Activities calendar

26 September 2016

వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణపై లంచం అడిగారని ఆరోపణలు

నెల్లూరు : జిల్లాలోని వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణ వివాదాల్లో చిక్కుకున్నారు. రాపూరు కృష్ణపట్నం రైల్వే పనులకు 5 కోట్ల రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని మాంటోకార్లో కంపెనీ సెక్రటరీ కల్పేశ్ దేశాయ్, ప్రతినిధులు ఆరోపించారు. పనులకు ఆటంకం కలిగిస్తూ, తరచు ఇబ్బంది పెడుతున్నారని.. ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యమని ఆయన అన్నారు. అంతేకాకుండా వెంకటగిరి నియోజకవర్గంలో లక్ష రూపాయల పని జరగాలన్నా ఎమ్మెల్యేకు సొమ్ము చెల్లించుకోవాల్సి వస్తోందని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపించారు. ఎమ్మెల్యే సంభాషణ స్పై కెమెరాలో రికార్డు అయింది. 

21:36 - September 26, 2016

విజయవాడ : పోలవరం ప్రాజెక్టు ఏపీ సత్వర అభివృద్ధికి దోహదం కాబోతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈరోజు చంద్రబాబు పోలవరం పనులపై సమీక్షలో కమాండ్ కంట్రోల్ నుంచి దృశ్యాలు తనిఖీ చేస్తూ చంద్రబాబు అధికారులను విరాలలను అడిగి తెలుసుకున్నారు. 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా పనులు నిలిచిపోవని 14 లక్షల క్యూసెక్కుల వరద వస్తే మాత్రం పనులకు ఆటంకం ఏర్పడవచ్చని అధికారులు చంద్రబాబుకు వివరించారు. పోలవరం ప్రాజెక్టును సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వం ఒక మోడల్ ప్రాజెక్టుగా పరిగణిస్తున్నాయని బాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట పరిసర ప్రాంతాలు టూరిజంగా అభివృద్ధి చెందడానికి కూడా ఉపయోగపడతాయన్నారు. మళ్లీ జరగబోయే సమావేశానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న 6 ఏజెన్సీలు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోని రావాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 

 

21:28 - September 26, 2016

నెల్లూరు : జిల్లాలోని వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణ వివాదాల్లో చిక్కుకున్నారు. రాపూరు...కృష్ణపట్నం రైల్వే పనులకు 5 కోట్ల రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని మాంటోకార్లో కంపెనీ సెక్రటరీ కల్పేశ్ దేశాయ్, ప్రతినిధులు ఆరోపించారు. పనులకు ఆటంకం కలిగిస్తూ, తరచు ఇబ్బంది పెడుతున్నారని.. ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యమని ఆయన అన్నారు. అంతేకాకుండా వెంకటగిరి నియోజకవర్గంలో లక్ష రూపాయల పని జరగాలన్నా ఎమ్మెల్యేకు సొమ్ము చెల్లించుకోవాల్సి వస్తోందని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపించారు. ఎమ్మెల్యే సంభాషణ స్పై కెమెరాలో రికార్డు అయింది. 

కనేకల్ సబ్ రిజిస్ట్రార్ ఎసిబి అధికారులు సోదాలు

అనంతపురం : కనేకల్ సబ్ రిజిస్ట్రార్ ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.1,20, 490నగదును స్వాధీనం చేసుకున్నారు. 

టాస్క్ ఫోర్స్ పోలీసులకు తారసపడ్డ ఎర్రచందనం కూలీలు

తిరుపతి : శేషాచలం అక్కన్నదోవ అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. కూలీలు పోలీసులపైకి రాళ్లు, గొడ్డళ్లు విసిరారు. హరికృష్ణ అనే కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. పోలీసులు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. 

 

కేంద్రం నుంచి పోలవరానికి 100 శాతం నిధులు : సుజనా చౌదరి

ఢిల్లీ : కేంద్రమంత్రి సుజనా చౌదరితో నాబార్డు చైర్మన్ హర్హకుమార్ భేటీ ముగిసింది. పోలవరానికి 100 శాతం నిధులను కేంద్రం ఇస్తుందని సుజనాచౌదరి అన్నారు. నాబార్డు నేరుగా కేంద్రానికి నిధులిస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు డెవలప్ మెంట్ అథారిటీకి నిధులు వస్తాయన్నారు. అక్టోబర్ 15 నుంచి పోలవరం నిధులు విడుదల అవుతాయని తెలిపారు. రాష్ట్ర ఎఫ్ ఆర్ బిఎం పరిమితికి పోలవరం నిధుల విడుదలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

 

ముగిసిన సుజనా చౌదరితో నాబార్డు చైర్మన్ హర్హకుమార్ భేటీ

ఢిల్లీ : కేంద్రమంత్రి సుజనా చౌదరితో నాబార్డు చైర్మన్ హర్హకుమార్ భేటీ ముగిసింది. ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శి శిశిభూషణ్, ఈఎన్ సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పోలవరం నిర్మాణానికి నిధుల విడుదలకు నాబార్డ్ అంగీకారం తెలిపింది. 

20:51 - September 26, 2016

మంత్రులను జూసి మండుతున్న జనం..సమస్యల పరిష్కారానికి సురువైతి రణం, తిరుపతి కొండమీద ఉగ్రనరసింహుడు .. విలేకరొళ్లకు పాటాలు చెప్పిన గవర్నర్, మిర్యాలగూడ మున్సిపాలిటీకి పెద్దరోగం... ఆర్నెళ్లసంది జీతాలందక ఆగమాగం, రసమయి కళ్లద్దాల మీద గంగుల కన్ను... ఎవలు గమనించకుంటే ఎమైతుండెనో, బండసోలికల కెళ్లి బయటికొస్తున్న నీళ్లు...గదిజూసినంక ఊకరుంటున్న మనోళ్లు, 'జనతా గ్యారేజ్' కు ఫోన్ చేసిన మల్లన్న, మిషన్ దేవదాసు పథకం, ప్రపంచంలో అత్యంత పొడవైన పాము... 33 ఫీట్లు.. నాలుగు కింటాళ్ల బరువున్న అనకొండ... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

పోలవరం పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

విజయవాడ : పోలవరం పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ నుంచి దృశ్యాలు తనిఖీ చేస్తూ సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమ, కాంట్రాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. పనుల పురోగతిపై అధికారులను సీఎం అడిగాడు. 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా... పనులు ఆగవని అధికారులు వివరించారు. 14లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే పనులకు ఆటంకం కలగవచ్చన్నారు.

20:19 - September 26, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు జల సిరులతో కళకళలాడుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా రాష్ట్రంలో జలాశయాలు పోటెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వానల దాటికి పలు చోట్ల ఇళ్లు కూలి నిర్వాసితులు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. పులిచింతల, నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు, కరీంనగర్‌లోని మిడ్ మానేరు, మహబూబ్‌నగర్‌లోని జూరాల ప్రాజెక్టుల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. 
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జూపల్లి
సికింద్రాబాద్‌ ఆల్వాల్‌లోని ముంపు ప్రాంతాలైన భూదేవినగర్‌, యాదమ్మనగర్‌లో స్థానిక ఎమ్మెల్యే కనకారెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఇళ్లలో నీరు చేరిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. బస్తీవాసుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్‌ క్యాంపును మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్‌ మల్కాజ్‌గిరిలోని ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌లో పొంగిపొర్లుతున్న నాలాలో ప్రమాదవశాత్తు ప్రతాప్‌ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. స్థానికులు గమనించి కర్రలతో ప్రతాప్‌ను ఆపారు. అనంతరం చికిత్స నిమిత్తం అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 
చెరువుల్లోకి పూర్తి స్థాయిలో నీరు 
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్‌ నగరంలోని భద్రకాళీ, చిన్నవడ్డెపల్లి చెరువులు నిండుకుండల్లా మారాయి. చెరువుల్లోకి పూర్తి స్థాయిలో నీరు చేరడంతో మత్తళ్లు పోస్తున్నాయి. త్రినగరీలోని చెరువుల వద్దకు చేరుకుని స్థానిక మహిళలు మత్తడి నోము కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌరమ్మ, గంగమ్మ తల్లికి నోములు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయని మహిళలు విశ్వసిస్తున్నారు. 
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 42 గేట్లు ఎత్తివేత 
నిజమాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 42 గేట్లు ఎత్తివేయడంతో ప్రాజెక్టును చూసేందుకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఆహ్లదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తుండటంతో ప్రాజెక్టు వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. పిట్లం మండలం కుర్ధి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామం లోతట్టు ప్రాంతంలో ఉండటంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరంతా గ్రామాన్ని చుట్టుముట్టింది. భారీ వర్షాలకు మంజీరా నది పొంగిపొర్లడంతో కుర్ధి గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మిషన్‌ కాకతీయ పనుల్లో నాణ్యత లేకపోవటం వల్లే పంట పొలాల్లోకి నీరు వచ్చిందంటూ పొలాలన్నీ మునిగిపోయాయని నవీపేట్‌ మండలం బినోలా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మిషన్‌ కాకతీయ మొదటి విడతలో భాగంగా చేపట్టిన చెరువుల మరమ్మతుల్లో నాణ్యత లోపించిందని, ఎమ్మార్వో, కాంట్రాక్ట్‌ నిర్లక్ష్యం వల్లే తాము పంట నష్టపోయామని రైతులు ఆందోళన చేపట్టారు. 
మూసీ నది ప్రాజెక్టు 3గేట్లు ఎత్తివేశారు 
పూర్తి స్థాయిలో నీటిమట్టం పెరగడంతో నల్గొండ జిల్లాలో మూసీ నది ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేశారు. ఎగువన కురుస్తోన్న వర్షాలతో శ్రీశైలం జలాయశంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు ఎడమ, కుడి గట్టు విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ నీటి మట్టం 590 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 73వేల క్యూసెక్కులు కాగా 1050 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది.

 

20:07 - September 26, 2016
19:54 - September 26, 2016

విశాఖ : అప్పుడు హోదా అన్నారు. ఇప్పుడు ప్యాకేజీ అంటున్నారు. ప్రజల్లో ఉన్న నిరసనను కూడా పరిగణనలోకి తీసుకోకుండా నేతలు రెండు నాల్కల దోరణితో వ్యవహరించడం తగదని, ప్రత్యేక హోదా వల్లనే ఏపీకి ప్రయోజనాలు చేకూరుతాయని పలువురు పారిశ్రామిక వేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్తవారితో పాటు పాతవారికీ పారిశ్రామిక ప్రోత్సాహాకాలు ఇవ్వాలన్నారు. హోదాపై పార్టీలకతీతంగా కేంద్రాన్ని డిమాండ్ చేయాలని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి జరుగుతుందని విశాఖ పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. 
పాలకులు పూటకో మాట : ఏయూ విద్యార్థులు  
ప్రజల్ల్ని మభ్య పెడుతూ పాలకులు పూటకో మాట మాట్లాడటం సిగ్గుచేటని ఏయూ విద్యార్థులు దుయ్యబడుతున్నారు. ఏపీకి హోదాపై కేంద్ర వైఖరిని మిగతా పార్టీలతో కలిపి ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు ముక్త కంఠంతో నొక్కొ చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. హోదా కోసం అన్ని పార్టీలతో కలిసి పోరాడాలని సూచిస్తున్నట్లు ఏయూ విద్యార్థులు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

19:45 - September 26, 2016

న్యూయార్క్ : కశ్మీర్.. భారత్ లో అంతర్భాగమని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో సుష్మా ప్రసంగించారు. కశ్మీర్ పై షరతులతో కాదు.. స్నేహపూర్వకంగా చర్చించాలని సూచించారు. జమ్మూలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని నవాజ్ షరీఫ్ అన్నారని... బలుచిస్తాన్ లో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని నిర్మూళించడంలో విఫలమవుతున్నామన్నారు. మతాలకు అతీతంగా ఉగ్రవాదంపై ఏకతాటిగా పోరాడాలని పలుపిచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై చర్యలు తీసుకోవాలన్నారు. భారత యువతకు ఉపాధి కల్పించేందుకు పలు శిక్షణాకార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. డిజిటల్ ఇండియా దిశగా భారత్ పయనిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అన్ని దేశాలు సహకరించాయని పేర్కొన్నారు. 

