Activities calendar

27 September 2016

టీఆర్ ఎస్ నేత గన్ లైసెన్స్ రద్దు

నల్గొండ : ఓ టీఆర్ ఎస్ నేత గన్ లైసెన్స్ ను రద్దు చేశారు. నయీంతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి... ఆ నేత గన్ లైసెన్స్ రద్దు చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఎస్పీ అధికారికంగా ధృవీకరించ లేదు.  

ప్రకృతి సంపదకు మారుపేరు ఎపి : సీఎం చంద్రబాబు

విజయవాడ : ప్రపంచ పర్యాటక దినోత్స కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని, మాట్లాడారు. ప్రకృతి సంపదకు మారుపేరు ఆంధ్రప్రదేశ్ కొనియాడారు. మనకు ఉన్నంత ప్రకృతి సంపద ఎక్కడా లేదన్నారు. 

 

ఎమ్మెల్యే మోద్గుల వేణుగోపాల్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

గుంటూరు : టీడీపీ ఎమ్మెల్యే మోద్గుల వేణుగోపాల్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించింది. బెంగళూరులో మోద్గుల ఆస్తుల పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. 

21:53 - September 27, 2016
21:49 - September 27, 2016

హైదరాబాద్ : రియో ఒలంపిక్స్ సిల్వర్‌స్టార్ పివి సింధుకు తాను చదువుకున్న కాలేజీలో ఘనసన్మానం లభించింది. మెహిదిపట్నం లోని సెయింట్ ఆన్స్ కాలేజీలో సింధుని విద్యార్ధులు ఎంతో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా విద్యార్ధులు ఆటపాటలతో అదరహో అనిపించారు. రియోలో అద్భుతమైన ప్రతిభతో దేశ ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలిపిందంటూ కాలేజీ యాజమాన్యం కొనియాడింది. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం దేశంలో ఉన్న అందరూ తన కోసం ప్రార్ధనలు చేయడమేనని సింధు అన్నారు. 

 

21:47 - September 27, 2016

గుంటూరు : ప్రజాగాయకుడు గోరటి వెంకన్నకు గుంటూరులో ఘనసన్మానం జరిగింది. జాషువా 121వ జయంతిఉత్సవాల సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం పొలిట్‌బ్యూరోసభ్యుడు రాఘవులు..గోరేటిని సన్మానించారు. అభ్యుదయ, విప్లవకవులు చందస్సును వదిలేసి కవిత్వాలు రాస్తే... జాషువా మాత్రం చందస్సు దాటకుండానే చాందసవాదాన్ని చీల్చిచెండాడారని  రాఘవులు అన్నారు. జాషువా 121వ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో  కవులు, గాయకులు, ప్రజాసంఘాల కళాకారులతో పాటు పలువురు రాజకీయనాయకులు పాల్గొన్నారు. 

 

21:45 - September 27, 2016

హైదరాబాద్ : కృష్టాజలాలపై ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం అక్రమంగా తీసుకువెళ్తోందని తెలంగాణ ప్రభుత్వం మరోసారి అరోపించింది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీకి అక్రమంగా కృష్ణాజలాల తరలింపుపై కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీకు ఫిర్యాదు చేసింది. 
కృష్ణా జలాలను అక్రమంగా వాడుకుంటున్న ఏపీ : టీసర్కార్ 
కృష్ణాజలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా వాడుకుంటోందని ఆరోపిస్తున్న... తెలంగాణ ప్రభుత్వం.. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేసినా ఏపీ వైఖరిలో మార్పు రాకపోవడం పట్ల మంత్రి హరీశ్‌ రావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయంలో కృష్ణా బోర్డ్ ప్రేక్షకపాత్రను విడిచిపెట్టి... కార్యాచరణను ప్రారంభించాలని మంత్రి డిమాండ్ చేశారు. ఏపీ తీరుపై జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ చైర్మన్ రామశరణ్, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీలతో సమావేశమయ్యారు. 
నిజనిర్ధారణకు బృందాన్ని పోతిరెడ్డిపాడుకు తీసుకెళ్లాలి :  హరీష్‌
పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణాజలాల తరలింపునకు సంబంధించి ఉన్నతస్థాయి బృందాన్ని అక్కడికి తీసుకువెళ్ళి నిజనిర్ధారణ జరపాలని చటర్జీని హరీష్‌ కోరారు. ఇందుకు చటర్జీ సుముఖత చూపారు. ఏపీ నీటిదోపిడి వల్లే నాగార్జునసాగర్‌కు ఈ సమయంలో రావాల్సిన మేరకు నీటినిల్వలు పెరగలేదని మంత్రి ఆరోపించారు. 
అరకొరగా పోతిరెడ్డిపాడుకు నీటి పంపిణీ లెక్కలు : హరీష్‌
కర్ణాటక నుంచి భారీ వరద వస్తున్నా... శ్రీశైలం నుంచి వదిలిన నీరు సాగర్‌కు చేరడం లేదని హరీశ్‌రావు చెప్పారు. పోతిరెడ్డిపాడుకు నీటి పంపిణీ లెక్కలు అరకొరగా ఉన్నాయన్నారు. ఈ సీజన్‌లో మొదటి రోజు 700 క్యూసెక్కులు అని చెప్పారని.. తర్వాత 1000, 1500 అంటూ కాకిలెక్కలు చూపారని మండిపడ్డారు. వారంరోజులుగా ప్రవాహం పెరిగినా... నీటిలెక్కలు అరకొరగా ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ నీటిని తరలింపును కట్టడి చేయని పక్షంలో ఇక సహించేది లేదని మంత్రి హరీష్ కృష్ణా బోర్డు ముందు ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

21:40 - September 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ సామాజిక, సమగ్ర అభివృద్ధి సాధనకై సీపీఎం ఆధ్వర్యంలో మహాజన పాదయాత్ర చేపట్టనున్నారు. అక్టోబర్ 17 నుండి మార్చి 12 వరకు ఈ పాదయాత్ర జరగనుంది. ఐదు నెలల పాటు జరిగే  ఈ పాదయాత్ర నాలుగు వేల కిలో మీటర్ల దూరం కొనసాగనుంది. ఈ సుదీర్ఘ పాదయాత్రకు సన్నాహకంగా సామాజిక, ప్రజా, వామపక్ష, సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ మద్దతు కూడగడుతోంది. ఆయా సంఘాలు, వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది.  
4వేల కి.మీ సుదీర్ఘ పాదయాత్ర
తెలంగాణలో సమగ్ర, సామాజిక అభివృద్ధి సాధనకై సీపీఎం ఆధ్వర్యంలో నాలుగు వేల కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు సన్నాహాలు చేస్తోంది ఆ పార్టీ. అక్టోబర్ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ పాదయాత్రను అంబేద్కర్ మనువడు ప్రకాష్ అంబేద్కర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. పాదయాత్రకు మద్దతుగా ఇప్పటికే రాష్ట స్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఎంబీసీ వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసింది సీపీఎం. అక్టోబర్ మొదటి వారం నాటికి జిల్లా, డివిజన్ స్థాయిలో సభలు, సెమినార్లు నిర్వహించి పాదయాత్ర ఉద్దేశాలను వివరించి ప్రజాసంఘాలు, మేధావుల మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే సీపీఎం ప్రణాళిక రూపొందించింది. ఐదు నెలల పాటు రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాల్లో  జరుగనున్న ఈ పాదయాత్ర మార్చి 12 ,2017 న హైదరాబాద్ లో ముగియనుంది. ఈ ముగింపు సభకు భారీ ఎత్తున జనసమీకరణకు పార్టీ వ్యూహం ఖరారు చేసింది. కేరళ సీఎం విజయన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యేలా సీపీఎం ప్రయత్నాలు చేస్తోంది.   
తమ్మినేని వీరభద్రం నేతృత్వం 
ఎనిమిది ప్రధాన టీమ్‌లతో సాగే ఈ పాదయాత్రకు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వం వహించనున్నారు. పాలకులు మారినా.. విధానాలు మారలేదని తమ్మినేని అన్నారు. అభివృద్ధి అనేది పాలకుల చుట్టూ తిరుగుతోందని, పేదల, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని తమ్మినేని అన్నారు. తెలంగాణలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎంబీసీలు 92 శాతం ఉన్నారని, వారిని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 
పాదయాత్రకు అందరూ మద్దతివ్వాలి : తమ్మినేని
పాదయాత్రకు వివిధ వర్గాల నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని, అన్ని వర్గాల ప్రజలు, సంఘాలు, మేధావులు మద్దతు ఇవ్వాలని తమ్మినేని కోరారు. విద్య, వైద్యం ప్రైవేటీకరణ అయి పేదలకు అందకుండా పోతున్నాయని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పాలకులు మారినా విధానాలు మారలేదని.. సీపీఎం ప్రత్యామ్నాయ అబివృద్ధి నమూనాను ప్రజల ముందు ఉంచుతామని ఆయన చెప్పారు. తెలంగాణలో సామాజిక ఉద్యమానికై వామపక్ష, సామాజిక, అభ్యుదయ, ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని ఆకాంక్షించారు. 

 

21:37 - September 27, 2016

విజయవాడ : వర్షాలను, వరదలను కూడా వైసీపీ అధినేత జగన్‌ రాజకీయం చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. వరదలపై అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యం చేసిన ఘనత సీఎం చంద్రబాబుదన్నారు. పంటనష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నామని.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చామని ప్రత్తిపాటి చెప్పారు. జగన్‌ ఇప్పుడు నిద్రలేచి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని.. ప్రజలు అసహ్యించుకుంటారని మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. 

 

21:33 - September 27, 2016

గుంటూరు : హెలికాఫ్టర్‌లో తిరిగితే రైతుల కష్టాలు తెలివని చంద్రబాబును వైసీపీ అధినేత జగన్‌మ్మోహన్‌రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లాలో ఆయన చేపట్టిన పర్యటన రెండోరోజూ కొనసాగుతోంది. రాజుపాలెం మండలం అనుపాలెంలోని వరద బాధిత ఎస్టీ కాలనీ, రెడ్డిగూడెంలో ఆయన పర్యటించారు. అంతకు ముందు జగన్ అనుపాలెంలో వర్షాలు, వరదలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. 

21:31 - September 27, 2016

హైదరాబాద్ : వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. పలుప్రాంతాల్లో చెరువులకు గండ్లుపడి పంటలు నీటమునిగాయి. అటు మహారాష్ట్ర కర్నాటక నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో గోదావరిలో ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. 
తడిసిముద్దవుతున్న తెలంగాణ  
ఎడతెరిపిలేని వర్షాలతో తెలంగాణ జిల్లాలు తడిసిముద్దవుతున్నాయి. పలుజిల్లాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో..  చెరువులకు గండ్లుపడ్డాయి. దీంతో పలు చోట్ల పంటలు నీటమునిగాయి. 
హైదరాబాద్‌లో జనం అవస్థలు
హైదరాబాద్‌లో వర్షం తగ్గినా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి ఉండటంతో.. జనం అవస్థలు పడుతున్నారు.   ఉప్పల్ చిలకనగర్ ,అన్నపూర్ణ కాలనీలో జనం  ఇప్పటికీ మోకాళ్ల లోతు నీళ్లలో వుంటున్నారు. కొద్దిపాటి వర్షం పడినా.. డ్రైనేజీ పొంగి కాలనీల్లోకి నీరు వస్తుందని స్థానికులు తెలిపారు. 
ముస్తాబాద్ చెరువుకట్టకు గండి 
అటు కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో లోని చెరువుకట్టకు గండిపడింది. దీంతో కిందనున్న పంటపొలాలతో పాటు అక్కడే ఉన్న  గంగమ్మగుడి కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. చెరువులోని నీరంతా బయటకు వెళ్లిపోయింది. కాంట్రాక్టర్లు కక్కుర్తితో మిషన్‌ కాకతీయపథకం కింద సుమారు 44లక్షల రూపాయల  ఖర్చుతోనిర్మించిన చెరువుకట్టను నాసిరకంగా నిర్మించారని స్థానికులు ఆరోపించారు. 
నల్లగొండ జిల్లాలో వేలాది ఎకరాల పంట నష్టం
భారీవర్షాలకు నల్లగొండ జిల్లాలో వేలాది ఎకరాల పంటలు తీవ్రంగా నష్టపోయాయి. వరితో పాటు పత్తి.. ఇతర పంటలు నీట మునిగాయి. పంటపొలాల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు తీవ్ర వేదనకు గురయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కొట్టుకుపోయిన పంటపొలాలను  సిపిఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు. వేములపల్లి, దామరచర్ల మండలాల పరిధిలో వరి, పత్తి పంటలను పరిశిలించి స్థానిక రైతులతో మాట్లాడారు. 
నిజామాబాద్ అతలాకుతలం 
భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా అతలాకుతలామైంది. జిల్లాలోని బందరతాండ వద్ద వరద నీరు భారీగా రోడ్లపైకి వచ్చింది. దీంతో ఎల్లారెడ్డి నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక ప్రజలైతే కనీస సౌకర్యాల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారిని పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. 
సింగూరు ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి 
మెదక్‌ జిల్లా సింగూరు ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 9గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టుప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్ట్‌ దగ్గరకు సందర్శకులను అనుమతించవద్దని కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. 
భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి 
అటు ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. ప్రస్తుతం 39అడుగులకు చేరుకున్న వరద ప్రమాదకరస్థాయికి చేరుకుంటోంది. ప్రవాహం 43అడుగులకు చేరుకుంటే.. మొదటి ప్రమాద హెచ్చరికను చేసే అవకాశం ఉంది. 
వెలవెలబోతోన్న నాగార్జున సాగర్‌..   
జోరువానలతో వాగులు, వంకలు ఉరకలెత్తుతుంటే... నాగార్జున సాగర్‌ పరిస్థితి మాత్రం.. వెలవెలబోతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 522 అడుగులు మాత్రమే ఉంది. మొన్నటి వరకు డెడ్ స్టోరేజీ 510 అడుగులకు చెరువలో ఉండగా.. మూడు రోజుల నుంచి ఎగువ నుంచి చేరుతున్న నీటితో ప్రస్తుతం 522 అడుగులకు చేరుకుంది. అయితే రెండేళ్లుగా సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న ఆయకట్టు రైతులు.. ఈ దఫా రబీ సీజన్ కు కూడా నీరు రాదేమోనని ఆందోళన చెందుతున్నారు.  

 

21:25 - September 27, 2016

కరీంనగర్ : వర్షాలు, వరదలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ముందుచూపు లేదని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌ జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద గండిపడ్డ మిడ్‌మానేరు జలాశయాన్ని రేవంత్‌ బృందం పరిశీలించింది. గతంలో మిడ్‌మానేరు నిర్వాసితులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తామన్న సీఎం ఇప్పుడు ముంపు గ్రామాలకు ఇళ్లు ఇవ్వలేమనడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన కాంట్రాక్టర్ల తప్పిదాల వల్లే మిడ్‌మానేరు తెగిపోయిందని రేవంత్‌ మండిపడ్డారు. 

 

నయీం కేసు విచారణ వేగవంతం

హైదరాబాద్ : నయీం కేసు విచారణ వేగవంతం అయింది. నయీంతో సంబంధం ఉన్న వారిపై సిట్ నిఘా పెంచింది. నల్గొండ జిల్లా నేతల కదలికపై సిట్ ఆరా తీస్తుంది. గన్ లైసెన్స్ లు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. నయీంతో సంబంధం ఉన్నవారు గన్ లను సరెండర్ చేయాలని ఆదేశించారు. 

 

ఎసిబి వలలో భీంగల్ ట్రాన్స్ కో ఏడీఈ

నిజామాబాద్ : భీంగల్ ట్రాన్స్ కో ఏడీఈ గంగాధర్ లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కాడు. ట్రాన్స్ ఫార్మర్ మంజూరు కోసం రైతు నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ గంగాధర్ పట్టుబట్టారు.

 

20:36 - September 27, 2016

సర్కార్ కు సున్నం పెడుతున్న పొన్నం... పేదోళ్లకు దొరకదంటున్నడు అన్నం, లంచానికి మంచం వేస్తా అంటున్న సారూ..చీము నెత్తురమ్ముకున్న ఎమ్మెల్యే, సవరం చేస్తున్న కేసీఆర్ అన్నబిడ్డే...తమ్ముడు కేటీఆర్ ను రమ్మని సవాల్, సర్పంచ్ గల్లవట్టి కొట్టిన గ్రామదేవత...గజగజావణికినా గందమళ్ల ఊరి పెద్ద, ఫైటింగ్ కు కొచ్చిన పచ్చిమిరపకాయ పంచాదీ... పోలీసులొచ్చిన ఆపినా ఆగేటట్లు లేదది, గిరిజనుల జాకెట్లు చింపికొట్టిన సర్కారొళ్లు... బాధితులనే అరెస్టుజేసిన పోలీసోళ్లు, కొత్త పండుగ... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

కాళేశ్వరం వద్ద 10 మీ. ఎత్తున ప్రవహిస్తున్న గోదావరి

కరీంనగర్ : కాళేశ్వరం వద్ద 10 మీటర్ల ఎత్తున గోదావరి ప్రవహిస్తుంది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో 27గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీటి మునిగాయి.

2015 తోటపల్లి ప్రాజెక్టు కాల్పుల కేసు కొట్టివేత

విజయనగరం : 2015 తోటపల్లి ప్రాజెక్టు కాల్పుల కేసు కొట్టివేశారు. ఈ కేసును పార్వతీపురం సివిల్ కోర్టు  కొట్టివేసింది. కేసును ఎదుర్కొన్న వారిలో సీపీఎం నేతలు ఎస్.పుణ్యవతి, ఎం.కృష్ణమూర్తి, రెడ్డి శ్రీరామమూర్తి సహా 16 మంది  ఉన్నారు. 

 

వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణను భర్తరఫ్ చేయాలి : సీపీఎం కార్యదర్శి మధు

విజయవాడ : రైల్వే కాంట్రాక్టరును బెదిరించిన వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణను భర్తరఫ్ చేయాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. నీతి సూత్రాలు చెప్పే ముఖ్యమంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే విషయంలో తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. రైల్వే కాంట్రాక్టరును బెదిరించినట్లు సాక్ష్యాలు ఉన్నా.. సీఎం మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎమ్మెల్యే విషయంలో పార్టీ వైఖరిని స్పష్టం చేసి.. సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. 

