Activities calendar

25 September 2016

21:42 - September 25, 2016

కేరళ : ముస్లింలను ఓటు బ్యాంకుగా చూడొద్దని 50 ఏళ్ల క్రితమే దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పిన విధానాన్ని బీజేపీ పాటిస్తోందని.. ప్రధాని మోదీ అన్నారు. కేరళ-కోజికోడ్ బీజేపీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని.. ముస్లింల అభివృద్థికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య పోరాట సమయంలో నేతల జీవితాలు ఆదర్శంగా ఉండేవని ప్రస్తుతం రాజకీయ నేతల జీవితాల్లో విలువల పడిపోయాయని మోదీ అభిప్రాయపడ్డారు. అయితే రాజకీయ నాయకుల్లో ఇప్పటికీ మంచివారు ఉన్నారన్నారు.  

21:40 - September 25, 2016

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమవుతోంది. పీఎస్ఎల్వీ -సీ 35 రాకెట్‌ ద్వారా సోమవారం ఉదయం 9 గంటల 12 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించనుంది. ఈ రాకెట్‌ ద్వారా ఎనిమిది ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెడతారు. ప్రయోగం పూర్తవడానికి 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ప్రయోగానికి ముందు జరిగే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో కొనసాగుతోంది.

సోమవారం ఉదయం 9.12 గంటలకు ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కొత్త అధ్యాయానికి తెర లేవనుంది. పీఎస్ఎల్వీ -సీ 35 రాకెట్‌ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు ఎనిమిది ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. సోమవారం ఉదయం 9 గంటల 12 నిమిషాలకు జరిగే ఈ ప్రయోగానికి నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో శనివారం ఉదయం 8గంటల 42 నిమిషాలను ప్రారంభమైన నలభైఎనిమిదిన్నర గంటల కౌంట్‌డౌన్‌ సజావుగా కొనసాగుతోంది.

ఎనిమిది ఉపగ్రహాల ప్రయోగానికి 2.15 గంటల సమయం
ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు గతంలో అనుసరించిన పద్ధతులకు పూర్తిగా భిన్నమైన ప్రక్రియను ఈసారి అవలంభిస్తున్నారు. ఎనిమిది ఉపగ్రహాలను రెండు విభిన్న క్షక్ష్యల్లోకి ప్రవేశపెట్టనుండటంతో ప్రయోగం పూర్తవడానికి 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ఇస్రో ఇలాంటి ప్రయోగాన్ని నిర్వహించనుండటం ఇదే తొలిసారి. ఒకే రాకెట్‌ ద్వారా పలు ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రోకు కొత్త కాకపోయినా.. ఒకే రాకెట్‌తో పలు శాలైట్లను భిన్న క్షక్ష్యల్లో ప్రవేశపెట్టడమే కొత్త ప్రక్రియ. ఇందుకోసం మల్టిపుల్‌ బర్న్‌ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. పీఎస్ఎల్వీ -సీ 35 రాకెట్‌లో ఘన, ద్రవ ఇంధనాలతో పనిచేసే నాలుగు దశలు ఉంటాయి. బహుళ ఉపగ్రహాలను విభిన్న కక్ష్యల్లో ప్రవేశపెట్టడానికి నాల్గవ దశను పలుమార్లు ఆఫ్‌ చేసి, ఆన్‌ చేస్తారు. సాధారణంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల ఎత్తు పెంచడానికి వీటి ఇంజిన్లను ఇలా ఆన్‌, ఆప్‌ చేస్తుంటారు. అయితే ఒకసారి ఆన్‌, ఆఫ్‌ చేసిన తర్వాత మరోసారి ఆన్‌, ఆఫ్‌ చేయడానికి మధ్య కొన్ని రోజుల విరామం ఉంటుంది. గతేడాది డిసెంబర్‌ 16న ఆరు ఉపగ్రహాలను ప్రయోగించినప్పుడు ఇస్రో ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరీక్షించింది.

నాలుగు నిమిషాల తర్వాత కక్ష్యలోని మరో ఏడు ఉపగ్రహాలు
పీఎస్ఎల్వీ -సీ 35 ద్వారా ముందుగా మనదేశ వాతావరణంతో పాటు, సముద్ర పరిశోధనలకు ఉద్దేశించిన స్కాట్‌శాట్‌-1ను కక్ష్యలో ప్రశేపెడతారు. 371 కిలో బరువున్న స్కాట్‌శాట్‌-1 ఉపగ్రహాన్ని 370 కి.మీ. ఎత్తులోని సన్‌ పోలార్‌ సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లోకి చేరుస్తారు. కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత పీఎస్‌ఎల్‌వీ నాలుగో దశ ఇంజిన్‌ను శాస్త్రవేత్తలు ఆఫ్‌ చేస్తారు. శ్రీహరికోట నుంచి బయలుదేరిన తర్వాత గంటా 22 నిమిషాల తర్వాత మళ్లీ ఆన్‌ చేస్తారు. ఇరవై సెకన్లపాటు మండిండి మరోసారి ఆఫ్‌ చేస్తారు. ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరిన రెండు గంటల 11 నిమిషాల తర్వాత ఇంజిన్‌ను మళ్లీ మండిస్తారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత నాలుగు నిమిషాలకు మరో ఏడు చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. వీటిలో అమెరికా, కెనడా, అల్జీరియా శాటిలైట్లతోపాటు మన దేశంలోని యూనివర్సిటీలకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి.

ఇంతకు ముందు 670 కి.మీ ఎత్తులో ఇరవై ఉపగ్రహాలు కక్ష్యలోకి
రాకెట్‌ ఇంజిన్‌ను ఆఫ్‌ చేసినప్పుడు అది ఒక ధృవం నుంచి మరో ధృవానికి ప్రరిభ్రమిస్తుంది. మధ్యలో ఇంజిన్‌ను మండించి, ఆఫ్‌ చేసినప్పుడు కక్ష్య మారుతుంది. విభిన్న కక్ష్యల్లో ప్రవేశపెట్టాల్సిన ఉపగ్రహాలను ఒకే రాకెట్‌తో ప్రయోగించడం వల్ల వ్యయాలు తగ్గుతాయి. ఇస్రో ఇంతకు ముందు 20 ఉప్రగ్రహాలను 670 కి.మీ. ఎత్తులోని పోలార్‌ సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. పీఎస్‌ఎల్‌వీ-సీ35 ప్రయోగం ద్వారా ఇప్పుడు మరో కొత్త అధ్యయానికి రంగం సిద్ధమయ్యింది. 

21:32 - September 25, 2016

నల్గొండ : జిల్లాలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం చెరువును సందర్శించడానికి వెళ్లిన ఎంపీని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎంపీ అయినప్పటినుంచీ ఇప్పటి వరకు తమ గ్రామానికి రాలేదని.. గ్రామం అభివృద్ధికి సహకరించడం లేదని నిలదీశారు. చెరువు కట్టను సరిగా నిర్మించలేదని మండిపడ్డారు.  

21:26 - September 25, 2016

కరీంనగర్ : మంత్రి కేటీఆర్ వాహనాన్ని సిరిసిల్ల జిల్లా సాధన ఐకాస నేతలు అడ్డుకున్నారు. సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేతలు నినాదాలు చేస్తూ గంగరావు పేట మండలం మల్లుపల్లి వద్ద కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్నారు. వీరితో పాటు స్థానికులు కూడా ఆందోళనలో పాల్గొని సిరిసిల్లాను జిల్లాగా ప్రకటించాలని నినాదాలు చేశారు. సమీపంలో వున్న ఆర్టీసీ బస్ అద్దాలు పగులగొట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ సంఘటనతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఆందోళన కారులతో పాటు మహిళలపై కూడా పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. లాఠీచార్జ్ పై ఆందోళన కారులు ధర్నా చేపట్టారు. కాగా ఆందోలన కారులను ఎటువంటి సమాధానం చెప్పకుండానే మంత్రి కేటీఆర్ వెళ్లిపోవటం గమనించాల్సిన విషయం.

మూసీలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు..

నల్గొండ : సూర్యాపేట మండలం కాసరాబాద్‌ వద్ద ఇద్దరు యువకులు మూసీనదిలో చిక్కుకున్నారు. ఆదివారం మూసీలో వరద ఉద్ధృతి తక్కువగా ఉండటంతో యువకులు చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే సాయంత్రం వరద ఒక్కసారిగా పెరగడంతో నదిలో చిక్కుకున్నారు. వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చీకటి కావడంతో యువకులను రక్షించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

మల్లన్న పాదాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు..

కర్నూలు : కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయానికి 1,95,568 క్యూసెక్కులకు చేరింది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 కాగా... ప్రస్తుతం 879.5 అడుగులకు చేరుకుంది. నాగార్జునసాగర్‌కు 66,541 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 500 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 1680 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరదనీరు పోత్తెటడంతో శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రలోని 7యూనిట్లు, ఎడమగట్టు విద్యుత్కేంద్రంలోని 5 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

మరో చరిత్ర సిద్ధమవుతున్న ఇస్రో..

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తన అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది. ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను నింగిలోకి పంపడంతో పాటు ఒకేసారి వేర్వేరు కక్ష్యలో వాటిని ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తొలిసారిగా ప్రయత్నిస్తున్నారు. సోమవారం ఉదయం 9.12 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ35 వాహకనౌకను నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి నింగిలోకి పంపనున్నారు. ఇందుకు సంబంధించి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం ఉదయం 9.12 గంటల నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది.

కేటీఆర్ వాహన ధ్వంసానికి యత్నం..

కరీంనగర్ : మంత్రి కేటీఆర్ వాహనాన్ని సిరిసిల్ల జిల్లా సాధన ఐకాస నేతలు అడ్డుకున్నారు. సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేతలు నినాదాలు చేస్తూ కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లింగాపురంలో ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ సంఘటనతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

19:57 - September 25, 2016

మెదక్ : జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి. జిల్లాలోని మంజీర నది ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతితో దిగువ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఈ ప్రాంత రైతులకు తెలంగాణ రాష్ట్రంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ పరిస్థితుల్లో.. స్థానికులు ప్రాణభయంతో పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రానికి తరలి వెళుతున్నారు.

అంతకంతకూ పెరుగుతున్న వదర ఉదృతి
వరదలతో మెదక్ జిల్లా జలదిగ్బంధమైంది. ముఖ్యంగా ముంపు గ్రామాల ప్రజలు వరదనీటితో విలవిలలాడుతున్నారు. ఏ చిన్న పనికైనా.. నీటి ప్రవాహాన్ని దాటుకు వెళ్లాల్సిన దుస్థితి. అంతకంతకూ పెరుగుతున్న ప్రవాహ ఉధృతిలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో నారాయణ్ ఖేడ్
జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతం తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ గౌడ్‌గావ్ జవ్వాడ గ్రామంలో మంజీరానది ప్రవహిస్తుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా సింగూరు జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో నీటి నిల్వ 25 టీఎంసీలకు చేరుకోవడంతో.. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు.

సాయగావ్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు తోడు.. కర్నాటకలోని సాయగావ్ ప్రాజెక్టు నుంచి కూడా వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గౌడ్‌గావ్ జవ్వాడ, ఔదత్‌పూర్‌, తదితర గ్రామాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. గడచిన ఐదు రోజులుగా ఆ గ్రామాల ప్రజలు విద్యుత్ సరఫరా లేక.. తాగడానికి నీరులేక.. తినడానికి తిండి లేక.. నానా అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాంతంలో పంట నష్టం కూడా భారీగానే ఉంది. కర్నాటక నుంచి తప్ప మరో మార్గం లేని రీతిలో ఈ ప్రాంతం జలదిగ్బంధంలో కూరుకుపోయింది. పరిస్థితి ఇంతదారుణంగా ఉన్నా అధికారులెవరు తమను ఇంతవరకు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బ్యాక్‌వాటర్‌ కూడా ఈ గ్రామాలను ముంచెత్తుతోంది. తమను ఇప్పటికైనా ఆదుకోవాలని సరిహద్దు ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 

19:53 - September 25, 2016

గుంటూరు : అరుణ్ జైట్లీ సూచనలమేరకు కేంద్ర,నాబార్ట్ అధికారులతో కలిసి ప్రాజెక్టు విషయం లో ముందుకెళ్తున్నామని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబు నాయుడు కృషి చేస్తుంటే కుంభకోణాలల్లో ఆరోపణలు ఎదుర్కొన్న కేవీపీ రామచంద్రరావు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవుసరముందని మంత్రి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయల్లో చేసిన అక్రమాలను వెల్లడించాలన్నారు.ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుని రాజకీయాలకు పాల్పడుతున్నారనీ ఆరోపించారు. ఆరోపణలు చేసినంత మాత్రాన అవినీతి చరిత్ర మాసిపోదని దేవినేని ఎద్దేవా చేశారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేవీవీ , జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. వీరిద్దరి అక్రమాలు తెలుగువారు ఎన్నటికీ మర్చిపోరన్నారు.

19:43 - September 25, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయనీ..వర్షాలకు ఎదురవుతున్న ఇబ్బందులకు అందరం కలిసి కట్టుగా వర్షాలపై పనిచేద్దామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ వానచుక్కనూ సేవ్ చేసిన భవిష్యత్తులో వాడుకునే చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిడ్ మానేరు వరద ఉధృతి పెరుగుతుండటంతో కరీంనగర్‌లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. ఎల్లంపల్లి వద్ద గోదావరిలో దాదాపు 4లక్షల క్యూసెక్కుల వరద వస్తోందన్నారు. వరద ఉధృతికి అనుగుణంగా ఎప్పటికపుడు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తుగా చాలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎస్పాఎస్పీ ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని వానేరు వాగు నుండి విడుదల చేసినట్లుగా మంత్రి పేర్కొన్నారు. వాన నీటిని కాపాడుకుంటేనే రైతులకు మేలు చేయగలుగుతామన్నారు. 

