్‌ కెనాల్‌కు గండిపడడంతో దాదాపు 195వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతుంది. దీంతో సమీపంలో ఉన్న చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు కుండపోత వర్షాలకు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. అటు భారీ వర్షాల కారణంగా గుంటూరు జిల్లాలోని పొందుగులలో రైల్వేట్రాక్‌ నీటమునిగింది. దీంతో మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ వద్ద గుంటూరు వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను నిలిపివేశారు. బుగ్గమాదారంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అటు భువనగిరిలోనూ రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. వలిగొండ, పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లో చెరువులన్నీ నిండి జలకళను సంతరించుకున్నాయి. మరోవైపు ఇటు రాజధాని హైదరాబాద్‌ను ఇంకా వాన కష్టాలు వీడలేదు. ఇప్పటికీ అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఇళ్లల్లోకి మోకాలిలోతు నీరు చేరడంతో ప్రజల అవస్థలు పడుతున్నారు. అల్వాల్‌లోని కాగారెడ్డి, వెంకటాపురం, ఘట్‌కేసర్‌, బోడుప్పల్‌, ద్వరకానగర్‌, మోతులకుంట, చింతల్‌నగర్‌, గణేష్‌నగర్‌, భగత్‌సింగ్‌నగర్‌, సూరారంకాలనీ, తెలుగుగల్లినగర్‌ ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

 

జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. రోడ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. 

12:17 - September 22, 2016

విజయవాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నిన్న అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ప్రధానంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండి అలుగు పడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా సుమారు 6 గంటలపాటు కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు పట్టణంలోని బసవమ్మవాగు వద్ద నిలిచిపోయాయి. రాజపాలెం మండలంలోని అనుపాలెం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. సత్తెనపల్లి నుంచి నరసరావుపేట, అచ్చంపేటకు వెళ్లే రహదారులు వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. సత్తెనపల్లిలో కురిసిన భారీ వర్షంతో పట్టణంలోని నాగన్నకుంట, సుందరయ్యనగర్‌, వెంకటపతికాలనీ, యానాదికాలనీ, కొత్తపేట ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సత్తెనపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. అటు కృష్ణా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నక్కలవాగు, ఏనుగుగడ్డవాగు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు..అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వరద ప్రాంతాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

 

ఉరి ఘటన..విచారణ వేగవంతం..

జమ్మూ కాశ్మీర్ : ఉరి ఉగ్రవాద ఘటనపై విచారణ వేగవంతమైంది. ఉరి దాడి ఘటనకు కొద్ది రోజుల ముందే భారత్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్లు, ఎల్ వోసీ నుండి భారత్ లోకి భారత్ లోకి చొరబడినట్లు గుర్తించారు. ఇద్దరు ఉగ్రవాదుల నుండి రెండు రెడియో సెట్ లు లభించాయి. 

12:14 - September 22, 2016

 శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. బందీపురాలో భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని కాల్చిచంపారు. బందీపురా అడవుల్లో ఉగ్రవాదులు దాగి ఉన్న సమచారం తెలియడంతో ఆ గ్రామాన్ని ఆర్మీ జవాన్లు  అదుపులోకి తీసుకున్నారు. గురేజ్ సెక్టారులో ఉగ్రవాదులు చొరబాటుకు అవకాశమున్న నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. 

 

వాగులో చిక్కుక్కున్న ఆర్టీసీబస్ ..

గుంటూరు : క్రోసూరు (మం) విప్పర్ల వద్ద ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకపోయింది. ప్రయాణీకులు సహాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. 

మూసీ ఐదు గేట్ల ఎత్తివేత..

నల్గొండ : మూసీ ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 13వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 7వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 643.5 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు. 

11:58 - September 22, 2016

గుంటూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నిన్న అర్ధరాత్రి నుంచి ఎపిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా సుమారు 6 గంటలపాటు కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు పట్టణంలోని బసవమ్మవాగు వద్ద నిలిచిపోయాయి. రాజపాలెం మండలంలోని అనుపాలెం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. సత్తెనపల్లి నుంచి నరసరావుపేట, అచ్చంపేటకు వెళ్లే రహదారులు వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. సత్తెనపల్లిలో కురిసిన భారీ వర్షంతో పట్టణంలోని నాగన్నకుంట, సుందరయ్యనగర్‌, వెంకటపతికాలనీ, యానాదికాలనీ, కొత్తపేట ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సత్తెనపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. 

 

గయాలో స్థానికుల ఆందోళనలు..వాహనాలకు నిప్పు..

బీహార్ : గయాలో స్థానికులు నిరసన పెల్లుబికుతున్నాయి. నిన్న ఆటో రిక్షా ఢీకొని ఓ విద్యార్థి మృతి చెందడంతో స్థానికులు గురువారం ఆందోళన చేపట్టారు. పలు వెహికల్స్ కు నిప్పు పెట్టారు. దీనితో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

గవర్నర్ ను కలిసిన సిద్ధరామయ్య..

బెంగళూరు : కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గవర్నర్ ను కలిశారు. సెప్టెంబర్ 23వ తేదీన శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచే విషయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

11:32 - September 22, 2016

నలుగురిలో ఉన్నా అందరి దృష్టి తమపైనే ఉండాలని కోరుకుంటుంటారు. చర్మం సౌందర్యంగా ఉండటానికి పలు రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ చర్మం సౌందర్యంగా మారకపోవడంతో నిరుత్సాహానికి గురవుతుంటారు. పండ్ల జ్యూస్ తాగితే చర్మం నిగారింపు వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. పండ్ల రసాన్ని ఫేసియల్ గా ఉపయోగిస్తే ? ఇంట్లోనే కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే చర్మ సంరక్షణ సులభంగానే సాధ్యమవుతుంది. పండ్ల గుజ్జును ముఖానికి, శరీరంలోని ఇతర భాగాలకూ రాసుకుంటే చర్మం మిలమిల మెరుస్తుంది.
పండ్లలో రాజు 'మామిడి'. ఈ పండు ద్వారా చర్మ సౌందర్యం పొందవచ్చు. దీని సరం చర్మం అందంగా తయారయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఈ పండులో బీటా కెరోటిన్ ఉంటుంది. దీనివల్ల చర్మం పునరుద్ధపరిచి, కణాల జీవితకాలాన్ని పెంచుతుంది.
ముఖంపై మచ్చలు..మొటిమల నివారణకు 'బొప్పాయి' పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పండురసాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. మచ్చలు..మొటిమలు..వివిధ చర్మ వ్యాధులను తగ్గించేందుకు ఇది చక్కగా పనిచేస్తుంది. చర్మం మరింత ప్రకాశించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
సంవత్సరం మొత్తం లభించే పండు 'అరటిపండు'. ఇందులో ఐరన్..మెగ్నిషియం..పోటాషియం వంటివి చర్మ నిగారింపునకు ఎంతో ఉపయోగపడుతాయి. అరటి పండులో ఏ, బీ, ఈ విటమిన్స్ ఉంటాయి. చర్మం మంచి రంగులోకి మారాలంటే అరటిపండును ఉపయోగించుకోవచ్చు.
చర్మం నిగనిగలాడటానికి 'నిమ్మ' ఎంతగానే ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుందనే విషయం తెలిసిందే. ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాస్ వేడి నీళ్లలో నిమ్మ..తేనె కలిపి తాగితే చర్మం నిగనిగలాడుతుంది. మోచేతులు..నల్లవలయాలు ప్రాంతాల్లో నిమ్మతో రుద్దితే చర్మం అందంగా తయారవుతుంది.
యాపిల్ పండుతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. సాధారణమైన చర్మం గల వారిలో ఈ ఫేస్ ప్యాక్ ఎంతగానే ఉపయోగపడుతుంది. యాపిల్ పండు ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టాలి. అందులోనే కాస్త తేనె, రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను చర్మంపై రాయాలి. అనంతరం నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగారింపు రెట్టింపు అవుతుంది. 

