Activities calendar

23 September 2016

22:05 - September 23, 2016

ఢిల్లీ : భారత్‌- ఫ్రాన్స్‌ల మధ్య 36 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు సంబంధించి చారిత్రక ఒప్పందం కుదిరింది. ఈమేరకు ఫ్రాన్స్ ర‌క్షణ మంత్రి జీన్ వెస్ లీడ్రియాన్‌, భార‌త ర‌క్షణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ ఢిల్లీలో ఒప్పంద ప‌త్రాలపై సంత‌కాలు చేశారు. ఎయిర్‌ఫోర్స్‌కు కొత్త ఫైట‌ర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌ను అందించాల‌ని ప‌దేళ్ల కింద‌టే భార‌త్ భావించినా.. ఫ్రాన్స్‌తో ఒప్పందం రూపంలో ఇన్నాళ్లకు సాకార‌మైంది. ఈ ఒప్పందం కింద ఫ్రాన్స్‌.. భార‌త్‌కు 36 డ‌సాల్ట్ రాఫెట్ ట్విన్ ఇంజిన్ ఫైట‌ర్ జెట్స్‌ను అందించ‌నుంది. మొత్తం 58 వేల కోట్లకు కుదిరిన ఒప్పందంలో 15 శాతం అడ్వాన్స్ రూపంలో చెల్లించారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్స్‌తోపాటు కొన్ని ఆయుధాలు, స్పేర్‌పార్ట్స్‌, మిటియోర్‌లాంటి అత్యాధునిక మిస్సైల్ భార‌త్‌కు ఫ్రాన్స్ స‌ర‌ఫ‌రా చేయనుంది.

22:02 - September 23, 2016

పంజాబ్ : అధికార అకాలీదళ్ పార్టీకి చెందిన నేత అతడి కుమారుడు రెచ్చిపోయారు. ఓ ఆసుపత్రిలోని నర్సుపై చేయి చేసుకున్నారు. పరమ్జిత్ సింగ్ అతడి కుమారుడు గుర్జిత్ సింగ్ మోగాలోని గుప్తా ఆస్పత్రికి ఓ రోగిని తీసుకెళ్లారు. కొద్ది సేపు ఎదురు చూడండని నర్స్‌ రమణదీప చెప్పినందుకు 'మేం సర్పంచ్ ఇంటి వాళ్లం. మమ్మల్నే వెయిట్ చేయిస్తావా' అంటూ ఆమెతో గొడవ పడ్డారు. తాను గర్బిణీనని చెప్పినప్పటికీ తండ్రి కొడుకులు పట్టించుకోకుండా నర్స్‌ కొట్టడంతో కింద పడిపోయింది. ఈ ఘటనా దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.

21:59 - September 23, 2016

హైదరాబాద్ : ఒకపక్క ముగుస్తున్న గడువు... మరోపక్క వర్ష బీభత్సం. నెట్‌ సెంటర్‌లో పవర్‌ కట్‌. మొరాయించిన సర్వర్లు. మొత్తానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కోల్పేయే పరిస్థితి. దీంతో అభ్యర్థుల్లో ఒకటే ఆందోళన. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితి. ఇదే సమయంలో వారికి అండగా నిలిచింది 10టీవీ. వారి సమస్యను టీఎస్‌పీఎస్సీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో గ్రూప్‌-2కు దరఖాస్తు చేసుకునేందుకు మరో మూడు రోజులు గడువు పొడిగించింది తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.

గ్రూప్‌-2కు కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్షకు దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. గురువారం నాటికి 6 లక్షల 75 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా చాలా మంది చేస్తూనే ఉన్నారు. అయితే.. దరఖాస్తు చేసుకునేందుకు శుక్రవారం అర్ధరాత్రితో గడువు ముగియనుంది. దీంతో ఇంకా మిగిలివున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు యత్నించగా టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సర్వర్లు మొరాయించడంతో దరఖాస్తు చేసుకునేందుకు వీలు పడలేదు. అభ్యర్థుల్లో ఒకటే ఆందోళన. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. ఏమీ చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దీంతో అభ్యర్థుల ఆవేదనపై 10టీవీలో కథనాలు ప్రసారమయ్యాయి. అభ్యర్థులు పడుతున్న ఆందోళనను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది 10టీవీ.

నెట్‌సెంటర్లలో పవర్‌కట్‌
మరోవైపు వర్షాలు విపరీతంగా కురుస్తుండడం.. ఇంటర్నెట్‌ సెంటర్లలో పవర్‌ సరిగ్గా లేకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. ఏం చెయ్యాలో అర్ధం కాక ఆందోళనకు గురయ్యారు.

నెట్‌ సెంటర్‌కు క్యూలు కట్టిన అభ్యర్థులు ..ఓపెన్‌ కాని టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌
ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నెట్‌ సెంటర్‌కు భారీగా క్యూలు కట్టారు. ఓ పక్క విద్యుత్‌ సరఫరా సరిగ్గా లేకపోవడం.. ఒకవేళ ఉన్నా.. అక్కడ టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన అంతకంత పెరిగింది. గ్రూప్‌-2 దరఖాస్తు చేసుకునే అర్హత ఉండికూడా అవకాశం కోల్పోతామోనన్న ఆందోళన వారిని వెంటాడింది.

ఈనెల 26 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
సరిగ్గా ఇలాంటి సమయంలోనే అభ్యర్థుల ఆవేదనను 10టీవీ ప్రసారం చేసింది. దీనిపై తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ స్పందించింది. గ్రూప్‌-2 దరఖాస్తు చేసుకునేందుకు గడువును మరో మూడు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈనెల 26 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించింది.

గడువు పెంపు పట్ల అభ్యర్థుల హర్షం
మొత్తానికి గ్రూప్‌-2 దరఖాస్తు గడువు పెంచడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన 10టీవీకి.. గడువు పెంచిన అధికారులకు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

21:55 - September 23, 2016

విజయవాడ : ఏపీ అసెంబ్లీని కుదిపేసిన ప్రత్యేక హోదా ఆందోళనల వ్యవహారం వైసీపీలో గుబులుపుట్టిస్తోంది. వైసీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో ప్రివిలేజ్‌ కమిటీ భేటీ అయ్యింది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఇప్పటికే ఆరుగురు వైసీపీ స‌భ్యులను గుర్తించిన ప్రివిలేజ్ క‌మిటీ..త్వరలోనే వారికి నోటీసులు అందించి వివ‌ర‌ణ కోర‌నుంది. ఆరోపణలపై లోతుగా విచారించి నిజమని తేలితే విపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు సూచించే అవకాశముంది. 

21:52 - September 23, 2016

ఢిల్లీ : ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై.. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని.. సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర హైకోర్టును ఆదేశించింది. ఈ కేసులో హైకోర్టు స్టేని సవాల్‌ చేస్తూ.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 

నాలుగు వారాల్లోగా నిర్ణయం : సుప్రీంకోర్టు
ఓటుకు నోటు కేసుపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని..సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టును ఆదేశించింది. నాలుగు వారాల తర్వాత వీలైనంత తొందరగా ఈ కేసు విచారణను పూర్తి చేయాలని సూచించింది. కేసు విచారణను ఎనిమిది వారాల పాటు నిలపాలంటూ హైకోర్టు ఇచ్చిన స్టేపై.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు విచారణలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.

న్యాయస్థానంలో చంద్రబాబు న్యాయవాది వాదనలు
న్యాయస్థానంలో మొదట వాదనలు ప్రారంభించిన చంద్రబాబు తరపు న్యాయవాది లూత్రా... ఎఫ్‌ఐఆర్‌ నమోదై చార్జీషీట్‌ దాఖలైన తర్వాత మరో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయమనడం చట్ట విరుద్ధమన్నారు. హైకోర్టు 8 వారాల స్టే ఇచ్చినందున ఈ అంశాన్ని అక్కడే నిర్ణయించేలా ఆదేశాలివ్వాలని కోరారు. పిటిషనర్‌ తరపు న్యాయవాది శేఖర్‌ నఫ్రే జోక్యం చేసుకుంటూ ఇంత పెద్ద కేసులో దర్యాప్తును ఆపమనడం సమంజసం కాదన్నారు. కేసు దర్యాప్తులో తెలంగాణ పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని వాదించారు.

ఆరోపణలను నిరూపించుకోవాలని పిటిషనర్‌ రామకృష్ణారెడ్డి
హైకోర్టులో వాదించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న పిటిషనర్‌ తరపు న్యాయవాది.. విచారణ జాప్యం కాకుండా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం నాలుగు వారాల్లోగా కేసుపై నిర్ణయం ప్రకటించాలని, ఆ తర్వాత వీలైనంత త్వరగా విచారణను పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించుకోవాలని పిటిషనర్‌ రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈకేసులో హైకోర్టు నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోని పక్షంలో.. పిటిషనర్‌ మరోసారి తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. 

21:47 - September 23, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వర్షాలు మోత మోగిస్తున్నాయి. వరంగల్‌, నల్గొండతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షాలతో జనజీవనం అల్లాడుతోంది. ఎక్కడ చూసినా రోడ్లు, కుంటలు, చెరువులు తెగిపోయి వరదలు పోటెత్తుతున్నాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడటంతో రాకపోకలు స్థంభించాయి.

నల్లగొండలో వృద్ధురాలు మృతి..
నల్లగొండ జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వరద ఉధృతికి తుర్కపల్లిలో చిన్న లక్ష్మాపూర్‌-పొట్టిమర్రు రోడ్డు తుర్కపల్లిలో కొట్టుకుపోయింది. పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. భారీగా కురుస్తోన్న వర్షాలకు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. తిప్పర్తి వద్ద రోడ్డుపై నాలుగు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భువనగిరి డివిజన్‌లో చిన్నేరు, పెద్దేరు వాగుల ఉధృతిగా ప్రవహిస్తున్నాయి. మోత్కూరు మండలం బొడ్డుగూడెంలో భారీ వర్షానికి ఓ ఇల్లు కూలిపోయి ఓ వృద్దురాలు మృతి చెందింది.

గట్టు తెగిన మోత్కూరు చెరువు
మోత్కూరు చెరువుకట్ట తెగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని 39వ వార్డు పూర్తిగా జల దిగ్బంధంలో ఉండిపోయింది. వరద ఉధృతికి తుర్కపల్లిలోని చిన్న లక్ష్మాపూర్-పొట్టిమర్రు రోడ్డు కొట్టుకుపోయి పొట్టిమర్రు గ్రామం జల దిగ్బంధంలో ఉండిపోయింది.

ప్రభుత్వ ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవులు
మిర్యాలగూడ, భవనగిరి, నకిరేకల్, హుజుర్ నగర్, నాగార్జున సాగర్ నియోజకవర్గాలలోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. మూసీనది నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నార్కట్ పల్లి అద్దంకి రహదారిపై తిప్పర్తి వద్ద నాలుగు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మేళ్లచెరువు మండలం పులిచింతల వద్ద వంద కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పవర్‌ప్లాంట్‌ మొదటి యూనిట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో పులిచింతల ప్రాజెక్టు కోసం 5000 క్యూసెక్కుల నీటిని తెలంగాణ ప్రభుత్వం వాడుకోనుంది.

ఉప్పొంగిన మోయతుమ్మెద వాగు
కరీంనగర్ జిల్లా జగిత్యాలలో భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్ని నీట మునగడంతో స్ధానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా రోడ్లపై నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని మోయతుమ్మెద వాగు ఉప్పొంగడంతో చెరువులు, కుంటలు నిండి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రహదారులపై రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

నారింజ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
మెదక్‌ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు నిండుకుండల్లా మారాయి. సిద్దిపేట నియోజకవర్గంలో పలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. జహీరాబాద్‌ సమీపంలోని నారింజ ప్రాజెక్టులోకి వరద నీటి ఉధృతి పెరగడంతో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తేశారు. దీంతో దిగువ ప్రాంతంలో పలు పంట పొలాలు నీట మునిగాయి. సదాశివపేట మండల పరిధిలోని గన్‌కత్వ కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. పదిహేనేళ్లుగా వర్షాలు లేక అల్లాడుతున్న తమకు ఈ వర్షాలు ఊరటనిస్తున్నాయని సూరారం, ఆరూర్‌ గ్రామాల రైతుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వరద ఉధృతిలో కొట్టుకుపోయిన కారు
తుల్చారం మండలం కొంగోడులో వరద ఉధృతిలో ఓ కారు నీటిలో కొట్టుకుపోయింది. కారులో ఉన్న కొడుకును రక్షించబోయి తండ్రి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కొడుకును కాపాడారు. భారీ వర్షాలకు రాంచంద్రాపురం ముంబై హైవే పై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

మెదక్ లో కూలిన గోడ..ఇద్దరు మృతి
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్‌ పట్టణంలో ఓ ఇంటిగోడ కూలి తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. తెల్లవారు జామును గోల్కొండ వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తులసి అనే ఎనిమిదేళ్ల కూతురుతో సహా తల్లి కళావతి మృతి చెందగా వారి బాబు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.

భారీ వర్షాలకు చెరువులు నిండుకుండలు
అందోల్‌ నియజకవర్గంలో భారీ వర్షాలకు చెరువులు నిండుకుండల్లా మారాయి. చాముండేశ్వరి వద్ద మంజీరా నది పొంగిపొర్లుతోంది. ఆందోల్‌ మండలంలోని నేరడిగుంట, డాకూర్‌ శివారులోని వాగులు నీటి ఉధృతితో పరవళ్లు తొక్కుతున్నాయి.

వానలోనే పెన్షన్ కోసం పాట్లు
నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ పట్టణంలో భారీ వర్షాలకు డ్రైనేజీలు నిండి రోడ్లపైకి మురికినీరు వచ్చి చేరింది. బాన్సువాడ పోస్టాఫీసులో వృద్ధులు, వికలాంగులు నీటిలో నిలబడే ఫెన్షన్‌ తీసుకోవాల్సి వచ్చింది. కామారెడ్డిలో కురిసిన భారీ వర్షాలకు ఇళ్లల్లోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు నానా తంటాలు పడుతున్నారు. కామారెడ్డిలోని బాలికల ఉన్నత పాఠశాలలోకి వర్షపు నీరు చేరడంతో ఒకే గదిలో విద్యార్థులను కోర్చోబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

21:39 - September 23, 2016

వరంగల్‌ : జిల్లాను వానలు ముంచెత్తుతున్నాయి. జోరువానలకు అనేక చెరువులు పొంగుపొర్లుతున్నాయి. పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. వరంగల్ నగరంలోని పలు కాలనీలు నీట మునగడంతో స్థానికులు విలవిల్లాడుతున్నారు. వర్ష ప్రభావంతో జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

వణుకుతున్న జిల్లా
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్‌ జిల్లా జనం వణికిపోతున్నారు. నగరంలోని పలు కాలనీల్లో వర్షపు నీరు చేరడంతో పిల్లలు, వృద్ధులు నిద్రాహారాలు మాని జాగారం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెరువులు, కుంటలు నీటి ఉధృతి పెరిగిపోయి మత్తళ్లు తొక్కుతున్నాయి. వర్ష బీభత్సంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

నిండుకుండల్లా చెరువులు
జిల్లాలోని అనేక చెరువులు నిండుకుండల్లా మారాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పాలకుర్తి, స్టేషన్‌ ఘన్‌పూర్‌, రఘునాథపల్లి, ధర్మసాగర్‌, జఫర్‌గఢ్‌, దేవరుప్పుల, లింగాలఘనపురం మండలాల పరిధిలోని 24 చెరువులకు బుంగలు పడ్డాయి. ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. జిల్లాలో హఠాత్తుగా వందలాది చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. పాకాల, రామప్ప, లక్నవరం చెరువుల్లో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.