రెండు కార్లు ఢీ ..4గురికి గాయాలు..

హైదరాబాద్ : ఘట్ కేసర్ మండలం నారపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు వేగంగా ఢీకొనటంతో ఓ కారులో వున్న నలుగురు వ్యక్తులు కారులోనే చిక్కుకుపోయారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కార్లు రెండూ వేగంగా ఢీకొనటంతో ఓ కారులో వున్న గ్యాస్ కిట్ పేలిపోయింది. దీంతో కారులో మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. ఒక కారులో నలుగురు..మరొక కారులు ముగ్గురు వ్యక్తులు వున్నట్లుగా తెలుస్తోంది. గాయపడినివారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.వీరి పరిస్థితి విషమంగా వున్నట్లుగా సమాచారం.

19:01 - September 25, 2016

గుంటూరు : ఏపీ తాత్కాలిక సచివాలయం సరికొత్తగా ముస్తాబవుతోంది.... అక్టోబర్‌ 3నుంచి పూర్తిస్థాయి పాలనకు అంతా సిద్ధమైంది.. కొత్త భవనాల్లో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంతా ప్లాన్‌ ప్రకారం అధికారులు ఏర్పాట్లు చేశారు.. సచివాలయానికి సంబంధించి పూర్తి వివరాలతో 10 టీవీ గ్రౌండ్‌ రిపోర్ట్..

అక్టోబర్‌ 3నుంచి వెలగపూడిలో పూర్తిస్థాయి పాలన
ఏపీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు దగ్గరకొస్తోంది.. విభజన తర్వాత సొంత రాష్ట్రంనుంచి పాలనకు అంతా సిద్ధమైంది.. అక్టోబర్‌ 3నుంచి గుంటూరు జిల్లా వెలగపూడిలో పూర్తిస్థాయి పాలన ప్రారంభం కాబోతోంది.. పాలనకు సంబంధించి అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేశారు.. తాత్కాలిక సచివాలయంలో 5 భవనాల నిర్మాణాన్ని పూర్తిచేసిన అధికారులు... మరో భవనాన్నికూడా డిసెంబర్‌నాటికి అందుబాటులోకి తేబోతున్నారు..

దసరా నాటికి సీఎం చంద్రబాబు
కొద్ది నెలలుగా హైదరాబాద్‌నుంచి వెలగపూడికి కార్యాలయాల షిఫ్టింగ్ కొనసాగుతోంది.. పూర్తిగా తరలిపోయిన శాఖల కార్యాలయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి... ఆయా శాఖల మంత్రులుకూడా తమ పనులను ఇక్కడి నుంచి కొనసాగిస్తున్నారు.... మిగిలినవారు అక్టోబర్‌ 3నుంచి పాలనకు రెడీ అవుతున్నారు.. దసరారోజు సచివాలయంలో అడుగుపెట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంతో.. సీఎం బిల్డింగ్ పనులుకూడా వేగంగా నడుస్తున్నాయి..

సర్వం సిద్ధం
వెలగపూడిలో ఉద్యోగులు ప్రశాంతంగా పనులు చేసుకునేందుకు అధికారులు అన్నీ ముందే సిద్ధం చేశారు.. ముఖ్యకార్యదర్శుల పక్కనే ఆయా శాఖల ఉద్యోగులకు విడి విడిగా చాంబర్లు కేటాయించారు.. క్యాబిన్‌లో కంప్యూటర్లుకూడా ఏర్పాటు చేశారు.. కొత్త సచివాలయంలో అపరిచితులు ప్రవేశించకుండా సెక్యూరిటీ సిస్టమ్‌కూడా పకడ్బందీగా రూపొందించారు.. ప్రతి బిల్డింగ్‌లోకి ప్రవేశించేముందు ఎంట్రన్స్ వద్దే చెకింగ్‌ పాయింట్స్ ఉన్నాయి.. మెటల్‌ డిటెక్టర్‌తోపాటు సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడికివచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు.. ఈ వ్యవస్థతోపాటు... అనుకోని ప్రమాదాలువస్తే వెంటనే బయటకు వెళ్లేలాకూడా ఏర్పాట్లు చేశారు.. ఉద్యోగులను అలర్ట్ చేసేలా కొత్త టెక్నాలజీతో సైరన్‌ మిషన్లు బిగించారు..

భవనాల మధ్య మొక్కలతో పచ్చదనం
సచివాలయం అంటేనే మంత్రుల, అధికారులు, సమీక్షలు ఎప్పటికీ నడుస్తూ ఉంటాయి.. ఈ భవనాల్లోనూ సమీక్షలకు ఎలాంటి ఇబ్బందికలగకుండా కాన్ఫరెన్స్ హాల్‌కూడా సిద్ధం చేశారు.. ఈ ఏర్పాట్లతోపాటు... సచివాలయం అలంకరణకుకూడా ప్రాముఖ్యత ఇచ్చారు.. బిల్డింగ్ మధ్యలో పచ్చదనం కనిపించేలా పలురకాల డిజైన్లతో మొక్కలు పెంచుతున్నారు.. ఇక భవనాల లోపలకూడా నీట్‌గా ఉండేలా... చూడగానే ఆకట్టుకునేలా ఫ్లోర్ మొత్తం టైల్స్‌తో నిర్మించారు.. వీటిని పరిశుభ్రంగా ఉంచేందుకు కార్మికులను నియమించారు.. సచివాలయంలో ఈ సౌకర్యాలతోపాటు ఉద్యోగులు, టిఫిన్స్, భోజనాలు చేసేందుకు డైనింగ్‌ హాల్స్‌ తయారుగా ఉంచారు.. మూడో బిల్డింగ్‌లో క్యాంటీన్‌ కూడా రెడీ అయింది.. అటు పూర్తిస్థాయి పాలనకుముందే ఇక్కడికి చేరుకోవడానికి రోడ్ల నిర్మాణం పూర్తయింది.. భవనాలమధ్య అనుసంధానంతోపాటు అంతర్గత రహదారులుకూడా నిర్మించేశారు..

సిటీ స్టైల్ చెఫ్‌లతో ప్రత్యేక వంటకాలు
హైదరాబాద్‌లో అయితే ఉద్యోగులు ఇంటినుంచి క్యారేజ్‌ తెచ్చుకోకపోయినా చుట్టుపక్కల మంచి హొటల్స్‌లో తినేవారు.. అదే ఈ కొత్త సచివాలయంలోఅయితే లంచ్‌ బాక్స్‌ తెచ్చుకోకుంటే గుంటూరుకో, విజయవాడకో వెళ్లాలని ఉద్యోగులు టెన్షన్ పడ్డారు.. ఉద్యోగులకు ఈ సమస్య రాకుండా సచివాలయం సమీపంలో రెస్టారెంట్లు కూడా ముందే ప్రారంభించేశారు.... హైదరాబాద్‌, బెంగళూరువంటి మెట్రో సిటీ స్టైల్ హొటల్‌ చెఫ్‌లను ఇక్కడికి రప్పించి వంటకాలు సిద్ధం చేస్తున్నారు.. అక్టోబర్‌ 3నుంచి ఈ హొటళ్లలో బిజినెస్‌ ఊపందుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు..

ఏడాదికే సందడి చేసిన సచివాలయం
మొత్తానికి మరో వారం తర్వాత కొత్త సచివాలయం సందడిని సంతరించుకుంటుందని స్థానికులు భావిస్తున్నారు. శంకుస్థాపన చేసిన ఏడాదికే అమరావతి నుంచి పాలన ప్రారంభం అవుతుండడం పట్ల స్థానికుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది.

 

18:53 - September 25, 2016

విజయవాడ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగురాష్ట్రాల్లోని జలశయాలు నిండుకుండలా మారాయి. నాగార్జున సాగర్‌ మినహా జూరాల, శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు జలకళతో కళకళలాడుతున్నాయి. మరో వైపు ఎడతెరిపిలేని వర్షాలతో సాగర్‌ దిగువన వస్తున్న వరద అంతా సముద్రంలోకి వృథాగా పోతోంది.

జూరాలలో నీటిమట్టం 9.66 టీఎంసీలు
కుండపోతగా కురుస్తున్న వానలతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జలాశయాల్లోకి వరదనీరు పోటెత్తుతోంది. ఆలమట్టి నుంచి నారాయణపూర్‌ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చిచేరుతుంది. భారీ స్థాయిలో నీటిని జూరాలకు వదిలారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.32 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 2 లక్ష 5 వేల క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 2 లక్షల 5.217 క్యూసెక్కులుగా ఉంది. వరద ఉద్ధృతి పెరగడంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా శ్రీశైలానికి వదులుతున్నారు.

నిండుకుండలా శ్రీశైలం జలాశయం
శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం ప్రస్తుత నీటి మట్టం 878 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 1.74 లక్షల క్యూసెక్కులు ఔట్‌ఫ్లో 54,000 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రీశైలంకోకి మరో 45 టీఎంసీల నీరు వస్తే.. డ్యాం నిండుతుంది. అయితే దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం అంతంత మాత్రంగానే ఉంది. ఇన్‌ఫ్లో 69 వేల 163 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ఫ్లో 1350 క్యూసెక్కులకు చేరింది.

పులకిరిస్తున్న పులిచింతల
పులిచింతల జలాశయంలో పూర్తి స్థాయిసామర్థ్యం 47.22 టీఎంసీలు. 30 టీఎంసీలే నిల్వ ఉంచి మిగతా నీటిని కిందకు వదిలేస్తున్నారు. పులిచింతలలోకి 1,05,476 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు వదిలేస్తున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద 1,51,943 క్యూసెక్కుల నీటిని గేట్లు ఎత్తి సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. కాలువలకు 7,683 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. 30 గేట్లు నాలుగు అడుగుల మేర, మరో 40 గేట్లు మూడు అడుగుల మేర ఎత్తి నీటిని వదిలిపెడుతున్నారు.

 

18:47 - September 25, 2016

నిజామాబాద్ : ఈ నెల 23న నిజామాబాద్‌లోని వేల్పూరు మండలం పడగల్ గ్రామం వద్ద నవాబు చెరువు అలుగు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ప్రియాంక మృతదేహం లభ్యమైంది. శుక్రవారం రాత్రి వేల్పూరు నుంచి పడగల్ గ్రామానికి కారులో వెళ్లుతుండగా వరద ప్రవాహం ఎక్కువ కావటంతో కారు దిగుతూ ప్రియాంక, ఆమె కుమారుడు గల్లంతయ్యారు.. ఆమె కుమారుడు మృతదేహం మాత్రం ఇంతవరకు లభ్యం కాలేదు.. 

18:45 - September 25, 2016

నల్లగొండ : చుట్టూ కొండలు.. ఆ కొండలపై నుంచి జాలువారుతున్న సెలయేటి గలగలలు. ఆ పక్కనే పచ్చని చెట్లతో నయనానందరకరమైన ప్రకృతి సోయగాల అందాలు. కృష్ణమ్మ ఒడిలోకి చేరేందుకు బిరాబిరా పరుగులు పెడుతున్న వరద నీరు.. నయాగరా జలపాతాన్ని తలపిస్తోంది. ఎత్తైన కొండ ప్రాంతం నుంచి పరవళ్లు తొక్కుతున్న నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు. మన చెంతనే మరో నయాగరా జలపాతం వెలసిందంటూ స్థానికులు తెగ సంబరపడిపోతున్నారు.

పచ్చల హారంగా ..ఎత్తైన కొండ ప్రాంతం నుంచి జాలువారే సెలయేటి సవ్వడులు..పచ్చని ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరిస్తున్న లోయల సోయగాలు...కనురెప్ప వాల్చకుండా తనివి తీరా చూసినా మళ్లీ చూడాలన్పించే జలపాత దృశ్యాలు

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
భారీ వర్షాలతో జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ గలగలలతో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ సమీపంలోని ఎత్తిపోతల జలపాతం ..నయాగరా జలపాతాన్ని తలపించేలా జలసిరులతో హోరెత్తుతోంది. దాదాపు 75 మీటర్ల ఎత్తైన కొండప్రాంతం నుంచి భారీ ఎత్తున వరద నీరు జాలువారుతుండటంతో ఈ జలపాతం ఇప్పుడు పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.చుట్టూ కొండల మధ్య.. ఎత్తైన ప్రదేశం నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహంతో గలగల పారే సెలయేటి సవ్వడులు స్థానికులు, పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. సుందరమైన ప్రకృతి దృశ్యాలతో ఎత్తిపోతల జలపాతం మరో నయాగరాను తలపిస్తోందని పర్యటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆస్వాదిస్తున్న పర్యాటకులు
అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదించేందుకు పర్యటకులు వస్తున్నారు. ఇంతటి సుందరమైన ప్రకృతి సోయగాలు పర్యటక రంగానికే వన్నె తెస్తున్నాయని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలంతా ఎత్తిపోతల జలపాతాన్ని దర్శించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నల్లమల కొండల మధ్య ఉరుకులు పరుగులతో హోరెత్తుతున్న ఎత్తిపోతల జలపాతం అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల వారికి అనువుగా ఆకట్టుకుంటోంది.