 

19:41 - September 26, 2016

యంగ్ హీరో రాజ్ తరుణ్, పాపులర్ టీవీ యాంకర్ లాస్యను సీక్రెట్‌గా పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వచ్చిన వార్తలన్నీ రూమర్లేనట. స్వయంగా ఈ హీరోయే తన ఫేస్ బుక్, ట్విటర్‌ ఖాతాలలో ఈ విషయాన్ని తెలిపాడు. అవన్నీ నిరాధారమైన కట్టుకథలేనని ఆయన పేర్కొన్నాడు. కుమారి 21 ఎఫ్ మూవీ ఆడియో రిలీజ్ సందర్భంగా తాను లాస్యను ఒకసారి కలుసుకున్నానని, ఆ తరువాత తామెప్పుడూ కలుసుకోనేలేదని తెలిపాడు. సభకు నమస్కారం అంటూ వెరైటీగా మొదలెట్టి.. ఈ రూమర్లు ఫన్నీగా ఉన్నాయన్నాడు. మీడియా, వెబ్ సైట్దారులు ఈ విషయాన్ని గమనించాలని సోషల్ మీడియా వేదికగా రాజ్ తరుణ్ కోరాడు.

ఉగ్రవాదాన్ని నిర్మూళించడంలో విఫలం : సుష్మాస్వరాజ్

న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితిలో భారత కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు. భారత యువతకు ఉపాధి కల్పించేందుకు పలు శిక్షణాకార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. డిజిటల్ ఇండియా దిశగా భారత్ పయనిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అన్ని దేశాలు సహకరించాయన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూళించడంలో విఫలమవుతున్నామని చెప్పారు. 

డిజిటల్ ఇండియా దిశగా భారత్ : సుష్మాస్వరాజ్

న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితిలో భారత కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు. భారత యువతకు ఉపాధి కల్పించేందుకు పలు శిక్షణాకార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. డిజిటల్ ఇండియా దిశగా భారత్ పయనిస్తుందని తెలిపారు. 

యువతకు ఉపాధి కల్పనకు పలు శిక్షణాకార్యక్రమాలు : సుష్మాస్వరాజ్

న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితిలో భారత కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు. భారత యువతకు ఉపాధి కల్పించేందుకు పలు శిక్షణాకార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. 

ఐరాసలో ప్రసంగిస్తున్న సుష్మాస్వరాజ్

న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితిలో భారత కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు. భారత యువతకు ఉపాధి కల్పించేందుకు పలు శిక్షణాకార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.

19:14 - September 26, 2016

గుంటూరు : వరద బాధితులకు సహాయం చేయటంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. పొందుగల నుంచి దాచేపల్లి, ముత్యాలంపాడు గ్రామాల్లో వరద వల్ల దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించి, రైతులను పరామర్శించారు. జగన్ భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ముష్టివేసినట్లు 10 కోట్ల రూపాయలను సీఎం ప్రకటించారని జగన్ మండిపడ్డారు. 

 

చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం

చిత్తూరు : జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. రామసముద్రం మండలం గొల్లపల్లి గ్రామంలోకి ఏనుగు చొరబడి పంటపొలాలను నాశనం చేసింది. ఏనుగుదాడిలో రామప్ప అనే వృద్ధుడు మృతి చెందాడు. ఆపరేషన్ గజా పేరుతో ఏనుగును పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. 

18:58 - September 26, 2016

చిత్తూరు : జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. రామసముద్రం మండలం గొల్లపల్లి గ్రామంలోకి ఏనుగు చొరబడి పంటపొలాలను నాశనం చేసింది. ఏనుగుదాడిలో రామప్ప అనే వృద్ధుడు మృతిచెందాడు. ఆపరేషన్ గజా పేరుతో ఏనుగును పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. కుప్పం నుంచి వినాయక, జయంతి అనే రెండు శిక్షణా ఏనుగులను తెప్పించి ఒంటరి ఏనుగును దారిమళ్లించేందుకు యత్నిస్తున్నారు. మత్తు ఇంజన్లతో అడవిలోకి వెళ్లారు. మరిన్ని వివరాలకు వీడియోలో చూద్దాం....

 

 

18:54 - September 26, 2016
18:51 - September 26, 2016
18:47 - September 26, 2016

ఖమ్మం : నగరంలో మిర్చి రైతుల చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమకు సరఫరా చేసిన విత్తనాలు నకిలీవని ఆందోళనకు దిగడంతో వ్యాపారస్తులు దుకాణాలను మూసివేసి పరారయ్యే ప్రయత్నం చేశారు.  దీంతో ఇదీ గమనించిన రైతులు వ్యాపారస్తులను అడ్డుకోని వారిపై దాడి చేసారు. ఖమ్మం, వరంగల్ జిల్లాలోని అనే ప్రాంతాలోల మిర్చి విత్తనాలు నకిలీవి సరఫరా చేశారని రైతులు మండిపడ్డారు. దీంతో తమకు దిగుబడి సరిగై రాక అప్పుల్లో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

18:45 - September 26, 2016

హైదరాబాద్ : ప్రభుత్వ వైద్యసేవలు పేదలకు అందడం లేదని ఐద్వా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కనీస వసతులు, వైద్యుల భర్తీ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించింది. ఐద్వా ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకి వైద్యవిధాన పరిషత్ డైరెక్టర్‌ సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో నేతలు ఆందోళన విరమించారు. 
పోలీసులపై ఐద్వా నేతలు మండిపాటు 
రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసి..24 గంటలు ప్రజలకు వైద్యసేవలను అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లో ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కోఠి వైద్య విధాన పరిషత్‌ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన ఐద్వా నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఐద్వా, డివైఎఫ్ఐ, గిరిజన సంఘాల నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులపై ఐద్వా నేతలు మండిపడ్డారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదని నేతలు స్పష్టం చేశారు. 
ప్రభుత్వ హాస్పిటల్స్‌ను బలోపేతం చేయాలి 
వైద్య రంగంలోని సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వ హాస్పిటల్స్‌ను బలోపేతం చేయాలని ఆందోళనలో పాల్గొన నేతలు డిమాండ్‌ చేశారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని,  ఏజెన్సీలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  ఎట్టకేలకు వైద్య విధాన పరిషత్‌ డైరెక్టర్‌ సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఐద్వా కార్యకర్తలు, నేతలు ఆందోలన విరమించారు. 
హాస్పిటల్స్‌లో సరైన సదుపాయాలు లేవు : నేతలు 
రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సరైన సదుపాయాలు లేవని ఐద్వా నేతలు స్పష్టం చేశారు. ఐద్వా అధ్యక్షురాలు ఆశాలతను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేయడాన్ని పలువురు నేతలు ఖండించారు. గిరిజనులకు కనీస వైద్యం అందని పరిస్థితి ఉందని, వెంటనే ప్రభుత్వం మొబైల్‌ వైద్యసేవల్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఐద్వా నేతలు కోరుతున్నారు. 

సుజనా చౌదరితో నాబార్డ్ చైర్మన్ హర్షకుమార్ భేటీ

ఢిల్లీ : సుజనా చౌదరితో నాబార్డ్ చైర్మన్ హర్షకుమార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎపి నీటి పారుదల శాఖ కార్యదర్శి శిశిభూషణ్ కుమార్, ఈఎన్ సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నాబార్డు నిధుల కేటాయింపుపై చర్చిస్తున్నారు. 

నల్లమడ వాగు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం : సీఎం చంద్రబాబు

గుంటూరు : బాపట్ల మండలం జిల్లెలమూడి వద్ద నల్లమడ వాగుకు పడిన గండిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. నల్లమడ వాగు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. 2018 కల్లా పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి సోమవారం పోలవరం పనులు సమీక్షిస్తామన్నారు. వచ్చే ఏడాది గోదావరి నీటిని పెన్నాకు తీసుకెళ్తామని చెప్పారు. 

నాలాపై అపార్ట్ మెంట్ ప్రహరీ గోడ కూల్చివేతకు యత్నం

రంగారెడ్డి : శేరిలింగంపల్లి మదీనాగూడలో నాలాపై నిర్మించిన అపార్ట్ మెంట్ ప్రహరీ గోడ కూల్చివేతకు జీహెచ్ ఎంసీ అధికారులు యత్నించారు. స్థానికులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు మోహరించారు. 

18:00 - September 26, 2016

కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. వర్షాలు, వరదల పరిస్థితిపై అధికారులతో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పరిస్థితులను తెలుసుకున్నారు. 

 

17:58 - September 26, 2016

ఢిల్లీ : సింధు నది జలాల ఒప్పందంపై  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి విదేశాంగ కార్యదర్శి జైశంకర్, నేషనల్ సెక్యూర్టీ సలహాదారు అజిత్‌ దోవల్, నీటి వనరుల కార్యదర్శి శశి శేఖర్, పిఎంఓ కార్యాలయ అధికారులు హాజరయ్యారు. యూరీలో ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు సింధూ నది ఒప్పందాన్ని భారత్‌ రద్దు చేసుకోవాలన్న ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 1960లో సింధు ఒప్పందంపై అప్పటి భారత తాత్కాలిక ప్రధాని నెహ్రూ, పాక్‌ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ సంతకాలు చేశారు. సింధూ నదితో పాటు రావి, బియాస్, సట్లెజ్‌, చీనాబ్‌ తదితర ఆరు నదుల నీటి పంపకాలపై ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య ప్రపంచ బ్యాంక్‌ మధ్యవర్తిగా వ్యవహరించింది.

 

17:56 - September 26, 2016

యూపీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌ సీతాపూర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌పై బూటు విసిరారు. ముందే గమనించిన రాహుల్‌- షూ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన వెనకాలే ఉన్న వ్యక్తి చేతికి తగిలింది. ఓపెన్ టాప్ జీపులో ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది.  రాహుల్‌పై  షూ విసిరిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

17:54 - September 26, 2016

ఖమ్మం : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు ప్రధాన రహదారిపై దాదాపు నలభై ఏళ్ల క్రితం కోడిపుంజువాగుపై నిర్మించిన వంతెన వర్షాలకు కుంగిపోయింది. వింగ్‌ వాల్‌ కుంగడంతో పాటు వంతెనపై బీటలు ఏర్పడ్డాయి. దీంతో ఎప్పుడే ప్రమాదం సంభవిస్తుందోనని అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ట్రాఫిక్‌ను టిడిపి సెంటర్‌ మీదుగా ఆంజనేయస్వామి టెంపుల్‌ రహదారికి మళ్లించారు. సాధ్యమైనంత త్వరలోనే ఈ రహదారి మరమ్మతులు చేపడతామని అధికారులు తెలిపారు. 

