Activities calendar

24 September 2016

22:07 - September 24, 2016

ఉత్తరకొరియా : అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని ఉత్తరకొరియా మరోసారి స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మంత్రి రి యాంగ్ హో ఈ విషయం తెలిపారు. తమకు అమెరికా నుంచి అణ్వాయుధాల ముప్పు ఉన్నందున- ఆత్మరక్షణ కోసం తాము తీసుకున్న నిర్ణయం సరైనేదేనని సమర్థించుకున్నారు. అణ్వాయుధాలు కలిగి ఉండాలన్నది తమ దేశ విధానమన్నారు. దక్షిణ కొరియా, అమెరికా కలిసి తరచు పెద్ద ఎత్తున అణ్వాయుధ విన్యాసాలు చేస్తున్నాయని, ఉత్తరకొరియా నాయకత్వాన్ని అస్థిరత పాలుచేయాలని, రాజధాని ప్యాంగ్‌యాంగ్‌ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాయని రి యాంగ్‌ హో ఆరోపించారు. జాతీయ భద్రత, కొరియన్ ద్వీపకల్పంలో శాంతి దృష్ట్యా తమకు ఈ ఆయుధాలు ఉండాలని ఉత్తర కొరియా పేర్కొంది.

22:03 - September 24, 2016

ఢిల్లీ : భారత్‌- ఫ్రాన్స్‌ల మధ్య 36 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంపై కాంగ్రెస్ మోది సర్కార్‌ను టార్గెట్‌ చేసింది. ఈ ఒప్పందంలో మోది మేక్‌ ఇన్ ఇండియా ఏమైందని ప్రశ్నించింది. వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు 126 రాఫెల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్ లను కొనాలని అప్పట్లో యుపిఏ ప్రభుత్వం నిర్ణయించిందని మాజీ రక్షణ మంత్రి, కాంగ్రెస్‌ నేత ఎకె అంటోని అన్నారు. మోది ప్రభుత్వం కేవలం 36 రాఫెల్‌ ఫైటర్‌ జెట్స్‌ కొనడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీటితో చైనా, పాక్‌లను ఎలా ఎదుర్కొంటారని ఆయన ప్రశ్నించారు. 126 ఎయిర్‌ క్రాఫ్ట్‌లకు గాను 108 భారత్‌లోనే తయారు చేయాలని యుపిఏ ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. మోది ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో మేక్‌ ఇన్‌ ఇండియా ప్రస్తావనే లేదని ఆంటోని తెలిపారు.  

22:01 - September 24, 2016

కేరళ : యూరీ ఘటన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోది స్పందించారు. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన బిజెపి బహిరంగ సభలో పాకిస్తాన్‌పై నిప్పులు కక్కారు. ఆసియాలోని ఒక దేశం ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందని మండిపడ్డారు. భారత్‌ సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లను ఎగుమతి చేస్తే పాకిస్తాన్‌ టెర్రరిస్టులను ఎగుమతి చేస్తోందని దుయ్యబట్టారు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల కారణంగా యూరీలో 18 మంది భారత జవాన్లు అమరులైన ఘటనను భారత్‌ ఎప్పుడూ మరచిపోదన్నారు. భారత్‌లో అశాంతి సృష్టించేందుకు టెర్రరిస్టులు 18 సార్లు చొరబాటుకు యత్నించగా భద్రతాదళాలు తిప్పికొట్టాయన్నారు. 110 మంది ఉగ్రవాదులను హతమయ్యారని తెలిపారు. భారత పాకిస్తాన్‌లు పేదరికంపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాడానికి ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాలని మోది పిలుపునిచ్చారు. బిజెపి జాతీయ కౌన్సిల్‌ సమావేశాల ముగింపు సందర్భంగా మోది ప్రసంగించారు.

21:54 - September 24, 2016

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ 7లో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, ఎయిర్ చీఫ్‌ మార్షల్ అరూప్ రాహా, నౌకదళం ఉప అధిపతి వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్‌ సింగ్తో పాటు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. యురిలో సైనిక స్థావరంపై జరిగిన దాడికి బదులిచ్చే విషయంపై ప్రధాని మోదీ చర్చించినట్టు సమాచారం. రొటీన్‌ సమావేశంలో భాగంగానే ఈ సమావేశం జరిగిందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.

21:52 - September 24, 2016

చిత్తూరు : జిల్లాలో ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన ఐటీ అధికారులు...సుమారు 30 గంటలుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఇంటిలోకి ఐటీ అధికారులు.. ఎవరినీ అనుమతించడం లేదు. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యేను ఐటీ పేరుతో వేధిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. 

21:50 - September 24, 2016

పశ్చిమగోదావరి : ఏలూరులో దోమలపై దండయాత్ర కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది విద్యార్థులతో చేపట్టిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో విద్యార్థులు కనిపించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. దోమలపై దండయాత్ర కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు కోటి మంది విద్యార్థులకు సెలవు ప్రకటిస్తే.. సభకు రాకుండా ఇంటికి పంపడం ఏంటని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వ విఫ్‌ చింతమనేని... జరిగిన తప్పుపై చంద్రబాబుకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

21:47 - September 24, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ను అతాలకుతలం చేసిన వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. కుంభవృష్టితో సముద్రాన్ని తలపించిన గుంటూరు జిల్లాలో పరిస్థితి కుదుట పడుతోంది. అయితే అక్కడక్కడా అడపాదడపా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు, కాల్వల్లో ముంపు ప్రభావం కొనసాగుతోంది. పంట పొలాల్లో వరదనీరు నిలవడంతో రైతులకు అపారనష్టం వాటిల్లింది. ముఖమంత్రి చంద్రబాబునాయుడు వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు.

తగ్గుముఖం పట్టిన వానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన వర్షాలు క్రమంగా తగ్గుతున్నాయి. వరుణుడు శాంతించడంతో పరిస్థితి కొద్దిగా కుదుట పడుతోంది. అయితే ముంపు కారణంగా ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

సుబ్బాయమ్మ (40), వనజ (10) మృతదేహాల లభ్యం
గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం గంగన్నపాలెం సమీపంలోని అమిన్‌సాహెబ్‌ పాలెం వంతెన దగ్గర వరద ఉద్ధృతికి నలుగురు వ్యక్తులు కొట్టుకు పోయారు. వీరిలో ఒకవ్యక్తిని గ్రామస్తులు కాపాడారు. మిగిలిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నలభై ఏళ్ల మహిళ సుబ్బాయమ్మ, పదేళ్ల పాప వనజ మృత దేహాలను లభ్యమయ్యాయి. ఏడుకొండలు మృత దేహం కోసం గాలిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో ఎనిమిది చెరువులకు గండ్లు
భారీ వర్షాలతో గుండె చెరువైన గుంటూరు జిల్లాలో వాగుల వెంబండి నీట మునిగి నేలవాలిన పంటలు, ఎటు చూసినా కోతకు గురైన రోడ్లు, ఇసుకు మేటలు, దెబ్బతిన్న ఇళ్లు... ఇలా గుండెలను పిండేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. పల్నాడు, మెట్ట ప్రాంతాల్లో పత్తి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలో ఎనిమిది చెరువులకు గండ్లు పడ్డాయి. జిల్లాలోని ముంపు ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏరియనల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. ఆ తర్వాత రెడ్డిగూడెం రహదారిపై హెలికాప్టర్‌ను దింపారు. రోడ్డు మార్గాన క్రోసూరు, పెదనందిపాడు, బాపట్ల తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించారు.

వానలతో సంతోషిస్తున్న రైతన్నలు
గుంటూరు జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం పూర్తిగా క్షీణించింది. మురుగుకాల్వల్లో నీరు నిలిచిపోవడంతో దోమలకు నిలయాలుగా మారాయి. దీంతో ప్రజలు రోగాల బారినపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ నదికి వరద ఉద్ధృతి పెరిగింది. రెండేళ్ల తర్వాత గుడ్లకమ్మ నదికి జలకళ సంతరించుకోవడంతో రైతులు సంతోషిస్తున్నారు.

మచిలీపట్నం, ఘంటసాల, పెడన, కృత్తివెన్నుల్లో వరద ఉద్ధృతి
కృష్ణా జిల్లాలోని కొన్నిప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో మున్నేరు వాగుకు వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో వత్సవాయి మండలం లింగాల దగ్గర రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. ఇప్పటికే పడుతున్న వర్షాలకు తోడు వరద నీరు తోడవడంతో ముక్త్యాల ప్రాంతంలో పత్తి, మిరపతో సహా ఇతర వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. మచిలీపట్నం, ఘంటసాల, పెడన, కృత్తివెన్ను ప్రాంతాల్లోని కాల్వల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పులిచింతల జలాశయం నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు విడుదల చేయడంతో ఎగువ గ్రామాల్లో వరదనీరు పోటెత్తుతోంది.

పోలవరం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో పొంగుతున్న వాగులు
అల్పపీడనం ప్రభావంతో పశ్చిమగోదారి జిల్లాలో ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. పోలవరం, జంగారెడ్డిగూండె ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భీమవరం, నరసాపురం ప్రాంతాల్లో డ్రెయిన్లలో వరద ఉద్ధృతికి కొన్ని చోట్ల వరి పంట నీట మునిగింది. తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో అధికారులు పంట నష్టం వివరాలు సేకరించడం ప్రారంభించారు. మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు 13 సాగునీటి కాల్వలకు గండ్లు పడ్డాయి. దీంతో జగ్గంపేట, గోకవరం, రాజానగం, కోరుకొండ ప్రాంతాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. భారీ వర్షాలకు రాజమండ్రి కటారినగర్‌లో ఒక భవనం ప్రహరీగోడ కూలి, పక్కనే ఉన్న కారుపై పడింది. ప్రమాదం జగినప్పుడు ఈ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. 

21:40 - September 24, 2016

హైదరాబాద్ : హైదరాబాదును విశ్వనగరం చేస్తాం.. అక్రమ కట్టడాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం.. గత పాలకుల ఖర్మ మనం అనుభవిస్తున్నాం.. ఐదారేళ్లలో భాగ్యనగరం రూపురేఖలు మార్చేస్తాం.. ప్రజలకు ఉత్తుత్తి మాటలు చెప్పం.. చెప్పిందే చేసి చూపిస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. వర్షాలపై సమీక్ష నిర్వహించిన సీఎం.. అధికారులు అప్రమత్తంగా ఉండి.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.

వర్షాలపై కేసీఆర్ సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి నీరు రావడం చాలా సంతోషంగా ఉందని.. అన్నీ మధ్యతరహా ప్రాజెక్టులు నిండి ప్రవహిస్తున్నాయన్నారు కేసీఆర్‌.. ఎస్సారెస్పీ, సింగూరు ప్రాజెక్టులు నిండాయని.. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లకు వరద నీరు వస్తుందన్నారు. ఒక్క నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ మినహా అన్ని ప్రాజెక్టుల్లోకి నీళ్లు భారీ చేరాయన్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే మరో రెండేళ్లు కరవు ఉండే పరిస్థితి లేదన్నారు. చెరువులన్నీ నిండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. వర్షాలతో రాష్ట్రంలో స్వల్ప నష్టం మాత్రమే జరిగిందన్నారు కేసీఆర్‌.

అక్రమ కట్టడాల వల్లనే ప్రస్తుత పరిస్థితి : కేసీఆర్
ఇక నగరంలో నిర్మించిన అక్రమ కట్టడాల వల్లనే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందన్నారు ముఖ్యమంత్రి. భాగ్యనగరంలో 28 వేల అక్రమ కట్టడాలున్నాయని.. వాటిని నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తామన్నారు. అక్రమ కట్టడాల సమాచారమిచ్చిన వారికి 10 వేల రూపాయలు నజరానా ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించారు.

10 శాతం రోడ్లు మాత్రమే దెబ్బతిన్నాయ్
హైదరాబాద్‌లో ప్రస్తుత పరిస్థితి మెరుగుపడాలంటే 11 వేల కోట్ల రూపాయలు కావాలన్నారు. ప్రస్తుతం 10 శాతం రోడ్లు మాత్రమే దెబ్బతిన్నాయని.. వర్షాలు ఆగిపోయిన తర్వాత యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడతామన్నారు. రోడ్ల అభివృద్ధికి జీహెచ్‌ఎంసీకి 300 నుంచి 400 కోట్లు మంజూరు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుత పరిస్థితికి గత పాలకుల వైఖరే కారణమని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు

ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాం : కేసీఆర్
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కేసీఆర్‌. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులెవరూ సెలవులు పెట్టవద్దని సీఎం ఆదేశించారు. మరో మూడు రోజుల్లో గోదావరికి కూడా వరద ఉధృతి పెరుగుతుందని.. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం కలెక్టర్లు, అధికారులను అప్రమత్తం చేశామని.. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్‌ సూచించారు. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చి సాయం కోరుతామన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు కేసీఆర్‌.