11:28 - September 22, 2016

ఏపీలో భారీ వర్షాలు..

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అర్ధరాత్రి నుండి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు జిల్లాలతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. పిడుగురాళ్ల వద్ద రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. దీనితో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

11:12 - September 22, 2016

పాలమూరుకు బాబు ఏం చేశాడు - మంత్రి లక్ష్మారెడ్డి..

హైదరాబాద్ : పాలమూరును దత్తత తీసుకుని ఏపీ సీఎం చంద్రబాబు ఏం చేశాడని తెలంగాణ రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనతో పాలమూరుకు అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని, చంద్రబాబు కుట్రతో పాలమూరుకు అన్యాయం జరుగుతోందన్నారు. జిల్లాకు చెందిన టిడిపి నాయకులు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని టిడిపికి రాజీనామా చేయాలని సూచించారు. అపెక్స్ కౌన్సిల్ లో చంద్రబాబు పాలమూరు ప్రాజెక్టుకు కొత్త ప్రాజెక్టు అని వాదించారని విమర్శించారు. జిల్లాలోని దౌర్భాగ్యపు కాంగ్రెస్, టిడిపి వల్లే మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడిందన్నారు.

బుగ్గమాదారంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు..

నల్గొండ : బుగ్గమాదారంలో వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. గత రాత్రి నుండి వర్షం కురుస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 

కుప్పగంజివాగులో నలుగురు గల్లంతు..

గుంటూరు : చిలకలూరిపేట (మం) అవిశాయపాలెంలో కుప్పగంజివాగులో నలుగురు గల్లంతయ్యారు. చెట్లను పట్టుకుని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు రక్షించుకున్నారు. వీరిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఇద్దరు ఆచూకి లభించడం లేదు. 

భారీ వర్షాలపై అధికారులతో మాట్లాడిన బాబు..

విజయవాడ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులతో సీఎం చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. వరద ప్రాంతాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

నందిగామలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు..

కృష్ణా : నందిగామలో రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు నక్కలవాగు, ఏనుగుగడ్డ వాగులు ప్రవహిస్తున్నాయి.

11:01 - September 22, 2016

హైదరాబాద్ : నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయమయ్యాయి. వరద ధాటికి రోడ్లు చిత్తడిగా మారాయి. రహదారులు గుంతలమయమ య్యాయి. నలాలు నోర్లు తెరుస్తున్నాయి. దీంతో తీవ్ర ట్రాఫిక్ జాం అయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనాదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

 

10:48 - September 22, 2016

భార్యల కోసం రోదిస్తున్న భర్తలు.. ఏజెంట్ చేతిలో మోసపోయిన కపుల్.. సౌదీలో నరకం అనుభవిస్తున్న ఇళ్లాళ్లు..

దుబాయిలో భర్తలతో ఉపాధి.. సంపాదించుకునే మార్గాలు చెప్పిన కేడీ.. ఆ తరువాత నట్టేట ముంచిన కిలాడీ..వారితో వచ్చిన భర్తలను తప్పించేశారు. వెళ్లిన ఇళ్లాలికి పని ఇప్పిస్తారని అనుకుంటే 'పడుపు' వృత్తి చేయమన్నారు. ఎదురుతిరిగితే చితక్కకొడుతున్నారు..అన్నపానీయాలు ఇవ్వడం లేదు. ఆ దుర్మార్గుల 'ఆకలి' తీర్చాలని అంటున్నారు.
నెలకు వేలాది రూపాయల జీతం వస్తుందని ఆశగా నమ్మి దేశాన్ని విడిచి వెళ్లారు..సంతోషంగా తమ భర్తలు..పిల్లలతో ఉండవచ్చని వారు భావించారు. కానీ ఏడారి నేలలో అడుగు పెట్టిన తరువాత తాము మోస పోయామని గ్రహిస్తున్నారు. వ్యభిచార కూపంలో ఇరుక్కుని నరకం అనుభవిస్తున్నారు. రెండు లక్షలు చెల్లిస్తేనే వదిలిపెడుతామని ఏజెంట్లు షరతులు పెడుతున్నారని భర్తలు ఆవేదనతో తెలిపారు. వారి ఆవేదనను వీడియోలో చూడండి. 

ఇంకా జలదిగ్బంధంలోనే పలు కాలనీలు

హైదరాబాద్ : నగరంలోని పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇళ్లలోకి మోకాళ్లలోతు నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అల్వాల్ లోని కాగారెడ్డి, వెంకటాపురం, ఘట్ కేసర్, బోడుప్పల్ ద్వారకానగర్ కాలనీ, మోతులకుంట, చింతల్ గణేష్ నగర్, భగత్ సింగ్ నగర్ జలదిగ్బంధంలో ఉన్నాయి.

 

హైదరాబాద్ లో రోడ్లు జలమయం

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో నైరుతి రుతుపవనాలు చరుగ్గా కదులుతున్నాయి. దీంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. 

09:42 - September 22, 2016

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని కుత్బుల్లాపుర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లితోపాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. 500 అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో నాలుగడుగుల నీరు చేరింది. బయటకు రాలేక అపార్టుమెంట్‌వాసులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. నిచ్చెనలతో కిందికొచ్చి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆరు వేలకుపైగా ఇళ్లలోకి నడుం లోతు వరద నీరు చేరింది. పలు కాలనీలు, బస్తీలు చెరువులయ్యాయి. రేకుల ఇల్లు.. అపార్ట్‌మెంట్‌ అని తేడా లేకుండా అన్నీ నీట మునిగాయి. నాలాలు ఉగ్ర గోదారులయ్యాయి. చెరువులు, కుంటలు పొంగి పొర్లాయి. హైదరాబాద్‌ చరిత్రలోనే అత్యధిక వర్షపాతాలు నమోదవుతున్నాయి. మరో రెండురోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.  