 

20:11 - September 27, 2016
20:10 - September 27, 2016

నాలాలపై నిర్మించిన అక్రమకట్టడాలను తొలగించాల్సిందేనని వక్తలు తెలిపారు. ఇవాళ్టి చర్చ కార్యక్రమంలో పద్మనాభరెడ్డి, ఫాకా అధ్యక్షుడు అంజయ్య పాల్గొని, మాట్లాడారు. నాలాలపై నిర్మించిన ఆక్రమణలను తొలగిస్తే వరదలను నివారించొచ్చన్నారు. నాలాలపై పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు..  వారికి ప్రత్యామ్నాయం చూపాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:53 - September 27, 2016

హైదరాబాద్ : నగరంలో అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చే వేసే పనిలోపడ్డారు అధికారులు. ఇప్పటికే భారీగా అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు... చెరువులు, కుంటలు, నాలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.  హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపుపై జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. సిటీలో ఇప్పటికే భారీగా అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించిన అధికారులు... వాటిని కూల్చివేసే పనిలో పడ్డారు. చెరువులు, కుంటలు, నాలాల్లోకి చొచ్చుకువచ్చిన అక్రమ కట్టడాలపై అధికారులు సీరియస్‌గా దృష్టి పెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూల్చివేతలను ముమ్మరం చేశారు. జీహెచ్‌ఎంసీలో 24 సర్కిళ్లలో  ప్రతి సర్కిల్‌కూ ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లో రెవిన్యూ, పోలీసు, టౌన్‌ప్లానింగ్‌ డిప్యూటీ కమిషనర్‌తో పాటు ఇరిగేషన్‌ అధికారులు ఉంటారు. 
నాలాలపైన 28 వేల అక్రమ నిర్మాణాలు 
నగరంలో గంట వ్యవధిలో రెండు సెంటిమీటర్ల వర్షం పడితే ఇప్పుడున్న నాలాలు సరిపోతాయి. కానీ అంతకుమించి  ఏ మాత్రం ఎక్కువ వర్షం కురిసినా పలు ప్రాంతాల్లో నాలాలనుంచి మురుగు తన్నుకువచ్చే ప్రమాదం ఉంది. నాలాలపైన 28 వేల అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు వాటిని తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతను ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు ఎవరూ అడ్డుకోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 
మొదటి దశలో కమర్షియల్‌ కట్టడాల తొలగింపు..
మొదటి దశలో కమర్షియల్‌ కట్టడాలను ఉన్నపళంగా తొలగించడం, ఆ తర్వాత రెండో దశలో సామాన్య ప్రజలకు చెందిన అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టనున్నారు. అయితే రెండో దశలో  అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టే ముందు సంబంధిత ప్రజలను ఇందిరమ్మ ఇళ్ల సముదాయాలకు మార్చాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. దాదాపు 3637 కుటుంబాలను గుర్తించిన జీహెచ్‌ఎంసీ.. వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించే యోచనలో ఉంది.  
అక్రమ నిర్మాణాల కూల్చివేత 
నగరంలోని కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 14 ఏ లోని కేపీహెచ్‌బీ కాలనీ మూడవ ఫేజ్‌లో గల బతుకమ్మకుంటలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. కాప్రాలో 105 అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు.. భారీ బందోబస్తు మధ్య.. చిక్రిపురం, కుషాయిగూడలోని నాలాల వద్ద గట కట్టడాలను కూల్చివేస్తున్నారు. 
మూసీ నదిపై అక్రమ కట్టడాలపై టౌన్‌ ప్లానింగ్‌ సర్వే 
జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 13 డివిజన్‌ 112 రాంచంద్రపురం కానుకుంటలో నాలపై నిర్మించిన కంపౌండ్‌ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 20 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సర్వే పూర్తయిన తర్వాత పెద్ద భవనాలను కూల్చివేస్తామని అధికారులు చెబుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతల్లో మూసీ కాలువను ఆక్రమించుకుని నివసిస్తున్న మూసానగర్‌ బస్తీలో ఏడుగురికి జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ముంపునకు గురికాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ 4ఏ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ కృష్ణ తెలిపారు. మూసీ నదిపై అక్రమ కట్టడాలపై టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.  
పలు కాలనీలలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు 
కుత్బుల్లాపూర్‌లోని భగత్‌సింగ్‌నగర్‌, మారుతీనగర్‌, సూరారం కాలనీల్లోని అక్రమ కట్టడాలని అధికారులు కూల్చి వేశారు. అటు శేరిలింగంపల్లి పరిధిలోని ఆదర్శనగర్‌, శాంతినగర్‌, దీప్తిశ్రీనగర్‌లో  2 కి.మీ మేర నాలా ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. రాజేంద్రనగర్‌ ఆరాంఘర్‌ చౌరస్తాలో అక్రమంగా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఇక అల్వాల్‌లో అక్రమంగా నిర్మించిన పంచశీల అపార్ట్‌మెంట్‌లోని 4వ అంతస్తును జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. 

 

19:46 - September 27, 2016

గుంటూరు : జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లలో ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించడం లేదంటూ నగరంపాలెం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌పై డీజీపీ మండిపడ్డారు. అనంతరం అర్బన్ పరిధిలో నిర్మించతలపెట్టిన మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయన్నారు. వీటి నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని డీజీపీ అన్నారు. 

 

19:42 - September 27, 2016

గుంటూరు : ఏపీ రాధాని అమరావతి గ్రామాల్లో అధికారులు ఫ్లాట్ల కేటాయింపును చేపట్టారు. గుంటూరు జిల్లా పిచ్చుకలపాలెం, దొండపాడు గ్రామాల్లో రైతులకు సీఆర్‌డీఏ అధికారులు  ఫ్లాట్ల పంపిణీ చేశారు. మొత్తం 1072 మంది రైతులకు 494 రెసిడెన్షియల్‌, 497 కమర్షియల్‌ ఫ్లాట్లను కేటాయించారు. అక్టోబర్‌ నెలాఖరు నాటికి మొత్తం 29గ్రామాల్లో ఫ్లాట్ల కేటాయింపును పూర్తిచేస్తామని ఆర్డీవో శ్రీధర్‌ చెప్పారు.

 

19:39 - September 27, 2016

హైదరాబాద్‌ : నగరం నుంచి మూడు డీసీఎం లారీల్లో అమరావతిలోని తాత్కాలిక సచివాలయానికి కంఫ్యూటర్లు, ఫైల్స్‌, ఫర్నీచర్‌ను తరలించారు. 2వ బ్లాక్‌లోని ఆర్థికశాఖ కార్యాలయంలో వీటిని ఉంచారు. వచ్చేనెల 3 నుంచి అమరావతి నుంచి పూర్తి స్థాయిలో పాలన చేపట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 

 

19:36 - September 27, 2016

పశ్చిమగోదావరి : జిల్లా ఉంగుటూరు టోల్‌గేట్‌ వద్ద పెను ప్రమాదం తప్పింది. స్కార్పియో వాహనం షార్ట్‌ సర్క్యూట్‌తో పూర్తిగా కాలిపోయింది. కారులో పొగలు వస్తుండటంతో గమనించిన అందులోని ప్రయాణికులు కిందకు దిగిపోయారు. కొద్ది సేపట్లోనే మంటలు అంటుకుని కారు మొత్తం కాలిపోయింది. 

 

రామోజీ ఫిల్మ్ సిటీలో ఇండీవుడ్ కార్మివాల్ ముగింపు ఉత్సవాలు

హైదరాబాద్ : రామోజీ ఫిల్మ్ సిటీలో ఇండీవుడ్ కార్మివాల్ ముగింపు ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. 

 

గ్రూప్ 2 కు 8, 18, 926 దరఖాస్తులు : ఘంటా చక్రపాణి

హైదరాబాద్ : గ్రూప్ 2 కు 8, 18, 926 దరఖాస్తులు వచ్చాయని ఘంటా చక్రపాణి తెలిపారు. గ్రూప్ 2 పరీక్షకు 8 లక్షల పైచిలుకు దరఖాస్తులు రావడం దేశ వ్యాప్తంగా ఇదే అత్యధికమన్నారు. పరీక్ష కేంద్రాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే స్కూళ్లను కూడా వాడుకుంటామని పేర్కొన్నారు. 

 

మూసీ ఒడ్డున నిర్మించిన ఇళ్లను ఖాళీ చేయిస్తున్న అధికారులు

హైదరాబాద్ : చాదర్ ఘాట్ పీఎస్ పరిధిలో మూసీ ఒడ్డున నిర్మించిన ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మూసానగర్, కమలానగర్, శంకర్ నగర్ కాలనీ వాసుల ధర్నా చేపట్టారు. 

ఆరోగ్యశ్రీకి మరో సీఈవో నియామకం

హైదరాబాద్ : ఉద్యోగుల హెల్త్ స్కీం, జర్నలిస్టుల హెల్త్ కార్డుల కోసం ఆరోగ్యశ్రీకి మరో సీఈవోను నియామించారు. ఈమేరకు తెలంగాణ ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈఎస్ ఐ జాయింట్ డైరెక్టర్ డా.పద్మకి పూర్తి అదనపు బాధ్యతులు అప్పగించారు. 

ఎసిబికి చిక్కిన నర్సాపూర్ వీఆర్వో

మెదక్ : జిల్లాలో ఓ వీఆర్వో లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కాడు. నర్సాపూర్ వీఆర్వో ముత్యాలరావు ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబట్టాడు.  

హైదరాబాద్ నుంచి అమరావతికి సామాగ్రి తరలింపు

హైదరాబాద్ : నగరం నుంచి మూడు లారీల్లో అమరావతిలోని తాత్కాలిక సచివాలయానికి కంప్యూటర్లు, ఫైల్స్, ఫర్నీచర్ తరలించారు. 2వ బ్లాక్ లోని ఆర్థికశాఖ కార్యాలయానికి తరలిస్తున్నారు. 

 

తాత్కాలిక సచివాలయంలో వివిధ శాఖలకు ఆఫీస్ లు కేటాయిస్తూ ఉత్తర్వులు

గుంటూరు : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో వివిధ శాఖలకు ఆఫీస్ లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

19:02 - September 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ కోసం చివరి వరకు పోరాడిన పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ మంత్రి జోగురామన్న అన్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణమండపంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు నాయిని, జోగురామన్న,మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ  చేసిన సేవలను స్మరించుకున్నారు. 

 

18:59 - September 27, 2016

ఆదిలాబాద్ : చిన్ననాటి నుంచి పెంచి పెద్దచేసిన కన్న తల్లిదండ్రులను కొడుకులు ఇంటి నుంచి బయటకు గెంటేసిన ఘటన... ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జరిగింది. స్థానిక కన్నాల బస్తీకి చెందిన సాహెచ్ హుస్సేన్‌, మహబూబ్‌బీ అనే వృద్ధదంపతులకు ఇద్దరు కుమారులున్నారు. కొన్ని రోజులుగా చిన్న కుమారుడు దగ్గర వీరు తలదాచుకుంటున్నారు. కుమారుడు లేని సమయంలో... చిన్న కోడలు అమీనా వారిని ఇంటి నుంచి బయటకు గెంటివేసింది. దీంతో చలించిన స్థానికులు పోలీసులను ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరు కుమారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 

 

18:56 - September 27, 2016

నల్గొండ : వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. అయితే  రెండు రాష్ట్రాలకు వరప్రదాయినిగా నిలిచిన నాగార్జునసాగర్ మాత్రం నీరు లేక వెలవెలబోతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం కేవలం 521 అడుగుల వరకు మాత్రమే నీరు ఉంది. మొన్నటి వరకు డెడ్ స్టోరేజీ 510 అడుగులకు చేరువలో ఉండగా.. మూడు రోజులుగా ఎగువ నుంచి చేరుతున్న నీటితో ప్రస్తుతం 521 అడుగులకు చేరుకుంది. దీనిపై టెన్ టివి ప్రతినిధి అందించిన మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

 

18:53 - September 27, 2016

కరీంనగర్‌ : జిల్లాలో ముస్తాబాద్‌ చెరువుకు గండి పడింది. దీంతో పోత్‌గల్‌ గ్రామానికి వరద నీరు పోటెత్తింది. వందల ఎకరాల పంట నీటమునిగింది. పంటలు మునుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ముస్తాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట బీజేపీ, కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు.  

18:51 - September 27, 2016

నిజామాబాద్‌ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా అతలాకుతలామైంది. జిల్లాలోని బందరతాండ వద్ద వరద నీరు భారీగా రోడ్లపైకి వచ్చింది. దీంతో ఎల్లారెడ్డి నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక ప్రజలైతే కనీస సౌకర్యాల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారిని పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. 

 

పాకిస్తాన్ హైకమిషన్ బాసిత్ కు భారత్ సమన్లు జారీ

ఢిల్లీ : పాకిస్తాన్ హైకమిషన్ బాసిత్ కు భారత్ సమన్లు జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ సమన్లు జారీ చేశారు. యూరీ ఘటనకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే పాల్పడినట్లు పూర్తి అధారాలను జైశంకర్ భాసిత్ కు అందజేశారు. యూరీ ఘటనలో మృతి చెందిన ఓ ఉగ్రవాది హఫీజ్ అహ్మద్ గా గుర్తించారు. ఉగ్రవాదులకు సహకరించిన ఇద్దరు గైడ్లు హుస్సేన్ అవాన్, యాసిన్ ఖుర్షిద్ ల వివరాలనూ జైశంకర్ బాసిత్ కు అందజేశారు. గైడ్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ముజఫరాబాద్ వాసులుగా నిర్ధారించారు. సీమాంతర ఉగ్రవాదవాన్ని భారత్ క్షమించదని జైశంకర్ చెప్పారు. 

 

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు పంపిణీ

గుంటూరు : రాజధానికి భూములు ఇచ్చిన దొండపాడు రైతులకు సీఆర్ డీఏ అధికారులు ప్లాట్లు పంపిణీ చేశారు. 243 మంది రైతులకు 400 నివాస, 497 వాణిజ్య స్థలాల పత్రాలు అందజేశారు. 

అక్రమ నిర్మాణాల కూల్చివేతపై మేయర్ బొంతు సమీక్ష

హైదరాబాద్ : అక్రమ నిర్మాణాల కూల్చివేతపై జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సమీక్ష నిర్వహించారు. కూల్చివేతలో ఇల్లు కోల్పోయిన పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పారు. వేరే చోట ఇళ్ల స్థలాల కేటాయింపులపై కలెక్టర్లతో మాట్లాడామని.. పేదలు ఎక్కడ కోరుకుంటే అక్కడి ఇళ్లు ఇస్తామని అన్నారు. ఆక్రమణల  తొలగింపు పూర్తైన తర్వాత నాలాల వెడల్పు పెంచుతామని పేర్కొన్నారు. కూల్చివేతలకు ఎవరూ అడ్డుచెప్పొద్దన్నారు. 

 

ఆర్డీఎస్ వద్ద ఎమ్మెల్యే సంపత్ ఆందోళన

మహబూబ్ నగర్ : జిల్లాలోని ఆర్డీఎస్ వద్ద ఎమ్మెల్యే సంపత్ ఆందోళన చేపట్టారు. అలంపూర్ కు రావాల్సిన నీళ్లు రాయలసీమకు మళ్లించడాన్ని నిరసిస్తూ రైతులతోకలిసి సంపత్ బైఠాయించారు. 

 

అక్టోబర్ 17 నుంచి మహాజన పాదయాత్ర : తమ్మినేని

హైదరాబాద్ : తెలంగాణ సమగ్ర సామాజిక అభివృద్ధి సాధనకై సీపీఎం ఆధ్వర్యంలో మహాజన పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అక్టోబర్ 17 న ఇబ్రహీంపట్నం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు. ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరవ్వనున్నట్లు తెలిపారు. 5 నెలలపాటు జిల్లా, మండల కేంద్రాల్లో పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద స్పష్టమైన అభివృద్ధి, ఉపాధి ప్రణాళికలేదని విమర్శించారు. ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. 

 

16:53 - September 27, 2016

విజయనగరం : విజయనగరం జిల్లా బోగాపురం మండలం తూడెం.. భీమిలి మండలం అన్నవరం గ్రామాల మథ్య నెలకొన్న భూవివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. సర్వే నెంబర్‌ 101లో 199 ఎకరాల బంజరు భూమి విషయమై ఇరు గ్రామాల మధ్య తీవ్ర గొడవ జరిగింది. తూడెం గ్రామస్తులు వివాదస్పదమైన భూమిలో మొక్కలు నాటేందుకు సన్నద్ధమవగా...విషయం తెలుసుకున్న అన్నవరం గ్రామాస్తులు తూడెం గ్రామస్తులపై దాడికి పాల్పడ్డారు. మహిళలని కూడా చూడకుండా కట్టుబట్టలను చింపేసి దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

16:50 - September 27, 2016

విశాఖ : విదర్భ నుంచి ఛత్తీస్‌గడ్‌  మీదుగా మహారాష్ట్ర వరకు అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీనికి తోడు ఉత్తరకోస్తా తీరాన్ని అనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగడంతో రాగల 24 గంటల్లో ఉత్తరకోస్తా రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తాయన్నారు. అత్యధికంగా ఇప్పటి వరకు విశాఖ జిల్లాలోని చోడవరం, అనకాపల్లి, యలమంచిలిలో 20 సె.మీలకు పైగా వర్షపాతం నమోదైంది. జిల్లాలో తాజా పరిస్థితిపై టెన్ టివి ప్రతినిధి అందిస్తున్న మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం....

 

16:47 - September 27, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయినా ఏం అభివృద్ధి జరగలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తమ్మినేని వీరభద్రం అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్‌ 17 నుంచి మార్చి 12 వరకు దాదాపు ఐదు నెలల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా తెలంగాణలోని ప్రజల స్థితిగతులను తెలుసుకుంటామన్నారు. ఈ మహా పాదయాత్రకు అన్ని ప్రజాసంఘాలు మద్దతివ్వాలని కోరారు. 

 

16:41 - September 27, 2016

ఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కు కశ్మీర్‌ కావాలంటే బిహార్‌ను కూడా తీసుకోవాలని ట్విట్టర్‌లో వివాదస్పద పోస్ట్‌ చేశారు. పాకిస్తానీయులారా.... వివాదాన్ని ముగింపు పలికేందుకు కశ్మీర్‌ను మేము మీకిస్తాం...ఇందుకోసం బిహార్‌ను కూడా తీసుకోవాలని షరతు విధించారు. ఇది ప్యాకేజీ డీల్‌ అంటు పేర్కొన్నారు. తీసుకుంటే కశ్మీర్‌, బిహార్‌లను  తీసుకోవాలని...లేదా ఏమి మిగలదంటూ వ్యాఖ్యానించారు. కట్జూ వ్యాఖ్యలపై బిహార్‌ రాజకీయ నేతలు మండిపడుతున్నారు. బిహార్‌ ప్రజలను కట్జూ అవమానించారంటూ, ఆయనపై విచారణ జరపాలంటూ జెడియు నేత కేసి త్యాగి డిమాండ్‌ చేశారు. వివాదం పెద్దది కావడంతో జోక్‌ చేశానంటూ కట్జూ తప్పించుకునే యత్నం చేశారు.

 

టెస్టు జట్టులోకి రానున్న గౌతం గంభీర్

ఢిల్లీ : టెస్టు జట్టులోకి గౌతం గంభీర్ రానున్నారు. సెలక్టర్ల నుంచి గౌతంకు పిలుపువచ్చింది. ఈడెన్ గార్డెన్ లో జరిగే మ్యాచ్ లో గౌతం ఆడనున్నారు. రేపు ఫిట్ నెస్ టెస్టుకు గౌతం హాజరుకానున్నారు. గాయపడ్డ రాహుల్ స్థానంలో గౌతంకు అవకాశం లభించింది. 2014 సం.లో గంభీర్ చివరి టెస్టు మ్యాచ్ ఆడారు. 

 

కాంగ్రెస్ ఎంపీ షాదీలాల్ బత్రాపై లైంగిక వేధింపుల కేసు

ఢిల్లీ : కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు షాదీలాల్ బత్రాపై ఢిల్లీలోని తిలక్ నగర్ జైలులో లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని...హర్యానా మహిళ ఫిర్యాదు చేసింది. 

అక్రమంగా నిర్మిస్తున్న 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు

హైదరాబాద్ : నగరంలో అక్రమనిర్మాణాలపై తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మలక్ పేట గంజ్ ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న 5 అంతస్తుల భవనాన్ని జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. 

శేరిలింగంపల్లి పరిధిలో కొనసాగుతోన్న నాలాల అక్రమణల తొలగింపు

హైదరాబాద్ : శేరిలింగంపల్లి పరిధిలో నాలాల అక్రమణల తొలగింపు కొనసాగుతోంది. ఆదర్శనగర్, శాంతినగర్, దీప్తిశ్రీ నగర్ ల నుండి దాదాపు 2 కి.మీ వరకు నాలా కబ్జాకు గురైంది. 