పలు కాలనీలు జలమయమం
వరంగల్ నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన మార్గాలన్నీ నీటితో నిండిపోయాయి. వరంగల్‌, హన్మకొండ బస్‌స్టేషన్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అత్యవసర సమయంలో రక్షణ ఏర్పాట్ల కోసం రెస్క్యూ టీంలు సిద్ధం చేశారు. కానీ తమ వద్దకు ఎవరూ రాలేదని బాధితులు చెబుతున్నారు.

భారీ వర్షాలతో గ్రామీణ ప్రాంతాలన్నీ అతలాకుతలం
భారీ వర్షాలతో గ్రామీణ ప్రాంతాలన్నీ అతలాకుతలమయ్యాయి. పంటలన్నీ నీట మునగడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. పలుచోట్ల వరి, పత్తి, మిరప చేలన్నీ నీట మునిగాయి. నర్సంపేటలోని మార్కెట్ యార్డులో మక్కలన్నీ వర్షాలకు కొట్టుకునిపోయాయి. 3వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు లెక్కలేస్తున్నారు. పంటల సర్వే ఇంకా కొనసాగుతున్నందున నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉంటాయనే సమాచారంతో జిల్లా ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.  

21:35 - September 23, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ సిటీ వాటర్‌ సిటీగా మారిపోయింది. ఆకాశానికి చిల్లుపడినట్లుగా వర్షాలు దంచికొడుతున్నాయి. వర్ష బీభత్సం నగరంలో అలజడి రేపుతోంది. నగర రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కుంగిపోతున్న రోడ్లు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న లోతట్టు ప్రాంతాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా... పరిస్తితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. భాగ్యనగరం మరో చిరపుంజిని తలపిస్తోంది. వరుసగా ఐదో రోజు హైదరాబాద్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. జోరు వానలు నగరాన్ని కుదిపేస్తున్నాయి. రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలు

రహదారులన్నీ జలమయం
గ్రేటర్‌ సిటీని షేక్‌ చేస్తున్నాయి. దీంతో రహదారులన్నీ జలమయమవడంతో పాటు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బాధితులకు భరోసానిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. వాహనదారులు రోడ్లను గమనించి నెమ్మదిగా వెళ్లాల్సిందిగా కోరుతున్నారు. జీహెచ్‌ఎంసీ అనుమతి లేకుండా మ్యాన్‌హోళ్లు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

చెరువును తలపిస్తున్న రామంతాపూర్‌ హోమియోపతి ఆస్పత్రి
భారీవర్షాలకు రామంతాపూర్‌ హోమియోపతి ఆస్పత్రి చెరువును తలపిస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మోటర్లతో నీటిని తోడుతున్నారు. నాచారం నాలా ఉగ్రరూపం దాల్చింది. వరదనీటి ప్రవాహం భారీగా పెరగడంతో హబ్సిగూడ- మల్లాపూర్ ప్రధాన మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. నాలా నీరు నాచారంలోని రాఘవేంద్రనగర్, ఇందిరానగర్‌లను ముంచెత్తడంతో ఇళ్లలో నడుంలోతు నీరు నిలచింది. నాచారంలో వరదనీటిలో నిలిచిపోయిన టాటాఏస్ వాహనాన్ని తోసేందుకు ప్రయత్నించిన యువకుడు హఠాత్తుగా నాలాలో పడిపోయాడు. వెంటనే పక్కనున్న వాళ్లు ఆ యువకుడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.

భారీ వర్షాలకు మెహిదీపట్నంలో కూలిన ఇండ్లు
భారీ వర్షాలకు మెహిదీపట్నం ప్రాంతంలో పురాతన ఇళ్లు నేలమట్టమవుతున్నాయి. ఆసిఫ్‌నగర్‌ మండల పరిధిలోని పలు బస్తీల్లో 8 ఇళ్లు నేలకూలాయి. గుఫానగర్‌లో రెండు, చింతల్‌బస్తీలో ఒకటి, మల్లేపల్లిలో ఒకటి, మాంగర్‌బస్తీలో ఒకటి, గుడిమల్కాపూర్‌లో ఒకటి, సాబెర్‌నగర్‌లో ఒకటి, ఫస్ట్‌లాన్సర్‌లో ఒకటి.. మొత్తం ఎనిమిది ఇళ్లు కూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. పాక్షికంగా కూలిన ఇళ్లకు రూ.3200, పూర్తిగా కూలిన ఇళ్లకు రూ.5200 ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.

తార్నక డివిజన్ లో పలు కాలనీలు జలదిగ్భంథం
తార్నాక డివిజన్‌లోని లాలాపేట, చంద్రబాబు నాయుడు నగర్‌లోని పలుకాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పునారావాస కేంద్రాల్లో స్థానికులు తలదాచుకుంటున్నారు. మంత్రి పద్మారావు, స్థానిక కార్పొరేటర్‌ ప్రజలకు ఆహార పొట్లాలు పంపిణి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి పద్మారావు తెలిపారు.

నిజాంపేట బండారీ లేఅవుట్‌ అతలాకుతలం
మరోవైపు జోరువానలు నిజాంపేట బండారీ లేఅవుట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న కాలనీ వాసులను మరో ప్రమాదం వణికిస్తోంది. భారీ వరదకు రోడ్‌నెంబర్ 8లో తుర్క చెరువు ప్రమాదకర పరిస్థితికి చేరుకుంది. స్పాట్

నాలాల ఆక్రమణపై చర్యలు : కేటీఆర్
నగరంలోని నాలాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. వర్షాలపై సమీక్షించిన ఆయన ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, హుస్సేన్‌సాగర్‌ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. నాలాల ఆక్రమణలపై విచారణకు కమిటీ వేస్తామని కేటీఆర్‌ తెలిపారు.

వరద పరిస్థితిని సీఎం కేసీఆర్  సమీక్ష
హైదరాబాద్‌ సహా తెలంగాణలో వరద పరిస్థితిని సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి సమీక్షిస్తున్నారు. మంత్రి కేటీఆర్, సీఎస్ రాజీవ్‌శర్మతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటనష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించారు. రాష్ట్రమంతటా రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. చెరువులకు గండ్లు పడి పంటపొలాల్లోకి నీరు చేరిందని ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. వర్షాలపై కలెక్టర్లతో సమీక్ష జరపాల్సిందిగా సీఎస్‌ను ఆదేశించారు.

టోల్ ఫ్రీ నెంబర్లు
ప్రజలకు వర్షాల వల్ల ఏ సమస్య తలెత్తినా 100 లేదా 040-24111111 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తే సంబంధిత అధికారులు తక్షణ సహాయం చేస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. వదంతులు, పుకార్లను నమ్మొద్దని సూచిస్తున్నారు. 

21:19 - September 23, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు జనాజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమై.. పలు చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

పులిచింతల నుంచి 1.30 క్యూసెక్కుల నీరు విడుదల
కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. పులిచింతల నుంచి ఇప్పటికే 1.30 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వదులుతుండటంతో బ్యారేజీ వద్ద మొత్తం గేట్లు ఎత్తేసి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. కృష్ణా నది భారీ వరద కారణంగా గుంటూరు జిల్లాలోకి లంక గ్రామాల ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు.

పొంగిపొర్లుతున్న నాగావళి, వంశధార నదులు

శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఇప్పటికే జిల్లాలోని ప్రధాన నదులు నాగావళి, వంశధార వరద నీటితో పోటెత్తుతున్నాయి. కొత్తూరు మండలంలోని పెనుగోటివాడ, మాతల గ్రామాలు ముంపు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నాయి. వేగావతి తీరాన గల దేవకివాడ, కొత్తపేట, వీపీఆర్‌పేట గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

పట్టణమంతా చెత్తా చెదారం
విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో జనజీవనానికి ఇబ్బందికరంగా మారింది. భారీ వర్షాలతో జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. మురికి కాలువలు పొంగిపొర్లడంతో వర్షపు నీటితో పాటు చెత్తచెదారంతో పట్టణమంతా బురదమయమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలకు చెరువులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి.

ప్రకాశం బ్యారేజ్‌ 70 గేట్ల ఎత్తివేత
కృష్ణాజిల్లా.. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర కృష్ణానది పరవళ్లు తొక్కుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు బ్యారేజ్‌ మొత్తం పూర్తిగా నిండిపోవడంతో 70 గేట్లు ఎత్తివేశారు. కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే ఇక్కడి పరిస్థితిని మంత్రి ఉమామహేశ్వరరావు కూడా పరిశీలించారు. నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

ముంపు గ్రామాలలో మంత్రుల పర్యటన
గుంటూరు జిల్లాలోని పలు ముంపు గ్రామాలలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. డిప్యూటీ సీఎం చినరాజప్ప ఇవాళ పర్యటించారు. గ్రామాలలో కొట్టుకుపోయిన పంటలను .. కోతకు గురైన రహదారులను పరిశీలించారు. జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రులు చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.

ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి
ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. మొత్తం 70 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి భారీ ఎత్తున నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్ట్‌ నుండి 3 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల కావడంతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. నదిలో వదర ఉధృతి పెరుగుతుండటంతో భవానీ ఐలాండ్‌ లోపలికి సందర్శకులను అనుమతించడం లేదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయంలో 1077 టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని అధికారులు ఆదేశించారు. 

20:50 - September 23, 2016

అల్పపీడనానికి బీపీ పెరిగిందంట..గందుకే వానలు దంచికొడుతన్నాయంట..వర్షాలకు ఆగమైపోయిన తెలంగాణ డల్లాసు నగరం హైదరాబాదు..వరంగల్ వణికింది..హన్మకొండ హడలిపోయింది..రోడ్ పై చేపలు పట్టిన ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే..ఇండ్లమీద ఆనలు ఇరుసుకుపడింది..విశాఖకు సర్ధిజేసింది...ఖమ్మం పట్నంల కమ్మంగా నిండినియ్యంట చెరువులు..ఆదిలాబాద్ ఆగమైపోతాంది వానకు..ఏపీలో వరదలో సిక్కిన సర్కార్ బస్..వాన నీటిలో ఈతకొడ్తన్న ఇండ్లు, గుళ్లు..రెండు నెలలు మంచువానల ఇరుక్కుపోయిన పెద్దమడిసి..

పడవ నుండి 100 మృతదేహాలు వెలికితీత..

ఈజిప్టు : వలసదారులతో వెళ్తూ ప్రమదానికి గురై మునిగిపోయిన పడవ నుంచి సుమారు వంద మృతదేహాలు వెలికి తీసినట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు 53 మంది మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని దీంతో ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 108కి పెరిగిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఆదెల్‌ ఖలీఫా తెలిపారు.బుధవారం ఈజిప్టు సమీపంలో సముద్ర తీరంలో వలసదారులతో వెళ్తున్న పెద్ద పడవ మునిగిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సహాయకసిబ్బంది చర్యలు చేపడుతూ మృతదేహాలను బయటకు తీస్తున్నారు.

20:39 - September 23, 2016

మీకు రెగ్యులర్ గా సినిమాలు చూసే అలవాటుందా? తెలుగు, హిందీ లేదా ప్రపంచ భాషల సినిమాలు..ఏవైనా సరే. ఇవి మీపై ప్రభావాన్ని చూపుతాయనేది కొత్త విషయం కాదు. ఏ కళా రూపమైనా సమాజంపై ప్రభావం చూపుతున్నప్పుడు, అక్కడ బాధ్యత అనే ఎలిమెంట్ కూడా ఉండాలా వద్దా..? ఇదే ఇక్కడ ప్రశ్న. భారతీయ సినిమా కేవలం సొమ్ము చేసుకోవటంతోనే ఆగుతోందా? లేక రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తోందా? అభిమానంతో నెత్తిన పెట్టుకుంటున్న వారిపట్ల హీరోలు కాస్తైనా బాధ్యతగా వ్యవహరిస్తున్నారా లేక... అంతా కలసి ప్రజలను ఓ మత్తులోనే ముంచేస్తున్నారా? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. సినిమా తీసేది కేవలం సినిమా కోసం.. పెట్టుబడి వెనక్కు రావటం కోసం, లాభాలు వెనకేసుకోవటం కోసం చేసే వ్యాపారం మాత్రమే అంటారా.. కానీ, ఈ వ్యాపారం అంతులేని అభిమానాన్ని, కొండంత ఇమేజ్ ని ఇచ్చే పరిస్థితిలో ఈ సమాజం ఉన్నప్పుడు హీరోల తీరులో, సినిమాల దిశలో మానవీయ కోణం, సామాజిక స్పృహ ఉండాలా వద్దా? 

స్వతంత్రం వచ్చి ఆరుదశాబ్దాలు దాటింది. దేశం అనేక సమస్యలతో అతలాకుతలమవుతోంది. అసమానతలు రాజ్యమేలుతున్నాయి. అవకాశవాద రాజకీయాలు అడ్డంగా దోచుకుంటున్నాయి. ఈ దారుణాలను వినోద మాధ్యమాలు ప్రజలకు చెప్తున్నాయా? కన్వీనియెంట్ గా దాటవేసి మాయలో ముంచెత్తుతున్నాయా? సమాజం నుండి సినిమాలు పుట్టాయనుకున్నాం.. కానీ, సమాజాన్ని సినిమా చెక్కుతోందా? అమితాబ్ ని ఆరాధించినంత, ఖాన్ త్రయాన్ని అభిమానించినంతగా దేశంలో మరొకరికి ఆ పాపులారిటీ ఉందా? తెలుగులో చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్, జూనియర్ ఎన్టీఆర్.. వీళ్లంటే కోట్లాది అభిమానులు పడిచస్తారు. వినోదం పేరుతో కొన్ని మూససినిమాలు ప్రేక్షకులపై కుమ్మరించటం తప్ప వీరిలో సామాజిక బాధ్యతతో వ్యవహరించేవారెంతమంది? నిన్నటిదాకా సమాజం నుండి సినిమాలు పుట్టాయనుకున్నాం.. కానీ, ఇప్పుడు సమాజాన్ని సినిమా చెక్కుతోందనే కొన్ని ఘటనలు నిరూపిస్తున్నాయి. అలాంటి సందర్భంలో పౌరాణిక, సాంఘిక, ప్రేమకథా, ఫ్యాక్షన్, ఇలా ట్రెండ్ మారుతూ వస్తున్న తెలుగు సినిమా.. ఏ దిశలో సాగుతోంది? కళలో వ్యాపారం కలసి ఉండొచ్చా లేదా అనే ప్రశ్న ఇక్కడ తీసుకురావటం లేదు. కానీ, కళ సమాజాన్ని ప్రభావితం చేసే సమయంలో... నూటముప్పై కోట్ల మంది ప్రజల్లో భాగమైన నటులు, ఆ సినిమాలు తీసే ఇండస్ట్రీ పెద్దలు ఏ రకమైన సినిమాలు తీయాలనే అంశంపై చర్చ జరగాల్సి ఉంది. 