21:36 - September 24, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వర్ష బీభత్సం సృష్టించిన విలయ తాండవానికి ఇంకా ప్రజానీకం తేరుకోలేదు. అనేక చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో కనీసం నిద్రాహారాలు కూడా మానేసి ఎదురు చూపులు చూస్తున్న బాధితులు తమను ఆదుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నారు. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతుండటంతో రోడ్లన్నీ తెగిపోయి చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అత్యవసరమైతే తప్పా.. ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరికొద్ది రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయంటున్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగా సూచించింది.

ఆదిలాబాద్ జిల్లాను అదరగొడుతున్న వానలు
అదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. జిల్లాలోని కడెం ప్రాజెక్టు పూర్తి స్థియిలో నిండిపోవడంతో 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి ఇన్ ఫ్లో 66,900 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 73, 735 క్యూసెక్కులు ఉంది. మరోవైపు స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరదన నీరు చేరుతోంది. 3 గేట్లు ఎత్తి 27 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. నిర్మల్ లో బంగల్ పేట వీధిలో పిడుగుపాటుకు ఇల్లు కూలిపోయింది.

నల్లగొండను ముంచేసిన వానలు
వర్ష బీభత్సానికి నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు మిర్యాలగూడ, భువనగిరి, నకిరేకల్, సూర్యాపేట, హూజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూసీ నదితో పాటు జిల్లాలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండుకండలను తలపిస్తున్నాయి. నార్కట్‌పల్లి అద్దంకి రహదారిపై నల్లగొండ సమీపంలోని పానగల్, తిప్పర్తి, దామరచర్ల ప్రాంతాలలో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆత్మకూర్(ఎం) మండలంలో చింతల చెరువుకు గండి పడటంతో దుప్పెల్లి గ్రామం జలదిగ్భందంలో చిక్కుకుంది.

కరీంనగర్ లో పొంగుతున్న వాగులు
బంగాళఖాతం ఏర్పాడిన అల్ప పీడన ద్రోణి ప్రభావంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హుస్నాబాద్‌ సమీపంలోని మోయతుమ్మెద, ఈదుల వాగులు.. సిరిసిల్లలోని మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి వరద కాల్వ ద్వారా లోయర్ మానేరు జలశయంలోకి నీరు చేరుతుండటంతో ప్రస్తుతం 8 టీఎంసీలకు చేరుకుంది. మోయతుమ్మెద వాగు నుండి 25 వేల క్యూసెక్కులు, శ్రీరామ్ సాగర్ నుండి 14,600 క్యూసెక్కులు జలశయంలోకి చేరుతుండడంతో 24 టీఎంసీల సామర్థ్యం గల లోయర్ మానేరు తొందరలోనే నిండే అవకాశం కనిపిస్తోంది. లోయర్‌ మానేరు జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మానేరు హారతి కార్యక్రమం నిర్వహించారు. చాలా కాలం తర్వాత మానేరు జలకళ సంతరించుకోవడం పట్ల ఎమ్మెల్యే కమలాకర్ ఆనందం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో కుండపోత వర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో అంతంత మాత్రంగానే పంటలు సాగవటంతో.. ఈసారి రబీ సీజన్‌ పంటలకు ప్రభుత్వం విత్తనాలను అందించాలని రైతులు కోరుతున్నారు.

వరంగల్ లో కుప్పకూలిన భవనాలు
భారీ వర్షాలకు వరంగల్‌ నగరంలోని పలు కాలనీల్లో పాత భవనాలు కుప్పకూలాయి. కరీమాబాద్‌లో రెండు పాత భవనాలు నేలమట్టం కాగా, పెరుకవాడలో మరో రెండు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. రంగశాయిపేటలోని యాదవ్‌నగర్‌లో రెండిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

నిజామాబాద్ ను ముంచుతున్న వానలు
నిజామాబాద్‌ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా వరద నీరు చేరడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నవీపేట్‌ మండలంలో ఎక్కడ చూసినా నీటి కుండలనే తలపిస్తున్నాయి. బర్కత్‌పురా ఏరియా పూర్తిగా నీటమునగడంతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీరు
భారీ వర్షాలకు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరడంతో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించి నీటిమట్టాన్ని పరిశీలించారు. భారీగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పోచారం సూచించారు. రైతులను రెండో పంటకు నీరిచ్చేందుకు అధికారులతో చర్చిస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.

కామారెడ్డిలో పొంగుతున్న వాగులు
కామారెడ్డిలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాల్లో వర్షం నీరు చేరడంతో స్థానిక రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరి, టమాటా, వంకాయ పంటలు వర్షంలో మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

మెదక్ బీభత్సం సృష్టించిన వర్షాలు
మెదక్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. రాయకోడ్ మండలం రాయపల్లి వద్ద మంజీరా నది బ్రిడ్జీపై ఓ లారీ రెయిలింగ్‌పైకి దూసుకొచ్చింది. దీంతో ఇలా ప్రమాదకరస్ధితిలో లారీ రెయిలింగ్‌పై వేలాడుతోంది. లారీని బ్రిడ్జి పైనుంచి తీసేందుకు అధికారులు, పోలీసులు యత్నిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఈ లారీ హైదరాబాద్ నుంచి బీదర్‌కు పండ్ల లోడ్‌తో వెళ్తుంది. మరోవైపు వరదనీటితో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏడుపాయలు దుర్గామాత ఆలయంలో నుంచి వరదనీరు ప్రవహిస్తోంది. ఏడుపాయల వద్ద వరదనీటిలో 27 మంది బీహర్‌కు చెందిన కూలీలు చిక్కుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఆర్డీవో నగేష్‌లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

283 ఇళ్లు నేలమట్టం
మెదక్‌ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు వాగులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. పలుచోట్ల రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. సిద్దిపేట పట్టణంలోని శ్రీనగర్‌కాలనీ, బారిమాం కాలనీల్లోని ఇళ్లన్నీ నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిద్దిపేట పట్టణంలో గోడ కూలడంతో ప్రదీప్‌ అనే యువకుడు మృతి చెందాడు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో కుంభవృష్టి వర్షాలకు 283 ఇళ్లు నేలమట్టమయ్యాయి. మండలం నాగూర్‌ బీ గ్రామంలో ఓ ఇళ్లు నేలకూలడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇళ్లు కూలిపోయి నష్ట పోయిన వారికి నష్ట పరిహారం అందజేస్తామని స్థానిక డిప్యూటీ తహసీల్దార్‌ కిషన్‌ చెప్పారు.

మరింతగా వాన
మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. 

21:12 - September 24, 2016

మందుబాబుకి లిప్ కిస్ పెట్టిన శునకం..ఆడపిల్లలకు పెప్పర్ స్ప్రే పంపిణీ చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ..పట్నమోల్లని ఏడిపించినయ్..పల్లెలోల్లని నవ్విచిచ్చినయ్ ..గివేంటనుకుంటన్నారా? అదేనుల్లా తెలంగాణ రాష్ట్రంల కురిసికుప్పలు పోత్తన్న వానలు..నిండుకుండాల్లా కళకళలాడుతున్న తాటాకాలు..కాలవల్ని జూసి రైతన్న మురిసిపోతన్నడు..ఏడుకొండల పైన ఎంకయ్య కాల్లు కడుగుతానన్న ఎర్రజెండా నారాయణ..మోదీ తిరుగుడు రికార్డును తిరగరాత్తానంటన్న కవితమ్మ..నీల్ల పెట్రోలు తాగి మోరాయించిన కారు.. గిసువంటి మస్తు ముచ్చట్లు చూసి ఖుషీ అవ్వాలంటే గీ వీడియో చూడుండ్రి మల్ల..

19:53 - September 24, 2016

మోగాస్టార్ చిరంజీవి..విక్టరీ వెంకటేశ్, నాగార్జున,ఈనాటి యువ హీరోలు చరణ్, బన్నీ, ఎన్టీఆర్ ఇలా హీరోలు ఎవరైనా సరే..వాళ్లు హీరోలనిపించుకోవాలంటే వారి వెనుక మరొకరి కృషి వుంటుంది. నటుల్ని హీరోల్ని చేసే రియల్ హీరో లెవరు? ఏక్షన్ సినిమాలకు వారు లేకుంటే అసలు కథే వుండదు.. మరి ఏక్షన్ సీన్స్ పండాలన్నా..వాటిని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలన్నా..హీరోలతో విలన్ల కాళ్లు, చేతులు విరిచేయించాలన్నా..చిత్రీకరణలో ఫైట్స్ సీన్స్ యాక్సిడెంట్స్ లో గాయాలైనా వారు ఏమాత్రం పట్టించుకోరు. వారే ఫైట్ మాస్టర్స్..రీల్ కాకుండా రిరియల్ హీరోస్ . టాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ట్విన్స్ ఫైట్ మాస్టర్లు..ఇంకెవరు వారే ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ లు.వారితో టెన్ టీవీ సరదా చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా వారు చెప్పే సరదా మాటలు విందాం..రామ్ లక్ష్మణ్స్ ఇద్దరూ కవల పిల్లలు కాబట్టి వారు కూడా కవల పిల్లల్నే చేసుకోవాలనుకున్నారట. తమ మ్యారేజ్ ఆలస్యంగా కావటానికి కూడా కవలల్ని చేసుకోవాలనే కారణమన్నారు. సినమా చేసే ప్రేక్షకులు ఫైట్స్ ను ఎంజాయ్ చేస్తేనే తమ ఫైట్స్ కు న్యాయం జరుగుతుందన్నారు రామ్ లక్ష్మణ్..ప్రతీరోజు వర్క్ అనంతరం మెడిటేషన్ చేస్తామని తెలిపారు. మెడిటేషన్ తో గర్వం దగ్గరు రాకుండా వుంటుందని తాము నమ్ముతామన్నారు. రామ్ లక్ష్మణ్ తో మీరు కూడా ఫైట్ చేయాలనుకుంటే ఐమీన్ మాట్లాడాలనుకుంటే ఈ వీడియో చూడండి..

ఉగ్రదాడిని ఉపేక్షించం : మోదీ

కేరళ : ఉగ్రవాదానికి పాకిస్తాన్ స్వర్గధామంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై విరుచుకుపడ్డారు. ఆసియా అంతటా ఉగ్రవాదాన్ని ఒక దేశం దిగుమతి చేస్తోందంటూ నిప్పులు చెరిగారు. ఆసియాను అస్థిరపరచేందుకే ఆ దేశం కుట్రలు పన్నుతోందన్నారు. ఊరి సెక్టార్‌పై దాడి సహా ఇటీవల కాలంపై 17 సార్లు ఉగ్రవాదులు సైన్యంపై దాడులు జరిపిందనీ..దీన్ని దేశం ఎప్పటికీ మరచిపోదనీ..దాడులను ౠరత్ సైన్యం వీరోచితంగా తిప్పికొట్టిందని, 110 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిందన్నారు. మానవతావాదానికి ఉగ్రవాదులు శత్రువులని, ఉగ్రదాడులను ఎంతమాత్రం సహించేది లేదని మోదీ హెచ్చరించారు.

గోదావరికి వరద ముప్పుపై అప్రమత్తం: కేసీఆర్

హైదరాబాద్ : గోదావరికి భారీ వరద వచ్చే ప్రమాదముందని అధికారులను అప్రమత్తం చేశామని కేసీఆర్ తెలిపారు. అధికారులకు సెలవులు రద్దు చేశామని ప్రకటించారు. వరద నష్టాలపై కేంద్రానికి నివేదిక ఇచ్చి కేంద్రసాయాన్ని కోరుతామని కేసీఆర్ తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవల్సిందిగా అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు.

లోయలో పడ్డ బస్..7గురు మృతి..

జమ్ము కశ్మీర్ : గురేజ్‌ నుంచి బందిపొరాకు 22మంది కార్మికులు ప్రయాణిస్తున్న బార్డర్‌ రోడ్స్ ఆర్గనైజైషన్‌ వాహనం బందిపొరా సమీపంలోకి రాగానే అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లోయలో పడ్డ వాహనం డ్రైవరు ఆచూకీ తెలియకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

గత ప్రభుత్వాల వల్లనే నగరం ముంపు : కేసీఆర్

హైదరాబాద్ : నగరం ఇంత ముంపుకు గురవటానికి కారణం నాలాపై కట్టిన అక్రమ కట్టడాలేననీ..దీనికంతటికీ గత పాలకుల విధానమే కారణమని ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోపించారు. ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి వుంటే అక్రమ కట్టడాలను కూల్చివేతకు సహకరించాలని సూచించారు. నగరంలో 400ల భవనాలకు అధికారులు కూల్చివేశారని తెలిపారు. రాంగోపాల్ పేట పీఎస్ ను కూడా కూల్చివేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. వరదలో చిక్కుకున్న వారికి భోజనాలు వసతి ఏర్పాట్లు చేశామని తెలిపారు. నాలాల మీద 28వేల అక్రమ కట్టడాలున్నాయని వర్షాలపై మంత్రులు అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన తెలిపారు.