16:02 - September 27, 2016

పశ్చిమగోదావరి : పచ్చటి పొలాలతో కళకళలాడే తుందుర్రు ప్రాంతం రణరంగంగా మారుతోంది. పోలీసు పహరాతో అదొ సరిహద్దు గ్రామాన్ని తలపిస్తోంది. ఆక్వాఫుడ్ పార్క్ వద్దంటే వద్దంటూ 33 గ్రామాల  ప్రజలు సాగిస్తున్న పోరాటం చివరకు ఎలాంటి మలుపు తిరుగుతుందో అర్ధం కావడం లేదు. ఒకవైపు  ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మించి తీరాలన్న పట్టుదలతో యాజమాన్యం, దానికి అండగా పోలీసుల మొహరింపు, మరోవైపు దానిని వ్యతిరేకిస్తూ వేలాది జనం. ఇంతమంది ఆ ఫుడ్ పార్క్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వారి భయానికి కారణం ఏమిటి? గతంలో ఎదురైన అనుభవాలేమిటి? ఇదే అంశంపై 10 టీవీ ఏలూరు ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. 
33 గ్రామాల్లో  అలజడి
ఇది ముప్పై మూడు గ్రామాల సమస్య. వేలాది ప్రజల ఘోష.  పశ్చిమగోదావరి జిల్లాలోని పచ్చటి గ్రామాలు ఇప్పుడు తమ సౌందర్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది.  ఆ 33 గ్రామాల్లో భయానక వాతావరణం ఏర్పడింది.  భారీ సంఖ్యలో పోలీసులు దిగారు. తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నల గురువు... ఇవి మూడు పశ్చిమగోదావరి జిల్లాలోని గ్రామాలు. ఈ మూడు గ్రామాలతో పాటు భీమవరం, నరసాపురం మండలాల్లోని దాదాపు 30 గ్రామాలు ఇప్పుడు యుద్ధభూమిగా మారిపోయాయి. మూడు గ్రామాల పురుషులు ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. 144 సెక్షన్ లు, అరెస్టులతో ఆ ప్రాంతం కర్ఫ్యూ వాతావరణం తాండవిస్తోంది. ఎప్పుడూ పచ్చగా ప్రశాంతంగా కనిపించే ఈ ప్రాంతంలో అలజడి రేగింది. ఇక తమ బతుకులు దుర్భరంగా మారతాయన్న ఆందోళన ఇక్కడి ప్రజలను ఆవహించింది. పోలీసు పికెట్లు, బూట్లచప్పుళ్లతో ఈ ప్రాంతంలో ఓ భయానక వాతావరణం కనిపిస్తోంది.
గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం
గత పదిరోజులుగా ఈ గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఇదేమీ ఆకస్మికంగా వచ్చిన మార్పు కాదు. కొంతకాలంగా ప్రజల్లో గూడుకట్టుకున్న ఆవేదన, ఆందోళన, భవిష్యత్ మీద పరచుకుంటున్న భయాలు వీరిని పోరుబాట పట్టించాయి. ఉద్యమ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇక్కడ సాగుతున్న ఉద్యమమే ఇంత మంది పోలీసుల మొహరింపునకు కారణం. 
ప్రజలు ఎందుకు ఉద్యమబాటపట్టారు? 
తుందర్రు పరిసర గ్రామాల ప్రజలు ఎందుకు ఉద్యమబాటపట్టారు? ఇక్కడ పోలీసులు ఎందుకు మొహరించారు? ఎంతకాలంగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం వుంది? రోజురోజుకీ ఉద్యమం ఎందుకు బలపడుతోంది? తుందుర్రు దాని పరిసర ముప్పై గ్రామాల్లో అగ్గి రాజుకోవడానికి కారణం  గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్. భీమవరంనకు చెందిన శ్రీరంగనాధరాజు, ఆనందరాజు అనే ఇద్దరు వ్యక్తులు కొన్నాళ్ల క్రితం ఇక్కడ పాగా వేశారు. చెరువుల తవ్వకాల కోసమంటూ 50 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కొంతకాలం ఆ భూమిని ఖాళీగానే వుంచారు. 2015లో అక్కడ కొన్ని నిర్మాణాలు ప్రారంభించారు. ఆ ఇద్దరు వ్యక్తుల వ్యూహాలేమిటో తొలుత స్థానికులకు అర్ధం కాలేదు. ఆ నిర్మాణ కార్యకలాపాల ఉద్దేశం ఏమిటో ఎవరికీ అంతు చిక్కలేదు. కానీ, రహస్యం ఎక్కువ కాలం దాగలేదు. 2016లో అసలు విషయం బయటపడింది. అక్కడ మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారన్న వార్త బయటకు పొక్కింది. దానికి ప్రభుత్వం అనుమతులిచ్చిందన్న వార్త కలకలం రేపింది. అంతే. జనంలో అలజడి మొదలైంది. అందరి మనసుల్లోనూ కీడు శంకించింది. తమకేదో ప్రమాదం రాబోతోందన్న నిర్ధారణకు వచ్చారు స్థానికులు.
ఫుడ్ పార్క్ కి వ్యతిరేకంగా ఉద్యమం 
ఫుడ్ పార్క్ కి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. గ్రామాలన్నీ ఏకమయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగారు. జనంపై లాఠీలు లేచాయి. పంట పొలాల్లో పరుగెత్తించి కొట్టారు పోలీసులు. ఆనాటి లాఠీ చార్జీలో చాలామంది తలలు పగిలాయి.  అయినా, జనం వెనక్కితగ్గలేదు.  పోరాటం మరింత ఉధృతమైంది. దీంతో  కొద్ది రోజుల పాటు ఆక్వాఫుడ్ పార్క్ యాజమాన్యం ఓ అడుగు వెనక్కివేసింది. 8 నెలల పాటు నిర్మాణ పనులు ఆపివేశారు. మూడు నెలల క్రితం నరసాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనతో పరిస్థితి మారిపోయింది. మళ్లీ ఆక్వాఫుడ్ యాజమాన్యం రంగంలోకి దిగింది. నిర్మాణ పనులు ప్రారంభించింది. వాటికి వ్యతిరేకంగా మళ్లీ ఉద్యమబాట పట్టారు 30 గ్రామాల ప్రజలు.
తుందుర్రు చుట్టు పక్కల గ్రామాల్లో టెన్షన్ 
తుందుర్రు చుట్టు పక్కల గ్రామాల్లో గత పది రోజుల్లో టెన్షన్ పెరిగింది. ఆక్వా ఫుడ్ పార్క్ కి వ్యతిరేకంగా జనాగ్రహం పెల్లుబికడంతో పోలీసులు రంగంలోకి దిగారు.  వందలాది పోలీసులు  సహకారంతో ఇసుక, సిమెంట్, ఐరన్ లాంటి నిర్మాణ సామగ్రిని  తీసుకొస్తున్నారు.  అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు ఉద్యమ తీవ్రతకు, స్థానికుల పోరాటపటిమకు అద్దం పడుతున్నాయి. 
తారా స్థాయికి ఫుడ్ పార్క్ వ్యతిరేక పోరాటం 
ఫుడ్ పార్క్ వ్యతిరేక పోరాటం తారా స్థాయికి చేరింది. తుందుర్రు, కంసాల బేతపూడి, జొన్నలగరువు  వీటి చుట్టుపక్కల వుండే మరో 30 గ్రామాల ప్రజలు ఏకమయ్యారు. గత పదిరోజులుగా జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ మధ్య ఫుడ్ పార్క్ వద్దంటే వద్దంటూ ఆందోళనలు చేస్తున్నారు. దీంతో పోలీసులు మోహరించారు. పోలీసులతో పాటు స్పెషల్ టీమ్ లను కూడా మొహరించారు. నిర్మాణ పనులకు అవసరమైన సిమెంట్, ఇసుక, ఐరన్ తరలించడానికి 700 మంది పోలీసులను వినియోగించాల్సి వచ్చిందంటే, ఈ ఫుడ్ పార్క్ పట్ల స్థానికులు ఎంత ఆగ్రహంతో వున్నారో అర్ధమవుతోంది. ఫుడ్ పార్క్ పరిసరాల్లోకి ఎవరూ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 260 మందిపై 120 సెక్షన్ కింద కేసులు పెట్టారు. 30 మందిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసులు పెట్టారు. పోలీసులు పెడుతున్న ఈ కేసులు ప్రజలను మరింత కోపోద్రిక్తులను చేస్తున్నాయి. పురుషులు కనిపిస్తే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో తుందుర్రు, జొన్నలగరువు, కంసాల బేతపూడి గ్రామాల్లో మగవాళ్లెవ్వరూ కనిపించడం లేదు. 
ఫుడ్ పార్క్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.? 
ఇంతకీ ఇన్ని గ్రామాల ప్రజలు ఫుడ్ పార్క్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.? అక్కడ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తే వీరికొచ్చే కష్టమేమిటి? నష్టమేమిటి? ప్రభుత్వం, యాజమాన్యం వీరికి ఎందుకు నచ్చచెప్పలేకపోతున్నాయి? పోలీస్ లను ఎందుకు ప్రయోగిస్తున్నారు?
ఫుడ్ పార్క్ నిర్మాణ వ్యయం విలువ దాదాపు రూ. 360 కోట్లు 
ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణ వ్యయం విలువ దాదాపు 360 కోట్ల రూపాయలు. తొలి దశ నిర్మాణ పనులకు 125 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇందులో 75 కోట్ల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఈ ఆక్వాఫుడ్ పార్క్ నిర్మిస్తే, తుందుర్రుతో పాటు చుట్టు పక్కల 32 గ్రామాలు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతాయి. అదంతా కాలుష్య ప్రాంతంగా మారిపోతుంది. తాగే నీళ్లు కలుషితమవుతాయి. పచ్చని పంట పొలాలు నాశనమవుతాయి. భూములన్నీ చౌడుబారిపోతాయి. ఈ ఫుడ్ పార్క్ లో వాడే కెమికల్స్ వల్ల గర్భవతులకు అనారోగ్య సమస్యలొస్తాయి. పుట్టే పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది. ఈ ఫుడ్ పార్క్ నుంచి వెలువడే రసాయనాలను ఎలా బయటకు పంపిస్తారో, కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో యాజమాన్యం చెప్పడం లేదు. గతంలో పాలకోడేరు మండలం వేండ్రలో పెట్టిన డెల్టా పేపర్ మిల్లు వల్ల తాగునీరు, సాగునీరు అందించే యనమదుర్రు డ్రెయిన్ విషతుల్యమైపోయింది. ఆ నీళ్లు తాగడానికి పనికిరాకుండా పోయాయి. ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మిస్తే తమ గ్రామాలకూ అలాంటి కష్టమే తప్పుదన్న భయంతో స్థానికులు హడలిపోతున్నారు. తుందుర్రుతో పాటు 33 గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి. వారి సమస్యలు ఓపికగా వినాలి. ప్రభుత్వం పంతాలకు పట్టింపులకు పోకుండా మెగా ఫుడ్‌ పార్క్‌ పార్క్‌ను మరో ప్రాంతానికి తరలించే అవకాశాలను పరిశీలించాలి. 

 

నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఇక కఠినతరం..

హైదరాబాద్ : ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం కానున్నాయి. జీవో మెంబర్ 80ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపట్టనుంది. పాయింట్ల పద్ధతిలో జరిమాన విధించనున్నారు. 12 పాయింట్లు దాటితే లైసెన్స్ రద్దుతో పాటు జైలుశిక్ష పడనుంది. 

15:52 - September 27, 2016

వ్యవసాయాధికారి సస్పెండ్ కు మంత్రి పోచారం ఆదేశాలు...

నిజామాబాద్ : సదాశివనగర్ మండల వ్యవసాయాధికారి రాజలింగం సస్పెండ్ కు కలెక్టర్ ను మంత్రి పోచారం ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

15:50 - September 27, 2016

నల్గొండ : జిల్లాలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను సిపిఎం బృందం పర్యటించింది. వేములపల్లి, దామరచర్ల మండలాల పరిధిలో వరి, పత్తి చేలను పరిశీలించిన నేతలు స్థానిక రైతులతో మాట్లాడారు. వరదల కారణంగా పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా వరి, పత్తి, తదితర పంటలు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లందని సిపిఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. వెంటనే క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి వాస్తవ నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేవలం నష్టపోయిన పంటలకే కాకుండా మేట వేసిన ఇసుకను తొలగించేందుకు రైతులకు పరిహారం అందజేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

 

కుత్బుల్లాపూర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత..

హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ లోని భగత్ సింగ్ నగర్, మారుతీనగర్, సూరారం కాలనీల్లో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. పోలీసు బందోబస్తుతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. 

సుప్రీంలో కావేరి జల వివాదంపై విచారణ..

ఢిల్లీ : సుప్రీంకోర్టులో కావేరి జల వివాదంపై విచారణ జరిగింది. రెండు రోజుల పాటు కావుని జలాలు విడుదల చేయాలని ఆదేశించింది. మొత్తం ఆరు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని సూచించింది. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది. 

ముద్రగడ అనవసర రాద్ధాంతం మానుకోవాలి - బోండా ఉమ..

విజయవాడ : కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే బోండా ఉమ పేర్కొన్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు..కడపలో జగన్ అనుచరులు మంజునాథ కమిషన్ ను అడ్డుకొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాపుల కోసం చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేస్తుంటే ముద్రగడ అనవసర రాద్ధాంతం మానుకోవాలని సూచించారు. 

15:42 - September 27, 2016

'మాయమైపోతున్నాడు మనిషిన్నవాడు' అనే ఓ గీతం ఉండేది. సాటి మనిషి చనిపోయినా రాతి గుండెలు కరగడం లేదు. ఇటీవలే పలు హృదయ విదాకరమైన ఘటనలు చూశాం. సమాజం ఎటుపోతుందో అంతు చిక్కదు. చుట్టూ ఉన్న మనుషులు ఇంత నిర్దయగా మారారా అన్న ఆవేదన చుట్టుముడుతుంది. ఒడిషాలోని ఓ నిరుపేద గిరిజనుడు తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని మైళ్ల దూరం నడిచిన ఘటన ఎవరూ మరిచిపోరు. ఇది మరిచిపోకముందే మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి మార్చురీ వెహికల్ డ్రైవర్ నిరాకరించడంతో ఆ శవాన్ని వెదురు బొంగుకు కట్టుకుని ఇద్దరు వ్యక్తులు తమ భుజాలపై మోసుకుని వెళుతూ కనిపించారు. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఒడిశాలోని కలహంది జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ జిల్లాలో కనక్ సప్తతి (75) అనే మహిళ ఇటీవలే మృతి చెందింది. కానీ తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సరిపడా డబ్బు లేదు. దీనితో అంత్యక్రియలకు సహకరించాలని వారు అభ్యర్థించారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. శవాన్ని తీసుకెళ్లేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. దీనితో మృతదేహాన్ని మంచంపై పెట్టారు. తమ ఇంటి పై కప్పునకు ఉన్న కలపను తీసుకున్నారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

15:39 - September 27, 2016
15:38 - September 27, 2016

అమెరికా : ఒబామా పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరోగమన దిశలో పయనిస్తోందని రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్‌ ఆరోపించారు. యూఎస్ లోని బహుళజాతి సంస్థలు భారత్‌, చైనా, మెక్సికో వంటి దేశాలకు అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగాలను తరలించడం, అమెరికాలో ఈ దేశాల వారిని ఉద్యోగాల్లో నియమించడం వలన స్వదేశంలో నిరుద్యోగం తీవ్ర రూపందాల్సిందని మండిపడ్డారు. తాను అధికారలోకి వస్తే ఈ పరిస్థితిని చక్కదిద్ది ఆమెరికా ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం తీసుకొస్తాయని న్యూయార్క్‌లో జరిగిన మొదటి బహిరంగ చర్చలో హామీ ఇచ్చారు. ట్రంప్‌కు హిల్లరీ ధీటుగా సమాధానమిచ్చారు. మౌలికసదుపాయాలు, టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని హిల్లరీ చెప్పారు.

మొదటి చర్చ...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ తలపడుతున్న డెమోక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ల మధ్య జరిగే మూడు బహిరంగ చర్చల్లో మొదటిది పూర్తయ్యింది. ట్రంప్‌ సొంత నగరం న్యూయార్క్‌లోని హోఫ్‌స్ట్రా యూనివర్సిటీలో జరిగిన చర్యలో ఇద్దరూ ముఖాముఖీ తలపడ్డారు. ఇరువురు అభ్యర్థులు తమ తమ విధానాలు, ప్రణాళికలను వివరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, తుపాకుల సంస్కృతి, శాంతి భద్రతలు వంటి అంశాల్లో ట్రంప్‌, హిల్లరీ వ్యక్తిగత విమర్శలకు దిగారు. పరస్పర విమర్శలు, ఆరోపణలతో చర్చను రక్తి కట్టించారు. ఆద్యతం ఆసక్తికరంగా సాగిన చర్చను అమెరికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించారు.

తాను గెలిస్తే పన్నులు తగ్గించి, ఉద్యోగాలు సృష్టిస్తా -ట్రంప్‌..
భారత్‌, చైనా, మెక్సికో వంటి దేశాలు అమెరికాలో ఉద్యోగాలను కొల్లగొడుతున్నా.... సెనెటర్‌గా, విదేశాంగ మంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభం ఉన్న హిల్లరీ నోరు మెదపలేదని ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఒబామా పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాల దిశగా పయనిస్తోందని, గాలిబుడగలా ఉన్న ఎకానమీ ఎప్పుడైన బద్దలయ్యే అవకాశం ఉందని విమర్శించారు. తాను గెలిస్తే పన్నులు తగ్గించి, ఉద్యోగాలు సృష్టిస్తానని ట్రంప్‌ చెప్పారు. దీనికి హిల్లరీ సమాధానం ఇస్తూ... కార్పొరేట్లపై పన్నులు వేయడంతో తప్పులేదని, పేదలకు ప్రయోజకరంగా ఉండే విధానాలు తీసుకొస్తాని చెప్పారు.

రోజుకు పది నుంచి పన్నెండు గంటలు కూడా ప్రయాణించా -హిల్లరీ..
హిల్లరీ ఆరోగ్యంపై ట్రంప్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న హిల్లరీ అమెరికా దౌత్య సంబంధాలను సరిగా నిర్వహించలేరని విమర్శించారు. దీనికి హిల్లరీ ధీటుగా సమాధానం ఇచ్చారు. విదేశాంగ మంత్రిగా 159 దేశాల్లో పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు. రోజుకు పది నుంచి పన్నెండు గంటులు ప్రయాణం చేసి దౌత్య సంబధాలను మెరుగు పరిచిన విషయాన్ని ప్రస్తావించారు. మహిళలపై నోరు పారేసుకోవడం ట్రంప్‌కు సహజమేనని, గర్భిణిలను కించపరిచిన ట్రంప్‌ అధికారంలోకి వస్తే మహిళ ప్రతిష్ఠ మంట కలుస్తుందని హిల్లరీ మండిపడ్డారు. ఒబామా పాలనలో అమెరికాలో శాంతిభద్రతు క్షీణించాయని ట్రంప్‌ ఆరోపించారు. పోలీసులు, ప్రజలపై జరిగిన దాడులను ప్రస్తావించారు. దీనికి హిల్లరీ సమాధానం చెబుతూ... తాను అధికారంలోకి వస్తే తుపాకీ లైసెన్స్ ల విధానాన్ని పునఃసమీక్షిస్తారని చెప్పారు.

హిల్లరీ చిరునవ్వు...
వచ్చే నవంబర్‌ 8న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే మద్దతు ఇస్తానని ట్రంప్‌ చెప్పారు. అమెరికాలో ప్రజాస్వామ్యం గెలుస్తుందని హిల్లరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాక్‌ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ, ఐసిస్‌ ఉగ్రవాదం, హిల్లరీ ఈ-మెయిల్స్ కుంభకోణం వంటి అంశాలను ట్రంప్‌ ప్రస్తావించి బిగ్‌ డిబేట్‌లో పైచేయి సాధించాలనుకున్నారు. హిల్లరీ కూడా ట్రంప్‌ ఆర్థిక లావేదేవీలు, పన్ను చెల్లింపు వంటి విషయాల్లో పాటిస్తున్న గోప్యత వంటి విషయాలను ప్రస్తావించారు. తాను అధికారంలోకి వస్తే ట్రంప్‌ పన్నులు చెప్పింపుల్లో జరిగిన అవకతవకలను బయటపెట్టేందుకు ప్రాసిక్యూటర్‌ను నియమిస్తానని హిల్లరీ హెచ్చరించారు. ట్రంప్‌ పలు సందర్భాల్లో ఆగ్రహావేశాలకు లోనైనా, హిల్లరీ అన్నింటికీ చిరునవ్వుతో సమాధానం చెప్పి ప్రజాభిమానాన్ని చూరగొన్నారని అమెరికా మీడియా సర్వేలు చెబుతున్నాయి. మొదటి డిబేట్‌లో హిల్లరీకి అమెరికా ప్రజల్లో 62 శాతం మద్దతు లభిస్తే, ట్రంప్‌ను 27 శాతం మంది ప్రజలు మాత్రమే సమర్ధించారు. దీంతో మొదటి డిబేట్‌లో హిల్లరీ పైచేయి సాధించినట్టు అయ్యిందని భావిస్తున్నారు. సర్వే ఫలితాలతో హిల్లరీ సంతోషం కనిపిస్తుండగా, ట్రంప్‌లో కొద్దిగా నిరాశ ఆవహించిందన్న చర్చ జరుగుతోంది. మొదటి డిబేట్‌ పూర్తవడంతో వచ్చే నెల 9న సెయింట్‌ లూయీస్‌లోని వాషింగ్‌టన్‌ యూనివర్సిటీలో జరిగే రెండో బహిరంగ చర్చలకు ట్రంప్‌, హిల్లరీ సిద్ధమవుతున్నారు. 