20:32 - September 23, 2016

13 సంవత్సరాలకే హరిశ్చంద్రుడు సినిమాతో తెరంగ్రేటం..సినిమా చిత్రీకరణలో అమాయక అల్లరిపిల్లగా..కన్నడ..మలయాళం సినిమాల్లో బిజీ హీరోయిన్ గా..ఆమె నోరు విప్పితే మాటల పూదోటలో విహరిస్తున్న భావన..ప్రముఖ దర్శకుడు, నటులు జంధ్యాల గారి తొలిచిత్రం అయిన ముద్దమందారం సినిమాలో  హీరోయిన్ గా ఛాన్స్..అంతేకాదు ఆమెకు కూడా హీరోయిన్ గా అదే మొదటి సినిమా..ఆమే  అలనాటి అభినయ ప్రియ నటి 'పూర్ణిమ'తో టెన్ టీవీ లైవ్ షో నిర్వహించింది. హీరోయిన్ గా పూర్ణిమకు ముద్ద మందారం సినిమాయే తొలి చిత్రం కావటం విశేషం. ముద్ద మందారం, నాలుగుస్తంభాలాట,శ్రీవారికి ప్రేమలేఖ,మాపల్లెలో గోపాలుడు వంటి పలు చిత్రాలతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారుపూర్ణిమ. ముద్ద మందారం సినిమా చిత్రీకరణ సందర్భంగా దర్శకులు జంధ్యాల గారు ముద్దుగా 'తింగరి'అనేవారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి పూరీ అని పిలిచేవారనీ..తను చీరూ అని పిలిచుకునేవారమని తెలిపారు. 

20:22 - September 23, 2016

హైదరాబాద్ : నగరంలో నాలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడం వల్లే ప్రస్తుత పరిస్థితులు తలెత్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. నాలాలకు పక్కనే ఉన్న వారు వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశించామన్నారు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని.. ఇప్పటికే నోటీసులు ఇచ్చామని కొంతమంది కోర్టుకు వెళ్లారన్నారు తలసాని. 

20:13 - September 23, 2016

విజయవాడ : విజయవాడ రైల్వే స్టేషన్‌లో సిగ్నలింగ్, ఎలక్ట్రికల్ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు చేపట్టిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2 వేల మంది కార్మికులతో ఇంజినీరింగ్‌ అధికారులు పనులు చేయిస్తున్నారు. 3 రోజులుగా విరామం లేకుండా శ్రమించి 1 నుంచి 5 ఫ్లాట్‌ఫాంల పనులు పూర్తి చేశారు. దీంతో రేపటి నుంచి ఈ 5 ఫ్లాట్‌ఫాంల వరకు రైళ్లను అనుమతించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బెజవాడ రైల్వే స్టేషన్‌లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 

20:11 - September 23, 2016

విశాఖ పట్నం : జిల్లాలోని పరవాడలో 15 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించి.. ఆడపడుచులకు విలువైన ఆస్తిగా ఇళ్లు ఇచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. పరవాడలో జేఎన్ఎన్ యూఆర్ ఎమ్ ఇళ్ల సముదాయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లు నిర్మించామని.. ఈ ఇళ్లలో మెరుగైన సౌకర్యాలున్నాయన్నారు చంద్రబాబు. ప్రజల ముఖాల్లో సంతోషం చూడడమే ప్రభుత్వ లక్ష్యమని.. ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని సమకూరుస్తామన్నారు చంద్రబాబు. 

20:06 - September 23, 2016

హైదరాబాద్ : గ్రూప్‌-2 దరఖాస్తు గడువును మరో మూడు రోజులు పొడిగిస్తూ టీఎస్ పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ అర్ధరాత్రి దరఖాస్తుకు చివరిరోజు కావడంతో సర్వర్లు మొరాయించాయి. దీనిపై 10టీవీ కథనాలు ప్రసారం చేసింది. దీంతో స్పందించిన టీఎస్ పీఎస్సీ ఈనెల 26 వరకు గడువు పెంచింది. 

19:56 - September 23, 2016

గుంటూరు : రాజధాని ప్రకటించిన తరువాత కొండవీటి వాగుకోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అతి భారీ వరద వస్తే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి ప్రమాదం రాకుండా తీసుకున్ జాగ్రత్తలతో వాగుకు ఆపద తప్పిందని పేరిచర్ల, ఫిరంగిపురం స్థానికులు పేర్కొంటున్నారు. రాజధాని ప్రకటించిన తరువాత కొండవీటి వాగు పరిసర ప్రాంత వాసులకు ప్రమాదం రాకుండా వాగు గట్లను వెడల్పు చేసిన ఎత్తు పెంచినందువల్లనే తమకు ముప్పు తప్పిందని కొండవీటి వాగు పరిధిలోని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొండవీటి వాగుపై మంత్రి దేవినేని ప్రత్యేక చర్యలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొండవీటివాగు ముంపు నివారణకు నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు చైర్మన్‌గా, పదిమంది నిపుణులతో కమిటీ ఏర్పాటైంది.గతంలో మంత్రి దేవినేని మాట్లాడుతూ కొండవీటివాగు కారణంగా రాజధాని ప్రాంతం ముంపునకు గురికాకుండా పటిష్ట చర్యలను చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారని తెలిపారు.దీంతో 15 రోజులుగా యుద్ధప్రాతిపదికన వాగు ముంపు నివారణ చర్యల కోసం అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్‌ నిపుణుల సలహాలు, సూచనల మేరకు గట్టి చర్యలు చేపడుతున్నామని మంత్రి దేవినేని ఉమా కూడా పేర్కొన్నారు. 

పాక్ చేరుకున్న రష్యా సైనిక దళాలు..

పాకిస్థాన్ : ‘ఫ్రెండ్‌షిప్‌-2016’ పేరుతో రష్యా, పాకిస్థాన్‌ సైనిక దళాలు నిర్వహించనున్న తొలి సంయుక్త విన్యాసాల నేపథ్యంలో నేడు రష్యా సైన్యానికి చెందిన బృందం పాకిస్థాన్‌కు చేరుకుంది. ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులుండగా.. ఇప్పుడు సైనిక సంబంధాలు మెరుగుపడుతున్నాయని తెలియజేయడానికి ఇరు దేశాలు సంయుక్తంగా డ్రిల్‌ నిర్వహిస్తున్నాయి. ఈ డ్రిల్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో జరగనుండడం గమనార్హం.

'పారా' విజేతలకు పద్మ అవార్డులు..

ఢిల్లీ: పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వారిని దేశంలో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులకు సిఫారసు చేయనున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్‌ గోయల్‌ తెలిపారు. పురుషుల హై జంప్‌లో స్వర్ణం సాధించిన మరియప్పన్‌ తంగవేలు, పురుషుల జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించిన దేవేంద్ర ఝఝారియా, మహిళల షాట్‌పుట్‌ విభాగంలో రజతం సాధించిన దీప మాలిక్‌, పురుషుల హై జంప్‌లో కాంస్యం సాధించిన వరుణ్‌ భాటి పేర్లను హోం శాఖకు సిఫారసు చేయనున్నట్లు గోయల్‌ చెప్పారు.

మరో వారంపాటు తెలంగాణలో వర్షాలు!..

హైదరాబాద్ : రాష్ట్రంలో కురిసిన భారీ వ‌ర్షాల‌కి ఇప్పటికే ప‌లు జిల్లాల్లోని ప్ర‌జ‌లు ఎన్నో అవ‌స్థ‌లు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో మ‌రో ఏడురోజుల పాటు వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలంగాణ విప‌త్తు నియంత్ర‌ణ శాఖ ఈరోజు పేర్కొంది. ఈనెల 27 వ‌ర‌కు భారీ వ‌ర్షాలు, 27 నుంచి 30 వ‌ర‌కు ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ చెబుతున్నందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలని సూచించారు.

18:41 - September 23, 2016

నేచురల్ స్టార్ నాని, మలయాళ భామ అను ఇమాన్యువేల్ జంటగా నటించిన వెరైటీ ప్రేమకథాచిత్రం మజ్నూ. ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో నాని ఈ సంవత్సరం హ్యాట్రిక్ కొట్టాడా? లేదా?

నానిని తనను నేచురల్ స్టార్ అని ఎందుకంటారో ఇప్పటివరుకూ చాలా సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాడు. కేవలం తన యాక్టింగ్ టాలెంట్ తో కంటెంట్ ఏమీ లేకపోయినా కూడా సినిమాను హిట్టు గట్టెక్కించగలడు . అదే హిట్టైతే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో , లాస్ట్ ఇయర్ భలే భలే మగాడివోయ్ తో నిరూపించాడు. ఇప్పుడు మజ్నూ విషయానికొస్తే , కథ పాతదే అయినా, కథనాన్ని తనదైన యాక్టింగ్ తో మసిపూసి మారేడు కాయ చేసేసాడు. సినిమా స్టోరీ, తరువాత ఏం జరుగుతుందో అందరూ ఎక్స్ పెక్ట్ చేసేదే, కాకపోతే హాయిగొలిపే సన్నివేశాలతో , బోర్ కొట్టించని నెరేషన్ తో ఈ సినిమాని బ్యాలెన్స్ డ్ గా తెరకెక్కించాడు విరించి వర్మ. అసలు నాని ప్రేమకథాచిత్రాలు చేసే స్థాయి ఎప్పుడో దాటిపోయాడు గానీ, ఈ సినిమాలో నాని హీరో అవడం వల్ల కథనానికే బలమొచ్చి, జనానికి కాస్తంత రిలాక్స్డ్ గా అనిపిస్తుంది. అదే వేరే ఇతర హీరోలెవరైనా ఈ సినిమా చేసి ఉండుంటే మాత్రం ఓ మామూలు రొటీన్ సినిమాలా మిగిలిపోయి ఉండేదేమో.

తన ప్రాణ స్నేహితుడు కాశి ప్రేమవ్యవహారం సెట్ చేద్దామని బైలుదేరిన ఆదిత్య, కిరణ్ అనే ఆ అందమైన అమ్మాయిని చూసి తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెను రోజూ ఫాలో చేస్తూ అనుకోకుండా ఆమె చదివే కాలేజ్ లోనే జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అవుతాడు. కొద్దిరోజులకు ఇద్దరి మధ్యా ప్రేమముదిరి పాకాన పడుతుంది. అయితే కాశీతో ఆదిత్య తనకన్నా బాగా క్లోజ్ గా ఉండడాన్నిభరించలేకపోతుంది కిరణ్. ఇద్దరి మధ్యా వాదోపవాదాలు జరుగుతాయి. దాంతో ఆమె మీద కోపంతో ఆమెను వదిలిపెట్టి వేరే ఊరు వెళ్లిపోతాడు. అక్కడ సుమ అనే మరో అమ్మాయికి ఆకర్షితుడై , ఆమెను తన ప్రేమలో పడేస్తాడు ఆదిత్య.అయితే తను ప్రేమిస్తున్న విషయాన్ని ఆదిత్య కు చెబుతూ, తనతో పాటే కిరణ్ ని తన కజిన్ గా పరిచయం చేస్తుంది సుమ. ఇద్దరి మధ్యా చిక్కుకున్న ఆదిత్య చివరికి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడన్నదే మిగతా కథ.

ఇలాంటి రొటీన్ కథను చివరి వరుకూ బోర్ కొట్టించకుండా నడిపించాలంటే ఎలాంటి డైరెక్టర్ కైనా కత్తి మీద సామే. అయితే డైరెక్టర్ మంచి మంచి సన్నివేశాలు రాసుకోవడం వల్ల, అందరూ మాట్లాడుకొనే సాధారణమైన సంభాషణల్ని పలికించడం వల్ల, అసలు ప్రేక్షకులకు టైమే తెలియకుండా పోతుంది . నాని తనదైన నటనా చాతుర్యంతో ,సంభాషణా చమత్కృతులతో ఈ సినిమా ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగిపోతుంది. ఇక హీరోయిన్స్ గా నటించిన ఇద్దరమ్మాలు బాగా నటించడంతో సినిమా బాగానే సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా పడుతుంది. ప్రేమ విఫలమైనవాళ్లంతా మజ్నూలు అవ్వక్కర్లేదని, ప్రేమ నిజమైతే ఎవరూ మజ్నూలు కానవసరం లేదని విరించి వర్మ కొత్తగా చెప్పడానికి ట్రై చేసాడు. అయితే ఈ తరహా సినిమాల్ని మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారు. మామూలు మాస్ ప్రేక్షకుడు ఎంతవరుకూ ఇష్టపడతాడో చెప్పలేం. క్లైమాక్స్ ను చాలా బ్యాలెన్స్ డ్ గా, ఫన్నీగా తెరకెక్కించాడు దర్శకుడు. టోటల్ గా సినిమా మరీ దారుణం లేకుండా , అలా అని మరీ సూపర్ గా కాకుండా, చూడ్డానికి బాగానే ఉంటుందనే కన్ క్లూజన్ కు వస్తారు ప్రేక్షకులు . ఈ వారం సినిమాలేవీ లేవు కాబట్టి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే పాసైపోతుంది. 

గ్రూప్-2 దరఖాస్తుల గడువు పెంపు!..

హైదరాబాద్: ఈ రోజు రాత్రి 12 గంటల వరకు ముగియనున్న గ్రూప్-2 దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచుతూ టీఎస్‌పీఎస్సీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 26 వరకు గ్రూప్-2 దరఖాస్తులను స్వీకరించనున్నారు. నవంబర్ 11న 1, 2 పేపర్‌లు, నవంబర్ 13న 3,4 పేపర్లకు పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే.

70 మంది విద్యార్థుల సస్పెండ్!..

తమిళనాడు : చెన్నైలోని ఓ ప్రముఖ కళాశాలకు చెందిన 70 మంది విద్యార్థులను ప్రిన్సిపల్‌ సస్పెండ్‌ చేశారు. అదే కళాశాలకు చెందిన మరో ఆరుగురు విద్యార్థులను ప్రిన్సిపల్‌ పిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొందరు విద్యార్థులు క్రమశిక్షణ రాహిత్య చర్యలకు పాల్పడుతున్నట్లు ప్రిన్పిపల్‌ గమనించారు. కొందరు డిగ్రీ విద్యార్థుల బ్యాగులను తనిఖీ చేసి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ప్రిన్సిపల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. వీరితో పాటు క్రమశిక్షణ రాహిత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న 70మంది విద్యార్థులను ప్రిన్సిపల్‌ ఒకేసారి సస్పెండ్‌ చేశారు.

తెలంగాణలో వరదలు..ఢిల్లీలో కేసీఆర్..

హైదరాబాద్: వరదల సమయంలో సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో ఉండడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ చెప్పుకొచ్చారు. అసలు ఢిల్లీలో ఆయన ఎందుకున్నారో.. ఎందుకు వెళ్లారో తమకు అర్థం కావట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ నేతలు సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితిలో అసెంబ్లీ సీట్ల పెంపు గురించి మాట్లాడడం దౌర్భాగ్యమన్నారు. ఇలాంటి పరిస్థితిలో సీఎం రాజకీయం చేయడం తగదన్నారు.