 

09:28 - September 22, 2016

జల వివాదాలపై అపెక్స్ సమావేశం నిర్వహించడం శుభసూచికమని వక్తలు తెలిపారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీకాంగ్రెస్ నాయకురాలు ఇందిర, బీజేపీ నేత నాగేంద్ర, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యలను సామరస్యపూర్వంగా పరిష్కరించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

బందీపురాలో ఉగ్రవాదిని కాల్చి చంపిన భద్రతా దళాలు

కశ్మీర్ : బందీపురాలో ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు 
కొనసాగుతున్నాయి. 

టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

హైదరాబాద్ : నేడు భారత్, కివీస్ తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాంటింగ్ ఎంచుకుంది. కాన్పూర్ లో మ్యాచ్ ప్రారంభం కానుంది.  

 

09:11 - September 22, 2016

చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ చెరకు రైతు సంఘం నేత టి.సాగర్ డిమాండ్ చేశారు. జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాటారు. చెరుకు రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. 'రేపు హైదరాబాద్‌ లో చెరకు రైతుల సదస్సు జరగబోతోంది. చెరకు రైతుల ప్రస్తుత పరిస్థితి ఏమిటి?  వారి జీవన ప్రమాణాలు ఎలా వున్నాయి?  రైతు రుణమాఫీ పథకం వల్ల వీరికి ఎలాంటి ప్రయోజనం చేకూరింది? చెరకు రైతులతో చక్కెర పరిశ్రమల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరు ఎలా వుంది?  రేపటి సదస్సులో ఏయే అంశాలను చర్చించబోతున్నారు? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో సాగర్‌ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

08:56 - September 22, 2016

జ్వరం వచ్చినా వారి 'కోర్కెలు' తీర్చాలి.. పేగులు నులిమిపెడుతున్నా వారి 'ఆకలి' తీర్చాలి.. ముస్తాబు చేసి 'మానాన్ని' దోచేస్తున్న దుర్మార్గం...

ఆకలి వేస్తే అన్నం పెట్టే వారు లేరు..కనిపించే మనిషి కూడా ఉండరు. ఉన్నా కనీసం మంచినీళ్లు కూడా పోయరు. ఆకలి కేకలు పెట్టినా కనికరించరు. వారికి కావాల్సింది 'ఆకలి' తీర్చడమే. అందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొడుతున్నారు..తిడుతున్నారు..చివరకు రాక్షసంగా హింసిస్తున్నారు. ఇదంతా 'ఆంధ్రా' మహిళలు పడుతున్న వేదన...అమాయక మహిళలను..కష్టాల్లో ఉంటున్న వారిని టార్గెట్ చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాల్లో అడ్డూ అదుపు లేకుండా ఈ వ్యాపారం జరుగుతోంది. మహిళల అక్రమ రవాణాలో కిలాడీలు పోటీ పడుతున్నారు. ఇక్కడ మహిళలే సారథులు కావడం దారుణం..పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

08:52 - September 22, 2016

మనకు ఎవరైనా ఏదైనా శుభవార్త చెబితే వెంటనే నోరు తీపి చేసుకుంటాం. పంచదార, బెల్లం మనకు నిత్యావసరం. కానీ, వీటిని మనకు అందించే చెరకు రైతులకు తీపి వార్తలు లేకుండా పోతున్నాయి. 
చక్కెర ఉత్పత్తిలో భారత్ రెండో స్థానం 
ప్రపంచవ్యాప్తంగా చక్కెర ఉత్పత్తిలో మన దేశానిది రెండో స్థానం. బ్రెజిల్ 22శాతం చక్కెర ఉత్పత్తి చేస్తుంటే, 14 శాతం మన దేశంలో ఉత్పత్తి అవుతోంది. మన దేశంలో 500కి పైగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీలలో దాదాపు మూడు లక్షల మంది పనిచేస్తున్నారు.  సుమారు 50 లక్షల ఎకరాల్లో చెరకు సాగవుతుండగా దాదాపు రెండున్నర కోట్ల మంది జీవనోపాధి పొందుతున్నారు. మన దేశంలో పత్తి తర్వాత ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తున్న రంగమిది.  గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న చెరకు సాగును, చక్కెర పరిశ్రమను  ఏమాత్రం అలక్ష్యం చేయడానికి వీలులేదు.  
గ్రామీణ ప్రాంతాలకు చేరువలో చక్కెర పరిశ్రమ 
మన దేశంలో పారిశ్రామికాభివృద్ధి ఎక్కువ భాగం  పెద్దపెద్ద నగరాలకే పరిమితమైతే, చక్కెర పరిశ్రమ గ్రామీణ ప్రాంతాలకు చేరువలో వుండడం విశేషం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, బీహార్, కర్నాటక రాష్ట్రాల్లో చెరకు విస్తారంగా సాగవుతోంది. ఒకప్పుడు చక్కెర ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో వుండగా, ఇప్పుడు మహారాష్ట్ర ఆ స్థానాన్ని ఆక్రమించింది.
క్రమంగా పెరుగుతోన్న చక్కెర వినియోగం 
మన దేశంలో చక్కెర వినియోగం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 24. 8 మిలియన్ టన్నుల చక్కెరను వినియోగిస్తుండగా, మరో రెండేళ్లలో 28.5 మిలియన్ టన్నులకు పెరుగుతుందన్న అంచనాలున్నాయి.  మరో పదిహేనేళ్లలో మన దేశంలో  చక్కెర వినియోగం 52 మిలియన్ టన్నులు దాటుతుందన్న అంచనాలున్నాయి.  ప్రస్తుతం మన దేశ అవసరాలకు బొటాబొటీగా చక్కెర ఉత్పత్తి అవుతోంది. రాబోయే కాలంలో మన దేశీయ అవసరాలు తీరాలంటే అందుకు తగ్గట్టుగా చెరకు దిగుబడులు పెంచుకోవాల్సి వస్తుంది. 
ఆర్థికాభివృద్ధిలో చెరకు రైతుల పాత్ర అనన్యసామాన్యం
బేకరీ, కాండీ, స్వీట్స్, కూల్ డ్రింక్స్ తయారీదారులు 60శాతం చక్కెర కొనుగోలు చేస్తుండగా, బిస్కెట్, ఫుడ్ ప్రొడక్షన్, ఫార్మా స్యూటికల్ కంపెనీలు కూడా ప్రధాన వినియోగదారులుగా వున్నాయి. చెరకు రైతులు మన జిహ్వ చాపల్యానికి తగ్గట్టుగా వంటింటి అవసరాలు తీర్చడంలోనే కాకుండా ఇంకా అనేక పరిశ్రమలకు ఊపిరి పోస్తున్నారు. ఈ లెక్కన చూస్తే మనదేశ ఆర్థికాభివృద్ధిలో చెరకు రైతులు పోషిస్తున్న పాత్ర అనన్యసామాన్యమైనది. 
ప్రభుత్వాల ఉదాసీనత 
దేశాభివృద్ధికి ఇంతగాపాటు పడుతున్న చెరకు రైతుల సంక్షేమం విషయంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం బాధాకరం. పొలం నుంచి, షుగర్ ఫ్యాక్టరీకి తాము పండించిన చెరకును రవాణా చేయడం రైతులకు పెద్ద సమస్యగా మారుతోంది. ట్రాన్స్ పోర్టు చార్జీలు భారంగా మారుతున్నాయి. గ్రామీణ రోడ్లు సరిగా లేకపోవడం మరో శాపం. ఇన్ని కష్టాలు పడి ఫ్యాక్టరీ తరలిస్తే, అక్కడ దానిని అప్పగించడానికి రాత్రింబవళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి. యాజమాన్యాలు సకాలంలో బిల్లులు చెల్లించవు. దేశవ్యాప్తంగా వివిధ ఫ్యాక్టరీలు రైతులకు 20 వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డాయంటే చెల్లింపుల్లో ఎంత తీవ్ర జాప్యం జరుగుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యాల కారణంగా, తాము తెచ్చుకున్న అప్పులకు వడ్డీలు పెరిగి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. 