15:31 - September 27, 2016

ఢిల్లీ : లంచం, అవినీతి ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. సిబిఐ కేసుల భయంతో కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన బీకే బన్సల్ తన కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తండ్రీ కొడుకుల శవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫార్మా కంపెనీ నుంచి లక్షలాది రూపాయల లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో బికె బన్సాల్‌ను జులై 16న సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో సిబిఐ ఆయన కుమారుడిని కూడా ప్రశ్నించింది. బన్సల్‌ అరెస్ట్ తర్వాత పరువుకు భయపడి జులై నెలలోనే ఆయన భార్య, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. సిబిఐ దాడులతో తమ పరువు పోయిందంటూ వారు ఓ లేఖ కూడా రాశారు. భార్య, కూతురు మరణంతో తీవ్రంగా కలత చెందిన బికె బన్సాల్‌ కుమారుడితో సహా ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు. బన్సాల్‌కు సంబంధించి సిబిఐ 8 చోట్ల దాడులు నిర్వహించి అక్రమ ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, నగదును స్వాధీనం చేసుకుంది.

15:29 - September 27, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలో ఆక్వాఫుడ్‌ ఫ్యాక్టరీ బాధిత గ్రామాలను పీడీఎఫ్ ఎమ్మెల్సీలు సూర్యారావు, నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం సందర్శించారు. గ్రామస్తుల అక్రమ అరెస్టులకు నిరసనగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఎమ్మెల్సీలు హెచ్చరించారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుందుర్రు, బేతపూడి, జొన్నలగరువు గ్రామాల్లో నిర్మించనున్న ఆక్వాఫుడ్‌ ఫ్యాక్టరీ వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోలీసులతో తమ గ్రామాలపై దాడులకు దిగుతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

15:26 - September 27, 2016

విజయవాడ : గతంలో భూములు పంచేందుకు ప్రభుత్వాలు సంస్కరణలు చేపడితే..ఇప్పటి టీడీపీ ప్రభుత్వం భూములు తీసుకునేందుకు సంస్కరణలు తెస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో.. సంస్కరణలు ప్రారంభమై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహించారు. సరళీకృత ఆర్థిక విధానాలు వ్యవసాయ కార్మికులపై ప్రభావం అనే అంశంపై వక్తలు ప్రసంగించారు. లక్షల ఎకరాల భూముల ల్యాండ్‌ బ్యాంక్‌ ఉందని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ..ఆ భూములు ఎవరి నుంచి తీసుకున్నారో స్పష్టం చేయాలని రాఘవులు స్పష్టం చేశారు. 

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి - తమ్మినేని..

హైదరాబాద్ : కనీస వేతనాలు అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పేర్కొన్నారు. సీపీఎం చేపడుతున్న మహాపాదయాత్రకు మద్దతుగా పలు ప్రజా సంఘాలు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా తమ్మినేని ప్రసంగించారు. దేశం..రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రజలు అభివృద్ధి కావడమేనన్నారు. 

15:12 - September 27, 2016
15:11 - September 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన విధానం జరగడం లేదని, ఇది ప్రజలు కోరుకోవడం లేదని..ప్రత్యామ్నాయ అభివృద్ధి జరగాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. త్వరలో సీపీఎం మహాపాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రకు మద్దతుగా పలు ప్రజాసంఘాలు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సమావేశంలో తమ్మినేని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం యొక్క స్వభావం ఏంటీ ? ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం ఏంటీ ? ఇలాంటి విధానాలను ప్రజల ఎదుట ఉంచాలన్నారు. అందుకోసం సీపీఎం మహాపాదయాత్ర చేపట్టడం జరుగుతోందని..'సామాజిక న్యాయం..సమగ్రాభివృద్ధి' అనే కాప్సన్ పెట్టుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం అంటే సామాజిక న్యాయం అమలు జరగాల్సిందేనని, సామాజిక న్యాయం అమలు కాకపోతే అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. దేశం..రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రజలు అభివృద్ధి కావడమేనన్నారు. లెక్కల్లో అభివృద్ధి కాదని..ఇవన్నీ మాయ లెక్కలని ప్రపంచం అంతా ఘోషిస్తోందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధి అయితే దానిని అభివృద్ధి అంటారన్నారు. నిన్నటి దాక మూడు ముద్దలు తిన్న వాడు నేడు నాలుగు ముద్దలు తినడం..నిన్నటి దాక మూడు గజాలు కట్టుకున్న వాడు నేడు నాలుగు గజాల బట్ట కట్టుకున్న వాడు..ఇలా ప్రతి అంశంలో జరిగితే దానిని అభివృద్ధి అంటారన్నారు. ఎన్నో పరిశ్రమలు వచ్చాయని చెప్పడం అంటే అభివృద్ధి కాదన్నారు. కనీస వేతనాలు అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని తమ్మినేని పేర్కొన్నారు. 

కేకే లైన్ లో విరిగిపడిన కొండచరియలు..

విశాఖపట్టణం : కేకే లైన్ లో తైదా - దీమిడిపల్లి మధ్యలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీనితో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అనకాపల్లి మండలం కుంచింగి వద్ద రహదారిపై వాగు పొంగిపొర్లుతోంది. వాహనాలను నిలిపివేశారు. 

ఉరి ఘటనలో చెక్కుల పంపిణీ..

లక్నో : ఉరిలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన ఆరుగురు జవాన్ల కుటుంబాలకు సీఎం అఖిలేష్ యాదవ్ చెక్కులను పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల చెక్కును ఆయన పంపిణీ చేశారు. 

14:26 - September 27, 2016

మహారాష్ట్ర..లాతూర్ పేరు చెబితే కరవు గుర్తుకొస్తుంది. ఎందుకంటే వేసవిలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంది. చుక్క నీరు లభించడమే కష్టమైపోయింది. దీనితో రైతులు..ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పంటలు ఎండిపోవడంతో రైతులు లబోదిబోమన్నారు. మంజ్రా జలాశయం ఎండిపోయింది. దీనితో రైళ్లలో నీటిని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2012 నుండి మంజ్రా రిజర్వాయర్ లో చుక్క నీరు లేదని తెలుస్తోంది. అప్పుడు తీవ్ర కరవుతో అల్లాడిన ఆ ప్రాంతం నేడు జలకళను సంతరించుకుంది. ఈ వర్షాకాల సీజన్ లో కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో ఉన్న జలాశయాలు నిండిపోయాయి. ప్రధానంగా మంజ్రా రిజర్వాయర్ నిండుకుండలా మారిపోయింది. ప్రస్తుతం బయటకు నీటిని వదులుతున్నట్లు సమాచారం. మంజ్రాతో పాటు మరో పెద్ద రిజర్వాయర్ అయిన లోయర్ తెర్నాతో పాటు ఎనిమిది చిన్న..మధ్య తరహా రిజర్వాయర్లు నిండుకుండలా మారిపోయాయంట. అంటే ఐదేళ్ల పాటు 'నీరు రైళ్లు' అవసరం లేదని అక్కడి వారు చర్చించుకుంటున్నారంట. 

14:02 - September 27, 2016

హైదరాబాద్ : నగరంలో ఇటీవల కురిసిని భారీ వర్షాలకు నిజాంపేట్‌ వాసులు రోజుల తరబడి జగదిగ్భంథంలోనే చిక్కుకుపోయారు. స్వచ్చంధ సంస్థలు, ప్రభుత్వం అందించే ఆహారంతోనే కడుపు నింపుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడున్న 150 అపార్ట్‌మెంట్లలో ఇప్పటివరకు వందకు పైగా ఖాళీ అయ్యాయి. అటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే ఆ నిజాంపేట వాసులు కోలుకుంటున్నారు. అపార్ట్ మెంట్ సెల్లార్లలో వుండిపోయిన వాహనాలన్నీ నీళ్ళల్లోనే వుండిపోవటంతో పనికిరాకుండాపోయాయని బాధితులు వాపోతున్నారు. 

13:50 - September 27, 2016

ఈ ఫొటో చూశారా..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..తెల్లని పంచె..తెల్లని చొక్కా..నున్నగా గీసిన గడ్డం..ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తోంది. 'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ అనంతరం ఆయన 'పి.శరత్ మరార్' నిర్మాణంలో రూపొందుతున్న చిత్రంలో 'పవన్' నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'కాటమరాయుడు'గా నామకరణం కూడా చేసేశారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అప్పుడే మొదలైంది. కానీ షూటింగ్ లో 'పవన్' పాల్గొనలేదు. షూటింగ్ కంటే ముందు ఆయన బెంగళూరులో జిమ్ లో కసరత్తులు చేశారని టాక్. సోమవారం నాడు ప్రారంభమైన షూటింగ్ కు 'పవన్' వచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత 'శరత్ మరార్' 'పవన్' ఫొటోను ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. వీలైంతన తొందరగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని 'పవన్' భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'గబ్బర్ సింగ్'లో 'పవన్‌'తో తొలిసారి జోడీ కట్టిన 'శ్రుతి హాసన్' ఈ సినిమాలో రెండోసారి నటించనున్నారు. ఫ్యాక్షనిస్ట్ ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది. 

13:47 - September 27, 2016

కుటుంబ నియంత్రణ శిబిరాలు వద్దనీ..దాని గురించి ప్రచారాలు అవసరం లేదనీ.. వాటి స్థానంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కు.ని ఆపరేషన్లు చేస్తున్న చోట, శిబిరాల నిర్వహణ సక్రమంగా లేక, పలు రాష్ట్రాల్లో మహిళలు మరణిస్తుండటాన్ని గుర్తు చేస్తూ, దేవికా బిశ్వాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో వేదిక చర్చను చేపట్టింది. ఈ చర్చలో డాక్టర్ రమాదేవి (జనవిజ్ఞానవేదిక) సజయ (కేరింగ్ సిటిజన్ కలెక్టివ్ ) పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

అలహాబాద్ లో కూలిన ఇళ్లు..ఇద్దరు మృతి..

ఉత్తర్ ప్రదేశ్ : అలహాబాద్ లో భారీ వర్షాలకు ఓ ఇళ్లు కూలిపోయింది. ఈఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 

భారతీయ విజ్ఙానమే మూలం - వెంకయ్య..

గుంటూరు : నేటి ఆధునిక ఆవిష్కరణలకు భారతీయ విజ్ఙానమే మూలమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ దక్షిణ భారత విశ్వ విద్యాలయ వీసీల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆధునిక భారత నిర్మాణంలో యువత భాగం కావాలని, భారతీయ యువత ప్రపంచానికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాలను విజ్ఞాన్ వర్సిటీ మార్చిందని, విజయానికి కష్టపడడం ఒక్కటే మార్గమని తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి కామినేని, విజ్ఞాన్ వర్సిటీ ఛైర్మన్ లావు రత్తయ్య, ఐదు రాష్ట్రాల వీసీలు హాజరయ్యారు. 

రామంతాపూర్..ఆరాంఘర్ చౌరస్తాలో కూల్చివేతలు..

హైదరాబాద్ : రామంతాపూర్ చెరువు వద్ద అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. రాజేంద్రనగర్ ఆరాంఘర్ చౌరస్తాలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పీవీఎక్స్ ప్రెస్ వేకి దగ్గరగా అనుమతి లేకుండా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. 

తుందుర్రులో పీడీఎఫ్ ఎమ్మెల్సీల బృందం పర్యటన..

పశ్చిమగోదావరి : తుందుర్రులో అక్వాఫుడ్ పరిశ్రమ నిర్మాణ ప్రాంతంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీల బృందం పర్యటిస్తోంది. స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకుంది. 

రైతులకు ప్లాట్ల పంపిణీ..

గుంటూరు : తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో పిచ్చుకలపాలెం రైతులకు ప్లాట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. 1097 మంది రైతులకు 494 నివాస స్థలాలు, 497 వాణిజ్య స్థలాలను పంపిణీ చేశారు. 

పిల్లలు లేరని వెళ్లితే బ్రెయిన్ డెడ్ చేశారు!

హైదరాబాద్‌ : నాగోల్‌లో ఈరోజు దారుణం చోటు చేసుకుంది. పిల్ల‌లు లేర‌ని బాధ‌ప‌డుతున్న ఓ దంప‌తులు ఆ ప్రాంతంలోని సృజ‌నా సంతాన సాఫ‌ల్య కేంద్రంలో చికిత్స చేయించుకుంటున్నారు. సంతానం కోసం అంటూ వైద్యులు స‌ద‌రు మ‌హిళ‌కు ఆప‌రేష‌న్ చేస్తున్న స‌మయంలో.. శ‌స్త్ర‌చికిత్స‌ వికటించడంతో ఆమె బ్రెయిన్‌డెడ్‌కు గురైంది. దీంతో మండిపడ్డ బాధితురాలి భర్త అత్త ఇచ్చినఫిర్యాదు మేరకు  పోలీసులు సంఘటానస్థలికి  చేరుకొని సదరు  కేంద్రంపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

శేరిలింగంపల్లిలో నాలాల ఆక్రమణల తొలగింపు...

హైదరాబాద్ : శేరిలింగంపల్లి పరిధిలో నాలాల ఆక్రమణ తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఆదర్శనగర్, శాంతినగర్, దీప్తి శ్రీనగర్ ల నుండి దాదాపు రెండు కిలోమీటర్ల నాలా కబ్జాకు గురైందని తెలుస్తోంది. 

గుంటూరులో డీజీపీ పర్యటన..

గుంటూరు : జిల్లాలో డీజీపీ సాంబశివరావు పర్యటిస్తున్నారు. నగరపాలెం పరేడ్ గ్రౌండ్స్ ను సందర్శించారు. రాష్ట్రంలో కొత్తగా మోడల్ పోలీస్ స్టేషన్ లను నిర్మించడం జరుగుతోందని, రాష్ట్రంలో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు పెరిగాయన్నారు. వాటి నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డీఎస్పీ, సీఐల ప్రమోషన్ల అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించని స్టేషన్ హౌస్ ఆఫీసర్ పై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

13:20 - September 27, 2016

హైదరాబాద్ : ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్, ఆరాంఘర్ చౌరాస్తాలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో పోలీసులు భారీ మోహరించారు. అల్వాల్ లో అక్రమంగా నిర్మించిన నాలుగు అంతస్థుల పంచశీల అపార్ట్ మెంట్ ను కూడా అధికారులు కూల్చివేశారు. నగరంలోని పలు ప్రాంతాలలో బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, మదీనాగూడ, గచ్చిబౌలి నుంచి కొత్తగూడ వరకు ఉన్న నాలాలపై ఆక్రమణలు తొలగింపులు కొనసాగుతున్నాయి. అలాగే ఉప్పల్‌ పరిధిలోని స్వరూప్‌నగర్‌ మూసీ నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇక్కడి నాలాను కొందరు ఆక్రమించుకుని భారీ నిర్మాణాలు చేపట్టారు. దీంతో వారం రోజులుగా కురిసిన వర్షానికి స్వరూప్‌నగర్‌, బ్యాంకు కాలనీ, అన్నపూర్ణ కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఇక రాజేంద్రనగర్ పల్లెచెరువు నాలాపై అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. లాలాలు, చెరువులపై వున్న ఆక్రమణలను తొలగిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాసీజర్ ప్రకారమే నిర్మాణాలను తొలగిస్తున్నామనీ..ఇరిగేషన్ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ నిర్మాణాలను తొలగింపు చర్యల్ని కొనసాగిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఆదర్శనగర్, శాంతి నగర్ లలో సుమారు 2కి.మీటర్ల మేర ఆక్రమణలకు గురైనట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం స్థానిక తహశీల్దార్లు కూల్చివేతకు సంబంధించిన నోటీసులిచ్చినట్లుగా అధికారులు తెలిపారు.

13:09 - September 27, 2016

మైనర్ బాలుడితో చెట్టాపట్టాల్..అడ్డొస్తున్నాడని భర్త హతం..బైక్ పై డెడ్ బాడీ తీసుకెళుతుండగా దొరికిన వివాహిత..

ఓ ఇళ్లాలు హాయిగా జీవితాన్ని సాగతీసుకోవాల్సింది పోయి దారి తప్పింది. తన కోర్కెల కోసం..తన స్వార్థం కోసం..ఓ నిండు ప్రాణాన్ని తీసి తన తాళిని తానే తెంచేసుకుని హంతకురాలైంది. ఓ పసివాడు ప్రేమను దూరం చేసేసింది. ఇదే సమయంలో మరో యువకుడి బతుకును నాశనం చేసేసింది. ఇంత చేసిన ఆమె ఏం సాధించినట్లు ? నల్గొండ జిల్లాకు చెందిన ప్రవళికకు మార్కెట్ కమిటీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో దేళ్ల క్రితం పెళ్లయ్యింది. వైవాహిక బంధంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఓ బాబు జన్మించాడు. ఆ సమయంలో ఆలోచనలు మారిపోయాయి. మైనర్ తో ప్రవళిక సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి భర్త మందలించాడు. కానీ మార్పు రాలేదు. భర్తను చంపేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:00 - September 27, 2016

రయ్యి మంటూ దూసుకెళ్తూ వచ్చిన కారుకు సమాంతరంగా ఓ వాహనం వచ్చింది. ఆ వాహనంలో ఉన్న దుండగులు కాల్చారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయారు. దుర్మార్గుల తూటాలకు తండ్రి..ఇద్దరు కుమారులు హతమయ్యారు. ఆ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఇది జరిగి రెండేళ్లు అవుతోంది. కానీ నేటికి ఈ కేసులో పురోగతి లభించడం లేదు. ఇది పోలీసుల వైఫల్యమా ? స్కెచ్ వేసిన హంతకుల తెలివితేటలా ? 2014 సెప్టెంబర్ 24వ తేదీన పెద్ద అవుటపల్లి వద్ద కాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో తండ్రి..కొడుకులు హతమయ్యారు. కోర్టులో వాయిదాకు వెళుతుండగా ఈ అటాక్ జరిగింది.

భూతం గోవింద్ ఎక్కడ ? 
ఈ కేసులో ప్రధాన నిందితుడు భూతం గోవింద్. ఇతను ఇప్పటి వరకు దొరకలేదు. ప్రధాన నిందితుడుకు పోలీసులు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. భూతం గోవింద్ విదేశాల్లో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఇతని స్వదేశానికి తీసుకరావడంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వీడియో క్లిక్ చేయండి. 

12:49 - September 27, 2016

నిజామాబాద్‌ : జిల్లాల్లో పోలీసు విధుల్లో రోజు రోజుకు రాజకీయ జోక్యం పెరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. నేతల జోక్యంతో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా విధులు నిర్వహించేలేని పరిస్థితి ఉత్పన్నమైందని పోలీసుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. బదిలీల నుంచి పోస్టింగ్‌ల వరకు అన్నింటా ఆధిపత్యాన్ని ప్రదర్శించించేందుకే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత ఇస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐలను వీఆర్‌లో ఉంచిన డీఐజీ
నిజామాబాద్‌ జిల్లా పోలీసు విధుల్లో అధికార పార్టీ నేతలు ఎక్కువగా తలదూర్చుతున్నారన్న వాదనలు తీవ్రం అవుతున్నాయి. ప్రత్యర్థులపై కేసులు బానాయించడం నుంచి బదిలీలు, తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకునే వరకు అన్నీ తమ పంతాలను నెగ్గించుకునేందుకు ప్రధాన్యత ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు... ఇలా అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు పోలీసు విధుల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

డీఐజీ చేసిన బదిలీలను ప్రశ్నించిన రాజకీయ నేతలు
ప్రజా ప్రతినిధులు పోలీసు స్టేషన్లకు వెళ్లి సమీక్షలు నిర్వహించే స్థాయికి రాజకీయ జోక్యం పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తూ.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మంది ఎస్‌ఐలను నిజామాబాద్‌ రేంజ్‌ డీఐజీ అకున్‌ సబర్వాల్‌ బదిలీ చేశారు. సివిల్‌ కేసుల్లో తలదూరుస్తూ, అడ్డగోలుగా పంచాయితీలు నిర్వహిస్తూ... సొమ్ము చేసుకుంటున్న కొందరు సబ్‌ ఇన్‌స్పెకర్టర్లను వేకెన్సీ రిజర్వులో ఉంచారు. రాజకీయాలకు అతీతంగా సమర్ధులకు పోస్టింగ్‌లు ఇచ్చిన డీఐజీ అకున్‌ సబర్వాలపై కొందరు నేతుల అగ్గిమీద గుగ్గిలిం అయ్యారని వినిపిస్తోంది. తమను సంప్రదించకుండా ఎలా బదిలీ చేస్తారంటూ ప్రశ్నించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే అదునుగా భావించిన బదిలీ అయిన ఎస్‌ఐలు ఎవరి స్థాయిలో వారు ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు. బదిలీ ఉత్తర్వులు ఇచ్చిన 48 గంటలు తిరగకుండానే ఆ ఉత్తర్వులను అటకెక్కించారంటే.... పోలీసు యంత్రాంగం విధుల్లో రాజకీయ జోక్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.