ఉగ్రదేశంతో ఆడం : బీసీసీఐ

ఢిల్లీ: పాకిస్థాన్‌లాంటి ఉగ్రవాద దేశాలతో క్రికెట్ ఆడబోమని బిసిసిఐ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్నీ తానై ఉగ్రవాదాన్నే దేశ విధానంగా మార్చుకున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఎండగట్టే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చెప్పారు. జమ్ముకాశ్మీర్ యూరీ సెక్టార్‌లోని ఆర్మీ స్థావరంపై పాక్ ప్రేరిత ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది అమాయక పౌరులను పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది. బిసిసిఐ తాజా నిర్ణయంతో పాక్ మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు.

నల్లవాగులో లారీలు!..

నిజామాబాద్‌: భారీగా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్‌ జిల్లా అతలాకుతలం అవుతోంది. కుండపోత వర్షాలతో వాగులు, చెరువులు నిండుకుండను తలపిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో నిజాంసాగర్‌ మండలంలోని నల్లవాగు ఉరకలెత్తుతోంది. నర్సింగరావుపల్లి వద్ద వంతెన పైనుంచి వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్‌ నుంచి నాందేడ్‌ వెళ్తున్న రెండు లారీలు వంతెన దాటుతూ వరదలో చిక్కుకున్నాయి. వీటిలో ఉన్న నలుగురు వ్యక్తులు తమను కాపాడాలని హాహాకారాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని వారికి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

17:45 - September 23, 2016

విశాఖపట్నం : ఫిషరీస్ అండ్ ఆక్వా రంగానికి ఏపీలో మంచి భవిష్యత్తు ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చేపల పెంచడమే కాకుండా వాటిని అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని తెలిపారు . ఆక్వా సెక్టార్ ను ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి అభివృద్ధి పరుస్తారమన్నారు. ఏపీకి పరిశ్రమలు రావటం ఎంతో ముఖ్యమే పర్యావరణంను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆదిశలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పిటికే 60 కోట్ల రూపాయలు కేటాయింపుపై క్యాబినెట్లో చర్చించామన్నారు. విశాఖపట్నంలో జరిగిన 20వ అంతర్జాతీయ సీ ఫుడ్‌ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. దేశంలోనే విశాఖపట్నం పోర్ట్‌ ఆక్వాప్రొడక్ట్స్ ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉందని తెలిపారు.  

17:43 - September 23, 2016

కరీంనగర్ : మార్కెట్‌ కమిటీలలో కీలక పదవులను బీసీ..ఎస్సీ..మైనార్టీలకు కేటాయిస్తున్న ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని ఎంపీ కవిత అన్నారు. కరీంనగర్‌ జిల్లా.. జగిత్యాల పట్టణంలో ఎంపీ కవిత పర్యటించారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మార్కెట్‌ కమిటీ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. జగిత్యాల మార్కెట్‌ అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలని ఎంపీ కవిత సూచించారు.

17:40 - September 23, 2016

కరీంనగర్ : భారీ వర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తింది. దీంతో 15 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 10 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. ఈ నీరు వరద కాల్వ ద్వారా లోయర్‌ మానేరు డ్యామ్‌కు చేరనుంది. నీళ్లు విడుదల చేయడం వల్ల షాబాష్‌పల్లి వంతెన మునిగిపోనుంది. దీంతో కరీంనగర్‌-వేములవాడ మధ్య రాకపోకలు నిలిచిపోనున్నాయి. మరింత సమాచారానికి వీడియో చూడండి..

17:37 - September 23, 2016

హైదరాబాద్‌ : నగరాన్ని వరదనీరు ఇంకా వీడలేదు. ఉదయం నుంచి భారీవర్షాలు లేకపోయినప్పటికీ... వరద కష్టాలు మాత్రం వీడటం లేదు. బండారి లే అవుట్ లో వరద నీరు ఇంకా అలాగే ఉన్నాయి. నిజాంపేటలో తుర్కచెరువుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో చెరువు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మరోవైపు హుస్సేన్‌సాగర్‌ తాజా పరిస్థితిని మంత్రి కేటీఆర్ సందర్శించారు.

తుర్క చెరువుకు భారీగా వరద నీరు
హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే వున్నాయి. ఏ కాలనీలు చూసినా తటాకాలను తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతు నీళ్లలో స్థానికుల పలు ఇబ్బందులకు గురవుతున్నారు. నిజాంపేటలో తుర్కచెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రమాదకర స్థాయిలో వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు చెరువుకు గండి పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.

17:27 - September 23, 2016

హైదరాబాద్‌ : నగరాన్ని వరదనీరు ఇంకా వీడలేదు. ఉదయం నుంచి భారీవర్షాలు లేకపోయినప్పటికీ... వరద కష్టాలు మాత్రం వీడటం లేదు. బండారి లే అవుట్ లో వరద నీరు ఇంకా అలాగే ఉన్నాయి. మరోవైపు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో రోడ్లపై వరదనీరు చేరడంతో... డివైడర్‌ ను తొలగించి ట్రాఫిక్‌ ను క్రమబద్ధీకరిస్తున్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

ముగిసిన ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. వర్షాకాల సమావేశాల్లో సభ్యుల తీరుకు సంబంధించిన వీడియో ఫుటేజీని కమిటీ సభ్యులు పరిశీలించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఆరుగురు సభ్యులు ప్రవర్తించినట్లు గుర్తించారు. వీరు శ్రీనివాసులు, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాచమల్లు ప్రసాదరెడ్డి, రామకృష్ణారెడ్డి, జగ్గిరెడ్డిలు. మరోసారి సమావేశమై నోటీసులివ్వాలని కమిటీ యోచిస్తోంది. ఐదు కోట్ల మంది ఆంధ్రుల హక్కుల కోసం పోరాటం చేయడం జరిగిందని, నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదని వైసీపీ సభ్యులు పేర్కొన్నారు. 

17:09 - September 23, 2016
17:04 - September 23, 2016

ఢిల్లీ : బహమాస్ లీక్స్‌ ఇప్పుడు మన దేశంతో పాటు ప్రపంచాన్ని కుదుపేస్తోంది. తాజాగా ఐసీఐజే బయటపెట్టిన జాబితా నల్లకుబేరుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఒక్క మన దేశంలో 475మంది నల్లకుబేరుల జాబితాను బయటపెట్టిందా సంస్థ. తెరవెనుక ఉన్న పెద్ద పెద్ద తలకాయల అసలు గుట్టును రట్టు చేసింది.

జాబితాను బయటపెట్టిన ఇంటర్‌నేషనల్‌ కన్సార్షియం ఆఫ్ ఇన్విస్టిగేషన్
వీకీలీక్స్, పనామాలీక్స్‌ తరహాలో బహమాస్‌ లీక్స్‌ సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక్క భారతదేశానికి సంబంధించి మొత్తం 475మంది నల్లకుబేరుల జాబితాను ఇంటర్‌నేషనల్‌ కన్సార్షియం ఆఫ్ ఇన్విస్టిగేషన్ బయటపెట్టింది.

బహమాస్ అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఓ చిన్న దేశం
బహమాస్.. అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఓ చిన్న దేశం. కొలంబియా, పనామాలతోపాటు.. అక్రమార్కులు నల్లధనం దాచుకోడానికి స్వర్గధామంగా పనికొస్తోంది బహమాస్‌. ఐసీఐజే తాజా జాబితాలో బయటకు వచ్చిన కంపెనీలన్ని 1990 నుంచి 2016 మధ్య బహమాస్‌లో బోగస్‌ కంపెనీలుగా రిజిస్ట్రేషన్‌ అయినవే..

వేదాంత గ్రూప్ అనిల్ అగర్వాల్‌, ఫ్యాక్షన్ టీవీ ప్రమోటర్ రాజన్ మధు
ఇక ఈ జాబితాలో ప్రముఖ వ్యాపారవేత్తలైన నిమ్మగడ్డ ప్రసాద్, ప్రకాశ్ నిమ్మగడ్డతో పాటు వేదాంత గ్రూప్ అధినేత అనిల్ అగర్వాల్‌, ఫ్యాక్షన్ టీవీ ప్రమోటర్ రాజన్ మధు, వీన్ వాటర్స్‌ చైర్మన్ అమన్ గుప్తా, బారోన్ గ్రూప్ అధినేత కబీర్ మల్‌చందానీ కూడా ఉన్నారు. ఇలా మొత్తం 475మంది పేర్లతో లక్షా 75వేల బోగస్‌ సంస్థలు ఉన్నట్లు ఐసీఐజే జాబితా బయటపెట్టింది.

సికింద్రాబాద్ లో ఒకే అడ్రస్‌తో 28 సంస్థలు
ఇటు సికింద్రాబాద్‌ నుంచి ఒకే అడ్రస్‌తో 28 సంస్థలు ఉన్నట్టు బహమాస్‌లీక్స్‌ వల్ల తెలుస్తోంది.. సాయిరాం టవర్స్‌, అలెగ్జాండర్‌ రోడ్‌, సికింద్రాబాద్‌ అడ్రస్‌తో ఈ కంపెనీలున్నాయి. క్రిస్టల్‌ ప్రాపర్టీస్‌ ఎల్‌ఎల్‌సీ, రోజ్‌మాంట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, బెస్ట్‌ హారిజన్‌ ఇన్‌కార్పొరేట్‌లో నిమ్మగడ్డ ప్రసాద్ డైరెక్టర్‌గా ఉన్నారు.

నల్ల కుబేరులపై చర్యలకు కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరింలంటున్న ప్రజలు
మొన్న వికీలీక్స్‌, నిన్న పనామా పేపర్స్‌, నేడు బహమా లీక్స్‌ ఏ జాబితా అయినా సరే మన భారతీయులకు చోటు లభించడం బట్టి చూస్తుంటే.. మన దేశంలో నుంచి దొంగచాటుగా ఎంత సొమ్ము బయటకు వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా నల్లకుబేరుల పనిపట్టడానికి కేంద్రప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. 

1839 మందికి ఇళ్లు కట్టించాం - సీఎం బాబు..

విశాఖపట్టణం : పరవాడ రాజధానిలో జెఎన్ఎన్ యుఆర్ఎం గృహ సముదాయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 1839 మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరిగిందని, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గృహ సముదాయంలో 38 బ్లాక్ లున్నాయని, ఈ సముదాయంలో తాగునీటితో సహా ఇతర వసతులు కల్పించినట్లు తెలిపారు. త్వరలో మిగిలిన వసతులు కల్పిస్తామని హామీనిచ్చారు.

16:53 - September 23, 2016

అనంతపురం : ఎస్ఏ రావతార్‌ మసాలా ఫ్యాక్టరీ నుండి అక్రమంగా తొలగించిన 183 కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురంలో సీఐటీయూ చేపట్టిన నిరాహారదీక్ష మూడో రోజుకు చేరింది. నిరాహారదీక్షకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి హరనాథ్‌రెడ్డితో పాటు వామపక్ష నేతలు, వైసీపీ నేతలు మద్దతు తెలిపారు. టీడీపీ అండతో ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులను అణిచివేస్తోందని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే ఫ్యాక్టరీ సమస్యను అమరావతి వరకు తీసుకెళ్తామని.. అవసరమైతే రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తామని నేతలు హెచ్చరించారు.

16:51 - September 23, 2016

విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 130 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. 133 మండలాల్లో అధిక వర్షపాతం, 364 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని అన్నారు. ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసి, రక్షణ చర్యలు చేపడుతోందని చెప్పారు. చంద్రబాబుపై జగన్‌ చేసిన విమర్శలపై మంత్రి స్పందించారు. వైసీపీ అధినేత జగన్‌కి ఏనైతిక అర్హత ఉందని చంద్రబాబుని విమర్శిస్తున్నారని మంత్రి దేవినేని అన్నారు. ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని అడిగే దమ్ములేకనే తమపై బురద జల్లుతున్నాడని ఆయన చెప్పారు. వారానికి ఒకరోజు కోర్టుకు వెల్లే జగన్‌ విద్యార్థులకు సందేశమివ్వడం హాస్యాస్పదమని అన్నారు.

హైదరాబాద్ కు బయలుదేరిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ కు బయలుదేరారు. కేంద్ర మంత్రి ఉమా భారతి అధ్యక్షతనలో జరిగిన కృష్ణా..గోదావరి జల వివాద సమావేశంలో ఆయన పాల్గొన్న సంగతి తెలిసిందే. 

16:48 - September 23, 2016

హైదరాబాద్ : నగరంలో గుంత కనిపిస్తే గుంతకు వెయ్యి రూపాయలిస్తాని గతంతో మంత్రికేటీఆర్ సవాల్ చేసారని..మరి ఇప్పుడు ఆ మంత్రిగా ఏం చేస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కూకట్‌పల్లి నిజాంపేట బండారి లేఅవుట్‌వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి లేక.. తాగేందుకు నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. కాలనీవాసులను కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పరామర్శించారు.గత నాలుగు రోజులుగా కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.  

16:42 - September 23, 2016

ముంబై : అనుమానాస్పద వ్యక్తులు ఆయుధాల‌తో సంచ‌రిస్తున్నార‌న్న నేప‌థ్యంలో హైఅలెర్ట్ ప్రక‌టించిన నేవీ అధికారులు.. అనుమానిత ఉగ్రవాది స్కెచ్‌ను విడుద‌ల చేశారు. ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉరాన్‌లో ఐదారుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో తిరుగుతూ కన్పించినట్లు స్కూలు విద్యార్థులు తెలిపడంతో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. వ‌రుస‌గా రెండో రోజు కూడా ముంబై మొత్తం విస్తృత గాలింపు చ‌ర్యలు చేప‌డుతున్నారు. ముందు జాగ్రత్త చ‌ర్యగా నేష‌న‌ల్ సెక్యూరిటీ గార్డ్స్‌ను కూడా రంగంలోకి దింపారు. ఏటీఎస్‌, నేవీ, పోలీసు అధికారుల‌తో క‌లిసి ఎన్ఎస్‌జీ అనుమానిత వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఉరాన్‌ ప్రాంతంలోనే పోర్టు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంట‌ర్ ఉండ‌టంతో అక్కడ భద్రతను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు.

16:40 - September 23, 2016

జార్ఖండ్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదోడికి వైద్యం మాట దేవుడెరుగు...కనీసం ఓ సాటి మనిషని కూడా గుర్తించడం లేదు. తాజాగా జార్ఖండ్‌లోనే అతిపెద్ద ప్రభుత్వాసుపత్రి రాంచి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్స్ సైన్సెస్-రిమ్స్‌లో ఓ రోగికి నేలపై అన్నం వడ్డించిన తీరు మానవతావాదులను కలచివేసింది. చేతికి కట్టుతో ఉన్న రోగి పాల్మతి దేవికి ప్లేట్లు లేవన్న సాకుతో ఆసుపత్రి సిబ్బంది నేలపైనే భోజనం వడ్డించి అమానవీయంగా ప్రవర్తించారు. ఆమె నేలపైనే తినడం కన్పించింది. దిగ్భ్రాంతి కలిగించే ఈ ఫొటోను దైనిక్ భాస్కర్ పత్రిక ప్రచురించింది. పాల్మతి దేవి ఆర్థోపెడిక్‌ వార్డులో చికిత్స పొందుతోంది. 3 వందల కోట్ల వార్షిక బడ్జెట్‌ కలిగిన రిమ్స్‌లో రోగులకు తినడానికి ప్లేట్లు కూడా లేకపోవడం శోచనీయం. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

16:37 - September 23, 2016

హైదరాబాద్‌ : గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో నగరంలో జనజీవనం అస్థవ్యస్తంగా మారింది. పలు ప్రాంతాలు జలదిగ్భంధంలోనే మునిగిపోయాయి. దీంతో వరదలపై జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మంత్రులు కేటీఆర్‌, లక్ష్మారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మొబైల్ హెల్త్‌ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాల్లో వైద్య సేవలకు డాక్టర్లను అందుబాటులో ఉంచామన్నారు. 