 

17:52 - September 26, 2016

కరీంనగర్ : రాబోయే రెండేళ్లకు సరిపడ వర్షం కురిసిందని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాలో సీఎం పర్యటించి, ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎల్ ఎండీ మరో 3 టీఎంసీలు నిండాల్సి ఉందన్నారు. మిడ్ మానేరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిడ్ మానేరును పటిష్టంగా నిర్మిస్తామని చెప్పారు. మిడ్ మానేరు, ఎల్లంపల్లి నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో గత ప్రభుత్వం ఆలస్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక నిర్వాసితులకు వేగంగా పరిహారం చెల్లించామని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని తెలిపారు. మిషన్ కాకతీయలో చేపట్టిన ఏ ఒక్క చెరువు కట్ట తెగలేదన్నారు. జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని చెప్పారు. 

 

17:48 - September 26, 2016

నల్గొండ : జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శ్రీశైలం నుంచి నాగార్జునాసాగర్‌కు వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌ ప్రస్తుతం 73.594 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం 517.60 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ఔట్‌ ఫ్లో 1350 క్యూసెక్కులుగా ఉంది. 

 

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

ఛత్తీస్ గఢ్ : కొరసేనార్ దండకారణ్యంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. భారీగా తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 

కుక్కనోటిలో పేలిన నాటు బాంబు

నెల్లూరు : నాయుడుపేట మునిరత్న నగరలో పేలుడు సంభవించింది. కుక్కనోటిలో నాటు బాంబు పేలింది. దీంతో కుక్క మృతి చెందింది. అడవి పందుల రక్షణకు అమర్చిన నాటు బాంబును నోట కరుచుకొని కుక్క జనావాసాల్లోకి వచ్చింది. 

కాళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి

కరీంనగర్ : మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం 9.85 మీటర్లకు చేరుకుంది. పెద్దంపేట వాగు పొంగి ప్రవహిస్తోంది. రెవెన్యూ అధికారులు గ్రామస్తులను పడవలపై తరలిస్తున్నారు. 

మిడ్ మానేరు కాంట్రాక్టర్లపై చర్యలు : సీఎం కేసీఆర్

కరీంనగర్ : మిడ్ మానేరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. మిడ్ మానేరును పటిష్టంగా నిర్మిస్తామని చెప్పారు. మిడ్ మానేరు, ఎల్లంపల్లి నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో గత ప్రభుత్వం ఆలస్యం చేసిందన్నారు. మా ప్రభుత్వం వచ్చాక నిర్వాసితులకు వేగంగా పరిహారం చెల్లించామని పేర్కొన్నారు. 

 

16:41 - September 26, 2016
16:39 - September 26, 2016

కరీంనగర్‌ : గోదావరి పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కరీంనగర్‌ జిల్లాలోని ప్రాజెక్ట్‌లన్నీ పూర్తిగా నిండిపోయాయి. లోయర్‌ మానేరు డ్యామ్‌లోకి లక్ష క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఎల్ ఎండీ ప్రాజెక్ట్‌ గేట్లలో ఆరింటిని ఎత్తి  పది వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:33 - September 26, 2016

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ వాన పరిస్థితిపై మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీల్లోని చెరువులు, నాలాల పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ఆదేశించారు. వీటి వల్ల వర్షపునీరు నిలిచి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిథిలావస్థలో ఉన్న పాడుబడ్డ, పాత భవనాలను కూడా కూల్చి వేయాలని ఆదేశించారు. ఇవి కూలితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.

 

ఎల్ ఎండీలో మరో 3 టీఎంసీలు నిండాల్సి ఉంది : సీఎం కేసీఆర్

కరీంనగర్ : రాబోయే రెండేళ్లకు పరిపడ వర్షం కురిసింది. ఎల్ ఎండీ మరో 3 టీఎంసీలు నిండాల్సి ఉందన్నారు. మిడ్ మానేరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

 

16:18 - September 26, 2016

హైదరాబాద్‌ : నగరంలో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. మదీనగూడ నుంచి గచ్చిబౌలి వరకు ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నగరంలోని పది ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగతున్నాయి. కొన్ని చోట్ల నాలాలపై గదులు, ప్రహరిగోడలను అక్రమంగా నిర్మించారు. అక్రమ కట్టడాలను జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది తొలగిస్తున్నారు.  

16:10 - September 26, 2016
16:08 - September 26, 2016

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించింది.. ఒకే రాకెట్‌ ద్వారా ఎనిమిది ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇందులో 3 భారత్‌వి కాగా మరో ఐదు విదేశాలకు చెందిన ఉపగ్రహాలున్నాయి. 
కక్ష్యలోకి 8 ఉపగ్రహాలు
వరుస అంతరిక్ష ప్రయోగాలతో విజయం సాధిస్తోన్న ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ35 వాహకనౌక ద్వారా ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా చరిత్ర సృష్టించింది.  ఉదయం 9.12 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ35 వాహకనౌక 2 గంటల15 నిముషాల్లో 8 ఉపగ్రహాలను రెండు విభిన్న కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.
తొలుత స్కాట్‌శాట్‌ 1 ఉపగ్రహం కక్ష్యలోకి 
తొలుత స్కాట్‌శాట్‌ 1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన పిఎస్‌ఎల్వీ సి35 వాహకనౌక మిగిలిన ఏడింటిని నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.  పీఎస్‌ఎల్‌వీ-సీ35 ప్రయోగించిన 17 నిమిషాలకు స్కాట్‌శాట్-1ను భూమికి 730 కి.మీ.ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నౌకను కిందకు రప్పించి 689 కి.మీ.ల ఎత్తులోని కక్ష్యలోకి 7 ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. మొత్తం నాలుగు దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. 
8 ఉపగ్రహాల మొత్తం బరువు 675 కిలోలు  
భారత్‌కు చెందిన స్కాట్‌శాట్‌ 1 ఉపగ్రహంతో పాటు బాంబే ఐఐటి విద్యార్థులు రూపొందించిన 10 కేజీల బరువు కల ప్రథమ్, బెంగళూరు పిఈఎస్‌ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన 5.25 కిలోల పిశాట్‌ ఉపగ్రహాలున్నాయి. ఇవి కాకుండా అల్జీరియాకు చెందిన మూడు ఉపగ్రహాలు, కెనడా, అమెరికా దేశాలకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహముంది. 8 ఉపగ్రహాల మొత్తం బరువు 675 కిలోలు.  
భారత శాస్త్రవేత్తల్లో ఆనందం 
ఈ విజయం పట్ల భారత శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లి విరిసింది. ఈ ప్రయోగం వంద శాతం విజయవంతమైందన్నారు. సముద్రాల్లో వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు దోహద పడనుందని ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. స్కాట్‌శాట్‌ 1 ద్వారా సునామీలను, తుపానులను గుర్తించడం లాంటి కీలక సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు.
రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు 
పిఎస్‌ఎల్‌వి సి 35 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్ర వేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. 

16:03 - September 26, 2016

విశాఖ : జిల్లాలో వర్షాలు హోరెత్తిపోతున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రేగుపాలెం, గుళ్లిపాడు మధ్య పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తుని రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లను నిలిపివేశారు. భువనేశ్వర్‌, రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ను సుమారు గంటకుపైగా నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 

 

15:52 - September 26, 2016

కరీంనగర్ : వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. మంత్రులు ప్రాజెక్టుల వద్ద ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈమేరకు మంత్రి ఈటెల రాజేందర్ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. వర్షాలు కురవడంతో చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయని తెలిపారు. వర్షాలతో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ ఏడాది వ్యవసాయానికి ఢోకా లేదన్నారు. ముందు జాగ్రత్త చర్యల వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. లక్షా 86 వేల క్యూసెక్కుల నీరు వచ్చినప్పుడు భయపడ్డామని...ప్రస్తుతం వరద తగ్గిందన్నారు. 

 

15:47 - September 26, 2016

తూర్పుగోదావరి : జిల్లాలోని దివీస్ ప్రభావిత గ్రామాల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీ పర్యటిస్తున్నారు. ఎమ్మెల్సీలు బాలసుబ్రమణ్యం, సూర్యారావు, నాగేశ్వరరావులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా కొద్ది నెలలుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే

కరీంనగర్ : జిల్లాలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. మిడ్ మానేరు, ఎల్లంపల్లి, గోదావరి పరివాహక ప్రాంతాలలను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. 

 

పొంగిపొర్లుతున్న వరాహా, శారదా నదులు

విశాఖ : జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వరాహా, శారదా నదులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 

శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు సందర్శకుల తాకిడి

నిజామాబాద్ : శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు సందర్శకులు తాకిడి పెరిగింది. నిజాంసాగర్ వద్ద కిలీ మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు పట్టించుకోలేదు. 

 

నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలు తొలగిస్తున్న జీహెచ్ ఎంసీ

హైదరాబాద్ : నగరంలోని నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను జీహెచ్ ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. అక్రమ కట్టడాలను జీహెచ్ ఎంసీ అధికారులు, సిబ్బంది తొలగిస్తున్నారు. 

 

కరీంనగర్ కలెక్టరేట్ లో అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

కరీంనగర్ : కలెక్టరేట్ లో అధికారులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులు సమర్థవంతంగా ఈ అనుభవాలతో భవిష్యత్ అనర్థాలు జరగకుంఆ చూడాలన్నారు. అప్పర్ మానేరు నుంచి పెద్ద ఎత్తున ప్రవాహం రావడం వల్ల మిడ్ మానేరుకు ఇబ్బంది కలిగిందన్నారు.
మిడ్ మానేరు పనుల్లో జాప్యం వల్లే ఈ అనర్థం జరిగిందని తెలిపారు.  

 

మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీలోని చెరువులు, నాలాలపై అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చివేయాలని ఆదేశించారు. 