18:41 - September 25, 2016

హైదరాబాద్ : ఘట్ కేసర్ మండలం నారపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనటంతో ఓ కారులో వున్న నలుగురు వ్యక్తులు కారులోనే చిక్కుకుపోయారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కార్లు రెండూ వేగంగా ఢీకొనటంతో ఓ కారులో వున్న గ్యాస్ కిట్ పేలిపోయింది. దీంతో కారులో మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. ఒక కారులో నలుగురు..మరొక కారులు ముగ్గురు వ్యక్తులు వున్నట్లుగా తెలుస్తోంది. కారులో చిక్కుకున్నవారిలో కొందరిని అతికష్టం మీద బైటకు తీసిన స్థానికులు అంబులెన్స్ లో ఘట్ కేసర్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా కారులో చిక్కుకున్న వారిలో ఒకరు మృతి చెందినట్లుగా సమాచారం. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం నిమిత్తం పూర్తి సమాచారం తెలియాల్సివుంది.

18:21 - September 25, 2016

పశ్చిమగోదావరి : తుందుర్రులో పోలీసుల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. అక్వాఫుడ్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు గత 15 రోజుల నుండి ఆందోళన కొనసాగిస్తున్నారు. భీమవరం మండలం తుందుర్రులో గోదావరి ఆక్వాఫుడ్‌ పార్క్ నిర్మాణాన్ని ఆపాలంటూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు..ఫ్యాక్టరీతో గొంతేరు కాలువ కలుషితం అవుతుందంటూ నిరసన చేపట్టారు..వారిని పరామర్శించేదుకు వెళ్ళిన ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవిని, సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.తుందుర్రు పరిధిలోని గ్రామాలలో ఐద్వా తరపున రమాదేవి పర్యటించారు. వారి కష్టసుఖాలనుతెలుసుకున్నారు. పర్యటన అనంతరం వారు ఓ ఇంట్లో వారు భోజనం చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

'నిర్మాణం వద్దు..మా పొట్ట కొట్టద్దూ'
అక్వా ఫుడ్ ఫ్యాక్టరీ మా కొద్దు..మా జీవితాలను నాశనం చేయొద్దు అని భీమవరం మండలం తుండుర్రు గ్రామస్తులు పేర్కొన్నా ఫ్యాక్టరీ యాజమాన్యం పెడచెవిన పెట్టింది. ఏడాదిన్నరగా వారు విజ్ఞప్తులను బేఖాతర్ చేశారు. పచ్చగా కళకళలాడే పొలాలు..అక్వా సాగుతో ఉండే ఈ గ్రామంలో ఫ్యాక్టరీ వద్దని..మూడు గ్రామాల మధ్యన ఈ ఫ్యాక్టరీ వద్దని వారు పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్ల కాలుష్యం వెదజల్లుతుందని..గ్రామాలను ఖాళీలను చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని గ్రామస్తులు కోరారు. 'నిర్మాణం వద్దు..మా పొట్ట కొట్టద్దూ' అని నినాదాలు చేశారు.

18:02 - September 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ పల్లెల్లో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. భారీ వర్షాలతో గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. గిరిజనతండాల్లో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. విషజ్వరాలు, టైఫాయిడ్‌, డెంగ్యూతో పల్లెప్రజలు విలవిల్లాడుతున్నారు. నల్లగొండ జిల్లాలో సీజనల్‌ వ్యాధులతో జనం గజగజా వణుకుతున్నారు.

నల్లగొండజిల్లాలోని బీబీనగర్‌ మండలంలో ప్రబలుతున్న వ్యాధులు
తెలంగాణపల్లెలు వ్యాధులతో వణికిపోతున్నాయి. పలు గ్రామాలు గిరిజన తండాలలో డెంగ్యూ ప్రతాపాన్ని చూపుతోంది. నల్లగొండజిల్లాలోని బీబీనగర్‌ మండలంలోని పలు గిరిజన తండాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆరోగ్య శాఖ చోద్యం చూస్తుండడంతో నెమురగోముల గ్రామం పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.

నెమురుగోముల గ్రామంలో పడకేసిన పారిశుద్ధ్యం
నెమురుగోముల గ్రామంలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. విషజ్వరాలతో జనం గజగజవణుకుతున్నారు. సాధారణ జ్వారాల మాదిరిగా వచ్చి మంచానికే పరిమితమయ్యేలా మార్చేస్తున్నాయని వాపోతున్నారు బాధితులు. వైద్యాధికారులు ఇటువైపు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాలలో వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలంటున్న గ్రామస్థులు
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి.. వ్యాధుల బారి నుంచి తమను కాపాడాలని నెమరుగోముల గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

17:55 - September 25, 2016

మెదక్ : గత కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని వానలు ముంచెత్తుతున్నాయి.దీంతో పలు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్థమయిపోయింది. పలు ప్రాంతాలకు వాహనరాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. ఈ నేపథ్యంలోనే మెదక్‌ కంగ్టి మండలం నాగూర్‌ గ్రామంలో ఇల్లు కూలి వ్యక్తి మృతి చెందాడు.... భారీ వర్షాలతో మొత్తం నియోజకవర్గంలో 283ఇళ్లు ధ్వంసమయ్యాయి.. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇళ్లన్నీ నానిపోయి కూలిపోతున్నాయి.. ఈ ఇళ్ల బాధితులందరికీ నష్టపరిహారం అందిస్తామని తహశీల్దార్‌ తెలిపారు..

అదరగొట్టిన టీమిండియా..

ఉత్తరప్రదేశ్ : భారత్, న్యూజిలాండ్ జట్ల మద్య జరుగుతున్న ప్రతిష్టాత్మక 500వ టెస్ట్ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసింది. సెకండ్ ఇన్నింగ్స్‌ను భారత్ 377/5 వద్ద డిక్లేర్డ్ చేసింది. అయితే తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆటగాళ్లను అశ్విన్ మూడు వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో అశ్విన్ 37 టెస్టుల్లోనే 200 వికెట్ల మైలురాయిని చేరుకుని రికార్డ్ సృష్టించాడు. నాలుగో రోజు 37 ఓవర్లు పాటు ఆడిన కివీస్ 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. దీంతో రేపు చివరి రోజు కావడంతో భారత్ గెలవడానికి ఇంకా ఆరు వికెట్లు పడగొట్టాల్సి ఉంది.

ఎట్టకేలకూ రోడ్ల మరమ్మత్తులు..

హైదరాబాద్ : ఇలీవల కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని రోడ్లు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రోడ్ల పరిస్థితిపై అటు విపక్షాలు, ఇటు ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వర్షానికి దెబ్బతిన్న నగర రోడ్ల మరమ్మతులను ఎట్టకేలకూ జీహెచ్‌ఎంసీ మొదలుపెట్టింది.
మరమత్తులకు రూ.100కోట్ల ఖర్చు

17:24 - September 25, 2016

వర్షం దెబ్బ నుంచి ఇంకా భాగ్యనగరం కోలుకోలేదు. పలు కాలనీల్లో ఇంకా నీళ్లు నిలిచే ఉన్నాయి. కూకట్‌పల్లి బండారి లేఅవుట్‌, ధరణినగర్‌ వాసులు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తమ కాలనీలో నిలిచివున్న నీళ్లను వెంటనే తొలగించాలని మహిళలు రోడ్డెక్కారు. తమకు ఆహార పదార్థాలు అవసరం లేదని... నీరు కాలనీ లోకి రాకుండా.. చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాము ఆందోళనకు దిగితే... మహిళలని కూడా చూడకుండా...నెట్టివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి మహేందర్ రెడ్డి... సత్వరమే సహాయక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. 

17:14 - September 25, 2016

అక్రమ నిర్మాణల కూల్చివేతకు రంగం సిద్దం..

హైదారాబాద్:నగరంలో నాలాలు ఆక్రమించి ఇళ్లు కట్టినవారిపై కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధమైంది. నగరంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఒక ప్లాన్ ప్రకారం నగరంలోని అక్రమకట్టడాలను తొలగిస్తామని జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ, ఇప్పటికే అక్రమ కట్టడాలను కొన్ని తొలగించామని అన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి కోర్టుకు వెళ్లిన వాటిపై యోచిస్తున్నామమని పేర్కొన్నారు.

కాలికట్.. కోజికోడ్ అయింది : మోదీ

కేరళ : కేరళలోని కోజికోడ్ లో జరుగుతున్న చివరి రోజు బీజేపీ జాతీయ మండలి సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘కాలికట్.. కోజికోడ్ అయింది. భారతీయ జన సంఘ్ నుంచి మేము భారతీయ జనతా పార్టీగా మారాం. అధికారం కోసమే ప్రయత్నం చేసి ఉంటే.. రాజకీయ యాత్రలో మేమూ రాజీ పడేవాళ్లం. రాజకీయ నేతల జీవితాల్లో విలువలు పడిపోయానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొందరు రాజకీయ నేతల్లో మంచివారుకూడా వున్నారని పేర్కొన్నారు. 

బీజేపీ కార్యాలయంపై బాంబ్ దాడి..

తమిళనాడు : దిండిగల్ లోని బీజేపీ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబు దాడి చేశారు. ఈరోజు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ సంఘటనలో ఒకరు గాయపడగా, కార్యాలయం స్వల్పంగా ధ్వంసమైంది. బీజేపీ నాయకులకు సంబంధించిన ఒక కారును, పార్టీ జెండాను దుండగులు తగులబెట్టినట్లు పోలీసులు తెలిపారు.

నదిలో పడ్డ బస్..24మంది మృతి..

కశ్మీర్‌ : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని నౌషహ్రీ వద్ద మినీ బస్సు నదిలో పడిపోవడంతో 24 మంది మృతి చెందారు. రోడ్లు బాగాలేకపోవడం, డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బస్సు నీలం నదిలో పడిపోయింది. నది లోతుగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగింది. మృత దేహాలు నదిలో కొట్టుకుపోయాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ రాజధాని ముషరాబాద్‌కు ఘటనా స్థలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.

16:52 - September 25, 2016

కేరళ : రాజకీయ నేతల జీవితాల్లో విలువలు పడిపోయానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొందరు రాజకీయ నేతల్లో మంచివారుకూడా వున్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత రాజకీయ నేతల జీవితాల్లో మార్పు వచ్చింది. కేరళలోని కోజికోడ్ లో జరుగుతున్న చివరి రోజు బీజేపీ జాతీయ మండలి సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘కాలికట్.. కోజికోడ్ అయింది. భారతీయ జన సంఘ్ నుంచి మేము భారతీయ జనతా పార్టీగా మారాం. అధికారం కోసమే ప్రయత్నం చేసి ఉంటే.. రాజకీయ యాత్రలో మేమూ రాజీ పడేవాళ్లం. ఏళ్ల తరబడి విపక్షంలో ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. స్వాతంత్ర్య పోరాట సమయంలో నేతల జీవితాలు ఆదర్శంగా వుండేవని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. 

16:44 - September 25, 2016

ఫ్రాన్స్ : ఏ క్రీడలో అయినా పాత రికార్డ్స్ బద్దలవ్వడం...సరికొత్త ప్రపంచ రికార్డ్స్ నమోదవ్వడం సర్వసాధారణమే. ఎడ్వంచరస్‌ స్పోర్డ్స్ లోనూ ఎప్పటికప్పుడూ పాత రికార్డ్స్ తెరమరు కావడం...కొత్తరికార్డులు తెరమీదకు రావడం మామూలు విషయంగా మారిపోయింది. ఫ్రెంచ్‌ ఆల్ప్స్ పర్వతాల్లో 17 ఏళ్ల స్టంట్‌ స్పెషలిస్ట్ పాబ్లో సినోరెట్‌ చేసిన డేర్‌డెవిల్‌ ఫీట్‌..సాహసక్రీడల ప్రపంచంలోనే హాట్‌టాపిక్‌గా నిలిచింది.ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కాని స్టంట్ ప్రదర్శించడం మాత్రమే కాదు హై లైనింగ్‌లో ప్రపంచరికార్డ్ సైతం నమోదు చేసి తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు.

17 ఏళ్ల ఫ్రెంచ్‌ స్టంట్‌ స్పెషలిస్ట్‌ పాబ్లో సినోరెట్‌ ప్రపంచరికార్డ్
హై లైన్‌ వాకింగ్‌...ఎడ్వంచర్స్ స్పోర్ట్స్ వరల్డ్ లోనే అత్యంత క్లిష్టమైన స్టంట్.ఐగ్విల్లీ డిబోనా ఫ్రాన్స్ ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లోనే అత్యంత పొడవైన పర్వతాల్లో ఒకటి. ఐగ్విల్లీ డిబోనా ఎత్తు 3131 మీటర్లు.ఇదే పర్వతంపై 17 ఏళ్ల ఫ్రెంచ్‌ స్టంట్‌ స్పెషలిస్ట్ పాబ్లో సినోరెట్‌ ఆల్ఫ్స్ పర్వతాల్లో పెద్ద సాహసమే చేశాడు. బ్రెజిల్‌ ప్రొఫెషనల్‌ స్లాక్‌ లైనర్‌ రాఫెల్‌ బ్రిడీతో కలిసి ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కాని స్టంట్ ప్రదర్శించాడు.