16:32 - September 23, 2016

వరంగల్‌ : జిల్లాలో వర్షబీభత్సం కొనసాగుతోంది. 4 రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు నాలా పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. పేదలు నివసించే గుడిసెల్లోకి నీరు చేరి..నిత్యావసరాలు తడిసిపోయ్యాయి. కనీసం పిల్లలకు కూడా భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉన్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని 56 కాలనీలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. అధికారులు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు తప్ప తమ గోడు ఎవరూ పట్టించుకోవటంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. డీకే నగర్‌లో మరింత సమాచారానికి వీడియో చూడండి..

16:20 - September 23, 2016

హైదరాబాద్ : గ్రూప్2 అభ్యర్థులకు దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. దరఖాస్తుల గడువు పొడిగించాలని అభ్యర్థులు విజ్ఞప్తులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే వున్నాయి. దీంతో నగరాలు..గ్రామాలు అనే తేడా విద్యుత్ సదుపాయాలు నలిచిపోవటం..సర్వర్స్ డౌన్ అయి టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లు ఓపెన్ కాకపోవటం...విద్యుత్ వున్న ప్రాంతాలలో ఇంటర్ నెట్ వర్క్ లు పనిచేయకపోవటం..ఇంటర్ నెట్ లేని గ్రామాలలో అభ్యర్థులు సమీపంలో వున్న టౌన్ కు వెళ్ళి దరఖాస్తులు డౌన్ లోడ్ చేసుకునే పరిస్థితులు వున్నాయి. భారీ వర్షాలకు రవాణా వ్యవస్థ స్థంభించిపోవటం..దీంతో దరఖాస్తులు డౌన్ లోడ్ చేసుకునే పరిస్థితులు లేకపోవటంతో పరీక్ష వ్రాయాల్సిన గ్రూప్ 2 అభ్యర్థులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. దీంతో దరఖాస్తుల గడువును పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈరోజు రాత్రి 12గంటలకు గడువు ముగియనుంది. దీంతో ఎంతోకాలంగా పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల గడువు పొడిగించే ప్రసక్తే లేదని టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. కాగా గురువారం నాటికి 6లక్షల 75వేల దరఖాస్తులు రాగా ఇంకా 50వేల దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

16:17 - September 23, 2016

కన్నవారి డబ్బును లాక్కొని వీధిన పడేసిన పోలీస్..పుత్రరత్న అరాచకంపై ఆమరణ దీక్షకు దిగిన వృద్ధ దంపతులు...

ముగ్గురు కొడుకులు ఉండడంతో కొండంత బలం అని అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. వారిని పెంచి పెద్ద చేసేందుకు ఆ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రయోజకులను చేసి చివరకు ఉన్న ఆస్తిని పంచి ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ఇద్దరు కొడుకులు తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చారు. పెద్ద కొడుకు మాత్రం తన వాటా ఇవ్వకుండా ఉన్న డబ్బును కాజేశాడు. ఈ పుత్రరత్నం ఎవరో కాదు. ఓ కానిస్టేబుల్. ఈ కొడుకు వేధిస్తున్నాడంటూ ఆ వృద్ధ తల్లిదండ్రులు ఆమరణ దీక్షకు దిగారు. ఇదంతా ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ వృద్ధ దంపతులకు న్యాయం జరుగుతుందా ? లేదా ? అనేది చూడాలి. ఈ విషాద ఘటన చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

గ్రూప్ 2 దరఖాస్తుల అభ్యర్థుల ఆందోళన...

హైదరాబాద్ : గ్రూప్ 2 దరఖాస్తులకు నేటితో గడువు ముగియనుంది. సర్వర్ లు పనిచేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. నిన్నటితో 6 లక్షల 75వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. గడువు పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు. 

నయీం..మంచిరెడ్డి అనుచరులు బెదిరించారు - బాధితులు..

హైదరాబాద్ :నయీం నేరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నయీం, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనుచరులు బెదిరించి 300 ఎకరాల భూమిని లాక్కొన్నారని సిట్ కు ఇబ్రహీంపట్నం మండలం రాందాస్ పల్లి గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు. 

15:31 - September 23, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ ను కూల్చివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ విషయంగా పరిశీలించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం సాయంత్రంలోగా భవనాన్ని ఖాళీ చేసి మరో ప్రాంతానికి తరలించాలని పోలీసులకు మంత్రి తెలిపారు. 6నెలల్లో నూతన భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.శిథిల భవనాలను కూల్చివేయటనాకి సహకరించాలని మంత్రి తలసాని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. నిజాంకాలంలో నిజాం ప్రభువులు కట్టిన భవనం కావటంతో ఇప్పటికే ఈ భవనం పెచ్చులూడిపోయి శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవలి కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయే ప్రమాదం పొంచివుండటంతో పీఎస్ భవనాన్ని కూల్చివేయటానికి జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. కాగా నగరంలో వందలాది భవనాలు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎప్పుడు కూలిపోతాయే అన్నట్లుగా భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పాత భవనాలకు కూల్చివేయాలని ఇప్పటికే పలువురు భవన యజమానులకు జీహెచ్ఎంసీ అధికారలు నోటీసులు కూడా జారీ చేశారు. రాంగోపాల్ పేట పీఎస్ ను కూల్చివేసి నగరవాసులకు ఒక సందేశాన్ని పంపేందుకు జీహెచ్ఎంసీ పీఎస్ ను కూల్చివేతకు రంగం సిద్ధం చేసినట్లుగా సమాచారం.

15:15 - September 23, 2016

ఆభరణాలంటే ఇష్టపడని అతివలుండరు. అది సింపుల్ డిజైన్ ఉన్నదే కావొచ్చు.. భారీ డిజైన్ ఉన్నదే కావొచ్చు. అకేషన్ కి తగ్గట్టుగా తమకి నచ్చిన నగలను కొనుక్కోవడం చాలా మంది ఇష్టంగా చేసే పని. అలాంటి వెరైటీ డిజైనర్ జ్యువెలరీ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు. 

15:12 - September 23, 2016

ఎప్పుడూ తమని తాము రక్షించుకునేందుకు భయాపడాల్సిన స్థితిగతులే. ఇలాంటి పరిస్థితులు మారాలంటే వ్యవస్థలో రావాల్సిన మార్పులు చాలా ఉన్నాయి. అవి పూర్తిగా మన చేతుల్లో లేవు. అందుకే వ్యక్తిగతంగానైనా మనని మనం రక్షించుకునేందుకు ఆత్మరక్షణా మార్గాలు నేర్చుకోవడం ఎంతో కొంత అవసరం. అలాంటి టెక్నిక్స్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి నిర్భయ. 

15:10 - September 23, 2016

గత కొంత కాలంగా ముస్లిం మహిళల హక్కులకు భంగం కలిగిస్తున్న తలాక్ అంశాన్ని కేంద్రం కూడా వ్యతిరేకించేలా ఉంది. ఇదే విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.

నెలసరి సమయంలో మహిళలు ఉపయోగించుకునేందుకు వీలుగా అత్యంత సురక్షితమైన సెల్యులోజ్ ఆధారిత నానో ఫైబర్స్ తో కూడిన శానిటరీ నాప్ కిన్స్ ను ఐఐటీ హైదరాబాద్ బృందం ఒకటి రూపొందించింది.

సుప్రీంకోర్టు వేసిన చురకలకు కార్పోరేట్ కంపెనీలు స్పందించాయి. కొన్ని ప్రకటనల విషయంలో బాధ్యతగా ఉండాలని చేసిన సూచనను అంగీకరించాయి.

జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌ కప్‌లో భారత కుర్రకారు పతకాల పంట పండిస్తూ దూసుకెళ్తోంది. కొత్త ఆశలు చిగురించేలా ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది.

భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ రితు రాణి ఆటకు వీడ్కోలు చెప్పేసింది.

అవాంఛిత గర్భస్రావానికి మహిళలు ఏ కారణమూ చూపక్కరలేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మహిళ తన ఇష్ట ప్రకారం జీవించే హక్కును గుర్తించాలని ధర్మాసనం పేర్కొంది.

పనిచేసే చోట మహిళలకు భద్రమైన రాష్ట్రం, దేశవ్యాప్తంగా రెండో ర్యాంకు. ఆరోస్థానంలో ఏపి. సిక్కిం టాప్, అట్టడుగున ఢిల్లీ, సీఎస్ఐఎస్ నివేదిక.

రాంగోపాల్ పేట పీఎస్ కు జీహెచ్ఎంసీ నోటీసులు..

హైదరాబాద్ : రాంగోపాల్ పేట పీఎస్ కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కూలడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పీఎస్ ను ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొంది. కాసేపట్లో మంత్రి తలసాని పీఎస్ కు రానున్నారు. 

జంటనగరాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటు..

హైదరాబాద్ : జిల్లాలోని 90..సికింద్రాబాద్ డివిజన్ లో 29..హైదరాబాద్ డివిజన్ లో 61 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

అడ్వకేట్ జనరల్ తో మంత్రి కేటీఆర్ భేటీ..

హైదరాబాద్ : అడ్వకేట్ జనరల్ తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీలో నాలాల ఆక్రమణల తొలగింపులో వచ్చే న్యాయపరమైన చిక్కులు ఎలా అధిగమించాలనే దానిపై చర్చ జరిగింది. 

14:54 - September 23, 2016

గుంటూరు : జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉప్పొంగిన వరదనీరు జిల్లావ్యాప్తంగా ఏడుగురిని బలిగొంది. చిలుకలూరిపేట మడంలం గంగన్నపాలెంలోని కుప్పగంజి వాగులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గ్లలంతయ్యారు. ఈఘటనలో గంగన్నపాలెంకి చెందిన చేవూరి ఏడుకొండలు, అతడి భార్య సుబ్బాయమ్మ, కుమార్తె వనజ మృతిచెందారు. మరోవైపు సత్తెనపల్లి మండలం గోరంట్ల వద్ద ఎద్దువాగులో అబ్రహం అనే వ్యకి కొట్టుకపోయి మృతిచెందాడు. సత్తెనపల్లికి చెందిన వాల్మీకినగర్ లో ఇంటి గేటు వద్ద నిలబడి ఉన్న ఎద్దులదొడ్డి వెంకటగణేష్ ఆదిత్య, పిడుగురాళ్ల మండలం బ్రహ్మణపల్లికి చెందిన గోసి సింగరయ్య, నకరికల్లులో బాలింత చింతకాయల జమ్మక్క లు మృత్యవాతపడ్డారు. వీరితో మరో ముగ్గురు గల్లంతయ్యారు.

విజయనగరంలో స్థంభించిన జనజీవనం..
జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో జనజీవనానికి ఇబ్బందికరంగా మారింది. భారీ వర్షాలతో జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. మురికి కాలువలు పొంగిపొర్లడంతో వర్షపు నీటితో పాటు చెత్తచెదారంతో పట్టణమంతా బురదమయమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలకు చెరువులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. 

14:49 - September 23, 2016

వరంగల్‌ : హన్మకొండలో కురుస్తున్నభారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై ప్రవహిస్తున్న వరదధాటికి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. హన్మకొండలోని ఎస్‌బీహెచ్ కాలనీ చెరువును తలపిస్తోంది. ఇళ్లలోకి చేరుతున్న వరదనీటితో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకూ వరంగల్ నగరంలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వరంగల్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి తగిని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అన్ని ప్రాంతాల పరిస్థితులపై సమీక్షించి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

తుర్క చెరువుకు గండిపడే అవకాశం ?

హైదరాబాద్ : నిజాంపేటలో తుర్కచెరువుకు భారీగా వరద నీరు చేరింది. బండారి లే అవుట్ లో మొదటి అంతస్తు వరకు ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తుర్క చెరువకు గండి పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ప్రత్తిపాడు ఎమ్మెల్యే తనయుడిపై కేసు నమోదు..

తూర్పుగోదావరి : జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కొడుకు రాజబాబుపై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని యువతిని వంచించినట్లు రాజబాబుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనపై అత్యాచారం చేశాడని గిరిజన యువతి ఫిర్యాదు చేసింది. దీనితో స్థానికంగా ఎమ్మెల్యే కొడుకు వ్యవహారం చర్చనీయాంశమైంది. కాకినాడ సర్పవరం పోలీసులు అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కింద కేసులు నమోదు చేశారు. 

వైద్య అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి లక్ష్మారెడ్డి..

హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో ఇంజినీరింగ్, వైద్య అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోని పాత వైద్య భవనాలను పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులకు లక్ష్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పాత భవనాలలో చికిత్సలు నిలిపిలవేయాలని సూచించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఓపీ కౌంటర్లు, వైద్యుల పనివేళలను పెంచాలని సూచించారు. 

14:37 - September 23, 2016

తూర్పుగోదావరి : జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కుమారుడిపై అత్యాచారం కేసు నమోదయ్యింది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కుమారు రాజబాబు ఓ గిరిజన యువతిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి గత కొంతకాలంలగా అత్యాచారం చేసినట్లుగా గిరిజన యువతి చేసిన ఫిర్యాదు మేరకు కాకినాడ పీఎస్ లో కేసు నమోదయ్యింది. రాజబాబుపై అత్యాచారం, ఎస్పీ, ఎస్టీ కేసులు నమోదు చేసినట్లుగా కాకినాడ పరిధిలోని సర్పవరం పోలీసులు పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మహిళా సంఘం ఐద్వా నేతలు గిరిజన యువతికి అండగా నిలబడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా బాధితులరాలిని కాకినాడ ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేసు నమోదు విషయంలో ఎమ్మెల్యే సుబ్బారావు తరపు నుండి ఎటువంటి స్పందనా రాలేదు. వైసీపీ నుండి గెలిచి ఇటీవల టీడీపీలోకి ఎమ్మెల్యే మారిన విషయం తెలిసిందే.

జీహెచ్ఎంసీ అధికారులతో కేటీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు నాయినీ, లక్ష్మారెడ్డి, తలసాని, అధికారులు హాజరయ్యారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు తొలగిస్తే వచ్చే న్యాయపరమైన సమస్యలపై చర్చించారు. బెంగళూరు తరహా టౌన్ ప్లానింగ్ నిబంధనల అమలుపై చర్చించారు. రోడ్ల పరిస్థితిపై జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. 

చెప్పిందే రాసుకోవాలి - బాబు..

విశాఖపట్టణం : దివీస్ కంపెనీ, హెటిరో డ్రగ్స్ కాలుష్యంపై ప్రశ్నించిన వారిపై సీఎం చంద్రబాబు నాయుడు విరుచకపడ్డారు. సందర్భానుసారమే ప్రశ్నించాలని, తాము చెప్పిందే రాసుకోవాలని..ప్రశ్నించకండని సూచించారు. తీర ప్రాంతంలో పరిశ్రమలు రావాలని, కాలుష్యం అరికట్టేలా చర్యలు తీసుకుంటామని బాబు తెలిపారు. 