 

08:46 - September 22, 2016

ఇస్లామాబాద్ : కశ్మీర్ అంశంపై చర్చించేందుకు భారత్‌ను ఆహ్వానిస్తున్నామని.. కశ్మీర్ వివాదం పరిష్కారంతోనే  రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెగేసి చెప్పారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంతో తమ దేశం కూడా చాలా కష్టాలు పడుతోందని.. ఉగ్రవాదం అణచివేతకు కృషిచేస్తున్నామన్నారు. 
పాకిస్తాన్ మరోసారి వక్రబుద్ధి 
పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధి చూపించింది. తను ఓ అబద్ధాల పుట్టనని  మరోసారి నిరూపించింది. భారత్‌ను ప్రపంచ దేశాల మధ్య దోషిగా నిలబెట్టేందుకు తెంపరితనాన్ని ప్రదర్శించింది. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్అసెంబ్లీ సమావేశాల్లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రసగించారు. నంగనాచి మాటలతో భారత్ విషయంలో ప్రపంచదేశాలను తప్పుదోవ పట్టించేలా ప్రసంగాన్ని కొనసాగించారు. 
కశ్మీర్ అంశాన్ని మరోసారి లేవనెత్తిన పాక్‌ ప్రధాని
పాక్‌ ప్రధాని మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీర్‌ అంశంపై చర్చించేందుకు భారత్‌ను ఆహ్వానిస్తున్నామంటూనే.. కశ్మీర్ ప్రజలు స్వాతంత్ర్యం కోరుకుంటున్నారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంతో తమ దేశం చాలా కష్టాలు పడుతోందని.. ఉగ్రవాదం అణచివేతకు కృషిచేస్తున్నామన్నారు. హిజ్బూల్ ముజాహీద్దున్ ఉగ్రవాది బుర్హాన్ వానీ యువనాయకుడు అని వ్యాఖ్యానించి తన అసలు రంగును బయటపెట్టుకున్నారు పాకిస్తాన్‌ ప్రధాని. తన ప్రసంగంలో ఉరీ ఉగ్రదాడి, బలూచిస్తాన్‌ అంశాలపై నోరుమెదపని షరీఫ్‌ . కశ్మీర్‌ అంశాన్ని మాత్రం అంతర్జాతీయ వేదకపై ప్రస్తావించి తాము ఎన్నటికీ మారమని పాకిస్థాన్‌ ప్రధాని నిరూపించారు. 

08:43 - September 22, 2016

గుంటూరు : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు జలమయమయ్యాయి. వరదధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వరదనీటిలో వాహనాలు చిక్కుకున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. 
 

08:41 - September 22, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ కేసులో రాజకీయులున్నారు..ఇది ఎన్‌కౌంటర్‌ నుంచి మొదలయిన వార్తలు..ఇప్పుడు ఆ నేతల భరతం పట్టేందుకు సిద్దమయింది సిట్.. అగ్రనేతల అనుచరులు..బినామీలుగా ఉన్నవారిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించే పనిలో పడింది..దీంతో ఆయా నేతల జాతకాలు రెడీ చేసి అరెస్టుకు సిద్దం చేస్తోంది... నల్లగొండలోని ఓ ఎమ్మెల్సీ బినామీ అరెస్టుతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది...
అరెస్టులకు రంగం సిద్ధం 
నయీం కేసులో సిట్‌ వేగం పెంచింది...ఇప్పటివరకు అన్ని ఆధారాలను సేకరించడంలోనే నిమగ్నమయిన సిట్‌ బృందాలు ఇక అరెస్టులకు రంగం సిద్ధం చేసింది...నయీం వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి తెరపైకి వచ్చిన నల్గొండ జిల్లాలోని ఓ ఎమ్మెల్సీ వ్యవహారంపై కన్నేసింది...ఇందుకు గాను ఆ ఎమ్మెల్సీ ముఖ్య అనుచరుడు పలుగుల శ్రీనివాస్‌ను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌ ఎమ్మెల్సీకి బినామీగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం...శ్రీనివాస్‌ నుంచి అన్ని రకాల సమాచారం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.. శ్రీనివాస్‌ తుర్కపల్లి మండలం మాదాపూర్‌ గ్రామస్తుడు...ఈ విచారణలో నయీంతో సంబంధాలున్న నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 
నయీంతో సంబంధాలున్న రాజకీయ నేతల్లో గుబులు 
గ్యాంగ్‌స్టర్ నయీం కేసుల్లో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది...రాజకీయులు ఎవరైనా వదిలేదిలేదని చెప్పడమేగాకుండా లీకులిచ్చిన సిట్ వేగం పెంచింది... రాజకీయులను అరెస్టులు చేస్తూ పెద్ద నేతల జాతకాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది..ప్రధానంగా నల్లగొండ జిల్లాలో లింకులు బయటపడనున్నాయి..దీంతో మరి కొందరు నేతలు అరెస్టులు కావచ్చని ప్రత్యర్థి రాజకీయులు లెక్కలేసుకుంటుండగా...నయీంతో సంబంధాలు పరోక్షంగా..ప్రత్యక్షంగా ఉన్నవారిలో ఆందోళన పెరిగింది.