3131 మీటర్ల ఎత్తులో హైలైన్‌ వాకింగ్‌ చేసిన పాబ్లో
ఎత్తైన కొండ మీద నుండి ఒక్కసారి కిందకు చూడాలంటేనే కళ్లు తిరుగుతాయి. అలాంటిది ఏకంగా 10272 అడుగుల ఎత్తు నుండి ఒక కొండ మీద నుండి మరో కొండ మీదకు తాడుపై నడవడమంటే...మాటలు కాదు. ఇటువంటి స్టంట్‌ చేయడానికి గట్స్‌ ఉండి తీరాల్సిందే. 3131 మీటర్ల ఎత్తులో రెండు కొండల మధ్య వేలాడదీసిన తాడుపై....నడిచాడు. అది కూడా 200 మీటర్లు. తాడుపై శరీరాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ రికార్డ్‌ లెవల్లో 200 మీటర్ల దూరం నడిచి ప్రపంచ రికార్డ్‌ సృష్టించాడు. ఎ మాత్రం తడబడకుండా.....ఎక్కడా బాలెన్స్ కోల్పోయుండా హైలైన్‌ వాక్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరచాడు.

వరల్డ్ లోనే హాట్‌టాపిక్‌..
డేర్‌ డెవిల్‌ స్టంట్‌ ప్రదర్శించడం మాత్రమే కాదు హై లైన్‌ వాకింగ్‌ సరికొత్త ప్రపంచరికార్డ్ సైతం నమోదు చేసి పాబ్లో సినోరెట్‌ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం పాబ్లో చేసిన స్టంట్‌ ఎడ్వంచరస్‌ స్పోర్డ్స్ వరల్డ్ లోనే హాట్‌టాపిక్‌గా మారింది. 

16:32 - September 25, 2016

గుంటూరు : ఇటీవల వర్షాలకు సర్వస్వం కోల్పోయిన గుంటూరు జిల్లాలోని బాధితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. కొండవీటి వాగుపై ఏరియల్ సర్వే ద్వారా నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించారు.. వర్షాలతోనీట మునిగిన దాచేపల్లిని పరిశీలించారు. అనంతరం గుంటూరులో వరద సహాయక చర్యల్ని సీఎం చద్రంబాబు పరిశీలించనున్నారు. 36లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఇప్పటికే అధికారులు అంచనా వేసి నివేదికను సిద్ధం చేశారు. అధికారులు ఇచ్చే  నివేదికను బాబు పరిశీలించి వరదలతో వాటిల్లిన  ఆస్తినష్టంపై  కేంద్రానికి నివేదికను  పంపించనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రులు పుల్లారావు, రావెల, దేవినేని ఉన్నారు. ఈరోజు సాయంత్రం గుంటూరు కలెక్టరేట్‌లో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

16:23 - September 25, 2016

హైదరాబాద్ : దేశంలో రిజర్వేషన్లను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే చెప్పారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జనాభాలో 77 శాతం ఉన్న ఎస్పీ,ఎస్టీ, బీసీలు 49.5 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారని, 23 శాతం ఉన్న ఇతరులు 50 శాంత అవకాశాలను దక్కించుకుంటున్నారన్నారు. మరోవైపు మహారాష్ట్రలో విదర్భ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌కు సాకారమయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోడ్పాడు అందించాలని రాందాస్‌ అథవాలే కోరారు. తన నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా విదర్భ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నదని రాందాస్‌ చెప్పారు. 

16:04 - September 25, 2016

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసు నీరుగారుతోందా..? వెలుగులోకి వస్తున్న మరికొందరు అధికారులు, నేతల పేర్లను బయటకు రానీయకుండా జాగ్రత్తలు పడుతున్నారా..? నయీంతో సంబంధాలున్నట్లు గుర్తించిన నాయకుల విషయంలో ఎంక్వరీ జరగడం లేదా..? సిట్‌ అధికారుల విచారణకు అడ్డుపడుతున్నది ఎవరు? ఈ కేసులో ఒత్తిళ్లు వస్తున్నాయా..? అసలేం జరుగుతోంది.....????

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసును నీరుగారుస్తున్నారా...
వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిపిన గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో సిట్‌ అధికారులు చేపట్టిన విచారణ నీరుగారుతోందా..? కొద్ది రోజులు మాత్రమే సంచలనం సృష్టించిన ఈ కేసును ఇక పట్టించుకోవడం లేదా..? తవ్వినకొద్దీ వెలుగులోకి వస్తున్న పోలీస్ అధికారుల పేర్లు బయటకు రాకుండా చూస్తున్నారా..? నయీంతో సంబంధాలున్న నాయకులను విచారించేందుకు వెనకాడుతున్నారా? సరైన ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నామని సిట్‌ అధికారులు చెబుతున్నారు. నేతల లాబీయింగ్‌తో విచారణ చేపట్టేందుకు వెనకాడుతున్నారనే అరోపణలు వినిపిస్తున్నాయి.

100కేసులు నమోదు..9.మంది అరెస్ట్
ఇప్పటి వరకు వివిధ పోలీస్ స్టేషన్లలో 100 కేసులు నమోదయ్యాయి. 90 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో అక్రమ ఆయుధాలు, డ్రగ్స్, భూ దందాలకు చెందిన కేసులున్నాయి. అయితే అండదండలు అందించిన నేతలెవ్వరినీ వదిలిపెట్టమని ప్రభుత్వం చెబుతున్నా..సిట్‌ విచారణలో జాప్యం అనేక అనుమానాలకు తావిస్తోంది. 20 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సిట్ చెప్పినా..చర్యలు తీసుకునేందుకు ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.

అనుమానాలకు తావిస్తున్న సిట్‌ విచారణ జాప్యానికి కారణమేంటి?
పోలీస్ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు సిట్ నుంచి నోటీసులు వస్తాయని వార్తలు రావడంతో.. నయీంతో లింకులున్న వారు అప్రమత్తమైనట్లు సమాచారం. నోటీసులు జారీ కాకుండా ఆలస్యం చేసేందుకు భారీ స్థాయిలో పైరవీలు చేయించుకుంటున్నారన్న ప్రచారం వినిపిస్తోంది. పోలీస్ శాఖలో అడిషనల్ డీ.జీ స్థాయి అధికారి....టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక నేత ద్వారా అప్పటి పరిస్థితులు...నయింతో సంబంధాలను వివరించి తనపై చర్యలు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది. మరికొందరు నేతలు తమపై కేసులు పెట్టిన వారికి డబ్బులు తిరిగి ఇచ్చి..అధిష్టానం ముందు ఈ కేసుతో సంబంధం లేదని వారితోనే చెప్పించి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నయీంకు అండదండలు అందించిన ఓ అడిషనల్ ఎస్పీ..తాను అరెస్ట్ అయితే అన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఢిల్లీ నుంచి ఫైరవీలు చేయించుకుంటున్నాడట.

నోటీసులు రాకుండా పైరవీలు చేయిస్తున్నది ఎవరు?
సాక్ష్యాధారాలు లేవని..ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలో ప్రభుత్వం నుంచి సిగ్నల్స్ అందేవరకు వేచిచూడాలనే ధోరణిలో సిట్‌ ఉన్నట్లు తెలుస్తుంది. నయింతో సంబంధం ఉన్న నేతలు, పోలీస్‌ బాసుల పైరవీలు సిట్‌ దూకుడుకు బ్రేకులు వేస్తున్నట్లు సమాచారం.

 

15:55 - September 25, 2016

మెదక్ : హత్నూర్ మండలం రెడ్డిఖానాపూర్‌ గ్రామ సమీపంలో బైకుపై వెళ్తున్న వాహనదారుడు గల్లంతయ్యాడు. నర్సాపులం మండలం జక్కపల్లికి చెందిన ఆంజనేయులు గౌడ్, చంద్రయ్య విధులకు బైకుపై వెళ్తుండగా రెడ్డి ఖానాపూర్‌ వద్ద రోడ్డుపై వరద ఉద్ధృతంగా ప్రవహించింది. రోడ్డు దాటుతుండగా బైకుతో సహా ఆంజనేయులు గౌడ్‌ కొట్టుకుపోయాడు. చంద్రయ్య ఈదుకుంటూ బయటపడ్డాడు. స్థానికుల సాయంతో గల్లంతైన వ్యక్తికోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులు, అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. 

15:51 - September 25, 2016

కరీంనగర్ : మరోవైపు ఎస్సారెస్పీలో 85 టీఎంసీల నీటినిల్వను స్థిరంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం వస్తుండటంతో దానికి అనుగుణంగా ఎస్సారెస్పీ నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుంది... దీంతో ఉదయం నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మహారాష్ట్రలో వర్షాలు, వరదల పరిస్థితిపై అక్కడి నీటిపారుదల శాఖ మంత్రి గిరిష్‌ మహాజన్‌తో.. హరీష్‌రావు మాట్లాడారు. ఎన్ని రోజుల పాటు.. ఎంత మేరకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందో తెలుసుకున్నారు. ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తుండటంతో ప్రాజెక్టుల వద్ద ఇరిగేషన్‌ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

15:42 - September 25, 2016

హైదారబాద్ : రేపు జరగనున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం రద్దైంది. వరదల నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని సీఎం కేసీఆర్ రద్దుచేశారు. జిల్లాలలో ఉండి పరిస్థితులను సమీక్షించాలని మంత్రులను ఆదేశించారు. గోదావరి నదికి ఉద్ధృతి పెరుగుతుండడంతో కరీంనగర్,నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు. 

దాచేపల్లికి బాబు వరాలు..

గుంటూరు: దాచేపల్లికి సీఎం చంద్రబాబు నాయుడు వరాలు ప్రకటించారు. దాచేపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.10 కోట్లు మంజూరు చేశారు. ఇళ్లు పూర్తిగా కోల్పోయిన వారికి రూ.95 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకి రూ. 5వేల ఆర్థికసాయం ప్రకటించారు. వరదనీరు వచ్చిన ప్రతి ఇంటికీ నిత్యావసర సరుకులతో పాటు, రూ.3,500 నగదును చంద్రబాబు ప్రకటించారు. ఆదివారం కొండవీటి వాగుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. నీట మునిగిన దాచేపల్లిని పరిశీలించిన అనంతరం వరదబాధితులను పరామర్శించారు.

15:26 - September 25, 2016

కరీంనగర్ : అప్పర్‌ మానేరు, సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మిడ్‌మానేరుకు భారీగా వరద ఉధృతి పెరిగింది. రెండు లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. కట్టకు గండి పడి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మన్వాడ, పుత్తూరు, మల్లాపూర్‌, కందికట్కూరు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నాలుగు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి హరీష్‌రావు స్వయంగా పరిశీలిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది లోతట్టు ప్రాంతాలకు చేరుకున్నాయి. మిడ్ మానేరు పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిమిత్తం సేకరించిన భూమికి తగిన నష్టపరిహారం ఇవ్వాలంటూ ఈ సందర్బంగా మంత్రిని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే నష్టపరిహారం అందించామని మంత్రి చెప్పినా స్థానికులు వినకుండా పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇస్తేనే ఆ ప్రాంతం నుండి కదలుతామనటంతో డిమాండ్ చేయటంతో మంత్రి హరీష్ రావు అన్నివిధాలా న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇవ్వటంతో స్థానికులు శాంతించారు. వరదలపై పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. అధికారులను ముందస్తుగా అలర్ట్ చేశామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా వరద పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.

 

15:08 - September 25, 2016

కరీంనగర్: మిడ్ మానేరుకు వరద పోటెత్తింది. దీంతో అదికారులు దిగువ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.నాలుగు రోజులుగా కురుస్తోన్నవర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ మానేరు నుంచి నీటిని వదులుతుండటంతో మిడ్‌మానేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పరిస్థితిని పరిశీలించేందుకు మంత్రి ఈటెల మానేరు వాగు ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రిని  స్థానికులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు నిమిత్తం సేకరించిన భూములకు ఇంతవరకూ తమకు  పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించలేదని ..తమకు న్యాయం చేయాలంటూ నిర్వాసితులు ఈటెలను అడ్డుకున్నారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కాగా మానేరు వాగుకు వరద నీరు పెరిగితే చుట్టుప్రక్కల గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని మానేరు వాసులు డిమాండ్  చేశారు. ఈ  నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు చొరవ తీసుకుని స్థానికులను శాంతింపజేసిన మంత్రిని తరలించారు.