13:55 - September 26, 2016

ఇదంతా పోటీ ప్రపంచం. ఇందులో ఫ్యాషన్ ప్రపంచం ఎప్పుడూ ఒక స్టెప్ ముందే ఉంటుంది. మరి ఇలాంటి ఫ్యాషన్ ప్రపంచంలో వచ్చిన ట్రెండ్స్ తో ఏంటో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:54 - September 26, 2016

మొక్కలంటే అందరికీ ఇష్టమే. చుట్టూ పచ్చని వాతావరణం పరుచుకునుంటే అందరికీ ఆహ్లాదమే. కానీ మహా నగరాల్లో అది ఎలా సాధ్యపడుతుంది? ఆ ఆనందం ఎలా తీరుతుంది? పెద్ద సమస్యే. కానీ, ఆ సమస్యకు అందమైన మినీయేచర్ గార్డెనే పరిష్కారమంటున్న అక్కాచెల్లెల్ల అనుభవాలు తెలుసుకోనే ప్రయత్నం చేసింది 'మానవి'. అభిరుచి ఉంటే, ఆసక్తిని జతచేస్తే, సృజనాత్మకతను దానికి మేళవిస్తే, అందమైన బృందావనాలు అరమీటరు జాగాలో కూడా సృష్టించొచ్చు. ఇంటిని అందంగా, పనిచేసే ప్రదేశాన్ని కళాత్మకంగానూ తీర్చిదిద్దుకోవచ్చు. డ్రాయింగ్ రూంలో టేబుల్ మీదైనా, కిచెన్ గట్టుమీదైనా, రీడింగ్ రూమ్ లో ఓ మూలకైనా అందంగా ఒదిగేలా ..మినీయేచర్ గార్డెన్ కు రూపమిస్తున్న ఈ అక్కాచెల్లెలిద్దరికీ మానవి అభినందనలు తెలియచేస్తోంది. ఎందరికో స్పూర్తిని కలిగించాలని ఆశిస్తోంది. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:50 - September 26, 2016

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్న హిల్లరీ క్రింటన్..డోనాల్డ్ ట్రంప్ లు ముఖాముఖి చర్చకు సిద్ధమౌతున్నారు. న్యూయర్క్ లోని హాఫ్ స్ట్రా యూనివర్సిటీలో ఇద్దరి మధ్య చర్చ జరగనుంది. రాత్రి 9గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉద్యం 6గంటలకు ఈ చర్చ ఉండనుంది. వచ్చే నవంబర్ 8వ తేదీన జరిగే అధ్యక్ష ఎన్నికంటే ముందు మూడు చర్చలు జరగనున్నాయి. ఇందులో ఇది మొదటి చర్చ. మొత్తం గంటన్నర పాటు హిల్లరీ..ట్రంప్ మధ్య చర్చ జరగనుంది. యూఎస్ విదేశాంగ విధానం అమెరికాకు ప్రమాదం కలిగించే అన్ని అంశాలపై వీరు అభిప్రాయాలను వెల్లడించనున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థి క్లింటన్ అనారోగ్య అంశాన్ని ట్రంప్ ప్రస్తావించే అవకాశం ఉందని వివ్లేషకులు భావిస్తున్నారు. తాను గెలిస్తే భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిస్తానని అంటున్న ట్రంప్ పై హిల్లరీ వేలేత్తి చూపనున్నారు. అలాగే ముస్లింలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన హిల్లరీ విరుచకపడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

13:48 - September 26, 2016

ఏలూరు : సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్ సెల్ లో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమ సమస్యలను అధికారులు పరిష్కరించడం లేదని తీవ్రమనస్తాపానికి గురవుతున్న వారు ఆత్మహత్య చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఏలూరు కలెక్టరేట్ లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. నిడదవోలు మండలం సమిస్రగూడెంకు చెందిన నాగరాజు సోమవారం కలెక్టర్ గ్రీవెన్ సెల్ కు వచ్చాడు. తన సమస్యను పరిష్కరించాలని కోరాడు. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నాగరాజు తీవ్రమనస్థాపానికి గురయ్యాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ తాగి ఆత్మహత్యకు నాగరాజు ప్రయత్నించాడు. వెంటనే అతడిని ఇతరులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఇతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

13:37 - September 26, 2016

విశాఖపట్టణం : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం భారీ వర్షాలు కురస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నీట మునిగాయి. దీనితో వాహనదారులు..పాదచారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. గంటకు పైగా భువనేశ్వర్ - రామేశ్వరం ఎక్స్ ప్రెస్ నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు. రేగుపాలెం - గుళ్లిపాడు మధ్య వరదనీరు పట్టాలపై నుండి ప్రవహిస్తోంది. తుని రైల్వే స్టేషన్ లో పలు రైళ్లను నిలిపివేశారు. 

13:31 - September 26, 2016

మెదక్ : భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తుతున్నాయి. రోడ్లపై వరద నీరు పోటెత్తుతోంది. దీనితో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లపై పారుతున్న వరద ఉధృతిని వెళ్లాలని భావిస్తున్న పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటన సోమవారం చోటు చేసుకుంది. మధ్యాహ్నం వేణు అనే యువకుడు కిష్టాపూర్ వాగును దాటే ప్రయత్నం చేశాడు. అప్పటికే అక్కడ చాలా మంది వేచి ఉన్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉందని రావద్దని చెప్పారు. కానీ ఆ యువకుడు బైక్ తో ముందుకు రావాలని ప్రయత్నించాడు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వాహనం ఆగిపోయింది. ఆ సమయంలో వాహనం అదుపుతప్పడం..వేణు పడిపోవడం జరిగిపోయాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న ఇతరులు స్పందించారు. కొట్టుకపోతున్న వేణును పట్టుకున్నారు. ఓ తాడు సహాయంతో అతని అతికష్టం మీద బయటకు లాగారు. ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

కరీంనగర్ కు చేరుకున్న సీఎం కేసీఆర్..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు చేరుకున్నారు. అక్కడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులు నీటితో నిండుకుండలా తయారయ్యాయి. 

13:21 - September 26, 2016

హైదరాబాద్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. కోఠిలోని వైద్య విధాన పరిషత్ ఎదుట ఐద్వా, డివైఎఫ్ఐ, టిజిఎస్ లు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు అనుమతి లేదని పోలీసులు పేర్కొంటూ నేతలను అరెస్టులు చేసింది. పోలీసులు అరెస్టు చేయడాన్ని సంఘాలు తప్పుబట్టాయి. ఈ సందర్భంగా ఐద్వా..గిరిజన సంఘం నేతలు టెన్ టివితో మాట్లాడారు. తాము మూడు నెలలుగా నిర్వహించిన సర్వేలో అనేక వాస్తవాలు తెలిశాయని, ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావించినట్లు తెలిపారు. అందులో భాగంగా శాంతియుతంగా ధర్నా చేయడం జరిగిందని, కానీ పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసిందని పేర్కొన్నారు. నిర్భందాల మధ్య తరలివచ్చి ధర్నా చేసినట్లు తెలిపారు. అనంతరం కమిషనర్ స్పందించి వినతిపత్రం తీసుకోవడం జరిగిందని, సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని ఒప్పుకోవడం జరిగిందన్నారు. పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదని, ప్రశ్నించడమే తప్పా అని ఎదురు ప్రశ్నించారు. కనీసం ధర్నా నిర్వహించుకోకుండా పోలీసులు వ్యవహరించడంపట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం చేయడం జరుగుతుందన్నారు. 

13:16 - September 26, 2016

కాన్పూర్ : చారిత్రాత్మకమైన 500 టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. గ్రీన్ పార్క్ లో కివీస్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో 197 పరుగుల తేడాతో గెలుపొందింది. 434 పరుగులను కివీస్ జట్టు చేయలేకపోయింది. త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ తన మాయాజాలాన్ని చూపాడు. అద్భుతమైన స్పిన్ తో ఆరు వికెట్లు తీసి భారత్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. షమీ రెండు వికెట్లు తీయగా జడేజా ఒక వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్..
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 318 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇందులో విజయ్ (65), పుజారా (62), జడేజా (42 నాటౌట్), అశ్విన్ (40) పరుగులు చేశారు. అనంతరం కివీస్ మొదటి ఇన్నింగ్స్ ఆటను ప్రారంభించింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ బ్యాట్స్ మెన్స్ పరుగులు రాబట్టడంలో శ్రమించాల్సి వచ్చింది. విలియమ్సన్ (75), టామ్ లాథమ్ (58) పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. 262 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో భారత్ బౌలర్ జడేజా ఐదు వికెట్లు తీయగా అశ్విన్ నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్ మెన్స్ విజృంభించారు. ఓపెనర్ రాహుల్ (38) విజయ్ (76) ధాటిగా ఆటను ప్రారంభించారు. పుజారా (78), కోహ్లీ (18), రహానే (40)లు పరుగులు చేశారు. మొత్తం 5 వికెట్లు కోల్పోయిన భారత్ 377 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. శర్మ (68 నాటౌట్), జడేజా (50 నాటౌట్) గా మిగిలారు.

434 పరుగుల లక్ష్యం..
434 పరుగుల లక్ష్య చేధనతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ఆటను ఆరంభించింది. కానీ భారత్ బౌలర్ అశ్విన్ మాయాజాలంతో కివీస్ బ్యాట్ మెన్స్ త్వరత్వరగా అవుట్ అయ్యారు. కానీ రోంచీ (80), శాంట్నర్ (71) పోరాటం చేశారు. కానీ మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చివరకు 236 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ ఆరు వికెట్లు, షమీ రెండు, జడేజా ఒక వికెట్ తీశారు. చారిత్రక 500 టెస్టు మ్యాచ్ లో భారత్ విజయం సాధించడం పట్ల క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 318 ఆలౌట్‌
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 262 ఆలౌట్‌
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ :
లోకేశ్‌ రాహుల్‌ (సి) టేలర్‌ (బి) సోధి 38, మురళీ విజరు (ఎల్బీ) శాంట్నర్‌ 76, చతేశ్వర్‌ పుజార (సి) టేలర్‌ (బి) సోధి 78, విరాట్‌ కోహ్లి (సి) సోధి (బి) క్రెయిగ్‌ 18, అజింక్య రహానె (సి) టేలర్‌ (బి) శాంట్నర్‌ 40, రోహిత్‌ శర్మ నాటౌట్‌ 68, రవీంద్ర జడేజా నాటౌట్‌ 50, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : ( 107.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 377 డిక్లేర్డ్‌.
వికెట్ల పతనం : 1-52, 2-185, 3-214, 4-228, 5-277.
బౌలింగ్‌ : ట్రెంట్‌ బౌల్ట్‌ 9-0-34-0, మిచెల్‌ శాంట్నర్‌ 32.2-11-79-2, మార్క్‌ క్రెయిగ్‌ 23-3-80-1, వాగర్‌ 16-5- 52-0, ఇశ్‌ సోధి 20-2-99-2, మార్టిన్‌ గప్టిల్‌ 4-0-17-0, కేన్‌ విలియమ్సన్‌ 3-0-7-0.
న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : టామ్‌ లాథమ్‌ (ఎల్బీ) అశ్విన్‌ 2, మార్టిన్‌ గప్టిల్‌ (సి) విజరు (బి) అశ్విన్‌ 0, కేన్‌ విలియమ్సన్‌ (ఎల్బీ) అశ్విన్‌ 25, రాస్‌ టేలర్‌ రనౌట్‌ (ఉమేశ్‌ యాదవ్‌) 17, ల్యూక్‌ రోంచీ బ్యాటింగ్‌ 38, మిచెల్‌ శాంట్నర్‌ బ్యాటింగ్‌ 8, వాటింగ్ 18, క్రేగ్ 1, సోది 17, బౌల్ట్ 2 నాటౌట్, వాగ్నర్ 0.
ఎక్స్ ట్రాలు : 3, మొత్తం : (87.3 ఓవర్లలో 236 పరుగులు ఆలౌట్)

తపాలకు ప్రాధాన్యం తగ్గలేదు - వెంకయ్య నాయుడు...