రోడ్లు మరమ్మత్తులు చేయాలన్న మంత్రి తుమ్మల..

హైదరాబాద్ : వర్షాలకు రోడ్లు..బ్రిడ్జీలు దెబ్బతింటే వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

 

కీసరలో భారీ వర్షాలు..

రంగారెడ్డి : కీసర మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాంపల్లి, సూర్యనారాయణనగర్ చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

13:54 - September 23, 2016
13:42 - September 23, 2016

హైదరాబాద్ : నగరంలో కురుస్తోన్న భారీవర్షాలపై ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మూడు రోజులు ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించినట్లు ఆయన చెప్పారు. అయితే ఈరోజు పరిస్ధితి మాత్రం అదుపులోనే ఉందని కేటీఆర్ అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో చర్చిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. మరో మూడురోజులు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో నగరవాసులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వదంతులను నమ్మొద్దని కేటీఆర్ సూచించారు. సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు, వివిధ శాఖల సిబ్బంది ఉన్నారని.. ఈరోజు పరిస్ధితి అదుపులో ఉందన్నారు.
నాలాలను ఆక్రమించిన వారిపై కఠినచర్యలు : మంత్రి కేటీఆర్ 
హైదరాబాద్ నగరంలో చాలా నాలాలు అతిక్రమణలకు గురయ్యాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నాలాలను ఆక్రమించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే చర్యలు తీసుకునే సమయంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్న నేపథ్యంలో వాటిపై ఎలా మందుకు వెళ్లాలనే దానిపై  న్యాయశాఖ, పోలీస్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. నాలాల ఆక్రమణదారులపై తీసుకునే చర్యల విషయంలో ప్రజల, మీడియా సహకరించాలని కోరారు. 

 

13:33 - September 23, 2016
13:31 - September 23, 2016

విశాఖ : 20వ అంతర్జాతీయ సీ ఫుడ్‌ షో విశాఖపట్నంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు,  కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మాలా సీతారామన్‌, ఎంపీ కంభంపాటి హరిబాబు , పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు.

 

13:25 - September 23, 2016

మెదక్ : జిల్లాలో విషాదం నెలకొంది. కొడును రక్షించబోయి తండ్రి మృతి చెందాడు. జిల్లాలో కరుస్తున్న వర్షాలకు తుల్చారం మండలం కొంగోడులో వరద ఉధృతికి ఓ కారు నీటిలో కొట్టుకుపోయింది. అయితే కారులో ఉన్న కొడును తండ్రి రక్షించబోయి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కారులో ఉన్న కొడుకును కాపాడారు. 

 

భండారి లే అవుట్ లో టి.కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్ : నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి జలదిగ్భందమైన భండారి లే అవుట్ లో టి.కాంగ్రెస్ నేతలు పర్యటించారు. జానారెడ్డి, షబ్బీర్ ఆలీ, పొంగులేటి ఇతర నేతలు పర్యటించి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

13:16 - September 23, 2016

హైదరాబాద్‌ : నగరంలో అందరూ చూస్తుండగానే ప్రమాదవశాత్తు ఓ యువకుడు పెద్ద గుంతలో పడిపోయాడు. నాచారంలో వరదనీటిలో చిక్కుకున్న ఓ ఆటోను తోసేందుకు ప్రయత్నించిన యువకుడు హఠాత్తుగా నీటి గుంతలో పడిపోవడంతో.. వెంటనే పక్కనున్న వాళ్లు ఆ యువకుడిని రక్షించారు. గుంతలోపల పడిపోయిన వ్యక్తిని బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. 

 

వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు - వెంకయ్య...

విశాఖపట్టణం : హోదాపై విమర్శలకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వివరణనిచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, మాట్లాడాను కాబట్టి ఏపీకి ఈ మేలైనా జరిగిందని, హోదాపై గొంతు చించుకుంటున్న నేతలు తలుపులు మూసి విభజన చేసినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు పరిపాలనాధ్యక్షుడు కాబట్టే పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించడం జరిగిందని, నిధులు కేంద్రమే భరిస్తుందన్నారు. 

13:12 - September 23, 2016

మెదక్ : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి జిన్నారంలో కుంటలు, చెరువులు, వాగుల పొంగిపోర్లుతున్నాయి. దీంతో రహాదారులపై కి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలచిపోతున్నాయి. ఆర్సీపురం జాతీయ రహాదారిపై వరద నీరు భారీగా ప్రవహించడంతో వాహనాలు భారీగా రహాదారిపైనే నిలిచిపోయాయి. 
ఇంటిగోడ కూలి తల్లికూతుళ్లు మృతి 
మెదక్ జిల్లాను భారీ వర్షాలు అతాలకుతలం చేస్తున్నాయి. రాత్రి కురిసిన బారీ వర్షానికి మెదక్ పట్టణంలోని ఓ ఇంటిగోడ కూలి తల్లికూతుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. తెల్లవారు జామును గోల్కొండ  వీధిలో ఈ ఘనట చోటుచేసుకుంది. ఈ ఘటనలో తులసి అనే ఎనిమిదేళ్ల కూతురుతో సహా తల్లి కళావతి మృతిచెందగా వారి బాబు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. 

 

ఉత్తర కోస్తాంధ్రపై తీవ్ర అల్పపీడనం..

విశాఖపట్టణం : ఉత్తర కోస్తాంధ్రపై తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో మరో 24 గంటల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 

13:00 - September 23, 2016

ఢిల్లీ : సుప్రీంకోర్టులో ఓటునోటుకు కేసు విచారణ జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబుపై విచారణకు హైకోర్టు ఇచ్చిన స్టేపై మంగళగిరి వైసీపీ ఎమ్మెళ్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు సుప్రీంకోర్టు విచారణను చేపట్టింది. చంద్రబాబుపై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. 
ఎమ్మెళ్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. 
'పేదవారికి చట్టాలు వర్తిస్తాయా... అధికారంలో ఉన్నవారికి చట్టం వర్తించదా.... ఓటునోటు కేసులో సెబాస్టియన్, జెరూసలెం మత్తయ్య, రేవంత్ రెడ్డిపై విచారణ జరుగుతుంది. కానీ చంద్రబాబుపై జరగడం లేదు. చంద్రబాబుపై ఇన్వెస్టిగేషన్ జరగాలి. చంద్రబాబు స్టే కు వెళ్లడం సరికాదు. చంద్రబాబు తాను నిప్పునని చెప్పుకుంటాడు... అలాంటప్పుడు ఆయన విచారణను ఎదుర్కొవాలని' అన్నారు. 

 

12:59 - September 23, 2016

వరంగల్ : జిల్లాలో కురుస్తున్న వర్షాలతో జన జీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరంగల్‌, హన్మకొండలను వానలు అతలాకుతలం చేశాయి. వరంగల్, హన్మకొండ ప్రాంతాలకు సంబంధించి 46 కాలనీలను ముంపు ఇబ్బందులకు గురి చేస్తోంది. వరంగల్‌ ఎన్టీఆర్‌ నగర్‌ నీట మునిగింది. నీరు చేరడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనై ఇళ్లపైకి పరుగులు తీశారు. 

 

12:57 - September 23, 2016

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న కుండపోత వర్షాలు. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరంలోని పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే  ఉన్నాయి. మోకాళ్లలోతు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజాంపేట్‌ సమీపంలోని కాలనీల్లో నాలుగురోజుల నుంచి తిండి, నిద్రలేక కాలనీవాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అల్వాల్ లోని భూదేవి నగర్ లో పరిస్థితి దయనీయంగా మారింది. వర్షానికి ఇంట్లోని సామాన్లు మొత్తం కొట్టుకుపోయాయని వాపోయారు. బియ్యం, నూనే, బట్టలు, పిల్లల పుస్తకాలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు ఆకలి కొనిసస్తున్నారని..తమను ఆదుకోవాలని వేడుకున్నారు. 
 

 

రఫెల్ ఒప్పందంపై సంతకాలు..

ఢిల్లీ : 36 అత్యాధునిక రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై సంతకాలు చేశారు. 7.87 బిలియన్ యూరోల (రూ. 59 వేల కోట్లు) విలువైన ఈ ఒప్పందంపై శుక్రవారం ఢిల్లీలో ఫ్రాన్స్ రక్షణ మంత్రి జీన్ లీ డ్రియాన్...భారత రక్షణ మంత్రి పారికర్ లు ఒప్పందంపై సంతకాలు చేశారు.  

65 లక్షల టన్నుల ధాన్యం సేకరణ - మంత్రి పరిటాల సునీత..

విజయవాడ : 2015-16 సంవత్సరంలో పౌర సరఫరాల సంస్థ ద్వారా 65 లక్షల టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని మంత్రి పరిటాల పేర్కొన్నారు. డీఎం, డీఎస్ వోలు, రైస్ మిల్లుల ప్రతినిధులతో మంత్రి పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. 2016-17లో ఖరీఫ్..రబీలో 85 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఖరీఫ్ లో 1500 ధాన్యం కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేషన్ బియ్యం అమ్మితే మిల్లర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

మేయర్ రాజీనామా చేయాలని వైసీపీ ధర్నా..

విజయవాడ : మేయర్ రాజీనామా చేయాలని కౌన్సిల్ హాల్ ఎదుట వైసీపీ ధర్నా నిర్వహించింది. ధర్నాకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

కొండపాటూరులో నీట మునిగిన పంటలు..

గుంటూరు : కాకునూరు (మం) కొండపాటూరులో పంటలు నీట మునిగాయి. నల్లమడవాగుకు నాలుగు చోట్ల గండి పడింది. దీనితో ఐదు గ్రామాల్లో పంటలు మునిగాయి. బాపట్ల (మం) జిల్లాలమూడి దగ్గర నల్లమడవాగుకు గండిపడింది. 

12:32 - September 23, 2016

వర్షాలపై సీఎం కేసీఆర్ ఆరా..

ఢిల్లీ : నగరంలో కురుస్తున్న వర్షాలపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని, వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడడం బాధాకరమన్నారు. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాపితంగా అపార నష్టం జరిగిందని పేర్కొన్నారు. 

భారతదేశంలో ఉన్న పాక్ నటులపై ఎమ్ఎన్ఎస్ ఫైర్..

ఢిల్లీ : భారతదేశంలో ఉన్న పాక్ నటులకు ఎమ్ఎన్ఎస్ ఛత్రపత్ సేన అల్టిమేటం జారీ చేసింది. 48గంటల్లోగా భారతదేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఎమ్ఎన్ఎస్ సంస్థ నేత ఒకరు ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 

నాంపల్లి కోర్టులో జగన్..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ నేడు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, అయోధ్యరామిరెడ్డిలు కూడా హాజరయ్యారు. 

12:12 - September 23, 2016

నల్లగొండ : జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. దీంతో విద్యాసంస్థలకు జిల్లా కలెక్టరు సెలవు ప్రకటించారు. భారీగా కురుస్తోన్న వర్షాలకు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. తిప్పర్తి వద్ద రోడ్డుపై నాలుగు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భువనగిరి డివిజన్‌లో చిన్నేరు, పెద్దేరు వాగుల ఉధృతిగా ప్రవహిస్తున్నాయి. మోత్కూరు మండలం బొడ్డుగూడెంలో భారీ వర్షానికి ఓ ఇల్లు కూలిపోయి ఓ వృద్ధురాలు మృతి చెందింది. మోత్కూరు చెరువుకట్ట తెగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని 39వ వార్డు పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోయింది. వరద ఉధృతికి తుర్కపిల్లలోని చిన్న లక్ష్మాపూర్-పొట్టిమర్రు రోడ్డు కొట్టుకుపోయి పొట్టిమర్రు గ్రామం జలదిగ్బంధంలోకి ఉండిపోయింది. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో 4 గేట్లు ఎత్తారు. ప్రస్తుతం నీటిమట్టం 49.90 మీటర్లు ఉంది, దీంతో 1.05 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గుండాల మండంల వస్తకొండూరులో చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు.
 నేడు విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.  

 

శ్రీశైలం..సాగర్ జలాశయాలు నిండాలి - దేవినేని..

విజయవాడ : వ‌ర్షాల ధాటికి పెద్ద ఎత్తున వ‌ర‌ద వ‌స్తోందని, నాగార్జున సాగ‌ర్, శ్రీ‌శైలం జ‌లాశ‌యాలు నిండాల‌ని తాము ఆశిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌రరావు పేర్కొన్నారు. రెండు వేల టీఎంసీల‌కు పైగా గోదావ‌రి నుంచి వ‌ర‌ద నీరు వ‌చ్చి స‌ముద్రంలోకి క‌లుస్తోందని చెప్పారు. 

న్యూయార్క్ ఎయిర్ పోర్టులో అలర్ట్..

అమెరికా : న్యూయార్క్ నగరంలోని మన్ హాటన్ ప్రాంతంలో లగార్డియా ఎయిర్ పోర్టులో ఓ వాహ‌నం అల‌జ‌డి రేపింది. వాహ‌నం ఎవరికి చెందింది ? ఎందుకు ఆపారనే దానిపై వివరాలు తెలియడం లేదు. దీనితో ఎయిర్‌పోర్టు వద్ద అలర్ట్ ప్రకటించారు. గత ఆదివారం ఓ పేలుడు సంభవించడంతో 27 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. 

సుప్రీంలో ఓటుకు నోటు కేసు విచారణ..

ఢిల్లీ : సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశించింది. చంద్రబాబుపై విచారణకు హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

వర్షం తగ్గుముఖం పట్టింది - కేటీఆర్..

హైదరాబాద్ : వర్షం ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చాలా చోట్ల పరిస్థితి అదుపులోనే ఉందని, అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దుష్ప్రచారాలను నమ్మవద్దని, నగరంలోని 80 శాతం చెరువులు, కుంటలు నిండాయన్నారు. వరద నివారణ చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. 

11:31 - September 23, 2016
10:58 - September 23, 2016

వర్షాకాలం సీజన్ లో ప్రజలను అనేక రోగాలు వణికిస్తుంటాయి. జ్వరాల బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. డెంగీ..మలేరియా..తదితర వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. ప్రస్తుతం రోగుల్లో 'ప్లేట్ లెట్స్' తగ్గిపోతుండడం ఆందోళనకరంగా మారుతోంది. ప్లేట్ లెట్స్ తగ్గిపోతుండడంతో వారు మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ ప్లేట్ లెట్స్ పై అవగాహన అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

అసలు ప్లేట్ లెట్స్ ఎందుకు తగ్గుతాయి ?
30 వేలకు తగ్గినప్పుడు మాత్రమే ప్లేట్‌ లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. శరీరంపై దద్దుర్లు రావడం, మల, మూత్రాల గుండా రక్తం పోవడం వంటి లక్షణాలతో డెంగ్యూగా గుర్తించాలి. హెచ్ ఐవీ..డెంగీ..హెపటైటీస్ సి, సైటో మోగలో వైరస్ సంక్రమించినప్పుడు. శరీరంపై ఎర్రని మచ్చలు, లాలాజలంలో రక్తం కనిపించడం, ముక్కు నుంచి రక్తం కారడం, మూత్రం ఎరుపు రంగులో రావడం, విపరీతమైన తలనొప్పి, కడుపునొప్పి, విరోచనం నలుపుగా ఉండటం, శరీరం నిస్సత్తువగా మారడం వంటివి జరుగుతాయి.