14:54 - September 25, 2016

సాహిత్యం సమాజంలో మార్పును ఆశిస్తుంది. సమానత్వం కావాలంటుంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో మార్పులొచ్చాయి. ఆ మార్పులను నేటి కవులు రచయితలు గుర్తించారు. నూతనత్వాన్ని ఆహ్వానించారు. అలాంటి వారిలో ప్రముఖ కవి కాంచనపల్లి కవిత్వంపై ప్రత్యేక కథనంతో పాటు అన్నం రాజు శ్రీనివాసమూర్తి కథల పరిచయం, వివిధ ప్రాంతాల్లో జరిగిన సాహితీ వేదికల వేడుకల సమాహారంగా ఈ వారం మీ ముందు కొచ్చింది 10 టి.వి.అక్షరం. ఇప్పడు వివిధ ప్రాంతాలలో జరిగిన సాహితీ వేదికల వేడుకల  విశేషాలేంటో చూద్దాం.... ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

14:51 - September 25, 2016

సాహిత్యం సమాజంలో మార్పును ఆశిస్తుంది. సమానత్వం కావాలంటుంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో మార్పులొచ్చాయి. ఆ మార్పులను నేటి కవులు రచయితలు గుర్తించారు. నూతనత్వాన్ని ఆహ్వానించారు. అలాంటి వారిలో అన్నం రాజు శ్రీనివాసమూర్తి ఒకరు. ఆయన కథల పరిచయంపై ప్రత్యేక కథనం చూద్దాం....
పాఠకుల హృదయాలను కదిలించే అన్నంరాజు  
కథలు అందరూ రాస్తారు. కొందరే పాఠకుల హృదయాలను కదిలిస్తారు. తీవ్రంగా ఆలోచింపజేస్తారు. అలాంటి కథలురాశారు అన్నంరాజు వేణుగోపాల శ్రీనివాసమూర్తి. ఆయన మూడు పదులు అన్న కథాసంకలనాన్ని వెలువరించారు.కథావస్తువులో కొత్తదనం,కథనంలో ఉత్కంఠత,వాతావరణ కల్పనలో సహజత్వం ఉట్టిపడే కథలు రాసిన కథారచయిత అన్నంరాజు శ్రీనివాసమూర్తి పరిచయ కథనం మీకోసం.....
అనేక కథలు రాశాడు
తెలుగు కథాసాహిత్యంలో ఎందరో కొత్త రచయితలు ప్రవేశిస్తున్నారు. కథాసంకలనాలు వెలువరిస్తున్నారు. వస్తువైవిధ్యంతో కథలు రాస్తున్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. అలాంటి వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన అన్నంరాజు వేణుగోపాల శ్రీనివాసమూర్తి ఒకరు. ఆయన మూడు పదులు అనే కథా సంకలనాన్ని వెలువరించారు. ఒక సాధారణ సందర్భాన్ని అసాధారణంగాను, ఒక అపురూపమయిన సంఘటనను చాలా సహజంగాను మలుస్తూ అనేక కథలు రాశాడు. మూడు పదుల కథాసంకలనంలో మెుత్తం 30 కథలు ఉన్నాయి. అందులో భావన, మనిషితనం, సాయం, డ్యూటి, అరుణ తరంగం, సహచరి, వలపు వీచిక, బాధ్యతాబంధం, మనిషికథ, ధ్వని, పంథా మెుదలైన కథలు ఉన్నాయి. పేదరికం వ్యక్తుల జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో రచయిత కరుణ రసాత్మకంగా శిల్పీకరించారు. స్వేచ్ఛాపిపాసతో, స్వతంత్ర జీవనాభిలాషతో ముందడుగువేసిన అమ్మాయికథ ధ్వని.. అలాగే తనదైన జీవితాన్ని ఎంత అందంగా మలుచుకోవచ్చో, ఎంత ఆదర్శవంతంగా జీవించవచ్చో తెలియజెప్పిన మనసిజ కథ.. ఇలా ప్రతి కథలో ఏదో ఒక జీవిత వాప్తవికతను తెలియ జేస్తూ రచయిత చాలా కథలు రాశాడు. చక్కని భాష, కథల్లో సహజమైన వాతావరన కల్పన, మనకళ్ళముందు కనిపించే మనుషుల్లాంటి పాత్రచిత్రణ, ఉత్కంఠత రేకెత్తించే కథాకథనం ..ఇలా శ్రీనివాసమూర్తి కథలన్నీ చదివించే విధంగా శిల్పీకరించబడ్డాయి. శ్రీనివాసమూర్తి అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో శ్రీనివాసమూర్తి కలం నుండి మరెన్నో కథాసంపుటాలు వెలువడాలని ఆశిద్దాం.

 

14:43 - September 25, 2016

సాహిత్యం సమాజంలో మార్పును ఆశిస్తుంది. సమానత్వం కావాలంటుంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో మార్పులొచ్చాయి. ఆ మార్పులను నేటి కవులు రచయితలు గుర్తించారు. నూతనత్వాన్ని ఆహ్వానించారు. అలాంటి వారిలో ప్రముఖ కవి కాంచనపల్లి కవిత్వంపై ప్రత్యేక కథనం... 
చిన్నతనం నుండే కవిత్వం రాస్తున్న కాంచన పల్లి....
రాత్రి దండానికి వెలువడే ఊపిరి తీగకు ఒక కుచ్చుకున్న జ్ఞాపకం అంటూ కవిత్వం రాసిన అభ్యుదయకవి కాంచన పల్లి. ఆయన చిన్నతనం నుండే కవిత్వం రాస్తున్నారు. పాఠశాలలో పద్యాలు రాసి, కళాశాలలో వచనకవితలకు శ్రీకారం చుట్టారు. కవిత్వాన్ని అమితంగా ప్రేమించే ఆయన గతేడాది ` కలఇంకా మిగిలే ఉంది` అన్న కవితా సంపుటిని వెలువరించారు. ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు సమీక్షకులు కాంచనపల్లి పై ప్రత్యేక కథనం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

అదుపు తప్పిన గ్యాస్ ట్యాంకర్..

తూర్పుగోదావరి : ఎల్పీజీ లోడుతో వెళ్తున్న ఒక గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి వద్ద జరిగింది. గోకవరం మండలం గుమ్మడిదొడ్డి ప్లాంట్ కు వెళుతున్న ఈ ట్యాంకర్ చెందుర్తి వద్ద 16వ జాతీయ రహదారిపై అదుపుతప్పి పొలాల్లోకి దూసుకువెళ్లింది. సమాచారం అందుకున్న సిబ్బంది విశాఖ నుండి సంఘటనాస్థలికి చేరుకుని ప్రత్యామ్నాయయత్నాలు చేపట్టారు. 

టీ.ఎస్ కాబినెట్ సమావేశం రద్దు..

హైదారబాద్ : వర్షాల కారణంగా సోమవారం జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం రద్దు అయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలు కారణంగా మంత్రులు జిల్లాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మంత్రులు జిల్లా కేంద్రాలను వదిలిఎక్కడికి వెళ్ల వద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరద పరిస్థితుల నుంచి ప్రజలు కోలుకున్న తర్వాతే కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.

ఘనంగా దసరా ఉత్సవాలు : దేవినేని

విజయవాడ: అక్టోబర్ 1 నుంచి 11 వరకు జరిగే దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఏపీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. 12 ఏళ్ల తరువాత దసరా ఉత్సవాలు 11రోజులు వచ్చాయని మంత్రి చెప్పారు. దసరా మహోత్సవముల ఏర్పాట్లను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల సమయంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కృష్ణ నదికి వరద వస్తున్నందున ఉత్సవాలకు వచ్చే భక్తులు స్నానం చేయడానికి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.

14:27 - September 25, 2016

విజయవాడ : ఏడాదికొకసారి మాటమార్చే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నోటిని ఫినాయిల్‌తో కడగాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ మొగల్రాజపురంలో సీపీఐ ప్రజా బ్యాలెట్‌ చేపట్టింది. ఈ కార్యక్రమానికి నారాయణ హాజరై, మాట్లాడారు. పదేళ్లపాటు హోదా ఇస్తామంటూ వెంకయ్య సన్మానాలు చేయించుకున్నారని గుర్తుచేశారు.. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీల పేరుతో మళ్లీ సన్మానాలు చేయించుకుంటున్నారని మండిపడ్డారు.. ప్రధాని మోదీ, వెంకయ్య నాయుడు అనుకుంటే ప్రత్యేక హోదా బిల్లును పాస్‌ చేయించడం కష్టమేమీకాదని చెప్పుకొచ్చారు. 

14:24 - September 25, 2016

హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ, గోదారమ్మలు పరవళ్లు తొక్కుతున్నాయి. జలశయాలకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. జూరాల, శ్రీశైలం, నిజామ్‌ సాగర్‌, కడెం, కొమురం భీమ్‌ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 

 

మిడ్ మానేరుకు భారీగా వరద నీరు ..

కరీంనగర్: మిడ్ మానేరుకు వరద పోటెత్తింది. దీంతో అదికారులు దిగువ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.నాలుగు రోజులుగా కురుస్తోన్నవర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ మానేరు నుంచి నీటిని వదులుతుండటంతో మిడ్‌మానేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మంత్రి హరీష్‌రావు మిడ్ మానేరు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

13:54 - September 25, 2016

కరీంనగర్ : అప్పర్‌ మానేరు, సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మిడ్‌మానేరుకు భారీగా వరద ఉధృతి పెరిగింది. రెండు లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. కట్టపై నుంచి నీరు ప్రవహిస్తోంది. కేవలం మూడు టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండడంతో.. మిగతా నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. దీంతో మన్వాడ, పుత్తూరు, మల్లాపూర్‌, కందికట్కూరు గ్రామాల్లోకి నీరు చేరుకునే అవకాశం ఉంది. అప్రమత్తమైన అధికారులు నాలుగు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి హరీష్‌రావు స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇక ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా హైదరాబాద్‌, నిజామాబాద్‌ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను కూడా తరలించారు. 

 

గోదావరి వరద ఉధృతి, తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : గోదావరికి అనూహ్యంగా వరద ఉధృతి పెరిగింది. గోదావరి వరద ఉధృతి, తీసుకుంటున్న చర్యలపై మంత్రి హరీష్ రావు, సీఎస్ రాజీవ్ శర్మతో సీఎం మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అదేశించారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను సీఎం కేసీఆర్ కు మంత్రి హరీష్ రావు వివరించారు. 

13:34 - September 25, 2016
13:30 - September 25, 2016
13:20 - September 25, 2016

కరీంనగర్ : జిల్లాలో జలాశయాలు నిండుకుండలా మారాయి. మిడ్ మానేరుకు తాత్కాలికంగా నిర్మించిన కట్టకు గండి పడింది. కలెక్టర్ తో కలిసి పరిస్థితిని మంత్రి హరీష్ రావు సమీక్షించారు. ఎస్సారెస్పీ నుంచి ప్రవాహం పెరగడంతో మిడ్ మానేరు నిండిపోయింది. అక్కడి నుంచి లోయర్ మానేరుకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు మిడ్ మానేరుకు చేరుకున్నాయి. 
 

మిడ్ మానేరుకు భారీగా వరద నీరు

కరీంనగర్ : మిడ్ మానేరుకు వరద నీరు భారీగా చేరింది. ముంపు గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వందలాది ఎకరాల పంట పోలాలు నీటి మునిగాయి. బోయినపల్లి మండలం మనువాడ వద్ద మిడ్ మానేరు కట్టకు గండి పడింది. 
   

13:00 - September 25, 2016

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న్యూ మూవీ దువ్వాడ జగన్నాథమ్ ఈ మధ్యే ముహుర్తం జరుపుకుంది. ఇంకా షూటింగ్ స్టార్ట్ కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేయడం విశేషం. ఈ కొత్త మూవీ రిలీజ్ డేట్ విషయంలో బన్నీ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్లు వినికిడి. మరి దువ్వాడ జగన్నాథమ్ ఆడియన్స్ ముందుకి ఎప్పుడు రానున్నాడో మీరే చూడండి...
బాక్సఫీసు వద్ద అల్లుఅర్జున్ కలెక్షన్ల మోత 
సరైనోడు సినిమాతో అల్లుఅర్జున్ బాక్సఫీసు వద్ద కలెక్షన్ల మోత మోగించాడు. ఈ సినిమా సక్సెస్ తో స్టార్ గా బన్నీ రేంజ్ మరింత హెట్స్ కి వెళ్లింది. ఇప్పటి వరకు క్లాస్ టచ్ ఉండే మాస్ పాత్రలు చేసిన అల్లుఅర్జున్ సరైనోడు మూవీ లో మాత్రం ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ మాస్ లో అదరగొట్టాడు. ఈ భారీ సక్సెస్ ని మిస్ యూజ్ చేసుకోవద్దనే ఉద్దేశ్యంతో బన్నీ కొత్త సినిమా విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు.
హరీశ్ శంకర్ డైరెక్షన్ లో 'దువ్వాడ జగన్నాథమ్'  
దువ్వాడ జగన్నాథమ్ హరీశ్ శంకర్ డైరెక్షన్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇంకా షూటింగ్ కి కూడా వెళ్లని ఈ చిత్రానికి ఓ సెంటిమెంట్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. సరైనోడు ఫిబ్రవరిలో వచ్చి భారీ హిట్టు అందుకుంది. ఈ సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకునే దువ్వాడ జగన్నాథమ్ చిత్రాన్ని కూడా వచ్చే ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని యూనిట్ ఫిక్స్ అయింది.
బన్నీకి జోడిగా పూజాహెగ్డె 
దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో బన్నీకి జోడిగా పూజాహెగ్డె నటిస్తోంది. ఈ బ్యూటీ బాలీవుడ్ ప్లాన్స్ బెడిసికొట్టడంతో మళ్లీ టాలీవుడ్ వైపు టర్న్ తీసుకుంది. బన్నీఅయిన తన ఫేట్ మారుస్తాడేమోనని ఈ తెలుగు గోపికమ్మ ఆశపెట్టుకుంది. ఇక మెగా హీరోలతో హరీశ్ శంకర్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. పవన్ తో గబ్బర్ సింగ్, సాయిధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో హిట్స్ కొట్టిన హరీశ్ శంకర్ బన్నీతో కూడా అలాంటి హిట్టుని రిపీట్ చేయాలని భావిస్తున్నాడు.

 

12:56 - September 25, 2016
12:54 - September 25, 2016

నిజామాబాద్ : కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. రేపు గేట్లు ఎత్తే అవకాశం ఉందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. వర్షాలతో వాగులు, వంకలన్నీ నిండాయన్నారు. ఎల్లుండి వరకు నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామన్నారు. ఈ ఏడాది వ్యవసాయానికి ఢోకా లేదని భరోసా ఇచ్చారు. ఖరీఫ్‌ సీజన్‌ ఆశాజనకంగా ఉందన్నారు. 