18:38 - September 24, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమీక్షానంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎప్పటిలాగా తనదైన శైలిలో విపక్షాలపై ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు ప్రతిపక్షాలుగా వున్న ఈనేతలే పాలన వల్లనే హైదరాబాద్ దుస్థితికి కారణమని ఎద్దేవా చేశారు. వర్షాలపై ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమై వుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నగరంలో సహాయక చర్యల కోసం ఆర్మీ దళాలను రంగంలోకి దింపామని తెలిపారు. ప్రతిపక్షంలో వున్న నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారనీ..గుడ్డివారిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

గత ప్రభుత్వాల ప్రభావమే నగరం ముంపు : కేసీఆర్
నగరం ఇంత ముంపుకు గురవటానికి కారణం నాలాపై కట్టిన అక్రమ కట్టడాలేననీ..దీనికంతటికీ గత పాలకుల విధానమే కారణమని ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోపించారు. ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి వుంటే అక్రమ కట్టడాలను కూల్చివేతకు సహకరించాలని సూచించారు. నగరంలో 400ల భవనాలకు అధికారులు కూల్చివేశారని తెలిపారు. రాంగోపాల్ పేట పీఎస్ ను కూడా కూల్చివేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. వరదలో చిక్కుకున్న వారికి భోజనాలు వసతి ఏర్పాట్లు చేశామని తెలిపారు. నాలాల మీద 28వేల అక్రమ కట్టడాలున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

విశ్వనగంగా మారాలంటే 5ఏళ్లు పడుతుంది : కేసీఆర్
హైదరాబాద్ ను విశ్వనగరంగా చేయటానికి అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. ఇది ఒకటి రెండు ఏళ్ళల్లో పూర్తికాదన్నారు. దీనికోసం దాదాపు మూడు నాలుగు ఏళ్లు పడుతుందన్నారు. దీనికి దాదాపు రై11వేల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. హైదరాబాద్ లో రోడ్లు కేవలం 10శాతం రోడ్లు మాత్రమే దెబ్బతిన్నాయన్నారు. రోడ్ల ససమస్యలను పరిష్కరించేందుకు 4వందల కోట్లు కేటాయిస్తామన్నారు. యుద్ధప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎంతటివారినైనా లెక్కచేయకుండా కూల్చివేస్తామన్నారు. వచ్చే ఏడాది కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనటం శుభసూచకమన్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో గోదావరికి వరద ఉదృతి వచ్చే అవకాశమున్న కారణంగా ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా వుండాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. 

17:53 - September 24, 2016

వరంగల్ : కుండపోత వర్షాలకు గ్రేటర్‌ వరంగల్‌ అతలాకుతలం అయ్యింది. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాలనీల్లోని నాలాలు, డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. ప్రభుత్వ భూములు, నాలాలను ఆక్రమించుకుని భారీ భవనాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించడంతో ముంపు సమస్య వచ్చిందని ప్రజలు ఆరోస్తున్నారు. అక్రమ నిర్మాణాలను పరిశీలించి కూల్చివేస్తామని గ్రేటర్‌ వరంగల్ మేయర్ నన్నపనేని నరేంద్ర పేర్కొన్నారు. వరంగల్‌ నగరంలో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థకు డీపీఆర్‌ సిద్ధం చేశామని ఈ సందర్బంగా మేయర్ తెలిపారు. 

17:51 - September 24, 2016

హైదరాబాద్ : వరద ముంపునకు గురైన కూకట్‌పల్లి ఆల్విన్‌ కాలనీలోని ధరణి నగర్‌ను టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు పరిశీలించారు. నీటిలో మునిగిన ఇళ్లను పరిశీలించి.. బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అందించిన సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మరింత వేగంగా సహాయ సహకారాలు అందించాలన్నారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సహాయ చర్యల్లో పాల్గొనాలని కోరారు. 

వైమానిక దాడుల్లో 25మంది మృతి..

ఢిల్లీ : రష్యా, సిరియా వైమానిక దళాలు జరిపిన దాడుల్లో సిరియాకు చెందిన 25 మంది సాధారణ పౌరులు మృతిచెందారు. ఇవాళ తూర్పు అలెప్పొలో రెబెల్స్ అధీనంలో ఉన్న ప్రాంతాలపై ఈ వైమానిక దళాలు విరుచుకు పడ్డాయి. మృతులు మార్కెట్ ప్రాంతంలో ఉండగా ఈ దాడులు జరిగాయని ఓ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. క్షతగాత్రులకు సహాయక చర్యలు అందుతున్నాయి.

ఐఏఎస్ అధికారికి హైకోర్టు ఆదేశాలు..

హైదరాబాద్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థకు చెందిన భవనంలో రెండేళ్ల నుంచి అనధికారికంగా ఉంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్‌ను నెల రోజుల్లోగా ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. సంస్థకు సంబంధించిన డీజీ క్వార్టర్‌ను 2013లో ప్రభుత్వం ఆయనకు కేటాయించింది. 2014 ఫిబ్రవరిలో ఆయన ఆ నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అక్కడే ఉన్నారు.

బాబు ఏరియల్ సర్వే..

విజయవాడ: గుంటూరు జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేశారు. గురజాల, పెదకూరపాడు, నరసరావుపేట, మాచర్లలో పర్యటించారు. రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో వర్షాలకు దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రెడ్డిగూడెం వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను సీఎం పరిశీలించనున్నారు.

యూరీ ఘటనతో బిజినెస్ షో రద్దు..

పాకిస్థాన్ : ఇటీవ‌ల పాక్ ఉగ్ర‌వాదులు యూరీలో దాడి చేసి భార‌త సైనికుల ప్రాణాలు తీసిన నేప‌థ్యంలో ఇరు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాలు మ‌రింత క్షీణిస్తున్నాయి. వ‌చ్చే నెలలో భారత్‌లో పాకిస్థాన్ ఓ వాణిజ్య ప్రదర్శన నిర్వ‌హించాల్సి ఉంది. భార‌త్‌లో 2012, 2014ల్లో 'అలీషాన్‌ పాకిస్థాన్‌' ఎగ్జిబిషన్ నిర్వ‌హించింది. అయితే మూడో ఎడిష‌న్‌గా వ‌చ్చేనెల ఢిల్లీలో ఈ ప్ర‌ద‌ర్శ‌న జ‌ర‌గాల్సి ఉండ‌గా ఇరు దేశాల మ‌ధ్య ఏర్ప‌డిన ప్రస్తుత పరిస్థితుల కార‌ణంగా త‌మ‌ ప్రదర్శనను రద్దు చేస్తున్నట్లు ట్రేడ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ పాకిస్థాన్ ఇస్లామాబాద్ లో ప్రకటించింది.

రికార్డు స్థాయిలో వర్షపాతం..

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 1989లో 35.5 సెం.మీ.ల వర్షపాతం నమోదు కాగా, తెలంగాణలో ఒకే రోజు ఒకే ప్రాంతంలో 39 సెం.మీ.ల వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమమని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలకు రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కళకళలాడుతున్నాయి.

ఖాళీ చేసాకే కూలింది!..

వరంగల్ : నయీంనగర్ బొక్కలగడ్డలో ఓ పురాతన భవనం వర్షానికి మెత్తగా నాని ఇవాళ కూలిపోయింది. భవనంలో కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వర్షాల నేపథ్యంలో యజమానులు నిన్ననే భవనాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.భవనం కూలిపోయే కొద్ది గంటల ముందే వారు ఆ భవనాన్ని ఖాళీ చేసి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. భారీ వర్షాలకు పురతాన భవనాలు మెత్తగా నాని కూలిపోతున్న నేపథ్యంలో అలాంటి భవనాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం విదితమే. 

17:04 - September 24, 2016
17:02 - September 24, 2016

హైదరాబాద్ : నగరంలోని నిజాంపేటలో నాలాపై అక్రమ కట్టడాలు కూల్చేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించకపోవడంపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లపోచమ్మ రోడ్డులో అక్రమ కట్టడాల వల్లే కాలనీ జలమయమైందని చెప్పడంతో.. ప్రొక్లెయినర్‌ తెప్పించిన రేవంత్‌ రెడ్డి అక్రమ కట్టడాల్లో కొన్నింటిని తొలగింపజేశారు. రోడ్లపై నాలుగు అడుగుల నీరు నిలిచిపోయాయి. నాలాలపై వున్న అక్రమ కట్టడాలను కూల్చేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. నల్లపోచమ్మ రోడ్డులో ప్రొక్లెయినర్‌తో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. అక్రమ కట్టడాలతో ఆక్రమణలకు గురయిన కట్టడాలను రేవంత్ రెడ్డి దగ్గర వుండి మరీ తొలగింపజేస్తున్నారు. 

16:56 - September 24, 2016

హైదరాబాద్ : గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు నవ తెలంగాణ దినపత్రిక యాజమాన్యం, సిబ్బంది ముందుకొచ్చింది. ముంపు బాధితులకు పులిహోర, వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ముషీరాబాద్‌, అల్వాల్‌, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో నవతెలంగాణ ఎడిటర్‌ వీరయ్య, సీజీఎం శ్రీనివాస్‌, సిబ్బంది ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. చుట్టు ప్రక్కల నాలాలను తమ సమీపంలో వున్న నాలాకు కనెక్ట్ చేయటంతో నీరంతా వచ్చి నాలా ఉప్పొంగి రోడ్లతో పాటు ఇళ్ళల్లోకి కూడా నీరు చేరుకుని మల్కాజ్ గిరీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరపడి నీళ్ళల్లోనే కాపురం చేస్తున్న వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి చేయూతా లేకుండా పోయిందని వారు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలతో వున్న తాము కనీసం వండుకోవటానికి అవకాశం లేకుండా ఇంట్లో బియ్యంతో సహా అన్నీ తడిపోవటంతో పలు ఇబ్బందులు పడుతున్నామని బాధితులు పేర్కొన్నారు. 

16:53 - September 24, 2016

వరంగల్ : జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్‌ భద్రకాళి మంచినీటి జలాశయానికి జలకళ సంతరించుకుంది. జలాశయంలో చేరిన నీరు మత్తడి నుంచి కిందకు జాలువారుతూ జలాశయాన్ని తలపిస్తోంది. దీంతో భద్రకాళి జలాశయాన్ని చూసేందుకు వరంగల్‌, హన్మకొండ, కాజీపేట వాసులు తరలివస్తున్నారు. ఈ ప్రాంతమంతా సందడి వాతావణం నెలకొంది.

16:51 - September 24, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి గ్రేటర్‌లోని నలుగురు మంత్రులతో పాటు...జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సివిల్ సప్లయ్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు... ఇతర విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై సమీక్షిస్తున్నారు. నష్టాలపై ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు.

16:40 - September 24, 2016

ప్రకాశం : బ్రిటీష్ కాలంలో సముద్ర తీరం వెంట సమాంతరంగా నిర్మించిన బకింగ్‌హాం కాలువకు కాలదోషం పట్టింది. 1970నుంచి కాలక్రమేణా ఈ కాలువ కనుమరుగవుతూ వస్తోంది. రాష్ట్రంలో 800 కిలోమీటర్ల మేర విస్తరించిన బకింగ్ హామ్ కెనాల్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని చేసిన ప్రకటన ఆచరణలో మాత్రం కనిపించటం లేదు. బకింగ్ హాం కెనాల్‌కు పూర్వవైభవం తీసుకువచ్చే విషయంపై కేంద్రం తీరుపై టెన్ టీవీ ప్రత్యేక కథనం.........

బకింగ్‌హాం కాలువ పునరుద్ధణకు కేంద్రం యోచన
ఏ దేశాభివృద్దికైనా రవాణా సౌలభ్యాలు కీలకం. ఈ రంగం సరళంగా ఉంటే అభివృద్దికి ఆకాశమే హద్దు. ఇందుకు అనుగుణంగా రోడ్డు, విమాన మార్గాలనే కాదు జల మార్గాలను కూడా మరింతగా వృద్ది చేసుకునేందుకు కృత నిశ్చయంతో ముందడుగు వేస్తున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా రాష్ట్ర పరిధిలోని చారిత్రక బకింగ్ హామ్ కాలువ పునరుద్దరణ చర్యలకు కేంద్రం ఏడాది క్రితం నిధులు విడుదల చేస్టున్నట్టు ఆర్భాటంగా ప్రకటించింది.