రాజకీయ జోక్యాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజాసంఘాలు
అవినీతి ఆరోపణలతో వేకెన్సీ రిజర్వులో ఉంచిన ఎస్‌ఐలకు తిరిగి పోస్టింగ్‌లు ఇప్పించుకునే విషయంలో కూడా రాజకీయ నాయకులు తమ పంతాన్నే నెగ్గించుకున్నారు. బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో వేకెన్సీ రిజర్వులో ఉన్న నలుగురు ఎస్సైల్లో ఇద్దరికి తిరిగి పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారు. ఎస్‌ఐల అవినీతిపై ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు విచారణ జరుపుతున్న తరుణంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడాన్ని ప్రజా సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. 

12:43 - September 27, 2016

హైదరాబాద్ : రాత్రి కురిసిన భారీ వర్షానికి రంగారెడ్డి జిల్లా నాగారం శీల్పనగర్‌లోకి వరదనీరు చేరింది. మోడి అపార్ట్‌మెంట్‌ పూర్తిగా జలమయమైంది. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. నగరంలో ఇప్పటికే 120కాలనీలు వర్షాల కారణంగా ముంపుకు గురయ్యాయి. కాగా నగరంలో నాలాలపై ఆక్రమించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తేనే ముంపు ప్రాంతాలలోని నీరు బైటకు వచ్చే అకాశముంది. కాగా ఇప్పటికే నాలాల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝుళిపించింది. ఈ నేపథ్యంలో నగరంలోని శేరిలింగంపల్లి, ఆదర్శ్‌నగర్, మియాపూర్, దీప్తిశ్రీనగర్, అల్వాల్ హిల్స్, ఉప్పల్‌లోని స్వరూప్‌నగర్‌లో గల అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పక్కా ఆధారాలతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసుల సహాయంతో నాలాలపై ఆక్రమణలను తొలగిస్తున్నారు.

సిగ్గుమాలిన ఘటన?..

ఉత్తరప్రదేశ్ : అమరవీరుల నివాళి ర్యాలీలో జాతియావత్తూ సిగ్గుపడాల్సిన ఘటన చోటు చేసుకుంది. ర్యాలీలో పాల్గొన్న వారిలో కొందరు 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేసినట్లుగా 'సమాచార్ ప్లస్' వార్తా చానల్, వీడియోతో సహా వార్తలను ప్రసారం చేసింది. యూరీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కోసం ఏర్పాటు చేసిన ర్యాలీలో పాక్ మద్దతు నినాదాలు చోటు చేసుకోవడం,నినాదాలు చేస్తున్న వారిని ఎవరూ వారించకపోవడం వీడియోలో కనిపిస్తోంది.యూరీలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు జరిపిన దాడి ఘటనలో 18మంది జవాన్లు ప్రాణాలు బలయిన విషయం తెలిసిందే.

నగరంలో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జాం..

హైదరాబాద్ : నగరంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. సుచిత్ర, తాడ్ బండ్, బోయిన్ పల్లిలో వాహనాలు నిలిచిపోయాయి. రసూల్ పురా, బేగంపేట్, గ్రీన్ లాండ్స్ రోడ్, పంజాగుట్టలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. 

యనమలతో పలువురు ఐఏఎస్ అధికారుల భేటీ..

విజయవాడ : మంత్రి యనమలతో పలువురు ఐఏఎస్ అధికారులు భేటీ అయ్యారు. సచివాలయం నిబంధనలు..పని దినాల ఖరారుపై చర్చ కొనసాగుతోంది. 

అల్వాల్ హిల్స్ ప్రాంతంలో కూల్చివేతలు..

హైదరాబాద్ : అల్వాల్ హిల్స్ ప్రాంతంలో అనుమతి లేకుండా నిర్మాణంలో ఉన్న మూడో అంతస్తును అధికారులు కూల్చివేస్తున్నారు. అల్వాల్ మున్సిపల్ పరిధిలో నాలాల ఆక్రమణలపై సర్వే కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. 

జీహెచ్ఎంసీ కమిషనర్ తో మంత్రి కేటీఆర్ భేటీ..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్, అధికారులతో మంత్రి కేటీఆర్..సీఎస్ రాజీవ్ శర్మలు భేటీ అయ్యారు. నాలాలపై అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

12:14 - September 27, 2016

బీకే బన్సాల్ ఆత్మహత్య..

ఢిల్లీ : పలు అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లి వచ్చిన కార్పొరేట్ వ్యవహారాల మాజీ డైరెక్టర్ బీకే బన్సాల్..ఆయన తనయుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదివరకే భార్య..బిడ్డలు సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ ఫార్మా కంపెనీ నుంచి లంచం తీసుకుని అవినీతి నిరోధక శాఖ కేసులో ఇరుక్కున్న బన్సాల్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. 

ఆర్టీసీ కళ్యాణ మండపంలో కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు..

హైదరాబాద్ : ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జరిగాయి. మంత్రులు నాయినీ, జోగు రామన్న, ఎంపీలు కేకే, రాపోలు తదితరులు హాజరయ్యారు. 

11:48 - September 27, 2016

శరీరంలో 'పాదాలు' కీలక భాగమే. ఎందుకంటే మన శరీర బరువును మోస్తుంటాయి. నిరంరతం ఇవి శ్రమిస్తూనే ఉంటాయి. ఎక్కడకంటే అక్కడకి తీసుకెళుతుంటాయి. శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగా 'పాదాల'పై ఎక్కువగా శ్రద్ధ చూపరు. దీనితో పాదాల సమస్యలు వస్తుంటాయి. బిగుతుగా ఉండే షూలు..చెప్పులు ధరించడం వల్ల పాదాలపై ఒత్తిడిని కలుగ చేస్తాయి. ఫలితంగా రక్త సరఫరా తగ్గడం వంటి పలు రకాల అనారోగాలకు దారి తీసే అవకాశం ఉంది. అందువల్ల పాదాలను జాగ్రత్తగా కాపాడుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తుంటారు. మధుమేహం..కీళ్లవాపు, నాడి సమస్య వంటి తీవ్ర జబ్బులకు సంకేతం కావచ్చు. వీటిని ముందుగానే గుర్తిస్తే సమస్యల బారి నుండి తప్పించుకొనే వారమవుతాం. నడకతో పాదాలకు రక్తసరఫరా బాగా మెరుగుపడుతుంది. కూర్చొన్న తరువాత మడమలను అటూ..ఇటూ తిప్పుతూ తేలికైన వ్యాయామాలు చేయవచ్చు. పాదాలు మొద్దుబారడం..తీవ్రమైన నొప్పి వంటివి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచింది. 

11:44 - September 27, 2016

తిరుమల : బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. స్వామివారి గర్భాలయాన్ని సుగంధ, పరిమళ ద్రవ్యాలతో శుద్ధి చేశారు. తిరుమంజనం సందర్భంగా రేపు ఉదయం 11 గంటల వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. అక్టోబర్‌ 3 నుంచి 11 వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 

11:38 - September 27, 2016

విజయవాడ : దుర్గమ్మ ఆలయం స్వర్ణ శోభితమైంది. ఇంతకాలం అమ్మవారి ఆలయ శిఖరం బంగారు కాంతులతో వెలిగిపోతుండగా..ఇప్పుడు అమ్మవారి ఆలయ ముఖ ద్వారం, అంతరాలయం, గర్భాలయ ద్వారాలన్నీ బంగారు కాంతులతో జిగేల్‌ మంటున్నాయి. ఒక్క ముఖ ద్వారమే కాదు..లక్ష్మీ సరస్వతి దేవి, గజలక్ష్మీ దేవి విగ్రహాలు కూడా బంగారు తాపడంతో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. దీంతో స్వర్ణ కాంతుల మధ్య దేదీప్యమానంగా వెలిగొందుతున్న అమ్మవారిని భక్తులు ధర్శించుకొని తరిస్తున్నారు.

దసరా ఉత్సవాలకు ముస్తాబవుతున్న విజయవాడ
దసరా ఉత్సవాలకు బెజవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. దాతల సహకారంతో దసరా పండుగనాడు దుర్గమ్మవారు స్వర్ణ శోభితంగా భక్తులకు దర్శనమివ్వనుంది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు తొలిసారిగా భారీ ఎత్తున కోటి రూపాయల వ్యయంతో అంతరాలయ తలుపులకు విశాఖకు చెందిన రఘు అనే భక్తుడు బంగారు తాపడం చేయించాడు. ఆలయంలోనే ఇరువైపులా ఉన్న లక్ష్మీ సరస్వతుల వెండి రూపాలకు, ద్వారంపైన గజలక్ష్మీ అమ్మవారికి కూడా బంగారు పూత పూయించారు. అదేవిధంగా మరికొన్ని అభరణాలు కూడా దుర్గమ్మకు సమర్పించారు. ముఖ్యంగా దసరాలో తొలిరోజు స్వర్ణకవచాలంకృత అమ్మవారిగా భక్తులకు దర్శనమివ్వనుండడంతో అమ్మవారు ఆభరణాలతో నిజరూప దర్శనాన్ని భక్తులకు కల్పించాలని ఆమ్మవారిని ఆభరణలతో ప్రత్యేకంగా అలంకరించనున్నారు.

ముఖ ద్వారం, అంతరాలయం, గర్భాలయ ద్వారాలు స్వర్ణమయం
ఇప్పటికే దుర్గమ్మ ఆలయ ముఖ ద్వారం, అంతరాలయం, గర్భాలయ ద్వారాలు స్వర్ణమయమవ్వడంతో దుర్గమ్మను స్వర్ణ కాంతుల మధ్య దర్శించుకోవడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బంగారు కాంతుల మధ్య అమ్మవారిని ఒక్కసారైనా దర్శించుకోవాలన్ని కోరికతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే దుర్గగుడికి దాతల సంఖ్య పెరిగిందని,..స్వచ్ఛందంగానే ముందుకొచ్చి అమ్మవారికి నగలు బహుకరిస్తున్నారని దుర్గగుడి స్ధానాచార్యులు శంకర్ శాండిల్య చెప్తున్నారు. మరికొంతమంది భక్తులు కూడా దుర్గమ్మకు ఆభరణాలు సమర్పించినట్లు చెప్పారు.మొత్తానికి స్వర్ణ కాంతుల మధ్య దుర్గమ్మను దర్శించుకోవడం శుభపరిణామంగా భావిస్తున్నారు. 

11:33 - September 27, 2016

లైఫ్ పార్నర్స్ గా టర్న్ తీసుకోబోతున్న నాగచైతన్య, సమంత, చైతన్ భగత్ రాసిన రోమాంటిక్ నవల స్టోరీలో నటించబోతున్నారట. బాలీవుడ్ లో సూపర్ హిట్టు అయిన ఈ నవల స్టోరీని ఇప్పుడు ఈ టాలీవుడ్ జంటతో ప్లాన్ చేస్తున్నట్లు టాక్. త్వరలో కపూల్స్ కాబోతున్న ఈ జంట నటిస్తున్న ఆ చిత్రం విశేషాలు..
ప్రస్తుతం ఇండస్ట్రీలో 'నాగ చైతన్య', 'సమంత'ల లవ్ ఎఫైర్ హాట్ హాట్ గా రన్ అవుతోంది. ఈ క్రమంలో వీరితో అంతకన్నా హాట్ లవ్ స్టోరీకి ప్లాన్ జరుగుతుండడం మరో హాట్ న్యూస్. చైతన్ భగత్ రాసిన 'టూ స్టేట్స్' నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. పుల్ లెంగ్త్ రోమాంటిక్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో 'చైతూ', 'శామ్స్' హాట్ హాట్ రోమాన్స్ చేయనున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో మూడేళ్ల కిందట వచ్చిన '2 స్టేట్స్' మూవీ సైతం 'టూ స్టేట్స్' నవల ఆధారంగానే రూపొందింది. అయితే ఈ మూవీని తెలుగుకు సరిపడ విధంగా మార్పులు చెర్పులు చేసి 'చైతూ', 'సమంత'లతో రీమేక్ చేసేందుకు ప్లాన్స్ జరుగుతున్నాయి. బాలీవుడ్ లో 'అర్జున్ కపూర్', 'ఆలియా భట్' ఈ చిత్రంలో హాట్ హాట్ రోమాన్స్ చేశారు. ఇప్పుడు వారి రేంజ్ లో 'శామ్స్', 'చైతూ' కూడా ఈ చిత్రంలో పుల్ రోమాన్స్ వర్కట్ చేయనున్నట్లు వినికిడి. ఈ చిత్రం ద్వారా వెంకట్ కుంచె దర్శకుడిగా పరిచయం కానున్నాడు. లవ్ లో ఉన్న నాగచైతన్య, సమంత ఈ రోమాంటిక్ ఎంటర్ టైన్ లో నటించబోతుండడంతో రీమేక్ ఇప్పటి నుంచే అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం 'చైతూ' 'ప్రేమమ్' రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఈ చిత్రం తరువాత బహుశా 'నాగ చైతన్య' 'టూ స్టేట్స్' రీమేక్ నే పట్టాలెక్కిస్తాడేమో చూడాలి.

11:28 - September 27, 2016

కరీంనగర్ : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు..వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముస్తాబాద్ చెరువుకు గండిపడింది. దీనితో పోత్ గల్ గ్రామానికి వరద నీరు చేరుతోంది. వందల ఎకరాల పంట నీట మునిగిపోయింది. దీంతో ముస్తాబాద్ తహశీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ,కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. పంటలు నీటమునుగుతున్నా అధికారులు పట్టించుకోవటంలేదంటూ నేతలు ఆరోపిస్తున్నారు. కాకతీయుల కాలంలో తవ్వించిన చెరువును మిషన్ కాకతీయ పథకంలో పూడిక తీశారు. చెరువు నీటితో కళకళలాడుతోండటంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల ఆనందం కాలం నిలవలేదు, చెరువుకు గండి పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ మానేరు నుండి చెరువుకు భారీగా నీరు చేరటంతో పట్టిష్టంగా లేని చెరువు గట్టుతెగి  గండి పడినట్లుగా తెలుస్తోంది. భారీగా నీరు బైటకు రావటంతో  సిద్ధిపేటకు ముస్తాబాద్ కు సంబంధాలు తెగిపోయాయి.

11:09 - September 27, 2016

నిజామాబాద్ : భారీ వర్షాలు.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ జలకళను సంతరించుకుంది. గత రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతాంగం.. ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

11:01 - September 27, 2016

క్రిమినల్ నయీం చనిపోగానే.. ఇమ్మీడియట్ గా అందరికీ వచ్చిన థాట్.. రాంగోపాల్ వర్మకు ఇంకో సినిమా స్టోరీ దొరికేసిందనే. వంగవీటి తర్వాత తాను ఇంకో తెలుగు సినిమా చేయనని.. వంగవీటి కంటే గొప్ప స్టోరీ తనకు దొరకదనే అంటూ చాలానే చెప్పిన వర్మ.. ఇప్పుడు నయీం మూవీని మొదలుపెట్టేసి..సంచలనం రేపుతున్నాడు. న‌యీం చ‌నిపోగానే అత‌ని గురించి తెలుసుకున్న వ‌ర్మ న‌యీంకు ఒక సినిమా చాల‌ద‌ని మూడు భాగాలుగా తీస్తాన‌ని సంచ‌ల‌న ప్రకటనలు చేశాడు. దీంతో ఈమ‌ధ్య‌నే న‌యీం పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన వ‌ర్మ ఇప్పుడు తాజాగా  టైటిల్ సాంగ్‌ను విడుద‌ల చేశాడు. ఇది కాస్తా సంచలనాత్మకంగా మారింది.  ఇందులో ఒక సోష‌ల్ మెసేజ్ కూడా ఇచ్చాడు వ‌ర్మ‌. ‘పిల్లలు చిన్నపుడు తప్పులు చేసినప్పుడు గారాబం చేస్తే.. ఆ తర్వాత వాళ్లు పెద్దవుతున్నపుడు సరిదిద్దకపోతే.. చివరకు క్రిమినల్స్ గా మారే ప్రమాదం ఉంటుందంటూ’ న‌యీంను ఉదాహ‌ర‌ణ‌గా చెప్పాడు. ఆ సాంగ్ మీకోసం

10:56 - September 27, 2016

నల్లగొండ : జిల్లాలో పులిచింతల, మూసీ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. జలాశయాలకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు ఒక్క గేటు ఎత్తి 10,409 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 163 అడుగులకు చేరింది.  

దక్షిణ భారత విశ్వ విద్యాలయ వీసీల సమావేశం..

గుంటూరు : వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ దక్షిణ భారత విశ్వ విద్యాలయ వీసీల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, మంత్రి కామినేని, విజ్ఞాన్ వర్సిటీ ఛైర్మన్ లావు రత్తయ్య, ఐదు రాష్ట్రాల వీసీలు హాజరయ్యారు. 

గుంటూరులో రెండో రోజు జగన్ పర్యటన..

గుంటూరు : జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. వర్ష ప్రభావిత ప్రాంతాలైన పల్నాడు, కొండమోడు, రెడ్డిగూడెం, ఘనపవరంలో పంట పొలాలను ఆయన పరిశీలించారు. 

అల్వాల్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత..

హైదరాబాద్ : అల్వాల్ లో అక్రమంగా నిర్మించిన పంచశీల అపార్ట్ మెంట్ లోని నాలుగో అంతస్తును జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. 

10:52 - September 27, 2016

విజయవాడ : సత్యనారాయణపురం ప్రభుత్వ సంగీత కళాశాల సమస్యలపై 10 టీవీ ప్రసారం చేసిన కథనాలతో అధికారుల్లో చలనం వచ్చింది. విద్యార్థుల ఆందోళనపై సాంస్కృతిక శాఖ అధికారులు స్పందించారు. కాలేజీలో నిర్వహిస్తున్న ప్రైవేట్‌ కార్యక్రమాలతో పడుతున్న ఇబ్బందులపై విద్యార్థులకు బాసటగా రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. గవర్నర్‌, సీఎం చంద్రబాబుకు ఇప్పటికే విద్యార్థులు లేఖలు రాశారు. విద్యార్థుల అవస్థలపై 10 టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలతో స్పందించిన సాంస్కృతిక శాఖ డైరెక్టర్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 

10:49 - September 27, 2016

అమెరికా : దేశ అధ్యక్ష ఎన్నికల పోరు ఉత్కంఠగా కొనసాగుతోంది. డెమోక్రటిక్‌ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్‌,.. రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య తొలిసారిగా న్యూయార్క్‌లోని ఓఫ్‌స్టా యూనివర్సిటీలో బిగ్‌ డిబేట్‌ జరిగింది. ఇరువురు పార్టీ విధి విధానాలు ప్రకటిస్తూ ప్రత్యర్థిపై పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. హోరాహోరీగా సాగిన ఈ డిబేట్‌లో అమెరికా అభివృద్ధి, ప్రజల భద్రత, శ్రేయస్సు వంటి అంశాలతో పాటు.. వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. నేను డిబేట్‌ కోసం సిద్ధం కాలేదు.. అధ్యక్ష పదవికి సిద్ధమయ్యానని ట్రంప్‌ అనగా.. నేను అధ్యక్ష పదవికి సిద్ధమయ్యా.. అందుకే డిబేట్‌కు సిద్ధమయ్యానని హిల్లరీ బదులిచ్చారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా డిబేట్‌ కొనసాగింది.