 

08:37 - September 22, 2016

మహబూబ్నగర్ : దశాబ్దాలుగా వాయిదా పడుతూ వస్తున్న పాలమూరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. బైపాస్ రోడ్డు నిర్మాణానికి 96కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.బైపాస్ రోడ్డు మంజూరుతో పాలమూర్ జిల్లా వాసులు హర్షవ్యక్తం చేస్తున్నారు.
నెరవేరనున్న దశాబ్దాల పాలమూరు ప్రజల కల
పాలమూరుపట్టణ వాసులు దశాబ్దాల కల నెరవేరుతోంది. 36 సంవత్సరాలుగా ఇప్పుడు, అప్పుడు అంటూ కాలయాపన జరిగి ఇన్నాళ్లకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 96.70 కోట్ల రూపాయలను మంజూరు చేయడంతో ఇటు ప్రజలు అటు రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
త్వరలో బైపాస్ నిర్మాణానికి సర్వే.. 
ప్రభుత్వం నిధులు కేటాయించినందున త్వరలో బైపాస్ నిర్మాణానికి సర్వే జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. అయితే బైపాస్ రోడ్డు నిర్మాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రోడ్డు నిర్మిస్తారనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటి వరకు ఎనుగొండ నుంచి పాల్కొండ మీదుగా క్రిష్టియన్‌పల్లి, పాలమూరు యూనివర్సిటీ వరకు నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు రూపొందించారు. అయితే ప్రస్తుతం పాలమూరు పట్టణం మరింతగావిస్తరించడంతో బైపాస్‌ రోడ్డును హౌజింగ్ బోర్డు కాలనీ సమీపంలో ఉన్న యూబీ గార్డెన్ నుంచి పాల్కొండ గ్రామ సమీపం మీదుగా, భూత్పూర్, మహబూబ్‌నగర్ రోడ్డు వరకు నిర్మించే అవకాశం ఉందంటున్నారు అధికారులు.  
భూమిధరలకు రెక్కలు 
బైపాస్‌రోడ్డు నిర్మాణంతో సమీపంలో భూములకు రెక్కలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  మహ బూబ్‌నగర్ పట్టణ ఫరిధిలోని భూములకే కాకుండా భూత్పూర్ మండల పరిధిలోని అమిస్తాపూర్, తాటికొండ, గాజులపేట తదితర గ్రామాల పరిధిలోని భూముల విలువలు ఒక్కసారిగా పెరగనున్నాయి. బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాలమూరు పట్టణ ప్రజలతోపాటు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

గుంటూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు

గుంటూరు : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు జలమయమయ్యాయి. వరదధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. 

08:24 - September 22, 2016

హైదరాబాద్ : మల్కాజ్ గిరిలో విషాదం నెలకొంది. గ్యాస్ లీకేజై ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మౌలాలి ఈడీఏ కంపెనీలో గ్యాస్ లీకేజీ అయింది. దీంతో అందులో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు ఊపరి రాడక అపస్మారకస్థితిలోకి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో వారు మృతి చెందారు. మృతులు దీరజ్ (20), విజయ్ (28)గా గుర్తించారు. మరో పదిమంది కార్మికులు అప్రమత్తతో బయటికి వచ్చి ప్రణాలు రక్షించుకున్నారు. మల్కాజ్ గిరి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి... మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురూకి తరలించారు. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అయితే కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే గ్యాస్ లీకేజీ అయిందని తెలుస్తోంది. 

తాలిపేరు ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత

ఖమ్మం : తాలిపేరు ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేశారు. అధికారులు 18500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 

ఏలూరులో నేడు వైసీపీ యువభేరీ

పశ్చిమగోదావరి : ఏలూరులో నేడు వైసీపీ యువభేరీ కార్యక్రమం జరుగనుంది. ఎపికి ప్రత్యేక హోదా సాధన ఆవశ్యకతపై యువభేరి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత జగన్ పాల్గొననున్నారు. 

మౌలాలి ఈడీఏ కంపెనీలో గ్యాస్ లీకేజీ... ఇద్దరు మృతి

హైదరాబాద్ : మల్కాజ్ గిరి పీఎస్ పరిధిలోని మౌలాలి ఈడీఏ కంపెనీలో గ్యాస్ లీకేజీ అయింది. దీంతో అందులో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 

 

08:01 - September 22, 2016

హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్న తమన్నా ఐటం సాంగ్స్ లో సైతం అదరగొట్టుతుంది. ఈ బ్యూటీ లేటేస్ట్ గా మరోసారి స్పెషల్ సాంగ్ లో మురిపించడానికి రెడీ అయింది. ఈ ఒక్కసాంగ్ కోసం మిల్కీ బ్యూటీ ఏకంగా కోటి రూపాయాలు ఛార్జ్ చేసిందట. మరి వైట్ స్కీన్ బ్యూటీ ఏ సినిమాలో ఐటం నంబర్ కోసం ఈ రేంజ్ లో వసూల్ వేసిందో మీరే చూడండి.
సౌత్ బ్యూటీ సైతం ఐటెం సాంగ్స్ లో 
ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే మన హీరోయిన్స్ పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు. ఇలాంటి సాంగ్స్ చేస్తే డి గ్రేట్ ఇమేజ్ వస్తుందేమోనని భయపడేవారు. కానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఈ ఐటం నంబర్స్ కి స్పెషల్ క్రేజ్ తీసురావడంతో, సౌత్ బ్యూటీ సైతం ఇలాంటి సాంగ్స్ లో నర్తించడం మొదలెట్టారు. తమన్నా, శ్రుతి హాసన్,కాజల్ ఇలా సౌత్ టాప్ హీరోయిన్స్ అందరూ ఈ సాంగ్స్ లో ఆడిపాడటానికి సై అంటున్నారు. సినిమా మొత్తం చేస్తే వచ్చే ఇన్ కమ్ ని ఈ బ్యూటీ ఒక్కసాంగ్ తోనే సంపాదిస్తున్నారు.
మిల్కీ బ్యూటీ డేర్ స్టెప్ 
తెలుగులో ఐటం సాంగ్స్ విషయంలో మిల్కీ బ్యూటీనే డేర్ స్టేప్ వేసింది. అల్లుడు శీను సినిమాలో నా ఒంటి పేరు మిల్క్ అంటూ ఐటం పాటలో అదరగొట్టేసింది. ఆ తర్వాత సీడున్నోడు లోనూ ఐటెం పాటలో ఆకట్టుకుంది. ఈ రెండు ఐటం కోసం 50లక్షలు తీసుకున్న తమన్నా ఈసారి ఐటం నంబర్ కోసం ఏకంగా కోటి వసూల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
జాగ్వార్ కోసం మరోసారి ఐటెం భామగా మిల్కీ బ్యూటీ  
కన్నడ కుర్రాడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న జాగ్వార్ కోసం మిల్కీ బ్యూటీ మరోసారి ఐటెం భామగా మారింది. ఈ సాంగ్ లో నర్తించడానికి ఈ వైట్ స్కీన్ బ్యూటీ కోటి రూపాయలు ఛార్జ్ చేసిందట. సినిమాకి కోటి రూపాయాలు తీసుకునే తమ్ము ఒక్క సాంగ్ కే కోటి వసూల్ చేయడం సౌత్ ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది. ఈ పాటకు సంబంధించిన స్టిల్ బయటికి వచ్చాయి. ఇందులో తమన్నా లుక్ హాట్ హాట్ గా ఉంది. కోటి తీసుకున్నాక ఆ మాత్రం హాట్ గా నర్తించకతప్పదేమో.