ప్రకాశం జిల్లాలో 119 కి.మీ మేర విస్తరించిన కాలువ
కేంద్రం ప్రకటన అయితే చేసింది కానీ ఇంతవరకు అమలు ఊసే మరిచింది. ప్రకాశం జిల్లాలో 119కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కాలువ..కాకినాడనుంచి కృష్ణపట్నం వరకు 800 కిలోమీటర్లు పొడవు వుంటుంది. బ్రిటీష్ కాలంలో ప్రారంభమైన ఈ కాలువ అప్పట్లో మానవ, సరకు రవాణాకు ఉపయోగపడింది. ఆ ఆనవాలును అనుసరించి కేంద్రం పోర్టులకు సమాంతరంగా, ఇన్లాండ్ వాటర్ వేను నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రధానంగా రాష్ట్రంలో అనువుగా ఉన్న గొలుసు కట్టు పోర్టుల విధానానికి ఈ ఇన్లాండ్ వాటర్ వే వెన్నుదన్నుగా మార్చాలని నిర్ణయించారు. 32 మీటర్లు వెడల్పు, 6 మీటర్లు లోతు,5:1వైశాల్యంతోపాటు గట్టు ఏర్పాటుతో నాలుగో జాతీయ జలమార్గంగా దీన్ని రూపొందిస్టున్నట్టు కేంద్రం ప్రకటించింది.ఇప్పటికే ఇందుకు సంబంధించి కేంద్ర జలవనరుల శాఖనుంచి ఓ బృందం వచ్చి కొత్తపట్నం బకింగ్ హాం కాలువను..ఇక్కడి పురాతన బ్రిడ్జిని సందర్శించింది. అయితే కేంద్రం పునరుద్దరణ ప్రకటన చేసిన అనతి కాలంలో జరిగిన హడావిడి చర్యలు నేడు కరువయ్యాయి. వేదికలెక్కి కమలనాధులు చేసిన బకింగ్ హామ్‌ ప్రాజెక్టు ఊసుకు రెక్కలు తెగిపోయాయి.

70 ఏళ్ల తర్వాత అంతరించిన జలమార్గం
ప్రస్తుతం బకింగ్ హాం కాలువ ఆక్రమణలు, పూడికలకు నెలవుగా వుంది. 1970 తర్వాత ఈ జలమార్గం అంతరించింది. ఇప్పటికీ నాటి బ్రిటీష్ సాంకేతిక పరిజ్ఙానానికి సాక్ష్యంగా ఈ కాలువ నిలిచింది. అనేక చోట్ల క్రేన్లు ఏర్పాటు చేయడంతో సముద్రానికి కేవలం కిలోమీటరు దూరంలో ఈ మార్గాన్ని అమర్చడంతో సునామీలు, వరదలు వంటివి జనజీవనాన్ని తాకకుండా రక్షణగానూ నిలిచింది. అయితే ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థలు కొలువు దీరడంతో పురాతన జలమార్గాలను మన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాష్ట్ర విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్ పాలన వంటి అంశాలతో ప్రభుత్వం ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రప్రభుత్వం కోరిక మేరకు కేంద్రం ఈ బృహత్తర పథకాన్ని పట్టాలెక్కిస్తానని హామీ ఇచ్చింది.. ఇందులో భాగంగా తొలి విడతగా మూడు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.

అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతుల్లో కీలక పాత్ర
ఈ జాతీయ జలరవాణా ద్వారా పోర్టులను కలుపుతూ అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతుల్లో కీలక భూమిక పోషించనుంది బకింగ్ హామ్‌. దీనికి తోడు బకింగ్ హామ్ కు ఇరువైపులా రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం వుండడంతో కోరమండల్ తీరమంతా ట్రాన్స్ పోర్ట్ కారిడార్ హబ్ గా రూపాంతరం చెందనుంది. ప్రధానంగా ప్రకాశం జిల్లానుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల అంచనా 20వేల కోట్ల రూపాయలు...ఇంతేకాకుండా గ్రానైట్ పరిశ్రమద్వారా లక్షల కోట్లలో అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగుతోంది. అందుకే బకింగ్ హామ్‌ పునరుద్దణ ఆవశ్యాన్ని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు గుర్తించాలి. ఈ విషయంలో చిత్తశుద్దితో వ్యవహరిస్తే నవ్యాంద్ర అభివృద్దిలో బకింగ్‌ హాం కీలకంగా మారుతుంది.

 

16:30 - September 24, 2016

మెదక్ : జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో జిల్లా ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్ధానికులు నిత్యావసరాలు తీర్చుకోలేని పరిస్దితుల్లో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోంటున్నారు. ఇళ్ళలోకి నీరు చేరటంతో పాములు కూడా ఇళ్ళల్లో రావటంతో ఇళ్ళల్లోకి రావటానికి స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. ఆరుబయటనే చిన్న పిల్లలతో వండుకుని చిన్నపిల్లతో స్థానికి నేతలుగానీ..ఎవ్వరూ రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

16:22 - September 24, 2016

హైదరాబాద్‌ : నగరంలో కురుస్తున్న వర్షాలను చూస్తుంటే ఇది హైదరాబాదా లేక ఏ చరపుంజీ నా అనే అనుమానం కలుగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నిజాంపేటలో ప్రమాదవశాత్తు ఓ వాహనదారుడు బైక్‌తో సహా మ్యాన్‌హోల్‌లో పడ్డాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంతటనే వాహనదారుడిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.

16:17 - September 24, 2016

హైదరాబాద్‌ : నిజాంపేటలోని జలమయమైన ప్రాంతాలను రేవంత్‌ రెడ్డి సందర్శించారు. నల్లపోచమ్మ రోడ్డులో నీటమునిగిన అపార్ట్ మెంట్ లను పరిశీలించిన ఆయన... స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలాపై అక్రమ కట్టడాలను కూల్చివేయాలని చెప్పడంతో జీహెచ్ఎంసీ అధికారులను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా.. వారు స్పందించలేదని తెలుస్తోంది. దీంతో అక్రమ కట్టడాలను తొలగించకపోతే ఇక్కడే కూర్చుంటానని రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రకృతి విపత్తు కన్నా ప్రభుత్వ వైఫల్యమే ఎక్కువ అని విమర్శించారు రేవంత్.

కూలీలను రక్షిస్తాం: పద్మాదేవేందర్

మెదక్: జిల్లాలోని ఏడు పాయల వద్ద చెక్ డ్యాం పనుల కోసం ఒడిశా కూలీలను తీసుకొచ్చారు. భారీ వర్షం కారణంగా కూలీలు నీటి మధ్యన చిక్కుకు పోయారు. వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏర్పాట్లను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఆర్డీవో సమీక్షిస్తున్నారు. కూలీలలను అవసరమైతే హెలికాప్టర్ ద్వారా తరలిస్తామని పద్మా దేవేందర్‌రెడ్డి తెలిపారు. కానీ వాతావరణం అనుకూలించడంలేదని తెలిపారు.

16:11 - September 24, 2016

ఆదిలాబాద్ : సేంద్రీయ ఎరువులతోనే ఓ యువకుడు సేద్యం చేస్తూ అబ్బురపరుస్తున్నాడు.. ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహారం ఇవ్వడమే లక్ష్యంగా.. సామాజిక బాధ్యతగా ముందుకు సాగుతున్నాడు. ఉద్యోగాన్ని వదిలి.. వ్యవసాయంలో ప్రతిభను కనబరుస్తున్నాడు

సేంద్రీయ సాగుకు అడుగులు ముందుకు వేస్తున్న యువసాఫ్ట్ వేర్‌
కాదేది కాలుష్యానికి అనర్హమంటూ..నిత్యం మన తినే తిండి కూడా కలుషితంగా మారింది. ఆహారం మొత్తం రసాయన పూరితంగానే ఉంది. వీటి వల్లే కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. అయినా మార్కెట్‌లో శుభ్రమైన.. నాణ్యమైన ఆహారం దొరకడమే గగనంగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు..నిర్మల్‌కు చెందిన ఓ యువ సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌ ముందుకు అడుగులు వేస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

సేంద్రీయ పద్ధతిలో రకరకాల పంటల సాగుకు శ్రీకారం
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు మంద శ్రీనివాస్.. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ వాసి అమెరికాలో సాఫ్ట్ వేర్‌ ఉద్యోగాన్ని వదిలి సేంద్రీయ సాగును ఓ వినూత్న ప్రయోగంగా ప్రారంభించాడు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకంతోనే దిగుబడి సాధ్యమవుతుందనే అపోహలని చెరిపివేశాడు. సేంద్రీయ పద్ధతులతోనూ మెరుగైన దిగుబడులు సాధించవచ్చని నిరూపించాడు. సేంద్రీయ పద్ధతిలో రకరకాల పంటల సాగుకు శ్రీకారం చుట్టాడు .

సాధారణ పెట్టుబడితో..3 ఎకరాల పొలంలో కూరగాయల పంటలు
తొలుత మామూలు పెట్టుబడితో..మూడు ఎకరాల పొలంలో కూరగాయల పంటలు పండించే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అలాగే సాగులో ఎలాంటి సమస్య ఎదురైనా రసాయనాలు లేకుండా సంప్రదాయ పద్ధతుల్లోనే నివారించే చర్యలు తీసుకుంటున్నాడు. పంటలకు సోకే వ్యాధులు..తెగుళ్లను తగ్గిస్తూ టమాటాలు, బెండకాయలు, బీరకాయలు, సొరకాయలు, పచ్చిమిర్చి, వంకాయలు, ఆకుకూరలు ఇలా అన్ని రకాల కూరగాయలు పండించి చూపుతున్నాడు.

ఆర్గానిక్సే ఆరోగ్యమంటున్న సాఫ్ట్ వేర్ యువకుడు..
సేంద్రీయ పద్ధతిలోనే సాగు చేయాలనే లక్ష్యంతో.. తొలిదశ నుంచే పేడ, గంజు, వేప కషాయం సిద్ధం చేసుకుని.. ప్రతిదశలోనూ అప్రమత్తంగా ఉంటూ వచ్చారు. విత్తనశుద్ధి చేసిన విత్తనాలను వాడుతున్నారు. విత్తనాలు నాటడానికి ముందే బెడ్‌ తయారు చేయడంలో సేంద్రీయ ఎరువు, మట్టిని సిద్ధం చేసుకున్నారు. బెడ్‌ను వేప కషాయంతో శుభ్రపరిచారు. డ్రిప్‌ ద్వారా మొక్కలకు నీరందిస్తూ అవసరమైతే ఫాగర్స్‌తో నీటి తుంపర్లు చల్లుతూ నిర్దేశించిన ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్త వహించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వేపకషాయం, గంజు, పేడతో పాటు సంప్రదాయ ఔషధాన్ని పిచికారి చేస్తూ వ్యాధులు రాకుండా నిరోధించగలిగారు. ఏదిఏమైన తక్కువ ఖర్చుతో..అందుబాటులో ఉన్నదాంతోనే నాణ్యమైన ఆహారం పొందవచ్చునని నిర్వాహకుడు మంద శ్రీనివాస్‌ అంటున్నారు.

రసాయనిక ఎరువులతో నిర్జీవమవుతున్న భూమి
రసాయనిక ఎరువులు ఎక్కువ మోతాదులో వాడితే భూమి నిర్జీవమైపోతుందని.. పంటకు మేలు చేసే మిత్ర పురుగులు, క్రిమికీటకాలు చనిపోతాయని నిర్వాహకులు మంద శ్రీనివాస్‌ అంటున్నారు. అందుకే సహజ సిద్ధంగా లభించే పేడ, గేదే మూత్రం, వేపకషాయంతోనే సేంద్రియ పద్ధతిలో పంటలు సాగుచేస్తున్నానని చెబుతున్నారు. దీని వల్ల ప్రస్తుతం కష్టంగా ఉన్న దీర్ఘకాలంలో చాలా ఉపయోగలున్నాయని అంటున్నారు. అలాగే ఈ సేంద్రీయ సాగును చూసి చుట్టుపక్కల చాలామంది సేంద్రీయ వ్యవసాయంపై మొగ్గుచూపుతున్నారని స్థానికులు చెబుతున్నారు .

ఫలించిన నిర్మల్ యువకుడి ప్రయోగం
మొత్తానికి నిర్మల్ యువకుడు చేసిన ప్రయోగం ఫలించింది. పంటకు ఎటువంటి రోగం లేకుండా ఆరోగ్యకరమైన దిగుబడి వస్తోంది. శ్యాంపుల్‌ టెస్ట్ కూడా జరిపి ఈ సహజ ఆహార కేంద్రం సర్టిఫికెట్‌ కూడా పొందింది. సేంద్రియ ఉత్పత్తులకు ప్రభుత్వం చేయూతనందిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

 

15:51 - September 24, 2016

నల్లగొండ : తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో విషాదం చోటు చేసుకుంది. భార్యను , పెద్ద కుమార్తెను గొడ్డలితో నరికి చంపాడు ఓ భర్త. అనంతరం రెండో కుమార్తెతో కలిసి వాటర్ హీటర్ ను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనలో భర్త రామచంద్రంతో పాటు కుమార్తెలిద్దరూ మృతి చెందారు. భార్య కవిత పరిస్థితి విషయంగా వుండటంతో స్థానికులు భువనగిరి ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా కుటుంబ కలహాలతోనే ఈ దారుణం జరిగినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. భర్తపేరు రమచంద్రం, భార్య కవితగా స్థానికులు పేర్కొంటున్నారు. 