భారత్ పై ట్రంప్ అక్కసు
డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై మళ్లీ నోరు పారేసుకున్నారు. భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కారు. భారతీయులు అమెరికన్ల ఉద్యోగులు కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. వచ్చే నవంబర్‌ 8న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే ఈ పరిస్థితిలో మార్పు తీసుకొస్తానని ట్రంప్‌ హామీ ఇచ్చారు. ఒబామా పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థ గాలిబుడగ చందంగా మారిందని, అది ఎప్పుడైనా పేలిపోవచ్చని విమర్శించారు. ట్రంప్‌ విమర్శలను హిల్లరీ క్లింటన్‌ తిప్పికొట్టారు. అమెరికా ఉద్యోగ, ఆర్థిక వ్యవస్థపై ట్రంప్‌కు పూర్తిగా అవగాహన లేదన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా చెల్లించిన పన్నుల వివరాలు ప్రకటించని ట్రంప్‌... అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కులేదని మండిపడ్డారు.

ట్రంప్ అధ్యక్షుడైతే మహిళల విలువలు మంటకలుస్తాయ్ : హిల్లరీ
మెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరుపున పోటీ చేస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రత్యర్థి హిల్లరీ ఆరోగ్యంపై మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. అరోగ్య సమస్యలతో బాధపడుతున్న హిల్లరీ దేశాధ్యక్షురాలైతే దౌత్యపరమైన సంబంధాలు సరిగా నిర్వహించలేరని విమర్శించారు. ట్రంప్‌ విమర్శలకు హిల్లరీ ధీటైన సమాధానం చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రిగా పని చేసినప్పుడు 159 దేశాల్లో పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఒక్కోసార పది, పదకొండు గంటలు కూడా ఏకధాటిగా ప్రయాణించిన సందర్భాలున్నాయని చెప్పారు. మహిళల శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనావేయడం ట్రంప్‌కు అలవాటేనని మండిపడ్డారు. మహిళల గర్భాన్ని కూడా కించపరిచిన ట్రంప్‌ను అధ్యక్షుడిన ఎన్నికుంటే అమెరికా మహిళల విలువ మంటకలవడం ఖాయమని హిల్లరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 96 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 31 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. 

వెంకయ్య ఏరియల్ సర్వే..

విజయవాడ : వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. అధికారుల నుండి నష్టం వివరాలను తెలుసుకున్నారు. 

10:30 - September 27, 2016

చిత్తూరు : జిల్లాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. రామసముద్రం మండలం గొల్లపల్లి గ్రామంలోకి ఏనుగు చొరబడి పంటపొలాలను నాశనం చేసింది. ఈ ఏనుగు సృష్టించిన బీభత్సం రామప్ప అనే వృద్ధుడు మృతిచెందిన విషయం తెలిసిందే. 'ఆపరేషన్ గజా' పేరుతో ఏనుగును పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. కుప్పం నుంచి వినాయక, జయంతి అనే రెండు శిక్షణా ఏనుగులను తెప్పించి ఒంటరి ఏనుగును దారిమళ్లించేందుకు యత్నిస్తున్నారు. మత్తు ఇంజన్లతో అడవిలోకి వెళ్లారు. ఎంకీ చిక్కని ఈ గజరాజు కోసం రెండోరోజు కూడా గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఫారెస్ట్ రేంజ్ అధికారులు మత్తు ఇంజెక్షన్లు తీసుకుని గజరాజును పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఓ ఏనుగుల మందలోంచి పొరపాటు తప్పించుకున్న ఏనుగు కర్నాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతం నుండి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. కాగా తెల్లరంగు చూస్తే ఏనుగు మరింతగా రెచ్చిపోయే ప్రమాదముందని ఫారెస్ట్ అధికారులు పేర్కొనటంతో గజరాజు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నవారు తెలుగు రంగు దుస్తులు వేసుకుని రావద్దని అధికారులు సూచించారు. సోమవారం ఎంత గాలించినా దొరకని ఏనుగు కొండప్రాంతాలకు వెళ్లినట్లుగా గుర్తించిన అధికారులు ఆ దిశగా గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. 

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న అజిత్ జోగి కాన్వాయ్ ?

ఛత్తీస్ గఢ్ : మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కాన్వాయ్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈఘటన బాగ్ బహారా ప్రాంతంలో చోటు చేసుకుందని సమాచారం. 

ఒంటరి ఏనుగు కోసం ఆపరేషన్..

చిత్తూరు : జిల్లాలో రెండో రోజు ఆపరేషన్ గజ ప్రారంభమైంది. రామసముద్రం మండలం గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ ఏనుగును పట్టుకొనేందుకు జయంతి..వినాయక అనే శిక్షణా ఏనుగులను అధికారులు రంగంలోకి దించారు. ఓ వ్యక్తిని చంపి పంట పొలాలను ఈ ఏనుగు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. 

ఇద్దరు నక్సల్స్ మృతి..

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లాలో పూల్ గావ్ అటవీ ప్రాంతంలో పోలీసులు..మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మూడు రైఫిళ్లు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

10:19 - September 27, 2016

హైదరాబాద్ : నగరంలో ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా ఝుళిపించింది. నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ జనార్థన్ రెడ్డి ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ ఎంసీ సిబ్బంది కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. మొదటిదశలో కమర్షియల్ కాంపెక్సులు, రెండో దశలో నివాస భవనాలకు కూల్చివేయాలని కమిషనర్ ఆదేశాల మేరకు సిబ్బంది కూల్చివేస్తున్నట్లుగా తెలుస్తోంది. నగర పరిధిలో దాదాపు 28వేల అక్రమ కట్టడాలు వున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు.625 కి.మీటర్ల పరిధిలో వున్న నగరంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ అక్రమ కట్టడాలు వున్నట్లుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఆరు, ఏడు ఏళ్ళలో ఈ ఆక్రమణలు మరింతగా పెరిగినట్లుగా కూడా అధికారులు గుర్తించారు.

పలు ప్రాంతాలలో కూల్చివేతలు
శేరిలింగంపల్లి, మదీనాగూడ, గచ్చిబౌలి నుంచి కొత్తగూడ వరకు ఉన్న నాలాలపై ఆక్రమణలు తొలగిస్తున్నారు. అలాగే ఉప్పల్‌ పరిధిలోని స్వరూప్‌నగర్‌ మూసీ నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇక్కడి నాలాను కొందరు ఆక్రమించుకుని భారీ నిర్మాణాలు చేపట్టారు. దీంతో వారం రోజులుగా కురిసిన వర్షానికి స్వరూప్‌నగర్‌, బ్యాంకు కాలనీ, అన్నపూర్ణ కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఇక రాజేంద్రనగర్ పల్లెచెరువు నాలాపై అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. కుత్బుల్లాపూర్ ఫాక్స్‌సాగర్ కెనాల్ వద్ద అక్రమ ప్రహారీ గోడలను కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. 

10:15 - September 27, 2016

'అల్లు అర్జున్', 'లింగుస్వామి'ల సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ న్యూస్ హాల్ చల్ చేస్తోంది. మూడు సినిమాలకి కలిసి తీసుకునే రెమ్యూనరేషన్ ని 'బన్నీ' ఈ ఒక్క మూవీకే తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ ద్విభాష చిత్రానికి 'బన్నీ' చేస్తున్న ఛార్జ్ చూస్తే రెమ్యూనరేషన్ పరంగా స్టైలిష్ స్టార్ 'మెగాస్టార్' ని కూడా క్రాస్ చేసినట్లు కనిపిస్తోంది. హ్యట్రిక్ సక్సెస్ ఊపులో ఉన్న 'బన్నీ' 'సరైనోడు' బ్లాక్ బస్టర్ తో స్టార్ గా మరింతగా షేన్ అయ్యాడు. దీంతో 'బన్నీ' 'లింగుస్వామి' డైరెక్షన్ లో చేస్తున్న ద్విభాష చిత్రానికి గాను ఈ స్టార్ రెమ్యూనరేషన్ వద్దన్నాడట.

నైజాం ఏరియా హక్కులు...
రెమ్యూనరేషన్ కి బదులుగా నైజాం ఏరియా హక్కులను ఇవ్వాల్సిందిగా కోరాడట. ఇందుకు చిత్ర నిర్మాత జ్ఞాన్ వేల్ సైతం అంగీకరించినట్లు సమాచారం. ఎంతలేదన్న నైజాంలో 'బన్నీ'కి 25కోట్ల కలెక్ట్ చేసే స్టామినా ఉంది. గతంలో 'చిరంజీవి' స్టార్ గా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలాగే నైజాం ఏరియా హక్కులు తీసుకునేవాడు. ఇప్పుడు 'బన్నీ' యాక్టింగ్ లోనే కాకుండా రెమ్యూనరేషన్ పరంగా కూడా 'చిరు'నే ఫాలో కావడం విశేషం. మొత్తానికి 'బన్నీ' మెగా కాంపౌండ్ లోనే మెగాస్టార్ తరువాత బడా స్టార్ గా ఎదిగేందుకు పక్కా ప్లాన్ తో కెరీర్ ని బిల్డప్ చేసుకుంటున్నాడు. ఈ ద్విభాష చిత్రంలో 'కీర్తి సురేష్' ని 'బన్నీ'కి జోడిగా తీసుకున్నట్లు వినికిడి. 

10:11 - September 27, 2016

మొన్న ఉల్లి ధరతో ప్రజలు బేజారేత్తిపోయారు. కందిపప్పు అందనంత ధర పలకడంతో సామాన్యులు..మధ్యతరగతి వాకరు కంగుతిన్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా నిత్యావసర ధరలతో సతమతమవుతన్న సామాన్య ప్రజలకు కూరగాయలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయలు, ఆకు కూరలు ధరలు పెరిగిపోవడంతో మధ్య తరగతి ప్రజలకు పూట గడవటం కష్టంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాలనీలను జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల పంటలు నీట మునిగిపోయాయి. ఒక్కసారిగా 'కూరగాయల' ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. మొన్నటి వరకు కిలో టమాట రూ. 7 నుండి రూ. 10 ఉంటే ప్రస్తుతం రూ. 25 కంటే తక్కువ దొరకడం లేదు. ఏ కూరగాయ చూసినా అధిక ధరలే పలుకుతున్నాయి. ఒక్కో మునగకాయ రూ. 10కి విక్రయిస్తున్నారు. దొండకాయ కిలో రూ. 40కి చేరడంతో ప్రజలు హతాశులవుతున్నారు. ఒక్క ఆకుకూర కట్ట రూ. 5 పెట్టందే దొరకడం లేదు. హోల్ సేట్ మార్కెట్లకు కూరగాయల రాక తగ్గిపోవడంతో సూపర్ మార్కెట్ల నిర్వాహకులు దీనిని అవకాశంగా తీసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా భారీ వర్షాలు పడితే కూరగాయాలు కొనే పరిస్థితి ఉంటుందా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. 

ఎమ్మెల్యే కు క్లాస్ పీకిన కేసీఆర్..

హైదరాబాద్ : మియాపూర్ సమీపంలోని దీప్తి శ్రీనగర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ సిబ్బందిని ఎమ్మెల్యే వివేకానంద అడ్డుకోవడంపై కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్మాణం అక్రమమని తేల్చిన తరువాత, వాటి కూల్చివేతకు వస్తే, అడ్డుకోవడం ఏంటని క్లాస్ పీకారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో గ్రేటర్ ఎమ్మెల్యేలు చెయ్యి పెడితే సహించబోనని వార్నింగ్ ఇచ్చారు. ఇక జీహెచ్ఎంసీ అధికారులు పక్కా ఆధారాలతో కూల్చివేతలకు వెళుతున్నారు. ఎవరైనా ప్రజా ప్రతినిధులు అడ్డు పడితే, వారికి తమ వద్ద ఉన్న సాక్ష్యాలు 

తెలంగాణలో తగ్గిన వర్షాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం నుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ పేర్కొంది. 

కొనసాగుతున్న నాలాల ఆక్రమణ కూల్చివేతలు..

హైదరాబాద్ : నగరంలో రెండో రోజు నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. మొదటి ప్రాధాన్యతలో కమర్షియల్ నిర్మాణాలు..రెండో ప్రాధాన్యతలో నివాస భవనాలను కూల్చివేయాలని జోనల్, డిప్యూటి కమిషనర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 

నెల్లూరు జిల్లాలో పేలుడు కలకలం..

నెల్లూరు : జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో సంభవించిన పేలుడుతో కలకలం రేగింది. ఆ సంఘటనపై దర్యాప్తు జరుగు తున్న తరుణంలోనే నాయుడుపేటలో సోమవారం మరో పేలుడు కలకలం రేగింది. నాయుడుపేట మునిరత్నంనగర్‌లో నివాసాల మధ్య సోమవారం సాయంత్రం ఒక్కసారిగా పేలుడు శబ్ధం వినిపించడంతో స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు పదార్థాలు వున్న ఓ కవర్ ను ఓ కుక్క నోటకరచుకోవటంతో పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు.ఈ ఘటనలో కుక్క మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

09:40 - September 27, 2016

'బాహుబలి 2' ఓ మెట్టుపైనే ఉంటుందట. బాక్సాఫీసు వద్ద 'బాహుబలి' క్రియేట్ చేసిన వండర్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా 'బాహుబలి 2' ఉంటుందని చెప్పుతున్నాడు. అంతేకాదు తనకు కూడా ఆ డ్రీమ్ ఉందని ఓపెన్ అయ్యాడు. ఇంతకీ 'బాహుబలి 2' కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విశేషాలు..'బాహుబలి' ది బిగినింగ్ తో పోలిస్తే, 'బాహుబలి ది కంక్లూజన్' ఓ మెట్టు పైనే ఉంటుందంటున్నాడు సినిమాటోగ్రాఫర్ 'కె.కె.సెంథిల్ కుమార్'. ఈ కెమేరామేన్ 'బాహుబలి'తో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో 'బాహుబలి 2'కి సంబంధించిన అనేక విషయాలు చెప్పిన 'సెంథిల్' సై మూవీ నుంచి 'రాజమౌళి'తో తన జర్నీ సాగుతోందని, 'బాహుబలి 2' 'బాహుబలి'కి మించి ఉంటుందని నమ్మకంగా చెప్పుతున్నాడు.

సొంతంగా కథ..
'బాహుబలి' తొలి భాగం అంత పెద్ద విజయం సాధిస్తుందని అనుకోలేదని, ఆ విజయం ఇప్పుడు 'రాజమౌళి' టీంపై మరింత బాధ్యతను పెంచిందని అసలు విషయం ఒప్పుకున్నాడు. అందుకే 'బాహుబలి ది కంక్లూజన్' కోసం మరింత కష్టపడుతున్నామని, తొలి భాగానికి ఏ మాత్రం తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు ఎత్తులోనే రెండో భాగాన్ని నిలిపేలా తెరకెక్కిస్తున్నామంటున్నాడు. 'బాహుబలి' కోసం యూనిట్ మొత్తం 2013లో రామోజీ ఫిలింసిటీకి వెళ్లామని, ఫిలింసిటీ టీం అందరికి ఇల్లుగా మారిపోయిందని సెంథిల్ అంటున్నాడు. ఇక అసలు విషయం చెప్పుతూ తనకు కూడా దర్శకుడు కావాలని ఉందని ఈ స్టార్ కేమేరా మేన్ ఒపెన్ అయ్యాడు. ప్రస్తుతం కమిట్ మెంట్స్ తో తీరిక లేకుండా ఉన్నానని, కచ్చితంగా సరైన సమయంలో దర్శకుడిగా టర్న్ తీసుకుంటానని చెపుతున్నాడు. సొంతంగానే ఓ కథ కూడా మొదలెట్టానని చెబుతున్న 'సెంథిల్' త్వరలోనే యాక్షన్ అంటూ కెప్టెన్ గా మారబోతున్నాడు.

న్యాయమూర్తిపై మహిళా ఎస్సై ఫిర్యాదు!..

ఢిల్లీ : సాక్షాత్తు జడ్జీపైనే ఓ మహిళా ఎస్సై ఫిర్యాదు చేసింది. కోర్టుకు వచ్చిన తనను న్యాయమూర్తి అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ మహిళా ఎస్ఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగింది. తీస్ హజారీ కోర్టు అదనపు సెషన్స్ జడ్జీ తనను దూషించాడని పోలీసు అధికారులకు తనపై ఫిర్యాదు చేస్తానని బెదిరించాడని సదరు ఎస్ఐ రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు సమర్పించారు.

09:27 - September 27, 2016

గుంటూరు : ఏపీ తాత్కాలిక సచివాలయంలో సీఎం కార్యాలయాన్ని దసరా నాటికి ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తోంది సర్కార్‌. అయితే అన్నీ అనుకూలించి ఒకవేళ దసరా నాటికి పూర్తయితే సీఎం కార్యాలయం ఎలా ఉండబోతోంది..? కార్యాలయం లోపల ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? కాన్వాయ్‌ రూట్ ఎలా ఉండబోతోంది అన్నదానిపై 10 టీవీ స్పెషల్‌ రిపోర్ట్‌..

మొదటి అంతస్థులోనే సీఎం కార్యాలయం
ఏపీ నూతనరాజధాని అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో సీఎం కార్యాలయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సచివాలయంలోని మొదటి అంతస్థులో సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. దసరానాటికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే పాలన మొదలు పెట్టాలని భావిస్తుండడంతో అధికారులు రేయింభవళ్లు పనిచేస్తున్నారు.

మొదటి అంతస్థులో పశ్చిమదిశగా ఉండనున్న సీఎం కార్యాలయం
మొత్తం ఆరు బ్లాకుల్లో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో కీలకశాఖలు,చీఫ్‌ సెక్రటరీ ఉండే కార్యాలయాలు ఉండబోతున్నాయి. మొదటి అంతస్థులో దాదాపు మొత్తం భాగమంతా సీఎం కోసమే కేటాయిస్తున్నారు అధికారులు. మొదటి అంతస్థులోని పశ్చిమదిశగా సీఎం కార్యాలయం ఉంటుంది. ఒక్క చీఫ్‌ సెక్రటరీ కార్యాలయం, ఆయన సిబ్బంది తప్పించి మిగతా భాగమంతా కాన్ఫరెన్స్‌హాల్‌, కమాండ్‌ కంట్రోల్‌ రూంకే కేటాయించారు.

సీఎం కాన్వాయ్‌ చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు
సీఎం కాన్వాయ్‌ కార్యాలయానికి చేరుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రహదారి నుండి సీఎం కార్యాలయం ఉండే భవనం లాబీ వరకు నేరుగా కాన్వాయ్‌ చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మొదటి అంతస్థులో సీఎం ఛాంబర్‌ ఎడమవైపు వన్‌టు వన్‌ రూమ్‌ ఉంటుంది. ప్రక్కనే 70 మంది కూర్చునేలా ఓ కాన్ఫరెన్స్‌హాల్‌ను ఏర్పాటు చేశారు. సీఎం వ్యక్తిగత సమావేశాలు ఇక్కడే జరగనున్నాయి.

కార్యాలయానికి పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసిన అధికారులు
వాస్తవానికి కార్యాలయం దాదాపు పూర్తయినా..సీఎం సచివాలయాన్ని పరిశీలించి తన కార్యాలయం ఎదురు గదులలో మార్పులు చేయాలని సూచించారు. దీంతో వీటి గోడలు పగులగొట్టి కొత్త ప్లాన్‌ ప్రకారం మార్పులు చేస్తున్నారు.ఇందుకు మరో 15 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో 15 రోజుల నుండి సీఎం బ్లాక్‌లోకి ఎవరిని అనుమతించడంలేదు. కమాండ్‌కంట్రోల్‌ రూం నుండే భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

ముహూర్తం నాటికే పూజా కార్యక్రమాలు
తాత్కాలిక సచివాలయంలో సీఎం కార్యాలయాన్ని నిర్ణీత గడువులోగా పూర్తిచేసేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి.దసరా నాటికి కార్యాలయం పూర్తి కాకపోయినా.. ముహూర్తం నాటికే పూజా కార్యక్రమాలు నిర్వహించి మరో పది రోజుల్లో పాలన ప్రారంభించాలని చూస్తున్నారు సీఎం. అయితే అనుకున్న సమయానికి సీఎం కార్యాలయం పూర్తవుతుందో లేదో చూడాలి. 