హైదరాబాద్ : రవీంద్రభారతిలో తెలంగాణ పోస్టల్ సర్కిల్ ను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, మనోజ్ సిన్హా లు హాజరయ్యారు. 1854లో తపాల చట్టం ఏర్పడిందని, తపాలా విభాగానికి ఎర్రపోస్టు డబ్బానే చిహ్నమని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. సెల్ ఫోన్ లు..ఇంటర్నెట్ వచ్చినా తపాలకు ప్రాధాన్యం తగ్గలేదన్నారు. ప్రతొక్కరూ మాతృభాషకు ప్రాధాన్యతనివ్వాలని, దేశ భాషగా హిందీ విరాజిల్లుతోందన్నారు. ప్రతి వ్యక్తీ కన్నతల్లికి..జన్మభూమికి కట్టుబడి ఉండాలన్నారు. 

గెలుపు ముంగిట భారత్..

కాన్పూర్ : న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ విజయం ముంగిట నిలిచింది. 434 పరుగుల లక్ష్య చేధనకు దిగిన కివీస్ జట్టు లంచ్ విరామ 9 వికెట్లు కోల్పోయింది. చారిత్రక విజయానికి ఒక వికెట్ దూరంలో ఇండియా నిలిచింది. 

12:28 - September 26, 2016

హైదరాబాద్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. కోఠిలోని వైద్య విధాన పరిషత్ ఎదుట ఐద్వా, డివైఎఫ్ఐ, టిజిఎస్ లు ధర్నా నిర్వహించారు. వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటు చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. 24గంటల పాటు వైద్యం ప్రజలకు అందుబాటులో ఉంచాలని వారు కోరుతున్నారు. ప్రధాన ద్వారం వద్ద పోలీసులు, నేతలకు మధ్య వాగ్వాదడం చోటు చేసుకుంది. తాము మూడు నెలల పాటు జరిపిన సర్వేలో వెల్లడైన వాస్తవాలను కమిషనర్ దృష్టికి తీసుకెళుతామని కోరడం జరిగిందన్నారు. తాము శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తామని, అనంతరం తాము కమిషనర్ కు వినతిపత్రం ఇస్తామని ఇందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరడం జరిగిందని, కానీ పర్మిషన్ ఇవ్వలేదని ఐద్వా నేత పేర్కొన్నారు. తెల్లవారుజామున ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి టెన్ టివితో మాట్లాడారు. రోడ్డు మీద ధర్నా చేస్తామంటే ఎలా పర్మిషన్ ఇస్తామని, ధర్నా ఇందిరాపార్కు వద్ద చేయాలని సూచించారు. ప్రధానం ద్వారం వద్ద రోడ్డుపై కూర్చొంటే ఇబ్బంది ఉంటుందని, అందుకే ఇక్కడ ధర్నా చేయవద్దని పేర్కొనడం జరుగుతోందన్నారు. 

12:14 - September 26, 2016
11:55 - September 26, 2016

స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' కి టాలీవుడ్ లో కాదు మాలీవుడ్ మలయాళంలోనూ స్టార్ ఇమేజ్ సంపాదించాడు. ఈ క్రమంలో తమిళంలో కూడా 'బన్నీ' మార్కెట్ క్రియేట్ చేసుకోని సౌత్ స్టార్ అనిపించుకోవాలని కొంతకాలంగా భావిస్తున్నాడు. సౌత్ వైజ్ గా స్టార్ డమ్ క్రియేట్ చేసుకోవాలని ఉద్దేశ్యంలో ఉన్న బన్నీ ఇప్పుడు డైరెక్ట్ గా తమిళ మూవీ చేస్తున్నాడు. 'సరైనోడు' సక్సెస్ తో 'అల్లు అర్జున్' అసలు సిసలు మాస్ స్టార్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం 'బన్నీ' హరీశ్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథమ్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు లేటేస్ట్ గా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తో తమిళ స్ట్రయిట్ మూవీకి ఒకే చెప్పేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన షార్ట్ టైంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావచ్చని తెలుస్తోంది. తమిళంలో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు .ఈ క్రమంలో ఈ మూవీని రెండు లాగ్వేంజెస్ లో కలిపి బైలింగ్యువల్ మూవీగా రూపొందించాడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సూర్య కజిన్ నిజానికి జ్ఞాన్ వేల్ నిర్మించనున్నాడు. బన్నీ సౌత్ స్టార్ సన్నాహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

విజయానికి మరింత చేరువలో భారత్..

కాన్పూర్ : చారిత్రాత్మకమైన 500 టెస్టు మ్యాచ్ లో భారత్ విజయానికి చేరువైంది. 434 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా ఓవర్ నైట్ స్కోరు 93/4తో చివరి రోజైన సోమవారం బరిలోకి దిగిన న్యూజిలాండ్ 158 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 170/5 తో రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న కివీస్ జట్టు విజయానికి 264 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. 

శాసనసమండలి ఉపఎన్నికకు నోటిఫికేషన్..

హైదరాబాద్ : శాసనసమండలి ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అసెంబ్లీ కోటాలో ఖాళీగా ఉన్న స్థానానికి నోటిఫికేషన్ ను సోమవారం అధికారులు విడుదల చేశారు. అక్టోబర్ 3 వరకు నామినేషన్ స్వీకరించనున్నారు. 

నిలిచిన యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్...

కాకినాడ : రేగుపాలెం సమీపంలో రైల్వే ట్రాక్ పై నీరు పారుతోంది. తుని రైల్వే స్టేషన్ లో యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. దీనివల్ల పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 

11:33 - September 26, 2016
11:30 - September 26, 2016
11:28 - September 26, 2016

కరీంనగర్ : గత కొద్ది రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీనితో మిడ్ మానేర్ నిండుకుండను తలపిస్తోంది. విషయం తెలుసుకున్న మంత్రులు హరీష్ రావు, ఈటెల మిడ్ మానేర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాసేపటి క్రితం ఆరు గేట్లను ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కేసీఆర్ పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. వాతావరణం అనుకూలించకపోడంతో ఏటీసీ అనుమతినివ్వలేదు. దీనితో గజ్వేల్ ఫాం హౌస్ నుండి కరీంనగర్ జిల్లాకు కేసీఆర్ బయలుదేరారు. మిడ్ మానేరు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించనున్నారు. మధ్యాహ్నం తరువాత ఏరియల్ సర్వే చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. జిల్లాకు చేరుకున్న అనంతరం కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎలాంటి ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 

11:22 - September 26, 2016
11:10 - September 26, 2016

కరీంనగర్ : లోయేర్ మానేరు ప్రాజెక్టు నిండుకుండని తలపిస్తోంది. ప్రాజెక్టులో నీటి పరిస్థితిని మంత్రులు హరీష్ రావు..ఈటెల రాజేందర్ లు పరిశీలించారు. కాసేపటి క్రితం 6గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 40వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ 21టీఎంసీలు ఉండగా పూర్తిస్థాయి నీటి నిల్వ 24.07 టీఎంసీలుగా ఉంది. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నట్లు తెలుస్తోంది. వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్ ద్వారా లేకపోతే రోడ్డు మార్గాన జిల్లాకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌ జిల్లాలో మిడ్ మానేరుకు వరద పోటెత్తుతోంది. దిగువ ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ మానేరు నుంచి నీటిని వదులుతుండటంతో మిడ్‌ మానేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మానేరు అలుగుతోపాటు పక్కన మట్టికట్టపై నుంచి కూడా పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తోంది. మానేరు, మోయతుమ్మెద వాగు, ఎల్లమ్మ, మూలవాగు, బిక్కవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు పోటెత్తడంతో.. మిడ్‌మానేరు దిగువ ప్రాంతాలైన చీర్లవంచ, మాన్వాడ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిస్థితి మంత్రి హరీష్‌రావు సమీక్షించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

టౌలీచౌకి వరకు బారులు తీరిన వాహనాలు..

హైదరాబాద్ : మాసబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ కింద లకడీకపూల్ వైపు వచ్చే మార్గాన్ని మూసివేశారు. రోడ్డు మరమ్మత్తుల దృష్ట్యా మార్గాన్ని మూసివేశారు. టౌలీచౌకి వరకు వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. 

విశాఖలో భారీ వర్షం..

విశాఖపట్టణం : జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జిల్లా వ్యాప్తంగా వాగులు..వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎజెన్సీతో పాటు పాయకరావుపేట, అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 

తెలుగు రాష్ట్రాల రైతులతో మాట్లాడిన మోడీ..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల రైతులతో మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం, కొత్త వంగడాలు అందించాలని సూచించారు. కొత్త రకం పుసుపు వంగడం 'పీతాంబర్' ను మోడీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. 

తెలంగాణలో నేడు భారీ వర్షాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. విదర్భ ప్రాంతానికి అల్పపీడనం చేరిందని, రేపటి నుండి క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. 

ఫీవర్ ఆసుపత్రికి రోగుల తాకిడి..

హైదరాబాద్ : తెలంగాణలో భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. నల్లంకుట ఫీవర్ ఆసుపత్రికి రోగుల తాకిడి అధికంగా ఉంటోంది. వారం రోజుల వ్యవధిలో ఓపీ రోగుల సంఖ్య 9వేలకు చేరుకుంది.

 

పల్నాడుకు రానున్న సీఎం బాబు..

గుంటూరు : నేడు పల్నాడు ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. జిల్లాలోని గురజాల నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 

10:10 - September 26, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వైరల్ ఫీవర్ల టెన్షన్ నెలకొంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీనితో అంటురోగాలు వ్యాపిస్తున్నాయి. దోమల కారణంగా వచ్చే డెంగ్యూ వ్యాధి ప్రబలుతోంది. 15 డెంగ్యూ..158 వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. ఫీవర్ ఆసుపత్రికి రోగులు భారీగా తరలివస్తున్నారు. అంటురోగాలు..డెంగ్యూ నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ రోగుల తాకిడి మాత్రం అధికంగానే ఉంటోంది. నగరంలో కుండపోత వర్షంతో పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నారు. నీరు ఎక్కువగా నిలువ ఉండడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

నిండుకుండలా శ్రీశైలం జలాశయం..

కర్నూలు : శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉంది. ప్రాజెక్టు నీటి మట్టం 880 అడుగుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 41,600, ఔట్ ఫ్లో 75,700 క్యూసెక్కులుగా ఉంది. 

గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి..

కరీంనగర్ : గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. దీనితో సింగరేణి అధికారులు అప్రమత్తమయ్యారు. రామగుండం, మేడిపల్లి ఓపెన్ కాస్ట్ 4 ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిపివేసి యంత్రాలు..డంపర్ లు సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. గోదావరి 1వ గదిలో అధికారులు సమీక్ష నిర్వహించారు. 

09:34 - September 26, 2016

నెల్లూరు : పీఎస్ఎల్వీ సీ 35 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. సోమవారం ఉదయం ఇస్రో ఈ రాకెట్ ను ప్రయోగించింది. ఈ రాకెట్‌ ద్వారా ఎనిమిది ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెడతారు. ప్రయోగం పూర్తవడానికి 2 గంటల 15 నిమిషాల సమయం పట్టనుంది. ప్రయోగానికి ముందు జరిగే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో కొనసాగింది. PSLV-C35 రాకెట్‌ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు ఎనిమిది ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు.