15:37 - September 24, 2016

పాకిస్థాన్ : యూరీ ఉగ్రదాడిపై పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్‌ పాకిస్తాన్‌పై నిందలు మోపుతోందని ఆరోపించారు. గత రెండు నెలలుగా కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ దాడి జరిగి ఉండొచ్చని షరీఫ్‌ లండన్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. భారత భద్రతా దళాల దాడుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారని మరికొందరు కళ్లు కోల్పోవడంతో కశ్మీర్‌ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. భారత్‌ ఎలాంటి విచారణ చేపట్టకుండానే పాకిస్తాన్‌ను దోషిగా నిలబెట్టడం బాధ్యతా రాహిత్యమని షరీఫ్‌ మండిపడ్డారు. కశ్మీర్‌ ప్రజలపై భారత దురాగతాలు ప్రపంచానికి తెలుసని, భారత భద్రతా దళాలు జరిపిన దాడుల్లో 108 మంది మృతి చెందారని, 150 మంది అంధులయ్యారని, వేలాది మంది గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు.

15:30 - September 24, 2016

తూర్పుగోదావరి : ఏపీ సర్కార్ రైతాంగాన్ని ఆదుకునేందుకు సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెడితే విపక్ష నేతలు కోర్టులకు వెళ్లి..ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి దేవినేని తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహన్ని పరిశీలించారు. అధికారులతో ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు..అనంతరం బ్యారేజీని ఆనుకుని ఉన్న పిచ్చుకలంక పర్యాటక ప్రాంతాన్ని సందర్శించారు.. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామని మంత్రి దేవినేని మరోమారు స్పష్టం చేశారు.

15:20 - September 24, 2016

నల్లగొండ : నాగార్జున సాగర్‌ ఎత్తిపోతల జలపాతం నయాగరా జలపాతాన్ని తలపిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌కు 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎత్తిపోతల జలపాతంకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో 75 మీటర్ల ఎత్తుగల కొండ ప్రాంతం నుంచి నీరు లోయలోకి ప్రవహిస్తోంది. ఇది నల్లమల కొండల మధ్య ఉరుకులు, పరుగులు పెడుతూ.. కృష్ణమ్మ ఒడికి చేరడానికి ప్రవహిస్తోంది. ఇలాంటి సుందర, అద్భుతమైన జలపాతాన్ని చూడటం కోసం పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. 

వాసాలమర్రిలో విషాదం..

నల్లగొండ : తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో విషాదం చోటు చేసుకుంది. భార్యను గొడ్డలితో నరికి కుమార్తెతో సహా తండ్రి కరెంట్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో రామచంద్రంతో పాటు ఏడాది లోపు కుమార్తె మృతి చెందారు. బార్య కవిత పరిస్థితి విషయంగా వుండటంతో స్థానికులు భువనగిరి ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా కుటుంబ కలహాలతోనే ఈ దారుణం జరిగినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. భర్తపేరు రమచంద్రం, భార్య కవితగా స్థానికులు పేర్కొంటున్నారు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో 17 రైళ్లు రద్దు..

హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో నడిచే 17 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 24 రైళ్లను దారి మళ్లిస్తున్నట్టు తెలిపింది. రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న కారణంగా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. తదుపరి సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది త్వరలోనే తెలియజేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

ముగ్గురు మావోల కాల్చివేత..

ఛత్తీస్‌గఢ్: రాష్ట్ర పోలీసులు నలుగురు నక్సలైట్లను మట్టుబెట్టారు. మృతుల వద్ద నుంచి పెద్ద ఎత్తున మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రావతి నది దాటి వచ్చిన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా, దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మావోయిస్టును పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు.

త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ..

ఢిల్లీ: భారత సైన్యాధిపతి, వైమానిక దళాధిపతి, నావికా దళ వైస్‌ చీఫ్‌ ముగ్గురూ శనివారం లోకకల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి అనంతరం సరిహద్దుల్లో భద్రత, ఉరీ దాడి పట్ల భారత్‌ స్పందన , తీసుకోవాల్సిన చర్యలు, తివిధదళాలకు చెందిన ఛీఫ్ లతో మోదీ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఉరీ ఘటనలో 18 మంది సైనికులు మరణించగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఘటనలో నలుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఉగ్రవాదులు పాక్‌ నుంచి వచ్చినట్లు కొన్ని ఆధారాలు లభించిన సంగతి తెలిసిందే.

14:41 - September 24, 2016

మెదక్ :జిల్లాలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. రాయకోడ్ మండలం రాయపల్లి వద్ద మంజీరా నది బ్రిడ్జీపై ఓ లారీ రెయిలింగ్‌పైకి దూసుకొచ్చింది. దీంతో ఇలా ప్రమాదకరస్ధితిలో లారీ రెయిలింగ్‌పై వేలాడుతోంది. లారీని బ్రిడ్జి పైనుంచి తీసేందుకు అధికారులు, పోలీసులు యత్నిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఈ లారీ హైదరాబాద్ నుంచి బీదర్‌కు పండ్ల లోడ్‌తో వెళ్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు వరదనీటితో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏడుపాయలు దుర్గామాత ఆలయంలో నుంచి వరదనీరు ప్రవహిస్తోంది. ఏడుపాయల వద్ద వరదనీటిలో 27 మంది బీహర్‌కు చెందిన కూలీలు చిక్కుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఆర్డీవో నగేష్‌లు సహ్యక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కూలీలను కాపాడేందుకు మరి కాసేపటల్లో హెలికాఫ్టర్ రప్పిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

14:12 - September 24, 2016
14:04 - September 24, 2016
14:01 - September 24, 2016
14:00 - September 24, 2016

హైదరాబాద్ : నగరంలో భారీ వర్షాల కారణంగా ..హైదరాబాద్‌లో ముంపుకు గురైన పలు కాలనీవాసులకు సినీ నటులు బాసటగా నిలిచారు. మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌.. శివాజీరాజా.. కాదంబరి కిరణ్‌కుమార్‌ కూకట్‌పల్లిలోని నీటమునిగిన కాలనీలలో పర్యటించారు. బాధితులను అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పాలు.. ఆహారాన్ని పంపిణీ చేశారు. ఇక్కడ పర్యటన పూర్తైన తర్వాత.. మరిన్ని ప్రాంతాలలో పర్యటిస్తామని సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ చెప్పారు.  

 

13:58 - September 24, 2016

హైదరాబాద్ : లిబియాలో ఉగ్రవాదుల కిడ్నాప్‌ చెర నుంచి క్షేమంగా బయటపడ్డ తెలుగు ప్రొఫెసర్లు బలరాంకృష్ణ, గోపికృష్ణ హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము విడుదల కావడానికి సహకరించిన వారిందరీకి కృతజ్ఞతలు తెలిపారు. విడుదలైనందుకు వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశారు. ఈమేరకు గోపికృష్ణ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్టాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

13:53 - September 24, 2016

చిత్తూరు : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రియుడు ఇంట్లో పియురాలు అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... జిల్లాలోని వీరభద్ర కాలనీలో నివాసముంటున్న ప్రీతి, శివ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే శివ ప్రియురాలు ప్రీతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో ప్రీతి తనను పెళ్లి చేసుకోవాలని అతన్ని నిలదీసింది. ఇదే విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. ఇదే క్రమంలో ప్రీతి.. శివ ఇంటికి వెళ్లింది. ఈనేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున ప్రియుడు ఇంట్లో పియురాలు అనుమానస్పదంగా మృతి చెందింది. ప్రియుడు  ప్రియురాలను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అయితే ప్రియుడు శివ, అతడి కుటుంబసభ్యులే కలిసి చంపారని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రియుడు శివను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

 

చిత్తూరు జిల్లాలో విషాదం

చిత్తూరు : జిల్లాలో విషాదం నెలకొంది. ప్రియుడి ఇంట్లో ప్రియురాలు అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 15 గేట్లు ఎత్తివేత

కరీంనగర్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరదనీనరు చేరింది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 35, 529 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 54, 821 క్యూసెక్కులుగా ఉంది. 

 

13:22 - September 24, 2016

తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 262 పరుగులకు ఆలౌట్

కాన్పూర్ : న్యూజిలాండ్, భారత్ ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 262 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 56 పరుగుల ఆధిక్యం లభించింది. జడేజా 5, అశ్విన్ 4, ఉమేష్ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు. 

13:07 - September 24, 2016

ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది : సెల్వం

హైదరాబాద్‌ : ప్రస్తుతం హైదరాబాద్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీఐజీ సెల్వం తెలిపారు. తెలంగాణ సచివాలయంలో రెవెన్యూ సెక్రటరీ ప్రదీప్‌ చంద్రతో భేటీ అయిన ఆయన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటికే ఆరు రెస్య్కూ టీమ్‌లను అందుబాటులో ఉంచామని తెలిపారు. 

 

12:48 - September 24, 2016

హైదరాబాద్‌ : ప్రస్తుతం హైదరాబాద్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీఐజీ సెల్వం తెలిపారు. తెలంగాణ సచివాలయంలో రెవెన్యూ సెక్రటరీ ప్రదీప్‌ చంద్రతో భేటీ అయిన ఆయన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటికే ఆరు రెస్య్కూ టీమ్‌లను అందుబాటులో ఉంచామని తెలిపారు. రెండు టీమ్‌లో నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలకు పంపించామని చెప్పారు. ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి.. రెస్య్యూ టీమ్‌లను అప్రమత్తంగా ఉంచుతున్నామని చెప్పారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. రంగంలోకి సైన్యం దిగింది. విపత్తు సహాయ చర్యలను ముమ్మరం చేసింది. సహాయచర్యల్లో నాలుగు ఆర్మీ బృందాలు పాల్గొంటున్నాయి. అల్వాల్‌, నిజాంపేట, హకీంపేట, బేగంపేటల్లో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, బస్తీలపై ప్రత్యేక దృష్టి సారించారు. 

 

12:45 - September 24, 2016

విశాఖ : జిల్లాను..దోమల రహిత జిల్లాగా చేయడమే తమ లక్ష్యమని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ బీచ్ రోడ్డులో 'దోమలపై దండయాత్ర..పరిసరాల పరిశుభ్రత' కార్యక్రమాన్ని మంత్రి గంటా ప్రారంభించారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. బీచ్‌లోని చెత్తచెదారాన్ని తొలగించారు. ప్రజలందరూ దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ఓ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని మంత్రి గంటా పిలుపునిచ్చారు. పరిశుభ్రతను పాటించి.. వ్యాధులకు దూరంగా ఉండాలని సూచించారు.

 

12:43 - September 24, 2016

విశాఖ : స్కై చాపర్‌ లాజిస్టిక్‌ వారి ఆధ్వర్యంలో విశాఖలో హెలి టూరిజం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన వుడా పార్క్‌లో జరుగుతున్న హెలిపాడ్‌..రోడ్డు నిర్మాణాలను మంత్రి గంటా శ్రీనివాసరావు.. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అధికారులు పరిశీలించారు. దీంతో విశాఖలో ఉన్న పర్యాటక ప్రదేశాలన్ని హెలికాప్టర్లో తిలకించే అవకాశం ఉంటుందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అలాగే లంబసింగి ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

 

12:33 - September 24, 2016

నల్గొండ : నాగార్జున సాగర్‌ ఎత్తిపోతల జలపాతం నయాగరా జలపాతాన్ని తలపిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌కు 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎత్తిపోతల జలపాతంకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో 75 మీటర్ల ఎత్తుగల కొండ ప్రాంతం నుంచి నీరు లోయలోకి ప్రవహిస్తోంది. ఇది నల్లమల కొండల మధ్య ఉరుకులు, పరుగులు పెడుతూ.. కృష్ణమ్మ ఒడికి చేరడానికి ప్రవహిస్తోంది. ఇలాంటి సుందర, అద్భుతమైన జలపాతాన్ని చూడటం కోసం పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. 

మూసీ ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తివేత

నల్గొండ : మూసీ ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 41309 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 34360 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 643 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులుగా ఉంది. 

 

పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

నల్గొండ : పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. 4 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.  ప్రస్తుతం నీటిమట్టం 49.90 మీటర్లుగా ఉంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో లక్షా వేల క్యూసెక్కులుగా ఉంది. 

 

నిజామాబాద్ జిల్లాలో 3రోజులుగా భారీ వర్షాలు

నిజామాబాద్ : జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బోధన్ రాకాసిపేట, గండి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. నవీపేట్, బర్కత్ పురా కాలనీలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. నవీపేట్ లో వర్షానికి రెండు పురాతన ఇల్లు కూలాయి. 