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత..

నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42 గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో 4 లక్షల క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 4లక్షల క్యూసెక్కులుగా ఉంది. 

శ్రీశైల జలాశయానికి కొనసాగుతున్న వరద..

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 881.20 అడుగులుగా ఉండగా పూర్తిస్తాయి నీటి మట్టం 885.01 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 1,40,592..ఔట్ ఫ్లో 77,283 క్యూసెక్కులుగా ఉంది. 

గోదావరి 36 అడుగులు..పలు ప్రాజెక్టులకు వరద ఉధృతి..

ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 36 అడుగులకు చేరుకుంది. నల్గొండ జిల్లాలోని పులిచింతల, మూసీ ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టు 1 గేటును ఎత్తివేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10,409గా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 163 అడుగులుగా ఉండగా పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు. మరోవైపు మూసీ ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు వదిలారు. ఇన్ ఫ్లో 7,899 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 4,281 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 644.2 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులుగా ఉంది. 

ముస్తాబాద్ చెరువుకు గండి..

కరీంనగర్ : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు..వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముస్తాబాద్ చెరువుకు గండిపడింది. దీనితో పోత్ గల్ గ్రామానికి వరద నీరు చేరుతోంది. వందల ఎకరాల పంట నీట మునిగిపోయింది. 

ఉద్యోగాలు కల్పించాలంటే అనేక మార్గాలు - హిల్లరీ...

అమెరికా : ఉద్యోగాలు కల్పించాలంటే చాలా మార్గాలున్నాయని, సాంకేతిక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవస్థలో లొసుగులు తొలగించాల్సినవసరం ఉందని, సుస్థిర ఆర్థిక విధానాలు రూపొందించాలని సూచించారు. ట్రంప్ తన ఆదాయ పన్నుల వివరాలను దాచిపెడుతున్నారని, ఆప్రో - అమెరికన్ల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. ఆఫ్రో - అమెరికన్లపై దాడులను ఎవరూ సహించరని తెలిపారు. 

హిల్లరీపై ట్రంప్ విమర్శలు..

అమెరికా : దేశంలో చాలా సమస్యలు వెంటాడుతున్నాయని అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రెసిడెన్షియల్ డిబేట్స్ కమిషన్ నిర్వహిస్తున్న చర్చలో అభ్యర్థులు హిల్లరీ క్లింటన్..ట్రంప్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ...ఆర్థిక విలువలు తెలిసినవారే సమర్థంగా నడపగలరని, అమెరికా నుండి ఉద్యోగాలు తరలిపోతున్నాయన్నారు. ఈ ఉద్యోగాలన్నీ వెనక్కి తెస్తానని హామీనిచ్చారు. చైనా, భారత్ లాంటి దేశాలు ఉద్యోగాలు కొల్లగొడుతున్నట్లు, సమస్యల పరిష్కారానికై ఇప్పుడు హిల్లరీ మాట్లాడుతున్నారని విమర్శించారు. 30 ఏళ్ల హిల్లరీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టం..

అమెరికా : అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ, డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరపున హిల్లరీ పోటీ చేస్తుండగా రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. అధ్యక్ష అభ్యర్థుల మధ్య చర్చ కొనసాగుతోంది. ప్రెసిడెన్షియల్ డిబేట్స్ కమిషన్ ఈ చర్చను నిర్వహిస్తోంది. ప్రజాభిప్రాయం ద్వారా చర్చలో అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా బహిరంగ చర్చా కార్యక్రమం కొనసాగుతోంది. అమెరికా అభివృద్ది..మార్గదర్శకాలు..భద్రత అంశాలపై చర్చ జరుగుతోంది. 

08:48 - September 27, 2016

హైదరాబాద్ నగరంలో ఆక్రమణలకు గురైన నాలాలపై నిర్మాణాలను కూల్చివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ యంత్రాగం కదిలింది. నగరంలోని పలు ప్రాంతాల్లో నాలాల వెంట అక్రమ కట్టడాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. శేరిలింగంపల్లి, మదీనాగూడ, గచ్చిబౌలి నుంచి కొత్తగూడ వరకు ఉన్న నాలాలపై ఆక్రమణలు తొలగిస్తున్నారు. అలాగే ఉప్పల్‌ పరిధిలోని స్వరూప్‌నగర్‌ మూసీ నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇక్కడి నాలాను కొందరు ఆక్రమించుకుని భారీ నిర్మాణాలు చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగరంలో వారం రోజులుగా కురిసిన వర్షానికి స్వరూప్‌నగర్‌, బ్యాంకు కాలనీ, అన్నపూర్ణ కాలనీలు ఇటీవలి నగరంలో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురయ్యాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్రం ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. దీనిపై స్పందించిన టీఆర్ఎస్ సర్కార్ అక్రమ కూల్చివేసేందుకు పూనుకుంది. ఈ నేపథ్యంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్యలో శ్రీనివాస రెడ్డి (సీపీఎం నేత) తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత),విజయ్ కుమార్ (కాంగ్రెస్ నేత)లు పొల్గొన్నారు. చర్చలో పాల్గొన్న నేతలు తెలిపిన అభిప్రాయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..సమగ్ర సమాచారం తెలుసుకోండి. 

08:30 - September 27, 2016

ఢిల్లీ : సింధు నది జలాల ఒప్పందంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఒకే సమయంలో నీరు, రక్తం ప్రవహించ లేవని మోది అన్నట్లు సమాచారం. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి విదేశాంగ కార్యదర్శి జైశంకర్, నేషనల్ సెక్యూర్టీ సలహాదారు అజిత్‌ దోవల్, నీటి వనరుల కార్యదర్శి శశి శేఖర్, పిఎంఓ కార్యాలయ అధికారులు హాజరయ్యారు. 1960లో సింధు ఒప్పందంపై అప్పటి భారత తాత్కాలిక ప్రధాని నెహ్రూ, పాక్‌ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ సంతకాలు చేశారు. సింధూ నదితో పాటు రావి, బియాస్, సట్లెజ్‌, చీనాబ్‌ తదితర ఆరు నదుల నీటి పంపకాలపై ఒప్పందం కుదిరింది. ఈ నదుల నుంచి 80 శాతం నీరు పాకిస్తానే వినియోగించుకుంటోంది. రెండు దేశాల మధ్య ప్రపంచ బ్యాంక్‌ మధ్యవర్తిగా వ్యవహరించింది. యూరీలో ఉగ్రదాడిలో 18 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పాక్‌పై ఒత్తిడి తెచ్చేందుకు సింధూ నది ఒప్పందాన్ని భారత్‌ తెరపైకి తెచ్చింది. 

'బతుకు జట్కా బండి'కి రావాలని బెదిరింపులు..

హైదరాబాద్ : ‘బతుకు జట్కా బండి’ కార్యక్రమ నిర్వాహకురాలు జీవితా రాజశేఖర్ వ్యక్తిగత కార్యదర్శులపై చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తమను ‘బతుకు జట్కా బండి’ టీవీ కార్యక్రమానికి రావాలంటూ జీవిత సెక్రటరీస్ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

హిల్లరీ -ట్రంప్ మాటల యుద్ధం..

అమెరికా : అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ ప్రారంభమైంది. న్యూయార్క్ లోని ని హోఫ్‌స్ట్రా యూనివర్సిటీ హాల్‌లో ప్రారంభమైన చర్చ వాడివేడిగా సాగుతోంది. మొట్టమొదటిసారిగా ముఖాముఖిగా తలపడుతున్న వీరిద్దరు పలు అంశాలు, సమస్యలను ప్రస్తావించారు. అమెరికా దశదిశ, ప్రజల భద్రత, శ్రేయస్సు అంశాలపై చర్చ కొనసాగుతోంది.

08:16 - September 27, 2016

అమెరికా : అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ ప్రారంభమైంది. న్యూయార్క్ లోని ని హోఫ్‌స్ట్రా యూనివర్సిటీ హాల్‌లో ప్రారంభమైన చర్చ వాడివేడిగా సాగుతోంది. మొట్టమొదటిసారిగా ముఖాముఖిగా తలపడుతున్న వీరిద్దరు పలు అంశాలు, సమస్యలను ప్రస్తావిస్తున్నారు. అమెరికా దశదిశ, ప్రజల భద్రత, శ్రేయస్సు అంశాలపై చర్చ జరుగుతోంది.

నేను అధికారంలోకి వస్తే కార్పొరేట్ కంపెనీల ముసుగు తొలగిస్తా : హిల్లరీ
అమెరికాలో ఉద్యోగాల కల్పనకు దేశంలో ఎన్నో మార్గాలు ఉన్నాయని డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆమె పేర్కొన్నారు. దృఢమైన, స్థిరమైన అభివృద్ధే తన లక్ష్యమనీ.. నిర్మాణరంగం, టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర రంగాల్లో ఉద్యోగ వృద్ధి సాధించామన్నారు. తాను అధికారంలోకి వస్తే కార్పొరెట్ లొసుగులు తొలగిస్తానని హామీ ఇచ్చారు. సంపన్నులకు పన్ను తగ్గింపులు ఇచ్చే ప్రసక్తే లేదని హిల్లరీ తేల్చి  చెప్పారు. ఐసిస్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు వివరించారు. సామాన్యులు, మధ్య తరగతి వారికి కూడా లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు.

నా ఈ మెయిల్స్ పొరపాటున డిలీట్ అయ్యాయి : హిల్లరీ
తన ఈమెయిల్స్ పొరపాటున డిలీట్ అయ్యాయని వివరణ ఇచ్చారు. మీ భవిష్యత్‌ను ఎవరు తీర్చిదిద్దగలరో చూడాలని కోరారు. కార్పొరెట్ లొసుగుల వలన ఎక్కువగా లాభపడింది ట్రంప్ కుటుంబమేనని ఆరోపించారు. మధ్యతరగతిపై ఖర్చులు పెరగాల్సిన అవసరం ఉందని హిల్లరీ పేర్కొన్నారు. దేశంలో అందరినీ సమానంగా గౌరవించాలని అన్నారు. పోలీసులు, కమ్యూనిటీల మధ్య సయోధ్య పెంచాల్సిన అవసరముందని హిల్లరీ నొక్కి చెప్పారు.

అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులు కొల్లగొడుతున్నారు : ట్రంప్
చైనా, మెక్సికో, ఇండియా వంటి దేశాలు అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నాయని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కంపెనీలకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాల్సిన అవసరముందని అప్పుడే కొత్త సంస్థలు వస్తాయని అభిప్రాయపడ్డారు. హిల్లరీకి ఎలాంటి ప్రణాళిక లేదని తూర్పారబట్టారు. గత 30 ఏళ్లలో హిల్లరీ ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్‌పైనా పోరాటం చేయలేకపోయారని విమర్శించారు. ఉద్యోగాలు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మాత్రం హిల్లరీ పరిష్కారాల గురించి మాట్లాడతున్నారని అన్నారు. ఉద్యోగాలను వెనక్కి తీసుకురాగలిగే సామర్థ్యం తనకు ఉందని, హిల్లరీకి లేదని తేల్చి చెప్పారు. హిల్లరీ 30వేల ఈమెయిల్స్‌ను డిలీట్ చేశారని ఆరోపించారు. హిల్లరీ ట్యాక్స్ విధానాల వలన దేశానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని ట్రంప్ అన్నారు.

08:00 - September 27, 2016

మన వంటింట్లో వాడే ఆవ గింజల్లో అనేక మార్పులు రాబోతున్నాయి. ఆవ గింజల్లో జన్యుమార్పిడి విధానం అనుమతించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారంపై అటవీ, పర్యావరణ శాఖ ప్రజాభిప్రాయం సేకరిస్తోంది

బిజెపి మ్యానిఫెస్టోకు భిన్నంగా మోడీ నిర్ణయాలు
ప్రతి ఒక్కరి వంటింట్లో ఆవాలుంటాయి. పోపుగింజలుగానే కాదు, వంట నూనెగానూ చాలామంది వాడుతుంటారు. మనదేశంలో వినియోగిస్తున్న మొత్తం వంట నూనెల్లో ఆవ నూనె పది శాతం వుంటుంది. ఇప్పుడు ఈ ఆవాలను జన్యుమార్పిడి విధానంలో పండించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధ చేస్తోంది. కానీ, తాము అధికారంలోకి వస్తే, జన్యుమార్పిడి పంటలను ఈ దేశంలో ఏమాత్రం అనుమతించేది లేదంటూ గత ఎన్నికల్లో బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. బిజెపి ఇచ్చిన వాగ్ధానికి భిన్నంగా నరేంద్రమోడీ ప్రభుత్వం పావులు కదుపుతుండడం విశేషం.

1970లో మొదలైన జన్యుమార్పిడి పంటలు
మన దేశంలో ఇప్పటి వరకు ఆహారపంటల్లో జన్యుమార్పిడి విధానాన్ని అనుమతించడం లేదు. కాబట్టి, ఆవాలు మొదటి జన్యుమార్పిడి ఆహార పంటగా రికార్డులకెక్కుతుంది. జన్యుమార్పిడి పంటల విషయంలో ప్రపంచంలో చాలా వ్యతిరేకత వుంది. 1970లో జన్యుమార్పిడి పంటలు మొదలయ్యాయి. పొగాకు పంటతో ఇది స్టార్టయ్యింది. మన దేశంలో 2000 సంవత్సరంలో బిటి కాటన్ రూపంలో జన్యుమార్పిడి పంటలను ప్రవేశపెట్టారు. ఇవాళ మనదేశంలో పత్తి పంటలో 90శాతం బిటి పత్తే ఉత్పత్తి అవుతోంది. బిటి కాటన్ వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరగడం పెద్ద విషాదం. జన్యుమార్పిడి పంటలవల్ల 20 నుంచి 30శాతం దిగుబడులు పెరుగుతాయని, ఖర్చులు తగ్గి రైతులకు బాగా లాభాలు వస్తాయంటూ చేస్తున్న ప్రచారం అబద్ధమని బిటి కాటన్ రుజువు చేసింది. రసాయన ఎరువుల వాడకం పెరిగింది. దేశంలోని పత్తి రైతులు పురుగు మందుల కోసమే వెయ్యి కోట్లకు పైగా ఖర్చే చేయాల్సి వస్తోంది. తెల్ల పురుగు, ఇతర తెగుళ్ల కారణంగా బిటి పత్తి అంటేనే రైతులు భయపడుతున్నారు.

బీటీ వంగకు 2010 లో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం
బిటి పత్తి అనుభవాలు ఇంత చేదుగా వున్నా, బిటి వంగను అనుమతించేందుకు 2010 లో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడంతో రైతు సంఘాలు భగ్గుమన్నాయి. దీంతో బిటి వంగను పక్కనపెట్టక తప్పలేదు. అయితే, ఆవ గింజల రూపంలో జన్యుమార్పిడి విధానాన్ని ఆహారపంటల్లోనూ జొప్పించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఢిల్లీకి చెందిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ వీటిని అభివృద్ధి చేస్తోంది. కేంద్రం నియమించిన జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ వీటిని ఆమోదించింది. అయితే, సురక్షిత వంగడం అన్న ముద్రతో వీటిని అనుమతిస్తున్నారో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ బహిర్గతం చేయలేదు. అయితే, ఈ అంశాలను వెబ్ సైట్ ద్వారా ప్రజలకు వెల్లడించి, వారి అభిప్రాయాలు సేకరించాలంటూ కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. అక్టోబర్ 5 వరకు ప్రజాభిప్రాయం సేకరిస్తారు. అయితే, జన్యుమార్పిడి ఆవ గింజలను పండిస్తే, దానితో పాటు కలుపు మందుల వాడకం విపరీతంగా పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కలుపు మందుల వినియోగాన్నిభారీగా పెంచే జన్యుమార్పిడి ఆవ గింజలను ఎలా అనుమతిస్తున్నరాంటూ ప్రశ్నలొస్తున్నాయి.

జన్యుమార్పిడి పంటలు ఆరోగ్యానికి సురక్షితం కాదంటూ అధ్యయనాలు
నిజానికి జన్యుమార్పిడి పంటలు ఆరోగ్యానికి ఏమాత్రం సురక్షితం కాదంటూ గతంలో అనేక అధ్యయనాలు వెల్లడించాయి. జన్యుమార్పిడి ఆహార పదార్ధాలు కేన్సర్ కణుతులు పెరగడానికి, సంతాన సమస్యలకు కారణమవుతాయన్నది కొన్ని అధ్యయనాల సారాంశం. జన్యుమార్పిడిలో తరచూ మారే జన్యువుల వల్ల ఎలర్జీ సమస్యలు వస్తాయంటోంది అమెరికాకు చెందిన బ్రౌన్ యూనివర్సిటీ . ఆవు పాల ఉత్పత్తిని అధికం చేసేందుకు మోనోశాంతో తయారుచేసిన ఆర్ బిజిహెచ్ వల్ల ఆవు పాలలో రక్తం, చీము వున్నట్టు గుర్తించిన యూరప్ యూనియన్, కెనెడా దేశాలు దీనిని నిషేధించాయి. జన్యుమార్పిడి పంటలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలొస్తున్నాయి. ఇలాంటి సమయంలో జన్యుమార్పిడి ఆవగింజలను అనుమతించేందుకు మోడీ ప్రభుత్వం ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నదన్నదే ప్రశ్న. జన్యుమార్పిడి విత్తనాల మార్కెట్ ను మోన్ శాంటో, బేయర్, డ్యూపాంట్, సింజెంటా వంటి పది బహుళజాతి సంస్థలే గుప్పెట పెట్టుకున్నాయి. వీటి ఒత్తిళ్లకు మోడీ ప్రభుత్వం తలవొంచుతోందా? అన్న అనుమానం కలగుతోంది. 

07:55 - September 27, 2016

జన్యుమార్పిడి పంటలపై సీరియస్ చర్చ నడుస్తోంది. ఆవాల పంటలో జన్యుమార్పిడి విధానం అనుమతించేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర వివాదస్పదమయ్యాయి. అసలు జన్యుమార్పిడి పంటలంటే ఏమిటి? జన్యుమార్పిడి పంటల విషయంలో ప్రపంచ అనుభావాలేమిటి? భారత్ అనుభవాలేమిటి? పత్తి లాంటి వాణిజ్యపంటల్లో జన్యుమార్పిడి విధానాన్ని అనుమతించిన భారత్ ఆహార పంటలు, నూనెగింజల విషయంలో అనుమతించకపోవడానికి కారణం ఏమిటి? ఆవ గింజల్లో జన్యుమార్పిడి విధానం ప్రోత్సహిస్తే ఏమవుతుంది? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు రైతు సంఘం నేత, వ్యవసాయ శాస్త్రవేత్త అరిబండి ప్రసాదరావు 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారానికి వీడియో చూడండి. 

07:52 - September 27, 2016

ఉత్తరప్రదేశ్ : 500వ టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. చరిత్రాత్మక టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై భారీ విజయం సాధించింది. అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌ ...రవీందర్‌ జడేజా ఆల్‌రౌండ్‌ షోతో కొహ్లీ అండ్‌ కో సునాయాస విజయం సాధించింది. తొలి రెండు రోజుల ఆటలో తేలిపోయిన భారత్‌.....మూడో రోజు నుంచి అశ్విన్‌, జడేజా స్పిన్‌ మ్యాజిక్‌ తోడవ్వడంతో టీమిండియాకు తిరుగేలేకుండా పోయింది.

భారీ పరుగుల తేడాతో నెగ్గొన ఇండియా
కొహ్లీ అండ్‌ కో 500వ టెస్ట్‌లో అదరగొట్టింది.జడేజా ఆల్‌రౌండ్‌ షో, అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌ ముందు న్యూజిలాండ్‌ టీమ్‌ తేలిపోయింది.అన్ని విభాగాల్లో కివీస్‌ టీమ్‌ కంటే మెరుగ్గా రాణించిన టీమిండియా 197 పరుగుల భారీ తేడాతో నెగ్గింది.