మరో కొత్త అధ్యాయం..
రాకెట్‌ ఇంజిన్‌ను ఆఫ్‌ చేసినప్పుడు అది ఒక ధృవం నుంచి మరో ధృవానికి ప్రరిభ్రమిస్తుంది. మధ్యలో ఇంజిన్‌ను మండించి, ఆఫ్‌ చేసినప్పుడు కక్ష్య మారుతుంది. విభిన్న కక్ష్యల్లో ప్రవేశపెట్టాల్సిన ఉపగ్రహాలను ఒకే రాకెట్‌తో ప్రయోగించడం వల్ల వ్యయాలు తగ్గుతాయి. ఇస్రో ఇంతకు ముందు 20 ఉప్రగ్రహాలను 670 కి.మీ. ఎత్తులోని పోలార్‌ సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. పీఎస్‌ఎల్‌వీ-సీ35 ప్రయోగం ద్వారా ఇప్పుడు మరో కొత్త అధ్యయానికి తెరతీసినట్లైంది. 

09:21 - September 26, 2016

కరీంనగర్ : ఎడతెరపి లేని వర్షాలతో కరీంనగర్ జిల్లా అతలాకుతలమవుతోంది. జలాశయాలు నిండుకుండాల తలపిస్తున్నాయి. మధ్యమానేరుకు వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీనితో కట్టకోతకు గురయింది. జిల్లా పరిస్థితులను తెలుసుకొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు రానున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాకతీయ కాలువకు గండి పడి వందల ఎకరాల పంట నీట మునిగిపోయింది. వాతవరణం అనుకూలిస్తే హెలికాప్టర్ ద్వారా జిల్లాకు సీఎం కేసీఆర్ రానున్నరని తెలుస్తోంది. వాతావరణం ప్రతికూలంగా ఉంటే పర్యటన రద్దవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

భారీగా వరద నీరు...
ఎగువ మానేరు నుంచి నీటిని వదులుతుండటంతో మిడ్‌ మానేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మానేరు అలుగుతోపాటు పక్కన మట్టికట్టపై నుంచి కూడా పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తోంది. మానేరు, మోయతుమ్మెద వాగు, ఎల్లమ్మ, మూలవాగు, బిక్కవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు పోటెత్తడంతో.. మిడ్‌మానేరు దిగువ ప్రాంతాలైన చీర్లవంచ, మాన్వాడ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిస్థితి మంత్రి హరీష్‌రావు సమీక్షించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

కాసేపట్లో పీఎస్ఎల్పీ సీ 35 ప్రయోగం..

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తన అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది. ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను నింగిలోకి పంపడంతో పాటు ఒకేసారి వేర్వేరు కక్ష్యలో వాటిని ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తొలిసారిగా ప్రయత్నిస్తున్నారు. సోమవారం ఉదయం 9.12 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ35 వాహకనౌకను నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి నింగిలోకి పంపనున్నారు. 

08:33 - September 26, 2016
08:31 - September 26, 2016

మూడు టెస్టు సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. న్యూజిలాండ్ ముందు 434 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ 377 వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ అధిక్యం 56 పరుగులు కలుపుకుని 433 పరుగుల కాగా 434 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచింది. అయితే న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 93 పరుగులకే 4 వికెట్లు కొల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

08:30 - September 26, 2016
08:26 - September 26, 2016

ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం సాగిస్తామని, అవసరమైతే ఎంపీల రాజీనామా అనే బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగిస్తామని ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పష్టం చేశారు. ప్రవాసాంధ్రులతో జరిగిన ముఖాముఖిలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో విష్ణువర్ధన్ రెడ్డి(బీజేవైఎం), తెలకపల్లి రవి (విశ్లేషకులు), కొణిజెటి రమేష్ (వైసీపీ), విజయ్ కుమార్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

ప్రమాదకరంగా కోడింపుంజుల వాగు..

ఖమ్మం : మణుగూరు ప్రధాన రహదారిపై కోడిపుంజులవాగు వంతెన ప్రమాదకరంగా మారింది. సుమారు పది అడుగుల మేర వంతెన కూలింది. దీనితో పోలీసులు భారీ వాహనాలను నిలిపివేశారు. 

మిడ్ మానేరుకు భారీగా వరదనీరు..

కరీంనగర్ : మిడ్ మానేరు వరదనీరు భారీగా చేరుతోంది. పది మీటర్ల కట్ట కొట్టుకపోయింది. మంత్రులు ఈటెల, హరీష్ రావులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోయర్ మానేరు డ్యాంగ్ కు భారీగా వరదనీరు చేరుతోంది. 

నేటి నుండి సరస్ 2016 ప్రదర్శన..

హైదరాబాద్ : తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్చ్) ఆధ్వర్యంలో భారతదేశ గ్రామీణ స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు (సరస్ 2016) సోమవారం నుండి మొదలు కానున్నాయి. 

నేడు రాష్ట్ర రైతులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..

హైదరాబాద్ : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ప్లాటినం సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా పీతంబర్ అనే నూతన పసుపు వంగడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. 

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు...

ఖమ్మం : వైరా సమీపంలో ఆగి వున్న లారీని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. 

07:16 - September 26, 2016

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వ్యతిరేక పోరాటాలు ఉధృతమవుతున్నాయి. సిపిఎస్ వ్యతిరేక పోరాటంలో ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. అక్టోబర్ 1 న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నాయి. ఇంతకీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే ఏమిటి? ఇది ఎప్పటి నుంచి అమలవుతోంది? ఉద్యోగులు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పాత పెన్షన్ విధానానికి, కొత్త కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కి వున్న తేడాలేమిటి? అసలు ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ లు ఎందుకు అమలు చేయాలి? ఈ అంశాలపై 10టివి జనపథంలో తెలంగాణ యుటిఎప్ నేత నర్సిరెడ్డి విశ్లేషించారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

07:13 - September 26, 2016

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పై ఉద్యోగుల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానమే అమలు చేయాలంటూ వివిధ ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ ఆందోళనలతో ఉపాధ్యాయ సంఘాలు కూడా గొంతుకలిపాయి. అక్టోబర్ 1న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించేందుకు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ప్రతి ఉద్యోగీ 58 ఏళ్ళకు రిటైరవ్వక తప్పదు. కొంతమందికి 60 ఏళ్ళ దాకా చాన్స్ వుంది. కానీ, ఉద్యోగి జీవితంలో రిటైర్మెంట్ తప్పనిసరి. పాతిక ముప్పై ఏళ్ల పాటు ఉద్యోగిగా సేవలందించినవారు రిటైరైన తర్వాత ఎలా బతకాలి? ఉద్యోగ విరమణ తర్వాత జీవితం ప్రశాంతంగా, నిశ్చింతగా సాగేందుకు ప్రవేశపెట్టిందే పెన్షన్ విధానం. ఆరు పదుల వయస్సులో రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించినా, కుటుంబ బాధ్యతలు మిగిలే వుంటాయి. వృద్ధాప్యంలో జీవితం ఆషామాషీ కాదు. రిటైర్మెంట్ తర్వాత ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను తట్టుకోవాలంటే అందుకు తగ్గ ధనం అవసరం. 30 ఏళ్ల పాటు సేవలు ఉపయోగించుకుని, వృద్ధాప్యంలో నీ దారి నువ్వు చూసుకో అనడం ఏ మాత్రం న్యాయం కాదు. అది మానవీయతాకాదు. కానీ, దురదృష్టవశాత్తు ఉద్యోగుల రిటైర్మెంట్ విషయంలో ప్రభుత్వాలు మానవీయతను కోల్పోతున్నాయా? అన్న అనుమానం కలుగుతోంది. ఇందుకు కారణం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్.

పెన్షన్ విధానంలో మార్పులు..
సిపిఎస్ గా ప్రసిద్ధి చెందిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మన దేశంలో దాదాపు పన్నెండేళ్ల క్రితం ప్రారంభమైంది. 2004 జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారందరికీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నే అమలు చేస్తున్నారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ దీనిని అమలు చేస్తుండగా, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ రికార్డుల నిర్వహణ చూస్తోంది. దీంతో ఉద్యోగుల పెన్షన్ విధానంలో చాలా మార్పులొచ్చాయి. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంత జీవితానికి హామీ పడే పాత పెన్షన్ విధానం మరుగున పడింది. పాత పెన్షన్ విధానంలో రిటైరయ్యే సమయంలో వున్న జీతాన్ని ఆధారం చేసుకుని పెన్షన్ నిర్ణయించేవారు. పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణానికి అనుగుణం పెన్షన్ కూడా పెరుగుతుండేది. ఒకవేళ పెన్షన్ దారుడు చనిపోతే, అతని మీద ఆధారపడ్డ భార్య, పెళ్లి కాని ఆడపిల్ల, 25 ఏళ్ళు నిండని నిరుద్యోగ కుమారుడికి పెన్షన్ ఇచ్చేవారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లో అలాంటి సౌకర్యం లేదు. పెన్షన్ దారుడు చనిపోతే, ఇక ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా వుండదు.

స్టాక్ మార్కెట్లో..
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కి ప్రతి ఉద్యోగి, తన బేసిక్ పే, డిఏలలో పది శాతం చొప్పున ప్రతి నెలా జమ చేయాల్సి వుంటుంది. దీనికి ప్రభుత్వం మరో పది శాతం జమ చేస్తుంది. ఈ సొమ్ము మొత్తాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిగా పెడతారు. స్టాక్ మార్కెట్ లో వచ్చే లాభనష్టాల మీద ఆధారపడి, రిటైరైన తర్వాత ఆ ఉద్యోగికి పెన్షన్ చెల్లిస్తారు. పాత పెన్షన్ విధానంలో మాదిరిగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లో నిర్ణీత మొత్తంలో పెన్షన్ వస్తుందన్న గ్యారంటీ లేదు. స్టాక్ మార్కెట్ లు దెబ్బతింటే, వచ్చే పెన్షన్ తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి అసలేమీ రాకపోవచ్చు. ఇలాంటి ప్రమాదం వుండబట్టే, కంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పెన్షన్ అనేది దయతోనో, జాలితోనో ఇచ్చేది కాదు. 30 ఏళ్ల పాటు చేసిన సేవలకు అందించే ప్రతిఫలం. దాన్ని వక్రబుద్ధితో చూడడం మంచిది కాదు. 

06:58 - September 26, 2016
06:56 - September 26, 2016

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమవుతోంది. PSLV-C35 రాకెట్‌ ద్వారా సోమవారం ఉదయం 9 గంటల 12 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించనుంది. ఈ రాకెట్‌ ద్వారా ఎనిమిది ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెడతారు. ప్రయోగం పూర్తవడానికి 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ప్రయోగానికి ముందు జరిగే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో కొనసాగుతోంది. PSLV-C35 రాకెట్‌ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు ఎనిమిది ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. సోమవారం ఉదయం 9 గంటల 12 నిమిషాలకు జరిగే ఈ ప్రయోగానికి నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో శనివారం ఉదయం 8గంటల 42 నిమిషాలను ప్రారంభమైన నలభైఎనిమిదిన్నర గంటల కౌంట్‌డౌన్‌ సజావుగా కొనసాగుతోంది.