ప్లేట్ లెట్స్ పెరగాలంటే..
బొప్పాయి ఆకు, గోధుమ నారు నుండి తీసే రసం గ్లాసు తాగాలి. బీట్ రూట్, కలబంద రసం తీసుకోవాలి. నీళ్లు సరిపడా తీసుకోవాలి.
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాచీ చల్లార్చిన గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. 5 నుంచి 6 లీటర్ల వరకు నీటిని తాగాలి. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

10:51 - September 23, 2016

విజయవాడ : తెలుగురాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కుండపోత వర్షాల వల్ల ఇప్పటివరకు 9మంది మృతి చెందారు. దీంతో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రకాశం, కర్నూలు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. గుంటూరు జిల్లాలో  నిన్నటి నుంచి కురుస్తున్న కుంభవృష్టి వానలకు జిల్లా మొత్తం తడిసి ముద్దయింది. జిల్లాలో ఎన్నడూ లేనంతగా కుండపోత వానలు కురుస్తుండడంతో జిల్లాలోని అత్యధిక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదధాటికి రోడ్లు ఎక్కడికక్కడ కోతకు గురవుతున్నాయి. మరో 24 గంటలు ఏపీలో అతి భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 
గుంటూరు జిల్లాలో మళ్లీ కుండపోత వర్షం 
గుంటూరు జిల్లా వ్యాప్తంగా మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. దాచేపల్లి ,గురజాల, పిడుగురాళ్లలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో  జాతీయ రహదారులు సైతం కోతకు గురయ్యాయి. దీంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గుంటూరు సికింద్రాబాద్‌ మధ్య రైళ్ల రాకపోకలను  దక్షిణమధ్య రైల్వే నిలిపివేసింది. 

 

10:32 - September 23, 2016

హైదరాబాద్ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభవాంతో తెలుగురాష్ట్రాల్లో కుండపోతగా వానలు పడనున్నాయి. మరో రెండు రోజులు బారీ నుంచి అతిభారీ వర్షాలు పడతయని  వాతావరణ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఇవాళ తక్కువసమయంలోనే హెవీరెయిన్‌ పడే అవకాశం ఉందంటున్నారు. గంటల వ్యవధిలోనే 7నుంచి 11 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉందని వాతారణశాఖ  అంచనావేస్తోంది. వాతావరణశాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అలర్టైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో సహాయకచర్యలకోసం ఆర్మీతోపాటు ఎన్ డీఆర్ఎఫ్ దళాల సహాయం తీసుకోనున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచిస్తున్నారు. 

 

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద..

విజయవాడ : ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. 70 గేట్లను ఎత్తి 1.25 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. 

10:13 - September 23, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యిందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందన్నారు. వర్షాలకు ఐదుగురు మృతి చెందారని ప్రత్తిపాటి తెలిపారు. ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని..  లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

 

నల్గొండ జిల్లా అతలాకుతలం..

నల్గొండ : జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. మోత్కురు మండలం బొడ్డుగూడెంలో వర్షానికి ఇల్లు కూలడంతో వృద్ధురాలు మృతి చెందింది. మోత్కురులో చెరువు కట్ట తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 39వ వార్డు జలదిగ్భందంలో చిక్కుకుంది. తిప్పర్తి వద్ద రోడ్డుపై నాలుగు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. భువనగిరి డివిజన్ లో చిన్నేరు, పెద్దేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తుతోంది. నాలుగు గేట్లు ఎత్తి 1.05 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. గుండాల మండలం వస్తకొండూరులో చేపలు పట్టేందుకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు.

10:09 - September 23, 2016

విజయవాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరద ధాటికి ప్రాజెక్టుల్లో నీటిమట్టం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం 12 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్‌ 75 గేట్లు ఎత్తివేసి,  95 వేల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ దిగువ లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:06 - September 23, 2016

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరద ధాటికి ప్రాజెక్టుల్లో నీటిమట్టం పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం 12 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్‌ 75 గేట్లు ఎత్తివేసి,  95 వేల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ దిగువ లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు.  

 

వరంగల్ లో హెవీ రెయిన్స్..

వరంగల్ : జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలు కాలనీలు నీట మునిగాయి. గొండివాగుకు వరదనీరు పోటెత్తింది. లోతట్టువాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. హన్మకొండ హంటర్ రోడ్డుపై వరదనీరు చేరింది. 

హుస్సేన్ సాగర్ వద్ద హై అలర్ట్..

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ వద్ద అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వరద ఉధృతి పెరగడంతో హై అలర్ట్ ప్రకటించారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 513.90 మీటర్లుగా ఉంది. ఇన్ ఫ్లో 5వేల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 4500 క్యూసెక్కులుగా ఉంది. 

10:00 - September 23, 2016

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కుండపోత వర్షాల వల్ల ఇప్పటివరకు 9మంది మృతి చెందారు. దీంతో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రకాశం, కర్నూలు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. గుంటూరు జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న కుంభవృష్టి వానలకు జిల్లా మొత్తం తడిసి ముద్దయింది. జిల్లాలో ఎన్నడూ లేనంతగా కుండపోత వానలు కురుస్తుండడంతో జిల్లాలోని అత్యధిక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదధాటికి రోడ్లు ఎక్కడికక్కడ కోతకు గురవుతున్నాయి. మరో 24 గంటలు ఏపీలో అతి భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దింపింది. ఏపీ సీఎం చంద్రబాబు వర్షాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో
గుంటూరు జిల్లా వ్యాప్తంగా మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. దాచేపల్లి ,గురజాల, పిడుగురాళ్లలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో  జాతీయ రహదారులు సైతం కోతకు గురయ్యాయి. దీంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గుంటూరు -సికింద్రాబాద్‌ మధ్య రైళ్ల రాకపోకలను  దక్షిణమధ్య రైల్వే నిలిపివేసింది. 

 

జయకు అస్వస్థత..

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వ్యక్తిగత వైద్యులు గత అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

 

రాజోరీలో రిక్రూట్ మెంట్ క్యాంప్..

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్రంలోని రాజోరీ జిల్లాలో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ మరియు ఎస్ఎస్ బి రిక్రూట్ మెంట్ క్యాంప్ జరుపుతోంది. ఇందులో స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొంటోంది. దేశానికి సేవ చేసేందుకు అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని స్థానిక యువత పేర్కొంటోంది. 

09:55 - September 23, 2016

హైదరాబాద్ : నగరంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో రాష్ట్రప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యింది. మల్కాజ్ గిరి లో 8.2 సెం.మీటర్లు, నారాయణ గుడ 7.9 , అంబర్ పేట 7.6, మారేడుపల్లి 7.6, శేరిలింగంపల్లి 7.3, మెండా మార్కెట్ 7 సెంటి మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. షామీర్ పేట 11.9, ఆలియాబాద్ 9.8, మోయిన్ పేట్ 8.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

 

09:53 - September 23, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇప్పటికీ నగరంలో భారీ వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. దీంతో నగరం మొత్తం జలదిగ్బంధనంలో చిక్కుకుంది. మరోవైపు తెలంగాణలోని జిల్లాల్లో కురుస్తోన్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రధాన రహదారులపైనా రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నల్లగొండ జిల్లాలో కుండపోత వానలతో మూసీనది పరవళ్లు తొక్కుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతుండడంతో ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. బీబీనగర్- పోచంపల్లి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలో వాగులో పడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోను భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. 

 

09:44 - September 23, 2016

90టీస్ లో 20కోట్లు, 2000లో 30కోట్లు, 2010వరకు 50కోట్లు ఇప్పుడు 100కోట్లు. ఈ లేక్కేంటి అనుకుంటున్నారా. తెలుగు పరిశ్రమ స్టార్ హీరోల బాక్సఫీసు టార్గెట్ లెక్కలివి. ప్రస్తుతం మన స్టార్ హీరోల టార్గెట్ 100కోట్లు. మొన్నటి వరకు 50కోట్లు గా ఉన్న తెలుగు సినిమా టార్గెట్ 100కోట్లు చేరింది. మరి 100కోట్లు కలెక్షన్లతో తెలుగు పరిశ్రమ మార్కెట్ ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ సినిమాలపై ఓ లుక్కెద్దామా.
పెరిగిన తెలుగు సినిమా మార్కెట్ పరిధి 
గత పదేళ్లలో తెలుగు సినిమా మార్కెట్ పరిధి బాగా పెరిగింది. ప్రపంచ సినిమా ప్రభావితంతో మన దర్శకులు, హీరోలు కూడా గిరి గీసి సినిమాలు తీయకుండా యూనివర్శల్ స్టోరీస్ వైపు  ఫోకస్ చేస్తున్నారు. దీంతో బాక్సఫీసు కలెక్షన్లు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి.
కలెక్షన్ల బౌండరీస్ ని బద్దలు చేసిన రాజమౌళి 
50కోట్లకు పైన 100కోట్లకు మధ్యలో కొట్టుమిట్టడుతున్న తెలుగు బాక్సఫీస్ కలెక్షన్ల బౌండరీస్ ని బాహుబలితో రాజమౌళి మరోసారి బద్దలు చేశాడు. బహుబలి సినిమాతో ఈ దర్శకుడు తెలుగు సినిమా కలెక్షన్లకు పరిధులు లేవని చాటి చెప్పాడు. సంథింగ్ స్పెషల్ అనేలా సినిమా చేస్తే తెలుగు సినిమా ఎన్ని వందల కోట్లైనా సాధించగలదని చూపించాడు.
ప్రపంచస్థాయి సినిమా స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నం
తెలుగు పరిశ్రమ మొత్తానికి ప్రపంచస్థాయి సినిమా స్థాయికి సమానంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడే మన దర్శకులు కానీ హీరోలు పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాలి. ఇంకా ఫార్మూలా కథలను పట్టుకుని వేలాడకుండా సరికొత్త ఆలోచనలకు పదును పెట్టి ప్రపంచస్థాయి సినిమా వైపు ఫోకస్ చేయాలి. రాజమౌళి మాదిరి ఇంకా చాలా మంది దర్శకులు కథల విషయంలో సరికొత్త ఆలోచనలు చేస్తే తెలుగు సినిమాలు 1000కోట్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. 

 

09:36 - September 23, 2016

ఫైనల్ గా సమంత ఒపెన్ అయిపోయింది. నాగచైతన్యతో లవ్ మ్యాటర్ పై క్లారిటి ఇచ్చేసింది. అంతేకాదు పెళ్లి తరువాత కూడా సినిమాలు మానేసే ప్రసక్తే లేదని తేగేసి చెప్పేసింది. అంతేకాదు బాలీవుడ్ ట్రెండ్ ని సౌత్ లో తనతో మొదలుపెడతానని చెప్పుతోంది. ఇంతకీ చైతూ తో లవ్ విషయంపై సమంత ఏం చెప్పిందో సౌత్ లో ఈ చెన్నైచిన్నది స్టార్ చేయనున్న ఆ బాలీవుడ్ ట్రెండ్ ఏంటో వాచ్ దీస్ స్టోరీ.
నాగచైతన్య, సమంత లవ్ వ్యవహారం 
నాగచైతన్య, సమంత లవ్ వ్యవహారం కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. షాపింగ్ మాల్స్,సినిమా థియేటర్స్ అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఈ ప్రేమజంట ఎక్కడపడితే అక్కడ షికార్లు చేస్తోంది. అయితే వీరి ప్రేమయాణంపై ఇప్పటి వరకు ఇద్దరు ఓపెన్  కాలేదు. కానీ లేటేస్ట్ సమంత చైతూతో లవ్ మ్యాటర్ కి సంబంధించిన వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.
అవును నాగచైతన్యతో లవ్ లో ఉన్నాను : సమంత
అవును నాగచైతన్యతో లవ్ లో ఉన్నాను. అంతేకాదు చైతూతో ఆరు నెలలుగా డేటింగ్ చేస్తున్నాను అంటూ సమంత ఒక్కసారి మీడియాతో పాటు కామన్ ఆడియన్స్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. అంతేకాదు తమిద్దరికి పేరేంట్స్ బ్లేసింగ్స్ ఉన్నాయని, అయితే పెద్దలు చెప్పేవరకు తమ పెళ్లి విషయం బయటకు చెప్పడం ఇష్టం లేక ఇంతకాలం చెప్పలేదని ఈ చెన్నై బ్యూటీ క్లారిటి ఇచ్చింది. ఇంతేకాకుండా ఇంకా చాలా విషయాలపై సమంత ఒపెన్ అయింది.
నా లైఫ్ ని చైతూ సరైన గాడిలో పెట్టాడు : సమంత 
సమంత, నాగచైతన్య గురించి చెప్పుతూ, అడ్డదిడ్డంగా ఉన్న తన లైఫ్ ని చైతూ సరైన గాడిలో పెట్టాడని చెప్పుతోంది. అంతేకాదు చైతూ లేకపోతే తన లైఫ్ లేదని చెప్పేసింది. అయితే మరో ఎడాది వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని కూడా క్లారిటి ఇచ్చేసింది. అంతేనా తనకు సినిమాలు తప్పా వేరే తెలియదని, పెళ్లి తరువాత సినిమాలు కంటిన్యూ చేస్తానని తేగేసి చెప్పింది. బాలీవుడ్ కల్చర్ మాదిరి పెళ్లైనా కూడా నటించేలా టాలీవుడ్ లో మార్పులు తెస్తానని ఈ బ్యూటీ సమాధానం ఇస్తోంది. సమంత వ్యవహరం చూస్తుంటే అక్కినేని ఫ్యామిలీకి తలనొప్పులు తెచ్చేలా కనిపిస్తోందని కొందరంటున్నారు.
                  

ఎపి పలు జిల్లాలో వర్ష బీభత్సం

హైదరాబాద్ : ఎపిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షాలకు 9 మంది మృతి చెందారు. ప్రకాశం, కర్నూలు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. 

ఎపిలో భారీ వర్షాలకు 9 మంది మృతి

హైదరాబాద్ : ఎపిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షాలకు 9 మంది మృతి చెందారు. 