07:50 - September 22, 2016

సిని స్నేహితులు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ రానున్న నెక్ట్స్ మూవీపై క్లారిటి వచ్చేసింది. ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ ఈ ఎడాదిలోనే ఉంటుందని ఇండస్ట్రీ టాక్. పవన్ ప్రస్తుతం చేస్తున్న కొత్త సినిమాతో పాటు త్రివిక్రమ్ తో సినిమాను కూడా స్టార్ట్ చేయాలని భావిస్తున్నాట్లు వినికిడి. మరి పవర్ స్టార్, త్రివిక్రమ్ ల కొత్త సినిమా అప్ డేట్స్ ను ఇప్పుడు చూద్దాం...
పవన్, త్రివిక్రమ్ సక్సెస్ పుల్ కాంబినేషన్ 
జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో పవన్, త్రివిక్రమ్ సక్సెస్ పుల్ కాంబినేషన్ అనిపించుకున్నారు. అంతేకాదు పర్సనల్ గా కూడా వీరు థికెస్ట్ ప్రెండ్స్ అయిపోయారు. దీనికి తోడు అత్తారింటికి దారేదితో ఇండస్ట్రీ హిట్టు కొట్టడంతో వీరి కాంబినేషన్ కి ఎనలేని క్రేజ్ వచ్చేసింది.దీంతో వీరి నుంచి మళ్లీ సినిమా ఎప్పుడోస్తుందా అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు చేయబోయే నెక్ట్స్ మూవీపై క్లారిటి వచ్చేసింది.
వీళ్ల కాంబినేషన్ లో డిసెంబర్ లో సెట్స్ పైకి మూవీ 
త్రివిక్రమ్ తో పవన్ చేయబోయే సినిమాపై కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ల కాంబినేషన్ లో మూవీని డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో పవన్ చేస్తున్న న్యూ మూవీ కాటమరాయుడు షూటింగ్ లో పవర్ స్టార్ ఈ నెల 24 నుంచి పాల్గొననున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈక్వల్ గా త్రివిక్రమ మూవీని కూడా స్టార్ట్ చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నాడు.
డిసెంబర్ ఫస్ట్ వీక్ లో త్రివిక్రమ్, పవన్ ల సినిమా ప్రారంభం
డిసెంబర్ ఫస్ట్ వీక్ లో లో త్రివిక్రమ్, పవన్ ల సినిమాను ప్రారంభం అవుతుందని సమాచారం. కామటరాయుడితో పాటు మాటలమాంత్రికుడితో చేయనున్న సినిమా షూటింగ్ లో ఏకకాలంలో పాల్గొనేలా పవర్ స్టార్ ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది.  రాధాకృష్ణ నిర్మించే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నిఅందిస్తాడని చెబుతున్నారు. పవన్ వేగంగా సినిమాలు చేస్తూ ఆయన ఫ్యాన్స్ ని పుల్ ఖుషీ చేస్తున్నాడు.

07:46 - September 22, 2016

జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్టు ఇప్పుడు ఇండస్ట్రీ ఈ మూవీ గురించి ఉదరగొట్టుతుంది. ఫాసెస్ట్ 100కోట్ల మూవీ అని, ఈ ఎడాది బిగెస్ట్ హిట్టు అని ఇలా రకరకాలు ప్రచారం చేస్తోంది. కానీ ఈ మూవీ జెస్ట్ హిట్టు అని తెలిపోయింది. మరి జనతా గ్యారేజ్ జెస్ట్ హిట్టు ఎలా ఫ్రూవ్ అయిందో ఈ స్టోరీ చూడండి.
ఇండస్ట్రీ టాప్ 3 హిట్స్ లో ఈ మూవీ థర్డ్ ప్లేస్ 
జనతా గ్యారేజ్ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టరే. ఇండస్ట్రీ టాప్ 3 హిట్స్ లో ఈ మూవీ థర్డ్ ప్లేస్ ని ఆక్రమించింది. ఇలాంటి మూవీని జస్ట్ హిట్టు అంటే ఎన్టీఆర్ కానీ ఆయన ఫ్యాన్స్ కానీ దర్శకుడు కొరటాల శివ కానీ హార్ట్ అవ్వడం ఖాయం. కానీ ఈ మూవీ జెస్ట్ హిట్టు తప్పా బ్లాక్ బస్టర్ మాత్రం కాదనే విషయం నిజం.
ఓవర్సీస్ లో మాత్రం జెస్ట్ హిట్టు
తెలుగులో 120కోట్ల గ్రాస్ తో 85కోట్ల షేర్ తో జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం జెస్ట్ హిట్టు తో సరిపెట్టుకుందని తెలుస్తోంది. ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ వీకెండ్ లోను ఓవర్సీస్ లో జోరు చూపించిన జనతా గ్యారేజ్ ఈ స్పీడ్ ని కంటిన్యూ చేయలేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పాలి. 
భారీ హిట్టు 
జనతా గ్యారేజ్ డివైడ్ టాక్ వచ్చినప్పటికి టాక్ తో సంబంధం లేకుండా భారీ హిట్టు కొట్టింది. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం పెట్టుబడికి కొంచెం ఎక్కువగా కలెక్ట్ చేసి ఓకే అనిపించుకుంది. యూఎస్ జనతా గ్యారేజ్ ని 7కోట్ల 20లక్షలకు అమ్మేశారు. ఇక్కడ ఈ చిత్రం 7కోట్ల 80లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే కేవలం 60లక్షల ప్రాఫిట్స్ తో డిస్టిబ్యూటర్స్ బయటపడ్డారు. దీన్ని బట్టి ఓవర్సీస్ లో జనతా గ్యారేజ్ జెస్ట్ హిట్టు అని ఒప్పుకోవాల్సిందేగా.