 

12:50 - September 25, 2016

కరీంనగర్ : జిల్లాలోని మిడ్ మానేరుకు ఇన్‌ ఫ్లో భారీగా పెరగడంతో తాత్కాలికంగా నిర్మించిన కట్టకు గండి పడింది. దీంతో స్థానికంగా ఉన్న మన్వాడ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌ను స్థానికులు అడ్డుకున్నారు. ప్రస్తుతం అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పలు కాలనీల్లో వర్షపు నీరు

హైదరాబాద్ : వర్షం దెబ్బ నుంచి ఇంకా భాగ్యనగరం కోలుకోలేదు. పలు కాలనీల్లో ఇంకా నీళ్లు నిలిచే ఉన్నాయి. కూకట్‌పల్లి బండారి లేఅవుట్‌, ధరణినగర్‌ వాసులు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తమ కాలనీలో నిలిచివున్న నీళ్లను వెంటనే తొలగించాలని మహిళలు రోడ్డెక్కారు. మరోవైపు బాధితులకు బోటు ద్వారా నిత్యావసరాలు అందిస్తున్నారు. 

 

12:47 - September 25, 2016

హైదరాబాద్ : వర్షం దెబ్బ నుంచి ఇంకా భాగ్యనగరం కోలుకోలేదు. పలు కాలనీల్లో ఇంకా నీళ్లు నిలిచే ఉన్నాయి. కూకట్‌పల్లి బండారి లేఅవుట్‌, ధరణినగర్‌ వాసులు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తమ కాలనీలో నిలిచివున్న నీళ్లను వెంటనే తొలగించాలని మహిళలు రోడ్డెక్కారు. మరోవైపు బాధితులకు బోటు ద్వారా నిత్యావసరాలు అందిస్తున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

12:41 - September 25, 2016
12:39 - September 25, 2016

విజయవాడ : ప్రభుత్వ సంగీత కళాశాల విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. కాలేజీలో రాజకీయ కార్యక్రమాలను  నిర్వహించరాదంటూ ధర్నా నిర్వహించారు. సంగీత కళాశాలలో రాజకీయ సభలు, సమావేశాలను నిర్వహించడం వలన ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పదించిన రాజకీయ సభల నిర్వహణను  ఆపకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాల్సి వస్తుందని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. 
 

12:36 - September 25, 2016

హైదరాబాద్ : నగరంలో వర్షాలు తగ్గినా ఇంకా రోడ్లపై నీళ్లు నిలిచేవున్నాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాచారంలో రోడ్లపై నీళ్లు నిలిచివుండడంతో వాహనాల దారి మళ్లించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రోడ్లపై నిలిచివున్న వర్షపు నీరు

హైదరాబాద్ : నగరంలో వర్షాలు తగ్గినా ఇంకా రోడ్లపై నీళ్లు నిలిచేవున్నాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాచారంలో రోడ్లపై నీళ్లు నిలిచివుండడంతో వాహనాల దారి మళ్లించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:32 - September 25, 2016

కరీంనగర్‌ : జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మాపూర్‌ చెరువుకు గండిపడింది. దీంతో గ్రామంలోకి భారీగా  వరదనీరు చేరింది. ఈ వరదనీటిలో రెండు ఇళ్లు, పశువులు కొట్టుకుపోయాయి. గంభీరావుపేట, గోరంట్లలోను వరద ఉధృతి కొనసాగుతోంది.

 

వరద ఉధృతిలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు

మెదక్ : సాంగాయి తండాలో వరద ఉధృతిలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఎన్ డీఆర్ ఎఫ్ బలగాలతో ఘటనాస్థలానికి చేరుకున్నాయి.

కరీంనగర్ జిల్లాలో నిండుకుండలా జలాశయాలు

కరీంనగర్ : జిల్లాలో జలాశయాలు నిండుకుండలా మారాయి. మిడ్ మానేరుకు తాత్కాలికంగా నిర్మించిన కట్టకు గండి పడింది. కలెక్టర్ తో కలిసి పరిస్థితిని మంత్రి హరీష్ రావు సమీక్షించారు. ఎస్సారెస్పీ నుంచి ప్రవాహం పెరగడంతో మిగ్ మానేరు నిండిపోయింది. అక్కడి నుంచి లోయర్ మానేరుకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. 

 

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది. ఇన్ ఫ్లో 1,71,144 టీఎంసీలు, ఔట్ ఫ్లో 65,936 టీఎంసీలుగా ఉంది. 

12:11 - September 25, 2016
10:45 - September 25, 2016

విజయనగరం : జిల్లాలో భారీ వర్షాలు విషాదాన్ని మిగిల్చాయి. నిద్రిస్తుండగా ఇంటి పైకప్పు కూలి దంపతులు మృతి చెందారు. వేపాడ మండలం బక్కునాయుడుపేటలో ఇల్లు కూలడంతో దంపతులు మృతి చెందారు. మృతులు కర్రి అప్పారావు, నాగరాజమ్మగా గుర్తించారు. అప్పారావు దంపతులు నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పు కూలడంతో.. సజీవ సమాధి అయ్యారు. 

10:41 - September 25, 2016

మెదక్‌ : జిల్లాలోని పాపన్నపేట దగ్గర ఏడుపాయలలో చిక్కుకున్న 23 మంది కూలీలను రెస్క్యూ టీమ్‌ రక్షించింది. రెండు హెలికాప్టర్ల ద్వారా బీహార్‌, ఒడిశాకు చెందిన 23 మంది కూలీలను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. వరద ఉధృతి పెరగడంతో నిన్న మధ్యాహ్నం కూలీలు వరదల్లో చిక్కుకున్నారు. రాత్రి నుంచి డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు. 

 

ఏడుపాయలలో చిక్కుకున్న కూలీలను కాపాడిన రెస్క్యూ టీమ్

మెదక్‌ : జిల్లాలోని పాపన్నపేట దగ్గర ఏడుపాయలలో చిక్కుకున్న 23 మంది కూలీలను రెస్క్యూ టీమ్‌ రక్షించింది. రెండు హెలికాప్టర్ల ద్వారా బీహార్‌, ఒడిశాకు చెందిన 23 మంది కూలీలను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. 

 

10:35 - September 25, 2016

కాన్పూర్ : టీమిండియా 500వ టెస్ట్‌ మ్యాచ్‌లో కొహ్లీ సేన జోరు పెంచింది. కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ మూడో రోజు ఆటలో పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. భారత స్పిన్నర్లు  జడేజా,అశ్విన్‌ల ధాటికి కివీ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టడంతో 56 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌పై కన్నేసింది. 
కాన్పూర్‌ టెస్ట్‌పై పట్టు బిగించిన కొహ్లీ అండ్‌ కో 
కాన్పూర్‌ టెస్ట్‌పై కొహ్లీ అండ్‌ కో పట్టు బిగించింది. 500వ టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి రెండు రోజుల్లో అంతంతమాత్రంగానే రాణించిన టీమిండియా..మూడో రోజు డామినేట్‌ చేసింది. 
మూడో రోజు చెలరేగిన భారత్ బౌలర్లు 
రెండో రోజు అంతగా ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్లు ..మూడో రోజు చెలరేగారు. జడేజా,అశ్విన్‌ల స్పిన్‌ మ్యాజిక్‌తో కివీ బ్యాట్స్‌మెన్‌ను క్యూ కట్టించారు.  వికెట్‌ నష్టానికి 152 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన న్యూజిలాండ్ టీమ్‌ ...ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 110 పరుగులు మాత్రమే జోడించగలిగింది. కివీ  ఓపెనర్‌ లాథమ్‌, కెప్టెన్‌ కేన్‌ విలియమ్‌సన్‌ల సెంచరీ భాగస్వామ్యానికి అశ్విన్‌ చెక్‌ పెట్టగా...లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను జడేజా బోల్తా కొట్టించాడు. దీంతో న్యూజిలాండ్‌ జట్టు 262 పరుగులకే ఆలౌటైంది.  
మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ 159పరుగులు 
56 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు రాహుల్‌, మురళీ విజయ్‌ శుభారంభాన్నిచ్చారు. 38 పరుగులకు రాహుల్‌ ఔటైనా...టెస్ట్‌ స్పెషలిస్ట్‌ పుజారాతో కలిసి విజయ్‌..కివీ బౌలింగ్‌ ఎటాక్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి...భారీ స్కోర్‌కు పునాది వేశారు. విజయ్‌ టెస్టుల్లో 14వ హాఫ్‌ సెంచరీ నమోదు చేయగా....పుజార 9వ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.  మూడో రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు వికెట్‌ కోల్పోయి 159 పరుగులు చేసింది. 
భారత స్పిన్నర్ల జోరు ముందు తేలిపోయిన న్యూటిలాండ్ ఆటగాళ్లు
కాన్పూర్ టెస్ట్‌లో తొలి రెండు రోజులు పై చేయి సాధించిన న్యూజిలాండ్‌ ఆటగాళ్లు....భారత స్పిన్నర్ల జోరు ముందు తేలిపోయారు. కివీస్‌ టీమ్‌ ముందు 400 పరుగులకు పైగా లక్ష్యాన్నుంచితే....500వ టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. భారత విజయావకాశాలు స్పిన్నర్లపైనే ఆధారపడి ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.     

 

10:29 - September 25, 2016

హైదరాబాద్ : టీమిండియా వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ధోనీ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమం హైదరాబాద్‌ జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఎంఎస్ ధోనీతోపాటు సినీదర్శకుడు రాజమౌళి, ఇతర సినీప్రముఖులు హాజరయ్యారు. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధోనీ క్యారెక్టర్‌లో సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్‌  నటిస్తున్నాడు. సెప్టెంబర్ 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

10:25 - September 25, 2016

ప్రకాశం : జిల్లాలోని సంతనూతల పాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. సంతనూతల పాడు చెరువు కట్ట వద్ద కేశినేని ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

10:22 - September 25, 2016

హైదరాబాద్‌ : నగరంలోని కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. శారదా బట్టలషాపులో షార్ట్‌సర్క్యూట్‌ మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది రంగంలోకి దిగి.. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 3 కోట్ల రూపాయల మేర నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. 

 

09:51 - September 25, 2016

నెల్లూరు : పోలార్‌ శాటిలైట్ లాంచ్ వెహికిల్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. సోమవారం ఉదయం 9 గంటల 12 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీశ్‌ దావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్వీ సీ-35 నింగిలోకి దూసుకెళ్లనుంది. 320 టన్నుల బరువు గల పిఎస్‌ఎల్‌వి రాకెట్‌ 8 ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఇందులో 3 ఇండియాకు చెందినవి కాగా మరో ఐదు విదేశాలకు చెందిన ఉపగ్రహాలున్నాయి. ఇస్రోకు చెందిన స్కాట్‌సాట్‌-1తో పాటు, అమెరికా, అల్జీరియా, కెనడా దేశాలకు చెందిన 5 ఉపగ్రహాలు, విద్యార్థులు తయారు చేసిన 2 ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.  371 కిలోలున్న స్కాట్‌స్కాట్‌ ఉపగ్రహం సముద్రం, వాతావరణానికి సంబంధించిన సమాచారం ఇవ్వనుంది.

 

09:47 - September 25, 2016

హైదరాబాద్ : ప్రతిష్ఠాత్మక ఇండీవుడ్‌ ఫిల్మ్‌ కార్నివాల్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా ప్రారంభమైంది. 80కిపైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.  నాలుగు రోజులపాటు జరిగే కార్నివాల్‌లో 132కి పైగా సినిమాలు ప్రదర్శించనున్నారు. వివిధ చిత్ర పరిశ్రమలను ఏకతాటిపైకి తేవడమే  కార్నివాల్‌ ఉద్దేశమని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. 
రామోజీ ఫిల్మ్‌సిటీలో ఇండీవుడ్‌ కార్నివాల్‌ 
రామోజీ ఫిల్మ్‌సిటీలో ఇండీవుడ్‌ కార్నివాల్‌ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 500 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.  ప్రారంభ కార్యక్రమంలో సినీతారాలోకం దిగివచ్చింది. కార్నివాల్‌లో పలువురికి అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి విదేశీ ప్రతినిధుల చేతుల మీదుగా పలువురికి అవార్డులు అందించారు. ఈ సందర్భంగా కళాకారుల నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇంటర్నేషనల్‌ ఫిల్మీకార్నీవాల్‌కు రామెజీ ఫిల్మ్ సిటీ వేదికకావడం సంతోషంగా ఉందని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అన్నారు. 
ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్మించే యోచనలో ప్రభుత్వం : తలసాని  
త్వరలోనే తెలంగాణలో అంతర్జాతీయ టెక్నాలజీలో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌అన్నారు. భారతీయ సినిమాలు మన సంస్కృతికి నిలువుటద్దాలని ఇండీవుడ్‌ వేదిక రూపకర్త సోహన్‌రాయ్‌ అన్నారు. భారత చలనచిత్ర రంగానికి ప్రపంచ చలనచిత్ర పరిశ్రమను నడిపించే సత్తా ఉంద్నారు. రామోజీఫిల్మ్‌ సిటీ ఫిల్మ్ కార్నివాల్‌ కు వేదిక కావడం సంతోషంగా ఉందని నిర్వాహకులు  తెలిపారు. ఒక్కో రోజు ఒక్కో వినూత్న కార్యక్రమాలతో సినీ అభిమానులను కార్నివాల్‌ అలరించనుంది.