12:09 - September 24, 2016

నల్లగొండ : జిల్లాలో వర్ష బీభత్సానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చాలా చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు మిర్యాలగూడ, భువనగిరి, నకిరేకల్, సూర్యాపేట, హూజూర్ నగర్ నియోజకవర్గాలలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూసీనదితో పాటు జిల్లాలోని వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండుకండను తలపిస్తున్నాయి. నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై నల్లగొండ సమీపంలోని పానగల్, తిప్పర్తి, దామరచర్ల ప్రాంతాలలో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. జిల్లాలోని భారీ వర్షాలపై మంత్రి జగదీష్ రెడ్డి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

 

12:01 - September 24, 2016

హైదరాబాద్‌ : బాలానగర్‌ పారిశ్రామిక వాడలోని..కృష్ణా ప్లాస్టిక్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో కంపెనీలో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.

 

11:53 - September 24, 2016

మెదక్ : నిజామాబాద్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మెదక్ జిల్లా సిద్థిపేటలో భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలిపోవడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడటంతో వరదనీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. వేల్పూరు మండలం పడ్ గల్‌శివారులో వరద నీటిలో కారు కొట్టుకుపోవడంతో తల్లీకొడుకుల గల్లంతయ్యారు. 

 

11:51 - September 24, 2016

అదిలాబాద్ : జిల్లాలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరదన నీరు పోటెత్తుంది. దీంతో జిల్లాలోని కడెం ప్రాజెక్టు పూర్తి స్ధాయిలో నిండిపోయింది. దీంతో 6గేట్లు 10 అడుగుల మేర ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల చేస్తున్నారు.  ప్రస్తుత నీటిమట్టం 698.950 అడుగులు ఉండటంతో ఇన్ ఫ్లో 66,900 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 73, 735 క్యూసెక్కులు ఉంది. మరో వైపు స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరదన నీరు చేరుతోంది. దీంతో 3 గేట్లు ఎత్తి 27 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. స్వర్ణ ప్రాజెక్టు పూర్తిస్ధాయి నీటిమట్టం 1183 అడుగులు ఉండగా స్వర్ణ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1184 అడుగులు మేరకు చేరుకోంది. నిర్మల్ లో బంగల్ పేట వీధిలో పిడుగుపాటుకు ఇల్లు కూలిపోయింది. 

 

11:48 - September 24, 2016

వరంగల్ : జిల్లాలో ఆరో రోజు కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దాదాపు 75 కాలనీలు వరదనీటితో మునిగిపోయాయి. స్ధానికులంతా వర్షపునీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వీరి కోసం వరంగల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 7 పునారావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో 54 చెరువులు లీకవ్వగా మరో నాలుగు చెరువులకు గండ్లుపడ్డాయి. వరదలతో జిల్లాలో ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. రెండు వేల పై చిలుకు హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లింది. 25 ఏళ్ల రికార్డు స్ధాయి వర్షపాతం నమోదు కావటం విశేషం. పాకాల, లక్నవరం, రామప్ప ప్రధాన జలాశయాలు నిండుకండను తలపిస్తున్నాయి. హన్మకొండ-కరీంనగర్ ప్రధాన రహాదారిలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 

 

హైదరాబాద్ చేరుకున్న కిడ్నాపైన ప్రొఫెసర్లు..

హైదరాబాద్ : యుద్ధ కల్లోల లిబియాలో ఏడాదికి పైగా ఉగ్రవాదుల నిర్బంధంలో ఉండి ఇటీవలే విడుదలయిన ఇద్దరు ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరాంకృష్ణ నిన్న అర్ధరాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. విదేశాంగశాఖ అధికారులు వీరిని హైదరాబాద్‌ తీసుకొచ్చారు. 

సిద్ధిపేటలో ఇల్లు కూలి ఒకరు మృతి

మెదక్ : జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలుగా కురుస్తున్నాయి. సిద్ధిపేటలో ఇల్లు కూలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కొండపాకలో వరద ఉధృతిలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. 

స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

ఆదిలాబాద్ : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేశారు. 27 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1184 అడుగులకు చేరింది.

 

10:52 - September 24, 2016

కరీంనగర్ : జిల్లాలోని ఎగువమానేరు నర్మాల ప్రాజెక్టు పూర్తిస్ధాయిలో నిండి అలుగుపారుతోంది. 32 అడుగుల సామర్ధ్యం గల ప్రాజెక్టు రాత్రి పూర్తిగా నిండిపోయి పెద్దఎత్తున మత్తడి పడింది. మానేరు వాగు, మోయతుమ్మెదవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులతో పాటు ఎస్సారెస్పీ వరదకాలువల ద్వారా భారీగా వరద నీరు లోయర్ మానేరు డ్యామ్ కు చేరుతోంది. 

 

వరదలో కొట్టుకుపోయి ఆరోగ్యశ్రీ ఉద్యోగి మృతి

మెదక్ : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ఉద్యోగి భాస్కర్ వరద ఉధృతిలో కట్టుకుపోయి మృతి చెందారు. 

సింగూరుకు చేరుకున్న 24 టీఎంసీలు నీరు

మెదక్ : జిల్లాలోని సింగూరుకు 24 టీఎంసీలు నీరు చేరింది. లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వీడుదల చేస్తున్నారు. 10.08 సెంమీ. వర్షపాతం నమోదు అయింది. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటిరావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.  

 

గోడ కూలి ఒకరు మృతి

మెదక్ : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోడ కూలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

 

శ్రీపాద ఎల్లంపల్ల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత

ఆదిలాబాద్ : భారీ వర్షాలతో జిల్లాలో ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. శ్రీపాద ఎల్లంపల్ల ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 19,521 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 11800 క్యూసెక్కులుగా ఉంది. 

భారీ వర్షాలతో జిల్లాలో ప్రాజెక్టులకు జలకళ

ఆదిలాబాద్ : భారీ వర్షాలతో జిల్లాలో ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. అధికారులు కడెం ప్రాజెక్టు 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. ఇన్ ఫ్లో 66,900 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 73,735 క్యూసెక్కులు గాఉంది. కడెం ప్రాజెక్టు ప్రస్తుతం నీటిమట్టం 699 అడుగులుగా ఉంది. 

అల్వాల్ పీఎస్ కు చేరుకున్న ఆర్మీ బృందం

హైదరాబాద్ : మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్‌లో సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపుతోంది. ఆరు వ్యాన్లలో 120మంది సైన్యం ఆల్వాల్ పీఎస్ కు చేరుకుంది. వర్షాలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. 

 

09:47 - September 24, 2016

హైదరాబాద్ : ఇంకా రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సైతం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ రెండింటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయిని వెల్లడించారు. ఈ నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే వరదల నుంచి తేరుకోని జనానికి...తాజా వాతావరణ శాఖ హెచ్చరికలు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. 
అప్రమత్తమైన తెలంగాణ సర్కారు 
మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్‌లో సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపుతోంది. ఆరు వ్యాన్లలో 120మంది సైన్యం ఆల్వాల్ పీస్ కు చేరుకుంది. వర్షాలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు సచివాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభా గం అసిస్టెంట్ కమిషనర్ బద్రీనాథ్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించింది. ఆపదలో ఉన్నవారు కంట్రో ల్ రూమ్‌కు సమాచారమివ్వాలని సూచించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్ర మంత్రులు, అధికార యంత్రాంగం స్వయంగా రంగంలోకి దిగి 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా జలమయమైన ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 12 స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. రానున్న 48 గంటలపాటు నగరంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో ఆర్మీ సహాయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, రెవెన్యూశాఖ నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో నమోదైన వర్షపాతంతో జరిగిన నష్టం, చేపట్టిన పునరావాస చర్యలపై రాష్ట్ర రెవెన్యూశాఖ విపత్తు నిర్వహణ అధికారులు వివరాలు అందించారు. ఇటు హుస్సేన్‌సాగర్‌కు వరదనీరు పోటెత్తుతోంది. సాగర్ గరిష్ట మట్టం వరకూ పూర్తిగా నిండిపోవడంతో.. వస్తున్న నీటినంతటినీ 18 స్లూయిజ్‌ల ద్వారా మూసీలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. మరింత వర్షం పడితే హైదరాబాద్ ప్రమాద స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. మరో రెండు, మూడు రోజులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 

09:34 - September 24, 2016

హైదరాబాద్ : ఇంకా రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సైతం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ రెండింటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయిని వెల్లడించారు. ఈ నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే వరదల నుంచి తేరుకోని జనానికి...తాజా వాతావరణ శాఖ హెచ్చరికలు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. 
అప్రమత్తమైన తెలంగాణ సర్కారు 
మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్‌లో సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు సచివాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభా గం అసిస్టెంట్ కమిషనర్ బద్రీనాథ్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించింది. ఆపదలో ఉన్నవారు కంట్రో ల్ రూమ్‌కు సమాచారమివ్వాలని సూచించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్ర మంత్రులు, అధికార యంత్రాంగం స్వయంగా రంగంలోకి దిగి 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా జలమయమైన ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 12 స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. రానున్న 48 గంటలపాటు నగరంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో ఆర్మీ సహాయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, రెవెన్యూశాఖ నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో నమోదైన వర్షపాతంతో జరిగిన నష్టం, చేపట్టిన పునరావాస చర్యలపై రాష్ట్ర రెవెన్యూశాఖ విపత్తు నిర్వహణ అధికారులు వివరాలు అందించారు. ఇటు హుస్సేన్‌సాగర్‌కు వరదనీరు పోటెత్తుతోంది. సాగర్ గరిష్ట మట్టం వరకూ పూర్తిగా నిండిపోవడంతో.. వస్తున్న నీటినంతటినీ 18 స్లూయిజ్‌ల ద్వారా మూసీలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. 
హైదరాబాద్‌లో జనజీవనం అస్తవ్యస్తం 
ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్‌లో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. శుక్రవారం నాటికి కూడా శివార్లతోపాటు హుస్సేన్‌సాగర్‌కు వచ్చే నాలాల పరివాహక ప్రాంతాలు, చెరువు కట్టల కింద అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. ప్రజలు మోకాళ్ల లోతు నీళ్లలోనే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. వరద నీరు కదలడం లేదని.. పాములు, తేళ్లు, జర్రెలు ఇళ్లలోకి వస్తున్నాయని వాపోతున్నారు. నిజాంపేటలోని బండారీ లేఅవుట్‌లో ఐదో రోజు కూడా వరద ముంపు వీడకపోవడంతో దాదాపు వెయ్యి ఫ్లాట్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ఇళ్లు ఖాళీ చేయించారు. కొన్నిచోట్ల ఇంకా విద్యుత్తు పునరుద్ధరణకు నోచులేదు. వరద తగ్గిన తర్వాత సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.
భారీ వర్షాలకు పది మంది మృతి  
తెలంగాణలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయింది. ఐదు రోజులుగా విస్తారంగా వానలు పడుతుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పది మంది మృత్యువాతపడ్డారు. రహదారులపై వరద ఉద్ధృతికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 50 శాతం పైగా చెరువులు నిండాయి. వరద తీవ్రత పెరుగుతుండడంతో చెరువులకు గండ్లు పడుతున్నాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలపై అంచనాలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. 