భిన్నమైన ప్రక్రియ..
ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు గతంలో అనుసరించిన పద్ధతులకు పూర్తిగా భిన్నమైన ప్రక్రియను ఈసారి అవలంభిస్తున్నారు. ఎనిమిది ఉపగ్రహాలను రెండు విభిన్న క్షక్ష్యల్లోకి ప్రవేశపెట్టనుండటంతో ప్రయోగం పూర్తవడానికి 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ఇస్రో ఇలాంటి ప్రయోగాన్ని నిర్వహించనుండటం ఇదే తొలిసారి. ఒకే రాకెట్‌ ద్వారా పలు ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రోకు కొత్త కాకపోయినా.. ఒకే రాకెట్‌తో పలు శాలైట్లను భిన్న క్షక్ష్యల్లో ప్రవేశపెట్టడమే కొత్త ప్రక్రియ. ఇందుకోసం మల్టిపుల్‌ బర్న్‌ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. PSLV రాకెట్‌లో ఘన, ద్రవ ఇంధనాలతో పనిచేసే నాలుగు దశలు ఉంటాయి. బహుళ ఉపగ్రహాలను విభిన్న కక్ష్యల్లో ప్రవేశపెట్టడానికి నాల్గవ దశను పలుమార్లు ఆఫ్‌ చేసి, ఆన్‌ చేస్తారు. సాధారణంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల ఎత్తు పెంచడానికి వీటి ఇంజిన్లను ఇలా ఆన్‌, ఆప్‌ చేస్తుంటారు. అయితే ఒకసారి ఆన్‌, ఆఫ్‌ చేసిన తర్వాత మరోసారి ఆన్‌, ఆఫ్‌ చేయడానికి మధ్య కొన్ని రోజుల విరామం ఉంటుంది. గతేడాది డిసెంబర్‌ 16న ఆరు ఉపగ్రహాలను ప్రయోగించినప్పుడు ఇస్రో ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరీక్షించింది.

కక్ష్యలో స్కాట్‌శాట్‌-1..
PSLV-C35 ద్వారా ముందుగా మనదేశ వాతావరణంతో పాటు, సముద్ర పరిశోధనలకు ఉద్దేశించిన స్కాట్‌శాట్‌-1ను కక్ష్యలో ప్రశేపెడతారు. 371 కిలో బరువున్న స్కాట్‌శాట్‌-1 ఉపగ్రహాన్ని 370 కి.మీ. ఎత్తులోని సన్‌ పోలార్‌ సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లోకి చేరుస్తారు. కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత పీఎస్‌ఎల్‌వీ నాలుగో దశ ఇంజిన్‌ను శాస్త్రవేత్తలు ఆఫ్‌ చేస్తారు. శ్రీహరికోట నుంచి బయలుదేరిన తర్వాత గంటా 22 నిమిషాల తర్వాత మళ్లీ ఆన్‌ చేస్తారు. ఇరవై సెకన్లపాటు మండిండి మరోసారి ఆఫ్‌ చేస్తారు. ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరిన రెండు గంటల 11 నిమిషాల తర్వాత ఇంజిన్‌ను మళ్లీ మండిస్తారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత నాలుగు నిమిషాలకు మరో ఏడు చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. వీటిలో అమెరికా, కెనడా, అల్జీరియా శాటిలైట్లతోపాటు మన దేశంలోని యూనివర్సిటీలకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి.

20 ఉపగ్రహాలు..
రాకెట్‌ ఇంజిన్‌ను ఆఫ్‌ చేసినప్పుడు అది ఒక ధృవం నుంచి మరో ధృవానికి ప్రరిభ్రమిస్తుంది. మధ్యలో ఇంజిన్‌ను మండించి, ఆఫ్‌ చేసినప్పుడు కక్ష్య మారుతుంది. విభిన్న కక్ష్యల్లో ప్రవేశపెట్టాల్సిన ఉపగ్రహాలను ఒకే రాకెట్‌తో ప్రయోగించడం వల్ల వ్యయాలు తగ్గుతాయి. ఇస్రో ఇంతకు ముందు 20 ఉప్రగ్రహాలను 670 కి.మీ. ఎత్తులోని పోలార్‌ సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. పీఎస్‌ఎల్‌వీ-సీ35 ప్రయోగం ద్వారా ఇప్పుడు మరో కొత్త అధ్యయానికి రంగం సిద్ధమయ్యింది. 

06:52 - September 26, 2016

హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పురాతన కట్టడాలను కూల్చి వేసేందుకు తెలంగాణ సర్కార్‌ సిద్ధమైంది. ఇందులో భాగంగా చారిత్రాత్మక కట్టడమైన రాంగోపాల్‌ పేట్ పీఎస్‌ను కూల్చివేస్తామని ఇటీవల సీఎం ప్రకటించారు. అయితే...పోలీస్‌స్టేషన్‌ను కట్టించిన రాంగోపాల్‌ మలానీ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కట్టడంతో తమకు అనుబంధముందని, దానిని ప్రభుత్వం మ్యూజియంగా మార్చాలని కోరుతున్నారు. ఏళ్ల నాటిది కావడం... శిథిలావస్థకు చేరడంతో.. సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేట్ పీఎస్‌ ను కూల్చివేస్తామనడంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. కట్టడాన్ని కూల్చివేయవద్దంటూ కొందరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కట్టడాల్లో సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌ ఒకటి. పందొమ్మిది వందల సంవత్సరంలో రాజ్‌బహద్దూర్‌ రామ్‌గోపాల్‌ మలాని దీన్ని నిర్మించి... నిజాం రెజిమెంట్‌కు కానుకగా ఇచ్చారు. అప్పట్లోనే జేమ్స్‌స్ట్రీట్‌ పోలీస్‌స్టేషన్‌గా అందిరికీ సుపరిచితమైంది.
బాధగా ఉందంటున్న పలువురు...
తాజాగా రాంగోపాల్‌పేట్‌ పీఎస్‌ వందేళ్లకు పైబడడంతో.. ప్రజల భద్రత దృష్ట్యా కూల్చివేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ప్రకటన తమకు బాధ కలిగించిందని... తమ వంశస్థులు నిర్మించిన కట్టడాన్ని కూల్చవద్దంటూ కుటుంబసభ్యులు కోరుతున్నారు. మరమ్మతులు చేస్తే ప్రమాదం ఉండదని అంటున్నారు రాజ్‌ బహదూర్‌ రాంగోపాల్‌ మలానీ కుటుంబీకులు. చారిత్రాత్మక కట్టడం కూల్చివేస్తామనడం తమకు బాధ కలిగించిందని అంటున్నారు కొందరు వ్యాపారులు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం భవనాన్ని మ్యూజియంగా మార్చాలని నిర్ణయించిందని గుర్తు చేస్తున్నారు. చారిత్రాత్మక కట్టడమైన రాంగోపాల్‌పేట్ పీఎస్‌ ను ముందు తరాలు చూసే విధంగా మరమ్మత్తులు చేయించాలని కుటుంబీకులు, స్థానికులు కోరుతున్నారు. ఈ కట్టడాన్ని మ్యూజియంగా మార్చాలంటున్న కుటుంబీకుల విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందో లేదో వేచిచూడాలి. 

06:49 - September 26, 2016
06:48 - September 26, 2016

గుంటూరు : ఇటీవల కురిసిన వర్షాలకు సర్వం కోల్పోయిన గుంటూరు జిల్లాలోని బాధితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. కొండవీటి వాగుపై ఏరియల్ సర్వే ద్వారా నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించారు. వర్షాలతో నీట మునిగిన దాచేపల్లిని పరిశీలించారు. గుంటూరు కలెక్టరేట్‌లో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. మరికొద్ది రోజులు వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాబు సూచించారు. కొండవీటివాగు సహా ఇతర ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్‌ ద్వారా విహంగ వీక్షణం నిర్వహించారు. అనంతరం రోడ్డుమార్గం ద్వారా గురజాల చేరుకున్నారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని పలు ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించి బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. వర్షాలకు నీట మునిగిన దాచేపల్లిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. వరదలతో దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలను పరిశీలించారు. వర్షాల దాటికి దెబ్బతిన్న ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని బాబు భరోసా ఇచ్చారు. మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు నిరంతరం అప్రమత్తతతో ఉండాలని బాబు సూచించారు. .

పరిహారం అందించాలన్న బాబు..
అంతకుముందు తన నివాసం నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించిన చంద్రబాబు.. వరద నీటి కారణంగా ముంపునకు గురైన గురజాల, మాచర్ల, న‌ర‌స‌రావుపేట‌, పెదకూరపాడు తదితర ప్రాంతాల్లోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో సర్పంచి నుంచి గ్రామ‌ కార్యదర్శులందరితోనూ ఒకే సారి టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. పునరావాసం, సహాయ చర్యలు సకాలంలో అందితేనే ప్రజలకు సంతృప్తి కలుగుతుందని చంద్రబాబు అన్నారు. భారీ వర్షాలలో నష్టపోయిన బాధితులందరికీ పరిహారం అందించాలని స్పష్టం చేశారు. వరద సాయం రాలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే కఠినంగా వ్యవహరిస్తానని సీఎం హెచ్చరించారు. తక్షణం ఆయా ప్రాంతాల్లో తాగునీటిని అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. బాధితులకు సేవలందించిన అధికారులు, అనధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులకు ప్రభుత్వం తరఫున సత్కారం, ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. రాజకీయలకు అతీతంగా బాధితుల్ని ఆదుకోవాలని సీఎం కోరారు.

06:45 - September 26, 2016

హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిత్యం సంప్రదింపులు జరిపి, సమాచారం సేకరించాలని సీఎస్‌ రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మలను ఆదేశించారు. వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వరదలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. అన్నిశాఖల అధికారులు అప్రమత్తమై ఉండాలని ఆదేశించారు. ప్రధానంగా వరదనీటితో ఉప్పొంగుతున్న ప్రాజెక్టుల పరిస్థితిపై ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. నిజాంసాగర్, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, సింగూరు తదితర ప్రాజెక్టులపై అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మంత్రులు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

భద్రాచలం..
ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సంప్రదించి పరిస్థితిని తెలుసుకోవాలని సీఎం సూచించారు. భద్రాచలం దగ్గర పరిస్థితిపై నిత్యం అప్రతమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సీఎం ఆదేశించారు. ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలను, ఖాళీ చెయించాలని సూచించారు. ప్రతి ప్రాజెక్ట్‌ వద్ద ఇరిగేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గండిపేట, హిమాయత్‌సాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని చెరువులు నిండుతున్నాయని అన్నారు. చెరువు కట్టలను ఎప్పటికప్పుడు గమనించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సందర్శకులను సైతం అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని సీఎం గుర్తు చేశారు. నదులు, కాలువల్లో భారీగా వరద నీరుచేరుతుండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయంలో అన్ని శాఖల అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. 

06:43 - September 26, 2016

మహబూబ్ నగర్ : బీమా ప్రాజెక్టు నుంచి రంగసముద్రం రిజర్వాయర్‌కు అధికారులు నీరును విడుదల చేయడంతో.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పేబ్బేరు మండలం నాగరాల గ్రామానికి ముప్పు ముంచుకొచ్చింది. రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటిమట్టం భారీగా పెరగడంతో ముంపు గ్రామంగా ప్రకటించిన నాగరాల గ్రామాన్ని వరదనీరు ముంచెత్తింది. దీంతో బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు గ్రామస్తులు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 21 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిందే రంగసముద్రం రిజర్వాయర్‌. ఈ రిజర్వాయర్‌ నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. రంగసముద్రం రిజర్వాయర్ నీటినిల్వ సామర్ధ్యం 325 మీటర్లు ఉండేలా గత కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించింది. కానీ, రంగసముద్రం రిజర్వాయర్‌ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడంతో.. తాజాగా నిర్వాసిత గ్రామాలు వరదనీటితో నిండిపోయాయి.