 

09:40 - September 25, 2016

లండన్ : ప్రముఖ కర్నాటక సంగీత విద్యాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి శత జయంతి ఉత్సవాలను లండన్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు ఆమెకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు  కళాకారులు సుబ్బులక్ష్మి పాడిన గీతాలను గానం చేశారు.  
సంగీతోత్సవం నిర్వహణ 
ప్రముఖ సంగీత విద్యాంసురాలు ఎంఎస్‌ సుబ్బులక్ష్మి శతజయంతి ఉత్సవాల సందర్భంగా లండన్‌లో సంగీతోత్సవాన్ని నిర్వహించారు. ఈనెల 16న సుబ్బులక్ష్మి జయంతి రోజు లండన్‌లోని భారతీయ విద్యా భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖలు హాజరయ్యారు. సుబ్బలక్ష్మిపాడిన ఆధ్యాత్మిక, దేశభక్తిగీతాలను ఆలపించారు. 1970 సుబ్బలక్ష్మి లండన్‌లో సంగీత కచేరి నిర్వహించిన వేదికపైనే ఈ  శతజయంతి వేడుకలు జరగడం విశేషం. 
సంగీతానికి సుబ్బలక్ష్మీ చేసిన సేవలను స్మరించుకున్న ప్రముఖులు  
లండన్‌లో జరిగిన ఎంఎస్‌ సుబ్బులక్ష్మి శతజయంతి వేడుకులకలో పాల్గొన్న ప్రముఖులు సంగీతానికి ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు. నోటయాభై ముంది యువతీయువకులు, బాలలు సుబ్బులక్ష్మి గానం చేసిన పాటను విపించారు. వీటికి అనుగుణంగా నృత్యరూపకాలను ప్రదర్శించారు. దక్షిణాది నృత్యరూపకాలైన భరతనాట్యం, కూచిపూడి, మోహినీఅట్టంలో నృత్యాలను ప్రదర్శించారు. 
పలు భాషల్లో పాడిన సుబ్బలక్ష్మీ 
సుబ్బులక్ష్మి సంస్కృతం, తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో పాడారు.  గణేశ పంచరత్న గీతంతో ప్రారంభమైన సంగీత కచేరి మూడుగంటలకు పైగా సాగింది. ఆహూతులను అలరించింది. ఈ శతయంతోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నామాచార్య ప్రాజెక్ట్‌ మాజీ డైరెక్టర్‌ కామిశెట్టి శ్రీనివాసులు హాజరయ్యారు. ఆ మహాగాయనితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

09:32 - September 25, 2016

తూర్పుగోదావరి : జోరుగా కురుస్తున్న వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా మన్యం చిగురుటాకులా వణికిపోతోంది. వాగులు,వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో..గిరిజన గ్రామాల నుంచి బయటిప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. గిరిజనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస వైద్యం అందక జర్వాలతో అడవిబిడ్డలు అవస్థలు పడున్నారు. 
ఆదివాసీలకు జీవన్మరణ పోరాటమే
తూర్పుమన్యం భూతల స్వర్గాన్ని తలపించే ప్రకృతి ధామం...ఇక్కడి కొండకోనల్లోనూ,దట్టమైన అటవీ ఆవాసాలలోనూ
శతబ్ధాలుగా మనుగడ సాగిస్తున్న ఆదివాసీ తెగలు తరతరాలుగా తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు జీవన్మరణ పోరాటాన్నే చేస్తున్నారు. ఏటా వర్షాకాలం సీజన్లో తూర్పుమన్యతో బయటిప్రపంచానికి సంబంధాలు తెగిపోతున్నాయి. 
స్తభించిన ఆదివాసీల జీవనం
వాగులు, వంకలు  ఉగ్రరూపంతో ప్రవహించడంతో కొండకోనల్లో ఆదివాసీలజీవనం పూర్తిగా స్తంభించే  పరిస్థితులు నెలకొంటున్నాయి..వర్షాకాలంలో కొండలపై కురిసిన వర్షపునీరు వాగుల్లోకి చేరడంతో..కొండ వాగులు నదులను తలపిస్తున్నాయి.సీతపల్లి,పాములేరు,మడేరు,జడేరుతోపాటు ఏలేరు,సోకిలేరు,దుమ్ముకొండ వాగుల ప్రవాహ ఉదృతితో వందలాది అటవీ ఆవాసాలముచెత్తుతున్నాయి. 
కొండవాగుల ప్రవాహంతో గిరిపుత్రుల తిప్పలు 
వరదలు పోటెత్తడొంతో అడవిబిడ్డలకు నిత్యావసర వస్తువులు కూడా అందడంలేదు. వారపుసంతల్లో సరకులు అమ్ముకోడవానికి,చేపల వేటకోసం వాగులుదాటే ప్రయత్నంలో ఆదివాసీలు వాగుల ప్రవాహంలోనే కొట్టుకుపోయి ప్రమాదంలో పడుతున్నారు. మన్యంలోని దేవిపట్నంమండలం దండంగి వాగుపొంగి 30 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకుని బతుకుతున్నారు. 
దండిగివాగుపై బ్రిడ్జినిర్మించాలని వేడుకుంటున్న ఆదివాసీలు
దేవీపట్నం మండలంలోని పోచవరం, ఫజుల్లాబాద్, రావిలంక, ఇందుకూరు, ఇందుకూరిపేట, దేవారం, పోతుకొండ, శరభవరంతో పాటు ఇతర  ప్రాంత ఆదివాసీలు దేవిపట్నానికి చేరుకోవాలంటే దండంగి వాగు దాటి 18కిలో మీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సిందే. వాగు దాటకుండా వెళ్లాలంటే దట్టమైన అడవిలో 60కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. దశాబ్థాల కాలం నుంచి దండంగి వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని వేడుకుంటున్నా... పాలకులు స్పందించి పాపాన పోవడంలేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
సొంతఖర్చులతో వంతెన నిర్మాణం
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గిరిపుత్రులే సొంతఖర్చులతో ఈ దండండివాగుమీద వంతెన నిర్మించుకున్నారు. అయితే వాగు ఉధృతికి వీరు కట్టుకున్న వంతెన నామరూపాల్లేకుండా పోయింది. ఆదివాసీల సంక్షేమానికి వందల కోట్లుఖర్చు చేస్తున్నామని చెబుతున్న రంపచోడవరం ఐ.టి.డి.ఎ అధికారులు కనీసం తాత్కాలికంగానైనా వంతెనను  నిర్మిస్తే ద్విచక్రవాహణాలు రాకపోకలు సాగించేందుకు వీలవుతుందని ఆదివాసీలు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి దండంగి వాగుపై వంతెన నిర్మించి.. ఆదుకోవాలని మన్యంబిడ్డలు కోరుతున్నారు. 

 

నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు

గుంటూరు : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పల్నాడులోని గురజాలలో వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను సీఎం పరిశీలించనున్నారు. 

పసుపులేరు, పుష్పాలవాగులో రోడ్డుపై వరద నీరు

మెదక్ : పసుపులేరు, పుష్పాలవాగులో రోడ్డుపై 5 అడుగులమేర వరద నీరు ప్రవహిస్తోంది. గ్రామాలు జలదిగ్బంధలోనే ఉన్నాయి. రాకపోకలు బంద్ అయ్యాయి.

08:54 - September 25, 2016

సినియర్ స్టార్ వెంకటేష్ లేట్ ఏజ్ లో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. వెంకీ కమిట్ మెంట్ చూసి ఇండస్ట్రీ తో పాటు ఆడియన్స్ సైతం షాక్ అవుతున్నారు. వావ్ 50ప్లస్ లో వెంకీ ఇా చేయడం గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు. ఇంతకీ ఈ సినియర్ స్టార్ చేసిన ఆ సర్ ప్రైజ్ ఏంటో వెంకీ కమిట్ మెంట్ మీరే చూడండి...
కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ 
విక్టరీ వెంకటేష్ బాక్సఫీసు వద్ద కొంతకాలంగా తన విక్టరీ చూపించడం లేదని నిజం. బాబు బంగారంతో ఈ సినియర్ స్టార్ తన బిరుదుకి న్యాయం చేయాలనుకున్నాడు. మంచి హైప్ తో రిలీజైన ఈ చిత్రం అంచనాలను అందుకోవడం మాత్రం నిరాశపరిచింది. ఈ క్రమంలో వెంకీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ కొత్త సినిమా విషయంలో వెంకీ కమిట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. 
సాలా ఖద్దూస్ రీమేక్ లో వెంకటేష్ 
వెంకటేష్ బాలీవుడ్ మూవీ సాలా ఖద్దూస్ రీమేక్ లో నటిస్తున్నాడు. సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో వెంకీ బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్నాడు. ఒరిజినల్ లో మాధవన్ చేసిన ఈ క్యారెక్టర్ కి వెంకీ ఈ ఏజ్ లో సూట్ అవుతాడా మొదట్లో ఆడియన్స్ కాస్త సందేహించారు . కానీ వెంకీ లుక్ చూశాక మాత్రం ప్రతి ఒక్కరూ వావ్ వెంకీ వాటే కమిట్ మెంట్ అంటూ పొగిడేస్తున్నారు. 
లుక్స్ తో మతిపోగోట్టుతున్న వెంకీ  
ఈ రిమేక్ షూటింగ్ ఈ నెల 19 మొదలైంది. షూటింగ్ స్టార్ అయిన రోజే ఈ  మూవీకి సంబంధించిన వెంకటేష్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి, ఈ రిమేక్ పై అంచనాలు రెట్టింపు చేశారు. ఒరిజినల్ మూవీలోని మాధవన్ లుక్ కి ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో వెంకీ లుక్స్ తో మతిపోగోట్టుతున్నాడు. ఈ మూవీని రిమేక్ చేయాలని ఫిక్స్ అయిన వెంకీ 9 నెలల పాటు జిమ్  వర్కౌట్స్ చేసి బాక్సింగ్ కోచ్ లా పర్ఫెక్ట్ లుక్ లోకి మారాడు. 50ప్లస్ లో వెంకటేష్ బాడీపరంగా ఇలాంటి సాహసం చేశాడంటే ఈ స్టార్ కమిట్ మెంట్ కి హ్యట్సాఫ్ చెప్పాల్సిందే.                   

 

బట్టలషాపులో చెలరేగిన మంటలు

హైదరాబాద్ : నగరంలోని కూకల్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజాము 3 గంటలకు బట్టలషాపులో మంటలు చెలరేగాయి. మూడు ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. 

నాటు పడవ బోల్తా..

తూర్పుగోదావరి : తొండంగి మండలం దానవాయిపేట వద్ద సముద్రంలో నాటు పడవ బోల్తా పడింది. ప్రమాదం తప్పింది. ఆరుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయి. 

 

నేడు మహబూబ్ నగర్ జిల్లాలో తమ్మినేని పర్యటన

మహబూబ్ నగర్ : నేడు జిల్లాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

08:06 - September 25, 2016

ఢిల్లీ : ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి మరింత ఊపుతెచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇవాళ్టి నుంచి స్వచ్ఛభారత్‌ వార్షికోత్సవాలు నిర్వహస్తున్నట్టు కేంద్రమంత్రి  వెంకయ్యనాయుడు తెలిపారు. గత రెండేళ్లుగా కార్యక్రమంలో సాధించిన ప్రగతిని బేరీజు వేసుకుంటూ.. ఈ వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఇవాళ్టి నుంచి అక్టోబర్‌ రెండు వరకు స్వచ్ఛభారత్‌ వారంగా పాటిస్తున్న  నేపథ్యంలో.. పట్టణాలు ,గ్రామాల్లోప్రభుత్వ యంత్రాంగాలు  పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని వెంకయ్య అన్నారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమ అమలులో రాబోయే మూడేళ్లలో ఎదురయ్యే సవాళ్ల ఎదుర్కొనేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. 