 

09:21 - September 24, 2016
09:18 - September 24, 2016

కొత్తగూడెం సింగరేణి ఓసెన్ కాస్టులో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

ఖమ్మం : రెండు రెజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొత్తగూడెం సింగరేణి ఓసెన్ కాస్టులో 9 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 

09:10 - September 24, 2016

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు సంభవిస్తున్నాయని.. వరదల నివారణ చర్యలు చేపట్టాలని వక్తలు సూచించారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత శ్రీనివాస్, టీ.కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. అక్రమ లేవట్లను అరికట్టాలన్నారు. ప్లానింగ్ డిపార్టుమెంట్ అత్యంత అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్ ఎండీఏ విఫలం చెందాయని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:55 - September 24, 2016

హైదరాబాద్ : ఎట్టకేలకు తెలుగు ప్రొఫెసర్ల కిడ్నాప్‌ ఉదంతం సుఖాంతమైంది. 13 నెలల కుటుంబ సభ్యుల ఎదురుచూపులు ఫలించాయి. యుద్ధ కల్లోల లిబియాలో ఏడాదికి పైగా ఉగ్రవాదుల నిర్బంధంలో ఉండి ఇటీవలే విడుదలయిన ఇద్దరు ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరాంకృష్ణ నిన్న అర్ధరాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. విదేశాంగశాఖ అధికారులు వీరిని హైదరాబాద్‌ తీసుకొచ్చారు. నాచారం రాఘవేంద్ర కాలనీలోని స్వగృహానికి గోపీకృష్ణ, తిరుమలగిరిలోని స్వగృహానికి బలరాంకిషన్‌ చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జులై 29న వీరిద్దరినీ ఉగ్రవాదులు అపహరించారు.
లిబియాలో గతేడాది జూలైలో అపహరణ
లిబియాలో గతేడాది జూలైలో అపహరణకు గురైన ఇద్దరు తెలుగువాళ్లు గోపీకృష్ణ, బలరాంకృష్ణ తీవ్రవాదుల చెర నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో వారి ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. కేంద్రప్రభుత్వ ప్రత్యేక చొరవతో వీరిద్దరి ఉదంతం సుఖాంతమైంది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.  2015 జులై 29న లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌నకు గురయ్యారు. ట్రిపోలి మీదుగా భారత్‌కు వస్తున్న గోపాలకృష్ణ, బలరామకృష్ణ, విజయ్‌కుమార్‌, లక్ష్మీకాంత్‌లను కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు వీరిని బంధించి ఉంటారని తొలుత భావించారు. అయితే రెండు రోజుల తర్వాత లక్ష్మీకాంత్‌, విజయ్‌కుమార్‌లను ట్రీపోలీలోని భారత అధికారులు రక్షించారు. మిగతా ఇద్దరూ కిడ్నాపర్‌ల చెరలోనే ఉండిపోయారు.  శ్రీకాకుళానికి చెందిన గోపీకృష్ణ.. హైదరాబాద్‌కు చెందిన బలరామ్‌లు ఎనిమిదేళ్లుగా లిబియాలోని ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. అయితే వారు అపహరణకు గురవడంతో బంధువుల్లో ఆందోళన నెలకొంది. తమవారిని రక్షించాలంటూ విదేశాంగ శాఖకు పదే పదే విజ్ఞప్తులు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో.. ట్రిపోలీలోని భారత అధికారులు గోపాలకృష్ణ, బలరామకృష్ణలను విడుదల చేయించారు. దీంతో 14 నెలలుగా విషాదంలో మునిగిన గోపాలకృష్ణ, బలరామకృష్ణల కుటుంబాల్లో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని బలరాం భార్య శ్రీదేవి అన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా.. టెక్కలిలో గోపీకృష్ణ తల్లిదండ్రులు సరస్వతి, నారాయణమూర్తి కూడా హర్షం వ్యక్తం చేశారు. 

దోమల నివారణ ర్యాలీని ప్రారంభించిన మంత్రి గంటా

విశాఖ : దోమల నివారణ ర్యాలీని మంత్రి గంటా శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో హెలీ టూరిజంకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. దసరా నుంచి హెలీ టూరిజం సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. 

సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

మెదక్ : సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తివేశారు. లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

ఇల్లు కూలి ఒకరి మృతి

 మెదక్ : సిద్ధిపేటలోని హనుమాన్ ఆలయం వద్ద వర్షానికి ఓ ఇల్లు కూలింది. దీంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు ఆయ్యాయి. వారిని ఏరియా ఆస్పత్రికి తరించారు. 

08:36 - September 24, 2016
08:28 - September 24, 2016
08:18 - September 24, 2016

మహేష్ బాబు పక్కా ప్లానింగ్ చేసుకున్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వన్ బై వన్ స్టార్ట్ చేసేలా స్కెచ్ వేశాడు. ఫీల్మ్ నగర్ జనాలు ప్రిన్స్ ప్లానింగ్ అదిరిపోయిందంటున్నారు. ఈ స్టార్ హీరో కాల్ షీట్స్ మూడేళ్లు బుక్ అయిపోయాయి. మరీ మహేష్ బాబు సెట్ చేసిన ఆ ముందస్తు ప్లానింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం...
మురుగదాస్‌తో బిగ్ మూవీకి సిగ్నల్ 
బ్రహ్మోత్సవం ఫ్లాపయినా మహేష్ స్పీడ్ మాత్రం లేదు. శ్రీమంతుడు విజయం ప్రిన్స్ స్టార్ గా ఓ మెట్లు పైకెక్కిస్తే, బ్రహ్మోత్సవం డిజాస్టర్ నాలుగుమెట్లు కిందికి లాగేసింది. ఈ మూవీ డిజాస్టర్ తో డిస్పాయింట్ అయిన ప్రిన్స్ వెంటనే తేరుకుని ఎవరూ ఊహించని విధంగా మురుగదాస్‌తో బిగ్ మూవీకి సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రిన్స్ ఆ తరువాత సినిమాలపై కూడా క్లారిటి ఇచ్చేశాడు.
కొరటాల శివతో మరోసారి సినిమా 
మురుగదాస్ తో చేస్తున్న సినిమాను మహేష్ బాబు సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు. ఈ సినిమాతో పాటు లేటేస్ట్ ప్రిన్స్ కొరటాల శివతో మరోసారి సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. శ్రీమంతుడు లాంటి బిగ్ సక్సెస్ కొట్టిన ఈ కాంబినేషన్ లోని మూవీ నవంబర్ లో స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఆగస్ట్ లో రిలీజ్ చేసేలా ప్లాన్స్ వేస్తున్నారు. 
వంశీపైడిపల్లి దర్శకత్వంలో మూవీ 
కొరటాల శివతో సినిమాను కంప్లీట్ చేస్తునే, వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ మూవీ చేసేలా మహేష్ బాబు ప్లాన్ చేశాడు. బ్రహ్మోత్సవంతో నష్టపోయిన నిర్మాత పొట్లూరి వరప్రసాద్ కోసం ప్రిన్స్ ఈ మూవీ చేస్తున్నాట్లు సమాచారం. వంశీపైడిపల్లితో చేయనున్నఈ సినిమాను వచ్చే 2017 అక్టోబర్ స్టార్ చేసి 2018 సంక్రాంతి రిలీజ్ చేసేలా ప్రణాళికలు వేసినట్లు సమాచారం. ఇలా ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమా తరువాత సినిమా చేయనున్న మహేష్ బాబు ప్లానింగ్ అదిరిపోయిందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

 

08:03 - September 24, 2016

రకూల్ ప్రీత్ సింగ్ స్పీడ్ కి లావణ్య త్రిపాఠీ స్పీడ్ బ్రేక్స్ వేస్తోంది. ఓ క్రేజీ మూవీలో సోలో హీరోయిన్ అనుకున్న రకూల్ కి లావణ్య ఝలక్ ఇచ్చింది. నెమ్మది స్టార్ హీరోయిన్స్ రేసులోకి వచ్చేసిన లావణ్య రకూల్ ప్రీత్ కి ఇచ్చిన షాక్ ఏంటో మీరే చూడండి.. 
నాగచైతన్య కొత్త సినిమాలో లావణ్య 
టాప్ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకుపోతోన్న రకుల్ ప్రీత్ కి లావణ్య రూపంలో షాక్ తగిలింది. రామ్ చరణ్, మహేష్ బాబు మూవీస్ లో సోలో హీరోయిన్ గా చెలరేగిపోతోన్న రకుల్ లేటేస్ట్ నాగచైతన్య కొత్త సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అయితే ఈ మూవీలో తనే సోలో హీరోయిన్ అనుకుంటే ఇప్పుడు లావణ్య కూడా ఈ మూవీలోకి ఎంటర్ అయింది. 
లావణ్య త్రిపాఠీ, రకూల్ కి కాంపిటీషన్..?  
నాగ చైతన్యతో సోగ్గాడే చిన్ని నాయనా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చేయబోయే మూవీలో రకుల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. నిన్నే పెళ్ళాడుతా తరహాలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీలో రకుల్ తో పాటు లావణ్యత్రిపాఠీని మరో హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో ఇప్పుడు లావణ్య త్రిపాఠీ, రకూల్ కి కాంపిటీషన్  అవుతోందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
నాగ్ వారసుడితో స్క్రీన్ షేర్ చేసుకోబోతోన్న లావణ్య 
అక్కినేని ఫ్యామిలీ మూవీ మనంలో గెస్ట్ రోల్ చేసిన లావణ్య. ఈ ఎడాది సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్టు గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయనా మూవీలో నాగర్జునకు జోడిగా నటించి వావ్ అనిపించింది. ఇప్పుడు నాగ్ వారసుడితో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి లావణ్య త్రిపాఠీ స్టార్ట్ స్టేటస్ కి దగ్గరగా వచ్చేసింది.

 

07:57 - September 24, 2016

కోలీవుడ్ స్టార్ విక్రమ్ రిజల్ట్ తో క్రిటిక్స్ కు షాక్ ఇచ్చాడు. పెదవి విరిచిన వాళ్లకు కలెక్షన్లతోనే సమాధానం చెప్పాడు. డిజాస్టర్ అన్నవాళ్లతోనే బ్లాక్ బస్టర్ అనిపించాడు. ఇంతకీ విక్రమ్ క్రిటిక్స్ కు ఇచ్చిన షాక్ ఏంటో వాచ్ దీస్ స్టోరీ.
తెలుగులో నిరాశ పరించిన 'ఐ'..
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ మార్కెట్ ఉన్న హీరోల్లో విక్రమ్ ఒకరు. ఈ ఎక్స్ పర్ మెంటల్ హీరోకి కొంతకాలంగా సరైన హిట్టు లేదు. ఐ సినిమా తమిళంలో భారీ కలెక్షన్లు సాధించినప్పటికి తెలుగులో మాత్రం ఈ చిత్రం పూర్తిగా నిరాశ పరించింది. ఇలాంటి టైంలో విక్రమ్ ఇరుగమన్ తెలుగులో ఇంకొక్కడు చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ఫస్ట్ షో నే డిజాస్టర్ టాక్ వచ్చింది. అయితే ఇక్కడే క్రిటిక్ సైతం ఆశ్చర్యపోయేలా ఈ చిత్రం కలెక్షన్లను రాబట్టుతుంది. 
ఇంకొక్కడు వంద కోట్ల కలెక్షన్లు
విక్రమ్ కెరీర్ లో ఇంకొక్కడు మరో డిజాస్టర్ అంటూ క్రిటిక్స్ కామెంట్స్ చేశారు. కానీ విచిత్రంగా అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చిన ఈ మూవీ వంద కోట్ల కలెక్షన్లను రాబట్టి షాక్ ఇచ్చింది. ఈ మూవీ ఫస్టాఫ్ సూపర్ గా ఉన్నా, సెకండాఫ్ తేలిపోయిందనేది క్రిటిక్స్ వాదన. అయితే క్రిటిక్స్ కామెంట్స్ ఎలా ఉన్న ఈ చిత్రం మాత్రం ఊహించని రేంజ్ లో అద్భుతకలెక్షన్లను సాధించి యూనిట్ ని సంతోషంలో ముంచేసింది.
ఇంకొక్కడు మూవీ ఫస్ట్ వీక్ లో 50 కోట్లు  
ఇంకొక్కడు మూవీ ఫస్ట్ వీక్ లో 50 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. తెలుగు తమిళంలో రెండు వారాలకుగాను  95కోట్లు వసూల్ చేసిందట. ఇక ఈ వీక్ ఎండ్ వరకు ఇంకొక్కడు 100కోట్ల మార్క్ అందుకోవడం ఖాయమని యూనిట్ కాన్పిడెంట్ గా ఉంది.  సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంతో విక్రమ్ రెండు పాత్రల్లో మెస్మరైజింగ్ పర్మామెన్స్ తో ఆడియన్స్ థ్రిల్ చేశాడు. క్రిటిక్స్ విమర్శించిన ఇంకొక్కడు ఆడియన్స్ ని మాత్రం బాగానే ఆకట్టుకుందని ఈ కలెక్షన్లను బట్టి అర్ధం అవుతుంది.

 

మెదక్ జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు

మెదక్ : భారీ వర్షాలు కారణంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

ఇంకా హైదరాబాద్ లోని పలు కాలనీలు జలదిగ్బంధలోనే

హైదరాబాద్ : నగరంలోని పలు కాలనీలు జలదిగ్బంధలోనే ఉన్నాయి. బండారిలే అవుట్, అల్వాల్ ఇంకా వరద నీటిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

శనిగరం మధ్యతరహా ప్రాజెక్టులో 18 అడుగుల వరదనీరు

కరీంనగర్ : కోహెడలోని శనిగరం మధ్యతరహా ప్రాజెక్టులో 18 అడుగులకు వరదనీరు చేరింది. మోయతుమ్మెద వాగు పొంగిపొర్లుతోంది. రాకపోకలు నిలిచాయి. 18 ఏళ్ల తర్వాత హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నిండి మత్తడి దూకుతోంది.  