నష్టపరిహారం ఎక్కడ ? 
మహబుబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలంలోని శ్రీరంగపురం చెరువును రంగసముద్రం రిజర్వాయర్‌గా మార్చింది గత ప్రభుత్వం. కానీ, 10 సంవత్సరాలైన భూములు, ఇళ్లకు నష్టపరిహారం పూర్తిగా చెల్లించకపోవడంతో నిర్వాసితులు గ్రామాలను ఖాళీ చేయలేదు. ముంపు గ్రామమైన నాగరాల గ్రామంలో 1, 360 కుటుంబాలు ఉన్నాయి. అయితే కొందరికి మాత్రమే ప్లాట్లను కేటాయించింది గత సర్కార్‌. పునరావాస కేంద్రంలో ఒక పాఠశాల సీసీ రోడ్లు, విద్యుత్ వైర్లు, నీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. నాగరాల గ్రామంలోకి రంగసముద్రం రిజర్వాయర్ నీరు రావడం తరచూ జరుగుతూనే ఉన్నా... అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా రంగసముద్రం నీరు గ్రామాన్ని ముంచెత్తడంతో ఉన్న పలంగా గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారులంటున్నారని గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కుడికాల్వ ద్వారా నీటిని విడుదల చేసి గ్రామంలోకి నీరు రాకుండా చూడాలని నిర్వాసితులు కోరుతున్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని మౌలికవసతులు కల్పించిన తర్వాతే గ్రామాన్ని ఖాళీ చేస్తామంటున్నారు.

కన్నీళ్లే..
2013 భూసేకరణ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని సీపీఎం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం రంగసముద్రం రిజర్వాయర్‌ నిర్వాసితులందరికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రంగసముద్రం రిజర్వాయర్‌ నిండినా.. నిర్వాసితులకు మాత్రం కన్నీళ్లనే మిగుల్చుతోంది. పరిహారం పూర్తిస్థాయిలో చెల్లిస్తే తప్ప కదలమంటున్నారు గ్రామస్తులు. రిజర్వాయర్‌ నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండడంతో అటు అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. 

06:39 - September 26, 2016

హైదరాబాద్ : కొన్ని రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. వరదనీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజల తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుతు పడుతున్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు.. ప్రజాప్రతినిధులు పర్యటించి, పరిస్థితులపై సమీక్ష జరుపుతున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఎప్పటికప్పడు ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తున్నారు. తెలంగాణ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలు ఇంకా జలదిబ్బంధంలోనే ఉన్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలోని పసుపులేరు వాగు పొంగిపొర్లుతుండటంతో రహదారులు జలమయమయ్యాయి. వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం కలగటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

నిజాం సాగర్ ప్రాజెక్టు..
భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లో వరద నీరు పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీస్థాయిలో వరద నీరు చేరుతోంది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా చాలాకాలం తర్వాత ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తివేసి...50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీనికితోడు మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్‌ల నుంచి వరద నీరు చేరడంతో గోదావరి ఉప్పొంగుతోంది. ఆయా ప్రాజెక్టులపై అప్రమత్తంగా ఉండాలని సీఎం మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించడంతో మంత్రులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితిని గమనించారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో అధికారులు, ప్రజలతో సమావేశం నిర్వహించి వారిని అప్రమత్తం చేశారు.

మహబూబ్ నగర్..
భారీ వర్షాలతో మహబూబ్‌ నగర్ జిల్లా అస్తవ్యస్తమైంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. మరోవైపు చెరువులు సైతం వరదనీటితో పొంగిపొర్లుతున్నాయి. చెరువు కట్టలు తెంచుకొని వరదనీరు బయటకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాలమూరు జిల్లాలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు వరద పరిస్థితిని పరిశీలించారు. కట్టమరమ్మతు విషయంలో పనులు త్వరితగతిన చెయ్యాలంటూ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

06:36 - September 26, 2016

హైదరాబాద్ : రాష్ర్టంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం చిల్లు పడిందా అన్నట్లు... ఆరు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు ప్రాజెక్టులు వరద నీటితో నిండిపోతున్నాయి. చెరువులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.  చాలా ఏళ్ల తర్వాత తెలంగాణలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులన్నీ జల సిరులతో కళకళలాడుతున్నాయి. ఎడతెరపి వర్షాల కారణంగా పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో గేట్లు ఎత్తేసి దిగువకు నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 1, 96,217 క్యూసెక్కులుగా ఉంది. 

శ్రీశైలం...
శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.78 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 182. 22 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్‌ ఇన్‌ఫ్లో 193952 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 75,729 క్యూసెక్కులు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 140.67 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 69,163 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1350 క్యూసెక్కులుగా ఉంది. మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 4.07 టీఎంసీలు కాగా.. పూర్తి స్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 18,280 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3920 క్యూసెక్కులుగా ఉంది.


ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టు...
ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 84.81 టీఎంసీలు, పూర్తి స్థాయి నీటినిల్వ 90.31 టీఎంసీలు. అయితే ఇన్‌ఫ్లో -4,02,651 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో - 4,02,651 క్యూసెక్కులుగా ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 8.42 టీఎంసీలు కాగా.. పూర్తి నిల్వ సామర్థ్యం 17.80 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 99 వేల క్యూసెక్కులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 16.94 టీఎంసీలు కాగా..పూర్తి స్థాయి నీటి నివ్ల సామర్థ్యం 20.18 టీఎంసీలు. ఇన్‌ఫ్లో - 4.18 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో - 4.30 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

ఆదిలాబాద్...
ఆదిలాబాద్‌ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటి నిల్వ -7.14 టీఎంసీలు కాగా, పూర్తి స్థాయి నీటి నిల్వ 7.60 టీఎంసీలు. ఇన్‌ఫ్లో - 6,752 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో - 11,994 క్యూసెక్కులుగా ఉంది. సింగూరు ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 29.96 టీఎంసీలు కాగా...పూర్తిస్థాయి నీటి నిల్వ 29.91 టీఎంసీలు. ఇన్‌ఫ్లో - లక్షా 20 వేల క్యూసెక్కులు. ఔట్ ఫ్లో - లక్షా 5 వేల క్యూసెక్కులుగా ఉంది. 

06:33 - September 26, 2016

హైదరాబాద్ : కరీంనగర్‌ జిల్లాలో మిడ్ మానేరుకు వరద పోటెత్తుతోంది. దిగువ ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ మానేరు నుంచి నీటిని వదులుతుండటంతో మిడ్‌ మానేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మానేరు అలుగుతోపాటు పక్కన మట్టికట్టపై నుంచి కూడా పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తోంది. మానేరు, మోయతుమ్మెద వాగు, ఎల్లమ్మ, మూలవాగు, బిక్కవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు పోటెత్తడంతో.. మిడ్‌మానేరు దిగువ ప్రాంతాలైన చీర్లవంచ, మాన్వాడ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిస్థితి మంత్రి హరీష్‌రావు సమీక్షించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

మాన్వాడ వద్ద..
వరద కాలువ నీటితో శాబాస్‌పల్లి వద్ద రోడ్డు నీట మునిగింది. కరీంనగర్ నుంచి సిరిసిల్ల, వేములవాడకు వెళ్లే వాహనాలను బోయిన్‌పల్లి నుంచి దారి మళ్లించారు. గంభీర్‌రావుపేట మండలం సముద్ర లింగాపురంలో సింగం చెరువు మత్తడి దుంకడంతో రోడ్డు నీట మునిగింది. దీంతో సిరిసిల్ల-కామారెడ్డిల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో 16 గేట్లు ఎత్తివేసి 1.34 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కరీంనగర్‌ జిల్లా బోయిన్‌పల్లి మండలం మాన్వాడ వద్ద వరద ఉధృతిని మంత్రి ఈటెల రాజేందర్‌ పరిశీలించారు. ఇదే సమయంలో తమకు న్యాయం చేయాలంటూ నిర్వాసితులు ఈటెలను అడ్డుకున్నారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునే ప్రభుత్వమని, ఈ సమయంలో రాజకీయం చేయడం తగదని మంత్రి అన్నారు.

మెదక్ జిల్లా..
మెదక్‌ జిల్లా ఏడుపాయలో చిక్కుకున్న 24 మంది కూలీలను రక్షించడానికి సీఎం కేసీఆర్‌ చూపిన చొరవ ఫలించింది. ఏడుపాయల వద్ద బ్రిడ్జి పనుల కోసం ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 24 మంది కూలీలు.. ఘనపురం వద్ద నీరు విడుదల చేయడంతో రెండు ఏరుల మధ్య చిక్కుకున్నారు. దీంతో సీఎం ఎయిర్‌ఫోర్స్‌ అధికారులతో మాట్లాడి బాధితులను కాపాడటానికి హెలికాప్టర్‌ పంపించారు. ఆదివారం ఉదయం ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌ ఏడుపాయలకు చేరుకుని 24 మంది కూలీలను రక్షించారు. తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ నిండుకుండలా మారింది. ఎగువ రాష్ట్రం మహారాష్ట్ర, తెలంగాణలో భారీగా వర్షాలు కురవడంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా విఘ్నపురి ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. దీంతో ఐదు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, రెండు లక్షల క్యూసేక్కుల ఇన్‌ఫ్లో క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి వస్తుండటంతో అధికారుల మొత్తం 42 గేట్లను ఎత్తివేశారు. దీంతో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పర్యటకులు ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో ప్రాజెక్టు పూర్వ వైభవం సంతరించుకుంది.  

మరో ఐదు రోజులు వర్షాలు..

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మరో ఐదురోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. విదర్భను ఆనుకొని తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

తెలంగాణ కేబినెట్ సమావేశం రద్దు..

హైదరాబాద్ : నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం రద్దు అయ్యింది. మంత్రులంతా జిల్లాలోనే ఉండాని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 

ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద నీరు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 1.20 లక్షలు, ఔట్ ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది. దీనితో తొమ్మిది గేట్లు ఎత్తివేశారు. 

రేపు హిల్లరీ..ట్రంప్ ల ముఖాముఖి..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతున్న డెముక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లు మంగళవారం తమ తొలి అధ్యక్ష అభ్యర్థుల చర్చాగోష్ఠిలో పాల్గొననున్నారు. 

నేడు గుంటూరులో జగన్ పర్యటన..

గుంటూరు : నేడు వైసీపీ అధ్యక్షుడు జగన్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను, సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులను పరామర్శించనున్నారు. 

నేడు పీఎస్ఎల్పీ సీ 35 ప్రయోగం..

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తన అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది. ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను నింగిలోకి పంపడంతో పాటు ఒకేసారి వేర్వేరు కక్ష్యలో వాటిని ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తొలిసారిగా ప్రయత్నిస్తున్నారు. సోమవారం ఉదయం 9.12 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ35 వాహకనౌకను నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి నింగిలోకి పంపనున్నారు. 

Don't Miss