మూడో రోజు నుంచి జోరు పెంచిన ఇండియా
తొలి రెండు రోజుల ఆటలో తేలిపోయిన భారత్‌...మూడో రోజు నుంచి జోరు పెంచింది. అశ్విన్‌, జడేజా పోటీలు పడి మరీ వికెట్లు తీయడంతో...భారత్‌ పోటీలో నిలిచింది.రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌ సమిష్టిగా రాణించడంతో.....న్యూజిలాండ్‌ ముందు భారత్‌ 434 పరుగుల లక్ష్యాన్నుంచింది. భారీ లక్ష్య చేధనలో ఆరంభం నుంచే న్యూజిలాండ్‌ జట్టు తడబడింది. భారత బౌలర్ల ధాటికి బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టడంతో కివీస్‌ 236 పరుగులకే కుప్పకూలిన కివీస్
ఆల్‌రౌండ్‌ షోతో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజాకే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది.ఈ విజయంతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 500వ టెస్ట్ మ్యాచ్‌లో చారిత్రక విజయం అందించిన కెప్టెన్‌గా విరాట్‌ కొహ్లీ భారత క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

07:42 - September 27, 2016

కర్నాటక : కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టులో కర్ణాటక, తమిళనాడుల మధ్య వార్‌ కొనసాగుతోంది. కావేరి జలాల వివాదంపై కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ ఏడాది డిసెంబర్‌ వరకు తమిళనాడు రాష్ట్రానికి కావేరీ జలాలను విడుదల చేయలేమని కర్ణాటక పిటిషన్‌ వేసింది. కావేరీ జలాల విషయంలో ఇదివరకు వెల్లడించిన తీర్పును మార్చాలని కర్ణాటక న్యాయస్థానాన్ని కోరింది. సెప్టెంబర్‌ 27వరకు ప్రతిరోజూ 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని గత వారం సుప్రీంకోర్టు.. కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టును తీర్పును వ్యతిరేకించిన కర్ణాటక ప్రభుత్వం.. తమిళనాడుకు సాగు నీరు అందించలేమని స్పష్టం చేసింది. మరోవైపు సుప్రీం ఆదేశాల ప్రకారం పూర్తి నీటిని విడుదల చేసేంతవరకు కర్ణాటక వాదనలను వినొద్దని తమిళనాడు ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. అయితే దీనిపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. 

07:40 - September 27, 2016

అమెరికా : సీమాంతర ఉగ్రవాదంతో భారత్‌ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్న పాకిస్తాన్‌ తన కలలు మానేయాలని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించిన ఆమె పాక్‌, భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడినట్లు అనేక సాక్ష్యాలున్నాయని స్పష్టం చేశారు. వాటిని పాక్‌ కాదనగలదా అని సూటిగా ప్రశ్నించారు.

జమ్ము కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం: .కా.సజనరల్ అసెంబ్లీలో సుష్మా
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. జమ్ము కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, అంతర్భాగంగానే ఉంటుందన్నారు. కాశ్మీర్‌పై కలలు కనడం మానాలని పాక్‌ను హెచ్చరించారు. భారత్ స్నేహ హస్తం అందిస్తే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని బహుమతిగా ఇచ్చిందన్నారు. పఠాన్‌కోట్, యూరీలను కానుకలుగా ఇచ్చిందన్నారు. ఈ నెల 21న ఇదే వేదికపై నుంచి భారత్‌పై తీవ్ర విమర్శలు చేసిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌‌‌కు గట్టి సమాధానం చెప్పారు. కాశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ నవాజ్ షరీఫ్ చెప్పడం గాజు ఇంట్లో ఉంటూ ఇతరుల ఇళ్లపైకి రాళ్లు విసరడంలా ఉందన్నారు. బలూచిస్తాన్‌లో పాకిస్థాన్ పెద్ద ఎత్తున మానవహక్కుల ఉల్లంఘన పాల్పడుతోందని చెప్పారు. ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తున్న దేశాలను అంతర్జాతీయ సమాజం నుంచి ఒంటరి చేయాల్సిందేనంటూ ప్రపంచ దేశాలకు సుష్మ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని విధానంగా చేసుకున్న దేశం పాకిస్థానేనని ఆమె పరోక్షంగా చెప్పారు.

ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రపంచదేశాలు ఏకమవ్వాలని పిలుపు
న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో సుష్మాస్వరాజ్‌ కీలక ప్రసంగం చేశారు. దేశంలో తమ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు ప్రతిష్ఠాత్మక పథకాలను తొలుత వివరించిన ఆమె ఉగ్రవాదం, జమ్ము కశ్మీర్‌ అంశంపై తీవ్రంగా స్పందించారు. జమ్ము కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని.. కశ్మీర్‌పై పాక్‌ కంటోన్న భ్రమల్ని విడనాడుకోవడం మంచిదని సూచించారు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రధాన సమస్య ఉగ్రవాదమని.. దాన్ని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవన్నారు.

ఉగ్రవాదులకు రక్షణకేంద్రాలుగా మారిన దేశాలను గుర్తించాలని సూచన
ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న వారెవరో గుర్తించి..వారిని అంతమొందించాల్సిన అవసరం ఉందన్నారు సుష్మా. పాక్‌ పెంచిన ఉగ్రవాద భూతం పాక్‌ను నాశనం చేస్తోందని, అయినా ఆ దేశం గుణపాఠం నేర్వడం లేదన్నారు. ఉగ్రవాదులకు రక్షణకేంద్రాలుగా మారిన దేశాలను గుర్తించాలని కోరారు.మొత్తంగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో సుష్మాస్వరాజ్‌... ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌పై నిప్పులు చెరిగారు. జమ్మూకాశ్మీర్‌ ప్రాంతం ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని వివరించారు. 

07:33 - September 27, 2016

హైదరాబాద్ : అధికార పార్టీ నేతలు ప్రజాక్షేత్రంలో పరుగులు పెడుతున్నారు. తెలంగాణను ముంచెత్తిన వర్షాలతో ముఖ్యమంత్రి ఆదేశాలతో నేతలు సొంత నియోజకవర్గంలోనే గడిపేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రజల్లో ఉంటూ..స్థానికంగా తలెత్తున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సహాయక చర్యల్లో సర్కార్
నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో తెలంగాణ సర్కార్‌ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రజాప్రతినిధులను అలర్ట్‌ చేయడంతో నిన్నమొన్నటి వరకు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఇప్పుడు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.

నగరంలో స్థంభించిపోయిన జనజీవనం
హైదరాబాద్ సహా దాదాపు అన్ని ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురిశాయి. దీంతో సాధారణ జనజీవనం స్తంభించి పోయింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తుండడంతో గులాబి బాస్..నేతలను కూడా రంగంలోకి దింపారు. అక్కడక్కడ భారీ వర్షాలతో ప్రమాదాలు జరుగుతున్నా..ప్రభుత్వ పరంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు అధికార పార్టీ నేతలు ప్రాధాన్యతనిస్తున్నారు.

నేతలు నగరంలో వుండొద్దు : కేసీఆర్
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ గ్రేటర్ హైదరాబాద్‌లో సుడిగాలి పర్యటనలు చేస్తూనే జిల్లాలపై కూడా దృష్టి పెడుతున్నారు. గ్రేటర్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇటు వర్షాలతో ప్రబలే అంటు వ్యాధులను అరికట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తోంది. ఈ పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలు హైదరాబాద్‌లో ఉండరాదని ఆదేశించారు. భారీ వర్షాలతో తమ నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షిస్తూ..ఇబ్బందులు తలెత్తితే వెంటనే పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. మొత్తంగా భారీ వర్షాల నేపథ్యంలోనైనా అధికార పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లి..సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

07:18 - September 27, 2016

హైదరాబాద్ : వర్షాలతో ప్రాజెక్టులలో నెలకొన్న జలకళను తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ ముందుచూపుతోనే నేడు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్ని నీటితో నిండాయంటున్నారు ఆపార్టీ నేతలు. టీఆర్ఎస్‌ చెప్పిన ప్రాజెక్టులన్ని ఇంకా గాలిలోనే ఉన్నాయని.. ఇకనైనా ప్రజలకు నిజం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్‌నేతలు .

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య మాటలయుద్ధం
టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య మాటలయుద్ధం కొనసాగుతూనే ఉంది. గత పాలకులు ప్రాజెక్టులను ఇష్టానుసారం కట్టారని.. రీడిజైన్‌ చేయాలనడంతో వ్యవహారం మరింత ముదిరింది. జలదృశ్యం పేరుతో కాంగ్రెస్‌ కౌంటర్‌ ప్రజెంటేషన్‌తో ధీటుగానే సమాధానం ఇచ్చింది. తాజాగా ప్రాజెక్టులు నీటితో నిండడంతో.. ఇదీ తమ క్రెడిటే అంటోంది కాంగ్రెస్‌.

అసెంబ్లీలో కేసీఆర్‌ ప్రజలకు అబద్దాలు చెప్పారంటున్న కాంగ్రెస్‌
అసెంబ్లీలో పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ పేరిట కేసీఆర్‌ అబద్దాలు చెప్పారని అంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టింది తామే అని జలదృశ్యంలో వివరించింది. నాగార్జునసాగర్‌, నిజాంసాగర్‌,శ్రీరాంసాగర్‌,జూరాల ప్రాజెక్టులు ,దేవాదుల, కల్వకుర్తి ఎత్తిపోతల, మంజీరా,సింగూరు ,మానేరు ఎల్లంపల్లి డ్యామ్‌లు నిర్మించామన్నది కాంగ్రెస్‌ నేతలవాదన. తాము నిర్మించిన ప్రాజెక్టుల కారణంగానే నేడు సాగు,తాగు నీరు అందుతోందని చెబుతున్నారు హస్తంనేతలు.

ముందుచూపుతోనే కాంగ్రెస్‌ ప్రాజెక్టులు నిర్మించిందంటున్న కాంగ్రెస్‌నేతలు
కాంగ్రెస్‌ పార్టీ మందుచూపుతో ప్రాజెక్టులు నిర్మించిందని అంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. ప్రస్తుతం ప్రాజెక్టులన్ని నిండుకుండలా మారడానికి కాంగ్రెస్‌ పార్టీ బాటలు వేసిందని అంటున్నారు. మొన్నటి దాకా కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందని ఆరోపించిన కేసీఆర్‌ దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. 100 రోజుల్లో హైదరాబాద్‌ రూపురేఖలు మారుస్తానన్న సీఎం,కేటీఆర్‌ వాగ్థానాలు గాలిలో కలిశాయని ఎద్దేవా చేశారు.

జలదృశ్యంలో వివరించింది వందకు వంద శాతం నిజం : కాంగ్రెస్
జలదృశ్యంలో వివరించింది వందకు వంద శాతం నిజమని..నేటి ప్రాజెక్టులలో నెలకొన్న జలకళ రుజువు చేస్తుందని అంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఇప్పటికైనా కేసీఆర్‌ ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

07:10 - September 27, 2016

విజయవాడ : పోలవరం వంటి భారీ ప్రాజెక్టును మనదేశంలో సమీప భవిష్యత్తులో నిర్మించే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎవ్వరికీ దక్కని అరుదైన అవకాశం పోలవరం రూపంలో ఏపీకి దక్కిందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన 6 ఏజెన్సీలు..నిబద్ధతతో పని చేయాలని సూచించారు. గడువులోపు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పోలవరం పనులపై చంద్రబాబు సమీక్ష
విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను లైవ్ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సమీక్షలో సీఎంతో పాటు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, 6 ఏజెన్సీల ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు జరిగిన పనుల ప్రగతిపై చంద్రబాబు..దాదాపు 3 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులను అధికారులు సీఎంకు క్షుణ్ణంగా వివరించారు. 3.05 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరిగిందని తెలిపారు. ప్రస్తుతం గోదావరికి 10 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా...పోలవరం పనులు ఆగవని, గోదావరికి 14 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తేనే పనులకు కొంతమేర ఆటంకం కలగవచ్చని వివరించారు. పోలవరంలో రోజుకు 44 వేల క్యూబిక్ మీటర్ల పని జరిగిందని, స్పీల్ వే నిర్మాణానికి గంటకు 700 క్యూబిక్ మీటర్ల నీటిని తోడే యంత్రాలను వినియోగిస్తూ నీటిని తొలగిస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. మొత్తం నీటిని తొలగించడానికి 15 రోజులు పడుతుందని తెలిపారు.

పోలవరానికి నాబార్డు నిధులు : చంద్రబాబు
పోలవరానికి నిధులు ఇవ్వడానికి నాబార్డు అంగీకరించిందని, ఆ మేరకు సుమారు 800 కోట్లు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని ముఖ్యమంత్రి తెలిపారు. స్పీల్ వే పనుల కోసం రోజు 1.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ చేయాల్సి ఉందని, అవసరమైతే రోజు వారీ ఎర్త్ వర్క్ 2 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు పెంచాలని అధికారులకు సీఎం సూచించారు.

పనుల విషయంలో రాజీపడొద్దు : సీఎం చంద్రబాబు
ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్, క్వాలిటీ, టెక్నికల్ విషయాల్లో ఎక్కడ కూడా రాజీ పడవద్దని అధికారులకు సీఎం సూచించారు. ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. నిర్మాణంలో చిన్న తప్పుకూడా జరగొద్దని హెచ్చరించారు. ప్రాజెక్టు పూర్తయితే..టూరిజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని, అందుకు అవసరమైన డిజైన్లు రూపొందించాలని టూరిజం శాఖను ఆదేశించారు. తదుపరి సమావేశానికి ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న 6 ఏజెన్సీలు యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని రావాలని సూచించారు.

ఖర్చు నిధులనూ తిరిగి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం : సుజనా
3 ఏళ్లలో పోలవరాన్ని పూర్తి చేయడానికి నాబార్డ్‌ వద్ద నిధులు ఉన్నాయని, ఇప్పటివరకు ఖర్చుచేసిన నిధులనూ తిరిగి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి సుజనాచౌదరి తెలిపారు. 

07:04 - September 27, 2016

హైదరాబాద్‌ : నగరంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా ఝూళిపిస్తోంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం కదిలింది. నగరంలోని నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు.

భారీ వర్షాలకు ముంపుకు గురైన పలు ప్రాంతాలు
ఆక్రమణలకు గురైన నాలాలపై నిర్మాణాలను కూల్చివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ యంత్రాగం కదిలింది. నగరంలోని పలు ప్రాంతాల్లో నాలాల వెంట అక్రమ కట్టడాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. శేరిలింగంపల్లి, మదీనాగూడ, గచ్చిబౌలి నుంచి కొత్తగూడ వరకు ఉన్న నాలాలపై ఆక్రమణలు తొలగిస్తున్నారు. అలాగే ఉప్పల్‌ పరిధిలోని స్వరూప్‌నగర్‌ మూసీ నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇక్కడి నాలాను కొందరు ఆక్రమించుకుని భారీ నిర్మాణాలు చేపట్టారు. దీంతో వారం రోజులుగా కురిసిన వర్షానికి స్వరూప్‌నగర్‌, బ్యాంకు కాలనీ, అన్నపూర్ణ కాలనీలు ముంపునకు గురయ్యాయి.

కేసీఆర్ ఆదేశాలతోనే కూల్చివేతలు : కమిషనర్
ఇక రాజేంద్రనగర్ పల్లెచెరువు నాలాపై అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. కుత్బుల్లాపూర్ ఫాక్స్‌సాగర్ కెనాల్ వద్ద అక్రమ ప్రహారీ గోడలను కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన నగరంలో అక్రమ కట్టడాల అంతుచూస్తామన్న కేసీఆర్ హెచ్చరికలతో వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు రంగంలోకి దిగడంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 

06:59 - September 27, 2016

హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన కరీంనగర్‌ జిల్లాలోని వరద ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించారు. మధ్యమానేరు నిర్మాణంలో జాప్యం జరిగినందునే వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిందని అభిప్రాయపడ్డ సీఎం ఆ ప్రాజెక్టును పరిశీలించేందుకు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మధ్య మానేరు పనుల్లో జాప్యం చేసిన ఏజెన్సీల టెండర్లను రద్దుచేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. తాజాగా టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారు.

ప్రాజెక్టులపై కేసీఆర్ ఏరియల్ సర్వే
మధ్య మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మిడ్‌ మానేర్‌ ముంపు ప్రాంతాల పరిస్థితిని ఆయన హెలికాప్టర్‌లో నుంచి పరిశీలించారు. మిడ్‌ మానేరు నిర్మాణంలో జాప్యం జరిగినందువల్లనే వరదలతో తీవ్రనష్టం కలిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఆ టెండర్లను రద్దుచేసి కొత్త టెండర్లను పిలవాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌ జిల్లా పర్యటన సందర్భగా కలెక్టరేట్‌లో మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌; ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో పాటు కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మిడ్‌మానేర్‌, ఎల్లంపల్లి ముంపు బాధితులకు తగిన పరిహారం చెల్లిస్తామని సీఎం చెప్పారు.

భద్రాచలం వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్
ఎగువ మానేరు నుంచి భారీస్థాయిలో వరదనీరు రావడం వల్లనే మధ్య మానేరుపై తీవ్ర ప్రభావం పడిందని కేసీఆర్‌ అన్నారు. భవిష్యత్‌లో నాణ్యత గల పనులు చేపట్టేందుకు 5శాతం కంటే తక్కువ టెండర్లు వేసిన గుత్తేదార్లను పనులకు అనుమతించొద్దని ఆదేశించారు. గోదావరిలో వరద అధికంగా ఉన్న దృష్ట్యా వరంగల్‌ జిల్లా రామన్నపేట, ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదల వల్ల కలిగిన నష్టంపై అధికారులు వెంటనే అంచనాలను రూపొందించి.. బాధితులకు పరిహారం వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కాకతీయ ఎడమ కాల్వ ద్వారా 4 వే క్యూసెక్కులు
కరీంనగర్‌ జిల్లాలోని మిడ్‌మానేరు ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉన్నందున లోయర్‌ మానేరు డ్యాంకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో లోయర్‌ మానేరుకు చెందిన కాకతీయ ఎడమ కాల్వ ద్వారా 4 వే క్యూసెక్కులు, ఆరు గేట్లను ఎత్తి పదివేల క్యూసెక్కులను మంత్రి ఈటెల రాజెందర్‌ విడుదల చేశారు.ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. 

అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు!

ఆమెరికా : హోస్టన్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.సోమవారం ఉదయం ఆస్పత్రిలోకి ప్రవేశించిన దుండగుడు ఏకే-47, ఏఆర్-15 తుపాకులతో వంద రౌండ్లకు పైగా కాల్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా ఈనెల 17న మిన్నెసొటా షాపింగ్‌మాల్‌లో 20 ఏళ్ల యువకుడు జరిపిన దాడుల్లో పదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఆగంతకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.

కలెక్టరేట్‌లో ఆత్మహత్యా కలకలం..

కరీంనగర్ : కలెక్టరేట్‌లో సోమవారం యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సాక్షాత్తు సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి బయలుదేరుతున్న సమయంలో కలెక్టరేట్‌లో ఒక్కసారిగా దూకి క్రిమిసంహారక మందుతాగాడు. పోలీసులు అప్రమత్తమై యువకుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సుష్మాపై భారత్ ప్రశంసలు..

అమెరికా : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అనేక కీలకమైన అంశాలను సుష్మ దృఢంగా, ప్రభావవంతంగా ప్రస్తావించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సుష్మ ప్రసంగం అద్భుతంగా ఉందని కాంగ్రెస్ నేత శశిథరూర్ ప్రశంసలు గుప్పించారు. విదేశాంగ మంత్రి సందేశానికి దేశ ప్రజలంతా కట్టుబడి ఉండాలన్నారు. మాజీ సైనికాధికారులు, మేధావులు కూడా సుష్మ ప్రసంగంపై ప్రశంసల జల్లు కురిపించారు.

తెలంగాణలో మరో ఎయిర్ పోర్ట్..

ఢిల్లీ : ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నూతన ఎయిర్‌పోర్టుకు పౌర విమానయాన స్టీరింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర పౌర విమానయాన సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు కానుంది. శంషాబాద్ తర్వాత తెలంగాణకు రెండవ విమానాశ్రయం కూడా అందుబాటులోకి వస్తుంది. కేంద్ర పౌర విమానయాన సంస్థ కార్యదర్శి అధ్యక్షతన ఢిల్లీలో సోమవారం జరిగిన స్టీరిం గ్ కమిటీ సమావేశంలో కొత్తగూడెం విమానాశ్రయంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.

Don't Miss