 

07:35 - September 24, 2016

విజయవాడ : ఏపీలో  దోమలు విజృంభిస్తున్నాయి. ప్రజలు విషజ్వరాలు, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ప్రాణాంతకవ్యాధులతో జనం అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న దోమలపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఏపీలోచేపట్టిన దోమలపై దండయాత్రపై టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ...
వ్యాధులను, దోమలవృద్ధిని అరికట్టేందుకు సరికొత్త ప్లాన్‌  
ఏపీలో పెద్దఎత్తున వర్షాలు కురుస్తుంటే... మరోవైపు అంతేస్థాయిలో దోమలు తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి.  రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వేలాదిగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. నవ్యాంధ్రరాజధానిగా మారిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఇప్పటి వరకూ అధికారికంగా 200 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. అనధికారికంగా వీటి సంఖ్య 2 వేలకు పైనే. దీంతో ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించేందుకు దోమల వృద్ధిని అరికట్టేందుకు ప్రచారం కల్పించాలని సంకల్పించింది ఏపీ సర్కార్‌. 
విషజ్వరాలకు నలుగురు చిన్నారుల మృతి
ఏపీ ప్రజలు విషజ్వరాలు, డెంగీ, మలేరియా, చికున్ గున్యా ఇలా వివిధ రకాల వ్యాధులతో అనారోగ్యానికి గురవుతున్నారు. రెండు జిల్లాలలో విషజ్వరాలకు నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో లేటుగా స్పందించిన సర్కార్‌ నేటి నుంచి దోమలపై దండయాత్ర పేరుతో పెద్దఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార ర్యాలీలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. పాఠశాల విద్యార్థులు, ఆశా వర్కర్లు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది  ప్రభుత్వశాఖల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ దోమలపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తోంది. జ్వరపీడిత కేసులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకయాప్ ను రూపొందించింది ఏపీసర్కార్‌ . 
సర్కార్‌ తీరుపై అనేక విమర్శలు 
అయితే .. ఏపీ సర్కార్‌ తీరుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ముందుచూపులేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాడమాడుతూ..  దండయాత్రలంటూ హడావుడి చేయడంపై జనవిజ్ఞాన వేదిక  ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 
విద్యార్థి సంఘాలు ఆగ్రహం 
ఇదిఇలా ఉంటే పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సెలవులు ప్రకటించి మరీ దోమలపై దండయాత్రలకు పంపే ప్రతిపాదనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశించడం... విద్యార్థులకు ఇబ్బందికరమని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు.   
ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందో..? 
పట్టణ ప్రాంతాల్లోనే పెరిగిపోయిన విషజ్వరాలను అరికట్టలేని ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రోజురోజుకి పెరిగిపోతున్న అంటువ్యాధులు, డెంగ్యూ వలక విష జ్వరాలను ప్రభుత్వం మేరకు అరికడుతుందో.. దోమలపై జరిగే దండయాత్ర ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో చూడాల్సి ఉంది. 

 

07:24 - September 24, 2016

హైదరాబాద్ : కొత్త సచివాలయం నుంచి పాలన సాగించాలన్న ఏపీ ప్రభుత్వ ఆశలకు భారీవర్షాలు గండికొడుతున్నాయి. సచివాలయ తరలింపు ప్రక్రియ ప్రారంభం అయిన వెంనటే వర్షాలు విజృభించడంతో ప్రభుత్వయంత్రాంగం పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యింది. దీంతో వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు సచివాలయ తరలింపునకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్టే అంటున్నారు అధికారులు.
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు సచివాలయతరలింపునకు ఆటంకంగా మారాయి. ప్రకాశం, గుంటూరు, కృష్ణాజిల్లాలతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లోకూడా వర్షాలు దంచికొడుతున్నాయి.దీంతో అధికార యంత్రాంగం పునరావాస కార్యక్రమాలపై దృష్టిపెడుతుండటంతో.. సచివాలయతరలింపు ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. 
అక్టోబర్‌3 నాటికి తరలింపు అనుమానమే
తాత్కాలిక సచివాలయం ఉన్న వెలగపూడితోపాటు.. నూతన రాజధాని ప్రాంత గ్రామాల్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆప్రాంతాలకు వెళ్లేందుకు ఉద్యోగులు సంశయిస్తున్నారు. ఈపరిస్థితుల్లో ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్‌.. అక్టోబర్‌3నాటికి సచివాలయ తరలిపు ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది. 
వర్షాలు తగ్గేవరకు తరలింపునకు తాత్కాలిక బ్రేక్‌..!
అటు హైదరాబాద్‌ను  కూడా భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో  హైదరాబాద్‌ నుంచి మొత్తం శాఖల తరలింపునకు ఏపీ ప్రభుత్వం పెట్టుకున్న వారం రోజుల గడువు ఆవాతంరాలు ఎదురవుతున్నాయి. రోడ్లు, రైలు మార్గాలు దెబ్బతినడంతో ఫర్నిచర్‌, కంప్యూటర్ల తరలింపు కష్టసాధ్యంగా మారింది.  మరోవైపు కొత్తరాజధానికి తరలివెళ్లే  ఉద్యోగులకు కూడా తమ సామాగ్రిని తరలించడానికి వర్షాలు ఇబ్బందిగా మారాయి. ఈపరిస్థితుల్లో సచివాలయ తరలింపు ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 

 

07:19 - September 24, 2016

హైదరాబాద్ : వర్షాలపై సమీక్షించకుండా.. సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో పర్యటించడంపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. కేసీఆర్‌ తీరు నీరోచక్రవర్తిని తలపిస్తోందని విమర్శిస్తున్నారు.  వర్షాలతో సహాయక చర్యలు అందక జనం అల్లాడిపోతుంటే ఢిల్లీలో అసెంబ్లీ సీట్లపెంపు కోసం లాబీయింగ్ చేశారని మండిపడ్డారు.
టీ.ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు  
తెలంగాణలో కుండపోత వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే టీఆర్‌ఎస్‌ప్రభుత్వానికి పట్టడం లేదని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. వర్షాలతో రోడ్లు చెరువులను  తలపిస్తూ.. ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఢిల్లీపర్యటనలో కేంద్రంతో అసెంబ్లీ సీట్లకోసం లాబీయింగ్‌లో మునిగిపోయారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. 
సీఎం ఢిల్లీ పర్యటనను తప్పుబట్టిన షబ్బీర్‌ అలీ
భారీ వర్షాలతో జనం అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు శాసన మండలి పక్షనేత షబ్బీర్‌ అలీ. రాష్ట్ర పరిస్థితిని పట్టించుకోకుండా .. ఢిల్లీలో పర్యటించడాన్ని ఆయన తప్పుబట్టారు. హైదరాబాద్‌లోని వరదముంపు ప్రాంతాలలో పర్యటించిన కాంగ్రెస్‌ నేతలు బాధితుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరం నీటిలో మునిగిపోతున్నా.. సీఎంకు అసెంబ్లీసీట్ల అంశమే ప్రధానంగా కనిపించిందా అని  ప్రశ్నించారు. 
సహాయచర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం 
వర్షాలు ప్రకృతి వైపరిత్యమయినప్పటికీ వరద సహాయచర్యలు చేపట్టడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమయ్యారని.. కాంగ్రెస్‌నేత ఆరోపించారు. ప్రభుత్వ శాఖల మద్య సమన్వయమే లేకుండాపోయిందని విమర్శించారు. వర్షాలు ముంచెత్తుతున్నా ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. 
మంత్రి కేటీఆర్‌ ఉత్తుత్తి పర్యటనలు 
హైదరాబాద్‌ బస్తీల్లో మంత్రి కేటీఆర్‌ చేస్తున్నవి ఉత్తుత్తి పర్యటలేనని కాంగ్రెస్‌నేతలు మండిపడ్డారు. రాజధాని అభివృద్ధికి కేటీఆర్  ప్రకటించిన వందరోజుల ప్రణాళికలు ఏ వరదలో కొట్టుకుపోయాయో చెప్పాలని వారు ఎద్దేవాచేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు పనిచేస్తున్నామన్న షోయింగ్‌ మాని.. హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దాలన్నారు.  

 

07:00 - September 24, 2016

హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల మంత్రులు, అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, రేయింబవళ్లు పరిస్థితిని గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో వరదలు, వానలు, వాటి వల్ల తలెత్తిన పరిస్థితిని సమీక్షించారు. 
మంత్రులు, అధికారులకు సూచనలు 
భారీవర్షాలతో తలెత్తున్న పరిస్థితులను ఎప్పటికపుడు సమీక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరద పరిస్థితిపై మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజీపీ అనురాగ్‌శర్మ,  జీహెచ్‌ఎంసీ కమీషనర్ జనార్థన్ రెడ్డి, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జెన్ కోసీఎండీ  ప్రభాకర్ రావు తదితరులతో ముఖ్యమంంత్రి మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 
ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రులకు ఆదేశం
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతవారణ శాఖ చెబుతున్నందున.. అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని మంత్రులను కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి, ఇండ్లలోకి వస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాత్రి, పగలు కూడా పరిస్థితిని పర్యవేక్షించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను సిఎం ఆదేశించారు. హైదరాబాద్ కు చెందిన మంత్రులంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలని ఆదేశించారు. 
మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలో సమన్వయంతో పనిచేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వానలు పడుతున్నాయని, వరదలు వస్తున్నాయని, చాాలా చోట్ల రోడ్లపైకి నీరు రావడంతో రాకపోకలు స్తంభించాయన్నారు. జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలని సిఎం చెప్పారు. ఏ జిల్లాకు చెందిన మంత్రి తన శాఖతో పాటు తన జిల్లాకు సంబధించిన పరిస్థితులను కూడా పర్యవేక్షించాలన్నారు.
అంటువ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం
రోడ్లపైకి, జనావాసాల్లో నీరు రావడం వల్ల అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డిని సిఎం కేసీఆర్ ఆదేశించారు. దోమలు వ్యాపించకుండా, నీటి కాలుష్యం వల్ల రోగాలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు కూడా తగు సూచనలు, సలహాలు చేయాలని కోరారు. అన్ని ప్రాంతాల్లో అవసమైన మందులను అందుబాటులో ఉంచాలని, రేయింబవళ్లు అత్యవసర సేవలు అందించడానికి అధికారులను సిద్ధం చేయాలని సిఎం సూచించారు.
వర్షాలతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం రావొద్దు
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే సమస్యను పరిష్కరించడానికి సిద్దంగా ఉండాలన్నారు. పోలీస్ శాఖ కూడా అన్ని విధాలా సిద్దంగా ఉండి, అవసరమైన సందర్భంలో ప్రజలకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 
ప్రాజెక్ట్‌ల దగ్గర అప్రమత్తంగా ఉండాలి
మరోవైపు భారీ వర్షాలతో వస్తున్న వరదల వల్ల రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, చెరువలు నిండుతున్నాయిని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.  ప్రాజెక్టుల వద్ద ప్రవాహ ఉధృతిని గమనిస్తూ, నీటి నిల్వ స్థాయిలను బట్టి నీరును బయటికి వదలాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావును ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పి, ఎల్ఎండి, నిజాంసాగర్, సింగూరు, ఎల్లంపల్లి, మిడ్ మానేరు తదితర రిజర్వాయర్ల వద్ద 24 గంటల మానిటరింగ్ అవరసమని ముఖ్యమంత్రి చెప్పారు. ఇన్ ఫ్లోను ఎప్పటికప్పుడు గమనిస్తూ, దానికి అనుగుణంగా ఔట్ ఫ్లో నిర్ధారించాలని సిఎం ఆదేశించారు. చాలా చెరువుల్లోకి నీరు వచ్చిందని, చెరువు కట్టల పరిస్థితిని కూడా గమనిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 
జలసౌధాలో కంట్రోల్‌ రూం
కేసీఆర్ ఆదేశం మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రాజెక్టుల వారీగా పర్యవేక్షణాధికారులను నియమించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల పరిస్థితిని గమనించి, సమాచారం సేకరించి, తగు ఆదేశాలు ఇవ్వడానికి 24 గంటలూ పనిచేసే విధంగా జలసౌధలో కంట్రోల్ రూమ్ (040-23390794) ఏర్పాటు చేశారు. 

 

జలదిగ్బంధంలో నల్గొండ జిల్లా దుప్పెల్లి

నల్గొండ : ఆత్మకూరు (ఎం) మండలం చింతల చెరువుకు గండి పడింది. దుప్పెల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. 

 

వరంగల్ జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు

వరంగల్ : జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. నేడు కేయాలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. 

 

నేడు పీఎస్ ఎల్వీ సీ..35 రాకెట్ ప్రయోగం

నెల్లూరు : నేడు పీఎస్ ఎల్వీ సీ..35 రాకెట్ ప్రయోగానికి ఉదయం 9.12 గంటలకు కౌంట్ డౌన్ ప్రయోగం కానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిచిన స్కాట్ శాట్ ఉపగ్రహం సహా 7 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి ఇస్రో ప్రవేశించనుంది. 

ఏబీసీ ఛైర్మన్‌గా ఐ.వెంకట్‌ ఏకగీవ్ర ఎన్నిక

హైదరాబాద్ : ఏబీసీ కొత్త ఛైర్మన్‌గా ఈనాడు డైరెక్టర్‌ ఐ.వెంకట్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2016..17 సంవత్సరానికి ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. వెంకట్‌ ఇప్పటికే పలు కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఎంఆర్‌యూసీ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు.

Don't Miss