 

07:22 - September 22, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే చేతి, కుల వృత్తుల వారు, వ్యవసాయ కూలీలకు.. పునర్నిర్మాణ, పునరావాస విధానంపై స్పష్టత ఇవ్వాలని  తెలంగాణ ప్రభుత్వాన్ని  హైకోర్టు ఆదేశించింది. దీనికి రెండు వారాల గడువిచ్చింది.
భూ నిర్వాసితుల పిటిషన్‌ పై విచారణ 
మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. 
వారికి ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించిన ధర్మాసనం 
మల్లన్నసాగర్‌ నిర్మాణంతో నిర్వాసితులయ్యే కుల, చేతి వృత్తులవారు, వ్యవసాయ కూలీలకు న్యాయం చేస్తున్నామని అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి హైకోర్టు బెంచ్‌కి వివరించారు. ఇప్పటి వరకు వీరి నుంచి ఎలాంటి సమస్య ఉత్పన్నంకాలేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం సమయంలో ఇలాంటి వారికి పరిహారం ఇస్తామని చెప్పారు. భూములు కొనుగోలు చేసిన తర్వాత వీరికి ఎలా న్యాయం చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. కుల, చేతివృత్తుల వారు, వ్యవసాయ కూలీలకు పునరావాసం, పరిహారం విషయంలో స్పష్టమైన విధానంతో ముందుకు రావాలని కోర్టు ఆదేశించింది. అసైన్డ్‌ భూ యజమాలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని పిటినర్ల తరుపు న్యాయవాది అర్జున్‌ కోర్టు దృష్టికి తెరచ్చారు. వీరి విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. 
మెరుగైన పరిహారం ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న ఏజీ 
2013 భూసేకరణ చట్టంలోని 108 వ సెక్షన్‌ ప్రకారం నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి ధర్మానం దృష్టికి తెచ్చారు. కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, గోవాల్లో ఇలాంటి విధానాలు అమలువున్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 123 జీవో ప్రకారం గ్రామసభల్లో స్వచ్చంధంగా  భూములు ఇవ్వడానికి ముందుకొస్తున్న వారితో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు వివరించారు. ఎకరం 15 వేల రూపాయల విలువచేసే భూమికి ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. 
నేడు మ. 2.30 నుంచి 4.30 గం. వరకు వాదనలు 
మల్లన్నసాగర్‌పై గురువారం కూడా హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. గురువారం మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగున్నర గంటల మధ్య  పిటిషనర్ల వాదన పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో తీర్పును దసరా తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది. 

 

నేటి నుంచి భారత్, కివీస్ తొలి టెస్టు మ్యాచ్

ఢిల్లీ : కన్పూర్ లో నేటి నుంచి భారత్, కివీస్ తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇది భారత చరిత్రలో 500వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. 

నేడు హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ పై సదస్సు

హైదరాబాద్ : ఉదయం 10 గంటలకు ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ పై సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్, చీఫ్ ప్లానర్లు, నిపుణులు హాజరుకానున్నారు. 

06:59 - September 22, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యర్థనల గడువు ముగిసింది. లక్షకుపైగా అభ్యర్థనలు, అభ్యంతరాలు వచ్చాయి. వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి స్వల్ప మార్పులు చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల సర్దుబాటు, ఫైళ్ళ విభజన, డికోడింగ్ తదితర ప్రక్రియలను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. 
బుధవారంతో ముగిసిన అభ్యర్థనల గడువు 
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను తెలంగాణ సర్కార్‌ స్పీడప్‌ చేసింది. దసరా నాటికి 17 కొత్త జిల్లాలు అమల్లోకి రావాల్సిందేనని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో.. అక్టోబర్‌ 11 కల్లా పనులు పూర్తిచేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. జిల్లాల విభజనపై అభ్యర్థనలకు బుధవారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగిసింది. డిస్టిక్ట్స్ ఫార్మేషాన్ వెబ్‌సైట్‌కి లక్షా 607 అభ్యర్ధనలు నమోదయ్యాయి. జిల్లాలకు సంబంధించి 55,321...రెవెన్యూ డివిజన్లపై 22,905.. మండల కేంద్రాలపై 22,381 అభ్యర్థనలు వచ్చాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో అత్యధికంగా యాదాద్రి కోసం 15161 విజ్ఞప్తులు, వనపర్తి కోసం 13193 విజ్ఞప్తులు వచ్చాయి. జిల్లాల విభజనపై ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని విమర్శలు వచ్చినా..దసరా నుంచి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చే దిశగా ప్రభుత్వం కార్యచరణ రూపొందించినట్లు సమాచారం. జిల్లా కేంద్రాల్లో పైళ్ళ విభజన, ఫైల్ నెంబర్ల కోడింగ్ పనులు ముగింపుదశకు చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు.  
విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి స్పందన లేదన్న విమర్శలు 
ఇప్పటి వరకు డిస్టిక్ట్స్ ఫార్మేషాన్ వెబ్  సైట్‌కి వచ్చిన విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి స్పందన లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చిన అభ్యర్థనలకు సమాధానం ఇస్తారా..లేదా అనేదానిపై సీసిఎల్ఏ నుంచి గానీ, రెవిన్యూ శాఖ నుంచి స్పష్టత లేదు. ఇక గతనోటిఫికేషన్ కంటే ముందు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసిఆర్ మరో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.. కానీ మూడు వారాలు గడుస్తున్నా దాని ఊసేలేదు. ఇక డ్రాప్ట్ నోటిఫికేషన్ తర్వాత ఫైనల్ నోటిపికేషన్‌లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హన్మకొండ జిల్లా స్థానంలో వరంగల్‌ గ్రామీణ జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఫైల్‌ సీఎం దగ్గరికి చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజకీయ ఒత్తిళ్ళకు తలోగ్గకుండా ప్రజల అభీష్టం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 
టాస్క్ పోర్స్ కమీటీ తీవ్ర స్థాయిలో కసరత్తు 
జిల్లాల ఏర్పాటుపై సీఎస్ రాజీవ్ శర్మ నేతృత్వంలో ఏర్పాటు చేసిన టాస్క్ పోర్స్ కమీటీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. అయితే పలుకుబడి ఉన్న మంత్రులు, నేతలు స్వయంగా తమ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే జిల్లాల్లో మార్పులు చేర్పులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లాలోని మరిపెడలో కొత్త చిన్న గూడురును మండల కేంద్రంగా చేయడంతో పాటు,.రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి, మొయినాబాద్ , షాబాద్‌లను శంషాబాద్ జిల్లాలోనే ఉంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏదీఏమైనా కొత్త జిల్లాల ఏర్పాటుపై డ్రాప్ట్ నోటిపికేషన్‌లో ఇచ్చిన వాటికే పరిమితం అవ్వాలని, మరీ అవసరమైతే స్వల్పమార్పులు చేసైనా దసరా నాటికి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