09:16 - September 23, 2016

మరాఠీలో సైరత్ మూవీ క్రియేట్ చేసిన సన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాను సౌత్ లోని అన్ని లాగ్వేంజెస్ లో రిమేక్ చేయడానికి రాక్ లైన్ వెంకటేష్ సిద్ధమైయ్యారు. మరి సైరత్ తెలుగు రిమేక్ లో నటిస్తున్న హీరో ఎవరో ఈ మూవీ డైరెక్టర్ చేస్తున్న డైరెక్టర్ ఎవరో మీరు చూడండి...
బాలీవుడ్ ఇండస్ట్రీని నివ్వెరపోయేలా చేసిన సైరత్ 
సైరత్ ఈ మరాఠీ చిత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం నివ్వెరపోయేలా చేసింది. ఈ ఎడాది సమ్మర్ లో రిలీజైన ఈ చిత్రం కేవలం 4కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా 100కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ చిత్రం ముందుకు వరకు మరాఠీ సినిమా పరిశ్రమని అందరూ లైట్ గా తీసుకునేవారు . కానీ సైరత్ సృష్టించిన బాక్సఫీసు ప్రభంజనంతో యావత్తు దేశ సిని ప్రియుడు మరాఠీ ఇండస్ట్రీ వైపు ఒక్కసారి ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు.
సౌత్ లో రిమేక్ చేయడానికి సన్నాహాలు 
ఇంతటి సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని సౌత్ లో రిమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. డజన్ మందికి పైగా తెలుగు నిర్మాతలు ఈ మూవీ రైట్స్ కోసం ఎగబడ్డరంటే ఈ చిత్రం కథను ఏ రేంజ్ లో దర్శకుడు డీల్ చేశాడో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా సౌత్ రైట్స్ ని రాక్ లైన్ వెంకటేష్ సొంతం చేసుకొన్నాడు. సౌత్ లోని అన్నిలాగ్వేంజెస్ లో ఈ మూవీని రిమేక్ చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
సైరత్ తెలుగు రిమేక్ లో బ్రహ్మానందం తనయుడు 
సైరత్ తెలుగు రిమేక్ లో బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నటిస్తున్నట్లు వినికిడి. ఈ హీరో ఇప్పటి వరకు చేసిన ఒక్క మూవీ కూడా ఆడియన్స్ మెప్పుపొందలేదు. ఈ క్రమంలో సైరత్ తో అయిన హీరోగా హిట్టు కొట్టాలని గౌతమ్ ఆశపడుతున్నాడట. ఇక శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో ఫాంలోకి వచ్చిన దర్శకుడు పరశురామ్ ఈ తెలుగు రిమేక్ కి దర్శకత్వం వహించనున్నాడు. ఈ టీనేజ్ లవ్ స్టోరీ లో గౌతమ్ సెట్ అవుతాడా లేదా అనేది సినిప్రియుల మదిలో బిలియన్ మార్క్ క్వశ్చన్ మారింది.

 

08:57 - September 23, 2016

ఎపికి ప్రత్యేకహోదా విషయంలో సీఎం చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్నారని వక్తలు విమర్శించారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత మదన్ మోహన్ రెడ్డి, సీపీఎం నేత గఫూర్, టీడీపీ నేత శంకర్ నారాయణ పాల్గొని, మాట్లాడారు. ఎపిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని.. వరదల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. తగిన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఎపిలో భారీగా కురుస్తున్న వర్షాలు

హైదరాబాద్ : ఎపిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల చెరువులు తెగిపోయాయి.

 

08:19 - September 23, 2016

హైదరాబాద్ నగరంలో ప్రణాళిక లేకుండా నిర్మాణాలు చేపట్టడం, చెరువులు, కుంటలు కబ్జా చేసి కట్టడాలు నిర్మించడంతోనే  వర్షాలు పడితే వరదలు సంభవిస్తున్నాయిని సీపీఎం నేత శ్రీనివాస్ తెలిపారు. జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. డ్రైనేజీ అస్తవ్యస్థంగా ఉందని.. పునరుద్ధరించాలన్నారు. 'వాన కురిసినప్పుడల్లా హైదరాబాద్ రోడ్లు నరకం చూపిస్తున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు చెరువుల్లా మారిపోతున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? ఇది ప్రకృతి వైపరీత్యామా? ప్రణాళికా లోపమా? నిర్వహణా వైఫల్యం? అసలు రోడ్లు, డ్రైనేజీలు నిర్వహించడానికి అవసరమైన ఆర్థిక దన్ను జీహెచ్ఎంసికి వున్నదా? ఇదే అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

07:55 - September 23, 2016

విజయవాడ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో  ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉభయగోదారి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. రోడ్లపై మోకాలి లోతున వరద నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లో రాకపోకులు స్తంభించాయి. భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్నవర్షాలతో ఏపీలోని పలు జిల్లాలు తడిచి ముద్దయ్యాయి. వాగులు, వంకలు, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పుడుతున్నారు. 
కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు 
కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. మచిలీపట్నం, గుడివాడ, పామర్రు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  ఆకాశానికి చిల్లు పడినట్టు ఉభయగోదారి జిల్లాల్లో కుండపోత  వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. గోదావరి పాయలకు వరద ఉద్ధృతి పెరగడంతో లంక గ్రామాలు జలమయయ్యాయి. అమలాపురంతోపాటు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోవరం, అల్లవరం, కొత్తపేట, రాజోలు మండలాల్లో  జనజీవనం స్తంభించింది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  
తూర్పుగోదావరి జిల్లాలో జలకళ  
తూర్పుగోదావరి జిల్లాలోని మెట్ట, ఎజన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి.కోరుకొండ మండలం గాడాల గ్రామం దగ్గర చెరువుకు భారీ గండిపడటంతో రాజమండ్రి-భద్రాచలం రహదారి  నీట  మునిగింది.  రాజమండ్రి-కోరుకొండ మార్గంలో రోడ్డుపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
ప.గో, కర్నూలు జిల్లా భారీ వర్షం 
పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, భీమవరం, నరసాపురం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లా మహానంది ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. వర్షానికి నల్లమల అడువుల నుంచి వచ్చిన వరద ఉద్ధృతికి పాలేరు వాగు ఉప్పొంగింది. దీంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల, ఒంగోలు జాతి పశుపరిశోధనా కేంద్రం, వైఎస్‌ఆర్‌ ఉద్యాన పరిశోధనా కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పశు పరిశోధనా కేంద్రంలోని ఆవులు, గేదెలు, లేగ దూడలు కొట్టుకుపోకుండా స్థానికులు చర్యలు తీసుకున్నారు. ఇళ్లలోకి నీరు చేరింది. రోడ్లపై నీరు చేరడంతో మహానంది పుణ్యక్షేత్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు-గుంతకల్లు రైలు మార్గంలో కొన్ని చోట్ల ట్రాక్‌పైకి నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒంగోలు-నంద్యాల  రహదారి మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి.  మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. 

 

నేడు రెవెన్యూశాఖ సిబ్బందితో మంత్రి పరిటాల సమావేశం

గుంటూరు : రెవెన్యూశాఖ సిబ్బందితో నేడు మంత్రి పరిటాల సునీత సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు

ఖమ్మం : జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కిన్నెరసాని, మల్లన్న, జిల్లేడు వాగులు పొంగిపొర్లుతున్నాయి. 40 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ముణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, సింగరేణి బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 

 

పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే

హైదరాబాద్ : నగరంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్ష బీభత్సానికి జనజీవనం అస్తవ్యస్తం అయింది. పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. 120 ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. 120 కాలనీలు నీటి మునిగాయి. ఇందులో 20 కాలనీల పరిస్థితి సీరియస్ గా ఉంది. హుస్సేన్ సాగర్ లో నీటిమట్టం 513 అడుగులు దాటింది. మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. 

హైదరాబాద్ లో హైఅలర్ట్

హైదరాబాద్ : నగరంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్ష బీభత్సానికి జనజీవనం అస్తవ్యస్తం అయింది. పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. టీసర్కార్ జీహెచ్ ఎంసీ పరిధిలో స్కూళ్లకు రెండు రోజులపాటు ప్రకటించారు. ఆర్మీ, ఎన్ డిఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 

కోస్తాంధ్ర తీరానికి అనుకుని తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతం

హైదరాబాద్ : కోస్తాంధ్ర తీరానికి అనుకుని తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతం అయింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి నుంచి భారీ వర్షాలు పడే అవకావం ఉంది. తెలంగాణలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40..45 కిమీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. 
 

 

07:24 - September 23, 2016

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. వందల ఎకరాల పంటలు నీటమునిగాయి. నల్లగొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉద్ధృతి..లోతట్టు ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. 
నిజామాబాద్ జిల్లా అతలాకుతలం 
భారీ వర్షాలు నిజామాబాద్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వరద ఉద్ధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 10 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 9700 క్యూసెక్కులుగా ఉంది. అటు సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 521.2 మీటర్లు, పూర్తిస్థాయి నీటిమట్టం 523.6 మీటర్లు. ప్రస్తుత నీటి నిలువ 18.9 టీఎంసీలు. పూర్థిస్థాయి నీటిమట్టం 30 టీఎంసీలు. ఇన్‌ఫ్లో ఫ్లో 4,187 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 117 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. 
నల్లగొండ జిల్లాలో దంచికొడుతున్న వానలు 
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కేతేపల్లి మండలం కొత్తపేట అలుగు వద్ద మూసీ కుడి కాలువకు గండిపడింది. అదేవిధంగా మండలంలోని భీమారం వద్ద మూసీ ఉధృతి కొనసాగుతుంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉద్ధృతి..లోతట్టు ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు సుమారు 3 లక్షల క్యూ సెక్యుల వరదనీరు వచ్చి చేరడంతో.. 30 టీఎంసీలను నిల్వ చేశారు. 15 గేట్లు 4 మీటర్ల మేర ఎత్తి దిగువకు వదులుతున్నారు. ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో.. అధికారులు ప్రాజెక్టు వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  
ఖమ్మం జిల్లాలో ఉప్పొంగుతున్న వాగులు, వంకలు 
ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. అశ్వారావుపేటలో చెరువులు నిండి అలుగులు పోస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నరసింహసాగర్‌, చెన్నయ్యకట్టు చెరువు, పాలవాగు చెరువు, అనంతారం వూరచెరువు, మొద్దులమడ, గెంటేడివాగు నిండుకుండలా మారి వరదనీరు అలుగుల ద్వారా దిగువకు పారుతోంది. పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. గోపన్నగూడెం-కంట్లం, నెమిలిపేట-వాగోడ్డుగూడెం, గుమ్మడవల్లి-రంగాపురం మధ్య వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు స్తంభించాయి.
మహబూబ్‌ నగర్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు
భారీ వర్షాలకు మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని వడ్డేమాన్‌ సమీపంలోని ఎర్ర కాలువకు గండిపడింది. దీంతో చిన్నచింతకుంట చెరువుకు నీటి ప్రవాహం తగ్గింది. గండ్లు పడ్డ ప్రదేశంలో రైతులు మరమత్తులు చేపట్టారు. ముచ్చింతల చెరువు నిండి అలుగు పారుతుంది. గత కొన్నేళ్లుగా నీరు లేక వెలవెలబోయిన చెరువు నీటితో కళకళలాడుతుంది. కల్వకుర్తి నియోజకవర్గంలోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. దుందుబి నది వాగు పొంగిపొర్లుతోంది. 
మెదక్ జిల్లాలో వానలు 
మెదక్ జిల్లాలో చేగుంట, రాయంపేట, శకంరపేట మండలాల్లో వానలు పడ్డాయి. వరంగల్ జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. భారీ వర్షానికి పాలకుర్తి మండలం చిగురుటాకులా వణికిపోతోంది. మండలంలోని మాధాపురం గరిక చెరువుకు గండి పడటంతో వరిపొలాలు నీటమునిగాయి. 
వరంగల్‌ జిల్లాలో వర్షాలు 
వరంగల్‌, హన్మకొండలను వానలు అతలాకుతలం చేశాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాలాలన్నీ పొంగిపొర్లాయి. హంటర్‌ రోడ్డుపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. 

 

07:18 - September 23, 2016

హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటిమునిగాయి. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్ష బీభత్సానికి జనజీవనం అస్తవ్యస్తం అయింది. పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. 120 ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. 120 కాలనీలు నీటి మునిగాయి. ఇందులో 20 కాలనీల పరిస్థితి సీరియస్ గా ఉంది. నిజాంపేట, షాపూర్, కూకట్ పల్లిలో అత్యధికస్థాయిలో వర్షం పడింది. హుస్సేన్ సాగర్ లో నీటిమట్టం 513 అడుగులు దాటింది. మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. టీసర్కార్ జీహెచ్ ఎంసీ పరిధిలో స్కూళ్లకు రెండు రోజులపాటు ప్రకటించారు. ఆర్మీ, ఎన్ డిఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఆర్మీ రంగంలోకి దిగనుంది. హైదరాబాద్ లో 25 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది తమ ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లడం లేదు. బాధితులు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటలు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంగలు పొంగిపొర్లుతున్నాయి.  పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవన స్తంభించింది. 

 

06:54 - September 23, 2016

హైదరాబాద్ : భారీ వర్షాలతో రాజధాని హైదరాబాద్‌ నగరం చిగురుటాకులా వణికిపోతోంది. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా పడుతున్న వానలతో.. నగరంలో జనజీవనం అతలాకుతలం అయింది. నాలాలు పొంగిపొర్లడంతో.. రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి. పల్లపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
హైదరాబాద్‌ ను అతలాకుతలం 
మూడురోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. పలుకాలనీలు జలమయం అయ్యాయి. నాలులు పొంగిపొర్లి.. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరుచేరడంతో 
జనలం నానా అవస్థలు పడుతున్నారు. 
రోడ్లు అస్తవ్యస్తం
ఈడ్చికొడుతున్న వానలతో రాష్ట్ర రాజధాని రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. గతుకులు తేలి.. రోడ్లపై ప్రయాణం అంటేనే నరకాన్ని తలపిస్తోంది. పైన వర్షం ..కింద వరద.. అంగుళం కదలని ట్రాఫిక్‌.. ఇవీ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిస్థితి. హదర్‌నగర్‌, శివంరోడ్డు ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయాయి.  అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌  అధికారులను ఆదేశించారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌తోపాటు.. మంత్రి కేటీఆర్‌కూడా నగరం పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.  
రాకపోకలకు తీవ్ర అంతరాయం 
గురువారం మధ్యాహ్నం నుంచి మొదలైన భారీ వర్షం.. రాత్రంతా పడుతూనే ఉంది.. నాలాలు పొంగి.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలు చోట్ల కరెంటు పోయి రాత్రంతా ప్రజలు  చీకట్లో గడిపారు. భారీ వర్షాల కారణంగా  జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.  
హుస్సేన్‌సాగర్‌లోకి  భారీగా వరదనీరు 
నగరంలో చెరువులన్నీ నిండిపోవడంతో.. పల్లపు ప్రాంతాల్లోభారీగా నీరు నిలిచిపోయింది. హుస్సేన్‌సాగర్‌లోకి  భారీగా వరదనీరు చేరుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అటు డీజీపీ అనురాగ్‌శర్మ.. పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయి.. నగరంలో వర్షబీభత్సంపై సమీక్షించారు. 

 

నేడు ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్ నరసింహన్

హైదరాబాద్ : నేడు గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్లనున్నారు. పలు అంశాలను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

జీహెచ్ ఎంసీ పరిధిలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు

హైదరాబాద్ : నగరంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటిమునిగాయి. నగరంలో భారీ వర్షాల కారణంగా జీహెచ్ ఎంసీ పరిధిలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 

 

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్ష బీభత్సం

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటిమునిగాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలడింది. కోస్తాంధ్ర తీరానికి అనుకుని తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతం అయింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి నుంచి భారీ వర్షాలు పడే అవకావం ఉంది. తెలంగాణలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40..45 కిమీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. 

 

హైదరాబాద్ లో కొనసాగుతున్న వర్ష బీభత్సం

హైదరాబాద్ : నగరంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటిమునిగాయి. 

 

Don't Miss