08:02 - September 25, 2016

హైదరాబాద్ : జోరువానలతో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో.. కృష్టా, గోదావరి నదుల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. లక్షలాది క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుల్లోకి చేరుతోంది. మహరాష్ట్ర కర్నాకల్లో కురస్తున్న వర్షాలతో గోదావరి, కష్ణా నదుల్లో వరద ఉధృతి పెరిగింది. తెలంగాణవ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. 
జూరాల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి
అటు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రిదర్శని జూరాల ప్రాజెక్టు వరద ఉధృతి రుగుతోంది. నారాయణపూర్ జలాశయం నుంచి జూరాల ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు చేరుతుంతోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయిలో నిండడంతో .. 8గేట్లను ఎత్తి వరదను కిందకు వదిలేస్తున్నారు.  జూరాలకు ఇన్‌ఫ్లో 1లక్షా 7500 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో.. 1లక్షా27,300 క్యూసెక్కులుగా ఉంది.
9ఏళ్లతర్వాత శ్రీరాంసాగర్‌లో జలకళ
అటు ఉత్తరతెలంగాణ వరప్రదాయనిగా పేరున్న శ్రీరాంసాగర్‌ జలాయం దాదాపు 9ఏళ్ల తర్వాత పూర్తిస్థాయిలో జళకళను సంతరించుకుంటోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు కాగా.. ప్రస్తుతం 1089అగుగులకు చేరింది. ప్రస్తుతం ఇన్‌ప్లో 4లక్షల 44వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 8గేట్లను ఎత్తి నీటిని కిందికి వదేలేస్తున్నారు. 
జలసిరలతో సింగూరుప్రాజెక్ట్‌ కళకళ
సింగూరు ప్రాజెక్ట్‌ 9గేట్ల ఎత్తివేత
మెదక్‌ జిల్లాలోని సింగూరుప్రాజెక్టు వరదజలాలతో కళకళ్లాడుతోంది.  ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుండటంతో అధికారులు  9గేట్లను ఎత్తివేశారు. ఆందోల్‌ ఎమ్మెల్యే బాబుమోహన్‌ ప్రాజెక్టు దగ్గర .. గంగమ్మతల్లికి హారతి ఇచ్చారు. ప్రాజెక్టువద్ద జలకళను తిలకించడానికి చుట్టుపట్టు గ్రామాల  ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
నిండుకుండలా ఎగువమానేరు జలాశయం
ఎడతెరిపిలేని వర్షాలతో కరీంనగర్‌జిల్లా లోని ఎగువమానేరు డ్యాం నిండుకుండలా మారింది.  ప్రాజెక్టు పూర్తిగా నిండిడంతో పైనుంచి వస్తున్న 40వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేస్తున్నారు. దీంతో సిరిసిల్ల నియోజకవర్గంలో 4మండలాల్లో వ్యవసాయానికి ఢోకాలేదని రైతులు అంటున్నారు. 
అన్నదాతలు సంతోషం 
నిండుకుండలను తలపిస్తున్న జలాశయాలను చూసి.. అటు ప్రభుత్వం , ఇటు అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరుస కరువులతో అల్లాడిన రోజులు పోయి... ఈసారి పంటలకు సమృద్ధంగా నీరు లభిస్తుందంటున్నారు. 

 

07:54 - September 25, 2016

గుంటూరు : జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. వరదల వల్ల కలిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రాంతాలలో క్యాంపులు ఏర్పాటు చేశామని.. బాధితులకు పునరావాసం కల్పిస్తున్నారని సీఎం తెలిపారు. ఇప్పటికే వరదల కారణంగా ఏపీ వ్యాప్తంగా కోట్లలో నష్టం వాటిల్లిందని సీఎం అన్నారు.
వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం : ఏపీ సీఎం చంద్రబాబు 
ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లాలో వేల హెక్టార్లలో పంటనష్టం జరిగిందన్నారు బాబు. జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు బాబు. 
వర్షాలకు ఇప్పటివరకు ఏడుగురు మృతి 
వర్షాల కారణంగా ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారని.. వారికి 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. గుంటూరు జిల్లాలోని దుర్గిలో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని.. మాచర్లలో 17 సెంటీమీటర్లు, రెంటచింతలలో 14 సెంటీమీటర్లు,గురజాలలో 13 సెంటీమీటర్లు ,వెల్దుర్తిలో 13 సెంటీమీటర్లు, నరసారావుపేటలో 22 సెంటీమీటర్లు, బెల్లంకొండలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని సీఎం తెలిపారు.   
11 ప్రాంతాలలో దెబ్బతిన్న రైల్వేలైన్లు 
వర్షాలకారణంగా 22 వేల హెక్టార్లలో పత్తి, 4 వేల హెక్టార్లలో కందిపంట, 4 వందల హెక్టార్లలో సోయాపంట దెబ్బతిన్నదన్నారు. అలాగే 4 వందలహెక్టార్ల మినుము, 50 హెక్టార్లలో జూట్‌ పంట, 5 వేల 6 వందల హెక్టార్లలో మిరపపంటకు నష్టం వాటిల్లిందని అన్నారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు బాబు. 
వర్షాలకు కూలిపోయిన 489 ఇళ్లు 
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వేయి 4 వందల 89 ఇళ్లు కూలిపోయాయన్నారు సీఎం చంద్రబాబు.వరద ప్రాంతాలలో 42 మెడికల్‌ క్యాంపులు ఏర్పాటుచేశామన్నారు. 407 మంది వరద బాధితులకు పునరావాసం కల్పించామన్నారు. బాధితులకు నిత్యావసర సరుకులు అందిస్తామన్నారు ముఖ్యమంత్రి. వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.85 వేల రూపాయలే నష్టపరిహారం, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు వేల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది సర్కార్‌.   
అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటా : సీఎం 
అటు వరద ప్రాంతాలలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. యాక్షన్ ప్లాన్‌ తయారుచేసి జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం అన్నారు.

 

07:46 - September 25, 2016

హైదరాబాద్‌ : భాగ్యనగరాన్ని ఇంకా వరద భయం వెంటాడుతూనే ఉంది. అనేక కాలనీల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అపార్ట్‌మెంట్ల నుంచి కిందకు దిగలేక.. నిత్యావసరాలు లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆర్మీని రంగంలోకి దింపింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం సహాయక చర్యలు ఇంకా వేగవంతం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇదిలా వుంటే బాధితులను ఆదుకునేందుకు అనేక స్వచ్చంద సంస్థలు తమ వంతు సాయం అందిస్తున్నాయి. 
ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజల ఇబ్బందులు 
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం జలమయమైంది. అనేక ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చాలా కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అల్వాల్‌, నిజాంపేట్‌, మల్కాజ్‌గిరి... ఏ ప్రాంతం చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పలు ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అపార్ట్‌మెంట్లన్నీ జలదిగ్బంధంలోనే 
ఇక నిజాంపేట్‌లో పరిస్థితి ఇంకా అలాగే ఉంది. మూడు రోజుల నుంచి అపార్ట్‌మెంట్లన్నీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. స్వచ్చంధ సంస్థలు, ప్రభుత్వం  అందించే ఆహారంతోనే కడుపు నింపుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడున్న 150 అపార్ట్‌మెంట్లలో ఇప్పటివరకు వందకు పైగా ఖాళీ అయ్యాయి. బండారి లేఅవుట్‌లో ఇంకా నిలిచివున్న నీళ్లను బయటకు పంపించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. పక్కనే ఉన్న తుర్కచెరువు నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమీప ఇళ్లలోని ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. నాచారంలో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రంగంలోకి 
జలదిగ్బంధంలో చిక్కుకున్న హైదరాబాద్‌ను కాపాడేందకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి. 60మందితో కూడిన రెండు బృందాలు అల్వాల్, నిజాంపేట్, ప్రకాష్‌నగర్, ఆల్విన్‌కాలనీ, రాజ్‌భవన్‌రోడ్, ఆనంద్ థియేటర్ ప్రాంతాల్లో నాలుగు ఆర్మీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
బాధితులను పరామర్శించిన రేవంత్‌రెడ్డి   
నిజాంపేటలో టీడీపీ నేత రేవంత్‌రెడ్డి పర్యటించి బాధితులను పరామర్శించారు. ప్రకృతి విపత్తు కంటే ప్రభుత్వ వైఫల్యమే ఎక్కువగా ఉందని రేవంత్‌ అన్నారు.  అక్రమ కట్టడాలను తొలగించకపోవడం వల్లే నగరంలో ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్నారు. 
ముంపు బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు  
కూకట్‌పల్లిలోని ధరణినగర్‌లో టీ.పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి పర్యటించారు. వరద ముంపు బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సంతృప్తికరంగా లేవని ఇంకా వేగంగా సహాయకచర్యలు చేపట్టాలని ఉత్తమ్‌ అన్నారు. 
'మా' ఆధ్వర్యంలో ఆహారపొట్లాలు, నీళ్లు 
నాలుగు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న వారికి అనేక స్వచ్చంధ సంస్థలు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకువచ్చాయి. కూకట్‌పల్లి ధరణినగర్‌లో 'మా' ఆధ్వర్యంలో ఆహారపొట్లాలు, నీళ్లు అందించారు. ఇక ఆల్వాల్‌, ముషీరాబాద్‌, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో నవ తెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో పులిహోర, వాటర్‌ ప్యాకెట్లు అందించారు. 
పెను ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తి  
నిజాంపేట శ్రీనివాసనగర్‌లో పెను ప్రమాదం నుంచి ఓ వ్యక్తి బయటపడ్డాడు. బైక్‌పై వెళ్తున్న వాహనదారుడు మూతలేని మ్యాన్‌హోల్‌లో బైక్‌తో సహా పడ్డాడు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే యువకుడిని రక్షించారు. 
వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష 
నగరంలోని వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. నగరంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. 
జంట జలాశయాలకు పోటెత్తిన వరద  
భారీ వర్షాలతో సుదీర్ఘ కాలం తర్వాత నగరంలో జంట జలాశయాలకు వరద పోటెత్తింది. గండిపేట చెరువులో నీటిమట్టం 1776 అడుగులకు చేరింది. హిమాయత్‌సాగర్‌కు వరద పోటెత్తింది. చాలా కాలం తర్వాత గండిపేట నిండుకుండలా మారడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. మొత్తానికి ఈరోజు వర్షం కాస్త తగ్గినా ఇంకా వరద కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం త్వరగా చర్యలు చేపట్టి కాలనీల్లో ఉన్న నీటిని తొలగించాలని బాధితులు కోరుతున్నారు. 

 

07:37 - September 25, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వర్ష బీభత్సానికి ప్రజానీకం ఇంకా తేరుకోలేదు. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి రోడ్లన్నీ తెగిపోయి చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.అనేక చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో కనీసం నిద్రాహారాలు కూడా మానేసి  బాధితులు ఎదురు చూపులు చూస్తున్నారు.  ఆదుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నారు. మరోవైపు మరికొద్ది రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయంటున్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగా సూచించింది.
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు 
దంచికొడుతున్న వానలతో తెలంగాణ వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తం అయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుకుడల్లా మారాయి. చాలాచోట్ల చెరువులకు గండ్లుపడటంతో పలు గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 
నిజామాబాద్‌ జిల్లాలో జోరువానలు 
జోరువానలతో నిజామాబాద్‌ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. బాన్సువాడ మండలం కోనాపూర్‌, కాద్లాపూర్‌, రాంపూర్ గ్రామాల్లో  సోయాబీన్‌ పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కామారెడ్డి ప్రాంతాల్లో టొమాటో పంట రదకు కొట్టుకుపోయింది. 
కరీంనగర్‌జిల్లాలో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు
కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌, కొహెడ మండలాల్లో భారీవర్షాలు బీభత్సం సృష్టించాయి. వరద ప్రవాహానికి చేటపల్లి, గౌరవెల్లి, కుందనవానిపల్లె, ధర్మారం తదితర గ్రామాలకు మధ్య రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. వరద ప్రవాహంతో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందున్నారు. 
నల్లగొండజిల్లాలో చెరువులకు గండ్లు
అటు నల్లగొండజిల్లాలో వర్షాలు జనానజీవనాన్ని అతలాకుతలం చేశాయి. భారీవర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుగ్రామలకు రాకపోకలు బందయ్యాయి. వేములపల్లి మండలంలో చెరువులకు గండ్లుపడి పంటలు నీటమునిగాయి. మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవార్గాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలు వర్షార్పణం అయ్యాయి. 
మెదక్ జిల్లాలో వర్షాల బీభత్సం 
మెదక్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి.  వరదనీటితో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏడుపాయలు దుర్గామాత ఆలయంలో నుంచి వరదనీరు ప్రవహిస్తోంది. ఏడుపాయల వద్ద వరదనీటిలో 27 మంది బీహర్‌కు చెందిన కూలీలు చిక్కుకున్నారు. 
వరంగల్‌ జిల్లాలో చెరువులకు గండ్లు
భారీ వర్షాలతో  వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 54 చెరువులు లీకవ్వగా మరో నాలుగు చెరువులకు గండ్లుపడ్డాయి. వరదలతో జిల్లాలో ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. రెండు వేల పై చిలుకు హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లింది. 25 ఏళ్ల రికార్డు స్ధాయి వర్షపాతం నమోదు కావటం విశేషం. పాకాల, లక్నవరం, రామప్ప ప్రధాన జలాశయాలు నిండుకండను తలపిస్తున్నాయి. అయితే వరద నష్టాన్ని ఇపుడే అంచనా వేయలేమంటున్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు.. మరో రెండుమూడు రోజుల వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో వరదభయంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి

వరంగల్ : నెల్లికుదురు మండలం తేజతండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 
మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు హేమ, రాములుగా గుర్తించారు. 

 

రాచర్లపతిమ్మాపూర్ చెరువుకు గండి

కరీంనగర్ : ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్లపతిమ్మాపూర్ చెరువుకు గండి పడింది. గ్రామంలోకి వరద నీరు చేరింది. వరద నీటికి రెండు ఇళ్లు కూలాయి. పశువులు కోట్టుకుపోయాయి. పోలీసులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

నేటి నుంచి దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ వార్షికోత్సవాలు

ఢిల్లీ : నేటి నుంచి దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ వార్షికోత్సవాలు జరుగనున్నాయి.

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నేడు రాత పరీక్ష

హైదరాబాద్ : తెలంగాణ పశువర్ధకశాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నేడు రాత పరీక్ష జరుగనుంది.

 

నేడు ప్రవాసాంధ్రులతో జగన్ ముఖాముఖి

హైదరాబాద్ : నేడు ప్రవాసాంధ్రులతో వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. రాత్రి 8.30 గంటలకు లోటస్ పాండ్ లో జగన్ వీడియో కాన్ఫరెన్స్ చేపట్టనున్నారు. 

Don't Miss