 

06:50 - September 22, 2016

విజయవాడ : ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షానికి అనేక ప్రాంతాల్లో  వరద నీరు పోటెత్తింది. కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో నివాస ప్రాంతాల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో జనం అవస్థలుపడుతున్నారు.  రోడ్లపై మోకాలి లోతు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోకి వర్షం నీరు చేరడంతో కార్యాలయ పనులకు ఆటంకం కలిగింది.
కడపలో 
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కడప నగరంలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నివాస ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. గంజికుంట కాలనీ, మృత్యుంజయకుంట, భాగ్యనగర్‌ కాలనీ, సింహపురి కాలనీ, భారత్‌నగర్‌ ప్రాంతాల్లో జోరు వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అనేక చోట్ల ఇళ్లనుంచి బయటకు వెళ్లడానికి కూడా వీల్లేకుండా వీధులన్నీ నీటితో నిండిపోయాయి.  ప్రధాన రహదారులపై భారీ ఎత్తున నీరు చేరడంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 
తూర్పుగోదావరిలో 
కుండపోత వర్షానికి తూర్పుగోదావరి జిల్లా తడిసి ముద్దైంది. జిల్లా కేంద్రం కాకినాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్లపై మోకాలి లోతున నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోకి వర్షం నీరు చేరడంతో  పనులకు ఆటంకం కలిగింది. రహదారులు చెరువుల్ని తలపించేలా వర్షం నీటితో నిండి జనం అవస్థలు పడ్డారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. 

 

06:47 - September 22, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌ ఎదురుగా కుంగిపోయిన రోడ్డు మరమ్మత్తులకు దాదాపు పదిరోజుల సమయం పడుతుందని జీహెచ్ ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌  ప్రకటించారు. భారీవర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. పైప్‌లైన్‌ కుంగిన ప్రాంతాన్ని మేయర్‌ పరిశీలించారు.. 

06:43 - September 22, 2016

హైదరాబద్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలాచోట్ల చెరువులు, కుంటలు తెగిపోయి.. వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. 
రంగారెడ్డి జిల్లాలో 
రంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయింది.  కాలనీలు జలమయమయ్యాయి. బాలాపూర్, కుత్బుల్లాపూర్, మల్కాజ్ గిరి, శేర్ లింగంపల్లిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు డీఈవో  సెలవు ప్రకటించారు. 
వరంగల్ జిల్లాలో 
వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలోని పలు ప్రాంత్లాలో  వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తొర్రూరు మండలం వలవీడులో ఎర్రచెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలతో  పెరిగిన వరదల్లో ముగ్గురు రైతులు చిక్కున్నారు. వారిని అతి కష్టమ్మీద రక్షించారు. పాలకుర్తి మండలం వల్మిడి గ్రామ సమీపంలోని వాగుకు వరదనీరు పోటెత్తడంతో..వాగు మధ్యలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు. వరదనీటిలో చెట్లను పట్టుకుని నిలబడటంతో స్థానికులు వారిని కాపాడారు. 
నల్లగొండ జిల్లాలో
నల్లగొండ జిల్లాలో మంగళవారం రాత్రి భారీగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. నార్కట్ పల్లి, చిట్యాల, కట్టంగూరు మండలాల్లో కుంటలు ,చెరువులు నిండుకుండలా మారి అలుగులు పారుతున్నాయి. వరద ఉధృతికి నార్కట్ పల్లి మండలం చెర్పు గట్టు యల్లగూడెం గ్రామాల మధ్య వరద నీటిలో కారు కొట్టుకు పోయింది. స్థానికులు కారులోని ప్రయాణీకులను తాళ్ల సాయంతో సురక్షితంగా కాపాడారు. నార్కట్‌పల్లి మండలం చిన్నతుమ్మల గూడెం వద్ద వరద నీటిలో బైక్ కొట్టుకు పోయింది. మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో రాకపోకలు నిలిచిపోయాయి.  
హైదరాబాద్‌లో 
హైదరాబాద్‌లో మూసీనది ఒక్కసారిగా మూడింతలు నీరు చేరి ప్రవహించడంతో.. భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి మండలాలకు పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం వల్ల బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మున్సిపల్‌ కేంద్రంలో పలు చోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి మురికి నీరు  రోడ్ల పైకి చేరడంతో ప్రజలు  ఇంబ్బందులు పడుతున్నారు. మూసీకి  భారీగా వ‌ర‌ద‌ పోటెత్తడంతో భట్టుగూడెం-పెద్దరావులపల్లి వంతెన పై  రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
మెదక్‌ జిల్లాలో 
మెదక్‌ జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రెల్లగడ్డవాగు పొంగి పొర్లుతోంది. పటాన్‌చెరు సమీపంలో వాగు దాటుతుండగా.. వేణు అనే వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. చెట్ల మధ్యలో చిక్కుకుని కాపాడాలని కేకలు వేయడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వేణును కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. 
ఆదిలాబాద్‌ జిల్లాలో
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం జగన్నాథపూర్‌ ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు వచ్చి చేరింది.  చింతగూడకు చెందిన రజియోద్దీన్‌ అనే యువకుడు పెద్దవాగులో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఒక్కసారిగా నీటి ఉధృతి పె రగడంతోనే రజియొద్దీన్‌ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అధికారులు, పోలీసులు సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. 
 

 

నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి చందూలాల్

హైదరాబాద్ : మంత్రి చందూలాల్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో మంత్రి పాల్గొననున్నారు. 

గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ లో చెలరేగిన మంటల

మహబూబ్నగర్ : జిల్లాలోని మానవపాడు...అలంపూర్ మధ్యలో గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ లో మంటల చెలరేగాయి. ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ తో మంటల చెలరేగాయి. రైలును నిలిపివేసి సిబ్బంది మంటలార్పింది. సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. 

నేడు ఎపి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

విజయవాడ : నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. మ.3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. కృష్ణా జలాల పంపిణీపై ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీ, అక్టోబర్ 3 నుంచి అమరావతి సచివాలయం నుంచే పాలన, రాజధాని నిర్మాణంపై మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపిక వ్యవహారం, స్విస్ చాలెంజ్ విధానంపై కేసు తదితర అంశాలపై చర్చించనున్నారు. 

 

తెలంగాణలో నేటి నుంచి ఐసెట్ 2016 తుది విడత కౌన్సిలింగ్

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి ఐసెట్...2016 తుది విడత కౌన్సిలింగ్ జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 25న సీట్ల కేటాయింపు ఉంటుంది. 

Don't Miss